Baby
-
ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!
బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ మధ్యనే జూలై లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి, ఏడాది క్రితం వరకు ఆమె – పిల్లల్ని అస్సలు కనకూడదనే అనుకున్నారు! ఆమెలోని ఎకో యాంగ్జైటీనే అందుకు కారణం. ‘ఇంతటి విపరీతమైన వాతావరణ మార్పుల్లో పిల్లల్ని భూమి మీదకు తెచ్చిపడేయటం ఎలారా దేవుడా.. ‘అని ఆకాశం వైపు దీనంగా చూసేవారట రిచా. ఉదయ లేస్తూనే భూతాపం గురించి ఆలోచించటం, లేచాక కిటికీ లోంచి పొల్యూషన్ లోని తీవ్రతను అంచనా వేయటం రిచాకు అలవాటైపోయింది. ‘మొన్నటి వరకు అతి వేడి. ఇప్పుడు అతి చలి. ఈ మార్పులు నా బిడ్డపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాను. తనకు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ వే. అలాంటి కొన్ని బేబీ ఐటమ్స్ ని నా స్నేహితురాళ్లు దియా మీర్జా, సోహా అలీ ఖాన్, ఇంకా నా పేరెంటల్ యోగా ఇన్స్ట్రక్టర్ నాకు కానుకగా ఇచ్చారు. నా చుట్టూ వాళ్లంతా నా ఆందోళనను కనిపెట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా పాప పెంపకంలో నాకు తోడ్పడుతున్నారు. టిప్స్ ఇస్తున్నారు’ అని ‘ఓగ్స్ ఇండియా‘కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు రిచా. ఇక ఆమె భర్త అలీ ఫజల్ గురించి చెప్పే పనే లేదు. ఈ ’మీర్జాపుర్ ’ యాక్టర్.. సింగిల్ యూస్ లాస్టిక్కి ఎప్పట్నుంచో వ్యతిరేకి. భార్యాభర్తలు షాపింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ యాకేజీల్లో ఏ రూపంలోనూ ప్లాస్టిక్ అన్నదే ఉండదు. బిడ్డ పుట్టాకయితే వాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. పిల్లలు పుట్టక ముందు నుంచే, పుట్టబోయేవారి సంరక్షణ గురించి, వారి కోసం భూతాపాన్ని తమ వంతుగా తగ్గించటం గురించి ఆలోచించే ఇటువంటి తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. భూమి తల్లి వారిని చల్లగా చూస్తుంది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?
చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.కారణాలు... మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది. త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉంచాలి. మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు / కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.చికిత్సమెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్‌గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్‌కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది. కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!) -
హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. చూడండి (ఫొటోలు)
-
ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం
జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సుదాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్లకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్‌ను సేవ్ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త ఆశిష్ వ్యాస్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్హెచ్సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్ తెలిపారు. ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు -
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
బేబీ జాన్‌లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్‌లపై వచ్చే యాక్షన్ సీన్స్‌ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
శబరిమలలో హరివరాసనం: అద్వితీయంగా చిన్నారి నృత్యాభినయం
ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7— @Bala (@neelabala) March 30, 2024ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్‌గా మారింది.కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్‌లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి. -
పిన్నీసు మింగిన మూడునెలల పసికందు..ప్రాణం కాపాడిన ఆంకురా ఆస్పత్రి వైద్యులు
అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు. ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. -
పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. -
గర్భంతో ఉన్నాం కదా అని.. అన్నీ లాగించేయకూడదు!
మన ఇంట్లోకి చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి. లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి. ఆహారం, జాగ్రత్తలుకోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు. వీటికి కారణంగా ఒక్కోసారి గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి. కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ చేపలను పరిమితంగా తినవచ్చు.కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ దంపతులు
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి షాలిని కొద్దిసేపటి క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా నితిన్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నితిన్ పంచుకున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.2020లో నితిన్, షాలిని కందుకూరిల వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు అయిన షాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు. వీరిద్దరి పెళ్లి అయి సుమారు నాలుగేళ్లు అవుతుంది. అయితే, ఇప్పుడు నితిన్ ఇంటికి వారసుడు రావడంతో అయన అభిమానులు సందడిగా కామెంట్లు పెడుతున్నారు.గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్' అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నితిన్ బలమైన కథతో ఈసారి ముందుకు రానున్నాడు. సరికొత్త కథతో ‘తమ్ముడు’గా అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' కూడా లైన్లో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
గర్భిణీలు వ్యాయామం చేయాలా? వద్దా?
బిడ్డకు జన్మనివ్వడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. గర్భం దాల్చింది మొదలు శరీరంలో అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటారు. హార్మోన్లలో తేడాలొస్తాయి. వాంతులు, మార్నింగ్ సిక్నెస్ లాంటివి మరింత ఇబ్బందిపెడతాయి. వీడికి తోడు అనేక ఏం తినాలి? ఇలా ఎందుకు అయింది? ఇదేమైనా ప్రమాదమా? లోపల బేబీ బాగానే ఉందా? బిడ్డ బాగానే ఎదుగుతోందా? వ్యాయామం చేయాలా? వద్దా? ఇలా సవాలక్ష సందేహాలు కాబోయే తల్లుల బుర్రల్ని తొలుస్తూ ఉంటాయి? బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి మంచిపోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలోవ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది పెద్ద ప్రశ్న.అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన తేలిగ్గా ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు జననాలను నివారించవచ్చు.గర్భం దాల్చడం అపురూపమే కానీ, కనీస శారీక శ్రమ చేయకూడనంత కాదు. గర్బిణీలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కొన్ని వ్యాయామాలు చేయడంద్వారా సుఖ ప్రసవం జరుగుతుంది. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. అధిక బరువు , గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం లేదా ప్రీఎక్లంప్సియా వంటి అధిక రక్తపోటు రుగ్మతలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడిని తేలికపాటి వ్యాయామం తగ్గిస్తుంది. పొట్ట పెరుగుతున్నపుడు వచ్చే నడుం నొప్పి తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ముందు మీ గైనగాలజిస్ట్ సలహా తప్పకుండా తీసుకోవాలి. వారి సలహా మేరకు నాలుగో నెల నుంచి సాధారణం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ప్రజారోగ్య మార్గదర్శకాల ప్రకారం గర్భిణీలు వారానికి సుమారు 150 నిమిషాలు (లేదా రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వాకింగ్ చేయవచ్చు. వార్మ్-అప్ ,కూల్-డౌన్ వ్యాయామాలు ఎంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంకోసం తేలికపాటి యోగా చేయవచ్చు.గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. తల్లి స్నానం చేసేటపుడు, పొట్టమీద ఒకసారి వేడి నీళ్లు (సమవేడి) మరోసారి చల్ల నీళ్లను పోసుకుంటూ వాటర్ థెరపీలా చేసుకోవాలట. దీని వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని చెబుతారు. అరగంట సమయానికి పరిమితం కావడం మంచిది. ఏదైనా తేడాగా అనిపించినా, అలసటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే సడన్‌గా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తకూడదు. ఏ వ్యాయామం అయినా, మితంగా చేయడం ముఖ్యం. అలసిపోయే దాకా చేయకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో బిడ్డ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
ఊయలలో పసికందుపై అఘాయిత్యం
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది. గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది. తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్‌టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
నేలకేసి కొట్టి పసికందు హత్య
చిత్తూరు రూరల్: ఏడాదిన్నర పసికందును తండ్రే నేలకేసి కొట్టి చంపిన ఉదంతం చిత్తూరు మండలం దిగువ మాసాపల్లిలో శనివారం వెలుగుచూసింది. బీఎన్ఆర్ పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి మండలం మాధవరం సమీపంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐరాల మండలం జంగాలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం భర్త వదిలేయడంతో ఆమె చిత్తూరు జిల్లా దిగువ మాసాపల్లికి వచ్చి ప్రదీప్ (34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఏడాదిన్నర క్రితం కుమారుడు పుట్టాడు. కాగా.. ఆ మహిళ ఇటీవల దిగువ మాసాపల్లిలోనే ఓ కోళ్లఫారంలో పనికి కుదిరింది. కాగా.. ప్రదీప్ శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పసికందు ఏడుస్తుండటంతో బిడ్డను నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ తరువాత తేరుకుని ఇంటిపై నుంచి పడి బిడ్డ మృతి చెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బంధువులకు అనుమానం రావడంతో మహిళ సోదరుడు బీఎన్ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. పసికందు మరణానికి కారణమైన తండ్రి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. -
అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!
బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!శాకాహార ప్రియులకు బెస్ట్ స్నాక్ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!) -
కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. వివరాల్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ (31)కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్ టాయిలెట్‌లోనికి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు.ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా తయ్యబ్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య డెలివరీ తేదీ జూన్ 20 అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి ‘మహాలక్షి ఎక్స్‌ప్రెస్’లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని తయ్యబ్ పేర్కొన్నాడు. ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ అనే పేరు పెట్టిందని ఆయన తెలిపాడు. -
భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
భార్యభర్తల్లో ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఈ విషాదాన్ని తట్టుకోవడం, దాన్నుంచి బయటపడటం రెండో వారికి చాలా కష్టం. తమ దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ, వారికోసం జీవితాన్ని గడిపేసే వారు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన జీవిత భాగస్వామి చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటీ అర్థం కాలేదా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.ఆస్ట్రేలియన్ మోడల్ ఎల్లిడీ పుల్లిన్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా బిడ్డను కన్నది. తన పోడ్కాస్ట్లో తన ప్రయాణాన్ని పంచుకుంది. మరణానంతరం భర్త వీర్యం ద్వారా గర్భం దాల్చడం, బిడ్డను కనడం గురించి పోడ్కాస్ట్లో వివరించింది. ఈ స్టోరీ ఇపుడు వైరల్‌గా మారింది. 2022లోనే ఇన్‌స్టాలో ఈ వివరాలను షేర్ చేసింది కూడా. View this post on Instagram A post shared by El Pullin (@ellidy_) 2020 జూలైలో ఎల్లిడీ పుల్లిన్ భర్త అలెక్స్ చుంప్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. స్పియర్ ఫిషింగ్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తన భర్తకు గుర్తుగా బిడ్డను కనాలని ఆశపడింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పద్ధతుల గురించి స్డడీ చేసింది. భర్త నుంచి పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ చేయాలని వైద్య నిపుణులను కోరింది. డాక్టర్లు మరణించిన భర్త నుంచి స్మెర్మ్ కలెక్ట్ చేశారు. తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఎల్లిడీ గర్బం దాల్చింది.అలా భర్తను కోల్పోయిన 15 నెలలకు ఎల్లిడీ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2021లో మిన్నీ అలెక్స్ పుల్లిన్కు జన్మనిచ్చింది. తన పాప అచ్చం తన భర్తలానే ఉంది అంటూ మురిసిపోయింది. ఎల్లిడీ షేర్ చేసుకున్న వివరాల ప్రకారం. 2020 ఉదయం మాజీ వింటర్ ఒలింపియన్ అలెక్స్ స్పియర్ ఫిషింగ్‌కు వెళ్లాడు. ఎల్లిడీ అప్పుడు తమ కుక్కను బయటకు వాకింగ్‌కి తీసుకెళ్లింది. కానీ ఆమె భర్తను చూడటం అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. చివరికి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన భర్త చనిపోయినట్టు గుర్తించింది. ఇంతలోనే పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ గురించి తన స్నేహితులు చర్చించు కోవడం ఆమెను ఆకర్షించింది. ఎందుకంటే వారు ఒక బిడ్డను కనేందుకు అప్పటికే చాలా ఆశపడడ్డారు. చివరికి ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కలను సాకారం చేసుకుంది. -
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
అరే బాప్రే.. నన్ను హంతకుణ్ని చేయకండి...! బుజ్జోడి వైరల్ వీడియో
అపుడే పుట్టిన బుజ్జాయిలు భలే ముద్దుగా ఉంటారు. బుజ్జి బుజ్జి..లేలేత కాళ్లు చేతులతో..ముట్టుకుంటే కంది పోతారేమో అన్నంత సుకుమారంగా ఉంటారు. అపుడే విరిసిన పింక్ గులాబీల్లా, మెరిసిపోయే కళ్లతో మిటుకు మిటుకు చూస్తూ ఉంటారు. ‘‘ఎవర్రా మీరంతా.. నేను ఏ లోకంలోకి వచ్చాను’’ అన్నటు చూస్తూ ఉంటారు కదా. ఇంకొంతమంది ఉంటారు గడుగ్గాయుల్లాగా...డాక్టర్, నర్సుల డ్రెస్ గట్టిగా పట్టేసుకుంటారు. ఇంకొంతమందేమో అమ్మ స్పర్శ తగలగానే ఏడుపు మానేసి ముద్దుగా బజ్జుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని శిశువు ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కత్తెరను గట్టిగా పట్టుకుని వదలనే వదలడు. బొడ్డు పేగు కోసిన తరువాత ఆ కత్తెరను సిబ్బంది ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ట్విటర్లో ఇది ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. Born braveheart! ❤️😂pic.twitter.com/Pam7maI7Ix — Figen (@TheFigen_) April 8, 2024 -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్‌స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్‌యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్‌గా తినండి లేదా సూప్‌లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్‌లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్‌ను, ఓవులేషన్ పీరియడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి!