Social Media
-
సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మేయర్ ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను రక్తదానం చేయకపోయినా రక్తం ఇస్తున్నట్టు నటించడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రక్తదానం చేసేందుకు చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, శిబిరంలో పాల్గొనేందుకు మొరదాబాద్ పట్టణ మేయర్ వినోద్ అగర్వాల్ కూడా అక్కడికి వచ్చారు. అయితే, వచ్చిన వ్యక్తి రక్తదానం చేయకుండా ఓవరాక్షన్ చేశారు. అయితే ఆయన రక్తదానం ఇచ్చినట్టు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.Uttarpradesh, Moradabad BJP mayor Vinod Agarwal did a fake for blood donation on the occasion of the Birthday of PM Narendra Modi. I am remembering that signature acting if you know. pic.twitter.com/6QhDaNmo0B— Mr.Haque (@faizulhaque95) September 20, 2024 అక్కడ రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసిన బెడ్‌పై పడుకుని రక్తం ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా డాక్టర్‌తో మాట్లాడుతూ.. తాను రక్తం ఇవ్వట్లేదని, కేవలం ఫోటోలు మాత్రమే దిగుతానని చెప్పి ఫోజు ఇచ్చాడు. అనంతరం బెడ్‌పై నుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, రక్తదానం ఇచ్చినట్టు దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాకుండగా.. రక్తదానం చేసి మీ బాధ్యతను నెరవేర్చండి అని రాసుకొచ్చారు. దీంతో మేయర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉంది ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఆయనపై వస్తున్న తీవ్ర విమర్శలకు తాజాగా మేయర్ స్పందించారు. తాను డయాబెటిక్ పేషంట్ అని చెప్పుకొచ్చారు. అందుకే తాను రక్తదానం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: అర్బన్ నక్సల్స్, తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయి -
రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
సలాం రామయ్య అంకుల్..! కంట తడి పెట్టించే వీడియో!
సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by 𝕃𝔼𝕀𝔸 ♡ The Golden Indie (@leia_the_golden_indie) బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట. లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.దీంతో రామయ్యంకుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్‌కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు. దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా. “ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. -
ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?
మనం సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్‌లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్ క్రియేటర్స్ ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్ ఓ పేపర్ బ్యాగ్‌లో ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు. ఆ తర్వాత ఆ డిజిటల్ క్రియేటర్లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది. కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్‌లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్ బెన్‌లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌ని క్లీన్ చేసి పడేయాలి. అప్పుడే అది రీసైకిలింగ్‌కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jordindian (@thejordindian) (చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!) -
డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ
ఇంజనీరింగ్ చదివి గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒక కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి డ్రీమ్ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్ పాట్ కొట్టేశాడు. గూగుల్‌లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్. తన డ్రీమ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్ తరువాత 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి చదివి గూగుల్‌లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్‌లో విధుల్లో చేరనున్నాడు.అభిషేక్ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూలకోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప సవాలే. ఎట్టకేలకు అభిషేక్ పట్టుదల కృషి ఫలించింది. "నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చా.. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే, ఇపుడిక నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను." అన్నాడు సంతోషంగా.అంతేకాదు “అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్. -
పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి అయిన ఇన్నాళ్లకి తన ఇంటి పేరును మార్చుకుంది. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత తన ఇంటిపేరును మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవల అలియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. జిగ్రా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె తన పేరు పక్కన ‘కపూర్’ను చేర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు జిగ్రా టైటిల్స్ లో కూడా తన పేరు అలానే ఉంటుందని గందరగోళం వద్దని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ భాగంగా శనివారం ‘‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్-2’’ లో జిగ్రా టీమ్‌తో పాల్గొంది. ఈ సమయంలో ఒక అభిమాని హాయ్ అలియా భట్ అని సంబోధించగా, ‘‘నేనిపుడు అలియా భట్ కపూర్ అంటూ స్పందించింది అలియా దీంతో అభిమానులలో ఆనందం , ఆశ్చర్యం రెండింటినీ రేకెత్తించింది. మన భారత దేశంలో ప్రాంతాలను బట్టి, వివాహం జరిగిన తరువాత భార్యకు భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. ఇంటి పేరు మార్చుకోవాలా? వద్దా? అనేది ఇది వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత 2022లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గంగూబాయి కతియావాడి, బ్రహ్మాస్త్రం, సడక్-2 లాంటి టాప్ మూవీలతోపాటు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. రణ్‌బీర్, అలియాకు రాహా అనే కూతురు ఉంది. వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా అక్టోబర్ 11న థియేటర్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి! -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
26 ఏళ్లుగా ముక్కులోనే ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ముక్క!..కట్‌చేస్తే ..!
చిన్నప్పుడూ చేసే పిచ్చిచేష్టల కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటాం. ఆ సమయంలో మన తల్లిందండ్రులు సకాలంలో స్పందించి కాపాడితే ఏ సమస్య ఉండదు. అదే సమయంలో వాళ్లు చూడకపోయినా లేదా మనం ప్రమాద బారిన పడిన విషయం గురించి ఇంట్లో వాళ్లక చెప్పకపోయినా..ప్రాణాంతక సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చిన్నతనంలో ఆకతాయి పనులతో ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. అయితే అతడి తల్లి సకాలంలో స్పందించి రక్షించే యత్నం చేసింది కూడా. అక్కడితో ఆ సమస్య సమూలంగా పరిష్కారంగాక పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారినపడి ఇబ్బంది పడ్డాడు. గమ్మత్తుగా ఆ సమస్య ఇటీవల పరిష్కారమయ్యింది. ఊహించని విధంగా ఏదో ఫన్నీగా ఆ సమస్య నుంచి బయటపడితే ఆ ఆనందం మాటకందనిది కదా. అలాంటి ఫీల్‌ని అనుభవిస్తున్నాడు అరిజోనా వ్యక్తి..ఏం జరిగిందంటే..అరిజోనాకు చెందిన 32 ఏళ్ల ఆండీ నార్టన్ అనే వ్యక్తి ఇన్నాళ్ల నుంచి పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గల కారణం తెలుసుకుని విస్తుపోయాడు. ఆ అనుభవాన్ని ఇన్స్టావేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆరేళ్లప్రాయంలో జరిగిన ఘటన కారణంగా ఇన్నాళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో అసౌకర్యానికి గురయ్యానా..అని తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యాడు. స్లీప్ అప్పియా, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో మొన్నటివరకు చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తుండగా ఆ సబ్బు నురుగకు పెద్దప్దెగా తుమ్ములు వచ్చాయి. అంతే ఆ తుమ్ముల్లో అతడి అనారోగ్య సమస్యలన్ని కొట్టుకుపోయాయి. ఆ తుమ్ముల కారణంగా ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకొచ్చింది. దాన్ని చూడగానే తన చిన్ననాటి ఘటన స్పురణకు వచ్చింది. 1990లలో జరిగా బాల్యపు ఘటన గుర్తుకొచ్చింది నార్టన్కి. లెగో బ్రాండ్‌కి సంబంధించిన చిన్న ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటూ దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. ఇది గమనించిన వాళ్ల అమ్మ ఆ బోమ్మను తొలగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఓ చిన్న ముక్కలో అతడి ముక్కులో ఇరుక్కుపోవడంతో దీర్ఘకాలికి అనార్యో సమస్యల బారిన పడ్డాడు. అనుకోని విధంగా వచ్చిన తుమ్ముల కారణంగా ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క బయటకు వచ్చి ముక్కు అంతా ఫ్రీగా ఉన్నట్లు అనిపించింది. దాన్ని చూడగానే బాల్యంలో జరిగిన ఘటన గుర్తుకొచ్చి..ఎంత సులభంగా ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంబరపడ్డాడు.ఆ విషయం నెట్టింట తెగ వైరల్ కావడంతో బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎలాంటి సర్జరీలు జరకుండా బయటపడ్డావని తెగ మెచ్చుకున్నారు. దీంతో ఇన్నాళ నుంచి నార్టన్ పడ్డ ఇబ్బందులకు తెరపడింది. హాయిగా ముక్కుతో గాలి పీల్చుకుంటున్నాడు కూడా. View this post on Instagram A post shared by 🇵🇭 Ben Havoc (@bigoompalumpia) (చదవండి: కూరగాయల షాపింగ్ గైడ్!) -
కూరగాయల షాపింగ్ గైడ్!
కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్ గైడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మార్కెట్లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్ గైడ్ నెటింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్లో చాలా విపులంగా వివరించి ఉంది. ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్ గైడ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.While going for market for vegetables my wife shared with me this👇 stating that you can use this as a guide 🤔🤔😃 pic.twitter.com/aJv40GC6Vj— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) September 13, 2024 (చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!
గడ్డకట్టే చలిలో గజగజలాడిపోయిన ప్రజలు అని వార్తల్లో వింటుంటాం. అంతెందుకు అందరూ ఇష్టపడే టైటానిక్ మూవీలో 1912 నాటి విపత్తు ఘన చూపించారు. ఆ మూవీలో అంట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతం ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయిన సీన్లోని హృదయవిదారక దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. అయితే దీని గురించి సినిమాల్లోనూ, వార్తల్లో వినటమే గానీ గడ్డకట్టే చలి ఎలా ఉంటుందో అనేది రియల్‌గా తెలియదు. ఆ ఫీల్ కావాలనుకుంటే ఈ మ్యూజియం వద్దకు వెళ్లిపోండి. అమెరికాలో టెన్నెస్సీలోని టైటానిక్ మ్యూజియం ఈ సరికొత్త అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. టైటానిక్ ఓడ మునిగినప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఉష్ణోగ్రత(రెండ డిగ్రీల సెల్సియస్)ని చవిచూడొచ్చు. 400కి పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలు కలిగి ఉన్న మ్యూజియం సందర్శకులకు ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది. గడ్డకట్టే నీటిలో అనుభవాన్ని పొందుతున్న సందర్శకులు వీడియోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ప్రతి సందర్శకుడు మంచుకొండను తాకిని ఫీల్ కలుగుతుందని చెబుతుండటం చూడొచ్చు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడూ చనిపోయిన యాత్రికులు ఎంత బాధ అనుభవించి ఉంటారో అని తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టారు.At the Titanic Museum you can find this basin filled with water, set to the exact temperature that the people in the surrounding waters would have had to swim in after the ship sank. The ocean temperature was about 30°F.pic.twitter.com/38e9jjXjEh— Massimo (@Rainmaker1973) September 11, 2024 (చదవండి: ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!) -
‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే పెంపుడు జంతువు శునకం. కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ప్రాణాలు కూడా ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం పదండి! A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW— TaraBull (@TaraBull808) September 12, 2024అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని ఆంబెలెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని చూసి కుక్క మనసు ఆగలేదు. అంబులెన్స్‌ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్ డ్రైవర్కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్‌లో తెగ వైరలవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. అసలు ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం పరమార్థం ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు. (ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!) -
అంత ఈజీగా స్మోకింగ్ అలవాటును వదిలేయొచ్చా..! ఏకంగా 24 ఏళ్లుగా..
కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. అలవాటు కాకుండానే ఉండాలి. మంచిది కాదు అని తెలిసి విడిచిపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. అందుకు ఎంతో బలమైన సంకల్పం ఉంటే గానీ సాధ్యంకాదు. ముఖ్యంగా సిగరెట్టు లాంటి అలవాట్లను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి ఏకంగా 24 ఏళ్లుగా ఉన్న అలవాటును సులభంగా స్వస్తి చెప్పి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సిగరెట్ట అలవాటు మానాలి అనుకునే వాళ్లు వెంటనే ఇది చదివేయండి.రిటైల్ అండ్ ఛానెల్ సేల్స్ ప్రొఫెషనల్ కులకర్ణి అనే వ్యక్తి 24 ఏళ్లుగా రోజుకు పది సిగరెట్లకు పైగా తాగేవాడు. అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఈ ఏడాది శ్రీ కృష్ణజన్మాష్టమి రోజు నుంచి సిగరెట్టు ముట్టకూడదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే అలా దాదాపు 17 రోజుల వరకు ఆ వ్యక్తి సిగరెట్టు జోలికే వెళ్లలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకోవడంతో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు అతడి సంకల్ప బలాన్ని మెచ్చుకుంటూ తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేగాదు కొందరూ ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా స్మోకింగ్ స్వస్తి చెప్పొచ్చు అంటూ సలహాలు ఇస్తు పోస్టులు పెట్టడం విశేషం. I have been smoking 10 cigarettes a day for the last 24 years daily.Don't want to do the math and arrive at a total, it's scary !On the day of Janmashtami this year, I decided to quit and it's been 17 days since I touched a cigarette.So happy for myself !!!— Rohit Kulkarni (@RohitKoolkarni) September 10, 2024 (చదవండి: "నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?) -
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
షార్ట్స్ వేసుకోకూడదా? యోగా ట్రైనర్‌కి చేదు అనుభవం..!
ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనలో మనకే వ్యతిరేకతన అనిపిస్తుంది. కొన్ని రకాల శిక్షణకు, ఆటలకు, వ్యాయమాలకు వెసులుబాటుగా ఉండే దుస్తులే ధరించాల్సి ఉంటుంది. తప్పదు. దీన్ని కొందరూ పెద్దవాళ్లు విశాల దృక్పథంతో అర్థం చేసుకునే యత్నం చేయాలి. లేదా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే సూచించొచ్చు. అంతేగానీ బహిరంగంగా వేరొకరి వేషధారణ గురించి అవమానకరంగా మాట్లాడటం సబబు కాదు. కానీ ఇక్కడ అలాంటి దిగ్బ్రాంతికర ఘటనే చోటు చేసుకుంది. బెంగళూరులో టానీ భట్టాచార్జీ అనే యోగా ట్రైనర్ షార్ట్స్ వేసుకున్నందుకు బహిరంగంగా ఓ వృద్ధ మహిళ అవమానించింది. ఇలాంటివి వేసుకోకూడదంటూ తన మాతృభాషలో అరుస్తూ మాట్లాడింది. అందుకు యోగా ట్రైనర్ మీకేంటి సమస్య అని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్న అదేపనిగా మాట్లాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టింది. చివరికీ ఆమెకు అర్థం కావడం లేదు లే అని సదరు యోగా ట్రైనరే పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్నా.. వెంటపడి మరీ అవమానించే పని చేసింది. అంతేగాదు ఆమె వేసుకున్న షార్ట్‌ని అక్కడున్న మరికొందరికీ చూపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడటం వంటివి చేసింది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునిక విలువల మధ్చ తీవ్రమైన చర్చకు దారితీసింది. కొందరూ ఆ వృద్ధ మహిళకు సపోర్ట్ చేయగా, మరికొందరూ మాత్రం సదరు యోగా ట్రైనర్‌ని లైట్ తీసుకోమని పట్టించుకోవద్దని సలహాలిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Tanny Bhattacharjee (@fit_and_fabb) (చదవండి: 'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!) -
'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!
ఇద్దరు ప్రయాణికులు ఒక్క ఫ్లైట్ జర్నీ చేయకుండా ఏకంగా 27 దేశాలు చుట్టొచ్చారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కార్బన్ ఉద్గారాలు లేకుండా ప్రయాణించి చూపారు. డబ్బుని కూడా ఆది చేశారు. అస్సలు ఫ్లైట్ జర్నీ చెయ్యకుండా అన్ని దేశాలు చుట్టిరావడం సాధ్యమేనా..?.అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా అన్ని దేశాలు ప్రయాణించగలిగారో చూద్దామా..!ఇటలీకి చెందిన టోమ్మాసో ఫరీనామ్, స్పెయిన్‌కి చెందని అడ్రియన్ లాపుఎంటే అనే ఇద్దరు గత వేసవిలో తమ అడ్వెంచర్‌ని ప్రారంభించారు. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వృక్ష సంపద, జంతువులతో సహవాసం చేసే ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే తాము ఈ సాహసం చేసినట్లు చెప్పారు ఇద్దరు. తమ జర్నీలో ఎక్కడ కార్బన్ ఉద్గారాలకు తావివ్వకూడదనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించారు. తాము సోషల్ మీడియాలో బోట్ హిచ్‌హైకర్స్ అనే రైడ్‌ని సంప్రదించి ప్రయాణించినట్లు తెలిపారు. ఇలాంటి జర్నీ చేసిన అనుభవం లేకపోయినా ధైర్యం చేసి మరీ ఇలా సెయిలింగ్ బోట్లో అట్లాంటిక్ మీదుగా ప్రయాణించినట్లు వివరించారు. ఆ తర్వాత మోనోహాల్ బోట్లో పసిఫిక్ మీదుగా ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ పనామా వరకు వెళ్లొచ్చినట్లు తెలిపారు. ఇలా తాము జర్నీ చేసినట్లు కుటుంబసభ్యులు, బంధువులకు చెబితే ఒక్కసారిగా వారంతా కంగుతిన్నారని చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు మిత్రులు. అంతేగాదు గల్ఫ్ ఆఫ్ పనామాలో సముద్రంలోని భయంకరమైన అలలతో చేసిన జర్నీఓ పీడకలని చెప్పారు. అయినప్పటికీ తాము తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీ చేయాలని అనుకోలేదని ధైర్యంగా చెప్పారు. ఇలా విమానంలో ప్రయాణించకుండా పర్యావరణానికి సహాయం చేయడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేయడం విశేషం. ఒక్కోక్కరికి ఇలా 27 దేశాలు చుట్టి రావడానికి కేవలం రూ. 6 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యింది. ఈ ఇద్దరు మిత్రులు 'ప్రాజెక్ట్ కునే'లో భాగంగా తమ కథనాన్ని ఆన్లైన్లో పంచుకోవడంతో నెట్టింట ఈ విషంయ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!) -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్‌లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్‌తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్‌ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్ సర్వ్ చేసినందుకు వెయిటర్లకు టిప్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు క్యూర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.చదవండి: స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడువెయిటర్ స్కానర్ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్ తీసి వెయిటర్ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు. ఇంతలో మరో హోటల్ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు. అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్ యాజమాన్యం దిండ్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.#Maharashtra: बीड में एक #Waiter खाने के बाद #Scanner लेकर #Car के पास आया और #Bill देकर पैसे की मांग की, लेकिन बिल का भुगतान करने की बजाय कार सवार उसे पकडकर एक किलोमीटर तक घसीटता ले गए. वेटर को पूरी रात बंधक बनाकर रखा और पिटाई भी की.#Maharashtracrime #maharashtranews pic.twitter.com/CF6wqnOC5S— Delhi Uptodate News (@DelhiUptodate) September 11, 2024 -
వరద బాధితుల కోసం వంగా గీత సాహసం
కాకినాడ, సాక్షి: వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారంలో ఉన్న నేతలంతా తటపటాయిస్తుంటే.. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీత (60) మాత్రం సాహసం ప్రదర్శించారు. వరద ఉధృతిని లెక్కచేయకుండా.. ట్రాక్టర్ ప్రయాణం చేసి బాధితుల దగ్గరకు చేరుకున్నారామె. బుధవారం వంగా గీత గోకువాడ, జమ్ములపల్లిలో రైతులు, ముంపు బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీటిని ట్రాక్టర్‌పై దాటి వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లపాటు ట్రాక్టర్పైనే ఆమె ప్రయాణం చేశారు. ఆమెతో పాటు కొందరు నేతలు వెంట వెళ్లారు. చివరకు.. ముంపు ప్రాంతాలకు చేరుకొని అక్కడి బాధితులను పరామర్శించారు. ‘‘గతంలో లేనంతా ఈసారి ఏలేరు వరద పిఠాపురాన్ని ముంచేసింది. వేలాది ఎకరాల వ్యవసాయ, ఉద్యానవన, సెరీ కల్చర్ పంటలు నీట మునిగాయి. అధికారులకు ప్రభుత్వానికి ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు 15 టీఎంసీలు ఉన్నప్పుడే మిగులు జలాలను క్రమక్రమంగా విడుదల చేసి ఉంటే ఇంత వరద ముప్పు ఉండేది కాదు. .. ఏలేరులో 6 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగు నీటికి, విశాఖ అవసరాలకు నీటిని వినియోగించుకున్నాం. వరద బాధితుల వద్దకు వెళ్ళి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. అధికారులను పంపించి ఆదుకోవాలి’ అని కోరారామె. ఎన్నికల ఫలితంలో సంబంధం లేకుండా.. తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని వంగా గీత చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇంత సాహసం చేసి తమ దగ్గరకు పరామర్శకు వచ్చిన గీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారుపవన్, ఉదయ్‌లపై పిఠాపురం రైతుల ఫైర్ఏలేరు వరదలో తమ పంటలు గత నాలుగు రోజులుగా నీట మునిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌పై పిఠాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదు. పవన్‌ను గెలిపిస్తే పిఠాపురాన్ని ప్రపంచమంతా చూస్తుందని జబర్దస్త్ నటులు చెబితే ఆనందపడ్డాం. తీరా ఇప్పుడు ఏలేరు వరదలో పిఠాపురం నియోజకవర్గం మునిగిపోతే టీవీలలో ప్రపంచం చూస్తోంది. ఎకరాకు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వరద ముంపుతో పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతులకు ఆహ్మహత్యే శరణ్యం’ అని పిఠాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ చంద్రబాబూ.. వైఎస్ జగన్ వార్నింగ్చదవండి: 'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు' -
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
గణేష్ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది. పోయిరావయ్య బొజ్జ గణపతి, మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి, హారతిచ్చి, జై బోలో గణేష్ మహారాజ్‌కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్, రాధికతోపాటు, ఆకాశ్ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్ ఆనంద్ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాగా గణేష్ చతుర్ధి అంటే అంబానీ ఇంట పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
ఇదేం పెర్ఫ్యూమ్ రా బాబు..! కొనుగోలు చేస్తారా ఎవరైనా ..?
పెర్ఫ్యూమ్ అంటే మంచి సువాసనభరితంగా చుట్టు ఉన్నవారిని తనవైపుకు ఆకర్షించేలా అటెన్ష్ తీసుకొస్తుంది. ఆ ఘుమాళింపు ముక్కుపుటలను తాకగానే అబ్బా అని మైమరచిపోయేలా ఉండే లగ్జరియస్ పెర్ఫ్యూమ్లను ప్రముఖ బ్రాండ్లు విడుదల చేస్తాయి. ఆ పేరుకి తగ్గ రేంజ్‌లోనే ఆ ఫెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫెర్ఫ్యూమ్ పేరు వినగానే కళ్లెర్రజేయడం ఖాయం. ఛీ ఇదేం ఫెర్ఫ్యూమ్ ఆ పేరేంటి అని చిరాకు పడిపోతారు. చెప్పాలంటే ఇలాంటి ఫెర్ఫ్యూమ్ని ఎవ్వరైనా కొనే సాహసం చేస్తారా అనే సందేహం రాకుండా ఉండదు కూడా. ఏంటా ఫెర్ఫ్యూమ్ కథా కమామిషు అంటే..దుబాయ్ రాజు కుమార్తె షేఖా మహ్రా అల్ మక్తూమ్ కొత్త పెర్ఫ్యూమ్ని టీచర్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెర్ఫ్యూమ్ని తన బ్రాండ్ మహ్రా ఎం పేరుతో విడుదల చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపి వివాదానికి దారితీసింది. ఆ టీజర్లో పెర్ఫ్యూమ్ పేరు "విడాకులు" అనే పదం చెక్కబడిన నల్లని సీసాపై ఉంది. విరిగిన గాజు, నల్లని చిరుతపులితో ఉండిన వీడియో వృత్తం 'డివోర్స్' ఇతి వృత్తాన్ని చెబుతున్నట్లుగా ఉంది. ఆ పెర్ఫ్యూమ్ లైన్ చూసి ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు. ఒకరేమో మహ్రా చాలా తెలివిగా, గౌరవప్రదంగా వ్యాపారం ప్రారంభించిందని ప్రశంసించగా, చాలామంది మాత్రం భర్త నుంచి విడిపోయాననే బాధతో మరీ ఇలా చేస్తుందా..?, ఆమె చాలా క్రియేటివ్ అంటూ వెటకారంగా పోస్టులు పెట్టారు. అయితే ఆమె ఇస్లామిక్ పద్ధతిలో ఇన్‌స్టాలో తన భర్తకు బహిరంగంగా ట్రిపుల్ తలాక అని విడాకులు ఇచ్చిన కొన్నివారాల తర్వాత ఇలా యువరాణి మహ్రా వివాదాస్పదమైన విధంగా టీచర్ని విడుదల చేయడంతో ఇంతలా ఊహగానాలకు తెరలేపింది. దీంతో నెటిజన్లు విడాకుల గురించే సోషల్ మీడియాలో ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యక్షంగా ఇలాంటి టీచర్ విడుదల చేసిందంటూ ఫైర్ అయ్యారు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని అయిన దుబాయ్ పాలకుడి కుమార్తె మహ్రా యూఏఈలో మహిళ సాధికారత, స్థానిక డిజైనర్ల తరుఫు న్యాయవాది. View this post on Instagram A post shared by @mahraxm1 (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
బాబోయ్ బొద్దింక! ముప్పు(క్కు)తిప్పలు పెట్టింది!
మన వంట ఇంట్లో బొద్దింకలు, ఈగలు,బల్లులు కనిపిస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొంతమందైతే బల్లి, బొద్దింకల్ని చూడగానే చాలా హడలిపోతారు. ఇవి ఆహారంలో చేరితే చాలా ప్రమాదం. ఇవన్నీమనకు తెలుసు. కానీ హాయిగా నిద్రపోతున్న మనిషి ముక్కులోకి బొద్దింక చేరి ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి మాంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన ముక్కులోకి చేరిపోయిందొక బొద్దింక. ఏదో అసౌకర్యంగా అనిపించి మెలకువ వచ్చింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అటు తిరిగి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజులకు విపరీతమైన నొప్పి మొదలైంది. దీనికి తోడు భరించలేని దగ్గు పట్టుకుంది. ఇది చాలదన్నట్టు ముక్కులోంచి దుర్వాసన రావడం మొదలైంది. అప్పుడు అనుమానంతో ముక్కు, చెవి, గొంతు డాక్టర్‌ను కలిసాడు. అయినా ఫలితం లేదు.బొద్దింకను ఎలా గుర్తించారు?ఎంతకీ తన బాధలనుంచి విముక్తి లభించకపోవడంతో శ్వాసకోశ , క్రిటికల్ కేర్ వైద్యుడిని కలిసాడు. స్టోరీ అంతా విన్నాక సదరు వైద్యుడు ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ చేయడంతో మన బొద్దింగ గారి గుట్టు రట్టు అయింది. శ్వాసనాళంలో కఫంతో కప్పి ఉన్న బొద్దింకను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ బొద్దింకను బయటకు తీసి, శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో దగ్గు, కఫం అన్నీ పోయి రోగికి ఉపశమనం లభించింది. దీంతో బాబోయ్ బొద్దింక అంటున్నారు నెటిజన్లు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్‌కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
మా తాత భారత స్వతంత్ర పోరాట యోధుడు: కమలా హ్యారిస్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన చిన్ననాటి భారత పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భాతరదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 10న) సందర్పంగా అమ్మమ్మ తాతయ్యలు పీవీ గోపాలన్-రాజమ్మలతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. భారత్ వెళ్లినప్పుడల్లా తాత తనను మార్నింగ్ వాక్కు తీసుకెళ్లేవారని తెలిపారు. అలాగే భారత స్వతంత్ర పోరాటంలో తాత పాత్రను వివరించారు. సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి తాత మాట్లాడేవారని అన్నారు. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని సోషల్ మీడియా ఎక్స్ రాశారు. అలాగే తన అమ్మమ్మ సహకారాన్ని కూడా హైలెట్ చేస్తు రాశారు. ఆమె మహిళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేలా భారతదేశం అంతటా ప్రయాణించేదని అన్నారు. అందువల్లే తనకు ప్రజాసేవ పట్ల నిబద్ధతగా ఉండటం, మంచి భవిష్యత్తు కోసం పోరాడటం వంటివి వారసత్వంగా వచ్చాయని అంటోంది. ఇలా హారిస్ తాను తన అమ్మమ్మ తాతయ్యల నుంచి సామాజికి విలువలు గురించి ఎలా నేర్చుకున్నానో చెప్పుకొచ్చారు. తరువాత తరాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా కీలకం అంటూ స్ఫూర్తిని కలిగించే తాతాయ్య అమ్మమ్మలందరికీ జాతీయ గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ఆమె కుటుంబ వారసత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం మీ తాత బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్‌లో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వాన్నే వ్యతిరేకించేలా తన సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడగలరని ప్రశ్నించారు. అంతేగాక ఆ సర్వీస్ స్వాత్రంత్య్రం అనంతరమే సెక్రటేరియట్ సర్వీస్‌గా మారిందని విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాదు క్షమించండి మిమ్మల్ని నమ్మలేం. ఇది కేవలం భారత సంతతి వ్యక్తులను బుట్టలో వేసుకునే రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శలు చేశారు.(చదవండి: శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!)