Dwayne Bravo
-
Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’!
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా మైదానంలో ఆల్‌రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు! రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్‌గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు శుభంకార్డు వేశాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్‌గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం. టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్లో 582 టి20 మ్యాచ్‌లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్‌లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై చిన్నోడు! ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇతర లీగ్‌లతో పోల్చుకుంటే ఐపీఎల్లో తన బౌలింగ్‌తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు. ఆటతో పాటే పాట! మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్లో రెండు సీజన్లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్లో 684 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్‌లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్‌లు), రసెల్ (523 మ్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్‌ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం బ్యాట్‌తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్‌లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్లో 17 టోర్నమెంట్ ఫైనల్స్‌లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్‌లో రెండు (2011/12, 2012/13), స్టాన్ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్‌టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్ఎల్ (2019), ఐఎల్టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సుదీర్ఘ కాలంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కనిపించనున్నాడు. -
కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బ్రావో
న్యూఢిల్లీ: టి20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్ టీమ్ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్చార్జ్గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు. -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు. గత సీజన్లో కోల్‌కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ కరేబియన్ లెజెండ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీకరించింది. మా కొత్త మెంటార్, డిజే 'సర్ ఛాంపియన్' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..కాగా బ్రావో ఐపీఎల్లో ఎప్పుడూ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్లో కూడా టీకేఆర్కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు. -
బ్రావో 'ది ఛాంపియన్'.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ నుంచి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అందులో ఒకడే దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు గాంచాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు వీరుడుగా నిలిచాడు. తన విరోచిత పోరాటాలతో విండీస్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందిచాడు. తన ప్రదర్శనతో, డ్యాన్స్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు కరేబియన్ అయినప్పటకి భారత్‌లో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.అయితే ఇకపై బ్రావో డ్యాన్స్‌లు మైదానంలో కన్పించవు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండీస్ దిగ్గజం.. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఎక్కడైతే తన కెరీర్ మొదలైందో అక్కడే ముగించనున్నాడు. సొంత ప్రజలముందే సగర్వంగా తనకు ఇష్టమైన ఆటనుంచి తప్పకోనున్నాడు. ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు బ్రావో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బ్రావో తన టీ20 క్రికెట్ జర్నీపై ఓ లుక్కే ద్దాం.టీ20 స్పెషలిస్టు.. విండీస్ హీరోబ్రావో ఒక టీ20 స్పెషలిస్టు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో విండీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మఖ్యంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బ్రావోది కీలక పాత్ర. ఈ రెండు మెగా టోర్నీల్లో బ్రావో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.విండీస్‌కే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్లో సైతం తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో కూడా దుమ్ములేపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ కరేబియన్ ధీరుడు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటకీ బ్రావో(154) పేరిటే ఉంది.స్లోయర్ బాల్స్ స్పెషలిస్టు..బ్రావో హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌తో పాటు అద్బుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్లోయర్ బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బ్రావో స్పెషాలిటీ. అంతేకాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా బ్రావో పేరు గాంచాడు. ఇవన్నీ అతడిని టీ20 క్రికెట్లో విలువైన ఆస్తిగా మార్చాయి.2021లో గుడ్బైబ్రావో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021 టీ20 వరల్డ్‌కప్ లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన చివరి సహచర ఆటగాళ్లు, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రావో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్లో 295 మ్యాచ్‌ల్లో విండీస్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో రికార్డు అదుర్స్..టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో 630 వికెట్లతో పాటు అతడు 6,970 పరుగులు కూడా చేశాడు.ఛాంపియన్ డ్యాన్స్..బ్రావో "ఛాంపియన్ డ్యాన్స్ వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ తీసినా ప్రతీసారి మైదానంలో డ్యాన్స్ చేస్తూ బ్రావో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇది 2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి బ్రావో ఈ విధంగా డ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం
విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రొఫెషనల్ క్రికెట్లో తనకు చివరి టోర్నీ అని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 40 ఏళ్ల బ్రావో ఇదివరకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బ్రావో సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2006 నుంచి ప్రొఫెషనల్ టీ20లు ఆడుతున్న బ్రావో తన కెరీర్లో మొత్తం 579 మ్యాచ్‌లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్ ఖాన్ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. "ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ సీజన్ నా చివరిది. కరీబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఉద్దేశిస్తూ.. ఎక్కడైతే మొదలు పెట్టానో, అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను.కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొన్న బ్రావో.. వెస్టిండీస్ తరఫున 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 6500 పరుగులు చేసి 363 వికెట్లు తీశాడు. బ్రావో ఖాతాలో 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి, 183 వికెట్లు తీశాడు. -
చరిత్రపుటల్లోకెక్కిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్‌లో రషీద్ 600 వికెట్ల క్లబ్లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు. టీ20ల్లో రషీద్‌కు ముందు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియమించింది. కరేబియన్ దీవులలో ఈ మెగా ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో బ్రావో సేవలను ఉపయెగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణయించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది. సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ పనిచేస్తున్నాడు. 40 ఏళ్ల బ్రావోకు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్లో కూడా అపారమైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవరాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర. అంతేకాకుండా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జట్లు టైటిల్స్‌ను సాధించడంలోనూ బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ జట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది. -
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా గయానా.. ఫైనల్లో పొలార్డ్ టీమ్ చిత్తు
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది -
'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. These two & their banter 😂💙 Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg — MI New York (@MINYCricket) July 29, 2023 చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి -
డ్వేన్ బ్రావో ఊచకోత.. అయినా గెలవలేకపోయిన సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమిని ఎదుర్కొంది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఇవాళ (జులై 17) జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినప్పటికీ సూపర్ కింగ్స్ గెలవలేకపోయింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు సీజన్ తొలి గెలుపును అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. మాథ్యూ షార్ట్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షార్ట్‌తో పాటు ముక్తర్ అహ్మద్ (20), మోసస్ హెన్రిక్స్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ సాంట్నర్, మోహిసిన్ ఖాన్, డ్వేన్ బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్.. ఛేదనలో తడబడింది. మార్కో జన్సెన్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే తొలి బంతికే క్లీన్ బౌల్డ్ కాగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (14) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బరిలోకి దిగిన లహీరు మిలంత (15), డేవిడ్ మిల్లర్ (14), మిలింద్ కుమార్ (3), మిచెల్ సాంట్నర్ (22) కూడా విఫలమైనా ఏడో నంబర్లో వచ్చిన బ్రావో సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు శక్తిమేరకు ప్రయత్నించాడు. అతనికి మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి, ఓటమిపాలైంది. -
ఇదేమి సిక్స్‌రా బాబు.. ఏకంగా స్టేడియం బయటకు! వీడియో వైరల్
మేజర్ లీగ్ క్రికెట్-2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగల్గింది. సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో( 39 బంతుల్లో 76) మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. కెప్టెన్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే వంటి టాపర్డర్ బ్యాటర్ల విఫలం కావడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సూపర్ కింగ్స్ కష్టాల్లోపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రావో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సూపర్ కింగ్స్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. బ్రావో 20 పరుగులు రాబట్టాడు. దీంతో 6 పరుగల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి చవిచూడల్సి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఇన్నింగ్స్‌లో మథ్యూ షార్ట్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు సాధించగా.. బ్రావో, శాంట్నర్, మోహ్సిన్ తలా వికెట్ పడగొట్టారు. బ్రావో సూపర్ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో.. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. నోర్జే షార్ట్‌పిచ్ డెలివరీ వేయగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb — Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023 చదవండి: IND vs WI: వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్.. ఎందుకంటే? -
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
KKR VS RR: చరిత్ర సృష్టించిన చహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్‌ల్లో 184) సాధించిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 11) కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్‌ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్‌ల్లో 171) టాప్-5లో ఉన్నారు. కాగా, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగలు చేసింది. జేసన్ రాయ్ (10), రహ్మానుల్లా గుర్భాజ్ (18), నితిశ్ రాణా (22), ఆండ్రీ రసెల్ (10) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (49 నాటౌట్), రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా.. చహల్, ఆసిఫ్ తలో వికెట్ దక్కించకున్నారు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లకు ఇది డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలిచి తీరాలి. చదవండి: సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి! -
LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా.. ఐపీఎల్లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు. మరో వికెట్ కూడా.. ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
RR VS LSG: చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న చహల్... ఈ మ్యాచ్‌లోనే అవుతుందా..?
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. జైపూర్‌లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో చహల్ మరో 7 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ జాబితాలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో 183 వికెట్లతో (161 మ్యాచ్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. చహల్ ప్రస్తుతం 177 వికెట్లతో (136 మ్యాచ్‌ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. చహల్ ఈ రికార్డును నేటి మ్యాచ్‌లోనే నెలకొల్పడం కాస్త కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. పైగా చహల్ ఈ మ్యాచ్ తమ సొంత మైదానంలో ఆడుతుండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..? అదీ కాక చహల్‌కు లక్నోపై గణమైన రికార్డు ఉంది. ఐపీఎల్-2022లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అదే సీజన్లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలకమైన దీపక్ హుడా (59) వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న చహల్.. ఈ సీజన్లోనూ లీడింగ్ వికెట్ టేకర్‌గా (5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇన్ని సానుకూలమైన అంశాల మధ్య చహల్ నేడు లక్నోతో జరిగే మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్ల ఐపీఎల్ రికార్డును తిరగరాస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే, రాజస్థాన్-లక్నో జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు).. రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో విజేత ఎవరో అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ -
IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
‘ఐపీఎల్‌కు గుడ్‌బై’ చెప్పిన మరో దిగ్గజం.. బంపరాఫర్ ఇచ్చిన సీఎస్కే
Dwayne Bravo- Chennai Super Kings: మరో వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇకపై ఆటగాడిగా కొనసాగబోనని స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్రావో సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎస్కేను చాంపియన్‌గా నిలపడంతో తన వంతు పాత్ర పోషించాడు ఈ రైట్ఆర్మ్ పేసర్. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో అతడిని రిలీజ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. బ్రావోకు బంపరాఫర్! అయితే, సుద్ఘీకాలం తమకు సేవలు అందించిన బ్రావోకు.. చెన్నై ఫ్రాంఛైజీ బంపరాఫర్ ఇచ్చింది. డ్వేన్ బ్రావోను సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సీఎస్కే సీఈవో కేఎస్ విశ్వనాథన్.. ఐపీఎల్లో విజయవంతంగా కెరీర్ కొనసాగించిన బ్రావోకు అభినందనలు తెలిపారు. సూపర్‌కింగ్స్ కుటుంబంలో దశాబ్దకాలంగా కీలక సభ్యుడిగా ఉన్న బ్రావోతో తమ అనుబంధం కొనసాగుతుందని.. అతడిని బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సైతం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు వచ్చే సీజన్లో అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అత్యధిక వికెట్ల వీరుడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్టు పడగొట్టిన ఆటగాడిగా డ్వేన్ బ్రావో రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తంగా 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 183 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 1560 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2011లో సీఎస్కేకు ఆడటం మొదలుపెట్టిన బ్రావో.. 2011, 2018, 2021లో జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. 2013, 2015లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. చదవండి: Ricky Ponting: రికీ పాంటింగ్‌కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు Rashid Khan: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన #ChampionForever 🦁💛 Official Statement 🔗🔽 @DJBravo47 — Chennai Super Kings (@ChennaiIPL) December 2, 2022 -
600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. హెండ్రెండ్ టోర్నమెంట్లో భాగంగా బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్‌లో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్విసిబుల్స్తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా టి20ల్లో 600వ వికెట్ మార్క్‌ను అందుకున్నాడు. సామ్ కరన్‌ను ఔట్ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో టి20ల్లో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్ క్రికెట్లో 2004 నుంచి 2021 కాలంలో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో బ్రావో పాత్ర కీలకం. ఓవరాల్‌గా విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో టి20 ప్రపంచకప్ 2020 దృశ్యా తన టి20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ కరన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్ కాక్స్ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్ కరన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 6️⃣0️⃣0️⃣ T20 wickets for DJ Bravo! 🎉 He becomes the first to yet another milestone - no other player has yet reached 500! 🙌 pic.twitter.com/ZRBMhoFKHK — ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో Slow deliveries 🤝 Bravo! Spectacular bowling from the superstar @DJBravo47. Watch all the action from The Hundred LIVE, exclusively on #FanCode 👉https://t.co/3GLSe3BlEE@thehundred#TheHundred #TheHundredonFanCode pic.twitter.com/BRNYIenclH — FanCode (@FanCode) August 12, 2022 -
పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన బ్రావో.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్‌కు గురి చేశాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/7gVh2Uys7n — Diving Slip (@SlipDiving) April 21, 2022 -
ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర
చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ఐపీఎల్లో చరిత్ర సృష్ఠించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాను ఔట్ చేయడం ద్వారా బ్రావో ఐపీఎల్లో 171వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో బ్రావో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ (170) రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఐపీఎల్ టాప్ ఐదు వికెట్ టేకర్స్ జాబితాను పరిశీలిస్తే.. బ్రావో(171 వికెట్లు), మలింగ(170 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత అమిత్ మిశ్రా (166), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150)లు ఉన్నారు. చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం.. Bravoooo Legend! No. 1⃣ 👑#LSGvCSK #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/GdgVCL6Gg2 — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022 -
IPL 2022: చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో ఉన్న సీఎస్కే బౌలర్
CSK VS LSG: చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆల్‌రౌండర్, టీ20 స్పెషలిస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో ఉన్నాడు. ఇవాళ (మార్చి 31) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో బ్రావో మరో వికెట్ తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ (170) రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం బ్రావో 170 వికెట్లతో మలింగతో సమానంగా ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ టాప్ 6 వికెట్ టేకర్స్ జాబితాలో మలింగ, బ్రావోల తరువాత అమిత్ మిశ్రా (166), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150), రవిచంద్రన్ అశ్విన్ (145) ఉన్నారు. ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా నేతృత్వంలో సీఎస్కే ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం సీఎస్కే, ఎల్ఎస్జీ జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. చెన్నై.. కాన్వే స్థానంలో మొయిన్ అలీని ఆడించే ఛాన్స్ ఉండగా, లక్నో.. మొహ్సిన్ ఖాన్ బదులు కృష్ణప్ప గౌతమ్, షాబజ్ నదీమ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైనప్పటికీ వెటరన్ ఆటగాళ్లు బ్రావో (3/20), ధోని (50 నాటౌట్) రాణించడం ఆ జట్టుకు శుభపరిణామమనే చెప్పాలి. చదవండి: IPL 2022: బోణీ విజయం కోసం తహతహలాడుతున్న జడేజా, కేఎల్ రాహుల్.. చెరో మార్పుతో..! -
వికెట్ తీసిన ఆనందం.. బ్రావో డ్యాన్స్ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఫీల్డ్‌లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వికెట్ తీసిన క్యాచ్ పట్టిన డ్యాన్స్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఐపీఎల్-2022లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రావో మరో సారి డ్యాన్స్ చేశాడు. కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసిన ఆనందంలో బ్రావో స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 7 ఓవర్ బౌలింగ్ చేసిన బ్రావో.. వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసి సీఎస్కేకు తొలి వికెట్ అందించాడు. ఈ క్రమంలో బ్రావో తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎమ్మెస్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Dwayne Bravo: ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర Bravo's new celebration pic.twitter.com/M24LnOr8IK — That-Cricket-Girl (@imswatib) March 26, 2022