Suryapet District News
-
సీఎం మూసీ బాట
● ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ● భీమలింగం కత్వ వద్ద పూజలు చేయనున్న సీఎం ● రైతులతో మాటామంతి ● యాదాద్రీశుడి దర్శనం అనంతరం మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8వ తేదీన జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తన పుట్టిన రోజు కావడంతో ముందుగా యాదాద్రీశుడిని దర్శించుకుంటారు. అనంతరం వలిగొండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగం కత్వ వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడే మూసీ నది జలాలు పరిశీలించనున్నారు. అక్కడి నుంచి ధర్మారెడ్డి కాల్వ కత్వ వరకు మూడు కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈసందర్భంగా మూసీ నది మురుగు నీటితో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. అదేమార్గంలో మూడు కిలోమీటర్లు వెనక్కి వచ్చి సంగెం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తం ఆరు కిలోమీటర్లు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేస్తూ పునురుజ్జీవం గురించి జిల్లా ప్రజలకు వివరించనున్నారు. అయితే వలిగొండ మండలం నాగారం నుంచి రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వరకు మూసీ నది వెంట సీఎం పర్యటించే మరో అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. యాదాద్రిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రారంభించనున్నారు. ఏర్పాట్ల పరిశీలనవలిగొండ: వలిగొండ మండలంలోని సంగెం సమీపంలో గల భీమలింగం కత్వ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే మూసీ పునరుజ్జీవ పాదయాత్ర స్థలాన్ని, రైతులు, కులవృత్తుల వారితో నిర్వహించే సభా స్థలాన్ని మంగళవారం ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుజ్జీవం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం నాగారం సమీపంలోని ఆసిఫ్ నగర్ కాల్వ, రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం చెరువు కత్వను పరిశీలించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఏసీపీ మధుసూదన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారిణి లావణ్య, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై యుగంధర్ పాల్గొన్నారు. -
సమగ్ర సర్వేకు రెడీ..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు మూడు వారాల పాటు ఈ సర్వే కొసాగనుంది. దీనికి అవసరమైన సిబ్బంది ఎంపిక, శిక్షణను సైతం పూర్తి చేశారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు ఎన్యూమరేటర్లు ఇళ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.58 లక్షల ఇళ్లు ఉండనున్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. మూడురోజుల పాటు.. సమగ్ర కుటుంబ సర్వే కోసం జిల్లాను 2,800 బ్లాక్‌లుగా విభజించి 2603 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. ఈ ఎన్యూమరేటర్లు చేసిన సర్వేను పర్యవేక్షించేందుకు మరో 264 మంది సూపర్వైజర్లను సైతం నియమించారు. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇళ్లను గుర్తించి జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల జాబితాను రూపొందించాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి మూడురోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఈనెల 9వ తేదీ నుంచి 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు చేపట్టనున్నారు. ఏరోజుకారోజు ఆన్లైన్ ఒక్కో ఎన్యూమరేటర్‌కు సర్వే కోసం 150 నుంచి 175 ఇళ్లను కేటాయించనున్నారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్లను మూడు వారాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఏ రోజుకారోజు సర్వేకు సంబంధించిన ఫారాలను సూపర్వైజర్కు అందిస్తే వాటిని మండల స్థాయిలో ఆన్లైన్ చేయనున్నారు. అవగాహన కల్పిస్తేనే.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటింటి సమగ్ర సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రజల జీవన విధానం తెలియడంతో పాటు కుల గణన ఉండడంతో బీసీల లెక్క తేలనుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో పత్తితీత పనులతో పాటు వరికోతలు, కొనుగోలు కేంద్రాల వద్దకు రైతుల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సిబ్బంది ఇళ్లకు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు లేకపోతే మళ్లీ రావాల్సి ఉంది. ఇలా ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు రావాల్సి ఉండడంతో సర్వే సిబ్బందికి ఇబ్బందులు కలగనున్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఈ సర్వేపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి సర్వే పకడ్బందీగా జరగనుంది.ఫ నేటి నుంచి 8వతేదీ వరకు ఇళ్ల గుర్తింపు ప్రక్రియ ఫ 9వతేదీ నుంచి 75 ప్రశ్నలతో కుటుంబ సర్వే ఫ మూడు వారాలపాటు కొనసాగనున్న ప్రక్రియ ఫ సర్వే వివరాలు ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు గ్రామ పంచాయతీలు 475మున్సిపాలిటీలు 5అధికారుల అంచనా ప్రకారం ఇళ్లు 3.58 లక్షలు ఎన్యూమరేటర్లు 2,603ఎన్యూమరేటర్ బ్లాక్‌లు 2800సూపర్వైజర్లు : 264 -
పేట మార్కెట్‌కు 31,399 బస్తాల ధాన్యం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వరి ధాన్యం పొటెత్తింది. 31,399 బస్తాల ధాన్యం మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చింది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో దీపావళి తర్వాత వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి తోడుగా ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కాంటాలు అయ్యేందుకు చాలా ఆలస్యం కావడంతో రైతులు నేరుగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. సోమవారం 38,715 బస్తాల ధాన్యం వచ్చింది. రెండోరోజు మంగళవారం 31,399 బస్తాలు రాగా.. అత్యధికంగా జైశ్రీరాం రకం 16,746 బస్తాలు ఉంది. గరిష్టంగా రూ.2416లు, కనిష్టంగా రూ.1409ల ధర పలికింది. తర్వాత ఐఆర్ 64 రకం 8356 బస్తాలు, బీపీటీలు 3124 బస్తాలు, హెచ్‌ఎంటీలు 2944 బస్తాల చొప్పున ధాన్యం వచ్చింది. -
డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏలు, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామా రమేశ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట టీపీయూఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డు లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు బకాయి ఉన్నాయని, ఈ కుబేర్ లో జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ లు, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకటించి తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి హరిప్రసాద్, అమరవాది బ్రహ్మచారి, బైరు తిరుమలేశ్, నేరెళ్ల దేవరాజ్, మంచాల రవికుమార్, బాణోత్ పూల్‌సింగ్, రామినేని శ్రీనివాస్, నాగవెల్లి ప్రభాకర్, శ్రీనివాసరావు, సాయికుమార్, సురభి శ్రీధర్, వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , శ్రీదేవి, జేజాల శ్రీదేవి, యమా సంతోష్ పాల్గొన్నారు. -
మాకు న్యాయం చేయాలి
ఫ మా జీతాలు లోన్ ఈఎంఐలకే పోతున్నాయి ఫ ఏడాది కాలంగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు ఫ సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేతిలో మోసపోయిన పలు శాఖల ఉద్యోగుల ఆవేదన ఫ బ్యాంకు ఎదుట బాధితుల ఆందోళన సూర్యాపేట : సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ చేసిన మోసానికి తమ జీతాలు లోన్ ఈఎంఐలకే పోతున్నాయని పలు శాఖల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట బాధిత ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ 2022 నుంచి సూర్యాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో మేనేజర్‌గా పనిచేసిన షేక్ సైదులు గతంలో బ్యాంకులో లోను తీసుకున్న పలు శాఖల ఉద్యోగులు 33 మంది పేర ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా తిరిగి లోన్ తీసుకున్నాడని ఆరోపించారు. సదరు బ్రాంచ్ మేనేజర్ పర్సనల్ లోన్, టాప్ అప్ లోన్ పేరుతో ఉద్యోగుల పత్రాలు తీసుకొని అనంతరం తమకు లోను రాదని చెప్పి ఆ లోను తాను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో ఉద్యోగి పేర రూ.15లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లు బాధితులు చెప్పారు. 2023 జూన్ లో సదరు బ్రాంచ్ మేనేజర్ రామంతాపూర్ ట్రాన్స్ఫర్ కాగా అక్కడ కూడా ఇలాగే చేస్తుండడంతో జనవరి 23న పట్టుకున్నారన్నారు. అప్పటి వరకు తమ పేర తీసుకున్న బ్యాంకు రుణాలకు ఈఎంఐ లను సదరు బ్రాంచ్ మేనేజర్ సైదులు చెల్లించాడని తెలిపారు. ఆ తర్వాత ఆ లోన్లకు సంబంధించిన ఈఎంఐ లు తమ జీతాల నుంచి కట్ అవుతుండడంతో అనుమానం వచ్చి బ్యాంకులో సంప్రదించామన్నారు. అప్పుడు విషయం బయటకు రావడంతో బ్యాంకు రీజనల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ లను కలిసి విషయం తెలిపినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదన్నారు. ఏడాది కాలంగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని , బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్లకు తమ జీతాల నుంచి ఈఎంఐలు కట్ అవుతున్నాయన్నారు. వచ్చిన జీతం మొత్తం ఈఎంఐ లకే పోతుండడంతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు బ్రాంచ్ మేనేజర్ ను పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారని, ఆయన కూడా తమ లోన్లు తీసుకున్నట్లు అంగీకరించాడని అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికై నా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి తమ జీతాల నుంచి బ్రాంచ్ మేనేజర్ తీసుకున్న లోన్ల ఈఎంఐ లను మినహాయించాలని కోరారు. -
7న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్లకు క్రీడాకారుల ఎంపిక
హుజూర్నగర్ : ఈనెల 7న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి ఆజం బాబా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–17 విభాగంలో బాలబాలికలు, అండర్ –14 విభాగంలో బాలురకు ఖోఖో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చే క్రీడాకారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే ధ్రువీకరించిన బోనోఫైడ్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. -
రైతులు నాణ్యమైన ధాన్యం తేవాలి
సూర్యాపేట: రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. మంగళవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ. 500బోనస్‌ను పొందాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని ఐకేపీ నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. రహదారులపై ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని ఆరబెట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట డీఆర్డీఓ అప్పారావు, ఏపీడీ సురేష్, తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, డీటీ నాగలక్ష్మి, ఏపీఎం వెంకయ్య, సీసీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
మద్యం అమ్మొద్దు.. తాగొద్దు
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): తండావాసులంతా ఏకమయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించారు. వందలాదిమంది అఖిలపక్షాల నేతలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై తండాలో మద్యం అమ్మవద్దని, ఎవరూ తాగవద్దని తీర్మానించారు. ఒకవేళ ఎవరైనా విక్రయించినా, తాగినా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రతిజ్ఞ కూడా చేశారు. గ్రామంలో బెల్టు, మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గుగులోతు గణేష్, చాంప్లా, కుమార్, సురేందర్, శ్రీనివాస్, శేఖర్, వీరన్న, ప్రేమ్ కుమార్, నందు పార్వతి, పద్మ, బుజ్జి, చంద్రకళ, కల్పన, మంజుల, మండల జేఏసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ సంపూర్ణ మద్యపాన నిషేధానికి బోరింగ్‌తండా వాసుల తీర్మానం ఫ అమ్మినా.. తాగినా జరిమానావిధించాలని నిర్ణయం -
సమయ పాలన పాటించాలి
సూర్యాపేటటౌన్ : అధ్యాపకులు, విద్యార్థులు సమయ పాలన పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి మాట్లాడారు. కళాశాలలో విద్యార్థులకు స్టడీ అవర్ పెంచాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు పాఠాలు బోధించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మద్యం సేవించి స్కూల్‌కు వచ్చినఉపాధ్యాయుడి సస్పెన్షన్ మోతె: మద్యం సేవించి పాఠశాలకు హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలో రాంపురంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నవిల ఉపేందర్ సోమవారం మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. స్కూల్ ఆవరణలో స్పృహలేకుండా నిద్రపోయారు. గమనించిన విద్యార్థులు, గ్రామస్తులు.. సదరు ఉపాధ్యాయుడి ఫొటోలు, వీడియో తీసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎంఈఓ విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడు నవిల ఉపేందర్‌ను డీఈఓ అశోక్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లో నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దుసూర్యాపేట: ఆశా కార్యకర్తలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం సూచించారు. మంగళవారం జిల్లాలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన వైద్య సేవలు సలహాలు, సూచనలు చేయాలన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాలు నిర్వహించాలి భానుపురి (సూర్యాపేట): సీపీఐ శత వార్షికోత్సవాలను ఏడాది పాటు ఊరూ– వాడా ఏకమై నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని మరింతబలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ లేని గ్రామాల్లో ప్రజాసంఘాలను నిర్మించడం ద్వారా విస్తృతపర్చవచ్చన్నారు. నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 26 వరకు పార్టీ ప్రజా సంఘాల సభ్యత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. డిసెంబర్ 30న నల్లగొండ జిల్లా కేంద్రంలో శత వార్షికోత్సవాల సందర్భంగా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయనాయుడు, మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, కంబాల శ్రీనివాస్, పోకల వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, గుండు వెంకటేశ్వర్లు, ఎస్.కె లతీఫ్, దేవరం మల్లీశ్వరి, కోటమ్మ, సాహెబ్ అలీ, రమేష్, చిలక రాజు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నడిగూడెం : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులైనా కొనుగోళ్లు వేగం పుంజుకోక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, ఏనుగుల వీరాంజనేయులు, లతీఫ్బాబు పాల్గొన్నారు. -
విద్యార్థి దశ నుంచే లక్ష్యం కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు విద్యార్థి దశనుంచే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సూర్యాపేట పట్టణంలోని గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీని తనిఖి చేశారు. మౌళిక వసతులను పరిశీలించి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన భోజనం అందించాలని కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పద్మజ , కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి,యాదాద్రి: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంత రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యాదాద్రి దేవస్థానం, మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలీస్ శాఖ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఏసీపీ సైదులు, ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
మట్టపల్లిలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవారిని అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారిని గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కాగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, మార్తి దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు, చీకూరి రాజేష్భక్తులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం సహించను
కోదాడ: కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి నిరంతం కృషి చేస్తున్నామని, అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు సంబంధించి నీటిపారుదల, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్య, వైద్యారోగ్యశాఖల పనితీరుతో పాటు వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోమవారం కోదాడలోని కాశీనాథం ఫంక్షన్హాల్లో అధికారులతో మంత్రి సమీక్షించారు. నీటిపారుదలశాఖలో గడిచిన రెండు నెలలుగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాన్‌పహాడ్ ఎత్తిపోతల, ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకాల పనులను ఆలస్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. అభివృద్ధి పథకాలకు ఎన్ని నిధులు కావాలన్నా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేనిబాబు పాల్గొన్నారు. -
సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందంజ
సూర్యాపేటటౌన్ : ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఐజీలు రమేష్ , సత్యనారాయణ, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.70 లక్షలు పోలీస్ హౌజింగ్ శాఖ నుంచి, రూ.20 లక్షలు పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఈ కార్యాలయానికి నిధులు సమకూర్చినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ ప్రథమ స్థానంలో ఉందని, రాష్ట్రంలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన అనంతగిరి, చింతలపాలెం, పాలకవీడు, మద్దిరాల, నాగారం పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నూతన కార్యాలయంలో డీఎస్పీ రవిని కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ చైర్మన్ వేణారెడ్డి, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకుడు చలసాని శ్రీనివాసరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి పేటలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ఇప్పటి వరకు వివిధశాఖల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వచ్చే వారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తుల స్థితిగతులను వివరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలించాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 16 దరఖాస్తులు, డీడబ్ల్యూఓ 4, డీఆర్డీఓ 6, డీపీఓ 1, డీఏఓ 7, ఇతర శాఖలకు సంబంధించి 24 ఇలా మొత్తం 58 దరఖాస్తులు అందాయని వీటిని సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అప్పారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, లత, బీసీ వెల్ఫేర్ అధికారి అనసూర్య, డీసీఓ పద్మజ, డీపీఓ నారాయణ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు -
తిరుమలగిరి మార్కెట్‌కు 24,746 బస్తాల ధాన్యం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్లోనే అత్యధికంగా సోమవారం 24,746 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. క్వింటాకు గరిష్టంగా రూ.2061, కనిష్టంగా రూ.1880 ధర పలికినట్లు తెలిపారు. రుణాలు త్వరగా పంపిణీ చేయాలి సూర్యాపేట : రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలను త్వరగా పంపిణీ చేయాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీసీసీబీ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకాలను సద్వియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్లు ఎ. శ్రవణ్ కుమార్, గుడిపాటి సైదులు, కొండ సైదయ్య, బ్యాంకు సీఈఓ శంకర్రావు, జేఆర్ఓఎస్డీ మైఖేల్ బోస్, సూర్యాపేట జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, డీజీఎం ఉపేందర్ రావు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. మజ్దూర్ యూనియన్తోనే రైల్వే కార్మికులకు మేలుమఠంపల్లి: మజ్దూర్ యూనియన్తోనే రైల్వే కార్మికులకు మేలు జరుగుతుందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ అన్నారు. సోమవారం ఆయన మజ్దూర్ యూనియన్ మధిర బ్రాంచ్ ఆధ్వర్యంలో మఠంపల్లి సెక్షన్లో సికింద్రాబాద్ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కీమెన్ బీట్ లెంత్ తగ్గించాలని ఉద్యోగులు కోరడంతో వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో ఆదేశాలు ఇప్పిస్తామని హామీ ఇప్పించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సంపత్‌రావు, యుగంధర్, అంజయ్య, చైర్మన్ వెంకట్, సీసీయాస్ డెలిగేట్స్ కిరణ్, కిషోర్, శ్రీనివాస్, వినయ్, కృష్ణ, చారి, రామక్రిష్ణ పాల్గొన్నారు. శివాలయంలో విశేష పూజలు యాదగిరిగుట్ట : యాదాద్రికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు... ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఆలయ ముఖమండపం, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. -
రుణమాఫీ కాలే..!
29,608 మంది రైతులకుకుటుంబ నిర్ధారణకు యాప్జిల్లాలో మూడు విడతల్లో మొత్తం 95,350 మందికి గాను రూ.746.09 కోట్ల మాఫీ చేసింది. అయితే అన్ని అర్హతలు ఉండి పాస్ పుస్తకం, బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులో తప్పులు, రేషన్ కార్డు లేకపోవడం తదితర కారణాలతో సుమారు 29,608 మందికి రుణమాఫీ కాలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రుణమాఫీ చేసేందుకు గాను కుటుంబ నిర్ధారణ చేయాలని భావించి యాప్‌ను రూపొందించింది. భానుపురి (సూర్యాపేట) : రైతు రుణమాఫీ పథకం అసంపూర్తిగానే మిగిలింది. మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియలో అన్ని అర్హతలున్నా వివిధ సమస్యల కారణంగా వేలమందికి మాఫీ డబ్బులు జమ కాలేదు. ఇలాంటి వారందరి కుటుంబ నిర్ధారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. జిల్లాలో ఈ ప్రక్రియ 80 శాతమే పూర్తయింది. 10 రోజులుగా సంబంధిత యాప్ పనిచేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో 29,608 మంది రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు. 80శాతమే నమోదు పూర్తి కుటుంబ నిర్ధారణ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వ్యవసాయ అధికారులు 80 శాతం వివరాలను మాత్రమే ఈ యాప్‌లో నమోదు చేశారు. దాదాపు 10 నుంచి 15 రోజులుగా యాప్ పనిచేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. ఇక బ్యాంకర్లకు ఆధార్ కార్డులో ఒకలా, పట్టాదారు పాసు పుస్తకాల్లో మరోలా ఉన్నవారి వివరాల సేకరణకు గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయగా.. ఒక్క దరఖాస్తు రాకపోవడం, పరిష్కారం కాకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వివరాలను సేకరించకపోవడం, ఎలాంటి కదలిక లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా నాలుగో విడత కింద రూ.2లక్షల లోపు అర్హత ఉండి కానివారి రుణాలను, రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుకుంటున్నారు. కుటుంబ నిర్ధారణ చేయడంలో జాప్యం ఇప్పటి వరకు 80 శాతం మంది వివరాలు యాప్‌లో నమోదు పదిరోజులుగా యాప్ ఓపెన్కాక నిలిచిన ప్రక్రియ రైతులకు తప్పని ఎదురుచూపులుమూడు విడతల్లో మాఫీ ఇలా.. విడత రైతుల మాఫీ అయిన డబ్బు సంఖ్య (రూ.కోట్లలో) మొదటి 56,217 282.78 రెండో 26,376 250.07 మూడో 12,757 213.24ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు కనుకు సత్యనారాయణ. సొంతూరు జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం. 2019 లో సూర్యాపేటలోని కెనరా బ్యాంకు నుంచి రూ.1.40లక్షల పంట రుణం తీసుకున్నాడు. దీనికి రూ.6వేల వడ్డీ కలుపుకొని ప్రస్తుతం రూ.1.46లక్షల అప్పు అయ్యింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మాఫీ కావాల్సి ఉన్నా కాలేదు. అధికారులను సంప్రదిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లో ఒకేలా పేరు లేదని చెప్పారు. అసలు మాఫీ అవుతుందా..? కాదా..? అంతుపట్టడం లేదు. -
పదికి ప్రతే్యక తరగతులు
నాగారం: పదో తరగతిలో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచే జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఎయిడెడ్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు సాయంత్రం వేళ, 2025 జనవరి 1 నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు ఉంటాయి. తరగతుల నిర్వహణ ఇలా..జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరంలో 6,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టైంటేబుల్ రూపొందించుకోవడం, రోజూ ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్పెషల్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వెనకబడకుండా ముఖ్యమైన అంశాలను చదివిస్తున్నారు. ఈనెల 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సాయంత్రం 4:20 గంటల నుంచి 5:20 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలి. జనవరి 1 నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:20 నుంచి 5:20 గంటల వరకు రెండు పూటలా తరగతులు నిర్వహించాలి. ఇందులో రెగ్యులర్ తరగతులు బోధించకుండా పునశ్చరణ, మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పెషల్ క్లాసులకు విద్యారులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా రిజిస్టర్ మెయింటేయిన్ చేయాలి. ఎప్పటి కప్పుడు విద్యా ప్రగతిపై విద్యార్థులతో చర్చించాలి. ప్రధానోపాధ్యాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా మోటివేట్ చేయాలి. ఐదు రోజులుగా కొనసాగుతున్న టెన్త్ స్పెషల్ క్లాసులు డిసెంబర్ వరకు సాయంత్రం వేళ జనవరి నుంచి రెండు పూటలా.. వందశాతం ఫలితాల సాధనే లక్ష్యంగతేడాది ఉత్తీర్ణత ఇలా..2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ఈసారి వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా శాఖ అధికారులు సూచిస్తున్నారు.ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత దాదాపుగా తీరింది. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీత సాధించే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లు ప్రణాళికరూపొందించుకొని ముందుకు సాగాలి. ప్రత్యేక తరగతుల కోసం విధిగా రిజిస్టర్ నిర్వహించాలి. అవసరమైతే అధికారులతో తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
నైపుణ్యాల పెంపునకు అదనపు కోర్సులు
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ రూరల్ : విద్య ప్రమాణాలు నైపుణ్యాల పెంపు కోసం అదనపు కోర్సులు నిర్వహించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం యూనివర్సిటీలో అన్ని శాఖల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు ప్రతి విభాగం నుంచి అదనపు కోర్సులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అదనంగా నైపుణ్య శిక్షణలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌లో నివసించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ రవి, ఓఎస్డీ అంజిరెడ్డి, అధ్యాపకులు రవి, రమేష్, ఉపేందర్‌రెడ్డి, శ్రీదేవి, అరుణ ప్రియ, సుధారాణి, మాధురి, రూప, తిరుమల, రామచంద్రగౌడ్, రమేష్, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ట్రంప్‌తోనే ఉద్యోగావకాశాలు
నేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి. మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయి. – దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, బేబికాన్ నా మద్దతు కమలాహారిస్‌కే..శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్‌లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్‌కే. – పాదూరి రామమోహన్‌రెడ్డి, మిజోరి స్టేట్ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన పంగ శ్రీను(39) రోజు మాదిరిగానే ఉదయం 6 గంటలకు పొలం పనులకు వెళ్లాడు. మృతుడి భార్య కవిత తమ చేనులో పత్తి తీయడానికి కూలీలను వెంటబెట్టుకొని ఉదయం 9.30 గంటలకు వెళ్లింది. అప్పటికే పంగ శ్రీను అక్కడ పడి ఉండడాన్ని చూసిన భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడి ఎడమ నడుము పైభాగాన చర్మం చీలి ఉండడంతో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లి పంగ సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. -
ట్రంప్ గెలిచే అవకాశం ఉంది
భువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు. – జి.సంతోష్, కాలిఫోర్నియా -
ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం
భువనగిరి : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ ఆఫీసర్ సి.రమణి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 68వ ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడుతాయని చెప్పారు. అనంతరం జెండా ఊపి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి, అర్గనైజింగ్ సెక్రటరీ ఇందిర, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ బాలకృష్ణ, పీడీ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే..అథ్లెటిక్స్ పోటీల్లోని 1500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో కె.శివాని, జి.స్పందన, ఎస్.సంధ్య, ఎం సాగరిక, బాలుర విభాగంలో వి.చంద్రశేఖర్, జి.మధుకర్, ఎం.ప్రమోద్, డి.ప్రవీన్ గెలుపొందారు. 400 మీటర్ల పరుగు పోటీల్లో బాలికల విభాగంలో బి.దేవిశ్రీ, డి.సంజన, జి.ఆకాంక్ష, ఎం.మౌనిక, బాలుర విభాగంలో ఎస్.రాము, ఎన్.నవీన్, కె.శివ గెలుపొందారు. డిస్కస్ త్రోలోని బాలికల విభాగంలో కె.నందిని, ఎన్.ప్రణతీ, ఉదయ్‌శ్రీ, బాలుర విభాగంలో ఎం.రాహుల్, వి.వినోద్ కుమార్, ఎస్.అక్షయ్, జావలిన్ త్రోలో బాలికల విభాగంలో హరిక, రాజేశ్వరీ, ప్రణతి గెలుపొందారు. డీఐఈఓ రమణి ఉమ్మడి నల్లగొండ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం -
ట్రంప్ గెలవాలనుకుంటున్నారు
నల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్‌కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్ గెలవాలనుకుంటున్నారు. – కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్ ఏంజెల్స్