Retirement
-
భావోద్వేగంతో‘బుల్’ గుడ్‌బై
22 గ్రాండ్‌స్లామ్‌లు... 36 మాస్టర్ సిరీస్–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్... 10 ఏటీపీ–250 టైటిల్స్... 2 ఒలింపిక్ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్...16500 మీటర్ల ఓవర్గ్రిప్... ఇదీ కోర్టులో రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్ బుల్’ నాదల్ కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్ అభిమాన ఆటకు గుడ్‌బై చెప్పాడు.మలాగా (స్పెయిన్): ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1–2తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ప్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/0), 6–3తో గ్రీక్స్పూర్ను ఓడించి 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్ జోడీ వాన్ డి జాండ్‌షుల్ప్–వెస్లీ కూల్‌హాఫ్ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్ ద్వయం అల్కరాజ్–మార్సెల్ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్ నిష్క్ర మణతో నాదల్కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్ మ్యాచ్‌ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు. అంతా అతనే... మ్యాచ్ ఆరంభానికి ముందు స్పెయిన్ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్‌కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్లలో ఓడిపోయాడు. నాదల్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్ ఓటమి తర్వాత నాదల్ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్‌లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.వరుసగా 19 ఏళ్ల పాటు...2024: 02023: 02022: 4 2021: 2 2020: 2 2019: 4 2018: 52017: 62016: 2 2015: 3 2014: 4 2013: 10 2012: 4 2011: 3 2010: 7 2009: 52008: 8 2007: 6 2006: 5 2005: 11 2004: 1 మొత్తం 92రాఫెల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పోలాండ్లోని సొపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు.అంకెల్లో నాదల్ కెరీర్1080 సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు 227 సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు 910 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో కొనసాగిన వారాలు 209 ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన వారాలు 92 కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 22 మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్: 14, ఆ్రస్టేలియన్ ఓపెన్: 2; వింబుల్డన్: 2, యూఎస్ ఓపెన్: 4) 2 గెలిచిన ఒలింపిక్స్ స్వర్ణాలు (2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్) 4 డేవిస్‌కప్ టీమ్ టైటిల్స్(2004, 2009, 2011, 2019)కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ13,49,46,100 డాలర్లు (రూ. 1138 కోట్లు)భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్ కప్‌లో తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. నేను టెన్నిస్ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్ నాదల్ -
‘ఆ జ్ఞాపకాలన్నీ పదిలం’
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు. ఆటను ఇష్టపడేలా చేశావు... ‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు. ఆ రోజు మర్చిపోలేను... 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు. నీతో స్నేహం వల్లే... మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు. కమాన్ రఫా... కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు. -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్‌ట్రంక్ రోడ్‌పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్‌లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్‌పాల్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్‌లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్‌గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్‌ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్‌తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్‌పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్‌గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్‌ఫీల్డర్‌గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్‌లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్‌గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్‌కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్‌పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్‌గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్‌కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్‌కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్‌బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్‌లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్‌పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఓపెనర్
బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. కయేస్ నవంబర్ 16న తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. కయేస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వీడియో మెసేజ్ ద్వారా షేర్ చేశాడు. కయేస్ రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా వైట్ బాల్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కయేస్ తన చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఖుల్నా డివిజన్‌కు ప్రాతినిథ్యం వహించే కయేస్.. ఢాకా డివిజన్‌తో తన ఆఖరి మ్యాచ్ ఆడతాడు. నేషనల్ క్రికెట్ లీగ్ అనేది బంగ్లాదేశ్‌లో సంప్రదాయ దేశవాలీ టోర్నీ. కయేస్ 2019లో తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడింది. కయేస్ తన టెస్ట్ కెరీర్లో 39 మ్యాచ్‌లు ఆడి 24.28 సగటున 1797 పరుగులు చేశాడు. కయేస్.. తమీమ్ ఇక్బాల్‌తో కలిసి తొలి వికెట్‌ను నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కయేస్-తమీమ్ జోడీ తొలి వికెట్‌కు 53 ఇన్నింగ్స్‌ల్లో 2336 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున తొలి వికెట్‌కు ఇవి అత్యుత్తమ గణాంకాలు. కయేస్ తన చివరి మ్యాచ్‌లో కనీసం 70 పరుగులు చేస్తే తన కెరీర్లో 8000 పరుగుల మార్కును దాటతాడు. కయేస్కు వన్డే క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 78 మ్యాచ్‌లు ఆడి 32 సగటున 2434 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు విడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు.ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీ కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని నబీ తనకు తనకు తెలియజేసినట్లు నసీబ్ ఖాన్ వెల్లడించాడు. అతడిని నిర్ణయాన్ని బోర్డు కూడా గౌరవించినట్లు నసీబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నబీ టీ20ల్లో మాత్రం అఫ్గాన్‌కు తన సేవలను కొనసాగించనున్నాడు. కాగా ఈ అఫ్గాన్ మాజీ కెప్టెన్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు సైతం విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2026 వరకు నబీ పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశముంది.ఒకే ఒక్కడు.. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించిన క్రికెటర్లలో మహ్మద్ నబీ అగ్రస్ధానంలో ఉంటాడు. 2009లో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నబీ తన కెరీర్లో 165 వన్డేలు ఆడాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌లపై అఫ్గాన్ చారిత్రత్మక విజయాలు సాధించడంలో నబీది కీలక పాత్ర.ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకాలని నబీ నిర్ణయించుకున్నాడు. 165 వన్డేల్లో 3,549 పరుగులతో పాటు 171 వికెట్లు నబీ సాధించాడు.చదవండి: WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. జోషఫ్‌కు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్ -
రాజకీయాల నుంచి తప్పుకోబోతున్న శరద్ పవార్?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత తను క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు సాహా సోషల్ మీడియాలో వెల్లడించాడు.క్రికెట్లో నా సుదీర్ఘ ప్రయాణానికి విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్లో ఈ రంజీ సీజనే నా చివరిది. ఆఖరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో సాహా రాసుకొచ్చాడు. కాగా 40 ఏళ్ల సాహా వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ బెంగాల్ స్టార్ ప్లేయర్ గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి..ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం భాగమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్లో గత కొన్నేళ్లగా గుజరాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును కూడా సాహా నమోదు చేసుకోపోయినట్లు తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.ధోని తర్వాత..అయితే టెస్టు క్రికెట్లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నర్
ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం వేడ్ ఆండ్రీ బోరోవెక్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో జాయిన్ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వేడ్ కొత్త బాధ్యతలు చేపడతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వేడ్.. దేశవాలీ క్రికెట్లో, బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగుతాడు. ఈ ఏడాది జూన్‌లో (టీ20 వరల్డ్‌కప్) తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వేడ్.. తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ సందర్భంగా వేడ్ తన సహచరులతో పాటు కోచింగ్ స్టాఫ్‌కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. 36 ఏళ్ల వేడ్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ప్రవేశముంది. వేడ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, పాకిస్తాన్ జట్టు నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 4, 8, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. నవంబర్ 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. చదవండి: ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిన చహల్ -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ దిగ్గజం
భారత హాకీ దిగ్గజ ప్లేయర్ రాణీ రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో తన పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది. ‘‘బాల్యంలో పేదరికంలో మగ్గిపోయాను. అయితే, ఆటపై ఉన్న ఆసక్తి నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చింది.దేశం తరఫున ఆడే అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నా ప్రయాణం కూడా ఇంత అద్భుతంగా సాగుతుందని ఊహించలేదు’’ అంటూ ఆటకు వీడ్కోలు చెబుతున్న సందర్భంగా 29 ఏళ్ల రాణీ రాంపాల్ ఉద్వేగానికి లోనైంది.కాగా హర్యానాకు చెందిన రాణీ పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టింది. 2008 ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా తొలిసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటి వరకు తన కెరీర్లో దేశం తరఫున 254 మ్యాచ్‌లు ఆడిన రాణీ రాంపాల్ 205 గోల్స్ కొట్టింది.భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా ఎదిగిన రాణీ రాంపాల్.. సారథిగా తనదైన ముద్ర వేసింది. టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత జట్టును నాలుగో స్థానంలో నిలపడం తన కెరీర్లో రాణీ సాధించిన అత్యుత్తమ విజయం. ఇక రిటైర్మెంట్ తర్వాత జాతీయ స్థాయిలో జూనియర్ మహిళా జట్టు కోచ్‌గా రాణీ వ్యవహరించనుంది.రాణీ రాంపాల్ సాధించిన విజయాలు2014 ఆసియా క్రీడల్లో కాంస్యం2018 ఆసియా క్రీడల్లో రజతంఆసియాకప్లో మూడు పతకాలుఆసియా చాంపియన్స్ ట్రోఫీలో మూడు పతకాలు సాధించిన జట్టులో సభ్యురాలు(2016లో స్వర్ణం)2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ పసిడి పతకం గెలవడంలో కీలక పాత్రరాణీ రాంపాల్ అందుకున్న పురస్కారాలు2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు20202లోనే పద్మశ్రీ అవార్డు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్‌ను విడుదల చేసింది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.ఇక ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్‌లో ఉన్నప్పుడు ఎన్పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. -
టీ20లకు గుడ్‌బై చెప్పనున్న బంగ్లాదేశ్ దిగ్గజం
బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మహ్మదుల్లా కెరీర్లో చివరి టీ20 సిరీస్ అయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్‌కీడా కథనం మేరకు భారత్‌తో మూడో టీ20 అనంతరం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడు. వాస్తవానికి మహ్మదుల్లా టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరమే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే బంగ్లా సెలెక్టర్లు అతన్ని భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత్‌తో జరిగిన తొలి టీ20లో మహ్మదుల్లా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్‌కు టీ20 కెరీర్లో మహ్మదుల్లానే తొలి వికెట్.మహ్మదుల్లా కెరీర్ కొనసాగిందిలా..బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున తన కెరీర్‌ను 2007లో టీ20 ఫార్మాట్‌తో ప్రారంభించాడు. నాటి నుంచి బంగ్లా తరఫున 50 టెస్ట్‌లు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడాడు. మహ్మదుల్లా టెస్ట్‌ల్లో 2914 పరుగులు (5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు) చేసి 43 వికెట్లు (ఓ ఐదు వికెట్ల ఘనత) తీశాడు. వన్డేల్లో మహ్మదుల్లా 5386 పరుగులు (4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు) చేసి 82 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 2394 పరుగులు (8 హాఫ్ సెంచరీలు) చేసి 40 వికెట్లు తీశాడు. మహ్మదుల్లా (2395 రన్స్).. షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు) తర్వాత టీ20ల్లో బంగ్లా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. బంగ్లా తరఫున అత్యధిక టీ20లు ఆడింది కూడా మహ్మదుల్లానే.చదవండి: టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం
ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా మారిపోతుంది. పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్పీఎస్ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది... తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి సమకూరుతుంది. వాత్సల్య ఎవరికి? 2024–25 బడ్జెట్లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్పీఎస్ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్పీఎస్ టైర్–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్పీఎస్కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.సంరక్షకుల హక్కుఖాతాదారు (మైనర్) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.ఉపసంహరణ వాత్సల్యకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు. ఎక్కడ ప్రారంభించాలి? ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్పీఎస్ పోర్టల్ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎన్పీఎస్ వాత్సల్యను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ప్రొటీన్ ఈ–గవ్ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్ ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు. వైదొలగడం పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్ లీవింగ్ సరి్టఫికెట్/ఎస్ఎస్సీ/పాన్ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఆర్ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి. అర్హతలు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ), ఓవర్సీస్ సిటిజన్íÙప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్ పేరిట పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్/ప్రాన్)ను పీఎఫ్ఆర్డీఏ కేటాయిస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు యాక్టివ్ చాయిస్: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్ అసెట్ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి. ఆటో చాయిస్: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్సీ)–75, ఎల్సీ–50, ఎల్సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి. డిఫాల్ట్ చాయిస్: పైన చెప్పుకున్న ఎల్సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.చిన్న మొత్తమే అయినా.. పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చండీగఢ్ జారీ చేసింది. మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్ మహిమ. ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్ డెట్ విభాగం 9.1 శాతం, జీ–సెక్ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్పీఎస్ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు. ఆన్లైన్లో ఎలా ప్రారంభించుకోవచ్చు? → ఈఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్పీఎస్ వాత్సల్య (మైనర్స్) రిజిస్ట్రేషన్’ను ఎంపిక చేసుకోవాలి. → ఇక్కడ మైనర్, గార్డియన్ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్ కాపీలను అప్లోడ్ చేసి ‘కన్ఫర్మ్’ చేయాలి. → మొదట గార్డియన్ పుట్టిన తేదీ వివరాలు, పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్ రిజి్రస్టేషన్’ను క్లిక్ చేయాలి. → మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. → ఆన్లైన్లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. → ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్ జారీ అవుతుంది. మైనర్ పేరిట ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభం అవుతుంది. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’!
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా మైదానంలో ఆల్‌రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు! రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్‌గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు శుభంకార్డు వేశాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్‌గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం. టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్లో 582 టి20 మ్యాచ్‌లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్‌లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై చిన్నోడు! ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇతర లీగ్‌లతో పోల్చుకుంటే ఐపీఎల్లో తన బౌలింగ్‌తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు. ఆటతో పాటే పాట! మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్లో రెండు సీజన్లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్లో 684 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్‌లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్‌లు), రసెల్ (523 మ్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్‌ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం బ్యాట్‌తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్‌లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్లో 17 టోర్నమెంట్ ఫైనల్స్‌లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్‌లో రెండు (2011/12, 2012/13), స్టాన్ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్‌టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్ఎల్ (2019), ఐఎల్టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సుదీర్ఘ కాలంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కనిపించనున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
లాంక్షైర్ క్రికెట్ క్లబ్ స్టార్ ఆల్ రౌండర్ స్టీవెన్ క్రాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్టీవెన్ క్రాఫ్ట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌కు విడ్కోలు పలికిన క్రాప్ట్.. టీ20ల్లో మాత్రం కొనసాగాడు.ఈ ఏడాది దేశీవాళీ టీ20 సీజన్‌కు ముందు లాంక్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని స్టీవెన్ నిర్ణయించుకున్నాడు. ఇకపై లాంక్షైర్ క్రికెట్ క్లబ్ కోచింగ్ స్టాఫ్‌లో అతడు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్‌ను క్రాప్ట్ ముగించాడు.నా చిన్నతనం నుంచి లంకాషైర్‌కు ఆడాలన్నది నా కల. అటువంటిది ఏకంగా 600 మ్యాచ్‌లు లంకాషైర్ తరపున ఆడాడు. రెండు దశాబ్దాల పాటు లంకాషైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాను. ఇక నేను రిటైర్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయంచుకున్నాను అని ఓ ప్రకటనలో క్రాఫ్ట్ పేర్కొన్నాడు. ఈ క్రికెట్ క్లబ్ తరపున అతడు 5,486 పరుగులు చేశాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇవాన్స్ గుడ్‌బై
స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. కాగా 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్ బౌలర్ 58, 41 వికెట్లు తీశాడు. చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా‘‘నా అరంగేట్రం గురించి ఇప్పటికీ ప్రతీ విషయం గుర్తుంది. ఆరోజు అబెర్డీన్లో మ్యాచ్. హెడ్‌కోచ్ పీట్ స్టెయిన్డిల్ నుంచి రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పారు.నేను కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతానని ఊహించలేదు. అందుకే నాకు హెడ్‌కోచ్ కాల్ చేసినపుడు ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా. నా ప్రయాణంలో అద్భుతమైన క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కింది. పదిహేనేళ్లు జట్టుతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఇవాన్స్ పేర్కొన్నాడు. చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
నేను వాళ్లలా కాదు.. నాకు క్లారిటీ ఉంది: రోహిత్ విమర్శలు
రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకునే ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శలు గుప్పించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మళ్లీ తిరిగి రావడంలో అర్థం లేదన్నాడు. విదేశీ ఆటగాళ్లలో చాలా మంది ఇలా రిటైర్మెంట్ను ఓ జోక్‌లా మార్చేశారని.. అయితే, భారత్‌లో మాత్రం ఇలాంటివి జరగవని అభిప్రాయపడ్డాడు.టీమిండియాను చాంపియన్‌గా నిలిపితాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయబోనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. తాజా.. తొమ్మిదో పొట్టి వరల్డ్‌కప్ టోర్నమెంట్లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగి టీమిండియాను చాంపియన్‌గా నిలిపాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్బైఅనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, రోహిత్ శర్మ టీమిండియా తరఫున పొట్టి క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అతడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో రిటైర్మెంట్ పెద్ద జోక్‌లా తయారైంది. చాలా మంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. నేను గుడ్‌బై చెప్పాను.. నా నిర్ణయంలో మార్పు లేదుఆ వెంటనే మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే, ఇండియాలో అలా జరుగదు. ఇతర దేశాల ఆటగాళ్లను నేను గమనిస్తున్నాను. వారిలో చాలా మంది రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటున్నారు. కాబట్టి ఓ ఆటగాడు రిటైర్ అయ్యాడో లేదనన్న అంశంపై మనకు స్పష్టత ఉండదు. అయితే, నా విషయంలో అలా జరుగదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు నేను గుడ్‌బై చెప్పాను. నా ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.గతంలో చాలా మంది ఇలాగేఅయితే, వన్డే ప్రపంచకప్-2023కి ముందు తాను యూటర్న్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అతడు పాల్గొన్నాడు. ఇక పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ సైతం కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. మేనేజ్మెంట్ అతడిని వెనక్కి రప్పించింది. ఇటీవలి టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆమిర్ ఆడాడు. అదే విధంగా గతంలో షాహిద్ ఆఫ్రిది కూడా పలుమార్లు రిటైర్మెంట్ ప్రకటించి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కానున్నాడు. చదవండి: వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు.. ఏకంగా.. -
మెరుగైన పెన్షన్ కావాలంటే?
సర్కారు ఉద్యోగం.. ఎంతో మంది నిరుద్యోగుల ఆకాంక్ష. ఆకర్షణీయమైన వేతనం, ఇతర ప్రయోజనాలతోపాటు, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను వస్తుందన్న భరోసా ఎక్కువ మందిని ఆకర్షించే అంశాలు. కానీ, 2004 నుంచి అమల్లోకి వచి్చన నూతన ఫింఛను విధానంతో రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు మారిపోయాయి. దీంతో పాత పింఛను విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను కేంద్ర సర్కారు తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. పదవీ విరమణ చివరి ఏడాది వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా అందించే హామీ ఉంటుంది. మరి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారి సంగతి ఏంటి? రిటైర్మెంట్ తర్వాత మెరుగైన పింఛను పొందాలంటే అసాధ్యమేమీ కాదు. ఇందుకు చేయాల్సిందల్లా.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. ఈపీఎఫ్‌తోపాటు, ఎన్‌పీఎస్‌లోనూ నిర్ణీత శాతం మేర పెట్టుబడి పెట్టడం ద్వారా విశ్రాంత జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు మార్గం ఉంది. ఇందుకు ఏం చేయాలో నిపుణుల విశ్లేషణ చూద్దాం. కేటాయింపులు కీలకం.. ప్రభుత్వరంగ ఉద్యోగుల మాదిరే ప్రైవేటు రంగ ఉద్యోగులూ తమ రిటైర్మెంట్ పెట్టబడులను కొంత మేర ఎన్పీఎస్కు కేటాయించుకోవడం ఇక్కడ కీలకం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, వారి తరఫున ప్రభుత్వం నుంచి 14 శాతం చొప్పున ఎన్‌పీఎస్‌లోకి పెట్టుబడిగా వెళుతుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తం ఎన్పీఎస్ పెట్టుబడుల్లో ఈక్విటీలకు 15 శాతం మించి కేటాయించుకోలేరు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌లో రాబడుల వృద్ధి పరిమితంగానే ఉంటుంది. అంటే 10 శాతంలోపు అని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలవుతుంది. ఉద్యోగి, యాజమాన్యం చెరో 12 శాతం చొప్పున మూల వేతనం, డీఏపై ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటాయి. దీనిపై రాబడి 8 శాతం స్థాయిలోనే ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ భవిష్యనిధి ఏర్పడుతుందేమో కానీ, రిటైర్మెంట్ అవసరాలను తీర్చే స్థాయిలో కాదు. కనుక ప్రైవేటు రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ కాకుండా ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈపీఎఫ్–ఎన్పీఎస్ కలయిక కేంద్ర ఉద్యోగులకు ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో అతిపెద్ద ఆకర్షణ.. చివరి వేతనంలో కనీసం 50 శాతాన్ని పింఛనుగా పొందడం. కానీ దీర్ఘకాలం పాటు సేవలు అందించిన తర్వాత చివరి వేతనంలో 50% భారీ మొత్తం కాబోదు. ప్రైవేటు రంగంలో పనిచేసే వారు సైతం తమ చివరి వేతనంలో 50 శాతాన్ని ఉద్యోగ విరమణ తర్వాత పొందొచ్చు. ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇంతకంటే ఎక్కువే సొంతం చేసుకోవచ్చు. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధితోపాటు, ఈపీఎఫ్‌లో భాగమైన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కూడిన పెట్టుబడుల ప్రణాళిక ఒకటి. ఉదాహరణకు ఈపీఎఫ్ కింద ఉద్యోగి మూల వేతనం నుంచి 12%, అంతే చొప్పున యాజమాన్యం జమ చేస్తాయి. దీనికితోడు పాత పన్ను విధానంలో కొనసాగే వారు ఎన్పీఎస్ ఖాతా తెరిచి తమ వేతనంలో 10 % మేర యాజమాన్యం ద్వారా జమ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు తమ వేతనంలో 14 శాతాన్ని ఎన్పీఎస్కు జమ చేయించుకోవడం ద్వారా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో క్రమం తప్పకుండా ఈ పెట్టుబడులు కొనసాగించడం ద్వారా చివరి వేతనంలో 50 శాతాన్ని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇతరులు అందరూ.. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులు చేసుకోవచ్చు. దీని ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధి సమకూరుతుంది. నెలవారీ ఆదాయం.. ప్రైవేటు ఉద్యోగంలో ఆరంభ మూల వేతనం రూ.14,000తో ప్రారంభమై.. ఏటా 10% చొప్పున పెరుగుతూ వెళితే.. పైన చెప్పుకున్న విధంగా ఈపీఎఫ్, ఎన్‌పీఎస్‌లకు 30 ఏళ్ల పాటు చందాలు జమ చేసుకుంటూ వెళ్లినట్టయితే, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ రూ.2.9 లక్షలు పొందొచ్చు. చివరి ఏడాదిలో వేతనం రూ.2.44 లక్షల కంటే ఇది ఎక్కువ. రిటైర్మెంట్ నాటికి ఎన్‌పీఎస్‌లో సమకూరిన నిధిలో 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను) తీసుకోవాలి. మిగిలిన 60% ఫండ్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్‌లో సమకూరిన నిధిని కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ/సిప్‌కు విరుద్ధమైనది) ఎంపిక చేసుకోవాలి. తద్వారా ప్రతి నెలా కోరుకున్నంత వెనక్కి తీసుకోవచ్చు. అలాగే, పనిచేసిన కాలం ఆధారంగా ఈపీఎఫ్‌లో భాగమైన ఎన్పీఎస్ నుంచి నెలవారీ నిరీ్ణత మొత్తం పింఛనుగా అందుతుంది. ఎన్‌పీఎస్‌లో 60% నిధి, ఈపీఎఫ్‌లో భవిష్యనిధి వాటా కింద సమకూరిన మొత్తాన్ని.. రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ లేదా బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే రిస్్క–రాబడుల సమతుల్యంతో ఉంటాయి. వ్యాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గడిచిన పదేళ్లలో కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 8.41 శాతంగా ఉంది. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో రాబడి 9.83% మేర ఉంది. ఈ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు కంటే తక్కువ మొత్తాన్ని ఏటా ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కాలక్రమంలో పెట్టుబడి కూడా కొంత మేర వృద్ధి చెందుతుంది. పెట్టుబడి విలువలో ప్రతి నెలా 0.5% చొప్పున ఎస్‌డబ్ల్యూపీ ద్వారా వెనక్కి తీసుకోవాలి. ఏటా ఈ మొత్తాన్ని 5% (ద్రవ్యో ల్బణం స్థాయిలో) పెంచుకుని ఉపసంహరించుకున్నా సరే.. రిటైర్మెంట్ నిధి ఏటా 10% చొప్పున వృద్ధి చెందితే 25 ఏళ్లలో రూ.2.05 కోట్ల నుంచి రూ.2.9 కోట్లకు చేరుతుంది. రిటైర్మెంట్ ఫండ్ విలువ మరింత పెరగాలంటే, నెలవారీ ఉపసంహరణ రేటు వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఎంత మేర..?ఆరంభ మూల వేతనం రూ.14,000. ఏటా 10% పెరిగేట్టు. ఈపీఎఫ్‌లో నిబంధనల మేరకు ఇన్వెస్ట్ చేస్తూనే, ఎన్‌పీఎస్‌లోనూ పాత పన్ను విధానంలో 10% మొత్తాన్ని యాజమాన్యం ద్వారా డిపాజిట్ చేయించుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. ఈపీఎఫ్ నిధిపై 8% రాబడి రేటు. ఎన్పీఎస్ జమలపై 12% రాబడి రేటు అంచనా. ఎన్పీఎస్ 40% ఫండ్‌తో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే, దీనిపై 6% రాబడి ప్రకారం ప్రతి నెలా వచ్చే ఆదాయం అంచనాలు ఇవి. ప్రత్యామ్నాయంప్రైవేటు రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎలానూ ఉంటుంది. దీనికితోడు ఎన్పీఎస్ జోడించుకోవడం రాబడుల రీత్యా మంచి నిర్ణయం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఎలాంటి పన్ను లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ నిధిపైనా ఎలాంటి పన్ను లేదు. పన్ను కోణంలో ఈ రెండింటి కంటే మెరుగైనవి లేవు. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. కానీ, ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు టాప్–200 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయగలరు. ఒకవేళ ఇంతకంటే అదనపు రాబడులు ఆశించే వారు ఎన్పీఎస్ బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం వెనక్కి తీసుకోకుండా, క్రమానుగతంగా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల పన్ను భారం చాలా వరకు తగ్గుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత నూరు శాతం ఈక్విటీల్లోనే పెట్టుబడులు ఉంచేయడం సరైనది కాదు. కనుక 50% మేర అయినా డెట్ ఫండ్స్‌కు మళ్లించుకోవాలి. కనుక ఈ మొత్తంపై పన్ను భారం పడుతుంది. అయినా సరే యాక్టివ్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా పన్ను భారానికి దీటైన రాబడులు సొంతం చేసుకోవడం సాధ్యమే. ఈ సంక్లిష్టతలు వద్దనుకునే వారికి సులభమైన మార్గం ఎన్పీఎస్. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. పైగా పన్ను భారం లేకుండా ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి పెట్టుబడుల కేటాయింపులు మార్చుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎన్‌పీఎస్‌లోనూ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఎన్పీఎస్ ద్వారా 50% పెట్టుబడులను ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో కొనసాగిస్తూ, క్రమానుగతంగా కావాల్సినంత మేర వెనక్కి తీసుకోవచ్చు. గమనిక: కొత్త పన్ను విధానంలో ఉన్న వారు ఎన్పీఎస్కు 14 శాతం మేర వేతనంలో ప్రతి నెలా కేటాయించుకుంటే.. చివర్లో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌పై ప్రతి నెలా టేబుల్లో పేర్కొన్న ఆదాయం కంటే 40 శాతం అధికంగా, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా 10 శాతం మేర అదనంగా పొందొచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ జట్టు నుంచి తప్పుకున్న అనంతరం మెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి రెండు సార్లు రిటైర్ అయ్యి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలని అతడు డిసైడ్ అయ్యాడు. డైలీ మెయిల్లో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్‌తో మెయిన్ మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ తెలిపాడు."నేను అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో నేను మళ్లీ ఇంగ్లండ్‌కు ఆడాలంటే ఆడగలను. కానీ మళ్లీ నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయను. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం నా ఫిట్నెస్ కాదు.ఇప్పటికీ నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను. కానీ జట్టులో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు నేను తప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇంగ్లండ్ క్రికెట్లోకి కొత్త తరం ఆటగాళ్లు రావాలని" అలీ పేర్కొన్నాడు.ఇక ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న అలీ... ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ తరపున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అలీ.. వరుసగా 3,094, 2,355, 1,229 పరుగులు సాధించాడు. అదే విధంగా మూడు ఫార్మాట్లు కలిపి 254 వికెట్లు పడగొట్టాడు. -
భరించలేని వేదన: సైనా నెహ్వాల్ వ్యాఖ్యలు వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివర్లో తాను ఆటకు స్వస్తి పలకనున్నట్లు తెలిపింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు 34 ఏళ్ల సైనా నెహ్వాల్ వెల్లడించింది.కామన్వెల్త్లో రెండు పసిడి పతకాలుఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత సైనాది. లండన్-2012 విశ్వ క్రీడల్లో ఈ హైదరాబాదీ షట్లర్ కాంస్య పతకం గెలిచింది. గతంలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంది సైనా. అంతేకాదు కామన్వెల్త్ 2010, 2018 ఎడిషన్లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె టోర్నీలకు దూరమైంది. గాయాల వల్లే ఆట విరామం తీసుకుంది.మోకాలి నొప్పి.. ఆర్థరైటిస్తాజాగా ఈ విషయాల గురించి సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘‘నాకు మోకాలి నొప్పి ఉంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నా. పరిస్థితి విషమంగానే ఉంది. ఇలాంటి స్థితిలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటపుడు నేను ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఎలా పోటీపడగలను?తొమ్మిదవ ఏట మొదలుపెట్టానుఅందుకే.. వాస్తవాలు చేదుగా ఉన్నా ఆమోదించకతప్పదు. మోకాలి గుజ్జు అరిగిపోయే దశలో కోర్టులో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం అంత తేలికేమీ కాదు. మనం అనుకున్న ఫలితాలు రాబట్టడం కష్టతరంగా మారుతుంది. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదేమైనా.. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఆటగాళ్ల కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. నేను తొమ్మిదేళ్ల వయసులో ఆట మొదలుపెట్టాను. 35వ ఏట రిటైర్ కాబోతున్నాను’’ అని సైనా వెల్లడించింది. గర్వంగా ఉందిసుదీర్ఘకాలం షట్లర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఉందని.. ఈ ఏడాది చివరలోగా రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వెల్లడిస్తానని సైనా నెహ్వాల్ స్పష్టం చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సైనా ఈ మేరకు విషయాలను వెల్లడించింది. సైనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం సైనాను పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో సత్కరించింది.సైనా ఘనతలు ఇవీఒలింపిక్ కాంస్య పతకంవరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యంకామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలుఆసియా క్రీడల్లో కాంస్యం ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతంసూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం
విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రొఫెషనల్ క్రికెట్లో తనకు చివరి టోర్నీ అని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 40 ఏళ్ల బ్రావో ఇదివరకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బ్రావో సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2006 నుంచి ప్రొఫెషనల్ టీ20లు ఆడుతున్న బ్రావో తన కెరీర్లో మొత్తం 579 మ్యాచ్‌లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్ ఖాన్ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. "ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ సీజన్ నా చివరిది. కరీబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఉద్దేశిస్తూ.. ఎక్కడైతే మొదలు పెట్టానో, అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను.కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొన్న బ్రావో.. వెస్టిండీస్ తరఫున 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 6500 పరుగులు చేసి 363 వికెట్లు తీశాడు. బ్రావో ఖాతాలో 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి, 183 వికెట్లు తీశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ బరిందర్ స్రాన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే దేశవాలీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 31 ఏళ్ల స్రాన్ 2016లో టీమిండియా తరఫున 6 వన్డేలు, 2 టీ20లు ఆడి 13 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో స్రాన్ కేవలం 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్రాన్ తన వన్డే, టీ20 కెరీర్లను ఎంఎస్ ధోని నేతృత్వంలోనే ప్రారంభించాడు. అప్పట్లో స్రాన్‌కు ధోని మద్దతు బాగా ఉండేది. స్రాన్ ఓ మోస్తరుగా రాణించినా టీమిండియాలో చోటు కాపాడుకోలేకపోయాడు. స్రాన్ వన్డే అరంగేట్రం చేసే సమయానికి కేవలం ఎనిమిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. స్వల్ప వ్యవధిలోనే అతను అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్రాన్ వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లోనూ ఆడాడు. అతను రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరఫున 24 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. స్రాన్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను 2019లో.. లిస్ట్-ఏ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అప్పటినుంచి అతనికి అవకాశాలు రాక క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఫాస్ట్ బౌలర్
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 36 ఏళ్ల షానన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2010 దశకంలో షానన్‌కు విండీస్ ఫాస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు ఉండింది. 2012-23 మధ్యలో అతను 59 టెస్ట్‌లు, 25 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. షానన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్‌ల్లో బాగా రాణించాడు. షానన్ టెస్ట్‌ల్లో 166 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. షానన్ వన్డేల్లో 33, టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 12 ఏళ్ల కెరీర్లో విండీస్ క్రికెట్ కోసం నన్ను నేను అంకితం చేసుకున్నాను. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అన్ని మంచి విషయాలు ఏదో ఒక రోజు ముగియాలి. తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావించి వీడ్కోలు పలుకుతున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా ఉండి సహకరించిన వారందకీ ధన్యవాదాలు అని షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో రాసుకొచ్చాడు. కాగా, షానన్ 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో విండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను గతేడాది భారత్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.