rohit sharma
-
టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. తన భార్య రితికా రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ భారత్‌లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే ఈ ముంబైకర్ పెర్త్ టెస్టుకు అందుబాటులో లేడు.అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సిద్దమయ్యాడు. తొలుత డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు హిట్‌మ్యాన్ జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు భారత కెప్టెన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే రోహిత్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. నవంబర్ 24న రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట సమయానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."రోహిత్ శర్మ ఈ నెల 23 తేదీన ముంబై నుంచి ప్రత్యేక విమానంలో 24న పెర్త్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అతడు జట్టుతో కలిసి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు. అదే విధంగా అడిలైడ్‌లో జరిగే డే-నైట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం కోచింగ్ సిబ్బందితో చర్చించనున్నాడు.అదే విధంగా కాన్బెర్రాలో ప్రాక్టీస్ గేమ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక తొలి టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు.చదవండి: మైదానంలో ఫ్రెండ్స్ ఉండరు.. గంభీర్ దూకుడు సరైనదే: ఆసీస్ లెజెండ్ -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
రోహిత్ నిర్ణయం సరైనదే.. నేనైనా అలానే చేసేవాడని: హెడ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy) ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే మరి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పెర్త్ టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.అయితే రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా తప్పుబట్టారు. ముందుగానే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హెడ్ తెలిపాడు."రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదే. అతడికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది.ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. గత రెండు పర్యటనలలో కీలక ఆటగాళ్లు గాయాలతో దూరంగా ఉన్నప్పటికి భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. మా దృష్టిలో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో మొదటి టెస్టులో భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రి అయినందున తన కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ తిరిగి మళ్లీ అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు భారత జట్టుతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో భారత కెప్టెన్‌గా ఒకరే ఉండాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినప్పటికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని అతడు సూచించాడు."రోహిత్ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే, బుమ్రా కెప్టెన్‌గా కొనసాగాలని భారత అభిమానులందరూ కోరుకుంటారు. ఒకవేళ రెండు గేమ్‌లలో భారత్ ఓడిపోతే రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని అదే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు. అభిమానుల మనసు చాలా త్వరగా మారిపోతుంది. నేను ఇప్పుడు సునీల్ గవాస్కర్ సర్ కోసం మాట్లడటం లేదు. నేను సాధారణ ప్రజల అభిప్రాయాన్ని చెబుతున్నా అంతే.నా వరకు అయితే మొత్తం సిరీస్‌కు ఒక కెప్టెన్ ఉంటే బెటర్ అన్పిస్తోంది. అదే జట్టుకు కూడా మంచిది. అప్పుడు ఒక వేళ ఓడిపోయినా ఎవరూ ప్రశ్నించరు. అదే బుమ్రా కెప్టెన్సీలో గెలిచి, తర్వాత రోహిత్ నాయకత్వంతలో ఓడిపోతే కచ్చితంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. కాగా ఇంతకుముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బుమ్రానే సిరీస్ మొత్తానికి కెప్టెన్‌గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.చదవండి: SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం
ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడం దాదాపు ఖాయమైంది. తన భార్య రితికా సజ్దే రెండువ బిడ్డకు జన్మనివ్వడంతో మరింత ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడంట. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకు తెలియజేసినట్లు సమాచారం.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నట్లు రోహిత్ ముందే సెలెక్టర్లు, బీసీసీఐకి తెలియజేశాడు. అయితే అతడి సతీమణి రితికా కాస్త ముందుగానే డెలివరీ కావడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందు జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ రోహిత్ తన ముందు అనుకున్న విధంగానే రెండు టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు."తొలి టెస్టుకు ముందే రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని ఆశించాము. కానీ అతడు తనకు మరికొంత సమయం కావాలని, ఇప్పుడు ఆసీస్‌కు వెళ్లలేనని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అతడి నిర్ణయాన్ని గౌరవించింది. రోహిత్ అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టు(రెండో టెస్టు)కు ముందు జట్టుతో కలవనున్నాడు. మొదటి టెస్టుకు, రెండో టెస్టుకు మధ్య తొమ్మిది రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఆ సమయానికి రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.కెప్టెన్‌గా బుమ్రా..ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టనున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా ముందుండి జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా రోహిత్ స్ధానంలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ప్రారంభించే అవకాశముంది.ప్రాక్టీస్‌లో గాయపడ్డ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో వచ్చాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
మేము ఇప్పుడు నలుగురం: ప్రకటించిన రోహిత్ శర్మ, రితికా సజ్దే (ఫొటోలు)
-
BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్‌మన్ గిల్‌కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
నేనే గనుక రోహిత్ స్థానంలో ఉండి ఉంటే..: గంగూలీ
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని.. ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు.ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. కనీసం నాలుగు మ్యాచ్లైనాఇక కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో కనీసం నాలుగు మ్యాచ్‌లైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్- టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలుకానుంది. పండంటి మగబిడ్డఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో.. భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్లుగానే రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా. ఎందుకంటే.. జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది.నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. అతడి భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి.. రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయల్దేరవచ్చు. నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. ఇప్పటికే ఆసీస్‌కు పయనమయ్యేవాడిని.తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..! -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్‌కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్‌కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య రితికా సజ్దే శుక్రవారం(నవంబర్ 15) పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రోహిత్- రితికా జోడీ ఇంకా అధికారికంగా అభిమానులతో పంచుకోలేదు. కానీ రోహిత్ శర్మ అనుచరులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీరిద్దిరికి ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉంది.ప్రేమించి పెళ్లాడి..రోహిత్ శర్మ తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరిద్దరూ వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 2018లో ఈ జోడీకి తొలి సంతానంగా సమైరా జన్మించింది. ఇప్పుడు రెండో సంతానంగా వారసుడు వారి ఇంట్లో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్, రితికా జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.టీమిండియాకు గుడ్ న్యూస్..కాగా రోహిత్ శర్మ తన భార్య డెలివరీ కారణంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జట్టు మొత్తం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టగా హిట్‌మ్యాన్ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే తన భార్య ప్రసవం ముందుగానే జరగడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందే జట్టుతో కలిసే అవకాశముంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: తిలక్, సామ్సన్ వీర విధ్వంసం -
ఆ నలుగురు మావాడి కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లో తన జోరును కొనసాగించలేకపోతున్నాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన శాంసన్.. ఇప్పుడు అదే వరుస మ్యాచ్‌ల్లో డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.ఏదైమైనప్పటకి బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై వరుసగా సెంచరీలు సాధించిన సంజూ భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు.కొన్ని సార్లు జట్టులోకి వచ్చినప్పటికి తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచేవాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో సీనియర్ ఆటగాళ్లు బీజీ షెడ్యూల్ కారణంగా సంజూకు టీ20 జట్టులో రెగ్యూలర్‌గా చోటు దక్కుతుంది.ఈసారి మాత్రం సంజూ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కానీ సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు. ఆ నలుగురే!"ముగ్గురు-నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారు. విరాట్ కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. వారితో కూడా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సంజూవైపు పెద్దగా మొగ్గు చూపలేదు.ఈ నలుగురు అతడి కెరీర్‌ను నాశనం చేయడంతో పాటు అతడిని తీవ్రంగా బాధపెట్టారు. కానీ సంజూ మాత్రం వాటన్నంటిని బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాడు"అని మలయాళం అవుట్లెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
BGT: టీమిండియా ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుంది..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బీజీటీలో భారత్ ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌లో మట్టికరిపించడం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత్ తమ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇప్పటికీ ఒత్తిడి ఆస్ట్రేలియాపైనే ఉందని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి విన్నింగ్ కంటెండర్‌గా బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు బీజీటీ 2024-25పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే వారి నెర్వస్నెస్ స్పష్టంగా బయటపడుతుందని అన్నాడు. భారత్ తాజాగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్ శర్మ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్..ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండాల్సి వస్తే, అతని స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్ వ్యక్తిగత కారణాల చేత తొలి టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్ నిజంగా తొలి టెస్ట్‌కు దూరమైతే బూమ్రా టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్లూ ఇచ్చాడు. తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే.KL Rahul, Shubman Gill & Yashasvi Jaiswal in today's practice session at WACA in Perth ahead of BGT. 🇮🇳⭐pic.twitter.com/91TCibESHx— Tanuj Singh (@ImTanujSingh) November 12, 2024ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు..ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేశారు. విరాట్ సహా భారత్ బృందంలోని పలువురు సభ్యులు రెండు రోజుల కిందటే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టారు. విరాట్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు 10 రోజుల ముందే మ్యాచ్‌కు వేదిక అయిన పెర్త్‌కు చేరుకున్నారు. -
BCCI: గంభీర్‌ను ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపకండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడిని మరోసారి మీడియా సమావేశానికి పంపవద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాడు. గంభీర్‌కు బదులు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌నే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపాలని సూచించాడు.టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాతకాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్న గౌతీ.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.నష్టమేమీ లేదుఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఫామ్ గురించి తమకు ఆందోళన లేదంటూ.. వారిని విమర్శిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌కు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. ఇక కివీస్ చేతిలో పరాభవం నుంచి పాఠాలు నేర్చకుంటామని.. విమర్శలను స్వీకరిస్తూనే ముందడుగు వేస్తామని పేర్కొన్నాడు. అంతేకాదు.. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు. అయితే, కొన్నిసార్లు మీడియా ప్రశ్నలకు గంభీర్ దూకుడుగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణి అవలంబించినట్లుగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘ఇందాకే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అతడిని ఇలాంటి పనులకు దూరంగా ఉంచితేనే బీసీసీఐకి మంచిది.అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం. మీడియాతో మాట్లాడేటపుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పదాలు వాడాలో అతడికి తెలియదు. రోహిత్, అగార్కర్ అతడి కంటే చాలా బెటర్. వాళ్లిద్దరినే మీడియా ముందుకు పంపిస్తే మంచిది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నాలుగు గెలిస్తేనేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో చివరగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. ఇందులో భాగంగా భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the seriesHead Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL— BCCI (@BCCI) November 11, 2024 -
అసలు అతడికి మాతో ఏం పని?: రిక్కీ పాంటింగ్‌పై గంభీర్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌పై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి భారత క్రికెట్‌తో పనేంటని.. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడే ముందు తమ ఆటగాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలని హితవు పలికాడు. కాగా టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలవాలంటేసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది రోహిత్ సేన. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కనీసం నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.ఇక కివీస్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమికి ఒకరకంగా వీరిద్దరి వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఆసీస్ పర్యటన భారత జట్టుకు మరింత కఠినతరంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోహ్లిపై పాంటింగ్ విమర్శలుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్‌గా కొనసాగుతూ గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం రెండు శతకాలే బాదడం ఏమిటని ప్రశ్నించాడు. కోహ్లి ఆట తీరు ఇలాగే ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవని.. అతడి బ్యాటింగ్ గణాంకాలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా గౌతీ ఫైర్ అయ్యాడు. ‘‘అసలు పాంటింగ్‌కు భారత క్రికెట్‌తో ఏం పని? అతడు.. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను.భారత క్రికెట్‌తో అతడికి ఏం పని?అయినా, విరాట్, రోహిత్ గురించి అతడికి ఆందోళన ఎందుకు? నా దృష్టిలో వాళ్లిద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లు. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారు’’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సమర్థిస్తూ పాంటింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. కివీస్‌తో సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.భారత్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్, మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ -
సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విధ్వంసకర సెంచరీతో చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్.. 48 గంటల తిరగకముందే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసి మంచి జోష్ మీదన్న శాంసన్ ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోను అదే జోరును కొనసాగిస్తాడని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్‌లో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌటైన భారత ప్లేయర్‌గా శాంసన్ చెత్త రికార్డు నెలకొల్పాడు.నాలుగో 'సారీ'..ఈ ఏడాది టీ20ల్లో శాంసన్ డకౌట్ కావడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన సంజూ.. ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. గతంలో రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ప్రోటీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య -
ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ
న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ సిరీస్ అయిన టీమిండియాకు ఆస్ట్రేలియా రూపంలో మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత జట్టు సన్నదమవుతోంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, సిరాజ్, ఆకాష్ దీప్, సుందర్‌లతో కూడిన ఫస్ట్ బ్యాచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. సోమవారం మిగిలిన ఆటగాళ్లు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆస్ట్రేలియా పయనం కానున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ముంబైలో విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ డౌటే: గంభీర్"తొలి టెస్టుకు రోహిత్ అందుబాటుపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అతడు పెర్త్ టెస్టులో ఆడతాడానే ఆశిస్తున్నాను. మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గురించి మేము ఎక్కువ ఆలోచించడం లేదు. గతంలో ఏమి జరిగిందనే విషయంతో కూడా మాకు సంబంధం లేదు. ప్రతీ సిరీస్ మాకు ముఖ్యమైనదే. ఎక్కడికి వెళ్లినా అద్బుతంగా ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. పెర్త్ టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపడతాడు. అదేవిధంగా ఈశ్వరన్, కేఎల్ రాహుల్‌లలో ఎవరో ఒకరు జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని" గౌతీ పేర్కొన్నాడు. కాగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్. -
వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-‘ఎ’ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆసీస్-‘ఎ’ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.వారు ముందుగానే ఆస్ట్రేలియాకుకాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బీజీటీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో బీజీటీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులను బీసీసీఐ ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది.రాహుల్‌తో పాటు జురెల్ కూడారుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-‘ఎ’ జట్టుకు కూడా వీరిని ఎంపిక చేసింది. కంగారూ గడ్డపై పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను సైతం భారత్-‘ఎ’ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేలా అక్కడకు పంపింది.సానుకూలాంశాలు ఆ రెండేఅయితే, ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో ఏడు, రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ రెండు మ్యాచ్‌లలో సానుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ శతకం(103).. రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీలు(80, 68).వరుసగా నాలుగు సెంచరీలతో సత్తా చాటిఇక ఈ సిరీస్‌లో అత్యంత నిరాశపరిచింది ఎవరంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(4, 10). రాహుల్ సంగతి పక్కన పెడితే.. అభిమన్యుపైనే ఈ సిరీస్ ప్రభావం గట్టిగా పడనుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ఈ బెంగాల్ బ్యాటర్‌ను సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బీజీటీ ఆడబోయే జట్టుకు ఎంపిక చేశారు.రోహిత్ స్థానంలో ఆడించాలనే యోచన.. కానీతొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడన్న వార్తల నడుమ.. అభిమన్యునే యశస్వి జైస్వాల్‌తో ఓపెనర్‌గా దించుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఆసీస్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలోనే అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాడు.దీంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.అతడు ఫెయిల్ అయినా ఓపెనర్గానేఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్ బీజీటీ మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్- ‘ఎ’ జట్టుతో రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ.. ‘‘మరోసారి మనవాళ్లు ఫెయిల్ అయ్యారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. అంతా చేతులెత్తేశారునిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి బీసీసీఐ వాళ్లను అక్కడికి పంపింది. కానీ.. వాళ్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ సిరీస్‌లో అభిమన్యు ఈశ్వరన్ విఫలమైనా.. అతడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దారుణంగా విఫలంఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఆసీస్-‘ఎ’తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో అభిమన్యు చేసిన పరుగులు వరుసగా.. 7, 12, 0, 17. ఇదిలా ఉంటే.. నవంబరు 22 నుంచి ఆసీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. తొలి భారత క్రికెటర్‌గా
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శాంసన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.ఇప్పుడు అదే ఇన్నింగ్స్‌ను సఫారీ గడ్డపై రిపీట్ చేశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్లో ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా సంజూ రికార్డులకెక్కాడు. గతంలో గుస్తావ్ మెక్‌కియాన్ (ఫ్రాన్స్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), రిలీ రూసో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.👉అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును శాంసన్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 10 సిక్స్‌లు నమోదు చేశాడు. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ కూడా 10 సిక్స్‌లు బాదాడు.👉టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా సంజూ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉండేది. గతేడాది డిసెంబర్లో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సూర్యకుమార్ 100 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సూర్య రికార్డును ఈ కేరళ బ్యాటర్ బ్రేక్ చేశాడు.👉ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత బ్యాటర్‌గా శాంసన్ నిలిచాడు. కేవలం 269 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను శాంసన్ సాధించాడు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీని(365) అధిగమించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్(197) అగ్రస్ధానంలో ఉండగా.. విరాట్ కోహ్లి(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.భారత్ ఘన విజయం..ఇక ఈ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా చతికలపడింది. భారత బౌలర్ల దాటికి సౌతాఫ్రికా కేవలం 141 పరుగులకే ఆలౌటైంది.చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్ -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ధృవ్ జురెల్..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితిక సజ్దే రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతను పితృత్వ సెలవులో ఇండనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రోహిత్ లీవ్ విషయం ముందే తెలిసి టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉపయోగపడతాడని ఆస్ట్రేలియాకు పంపింది. అయితే రాహుల్ ఆసీస్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్‌తో పాటు మరో బ్యాకప్ ఓపెనర్‌గా పరిగణించబడిన అభిమన్యు ఈశ్వరన్ కూడా రెండు అనధికారిక టెస్ట్‌ల్లో చేతులెత్తేశాడు. వీరిద్దరితో పాటు ఓపెనర్ రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ సైతం దారుణంగా నిరాశ పరిచాడు.ఈ నేపథ్యంలో రెండో అనధికారిక టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. యశస్వి జైస్వాల్‌కు జతగా శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపించి జురెల్‌ను మిడిలార్డర్లో ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో అందరూ విఫలమైన వేల జురెల్ సూపర్‌గా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొని 19 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆసీస్‌తో తొలి టెస్ట్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉండకపోతే జురెల్నే ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేయడం మంచిందని అందరూ అనుకుంటున్నారు. మరి టీమిండియా మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి. -
Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు గల కారణమేమిటన్నది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. పితృత్వ సెలవుల కారణంగానే హిట్‌మ్యాన్ ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!అవును.. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడట. అతడి భార్య రితికా సజ్దే త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ జియో సినిమాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పెటర్నిటీ లీవ్‌లో ఉన్నందు వల్లే రోహిత్ కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు వెల్లడించాడు.స్వదేశంలో చెత్త రికార్డుఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం రోహిత్ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల సారథిగా చెత్త రికార్డును రికార్డును మూటగట్టుకున్నాడు. స్వదేశంలో తొలిసారి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు కెప్టెన్‌గా నిలిచాడు.న్యూజిలాండ్‌తో ఇటీవల బెంగళూరు, పుణె, ముంబై టెస్టుల్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది. ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది.ఇంతటి కీలకమైన సిరీస్‌లో రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడన్న వార్తల నడుమ.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఆసీస్‌తో టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.ఒకవేళ భార్య ప్రసవం కోసమే అయితే..ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ స్పందిస్తూ.. గావస్కర్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ఒకవేళ భార్య ప్రసవం కోసం.. అతడు ఇంటిదగ్గరే ఉండాలనుకుంటే.. అంతకంటే అందమైన క్షణాలు ఉండవు.కాబట్టి అతడు సెలవు తీసుకున్నా మరేం పర్లేదు. అతడికి ఆ హక్కు ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లకు దూరమైనంత మాత్రాన సిరీస్ మొత్తానికి కేవలం ఆటగాడిగానే పరిగణించాలనడం సరికాదని గావస్కర్ వ్యాఖ్యలను ఫించ్ ఖండించాడు.సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు!ఇక కివీస్‌తో ముంబై టెస్టు తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేను ఆస్ట్రేలియాకు ఇప్పుడే వెళ్తానో లేనో చెప్పలేను’’ అని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు రావడం కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేను రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు తొలి సంతానంగా 2018లో కుమార్తె సమైరా జన్మించింది.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం వారిద్దరి ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. బుధవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి, రోహిత్ శర్మ టాప్–20లో చోటు కోల్పోయారు. కోహ్లి ఎనిమిది స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌లో, రోహిత్ రెండు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌లో నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 93 పరుగులు, రోహిత్ 91 పరుగులు సాధించడం గమనార్హం. మరోవైపు భారత్‌కే చెందిన యశస్వి జైస్వాల్ ఒక స్థానం పడిపోయి నాలుగో ర్యాంక్‌లో నిలువగా... రిషబ్ పంత్ ఐదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్‌లోకి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌లో నిలిచాడు. -
వీఐపీ ట్రీట్మెంట్ గురించి మర్చిపోండి.. ఇకనైనా.. కైఫ్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ల వైఫల్యం వల్లే భారత్‌కు స్వదేశంలో ఘోర పరాభవం ఎదురైందని అభిమానులు సైతం మండిపడుతున్నారు. కనీసం ఆస్ట్రేలియా సిరీస్‌లోనైనా సత్తా చాటి జట్టును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు.. భారత మాజీ క్రికెటర్లు మాత్రం.. రోహిత్- కోహ్లి ఇప్పటికైనా దేశవాళీ క్రికెట్ ప్రాముఖ్యతను గుర్తించి.. రంజీ బరిలో దిగాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టిఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ కీలకం కానున్నాడన్న కైఫ్.. సీనియర్లు తమ విలాసవంతమైన జీవితాన్ని కాస్త పక్కనపెట్టి చెమటోడ్చాలని సూచించాడు. పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో తిరగడం కంటే.. జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని పేర్కొన్నాడు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చారంటే రోహిత్, కోహ్లిలాంటి వాళ్లకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘పరుగులు రాబట్టేందుకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో.. ఎవరికైతే సరైనంత ప్రాక్టీస్ టైమ్ దొరకడం లేదో.. వారు వందకు వంద శాతం దేశవాళీ క్రికెట్ ఆడాలి.అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ దొరకకపోవచ్చుమేము పెద్ద పెద్ద కార్లు, విమానాల్లో ప్రయాణిస్తామనే విషయాన్ని మర్చిపోవాలి. మీకు అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ దొరకకపోవచ్చు.. కానీ ఫామ్‌లోకి రావాలంటే ఇదొక్కటే మార్గం’’ అని కైఫ్ కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. అదే విధంగా.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో రిషభ్ పంత్ మరోసారి కీలకంగా మారనున్నాడని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో సిరీస్‌లో దారుణంగా విఫలంకాగా న్యూజిలాండ్‌తో తాజాగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్, కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఆరు ఇన్నింగ్స్‌లో రోహిత్ వరుసగా 2, 52, 0, 8, 18, 11 పరుగులు మాత్రమే చేయగా.. కోహ్లి 0, 70, 1, 17, 4, 1 రన్స్ రాబట్టాడు. ఇద్దరూ కలిసి కేవలం 184 పరుగులు మాత్రమే చేశారు. ఈ సిరీస్‌లో భారత్ కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది. కాగా దేశవాళీ క్రికెట్లో రోహిత్ ముంబై, కోహ్లి ఢిల్లీకి ఆడిన విషయం తెలిసిందే.చదవండి: BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం -
BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి: టీమిండియా దిగ్గజం
చారిత్రాత్మక ఓటమి నుంచి కోలుకుని తదుపరి టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్‌ను తప్పించండిఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని గావస్కర్ బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సారథిగా నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అతడు రెండో టెస్టు కూడా ఆడకపోవచ్చు.అదే నిజమైతే మాత్రం.. టీమిండియా సెలక్షన్ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే అలాగే చేయండి. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమై.. రెండు- మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోతే మాత్రం.. ఈ టూర్లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించండి.భారత క్రికెట్ కంటే ఎవరూ ఎక్కువ కాదువైస్ కెప్టెన్‌ను ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించండి. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్ బాగోగులే మనకు ముఖ్యం. ఒకవేళ మనం న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. మనం కివీస్ చేతిలో 3-0తో ఓడిపోయాం. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్ అవసరం తప్పకుండా ఉంటుంది.కెప్టెన్ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుంది. ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్ వచ్చాడంటే మాత్రం పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గావస్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు. టెస్టు సారథిగా ఒకే ఒకసారిఇదిలా ఉంటే.. బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. నాడు ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో బుమ్రా సేన పరాజయం పాలైంది. ఇక.. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా జరగటం ఇదే తొలిసారి. కాగా ఆసీస్‌తో నవంబరు 22 నుంచి టీమిండియా టెస్టులు ఆరంభం కానున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: IPL Auction: టీమిండియా స్టార్ల కనీస ధర? అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడకుండానే...