Ordinance
-
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు ఆర్డినెన్స్?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్‌ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.చైర్మన్, పాలకవర్గం నియామకం యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్‌తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్‌గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు. స్వాగత తోరణానికి రంగులు యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్‌తో నిర్మించారు. నవంబర్‌లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్? యాగశాల ఏర్పాటుకు మార్కింగ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
‘హైడ్రా’కు చట్టబద్ధత.. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్
-
హైడ్రా ఆర్డినెన్స్ అధికారిక ఉత్తర్వులు జారీ
-
హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర
-
ఇప్పటికైతే ప్రత్యేకంగా లేదు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జలవనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక చట్టం అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాలలోపు దానికి రూపం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ, మరింత బలోపేతం చేయడానికి ఆరు శాఖలకు చెందిన చట్టాలను సవరిస్తున్నారు. దీనికి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదముద్ర వేయడంతో త్వరలో ఆర్డినెన్స్ వెలువడనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార విభాగాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్విసెస్ చట్టాల్లోని కీలకాంశాలను సవరించనున్నారు. వీటి కింద నోటీసులు జారీ సహా వివిధ అధికారాలను సైతం హైడ్రాకు అప్పగించనున్నారు. జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించడం, అనధికార హోర్డింగ్స్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జరిమానాలు విధించడం తదితర అధికారాలు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి మాత్రమే ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటైన తర్వాత అమలులోకి వచ్చిన తెలంగాణ పురపాలక చట్టం–2021 ప్రకారం ఆయా పురపాలికలకూ ఇవి దఖలయ్యాయి. బీపాస్ చట్టం–2020 ప్రకారం జోనల్ కమిషనర్ల నేతృత్వంలోని జోనల్ టాస్‌్కఫోర్స్, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు ఇలాంటి అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలకు అధికారాలు వచ్చాయి. హెచ్ఎండీఏ చట్టం–2008లో 8, 23 ఏ సెక్షన్ల కింద ఆ విభాగం కమిషనర్‌కు కూడా విశేషాధికారాలు ఉన్నాయి. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317ఎఫ్ సెక్షన్ ప్రకారం అక్రమ కట్టడాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357ఎఫ్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్‌కు జలవనరులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. జీవోఎంఎస్ నం.67 ద్వారా 2002లో యూడీఏలతో పాటు ఎగ్జిక్యూటివ్ అధికారులకు, తెలంగాణ భూ ఆక్రమణల చట్టం–1905లోని 3, 6, 7, 7ఏ సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకూ చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు. ఈ యాక్ట్‌లతో పాటు వాల్టా చట్టం–2002, జీవోఎంఎస్–168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్–1999లకూ సవరణ చేసి హైడ్రాకు అవసరమైన అధికారాలు ఇస్తున్నారు. న్యాయ విభాగం సిఫార్సుల ప్రకారం హైడ్రా గవరి్నంగ్ బాడీలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్కు (సీసీఎల్ఏ) స్థానం కల్పించనున్నారు. ఈ మార్పుచేర్పులతో పాటు మరిన్ని కీలకాంశాలను హైడ్రా యాక్ట్‌లో పొందుపరచనున్నారని తెలిసింది. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు నేడు ఆర్డినెన్స్!
సాక్షి, అమరావతి: నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీచేయనుంది. మంత్రుల ఆమోదం కోసం మంగళవారం వారికి సర్క్యులేషన్లో పంపగా వారు ఆన్లైన్లో దానికి ఆమోదం తెలిపారు. దీంతో.. దీనిని గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ను జారీచేస్తుంది. ఇక ఈ నాలుగు నెలల అత్యవసర వ్యయానికే ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు సమాచారం.హామీలు ఎగ్గొట్టేందుకే..ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు ఈ నెలాఖరుతో (జూలై 31తో) ముగియనుంది. సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. పైగా.. శ్వేతపత్రాల పేరుతో ఆత్మస్తుతి పరనిందలతో గత ప్రభుత్వంపై ఆరోపణలకే అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా అప్పులపై అవాస్తవాలను చెప్పించడంతో పాటు హామీలను తక్షణం అమలుచేయలేమని కూడా గవర్నర్‌తో చెప్పించింది. అంటే.. చంద్రబాబు నిజస్వరూపం ఇక్కడే బట్టబయలైంది. హామీలివ్వడమే తప్ప అమలుచేసే తత్వం తనది కాదని ఆయన రుజువు చేసుకున్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడతాయనేవాస్తవానికి.. గవర్నర్ ప్రసంగం ఎన్నికల హామీలు అమలు అంశాలతో సాగడం రివాజు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై నిందలకే పరిమితం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే గత ప్రభుత్వం చేసిన అప్పుల వాస్తవాలను బడ్జెట్ డాక్యుమెంట్లో స్పష్టంచేయాల్సి వస్తుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. దీంతో శ్వేతపత్రాల ముసుగు లో అవాస్తవ ఆరోపణలతో కాలయాపన చేశారు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరో నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకోవచ్చు. అలా చేయకుండా అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించేశారు. అసెంబ్లీ, ‘మండలి’ని మంగళవారం ప్రొరోగ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో.. బుధవారం నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను జారీచేయనుంది. ఇది అసెంబ్లీని అవమానించడమే..అసెంబ్లీ సమావేశాలను ముగించేసి, ఆర్డినెన్స్ ఇవ్వడం అంటే శాసనసభను అవమానించడమే అవుతుందని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేనంత అసాధారణ పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని.. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు ఎంత వస్తాయో స్పష్టంగా ఉన్నాయని, అయినాసరే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ ఎత్తుగడ వేశారంటే హామీలకు ఎగనామం పెట్టడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రాధాన్యతల్లో సూపర్ సిక్స్ హామీలకు చోటులేదు. నాణ్యమైన లిక్కర్ బ్రాండ్స్, చెత్త తొలగింపు, నూతన ఇసుక విధానాలకే చోటుండటం గమనార్హం. -
అది విద్వేష ప్రసంగమే.. ప్రధానిపై చర్య తీసుకోండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బర్మేర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. కాంగ్రెస్‌కు మరణ శాసనం లిఖించేందుకు కమలం బటన్‌పై నొక్కాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ప్రధాని అహంకారానికి ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు. ‘కాంగ్రెస్ నేతలను మోదీ ఎంతగా ద్వేషిస్తున్నారో ఆయన ప్రసంగాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటివి మాట్లాడొచ్చా? ఆయన ప్రజాస్వామ్యం గొంతు పిసికేస్తున్నారు. ఇది కచ్చితంగా విద్వేష ప్రసంగమే’అని జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రధానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం అన్న విషయం తెలిసిందే. -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
అసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా జాబితాలు.. కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు. 1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు. -
మణిపూర్ వ్యవహారం.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Live Updates: ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం(జులై 31).. మణిపూర్ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చకు ఇటు లోక్‌సభ స్పీకర్, అటు రాజ్యసభ చైర్మన్ అంగీకరించినా.. విపక్షాలు మాత్రం ప్రధాని మోదీ సమక్షంలో దీర్ఘకాలిక చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా నినాదాలతో తమ ఆందోళన కొనసాగించాయి. సభలు ముందుకు సాగకపోవంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. ► పార్లమెంట్‌ను 9 రోజుల పాటు నినాదాలు చేసి సభలు జరగనివ్వకుండా పాడు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్షాలపై మండిపడ్డారు. అయితే.. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023 మాత్రం ఇవాళ ఆమోదం పొందగలిగింది. తొలుత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో ఆమోదించబడింది. ► రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. ►పార్లమెంటులో మణిపూర్ మంటలు ఆరడం లేదు. గత పదిరోజులుగా ఉభయ సభల్ని మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మధ్యాతర్వాత రాజ్యసభలో మణిపూర్‌పై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం తెలిపింది. అయితే అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ►మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ►లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్ ఘటనపై విపక్ష ఎంపీలో నినాదాలతో హోరెత్తించడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. #WATCH | Leader of the House in Rajya Sabha, Piyush Goyal says "We want discussions on Manipur to take place in Parliament today at 2 pm. They (Opposition) are trying to misuse the liberty given to the members. The govt is ready to discuss Manipur, but they (Opposition) have… pic.twitter.com/Bs37pxMbD8 — ANI (@ANI) July 31, 2023 ► సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ,నేటి మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో మణిపూర్‌పై చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్షాక్ష సభ్యులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మణిపూర్‌పై చర్చకు సిద్ధంగా ఉందని చెబుతున్నా.. విపక్షాలు ఇప్పటికే 9 రోజులగా సభలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ►పార్లమెంట్లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మణిపూర్‌పై చర్చ జరగకుండా ప్రతిపక్షాలను ఎవరు ఆపుతున్నారు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటు లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాలని మేము మొదటి రోజు నుంచి కోరుతున్నామని.. చర్చలు జరపకుండా వారిని ఆపేది ఏంటని నిలదీశారు. చర్చలో పాల్గొనకుండా పారిపోతారని విమర్శించారు. రాజకీయాల కోసం మణిపూర్ అంశాన్ని వాడుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. #WATCH | Delhi: Union Minister Anurag Thakur says, "I request them to come inside Parliament and participate in discussions. We want discussions from day 1. What is stopping them (Opposition) from holding talks?... They only run away from discussions rather than taking part in… pic.twitter.com/LJ6kMxmT7T — ANI (@ANI) July 31, 2023 విపక్షాల భేటీ ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలతో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ అయింది. పార్లమెంట్ హౌజ్ భవనంలోని కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ(సీపీపీ) కార్యాలయంలో సమావేశమయ్యాయి. రెండు రోజుల పర్యటన వివరాలను ఎంపీల బృందం విపక్ష నేతలకు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా విపక్షపార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు రెండు రోజులపాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. #WATCH | Meeting of I.N.D.I.A party alliance floor leaders with MPs who visited Manipur recently is underway at the Congress Parliamentary Party CPP office in Room no 53 at the Parliament House building to discuss the strategy for the floor of the House. Congress parliamentary… pic.twitter.com/UY5r2m3MW5 — ANI (@ANI) July 31, 2023 మణిపూర్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది: అధిర్ రంజన్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, మిత్రపక్షాలు కూడా మణిపూర్‌లో పర్యటించాలని, అక్కడి పరిస్థితిని అందరూ విశ్లేషించుకోవాలని సూచించారు. చదవండి: మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు #WATCH | Delhi: West Bengal Congress president Adhir Ranjan Chowdhary says, "Our demand is only that there is a discussion on no-confidence motion...The situation in Manipur is very serious...The country needs to be saved...BJP and its alliances should also tour Manipur, they… pic.twitter.com/dcTWjBDipr — ANI (@ANI) July 31, 2023 న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం నేడు (జూలై 31) పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్‌షా ఈ బిల్లును ప్రవేశ పెట్టనుననారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మణిపూర్ హింసపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కూడా సమర్పించింది. దానిపై ఇంకా చర్చించలేదు. ఓటింగ్ జరగలేదు. లోక్‌సభలో రగడ ఈ క్రమంలో లోక్‌సభలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్(సవరణ) బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగమైన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో.. పార్లమెంట్ వేదికగా దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సోమవారం లోక్‌సభలో రగడ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముందు ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి లెక్కచేయకుండా అధికార యంత్రాంగంపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అయితే ఇది చట్టవిరుద్దమంటూ, ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఇప్పటికే ఆప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. VIDEO | "This is the most undemocratic, illegal legislative exercise that is being done by the BJP in the history of India's parliamentary democracy. This bill is an assault on two crore people of Delhi," says AAP leader @raghav_chadha on Delhi services bill which the government… pic.twitter.com/62WNGg0nHG — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
అవిశ్వాసం సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ :ఈశాన్య ప్రాంత చిన్న రాష్ట్రమైన, దేశ సరిహద్దులో ఉన్న మణిపూర్‌లోని వివాదాస్పద అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా అందరూ సమష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని, కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఓ జాతీయ మీడియా చర్చలో ఢిల్లీ ఆర్డినెన్స్, విపక్షాలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదన్న విషయం గుర్తు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బ తీయట్లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పును ఏమాత్రం ఉల్లంఘించడం లేదన్నారు. అందువల్లే ఈ రెండు అంశాలపై వైఎస్సార్సీపీ కేంద్రానికి మద్దతు ఇస్తోందన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు విచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విఫలమయ్యారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ ఏకాభిప్రాయంతో డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ఒకరి పేరును సూచించలేరా? అని ప్రశ్నించింది. సంస్థను ఎవరూ పట్టించుకోకపోవడం విచారణకరమని పేర్కొంటూ.. చైర్మన్‌ను తామే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు డీఈఆర్సీ చైర్మన్ ఎంపికపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పీఎస్ నరసింహా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ గవర్నర్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ.. డీఈఆర్సీ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి నియమించారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. డీఈఆర్సీ చైర్మన్ నియామకం కేంద్ర ఆర్డినెన్స్ ప్రకారం జారీ చేశారని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం కోర్టులో సవాలు చేసిందని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్డినెన్స్ విచారణ రాజ్యాంగ ధర్మాసానానికి వెళుతుందని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలలు పడుతుందని అప్పటి వరకు డీఈఆర్సీ పని చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించింది. అయితే డీఈఆర్సీ సంస్థ అధిపతి లేకుండా ఉండలేదని, సుప్రీంకోర్టే దీనికి చైర్‌పర్సన్‌ను నియమించవచ్చని హరీష్ సాల్వే సూచించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. డీసీఆర్సీ చైర్మన్ ఎంపికపై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇందుకు కొంత సమయం వేచి ఉండాలని ఇరు వర్గాలకు చెందిన లాయర్లకు సూచించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలంపాటు మాజీ న్యాయమూర్తిని నియమించడానికి కొంతమంది న్యాయమూర్తులను పేర్లను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి జాబితా లేదని, ముగ్గురు లేదా అయిదుగురు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పేర్లను అందించాలని.. వారిలో నుంచి ఒకరిని తామే నియమిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆర్డినెన్స్‌పై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి పదవుల్లో నియామకాలు ఆగిపోవడంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడుకోవాలని సుప్రీంకోర్టు జూలై 17న సూచించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరఫు న్యాయవాది అందుకు సరేనన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు. చదవండి: చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్డినెన్స్ ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇంతకుముందుకు విచారణ జరిపిన రెండు రాజ్యాంగ బెంచ్‌లు పరిశీలించని న్యాయపరమైన అంశాలు ఈ పిటిషన్లో ఉన్నాయని.. అందుకే దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్టు తెలిపింది. -
కేంద్ర ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వండి
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నమని ఆరోపించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతోపాటు అమ లుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా మిగతా సరీ్వసులపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పెత్తనం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలంటూ మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్–ఏ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పెత్తనం కొనసాగేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. -
ఆక్రమణల నుంచి దేవుడి భూములకు విముక్తి
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బుధవారం పకడ్బందీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖ అధికారులకు కల్పించింది. ఈ మేరకు 1987, 2007 దేవదాయ శాఖ చట్టాల్లోని 83, 84, 85, 86, 93, 94 సెక్షన్లలో పలు మార్పులు చేస్తూ, కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో న్యాయ శాఖ ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తక్షణమే ఆర్డినె¯Œ్స అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నదిదీ.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను ఎవరైనా ఆక్రమిస్తే దేవదాయ శాఖ అధికారులు ముందు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి వచ్చేది. ట్రిబ్యునల్‌లో ఆక్రమణదారులు లాయర్ల ద్వారా వారి వాదనలు వినిపించుకోవచ్చు. ట్రిబ్యునల్ ఆ భూములు దేవదాయ శాఖవని తేల్చే వరకు వాటిని అనుభవించే వెసులుబాట ఆక్రమణదారులకే ఉంటుంది. ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పు ఇస్తే, దానిపై కింద నుంచి పై కోర్టుల వరకు వెళ్లి, కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకే ఉంది. దీంతో భూముల వివాదం ఏళ్ల తరబడి ఎండోమెంట్ ట్రిబున్యల్, కోర్టులలో కొనసాగుతోంది. అత్యధిక కేసుల్లో పదేళ్లకు పైనే సాగుతోందని, అంత కాలం ఆ భూములు ఆక్రమణదారులే అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా వేలాది ఎకరాల దేవుడి భూములు ఆక్రమణదారుల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేది ఇదీ.. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఆక్రమణదారు నుంచి భూముల స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ఆ భూమి దేవుడిదని పేర్కొంటూ ఒక నోటీసు ఇస్తారు. ఆక్రమణదారు జవాబు చెప్పుకోవడానికి ఓ వారం వ్యవధి ఇస్తారు. వారం దాటిన వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారుల çసహాయంతో ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు తాజా ఆర్డినెన్స్ ద్వారా దేవదాయ శాఖ అధికారులకు అన్ని అధికారాలు దఖలు పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆలస్యం లేకుండా దేవుడి భూములు దేవదాయ శాఖ చేతుల్లోకి వస్తాయి. ఈ స్వాధీన ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఆక్రమణదారుడే కోర్టులకు వెళ్లి, అవి తమ భూములని నిరూపించుకోవాల్సి ఉంటుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్
ఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. పగలు, రాత్రి వేళ్లలో వేర్వేరు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు, పగటివేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేయనుంది. కొత్తగా టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేళ వాడే కరెంట్‌పై వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండే రాత్రి వేళ వాడే కరెంట్ ఛార్జీల భారం ఇప్పటికంటే 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కొత్త నిబంధన 10 కిలో వాట్ లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యవసాయ వినియోగదారులను మినహాయించి ఇతర వినియోగదారులకు 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండటంతో దాని ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేశామని మంత్రి అన్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
కేసీఆర్ దారిలో కేజ్రీవాల్?.. ఇది కాంగ్రెస్‌కు రిక్వెస్ట్ కాదు అల్టిమేటం!
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నించాగా.. అది కుదరలేదు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్ దారిలో కేజ్రీవాల్? ఒక వేళ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్ కూడా సీఎం కేసీఆర్ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భేటీకి హాజరైన ప్రతిపక్ష నాయకుల ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో..?' -
జూన్ 11న ఆప్ మహా ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు. -
ఢిల్లీ సీఎం అధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్
ఢిల్లీ సీఎం అధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ -
నరేంద్ర మోదీ పాత ట్వీట్‌ను జత చేసి.. విరుచుకుపడ్డ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చునిచ్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. 2013లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఒక సమస్యపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైర్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. అందులో “పార్లమెంట్ ఏమైనప్పటికీ సమావేశమవుతుంది. కేంద్రం పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకుని మంచి బిల్లు ఇవ్వలేకపోయింది? ఆర్డినెన్స్ ఎందుకు? అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఉద్దేశించి ఆర్డినెన్స్ ఎందుకు సార్ అని మోదీ పాత ట్వీట్‌ని జత చేశారు ఢిల్లీ సీఎం . ‘సేవల’పై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును నేరుగా సవాల్ చేసే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తన అధికారులపై నియంత్రణ కలిగి ఉండాలని తెలిపింది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్జీది కాదని తేల్చింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఢిల్లీ పరిపాలన, అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల్లోనే.. తాజాగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం బదిలీ, విజిలెన్స్ వంటి అంశాల్లో ఆర్డినెన్స్ జారీ చేసి చట్ట సవరణ చేసింది. అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంతో ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాల్సిందే. Why ordinance Sir? https://t.co/C9otuhtY4X — Arvind Kejriwal (@ArvindKejriwal) May 21, 2023 -
కేరళ గవర్నర్‌కు బిగ్ షాక్.. ఛాన్సలర్‌గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
అప్పు దొరక్క ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్!
ఇస్లామాబాద్: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ‘ఇంటర్ గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డినెన్స్-2022’ను గురువారం ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. 2.5 బిలియన్ డాలర్ల సమీకరణ.. చమురు, గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం. గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది యూఏఈ. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి 1.17 బిలియన్ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇదీ చూడండి: Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’ -
రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్ ఆమోదం
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆడవారిపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి చోటా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మనదేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి లాభం లేకుండా పోతుంది. ఈ క్రమంలో మృగాళ్లను ఎన్కౌంటర్ చేయడం.. లేదా వారికి అంతకు మించి కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంటు కొత్త చట్టాన్ని ఆమోదించింది. తరచుగా అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టాన్ని ఆమోదించింది. అత్యాచార నేరాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడం.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకుగాను పాక్ ఈ చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపింది. (చదవండి: కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్) గత కొంత కాలంగా పాకిస్తాన్లో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తడంతో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు పాక్ ప్రకటించింది. విమర్శకులు ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచార కేసుల్లో కేవలం 4 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడుతున్నట్లు ఆరోపించారు. దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను పాక్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఆమోదించాడు. అత్యాచార నిందుతలకు కెమికల్ కాస్ట్రేషన్ విధించాలని ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. కొత్త క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను బుధవారం పాక్ పార్లమెంటు ఉమ్మడి సెషన్ ఆమోదించింది. ఇది పాకిస్తాన్ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1898లను సవరించాలని కోరుతున్నట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) ‘‘కెమికల్ కాస్ట్రేషన్ అనేది ప్రధాన మంత్రి రూపొందించిన నియమాల ద్వారా సక్రమంగా తెలియజేయబడిన ప్రక్రియ. ఈ శిక్ష అనుభవించిన వ్యక్తి ఇక తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. ఇక ఈ శిక్ష అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహించబడుతుందని’’ బిల్లులో పేర్కొన్నారు. (చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు ) జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇస్లాం విరుద్ధమని.. షరియాకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని, అయితే షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. కెమికల్ కాస్ట్రేషన్.... కెమికల్ కాస్ట్రేషన్ అంటే లైంగిక కార్యకలాపాలను తగ్గించడానికి మందులు వాడే ప్రక్రియ. మీడియా నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా దేశాల్లో ఇది ఒక చట్టపరమైన శిక్ష. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’ -
Kulbhushan Jadhav Case : కీలక పరిణామం
ఇస్లామాబాద్: భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ తాజా చర్యతో ఆయనకు భారీ ఊరట లభించింది. తన శిక్షపై అప్పీల్ చేసుకునే హక్కు ఆయనకు ఇప్పుడు లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభ, ఐసీజే (రివ్యూ అండ్ రీ కన్సిడరేషన్) బిల్లు–2020ను గురువారం ఆమోదించింది. జాదవ్‌ని గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై 2017 ఏప్రిల్‌లో పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జాదవ్‌కు ఎలాంటి దౌత్యసాయం కల్పించకుండా, న్యాయవాదులు కలవడానికి వీల్లేకుండాచేసి, ఆయన వాదనలు వినకుండా ఉరికంబం ఎక్కించాలని పాక్ కుట్ర పన్నింది. భారత్ పంపిన దౌత్యాధికారులను జాదవ్‌ను కలవనివ్వకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ మరణ శిక్షపై సవాల్ చేసింది. ఐసీజే చొరవతో.. వాదోపవాదాలు విన్న ఐసీజే జాదవ్ మరణశిక్షపై పాకిస్తాన్ పునఃపరిశీలన చేయాలని, ఏ మాత్రం జాప్యం లేకుండా ఆయనకు న్యాయవాదుల్ని నియమించుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీనికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్డినెన్స్ 2020 అని పేరు పెట్టింది. సంవత్సరం సాగదీత తర్వాత గురువారం విపక్ష పార్టీల గందరగోళం, సభ నుంచి వాకౌట్ల నడుమ పాక్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో తనకు విధించిన మరణ శిక్షపై జాదవ్ ఏ హైకోర్టులోనైనా అప్పీలు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా తాము ఎంత బాధ్యతాయుతంగా ఉంటామో ప్రపంచ దేశాలకు తెలిసిందని పాక్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్ వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన లాయర్లతో జాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వీలు కల్పించింది. అయితే భారత్ మాత్రం ఇక్కడి లాయర్‌ను నియమించాలని ప్రయత్నిస్తోంది. కాగా, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ అరెస్ట్ చేసిందని ప్రకటించుకోగా.. కాదు జాదవ్‌ను ఇరాన్‌లోని చబాహర్ పోర్టులో అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. నిజానికి ఐసీజే ఈ ఆదేశాలిచ్చి ఏడాదికి పైనే గడుస్తున్నా.. పాక్ వక్రబుద్ధి ప్రదర్శిస్తూ ఆలస్యం చేస్తూ వచ్చింది. తన కొడుకు విషయంలో ఇది ఊరట కలిగించే విషయమని, పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జాదవ్ తండ్రి సుధీర్ పేర్కొన్నాడు. ఇది మన దౌత్య విభాగం సాధించిన విజయమని జాదవ్ స్నేహితుడు అరవింద్ మీడియాకు తెలిపాడు. చదవండి: పాక్ కొత్త కుట్ర -
ఏపీ: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్
సాక్షి, అమరావతి: బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించడంతో ఆయన ఆమోద ముద్ర వేశారు. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్.. సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా -
ఆర్డినెన్న్సును గవర్నర్ కి పంపిన ఏపీ ప్రభుత్వం
-
డిప్యూటీ మేయర్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం
తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్) (AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు) -
యోగికి షాకిచ్చిన ఐఏఎస్ అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. "చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు. "స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్‌ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. మూడు వారాల్లో ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పరీక్షల వాయిదా నిరాకరించిన హైకోర్టు.. పీజీ మెడికల్, దంత పరీక్షల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. రేపటి నుంచి యథాతథంగా పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయినా రెగ్యులర్‌గా గుర్తిస్తామని హైకోర్టుకు కాళోజీ యూనివర్శిటీ తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. -
కోతలపై ఆర్డినెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విపత్తులు, ప్రజారోగ్యపరంగా అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులో గరిష్టంగా 50 శాతం వరకు కోత (వాయిదా)కు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతితో మంగళవారం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అత్యవసర ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో పెన్షన్లలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటు ఏ చట్టం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటీవల రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక రోజు ముందు అంటే మంగళవారం ఆగమేఘాల మీద తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల ఆర్డినెన్స్–2020 పేరిట ఆర్డినెన్స్ విడుదల చేసింది. 2020 మార్చి 24 నుంచి రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని, యావత్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో కొంత భాగాన్ని వాయిదా వేసేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అత్యవసరంగా మారిందని, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఈ మేరకు చట్టాన్ని తీసుకురావడం సాధ్యం కాక ఈ అత్యవసర ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. నేపథ్యం ఇదీ..: కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత మార్చి 24న రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్ల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల జీతాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లు 25 శాతం, నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తూ గత మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ కోతలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు, పెన్షన్లలో ఈ మేరకు ప్రభుత్వం కోతలను అమలుపరచగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కుదుటపడే వరకు కోతలను కొనసాగించే అవకాశాలున్నాయి. తిరిగి చెల్లింపుపై 6 నెలల్లో స్పష్టత.. జీతాలు, వేతనాలు, పెన్షన్లలో కోత (వాయిదా) వేసిన భాగాన్ని సదరు వ్యక్తులు, ఉద్యోగులు,పెన్షనర్లకు, సంస్థలకు తిరిగి చెల్లించే విధానంపై స్పష్టతనిస్తూ, కోతలను అమల్లోకి తెచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా ప్రకటన జారీ చేస్తారు. విపత్తు, అత్యయిక పరిస్థితుల్లోనే ఏదైనా విపత్తు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వ్యక్తికి, సంస్థకు, చెల్లించాల్సిన చెల్లింపులు, బకాయిల్లో కొంత భాగాన్ని గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా లేదా కోత విధించేందుకు చట్టబద్ధంగా ప్రభుత్వానికి అధికారం ఉందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం తెలిపింది. విపత్తులు, అత్యయిక ప్రజారోగ్య పరిస్థితులు నెలకొని ఉన్నంత కాలం వాటిని సమర్థంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. ఏదైనా చట్టం, ఉత్తర్వులు, నిబంధనలు, నియమావళి, ఏదైనా కోర్టు/ట్రిబ్యునల్ ఉత్తర్వులు, తీర్పులతో సంబంధం లేకుండా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర ఏదైనా వ్యక్తులకు నెలవారీగా చెల్లించాల్సిన చెల్లింపుల్లో గరిష్టంగా 50 శాతానికి మించకుండా వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఉద్యోగి, పెన్షనర్, ఇతర ఎవరైనా వ్యక్తి, ఏదైనా ప్రభుత్వ యాజ మాన్య/ నియంత్రిత/ ఎయిడెడ్ సంస్థ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలు, చట్టబద్ధ సంస్థ, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఎయిడెడ్ విద్యా సంస్థలు తదితర సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తించనుంది. -
‘జాతీయ జంతువుగా గోవు’
గువహటి : గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ పదార్ధాలను తింటూ, డ్రైన్ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. చదవండి : గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? -
పాజిటివ్ కేసులు 21వేలు, మృతుల సంఖ్య 681
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటిపోయాయి. ఇప్పటివరకు 21,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 681 మంది మృతి చెందగా.. 4,257 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అత్యధిక పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,710 చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 269మంది చనిపోయారు. గత 24 గంటల్లో 18 మంది వైరస్ బారినపడి మరణించగా, వారిలో పదిమంది ముంబైకి చెందినవారే ఉన్నారు. అలాగే 789మంది కోలుకున్నారు. ఇక కరోనా కేసులతో గుజరాత్ రెండు, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా, లక్షా, ఎనభైమూడు లక్షల మంది మృత్యువాత పడ్డారు. (27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్) ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ నిమిత్తం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ నిన్న (బుధవారం) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం రాష్ట్రపతికి పంపగా, ఆయన వెంటనే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్రవేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. (కరోనా: నోట్లను ముట్టుకుంటే ఒట్టు) -
మాపై దాడులా.. సిగ్గుచేటు
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడులకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైద్యులు స్వాగతించారు. కరోనా మహమ్మారిపై పోరులో ముందంజలో ఉండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇటీవల కాలంలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. డాక్టర్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కాస్త ఊరట కలిగించే విషయమ’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి డాక్టర్ రవి మాలిక్ అన్నారు. అయితే దాడులకు భయపడబోమని, కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ సేవలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి విన్నవించారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీబీ వాద్వా కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘దాడులతో మేము కలత చెందాం. ఎన్ని దాడులు జరుగుతున్నా వైద్యులు తమ సేవలను మాత్రం ఆపలేదు. ఇటువంటి దాడులను నివారించేందుకు చట్టం కావాలని కోరుకున్నాం. ఎల్లప్పుడూ భయపడుతూ సేవలు అందించలేం కదా’ అని వాద్వా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. మొరదాబాద్‌లో వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన 17 మందిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టారని, మిగతా రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) కరోనా విజృంభణ నేపథ్యంలో తమ సేవలను ప్రధాని మోదీ గుర్తించడం పట్ల ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ హరీశ్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. వరుస దాడులు వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. దేశం తమ వెంటనే కరోనాపై విజయం సాధించి తీరుతామని ఆయన అన్నారు. తమకు చట్టబద్దమైన రక్షణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు హెం మంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు గురువారం తలపెట్టిన ఆందోళన విరమించారు. ఐఎంఏ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అమిత్ షా.. వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీయిచ్చారు. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం కీలక నిర్ణయం.. వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్ -
రాజ్యాంగమిచ్చిన అధికారం మేరకే ఆర్డినెన్స్
సాక్షి, అమరావతి: రాజ్యాంగంలోని అధికరణ 213 ప్రకారం సంక్రమించిన న్యాయమైన అధికారాన్ని అనుసరించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్ బాధ్యతలు కూడా స్వీకరించారని వివరించింది. అధికరణ 243(కె), ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని నిబంధనలను అనుసరించే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తప్పించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామన్న వాదనలో ఏ మాత్రం వాస్తవంలేదని స్పష్టంచేసింది. అధికరణ 243(కె)(2) ప్రకారం సర్వీసు నిబంధనల్లో పదవీ కాలం భాగం కాదని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మేళనం ఎలా ఉండాలన్నది అధికరణ 243(కె) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కొనసాగింపు ఫలితమే ప్రస్తుత ఆర్డినెన్స్ అని.. ఈ ఆర్డినెన్స్ నేపథ్యంలో పిటిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందని కోర్టు కు నివేదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలన్నది ప్రభుత్వ విధానప రమైన నిర్ణయమని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు అంటగట్టడం సరికాదంది. తమ ఈ కౌం టర్ను పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేయాలని రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును అభ్యర్థించింది. ఎస్ఈసీ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డి నెన్స్, తదనుగుణ జీఓలను, కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. సంస్కరణల్లో భాగమే ఈ ఆర్డినెన్స్ ‘ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అవసరమైన సంస్కరణలు తేవాలని నిర్ణయించి, ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ సంస్కరణలపై పలు సమావేశాల్లో చర్చించాకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చాం. అందువల్ల దీనిని హడావుడిగా జారీచేశామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవంలేదు. ఎన్నికల కమిషనర్‌గా తనను కొనసాగించాలని ఒత్తిడి చేసే ప్రాథమిక హక్కూ పిటిషనర్‌కు లేదు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా చట్ట సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని ద్వివేది వివరించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి పంపడానికి కన్నా ముందు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకే తెలియజేశారు. ఎన్నికల వాయిదా విషయంలో కమిషనర్‌ది ఏకపక్ష నిర్ణయం. అలాగే వైద్య శాఖ నుంచి ఎటువంటి నివేదిక కోరలేదు.’ అని ఆయన విన్నవించారు. అంతేకాక.. ‘కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ గురించి నిమ్మగడ్డ ఆ పిటిషన్లో ప్రస్తావించలేదు. ఇందులో ఆయన ఆరోపణలను తోసిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం లేదా బహుళ అధికారుల బృందం మార్గదర్శకంలో జరిగే అవకాశాలను చూడాలని కేంద్రాన్ని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం’ అని ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
‘ఆ ఆర్డినెన్స్‌తో వర్సిటీల మూసివేత’
లక్నో : ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఈ ఆర్డినెన్స్‌లో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీలు మూతపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించమని స్పష్టం చేస్తూ హామీ ఇవ్వాలని, దేశ లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వర్సిటీలు కట్టుబడి ఉండాలని యూపీ క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో పొందుపరిచారు. కాగా ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రైవేట్ వర్సిటీలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారిపై నియంత్రణలు విధించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యోగి ఆదిత్యానాథ్ ఓవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూనే మరోవైపు పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. నూతన విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం పట్ల యూపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మూతపడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అఖిలేష్ అన్నారు. మరోవైపు యూపీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సైతం తాజా ఆర్డినెన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. -
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
-
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఊర్జిత్ నిష్ర్కమణ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. గత ఆరేడు నెలలుగా ఆయన తనను రిలీవ్ చేయాలని కోరుతున్నారని, చివరికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఊర్జిత్ రాజీనామా వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహించారని ప్రశంసించారు. కూటమి వర్సెస్ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు మహాకూటమికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు కొండంత అండగా నిలుస్తాయన్నారు. మెరుపు దాడులపై ఉత్తర్వులు.. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు నిర్వహించిన మెరుపు దాడులకు తాను స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశానని చెప్పుకొచ్చారు. దాడులు చేపట్టే క్రమంలో మీరు విజయవంతమైనా, విఫలమైనా దాని గురించి ఆలోచించకుండా సూర్యోదయం అయ్యే సమయానికి తిరిగి చేరుకోవాలని సైన్యానికి సూచించానన్నారు. ఆపరేషన్‌ను అతితక్కువ సమయంలో పూర్తిచేయాలని, దాన్ని ఎక్కువసేపు కొనసాగించరాదని చెప్పానన్నారు. ఈ ఆపరేషన్ గురించి వివరించే క్రమంలో మోదీ కొంత భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఎందుకంటే.. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాజ్యాంగ పరిధిలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని ప్రధాని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పెద్దసంఖ్యలో ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పారు. పాకిస్తాన్లో సైతం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారన్నారు. ఇది ఎలాంటి మతానికి, విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, కేవలం లింగ సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడిన వ్యవహారమని చెప్పారు. శబరిమలపై విస్తృత చర్చ.. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నది భారత్ అభిమతం..దేశంలో కొన్ని దేవాలయాలకు ప్రత్యేక సంప్రదాయాలున్నాయని శబరిమల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తుచేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, ఆయా అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి రాజకీయ కోణాలతో ముడిపెట్టరాదన్నారు. ఓ మహిళగా ఆమె చేసిన సూచనలపైనా చర్చ జరగాలన్నారు. -
రామ మందిరంపై ఒవైసీ సవాలు..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ.. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధాని మంత్రి గిరిరాజ్ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి.. ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రతిసారి, ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్ తీసుకొస్తామని బెదిరింపులకు పాల్పడతారని.. కానీ వారు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని సవాలు విసిరారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు రామ మందిరం నిర్మాణంపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు. -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
‘ఈ ఆర్డినెన్స్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’
సాక్షి, హైదరాబాద్ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకరావడం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామంటూ గురువారం ప్రకటించింది. పార్లమెంటు ఆమోదం పొందకుండానే ఆర్డినెన్స్ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. చట్టసభలను గౌరవించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందంటూ లా బోర్డు విమర్శించింది. దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు? ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫ్ ఉల్లా రహ్మానీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. అసలు ముస్లిం వర్గాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు హాని కలిగించే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై తమ లీగల్ కమిటీ చర్చిస్తోందని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే : అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఓ నాటకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రఫెల్ డీల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉదంతాలు, పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇటువంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కాగా ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గత బుధవారం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు. -
హడావుడి ఆర్డినెన్స్!
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులివ్వడాన్ని నిషేధిస్తూ, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తక్షణ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాక కేంద్రం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. అనంతరం ఆ బిల్లుకు లోక్‌సభ ఆమోదాన్ని పొందింది. ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో దీనికి అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడా, వెలుపలా వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్నిటికి చోటిచ్చి తాజా ఆర్డినెన్స్ రూపొందించారు. దానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెల్పడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా పూర్తయ్యాయి. ఈ దురాచారం ముస్లింలలో ప్రబలంగా లేదు. దాన్ని ఆచరించేవారి సంఖ్య స్వల్పం. అయితే బాధి తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్యాయం జరుగుతున్నదనుకుంటే దాన్ని చక్కదిద్దవలసిందే. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అవి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఆ సమావేశాల వరకూ ఆగి బిల్లు ప్రవేశపెడితే... దాని ఆమోదానికి, ఆ తర్వాత చట్టంగా రూపొందడానికి మరో అయిదారు మాసాలు పడుతుంది. కనుక ఆర్డినెన్స్ తప్పనిసరైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు. దానికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఆయన ఏకరువు పెట్టారు. నిరుడు జనవరి మొదలుకొని ఈ నెల వరకూ దేశవ్యాప్తంగా 430 తక్షణ తలాక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వకముందు 229, ఇచ్చాక 201 జరిగాయి. తక్షణ తలాక్ ఆచరణ మన దేశంలో ఎంత స్వల్పమో ఈ లెక్కలే చెబు తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. అంటే దాదాపు 17 కోట్ల 23 లక్షలు. అయితే గతంలో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎదురైన అవాంతరాలకు గల కారణాలనుగానీ, ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలనుగానీ తాజా ఆర్డినెన్స్ పరిగణనలోకి తీసు కున్నట్టు కనబడదు. కనీసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందైనా ఆయా వర్గాలతో, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలతో కేంద్రం మరోసారి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే తక్షణ తలాక్ విధానం పోవాలని కోరుకునేవారు సైతం కొన్ని నిబంధనల విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు తక్షణ తలాక్ చెప్పటం దానికదే శిక్షార్హమైన నేరంగా పరిగణించి అందుకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చునని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ నిబంధనను స్వల్పంగా సవరించి భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్దేశించారు. దీన్ని రాజీకి వీలైన నేరంగా కూడా మార్చారు. అంటే ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికొచ్చి కేసును ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇది నాన్‌బెయిలబుల్ కేసు అయినా, విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. గతంతో పోలిస్తే ఇవి మెరుగైన మార్పులే. అయితే లోగడ బిల్లును వ్యతిరేకించినవారు కోరింది ఇవి మాత్రమే కాదు. అసలు తక్షణ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే విధానమే రద్దు కావాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో అహేతుకత ఏమీ లేదు. తక్షణ తలాక్ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది గనుక లేని హక్కును చలాయించటం భర్తకు అసాధ్యం. ఒకవేళ గెంటేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ చట్టవిరుద్ధం గనుక ఆ పెళ్లి రద్దు కాలేదని న్యాయ స్థానం స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో భర్త ఆమె హక్కులు కాలరాయాలని చూస్తే గృహహింస చట్టం కింద ఆమె కేసు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు సైతం తక్షణ తలాక్ చెల్లదని చెప్పింది తప్ప, దాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొనలేదు. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, అవి తీవ్రరూపం ధరించినప్పుడు విడాకుల వరకూ వెళ్తుంది. అయితే ఇతర మతస్తుల విషయంలో దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించనప్పుడు ముస్లింలకు వేరే విధమైన నిబంధన ఎందుకు? ఇది తమ పట్ల చూపిస్తున్న వివక్షలో భాగమని వారనుకునే అవకాశం లేదా? ఆవేశం అవధులు దాటినప్పుడు భార్య లేదా ఆమె తరఫు బంధువులు కేసు పెట్టి తక్షణ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయిస్తే రాజీకి దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన మహిళకు వెనువెంటనే కావాల్సింది భరణం. ఆమె, ఆమెతో ఉండే సంతానం జీవించడానికి అవసరమైన జీవనభృతి జైలు పాలైన భర్త సమకూర్చగలుగుతాడా? అలాంటి సందర్భాల్లో ఆమె మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని ఆర్డినెన్స్ చెబుతోంది. కానీ ఆ జీవనభృతి ఇచ్చేదెవరో, ఎలా లెక్కేస్తారో ఈ ఆర్డినెన్స్‌లో లేదు. మారే కాలానికి అనుగుణంగా ఎవరైనా మారక తప్పదు. పౌర హక్కుల భావన లేనికాలంలో మహిళలకు అన్యాయం చేసే పలు సంప్రదాయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రపం చంలోని అన్ని మతాల్లోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ప్రతి మతం లోని పెద్దలూ ఎప్పటికప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకటం అవసరం. అదే సమయంలో ముస్లింల విషయంలో ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ రాకుండా చూసుకోవటం ప్రభుత్వం బాధ్యత. డిసెంబర్‌లోగా జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తెచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్ తదితర పక్షాలు ఆరోపించాయి. ఎవరినీ సంప్రదించకుండా, ఇప్పటికే వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డినెన్స్ జారీ చేసి ఆ విమర్శలను కేంద్రం నిజం చేసింది. -
‘ట్రిపుల్ తలాక్‌పై ఖేదం, మోదం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్డినెన్స్‌ను తీసుకరావడం పట్ల ముస్లింలు, మహిళా హక్కుల కార్యకర్తల్లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఏ రకంగానైనా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లయితే అతనికి మూడేళ్ల వరకు శిక్ష విధించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 2017, డిసెంబర్లో లోక్‌సభ ఆమోదించిన ‘ముస్లిం మహిళల పెళ్లి హక్కుల పరిరక్షణ బిల్లు’ స్థానంలో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లులో పలు మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పట్టు పట్టడంతో నాడు రాజ్యసభలో సంపూర్త బలంలేని బీజేపీ ప్రభుత్వం ఆ సభలో బిల్లును ప్రవేశపెట్టలేక పోయింది. చివరకు కేంద్ర కేబినెట్ ప్రతిపక్షాలతోపాటు, పలు ముస్లిం సంస్థలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 9వ తేదీన బిల్లులోని కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు బిల్లులో చేసిన సవరణలను పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా సభా కార్యక్రమాలను స్తంభింపచేయడంతో బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బిల్లు స్థానంలో కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్‌ను తీసుకరావాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ పట్ల ముస్లింలో ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించరాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం వాదిస్తోంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017, అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌లు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. షమీమ్ ఆరా వర్సెస్ ఉత్తర ప్రభుత్వం మధ్య కొనసాగిన కేసులో ట్రిపుల్ తలాక్ చెల్లదని 2002లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 2017, ఫిబ్రవరి నెలలో ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా (భర్త నుంచి విడిపోయి మళ్లి కలుసుకోవాలంటో మరో వ్యక్తినిపెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం)ను వ్యతిరేకిస్తూ ట్రిపుల్ తలాక్ బాధితురాలు షయారా బానో, పలువురు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల వరకు జైలు, జరిమానా విధించేలా తొలుత బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఫలానా వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ ఎవరైన పోలీసు ఫిర్యాదు ఇచ్చేలా ఆ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు, పలు సంస్థలు గొడవ చేయడంతో కేంద్రం భార్య, లేదా అమె సమీప బంధువలు మాత్రమే ట్రిపుల్ తలాక్‌పై ఫిర్యాదు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్యను విచారించి హేతుబద్ధంగా భర్తకు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా మరో మార్పు చేయడంతోపాటు, భార్యా భర్తలు అవసరమైతే రాజీకి వచ్చేందుకు కూడా వీలు కల్పిస్తూ ముఖ్యమన సవరణకు చేర్చారు. ఆర్డినెన్స్‌ను భారతీయ ముస్లిం మైనారిటీ ఆందోళన్ సంస్థ పూర్తిగా సమర్థించింది. సవరణలను కూడా స్వాగతించింది. ఆర్దినెన్స్ పట్ల అసంతృప్తి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్ష పార్టీలతోపాటు కొన్ని మానవ హక్కుల సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి ఎంతో తేడా ఉంది. ముస్లిం మహిళల పేరిట ముస్లిం పురుషులను వేధించేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది’ అని ‘బెబాక్ కలెక్టివ్’ అనే మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు హసీనా ఖాన్ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి బదులుగా గృహ హింస నేరంగా పరిగణించి గృహ హింస చట్టం కింద విచారించేలా ఉంటే బాగుంటుందని మానవ హక్కుల కార్యకర్త జావెద్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ ఇస్తే భర్త నుంచి భరణం కోరే హక్కును కూడా కల్పించారుగానీ, జైల్లో ఉండే భర్త ఎలా భార్యకు భరణం చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు. మెజారిటీ ముస్లింలలో మగవాళ్లు పనిచేస్తేగానీ కుటుంబం గడవదన్న విషయం తెల్సిందే. -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
అది రాజ్యాంగ విరుద్ధం : ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తలాక్‌పై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని, కేవలం ముస్లిం మహిళలకు వర్తించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురాడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇస్లాంలో వివాహం అనేది పూర్తిగా సివిల్ కాంట్రాక్టు. దానిలో శిక్షా నిబంధనలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకం. దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరగదు. దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఓవైసీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లు లోకసభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కెబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసేందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తరువాత కోర్టులో 430కిపైగా తలాక్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకే అత్యవస అర్డినెన్స్ను తీసుకువచ్చామని ప్రభుత్వం వివరించింది. -
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ట్రిపుల్ తలాక్’పై నరేంద్ర మోదీ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకరావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ‘ట్రిపుల్ తలాక్’పై ఆర్డినెన్స్‌తో పాటు పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గ నిర్ణయాలను న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని వివరించారు. తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలు, భార్యకు భరణం ఇచ్చేలా ఆర్డినెన్స్ రూపొందించామన్నారు. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భార్య, రక్తసంబంధీకులు, స్నేహితులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, భార్య వాదనలు విన్న తర్వాతే బెయిల్‌పై మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 430 ట్రిపుల్ తలాక్ కేసులు సుప్రీం కోర్టు ఉత్తర్వుల తర్వాత 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, రాజ్యాంగపరంగా అత్యవసరం కాబట్టే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకే, వారి గౌరవం కోసమే ఈ బిల్లు తెచ్చామని అన్నారు. సోనియా, మాయావతి, మమతా బెనర్జీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు వీడి ఈ బిల్లుకు మద్దతివ్వాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాల పెంపు అంగన్ వాడీ వర్కర్లు, సహాయక సిబ్బంది, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3000 నుంచి రూ.4500కు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రాఫెల్ ఒప్పందంపై జెపిసి, సీఏజీ విచరణ అవసరం లేదని స్సష్టం చేశారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ఏ నిర్ణయం తీసుకోకుండా పదేళ్లు నానబెట్టారని గత కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు. -
అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఆర్డినెన్స్: అథవాలే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై శనివారం ఆయన ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై త్వరలో ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు. ఓబీసీ వర్గీకరణపై అధ్యయనం జరుగుతోందని, ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్డీయేలోనే కొనసాగి ఉంటే ప్రత్యేక హోదా అంశంపై మోదీ సానుకూలంగా స్పందించే వారని పేర్కొన్నారు. పార్టీని రక్షించుకోలేని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పటం హాస్యాస్పదమని రాందాస్ ఎద్దేవా చేశారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్‌షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
‘పారిపోయిన నేరస్తుడి’గా మాల్యా
ముంబై/న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్ కింద వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ’పారిపోయిన నేరగాడి’గా ప్రకటించాలని ముంబైలోని స్పెషల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ వేసింది. తద్వారా రూ.12,500 కోట్ల విలువ చేసే ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని కోరింది. ఇలాంటి నేరాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ట్రయల్ పూర్తయి, ఆస్తుల జప్తుకు అనేక సంవత్సరాలు పట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా అమల్లోకి వచ్చిన పలాయన ఆర్థిక నేరగాళ్ల పట్టివేత ఆర్డినెన్స్ కింద ఈడీ తాజా పిటిషన్ వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట ఐడీబీఐ బ్యాంకు, ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్షియం నుంచి తీసుకున్న రూ. 9,000 కోట్లకు పైగా రుణాలు మాల్యా ఎగవేసిన కేసుకు సంబంధించి ఈడీ ఈ పిటిషన్ వేసింది. ‘బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం మాల్యాకు ముందు నుంచే లేదు. మాల్యాకు, ఆయనకు చెందిన యూబీహెచ్ఎల్ (యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్) వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన వనరులు ఉన్నప్పటికీ, బ్యాంకుల నుంచి ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలను దాచిపెట్టి ఉంచారు‘ అని ఈడీ ఆరోపించింది. ఇప్పటికే మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాతో పాటు ఇతర నిందితులపైనా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను దీనికి జతపర్చింది. ఆయనపై నాన్–బెయిలబుల్ వారంట్లు జారీ అయిన సంగతి కూడా తెలియజేసింది. త్వరలో నీరవ్ మోదీపై కూడా.. పలాయన నేరగాళ్లను శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్ కింద ఈడీ వేసిన మొదటి పిటిషన్ ఇదే. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై కూడా దీన్ని ప్రయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో పలువురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోతున్న ఉదంతాల నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. -
ఆర్డినెన్స్‌తో చిత్తశుద్ధి చాటుకున్నాం
మాండ్లా (మధ్యప్రదేశ్): అత్యాచారాలపై ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఆ అంశం పట్ల తమ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ కుమార్తెలను గౌరవించాలని, భద్రతతో కూడిన వాతావరణం కోసం వారి కుమారుల్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు హామీనిచ్చేలా సామాజిక ఉద్యమానికి పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రామ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, గ్రామ పంచాయతీ ప్రతినిధుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఢిల్లీలోని మా ప్రభుత్వం మీ అభిప్రాయాల్ని వినడమే కాకుండా తదనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందుకే అత్యాచారాలకు మరణశిక్ష విధించేలా నిబంధనల్ని తెచ్చాం’ అని చెప్పారు. అంతకుముందు మోదీ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రూపొందించిన ‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం అమలుచేసే ఈ పథకంలో భాగంగా స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. వాటి స్వయం సమృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి కృషిచేస్తారు. జల సంరక్షణకు ఉపాధి నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని వేసవికాలం మూడు నెలలు జల సంరక్షణ పనులకు వినియోగించాలని,దీంతో గ్రామాల్లో నీటి కొరతను అధిగమించడంతో పాటు, రైతులకు సహాయకారిగా ఉంటుందని మోదీ అన్నారు. ‘ప్రతీ వర్షపు చుక్కను సంరక్షించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయడమే కాకుండా.. నీటికొరత నుంచి గ్రామాల్ని కాపాడవచ్చు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోనే నాటికి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేయాలి’ అని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు జన్ ధన్, వన్ ధన్, గో ధన్ (మానవ వనరుల, అటవీ సంపద, గో సంపద)పై దృష్టిపెట్టాలని సూచించారు. పల్లెలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్న మహాత్మా గాంధీ కల సాకారం కోసం గ్రామీణ ప్రాంతా ల్లోని మానవ శక్తిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దేశంలో వనరుల కొరత లేదని, ప్రాధమ్యాలు, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడంలోనే సమస్యలున్నాయని.. వాటిని అధిగమించేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు. సమర యోధుల కోసం... గాంధీ – నెహ్రూ కుటుంబంపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర కేవలం కొద్ది మంది, కొన్ని కుటుంబాల చుట్టే తిరగడం దురదృష్టకరమని మోదీ అన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల్లో గుర్తింపు పొందని స్వాతంత్య్ర పోరాట యోధుల కోసం మ్యూజియంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘1857 నుంచి జరిగిన స్వాతంత్య్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి తగిన గుర్తింపు దక్కేలా ప్రతి రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. భావితరాలకు వారి త్యాగాలను తెలియచెప్పేందుకు ఈ మ్యూజియంలు ఉపయోగపడతాయి’ అని మోదీ చెప్పారు. -
ఉరి వల్ల రేప్‌లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?) -
ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: అత్యాచార దోషులకు కఠిన శిక్షలతోపాటు, రుణ ఎగవేత దారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగడం లేనందున, ఈ ఆర్డినెన్స్‌లను అత్యవసరమైనవిగా భావించి.. రాజ్యాంగంలోని 123 ఆర్టికల్ ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌లను కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదించిన రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధిస్తారు. అలాగే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు మరో ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. -
కథువాలో మరో కీలక పరిణామం
కథువా : దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కథువా ఉదంతంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, హత్య కేసుపై విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కథువా ఎస్పీని మార్చేశారు. కథువా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ)గా ఉన్న సులేమాన్ చౌదరి స్థానంలో శ్రీధర్ పాటిల్ నియమించారు. దీంతో కొత్త కథువా ఎస్పీగా శ్రీధర్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కథువాలో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం ఒడిగట్టిన వారికి మరణ శిక్ష విధించేందుకు ఆమోదిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను సైతం తీసుకొచ్చింది. ఈ ఘటనలో స్థానిక పోలీసులదే కీలక పాత్ర కావడంతో, ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేపట్టడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకించారు. దీంతో ఈ కేసును జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచు పోలీసులు ఈ కేసుపై ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీటులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. బక్వారా ముస్లింలను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా కుట్రలు చేసి, పాపపై అకృత్యం జరగడానికి అసలు సూత్రధారి, రిటైర్డ్ ఉద్యోగి సాంజీ రామ్‌ను ఏ1గా పేర్కొన్నారు. సాంజీరామ్ మేనల్లుడు( మైనర్), మైనర్ నేరస్తుడి స్నేహితుడు పర్వేశ్ కుమార్, సాంజీరామ్ కొడుకు విశాల్, మీరట్ స్పెషల్ పోలీసులు దీపక్ ఖజూరియా, సురేంద్ర వర్మలు కూడా బాలికపై అత్యాచారం జరిపారన్న ఆధారాలు లభించడంతో వీరిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం కథువా కేసు విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే కొత్త ఎస్పీని నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. -
లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల రీ అసైన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పరాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోగా ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్ తీసుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అసైన్డ్ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా ఈ కటాఫ్ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి అసైన్డ్ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి.. వారి పేరిట రీ అసైన్ చేస్తారు. అందుకు అనుగుణంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిష¯Œన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 977లో పలు నిబంధనల్ని సవరించటం తప్పనిసరి. అందుకే అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 12కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పేద వర్గాలకు రీ అసైన్డ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుపై వచ్చే వారమే ఆర్డినెన్స్! అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లన్నింటా తెలుగును తప్పనిసరి చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి చట్టరూపం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్డినెన్స్‌ను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ముసాయిదా న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గవర్నర్ ఆమోదంతో వచ్చే వారంలో ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
పోలీసు చట్టం అర్డినెన్స్ను తప్పుబట్టిన IYR
-
ఆస్తుల కొనుగోలుకు వారికి అర్హత లేదు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారు, బ్యాంకులకు బకాయి పడిన ఖాతాదారులు (ఎన్పీఏ) దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా... వేలానికి వచ్చే ఆస్తులకు బిడ్డింగ్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణల ఆర్డినెన్స్‌కు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ ముద్రపడింది. ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిం దే. ఐబీసీ చట్టంలో నిబంధనలను దుర్వినియోగం చేయకుండా మోసపూరిత వ్యక్తులను అడ్డుకోవడమే ఆర్డినెన్స్ ఉద్దేశమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఐబీసీలో చేసిన మార్పులకు వచ్చే నెల 15 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది. తొలి దశలో బ్యాంకులకు రూ.5,000 కోట్లకుపైగా బకాయిలు పడిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో దివాలా పరిష్కార చర్యలు ఇప్పటికే ఐబీసీ కింద మొదలయ్యాయి. వీటిలో పలు ఖాతాల కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీల ప్రమోటర్లు బిడ్డర్లుగా ఉండడం గమనార్హం. ఈ విధమైన అనైతిక చర్యలను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఆరు సెక్షన్లలో మార్పులు ఎన్పీఏ ఖాతాలుగా వర్గీకరించి ఏడాది, అంతకుమించినా, లేదా దివాలా పరిష్కారం కింద నమోదు చేసేలోపు వడ్డీ సహా బకాయిలను చెల్లించ లేకపోయిన వారిపై అనర్హత అమలవుతుంది. వీరు ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉండదని ఆర్డినెన్స్ స్పష్టం చేస్తోంది. దీంతో ఐబీసీ కింద దివాలా పరిష్కారానికి నివేదించిన ఖాతాల తాలూకూ కార్పొరేట్లు, ప్రమోటర్లు హోల్డింగ్ కంపెనీలు లేదా సంబంధిత పార్టీలు మొండి బకాయిల ఆస్తుల బిడ్డింగ్‌లో పాల్గొనలేరు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు అదనపు అధికారాలు కల్పించారు. ఐబీసీ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై రూ.2 కోట్ల వరకు జరిమానా విధించొచ్చు. మొత్తం మీద ఐబీసీ కోడ్‌లో ఆరు సెక్షన్లలో సవరణలు చేయగా, కొత్తగా రెండు సెక్షన్లు జోడించారు. ఆస్తుల విలువపై ప్రభావం ఉండదు: ఎస్బీఐ దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటున్న ఎన్పీఏ ఆస్తుల విలువపై తాజా ఆర్డినెన్స్ ప్రభావం చూపించకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘చట్టంలో మార్పులతో ఆ ఆస్తుల విలువ పడిపోదు. ఎందుకంటే వీటి కొనుగోలుకు ఎంతో ఆసక్తి ఉంది. ప్రస్తుత ప్రమోటర్లను బిడ్డింగ్‌కు అనుమతించకపోయినా, అనుమతించినా విలువలో మార్పుండదు. సరసమైన ధర ప్రకారమే వేలం ఉంటుంది’’ అని రజనీష్‌కుమార్ చెప్పారు. -
ఆ కార్లు ఇక కొనలేరు...
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ, ఎస్యూవీ కార్లు ఇక భారం కానున్నాయి. వీటిపై ఇప్పుడు విధిస్తున్న 15 శాతం సెస్‌ను జీఎస్టీ కింద 25 శాతానికి పెంచనున్నారు. సెస్‌ను పెంచేందుకు ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిచడంతో పెంపు ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేయనుంది.ఈ దిశగా ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణను చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టంలో మార్పులకు మొగ్గుచూపింది. జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించేలా లగ్జరీ వస్తువులపై సెస్ విధించేందుకు కేంద్రం జీఎస్టీ (ఆదాయ నష్టం జరిగే రాష్ట్రాలకు పరిహారం) ప్రత్యేక బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే సెస్ పెంపుపై ఆటోమొబైల్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సెస్ పెంచితే తాము వాహనాల ధరలను పెంచాల్సివస్తుందని ఇది కస్టమర్లపై భారం మోపినట్టవుతుందని వాపోతున్నాయి. సెస్ పెరిగితే లగ్జరీ వాహనాల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. -
మిర్చి విత్తన చట్టం ముసాయిదాకు తుది రూపు!
► వ్యవసాయ మంత్రి పోచారంతో న్యాయ శాఖ కార్యదర్శి భేటీ ► త్వరలో కేబినెట్ ముందుకు ముసాయిదా.. ► గవర్నర్ ఆమోదం అనంతరం అసెంబ్లీకి బిల్లు సాక్షి, హైదరాబాద్: మిర్చీ విత్తన చట్టం–2017 ముసాయిదాకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తుది రూపు తీసుకొచ్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ముసాయిదాను ప్రవేశపెడతామని, గవర్నర్ ఆమోదంతో ఆర్డి నెన్స్ తీసుకొస్తామని తెలిపారు. తదుపరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బుధవారం ఈ మేరకు మంత్రి పోచారంతో న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు సమావేశమయ్యారు. మిర్చీ నకిలీ విత్తనాల విక్రయదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కఠిన అంశాలను పాందుపరిచామని తెలిపారు. అయితే ఖరీఫ్ కంటే ముందే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావించినా అది ఆలస్యమైంది. అన్ని విత్తనాలకు అన్నారు కానీ... 2007లో ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పంటకు నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే ఏపీ కాటన్ సీడ్స్ యాక్ట్–2007ను తీసుకొచ్చారు. అందులో పత్తికి తప్ప మిగతా పంటలకు సంబంధించి నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం ఇప్పించే అంశం లేదు. దీంతో ఇతర పంటలకు సంబంధించిన విత్తనాల్లో కల్తీ జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటలకు చట్టం అవస రమని భావించింది. పత్తి తర్వాత అత్యధికంగా రైతు లు నకిలీ విత్తనాలతో నష్టపోయేది మిర్చితోనేనని భావించిన ప్రభుత్వం ఆ ఒక్కదానికే పరిమితమైంది. దీంతో ఇతర నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ తాజా విత్తన ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో జిల్లా వ్యవసా యాధికారి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా ఉద్యానాధికారి, సంబంధిత పంటకు సంబం ధించిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు, విత్తన ఉత్పత్తి దారులు సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనా ల కారణంగా మిర్చి పంటకు నష్టం వాటిల్లితే జిల్లా కమిటీనే పరిహారం ఇప్పిస్తుంది. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగిన రైతు వ్యవసాయ క్షేత్రాల్లో కమిటీ పర్యటించి నష్టం విలువను అంచనా వేస్తుంది. ఆ ప్రకారం కంపెనీలను పిలిపించి పరిహారం ఇప్పిస్తుంది. అవసరమైన శిక్షలను ఖరారు చేస్తుంది. జిల్లాస్థాయి కమిటీలో రైతు తనకు న్యాయం జరగలేదని భావిస్తే రాష్ట్రస్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్డినెన్స్ జారీ చేశాక నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. కంపెనీలు ఎంత నష్టపరి హారం చెల్లించాలి, వాటి యాజమాన్యాలకు ఎలాంటి శిక్షలు అమలు చేయాలి, పరి హారం, జైలు శిక్ష రెండూ ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేస్తారు. ముసాయిదా బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు ♦ నకిలీ విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని రైతు లేదా రైతు బృందం జిల్లా కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు. ♦ రైతుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అధికారి, ఉద్యోగి, ఏజెన్సీ, డీలరు ఇలా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవచ్చు. ♦ మిర్చి విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్ ఇక ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. అందుకోసం సరైన నిబంధనలు రూపొందిస్తారు. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ► ఎగవేత కంపెనీలపై బ్యాంకులకు నియంత్రణ ► ఎన్పీఏల పరిష్కారంలో కీలక అడుగు ► ఎగవేతదారులపై విస్తృత చర్యలు చేపట్టే అధికారం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్య పరిష్కారం దిశగా ఆర్బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఎన్పీఏల వసూలుకు సంబంధించి బ్యాంకులను ఆర్బీఐ ఇక నేరుగా ఆదేశించగలదు. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని భారీగా ప్రక్షాళన చేసేందుకు తాజా ఆదేశాలు దోహదపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఆర్డినెన్స్‌తో ‘‘రుణ ఎగవేత దారుల విషయంలో ‘ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్ 2016’ నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్బీఐ ఆదేశించగలదు’’ అని శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు అసాధారణంగా రూ.6 లక్షల కోట్లకుపైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను చేపట్టడం గమనార్హం. మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో 2016 డిసెంబర్ నాటికి ఎన్పీఏలు రూ.7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్పీఏలుగా మారాయి. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్పీఏలు అసాధారణ స్థాయికి చేరాయని, సమస్య పరిష్కరానికి సత్వర చర్యలు అవసరమని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లో కొత్తగా సెక్షన్ 35ఏఏ, 35ఏబీలను చోటు కల్పించనుంది. చట్ట సవరణ ఉద్దేశాలు ♦ భారీ రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు తాజా రుణాలు ఇక లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. ♦ రంగాల వారీగా పర్యవేక్షణ కమిటీలను నియమించే అధికారం ఆర్బీఐకి ఇచ్చారు. ఒత్తిడిలో ఉన్న రుణాల వసూలుకు పరిష్కారాలు సూచించేందుకు కమిటీలు లేదా అధికారులను కూడా నియమించగలదు. ♦ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాం కర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. ♦ ఒత్తిడిలో ఉన్న రుణాల విషయమై పరిష్కారానికి గాను ఆర్బీఐ సమయానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేయగలదు. దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించగలదు. ♦ మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. ♦ హెయిర్ కట్ (ఇచ్చిన రుణంలో బ్యాంకు నష్టపోయేందుకు అంగీకరించే మొత్తం) విషయంలో కేసును బట్టి పరిష్కారం సూచించే అధికారం ఆర్బీఐకి లభించింది. అవసరమైతే మార్గదర్శకాల్లోనూ వెసులుబాటు ఇవ్వగలదు. ♦ కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. ♦ తాజా చట్టానికి అనుగుణంగా రెండు వారాల్లో ఆర్బీఐ ఎన్పీఏలకు సంబంధించి తగిన చర్యల్ని నోటిఫై చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ తొలుత 50 భారీ రుణ ఎగవేత కేసులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పరిష్కరించడంపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ప్రస్తుత స్థితి ఇక ఎంత మాత్రం కొనసాగరాదు: జైట్లీ బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి చేసిన సవరణలతో బ్యాంకులు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, దాంతో ఒత్తిడిలో ఉన్న రుణాల విషయంలో త్వరగా పరిష్కారాలు లభించగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘‘ఈ చట్టం యొక్క లక్ష్యం ప్రస్తుతమున్న యాథాతథ స్థితి (ఎన్పీఏలకు సంబంధించి) కొనసాగకూడదన్నదే. స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అచేతనం చేయడమన్నది ఆర్థిక రంగానికి హానికరం. కనుక దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎన్పీఏలుగా మారిన రుణాలను గుర్తించి సత్వర పరిష్కారాలను కనుగొనేందుకు ఆర్బీఐకి అధికారాలు కల్పించినట్టు జైట్లీ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న రుణాల జాబితా ఇప్పటికే ఆర్బీఐ ముందుకు చేరింద ని, దాన్ని పరిశీలించి చర్యలు చేపడుతుందన్నారు. ఆస్తులను విక్రయించడం, లాభసాటిగా లేని బ్యాంకు శాఖలను మూసివేయడం, వ్యాపార పునర్వవ్యస్థీకరణ చర్యలు చేపట్టడం వంటివి కూడా పరిష్కారాల్లో భాగంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంచి చర్యే: బ్యాంకర్లు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు... దివాళా బాంక్రప్టసీ కోడ్, సర్ఫేసీ, రుణ రికవరీ ట్రిబ్యునల్ చట్టాలకు సవరణలు ఇవన్నీ కూడా ఎన్‌పీల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆర్బీఐకి అధికారాలు ఇవ్వడం సమస్యకు ప్రభావవంతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. బ్యాంకులు సత్వరమే ఈ నిబంధనల ఆసరాతో ప్రయోజనాలను అందుకోవాలి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ పూర్తి పరిష్కారానికి సమయం ఎన్పీఏలకు పరిష్కారానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టం పెద్ద అడుగు. పరిష్కార ప్రక్రియకు వెంటనే మొదలయ్యేలా చేస్తుంది. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి సమయం తీసుకుంటుంది. అయితే, పరిష్కారం కోసం ఓ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మార్గంలో సాగిపోతే పురోగతి ఉంటుంది. – చందాకొచర్, ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ ఆర్బీఐ మరింత జోక్యం ఎందుకు: రేటింగ్ ఏజెన్సీలు ఎన్పీఏల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో క్షేత్ర స్థాయిలో ఫలితం చూపించడానికి సమయం పడుతుందని రేటింగ్ ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. వాణిజ్య బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో మరింత సునిశిత పరిశీలనకు ఆర్బీఐను అనుమతించడాన్ని ప్రశ్నించాయి. ఎన్పీఏల పరిష్కారం విషయంలో ఇప్పటి వరకూ నెలకొన్న ఉదాసీనతను తాజా ఆర్డినెన్స్ పరిష్కరించాల్సి ఉందని ఇండియా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. వాణిజ్య రుణాల జారీ విషయంలో నియంత్రణ సంస్థ జోక్యానికి అవకాశం కల్పించడాన్ని వాటి సమర్థ నిర్వహణ విషయంలో ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందని తెలిపింది. క్రిసిల్ మాత్రం సానుకూలమని వ్యాఖ్యానించింది. -
మొండి బకాయిలపై ఆర్బీఐ అస్త్రం
-
ప్రభుత్వ సంస్థలకు ‘మొండి’ ప్రాజెక్టులు
► వ్యూహరచనలో కేంద్రం ► ఎన్పీఏల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ)అప్పగించే కీలక వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో బుధవారం బ్యాంకింగ్ యాక్ట్ సవరణకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిన కేంద్రం, ఇదే క్రమంలో మరింత ముందుకు వెళ్లడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూలకు ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టులను అప్పగించడానికి తగిన నిబంధనల సవరణపై కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేబినెట్ సెక్రటేరియట్ వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం చేస్తుంది. ప్రధాని కీలక సమీక్ష సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గత వారం ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఒక నిర్ధిష్ట రంగం ప్రాజెక్టులను సంబంధిత మంత్రిత్వశాఖకు అప్పగించే వ్యూహంపై కేంద్రం ప్రత్యేకించి దృష్టి పెట్టింది. వివిధ రంగాలకు సంబంధించి భారీ ఎన్పీఏలను గుర్తించాలని, ఆయా రంగాల వివరాలను సంబంధిత మంత్రిత్వశాఖలకు తెలియజేయాలని ఇప్పటికే బ్యాంకింగ్‌కు కూడా సంకేతాలు అందాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించి వ్యూహాలను రూపొందించే పనిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిజీగా ఉన్నాయి. పరస్పర ప్రయోజనం లక్ష్యం... తక్కువ స్థాయి ధర వద్ద... ఒత్తిడిలో ఉన్న ప్రాజెక్టుల కొనుగోలు ప్రభుత్వ రంగ సంస్థలకు లాభదాయక అంశమయితే, ఎన్పీఏల భారం తగ్గడం బ్యాంకులకు సానుకూల అంశమని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ పరస్పర ప్రయోజన లక్ష్యంగా సమస్య ఎన్పీఏల పరిష్కార ప్రణాళికలు రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్పీఏలు 2015 మార్చిలో రూ.2.67 లక్షల కోట్లు ఉంటే,, 2016 మార్చి నాటికి ఈ మొత్తం రూ.5.02 లక్షలకోట్లకు పెరగడంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్పీఏల పరిష్కారం దిశలో ఆర్బీఐకి కీలక అధికారాలను అప్పగించే నిర్ణయాలను బుధవారం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ప్రత్యేకించి బ్యాంకింగ్ చట్ట సవరణలు ఎన్పీఏల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని ఫైనాన్స్ కార్యదర్శి అశోక్ లవాసా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. -
కల్తీ చేస్తే.. కటకటాలే!
విత్తనాలు, ఎరువుల్లో కల్తీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం ► అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం ► కఠిన చట్టం తెచ్చి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తాం ► ఆహార పదార్థాలు కల్తీ చేసేవారిపైనా కఠిన చర్యలు ► పండించిన కూరగాయలు, పండ్లను రైతులే అమ్మాలి ► ఈ నెల 10 నుంచి ఏఈవోలు గ్రామాల్లో పర్యటించాలి సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందాలని, నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నకిలీ, కల్తీకి పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా కఠిన చట్టం రూపొందించాలని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపైనా ఉక్కుపాదం మోపేలా విధానం రూపొందించాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు మన రైతులే పండించి అమ్మేలా తగిన సహకారం అందించాలని సూచించారు. పండించిన పంటను కూడా రైతులతోనే ఆహార పదార్థంగా ప్రాసెసింగ్ చేయించాలని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయాన్ని అందించే విధానంతోపాటు ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ ప్రక్రియలో రైతుకు వెన్నుదన్నుగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందించాలని కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనంత్ కుమార్‌ను కోరారు. ఈ భేటీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, పార్థసారథి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎరువులు ఇప్పుడే నిల్వ చేయండి వర్షాకాలానికి అవసరమయ్యే ఎరువులన్నీ వేసవిలోనే సేకరించి నిల్వ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో 16 లక్షల టన్నుల ఎరువులు అవసరమని, ఇప్పటికే 8 లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. కొంత ఎరువు స్థానికంగానే లభ్యమవుతుందన్నారు. 2 లక్షల టన్నుల యూరియా, 50 వేల టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల ఎన్పీకే సేకరించి పెట్టుకుంటే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇందుకు స్పందించిన సీఎం వెంటనే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్‌కు ఫోన్ చేసి ఎరువులుS సరఫరా చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. మంగళవారం వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించనున్నారు. ‘‘రాష్ట్రంలో కేవలం వరి ధాన్యం విషయంలో మాత్రమే స్వయం సమృద్ధి సాధించాం. ఇతర ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ అవసరాలు ఏమిటి? కూరగాయలు ఎన్ని కావాలి? పండ్లు ఎన్ని కావాలి? ఏది ఎంత కావాలో నిర్ధారించి అంత మేరకు ఉత్పత్తి చేసుకోవాలి. దీని ద్వారా ప్రజల అవసరాలు తీరుతాయి. మన అవసరాలు పోను మిగతా సరుకును ఎగుమతి చేస్తే రైతులు బాగుపడతారు. ఇందుకు అధికారులు ఏ పంట వేయాలనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు అందించాలి. ఏ పంటకు డిమాండ్ ఉందో గుర్తించి మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి చేయాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామంలో రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. మిర్చి వేసిన రైతులే కారం పట్టి అమ్మేలా, పసుపు కొమ్ములను పసుపుగా మార్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ శాఖ కూడా స్వరూపం మార్చుకోవాలని, అసవరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఏ ఉద్యోగి ఏ పని చేయాలనే విషయంలో జాబ్ చార్ట్ రూపొందించాలని ఆదేశించారు. భూముల లెక్కలు తీయండి వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు గ్రామాల్లో పర్యటించి, భూముల వివరాలు సేకరించా లని సీఎం ఆదేశించారు. ‘‘ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది? అందులో ఏ పంట సాగుచేస్తున్నారు? నీటి వసతి ఉందా? వానా కాలంలో ఏం పండిస్తారు? యాసం గిలో ఏం పండిస్తారు? సూక్ష్మ సేద్యం చేస్తు న్నారా? యంత్రాలు వాడుతున్నారా? భూ సార పరీక్ష చేయించారా? చేయిస్తే ఎలాంటి రకం నేల అని తేలింది? తదితర వివరాలన్నీ సేకరించాలి. ఇలా సేకరించిన వివరాల ఆధారంగానే రైతుకు పెట్టుబడి అందించ డంతో పాటు భవిష్యత్తులో రైతుకు సంబం ధించిన ఇతర కార్యక్రమాలు అమలు చే స్తాం. కాబట్టి వివరాలు కచ్చితంగా ఉండాలి. వాస్తవాలే ఉండాలి. తప్పుడు వివరాలు సేక రించినా.. తప్పుడు సమాచా రం అందిం చినా ప్రభుత్వం కఠినంగా వ్యవ హరిస్తుంది. వ్యవసాయాధికా రులు ప్రతీ రైతు దగ్గరికి వస్తారు. రైతులు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలి’’ అని పేర్కొన్నారు. -
తప్పనిసరి సబ్జెక్టుగా మలయాళం
తిరువనంతపురం: కేరళలో మాతృభాష మలయాళాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో (ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనుబంధమున్న స్కూళ్లు, సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) పదో తరగతి వరకు మలయాళంను తప్పనిసరిగా బోధించాలి. ఈ నిర్ణయం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ముఖ్యమంత్రి విజయన్ మీడియాకు తెలిపారు. మలయాళం బోధించని పాఠశాలలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కొత్త నియమాన్ని పాటించని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై రూ. 5 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. కానీ ఈ విషయంలో ఇతర రాష్ట్ర విద్యార్థులు, విదేశీ విద్యార్థులకు మినహాయింపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ పి.సదాశివం ఆమోదం తెలిపారు. -
ఆమోదం
► జల్లికట్టు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర ► జల్లికట్టు అభిమానుల ఆనందహేల ► ‘అల్లరి’ పోలీసులపై వేటు ► అల్లర్ల వెనుక కుట్ర : విపక్షాల ఆగ్రహం తమిళనాడు ప్రజలకు దేశ రాజధాని నుంచి సోమవారం శుభవార్త అందింది. ఈ శుభవార్త చెవిన పడగానే రాష్ట్ర ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడమే ప్రజల ఆనందానికి కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై కొన్నేళ్ల క్రితం విధింపబడిన నిషేధం రాష్ట్ర ప్రజలను తీరని ఆవేదనకు గురిచేసింది. ఆవేదన ఆగ్రహంగా మారి ఆం దోళనలకు దారితీసింది. మూడేళ్లుగా పొంగల్ పండుగ సమయాల్లో జల్లికట్టు ఆందోళనలు సాగుతూ చల్లారిపోతున్నాయి. అయితే ఈ ఏడాది జల్లికట్టు ఉద్యమంలోకి క్రీడాకారులు, అభిమానులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం రంగప్రవేశం చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ తీరమే వేదికగా చేసుకుని సాగించిన ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. తమ డిమాండ్‌ను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జల్లికట్టుపై పట్టుపట్టారు. భార్యా పిల్లలతో కుటుంబాలు సైతం మెరీనాతీరానికి తరలిరాగా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. జల్లికట్టు ఉద్యమంపై అడ్డంకులను తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. అయితే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి విద్యార్థి సంఘాల నేతలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆందోళనను విరమింపజేసేందుకు 23వ తేదీ తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు, ఉద్యమకారుల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రారంభమై లాఠీచార్జీ, భాష్పవాయి ప్రయోగాలు, గాలిలోకి కాల్పులు, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల దగ్ధం తదితర అవాంఛనీయ సంఘటనలవైపు ఉద్యమం మళ్లింది. చెన్నై మెరీనాతీరంలోని కొందరు ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన మరికొందరిని జైళ్లలోకి నెట్టారు. ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపగా జల్లికట్టు ఉద్యమకారులు ఇంటి బాట పట్టారు. అల్లర్ల సమయంలోనే జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ద్వారా రాష్ట్రపతికి చేరుకుంది. అలాగే ఆర్డినెన్స్ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం కాపీని సైతం రాష్ట్రపతికి పంపారు. దీంతో జల్లికట్టు ఉద్యమానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడంతో కథ సుఖాంతమైంది. ‘అల్లరి’ పోలీసులపై త్వరలో వేటు జల్లికట్టు అల్లర్లను అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన చెన్నై నగరంలో పలు విధ్వంసక చర్యలు చోటుచేసుకోగా వీటిల్లోని 35 సంఘటనలను కొందరు సెల్‌ఫోన్ ద్వారా వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టారు. రోడ్డు వారగా నిలిపి ఉన్న ఆటోకు ఒక మహిళా కానిస్టేబుల్ నిప్పుపెట్టడం, మరికొందరు పోలీసులు రోడ్లపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు వాట్సాప్‌ల ద్వారా ప్రసారం కావడం పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వాట్సాప్ దృశ్యాల ద్వారా పోలీసులను గుర్తించారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిలిచి ఉన్న ఒక ఆటోకు నిప్పుపెట్టిన మహిళా కానిస్టేబుల్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసినవారిపై త్వరలో సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది. రెండు వారాలు వాయిదా చెన్నై మెరీనాతీరంలో అల్లర్ల ఆరోపణలపై అరెస్టయిన వారికి బెయిల్ మంజూరుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ఈ నెల 23వ తేదీన పోలీసులు జరిపిన చర్చలకు సమ్మతించని ఉద్యమకారులు అల్లర్లకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 280 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీస్‌శాఖ చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి మహాదేవన్ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆగ్రహం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంలో ఉద్రిక్తతలు సృష్టిం చి కుట్రపూరితంగా అణచి వేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమంలో ఉద్దేశ పూర్వకంగా పోలీసులే అల్లర్లు సృష్టించారని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సోమవారం ఆరోపించారు. వారం రోజులపాటూ శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తున్న వారిని చెదరగొట్టే ఉద్దేశంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. పోలీసుల జోక్యానికి నిరసనగా ఉద్యమకారులు సముద్రతీరంలోకి వెళ్లగా వారికి రక్షణగా నిలిచిన మత్స్యకారులను సైతం అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. 23వ తేదీ జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన కోరారు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంపై పార్లమెంటులో గళం విప్పుతానని రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళి సోమవారం తెలిపారు. -
కేంద్రంవల్లే జల్లికట్టు
► రాష్ట్రంపై నిర్లక్ష్యం లేదు ► కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల జల్లికట్టు కోర్కెను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం ఇచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్డినెన్స్ సలహా, రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం తోడ్పాటు వల్లనే జల్లికట్టులోని అడ్డంకులు తొలగిపోయాయని ఆమె తెలిపారు. అలాగే వర్దా తుపాను సహాయం, జల్లికట్టు సాదనలో కేంద్రానికి ఎంతమాత్రం వివక్ష లేదని ఆమె అన్నారు. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జల్లికట్టు ఉద్యమం సాగుతున్న తరుణంలో సీఎం పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వచ్చినపుడు ప్రధాని మోదీ ఆయన్ను కలుసుకున్నారని, అలాగే పార్లమెంటు ఉపసభాపతి తంబిదురైతో జల్లికట్టు అంశంపై తాను సైతం అనేకసార్లు మాట్లాడానని తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి తంబిదురై సహా అన్నాడీఎంకే పార్లమెంటు బృందం ప్రధానిని కలవలేకపోవడాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కేంద్రం దూరంగా పెట్టిందని ఆరోపించడం సబబు కాదని అన్నారు. జల్లికట్టుకై ఆర్డినెన్స్ ను తీసుకురండి, తాము సహకరిస్తామని సలహా సీఎంకు ఇచ్చింది కూడా మోదీనేనని ఆమె చెప్పారు. సలహాతో సరిపెట్టక రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ ఆమోదానికి కూడా మోదీ చొరవచూపారని ఆమె తెలిపారు. జల్లికట్టుపై నిషేధం విధించి రెండేళ్లు కావస్తుండగా తమిళనాడు ప్రభుత్వం ఏనాడో నిర్ణయం తీసుకుని ఉండొచ్చుకదా, జాప్యానికి కేంద్రం కారణమా అని ఆమె ప్రశ్నించారు. జల్లికట్టు ఆర్డినెన్స్ కు సహకరించిన ప్రధాని మోదీపై తంబిదురై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజుల్లో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. జాతీయ పతాకాన్ని దగ్ధం చేయడం, మోదీ దిష్టిబొమ్మ దహనాలు ఎవరిపని అని ఆమె ప్రశ్నించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించేందుకు జరుగుతున్న విచారణలో వాస్తవాలు వెలుగుచూడగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు తప్పు చేసి ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. వర్దా తుపాను సహాయక చర్యల్లో సైతం కేంద్రం రాష్ట్రాన్ని పక్కన పెట్టిందని విమర్శలు సత్యదూరమని పేర్కొన్నారు. స్పష్టమైన ఆరోపణలు చేస్తే జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ప్రగతిశీల భారత్ సాధ్యమని అన్నారు. జల్లికట్టుకు తాము ఆమోదం తెలిపామని తమిళ కాంగ్రెస్ చెప్పడం శోచనీయమని అన్నారు. నిషే«ధానికి కారణమైన కాంగ్రెస్ అనుమతి ఎలా ఇవ్వగలదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అద్దాల భవనంలో కూర్చుని ఎదుటి వారిపై రాళ్లు విసరడం క్షేమం కాదని ఆమె హితవు పలికారు. -
రంకెలేసిన తంబి
► ఓ పక్క నిరసన..మరోపక్క రంకెలేసిన బసవన్న ► తెరుచుకున్న వాడి వాసల్ ► తిరుచ్చి, పుదుకోట్టైలలో జల్లికట్టు జోరు ► పుదుకోట్టైలో ఇద్దరి బలి ► అలంగానల్లూరులో సీఎంకు వ్యతిరేకత ► పోటెత్తిన మెరీనా తీరం నిషేధపు కట్లు తెంచుకున్నా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జల్లికట్టు విషయంలో తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. శాశ్వత పరిష్కార నినాదం మిన్నంటింది. అత్యవసర ఆర్డినెన్స్ తో ఆదివారం కొన్నిచోట్ల బసవన్నలు రంకెలే శాయి. మరెన్నో చోట్ల వ్యతిరేకత తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం పన్నీరు సెల్వం వెనుదిరగాల్సి వచ్చింది. పుదుకోట్టైలో నిర్వహించిన సాహసక్రీడలో రంకెలేసిన ఎద్దుల దాడిలోఇద్దరు క్రీడాకారులు బలి అయ్యారు. సాక్షి, చెన్నై : తమిళుల సాహస, సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు పట్టు బడుతూ సాగుతున్న నిరసనల గురించి తెలిసిందే. మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుతూ శనివారం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. కంటి తుడుపుచర్యతో మాకేంటి, శాశ్వత పరిష్కారం లక్ష్యం అంటూ జల్లికట్టు మద్దతు ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. సెలవు రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తినా, ఎక్కడికక్కడ బలగాల్ని మోహరింప చేస్తుండడం గమనార్హం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగి తీరుతామని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. ఇక, ఆర్డినెన్స్ తో ఆదివారం జల్లికట్టుకు శ్రీకారం చుట్టి తీరుతానంటూ ముందుకు సాగిన సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులకు వ్య తిరేకత తప్పలేదు. అలంగానల్లూరులో సీఎం పన్నీరు సెల్వం పాచికలు పారలేదు. అన్ని చో ట్ల వాడి వాసల్ తెరచుకున్నా, కొన్ని చోట్ల మా త్రమే బసవన్నలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి. అటు ఆట : నిషేధపు కట్లు తెంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దక్షిణాదిలోని జల్లికట్టుకు పేరు గడించిన తిరుచ్చి, మదురై, దిండుగల్, శివగంగై జిల్లాల్లో, డెల్టా పరిధిలోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో జల్లికట్టుకు, పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నామక్కల్‌లలో రెక్లాతో ఎడ్ల పందేలకు చర్యలు తీసుకున్నారు. ఆటకు తగ్గ అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగినా, వ్యతిరేకత మాత్రం తప్పలేదు. తిరుచ్చి మనప్పారైలో మూడు, నాలుగు రోజులుగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, కట్లు తెంచుకోవడంతో ఆదివారం మరింత ఉత్సాహంతో జల్లికట్టులో ఎద్దులతో కలిసి క్రీడాకారులు రంకెలు వేస్తూ తమ సత్తాను చాటుకున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను నిర్వాహకులు అందజేశారు. పుదుకోట్టైలోని ఇలుపురు సమీపంలోని రాపూసల్ గ్రామంలో జల్లికట్టును మంత్రులు విజయభాస్కర్, పాండియరాజన్ ప్రారంభించారు. వాడివాసల్ నుంచి ఎద్దులు దూసుకొచ్చాయి. ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో జల్లికట్టు సాగింది. అయితే, ఎద్దుల్ని పట్టుకునే క్రమంలో లక్ష్మణ పట్టికిచెందిన మోహన్, ఉడుక్కురుకు చెదిన రాజా అనే క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ప్రాంతంలో మరో యాభై మంది స్వల్పం గా గాయపడ్డారు. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడంతోనే భద్రత కరువైందని, పాలకుల తీరుతో ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయని సహచర క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, రామనాథపురంలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో రెండు రోజులుగా జల్లికట్టు సాగినా, ఆదివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎద్దులు దూసుకొచ్చాయి. ఇక, కోయంబత్తూరు కొడీస్సియా మైదానంలో రెక్లా పోటీలను మంత్రి ఎస్పీ వేలుమణి జెండా ఊపి ప్రారంభించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో రెక్లా పోటీలను మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. రెక్లా పోటీలకు వచ్చిన మంత్రులకు జల్లికట్టు మద్దతు దారుల సెగ తగిలింది. వారిని బుజ్జగించి బయట పడేలోపు మంత్రులకు ముచ్చెమటలు తప్పలేదు. ఇటు పట్టు : జల్లికట్టుకు ప్రసిద్ది గాంచిన అలంగానల్లూరులో ‘ఆట’కు శ్రీకారం చుట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే సాగాయి. శాశ్వత పరిష్కారం నినాదంతో వాడివాసల్ వైపుగా ఏ ఒక్కర్నీ యువత, గ్రామస్తులు, మద్దతుదారులు వెళ్లనివ్వ లేదు. జల్లికట్టుకు జెండా ఊపుతానంటూ మదురైకు రాత్రికి రాత్రే పరుగులు తీసిన సీఎం పన్నీరుసెల్వం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. జోరు వాన కురిసినా మద్దతుదారులు ఏ మాత్రం వెనక్కు తగ్గని దృష్ట్యా, ఆగమేఘాలపై జల్లికట్టు నిర్వాహకుల్ని పిలిపించి బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఫలితం శూన్యం. వాడివాసల్ తెరిచే ఉందని, ప్రజలు ఎప్పుడు కోరితే, అప్పుడు జల్లికట్టుకు సిద్ధమని మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు ప్రకటించారు. దిండుగల్ జిల్లా నత్తం, సాత్తూరు, సేలం ఆత్తూరు, తంజావూరులో జల్లికట్టుకు ఏర్పాట్లు సాగినా, వ్యతిరేకతతో రద్దు చేసుకోక తప్పలేదు. ఇక, జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సెలవు రోజు పెద్ద ఎత్తున జన సమూహం తోడు కావడం విశేషం. ఈరోడ్‌లోని వీరప్పన్ పాళయంలో బీజేపీ నేతృత్వంలో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీ శాయి. యువత తిరగ బడడంతో, ఓ సందర్భంలో రాళ్లు రువ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు, బీజేపీ వర్గాలు పరుగులు తీశారు. మదురై మేలూరులో వర్షంలోనూ నిరసన కొనసాగగా, రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు మద్దతు ఉద్యమంలో శాశ్వత పరిష్కారం నినాదం మిన్నంటింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా స్పం దించిన జంతు సంరక్షకుడు రాధా రాజన్ ఇరకాటంలో పడ్డారు. బీసెంట్‌నగర్‌లోని ఆయన ఇంటిని డీఎండీకే వర్గాలు ముట్టడించాయి. ఇదే శాశ్వతం : అలంగానల్లూరులో జల్లికట్టుకు జెండా ఊపేందుకు వెళ్లి నిరాశతో చెన్నైకు చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రూపొందించిన ఆర్డినెన్స్ శాశ్వతం అని, ఇది తాత్కాళికం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. అన్ని చోట్ల వాడివాసల్ తెరచుకుందని, జల్లికట్టుకు అనుమతుల్ని కలెక్టర్లు ఇస్తున్నారని, జిల్లాల ఎస్పీలు భద్రతను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చట్ట, నిబంధనలమేరకు ముందుకు సాగుతోందని, ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి , రాష్ట్రపతి ఆమోదం పొంది తీరుతామని స్పష్టం చేశారు. అత్యవసరంగా తీసుకొచ్చిన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ నియమ నిబంధనలు సిద్ధం అయ్యాయని, ప్రభుత్వ గెజిట్‌లో అన్ని వివరాలను ప్రకటించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టు మద్దతుదారులు ఎందుకు ఏకీభవించడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ› ఆ కారణం ఏమిటో మీకే తెలుసు అంటూ పన్నీరు ముందుకు సాగారు. ఇక, ఆర్డినెన్స్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని రీతిలో సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉండడం ఆహ్వానించ దగ్గ విషయం. సరైన వివరణ ఇవ్వండి : జల్లికట్టు కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే, ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చి ఉండేది కాదన్నారు. అయితే, ఇదే శాశ్వతం అని ప్రకటనలు చేయడం కాదు అని, ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ పూర్తి వివరణను సీఎం పన్నీరుసెల్వం జల్లికట్టు మద్దతు దారులుకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా మద్దతుదారుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు. గతంలో జల్లికట్టు విషయంగా సాగిన నాటకీయ నిర్ణయాలతోనే ప్రస్తుతం, ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టుమద్దతు దారులు ఏకీభవించడం లేదన్న విషయాన్ని సీఎం గుర్తెరగాలని హితవు పలికారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా నినాదం మిన్నంటింది. ఆదివారం ఎక్కడిక్కడ ఆందోళనలు సాగాయి. చెన్నై మెరీనా తీరంలో జన సందోహం పోటెత్తింది. యువత, విద్యార్ధులు ఆందోళనల బాటలో ఉదృ్ధతంగా దూసుకెళ్తుండడంతో సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్నడం గమనార్హం. దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. మార్చి 31వరకు సంయమనం పాటిద్దాం. అంతవరకు ఉద్యమాన్ని వాయిదా వేద్దామంటూ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జల్లికట్టు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నిర్వాహకులు చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నిర్వాహకులు చెన్నై ప్రెస్‌క్లబ్ వేదికగా ఈ ప్రకటన చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చే రీతిలో ఉండడం గమనార్హం. అదే సమయంలో వీరి చర్యలను తప్పుబట్టేవారు తెరమీదకు వస్తున్నారు. దీంతో జల్లికట్టు ఉద్యమం సోమవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కొందరు విద్యార్థులయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని మెరీనాతీరంలో బైఠాయించారు. -
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
-
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
చెన్నై: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్ పడింది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలవుతుందనుకున్న వేళ మరోసారి అంతరాయం ఏర్పడింది. అయితే, ఈసారి అడ్డుకుంది మాత్రం తమిళ తంబీలే. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అనే విషయం తెలిసిందే. మూగజీవాలను ఈ ఆట పేరుతో వేధిస్తున్నారని పెటా కోర్టుకు ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు వెళ్లడంతో గత మూడేళ్లుగా ఈ క్రీడపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ఈసారి తమిళులలంతా ఒక్కటై తమ సంప్రదాయ క్రీడకు అడ్డుచెప్పొద్దని నినదిస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య మద్దతులభించడంతోపాటు ఆందోళన ఉదృతం అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆట నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా దానిని గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభమైంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభించేందుకు రాగా జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ క్రీడను ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి సెల్వం అలంగానల్లూరు నుంచి వెనుదిరిగారు. విద్యార్థులతో ఆయన మధ్యాహ్నం భేటీ అవనున్నారు. మరోపక్క, మంత్రులు కూడా ఉదయం 11గంటల ప్రాంతంలో తమ జిల్లాలో ఈ క్రీడను ప్రారంభించాల్సి ఉండగా అక్కడ కూడా నిలిచిపోయాయి. -
లంఘించిన బసవన్నలు.. జల్లికట్టూ షురూ
-
కట్టు తెంచుకున్న జల్లికట్టు
-
కట్టు తెంచుకున్న జల్లికట్టు
• తమిళనాడు ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం • నేడు ఆటను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం • సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటున్న నిరసనకారులు • అప్పటి వరకు మెరీనా బీచ్ నుంచి కదలబోమని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే. మెరీనా బీచ్‌లో నిరసనలో ప్లకార్డు చేతపట్టుకున్న చిన్నారి జంతుహింస నిరోధక చట్టం–1960లోని ప్రదర్శన జంతువుల(పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనికి రాష్ట్రపతి తెలిపిన ఆమోదం శుక్రవారం రాత్రి తమకు చేరిందని, ఆటపై నిషేధం తొలగినట్లేనని సీఎం తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారమని, దీని స్థానంలో బిల్లును, జంతుహింస నిరోధక చట్టానికి సవరణను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఆట విషయంలో మద్దతిచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఫోన్లోనూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగని నిరసనలు ఆర్డినెన్స్‌పై జల్లికట్టు మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కావాలని, అంతవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత పరిష్కారం లభించేంతవరకు బీచ్ నుంచి కదలబోమని అక్కడున్న 2 లక్షల మంది ఉద్యమకారులు చెప్పారు. జల్లికట్టుకు మద్దతుగా వళ్లువర్‌కోట్టంలో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నిరాహార దీక్ష చేశారు. అన్ని యత్నాలూ చేస్తున్నాం: మోదీ తమిళ ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. సుసంప్ననమైన తమిళనాడు సంస్కృతిని చూసి గర్వపడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పెటాకు సూర్య నోటీసులు జల్లికట్టుకు తాను మద్ధతు ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థ (పెటా) నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సూర్య స్పందించారు. జల్లికట్టు పోరాటానికి సూర్య వంత పాడటం ఆశ్చర్యంగా ఉందని, తన సినిమా ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నారని సంస్థ నిర్వాహకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సూర్య తన న్యాయవాది ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు. -
తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు
తక్షణ ఆర్డినెన్స్‌కు స్టాలిన్ డిమాండ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుపై నిషేధాన్ని ఉల్లంఘిస్తూ మదురై సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం జల్లికట్టు నిర్వహించారు. జల్టికట్టు కోసం చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో భాగంగా కొందరు యువకులు ఐదు ఎద్దుల్ని మైదానంలోకి వదిలారని స్థానిక పోలీసులు చెప్పారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలంటూ చెన్నైలో జరిగిన ఆందోళనలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై స్టాలిన్ ధ్వజమెత్తింది. సినీ నటులు, ఇతరులను కలిసేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ ఏఐఏడీఎంకే ఎంపీలకు మాత్రం సమయం కేటాయించలేదని స్టాలిన్ విమర్శించారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఇప్పటికైనా ఆలోచిస్తారా?
సామాన్యులకు రంగుల ప్రపంచాన్ని వాగ్దానం చేసి, ఆశల్ని కల్పించి అందల మెక్కుతున్నవారు క్రియకొచ్చేసరికి వారిని దగా చేస్తున్న దాఖలాలు దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకొచ్చి ఆర్నెల్లు దాటకుండానే 2013 నాటి భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది మురిగిపోయిన ప్రతిసారీ ప్రాణప్రతిష్ట చేస్తూ మూడుసార్లు సరికొత్త ఆర్డినెన్స్‌లు పుట్టించింది. చివరకు బిహార్ ఎన్నికలు ముంగిట్లోకొచ్చాక, ప్రజానీకంనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యాక అయిష్టంగానే ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పింది. ఆ చట్టం సరిగా లేదనుకుంటే రాష్ట్రాలే మార్పులు చేసుకోవచ్చు నంటూ 2015 జూలైలో జరిగిన నీతిఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పాక చాలా రాష్ట్రాలు ఆ పనిలోబడ్డాయి. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు అందరి కన్నా ముందున్నాయి. ఉమ్మడి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేసిన జీవో 123 అలా పుట్టుకొచ్చిందే. తెలంగాణ సర్కారు 2015 జూలైలో తీసుకొచ్చిన ఈ జీవో అయినా... ఈమధ్యే శాసనసభ ఆమోదం పొందిన తెలంగాణ రాష్ట్ర భూసేకరణ (సవరణ) బిల్లు–2016 అయినా మురిగిపోయిన కేంద్ర ఆర్డినెన్స్‌కు దగ్గరవే. ఇలాంటి బిల్లునే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని మొన్న ఆగస్టులో చట్టంగా మార్చుకుంది. అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు మాయ చేయడంలో అందరినీ మించిపోయింది. భూసమీ కరణ పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నట్టు ప్రచారం చేసుకుని ఇప్పటికే 34,000 ఎకరాలు తన ఖాతాలో వేసుకుంది. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో పది లక్షల ఎకరాల భూమిని ఒడిసి పట్టి ‘ల్యాండ్ బ్యాంక్’ను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ తంతు ఎలా సాగబోతున్నదో అమరావతి ప్రాంత రైతుల దీనావస్థను చూసినా... తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ సంస్థ కోసం 500 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన జీవోను గమనించినా, పశ్చిమగోదావరిలో గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరే కిస్తున్న పల్లెలపై అమలవుతున్న నిర్బంధాన్ని చూసినా అర్ధమవుతుంది. ప్రజా ప్రయోజనం పేరిట ఈ దేశ పౌరులపై దాదాపు ఏడు దశాబ్దాలుగా స్వారీ చేసిన 1894 నాటి భూసేకరణ చట్టం కోట్లాదిమందిని నిర్వాసితులుగా మార్చింది. ఒకసారి ప్రభుత్వం దేనికైనా ‘ప్రజా ప్రయోజనం’ ముద్రేస్తే ఆ ముసు గులో విలువైన పంట భూముల్ని, జనపదాల్ని, అరణ్యాలను, కొండప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఆ చట్టం లైసెన్స్నిచ్చేది. పర్యవసానంగా ఆయా ప్రాంతాల వనరులను వినియోగించుకునే, వాటి ఆధారంగా ఉపాధి పొందే లక్ష లాదిమంది జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఇందులో అధిక శాతంమంది ఆది వాసీలు, దళితులు, నిరుపేద గ్రామీణులు, బక్క రైతులే. తమ చర్యల కారణంగా సర్వస్వం కోల్పోతున్నవారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా ప్రభుత్వాలకు లేక పోయింది. ఒక అంచనా ప్రకారం స్వాతంత్య్రానంతరం ఆ చట్టం వల్ల నిర్వాసి తులైనవారి సంఖ్య 6 కోట్లపైమాటే! వారిలో కనీసం 20 శాతంమందికి కూడా ఇప్పటివరకూ పునరావాసం దక్కలేదు. అంతక్రితం మాటేమోగానీ నర్మదా బచావో, పోస్కో ఉద్యమాలు ఈ నిలువుదోపిడీని నిలదీశాయి. నేలతల్లితో తమ పేగుబంధాన్ని తెంచుతున్న దుష్ట పోకడలపై సింగూరు, నందిగ్రామ్, భట్టాపర్సాల్ వంటి చోట్ల బడుగు జీవులు, బక్క రైతులు తిరగబడ్డారు. తమ ప్రాణాలొడ్డి ప్రతిఘ టించారు. ఈ పరిణామాలన్నిటి తర్వాత ఆ చట్టం మార్చాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయినా ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత 2013లోగానీ కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు. ఈ చరిత్రంతా గమనిస్తే 2013 చట్టం పాలకుల భిక్ష కాదని, అది అసహా యులైన ప్రజానీకం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న హక్కని అర్ధమవుతుంది. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదట్లో తానిచ్చిన హామీల నుంచి వెనక్కు తగ్గింది. బిల్లు రూపకల్పన దశలో ఉన్న కొన్ని మంచి అంశాలు పార్లమెం టులో ప్రతిపాదించేనాటికి మాయమయ్యాయి. మరికొన్ని నీరుగారాయి. పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతంలోని ప్రజల్లో 80 శాతంమంది ఆమోదిస్తేనే భూసేకరణ ఉంటుందన్న నిబంధన కాస్తా భూమిని కోల్పోయేవారిలో 80 శాతంమంది ఆమోదం సరిపోతుందని మారింది. ఒక పరిశ్రమ ఏర్పాటైనప్పుడు నేరుగా నష్టపో యేది భూ యజమానులే అయినా ఆ ప్రాంతంలో నివసించేవారు, అక్కడ జీవించే వారి పరిస్థితేమిటన్నది 2013 చట్టం పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం 5 కేటగిరీల కింద, ‘ఇతర ప్రజా ప్రయోజనాల’కింద స్వాధీనం చేసుకుంటే ఇవేమీ వర్తించవు. ఆ చట్టమే పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదనుకుంటుంటే...దాని స్థానంలో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలైనా, బిల్లులైనా అందులోని మంచి అంశాలను సైతం మింగేస్తున్నాయి. సామాజిక ప్రభావ మదింపు (ఎస్ఐఏ), రెండు లేదా అంతకుమించి పంటలు పండే భూముల సేకరణపై ఉన్న ఆంక్షలను బేఖాతరు చేస్తున్నాయి. గుజరాత్ చట్టం చూసినా, తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బిల్లు చూసినా వాటి మూలాలు ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో కనబడ తాయి. గుజరాత్ తెచ్చిందని, కర్ణాటక తీసుకురాబోతున్నదని వాదిస్తూ తమ చర్యకు సహేతుకత కోసం సాగునీటి మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా చెప్పి ఆయా పార్టీల వారిని నోరుమూయించ వచ్చునే మోగానీ జనం నోళ్లెలా మూయిస్తారు? అలా వాదించడానికి ముందు ఈ మాదిరి అంశాలే ఉన్న కేంద్ర ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమ య్యాయో, చివరికది చట్టంగా ఎందుకు రూపుదిద్దుకోలేదో తెలుసుకుంటే మంచిది. ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలను గమనించాకైనా తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను పునఃసమీక్షించుకోవాలి. రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజానీకం చేస్తున్న ఆందోళనలను సానుభూతితో అర్ధం చేసుకోవాలి. -
రెండోసారి ఆర్డినెన్స్ అన్యాయం
సుప్రీం కోర్టు మండిపాటు న్యూఢిల్లీ: ఒక ఆర్డినెన్స్‌ను తిరిగి ప్రకటించడం రాజ్యాంగాన్ని దగా చేయడం, ప్రజాస్వామిక శాసస ప్రక్రియను నాశనం చేయడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్డినెన్స్ ప్రకటనకు రాష్ట్రపతి లేదా గవర్నర్ తెలిపే సంతృప్తికి న్యాయసమీక్ష నుంచి రక్షణ లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బెంచ్ సోమవారం 6:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు చెప్పింది. ‘ఆర్డినెన్స్‌కు కూడా చట్టసభ చేసే చట్టానికి ఉన్నంత శక్తి ఉంటుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర చట్టసభల ముందు ఆర్డినెన్స్‌ను ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన’ అని మెజారిటీ జడ్జీల తరఫున జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. బిహార్ సర్కార్ ఒక ఆర్డినెన్స్‌ను 4సార్లు ప్రకటించిన కేసును కోర్టు విచారిస్తోంది. -
పాత నోట్లు : జరిమానాకు రాష్ట్రపతి ఓకే
న్యూఢిల్లీ: మార్చి 31 తర్వాత రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు భారీ ఎత్తున కలిగి ఉన్నవారిపై జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30 శుక్రవారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి గడువు ముగియడం, శీతాకాల విడిది కోసం గత పది రోజులుగా హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకోవడం, ఆ వెంటనే కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు ఆయన ఆమోదం తెలపడం వెనువెంటనే జరిగిపోయాయి. తాజా ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా జరిమానా విధించనున్నారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. (చదవండి : పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!) గత నవంబర్ 8 నుంచి పెద్ద నోట్లను రద్దు చేయగా, అప్పటి నుంచి వాటిని డిపాజిట్ చేసే గడువు పూర్తయ్యే వరకు విదేశాల్లో ఉండిపోయిన వారికి మాత్రం మరో అవకాశం కల్పించారు. అలాంటి వాళ్లు వచ్చే మార్చి 31 వరకు తమ పాత నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే విదేశాల్లో ఉన్న భారతీయ కరెన్సీ తెచ్చుకోవాలంటే అందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఒక్కో వ్యక్తి 25 వేల రూపాయలకు మించి తెచ్చుకోవడానికి వీలులేదు. పైగా ఎయిర్ పోర్టుల్లో వాటిని విధిగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైనా తప్పుగా నమోదు చేస్తే మాత్రం 50 వేల రూపాయల జరిమానా లేదా దానికి అయిదింతల మేరకు జరిమానా ఉంటుంది. నేపాల్, భూటాన్ దేశాల నుంచి తీసుకురావాలనుకుంటే వారికి ఫెమా చట్టం పరిధికి లోబడి మాత్రమే అనుమతిస్తారు. -
పాత నోట్లుంటే జైలే!
‘ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ పెద్ద మొత్తంలో పాత నోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు? ♦ పదికి మించి పాత నోట్లు ఉంటే రూ.పది వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు.. ఏది ఎక్కువైతే అది జరిమానా ♦ జనవరి 1–మార్చి 31 తేదీల మధ్య తప్పుడుసమాచారంతో నగదు డిపాజిట్ చేస్తే రూ.5 వేలు లేదా ఆ డిపాజిట్ మొత్తానికి ఐదింతల జరిమానా ♦ రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అమలులోకి.. ఆ నోట్లుంటే నేరం.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం క్రిమినల్ నేరం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షార్హం. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లకే అనుమతి జరిమానా.. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. జైలు శిక్ష కూడా.. మార్చి 31 తర్వాత రద్దయిన పెద్ద నోట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం? జనవరి 1 – మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సదరు మొత్తానికి ఐదు రెట్లు జరిమానా నోట్ల డిపాజిట్ల లెక్క రూ.15.4 లక్షల కోట్ల రద్దు చేసిన నోట్లలో ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరింది.. రూ. 14 లక్షల కోట్లు న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. పెద్ద నోట్లు ఉంటే భారీగా జరిమానా.. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నిర్దిష్ట రిజర్వ్‌బ్యాంకు కార్యాలయాల్లో నిర్దేశిత పత్రాలను సమర్పిం చి మార్చి 31 వరకు నగదు డిపాజిట్ చేసేం దుకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. విదేశాల్లో ఉన్న వారికి.. మారు మూల ప్రాంతాల్లో పనిచేసే భద్రతా బలగాల్లో పని చేసే వారికి.. సరైన కారణం చూపించే ఇతరు లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. నాలుగేళ్ల జైలు శిక్ష!: మార్చి 31 తర్వాత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే ప్రతిపాదన కేబినెట్ ముందుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులకు తిరిగి చేరని రద్దయిన నోట్లను రప్పించడానికి చట్టబద్ధమైన మద్దతును అందించేందుకు ఆర్బీఐ చట్టానికి సవరణలు చేయడానికి తాజా ఆర్డినెన్స్ ఉపకరించనుంది. అలాగే నోట్ల రద్దుకు సంబంధించి నవంబర్ 8న జారీ చేసిన నోటిఫికేషన్ సరిపోదని, ఆర్బీఐకి జవాబుదారీతనం కల్పించేందుకు.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఆయన ఆమోదం లభించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిన తర్వాత ఆరు నెలల కాలంలో పార్లమెంట్ దీనిని చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000/10,000 నోట్లను రద్దు చేసినప్పు డు కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌నే తెచ్చారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ‘ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం’కింద రూ.11,724.53 కోట్ల వ్యయంతో 5,400 కి.మీ రోడ్లు, 126 చిన్న వంతెనల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.7034.72 కోట్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. రుణాల చెల్లింపునకు మరో 30 రోజుల గడువు ముంబై: పెద్ద నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరికొంత వెసులుబాటు ఇచ్చింది. రుణాలు తిరిగి చెల్లించేం దుకు ఇప్పటికే 60 రోజుల అదనపు గడువు ఇచ్చిన ఆర్బీఐ తాజాగా దానిని మరో 30 రోజులు పొడిగించి 90 రోజులు చేసింది. రూ.కోటి లోపు విలువైన, నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్యన తిరిగి చెల్లించాల్సి ఉన్న పంట, గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. నోట్ల రద్దు వల్ల అనేక మంది వ్యాపారులు, ప్రజలు తమకు రావాల్సిన నగదును పొందలేకపోయారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల వంటి లావాదేవీలు కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అదనపు గడువిచ్చారు. -
రద్దైన పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే !
-
పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత నోట్లు రూ.500, రూ.1000 బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉంచుకున్నవారిపై లీగల్‌గా చర్యలు తీసుకునేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టాన్ని సవరించాలని భావించిన ప్రభుత్వం, గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వర్తించలేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని మోదీ, వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 30వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు దగ్గరపడుతుండటంతో పాత నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై జరిమానాలు విధించేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని అంతకముందే కేంద్రం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మేరకు బుధవారం కేబినెట్ సమావేశమై, ఆర్డినెన్స్ ను ఆమోదించింది. -
10 వేల కంటే ఎక్కువ ఉంటే జరిమానా!
-
10 వేల కంటే ఎక్కువ ఉంటే జరిమానా!
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ నెల 30వ తేదీ తర్వాత వ్యక్తుల వద్ద 10 వేల రూపాయల వరకు మాత్రమే పాతనోట్లను ఉంచుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకుమించి ఎవరి దగ్గరైనా ఉంటే 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది. పాత నోట్ల రద్దుపై ఆర్డినెన్స్‌లో కేంద్రం ప్రభుత్వం నియమాలను పొందుపరచనుంది. కంపెనీలు, సంస్థల దగ్గర పాతనోట్లను ఉంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. గత నెల 8న 500, 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. త్వరలో ఈ గడువు ముగియనుంది. -
పెద్దనోట్లపై మరో షాకింగ్ న్యూస్..!
-
రద్దయిన నోట్లుంటే జరిమానా!
ఆర్డినెన్స్ యోచనలో కేంద్రం న్యూఢిల్లీ: డిసెంబర్ 30 తర్వాత కూడా రద్దయిన పాత పెద్ద నోట్లను తమ వద్దే అట్టిపెట్టుకున్న వారిపై జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేవాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 30 తర్వాత చెరో పది లేదా అంతకంటే ఎక్కువ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు తమ వద్ద ఉంచేసుకున్న వారిపై జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఎక్కువగా నోట్లు అట్టిపెట్టుకున్న వారిపై రూ.50వేల జరిమానా లేదా దాచుకున్న నగదువిలువకు ఐదురెట్లు జరిమానా విధించే వీలుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతాపార్టీ 1978లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దుచేసినపుడు సైతం ఇలాంటి ఆర్డినెన్స్‌నే జారీచేసింది. ‘లక్కీ డ్రా’ విజేతలు 15 వేలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా తెచ్చిన లక్కీ డ్రా పథకానికి సంబంధించి 15 వేల మంది విజేతలను ఎన్పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్) ఎంపిక చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 మధ్య లక్కీ డ్రా కోసం ఎన్పీసీఐ నిర్దేశించిన పద్ధతుల్లో 8 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి నుంచి 15 వేల మంది విజేతలను ఎంపిక చేశారు. వీరందరి బ్యాంకు ఖాతాల్లో మరో 24 గంటల్లో రూ.1,000 జమ చేస్తామని ఎన్పీసీఐ తెలిపింది. రూపే కార్డు, యూఎస్ఎస్డీ, యూపీఐ, ఏఈపీఎస్ విధానాల్లో చెల్లింపులు చేసే వినియోగదారులు లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హులని ఎన్పీసీఐ గతంలో ప్రకటించింది. విజేతల జాబితాను www. digidhanlucky. mygov. in వెబ్సైట్లో చూడవచ్చు. -
ఐదోసారి వచ్చిందని అప్సెట్ అయ్యారు!
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఒక సవరణ బిల్లును ఇప్పటి వరకు చట్టంగా మార్చకుండా పదేపదే ఆర్డినెన్స్‌గా తన వద్దకు పంపించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండుకాదు.. ఒక ఆర్డినెన్స్‌గా రాష్ట్రపతి వద్దకు ఆ బిల్లు రావడం అది ఐదోసారి. ఇంతకీ ఏమిటా బిల్లు అని అనుకుంటున్నారా? శత్రువుల ఆస్తుల చట్టానికి సవరణ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు ఆర్డినెన్స్‌కు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ నాలుగుసార్లు ఆమోదముద్ర వేశారు. గతంలో వచ్చినప్పుడే కేంద్రం ఇప్పటి వరకు ఈ ఆర్డినెన్స్‌ను ఎందుకు చట్టంగా మార్చలేదని ప్రశ్నించినట్లు సమాచారం. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లేకుండానే ఆసమయంలో ఆయన వద్దకు అది వచ్చిందట. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు నిర్ణీత కాలం తీరేలోగానే చట్టంగా మార్చుకుంటే మంచిదని, అలా కాకుండా ఇలా పదేపదే ఆర్డినెన్స్‌గా మంజూరుచేయించుకుంటే దొడ్డిదారిని ఆ చట్టాన్ని అమలు చేస్తున్నట్లవుతుందని కూడా రాష్ట్రపతి అన్నట్లు సమాచారం. ఈ చట్టం 48 ఏళ్ల కిందటిది. ఇందులో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ బిల్లు సవరణకు లోక్ సభ ఓకే చెప్పింది కానీ, విపక్ష సభ్యులు మాత్రం రాజ్యసభలో అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఆర్డినెన్స్ ద్వారానే అమలు చేస్తోంది. -
జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్
• కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన దత్తాత్రేయ • చెక్కులు, ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు జీతాల చెల్లింపునకు కేంద్రం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతితో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. న్యూఢిల్లీ: తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ కోసం జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన చెల్లింపు చట్టం–1936లోని 6వ భాగాన్ని సవరించేందుకు ఇటీవల సవరణ బిల్లు–2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. కేబినెట్ భేటీ తర్వాత కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘దీనికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరిశ్రమలను నోటిఫై చేశాక యాజమాన్యాలు జీతాలను నగదుగా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పారు. అయితే బిల్లులో మాత్రం.. ఉద్యోగులకు జీతాలను చెక్కు లేదా వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ చేయాల్సిన పరిశ్రమలేమిటో వివరిస్తూ సంబంధిత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయొచ్చనడం గమనార్హం. నెల జీతం రూ. 18 వేలకు మించని కొన్ని సంస్థల ఉద్యోగులు ప్రస్తుతం వేతన చెల్లింపుల చట్టపరిధిలో ఉన్నారు. రైల్వే, విమానయాన రవాణ సంస్థలు, గను లు, చమురు క్షేత్రాలు తదితర సంస్థలకు సంబంధించి వేతనాల చెల్లింపు నిబంధనలను కేంద్రం, మిగతా సంస్థల విషయంలో రాష్ట్రాలు మార్చొచ్చు. ⇔ 20కిపైగా సామాజిక, ఆర్థిక సంస్థలకు రద్దు చేసిన భూకేటాయింపులను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన కేబినెట్ అజెండాలో చోటుచేసుకుంది. ఈ సంస్థల్లో అత్యధికం ఆరెస్సెస్ అనుబంధ సంస్థలని తెలుస్తోంది. -
జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో కేంద్రం జీతాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాల్లో పనిచేసే వారికి జీతాలను చెక్కులు లేదా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ‘ఈమేరకు 1936 నాటి వేతన చెల్లింపుల చట్టానికి సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ఆ బిల్లును 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదించడానికి యత్నిస్తారు. మరో రెండు నెలలు వేచి ఉండేందుకు బదులు ఆర్డినెన్స్ తెచ్చి, ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసుకోవచ్చు.’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. -
కేసులు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్
* ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకు మార్పు * హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ జారీ చేయకపోతే.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించడంతో రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు కిరణ్‌కుమార్, పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తూ.. ఏపీఏటీ పరిధి నుంచి తెలంగాణ కేసులను హైకోర్టుకు బదిలీ చేసేందుకు ఆర్డినెన్స్ తెస్తామని విన్నవించారు. దీంతో ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా శాసనసభ సమావేశాలను దసరా తర్వాత నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ గురువారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. -
సైబరాబాద్ కమిషనరేట్లకు రాజముద్ర
* సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ విభజన, పరిధి పెంపు ఇక అధికారికం * గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన గవర్నర్ * జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఆర్డినెన్స్ * ఇక నూతన కమిషనరేట్ల నుంచే కొత్త ఠాణాల పాలన సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల విభజన, పరిధి పెంపు పరిపూర్ణమైంది. జూన్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్గా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శని వారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 కమిషనరేట్ల పరిధి, విధివిధానాలకు సంబంధించిన చట్టాన్ని శాసనసభ ఆమోదించాల్సి ఉండటం.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల కోణంలో దీని ఆవశ్యకతను గుర్తించి గవర్నర్ ‘రాజముద్ర’ వేశారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ ఊపందుకుంటుండటంతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగాఅవసరాలను బట్టి ఇతర జిల్లాలోని ఠాణాలను కలుపుకునేలా, లేదంటే ఇతర ప్రాంత పరిధిలోకి ఠాణాలు ఇచ్చేలా అధికారాలు కల్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తాజా ఆర్డినెన్స్ ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ ఎం.భగవత్, సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్ చంద్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు. సైబరాబాద్ ఈస్ట్‌లోకి భువనగిరి జోన్.. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లు ఉండగా తాజాగా భువనగిరి జోన్ వచ్చి చేరనుంది. భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్లో మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు ఉంటాయి. ఎల్బీనగర్ జోన్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్కేసర్ పోలీసుస్టేషన్లతో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్లోకి వచ్చాయి. మ ల్కాజ్గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా పిలుస్తారు. శంషాబాద్ జోన్లోకి షాద్‌నగర్ డివిజన్.. సైబరాబాద్ వెస్ట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండనున్నాయి. శంషాబాద్ జోన్లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ చేరనుంది. మాదాపూర్ జోన్లో మాదాపూర్, కూకట్పల్లి డివిజన్లతో పాటు కొత్తగా మియాపూర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బాలానగర్ జోన్లో పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు ఉంటాయి. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్జీఐ పోలీసు స్టేషన్లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవేళ్ల, షాబాద్ ఠాణాలు చేరనున్నాయి. బాధ్యత మరింత పెరిగింది.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇతర జిల్లాల్లోని మరిన్ని ఠాణాలు మా పరిధిలోకి రానుండటంతో మరింత బాధ్యత పెరిగినట్టైంది. ఇది మాకు చాలెంజ్ లాంటిదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ల పరిధి పెంపుతో ఇక నుంచి సమర్థవంతంగా పనిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం. - మహేష్ భగవత్, నవీన్ చంద్, సైబరాబాద్ కమిషనర్లు -
నీట్ పై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష (నీట్) పై వివాదం అప్పుడే ముగిసేలా కనబడటం లేదు. నీట్ పై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ సంకల్స్ చటర్జీ ట్రస్ట్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, దీని వల్ల వైద్య విద్యలో సంస్కరణలు నిలిచిపోయే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు . పిటిషనర్ తరఫు న్యాయవాది అమిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ... న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై కార్యనిర్వాహక శాఖ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకి తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యేడాది రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి సొంతంగా పరీక్షను నిర్వహించుకునే ఆర్ఢినెన్స్ పై ఇటీవలే సంతకం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత తమ రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించమని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది . -
‘నీట్’ ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-నీట్) నుంచి రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపు కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు. పలు రాష్ట్రాలు, విపక్షాల డిమాండ్ మేరకు నీట్ తప్పనిసరంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాక్షికంగా పక్కనబెడ్తూ, రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపునిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌లోని పలు అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ శనివారం న్యాయ నిపుణుల నుంచి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఇంత అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరమేంటని కూడా ప్రణబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
ఉత్తరాఖండ్ ఖర్చులకు ఆర్డినెన్స్
జారీ చేసిన కేంద్రం డెహ్రాడూన్: ఏప్రిల్ 1 నుంచి ఉత్తరాఖండ్ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ బిల్లు(ఓటాన్ అకౌంట్)కు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గురువారం రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీఅయ్యాయి. పార్లమెంట్ సెషన్స్ లేకపోవడంతో... ఉత్తరాఖండ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంపై రాష్ట్రపతి సంతృప్తి చెందారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2016-17 సంవత్సరానికి ఖర్చుల కోసం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర సంచిత నిధి నుంచి నిధులు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ ఖర్చుల కోసం రూ. 13,642.43 కోట్లు ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. కాగా, కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 5లోగా స్పందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 6న పిటీషన్‌పై తిరిగి విచారణ కొనసాగుతుంది. పార్లమెంటును ప్రొరోగ్ చేయడాన్ని వ్యతిరేకించే పిటిషన్‌ను కూడా జత చేసేందుకు రావత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు అనుమతినిచ్చింది. -
'జల్లికట్టుపై మేమేం చేయలేం..'
న్యూఢిల్లీ: తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించే సంప్రదాయిక క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయలేదని, ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోజాలదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కావాలంటే జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేయవచ్చునని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. జల్లికట్టుపై విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో గతంలో నిషేధించిన జల్లికట్టును అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ జానపద క్రీడలో ఎద్దులు తీవ్ర హింసకు గురవుతాయని, ఈ అనాగరిక క్రీడను అనుమతించడం జంతుహక్కులను కాలరాయడమేనని జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జల్లికట్టుకు బ్రేక్ వేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. స్టేను తాత్కాలికంగా ఎత్తివేయాలని మరో పిటిషన్ వేసినా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. -
గుణపాఠం
ప్రజాభీష్టానికి ఏ పాలకుడైనా తలొగ్గవలసిందే. చట్టసభల్లో ఉండే బలంతో ఏమైనా చేయగలమనుకుంటే కుదరదు. భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకొస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ కథ ముగిసినట్టేనని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రకటన ఈ సంగతినే రుజువు చేసింది. కేంద్ర కేబినెట్ గత డిసెంబర్లో తొలిసారి ఈ సవరణలు చేయడానికి పూనుకున్నప్పటినుంచీ అందుకు సంబంధించి మూడు దఫాలు ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి. ఒక ఆర్డినెన్స్ మురిగిపోయిన వెంటనే మరో ఆర్డినెన్స్ తీసుకురావడంద్వారా కేంద్రం ఆ సవరణలకు ప్రాణ ప్రతిష్ట చేస్తూనే ఉంది. అధికారం చేతికందిన మరుక్షణం ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టంపై దృష్టి సారించింది. ఆ చట్టాన్ని సవరిస్తే తప్ప దేశంలో పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు రావడం సాధ్యం కాదన్నది. పాలకులు అలా అనుకోవడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చట్టం అమలులోని సాధకబాధకాలేమిటో వారికే బాగా తెలుస్తాయి. అయితే వాటి వివరాలను పార్లమెంటు ముందు పెడితే...చర్చకు చోటిస్తే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రభుత్వ నిర్ణయంలోని మంచిచెడ్డలేమిటో అందరికీ తెలిసేవి. చివరకు సవరణ బిల్లు ఏమవుతుందనేది వేరే విషయం. వాస్తవానికి మూడోసారి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు భూసేకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. అయితే విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో అందుకు సంబంధించిన ప్రయత్నం వీగిపోయింది. బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ ముందు పరిశీలనలో ఉంది. ఈలోగానే మోదీ 'మన్ కీ బాత్' ద్వారా భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయబోమని చెప్పారు. సారాంశంలో ఆ సవరణలు పార్లమెంటు ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌ల ద్వారా కొన్నాళ్లు అమల్లో ఉండి...పార్లమెంటు ప్రమేయం లేకుండానే కనుమరుగయ్యాయి! భూసేకరణకు సవరణలు తలపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలకూ, ఇప్పుడు ఉపసంహరించుకుంటూ చేసిన వాదనలకూ మధ్య పొంతన లేదు. 2014 చిట్టచివరిలో కేంద్ర కేబినెట్ భూసేకరణ ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపింది. అప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. భూసేకరణ చట్టం కారణంగా పారిశ్రామికీకరణ మూలనబడిందని ఆయన చెప్పారు. గ్రామాల్లో రోడ్లేయాలన్నా, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నా, నీటి పారుదల సౌకర్యం కల్పించాలన్నా ఆ చట్టం పెద్ద అడ్డంకిగా తయారైందని తెలిపారు. రైతుల ప్రయోజనాలకూ, పారిశ్రామికాభివృద్ధికీ మధ్య సమతూకం ఉండేలా చూడటమే తమ ధ్యేయమన్నారు. తాము జారీ చేస్తున్న ఆర్డినెన్స్ ఏకకాలంలో 'రైతు అనుకూల, పారిశ్రామిక అనుకూల' ధోరణులతో ఉన్నదని చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమంటున్నారు? రైతు అనుకూల వైఖరితోనే దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చెబుతున్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ జారీ, దాని ఉపసంహరణా...రెండూ రైతు అనుకూలమే ఎలా అవుతాయి? ఇందులో ఏదో ఒకటి మాత్రమే రైతుకు అనుకూలమై, రెండోది వ్యతిరేకం కావాలి. కేవలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఏకైక ఉద్దేశంతో మాత్రమే మోదీ ఈ ప్రకటన చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ వద్ద సమాధానం ఏది? భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడమే కాదు...మరో 13 చట్టాల ద్వారా జరిగే భూసేకరణకు కూడా ఆ చట్టంలోని పరిహారమే వర్తించేలా చర్యలు తీసుకుంటూ నోటిఫికేషన్ జారీచేసినట్టు నరేంద్ర మోదీ చెప్పారు. కనుక 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలే జాతీయ రహదార్ల చట్టం, విద్యుత్ చట్టం, రైల్వే చట్టం, గనుల చట్టం వగైరాలకింద సేకరించే భూముల విషయంలోనూ ఇకపై వర్తిస్తాయన్నమాట! మంచిదే. వాస్తవానికి భూసేకరణ చట్టంలోనే ఆ మేరకు హామీ ఉంది. 2014 డిసెంబర్‌కల్లా ఆ పని పూర్తవుతుందని అది పూచీపడింది. రైతులందరూ అందుకోసం ఎదురుచూస్తుండగా ఎన్డీఏ సర్కారు అప్పట్లో హఠాత్తుగా ఆర్డినెన్స్ బాటపట్టింది. ఆర్డినెన్స్‌ను రైతులు, పలు ప్రజా సంఘాలు ఇంతగా వ్యతిరేకించడానికి కారణం ఉన్నది. పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ రంగం, గ్రామీణ మౌలిక వసతుల వంటి అవసరాలకు భూములు సేకరించేటపుడు భూ యజమానుల నుంచి అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్ పేర్కొంది. పీపీపీల విషయంలో భూమి సేకరిస్తే భూ యజమానుల్లో 70 శాతం మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో 80 శాతంమంది అంగీకారం తప్పనిసరన్న చట్టంలోని నిబంధనను ఆ ఆర్డినెన్స్ తొలగించింది. అలాగే ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) ఉండితీరాలన్న నిబంధనను కూడా తోసిరాజంది. అయితే మూడో ఆర్డినెన్స్ జారీకి ముందు ఎన్డీఏ సర్కారు ఈ రెండు అంశాల్లోనూ తన తప్పిదాన్ని గ్రహించింది. జూలై నెలలో సెలెక్ట్ కమిటీలోని బీజేపీ సభ్యులు ఆ నిబంధనలు యథాతథంగా కొనసాగాలంటూ సవరణలు ప్రతిపాదించారు. ఇలా ఒక మెట్టు దిగిన బీజేపీ చివరకు పాత చట్టమే సరైందని చేతులు దులుపుకుంది. అంతమాత్రాన ఆ చట్టంలో సరిచేయాల్సినదేమీ లేదని చెప్పడానికి వీల్లేదు. భూములు కోల్పోయేవారికి మార్కెట్ విలువపై పట్టణాల్లో అయితే రెండు రెట్లు, గ్రామాల్లో అయితే నాలుగు రెట్లూ పరిహారం ఇస్తామన్న నిబంధన అస్పష్టంగా ఉన్నదని సామాజిక ఉద్యమకారులు ఎప్పటినుంచో అంటున్నారు. మార్కెట్ విలువను ఏ ప్రాతిపదికన లెక్కేస్తారో చట్టంలో స్పష్టంగా ఉండాలని కోరారు. అలాగే 'ప్రజా ప్రయోజనం' అంటే ఏమిటో చట్టం నిర్వచించాలని అడిగారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి. అలాగే దీన్నొక గుణపాఠంగా స్వీకరించి ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవాలి తప్ప ఆర్డినెన్స్‌ల బాట పట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గుర్తించాలి. -
మోదీ పరాజయం
భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయం ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని వెల్లడి * బిహార్ ఎన్నికల నేపథ్యంలో తన సవరణలపై కేంద్రం యూ టర్న్ * నీతి ఆయోగ్ సూచనతో మళ్లీ ఆర్డినెన్స్ జారీచేయరాదని నిర్ణయం * కేంద్రం ఆర్డినెన్స్ మళ్లీ జారీచేయబోదని ముందే వెల్లడించిన ‘సాక్షి’ * భూ ఆర్డినెన్స్‌ను కాలం చెల్లిపోనివ్వాలని నేను నిర్ణయించా: మోదీ * 2013 భూసేకరణ చట్టం అమలవుతుంది * నెలవారీ రేడియో ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎట్టకేలకు పరాజయాన్ని అంగీకరించింది. భూసేకరణకు సంబంధించి వివాదాస్పద ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సోమవారం (31వ తేదీ)తో గడువు ముగిసిన తర్వాత ఈ ఆర్డినెన్స్ చెల్లిపోతుందని, దానిని అలాగే చెల్లిపోనివ్వాలని తాను నిర్ణయించానన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను కేంద్రం తిరిగి జారీచేయబోదని ‘సాక్షి’ మూడు రోజుల కిందటే కథనం ప్రచురించడం తెలిసిందే. ఆ కథనాన్ని నిజం చేస్తూ స్వయంగా ప్రధానిమోదీయే ఆదివారం రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఆయన చెప్పుకొచ్చిన కారణాలు ఏవైనా.. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా.. పార్లమెంటు ప్రక్రియను కాదని ఆర్డినెన్స్‌ల రూపంలో చట్టాలు తీసుకువచ్చి.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చునన్న మోదీ ధీమా సడలిపోనట్లు తాజా పరిణామం తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. పలు పరిశ్రమల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం గతంలో చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని సింగూరు, నందిగ్రామ్ వంటి ప్రాంతాల్లో వెల్లువెత్తిన రైతాంగ, ప్రజా ఆందోళనలు.. అనంతరం అనేక అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత గత యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టం చేసింది. ఈ చట్టం కింద భూమిని సేకరించటం ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది కావటంతో.. అది అభివృద్ధికి ప్రతిబంధకమని చెప్తూ మోదీ సర్కారు ఆ చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్త భూసేకరణ బిల్లును రూపొందించడం తెలిసిందే. పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో.. పెట్టుబడులను ఆకర్షించడానికి భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని.. కార్పొరేట్ ప్రపంచానికి చూపటం కోసం.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు చేసిన సూచనలతో హడావుడిగా రూపొందించిన ఆ సవరణల్లో.. పలు రంగాల కోసం భూసేకరణకు భూమి యజమానులైన రైతుల అంగీకారం తప్పనిసరి కాదని.. భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదని చేసిన సవరణలు అతి ముఖ్యమైనవి. భూసేకరణకు తక్షణం ‘అడ్డంకులు’ తొలగించే లక్ష్యంతో ఈ సవరణలతో 8 నెలల కిందటే ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ.. ఈ సవరణలపై ప్రతిపక్ష పార్టీలే కాదు.. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న మూడు రైతు సంఘాలు సహా దాదాపు అన్ని రైతు సంఘాలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆ సవరణలతో కూడిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మూడు దశాబ్దాల అనంతరం లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. అభివృద్ధి నినాదంతో ఈ బిల్లును సులభంగానే గట్టెక్కించవచ్చని భావించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి లభించిన ప్రజాదరణను బట్టి.. మోదీ ‘అచ్చే దిన్’ తేవటం కోసం ఎటువంటి అవరోధాలనైనా అధిగమించేందుకు సిద్ధపడతారన్న సంకేతాలనిస్తూ.. రైతాంగం కూడా ఈ బిల్లుకు సానుకూలంగానే ఉంటారని తలచింది. కానీ.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. విపక్షాల నుంచే కాదు.. మిత్రపక్షాల నుంచీ మోదీ భూబిల్లు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షం ఆధిక్యం ఉన్న రాజ్యసభ.. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పట్టుపట్టి మరీ సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)కి నివేదించింది. ఈలోగా భూ ఆర్డినెన్స్ గడువు తీరిపోయిన కారణంగా ఇప్పటికే మూడు పర్యాయాలు దానిని జారీచేసింది. ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న బిల్లు విషయంలో.. 8 నెలల పాటు పట్టువీడని సర్కారు ఎట్టకేలకు ఇటీవలే తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రతిపక్ష పార్టీల్లో చాలా పార్టీలతో పాటు, పాలక ఎన్డీఏ మిత్రపక్షాలు కొన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో తను చేసిన సవరణల విషయంలో యూ టర్న్ తీసుకుంది. వాటిని వదిలివేయటానికి సిద్ధమని చెప్పటమే కాదు.. జేపీసీకి స్వయంగా అధికార బీజేపీయే సంబంధిత సవరణలు కూడా ప్రతిపాదించింది. మూడోసారి జారీచేసిన ఆర్డినెన్స్ గడువు కూడా సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో.. దానిని తిరిగి జారీ చేయాలని సర్కారు తొలుత నిర్ణయించింది. కానీ.. ప్రతిపక్షాలవ్యతిరేకత.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దానిని విపక్షాలు ఆయుధంగా చేసుకునే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. భూ ఆర్డినెన్స్‌తో తనపై పడిన రైతు వ్యతిరేక ముద్రను చెరిపివేసుకునే లక్ష్యంతో.. 2013 భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తను చేసిన కీలకమైన సవరణలన్నిటినీ సర్కారు ఉపసంహరించుకోనుందని.. అందులో భాగంగానే ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోనివ్వాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అదీగాక.. భూసేకరణ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దీనిపై చట్టం చేసే అంశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టాలన్న నీతిఆయోగ్ సిఫర్సూ ఈ నిర్ణయానికి కారణమని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన మోదీ.. ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోవటమంటే.. భూసేకరణ చట్టం 2013ను యథాతథంగా అమలులోకి రావటమేననీ అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా భూసేకరణ బిల్లులో చేర్చటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనీ చెప్పారు. తద్వారా.. మోదీ మొట్టమొదటిసారిగా తన ఓటమిని పరోక్షంగానైనా స్వయంగా ఒప్పుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాభవం కన్నా.. భూసేకరణ చట్టం విషయంలో ‘అంగీకరించిన’ పరాభవమే చాలా పెద్దదని వారు విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రధానమంత్రి మోదీ తన రేడియో ప్రసంగంలో.. రైతుల ప్రయోజనాల కోసం ‘13 అంశాల’ను నోటిఫై చేయటం ద్వారా నిబంధనల రూపంలో అమలులోకి తెచ్చామని చెప్పటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ.. ఆ అంశాలు కొత్తవేవీ కాదని, 2013 చట్టంలో భాగంగా రూపొందించినవేనని పేర్కొంటున్నారు. నిర్దిష్ట ప్రభుత్వ పనుల కోసం భూసేకరణకు గల కష్టాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన ఈ 13 అంశాలను నోటిఫై చేయకపోతే ఆర్డినెన్స్‌తో పాటే గడువుతీరిపోతాయని వివరించారు. ఈ నిబంధనలను నోటిఫై చేయటం ద్వారా రైతులు ప్రస్తుతమున్న 2013 చట్టం ప్రకారం భూసేకరణకు పరిహారం పొందనున్నారు. మోదీ ‘మన్ కీ బాత్’.. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. మాకు ‘జై జవాన్-జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. ‘‘మేం ఒక భూ ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. రేపటితో (సోమవారంతో) దాని గడువు తీరిపోతుంది. ఆ ఆర్డినెన్స్ గడువు తీరిపోనివ్వాలని నిర్ణయించాను. దానర్థం.. నా ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించటం. రైతుల అభిప్రాయమే నాకు అత్యంత ముఖ్యం. భూసేకరణ బిల్లుపై ప్రభుత్వానికి విశాలదృక్పథం ఉంది. ఆ బిల్లుపై చాలా వివాదం నెలకొనివుంది. రైతుప్రయోజనాల కోసం ఎలాంటి సూచనలనైనా నేను అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. 2013 భూసేకరణ చట్టాన్ని మెరుగుపరచటానికి రాష్ట్రాల నుంచి సూచనలు వచ్చాయి. ఈ చట్టానికి ఉద్యోగస్వామ్య పిడికిళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని.. సాగునీటి కాలువలు, విద్యుత్తుకు విద్యుత్తు స్తంభాలు, రోడ్లు, ఇళ్లు అందించటం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం జరిగేలా చూడాలని, పేద గ్రామాలకు పని లభించేలా సాయం చేయాలని ఆ సూచనలు పేర్కొన్నాయి. అయితే.. ప్రభుత్వం ఈ భూ బిల్లును తీసుకువచ్చిన తర్వాత చాలా పొరపాటు అనుమానాలను సృష్టించారు. రైతుల్లో ఎంతో భయం నింపారు. రైతులకు ఎటువంటి సందేహం కానీ ఎటువంటి భయం కానీ అవసరం లేదు. నేను ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వను. ఇప్పుడు ఎటువంటి సందేహానికీ ఆస్కారం లేదు. ఎవరైనా భయం సృష్టించటానికి ప్రయత్నిస్తే.. మీరు భయపడకూడదు. ఈ వివాదాల కారణంగా విషయం సంక్లిష్టంగా మారింది. ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయేలా చేస్తున్నందున.. 13 అంశాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అసంపూర్ణంగా ఉన్న పనిని పరిష్కరించేందుకు ఈ నిబంధనలు ఈ రోజు (ఆదివారం) నుంచి అమలులోకి వస్తాయి. రైతులు ఆర్థికంగా లేదా మరే రకంగా నష్టపోకూడదని మేం ఈ పని చేస్తున్నాం. మాకు ‘జై జవాన్- జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. అందుకే రైతుల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు స్వాతంత్య్ర దిన ప్రసంగంలో ప్రకటించాను.’’ అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు సమాధానం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు అంశంతో పాటు అనేక అంశాలను ప్రస్తావించారు. సొంతరాష్ట్రం గుజరాత్లో పటేల్‌ల ఆందోళనపై మొదటిసారి స్పందించారు. ప్రధాని ‘మన్‌కీ బాత్’ ప్రధాన అంశాలు... * గుజరాత్లో జరిగిన హింసా ఘటనలు దేశాన్ని ఆందోళన పర్చాయి. సర్దార్ పటేల్ పుట్టిన గడ్డపై ఏం జరిగినా అన్నింటికన్నా ముందు దేశానికి దిగ్భ్రాంతి కలిగింది. పరిస్థితులు అదుపు తప్పకుండా చూడడంలో కీలక భూమిక నిర్వహించిన నాగరికులతో గుజరాత్ శాంతి మార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐక్యత, సోదరభావమే సరైన మార్గం. భుజం భుజం కలిపి అభివృద్ధి మార్గంలో నడవాలి. అభివృద్ధే మన సమస్యలకు సమాధానం. * రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెలకు బీమా ఇవ్వాలనే పిలుపునకు స్పందించి 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. * జన్‌ధన్ యోజన పిలుపుతో 17.75 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం సంతోషం. జీరో బ్యాలెన్సుతో ఖాతా తెరవాలని కోరగా, 22వేల కోట్లు పొదుపు చేశారు. * బౌద్ధ దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయ విద్వాంసులు త్వరలోనే బుద్ధగయ రానున్నారు. మానవజాతి ప్రాపంచిక విషయాలపై చర్చించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగయ వెళ్లారు. ఇప్పుడు బౌద్ధ విద్వాంసులతో బోధ్‌గయ వెళ్లే అవకాశం లభించడం ఆనందక్షణాలుగా భావిస్తున్నా. * మన శాస్త్రవేత్తలు అత్యుత్తమరీతిలో పనిచేస్తున్నారు. వారి పరిశోధనలు, ఆవిష్కరణలను సామాన్యుల వరకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలి. సిద్ధాంతాలను పరికరాల్లో ఎలా మార్పు చేయాలి? ల్యాబ్‌లను భూమికి ఎలా అనుసంధానం చేయాలి? అనే దిశగా ముందుకు వెళ్లాలి. * విద్యలో సంస్కరణలు తేవాలని, నైపుణ్యాభివృద్ధిపై పరిమల్ షా (ఠానే), ప్రాథమిక విద్యలో ఉత్తమ ఉపాధ్యాయుల అవసరంపై ప్రకాశ్ త్రిపాఠి లేఖల ద్వారా సూచనలు తెలియచేశారు. * చిన్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి నివారణకు ఇంటర్వ్యూల విధానం నుంచి విముక్తి కల్పించే పని త్వరలో అమల్లోకి రానుంది. * మనదేశంలో ఏటా 50వేల మంది తల్లులు, 13 లక్షల మంది శిశువులు ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత మృతి చెందడం ఆందోళనకరం. ఈ మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. * దేశంలో 514 డెంగీ రోగ నిర్ధారణకు ఉచిత పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటే ఉచిత పరీక్ష కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలి. * ప్రేమ, ఔదార్యాలతో కూడిన సూఫీ సంస్కృతిని అన్ని మతాలవారూ అర్థం చేసుకోవాలి. సూఫీ సంస్కృతి ఇస్లాం వాస్తవ రూపాన్ని చూపుతుంది. ఇటీవల సూఫీ సన్యాసులను, పండితులను కలుసుకున్నాను. వారి మాటలు, మాట్లాడిన విధానం వీనుల విందుగా అనిపించింది. క్రూరమైన జోక్... మోదీ దేశ రైతుల పట్ల క్రూరమైన జోక్ చేశారు. తమ సవరణలు ఆమో దం పొందే అవకాశాలు లేవని తెలిసినప్పుడు మూడు సార్లు ఎందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వచ్చింది? - సీతారాం ఏచూరి, సీపీఎం నేత సంస్కరణకు విఘాతం.. భూఆర్డినెన్స్ రద్దు ఆర్థిక సంస్కరణలకు తీవ్ర విఘాతం. పారిశ్రామికీకరణకు కీలకమైన భూసేకరణ ఇకపై కష్టతరమౌతుంది. - అసోచామ్ కాంగ్రెస్ బండారం బయటపడింది.. భూసేకరణ బిల్లుతో కాంగ్రెస్ బండారం బయటపడింది. సలహాలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా కాంగ్రెస్ అడ్డుపడింది. తాజా నిర్ణయంతో ఇక రాష్ట్రాలు స్వేచ్ఛగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. - కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ‘పొరపాటు’ ఒప్పుకుంది.. ప్రభుత్వం చివరకు తన పొరపాటు అంగీకరించింది. - ఆప్ -
మళ్లీ 'భూ' ఆర్డినెన్స్ తీసుకురాం
న్యూఢిల్లీ: ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన పలు వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇదే అదనుగా చూసుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడానికి తమ పోరాటమే కారణమని కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురాబోమని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున బిల్లులో రైతుల ప్రయోజనాలుద్దేశించి ఎలాంటి సవరణలు కోరుకుంటున్నారో, ఏ అంశాలు చేర్చాలని భావిస్తున్నారో సలహాలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతుల్లో తీవ్ర ఆందోళన పుట్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దీనివల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాత యూ టర్న్ తీసుకొని బిల్లులో సవరణలకు డిమాండ్ చేశాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోవడంతో గత రెండు పార్లమెంటు సమావేశాలు ఈ అంశం కారణంగానే ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించి మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. -
పనికిమాలిన ఆర్డినెన్స్‌తో భూ సేకరణా?
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం మంగళగిరి : పనికిమాలిన ఆర్డినెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణకు దిగడం సిగ్గుమాలిన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. మండలంలోని నిడమర్రులో సోమవారం సీఆర్డీఏ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, అతని అనుచరులు వ్యాపారం చేసుకునేందుకే రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వారి ఇష్టానుసారం భూసేకరణకు దిగితే రైతులు చూస్తూ ఊరుకోరని, వెంటనే భూ సేకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత గ్రామంలోని రామాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. భూ సేకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉప సర్పంచ్ గాదె సాగరరెడ్డి, సీపీఎం నాయకులు బాబూరావు, ఎం రవి, రాధాకృష్ణ, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మునగాల మల్లేశ్వరరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు ఎన్ బ్రహ్మయ్య, టి.బాబూరావు, కొండారెడ్డి, కృష్ణ, కుమారస్వామి, ఎన్ విష్ణు, ఎన్ రాజు, బి శంకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నవులూరులో.... మండలంలోని నవులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఉడా కాలనీ, ఎమ్మెస్సెస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీలను గ్రామ కంఠాల నుంచి తొలగించి తమకు న్యాయం చేయాని కోరుతూ గ్రామస్తులు సోమవారం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్లు తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా డిప్యూటీ కలెక్టర్ రఘునాథరెడ్డి బయటకు వచ్చి మహిళలకు సర్ధి చెప్పారు. నివాసాలను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహిళలు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ బాలాజీనాయక్, ఉప సర్పంచ్ కూచిపూడి రమేష్, వైఎస్సార్ సీపీ నాయకులు మేకల సాంబశివరావు, షఫీ, మాజీ సర్పంచ్ కొల్లి లక్ష్మయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణకు చెక్!
ఆర్డినెన్స్ ఉపసంహరణ యోచనలో కేంద్రం ♦ అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చెల్లుబాటు కాదు ♦ అమల్లోకి 2013 భూసేకరణ చట్టం ♦ దీని ప్రకారం బహుళ వార్షిక పంటలు పండే భూములను సేకరించరాదు ♦ 80% ప్రజల మద్దతు అనివార్యం ♦ సామాజిక ప్రభావం మదింపు చేయాలి ♦ అయినా సేకరించాలంటే ఎకరాకు రూ. 5 కోట్లు చెల్లించాలి ♦ 11 వేల ఎకరాలను సేకరించాలంటే దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయం సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునరుపాధి కల్పన చట్టానికి (2013) సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటే రాష్ట్ర రాజధానికి భూ సేకరణకు బ్రేక్ పడుతుందంటున్నారు న్యాయవాద, హక్కుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్స్‌ను జారీ చేసినా పార్లమెంటులో చట్టం కాకపోవడంతో ప్రభుత్వం దాదాపు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. పూర్తిగా ఉపసంహరించుకోకుండా వివాదాస్పదమైన కీలకాంశాలను సడలించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 14న- కేంద్రం ఆర్డినెన్స్ ఆధారంగా భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువ లేకుండా పోతుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ఉపసంహరించుకుంటే అమల్లోకి వచ్చే 2013నాటి భూసేకరణ చట్టప్రకారం రాజధానికి 11 వేల ఎకరాలను సేకరించాలంటే ప్రభుత్వం కనీసం రూ.60 వేల కోట్లు రైతులకు చెల్లించాలని, సహాయ పునరావాస పథకానికి మరో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. 80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే... 2013 నాటి భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ మదింపు అనివార్యం. ప్రైవేటు వ్యవహారమైతే 80 శాతం మంది, పబ్లిక్ వ్యవహారమైతే 70 శాతం మంది భూ యజమానుల అనుమతివ్వాలి. సర్వే, నిపుణుల కమిటీ పరిశీలన జరగాలి. దీనికి11 నెలల గడువు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భూ సేకరణ మొదలు పెడితే 2016 ఆగస్టునాటికి కానీ పూర్తికాదు. పంట పొలాలు తీసుకునే వీలు లేదు... చట్టంలోని మూడో అధ్యాయం సెక్షన్ 10-ఎ ప్రకారం బహుళ పంటలు పండే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. గత్యంతరం లేక తీసుకుంటే దానికి సమానమైన భూమిని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాజధానికి గుర్తించిన 29 గ్రామాల్లో (మరో నాలుగు గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది) లక్షా 40 వేల మంది జీవనోపాధి కోల్పోతారు. 90 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. దీన్ని మదింపు చేయాలి. సహాయ పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)ని అమలు చేయాలి. నిర్వాసితులకు పూర్తి ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలి. బాబు ప్రభుత్వం ఈ ప్యాకేజీ ఊసెత్తకుండా భూసమీకరణ చేస్తోంది. కేంద్రం ఆర్డినెన్స్ రద్దయితే రూ.వేల కోట్లు అవసరమవుతాయి. పరిహారానికే రూ.70 వేల కోట్లు కావాలి... రాజధాని ప్రాంతంలో 44 వేల ఎకరాల భూ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి 22 వేల ఎకరాలు సమీకరించినట్టు ప్రకటించింది. మిగతాదాన్ని భూ సేకరణ చట్టం కింద తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఒకే ప్రయోజనం (రాజధాని నిర్మాణం) కోసం రెండు నోటిఫికేషన్లు, వేర్వేరు చట్టాలను ప్రయోగిస్తోంది. భూ సమీకరణ పథకం కింద భూమి ఇచ్చిన జరీ భూముల రైతులకు ఒక ఎకరానికి 1450 గజాలు, మెట్టరైతులకు 1200 గజాల అభివృద్ధి చేసిన భూమిని, ఏటా రూ. 50 వేలుచొప్పున కౌలు ఇస్తామని ప్రకటించింది. 2013 చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మార్కెట్ విలువ ్ఠ1.25 ఫార్ములా (ఏపీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్) (తెలంగాణ అయితే 2, మహారాష్ట్ర అయితే 5) ప్రకారం పరిహారం చెల్లించాలి. దీంతోపాటు భూమి ఇచ్చిన వారికి సాంత్వన (సొలాషియమ్) కింద వంద శాతం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో వేసేంతవరకు 19 శాతం వడ్డీ కలపాలి. తుళ్లూరులో ఎకరం భూమి విలువ రూ.రెండు కోట్లుగా నమోదైంది. తాడికొండ, మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈమేరకు ఆధారాలున్నాయి. దీన్ని బట్టి 2013 భూ సేకరణ చట్టం కింద ఎకరం ఉన్న రైతుకు మార్కెట్ విలువ కింద రెండు కోట్లు, మల్టిప్లికేషన్ ఫార్ములా కింద 50 లక్షలు (మొత్తం 2.5 కోట్లు), సోలాషియమ్ కింద రెండున్నర కోట్లు... ఇలా ఎకరానికి రూ. ఐదు కోట్లు చెల్లించాలి. డబ్బు పూర్తిగా చెల్లించేవరకు 19 శాతం వడ్డీని కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి పోను మిగతా 11 వేల ఎకరాలను సేకరించాలంటే కనీసం రూ.60 వేల కోట్లు చెల్లించాలి. పునరావాస పథకానికి మరో రూ. 20 నుంచి 30 వేల కోట్లు కావాల్సి ఉంది. భూ సమీకరణ కింద ఇచ్చిన రైతులకే కౌలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందో అంతుబట్టని విషయమని రైతు సమాఖ్య కన్వీనర్, హక్కుల సంఘం నాయకుడు మల్లెల శేషగిరిరావు వ్యాఖ్యానించారు. -
భూ బిల్లుపై బీజేపీ యూటర్న్!
యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలకు ఓకే * భూమి యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా యథాతథం * జేపీసీ భేటీలో సవరణలు ప్రతిపాదించిన బీజేపీ సభ్యులు.. న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లుపై బీజేపీ మెట్టు దిగుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చింది. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా వంటి యూపీఏ చట్టంలోని కీలక నిబంధనలను యథాతథంగా కొనసాగించేందుకు బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో ఏకాభిప్రాయం వచ్చింది. గత డిసెంబర్లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన వివాదాస్పద సవరణలను తొలగించేందుకూ కమిటీ సిఫారసు చేయనుంది. అంటే.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించినట్లే అవుతుందని పరిశీల కులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తన వైఖరిని మార్చుకునేందుకు.. సోమవారం జరిగిన జేపీసీ భేటీలో అధికార బీజేపీ సభ్యులు మార్గం సుగమం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధలను తిరిగి తీసుకురావాలంటూ కమిటీలో మొత్తం 11 మంది బీజేపీ సభ్యులు సవరణలను ప్రవేశపెట్టారు. బీజేపీ తెచ్చిన సవరణలపై సమావేశంలో పూర్తి అంగీకారం కుదిరింది. అయితే సవరణను ఉదయమే ఇచ్చారని, వాటిని అధ్యయనం చేయడానికి తమకు సమయం లేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరెక్ ఓబ్రియాన్, కల్యాణ్ బెనర్జీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ‘‘ఆరు సవరణలపై చర్చ జరిగి, అంగీకారం కుదిరింది. ఎన్డీఏ బిల్లులోని 15 సవరణల్లో 9 ముఖ్యమైన సవరణలను కాంగ్రెస్, ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ 9 సవరణల్లో భూ యజమానుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, ప్రైవేట్ కంపెనీ స్థానంలో ప్రైవేట్ ఎంటిటీ సహా ఆరింటిపై చర్చ జరిగింది. వాటిపై ఏకాభిప్రాయం కుదిరింది’’ అని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. ఇప్పుడు సవరణలతో రానున్న బిల్లు తమ చట్టం మాదిరే ఉందని కమిటీలో కాంగ్రెస్ సభ్యుడొకరు చెప్పారు. బీజేపీ యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో జేపీసీకి నేతృత్వం వహిస్తున్న ఆ పార్టీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా ఈ నెల 7 నాటికి ఏకాభిప్రాయ నివేదికను పార్లమెంటుకు అందించే అవకాశముంది. ఈమేరకు మరో 4 రోజుల గడువు కావాలని బీజేపీ ఎంపీ అయిన అహ్లూవాలియా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం లభించింది. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సర్కారు భూబిల్లుపై వెనక్కి తగ్గినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. యూపీఏ చట్టంలోని కీలకాంశాలు... * యూపీఏ భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. ప్రైవేటు ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే 80% మంది భూయజమానుల ఆమోదం అవసరం. పీపీపీ ప్రాజెక్టులకైతే 70% మంది ఆమోదం తప్పనిసరి. భూసేకరణ జరిపే ప్రాంతంలోని ప్రజలపై సామాజిక ప్రభావాన్ని ముందుగా సర్వే ద్వారా అంచనా వేయాలి. * బహుళ పంటలు పండే సాగు భూములను ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి సేకరించరాదని ఆంక్షలు విధించింది. * సేకరించిన భూమిని ఐదేళ్లపాటు వాడకుంటే దాన్ని వాస్తవ యజమానులకు లేదా భూ బ్యాంకుకు తిరిగి ఇచ్చేయాలని నిర్దేశించింది. * ప్రయివేటు ఆస్పత్రులు, ప్రయివేటు విద్యా సంస్థలను 2013 భూ సేకరణ చట్టం తన పరిధి నుంచి మినహాయించింది. ‘ప్రయివేటు కంపెనీ’ల భూసేకరణకు 2013 చట్టం వర్తిస్తుంది. * భూసేకరణలో ప్రభుత్వం (సంబంధిత అధికారి) ఏదైనా నేరం చేసినట్లయితే.. సంబంధిత శాఖాధిపతి.. తనకు తెలియకుండా ఆ నేరం జరిగిందని, లేదా ఆ నేరం జరగకుండా నిరోధించటానికి తాను తగిన జాగ్రత్తలు వహించానని చూపించకపోయినట్లయితే.. ఆ అధికారిని నేరస్తుడిగా పరిగణించటం జరుగుతుందని పేర్కొంది. * 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో ఆ చట్టమే వర్తిస్తుందని.. కానీ, 2013 చట్టం చేసినప్పటికి ఐదేళ్లు, అంతకు మించిన కాలంలో 1894 చట్టం కింద అవార్డు ఇచ్చి ఉండి, భూమిని స్వాధీనం చేసుకోని, పరిహారం చెల్లించని ఉదంతాల్లో కొత్త చట్టం వర్తిస్తుందని నిర్దేశించింది. ఎన్డీఏ బిల్లులో సవరణలు... * భూ యజమానుల ఆమోదం తప్పనిసరనే నిబంధన నుంచి.. రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, హౌసింగ్, పారిశ్రామిక కారిడార్లు, పీపీపీ సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు - 5 రంగాలను మినహాయించింది. వీటిని సామాజిక ప్రభావ సర్వే నుంచీ తప్పించింది. * పై ఐదు రంగాలనూ బహుళ పంటలు పండే భూమిని, ఇతర వ్యవసాయ భూముల సేకరణపై ఆంక్షల నుంచీ మినహాయించింది. * సేకరించిన భూమిని ఐదేళ్ల కాలం లేదా.. ప్రాజెక్టును నెలకొల్పే సమయంలో పేర్కొన్న కాలపరిమితి.. ఏది ఎక్కువ కాలమైతే ఆ కాలం వరకూ వాడకుండా ఉంటే భూమిని తిరిగివ్వాలని సవరించింది. * ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఇచ్చిన మినహాయింపును తొలగించింది. ‘ప్రైవేట్ కంపెనీల’ను ‘ప్రైవేట్ ఎంటిటీలు’గా ఎన్డీఏ బిల్లులో సవరించారు. అంటే.. ప్రభుత్వ ఎంటిటీ కాని ఏ ఎంటిటీ అయినా ప్రయివేటు ఎంటిటీగా పేర్కొంది. * ప్రభుత్వ అధికారి నేరానికి పాల్పడితే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అతడిపై విచారణ చేపట్టరాదని మార్చింది. * 1894 చట్టం కింద అవార్డు ఇచ్చిన ఉదంతాల్లో 2013 చట్టం చెప్పిన ఐదేళ్ల కాలపరిమితిని లెక్కించేటపుడు.. కోర్టు స్టేలతో నిలిచిన భూసేకరణ కాలాన్ని కానీ, భూమి స్వాధీనం చేసుకోవటానికి ట్రిబ్యునల్ అవార్డు నిర్దేశించిన కాలాన్ని కానీ లెక్కించటం జరగదని, భూమిని స్వాధీనం చేసుకుని, పరిహారాన్ని కోర్టులో, మరేదైనా ఖాతాలో జమ చేసిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకోవటం జరగదని పేర్కొంది. -
భూసేకరణ ‘బిల్లు’ లేనట్టే!
నాలుగోసారి తప్పని ఆర్డినెన్స్ సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూసేకరణ చట్టం సవరణ బిల్లుకు ఇప్పట్లో ఏకాభిప్రాయం వచ్చే సూచనలు లేకపోవడంతో దీనిని మంగళవారం నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా సమావేశాలు ముగిశాక రికార్డుస్థాయిలో నాలుగోసారి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఈ బిల్లులోని వివాదాస్పద అంశాలను పరిశీలిస్తున్న బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదిక సమర్పణకు ఆగస్టు 3 వరకు సమయం కోరే సూచనలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం లేదని, దాంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం గత మే 31న మూరోసారి భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. బిహార్ ఎన్నికలు ముగిసే వరకూ ప్రభుత్వానికి ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. కాగా, ఇలా ఆర్డినెన్స్‌లను ప్రకటించడం కొత్తేమీ కాదని, గత ప్రభుత్వాల హయాంలో 15 ఆర్డినెన్స్‌లను రెండు, మూడుసార్లకు మించి ప్రకటించారని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అహ్లూవాలియా కమిటీకి ఇప్పటివరకు 672 వినతిపత్రాలు రాగా, అందులో 670 వినతులు భూసేకరణ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచారం. సమరానికి కమలదళం సై * రాజే, చౌహాన్‌లతో షా భేటీ * కేంద్రమంత్రులతో వ్యూహరచన వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులపై పలు అవినీతి ఆరోపణలు, పలువురు కేంద్రమంత్రుల విషయంలో వివాదాల నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. విపక్షాల దాడిని ఎదురు దాడితో ఎదుర్కోవాలని అధికార బీజేపీ నిర్ణయించింది. ఇందుకు వ్యూహరచనలో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఢిల్లీ వచ్చిన ఇరువురు సీఎంలు షాను కలసి తమపై వచ్చిన ఆరోపణల లోటుపాట్లను ఆయనకు వివరించారు. అనంతరం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, రవిశంకర్‌ప్రసాద్, పీయూష్గోయల్లతో పాటు.. పార్టీ మీడియా ప్రతినిధులు సహా పలువురు నేతలతో షా సమావేశాలు నిర్వహించారు. ఆయా వివాదాలు, ఆరోపణలపై ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా స్పందించాలనే అంశాలపై సమీక్షించారు. ఆ తర్వాత జైట్లీ, శివరాజ్‌లతో కలిసి అమిత్‌షా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి చర్చించారు. ఇదిలావుంటే.. పార్లమెంటులో ‘ముకాబలా’ (ముఖాముఖి ఘర్షణ) ఉంటుందని ప్రధాని మోదీ శుక్రవారం నాడే వ్యాఖ్యానించారు. ఇందుకోసం వ్యూహరచనలో భాగంగా ఆయన సోమవారం తన నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం కానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశానికీ పిలుపునిచ్చారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రమహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వేర్వేరుగా నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాలకూ మోదీ హాజరయ్యే అవకాశముంది. సజావుగా సాగాలంటే.. వారిని తొలగించాల్సిందే పార్లమెంటు సమావేశాలు ప్రశాంతంగా జరగాలంటే.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధరరాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్చౌహాన్లను వారి పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ స్పష్టంచేసింది. ‘జీఎస్టీ’ నివేదిక సిద్ధం: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తాన్ని ఐదేళ్ల పాటు పరిహారంగా అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని ఆ నివేదికలో పొందుపర్చారు. కాగా లోక్‌పాల్ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ సమావేశాల్లో తన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లేదు. -
చెక్కు బౌన్స్ కేసులపై ఆర్డినెన్స్
చెక్కును సమర్పించిన బ్యాంక్ న్యాయపరిధిలోనే కేసుకు వెసులుబాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్ఐ యాక్ట్ సవరణ దిశలో అడుగు 18 లక్షల మందికి ఊరట... న్యూఢిల్లీ: చెల్లింపులకు సంబంధించి, చెక్కును దాఖలుచేసిన బ్యాంక్ న్యాయ పరిధిలోనే ఫిర్యాదుదారు క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్ జారీకి కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులను ఎదుర్కొంటున్న దాదాపు 18 లక్షల మందికి ఈ ఆర్డినెన్స్ ఊరట కలిగించే అంశం. నేపథ్యం... నెగోషియబుల్ ఇన్స్ట్రమెంట్ (ఎన్ఐ) యాక్ట్ ప్రకారం... జారీ అయిన చెక్కు బ్యాంక్ పరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ఐ యాక్ట్ సవరణ దిశలో కేంద్రం తొలిచర్యగా తాజా ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ ఆర్డినెన్స్ (మూడవసారి జారీచేసిన) తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇది 14వ ఆర్డినెన్స్. ముఖ్యాంశాలు... చెల్లింపులు (క్లియరెన్స్) కోసం చెక్కు దాఖలు చేసిన బ్యాంకు న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయడానికి ఫిర్యాదుదారులకు వీలు కల్పి స్తూ కేంద్రం రూపొందించిన ఎన్ఐ యాక్ట్ సవరణ బిల్లు, 2015కు మే 13న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడలేదు. దీనితో తాజా ఆర్డినెన్స్ అవసరమైంది. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా వేరువేరుచోట్ల మూడు చెక్ బౌన్సు కేసులు ఉంటే వాటిని ఒకే చోటకు తీసుకువచ్చి, సంయుక్తంగా విచారించడానికి సైతం తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విలేకరులకు తెలిపారు. ఎన్ఐ యాక్ట్‌కు సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సందర్భంగా జరిగిన చర్చలో తన సొంత బీజేపీ ఎంపీల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని కఠిన ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది. సామాన్యుడిని వేధించడానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు ‘ఈ తరహా చట్ట సవరణలను’ వినియోగించుకునే వీలుందని బీజేపీ ఎంపీలు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చెక్కును జారీ చేసిన న్యాయపరిధిలోనే ‘బౌన్స్’ కేసు దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు డిఫాల్టర్లకు అయాచిత రక్షణ కల్పిస్తుందని, దీనివల్ల ఫిర్యాదుదారు అనవసర వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నట్లు ‘సవరణ బిల్లుకు సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్’ వివరించింది. వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల, చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక, ఆర్థిక సంస్థలు సహా సంబంధిత వర్గాలు కోరినట్లు పేర్కొంది. -
ఆర్డినెన్స్ తెచ్చాక ఎంత భూమిని సేకరించారు?
జేపీసీలో సర్కారును ఇరుకున పెడుతూ ప్రతిపక్షం డిమాండ్ న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్షం.. ఇప్పుడు సర్కారును మరింత ఇరుకున పెడుతోంది. తొలిసారి గత డిసెంబర్లో భూసేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసినప్పటి నుండీ.. దాని కింద వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను అందించాలని సర్కారును డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లూవాలియా అధ్యక్షతన జరిగిన జేపీసీ తొలి భేటీలో.. కాంగ్రెస్ నేత జైరాంరమేశ్, బీజేడీ ఎంపీ బి.మహతాబ్లతో పాటు.. టీఎంసీ, వామపక్షాల సభ్యులు.. యూపీఏ సర్కారు తెచ్చిన భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి, ఆర్డినెన్స్‌ను జారీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం ఈ మార్పులు చేయటం అనివార్యమన్న ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు.. ఈ ఆర్డినెన్స్ తెచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం ఆమోదించిన జాతీయ భద్రతా ప్రాజెక్టుల వివరాలేమిటో జేపీసీ ముందుకు పెట్టాలని జైరాం కోరారు. -
‘గుజరాత్’ సేద్యం.. పెద్దల భోజ్యం
రెండోమాట ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. నరేంద్ర మోదీ పదే పదే ప్రచారం చేసుకున్న ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ లో బడుగు బలహీన వర్గాలకు చోటుండదు. అది బహుజనులతో కూడిన సమాజాన్ని చీల్చే ‘అభివృద్ధి’ నమూనా. కీలక రంగాలలో కేంద్రీకరించాల్సిన అభివృద్ధిని మోదీ ‘గుజరాత్ నమూనా’ నిర్వీర్యం చేస్తుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలూ, వివిధ సర్వేలూ, సాధికార గణాంకాలే ఇందుకు సాక్ష్యం. అతుల్ సూద్, కల యర్సన్: ప్రసిద్ధ విశ్లేషకులు (13-6-2014) గుజరాత్ అభివృద్ధి నమూనా వందిమాగధ ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గా న్ని పెంచే నమూనా. కొద్దిమంది చేతులలో సంపద కేంద్రీకరణకు దోహదం చేసే నమూనా. గుజరాత్లో పరిశ్రమాభివృద్ధి జరగలేదని నేనడం లేదు. కాని, రూ.30,000 కోట్ల వెచ్చించిన నూనెశుద్ధి కర్మాగారం, కేవలం 400 మం దికి ఉపాధి కల్పిస్తే ఒరిగేదెంత? ఈ అభివృద్ధి నమూనా వల్ల సామాజిక న్యాయం లేదా సమానత్వం సిద్ధించడం కల్ల. క్రిస్తీ ఫెర్నాండెజ్ (మోదీ సీఎంగా పనిచేసిన కాలంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి) 20-5-2015న చేసిన వ్యాఖ్య ఎన్నికల ప్రణాళికల పేరుతో రాజకీయ పక్షాలు చేసే బాసలన్నీ ఆచర ణలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇది ప్రజల అనుభవం. అబ ద్ధాల అంకయ్యలకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఇలా వచ్చిందే. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి ఒక సంవత్సరం గడిచిన సందర్భం ఇది. సినిమా వందరోజులు ఆడితే చాలునని కొందరు దర్శక నిర్మాతలు ఈ రోజులలో కోరుకుంటూ ఆత్మతృప్తి పొందుతున్నట్టే, బీజేపీ నాయకులు కూడా ఏడాది పాలనకే ఆత్మ సంతృప్తి చెందవలసిన ఆవశ్యకత వచ్చింది. అయితే వారి ఆత్మతృప్తిని మనం కాదనలేం. ఆ హక్కు మనకు లేదు. అప్పటిదాకా ఏలిన పార్టీల నిర్వాకంతో విసిగి వేసారిపోవడం వల్ల కావచ్చు. వాగ్ధాటితో నేతలు తమను నమ్మించడం వల్ల కావచ్చు. ప్రజలు దింపుడు కల్లం ఆశతో ఓట్లు వేస్తున్నారు. మోసపోతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇదంతా నిరూపితమవుతున్న దశలో మనం ఉన్నాం. యూపీఏ, ఎన్డీయే పాలక వ్యవస్థలు ఆ దశలో భాగాలే. వాటి మధ్య ఆచరణలో వ్యత్యా సాలు తక్కువ. యూపీఏ హయాంలోనూ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక విధానాలు యథేచ్ఛగా అమలైనాయి. అటల్ బిహారీ వాజపేయి కాలం నుంచి, నేటి పరివార్ కూటమి ఏలుబడి వరకు జరిగినదీ, జరుగుతున్నదీ అదే. దేశ విదే శీ గుత్త పెట్టుబడులకు అనుకూలంగా వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలు జరుగుతూనే వచ్చాయి. 1894 నాటి భూసేకరణ చట్టానికి యూపీఏ సవరణ తెచ్చింది. ఆహార భద్రతకు ఆధారంగా ఉన్న పంట భూములను తాకకుండా, ప్రభుత్వ భూములను పరిశ్రమాభివృద్ధికి వినియోగించేటట్టు జాగ్రత్తలు తీసుకోవడం ఆ సవరణ ఉద్దేశం. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. గుజరాత్ నమూనా ఇంతకీ గ్రామీణ గుజరాత్లో ఈ అభివృద్ధి నమూనా కింద ఎలాంటి సాగు జరుగుతున్నదో గమనించడానికి రెండు ఉదాహరణలు చాలు. ఈ రెండు ఉదాహరణలు (ఫొటోలు చూస్తే తెలుస్తుంది) మోదీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనిది ఒకటి కాగా, రెండవది చివరి మూడేళ్ల కాలానికి చెందినది. మొదటిది: అహ్మదాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని కాయ్‌లా అనే గ్రామంలో పత్తి విత్తనాలు చల్లుకోవ డానికి ఒక గుజరాత్ కుటుంబం తన సభ్యులతోనే కాడి పట్టించవలసి వచ్చింది. ఆధునిక యంత్రాలకు నోచుకోకపోవడమే కాదు, కనీసం ఎడ్లతో కూడా కాకుండా వారే (2011) దుక్కి దున్నుకోవలసివచ్చింది. హిందూ గ్రూప్‌నకు చెందిన ‘ఫ్రంట్‌లైన్’ ఏప్రిల్ 14, 2014లో ఈ ఫొటోను ప్రచు రించింది. మోదీ చెబుతున్న అభివృద్ధి నమూనాలో చోటు లేని గ్రామీణ రైతు కుటుంబాలు దానికి బయటే ఉండిపోయిన సంగతిని ఈ ఫొటో చెబుతోంది. రెండవ ఫొటో.. అహ్మదాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని లక్తార్ తాలూ కాలోని వాద్లా గ్రామానికి చెందిన చిత్రం(ఫ్రంట్‌లైన్, 13-6-2014). ఆధు నిక యంత్రాలు కాని, ఎద్దులు కాని లేకుండా పురాతన నాగలితోనే రైతు కుటుంబం పొలం దున్నుకుంటోంది. మోదీ దేశాన్ని నమ్మిస్తూ వస్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనాకు ఇవి సాక్ష్యాలా? లేక వక్రభాష్యాలా? భూసేకరణ చట్టంలో యూపీఏ తీసుకువచ్చిన సవరణ మీద మోదీ ప్రతిపాదించిన సవరణ దగ్గరకు మళ్లీ ఒక్కసారి వద్దాం. 2013 చట్టం ప్రకారం భూములను సేకరించడానికి నూటికి 70 నుంచి 80 మంది రైతుల స్వచ్ఛంద అనుమతి అవసరం. ఆ సేకరణ మూలంగా సామాజిక జీవనం మీద పడే ప్రభావాన్ని గురించి సర్వే జరగాలి. జనాభిప్రాయం తెలుసుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే నిరాకరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను ఒకటికి రెండుసార్లు ప్రవేశపెట్టింది. కాబట్టి ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గానీ, రైతాంగ వ్యతిరేక సవరణ లను గానీ ఉపసంహరించుకోవడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ఇంకా వెలుగుచూడని ఈ ఆర్డినెన్స్/బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చి రైతుల మీద సవారీ చేయడం మొదలుపెట్టారు. రాణ్ ఆఫ్ కచ్ రైతుల అనుభవం 1965 నాటి ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన 5,000 మంది పంజాబీ, హరియాణా రైతుల శ్రమ కూడా 2010లో, అంటే మోదీ హయాం లోనే దగా పడింది. ఈ అంశం మీద సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం నడు స్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ యుద్ధం సమయంలో ఆ రైతులు గుజ రాత్‌కు వలస వచ్చి రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో స్థిరపడవలసి వచ్చింది. యుద్ధంతో నిర్వాసితులైన ఆ రైతులనూ, మిగిలిన సైనికులనూ ఆ సరి హద్దులో స్థిరపడవలసిందిగా నాటి ప్రధాని సాక్షాత్తు లాల్ బహదూర్ శాస్త్రి కోరారు. అప్పటికి అదంతా ఊసర క్షేత్రం. పైగా పొరుగునే ఉన్న పాకిస్తాన్ చొరబాట్లకు అది ఆలవాలం. బండరాళ్ల నేల. ఆ రైతులే ట్రాక్టర్లతో, పశువుల సాయంతో నేలను సరి చేసుకున్నారు. 400 అడుగులు వెడితే గాని నీరు రాదు. వర్షాలు కురిసే ప్రాంతం కాదు. అలాంటి నేల మీద పత్తి, వేరుశెనగ, గోధుమ, మామిడి, ఖర్జూరం వంటి పంటలు పండించే సరికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇంత కష్టపడినా, వచ్చి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారు స్థిర నివాసం ఏర్పరుచుకున్న నిర్వాసితులుగానే పరిగణనలో ఉన్నారు. వారే అభివృద్ధి చేసుకున్న భూమి మీద వారు రుణం పొందలేరు. అమ్మలేరు. కాలక్రమంలో వారి ఉనికికే ఎసరు పెడుతూ గుజరాత్ ప్రభుత్వం రాణ్ ఆఫ్ కచ్ రైతులు ఖాళీ చేయాలని కచ్ జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. 2010లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నట్టు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంలో వారు మోదీని కలుసుకోవడానికి యత్నించి కూడా విఫలమ య్యారు. ‘మేమంతా భారతీయ రైతులమే. గుజరాత్లో బతుకుతూ ఇక్కడి వారి కోసం భూములు సాగుచేస్తున్నాం. మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, మాతో భూమిని వెంటబెట్టుకుని పోలేం.’ అని చెప్పినా ఎవరూ కరగలేదు. ఈ వివాదం గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. ముగ్గురు న్యాయమూర్తులు ఐదురోజులు రైతుల గోడు విన్నారు. తరువాత,‘కచ్‌లో రైతులకు మాత్రమే సొంత భూమి ఉండాలి’ అని తీర్పు చెప్పారు. కానీ గుజరాతీ రైతులకే భూములు ఉండాలని అని చెప్పలేదు. ‘వారు పంజాబీ రైతులు అయితే వారికి కచ్ భూముల మీద హక్కు ఉంది అని కూడా స్పష్టం చేసింది. రైతులే కేసు గెలిచారు. కానీ భూమి దక్కలేదు. మోదీ ప్రభుత్వం ఈ కేసును సుప్రీం కోర్టుకు (2012, జూలై 9) లాగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఈ రోజుకీ రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒక మేడిపండు. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..
భూ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్‌ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరవడానికే ప్రభుత్వం 166 జీవో చేసిందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు. రైతులే స్వచ్ఛందంగా భూములిస్తున్నారన్న మంత్రులు ఇప్పడెందుకు భూ సేకరణకు సిద్ధం అయ్యారని విశ్వరూప్ ప్రశ్నించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఏపీలో లక్షలాది ఎకరాల భూ సేకరణకు సిద్ధమైందన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఇప్పటి కూడా ఏపీ ప్రభుత్వం బయటపెట్టడం లేదని విశ్వరూప్ విమర్శించారు. కాగా యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో 'రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు'ను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. 'భూసేకరణ చట్టం-2013'లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది. -
రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..
-
ఇక బలవంతమే!
‘రాజధాని’ కోసం భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: రైతుల అనుమతితో నిమిత్తం లేకుండా రాజధానిలో బలవంతపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం వివాదాస్పదంగా మారి జాతీయ స్ థాయిలో చర్చ జరుగుతున్న భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఇందుకు ఆసరాగా చేసుకుంది. నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇంతకాలం భూ సమీకరణ పాటపాడిన ప్రభుత్వం గురువారం నుంచి ‘కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు’ పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టనుంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో ‘రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు’ను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. ‘భూసేకరణ చట్టం-2013’లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది. రెండు, మూడు చాప్టర్ల నుంచి మినహాయింపునివ్వడం ద్వారా రైతుల సమ్మతి లేకుండానే భూమి లాక్కోవడానికి ప్రభుత్వానికి అవకాశం లభించడంతో పాటు, పునరావాస బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీలుంటుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 166) జారీ చేసింది. ఆర్డినెన్స్‌లోని 10(ఎ)(1) ప్రకారం.. జాతీయ భద్రత, దేశ రక్షణకు సంబంధించిన, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, చౌక గృహనిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు, భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ఉండే పీపీపీ ప్రాజెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. భూసేకరణ చట్టం-2013లో ‘సామాజిక ప్రభావం అంచనా’ చాలా ముఖ్యమైన అంశం. తాజా నోటిఫికేషన్ ప్రకారం సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడానికి అధ్యయనం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి అవకాశమేర్పడింది. 2, 3 చాప్టర్లను మినహాయించడం వల్ల... రైతుల సమ్మతి లేకుండానే భూములు సేకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరమే ఉండదు. భూమి యజమానులకు చట్టంలో పేర్కొన్న మేరకు రిజిస్ట్రేషన్ విలువను బట్టి పరిహారం చెల్లించి భూములు లాక్కొనే హక్కు ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. మూడు నెలల్లో పరిహారం చెల్లించడంతో పాటు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలనే నిబంధనలు లేకపోవడంతో.. ప్రభుత్వం ఇచ్చినప్పుడే పరిహారం పుచ్చుకోవాలి.భూములపై ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతులు, కూలీల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది. పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలనే పరిమితుల నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు. భూ సేకరణ, తర్వాత చేపట్టే నిర్మాణ కార్యక్రమాల వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినా.. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రాజధాని కనీస అవసరాలకే భూ సేకరణ జరగాలనే నిబంధన లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చిన మేరకు భూ సేకరణ చేయవచ్చు. ఫలితంగా అవసరాలకు మించి భూములు సేకరించి, సర్కారు పెద్దలు సొమ్ము చేసుకొనే ప్రమాదం ఉంది.{పభావిత ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగుల సంక్షేమానికి, భూసేకరణతో సంబంధం ఉన్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను రూపొందించడం, సేకరణ వల్ల ఎదురయ్యే సామాజిక ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవచ్చు.మూడు పంటలు పండే భూములకు సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధన లేకపోవడం వల్ల.. మూక్కారు పండే భూములను రాజధాని కోసం సేకరించేందుకు అవరోధం ఉండదు. 33,400 ఎకరాలు రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించదలచుకున్న భూ విస్తీర్ణం. 14,800 ఎకరాలు రైతులతో ఒప్పందాలు కుదిరిన భూమి 18,600 ఎకరాలు భూ సమీకరణకు దూరంగా ఉన్న కొందరు(తొలుత అంగీకార పత్రాలు ఇచ్చినప్పటికీ) రైతుల ఆధీనంలో ఉన్న భూమి. 900 ఎకరాలు సమీకరణకు రాని భూమి ఇంతేనని, దీన్ని భూ సేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. సవరణకు ముందున్న భూసేకరణ చట్టంలోని చాప్టర్ 2 ఏం చెబుతోందంటే.... ►సామాజిక ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి విస్తృత ప్రచారం కల్పించాలి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచాలి. స్థానిక సంస్థతో సంప్రదింపులు జరిపి అధ్యయనం చేయాలి. ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్) చేపట్టాలి. నిర్వాసితుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకొని నివేదికలో పొందుపరచాలి. అధ్యయనం ప్రారంభించిన మూడు నెలల్లో పునరావాస కమిషనర్‌కు నివేదిక సమర్పించాలి. ► సామాజిక ప్రభావ అధ్యయనం (ఎస్ఐఏ) కోసం పునరావాస కమిషనర్ బృందాన్ని ఎంపిక చేయాలి. భూసేకరణకు దరఖాస్తు చేసిన సంస్థ ప్రతినిధులు ఎవరూ అధ్యయన బృందంలో ఉండకూడదు. సామాజిక కార్యకర్తలు, విద్యా, సాంకేతిక నిపుణులు, స్వతంత్ర ప్రాక్టీషనర్లు ఉండాలి. ప్రాజెక్టు వల్ల ప్రతికూల ప్రభావానికి గురయ్యే ప్రాంత విస్తీర్ణం, సేకరించిన ప్రాంతం మీదే కాకుండా పరిసరాలపై పర్యావరణ, సామాజిక ప్రభావాలను బృందం పరిశీలించాలి. ప్రాజెక్టు కనీస అవసరాల మేరకే భూసేకరణ జరుగుతోందనే విషయాన్ని నిర్ధారించాలి. ► {పభావిత ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రొఫైల్‌ను రూపొందించాలి. సామాజిక ప్రభావ అంచనా నివేదిక తయారైన తర్వాత.. ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి అనుసరించాల్సిన ‘సామాజిక ప్రభావ నిర్వహణ ప్రణాళిక (ఎస్‌ఐఎంపీ) రూపొందించాలి. దీనికి గ్రామసభ ఆమోదం ఉండాలి. ► సామాజిక ప్రభావ అంచనా అధ్యయన నివేదికను పరిశీలించడానికి నిపుణుల కమిటీ నియమించాలి. ► {పాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 2 నెలల్లోపు ప్రభావిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలి. ఆహార భద్రతను పరిరక్షించే చాప్టర్-3 రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను సేకరించాలని భావిస్తే.. అదే ఆఖరి ప్రత్యామ్నాయం అయి ఉండాలి. భూ సేకరణలో ప్రజోపయోగం ఉండి తీరాలి. ఆహార భద్రతకు భంగం కలిగించకుండా భూసేకరణ జరగాలి. ఆహార భద్రతకు భంగం కలుగుతుందని భావిస్తే.. సేకరించిన భూమికి సమానమైన బీడు భూమిని మరోచోట ముందుగా సాగుయోగ్యంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ లెక్కలేం చెబుతున్నాయి రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో దాదాపు 33 వేల ఎకరాలను సేకరించినట్టు, అది కూడా రైతులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారని చెబుతోంది. అయితే, ఇప్పటివరకు కేవలం 14,800 ఎకరాలకు మాత్రమే ఒప్పంద పత్రాలు అందాయని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ గురువారం చెప్పారు. అంటే సర్కారు చెబుతున్న 33 వేల ఎకరాల్లో సగానికన్నా ఎక్కువ మొత్తంలో భూములపై ఒప్పందమేదీ జరగలేదని స్పష్టమవుతోంది. రాజధాని కోసం తీసుకున్న భూములకు సంబంధించి కౌలు కింద చెల్లించాల్సిన నగదునూ స్వీకరించడానికి నిరాకరిస్తున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. దాదాపు 15 వేల ఎకరాలకు సంబంధించి రైతులు కౌలు తీసుకోలేదు. ప్రయోగించే అవకాశమున్న గ్రామాలు కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం దాని ఆధారంగా భూ సేకరణ చేయనుంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల నుంచి ఇక బలవంతంగా తీసుకోవడానికి వీలుగా ఈ నోటిఫికేషన్ ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, రాయపూడి, కురగల్లు, వెంకటపాలెం, ఎర్రుపాలెం, నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి తదితర గ్రామాల్లో భూ సేకరణ చట్టం ప్రయోగించడానికి సర్కారు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే తొలి ప్రయోగం భూ సేకరణ చట్టంలో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి వివాదాస్పదమైన ఆర్డినెన్స్‌ను అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్రం కానుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చట్టంలో చేసిన మార్పులను పరిశీలించడానికి ఆ అంశంపై ఈ నెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది. చట్ట సభల తుది నిర్ణయం రాకముందే దాన్ని అమలులోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. పూర్వాపరాలు ప్రజోపయోగ అవసరాలకు భూమిని సేకరించేందుకు 1894 నుంచి 2013 వరకు నాలుగు చట్టాలు వచ్చాయి. 2013లో తెచ్చిన చట్టం - భూ సేకరణ, నష్టపరిహారం, పునరావాస, పునః ఉపాధి కల్పన చట్టం. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిలో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ 2014, డిసెంబర్ 31న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంట్ ముందుంచి చట్టం చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దాంతో ఆ ఆర్డినెన్స్ గడువు తీరడంతో అవే మార్పులతో ఏప్రిల్ 3న కేంద్రం మళ్లీ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీన్ని తాజా సమావేశాల్లో పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవాలన్న ప్రయత్నం కూడా ముందుకు కదలలేదు. విపక్షాల డిమాండ్ మేరకు ఆ అంశాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఆ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అది మళ్లీ పార్లమెంట్ ముందుకొస్తుంది. ఈ ప్రక్రియ ఒకవైపు సాగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆధారంగా గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అధికారంతో భూ సేకరణకు అడ్డంగా నిలుస్తున్న రెండు అధ్యాయాలకు మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. -
భూఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండోసారి తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. లోక్‌సభలో చేసిన 9 సవరణలను తాజా ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్‌సభలో గట్టెక్కినా రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందలే కపోయింది. గత డిసెంబర్లో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ గడువు శనివారంతో ముగియనుంది. దీంతో మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మార్చి 31న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సిఫారసు మేరకు శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీంతో మోదీ అధికారం చేపట్టాక జారీ అయిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 11కు చేరింది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం కిందటివారమే రాజ్యసభను ప్రొరోగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆహార చట్టం అమలుక 6 నెలల గడువు పొడిగింపు ఆహార భద్రత చట్టం అమలుకు కేంద్రం మరో ఆరు నెలల గడువు పొడిగించినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. చట్టం అమలుకు ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించారు. ఈనెల 4తో రెండో గడువూ ముగియనున్న నేపథ్యంలో మరో ఆరునెలలు పొడిగించడం గమనార్హం. ఇప్పటివరకు ఒక కేంద్రపాలిత ప్రాంతం, 10 రాష్ట్రాలు(పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, చండీగఢ్) మాత్రమే దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ చట్టం కింద దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను రూ.1-3కే ఇవ్వాల్సి ఉంది. కాగా, రాష్ట్రాల్లో ఎక్కడా ఆహార ధాన్యాల నిల్వ సమస్య లేదని పాశ్వాన్ తెలిపారు. -
ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
-
భూసేకరణ ఆర్డినెన్స్‌పై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వాకౌట్ చేస్తే టీడీపీ సభ్యులంతా కిమ్మనకుండా లోపలే ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల వ్యతిరేకతను చూసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడి ఎనిమిది మంది సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అన్నాహజారే, మేధాపాట్కర్ వంటి సామాజిక ఉద్యమ నేతలు ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోసమే ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లుగా బోధపడుతోందని చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో రైతులను బెదిరించి అంగీకారపత్రాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో తమ పార్టీ శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు, నేతలు పర్యటించినప్పుడు పలువురు రైతులు ముందుకు వచ్చి ‘మీరు అండగా ఉంటే మేం భూములు ఇవ్వబోం’ అని స్పష్టం చేశారని చెప్పారు. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులూ వాటిని వెనక్కు తీసుకుంటామని చెప్పారన్నారు. సీఆర్డీఏ రైతుల నుంచి అంగీకారపత్రాలు (9.3 ఫారం) తీసుకోవడానికి గడువు పొడిగించినట్లుగానే అభ్యంతరపత్రాలు (9.2 ఫారం) తీసుకునేందుకూ పొడిగించాలని డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో 80 శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదని చెప్పారు. ఈ పర్యటనలో తమ దృష్టికి వచ్చిన అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. -
'ఆర్డినెన్స్‌లను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకిస్తోంది'
కేంద్ర ప్రభుత్వ తీరు ఆర్డినెన్స్‌ల రాజ్యంగా మారిపోయిందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. ఆరెస్సెస్ కూడా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చివరికి రాష్ట్రపతి సలహాలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని రామచంద్రయ్య ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవంటున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రామచంద్రయ్య చెప్పారు. ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఘనతేనని రామచంద్రయ్య గుర్తుచేశారు. -
అన్నదాతకు ఆర్డినెన్స్ కాటు
విశ్లేషణ నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/ సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే. ‘పార్లమెంట్‌ను విస్మరించి దొంగచాటుగా అనేక ఆర్డినెన్స్‌లు తెచ్చినందుకు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏకి మించిపోయి మరింత వేగంగా, ఆరునెలల్లోనే ఆర్డినెన్స్‌ల ప్రహసనాన్ని ఆరంభించింది. ఇది పార్లమెంట్ ప్రతిపత్తినీ, అధి కారాన్నీ నాశనం చేసే పరిణామం’ - కె.సి.త్యాగి, (పార్లమెంటేరియన్ ,1-1-2015) ‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్న సామెత ఎందుకు పుట్టిందో గాని; బీజేపీ నాయకుడు, ప్రధాని నరేంద్రమోదీకీ, తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ అది వర్తించినంతగా మరో ఏ ఇద్దరు పాలకులకూ వర్తించదేమో! అటు మోదీ, ఇటు బాబూ కూడబలుక్కున్నారో ఏమోగాని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోని బడా మోతుబరుల ప్రయోజనాల రక్షణ కోసం; దేశ, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలలో భాగంగా విదేశీ బహుళజాతి కంపెనీల పెట్టుబడి ప్రయోజనాల పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నట్టుంది. ఆర్డినెన్స్లూ, అసంపూర్ణ చర్చలూ రాష్ట్ర శాసనసభలో సమగ్ర చర్చతో నిమిత్తం లేకుండా, ప్రతిపక్షం నోరు నొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి సంస్థ పేరిట భూములను కబళించే బిల్లును బాబు ‘పాస్’ చేయించుకున్నారు! రాజధాని నిర్మాణ ం పేరుతో అవసరానికి మించి వేల ఎకరాల సుక్షేత్రాలను, దేశ ఆహార భద్రతకు రక్షణగా ఉన్న ధాన్యాగారాలైన జిల్లాలలో భూములను సేకరించడం దీని ఉద్దేశం. తరువాత, పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో మోదీ ప్రభుత్వం యూపీఏ జమానాలో చట్టంగా రూపొందిన ‘భూసేకరణ - పునరావాస నిర్వాసితుల పునః స్థిరీకరణ’ చట్టాన్ని (2013) సవరిస్తూ దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రపతి ఆమోదముద్రను సంపాదించుకుంది! యూపీఏ -2 తన ఐదేళ్ల (2009-2014) పాలనలో 25 ఆర్డినెన్సులను విడుదల చేస్తే, మోదీ ప్రభుత్వం ఆరేడు నెలలపాలనలోనే 8 ఆర్డినెన్సులు తెచ్చింది! అటు యూపీఏ (2013) చట్టంలోనూ, ఇటు మోదీ ప్రభుత్వం హోంశాఖ ద్వారా (2014) చొప్పించిన ఆర్డినెన్స్లోనూ కొన్ని సమాన ధర్మాలున్నాయి. అంతేకాదు, యూపీఏ అమలు చేయడానికి సాహసించలేని కొన్ని అంశాలూ ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కనిపిస్తున్నాయి. మొత్తం మీద యూపీఏ, ఎన్డీఏ కూటముల లక్ష్యం ఒక్కటే - దేశ, విదేశీ గుత్త పెట్టుబడులను భారీ స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోకి దించి, శాసించి, రైతాంగ వ్యవసాయ కూలీల, పారిశ్రామిక కార్మికుల జీవనాన్ని నియంత్రించడమే. రైతాంగాన్ని కూలీలుగా మార్చి, వ్యవసాయ కార్మికుల్ని పంట పొలాలపై ఆధారపడ కుండా పట్టణాలకు వలస పోయేస్థితిని కల్పించటం కూడా. ఇది 1894 నాటి వలసపాలనా చట్టానికి ఆధునికమైన నకలుగా భావించాలి. అమెరికా తరహా కార్పొరేట్ వ్యవసాయాన్ని ఇండియాలోనూ ప్రవేశపెట్టడం కోసమే గత వలసపాలనా చట్టానికి 1991లోనే ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణను ప్రతిపాదించిందన్న సంగతి మరచిపోరాదు! గడచిన 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ కలిపి) సహా యావద్భారతంలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దీని ఫలితమే. యూపీఏ, బీజేపీ- ఈ రెండు రకాల పాలనా వ్యవస్థలకూ ఆచరణలో తేడా లేదనడానికీ ఒకే ఒక ఉదాహరణ చాలు - 2013లో రైతాంగ ప్రయోజనాలకు భిన్నంగా యూపీఏ తెచ్చిన చట్టాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏడాదిన్నర క్రితం పార్లమెంటులో ఆమోదించిన బీజేపీ, నేడు అదే చట్టాన్ని గుత్త వ్యాపార బనియా వర్గాలకు మరింత అనుకూలంగా మారుస్తూ ‘సవరణలు’ తెచ్చి ‘సత్వర ఆదేశం’గా (ఆర్డినెన్సు) రైతుల నెత్తిన రుద్ద బోవటం ఏలాంటి నీతి? అయితే,2013 నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే. 2013 చట్టం ప్రకారం, భూసేకరణ జరిపే సమయంలో నష్టపోయే రైతులలో 70 శాతం మంది, ఇతర ప్రయివేట్, ప్రభుత్వ-ప్రయివేట్ (సి.పి.పి.) ప్రాజెక్టుల విషయంలో అయితే కనీసం 80 శాతం మంది ఆమోదం తప్పనిసరి. కానీ ఈ వెసులు బాటును కూడా 2014-15లో మోదీ ప్రభుత్వం తొలగించింది. ఫలితంగా రైతుల అంగీకారం లేకుండానే భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది. మాతృసంస్థకూ అనిష్టమే ఈ సందర్భంగా భారత ప్రభుత్వ జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి, నిపుణుడు రామస్వామి అయ్యర్ వ్యాఖ్య గమనించదగింది: ‘‘2013 నాటి భూసేకరణ చట్టంపైన పారిశ్రామికవేత్తలు, వారికి అనుకూలంగా వ్యాఖ్యాతలు వెలిబుచ్చిన వ్యతిరేకతను పట్టించుకోవలసిన పనిలేదు. అలాగే, పారిశ్రామికాభివృద్ధిని త్వరితం చేయాలన్న ప్రభుత్వ ఆశయాన్ని చట్ట విరుద్ధమైనదని కూడా భావించకూడదు. ఈ విషయంలో కొందరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ఈ సందర్భంగా వ్యక్తమైన ఆందోళనల దృష్ట్యా చేయవలసిన పని- 2013 చట్టంపైన, పంట భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఆ చట్టం చేసిన నిర్దేశం పైన ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చర్చకు అనుమతించి ఉండాల్సింది. తద్వారా సంబంధిత వర్గాలు సమన్వయ పూర్వకమైన పరిష్కారానికి వచ్చేలా చేయవలసింది. 2013 చట్టం మీద ఇంతవరకూ సమీక్షే జరగలేదు. కాగా, ఎన్డీఏ పాలకులు ఆ చట్టానికి సవరణలు తెస్తూ ఆకస్మికంగా ఆర్డినెన్స్ జారీచేశారు. ఈ ఆర్డినెన్స్ మంచి చెడ్డల గురించిన చర్చ అలా ఉంచితే, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు నిరంకుశం, పాక్షికం. ప్రజాస్వామ్య విరుద్ధం.’’ కాబట్టి, దేశ ఆహార భద్రతను దెబ్బతీసే నియంత్రణ రహితమైన భూమి బదలాయింపులు అనర్థమని ఆయన విశ్లేషించారు. రెండు మూడు పంటలు పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలని 2013 చట్టం ఆదేశించినప్పటికీ అది పరిశ్రమాభివృద్ధిని వ్యతిరేకించలేదనీ, ఈ అంశమే ప్రస్తుత ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కొరవడిందనీ స్పష్టమవుతోంది! చివరికి ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి ఒకరోజు ముందే మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడిన ఆర్.ఎస్.ఎస్. పరివార్‌లోని ‘స్వదేశీ జాగరణ మంచ్’ కూడా ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన విషయాన్ని గమనించాలి. అంతేగాదు, అంతకుముందు 15 రోజుల క్రితం ఇదే పరివార్ జాతీయ సదస్సులో ‘వ్యవసాయ రంగంలో విదేశీ పెత్తనాన్ని నిలిపివేయాలం’టూ తీర్మానం (నం.4) ఆమోదించిన విషయాన్ని గమనించాలి! అంతకన్నా విచిత్రమైన విషయం - ఏ బీజేపీ (మోదీ) ప్రభుత్వానికి ఆదేశాలిచ్చే ‘సైద్ధాంతిక’ శక్తిగా ‘థింక్ టాంక్’గా ఏ శక్తయితే ఉందో, అదే శక్తి, అంటే ఆర్.ఎస్.ఎస్. దేశ ఉత్పత్తుల పేటెంట్‌కు సంబంధించిన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వ విధానం గాడి తప్పిపోవడాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది! ఎందుకంటే, దేశీయ పేటెంట్ల హక్కుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించడానికి మోదీ ప్రభుత్వం ‘చింతనా సంఘాన్ని’ (థింక్ టాంక్) నియమించింది. అయితే, ఈ సంఘం దేశీయ ‘చింతన’కు స్వస్తి చెప్పి ఏం చేస్తోంది? భారతదేశంలోనే ‘వస్తు సముదాయాన్ని ఉత్పత్తి చేయాల’ని ఢిల్లీ కోట నుంచి అరుస్తున్న మోదీ ప్రభుత్వం ‘‘తమ థింక్ టాంక్ అమెరికాతో చేతులు కలిపి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యనిర్వహణా గ్రూపు (జాయింట్ వర్కింగ్ గ్రూప్) నీడలో పనిచేస్తోంద’’ని ఆర్.ఎస్.ఎస్. బట్టబయలు చేసింది! ప్రభుత్వాలకు ఎక్కడిది హక్కు? కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్న 38-39వ అధికరణలకు పూర్తి విరుద్ధం. పౌరుల జీవించే హక్కును, వ్యక్తి స్వేచ్ఛను హరించరాదన్న రాజ్యాంగ ఆదేశానికి ఇది పూర్తిగా అపవాదు. పార్లమెంట్ నిర్ణయాలు, అది చేసే చట్టాల చట్టబద్ధతను సమాజ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయించాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో (ఉదా: 1976/2007/2008) ఆదేశించింది. రాజ్యాంగం మౌలిక చట్టాల ప్రకారం అమలు కావాలి. అంతేగాని, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వసత్తాక (సావరీన్) ప్రతిపత్తి లేదనీ, ప్రభుత్వ ఆచరణ పరిధులు రాజ్యాంగ నిర్వచనకు లోబడి ఉండాలనీ, ఒక చట్టాన్ని రాజ్యాంగం విరుద్ధమని ప్రకటించే హక్కు న్యాయవ్యవస్థకు మాత్రమే ఉందనీ సమాఖ్య రాజ్యాంగ లక్షణాలను విశదీకరిస్తూ న్యాయశాస్త్ర కోవిదుడు పి.ఎం.బక్షీ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు లేవు కాబట్టి (123వ రాజ్యాంగ అధికరణ ప్రకారం) ఆర్డినెన్సు జారీ చేయగల హక్కు రాష్ట్రపతికి ఉంది. కాని ఆర్డినెన్సును జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక స్వభావానికి బద్ధమై ఉండాలి. ఒక రెగ్యులేషన్, లేదా ఆర్డినెన్స్ సదరు చట్టం ఉద్దేశానికి హేతుబద్ధంగా లేనప్పుడు న్యాయస్థానం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని కూడా బక్షీ స్పష్టం చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు చట్టం చేయడానికి అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నప్పుడు, ఆర్డినెన్సును కూడా పరోక్ష చట్టంగా పాలకులు భావిస్తున్నందున రాష్ట్రపతి సదరు ఆర్డినెన్సును కూడా తన పరిధిలో ప్రశ్నించవచ్చు! కాని అందుకు రాష్ట్రపతి సాహసించలేని ఒక నిరంకుశ చట్రంలో ఎప్పటికప్పుడు ప్రభు త్వాలు బిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు యూపీఏ ప్రవేశపెట్టిన తప్పుడు బిల్లును తనకున్న ‘వీటో’ అధికారంతో రాష్ట్రపతి ప్రశ్నించలేక పోయారు! ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భూమిపై రైతాంగహక్కుల్ని హరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలోనూ అదే జరిగింది. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
అసాధారణ పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌లు
కేంద్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచన చట్టాలు చేసేందుకు దగ్గరి దారిగా చూడొద్దని హితవు న్యూఢిల్లీ: మోదీ సర్కారు కుప్పలుతెప్పలుగా ఆర్డినెన్స్‌లు తీసుకువస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కొన్ని అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్లమెంట్ ప్రమేయం లేకుండా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించిందని, దీన్ని చట్టాలు చేయడానికి సులువైన మార్గంగా చూడొద్దని కేంద్రానికి సూచించారు. ఆర్డినెన్స్ వెసులుబాటును సాధారణ చట్టాలకు కూడా వర్తింపచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, దానిపై విపక్షాలు గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని పార్టీలు చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. సోమవారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లోని ఫ్యాకల్టీ, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్ ఆమోదంతో పనిలేకుండానే ప్రభుత్వం పలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘కొన్నిసార్లు చట్టాన్ని ఆమోదించుకోవడానికి అధికార పార్టీకి రాజ్యసభలో తగినంత మంది సభ్యులు ఉండకపోవచ్చు. అప్పుడు ఉభయ సభలను సమావేశపరిచి చట్టాన్ని ఆమోదించుకోవచ్చు. వాస్తవానికి ఇది కూడా క్లిష్టమే. 1952 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఉభయ సభలను సమావేశపరిచి నాలుగుసార్లు మాత్రమే చట్టాలు ఆమోదించారు. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి రాజ్యాంగం అనుమతించింది. సాధారణ చట్టాలు చేయడానికి కూడా ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవడం సరికాదు’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘‘ఒక అంశాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు, పూర్తిగా నిరాకరించవచ్చు. ఏదేమైనా ఆ సమస్యకు వివిధ మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యత’’ అని వ్యాఖ్యానించారు. భూసేకరణతోపాటు వివిధ కీలకాంశాలపై మోదీ సర్కారు ఏకంగా ఎనిమిది ఆర్డినెన్స్‌లు తీసుకువ చ్చిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే ముందు దాని ఆవశ్యకతపై ముగ్గురు సీనియర్ కేంద్రమంత్రుల నుంచి ప్రణబ్ వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. -
నిరంకుశ ఆర్డినెన్స్
సంపాదకీయం అధికారంలో ఉన్నవారు తాము ఏదనుకుంటే అది చేయగలుగుతున్నామని సంబరపడుతున్నారు తప్ప ఆ క్రమంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామన్న స్పృహను కోల్పోతున్నారు. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలను నిర్దేశిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ చుట్టూ సాగుతున్న వివాదం దీన్ని మరోసారి రుజువుచేసింది. అసలు ఆర్డినెన్స్ జారీకి అక్కడి ప్రభుత్వం ఎన్నుకున్న సమయాన్ని గమనిస్తే దాని అంతరంగమేమిటో సులభంగానే అర్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి సరిగ్గా పక్షంరోజులముందు...న్యాయస్థానాలు సెలవులో ఉన్నప్పుడు గత నెల 20న ఆర్డినెన్స్ జారీ అయింది. దానిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రూపొందించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సమయానికే నామినేషన్ల ఘట్టం మొదలైంది. ధర్మాసనం పరిశీలనకొచ్చిన మంగళవారానికి ఆ ఘట్టం ముగిసిపోయింది కూడా. ఈ ఆర్డినెన్స్‌పై ముందుగా రాజస్థాన్ హైకోర్టులో సవాల్‌చేసి, అక్కడ వెలువడిన నిర్ణయంపై తమవద్దకు రావాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే, పిటిషనర్లు న్యాయస్థానాలచుట్టూ తిరిగేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ నెల 16న మొదలై మూడు దశల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కూడా కాదు. ఇంతమాత్రానికే సత్యం జయించిందంటూ ఆ రాష్ట్ర బీజేపీ సంబరపడుతున్నది. రాజస్థాన్ ఆర్డినెన్స్‌లోని నిబంధనలు చిత్రంగా ఉన్నాయి. సర్పంచ్‌గా పోటీచేసే వ్యక్తి కనీసం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. గిరిజన ప్రాంతాల్లో ఈ అర్హతను అయిదో తరగతికి పరిమితం చేశారు. జిల్లా పరిషత్ లేదా పంచాయతీ సమితికి పోటీచేసేవారు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. పునాది స్థాయిలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తే దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతి పరిఢవిల్లుతుందన్న సదుద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు పంచాయతీ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చారు. అనంతరకాలంలో పార్లమెంటుతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలన్నీ ఆమోదించిన 73 వ రాజ్యాంగ సవరణ కూడా ఈ వ్యవస్థ పటిష్టతపై దృష్టిపెట్టింది. ఈ చర్యల వెనకున్న స్ఫూర్తిని మొత్తం రాజస్థాన్ ఆర్డినెన్స్ దెబ్బతీస్తున్నది. దేశంలో ఓటు హక్కు ఎవరికివ్వాలన్న చర్చ జరిగినప్పుడు రాజ్యాంగ సభ సభ్యులు అందుకు కేవలం నిర్దిష్ట వయసును సూచించారు తప్ప విద్యార్హతలు అవసరమని భావించలేదు. అలాగే స్త్రీ, పురుష వివక్షనూ...గ్రామాలు, పట్టణాలన్న విభజనను వారు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజాస్వామ్య యజ్ఞంలో అన్ని వర్గాలవారికీ సమానమైన ప్రాధాన్యమివ్వాలనీ, అన్ని గొంతులూ వినాలనీ విశ్వసించడమే అందుకు కారణం. పాలక వ్యవస్థ తమకు సంబంధించినది కాదనీ...అందులో తమ మాటకు విలువలేదనీ ఏ ఒక్క వర్గమైనా భావిస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందన్న ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు వయోజన ఓటు హక్కును కల్పించారు. ఓటేయడానికి పనికొచ్చే విచక్షణా జ్ఞానం పాలించడానికి పనికిరాదనుకోవడం...విద్యార్హతలు లేనివారే అవినీతికి పాల్పడతారని చెప్పడం పాలకుల సంకుచిత స్వభావానికి చిహ్నం. ఇవే అర్హతలను ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేస్తే ఆ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు అనర్హులవుతారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండేందుకు అడ్డురాని విద్యానర్హతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేవారికి మాత్రమే వర్తింపజేయడం ఎందుకన్న స్పృహ కూడా రాజస్థాన్ ఏలికలకు లేదు. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి బీజేపీ సర్కారు చెబుతున్న కారణాలు ఎంతో అసంబద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉంటున్నవారు అవినీతికి పాల్పడుతూ, దర్యాప్తు సమయంలో మాత్రం తమకు చదువురాకపోవడంవల్ల చట్టాలపై అవగాహన కొరవడిందని చెబుతున్నారని అంటున్నది. ఇది నిజానికి సాకు మాత్రమే. రాజస్థాన్‌లోని దాదాపు 6,000మంది సర్పంచ్‌లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది కొన్ని వందలమంది మాత్రమే. రాజస్థాన్‌లో నిరక్షరాస్యతకు సంబంధించిన గణాంకాలు గమనిస్తే అక్కడి సర్కారు నిర్ణయం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అంచనావేయొచ్చు. అది గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో దాదాపు 24 శాతంకాగా, మహిళల్లో అది 54.2 శాతం. అక్షరాస్యుల్లో కూడా ఆర్డినెన్స్ సూచిస్తున్న విద్యార్హతలున్నవారు చాలా తక్కువమంది ఉంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లో 20 ఏళ్లు పైబడినవారిలో 82.5 శాతంమంది అయిదో తరగతికి మించి చదువుకోలేదని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. ఇలా చదువుకు దూరమైనవారిలో అత్యధికులు సహజంగానే మహిళలు, దళితులు, ఆదివాసీలు ఉంటారు. పంచాయతీరాజ్ సంస్థల్లో భాగస్వాములుకాకుండా ఇంతమందిని అడ్డుకుంటున్న ఈ ఆర్డినెన్స్ ఎంతటి అప్రజాస్వామికమైనదో వేరే చెప్పనవసరం లేదు. అసలు ఇలాంటి అంశంపై ఆర్డినెన్స్ తోవను ఎంచుకోవడమే తప్పు. ఏ బిల్లునైనా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగినంత మెజారిటీ అక్కడి ప్రభుత్వానికి ఉంది. అసలు ఇది మెజారిటీకి సంబంధించిన సమస్య కూడా కాదు. కీలకమైన విషయాలను చట్టసభలో చర్చించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లుకు పదునుపెట్టి ఆమోదం పొంది అప్పుడు చట్టరూపం తీసుకురావడం కనీస ధర్మం. అందుకు సమయం పడుతుందనుకుంటే వచ్చే దఫా ఎన్నికలకు వర్తించేలా చట్టాన్ని తీసుకురావొచ్చు. ఈలోగా తమ విద్యార్హతలను పెంచుకునేందుకు కొందరికైనా అవకాశం లభిస్తుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా, చట్టసభలను సైతం ఖాతరు చేయకుండా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ అత్యంత అప్రజాస్వామికమైనది. పాలకులు ఇలాంటి నిరంకుశ పోకడలకు పోవడం దురదృష్టకరం. -
ప్రాజెక్టుల పరుగులు
భూ సేకరణ ఇలా (ఎకరాల్లో).. ప్రాజెక్టు సేకరించాల్సింది సేకరించింది నెట్టెంపాడు 26,542 21,657 రాజీవ్‌భీమా 17,254 15,591 కల్వకుర్తి 17,254 16,532 జూరాల 10,000 9,196 కోయిల్‌సాగర్ 7,230 6,476 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో నాలుగు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులు, లింక్ కెనాల్స్ పనులు ముమ్మరం అవుతున్నాయి. ఎన్నో ఏళ్లనుంచి భూ సేకరణ పూర్తికాక నత్తనడకన సాగిన పనులు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఆసరా చేసుకొని ప్రాజెక్టుల పనులు చకచకా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. జిల్లాలోని ఆరు ప్రధాన ప్రాజెక్టులకోసం 8,828 ఎకరాల భూమిని సేకరించే పని లో అధికార యంత్రాంగం నిమగ్నమైం ది. దీంతో వచ్చే ఏడాది పాలమూరు భూములు పచ్చగా మార్చేందుకు సర్కారు సన్నద్ధం చేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నత్తనడకనే... జిల్లా తలాపునుంచే రెండు ప్రధానమైన నదులు ప్రవహిస్తుంటాయి. కానీ వాటినుంచి జిల్లావాసులకు పెద్దగా ప్రయోజ నం చేకూరడం లేదు. దీంతో పొట్టకూటి కోసం జిల్లావాసులు ముంబై, దుబాయి తదితర ప్రాంతాలకు వలసలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు వలస కష్టాలను నివారించేందుకు ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. రాజీవ్‌భీమా, నెట్టెం పాడు, కల్వకుర్తి (మహాత్మాగాంధీ ఎత్తిపోతల) తదితర వాటి ద్వారా జిల్లా కష్టాలను తీర్చాలని భావించారు. వైఎస్ఆర్ ఉన్నంత వరకు ఆయా ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించారు. కేవలం నాలుగేళ్లలో ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తయి ఇప్పటికే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ వైఎస్ఆర్ మరణానంతరం ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తిగా నెమ్మదించాయి. ఐదేళ్లుగా పనులన్నీ పూర్తిగా స్తంభించి, ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయి 2015 ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సిద్ధమవుతాయని భావించిన తరుణంలో ప్రాజెక్టుల భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం... కొరకరాని కొయ్యలా తయారై జిల్లాలో ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ సాధ్యపడలేదు. దీంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం జిల్లాలో మూడు ప్రధాన భారీ ఎత్తిపోతల పథకాల్లో మట్టి పనులు, రిజర్వాయర్ పనులు, కాలువల తవ్వకాల పనులు పూర్తయ్యాయి. కీలకమైన డిస్ట్రిబ్యూటర్లు, తూములు, ప్రధాన సిమెంటు నిర్మాణ పనులకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఖరీఫ్ నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ త్వరతగతిన పూర్తిచేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల లక్ష్యాలు ఇలా... జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులలో ఒకటైన నెట్టెంపాడు ద్వారా మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రా జెక్టు ద్వారా రెండు పంప్‌హౌస్‌లను ఉపయోగించి దీనికిందున్న ఏడు రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేసేలా ప్రణాళిక ర చించారు. అక్కడి నుంచి మొత్తం రెండు లక్షల ఎకరాల పొలానికి సాగునీరు అం దించనున్నారు. అలాగే రాజీవ్‌భీమా ఎత్తిపోతల ద్వారా కూడా మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా మక్తల్, దేవరకద్ర, తదితర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మూడు లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించనున్నారు. మొత్తం 25 టీఎంసీల నీటిని ఉపయోగించి నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లు నిర్మించి సాగునీరు అందించనున్నారు. మొదటి పంపు ద్వారా మొన్నటి ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేశారు. రెండో లిఫ్టులో మొత్తం ప్రాజెక్టు లక్ష్యం ఉన్నందున మిగతా పనులను వేగవంతం చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రస్తుతం సాగునీరు అందిస్తోన్న జూరాల, కోయిల్‌సాగర్ ఆయకట్టును కూడా పూర్తిగా పనులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది. ఇలా మొత్తం మీద వచ్చే ఖరీఫ్ నాటికి నెట్టెంపాడు ద్వారా 2లక్షల ఎకరాలు, భీమా ద్వారా 2లక్షల ఎకరాలకు, కల్వకుర్తి ద్వారా 3.30లక్షల ఎకరాలలో సాగునీరు కనీసం 80 శాతం మేరకైనా అందించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. -
గవర్నెన్స్... వయా ఆర్డినెన్స్
ప్రజాస్వామిక దేశంలో పాలనకి రాజమార్గం చట్ట సభల ద్వారానే ఉంటుంది. ఆర్డినెన్స్ మార్గం అన్నది అత్యవసరానికి ఉద్దేశించినది. చట్టసభలు నిర్వహించే అవకాశం లేనప్పుడు చేబట్టిన విషయం దేశానికి అత్యవసరమైనప్పుడు తాత్కాలిక ఉపశమన ఏర్పాటుగా ప్రభు త్వానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఆ స్ఫూర్తితోనే ప్రభు త్వం ఆర్డినెన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అది అరుదైన వ్యవహారంగానే తప్ప అలవాటైన వ్యవహా రంగా ఉండరాదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా జీవనంపై తీవ్రప్రభావం చూడగల ము ఖ్య నిర్ణయాల్ని ఆర్డినెన్స్ మార్గంలో తీసుకురావడం దురదృష్టకరం. ఈ మధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసి, మళ్లీ రెండు నెలల వ్యవధిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ రకమైన చర్య ప్రజాస్వామిక సంప్రదాయాల్ని అగౌరవపరచడమే. పైగా బొగ్గు గనుల కేటాయింపులు అంశం మినహా భూసేకరణ చట్టం గానీ బీమా సవరణల చట్టం గానీ ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం చూపేవి. చట్ట సభల ద్వారా విస్తృత చర్చ జరగా ల్సినవి. ఈ తరహా చర్యల్ని ప్రభుత్వం మానుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టసభల గౌరవాన్ని నిలపడం ద్వారానే ప్రజానీకానికి మేలు చేయడం సాధ్యం. - డా॥డి.వి.జిశంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే
భూసేకరణ సవరణలకు ఆమోదం న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంలో సవరణలతో కేంద్ర మంత్రివర్గం గత నెల 29న ఆమోదించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి బుధవారం ఆమోదముద్ర వేశారు. పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, రక్షణ, గృహనిర్మాణ రంగాలకోసం జరిపే భూసేకరణకు సంబంధించిన నిబంధనల్లో మార్పు చేస్తూ తయారు చేసిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసినట్టు రాష్ట్రపతి మీడియా కార్యదర్శి వేణు రాజమొనీ చెప్పారు. కాగా, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకానికి ఇప్పటివరకు అనుసరిస్తున్న కొలీజియం విధానం రద్దుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పార్లమెంటు ఆమోదించిన జాతీయ న్యాయసంబంధ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తాం’ భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌నురాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆర్డినెన్స్ ఉన్నదున్నట్టుగా చట్టం కాజాలదని, పరిస్థితుల ఒత్తిడితో మాత్రమే ఆర్డినెన్స్‌లు తేవాల్సి ఉండగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడునెలలోనే తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిందని ఆరోపించింది. -
లోహ షేర్లు మిలమిల
ఆర్డినెన్స్‌లపై ఆశాభావం 154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై: కేంద్రం ఆర్థిక సంస్కరణల కోసం పలు ఆర్డినెన్స్‌లను తీసుకురానున్నదన్న వార్తలతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా లావాదేవీలు మందకొడిగా ఉన్నప్పటికీ, లోహ, వాహన రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 154 పాయింట్లు పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉండడం, విదేశీ ఫండ్ల కొనుగోళ్లు షురూ చేయడంతో వరుసగా రెండో సెషన్లోనూ సెన్సెక్స్ లాభాల బాటలోనే నడిచింది. గరిష్టంగా 27, 507 పాయింట్లకు ఎగసిన సెన్సెక్స్ చివరకు 154 పాయింట్ల లాభంతో 27,395.73 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 8,246 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ సూచి మినహా మిగిలిన 11 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ నెల 9 నుంచి 12 రోజుల పాటు భారీగా అమ్మకాలు జరిపిన ఎఫ్‌పీఐ(ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్)లు గత శుక్రవారం రూ.39.9 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారని స్టాక్‌మార్కెట్ డేటా వెల్లడిస్తోంది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ భూ సేకరణ, మైనింగ్ ఇతర చట్టాల్లో ఆర్డినెన్స్‌ల రూపంలో కేంద్రం మార్పులు, చేర్పులు చేయనున్నదన్న వార్తలతో పలు మౌలిక రంగ, లోహ షేర్లు పెరిగాయి. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర లోహ షేర్లు సెన్సెక్స్‌కు తగిన తోడ్పాటునందించాయి. డిసెంబర్ అమ్మకాల గణాంకాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నందున వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఫార్మా, ఐటీ షేర్లు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ కారణంగా ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్‌గా ఉంది. శుక్రవారం రూ.1,962 కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్ టర్నోవర్ సోమవారం రూ.2,261 కోట్లకు పెరిగింది. టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, ఐటీసీ, టీసీఎస్, సెసా స్టెరిలైట్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, హిందాల్కో, హిందూస్తాన్ యూనిలివర్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు 4 శాతం నుంచి 1 శాతం రేంజ్లో పెరిగాయి. ఆసియా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.74 శాతం నుంచి 1.82 శాతం మధ్యలో పెరగ్గా, జపాన్, దక్షిన కొరియాలు సూచీలు 0.5 శాతం, 1.04 శాతం చొప్పున క్షీణించాయి. -
భూసేకరణ చట్టంలో సవరణలకు కేంద్రం ఆమోదం!
-
మైనింగ్ సంస్కరణలకూ ఆర్డినెన్స్ రూట్..!
న్యూఢిల్లీ: బొగ్గు, బీమా రంగాల్లో సంస్కరణల కోసం ఆర్డినెన్స్‌లను జారీ చేసిన మోదీ సర్కారు... మైనింగ్ రంగంలో కూడా ఇదే రూట్‌ను ఎంచుకోనుంది. తద్వారా ముడి ఇనుము ఇతర ఖనిజాల వేలానికి మార్గం సుగమం చేయాలని భావిస్తోంది. ప్రతిపాదిత గనుల, ఖనిజాల(అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957కు సవరణలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణం. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’లో మైనింగ్ రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మైనింగ్ చట్టంలో సవరణలను అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఆర్డినెన్స్ జారీ కోసం కేబినెట్ నోట్ సిద్ధమైందని గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే కేబినెట్ ఆమోదం కోరనున్నట్లు వెల్లడించాయి. మైనింగ్‌పై నిషేధం ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని మార్చడం కోసం గత యూపీఏ ప్రభుత్వం మైనింగ్ సవరణ బిల్లు-2011ను రూపొందించింది. అయితే, లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా మురిగిపోయింది. కొత్తగా వచ్చిన మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా సవరణ బిల్లుపై అన్ని పక్షాల అభిప్రాయాల ఆధారంగా కొత్త బిల్లును మైనింగ్ శాఖ సిద్ధం చేసింది. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా చాలా బిల్లుల మాదిరిగానే దీన్ని ప్రవేశపెట్టడం కుదరలేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. -
నిధుల సమీకరణకు
బీమా ఆర్డినెన్స్ తోడ్పాటు న్యూఢిల్లీ: బీమా కంపెనీలు బీమా రంగ సంస్కరణలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీతో ఇన్సూరెన్స్ కంపెనీలు కొంగొత్త, వినూత్నమైన సాధనాల ద్వారా నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకూ తోడ్పడుతుందని తెలిపింది. భారీ పెట్టుబడులు అవసరమైన బీమా కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి వీలు కల్పించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు పొందుపర్చినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బీమా చట్టాల (సవరణ) ఆర్డినెన్స్ 2014ని ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దేశీ బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం ఈ ఆర్డినెన్స్ ప్రధానోద్దేశం. దీనితో సుమారు 7-8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 50,000 కోట్లు) నిధులు బీమా రంగంలోకి రాగలవని అంచనా. దేశ ఎకానమీ.. ముఖ్యంగా బీమా రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టే దిశగా ఆర్డినెన్స్ ఉపకరించగలదని ఆర్థిక శాఖ వివరించింది. పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
ఆర్డినెన్స్ పాలన!
ఎన్నిసార్లు ఎంత ఘనంగా సంకల్పం చెప్పుకున్నా మన పార్లమెంటును సజావుగా నడపడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదని మళ్లీ రుజువైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేసరికి మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఉంది. సమావేశాలు ముగిసే రోజున జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో సైతం ఆ పార్టీ మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ ఎన్నికలన్నిటా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఆ రకంగా కేంద్రంలో పాలకపక్షం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటపుడు పార్లమెంటును నడపడం దానికి కష్టం కాకూడదు. లోగడ యూపీఏ సర్కారు ఉన్నప్పుడు వాయిదాల ప్రమేయం లేకుండా ఒక్కరోజు కూడా పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోయింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండు కోసం ఒక సందర్భంలో మొత్తంగా సమావేశాలే చాపచుట్టుకుపోయాయి. ఇప్పుడు సైతం అవే దృశ్యాలు కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఎవరినో తప్పుబట్టడం కంటే ఆత్మవిమర్శ చేసుకోవడం బీజేపీకి తక్షణావసరం. ఆ సంగతలా ఉంచి...నరేంద్ర మోదీ సర్కారు ఈ సమావేశాల్లో ఆమోదం పొంది ఉండాల్సిన రెండు ప్రధాన బిల్లుల స్థానంలో శుక్రవారం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఈ రెండూ అత్యంత కీలకమైనవి. ఒకటి బీమా రంగంలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను 26 శాతంనుంచి 49 శాతానికి పెంచడానికి వీలు కల్పించేదైతే...రెండోది రద్దయిన బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా చట్టసభలు ఉన్నతమైనవనీ... వాటిని విస్మరించి ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిద్దామని భావించడం రాజ్యాంగ విరుద్ధమనీ 1986లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయాల్సింది శాసనవ్యవస్థే తప్ప కార్యనిర్వాహకవ ర్గం కాదని ఆ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. చట్టసభల నిర్వహణ సాధ్యపడని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలని రాజ్యాంగంలోని 123వ అధికరణం కూడా సూచిస్తున్నది. కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూనే... ఆర్డినెన్స్ జారీ అత్యవసరమన్న అంశంలో ఆయన ముందుగా సంతృప్తి చెందాల్సి ఉంటుందని కూడా అన్నది. వాస్తవానికి ఆర్డినెన్స్‌లు జారీచేయడం దొడ్డిదారి పాలనతో సమానం. బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆర్డినెన్స్ విధానాన్ని చట్టబద్ధం చేశారు. ఏ ప్రజాస్వామిక దేశంలోనూ ఇలాంటి పద్ధతి ప్రస్తుతం అమలులో లేదు. కాలం చెల్లిన చట్టాలను తొలగించడానికి నడుం బిగించిన మోదీ సర్కారు ఇలాంటి అప్రజాస్వామిక చట్టాల ఆధారంగా ఆర్డినెన్స్‌లను జారీచేయడానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వాస్తవానికి బొగ్గు క్షేత్రాల పునఃవేలం అత్యవసరమైనదే. వాటి కేటాయింపులో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్నందున రెండేళ్లనుంచి అనేక పరిశ్రమలు అనిశ్చితిలో పడ్డాయి. మార్చి 31లోగా బొగ్గు క్షేత్రాల పునఃవేలం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని, అందులో మళ్లీ ఆ క్షేత్రాలను సొంతం చేసు కున్న సంస్థలకే చోటుంటుందని, మిగిలినవాటికి అవి రద్దవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక వేలం ప్రక్రియ ప్రారంభించడం ముఖ్యమే. బీమా బిల్లుకు సంబంధించినంత వరకూ వామపక్షాలు మినహా ఇతర పార్టీలేవీ దాన్ని వ్యతిరేకిం చడంలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక అవగాహనకొచ్చాయి. అయితే, మత మార్పిళ్ల వ్యవహారంలో ప్రధాని హామీ ఇవ్వాలన్న విపక్షాల డిమాండును అంగీకరించని కారణంగా ఏర్పడ్డ పరిణామాలవల్ల ఇలా అంగీకారం కుదిరిన బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టలేని స్థితిలో ప్రభుత్వం పడింది. బొగ్గు క్షేత్రాల వేలం గురించి అయితే ఆర్డినెన్స్ అవసరం ఉన్నదనుకున్నా బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు విషయం దాదాపు ఆరేళ్లుగా నానుతున్న సమస్య. అది మరికొన్ని నెలలు వాయిదా పడితే వచ్చే నష్టమేమీ లేదు. కానీ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తగ్గబోమని ప్రపంచానికి చాటడం కోసమే బీమా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ప్రభుత్వం అంటున్నది. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పెంపు వివాదాస్పదమైన అంశం. దాన్ని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జీవిత బీమా, ఇతరత్రా బీమా రంగాల్లో ప్రస్తుతం 52 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో 5 మాత్రమే ప్రభుత్వరంగసంస్థలు. భారత్‌లో 36 కోట్లమంది జీవిత బీమా పాలసీదారులున్నారని ఈమధ్యే సిగ్మా నివేదిక వెల్లడించింది. బీమా రంగంలో సంస్కరణలు మొదలై దశాబ్దం దాటుతున్నా ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీదే అందులో ఆధిపత్యం. ఈ మార్కెట్లో దాని వాటా 71 శాతం. పార్లమెంటులో బీమా బిల్లును పెట్టి చర్చలు సాగనిస్తే ఈ విషయంలో ఎవరి వాదన ఏమిటో దేశ ప్రజలకు తెలుస్తుంది. ఆ నిర్ణయంలోని మంచిచెడ్డలపై కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాలను పార్లమెంటు ఆమోదంతో అమల్లోకి తీసుకురావడం ప్రజా స్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఏర్పాటు కాదని... ఒకవేళ ఆర్డినెన్స్ మురిగి పోతే తమ పెట్టుబడులు అనిశ్చితిలో పడతాయని విదేశీ సంస్థలకు తెలియదా? నరేంద్ర మోదీ సర్కారు పార్లమెంటులో చర్చించడం ద్వారా, అందరినీ కలుపుకొని వెళ్లడంద్వారా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సత్సంప్రదాయానికి శ్రీకారం చుడితే బాగుండేది. అలా చేయకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి కారణమని పాలకులు గ్రహించాలి. -
బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది. ఈ రెండు రంగాల్లో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు మంగళవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి నోచుకోని నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్సుల మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బీమా బిల్లుపై ఒకటి, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కొత్తగా మరొకటి ఆర్డినెన్సులు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజాగా వీటికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడం వల్ల ఈ రంగంలో 6-8 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగ లవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందనేందుకు తాజా ఆర్డినెన్సులు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, పార్లమెంటులోని ఏదో ఒక సభలో కీలకాంశాలను అడ్డుకుంటూపోతే.. సుదీర్ఘకాలం నిరీక్షిస్తూ కూర్చునే పరిస్థితి ఉండబోదని ఇటు ఇతర దేశాలకు, అటు ఇన్వెస్టర్లకూ తెలియజేసినట్లయిందన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతం దాకా పెంచాలన్న ప్రతిపాదన 2008 నుంచి పెండింగ్‌లో ఉంది. రాజ్యసభ కమిటీ ఆమోదముద్ర పడినప్పటికీ మతమార్పిళ్లు మొదలైన ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగినందు వల్ల ఇటీవలే ముగిసిన సమావేశాల్లో కూడా బీమా బిల్లుపై చర్చ సాధ్యపడలేదు. అటు, లోక్‌సభ ఆమోదించినప్పటికీ బొగ్గు గనులు బిల్లుకు కూడా మోక్షం లభించలేదు. -
ఆగమేఘాలపై ఆర్డినెన్స్
* పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్ * ఉదయం అరగంటపాటు తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే సంబంధిత ఫైలు గవర్నర్ నరసింహన్‌కు చేరింది. ఆయన ఆమోదముద్ర వేయడంతో రాత్రికే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఒక్కరోజులోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం, వారి జీతభత్యాలు, సంబంధిత వ్యవహారాలను ఆర్డినెన్స్‌లో పొందుపరిచింది. దీన్ని రాష్ట్ర గెజిట్లోనూ ప్రచురించినట్లు సర్కారు ప్రకటించింది. దీంతో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్ అయింది. ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అసెంబ్లీని ప్రొరో గ్చేయాల్సి ఉంటుంది. అందుకే రాష్ర్ట శాసనసభ రెండో విడత సమావేశాలు శుక్రవారం ముగిసినట్లుగా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆర్డినెన్స్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేబినెట్ పరిమాణంపై ఉన్న పరిమితుల దృష్ట్యా మంత్రి పదవులను ఆశించిన పలువురు టీఆర్ఎస్ నేతలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. జలగం వెంకట్రావు, శ్రీనివాస్‌గౌడ్, వినయ్‌భాస్కర్, కోవ లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించే అవకాశమున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ పదవుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నియామక ప్రక్రియపై సీఎం ఇప్పటికే అధ్యయనం చేయించారు. సహాయ మంత్రుల హోదా ఉండే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే అత్యవసరంగా భావించి ఆర్డినెన్స్ జారీకి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం కేవలం అరగంటసేపు సమావేశమైంది. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించి నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు. కేబినేట్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవశ్యాన్ని సీఎం వివరించారు. లేకుంటే చట్టపరంగా చిక్కులు వస్తాయని, కొన్ని రాష్ట్రాల్లో అలా చేపట్టిననియామకాలు తిరస్కరణకు గురయ్యాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలో లేదా తదుపరి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే సమావేశంలో మంత్రివర్గం మరో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌కు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో క్రైస్తవ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనే జనవరి ఒకటిని సెలవు దినంగా ప్రకటించింది. బదులుగా రెండో శనివారం సెలవు దినమైన ఫిబ్రవరి 14న ఉద్యోగులు పనిచేయాలని నిర్ణయించింది. రెండోసారి కేటీఆర్ డుమ్మా! రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి మంత్రి కేటీఆర్ వరుసగా రెండోసారి గైర్హాజరయ్యా రు. కేబినెట్ విస్తరణ రోజున పూర్తిస్థాయి మం త్రివర్గంతో నిర్వహించిన భేటీకి ఆయన హాజ రుకాని విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన భేటీకి కూడా కేటీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కుటుం బసభ్యులతో కలిసి కేరళ టూర్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలేవైనా పది రోజుల వ్యవధిలో నాలుగు ముఖ్య కార్యక్రమాలకు కేటీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉండ టం గమనార్హం. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ కు కేటీఆర్ రాకపోవటం పలు సందేహాలకు తావిచ్చింది. పదవుల పంపకానికి సంబంధించిన విభేదాలే కారణమనే ప్రచారానికి తెరలేపింది. అదే రోజున సాయంత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతో నిర్వహించిన భేటీకి సైతం కేటీఆర్ హాజరవలేదు. అంతకు వారం ముం దు సిద్దిపేటలో వాటర్‌గ్రిడ్‌పై సీఎం మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇది కేటీఆర్ మంత్రిత్వ శాఖ కార్యక్రమమైనప్పటికీ దానికి వెళ్లలేదు. అంతేగాదు దుబాయ్ నుంచి తిరిగొచ్చాక సెక్రెటేరియట్ విధులకు కూడా ఆయన హాజరుకాలేదు. ఇక శుక్రవారం నాటి సమావేశానికి కొత్తగా మంత్రివర్గంలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు రాలేదు. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నందున సీఎం సూచన మేరకే ఆయన హాజరుకాలేదని సహచర మంత్రులు తెలిపారు. -
కోల్ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నిర్ణయంతో రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదం తెలిపారు. ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. అవకతవకల అభియోగాలతో 1993 నుంచి జరిగిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ప్రైవేటు కంపెనీల వినియోగం కోసం సదరు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు గనులను కేటాయించేందుకు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలకు నేరుగా కేటాయింపులు జరిపేందుకు వీలుగా రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌ను విద్యుత్ సంస్కరణల్లో ప్రభుత్వం వేసిన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. కాగా, వాణిజ్య ప్రాతిపదికన బొగ్గుగనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మరోవైపు ప్రైవేటు కంపెనీలకు ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు బ్లాకులను కేటయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు సిద్ధమమతున్నాయి. -
బొగ్గు క్షేత్రాల 'ఈ ఆక్షన్' కు ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేపడుతోంది. సుప్రీం కోర్టు రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల భూమిని కేంద్రం సేకరించనుంది. పీఎస్ యూ, రాష్ట్రాలకు ప్రత్యేక్షంగా భూకేటాయింపులు చేయడానికి ఈ-ఆక్షన్ నిర్వహించడానికి ఆర్డినెన్స్ తేవాలని కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 1993 నుంచి చేసిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు లబ్ది చేకూరనుంది. -
హైకోర్టులో ఏపీ సర్కార్ కి ఊరట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆలయ పాలక మండళ్లను రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే ఆర్డినెన్స్‌ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం లైన్ క్లియర్ అయినట్లే. -
పనులకు ముప్పు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించ బడిన ముంపు మండలాల్లో అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆగస్టు రెండో వారం నాటికి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ఈ మండలాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేసేందుకు వెనుకంజ వేస్తుండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతే తాము చేసిన పనులకు బిల్లులు మంజూరవుతాయో.. లేదోననే ఆందోళనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు మంజూరైతే చాలన్న రీతిలో వారు ఆయా శాఖల ఇంజనీరింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లలో అనుమానం..ఆందోళన భద్రాచలం డివిజన్లోని భద్రాచలం రూరల్, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అవుతాయి. పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలుస్తాయి. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ తతంగం అంతా ఎప్పట్లోగా పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరవుతాయో లేదోననే అనుమానం కాంట్రాక్టర్లలో నెలకొంది. దీనిపై జిల్లా అధికారులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పకపోవటంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది. కొనసాగుతున్న పనులివే.. గిరిజన సంక్షేమ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఏడు మండలాల్లో రూ.53 కోట్ల మేర పనులు నిర్వహిస్తున్నారు. వీటిలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల భవనాలు, పాఠశాలల భవనాలు, గిరిజన గ్రామాలకు రోడ్లు, అంగన్వాడీ భవనాలు కలపి రూ. 20 కోట్ల విలువైన పనులు ఉంటాయి. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల విలువైన పనులు ఉన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ. 33 కోట్లు పనులు నిర్వహిస్తున్నారు. ముంపు మండలాలను అధికారికంగా అప్పగించాల్సి వస్తే ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సంబంధిత జిల్లాల్లోని ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాల్సిందే. మరి కొన్ని రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఏ స్టేజి వరకు పనులు చేశారు? ఎంత మేరకు బిల్లు అయింది? అనే దానిపై ప్రస్తుతం నివేదికలు సిద్ధం చేస్తున్నట్లుగా ఓ ఇంజనీరింగ్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏ క్షణాన అడిగినా పనులను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి చెప్పారు. ఎల్‌డబ్ల్యూఈఏ పనులు ఏమవుతాయో..?! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా దేశంలోని 60 జిల్లాలు ఎంపికయ్యాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్న ఏడు మండలాల్లో ఈ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఆశ్రమ పాఠశాలల నిర్మాణ పనులు కొద్దిమేరకు మిగిలి ఉన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.5 కోట్లతో భద్రాచలం- రాజమండ్రి రహదారి, రూ.15 కోట్లతో సీలేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. చింతూరు నుంచి రాజమండ్రి మార్గంలో రూ.13 కోట్లతో ఘాట్ రోడ్ పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఆంధ్రప్రదే శ్‌కు బదలాయింపు జరగటంతో ఎల్‌డబ్ల్యూఈఏ పథ కం కింద చేపట్టిన పనులు కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఆంధ్రకు బదలాయిస్తున్నారు. ఆయా జిల్లాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఈ పనులు ఎలా చేపట్టాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచే ఆదేశాలు రావాల్సి ఉంటుందని ఓ ఇంజనీరింగ్ అధికారి వెల్లడించారు. -
నేడు సిటీ బంద్
ఎంఎంటీఎస్‌లు యధాతథం పరిస్థితిని బట్టి బస్సుల రాకపోకలు: ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో కూడా బంద్ ప్రభావం కనిపించనుంది. బంద్ దృష్ట్యా పోలీసుల సూచనలు, సలహా మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలి పారు. మరోవైపు నగరంలోని 121 ఎంఎంటీఎస్ సర్వీసులు, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలి పారు. ఈ బంద్‌కు ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ ఆటోలు మాత్రం యధావిధిగా నడుస్తాయని చెప్పారు. -
ముంపు గ్రామాల విలీనం దారుణం: హరీశ్ రావు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడం దారుణం అని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ వాటాను సాధించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేస్తామన్నారు. జూరాల, పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీశ్‌రావు వివరించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదంతో ఖమ్మం జిల్లానుంచి కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూర్, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం మండలాలు ఆంధ్రప్రదేశ్ విలీనమయ్యాయి. బూర్గంపాడులో 15 గ్రామాలు మినహా, భద్రాచలం మండలంలో భద్రాచలం మినహా ఏపీలో విలీనమయ్యాయి. ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్ కు పలు పార్టీలు బంద్ ప్రకటించాయి. -
రామయ్య ఇక్కడ.. ఆస్తులు అక్కడ
ఆర్డినెన్స్‌తో దేవస్థానం భూములు ఆంధ్రలోకి.. రామాలయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం భద్రాచలం : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రస్తుతం భద్రాచలం ప్రాంతమే చర్చనీయాంశమైంది. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటమే ఇందుకు కారణం. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా, నేడో రేపో దీనిపై వాడివేడిగా చర్చసాగనుంది. దీంతో పార్లమెంటు సాక్షిగా భద్రాచలం అంశమే హాట్‌టాపిక్‌గా మారింది. భద్రాచలం డివిజన్లోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలను, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రామాలయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామా న్ని తెలంగాణకు ఉండేలా ఆర్డినెన్స్‌లో పొందుపరిచా రు. దీని వల్ల రామాలయానికి సంబంధించిన భూములు ఉన్న ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతుంది. ఇది శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాభివృద్ధిపై ప్రభావం పడనుంది. భూములన్నీ ఆంధ్రలోనే.. భద్రాద్రి రామాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,250.67 ఎకరాల భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్ఛిమగోదావరి జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఒక్క ఖమ్మం జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్న 30.25 ఎకరాలు భూమి మినహా మిగతా భూమి అంతా ఆర్డినెన్స్‌తో ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్లిపోతుంది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనర్సింహారావు పేట లో ఉన్న 20 ఎకరాలు, అశ్వాపురం మండలం నెల్లిపాకలో 6.25, ముల్కలపల్లి మండల కేంద్రంలో 4 ఎకరాలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. భద్రాచ లం మండలం పురుషోత్తపట్నంలోనే రామాలయాని కి 889.50 ఎకరాల భూమి ఉంది. ఇదే మండలంలోని పినపల్లి, మనుబోతుల చెరువు, చోడవరం, కాపవరం, రాచగొంపల్లి, బూర్గంపాడు మండలం సీతారామనగరంలో ఆలయ భూమలు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్నారు. దీంతో ముంపు మండలాలతో కలుపుకొని ఇతర జిల్లాలో ఉన్న 1220.42 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ మొత్తం భూములకు గాను కౌలు రూపేణా రూ.20 లక్షల ఆదాయం వస్తుండగా, వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. రామయ్య భూములన్నీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో భవిష్యత్‌లో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు ఆ రాష్ట్రానికి చెందిన దేవాదాయశాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుం ది. ఈ కారణంగా అనేక ఇబ్బందులు ఉంటాయని ఆలయ అధికారులు ఉంటున్నారు. వసతి కేంద్రాలకు భూసమస్య... ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తే భద్రాచలం ఆలయాభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. భక్తులకు వసతి కోసం కాటేజీలు, సత్రాలు కట్టాలన్నా పట్టణానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తున్న పురుషోత్తపట్నం భూముల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. సెయింట్ ఆన్స్ పాఠశాలకు అనుకొని ఉన్న భూముల్లో కాటేజీల నిర్మాణం కోసం గతంలో దేవస్థానం పాలకమండలి కూడా తీర్మానిం చింది. రామాలయం వద్ద భవనాల నిర్మాణానికి తగి నంత స్థలం లేకపోవటంతో పురుషోత్తపట్నం భూముల్లోనే వసతి కేంద్రాలు నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ భూమిలో బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆర్డినెన్స్ అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇక ఐటీడీఏకు సమీపంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ట్రైబల్ హట్, రామాయణం థీమ్ పార్కు నిర్మిస్తున్న ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్‌లోకే వెళ్లిపోతుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల(సీతాకుటీరం)నకు వెళ్లే మార్గంలోని భద్రాచలం మండలంలో గల గ్రామాలను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చటంతో సీతాకుటీరానికి భద్రాచలం మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించాకే తగు నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
పోలవరం బిల్లుకు బ్రేక్
-
పోలవరం బిల్లుకు బ్రేక్
బిల్లును చేపట్టవద్దని లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోంమంత్రి వినతి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించేందుకు ప్రవేశపెట్టదలచిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు - 2014కు బ్రేక్ పడింది. సోమవారం లోక్‌సభ కార్యక్రమాల్లో 6, 7 క్రమసంఖ్యల కింద ఉన్న ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2014ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద రాష్ట్రపతి సిఫారసును పొందే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎజెండాలోని 6, 7 అంశాలను తీసుకోవద్దు’’ అని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ఎజెండాలోని ఈ అంశం లోక్‌సభ నిబంధనల్లోని 72వ నిబంధనను ఉల్లంఘిస్తోందని అంతకుముందు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు టీఆర్ఎస్ సభ్యుడు నోటీసులిచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ఆ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 కింద ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి బిల్లు ఏదైనా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సభలో ప్రవేశపెట్టకూడదన్నారు. అందువల్ల దీనిపై 72వ నిబంధన కింద చర్చించాలని, ఆ తరువాతే బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఈ నోటీసు కారణంగానే హోంమంత్రి పై ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి సిఫారసు వచ్చాకే బిల్లును తిరిగి సభలో ప్రవేశపెట్టనున్నట్టు అవగతమవుతోంది. -
నేడు పార్లమెంట్ లో పోలవరం ఆర్డినెన్స్ బిల్లు!
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ వల్ల ఖమ్మం జిల్లాలో మునిగిపోయే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ ను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ పై ఆర్డినెన్స్ ను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే అంశాన్ని పార్లమెంట్ కు రాజ్‌నాథ్ వివరించనున్నారు. ముంపు మండలాలను కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆంధ్రాలో కలపడం అన్యాయమని తెలంగాణలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
నిరసనల హోరు...
భద్రాచలం : ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో గిరిజన గురుకుల విద్యాలయ ఉద్యోగులు కూర్చోగా, టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూబన్న ప్రారంభించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కేంద్ర మాజీమంత్రి పోరిక బలరామ్‌నాయక్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ముంపు మండలాల ప్రజల అభిప్రాయాల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటకీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తోందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్‌నాయక్ మాట్లాడుతూ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనేం చేయటం అన్యాయమన్నారు. అయితే ఆయన మాట్లాడుతుండగా.. ‘మీరు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, నాడు అడ్డుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆదివాసీలకు అన్యాయం జరిగింది’ అని బలరాం నాయక్‌ను జేఏసీ నాయకులు నిలదీశారు. శుక్రవారం నాటి దీక్షల్లో బాణోతు కృష్ణ, ఎం దేవదాసు, కృష్ణార్జునరావు, చంద్రయ్య, నాగముణి, మధు, శ్రీహరి, పద్మ, పార్వతి, రాంబాబు, బాలరాజు కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్శిం హారావు, కొవ్వూరి రాంబాబు, జేఏసీ నాయకులు వెక్కిరాల, రామాచారి, సోమశేఖర్, జపాన్‌రావు, రామాచారి, బాలకృష్ణ, దాసరి శేఖర్, పూసం రవికుమారి తదితరులు మద్దతు పలికారు. నేటి నుంచి ఆంధ్ర బస్సులు నిలిపివేత... ఆర్డినెన్స్‌కు వ్యతిరేక పోరులో భాగంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు(72 గంటలు) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటామని జేఏసీ నాయకులు ప్రకటించారు. కాగా ముంపు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ శుక్రవారం కూడా మూత పడ్డాయి. ఇదిలా ఉండగా నెల్లిపాకలో ఏర్పాటు చేసిన ఆంధ్ర ఎక్సైజ్ చెక్‌పోస్టును తొలగించేందుకు టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు తదితరులు ప్రయత్నించారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఎక్సైజ్ సిబ్బంది అక్కడి నుంచి మరో చోటకు వెళ్లిపోయారు. చెక్‌పోస్టు ఏర్పాటుకు గుడిసెను ఎవరు అద్దెకు ఇచ్చారని జేఏసీ నాయకులు ఆరా తీసి, సదరు యజమానిని దీనిపై నిలదీశారు. చెక్‌పోస్టును వెంటనే తొలగించకపోతే తామే తీసేస్తామని హెచ్చరించారు. -
ఆర్డినెన్స్‌పై ఆగ్రహం
ప్రభుత్వ కార్యాలయాలకు తాళం 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ వల్ల ఖమ్మం జిల్లాలో మునిగిపోయే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. అఖిలపక్ష నాయకుల పిలుపు మేరకు గురువారం ముంపుమండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళంవేసి నిరసన తెలిపారు. తహసిల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీ వో రామచంద్రరావుతోపాటు రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు పంపించారు. బ్యాంకులు, అటవీశాఖ, రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ధర్నా చేశారు. ‘ఆంధ్ర అధికారులూ దయచేసి తెలంగాణకు రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. సీపీఐ(ఎంఎల్)పాల్వంచ డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్కే గౌస్ మాట్లాడుతూ తెలంగాణలోని ముంపుమండలాలను కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆంధ్రాలో కలపడం అన్యాయమన్నారు. ఏడు మండలాలలోని ఏ ఒక్కరైనా విలీనానికి అంగీకరిస్తే అప్పుడు ఆంధ్రాలో కలపడానికి ఎవరూ అభ్యంతరం చెప్పమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సీపీఐ(ఎంఎల్)మండల కార్యదర్శి బాసినేని సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు చేకూరి రమణరాజు, సీపీఎం మండల నాయకులు యర్రంశెట్టి నాగేంద్రరావు పాల్గొన్నారు. -
'పోలవరం ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జులై రెండోవారంలో ఢిల్లీలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన శనివారమిక్కడ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసి వినతిపత్రం సమర్పిస్తామని కోదండరామ్ తెలిపారు. -
పోలవరం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నాం: పోన్నాల
న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై జారీ చేసిన ఆర్టినెన్స్ ను కేంద్ర వెంటనే ఉపసంహరించుకోవాలని పొన్నాల డిమాండ్ చేశారు. పీసీసీ ఎగ్జిక్యూటీవ్‌లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పొన్నాల మీడియాకు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపామన్నారు. జూలై 2న ఆంటోనీ కమిటీతో సమావేశం ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిపై న్యూఢిల్లీలోని ఏఐసీసీ సమావేశంలో ఇరు ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్‌పై ఆగ్రహం
సాక్షి, ఖమ్మం: పోలవరం ముంపు ఆర్డినెన్స్న్పై ప్రజాత్రినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం ఏజెన్సీలోని ఆదివాసీలు, వారి సంస్కృతి సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేలా వ్యవహరించిన కేంద్రం తీరును ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రెండేళ్ల తర్వాత నిర్వహించిన ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఇందుకు వేదికైంది. ఈ ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని, డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలకమండలి సమావేశం రెండేళ్ల తర్వాత శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధ్యక్షత వహించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. తెలంగాణ అమరులకు ముందుగా సమావేశంలో రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రారంభమైన సమావేశంలో సభ్యులందరూ ఒక్కొక్కరుగా పోలవరం ఆర్డినెన్స్‌పై ఏకగ్రీవ తీర్మానం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీలో ఆదివాసీలను ముంచే ఈ ఆర్డినెన్స్‌తో వారికి తీవ్ర నష్టం జరుగుతుందని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌పై తీర్మానం చేసిన తర్వాతనే ఎజెండా అంశాల్లోకి వెళ్లాలని వారు పట్టుబట్టడంతో దీనిపైనే గంటపాటు సమావేశంలో చర్చ జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రవేశపెట్టిన పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ, ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలైన పీసా, 1/70 చట్టాలను అమలు చేయాలనే తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆదివాసీల బాధేంటో మాకు తెలుసు.. ‘ఆదివాసీలు ఉన్న నియోజకవర్గాలకు మేము బాధ్యులుగా ఉన్నాం.. ఎప్పుడూ వారు ముంపులోనే ఉంటున్నారు.. పోలవరం ఆర్డినెన్స్‌తో వాళ్లను ముంచుతారా..? వారి బాధేంటో మాకు తెలుసు.. కేంద్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఆర్డినెన్స్ ఎలా జారీచేసింది’ అని పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడంతో పాటు డిజైన్ మార్చాలని, పీసా, 1/70 చట్టాలు సరిగా అమలయ్యేలా తీర్మానంలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరారు. మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, జలగం వెంకట్రావ్, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేంద్రం అప్రజాస్వామికంగా ఆర్డినెన్స్ జారీ చేసిందని విమర్శించారు. జిల్లా నుంచి ఒక్క గ్రామం కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి వీల్లేదన్నారు. హక్కులు కాలరాసే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం.. ఏజెన్సీలో పోలవరం ముంపు పేరుతో జారీ చేసిన ఆర్డినెన్స్ ఆదివాసీల హక్కులను కాలరాస్తుందని, దీన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముంపు తగ్గేలా డిజైన్‌ను మార్చితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ జిల్లా ఆదివాసీల గోడు పట్టించుకోకండా కేంద్రం వ్యవహరించిన తీరు ఇక్కడివారికి ఆశనిపాతమైందన్నారు. ఆదివాసీలకు అన్యాయం జరగకుండా జిల్లాలోనే వారికి పునరావాసం కల్పించాలని, కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ ఏజెన్సీలో అటవీ హక్కు చట్టం, నేషనల్ ట్రైబల్ పాలసీ, వంటి చట్టాలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. ఆర్డినెన్స్ జారీకి మీరే కారణమంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఉద్దేశించి అనండంతో వారిరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో మిగితా సభ్యులు జోక్యం చేసుకొని రాజకీయాలకతీంగా సమావేశం జరగాలని సూచించడంతో ఆ తర్వాత పోలవరం ఆర్డినెన్స్‌పైనే చర్చించారు. తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతాం.. పోలవరం ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని, డిజైన్‌ను మార్చాలని, ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. అసెంబ్లీ, శాసనమండలి చేసిన తీర్మానాల కాపీలను తెప్పించుకొని దాని ప్రకారం పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ తీర్మానం తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బానోతు మదన్‌లాల్, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, బాలసాని లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఐటీడీఏ పీఓ దివ్య, ఫారెస్టు కన్జర్వేటర్ ఆనంద్‌మోహన్, ఐటీడీఏ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ముంపు మండలాల్లో పాలన యథాతథం.... ప్రస్తుతానికి ఏజెన్సీలోని పోలవరం ముంపు మండలాల పాలన తెలంగాణ ప్రభుత్వం నుంచే కొనసాగుతుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వెల్లడించారు. అంతుకు ముందు జిల్లా నుంచి ఎలా పాలన జరిగిందో ఇప్పుడు కూడా అలానే ఉంటుందని స్పష్టం చేశారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో సభ్యులు లేవెనెత్తిన అంశాలపై ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని యథాతథంగా ముంపు మండలాల్లో అమలు జరపాలని ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. అలాగే ముంపు మండలాల విద్యార్థులకు భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ బస్ పాస్‌ల జారీ నిలిపివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను జిల్లా అధికారులు పరిచయం చేసుకునేందుకే ఐటీడీఏ సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించామని, ఇక నుంచి ప్రతి పాలకమండలి సమావేశం తప్పకుండా భద్రాచలంలోనే జరుగుతుందని చెప్పారు. సాగర్ ఆయకట్టు రెండో జోన్‌గా మార్చాలి : ఎంపీ పొంగులేటి సాక్షి, ఖమ్మం :జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద మూడో జోన్ పరిధిలో 10 వేల ఎకరాలు ఉందని, ఇదంతా రెండోజోన్గా మార్చాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టర్‌లో జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశం, వర్క్‌షాప్‌లో ఆయన ఇటు ఏజెన్సీ, అటు మైదాన ప్రాంతంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఆయకట్టును రెండోజోన్లోకి మార్చడానికి తగిన నిధులను ప్రభుత్వం కేటాయించాలన్నారు. దీనివల్ల జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు కూడా సాగు నీరు అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. నీటి పారుదలశాఖ పరిధిలో మరమ్మతులు లేకుండా ఉన్న మేజర్, మైనర్ చెరువులపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం దుమ్మగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాం డ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని కోరారు. దీనివల్ల ఇల్లెందు, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లోని భూములు సాగులోకి వస్తాయని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తగా ఉండడం పట్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యా శాఖ పరిధిలో 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏజెన్సీలో వైద్యంపై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 104, 108 సేవలను జిల్లాలో సమర్థంగా కొనసాగించాలని సూచించారు. అర్హులైందరికీ ఇళ్ల స్థలాలు, ఫించన్లు ఇవ్వాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌కు సూచించారు. -
అదో ‘శాపం’
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలి రైతు రుణాలను మాఫీ చేసి,కొత్త రుణాలు ఇవ్వాలి విత్తనాల సరఫరాలో జాప్యం వీడి రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి సీఎం, మంత్రులను కలిసిన ఖమ్మం ఎంపీ ఖమ్మం గాంధీచౌక్: పోలవరంపై కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దుచేసి తెలంగాణలోనే కొనసాగించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. పొంగులేటి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి రైతు రుణాలను వీలైనంత త్వరగా మాఫీ చేసి కొత్తరుణాలను మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటి వరకు అందాల్సిన విత్తనాలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారని వివరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సాగర్ జలాలను విడుదల చేసి చెరువులను నింపాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలన్నారు. కళాశాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేయాలన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా పోరాడుతాం.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వెలువడిన పోలవరం ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దుచేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల విలీనానికి వ్యతిరేకంగా అ టు పార్లమెంట్‌లోనూ, ఇటు జిల్లావాసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చరేయాలని కోరారు. బియాస్ మృతుల వెతుకులాటలో జాప్యంపై పొంగులేటి మండిపడ్డారు. విద్యార్థులు గల్లంతై వారం దాటినా మృతదేహాలను వెలికి తీయకుండా వారి తల్లిదండ్రులను తీరని వేదనకు గురిచేస్తున్నారని వాపోయారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేవారు. జిల్లాకు చెందిన బియాస్ మృతులు కిరణ్, ఉపేందర్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన జిల్లావాసి సాధనపల్లి ఆనంద్‌కుమార్, నిజామాబాద్‌కు చెందిన పూర్ణలను అభినందించారు. ఇటువంటి సాహసికులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. జిల్లాకు చెందిన ఆనంద్‌కు తాను అండగా ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. త్వరలోనే ఈ విద్యార్థులను కలవనున్నట్లు ఆయన ప్రకటించారు. -
పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి
నర్సంపేట : పోలవరంలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కత్తి వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాలు 133 అయితే 274 గ్రామాలను మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కట్టబెట్టేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడం దారుణమన్నారు. సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించిందన్నా రు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా మారనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంపదను దోచుకోవడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని కోరారు. దీక్షలో నాయకులు బానోతు నవీన్‌నాయక్, సాంబయ్య, తాబేటి శ్రీనివాస్, వెంకటనారాయణ, పూజారి శ్రీనివాస్, కట్టస్వామి, కేశవస్వామి, సాంబశివరావు, పంజాల రాము, రవి, సంజీవ, పాష, రవినాయక్, రమేష్, రవినాయక్, శ్రీనివాస్, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
టీజేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ భద్రాచలం టౌన్: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేయాలని జారీ చేసిన అక్రమ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ టీజేఏసీ, ప్రజా, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులకు భంగం కల్గించేలా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను వేరు చేసి సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర స్థాయిలో ఆర్డినెన్స్ రద్దుకై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, ఎస్కే గౌసుద్దీన్, పూసం రవికుమారి, కొండరెడ్ల సంఘ నాయకులు ముర్ల రమేష్, సీపీఎం నాయకులు జీఎస్ శంకర్రావు, టీఎఫ్‌ఎఫ్ నాయకులు బి రాజు, వెంకటేశ్వర్లు, వీరభద్రం, గెజిటెడ్ ఉద్యోగ సంఘ నాయకులు కె. సీతారాములు, నాయకపోడు సంఘ నాయకులు సంగం నాగేశ్వరరావు, బీఎస్పీ నాయకులు ఏవి రావు, మాలమహానాడు నాయకులు దాసరి శేఖర్, టీఆర్ఎస్ నాయకులు కొండముక్కుల సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు జగదీష్, ఆదినారాయణ పాల్గొన్నారు. -
స్తంభించిన రాకపోకలు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ముంపు మండలాల సరిహద్దు దిగ్బంధం విజయవంతం అయింది. భద్రాచలంలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శనగా బ్రిడ్జి సెంటర్ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి పట్టణం నుంచి వెళ్లే వాహనాలు, వచ్చేవాహనాలను అడ్డుకున్నారు. వివిధ పార్టీలు, ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ‘ఖబడ్దార్ పాలకులారా ఇది ఆరంభం మాత్రమే’ అని నినదించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద చేయి చేయి కలిపి రాస్తారోకో నిర్వహించారు. అరుణోదయ కళాకారులు, ఆదివాసీలు పోలవరం వ్యతిరేక పాటలను పాడుతూ లయబద్దంగా నృత్యం చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడు రోజులలోనే మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయటం దుర్మార్గమాన్నారు. ప్రాణాలు పోయినా మేం తెలంగాణాలోనే కొనసాగుతామని ఆదివాసీలు అరుస్తుంటే ప్రభుత్వాలు బలవంతంగా వారి హక్కులను, నోర్లను నొక్కి పరాయి రాష్ట్రాలకు తరిమేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపి నాయకులు వెంకయ్య నాయుడు పునరాలోచించి, ముంపు ప్రాంతాలను తెలంగాణాలోనే కొనసాగించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలలో నెలకొని ఉన్న భయాందోళలను తొలగించాలని కోరారు. సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ...అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై ప్రేమ చుపూతూ ఆదివాసీలను మోసం చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తుల కోసమే ఆదివాసీల ప్రాణాలను తాకట్టుపెట్టి ఆర్డినెన్స్‌ను జారీ చేశారని దుయ్యబట్టారు. కొండరెడ్ల సంక్షేమ శాఖ అధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ.... ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలకు పోతే భంగపాటు తప్పదని హెచ్చరించారు. ప్రజల ఆభిప్రాయం మేరకు ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తొలుత దిగ్బంధానికి అనుమతి లేదని పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్సై మురళీ అఖిల పక్షం నాయకులను అడ్డుకున్నారు. అనంతరం ఎస్పీ రంగనాథ్‌తో మాట్లాడటంతో నిరసనకు అనుమతిని ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, కల్పన, ముద్దా బిక్షం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు టి. రాజేందర్, పినపాక నాయకులు డా. శంకర్ నాయక్, బీజేపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కూరపాటి రంగరాజు, వెంకటపతి రాజు, టీజేఏసి డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావ ు, వెక్కిరాల శ్రీనివాస్, గెజెటెడ్ ఆఫీసర్ సంఘం నాయకులు సీతారాములు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారాం, కాంగ్రెస్ నాయకులు కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, సరెళ్ల నరేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, బండారు రవికుమార్, ఎంబీ నర్సారెడ్డి, శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు. చింతూరు మండల పరిధిలో.... దిగ్బంధంలో భాగంగా విజయవాడ, జగ్దల్పూర్ జాతీయ రహదారిలోని ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గల చింతూరు మండలం చిడుమూరు వద్ద రహదారిపై చెట్లు అడ్డంగా వేసి నాయకులు బైఠాయించారు. భద్రాచలం, రాజమండ్రి రహదారిలోని తులసిపాక వద్ద , భద్రాచలం, విశాఖపట్నం రహదారిలోని చింతూరు మండలం తూలుగొండ వద్ద రహదారిని దిగ్బంధించారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టం నారాయణ, సీసీఎం జిల్లా నాయకులు ఏజే రమేష్, బ్రహ్మాచారి, ఆదివాసీసేన నాయకుడు గుండు శరత్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు బొడ్డు రాజా, సోయం భీమా తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు పరిధిలో..... కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల నడుమగల లంకాల పల్లి గ్రామం వద్ద ఆదివాసీలు విల్లంబులు చేతపట్టి నిరసన తెలిపారు. తెలంగాణంలోనే ఉంటాం...సీమాంధ్రకు వెళ్లం అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యవర్గ సభ్యుడు గోకినేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా వేలేరుపాడు, అశ్వారావుపేటల మధ్య గల ఆంధ్రా, సరిహద్దు గ్రామం మేడేపల్లి గ్రామం వద్ద రహదారిని దిగ్బంధించారు. కాగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లంకాలపల్లి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...పోలవరం ముంపుపేరుతో ఏడుమండలాలను తెలంగాణనుంచి విడదీయొద్దని చేతులు జోడించి ప్రధానమంత్రి మోడీని వేడుకున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు విని అమాయకులైన ఏడమండలాల గిరిజనులు, గిరిజనేతరులు, వారి సంస్కృతీ సంప్రదాయాలను ముంచొద్దని వేడుకున్నారు. -
‘ముంపు’ ఉద్యమం మరింత ఉధృతం
భద్రాచలం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏడు ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టేందుకు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక సన్నద్ధమైంది. భద్రాచలంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణను పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ నాయకులు గుండు శరత్‌బాబు, వట్టం నారాయణ, ముర్ల రమేష్ ప్రకటించారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ ఈనెల 7న సరిహద్ధులను దిగ్బంధించనున్నట్లు పేర్కొన్నారు. 8న నల్లజెండాలతో నిరసన తెలపాలన్నారు. భద్రాచలంలో భవిష్యత్ ఉద్యమాల వేదికగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజానీకాన్ని సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించేలా ఆర్డినెన్స్‌ను వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఏ రీతిన ఉద్యమించారో, ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ఆందోళనలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరే రోజైన జూన్ 8న ఉద్యోగులు, ఆదివాసీ సంఘాల నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపాలని కోరారు. ముంపు మండలాల్లో భవిష్యత్ కార్యాచరణ కోసం అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఎం.బి.నర్సారెడ్డి, కుంచాల రాజారామ్, కృష్ణమూర్తి, కృష్ణ, పడిసిరి శ్రీనివాస్, ఖాసిం, సొందె వీరయ్య, నాగేశ్వరరావు, మడవి నెహ్రూ, దాగం ఆదినారాయణ, అట్టం లక్ష్మణ్‌రావు, గొంది వెంకటేశ్వర్లు, సీతారాములు, జగదీష్, దాసరి శే ఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు...
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా..?
భద్రాచలం, న్యూస్‌లైన్: ముంపు మండలాలను సీమాంధ్రకు బదలాయించి ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా అని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం లక్షలాది మంది అమాయక ఆదివాసీ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని వినియోగించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. వనరులను దోపిడీ చేయాలనే లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. తాము తెలంగాణలోనే ఉంటామని ముంపు ప్రాంత ఆదివాసీలంతా పట్టుబడుతున్నా.. ఎవరినీ సంప్రదించకుండా ఆర్డినెన్స్ తీసుకురావటం అన్యాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రతోనే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగంపై ఆయనకు గౌరవం ఉంటే గిరిజనులకు అన్యా యం చేసే పోలవరం ప్రాజెక్టును ఆపాలని కోరారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ పక్షాన అన్ని రకాలుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య ఒక సత్కార్యం కోసం చేస్తున్న దీక్షలు అభినందనీయమన్నారు. ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి... రాజ్యాంగ విరుద్ధంగా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బదలాయింపును అడ్డుకునేందుకు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోదండరామ్ కోరారు. ఆర్డినెన్స్ వచ్చినందున ఈ దశలో ఏమీ చేయలేమని చెప్పటం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన చట్టాలు గిరిజనులకు రక్షణ కవచాల వంటివని, వీటిని పరిరక్షించాల్సింది రాష్ట్ర గవర్నరేనని అన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలి... ముంపు మండలాల్లోని గిరిజనులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు కొంతమంది దూరంగా ఉంటున్నట్లుగా తాము గుర్తించామని, వారి వైఖరి సరైంది కాదని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలువాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమించడంలో భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు నడింపల్లి వెంకటపతిరాజు, టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి తదితరులు పాల్గొన్నారు. -
'ఆర్డినెన్స్ వెనక్కి తీసుకునేవరకూ దీక్ష'
భద్రాచలం : పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా.. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ముంపు మండలాలను తెలంగాణాలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకునేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. మరోవైపు సున్నం రాజయ్యకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వారు తెలిపారు. కాగా రాజయ్య దీక్షకు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. -
వైద్యం బదలాయింపు..
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంతో అక్కడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్య విభాగ కార్యాలయాలు సీమాంధ్రలో కలవనున్నాయి. అక్కడ పనిచేస్తున్న 437 మంది సిబ్బంది జిల్లా కేంద్రానికి తిరిగి రానున్నారు. ఆ ఏడు మండలాల్లోని ఎనిమిది పీహెచ్‌సీలు, 44 సబ్‌సెంటర్లు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోకి వెళ్తాయి. ఏడు మండలాల్లో 17 క్లస్టర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోకి మూడు క్లస్టర్లు వెళ్తున్నాయి. ఈ హెల్త్సెంటర్లలో ప్రస్తుతం 520 పోస్టులు ఉండగా 437 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలు మూడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు ఎనిమిది, సబ్‌సెంటర్ భవనాలు 44, ప్రసూతి భవనాలు నాలుగు, ఉద్యోగుల క్వార్టర్లు ఏడు ఏపీలోకి వెళ్తున్నాయి. జిల్లా కేంద్రానికి రానున్న ఉద్యోగులు... జిల్లా కేంద్రానికి రిపోర్టు చేయనున్న ఆ ఏడు మండలాల్లోని ఉద్యోగుల వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ -1, మెడికల్ ఆఫీసర్-17, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -2, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్-1, పబ్లిక్ హెల్త్ నర్సు -1, కంటి వైద్యానికి సంబంధించిన ఆఫీసర్లు -2, హెల్త్ ఎడ్యుకేటర్స్-2, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్-7, హెడ్‌నర్సులు-2, స్టాఫ్ నర్సులు -29, హెల్త్ సూపర్వైజర్స్ (పురుషులు)-4, హెల్త్ సూపర్వైజర్స్ (మహిళలు)- 11, సీనియర్ అసిస్టెంట్స్-4, ఏఎన్ఎంలు-33, సెకండ్ ఏఎన్ఎంలు -39, ఏఎన్ఎంలు(పురుషులు)- 24, జూనియర్ అసిస్టెంట్ -2, ఫార్మసిస్ట్-12, ల్యాబ్‌టెక్నీషియన్స్ -13, కంప్యూటర్ ఆపరేటర్స్-2, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ -14, డ్రైవర్లు -5, డీఈఓ -3, సెక్యూరిటీ గార్డ్స్-3, ఆశ వర్కర్లు-204 మందిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికిప్పుడు వీరిని జిల్లాకేంద్రానికి రప్పించడం వల్ల అక్కడి రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మూడు, నాలుగునెలల వరకు వీరిని కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రి మాత్రం జిల్లాలోనే ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల్లోని 136 గ్రామాలు, 211 కుగ్రామాలకు చెందిన 1,16,796 మంది ప్రజలు ఈ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. ఇప్పుడు వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. విలీనంతో చిక్కులు... ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే ఏడు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటి వరకు వారికి అత్యంత దగ్గరగా భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఉండేది. పెద్ద ప్రమాదం సంభవిస్తే దగ్గరిలో కొత్తగూడెంలో సింగరేణి ప్రధానాస్పత్రి, ప్రభుత్వాస్పత్రి, జిల్లాకేంద్రప్రభుత్వాస్పత్రికి వచ్చేవారు. ఇప్పుడు వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు, తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రికి వెళ్లాల్సి ఉంటుంది. అంతదూరంలోని ఆస్పత్రులకు వెళ్లడం కష్టమని గిరిజనులు వాపోతున్నారు. ఏజెన్సీలోని ఆ ఏడు మండలాల్లో వర్షాకాలంలో ఎక్కువగా విషజ్వరాలు వస్తుంటాయి. అటువంటి సమయంలో జిల్లా వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో వైద్యం అందించే వారు..ఇకమీదట ఆ పరిస్థితి ఉండకపోవచ్చని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ముంపు మండలాల బంద్ ప్రశాంతం
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుతో ముంపు మండలాల్లో శుక్రవారం సంపూర్ణ బంద్ జరిగింది. దుకాణాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ముంపు ప్రాంతాలకు బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. భద్రాచలంలోని ముఖ్య కూడళ్లలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శన, అటవీశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కెచ్చెల రంగారెడ్డి, పట్టం నారాయణ, కె.ఫణీశ్వరమ్మ, ముర్ల రమేష్, గుండు శరత్, బాదం జగదీష్, దాసరి శేఖర్, ఎవి.రావు, దాగం ఆదినారాయణ, జంజర్ల రమేష్, కాటం హరినాధ్, మడివి నెహ్రూ, కల్లూరి జయబాబు, చల్లగుళ్ల నాగేశ్వరరావు, కె.సీతారాములు, బి.రాజు, బండారు వెంకటేశ్వర్లు, కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరనన హోరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముంపు మండలాల్లో నిరసల హోరు సాగింది. వీఆర్‌పురంలో రహదారులపై అఖిలపక్షం నాయకులు ముళ్ళ కంచెలు వేసి వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డున్నారు. వంటావార్పు నిర్వహించారు. కూనవరం పాత బస్టాండ్ సెంటర్లో అఖిలపక్షం నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పాల్వంచ డివిజన్లోని కుక్కునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. -
గిరిజనుల కోసం గళమెత్తుతా..
భద్రాచలం, న్యూస్‌లైన్ : గిరిజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గళమెత్తుతానని, శక్తివంచన లేకుండా వారి అభ్యున్నతి కోసం పోరాడుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్, ఇతర నాయకులతో కలిసి శుక్రవారం ఆయన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటం దుర్మార్గమైన చర్య అన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ వస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు ఈ ఆర్డినెన్స్ ఆశనిపాతంలా మారిందన్నారు. ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ రద్దు కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలసి పార్లమెంట్లో చర్చకు లేవనెత్తుతామని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందని, ఈ విషయంలో సీపీఎం వంటి పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముంపుప్రాంత వాసులకు అండగా నిలిచేలా ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణలోనే ఉంచేలా పోరాడుతాం : పాయం ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచేలా వైఎస్ఆర్సీపీ పక్షాన అసెంబ్లీ లోపల, బయట పోరాడుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివాసీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతంలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు తాము ఎటువైపు వెళ్లాలనే దానిపై సందిగ్ధింలో ఉన్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలి : మదన్‌లాల్ గిరిజనులను గోదావరిలో ముంచే ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంతో ఆదివాసీలకు ఎంతో అనుబంధం ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతాల పరిరక్షణకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్సింహారావు, కొవ్వూరి రాంబాబు, గంటా కృష్ణ, రామలింగారెడ్డి, మన్మద హరి, చిట్టిబాబు, చిన్ని, దామెర్ల రేవతి, సమ్మక్క, ఎంపీటీసీ బానోతు రాముడు, మండవ వెంకటేశ్వరెడ్డి, రాయిని రమేష్, కృష్ణారెడ్డి, కాపుల నవీన్, రాజు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
విలీన చిక్కులు..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : పోలవరం ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటంతో మళ్లీ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం, పట్టణం, రామాలయం మినహా) మండలాలను పూర్తిగా జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు సర్వం సిదమైంది. అదే విధంగా పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చే మోరంపల్లి బంజర్, బూర్గంపాడు, సారపాక రహదారిలో ఉన్న 12 గ్రామాలు మినహా) మండలాలు మరో మూడు రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనున్నాయి. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాల విలీనంపై ఆర్డినెన్స్ తీసుకురాగా, దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మండలం అంతా సీమాంధ్రకు కేటాయిస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు దారి లేకుండా పోయింది. ఆ మండలాలకు వెళ్లాలంటే భద్రాచలం నుంచి ఎటపాక, కన్నాయిగూడెం మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనిపై సరైన స్పష్టత లేకపోవటమే గందరగోళానికి దారి తీస్తోంది. ఆర్డినెన్స్‌కు మరోసారి సర్దుబాట్లు చేసి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే రహదారిలో గల భద్రాచలం మండలంలోని గ్రామాలన్నీ తిరిగి తెలంగాణలోనే ఉంచేలా చేస్తేనే ఇబ్బందులు తొలగుతాయి. లేకుంటే రామాలయం నుంచి దుమ్ముగూడెం మండలంలోని సీతాకుటీరం(పర్ణశాల)నకు వెళ్లేందుకు దారి లేకుండా పోతుంది. భద్రాచలం పట్టణంలోనే సరిహద్దులు... భద్రాచలానికి ఆనుకునే సరిహద్దులు ఏర్పాటు కాబోతున్నాయి. కేవలం రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతూ మండలం అంతా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తుండటంతో పెద్ద సమస్యే ఉత్పన్నం కాబోతుంది. భద్రాచలం పట్టణానికి ఆనుకునే లక్ష్మీదేవిపల్లి, పురుషోత్తపట్నం, ఎటపాక రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పట్టణంలో రాజుపేట కాలనీలో ఒక భాగం లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోకి రాగా, జగదీష్ కాలనీకి ఆనుకొని ఉన్న శ్రీరామ్‌నగర్ కాలనీ పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం పరిధిలోకి వస్తుంది. అదే విధంగా పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలోనే రామాయణం థీమ్ పార్కు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ ప్రదేశం పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామం పరిధిలోకి వస్తున్నందున దీన్ని కూడా వదులుకోవాల్సిందేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన స్పష్టత ఇవ్వకపోగా, జూన్ 2 తరువాత భౌగోళికంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయిస్తుండంతో ఎక్కడ సరిహద్దులు ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ కేనా..? భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ప్రతిభా పాఠశాల, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ విద్యాలయాలు తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోనున్నాయి. భద్రాచలం రెవెన్యూ గ్రామం ఒక్కటే తెలంగాణలో ఉంచి, మిగతా మండలం అంతా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించేలా నిర్ణయం తీసుకోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎటపాక సమీపంలో ఉన్న ప్రతిభా పాఠశాల, రెసిడెన్సియల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలంగాణ పది జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు ప్రేవేశాలు కల్పిస్తున్నారు. జూన్ 2 తరువాత ఇవి అవశేష ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతుండటంతో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు చోటు ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. అలాగే ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా తెలంగాణ విద్యార్థులకు ఇక దూరం కానున్నాయి. అయితే మండలాల బదలాయింపు జరుగుతున్న సమయంలో వీటిపై పునరాలోచించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
‘ముంపు మండలాల’ బంద్ సక్సెస్
భద్రాచలం, న్యూస్‌లైన్: కేంద్రం ఆర్డినెన్స్‌కు నిరసనగా ముంపు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అఖిలపక్షం నేతలు రాస్తారోకో, వంటావార్పు, మానవహారాలు నిర్వహించారు. మోడీ, చంద్రబాబు ,వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజయ్య చేపట్టిన దీక్ష శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరింది.