Automobile
-
బుల్లి ఎస్‌యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్‌యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్‌యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్‌లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్‌యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్‌యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్‌లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్‌యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్‌తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్‌ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్‌యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్‌యూవీలు కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్‌యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్‌యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే.?
పండగ సీజన్ వస్తుందంటేనే చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఆఫర్ వెల్లడించింది. సంస్థ తయారు చేసిన ఎస్1 బేసిక్ మోడల్‌ను రూ.50 వేల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.80 వేలు వరకు ఉంది.ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానంగా బ్యాటరీకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు బ్యాటరీతోపాటు టెక్నాలజీను అందిస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ వ్యయం పెరుగుతోంది. ఈ పండగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా ప్రకటన కొంత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తమ అవసరాలు, వాహనంలోని సౌకర్యాలు, మన్నిక, ఇప్పటికే ఆ వాహనాన్ని ఎవరైనా వాడుతుంటే తమ అభిప్రాయం..వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వాటిలో కస్టమర్ల అవసరాలు, ఆర్థిక వ్యయాన్ని పరిగణించి సౌకర్యంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆఫర్లకు మొగ్గు చూపకుండా వాహనం నాణ్యతకు పెద్దపేట వేయాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..! -
నెలలో 11 శాతం పెరిగిన విక్రయాలు
మోటార్‌సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ సెప్టెంబర్‌లో విక్రయాలు పెరిగినట్లు కంపెనీ సీఈఓ బి.గోవిందరాజన్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 11 శాతం పెరిగి 86,978 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోవిందరాజన్ మాట్లాడుతూ..‘కంపెనీ మోటార్ సైకిల్ విభాగంలో విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో 78,580 యూనిట్ల విక్రయం జరిగింది. ఈసారి అదే సమయంలో 11 శాతం విక్రయాలు పెరిగి 86,978కు చేరాయి. 2024 ప్రారంభంలో క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేయడం సంస్థ విక్రయాలు పెరిగేందుకు తోడ్పడింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు 4,319 యూనిట్లుగా ఉండేది. అది గత నెలలో 7,652 యూనిట్లకు పెరిగింది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..? -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
కేవలం 12 మందికే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
రేంజ్ రోవర్ తన మొట్టమొదటి ఇండియా ఎక్స్‌క్లూజివ్ మోడల్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.98 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే 12మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు.రేంజ్ రోవర్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్ అనేది రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందింది. ఈ కారును విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కంపెనీ విరాళంగా అందించనున్నట్లు సమాచారం.రణథంబోర్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది బ్లాక్ బాడీ కలర్లో రెడ్ షిమ్మర్‌తో నిండి ఉంది. డిజైన్ పులికి చిహ్నంగా రూపొందించారు. కాబట్టి పులి చారల వంటి డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఇది 23 ఇంచెస్ ఫోర్జ్డ్ డార్క్ గ్రే వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఇంటీరియర్.. కారావే అండ్ లైట్ పెర్లినో సెమీ-అనిలిన్ లెదర్ కలయికను పొందింది. సీట్లపై ఎంబ్రాయిడరీ పులి వెన్నెముక వెంట ఉన్న చారల మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో రిక్లినబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లోయబుల్ కప్‌హోల్డర్స్, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ మొదలైనవి ఉన్నాయి.ఈ కారు ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 500 Nm టార్క్, 394 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి పనితీరు బాగుంటుందని భావిస్తున్నాము. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ఇవే..
ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సీ3 ముఖ్యమైన ఫీచర్ అప్డేట్లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఇది కేవలం టాప్-స్పెక్ షైన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. సీ3 ఆటోమాటిక్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 10.27 లక్షల మధ్య ఉన్నాయి.సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. అయితే ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. డిజైన్ కొంత అప్డేట్ పొందినప్పటికీ.. ఫీచర్స్ జాబితాలో మాత్రం మాన్యువల్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ 1.2 లీటర్ టర్బో పిత్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) భారతీయ విఫణిలో 'కల్లినన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్యూవీ డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారును కల్లినన్ సిరీస్ 2 అని కూడా పిలువవచ్చు.2024 రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. ఇది ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక భాగంలో స్టెయిన్లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. రీడిజైన్ గ్రిల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా కొంత అప్డేట్ పొందాయి.ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలురోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్
హైదరాబాద్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్+, ఎకో, నార్మల్, స్పోర్ట్) డ్రైవింగ్ మోడ్లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. -
నెక్సాన్ సీఎన్జీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ టర్బోచార్జ్డ్ ఐసీఎన్జీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనమిది వేరియంట్లలో లభిస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.99 లక్షలతో ప్రారంభమై రూ.14.59 లక్షల వరకు ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో తయారైంది. కేజీకి 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఫీచర్లు. 321 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టాప్ వేరియంట్‌కు 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, టైర్ ప్రెజర్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆటో హెడ్‌లైట్, ఆటో వైపర్స్ వంటివి జోడించారు. ఈవీ 489 కిలోమీటర్లు.. టాటా మోటార్స్ తాజాగా 45 కిలోవాట్ అవర్ బ్యాటరీతో కూడిన నెక్సాన్ ఈవీని పరిచయం చేసింది. ధర రూ.13.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 48 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టచ్ బేస్డ్ ఏసీ ప్యానెల్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు జోడించారు. కాగా, టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్‌ను రూ.17.19 లక్షల ధరతో ప్రవేశపెట్టింది. -
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజంపోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
అక్టోబర్‌లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..
పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.2024 కియా కార్నివాల్కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.కియా ఈవీ9ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్ మొదలైనవి ఉంటాయి.బీవైడీ ఈమ్యాక్స్7దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీమెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది. -
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్..
పండుగ సీజన్ మొదలవుతోంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించేసాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన రైడర్ 125 మీద తగ్గింపులను ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 84,869కే లభిస్తుంది.టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.2 న్యూటన్ మీటర్ టార్క్, 11.4 హార్స్ పవర్ అందిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఆఫర్స్ అందిస్తున్న కంపెనీల జాబితాలో టీవీఎస్ మాత్రమే కాకుండా.. చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలను పెంచడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటి గురించి పూర్తిగా కనుక్కున్న తరువాత కొనుగోలు చేయడం ఉత్తమం. -
అమ్మకాల్లో అదరగొట్టిన టైగన్.. మూడేళ్ళలో లక్ష!
టైగన్ అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న.. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 18.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఈ కారు జఫ్రీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. -
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
నాలుగేళ్లలో.. ఈ కారును 4.5 లక్షల మంది కొనేశారు
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి. -
ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ వాహనాలలో ఒకటైన లెక్సస్ తన 'ఎల్ఎమ్ 350హెచ్' (Lexus LM 350h) బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 మార్చిలో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ 2023 ఆగష్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం 100 బుకింగ్స్ పొందింది.కంపెనీ వంద బుకింగ్స్ పొందింది, కాబట్టి వీటిని డెలివరీ చేసిన తరువాత మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్ళీ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయనేది తెలియాల్సిన విషయం.లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్విశాలమైన క్యాబిన్ కలిగిన ఈ ఎంపీవీ.. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగులలో లభించే ఈ కారు 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 23 స్పీకర్ ఆడియో సిస్టం, ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, రిఫ్రిజిరేటర్ మొదలైనవన్నీ ఇందులో లభిస్తాయి.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనఈ లగ్జరీ ఎంపీవీ 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లు. ఈ కారు టయోటా వెల్ఫైర్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన
అమెరికన్ వాహన తయారీ 'జనరల్ మోటార్స్' కంపెనీ 4,49,000 కంటే ఎక్కువ పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.కంపెనీ రీకాల్ ప్రకటించిన వాహనాల జాబితాలో.. 2023-2024 కాడిలాక్ ఎస్కలేడ్, ఎస్కలేడ్ ESVలు, 2023 చేవ్రొలెట్ సిల్వరాడో 1500, 2023-2024 చేవ్రొలెట్ టాహో, సబర్బన్ సిఐ 1500, 2023 జీఎంసి సియెర్రా 1500, 2023-24 జీఎంసి యుకాన్ ఎక్స్ఎల్ మోడల్స్ ఉన్నాయి.రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ బ్రేక్ ఫ్లూయిడ్ కోల్పోయినప్పుడు వార్ణింగ్ ప్రదర్శించడంలో లోపం అని తెలుస్తోంది. ఇది బ్రేకింగ్ పనితీరును తగ్గిస్తుంది, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది.కంపెనీ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్లకు అక్టోబర్ 28న మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుంది. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయినా.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్ అందించే వాహనాలనే ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం..ప్రస్తుతం దేశీయ విఫణిలో 15 లక్షల రూపాయలకంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3, టాటా టియాగో ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటివి ఉన్నాయి.టాటా నెక్సాన్ ఈవీ: భారతదేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక ఫుల్ ఛార్జీతో 325 కిమీ నుంచి 465 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ఈవీ: ఇటీవల ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన విండ్సర్ ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 10.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 331 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సిట్రోయెన్ ఈసీ3: ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఈసీ3 ధర రూ. 12.70 లక్షల నుంచి రూ. 13.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జీతో గరిష్టంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.టాటా టిగోర్ ఈవీ: టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టియాగో ఈవీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ 315 కిమీ.టాటా పంచ్ ఈవీ: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్న టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జీతో 315 కిమీ నుంచి 421 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీ: రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షల మధ్య లభించే టాటా టియాగో ఈవీ.. ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందిన సరసమైన ఎలక్ట్రిక్ కారు. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 250 కిమీ నుంచి 315 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!ఎంజీ కామెట్ ఈవీ: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. దీని ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. సింపుల్ డిజైన్ కలిగి, మూడు డోర్స్.. నలుగురు ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు 230 కిమీ రేంజ్ అందిస్తుంది.రేంజ్ (పరిధి) అనేది ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంచుకునే బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. వాహన కొనుగోలు దారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..
సెంకడ్హ్యాండ్లో వెహికిల్ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్ఎస్) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్ చేయాలి.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది.సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్‌చేసి ‘సెండ్ ఓటీపీ’ బటన్‌పై క్లిక్ చేయాలి.మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి.తర్వాత వేరే విండో ఓపెన్ అవుతుంది. వెహికిల్ టైప్ ఎలాంటిదో సెలక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్ఓసీ వస్తుంది.ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..? -
టాటా వాహనాలకు ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది.