Automobile
-
అమ్మకాల్లో అరుదైన రికార్డ్!.. అప్పుడే 2 లక్షల మంది కొనేశారు
ఏప్రిల్ 2023లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం 17 నెలల్లో రెండు లక్షల అమ్మకాలను చేరుకుంది. మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి 10 నెలల్లో 100000 యూనిట్లు.. మరో నాలుగు నెలల్లో 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 14 నెలల్లోనే 1.50 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.1.50 లక్షల సేల్స్ సాధించిన తరువాత.. మరో మూడు నెలల్లో 50వేల విక్రయాలను పొందింది. అంటే మొత్తం 17 నెలల్లో రెండు లక్షలమంది కస్టమర్లను ఆకర్శించి అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది.ఇదీ చదవండి: కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయంమారుతి ఫ్రాంక్స్ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ), జీటా, ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.టీవీఎస్ రైడర్ 125టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125సీఎన్జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హోండా హార్నెట్ 2.0రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..బజాజ్ పల్సర్ ఎన్160అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. -
రెనో సీఎన్జీ వేరియంట్స్ వస్తున్నాయ్..
చెన్నై: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో సీఎన్జీ వేరియంట్లను త్వరలో పరిచయం చేయనుంది. తొలుత ట్రైబర్, కైగర్ ఆ తర్వాత క్విడ్ సీఎన్జీ రానున్నాయి. కొన్ని నెలల్లో కంపెనీ ప్రవేశపెట్టదలచిన ఆరు కొత్త మోడళ్ల కంటే ముందే ఈ సీఎన్జీ వేరియంట్లు దర్శనమీయనున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు.భారత్‌లో 2023లో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వెహికిల్స్ 5.24 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ సంఖ్య 4.8 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. కాగా, కంపెనీ విడుదల చేయనున్న మోడళ్లలో సరికొత్త బి–సెగ్మెంట్ ఎస్యూవీ, సి–సెగ్మెంట్ ఎస్యూవీ, రెండు ఈవీలతోపాటు ఆధునీకరించిన ట్రైబర్, కైగర్ ఉన్నాయి.రెనో ఇండియా ప్రత్యేక ఫీచర్లతో ట్రైబర్, కైగర్, క్విడ్ మోడళ్లలో నైట్ అండ్ డే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను బుధవారం ప్రవేశపెట్టింది. లిమిటెడ్ ఎడిషన్‌లో 1,600 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచామని వెంకట్రామ్ తెలిపారు. గతేడాది మాదిరిగానే 2024లో 53,000 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని రెనో ఇండియా అంచనా వేస్తోంది. -
విదేశీ బ్రాండ్ల చలో భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్‌లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్‌లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.యూరప్‌లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్‌లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్‌లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్‌తో తిరిగి భారత్‌లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌ను వీడింది.కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్‌లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్‌లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జాయింట్ వెంచర్లు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్‌తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్‌తో టై అప్ పెట్టుకుని భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్‌లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్‌లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్‌తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్‌లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది. విధానాల ఫలితం.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్‌కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్‌మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్‌డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్ తెలిపారు. విస్మరించలేనివి...భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్‌లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు. -
లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త యూనికార్న్: వివరాలు
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ఒకటైన 'హోండా మోటార్‌సైకిల్'.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పాపులర్ బైక్ 'యునికార్న్'ను సరికొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.హోండా యూనికార్న్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే అమ్ముడవుతోంది. దీని ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ, బజాజ్ పల్సర్ 150 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూనికార్న్ బైకు మీద కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీ, మరో ఏడేళ్లు ఎక్స్టెండెడ్ వారంటీ ఉన్నాయి.కొత్త హోండా యూనికార్న్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఎంపికలను కలిగి ఉంది. 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ పొందుతుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ప్రారంభంలో హోండా యునికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ స్కీమ్‌లలో విక్రయించబడింది. ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ స్కీమ్‌లో కూడా అమ్ముడైంది. ఇక రాబోయే కొత్త యునికార్న్ ఎలాంటి అప్డేట్స్ పొందుతుందో అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
మొదటిసారి కారు కొన్నవారు ఇంతమందా?
కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్‌ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. -
కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక కోటి (10 మిలియన్) యాక్టివా స్కూటర్లను విక్రయించి సేల్స్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.2001లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన యాక్టివా 2017 నాటికి 50 లక్షల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత 50 లక్షల సేల్స్ సాధించడానికి 7 సంవత్సరాల సమయంలో పట్టింది. యాక్టివా స్కూటర్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు వంటి ప్రాంతాల్లో విరివిగా అమ్ముడైంది. దీంతో 1 కోటి సేల్స్ సాధించింది. అమ్మకాల్లో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడల్స్ రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..హోండా మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న టూ వీలర్స్ ఇవే..యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోటార్‌సైకిల్స్ మాత్రమే కాకుండా డియో, షైన్ 100, సీడీ 110 డ్రీమ్ డీలక్స్, షైన్ 125, ఎస్పీ125, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి టూ వీలర్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 110సీసీ, 125 సీసీ బైకులు అమ్ముడవుతున్నాయి. -
బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బీఎండబ్ల్యూ' ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందింది.ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తున్న ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయానికి ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు స్వరోవ్స్కీ గ్లాస్ కట్ క్రిస్టల్స్, అల్యూమినియం శాటినేటెడ్ రూఫ్ రెయిల్‌లతో కూడిన క్రిస్టల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.టాంజానైట్ బ్లూ, డ్రవిట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఇండివిజువల్ లెదర్, యూనిక్ క్రిస్టల్ డోర్ పిన్స్,అల్కాంటారా కుషన్స్ వంటి వాటితో పాటు 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 381 హార్స్ పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ రూ.5 వేలేనా?
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. ఫేమ్ స్కీమ్ స్థానంలో ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్లపై గరిష్టంగా మొదటి సంవత్సరంలో రూ.10,000, రెండో ఏడాదిలో రూ.5,000 సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం అందించనుంది.ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకానికి సంబంధించిన వివరాలను, ఏయే వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుందన్న విషయాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద బ్యాటరీ 'పవర్'ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 సబ్సిడీని నిర్ణయించినట్లు కుమారస్వామి తెలిపారు. అయితే మొదటి సంవత్సరంలో మొత్తం సబ్సిడీ రూ.10,000 మించదు. రెండవ సంవత్సరంలో ఈ సబ్సిడీ కిలోవాట్ అవర్‌కు సగానికి అంటే రూ. 2,500కి తగ్గుతుంది. మొత్తం ప్రయోజనాలు రూ. 5,000 మించవు.ఇక ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలుదారులకు మొదటి సంవత్సరంలో రూ.25,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాది రూ.12,500 సబ్సిడీని పొందవచ్చని కుమారస్వామి తెలిపారు. ఎల్ 5 కేటగిరీ (త్రీవీలర్లను తీసుకెళ్లే వాహనాలు) వాహనాలకు మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 సబ్సిడీ లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.‘ఫేమ్’లో భారీగా సబ్సిడీఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకాన్ని మొదటిసారి 2015 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ రెండో ఫేజ్‌ను 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది వాస్తవానికి మూడేళ్ల ప్రణాళిక 2022 మార్చి 31న ముగియాల్సి ఉండగా 2024 జూలై 31 వరకు పొడిగించింది.ఈ స్కీమ్ రెండో దశ కాలంలో నమోదైన ఒక్కో ఎలక్ట్రిక్ టూవీలర్‌పై ప్రభుత్వం ప్రభుత్వం రూ.20,000 రాయితీ అందించేది. ఫేమ్2 ప్రారంభంలో సబ్సిడీ మొత్తం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 ఉండేది. తర్వాత రూ.15000 లకు పెంచినప్పటికీ మళ్లీ తగ్గించింది. -
ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.గత ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్సర్ట్లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
టీవీఎస్ అపాచీ లేటెస్ట్ ఎడిషన్.. మరింత పవర్ఫుల్!
టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్టీఆర్ 310 లాగే ఉంటుంది.కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్లెట్లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్‌కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్‌తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్పీ, 29ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్బాక్స్ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.యూఎస్డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివరల డిస్క్ బ్రేక్‌లు, రైడ్ మోడ్లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను కూడా వీటిలో చేర్చింది. అవుట్గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.ధరలుకొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్‌షిఫ్టర్‌తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్‌లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.41 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ ఖరీదు.బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి.. ఇది ఒక బ్లాంక్డ్ ఆఫ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ముందు భాగంలో విస్తరించి ఉన్న లైట్బార్కు కనెక్ట్ అయి ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది.విలాసవంతమైన క్యాబిన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్‌తో కూడిన హైపర్‌స్క్రీన్ సెటప్ పొందుతుంది. వీటితో పాటు ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు! కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 809 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
నాలుగేళ్ల ఆంక్షలు ఎత్తివేత!
వాహన దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. అక్టోబర్ 1, 2024 నుంచి వివిధ దశల్లో ఈ నిర్ణయం అమలవుతుందని పేర్కొంది. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభానికి గురైన శ్రీలంక 2020లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. 2022లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో స్థానిక ప్రభుత్వం రద్దయింది. దానికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి. తర్వాత శ్రీలంకలో ఇతర పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. క్రమంగా స్థానిక ఆర్థిక పరిస్థితులు గాడినపడుతున్నాయి.ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ నిబంధనల్లో భాగంగా దేశీయంగా వివిధ దశల్లో వాహన దిగుమతులు పెంచాలని శ్రీలంక నిర్ణయించింది. మొదట దశలో అక్టోబర్ 1, 2024న ప్రజా రవాణా వాహనాలు, రెండో దశ కింద డిసెంబర్ 1, 2024 నుంచి వాణిజ్య వాహనాలు, మూడో దశ ఫిబ్రవరి 1, 2025 నుంచి ప్రైవేట్ మోటార్ వాహనాల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విదేశీ మారక నిల్వల నిర్వహణకు మాత్రం అదనపు కస్టమ్స్ సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2022లో భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది రైతులకు సాయంభారత్లో వాహన తయారీ కంపెనీలైన మారుతీసుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్..వంటి కంపెనీలకు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆ దేశానికి ఎక్కువగా ఈ కంపెనీలు వాహనాలు సరఫరా చేస్తుంటాయి. దాంతో రానున్న రోజుల్లో కంపెనీల రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్
కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్‌లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్‌బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్ల్యాంప్ ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయంకొత్త కియా కార్నివాల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు టచ్‌స్క్రీన్, డ్యూయల్ సన్‌రూఫ్, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్లు, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
ఆగస్టులో నెమ్మదించిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి. → ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి. → త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి. ‘‘ఈ పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది. -
ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే?
ప్రత్యర్థులతో పోటీ పడలేక.. అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగడంచేత అమెరికన్ కంపెనీ 'ఫోర్డ్' భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.భారత్‌ను వీడిన మూడేళ్ళ తరువాత ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన కార్యకలాపాలను దేశంలో ప్రారభించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా వెల్లడించారు.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయంఇండియాలో కేవలం ఎగుమతుల కోసం మాత్రమే తన తయారీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే వాహనాలను మళ్ళీ భారతదేశంలో విక్రయిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే తమిళనాడు సదుపాయంతో ఫోర్డ్ తయారు చేయాలనుకుంటున్న కార్లు, ఇతర వాహనాల వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.10,900 కోట్లు.. కేంద్రం ఆమోదం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఏయే వాహనాలకు ఎంతెంత?పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది. -
న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్
గురుగ్రామ్: ఆటోమొబైల్స్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్’ పేరిట ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బీఏఏఎస్)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఒకసారి చార్జ్ చేస్తే దీని రేంజ్ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్‌తో విండ్సర్ను 40 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.ఎంజీ మోటార్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్. తాము న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.