South India
-
దక్షిణ భారత్‌కు ఐదు కొత్త కార్గో విమాన సర్వీసులు
హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రవాణా సేవల కంపెనీ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్ (ఫెడెక్స్) దక్షిణ భారత్ ప్రాంతాలకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానత కల్పించేందుకు కొత్తగా ఐదు కార్గో విమాన సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి కీలక దిగుమతులకు ఈ విస్తరణ వీలు కల్పిస్తుందని, యూరప్, యూఎస్ఏకి ఎగుమతుల వృద్ధికి సాయపడుతుందని కంపెనీ తెలిపింది.అలాగే, లాజిస్టిక్స్, సరఫరా చైన్‌కు అనుకూలిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో దక్షిణ భారత్ పాత్రను బలోపేతం చేస్తుందని పేర్కొంది. ‘‘దేశ వృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ కంపెనీలకు కేంద్రంగా ఉంటోంది. నూతన ఫ్లయిట్ సేవలు ఈ ప్రాంత డిమాండ్‌ను తీర్చేందుకు ఫెడెక్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’అని ఫెడెక్స్ సీఈవో, సీఎఫ్‌వో రిచర్డ్ వి.స్మిత్ ప్రకటించారు. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
మిషన్ మేకోవర్
ఇప్పుడు కమల్‌హాసన్ మిషన్ ఏంటంటే... ‘మేకోవర్’ అన్నమాట. కొత్త సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు కమల్‌హాసన్. ఆయన హీరోగా ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్స్ అన్బు–అరివుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ‘ఇండియన్’ సీక్వెల్స్ ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలతో పాటు ‘థగ్ లైఫ్’ చిత్రంతో కమల్‌హాసన్ బిజీగా ఉన్నారు.ఈ కారణంగా అన్బు–అరివులతో కమల్‌హాసన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘ఇండియన్ 2’ విడుదల కాగా, ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ చిత్రాలను కమల్ పూర్తి చేశారు. దీంతో అన్బు–అరివులతో చేయాల్సిన సినిమాను వచ్చే జనవరి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం కమల్‌హాసన్ స్పెషల్ మేకోవర్ అవుతున్నారు. ఆయన తాజా లుక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
లీక్డ్ వీడియోతో ఒవియా వైరల్.. బిగ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
ఒవియా హెలెన్.. కొద్దిరోజులుగా ఈ బ్యూటీ పేరు సౌత్ ఇండియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. కేరళకు చెందిన ఒవియా తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధింఇచన లీక్డ్ వీడియో అంటూ ఒకటి నెట్టింట షేర్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒవియా ఫోటోను లారెన్స్ షేర్ చేస్తూ సినిమా ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంచన' ప్రాంచైజీ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 3 చిత్రాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, 'కాంచన 4' ప్రాజెక్ట్‌ను త్వరలో లారెన్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఒవియాకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంచన 3 షూటింగ్ సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటోను తాజాగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్‌కు గురౌతున్న ఒవియాకు లారెన్స్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చారంటూ ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాంచన బొట్టుతో ఉన్న ఒవియా ఫోటో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. లారెన్స్ దర్శకత్వంలో 2011లో విడుదలైన 'కాంచన' భారీ విజయాన్ని సాధించింది. హారర్ కామెడీ జానర్లో ట్రెండ్‌ని సెట్ చేసిన ఈ సినిమా 2015లో రెండో పార్ట్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మంచి సూపర్ హిట్ కావడంతో 2019లో 'కాంచన-3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మళ్లీ భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం ఈ నవంబర్‌లో నాలుగో భాగం షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, అదికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మూడు భాగాల్లో లారెన్స్ ప్రధానపాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. కోవై సరళ, శరత్‌కుమార్ గత మూడు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Raghava Lawrence Fans (@raghavalawrenceoffl) -
డ్రగ్స్ కేసులో 'పిశాచి' సినిమా నటి
మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ నిర్వహించి ఒక డీజే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అతనిపై ఇప్పటికే దాదాపు 30 క్రిమినల్ కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తితో మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు నటీనటులు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ 5న ఓ పార్టీలో పాల్గొన్న ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారిని విచారించగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన ఆదారాలు కోర్టుకు అందించడంలో పోలీసులు విఫలం కావడంతో ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్‌కు బెయిల్ వచ్చింది. కానీ, వారిద్దరితో టచ్‌లో ఉన్న నటీనటులు ఎవరనేది చర్చ జరుగుతుంది.మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనాథ్ భాసితో పాటుగా.. పిశాచి చిత్రం ద్వారా ఫేమ్ అయిన నటి ప్రయాగ మార్టిన్ ఈ డ్రగ్స్‌తో లింక్ ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా ఓం ప్రకాశ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు వారు అతని గదికి కూడా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 20 మందికి పైగా ఓం ప్రకాశ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు లభించిన CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారట. కానీ, ఆ వీడియోను పోలీసులు బహిర్గతం చేయలేదు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో గుహ లోయలో పడిపోయిన పాత్రలో శ్రీనాథ్ భాసి కనిపించారు. నటి ప్రయాగ మార్టిన్ 2014లో పిశాచి సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. -
ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్
బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ (ఐఫా) వేడుక అబుదాబిలో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండోరోజు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి అవార్డ్స్ అందించారు. అయితే, బాలీవుడ్ విభాగంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా సత్తా చాటింది. కానీ, జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అయితే, సౌత్ ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా జైలర్ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) అవార్డ్ అందుకున్నారు. అయితే, నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ చిత్రానికి పలు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.ఐఫా 2024 విజేతలు (సౌత్ ఇండియా)ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవిఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంతఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టిఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరాఉత్తమ నటుడు (తెలుగు)- నాని (దసరా)ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం(రంగమార్తాండ)ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పీఎస్ 2)ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్జే సూర్య (మార్క్ ఆంటోనీ)ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబుఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పీఎస్ 2)ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ నటుడు (కన్నడ) – రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పీఎస్ 2)ఉత్తమ లిరిక్స్ – జైలర్ (హుకుం)ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పీఎస్ 2)ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్ 2)ఐఫా 2024 విజేతలు (బాలీవుడ్)ఉత్తమ చిత్రం : యానిమల్ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్)ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )ఉత్తమ విలన్: బాబీ డియోల్(యానిమల్)ఉత్తమ సంగీతం: యానిమల్ ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్)ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీఅచీవ్మెంట్ ఆన్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్ -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
యువతిపై 'జానీ మాస్టర్' లైంగిక దాడి నిజమే.. రిమాండ్ రిపోర్టు ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్‌ను విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే, రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది. (ఇదీ చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు.' రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ తర్వాత జానీకి శిక్ష తప్పదని తెలుస్తోంది. -
పీరియాడికల్ ఫిల్మ్‌లో...
కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమా ప్రకటన ఆదివారం వెలువడింది. ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్‌కు ‘టానాక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు.కార్తీ కెరీర్లో 29వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి చెందిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
విజయ్ రాజకీయ పార్టీకి గుడ్‌న్యూస్.. అభిమానుల్లో ఉత్సాహం
దళపతిగా కోలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంబంధించి జెండాతో పాటు గుర్తును కూడా ఆవిష్కరించారు.ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్.విజయ్‌కి ఎన్నికల సంఘం నుంచి శుభవార్త వచ్చింది. తమ పార్టీకి గుర్తింపు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యచరణ గురించి వెళ్లడిస్తామని అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం వేదికగా TVK పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. 21 నిబంధనలతో సభకు అనుమతి లభించింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా పొత్తుల సాయంతో ముందుకొస్తారా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. -
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
సారీ... నాకు తెలియదు: రజనీకాంత్
మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న హేమా కమిటీ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి హీరో రజనీకాంత్ తనకు ఏమీ తెలియదంటూ స్పందించడం సినిమా వాసులను ఆశ్చర్యపరుస్తోంది.చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల కోసం జస్టిస్ హేమా కమిటీ తరహాలో కోలీవుడ్‌లోనూ ఓ కమిటీ రావాలంటారా? అనే ప్రశ్నకు రజనీకాంత్ స్పందిస్తూ– ‘‘సారీ... ఆ అంశం గురించి నాకేమీ తెలియదు’’ అంటూ జబాబు చెప్పారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
కంగువ వాయిదా?
‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్‌గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
OTT: మమ్ముట్టి ‘టర్బో’ రివ్యూ
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో సీరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. దీనికి దర్శకులు వైశాఖ్. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. టర్బో జోస్ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్‌కి మంచి ఆప్తుడు జెర్రీ. జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్‌తో టర్బో జోస్ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్‌ను జోస్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్ ఓటీటీæ తెరమీదే చూడాలి. టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్‌తో జోస్ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్ పాత్రలో రాజ్ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్ కథను సరదా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్‌కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’. – ఇంటూరి హరికృష్ణ -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్‌లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ఈమెని గుర్తుపట్టారా? సౌత్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపింది.. కానీ కొన్నాళ్లకే!
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్నీ రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో.. నటీనటులు జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ మాత్రం చెప్పాం కదా! మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో సంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిలాల్లో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష్మీ.. టీనేజీలో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరుగా మొదలై.. స్టార్ హీరోలతో కలిసి ఐటమ్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)80-90ల్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటమ్ సాంగ్స్ అంటే దర్శకనిర్మాతలకు ముందు గుర్చొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత వచ్చిన ఫేమ్, డబ్బుని మేనేజ్ చేసుకోలేక.. కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ.. ఈమెని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటోంది.ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికే ఆధార్‌లా ఉన్న సిల్క్‌ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్నీ.. ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో 'ద డర్టీ పిక్చర్' అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది!(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి) -
ఖరీదైన కారును అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో
తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం 'గోట్' చిత్రంలో నటిస్తున్నారు. సురేశ్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. త్వరలో నటుడు విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. త్వరలో పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2012లో ఎంతో ఇష్టపడి రోల్స్‌రాయ్స్ ఖరీదైన కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవడం వల్ల లోకల్ టాక్స్ కట్టలేదనే ఆరోపణలను విజయ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. చైన్నె న్యాయస్థానం విజయ్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. అలాంటిది విజయ్ తను ముచ్చటపడి కొనుక్కున ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ విజయ్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అని రోల్స్‌రాయ్స్ కారు ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. దీని ధర రూ.26 కోట్లు అని, అయితే ఇది నిర్ణయిత ధర కాదని పేర్కొన్నారు. అయితే అది విజయ్ కారా, కాదా అనే చర్చ జరుగుతోంది. -
ధనుష్‌కు మద్ధతుగా నిలిచిన నడిగర్ సంఘం
తమిళ టాప్ హీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్‌పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని ఆపై షూటింగ్స్‌కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్‌పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్‌కు మద్ధతుగా నిలిచింది.ధనుష్‌తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్‌కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. -
అజర్బైజాన్ కు బై
అజర్బైజాన్ కు బై బై చెప్పారు అజిత్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా, అర్జున్ , ఆరవ్, రెజీనా, నిఖిల్ ఇతర రోల్స్‌లో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా అజర్బైజాన్లో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. అజిత్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట మేకర్స్.కాగా దాదాపు పదమూడేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గ్యాంబ్లర్’ (2011) సినిమా తర్వాత అజిత్–అర్జున్ –త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విడాముయర్చి’ కావడం విశేషం. హీరో కుటుంబం విహారయాత్రకు వెళ్తుంది. అక్కడ హీరో భార్య, అతని కుమార్తె అదృశ్యం అవుతారు. వారి ఆచూకీని హీరో ఎలా కనుక్కున్నాడు? ఏ విధంగా రక్షించాడు? అన్నది ‘విడాముయర్చి’ కథ అని కోలీవుడ్ టాక్. -
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్‌బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
గ్లామరస్ పాత్రలలో ఎందుకు నటించనంటే..: ఐశ్వర్య రాజేశ్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెండ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయితే, సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడానికే దర్శక నిర్మాతలు యత్నిస్తుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుంటారన్నది వాస్తవం. అయితే, అందుకు భిన్నంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్యరాజేశ్ ఒకరు. కోలీవుడ్‌లో ఐశ్వర్యరాజేశ్‌కు అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్యరాజేశ్ అక్కడ నుంచి గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య రాజేశ్ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కానీ, తాను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదన్నారు. తనకు తగిన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టం అని పేర్కొన్నారు. గ్లామరస్‌గా నటించడం తనకు తగదన్నారు. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదన్నారు. తనకు కుటుంబ కథా చిత్రాలే కావాలనీ, అందులోనూ నటనకు అవకాశం ఉండాలనీ కోరుకుంటు న్నాని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొన్నారు. కాగా ఈమె కన్నడంలో శివరాజ్ కుమార్‌కు జంటగా నటించిన ఉత్తరఖాండ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈమె నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం.