Ravi Shankar Prasad
-
ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్షలు తీవ్రంగా మండిపడిపడుతున్నాయి. అదానీ గ్రూప్‌లో ఆమె పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. తాజాగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక అస్థిరత, ద్వేషం సృష్టించడానికి కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ‘‘మూడోసారి (2024 లోక్‌సభ ఎన్నికలు) కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పార్టీ, టూల్‌కిట్ గ్యాంగ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం దేశంలో ద్వేషాన్ని పెంచాలని భావిస్తోంది. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉండటం మేము పట్ల గర్వపడుతున్నాం. చిన్నమొత్తాల పెట్టుబడిదారులకు సల్యూట్ చేస్తున్నా. పెట్టుబడిదారులకు టూల్‌కిట్, హిండెన్‌బర్గ్ నివేదికలపై నమ్మకం లేదు’’ అని అన్నారు. -
రాహుల్‌పై బీజేపీ ఫైర్.. కాంగ్రెస్, చైనాలు భాయ్ భాయ్ అంటూ..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, పెగాసెస్ స్పైవేర్ దేశంలోని రాజకీయ నాయకుడి ఫోన్లలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. విదేశీ గడ్డపై ఇండియాను కించపరిచే ప్రయత్నమంటూ మండిపడ్డారు. ఇదివరకు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వదేశీయులు సైతం భారత్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జ్‌లో రాహుల్ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ విమర్శించారు. ఇదే సమయంలో రాహుల్ ప్రస్తావించిన ప్రజాస్వామ్యంపై దాడి అనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిందన్నారు. జోడో యాత్రలో 4,000 కిలో మీటర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు. మరోవైపు.. రాహుల్ ఫోన్ పెగాసెస్ ఉందన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. దీనిపై విచారణకు రాహుల్ తన ఫోన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. First foreign agents target us! Then our own targets us on a foreign land! Rahul Gandhi’s speech at Cambridge was nothing but a brazen attempt to denigrate our country on foreign soil in the guise of targeting Adarniya PM Shri @narendramodi ji. Thread — Himanta Biswa Sarma (@himantabiswa) March 3, 2023 ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్ భారత్‌ను అవమానపరుస్తున్నాడు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాహుల్ మాటలు చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అంటూ కామెంట్స్ చేశారు. #WATCH |This is Rahul Gandhi-whenever he goes abroad,he insults India...He does this whenever he goes abroad&calls China the symbol of goodwill. Country should see his true face...We condemn his childish statment..:BJP's RS Prasad on Rahul Gandhi's address at Cambridge University pic.twitter.com/aMEtS3nJJR — ANI (@ANI) March 3, 2023 -
‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు. బీజేపీ కౌంటర్ అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
రతన్ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్! ఎనిమిదేళ్ల తర్వాత..
ఢిల్లీ: నీరా రాడియా ఆడియో టేపుల లీకేజీ వ్యవహారంలో.. ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ రతన్ టాటా వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎనిమిదేళ్ల తర్వాత నేడు విచారణ చేపట్టనుంది. 2010లో మాజీ కార్పొరేట్ వ్యవహారాల ప్రతినిధి నీరా రాడియా-టాటాల మధ్య జరిగిన సంభాషణలను మీడియా ప్రసారం చేయగా.. అది తన గోప్యత హక్కుకు భంగం కలిగించేదని రతన్ టాటా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీరా రాడియా తన వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా ప్రముఖులతో ఫోన్ సంభాషణలు జరిపారు. అయితే.. పన్నులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆమె ఫోన్ సంభాషణలను 2008, 2009 ట్యాప్‌చేసి.. రికార్డు చేశారు అధికారులు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. అయితే 2010లో రతన్ టాటా-రాడియా మధ్య జరిగిన ఆడియో సంభాషణను మీడియా ప్రసారం చేసింది. దీంతో ఈ టేపుల విడుదల.. తన గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని వాదిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2011లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2012 ఆగస్ట్ నెలలో రతన్ టాటా 'రాడియా టేపులు' ఎలా బయటపడ్డాయో వివరిస్తూ ప్రభుత్వం సమర్పించిన నివేదిక కాపీని తనకు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఇక రతన్ టాటా పిటిషన్‌పై చివరిసారిగా 2014లో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. -
పెగాసస్ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ ప్రకారం పెగాసెస్‌ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్‌ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది. -
ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్
న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. "దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు" కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే "16 రాష్ట్రంలోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి" అని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ తో అనుసంధానించబడతాయని అన్నారు.భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది. -
వాయిస్ బీపీవో హబ్‌గా భారత్..
న్యూఢిల్లీ: వాయిస్ ఆధారిత బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కార్యకలాపాలకు భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే దిశగా దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్రం మరింత సరళతరం చేసింది. అన్ని రకాల ఓఎస్పీ (ఇతర సర్వీస్ ప్రొవైడర్స్) మధ్య ఇంటర్ కనెక్టివిటీని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశీ, విదేశీ యూనిట్లకు ఒకే రకం నిబంధనలను వర్తింపచేయనుంది. వీటితో పాటు మరికొన్ని నిబంధనల సడలింపుతో భారత్‌లో వాయిస్ ఆధారిత సెంటర్ ఉన్న అంతర్జాతీయ సంస్థలు.. ఇకపై ఉమ్మడి టెలికం వనరులను ఉపయోగించుకుని దేశ, విదేశాల్లో కస్టమర్లకు సర్వీసులు అందించడానికి వీలు కానుంది. ఇప్పటిదాకా ఇలాంటి సేవల కోసం ప్రతీ కంపెనీ తమ సొంత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండేది. తాజా పరిణామాలతో కంపెనీలు తమ వనరులను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలు కానుంది. ‘సరళతరం చేసిన నిబంధనలతో బీపీవో పరిశ్రమలో సింహ భాగం వాటాను భారత్ దక్కించుకోగలదు‘ అని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, ఐటీ–బీపీఎం పరిశ్రమ వృద్ధికి దోహదపడటంతో పాటు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు నిబంధనల సడలింపు తోడ్పడగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. టెక్ రంగం వృద్ధికి దోహదం.. గతేడాది నవంబర్లోనే ఓఎస్పీ మార్గదర్శకాల్లో కొన్నింటిని సరళతరం చేశామని, తాజాగా వీటిని మరింత సడలించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనితో అనేకానేక నిబంధనలను పాటించాల్సిన భారం కంపెనీలకు తగ్గుతుందని, టెక్ పరిశ్రమ వృద్ధికి ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం వనరులను ఉపయోగించుకుని అప్లికేషన్ సర్వీసులు, ఐటీ ఆధారిత సేవలు, కాల్ సెంటర్ సేవలు లేదా ఇతరత్రా అవుట్సోర్సింగ్ సర్వీసులు అందించే సంస్థలను ఓఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 2019–20లో 37.6 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2.8 లక్షల కోట్లు) ఉన్న దేశీ ఐటీ–బీపీవో పరిశ్రమ 2025 నాటికి 55.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3.9 లక్షల కోట్లు)కు చేరగలదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
భావ ప్రకటనా స్వేచ్ఛపై భారత్‌కు చెప్పక్కర్లేదు!
పుణె: ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛపై భారత్‌కు లెక్చర్లు ఇవ్వాల్సిన పనిలేదని సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చురకలంటించారు. ఇలాంటి సంస్థలను ‘‘లాభార్జన సంస్థలు’’గా నిర్వచించిన ప్రసాద్, ఈ కంపెనీలు భారత్‌లో సంపాదించాలనుకుంటే తప్పక భారత రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలని స్పష్టం చేశారు. ‘‘సోషల్ మీడియా అండ్ సోషల్ సెక్యూరిటీ’’ మరియు ‘‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రిఫామ్స్’’ అనే అంశాలపై సింబయాసిస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. కొత్త ఐటీ చట్టాలు సోషల్ మీడియా వాడకాన్ని నిరోధించవని, కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దుర్వినియోగం చేయడాన్ని నిరోధిస్తాయని వివరించారు. కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదుల పరిష్కార అధికారి, కంప్లైయన్స్ అధికారి, నోడల్ అధికారిగా భారత సంతతికి చెందినవారిని నియమించాలన్నారు. ఇదేమీ అసాధ్యమైన పనికాదన్నారు. అమెరికాలో ఉంటూ మనదగ్గర లాభాలు పొందుతున్న కంపెనీల నుంచి భావప్రకటనా స్వేచ్ఛపై సందేశాలు వినాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. దేశీయ కంపెనీలు అమెరికాలో వ్యాపారానికి వెళితే అక్కడి చట్టాలను పాటించినట్లే, అక్కడి కంపెనీలు ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడి చట్టాలను పాటించాలని హితవు పలికారు. ఎవరినైనా విమర్శించండి, కానీ ఇక్కడి చట్టాలను మాత్రం పాటించమంటే కుదరదన్నారు. భారత్‌లో వ్యాపారం చేయాలంటే ఇక్కడి రాజ్యాంగాన్ని అనుసరించితీరాలన్నారు. కొత్త చట్టాల అమలుకు ఈ సంస్థలకు అదనపు సమయం ఇచ్చామని, కానీ అవి నియమాలను అనుసరించలేదని గుర్తు చేశారు. చట్టాలకు అనుగుణ మార్పులు చేయనందున ఇకపై ఈ కంపెనీలు కోర్టుల చుట్టూ తిరగకతప్పదన్నారు. చదవండి: 70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి -
ప్రజలను ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నావా కేజ్రివాల్?
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేజ్రివాల్ ఇంటికే రేషన్ పథకం ఆమ్ ఆద్మీ పార్టీ రేషన్ మాఫియా కోసమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని ఢిల్లీలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఇంటికే రేషన్ అన్నది వినడానికి బాగానే ఉంది. ఓ సారి అందులోని లూప్ హోల్స్‌ను పరిశీలిస్తే అందులో అవినీతికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుస్తాయి. కేజ్రివాల్‌కు కావాల్సింది కూడా అదే. నువ్వు(కేజ్రివాల్) చట్టాన్ని బ్రేక్ చేసి.. ప్రజల్ని ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నావా?. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించలేకపోతున్నాడు కానీ, ఇంటికే రేషన్ అందిస్తాడంట! ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా కంట్రోల్ ఉంది. మేము ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని తెచ్చాం. ఈ పథకం ద్వారా ప్రజలు ఆధార్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేసింది. కానీ, ఢిల్లీ, బెంగాల్, అస్సాం రాష్ట్రాలు అమలు చేయకపోవటం బాధగా ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో సమస్య ఉంది. కానీ, ఢిల్లీకి, అరవింద్ కేజ్రివాల్‌కు ఏం సమస్య ఉంది. చవకగా రేషన్ కార్డుదారులకు, పేద ప్రజలకు రేషన్ అందిస్తున్నాము. అలాంటప్పుడు నువ్వెందుకు ఆ పథకాన్ని అమలు చేయలేదు? నీ సమస్య ఏంటి?’’ అంటూ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. -
స్పెక్ట్రం వేలం షురూ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే టెలికం స్పెక్ట్రం వేలం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున రూ. 77,146 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బిడ్డింగ్‌కు స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం బ్యాండ్స్ అయిన 700, 2500 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్ చేయలేదని చెప్పారు. మంగళవారం కూడా వేలం కొనసాగించి, ముగించనున్నామని వివరించారు. ‘సోమవారం సాయంత్రం 6 గం.ల దాకా రూ. 77,146 కోట్ల బిడ్లు వచ్చాయి. కేవలం మూడు సంస్థలే పోటీపడుతున్నాయి.. అది కూడా గత స్పెక్ట్రంనే రెన్యూ చేసుకోనున్నాయి కాబట్టి బిడ్లు మహా అయితే రూ. 45,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మేం అంచనా వేశాం. అయితే దానికి మించి బిడ్లు వచ్చాయి’ అని ప్రసాద్ తెలిపారు. బిడ్డర్ల వారీగా వివరాలు వెల్లడి కానప్పటికీ దాదాపు 849.20 మెగాహెట్జ్ పరిమాణానికి బిడ్లు వచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదటి రోజున నాలుగు రౌండ్లు జరిగాయి. 700 మెగాహెట్జ్‌కు దూరం.. ‘మొత్తం వేలానికి ఉంచిన స్పెక్ట్రం విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 700 మెగాహెట్జ్ బ్యాండ్.. అత్యంత ఖరీదైనది. దీని విలువే ఏకంగా రూ. 1.97 లక్షల కోట్లు ఉంటుంది’ అని ప్రసాద్ తెలిపారు. 5జీ సేవలకు ఉపయోగపడే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌కు 2016లో నిర్వహించిన వేలంలో కూడా స్పందన లభించలేదు. ఒకవేళ రేటు కారణంగా ప్రస్తుత వేలంలోనూ అమ్ముడు కాకపోయిన పక్షంలో దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరిణామాలతో ఎకానమీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వేలం జరుగుతున్నప్పటికీ.. ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తుండటం సానుకూలాంశమని ప్రసాద్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం జరిగే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. దూకుడుగా జియో.. వేలంలో పాల్గొంటున్న మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కలిపి రూ.13,475 కోట్లు ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చేశాయి. దాదాపు రూ. 1.79 లక్షల కోట్ల విలువ చేసే జియో సంస్థ అత్యధికంగా రూ. 10,000 కోట్లు బయానాగా చెల్లించింది. ఇక రూ. 71,703 కోట్ల విలువ గల భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, రూ. 43,474 కోట్ల నెగటివ్ విలువ గల వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ చెల్లించాయి. జియో చెల్లించిన బయానా బట్టి చూస్తే .. సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గణనీయంగా స్పెక్ట్రం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖజానాకు రూ. 13,000 కోట్లు స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.12,000–13,000 కోట్లు రావచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో అందవచ్చు. ప్రస్తుత వేలంలో .. ఏడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (700 మెగాహెట్జ్, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్) మొత్తం 2,308.80 మెగాహెట్జ్ (ఎంహెచ్‌జెడ్) స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇందులో 5జీ కోసం ఉద్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్లను చేర్చలేదని, వీటిని తర్వాత వేలం వేయవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: నగరానికి ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కు సమానంగా నూతన హోదాను కల్పించాలని కోరుతూ ఆదివారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కి కేటీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘‘ గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రగతి ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ప్రశ్నార్థకమైనా.. తెలంగాణలో మాత్రం ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. జాతీయ సగటు 1.9శాతం ఉండగా.. తెలంగాణ గ్రోత్ రేట్ 7 శాతంతో 1.4 లక్షల కోట్లుగా ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీస్, బ్లాక్‌చైన్ వంటి నూతన ఎమర్జింగ్ టెక్నాలజీలను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం వినూత్న పాలసీల ద్వారా అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత గొప్ప ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న టీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి అనేక సంస్థలు ఈ రంగంలో గత ఆరు సంవత్సరాల్లో నెలకొల్పబడ్డాయి’’ అని పేర్కొన్నారు. -
హైకోర్టు తరలింపుపై స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. హైకోర్టు తరలింపు అంశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధామనిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు.న్యాయస్థానం తరలింపు కోసం ఎలాంటి గడువూ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అన్న జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇదివరేక సంకల్పించిన విషయం తెలిసిందే. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడో రోజైన బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆయన వెంట ఉన్నారు. వరి ఎగుమతికి సహకరించండి.. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం సందర్భంగా వరి సేకరణకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. నివర్ తుపాన్ వల్ల రంగు కోల్పోయిన వరి ధాన్యం నాణ్యతలో సడలింపులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సేకరించిన వరిని రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు. న్యాయ వర్సిటీని కేటాయించండి.. కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బుగ్గన కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుండటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరులోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని నల్సార్, భోపాల్, జోధ్పూర్లలో మాదిరిగా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ బకాయిల సమస్యను పరిష్కరించాలి.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లకు సంబంధించి అప్పులను రీస్ట్రక్చర్ చేసుకోవడానికి సహకరించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌తో శ్రమశక్తి భవన్లో సమావేశంసందర్భంగా బుగ్గన కోరారు. అంతర్ రాష్ట్ర విద్యుత్ బకా యిల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత సర్కారు హయాంలో చేసుకున్న ఒప్పందాలలో థర్మల్ విద్యుత్ ధర అధికంగా ఉందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు. -
ఎలక్ట్రానిక్ తయారీయే.. రూ.లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని పెంచడం ఒక్క చర్యతోనే జీడీపీకి ట్రిలియన్ డాలర్లు (రూ.74లక్షల కోట్లు) మేర సమకూరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ విషయంతో తనకు ఎటువంటి సందేహం లేదంటూ, దీన్ని తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలైన యాపిల్, శామ్సంగ్ తదితర సంస్థలకు భారత్‌లో కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉందని, వీటితోపాటు వీటి కాంట్రాక్టు తయారీ సంస్థలు సైతం భారత్‌లో ఉత్పత్తిని విస్తరించనున్నాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.370 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీలు), ల్యాప్‌టాప్‌లు, ఐవోటీ ఉత్పత్తుల విషయంలో భారత్‌కు అపార సామర్థ్యాలున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయంగా అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరించాలన్నది ఆలోచన’’ అని మంత్రి ప్రసాద్ వివరించారు. దేశంలో నైపుణ్యాలు, ఆవిష్కరణల సామర్థ్యాలు, అధిక జనాభా అనుకూలతలు అన్నవి భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసేందుకు సరిపోతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించిందని.. రూ.10 లక్షల కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సంసిద్ధతను ప్రకటించాయని తెలిపారు. ఇందులో రూ.7 లక్షల కోట్ల మేర ఎగుమతులకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘పీఎండబ్ల్యూఏఎన్‌ఐని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. కొచ్చి- లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు ఆమోదం తెలిపింది’’ అని రవిశంకర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు. అంతేగాక ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 58.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.(చదవండి: రైతులతో చర్చలు: కేంద్రం ప్రతిపాదనలు) -
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లను నిషేధించండి..
సాక్షి, అమరావతి : పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటి వల్ల డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా మేము ఏపీ గేమింగ్ యాక్ట్–1974లో ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌లను ఒక నేరంగా పేర్కొంటూ ‘ఏపీ ఆర్డినెన్స్–2020’ తెచ్చాం. దాన్ని 2020 సెప్టెంబర్ 25న నోటిఫై చేశాం. ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశం ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌లను నిషేధించడమే. వీటిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయం లేకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. నిషేధించాల్సిన 132 వెబ్సైట్ల వివరాలను లేఖకు జత చేశారు. (రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చూడాలి) -
కేంద్రానికి సహాయమంత్రి కిషన్ రెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని కోరుతూకేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు. చదవండి: నిజామాబాద్‌లో 173 మంది వీఆర్ఓల బదిలీ -
సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుత విధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ భారత్‌ను సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచించారు. వినూత్నమైన మేడిన్ ఇండియా ఉత్పత్తులను అందించాలని పేర్కొన్నారు. దేశీ వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్లు, యాప్స్ రూపకల్పన ద్వారా కరోనా వైరస్‌పరమైన భారీ సవాళ్లను పరిశ్రమ అసాధారణ రీతిలో ఎదుర్కొందని ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఐటీ, కమ్యూనికేషన్స్ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయని.. ప్రపంచమంతా భారత్‌ని విశ్వసించడమే ఇందుకు కారణమని ప్రసాద్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపకల్పన పోటీల విజేతలను ప్రకటించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీకన్సోల్ అనే వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపొందించిన కేరళకు చెందిన టెక్జెన్సియా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ పోటీలో విజేతగా నిల్చింది. విజేతకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం, అదనంగా మూడేళ్ల పాటు నిర్వహణ వ్యయాల కోసం రూ. 10 లక్షలు అందించడం జరుగుతుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సర్వ్ వెబ్స్, పీపుల్‌లింక్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌ల్యాబ్స్ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న సొల్యూషన్స్‌గా జ్యూరీ ఎంపిక చేసింది. వీటికి తలో రూ. 25 లక్షల మద్దతు లభించనుంది. -
మొబైల్ ఫోన్లు ఇక లోకల్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ ఫోన్లు, విడిభాగాల తయారీకి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. భారత్‌తోపాటు తైవాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి 22 కంపెనీలు తమ ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిలో శాంసంగ్, లావా, డిక్సన్, మైక్రో మ్యాక్స్, పెడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఆపిల్ ఫోన్లను తయారు చేసే కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ ఉన్నాయి. రూ.11,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను కంపెనీలు సమర్పించాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో రూ.11 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఈ కంపెనీలు తయారు చేస్తాయని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
జోయా ఖాన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ : దేశంలోనే టెలీ మెడిసిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ జోయా ఖాన్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. ప్రస్తుతం వడోదరలో పనిచేస్తున్న ఈమె ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సాంకేతిక రంగంలోనూ ట్రాన్‌జెండర్లు మరింత అభివృద్ది చెందాలన్నాదే ఆమె లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు జోయా ఖాన్‌ను ప్రశంసిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. (భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్ ) Zoya Khan is India's first transgender operator of Common Service Centre from Vadodara district of Gujarat. She has started CSC work with Tele medicine consultation. Her vision is to support transgender community in making them digitally literate & give them better opportunities. pic.twitter.com/L0P9fnF2JT — Ravi Shankar Prasad (@rsprasad) July 4, 2020 దేశంలో ట్రాన్స్జెండర్లకు కూడా మిగతావారితో సమానంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు కామన్ సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఏర్పాటుచేసింది. దీనిలో భాగంగా గ్రామీణ, మారుమూల ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలు, వైద్యం, ఆరోగ్యం, తదితర సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి టెలీ మెడిసిన్ ఆపరేటర్‌గా జోయా ఖాన్ నియమితురాలైంది. గుజరాత్లో వడోదరలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లో విధులు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నందున ప్రతీ ఒక్కరూ హాస్పిటల్‌కి వెళ్లకుండా రోగులు తమ సమీప కేంద్రం నుంచి వీడియో కాలింగ్ ద్వారా కన్సల్టేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు. (కోవిడ్-19 టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన ) -
‘చైనా వైపు రెండింతలు చనిపోయారు’
న్యూఢిల్లీ : భారత్‌కు చెడు చేయాలని చూసేవారికి దీటైన సమాధానం చెబుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణ త్యాగం చేశారని.. కానీ చైనా వైపు ఆ సంఖ్య రెండింతలుగా ఉంటుందని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ ల గురించి వింటున్నామని.. అందులో ఒకటి కరోనా వైరస్ అని, మరోకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని వెల్లడించారు. (చదవండి : ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో) గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్‌ల నిషేధంపై స్పందిస్తూ.. భారతీయులు డేటా రక్షించేందుకు డిజిటిల్ స్ట్రైక్ ప్రారంభించామని చెప్పారు. కాగా, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ తమవైపు 20 మంది జవాన్లు మృతిచెందినట్టుగా ప్రకటించగా.. చైనా మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌కు ధీటుగా బదులిస్తున్నారు. (చదవండి : ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు) మరోవైపు ఎమర్జెన్సీకి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై రవిశంకర్ ప్రసాద్ పలు విమర్శలు చేశారు. ‘1975 జూన్ 25 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని సీటును కాపాడుకోవడానికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, చంద్రశేఖర్ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారు. కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే రోజు ఇది. వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో బిహార్ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం నా అదృష్టం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. On 25th June 1975 draconian Emergency was imposed by the Congress Govt led by PM Indira Gandhi. Major opposition leaders including Lok Nayak Jai Prakash Narayan, Bharat Ratna Atal Behari Vajpayee, L. K. Advani, Chandrashekhar and lakhs of people of India were arrested. — Ravi Shankar Prasad (@rsprasad) June 25, 2020 -
అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచిందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్సెట్లు తయారైనట్టు చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్ చేశారు. 2014లో కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే రేపు (జూన్ 2న) మధ్యాహ్నం 12:00 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. Under the leadership of PM @narendramodi, India has emerged as the 2nd largest mobile phone manufacturer in the world. In the last 5 years, more than 200 Mobile Phone Manufacturing units have been set up. #ThinkElectronicsThinkIndia pic.twitter.com/fGGeCRpj87 — Ravi Shankar Prasad (@rsprasad) June 1, 2020 చదవండి : సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్ షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే -
కోర్టుల ద్వారా రాజకీయాలు నియంత్రించరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రామాణికమైన ప్రజాప్రయోజన వ్యాజ్యమైతే దానిని సమర్థిస్తామని, తాను కూడా అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశానని గుర్తుచేశారు. ఏ సందర్భంలోనైనా సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందని, కానీ, కొందరు కోర్టులను మాధ్యమంగా చేసుకుని తమ రాజకీయాలు నడపాలనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆజ్‌తక్ ఛానల్ నిర్వహించిన ఈ–ఎజెండా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేవాళ్లు..న్యాయమూర్తిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు ప్రయత్నించిన వారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. వలస కార్మికులకు సంబంధించి ఓ కేసులో సొలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కోర్టుకు వచ్చిన వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఏం చేశారని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారని, ఈ ప్రశ్న ఎందుకు వేయరాదని, కేవలం రాజకీయపరమైన ఒత్తిళ్లు తెచ్చేం దుకు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యా నించారు. తాము న్యాయవ్యవస్థను విశ్వసిస్తామని, ఆ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుండాలని పేర్కొన్నారు. -
కట్టాల్సినది రూ. 21 వేల కోట్లే
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల (ఏజీఆర్) కింద తాము కట్టాల్సినది టెలికం శాఖ (డాట్) చెబుతున్న దానికంటే చాలా తక్కువేనని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తెలిపింది. వాస్తవంగా తాము చెల్లించాల్సినది రూ. 21,533 కోట్లు మాత్రమేనని స్వీయ మదింపులో తేలిందని సంస్థ వివరించింది. ఇందులో ఇప్పటికే రూ. 3,500 కోట్లు కట్టినట్లు పేర్కొంది. వొడాఫోన్ ఐడియా రూ. 53,000 కోట్ల పైగా కట్టాలని డాట్ చెబుతోంది. మరోవైపు, వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. కంపెనీని నిలబెట్టేందుకు తోడ్పాటు అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రాజధర్మంపై ఆగని రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాజధర్మం వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ మాటలనే మీరు పెడచెవిన పెట్టారు. ఇక.. మా మాటలను ఎందుకు వింటారు అంటూ కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు. వినడం, నేర్చుకోవడం, ఆచరించడం రాజధర్మంలో భాగమని.. ఇవేవీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదని కపిల్ సిబాల్ విమర్శించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ అయితే.. గురువారం రోజున ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాజధర్మాన్ని పాటించామని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించి వారిని రక్షించామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. సోనియా గాంధీ, దయచేసి రాజధర్మం గురించి మాకు బోధించొద్దు. మీ చరిత్ర అంతా తప్పులతడక అని అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చేస్తే అది మంచిది. అదే మేంచేస్తే ప్రజలను రెచ్చగొడతారు.ఇది ఎలాంటి రాజధర్మం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. Law Minister to Congress : “ Please don’t preach us Rajdharma “ How can we Mr. Minister ? When you did not listen to Vajpayeeji in Gujarat why would you listen to us ! Listening , learning and obeying Rajdharma not one of your Government’s strong points ! — Kapil Sibal (@KapilSibal) February 29, 2020 -
టెల్కోలకు మరిన్ని కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) చెల్లింపుల సంక్షోభం దేశీయ టెలికాం కంపెనీల మెడకు మరింత గట్టిగా బిగుస్తోంది. ఒకవైపు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడ్డ టెలికాం సంస్థలు తమ బకాయిలను క్రమంగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే భారతి ఎయిర్టెల్ రూ. 10వేలకోట్లు, వోడాఫోన్ ఐడియా మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. మరోవైపు టెలీకమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించనందుకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలిసర్వీస్‌లకు ఈ వారం తాజా నోటీసులు జారీ చేయనుంది. అలాగే బ్యాంక్ హామీలను అంగీకరించే అవకాశం వుందని, అయితే మార్చి 17 లోపు చేయాలా వద్దా అనే దానిపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరినట్టు డాట్ వెల్లడించింది. టాటా టెలీ సర్వీసెస్ ప్రకటనపై డాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ బకాయిలు రూ .2,197 కోట్ల 'ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్' చేసినట్టు టాటా టెలిసర్వీసెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాట్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించాలని కోరుతూ టాటా టెలీ సర్వీసెస్‌కు ప్రత్యేక నోటీసు జారీ చేయనుంది. కంపెనీ మొత్తం బకాయిలు రూ. 14,000 కోట్లని డాట్ స్పష్టం చేసింది. మొత్తంపై వడ్డీ (పెనాల్టీతో పాటు), పెనాల్టీపై వడ్డీని చెల్లించలేదని డాట్ అధికారి తెలిపారు. పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా టాటా టెలీ సర్వీసెస్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ గురువారం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసారు. ఇంతకుముందెన్నడూ లేని ఈ అసాధారణ సంక్షోభంలో టెలికాం రంగానికి పన్నులు, సుంకాలను తగ్గించాలని కోరారు. అలాగే బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించటానికి ఎయిర్టెల్ కట్టుబడి ఉందని మిట్టల్ చెప్పారు. మిగిలిన ఏజీఆర్ బకాయిల చెల్లింపులను వేగవంతం చేశామన్నారు. మార్చి 17 వరకు సమయం ఉందని, కంపెనీ తన బకాయిలను అంతకు ముందే చెల్లిస్తుందని వెల్లడించారు. కాగా బకాయిల చెల్లింపుల ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. -
న్యాయశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు. 50 నిముషాల పాటు జరిగిన ఈ ముఖాముఖి సమావేశంలో శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై సీఎం జగన్ కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. (చదవండి : దిశ చట్టం రూపుదాల్చాలి) ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్ దాదాపు 40 నిముషాలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే. ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్ షాకు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం విదితమే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు. -
న్యాయశాఖ మంత్రిని కలవనున్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను శనివారం కలవనున్నారు. శాసనమండలి, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై ఆయనతో చర్చించన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరి భేటీ ఉండనుంది. ఇక శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం వైఎస్ జగన్ దాదాపు 40 నిముషాలపాటు చర్చించారు. (చదవండి: దిశ చట్టం రూపుదాల్చాలి) ‘దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే ఆమోదం తెలపాలని ఆయన అమిత్ షాకు విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, మూడు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ఆయన ప్రధానిని కోరారు. -
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కశ్మీర్లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్ ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్లో, లడాఖ్‌ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు. ‘నెట్’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్‌లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. -
దయచేసి వారి సలహా తీసుకోండి..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయకుండా ఏ ఒక్కరాష్ట్రం తప్పించుకోలేదని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయనివ్వబోమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏను ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రవిశంకర్ ప్రసాద్... ‘ ఓటు బ్యాంకు రాజకీయాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను అమలు చేయనివ్వమంటూ బాహాటంగా ప్రకటనలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వారందరికీ నేనిచ్చే మర్యాదపూర్వక సలహా ఒకటే. దయచేసి మీరంతా న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245, 256 సహా ఇతర అధికరణల ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్ 256 ప్రకారం కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో విభేదించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా’అని ప్రశ్నించారు. అదే విధంగా.. ‘ మీరు ఆచరిస్తున్న ప్రక్రియ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ఉభయ సభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ప్రజాప్రతినిధులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసినపుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామన్న మాటలను మరోసారి గుర్తుచేసుకోండి అని రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. -
మార్చికల్లా అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: రవిశంకర్ ప్రసాద్
రేవారి (హర్యానా): భారత్‌నెట్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు. -
లైంగిక దాడి కేసులపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దిశ, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక దాడి, పోక్సో కేసులన్నింటిపై ఆరు నెలల్లోగా విచారణ ముగిసేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురువారం లేఖ రాశారు. ఈ తరహా కేసులన్నింటిలో విచారణను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆదేశించారు. లైంగిక దాడి కేసుల సత్వర విచారణకు దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 700 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నాయని, తాజా కోర్టులతో వీటి సంఖ్య 1723కు చేరుతుందని చెప్పారు. దిశ హత్యాచార ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
సెలెక్ట్ కమిటీకి ‘డేటా’ బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో.. పౌరుల సమాచార భద్రతకు ఉద్దేశించిన ‘వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు’పై (పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు) కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ ప్యానల్ పరిశీలనకు పంపిస్తున్నట్లు ఐటీ మంత్రి రవి శంకర్ చెప్పారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను బడ్జెట్ సమావేశాల్లోపు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తడం తెల్సిందే. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. ఆందోళనల నేపథ్యంలో బిల్లును కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు. -
‘ఏపీ హైకోర్టులో ఖాళీగా 22 జడ్జీల పోస్టులు’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం 22 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. హైకోర్టులో న్యాయమూర్తుల బదిలీ లేదా పదవులు ఖాళీ కావడానికి ముందుగానే వాటిని భర్తీ చేసే ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే చేపడతారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరు మాసాల కాలవ్యవధిని విధిగా పాటించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. న్యాయమూర్తి పోస్టుల భర్తీ లేదా బదిలీ అనేది ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయంతో నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన తెలిపారు. వివిధ రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్రాలు, కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపి అనుమతులు పొందాల్సి ఉండటం వల్ల జడ్జీల నియామకంలో జాప్యం నెలకొంటోందని ఆయన వెల్లడించారు. ఖాళీలను వేగంగా భర్తీ చేయడానికి ఒకవైపు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పదోన్నతులు, పదవీ విరమణ, న్యాయమూర్తుల సంఖ్యాబలం పెంపు వంటి కారణాల వలన హైకోర్టు జడ్జీల పదవులకు ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయని మంత్రి వివరించారు. -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఏఐజేఎస్‌పై ఏకాభిప్రాయం రాలేదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత జుడిషియల్ సర్వీసెస్(ఏఐజేఎస్) ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏఐజేఎస్ ఏర్పాటు కోసం రాష్ట్రాలు, హైకోర్టులతో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జిల్లా జడ్జీల పోస్టుల నియామకం, జడ్జీలు, అన్ని స్థాయిలలో జుడిషియల్ అధికారుల ఎంపిక ప్రక్రియను సమీక్షించే అంశాన్ని, 2015 ఏప్రిల్‌లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఎజెండాలో చేర్చడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అయితే జిల్లా జడ్జీల ఖాళీల నియామకాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ పరిధిలోనే చేపట్టడానికి తగిన విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఆయా హైకోర్టులకే వదిలేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అలాగే తదుపరి సెక్రెటరీల కమిటీ ఆమోదించే.. అఖిల భారత జుడిషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) ఏర్పాటుకై సమగ్ర ప్రతిపాదన రూపకల్పన కోసం రాష్ట్రాల, హైకోర్టుల అభిప్రాయాలను కోరడం జరిగిందని తెలిపారు. ఏఐజేఎస్ ఏర్పాటుకు సెక్రటరీల కమిటీ ఆమోదించిన ప్రతిపాదనతో సిక్కిం, త్రిపుర హైకోర్టులు ఏకీభవించాయని వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, బొంబాయి, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాసు, మణిపూర్, పట్నా, పంజాబ్, హరియాణా, గౌహతి హైకోర్టులు తిరస్కరించాయని చెప్పారు. ఏఐజేఎస్ ద్వారా భర్తీ చేసే ఖాళీలకు సంబంధించి అభ్యర్ధుల వయో పరిమితి, విద్యార్హతలు, శిక్షణ, రిజర్వేషన్ల కోటాకు సంబంధించి అలహాబాద్, ఛత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఒరిస్సా, ఉత్తరాఖండ్ హైకోర్టులు సూచించాయని మంత్రి చెప్పారు. కాగా ఏఐజేఎస్ ఏర్పాటును అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్ రాష్ట్రాలు వ్యతిరేకించగా.. బీహార్, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్, ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మాత్రం దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో మార్పులు చేయాలని సూచించాయని ఆయన తెలిపారు. ఈ విధంగా ఏఐజేఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన దృష్ట్యా ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం తిరిగి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్న యూజర్లు...
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018–19లో పోర్ట్–అవుట్స్ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్–ఇన్స్ (బీఎస్ఎన్ఎల్కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్ దాకా 2.04 కోట్ల మేర పోర్ట్–ఇన్స్ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్–అవుట్స్ ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. -
‘కోర్టుకు కాదు.. దేశానికి క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధానితో పాటు ప్రజలందరినీ రాహుల్ తీవ్రంగా అవమానించాడని అన్నారు. అలాగే ప్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలను కూడా రాహుల్ వక్రీకరించారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించిన రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలను చేయవద్దని సూచించింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన పలువురు కేంద్ర మంత్రులు విపక్షాలు ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవుపలికారు. దేశ ప్రజలందరికీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. -
మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయిలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా కుదరకపోతే కనీసం వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలో రాసిన లేఖకు అనుబంధంగా కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అక్టోబర్ 31న తాజా లేఖ రాశారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) ఫార్ములాకు తగ్గట్లు పాత బకాయిలన్నింటిని లెక్కగట్టి, కేంద్రానికి చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు అక్టోబర్ 24న టెల్కోలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతి ఎయిర్టెల్ ఏకంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు పైగా కట్టాల్సి రావొచ్చని అంచనా. రింగ్ వ్యవధి 30 సెకన్లు.. టెలిఫోన్ రింగ్ అయ్యే వ్యవధిని నిర్దేశిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లకైతే ఇది 30 సెకన్లుగాను, ల్యాండ్‌లైన్ ఫోన్లకు∙60 సెకన్లుగాను నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది. -
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని పేర్కొంది. సీవోఏఐ బ్లాక్మెయిల్... ‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. భారత మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్ భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్మెంట్కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్ తెలిపింది. ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది. -
బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం
న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్ఎల్ సంస్థ బీఎస్ఎన్ఎల్కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్ఎస్ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది. రెండూ కీలక సంస్థలే.. ‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్ వంటివి. మొత్తం ఆర్మీ నెట్వర్క్ అంతా బీఎస్ఎన్ఎల్ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్ఎస్ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ఎస్ స్వచ్ఛందమైనదే. వీఆర్ఎస్ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్ఎస్ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది. రూ. 40 వేల కోట్ల రుణభారం.. ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం. 4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అధికంగా మనకే రావాలి!
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అత్యధికంగా ఆకర్షించే దేశంగా భారత్ నిలవాల్సి ఉందని కేంద్ర ఐటీ, సమాచార, ఎల్రక్టానిక్స్ మంత్రి రవి శంకర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి ఏంచేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మన దేశంలో డిజిటల్‌గా అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. యాపిల్ తదితర విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి మార్కెట్, ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండే విధానాలను అవలంబిస్తున్నామని వివరించారు. ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్ డిజికామ్ 2019లో ఆయన ప్రసంగించారు. పన్నులు తగ్గించాం.... కంపెనీలకు అనుకూలమైన విధానాలనే అనుసరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామని ప్రసాద్ పేర్కొన్నారు. కంపెనీలు ఆశించిన విధానాలను, సదుపాయాలను కలి్పంచడానికి సదా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తయారీ రంగంలో కంపెనీలు నెలకొల్పేవారికి ఇటీవల కార్పొరేట్ పన్నులు తగ్గించామని, ఈ తగ్గింపుతో పన్నుల విషయంలో వియత్నాం, థాయ్‌లాండ్ సరసన నిలిచామని వివరించారు. అగ్రస్థానం చేరుకోవాలి..: ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆరి్థక వ్యవస్థగా భారత్ నిలిచిందని ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న తొమ్మిదో దేశంగానే ఉన్నామని, ఈ విషయంలో అగ్రస్థానానికి చేరాల్సి ఉందని వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సి ఉందని చెప్పారు. 6,400 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు గత కొన్నేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు పెరుగుతోందని ప్రసాద్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 6,400 కోట్ల డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమమైన కంపెనీలను ఆకర్షించడానికి పన్నుల్లో, ఇతర నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశామని పేర్కొన్నారు. మరెంతో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డేటా అనేది కీలకమైన వృద్ధి అంశాల్లో ఒకటని, డేటా ఎనలిటిక్స్‌లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదగాల్సి ఉందని పేర్కొన్నారు. -
భారత్‌లోకి ‘ఆపిల్’.. భారీగా పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అన్ని దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత మార్కెట్ పట్ల ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. అతి పెద్ద వ్యాపార ప్రణాళికతో ఇక్కడ విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు భారత్ ఎగుమతుల హబ్‌గా మారనుందన్నారు. ఇక తమ హయాంలోనే భారత్‌లోని మొబైల్ ఫ్యాక్టరీలు రెండు నుంచి 268కి చేరాయని చెప్పారు. మన దేశంలో బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్ సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫండ్స్ పెట్టుబడుల్లో చిన్న పట్టణాల హవా న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చిన్న పట్టణాల్లోని ఇన్వెస్టర్లనూ పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు ఆగస్ట్ చివరికి రూ.25.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం జూలై చివరికి ఉన్న రూ.24.53 లక్షల కోట్లతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. దేశంలోని టాప్ 30 పట్టణాలు కాకుండా.. ఇతర పట్టణాల (బియాండ్ 30) నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా మొత్తం రూ.25.64 లక్ష కోట్లలో 15.3 శాతంగా ఉన్నట్టు ‘యాంఫి’ డేటా తెలియజేస్తోంది. జూలై చివరికి ఉన్న 14.48 శాతం నుంచి సుమారు ఒక్క నెలలోనే ఒక శాతం పెరిగింది. చిన్న పట్టణాలకూ విస్తరించే దిశగా సెబీ గత కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్న ఒత్తిడి ఫలితాలనిస్తోంది. ఫండ్స్ పెట్టుబడి ఆస్తుల్లో అత్యధికంగా 41.80 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 52.60 శాతంగా ఉంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 47.40 శాతంగా ఉంది. ఫండ్స్ పెట్టుబడులు చౌక: మార్నింగ్ స్టార్ కాగా, సెబీ తీసుకున్న చర్యలతో ఫండ్స్‌లో పెట్టుబడులు చౌకగా మారినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక పేర్కొంది. అప్‌ఫ్రంట్ కమీషన్లపై నిషేధం, ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే వ్యయ చార్జీలపై పరిమితులు వంటి అంశాలను ప్రస్తావించింది. -
చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇతరులతో పాటు ముస్లిం మహిళ కూడా సమాన హక్కులు కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లుకు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళలపై చూపుతున్న వివక్షకు నేడు సరైన న్యాయం జరిగిందన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం పెరిగిందన్న మోదీ.. ఇది మహిళ విజయంగా వర్ణించారు. కాగా మంగళవారం సాయంత్రం రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల సభ్యులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు. బిల్లు ఆమోదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక దేశంలో ట్రిపుల్ తలాక్ అనే పదమే వినపడదని స్పష్టం చేశారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి అసలైన విజయం నేడు లభించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు. -
రాజ్యసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్ ఫిగర్ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. పలువురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గడం వల్ల బిల్లు సునాయంగా ఆమోదం పొందింది. సభ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్ పద్దతిలో బిల్లుపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంలో పొందుపరిచిన విధంగా కఠిన శిక్ష అమలు కానుంది. కాగా తలాక్ బిల్లుకు ఈనెల 25న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో కూడా గట్టెక్కడంతో రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా.. టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిల్లుకు బీజేడీ మద్దతిచ్చింది. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి బిల్లును నెగ్గించుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచించింది. అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనలకు సభ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్‌ను నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 84 మంది ఓటువేయగా.. వ్యతిరేకంగా 100 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో సవరణలకు విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది. -
ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్’ పరీక్ష
న్యూఢిల్లీ: తమిళ పార్టీల ఆందోళనకు కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 14న నిర్వహించిన పోస్ట్‌మెన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది, ప్రాంతీయ భాషల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పోస్టల్ శాఖ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని రాజ్యసభలో ఏఐడీఎంకే నాయకత్వంలో చేపట్టిన నిరసనలో డీఎంకే, సీపీఐ, సీపీఎం పాల్గొన్నాయి. సభ్యుల ఆందోళనతో లంచ్ విరామానికి ముందు సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైనా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో మరోసారి అర్ధగంట వాయిదాపడింది. పోస్టుమెన్, సహాయకుల కోసం పోస్టల్ శాఖ గత ఆదివారం నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వశాఖల పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించాలని సభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి. -
లోక్‌సభలో ‘ట్రిపుల్ తలాక్’ రగడ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 186 మంది సభ్యులు మద్దతు తెలపగా, 74 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనంతరం రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. మహిళలకు న్యాయం చేకూర్చడానికి సంబంధించినది. ఈ బిల్లును సమానత్వం, న్యాయం కోసం తీసుకొస్తున్నాం. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి 543 కేసులు నమోదయ్యాయి. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా 200 కేసులు నమోదయ్యాయి. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇందుకోసం మేం కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టం చేశారు. అందరికీ ఒకే శిక్ష ఉండాలి: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు కేవలం ఓ మతాన్ని.. ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. భార్యలను కేవలం ముస్లిం పురుషులే వదిలివేస్తున్నారా? ఈ బిల్లు సివిల్, క్రిమినల్ చట్టాలకు విరుద్ధంగా ఉంది. మేం ట్రిపుల్ తలాక్‌ను సమర్థించడం లేదు. కానీ ఈ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దేశంలో ఎవరు భార్యను వదిలేసినా ఒకే శిక్ష పడేలా చట్టం ఉండాలి’ అని సూచించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే: ఒవైసీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘ముస్లిం మహిళలపై ఇంత ప్రేమ చూపుతున్న బీజేపీ శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలు వెళ్లడాన్ని వ్యతిరేకించింది. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. ఎందుకంటే ఓ ముస్లిం పురుషుడు చేసిన నేరానికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని బిల్లులో పొందుపర్చారు. ఇదే తప్పును ముస్లిం కానివారు చేస్తే ఏడాది జైలుశిక్ష మాత్రమే పడుతుంది’ అని విమర్శించారు. ఆర్ఎస్పీకి చెందిన ఎంపీ ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్‌తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును 2018, సెప్టెంబర్‌లో ఓసారి, 2019, ఫిబ్రవరిలో మరోసారి కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది. -
రెబెల్.. స్టార్ తిరిగేనా!
సాక్షి, ఎలక్షన్ డెస్క్ : శత్రుఘ్న సిన్హా రంగప్రవేశంతో పట్నా సాహిబ్ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఢీకొనేందుకు శత్రుఘ్న సమాయత్తమవుతున్న తరుణంలో దేశంలోకెల్లా అత్యంత ఉత్కంఠ పోరు నెలకొన్న నియోజకవర్గంగా పట్నా సాహిబ్ అవతరించబోతోంది. బీజేపీతో పాతికేళ్లకు పైగా ఉన్న బంధాన్ని శత్రుఘ్న సిన్హా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సొంత సీటు పట్నా సాహిబ్ నుంచి లోక్‌సభకు బరిలోకి దిగుతుండడంతో ఇప్పటి వరకూ సిన్హా భవిష్యత్తుపై కొనసాగిన సస్పెన్స్ తొలగిపోయింది. వాజ్‌పేయి సర్కారులో మంత్రిగా పనిచేసిన సిన్హా ‘బిహారీ బాబు’గా ఉన్న జనాదరణతో రెండుసార్లు రాజ్యసభకు (1996, 2002), మరో రెండుసార్లు లోక్‌సభకు బీజేపీ టికెట్‌పై ఎన్నికయ్యారు. మోదీ కేబినెట్లో మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను మే 19 జరగనున్న ఎన్నికల్లో ఢీకొననున్నారు. దాదాపు 22 ఏళ్లు బీజేపీ తరఫున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన శత్రుఘ్న కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ఇదే ప్రథమం. 1970ల్లో రెబెల్ స్టార్‌గా సంచలనం సృష్టించిన శత్రు.. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొందిన శిక్షణతో రాణించారు. ప్రతినాయకుని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. రాజకీయాల్లో ఎలాంటి శిక్షణ లేకున్నా 1992లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ టికెట్‌పై తొలిసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ తరఫున పోటీపడిన తోటి బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా చేతిలో 28 వేలకు పైగా ఓట్ల తేడాతో శత్రుఘ్న ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలో రాజేష్, శత్రు భార్యలు డింపుల్ కపాడియా, పూనమ్ సిన్హా భర్తల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. 1996లో రాజ్యసభకు.. 1992 జూన్ ఉప ఎన్నికలో ఓడినా కానీ బీజేపీ తరఫున చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా సిన్హాను 1996లో రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా 2002లో ఆయన రెండోసారి రాజ్యసభకు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఉండగా ఆయన 2003 జనవరి నుంచి 2004 మే వరకూ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనతో బిహార్ రాజధానిలో కొత్తగా ఏర్పాటైన పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు సిన్హా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను లక్షా 66 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ 2014లో బీజేపీ తరఫునే పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుణాల్‌సింగ్‌ను 2 లక్షల 65 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీగా 17 ఏళ్ల అనుభవంతో ఇంత మెజారిటీతో గెలిచినా మోదీ కేబినెట్లో చోటు దక్కకపోవడం శత్రుçఘ్న బీజేపీలో ‘రెబెల్ స్టార్’గా మారడానికి దారితీసింది. వాజ్‌పేయి కేబినెట్లో సిన్హా సహచరుడైన యశ్వంత్ సిన్హాతో చేతులు కలిపారు. కొన్నేళ్లుగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బీజేపీని, మోదీని మరింత ఇరుకున పెట్టడానికి బీజేపీ బద్ధ శత్రువు, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ను సిన్హా అనేకసార్లు కలిశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మోదీ ద్వయం వల్లే తనకు మంత్రి పదవి, ప్రాధాన్యం లేకుండా పోయిందనే కసితో కాంగ్రెస్‌లో చేరిన రోజు కూడా సిన్హా వారిపై బాణాలు సంధించారు. ‘బీజేపీ ఒన్ మ్యాన్ షో (మోదీ ఏకపాత్రాభినయం), ఇద్దరు సిపాయిలతో కూడిన సేన’గా మారిందని శత్రు వ్యాఖ్యానించారు. ఇద్దరు కాయస్థుల మధ్య రసవత్తర పోటీ! సిన్హాకు టికెట్ ఇవ్వడం లేదనే విషయం సూటిగా చెప్పకుండా కేంద్ర మంత్రి, సిన్హా కులానికే (కాయస్థు ) చెందిన రవిశంకర్‌ప్రసాద్‌ను పట్నాసాహిబ్‌కు తమ అభ్యర్థిగా రెండు వారాల క్రితమే బీజేపీ ప్రకటించింది. 2000 నుంచి వరుసగా రాజ్యసభకు ఎన్నికైన ప్రసిద్ధ లాయర్ ప్రసాద్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి ఠాకూర్ ప్రసాద్ బీజేపీ పూర్వ రూపం జనసంఘ్ స్థాపక సభ్యుల్లో ఒకరు. ఈ నియోజకవర్గంలో కాయస్థులతోపాటు అగ్రవర్ణాల జనాభా దాదాపు 28 శాతం వరకూ ఉంది. వారిలో బీజేపీకి మద్దతుదారులు ఎక్కువ. కాయçస్థు ఓట్లలో అధిక శాతం ప్రసాద్‌కే పడతాయని అంచనా. ఆర్జేడీతో పొత్తు వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న యాదవుల ఓట్లు, కాయస్థుల ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి సిన్హాకు లభిస్తాయని భావిస్తున్నారు. 2014లో కాయస్థులు చాలా వరకూ బీజేపీ అభ్యర్థి సిన్హాకే ఓటేశారు. ఈసారి ప్రసాద్‌కు ఆ స్థాయిలో ఈ కులస్తుల మద్దతు లభించకపోవచ్చనీ, కాయస్థులు, ఇతర అగ్రకులాల ఓట్లు చీలిపోతాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో (మహాగఠ్‌బంధన్)లో భాగం కావడం వల్ల శత్రుఘ్న నుంచి ప్రసాద్‌కు గట్టి పోటీ తప్పదనీ, సీఎం నితీశ్‌కుమార్ (జేడీయూ) మద్దతు ఉన్నా కూడా.. బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తే తప్ప విజయం దక్కదని కొందరు జోస్యం చెబుతున్నారు. ఓటర్లు : 20,51,905 అసెంబ్లీ సెగ్మెంట్లు : 6 (బక్తియార్పూర్, దీఘా, బంకీపూర్, కుంహ్రార్, పట్నాసాహిబ్, ఫాతుహా.. వీటిలో మొదటి ఐదు సీట్లను 2015 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోగా, ఫాతుహాలో ఆర్జేడీ గెలిచింది). -
ఇద్దరి మధ్య ఉత్కంఠ పోరు
పట్నా: ఇద్దరు రాజకీయ ఉద్దండులు పోటీపడుతుండడంతో బిహార్‌లోని పట్నా సాహీబ్ లోక్‌సభ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఇటీవల బీజేపీని వీడి.. ఈసారి కాంగ్రెస్‌లో చేరి మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ పోటీలో నిలిపింది. స్థానికంగా ఇద్దరూ బలమైన నేతలు కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. అధికార పార్టీలోనే ఉంటూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సిన్హాను ఓడించాలనే వ్యూహంతోనే బీజేపీ అధిష్టానం రవిశంకర్ ప్రసాద్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మరోవైపు తనకు టికెట్ నిరాకరించిన బీజేపీని పట్నా సాహీబ్‌లో ఎలానైనా ఓడించి తీరుతానని షాట్‌గన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా బిహార్‌లో స్థానికంగా బలమైన కాయస్థా వర్గానికి చెందిన నేతలే. ఈనియోజకవర్గంలో 48శాతం అగ్రవర్గాలకు చెందిన ఓట్లు కీలకం కానునున్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 23శాతం ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఈసారి జేడీయూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే దళిత, మైనార్టీ, బీసీ ఓట్లపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. -
డైరీ లీక్స్‌పై బీజేపీ ఎదురుదాడి
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పరస్పర ఆరోపణలు, దూషణల పర్వం తీవ్రస్ధాయికి చేరుకుంది. బీజేపీ అగ్రనేతలకు రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. యడ్యూరప్ప డైరీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్ పత్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మీడియా కథనాల ఆధారంగా కాంగ్రెస్ తమ పార్టీపై బురదజల్లుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. యడ్యూరప్పను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్ధించారు. కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. -
ఐటీలో 8.73 లక్షల ఉద్యోగాలు వచ్చాయ్!
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత ఐదేళ్లలో కొత్తగా 8.73 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 41.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. ‘నేను నా సొంత డేటా బట్టి చెప్పడం లేదు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఉద్యోగాల గణాంకాలపై కాంగ్రెస్ అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నాను‘ అని ఆయన వివరించారు. నిరుద్యోగిత సంక్షోభం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్... తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించగలిగిందో చెప్పాలన్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు పుంజుకోవడంతో.. గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి చెప్పారు. ‘దేశ ఎకానమీ 7.4% పైగా వృద్ధి సాధిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. తయారీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. అలాగే అంతర్జాతీయంగా భారత ఎకానమీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీటన్నింటి ఫలితంగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోంది‘ అన్నారు. -
‘రాహుల్ పాకిస్తాన్నే నమ్ముతారు’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ అవాస్తవాలను ప్రచారంలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత వాయుసేనపై రాహుల్‌కు విశ్వాసం లేదని, ఆయన సుప్రీం కోర్టు, కాగ్‌ను కూడా నమ్మరని..మరి పాకిస్తాన్‌ను మాత్రమే రాహుల్ విశ్వసిస్తారా అని కేంద్ర మంత్రి నిలదీశారు. రఫేల్ పోటీదారులకు అనుకూలంగా రాహుల్ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. కాగా రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రఫేల్ ఒప్పందం పత్రాలు గల్లంతయ్యాయని మీడియాపై మోదీ సర్కార్ ఆరోపణలు గుప్పిస్తోందని, రూ 30,000 కోట్ల రఫేల్ ఒప్పందంలో ప్రమేయం కలిగిన వారిపై మాత్రం విచారణ చేపట్టడం లేదని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ సహా ఈ ఒప్పందంలో భాగమైన వారందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. -
భారత్-పాక్ క్రికెట్‌పై స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని వ్యక్తమవుతున్న డిమాండ్ న్యాయబద్దమైందేనని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ భారత్.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్ ఆడవద్దనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ డిమాండ్ సరైందేనని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘ప్రస్తుతానికి క్రికెట్‌పై నేను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదు. కానీ ఎవరైతే పాక్‌తో ఆడవద్దనే డిమాండ్ చేస్తున్నారో అది మాత్రం న్యాయమైన డిమాండే. పరిస్థితులు అంత సాధారణంగా లేవు. అదొక అంతర్జాతీయ టోర్నమెంట్. ఐసీసీ, మన భారత క్రికెట్ బోర్డు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేనే అయితే పాక్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటాను. ఉగ్రదాడిపై ఇమ్రాన్ ఖాన్ కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు.’ అని రవిశంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. బీసీసీఐ మాత్రం కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక భారత్-పాక్ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. అయితే ఓ బీసీసీఐ సీనియర్ అధికారి మాత్రం ‘ప్రపంచకప్ లీగ్ దశలో ఆడం సరే... అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్ వదిలేసుకుంటామా? నిజానికి కార్గిల్ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా మనం 1999 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడలేదా’ అని ప్రశ్నించారు. -
కోటి ఉద్యోగాల కల్పన
న్యూఢిల్లీ: నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. మొబైల్స్ తయారీని సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019లో నిర్దేశించుకున్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండనున్నాయి. అలాగే, రక్షణ శాఖ, ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలను కూడా తీర్చడంపై దృష్టి సారించాలని ఈ విధానంలో నిర్దేశించుకున్నారు. 2012లో తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం అమల్లోకి వచ్చింది. మరోవైపు, పోంజీ స్కీముల్లాంటి అనియంత్రిత డిపాజిట్ స్కీములను నిషేధించడం కోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గతేడాది జూలైలో ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అటు కంపెనీలు సొంత అవసరాల కోసం తీసుకున్న గనుల (క్యాప్టివ్ మైన్స్) నుంచి ఉత్పత్తి చేసే బొగ్గులో 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటును ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. -
దేశాభివృద్ధికి సలహాలు, సూచనలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రతి పౌరుడు, అన్ని వర్గాల ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మన దేశం అభివృద్ధిలో మరింతగా పురోగమించేందుకు ‘భారత్ కే మన్ కీ భాత్.. మోదీకే సాథ్’పేరిట దేశ పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. వాటన్నింటిని క్రోడీకరించి మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పలు సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవసరమైన అభిప్రాయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా 7 వేల డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు తమ అభిప్రాయాలు రాసి వాటిల్లో వేయాలని, అనంతరం వాటిని తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు 300 ఐటీ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. మిస్డ్ కాల్ ద్వారా కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 6357171717 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. యూపీఏ 11.. ఎన్డీయే 6.. యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక రంగంలో దేశం 11వ స్థానంలో ఉంటే మోదీ ప్రభుత్వం ఆరో స్థానానికి చేరుకుందన్నారు. 30 కోట్ల మందికి పింఛన్లు, 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రూ.6 వేల సాయం వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 మే 26 వరకు దేశంలో 6.2 కోట్ల గ్రామీణ ప్రాంత టాయిలెట్లు నిర్మిస్తే మోదీ హయాంలో 10 కోట్ల టాయిలెట్స్ నిర్మించామన్నారు. దేశ రక్షణ, నల్లధనం విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా బ్యాంకుల ద్వారా రుణాల పేరిట దోచిపెట్టాయని, తమ ప్రభు త్వం బకాయిలను రాబట్టే పనిలో పడిందని వెల్లడించారు. మాల్యాకు చెందిన రూ.13 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపారు. 2019లో ఎన్డీయే 300 స్థానాలను సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. రఫేల్ విషయంలో మోదీ పట్ల రాహుల్ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రఫేల్‌పై కమీషన్లు రావనే.. 2001లో రఫేల్ ఒప్పందం చేసుకున్నా కమీషన్లు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. యూపీఏ కంటే 9 శాతం తక్కువ ధరకు విమానాలను, వెపన్స్ లోడింగ్‌లో 20 శాతం తక్కువ ధరలకే కొనుగోలు చేసిందన్నారు. సుప్రీం కోర్టు కూడా రఫేల్ కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని చెప్పిందన్నారు. ఎకనమిక్ టైమ్స్ కూడా రఫేల్ సీఈవో ఎరిక్‌ను ఇంటర్వూ్య చేసిందని, అందులో యూపీఏ కంటే మోదీ ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేసిందని చెప్పారు. చంద్రబాబు నైజం అదే.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పేరుతో మోదీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు వైఖరి కొత్తేమీ కాదు. పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి గెలవడం. తర్వాత వారిపైనే విమర్శలు చేయడం చంద్రబాబు నైజం. వాజ్‌పేయితోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన అనంతరం చంద్రబాబు వాజ్‌పేయిని ఆశ్రయించి పొత్తు పెట్టుకుని అప్పటి ఎన్నికల్లో గెలిచారు. 2014లో మోదీకి దేశంలో ప్రజాదరణ పెరగ్గానే ఆయన పంచన చేరి ఆనాడు ఎన్నికల్లో గెలిచారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడేమో మోదీపై విమర్శలు చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అది కాంగ్రెస్ ప్రాయోజిత కుట్ర
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని లండన్‌లో సైబర్ భద్రతా నిపుణుడు ఆరోపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రా యోజిత కుట్రలో భాగమని మంగళవారం తిప్పికొట్టింది. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘానికి తలవంపులు తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే సాకులు వెతకడం ప్రారంభించిందని ఎద్దేవా చేసింది. షుజా పాల్గొన్న లండన్ ఈవీఎం హ్యాకథాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి గత ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందిందని సయ్యద్ షుజా అనే నిపుణుడు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. షుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసే, వదంతులు వ్యాపింపజేసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని కోరింది. సిబల్‌కు అక్కడేం పని? కపిల్ సిబల్ ఏ హోదాతో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘సిబల్ అక్కడ ఏం చేస్తున్నారు? ఏ హోదాతో ఆయన అక్కడికి వెళ్లారు? భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన కుట్ర ఇది. అంతా కాంగ్రెస్ రచించిన ప్రణాళిక ప్రకారమే జరిగింది’ అని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతోనే లండన్ కార్యక్రమానికి వెళ్లానన్న సిబల్ వివరణను రవిశంకర్ కొట్టిపారేశారు. ఆ కార్యక్రమానికి హాజరైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియనంత అమాయకుడు సిబల్ కాదని అన్నారు. సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా సైబర్ భద్రతా రంగంలో వస్తున్న మార్పులపై నిత్యం నిపుణులతో మాట్లాడతానని, కానీ తాను సయ్యద్ షుజా అనే పేరును ఎప్పుడూ వినలేదని చెప్పారు. లండన్‌లో జరిగిన ప్రెస్ మీట్ ఒక డ్రామా అని, ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా మీడియా ముందుకు రాకుండానే షుజా పెద్దపెద్ద ఆరోపణలు చేశారని అన్నారు. షుజా మా ఉద్యోగి కాదు: ఈసీఐఎల్ షుజా చెప్పుకున్నట్లుగా ఆయన తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) స్పష్టతనిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను రూపొందించిన ఈసీఐల్ నిపుణుల బృందంలో తానూ ఒకడినని షుజా తెలిపిన సంగతి తెలిసిందే. ఈవీఎంల రూపకల్పనకు షుజాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ సంస్థలో ఉద్యోగి కూడా కాదని ఈసీఐఎల్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్‌కు లేఖ రాసింది. రేడియో ఫ్రీక్వెన్సీతో చొరబడలేం: ఈసీ ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని వాటిని రూపొందించిన నిపుణుల కమిటీ పునరుద్ఘాటించిందని తెలిపింది. ఈవీఎం యంత్రాలు..బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లకు మాత్రమే అనుసంధానమై ఉంటాయని, ఏదైనా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్ మార్గం లో వాటిలోకి చొరబడటం సాధ్యం కాదని నిపుణుల కమిటీని ఉటంకిస్తూ ఈసీ పేర్కొంది. నిర్వాహకుడు కాంగ్రెస్ మనిషి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వయం ప్రకటిత సైబర్ భద్రతా నిపుణుడు షుజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగను రేపాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లండన్‌లో షుజా పాల్గొన్న మీడియా సమావేశం నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ చీఫ్ ఆశిష్ రే కాంగ్రెస్ మనిషని అన్నారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగుడుతున్న రే...కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు వ్యాసాలు రాస్తున్నారని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని తరచూ విమర్శించారని ప్రస్తావించారు. గతంలో లండన్‌లో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై రే స్పందించలేదు. -
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. అధికార బీజేపీ మాత్రం ఓటింగ్ సమయంలో రాజ్యసభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. గురువారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మిత్రుల సంఖ్యతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి తప్పకుండా బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. 2018లో దాదాపు పది పార్టీలు ఈ బిల్లును నేరుగానే వ్యతిరేకించాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపడుతోందని, మరింత మెరుగైన అధ్యయనంకోసం బిల్లును పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముస్లిం మహిళల సమానత్వం, గౌరవం కోసం ఉద్దేశించినదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ముస్లిం కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నదని ఆలిండియా ముస్లిం విమెన్ పర్సనల్ లాబోర్డు అంటోంది. బిల్లుపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించడం వల్ల సమాజంలో అలజడులు చెలరేగే అవకాశముందని విమెన్ పర్సనల్ లాబోర్డు అధ్యక్షురాలు శైస్త్రా అంబర్ చెప్పారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ చేస్తే విడాకులు ఇచ్చిన భర్తకు మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు ఇవే... ►రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా ►టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్) ►నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్సీ) ►తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్,) ►వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) ►ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్) అయితే ఈ ఐపీఓ, ఎఫ్పీఓలు ఈ ఆర్థిక సంవత్సరంలోనా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనా అనే విషయాన్ని రవి శంకర్ ప్రసాద్ వెల్లడించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్‌యూలు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టింగ్‌కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది. -
కామాంధులకు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ఐటీ మంత్రి రవిశంకర్ మీడియాకు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించినట్లు తెలిపారు. ఈ మూడు సవరణలు లైంగికనేరాల నిరోధానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేలా సెక్షన్ 14, 15ను సవరించారు. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► దేశంలోని కొబ్బరి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.7,750 ఉండగా, తాజా పెంపుతో అది రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీంతో దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది. ► ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు–2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
‘బాబర్నేందుకు పూజించాలి..?’
లక్నో : రామ జన్మభూమి వివాదం పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతనంటున్నారు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య వివాదం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఇందుకుగాను నేను సుప్రీం కోర్టును కలిశి.. సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు. శబరిమల ఆలయం కేసులో సుప్రీం కోర్టు చాలా త్వరగా తీర్పు చెప్పింది. మరి 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామ జన్మభూమి కేసు విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. దీనిలో రాముని గురించి ఉంది, కృష్ణుని గురించి ఉంది ఆఖరుకి అక్బర్ గురించి కూడా ఉంది. కానీ బాబర్ గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు మేమేందుకు బాబర్‌ను పూజించాలని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే.. వేరే రకమైన వివాదాలు తలెత్తుతాయన్నారు. -
ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ వేగవంతం
-
కేంద్ర మంత్రులతో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల వనరులు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. తొలుత నితిన్ గడ్కరీని కలసి సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల ప్రాజెక్టులపై చర్చించారు. ఆగస్టు 27న సీఎం కేసీఆర్.. గడ్కరీని కలసి పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు గడ్కరీ వద్ద మరోసారి నివేదించారు. కృష్ణా నదీ జలాలను నది పరీవాహక రాష్ట్రాల మధ్య తిరిగి పంచాలని, ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపేలా కృష్ణా ట్రిబ్యునల్‌కు ప్రతిపాదించాలని కోరారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామసాగర్ ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగా గుర్తించాలని నివేదిం చారు. 154 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–గజ్వేల్– భువనగిరి– చౌటుప్పల్ రహదారి, 180 కి.మీ. పొడవున్న చౌటుప్పల్– యాచారం– షాద్‌నగర్– చేవెళ్ల– శంకర్పల్లి– కంది రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించడం ద్వారా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. జడ్చర్ల– మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్–167 పై 15 కి.మీ. మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారులకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, పలు రహదారులకు అలైన్మెంట్ అనుమతి రావాల్సి ఉందని గుర్తుచేశారు. హైకోర్టు విభజనపై చర్యలు తీసుకోండి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి త్వరితగతిన నోటిఫికేషన్ వెలువడేందుకు చొరవచూపాలని రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. ఈ సమావేశాల్లో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి గెలుపొందిన బాల్క సుమన్ తన ఎంపీ పదవికి చేసిన రాజీనామాను సోమవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్‌పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
‘రాహుల్ శివభక్తుడైతే.. క్షమాపణ చెప్పాలి’
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘూటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తక్షణమే స్పందించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తనను తాను శివభక్తుడిగా చెప్పకుంటారని అన్నారు. కానీ ఆయన పార్టీకి చెందిన నేతలు మహాదేవుని ప్రతిష్టను దెబ్బతిసేలా వ్యవహారిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరో చెప్పారని.. మోదీపై నిందలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప శివభక్తుడిగా చెప్పుకునే రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. శివలింగంపై థరూర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ.. మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారని, ఆయనను చేతితో తొలగించలేరని, చెప్పుతో కొట్టలేరని ఓ ఆరెస్సెస్ నేత ఓ జర్నలిస్టుతో చెప్పినట్టు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారు’ -
‘అక్బర్’పై స్పందించని కేంద్రం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎంజే అక్బర్ గతంలో పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేస్తున్న కాలంలో తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా విలేకరులు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అక్బర్‌పై ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టుల సంఖ్య తాజాగా ఎనిమిదికి పెరిగింది. అయినా అటు ఎంజే అక్బర్ కానీ, ఇటు కేంద్ర మంత్రులు లేదా అధికార బీజేపీ ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై తమ స్పందనను కూడా తెలియజేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరిస్తుండగా విలేకరులు అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు రవి శంకర్ కూడా నిరాకరించారు. ఈ ఆరోపణలు అక్బర్ మంత్రి పదవిలో ఉన్న కాలానికి సంబంధించినవి కాదు కాబట్టి అధికారికంగా స్పందించకూడదని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై మీడియాతో మాట్లాడకూడదని బీజేపీ తన అధికార ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది. రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పలువురికి స్ఫూర్తినిచ్చే స్థానంలో ఉన్న సుష్మ, తన జూనియర్ మంత్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పేర్కొంది. ‘తనపై వచ్చిన ఆరోపణలపై అక్బర్ సంతృప్తికరమైన వివరణ అయినా ఇవ్వాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రాఫెల్ వివాదం : రాహుల్‌కు కేంద్రమంత్రి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్టీ ప్రెసిడెంట్ దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి పదాలను ఉపయోగించడం ఇంతకుముందెన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ కుటుంబ చరిత్ర తప్ప రాహుల్‌గాంధీకి ఎలాంటి అర్హత లేదని మండిపడ్డారు. రాహుల్ నుంచి ఇంతకంటే మనం ఏమీ ఆశించలేమంటూ ఎద్దేవా చేశారు. ఈ భాగస్వామ్యం డసాల్ట్ ఏవియేషన్‌కు, రిలయన్స్‌కు మధ్య జరిగిన డీల్ అని తేల్చి చెప్పారు. అలాగే ఒప్పందానికి సంబంధించి డసాల్ట్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య స్పష్టమైన ఎంవోయూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రాఫెల్ డీల్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. రాహుల్ గాంధీ టీంకు పెద్ద భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతికి పాల్పడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని మండిపడ్డారు. అనేక స్కాంల కారణంగా పలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, మాజీ ప్రధాని మన్మోహన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశ ఆయుధ వ్యవస్థ గురించి సమాచారాన్ని వెల్లడించడం ద్వారా శత్రువులను అప్రమత్తం చేయాలని ఆయన కోరుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ఈ వివరాలను బహిర్గతం చేయడం ద్వారా పాకిస్తాన్‌తో చేతులు కలుపుతున్నారంటూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు రాఫెల్ డీల్ పై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని భాగస్వామిగా ఎంపికచేయడంతో ప్రభుత్వ పాత్ర ఏదీ లేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మాజీ ఫ్రాన్స్ అధ్యక్షుడి మాటలపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇది డసాల్ట్‌కు రిలయన్స్ డిఫెన్స్‌కు మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
సమాచార దుర్వినియోగాన్ని సహించం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో సమాచార దుర్వినియోగాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం కలిగించే ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. అర్జెంటీనాలోని సలాట నగరంలో జరిగిన జీ–20 డిజిటల్ ఎకానమీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో అసలు రాజీ పడమని, ఒకవేళ ఎవరైనా విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డిజిటల్ మీడి యా ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర రంగాలకు మళ్లించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ సైబర్ ప్రపంచంలో మెరుగైన భద్రతతో కూడిన సేవలు అందించినప్పడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు లాభం చేకూరుతుందని రవిశంకర్ తెలిపారు. సైబర్ మాధ్యమాల ద్వారా విస్తరిస్తున్న తప్పుడు వార్తలను అరికట్టేందుకు అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. -
ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
-
ఆమోదించండి
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. మూడ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన సీఎం శుక్రవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుత జోనల్ విధానం వల్ల ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించలేకపోతున్నామని, అందుకే కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని కేంద్రమంత్రికి వివరించారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు 95 శాతం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ తన ప్రక్రియను వేగవంతం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కోరారు. సత్వరమే హైకోర్టును విభజించండి హైకోర్టు విభజనకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌ను కేసీఆర్ కోరినట్టు తెలిసింది. ఏపీ హైకోర్టును ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో కేంద్రానికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే హైకోర్టు విభజనపై తమ ప్రక్రియ పూర్తయిందని, ఏపీ ప్రభుత్వమేనూతన హైకోర్టు నిర్మించి వర్తమానం పంపాల్సి ఉందని కేంద్రమంత్రి సీఎంతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వమే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి హైకోర్టు విభజనలో వేగం పెంచేలా చూడాలని సీఎం కోరారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై చేసిన తీర్మానాలు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సీఎం కేసీఆర్.. రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ అసెంబ్లీ సీట్ల పెంపుపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపునకు అవసరమైన చట్ట సవరణ ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోందని కేంద్ర హోంశాఖ ఇటీవల ఎంపీ వినోద్ కుమార్‌కు ప్రత్యుత్తరం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్–170ని సవరించనంత వరకు సీట్ల పెంపు కుదరదని, అయితే విభజన చట్టంలోని సెక్షన్–26ను అమలు చేసేందుకు వీలుగా 170(3)ని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రెండో షెడ్యూల్‌ను సవరించేందుకు అవసరమైన ముసాయిదా కేబినెట్ నోట్ తయారు చేసి న్యాయశాఖకు పంపామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చట్ట సవరణపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది? అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పట్లోగా పూర్తి కావొచ్చు? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కూడా సమావేశానికి పిలిపించిన రవిశంకర్ ప్రసాద్ సీట్ల పెంపునకు అవసరమైన చట్ట సవరణపై ప్రస్తుత పరిస్థితిని కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. కేంద్రమంత్రిని కలసిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రధానితో సమావేశం ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణానికి అవసరమైన రక్షణ శాఖ భూమి బదలాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన రాజ్యాంగ సవరణ, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. -
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో కేసీఆర్ భేటీ
-
‘డేటా రక్షణ’ ముసాయిదా సిద్ధం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో వ్యక్తిగత సమాచార భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తుల హక్కులు, నియమాల ఉల్లంఘనకు విధించాల్సిన పెనాల్టీలు తదితర అంశాలను పొందుపరిచింది. ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు – 2018’ ముసాయిదాలో సున్నితమైన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ చేసేటపుడు సదరు వ్యక్తి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించింది. శుక్రవారం ఈ కమిటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు నివేదికను అందజేసింది. డేటా రక్షణ నిబంధనల ఉల్లంఘన జరిగితే విధించాల్సిన జరిమానా వివరాలనూ ముసాయిదాలో పొందుపరిచింది. దీని ప్రకారం.. డేటా ప్రాసెసింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 15కోట్ల జరిమానా లేదా ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 4% జరిమానా చెల్లించాల్సిందేనని పేర్కొంది. డేటా రక్షణ ఉల్లంఘనపై చర్య తీసుకోవడంలో విఫలమైతే రూ.5 కోట్ల జరిమానా లేదా డేటా సేకరణ సంస్థల టర్నోవర్‌లో 2% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇది ఒక చారిత్రక చట్టం. దీనిపై విస్తృతమైన చర్చ జరగాలని అనుకుంటున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా భారత సమాచార రక్షణ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం’ అని రవిశంకర్ చెప్పారు. -
ఫేస్బుక్ డేటా దుర్వినియోగంపై విచారణ
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాకు నోటీసులు జారీచేయగా, డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ బదులిచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళల సాధికారతకు కొత్త పథకం ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్ పేర్కొన్నారు. -
జడ్జీల వయోపరిమితి పెంపు లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచే యోచన లేదని న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయోపరిమితిని రెండేళ్ల చొప్పున పెంచేందుకు ప్రభుత్వం బిల్లు రూపొందిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌కు ప్రమోషన్ రాకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లకు పెంచుతోందంటూ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ట్విట్టర్లో అంతకు కొద్దిసేపటి ముందే ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీం, హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులు వరుసగా 65, 62 ఏళ్లు. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంచుతూ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం బిల్లు రూపొందించి, లోక్‌సభలో కూడా ప్రవేశపెట్టింది. అయితే, చర్చ జరగలేదు. అనంతరం 2014లో లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లు కాలపరిమితి ముగిసిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 జడ్జీలకు గాను 22 మంది.. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 673 మందే ఉన్నారు. -
వంద కోట్ల సార్లు ప్రయత్నించినా.. చేయలేరు!
పనాజీ : ఆధార్ బయోమెట్రిక్ డేటా భద్రతపై ఎవరెన్ని అనుమానాలు సృష్టించినా.. ప్రభుత్వం మాత్రం వివరణ ఇస్తూనే ఉంది. ఈసారి కాస్త ఘాటుగానే క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ఆధార్ డేటాను దొంగలించడానికి, హ్యాక్ చేయడానికి వంద కోట్ల సార్లు ప్రయత్నించినా... దాన్ని మాత్రం హ్యాక్ చేయలేరని ఆధార్ డేటా భద్రతపై వస్తున్న రూమర్లన్నింటిన్నీ కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. డేటా స్టోరేజ్ సిస్టమ్ పూర్తి భద్రంగా, సురక్షితంగా ఉందని మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ సిస్టమ్‌లో చాలా మంది ఫింగర్ప్రింట్లు, ఐరిస్ స్కాన్లు ఉన్నాయని, వాటిని తాము ఎంతో భద్రంగా, సురక్షితమైన పరిస్థితుల్లో ఉంచామని తెలిపారు. వీటిని హ్యాక్ చేయడానికి వందల కోట్ల సార్లు ప్రయత్నించినా.. ఏ మాత్రం లీక్ కాదని, హ్యాక్ చేయలేరని పనాజీలో జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్లో స్పష్టం చేశారు. ప్రతి సెకన్‌కు సుమారు కోటి మంది ధృవీకరణలను ఆధార్ అథారిటీలు చేపడుతున్నాయని చెప్పారు. ‘ప్రతి మూడు సెకన్లకు ఎంతమంది ధృవీకరణలు జరుగుతున్నాయో మీకు తెలుసా? మూడు కోట్లు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఆధార్‌కు లింక్ అవుతున్నాయో తెలుసా? 80 కోట్ల అకౌంట్లు. ఆధార్ అనేది దేశీయ టెక్నాలజీ. పూర్తిగా భద్రంగా, సురక్షితంగా ఉంటుంది.’ అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత్‌ను మరింత డిజిటల్‌గా రూపాంతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భారత్‌లో 130 కోట్ల మంది జనాభా ఉంటే, వారిలో 121 కోట్ల మంది మొబైల్ ఫోన్లున్నాయని, 450 మిలియన్ మందికి స్మార్ట్ఫోన్లు, 50 కోట్లకు పైగా మంది ఇంటర్నెట్ కనెక్షన్లు, 122 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయని.. ఇదీ భారత్ డిజిటల్ ప్రొఫైల్ అని చెప్పారు. ‘మనం పారిశ్రామిక విప్లవాన్ని, వ్యవస్థాపక విప్లవాన్ని మిస్ అయ్యాం. లైసెన్స్ క్వోటా రాజ్ కింద అవన్నీ 1960, 70ల్లో జరిగాయి. కానీ మనం డిజిటల్ విప్లవాన్ని చేజార్చుకోవద్దు. మనం కూడా అధినేతలుగా నిలువాలి. ఇదే డిజిటల్ ఇండియా ఫిలాసఫీ’ అని ఉద్ఘాటించారు. -
మూక దాడులకు ఇదా విరుగుడు?
సామాజిక మాధ్యమాలే వాహికలుగా వదంతులు చెలరేగి ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాలపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదిలింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది వినియోగదారులున్న భారత్‌లో భద్రతకు సంబంధించిన అంశాలపై వాట్సాప్ సంస్థ శ్రద్ధ పెట్టడం ముఖ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. అంతే కాదు... పోలీసు, న్యాయ విభాగాలతో అది కలిసి పనిచేయాలని కోరారు. ఆ సంస్థ కూడా వెను వెంటనే స్పందించి కొన్ని సాంకేతిక పద్ధతుల్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వాట్సాప్‌లో ప్రచారమయ్యే వార్తల్లోని నిజానిజాలు తనిఖీ చేయడం, కొన్ని నియంత్రణలు పెట్టడం, డిజిటల్ లిటరసీని పెంచడం వంటి చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పింది. వీటితోపాటు విచారణ సంస్థల వినతులకు అనుగుణంగా పూర్తి వివరాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆటవిక యుగాన్ని తలపించేలా పదులకొద్దీమంది వ్యక్తులపై దాడులు చేయటం, నెత్తురోడేలా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం, ప్రాణాలు తీయడం సర్వసాధారణమైంది. ఒక నివేదిక ప్రకారం నిరుడు మే నెలతో మొదలుపెట్టి ఇంతవరకూ 9 రాష్ట్రాల్లో 27మందిని మూకలు కొట్టి చంపాయి. ఇటీవల ఒక చోట అయితే తీవ్ర గాయాలతో మరణించినవారి మృత దేహాలను అక్కడికక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ఒక గుంపు ప్రయత్నించింది. ఈ భయంకర ఘటనల పరంపర చూస్తున్నవారెవరికైనా కేంద్ర ప్రభుత్వం చేసిన వినతి, అందుకు వాట్సాప్ సంస్థ స్పందించిన తీరు ఉపశమనం కలిగిస్తుంది. ఇకపై ఈ ఆటవిక ఉదంతాలు ఆగిపోతాయన్న ఆశ కలుగుతుంది. అయితే ఈ వదంతుల మూలాల్లోకి వెళ్లి కారకులెవరో, వారికున్న ప్రయోజనాలేమిటో కూపీ లాగి చర్యలు తీసుకోవడం వల్ల ఇంతకన్నా మెరుగైన ఫలితం వస్తుంది. అంతేతప్ప సామాజిక మాధ్య మంపై నిఘా మొదలుపెడితే అది దేనికి దారితీస్తుందో వేరే చెప్పనవసరం లేదు. వివిధ అంశాలపై న్యాయమైన, సహేతుకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని నియంత్రించేందుకు ప్రభు త్వాలు పూనుకుంటాయి. భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతుంది. వదంతుల వ్యాప్తి వాట్సాప్‌తోనే మొదలుకాలేదు. మన దేశంలో ఫోన్ సౌకర్యం కూడా సరిగా లేనప్పుడు కూడా వదంతులు రాజ్యమేలాయి. దేశ చరిత్రలో రుధిరాధ్యాయాలుగా నమోదైన అనేక ఉదంతాలు గుర్తుకు తెచ్చుకుంటే ఈ సంగతి ధ్రువపడుతుంది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్న దేశ విభజన సమయంలో అన్య మతస్తులపై ఇక్కడా, పాకిస్తాన్‌లోనూ ఎంతటి దారుణ ఉదంతాలు చోటుచేసుకున్నాయో విన్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇరుపక్కలా వందలాదిమంది చనిపోయారు. వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో తరలిపోయాయి. ఈ భావో ద్వేగాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే... మహాత్మా గాంధీని దుండగులు పొట్టనబెట్టుకున్నప్పుడు ఆ దుండగుల కులాన్ని కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రసారం చేయించవలసి వచ్చింది. లేదంటే అనవసర అపోహలు వ్యాపిస్తాయని ఆందోళనపడింది. 1983నాటి అస్సాం లోని నెల్లీ మారణకాండ, ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో ఢిల్లీలో మూడురోజులపాటు సాగిన సిక్కుల ఊచకోత, 2002నాటి గుజరాత్ నరమేథం వగైరాలన్నీ కేవలం వదంతుల పర్యవసానంగా పుట్టుకొచ్చి విస్తరించినవే. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు దురుద్దేశంతో వదంతుల్ని ప్రచారంలో పెట్టడం వల్లే ఇవన్నీ జరిగాయి. వ్యక్తుల ప్రమేయం లేకుండా, ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఇవి వ్యాపిస్తున్నాయనుకుంటే అది తెలివితక్కువతనం. ఆవేశం ముదిరి, అది ఉన్మాద స్థాయికి చేరుకుని చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడే వ్యక్తుల సమూహాన్ని గుంపు అంటారని నిఘంటువులు చెబుతాయి. కానీ అందులో వ్యక్తులుంటారు. వారిని ప్రేరేపించినవారుంటారు. ప్రభుత్వాలు చురుగ్గా కదిలితే బాధ్యుల్ని పట్టుకోవటం కష్టం కాదు. దేశంలో గత మూడు నాలుగేళ్లుగా గోరక్షణ పేరుతో మూకలు రెచ్చిపోయాయి. పశువుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, పశు మాంసాన్ని దగ్గరుంచుకున్నారని ఆరోపించి ఎందరిపైనో దాడులకు దిగాయి. ఇందులో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని ఉనాలో తగిన పత్రాలతో పశువుల్ని తీసుకెళ్తున్న అయిదారుగురు యువకుల్ని చేతులు విరిచికట్టి బహిరంగంగా కొట్టడం దృశ్య సహితంగా ప్రచారంలోకొచ్చింది. ఇవి ఇంకా ఆగాయో లేదో చెప్పలేంగానీ... ఈలోగా ‘పిల్లల అపహరణ’ సీజన్ మొదలైపోయింది. వీటిని నియంత్రించడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసి 24 గంటలు గడవక ముందే అస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో శుక్రవారం రైలు దిగిన ముగ్గురు కాషాయాంబరధారులను వందలమంది చుట్టుముట్టి వారి చేతులు కట్టి దౌర్జన్యం చేస్తుండగా దగ్గరలోని సైనిక జవాన్లు, పోలీసులు అడ్డు పడ్డారు. వారు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ ముగ్గురినీ గుంపు కొట్టి చంపేది. దేశాన్ని అప్ర దిష్టపాలు చేస్తున్న మూక దాడులకు అడ్డుకట్ట వేయాల్సిందే. కానీ నిర్దిష్టమైన ఘటనలో కాల్ రికార్డులు తనిఖీ చేసి నేర నిర్ధారణను రుజువు చేయడానికి ప్రయత్నించడం వేరు. మొత్తంగా పౌరులందరి ఫోన్ సంభాషణలపై టోకున నిఘా పెట్టడం వేరు. ప్రభుత్వం తన అధీనంలోని సంస్థలన్నిటినీ, వాటి సమస్త వనరుల్నీ వినియోగించుకుని నేరగాళ్ల ఆచూకీ పట్టాలి. కానీ ఆ పేరిట మాధ్యమాలను నియంత్రించడం మొదలుపెడితే అది త్వరలోనే దుర్వినియోగ మయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. -
‘కాంగ్రెస్ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో సైనిక, పారా మిలటరీ దళాలు ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా చంపుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని విడదీయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తారిఖ్ హమీద్ వంటి పాకిస్తానీ వకాల్తాదార్లను పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని వాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తారిఖ్ హమీద్‌ను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆజాద్, సోజ్‌లతో పాటు ప్రస్తుతం మరో పాకిస్తానీ ప్రతినిధి(వకాల్తాదారు) హమీద్‌కు కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం లభించింది. పాకిస్తానీ భాష మాట్లాడే మిస్టర్ హమీద్ కర్రా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ’ బీజేపీ ట్వీట్ చేసింది. Azad and Soz are not exceptions, another Pakistan proxy finds his rightful place in the Congress party! Mr Tariq Hameed Karra, who is known for speaking the language of Pakistan, recently joined the Congress in the presence of Smt. Sonia and Rahul Gandhi. #CongLeTGathbandhan pic.twitter.com/sMVu3bbmXN — BJP (@BJP4India) June 22, 2018 -
నిబంధనల మేరకే సీజేఐ ఎంపిక
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు. 121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. -
బీపీవో స్కీమ్‌కు మరింత ఊతం
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యాలయాలు ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో స్కీమ్‌ను మరింతగా విస్తరించనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడే ఈ స్కీమ్ పరిధిని ఒక లక్ష సీట్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ పరిమితి 48,000 సీట్లుగా ఉంది. తాజాగా బీపీవో సంస్థల రాకతో గయా, గాజీపూర్ వంటి చిన్న పట్టణాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరగగలవని మంత్రి వివరించారు. మరోవైపు, దేశంలోనే అతి పెద్ద జాతీయ డేటా సెంటర్‌ను భోపాల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 5 లక్షల వర్చువల్ సర్వర్స్ సామర్థ్యంతో ఇది ఉంటుందని వివరించారు. ప్రభుత్వ వెబ్సైట్లు, సర్వీసులు, యాప్స్ మొదలైన వాటన్నింటినీ నిర్వహించేందుకు ప్రస్తుతం హైదరాబాద్, పుణె, ఢిల్లీ, భువనేశ్వర్‌లో మొత్తం 4 జాతీయ డేటా సెంటర్స్ ఉన్నాయి. -
‘మూడో ఫ్రంట్’ పునరావృతం కాదు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. ఎలాంటి మూడో, నాలుగో కూటమికీ బీజేపీ అధికారికంగానూ, అనధికారికంగానూ ఏ విధంగా కూడా సలహాదారు కాదని స్పష్టం చేశారు. 1990ల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్ నేతృత్వంలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడిన ఘటనలు 2019లో పునరావృతం కాబోవని ధీమా వెలిబుచ్చారు. విపక్ష పార్టీలతో అతుకుల బొంతగా ఏర్పడే కూటములు ఎక్కువ రోజులు నిలవబోవన్నారు. బీజేపీ వంటిæ బలమైన పార్టీ నేతృత్వంలోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2019లో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని నిలుపుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాధించిన పురోగతి, విజయాలను గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారీగా భూములు మింగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టులు ఆచరణలో సాధ్యం కావని, అందుకే దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా వాటిని పక్కన పెట్టామని చెప్పారు. ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకు వస్తే పరిశీలిస్తామన్నారు. ‘‘ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయిస్తేనే హైకోర్టు విభజన ప్రక్రియ సాధ్యమవుతుంది. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యేదాకా హైకోర్టు విభజన జరపరాదని ఆ రాష్ట్ర సీఎం హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’అని చెప్పారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటములకు బీజేపీ ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కుంభకోణాలకు గత ప్రభుత్వమే కారణం’’అని ఆరోపించారు. తాజాగా బయటపడిన ఎయిర్ ఏషియా కుంభకోణమూ గత ప్రభుత్వ హయాంలో జరిగిందేనన్నారు. తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర కీలకం కానుందని జోస్యం చెప్పారు. ‘‘జాతీయ వృద్ధి రేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి అభివృద్ధికి సూచికలు నాలుగేళ్లలో బాగా పెరిగాయి. పారదర్శకతతో అవినీతిని అడ్డుకున్నాం. భారీగా రహదారులను విస్తరిస్తున్నాం. ఉజ్వల యోజన పథకాల, అటల్ యోజన, ప్రధాని జీవన్ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు తెచ్చాం. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర పథకాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. నాలుగేళ్లలో 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చాయి’’అని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలయ్యేదాకా పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రించిందన్న విమర్శలు అవాస్తవమన్నారు. దేశ గతిని మార్చిన మోదీ అన్ని విషయాల్లో ప్రపంచం ప్రాధాన్యమిచ్చేలా దేశ గతిని ప్రధాని నరేంద్ర మోదీ మార్చేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. మోదీని విజ్ఞుడైన ప్రపంచ నేతగా, భారత్‌ను ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నారని, ఇది భవిష్యత్తులో మన దేశం వేగంగా పురోగమించేందుకు సహకరిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే లబ్ధిదారుకు కేవలం 15 పైసలే చేరేవని.. ఇప్పుడు లబ్ధిదారు ఖాతాలో కేంద్రం రూ.వేయి జమ చేస్తే రూ.వేయి చేరుతోందన్నారు. ప్రస్తుత కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తోంది భారతే.. ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం భారతేనని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 2014లో మన దేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 120కి పెరిగిందని వెల్లడించారు. అన్ని దేశాలు భారత్‌తో మైత్రిని కోరుకుంటున్నాయని, దాన్ని నిలబెట్టుకుంటూ వాటితో మన దేశం స్నేహంగా మెలుగుతోందన్నారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో పాకిస్తాన్ బెదిరిపోతోందని చెప్పారు. మోదీ నిజాయితీకిదే నిదర్శనం.. 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా, నాలుగేళ్లు దేశ ప్రధానిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మోదీ కుటుంబ సభ్యులు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి సాధారణ జీవితాలను గడుపుతున్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది ఆయన నిజాయితీకి నిదర్శమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆ అవినీతే మందు పాతరలాగా పేలుతోంది..
సాక్షి, హైదరాబాద్ : అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి ఇపుడు మందు పాతరలాగా పేలుతోందని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాక్యానించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీల రూ.10వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని క్షత్రియ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు అంశాలు చెప్పారు. ప్రభుత్వం వచిన కొత్తలో 24 గంటలు 7 రోజులు పని చేయాలన్నారు. ఆదివారం కూడా సోమవారం లాగా తీసుకోవాలన్నారు. అన్నీ రూరల్ ఏరియాల పర్యటన చేయాలనీ సూచించారు. వ్యవస్థలో గుమస్తాలు శాశ్వతం. మంత్రులు, కలెక్టర్, న్యాయమూర్తులలో మారిన వాళ్లు మారారు. మోదీ కుటుంబము అంతా సామాన్యులే. ఇప్పటికి 14 ఏళ్లు సీఎం, 4 ఏళ్లు ప్రధానిగా మోది పని చేశారు. మోది గ్లోబల్ లీడర్. కామన్వెల్త్ సమావేశానికి గత 14 ఏళ్లుగా ఇండియా ప్రదాని వెళ్లలేదు. మోదీ వెళ్లారు. ఇండియా ప్రధాని మోది అభిప్రాయం తీసుకోండి అని పారిస్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పార’ ని వెల్లడించారు. @పాకిస్తాన్ ఎంతో భయపడుతోంది. మోది ఏం చేస్తున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సర్జికల్ స్ట్రైక్‌లో ఒక్క జవాన్ కూడా గాయపడలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 50 మంది చనిపోయారు. కొరియా వాళ్లు ఇండియాతో మాట్లాడటానికి సిద్దంగా ఉన్నారు. 17 వేల కంపెనీలు రూ.35 వేల కోట్ల టాక్స్‌లు చెల్లించాయి. 2014 వరకు ఇండియాలో రెండు మొబైల్ తయారీ కంపెనీలు ఉండేవి. బీజేపీ హయాంలో 120 మొబైల్ తయారీ కంపెనీలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దేశంలో 45 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇవి కంప్యూటర్‌తో సమానం. దేశ జనాభా ఎంత ఉందో అన్ని మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలకు 31 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఇచ్చాము. అన్నీ సబ్సిడీలు బ్యాంకు అకౌంట్ ద్వారా సుమారు రూ.90వేల కోట్ల సబ్సిడీ ఇచ్చాం. కేంద్రం 1000 రూపాయలు అకౌంట్లో వేస్తే 1000 వినియోగదారునికి అందుతున్నాయి. కాంగ్రెస్‌లో రూపాయి ఇస్తే 15 పైసాలు అందేవ’ ని వ్యాఖ్యానించారు. -
ఏడాదిలో ఎన్ఐసీ 800 కొలువులు
భువనేశ్వర్: వచ్చే ఏడాది కాలంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) 800 మంది నిపుణులను నియమించుకోనుంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు 355 మంది వరకు ఉంటారని సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్ ముప్పు పెరిగిపోవడంతో డేటా భద్రత కీలకంగా మారిపోయిందని పేర్కొంది. ఎన్ఐసీ భువనేశ్వర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లౌడ్ ఆధారిత నేషనల్ డేటా సెంటర్‌ను ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభిం చారు. ఢిల్లీ, హైదరాబాద్, పుణే తర్వాత భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన నాలుగవ కేంద్రమిది. ఎన్ఐసీ ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 10,000 వెబ్సైట్ల నిర్వహణ చూస్తోంది. దేశవ్యాప్తంగా 4,500 మంది పనిచేస్తున్నారు. కంప్యూటింగ్, స్టోరేజీకి డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగిపోయిందని ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా పాల్గొన్నారు. -
మోదీపై విశ్వాసం వల్లే...
సాక్షి, బెంగళూరు : ఈరోజు(మంగళవారం) వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతూ విజయానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటక ఫలితాలు మోదీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పార్టీ కార్యకర్తల కఠోర శ్రమ ఫలించిందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. వారు మా(బీజేపీ)పై ఉంచిన నమ్మకానికి నమ్మకానికి బదులుగా నిజాయితీతో కూడిన పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. -
ఈ ఏడాది ఐటీలో లక్ష ఉద్యోగాలు!!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ ఈ ఏడాది 8 శాతం వృద్ధితో 167 బిలియన్ డాలర్లకు చేరొచ్చని, లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించొచ్చని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ‘నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ నన్ను కలిశారు. దేశీ ఐటీ రంగానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించుకున్నాం. పరిశ్రమ 2018లో 8 శాతం వృద్ధితో 167 బిలియన్ డాలర్లకు చేరొచ్చని, ప్రత్యక్షంగా 39.7 లక్షల మందికి ఉపాధి లభించొచ్చని (గతేడాది పోలిస్తే అదనంగా 1,05,000 మందికి) ఆమె నాతో చెప్పారు’ అని మంత్రి ట్వీట్ చేశా రు. కాగా మరొక కార్యక్రమంలో పాల్గొన్న దేవయాని ఘోష్.. ఇండియా–యూకే టెక్ రాకెట్‌షిప్ అవార్డ్స్ 4వ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ఇందులోని విజేతలకు లండన్ టెక్ వీక్‌లో పాల్గొనేందుకు ఒకవారం యూకేకు వెళ్లేందుకు స్పాన్సర్షిప్ లభిస్తుంది. -
2020 వరకు ‘కృషి ఉన్నతి’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ గతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని 2020 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,269 కోట్ల నిధులను తన వాటాగా కేంద్రం కేటాయించనుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత కూడా.. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి పర్యవేక్షణ సులభమైందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ), సబ్–మిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ (ఎస్ఎంఏఈ) తదితర వ్యవసాయ రంగానికి చెందిన 11 పథకాలను కేంద్రం గతేడాది ఒకే గొడుగు కిందకు తెచ్చి హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం విదితమే. పెట్టుబడి పరిమితి రెండింతలు వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గురువారమే (మే 3) చివరి తేదీగా ఉండగా, ఆ గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ఇప్పటివరకు వృద్ధులు గరిష్టంగా రూ. 7.5 లక్షలను మాత్రమే పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో ఆ పరిమితి రూ.15 లక్షలకు పెరిగింది. పీఎంవీవీవైలో పెట్టుబడి పెట్టిన వృద్ధులకు వారి పెట్టుబడిపై ఏడాదికి 8 శాతం రాబడి పదేళ్లపాటు వస్తుంది. ఆ మొత్తాన్ని ప్రతినెలా లేదా మూడు లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వృద్ధులు తీసుకునే వెసులుబాటు ఉంది. పరిమితి పెంచడంతో ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన వృద్ధులు నెలకు రూ.10 వేల పింఛనును పదేళ్లపాటు పొందొచ్చని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,540 కోట్లను (మొత్తం బకాయిల్లో 10%) రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని నిర్ణయించారు. ► చెన్నై, లక్నో, గువాహటి నగరాల్లోని విమా నాశ్రయాల్లో రూ.5,082 కోట్ల వ్యయంతో కొత్త టర్మినళ్ల నిర్మాణానికి అంగీకారం. ► ఖనిజ రంగంలో సంస్కరణలకోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)ను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. ► ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019–20 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఎంఎస్‌డీపీ ఇక పీఎంజీవీకే బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ–మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పేరు మార్చి, పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్డీపీకి ‘ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) అనే కొత్త పేరు ను ఖరారు చేసింది. మైనారిటీలకు మ రింత మెరుగైన సామాజిక–ఆర్థిక మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఈ పథకం పరిధిని విస్తరించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. -
ఇందిరా హయాంలో జరిగిన ఘటనలు మరిచిపోయారా?
-
‘మన్మోహన్జీ.. మోదీతో పోల్చుకోకండి’
సాక్షి, న్యూఢిల్లీ : కథువా, ఉన్నావ్ ఉదంతాల నేపథ్యంలో శాంతిభద్రతల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపాలన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను ప్రధాని తీవ్రంగా ఖండించారని, ఇవి జాతికి సిగ్గుచేటని, అమానవీయ ఘటనలని అభివర్ణించారని ఆ పార్టీ స్పష్టం చేసింది. ప్రధాని ఏ అంశంపైనైనా ధృడంగా చెబుతారని, చర్యలు చేపడతారని.. మోదీ పాలనను దయచేసి మీ హయాంతో పోల్చుకోవద్దని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తనను తరచూ మాట్లాడాలని సలహా ఇస్తుంటారని.. అయితే ఇప్పుడు తాను ఆయనకు ఈ సలహా ఇస్తున్నానని, ఇటీవల వెలుగుచూసిన శాంతిభద్రతల అంశాలపై మోదీ నోరువిప్పాలని మన్మోహన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మౌనం దాల్చితే తామెలాంటి పనిచేసినా ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకోవచ్చని ప్రజల్లో సంకేతాలు వెళతాయని అన్నారు. శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలు, దళితులు, మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేయాలని మన్మోహన్ డిమాండ్ చేశారు. -
సీజేఐని కలవనున్న న్యాయశాఖ మంత్రి!
న్యూఢిల్లీ: కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య పలు అంశాలపై విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ త్వరలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై న్యాయశాఖ ఇప్పటికే ఓ నోట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్ కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలకు ప్రమోషన్ కల్పించటం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జిల్లా కోర్టు జడ్జి భట్‌కు హైకోర్టు జస్టిస్‌గా పదోన్నతి వివాదం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
ఆధార్ లింక్‌పై ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు : ఆధార్‌ను ఓటర్ ఐడీతో అనుసంధానం చేయడంపై కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డులను ఓటర్ ఐడీలతో లింక్ చేయడాన్ని తాను వ్యక్తిగతంగా సమర్థించనని వ్యాఖ్యానించారు. ఈ రెండు వేర్వేరు అవసరాలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ‘ఐటీ మంత్రిగా నేను ఇది చెప్పడం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆధార్‌ను ఓటర్ ఐడీ కార్డుతో లింక్ చేయకూడదు’ అని ప్రసాద్ అన్నారు. అయితే ప్రజల గూఢాచార్య ఆరోపణలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఒకవేళ తాము అలా చేయదలిస్తే.. మనం ఏం తింటున్నాం, మనం ఏం సినిమా చూస్తున్నాం అనే అన్ని విషయాలు ప్రధాని మోదీ ట్యాప్ చేసే అవకాశాలున్నాయని, ఇలా జరగాలని తాను కోరుకోవడం లేదని మంత్రి చెప్పారు. మీ ఈపీఐసీ కార్డు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్‌కు లింక్ అయి ఉంటుంది. దీనిలో ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన డేటా పోలింగ్ బూత్ వివరాలు, అడ్రస్‌లు మాత్రమే ఉంటాయి. కానీ ఆధార్ దానికి సంబంధించి కాదని మంత్రి అన్నారు. అయితే బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని మాత్రం ఆయన గట్టిగా సమర్థిస్తున్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడంలో పారదర్శకతను చూడవచ్చని చెప్పారు. ఆధార్ ఆఫ్ మోదీకి, ఆధార్ ఆఫ్ మన్మోహన్ సింగ్‌కు మధ్య చాలా తేడా ఉందని ఆయన ఎత్తి చూపారు. మోదీ ఆధార్‌కు చట్టం సపోర్టు ఉంటే, సింగ్ ఆధార్‌కు ఎలాంటి చట్టం సపోర్టు లేదన్నారు. కేంద్ర జామ్(జన్ ధన్, ఆధార్, మొబైల్ నెంబర్లు) పథకం కింద 80 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు బ్యాంకు అకౌంట్లతో లింక్ అయినట్టు మంత్రి చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చిస్తే, వారి దగ్గరికి 15 పైసలే చేరుకుంటున్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఈ మొత్తాన్ని డైరెక్ట్‌గా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమచేస్తున్నట్టు చెప్పారు. అనధికారికంగా యూజర్ల డేటాను వాడితే ప్రభుత్వం అసలు ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. -
హిట్లర్‌కు గోబెల్స్.. మోదీకి ఆయనే!
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ను కుదిపేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ వినియోగదారులు సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు అపఖ్యాతి ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, జీఎస్టీని ఉద్దేశించి ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ కామెంట్ వెనుక ఉన్నది ఆ సంస్థేనని కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను కాంగ్రెస్ పార్టీ పొందిందని విమర్శించారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే విషయంలో హిట్లర్‌కు గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని, ఇప్పుడు ప్రధాని మోదీకి రవిశంకర్‌ప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బూటకపు కథనాలను సృష్టించే కార్ఖానా బీజేపీ ప్రభుత్వమేనని, అతిపెద్ద సమాచార దొంగే.. అందరికంటే గట్టిగా అరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు. -
ఫేస్బుక్ సీఈవోకు సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగలించిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో, కాంగ్రెస్‌కు కూడా లింక్ లున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది. ఒకవేళ అవసరమైతే, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై తాము కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమేనని బీజేపీ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డేటా చోరీని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనాల కోసం వాడుకుందని, ఎన్నికల్లో గెలువడానికి డేటాను తారుమారు చేసిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఆ డేటా సంస్థ పాత్రను రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగతనం చేయడం, తారుమారు చేయడం వంటి వాటికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోదా? అని అన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో దేశీయ సిటిజన్ల ప్రైవేట్ డేటాను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిందని ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఫేస్బుక్ యూజర్ల ప్రైవేట్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేస్తుందని పలు న్యూస్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ అనలిటాకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఇది భారత్‌లో ఉచిత, న్యాయపరమైన ఎన్నికలకు సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుందని, దేశీయ ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధినేత రమ్య కొట్టిపారేశారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్‌కు లింక్ ఉన్నాయనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ట్వీట్ చేశారు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన ఈ కన్సల్టెన్సీకి ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. -
చివరిరోజు ఆమోదించారు
న్యూఢిల్లీ: 2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పలు బిల్లులను ఆమోదించారని బీజేపీ ఆరోపించింది. గీతాంజలి జెమ్స్ సహా పలు కంపెనీలకు మేలు చేసేలా బంగారు దిగుమతి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొంది.ఈ నిర్ణయం ద్వారా చిదంబరం ఎంత లాభం పొందారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. విపక్షాలు బీజేపీపై చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.మొండి బకాయిలు బ్యాంకు పుస్తకాల్లో లేకుండా చేసింది. ప్రభుత్వం చివరి ఆరేళ్లలో రూ.52.15లక్షల కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీలకు ఇచ్చింది. ఇందులో 36 శాతం నిధులు మొండి బకాయీలుగా గుర్తించగా.. అవి ప్రభుత్వం గద్దెదిగే సమయానికి 82 శాతానికి చేరాయి. గొప్ప ఆర్థికవేత్తలైన మన్మోహన్ సింగ్, చిదంబరంల హయాంలో అనవసర జోక్యం, మొండి బకాయిలను ప్రోత్సహించటం, ఒత్తిడి చేయటంతో బ్యాంకింగ్ వ్యవస్థ పట్టాలు తప్పింది’ అని వెల్లడించారు. 80:20 పథకం ద్వారా ఏడు ప్రైవేటు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరిందన్నారు. ‘మే 16న మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. చిదంబరం కుర్చీ ప్రమాదంలో పడింది. చివరి రోజు అత్యవసరంగా ఏడు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో.. చిదంబరం, రాహుల్ గాంధీ వెల్లడించాలి’ అని రవిశంకర్ చెప్పారు. పీఏసీకి ‘80:20’ వివరాలు యూపీఏ హయాంలో తెచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం వివరాలను పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి (పీఏసీ) ఆర్థిక శాఖ అందజేయనుంది. ఈ పథకంలోని లొసుగులను వినియోగించుకునే గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారం టూ పీఏసీలోని బీజేపీ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆర్థిక శాఖ పథకం వివరాలను సేకరిస్తోంది. పథకం, తదనంతర పరిణామాలపై 10 రోజుల్లో పీఏసీకి వివరాలు ఇవ్వనుంది. 80:20 బంగారు దిగు మతి పథకం ప్రకారం.. వ్యాపారస్తులు తా ము గతంలో దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతమైనా ఎగుమతి చేసి ఉంటేనే.. తర్వాత మరోసారి బంగారం దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. -
చిదంబరం చుట్టూ చోక్సీ ఉచ్చు
సాక్షి, ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా వివాదంలో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం చుట్టూ మరింత ఉచ్చు బిగించేందుకు బీజేపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ భారీ అక్రమాలకు, కుంభకోణానికి యూపీయే ఆధ్వర్యంలోని బంగారం దిగుమతి పథకం ఊతమిచ్చిందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చిదంబరంపై సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చిదంబరం ఆశీర్వాదంతోనే గీతాంజలి గ్రూపు మెహల్ చోక్సి సహా మిగిలిన ఏడు కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. వివాదాస్పదమైన ఈ నిబంధనను 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. దిగుమతి చేసుకున్న బంగారంలో 20శాతం ఎగుమతి చేసిన తరువాత మాత్రమే బంగారం దిగుమతులకు ట్రేడర్లకు అనుమతి లభించేలా 80:20 నియమాన్ని తెచ్చారన్నారు. తత్ఫలితంగానే ఏడు ప్రయివేటు కంపెనీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ పథకానికి ఎందుకు అనుమతినిచ్చారో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చిదంబరం ఇపుడు సమాధానం చెప్పాలని రవిశంకర ప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్డీఐ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవంబర్‌లో ఈ నిబంధనను తాము రద్దు చేశామన్నారు. ఇది ఇలా ఉంటే 80:20 బంగారు దిగుమతి పథకానికి సంబంధించి అన్ని వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు ఉంచనున్నారని పీటీఐ నివేదించింది. రానున్న పదిరోజుల్లో ఈ వివరాలను అందించనున్నారని తెలిపింది. కాగా ఐఎన్ఎక్స్ కేసు లో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ కేసు విచారణలో మరో కీలక నిందితురాలు, ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ వాంగ్మూలం ఆసక్తికరంగామారింది. కార్తి చిదంబరానికి సాయం చేయాలని స్వయంగా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తనను కోరారని సీబీఐ విచారణలో ఆమె చెప్పింది. దీంతో మాజీ ఆర్థికమంత్రి మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే చిదంబరాన్ని కూడా సీబీఐ ప్రశ్నించనుందని భావిస్తున్నారు. -
పది పోతే వంద ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఉద్యోగాల్లో పదింటికి కోత పడినా వంద కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ల వాడకం పెరుగుతుండ టంతో అనేక అంతర్జాతీయ డిజిటల్ టెక్నా లజీ కంపెనీలు భారత్‌లో అడుగుపెడుతున్నాయన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్–2018కు హాజరవడానికి సోమవారం హైదరాబాద్ వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమం సామాన్యునికి కూడా ఆధునిక టెక్నా లజీ ఫలాలు అందిస్తోందని చెప్పారు. మరో ఐదేళ్లలో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రూ.లక్ష కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీల వల్ల ఐటీ ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు, కొత్త ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు నాస్కామ్, ఐటీ కంపెనీలు ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం సిద్ధం చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సమాచార రక్షణ బిల్లు గురించి మాట్లాడుతూ.. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ బిల్లు సిద్ధం చేస్తోందని, అవినీతిపరులు, టెర్రరిస్టులకు ప్రైవసీ వర్తించదని స్పష్టం చేశారు. 40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు.. ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు సంబంధించి మంత్రి సమక్షంలో నాస్కామ్, కేంద్ర ఐటీ శాఖ అవగాహన పత్రం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్ ఫాం ద్వారా వచ్చే మూడు నాలుగేళ్లలో 40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీలపై శిక్షణిస్తామని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, బిగ్ డేటా అనలటిక్స్ వంటి 8 కొత్త టెక్నాలజీలు.. 55 కొత్తతరం ఉద్యోగాల శిక్షణ, సర్టిఫికేషన్ ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా అందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీ సంస్థ ఎడ్కాస్ట్ భాగస్వామ్యంతో ప్లాట్‌ఫాం నిర్మాణం జరిగిందని.. ఎడక్స్, రెడ్‌హ్యాట్, హ్యాకర్ ర్యాంక్, ఎడ్జ్ నెట్వర్క్స్ వంటి సంస్థలు వేర్వేరు హోదాల్లో సహకరిస్తున్నాయని వివరించారు. కంపెనీల అవసరాలు, ఉద్యోగుల అర్హతల ఆధారంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకు కంపెనీలు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తాయని ప్లాట్‌ఫాం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మోహిత్ టుక్రాల్ చెప్పారు. -
స్థానిక భాషల్లోనే ఐటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక భాషల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తేనే ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. దేశ జనాభాలో 60–70 శాతం మందికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేనందున ఆ భాషలో తయారైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను ఉపయోగించుకోలేక పోతున్నారన్నారు. మన దేశంలో 22 అధికారిక భాషలున్నాయని, ప్రజలు మాట్లాడే ఈ భాషల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైన మూడ్రోజుల ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మాట్లాడారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిరర్థకమని కేసీఆర్ తనతో అంటుంటారని, వారికి ప్రయోజనం కలిగించే టెక్నాలజీ వృద్ధికి కృషి చేయాలని ఐటీ రంగ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని లక్ష గృహాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి టీ–ఫైబర్ పథకాన్ని చేపట్టామన్నారు. దీనిద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 వేల చదరపు అడుగుల స్థలంలో ఈ–హబ్ రెండో విడత భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ల ఇంక్యుబేటర్‌గా ఇది అవతరించనుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెచ్చిన రూరల్ టెక్నాలజీ పాలసీకి మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే రెండో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ తొలిసారిగా భారత్‌లో.. అదీ హైదరాబాద్‌లో జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ నగరంలో ఐటీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతం. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి ఎన్నో ప్రఖ్యాత కంపెనీలకు ఈ నగరం నిలయం’’అని చెప్పారు. ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందంటూ నగరంలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) చైర్మన్ ఇవాన్ చియూ, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, విప్రో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషబ్ ప్రేమ్‌జీ, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షుడు చంద్రశేఖర్, టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ప్రసంగించారు. అంతకుముందు ‘ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్’ అనే అంశంపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో హైటెక్స్‌లోని సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కృత్రిమ మేధోశక్తితో సవాళ్లు: రవిశంకర్ ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగంలో కీలక శక్తిగా మారిన కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పరిజ్ఞానంతో ప్రయోజనాలతోపాటు దుష్పరిణామాలు సైతం ఎదురు కావొచ్చని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. దీని ద్వారా జరిగే నష్టాలు, నేరాలకు బాధ్యత ఎవరిదన్న అంశంపై ఐటీ రంగం మేధోమథనం జరపాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ సైతం ప్రధానాంశంగా మారిందన్నారు. దేశంలో ఐటీ రంగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా డిజిటల్ ఇండియా కింద దేశంలోని గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భారత్ ప్రపంచంలో అత్యధిక స్టార్టప్ కంపెనీలు కలిగిన మూడో దేశమని చెప్పారు. -
ఆధార్ డేటా కొనొచ్చా.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..!
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వందల రూపాయలు చెల్లించి ఇతరుల ఆధార్ సమాచారం సులువుగా సేకరించవచ్చునంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఆధార్ డేటా ఎప్పుడూ భద్రంతగానే ఉంటుందని, ఇతరుల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ డేటాకు గోపత్య లేదని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అని ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 4న యూఐడీఏఐ (ఆధార్ సంస్థ) ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సైబర్ విభాగం పోలీసులు ఆధార్ చట్టం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. 'విపక్ష నేతలు ఆధార్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ డబ్బు చెల్లించి ఆధార్ సమాచారాన్ని చోరీ చేసినట్లు దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆధార్ వివరాలపై గోప్యత ఉంటుందని అర్థమవుతోంది. ఆధార్ సంస్థ స్వయంగా ఓ వ్యక్తిపై డేటా దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు చేయగా ఢిల్లీ సైబర్ విభాగం విచారణ చేపట్టింది. ఆధార్ డేటాపై అభద్రత భావాన్ని దూరం చేసుకోవాలి. రూ.500 చెల్లించి ఇతరుల ఆధార్ డేటా వ్యక్తిగత సమాచారాన్ని పొందడం తేలికంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆధార్‌పై పుట్టకొస్తున్న వదంతులను నమ్మవద్దని' మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతిక్షాల వాదనకు, ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతుండటం గమనార్హం. -
'సంక్షోభం' సమసేందుకు!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ల పర్యవేక్షణలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), మిగిలిన నలుగురు న్యాయమూర్తుల మధ్య సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సంప్రదింపుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఆ నలుగురితో ఆదివారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ రంజన్ గొగోయ్‌లు వేర్వేరు వేదికలపై చేసిన వ్యాఖ్యలు సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందనే సంకేతాలనిచ్చాయి. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మినహా మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఢిల్లీలో అందుబాటులో లేకపోవటంతో.. వీరంతా ఆదివారం రాజధానికి చేరుకున్న తర్వాత సీజేఐ వీరితో మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా, ఇది న్యాయవ్యవస్థ అంతర్గత వివాదమని.. ఇందులో బయటివారి జోక్యం అవసరం లేదని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. అటు, అందరు సుప్రీం న్యాయమూర్తులతో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏడుగురు సభ్యు ల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరసించిన సంగతి తెలిసిందే. రంగంలోకి బార్ కౌన్సిల్ మరోవైపు సమస్య పరిష్కారంలో చొరవతీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిర్ణయించింది. న్యాయమూర్తులతో చర్చించేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ బృందం ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ కలిసి వీలైనంత త్వరగా వివాదం సమసిపోయేందుకు వారితో చర్చిస్తుందని బీసీఐ అధ్యక్షుడు మనన్ మిశ్రా వెల్లడించారు. ‘మేం మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయాల్సిన పనిలేదని, రాజకీయ పార్టీలేమీ ఈ వివాదంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని (పరోక్షంగా రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ) ఆయన హెచ్చరించారు. ‘ఈ వివాదంలో జోక్యం చేసుకోబోమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అంతర్గత సమావేశాల ద్వారానే ఈ వివాదం పరిష్కారమవుతుంది’ అని మనన్ మిశ్రా తెలిపారు. అటు, ఈ వివాద పరిష్కారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా చొరవతీసుకోవాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీర్మానం చేసింది. జనవరి 15న విచారణకు రానున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సీజేఐ నేతృత్వంలోని బెంచ్ లేదా కొలీజియం సభ్యులున్న ఇతర ధర్మాసనాలకు బదిలీ చేయాలని కోరింది. సీజేఐ ఇంటికి మోదీ దూత! అటు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా శనివారం ఉదయం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే సీజేఐ ఇంటిగేటు తెరవకపోవటంతో తన కారులోనే కాసేపు వేచి ఉండి.. అనంతరం తిరిగి వెళ్లినట్లు టీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ప్రధాని తన వ్యక్తిగత కార్యదర్శిని ప్రత్యేక దూతగా సీజేఐ వద్దకు పంపేందుకు ప్రయత్నించారని విమర్శించింది. దీనికి ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వివాదానికి కారణమైన వ్యక్తులే చొరవతీసుకుని సమస్యను పరిష్కరించుకోలేని నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కోరారు. అయితే.. నలుగురు న్యాయమూర్తులు ధైర్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను చెవిటి, మూగ వ్యవస్థగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. కాగా, కేబినెట్ మంత్రులు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లా బయటకొచ్చి మాట్లాడాలని.. వారిలో నెలకొన్న భయాన్ని పక్కనపెట్టాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సూచించారు. పార్లమెంటు రాజీపడి, సుప్రీంకోర్టు సరైన విధంగా నడవని పక్షంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘దురుద్దేశంతోనే పిటిషన్’ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని బాంబే లాయర్ల అసోసియేషన్(బీఎల్ఏ) ఆరోపించింది. ఈ విషయంపై తాము బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణను అడ్డుకోవడానికే జర్నలిస్టు బీఆర్ లోనె సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ దాఖలుచేసినట్లు పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ మిశ్రా అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు జడ్జీలు గళమెత్తిన నేపథ్యంలో బీఎల్ఏ అధ్యక్షుడు అహ్మద్ అబ్ది శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. జనవరి 4న తాము బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన తరువాతే లోనె సుప్రీంకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం పరిధికి చేరిన విషయాన్ని బాంబే హైకోర్టు విచారణకు చేపట్టకుండా చూసేందుకు దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. సమస్య పరిష్కారమైనట్లే: జస్టిస్ కురియన్ సుప్రీంకోర్టులో రాజ్యాంగ సంక్షోభమేమీ లేదని.. తాము లేవనెత్తిన సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని జస్టిస్ కురియన్ కొచ్చిలో వెల్లడించారు. ‘రాజ్యాంగ సంక్షోభమేమీ లేదు. విధానంలోని లోపాలను సరిదిద్దాలనేదే మా అభిమతం. సీజేఐకి ఇచ్చిన లేఖలో ప్రతి అంశాన్నీ పేర్కొన్నాం. ఈ లేఖను రెండు నెలల క్రితమే ఆయనకు ఇచ్చాం’ అని తెలిపారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేందుకు మాత్రమే అధికారమున్నందున ఆయనకు ఈ విషయాన్ని వెల్లడించలేదన్నారు. ‘మేం ఓ కారణం కోసం దీన్ని లెవనెత్తాం. ఈ సమస్య త్వరగానే పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. మాకు వ్యక్తిగత విభేదాలేమీ లేవు. పారదర్శకత ఉండాలనేదే మా అభిప్రాయం’ అని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం బయటివారు చొరవతీసుకోవాల్సిన పనేం లేదని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు. ‘విషయాన్ని లేవనెత్తాం. సంబంధించిన వాళ్లు దీన్ని విన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు. సమస్య పరిష్కారమైందని నేను భావిస్తున్నాను. న్యాయవ్యవస్థ అంతర్గతంగా నెలకొన్న వివాదమిది. దీనిలో వేరే వ్యక్తుల జోక్యం అవసరం లేదు. వ్యవస్థే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. ‘సీజేఐ తరపునుంచి ఎలాంటి రాజ్యాంగపరమైన పొరపాటు జరగలేదు. కానీ ఆయన బాధ్యతల నిర్వహణలో సంప్రదాయ విధివిధానాలను అనుసరించాల్సింది. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. మార్పు చేసుకోవటం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మేం న్యాయం కోసం నిలబడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ న్యాయసేవ కార్యక్రమంలో పాల్గొన్న మరో న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా సంక్షోభమేమీ లేదని వెల్లడించారు. కాగా, ఈ వివాదం సోమవారం కల్లా పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధీమాగా చెప్పారు. ‘సోమవారానికల్లా న్యాయమూర్తుల మధ్య ఐక్యత నెలకొంటుంది. న్యాయవ్యవస్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. న్యాయమూర్తులు మేధావులు, అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞత గలవారు. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని వారనుకోరు’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు. 17 నుంచి 8 కీలక కేసులపై విచారణ ఒకవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియరు న్యాయమూర్తుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు జనవరి 17 నుంచి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 8 కీలక అంశాలపై విచారణ చేపట్టనున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజ్యాంగ పరంగా ఆధార్ చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని తేల్చడంతో పాటు 2013లో స్వలింగ సంపర్కం కేసులో తానిచ్చిన తీర్పును ఈ రాజ్యాంగ ధర్మాసనాలు పునః పరిశీలిస్తాయి. వివాదాస్పద అంశమైన కేరళలోని శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలకు ప్రవేశంపై నిషేధంతో పాటు, వేరే మతస్తుడిని పార్శీ మహిళ పెళ్లి చేసుకుంటే తన మత గుర్తింపును కోల్పోతుందా? అన్న విషయాన్ని కూడా ఈ రాజ్యాంగ ధర్మసనాలు విచారించనున్నాయి. వ్యభిచారం కేసుల్లో ఐపీసీ సెక్షన్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన కేసును కూడా సుప్రీంకోర్టు చేపట్టనుంది. వివాహేతర సంబంధం కేసుల్లో కేవలం పురుషుడినే శిక్షించేందుకు అవకాశమిస్తోన్న ఈ ఐపీసీ సెక్షన్ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. అలాగే చట్టసభ్యులు ఎప్పుడు క్రిమినల్ విచారణ ఎదుర్కొంటారు.. వారి అనర్హతకు సంబంధించిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఈ అంశాల్ని ఇంతకముందే విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు.. కీలక అంశాలు కావడంతో రాజ్యాంగ ధర్మాసనాలకు సిఫార్సు చేశాయి. -
ఏపీకి త్వరలో తాత్కాలిక హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పా టుకు వీలుగా తాత్కాలిక భవనాలను ప్రతి పాదిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియ పరిచే ప్రక్రియలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్ సభలో వెల్లడించారు. తాత్కాలిక భవనాల్లో ఉన్నత న్యాయ స్థానం ఏర్పాటుకు హైకోర్టు సమ్మతిస్తే తాత్కాలిక పద్ధతిలో అక్కడికి ఏపీ హైకోర్టును తరలించే వీలుంటుందని తెలి పారు. ఈ అంశంపై బుధవారం లోక్‌సభ కార్య కలాపాలను టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్న నేపథ్యంలో గురువారం మధ్యా హ్నం ఆయన లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు భవనం నిర్మిం చేందుకు సమ యం పడుతుంది. చట్ట ప్రకారం ప్రస్తుత ఏపీ హైకోర్టు తెలంగాణకు చెందుతుంది. ఆంధ్ర ప్రదేశ్ భూ భాగంలో ప్రత్యేక హైకోర్టు రావాల్సి ఉంది. ఏపీలో నూతన హైకోర్టు భవన ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నాకు సమా చారం ఉంది. కేంద్రం కూడా రాజధాని భవనాలకు నిధులు ఇస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి హైకోర్టు కోసం ఒక స్థలాన్ని సూచిస్తూ తమకు ప్రతి పాదించాలని, హైకోర్టుతో సంప్రదింపులు జర పాలని ఆ ఉత్తర్వు సారాంశం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు వీలుగా తాత్కాలిక భవనాలను ప్రతిపాదిస్తూ హైకోర్టుకు తెలియపరిచే ప్రక్రియలో ఉంది. ఆయా భవనాలకు హైకోర్టు సమ్మ తిస్తే లేదా ఏవైనా మార్పులు సూచిస్తే దానికి అను గుణంగా తాత్కాలిక పద్ధతిలో హైకోర్టును హైదరాబాద్ నుంచి తరలించవచ్చు. ఇక కొత్త భవనం నిర్మాణం కావాలంటే అందుకు సమ యం పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మి త్రులకు నేను చెప్పగలిగిందేమంటే వారు పరస్పరం ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోవా లి. కేంద్ర ప్రభుత్వం వారి ప్రయోజనాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటుంది’’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అప్పటివరకు వద్దు: జితేందర్‌రెడ్డి న్యాయశాఖ మంత్రి ప్రకటన అనంతరం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఏపీ ముఖ్యమంత్రి తాత్కాలిక హైకోర్టుకు నాలుగు భవనాలు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిని మేం స్వాగతిస్తున్నాం. అయితే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు న్యాయాధి కారులు, న్యాయమూర్తుల పదోన్నతుల ప్రక్రియను నిలిపివేయాలి. అది జరిగితే తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధి కారులకు అన్యాయం జరుగుతుంది. అది తాత్కాలిక ఏర్పాటైనా, శాశ్వత ఏర్పాటైనా మాకు అభ్యంతరం లేదు. కానీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు న్యాయాధికారుల పదోన్నతుల ప్రక్రియ మాత్రం వద్దు’’ అని విన్నవించారు. దీనికి న్యాయ మంత్రి స్పందిస్తూ ‘‘న్యాయమూర్తుల నియామ కాల ప్రక్రియను కొలీజియం చేపడుతుంది. దీనిపై నేను ఎలాంటి హామీ ఇవ్వలేను’’ అని పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు కలసి మాట్లాడుకోవాలి: రాజ్‌నాథ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబం ధించి హైకోర్టు మినహా ఇతర అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుగా కలసి మాట్లాడుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలను కోరతానని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో తెలిపారు. విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ పరిష్కారం అయ్యేందుకు తన వంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ఓవైసీ సవరణలకు నో.. ట్రిపుల్ తలాక్‌కు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఒక్క సవరణ లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలతోపాటు ఇతరులు ప్రతిపాదించిన సవరణలకు కూడా మద్దతు లభించకపోవడంతో అవి వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభలోకి అడుగుపెట్టనుంది. గురువారం లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు తాను వ్యతిరేకం అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన ప్రసంగిస్తూ పలు సవరణలు ప్రతిపాదించారు. ముస్లింలను సంప్రదించకుండానే బిల్లును తీసుకొచ్చారన్న ఆయన ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనితో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని, ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త జైలుకు వెళితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని అసదుద్దీన్ ప్రశ్నించారు. కాగా, అంతకుముందు మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ నేడు చారిత్రాత్మక దినం అన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదని, ముస్లిం మహిళలకు పెద్ద ఊరట అని, లింగ సమానత్వం కూడా ఈ బిల్లు ద్వారా అందుతుందని చెప్పారు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు ఎంతో సహాయం చేస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలను ఈ బిల్లుతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మరోపక్క, ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, ఎంఐఎం, బిజు జనతాదల్ వంటి పార్టీలు మాత్రమే ఈ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకం అని అన్నారు. అలాగే, ముస్లి పర్సనల్ లా బోర్డు కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఏదీ ఏమైనా మొత్తానికి ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించాయి. ట్రిపుల్ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లులో చిల్లులెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ పేరిట ముస్లిం యువతులకు ఏకపక్షంగా విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్)–బిల్’ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదంటూ గత ఆగస్టు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని భావించడం వల్ల ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. పెళ్లయిన ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం యువకులను వేధించే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. బిల్లులోని మూడవ సెక్షన్ ప్రకారం పెళ్లయిన ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు నోటిమాటగాగానీ, రాతపూర్వకంగాగానీ, ఎలక్ట్రానిక్ రూపంలోగానీ, మరే ఇతర రూపాల్లోగానీ ‘ట్రిపుల్ తలాక్’ చెప్పడం చెల్లదు, అది చట్టవిరుద్ధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్ సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉంది. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని బిల్లులోని ఏడవ సెక్షన్ ‘కాగ్నిజబుల్ అఫెన్స్ (పరిగణించతగ్గ తీవ్రమైన నేరం)’గా పరిగణిస్తోంది. అంటే ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు. బాధిత భార్య భర్తను శిక్షించాలని కోరుకోక పోయినా ఈ సెక్షన్ కింద భర్తను విచారించి జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ భార్య తప్పుడు ఫిర్యాదు చేసినా భర్తకు శిక్ష తప్పదు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్‌గా ఈ నేరాన్ని పరిగణించి నట్లయితే ముందుగా బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ కేసును విచారించాల్సిన అవసరం ఉందా, లేదా? పోలీసుల దర్యాప్తునకు ఆదేశించి నిందితుడికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందా? అన్న అంశాలను మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. (సాక్షి ప్రత్యేకం) హిందువులకు సంబంధించిన చట్టాలతో ఈ కొత్త చట్టాన్ని పోల్చిచూస్తే మత వివక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తన నుంచి విడిపోయిన భార్యను రేప్ చేసిన ఓ హిందూ భర్తను చట్టప్రకారం శిక్షించాలంటే భార్య అనుమతి తప్పనిసరి. ఇక్కడ త్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం భర్తను శిక్షించడానికి భార్య అనుమతే అవసరం లేదు. హిందువుల్లో వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లో తీసుకొచ్చిన చట్టంలో కూడా నిందితులకు రక్షణ ఉంది. (సాక్షి ప్రత్యేకం) భార్య లేదా సమీప బంధువులు ఫిర్యాదు చేస్తేగానీ కేసు నమోదు చేయకూడదు. విచారణ జరపరాదు. మన దేశంలో ముస్లిం మహిళల వివాహాలను ‘అఖిల భారత ముస్లిం లా బోర్డు’ పర్యవేక్షిస్తోందన్న విషయం మనకు తెల్సిందే. ముస్లిం వివాహాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వాటికి సంబంధించిన బిల్లులపై ముందుగా ఆ బోర్డు అభిప్రాయాలను తీసుకోవడం మన గత ప్రభుత్వాల ఆనవాయితీ. ఈసారి అలాంటి అభిప్రాయలను తీసుకోకుండానే బిల్లును తీసుకొచ్చారు. ‘ట్రిపుల్ తలాక్’ నుంచి ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల ముస్లిం కమ్యూనిటీకే ముస్లిం మహిళలు దూరమై, మరింత సామాజిక శిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ‘శ్యారా బానో కేసు’లో ఆమెకు అండగా నిలబడి వాదించిన మహిళా సంఘం ‘బెబ్యాక్ కలెక్టివ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం స్త్రీ, పురుషుల మధ్య వివక్షను తొలిగించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని శంకించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంలో ఈ మహిళా సంఘం కృషి ఎంతో ఉందన్న విషయం తెల్సిందే. (సాక్షి ప్రత్యేకం) -
మూడుసార్లు తలాక్ అంటే ఇక కటకటాల్లోకే...
సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది. ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆయన జూనియర్ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ప్రసాద్ మద్దతు పలికారు. కోల్‌కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు. -
చిన్న పట్టణాలకు బీపీఓ కంపెనీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలను చిన్న పట్టణాల దిశగా కదిలించేందుకు ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది. ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద మొత్తం 48,300 సీట్లకుగాను 35,000 సీట్లు చిన్న పట్టణాలకే కేటాయించినట్టు తెలిపింది. రానున్న ఆరు నెలల్లో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో సీటుకు రూ.లక్ష చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఈ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ఈ పథకం ఆసరాతో బీపీవో అన్నది చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ ఆకాంక్షలకు వేదికగా అవతరిస్తుంది. డిజిటల్ సాధికారతకు చిన్న పట్టణాల్లోని బీపీవోలు అతిపెద్ద చోదక శక్తి అవుతాయి’’ అని రవి శంకర్ ప్రసాద్ వివరించారు. ఇప్పటి వరకు నాలుగు దశల బిడ్డింగ్‌లో, 18,160 సీట్లను 87 కంపెనీలకు చెందిన 109 యూనిట్లకు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. వీటిలో 76 యూనిట్లు కార్యకలాపాలు ఆరంభించాయని, ఇప్పటికే 10,297 మందికి ఉపాధి లభించిందని చెప్పారు. గత నెల ముగిసిన ఐదో దశ బిడ్డింగ్‌లో 68 కంపెనీలు 17,000 సీట్లకు బిడ్లు సమర్పించాయని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఏపీలో మూడు చోట్ల కేంద్రాలు: కొత్తగా బీపీవో కేంద్రాలు ఆరంభించిన పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రాజమండ్రి, గుంటుపల్లి కూడా ఉన్నాయి. అలాగే, ఏపీలోని చిత్తూరు సహా తిర్పూర్, గయ, వెల్లూర్, జహనాబాద్, మధుర తదితర పట్టణాల్లోనూ బీపీవో కేంద్రాలకు బిడ్లు వచ్చినట్టు మంత్రి తెలిపారు. -
తటస్థతకే ట్రాయ్ ఓటు!
ఇంటర్నెట్ సేవల్ని అందించే విషయంలో ఈమధ్య బయల్దేరిన వింత పోకడలకు వ్యతిరేకంగా టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ వెలువరించిన తాజా సిఫా ర్సులు సర్వ స్వతంత్రమైన, పారదర్శకమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఉండాలని కోరు కునేవారికి ఊరటనిస్తాయి. ఇంటర్నెట్లో ప్రవహించే సమాచారానికి లాభాపేక్షతో అంతరాల దొంతరలు కల్పించడం, అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధపడే వెబ్సైట్ల విషయంలో ఒకలా, అలా చెల్లించనివారితో మరొక రీతిలో వ్యవహరించడానికి అనేక సంస్థలు సిద్ధపడిపోయాయి. ఈ అంశాలను పరిశీలించేందుకు టెలికాం విభాగం నియమించిన నిపుణుల కమిటీ రెండేళ్లక్రితం ఇచ్చిన నివేదిక ఇంటర్నెట్ తటస్థతను సమర్ధిస్తున్నట్టు కనబడుతూనే అందుకు విరుద్ధమైన సూచనలు చేసింది. చివరకు ఈ సూచనల్నే ట్రాయ్ కూడా నెత్తిన పెట్టుకుంటుందని అందరూ ఆందోళన పడ్డారు. అయితే అది ఎన్నో ప్రగతిశీలమైన సూచనలు చేసి తన ఓటు ఇంటర్నెట్ తటస్థతకూ, పారదర్శకతకేనని స్పష్టం చేసింది. ఇంటర్నెట్పై ఎవరి గుత్తాధిపత్యాన్నీ అంగీకరించబోమని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సైతం ఇప్పటికే చెప్పి ఉన్నారు గనుక ట్రాయ్ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర సులభంగానే పడుతుందని భావించవచ్చు. ఇంటర్నెట్ పుట్టిల్లు అమెరికా దాని తటస్థత విషయంలో వెనక చూపులు చూస్తున్న తరుణంలో ఆ దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటికీ ట్రాయ్ సిఫార్సులు మార్గదర్శకంగా నిలుస్తాయి. అమెరికా ఫెడరల్ కమ్యూ నికేషన్ల కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ ఈమధ్య చేసిన ప్రతిపాదనలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి అమలైతే రెండేళ్లక్రితం ఒబామా హయాంలో స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ వ్యవస్థకు అనువుగా రూ పొందిన విధానాలు కనుమరుగవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పు డమలవుతున్న విధానంలో కొంత రుసుము చెల్లించి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన డేటాను, తాము వ ¬ఖ్యమనుకున్న డేటాను చూసుకునే వీలుంది. ఆయా వెబ్సైట్లు అనుమతించిన మేరకు డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అందుకు విరుద్ధంగా అజిత్‌పాయ్ చేసిన ప్రతిపాదనలవల్ల అధిక మొత్తం చెల్లించినవారి వెబ్సైట్లు పెనువేగంతో తెరుచుకునేలా, అలా చెల్లించని వెబ్సైట్లు మాత్రం వినియోగదారుల సహనాన్ని పరీక్షించేవిధంగా ఎంతో సమయం తీసుకునేలా చేయడం సర్వీస్ ప్రొవైడర్లకు సులభమవుతుంది. వివిధ వెబ్సైట్ల నుంచి అవి ఉపయోగించుకునే బ్యాండ్‌విడ్త్ ఆధారంగా చార్జీలు వసూలు చేయాలని గతంలో ఎయిర్టెల్,ఫేస్బుక్ లాంటి సంస్థలు ప్రతిపాదిం చాయి. వినియోగదారులకు కొన్ని యాప్‌లు, వెబ్సైట్లు ఉచితంగా అందిస్తామనే పేరిట గ్రూపులు కట్టి అందులో చేరే సంస్థల నుంచి రుసుము వసూలు చేయాలని ఎత్తులేశాయి. అలాంటి ప్రతిపాదనలకు అనుమతిస్తే అధిక బ్యాండ్ విడ్త్‌ను ఉప యోగించుకునే యూట్యూట్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్సైట్లు అధిక మొత్తం చెల్లిం చాల్సివస్తుంది. చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతుంది. ఇలా వివక్ష ప్రదర్శించడం చెల్లదని ట్రాయ్ సిఫార్సులు చెబుతున్నాయి. ఈ తరహా పోకడలకు పోకుండా సర్వీస్ ప్రొవైడర్ల లైసెన్స్ నిబంధనలను మార్చాలని అవి సూచి స్తున్నాయి. ఈ వివక్షపై నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘించినవారిపై విచారణ జరిపేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగం బహుళపక్ష మండలి ఏర్పాటు చేయాలని కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిశీలించి, తగిన పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ తరహా మండలి తప్పనిసరి. పారదర్శకత అమలు చేయడమన్నది మరో కీలకాంశం. టెలికాం ఆపరేటర్లు వేర్వేరు వెబ్ సంస్థలతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పం దాలను బహిర్గతపర్చాలని, వెబ్ ట్రాఫిక్ విషయంలో తాము అనుసరిస్తున్న విధా నాలేమిటో వినియోగదారులకు స్పష్టం చేయాలని ట్రాయ్ చేసిన సిఫార్సు సైతం స్వాగతించదగింది. ఇంటర్నెట్ అమల్లోకొచ్చాక ప్రపంచంలో ఏమూల నుంచి ఏ మూలకైనా సమాచారాన్ని చేరేయడం అత్యంత సులభమైంది. వినూత్న ఆవిష్కరణలకూ, విలక్షణమైన ధోరణులకూ ఇంటర్నెట్ వేదికగా నిలుస్తోంది. సమర్ధత కలిగి ఉంటే బడా బ్రాండ్లను ఛోటా సంస్థలు సైతం గడగడలాడించగలవని ఇంటర్నెట్ నిరూపించింది. భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత పదును తేలాయి. ఇలాంటి సమయంలో లాభాపేక్ష ముసుగులో కొన్ని వెబ్సైట్లకు పెద్దపీట వేసి, ఇతర వెబ్సైట్లను అందుబాటులోకి రాకుండా చేయడం వల్ల పౌరులకు ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే సంస్థల మధ్య పోటీ బయల్దేరి పరస్పర హననం మొదలవుతుంది. పెద్ద సంస్థలు చిన్న సంస్థల మనుగడను దెబ్బతీస్తాయి. వివక్షాపూరిత విధానాలు అంతిమంగా ఇంటర్నెట్ వినియోగదారులకు శాప మవుతాయి. వారు తమకు అవసరమైనవి కాక, టెలికాం సంస్థలకు లాభాల్ని తెచ్చిపెట్టే వెబ్సైట్లను మాత్రమే చూసే అవకాశం ఏర్పడుతుంది. అయితే అత్యంతాధునికం అనదగ్గ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్తో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుసంధానించి అందించే సేవలు–టెలీ సర్జరీ, డ్రైవర్ రహిత వాహనాలు వగైరా) కిందకు ఏమేం వస్తాయో పరిశీలించి, వాటికి ఎలాంటి విధా నాలు అవసరమో నిర్ణయించుకునే స్వేచ్ఛను టెలికాం విభాగా నికే వదలాలని ట్రాయ్ సిఫార్సుచేసింది. ఇంటర్నెట్ తటస్థత విషయంలో గత రెండేళ్లుగా నెటిజన్లలో ఎంతో ఆందోళన నెలకొంది. వాటిని పరిగణనలోకి తీసుకుని ట్రాయ్ సహేతుకమైన సిఫార్సులు చేసింది. అయితే నెటిజన్లు ఇంతమాత్రాన విశ్రమించకూడదు. అమెరికా అనుసరించబోయే విధానాలు కొంచెం ముందు వెనుకలుగా ప్రపంచ దేశాలన్నిటినీ భవిష్యత్తులో ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల స్వేచ్ఛాయుత, పారదర్శక, తటస్థ ఇంటర్నెట్ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి నెటిజన్లు పోరాడక తప్పదు. -
‘ఇంటర్నెట్ ఎవరి సొత్తు కాదు’
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ ఇంటర్నెట్పై ఏ ఒక్కరి గుత్తాధిపత్యాన్నీ అనుమతించదని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా పర్యవసానాల ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను భారత్ ఎలా అధిగమిస్తుందనే దానిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌లో తగిన చట్టాలున్నాయని చెప్పారు. డిజిటల్ విప్లవం అందరికీ చేరేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే డిజిటల్ గుత్తాధిపత్యాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. సాంకేతికత అభివృద్ధికి దోహదపడేలా ఉంటూ తక్కువ వ్యయంలో అందుబాటులో ఉండాలని అన్నారు. భారత్ సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకోవాలని పలు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ఇంటర్నెట్ను ఏ కొద్ది మందో ఆవిష్కరించినా ప్రస్తుతం అంది అంతర్జాతీయ ప్రజల ఆస్తిగా మారిందన్నారు. ప్రజలందరికీ అతితక్కువ ధరకు, భద్రతతో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలని చెప్పారు. ఫేస్బుక్, వాట్పాప్ వంటి దిగ్గజ సంస్థకు భారత్ భారీ మార్కెట్‌గా ఎదిగిందని అన్నారు. -
మీ మనసులో ఏముందో చెప్పండి
లక్నో/న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ జోక్యం చేసుకోవడంపై ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముందు ఆయన తన ఆలోచనేమిటనేది విధిగా వెల్లడించాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదం విషయంలో షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ వాసిం రజ్వి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అవి అనవరసమంటూ మండిపడ్డాయి. ‘ఈ కేసులోని అన్నిపక్షాలతోనూ రవిశంకర్ సంప్రదింపులు జరుపుతారని చెబుతున్నారు. అయితే ఆయన ఇప్పటిదాకా తమను సంప్రదించలేదు’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) చైర్మన్ మౌలానా వలి రెహమాని బుధవారం స్పష్టం చేశారు. 12 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఒకసారి యత్నించారని, అయితే వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని సూచించారని గుర్తుచేశారు. ఈసారి ఆయన ఏ ఫార్ములాతో వస్తున్నారో చెప్పాలని, ఆ తర్వాత తమ ప్రతినిధి ఆయనతో సంప్రదింపులు జరుపుతారని అన్నారు. సీఎంతో రవిశంకర్ భేటీ రవిశంకర్ బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వివాదాస్పద అయోధ్య స్థలాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. రవిశంకర్.. సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారని, ఈ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు జరిగిందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఆదిత్యనాథ్‌తోపాటు రవిశంకర్..దిగంబర్ అఖాడాకు చెందిన సురేశ్ దాస్, జనమేజయ్ శరణ్ (రసిక్పీఠ్), రాజారాంచంద్ర ఆచార్య (నిర్మోహి అఖాడా)లతోపాటు అనేక హిందూ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇదొక ఆరంభం. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ఎవరూ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం లేదు. అందరితోనూ అయోధ్య వివాదంపై సంప్రదింపులు జరుపుతా’ అని చెప్పారు. -
ఇంద్రసేనారెడ్డికి ‘క్యాపిటల్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన ప్రముఖులకు క్యాపిటల్ ఫౌండేషన్ ఏటా అందిస్తున్న వార్షిక అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేసింది. తెలంగాణకు చెందిన నెప్లస్ ల్యాబ్స్ సీఎండీ డాక్టర్ తూడి ఇంద్రసేనారెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ ప్రొ.టి.శివాజీరావ్ జాతీయ అవార్డు దక్కింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డు ప్రదానం చేశారు. గ్రామ్‌వికాస్ భారతి పేరుతో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలకు, సేవ్ రివర్ పేరుతో మూసీనది ప్రక్షాళనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఓయూలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇంద్రసేనారెడ్డి, పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఫార్మకాలజీలో డాక్టరేట్ పూర్తి చేశారు. జర్మనీకి చెందిన హుంబోల్ట్ ఫౌండేషన్, అమెరికాకు చెందిన ఎన్ఐ హెచ్‌ల నుంచి ఫెలోషిప్ పొందారు. అనంతరం యూఎస్ఏ, భారత్‌లో నెప్లస్ అల్ట్రా ల్యాబ్స్‌ను స్థాపించారు. 2010లో బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి తెలం గాణ బీజేపీ ఎన్ఆర్ఐ విభాగానికి కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ప్రొఫెసర్ సి.సురేశ్ రెడ్డికి కూడా ఈ అవార్డు దక్కింది. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించిన సురేశ్‌రెడ్డి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రసిద్ధ నిపుణులు. ఈయన ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర ఐటీ, న్యాయశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. వివిధ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల ఎలాంటి వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాదని కేవలం పేరు, చిరునామా, పుట్టినతేదీ మాత్రమే తెలుసుకోగలమన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఏకే పట్నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్ సేతి, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిపై మండిపడ్డ సీఎం
సాక్షి, మైసూరు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘గౌరీ లంకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని మా ప్రభుత్వానికి ముందుగా తెలిసినట్టు ఆ కేంద్ర మంత్రి చెప్పారు. ఆమె కోరినా మేము భద్రత కల్పించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి బాధ్యతారహితంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నార’ని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపిన గౌరికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని రవిశంకర్ ప్రసాద్ అంతకుముందు ప్రశ్నించారు. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందన్న విషయం తమతో గౌరి చెప్పలేదని, భద్రత కూడా కోరలేదని సిద్ధరామయ్య తెలిపారు. గౌరీ లంకేశ్ చాలా మంచి మనిషి అని, ఆమెను ఎవరూ ద్వేషించరని చెప్పారు. గౌరికి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించారా, లేదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానని రవిశంకర్ ప్రసాద్ తాజాగా పేర్కొన్నారు. -
గౌరీ హత్యపై రాజకీయం
-
గౌరీ హత్యపై రాజకీయం
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ► లంకేశ్‌కు సిద్ధరామయ్య భద్రత కల్పించలేదని విమర్శ ► నిందితుల ఆచూకీపై రూ. 10 లక్షల రివార్డు బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసుపై రాజకీయ వేడి రాజుకుంది. హత్యకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కేసు విచారణలో ముందడుగు పడకుండా అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించింది. నక్సలైట్ల నుంచి ముప్పుందని గౌరీ సోదరుడు చెప్పినా.. భద్రత ఇవ్వటంలో కర్ణాటక సర్కారు విఫలమైందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. కాగా, గౌరీ హంతకుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. నిష్పాక్షిక విచారణ సాధ్యమేనా?: గౌరీ హత్య దురదృష్టకరమని అయితే.. పూర్తి విచారణ జరగకుండానే అనుచిత విమర్శలు చేయటం సరికాదని రవిశంకర్ అన్నారు. మావోలను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. వారి నుంచి గౌరీకి హెచ్చరికలు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘నక్సలైట్లను సరెండర్ చేసేందుకు ఆమె ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారా? ఇది నిజమే అయితే.. ఆమెకు భద్రత ఎందుకు కల్పించలేదు’ అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఈ ఘటనపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యంపై ఆ పార్టీ సీఎంను అడగాలని సూచించారు. గౌరీకి భద్రత కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న రవిశంకర్ వ్యాఖ్యలను కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి ఖండించారు. గౌరీ హత్యను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖండించారు. ‘ఇలాంటి ఘటనకు భారత్‌లో జరగొద్దు. ఇది నా భారతం కాదు’ అన్నారు. -
ఆమెకు సెక్యురిటీ ఎందుకివ్వలేదు?
న్యూఢిల్లీ: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపారని, ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతి హత్యను ఖండించడం కరెక్టేనని.. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యకర్తల హత్యలపై ఉదారవాదులు ఎందుకు నోరు విప్పలేదని ఆయన నిలదీశారు. సంఘ్ కార్యకర్తలకు మానవ హక్కులు లేవా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. గౌరి లంకేశ్ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే.. ఆర్ఎస్ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ బహిరంగంగా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ‘సిట్’ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తాము ఎలా నమ్మగలమన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి ఏకీభవిస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. -
ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులివ్వండి
కేంద్ర మంత్రి రవిశంకర్‌కు మంత్రి కేటీఆర్ లేఖ ♦ కేంద్రం మద్దతు లేక ముందుకు కదలని ప్రాజెక్టు ♦ రూ.3,275 కోట్లు మంజూరు చేసినా విడుదల చేయలేదు ♦ అంగీకరించిన మేరకు నిధులివ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రానికి ఈ ప్రాజెక్టు పట్ల స్పష్టత లేకపోవడం వల్ల అనేక అనుమానాలు నెలకొన్నాయని, వీటివల్ల గందరగోళం తలెత్తిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విధాన పరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా నాలుగేళ్ల కిందట ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. రెండు సార్లు డీపీఆర్ సమర్పించాం.. 2013 సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతివ్వడం జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించిందని, అయితే ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 2008లో కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఐటీఐఆర్‌లను మంజూ రు చేయాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ శాఖ 2010లో ప్రతిపాదిం చగా, అప్పటి కేంద్రం ఆమోదించిందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.4,863 కోట్లను రెండు దశల్లో సహాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఐటీఐఆర్ డీపీఆర్ సమర్పించామన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి రూ.3,275 కోట్లను (తొలి దశ రూ.165 కోట్లు, రెండో దశ రూ.3,110 కోట్లు) కేంద్రం మంజూరు చేసిందన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పూర్తిస్థాయి నిధుల విడుదల మాత్రం జరగలేదన్నారు. తాను స్వయంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలసి ఐటీఐఆర్‌కు సహకరించాల్సిందిగా కోరానని గుర్తుచేశారు. కేంద్రం అంగీకరించిన మేరకు నిధులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ఈ సాయం హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు తేవడంతోపాటు యువతకు ఉద్యోగాలు వస్తాయని విజ్ఞప్తి చేశారు. కాకతీయ టెక్స్టైల్స్ పార్కు శంకుస్థాపన వాయిదా సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆదివారం ఆయన ట్వీటర్ ద్వారా తెలిపారు. ఐటీలో తెలంగాణ మేటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయన్నారు. 2016–17లో జాతీయ సగటు కన్నా 4 శాతం అధిక ఐటీ ఎగుమతులను రాష్ట్రం సాధించిందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉపాధి 3,23,396 నుంచి 4,31,891 మందికి పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ విధానం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలైన గూగుల్, యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని వివరించారు. ఇన్నొవేషన్ రంగంలోనూ తెలంగాణ దూసుకుపోతోందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. టీ–హబ్‌ను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతేడాది స్వయంగా సందర్శించి, స్టార్టప్‌లపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం అందించడానికి టాస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. -
వాట్సాప్‌లో వచ్చే ఆ కంటెంట్‌పై ఏం చేయలేం
న్యూఢిల్లీ : ఆన్లైన్ మెసేజింగ్ సైట్ వాట్సాప్‌లో వచ్చే అభ్యంతరకర కంటెంట్‌పై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. వాట్సాప్‌లో అప్లోడ్ చేసే ఈ కంటెంట్‌ను చెక్ చేయడానికి ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదని ప్రభుత్వం తెలిపింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ కావడం వల్ల, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేరని పేర్కొంది. చట్టం కిందకు వస్తే, ఆ కంటెంట్‌పై చర్యలు తీసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రాజ్యసభలో ఓ కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ మేరకు స్పందించారు. వాట్సాప్, మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చే అభ్యంతరకర వీడియోలను నిరోధించడానికి ప్రణాళికలేమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించారు. అభ్యంతరకర కంటెంట్లను పంపించిన లేదా ప్రచురించిన అలాంటి నేరాలను చట్టాలు డీల్ చేస్తాయని చెప్పారు. వాట్సాప్‌ల ద్వారా, మొబైళ్ల ద్వారా అభ్యంతరకర వీడియోలు అప్లోడ్ అవుతున్నట్టు కూడా గుర్తించినట్టు తెలిపారు. కానీ వాట్సాప్ మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం, మూడో పార్టీ వాటిని యాక్సస్ చేయలేమని స్పష్టంచేశారు. యూజరు ఆ కంటెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, సంబంధిత లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీలకు షేర్ చేయవచ్చని చెప్పారు. వీటితో చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, దాని సవరణ చట్టం 2008లో అభ్యంతరకర కంటెంట్‌ను పంపించిన లేదా ప్రచురించిన వారిని శిక్షించవచ్చని క్లారిటీ ఇచ్చారు. -
ఆధార్‌తో 67 కోట్ల ఖాతాలు అనుసంధానం
ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: దేశీయంగా ప్రస్తుతం 110 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా.. సుమారు 67 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయినట్లు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకోసం గ్రామాల స్థాయిలోని కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్సీ) ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. సీఎస్సీలు అందించే ఆధార్ సర్వీసులపై వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రసాద్ ఈ విషయాలు చెప్పారు. సీఎస్సీలు దాదాపు 22 కోట్ల ఆధార్ ఎన్రోల్మెంట్లకు సర్వీసులు అందించాయని చెబుతూ... ఇతర ఎన్రోల్మెంట్ ఏజెన్సీల నుంచి పోటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. సీఎస్సీ బిజినెస్ మోడల్ మరింతగా రూపాంతరం చెందుతుందని, మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఇంకా కొత్త సర్వీసులు, పథకాలను ఈ నెట్వర్క్ ద్వారా గ్రామ స్థాయికి చేర్చనున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సీఎస్సీల్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారని, మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాబోయే 4–5 ఏళ్లలో ఈ సంఖ్య ఒక కోటికి చేరవచ్చన్నారు. ఆధార్, మొబైల్ నంబర్‌తో జన్‌ధాన్ ఖాతాలను అనుసంధానం చేసి, సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే బదలాయించడం వల్ల ఖజానాకు రూ. 50,000 కోట్ల మేర ఆదా అయ్యిందని చెప్పారు. ఇది గతంలో మధ్యవర్తుల జేబుల్లోకి చేరేదన్నారు. -
కేంద్రమంత్రి కూతురు రిసెప్షన్‌కు కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ కూతురు వివాహ విందుకు ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తాజ్హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. -
బిట్‌కాయిన్‌పై జైట్లీ సమావేశం
వర్చువల్ కరెన్సీలతో ఎదురయ్యే సమస్యలపై చర్చలు న్యూఢిల్లీ: బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల వల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ మహర్షి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్‌రాయ్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బిట్ కాయిన్‌పై చర్చించినప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో బిట్‌కాయిన్‌పై దేశీయంగా పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోతుండటంతో దీన్ని ప్రాధాన్య అంశంగా కేంద్రం పరిగణిస్తోంది. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని ఎదుర్కొనే విషయమై చర్యలు సూచించేందుకు గాను ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ ఓ కమిటీని నియమించింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలను చట్టబద్ధం చేసే విషయంలో గత నెలలో ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా ఆహ్వానించింది. మరోవైపు వర్చువల్ కరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆర్బీఐ సైతం దీనిపై పెట్టుబడి పెట్టేవారిని, ట్రేడర్లను ఇటీవలి కాలంలో పలుమార్లు హెచ్చరించింది కూడా. దేశీయంగా బిట్ కాయిన్లో ట్రేడింగ్‌కు పలు ఎక్సే్చంజ్‌లు ఉండగా, ఒక్క ‘జెబ్‌పే’ సంస్థలోనే రోజూ 2,500 మంది చేరుతుండటం దీనికున్న ఆకర్షణకు నిదర్శనం. ఇటీవల వన్నా క్రై వైరస్‌తో కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపజేసిన సైబర్ నేరగాళ్లు బిట్‌కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయడంతో, దాని విలువ అమాంతం పెరగడం తెలిసిందే. -
ఐటీ లేఆఫ్స్: గోరంతైతే, కొండంత చేస్తున్నారు
ఐటీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న లేఆఫ్స్ ఆందోళన తెలిసిందే. భారీ ఎత్తున్న కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తున్నారంటూ పలు రిపోర్టులు టెకీల గుండెల్లో దడలు పుట్టిస్తున్నాయి. అయితే ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అతిశయోక్తిగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ''పర్ ఫార్మెన్స్ ఆధారంగా సాధారణంగా ఉద్యోగులపై వేటు వేయడం ప్రతి ఇండస్ట్రిలో ఓ అంతర్గత భాగం. దీన్ని మరీ అతిశయోక్తి చేయడం అంత మంచిది కాదు. ఆందోళన చెందడానికి ఎలాంటి కారణాలు లేవు. సాధారణంగా జరిగే ప్రక్రియను కొండంత చేసి చూస్తున్నారు'' అని మంత్రి చెప్పారు. తమ మంత్రిత్వశాఖ లేఆఫ్స్ పరిస్థితిపై ఎప్పడికప్పుడూ దేశీయ ఐటీ సీఈవోలతో సంప్రదిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ప్రత్యక్షంగా 40 లక్షల మందికి, పరోక్షంగా 1.6 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. సాఫ్ట్ బ్యాంకు, అమెజాన్, అలీబాబాలతో దేశీయ స్టార్టప్ స్పేస్ రన్ అవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేశారు. ఇంటర్నెట్ స్పేస్ లో విదేశీ నగదు ఫండింగ్ కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పక్షపాతం చూపించదని పేర్కొన్నారు. -
30 లక్షల ఐటీ ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగంలో మందగమనంలాంటిదేమీ లేదని 2025 నాటికల్లా పరిశ్రమలో 25–30 లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరగగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. గడిచిన మూడేళ్లలో దేశీ ఐటీ కంపెనీలు 6 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయని ఆయన వివరించారు. గత మూడేళ్లలో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పనితీరు గురించి వివరిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఐటీ కంపెనీలు 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.3 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఐటీ పరిశ్రమ గణనీయంగా ఎదుగుతోందని, రాబోయే నాలుగైదేళ్లలో కొత్తగా 20–25 లక్షల ఉద్యోగాల కల్పన జరగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేసినట్లు ప్రసాద్ చెప్పారు. -
'ఐటీ సెక్టార్ లో 20-25 లక్షల ఉద్యోగాలు'
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రి ఇంకేముంది? భారీ ఎత్తున్న కుప్పకూలిపోతుంది.. ఓ వైపు అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావంతో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందంటూ రిపోర్టులు వస్తున్నాయి. కానీ ఈ రిపోర్టులన్నీ అసత్యమేనని ఇప్పటికే ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ ప్రకటించగా.. తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఆ రిపోర్టులను కొట్టిపారేస్తున్నారు. వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ సెక్టార్ లో 20 లక్షల నుంచి 25 లక్షల అదనపు ఉద్యోగాల కల్పన ఉంటుందని హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు పడిపోతున్నాయనే రిపోర్టులను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, ఒక్కసారి డిజిటల్ టెక్నాలజీ వచ్చాక, ఏమేర ఉద్యోగవకాశాలు పెరుగుతాయో మీరే చూస్తారంటూ మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో, 80 దేశాల్లో భారతీయ ఐటీ ఇండస్ట్రి విస్తరించి ఉందని, ప్రత్యక్షంగా 40 లక్షలమందికి, పరోక్షంగా 1.3 కోట్ల మందికి ఇది ఎంప్లాయీమెంట్ కల్పిస్తుందని పేర్కొన్నారు. నాస్కామ్ అంచనాల ప్రకారం వచ్చే నాలుగు నుంచి ఐదేళ్లలో ఐటీ పరిశ్రమలో సుమారు 20-25 లక్షల అదనపు ఉద్యోగాలు ఖాయమని తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంటే 600 లక్షల కోట్లని పేర్కొన్నారు. గత మూడేళ్లలో దేశీయ ఐటీ రంగంలో సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగవకాశాలు లభించినట్టు తెలిపారు. 2016-17లో 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. -
ట్రంప్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి
బెంగళూరు: యుఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంపై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని వ్యాఖ్యానించారు. దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు శనివారం వరుస ట్వీట్లలో ఐటీ కంపెనీల సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటా తదితర అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు. బెంగళూరులో దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు. బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో భారతీయ ఐటి కంపెనీలు ప్రపంచాన్ని జయించాయి, ఇప్పుడు భారతదేశంవైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ‘డిజిటల్ ఇండియా’తో విస్తృత మార్కెట్ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలవైపు చూడాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. కాగా బై అమెరికా, హైర్ అమెరికా అంటూ హెచ్-1బీ వీసాల విధానంపై కఠిన వైఖరి అనుసరిస్తున్న ట్రంప్ ఇటీవల కొత్త కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. తమ ఉద్యోగాలు తమకే కావాలన్న నినాదంతో వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. Opportunities in emerging areas of Artificial Intelligence, big data etc present a huge opportunity for Indian IT companies. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 Indian IT companies create jobs they do not steal jobs either in USA or in any other country. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 -
'షేమ్ ఫుల్.. క్షమాపణ చెప్పండి'
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆధార్ కార్డు సమాచారాన్ని బహిర్గతం చేసిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ధోనికి మరో ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించారు. 'ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్... ధోని కార్డు వివరాలు లీక్ చేశారు. ఇది అవమానకరం. మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ధోనికి మరో ఆధార్ కార్డు మంజూరు చేయాలి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన పని ధోని భార్య సాక్షి సింగ్ కు కోపం తెప్పించింద'ని దిగ్విజయ్ సింగ్ ట్విటర్ లో పేర్కొన్నారు. ధోనీ తన ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మంత్రి రవిశంకర్ ప్రసాద్ పై సాక్షి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
న్యాయవ్యవస్థా కట్టుబడి ఉండాల్సిందే
♦ అధికారాల విభజనపై లోక్‌సభలో న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ♦ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం కష్టమని వ్యాఖ్య న్యూఢిల్లీ: అధికారాల విభజనకు న్యాయ వ్యవస్థ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఇతర ప్రజాస్వామిక మూల స్తంభాలకు నిర్దేశించిన విధంగానే న్యాయవ్యవస్థకు అధికారాలు నిర్దేశించారని కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభలో పేర్కొన్నారు. పలు తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు, శాసనవ్యవస్థ పరిధిలోకి అడుగుపెడు తోందని పలువురు సభ్యులు పేర్కొనడంపై ఆయన పైవిధంగా స్పందించారు. జడ్జీల నియామకాలపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... అణ్వస్త్రాలను ప్రయోగించే విషయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సీవీసీ నియామకాల్లోనూ ప్రధానిపై విశ్వాసం ఉన్నప్పుడు న్యాయమూ ర్తులను నియమించే విషయంలో ఎందుకు ఉండదని మంత్రి ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు. క్రికెట్ నిర్వహణ నుంచి మెడికల్ ప్రవేశ పరీక్షల వరకూ వివిధ అంశాల్లో సుప్రీంకోర్టు, శాసన వ్యవస్థ పరిధిలోకి జోక్యం చేసుకుంటోందని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ పేర్కొన్నారు. నీట్ ఎంట్రన్స్, క్రికెట్ నిర్వహణ అంశాల్లో కోర్టు తీర్పులపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. ప్రత్యక్ష ప్రసారాలు కష్టం: కోర్టు ప్రొసీడిం గ్స్‌ను లైవ్ టెలికాస్ట్ చేసే అంశంపై స్పందిస్తూ.. రెండు సభలే ఉన్నందున లోక్‌సభ, రాజ్యసభ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలు అందించడం సులభమమని, అయితే దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాల్లో ఇది కష్టమన్నారు. అయితే సభ్యుల సూచన పరిశీలించదగినదని పేర్కొ న్నారు. హైక్టోరుల్లో పెండెన్సీ కమిటీలపై సభ్యులు ప్రశ్నించగా.. కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని సమాధాన మిచ్చారు. తన దృష్టిలో పార్లమెంటు సుప్రీం అని, అయితే చట్టాలను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపిందని, అయితే దీన్ని కోర్టు కొట్టివేసిందని చెప్పారు. పూర్తయిన బడ్జెట్ ప్రక్రియ: లోక్‌సభలో ఆర్థిక బిల్లు ఆమోదం పొందడంతో 2017 – 18 ఏడాది బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది. ప్రతి పక్షాలు కాంగ్రెస్, బీజేడీ వాకౌట్ చేయడంతో 40సవరణలు చేసిన ఈ బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆర్థిక బిల్లుకు చేసిన సవరణల్లో...ఏప్రిల్ 1 నుంచి నగదు లావాదేవీలను రూ.2 లక్షలకు పరిమితం చేయడం, పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం లాంటివి ఉన్నాయి. -
‘బీజేపీకి ముస్లిం మహిళల భారీ ఓటింగ్’
గాంధీనగర్: ట్రిపుల్ తలాక్‌తో నష్టపోయిన ముస్లిం మహిళలు ఉత్తరప్రదేశ్‌లో పెద్దఎత్తున బీజేపీకి ఓటువేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 8వ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘ట్రిపుల్ తలాక్ వల్ల యూపీలో ముస్లిం మహిళలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. వారందరూ బీజేపీకే పట్టం కట్టారు’ అని తెలిపారు. ట్రిపుల్ తలాక్ కేవలం మత సంబంధమైన అంశం కాదనీ, అది న్యాయం, సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై బీఎస్పీ చీఫ్ మాయావతి, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఏం అఖిలేశ్ భార్య డింపుల్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మహిళల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20కి పైగా ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ తలాక్‌కు సవరణలు చేయడమో, నిషేధించడమో చేశారన్నారు. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలో రాజ్యాంగబద్ధంగా రామ మందిరాన్ని కట్టితీరుతామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని ప్రసాద్ వ్యక్తం చేశారు. ఇందుకోసం బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అసలు సమస్య రాహుల్ గాంధీయేనని ఆయన విమర్శించారు. తాము బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో యూపీ తరహాలో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
-
అమెరికా దృష్టికి వీసా సమస్యలు: రవిశంకర్
న్యూఢిల్లీ: ఐటీ నిపుణులకు ఉపయుక్తమైన హెచ్–1బీ వీసా ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడం పట్ల భారత్ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని కేంద్ర సమాచార సాంకేతికత శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఐసీఈజీఓవీ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలకు విలువను జోడిస్తున్నారని పేర్కొన్నారు. భారత ఐటీ కంపెనీలు ఫార్చ్యూన్–500 జాబితాలోని 75 శాతం కంపెనీలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. అవి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 4లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు. భారత ఐటీ నిపుణులు, కంపెనీలు అమెరికా కంపెనీలకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. -
ట్రిపుల్ తలాక్ నిషేధంపై ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి ఘజియాబాద్/లక్నో: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది మత సంబంధ విషయం కాదని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని శనివారం ఘజియాబాద్‌లో విలేకర్లతో అన్నారు. ‘ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం ప్రభుత్వం యూపీ ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం ప్రతి మతాన్నీ గౌరవిస్తుంది. అయితే మతారాధన, సంఘ దురాచారం కలసి మనుగడ సాగించలేవు. ట్రిపుల్ తలాక్ మహిళలకు గౌరవాన్ని నిరాకరిస్తోంది. ఈ దురాచారానికి ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చెప్పారు. మహిళకు గౌరవం, న్యాయం, సమానత్వమనే మూడు అంశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తుతుందని వివరించారు. మహిళలను బీజేపీ ఒక్కటే గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద అంశంపై సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు తమ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆదివారం ఆయన లక్నోలో డిమాండ్ చేశారు. -
'ఎన్నికలయ్యాక తలాక్‌పై కీలక నిర్ణయం'
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత త్రిపుల్ తలాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఆయన ఓ పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ తలాక్ వ్యవస్థ ముస్లిం మహిళల గౌరవానికి విలువ ఇవ్వడం లేదని, దానిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 'ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత తలాక్ విధానంపై కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది' అని ఆయన అన్నారు. సమాజంలో దుశ్చేష్టలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మూడు పాయింట్లపై కేంద్రంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఈ విషయానికి మతానికి సంబంధం లేదని, ఇది ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయం అని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల విశ్వాసాలను, నమ్మకాలను కేంద్రం గౌరవిస్తుందని, ఆ పేరిట చేసే దుశ్చర్యలకు మాత్రం అనుమతించబోదని అన్నారు. -
మొబైల్‌కు చెల్లు.. ఆధార్ చాలు!
నగదు చెల్లింపులు, స్వీకరణకు ఆధార్ పే • త్వరలోనే ప్రారంభం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి • ఆధార్‌తో రెండేళ్లలో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు వెల్లడి న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోయినా... దగ్గర డెబిట్ కార్డు లేకున్నా... ఆధార్ నంబర్ ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు... ఎక్కడైనా సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు. నగదు తీసుకోవొచ్చు. ఆధార్ నంబర్‌తో చెల్లింపులు, నగదు స్వీకరణలకు వీలు కల్పించే ‘ఆధార్ పే’ సేవను అతి త్వరలోనే ప్రభుత్వం పట్టాలెక్కించనుంది. ‘‘ఆధార్ పే సేవను ప్రారంభించబోతున్నాం. దీంతో నగదు చెల్లింపులకు ఫోన్‌ను తమ వెంట తీసుకుని వెళ్లనవసరం లేదు. ఏ దుకాణానికైనా వెళ్లి తమ ఆధార్ నంబర్ చెప్పి, వేలి ముద్రలు వేయడం ద్వారా నగదు చెల్లించవచ్చు, స్వీకరించవచ్చు’’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఆధార్ పే సర్వీస్ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. కొన్ని బ్యాంకులు ఆధార్ పేకు సంబంధించి ఇప్పటికే సొంతంగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటి పనితీరును పరీక్షిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా పనిచేసే భీమ్ యాప్‌ను అన్ని చెల్లింపులకు వీలుగా ఇటీవల కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, భీమ్ యాప్‌ని ఆధార్ చెల్లింపుల విధానంతో అనుసంధానించనున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 111 కోట్ల మందికిపైగా ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సమాచార దుర్వియోగంపై ప్రజలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆధార్ చట్టం ప్రజల సమాచార గోప్యతను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 49 కోట్ల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం ‘‘ఆధార్‌ను మునుపటి ప్రభుత్వం ప్రారంభించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఆ సమయంలో ఇది కేవలం ప్రజల డిజిటల్ గుర్తింపుగానే ఉంది. నరేంద్ర మోదీ సర్కారు మాత్రం చాలా చర్యలను చేపట్టింది. దీంతో ఆధార్ అనేది ఆర్థికపరంగా శక్తిమంతమైన ఉపకరణంగా, భవిష్యత్తును మార్చేదిగా మారిపోయింది’’ అని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 49 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉన్నాయని, ప్రతి నెలా రెండు కోట్ల ఖాతాలు ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు. ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపుల విధానం ఇప్పటికే అమల్లో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 33 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. లావాదేవీలకు ఆధార్‌ను ఉపయోగించడం వల్ల 2014–15, 2015–16లో రూ.36,144 కోట్లు ఆదా అయినట్టు చెప్పారు. 2014 మేలో ఎన్డీఏ సర్కారు ఏర్పాటయ్యే నాటికి 63.22 కోట్ల ఆధార్ నమోదు జరగ్గా... గతేడాది అక్టోబర్ వరకు రోజుకు 5–6 లక్షల చొప్పున ఆధార్ నమోదు జరుగుతూ వచ్చింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆధార్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఆధార్ నమోదు, వివరాల అప్డేట్కు సంబంధించి వినతులు రోజుకు 7–8 లక్షలకు పెరిగిపోయాయి. -
వారంలోగా ప్లాన్ సిద్ధంచేయాలని టెల్కోలకు ఆదేశం
నగదు రహిత లావాదేవీల పెంపుపై ఐటీ మంత్రిత్వశాఖ దృష్టిసారించింది. నగదు రహిత లావాదేవీలు పెంపుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని మొబైల్ టెలిఫోన్ సర్వీసు కంపెనీలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. వారంలోగా తమ ప్రణాళికలు తయారుచేయాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శుక్రవారం నిర్వహించిన జియో, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్తో పాటు మరికొందరి టెల్కోల భేటీలో మంత్రి ఈ విషయాలు స్పష్టంచేసినట్టు అధికారులు పేర్కొన్నారు. . డిజిటల్ పేమెంట్ల ప్రకటనతో పాటు, ఫీచర్ల ఫోన్లనలో కూడా ఈ-పేమెంట్ల చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. వారంలోగా ప్రణాళికను తయారుచేసేందుకు వొడాఫోన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు పరిష్కార మార్గాలను కూడా టెల్కోలు సూచించాలని ఆయన కోరారు. ఈ విషయంలో తమకు సాధ్యమైనంత రీతిలో టెల్కోలకు సాయపడతామని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి చెప్పారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటలైజ్ సర్వీసులను అందించడానికి టెల్కోలు అత్యవసరంగా వారి సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెల్కోలు కనెక్టివిటీ సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. వెంటనే తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ప్రభుత్వ రంగ కంపెనీ బీఎస్ఎన్ఎల్ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సర్వీసుల ప్రారంభించడానికి అనువుగా టెలికాం కంపెనీలు సన్నద్ధమవ్వాలని ఆదేశించినట్టు అధికారులు చెప్పారు. -
1000 శాతానికి పెరిగిన ఆ లావాదేవీలు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం డిజిటల్ లావాదేవీలు ఏకంగా 400-1000శాతం రేంజ్లో పెరిగాయని న్యాయ, ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ లావాదేవీల్లో మాస్టర్, వీసా కార్డుల లావాదేవీలను కలుపలేదని, కార్డుల వాడకం కలుపకుండానే డిజిటల్ లావాదేవీల్లో ఈ మేరకు నమోదుకావడం విశేషమని పేర్కొన్నారు. ఓ టీవీ చానల్, వెబ్సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను తెలిపారు. ఫ్రీ-టూ-ఎయిర్ చానల్ డిగిశాలను మంత్రి ప్రారంభించారు. ఈ చానల్ దూరదర్శన్ డీటీహెచ్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. క్యాష్ లెస్ ఇండియా వెబ్సైట్ కూడా ఆయన లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించున్నారు. దూరదర్శన్ ప్లాట్‌ఫామ్ ను మొత్తం 2 కోట్లకు పైగా ప్రజలు వాడుతున్నారు. వారిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు. ప్రజలు ఎడ్యుకేట్ అయితే ఈ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతాయో మనం అర్థంచేసుకోగలమని ప్రసాద్ వారికి చెప్పారు. ఈ-వాలెట్ల లావాదేవీలు రోజుకు 17 లక్షల నుంచి 63 లక్షలకు పెరిగినట్టు పేర్కొన్నారు. వీటి విలువ కూడా రూ.52 కోట్ల నుంచి రూ.191 కోట్లకు ఎగిసినట్టు వెల్లడించారు. రూపే కార్డు ద్వారా లావాదేవీలు రోజుకు రూ.16 లక్షలు, యూపీఏ లావాదేవీలు రోజుకు 48వేలకు పెరిగినట్టు తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల, పన్నుఎగవేత తప్పి, దేశ ఆర్థికవ్యవస్థ మెరుగవుతుందన్నారు. బ్యాంకులోకి వచ్చిన నగదును ప్రజల సంక్షేమం కోసం వాడతామని హామీ ఇచ్చారు. -
కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం
డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్ అంశాలపై చర్చ న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టాప్ బిలియనీర్ అరుున బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో గురువారం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్, ఈ-అగ్రికల్చర్ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి అపార వృద్ధి అవకాశాలు ఉన్నారుు. ఇది తమకు అనుకూలమైన సమయమని భావిస్తున్నాం’ అని బిల్ గేట్స్ సమావేశం అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని కొత్త అప్లికేషన్‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రధాన్యమిస్తాం. మా ఫౌండేషన్ కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తుంది’ అని వివరించారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కి బిల్ గేట్స్ సహవ్యవస్థాపకుడు అనే విషయం తెలిసిందే. ‘ఈ-అగ్రికల్చర్, డిజిటల్ హెల్త్, ఈ-పేమెంట్స్ వంటి అంశాలపై బిల్ గేట్స్ తన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆధార్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి అంశాల గురించి నేను గేట్స్‌కు వివరించాను’ అని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఆ వ్యాఖ్యలు కుట్రపూరితం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితమైనవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. జాతి గర్వించదగ్గ దిగ్గజం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని, ఆయన్ను పొగుడుతూ నెహ్రూను నిందించటం అన్యాయమని తెలిపారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రూమర్స్ప్రెడింగ్ సొసైటీ అని ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలసి దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జైపాల్‌రెడ్డి వివరించారు. -
‘ఆధార్ చైర్మన్‌కు కేబినెట్ హోదా లేదు’
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులకు సంబంధించిన యూఐడీఏఐ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) చైర్మన్‌కు తమ ప్రభుత్వం కేబినెట్ హోదా ఇవ్వదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం చెప్పారు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని, కానీ తమ ప్రభుత్వం యూఐడీఏఐ చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇచ్చేందుకు సముఖంగా లేదని స్పష్టం చేశారు. ఏపీ కేడర్ 1977 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.సత్యనారాయణను యూఐడీఏఐ చైర్మన్‌గా మరో ఇద్దరిని సభ్యులుగా ప్రమాణం చేయించారు. -
గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు
న్యూడిల్లీ: దేశాల మధ్య అంతర్జాతీయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించే గ్లోబల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోందని లా అండ్ జస్టిస్, ఐటీ శాఖామంత్రి రవి శంకర ప్రసాద్ తెలిపారు. తాము దేశానికి పెట్టుబడులు ఆహ్వానిస్తూనే, శ్రీఘ్రంగా వివాదాలను పరిష్కరించే వ్యవస్థమీద దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు. భారతదేశ పెట్టుబడిదారులకు ఒక సాహసోపేతమైన వివాద పరిష్కార వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రపంచ మధ్యవర్తిత్వ కేంద్రంగా మారే లక్ష్యంతో ఉన్నామని బ్రిక్స్ దేశాల ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అంశంపై నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి చెప్పారు. ముంబై, ఢిల్లీ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో రవి శంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యాపార వృద్ధి ఉంటే, వివాదాలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో ఒక బలమైన మధ్యవర్తిత్వ ఫోరమ్ ఉండాల్సి అవసరం ఉందని ప్రసాద్ వివరించారు. దేశంలో ఉత్తమ న్యాయమూర్తులున్పప్పటికీ, వారు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సందర్భాలలో వారికి ప్రాతినిధ్యం లభించడంలేదని తెలిపారు. ఐదుగురు సభ్యుల బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా , దక్షిణ ఆఫ్రికా మధ్య బలమైన మధ్యవర్తిత్వ ఫోరం కోసం ఒక అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఐదు బ్రిక్స్ దేశాల మధ్య 2015 లో 242 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయటకు క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అయితే నేటి నుంచి మూడు రోజుల పాటు టీటీడీ శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంది. శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు కేంద్రమంత్రికి అందజేశారు. -
‘మైగవ్’లోకి 15 కోట్ల మంది!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మైగవ్’ ప్లాట్‌ఫాం ప్రజలకు ఎంతో చేరువవుతుందని, భవిష్యత్‌లో ఇందులో 15 కోట్ల మంది చేరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తై సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘డిజిటల్ ఇండియాలో మైగవ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి నెట్ న్యూట్రాలిటీ, స్మార్ట్ సిటీస్ తదితర అన్ని అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటానికి, వారితో మమేకం అవడానికి ఇదొక ముందడుగు’ అని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇందులో 35 లక్షల మంది చేరినట్లు తెలిపారు. మన దేశంలో మొబైల్ ఫోన్ యూజర్లు 103 కోట్ల మంది ఉన్నందున ‘మై గవ్’లో 10-15 కోట్ల మంది చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. సామాన్యలు సాధించిన విజయాలను ఈ పోర్టల్ ద్వారా అందరికీ తెలియజేయొచ్చని, టెక్నాలజీ సాయంతో భారత్ ముఖ చిత్రాన్ని మార్చొచ్చన్నారు. ఇదే మైగవ్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. -
‘ప్యానిక్ బటన్ వస్తోంది'
సాక్షి, హైదరాబాద్: అపాయంలో చిక్కుకున్న వారి సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరవేసేందుకు సెల్ఫోన్లలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్యానిక్ బటన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అప్పటి నుంచి మార్కెట్లోకి వచ్చే అన్ని సెల్ఫోన్లలో ఈ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళల భద్రతకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, భద్రతకు, సెల్ఫోన్లను అనుసంధానం చేయాలని భావించి ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 5 లేదా 9 నంబర్లు ప్యానిక్ బటన్‌గా పనిచేస్తుందని, దాన్ని నొక్కగానే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, కుటుంబసభ్యులు లేదా స్నేహితులకు సమాచారం వెళ్తుందని వివరించారు. కాగా, ప్రమాదంలో ఉన్నవారు ఏ ప్రాంతంలో ఉన్నారో సులభంగా తెలుసుకునేందుకు అన్ని ఫోన్లలో అంతర్గతంగా (ఇన్‌బిల్ట్) జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఫోన్ తయారు చేసే సమయంలోనే జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఉండేలా ఏర్పాటు చేయబోతున్నారు. 2018 జనవరి నుంచి అన్ని కొత్త ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
ఆధార్ @100 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డును తీసుకున్నవారి సంఖ్య మరి కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటబోతోంది. ప్రస్తుతం 99.91 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఈ వివరాలు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయలేదు. సోమవారం దీనిపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేయబోతున్నారు. -
వచ్చే ఏడాది మార్చి నాటికి పోస్టల్ చెల్లింపుల బ్యాంకు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా పేమెంట్స్ బ్యాంక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కార్యకలాపాలు ప్రారంభం కాగలవని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే దీనికి సూత్రప్రాయ ఆమోదం లభించినందున త్వరలో క్యాబినెట్ ముందు కూడా ఈ ప్రతిపాదన ఉంచనున్నట్లు మంగళవారం డిజిటల్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. బ్యాంకింగ్, బీమా పథకాలు మొదలైన వాటి డెలివరీ సేవల కోసం థర్డ్ పార్టీగా ఇండియా పోస్ట్‌తో చేతులు కలిపేందుకు దాదాపు 60 పైగా అంతర్జాతీయ కన్సార్షియంలు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోర్ బ్యాంకింగ్ విధానాలు పాటిస్తున్న ఇండియా పోస్ట్ శాఖలు 2014లో కేవలం 230 మాత్రమే కాగా ప్రస్తుతం 20,494 పైచిలుకు శాఖలకు వీటిని విస్తరించినట్లు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ నాటికి మొత్తం 25,000 శాఖల్లోనూ కోర్ బ్యాంకింగ్ విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. -
20 వేల పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్
న్యూఢిల్లీ: దాదాపు 20,106 పోస్టాఫీసు శాఖలకు కోర్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విస్తరించినట్లు టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2014 మేలో వీటి సంఖ్య 230 మాత్రమేనని సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్వీటర్లో పేర్కొన్నారు. కోర్ బ్యాంకింగ్ సదుపాయాలతో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు తమ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవచ్చని మంత్రి తెలిపారు. చెల్లింపుల బ్యాంకు ఏర్పాటు కోసం పోస్టల్ విభాగానికి 2015 సెప్టెంబర్ 7న రిజర్వ్ బ్యాంక్ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్స్ రాకపోతే..
చర్యలు తప్పవు: రవి శంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందించడంలో విఫలమైతే.. అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251’ ఉదంతాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడవ్ 251’ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా తయారు చేస్తుంది? రూ.251లకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా? బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా? లేదా? వంటి తదితర అంశాలపై తమ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ కూడా రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తోంది. -
రాష్ట్రంలో ‘నిక్’కు ఓకే: రవిశంకర్ ప్రసాద్
* విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో పోస్టల్ హబ్‌లు * అమరావతిలో పోస్టల్ ఎక్స్ఛేంజ్ సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏపీలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తాం. రాష్ర్టంలోని పోస్టాఫీసులన్నింటినీ కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడంతోపాటు డిజిటలైజ్ చేస్తాం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పోస్టల్ హబ్స్ ఏర్పాటు చేస్తాం. ఈ-కామర్స్ పోస్టల్ పార్సిల్ విభాగాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాజధాని అమరావతిలో కొత్తగా పోస్టల్ ఎక్స్ఛేంజ్ మంజూరు చేస్తున్నాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రూ.80.02 కోట్లతో ఏర్పాటు చేయనున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) కేంద్రానికి విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖలోని సిరిపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ సెంటర్ కోసం ఎస్టీపీఐ డెరైక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్, వుడా వీసీ బాబూరావునాయుడులు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఎన్నిసార్లు పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు: తాను ఎన్నిసార్లు ఏపీలో పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వర్సిటీలను కొన్ని శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం బాబు మాట్లాడుతూ... ఏపీ గ్రోత్ రేట్ 10.5 శాతంగా ఉందన్నారు. బీపీఓ సేవలను విశాఖకు విస్తరించండి బిజినెస్ ప్రొసెసింగ్ ఔట్ సోర్సింగ్(బీపీవో) సేవలను విశాఖకు విస్తరించాలని ఐటీ శాఖ అధికారులను రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం విశాఖపట్నంలో తపాలా, బీఎస్ఎన్ఎల్, ఐటీ, ఎన్ఐసీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జూన్ నాటికి అధునాతన టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో అధునాతన పార్సిల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. -
'శర్మ చర్య సమర్థనీయం కాదు'
న్యూఢిల్లీ: పటియాలా కోర్టు ఆవరణలో తమ పార్టీ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ శర్మ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. హింసాత్మక చర్యలకు ఎవరూ పాల్పడినా తప్పేనని చెప్పారు. ఇటువంటి చర్యలను బీజేపీ ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు. క్యాంపస్ లో జాతివ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు. రాజద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కేసు విచారణ సందర్భంగా పటిపాలా కోర్టు ఆవరణలో జరిగిన ఘర్షణలో శర్మ వామపక్ష కార్యకర్తలపై దాడి చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. తన చర్యను శర్మ సమర్థించుకున్నారు. సమయానికి చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిననంటూ రెచ్చిపోయారు. -
టెలికంకు 41 లక్షల మంది సిబ్బంది అవసరం!
న్యూఢిల్లీ: వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి చెందుతోన్న భారత టెలికం రంగానికి 2022 నాటికి 41 లక్షల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమౌతారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రజలకు శిక్షణనిచ్చే నిమిత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (ఎంఎస్డీఈ) మంత్రిత్వశాఖ మధ్య ఒక పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డాట్, ఎంఎస్‌డీఈలు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన జాతీయ ఆక్షన్ ప్లాన్ అభివృద్ధి చేయడంతోపాటు దాన్ని టెలికం రంగంలో అమలు చేయనున్నారు. టెలికం రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది శిక్షణ కోసం ఎంఎస్డీఈ, డాట్లు సంయుక్తంగా ఆర్థిక చేయూత అందించనున్నాయి. -
గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యలపై కమిటీ
ఎంపీ పొంగులేటి లేఖకు స్పందించిన కేంద్రం సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసిందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశారు. గ్రామీణ పోస్టల్ సేవలను క్రమబద్ధీకరించడంతోపాటు వారి జీతభత్యాలను పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడానికి సుప్రీం లేదా.. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఆర్థికశాఖ అనుమతితో సంబంధిత శాఖలో సీనియర్ అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారని పొంగులేటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏకసభ్య కమిటీ ద్వారా గ్రామీణ పోస్టల్ సేవకుల సమస్యలు, వారి డిమాండ్లు పరిష్కరించడానికి, వాటి అమలు సాధ్యాసాధ్యాలు, జీతభత్యాల పెంపు తదితర విషయాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అలాగే వారి ఉద్యోగ భద్రత, సర్వీస్ క్రమబద్ధీకరణ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసేందుకు రవిశంకర్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారన్నారు. -
కాల్డ్రాప్స్ విషయంలో కఠిన చర్యలు
టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ టెల్కోల సేవలు మెరుగుపడట్లేదని వ్యాఖ్య... న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం కంపెనీలు తమ కస్టమర్లను పెంచుకుంటున్నాయే తప్ప అధ్వాన్నంగా ఉంటున్న సేవల నాణ్యతను మెరుగుపర్చుకోవడం లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మొబైల్ కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ సోమవారం రాజ్యసభలో దీనిపై లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా పరిగణిస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిందిగా టెలికం కంపెనీలను ఆదేశించామని, ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ప్రసాద్ వివరించారు. ‘నేను కఠినంగా వ్యవహరించే మంత్రిని. సేవలు మెరుగుపడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటాము’ అని ఆయన తెలిపారు. వొడాఫోన్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీల చీఫ్‌లు కూడా సమస్యలను అంగీకరించి, సర్వీసులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు ప్రసాద్ చెప్పారు. దేశవ్యాప్తంగా 18 లక్షల పైచిలుకు ప్రైవేట్ కంపెనీల మొబైల్ టవర్లు ఉండగా, వీటిలో 35,000 టవర్లలో లోపాలు ఉన్నాయని ఒక సర్వేలో గుర్తించినట్లు మంత్రి వివరించారు. వీటిలో 20,000 దాకా టవర్లను సరిదిద్దడం జరిగిందని, మిగతావాటిని సరిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గడిచిన మూడు నెలల్లో ప్రైవేట్ టెల్కోలు 14,000 పైగా కొత్త టవర్లను ఏర్పాటు చేశాయన్నారు. కాల్ డ్రాప్ విషయంలో టెల్కోలపై జరిమానా విధించాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫర్సులు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను మళ్లీ లాభాల బాట పట్టిస్తానని ఆయన తెలిపారు. -
నెటిజన్ల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కేంద్రం
న్యూఢిల్లీ: మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తం చేయాలంటూ చేసిన ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఎలాంటి గోప్యతకు తావు లేకుండా ఉన్న తాజా పాలసీపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ఇది ముసాయిదానే తప్ప ఫైనల్ పాలసీ కాదంటూ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పౌరులు వినియోగిస్తున్న మెసెంజర్లనుద్దేశించి ఈ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన సోషల్ మీడియాకు వర్తించదని తెలిపారు. ప్రస్తుత ముసాయిదాను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు. ఇది ఫైనల్ కాదని, మరింత స్పష్టంగా దీన్ని మళ్లీ రూపొందిస్తామని ఆయన తెలిపారు. కాగా మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తం చేయాలంటూ కొత్తగా సిద్ధంచేసిన ‘సంకేత నిక్షిప్త సందేశాల పాలసీ’ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త ముసాయిదా ప్రకారం... వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా మరే ఇతర సేవల ద్వారా మొబైల్, కంప్యూటర్లో వచ్చే సందేశాలను మూల వాక్యాల రూపం(ప్లేన్ టెక్ట్స్ ఫార్మాట్)లో దాచి ఉంచాలి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వారు తయారుచేసిన ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 15లోగా కేంద్రానికి తెలపాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. కాగా సమాచారాన్ని సేకరణ ప్రక్రియభద్రతా సంస్థలకు కష్టంగా మారడంతో కొత్తగా తీసుకువస్తున్నామంటున్నఈ పాలసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందని విమర్శించారు. దీంతో కేంద్ర ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. -
'అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది'