Nitish Rana
-
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు: కేకేఆర్ మాజీ కెప్టెన్
‘‘గతేడాది నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ భయ్యా దగ్గరకు వెళ్లి నా మనసులో చెలరేగుతున్న అలజడి గురించి పంచుకున్నాను. రెండు మ్యాచ్‌లు గెలిచాం.. రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం.నాకేమీ అర్థం కావడం లేదు భయ్యా అన్నాను. అప్పుడు.. ‘నితీశ్.. ఇంతకీ కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? అని అడిగాడు.వెంటనే నా మనసులో ఉన్నదంతా కక్కేయాలని.. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ.. రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు.‘కెప్టెన్సీ అంటే అసలేమీ లేదు. బౌలర్లను మారుస్తూ.. ఫీల్డర్లనూ అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం అంతే. ఫలితం నీకు అనుకూలంగా వచ్చిందనుకో.. నువ్వు బాగానే ఉంటావు.ఒకవేళ నువ్వు ఆశించినది జరగలేదనుకో.. నువ్వు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా ఎవరూ నీ గురించి మాట్లాడుకోరు. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ.. నీ ఆట, నైపుణ్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలంతే.ఏ విషయాన్నైనా క్లిష్టంగా భావించనంత వరకు అంతా బాగానే ఉంటుంది. నువ్వు తెలివైన, తేలికైన మార్గాన్నే ఎంచుకోవాలి’ అని భయ్యా నాతో అన్నాడు.ఆరోజు నన్ను నేను సమాధానపరచుకునేలా నాలో స్ఫూర్తి నింపాడు’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కాగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 413 పరుగులు చేసిన నితీశ్ రాణా.. జట్టును ప్లే ఆఫ్స్ మాత్రం చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. కేకేఆర్ మేనేజ్మెంట్ అతడిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది.అయితే, తాను కేకేఆర్ సారథిగా ఉన్న సమయంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ విలువైన సూచనలు , సలహాలు ఇచ్చాడని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 42 పరుగులు చేయగలిగాడు. అయితే, కేకేఆర్ ఈసారి చాంపియన్‌గా నిలవడంతో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా మధుర జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు. -
శతక్కొట్టిన రాణా.. 5 వికెట్లతో చెలరేగిన భువీ! రహానే మళ్లీ..
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది. కొనసాగుతున్న రహానే వైఫల్యం ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రాణా శతకం యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు. దూబే సెంచరీ కొట్టినా దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది. కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు. రెండు వికెట్ల తేడాతో విజయం ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం. చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
IPL 2024: కేకేఆర్ కీలక ప్రకటన... కెప్టెన్‌గా మళ్లీ అతడే
IPL 2024- KKR Captain Announcement: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయ్యర్ కెప్టెన్సీలో నితీశ్ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా వెన్నునొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రాణా సారథ్యంలో కేకేఆర్ ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఆరు మాత్రమే గెలిచింది. అయ్యర్ లేని లోటు పూడ్చేందుకు తద్వారా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ మాజీ చాంపియన్. అయితే, శ్రేయస్ అయ్యర్ లేని లోటును పూడ్చేందుకు నితీశ్ రాణా ప్రయత్నించిన తీరుపై మాత్రం ప్రశంసలు కురిశాయి. ఇక కేకేఆర్ సారథిగా పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయినా.. బ్యాటర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు నితీశ్ రాణా. ఐపీఎల్-2023లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున రింకూ సింగ్(474) తర్వాత రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్న అయ్యర్ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడం సహా వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస సెంచరీలతో అదరగొట్టడంతో.. మరలా అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ కేకేఆర్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గత ఎడిషన్ కెప్టెన్ నితీశ్ రాణాను అతడికి డిప్యూటీగా నియమించింది. ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్‌కు తిరిగి స్వాగతం పలుకుతూనే.. తమ అభ్యర్థన మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నితీశ్ రాణాకు ధన్యవాదాలు తెలిపింది. అదే విధంగా శ్రేయస్ సైతం.. తన గైర్హాజరీలో రాణా జట్టును ముందుకు నడిపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసించడం విశేషం. చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్! Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO — KolkataKnightRiders (@KKRiders) December 14, 2023 -
రాణించిన నితీశ్ రాణా.. చెలరేగిన భువనేశ్వర్ కుమార్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా సత్తా చాటారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్-1లో ఈ ఇద్దరు ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో రాణించారు. తొలుత బౌలింగ్‌లో భువీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో రాణా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను భువనేశ్వర్ కుమార్ (4-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. భువీతో పాటు మోహిసిన్ ఖాన్ (4-0-13-2), నితీశ్ రాణా (1-0-9-1), ధన్కర్ (3-0-21-1), కార్తీక్ త్యాగి (4-0-27-1) రాణించడంతో గుజరాత్ 127 పరుగులకు (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సౌరవ్ చౌహాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. రాణా (49 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాణాతో పాటు సమీర్ రిజ్వి (30) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. చింతన్ గజా, హేమంగ్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరిగిన క్వార్టర్‌ఫైనల్-2లో బెంగాల్‌పై అస్సాం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా సంచలన నిర్ణయం
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్ ఇనాగురల్ సీజన్లో రాణా నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. Onto the next chapter. https://t.co/Zz1VyZKysA — Nitish Rana (@NitishRana_27) August 20, 2023 టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్ చేశాడు. ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ అని క్యాప్షన్ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్, నాన్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
శివాలెత్తిన శివమ్ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
నితీష్ రాణాకు బంఫరాఫర్.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక!
జూలై 24 నుంచి ప్రారంభం కానున్న దేవధర్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఢిల్లీ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ నితీష్ రాణా సారధ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా పర్వాలేదనపించాడు. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అద్బుత ప్రదర్శరనతో కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే విధంగా అతడికి గతంలో దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుగా కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నార్త్ జోన్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. ఇక రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. దేవధర్ ట్రోఫీకు ఎంపిక చేసిన నార్త్ జోన్ జట్టులో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, పేసర్ హర్షిత్ రాణా కూడా ఉన్నారు. దేవధర్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు: నితీష్ రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఎస్జి రోహిల్లా, ఎస్ ఖజురియా, మన్దీప్ సింగ్, హిమాన్షు రాణా, వివ్రాంత్ శర్మ, నిశాంత్ సింధు, రిషి ధావన్, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్క్ అరోరా మార్కండే చదవండి: MS Dhoni Reply To Yogi Babu: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ టూర్‌కు కూడా భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో ఆసియాకప్ ప్రారంభం కానుండడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ చోటు ఆశించి భంగపాటు పడ్డ యువ ఆటగాళ్లకు ఐర్లాండ్ టూర్‌కు సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ వర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నితీష్ రాణా రీ ఎంట్రీ.. ఇక ఐర్లాండ్ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్ రాణా.. ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే ఐపీఎల్-2023లో నితీష్ అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో.. సెలక్టర్లు అతడికి మళ్లీ పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్‌కు సారధ్యం వహించిన రాణా పర్వాలేదనపించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. చదవండి: IND Vs WI 2023: భారత జట్టులో నో ఛాన్స్.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’ -
Ind Vs WI: గడ్డు కాలం.. మంచి రోజులు వస్తాయి! కేకేఆర్ స్టార్ ట్వీట్ వైరల్..
WI Vs Ind T20 Series: ఐపీఎల్-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియాకు ఎంపికయ్యారు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్‌లో యశస్వి రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ ముంబై బ్యాటర్ ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తం 625 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు 11 మ్యాచ్‌లలో 343 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆ ముగ్గురికి మొండిచేయి ఈ క్రమంలో వీరిద్దరు భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే, టీ20 సిరీస్ జట్టులో స్థానం ఆశించిన టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. దీంతో అభిమానులు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రింకూ విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భంగపాటు తప్పదు.. మనకెందుకు భయ్యా! గతంలో టీమిండియాకు ఆడిన నితీశ్ తాజా ట్వీట్ చూస్తుంటే.. తాను కూడా జట్టులో చోటు ఆశించినట్లు తెలుస్తోంది. ‘‘గడ్డు కాలమే మంచి రోజులకు పునాది వేస్తుంది’’ అన్న అర్థంలో ఉన్న కోట్‌ను అతడు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా కొంతమంది నితీశ్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ట్రోలింగ్‌కు దిగారు. ‘‘రింకూ వంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే దిక్కులేదు భయ్యా! రుతురాజ్‌ను కూడా పక్కనపెట్టారు. ఇక నీ గురించి ఏం ఆలోచిస్తారు? బుద్ధిగా కేకేఆర్‌కు ఆడుకో! అనవసరంగా ఆశలు పెంచుకుంటే.. భంగపాటు తప్పదు’’ అని నితీశ్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా తరఫున కాగా కేకేఆర్ తరఫున ఐపీఎల్-2023లో రింకూ సింగ్ 14 మ్యాచ్‌లలో 474 పరుగులు చేయగా.. కోల్‌కతా సారథి నితీశ్ రాణా 413 పరుగులు సాధించాడు. ఇక ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల రాణా.. 2021లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీమిండియా తరఫున టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భారత్ తరఫున ఒక వన్డే, 2 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 7, 15 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: బౌండరీల వర్షం కురిపించిన రోహిత్, జైశ్వాల్.. వీడియో వైరల్ Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ 🧘 pic.twitter.com/UzJDMQiSPh — Nitish Rana (@NitishRana_27) July 5, 2023 -
కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్‌కు లక్నో
కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్ రాయ్ 45 పరుగులు చేశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు. టార్గెట్ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ 120 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11 ఓవర్లలో కేకేఆర్ 88/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్ 6, రింకూ సింగ్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్(45 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 61/1 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్ 36 పరుగులతో ఆడుతున్నాడు. రాణించిన పూరన్.. కేకేఆర్ టార్గెట్ 177 కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్ పూరన్(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. కేకేఆర్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు. 17 ఓవర్లలో లక్నో 133/5 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు. 73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 24, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో లక్నో 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 26, క్వింటన్ డికాక్ 20 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 27/1 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్ డికాక్ 19, ప్రేరక్ మన్కడ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్ శర్మ హర్షిత్ రానా బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. -
కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ!
IPL 2023 CSK Vs KKR- Nitish Rana: గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడికి 24 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. అదే విధంగా జట్టు మొత్తానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2023లో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది కేకేఆర్. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత సమయంలో బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఈ నేపథ్యంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు కేకేఆర్ సారథి నితీశ్ రాణాకు ఈ మేరకు ఫైన్ విధించారు. అప్పుడు 12 లక్షలు.. ఇప్పుడు 24 లక్షలు కాగా ఈ సీజన్లో కేకేఆర్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో (మే 8)లో పంజాబ్ కింగ్స్‌తో తలపడిన సందర్భంలోనూ కోల్‌కతా ఈ తప్పిదం చేసింది. పదహారో ఎడిషన్‌లో ఇది మొదటి తప్పు కాబట్టి అప్పుడు నితీశ్‌కు 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ కానీ.. మే 14 నాటి మ్యాచ్‌లోనూ మరోసారి ఇదే తప్పిదం పునరావృతం చేయడంతో నిబంధనల ప్రకారం అతడికి 24 లక్షల జరిమానా విధించారు. అదే విధంగా ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ప్రతి సభ్యుడికి ఆరు లక్షల ఫైన్ లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనన్నుట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా చెపాక్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన కేకేఆర్.. ధోని సేనను 144 పరుగులకు కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రాణా(57), రింకూ సింగ్(54) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అర్థ శతకాలతో రాణించి జట్టుకు విజయం అందించారు. ఇక సీఎస్కే మీద గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని వాళ్లు మమ్మల్ని అవుట్ చేయలేదు.. మా అంతట మేమే! మరీ చెత్తగా.. -
పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా!
IPL 2023 CSK vs KKR- Nitish Rana: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌పై గెలుపొందిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కేపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పటిష్ట చెన్నై జట్టును వారి సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న నితీశ్ రాణా.. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. సీఎస్కే బ్యాటింగ్ చేస్తున్నపుడు ఆఖరి ఓవర్ వేసేందుకు కేకేఆర్ అరోరా సమాయత్తమయ్యాడు. అంపైర్లతో రాణా గొడవ! అయితే, స్లో ఓవర్ రేటు మెయింట్ చేస్తున్న కారణంగా.. కొత్త నిబంధనల ప్రకారం మైదానంలోనే కేకేఆర్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే ప్లేస్ చేయాలని అంపైర్లు సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నితీశ్ రాణా.. అంపైర్ల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఎందుకో ప్రతిదానికీ ఇలా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అంపైర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పడంతో రాణా అక్కడి నుంచి కదలినట్లు కనిపించింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే కదా! ఎందుకో ప్రతిదానికి గొడవపడటం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గెలిచి నిలిచిన కేకేఆర్ ఇక సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వేసిన వైభవ్ అరోరా.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రవీంద్ర జడేజా వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కేను 144 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్.. నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో రాణించడంతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 57 పరుగులతో అజేయంగా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రింకూ సింగ్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కేను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి pic.twitter.com/DW2nun5NJs — Raju88 (@Raju88784482906) May 14, 2023 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
రింకూ, నితీశ్ రానా అర్థసెంచరీలు.. కేకేఆర్ ఘన విజయం
IPL 2023: CSK Vs KKR Match Live Updates: రింకూ సింగ్ ఫిఫ్టీ.. 16 ఓవర్లలో 126/3 కేకేఆర్ సంచలనం రింకూ సింగ్ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 39 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన రింకూ సింగ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సీఎస్కేతో మ్యాచ్‌లో 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ విజయానికి చేరువైంది. 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాలి. 11 ఓవర్లలో కేకేఆర్ 75/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. నితీశ్ రానా 20, రింకూ సింగ్ 29 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో కేకేఆర్ 46/3 ఆరు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీశ్ రానా 9 పరుగులు, రింకూ సింగ్ 12 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో కేకేఆర్ 22/2 మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 9, నితీశ్ రానా సున్నా పరుగులతో ఆడుతున్నారు. రాణించిన కేకేఆర్ బౌలర్లు.. సీఎస్కే 20 ఓవర్లలో 144/6 కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బౌలర్ల కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సీఎస్కే బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కాన్వే 30, జడేజా 20 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కో వికెట్ తీశారు. 16 ఓవర్లలో సీఎస్కే 99/5 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శివమ్ దూబే 24, రవీంద్ర జడేజా ఏడు పరుగులతో ఆడుతున్నారు. 72 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తడబడుతోంది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మొయిన్ అలీ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రహానే(16)ఔట్.. 9 ఓవర్లలో సీఎస్కే 65/2 రహానే(16) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రహానే జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కాన్వే 30, అంబటి రాయుడు 2 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవరల్లో సీఎస్కే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 23, రహానే 12 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 5 ఓవర్లలో 48/1 17 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. రహానే 11, కాన్వే 22 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్),రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి Thala wins the toss & elects to bat first in #CSKvKKR!#IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/CRRXnNPPIh — JioCinema (@JioCinema) May 14, 2023 వరుస విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఓటములతో డీలా పడిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇరుజట్లు గతంలో 37 సార్లు తలపడగా సీఎస్కే 18 సార్లు, కేకేఆర్ 19 సార్లు మ్యాచ్‌లు నెగ్గాయి. -
తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు..
IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం.. మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పిన్‌తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్ నరైన్.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్ శర్మ.. అతడి తోడుగా అనుకూల్ రాయ్.. జట్టులో ఇంత మంది స్పిన్ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు. సీజన్ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్ కోసం పార్ట్ టైమ్ స్పిన్నర్‌ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో నితీశ్ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్‌కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా నిర్ణయంపై కేకేఆర్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు. తప్పు చేశాను! ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్ సారథి నితీశ్ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు. టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్ స్పిన్నర్‌ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్ అద్భుతం’’ అని మొదటి ఓవర్ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు. మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా అయితే, కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మాత్రం నితీశ్ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడం మంచి ఆప్షన్. కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అది మాస్టర్‌స్ట్రోక్ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ 57 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన నితీశ్.. రైట్ ఆర్మ్బ్రేక్ స్పిన్నర్ కూడా! కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా టాస్: రాజస్తాన్ - బౌలింగ్ కేకేఆర్ స్కోరు: 149/8 (20) రాజస్తాన్ స్కోరు: 151/1 (13.1) విజేత: రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్. చదవండి: రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్ గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls. Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI — IndianPremierLeague (@IPL) May 11, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా బౌలర్లను రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జైశ్వాల్ కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాకు చుక్కలు చూపించాడు. కాగా జట్టులో శార్ధూల్ ఠాకూర్, రస్సెల్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ.. నితీష్ రాణా రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు వచ్చాడు. అయితే నితీష్ రాణా ప్రయోగం బెడిసి కొట్టింది. రాణా వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచిన జైశ్వాల్.. తరువాతి రెండు బంతులను ఫోర్లుగా, మళ్లీ ఆఖరి బంతికి ఫోరు బాదడంతో 26 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక తొలి ఓవర్ వేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన నితీష్ రాణాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీవు ఏమైనా నెం1 బౌలర్ అనుకున్నావా, నీ చెత్త కెప్టెన్సీకు ఓ దండం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా! The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 -
యశస్వి జైశ్వాల్ విధ్వంసం.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
యశస్వి జైశ్వాల్ శివ తాండవం.. రాజస్తాన్ ఘన విజయం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. యశస్వి జైశ్వాల్(48 బంతుల్లో 98 నాటౌట్, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) శివతాండవం ఆడగా.. సంజూ శాంసన్ 29 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. భారీ విజయం దిశగా రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయం దిశగా దూసుకెళుతుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. జైశ్వాల్ 89, శాంసన్ 48 పరుగలతో ఆడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 150 రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 22 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు. వెంకటేశ్ అయ్యర్(57)ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీతో రాణించిన వెంకటేశ్ అయ్యర్(57 పరుగులు) చహల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో కేకేఆర్ 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లలో కేకేఆర్ 110/4 14 ఓవర్లలో కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 45, రింకూ సింగ్ 2 పరుగులతో ఆడుతున్నారు. నితీశ్ రానా(22) ఔట్.. కేకేఆర్ 77/3 22 పరుగులు చేసిన నితీశ్ రానా చహల్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 9 ఓవర్లలో కేకేఆర్ 58/2 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. నితీశ్ రానా 17, వెంకటేశ్ అయ్యర్ 11 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ జేసన్ రాయ్(10) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా వేదికగా గురువారం 57వ మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్‌కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో జోరు చూపిన రాజస్తాన్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. మరోవైపు కేకేఆర్ మాత్రం విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తుంది. -
KKR VS PBKS: విజయానందంలో ఉన్న కేకేఆర్ కెప్టెన్ భారీ షాక్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్.. రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్ -
క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! అందరికీ సాధ్యం కాదు!
IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయ్యర్ దూరం కావడంతో ఐపీఎల్-2023కు ముందు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ స్థానంలో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది. అతడెందుకని విమర్శలు కెప్టెన్సీ రేసులో సీనియర్ సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్ అటాక్‌తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు నితీశ్ రాణా. బ్యాటర్‌గా రాణిస్తున్నాడు బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేకేఆర్ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్, సెంచరీ వీరుడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8 నాటి మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్. ఈ సందర్భంగా కెప్టెన్ నితీశ్ రాణా, కోచ్ చంద్రకాంత్ పండిట్ గురించి ప్రశ్న ఎదురైంది. చందూ సర్ కోచ్‌గా రావడం సంతోషం ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్‌తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్ కోచ్‌గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. ఇక నితీశ్ రాణా విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. అతడికి సాధ్యమైంది నా వరకు కెప్టెన్‌గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్‌గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో వెంకటేశ్ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్ రాణా 275 పరుగులు సాధించాడు. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. -
స్మూత్‌గా డీల్ చేయండి.. వాళ్లు స్కూల్ పిల్లలు: కేకేఆర్ కెప్టెన్ భార్య
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా భార్య సాచి మర్వా రాణా.. తనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు యువకుల పట్ల జాలి చూపించి, పెద్ద మనసు చాటుకుంది. కొద్ది రోజుల క్రితం సాచి మర్వాను దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడించారు. ఆ ఇద్దరు యువకులు కారును వెంబడించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా పలు మార్లు బైక్‌తో సాచి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. యువకుల ప్రవర్తనతో భయాందోళనకు గురైన సాచీ.. విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు చేరవేసింది. అయితే పోలీసుల నుంచి ఆమెకు తగినంత రెస్పాన్స్ రాలేదు. దీంతో యువకులు కారును వెంబడిస్తున్నప్పుడు తీసిన వీడియోను, జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. విషయం వైరల్ కావడంతో సదరు యువకులను ట్రేస్ చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. #Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv — UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023 అయితే, విషయం గురించి సమాచారం అందుకున్న సాచి.. సదరు యువకుల బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుని, వారిని కాస్త స్మూత్‌గా డీల్ చేయాలని పోలీసులను కోరింది. వారిరువురు స్కూల్ పిల్లలని తెలియడంతో ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియక వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు.. వారిని మందలించి వదిలేయండి.. కేసులు కట్టి వారి జీవితాలను పాడు చేయవద్దని ప్రాధేయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో సాచి భర్త నితీశ్ రాణా సారధ్యం వహిస్తున్న కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మే 8న జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..! -
నితీశ్ రానా భార్యకు చేదు అనుభవం..
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్య సాచీ మార్వాకు చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె కారును వెంబడించడం కలకలం రేపింది. కారును వెంబడించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో సాచీ మార్వా వారి ప్రవర్తనతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తన కారును వెంబడిస్తున్న యువకులను ఫోటో తీసి వీడియో రూపంలో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. అంతగా పట్టించుకోలేదని.. విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని సాచీ మార్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. యువకుల ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె షేర్ చేసుకుంది. ''ఢిల్లీలో అది ఒక సాధారణ రోజు. నా పనులు పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తున్నాను. వీళ్లు (ఫొటోలో ఉన్న యువకులు) యాదృచ్ఛికంగా నా కారును ఢీకొట్టడం మొదలుపెట్టారు.! కారణం లేకుండానే వెంబడించారు. నేను ఈ విషయంపై ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో వారు నాకు 'ఇప్పుడు మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక దానిని వదిలేయండి! వచ్చేసారి ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోండి' అని అన్నారు. సరే కెప్టెన్. వచ్చేసారి వారి ఫోన్ నంబర్లు తప్పకుండా తీసుకుంటానని చెప్పా'' అని పేర్కొంది. #Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv — UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ నితీశ్ రానా, రింకూ సింగ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు దాదాపు 60 పరుగులు జోడించారు. ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్క్రమ్ తానే బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి రింకూ సింగ్ సింగిల్ తీయగా.. రెండో బంతిని నితీశ్ రానా లాంగాన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మార్క్రమ్ లాంగాన్ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకోవడంతో కేకేఆర్ కెప్టెన్ 42 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Just something about Proteas and 👌🏻 fielding efforts... @AidzMarkram's 💥 catch sends the #KKR skipper packing 🔙#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/bAn65remH3 — JioCinema (@JioCinema) May 4, 2023 చదవండి: తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం! -
IPL 2023: ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అప్డేట్స్
IPL 2023: SRH Vs KKR Match Live Updates: మార్క్రమ్(41)ఔట్.. ఆరో వికెట్ డౌన్ 41 పరుగులు చేసిన మార్క్రమ్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్లాసెన్(36) ఔట్.. ఎస్ఆర్హెచ్ 134/5 హెన్రిచ్ క్లాసెన్(36) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ నష్టపోయింది. మార్క్రమ్తో కలిసి ఐదో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్ 39, అబ్దుల్ సమద్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. బ్రూక్ డకౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్ 2, క్లాసెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 6, మార్క్రమ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. Photo Credit : IPL Website ఎస్ఆర్హెచ్ టార్గెట్ 172 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నితీశ్‌రానా 42 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి. నటరాజన్‌లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండేలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవరల్లో కేకేఆర్ 137/6 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్ 29, శార్దూల్ ఠాకూర్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 42 పరుగులు చేసిన నితీశ్ రానా మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్ 22, రసెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 73/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్ రానా 24, రింకూ సింగ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 35 పరుగులకే మూడు వికెట్లు డౌన్ 35 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్ రాయ్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి Nitish Rana calls right at the toss & @KKRiders choose to BAT FIRST tonight🏏 Watch #SRHvKKR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/A6QyPUh2nt — JioCinema (@JioCinema) May 4, 2023 గత మ్యాచ్‌లో విజయంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఇక కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుపు.. మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. -
SRH Vs KKR: కేకేఆర్‌తో పోరుకు సన్‌రైజర్స్ సై! అతడికి నో ఛాన్స్!
IPL 2023 SRH Vs KKR: సొంతగడ్డపై.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్-2023లో గత మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించిన రైజర్స్.. కోల్‌కతాపై విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని నితీశ్ రాణా సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక మార్పు.. ! రాయ్ వచ్చేస్తున్నాడు! దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనున్న రైజర్స్.. అకీల్ హొసేన్ స్థానంలో మార్కో జాన్సెన్ను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇంగ్లంగ్ విధ్వంసకర వీరుడు జేసన్ రాయ్ పూర్తి ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కేకేఆర్ డేవిడ్ వీజ్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కానుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన జేసన్ రాయ్ 160 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ శతకం(61) ఉంది. ముఖాముఖి పోరులో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ మధ్య 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ కేవలం తొమ్మిదింట విజయాలు సాధించగా.. 15 సార్లు గెలుపు కేకేఆర్ననే వరించింది. అయితే, గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై 23 పరుగులతో పైచేయి సాధించడం ద్వారా ఎస్ఆర్హెచ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పిచ్, వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్‌పై పచ్చిక ఉన్న నేపథ్యంలో ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ తుది జట్లు(అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్. కోల్‌కతా నైట్ రైడర్స్ జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. It's time for Physix practicals says Prof. Klaasen 🥼🔥 pic.twitter.com/CHNQ0LKF8P — SunRisers Hyderabad (@SunRisers) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });