Gossip
-
సూపర్ హీరో పాత్రలో బాలకృష్ణ?
హీరో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 'అఖండ' తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే. కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ టైంలో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. 'హనుమాన్', 'కల్కి' ఈ తరహా చిత్రాలే.ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది. లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
'పుష్ప 2' రిలీజ్ డేట్.. మళ్లీ మార్పు?
తెలుగు ప్రేక్షకులు 'పుష్ప 2' మూవీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. లెక్క ప్రకారం ఈపాటికే షూటింగ్ పూర్తయి, థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీలో కూడా చిన్నపాటి మార్పు చేశారట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తీసిన 'పుష్ప' మూవీ 2021 డిసెంబరులో రిలీజైంది. ఎలాంటి అంచనాల్లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజై, సెన్సేషన్ సృష్టించింది. దీంతో సీక్వెల్‌పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దర్శకుడు సుకుమార్.. ప్రతి విషయాన్ని చాలా కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా దాదాపు మూడేళ్లు గడిచిపోయింది.ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి ప్లాన్ మార్చారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఇందుకు గల కారణాలు ఏంటి? బిజినెస్, ఓటీటీల లెక్కల పరంగా మార్పు చేశారా? మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఆ హీరోయిన్ తో?) -
క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ?
‘కాంతార’ సినిమాతో నేషనల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు కన్నడ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. ఈ చిత్రంలోని రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరింగింది. చిన్న సినిమాగా వచ్చిన కాంతార చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో రిషబ్ శెట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ అంచాలు నెలకొన్నాయి. ఇక లైగర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికి విజయ్‌కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి, ‘లైగర్’తో విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ చూసి సౌత్ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిషబ్, విజయ్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడా? లేక వీరిద్దరు హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం రూపొందనుందా? అనేది క్లారిటీ లేదు. ఈ ప్రస్తుతం ఈ వార్త ఫిలిం దూనియా హాట్‌టాపిక్‌గా నిలిచింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇదివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార సీక్వెల్‌ను తెరకెక్కించిన పనిలో ఉండగా. మరోవైపు విజయ్ ఖుషీ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్ -
షాకింగ్.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?
జయసుధ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఆమె సినీప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామీలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే! ఇటీవల వారసుడు(తమిళంలో వారీసు) మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. ఇమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిస్తున్నారట. ఏ కార్యక్రమం అయిన మూవీ ఈవెంట్ అయిన అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్త అని తెలిస్తోంది. అతడిని ఆమె సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ! ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. అదే సమయంలో జయసుధ ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జయసుధ ఈ వార్తలపై స్పందించేవరకు వేచి చూడాలి. చదవండి: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’ కాగా జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
త్రిషకు షాక్! తెరపైకి కాజల్ అగర్వాల్?
సినిమా రంగంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నటుడు అజిత్ కొత్త చిత్రం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం. ఈయన కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌కు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తన 62వ చిత్రానికి అజిత్ రెడీ అవుతున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇందులో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అజిత్, నయనతారలది హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట నటించి మెప్పించింది. ఆ విషయం పక్కన పెడితే అజిత్ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. దీంతో కాజల్ అగర్వాల్ ఎంపిక చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, కమలహాసన్ సరసన ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. -
మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. మహేశ్ బాబు తల్లి ఇందిర దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఇక షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు చిత్ర బృందం రీసెంట్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: మాజీ కపుల్స్ ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్ ఇదిలా ఉంటే వచ్చే ఏడాదిలోనే మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా 2023 మార్చిలో ప్రారంభం కానున్నట్లు గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఈ నేపథ్యంలో జక్కన-మహేశ్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం జక్కన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను పరిశీలిస్తున్నారట. ఈ పాత్రకు ఆయన అయితనే కరెక్ట్ సెట్ అవుతారని ఆయన అభిప్రాయపడుతున్నారట. దీంతో త్వరలోనే బిగ్‌బిని కలిసి కథ వివరించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా పాన్ వరల్డ్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో దాదాపు అంత స్టార్ నటీనటులనే పరిశీలిస్తున్నారని, ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్‌ని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే అలాగే హీరోయిన్గా బాలీవుడ్ భామనే అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. కాగా యాక్షన్ అడ్వెంచర్ తరహాలో రూపొందే ఈ చిత్రంలో మహేశ్ బాబు జెమ్స్‌బాండ్ తరహా కనిపిస్తారని ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో జక్కన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: తల్లయిన తర్వాత తొలిసారి బయటకు వచ్చిన నయన్, ఫొటోలు వైరల్ పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు -
పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే ఆ ఒక్క డైలాగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా రష్మిక మందన్నా గ్లామర్‌కు తోడు అల్లు అర్జున్ డ్యాన్స్, విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేసింది. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2కు మూవీ షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ దీనికి సంబంధించి రూమర్స్ మాత్రమే బాగానే బయటకు వస్తున్నారు. పార్ట్‌లో పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్నారంటూ రోజుకో అప్డేట్ బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మారో అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో కేథరిన్‌ను తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర మొదట పాజిటివ్‌గా కనిపించి, ఆఖరిలో బన్నీకి షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇదివరకే కేథరిన్ బన్నీ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మహిళా ఎమ్మెల్యే పాత్రలో అలరిచింది. చదవండి: బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే చాలా జరిగిపోతాయి: ప్రియదర్శి -
ఆ నటుడి డైరెక్షన్లో సమంత నెక్ట్స్ మూవీ?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. బక్సాఫీసు వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. సరోగసి నేఫథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లో అలరించింది. దీంతో ఆమె తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. నెక్ట్ సమంత ఎవరి డైరెక్షన్లో చేయనుంది, ఎవరికి ఒకే చెప్పనుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె ఓ నటుడు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! స్టార్ హీరోయిన్ సమంత నటుడు డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు ఓ స్టోరీ లైన్ వినిపిండాడట. అది ఆమెకు బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే మొదట రాహుల్ ఈ కథను రష్మికకు వినిపించాడట, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సమంత కోసం ఈ స్క్రీప్ట్ మర్పులు చేసి ఆమెకు స్టోరీ చెప్పగా సమంత ఒకే చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా రూపొందుతున్న ఈచిత్రంలో సామ్ విజయ్‌తో జతకట్టింది. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు -
ప్రభాస్ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ! ఈ పాత్ర ఎలా ఉంటుందో?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదోక అంశంపై తనదైన శైలిలో కాంట్రవర్సల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక డైరెక్టర్‌గా హిట్, ప్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తు వస్తున్నాడు. యథార్థ సంఘటల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్న ఆర్జీవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. అది కూడా అంత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా హీరో చిత్రంలో... ఆయన ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సలార్, ప్రాజెక్ట్-kలు సెట్‌పై ఉండగా.. ఆది పురుష్ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మారుతితో మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్-k ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలోనే ఆర్జీవీ ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నాడట. ఇటీవలే నాగ్ అశ్విన్ ఈ మూవీలో ఓ పాత్ర కోసం ఆర్జీవీని సంప్రదించగా.. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల? షాకవుతున్న నిర్మాతలు! దీంతో ఆర్జీవీ రోల్‌పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడు భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ నచ్చిన ఆ రోల్ ఏంటనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆయన పాత్ర ఎలా ఉంటుందో? అంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సై-ఫై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుంది. -
భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ?
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం వెండితెరపై ఆమె సందడి కరువైంది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. మళ్లీ సినిమాకు విరామం ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! 2012లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది ఈ జంట. అప్పటి నుంచి కోలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఫ్యాన్స్ చేత మన్ననలు అందుకుంటున్నారు. ఎంతో అన్యన్యంగా తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అందరి చేత ప్రసంశలు అందుకుంటున్నారు. అంతేకాదు భర్తతో, పిల్లలతో కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ స్నేహ మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ స్నేహ కొద్ది రోజులుగా తన భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె మరో ఇంట్లో వేరుగా ఉంటోందంటూ పలు తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయని, ప్రస్తుతం స్నేహ భర్త మీద కోపంతో ఉందని.. అందువల్లే భర్తకు దూరంగా ఉంటుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఈ జంట స్పందించలేదు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే స్నేహ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
అర్జున్ సర్జా-విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి మరో యంగ్ హీరో!
గత కొద్ది రోజులుగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. అర్జున్ డైరెక్షన్లో రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో సడెన్‌గా ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేశారు. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా రీసెంట్గా ఆరోపణలు చేయగా.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, అందువల్లే షూటింగ్ ఆపమని అడిగానంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్. ప్రస్తుతం ఈ వివాదంపై సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: 9 వారాలకు గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం అర్జున్ మరో యంగ్ హీరోను తీసుకునే ఆలోచన ఉన్నారట. ఇది తెలుగులో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో అర్జున్‌కి ఈ సినిమాని సెంటిమెంట్‌గా చూస్తున్నారట. అందువల్లే ఆయన ఈ సినిమాను ఆపేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. చాలా కాలం తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. చదవండి: పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్ పోస్ట్ -
వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా?
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచలోనికి తీసుకేళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. భారత ప్రేక్షకులను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్) పేరుతో సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి దాదాపు 160 దేశాల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్కాలజీతో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ విషయంలో వివిధ దేశాల్లో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఇండియాలో సైతం అవతార్ 2 భారీగానే బిజినెస్ చేసేలా ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అందుకే అవతార్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో తెలుగులో ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. -
పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష!
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట. అది కూడా ఓ సీనియర్ బడా ఇంటికి కోడలిగా వెళ్లబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వర్ష.. మిడిల్ క్లాస్ మెలోడిస్‌తో స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. తాజాగా ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ సరసన స్వాతిముత్యంలో నటించింది. చదవండి: అనసూయ పక్కన ఉన్న ఈ కొత్త వ్యక్తి ఎవరు? అతడితో అంత క్లోజ్ ఏంటి.. ఈ సినిమాతో ఆమె మరో హిట్ కొట్టేసింది. ప్రస్తుతం స్వాతిముత్యం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వర్ష పెళ్లి గురించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే తెరపై వర్ష అందం, అభినయానికి ఓ సీనియర్ నిర్మాత కొడుకు ఫిదా అయ్యాడట. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో సదరు నిర్మాత ఒకే అనేశాడట. ఇక బయట కూడా వర్ష వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను కొడలిగా చేసుకునేందుకు ఆ మాజీ నిర్మాత ఆసక్తిగా ఉన్నాడట. చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో.. దీంతో ఆలస్యం చేయకుండా పెళ్లి విషయాన్ని వర్ష తల్లిదండ్రులతో మాట్లాడాడట ఆయన. ఇరు కుటుంబాలు చర్చించుకుని పెళ్లికి ఒకే చెప్పుకున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ, వర్ష ఓ పెద్దింటికి కోడలిగా వెళుతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. ఇక ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే వర్ష బొల్లమ్మ స్పందించేవరకు వేచి చూడాల్సిందే. -
ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. . కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందించి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇక మొదటి భాగంగా గత నెల సెప్టెంబర్ 30న తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పెద్దగా వసూళు చేయలేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పొన్నియన్ సెల్వన్ రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన నిర్మాత.. కారుతో భార్యను తొక్కించి.. ఇక థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైం సొంతం చేసుకుందని, నవంబర్ మొదటి, రెండు వారాల్లో పొన్నియన్ సెల్వన్ అందుబాటులోకి రానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లతో పాటు మణిరత్నం కూడా నిర్మించారు. #PonniyinSelvan Streaming On #PrimeVideo Coming Soon#vikram #karthi #jayamravi #parthiban #prakashraj #jayaram #vikramprabhu #prabhu #rahuman #aishwaryarai #trisha #aishwaryalekshmi #sobhitadhulipala #ott #diwali2022 #diwali #tamiltvsatellitesrights #vijayavikash#VIJAYAVIKASHM pic.twitter.com/vVEdp3tHfV — Tamil TV Satellites Rights (@TTSR_Official) October 24, 2022 -
‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేశ్ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమాకు హైలెట్‌గా నిలిచారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ అయితే ఈ సినిమా కోసం వెంకి భారీగానే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించింది 15 నిమిషాలే యంగ్ హీరో రెమ్యునరరేషన్ స్థాయిలో ఆయనకు మేకర్స్ భారీ మొత్తం చెల్లించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓరి దేవుడా సినిమాలో వెంకి తన పాత్ర కోసం 5 రోజుల కాల్షీట్ ఇచ్చారట. ఈ 5 రోజుల షూటింగ్, 15 నిమిషాల నిడివికి ఆయన దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చదవండి: Mega 154 Title: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్ -
యాంకర్‌గా అనసూయ చెల్లెలు? త్వరలోనే ఆ షోతో ఎంట్రీ!
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై సైతం సత్తా చాటుతోంది. పెద్ద సినిమాల్లో కీ రోల్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఇటూ యాంకర్‌గా, అటూ నటిగా కెరీర్లో సక్సెస్ అయ్యింది అనసూయ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లెలు యాంకర్‌గా రంగప్రవేశం చేయనుందట. అనసూయకు ఇద్దరు చెల్లెల్లు అనే విషయం తెలిసిందే. వారిలో వైష్ణవి ఒకరు. చదవండి: కొడుకు పోజులు చూసి మురిసిపోతున్న కాజల్.. ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ఆమె త్వరలోనే యాంకర్‌గా బుల్లితెరపై అలరించబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య కామెడీ షో స్పెషల్ ఎపిసోడ్లో అనసూయతో పాటు వైష్ణవి కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అందం, అల్లరి, చాలాకి తనంలో అచ్చం అనసూయను తలపించడంతో అక్కకు తగ్గ చెల్లెలు అనిపించుకుంది వైష్ణవి. అందుకే ఆమెను యాంకర్‌గా రంగప్రవేశం చేయించేందుకు ‘రంగమత్త’ గట్టి ప్రయత్నాలు చేస్తోందని వినికిడి. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని ఒక షో కోసం రికమండ్ కూడా చేసిందట. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో త్వరలో ప్రసారం కానున్న ఒక షో ద్వారా వైష్ణవి యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు!
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుశ్-ఐశ్వర్య రజనీకాంత్‌లు మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయామని ధనుశ్-ఐశ్వర్యలు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. పిల్లల కోసం వీరిద్దరు వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ధనుశ్ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుశ్కు తన పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విడాకులు ఈ వార్తలపై స్పందించాడు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట ఫాలోవర్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుశ్ ఓ కొత్త ఇంటిని కొనుగొలు చేస్తున్నాడని, విడాకులు రద్దు ప్రకటన ఆనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే ధనుశ్ ఖరీదు చేయబోయే ఆ ఇంటి విలువ రూ. 100 కోట్లని, వచ్చే ఏడాది జనవరిలో భార్య, పిల్లలతో గృహ ప్రవేశం కూడా చేయబోతున్నాడంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలు నిజమైతే బాగుండని, మళ్లీ వారిద్దరు కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2004 నవంబర్ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ధనుశ్-ఐశ్వర్యలకు యాత్రా రాజా (15 ), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కాస్తా దగ్గిందననే చెప్పొచ్చు. ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేని వారే ఈ సీజన్లో ఎక్కువ ఉన్నారు. బాలాదిత్య, సింగర్ రేవంత్ మిగతావారేవరు పెద్దగా పరిచయం లేనివారే. దీంతో ఈ సీజన్‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే హౌజ్‌లో కంటెస్టెంట్స్ తీరు కూడా అలాగే ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, వ్యక్తిగతంగా ద్వేషించుకోవడం తప్పా ఎవరి మధ్యా పెద్దగా సఖ్యత కనిపించడం లేదు. టాస్క్‌లో సైతం టీం మెంబర్స్ మద్దతుగా నిలవకపోగా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్‌గానే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గత సీజన్ల కంటే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కరువైంది. దీంతో ఎంటర్టైన్మెంట్ డోస్‌ను పెంచేందుకు బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్‌గా వచ్చి యాంకర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వైల్డ్‌కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి తీసుకువస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం చివరిలో సుధీర్ సడన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.ప్రస్తుతం సుధీర్ క్వారంటైన్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది తెలిసి బిగ్‌బాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్‌కి కచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందంటున్నారు అతడి ఫ్యాన్స్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఒక్క కంటెస్టెంట్లు అంతగా వినోదాన్ని అందించలేకపోతున్నారు. అందుకే ఈ సమయంలో సుధీర్ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు మంచి టాప్ టీఆర్పీ రేటింగ్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సుధీర్‌కు భారీగా పారితోషికం కూడా ఇస్తున్నారట. అయితే అది ఎంత అనేది స్పష్టత లేదు. ఇక సుధీర్ హౌజ్‌లో వస్తాడా? రాడా? తెలియాలంటే ఈ వారం చివరి వరకు వేచి చూడాల్సిందే. -
దీపికా -రణ్‌వీర్‌లు విడాకులు తీసుకోబోతున్నారా? కారణం ఇదేనా!
బాలీవుడ్ క్యూట్ కపుల్లో దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏ అవార్డు ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్‌లో చూసిన వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించేవారు. అలాంటి ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి. దీపికా-రణ్‌వీర్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ప్రస్తుతం వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని అలాగే రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. అంతేకాదు ఉమైర సంధూ అనే రివ్యూవర్, ఫిలిం క్రిటిక్ దీపికా-రణ్‌వీర్‌ల బంధం చెడిందని, త్వరలోనే వారి విడాకుల ప్రకటన రానుందంటూ ట్వీట్ చేయడంతో ఈ వార్తలు ఒక్కసారి వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ తమ విడాకుల రూమర్స్‌పై స్పందించాడు. చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ పదేళ్లలో తనపై ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్‌లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనెతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో దీపికా చేతికి వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. అది పట్టేసిన నెటిజన్లు ’హో.. దీపికా వెడ్డింగ్ రింగ్ తీసేసింది.. అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా?’ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
పొన్నియన్ సెల్వన్: అమ్మకానికి ఐశ్వర్య రాయ్, త్రిషల నగలు
తమిళసినిమా: ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇందుకు కారణాలు అనేకం. ప్రధాన కారణం చిత్ర కథ దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి కలం నుంచి జారువాలిన నవల పొన్నియిన్ సెల్వన్. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నవల ప్రతులను అనేక మంది అనేకసార్లు ముద్రిస్తూనే ఉన్నారు. అంతగా తమిళ ప్రజల మనసుల్లో మమేకమై పోయింది ఈ నవల. మరో విశేషం ఏంటంటే దీనిని ఎంజీఆర్ నుంచి కమలహాసన్ వరకు చిత్రంగా మలచాలని ప్రయత్నించారు. చదవండి: Indira Devi: మహేశ్ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం చివరికి దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మి వంటి ముఖ్య తారలు నటించారు. ఏఆర్ రెహామాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం తొలిభాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచా ర కార్యక్రమాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముంబయికి చెందిన నటి ఐశ్వర్యారాయ్ కూడా ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఇంకా చెప్పాలంటే ఆమె యూనిట్‌కు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారిపోయారు. అదే విధంగా ఇందులో నటించిన హీరోలు ఐశ్వర్యారాయ్‌తో ఫొటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చిత్రంపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రాజుల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఇందులో నటి ఐశ్వర్యారాయ్ నందినిగానూ, త్రిష కుందవై రాణిగానూ నటించారు. ఆ పాత్రల కోసం వీరిద్దరూ ధరించిన ఆభరణాలను వేలం వేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. -
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే..
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయా హీరోల స్పెషల్ డేస్‌ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవర్గ్రీన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత ఈళలు వేయిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి, పవన్ కల్యాణ్ జాల్సా, రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి. చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్! కలెక్షన్స్ పరంగా పోకిరి, జాల్సా చిత్రాలు అదుర్స్ అనిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ చిత్రం కూడా రాబోతోంది. తారక్ కెరీర్ల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం, ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఆది’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీరిలీజ్‌కు నవంబర్‌లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: అలనాటి హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్గా ఎంట్రీ! జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 22న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్‌లో ఈ సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ‘ఆది’ చిత్ర బృందం పేర్కొన్నట్లు సమాచారం. కాగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే నవంబర్ వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో తారక్ జోడిగా కీర్తి చావ్లా నటించింది. -
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్‌పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్‌లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! అయితే యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్‌ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్‌బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్‌కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్ని కొనసాగించాలా? కొత్త మాస్టర్ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥 Thank you @anbariv masters for amazing stunt choreography 🤗 The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja. — Naga Vamsi (@vamsi84) September 21, 2022 -
NTR 30: జూనియర్ ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో ‘నేషనల్ క్రష్’?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్30(NTR30) మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఎన్టీఆర్ 30కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను జరపుకోనుంది. చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి ఈ క్రమంలో ఇందులో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా.. ఆ తర్వాత సమంత ఫైనల్ అయ్యిందన్నారు. రెమ్యునరేషన్ విషయంలో సమంత ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పగా.. అసలు ఈ ఈ ప్రాజెక్ట్ ప్రస్తావనే తన దగ్గరికి రాలేదని జాన్వీ స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకున్న అంశం. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. డైరెక్టర్ కొరటాల నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఈ సినిమాలో హీరోయిన్గా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకుంది రష్మిక. దీంతో భాషతో సంబంధం లేకుండ సౌత్, నార్త్‌లో వరసు పెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె క్రేజ్దృష్ట్యా రష్మికను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చిత్రం బృందం భావిస్తోందట. ఇప్పటికే ఆమెను కలిసి కొరటాల కథ చెప్పాడని, దీనికి ఆమె ఒకే కూడా చెప్పిందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. కాగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందని సమాచారం. -
‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ, డిజిటల్ రైట్స్ అన్ని కోట్లా?!
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈమూవీ ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ రూ. 120 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్, శాటిలైట్‌ను రైట్స్‌ను అమెజాన్‌తో పాటు సన్‌టీవీ కూడా విక్రయించారట. అయితే ఎంతమొత్తానికి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. -
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈమూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ కురువైన నేపథ్యంలో తెలుగు చిన్న సినిమా అయిన కార్తికేయ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఇప్పటికీ థియేటర్లో కార్తీకేయ 2 సందడి చేస్తోంది. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా రూ. 60 కోట్లు షేర్ చేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ చేసింది. బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఏ చిత్రంమైన థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి ఈ మూవీ థియేటర్లో విడుదలైన నెల రోజులు కావోస్తున్న నేపథ్యంలో కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని వినికిడి. ఇక త్వరలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుందట. మరోవైపు సెప్టెంబర్ 30 నుంచే కార్తికేయ 2 అన్ని భాషల్లో అందుబాటులోకి రానుందని కూడా అంటున్నాయి సినీవర్గాలు. దీనిపై జీ5 త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. కాగా టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. #karthikeya2 ott update#nikhil #nikhilsiddhartha #anupamaparmeswaran #anupamkher #adithya #superstar #youngtiger #powerstar #megastar #megapowerstar #rebelastar #stylishstar #naturalstar pic.twitter.com/NxR8MSxFRO — Aniket Nikam Creations (@ANikamCreations) September 10, 2022 -
చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఈ మూవీకి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఓ కీలక పాత్రను రవితేజ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటున్న ఈచిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కూడా భాగం కానున్నారట. ఇందులో ఆయన ఓ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు మెగాస్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వెంకీ ఈ సినిమాలోని ఒక సరదా సందర్భంలో మెరవడానికి ఓకే చెప్పారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా వెంకటేశ్ ఈ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌తో పాటు దగ్గుబాటి అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అంతేకాదు వెంకి చేస్తున్న సీన్‌పై రకరకాలు చర్చించుకుంటున్నారు. తనదైన నటన, కామెడీ టచ్‌తో నవ్వించే వెంకటేశ్‌తో సరదా సన్నివేశం అంటే మామూలు ఉండదని, ఆ సీన్ నెక్ట్ లెవల్లో ప్లాన్ చేసింటారంటూ నెట్టింట నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. -
‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరి జగన్నాథ్
లైగర్ ఫ్లాప్‌తో మరోసారి పూరి జగన్నాథ్ కష్టాల్లో పడ్డాడని తెలుస్తోంది. మాస్, డాషింగ్ డైరెక్టర్ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న పూరి ఆ మధ్యలో వరుస ఫ్లాపులతో అప్పుల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి తన కెరీర్‌ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్‌తో లైగర్ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్ని తలకిందులయ్యాయి. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. దీంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఈ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట. ఇక మూవీని కరణ్ జోహార్‌తో కలిసి పూరీ, చార్మీలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు లైగర్ చిత్రీకరణ అంతా ముంబైలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఓ విలసవంతమైన ప్లాట్‌ను తీసుకున్న పూరి ఇప్పుడు రెంట్ కట్టలేక దాన్ని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్, ప్రమోషన్స్‌లో భాగంగా గతేడాది పూరీ ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబైలో ఓ విలాసవంతమైన సీ ఫేసింగ్ 4 బిహెచ్కే ఫ్లాట్‌ను రూ. 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటనెన్స్ ఖర్చులు కలుపుకుని దాదాపు రూ. 15 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ఇక లైగర్ డిజాస్టర్‌తో ఇప్పుడు ఆ రెంట్ కట్టేలేని పరిస్థితులో పూరి ఉన్నాడని, అందువల్లే ఈ ఫ్లాట్‌ను ఖాళీ చేశాడని తెలుస్తోంది. అదే లైగర్ హిట్ అయ్యి ఉంటే పూరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయేది. ఆశించినట్లు ఈ మూవీ విజయం సాధించి ఉంటే ఆయన కోసం బాలీవుడ్ అగ్ర హీరోలు, నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారు. పూరి కూడా ఈ ఉద్దేశంతోనే ముంబైకి మకాం మార్చాడని సన్నిహితుల నుంచి సమాచారం. లైగర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని, అదే జరిగితే ఇక తాను ముంబైలోనే సెటిల్ అవ్యొచ్చనే ఉద్దేశంతో వెతికి మరి పూరి ఆ విలాసవంతమైన ఫ్లాట్‌ను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడట. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లైగర్ చిత్రం తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు లైగర్ రూ. 58 నుంచి 60 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. Rumours Suggest Director #PuriJagannadh Has Been Forced To Vacate His Posh Mumbai Sea-Facing Flat After #Liger Failed At The #BoxOffice@purijaganhttps://t.co/zqPfGmWWTb — Box Office Worldwide (@BOWorldwide) September 8, 2022 -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ.. పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. చదవండి: ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే ఈ క్రమంలో తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఆమె కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ప్రస్తుతం దక్షిణాన పలు చిత్రాలు చేస్తున్న ఈషా ఈక్రమంలో అక్కడి ఓ స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందట. ఇక త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని, కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఒక్కటికాబోతున్నారంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ తెలుగు బ్యూటీ స్పందించేవరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు బయటకు రావడంతో ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆమె ఫాలోవర్స్. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత -
సమంత బాలీవుడ్ డెబ్యూ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. యశోద ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు ఆమె హాలీవుడ్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విడాకుల అనంతరం భారీ ప్రాజెక్ట్సకు సైన్ చేసి ఫుల్ బిజీగా సామ్ బాలీవుడ్లో అడుగు పెట్టాకుండానే అక్కడ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ‘ది ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్‌తో నార్త్ ఆడియన్స్‌కు దగ్గరైన సామ్ హిందీలో రీసెంట్గా ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలిసింది. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి అంతేకాదు తాప్సీతో ఓ వెబ్ సిరీస్ కూడా సంతకం చేసినట్లు సమాచారం. అయితే, ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రంపై రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొన్నటిదాకా తాప్సీ సినిమాతోనే ఆమె హిందీకి పరిచయం అవుతుందని అనుకున్నారు. ఆ తర్వాత యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిన త్వరలోనే అది పట్టాలెక్కనుందని వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఆమె మరో సినిమాకు సంతకం చేసిందని, ఈ చిత్రమే ముందుగా సెట్స్ పైకి వెళ్లి, విడుదల అవుతుందని తాజా సమాచారం. చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్ జశ్వంత్, ఫ్యాన్స్ ఆందోళన ‘స్త్రీ’ సినిమా ఫేమ్ అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది హారర్ చిత్రమని, ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని సమాచారం. ఈ చిత్రం రాజస్థాన్ జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. చిత్రంలో సమంత రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాజ్‌పుత్ యువ రాణితో పాటు దెయ్యం పాత్రల్లో అలరించనున్నట్టు తెలుస్తోంది. -
జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్?
ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రేంజ్లో ఎన్టీఆర్ 30 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ప్రస్తుతం తారక్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర్తసుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం కోసం కొరటాల భారీ తారాగణంతో ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ప్రతి కథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతిబాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్.. చార్మీ షాకింగ్ నిర్ణయం అలాగే ఇందులో పవర్ఫుల్ మహిళా పాత్ర ఉందట. దానికి కోసం అలనాటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెను కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సుదీర్ఘ విరామం అనంతరం ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లే చేశానని, ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదన్నారు. మళ్లీ అలాంటి పాత్ర వస్తే చేస్తానని చెప్పిన విజయశాంతి ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: నిర్మాతతో టీవీ నటి రెండో పెళ్లి, కొత్త జంటపై దారుణమైన ట్రోల్స్ మరి విజయశాంతి ఎన్టీఆర్ సినిమాకు ఒకే చెప్తుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరోయిన్ సమంతల పేర్లు వినిపంచగా వీరు ఈ ప్రాజెక్ట్ చేయట్లేదనేది స్పష్టమైంది. మరి కొరటాల చివరకు హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. -
‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన లైగర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ బాక్సాఫీస్ లెక్కలన్ని తలకిందులయ్యాయి. విడుదలకు ముందు ఈ మూవీ రూ. 200 కోట్లకుపైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్‌కి బాక్సాఫీసు ఫలితాలు షాకిచ్చాయి. చదవండి: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! దీంతో రౌడీ హీరో ఆశలన్ని అడియాసలయ్యాయి. అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో లైగర్ మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున్న నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, నటి చార్మీ కౌర్‌లు నిర్మాతలు కాగా.. పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లైగర్ పరాజయంతో పూరీ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని సమాచారం. ఇక హీరోగా చేసిన విజయ్ కూడా తన పారితోషికంలో కొంతభాగాన్ని వదులుకున్నాడని తెలుస్తోంది. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాకి విజయ్ రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీనితో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్‌లో విజయ్‌కి కూడా వాటా ఉందట. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, చార్మీలకు చెప్పడమే కాకుండా.. తన పారితోషికంలో రూ. 6 కోట్లను విజయ్ వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసి విజయ్ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడంటూ విజయ్ అభిమానులు కాలర్ ఎగిరేస్తున్నారు. కాగా విజయ్ తన తదుపరి చిత్రం జన గణ మన కోసం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాడు. ఈ మూవీకి కూడా పూరీ దర్శకత్వం వహిస్తుండగా.. చార్మీతో కలిసి నిర్మించనున్నాడు. -
ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
బిగ్‌బాస్ ఫేం, సినీ, టీవీ నటి భానుశ్రీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు షోలకు యాంకర్‌గా చేసిన భాను టీవీ సీరియల్స్ కూడా నటించింది. అలాగే సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిన భాను ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ తెచ్చిపెట్టిన ఫేంతో ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చాన్స్ కొట్టేసింది. ఇటీవల మౌనం, నల్లమల వంటి చిత్రాల్లో హీరోయిన్గా చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం నటిగా, హీరోయిన్గా కెరీర్లో బిజీ అయిపోయిన భాను అటూ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే భాను పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. త్వరలోనే ప్రియుడితో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో తాను ఓ వ్యక్తి వల్లే ఇలా ఉన్నానని, హైదరాబాద్‌లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని చెప్పింది. ఇక తాను అతడినే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడితోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే భానుశ్రీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘తమ్ముడు’కి చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్ -
క్రేజీ అప్డేట్: బిగ్‌బాస్‌లోకి స్టార్ సింగర్స్ దంపతులు? వారెవరంటే..
దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్ పేర్లు రాగా తాజాగా ఓ స్టార్ జంట పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్గా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్టార్ సింగర్స్ ఈ సీజన్లో హౌజ్‌లో సందడి చేయబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ జంట ఎవరనేది ఇప్పటికే మీకో క్లారిటీ వచ్చినట్టుంది కదా. చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! అవును మీరు అనుకుంటున్నట్టుగానే సింగర్ హేమచంద్ర ఆయన భార్య, గాయనీ శ్రావణ భార్గవిలు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారట. గత 3వ సీజన్లో వరుణ్ సందేశ్-వితిక దంపతులు హౌజ్‌లో అలరించిన సంగతి తెలిసిందే. అదే రిపీట్ చేస్తూ ఈ సారి హేమచంద్ర, శ్రావణ భార్గవిలను హౌజ్‌లోకి తీసుకువస్తున్నారట నిర్వహాకులు. ఇందుకోసం వారికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఇక వారు విడాకులు తీసుకుబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఈ జంట ఇప్పటికే ఖండిచింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? అయినప్పటికీ ఈ రూమర్స్ ఇంకా చెక్ పడలేదు. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ శ్రావణ భార్గవి వ్యవహరం పట్ల పరువురు సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ జంట బిగ్‌బాస్ హౌజ్‌లోకి వస్తే ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే అంటున్నారు నెటిజన్లు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్ చేస్తూ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఇక ఈ ఆరవ సీజన్‌కు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారనే దానిపై సెప్టెంబర్ 4వ తేదీతో స్పష్టత రానుంది. -
జూ.ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా ఎన్టీఆర్ 30 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో హీరోయిన్ వేటలో ఉంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఇందులో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ఆ తర్వాత రీసెంట్గా సమంత పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు కొరటాల సమంతను సంప్రదించారనే వార్తలు బయటకు రావడంతో తారక్‌తో సామ్ మరోసారి జతకట్టనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సమంత నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ కుదరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సమంత అడిగినంత పారితోషికం మేకర్స్ ఇవ్వలేకపోయారట. కొరటాల ఈ మూవీ కోసం హీరోయిన్‌కి రూ. 2.5 కోట్ల ఫిక్స్ చేశారట. అయితే సామ్ మాత్రం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. కానీ, కొరటాల రూ. 2.5 కోట్లు మాత్రమే ఇస్తామనడంతో సామ్ ఈ ప్రాజెక్ట్ చేయనని తెగేసి చెప్పినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం కానీ సమంత కానీ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా గతంలో కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో సమంత నటించిన సంగతి తెలిసిందే. చదవండి: నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: స్టార్ హీరోయిన్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ చిత్రంలో సమంత కొద్ది సేపు మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమెను ఫుల్లెన్త్ హీరోయిన్గా తీసుకోవాలని భావించిన కొరటాల ఆమెను సంప్రదించాడట. కానీ సామ్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ సినిమాను వదులుకోవడంతో నందమూరి ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్స్ చేతిలో ఉన్నంత మాత్రానా అంత తలపోగరు ఎందుకంటూ సమంతను తిట్టిపోస్తున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తుంది. అరేంజ్మెంట్స్ ఆప్ లవ్ అనే చిత్రంతో ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిననున్న ఈ చిత్రంలో సామ్ లెస్బియన్ పాత్రలో నటించనుంది -
‘జైలర్’లో తమన్నా పాత్ర అలా ఉంటుంది!
ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్. అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ అయితే తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది. -
ఓటీటీకి మాచర్ల నియోజకవర్గం.. అక్కడే స్ట్రీమింగ్!
హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. తొలి షో నుంచే ఈ మూవీ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, స్పెషల్ సాంగ్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌ను మాచర్ల నియోజకవర్గం నిరాశ పరిచింది. చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు బిగ్‌స్రీన్‌పై పెద్దగా సందడి లేని ఈ చిత్రం త్వరలో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 9న మాచర్ల నియోజకవర్గంను ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక థియేటర్లో నిరాశ పరిచిన ఈ మూవీ సందడి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకొనుంది వేచి చూడాలి. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక?
‘దేశముదురు’ మూవీతో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బ్యూటీ హన్సిక. బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న హాన్సికకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్‌పై ఫోక్స్ పెట్టింది. చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు లేడీ ఓరియంటెడ్, గ్లామర్ రోల్స్ పోషిస్తూ తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. రెండేళ్ల గ్యాప్ అనంతరం ఆమె నటించిన తాజా చిత్రం మహా. త్వరలోనే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది ఆమె. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకుంటున్న హాన్సిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హన్సిక స్పందించే వరకు వేచి చూడక తప్పదు. -
బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్?
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్ నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హౌజ్ సందడి చేసే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను పేరు వచ్చి చేరింది. ఒకప్పుడు బుల్తితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెర శ్రీదేవిగా పిలుపించుకున్న ఆమె తనదైన యాంకరింగ్, వాక్చాతుర్యం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం తెరకు దూరమైన ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోయిన్ రెంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె అప్పుడప్పడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో దర్శనమిస్తూ ప్యాన్స్‌ని పలకరిస్తోంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్ ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే ఆమెను సంప్రదించి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయభాను బిగ్‌బాస్ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించిడం లేదని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ఆమెను ఒప్పించి బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఉదయభానుతో నేరుగా మాట్లాడి ఒప్పింయే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వని రేంజ్లో ఉదయభానుకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా బిగ్‌బాస్ నిర్వహకులు సిద్ధంగా ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది.. బిగ్‌బాస్ 6లో ఉదయభాను సందడి చేస్తుందా?లేదా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది. -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్?
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఇక్కడ ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా తనదైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తన మల్టీ టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిత్యాపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు వినిపించలేదు. చదవండి: Actress Kalayani Divorce: ఆ భయంతోనే కల్యాణి విడాకులు అడిగింది..: సూర్య కిరణ్ హీరోయిన్ అంటే ఆ హీరోతో డేటింగ్ అని, ఈ నటుడితో సహాజీవనం వంటి వార్తలు వినిపించడం సర్వాసాధారణం. కానీ తనపై ఒక్క పుకారు కూడా రాకుండా ఇండస్ట్రీలో రాణించడమంటే అది కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందులో నిత్యా ఒకరని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా నిత్యా పెళ్లికి సంబంధించి రకరకాల పుకార్లు ప్రస్తుతం నెట్టిం చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో ఉన్న నిత్యా మీనన్ ప్రస్తుతం పెళ్లి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది చిత్ర పరిశ్రమలోని వ్యక్తే నని, అతడు ఓ స్టార్ యాక్టర్ అని వినికిడి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. సదరు హీరోకు, నిత్యాకు కొంతకాలంగా మంచి సాన్నిహిత్యం ఉందని, త్వరలోనే అతడితో ఏడడుగులు వేయబోతుందంటూ మలయాళ వెబ్సైట్లలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కాగా ఇటీవల భీమ్లానాయక్ చిత్రంతో అలరించిన నిత్యా మీనన్ రీసెంట్గా ‘మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్ ప్రైం వీడియోస్‌లో జూలై 8న విడుదలై ఈ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది నిత్యా. -
‘నేషనల్ క్రష్’ రష్మిక హావా.. కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్!
కన్నడ బ్యూటీ రష్మిక హవా తగ్గేదేలే అన్నట్లుగా సాగుతోంది. టాలీవుడ్ ఈ అమ్మడికి స్టార్ డమ్‌ను తీసుకొస్తే దాన్ని కోలీవుడ్, బాలీవుడ్‌లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. పుష్ప చిత్రంతో తెలుగుతో పాటు, తమిళం, హిందీ ప్రేక్షకుల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్న రష్మిక క్రేజ్ పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో విజయ్ నటిస్తున్న వారీసు చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో పుష్ప- 2లోనూ నటించనుంది. ఇక హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మికకు తాజాగా కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. నటుడు విక్రమ్‌తో జతకట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీన్ని స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నీలం ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. జయ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయకగా నటి రష్మికను సంప్రదించి చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని చిత్రవర్గాల నుంచి సమాచారం. చదవండి: మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్ -
దళపతి విజయ్‌కి విలన్‌గా సమంత?.. ఏ చిత్రమంటే..
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు కొల్లగొడతాయి. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. మరో విషయం ఏమిటంటే ఇందులో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు తెరి, మెర్సల్, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా నటి సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా బోల్డ్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పుష్ప చిత్రం కోసం చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టే విషయం తెలిసిందే. ప్రస్తుతం శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది విజయ్ 66 చిత్రంలో ఆయన్ని ఢీకొనే ప్రతినాయకి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతుంది. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. -
కొత్త జంట నయన్-విఘ్నేశ్‌కు ఓటీటీ షాక్! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు?
నూతన దంపతులు నయనతార, విఘ్నేశ్ శివన్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ షాకిచ్చింది. గత నెల 9వ తేదీని నయన్-విఘ్నేశ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ జంట పెళ్లి జరిగింది. ఇక సినీ ప్రముఖుల రాకతో వీరి పెళ్లి వేదిక కళకళలాడింది. అయితే పెళ్లి అనంతరం వీరి ఫొటోలు కూడా చాలా అరుదుగా బయటకు వచ్చాయి. ఇక వీడియోలు అయితే ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణంగా వీరి వివాహ మోహోత్సవాన్ని సంబంధించిన వీడియో, ఫొటోలు హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం నయన్ దంపతులకు భారీగా డబ్బు చెల్లించుకుందట నెట్‌ఫ్లిక్స్. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేశ్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి పెళ్లి జరిగి నెల రోజులు గడిచిన సందర్భంగా విఘ్నేశ్ వరుసగా పలు పెళ్లి ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ నుంచి పలువురు సినీ ప్రముఖలు పెళ్లికి హాజరై ఆశీర్వదించిన ఫొటోలను విక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇది చూసి సదరు ఓటీటీ సంస్థ నిరాశ వ్యక్తం చేసిందట. ఒప్పందం ప్రకారం స్ట్రీమింగ్కు ముందే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియో షేర్ చేయకూడదట. కానీ విఘ్నేశ్ అసలైన ఫొటోలను షేర్ చేయడంతో వారి పెళ్లి వీడియోను స్ట్రీమింగ్ చేయకూడదని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందని కోలీవుడ్‌లో టాక్. అంతేకాదు తమ ఢీల్‌ను రద్దు చేసుకుని, అడ్వన్స్‌గా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని నెట్‌ఫ్లిక్స్ నయన్, విఘ్నేశ్‌లకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో నయన్-విఘ్నెశ్ల పెళ్లీ వీడియో, ఫొటోషూట్లు నిర్వహించారు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ -
బిగ్‌బాస్ క్రేజ్.. రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో?
ప్రముఖ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ, టీవీ సెలబ్రెటీలను మూడు నెలల పాటు ఒకే గూటిలో లాక్ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది ఈ షో. ఇక వారి మధ్య జరిగే గొడవలు, మనస్పర్థలు, మాటల యుద్దం, ప్రేమ వంటి ఆసక్తికర సంఘటనలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగులో బిగ్‌బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో హిందీలో ఏకంగా 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు రెడీ అవుతోంది. చదవండి: వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్ ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్‌బాస్ 16వ సీజన్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా హిందీ బిగ్‌బాస్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన స్టైల్, మ్యానరీజం, వాక్చతర్యంతో సల్మాన్ బిగ్‌బాస్ షోను సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వహకులు సైతం నో చెప్పడం లేదు. గత సీజన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 15 కోట్ల చొప్పున అందుకున్న భాయిజాన్ 16వ సీజన్‌కు షాకింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఇక ఆయన ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న షో నిర్వహకులు సల్మాన్ డిమాండ్ విన్నాక ఒక్కసారిగా అవాక్కయ్యారట. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి ఇంతకి ఆయన అడిగిన రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీకు కూడా కళ్లు చెదరడం ఖాయం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 16వ సీజన్ మొత్తానికి ప్యాకేజీ కింద సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేశాడట. ఇక ఆయన ఫ్యాన్సీ రెమ్యునరేషన్ చూసి అంతా కంగుతిన్నారట. ఇక సల్మాన్‌కు ఉన్న క్రేజ్ బట్టి ఆయన అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే బిగ్‌బాస్ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా బిగ్‌బాస్ 16న సీజన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. -
లండన్‌లో సీక్రెట్‌గా హీరో పెళ్లి..!
ఈ మధ్య బాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్ హీరోగా, విలన్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్. తాజాగా ఇతడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గర్ల్‌ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో ఈ నెలలోనే ఏడగుడు వేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా కాగా గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం లండన్ వేకేషన్లో ఉంది. అక్కడే సీక్రెట్‌గా ఈ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో కథనాల వస్తుంటే.. ఇప్పటికే వారి వివాహం జరిగిపోయిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందేహాలకు త్వరలోనే విద్యుత్ చెక్ పెట్టనున్నాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కొద్ది రోజుల్లో తమ వివాహంపై స్వయంగా ప్రకటన ఇవ్వనున్నాడని సమాచారం. కాగా విద్యుత్ జమ్వాల్ కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్ శక్తి, ఉసరవెల్లి చిత్రాల్లో విలన్‌గా నటించాడు. View this post on Instagram A post shared by Nandita Mahtani (@nanditamahtani) చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. -
లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
దర్శకుడిగా మణిరత్నంకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు. ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో చిన్న రోల్ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్ డైరెక్టర్ చాన్స్ ఇస్తే ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ‘మహానటి’ కీర్తి సురేశ్. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్ లేవని ఆ లక్కీ చాన్స్ వదుకుందట కీర్తి. చదవండి: నయన్ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ అయ్యే అంటుండగా.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ‘‘మహానటి’ తర్వాత ఒక్క హిట్ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్ డైరెక్టర్ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా?, చాలా తెలివి తక్కువ వ్యవహరించింది’’అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా మహానటి చిత్రంతో తన నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించిన సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో మణిరత్నం చారిత్రక చిత్రం పొన్ని యన్ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! అయితే అదే సమయంలో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే చిత్రంలో నటిస్తుండటంతో పాటు మరోవైపు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో కీర్తి పాత్రకు త్రిషని తీసుకుందట చిత్ర బృందం. ఇందులో త్రిష కుందనవై అనే రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
ఎన్టీఆర్ 30: సెట్స్‌పైకి వచ్చేది అప్పుడే!
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కోరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ 30 రూపొందే ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ను కూడా కొరటాల టీం ఇవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫిదా చేసిన ప్రభుదేవా.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల స్క్రీప్ట్‌లో కొన్ని మార్పులు, చెర్పులు చేసే పనిలో ఉన్న కొరటాల దాన్ని పూర్తి చేశారట. అంతేకాదు త్వరలోనే ప్రీ ప్రోడక్ష్న్ పనులను కూడా మొదలు పెట్టి మూవీని సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ చిత్రంలోని హీరోయన్ ఇతర తారగణంకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. కాగా ఎన్టీఆర్30(NTR30)గా రూపొందే ఈ ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. -
‘ఏంటీ.. మహేశ్ సినిమాకు పూజా కండిషన్స్ పెట్టిందా?’
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. అయినప్పటికీ ‘బుట్టబొమ్మ’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో జనగనమణ, మహేశ్-తివిక్రమ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ28’తో (#SSMB28) పాటు హిందీలో సర్కస్ రెండు సినిమాలకు సంతకం చేసింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కభీ ఈథ్ కభీ దివాలీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న పూజా త్వరలో సర్కస్ మూవీ షూటింగ్లో కూడా పాల్గొనుంది. చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది: ఆలియా మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో సైతం ఆమె బిజీ బిజీగా మారింది. ఈ క్రమంలో తివిక్రమ్-మహేశ్ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ మొదటి వారం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకొనుందని సమాచారం. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాకు పూజా పలు కండిషన్స్ పెట్టినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పూజా కేవలం 45 రోజుల కాల్షీట్ మాత్రమే కేటాయించిన్నట్లు సమాచారం. చదవండి: నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు ప్రస్తుతం ఉన్న తన బిజీ షెడ్యూల్ కారణంగా.. ఇచ్చిన డేట్స్‌లోనే తనకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్‌కు చెప్పిందట పూజా. ఇది తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పూజాపై కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ సినిమాకే ఆమె కండిషన్స్ పెట్టిందా? అంటూ ఆమెపై కొందురు ముక్కు విరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మహేశ్ సైతం ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎందుకంటే జక్కన్నతో చేసే సినిమాను 2023లోనే సెట్స్‌పైకి తీసుకురావాల్సింది ఉందట. -
సూర్యతో రొమాన్స్‌కు రెడీ?
స్టార్ హీరోహీరోయిన్లు కలిసి నటిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరు. తాజాగా నటుడు సూర్యతో రొమాన్స్ చేయించడానికి ఒక క్రేజీ హీరోయిన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెట్టిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలోనూ నటించనున్నారు. అయితే దీని కంటే ముందు చిరుతై శివ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు జోడిగా ‘బుట్టబొమ్మ’ పూజాహెగ్డేను సంప్రదించినట్లు కోలీవుడ్‌లో టాక్. తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ఇప్పటి వరకు మంచి హిట్ పడలేదు. గతంలో మిష్కిన్ ముగముడి చిత్రం ద్వారా పూజాహెగ్డె కోలీవుడ్‌కు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఈ బ్యూటీని అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల బీస్ట్ చిత్రంలో విజయ్‌తో జత కట్టే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది. కానీ అదీ కూడా నిరాశ పరిచింది. ఇక పూజకు ఇక్కడ కెరీర్ లేదనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా సూర్యతో నటించే అవకాశం తలుపు తట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్యతో చిరుతై శివ పాన్ ఇండియా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని భాషల్లోనూ క్రేజ్ ఉన్న పూజాహెగ్డే హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకే సినిమాలో ప్రభాస్, యశ్?... ‘నెక్ట్స్ లెవల్ అంతే..’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రం ‘సలార్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సలార్‌ను తెరకెక్కుతోంది. 'కేజీయఫ్' .. 'కేజీయఫ్ 2' సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకుడు కావడంతో సలార్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన ఇటూ ప్రభాస్ ఫ్యాన్స్, అటూ యశ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి.. ఈ సినిమాలో యశ్‌తో ఓ గెస్ట్ చేయించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేజీయఫ్ చిత్రంతో సౌత్‌లోనే దేశవ్యాప్తంగా యశ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో సలార్ యశ్‌తో అతిథి పాత్ర చేయించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. ఇక ఇది తెలిసి ఇటూ డార్లింగ్ ఫ్యాన్స్, అటూ రాక్‌స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఇద్దరు పాన్ ఇండియా స్టార్లలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ సీన్ నెక్ట్ లెవల్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
భారీ ధరకు పలుకుతున్న నిఖిల్ ‘కార్తీకేయ 2’ థియేట్రికల్ రైట్స్
మూడేళ్లు గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది మంచి కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు. నిఖిల్ నటించిన చివరి చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ మూవీ తర్వాత అతడి నుంచి మరే సినిమా రాలేదు. ఈ మూవీ అనంతరం దాదాపు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న నిఖిల్ వరుస సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిచన ఈ చిత్రం రూ. 20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చర్చనీయాంశమైంది. జూలై 22న థియేటర్లోకి రానున్న ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.14కోట్ల నుంచి రూ. 20 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
మెగా 154: చిరుకి విలన్‌గా ఆ మలయాళ స్టార్ నటుడు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్, గాడ్ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్ ఫాదర్, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తిక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ప్రతికథానాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం తమిళ హీరో విజయ్ సేతుపతి, నటుడు సముద్రఖనిలను అనుకుంటున్నట్లు ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. ఈ క్రమంలో తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు బీజూమీనన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని సమాచారం. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో బిజు మీనన్ పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. కాగా బిజూ మీనన్ ‘రణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ఈ చిత్రంలో అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!
ప్రస్తుతం సౌత్‌లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరో అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు పరాజయం కావడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. పూజా స్టాఫ్ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి నిర్మాతలు ఒక్కసారిగా చుక్కలు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్‌తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట. దీంతో ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, తన స్టాఫ్‌కు అయిన ఖర్చులను ఆమె భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజా కూడా దీనిపై నోరు విప్పకుండ ఆ బిల్లును తానే కట్టాలని నిర్ణయించుందని సినీవర్గాల నుంచి సమాచారం. అయితే అ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. మరి దీనిపై పూజా, బీస్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గతంలో పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. -
ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన పూరీ జగన్నాథ్ కూతురు!
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో పూరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాలకు యువత ఫిదా అవుతుంది. పూరీ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. అలా డైరెక్టర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన నట వారసుడిగా పూరీ తనయుడు ఆకాశ్ పూరి ఇప్పటికే టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు. హీరో ఆకాశ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన కూతురు పవిత్ర పూరీ కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట. చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ అయితే హీరోయిన్గా మాత్రం కాదట. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం. ఇక సినీ పరిశ్రమలో ఉన్న తక్కువమంది నిర్మాతల్లో పవిత్ర కూడా ఒకరు కాబోతున్నారని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పూరీ కనెక్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారారు పూరీ జగన్నాథ్. ఇప్పుడు మళ్లీ లైగర్‌తో డైరెక్టర్‌గా ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పూరీ. చదవండి: Mega 154: చిరంజీవి మూవీ సెట్లో సుకుమార్ సందడి -
కన్నడ రాక్‌స్టార్ యశ్ జంటగా పూజా హెగ్డే?
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ఒకరు. తెలుగు, తమిళంలో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న పూజ ఇప్పటి వరకు తన మాతృభాష కన్నడంలో తెరంగేట్రం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పూజా కన్నడ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘కేజీఎఫ్’ మూవీ తర్వాత హీరో యశ్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కన్నడ ‘మఫ్తీ’ ఫేమ్ నార్తన్-యశ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ ఇటీవల ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన నార్తన్ కథానాయిక, ఇతర నటీనటుల ఎంపికపై దృష్టి సారించారట. ఇందులో భాగంగానే హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించిందట చిత్రబృందం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న పూజ ఇప్పటివరకు కన్నడంలో మాత్రం చేయలేదు. మరి.. యశ్ సినిమాతో ఆమె శాండల్‌వుడ్‌కి పరిచయం అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దీవాలి’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, విజయ్ దేవరకొండ ‘జేఎస్ఎమ్’ చిత్రాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. -
పవన్-హరీశ్ శంకర్ మూవీ నుంచి తప్పుకున్న పూజా! అందుకేనా?
లక్కీ లెగ్ హీరోయిన్గా టాలీవుడ్లో గుర్తింపు పొందిన బ్యూటీ పూజా హెగ్డే. ఆమె సినిమాకు ఒకే చేసిందంటే అది హిట్ అనేంతగా దర్శకులకు, హీరోలకు సెంటిమెంట్‌గా మారింది ఆమె. ఇలా బడా హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ‘బుట్టబొమ్మ’ను వరుస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. అయినా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. అంతేకాదు పలు భారీ చిత్రాల్లో సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్ర కొత్త టీజర్, నాగార్జున లుక్ రిలీజ్ ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్‌తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో పూజా హేగ్డే హీరోయిన్ అని ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో కిన్నెర మొగిలయ్యకు ఇంటిస్థలం, రూ కోటి నగదు.. ఉత్తర్వులు జారీ దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ సినిమాలో చేయనుంది. మరో వైపు విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’, బాలీవుడ్ మూవీ యనిమల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న పూజా తాను ఈ సినిమాలో చేయలేనని హరీశ్ శంకర్‌కు చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా పూజా ఇటీవల ఆచార్య మూవీతో పాటు, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే. -
రామారావు ఆన్‌డ్యూటీ పదేపదే వాయిదా, నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలే కారణం?
మాస్ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 17న థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే జూన్ 17న మూవీని రిలీజ్ చేయడం లేదని తాజాగా మరో ప్రకటన ఇచ్చారు మేకర్స్. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘రామారావు ఆన్‌డ్యూటీ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటి జాప్యం కారణంగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చదవండి: బర్త్‌డే రోజునే సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం అంతేకాక ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు, టీజర్, ఫస్ట్‌లుక్‌లు మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. రామారావు డ్యూట్ మరోసారి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వాయిదా పడ్డ సినిమాలన్ని పెద్ద, చిన్న సినిమాలన్ని రిలీజై మంచి విజయం సాధించాయి. ఇప్పుడు పోటీగా ఎలాంటి పెద్ద సినిమా లేదు. కానీ రామరావు ఆన్‌డ్యూటీ పదే పదే ఎందుకు వాయిదా పడుతుందా? అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే నిజానికి ఈ మూవీ నిర్మాత, హీరో రవితేజకు మధ్య మనస్పర్థలు తలెత్తడం వ్లలే సినిమా వాయిదా పుడుతున్నట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ఈ తాజా బజ్ ప్రకారం.. మూవీ స్టార్ట్ చేసేముందే బిజినెస్‌ను బట్టి హీరో, నిర్మాత, డైరెక్టర్ల మధ్య ఒప్పందం జరిగిందట. ఈ క్రమంలో విడుదలైన మూవీ పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవడంతో బిజినెస్ పరంగానూ థియేట్రికల్, శాటిలైట్, ఒటీటీ ఇతర హక్కులకు సంబంధించి రామారావు ఆన్‌డ్యూటీ మంచి బిజినెస్ జరిగిందట. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బిజినెస్‌ను బట్టి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని రవితేజ డిమాండ్ చేశాడని, అయితే ఈ సినిమా కాగితాల వరకు బిజినెస్ జరిగినా ఇంకా చేతికి డబ్బులు అందలేదని ప్రొడ్యూసర్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య కాస్తా విభేదాలు తలెత్తాయని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్లు పనులు వాయిదా పడ్డట్లు సమాచారం. వీరిద్దరు ఒక నిర్ణయానికొస్తే చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, ఈ సినిమా రిలీజ్ అవుతుందని వినికిడి. The release of #RamaRaoOnDuty is postponed and would not be releasing on June 17th due to extensive post production for the BEST and MASSIEST output! A New Release Date will be announced soon. pic.twitter.com/9ulOkExtsg — SLV Cinemas (@SLVCinemasOffl) May 26, 2022 -
ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Rana Virata Parvam Release Date Preponed: రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈమూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కారోనా టైంలో వాయిదా పడ్డ సినిమాలన్ని వరుసగా విడుదలై మంచి విజయాలను సాధించాయి. కానీ విరాట పర్వం మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేకపోయింది. ఒకనొక సమయంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే ఈ పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన అడివి శేష్ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎట్టకేలకు విరాట పర్వం విడుదల కాబోతుందని, థియేటర్లోనే ఈ మూవీ వస్తుండటంతో దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటూ సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ అన్ని కుదిరితే జూన్17న ఈ చిత్రం విడుదల కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక దీనిపై చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఉగ్గుల వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. -
ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్?
Sarkaru Vaari Paata OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది. చదవండి: మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒప్పందం ప్రకారం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల ముందుగానే ఈ సినిమాను అమెజాన్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ నెల చివరిలో లేదా జూన్ 10న ఈమూవీ ఓటీటీకి రాబోతుందట. లేదా జూన్ 24న నుంచి స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలు థియేట్రికల్ రన్‌టైం అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు అందులోనూ సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నెలలైన పడుతుందని అందరు అభిప్రాయం పడ్డారు. కానీ ఈ మూవీని త్వరలోనే ఓటీటీకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం నెల రోజుల ముందుగానే డిజిటల్ రిలీజ్‌కు మేకర్స్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఈ బజ్ ప్రకారం సర్కారు వారి పాట అతి త్వరలోనే ఓటీటీకి రాబోతుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
NTR 30: ఎన్టీఆర్ సరసన జాన్వీని ఫైనల్ చేసే ఆలోచనలో కొరటాల!
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో స్టార్ట్ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్ అయితేనే బాగుటుందని చిత్ర బృందం అభిప్రాయపడుతుందట. చదవండి: రాత్రి 11 గంటలకు కానిస్టేబుల్ ఆపి దురుసుగా ప్రవర్తించారు: హీరోయిన్ దీంతో జాన్వీని ఈ సినిమాకు ఫైనల్ చేయాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే కొరటాల బృందం జాన్వీని సంప్రదించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఆమె అటూ ఇటూగా ఉన్న జాన్వీని ఒప్పించేందుకు అన్ని విధాల ప్లాన్ చేస్తున్నారట కొరటాల బృందం. కాగా పెద్ద బ్యానర్ .. స్టార్ కాంబినేషన్ .. కథ నచ్చితే జాన్వీ తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉందని ఆ మధ్య ఆమె తండ్రి బోనీ కపూర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఒప్పించడానికి కొరటాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చదవండి: చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య -
మలైకాతో పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన అర్జున్!
బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ లవ్‌లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకన్నారంటు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. తామిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నామని, ఇది తనకు చాలా ముఖ్యమైనదంటూ చెప్పడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. చదవండి: చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా దీంతో ఈ ఏడాది నవంబర్‌లో మలైకా-అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మలైకతో పెళ్లి వార్తలపై స్పందించాడు అర్జున్ కపూర్. ఈ మేరకు అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘లవ్.. నా జీవితం గురించి నాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరికి తెలుసని ఎలా అనిపిస్తుందో’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో! దీని అర్థం ఏంటని.. అంటే మలైకా, అర్జున్ పెళ్లి చేసుకోవడం లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో, ఇంటర్య్వూల్లో అర్జున్, మలైకాలు ఒకరిపై ఒకరు తరచూ ప్రేమను వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక అర్జున్‌తో పెళ్లిపై మలైకా స్పందిస్తూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అందుకే కలిసి జీవితాన్ని కొనసాగించచాలని అనుకుంటున్నాం. ఆ క్షణంగా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని మలైకా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఎస్ఎస్ఎమ్బీ28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక త్వరలోనే ఈమూవీ సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఆయన ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం నానిని సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్ చేస్తారా? లేక ఎంగేజ్మెంట్ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్లో ప్రతి కథానాయకుడిగా నటించాడు. -
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా?
Pay per View For RRR Movie OTT Streaming: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. మొత్తం ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. చదవండి: ఆసక్తికర వీడియో షేర్ చేసిన కొత్త పెళ్లి కూతురు ఆలియా ఇదిలా ఉంటే త్వరలోనే ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్రేక్షకులకు షాకిస్తూ ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పే ఫర్ వ్యూ పద్దతిలో ఆర్ఆర్ఆర్ను ఓటీటీలో రిలీజ్ చేయాలని సదరు ఓటీటీ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలట. అయితే లాక్డౌన్లో చిన్న నుంచి పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు చూడాలంటే ప్రీమియర్ చెల్లించాల్సి వచ్చింది. అయితే అది డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన సినిమాలకు మాత్రమే. చదవండి: క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ కానీ మొదటిసారి థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా ఓటీటీలో చూడాలంటే పే ఫర్ వ్యూ ఫార్మాట్‌ను ఫాలో అవ్వాలంటున్నాయట 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ ప్రీమియర్ సంస్థలు. కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్కు హక్కులు భారీ డీల్‌కు అమ్ముడైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా హిందీ, విదేశీ భాషల వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇక మే 20న ఆర్ఆర్ఆర్ జీ5లో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా మే చివరి వరకు జీ5లో ఈ సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించక తప్పదని కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. -
విజయ్‌తో జతకట్టనున్న పూజా హెగ్డే?, ఏ సినిమాలో అంటే..
P పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించనున్న రెండో సినిమా 'జనగణమన' (JGM). లైగర్ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ముంబైలో గ్రాండ్‌గా ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చదవండి: సమంత వర్సెస్ నాగచైతన్య, ఫలితం ఎలా ఉండనుందో? అయితే గతంలో విజయ్ సరసన దివంగత నటి, ‘అతిలోక సుందరి’ శ్రీదేవీ కూతురు జాన్వి కపూర్ నటించనుందని, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లను ఆమె కొట్టేస్తూ తాను ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమాకు సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది. దీంతో మరోసారి జనగనమణలో హీరోయిన్ ఎవరన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే విజయ్‌తో జతకట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్ ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని వినికిడి. ఇటీవల ఆచార్యతో అలరించిన పూజ ప్రస్తుతం ఎస్ఎస్ఎమ్బీ 28, కభీ ఈద్ కభీ దీపావళి, భవదీయుడు భగత్ సింగ్‌తో పాటు సర్కస్ సినిమాలతో బిజీగా ఉంది. అటు విజయ్ దేవరకొండ జనగణమనతో పాటుగా శివ నిర్వాణలో దర్శకత్వంలో సమంతతో మరోసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1181265244.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్!
Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ దీనికి బదులుగా ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్ టచ్ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే రోషన్ తన రెండో సినిమాను లైన్లో పెట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్‌లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్లో పెట్టాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
సుక్కు-చిరు కమర్షియల్ యాడ్, మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Chiranjeevi Remuneration For Latest Commercial Ad: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు. ఇప్పటికే ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ సిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకి మరో పక్క కమర్షియల్ యాడ్స్‌లో సైతం నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా ఓ కమర్షియల్ యాడ్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ యాడ్‌కు చిరు తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ఈ యాడ్‌లో చిరుతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్, ఖుష్బు సుందర్‌లు నటించారు. ఇందులో నటించిన వారంత పెద్ద స్టార్స్ కావడంతో ఈ యాడ్‌కు వారు తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితొషికం గురించి ఆరా తీయగా చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్‌గా, అటూ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్డమ్ బట్టి రెమ్మునరేషన్ ఇచ్చారట. -
అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
RRR Movie OTT Streaming Details Inside: దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ శుక్రవారం(మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ మూవీని రూపొందించాడు. భారీ మల్టీస్టారర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా నటించిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంరతం నిన్న రిలీజ్ కావడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద సందడి వాతావరం నెలకొంది. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ ఏ థియేటర్ ముందు చూసిన అభిమానుల హంగామా చూస్తుంటే పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇందులో తారక్, ఎన్టీఆర్‌ల పాత్రలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కాయమంటూ ఫ్యాన్స్ అంతా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కరోనా కాలం నుంచి ఓటీటీలు బిగ్‌స్క్రీన్‌కు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్లో పూర్తిగా ఓటీటీ హవా కొనసాగడంతో ఇప్పటికీ సైతం ఎక్కడ తగ్గేదే లా అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి కొత్త సినిమా సిల్వర్ స్రీన్‌పై సందడి చేసిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చదవండి: RRR Movie: కర్ణాటక టికెట్ రేట్స్‌పై ట్రోలింగ్ ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ కూడా ఒక్క నెల రోజుల్లోనే వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఈ తాజా బజ్ షాకిస్తుంది. దీని ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ మూడు నెలల వరకు ఓటీటీకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గతంలో మేకర్స్ కూడా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లో విడుదలైన మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే ఈ మూవీ జూన్ తర్వాతే ఓటీటీలోకి వచ్చేటట్టు కనిపిస్తోంది. కాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగొలు చేసినట్లు సమాచారం. -
తల్లి కాబోతోన్న నయనతార?
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార, కాబోయే భర్త విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. లాక్డౌన్లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట రీసెంట్గా వివాహం కూడా చేసుకున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయన్, విఘ్నేశ్‌లు జంటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియోలో బయటకు రాగా అందులో నయన్ పాపిటన సింధూరం పెట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి నయన్, విఘ్నేశ్‌లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే! ఈ క్రమంలో వీరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. నయన్, విఘ్నేశ్‌లు పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట. సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట నయన్. దీనికి విఘ్నేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో నయన్, విఘ్నేశ్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఇప్పటికే తమిళ మీడియా, వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఆఫర్లతో నయన్ ఫుల్ బిజీగా ఉంది, అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఆమె ఎంచకుకున్నట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. చదవండి: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌కి దూరంగా విజయేంద్ర ప్రసాద్.. అందుకేనా? ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి జరిగిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ వారు సరోగసి ద్వారా పిల్లలను పొందాలని అనుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలు కొందరు కొట్టిపారేస్తుండగా.. మరికొందరు.. ‘ఏమో ఇది నిజమై ఉండోచ్చు, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారేమో’ అని అభిప్రాయ పడుతున్నారు. కాగా గత ఆరేళ్లుగా నయనతారా, విఘ్నేశ్ శివన్‌తో రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ దర్శకత్వం వహించిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమా సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్డౌన్లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించి.. పెళ్లి మాత్రం అందరి సమక్షంలో అంగరంగ వైభవం చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్‌లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్‌కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్‌కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ మూవీ, హాటాటాపిక్గా ‘డార్లింగ్’ రెమ్యునరేషన్
‘బాహుబలి’, ‘సాహె’ చిత్రాల తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి వరకు సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ప్రభాస్ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్‌తో ఇటీవల ఫ్యాన్స్‌ను పలకరించాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం అయితే ఈ సినిమాకు ప్రుభాస్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్. వీరిలో ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తాడని సమాచారం. చదవండి: Ram Gopal Varma: ‘రాధేశ్యామ్’ మూవీపై వర్మ షాకింగ్ కామెంట్స్ -
సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌లో హీరోయిన్లు స్టెప్పులు వేయడం సాధారణ విషయమైంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్, సమంతలు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక వారి బాటలోనే నడిచేందుకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం సిద్ధం అంటోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మీక.. గీతా గోవిందం మూవీతో టాలీవుడ్ స్టార్డమ్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం పుష్పతో జాతీయ స్తాయిలో గుర్తింపు పొందింది. చదవండి: ఈ యంగ్ హీరో 50 రోజుల కష్టం, సుకుమార్‌పై అరుదైన దృశ్యం ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ ఆఫర్స్ అందుకుంటూ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చింది. ఇలా సౌత్, నార్త్‌లో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌తోనూ అలరించనుందుకు సై అంటుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ హీరో రణ్‌బిర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కాంబినేషన్లో రూపొందనున్న యానిమల్ మూవీలో ఐటెం సాంగ్ కోసం రష్మికను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట అయితే కొన్ని చర్చల అనంతరం ఈ పాటకు రష్మికను ఫిక్స్ చేసిన దర్శక-నిర్మాతలు ఇదే విషయమై ఆమెను కలిశారట. అయితే దీనికి ఒకే చెప్పిన రష్మిక వారు అవాక్కాయ్యే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ ఐటెం సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు ఇవ్వాలని నిర్మాతలకు చుక్కలు చూపించిందట. సినిమా మొత్తానికి రూ. 2 కోట్లు తీసుకునే రష్మిక.. ఒక ఐటెం సాంగ్‌కు భారీగా డిమాండ్ చేయడం చూసి నిర్మాతలు షాకయ్యారట. చివరకు ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి కోటిన్నర ఇవ్వడానికి రెడీ అయ్యారని, దీంతో రష్మిక కన్విన్స్ అయ్యి వారం రోజుల కాల్షీట్ కూడా ఇచ్చినట్లు బీ-టౌన్లో గుసగుసల వినిపిస్తున్నాయి. -
పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం!
Samantha Shocking Decision: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులు ప్రకటించి 5 నెలలు గడిచింది. ఇప్పటికి వారి విడాకుల అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. వారు మళ్లీ కలిస్తే బాగుండు అని ఇప్పటికీ వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత-చైతన్యలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా ‘ఏం మాయ చేసావె’ సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది. చదవండి: ఆ యాక్షన్ సీన్లో ప్రభాస్‌ను విలన్ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత.. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అంతేకాదు ఈ చీర నాగ చైతన్యకు సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అమ్మమ్మ అంటే చైకి చాలా ఇష్టం. అందుకే ఆమె గుర్తుగా ఆ చీరను సమంత రీమోడలింగ్ చేయించి దాన్ని ధరించింది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇందుకోసం సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయిందట. అయితే పెళ్లిలో అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈపెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం చై, అక్కినేని కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలను సామ్ వదిలించుకోవాలనుకుంటుందట. అందుకే ఈ పెళ్లి చీరను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -
బాలయ్య సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ మూవీ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. అఖండ తర్వాత వెంటనే గోపించంద్ మలినేని మూవీని స్టార్ట్ చేశాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమాతో మరిన్ని ప్రాజెక్టస్ చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో ఎన్బీకే107(#NBK107) మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్ పోష్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి కొడుకులుగా బాలయ్య రెండు పాత్రలు చేయనున్నాడట. ఇందులో ఒక హీరోయిన్ శ్రుతి హాసన్‌గా సెకండ్ హీరోయిన్ వేటలో ఉన్నాడట గోపించంద్ మిలినేని. దీంతో ఈ పాత్ర కోసం ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని సంప్రదించగా.. దానికి ఆమె నో చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కృతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో మరో భారీ విజయాలను ఆమె ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తుండటంతో డేట్స్ సర్ధుపాటు కాక బాలయ్య సినిమాకు ఆమె నో చెప్పినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అలాగే ప్రస్తుతం లీడ్ హీరోయిన్ ఆఫర్స్ వస్తున్న క్రమంలో సెకండ్ హీరోయిన్ నటించడం వల్లే కెరీర్‌పై దెబ్బ పుడుతుందనే భయంతో కూడా ఈ మూవీ ఆఫర్‌ను తిరస్కరించందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బేబమ్మ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. -
స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్?
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో దాదాపు అరజడజను చిత్రాలు ఉన్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్‌తో పాటు మరిన్న ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోగా మార్చిలో రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమైంది. సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K షూటింగ్‌ను జరుపుకుంటోంది. వీటి తర్వాత ప్రభాస్ సందీప్ వంగతో స్పిరిట్ మూవీని సెట్స్‌పై తీసుకువస్తాడని అంతా అనుకున్నారు. కానీ దీని కంటే ముందు ప్రభాస్ మారుతి సినిమాను పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడట. కాగా డైరెక్టర్ మరుతితో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే చర్చలు, స్క్రిప్ట్ కూడా పూర్తయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కు 'రాజా డీలక్స్'గా టైటిల్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలను మారుతి ఖండించలేదు. దీంతో ఇది నిజమే అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలాగే కనిపస్తుంది. -
బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్!
Meera Jasmine Reentry: ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది నటి మీరా జాస్మిన్. ఆ తర్వాత వరస చిత్రాల్లో ఆపర్ అందుకున్న ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. చివరిగా గొరింటాకు సినిమాలోరాజశేఖర్ చెల్లెలి పాత్రలో మెప్పించింది, మంచి హిట్‌ను అందుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత నటకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి తన సినిమాలో మీరాకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చర్చలు, స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం నటీనటులు ఎంపిక దశలో ఉంది. చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్ ఈ క్రమంలో హీరో అక్క పాత్రకు మీరా జాస్మిన్ను సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఆమెకి బోయపాటి కధ,పాత్రను వివరించగా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమెది కీలకమైన పాత్ర అని సమాచారం. కాగా బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. -
తేజస్వికి పార్టీ పగ్గాలపై లాలూ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పగ్గాలు మారబోతున్నట్లు వస్తున్న కథనాలపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తల్ని ప్రసారం చేసేవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు. ఆర్జేడీ జాతీయాధ్యక్షుడిగా లాలూ దిగిపోతున్నారని.. ఆ స్థానే చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు త్వరలో పగ్గాలు అప్పగించబోతున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై లాలూను వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ‘అలాంటి వార్తలు ఇచ్చేవాళ్లు మూర్ఖులు. పిచ్చోళ్లే అలాంటివి ప్రచారం చేస్తారు. ఏమైనా ఉంటే మేం చెప్తాం కదా’ అని న్యూఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తేజస్విని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలపై పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు. ఆ కథనాల్ని కొట్టిపారేస్తూ.. తండ్రి లాలూనే పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు లాలూ సతీమణి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తేజస్విని పార్టీ చీఫ్‌గా ప్రకటిస్తారనే కథనాలు మొదలయ్యాయి. #WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm — ANI (@ANI) February 5, 2022 -
‘రాధేశ్యామ్’ డిజిటల్-శాటిలైట్ రైట్స్‌కు భారీ ఒప్పందం !, అన్ని కోట్లా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవబోతుందంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా అందులో నిజం లేదని కొట్టిపారేశారు మేకర్స్. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు రిసెంట్‌గా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే మొదట రిలీజవబోతుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం.. దీంతో తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తామా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 350కోట్ల వరకు బడ్జెట్ అయిందట. అయితే ఈ సినిమాకు డిజిటల్ శాటిలైట్ హక్కులు భారీ డీల్‌కు కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ. 250కోట్ల భారీ ధరకు డీల్ కుదిరిందని సమాచారం. ఇదే నిజమైనతే రాధేశ్యామ్ నిర్మాతలకు ఇప్పటికే 70 శాతం రిటర్న్స్ వచ్చినట్టే అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడ్డటంతో మార్చి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. -
స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు గ్లామరస్ తల్లిగా అనసూయ!
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. మొదట్లో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఈ క్రమంలో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడి’ సినిమాలో అని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అట. చదవండి: మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్.. హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌గాను అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేయనుందట. హీరోయిన్‌కు తల్లి అంటే.. హీరో రవితేజకు అత్త కూడా. అంటే ఒకే సినిమాలో తల్లి, అత్త పాత్రల్లో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు. ఆమె పోషించిన 'చంద్రకళ' పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. -
మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్..
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్ లవ్‌బర్డ్స్ షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ బ్రేకప్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణమెంటో అందరికి తెలిసిందే. అయితే యూట్యూబ్‌లో, సిరీస్‌లో వీరిద్దరి పేర్కు, కెమిస్ట్రికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం ఈ క్రమంలో షణ్మఖ్ తండ్రి మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశాడు. కానీ దీప్తి వాలకం చూస్తుంటే మళ్లీ ఆమె షణ్నుతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందంటూ వారి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేయగా.. మరికొందరూ కలుస్తారు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి బిగ్‌బాస్ షో వేదిక కాబోతోందట. చదవండి: డబ్బు కావాలంటూ మెసేజ్‌లు చేస్తున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ అదేలా అంటే బిగ్‌బాస్ నిర్వాహకులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్ సెలబ్రెషన్స్‌కు ప్లాన్ చేశారట. ఆ రోజు అయిదు సీజన్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే ఇక అదే రోజు బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానుందని, ఇందులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. దీంతో నిజంగానే బిగ్‌బాస్ షణ్ను-దీప్తి కలవబోతున్నారంటూ కోందరూ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదికపై షణ్ముఖ్-దీప్తిలను జంటగా చూపించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి వారి ఫాలోవర్స్ తెగ సంబరపడితున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఉత్సవంకు సంబంధించి తొలిపార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నారు. ఆ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ఇవే అంటూ సోషల్ మీడియా బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో దీప్తి కానీ, షణ్మఖ్ కానీ ఎక్కడా కనిపించలేదు. చదవండి: యంగ్ హీరోయిన్‌తో హృతిక్ సీక్రెట్ డేటింగ్.. వీడియో వైరల్ -
ఆ మూవీ నుంచి రాజశేఖర్‌ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్ పోయిందట!
Rajasekhar Removed From Sriwass and Gopichand Movie: ఫ్యామిలీ హీరోలుగా మెప్పించిన నటుడు జగపతి బాబు, శ్రీకాంత్‌లు విలన్స్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విలనిజంలో జగపతి బాబుకు వందకు వందశాతం మార్కులు కొట్టెసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అఖండతో శ్రీకాంత్ కూడా ప్రతి కథనాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక వీరి జాబితాల్లోకి యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా చేరాలనుకున్నాడు. మంచి అవకాశం వస్తే తాను విలన్‌గా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న రాజశేఖర్‌కు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్‌ను మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ స్థానంలో జగపతి బాబును రీప్లేస్ చేసినట్లు సమాచారం. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? అయితే గోపిచంద్ సినిమా నుంచి రాజశేఖర్‌ను తప్పించడానికి కారణమేంటో తెలియదు కానీ, ఆయనకు ఈ ఆఫర్ పోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటూ కొందరూ అంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. ఈ విషయంలో ఆమె ప్రమేయం నిర్మాతలకు చికాకు తెప్పించిదట. దీంతో గోపించంద్-శ్రీవాస్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్‌ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై చిత్ర బృందం కానీ, జీవిత రాజశేఖర్‌లు స్పందించే వరకు వేచి చూడాలి. అయితే ఇది విన్న పలువురు విలన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్ ఆశలకు జీవిత విలన్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
క్రేజీ అప్డేట్.. చిరు సినిమాలో హీరోయిన్గా అనుష్క!
Anushka Shetty Heroine In Chiranjeevi Next Movie?: సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో మూవీతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరే సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో చేస్తుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: Siddharth-Saina Nehwal: సైనాపై సిద్ధార్థ్ అభ్యంతరక వ్యాఖ్యలు, హీరోకు భర్త కశ్యప్ చురకలు స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందంటూ టాక్ నడుస్తోంది. కాగా ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు యంగ్ హీరోలకు పోటీగా వరస సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంతో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్ అనంతరం ఏమాత్రం గ్యాప్ లేకుండా ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు’ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఇదిలా ఉండగా వీటితో పాటు చిరు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్గా అనుష్క పేరు పరిశీలించారట. అంతేకాదు ఇప్పటికే ఆమెను సంప్రదించి కథ వివరించినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి అనుష్క తన సమాధానం ఇవ్వాల్సింది ఉందని వినికిడి. ఆ తర్వాత దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై స్వీటీ స్పందించేవరకు వేచి చూడాలి. -
న్యూ ఇయర్లో కీలక ప్రకటన ఇవ్వబోతున్న ‘గీత గోవిందం’ జంట!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కానీ అప్పడప్పుడు వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్స్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరూ రూమర్డ్ కపుల్స్‌గా పేరొందారు. ఈ క్రమంలో ఈ రూమర్డ్ కప్పుల్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. చదవండి: Vijay Deverakonda-Rashmika: డిన్నర్ డేట్‌కు విజయ్ దేవరకొండ- రష్మిక బాలీవుడ్‌కు చెందిన ఓ టాబ్లైడ్ ప్రకారం ఈ జంట త్వరలో కీలక ప్రకటన ఇవ్వబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త సంవత్సరంలో వీరి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాలని ఈ రూమార్డ్ కపుల్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘వీరి రిలేషన్‌ను అఫిషియల్ చేయబోతున్నారా? లేక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటించబోతున్నారా?’అంటూ నెటిజన్లు రకరకాలుగా సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా న్యూ ఇయర్‌కు విజయ్, రష్మికలు తమ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చే ప్రకటన ఏదో ఇవ్వబోతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: ఒక్క వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా అయితే ప్రస్తుతం విజయ్, రష్మికలు గోవాలో హలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భంగా వీరిద్దరూ కలిసి గోవా పయనమయ్యారని, అక్కడ జంట కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతున్నారట. కాగా గీతా గోవిందం మూవీలో జంటగా నటించిన విజయ్-రష్మికల పేర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆన్స్రీన్పై వీరి కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్‌తో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉండగా, రష్మిక పుష్ప మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్? -
రానా వల్లే సమంతకు ఆ క్రేజీ ఆఫర్ వచ్చిందట!
Rana Helps To Samantha For Get A International Film The Arrangement Of Love: స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. ‘డోంటన్ అబ్బే’ఫేమ్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కాగా సమంత ఈ మూవీపై ప్రకటన ఇస్తూ.. ‘ఈ సినిమా ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా, షూటింగ్ ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్ షేర్ చేసింది. అయితే ఈ క్రేజీ ఆఫర్ సామ్‌కి ఎలా వరించిందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యారు. దీనిపై ఆరా తీయగా ఈ చాలెంజింగ్ రోల్‌కు ఎవరూ అయితే సరిపోతారని నిర్మాతలు ఆలోచిస్తుండగా సామ్ పేరు ప్రతిపాదించాడట ఓ స్టార్ హీరో. ఆ హీర ఎవరో కాదు దగ్గుబాటి వారసుడు, సమంతకు ఒకప్పుడు బంధువు అయిన రానా అని వినికిడి. బై-సెక్సువల్ అమ్మాయిగా కనిపించే ఆ పాత్రకు సమంత అయితే న్యాయం చేస్తుందని మేకర్స్‌కు రానా సలహా ఇచ్చాడట. చదవండి: సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా? అంతేగాక సామ్‌కు ఒకసారి ఈ కథను తనకు వినిపంచమని రానా మేకర్స్‌ను పట్టుబట్టినట్లు ఫిలిం దూనియాలో గుసగుసల వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కచ్చితమైన క్లారిటీ లేదు. ఇది కొంత సృష్టించిన రూమర్లు అని కూడా పలువురు ఈ వార్తను కొట్టిపారెస్తున్నారు. భారత రచయిత తిమేరి ఎన్ మురారీ రచించిన ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. గురు ఫిల్మ్స్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తుండగా.. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే ‘సూపర్‌డీలక్స్’ చిత్రం ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్స్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సామ్ మరోసారి అలాంటి వివాదాస్పద పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తి నెలకొంది. -
ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ ఇదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’, ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కాస్తా బ్రేక్ తీసుకుంటున్నాడు. విరామం అనంతరం డిసెంబర్లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు దీని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ బడా దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీ-టౌన్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. చదవండి: అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రీతూ వర్మ ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఈ తాజా బజ్ ప్రకారం సంజయ్ లీలా భన్సాలీ, ఎన్టీఆర్ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. అన్నీ కుదిరి భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కు పండగే. దీంతో భన్సాలీతో, ఎన్టీఆర్ చిత్రం అంటే.. దీనికంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదంటూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. మరీ ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వస్తుందా? లేదా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. చదవండి: రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కూతురు సౌందర్య -
‘పెళ్లి సందD’ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు!, మెగా హీరోతో కూడా ఓ సినిమా?
టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు. అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ. ఈ సినిమాలో శ్రీలీల తన గ్లామర్‌తో పాటు నటన పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతేగాక డ్యాన్స్‌తో కూడా అదరగొట్టింది. ఇక ఆమె అందంతో పాటు యాక్టింగ్, డ్యాన్స్ స్క్రీల్స్ ఉండటంతో తెలుగు దర్శక-నిర్మాతలు ఆమెకు ఫిదా అవుతున్నారట. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాలీవుడ్లో టాక్. ఇప్పటికే ఆమె మాస్ మహారాజా రవీతేజ ‘ధమకా’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరిన్నీ ఆఫర్లు వస్తున్నాయని, దాదాపు 4నుంచి 5 సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు వినికిడి. అంతేగాక ఓ మెగా హీరో సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అకీరా బర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుతారనే సంగతి తెలిసిందే. అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ కొంతకాలంగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకీరా సినిమా, తెలుగు వెండితెర ఎంట్రీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. చదవండి: విజయ్‌పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మెగా అభిమానులంత పండగ చేసుకునే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అదేంటంటే అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందని, తన తండ్రి పవన్ సినిమాతోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నాండంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏఎంరత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చదవండి: కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట ఈ సినిమాలో అకీరా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడని టాక్. కాగా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభమం కాబోతోంది. అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అకీరా నందన్‌ను తీసుకుంటున్నట్టుగా సమాచారం. తండ్రి పవన్‌తో పాటు అకీరా కలిసి పలు సీన్లలో అలరించనున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో నిధీ అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్స్ కాగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
ప్రభాస్-సందీప్ వంగ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 25వ చిత్రం అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: Prabhas25: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తోనే ప్రభాస్ 25వ చిత్రం ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ‘బెబో’ కరీనా కపూర్ నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరీనా ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. తొలి చిత్రంలోనే బెబో నెగిటివ్ షేడ్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోందట. ఇందులో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందని చెబుతున్నారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా శక్తివంతంగా కరీనా పాత్ర ఉండబోతుందట. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపాన్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలవనున్నారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
లండన్‌లో హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ!
Hero Siddharth Got Surgery In London: హీరో సిద్ధార్థ్‌కు లండన్‌లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన సిద్ధార్థ్‌కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్ అనూ ఇమ్మాన్యయేల్తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్ వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Love Story Review: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్‌తో పాటు శర్వానంద్ కూడా హీరో నటిస్తున్నాడు. -
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్?!
‘బాహుబలి’తో చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ‘డార్లింగ్’ ప్రభాస్. ఆయనకు అంత్యంత భారీ విజయాన్ని అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ మూవీని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ప్రభాస వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్స్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్‌తో సైన్స్ ఫ్రికక్షన్ మూవీకి సంతకం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అమెరికాలో సేదతీరుతున్న జగపతి బాబు ఈ ప్రాజెక్ట్స్ అనంతరం ప్రభాస్ కోసం స్క్రిప్ట్ సిద్దం చేయాల్సిందిగా మైత్రి మేకర్స్ రాజమౌళిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై రాజమౌళితో చర్చలు జరపుతున్నట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ‘సలార్’ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందే ఆది పురుష్ మూవీ ఇటీవల సెట్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం -
రూ. 4 కోట్ల పారితోషికం తిరిగిచ్చిన నవీన్ పొలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థకు షాక్ ఇచ్చాడు. నవీన్ ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. జాతి రత్నాలు మూవీతో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో నవీన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతడికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో స్వీటీ అనుష్కతో ఓ సినిమాతో పాటు సితార ఎంటర్టైన్మెంట్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అయితే సితార ఎంటర్టైమెంట్ సంస్థ దగ్గర నవీన్ తీసుకున్న 4 కోట్ల రూపాయల పారీతోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో! అయితే ఈ తాజా బజ్ ప్రకారం నవీన్ సితార ఎంటర్టైన్మెంట్లోని ఈ సినిమాను కాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. రంగ్ దే మూవీ కో డైరెక్టర్ కథ వినిపించగా నవీన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికి కథ పూర్తి కాకపోవడంతో నవీన్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశాడట. అయితే దీనిలో ఎంతవరకు నిజముందనేది హీరో కానీ, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పందించేవరకు వేచి చూడాలి. మరోకపక్క అనుష్క అనుకున్న మరో మూవీపై కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోపక్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఈ సారి నవీన్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడో తెలుసుకొవాలంటి ఇంకా కొంతకాలం వేచి చూడాలి. -
బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటికి నుంచి ఈ మూవీలోని హీరోయిన్, విలన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట బాలయ్య సరసన హీరోయిన్గా శృతీ హాసన్, త్రిష పేర్లు వినిపించగా ఆ తర్వాత మెహ్రీన్ కౌర్ పర్జాదా పేరు తెరపైకి వచ్చింది. చదవండి: బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు ఆ తర్వాత విలన్ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ తాజా బచ్ ప్రకారం ఈ మూవీలో విలన్‌గా నటించేందుకు విజయ్ సేతుపతి నో చెప్పినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాకు విజయ్ నో చెప్పడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనితో పాటు మరో వార్త కూడా బయటకు వచ్చింది. అయితే మొదట దర్శకుడు గోపిచంద్ హీరోయిన్గా శ్రుతి హాసన్‌ను సంప్రదించగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య మీద ఉన్న అభిమానం, డైరెక్టర్ సెంటిమెంట్‌ను కాదనలేక శ్రుతి అతిథి పాత్ర ఏమైనా ఉంటే చేస్తాని ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ శ్రుతి నటించడం లేదని స్పష్టత వచ్చేసింది. బాలయ్యతో సందడి చేయనుంది మెహ్రీన్ హా లేక త్రిష అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఎన్బీకే 107 మూవీని స్టార్ నటీనటులతో చేయాలని ప్లాన్ చేసుకున్న గోపిచంద్‌కు ఇలా చేదు అనుభవం ఎదురైందంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్! -
బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్!
ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో అగష్టు 22 నుంచి కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్ పంపించనున్నారని వినికిడి. కానీ బిగ్‌బాస్ 5 సీజన్ కంటస్టెంట్స్కు సంబంధించిన ఖచ్చితమైన జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. చదవండి: బిగ్‌బాస్ 5: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్, సింగర్! ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో జాబితా బయటకు వచ్చింది. అయితే ఇందులో కొంతమంది కొత్తవాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్ ప్రత్యూష్, ఆట సందీప్/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అరియాన గ్లోరీ! ఇంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్ల పేర్లు ఉండగా.. ఈ కొత్త లిస్టులో వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అని, అందులో డౌట్ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల బిగ్‌బాస్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షో హోస్ట్ ఎవరనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ నాగార్జున ‘బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ కొత్త జాబితా: యాంకర్ రవి ఆర్జే కాజల్ శ్వేతా వర్మ లహరి షారి కమెడియన్ లోబో సిరి హన్మంతు నటి ప్రియ కార్తీకదీపం ఉమాదేవి 7 ఆర్ట్స్ నటి సరయు నటుడు మానస్ షా మోడల్ జస్వంత్ నటుడు సన్నీ విశ్వ టీవీ9 యాంకర్ ప్రత్యూష్ ఆట సందీప్/రఘు మాస్టర్లు -
ఓటీటీకి ఎస్ఆర్ కల్యాణమండపం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’. శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్-రాజ్‌లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడదులై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్లకు తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న తరుణంలో ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిందని చెప్పుకొవచ్చు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ 7 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ఢీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉందట. (చదవండి: ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ) ఈ సినిమా.. విడుదలైన దాదాపు మూడు వారాలకే ఓటీటీలో విడుదల కావడం విశేషం. సిల్వర్ స్క్రీన్‌పై కాసుల వర్షం కురింపించిన ఎస్ఆర్ కల్యాణ మండపం మరి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది, ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కిరణ్ అబ్బవరమే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించాడు. ఇందులో సీనియర్ నటుడు సాయికుమార్-తులసిలు కీలక పాత్రలు పోషించారు. -
చిరు చెల్లిగా కీర్తి, ఆమెకంత రెమ్యునరేషన్ అవసరమా!
కీర్తి సూరేశ్ ‘మహానటి’ మూవీ తర్వాత మహిళ నేపథ్యం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఓ వైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే లేడి ఓరియంటెట్ చిత్రాలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘పెగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు అంతగా గుర్తింపు పొందలేదు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె సైడ్ క్యారెక్టర్లోనూ నటించేందుకు సిద్దమైంది. స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించేందుకు కీర్తి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీలో రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా చెల్లిగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో హిట్‌గా నిలిచిన వేదాళం మూవీని చిరు ప్రధాన పాత్రలో మెహర్ రాజా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు సోదరి పాత్రకు దర్శక-నిర్మాతలు మొదట కీర్తిని సంప్రదించడంతో వెంటనే ఒకే చెప్పిందట. అంతేగాక ఈ మూవీకి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేడి ఒరియంటెడ్ చిత్రాలకే అంత పారితోషికం తీసుకోనప్పుడు, సైడ్ క్యారెక్టర్‌కు అంత ఇవ్వడం ఎందుకని చిరు అభిప్రాయపడ్డారట. అంతేగాక ఈ విషయంపై ఆయన మేకర్స్‌ను వారించినట్లు వినికిడి. దీనిపై చర్చలు జరుగుతుండగానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో చిరు సలహా మేరకు కీర్తికి ప్రత్యామ్నాయం దర్శక-నిర్మాతలు మరో నటిని వేతికే పనిలో పడ్డారట. ఎవరు దొరకపోవడంతో మేకర్స్ కీర్తినే ఫైనల్ చేద్దామని చిరును ఒప్పించారట. అలా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి కీర్తినే ఖారారు చేసేందుకు రెండోసారి ఆమెను సంప్రదించారట దర్శక-నిర్మాతలు. అయితే ఈసారి ఆమె మరో కోటి పెంచి మొత్తం 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ మూవీకి డేట్స్ ఇచ్చిన చిరు వేదాళం మూవీకి కూడా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీంతో త్వరలోనే వేదాళం మూవీని సెట్స్‌పై తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ సమయంలో వేరే నటిని వేతకడం కంటే కీర్తినే ఫైనల్ చేమాలని నిశ్చయించుకుని, ఆమె అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ రేడి అయ్యారట. దీంతో మొత్తానికి కీర్తి తన రెమ్మునరేషన్ విషయంలో మాట నెగ్గించుకుందంటూ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
గర్ల్‌ఫ్రెండ్‌తో నటి రహస్య వివాహం!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రతీది ఇప్పుడో న్యూస్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వాటిని సానుకూలంగానే స్వీకరిస్తుంటారు. ఇదిలా ఉంటే ‘ట్విలైట్’ భామ క్రిస్టెన్ స్టెవార్ట్ రహస్య వివాహం చేసుకుందని, అదీ తన గర్ల్ఫ్రెండ్నేనన్న వార్తలు హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ‘ట్విలైట్’, ‘స్నో వైట్ అండ్ ది హంట్స్‌మ్యాన్’ లాంటి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న క్రిస్టెన్(31).. స్క్రీన్ రైటర్ డైలాన్ మెయెర్తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. చాలాకాలం తర్వాత ఈమధ్యే లాస్ ఏంజెల్స్‌లోని ఓ సెలూన్ వద్ద క్రిస్టెన్ ఫొటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కింది. అయితే ఆమె చేతికి ఒక రింగ్ కనిపించడం, అలాంటి రింగ్ ఒకటి కొన్నిరోజుల క్రితం ఓ ఈవెంట్‌కు హాజరైన డైలాన్ వేలికి కూడా కనిపించడంతో ఇద్దరి రహస్య వివాహం జరిగిపోయిందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాను ఫెమినిస్ట్‌నని, బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించుకున్న స్టెవార్ట్.. గతంలో ట్విలైట్ హీరో రాబర్ట్ పాటిన్సన్తోనూ రిలేషన్షిప్ నడిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ రుపెర్ట్ శాండర్స్‌తో కొన్నాళ్లూ, తిరిగి పాటిన్సన్తో ఏడాది డేటింగ్ చేసింది. అటుపై విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అలిసియా కార్గిలేతో, న్యూజిలాండ్ మోడల్ స్టెల్లా మాక్స్వెల్తోనూ డేటింగ్ చేసింది. ఆపై ఓ టీవీ షో టైంలో డైలాన్ మెయర్కి దగ్గరై డేటింగ్ చేస్తూ.. లాస్ ఏంజెల్స్‌లో ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌తో బయట కనిపిస్తే ఛాన్స్‌లు ఇవ్వమని కొందరు ప్రొడ్యూసర్లు ఆమెతో చెప్పినప్పటికీ.. క్రిస్టెన్ మాత్రం ఆ వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా.. పార్టీలకు సైతం హాజరవుతూ వస్తోంది. -
బేబమ్మకు 'ఉప్పెన'లా వెల్లువెత్తుతున్న ఆఫర్లు!
ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రభంజనం సృష్టించామన్నదే ముఖ్యమంటోంది హీరోయిన్ కృతీ శెట్టి. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ తమ సరసన కృతీ నటిస్తే బాగుండు అనుకుంటున్నారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి బేబమ్మకు తెలుగులో వస్తున్న ఆఫర్లేంటి? వేటికి ఆమె ఓకే చెప్పిందో తెలియాలంటే ఇది చూసేయండి.. -
బిగ్‌బాస్ 5లోకి బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్?!
బిగ్‌బాస్ అంటేనే సెలబ్రిటీల హంగామా! ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నంత రేంజ్లో రచ్చ చేస్తుంటారు. టాస్కుల్లోనే కాదు పోట్లాటలకు కూడా ముందుంటారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా ఇదే.. కామెడీని పండించేందుకు ఒకరు, వయ్యారాలు ఒలకబోసేందుకు ఒకరు, శాపనార్థాలు పెట్టేందుకు ఒకరు, చిచ్చు రాజేసేందుకు ఒకరు, పాట పాడేందుకు, ఆట ఆడేందుకు, స్టెప్పులేసేందుకు, శోకరాగం అందుకునేందుకు.. ఇలా అన్ని ఎమోషన్లను పండించేవారినే ఒక్కొక్కరిగా సెలక్ట్ చేసుకుంటారు. ఈసారి కూడా అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరేనంటూ చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సిరి హన్మంత్ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి తర్వాత సీరియల్స్ వైపు అడుగులేసి నటిగా రాణిస్తోంది. పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకు బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చిందట. మరి ఈ ఆఫర్‌ను ఆమె అంగీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ లోబోను కూడా ఈ సీజన్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
అమీర్-కిరణ్.. మధ్యలో ఆమె!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన మరుక్షణమే.. అదొక హాట్ టాపిక్‌గా మారింది. సెటైర్లు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లతోనే నిన్నంతా సోషల్ మీడియాలో చర్చ నడించింది. అయితే హాఠాత్తుగా ఫాతిమా సనా షేక్ పేరు తెర మీదకు వచ్చింది. రికార్డుస్థాయిలో ఆమె పేరు హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు ట్విటర్లో పోస్ట్ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్‌తో యంగ్ హీరోయిన్ ఫాతిమాకు ఎఫైర్ ఉందని, అందుకే వాళ్లిద్దరూ విడిపోతున్నారనేది నెటిజన్స్ ఒపీనియన్. అందుకే వాళ్ల ఫొటోలతో, ఫాతిమాను తెర మీదకు తెచ్చి ఆడుకుంటున్నారు. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఆ వ్యవహారాన్ని అమీర్ లైట్ తీసుకోగా.. ఫాతిమా మాత్రం తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు తన గురించి తప్పుగా రాయడం సరికాదని వ్యాఖ్యానించింది కూడా. భావ ప్రకటన స్వేచ్ఛ.. ఇక ఫాతిమాతో అమీర్‌కు లింక్ అంటగట్టడం.. ఈ ఎఫైర్‌ను విడాకులకు ముడిపెట్టడం అంతా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగమేనని పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో దేశం పట్ల, దేశభద్రత పట్ల, ప్రభుత్వం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించిన అమీర్ తీరును ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ‘అమీర్ నువ్వు ఎలాగైనా భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్యా దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా?.. ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ ప్రియురాలు(ఫాతిమా) .. ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కూతురు.. ఆ వెంటనే హీరోయిన్ హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్.. బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం (2015)తో తెలుగులో నటించిన ఫాతిమా.. 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో జోడిగా నటించింది. ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ముంబైలో దిగినప్పుడల్లా ఆమె అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. దీంతో రూమర్లు మొదలయ్యాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీకి, అవార్డుల వేడుకల దగ్గర కూడా వీళ్లు జోడిగా కనిపించడం.. అప్పటిదాకా యాక్టివ్‌గా కెమెరాలకు కనిపించిన కిరణ్‌రావ్ సైడ్ అయిపోవడంతో ఆ రూమార్లకు మరింత బలం చేకూరింది. Amir khan after every 15 years#AmirKhan #FatimaSanaShaikh pic.twitter.com/oPQzSajFsX — Iamsarcasterr_ (@iamsarcasterr) July 3, 2021 People celebrate the anniversary, these divorce are playing divorce. Aamir Khan did his second divorce#AamirKhan#KiranRao #FatimaSanaShaikh pic.twitter.com/Suvta7K2dG — ❤️ (@Agnostic_Ram) July 3, 2021 During that time #FatimaSanaShaikh didn't realize that i am gonna be next target of #amirkhan wife 😂🤣 pic.twitter.com/hSjsAaCYDp — sarcastic guy (@TheChandler007) July 3, 2021 Mere speculation of this affair by social police, #AamirKhan and #FatimaSanaShaikh aren't officially a couple. But, people started defaming both Aren't we living in morally dead society. pic.twitter.com/JcBYlrJ6j1 — Punologist™ (@Punology1) July 3, 2021 #EtimesPaps#FatimaSanaShaikh spotted in the city (Mumbai). While her memes are trending after #AamirKhanDivorce was announced, do you think it is 'cool' to put her in a spot? Tell us 👇 pic.twitter.com/kFNhJ4MDnT — ETimes (@etimes) July 3, 2021 -
Vakeel Saab: మొదట అనుకుంది పవన్‌ను కాదట!
వకీల్ సాబ్తో మూడేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పింక్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్‌లో మొదటగా పవన్ కల్యాణ్‌ను హీరోగా అనుకోలేదట. నందమూరి బాలకృష్ణ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించారట. దీంతో ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరకు తీసుకువెళ్తే బాలయ్య దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పేరును సూచించాడని, అలా దిల్ రాజు పవన్‌ను కలిసి వకీల్‌సాబ్‌కు ఒప్పించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌తోపాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం వకీల్‌సాబ్ టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' సినిమా చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. మరోవైపు పవన్.. క్రిష్ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్నాడు. చదవండి: చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు? హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
Krithi Shetty: ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి?
తొలి సినిమా 'ఉప్పెన'తోనే ధక్ ధక్ ధక్ అంటూ కుర్రకారుల గుండె తలుపు తట్టింది కృతీ శెట్టి. తనకు వచ్చిన క్రేజ్‌తో ఫట్ ఫట్ ఫట్ అంటూ అందివచ్చిన ఆఫర్లు అన్నింటినీ చేసుకుంటూ పోతోంది. దీంతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది కృతీ. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు అరడజను సినిమాలున్నట్లు తెలుస్తోంది. నాని 'శ్యామ్ సింగరాయ్', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు తమిళ చిత్రసీమలో ధనుష్ సరసన నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు సంతకం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మ కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ సమయంలో వినూత్న చిత్రాల దర్శకుడు తేజ తన కొత్త సినిమా కోసం కృతీ శెట్టిని సంప్రదించాడట. దగ్గుబాటి అభిరామ్ వెండితెర అరంగ్రేటం చేయనున్న సినిమాలో బేబమ్మ నటిస్తే ప్లస్ అవుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కానీ చేతిలో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ఉండటంతో తేజ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. అయితే తేజ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తపడతాడు. అలాంటి దర్శకుడికి బేబమ్మ తొందరపడి నో చెప్పిందా? అని సినీప్రియులు చర్చించుకుంటున్నారు. చదవండి: తమిళ స్టార్ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్! Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు? -
క్రిష్ తన భార్యతో విడిపోవడానికి ఆ హీరోయినే కారణమట!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆయన భార్య రమ్యతో విడిపోయి మూడేళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆయన విడాకులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. కాగా రమ్య అనే డాక్టర్‌ను 2016 అగష్టు 7న వివాహం చేసుకున్న క్రిష్ ఆ తర్వాత రెండేళ్లకే ఆమెతో విడిపోయాడు. లేటు వయసులో వివాహం చేసుకున్న ఆయన అతి తక్కువ సమయంలో భార్యతో విడిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో అప్పట్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే క్రిష్.. భార్య రమ్యతో విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణమట. ఆయన డైరెక్షన్లో నటించిన ఓ హీరోయిన్‌తో క్రిష్ క్లోజ్‌గా ఉండేవాడట, అది నచ్చని భార్య రమ్య ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దీంతో ఇద్దరూ కలిసి విడిపోవాలని నిర్ణయించుకుని 2018లో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం, విడిపోవడం చకచక జరిగిపోయింది. అయితే క్రిష్‌తో చనువుగా ఉన్న ఆ హీరోయిన్ ఎవరూ, ఏ మూవీ డైరెక్షన్ సమయంలో ఇలా జరింగిందనేది ఇప్పటికి స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం క్రిష్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: పోరాటానికి ‘వీరమల్లు’ కసరత్తు, ఫొటోలు వైరల్ -
హిందీ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్!
తెలుగులో మెగాస్టార్ ఎవరనగానే ఇంకెవరు, టాలీవుడ్ బాస్ చిరంజీవి అని టపీమని చెప్తారు. హిందీలో మెగాస్టార్ ఎవరంటే.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అని టక్కున చెప్పేస్తారు. మరి ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదూ.. గతంలో 'సైరా నరసింహారెడ్డి'లో అమితాబ్.. చిరుకు గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా! తాజాగా బిగ్‌బీ తన బాలీవుడ్ మూవీలో నటించమని చిరంజీవిని చిరు కోరిక కోరాడట. ఆయన నోరు తెరిచి అడిగాక కాదంటానా? అన్నట్లుగా చిరంజీవి కూడా వెంటనే ఆ కోరికను మన్నించి సినిమాకు అంగీకరించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే చిరుది ప్రధాన పాత్రా? లేక గెస్ట్ రోలా? అంటూ అభిమానులు బుర్రలు గోక్కుంటున్నారు. కాగా చిరంజీవి గతంలోనూ పలు హిందీ చిత్రాల్లో నటించాడు. ప్రతిబంధ్, ది జెంటిల్మెన్, ఆజ్ కా గుండా రాజ్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరో హిందీ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఆయనతో జోడీ కడుతోంది. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. చెర్రీతో పూజా హెగ్డే జోడీ కడుతోంది. ఇందులో సోనూసూద్‌తో పాటు మరో నటుడు కూడా ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ రెజీనా కసాండ్రాతో స్టెప్పులేయించినట్లు సమాచారం. చదవండి: ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్! మగాడిలా ఉన్నానని కామెంట్ చేశారు: అనన్య పాండే -
ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్!
'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్ 2' సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పెద్ద హీరోలతో జత కట్టే ఈయన ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి కొండాపూర్ సమీపంలో ఓ కాస్ట్లీ బంగ్లాను తన సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాడంటున్నారు. త్వరలోనే ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తన కుటుంబాన్ని తీసుకొని కొత్తింట్లోకి ప్రవేశించనున్నాడని చెప్తున్నారు. అయితే ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కాబట్టి అనిల్ అన్ని కోట్లు ఖర్చుపెట్టి కొత్త బంగ్లా కొన్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఆయన స్పందించేవరకు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం ఈ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో కలిసి ఫన్ బాంబ్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి రిలీజై ఘన విజయం సాధించిన ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో వెంకటేశ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ తేజ్ పక్కన మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్ -
బిగ్‌బాస్ తెలుగు 5: పాపులర్ సింగర్ ఎంట్రీ!
ఇండియాలో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హిట్ షో బిగ్‌బాస్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ షో విజయవంతంగా ప్రసారమవుతోంది. తెలుగులో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు సీజన్లకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఐదో సీజన్‌కు కూడా మరోసారి నాగార్జునే హోస్ట్‌గా వచ్చే అవకాశాలున్నాయి. కాగా తెలుగునాట బిగ్‌బాస్ ప్రతిసారి జూన్‌లో ప్రారంభమవుతుండగా గతేడాది కరోనా టెన్షన్ వల్ల షో ఆలస్యంగా మొదలైంది. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన నాల్గో సీజన్ డిసెంబర్ 20న అంగరంగ వైభవంగా ముగిసింది. ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యతను కనబర్చారు నిర్వాహకులు. యూట్యూబ్ స్టార్లను, బుల్లితెర సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించారు. వారు కూడా ఆటపాటలతో మెప్పించి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో వారికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఐదో సీజన్లో ఎవరెవర్ని తీసుకుంటారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో అరేయ్, ఏంట్రా ఇది? ఇంత బాగా నటించాడు అనిపించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ హౌస్‌లోకి రాబోతున్నాడు అని ఆయన అభిమానులు బలంగా ఫిక్సయ్యారు. తాజాగా ఓ సింగర్ కూడా ఈసారి రేసులో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ సింగర్ హేమచంద్ర బిగ్‌బాస్ షో ద్వారా తన అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. గతంలోనూ అతడికి బిగ్‌బాస్ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల వాటిని సున్నితంగా తిరస్కరించాడు. మరి ఈసారి ఈ ఛాన్స్‌ను వదులుకుంటాడా? లేదా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేస్తాడా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు కంటెస్టెంట్‌గా వస్తే మాత్రం టైటిల్ విన్నర్‌ను చేస్తామని శపథం చేస్తున్నారు ఆయన అభిమానులు. కానీ అతడికి బిగ్‌బాస్ నిర్వాకుల నుంచి పిలుపు వచ్చిందనేది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే! చదవండి: బిగ్‌బాస్ ఐదో సీజన్లో శ్రీరెడ్డి! మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ -
ముంబైలో రష్మిక మందన్నా కొత్త ఇల్లు!
ఛలో సినిమా హిట్ తర్వాత ఏ భాషైనా, ఏ సినిమా అయినా ఆగేది లేదంటూ యమ స్పీడుగా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. తెలుగు, కన్నడ భాషలను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఈ క్యూటీ ఈ మధ్యే మిషన్ మజ్నుతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. దీంతో మొన్నామధ్య లగ్జరీ కారు కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ఓ ఇల్లు కూడా కొందట. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్ తో ‘డాడీ’ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ రెండు చిత్రాల తర్వాత మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు కూడా రష్మిక ప్లాన్ చేసుకుంటోందని భావిస్తున్నారు అభిమానులు. ఎలాగో పాన్ ఇండియా సినిమాల్లో వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నందున రష్మిక ముంబైలో సెటిలవ్వాలనుకుంటోందా? ఏంటని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ముంబైలో ఆమె నిజంగానే కొత్త ఇల్లు కొనుక్కుందా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే రష్మిక దీనిపై స్పందించాల్సిందే. ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప'లో నటిస్తోంది. ఇందులో ఆమె చిత్తూరు యాసలో మాట్లాడే పల్లెటూరి యువతిలా కనిపించనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. మరోవైపు 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శర్వానంద్‌తో జోడీ కడుతోంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. చదవండి: ఆ వార్తలు నిజమైతే బాగుండు.. అదే నా కల: రష్మిక బిజీ బిజీగా మన స్టార్ హీరోయిన్లు.. -
దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్!
తెర మీద హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. తెర వెనుక కూడా చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమలో పడతారు. అయితే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2017లో నటించిన 'ఆక్సిజన్' సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. ఇక ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కాగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడే ఈ జ్యోతి కృష్ణ. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే.. 'యాక్షన్ హీరో బైజు' చిత్రంతో హీరోయిన్గా అడుగు పెట్టిందీ బ్యూటీ. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ అనుకు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగులోనే. అలా టాలీవుడ్లో తొలి చిత్రం 'మజ్ను'లో నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు. ఇక 'శైలజా రెడ్డి' అల్లుడు తర్వాత ఇక్కడ పూర్తిగా స్లో అయిన అను ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్'లో నటించింది. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కోలీవుడ్‌లోనూ రెండు, మూడు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి! చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’.. -
ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది!
వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం "ఉప్పెన". ఈ సినిమా రిలీజవకముందే కృతీకి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన కుర్రకారంతా కృతీ నవ్వుల మాయలో పడి తూగుతున్నారు. ఎక్కడ చూసినా ఆమె పేరే జపిస్తున్నారు. అటు సినీ ఉద్ధండులు కూడా ఆమె అందాన్ని, ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు సెలబ్రిటీలు ఆమె చాలా బాగా నటించిందని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా 'దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్లను బుక్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో దొరక్కపోవచ్చు' అని వేదిక మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరి మాటలను అక్షరాలా నిజం చేస్తూ కృతీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు సినిమాల్లో నటించే ఛాన్స్ రాగా నాగశౌర్య చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరోతో జోడీ కట్టే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ క్యూటీ అక్కినేని అఖిల్ సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం బాడీ పెంచుతూ తెగ కష్టపడుతున్నాడు అఖిల్. కథ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడట. ఇప్పటికే గుర్రపు స్వారీ వచ్చినప్పటికీ ఇంకా సాన పెట్టేందుకే ఈ తపన, కృషి. ఏదేమైనా యంగ్ హీరో అఖిల్ పక్కన, కొత్త హీరోయిన్ కృతీని ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు. చదవండి: చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం: విద్యాబాలన్ Radhe Shyam: జూలై నెలాఖరున రిలీజ్! ఉప్పెన రూ.100 కోట్ల చిత్రం: సుకుమార్ -
త్వరలో ప్రముఖ టాలీవుడ్ హీరో పెళ్లి!
ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్ఎస్ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్‌లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే! (చదవండి: మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస) ఇక సుమంత్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) -
సునీల్ సినిమాలో అనసూయ హీరోయిన్!
జబర్దస్త్ కామెడీ షోలో అందాల ఆరబోతతో పాటు నవ్వులు విరజల్లులు చిలకరించే యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెర, వెండితెర.. మధ్యలో ఓటీటీ తెర.. కాదేదీ ఎంటర్టైన్మెంట్కు అనర్హమన్నట్లుగా కుదిరిన అన్ని చోట్లా కాలు మోపుతూ సక్సెస్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమెకు కమెడియన్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో అతడికి జోడీగా నటించేందుకు అనసూయను సంప్రదించారని సమాచారం. అయితే కథ నచ్చడంతో పాటు, హీరోహీరోయిన్లు ఇద్దరికీ సమప్రాధాన్యత ఉండటంతో సదరు సినిమాలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. (చదవండి: కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ) మరి ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని అనసూయ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.ఇదిలా వుంటే అనసూయ ఇప్పటికే ఆమె 'థాంక్యూ బ్రదర్' సినిమాలో నటిస్తోంది. అది కూడా గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. మరోవైపు మెగా డాటర్ నిహారికతో కలిసి ఓ వెబ్‌సిరీస్ కూడా చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఆదివారం ఓ పోస్టు పెట్టి అభిమానులను ఆందోళనకు గురిచేసిన ఈ నటి దాని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. (చదవండి: మహేశ్ చేతుల మీదుగా ‘థ్యాంక్ యు బ్రదర్’ మోషన్ పోస్టర్) -
నిహారిక నిశ్చితార్థం: పవన్ అందుకే వెళ్లలేదు
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిశ్చితార్థం నిన్న రాత్రి వేడుకగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ అందరూ హాజరయ్యారు. కొత్త పెళ్లి కూతురితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. కానీ నిహారిక బాబాయ్ జాడ మాత్రం కనిపించలేదు. నాగబాబు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంగేజ్మెంట్కు రాకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు బయలు దేరాయి. నితిన్ పెళ్లి వేడుకకు వెళ్లేంత సమయం ఉన్న పవన్‌కు సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్లలేదంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (బాపు బొమ్మకు పెళ్లంట: సిగ్గు పడుతోన్న నిహారిక) వారి మధ్యేమైనా కుటుంబ సమస్యలున్నాయోమేనని అనుమానపడేంత వరకు వచ్చింది కథ. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. నిజానికి పవన్ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. గత నెల ఈ దీక్షకు పూనుకున్నారు. ఇది నాలుగు నెలలపాటు కొనసాగుతుంది. ఈ దీక్షలో ఉన్నప్పుడు సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు విడిచి వెళ్లకూడదు. ఎంగేజ్మెంట్ రాత్రి పూటే జరగడంతో ఆ వేడుకలో పవన్ కనిపించలేదు. అయితే గురువారం ఉదయమే నాగబాబు నివాసానికి వెళ్లి నిహారికను, ఆమెకు కాబోయే భర్త చైతన్యను మనసారా ఆశీర్వదించారు. (ఆర్జీవీ ట్వీట్: పవన్‌ను ఓదార్చిన బాబు) -
పాక్ క్రికెటర్‌తో మిల్కీ బ్యూటీ..
ఏ వుడ్ అయినా సరే, సినిమా వాళ్లపై రూమర్స్ తప్పవు. కొన్నిసార్లు అవి వారి ఉనికి గుర్తు చేస్తుంటే మరికొన్నిసార్లు మాత్రం పెద్ద తలనొప్పిగా మారుతాయి. సినీ సెలబ్రిటీలే కాదు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ఈ ముప్పు తప్పదు. అప్పట్లో సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్‌ను పెళ్లాడనుందహో అని పుకారు రాయుళ్లు దరువేసి మరీ చాటింపు చేశారు. ఆ తర్వాత అదే నిజమైంది కూడా.. ఇన్నాళ్లకు మరో పాక్ క్రికెటర్‌తో ఓ టాలీవుడ్ తార ప్రేమలో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి తమన్నా, పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. (అలాంటివి చేయను..చూడను : తమన్నా) కాబోయే భార్యకు దగ్గరుండి మరీ నగలు కొనిస్తున్నాడంటూ అబ్దుల్ రజాక్‌ను ఆడేసుకుంటున్నారు. అయితే ఈ రూమర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందీ మిల్కీ బ్యూటీ. "ఒకరోజు నటుడి పేరు చెప్తారు. మరో రోజు క్రికెటర్ అంటారు, ఇటు డాక్టర్ అంటారు, అటు క్రికెటర్ అంటారు. ఇలా అందరితో రిలేషన్షిప్ అంటగట్టడం ఏంట"ని కడిగి పారేసింది. తను ఎవరితోనూ డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. మరి ఫొటో అంటారా? గతంలో దుబాయ్‌లో ఓ నగల షాపు ప్రారంభోత్సవానికి తమన్నాతో పాటు, అబ్దుల్ కూడా వెళ్లాడు. అప్పుడు తీసిందేనన్నమాట ఈ ఫొటో. ("నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో చెత్త సినిమా") -
ఆ జాబితాలో నేను లేను: హీరో
ముంబై: తన పెళ్లిపై మీడియాలో వస్తున్న ఊహాగానాలను బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కొట్టిపారేశాడు. పెళ్లి విషయం దాచాల్సిన అవసరం తనకు లేదని, అందరికి చెప్పే పెళ్లాడతానని అన్నాడు. ఈ యువహీరో త్వరలో మలైకా అరోరాను పెళ్లాడనున్నట్టు మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అతడు తేల్చిచెప్పాడు. ‘నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెబుతాను. దాయాల్సిన అవసరం ఏముంది? నా సినిమాలతో బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకునే వారి జాబితాలో నేను లేను. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోన’ని అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. తన గురించి ఎటువంటి గాసిప్స్ పుట్టించినా లెక్కపెట్టనని, సినిమా వాళ్లకు ఇవన్నీ మామూలేనని తేలిగ్గా తీసుకున్నాడు. మీడియా అంటే తనకు గౌరవం ఉందన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పాడు. అర్జున్ కపూర్ నటించిన ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించనున్న సినిమాలో నటించనున్నాడు. చరిత్ర నేపథ్యంలో అశతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘పానిపట్’ సినిమాలోనూ కనిపించనున్నాడు. -
ఫేస్‘బుక్కవుతారు’..!
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంతో పాటు రాష్ట్రంలో సోషల్ మీడియా విస్తరించింది. ఓటర్ల కంటే రెట్టింపు స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు సాంకేతిక విప్లవం పెరిగిన నేపథ్యంలో ఈ సారి ఎన్నికల ప్రసారంలో సోషల్‌మీడియా కీలక భూమిక పోషించనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే కంటే కొంతమంది సిబ్బందితో సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా పోస్టింగులు చేసుకుంటే మేలన్న అభిప్రాయాలు లేకపోలేదు. అంతలా సోషల్ మీడియా ప్రభావం దేశంలోను, రాష్ట్రంలోను మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇష్టానుసారం పోస్టింగులు కుదరవిక ఎన్నికల కోడ్ వచ్చేసింది. సామాన్యులతో పాటు ఉద్యోగులు సైతం ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ గ్రూపులలో పోస్టులు పెడుతుంటారు. అయితే సోషల్ మీడియాపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా చర్యలు తప్పవు. జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివిధ పార్టీలకు పరోక్షంగా సహకరించాలని ప్రయత్నించినా..ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పెట్టినా ఇక అంతే సంగతులు. పోస్టింగులు ఊస్టింగ్ అయిపోతాయి. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌లోకి అధికారులు, ఉద్యోగులు ఎన్నికల కోడ్ రావడంతో ఎక్కడైనా..ఒకేమాట, ఒకే పాట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంత మెజారిటీతో గెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇవే అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. పలు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో గ్రూపుల మధ్య వేరు వేరు అభిప్రాయాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వం గురించి పొగడడం గానీ, రాజకీయ పార్టీల గురించి ప్రశంసించడం గానీ అధికారులు చేయకూడదు. ఎన్నికల నియమావళిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం ఎన్నికల కోడ్‌లోకి వచ్చేశారు. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారంలో గానీ.. సామాజిక మాద్యమాల్లో సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, వీడియోలు పెట్టడం, షేర్ చెయ్యడం, చర్చలు సాగించడం వంటివి ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితోపాటు తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్నికల అధికారులు, కలెక్టర్ జె.నివాస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. -
బన్నీ బాలీవుడ్ ట్రయల్స్!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’తో పరాజయాన్ని చూశాడు. సినిమా విడుదలై రెండు నెలలు దాటినా మరో మూవీని కన్ఫర్మ్ చేయలేదు. విక్రమ్ కే కుమార్‌తో సినిమా అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తేగానీ లెక్కలోకి రాదు. అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో నిన్నంతా మార్మోగింది. సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాను 2కోట్లకు పైగా వీక్షించారు. ఇది ఇండియన్ సినిమాలో ఓ రికార్డ్. బాలీవుడ్లో బన్నీ డబ్బింగ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. బన్నీ ఈ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు విక్రమ్ కే కుమార్, త్రివిక్రమ్‌లతో సినిమాలు ఉండొచ్చని రూమర్స్ వస్తే.. ప్రస్తుతం బన్నీ బాలీవుడ్ ఎంట్రీ వార్త బయటకు వినిపిస్తోంది. వీటన్నంటిలో ఏది నిజమో తెలియాలంటే బన్నీయే సమాధానం చెప్పాలి. -
ఆ మాటంటే ఒప్పుకోను!
ఓ ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత కొందరు కథానాయికలు యాక్టింగ్‌కు బై బై చెబుతారు. పెళ్లి తర్వాత మరికొందరు స్మాల్ బ్రేక్ ఇచ్చి, మళ్లీ కెమెరా ముందుకు వస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ లాంగ్ బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ అంటూ షూట్‌లోకి అడుగుపెడతారు ఇంకొందరు కథానాయికలు. ఇలా పెళ్లి తర్వాత కథానాయికలు కెరీర్ గ్రాఫ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరి... మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే స్పీడ్‌లో యాక్ట్ చేస్తారా? అన్న ప్రశ్నను ఆలియా ముందు ఉంచితే... ‘‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలన్నా, అవకాశాలు తగ్గిపోతాయని ఎవరైనా అన్నా నేను ఒప్పుకోను. ప్రతిభ ఉంటే చాన్సులు ఆగవు. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ జర్నీకి పెళ్లితో సంబంధం లేదని నా ఫీలింగ్. ఈ విషయాన్ని అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కూడా. నేనూ అలాగే కొనసాగుతాను. మంచి యాక్టర్ కెరీర్‌ను రిలేషన్షిప్ స్టేటస్ ప్రభావితం చేయదు’’ అని అంటున్నారు ఆలియా భట్. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్ ఏంటీ? అన్న ప్రశ్నకు మాత్రం–‘‘అమేజింగ్ కో స్టార్’’ అంటూ తెలివిగా మాట దాటేశారు. కానీ, వారిద్దరి పెళ్లి గురించి మీడియాలో వస్తున్న గాసిప్‌లకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర’ సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు ఆలియా. -
అర్జున్ రెడ్డి తమ్ముడ్ని చూశారా?
టాలీవుడ్లో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ సెట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌లో విజయ్ వన్ ఆఫ్ ది క్రేజీ స్టార్. అలాంటి విజయ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదెవరో కాదు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఫిలిం క్రాఫ్ట్స్‌లో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడన్నది ఆ కథనం సారాంశం. విజయ్‌కు బాగా క్లోజ్ అయిన ఓ బడా నిర్మాణ సంస్థ.. ఆనంద్ అరంగేట్రానికి సంబంధించిన బాధ్యతలను తీసుకుందంట. ప్రస్తుతం ఆనంద్ ఫిజికల్ ఫిట్నెస్ పనిలో పడ్డాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్‌లో కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆనంద్ కూడా విజయ్‌లా రెబల్‌గా ఉంటాడా? లేదా అంతకన్నా వైల్డ్ గా ఉంటాడా? అతను సినిమాల్లోకి వచ్చే వార్త నిజమేనా?.. వస్తే అర్జున్ రెడ్డి తమ్ముడిగా ఆ అంచనాలను ఏ మేర అందుకుంటాడు?... ప్రస్తుతం ఆనంద్‌ను చూపిస్తూ విజయ్ ఫ్యామిలీ ఫోటో పాతది ఒకటి చక్కర్లు కొడుతోంది. -
టాప్ హీరోతో పూరీ మల్టీస్టారర్?
సాక్షి, హైదరాబాద్: మెహబూబా చిత్ర ఫలితంతో ఢీలా పడిపోకుండా తన తర్వాతి ప్రాజెక్టు పనిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మునిగిపోయారు. తనయుడు ఆకాశ్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఓ స్టార్ హీరోకు ఓ కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జున అక్కినేనికి ఓ కథను వినిపించారంట. ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం. మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్ కమిట్ అయినట్లు ఆ వార్త ఉటంకించింది. అయితే నానితో చేస్తున్న మల్టీస్టారర్, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరీతో మల్టీస్టారర్ ప్రారంభిస్తారంట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది. గతంలో పూరీ-నాగ్ కాంబోలో శివమణి, సూపర్ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత వీళ్లు మళ్లీ జత కడుతున్నారని, ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న పూరీకి నాగ్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. -
వెనక్కి తగ్గిన నాని
సహజమైన నటనతో మూడేళ్లపాటు వరుసగా విజయాలు అందుకున్న నానిపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తదనం లేకపోగా.. పైగా కమర్షియల్ రూట్లో వెళ్తున్నాడంటూ క్రిటిక్స్ ఏకేస్తున్నారు. వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం విషయంలో నాని అలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్యా డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ.. కథ నచ్చటంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలన్న నాని నిర్ణయించుకున్నాడంట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందే తప్ప.. పెద్దగా పేరు రాదనే అంచనాకు నాని వచ్చినట్లు సమాచారం. అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి ఇద్దరితో స్టోరీ డిస్కషన్లు అవుతుండటంతో.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎన్టీఆర్ బయోపిక్... కాస్టింగ్ మామూలుగా లేదు!
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం మామూలు విషయం కాదు. తెలుగు తెరపై ఎన్టీఆర్ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. బాలయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కాబట్టి సినిమాలో వివాదాలకు సంబంధించిన అంశాలు ఉండకపోవచ్చు. అయితే ఈ సినిమాలో కాస్టింగ్‌కు సంబంధించి పూటకో వార్త బయటకి వస్తోంది. ఎన్టీఆర్ సినీజీవితం ఎంత చెప్పుకుంటే అంత మిగిలిపోతుంది. అయితే ఈ సినిమాలో జయలలిత పాత్రకు కాజల్, శ్రీదేవి పాత్రకు దీపికా పదుకొణే, సూపర్ స్టార్ కృష్ణ పాత్రకు మహేశ్ బాబును తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరోలను తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్‌రామ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్, తారక రత్నలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
క్రిష్‌తో బన్నీ...ప్రయోగానికి సిద్ధమేనా..?
అల్లు అర్జున్ సినిమా అంటే అదిరిపోయే ఫైట్స్, స్టెప్స్, ఐటంసాంగ్, పంచ్ డైలాగ్స్ ఉండాల్సిందే. స్టైలీష్ స్టార్ సినిమా..సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. బన్నీ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు క్రిష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో సినిమా అంటే కమర్షియల్ ఫార్మట్‌కు దూరంగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉండే మాస్ మసాలా, హీరోయిజం, ఫైట్లు, ఐటంసాంగ్‌లు ఉండవు. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో చేసిన ఓ పాత్రతో బన్నీకి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంత విజయం సాధించలేదు. అసలే వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ టైంలో బన్నీ క్రిష్‌తో సినిమా అంటే చేస్తాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి క్రిష్ బాలీవుడ్ మూవీ మణికర్ణిక షూటింగ్లో ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. -
ఉపాసన కజిన్‌తో శ్రియా భూపాల్ పెళ్లి?
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జరిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి రద్దు అయింది. అప్పట్లో ఆ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం శ్రియా భూపాల్ పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే శ్రియా భూపాల్ పెళ్లి చేసుకోబోతుందని, రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్తో ఆమె పెళ్లి నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలపై శ్రియా భూపాల్, ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత, ఈ సమస్య పూర్తిగా సమసిపోవాలంటే శ్రియా భూపాల్‌కు త్వరగా పెళ్లిచేయడమే కరెక్ట్ అని వారి పెద్దలు భావించినట్టు తెలిసింది. కానీ అఖిల్ పెళ్లి మాత్రం ఇప్పుడు ఉండదని, హీరోగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించినట్టు టాక్. -
శ్రద్ధా ఫెయిల్.. ఆ చిత్రం ఆగిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు గత కొంత కాలంగా సక్సెస్ రేటు లేకుండా పోయింది. ఓకే జానుతోపాటు భారీ అంచనాల నడుమ విడుదలైన హసీనా పార్కర్ కూడా ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్ సాహో షూటింగ్లో పాల్గొంటూనే.. మరోపక్క సైనా నెహ్వాల్ బయోపిక్కు సన్నద్ధమవుతోంది. అయితే అనూహ్యంగా సైనా బయోపిక్ రద్దైనట్లుగా బాలీవుడ్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బ్యాడ్మింటన్ నేపథ్యం కావటంతో గత కొన్ని రోజులుగా సైనా, గోపీచంద్‌ల సమక్షంలో శ్రద్ధా ఆటను సాధన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆటలో పరిపూర్ణత సాధించలేకపోవటంతో ఈ బయోపిక్ యత్నాన్ని దర్శకుడు అమోల్ గుప్తే విరమించుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ మింట్ కథనం ప్రచురించింది. అయితే ఆ వార్తలను చిత్ర యూనిట్ ఖండించినట్లు మరో కథనం వెలువడింది. శ్రద్ధా సాధన కోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తోందని.. అమోల్ కూడా అందుకు అంగీకరించటంతో కాస్త ఆలస్యంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆ కథనం పేర్కొంది. ఇక మరో కథనం అయితే ఏకంగా శ్రద్ధాను తప్పించి.. ఆ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటలో ప్రావీణ్యం ఉన్న దీపిక పదుకునేను తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా మేకర్లు, చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తేనే ఈ పుకార్లపై స్పష్టత వచ్చేది. -
స్వీటీకి...కోపం వచ్చిందా?
స్వీట్ స్వీట్‌గా క్యూట్ క్యూట్‌గా మాట్లాడే స్వీటీ.. అదేనండి అనుష్కకు కోపం వచ్చినట్లుంది. అందుకే ‘ఇలాంటి వార్తలు రిపీట్ అయితే సహించేది లేదు’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ప్రభాష్–అనుష్కా జోడి సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలతో ప్రభాస్– అనుష్కా హిట్ పెయిర్‌గా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే గాసిప్ రాయుళ్లు ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరికీ ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఎప్పటికీ ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడవని అనుష్క అనుకున్నారేమో. ‘‘అనవసరమైన కథలు సృష్టించవద్దు. ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడను’ అని అనుష్క పేర్కొన్నారు. ఈ మాటలను బట్టి కూల్ గాళ్ అనుష్కకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ సంగతలా ఉంచితే.. ఈ మధ్య అనుష్క భక్తి బాట పట్టారనిపిస్తోంది. ఆ విషయంలోకి వస్తే... కేరళలో పూజలు... ఇటీవల మహాలింగేశ్వర దేవాలయంలో పూజలు చేసిన అనుష్క తాజాగా కేరళలోని కొల్లూరులో గల మూకాంబిక దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ‘భాగమతి’ సినిమాలో తనకు కో–స్టార్‌గా చేస్తోన్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తన కుటుంబ సభ్యులతో కలసి అనుష్క కేరళ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఉన్ని ముకుందన్ స్నేహితుడి ఆయుర్వేద షాపులో కొన్ని ఫేస్‌ప్యాక్స్ కొన్నారట. -
మళ్లీ మొదలైందా?
గాసిప్ సల్మాన్‌ఖాన్ ఆదరణతో... సల్మాన్ అండతో... సల్మాన్ ప్రేమతో... సల్మాన్ రికమండేషన్‌తో.... కత్రినా కైఫ్ కెరీర్ అంతా సల్మాన్ జపమే! కత్తిలాంటి కత్రిన అందం చూసి కండల వీరుడి మనసు మురిసింది. ప్రేమ మొదలైంది. ఆ ప్రేమే కత్రినాను హిందీలో స్టార్ హీరోయిన్ను చేసింది. సల్మాన్ రికమండేషన్ లేకుండా కత్రిన ఈ స్థాయికి వచ్చేది కాదేమో. సల్లూభాయ్ ట్రాక్ రికార్డ్ చూస్తే... ఎక్కువ రోజులు ఎవర్నీ ప్రేమించిన దాఖలాలు లేవు. కానీ, కత్రినాను పెళ్లాడాలనుకున్నాడట! ఏమైందో ఏమో... సల్మాన్ ప్రేమకు కత్రిన కటీఫ్ చెప్పేసింది. ఆ కోపంతోనే సల్మాన్ తన చెల్లెలి పెళ్లిలో ‘ఖాందాన్కి కోడల్ని చేద్దామనుకుంటే కాదంటున్నావ్’ అని ఆమెపై జోకులు కూడా వేశాడంటారు. కండల వీరుడికి దూరమైన తర్వాత కత్రిన కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మధ్యలో రణబీర్ కపూర్ ప్రేమలో కత్రిన, రొమేనియన్ నటి లులియా వంతుర్ ప్రేమలో సల్మాన్ ఊయలలు ఊగారని హిందీ మీడియా కోడై కూసింది.ఇప్పుడు రణబీర్ ప్రేమకు కటీఫ్ చెప్పిన కత్రిన, మళ్లీ సల్మాన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందట! చూస్తుంటే... ఆమె ప్రయత్నాలు ఫలించినట్టే ఉన్నాయి. ఎందుకంటే... తన ప్రేమకు కటీఫ్ చెప్పిన కత్రినాను ఐదేళ్లు దూరం పెట్టిన సల్మాన్ మళ్లీ ‘టైగర్ జిందా హై’లో ఛాన్స్ ఇచ్చాడు. అంతే కాదండోయ్... ‘టైగర్ జిందా హై’ నిర్మాత ఆదిత్యా చోప్రా తీయబోయే మిగతా చిత్రాల్లోనూ కత్రినాను కథానాయికగా తీసుకోమని రికమండ్ చేస్తున్నాడట! అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ హీరోలుగా ఆదిత్య చోప్రా నిర్మించనున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇవ్వమని ఆల్రెడీ హుకుం జారీ చేశాడట. సల్మాన్ నటించబోయే మిగతా సినిమా దర్శక–నిర్మాతలకూ ఇదే మాట చెబుతున్నాడట. కత్రినా కైఫ్ కెరీర్‌పై సీరియస్‌గా కాన్సన్ట్రేట్ చేసిన సల్మాన్‌ను చూసి, మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందా? లేదా ప్రేమ లేకుండానే సల్మాన్ రికమండ్ చేస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. -
గాసిప్స్‌కు బాధపడను
గాసిప్స్‌కు బాధపడనని అంటున్నారు నటి శ్రుతిహాసన్. టాప్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హిందీ అంటూ రౌండ్ చుట్టేస్తున్నారు. చాలా బోల్డ్ నటిగా భావించేవారిలో శ్రుతిహాసన్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఆదిలో విజయం ఆమడదూరం అనిపించినా ఆ తరువాత సక్సెస్‌కు చిరునామాగా మారారు. తాజాగా తెలుగులో నటించిన ప్రేమమ్ చిత్రంలో టీచర్ పాత్ర శ్రుతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా శ్రుతి ఒక భేటీలో పేర్కొంటూ ప్రేమమ్ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు ఈ పాత్రను తాను పోషించడం గురించి సోషల్ మీడియాలో చాలా విమర్శలు ప్రసారం అయ్యాయన్నారు. అలాంటి వాటిని పని పాటా లేని వాళ్లు ప్రసారం చేసి ఉంటారని భావించానన్నారు. ఏదేమైనా అలాంటి ప్రచారం గురించి తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కథ, అందులోని తన పాత్రపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆ పాత్రకు ఎలా జీవం పోయాలన్న విషయంపై శ్రద్ధ చూపానని చెప్పారు. చిత్రం విడుదల అనంతరం తన పాత్ర పోషణకు ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. తాను కమలహాసన్ కూతురినని, ఆయనలానే తాను చాలా స్ట్రాంగ్ అని పేర్కొన్నారు. విమర్శలు, సత్యదూర ప్రచారాలు తనను ఎలాంటి బాధింపునకు గురి చేయవని దృఢంగా అన్నారు. అదే విధంగా తన గురించి గాసిప్స్ ప్రసారం అవుతున్నాయనీ,అలాంటి వాటికి అస్సలు వర్రీ అవ్వనని అన్నారు. ప్రస్తుతం తాను తెలుగు,తమిళం,హిందీ అంటూ అధిక చిత్రాలలో నటిస్తున్నాననీ తెలిపారు.నటీనటులకు భాషాభేదం ఉండదన్నారు. భాషకు అతీతమైంది ఒక్క సినిమారంగమేనని పేర్కొన్నారు. తాను తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకాదరణను పొందానని, బాలీవుడ్‌లోనూ ప్రత్యేక స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నానని అన్నారు. అందుకు శాయ శక్తులా పోరాడుతున్నానని, ఆ ఆశను నెరవేర్చుకుంటాననే విశ్వాసాన్ని శ్రుతిహాసన్ వ్యక్తం చేశారు. -
ఆయనతో అలా అలా... అలలతో సరదాగా!
గాసిప్ సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అదే పక్కన లవర్ ఉంటే ఇక ప్రపంచం మొత్తం పసందుగా అనిపిస్తుంది. ప్రస్తుతం సోనాక్షీ సిన్హాకు అలానే అనిపిస్తోందట. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ మూవీ ‘అఖీరా’కి సోనాక్షి చాలానే కష్టపడ్డారు. పవర్ఫుల్ ఫైట్స్ చేసి అలసిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు. నెక్ట్స్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. సోనాక్షీకి బీచ్‌లంటే చాలా ఇష్టం. స్వదేశీ బీచ్‌లకు వెళితే జనాలు చుట్టుముట్టేస్తారు కదా. అందుకే విదేశీ బీచ్‌కి వెళ్లాలనుకున్నారు. వెళ్లిపోయారు కూడా. సోలోగా కాదు.. ప్రియుడు బంటీ సజ్దేతో కలసి వెళ్లారని సమాచారం. ఈ బంటీ ఎవరో కాదు.. సోనాక్షీతో పాటు మరికొంతమంది ప్రముఖ తారలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కి బంధువు కూడా. గత కొంత కాలంగా సోనాక్షీ, బంటీ ప్రేమాయణం సాగిస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. అదేం లేదని సోనాక్షీ కొట్టి పారేస్తున్నప్పటికీ ‘అదేం కాదు.. ఏదో ఉంది’ అని కొంతమంది అంటున్నారు. నిజమే కదా.. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుందబ్బా? -
గాసిప్పులకు స్పందించను కానీ...
ముంబై: పెళ్లికి తాను ఒప్పుకోకపోవడం వల్లే తన ప్రియురాలు నర్గిస్ ఫక్రీ అలిగి విదేశాలకు వెళ్లిపోయిందని వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు-నిర్మాత ఉదయ్ చోప్రా తోసిపుచ్చాడు. ఇప్పటికీ తనకు ఆమె సన్నిహితురాలేనని చెప్పాడు. తాము విడిపోయారని వచ్చిన వార్తలపై ఉదయ్ స్పందించాడు. 'సాధారణంగా గాసిప్పులకు నేను స్పందించను. కానీ మీడియా ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నర్గిస్, నేను ఇప్పటికీ సన్నిహిత మిత్రులమే'నని ఉదయ్ చోప్రా స్పష్టం చేశాడు. కల్పిత వార్తలు రాయడంలో మీడియా బాగా పనిచేస్తోందని ఎద్దేవా చేశాడు. తమపై సాగుతున్న ప్రచారం అంతా అవాస్తమని కొట్టిపారేశాడు. అనారోగ్య కారణాలతో నర్గిస్ ఫక్రీ విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ ఇప్పటికే తెలిపారు. -
మైండ్ గేమ్
చేతనబడి దెయ్యాన్ని దేనికోసమైనా వాడుకోవచ్చు. మంత్రగాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోడానికీ... మామిడి కాయలు రాలకుండా ఉండడానికీ...మైండ్ గేమ్ ఆడుకోడానికీ, పాడుకోడానికీ... దెయ్యాన్ని వాడుకోవచ్చు. కానీ ‘మారాల’ ఊరి యువత.. దెయ్యం మాయలో పడలేదు. దారి కాశారు... మాటు వేశారు. అసలు దెయ్యం ఎవరో కనిపెట్టారు. అది అనంతపురం జిల్లా మారాల గ్రామం. ఊరికి దూరంగా ఉంటూ, ఊరితో సంబంధం ఉన్నట్లే ఉంటాయి తండాలు. బోడే నాయక్ తండా కూడా అలాంటిదే. తండాలో మంచిబావి, తండాకు ఆనుకుని తోటలు, అందరికీ చేతిలో పని ఉంటుంది. ఒక హ్యాబిటేషన్‌లో జనం ప్రశాంతంగా జీవించడానికి అనువైన వాతావరణమనే చెప్పాలి. ఏ ఉపద్రవాలూ లేకపోతే ఏదో ఒక ఉపద్రవాన్ని మనమే సృష్టించుకుంటాం. అది మనుషుల నైజం. పగలంతా పని చేసుకుని రాత్రి భోజనం చేసి మంచాల మీద పడుకున్న తర్వాత నిద్ర వచ్చే వరకు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. అది గాసిప్ అయినా ఫరవాలేదు. కిష్టప్ప భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు. ఎండాకాలం ఉక్కపోత. ఎంతకీ నిద్రరావడం లేదు. ‘రే య్! నువ్వు ఇయ్యాల బాలమోళ్ల తోపులోకి పనికిపోయావంట’ అంటూ మరో మంచం మీదున్న తమ్ముడిని పలకరించాడు. ‘ఆ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు మారెప్ప. ‘ఇంకెప్పుడూ అటెల్లకు, రాత్రయితే అసలే ఎల్లకు. దెయ్యం తిరుగుతోందక్కడ’ అనేసి పక్కకు తిరిగి నిద్రకుపక్రమించాడు. నిద్రలోకి జారుకుంటున్న మారెప్ప దిగ్గున లేచి కూర్చున్నాడు. నిద్ర గాలికెగిరిపోయింది. పగలంతా ఆ తోపులోనే పనిచేసి వస్తిని... ఏమౌవుతుందో ఏమో! మంచం దిగాడు, తనతోపాటు ఆ రోజు తోపులోకి పనులకొచ్చిన వాళ్లను నిద్రలేపడానికి వెళ్లాడు. అంతా కలిసి బాలమోళ్ల తోపు కనిపించేటట్లు ఒక చోట మాటు వేశారు. ‘అదుగో వెళ్తోంది’ అంటూ చేయి చూపించారొకరు. జుట్ట ‘విరబోసుకుని ఉంది’ మరొకరు తాను గమనించిన విశేషణాన్ని తెలియచేశారు. ‘మీ అన్న చెప్పింది నిజమేరా!’ అంటూ వణికిపోయాడు అసలేమీ చూడని ఓ కుర్రాడు. ‘తోపులో దెయ్యం తిరుగుతోంది’ అని ఊరంతా పొక్కిపోయింది. దాదాపుగా అందరిలో లీలగా ఉన్న అనుమానం బలపడింది. ఆ తోటల వాళ్లకూ భయం పట్టుకుంది. ఎవరికీ చెప్పుకోకుండా ఎవరి తోటను వాళ్లు రాత్రిళ్లు కాపలా కాసుకోసాగారు. ఓ రోజు విరూపాక్షరెడ్డి దెయ్యం తన తోటలోకి పోవడాన్ని చూశాడు. మరో రోజు ఎల్లప్ప తోపులోకి వెళ్లడాన్ని కూడా చూశాడు. ఆ సంగతిని ఎన్నో రోజులు మనసులో దాచుకోలేక ఓ రోజు ఎల్లప్పతో చూచాయగా బయటపెట్టాడు. తానూ చూశానన్నాడు ఎల్లప్ప. తోటల యజమానులకు దెయ్యం పెద్ద సవాల్‌గానే అనిపించింది మొదట్లో. మెల్లగా ఆ దెయ్యం భయాన్ని పెంచి పోషించారు. ఆ పుకారుతో కాపును దొంగలబారి నుంచి కాపాడుకోవచ్చనేది వారి వ్యూహం. ప్రతి చర్యకూ ఓ ప్రతి చర్య ఉన్నట్లే... ప్రతి పనికీ ఎవరి లెక్కలు వారికుంటాయి. దెయ్యం తిరుగుతుందన్న భయంతో చీకటి పడితే తోటల పరిసరాల్లో మనుషులు మెదలడం లేదు. ఇక ఆ తండాలో రాత్రి ఎనిమిది అవుతుందో లేదో అన్ని ఇళ్ల తలుపులూ బిగించుకుంటున్నాయి. అప్పటి వరకు అర్ధరాత్రి తర్వాత కనిపించిన దెయ్యం, తొమ్మిదింటికే కనిపించసాగింది. తోటల్లో తిరిగే దెయ్యం ఆ తండా ఆచారి ఇంటి పరిసరాల నుంచి వస్తోందని, కాదు కాదు గుడిలో ఉంటోందని ఒకరు, ఊరి దిగుడు బావిలో నుంచి అర్ధరాత్రి బయటకొస్తోందని ఒకరు చెప్పసాగారు. తెల్లవారు జామున బావికెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భయం, తోటల్లో, పంట పొలాల్లోకి పనులకెళ్లాలంటే భయం, మిట్టమధ్యాహ్నం అయినా భయమే, కనుచూపు మేరలో మనిషి కనిపించకపోతే చాలు... దెయ్యం కనిపిస్తుందేమోనని భయం. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు తండా వాసులు.. ఇలాగైతే లాభం లేదు. ఊరు ఊరంతా ఏ పనీ చేయకుండా చేతులు ఒళ్లో పెట్టుకుని భయంతో వణికిపోతూ ఉంటే కడుపులోకి అన్నం వెళ్లేదెలాగంటూ తండా పెద్దలు కార్యరంగంలోకి దిగారు. ‘దెయ్యాన్ని తరిమేయాలి’ తీర్మానించారంతా. ఒక్కొక్కరు తమకు తెలిసిన మంత్రగాళ్ల పేర్లు చెప్పసాగారు. అరివీరభయంకర మంత్రగాడు, దెయ్యాలకు సింహస్వప్నం లాంటి మంత్రగాడనే పేరున్న ఓ మంత్రగాడిని పిలిపించారు. ఈ విషయంలో ఊరంతా ఐకమత్యంతో పని చేసింది. సామూహికంగా జాతర చేశారు. మేకపోతును బలి ఇచ్చి ఊరి చుట్టూ ధార పోశాడు మంత్రగాడు. ఆకాశంలోకి చూస్తూ ‘అష్టదిగ్బంధనం చేశాను. ఇక ఈ గీత దాటి ఊళ్లోకి రావడానికి వీల్లేద’ంటూ కళ్లు ఉరుముతూ దెయ్యాన్ని ఆజ్ఞాపించాడు. తనకు రావాల్సిన డబ్బు, వాయనాలందుకుని వెళ్లిపోయాడు. ఊరంతా హాయిగా నిద్రపోయింది. అదీ రెండు రోజులే. మూడో రోజు మళ్లీ జుట్టు విరబోసుకున్న దెయ్యం తోటల్లో తిరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఇది ఆ తండాలో అభ్యుదయకోణంలో ఆలోచించే యువకులకు వచ్చిన ప్రశ్న. ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్టు చురుగ్గా పని చేస్తున్న యువకులు ఏకమయ్యారు. దెయ్యం మిస్టరీ చేధించాలనుకున్నారు. వారి ప్రణాళిక అమలు చేయడానికి వేదిక కావాలి. ఆ ఊరి మొత్తానికి ఒకటే మిద్దె ఇల్లు. ఆ ఇంటి వారిని ఒప్పించి యువకులంతా రాత్రి అక్కడే మకాం వేశారు. మధ్య రాత్రిలో భాస్కర్ చేతులు చరుస్తూ ‘అదిగో వెళ్తోంది’ అని ఒక్కసారిగా అరిచాడు. మిగిలిన వారంతా అప్రమత్తం అయ్యారు. ‘ఆచారి శేషయ్య ఇంట్లో నుంచి వచ్చి, దిగుడుబావి దగ్గరకు వెళ్తోంది’ అన్నాడు భాస్కర్. అంతా చూస్తూనే ఉన్నారు, కొంతసేపటికి బావిలో నుంచి బయటకొచ్చి చీనీ తోటలోకెళ్లింది దెయ్యం. ‘వెనుకే వెళ్లి చూద్దాం’ అన్నాడో యువకుడు. అనుసరించడానికి కొందరికి ధైర్యం చాలడం లేదు. ఈ మీమాంసలో దెయ్యం మాయమైంది. మిస్టరీ వీడింది! మరుసటి రోజు రాత్రి కూడా నిఘా వేశారు. మళ్లీ అదే ఇంటి నుంచి మొదలైంది. ఈ రెక్కీ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు బావిలో నుంచి వచ్చి నేరుగా గుడిదారి పట్టింది. నిశ్శబ్దంగా అనుసరించారు యువకులంతా. గుళ్లో కెళ్లగానే యువకులంతా ఆశ్చర్యంగా నోరు తెరిచారు. ఆచారి ఇంటికి వెళ్లి చెప్పారు. ఆ సంగతి అతడికీ ఆశ్చర్యమే. బాధను తమాయించుకుని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఊళ్లో అందరికీ చెప్పి అల్లరి చేయవద్దని బతిమలాడాడు. ఆ తర్వాత మారాల గ్రామం, బోడేనాయక్తండాలో ఎవరికీ దెయ్యం కనిపించలేదు. గుళ్లో ఏం కనిపించింది? ఆచారి శేషయ్యకు మానసిక పరిణతి లేని ఓ చెల్లెలు, పేరు నీలమ్మ. యువకులు అనుసరిస్తూ వెళ్లి చూసేటప్పటికి ఆమె గుళ్లో తులసికోట ముందు కూర్చుని ఉంది. దగ్గరకు వెళ్లి ‘నీలమ్మా!’ అని పిలవగానే ఉలిక్కిపడింది. భయంతో బిగుసుకుపోయింది. ఆమెకు ఇంటికి వెళ్దాం అని నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి అన్నావదినలకు అప్పగించారు యువకులు. ఆకలి తీరకనే! నీలమ్మను ఇంట్లో ఎవరూ పట్టించుకునే వారుకాదు. ఆమె ఆలయానికెళ్లి పూజారులు పళ్లేలలో పెట్టిన బెల్లం పొంగలి, కొబ్బరి, అరటి పండ్లు తిని ఆకలి తీరాక ఇల్లు చేరేది. గుళ్లో ప్రసాదాలు దొరక్కపోతే తోటల్లోకెళ్లి కాయలు కోసుకుని తినేది. మధ్యలో ఎక్కడ ఫిట్స్ వస్తే అక్కడే పడిపోయేది. తెలివి వచ్చాక ఇంటికెళ్లేది. మేమంతా మిద్దె ఇంటి మీద ఒక్కొక్కరు రెండు గంటలు నిద్రమేల్కొని కాపలా కాసి మిస్టరీ ఛేదించాం. - ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అవన్నీ నమ్మొద్దు..!
గాసిప్ మనీషా కోయిరాలా ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్. నిజజీవితంలో చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే ఆమెనూ ఇబ్బంది పెట్టింది. చాలామంది ఫేక్ అకౌంట్‌తో ఎదుటివాళ్లను నమ్మిస్తుంటారు. కానీ ఇక్కడ ఆమె పేరు చెప్పి, తానే మనీషానంటూ చాలామంది తప్పుడు యవ్వారాలకు పాల్పడుతున్నారట. అచ్చం... ఆమె పంపినట్టే సందేశాలు పంపుతున్నారట. ఆమె నడుపుతున్నట్టే ఫేస్బుక్ అకౌంట్ నడుపుతున్నారట. అలాంటి సంఘటనలు ఆమె దృష్టికి కూడా వచ్చాయట. ఆమె పంపని సందేశాలు పంపడం, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె రాసుకున్నట్లే గాసిప్‌లు రాయడం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఇదేమిటంటూ షాక్‌కు గురవుతున్నారట. చనువున్న కొందరు ఆమెనే నేరుగా నిలదీస్తున్నారట. ఆమె కూడా తెలియక ఏమిటని అడిగితే... ఈ వ్యవహారాలు ఆమె దృష్టికి వచ్చాయట. దాంతో అలర్ట్ అయిన ఆమె ‘ఈ ఫేక్ గాసిప్స్ నమ్మకండి’ అంటూ స్వయంగా ప్రకటించాల్సి వచ్చిందట! -
మళ్లీ ఒకసారి...
గాసిప్ బాలనటిగా చిత్రసీమలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోంద్కర్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ భాషల్లో కథానాయికగా తన ప్రతిభ చాటుకుంది. ‘రంగీల’ ‘సత్య’ ‘మనీ మనీ’ ‘అనగనగా ఒకరోజు’... ఇలా ఆమె కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. గ్లామర్ పాత్రలే కాదు నాన్గ్లామర్ పాత్రలను పండించడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. ‘పింజార్’ సినిమాలో హమిదా పాత్రలో ఆమె నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. విక్రమ్ భట్ ‘స్పీడ్’ తరువాత మాత్రం ఆమె కెరీర్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఫరాఖాన్ ‘ఓమ్ శాంతి ఓం’లో ఒక పాటలో కనిపించింది. ఆ తరువాత ఊర్మిళను ప్రత్యేకంగా గుర్తుంచుకునే సందర్భం, సినిమా ఏదీ రాలేదు. ఇక ఆమె బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లే అనుకున్నారు చాలామంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, వెండితెరపై ఊర్మిళ మరోసారి తన సత్తా చాటనుందని! ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన విందుకు హాజరైంది ఊర్మిళ. కరణ్ జోహర్, జోయా అక్తర్...మొదలైన వారు కూడా ఈ విందుకు హాజరయ్యారు. అందరూ ఏకకంఠంతో అన్నమాట ఏమిటంటే-‘‘ఊర్మిళలో గ్లామర్ పెరిగిందేగానీ తరగలేదు’’ అని! ఊర్మిళ కోసం కరణ్ జోహర్ మంచి కథ ఒకటి సిద్ధం చేశాడట. అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగితే...ఈ రంగీలా పిల్ల మరోసారి వెండితెరపై కనువిందు చేయవచ్చు! -
కాస్త మాకు కూడా చెప్పవూ!
గాసిప్ బాలీవుడ్‌ను తనవైపుకు ఎలా తిప్పుకోవాలో సోనమ్ కపూర్‌కు బాగానే వొంటబట్టినట్లుంది. హాట్ హాట్ ఫోటోలతో కొంత కాలం క్రితం హాట్ టాపిక్‌గా మారిన సోనమ్ కపూర్ మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగింది. ఈసారి మాత్రం టాపిక్... హాట్ ఫోటోలు కాదు... ఆరోగ్యం! పాత్రలను ఎంచుకోవడంలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ ఇతరుల కంటే భిన్నమైన విధానాలను ఆమె అనుసరించాలనుకుంటోంది. దాని ఫలితమే... ‘స్పెషల్ డైట్’. ఈ స్పెషల్ డైట్‌ను ‘ది ప్రోటిన్ స్పేరింగ్ మాడీఫైడ్ ఫాస్ట్’ అని పిలుస్తారు. ఇది ఆహారంలో కొవ్వును నియంత్రించి, పోషక విలువలను పెంపొందిస్తుంది. కేట్ మిడిల్టన్, జెన్నిఫర్ లోపెజ్... మొదలైన అంతర్జాతీయ సెలబ్రెటీలు ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారట. బాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం... ‘స్పెషల్ డైట్’ను అనుసరిస్తున్న తొలి వ్యక్తిని తానే అంటుంది సోనమ్.‘‘చక్కని శరీరాకృతి కోసం నేను తీసుకుంటున్న స్పెషల్ డైట్ ఉపకరిస్తుంది’’ అని సోనమ్ చెప్పగానే, ఆమెకు ఫోన్ల వరద మొదలైందట. పరిచయం ఉన్న వాళ్లు, లేని వాళ్లు, చుట్టాలు, పక్కాలు, విదేశీయులు, పరదేశీయులు... ఎందరెందరో సోనమ్‌కు ఫోన్ చేసి ‘‘స్పెషల్ డైట్ గురించి కాస్త చెప్పండి!’’ అని అడుగుతున్నారట. మొదట్లో కాస్త ఉత్సాహంగానే స్పందించిన సోనమ్ ఆ తరువాత మాత్రం విసుక్కోవడం మొదలు పెట్టిందట! -
ఆ పెళ్లికి బెబో హాజరవుతుందట!
గాసిప్ కొందరు ప్రేమికులు విడిపోయాక... ఇక ఎప్పటికీ కలుసుకోరు. కొందరు విడిపోయినా... ఒకరికొకరు కలుసుకోక పోయినా ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అని మౌనంగా పాటలు పాడుకుంటారు. కొందరు ప్రేమికులు మాత్రం... వీడిపోయాక మంచి స్నేహితులుగా మిగిలిపోతారు. ఒన్స్ అపాన్ ఏ టైమ్... చాక్లెట్ బాయ్ షాహీద్ కపూర్, కరీనాకపూర్‌లు జగమెరిగిన ప్రేమికులన్నది తెలిసింది. ఆ తరువాత ఏమైందో ఏమోగానీ... ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే కాలం స్నేహితులుగా మళ్లీ వారిని దగ్గర చేసింది. ఒకప్పుడు వాళ్లు ప్రేమికులు కావచ్చునేమోగానీ, ఇప్పుడు మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ‘ ఉడ్తా పంజాబ్’ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది సరే, ఇంతకీ కరీనా షాహిద్ పెళ్లికి హాజరు కానుందా? హాజరు కావడమేమిటి... షాహిద్ కుటుంబంలోని వ్యక్తిలాగే పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. చూద్దాం మరి ఏంజరగనుందో! -
అమ్మబాబోయ్!
గాసిప్ చాలామంది నటుల్లో ‘నటన’ మాత్రమే కాదు గానం కూడా ఉండొచ్చు. కొందరిలో రచనా సామర్థ్యం కూడా ఉండొచ్చు. కంగనా రనౌత్‌లో ‘ఉత్తమ నటి’ మాత్రమే కాదు...‘రచయిత్రి’ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ ‘రచయిత్రి’ని చూసి నిర్మాత, దర్శకులు జడుసుకుంటున్నారట. విషయమేమిటంటే, ‘క్వీన్’ సినిమా స్క్రిప్ట్‌లో కంగనా కూడా పాలుపంచుకుంది. డైలాగ్ రైటర్స్ జాబితాలో ఆమె పేరు కూడా తెర మీద కనిపించింది. ‘క్వీన్’ సినిమా హిట్ కావడంతో తనలోని రచయిత్రిపై కంగనాకు పూర్తిగా నమ్మకం వచ్చేసినట్లుంది. దీంతో తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ రచనలో తాను కూడా భాగం అవుతుంది. అంతేకాదు.. డైలాగ్ రైటర్‌గా తన పేరు తప్పనిసరిగా స్క్రీన్ మీద కనిపించాలని కోరుతుందట. స్క్రిప్ట్‌లో కంగనా పాలుపంచుకోవడంలో తప్పేమిటి? అనే డౌటు రావచ్చు. అయితే ఆమె సూచనలు, సలహాలు, డైలాగులు...సినిమాకు ప్లస్ అవ్వడం కంటే మైనస్సయ్యే అవకాశాలే ఎక్కువని దర్శక,నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. -
ఎందుకో ఏమో?!
గాసిప్ ఇగో వార్ అనేది బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. చిన్న చిన్న కారణాలే నటుల మధ్య అగాథాన్ని పెంచిన సందర్భాలూ ఉన్నాయి. వేడి తగ్గాక మళ్లీ ఆప్యాయంగా ఒక్కటైన సందర్భాలూ బాలీవుడ్ చరిత్రలో కనిపిస్తాయి. దీపికా పదుకొనే గురించి బిగ్ బి ప్రశంసాపూర్వకంగా మాట్లాడడం, అమితాబ్ గురించి కదిలిస్తే చాలు...‘ఎంత గొప్ప లెజెండ్ అంటే..’ అని దీపిక నాన్‌స్టాప్‌గా మాట్లాడడం అందరికీ తెలిసిన విషయమే. ‘పీకు’ సినిమా వీరిని మరింత దగ్గర చేసింది. అయితే ఈ సినిమాయే దూరాన్ని కూడా పెంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక, బిగ్ బిలు మాటవరుసకు కూడా పలకరించుకోవడం లేదట. ఇటీవల తన సన్నిహితులకు దీపిక ‘పీకు’ విజయోత్సవ విందు ఇచ్చింది. దీనికి బిగ్ బికి ఆహ్వానం అందకపోవడం ‘ఇద్దరి మధ్య విభేదాలు’ పుకారుకు బలాన్ని ఇస్తున్నాయి. తనకు విందుకు ఆహ్వానం అందలేదని బిగ్ బి స్వయంగా ప్రకటించడం గమనార్హం! -
టాక్సీ డ్రైవర్‌గా..!
గాసిప్ శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. -
కామెడీయే కలిసొస్తున్నట్టుంది!
గాసిప్ నేహాశర్మ గుర్తుందా? ‘చిరుత’ సినిమాలో ‘ఏయ్ బాబూ... ఇలా రామ్మా’ అంటూ రామ్‌చరణ్ దగ్గర అహంకారాన్ని ప్రదర్శించే అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాలు చేసినా... అవి విజయం సాధించకపోవడంతో మెరుపులా మాయమైంది నేహా. ఏమయ్యిందబ్బా అని అందరూ అనుకుంటుండగానే బాలీవుడ్లో తేలింది. క్రూక్, తేరీ మేరీ కహానీ, యంగిస్తాన్ వంటి సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించింది కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా లేదనే చెప్పాలి. ఇటీవలే ఆమెకి ‘హేరా ఫేరీ’ సినిమా మూడో భాగంలో నటించే చాన్స్ వచ్చింది. ఓకే అయితే చెప్పింది కానీ కామెడీ సినిమా కాబట్టి కాస్త లోలోపల ఫీలవుతోందని సమాచారం. ఇంతకు ముందు కూడా క్యా సూపర్ కూల్ హై హమ్, జయంతిభాయ్కీ లవ్‌స్టోరీ, యమ్లా పగ్లా దివానా 2 వంటి కామెడీ చిత్రాల్లో నటించింది. ఇప్పుడూ అలాంటి సినిమాయే రావడంతో ‘కామెడీయే కలిసొస్తున్నట్టుంది’ అంటూ కొన్ని ముంబై పత్రికలు రాసి పారేశాయ్. దాంతో నేహ కాస్త నొచ్చుకుందని వినికిడి! -
విదేశాలకు వెళ్లి తప్పు చేసిందా?!
గాసిప్ ఆధునిక ఫ్యాషన్స్ అచ్చంగా ఫాలో అవుతుంది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. తలకు పెట్టుకునే క్లిప్పు దగ్గర్నుంచి కాలికి తొడిగే జోడు వరకూ అన్నింట్లోనూ వైవిధ్యతను చూపిస్తుంది. అయితే ఫ్యాషన్ పట్ల ఆమె ఆసక్తి మరీ మితిమీరింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా పలు వెబ్సైట్లలో కనిపించిన ఫొటోలు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లిన సోనమ్... అక్కడ ఓ వెస్టర్న్ డ్రెస్ వేసుకుని ఫొటోకి ఫోజిచ్చింది. అది నెట్లో పోస్ట్ అయ్యింది. ఆమె అందాల్ని దాదాపుగా బహిర్గతం చేసిన ఆ డ్రెస్‌ని చూసి చాలామంది భారతీయులు భగ్గుమన్నారు. స్టైల్‌గా ఉండటంలో తప్పు లేదు కానీ ఇలా విదేశాలకు వెళ్లి మరీ పరువు తీయడం ఏం బాలేదు, ఇది చాలా తప్పు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అవి సోనమ్ వరకూ వెళ్లాయో లేదో! -
ఫేస్బుక్ చంపేసింది!
చదివింత... సత్యవర్షి ‘‘అదిగో పులి ఇదిగో తోక... అదిగో చావు ఇదిగో సంతాపం’’ అన్నట్టుంది పరిస్థితి. ముక్కూ ముఖం కాస్త తెలిసున్న వ్యక్తి కాలధర్మం చెందినట్టు గాసిప్పు రాజేస్తే చాలు... ఫేస్‌బుక్కులూ వాట్సప్పులూ సంతాప సందేశాలను కుప్పలుగా ‘పొగే’యడానికి రెడీ. ఈ విషయాన్ని రుజువు చేస్తోందీ ఉదంతం. లండన్, సౌత్‌వేల్స్‌కు చెందిన 52 ఏళ్ల ఎయిర్పోర్ట్ షటిల్ బిజినెస్ వుమెన్ త్రిషా మెఖలే రోజు మొత్తం ఆఫీసుకు గైర్హాజరైంది. అదే రోజున... తన ఫ్రెండ్ త్రిష బాగా మందుకొట్టి మేడ మీద నుంచి జారిపడి చనిపోయిందని, ఆమె మరణం తననెంతో బాధిస్తోందంటూ... ఓ పరిచయస్థుడు ఫేస్బుక్లో సంతాప సందేశం పోస్ట్ చేశాడు. అంతే... కొన్ని నిమిషాల్లోనే అది వైరస్ కంటే వేగంగా పాకేసింది. ఇంకేముంది... త్రిష సన్నిహితులు, బంధువులు శోకాలు పెడుతూ అంత్యక్రియలకి సైతం డబ్బులు పోగేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఆమె కస్టమర్లు తమ లావాదేవీలకు సంబంధించి ఆందోళన చెందుతూ సంబంధీకులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. మొత్తానికి త్రిష తిరిగి రానే వచ్చింది. ఆమెని చూసి చుట్టుపక్కల వాళ్లు చుట్టపక్కాలు చుట్టుముట్టేసి కళ్లమ్మట నీళ్లతో ‘‘ఉన్నావా అసలున్నావా...’’ అంటూ కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న త్రిష... ఆ ఫేస్బుక్ రూమర్ అంతా అబద్ధమని తాను బతికే ఉన్నానని చెప్పలేక నానా సతమతమైందట. ‘‘ఇంకా నయం! వారం రోజులు టూర్ వెళదామనుకున్నా. అప్పుడు గాని ఈ గాసిప్ వచ్చి ఉంటే... వీళ్లిక నేను తిరిగొచ్చి చెప్పినా నమ్మేవారు కాదేమో’’ అంటూ వాపోతోతున్న త్రిష... దీనిపై కోర్టులో కేసు వేస్తానంటోంది. -
ప్రస్తుతానికి ఒంటరే!
సినిమాల కంటే ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌తో వార్తల్లో ఉంటుంది మలయాళ తార విమలారామన్. ఈ మధ్య ఎవరితోనో క్లోజ్ రిలేషన్ మెయిన్టేన్ చేస్తోందని మల్లువుడ్ కోడై కూసింది. అయితే వీటన్నింటికీ సింపుల్‌గా ఫుల్స్టాప్ పెట్టేసిందీ సుందరి. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని... ఒకవేళ ఉంటే తప్పకుండా అందరికీ పరిచయం చేస్తానని ఓ సందర్భంలో తేల్చి చెప్పింది విమల. ‘ప్రస్తుతానికైతే ఒంటరినే. ఇలానే ఎంతో హ్యాపీగా ఉంది’ అంటున్న విమలారామన్... తన ధ్యాసంతా పనిమీదే ఉందని... అందులోనే ఎడతెరిపి లేనంత బిజీగా ఉన్నానని సెలవిచ్చింది. కానీ... నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు కొందరు ఇండస్ట్రీ జనం. ఎవరేమనుకున్నా... మొత్తానికి అమ్మడు సింగిల్ అని సభాముఖంగా తెలియజేసి... కుర్రకారు గుండెల్లో మంటల్ని చల్లార్చింది! -
బిజీగా మారిన నయన