film actor
-
వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్‌ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్‌ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్‌నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్‌ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్‌ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్‌హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి. -
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. విద్యార్థుల నిరసనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వారికి మద్దతుగా సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, భిన్న రంగాల ప్రముఖులు గొంతు కలుపుతున్నారు. దీనితో హెచ్‌సీయూ భూముల అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం..: హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా సినీహీరో రాంచరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘‘జంతువులు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? మనం చెట్టును ఎక్కడ తిరిగి నాటుతున్నాం? దీనిపై మీ భవిష్యత్తు ప్రణాళికను పంచుకోండి. అటవీ ప్రాంతాన్ని నిర్మూలించిన తర్వాత ఏం చేయబోతున్నారు’అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టారు. ప్రముఖ నటి సమంత కూడా ఈ అంశంపై స్పందించారు. గచ్చిబౌలిలో జీవవైవిధ్యమున్న భూమిని ధ్వంసం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటూ.. పర్యావరణ ప్రభావాలపై ఓ ఆంగ్లపత్రిక నివేదికను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు అండగా నిలుస్తాను. భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ నిరసన తెలపాలి’’అని పిలుపునిచ్చారు. ఇక.. ‘‘పర్యావరణ భవిష్యత్తు కోసం విద్యార్థులు గళం విప్పుతున్నారు. యువతకు సుస్థిరమైన రేపటికి అవకాశం కల్పిoచేవి ఐటీ పార్కులు కాదు, అరణ్యాలే. జీవవైవిధ్యాన్ని పణంగా పెట్టి చేసేది అభివృద్ధి కాదు వినాశనం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో కంచ ఫారెస్ట్‌ను కాపాడండి’’అని బాలీవుడ్ నటి దియా మీర్జా పేర్కొన్నారు. వీరితోపాటు నటి ఈషా రెబ్బా, బిందు మాధవి కూడా విద్యార్థులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేరుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. టీవీ, సోషల్ మీడియా ప్రముఖులు సైతం.. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, నటి రష్మీ గౌతమ్ తదితరులతోపాటు పలువురు టీవీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. చాలా మంది నెటిజన్లు తమ ఇన్‌స్ట్రాగామ్ పోస్టుల్లో ‘ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’వంటి నినాదాలను షేర్ చేస్తున్నారు. -
కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.#monalisabhosle video #MahaKumbh2025 pic.twitter.com/OgosaBMXeg— Narinder Saini (@Narinder75) February 2, 2025ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్‌గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. మరయూర్ బస్టాండ్‌లో ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించి కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నేడు ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'విలాయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా అదే ప్రాంతంలో జరుగుతోంది. ఇకపోతే తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్లో హీరోగా నటించింది ఆయననే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సలార్'లో ఆయన కీ రోల్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!) -
ఈశ్వర్ టూ ఆదిపురుష్.. ప్రభాస్ కటౌట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
-
Vijay Devarakonda: ప్రతీ సినిమాలో కొత్త రకం బైక్
వెబ్‌డెస్క్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాట్యిట్యూడ్కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపుల్లో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్‌రెడ్డిలో నట విశ్వరూపమే చూపించాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. గీతగోవిందంలో భయస్తుడిలా కనిపించినా.. డియర్ కామ్రేడ్లో ఆవేశపరుడిగా మెప్పించాడు విజయ్. వింటేజ్ టూ విదేశీ పాత్ర ఏదైనా సరే తన ప్రతీ సినిమాలో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే బైక్స్ వాడేస్తుంటాడు విజయ్ దేవరకొండ. వింటేజ్ నుంచి విదేశీ భైకుల వరకు తన సినిమాలో బైక్‌లకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తాడు. నెక్ట్స్ సినిమాలో విజయ్ ఏ బైక్ యూజ్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ఏస్ వన్ ఫోటోగ్రాఫర్ దబు రత్నానీ ఫోటోషూట్‌లో ట్రంఫ్ బైక్‌తో కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు విజయ్ చిత్రాల్లో రైడ్ చేసిన బైకులు.. వాటి ధరల ఎంతో చూద్దాం (ఎక్స్‌షోరూం) Yezdi 300, ధర రూ. 1.6 లక్షలు సుజికీ యాక్సెస్, ధర రూ. 74 వేలు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ధర రూ. 1.6 లక్షలు సీబీజెడ్ ఎక్స్ట్రీం ధర రూ. 81 వేలు రాయల్‌ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ రూ. 2.5 లక్షలు బొనవిల్లే స్పీడ్‌మాస్టర్ ట్రయంఫ్ రూ. 11.75 లక్షలు యమహా వైజెడ్ డర్ట్ బైక్ ధర రూ. 4 లక్షలు బీఎస్ఏ గోల్డ్‌స్టార్ ధర 2,000 యూరోలు బీఎండబ్ల్యూ జీ 310 ధర రూ. 2.90 లక్షలు బజాజ్ చేతక్ ధర రూ. 23,000 చదవండి : ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ -
విషాదం...ఆటోలో నటుడి మృతదేహం
సినిమాలపై మోజులు చాలామంది కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి నగరాలకు వస్తారు. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతారు. చివరకు ఏదోలా సినిమా చాన్స్ వచ్చినా.. తర్వాత నిలదొక్కుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరికొంత మంది రోడ్ల పక్కన, బస్టాండ్స్‌లో చాయ్, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తెరపై వినోదాన్ని అందించే సినీనటులు.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపై ఉంటూ.. చివరకు ఆటోలోనే మృతిచెందాడు. హృదయ విచారకర ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమిళ నటుడు విరుత్చకాకాంత్ బాబు ఆటోలోనే తనువు చాలించాడు. తమిళ హీరో భరత్ నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాలో విరుత్చకాకాంత్ బాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయిన విరుత్చకాకాంత్ బాబు.. కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. రూమ్ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. సినిమా అవకాశాలు లేక, తిండి దొరక్క చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు. -
రాజకీయాల్లో సినీ స్టార్ల ప్రాభవం అంతరించినట్లే!
సినిమాలంటే వెర్రెత్తిపోయే తమిళనాడులో కూడా ఎన్నికల సమరంలో రాజకీయ ప్రత్యర్థులను సినిమా సూపర్ స్టార్లు ఊడ్చిపారేసే కాలం ముగిసిపోయినట్లేనా? వెండితెర ఇలవేల్పు అయిన ఎన్టీరామారావును సీఎంగా గెలి పించిన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదా? బహుశా రజనీకాంత్ దీన్ని గుర్తించే కాబోలు.. చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావడం నా వల్ల కాదనేశారు. రజనీకాంత్‌ను దాటి ముందుకెళ్లిన మరో సూపర్ స్టార్ కమలహాసన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్–మే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను ఎక్కువగా గెల్చుకోకపోవచ్చు కానీ అగ్రస్థానంలో నిలబడాలని పోరాడుతున్న రెండు ప్రధాన ద్రావిడ పార్టీలలో ఏదో ఒక పార్టీకి కమల్ సమస్యలు సృష్టించవచ్చు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పాత్రను గుర్తుంచుకోండి చాలు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో రజనీకాంత్ కంటే చిరంజీవి ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్‌స్టార్. 2008లో ప్రజారాజ్యం పేరిట తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి సీఎం అవ్వాలని తీవ్రంగా కృషి చేశారు. అయితే రియల్ లైఫ్‌కి రీల్ లైఫ్‌కి చాలా తేఢా ఉంటుంది. అందుకే ప్రజారాజ్యం పోటీ చేసిన 296 అసెంబ్లీ స్థానాల్లో 276 స్థానాలను కోల్పోయింది. చివరకు కులపరంగా మెజారిటీ ఉండే తన సొంత ఊరు పాలకొల్లులో ఓడిపోయి పరాభవాన్ని చవి చూశారు. చిరు రాజకీయ జీవితాన్ని చాలా సన్నిహితంగా చూసిన రజనీకాంత్ కీలక సమయంలో చాలా తెలివిగా తనదైన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు చిరంజీవి కూడా కనుమరుగైపోయారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, కమల హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్ల షేరుకు పరిమితమైపోయారు. అయితే తమిళ రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత కన్నుమూసిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరించే విషయంలో సమీపానికి కూడా కమల్ చేరుకోలేకపోయారు. తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామి పూరించేశారని, అన్నాడీఎంకేపై పట్టు సాధించడమే కాకుండా ఒకమేరకు సత్పరిపాలనను అందిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించడంలో కమల్ బహుశా విఫలమై ఉండవచ్చు. అదే సమయంలో డీఎంకే పార్టీ శ్రేణులపై ఎంకే స్టాలిన్ తన పట్టును స్థిరపర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కాంత్ చిట్టచివరలో రాజకీయాల్లోంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ ప్రాభవాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో భారీ స్థాయిలో ప్రవేశించాలనుకున్న బీజేపీ పథకాలకు కూడా రజనీ గండికొట్టారు. మరి కమలహాసన్ కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కానీ రాజకీయంగా బలమైన పాత్ర పోషించగలరా? తెలుగు ప్రజలు దేవుడిగా భావించే ఎన్టీఆర్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులను నిర్లక్ష్యంగా చూడటంతో జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రులను రెచ్చగొట్టిన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షంలోనూ పాతుకుపోయిన రాజకీయ నేతలను పక్కకునెట్టి ఒక సినీ స్టార్ ఆవిర్భవించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పెద్ద రాజకీయ పార్టీలు జరిపే రాజకీయ సమరంలో వోట్లను చీల్చివేసే తరహా పాత్ర పోషణకే ప్రస్తుతం చిత్రసీమ ప్రముఖులు పరిమితం కావచ్చు. సినిమాలంటే పిచ్చిప్రేమ చూపించే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కలలు పండించుకోవాలని చూస్తున్న ఏ సినిమా స్టార్‌కైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడులో సినీ హీరోలు విజయవంతమైన రాజకీయ నేతలుగా మారే రోజులకు కాలం చెల్లిపోయినట్లే. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నరసింహ యాదవ్‌ను ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కామెడీ విలన్‌గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి పాత్ర చేశారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జరుగుతోంది. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే
కాగితం కంటే పల్చగా.. నాన్‌స్టిక్ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్ క్యాంటీన్లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. ఇలా కాలుస్తారు.. ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. వారంతా రుచిచూశారు.. పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే. నిత్యం 500 రొట్టెలకు పైనే.. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ కావడం వల్ల ఈ క్యాంటీన్‌కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు. ఆరు దశాబ్దాల చరిత్ర మారుతి థియేటర్ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్‌ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం. – మట్టా విజయభాస్కర్, క్యాంటీన్ యజమాని -
అఖండ విజయం మిరాకిల్: అలీ
సాక్షి, విజయవాడ: అపార నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డైరెక్షన్ అంటే చాలా ఇష్టం
సాక్షి, చాగల్లు: దర్శకుడు అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిని అయ్యానని హీరో, హాస్యనటుడు సప్తగిరి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలగా సంఘం వినాయకుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సప్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తాను పరువు సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యానని.. ఇప్పటివరకు 80 సినిమాల్లో హాస్యనటుడిగా నటించానని చెప్పారు. కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించిందన్నారు. పరువు, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రం, మనం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. సప్తగిరి ఎల్ఎల్బీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో హీరోగా నటించానన్నారు. తొలుత సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ అవుదామనే ఈ పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు తననెంతగానో ప్రోత్సహించారన్నారు. ఎక్స్‌ప్రెస్ రాజాలో నటనకు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యువత బాగా కష్టపడాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టాలెంట్ చాలా మందికి ఉంటుందని, అయితే వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్నవారు తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు. తన సొంతూరు తిరుపతి అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నటులకు నిజమైన గుర్తింపు అన్నారు. చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సప్తగిరిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు సప్తగిరి వెంట ఉన్నారు. -
రాజావారి ఇంటి దగ్గర...
నవలలో నుంచి నడిచొచ్చిన సినిమా కథ ఇది. దృశ్యంలో కవిత్వం పలుకుతుంది. పాటల్లో దృశ్యం వినిపిస్తుంది. జాతీయ అవార్డ్లు దక్కించుకోవడంతో పాటు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (1984), ‘మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్’, ‘ఏషియన్ ఫిల్మ్‌ఫెస్టివల్’లో ప్రదర్శితమైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘టుక్కు టుక్కు టుక్కు’ అని సౌండ్ చేస్తూ గోదావరిలో లాంచి పరుగెడుతుంది. లాంచీ లోపల ఉన్న వీరాస్వామి తన పక్కన ఉన్న నాంచారి కళ్లలోకి చూస్తూ అప్పటికప్పుడు కవిగా మారిపోయాడు...‘నాంచారి...ఇలా వెన్నెల్లో గోదారిని చూస్తుంటే నా గుండె ఐసుముక్కలా కరిగిపోతుందనుకో’వీరాస్వామి భావుకత్వానికి నాంచారికి మండిపోయింది. ‘‘ఎండమండి పోతుంటే వెన్నెలంటావేంటి?’’ కళ్లతోనే కడిగేసింది. అంతమాత్రనా వీరాస్వామి సైలెన్సైపోతాడా ఏమిటి? ‘‘నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల. ఈ లాంచే ఊయల’’ అంటూ కవిత్వాన్ని కంటిన్యూ చేశాడు. ‘‘నువ్వు మాత్రం నా పక్కన కూర్చుంటే ఈ బల్ల ముళ్లకంప...ఆ రేవే వల్లకాడు’’ అని చురక వేసింది నాంచారి. సరే వీళ్ల సంగతి వదిలేద్దాం. అదిగో అటు చూడండి... అక్కడ ఎవరిదో తల ‘ఇంతై...అంతై’ అన్నట్లు సైజ్ పెరిగిపోతుంది. పక్కన కూర్చున్నాయన నాలిక అనే సుత్తితో తెగ బాదుతున్నాడు.... ‘‘అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్లు వచ్చారు. ఆ తరువాత బుర్రకథల వాళ్లు వచ్చారు. ఆ తరువాత నాటకాల వాళ్లు వచ్చారు. ఆ తరువాత సినిమావాళ్లు వచ్చారు. ఆ తరువాత...’’ ఈ వాక్ దాడికి అడ్డుపడిన ఆ తలవాచినాయన... ‘‘అసలు రేవు ఎప్పుడూ వస్తుంది?’’ అడిగాడు దీనంగా. ఈయన దీనత్వాన్ని ఖాతరు చేయని ఆ మహాస్పీకరుడు ‘‘అడ్డుపడకండలా’’ అని విసుక్కున్నాడు. అంతే...ఆ తలవాచినాయనకు మహా కోపం వచ్చింది. అది ఇలా కట్టలు తెంచుకుంది... ‘‘పగటి వేషాలు కాదు...అసలు నువ్వు ఏ వేధవ వేషాలేస్తే నాకేంటటా? దురదగొండాకులా హింసిస్తున్నావు. అయ్యో...వర్జ్యంలో బయలుదేరవద్దని మా ఆవిడ చెప్పినా వినలేదు. కొరివితో తలగోక్కున్నాను...’’ ‘‘ఏంట్రా గొడవ’’ అని ఆరా తీశాడు అక్కడికి వచ్చిన వీరాస్వామి. ‘‘చూడండి వీరాస్వామిగారూ...’’ అని ఆ బాధితుడు ఏదో చెప్పేలోపే... ‘‘నాపేరు నీకెలా తెలుసు?’’ ఆశ్చరంగా అడిగాడు వీరాస్వామి. ‘‘తెలుసండీ...తెలుసు. మీ పేరే కాదు....మీ గురువు గురుమూర్తి. ఆయన కూతురు పేరు నాంచారి. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడి పేరు రాజా. రాత్రి నుంచే ఒకటే సొద. వద్దన్న కొద్దీ అన్నీ చెబుతాడు. బుర్ర హీటెక్కిపోయింది. గోదాట్లో మునిగి తేలితేగాని నా వివరాలు నాకు తెలియవు. అబ్బ...రేవొచ్చింది...నేను వెళ్తాను’’ అని ఒక లాంగ్‌జంప్ చేశాడు తలవాచినాయన. పొద్దు పొద్దున్నే లాంచీ దిగిన పగటివేషగాళ్లు రాజావారి ఇంటికి వెళ్లారు. తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. ‘‘గొంతు ఎంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు’’ చిన్నగా విసుక్కోన్నాడు ట్రూప్‌లో కొత్తగా చేరిన రాజా. ‘‘ష్...తప్పుమంది. మన లాంచి పెందరాళే వచ్చింది. రాజావారు స్నానం చేసే వేళ ఇది’’ అని రాజా విసుగుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు ట్రూప్ లీడర్ గురుమూర్తి. ‘‘ఆయన స్నానం సంగతి సరే....ఇంట్లో పనివాళ్లు ఉండరా? వాళ్లు ఏంచేస్తారు?’’ అమాయకంగా అడిగాడు రాజా. ‘‘కాళ్లకు గజ్జెలు కట్టుకొని గెంతులు వేస్తారు. రాజావారు స్నానం చేయడమంటే మామూలు విషయం కాదు. కొత్తోడివి నీకేం తెలుసు!’’ అంటూ ఇంచుమించు రాజా మీద కన్నెర్ర చేశాడు ట్రూప్ సీనియర్లలో ఒకౖడైన వీరాస్వామి. అయినప్పటికినీ మరో డౌటు అడగానే అడిగాడు రాజా... ‘‘ఇంతటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా! వాళ్లేం చేస్తారు?’’ ‘‘రాణిగారు నిద్ర లేచే సమయంరా ఇది. దాసీలు ఆమె ఎటు వెళితే అటూ కాలు కింద పడకుండా... ముఖమల్ వస్త్రాలు పరుస్తారు’’ అని రాజా డౌటు తీర్చాబోయాడు గురుమూర్తి. రాజా చిటపటలాడుతుండగానే చందర్రాజావారు రానే వచ్చారు. నల్లటి కోటు ధరించి పైప్ పీలుస్తున్న ఆయనలో రాజఠీవి ఉట్టిపడుతోంది. ‘‘అయ్యగారికి దండలేట్రా’’ రాజాను మెల్లిగా గిల్లాడు గురుమూర్తి. ఉలుకూ లేదు. పలుకూ లేదు. పైగా అటువైపు తిరిగి అసహనంగా అటు ముఖం పెట్టాడు రాజా. ఇలాంటి దృశ్యం గతంలో ఎన్నడూ చూడనిది. చందర్రాజావారి దగ్గరికి వచ్చే కళాకారులు పొగడడమే తమ పని అన్నట్లుగా ఉంటారు. ‘‘ఇతడేమిటి నన్ను చూసి అలా కోపంగా ముఖం తిప్పుకున్నాడు!’’ తనలో తాను అనుకుంటూనే... ‘‘ఏం వీరాస్వామి బాగున్నావా?’’ అని అడిగారు. అంతే!వీరాస్వామి ఎక్కడికో వెళ్లిపోయాడు. ‘‘చూశావా! అంత పెద్ద రాజావారు నన్ను పేరు పెట్టి మరీ పిలిచారు’’ అన్నట్లు గర్వం నిండిన కళ్లతో గాలిలో గంతులు వేశాడు. ‘‘ఎవరు?’’ అంటూ రాజాను కళ్లతో చూపిస్తూ అడిగాడు చందర్రాజావారు. ‘‘కొత్తాడండీ’’ అని కళ్లతోనే రాజాను తేలిగ్గా తీసేస్తూ చందర్రాజావారికి సమాధానం ఇచ్చాడు వీరాస్వామి. ‘‘మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి రెండు కళ్లు...’’ అని ట్రూప్ సభ్యుడొకరు రాజా గురించి కాస్త గొప్పగా చెప్పేలోపే ఆయన కాలు తొక్కాడు వీరాస్వామి. దీంతో ‘కళ్లు’ అనబోయి ‘కాళ్లు’ అని నోరుజారాడు ఆయన. ‘‘వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండీ’’ అని చెప్పి రాజావారి దగ్గర సెలవు తీసుకున్నాడు గురుమూర్తి. ఆతరువాత... ‘‘అసలు ఆ పొగరేమిటి నీకు? రాజాగారికి దండమెట్టమంటే అంత ఇదై పోతున్నావు. ఆయన ఈ ఊరి వాళ్లకు దేవుడిలాంటి వాడు’’ అని చందర్రాజావారి గొప్పతనం, కీర్తి గురించి గురుమూర్తి ఘనంగా చెప్పబోతుండగానే రాజా అడ్డుపడి.... ‘‘ఊరి వాళ్లు ఎలా కొలిస్తే నాకేం. నేను దణ్ణం పెట్టను. గొప్పమనసు అని తెలిస్తే ముష్ఠివాడికి కూడా పాదాభివందనం చేస్తాను’’ అన్నాడు స్పష్టంగా... కోపంగా. -
వైఎస్ జగన్మోహన్రెడ్డి నా దేవుడు
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దేవుడని ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. తన ఊపిరి ఆగేవరకు జగన్ వెంటనడుస్తానన్నారు. నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్–నెల్లూరు ఆధ్వర్యంలో సినీ ‘హాస్యచక్రవర్తి’ టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎందరో కళాకారులకు, నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని చెప్పారు. తాను జగన్‌కు మద్దతుపలికిన సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పారు. జగన్‌లా తనకు గుండె ధైర్యమెక్కువన్నారు. తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌ను సీఎం చంద్రబాబు కాపీకొట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవార్డు అందచేసిన కళాంజలి సంస్థ నిర్వాహకుడు అనంత్‌కు పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పృథ్వీరాజ్‌కు అవార్డును నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అందజేసి, సన్మానించారు. పృథ్వీరాజ్‌కు రమణారెడ్డి స్మారక అవార్డును అందచేస్తున్న నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి -
వివాదాస్పద సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్
ప్రముఖ అవార్డు గ్రహీత దర్శకుడు రహత్ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లిహాఫ్’(మెత్తని బొంత) సినిమా తొలి పోస్టరు మాంటోలో జరుగుతున్న71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదలయ్యింది. కాన్స్‌లో విడుదల చేసిన ఈ పోస్టర్లో ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఉన్నాయి. వాటిలో ఒకరి పాదాలకు బాగా అలకంరించిన మువ్వలు ఉండగా, మరొకరి పాదాలకు సాదా మువ్వలున్నాయి. ప్రముఖ ఉర్డూ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన వివాదస్పద పుస్తకం ‘లిహాఫ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనిష్తా ఛటర్జీ రచయిత ‘చుగ్తాయి’ పాత్రలో నటిస్తుండగా, సోనల్ సెహగల్ ‘బేగమ్ జాన్’ పాత్రలో నటిస్తున్నారు. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఎలాంటి విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. స్వలింగ సంపర్కం నేపథ్యంలో ‘చుగ్తాయి’ రచించిన ఈ కథ లక్నోలో ప్రారంభమవుతుంది. ఈ కథనంతా బేగమ్ జాన్ చిన్న మేనకోడలు వివరిస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న బేగమ్ జాన్, తన పరిచారికతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకున్నది, దాని పర్యావసనాలు ఏమిటనే నేపథ్యంలో సాగుతుంది. తనకు, పరిచారికకు మధ్య ఉన్న సంబంధం గురించి మేనకోడలికి తెలియడంతో బేగమ్ జాన్ ఆమెను చంపేస్తుంది. చుగ్తాయి రాసిన ‘లిహాఫ్’, అలానే ఆమె స్నేహితుడు సాదత్ హసన్ మంటో రాసిన పుస్తకం ‘బూ’ రెండింటిల్లోను అశ్లీలత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఈ చిత్రానికి కజ్మీ, తారిక్ ఖాన్, ఉత్పల్ ఆచార్య నిర్మాతలుగా వ్వవహరిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహిత మార్క్ బషేట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
‘మేరా భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్‌ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్‌ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్‌నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని అభివృద్ధికి సినీ నటులు కృషి చేయాలి
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం... ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్‌రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్‌యాదవ్(మళ్లీరావే), దిల్‌రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్టైలర్), సోనీచరిస్టా(టాప్‌ర్యాంకర్)గా ఎంపికైయ్యారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల -
వచ్చే ఎన్నికల్లో బరిలోకి : సినీ నటుడు
హుజూర్నగర్ : విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే.. తాను వారికి మద్దతుగా ప్రచారం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ధిదమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించాడన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల నిర్ణయం ప్రకటించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు విద్యాభ్యాసం ఆధారంగా సైకిళ్లు, స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. సమావేశంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు కుక్కడపు కోటేశ్వరరావు, కార్యదర్శి కోతి సంపత్‌రెడ్డి, ఎన్.వెంకటేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రవేశంపై రాజేంద్రుడి కామెంట్
పాలకొల్లు అర్బన్: రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో అందర్నీ ఆనందింపజేయడమే ఇష్టమని నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఆయనను ‘జీవిత సాఫల్యతా పురస్కారం’తో ఘనంగా సత్కరించింది. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు ఈ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ లఘుచిత్రం ‘క్రీమిలేయర్’ పాలకొల్లు అర్బన్: క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లఘుచిత్రంగా స్కైవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్‌కుమార్ చిత్రీకరించిన ‘క్రీమిలేయర్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవం స్థానిక రామచంద్ర గార్డెన్స్‌లో శనివారం కోలాహలంగా సాగింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.కల్యాణ్ రూపొందించిన ‘బి అలర్ట్’ ఎంపికయ్యాయి. విజేతలకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేల నగదు పారితోషికాలతో పాటు షీల్డ్‌లు అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇండియా ఈజ్ డెడ్‌లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్రధారి సతీష్ సుంకర దక్కించుకున్నారు. స్పెషల్ జ్యూరీ చిత్రాలుగా మాతృదేవోభవ, హెల్మెట్ ఎంపికయ్యా యి. ఉత్తమ ఎడిటింగ్ మీ కోసమే లఘుచిత్రం ఫణిశ్రీ, ఉత్తమ కెమెరామెన్‌గా ఇండియా ఈజ్ డెడ్‌లో మోహన్‌చంద్, ఉత్తమ కథా రచయితగా బి అలర్ట్ కల్యాణ్, ఉత్తమ దర్శకుడిగా ఇండియా ఈజ్ డెడ్‌లో రాజేంద్రకుమార్ బహుమతులు అందుకున్నారు. జ్యూరీ కమిటీ సభ్యులుగా జనా ర్థన మహర్షి, ఎంవీ రఘు, పద్మిని, కె.వెంకట్రాజు, ఎ.బాబూరావు, కె.సురేష్, ఎన్. గోపాల్, డి.రవీంద్ర వ్యవహరించారు. -
నేటి డూడుల్ ఏంటో తెలుసా?
ప్రఖ్యాత గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన వ్యక్తులను డూడుల్రూపంలో లోగోను తయారుచేసి వారిని గౌరవిస్తుంది. వారి పుట్టిన రోజున వీటిని ఆ ఒక్కరోజు డూడుల్‌గా గూగుల్‌లో దర్శనమిస్తుంది. ఈ రోజు(జనవరి 22)న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెర్గీ ఐజిన్స్టైన్పై డూడుల్ చిత్రించి గౌరవించింది. నేడు ఆయన 120వ పుట్టిన రోజు. చిత్రరంగంలో ఫిల్మ్‌లతో సినిమాలను చిత్రీకరించడం ఈయనతోనే ప్రారంభమైంది. ఈయనను ఫాదర్ ఆఫ్ మోంటేజ్ టెక్నిక్ ఇన్ ఫిల్మ్‌మేకింగ్ అంటారు. అందుకే ఈయనను ఫిల్మ్‌లతో కూడిన లోగోను ఏర్పాటుచేసి డూడుల్‌గా పెట్టారు. ఫిల్మ్‌లతో కూడిన గూగుల్ అనే అక్షరాల నడుమ సెర్గీ ఈ రోజు మనకు దర్శనమిస్తాడు. మాంటేజ్ టెక్నిక్ అంటే...ఎడిటింగ్‌లో ఒక ప్రక్రియ. చిన్న చిన్న షాట్స్‌ను సమయానికి, స్పేస్, విషయానికి అనుగుణంగా ఉండేలా కుదించడం. ఈయన 1898 రిగాలో (ఇప్పటి లాత్వియాలో) జన్మించారు. ఆయన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. బోల్షివిక్ విప్లవంలో కూడా పాల్గొన్నారు. తరువాత ఆయనకు సినిమాలపై ఇష్టమేర్పడి మాస్కోకు వెళ్లాడు. ఈయన మొదటి సినిమా స్ట్రైక్ 1925లో విడుదలైంది. రష్యాలోని కార్మికులు ఫ్యాక్టరీ ముందు చేస్తున్న ధర్నా నేపథ్యంలో చిత్రీకరించాడు. ఇది ఒక సైలెంట్(మూకీ)సినిమా. అదే సంవత్సరంలో బాటిల్షిప్ పొటెమ్కిన్ అనే మరో చిత్రాన్ని విడుదలచేశాడు. రష్యా సైనికులు అమాయకపు పౌరులను హతమార్చిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాడు. 1928లో అక్టోబర్ అనే సినిమాను విడుదలచేశాడు. 1917 అక్టోబర్ విప్లవం, రష్యా నియంతృత్వ పాలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాపై అప్పటి పాలకులు కన్నెర్ర చేశారు. అయినా కానీ ఐజిన్స్టైన్ వెనక్కితగ్గకుండా ఇంకా ఎన్నో మరుపు రాని చిత్రాలను తీశారు. అలెగ్జాండర్ నెవస్కీ, ఇవాన్ ది టెర్రిబుల్ లాంటి సినిమాలెన్నో తీసి...1948లో గుండెనొప్పితో మరణించారు. -
ప్రముఖ నటుడు కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు . గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. చూడగానే పక్కింటి అబ్బాయిగా కనిపించే పార్థ 60వ దశకంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. 1958లో 'మా' సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. తపన్ సిన్హా తెరకెక్కించిన 'అతిథియా' సినిమాతో హీరోగా మారారు. రవీంద్రనాథ్ టాగోర్ కల్ట్ షార్ట్‌స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తపన్ సిన్హా తెరకెక్కించిన 'అపోంజాన్' సినిమాలో కూడా హీరోగా కనిపించారు. బెంగాల్ లెజెండ్ హీరో ఉత్తమ్‌కుమార్ తమ్ముడు, కొడుకు పాత్రలకు ఆటోమేటిక్ చాయిస్‌గా పార్థ గుర్తింపు పొందారు. బాలిక బధూ (1967), ధోన్యి మెయే (1971), అగ్నిష్వర్ (1975), అమర్ పృథ్వీ (1985), బాగ్ బందీ ఖేలా (1975) పాపులర్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్నో సినిమాల్లో గొప్ప అభినయాన్ని కనబర్చిన పార్థ ముఖోపాధ్యాయ బెంగాలీ సినీప్రేమికుల మదిలో ఎల్లప్పటికీ నిలిచి ఉంటారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో నివాళులర్పించారు. -
హైదరాబాద్ ఫిల్మ్ క్యాపిటల్‌గా తయారవుతుంది : నవీన్ మిట్టల్
‘‘సినీ పరిశ్రమ అనగానే చాలా మంది ముంబైలో ఉన్న హిందీ పరిశ్రమ అనుకుంటున్నారు. భాగ్యనగరం ఫిల్మ్ హబ్ అవుతోంది. భారతదేశంలో సినిమాకి హైదరాబాద్ రాజధానిగా తయారవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల అధికారి నవీన్ మిట్టల్ అన్నారు. డిసెంబరు 1న హైదరాబాద్‌లో ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో సినిమాలు, సీరియల్స్ షూటింగ్‌తో పాటు సినిమా పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన స్టూడియోలు, ల్యాబ్‌లు ఉన్నాయి. సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొస్తోంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ గత ఏడాది కంటే ఈ ఏడాది మూడు రెట్లు గ్రాండ్‌గా జరగనుంది’’ అన్నారు. ‘‘సినిమా రంగంలో టెక్నాలజీ ఫాస్ట్‌గా మారుతోంది. ప్రజలు కూడా అప్డేట్ అవాల్సి ఉంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’కి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పి.రామ్మోహన్రావు అన్నారు. ‘‘డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ జరుగుతుంది. ఈ సమావేశానికి 50–60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది తొలిసారి 22 విభాగాల్లో టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం’’ అని ‘ఇండీవుడ్ ఫౌండర్, డైరెక్టర్ సోహన్ రాయ్ అన్నారు. -
కాలేజీ రోజులు
దర్శకుడు క్రిష్ వద్ద కో–డైరెక్టర్‌గా పని చేసిన రజినీకాంత్ ‘కాలేజ్ డేస్’ చిత్రంతో దర్శకునిగా మారారు. నూతన నటీనటులతో శ్రీలత నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పటేల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందించారు. శ్రీలత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఇది రెండో సినిమా. మొదటి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. కళాశాల నేపథ్యంలో మంచి సందేశంతో యూత్‌ని ఆకట్టుకునే విధంగా ‘కాలేజ్ డేస్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి శ్రీలతగారు దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జూలై మొదటి వారంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు రజినీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. ఈశ్వర్ రావు. -
సినిమాను కాపాడండి- సీనియర్ నటుడు
తమిళసినిమా: సినిమాను కాపాడండి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీకి నటుడు కమలహాసన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విధానం (జీఎస్టీ) జూలై 1న అమల్లోకి రానుంది. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని కోలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఈ విషయం పునఃపరిశీలించి పన్ను శాతాన్ని తగ్గించని పక్షంలో తాను సినిమాను వదిలేస్తానని నటుడు కమలహాసన్ ఇటీవల దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని తాము తప్పు పట్టడం లేదని, సినిమా టిక్కెట్లపై ఈ పన్ను విధానంతో 28శాతం అదనంగా భారం పడుతుందని, దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలకు తీవ్ర ముప్పు కలుగుతుందని కమలహాసన్ అన్నారు. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్‌ను వేడుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ సినిమాను కాపాడాలని కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీకి విజ్ఞప్తి చేశారు. -
టికెట్ వద్దా? ఆన్లైన్లో అమ్మెయ్!!
⇒ సినిమా, ట్రావెల్, ఈవెంట్స్ టికెట్లను విక్రయించే వీలు ⇒ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘క్యాన్సెల్’ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్సు, సినిమా, ఈవెంట్ల టికెట్లు కొనడం మనకు తెలిసిందే. ఒకవేళ ఆ టికెట్లు వినియోగించుకోలేకపోతే? ఆ టికెట్లు మనకు వద్దనుకుంటే..? క్యాన్సిల్ చేసినందుకు కొంత చార్జీ భరించాలి. కానీ, పైసా చార్జీ లేకుండా మనం వద్దనుకున్న టికెట్లను ఉచితంగానే అమ్మిపెడుతోంది క్యాన్సెల్.ఇన్. సరికొత్త ఆలోచనతో బెంగళూరు కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఈ సంస్థ విశేషాలను కో–ఫౌండర్ రఘురాం ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ⇒ నేను, నవీన్, పవన్, సందీప్ నలుగురం స్నేహితులం. నవీన్ సింగపూర్‌లో పనిచేసేవాడు. తరచూ విదేశాలకు ప్రయాణించేవాడు. ఒకోసారి అనుకోకుండా ప్రయాణం రద్దయ్యేది. విమాన టికెట్లను క్యాన్సిల్ చేసిన ప్రతిసారీ జేబుకు చిల్లుపడేది. అది కంపెనీ డబ్బే అయినా మనసుకు బాధనిపించేది. కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకున్నట్టుగా వద్దనుకున్నప్పుడు అలానే క్యాన్సిల్ చేసుకునే వీలుంటే బాగుండునని అనిపించేది. ఇదే విషయాన్ని మాతో చర్చించాడు. ఎవరో ఎందుకు మనమే ప్రారంభిస్తే పోలే... అనుకుని గతేడాది జనవరిలో క్యాన్సెల్.ఇన్ను ప్రారంభించాం. టెక్నాలజీ, మార్కెటింగ్‌కు రూ.15 లక్షల వరకు ఖర్చయింది. ⇒ చివరి క్షణంలో క్యాన్సిల్ అయిన టికెట్లను అమ్మి పెట్టడమే మా వ్యాపారం. అంటే మనకొద్దనుకున్న టికెట్లను క్యాన్సెల్ వేదికగా ఇతరులకు విక్రయించుకోవచ్చన్నమాట. దీంతో మన డబ్బులు మనకొచ్చేస్తాయి. సమయానికి ఇతరులకూ సాయం చేసినట్టవుతుంది. ప్రస్తుతం క్యాన్సెల్ వేదికగా ఈవెంట్లు, సినిమా, ట్రావెల్ టికెట్స్, గిఫ్ట్ ఓచర్లను విక్రయించుకోవచ్చు. ట్రావెల్ టికెట్స్‌లో బస్సు, ప్రైవేట్ వాహనాల టికెట్లు, టూర్ ప్యాకేజీలను విక్రయించుకోవచ్చు. ⇒ ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నాం. త్వరలోనే కొంత చార్జీ వసూలు చేసి ఆదాయార్జన ఆరంభిస్తాం. భవిష్యత్తులో హోటల్స్, విమాన టికెట్లు విక్రయిస్తాం కూడా. ఇప్పటికైతే లావాదేవీలు ఆశాజనకంగానే ఉన్నాయి. ⇒ దేశంలో ఆన్లైన్ టికెట్ పరిశ్రమ రూ.79 వేల కోట్లుగా ఉంది. ఇందులో క్యాన్సిలేషన్ వాటా 9 శాతం. అంటే రూ.7,110 కోట్లు. గిఫ్ట్ ఓచర్ల మార్కెట్ రూ.9 వేల కోట్లు. ఇందులో ఉపయోగించని ఓచర్లు 30 శాతం. అంటే రూ.3 వేల కోట్లు. వీటన్నిటినీ అందిపుచ్చుకోవాలన్నది మా ఉద్దేశం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
మెగా మూవీ షురూ!
అన్న చిరంజీవి–తమ్ముడు పవన్ కల్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక, ఒకే సినిమాలో కనిపిస్తే వాళ్లు పరమానందపడిపోతారు. చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘నా పేరే కాంచనమాల..’ పాటలో పవన్ కల్యాణ్ కాసేపు కనిపిస్తేనే, హ్యాపీ ఫీలయ్యారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ టైమ్ వచ్చే సింది. చిరు–పవన్ కాంబినేషన్లో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని గురువారం టీయస్సార్ అధికారికంగా ప్రకటించారు. మరిన్ని విశేషాలను టీయస్సార్ చెబుతూ– ‘‘చిరంజీవిగారి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ చూశాక మళ్లీ సినిమాలు నిర్మించాలనిపించింది. ఇటీవల ఈ చిత్రబృందాన్ని సన్మానించి నప్పుడు చిరంజీవి–పవన్ కాంబినేషన్లో సినిమా తీస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇద్దర్నీ ప్రత్యేకంగా కలసి డిస్కస్ చేశాను. నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ బెస్ట్ అనుకున్నాను. అతనితో కూడా మాట్లాడాను. ఈ చిత్రాన్ని గ్రేట్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్‌తో కలసి నిర్మించబోతున్నా’’ అని చెప్పారు. గతంలో శోభన్ బాబుతో ‘జీవన పోరాటం’, చిరంజీవితో ‘స్టేట్ రౌడీ, రాజశేఖర్‌తో ‘గ్యాంగ్‌మాస్టర్’తో పాటు సంస్కృత సినిమా ‘భగవద్గీత’, పలు హిందీ చిత్రాలు నిర్మించారు టీయస్సార్. చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా ఈ మెగా మూవీ చేయనున్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చిత్రాలు
రచయిత, దర్శకుడు, కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా తెనాలి : షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక, వివిధ ప్రభుత్వ పథకాలపై దళిత, గిరిజనులు అవగాహన కల్పించుకొని ఆయా కార్యక్రమాలతో అభివృద్ధిని సాధించాలనేది తన అభిమతంగా టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వెల్లడించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన ఎస్సీ ఉపప్రణాళికలోని వివిధ అంశాలపై తొమ్మిది ప్రచార చిత్రాలను, అన్ని పథకాల్లోని అంశాలు ప్రతిబింబించే విధంగా నృత్యరూపకంతో మరో చిత్రాన్ని ఇటీవలే ఆయన తీశారు. మొత్తం 10 ప్రచార చిత్రాలకు ఆయనే రచన, దర్శకత్వం వహించారు. డబ్బింగ్, మిక్సింగ్ తదితర నిర్మాణానంతర కాక్రమాలను పూర్తిచేసుకుని సెన్సారుకు వెళుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇక్కడి క్యాపిటల్ స్టూడియోలో విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్, సిమెంటురోడ్లు/మంచినీరు, అత్యాచార నిరోధక చట్టం, భూమి కొనుగోలు పథకం, అంటరానితనం, కులాంతర వివాహాలు, నైపుణ్య శిక్షణ పేరుతో గల ఈ చిత్రాల్లో అనుభవజ్ఞులైన సినిమా నటులు అన్నపూర్ణ, వినోద్, నరసింహరాజు, బాలాజీ ఇతర టీవీ నటీనటులే కాకుండా స్థానిక ఔత్సాహిక, వర్ధమాన నటులతో తెనాలి, పరిసరాల్లోనే చిత్రీకరించినట్టు దిలీప్‌రాజా చెప్పారు. చిత్రాల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నిరకాల సాంకేతిక హంగులను చేర్చినట్టు తెలిపారు. సెన్సారు అయిన అనంతరం వీటిని ప్రచారానికి వినియోగించే నిమిత్తం ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వివరించారు. సమావేశంలో నిర్మాత ఆలూరి సుందరరామయ్య, షబ్బీర్ తదితరులు ఉన్నారు. -
‘పెద్ద’ ఇబ్బందుల్లో ఉన్నా సినిమాను ఆదరించారు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ హీరో నిఖిల్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్లు రద్దై, డబ్బు మార్పిడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తన సినిమాను మాత్రం హిట్ చేశారని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా హీరో నిఖిల్ అన్నారు. మేఘనా ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ్సపై నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విజయం సా««ధించిన సందర్భంగా ఆ సినిమా యూనిట్ ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఊర్వశి థియేటర్‌కు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కావడంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేక ఆగిపోయాయని, ఇటువంటి సమయంలో కూడా తన చిత్రాన్ని ఆదరించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రేక్షకులను మరువలేనని అన్నారు. అనంతరం సినిమాలో తన నటన, హాస్యం ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు వై.ఆనంద్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో నాణ్యతపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సినిమా విజయం సాధించడం ఖాయమని ఊహించినా, ప్రస్తుత సంక్షోభంలో ఎలా ఉంటుందోనని తొలుత భయమేసిందన్నారు. యూనిట్‌ను చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. విజయయాత్రలో హీరోయిన్లలో ఒకరైన నందితా శ్వేత, నిర్మాత పీవీ రావు, సురేష్ మూవీస్ మేనేజర్ సత్తి రంగయ్య, ఎగ్జిబిటర్ రౌతు వెంకటేశ్వరావు, గెడ్డం శ్రీను ఉన్నారు. -
‘మామా..ఓ చందమామా’ షూటింగ్ సందడి
పసలపూడి(రాయవరం) : ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ రాయవరం మండలం పసలపూడిలో జరుగుతోంది. హీరోగా సాయిరామ్ కార్తీక్, హీరోయి¯ŒSగా సనా మక్బుల్ఖాన్, ప్రతి నాయకుడిగా జీవా, ముఖ్యపాత్రల్లో నాగినీడు, దువ్వాసి మోహ¯ŒS తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో..ఆప్యాయతలు, అనుబంధాలు దూరమవుతున్న తరుణంలో వాటి విలువలను ఈ సినిమా తెలుపుతుందన్నారు. నేటి సమాజంలో జరిగే ఘటనలకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందన్నారు. జిల్లాలోని కోటిపల్లి, రామచంద్రపురం, కె.గంగవరం, దంగేరు తదితర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ చేస్తామన్నారు. బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో బొడ్డు వరప్రసాద్ నిర్మాతగా, మురళి సాధనాల సహ నిర్మాతగా నిర్మిస్తున్న సినిమాకు సంగీతాన్ని మున్నా కాశి అందిస్తున్నారని, ఆర్ట్ డైరెక్టర్‌గా ఉత్తరకుమార్ సూరిశెట్టి, కెమెరామ¯ŒSగా జి.ఎల్.బాబు, కో డైరెక్టరుగా నాగేంద్ర వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. సినిమాకు అవసరమైన సెట్టింగ్‌లను పసలపూడి శివాలయం, సత్తి అనసూయమ్మ నిలయంలో వేసి చిత్రీకరణ చేస్తున్నారు. జీవా, దువ్వాసి మోహ¯ŒSలపై ఆదివారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు. -
రావులపాలెంలో సినీ సందడి
రావులపాలెం : మండల పరిధిలోని వెదిరేశ్వరం శివారు కోసూరు నగర్ పంట చేల మధ్య మంగళవారం ప్రముఖ హీరో హీరోయిన్లు శర్వానంద్, లావణ్య త్రిపాఠీ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. వరి చేల మధ్య పల్లెటూరి వాతావరణంలో హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో శర్వానంద్‌తో పాటు కమెడీయన్లు షకలక శంకర్ తదితరులు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. సాయంత్రం వరకూ ఈ ఘాటింగ్ జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన అక్కడికి రావడంతో సినీ సందడి నెలకొంది. కాప్స్, ఎంటర్టైన్మెంట్ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి హిట్ చిత్రాలు నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, లావణ్య త్రిపాఠీలు హీరో హీరోయిన్లు కాగా కోట శ్రీనివాసరావు, రవికిషన్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. రచయితగా పలు చిత్రాలకు పని చేస్తున్నాను’ అని దర్శకుడు చింతాడ చంద్రమోహన్ తెలిపారు. ‘‘కోనసీమ అందాలు ఇక్కడి పంట చేలు కొబ్బరి తోటలు, గలగల పారే కాలువలు ఎంతో బాగున్నాయని హీరో శర్వానంద్ అన్నారు. ‘సినిమా ఘాటింగ్లకు తూర్పు గోదావరి జిల్లా నంబర్ వన్ ప్రాంతమని, జబర్దస్త్ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది’’ కమెడీయన్ అని షకలక శంకర్ తెలిపారు. -
తిర్మలగిరిలో సినిమా షూటింగ్
హాలియా: హనుమాన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శనివారం మండలంలోని తిర్మలగిరి, ఎల్లాపురం రాజవరం మేజర్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో సినిమాను నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఇందులో హీరోగా హర్షవర్థన్‌రెడ్డి, హీరోయిన్లుగా రోహిణీ, దివ్యలు, కోడైరక్టర్గా నరేష్, కెమెరామెన్‌గా తౌర్యాలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని దర్శకుడు తెలిపారు. -
జాహ్నవిలో సినిమా షూటింగ్
సూర్యాపేట రూరల్: ఆర్ఎం మూవీ మ్యాకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మరో దృశ్యం సినిమా షూటింగ్ గురువారం సూర్యాపేట మండలంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జహ్నావి టౌన్షిప్లో నిర్వహించారు. ఈ సినిమాలో హీరోగా పచ్చిపాల గౌతమ్, హీరోయిన్గా శ్వేత నటిస్తున్నట్లు సినిమా నిర్వాహకులు తెలిపారు. సినిమా ఫోటోషాట్లో భాగంగా హీరో గౌతమ్, హీరోయిన్ శ్వేతలపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా హత్యలు, అత్యాచారాల నివారణకు తోడ్పడే విధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ కట్ల రాజేంద్రప్రసాద్, కో డైరెక్టర్ కోల మధుబాబు, నటీనటులు బోళ్ల స్వామిరెడ్డి, దొంతగాని సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజాపేటలో సినిమాషూటింగ్
రాజాపేట: మండలంలోని హరిష్‌రావ్ ఫామ్‌హౌజ్‌లో బుధవారం బీ ఫామ్‌హౌజ్ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఎంఅండ్ఎస్ క్రియేషన్స్, లక్ష్మీ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్స్ వారి బీ ఫామ్‌హౌజ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ పాల్ వివరాలను తెలిపారు. కథ, డైరక్టర్, నిర్మాత ఎస్ పాల్, కెమెరామెన్, స్క్రీన్‌ప్లే వీఎన్ రాజు, రణదీప్‌రెడ్డి, హీరో రిషి, అక్షయ్, హీరోయిన్ రమ్యారెడ్డిలు నటిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు క్రితం సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు, ఈ సినిమా షూటింగ్ సన్నివేశాలను హైదరాబాద్‌లోని అమీర్‌పేట, చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నినిమా మొత్తం హర్రర్, సెంటిమెంట్, క్రైం సన్నివేశాలల్లో మొత్తం 15 మంది పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ సినిమా మొదటిదని దీపావళి వరకు బీ ఫామ్‌హౌజ్ సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
నయీమ్ జీవితంతో మూడు సినిమాలు!
ఎప్పుడూ ఓ నాలుగు కళ్లు నేరాలు-ఘోరాలు, మాఫియా కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయా? అని వెతుకుతుంటాయి. అందులో పోలీసులవి రెండు కళ్లు అయితే.. ఇంకో రెండు కళ్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మవి. మాఫియా, ఇతర నేరాలను అరికట్టాలని పోలీసులు ఓ కన్నేస్తే, సదరు గ్యాంగ్స్టర్లపై సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వర్మ ఉంటారు. నిజజీవిత ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మ స్పెషలిస్ట్. హిందీలో ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం వర్మ కన్ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ మీద పడింది. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన నయీమ్ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తానని వర్మ ట్వీటారు. ‘‘నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా, ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఆల్ టైమ్ క్రిమినల్ నంబర్‌వన్ నయీమ్ నేరచరిత్రకు సంబంధించిన పలు కథనాలు తెలుసుకున్నాను. అతడు చేసిన పనులు భయంకరమైనవి. ఒక్క సినిమాలో నయీమ్ కథ అంతటినీ చెప్పడం అసాధ్యం. అందుకే, మూడు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని వర్మ పేర్కొన్నారు. నయీమ్ మరణించిన తర్వాత ప్రతి రోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో రాబోయే నయీమ్ ట్రయాలజీ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో! -
అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!
• ఆన్లైన్ సంస్థల రాయితీలు, కూపన్ల వివరాలందిస్తున్న బక్కర్ • బక్కర్తో ఈ-కామర్స్‌లకు నెలకు రూ.75 లక్షల వ్యాపారం • నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరణ కూడా • 3 నెలల్లో రూ.6 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో కో-ఫౌండర్ వెన్నెల మిర్యాల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వీకెండ్స్‌లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్‌కు చేరుకోవడానికో క్యాబ్ కావాలి! రిటర్న్‌లో రెస్టారెంట్లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్లైన్లో షాపింగూ చేసేయాలి!! ...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్లైన్లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు దొరుకుతాయ్. కానీ, ఒక్కో దానికోసం బోలెడంత సమయం వృథా. అసలు రాయితీలందించే యాప్‌లన్నీ ఒకే వేదికగా ఉంటే!! ఆ కిక్కే వేరు కదూ...! ఇదిగో అచ్చం ఇలాంటి యాపే ‘‘బక్కర్’’. ఈ యాప్ విశేషాలు, సేవల గురించి వెన్నెల మిర్యాల ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నేను, రవనీత్ సింగ్, నిఖార్ అగర్వాల్ ముగ్గురం ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్. బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ అంశాన్ని ఎంచుకోవాలనే విషయంపై బాగా ఆలోచించాం. ఆ సమయంలో మాకెదురైన అనుభవాన్నే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అదే బక్కర్ యాప్‌గా మారింది. అదెలాగంటే.. మీం వీకెండ్స్‌లో ఫుడ్యాప్ల ద్వారా రాయితీలపై ఆహారాన్ని తెప్పించుకొని తినేవాళ్లం. అయితే తక్కువ ధరకు, నాణ్యమైన ఫుడ్ ఏ సంస్థ ఆఫర్ చేస్తుందోనని తెలుసుకునేందుకు ఆన్లైన్లో గంటల కొద్దీ వెతికేవాళ్లం. ఆ సమయంలో మేం గ్రహించిందేంటంటే.. ఆన్లైన్లో రాయితీలను వెతికేందుకు ఎంత సమయం వృథా అవుతుందోనని! ‘‘ప్రతీ సంస్థకూ ఓ యాప్ ఉంటుంది.. రాయితీలూ ఉంటాయ్’’ కానీ, అవన్నీ ఒకే వేదికగా అందుబాటులో లేవని కూడా తెలిసింది. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకొని రూ.2 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా గతేడాది డిసెంబర్లో క్రూగ్జియో ల్యాబ్స్ ప్రై.లి. పేరిట సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాపే ‘బక్కర్’! వినియోగదారులకు లాభపడేలా.. కంపెనీలకు తగిన మార్కెట్ చూపించేలా వివిధ సంస్థల యాప్‌లు, వాటికి ప్రత్యామ్నాయాలు, రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లనూ అందించే సంస్థలు.. ఇలా అన్నింటికీ ఒకే వేదికగా పొందే వీలు కల్పించడమే బక్కర్ పని. 4 విభాగాలు.. 22 సంస్థలు.. బక్కర్ యాప్‌లో లాగినయ్యాక.. కావాల్సిన సేవలను ఎంచుకోవాలి. వెంటనే ఆయా సేవలందిస్తున్న సంస్థలు, ధరలు, రాయితీల వివరాలొస్తాయి. నేరుగా అక్కడి నుంచే వాటిని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాబ్స్, ఈ-కామర్స్, విమానాలు, కూపన్లు... నాలుగు విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఫుడ్‌పాండా, స్విగ్గీస్, సాసోస్, ఓలా, ఉబర్, పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, గ్రాబ్ఆన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి 22 సంస్థలు మాతో భాగస్వామ్యమయ్యాయి. నెలకు 50 వేల మంది బక్కర్ను వినియోగించుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో 5 లక్షల యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా యాప్ నుంచి జరిగే ప్రతి కొనుగోలు మీద 7-10 శాతం కమీషన్ కింద ఆయా సంస్థలు చెల్లిస్తాయి. నెలకు రూ.75 లక్షల జీఎంవీ.. ప్రస్తుతం నెలకు రూ.9-10 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. బక్కర్ ద్వారా మా భాగస్వామ్య సంస్థలకు నెలకు రూ.75-80 లక్షల వ్యాపారం (జీఎంవీ) జరుగుతుంది. ఆగస్టులో రెండింతల వృద్ధిని చేరుకోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరించనున్నాం. 6 నెలల్లో హోటల్స్, ట్రావెల్ (బస్సు, రైళ్లు) విభాగాలకు విస్తరించాలనేది లక్ష్యం. రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి.. ‘‘సీడ్రౌండ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో కోటి రూపాయల నిధులను సమీకరించాం. 50కే వెంచర్స్, సింగపూర్, సిలికాన్‌వ్యాలీకి చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. బెంగళూరు, ముంబైకి చెందిన పలువురు వీసీ)సంస్థలతో మాట్లాడుతున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని వెన్నెల వివరించారు. -
‘వనం–మనం’లో సినీతారలు
రాజమండ్రి : ఓడలరేవు బీవీసీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వనం–మనం’ కార్యక్రమానికి సినిమా గ్లామర్ అద్దుకుంది. హీరో భరత్, హీరోయిన్ శ్వేతాశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. వారితో పాటు విద్యార్థులు 500 మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్వీ ప్రసాద్, కొల్లు విష్ణుమూర్తి,నాతి లెనిన్‌బాబు, గిడుగు భాస్కరరావు పాల్గొన్నారు. -
పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే..
న్యూయార్క్: అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లిన ఓ వ్యక్తి తమ పిల్లలను అక్కడి ఊయలలు ఊగనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా.. దెయ్యం. అవును ఆ ఊయలలో దెయ్యం ఊగుతోందంట. ఆ విషయం ఆ వ్యక్తి స్వయంగా తెలపడం కాకుండా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ వీడియోను లక్షలమంది చూశారు. అమెరికాలోని రోడే ఐలాండ్ లో వార్విక్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం సరదాగా గడిపేందుకు వెళ్లింది. అదే సమయంలో అదే కుటుంబంలోని ఓ మూడేళ్ల పాప బీచ్ ఒడ్డున ఉన్న ఊయల ఊగుతానని మారాం చేసింది. దీంతో ఆ కుటుంబం పాపను తీసుకునే ముందుకు రెండు అడుగులు వేయగా అనూహ్యంగా అందులో ఎవరు కూర్చోకుండానే ఆ ఊయల ఊగడం ప్రారంభించింది. దీంతో అవాక్కయిన ఆ పాప తండ్రి స్కాట్ పాపను వెళ్లనివ్వకుండా వీడియో తీయడం ప్రారంభించాడు. ఆ సమయానికి పెద్దగా గాలి ప్రభావం కూడా లేదని, ఊయలలో ఉన్న ఓ ఖాళీ కుర్చి ఎలా ఊగుతుందని ఆశ్చర్యపోయానని అతడు చెప్పాడు. పగలు కూడా దెయ్యాలు సంచరిస్తున్నాయా అనే గుండె ఆగినంత పనైందని అతడు తన అభిప్రాయం చెప్పాడు. -
ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున
తిరుమల: 'ఓం నమో వేంకటేశాయః' చిత్రం ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుడు హథీరాం పాత్రను చేస్తుండటం ఉత్తేజకరంగా ఉందని సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. గురువారం ఉదయం ఆయన తన సతీమణి అమలతో కలిసి స్వామివారిని దర్శించకున్నారు. వీరి వెంట దర్శకుడు కే రాఘవేంద్రారావు, నిర్మాత ఎ.మహేశ్వరరెడ్డిలతో పాటు సాంకేతిక బృందం కూడా ఉన్నారు. చిత్ర నిర్మాణం ప్రారంభంకావడానికి ముందు చిత్రం విజవంతం కావాలని గర్భాలయ మూలమూర్తకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల నాగార్జన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని చిత్రం పేరును 'ఓం నమో వేంకటేశాయః' గా ప్రకటించారు. అన్నమయ్య సినిమాలానే ఈ చిత్రంలో కూడా భక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల25 నుంచి షూటింగ్ ను ప్రారంభిస్తామన్నారు. అన్నమయ్య తర్వాత ఓం నమో వేంకటేశాయః చిత్రానికి దర్శకత్వం వహించడం అద్భుత అవకాశమని చెప్పారు. -
థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది. ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు. 'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ
తమిళసినిమా: సినీ నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడై నా తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు. ఆదివారం తిరుచ్చిజిల్లాలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు...తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూర్ భగవతీపురంలోని అమ్మన్ ఆలయంలో వారం రోజు లుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రో జు ఆదివారం రాత్రి పసుపు జలాలతో అభిషే కం నిర్వహించారు. ఆ సమయంలో అదే ప్రాం తానికి చెందిన నటుడు అజిత్, విజయ్ అభిమానులకు, నటుడు శింబు అభిమానులకు మధ్య పరస్పర వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే జాఫర్ అనే వ్యక్తి అనూహ్యంగా శంకర్ మీద దాడి చేసి ఇనుప రాడ్డుతో కొట్టడంతో మళ్లీ గొడవ జరి గింది. గొడవల్లో ఆ ప్రాంతానికి చెందిన కరుప్పయ్య, చంద్రశేఖర్, పెరియసామి తదితర 8 మంది గాయాల పాలయ్యారు. వారిని స్థానికు లు తువాంగుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రాంతానికి చెందిన 100 మందికిపైగా తిరువెరుంబూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయడానికి వెళ్లారు. అయితే పోలీసులు వారి ఫిర్యాదును నిరాకరించడంతో మహిళలు పోలీస్‌స్టేషన్‌ను చుట్టి ముట్టి ఆందోళనకు దిగా రు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. -
అజహరుద్దీన్‌కు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా?
పాత గాయం సినిమా వేరు... జీవితం వేరు... సెలబ్రిటీ జీవితం వేరు... పబ్లిక్‌లోకి వచ్చి, సామాన్యుడిలా నిలబడడం వేరు.... మనకు నోటికొచ్చింది మీడియా మీట్లో చెప్పేసి వెళ్ళిపోవడం వేరు... ప్రత్యేక ఇంటర్వ్యూకు ఒప్పుకొని, అడిగిన ప్రశ్నకల్లా జవాబు చెప్పగలగడం వేరు. క్రికెటర్‌గా పేరు తెచ్చుకొని, భారత క్రికెట్ జట్టుకు సారథిగా కూడా వెలిగిన మహమ్మద్ అజహరుద్దీన్‌కు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా? వరుస చూస్తుంటే, అలాగే అనిపిస్తోంది. అజహరుద్దీన్ జీవితంపై తాజాగా హిందీలో ‘అజహర్’ అనే సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రచారం కోసం అజహర్ ఇప్పుడు వరుసపెట్టి బోలెడన్ని ప్రెస్మీట్లలో మాట్లాడుతున్నారు. అడిగినవాడికి లేదనకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అలాంటి ఒక ఇంటర్వ్యూ ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. అజహర్ క్రికెట్ ఆడుతున్న సందర్భంలో తలెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురించి సదరు ఇంటర్వ్యూలో లోతైన ప్రశ్నలు వేశారట! మాల్కమ్ మార్షల్, కోట్నీ వాల్ష్ లాంటి ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొన్న అజహర్ ఈ వాడి వేడి ప్రశ్నల బంతులకు మాత్రం చేతులెత్తేశారు. ఆ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళు పదే పదే అభ్యర్థించినా మళ్ళీ వచ్చి కూర్చోలేదు, ఇంటర్వ్యూ కొనసాగించలేదు. విచిత్రం ఏమిటంటే బౌన్సర్ల లాంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో మరో న్యూస్ ఛానల్ నిర్వహించే ఒక పెద్ద టీవీ షోకు కూడా మన హైదరాబాదీ క్రికెటర్ నో చెప్పేశారట. ‘జవాబివ్వడానికి తడుముకోవాల్సి వచ్చే ప్రశ్నలు ఎవరైనా అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే, ఆ టీవీ షోకైనా, ఈ ఇంటర్వ్యూకైనా ఆయన దూరంగానే ఉండిపోయారు’ అని ఆంతరంగిక వర్గాలు చెప్పాయి. ఎంతైనా ఇంటర్వ్యూలో సంధించే లోతైన ప్రశ్నల్ని తట్టుకోవడం మైదానంలో క్రికెట్ ఆడినంత సులభం కాదని అజహరుద్దీన్ తాజాగా అనుభవంలోకి వచ్చినట్లుంది! -
అమెరికాను పక్కన పెట్టి ఇండియా బాటలో..
చెన్నై: హాలీవుడ్ చిత్రాలు ఇండియా బాటపడుతున్నాయి. వందల కోట్లు పెట్టి భారీ స్థాయిలో చిత్రాలు నిర్మించి వాటిని తొలుత తమ దేశాల్లో కాకుండా భారత్ లో విడుదల చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్ ల హవా మొదలవడం.. హాలీవుడ్ చిత్రాల క్రేజ్ పెరగడంతో ఇక తమ చిత్రాలను తొలుత అత్యధిక వ్యాపార అవకాశాలు ఉన్న భారతీయ స్క్రీన్ లపైకే వదులుతున్నాయి. ఇటీవల జంగిల్ బుక్ చిత్రాన్ని నేరుగా ఇండియాలో విడుదల చేసినట్లుగానే ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం 'ఎక్స్ మెన్ అపోకాలిప్స్' నేరుగా ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్రియాన్ సింగర్ దర్శకత్వం వహించారు. మే 20న సినిమాను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియో ప్రకటన చేసింది. 'ఎక్స్ మెన్ చిత్రాలకు ఇండియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆసియా దేశాలతో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ. అందుకే అమెరికా కన్నా ఒక వారం రోజుల ముందుగానే ఇండియాలో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాలకు దక్కని ఈ అవకాశం భారతీయులు ముందుగా ఉపయోగించుకోవాలి' అని ఫాక్స్ స్టార్ సీఈవో విజయ్ సింగ్ తెలిపారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు. -
'డబ్బు కోసం సినిమాల్లో నటించడం లేదు'
ముంబై: డబ్బుల కోసం తాను సినిమాల్లో నటించలేదని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంది. డబ్బులు కావాలంటే మరో పనిచేసి సంపాదించేదాన్నని చెప్పింది. స్వర తాజాగా అశ్వినీ అయ్యర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిపాత్రలో నటించింది. 'నేను డబ్బుల కోసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ నటించలేదు. నేను నటించిన సినిమాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోవాలి. అంతేకానీ ఓ ఇడియట్‌లా కనిపించాలని కోరుకోవడం లేదు. నేను చనిపోయినా గౌరవంగా గుర్తించుకోవాలి. అశ్వినీ అయ్యర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినపుడు తిరస్కరించాలని భావించా. అదే ఉద్దేశ్యంతో స్ర్కిప్ట్ చదివాను. ఆ తర్వాత తెలిసింది ఇది అద్భుతమైన స్ర్కిప్ట్ అని. ఈ పాత్ర చేయడం నటిగా నాకు సవాల్' అని స్వర చెప్పింది. -
అజిత్ తో అనుష్క మరోసారి..
అజిత్‌తో మరోసారి జత కట్టడానికి అందాల తార అనుష్క సిద్ధమవుతున్నారా? దీనికి కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌ల తరువాత కోలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ విజయ్, అజిత్లేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అలాంటి వారితో జత కట్టడానికి ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటారు. అందుకు తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల నటి తమన్నా అలాంటి ప్రయత్నాన్నే చేసినట్లు ప్రచారం జరిగింది. తమన్నా అజిత్‌తో కలిసి వీరం చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అజిత్ వేదాళం తరువాత తన 57వ చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఇందులో హీరోయిన్గా నటించాలన్న ఆకాంక్షను తమన్న వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో సారి అజిత్‌తో నటిస్తానని తనే ఇటీవల వెల్లడించారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఎంపికయ్యిందేమోన ని అనుకున్న వారూ లేక పోలేదు. అయితే అజిత్ తాజా చిత్రంలో నటించే అవకాశం తమన్నాకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ అవకాశాన్ని స్వీటీ(అనుష్క)తన్నుకుపోయినట్లు తాజా సమాచారం.అనుష్క ఎన్నై అరిందాల్ చిత్రంలో తొలి సారిగా అజిత్ తో నటించారు. అయితే ఆ చిత్రంలో ఆయనతో అంతగా రొమాన్స్ చేసే అవకాశం లభించలేదు. అజిత్ 57వ చిత్రం మరోసారి ఫుల్ప్లెజ్డ్ హీరోయిన్గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివనే అజిత్ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్‌పైకి రానున్నదని తెలుస్తోంది. వేదాళం చిత్రానికి సంగీత బాణీలు అందించిన అనిరుద్‌నే దీనికి సంగీతాన్ని అందించనున్నారు. అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో అవినీతి’
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్‌లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌కు చెందిన రూ.2 కోట్లు క్యాన్సిలేషన్ చేసి యూనియన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి పీవీవీ ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం వద్ద 35 ఎకరాల కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి ఎకరం విలువ రూ.3.30 లక్షలు మాత్రమే ఉండగా వారు మాత్రం రూ.5.30 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. యూనియన్ డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పారు.ఈ మేరకు ఫిర్యాదు పత్రంపై సంఘం సభ్యులు 60 మంది సంతకాలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పోలీసులను కలిసిన వారిలో ఉన్నారు. -
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు. -
ఎస్‌ఎంకేకు కొత్త జట్టు
సాక్షి, చెన్నై: అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చికి(ఎస్ఎంకే) కొత్త జట్టు ఎంపికైంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా సినీ నటుడు శరత్‌కుమార్ మళ్లీ ఎంపికయ్యారు. ఆయన సతీమణి, నటి రాధిక శరత్‌కుమార్ ఆ పార్టీ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం తిరునల్వేలి వేదికగా జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో రానున్న ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్న అంశంపై చర్చించారు. సమత్తువ మక్కల్ కట్చిలో గత నెల ప్రకంపన బయ లు దేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటుగా పలువురు బీజేపీలో చేరడం, తదుపరి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ తిరుగు బావుటా ఎగురవేయడంతో వివాదం రచ్చకెక్కింది. ఎస్‌ఎంకేను కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఎర్నావూర్ నారాయణన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరునల్వేలి వేదికగా ఆ పార్టీ సర్వ సభ్య సమావేశానికి శరత్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఈ పిలుపునకు అమిత స్పందన వచ్చిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ, రాష్ట్ర నాయకులు తరలి రావడంతో ఎస్ఎంకే ను కైవసం చేసుకోవడం ఎవరి తరం కాదన్న ధీమా శరత్‌కుమార్‌లో నెలకొన్నట్టు అయింది. ఈ సమావేశం నిమిత్తం తూత్తుకుడి నుంచి తిరునల్వేలి కేటీసీ నగర్‌కు చేరుకున్న శరత్‌కుమార్‌కు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ అధ్యక్షుడిగా: పార్టీలో నెలకొన్న ప్రకంపనను చల్లార్చే దిశగా ఈ సమావేశ ఆరంభంలో కొత్త జట్టు ఎంపిక మీద శరత్‌కుమార్ దృష్టి పెట్టారు. పార్టీ నుంచి ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్లు బయటకు వెళ్లడంతో, వారి స్థానాల్ని భర్తీ చేస్తూ, కొత్త జట్టును ప్రకటించారు. సర్వ సభ్య సమావేశం ఆమోదంతో పార్టీ అధ్యక్షుడిగా శరత్‌కుమార్ మళ్లీ ఎంపిక అయ్యారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శిగా జయ ప్రకాష్, కోశాధికారిగా సుందరేషన్, ఉపాధ్యక్షుడిగా కాళిదా స్, సహాయ ప్రధాన కార్యదర్శులుగా ష ణ్ముగ సుందరం, పన్నీరు సెల్వం, ప్రిసీడి యం చైర్మన్‌గా సెల్వరాజ్, రాజకీయ సల హాదారుడిగా లారెన్స్‌ను ఎంపిక చేస్తూ శరత్‌కుమార్ ప్రకటించారు. ఇక పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా రాధికను ఎంపిక చేశారు. అలాగే, ఇతర పదువులకు ఎంపికైన వారి వివరాల్ని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఎ వరితో అన్న అంశంపై పార్టీ వర్గాల అభిప్రాయాల్సి శరత్‌కుమార్ సేకరించారు. డీఎంకే వైపు చూపా: అభిప్రాయ సేకరణ అనంతరం శరత్‌కుమార్ ప్రసంగిస్తూ, పార్టీ తొమ్మిదో ఏట అడుగు పెట్టిందని గుర్తు చేస్తూ, ఈ కాలంలో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రంలో పొత్తులు కుదరడం లేదని గుర్తు చేస్తూ, అస్సలు ఎన్నికల ముందు పొత్తులు అవసరమా అని ప్రశ్నించారు.ఎ న్నికల అనంతరం పొత్తులు కుదిరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వారి వారి బలం ఏమిటో చాటుకోవాలంటే ఒంటరి సమరానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఎవరంటే, వాళ్లు తానే సీఎం ...తానే సీఎం అని చెప్పుకుంటున్నారని,అలాంటప్పుడు తాను కూడా ఓ కూటమి ఏర్పాటు చేసుకుని సీఎంగా ప్రకటించుకుంటానంటూ చమత్కరించారు. సీఎం కుర్చి కోసం పరుగు పందెం ఇక్కడ సాగుతున్నట్టుందని వ్యాఖ్యానిస్తూ, పార్టీ వర్గాల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం ఉంటుందన్నారు. ఈసందర్భంగా తన ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్య డిఎంకే వైపుగా ఎస్ఎంకే చూస్తున్నదా..? అన్న ప్రశ్నను లేవ దీసినట్టు అయింది. ఇన్నాళ్లు నీడలో ఉన్నానని, సూర్య రశ్మి కోసం బయటకు వస్తున్నట్టుగా వ్యాఖ్యానించడంతో, డిఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారన్న భావనలో అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ బయలు దేరింది. ఇదే విషయంగా ఆయన్ను మీడియా కదిలించగా, అలాంటిది ఏమి లేదు అని, ఓ అంశాన్ని వివరించే క్రమంలో ఆ పదాన్ని వాడడం జరిగిందే గానీ, పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సైతం పరిశీలన జరుపుతున్నట్టు సమాధానం ఇచ్చారు. పార్టీ వర్గాలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు అప్పగించారని, త్వరలో మంచి ప్రకటన ఉంటుందన్నారు. -
సినిమా చూస్తూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి
-
భాగ్యనగరం చాట్ భలే..
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే ఇంకా మరీనూ. అందులోనూ హైదరాబాద్‌లో షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడి థియేటర్స్‌లో సినిమాలు చూడటం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇన్ని ఇష్టాలతో పాటు మరొకటి.. ఇక్కడ దొరికే చాట్. మామూలుగా చాట్ అంటే.. ముంబైలోనే ఫేమస్. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ పట్టు పడతా. ఓసారి హైదరాబాదీ చాట్ టేస్ట్ చేశా. నాకైతే ముంబైలో దొరికే చాట్కన్నా భాగ్యనగరంలో దొరికే చాట్ భలేగా ఉందనిపించింది. ఇక, ఇక్కడివాళ్ల గురించి చెప్పాలి. వాళ్ల ప్రవర్తన చాలా స్వీట్‌గా ఉంటుంది. నాకిక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో కలిసి చాట్ తినడం, సినిమాలు చూడటం లాంటివి ఎప్పుడూ మిస్ కాను. ఓవరాల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. - ఆదాశర్మ, సినీనటి -
మళ్లీ అవన్నీ చేస్తా!
ఆ రోజులే వేరు... మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే... అని ఒక్కసారైనా అనుకోనివాళ్లు ఉండరు. ఈ మధ్య శ్రీయ కూడా అలానే అనుకున్నారు. కాలం వెనక్కి వెళితే తాను ఏమేం చేయాలనుకుంటున్నారో శ్రీయ చెబుతూ - ‘‘కాలేజీలో జాయినవుతా. బోల్డంత మందితో స్నేహం చేస్తా. కాలేజీ లైఫ్‌ని వీలున్నంతవరకూ ఎంజాయ్ చేస్తా. బాగా చదువుకుంటా. అలాగే, నేనెక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటా. అంటే... సినిమాల్లోకి రాకముందు నేను కొన్ని నృత్యప్రదర్శనలు ఇచ్చాను. అక్కణ్ణుంచే నా సినిమా కెరీర్ మొదలైంది. అందుకని మళ్లీ స్టేజి మీద డ్యాన్స్ చేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు. మరి.. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్ చిల్డ్రన్ సహాయం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. పుస్తకాలు చదవాలనుకుంటున్నా. అలాగే, విదేశాల్లో నివసించాలని ఉంది. ఆ దేశాల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా చాలా చాలా అనుకుంటున్నా. అనుకున్నట్లు అన్నీ చేయగలిగితే బాగానే ఉంటుంది. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో?’’ అన్నారు. -
31 రోజులు... 25 సినిమాలు...
నెలంతా పండగే కొత్త ఏడాదిలో... కొత్త రిలీజ్‌ల సందడి మిన్నంటుతోంది. ఈ ఒక్క జనవరిలో ఏకంగా 25 సినిమాలు రిలీజవుతున్నాయి. బాబాయ్, అబ్బాయ్ సహా పెద్ద హీరోలు ముగ్గురు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. పల్లెటూరి కథలు, పెళ్ళి కథలు, యాక్షన్ డ్రామాలు, రియల్ లైఫ్ స్టోరీలు - ఇలా ఎటు చూసినా వైవిధ్యమైన కథలతో ఈ నెలంతా రిలీజ్‌ల పండుగ అనిపిస్తోంది. కాస్త అటూ ఇటుగా రూ. 200 నుంచి 300 కోట్ల మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ పణంగా ఒడ్డుతోంది. కొత్త ఏడాది మొదలైంది. మళ్ళీ కొత్త సినిమాల సందడీ మొద లైంది. ఈసారి కొత్త రిలీజుల తాకిడి ఎలా ఉందంటే, మునుపెన్నడూ లేనంతగా ఒకే రోజున నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. కొత్త ఏడాది తొలి రోజునే ఏకంగా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు (రామ్ ‘నేను... శైలజ’, నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’, హార్రర్‌కామెడీ ‘చిత్రం భళారే విచిత్రం’) రిలీజయ్యాయి. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ ప్లాన్ చేశాయి. కానీ, ఆఖరు నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఆగాయి. అందులో ఒకటి ‘కిల్లింగ్ వీరప్పన్’ రేపు గురువారం నాడు రిలీజవుతోంది. ఇక, ఆ మరునాడే 8వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘బొంబి బెల్లె’, యానిమేషన్ చిత్రం ‘ఛోటా బీమ్’ సహా ఏకంగా 8 చిత్రాలు రిలీజవడానికి పోటీపడుతున్నాయి. ఆఖరి నిమిషంలో కొన్ని ఆగినా, అందులో సగమైనా కనీసం హాళ్ళలో పలకరించే సూచనలున్నాయి. సంక్రాంతి పుంజులు... బాబాయ్, అబ్బాయ్ వెరసి, పదిహేను రోజుల ముందే తెలుగు సినిమాకు సంక్రాంతి వచ్చేసినట్లుంది. ఈసారి సంక్రాంతికి ఊళ్ళలోనే కాదు... సినిమాహాళ్ళ లోనూ స్టార్ కోడిపుంజుల మధ్య పోటాపోటీగా జరగనుంది. ‘నాన్నకు ప్రేమతో...’ అంటూ చిన్న ఎన్టీయార్ ఈసారి సంక్రాంతి సినిమా సందడికి జనవరి 13న తెర తీస్తున్నారు. అబ్బాయ్ అలా అంటుంటే, బాబాయ్ బాలకృష్ణ ఆ మరునాడే భోగి పండుగకి (ఈసారి జనవరి 14న వచ్చింది) ‘డిక్టేటర్’గా వస్తున్నాడు. నందమూరి వంశం నుంచి ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్లో ఇలా పోటీపడడం అభిమాను లతో పాటు సినీ పరిశ్రమలో అందరి మధ్య చర్చనీయాంశమైంది. రెండూ భారీ చిత్రాలే కావడంతో హాళ్ళలో పోరాటమూ భారీగానే మారనుంది. ఇక, జనవరి 14నే యువ హీరో శర్వానంద్ - మేర్లపాక గాంధీల కాంబినేషన్లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘మనం’ తరువాత బుల్లితెరపైనే తప్ప, వెండితెరపై కనిపించని నాగార్జున ఎట్టకేలకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనిపించుకుంటూ, ఈ సంక్రాంతికి జనవరి 15న వస్తున్నారు. తమిళనాట యువ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ కొత్త తమిళ చిత్రం ‘కథకళి’. తమిళులకు కూడా సంక్రాంతి (పొంగల్) పెద్ద పండుగ కావడంతో, అక్కడ ఆ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది. ‘కథకళి’ పేరుతోనే తయారవుతున్న తెలుగు డబ్బింగ్ కూడా లెక్క ప్రకారమైతే, ఏకకాలంలో తెలుగునాటా రిలీజ్ కావాలి. ఇప్పటికే థియేటర్ల కోసం సినిమాల మధ్య తొక్కిసలాట పరిస్థితి ఉండడంతో ‘కథకళి’ ఒక్కవారం ఆలస్యంగా జనవరి 21న రానుందని పరిశ్రమ వర్గాల కథనం. మూకుమ్మడిగా మీడియవ్‌ు రేంజ్ చిత్రాలు సంక్రాంతి పండుగ అయిపోయినా, హాళ్ళలో పండుగ వాతావరణం తగ్గేలా లేదు. ప్రేక్షకుల మాటెలా ఉన్నా, సంక్రాంతి మరుసటి వారం కూడా కొత్త సినిమాలతో హాళ్ళు ఫుల్‌గా ఉండడం ఖాయం. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ను జనవరి 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక, మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా ఆయన తండ్రి - సీనియర్ నటుడు సాయికుమార్ స్వయంగా నిర్మించిన ‘గరం’, మరో చిన్న సినిమా కూడా 22న రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక, జనవరిలో ఆఖరి శుక్రవారమైన 29న రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’, కన్నడ అనువాద చిత్రం ‘బొంబాయి మిఠాయి’, సిద్ధార్థ - త్రిష - హన్సిక తదితరులు నటించిన తమిళ ‘అరణ్మణై-2’కు అనువాదం ‘చంద్రకళ-2’, మరో చిన్న చిత్రం ‘నిలువవే వాలు కనుల దానా...’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాయి. సగటున ప్రతివారం 5 రిలీజ్లు లెక్కచూస్తే, అయిదు శుక్రవారాలున్న ఈ జనవరి నెలలో ఏకంగా పాతిక సినిమాల దాకా రిలీజవుతున్నాయి. అంటే, సగటున ప్రతి వారం అయిదేసి సినిమాలన్నమాట! ఫిబ్రవరి, మార్చిల్లో కూడా చాలా సినిమాలు సిద్ధమవు తున్నాయి. సునీల్ హీరోగా వస్తున్న ‘కృష్ణాష్టమి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడు న్నోడు’, త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ’ లాంటివి ఆ జాబితాలో ఉన్నాయి. ఇన్ని రిలీజ్లు చూసి, తీసిన సినిమాలు తీసినట్లు రిలీజైపోతున్నాయను కుంటే పొరపాటే. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, సరైన రిలీజ్ డేట్ కోసం, తగినన్ని థియేటర్ల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమా ఎన్ని వారాలు ఆడుతుందన్న మాట దేవుడెరుగు, అసలు ఏ వారం రిలీజ్ చేయగలుగుతామో తెలియని పరిస్థితి ఇప్పుడు దర్శక, నిర్మాతల్లో నెలకొంది. ‘‘ప్రతివారం ఇన్నేసి సినిమాలు రిలీజవుతుంటే హాళ్ళూ ఖాళీ ఉండట్లేదు. ప్రేక్షకులకూ ఊపిరి పీల్చుకొనే గ్యాప్ రావడం లేదు. ఈ గందర గోళం మధ్యలో ఎప్పుడు మా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందో తెలియడం లేదు’’ అని దాదాపు నెలన్నర క్రితమే అన్ని పనులూ పూర్తి చేసుకొని, రిలీజ్‌కు సిద్ధమైన ఒక యువ హీరో సినిమా తాలూకు నిర్మాత ఆంతరంగికంగా వాపోయారు. దాంతో, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ - ఎగ్జిబిషన్ సెక్టార్ల మిత్రులు, మీడియా శ్రేయోభిలాషులు ఎవరు కనిపించినా దర్శక, నిర్మాతలు ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అంటారూ’ అని అడుగు తున్నారంటే అతిశయోక్తి కాదు. డిజిటల్ చిత్రనిర్మాణ విధానం వచ్చాక ఔత్సాహికులు ఎక్కువై, చిత్రనిర్మాణం గణనీయంగా పెరిగింది. దాంతో, రిలీజ్‌ల దగ్గర అవస్థలూ పెరిగాయి. నిర్మాణం పూర్తయినా, రిలీజ్‌కు నోచుకోని సినిమాలు పదులకొద్దీ పెరిగాయి. అయినా సరే, గత 2015లో ఏకంగా 172 స్ట్రెయిట్ చిత్రాలూ, 73 డబ్బింగ్‌లూ కలిపి మొత్తం 245 సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిం చాయి. అంటే, ప్రతివారం 4 నుంచి 5 కొత్త రిలీజులు వచ్చాయన్న మాట! సీజన్లు మారిపోయాయోచ్... ఇన్ని సినిమాల నిర్మాణం, రిలీజ్‌లతో ఇప్పుడు సినిమాల సీజన్ కూడా మారిపోయింది. ఒకప్పుడు సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి లాంటి కొన్నే వరుస రిలీజ్‌లకు సీజన్లు. కానీ, ఇప్పుడు ఆ రూల్స్ మారిపోయాయి. క్రిస్మస్, జనవరి ఫస్ట్ మొదలు ఒకప్పుడు పరీక్షల వల్ల సినిమా కలెక్షన్లకు బ్యాడ్ సీజన్లు అనుకున్న ఫిబ్రవరి, మార్చిల్లో కూడా ఎక్కిడి తొక్కిడిగా సినిమాలు హాళ్ళకు క్యూలు కడుతున్నాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న హాళ్ళు 1800 చిల్లరే. ఫలితంగా, సినిమా బాగుంటే సరే... లేదంటే ఈ శుక్ర వారం రిలీ జయ్యే కొత్త సినిమా కోసం గత శుక్రవారం రిలీజైన సిని మాలు హాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తోంది. దాంతో, కోట్ల కొద్దీ వ్యాపారం కొన్ని వారాలకే హారతి కర్పూ రమవుతోంది. ఎవరికి మోదం... ఎవరికి ఖేదం... కానీ, నాలుగు సెలవులుంటే చాలు... ప్రతి ఒక్కరూ దాన్ని తమ సినిమా రిలీజ్‌తో వసూళ్ళకు ఎడ్వాంటేజ్‌గా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎవరూ ఎవరినీ ఆపే, ఆగే పరిస్థితి లేదు. పెద్ద హీరోల, భారీ సినిమాలన్నీ ఒకేసారి రావడంతో చిన్నవాటికి హాళ్ళూ అంతంతే. ఇగోలు వదిలి, కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొనే వాతావరణం లేకపోయేసరికి ఒకరి సినిమాను మరొకరు కిల్ చేస్తున్నారనిపిస్తోంది. ‘‘‘ఒకప్పుడు సంక్రాంతి పండుగ సీజన్ అంటే పంట చేతికొచ్చి, రైతుల చేతుల్లో డబ్బులు ఆడతాయి. సినిమాలు ఆడేందుకు మంచి సీజన్ అనుకొనే వాళ్ళం. కానీ, ఇప్పుడు సినిమాల లైఫ్ పదిరోజులకే పరిమితమవడంతో లెక్కలు మారాయి. ఏ పది రోజుల్లో మూడు, నాలుగు సెలవులంటే అప్పుడు రిలీజ్ చేసేస్తున్నాం. దాంతో, చిన్నా, పెద్దా అన్ని సినిమాలూ ఆ సెలవులు కలిసొచ్చేలా ఒకేసారి రిలీజవుతున్నాయి. అందుకే ఈ హడావిడి.’’ - కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్‌చాంబర్ గౌరవ కార్యదర్శి ఈ పరిస్థితుల్లో చిత్ర నిర్మాణ, పంపిణీ, ప్రద ర్శన రంగాలకు ప్రాతినిధ్యం వహించే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ కొత్త రిలీజ్‌లను క్రమబద్ధీకరించి, అన్ని సినిమాలకూ హాళ్ళు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది. రెండు నెలల క్రితం కొందరు నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ‘‘ఇవాళ చిత్రనిర్మాణం కన్నా రిలీజ్ ఎక్కువ టెన్షన్‌గా మారింది. అందుకే, అందరినీ చైతన్యం చేసి, ఎవరికీ నష్టం కలగకుండా చేయా లని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని నిర్మాత -ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఒక్క జనవరిలో సుమారు 200 కోట్ల పైగా పణంగా ఒడ్డుతున్న తెలుగు పరిశ్రమలో అలాంటి ప్రయత్నాలు సఫలమైతే ఎంత బాగుండు! చిత్రం: నాన్నకు ప్రేమతో, తారాగణం: చిన్న ఎన్టీయార్, రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత: భోగవల్లి ప్రసాద్, దర్శకత్వం: సుకుమార్, ఇతివృత్తం: రివెంజ్ ఫార్ములా ఫ్యామిలీ డ్రామా, రిలీజ్: జనవరి 13 చిత్రం: డిక్టేటర్, తారాగణం: బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నిర్మాతలు: ఈరోస్ ఇంటర్నేషనల్, దర్శకత్వం: శ్రీవాస్ ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్ డేట్: జనవరి 14 చిత్రం: సోగ్గాడే చిన్ని నాయనా, తారాగణం: నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల, ఇతివృత్తం: ఆత్మ చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామా, రిలీజ్: జనవరి 15 చిత్రం: సీతమ్మ అందాలురామయ్య సిత్రాలు, తారా గణం: రాజ్‌తరుణ్, అర్తన, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు,కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి, ఇతివృత్తం: యూత్ ఎంటర్ టైనర్, రిలీజ్: జనవరి 29 చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా, తారాగణం: శర్వానంద్, సురభి, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, దర్శకత్వం: మేర్ల పాక గాంధీ ఇతివృత్తం: యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, రిలీజ్: జనవరి 14 చిత్రం: కళ్యాణ వైభోగమే, తారాగణం: నాగశౌర్య, మాళవికా నాయర్, నిర్మాత: దామోదర్ ప్రసాద్, దర్శకత్వం: నందినీరెడ్డి ఇతివృత్తం: యూత్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రిలీజ్: జనవరి 22 చిత్రం: గరం, తారాగణం: ఆది, ఆదాశర్మ, నిర్మాత: పి.సురేఖ, దర్శకత్వం: మదన్, ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్: జనవరి 22కి ప్లాన్ చిత్రం: కథకళి, తారాగణం: విశాల్, కేథరిన్ థెరిస్సా, రెజీనా, దర్శకత్వం: పాండ్యరాజ్, ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్ డేట్: జనవరి 21 చిత్రం: కిల్లింగ్ వీరప్పన్, తారాగణం: సందీప్ భరద్వాజ్, శివరాజ్‌కుమార్, దర్శకత్వం: రావ్‌ుగోపాల్‌వర్మ, ఇతివృత్తం: వీరప్పన్ రియల్ లైఫ్ స్టోరీ, రిలీజ్ డేట్: జనవరి 7 - రెంటాల -
'పద్మభూషణ్' కోసం నటి లాబీయింగ్!
పద్మభూషణ్ పురస్కారం కోసం అలనాటి బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ తన వద్ద లాబీయింగ్ చేసిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అవార్డులకు తమ పేర్లను సిఫారసు చేయాలని పలువురు వ్యక్తులు తనను వెంటాడుతున్నారని ఆయన చెప్పారు. ' పద్మభూషణ్ పురస్కారం కోసం తన పేరు సిఫారసు చేయాలని ఆశా పరేఖ్ నన్ను కోరింది. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పనిచేయడం లేదు. అందువల్ల 12 అంతస్తుల ఎక్కి వచ్చి మరీ ఆమె నన్ను వ్యక్తిగతంగా కలిసింది. ఇది నాకేమీ మంచిగా అనిపించలేదు' అని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు విస్మయకర విషయాలు తెలిపారు. భారత సినిమా పరిశ్రమకు అపారమైన సేవలందించిన తాను పద్మభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని ఆశా పరేఖ్ తనకు చెప్పిందని గడ్కరీ తెలిపారు. -
శింబుపై పిటిషన్లు ఉపసంహరణ
చె న్నై : నటుడు శింబుపై దాఖలైన కోర్టు కేసులు ఒక్కొక్కటి ఉపసంహరించుకోవడం విశేషం. బీప్ సాంగ్ పాటతో మహిళల్ని అవమానించారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లపై పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే.పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కోవై,చెన్నై లలో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి.అంతే కాదు శింబు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. ఒక్క సైదాపేట కోర్టులోనే శింబుపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయన ముందస్తు బెయిల్ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. దానిపై జనవరి4 న విచారణ జరగనుంది. శింబుపై దాఖలైన పీఎంకే పార్టీకి చెందిన నాయకుడు చెన్నై సైదాపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. మరో రెండు పిటిషన్లను బుధవారం ఉపసంహరించుకోవడం విశేషం. శింబు,అనిరుద్‌లపై విడుదలై చిరుతై పార్టీకి చెందిన దక్షిణ చెన్నై న్యాయవాదుల సంఘం కార్యదర్శి వక్ శీల్ కాశీ చెన్నై,సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం 9వ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి దిలీప్ అలెక్ప్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడు కాశీ హాజకై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేకే.నగర్‌కు చెందిన విడుదలై చిరుతై పార్టీ కార్యదర్శి పుదియవన్ అలియాస్ లక్ష్మణన్ శింబు, అనిరుద్‌లపై దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సైదాపేట 23వ మెట్రోపాలిటిన్ కోర్టులో న్యాయమూర్తి సురేష్ సమక్షంలో విచారణకు రాగా ఆ కేసును పిటిషనర్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికి శింబుపై మూడు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడం గమనార్హం.శింబు తల్లి వీడియోలో కన్నీటి ఘోష తరువాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం జరుగుతున్న వాడీవేడి చర్చ. -
సల్మాన్ హీరో..చరణ్ ప్రొడ్యూసర్
-
ఆ వీడియో చూస్తే చాలు...
కాంక్రీట్ ప్రపంచం.. ఉరుకులు.. పరుగుల జీవితాలు.. తెల్లారింది మొదలు పొద్దుగూకే వరకూ హడావిడి. ప్రతిరోజూ ఒకేలా సాగుతున్న పనితో బోర్ కొట్టేస్తోందా? ఉద్యోగంలోనూ కొత్తదనం కనిపించడం లేదా? వర్క్ మీద ధ్యాస పెట్టలేక పోతున్నారా? అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుకు ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ప్రముఖ ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్... బాతుల్ కాప్సీ. ఆయన సృష్టించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలట. అందులో మీకు అద్భుతం ఏమీ కనిపించకపోయినా జీవితం పట్ల మీ అవగాహనే పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. మరి మీరూ ఆ మార్పును కోరుకునేవారైతే ఇంకెందుకాలస్యం... ఆ వీడియో చూసేయ్యండి. -
'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని'
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆదిత్య పచోలికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంటి యజమానిని ఎందుకు వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31లో ఆయన అద్దెకు ఉంటున్న భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగిచాలని స్పష్టం చేసింది. దీంతోపాటు ఇప్పటి వరకు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆ మహిళా యజమానురాలికి చెల్లించాలని ఆదేశించింది. ఒక ఇళ్లు కొనుగోలు చేసుకోగలిగే స్థోమత ఉండి కూడా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదని, ఆయనది అంగీకరించకూడని ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు చాలా పెద్ద మనిషి. ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేయగలరు. మీ పద్దతి ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
నేను రాజకీయాల్లోకి రాకూడదా?
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే గుజరాతీ భామ నమిత. అభిమానులను మచ్చాన్స్(బావలు) అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించే ఆమె ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ సందడి చేస్తుంది. ఈ సుందరి కొంతకాలంగా తమిళసినిమాలకు దూరం కావడంతో అభిమానులు కలత చెందారు. అందుకు కారణం ఆమె స్థూలకాయమే. చాలా ఒత్తిడికి గురైన నమిత ఇప్పుడు మళ్లీ చిక్కి చక్కగా తయారైంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సినీ, వ్యక్తిగత విషయాల గురించి నమితతో ‘సాక్షి’ భేటీ.. - తమిళ సినిమా ప్ర : రీఎంట్రీ మలయాళంలో అయినట్లున్నారే? జ : నేనెక్కడికి వెళ్లినా, ఏ సినిమాతో రీఎంట్రీ అయినా తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను. శరీరం లావెక్కడంతో నటించడానికి ఎవరూ పిలవలేదు. కొంచెం పరిచయం ఉన్నవాళ్లు కూడా ఎక్కడ అవకాశాలు అడుగుతానో అని తప్పించుకుతిరుగుతున్నారు. అప్పుడే ఇక విషయం అర్థమైంది. నేను చాలా చాలా బరువెక్కాను. నాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించాను. ఎక్సర్సైజ్ ద్వారా 94 కిలోల బరువున్న నేను 76కు తగ్గాను. స్లిమ్‌గా తయారవడంతో మలయాళంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్ర : భోజనం ఫుల్‌గా లాగించేవాళ్లా? జ : అవును. తమిళంలో నేను నటించిన చివరి చిత్రం ఇళంజన్. అది విడుదలై సుమారు ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తెలుగు, కన్నడ భాషలలో నటిస్తూనే ఉన్నాను. నాకు నచ్చిన తమిళంలో సక్సెస్ కాలేకపోయాననే చింత వెంటాడుతూనే ఉండేది. అలా ఒత్తిడికి లోనై ఆహార నియమాలను పక్కన పెట్టి బిరియాని, పిజ్జా, ఐస్‌క్రీమ్, అన్నం అంటూ ఏదిపడితే అది లాగించేశాను. ఆ తర్వాత చూసుకుంటే బరువు సరాసరిగా పెరిగిపోయింది. చాలా భయపడిపోయాను. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంతోనే ఇదిగో ఇలా స్లిమ్‌గా తయారయ్యాను. ప్ర : నిర్మాతగా మారనున్నారట? జ : ఇది నిజంగా జోకే. ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వదంతులను. నాకు చిత్ర నిర్మాణ ఆలోచనే లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా చెయ్యాలో తెలియదు. నాకు తెలిసిందల్లా నటన ఒక్కటే. అది సరిగా చేస్తే చాలని భావిస్తాను. ప్ర : బాక్సింగ్ నేర్చుకున్నారట? జ : ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. అలా స్టంట్ క్లాస్‌కు వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు తెలియకుండానే నాలో ధైర్యం పెరిగింది. అంతేకాదు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలనే కోరిక పెరిగింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ప్ర : తమిళనాడు నచ్చిందా? జ : చాలా బాగా నచ్చేసింది. అందుకేగా గుజరాత్ నుంచి వచ్చేసి చెన్నైలో సెటిల్ అయిపోయాను. ఇకపై ఇదే నా పుట్టినిల్లు. ఇప్పుడు గుజరాత్లో ఏయే పండుగలు చేసుకుంటున్నారన్నది కూడా మరచిపోయాను. తమిళనాడులో జరుపుకునే పండుగలన్నీ నాకు తెలుసు. నాకు బాగా నచ్చిన పండుగ పొంగల్. ఈ పొంగల్‌ను ఏదైనా పల్లెటూరుకెళ్లి జరుపుకోవాలనుకుంటున్నాను. ప్ర : రాజకీయరంగ ప్రవేశం ఆలోచనలో ఉన్నారట? జ: ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? భారత దేశంలో ఇప్పుడున్న రెండు పెద్ద రాజకీయ పార్టీల వారు నన్ను తమ పార్టీలో చేరమని రాయబారం పంపుతున్నారు. వారికి నేనింకా ఏమీ చెప్పలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తా. ఏ పార్టీలో చేరతానన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. ప్ర : సరే పెళ్లి సంగతేమిటి? జ : దాంతో ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకూ నేనెవరినీ ప్రేమించలేదు. ఇకపై ఏమి జరుగుతుందో తెలియదు. -
ప్రజల్లోకి ప్రతికూల సందేశం వెళ్తుంది
పాట్నా : బీహార్ ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు కావడంపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు అవడం ప్రజలలో ప్రతికూల సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీలో ఇటు ఎన్నికల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయని అవి తొలగిపోవాలని ఆకాంక్షించారు. అయితే బీహార్ బీజేపీ శాఖలో కొంత మంది నాయకులు నియంతల్లా వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిత్యవసర వస్తువల ధరలు ఆకాశాన్ని తాకడంపై శత్రుఘ్న సిన్హా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కందిపప్పు ధర కేజీ రూ.200 చేరుకోవడంపై నిరసన తెలిపారు. ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ఉల్లి ధర సామాన్యుడిని ఎంత కలవరానికి గురి చేసిందో సిన్హా ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం సిన్హా ట్విట్ట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ హీరోలతో బీజేపీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శత్రుఘ్న సిన్హాను మాత్రం పార్టీ పక్కన పెట్టింది. దీనిపై ఆయన ఆ పార్టీ నేతలపై ఒకింత ఆగ్రహాంతో ఉన్నారు. బీహార్‌లో రెండో విడత పోలింగ్ అక్టోబర్ 16వ తేదీన జరగగా... ఆదే రోజు బాక్సర్, పాలిగంజ్, వైశాలీలో ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించవలసి ఉంది. అయితే ఆ ర్యాలీలు చివరి నిమిషంలో రద్దు అయింది. మూడో విడత పోలింగ్ 28వ తేదీన ఆయా ప్రాంతాల్లో జరగనుంది. ఇంత ముందుగా ర్యాలీ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నాయకత్వం భావించి... ఈ ర్యాలీలు రద్దు చేసినట్లు సమాచారం. -
క్లైమాక్స్ మిస్సయింది!
హ్యూమర్ ఫ్లస్ ఈ సంవత్సరం చేపల చెరువుల మీద గుర్నాధానికి భారీ నుంచి అతి భారీ లాభాలు వచ్చాయి. ఈ సంతోషంలో తన చిరకాల కోరిక ఒకటి గుర్తుకు వచ్చింది. సినిమా తీయాలనేది అతని చిన్నప్పటి కోరిక. తాను అమితంగా ఇష్టపడే ‘మిస్సమ్మ’ సినిమాను రిమేక్ చేయాలనుకొని రంగంలోకి దిగాడు. తన స్వగ్రామం పేరునే తన నిర్మాణ సంస్థకు పెట్టుకొని మురిసిపోయాడు.‘మునుగుడు పాలెం టాకీస్’....అబ్బో అదిరిపోయింది అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు. థాయ్‌లాండ్‌లోని ‘షంగ్రీ-ల’ బీచ్ హోటల్లో స్టోరీ డిస్కషన్‌ను మొదలైంది. దీనికోసం హైదరాబాద్, అమరావతి ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద రచయితలను, పెద్ద రచయిత కావాలనుకుంటున్న చిన్న రచయితలను, పనిలో పనిగా ఘోస్టు రచయితలను కూడా తీసుకువచ్చాడు గుర్నాధం. ‘‘మిస్సమ్మ సినిమానే కదా మనం రిమేక్ చేస్తుంది. దీనికి స్టోరీ డిస్కషన్ ఎందుకు? కథను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీస్తేనే మంచిది’’ అన్నాడు సీనియర్ రచయిత కళ్లజోడు సవరిస్తూ. ‘‘ఉన్నదున్నట్లు తీస్తే రీమేక్ చేయడం ఎందుకు? పాత సినిమానే మళ్లీ విడుదల చేస్తే సరిపోతుంది. మన స్టైల్లో కథ ఉండాలనే ఈ స్టోరీ డిస్కషన్ ఏర్పాటు చేశాను’’ అన్నాడు రాబోయే కాలంలో కాబోయే టాప్ ప్రొడ్యూసర్ గుర్నాథం. మొదట యువ రచయిత ఇడ్లీ ఈశ్వర్నాథ్ కథ చెప్పడం మొదలు పెట్టాడు... ‘‘పాత మిస్సమ్మ సినిమాలో చిన్నప్పుడు సావిత్రి మిస్ అవుతుంది. మన సినిమాలో మాత్రం హీరో చిన్నప్పుడు పుష్కరాల్లో మిస్ అవుతాడు. ఇక అప్పటి నుంచి అతని పేరు మిస్సయ్యగా స్థిరపడిపోతుంది. మిస్సయ్య కోసం కోటీశ్వరుడైన అతని తండ్రి ప్రకాశ్‌రాజ్ వెదకని చోటు ఉండదు. పదహారు సంవత్సరాల తర్వాత... మిస్సయ్య ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాడు. ‘మిస్సయ్య...మోస్ట్ వాంటెడ్’ ప్రకటన చూసి ‘నేనే మిస్సయ్యను’ అంటూ ఒకడు వస్తాడు. ఎడమకాలు మీద చింతగింజంత పుట్టుముచ్చ చూసి, తన కొడుకే అని డిసైడై పోయి ఆనందంలో మునిగిపోతాడు ప్రకాశ్‌రాజ్. కథలో ట్విస్ట్ ఏమిటంటే, నెల తిరిగే లోపే ‘వాడు మిస్సయ్య కాదు...నేనే అసలు మిస్సయ్యను’ అంటూ డజను మంది మిస్సయ్యలు వస్తారు. పుట్టుమచ్చలు సేమ్ టు సేమ్. ప్రకాశ్‌రాజ్ తల పట్టుకుంటాడు. అసలు మిస్సయ్య ఎవరు అనేదే క్లైమాక్స్’’ ‘‘బానే ఉందిగానీ, ఆ ఒరిజినల్ మిస్సయ్యను ఎలా కనిపెట్టారు అనేది నువ్వే చెబితే ఓ పనై పోతుంది’’ అన్నాడు సీనియర్ రచయిత విసుగ్గా. ‘‘మీరు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు రాశారు కదా...మీరు చెబితేనే బాగుంటుంది’’ అని బాంబును సీనియర్‌పై వేసి చేతులు దులుపుకున్నాడు జూనియర్. వారం రోజుల పాటు క్లైమాక్స్ కోసం చర్చలు జరిగాయి...నో ఫలితం! నిర్మాత గుర్నాధానికి చిర్రెత్తిపోయింది.‘‘మీరెవరూ వద్దయ్య...హాలివుడ్ ఫేమస్ స్క్రీన్‌ప్లే రైటర్ డేవిడ్ రాబ్సన్ డూప్సన్ను పిలిపిస్తున్నాను. పోతే పోయింది డబ్బు!’’ అని అన్నంత పని చేశాడు నిర్మాత.డబ్బు కట్టలు బ్యాగులో సర్దుకుంటూ ‘‘కథ ఏంటి?’’ అని అడిగాడు రాబ్సన్ డూప్‌సన్. నిర్మాత టకటకమని కథ చెప్పి...‘‘గంటలో స్క్రీన్‌ప్లే చెప్పేస్తారని మీకు పేరు. మా సినిమా క్లైమాక్స్ కోసం మాత్రం ఎంత టైమ్ తీసుకున్నా ఫరవాలేదు’’ అన్నాడు గుర్నాథం. ‘‘అయిదు నిమిషాల్లో చెప్పేస్తా...నీకేమైనా అభ్యంతరమా?’’ పొడవాటి సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు డూప్‌సన్. ‘‘అంత కంటే భాగ్యమా’’ మెలికలు తిరిగాడు గుర్నాథం. ‘‘వెరీ సింపుల్...ఇప్పుడు ఎలా అనుకున్నారో అలాగే సినిమా తీసి విడుదల చేయండి. దీనికి ‘మిస్సయ్య...ది బిగినింగ్’ అని పేరు పెట్టండి. శుభం కార్డుకు బదులు... అసలైన మిస్సయ్య ఎవరో పార్ట్-2 ‘మిస్సయ్య...ది కన్‌క్లూజన్’లో చూడండి అని వేయండి. సినిమా హిట్ అయితే పార్ట్-2 గురించి, క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం. హిట్ కాకపోతే మాత్రం వేరే సినిమా గురించి ఆలోచిద్దాం’’ అని టైమ్ చూసుకున్నాడు డూప్‌సన్. తన టైమ్ బాగలేదని డిసైడైపోయాడు గుర్నాథం! -
వ్యవసాయదారుల చిత్రం 49ఓ
వ్యవసాయం, వ్యవసాయదారుల ఇతివృత్తంగా తెర కెక్కించిన చిత్రం 49ఓ అని ఆ చిత్ర కథానాయకుడు గౌండ్రమణి తెలిపారు. నిర్మాత శివబాలన్ నిర్మించిన ఈ చిత్నానికి ఆరోగ్యన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల తరువాత సీనియర్ హాస్యనటుడు గౌండ్రమణి కథానాయకుడిగా రీఎంట్రీ అవుతున్న చిత్రం 49ఓ. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. కాగా సంగీత దర్శకుడు కే సంగీతబాణీలు కట్టిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు సత్యరాజ్, శివకార్తికేయన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో గౌండ్రమణి మాట్లాడుతూ ఐటమ్ సాంగ్స్, ఆరు ఫైట్స్, పాటలు అంటూ చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో వ్యవసాయం గురించి చిత్రం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత శివబాలన్‌ను అభినందించాలన్నారు. వ్యవసాయం, వ్యవసాయదారులు లేకుంటే ఈ లోకమే లేదు అని చెప్పే చిత్రమే 49ఓ అని వివరించారు. అలాంటి వ్యసాయాన్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నారన్నారు. కొందరు రియల్టర్లు వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద కట్టడాలను కట్టేస్తున్నారన్నారు. అలాంటి వారికి పంట భూముల్ని విక్రయించవద్దు అని హితవు పలికారు. రైతులు కొందరు వ్యవసాయం లాభించడం లేదని పొలాలను అమ్ముకుంటున్నారని తెలిపారు. ఒక ఏడాది పంటలు పండకపోయినా మరో ఏడాది పండుతాయని, పొలాల్ని అమ్ముకోవద్దని చెప్పే చిత్రం 49ఓ అని తెలిపారు. -
నారాయణమూర్తి సినిమాలో గద్దర్
-
బాబుకు ప్రత్యేక హోదాపై శ్రద్ధ లేదు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలపై చూపిన శ్రద్ధ ప్రత్యేకహోదా సాధనపై చూపించడం లేదని ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీనటుడు శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేకహోదా సాధన సమాఖ్య సమావేశంలో సినీనటుడు శివాజీ మాటాడారు. ప్రజలు నమ్మి చంద్రబాబుకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. సమస్యలను పూర్తి గా పక్కన పెట్టేసి పదవుల కోసం పబ్బం గడుపుకోవడం తప్పితే చేసిందేమి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతి పక్షం మాట్లాడితే సీబీఐ కొరడా తీస్తున్నారని ఆరోపించారు. హోదా సాధనకు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పైనా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ధర్నాకు సాధన మద్దతు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్సీపీ వచ్చే నెల 10న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు కేంద్ర హామీల సాధన సమాఖ్య మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఎఫ్ఐ చేపట్టిన బస్సు యాత్రకు పూర్తి మద్దతు పలికారు. వచ్చే నెల 5న ఏలూరులో తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అడ్హాక్ కమిటీ ఎన్నిక..: ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా సినీనటుడు శివాజీ ఎన్నికయ్యారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఆంధ్రమేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సదాశివరెడ్డిలను ఎన్నుకున్నారు. తన సహా ఏపీలోని విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీలతో పాటు రైతు, ప్రజా, కుల సంఘాల నేతలందరూ కన్వీనర్లుగా ఉంటారని కారెం శివాజీ వెల్లడించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ట్రైలర్: స్టీవ్ జాబ్స్ నిడివి: 2 ని. 40 సె. హిట్స్: 28,70,219 స్టీవ్ జాబ్స్‌పై బయోగ్రఫికల్ డ్రామా ఫిల్మ్ వస్తోంది. అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ ‘స్టీవ్ జాబ్స్’ చిత్రానికి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయెల్ దర్శకత్వం వహించారు. జర్మన్-ఐరిష్ నటుడు మైఖేల్ ఫాస్బెండర్ స్టీవ్ జాబ్స్‌గా నటించారు. ‘‘ట్రైలర్లో మైఖేల్‌ను చూస్తే అచ్చంగా స్టీవ్ జాబ్స్‌ను చూస్తున్నట్లుగానే ఉంది’’ అంటున్నారు సినీ విశ్లేషకులు. ట్రైలర్లో వినిపిస్తున్న డైలాగులు ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి రేపుతున్నాయి. డ్యాన్స్ వీడియో: చానింగ్ టటమ్ నిడివి: 30 సె. హిట్స్: 23,52,261 హాలీవుడ్ డ్యాన్స్ ఫిల్మ్ ‘సెట్ అప్’తో నటుడు, నృత్యకారుడు చానింగ్ టటమ్కు వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. అతని నృత్యరీతులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అభిమానులు అతడిని ‘మెగాస్టార్’ అని, ఈ కాలపు ‘జెన్ కెల్లీ’ అని కూడా అంటున్నారు. చానింగ్ సరికొత్త నృత్యరీతుల వీడియో యూట్యూబ్‌లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకండ్లలో 7 డ్యాన్స్ స్టెప్లు వేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు చానింగ్. ట్రైలర్: ఆల్ ఈజ్ వెల్ నిడివి: 2 ని. 49 సె. హిట్స్: 15,13,813 ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో రానున్న ‘ఆల్ ఈజ్ వెల్’ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆగస్ట్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో రిషి కపూర్, అభిషేక్ బచ్చన్లు తండ్రీ కొడుకులుగా నటించారు. ఉమేశ్ శుక్లా సినిమాలో బోలెడు కామెడీ ఉంటుంది. నవ్విస్తూనే మనల్ని ఆలోచనల్లోకి తీసుకువెళతాడు దర్శకుడు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆల్ ఈజ్ వెల్’. ఈ డైలాగ్‌లాగే సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది చూద్దాం. ట్రైలర్: క్యాలెండర్ గర్ల్స్ నిడివి: 1 ని. 31 సె. హిట్స్: 2,16,837 నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో మాధుర్ బండార్కర్ దిట్ట. ఈ దర్శకుడు ఇప్పుడు ఫేమస్ క్యాలెండర్లకు పోజులు ఇచ్చే మోడల్స్‌పై ‘క్యాలెండర్ గర్ల్స్’ సినిమా తీశాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో గ్రౌండ్‌వర్క్ చేశాడట. క్యాలెండర్ మోడల్స్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సినిమా ప్రతిబింబిస్తుంది. బికినీలతో నిల్చున్న అందాల బొమ్మల పోస్టర్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది. టీజర్: స్నోడెన్ నిడివి: 1 ని. 27 సె. హిట్స్: 3,25,687 లూకె హర్డింగ్ ‘ది స్నోడెన్ ఫైల్స్’ పుస్తకం ఆధారంగా ఇప్పుడు ‘ది స్నోడెన్’ పేరుతో హాలివుడ్ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఆలివర్ స్టోన్ దర్శకత్వం వహించారు. ‘ది స్నోడెన్’కు సంబంధించి తాజా టీజర్లో ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. అమెరికా జాతీయ జెండా మాత్రం కనిపిస్తుంది. జెండాపై ఉన్న తెలుపు భాగంలో ‘నిఘా నీడలో... అందరికీ న్యాయం, స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ ఒకటి ఆకర్షణీయంగా మెరుస్తుంటుంది. ట్రైలర్: మసాన్ నిడివి: 2 ని. 32 సె. హిట్స్: 12,01,474 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మసాన్’ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. దర్శకుడు నీరజ్‌కు ఇది తొలి సినిమా. ఒక చిన్న పట్టణంలో నలుగురు సాధారణ వ్యక్తుల జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. రీచా చద్దా అభినయానికి మంచి పేరు వస్తోంది. సామాజిక వాస్తవాల ఆధారంగా మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నాడు నీరజ్. ‘మసాన్’కు ఇప్పటికే మీడియాలో మంచి ప్రచారం లభించింది. సినిమా జూలై 24న విడుదల కానుంది. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: రాజ్‌బబ్బర్ (నటుడు); ముకేష్ ఖన్నా (టీవీ, సినీ నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఇది ల్యాండ్ మార్క్ ఇయర్‌గా చెప్పవచ్చు. వీరికి ఈ ఏడాది నూతనోత్సాహం, ధైర్యం, తెగువ, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహం, కొత్త పరిశ్రమలు, కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వాటి వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కష్టపడి పని చేయాలనే మనస్తత్వం ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి, అదృష్టం కలిసి వస్తాయి. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్ఠలతోపాటు సన్మానాలు జరుగుతాయి. అయితే అహంభావం వృద్ధి చెందటం వల్ల సన్నిహితులు, స్నేహితులు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల సంయమనంతో వ్యవహరించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5,9; లక్కీ డేస్: మంగళ, బుధ, ఆదివారాలు; లక్కీ కలర్స్: గ్రీన్, రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్. సూచనలు: ఆదిత్య హృదయ పారాయణం చేయడం, లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, శివారాధన, నేత్రదానాన్ని ప్రోత్సహించడం, వృద్ధాశ్రమంలో సేవ చేయడం - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
ప్రత్యేక హోదా ప్రజల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి అధ్యక్షతన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా - రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశంతో కలిసి 8 జిల్లాలకు తొలుత ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే విజయవాడ, విశాఖపట్టణం లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతాయన్నారు. దీని వలన మళ్లీ కోస్తా ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది తప్ప రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, పీసీసీ అధ్యక్షుడు ఇలా అందరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులే ఉన్నప్పటికీ రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారం వద్దు.. అభివృద్ధి కావాలన్నది కోస్తా ప్రాంతం వారి నినాదమన్నారు. సీమ ప్రాంతం నాయకులు మాత్రం అధికారం కోసం అభివృద్ధి అక్కడే చేస్తామంటుండటం శోచనీయమన్నారు. కోస్తాంధ్రతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి అయ్యేవరకు ఈ ప్రాంతాలకే నిధులు కేటాయించాలన్నారు. ఇతర విద్యాసంస్థలు, వైద్యశాలలతో పాటు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని, ఎయిమ్స్‌తో పాటు అన్ని రకాల సంస్థలను కోస్తా ప్రాంతానికే పరిమితం చేస్తున్నారన్నారు. రాజధాని అవసరాల కోసం పట్టిసీమను నిర్మిస్తున్నారన్నారు. బయటకు మాత్రం సీమకు నీటిని అందించేందుకు అని చెబుతున్నా అందులో కోస్తా వారి ప్రయోజనాలే దాగి ఉన్నాయన్నారు. పట్టిసీమ జీఓలో ఎక్కడా రాయలసీమకు సంబంధించిన అంశం లేదన్నారు. రాత పూర్వకంగా హక్కు లేకుంటే రాబోయే రోజుల్లో ఏవిధంగా పట్టిసీమపై హక్కు ఉంటుందన్నారు. పట్టిసీమ నిర్మాణంరాయలసీమ ప్రజల నోట్లో దుమ్ముకొట్టడానికేనని విమర్శించారు. రాయలసీమను ఎందుకు అభివృద్ధి చేయాలి.. ఓట్లు వేసిన కోస్తా ప్రాంతానికే మేలు చేస్తానని ముఖ్యమంత్రి అనడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని, పాలకులు ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్‌లో చేసిన తప్పును పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడింది రాయలసీమ ప్రాంతవాసులైతే.. ఫలాలు పొందింది మాత్రం కోస్తావారన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులని మళ్లీ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని వెనక్కి వెళ్లమంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చామన్నారు. నేడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేయాలన్నారు. యువత సైతం పదవులు ఆశించకుండా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది రాష్ర్ట ప్రజల హక్కు అని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు సీఎంగా పని చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలక, ప్రతిపక్షం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఉద్యమం గురించి పట్టించుకోకుండా ఉంటే తనకు ఇప్పటికే పదవి వచ్చి ఉండేదని, దానిని కాదనుకుని ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజల్లో చైతన్యం నింపడానికి పోరుబాట పట్టానన్నారు. ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రత్యేక హోదాపై అఖిల పక్షం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఏడాది గడిచినా ఇపుడు దాని గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీకి పంపి ప్రత్యేకహోదాను సాధించాలన్నారు. దీనికి అవసరమైతే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి సాధించుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యలపై సినీనటుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా స్థానిక బీజేపీ నాయకుడు సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి అడ్డుచెప్పారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని లక్ష్మణ్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండించడం తగదని వాగ్వాదానికి దిగారు. దీంతో సినీనటుడు శివాజీ తనకు ప్రాంతీయ భేదాలు లేవని చెప్పారు. తాను పుట్టింది గుంటూరులో అని ఇల్లు తిరుపతిలో కట్టుకున్నానన్నారు. హైదరాబాద్‌లో సైతం తనను ఆదరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పి. ప్రతాప్‌రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు శివనాయక్, రంగనాథరెడ్డి, ఆర్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఆర్ఎస్యూ, ఆటోయూనియన్ నాయకులు జాకీర్, షరీఫ్, ఐఎస్ఎఫ్ నాయకులు గంగిరెడ్డి, తరుణ్‌కుమార్, రాజ, సిద్ధయ్య, శ్రీనివాసులు, సందీప్, అజీమ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకహోదాపై మహానాడులో ఎందుకు తీర్మానం చేయలేదు? రాష్ట్ర విభజనకు సీపీఎం తప్ప అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా అంగీకరించాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు. చిత్తశుద్ధి వుంటే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రత్యేకహోదాపై ఎందుకు తీర్మానం చేయలేదు? ప్రత్యేకహోదా వస్తేనే అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివదిృ చెందుతుంది. 90 శాతం గ్రాంట్ల రూపంలో నిధులు వచ్చే అవకాశం ఉంది కనుక విభజన చట్టంలోని అన్ని అంశాలను ఐక్యంగా సాధించుకోవాలి. - రవిశంకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజ్యాంగ సవరణ చేసైనా ప్రత్యేకహోదా కల్పించాలి ప్రత్యేకహోదా విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ సవరణ చేసైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి. వందల సార్లు రాజ్యాంగ సవరణ చేసిన నాయకులు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే సవరణ చేసి హోదాను ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయన్నాయి. శివరామకృ్ణన్ కమిటీ చెప్పిన విధంగా అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కడప -
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
-
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి రైల్వేకోడూరు, అర్బన్ : రైల్వేకోడూరు ప్రజల అభిమానాన్ని తాను మరవలేనని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. శనివారం ఆయన పట్టణంలోని శివాలయం సర్కిల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2010లోనే ఈ విగ్రహాన్ని చిరంజీవి చేతులమీదుగా ఆవిష్కరించాలని నిర్వాహకులు భావించారు. చిరంజీవికి సమయం లేకపోవడంతో ఎట్టకేలకు శనివారం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన పట్టణంలో అభిమానులకు అభివాదం చేస్తూ విగ్రహం వద్దకు వచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు పరిపాలనాధ్యక్షుడని ఆయన పరిపాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉండేదన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలన్నారు. అభిమానుల కోరిక మేరకు తన 150వ సినిమాను ఆగస్టులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా హాజరైన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
సమ్మరమే
సినిమాకి హీరో దేవుడంతటివాడు... కాదు... దేవుడే! హీరోని ఏ వరం అడిగినా ‘ఓకే టేకిట్’ అంటాడు బోళాశంకరుడిలా! అందుకే అతగాడు హీరో. ఈ ఎండాకాలంలో హీరోని ఇండస్ట్రీ ఏమి అడుగుతుంది? చల్లని హిట్ ఇవ్వు స్వామీ అని వేడుకుంటుంది. ఇస్తారా? ఇవ్వకపోతే సమ్మర్లో మాడి మసైపోతుంది ఇండస్ట్రీ. దట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అవర్ హీరో ఈజ్ ఫేసింగ్! ఈ సమ్మర్లో హీరోగారు సప్తసముద్రాలు దాటి విలన్ని పంచ్‌లు కొట్టి, హీరోయిన్ మీద పంచ్‌లు విసిరి, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ టైమ్‌ని పటాపంచ్‌లు చేసి హిట్ కొడతాడా? అన్నదే క్లైమాక్స్ సీన్. 150 కోట్ల లాసులు... 500 కోట్ల స్టేకులు... 8 వీక్స్ టైము... దేఏఏఏవుడా! ఇరవై సినిమాలు... 500 కోట్లు... కేవలం అరవై రోజులు!! మే నెల సెకండాఫ్ నుంచి జూలై ఫస్టాఫ్ దాకా రెండు నెలల కాలంలో వచ్చే సినిమాల రిజల్ట్‌తో ఇండస్ట్రీ భవిష్యత్తు ముడిపడి ఉంది. బాలకృష్ణ ‘లయన్’ మొదలు గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ దాకా పదుల కోట్ల పెట్టుబడితో, ప్రతిష్ఠాత్మకంగా తయారైన అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మీడియమ్ రేంజ్ సినిమాలు సహా 20 కొత్త చిత్రాలు పలకరించనున్నాయి. ఒక్కముక్కలో పణంగా ఒడ్డుతున్న 500 కోట్ల సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ వసూళ్ళ వర్షం కోసం ఎదురుచూస్తోంది. సక్సెస్ దాహార్తిలో సినిమా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తెలుగులో ‘యూనివర్సల్ హిట్స్’ ఎన్ని అంటే, వెతుక్కోవాల్సి వస్తోంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాలు మూడింటికీ తృప్తినిచ్చిన సినిమాగా కల్యాణరామ్ ‘పటాస్’ రీజనబుల్‌గా పే చేసింది. డబ్బింగ్‌ల సంగతికొస్తే - కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ఇటీవలి లారెన్స్ ‘గంగ’ డబ్బులు తెచ్చాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ‘‘గత డిసెంబర్లో వచ్చిన రజనీకాంత్ ‘లింగ’ నుంచి వరుస ఫ్లాపులే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అతను డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన ఫైనాన్షియర్ - ఇలా అందరూ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కష్టాల్లో ఉన్నారు. ఒక్క మాటలో తెలుగు సినిమా ‘ఫైనాన్షియల్ స్లంప్’లో ఉంది. ఇండస్ట్రీకిప్పుడు మంచి హిట్ రూపంలో టానిక్ కావా’’లని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు వ్యాఖ్యానించారు. ఫస్టాఫ్‌లో... గత ఏడాదే బెటర్! లాస్ట్ ఇయర్ ఫస్ట్‌హాఫ్ ఇంత దారుణంగా లేదు. మహేశ్‌బాబు ‘1’ లాంటివి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ‘లెజెండ్’, ‘రేసుగుర్రం’ లాంటి బాక్సాఫీస్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడింది. ‘‘ఫ్లాపులొచ్చినా, కొన్ని సూపర్హిట్లు, కొన్ని సక్సెస్‌లతో గత ఏడాదే బ్యాలెన్స్ అయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా రూ. 125 కోట్ల పైగా నష్టపోయాం. పరిశ్రమ బ్యాడ్షేప్లో ఉంది’’ అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే, టాలీవుడ్‌కి ఇది చాలా క్లిష్టమైన కాలం. రానున్న రెండు నెలల్లో సగటున ప్రతి పది రోజులకూ ఒక భారీ చిత్రం రానుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న డిఫరెంట్ జానర్ చిత్రాలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ మీద ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి. అందరి కళ్ళూ అటువైపే! ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి, ఇంకా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, ఈ చిత్రాల నిర్మాణ వ్యయం, వ్యాపారం వగైరా గురించి ఎవరూ కచ్చితమైన గణాంకాలు చెప్పలేకపోతున్నారు. అయితే, సినీవ్యాపార వర్గాల అంచనా ప్రకారం కేవలం ఈ రెండు సినిమాల మీదే దాదాపు రూ. 200 నుంచి 260 కోట్ల పైచిలుకు సొమ్మును పణంగా ఒడ్డుతున్నారు. ‘‘ఒక సగటు భారీ తెలుగు సినిమాకయ్యే ఖర్చు కన్నా రెట్టింపు వ్యయంతో ‘బాహుబలి’ తయారవుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీదే వంద కోట్ల పైగా స్టేక్ ఉంటుంది’’ అని సినీ వ్యాపారంలో మూడు దశాబ్దాల పైచిలుకు అనుభవజ్ఞుడు ఒకరు వివరించారు. అలాగే, కాకతీయ వీరనారి రుద్రమదేవి చారిత్రక గాథ ఆధారంగా గుణశేఖర్ తీస్తున్న తొలి తెలుగు స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ కూడా 60 కోట్ల పైచిలుకు పెద్ద పందెం. ఇక, మహేశ్‌బాబు, రవితేజ, రామ్, కల్యాణరామ్ లాంటి పేరున్న హీరోలు, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ అరవై రోజుల సినీ మారథాన్‌లో కీ-ప్లేయర్స్. అందుకే, ఏలూరుకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్. అన్నట్లు, ‘‘ఈ రెండు నెలల్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రాలు అటు ప్రేక్షకులకూ, ఇటు పరిశ్రమకూ కొత్త ఎనర్జీని ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతుంది.’’ అది ‘లయన్’తో మొదలవుతుందనీ, వరుస హిట్లతో ఈ రెండు నెలల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనీ పరిశ్రమ వర్గీయుల ఆశ. స్పెక్యులేటివ్ బిజినెస్ అయిన సినిమా పయనించేది ఎప్పుడూ ఇలాంటి ఆశల గుర్రం మీదే కదా! - రెంటాల జయదేవ హై స్టేక్స్ బాక్సాఫీస్ జూదం పెట్టినఖర్చు, చేస్తున్న వ్యాపారం, ప్రింట్స్, పబ్లిసిటీ కలుపుకొని, పరిశ్రమ భారీగా పణం ఒడ్డుతున్న చిత్రాల్లో కొన్ని... బాహుబలి: *150 - 200 కోట్లు (అన్ని భాషల్లో కలిపి) (జూలై 10న) రుద్రమదేవి: *60 కోట్లు (జూన్) మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’: 60 కోట్లు (జూలై 17 రిలీజ్) లయన్: *35 కోట్లు (మే 14) రవితేజ ‘కిక్2’: *45 కోట్లు (జూన్) రామ్ ‘పండగ చేస్కో’: 22-25 కోట్లు (మే 29) కల్యాణ్‌రాం ‘షేర్’: *20 కోట్లు (జూన్) చార్మి ‘జ్యోతిలక్ష్మీ’: *12 కోట్లు (జూన్) సందీప్ కిషన్ ‘టైగర్’: *7.5 కోట్లు (మే 22) అల్లరి నరేశ్ ‘జేమ్స్‌బాండ్’: *8-10 కోట్లు (జూన్) మోసగాళ్ళకు మోసగాడు: *6-7 కోట్లు (మే 22) సూర్య ‘రాక్షసుడు’: *14 కోట్లు (మే చివర) నాగశౌర్య ‘జాదూగాడు’: *4 కోట్లు (జూన్) ఈ అంకెలన్నీ సినీ వ్యాపార వర్గాల భోగట్టా సెలవుల సీజన్ వేస్ట్ చేశారు! ‘‘ఇవాళ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేక, ఈ వేసవి సెలవుల సీజన్‌ను చాలా వృథా చేశారు. తీరా వేసవి సెలవులైపోతుండగా, ఇప్పుడు పెద్ద సినిమాల సీజన్ మొదలవుతోంది. ఈ సినిమాల విజయం మీదే కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉంది.’’ - సత్య రంగయ్య, ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ఎవరి దగ్గరా డబ్బులు లేవు! ‘‘ఈ ఏడాది ఇప్పటి దాకా డిజప్పాయింట్మెంటే! ఓవర్ బడ్జెట్ వల్లే ఫ్లాపవుతు న్నాయి. ఎగ్జిబిటర్స్ డబ్బుల్లేక, ఫుల్ పేమెంట్ చేయడం లేదు. దాని మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టడం లేదు. దాంతో ప్రతి రిలీజ్‌కూ కష్టమే.’’ - తేజ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, దర్శక, నిర్మాత -
పొగను పొమ్మంటున్నారు...
సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్తే.. ‘ఈ నగరానికి ఏమైంది..’ అంటూ ప్రకటనలు, సిగరెట్ డబ్బా కొంటే.. దానిపై పొగచూరిన ఊపిరితిత్తులు.. మొత్తానికి ధూమపానం అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం.. ధూమపానాన్ని మనవాళ్లు కాస్త దూరంగా ఉంచుతున్నారని తేలింది. పాన్, గుట్కా, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులతో పోలిస్తే.. సిగరెట్ల విషయంలో ప్రజలు కాస్త సీరియస్‌గా ఆలోచించడం మొదలైందని సర్వే సారాంశం. గ్రామీణ భారతం, పట్టణ భారతం వారీగా చేసిన సర్వే ఫలితాలు సిగరెట్ సమస్యకు ప్రజలు చెక్ పెడుతున్నారని తెలిపాయి. యావత్ భారతంలో పొగాకు ఉత్పత్తుల కోసం వెచ్చించే మొత్తం పెరిగింది. ఇదే సమయంలో పెరుగుదల నిష్పత్తి కొంత తగ్గడం గుడ్డిలో మెల్ల. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) డాటా ప్రకారం 2004-05 గ్రామీణ భారతం నెల వారీగా పొగాకు ఉత్పత్తులపై రూ.15.09 ఖర్చు చేస్తే.. అదే సమయంలో పట్టణ భారతం రూ.16.84 పొగాకుపై తగిలేసింది. ఇక 2009-10కి వచ్చే సరికి ఈ ఖర్చు గ్రామీణ భారతంలో రూ.20.41 ఉంటే, పట్టణ భారతంలో రూ.21.43గా నమోదైంది. అయితే గతంతో పోలిస్తే సిగరెట్లపై ఖర్చు చేసే మొత్తం నిష్పత్తి కొంత తగ్గిందని తెలిసింది. ఈ లెక్కన పొగచూరిన బతుకులు తమకొద్దనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం.. ఆహ్వానించదగ్గ పరిణామం. -
హాలీవుడ్లో... బొమ్మల బాపు
సినిమా స్క్రిప్ట్‌ల్లో బాపు సినిమా స్క్రిప్ట్ ప్రత్యేకమైనది. ఇంచక్కా ప్రతి సన్నివేశానికి బొమ్మలు వేసి స్క్రిప్టు బుక్‌లో ముందే సినిమా చూపిస్తారు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే బొమ్మలతో స్క్రిప్ట్‌లు తయారు చేసుకుంటారు. ‘ఇన్సెప్షన్’ నుంచి ఇటీవలి ‘ఇంటర్స్టెల్లార్’ చిత్రాల దాకా హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈ దిగ్దర్శకుడు కూడా స్క్రిప్ట్‌ను స్కెచ్‌లుగా మార్చే కళాకారుడే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్రైబె కా చిత్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టఫర్ మాట్లాడుతూ ‘‘మూలకథ కూడా రాసుకోను. అంతా స్కెచ్ వర్కే ఉంటుంది. దీంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇదే నా శైలి. నా ‘మెమొంటో’ చిత్రానికి మాత్రమే స్క్రిప్ట్ రాసుకున్నాను. మిగతా వాటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ వేసుకున్నా’’ అని చెప్పారు. -
భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు! - పూరి జగన్నాథ్
‘‘మగాడు, ఆడది ఇద్దరూ ఒకరు లేకుండా ఒకరు బతకలేరు. ఇద్దరూ కలిసి అస్సలు బతకలేరు. అందుకే ఇక భవిష్యత్తులో పెళ్లిళ్లు అనేవి ఉండవు. ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నందు, ఐనెకా సోటీ జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘365 డేస్’. డీవీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంక టేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ- ‘‘ఒక జంట భావోద్వేగాల ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా అభిప్రాయాన్నే రాశాను. చాలా మంది అడుగుతూ ఉంటారు.. నీ పెళ్లి ఎందుకు ఫెయిలైందని. నా సమాధానం ఒక్కటే . నాకు మంచి భార్య దొరికింది. నా భార్యకు మాత్రం చెడ్డ భర్త దొరికాడు. అదే కారణం. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఎలాంటి క్రైమ్ లేని చిత్రం’’ అన్నారు. ఈ వేడుకలో రామ్‌గోపాల్‌వర్మ తల్లి సూర్యవతి, వీవీ వినాయక్, కోన వెంకట్, చార్మి, నందు, అనైకా సోటీ, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి
⇒ కష్టజీవుల పక్షాన నిలిచిన కానూరి తాత ⇒ సంస్మరణ సభలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి ఖమ్మం మయూరిసెంటర్ : కేంద్రంలో, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా కళాకారులు వ్యవహరించాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఖమ్మంలోని పోట్ల రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆవుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు సంస్మరణ సభను నిర్వహించారు. హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో కానూరి తాత వీరమరణం పొందారన్నారు. ఆయన 99 సంవత్సరాల కాలంలో ప్రజా సాంస్కృతిక కేంద్రాలకు జీవితాన్ని త్యాగంచేశారని అన్నారు. సినిమా జీవితం వందేళ్లయితే 75 ఏళ్లు సాంస్కృతిక రంగానికి సేవ చేశారన్నారు. ఏఎన్ఆర్, మిక్కిలినేని లాంటి ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడన పనిచేశారని, ఆయన కృష్ణా జిల్లాలోని ఒక దేవాలయంలో భజన పాటలు, కీర్తనల స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు పాడి ప్రజలను ఉత్తేజ పరిచారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇన్ని సంవత్సరాల పాటు కళారంగానికి సేవ చేసిన అరుదైన వ్యక్తి కానూరి తాత అని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి వస్తున్న సమయంలో కూడా ఆయన రాకకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కానూరి తాత పాల్గొన్నారని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. పేదలు ఎప్పుడైతే ప్రజా ప్రతినిధులు అవుతారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్న రాహుల్ గాంధీ వారి ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. చాయ్‌వాలా అని చెప్పుకునే ప్రధాని మోదీ విదేశీ పెట్టుబడి దారులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. దీంతో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, కృష్ణ మాట్లాడారు. తొలుత కానూరి చిత్రపటానికి ఆర్. నారాయణమూర్తి. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, రామారావు, కృష్ణ, నాయకులు సివై. పుల్లయ్య, బి. వెంకన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. విప్లవోద్యమ సాంస్కృతిక నేత అని అరుణోదయ కళాకారులు పాట లు పా డారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రచురించిన ప్రజా సాంస్కృతిక ఉద్యమకేతనం అనే పుస్తకాన్ని నారాయణ మూర్తి ఆవిష్కరించారు. -
ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్
రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్‌గా నిలుస్తున్న నేటి యువత సామాజిక స్పృహను కలిగించే చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటోంది. అలాంటి చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ‘ఎ షార్ట్ ఈవినింగ్ విత్ ఫిల్మ్స్-17’ పేరుతో ఆక్టోపస్ స్టూడియోస్ ఈ చిట్టి చిత్రాల ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. -
నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను
అవిశ్రాంతం -అరవై తర్వాత రాళ్లపల్లి వెంకట నరసింహారావు... ఇంత పొడవు పేరు చెబితే అయోమయం కలుగుతుంది. రాళ్లపల్లి... అనగానే చక్కటి ఉచ్ఛారణ, స్పష్టమైన హావభావాల వ్యక్తీకరణతో అనేక పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. నాటకరంగ నేపథ్యమే తనను ఇంత వరకు నడిపించిందని చెప్పే రాళ్లపల్లి ‘చెడ్డసినిమా ఉంటుందేమో కానీ చెడ్డ నాటకం ఉండదంటారు. రాబోయే ఆగస్టు 15వ తేదీతో డెబ్బైలోకి అడుగు పెట్టనున్న ఆయన అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవితాన్ని ‘అవిశ్రాంతం’గా మలుచుకున్న వైనం ఆయన మాటల్లోనే... ‘‘అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వృత్తిలో కొంత విరామం దొరికినట్లయింది. అప్పటి వరకు ఏడాదికి 365 రోజులు పని చేసిన స్థితి నుంచి నా పని వారానికి మూడు రోజులకే పరిమితమైంది. అది నేను తెచ్చుకున్న విరామం కాదు. ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రభావంతో వచ్చిన విరామం. విద్యార్థి అవతారమెత్తి ఆ ఖాళీని బిజీగా మలుచుకున్నాను. 2011లో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సులో చేరాను. డిస్టింక్షన్లో పాసయ్యాను కూడా. ఇప్పుడు ఎం.ఫిల్ చేస్తున్నాను. రిటన్ టెస్ట్ పూర్తయింది. థీసిస్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత పీహెచ్‌డి చేద్దామనుకుంటున్నాను. అరవై ఆరేళ్ల విద్యార్థి! ఇన్నేళ్లు నటించిన తర్వాత ఇంక నటన గురించి చదువుకోవడమేంటి- అని విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ, విద్యార్థిదశను ఆస్వాదించాను. ఈ తరం యువతతో కలిసి చదువుకోవడం నాకూ- వారికీ పరస్పరం ఉపయుక్తంగానే సాగింది. గతంలో సాంఘిక నాటకాలు రాసిన నేపథ్యం ఉండడంతో నటన, ఉచ్చారణ, అభినయం వంటి అంశాలలో పాఠాలు చెప్పగలిగినంత పట్టు వచ్చింది. ఏదైనా అంశం మీద ఉపన్యసించగలిగిన సామర్థ్యం అలవడింది. నాటకం చూడాలి లేదా చదవాలి! నా దైనందిన జీవితం ఎప్పుడూ ఉదయం ఐదూ ఐదున్నరకే మొదలవుతుంది. పూజ, ధ్యానం తర్వాత ఉపాహారం. ఏదైనా ఓ నాటకాన్ని తీసుకుని చదవడం, మిత్రులను సంప్రదించి నాటక ప్రదర్శన, సాధన గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాను. భోజనం తర్వాత ఓ అరగంట సేపు టీవీ చూస్తాను. సాయంత్రమైతే రవీంద్రభారతిలోనో, తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్లోనో ప్రదర్శించే నాటకాలకు ఆహ్వానాలు సిద్ధంగా ఉంటాయి. మూడు రోజుల కిందట కూడా జ్యోతిరావు ఫూలే మీద నాటకం చూశాను. 1966లో రాష్ట్రపతి భవన్లో రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ప్రదర్శించడం... వంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ విరామమే తగిన సమయం. నాటకానికి టికెట్టు కొనడమా! థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించే నాటకాలకు తప్పకుండా వెళ్తుంటాను. మిత్రబృందంతో కలిసి నాటకాలు ప్రదర్శిస్తుంటాను. నేను పదిసార్లు అమెరికాకు వెళ్లాను. ప్రతిసారీ ఏదో ఒక నాటకాన్ని చూసేవాడిని. మన దగ్గర టికెట్ కొని నాటకం చూసే అలవాటే లేదు. అలాగని నాటకానికి ఆదరణ తగ్గలేదు. కళాపోషకులు ఆసక్తి కొద్దీ ప్రదర్శిస్తే చూసే వాళ్లు మాత్రం ఉన్నారు. గత ఏడాది యాంకర్ ఝాన్సీ మొదలైన వాళ్లం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఒంగోలులో నాటక ప్రదర్శనకు రాత్రి తొమ్మిదికి మొదలైనా సరే ప్రేక్షకులు ఉన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే నాటకం ప్రధానస్రవంతిలోకి రావాలని కోరుకుంటూ పని చేసుకుపోవడం మా వంతు. ఇంకా నాటకాలు వేయడం వల్ల మేము నాటకరంగానికి చేస్తున్న మేలు ఏమీ ఉండదు. ఇదంతా మమ్మల్ని మేము పనిలో నిమగ్నం చేసుకుని సంతోషంగా ఉండడానికే. కళాకారులకు ప్రోత్సాహంగా... పేదరికంలో ఉన్న రంగస్థల నటులకు సన్మానం చేసి పదివేల నుంచి పాతిక వేల వరకు నగదు బహుమతినివ్వడం అనే ఓ వ్యాపకాన్ని పెట్టుకున్నాను. మిత్రుల సహకారంతో ఎనిమిదేళ్లుగా ఆగస్టు 15వ తేదీన నా పుట్టిన రోజు నాడు ఒకరికి బహుమతి ఇస్తున్నాను. మందుల వంటి కనీస ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి నా శక్తి కొద్దీ నేను అందిస్తున్న చిన్న ఆసరా. నాకు చేతనైంది నటించడం... నేర్పించడం నేను మూడు వేల నాటకాలు వేశాను, ఏడు వందలకు పైగా సినిమాలు చేశాను. నాకు చేతనైంది నటించడం, ఎలా నటించాలో నేర్పించడం, చక్కటి కథను ఆసక్తికరమైన కథనంతో తీర్చిదిద్దడం వంటివే. బహుశా అవే నన్ను అవిశ్రాంతంగా ఉంచుతూ నన్నింకా బతికిస్తున్నాయేమో! (నవ్వు) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు:రాజేశ్ రెడ్డి ముగింపు లేని కథ, మారని సంసారం, జీవన్మృతుడు నాటకాలను రాశారు. వరవిక్రయం నాటకాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాతికకు పైగా ప్రదర్శనలిచ్చారు. -
విలన్‌గా రాణించాలనే వచ్చా
హీరోగానూ పేరు రావడం అదృష్టం సినీనటుడు మోహన్‌బాబు విశాఖపట్నం: సినిమాల్లో విలన్‌గా రాణించాలనే కోరికతోనే తన ఊరి నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చానని సినీ నటుడు, నిర్మాత ఎం.మోహన్‌బాబు చెప్పారు. తనది మధ్యతరహా కుటుంబమని, పుట్టుకతో తనకు ఆస్తులు లేవని చెప్పిన ఆయన భగవంతుని దయతో సినీ రంగంలో విభిన్న పాత్రలు పోషించి హీరోగా, నిర్మాతగా ఎదిగానన్నారు. టీఎస్సార్ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి జీరో అయ్యానని... భగవంతుని దయతో ‘అల్లుడుగారు’ సూపర్ డూపర్ హిట్ అయి తనను హీరోగా, నిర్మాతగా నిలబెట్టిందన్నారు. కె.రాఘవేందర్రావు దర్శకత్వంలో దేవత, కొండవీటి సింహం, అల్లుడుగారులాంటి హిట్ చిత్రాలలో నటించానన్నారు. విలన్ కావాలని కోరుకున్నా హీరోగా కూడా ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు. హుద్‌హుద్ తుపాను కలచివేసింది హుద్‌హుద్ తుపాన్ తనను కలచి వేసిందని, విశాఖ ప్రజలను ఆదుకోవడానికి తనవంతు సాయంగా రూ.30 లక్షలు తన కుమారుడు మనోజ్‌కుమార్‌తో పంపించానని చెప్పారు. మనోజ్, అతని అభిమానులు ఆ డబ్బులతో బాధితులకు అవసరమైన సాయం అందించారని మోహన్‌బాబు చెప్పారు. తన విద్యాసంస్థల సిబ్బంది అందించిన ఒక నెల జీతాన్ని త్వరలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేస్తానన్నారు. త్వరలోనే తన ఇంజనీరింగ్ సంస్థ విద్యార్థులతో విశాఖలో అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమం చేపడతానన్నారు. -
అందమైన సందేశం
‘వీడు మరీ వయొలెంట్‌గా ఉన్నాడు. పువ్వులు, అమ్మాయిలను చూపించండర్రా...’ హీరోనుద్దేశించి ఓ సినిమాలో డైలాగ్. అమ్మాయిల విషయం పక్కకు పెట్టేస్తే... పువ్వులతో ప్రశాంతత కచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి సంగీతం, నాట్యం లాంటివి తోడైతే మనసు మరింత ఆహ్లాదంగా మారుతుంది. ఈ విషయాన్ని వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ చెబుతోంది. ఇటీవల బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన ‘యాన్ ఈవెనింగ్ ఆఫ్ జపనీస్ కల్చర్, ఇకెబెనా వర్క్‌షాప్’లతో నిత్యం బిజీగా ఉండే నగరవాసులకు ప్రశాంతతను చేకూర్చుకోవడమెలాగో చేసి చూపించింది.. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలనే కాన్సెప్ట్‌తో 1996లో వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ ఏర్పాటైంది. దీని వ్యవస్థాపకుడు దుబూమ్ తుల్కూ. టిబెటన్ అయిన ఈయన హర్యానాలో ఉంటున్నారు. మొదటి నుంచి సంస్కృతి, కళలను అభిమానించే దుబూమ్... వాటిని జీవన విధానానికి జోడించి ప్రశాంతంగా బతకడమెలాగో చెబుతున్నారు. అందుకే దేశమంతటా ‘ఇకెబానా, డ్యాన్స్ థీమ్స్’తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించే పని చేయకూడదు’ అంటాడాయన. ప్రకృతితో మమేకం ఒక్కో పువ్వుది ఒక్కో అందం. ఒక్కో ఆకుది ఒక్కో ఆకృతి. అందమైన ఆకులను, పరిమళించే పువ్వులను ఒక్కచోట చేర్చితే... వర్ణించడానికి మాటలు చాలవు. అదే ఇకెబెనా. ప్రకృతి ప్రతిబింబించేలా అమర్చే అందమైన కళ. ఫ్లవర్‌వాజ్ లేదా మరేదైనా ట్రే, పాత్రలో పూలను అందంగా అలంకరించే పద్ధతి. కేవలం అలంకరణే కాదు.. దాని ద్వారా ఆనందం పొందడమెలాగో చేసి చూపించారు జపాన్ కళాకారులు. మయూమీ మెజెకీ.. ఇకెబెనా ప్టైల్ నిపుణురాలు. 18 ఏళ్ల వయసులోనే ఇకెబెనా నేర్చుకున్న ఈమె... ప్రస్తుతం జపాన్‌లోని ఇకెబెనా స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యకుమోగోటో అనే సంగీత వాయిద్యాన్నీ అద్భుతంగా వాయిస్తుంటారు. ఇకెబెనా పూల అలంకరణ ద్వారా ఆనందం, అభినందనవంటి భావాలను వ్యక్తపరచొచ్చని చెప్పారామె. ‘పూల అలంకరణ అంటే మామూలే అనుకున్నాను. కానీ, ఇక్కడకు వచ్చాక తెలిసింది ఈ పని ద్వారా ఎంత ప్రశాంతత పొందవచ్చో’ అని ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఆంజనేయులు చెబుతున్నాడు. - నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
పీర్ పోరాటం
ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖ పేరు ఇబ్సెన్. ఆయన రాసిన నాటకాల ప్రభావం భారతీయ నాటక, సినిమా రంగాలపై నేటికి కనిపిస్తుంది. మోడ్రన్ డ్రామా ఆద్యుడైన ఇబ్సెన్ నాటకం ‘పీర్‌గింట్’ని 5 భాషలు, 5 రీతుల్లో నగరంలో ప్రదర్శించనున్నారు. ‘ఇబ్సెన్ బిట్వీన్ ట్రెడిషన్ అండ్ కాంటెంపర్నిటీ’ పేరుతో ఈ ఫెస్టివల్‌ని రాయల్ నార్వేజియన్ ఎంబస్సీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ‘పీర్’ ప్లేతో ఈ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. ఆధునిక నాటకాలకు ఆద్యుడు హెన్రిక్ ఇబ్సెన్. నార్వే జానపద కథను ఇబ్సెన్ ‘పీర్’ నాటకంగా మలిచారు. ఆ నాటకాన్ని క్లాసికల్, కాంటెంపరరీ, లోకల్, ఒరిజినల్... ఇలా రకరకాలుగా చూపించే ప్రయోగమే ఈ ఫెస్టివల్ థీమ్. పీర్‌గింట్ ప్లే ఇబ్సెన్ రాసిన ‘పీర్’కి అడాప్టేషన్. ఇబ్సెన్ రాసిన డైలాగులను అలాగే వుంచుతూ నేటి కాలమాన పరిస్థితుకు అనుగుణంగా నేటి తరానికి ఆయన నాటకాలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తోంది టీటర్జోకర్ అనే నార్వే థియేటర్ కంపెనీ. ఈ ఒరిజినల్ నాటకాన్ని ప్రదర్శించడానికి 4 గంటలు పడుతుంది. 2012లో జరిగిన ‘ఇబ్సెన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్’లో ప్రదర్శించడానికి నాటకాన్ని ఒక గంటకు కుదించి కొత్త తరహాలో రూపొందించారు. నాటి నుంచి నేటి వరకు నార్వేలో కొన్ని వందల సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం క్లుప్తంగా... తండ్రి దురలవాట్ల వలన ఆస్తి నష్టపోయిన కొడుకు పీర్. ఎలాగైనా పూర్వవైభవం పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సాగే కథ మిగతా నాటకం. ఈ కథనంలో అతని ప్రేమ వ్యవహారాలు, ప్రయాణాలు ఆసక్తికరంగా వుంటాయి. అయితే ‘నార్వే కథను, ఆ భాషను, ఇక్కడి వారు ఎలా అర్థం చేసుకోగలరు’ అంటే, ఎక్స్‌ప్రెషన్‌ని మించిన భాష లేదనేదే వారి సమాధానం. ‘కథను ఏ మాత్రం మార్చకుండా రెగ్యులర్ లైఫ్‌లో కనిపించే ఫోన్, ఫ్లైట్, కాసినో, కారు లాంటి అనేక మోడరన్ లైఫ్ యుటిలిటీస్‌ని ఇందులో జొప్పించాం. లాంగ్వేజ్ పాతదే వుంచినా, ఈ వస్తువులు చూసి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటం సులభం. విదేశాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించటం ఇదే మొదటిసారి’ అని నాటక దర్శకులలో ఒకరైన యాంగ్వే మార్కుస్సేన్ తెలిపారు. ఐదు రోజుల ఫెస్ట్... ఈ ఫెస్టివల్లో పీర్ ప్లేను 5 భాషల్లో.. ఈ నెల 12 నుంచి 16 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 12న తెలుగులో చిందుభాగవతం, 14 మలయాళ కుడియాట్టం, 15న కన్నడ యక్షగానం, 16న తమిళంలో తెరుకుట్టు. రవీంద్రభారతిలో 13 సాయంత్రం 7 గంటలకు నార్వేయిన్ ప్లే.. ‘పీర్‌గింట్’. - ఓ మధు -
బాధ్యతతోనే రాజకీయాల్లోకి: పవన్ కల్యాణ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, బాధ్యత కారణంగానే అందులోకి వెళ్లాల్సివచ్చిందని సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని వరలక్ష్మి ఫౌండేషన్, నైరేడ్, ఆస్పత్రి తదితర సంస్థల పనితీరును చూసేందుకు సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం ఆయన రాజాం వచ్చారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఐటీలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సినిమాల్లో మాట్లాడింది వేరు, నిజ జీవితంలో జరుగుతున్నది వేరని చెప్పారు. జీవితంలో అన్నీ చూశానని, సమాజం అంటే విసుగొస్తోందని, ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించారు. హృదయం ఒప్పుకోలేదని, మనసు మార్చుకుని, ఎన్ని కష్టాలెదురైనా పోరాడుతున్నానన్నారు. ఈ పోరాటానికి తన ఒక్కడి శక్తి సరిపోదని, పదిమంది కలిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఆ నినాదం మోదీ ఇచ్చారని కాకుండా, నిత్య జీవితంలో అందరూ పాటించాల్సిందేనన్నారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు. -
మనసున్న మారాజుకు నివాళి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు జగపతి ఆర్ట్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ మృతితో తెలుగుచలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మానవతా వాదిని, ఉద్దండులైన ఓ సినిమా ప్రముఖుడిని కోల్పోయి నట్లయింది. తన సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ ద్వారా దసరా బుల్లోడు, బంగారుబుల్లోడు, ఆరాధన, అన్నపూర్ణ, అంతస్తులు, ఆత్మ బలం వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమేగాక, తన వారసత్వంగా జగపతిబాబు రూపంలో ఓ ప్రతిభా సంపన్నుడైన నటున్ని తెలుగు సినిమా ప్రపంచంపై ఆవిష్కరించుకున్న ఘనత వీబీది అనడంలో ఎలాంటి సందేహంలేదు. ముఖ్యంగా సినిమా జీవి తంలో ఎన్నో ప్రసిద్ధమైన అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం ఆయనకెంతో సంతృప్తినిచ్చి ఉంటుంది. అదేవిధంగా ఫిలింనగర్లో ‘దైవసన్ని ధానం’ అనే పూజా మందిర నిర్మాణంలో కీలకపాత్ర పోషించి అదే దేవస్థానం సన్నిధిలోనే తన శేషజీవితాన్ని చాలా సుఖప్రదంగా, శాంతి సౌభాగ్యాలతో గడిపి తన జీవితానికి ఒక గొప్ప సార్థకతను సంత రింపజేసుకున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమా పరిశ్రమ ఓ పేరు మోసిన విశిష్ట వ్యక్తిని వీబీ రాజేంద్రప్రసాద్ రూపంలో కోల్పోయి నట్లయింది. తెలుగు సినిమా ప్రపంచంలో మనసున్న మారాజుగా పేరొందిన ఆయనకు కన్నీటి నివాళి. - బుగ్గన మధుసూదనరెడ్డి బేతంచెర్ల, కర్నూల్ జిల్లా -
ఈ ఏడాది వీరిది!
ఇది ఎప్పుడూ ఉండేదే అయినా, మళ్లీ మళ్లీ ఉత్సాహాన్నిచ్చేది కూడా! కొన్ని తలపోతల్ని తవ్వుకోవడం, వచ్చిన దారిని వెనుదిరిగి చూసుకోవడం! తెలుగువారి చరిత్రకు సంబంధించీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన మైలురాయి. మనం రెండు రాష్ట్రాలుగా ‘కలిసిపోయాం’! ఘటనాఘటనల్ని అటుంచితే, ఈ సంవత్సరాన్ని తమదిగా చేసుకున్న వ్యక్తులు వీళ్లు. కొన్నిసార్లు ప్రగతి వ్యక్తిగతమైనదే అయినా అది నేలంతటికీ వర్తిస్తుంది. అందుకే ఈ ‘2014లో విస్మరించలేని వ్యక్తుల’ జాబితా! అయితే, కైలాశ్ సత్యార్థి లాంటివాళ్లు ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి గెలుచుకున్నప్పటికీ ఈ జాబితాలో చేర్చలేదు. కేవలం తెలుగువాళ్లకే పరిమితమయ్యాం. అలాగే వీళ్లను ప్రజెంట్ చేయడంలో ప్రాధాన్యాల క్రమం పాటించలేదు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, ఇది పరమప్రమాణం కాదు, సాధికారికం కూడా కాదు. ఈ జాబితాలోని లోటుపాట్లని మానవ పరిమితిగా పరిగణించండి. సత్య నాదెళ్ల సాఫ్ట్వేర్ దిగ్గజం అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడు దశాబ్దాల పైగా చరిత్రలో ముచ్చటగా మూడో సీఈవోగా పగ్గాలు చేపట్టి సంచలనం సృష్టించాడు సత్య నాదెళ్ల. అనంతపురం జిల్లా బుక్కాపురం నుంచి మొదలైన సత్యనారాయణ నాదెళ్ల ప్రస్థానం... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీదుగా మైక్రోసాఫ్ట్ దాకా సాగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన సత్య 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి, అంచెలంచెలుగా సీఈవో స్థాయికి ఎదిగాడు. ఏడాదికి రూ. 520 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్న నాదెళ్ల... ప్రపంచవ్యాప్తంగా 50 మంది అత్యుత్తమ సీఈవోలతో ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 38వ స్థానం దక్కించుకున్నాడు. ‘క్లౌడ్’ లాంటి కొంగొత్త విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌కి పూర్వ వైభవం తెచ్చిపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు. సానియా మీర్జా టెన్నిస్ అంబాసిడర్ ఒకానొకదశలో టెన్నిస్‌కు వీడ్కోలు చెబుదామని భావించిన సానియా మీర్జా ఈ యేడు నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... సీజన్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించింది. అంతేకాకుండా కారా బ్లాక్ (జింబాబ్వే)తో మూడు టైటిల్స్ నెగ్గడంతోపాటు, మరో నాలుగు టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో విజేతగా నిలువడం ద్వారా గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ‘బ్రాండ్ అంబాసిడర్’గా నియామకం తర్వాత సానియా ఆట ఉన్నత శిఖరానికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించడం, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించడం, ఐక్యరాజ్యసమితి (యూఎన్) దక్షిణాసియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియామకం... ఇలా ఈ ఏడాది సానియాకు పూర్వ వైభవాన్ని రప్పించింది. కొలకలూరి ఇనాక్ సముచిత గౌరవం ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ రంగానికి చేసిన సేవలకుగానూ భారతప్రభుత్వం ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గుంటూరు జిల్లా వేజండ్లలో జన్మించిన ఇనాక్ సాహిత్యంలో, దళిత స్పృహ, స్త్రీవాద చైతన్యం, విప్లవభావాలు అన్నీ ఉంటాయి. అయినా ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడు కాడు. ఆయన నేలలో వేరూనిన చెట్టు! గ్రామీణ జీవితంలోని సాంఘిక వివక్షతలను వివిధ ప్రక్రియల్లో ప్రశ్నించారు. ఇనాక్ కథలు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇనాక్ కథలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించిన సాహిత్య అకాడెమీ ఆయన రచనలను ‘ఆధునిక సాహిత్యంలో క్లాసిక్స్’గా అభివర్ణించింది. ఇనాక్ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. కె.చంద్రశేఖరరావు ‘ప్రత్యేక’ సాధకుడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయంగా కూడా సత్తా చాటారు. జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ఆ లక్ష్య సాధనలో విజయవంతం కావడం, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ద్వారా కేసీఆర్ డబుల్ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక తెలంగాణ సాధన అంశాలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేశాయి. అయితే తెలంగాణ వచ్చింది మా వల్లనే, ప్రత్యేక తెలంగాణ మా అధినేత్రి చలువే... అంటూ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్‌కు కాలం కలిసిరాలేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు కూడా తెలంగాణలో వర్కవుట్ కాలేదు. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీదళమే సంపూర్ణ ఆధిక్యత సాధించింది. పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి ఫోర్బ్స్ ఎంట్రీ ఫార్మా దిగ్గజం, అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ఆయన సంపదను 1.8 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. కంపెనీ షేరు ధర ఏకంగా మూడు రెట్లు పెరగడం ఇందుకు కారణం. తయారీ ప్రక్రియల్లో లోపాల మూలంగా 2011లో విధించిన ఆంక్షలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తాజాగా ఎత్తివేయడం ఇందుకు దోహదపడింది. అమెరికాలోనూ, యూరప్‌లోనూ కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కె.నిత్యానంద రెడ్డితో కలిసి రామ్‌ప్రసాద్ 1986లో అరబిందో ఫార్మాను ప్రారంభించాడు. కంపెనీ ప్రస్తుతం హృద్రోగం, మధుమేహం, హెచ్ఐవీ మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను 125 పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇటీవలే అమెరికాకు చెందిన న్యూట్రాస్యూటికల్ సంస్థ నాట్రోల్‌ను కొనుగోలు చేసింది. రామ్‌గోపాల్‌వర్మ నిరంతర వ్యాఖ్యా స్రవంతి ఫ్లోకామ్ టెక్నాలజీతో కేవలం పాతిక వేల రూపాయలతో సినిమా తీయొచ్చని ‘ఐస్‌క్రీమ్’తో నిరూపించాడు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. సినిమా నిర్మాణంలో మూస విధానాలు ఉండకూడదని నిర్మొహమాటంగా వెల్లడించాడు. వైజాగ్‌లో కాదు... కరీంనగర్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానని నిర్భయంగా ప్రకటించాడు. కేసీఆర్, పవన్‌కల్యాణ్‌పై పాజిటివ్‌గానూ, నెగిటివ్‌గానే కాదు, చివరకు దేవుళ్ల మీద కూడా తనవైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. మహమ్మదాలీ బేగ్ థియేటర్ ఐకన్ నాటక రంగ సేవలకుగాను భారతప్రభుత్వం మహమ్మదాలీ బేగ్‌ను ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఆయన తండ్రి ఖాదర్ అలీ బేగ్ నాటకాన్ని ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్ ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు. దురదృష్ట వశాత్తూ ఖాదర్ అలీ బేగ్ 46 ఏళ్ల వయసులోనే మరణించాడు. తండ్రి అందించిన నాటకరంగపు కాగడాను కుమారుడు చేబూనాడు! తండ్రి పేరు మీద ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి, ‘నాటకరంగ పునరుజ్జీవన వారసత్వాన్ని కొనసాగిస్తున్న అరుదైన నమూనా’గా ఫ్రాన్స్ దేశపు సమున్నత గౌరవం పొందాడు. నాటకరంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కెనడా ప్రభుత్వం అందజేసే అవార్డునూ టొరొంటోలో అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వీయ దర్శకత్వంలో జీవితభాగస్వామి నూర్బేగ్తో కలసి నటించిన ‘కులీదిలోంకీ షాహ్జాదా’ను ప్రదర్శించాడు. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి ‘విభజనానంతర’ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండిన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విభజన తర్వాత నూతన రూపు రేఖలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, పవన్ కల్యాణ్ కలిసి రావడం తెలుగుదేశం పార్టీకి అనుకూలాంశాలుగా నిలిచాయి. రైతుల రుణమాఫీ హామీ కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని గద్దెనెక్కించడంలో కీలకపాత్ర పోషించింది. 175 సీట్లలో 102 సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి అదనంగా లభించింది ఐదు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే అయినప్పటికీ దశాబ్దంగా అధికారంలో లేని పార్టీని విజయపుగట్టుకు చేర్చడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి ప్రజారోగ్యం... ఆయనకు భాగ్యం! దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థ ‘ఎయిమ్స్’లో కార్డియాలజీ విభాగపు అధిపతి లాంటి అసామాన్యమైన హోదాను కూడా వదులుకున్నారు శ్రీనాథ్‌రెడ్డి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య వసతులూ అందని అసౌకర్యాలను గుర్తించి, ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన నిపుణుల తయారీ, వాళ్లకు అవసరమైన శిక్షణ, అందుకోసం కావాల్సిన 80 సంస్థలను నెలకొల్పడం వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టారు. వాటికిగానూ భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ గౌరవం పొందిన ఈ వైద్యమణిని బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ‘రాయల్ ఆనర్’తో సత్కరించారు. హైదరాబాద్‌లో బాల్యాన్ని గడిపిన శ్రీనాథ్‌రెడ్డికి తండ్రి బోధించిన స్వామి వివేకానంద సూక్తులే స్ఫూర్తి! నాగార్జున ‘మా’లో ఎవరు కోటీశ్వరుడు? అమితాబ్ బచ్చన్‌కి చెల్లుబాటయినట్టుగా అందరికీ కాదు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా రాణిస్తూ, బుల్లితెర మీదికి జంప్ చేయడమంటే ఓ మెట్టు దిగినట్టే! అమితాబ్ మాత్రం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో పదిమెట్లు పైకి ఎక్కి చూపించాడు. నాగార్జున కూడా సేమ్ టూ సేమ్. మరికొన్ని సినిమాలు చేస్తే, వంద సినిమాలు పూర్తి చేసుకొనే దశలో ఉన్న నాగ్ ‘మా’ టీవీ కోసం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేయడమంటే ఒక రకంగా రిస్కే. కానీ 2014లో నాగ్ అవలీలగా బుల్లితెరను ఆక్రమించాడు. ఇన్నేళ్లూ వెండితెరపై మన్మథుడిలా ప్రకాశించిన నాగ్, బుల్లితెరపై కొత్త గెటప్‌తో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. సాకేత్ మైనేని భవిష్యత్‌కు భరోసా వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్‌కు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. భారత డేవిస్ కప్ జట్టులో స్థానం, ఏటీపీ చాలెంజర్ టోర్నీలో మూడు డబుల్స్ టైటిల్స్, రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్, ఆరు ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్స్, ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం, చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పుణే మరాఠాస్ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర... ఇలా సాకేత్ భారత టెన్నిస్ భవిష్యత్‌కు భరోసా కల్పించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న ఈ ఆజానుబాహుడు పదునైన సర్వీస్‌లకు పెట్టింది పేరు. ఆటలోనే కాదు చదువులోనూ సాకేత్ మేటి. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ స్కాలర్షిప్ రావడంతో అక్కడకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక 2011లో భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఇండియన్ ఫ్యూచర్స్ టోర్నీలో సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. నలిమెల భాస్కర్ బహుభాషా అనువాదకుడు కరీంనగర్ వాసి నలిమెల భాస్కర్ ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అవార్డు పొందారు. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్అబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను నలిమెల తెలుగులోకి ‘స్మారక శిలలు’గా అనువదించారు. ఈ పుస్తకమే అవార్డుకు ఎంపికైంది. గ్రంథాలయాలే తరగతి గదులుగా భాస్కర్ భారతీయ భాషల్లో పట్టు సంపాదించారు. తాను తెలుగులో స్వయంగా ‘మంద’ కథను రాసి మరో 13 భారతీయ భాషా కథలను మూలభాష నుంచి అనువాదం చేసి భారతీయ కథలుగా పాఠకులకు అందించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు బోధనా వృత్తిలో ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ మాండలీకంపై ఇతోధిక కృషి చేస్తున్న నలిమెల భాస్కర్ నేషనల్ బుక్‌ట్రస్ట్ సలహామండలి సభ్యుడు. మత్స సంతోషి పేదరికాన్ని లిఫ్ట్ చేసింది నేపథ్యం ఎలాంటిదైనా పట్టుదలతో కృషి చేస్తే విజయం వరిస్తుందని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహిళా వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి నిరూపించింది. అరకొర సౌకర్యాల నడుమ సాధన చేసిన సంతోషి ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఆమెకు కోచ్ చల్లా రాము మార్గదర్శకుడిగా నిలిచాడు. ఆమె గెలిచింది పేదరికాన్ని కూడా. ఎందుకంటే జూట్ మిల్లులో కార్మికుడైన సంతోషి తండ్రి తన సంపాదనలో ఎక్కువ భాగం తన కూతురు సాధనకే వినియోగించాడు. భారత్ తరఫున పలుమార్లు జూనియర్, యూత్ విభాగాల్లో ఆసియా, కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న సంతోషి పలు పతకాలు సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం నెగ్గి భవిష్యత్‌పై మరిన్ని ఆశలు పెంచింది. శ్రీధర్ కోట ఎగరడానికి కొత్త రెక్కలు రైట్ బ్రదర్స్ విమానాన్ని ఆవిష్కరించి వందేళ్లు గడచిపోతున్నా, దాని మౌలిక డిజైన్‌లో వచ్చిన మార్పులు దాదాపు శూన్యం. అదే ఆకారం, అవే పొడవైన రెక్కలు! అవసరాన్నిబట్టి ఆకారాన్ని మార్చుకునే రెక్కల ఫ్లాప్స్ (రెక్కల వెనుక భాగంలో పైకి, కిందకూ కదులుతూ ఉండే నిర్మాణాలు) రూపొందించారు శ్రీధర్ కోట! వీటిని అమర్చుకుంటే, ఇంధన ఖర్చు 12 శాతం వరకూ, టేకాఫ్, ల్యాండింగ్ల సమయాల్లోని శబ్దం 40 శాతం వరకూ తగ్గుతాయి. ‘అడాప్టివ్ కంప్లయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్’ పేరుతో శ్రీధర్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని అమెరికా వాయుసేన ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. మన బేగంపేట విమానాశ్రయం నుంచి పైకి ఎగిరే విమానాల్ని చూస్తూ... 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్ ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. అందె శ్రీ ‘రాష్ట్ర’ గీత రచయిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ సంస్థలు, రాజకీయ పక్షాలు ఉద్యమించిన సందర్భంలో అంద్శై గీతం ‘జయజయహే తెలంగాణ’ సంకల్పశక్తిని ఇనుమడింపజేసింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ గీతం రాష్ట్రగీతంగా అధికార హోదా పొందింది. గీత కర్త అంద్శైవరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. ‘గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాన’ంటారు. సుమతీ శతకం, వేమన శతకాల్లా తెలంగాణ ప్రజలు పాడుకునే ‘వరకవుల’ పద్యాలు ఆయనను ప్రకృతి కవిని చేశాయి. అందె ఎల్లయ్య అనే పూర్వనామాన్ని శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ అంద్శై మార్చారు. ఆలమందలు కాస్తూ అపురూప వాక్కులమ్మను ఉపాసించిన అంద్శై జక్కిరెడ్డి మల్లారెడ్డి, మహ్మద్ మునీర్ సేట్ వంటి సహృదయులు ఆదరించారు. తెలంగాణ రాష్ట్రగీతం గురించి చెబుతూ- మొలకెత్తగానే విత్తనం చనిపోతుంది, కొన్నేళ్లుగా ప్రజల నాల్కలపై నునుపు తేలిన ఆ పాట నాది కాదు వారిదే అంటారు. తనను కొడుకుగా పెంచి పెద్దచేసిన బిరుదురాజు రామకృష్ణ ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేలకు జాతీయ గీతం’ అని అభినందించారు. అలేఖ్య పుంజల కూచిపూడి గౌరవం పేరుకు తగ్గ శాస్త్రీయ నృత్యకారిణి పద్మశ్రీ అలేఖ్యా పుంజల. ఈ సంవత్సరం కోణార్క్ ఉత్సవంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే అపూర్వ గౌరవాన్ని పొందారు. (గురు గంగాధర్ ప్రధాన్ 1986లో కోణార్క్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ప్రపంచశ్రేణి నృత్యకారులు, గాత్ర-వాద్య సంగీతకారులు ఒరిస్సాలోని కోణార్క నాట్యమండపంలో పాల్గొనడం జీవన సాఫల్యంగా భావిస్తారు.) భరతనాట్యం-కూచిపూడి రెండు శాస్త్రీయ నృత్యాల్లోనూ నిపుణురాలైన అలేఖ్య తాను కూచిపూడి పక్షపాతిని అంటారు. అభినయానికి, భావవ్యక్తీకరణకు కూచిపూడిలో అదనపు ఆస్కారం ఉంటుందంటారు. పురావస్తుశాస్త్రం ఆధారంగా శిల్పాలలో నృత్యకళ అంశంపై పరిశోధన చేసిన అలేఖ్య తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు, నాట్యవిభాగం అధిపతి. సంగీత-నాటక అకాడెమీ పురస్కార గ్రహీత. కాంటెపరరీ జర్మన్ డ్యాన్సర్- ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్’ల అభినయపూర్వక ప్రదర్శన ‘యు అండ్ మి’ని హైద్రాబాద్, జర్మనీలలో ప్రదర్శించారు. వినోద్ చౌదరి రాపర్ల ఇన్స్టలేషన్ ఆర్ట్ పరిచయ కర్త ఒక అపురూపమైన చిత్రకళా ప్రదర్శనను చూడబోతున్నాం అనుకున్న కళాభిమానులు ఆ గదిలోకి వెళ్లి బిక్కమొగం వేశారు. కళ ఏమీ కనపడదే! కాని, ఆ గది వింతగా ఉంది. చిందరవందరగా ఉంది. గోనె సంచులు. దుమ్మెత్తి పోసుకునే దినపత్రికల క్లిప్పింగులు. ప్లాస్టిక్ కుర్చీలు. ఒక పాతకాలపు కుర్చీ. పైన నెమలి ఈకలు. సిల్క్ వస్త్రం. ఏమిటది? ‘ద గోల్డెన్ చైర్’ పేరుతో గుంటూరుకు చెందిన వినోద్ చౌదరి ఏర్పాటు చేసిన ఇన్స్టలేషన్ ఆర్ట్! ఒకానొక అంశాన్ని బలంగా చెప్పేందుకు త్రీడైమన్షన్స్ స్థలంలో అనేక వస్తువుల అమరికతో ఏర్పాటు చేసే వస్తు సముదాయమే ఈ కళ! మహాభారతం చరిత్ర కాదనీ, వర్తమానం కూడాననీ, భవిష్యత్తు బాగుండాలంటే కుర్చీపై కూర్చునేవారిని ఎంపిక చేసుకోవడంలో జాగరూకత పాటించాలనీ గోల్డెన్ చైర్ చెబుతుంది. తన లైఫ్ క్యాన్వాస్‌లో పెళ్లికి చోటులేదనీ, కళతోనే సహజీవనమనీ అంటాడు. చైన్నైలో సినిమాలకు ఆర్ట్ వర్క్ చేశాడు. ఇటీవలే తన చిత్రాలను ప్రదర్శిస్తోన్న అమెరికాలోని న్యూజెర్సీ మ్యూజియంను సంద ర్శించి వచ్చాడు. సంపూర్ణేశ్‌బాబు ఆల్మోస్ట్ స్టార్ ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ప్రచారంతో వెండితెరపై ఉవ్వెత్తున ఎగిసిన కెరటం సంపూర్ణేశ్‌బాబు. తెలుగు చిత్ర సీమలో పేరుకు పోయిన పలు విధానాలను, రొడ్డకొట్టుడు కథాంశాలను, మూస పాత్రలను పరిహసిస్తున్న రీతిలో దర్శకుడు స్టీవెన్ శంకర్ చేసిన ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేశ్‌బాబు రాత్రికి రాత్రి దాదాపు ‘స్టార్’గా అవతరించాడు. చిత్రమైన మాటతీరు, నిర్లక్ష్యపు శారీరక భాషతో సంపూర్ణేశ్ బాక్సాఫీస్‌కి పనికొచ్చే మూలకంగా మారాడు. సంపూర్ణేశ్తో నటుడు మంచు విష్ణు ‘పోకిరి రిటర్న్స్’ నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. మంజులతా కళానిధి అన్నదాత సుఖీభవ! ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటారు. అలా ఇంటిదగ్గర మొదలయ్యే దాతృత్వానికి కాస్తంత సోషల్ మీడియా గాలి కూడా తగిలిందంటే ఎనలేని గుర్తింపు వస్తుంది. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా సెలబ్రిటీల మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ విజయవంతమైన విరాళ కార్యక్రమంగా నిలిస్తే, దాని స్ఫూర్తితో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి. ఒక బకెట్ పరిమాణంలోని బియ్యాన్ని అన్నార్థులకు అందజేస్తున్న ఫొటోను తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేసి, అందరూ అలాంటి దాన కార్యక్రమాన్ని చేపట్టాలని సవాలు విసిరారు ఆమె. వేల మంది మంజులత ఐడియాను అభినందిస్తూ లైక్ కొట్టగా, అనేక మంది బకెట్టుడు బియ్యాన్ని ఇవ్వడమో, ఆ పరిమాణపు బియ్యాన్ని వండివడ్డించడమో చేశారు. ఎంవైఎస్ ప్రసాద్ మన శాస్త్రవేత్త చంద్రయాన్, మామ్, తాజాగా జీఎస్ఎల్వీ మార్క్-3... భారత అంతరిక్ష ప్రయోగాల వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంవైఎస్ ప్రసాద్! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో దాదాపు 37 ఏళ్ల అనుభవాన్ని గడించిన ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా (1974) అందుకున్నారు. ఆ తరువాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంశంపై స్నాతకోత్తర విద్యనభ్యసించారు. భారత దేశం తొలిసారి విజయవంతంగా ప్రయోగించిన లాంచ్ వెహికల్ ఎస్ఎల్వీ 3 అభివృద్ధిలోనూ ప్రసాద్ పాలుపంచుకున్నారు. 2013 నుంచి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం డెరైక్టర్‌గా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి త్వరలో విడుదల వరుస విజయాల పరుసవేది అనిపించుకున్న రాజమౌళి ‘ఈగ’ సినిమా 2012 జూలై 6న విడుదలైంది. అప్పటి నుంచీ ఆయన ‘బాహుబలి’ అనే అతి పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం జరుగుతున్నా కూడా, ఈ సినిమాకు సంబంధించిన రకరకాల గాసిప్‌లతో ఈ దర్శకుడు ఏడాదంతా మీడియాలో మార్మోగుతూనే ఉన్నాడు. బడ్జెట్, గెటప్స్, కాస్టింగ్, గ్రాఫిక్స్... ఇలా 24 శాఖల పరంగానూ ‘బాహుబలి’ వార్తల్లో నిలవడానికి ఆయన ఇమేజే కారణం! రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సాహిత్యానికి రాచమర్యాద తెలుగు సాహిత్య లోకంలో నిబద్ధతగల విమర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రముఖ రచయిత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘మన నవలలు-మనకథానికలు’ పేరుతో చంద్రశేఖర్ రెడ్డి రచించిన విమర్శనా గ్రంథానికి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యానికి విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు ప్రతియేటా సాహిత్య అకాడమీ అవార్డులను ఇస్తుంది. చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన రాచపాలెం శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు. మాలావత్ పూర్ణ సద్దనపల్లి ఆనంద్‌కుమార్ శిఖరమంత విజయం! ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖరం. మరి దాన్ని అధిరోహిస్తే ఆ శిఖరమంతటి పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. అలాంటి ఖ్యాతిని అతి చిన్న వయసులోనే సంపాదించుకొన్నారు మాలావత్ పూర్ణ (13), సద్దనపల్లి ఆనంద్‌కుమార్(18). పూర్ణ అయితే ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అభ్యసిస్తున్న ఈ సాహస వీరులకు తెలుగుజాతి నీరాజనాలు పట్టింది. 29,035 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ప్రతిష్టించిన వీళ్లను చూసి భారతజాతి మొత్తం గర్వించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్... ట్రైనర్ శేఖర్ మార్గదర్శకత్వంలో ఈ అరుదైన ఘనత సాధించారు. క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం లాంటి పదాలు మాత్రమే పూర్ణ, ఆనంద్‌ల సాహసాన్ని అర్థంచేసుకోవడానికి సరిపోవేమో! కిడాంబి శ్రీకాంత్ చైనా గడ్డపై తెలుగు బిడ్డ గర్జన మెదడువాపు జ్వరంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి... నెమ్మదిగా కోలుకొని... నమ్మశక్యంకాని విజయంతో ‘తెలుగు రాకెట్’ పదునెంతో చూపించాడు కిడాంబి శ్రీకాంత్. 21 ఏళ్ల ఈ యువతార ఏమాత్రం అంచనాలు లేకుండా చైనా గడ్డపై చమక్కుమనిపించాడు. ‘బ్యాడ్మింటన్ సచిన్’లా పేరొందిన చైనా సూపర్‌స్టార్ లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి, బ్యాడ్మింటన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. 2007లో మొదలైన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ హైదరాబాద్ యువకుడు దాన్ని నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. (సాక్షి స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్స్, సినిమా, పొలిటికల్, హెల్త్, కల్చరల్ డెస్కుల సహకారంతో) -
బెజవాడ బుల్లోడినే..
సినీ నటుడు శ్రీకాంత్ కొత్త సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన తన చిన్ననాటి సంగతులు, తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించారు. ఆ వివరాలు ... విలన్‌గా అద్భుతమైన పాత్రలు పోషించి.. అనతికాలంలోనే హీరోగా ఉన్నతస్థానానికి చేరుకుని విజయవంతమైన చిత్రాల్లో నటించారు హీరో శ్రీకాంత్. పెళ్లిసందడి, తాజ్‌మహల్, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి సినీరంగంలో ఉన్నతస్థానానికి చేరుకున్న ఆయనకు విజయ వాడతో ప్రత్యేక అనుబంధమే ఉంది. శ్రీకాంత్ మన జిల్లాలోనే పుట్టినా.. తరువాత కర్ణాటక వెళ్లిపోయూరు. బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆదివారం నగరానికి వచ్చిన శ్రీకాంత్ కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - సాక్షి, విజయవాడ - హీరో శ్రీకాంత్ సాక్షి : మీ కొత్త సినిమా విశేషాలేమిటి? శ్రీకాంత్ : కొత్త సినిమాలో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ నాది. ఫ్యామిలీతో పాటు రాజకీయం కొంత టచ్‌లో ఉండే పాత్ర. ఇక మిగిలిన విషయాలు చెబితే కథలో సస్పెన్స్ పోతుంది. దర్శకుడు బాబ్జీ (శ్రీను) మంచి కథా రచయితగా నాకు తెలుసు. మంచి కథతో పాటు శ్రీను దర్శకత్వం వహిస్తే ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన్ను ఒప్పించాం. సాక్షి : ప్రస్తుతం నటిస్తున్న మిగతా సినిమాలు? శ్రీకాంత్ : జల్సారాయుడు, నాటుకోడి, ఢీ అంటే ఢీతో పాటు సతీష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటిలో జల్సారాయుడు త్వరలోనే విడుదలకానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాక్షి : మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? శ్రీకాంత్ : బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. నగరానికి చెందిన లక్ష్మీ ఫిలిమ్స్ నా సినీ ఎదుగుదలకు ఎంతో సాయమందించింది. సాక్షి : నవ్యాంధ్రలో సినిమాలకు అనుకూలమైన ప్రాంతమేది? శ్రీకాంత్ : విజయవాడతో పాటు వైజాగ్, శ్రీకాకుళం పరిసరాలు షూటింగ్‌లకు అనుకూలం. ఇప్పటికే వైజాగ్, శ్రీకాకుళంతో పాటు రాజమండ్రి పరిసరాల్లో జరుగుతున్నాయి. ఇకపై విజయవాడలో కూడా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతాయని భావిస్తున్నా. మా నుంచే ప్రారంభం అయితే అందరికీ మంచిదే. సాక్షి : నగరంతో మీకున్న అనుబంధం? శ్రీకాంత్ : నా చిన్నతనమంతా విజయవాడలోనే సాగింది. ఇక.. నా చెల్లెల్ని నగరంలోని పటమటకు కోడల్ని చేశాను. ఏడాదిలో కనీసం కొన్ని రోజులైనా నగరంలోనే గడుపుతాను. పైగా.. దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అమ్మ దయతో కొత్త సినిమా విజయవంతం కావాలని కోరుకున్నా. సాక్షి : షూటింగ్‌లకు విజయవాడ అనుకూలమేనా..? శ్రీకాంత్ : పల్లెలు, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు విజయవాడ ఎంతో అనువుగా ఉంటుంది. దీనికితోడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రకటించారు. ఇకపై మరికొంతమంది నగరంలో సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. అయితే, దీనికి నగర ప్రజలతో పాటు పోలీసుల సహకారం ఎంతో అవసరం. -
మేకింగ్ ఆఫ్ 'కార్తికేయ'
-
రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ
అంబాజీపేట : సామాజిక సేవతోపాటు రియల్ స్టార్‌గా పేరొందిన దివంగత సినీనటుడు ఆర్.శ్రీహరి విగ్రహాన్ని గురువారం అభిమానులు ఆవిష్కరించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ శ్రీహరి సినీ నటునిగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందున్నారని కొనియాడారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడు యేడిద శ్రీను, కల్వకొలను తాతాజీ, గణపతి బాబులు, పత్తి దత్తుడు, గణపతి వీరరాఘవులు, సుంకర బాలాజీ, నూకల గౌరీష్, కొర్లపాటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల రాము, గొల్లపల్లి బాబి, దాసం బాబి, సలాది స్వామి, పత్తి దత్తుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ సిట్టింగ్‌లో...సంపత్‌నందికి ఓకే!
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను ‘ఓకే’ చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన ‘కిక్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కిక్-2’ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ -‘‘సింగిల్ సిట్టింగ్‌లో సంపత్‌నంది కథ ఓకే చేశాను. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలున్న కథ ఇది. వినోదాన్ని పంచడంలో సంపత్నందిది ఓ భిన్నమైన శైలి. వాణిజ్యవిలువలతో కూడిన పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని సంపత్ తీర్చిదిద్దుతాడని నా నమ్మకం. ‘కిక్-2’ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అని తెలిపారు. ‘‘నాపై నమ్మకంతో సింగిల్ సిట్టింగ్‌లో నా కథను ఓకే చేసిన రవితేజగారికి ధన్యవాదాలు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తా. ఇద్దరు కథానాయికలు ఇందులో నటిస్తారు. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని సంపత్‌నంది చెప్పారు. -
బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన నటుడు సునీల్
శంషాబాద్ రూరల్: మండలంలోని ఒయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న బాక్సింగ్ పోటీలను సినీ నటుడు సునీల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. పుల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ ఓపెన్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సునీల్‌తో పాటు విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ప్రభాకర్‌రెడ్డి సూచించారు. హీరో సునీల్ తాను నటించిన సినిమాల్లోని డైలాగులు, డ్యాన్స్‌తో విద్యార్థులను ఉత్తేరపర్చారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ చైర్మన్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకకు రమ్య గుడ్ బై?
లండన్‌లో స్థిరపడేందుకు సన్నాహాలు! సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్‌లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రముఖ తారగా వెలుగొందిన నటి రమ్య రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోనున్నారనేప్రచారం ప్రస్తుతం కన్నడ సినీపరిశ్రమలో సాగుతోంది. శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రమ్య ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే రాజకీయాల్లో ఆమె అనుకున్నంతగా రాణించలేక పోయారు. 2013లో మండ్య పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన రమ్య, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు. ఇక ఇప్పుడు ఆమె బెంగళూరు నగరాన్ని వీడి లండన్‌లో స్థిరపడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనే వార్తలు గాంధీనగర్‌లో వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా ఆమె బయటి ప్రపంచానికి కనిపించకపోవడం, తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను కూడా డిస్కనెక్ట్ చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. కాగా రెండు నెలలుగా రమ్య లండన్‌లోనే ఉండడంతో ఆమె ఇక అక్కడే స్థిరపడనున్నారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. తన తల్లితో కలిసి లండన్ వెళ్లిపోయేందుకు ఇప్పటికే రమ్య అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నారని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే రమ్య దిల్ కా రాజా అనే కన్నడ సినిమాతో పాటు కాదల్ టు కళ్యాణం అనే తమిళ సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. దీంతో ఈ సినిమాల్లో అసలు రమ్య నటించనున్నారా.. లేదా అంతకుముందే ఉద్యాన నగరి వీడి లండన్ వెళ్లిపోతారా.. అన్న విషయంపై అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. -
తెలుగోడి దయ కోసం...
* జాతీయ పార్టీల తరఫున ప్రచారబరిలో ఆంధ్ర, తెలంగాణ నాయకులు * సినీనటులను నమ్ముకుంటున్న ఎన్సీపీ * స్థానిక నాయకులతో నెట్టుకొచ్చేస్తున్న శివసేన * తెలుగు ఓట్లు చీలడం ఖాయమంటున్న విశ్లేషకులు సాక్షి, ముంబై: బహుముఖ పోటీ నెలకొన్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే సత్తా ఉన్న తెలుగువారిని ఆకర్షించేందుకు సైతం పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ముందున్నాయనే చెప్పవచ్చు. ముంబైతోపాటు పలు జిల్లాల్లో స్థిరపడిన తెలుగువారిని తమ పార్టీ అభ్యర్థుల వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను ప్రచార బరిలో దింపాయి. వారు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండేప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో తెలుగు నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. మహారాష్ట్రలో ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయిడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు కృష్ణంరాజు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, గురవారెడ్డి, కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్ తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్, మరాఠ్వాడాలోని నాందేడ్, విదర్భలోని చంద్రాపూర్లతోపాటు ముంబై, భివండీలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలుగుతోందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్నీ దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. హామీల వర్షం... తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. తమ పార్టీలు అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కొందరు వాగ్దానాలు చేస్తుండగా తెలుగు భవనం, తెలంగాణా భవనం నిర్మిస్తామని మరి కొందరు చెబుతున్నారు. ముంబైలోని కామాటిపురా, వర్లీ, భివండీలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన బహిరంగ సభలు, చిన్నచిన్న సభలకు సైతం భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరవుతుండడం విశేషం. దీంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ తరఫున టాలీవుడ్ నటులు... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపడంతో రాష్ట్రీయ పార్టీలు మరోమార్గాన్ని ఎంచుకున్నాయి. ముఖ్యంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీ టాలీవుడ్ నటులను ప్రచారంలోకి దింపింది. ఆదివారం ఉదయం వర్లీతోపాటు కొన్ని ప్రాంతాల్లో తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచతమైన సోనూ సూద్ ఎన్సీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహించారు. మరోవైపు ఆదివారం రాత్రి నిర్వహిం చిన బహిరంగ సభలో తెలుగు నటుడు ప్రకాష్ రాజ్ ప్రచారం చేసి ఎన్సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మరోవైపు శివసేన స్థానిక తెలుగువారిని ప్రచారంలోకి దింపింది. తెలుగు వారి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ శివసేనకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. చీలనున్న తెలుగు ఓట్లు...? వివిధ పార్టీలకు చెందిన తెలుగు నాయకులు చేస్తున్న ఎన్నికల ప్రచారం తెలుగు ఓటర్లపై ఎంతమేర ప్రభావం చూపనుందనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా భివండీ, ముంబైలోని వర్లీతోపాటు పలు నియోజకవర్గాల్లో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీకి చెందిన తెలుగు నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ టాలీవుడ్ నటులను రంగంలోకి దింపింది. దీంతో తెలుగు ప్రజలు కీలకంగా ఉండే అనేక నియోజకవర్గాల్లో ఓట్ల చీలిపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబై, భివండీ లాంటి ప్రాం తాల్లో తెలుగు అభ్యర్థులెవరూ బరిలోలేరు. తెలుగు ఓట్లు కీలకంగా ఉన్న ప్రాంతంలో ఏదైనా పార్టీ తెలుగు అభ్యర్థిని బరిలోకి దింపి ఉంటే తెలుగు ఓట్లలో చీలికశాతం తక్కువగా ఉండే అవకాశం ఉండేది. కాని ప్రస్తుత పరిస్థితిలో తెలుగు ఓట్లు చీలిపోవడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. -
ఉద్యోగం చేయాలనుకున్నా కానీ, సినిమాల్లోకి రావాలనుకోలేదు!
‘ముద్దమందారం’లో పూర్ణిమ ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం... మువ్వల్లే నవ్వింది సింగారం’. బహుశా...పూర్ణిమను చూసే వేటూరి ఈ పాట రాశారేమో! వెండితెరపై తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారామె. పరికిణీలో పూర్ణిమ నిజంగా ముద్దమందారమే. ఆహార్యంలోనే కాదు, అభినయంలో కూడా పూర్ణిమ అభినందనీయురాలే. జంధ్యాల వంటి దిగ్గజం ప్రశంసలు ఆమెకు లభించాయంటే కారణం అదే. ఇటీవలే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పూర్ణిమ ఇంటర్వ్యూ కోసం ఆమె మొబైల్‌కి కాల్ చేసింది ‘సాక్షి’. ‘నువ్వు నేనూ కలిసుంటేనే నాకెంతో ఇష్టం..’ అంటూ ‘గంగోత్రి’ సినిమా లోని పాట కాలర్ట్యూన్గా వినిపించింది. చరణం పూర్తయ్యేలోపే ‘హలో’ అన్నారు పూర్ణిమ. ఆ తర్వాత జరిగిన సంభాషణ. మీ కాలర్‌ట్యూన్ వింటే... మీకు సినిమాలంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది... అవును... ఇప్పటికీ సినిమాలు బాగా చూస్తుంటాను. ఇప్పటి హీరోల్లో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని చూడాలనుంది. అలాగే చిరంజీవిగారబ్బాయి చరణ్ యాక్షన్ అన్నా నాకు ఇష్టమే. రవితేజ, సిద్దార్థ్‌ల సినిమాలు కూడా బాగానే చూస్తా. ఇక హీరోయిన్లలో సమంత, కాజల్, అనుష్క, తమన్నా అంటే ఇష్టం. అప్పట్లో సౌందర్య కూడా నాలాగే తెరపై పద్ధతిగా కనిపించింది. తనంటే ఇంకా ఇష్టం. మీరు తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారు కదా. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల పోకడలు చూస్తే ఏమనిపిస్తుంది? మనం ఎవర్నీ తప్పు పట్టలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. పాపం... హీరోయిన్లే ఐటమ్సాంగులు కూడా చేయాల్సొస్తోంది. మీరు ఈ జనరేషన్వారు కాకపోవడం వల్ల హ్యాపీగా ఫీలయ్యారా? నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అసలు సినిమాల్లో చేయడమే మా ఇంట్లో ఇష్టం లేదు. ‘ఒక్క సినిమానే’ అనేసరికి చేశాను. కమిట్మెంట్తో నడుచుకున్నాను కాబట్టే, అమ్మానాన్న కూడా నన్ను విభేదించలేదు. 1989లో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడు కొంతమంది దర్శక, నిర్మాతలు ట్రెండీగా కనిపిస్తే... పారితోషికం కూడా ఎక్కువిస్తామని అన్నారు. కానీ... నేను మాత్రం నా అభిమతాన్ని మార్చుకోలేదు. మీరు గాయని కూడా కదా? అవును.. అప్పట్లో చాలా పాటలు పాడాను. కొన్ని ఫంక్షన్లలో కూడా పాడాను. తొలుత గాయని అవుదామనే జంధ్యాల గారిని కలిశారట కదా? కాదండీ... ‘ముద్దమందారం’ హీరోయిన్ కోసం జంధ్యాల దాదాపు వందమంది అమ్మాయిలను చూశారు. ఆయనకు ఎవరూ సరిగ్గా నచ్చలేదు. అనుకోకుండా ఓ సందర్భంలో నా ఫొటో చూసి, ‘నా సినిమాలో నాయిక ఈ అమ్మాయే’ అని ఫిక్సయిపోయారట. మా నాన్నగారి వద్దకు తన కో-డెరైక్టర్ని పంపించి మాట్లాడించారు. నేను మాత్రం చేయనని కరాఖండీగా చెప్పేశాను. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని నాకుండేది. కానీ నచ్చజెప్పడంతో ఒక సినిమా చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ... తర్వాత అదే జీవితం అయిపోయింది. దాదాపు వంద సినిమాల్లో నటించాను. ముద్దమందారం, మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, ఆడపడుచు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య... ఇలా నాకు పేరు తెచ్చిన సినిమాలెన్నో. మీరు మరచిపోలేని పాత్ర? ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’లో ‘పిచ్చితల్లి’ పాత్రను ఎప్పటికీ మరువలేను. ‘ఆ సినిమా ఒప్పుకోడానికి పూర్ణిమ పాత్రే కారణం’ అని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు... అవునా... అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చిరంజీవిగారు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉండేవారాయన. నన్ను ‘పూరీ.. పూరీ’ అని పిలిచేవారు. ఇద్దరం సెట్ అంతా అల్లరి చేసేవాళ్లం. మాధవి రిజర్డ్వ్ పర్సన్. ఎవరితోనూ కలిసేవారు కాదు. అందుకే... చిరంజీవిగారూ నేనూ కూడబలుక్కొని మరీ ఆమెను ఏడిపించేవాళ్లం. ఆ పాత్రను నేను చాలా బాగా చేశానని అందరూ అంటుంటారు. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం కోడి రామకృష్ణగారిదే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటించి చూపించేవారు. చిరంజీవిగారిని తర్వాత ఎప్పుడైనా కలిశారా? మొన్న టి.సుబ్బరామిరెడ్డిగారి పుట్టినరోజు వేడుక మా వైజాగ్‌లో జరిగింది. అప్పుడు కేవలం చిరంజీవిగారిని కలవడానికే వెళ్లాను. చూడగానే... ‘ఏమ్మా... బావున్నారా’ అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందమనిపించిందో. నిజంగా ఆయన చాలా గ్రేట్. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవిగారి అభిమానినే. ‘మా వైజాగ్’ అంటున్నారు! మీరు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారా? అవును.. ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఇక్కడే జరిగేవి. జంధ్యాల గారికి కూడా వైజాగ్ ఇష్టం. ఇక్కడే షూటింగ్స్ జరిపేవారు. జంధ్యాలగారు కుడివైపుకి తిరిగి నిలబడమంటే, నేను ఎడమవైపు తిరిగి నిలబడేదాన్ని. దాంతో నన్ను ‘తింగరి..’ అని పిలిచేవారు. చనిపోయేవరకూ నన్ను అలాగే పిలిచారాయన. నిజంగా ఆ రోజులు మళ్లీ తిరిగిరావు. నా కెరీర్ ఎక్కువ భాగం వైజాగ్‌లోనే సాగింది. అయితే.. పెళ్లయ్యాక సినిమాలకు దూరమయ్యాను. మీ శ్రీవారు ఏం చేస్తారు? ఒరిస్సాలో ఉద్యోగం ఆయనకు. అందుకే అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. నాతోటి హీరోయిన్లందరూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే.. నాక్కూడా నటించాలనిపించింది. అందుకే... వైజాగ్ వచ్చేశాం. తొమ్మిది నెలల నుంచీ ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ఉందిలే మంచికాలం ముందుముందునా, తొండి, 33 ప్రేమకథలు, సాహసం చేయరా డింభక, సాహెబా సుబ్రమణ్యం ఇలా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేశాను, చేస్తున్నాను. అయినా ఈ వయసులో అమ్మ పాత్రలు చేయడమే కరెక్ట్ కదా. సంభాషణ: బుర్రా నరసింహ -
వెండితెరపై విషాద నాటకం
సినిమా వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎటువంటి దాగుడుమూతలు లేకుండా వినిపించిన బలమైన అవతలి గొంతు ‘హైదర్’. ఇలాంటి సినిమాను ఈ పద్ధతిలో తీయవచ్చా... సాధ్యమా... ఇంత ధైర్యం ఇంకా మిగిలి ఉందా... చీటికి మాటికి నిరసనలు సినిమాహాళ్ల దగ్గర ధర్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా తాము నమ్మిన ఒక సత్యాన్ని సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చా? చెప్పవచ్చు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పి చూపించాడు. బహుశా కాశ్మీరీల జీవితాన్ని లోకానికి చెప్పి తీరాలి అని అతడు నిజాయితీగా గట్టిగా అనుకోవడమే దీనికి కారణం కావచ్చు. ఇందుకు అతడు షేక్స్పియర్ ప్రఖ్యాత నాటకం ‘హామ్లెట్’ని ఒక ముఖ్యమైన ఆధారంగా తీసుకున్నాడు. అయితే ఇది కేవలం ఆధారం మాత్రమే. కాని ఈ కథలో దర్శకుడు చూపించాలనుకున్నది ‘90ల నాటి కాశ్మీర్ పరిస్థితి, వేర్పాటు ఉద్యమం, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రమేయం, విరుగుడుగా భారత సైన్యం, దాని మద్దతుతో పనిచేసే సంస్థలు, వీటితో సంబంధం లేకుండా స్వతంత్రం కావాలనుకునే మరికొన్ని సంస్థలు, వీటిని అడ్డు పెట్టుకొని లాభపడాలనుకునే రాజకీయ నాయకులు, ఇన్ని విరుద్ధ శక్తుల మధ్య నలిగిపోయిన సామాన్య ప్రజలు- వీటన్నింటినీ దర్శకుడు చూపించ దలుచుకున్నాడు. ఇందుకు ‘హైదర్’ అనే ఒక నవయువకుణ్ణి అతడి చివికిపోయిన కుటుంబాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. కాశ్మీర్ ఉద్యమంలో హటాత్తుగా మాయమై ఆచూకీ దొరక్కుండా పోయిన వేల మంది కాశ్మీరీలు ఉన్నారు. అలాంటి కాశ్మీరీలలో హైదర్ తండ్రి కూడా ఒకడు. అలా అదృశ్యమైన తండ్రిని వెతకడం కోసం హైదర్ కాశ్మీరుకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. కాని వచ్చాక అతడికి ఊహించని విషయం తెలుస్తుంది. తన తల్లి తన బాబాయ్‌తో మెలగడం గమనిస్తాడు. అది చాలనట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా తన తండ్రి తన తల్లి సహకారంతో బాబాయ్ కుట్ర వల్ల చంపించబడ్డాడన్న సంగతిని తెలుసుకుంటాడు. అసలే బయట ఒక విధ్వంసం. ఇప్పుడు లోపల ఒక విధ్వంసం. ఆ తర్వాత జరిగిన అనేకానేక సంఘటనలు అతని ప్రమేయం లేకుండానే అతన్ని ఒక విషవలయంలోకి లాగుతాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు చెప్పిన దాంట్లో ఎంత నిజమున్నదో తెలియదు. ఎవరివి నిజాలో ఎవరివి అబద్ధాలో తెలియదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియదు. ఏ కన్నీళ్లు నకిలీవో ఏవి నిజమైనవో తెలియదు. ఏ ఆలింగనం వెనుక ఏ కుట్ర దాగుందో తెలియదు. ఇది ఒక్క హైదర్ పరిస్థితి మాత్రమే కాదు. సమస్త కాశ్మీరీలది కూడా. దీనికి కారణం ఎవరు? ఒక ప్రజా సమూహాన్ని అబద్ధంలో అభద్రతలో వంచనలో అపనమ్మకంలో అనైతికంలో నెట్టింది ఎవరు? దీనికి బీజం ఎక్కడ పడింది... దీనిని చర్చిస్తాడు దర్శకుడు. కొన్ని నేరుగా చెబుతాడు. కొన్ని ప్రేక్షకులకు వదిలిపెడతాడు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్, టబూ వంటి గొప్ప నటీనటులు పని చేశారు. నాటి కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని ఇందులో రెండు పాటలుగా మలిచారు. మెహదీ హసన్ గజల్ ఉంది. మరి రెండు పాటలకు గుల్జార్ కలంకరణ చేశాడు. బషారత్ పీర్ అనే కాశ్మీరీ జర్నలిస్టు తన జీవితంలో చూసిన వాస్తవ కథనాలను అందించాడు. ‘ప్రతీకారంతో మరింత ప్రతీకారం తప్ప జరిగేదేమీ ఉండదు’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ఈ ప్రతీకారాల వర్తమానం, సరిహద్దుల్లో కాల్పులు, వలస పోతున్న ప్రజానీకం ఇవాళ మనం చూస్తున్నాం. ‘కాశ్మీర్ మొత్తం జైలులా ఉంది’ అనడానికి చాలా సాహసం కావాలి. ఆ గొంతు వినడానికి సంయమనం కావాలి. మన సినిమా మరింత ముందుకెళ్లింది అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. - కృష్ణమోహన్‌బాబు 98480 23384 -
సదాశివకు సగౌరవ నివాళి
స్మృతి సంచిక సామల సదాశివ సంగీతానికి సేవ చేశారా సంగీతం సామల సదాశివకు సేవ చేసిందా చెప్పడం కష్టం. సంగీతం, సదాశివ వేరువేరు కాదు. తెలుగులో సినిమా సంగీతం గురించి విరివిగా రాసినవారు ఉన్నారు. దక్షిణాది సంగీతం గురించి రాసినవారూ సరే. కాని ఉత్తరాది సంగీతం గురించి తెలుగులో అందునా సామాన్య పాఠకులకు ఆసక్తి రేగేలా ఏవో ముచ్చట్లు చెబుతున్నట్టుగా రాసి, వారిని ఆ అమృతభాండాగారంలో మునకలేయించినవారు సదాశివ. తెలుగు, హిందీ, మరాఠి, ఉర్దూ భాషలలో ఆయనకున్న పాండిత్యం, ప్రవేశం తెలియనిది కాదు. ఉర్దూ, పారశీక కవుల గొప్పదనాన్ని, కలం విన్యాసాలను ఆయన అలుపెరగకుండా రాస్తూ ఆ తీపికరమైన రచనల కోసం కొత్త పాఠకులనే సృష్టించగలిగారు. సదాశివ ‘మలయమారుతాలు’, ‘యాది’ ఎంత ఆదరణ పొందాయో, ఆయన ప్రాణగడ్డ అయిన అదిలాబాదును ఎలా దర్శనీయమైన స్థలంగా చేశాయో అందరికీ తెలిసిందే. అటువంటి మహనీయునికి నిజమైన నివాళి ఏమిటి? ఇదిగో ఈ స్మృతి సంచికే. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ (కావలి- నెల్లూరు జిల్లా) వారు కె.రామచంద్రమూర్తి సంపాదకత్వ సూచనలతో వెలువరించిన ఈ 1200 పేజీల మహాసంచిక తన మకుటం- ‘పరిశోధన’కు తగినట్టుగా మహామహులు రాసిన ఉత్తమోత్తమ సంగీత, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ పరిశోధనా వ్యాసాలతో నిండి మనసుకు మాత్రమేగాక మేధకు కూడా ఆహారం కోరే వారిని ఉక్కిరిబిక్కిరి చేసేంత స్థాయిలో ఉండి ఒక అద్భుత విందు భోజనంగా మారింది. ఒకరా ఇద్దరా? వేదుల సత్యనారాయణ శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పన్యాల జగన్నాథరావు, శ్రీరంగం నారాయణబాబు, శ్రీపాద పినాకపాణి, కొండపల్లి శేషగిరిరావు, భుజంగ రాయశర్మ, ఆరుద్ర, తల్లావఝల శివశంకరశాస్త్రి, కవికొండల వేంకటరావు వంటి ఉద్దండులెందరో రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సింబలిస్టు ధోరణి- రోణంకి అప్పలస్వామి, తోలుబొమ్మలాటలు- కూర్మా వేణుగోపాలస్వామి, నీలగిరి పాటలు- యు.ఎ.నరసింహమూర్తి, వెంకట రామకృష్ణకవులు- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, హనుమంతరాయ చిత్రకళామందిరము- అబ్బూరి రామకృష్ణారావు, గీత గోవిందం- సి.వేదవతి, బౌద్ధంతో వికసించిన హిందీ- ఆలూరి బైరాగి వంటి వ్యాసాలు ఎన్నో పాఠకుల జ్ఞానదాహాన్ని పరిశోధనాభిలాషను తీరుస్తాయి. రామాయణంలో అజ్ఞాతంగా ఉండిపోయిన పాత్రగా అందరూ భావించే ఊర్మిళ గురించి కోడూరి పుల్లారెడ్డి చేసిన పరిశీలన చాలా కుతూహలం కలిగిస్తుంది. రొమాంటిసిజం గురించి నండూరి వేంకట రామకృష్ణమాచార్యులు రాసిన వ్యాసం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తప్ప. చింతా దీక్షితులు గురించి మల్లాది రామకృష్ణశాస్త్రి ఏం రాస్తారో తెలియాలంటే ఈ స్మృతి సంచికే గతి. కాళిదాస మాళవిక గురించి రాసే యోగ్యులు భుజంగరాయశర్మ కాక మరెవరు? రాయప్రోలు చెప్పిన రాయలనాటి గాథలు ఎట్టివి? ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించి అనువదించి గుదిగుచ్చి లక్షల రూపాయలు వెచ్చింది రాశి పోయడం అంటే మామూలు మాట కాదు. మన సాహిత్య సంస్కృతుల పట్ల భక్తి గౌరవాలు సరే ఒక రకమైన ఉన్మత్తత ఉంటేనే ఈ పర్వతసమానమైన పని సాధ్యం. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ తరఫున ఎన్.వి.రమణయ్య, కె.తాతిరెడ్డి కలసి గతంలో దొడ్ల రామచంద్రరెడ్డి, పి.పి.రావు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శంకరన్‌ల స్మృతి సంచికలు ఎంతో ఘనమైనవిగా, విలువైనవిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సదాశివ స్మృతి సంచిక. ఇవన్నీ ఏ ఇంట ఉన్నా ఆ ఇంట మణులు మాణిక్యాలు ఉన్నట్టు. భావితరాల కొరకు నిధి నిక్షేపాలు ఉన్నట్టు. ఇందుకోసం పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. గిరిధర్ గౌడ్ ముఖచిత్రం బాగుంది. శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రచురణలో శ్రద్ధ ఉంది. - సాక్షి సాహిత్యం పరిశోధన- సామల సదాశివ స్మృతి సంచిక వెల- అమూల్యం ప్రతులకు: 9963500130 -
‘ముహూర్తం’ కుదిరింది.. క్యారెక్టర్ దొరికింది
సినిమాలు అంటే పిచ్చి. నటనంటే ప్రాణం. అందుకే ఆ యువకుడు హైదరాబాద్ రెలైక్కాడు. అవకాశం కోసం ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌తో పాటు సినీస్టార్స, స్టూడియోలుండే ప్రతి చోటుకు వెళ్లాడు. అంతటా నిరాశే. ఇంటిబాట తప్పలేదు. కుటుంబ సభ్యులతో కొంత డబ్బు ఇప్పించుకుని మళ్లీ చలో భాగ్యనగరం. ఈ సారి ఓ ఫిలిం ఇన్సిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇండస్ట్రీ వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే ఒక కెమెరామెన్ సాయంతో ముహూర్తం అనే సినిమాలో అవకాశం లభించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాన్స కొట్టేశాడు. అలా మొదలైన సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు.. అయినా ఎదురీదుతున్నాడు. * మంచి నటుడిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం * సినీ, టీవీ ఆర్టిస్ట్ వెంకట ఎమ్మిగనూరు టౌన్: వెంకట గోవిందురాజు అలియాస్ వెంకట 14 ఏళ్లక్రితం ఎమ్మిగనూరుకు ఎస్ఎంటీ కాలనీలో నివాసం ఉండేవారు. తల్లిదండ్రులు రంగయ్య, సుభద్రమ్మలు. తండ్రి చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం (వైడబ్ల్యూసీఎస్)లో చిరుద్యోగి. స్థానిక వీవర్స్‌కాలనీ హైస్కూల్లో వెంకట పదో తరగతిదాకా చదివాడు. పుస్తకాల కన్నా సినిమా సీన్లే ఆయన కళ్లలో కదలాడేవి. అలా చదువుకు శుభం కార్డు పడింది. తర్వాత సినిమాల్లో నటించాలని హైదరాబాద్ బయల్దేరాడు. అవకాశాల కోసం ప్రారంభంలో నాలుగేళ్లు కడుపుకాల్చుకొని స్టూడియోలు, దర్శకుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేదు. దీంతో మళ్లీ ఊరికొచ్చాడు. కుటుంబ సభ్యులతో కొంత మొత్తాన్ని తీసుకువెళ్లి అభినయ ఫిలిం ఇన్సిట్యూట్‌లో ఆరు నెలలు పాటు శిక్షణ పొందాడు. అక్కడ కొద్ది మంది డెరైక్టర్లు, కెమెరామెన్లతో పరిచయం ఏర్పడింది. బంగారు చౌదరి అనే కెమెరామెన్ ‘ముహూర్తం’ అనే సినిమాలో దర్శకుడు మూర్తికి చెప్పి చిన్న వేషం ఇప్పించారు. తర్వాత సీతయ్య, బాబీలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు. ఆపై అవకాశాలు రాలేదు. టీవీ రంగం వైపు అడుగులు వేశారు. వివిధ టీవీ చానల్స్‌లో ప్రసారమైన లక్ష్యం, మిస్టర్ రోమియో, తూర్పుపడమర, ఏడు అడుగులు, శ్రీమతి శ్రీ దేవత తదితర సీరియల్స్‌లో క్యారెక్టర్ అర్టిస్టుగా నటించారు. కానీ తిరిగి సినిమా వైపు మనస్సు మొగ్గుచూపడంతో 1940 ఒక గ్రామంలో, అదేనీవు..అదేనేనులో హీరో శశాంక్‌కు మిత్రుడిగా, రైల్వేస్టేషన్, కోయిల, అమ్మనాన్న ఊరెళితే, తమాషా, నాకంటూ ఒకడు, శ్రీమతి కల్యాణం సినిమాల్లో నటించారు. ఇటీవల స్వాతి చినుకులు (ఈటీవీ), సీరియల్లో సేల్స్‌మెన్‌గా నటించారు. సినిమా అల్లుడు (జెమినీ టీవీ)లో ఫైనాన్సియర్‌గా నటించారు. డిసెంబర్ నుంచి ఆ సీరియర్ ప్రారంభం కానుంది. పస్తుతం కన్నడ, తెలుగులో నిర్మిస్తున్న దండు, కడప ముద్దుబిడ్డ సినిమాల్లో నటించానని, అవి రిలీజ్ కావాల్సి ఉందని వెంకట పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20కు పైగా సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించానని, మున్ముందు దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తే తన టాలెంట్‌ను నిరూపించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేందుకు శ్రమిస్తానని ఆయన తన మనసులో మాట చెప్పారు. -
వారిద్దరూ ఒకటవుతారు..
ఉద్ధవ్, రాజ్ఠాక్రేలపై సినీ నటుడు నానా పటేకర్ సాక్షి, ముంబై: శాసనసభ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కచ్చితంగా ఒకటవుతారని ప్రముఖ మరాఠీ, హిందీ సినీ నటుడు నానా పటేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా చానెల్ తో మంగళవారం జరిగిన మాటామంతి కార్యక్రమంలో పటేకర్ మాట్లాడుతూ ఇద్దరు సోదరులు ఒక్కటవ్వాలని గతంలో తను అనేక ప్రయత్నాలు చేశానని, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికెన్ని స్థానాలు వస్తాయో అన్న విషయం మీదే వారిద్దరి కలయిక అధారపడి ఉందని అన్నారు. అన్ని పార్టీలూ ఒంటరిగా పోటీచేస్తున్నాయి కాబట్టి ఇందులో ఎవరు లాభపడతారో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. ఓటర్లు మాత్రం మేలుకుని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు. నేర చరిత్ర గల నాయకులు ఏ పార్టీవారైనా సరే వారిని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. -
నేనొక దేశదిమ్మరిని
న్యూఢిల్లీ: కొత్త కొత్త అనుభవాలకోసం వెంపర్లాడుతుంటానని, అందువల్లనే ప్రపంచంలోని అనేక నగరాల్లో ఉన్నానని, ఒకేచోట ఉండలేకపోయానని నటి లీసారే తన మనసులో మాట చెప్పింది. త్వరలో సొంతగడ్డ అయిన భారత్‌కు రావాలని యోచిస్తున్నట్టు కేన్సర్ వ్యాధి బారినపడి విజయవంతంగా బయటపడిన ఈ 42 ఏళ్ల ఇండో కెనడియన్ ఇటీవల ప్రకటించింది. తన జీవితాన్ని, సినిమా కెరీర్‌ను మార్చేసిన తళుకుల నగరానికి రాబోతున్నానంది. ‘నేనొక దేశదిమ్మరిని. ప్రకృతిపరంగా వివిధ రకాల అనుభవాలను నా మనసు కోరుకుంటుంది. చిన్నతనంలో ఒకేచోట ఉండేదాన్ని. ఇప్పుడు జీవితంతోపాటు పరిశ్రమ కూడా మారిపోయింది. నాకు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. వెనక్కివచ్చేయాలనే ఆలోచన ఏనాటినుంచో ఉంది. అయితే ఎప్పుడు రావాలనేదే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది’ అని అంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్లనే టొరంటోనుంచి ముంబైకి రావాలనుకుంటున్నానని ఈ రెండు నగరాల మధ్య తరచూ రాకపోకలు సాగించే ఈ ‘వాటర్’ నటి తెలిపింది. ‘నన్ను తీర్చిదిద్దిన నగరంలో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాను. ఏ దేశంలో ఉన్నప్పటికీ నా మనసులో కొంత భాగం భారతదేశంలోనే ఉండేది. నా జీవితానికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. నా జీవితానికి ఏది వర్తిస్తుంది ? ఏది వర్చించదు? అనే విషయం నాకు బాగా తెలుసు. నాకు నా స్నేహితులు ఎంతో ముఖ్యం. ఇందుకు వ్యక్తిగతమైన కారణాలతోపాటు వృత్తిపరమైన కారణాలు కూడా ఉన్నాయి’ అని అంది. కాగా లీసారే కాశ్మీర్ కథాంశంగా రూపొందబోతున్న సినిమాకు సంతకాలు చేసింది. ఈ సినిమాలో సంజయ్సూరి సరసన నటించనుంది. -
బాల్యం మర్చిపోని మనిషి...
నేడుతాపీ ధర్మారావు జయంతి సాహిత్యం, సినిమా, పత్రికలు, అధ్యాపకత్వం - ఇన్ని రంగాల్లో ఏకకాలంలో కృషి చేసిన అభ్యుదయవాది అంటే ‘ఆంధ్ర విశారద’ తాపీ ధర్మారావు పేరే గుర్తొస్తుంది. 127 ఏళ్ల క్రితం జన్మించిన ఈ ‘తాతాజీ’ తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు. ఈ మానవతావాదిని అతి దగ్గర నుంచి చూసిన ఆఖరు మనుమరాలు్ర శీమతి సుజాతా షా. స్వయంగా కవయిత్రి, అధ్యాపకురాలైన ఆమె మాటల్లో... ఆ వ్యావహారిక భాషా విప్లవమూర్తి జ్ఞాపకాల్లోకి ప్రయాణం... తాపీ ధర్మారావు ‘మీ తాతయ్యట కదా’ అని ఎవరైనా అనగానే ఒక్కసారిగా యాభై ఎనిమిదేళ్ళు వెనక్కి, నా చిన్నతనానికి వెళ్ళిపోతాను. మనుమరాళ్ళలో అందరి కన్నా చిన్నదాన్ని నేను. తాతయ్యకు ముగ్గురబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. పెద్దబ్బాయి - మా నాన్న, ప్రముఖ జర్నలిస్టు తాపీ మోహనరావు. ఆఖరబ్బాయి - దర్శకుడు చాణక్య బాబాయి. నిజం చెప్పాలంటే, మా లాంటి వాళ్ళం ఆయనను తాతయ్యగానే ఎక్కువ చూశాం. కానీ, ఆయన పోయిన తరువాత రచయితగా, సినీకవిగా, పరిశోధకుడిగా ఆయన గురించి నలుగురూ చెబుతూ ఉంటే, అప్పుడు తెలిసింది - ఎంత గొప్పమనిషితో మేమింత కాలం కలసి గడిపామో అని! చిన్నప్పుడు ఆర్థికంగా చాలా కష్టపడి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, క్రమంగా యెదిగిన తాతయ్య బయట ప్రపంచంలో ఎంతో ప్రముఖులైనా ఇంట్లో మామూలు గృహస్థులా పిల్లల పట్ల అక్కరతో ఉండేవారు. మద్రాస్, ఆ తరువాత హైదరాబాద్‌ల నుంచి తాతయ్య విజయవాడలో నాన్న దగ్గరకెప్పుడొచ్చినా మాకు పండగే. పడక్కుర్చీలో పడుకొని కాళ్ళ మీద చిన్నదాన్నైననన్ను ఊపుతూ ఆయన చెప్పిన సంగతులు ఇంకా జ్ఞాపకం. పిల్లల చదువు, పెళ్ళిళ్ళ విషయంలో తాతయ్య చాలా స్వేచ్ఛనిచ్చేవారు. నాకు లెక్కలంటే భయమని నా పరీక్షల రోజుల్లో ప్రత్యేకంగా వచ్చి, నాకు పాఠాలు చెప్పేవారు. అలాగే, మేము వారం వారం ఆయనకు ఉత్తరాలు రాయాల్సిందే. కార్డు మీద ఒకవైపు యోగక్షేమాలు, మరోవైపు చిట్టి కవితలు రాసి పంపేదాన్ని. వాటికి ఆయన ఇచ్చే జవాబులు, ప్రోత్సాహం తమాషాగా ఉండేవి. ఉత్తరాలు రాకపోతే, ఆయనే టెలిగ్రావ్‌ు ఇచ్చేసేవారు. ఒకసారి స్కూల్లో హంపీ విహార యాత్ర వెళ్ళి వచ్చాక, ఉగ్ర నరసింహమూర్తి అంటూ నేను కవిత రాశా. అందులోని ‘చరాచర జీవకోటి’ లాంటి మాటలు విని, బాగుందంటూనే, ఇంకా తేలిక మాటల్లో రాయాలనడం ఇప్పటికీ గుర్తు. జన వ్యవహారంలో...: ఆ మాటకొస్తే పత్రికల్లో వ్యావహారిక భాషా వాదానికి కూడా ఆయన పెద్ద అండ. 1930 జూన్‌లో జస్టిస్ పార్టీ వారి పత్రిక ‘సమదర్శిని’లో సంపాదకులుగా, 1935-’36లో గూడవల్లి రామబ్రహ్మం సారథ్యంలోని ‘ప్రజామిత్ర’ పత్రికలో రచయితగా, 1936లో పిఠాపురం రాజా పీపుల్స్ పార్టీ పక్షాన నెలకొల్పిన ‘జనవాణి’కి ఎడిటర్‌గా పత్రికా రంగానికి తాతయ్య చేసిన సేవ, పెట్టిన ఒరవడి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. ముందు వీర గ్రాంథికవాదైనా, గిడుగు వారి ప్రభావంతో తర్వాత వ్యావహారికానికి తాతయ్య పట్టం కట్టారు. ‘కొత్త పాళీ’ పట్టారు. ఆచరణలోనూ అభ్యుదయం...: నిత్యం నేర్చుకోవాలనే తపన జీవితాంతం కొనసాగిన జిజ్ఞాసువు తాతయ్య. అందుకే, మా నాన్న గారి కమ్యూనిస్టు భావాల ప్రభావాన్నీ సంతోషంగా ఇముడ్చుకొన్నారు. పార్టీలో సభ్యులుగా నాన్న,‘ప్రజానాట్యమండలి’ బుర్రకథ కళాకారిణిగా అమ్మ రాజమ్మల వర్ణాంతర వివాహాన్ని స్వాగతించారు. ఇంటా, బయటా అభ్యుదయ మార్గంలో దండల పెళ్ళిళ్ళెన్నింటికో పౌరోహిత్యం వహించారు. అభ్యుదయ రచయితల సంఘం తొలి మహాసభలకూ ఆయనే అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు చంద్రం లాంటి వారందరితో తాతయ్యకు బాగా స్నేహం. ‘విశాలాంధ్ర’కు పేరు పెట్టి, దాన్ని ప్రారంభించిందీ ఆయనే. రాంభట్ల, బిరుదురాజు రామరాజు, సెట్టి ఈశ్వరరావు, డాక్టర్ చిట్టూరి ఆయనకు బాగా దగ్గర! ఇంటి పేరు... మనిషి తీరు...: ఇంటిపేరుకు తగ్గట్లే రచనల్లో తాపీతనం, జాప్యం మాటెలా ఉన్నా, తాతయ్య రచన కోసం దర్శక, నిర్మాతలు ఇంటికొచ్చిన సందర్భాలు నాకు గుర్తు. సినీ రచయితగా ఆయన తొలిచిత్రం ‘మోహినీ రుక్మాంగద’ (1937). ఆ పౌరాణిక చిత్రంలో ఆయన వ్యావహారిక భాషలో డైలాగులు రాయడం అప్పట్లో చర్చనీయాంశం. ‘మాలపిల్ల’, ‘రోజులు మారాయి’ చిత్రాల రచనల్లో ఆయన అభ్యుదయ భావాలు చూడవచ్చు. ఇక ఎన్టీఆర్ ‘భీష్మ’ (1962) ఆయన పూర్తి స్థాయిలో రచన చేసిన చివరి చిత్రం. అయితే, ‘మదర్ ఇండియా’ని నటి జమునతో ‘బంగారు తల్లి’ (1971)గా రూపొందించినప్పుడు పద్యం లాంటి చిన్న పాటను తాతయ్యతో బలవంతాన రాయించారు దర్శకుడైన మా చాణక్య బాబాయ్. తాతయ్య ఆఖరి సినీ రచన అది. సంపాదకీయాలు ఇవాళ్టికీ...: తాతయ్య ప్రసిద్ధ రచనలు ‘పెళ్ళి - దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ లాంటివన్నీ పలు ముద్రణలు పొందాయి. అప్పటి ప్రసిద్ధ వేగుచుక్క గ్రంథమాల కోసం ఆయన రాసిన స్వభావ పరిశోధనాత్మక నవల ‘క్రొవ్వురాళ్ళు’ తాతయ్య బతికున్నప్పుడే వేరొక పబ్లిషర్ చేతుల్లో పడి కనిపించకుండా పోయింది. కానీ, అప్పట్లో తాతయ్య స్వయంగా దిద్దుకున్న ప్రూఫు కాపీ నా దగ్గర సగం దొరికింది. అలాగే, తాతయ్య జీవితం - రచనల మీద పరిశోధన చేసిన సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్ మిగతాది కష్టపడి సంపాదించారు. అలా అది ఈ మధ్య మళ్ళీ తాతయ్య పేరు మీద పాఠకలోకం ముందుకొచ్చింది. ఇక, తాతయ్య ఎడిటోరియల్స్, వ్యాసాలు, పాటలను పుస్తకంగా తేవాలని ప్రయత్నం. మరపురాని జ్ఞాపకం...: ఆఖరు వరకు బాల్యం మర్చిపోని మనిషి ఆయన. చెప్పిందే చేస్తూ, చేసేదే చెబుతూ బతికిన ఆయన మాట్లాడు తుంటే, మెరిసే ఆ కళ్ళు ఇవాళ్టికీ నాకు గుర్తే. బొమ్మలు గీయడం, కవితలు రాయడం, ఉపాధ్యాయ వృత్తి లాంటి నా లక్షణాలకు తాతయ్య జీన్సే కారణమనిపిస్తుంటుంది. రెండేళ్ళ క్రితం తాతయ్య 125వ జయంతి సంవత్సరం సందర్భంగా విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో వేదికకు ఆయన పేరు పెట్టారు. తాతయ్య గురించి నేను మాట్లాడితే, దూరం నుంచి మైకులో నా మాటలు విన్న ఒక ఎన్నారై కుర్రాడు దగ్గరకొచ్చి సమాజం, భాష, పెళ్ళి లాంటి వాటి గురించి కొన్ని దశాబ్దాల క్రితమే తాతయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ, అప్పటికప్పుడు ఆయన రచనలన్నీ కొనుక్కొని వెళ్ళడం తాతయ్య భావాలు నవ తరానికి కూడా ప్రేరణనిస్తున్నాయనడానికి ఋజువు! సంభాషణ: రెంటాల జయదేవ మా ఇంటి పేరుకూ కథ ఉందని చెప్పేవాళ్ళు తాతయ్య. మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని రాశారట. అలా మా ఇంటి పేరు ‘తాపీ’ అయింది. సినీ రచన విషయంలో తాతయ్య అక్షరాలా తాపీగానే పనిచేసేవారట. -
డెంటిస్ట్ నుంచి డైరె క్టర్ వరకూ..!
అంతర్జాతీయ స్థాయి సినిమా అంటే అది కొందరికే సాధ్యమయ్యేది కాదు... హృదయాన్ని తాకే కథ ఏదైనా ప్రపంచ స్థాయి సినిమాకు ముడి సరకు కాగలదు. అందుకే ఎవరైనా ప్రపంచస్థాయి సినిమాను రూపొందించగలరు... అని అంటాడు పరమ్‌గిల్. ఈ సిద్ధాంతాన్ని ఇతరుల కోసమే చెప్పడం లేదు. సొంతంగా నమ్మాడు. ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించాడు. అవార్డులను అందుకొన్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఎవరైనా సమ్మతించాల్సిందే! శాన్ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో గిల్ రూపొందించిన రెండు సినిమాలు ప్రదర్శనకు నోచుకొన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన దర్శకుడితను. ఒక బాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్సినిమా.. ఈ రెండు సినిమాలూ గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యాయి. గిల్‌కు ప్రశంసలు దక్కేలా చేశాయి. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన ఇతడికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుతో పాటు లక్ష డాలర్ల బహుమతిని కూడా దక్కడం విశేషం. వృత్తిరీత్యా గిల్ ఒక డెంటిస్ట్ కావడం మరింత విశేషమైన అంశం. పంజాబ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగాడు... అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని చదువు అనే అర్హతతోనే అమెరికాకు చేరుకొన్నాడు. 2001లో ఇతడు అమెరికా వెళ్లాడు. అక్కడ మళ్లీ అవస్థలే. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. అయినప్పటికీ చదువు కొనసాగించాడు. పగలంతా కాలేజ్‌కు వెళ్లి రాత్రిపూట ఒక గ్యాస్‌ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేసేవాడట. ఇలా స్వయం సంపాదనతోనే న్యూజెర్సీలోని ఒక వర్సిటీలో డెంటిస్ట్‌గా మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఇన్ని రకాల కష్టాలతో ఎదిగిన పరమ్‌గిల్ కట్ చేస్తే దర్శకుడయ్యాడు. దాదాపు ఏడెనిమిదేళ్లు డెంటిస్ట్‌గా పనిచేసి.. అనేక వనరులను సమీకరించుకొని ‘రాకిన్ మీరా’ అనే సినిమాను రూపొందించాడు. ఆంగ్లంలో రూపొందించిన ఈ కామెడీ సినిమాను భారత్, అమెరికాల్లో చిత్రీకరించారు. సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎంతో కష్టపడ్డా ఫలితం మాత్రం అపజయమే. 2009 వేసవిలో అమెరికాలో విడుదల అయిన ఈ సినిమా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దాదాపు పదిహేను లక్షల డాలర్లు వెచ్చించి రూపొందించిన ‘రాకిన్ మీరా’ పదిలక్షల డాలర్లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇది వ్యక్తిగతంగా గిల్‌కు భారీ నష్టమే. మరొకరయితే మళ్లీ సినిమా జోలికి వెళ్లే వారు కాదు. థియేటర్లో సినిమా చూడటానికి కూడా భయపడే వాళ్లేమో. కానీ గిల్ వెనక్కి తగ్గలేదు.భారీ నష్టాన్ని ఎదుర్కొన్నా భయపడలేదు. మరో సినిమాకు స్క్రిప్ట్ రాయడంలో మునిగిపోయాడు. అలా రూపొందించినదే ‘హోటల్ హాలీవుడ్’. ఈ సినిమాకు అమెరికాలో గొప్ప స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ కాసుల పంట పండించింది. సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో పరమ్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అపజయం ఎదురైనప్పుడు పరమ్‌గిల్ నిరాశ పడి ఉంటే, అక్కడే ఆగి ఉంటే దర్శకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఉండేది కాదు. విజయం సాధించిన పరమ్‌కు కొంతమంది నిర్మాతలు కలిసివచ్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఒకేసారి ఒక హాలీవుడ్ సినిమాను, మరో బాలీవుడ్ి సనిమాను రూపొందించే అవకాశాన్ని ఇచ్చారు. హాలీవుడ్ సినిమా పేరు ‘లాస్ట్ సప్పర్’, బాలీవుడ్సినిమా పేరు‘డీఓఏ- డెత్ ఆఫ్ అమర్’ ఈ రెండు సినిమాలూ అనేక ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యాయి. విమర్శల ప్రశంసలను అందుకొన్నాయి. ఈ రెండు సినిమాలూ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. పరమ్ సినిమాలు అన్నీ థ్రిల్లర్లే. అయితే ఆ సినిమాల్లో ఉన్న మలుపుల కన్నా పరమ్ జీవితంలోనే ఎక్కువమలుపులున్నాయి! డెంటిస్టుగా స్థిరపడాల్సిన పరమ్ సృజనాత్మకతను ఆయుధంగా మలుచుకొని దర్శకుడిగా ఎదిగిన తీరుకు మించిన మలుపు ఏముంటుంది! సినీ పరిశ్రమలో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు గిల్. ఆ పుస్తకం పేరు ‘హౌ టు లాస్ ఏ మిలియన్ డాలర్స్ అండ్ నాట్ లూజ్ యువర్ స్మైల్’. ఈ పేరును బట్టే అది ఎంతటి పాజిటివ్ ఔట్లుక్ ఉన్న పుస్తకమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాత్రం పాజిటివ్నెస్ ఉంటే చాలదూ జీవితంలో విజేతగా నిలవడానికి! -
దిక్కులేని స్థితిలో సినీ పరిశ్రమ
ప్రముఖ సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మావిచిగురు తినగానే కోయిల పలికేనా.. అంటూ ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టార్‌గా పాట పాడిన వ్యక్తి మీకు గుర్తున్నారా.. ఆయనే ఈయన. పేరు వంకాయల సత్యనారాయణమూర్తి. దేశోద్ధారకుడు, జానకిరాముడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. ప్రస్తుతం కౌతవరంలో జరుగుతున్న ‘ఈ నేల- ఈ గాలి’ సీరియల్ షూటింగ్ పాల్గొనేందుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమలో నటులు, సాంకేతిక నిపుణులు తెలంగాణ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయన శనివారం ‘సాక్షి’కి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ దిక్కులేని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) ప్రశ్న : ‘సీతామహాలక్ష్మి’ సినిమా మీకు మంచి పేరేతెచ్చినట్టుంది? జవాబు : 1978లో ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టారుగా నటించాను. 36ఏళ్లు గడుస్తున్నా నన్నింకా అందరూ సీతామహాలక్ష్మి స్టేషన్ మాస్టారుగానే పలకరిస్తారు. ప్రశ్న : ఇప్పటివరకు ఎన్ని సినిమాలు, సీరియల్స్‌లో నటించారు? జవాబు : తెలుగులో 174, తమిళంలో మూడు, హిందీలో మూడు సినిమాల్లో నటించాను. అలాగే, తెలుగులో 50, తమిళంలో 12 సీరియల్స్ చేశాను. ప్రశ్న : ఆంధ్రా నటులపై తెలంగాణ సర్కార్ వివక్ష చూపుతోందంటున్నారు. కారణం? జవాబు : కేవలం నటులే కాదు. ఆంధ్రావాళ్లంటేనే తెలంగాణ ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ప్రశ్న : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది? జవాబు : దిక్కులేక అద్దె కొంపలో తెలుగు పరిశ్రమను బతికించుకునేంతగా ఉంది. ప్రశ్న : కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ వస్తుందంటారా.. జవాబు : తెలంగాణలోని ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి పరిశ్రమను ఆంధ్రాకు తరలిద్దామని సినీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. కానీ రావటానికి అవసరమైన వనరుల్ని కల్పించాలి. ప్రశ్న : ఎప్పటికి అది సాధ్యమవుతుంది? జవాబు : రాత్రికిరాత్రి పరిశ్రమను మార్చేయటం కుదరదు. నెమ్మదిగా ఆంధ్రాలోకి తీసుకురావాలి. కోట్లాది సినీ ప్రముఖుల ఆస్తులు తెలంగాణ పాలయ్యాయి. ప్రశ్న : ఆంధ్రాలో పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి? జవాబు : సింగిల్ విండో పద్ధతిని అనుసరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. -
అభిరుచులకు అనుగుణంగా సినీ సాహిత్యంలో మార్పు
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సింహాచలం: సినిమా రంగంలో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సాహిత్య విలువలు మారిపోతుంటాయని, దాన్ని ఆపలేమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శనివారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సినిమాల్లో సాహిత్య విలువలు తగ్గిపోతున్నాయని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రేక్షకుల అభిరుచులను బట్టి సాహిత్యం తీరుతెన్నుల్లో మార్పులు వస్తుంటాయన్నారు. తన వరకు సాహిత్య విలువలను కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నానన్నారు. సమాజాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలని నేటి రచయితలకు తాను సూచిస్తున్నానన్నారు. గీతం యూనివర్శిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం సింహాచల లక్ష్మీనృసింహస్వామి వరస్రాదంగా భావిస్తునానన్నారు. డాక్టరేట్ అందుకునే ముందు స్వామిని దర్శించుకోవాలని వచ్చానన్నారు. అశోకతేజ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రాకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. -
షార్ట్ రూట్ టు సక్సెస్
సినిమా తీయూలంటే క్వాలిఫికేషన్‌తో పనిలేదు. గాడ్‌ఫాదర్ అండదండలు అక్కర్లేదు. సినీ కుటుంబ వారసత్వంతో పని లేదు. మీలో ప్యాషన్ ఉంటే మేం ప్లాట్‌ఫాం కల్పిస్తావుంటోంది సినీషార్ట్స్. ఈ తరం ప్రతిభను వెలికితీయుడానికి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తోంది. బాలీవుడ్ సినీ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ, మేరీకోమ్ చిత్ర దర్శకుడు ఉమంగ్ కుమార్ తదితరులతో కూడిన జ్యూరీ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తుంది. పోటీలో గెలుపొందిన మొదటి ఐదు చిత్రాలకు బహువుతి అందించడంతో పాటు, వీటిని ఓ జాతీయు చానల్లో ప్రసారం చేయునున్నారు. మొదటి స్థానంలో నిలిచిన చిత్రానికి రూ.లక్ష, తర్వాతి స్థానాల్లో నిలిచిన చిత్రాలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇవ్వనున్నారు. ‘అగెనైస్ట్ ఆల్ ఆడ్స్’ థీమ్‌తో హిందీలో 5 నిమిషాల చిత్రాన్ని రూపొందించి సినీషార్ట్స వెబ్సైట్ (http://www.cineshorts.in) లో సబ్మిట్ చేయూల్సి ఉంటుంది. వయాకామ్ 8 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిలిం పోటీకి ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. ముంబై 48 అవర్ ఫిలిం ప్రాజెక్ట్ 48 గంటల్లో షార్ట్ ఫిలిం తీసే సత్తా మీకు ఉంటే ఈ పోటీ మీ కోసమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పోటీ అక్టోబర్ 10వ తే దీ నుంచి 12 వరకు ముంబై లో జరగనుంది. ఈ పోటీలో ఉత్తమగా నిలిచిన చిత్రాలను అంతర్జాతీయు పోటీలకు ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొంటున్న ప్రతి టీమ్‌కు జానర్‌తో పాటు ఒక డైలాగ్, ఒక ప్రాపర్టీ, ఒక క్యారెక్టర్‌ను అసైన్ చేస్తారు. వీటితో చక్కటి సినిమాను 48 గంటల్లో పూర్తి చేయూల్సి ఉంటుంది. ఈ పోటీలకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు రూ.2,500గా నిర్ధారించారు. ఇతర వివరాలకు లాగ్ ఇన్ టు.. www.48hourfilm.com/en/mumbai -
మనసంతా సినిమానే...
వెండితెరపై వెలగాలని యువ ఇంజినీర్ ప్రయత్నం ఉద్యోగం వద్దని.. నటన వైపు పయనం భరత్‌రాజ్. చదివింది ఇంజినీరింగ్. నటనంటే ప్రాణం. చదువు పూర్తయ్యాక ఓ ప్రముఖ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చినా.. వదులుకుని తనలోని ప్రతిభకు పదునుపెట్టారు. పలు లఘుచిత్రాల్లో నటించి అవార్డులు సొంతం చేసుకున్నారు. బుల్లితెరలో ప్రధాన పాత్ర పోషిస్తూ.. వెండితెరపై చిన్న వేషాలు వేస్తున్నారు. తన నటనతో అందర్నీ ఆకట్టుకోవాలని కృషి చేస్తున్నారు. పక్కా హైదరాబాదీ భరత్‌రాజ్. బంజారాహిల్స్‌లో నివాసం. అతనికి చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి. స్కూల్, కాలేజీ రోజుల్లో అనేక నాటకాలు వేశారు. తన నటనతో పలువురి మన్ననలు అందుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఢిల్లీలో ఐఏయస్ కోచింగ్‌కు వెళ్లారు. అయినా మనసంతా సినిమానే. హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం వచ్చినా వద్దని నటనపై ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. దర్శకత్వంలో ఓనమాలు.. భరత్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే అలనాటి మేటి డెరైక్టర్ పీసీ.రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో మూడు సంవత్సరాలు శిక్షణ పొందారు. క్రమశిక్షణ, సృజనాత్మకత, దర్శకత్వ మెలకువలు అలవరుచుకున్నారు. అప్పుడే పీసీ.రెడ్డి భరత్‌లోని ప్రతిభను గుర్తించి నటనవైపు వెళ్లాల్సిందిగా ప్రోత్సహించారు. అలా హాస్టల్ డేస్, దిల్ దివానాలతో పాటు పలు చిత్రాల్లో చిన్న వేషాలు వేశారు. ఆ తర్వాత కిల్లింగ్ చాందిని, ఫైనల్ ఎగ్జిస్ట్, ఎ పోస్ట్‌కార్డ్ టు గాడ్ అనే లఘు చిత్రాల నిర్మాణంలో పాల్పంచుకున్నారు. కిల్లింగ్ చాందిని అనే లఘు చిత్రంలో నటనకుగాను 48 అవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తర్వాత ఆర్కా మీడియా ‘మేఘమాల’ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం బాహుబలి చిత్రంలో ఒక చిన్న పాత్రలో భరత్‌రాజ్ నటిస్తున్నారు. కళాకారులకు తోడ్పాటు.. తనలాంటి సినీ కళాకారులకు తగిన గుర్తింపు అందించేందుకు భరత్ రాజ్ సహాయ సహకారాలు అందిస్తుంటారు. సినిమా, నటన , దర్శకత్వం మీద తపన ఉన్న వారికి తన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తోడ్పడుతుంటారు. వారితో చిన్న చిత్రాలు తీయించి యూ ట్యూబ్‌లో ఉంచి.. తగిన గుర్తింపు లభించేలా చేస్తుంటారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లఘు చిత్ర పోటీలను నిర్వహించి.. న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన ఉత్తమ చిత్రానికి నగదు పురస్కారం భరత్ అందిస్తున్నారు. సినీ రంగంలో ఓ మంచి నటుడిగా గుర్తింపు కోసం కష్టపడతానిని చెబుతున్న భరత్ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. -
సినిమా ప్రభావంతో యువత పెడదారి...
కవి మిట్టపల్లి సురేందర్ భీమారం : జనం కోసమే తాను పాటలు రాస్తున్నానని కవి మిట్టపల్లి సురేందర్ అన్నారు. భీమారంలోని ఎన్ఆర్ఐ కళాశాల నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సినిమాల వల్ల యువత పెడదారిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో వస్తున్న పాటలు కేవలం వ్యాపార దృక్పథానికి సంబంధించినవిగా పేర్కొన్నారు. దర్శకులు, నిర్మాతలు వ్యాపార ధోరణితోనే సినిమాలు తీస్తున్నారన్నారు. కష్టపడి పనిచేస్తేనే కళాకారుడికి గుర్తింపు వస్తుందన్నా రు. తెలంగాణ ప్రాం తంలో వేలాది మంది కళాకారులు ఉన్నారన్నారు. ఇక్కడి కళాకారులకు సరైన గుర్తింపు లేదన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పటికీ ఇక్కడ ఉన్న దర్శకు లు, నిర్మాతలు ఈ ప్రాంత కళాకారులతో సిని మాలు తీయడానికి శ్రద్ధ చూపడం లేదన్నారు. తెలంగాణ వచ్చినప్పటికీ సినిమా రంగం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దర్శకులు, నిర్మాతలే శాసించే అవకాశం ఉందన్నారు. పూర్వ కాలపు సినిమా, ఇప్పటి సినిమాలకు చాలా వ్యత్యా సం ఉందన్నారు. అలనాటి సిని మాలను కుటుంబ సపరివారంగా చూసేవారని, పాట లు సైతం వినసొంపుగా ఉండేవని వివరించా రు. ప్రస్తుత సినిమాలు కుటుం బంతో చూసే పరిస్థితులు లేవన్నారు. ఇప్పటి సినిమాల్లో పాడుతున్న పాటల్లో కనీసం భాష కూడా సక్రమంగా లేదన్నారు. పాడుతున్న పాటకు సరైన అర్థం కూడా లేదని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 400 పాటలు రాసినట్లు సురేందర్ చెప్పారు. ఇందులో 30 పాటలను పాడినట్లు తెలిపారు. ఇందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకూ తెలియదురా’ అనే పాట రాష్ర్ట వ్యాప్తంగా మంచిపేరు తీసుకోచ్చిందన్నారు. రాజన్న, నాన్ స్టాప్, ధైర్యం సినిమాలకు పాటలు రాసినట్లు చెప్పారు. తాను రాసిన పాటలు ఎక్కువగా తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమానికే సంబంధించినవిగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో తాను రాసిన పాటలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. తెలంగాణ రాష్ర్ట సమితిని ప్రజలు విశ్వసించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధైర్యం చేసి తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇక్కడ ప్రజలు ఆ పార్టీని నమ్మకుండా టీఆర్ఎస్కు ఓటు వేశారని సురేందర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు రాస్తానని పేర్కొన్నారు. -
పులిరాజా ఐపీఎస్ హల్చల్
పొట్టి రాంబాబు గుర్తున్నాడా.. అదేనండి ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్‌కు పొట్టి ఫ్రెండ్‌గా కనిపించి కడుపుబ్బ నవ్వించాడు కదా.. గుర్తొచ్చిందా.. అరె అతని గురించి ఇప్పుడు ప్రస్తావనెందుకు.. అనుకుంటున్నారా. ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ మధ్య ‘హృదయ కాలేయం’ సినిమా హీరో సంపూర్ణేశ్బాబుపై ఫేస్బుక్లో చేసిన కామెంట్స్, ఫొటోలకు మంచి స్పందన రావడంతో తాజాగా మన పొట్టి రాంబాబు రంగంలోకి దిగాడు. ‘పులిరాజా-ఐపీఎస్’ సినిమాలో లీడ్‌రోల్ చేస్తున్న ఆయన షూటింగ్లో దిగిన పలు ఫొటోలతో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నాడు. భుమికి మూడడుగుల ఎత్తులో ఉండే రాంబాబు ‘స్టార్ రభాస్’ పేరుతో సిక్స్‌ప్యాక్ కసరత్తులు చేయడం నెటిజన్లను నవ్విస్తోంది. టైటిలే కామెడీగా ఉండటంతో చాలామంది అప్లోడ్ చేసుకుని ఫన్నీగా నవ్వుకుంటున్నారు. ఈ పొట్టి రాంబాబు త్వరలో ‘పులిరాజా-ఈఫ్స్’ అంటూ రచ్చ కూడా చేస్తాడట. ఇప్పటికే చిన్నపిల్లలతో ‘పులిరాజా ఎవడ్రా..’ అంటూ చేసిన ప్రచార టీజర్, ఇతర లఘుచిత్రాలతో యూట్యూబ్‌లో సందడి చేశాడు. ‘కథానాయకుడు’ సినిమాలో రజనీకాంత్‌తో, ‘దొంగ దొంగది’లో మనోజ్ స్నేహితుడిగా ఆకట్టుకున్న పొట్టిరాంబాబు పలు చిత్రాల్లో హాస్యం పండించి కమింగ్ సిక్స్‌ప్యాక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఈ చిత్ర దర్శకుడు తిరువాయిపాటి రాఘవ సోషల్ నెట్‌వర్క్‌లో పేర్కొన్నారు. వినూత్న రీతిలో హల్చల్ చేస్తున్న పులిరాజా-ఐపీఎస్ పొట్టి రాంబాబును చూసి ఫేస్బుక్, యూట్యూబ్ ప్రియులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదిఏమైనా చిన్నచిత్రాల దర్శకులు, నటులు తమ ఉనికిని ప్రదర్శించుకునేందుకు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయించటం, వారిని నెటిజన్లు ఆదరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. - నాగాయలంక -
సాటిలేని పరిణీత నటి
నేడు మీనాకుమారి జయంతి మరణించే ముందు ‘నూర్జహాన్’ కవిత రూపంలో ‘‘మిత్రులారా దయచేసి నా సమాధి పక్కన ‘గుర్తుగా’ నా కోసం మొక్కను నాటకండి అని కోరిందట. ఎందుకంటే వసంతకాలంలో కోయిలలు వచ్చి గీతాన్ని ఆలపిస్తాయి. అలా ఆలపించే సమయం లో వాటి కన్నులలోంచి వెచ్చని కన్నీరు జారి నా సమాధి మీద పడుతుంది... ఎవరైనా కన్నీరు కారిస్తే నా కళ్లు చూడలేవు’’ అని రాసింది. ఎంత గొప్ప కవిత! కోయిల కన్నీరు కారిస్తే చూసి సహించలేని బేల హృదయం నూర్జహాన్దేతై... జీవితాన్ని ‘నలిపి’ వేసిన వారిని కూడా క్షమించి ‘‘మిగిలిన ‘సినిమా’ షూటింగ్‌ని పూర్తి చేసుకో, నేనెక్కువ కాలం బతకను’’ అని చివరి కాల్షీట్లనిచ్చి తన గుర్తుగా ‘పాకీజా’లాంటి సినిమాని మిగిల్చిపోయిన బేల హృదయం ‘మెహజబీన్బానో’ అన్న పేరు పెట్టబడిన మీనాకుమారిది. తల్లి ఇక్వాల్ ఉన్నీసా... తండ్రి ఆలీ బక్ష్. తల్లి స్వచ్ఛమైన హిందువు. రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడి మనవరాలు. అసలు పేరు ప్రభావతి. ఆమె నృత్యకళాకారిణి కూడా. దాంతో మెహజబీన్కి అటు సంగీతం, ఇటు నృత్యం రెండూ అబ్బాయి. ‘నటి’ కావాలనే తల్లి ఆశ మీనాకుమారి ద్వారా తీరుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. మీనాకుమారిని ‘గుర్తించి’ వేషమిచ్చింది విజయ్ భట్. మొదటి పారితోషికం పాతిక రూపాయలు. సినిమా పేరు లెదర్ఫేస్! మెహజబీన్ని ‘బేబీ మీనా’గా మార్చిందీ విజయ్ భట్గారే. మీనాకి హీరోయిన్గా మొదటి సినిమా కేదార్ శర్మగారి ‘దాదాజీ’. దురదృష్టం ఏమంటే సినిమా పూర్తయ్యాక ‘నెగటివ్’ పూర్తిగా కాలిపోయింది. తమాషా అనే పిక్చర్ షూటింగ్లో మీనాకుమారి కమాబ్ అమ్రోహీని కలిసింది. ఆయన ‘మవాల్’ (అశోక్ కుమార్, మధుబాల) సినీ చరిత్రని తిరగరాసింది. తండ్రి ఆలీబక్ష్‌కి తెలియకుండా సోదరి ‘మధు’ సాయంతో ‘సయ్యద్ అమీర్ హైదర్ కమాల్, నభ్వీ (కమాల్ అమ్రోహీ)ని పెళ్లి చేసుకుంది మీనా కుమారి. కమల్‌కి అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. 1953లో ఫిలింఫేర్ పత్రిక ప్రవేశ పెట్టిన తొట్ట తొలి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు మీనాకుమారిని వరించింది. ‘బైజూ బావ్రా’ ఆమెని సూపర్‌స్టార్‌ని చేస్తే, ‘ఫుట్‌పాత్’ చిత్రం నెగిటివ్ కాలిపోయి మీనాకి దుఃఖాన్ని మిగిల్చింది. 1553లో కమాల్ అమ్రోహీ నిర్మించిన ‘దాయ్రా’లో నటిస్తూ ‘ఇంటి’ని వదిలి కమాల్ దగ్గరికి కట్టు బట్టల్తో వెళ్లిపోయింది మీనా. అది ఫ్లాప్. శరత్చంద్ర నవల ‘పరిణీత’లో నటించి (అశోక్ కుమార్ మీరా) 1954 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది. ఒక పక్క సినిమా తర్వాత సినిమా, మరో పక్క కమాల్ అమ్రోహీ పెడుతున్న ఆంక్షలతో మీనాకుమారి నలిగిపోయింది. జీవితంలో ఒక్కో అడుగూ దిగిపోతూ మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ‘సాహబ్ బీబీ గౌర్ గులామ్’లో సహజత్వం కోసం మొట్టమొదట గొంతులో పోసుకున్న ‘బ్రాందీ’ మీనాకుమారికి జీవిత సహచరిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేగాదు, కమల్ అమ్రెహ ప్రొడక్షన్ మేనేజర్ బాకర్ ‘పింజ్డే కీ పంభీ’ (పంజరంలో పక్షి) షూటింగ్లో మీనాని చెంపదెబ్బ కొట్టడం. టాప్ హీరోయిన్ని ఆఫ్ట్రాల్ మేనేజర్ కొట్టడమా? ప్రేమ దొరక్క... ప్రేమ అనే ఆకలి తీరక మీనా ‘మందు’లో ప్రేమను వెదుక్కుంది. మీనా సహజ రచయిత్రి. కవితలల్లేది. మేరీ అప్నే - దుష్మన్... ఇవన్నీ అనారోగ్యంతో చేసిన సినిమాలే. అయినా ఆమెకి ఆమే సాటి అని నిరూపించాయి. మళ్లీ కమాల్‌కి ఫోన్ చేసి ‘నీ సినిమా పూర్తి చేసుకో’ అని ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఎవరికి ఏది ఎలా ఎప్పుడు ఇవ్వాలని ‘అల్లా’ నిర్ణయించాడో అంతిమ ‘గమ్యా’న్ని చేరింది మెహజబీన్బానో (సాటిలేనిది అని అర్థం). ఏదయితేనేం పాకీజా అద్భుత విజయాన్ని విన్న మీనా ‘ఇన్షా అల్లా’ అంది. ఇది ఆమె భూమి మీదకొచ్చిన తొలి దినం! అందుకే ఆమెను మళ్లీ మళ్లీ స్మరించుకుందాం! మన జ్ఞాపకాలలో ఆమెను బతికించుకుందాం!! - భువనచంద్ర (సినీ గీత రచయిత) -
అలా చెప్పుకోవడం విని నవ్వొచ్చేది!
లైఫ్‌బుక్ - నిమ్రత్, హీరోయిన్ (లంచ్‌బాక్స్ ఫేమ్) నాన్న మిల్ట్రీ ఆఫీసర్. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాశ్మీర్లో మిలిటెంట్ల కాల్పుల్లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంది అమ్మ. ఢిల్లీ కాలేజిలో చదువుతున్న రోజుల్లో ముంబాయికి వెళ్లి సినిమాల్లో నటించాలని కలలు కనేదాన్ని. ‘ముంబాయి వెళతాను’ అని అమ్మకు చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను. ముందు కాదన్నా... ఆ తరువాత ఒప్పుకుంది. ప్రతి ఒక్కరు అమ్మను - ‘‘మీ అమ్మాయి ముంబాయికి ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం చేస్తుంది?’’లాంటి అనుమానపు ప్రశ్నలు అడిగేవారు. ఈ ప్రశ్నలతో అమ్మకు కోపం నషాలానికి అంటేది. వెంటనే నాకు ఫోన్ చేసి - ‘‘ఉద్యోగం దొరికిందా? దొరకకపోతే వచ్చేయ్’’ అని ఆజ్ఞాపించేది. ఇక నటన విషయానికి వస్తే హాబీగా మాత్రమే దాన్ని తీసుకోవాలని, వృత్తిగా ఎంచుకోవద్దని గట్టిగా చెప్పేది. ‘‘మీ అమ్మాయి సినిమాల్లో నటిస్తుందా?’’ అని నోళ్లు నొక్కుకున్న వాళ్లే ‘లంచ్‌బాక్స్’ సినిమాకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభించిన తరువాత ‘మాకు బాగా తెలిసిన అమ్మాయి’ అని నా గురించి చెప్పుకోవడం విని నవ్వొచ్చేది! -
తెలుగు.. ఎప్పటికీ వెలుగే..
తనికెళ్ల భరణి నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చి తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న నటుడు తనికెళ్ల భరణి. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎక్కని మెట్టు లేదు. తెలుగు భాషపై పట్టు కలిగిన భరణి భాషాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. తాను తీసే ప్రతి సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. నగరంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు.. - విజయవాడ ప్ర : దర్శకుడిగా, నటుడిగా,రచయితగా, నిర్మాతగా ఇలా చాలా పాత్రలు పోషించారు కదా.. మీకు నచ్చిన, మీరు మెచ్చిన అంశం ఏమిటీ? జ : అన్నీ నాకు నచ్చినవే. నా నిర్మాత నుంచి నా రచనలకు ఏవిధమైన ఒత్తిడి లేదు. ఇష్టపడి చేసిన అన్ని రంగాలూ నాకు పేరు తెచ్చినవే. ప్రశ్న : మీరు సినీరంగంలోకి వచ్చాక ఏం నేర్చుకున్నారు? జ : అదో పద్మవ్యూహం. సినీరంగం నుంచి నేను బతకటం నేర్చుకున్నా. ఈ రంగంలోకి వచ్చి 30 సంవత్సరాలైంది. ప్రస్తుతం ప్రయాణం సుఖంగా సాగుతోంది. ప్ర : ప్రస్తుతం తెలుగు సినిమా హీరో చుట్టూ కథ తిరుగుతోంది కదా.. సినిమాకు న్యాయం జరుగుతోందా? జ : నిర్మాతకు న్యాయం జరుగుతోంది కదా.. ప్ర : జంధ్యాల స్మారక పురస్కారంపై మీ స్పందన.. జ : జంధ్యాల అవార్డు నాకు రావటం సంతృప్తినిచ్చింది. 39 సంవత్సరాల కిందట సుమధుర సమాజం ద్వారా ప్రదర్శించిన కొక్కురొక్కో.. నాటకం అవార్డు తెచ్చిపెట్టింది. ప్ర : తెలుగు అంతరించిపోతోందని మేధావుల వాదన. దీనిపై మీరేమంటారు? జ : తెలుగు అంతరించిపోదు. 20ఏళ్ల నుంచి వచ్చిన సాహిత్యం చూస్తే చాలు మీకు సమాధానం దొరుకుతుంది. ప్రజల్లో సాహిత్య పిపాస పెరిగింది. ప్ర : మరి భాషా ఉద్యమాలు.. జ : వారి పని వారిని చెయ్యనివ్వండి. ప్ర : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు సినిమా పరిస్థితి ఏమిటీ? జ : నాకు తెలియదు. ప్ర : నేటి సినిమాల్లో అరువు తెచ్చుకున్న కథలు, ఎరువు తెచ్చుకున్న గొంతులు ఉంటున్నారుు. దీనిపై మీ కామెంట్. జ : పాతతరం నటులు చాలామంది బహుభాషా చిత్రా ల్లో నటించారు. వారి ప్రతిభకు భాష అడ్డుకాలేదు. నేను, కోట శ్రీనివాసరావు పరభాషా చిత్రాల్లోనూ నటించాం. ప్ర : మీరు ‘ప్యాసా’ గ్రంథం రాశారు కదా.. అసలు ప్యాసా అంటే ఏమిటీ? జ : ప్యాసా అనేది ఉర్దూ పదం.. దాహార్తి అనుకోవచ్చు. ప్ర : మీరు వేయూలనుకున్న పాత్ర ఏమైనా ఉందా.. జ : శకుని పాత్ర వెయ్యూలని ఉంది. -
అమ్మవారి సేవలో సినీ నటుడు మోహన్‌బాబు
బాసర : శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు వారికి ఆలయాధికారులు ఘనస్వాగతం పలికారు. మోహన్‌బాబు, ఆయన భార్య, పెద్ద కుమారుడు మంచు విష్ణు, కోడలు, మనుమరాళ్లు అరియాన, విరియానా వచ్చారు. మనుమరాళ్లకు అక్షరాభ్యాసం చేయించారు. కుటుంబమంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ అందజేసి ఆశీర్వదించారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్ మోహన్‌బాబు కుటుంబాన్ని శాలువాలతో సన్మానించారు. వారిని చూసేందుకు అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈవో ముత్యాలరావు, ఏఈవో అశోక్, సూపరింటెండెంట్ సాయిలు, జ్యోతిష్యులు దైవగ్న, బాసర, లోకేశ్వరం, ముథోల్ ఎస్సైలు నాగరాజు, వెంకటేశ్, రాజన్న, శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!!
షంషుద్దీన్ ఇబ్రహీం... సినిమాలలో షామ్‌గా మారారు... కిక్ సినిమాతో కిక్ షామ్ అయిపోయారు... రేసుగుర్రం చిత్రంతో తెలుగువారి హృదయాలు దోచుకున్నారు... పంజాబీ అమ్మాయిని భార్యగా చేసుకున్నారు... ఇద్దరు కూతుళ్లు... అమ్మ చేసే దక్షిణాది వంటకాలు... భార్య చేసే ఉత్తరాది వంటకాలు... టు స్టేట్స్ వంటకాలనూ టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు... షూటింగ్లలో బిజీగా ఉంటూ కూడా అప్పుడప్పుడు గరిటె పట్టుకుని టూ మినిట్స్ రుచులనూ చూపిస్తారు... కిక్ షామ్ చెప్పిన ముచ్చటైన ఇంటి కబుర్లు... వాటికి తోడుగా రంజాన్ పండుగకు వారి ఇంట్లో ఘుమఘుమలాడే వంటింటి కబుర్లు... మీరు శాకాహారం ఇష్టపడతారా? మాంసాహారం ఇష్టపడతారా? నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. అయితే మా ఆవిడ కామ్నా... పంజాబీ హిందూ కావడంతో ఎక్కువగా పంజాబీ వంటకాలే చేస్తుంది. ముఖ్యంగా చోలే బటూరా చాలా బాగా చేస్తుంది. మీ కుటుంబం గురించి... నేను నటుడిని కాక ముందే నాన్నగారు మరణించారు. అమ్మకు మేం నలుగురు పిల్లలం. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మ అందరికీ కావాలి కనుక మా అందరి దగ్గర తలో మూడు నెలలు ఉంటారు. మాది ప్రేమ వివాహం. మేం తమిళులం. మొదట్లో మా పెళ్లిని మా అమ్మగారు అంగీకరించలేదు. కాని తరవాత అర్థం చేసుకున్నారు. ఉత్తరాది వంటకాలు మా ఆవిడ, దక్షిణాది వంటకాలు అమ్మ చేసి, వారిద్దరూ ఒకరి రుచులను ఒకరు ఆస్వాదిస్తున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద పాప సమైరా. ఒకటో తరగ తి చదువుతోంది. రెండో పాప కియారాకు రెండేళ్లు. నాకు ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. బాగా ఆడతాను కూడా. పండుగలెలా జరుపుకుంటారు? మేం అన్ని పండుగలూ జరుపుకుంటాం. దీపావళి, రంజాన్ ఇంకా మిగతా పండుగలు కూడా. నా ప్రాణస్నేహితులు అజయ్ క్రిస్టియన్, అందుకని క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తాం. మీకు బాగా ఇష్టమైన వంటకం? నాకు సాంబార్ అన్నం, అందులో వందలకొద్దీ అప్పడాలు ఉంటే చాలా చాలా చాలా ఇష్టం. అది ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు. మీ కోసం మీ భార్య ప్రత్యేకంగా ఏయే వంటలు చేస్తారు? చిల్లీ చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేస్తుంది. అయితే గతంలో ఇవేవీ తనకు చేయడం రాదు. నా కోసమని ప్రత్యేకంగా వంటల పుస్తకాలు తెచ్చి చదివి నేర్చుకుంది. (నవ్వుతూ) ఏ ప్రయోగం చేసినా ప్రథమ బాధితుడిని నేనేగా! మీ భార్య కోసం మీరు ప్రత్యేకంగా ఏం తయారుచేసి పెడతారు? అత్యంత తేలికగా అయిపోయే మ్యాగీ నూడుల్స్, ఆమ్లెట్. మీరు చిన్నతనంలో ఎప్పుడైనా వంట చేశారా? లేదంటే ఎప్పుడైనా మీ అమ్మగారికి వంటలో సాయం చేశారా? నాకు తినడమంటే ఇష్టం! అప్పట్లో తినడమే తప్ప, వండింది ఎక్కడ! అయితే అప్పుడప్పుడు అమ్మకి ఉల్లిపాయలు, టొమాటోలు కట్ చేసి పెట్టేవాడిని. మీరు చదువుకునే రోజుల్లో కనీసం మీ స్నేహితుల కోసం ఎప్పుడైనా వంట చేశారా? చెయ్యకేం చక్కగా చేశాను. అదేంటో చెప్పమంటారా... బ్రెడ్ - జామ్ - బటర్. బావుంది కదూ! పెళ్లయ్యాక అప్పుడప్పుడు వంట చేయడం తప్పుదు కదా! అలా మీరు చేసిన మొట్టమొదటి వంటకం? అలాగే వంటగదిలో మీ మొదటి అనుభవం? నిజమే! తప్పదుగా! అందుకే చాలా తేలికగా తయారయ్యే మ్యాగీ టూ మినిట్స్ నూడిల్స్ చేశాను. నేను చక్కగా చేసిన నా మొదటి వంటకం అదే. అంతకు ముందు ఒకసారి కోడిగుడ్లు ఉడకపెట్టడం కోసం వంట గదిలోకి వెళ్లి గది మొత్తం గందరగోళం చేసేశాను. అనుభవం లేకపోతే అంతే కదా మరి! మీ పిల్లలకు మీరు చేసిన వంట ఇష్టమా? మీ భార్య చేసిన వంట ఇష్టమా? ఇద్దరి వంటా ఇష్టపడతారు. నేను మాత్రం పిల్లల కోసం ప్రత్యేకంగా కార్న్‌ఫ్లేక్స్, ఓట్స్ చేస్తాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు ఎప్పుడైనా మీ అమ్మగారికి కాని, మీ భార్యకి కాని ప్రత్యేకమైన వంట ఏదైనా తయారుచేశారా? అమ్మకోసం ఒకసారి రంజాన్ రోజున బాదం ఖీర్ చేశాను. అంతే! సాధారణంగా... అమ్మ చెన్నై వంటకాలు, మా ఆవిడ పంజాబీ వంటకాలు తయారుచేసి నాకే పెడతారు. హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ వంటలు ఆరగిస్తుంటాను. రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా ఏయే వంటకాలు తయారుచేస్తారు? మటన్ బిర్యానీ మాత్రమే ప్రత్యేకంగా చేస్తాం. సినీ పరిశ్రమకు చెందిన నా మిత్రులు మా ఇంటికి బిర్యానీ తినడానికి తప్పకుండా వస్తారు. మా అమ్మగారే స్వయంగా వండుతారు. మీ అమ్మగారే ఎందుకు తయారుచేస్తారు? నా దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ కుక్ మా మదర్. రంజాన్ సందర్భంగా మీరు మీ అమ్మగారికి ప్రత్యేక బహుమతి ఏదైనా ఇస్తుంటారా? రంజాన్‌కి ఏమీ ఉండదు. కాని ప్రతి డిసెంబరు మాసంలోనూ అమ్మతో కలిసి ఎక్కడో ఒక చోటుకి వెళతాం. కిందటి సంవత్సరం సింగపూర్ వెళ్లాం. ఈ సంవత్సరం దుబాయ్ వెళ్లాలనుకుంటున్నాం. - సంభాషణ: పురాణపండ వైజయంతి మటన్ బిర్యానీ కావలసినవి: మటన్ - కేజీ; బాస్మతి బియ్యం - అర కేజీ; పసుపు - చిటికెడు; కుంకుమపువ్వు - చిటికెడు; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - 5 టేబుల్ స్పూన్లు; ఉడికించిన కోడిగుడ్లు - 2; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు - 2 కప్పులు (గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి); పుదీనా - ఒక కట్ట; పచ్చి మిర్చి - 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); పెరుగు - రెండు కప్పులు; జీడిపప్పు - 50 గ్రా.; జీలకర్ర - టీ స్పూను; గరం మసాలా - 2 టేబుల్ స్పూను; మటన్ బిర్యానీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ఒక పాన్‌లో మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, గరం మసాలా, పెరుగు, ఉల్లి తరుగు వేసి సుమారు గంటసేపు ఊరనివ్వాలి ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక... నూనె, ఉప్పు, బాస్మతి బియ్యం వేసి హాఫ్ బాయిల్ చేయాలి మరొక పాన్‌లో ఊరబెట్టిన మటన్ మిశ్రమాన్ని కింద వేసి, ఆ పైన హాఫ్ బాయిల్డ్ అన్నం, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, వేయించిన ఉల్లి తరుగు వేయాలి ఈ విధంగా అన్నం ఒక పొరలా, పైన మటన్ మిశ్రమం ఒక పొరలా వేయాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని పొరలుగా వేసి, సుమారు 30 నిమిషాలు ఉడికించి దింపాలి పూర్తిగా ఉడికిన తర్వాత పసుపు, కుంకుమ పువ్వు, మిరప్పొడి, ఉడికించిన కోడిగుడ్లు, జీడిపప్పు, నిమ్మరసం ఒక దాని తరవాత ఒకటి వేస్తూ కలపాలి చివరగా మటన్ బిర్యానీ మసాలా, కొత్తిమీద వేసి కలపాలి వేడివేడిగా వడ్డించాలి. చిల్లీ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - 500 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కోడిగుడ్డు - 1 కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; సోయా సాస్ - 4 టేబుల్ స్పూన్లు; రిఫైన్డ్ ఆయిల్ - కప్పు; ఎండు మిర్చి - 4; ఉల్లిపాయలు - 2 (ముక్కలుగా కట్ చేయాలి); వెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు; వేడి నీళ్లు - 2 కప్పులు; క్యాప్సికమ్ - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), ఉప్పు - తగినంత తయారి: చికెన్ ముక్కలలో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, టేబుల్ స్పూను సోయా సాస్, కోడి గుడ్డు సొన జత చేసి అన్నీ బాగా కలిసేలా కలిపి సుమారు అరగంటసేపు ఊరనివ్వాలి బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఎండు మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాక, వెల్లుల్లి తరుగు వేసి ఒక నిమిషం వేయించాలి సోయా సాస్, టొమాటో కెచప్ వేసి మరో నిమిషం పాటు క లిపి దించేయాలి మరొక బాణలి స్టౌ మీద ఉంచి, మిగిలిన నూనె వేసి కాగాక, ఊరబెట్టుకున్న చికెన్ మిశ్రమంలో నాలుగో వంతు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇదే విధంగా మిగతా చికెన్‌ను కూడా వేయించి, వెంటవెంటనే ఉల్లి తరుగు వేయించుకున్న బాణలిలో జాగ్రత్తగా వేస్తుండాలి అంతా పూర్తయ్యాక బాణలిని స్టౌ మీద ఉంచి మూడు నిమిషాలు బాగా కలపాలి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి, చికెన్ మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (సుమారు ఆరేడు నిమిషాలలో ఉడికిపోతుంది) క్యాప్సికమ్ తరుగు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ఒక కప్పులో... టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్, ఆరు టేబుల్ స్పూన్ల చల్లటి నీళ్లు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి, ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి కలిపి, గ్రేవీ కొద్దిగా చిక్కబడగానే దింపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. షీర్ కుర్మా కావలసినవి: సేమ్యా - 75 గ్రా. (సన్నగా ఉండే సేమ్యా); పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 200 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్రీమ్ - 200 గ్రా; నెయ్యి - టేబుల్ స్పూను; గింజలు తీసిన ఖర్జూరాలు - 3; కిస్మిస్లు - 7; జీడిపప్పు పలుకులు - 7; బాదం పప్పులు - 4; ఏలకులు - 4; పంచదార - రుచికి తగినంత తయారి: పొడవుగా ఉన్న సేమ్యాను చిన్నచిన్న ముక్కలు గా చేయాలి ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి, పైన తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు చేయాలి ఏలకులను పొడి చేసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, కిస్మిస్లు వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో జీడిపప్పు పలుకులు వేసి వేయించి తీసేయాలి సేమ్యా వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి పాలు పోసి ఆపకుండా కలుపుతుండాలి పాలు మరిగిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మరో నిమిషం పాటు కలపాలి క్రీమ్ వేసి మరో నిమిషం పాటు కలపాలి పంచదార వేసి బాగా కలిపి, తీపి సరిపోయిందీ లేనిదీ రుచి చూసుకోవాలి ఏలకుల పొడి, ఖర్జూరాల తరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్స్‌లోకి తీసుకోవాలి వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పుల తరుగు వేసి అతిథులకు అందించాలి. చెన్నై సాంబారు సాంబారు దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన వంటకం. ఇది పప్పుతో తయారయ్యే వంటకం. దీనిని సాధారణంగా అన్నంతో తీసుకుంటారు. ఇడ్లీతో చాలా ఇష్టంగా తింటారు. కావలసినవి: కందిపప్పు - కప్పు; కూరగాయ ముక్కలు - అర కప్పు; చింతపండు రసం - పావు కప్పు; సాంబారు ఉల్లిపాయలు - 10 (చిన్నవి, తొక్క తీయాలి); టొమాటో - సగం చెక్క; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేసుకోవాలి); పసుపు - పావు టీ స్పూను; సాంబారు పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత పోపు కోసం: ఆవాలు - పావు టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; మెంతులు - ఆరు గింజలు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి); నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి, చల్లారాక గరిటెతో బాగా మెదపాలి ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా వేయించాలి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి చింతపండు రసం వేసి పచ్చి వాసన పోయేవరకు ఉడికించాలి కొద్దిగా నీటిలో సాంబారు పొడి, ఇంగువ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి మరుగుతున్న సాంబారులో వేయాలి ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి కరివేపాకు వేసి అన్నంతో వేడివేడిగా అందించాలి. -
సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే
ఇప్పటికైనా బయటపడితే మంచిది సాంస్కృతిక ఆధిపత్యం సినిమాతోనే మొదలైంది ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బంజారాహిల్స్: సినిమా ప్రభావశీల మాధ్యమమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణపై సాంస్కృతిక ఆధిపత్యం సినిమా ద్వారానే మొదలైందని తెలి పారు. ఈ పరిశ్రమను శాసిస్తోన్న నాలుగు కుటుంబాల కబంధ హస్తాల నుంచి బయట పడినప్పుడే తెలంగాణ సినిమా మనగలుగుతుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిలిమ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ లోగోను అల్లం, వెబ్‌సైట్‌ను సుప్రసిద్ధ దర్శకుడు బి.నర్సింగరావు ఆవిష్కరించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ సినిమాకు మన భాష, యాస, ప్రవర్తనలను మార్చగలిగే శక్తి ఉందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ సినిమాలు రూపొందించడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. మాభూమి వంటి సినిమాలను చూస్తే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు సినీ రంగంలో విషనాగులు ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సినీ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి, టీఈఎంజేయూ అధ్యక్షుడు రమణ, టి దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీధర్, టి ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ?
రుద్రమదేవి చిత్రం షూటింగ్లో నగలు మాయంపై లభించని క్లూ? దొంగ ఎవరు? అసలు బంగారం ఎంత..? పోలీసులకు సవాల్‌గా మారిన దర్యాప్తు సాక్షి, సిటీబ్యూరో: రుద్రమదేవి సినిమా షూటింగ్లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కిలోన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా క్లూ లభించలేదు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్‌గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదనడం కొత్త అనుమానాలకు తెరలేపింది. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా రుద్రమదేవి సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకు వస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు. ఇలా ఆరు షెడ్యూల్స్‌లో జరిగింది. ఈ నెల 19వ తేదీన గోపన్‌పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడవ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్‌లున్న బ్యాగ్‌లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చాడు. ఈ బ్యాగ్‌ను ఏసీ మేకప్‌వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. భోజన విరామం తరువాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తేలని బంగారం లెక్క.. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత ఉంది. రోల్డ్‌గోల్డ్ ఎంత అనేది తెలియరాలేదు. నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్‌ను పోలీసులు సోమవారం విచారించారు. ఆయన కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు. దీంతో ముంబయి నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. నగలు వాడుతున్న వారికి, పంపిన వారికి వివరాలు తెలియదనడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. దొంగ ఎవరు... నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్‌ను వ్యాన్‌లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. న గలు మాయమైన రోజు రవితో పాటు చెన్నై నుంచి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంనేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పుటేజ్‌లను పరిశీలించనున్నారు. అసలు ఆ బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం రవికి మాత్రమే తెలుసు. ఆ నగలను ఇంకా షూటింగ్ నిర్వాహకులకు అందించలేదు. అప్పటికే అవి మాయం కావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. షూటింగ్లో అసలు బంగారం వాడరని పోలీసులు అంటుండగా తమ కంపెనీ పబ్లిసిటీ కోసం వాటిని నిజమైన బంగారంతో నగలను డిజైన్ చేశామని నగల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారి షూటింగ్ ఉన్న సమయంలో విమనాంలో తేవడం తిరిగి విమానంలో తీసుకెళ్లడం జరిగిందంటే అవి నిజమైనే బంగారు నగలేననే అనుమానాలు కలుగుతున్నాయి. నగల్లో విలువైన రాళ్లు ఉన్నాయని సమాచారం. -
ఒక క్రిమినల్ ప్రేమకథ న్యూ స్టిల్స్
-
టైటిల్‌ని లైట్‌గా తీసుకుంటున్నారేం?!
టీవీక్షణం సినిమాకైనా, సీరియల్‌కైనా టైటిల్ ప్రాణమనే చెప్పాలి. ప్రేక్షకుడిని మొదట కట్టిపడేసేది, ఆకర్షించేది, తన దగ్గరకు రప్పించుకునేది, చూసేందుకు ప్రోత్సహించేది అదే. అందుకే దానికంత ప్రాధాన్యత! అయితే ఈ మధ్య సీరియళ్లకి సినిమా పేర్లు తెచ్చి పెట్టేస్తున్నారు. మంచుపల్లకి, చక్రవాకం, చిన్నకోడలు, రాధాకళ్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, బృందావనం, అమ్మ, అన్నాచెల్లెళ్లు, అష్టాచెమ్మా, కలసివుంటే కలదు సుఖం, నువ్వేకావాలి, మూగ మనసులు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బొమ్మరిల్లు, గోరింటాకు, సుందరకాండ... ఒక్కటి కాదు, దాదాపు అన్నీ సినిమా పేర్లే. విచిత్రం ఏమిటంటే... కొన్నింటికి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమై చావదు. దేవత టైటిల్ చూసి హీరోయిన్‌ది దేవతలాంటి వ్యక్తిత్వమేమో అనుకుంటారంతా. కానీ ఆ హీరోయిన్లో కోపం, ఆవేశం, అపార్థం చేసుకోవడం లాంటి బోలెడు మైనస్‌లుంటాయి. ‘బానీ’ అనే డబ్బింగ్ సీరియల్‌కి ‘పవిత్రప్రేమ’ అని పేరు పెట్టారు. అదసలు ప్రేమకథే కాదు. ఓ అబ్బాయి హీరోయిన్ని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ అనుకుని ఆమె చెల్లెలిని పెళ్లాడతాడు. మోసం చేసి తనని అంటగట్టారంటూ ఆమెని ద్వేషిస్తాడు. హీరోయిన్ని భర్త మోసగించి వదిలేస్తాడు. ఆమె అతడికి బుద్ధి చెబుతుంది. ఎప్పటికో మారతాడు. ప్రేమ అనేది ఉన్నా... ఎవరూ ఎవరి కోసమూ త్యాగాలు చేసేంత పవిత్ర ప్రేమ లేదందులో. అలాగే మమతల కోవెల. అనుకోని పరిస్థితుల్లో తన స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు హీరో. అది అతడి తల్లికి నచ్చదు. కోడల్ని ద్వేషిస్తుంది. ఆమె అన్నయ్యేమో తన కూతురు ఉండాల్సిన స్థానాన్ని కాజేసిందన్న కోపంతో హీరోయిన్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఆ తర్వాత కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లతో బాగా సా...గు... తుం...ది. మమతలు, మమకారాలతో ఇల్లు నిండిపోయిన సన్నివేశమే కనిపించదు. మరి మమతల కోవెల అని ఎందుకన్నారో తెలియదు. అయితే అన్నీ అలానే ఉన్నాయని కాదు. కొన్ని కథకు తగ్గట్టుగానే ఉంటాయి. కానీ చాలావరకూ మాత్రం పేరు బాగుందని పెట్టేశారేమో అనిపిస్తోంది. దానికి తోడు సినిమా పేర్లు తెచ్చి పెట్టడం వల్ల కొత్తదనాన్ని ఫీలయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు మనిషి, ఎండమావులు, ప్రియసఖి, అన్వేషిత, కళంకిత, విధి, రుతురాగాలు, కలలతీరం, ఆగమనం అంటూ క్యాచీగా, కాస్త ఆసక్తికరంగా అనిపించే పేర్లు ఆలోచించి పెట్టేవారు. ఇప్పుడు కనీసం అలాంటివైనా పెట్టడం లేదు. వెండితెర మీదా అవే, బుల్లితెర మీదా అవే! మొదటి ఇంప్రెషన్ టైటిల్ వల్లే పడుతుందని తెలిసి కూడా ఎందుకు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారో... కాస్త కొత్తగా ఎందుకు ఆలోచించడం లేదో... వైవిధ్యభరితమైన పేర్లు ఎందుకు పెట్టడం లేదో ఏమో మరి!! -
టీచర్‌పై అత్యాచారం.. వీడియో తీసిన విద్యార్థులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు మరింత క్షీణించిపోతున్నాయి. మతఘర్షణలతో అట్టుడికిన ముజఫర్ నగర్ జిల్లాలో మరో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం బల్వాఖేరి గ్రామంలో 23 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారం జరిగింది. ఓ వ్యక్తి బలత్కారం చేయగా, బ్లాక్ మెయిల్ చేయడం కోసం మరో ఇద్దరు దుండగులు సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెపితే అంతుచూస్తామని ఆమెను బెదిరించారు. నిందితులు ముగ్గురూ కాలేజీ విద్యార్థులు. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. 'ట్యూషన్ చెప్పి ఇంటికి వెళ్తుండగా మోహిత్ నా వెనుకవైపు వచ్చి నోరు మూశాడు. దీంతో అరవలేకపోయాను. అతను నన్ను బలవంతంగా ఖాలీ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మరో ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. నాపై అత్యాచారం చేస్తుండగా, మరో ఇద్దరూ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు' అని చెప్పింది. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. రెండు వారాల క్రితం ముజఫర్ నగర్లోనే ఓ మహిళపై ఎనిమిది మంది అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించి వాట్స్ యాప్‌లో ఉంచిన కేసు నమోదైంది. -
శ్రీవారి సేవలో సుమలత
తిరుమల: సినీతార సుమలత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమలత దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఏ చిత్రాల్లోనూ నటించడం లేదని చెప్పారు. రాజకీయలపై కూడా ఆసక్తి లేదన్నారు. ‘చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే మళ్లీ నటిస్తారా’ అనే ప్రశ్నకు నవ్వుతూ చూద్దామని సమాధానమిచ్చారు. ఆలయం వెలుపల సుమలతను చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమెతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. -
రాష్ర్టం కలిసి ఉంటే బాగుండేది
ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటే ఎంతో బాగుండేదని ప్రముఖ సినీనటుడు కృష్ణభగవాన్ అన్నారు. పట్టణంలో స్వీట్‌హోం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలని అభిమానులు కోరగా, వెంకీ సినిమాలో గుర్తింపు పొందిన ‘జీఎం గావాల్నా...ఎజీఎం గావాల్నా...బంకు గావాల్నా... జింకు గావాల్నా’ డైలాగ్ చెప్పి అందరినీ న వ్వించారు. అనంతరం ‘సాక్షి’ విలేకరితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి ఏంటి? కృష్ణభగవాన్: ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణా ప్రాంతంలోనూ, సీమాంధ్ర ప్రాంతంలోనూ చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉంది. జాన్ అప్పారావు సినిమాలో హీరోగా మెప్పించారు కదా? మళ్లీ హీరోగా ఏదైనా సినిమా చేయాలనుకుంటున్నారా? కృష్ణభగవాన్: అప్పుడలా కలిసొచ్చేసింది (అంటూ తన బాణీలో నవ్వుతూ టైమింగ్ డైలాగ్ వదిలారు.) అప్పారావు ప్రేక్షకులను నవ్వించాడు...ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి ప్రస్తుతం హీరో ఆలోచన లేదు. మీరు చేస్తున్న కొత్త సినిమాల సంగతేంటి? కృష్ణభగవాన్: కొత్త హీరోల చిత్రాల్లో చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉంది. చిత్ర పరిశ్రమలో మీ స్థానమేంటి? కృష్ణభగవాన్: ప్రస్తుతం ఎందరో హాస్యనటులు సినిమాల్లోకి కొత్తగా వస్తున్నప్పటికి నాకు మాత్రం సరైన పాత్రలు లభిస్తున్నాయి. సినీపరిశ్రమలో అడుగు పెట్టినప్పటినుంచి హాస్యన టుడిగానే ఉన్నాను ఎప్పటికి అలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలని నా కోరిక. -
నేను తీయలేనని వాళ్ల నమ్మకం!
చెరుకుగడలా నిటారుగా,‘నవ్వించడానికే’ అన్నట్టుగా ఉంటారు అవసరాల శ్రీనివాస్. ఆయనను చూస్తే హాలీవుడ్ హాస్య ద్వయం లారెల్-హార్డీలో లారెల్ గుర్తొస్తాడు. శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆర్జించిన పేరు మాత్రం ఎక్కువ. ఇప్పుడందరికీ షాకిస్తూ.. ‘ఊహలు గుసగుసలాడే’తో డెరైక్టర్‌గా కూడా మారిపోయాడు. అవసరానికి నటునిగా మారి.. ఇప్పుడు తెలుగు తెరకు అవసరం అన్నట్లుగా ఎదిగిన ఈ ప్రవాస భారతీయుడితో కాసేపు... చెప్పండి సార్... దర్శకునిగా తొలి అనుభవం ఎలా ఉంది? చాలా బాగుంది... క్రియేటివ్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. నిజంగా ఇదో కిక్కు. అసలు డెరైక్టర్ అవ్వాలని ఎందుకనిపించింది? నిరుత్సాహానికి గురైన ప్రతిసారీ... ఉత్సాహంగా ముందుకు దూకడం నాకు అలవాటు. ‘నువ్వు నటుడివి అవడం ఏంటి?’ అన్నారు అప్పట్లో చాలామంది. దాంతో, నటుడినై చూపించాను. ‘నీకు డెరైక్షన్ దేనికి?’ అన్నారు కొంతమంది. డెరైక్టర్ అయి చూపించాను. అంతే. డెరైక్షన్ అంటే దానికి కొన్ని అర్హతలుండాలేమో కదా! నాకు లేవని ఎందుకు అనుకుంటున్నారు! నేను కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేశాను. ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రానికైతే... రచయితల టీమ్‌లో నేనూ ఒకణ్ణి. డెరైక్టర్‌కు ఉండాల్సింది విజన్. అది నాకుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన మీకు అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంటర్మీడియట్లో బైపీసీ చదువుదామనుకున్నా. ఇంట్లోవాళ్లు బలవంతంగా ఎంపీసీ గ్రూపు అంటగట్టారు. ఆ పైన ఇంజినీరింగ్ పూర్తవగానే పై చదువులకు అమెరికా పంపారు. ఇష్టం లేని కాపురం చేయలేంగా... చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. దాంతో అమెరికాలో ఫిల్మ్ స్కూల్లో చేరా. ‘అష్టాచమ్మా’కు సెలక్టయ్యా. ఆ తర్వాత తెలిసిందే. మరి... డెరైక్టర్‌గా తొలి అవకాశం? సినిమాలు చేస్తూనే ఓ వైపు కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి. అలా రాసుకున్న కథే ‘ఊహలు గుసగుసలాడే’. చాలామంది కథ బాగుందన్నారు కానీ, అవకాశం ఇవ్వలేదు. నేను సినిమా తీయలేనని వాళ్ళ నమ్మకం. కానీ... నిర్మాత కొర్రపాటి సాయిగారు కథ వినగానే ‘చేస్కో’ అని అవకాశం ఇచ్చేశారు. స్క్రిప్టే ఈ సినిమాకు స్టార్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. త్వరలో విడుదల చేస్తాం. డెరైక్టర్‌గా కొనసాగుతారా? ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మరో వైపు డెరైక్షన్ చేస్తా. కొర్రపాటి సాయిగారిదే మరో సినిమా చేయాలి. స్క్రిప్ట్ వర్క్‌కు నేను ఎక్కువ టైమ్ తీసుకుంటా. తొలి ప్రాధాన్యం మాత్రం నటనకే. నాకు నటన అంటే ప్రాణం. కామెడీ హీరోగా బావుంటారు. ఆ ప్రయత్నం చేయొచ్చుగా? అప్పుడప్పుడైతే ‘ఓకే’.‘అమృతం చందమామలో’ హీరోని నేనేగా. అయితే, అలాగే కొనసాగలేను. హీరో అంటే సినిమా భారమంతా మోయాలి. అంత బలం నాకు లేదు. నటునిగా మీకంటూ డ్రీమ్‌రోల్ ఏమైనా ఉందా? నెగిటివ్ షేడ్సున్న పాత్ర చేయాలనుంది. అలాంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డెరైక్టర్‌గా చాలా చేయాలి. ‘శ్రీనివాస్ ఇలాంటి సినిమాలే చేస్తా’డనే పేరు నాకొద్దు. ‘ఎలాంటి సినిమా అయినా చేయగల’డనే పేరు కావాలి. అది సరే.. కానీ... మీరు ‘రాకెట్‌బాల్’ బాగా ఆడేవారట కదా? అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తెలుగువాళ్లందరం కలిసి అప్పుడప్పుడు క్లబ్‌కి వెళ్లి అమెరికన్లతో సరదాగా ఆడేవాణ్ణి. పోనుపోనూ ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. స్టేట్ లెవల్లో స్వర్ణ, రీజినల్ లెవల్లో రజత పతకాలు సాధించా. మార్చి 1న మన దేశంలో తొలిసారిగా ‘ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ చాంపియన్‌షిప్’ జరిగింది. అదీ హైదరాబాద్‌లో! అప్పుడు దక్షిణ కొరియాపై ఆడాం. మళ్లీ అక్టోబర్‌లో అమెరికా టోర్నమెంట్ ఉంది. వెళ్లాలి. అప్పటివరకూ సినిమాలతోనే బిజీ. - బుర్రా నరసింహ -
పోర్టల్స్‌లోనే ఫ్లాట్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సినిమా చూడాలంటే..! భాగ్యనగరం నుంచి ఊరెళ్లాలంటే..!! మహా ప్రయాస. అందుకే చాలా మంది ఆన్లైన్లోనే మూవీ టికెట్స్‌ను, బస్సు, రైలు సీట్‌ను బుకింగ్ చేసుకుంటారు. మరి అలాంటి అవకాశం సొంతిల్లు కొనడంలోనూ ఉంటే. సరిగ్గా ఇలాంటి ఆలోచనకే తెరలేపింది ‘రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్’. మహానగరంలో ప్రాపర్టీ కొనాలంటే బిల్డర్ ఎంపిక దగ్గర నుంచి ప్రాజెక్ట్ లొకేషన్, అందుబాటు ధర, మౌలిక సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. ఇవేవీ లేకుండా నేరుగా ఇంట్లో నుంచే ఫ్లాట్ కొనే అవకాశాన్ని కల్పిస్తోంది ‘ఇంటరాక్టివ్ డైనమిక్ ప్రాజెక్ట్ లే-అవుట్’ (ఐడీపీఎల్). ‘రీడైల్’ ప్రాపర్టీ వెబ్సైట్ కథేంటో చదవండి మరి!! ప్రస్తుతం redial.in, indiaproperty.com, magicbricks.com, commonfloor.com.. వంటి రియల్టీ పోర్టల్స్‌లో అద్దె ఇల్లు, కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్లకు సంబంధించిన వివరాలు, ధరలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ‘‘ఇకపై రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్లో అలా కాదు. అద్దె, సొంతింటిని వెతుక్కోవడమే కాకుండా నేరుగా కొత్త ప్రాజెక్ట్‌లో మనకు నచ్చిన దిశలో ఫ్లాట్‌ను బుకింగ్ చేసుకోవచ్చు’’ అని రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ వెంకటరమణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా ఇంటరాక్టివ్ డైనమిక్ ప్రాజెక్ట్ లే-అవుట్ (ఐడీపీఎల్) అనే సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామన్నారు. దీంతో ఆయా ప్రాజెక్ట్‌లు, వెంచర్ల గురించి ప్రచారం చేయడమే కాదు నేరుగా ఆన్లైన్లో ఫ్లాట్ బుక్ చేసుకునే వీలుంటుంది. దీంతో బిల్డర్లకు మార్కెటింగ్ ఇబ్బందులు తప్పుతాయి. కొనుగోలుదారులకు సమయమూ ఆదా అవుతుందని వెంకటరమణ చెప్పారు. అంతా ఉచితమే.. ఆన్లైన్లో ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు కొనుగోలుదారులు చిల్లి గవ్వ చెల్లించక్కర్లేదు. అంతా ఉచితంగా పొందవచ్చు. అయితే ఆయా ప్రాజెక్ట్‌లకు ప్రచారం, బుకింగ్ చేస్తున్నందుకు గాను నిర్మాణ సంస్థలు కొంతమేర చెల్లించాలి. సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే మూడు విభాగాల్లో ధరలుంటాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు నెలకు సిల్వర్ అయితే రూ.5 వేలు, గోల్డ్ అయితే రూ.10 వేలు, ప్లాటినం అయితే రూ. 15 వేలుగా ధరలు నిర్ణయించారు. ప్రాజెక్ట్ విస్తీర్ణం, ప్రాంతమేదైనా సరే ధరల్లో తేడాల్లేవు. ఇప్పటివరకు ఐడీపీఎల్‌లో జేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రాయల్ ఇండియా ఇన్ఫ్రా డెవలపర్స్, మన్సన్ కన్స్ట్రక్షన్స్, స్కై స్పేస్, శ్రీ వైషు, భాష్యం డెవలపర్స్, శ్రీదుర్గ ఎస్టేట్స్, ఇస్తా హోమ్స్ వంటి పది వరకు నిర్మాణ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి. ఆదిభట్ల, ఉప్పల్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఆయా సంస్థల నిర్మాణాలున్నాయి. ఫ్లాట్‌ను ఎంచుకోగానే దాని పక్కనే బిల్డర్ ఫోన్ నంబర్ ఉంటుంది. దీంతో నేరుగా బిల్డర్తోనే బేరసారాలు చేసుకోవచ్చు. ఫ్లాట్ బుకింగ్ కాగానే వెబ్‌సైట్‌ను అప్డేట్ చేస్తారు. బిల్డర్లు ప్రకటించే రాయితీలు, ఆఫర్ల వంటివి కూడా వెబ్సైట్లో అప్డేట్ అవుతుంటాయి. చికాకులూ తప్పుతాయ్.. హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారిలో 60-70 శాతం మంది ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలు, వ్యాపారులుంటారు. వీరిలో 50-60 శాతం మంది ప్రాపర్టీలను కొనేముందు రియల్టీ పోర్టల్స్‌లో ఆయా ప్రాజెక్ట్ వివరాలు, అక్కడి ప్రాంత అభివృద్ధి తదితర అంశాలను తెలుసుకుంటారు. ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాక ఫ్లాట్ కొందామని ఏదైనా బిల్డర్‌ను కలుద్దామంటే కొనుగోలుదారుల్లో భయం నెలకొంటోంది. ఎందుకంటే తమ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్ తీసుకొని ఫ్లాట్ కొనే వరకూ వేధిస్తుంటారు. ఫోన్లు చేసి విసిగిస్తుంటారు కూడా. అయితే ఇప్పుడా చికాకులేవీ లేకుండా నేరుగా రీడైల్ రియల్టీ పోర్టల్‌లోనే ఫ్లాట్ బుక్ చేసుకునే వీలుండటంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘రీడైల్’ సేవలు! సాక్షి, హైదరాబాద్: ‘‘ఇప్పటివరకు హైదరాబాద్‌లో మాత్రమే ‘రీడైల్’ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి జిల్లాల్లోని అద్దె, సొంతిల్లు, ప్రాజెక్ట్‌లు, వెంచర్ల వివరాలు రీడైల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని’’ రీడైల్ రియల్ ఎస్టేట్ సెర్చ్ ఇంజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ వెంకటరమణ చెప్పారు. శుక్రవారమిక్కడ సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా 1800 274 2224 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది రీడైల్కు 25 వేల మంది కాలర్స్ ఫోన్ చేశారని, 40 వేలకు పైగా ప్రాపర్టీ వివరాలను కొనుగోలుదారులకు అందించామన్నారు. హైదరాబాద్‌లోని సుమారు 400 ప్రాజెక్ట్‌లు, 14 వేలకు పైగా ప్రాపర్టీలు తమ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నాయని ఆయన వివరించారు. ఇకపై రీడైల్ వెబ్సైట్లో గృహ రుణాలకు సంబంధించిన వివరాలూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు. -
ఆలస్యంగా అర్థం చేసుకున్నాను!
లైఫ్ బుక్ ‘జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలి’ అనే ఆలోచనతో మెడిసిన్‌ను మధ్యలోనే వదిలేశాను. నా జీవితానికి ఒక అర్థం ఉండాలంటే అది కళలతోనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు... ఇలా సినిమాల్లోకి వచ్చాను. చిత్రసీమకు వచ్చిన కొత్తలో మిగతా వాళ్లతో పోల్చితే... నాకు పెద్దగా ఏమీ తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. కెమెరా ఒకవైపు ఉంటే మరొక వైపున నిల్చొని నటించేదాన్ని. చీవాట్లు తినేదాన్ని. ఇలాంటివి సాంకేతిక విషయాలే అనుకుంటాంగానీ వాటి ప్రభావం ఇతర విషయాల మీద కూడా పడుతుంది. అయితే కాలక్రమంలో లోపాలను సరిదిద్దుకున్నాను. చుట్టూ సరైన వాళ్లు లేకపోవడం వల్ల మనం ఏంచేస్తున్నామో మనకు అర్థం కాదు. నేను కూడా సరైన సలహాలు ఇచ్చే మంచివాళ్లు నా చుట్టూ లేకపోవడం వల్ల మంచి సినిమాల్లో చేసే అవకాశం పోగొట్టుకున్నాను. ‘ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. అహాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మవిశ్వాసం నుంచి అహాన్ని మైనస్ చేయడం నేర్చుకోవాలి. ఏ సమస్య వచ్చినా ‘సబ్ ఠీక్ హోజాయేగా’ ‘ఎవ్రీథింగ్ విల్ బి ఓకే’ అనుకుంటాను. అదృష్టం బాగుంటే ఆశించింది జరుగుతుంది. అలా కాని పక్షంలో దాని గురించి అయిదు నిమిషాలు కూడా ఆలోచించను. ఆరోగ్యకరం కాని పోటీలో ఉండడం కంటే, అసలు పోటీలో ఉండక పోవడమే క్షేమం అనుకుంటాను. సినిమా మాత్రమే నా ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి అని మాత్రమే అనుకుంటాను. వంట నేర్చుకోవాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, కొత్త భాషలు నేర్చుకోవాలి...ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి. - కంగనా రనౌత్, హీరోయిన్ -
ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు? దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు? ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా? రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం. అతని తెలివితేటల ముందు నేనో పురుగులా అనిపించేవాణ్ణి! నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు. ‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి. ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే! సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది. తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది! ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది. నాకెప్పుడూ, దేనికీ భయం లేదు! అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
హోరెత్తిన ఉప్పల్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో ఉప్పల్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. ఆరంభంలో కాస్త పలుచగా కనిపించినా... మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాండ్స్ అన్నీ నిండిపోయాయి. సినీ నటుడు వెంకటేశ్, సుశాంత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంతో పోలిస్తే ఈ సారి మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు బాగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ రాకపోవడంతో... మాస్టర్‌ను ప్రత్యక్షంగా చూద్దామని ఆశించిన అభిమానులు నిరాశచెందారు. -
కాలువల్లో ఈత కొట్టేవాళ్లం...
వేసవి జ్ఞాపకం ‘జై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నవదీప్ ఆ తరువాత ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’, ‘ఆర్య 2’.. వంటి సినిమాలతో మరింత చేరువయ్యారు. తెలుగు, తమిళ సినిమా షూటింగ్‌లతో ఇప్పుడు వేసవి సెలవుల హంగామాను మిస్సవుతున్నానంటున్న ఈ యువ హీరో చిన్ననాటి సమ్మర్ హాలీడేస్‌ను గుర్తుతెచ్చుకున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. స్కూల్ డేస్‌లో వేసవి వస్తుందంటే చాలు ఓ పండగలా అనిపించేది. పుస్తకాలు లేకుండా రెండు నెలలు ఎంజాయ్ చేయచ్చు అనే భావనే కాదు, దాంతో పాటు విజయవాడ వెళ్లచ్చు అనే ఆనందం కూడా ఉక్కిరిబిక్కిరి చేసేది. మా అమ్మగారి అక్కచెల్లెళ్లు విజయవాడలో ఉండేవారు. అమ్మమ్మ తాతయ్య తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు. ప్రతి వేసవికి అమ్మ, నేను, చెల్లెలు విజయవాడ వెళ్లేవాళ్లం. రెండు నెలలు అక్కడే. అందుకే, ఇప్పటికీ వేసవి వస్తోందంటే చాలు విజయవాడే గుర్తుకువస్తుంది. అక్కడి తిన్న మామిడికాయలు, స్నేహితులతో ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్లూ... అమ్మమ్మ, తాతయ్య, బంధువుల పిల్లలు... ఆ ఆనందం అంతా ఇప్పటికీ కళ్లముందు నిలుస్తుంది. అక్కడ మా బంధువుల పిల్లలమంతా కలిసేవాళ్ళం. అక్కడే కొత్త స్నేహితులు పరిచయం అయ్యేవారు. అంతా కలిసి కాలువల్లో ఈతలు కొట్టేవాళ్లం. సాయంత్రాలు కృష్ణానది ఒడ్డుకెళ్లి కూర్చునేవాళ్ళం. ఎండ అని కూడా ఆలోచించకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వెళ్లేవాళ్ళం. ఇప్పటికీ విజయవాడలో నాకిష్టమైన ప్లేస్ అదే! ఇంకా అక్కడ చూసినన్ని సినిమాలు... ఎక్కడా చూడలేదంటే నమ్మండి. ఊళ్ళో ఎంత తిరిగినా, ఏ ఆటలు ఆడినా ఇంట్లో అభ్యంతరాలు ఉండేవి కావు. కాకపోతే ఎండలో ఆడవద్దని మాత్రం జాగ్రత్తలు చెప్పేవారు. అయినా వినేవాళ్ళం కాదనుకోండి. ఇప్పుడు ఎండ ఉంటే బయటకెళ్లలేం. మా విజయవాడ స్నేహితులంతా ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందరం కలుస్తుంటాం. కానీ అప్పటి సెలవుల ఆనందం ఇప్పుడు రాదు. చదువుకునే రోజుల్లో వచ్చే వేసవి సెలవుల ఆనందం పెద్దయ్యాక అందమైన జ్ఞాపకంగా మిగలాలి. అందుకే పిల్లలు అన్ని రకాలుగా సెలవులను ఆనందించేలా పెద్దలే చూడాలి.’’ -
మళ్లీ వాయిదా
తమిళసినిమా, న్యూస్‌లైన్ : కోచ్చడయాన్ చిత్రం విడుదల అనూహ్యంగా మరోసారి వాయిదాపడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా కాప్చరింగ్ ఫార్మెట్లో రూపొందిన 3డి యానిమేషన్ చిత్రం ఇది. హాలీవుడ్ చిత్రాలు అవతార్ టిన్టిన్ చిత్రాల తరహాలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వచ్చింది. అయితే మే నెల 9న చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఆ విధంగా పబ్లిసిటీ కూడా చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో బుధవారం అనూహ్యంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. కోచ్చడయాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల ప్రింట్లతో 2డి, 3డి ఫార్మెట్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన చిత్రాన్ని ఈ నెల 9న కాకుండా 23న విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యిందనే చెప్పాలి. -
నేను... నేనేనా?!
కనువిప్పు మాకు మేము ‘పంచపాండవులు’ అని పేరు పెట్టుకొని ప్రతి తగాదాలో తలదూర్చేవాళ్లం. లెక్చరర్లను ఎదురించేవాళ్లం. ఒకసారి మా ఫ్రెండ్‌ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. సినిమాల ప్రభావమో ఏమిటోగానీ... గొడవలు పడడం, గొడవల్లో తల దూర్చడం. దీన్ని హీరోయిజంగా భావించేవాడిని. ఇంటర్ చదివే రోజుల్లో అయితే చదువు కంటే గొడవల మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మా గ్రూపులో మొత్తం అయిదుగు సభ్యులం. ఒకసారి మా ఫ్రెండ్‌ను సీనియర్ ఎవరో ఏదో అన్నాడని, అతడిని చితకబాదాం. ఒక వారం తరువాత...ఆ రోజు నేను ఏదో పని ఉండి పక్క ఊరు నుంచి వస్తున్నాను. సమయం రాత్రి పది దాటింది. టీ స్టాల్ దగ్గర ఒక బ్యాచ్ కనిపించింది. మేము చావబాదిన సీనియర్ అందులో ఉన్నాడు. ‘వీళ్లు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా?’ అని మనసులో అనుకొని వేరే రూట్లో వెళ్లే ప్రయత్నంలో ఉండగానే- ‘‘రేయ్ ఆగరా’’ అనే అరుపు వినిపించింది. నేను పారిపోబోతుండగా...అందరూ ఒక్కసారిగా వచ్చి నా మీద పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. రెండు వారాల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాను. కొంత కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు మా నాన్న కొన్ని పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టి ‘‘ఇవి చదువుకోరా. బోర్ కొట్టదు’’ అన్నారు. అవి ప్రముఖుల జీవిత చరిత్రలు. నా ఆసక్తిని గమనించి మరికొన్ని పుస్తకాలను తెచ్చిచ్చాడు నాన్న. ఆ పుస్తకాలు చదివిన తరువాత జీవితానికి సార్థకత లేకపోతే వృథా అనే భావన ఏర్పడింది. ఇక ఆనాటి నుంచి గొడవలు వదిలేశాను. చదువులో ముందున్నాను. ఇప్పుడు నన్ను ఎవరైనా పొగడుతుంటే ‘నేను నేనేనా?’ అనిపిస్తుంది! -వలస శేషుకుమార్, కాగజ్‌నగర్ -
ఒక తెలివైన ప్రేమ కథ
ప్రేమ గుడ్డిది.. అని అంటుంటారు. అన్ని ప్రేమల సంగతి ఏమిటో కానీ కొన్ని ప్రేమలు చాలా తెలివైనవి. అలాంటి ప్రేమ కథల్లో ఒకటి ‘టూ స్టేట్స్’. సంస్కృతి, సంప్రదాయాలపరమైన తేడాను, కులం గోడలను దాటి ప్రేమను విజయవంతం చేసుకొన్న ఒక తెలివైన జంట కథ ఇది. అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో మొదలై నవలగా, ఇప్పుడు ‘2స్టేట్స్’ సినిమాగా థియేటర్లలో సందడి చేస్తున్న కథ ఇది. ప్రపంచమంతా ప్రేమ పెళ్లిళ్లు సులభంగా జరిగిపోతాయి. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొంటారు. భారతదేశంలో మాత్రం ఇంకొన్ని మెట్లు ఉంటాయి. అబ్బాయి అమ్మాయిని, అబ్బాయిని అమ్మాయి ప్రేమించిన తర్వాత అమ్మాయి కుటుంబం అబ్బాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది. ఇలాంటి దశల వారీ ప్రక్రియలా జరిగే ప్రేమ కథే 2 స్టేట్స్. చేతన్‌భగత్ నవలగా రచించిన తన సొంత ప్రేమ కథ ఇప్పుడు సినిమాగా మారింది. అర్జున్ కపూర్, ఆలియాభట్‌లు జంటగా వచ్చిన ఈ సినిమా కమ్ నవల కథ మన సంస్కృతిలో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించే జంటలకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమించడానికి రెండు మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. అలా కలవని సందర్భాల్లో... ఒకవైపు పరువు హత్యలు మరోవైపు పెద్దలను ఎదురించి చేసుకొని పెళ్లిళ్లు చేసుకొనే జంటలు.. ఇటువంటి పరిణామాల మధ్య పెద్దలను ఒప్పించి, రెండు కుటుంబాలను కలిపి ఒక్కటయ్యే జంట కమ్మని కథ ఇది. తన నవల 90 శాతం వినోదాన్ని 10 శాతం సొసైటీ రీఫార్మింగ్కోసం సందేశాన్ని ఇస్తుందని చేతన్‌భగత్ అంటాడు. కాలేజీలో ఎంపిక చేసుకొన్న అమ్మాయికి ఎదురుపడితే ఎలా ఉంటుంది? అది కూడా తరచూ! ఆ ఎదురుపడటం యాదృచ్ఛికంగా జరిగిందని అవతలి వారికి అనిపించి కళ్లూకళ్లూ కలిశాయంటే సమ్మోహనం మొదలయినట్టే. ఇలాంటి సమ్మోహనమే మొదలవుతుంది అనన్య, క్రిష్‌ల మధ్య. ఐఐఎమ్‌లో ఇంటరాక్షన్ క్లాస్‌లోనే వారి పరిచయం మొదలవుతుంది. మనిషి మనసులో ప్రేమ పుట్టడం అనేది హార్మోన్ల ప్రభావం అని, లవ్ ఈజ్ కెమిస్ట్రీ అని అంటారు శాస్త్రజ్ఞులు అయితే ఒక అమ్మాయి, అబ్బాయి చూపుల మధ్య ఒకేసారి అలాంటి కెమిస్ట్రీ వర్కవుటవ్వడం మాత్రం చాలా కష్టమైన పని. దాన్ని సాధించాలంటే చాలా కష్టమే ఉంటుంది. దానికి చొరవ కూడా ముఖ్యం. క్రిష్‌లో చొరవ ఉన్న దాన్ని ఎప్పటికప్పుడు రెసిస్ట్ చేస్తూ వచ్చిన ఆమె అప్పటికప్పుడు కన్విన్స్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకేముంది వర్సిటీ డార్మ్రూమ్లోనే రొమాన్స్ మొదలు! అంత వరకూ వాళ్లిద్దరికీ ఉన్న పరిచయం వేరు, పెళ్లి ఆలోచన వచ్చాక కలిగే పరిచయం వేరు. అబ్బాయి పంజాబీ హిందూ, అమ్మాయి తమిళ బ్రాహ్మణకుటుంబానికి చెందిన యువతి... సంప్రదాయాల్లోని సవాలక్ష తేడాలు. ఇరు కుటుంబాల పెద్దల అభ్యంతరాలు. కుటుంబాల మధ్య స్పర్థలతో పెళ్లి వద్దు, అనుకొనేంత వరకూ వెళుతుందామె. కానీ చివరకు తమ పెళ్లిని కాదన్న పెద్దలను ఒప్పించి, మెప్పించి పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. మనది కులాల, మతాల, సంప్రదాయాల తేడాతో రంగురంగులుగా మెరిసే సీతాకోకచిలుక లాంటి సమాజం. ఇలాంటి వ్యవస్థలో ప్రేమ వ్యవహారాలు రక్తసిక్తవర్ణాలకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కులాంతర, ప్రాంతాంతర వివాహం చేసుకొని ఆ విషయాన్ని తన వాళ్ల చేత ఒప్పించి, దాన్ని నవలగా గ్రంథస్థం చేసి సమాజం చేత కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు చేతన్‌భగత్. ఆ ప్రయత్నం సినిమాగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇలాంటి కథలు కొన్ని పరువు హత్యలను నివారించినా, కొందరు ప్రేమికులను తెలివైన వారిగా తీర్చిదిద్దినా మంచిదే కదా! - జీవన్ రెడ్డి.బి -
మగాడు ఏడవడా? ఏడవకూడదా?
ఈ మధ్యనే టీవీ చూస్తుండగా ఓ పాత సినిమాలో డైలాగ్ వినపడింది... ‘ఆడవారి కన్నీటికి వెయ్యి కారణాలుండొచ్చు. కానీ మగాడి కన్నీటికి మాత్రమే ఆడది కారణం’ అని. సినిమాలోని ఈ పంచ్ డైలాగ్ ఉద్దేశమేమిటన్నది వేరే కథ. దాన్ని పక్కన పెడితే ఆడాళ్ల కంటే మగాళ్ళు చాలా తక్కువ సార్లు ఏడుస్తారనే కోణంలో దీన్ని చూడాలి. మగాడు చాలా అరుదుగా మాత్రమే ఏడుస్తాడనే విషయాన్ని స్త్రీ సమాజంతో సహా అందరూ అంగీకరిస్తారు. అవును, ఎందుకు? ఏడుపు రాకనా? ఏడవ లేకనా? ఏడవ కూడదనా? ఏదైనా ఒక పనిని సమాజం అంగీకరించకపోతే అది క్రమంగా నిబంధన అయి కూర్చుంటుంది. బహుశా మగాడి నుంచి ఏడుపును మైనస్ చేసింది ఇటువంటి చర్యే కావచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ‘ఏరా ఆడదానిలా ఏడుస్తున్నావేంటి’ అనే తిట్టుతో కూడిన వెక్కిరింపు ప్రశ్న వినకుండా బహుశా ఏ పురుషుడూ పెరిగిపెద్దయి ఉండడు. మగాడు ఏడవటాన్ని సమాజం అంతగా వ్యతిరేకించబట్టే ఏడ్చే మగాళ్ల సంఖ్య కనుమరుగైంది. కాదు..కాదు, మగాడి నుంచి ఏడుపు కనుమరుగైంది. దీన్ని సమాజం ఎన్ని కోణాల్లో అణచివేస్తుందంటే, ‘ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదు’ అంటారు. ఇన్ని మాటలన్నాక ఎట్లా ఏడుపొస్తుంది? అంతేకాదు, టెక్నికల్‌గా కూడా మగాడు ఏడవటానికి ఏనాడూ అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇంట్లో ఏదైనా మరణం సంభవిస్తే స్త్రీలు తీవ్రంగా రోదిస్తుంటారు. వారితో పాటు మగాళ్లు కూడా ఏడుస్తూ కూర్చుంటే తదనంతర కార్యక్రమాలు చేసేదెవరు? అపుడు కూడా సెలైన్సర్ పెట్టిన తుపాకిలా లోలోపల ఏడుస్తూ మరో పనిచేసుకుంటూ ఉంటాడు. అంటే గగ్గోలు పెట్టి ఏడవనంత మాత్రాన ఏడ్చేంత బాధ వారిలో లేదని కాదు కదా. ఇలాంటి మరో సందర్భమే చూస్తే పిల్లలకు ఏమైనా అయితే తల్లి కడుపుకోతతో బాధపడుతూ రోదిస్తుంది. భర్త తనూ ఏడుస్తూ కూర్చోలేడు. తనను తాను సముదాయించుకుని భార్యను ఓదార్చాలి. అంటే మగాడు ఏడుపును త్యాగం చేస్తూ ఉన్నాడు. ఇది ఒకటీ రెండు సందర్భాల్లో కాదు, అనేక సందర్భాల్లో, అనేక తరాలుగా! ఏడుపును ఎందుకు త్యాగం చేయాలి. చేయొద్దు. కన్నీరు పెడితే తప్పు కాదు, పాపం అంతకన్నా కాదు. ముందు మగాళ్లు ఈ భావన పోనిచ్చుకోవాలి. స్త్రీ ప్రతి చిన్నదానికీ పెద్దదానికీ ఏడిస్తే, మగాడు ఏడుపు వచ్చినపుడన్నా ఏడవకపోతే ఎలా? ఇదేదో వారితో పోటీపడడం కోసమని కాదు. మనసు తేలిక చేసుకోమని. కానీ, ఎవరూ చెప్పక్కర్లేకుండానే ఒక్కచోట మాత్రం (కూతురున్న) ప్రతి మగాడూ తప్పకుండా ఏడుస్తాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి పంపే ప్రతి తండ్రీ కచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అవతల అద్భుతమైన సంబంధమే కావచ్చు. మంచి అల్లుడే కావచ్చు...కానీ కచ్చితంగా కన్నీళ్ళు పెడతాడు. అది తన జీవితంలో భాగం అనుకున్నది తనకు దూరమైపోతుందేమోనన్న బాధలో నుంచి పొంగుకొచ్చే కన్నీరు. ఆ ఏడుపును మాత్రం ఎవరూ కించపరచరు. ఎవరూ ఎగతాళి చేయరు. శాస్త్రాల పరంగా చూస్తే మగాళ్లు తరచుగా ఏడవకపోవడానికి కొన్ని సైకలాజికల్ కారణాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్లకు ఎమోషన్స్ ముందుంటే మగాళ్లకు వెనకుంటాయి. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు గురవడం వారి హార్మోన్ల ప్రభావమే. స్త్రీలలో లెఫ్ట్బ్రెయిన్కూ, రైట్ బ్రెయిన్‌కూ మధ్య సంబంధాలు గాడంగా ఉంటాయి. దీంతో లెఫ్ట్ (లాజిక్) రైట్ (ఎమోషన్స్) రెండింటి సమన్వయం స్త్రీలలో ఎక్కువుండటం వల్ల వారిలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయని తేల్చారు. అందుకే వారు సులువుగా ఏడుస్తారు. ఈ రెండింటి సమన్వయం పురుషుల్లో అంత వేగంగా, సులువుగా జరగకపోవడం వల్ల మగాళ్లు వెంటనే భావోద్వేగాలకు గురికారని సైకియాట్రిస్టులు చెబుతారు. అదండీ కథ. ప్రపంచంలో ప్రతి విజయం వెనుక కొన్ని త్యాగాలుంటాయి. అలాగే, పురుష సమాజం విజయం వెనుక కూడా ఇలాంటి త్యాగాలెన్నో ఉంటాయి, ఉన్నాయి! - ప్రకాష్ చిమ్మల -
రాజకీయాల్లోకి రానేరాను
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల కాలం కాబట్టి చాలా మంది బాలీవుడ్ తారలు పోటీలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభయ్ డియోల్‌కు మాత్రం ఇలాంటి ఆలోచనలు ఏవీ లేవు. పోలింగ్ రోజు బయటికి వచ్చి ఓటేసి రావడమే తనకు తెలుసని అన్నాడు. ‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకైతే లేదు. తాము మార్పు తేగలమని ఇతర నటులు నమ్మితే ముందుకు సాగవచ్చు. అందులో తప్పేం లేదు. వ్యవస్థను బాగు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే’ అంటూ అభయ్ మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ 38 ఏళ్ల నటుడు సినిమాల్లో చాలా వరకు సామాజిక, రాజకీయ నేపథ్యమున్నవే కావడం విశేషం. షాంఘై సినిమా భూనిర్వాసితుల గురించి చర్చిస్తుంది. చక్రవూ్యహ నక్సలైట్ల సమస్య చుట్టూతిరుగుతుంది. రాంఝనాలో అభయ్ సామ్యవాద భావాలున్న నాయకుడిగా కనిపిస్తాడు. రాజకీయాల్లోకి రాకుండానే తన సినిమాలతో సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ‘నేను నాయకుణ్ని కాదు.. సామాజిక కార్యకర్తనూ కాను. సినిమాల ద్వారా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా సినిమాలన్ని సమాజాన్ని ప్రతిబింబిస్తాయి’ అని వివరించాడు. అన్నట్టు మనోడు తాజాగా నిర్మాత అవతారం ఎత్తి వన్ బై టూ అనే సినిమా తీశాడు. తన నిజజీవిత ప్రేయసి ప్రీతీదేశాయ్ ఇందులో అభయ్కు జోడీ. దురదృష్టవశాత్తూ వన్ బై టూ పెద్దగా ఆడలేదు. దీని వైఫల్యం కొంచెం బాధగా అనిపించినప్పటికీ, ఇక ముందు కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు. నటులు, దర్శకులు, నిర్మాతలకు జయాపజయాలు సహజమని, ఎల్లప్పుడూ వంద శాతం విజయం సాధ్యం కాదని అన్నాడు. ‘నువ్వు ఎన్నిసార్లు కిందపడ్డావనేది ముఖ్యం కాదు.. నువ్వు ఎన్నిసార్లు తిరిగి లేచావనేది ముఖ్యం’ అనే నానుడిని తాను విశ్వసిస్తానని అభయ్ డియోల్ వివరించాడు. -
రాజకీయాల్లోకి రావాలని ఉంది
పూసపాటిరేగ : రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉందని సినీనటుడు శరత్ బాబు అన్నారు. నిన్న ఆయన శ్రీకాకుళం వెళ్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి రాబోయే ఎన్నికల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి బయటి వ్యక్తులు పోటీచేస్తే ఓడించాలని శరత్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా తాను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు సహకారంతో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆయనతో పాటు డైరెక్టర్ తిలక్, పర్యావరణ శాస్త్రవేత్త కమల్ కోయలాడా తదితరులు ఉన్నారు. -
అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!
లైఫ్ బుక్ నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను. సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని. ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది. నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి. - విద్యాబాలన్ -
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
నిరుపేద కుటుంబంలో పుట్టిన.. కేబినెట్ మంత్రిగా పనిచేశా.. 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను హాస్యనటుడు బాబుమోహన్ దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు దుగ్గొండి, న్యూస్‌లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్ఎల్బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్‌ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు. అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్‌రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కేపిటల్ సిటీ
భవిష్యత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా విశాఖ నగరం రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తితో చిగురిస్తున్న కొత్త ఆశలు రాయితీలతో తరలిరానున్న కంపెనీలు ఐటీ, ఫార్మా, చమురు, పోర్టులు, సినీ, ఉత్పత్తి రంగాలకు ఊపు సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర విభజన బాధిస్తున్నా తాజాగా వినిపిస్తున్న మాటలు విశాఖకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన ఈ పారిశ్రామిక నగరానికి మంచిరోజులొస్తున్నాయి. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరమైన విశాఖ అభివృద్ధిలో సింగపూర్, మలేషియాలను తలదన్నుతూ పోటీ ఇచ్చే రీతిలో ఎదగడానికి అవకాశాలు కనిపిన్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ ముందంజలో ఉంటుందని ఆసోచామ్ సర్వే కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేసింది. సీమాంధ్రకు ప్రత్యేకహోదా నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదుగుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇవీ ఆశారేఖలు.. సింగపూర్‌ను పోలిన వనరులు..సౌకర్యాలు విశాఖలోనూ ఉన్నాయి..చుట్టూ సముద్రం.. భారీ నౌకలుకూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు..చమురు కంపెనీలు ... 24గంటల విదేశీ కార్గో ఎగుమతులు...ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు...వేలకోట్ల ఫార్మా ఎగుమతులు..ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు..షిప్‌యార్డు ...ఏడాదిపొడవునా బారులు తీరే పర్యాటకులు.. 21లక్షల జనాభా..550 కిలోమీటర్ల విస్తీర్ణం.. ఇప్పుడు సింగపూర్ తరహాలో విశాఖ అభివృద్ధి చెందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత వర్తించే ప్రత్యేకహోదా మన నగరానికి కొంత ఊపును తీసుకురానుంది. కొత్త రంగాలలో పెట్టుబడులకు ఆస్కారమేర్పడనుంది. ఇప్పుడున్న కంపెనీలు విస్తరణతోపాటు కొత్తవి,అంతర్జాతీయస్థాయి కంపెనీలు క్యూ కట్టనున్నాయి. నగరంలో 90 ఫార్మా కంపెనీలున్నాయి. దివీస్, రెడ్డి ల్యాబ్స్,కొర్నియాస్,లీఫార్మా, అమెరికాకు చెందిన హోస్పిరా,జపాన్‌కు చెందిన ఈజాయ్,జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 50వరకు భారీ ప్లాంట్లు నెలకొల్పాయి. రానురాను పెరుగుతున్న ఫార్మా కంపెనీలు,కొత్త యూనిట్ల కారణంగా ఎగుమతులు రెండేళ్లలో రూ.15నుంచి నూ.20వేల కోట్లకుపైగానే పెరగవచ్చు. విశాఖలో 70కిపైగా ఐటీ కంపెనీలు,నాలుగు ఎస్ ఈజెడ్లున్నాయి. 10,200మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, టర్నోవర్ రూ.1450కోట్లు. అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా కారణంగా భారీస్థాయిలో పన్నుల మినహాయింపు లభిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఐటీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. . విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఐటీ రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఐటీఐఆర్ వేగంగానే మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేస్తోన్న ఐటీ కంపెనీ భూములను డీ-నోటిఫై చేయడంలేదు. ఐటీ కంపెనీల ఆదాయంపై ప్రభుత్వం 18% మ్యాట్ పన్ను వసూలు చేస్తోంది. ప్రత్యేక హోదాతో కొత్త కంపెనీలకు ఈ సమస్యలు ఉండకపోవచ్చు. దీంతో వచ్చే కొన్నేళ్లలో 50కంపెనీలకుపైగా ఇక్కడ పెరగడానికి అవకాశాలున్నాయి. విశాఖనుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు అధారిత కంపెనీలు భారీగా రానున్నాయి.సముద్రతీరానికి సమీపాన వచ్చే ఈ కారిడార్‌కు ఇకపై మంచి డిమాండ్ ఏర్పడనుంది. పదిమండలాల్లో విస్తరించనున్న ఈజోన్‌లో వివిధ కంపెనీలు రానున్నాయి..పీసీపీఐఆర్ కంపెనీలకు పన్నురాయితీలు వర్తిస్తుండగా,ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్పెరగనుంది. ప్రత్యేకహోదా కారణంగా పన్ను రాయితీలు పెరగనున్నందున అన్నిరకాల వ్యాపార,వాణిజ్యవర్గాలు విశాఖను గమ్యస్థాన నగరంగా ఎంచుకుంటాయని నిపుణుల అంచనా.అందుకే హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ,ఫార్మా,ఉక్కు,చమురు కంపెనీలు ఇకనుంచి విశాఖలోనూ ప్రధానసంస్థలు ప్రారంభించే అవకాశం ఏర్పడనుంది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడకు వీటిని తరలించే యోచనలో ఉన్నారు. ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టు కూడా వచ్చే వీలుంది.ప్రస్తుత ఎయిర్‌పోర్టు నేవీ నియంత్రణలో ఉంది. 24గంటలూ విమాన సౌకర్యం ఇటీవలే కలిగింది. భవిష్యత్తులో విదేశాలకు విమానసర్వీసులు నడిపే వీలున్నందున వేరేచోట ప్రత్యామ్నాయ విమానాశ్రయం పెరగడానికి అవకాశాలున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి ఎగుమతులకు ఎయిర్ కార్గో సౌకర్యంలేదు. ప్రత్యేకహోదా ఫలితంగా పన్నుల రాయితీ పెరగడం తదితర కారణాలతో కొత్త కంపెనీలు వచ్చే వీలుంది. వైజాగ్,గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి,భీమిలిలోను పోర్టులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విభజన కారణంగా సీమాంధ్రకు కొత్త ఐఐటీ,ఐఐఐటీల మంజూరుకు వీలున్నందున విశాఖలోనూ దీనిఆధారంగా కంపెనీలు పెరిగేవీలుంది. అభివృద్ధికి ఇదే సరైన సమయం విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పెట్టుబడులు భారీ స్ధాయిలో విశాఖపట్ననికి ఖచ్చితంగా రానున్నాయి. విడిపోయిన తరువాత ఆంప్రదేశ్‌కు రాజదాని విశాఖ అయినా కాకాపోయినా అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిశ్రమలు నిర్వహిస్తున్న వ్యాపారుల్లో అధికశాతం సీమాంధ్రులే. ఇప్పుడు వీరందరు విశాఖపై చూస్తున్నారు.పెట్రో కారిడర్ల అనూహ్యంగా విదేశీ కంపెనీలు కూడా పన్ను రాయితీ కోసం ఇక్కడకు వస్తారు. రైల్వే అనూహ్య ప్రగతి సాధించనుంది. రైల్వేజోన్ రావడం మరింత సులువవుతుంది. - జి.సాంబశివరావు చైర్మన్, సిఐఐ, విశాఖపట్నం -
స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్!
ఆయన ఏ సినిమా తీసినా అందులో హృదయాన్ని స్ప ృశించే కథనం ఉంటుంది. ఆ సినిమా రీమేక్ గానో, డబ్బింగ్గానో మరో భాష సినీ ప్రేమికులను పలకరిస్తుంటుంది. దాని ద్వారా పరిచయం అయ్యే నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు తర్వాత సినీ పరిశ్రమకే వరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా గుర్తుండి పోతాయి ఆయన సినిమాలు. ఆయనే భారతీ రాజా... మద్రాస్ ప్రెసిడెన్సీలోని తేని ప్రాంతంలో ఉండే అల్లినగరంలో పుట్టిన చిన్నస్వామికి జింకలను వేటాడటం, సాహిత్యం చదవడం చాలా ఇష్టం. ఆ ఊరికి పక్కనే పెద్ద అడవి. అక్కడ అతడి వేట సాగేది. వేట... సరదాను తీరిస్తే, సాహిత్యం... సృజనాత్మకతను వెలికితీసింది. సినీదర్శకుణ్ణి చేసింది. చిన్నస్వామిగా అడవిలో జింకలను వేటాడిన అతడు... భారతీరాజాగా మారి సినీ పరిశ్రమలో అనేకమంది ప్రతిభావంతులను వేటాడి పట్టుకొన్నాడు. వారి ప్రతిభకు మరింత పదును పెట్టాడు. వారిని స్టార్స్‌ని చేసి తాను స్టార్ డెరైక్టర్ అయ్యాడు! నల్లమనుషులను, సముద్రంపై ఆధారపడి బతికే వారి యాస, భాషలను, పచ్చని ప్రకృతిని తెరపై చూపించే ప్రయత్నం చేశారు భారతీరాజా. అసలు సిసలు పల్లెలను తెరమీద ఆవిష్కరించాడు. అందుకే... దక్షిణాది సినిమా స్వరూపాన్ని మార్చేసిన దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు భారతీరాజా. ‘పదునారు వయదునిలే’తో బాలనటి శ్రీదేవిని హీరోయిన్గా పరిచయం చేయడంతో బోణీ చేశారు భారతీరాజా. అది ఆయనకు కూడా తొలి సినిమానే. రెండో సినిమా ‘కిళక్కే పోగుమ్ రైల్’తో రాధికను తెరమీదికి తెచ్చారు. అదే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తెలుగు నటుడు సుధాకర్. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఒక వెలుగు వెలిగిన భాగ్యరాజా కూడా భారతీరాజా శిష్యుడే. భారతీరాజా దగ్గర అసి స్టెంట్గా పనిచేస్తూ, ఆయన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలను చేస్తూ వచ్చిన భాగ్యరాజాను హీరోని చేశారు భారతీరాజా. ఆ సినిమాతోనే రతీ అగ్నిహోత్రి కూడా హీరోయిన్గా పరిచయం అయ్యింది. తమిళనటుడు, దర్శకుడు మణివణ్ణన్కి కూడా భారతీరాజాయే గురువు. ‘సీతాకోక చిలుక’ తమిళ వెర్షన్‌తో కార్తీక్, రాధల్ని హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఆ సినిమా తెలుగు రీమేక్‌తో కార్తీక్ తెలుగు వాళ్లకు పరిచయమైతే... ముచ్చర్ల అరుణ హీరోయిన్ అయ్యింది. ప్రసిద్ధ తమిళ గీత రచయిత వైరముత్తు కూడా భారతీరాజా కనిపెట్టిన కవే. ‘డాన్స్‌మాస్టర్’లో కమల్‌కి జోడీగా నటించిన రేఖ, ‘మంగమ్మగారి మనవడు’ తమిళ వెర్షన్ ‘మన్వాసనై’తో రేవతిలు హీరోయిన్లు అయ్యారు ఆయన చలువ వల్లే. ఆయన ‘నిళల్గల్’ సినిమాతో పరిచయం చేసిన రవి ఆ తరువాత నిళల్గల్ రవిగానే స్థిరపడిపోయారు. ఇంకా భానుప్రియ, సుకన్య, రంజిత, రియాసేన్, ప్రియమణి, కాజల్... వీళ్లందరి తొలి సినిమాల కెప్టెన్ కూడా భారతీరాజానే. ఇంతమంది గొప్ప నటీనటులను వెలికి తీయడం మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికి తీయడమంటే మాటలూ కాదు. అది భారతీరాజాకు మాత్రమే సాధ్యమేమో! ఏకలవ్యులలా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు వసంత బాలన్, బాల, శివకుమార్ వంటి తమిళ దర్శకులు. ఇంతమంది స్టార్లనూ, డెరైక్టర్లనూ ప్రభావితం చేసిన భారతీరాజాను స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్ అనొచ్చు. - జీవన్ -
3డి మూవీలో నటించబోతున్న సూర్య
-
అజారుద్దీన్ జీవిత కథతో సినిమా
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర, వెండితెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ క్రీడాకారుడు క్రికెట్‌కు అందించిన విశేష సేవలను ఎవరూ మరచిపోరు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం మాత్రం పలు ఆసక్తికరమైన మలుపులు తిరగడం గమనార్హం. అజారుద్దీన్ నవ్రిన్ అనే హైదరాబాద్ యువతిని వివాహం చేసుకుని తొమ్మిదేళ్లు కాపురం చేసి ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడాకులు పొందారు. ఆ తరువాత నటి సంగీత బిజ్లానీతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 1986లో వీరిద్దరూ ఒకటయ్యారు. అయితే 14 ఏళ్ల సంసార జీవితం అనుభవించిన తరువాత 2010లో విడిపోయారు. ఆ తరువాత ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణితో అజారుద్దీన్ షికార్లు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అజారుద్ధీన్ ఖండించారు. అజారుద్దీన్‌కు తొలి భార్య నవ్రిన్కు అసాద్, అరుష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో 19 ఏళ్ల అరుష్ ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించాడు. ఇలాంటి మలుపులతో కూడిన అజారుద్దీన్ జీవిత ఇతివృత్తంతో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. బాలీవుడ్ మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి అజారుద్దీన్ నుంచి అనుమతి పొందినట్లు తెలిసింది. దీనికి కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. -
తారల బిజీనెస్
రంగులలోకంలో రాజాలై, ‘రాణి’ంచాలని... తెరకెక్కుతున్న తారలు ఆ కలలు కల్లలైతే... ఏం కావాలి? ఓ వైపు ఈ ప్రశ్న ‘ఉదయి’ంచే సంఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటుంటే... మరోవైపు ‘మాకు రెస్టారెంట్ ఉంది.. రియల్ఎస్టేట్ ఉంది.. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది’ అంటూ పలువురు నటీనటులు తమకున్న విభిన్న రకాల వ్యాపకాలతో దీనికి సమాధానం చెప్పకనే చెబుతున్నారు. అవకాశాల దీపం వెలుగుతూ ఉండగానే కొత్త కెరీర్లను వెతుక్కుంటున్నారు. సినీ వినీలాకాశంలో వెలిగే తారలు కాలేకపోయినా... ఆర్థిక స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. యువనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య ఉదంతం వెండితెర తారల జీవితాలపై రేపిన ప్రశ్నలెన్నో. అందులో ప్రధానమైనది... సినిమా నటుల ఆర్థిక పరిస్థితి. కెరీర్ బాగున్నప్పుడు సరే గానీ... కాస్త అటూ ఇటూ అయినా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా... కొందరు ముందస్తు ప్రణాళికలతో కొత్త కొత్త వ్యాపకాలతో సినిమా రంగానికి ఆవల సరికొత్త వ్యాపకాలను విస్తరించుకుంటున్నారు. ప్లస్.. సెలబ్రిటీ స్టేటస్ తమకున్న సెలబ్రిటీ స్టేటస్‌నే పెట్టుబడిగా.. నటులు వ్యాపారవేత్తలుగా అవతరిస్తున్నారు. నగరానికి చెందిన పలువురు వ్యాపారులు వీరిని భాగస్వాములుగా కలుపుకునేందుకు ఉవ్విళ్లూరుతుండడంతో వీరి పని మరింత సులువుగా మారుతోంది. తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఫ్యాషన్ రంగంతో పాటు స్పాలు, జిమ్‌లు, క్లబ్‌లు, పబ్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు... ఇలా విభిన్న రంగాలను సినీనటులు ఎంచుకుంటున్నారు. కాదేదీ.. కాలిడేందుకు అనర్హం... తమకు వ్యాపారం లేదా వ్యాపకం ఉన్న విషయం తెలిస్తే సినీ అవకాశాలు దూరమవుతాయనే కారణంతో వీటి వివరాలు కొందరు నటీ నటులు వెల్లడించడానికి ఇష్టపడనప్పటికీ.. నగరంలో వీరి ‘బిజీ’నెస్‌లు చాలా మందికి తెల్సినవే. * హీరో శర్వానంద్‌ను తీసుకుంటే ఆయన సినిమాలకు ప్రత్యామ్నాయ కెరీర్‌గా హోటల్ రంగాన్ని ఎంచుకున్నట్టు కనబడుతోంది. తన స్నేహితుల, కుటుంబీకుల సహకారంతో జూబ్లీహిల్స్‌లో ఆయన ‘బీన్జ్’ పేరుతో ఓ కాఫీ షాప్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. * స్లిమ్‌గా మారి మళ్లీ చిన్నితెర, వెండితెరలపై త‘లుక్’మంటున్న రాశి... మణికొండలో ఓ ప్లే స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. * నటి భూమిక ‘మాయాబజార్’ అనే మేగజైన్‌ను ప్రారంభించి అనంతరం ఒక మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. భర్త భరత్ ఠాకూర్‌కు యోగా శిక్షకుడిగా ఉన్న ప్రాచుర్యాన్ని ఉపయోగించుకునేందుకు భారీస్థాయిలో యోగా శిక్షణా స్కూల్ నిర్వహణలోనూ ఆమె పాలుపంచుకుంటున్నారు. * పలు చిత్రాల్లో హీరోగా, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ టాలీవుడ్లో తనదైన గుర్తింపు పొందిన నటుడు నవదీప్ మరో స్నేహితుడ్ని పార్ట్నర్గా చేసుకుని ఇటీవలే ‘రా ప్రొడక్షన్ హౌస్’ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు. సుష్మితాసేన్ సమర్పించిన ‘ఐయామ్ షి’ ఈవెంట్‌ను ఆయన సంస్థ విజయవంతంగా నిర్వహించింది. * వారసత్వంగా లభించిన స్థలంలో కొందరు మిత్రులతో కలిసి కార్ఖానా, వాసవీనగర్‌లో ‘మాయాబజార్’ పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు నటుడు శశాంక్. ‘ఐతే’తో అరంగేట్రం చేసిన ఈ నటుడు తాజా సినిమా‘ఎవడు’లోనూ మంచి పాత్ర పోషించారు. * కమల్ కామరాజ్ అటు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు చిత్రకారుడిగానూ నిరూపించుకుంటున్నారు. ఒడిదుడుకులు తట్టుకునేందుకు.. సినీరంగంలో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. వీటిని తట్టుకునేందుకు ఆర్థిక స్వావలంబన అవసరం. అందుకే మాయాబజార్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాను. షూటింగ్‌లు లేని సమయాల్లో వీలైనంత ఎక్కువ సమయాన్ని దీని నిర్వహణకే కేటాయిస్తున్నా. వ్యాపార భాగస్వాములైన మిత్రుల సహకారంతో రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా. - శశాంక్, నటుడు ‘రియల్ ఎస్టేట్’లోకి వస్తున్నా మొదటి నుంచీ సినిమారంగంతో పాటు నన్ను నేను నిరూపించుకునేందుకు పలు రంగాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాను. త్వరలో ‘ది విలేజ్’ పేరుతో ఓ సరికొత్త రియల్ ఎస్టేట్ వెంచర్‌ను సైతం ప్రారంభిస్తున్నాను. నా సినిమా షూటింగ్‌లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ వ్యాపకాలన్నింటిలో సన్నిహితులను భాగస్వాములుగా చేసుకుంటున్నాను. - నవదీప్, నటుడు -
చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు
సందర్భం:‘ఆత్మబలం’చిత్రానికి 50 ఏళ్లు ఏ సినిమాకైనా కథే బలం. ఆ తర్వాత తారాగణం బలం. సాంకేతిక బృందం బలం. పాటలు ఇంకా బలం. ఇన్ని బలాలు ఉన్నాయి కాబట్టే ఆత్మబలం చిత్రాన్ని 50 ఏళ్లయినా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ ఇందులోనిదే. ఏయన్నార్ కెరీర్లో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయిన ఈ చిత్రం ‘జగపతి’ సంస్థను తిరుగులేని నిర్మాణ సంస్థగా నిలబెట్టింది. ‘ఆరాధన’ సినిమా పెద్ద హిట్టు. నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్‌కు ఇది రెండో విజయం. ‘అమ్మయ్యా... మనం నిలదొక్కుకున్నట్టే’ అని ఊపిరి ల్చుకున్నారాయన. కానీ ఎదురుగా కాలం కత్తితో గుచ్చడానికి సిద్ధంగా ఉంది. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న మెయిన్ పార్టనర్ పర్వతనేని రంగారావు హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. అర్జంట్‌గా కథ కావాలి. అప్పట్లో మన సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ చలో కలకత్తా. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా స్టార్ట్. వి.మధుసూదనరావు డెరైక్టర్‌గా రెడీ. కేవీ మహదేవన్ మ్యూజిక్కు. సి.నాగేశ్వర్రావు ఫొటోగ్రఫీ. ఆత్రేయ మాటలూ పాటలూ. హీరోయిన్గా బి.సరోజాదేవి కాల్షీట్స్ ఇచ్చారు. జగ్గయ్య, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం... ఇలా హేమాహేమీలంతా ఓకే. ఈ పనులు ఇలా జరుగుతుంటే... ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కు చలో అన్నారు. మొదట పాటల తయారీ మొదలైంది. కంపోజింగ్ కోసం మామ, ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్... నలుగురూ బెంగళూరు వెళ్లారు. బృందావన్ హోటల్లో బస. మామకు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన టాప్ మ్యూజిక్ డెరైక్టర్. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మామకు చెబితే ఓకే అన్నారు. ఆత్రేయ కూడా ఇన్‌స్పయిర్ అయిపోయారు. కానీ రెండ్రోజులైనా పాట పుట్టదే! హాయిగా నచ్చిన ఫుడ్ తింటూ, బాగా రెస్టు తీసుకుంటున్నారు తప్ప, కలం మూత మాత్రం తీయలేదాయన. దాంతో దర్శక నిర్మాతలిద్దరికీ చిర్రెత్తుకొచ్చింది. ‘రేపే మన తిరుగుప్రయాణం’ అని చెప్పేశారాయనకు. దాంతో ఆత్రేయకు కంగారొచ్చింది. నిద్ర రాకుండా ఏవో మాత్రలు తెప్పించుకుని వేసుకున్నారు. నిద్ర రాలేదు... ఆయనలోంచి పాట కూడా రాలేదు. తెల్లవారు జామునే డ్రైవర్ని లేపి కారులో కబ్బస్ పార్కుకి వెళ్లారు. పలచగా జనం. అంతా వాకింగ్‌కొచ్చిన వాళ్లే. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అంతా పరుగులు. ఓ జంట మాత్రం ఓ గుబురు పొదలో దాక్కున్నారు. లోకాన్ని మరిచిపోయి ముద్దుమురిపాల్లో తేలిపోతున్నారు. ఇదంతా ఆత్రేయ కంటబడింది. ఆయనలో ప్రణయరసం ఉప్పొంగింది. ఆపై పాట పరవళ్లు తొక్కింది. ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ అంటూ పాట రెడీ. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్. అంతా సాఫీగానే ఉంది. అయితే మూడో షెడ్యూల్ సమయంలోనే తంటా వచ్చి పడింది. ఓ హిందీ సినిమా షూటింగ్లో అనుకోకుండా బి.సరోజ తలకు గాయమైంది. డాక్టరు 15 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అన్ని సినిమాల కాల్షీట్లూ వృథా. నిర్మాతల్లో టెన్షన్. వి.బి.రాజేంద్రప్రసాద్ ఆమె ఇంటికి వెళ్తే గూర్ఖా ఆపేశాడు. ఎంత చెప్పినా లోపలకు నో ఎంట్రీ. బి.సరోజ తల్లి చూసీ చూడనట్టు లోపలకు వెళ్లిపోయింది. దాంతో ఈయనకు ఏడుపొచ్చినంత పనైంది. అయినా తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి, డేట్లు ఎప్పుడో కనుక్కోవాలి. ఎల్వీ ప్రసాద్ కొడుకు ఆనంద్‌బాబు, ఈయనకు క్లోజ్. అతన్ని తీసుకుని బి.సరోజ ఇంటికెళ్లారు. ఒక నెల తర్వాత కాల్షీట్లు ఇస్తామని, 15 రోజుల్లోనే మొత్తం వర్క్ పూర్తి చేసుకోవాలని, అది కూడా అంతా మద్రాసులోనే జరగాలని కండిషన్స్. పాపం... వి.బి.రాజేంద్రప్రసాద్ పరిస్థితి అయోమయం అయిపోయింది. అక్కినేనిని మద్రాసు రమ్మనలేడు. బి.సరోజ హైదరాబాద్ రాదు. అటు నుయ్యి... ఇటు గొయ్యి. సినిమా మధ్యలో ఉంది. సరే... ధైర్యం చేసి అక్కినేనిని కలిసి విషయమంతా చెప్పేశారు. ‘‘అయితే... నేనే మద్రాసు వస్తా’’ అని భరోసా ఇచ్చారు అక్కినేని. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్‌కి కొండంత ధైర్యం వచ్చింది. మద్రాసులోని విజయా వాహినీ స్టూడియోలో సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. ‘చిటపట చినుకులు’ పాట ఇక్కడే తీశారు. తలకు తగిలిన దెబ్బ కనబడకుండా బి.సరోజ తలకు గుడ్డ కట్టారు. ఎట్టకేలకూ సినిమా రెడీ. మళ్లీ టెన్షన్. ఈసారి సెన్సార్ రూపంలో. సెన్సారాఫీసర్ శాస్త్రి చండశాసనుడు. కట్ అంటే కట్. నో డిస్కషన్. క్లైమాక్స్ చాలా భాగం కట్ చేసేయాలన్నారాయన. సినిమాకు అదే ఆయువు పట్టు. వీళ్లు ఎంత మొత్తుకున్నా వినలేదు. దాంతో క్లైమాక్స్ కట్ చేశారు. 1964 జనవరి 9న ‘ఆత్మబలం’ రిలీజైంది. పెద్ద మ్యూజికల్ హిట్టు. ఏడు పాటలూ మార్మోగిపోయాయి. అసలు పాటల కోసమే మళ్లీ మళ్లీ చూసిన వాళ్లు ఉన్నారు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ వాన పాటల్లో నంబర్‌వన్. సాహిత్యం, సంగీతం, ముఖ్యంగా ఏయన్నార్, బి.సరోజల కెమిస్ట్రీతో... పాట విన్నప్పుడల్లా మనసులో అనుభూతుల వాన కురవడం మొదలైపోతుంది. వి.బి.రాజేంద్రప్రసాద్‌కు నిజంగానే ఆత్మబలాన్ని ప్రసాదించిందీ సినిమా. క్లైమాక్స్ కట్ చేయకుంటే ఇంకా పెద్ద హిట్టయ్యేది! ‘‘క్లైమాక్స్ సెన్సార్ కట్‌కి గురికాకుండా ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించేది. ఎందుకంటే క్లైమాక్స్ కట్ కావడంతో గ్రాఫ్ హఠాత్తుగా పడిపోయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏంటంటే... హీరోకి ఉరిశిక్ష పడుతుంది. తెల్లవారితే ఉరి తీస్తారు. ఈలోగా హీరోయిన్, అతను నిర్దోషి అని చెప్పే ఆధారంతో జడ్జిని కలుస్తుంది. దాంతో ఉరి ఆగుతుంది. ఇదంతా చాలా డీటైల్డ్‌గా తీశాం. ఇంటర్‌కట్స్ వల్ల ప్రేక్షకునిలో ఉత్కంఠ కలుగుతుంది. సెన్సారాఫీసర్ ఈ ఉత్కంఠ వల్ల ప్రేక్షకుడి గుండె ఆగిపోతుందని వాదించి, ఉరిశిక్షకు సంబంధించిన షాట్స్ అన్నీ కట్ చేయించేశారు’’. -
తారల సెంటిమెంట్
-
ధర్మవరపు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: ‘మాక్కూడా తెలుసు బాబూ..’ వంటి మాటల విరుపులు, విలక్షణ నటనతో అశేష తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(59) ఇక లేరు. ఆరు నెలలుగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటలకు ఇక్కడి చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో మృతిచెందారు. పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల కింద ట ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. సందీప్ వివాహితుడు కాగా, రవిబ్రహ్మతేజ డిగ్రీ చదువుతున్నారు. ధర్మవరపు కుటుంబం దిల్‌సుఖ్‌నగర్‌లోని శారదానగర్‌లో నివాసం ఉంటోంది. ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అద్దంకి దగ్గర్లోని శింగరకొండ దేవాలయం వద్ద ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. దర్శకుడు తేజ.. ధర్మవరపు భౌతికకాయాన్ని సందర్శించారు. ఆనందోబ్రహ్మతో: ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. అలా చదువుతున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో ఏర్పడింది. ‘గాలివాన’ నాటకంలోని జగన్ పాత్రతో ధర్మవరపు 18 ఏళ్ల వయసులోనే నటనలో సత్తా చాటారు. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగానికి ఎంపికైన ఆయన హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో దూరదర్శన్‌లో ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్లో నటించి గుర్తింపు పొందారు. తర్వాత ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. ఎమ్మెల్యేలకు నిర్వహించే క్రీడాపోటీలకు వ్యాఖ్యానం చెప్పే అవకాశం కూడా ఆయనకు లభించింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో తెరంగేట్రం.. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ధర్మవరపు తెరంగేంట్ర చేశారు. ‘నువ్వు-నేను’ తదితర చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన నరేష్ నటించిన ‘తోకలేనిపిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాస్యంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా సాక్షి టీవీలో నిర్వహిస్తున్న రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్‌డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ధర్మవరకు రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గా పనిచేశారు. ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మవరపు కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా కళారంగ వికాసానికి కృషి చేశారు. ఆయన నటించిన ‘ప్రేమాగీమా జాంతానై’ విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరై తమకెంతో సహకరించారని చిత్ర దర్శకుడు ఆర్వీ సుబ్బు తెలిపారు. ధర్మవరపు మరణంపై రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సంతాపం తెలిపారు. -
జూనియర్ ఆర్టిస్ట్‌పై లైంగికదాడికి యత్నం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: పీకలదాక మద్యం తాగిన ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్‌పై లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు ‘నిర్భయ’చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సురేష్‌బాబు (26) ఇందిరానగర్‌లో ఉంటూ సినిమాల్లో సెట్టింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పదిన్నర గంటలకు పీకల దాకా మద్యం తాగిన ఇతను రహ్మత్‌నగర్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ (22) ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు. ఆమె తలుపు తీయగానే ఉదయాన్నే సినిమా షూటింగ్ ఉందని, సిద్ధంగా ఉండమని చెప్పాడు. గతంలో తనను షూటింగ్‌కు తీసుకెళ్లి ఇంతవరకు పారితోషికం ఇవ్వలేదని ఈసారి వచ్చేది లేదని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహించిన సురేష్ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సురేష్ ఆమెను గట్టిగా పట్టుకొని మెడ కొరకడంతో పాటు లైంగికదాడికి యత్నించారు. షాక్‌కు గురైన బాధితురాలు మెడ నుంచి రక్తం కారుతుండగా గట్టిగా కేకలు పెడుతూ పరుగులు తీసింది. అక్కడకు వచ్చిన మరో మహిళతోనూ సురేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు సురేష్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై నిర్భయ చట్టం (సెక్షన్ 354) కింద కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్‌చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
ప్రజాసంఘూలతో భేటి ఆయిన మోడీ