Damodar raja narasimha
-
కాంట్రాక్టు ఏఎన్ఎంలను తొలగించం
హైదరాబాద్: రెగ్యులర్ ఉద్యోగులను నియమించి నప్పటికీ, కాంట్రాక్టు ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసేయబోమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని ఏఎన్ఎంలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి తెలిపారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ పరీక్షకు హాజరయ్యే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని గుర్తుచేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో ఇచ్చిన 1,931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి, ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రానివారిని, చివరి వరకూ కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఏఎన్ఎంలు కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీకి టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు. దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్ రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు. ఎక్స్పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార భద్రతపై కలెక్టరేట్లలో ఫిర్యాదు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)కు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, రిజి్రస్టేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. గత పదేళ్లలో పెరిగిన హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం కాలేదని మంత్రి అన్నారు. తామిప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచబోతున్నామని చెప్పారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇవిగాకుండా కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచిపేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంచిగా బిజినెస్ చేసుకునే వారికి అండగా ఉంటూనే, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్...: వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను మంత్రి దామోదర అందజేశారు. హైజెనిక్ కండీషన్లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంసహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సరి్టఫికేషన్ ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై పోలీస్ నిఘా
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కమిటీ ఏర్పాటు ఇలా...ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్పర్స న్గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు. కమిటీలు ఏం చేస్తాయంటే?ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు. -
గాంధీ ఆస్పత్రిలో ‘ఐవీఎఫ్’ సేవలు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యవిద్యార్థుల వసతిగృహ భవన సముదాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి దామోదర రాజనర్సింహ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎంసీహెచ్ భవనంలోని ఐవీఎఫ్ సెంటర్‌ను వైద్య ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం గాం«దీఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిందని, తనకు తెలిసిన వెంటనే డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఎంబ్రయాలజిస్ట్లను నియమించి, రీఏజెంట్స్ కోసం నిధులు కేటాయించి, సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.సంతానలేమితో బాధపడుతున్న వారిక్కడ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లలో ప్రభుత్వ సెక్టార్లో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి లో ఐవీఎఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించారు. గాందీలో అదనపు విభాగాల ఏర్పాటు గాం«దీలో ప్రస్తుతం ఉన్న 34 విభాగాలతోపాటు అదనంగా మరో నాలుగు విభాగాలు, యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 కేన్సర్ కేర్, 74 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకే అనే అభిప్రాయం పోగొట్టాలని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రియా జ్, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ హేమంత్‌కుమార్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్డీహెచ్పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుమతి ఇస్తాం.. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్‌కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్‌కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్‌రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
చవకబారు విమర్శలు మానుకో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య వ్యవస్థపై చవకబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి హెచ్చరించారు. ఈహెచ్ఎస్పై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఈహె చ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్‌లను పదేళ్లు భ్రష్టు పట్టించి, ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల, పేదలకు, ఉద్యోగులకు ఆ స్కీమ్ సేవలు అందకుండా పో యాయన్నారు.ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ కోసం పోయిన ఉద్యోగులు, పెన్షనర్లను కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు అవమానిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చోద్యం చూశారని విమర్శించారు. ‘‘మా వేతనాల్లో నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తాం, స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్యోగు లు, పెన్షనర్లు కోరినా పట్టించుకోలేదు. పదేళ్లు మోసం చేసింది చాలదన్నట్టు, ఎన్ని కల ముందు హడావుడిగా డమ్మీ జీవో ఇచ్చి మరోసారి ఉద్యోగులను మోసం చేసే కుట్రలు చేశారు.మీ కుట్రలు, కుతంత్రాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఉద్యోగులు. ఇకనైనా ఇలాంటి చవకబారు విమర్శలు మానుకోవాల’’ని మంత్రి హెచ్చరించారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిన ప్యాకేజీల రివిజన్‌ను 6 నెలల్లోనే చేసి చూపించాం. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం’ అని మంత్రి దామోదర తన ట్వీట్లో పేర్కొన్నారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
సాక్షి, వరంగల్/నర్సంపేట: ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం ఉండాలి.. అవి అమలు చేసేదిశగా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలను గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెడికల్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని వెల్లడించారు. 7 వేల మందికి నర్సింగ్ పోస్టింగ్‌లు ఇచ్చామని, త్వరలో ఇంకో 2,500 మందికి పోస్టింగ్ ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ‘సామాన్యులకు ఎక్కడి నుంచైనా 20 నుంచి 45 నిమిషాల్లో వైద్యచికిత్స అందేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆస్పత్రులను నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా 108, 104, 102 ఆరోగ్యశ్రీ ట్రస్టు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ప్రొసీజర్ చార్జెస్ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచింది. దానికోసం రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చు చేశాం’అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని, రూ.46వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా, 53 శాతం ఇళ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన విషయాలు వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడానికి చేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి పాల్గొన్నారు. మంత్రుల నోట వైఎస్ అభివృద్ధి మాట దేశ చరిత్రలోనే పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ కొనియాడారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలకు వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ సేవలు మరచిపోలేమన్నారు. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
వైద్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని... వాటన్నింటికీ సమగ్రంగా వైద్యసేవలు అందించడానికి వీలుగా ఒకేచోట అన్నిరకాల వైద్యం చేసేందుకు ఈ ప్రాంతంలో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ సృశాంత్ లాంటి యువకులు ఈ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ ప్రజలకు తమవంతు సేవలు అందించాలని సూచించారు. ఈ దిశగా డాక్టర్ సృశాంత్, ఆయన బృందం మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడుతూ, “ఇప్పటికే కోకాపేటలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్న మేము.. ఇప్పుడు నగరవాసులకు కూడా సేవలందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగణంలో ఆస్పత్రిని ఏర్పాటుచేశాం. ఇక్కడ కేవలం ఒక్కరే కాకుండా.. అన్నిరకాల చర్మ, శరీర, జుట్టు సమస్యలకు సంబంధించిన వైద్యులు, మహిళా వైద్యులు, కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. అందువల్ల సాధారణ చర్మసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర సమస్యల వరకు.. అలాగే జుట్టు రాలడం, పూర్తిగా ఊడిపోవడండ లాంటి తీవ్రమైన ఇబ్బందుల వరకు అన్నింటికీ చికిత్సలు అందిస్తాం. అలాగే కాస్మెటిక్ చికిత్సలు కూడా ఇక్కడ అందించగలం. శరీరంలోని గుప్తభాగాలకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటికి సైతం సమర్థవంతంగా చికిత్సలు చేయగల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.గతంలో 50-60 ఏళ్లు దాటిన తర్వాతే జుట్టు రాలడం, ఊడిపోవడం, బట్టతల ఏర్పడటం లాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడవి 18-20 ఏళ్ల వయసులో కూడా వస్తున్నాయి. దీనివల్ల చాలామంది యువతీ యువకులు ఇబ్బంది పడుతూ కాలేజీలకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. ఇలాంటివారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చేసి, వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపడం, వారిని మళ్లీ కాలేజీకి పంపడం లాంటివి చేస్తున్నాం. ఇక్కడ మా ఆస్పత్రిలో పీడియాట్రిక్ డెర్మటాలజీ నుంచి.. అంటే పదేళ్ల వయసు వారికి వచ్చే సమస్యల నుంచి మొదలుపెట్టి జేరియాట్రిక్ సమస్యలు.. అంటే వయోవృద్ధులకు వచ్చే చర్మ సంబంధిత, ఇతర సమస్యల వరకు అన్నింటికీ చికిత్సలు అందించడానికి అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించి వ్యక్తిగతీకరించిన చికిత్సలు అందించడం ఇక్కడ మా ప్రత్యేకత.చర్మ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. డెంగ్యూ, చికున్ గన్యా లాంటివాటిలో కూడా చర్మసమస్యలు కొన్ని వస్తాయి. రోజూ తడిలో పనిచేసే గృహిణులకు కాళ్ల వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఇలాంటివాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చర్మవైద్యులకు చూపించుకుని దానికి తగి చికిత్స తీసుకోవాలి. మొటిమలకు కూడా ఏవి పడితే ఆ క్రీములు వాడటం కాకుండా.. సరైన చికిత్స చేయించుకోవాలి” అని తెలిపారు. -
గ్యారంటీలను అందిస్తాం.. పేదవారిని ఆదుకోవడమే మా లక్ష్యం: మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.కాగా, మంత్రి దామెదర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల దయతోనే మాకు పదవులు వచ్చాయి. మా కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. ఆరు గ్యారంటీల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమంతో పేదవాడిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం.అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ప్రతీఏటా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం ద్వారా రూ.580 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతోంది. అయినా పేదల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తోంది.అవసరం ఉన్న చోట డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటుతో పాటు 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలోని ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దేవరకద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రికి మంజూరుకి అనుమతులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి పండుగను తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
సనత్‌నగర్ (హైదరాబాద్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వాదన లు వినిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను పంపించి బలమైన వాదనలు వినిపించేలా చేశారని గుర్తు చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ–మాదిగల భవిష్యత్తు’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మాదిగ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేధావుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ జి.మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావే శానికి హాజరైన దామోదర రాజనర్సింహ మాట్లాడు తూ, రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను చేసుకో వచ్చని తీర్పు రావడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. న్యాయనిపుణులతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసిన నివేదిక సీఎంకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక కమిటీ వేయాల్సిందిగా కోరతామని, ఆ కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకు రావాలన్నారు. అంతేకాకుండా త్వరలో పెద్దఎత్తున మాదిగల సమ్మేళనం పేరుతో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి సీఎంను ఆ సభకు ఆహ్వానించి సన్మా నించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు జాతి పెద్దలుగా అందరం కలసిక ట్టుగా ముందుకుసాగుదామన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ లకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి నేత ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు పుష్పలీల, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దామోదర రాజనర్సింహ రియాక్షన్
-
ఫుడ్ కల్తీ చేసే సంస్థల లైసెన్స్ రద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్జీవమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇదే సమయంలో దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించింది. దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కొత్తగా 10 మొబైల్ ఫుడ్ లాబ్స్ లను త్వరలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను బలోపేతం చేస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ల్యాబ్స్ ద్వారా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహిస్తున్నాం. స్ట్రీట్ వెండర్లుకు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర సచివాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించాం. ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థలు తప్పని సరిగా FSSAI లైసెన్స్‌ను తీసుకోవాలనే నిబంధనలను అమలు చేస్తున్నాం.ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లలను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి Fssai లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఆహారం కల్తీ చేసే సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
వైద్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు అనుబంధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, ఇంకా అవసరమైన మేరకు అనుమతులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎంఐడీసీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), బ్లడ్‌బ్యాంక్‌లు, ఎఫ్ఎస్ఎస్ఏఐ యాక్ట్ అమలు తదితరాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణకు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వసతి గృహాలు, క్యాంటీన్లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న క్యాంటీన్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. నాచారంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణాలతో వైద్య విద్యను అందిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య వైద్యను అందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల శారీరక ఎదుగుదలకు డీవార్మింగ్ టాబ్లెట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డీవార్మింగ్ టాబ్లెట్లను మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు అందిస్తున్నామన్నారు. గురువారం నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని, మన పూరీ్వకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి పాల్గొన్నారు. -
వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు, డీన్లు, ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో తెలంగాణకు అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు తేవడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలతోపాటు డెంటల్ కాలేజీలలో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య, డెంటల్ కళాశాలల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, వాటిల్లో 3,690 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎయిమ్స్‌లో 100, ఈఎస్ఐలో 125 ఎంబీబీఎస్ సీట్లున్నాయన్నారు. ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,320 పీజీ సీట్లున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ సీట్లు 179 ఉన్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోని 28 మెడికల్ కళాశాలల్లో 4,600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నారు. సమావేశంలో వైద్య విద్య సంచాలకురాలు (డీఎంఈ) డాక్టర్ వాణి, వైద్య విద్య స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ విమల థామస్ పాల్గొన్నారు.నేడు 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలుజూన్ 20న నులిపురుగుల నివారణ దినం సందర్భంగా 96 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ రోజు వేయించుకోని వారికి 27న మాప్ అప్ రౌండ్లో వేస్తామని చెప్పారు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్‌్కఫోర్స్‌లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు ఓ టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్‌పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్‌ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్‌్కఫోర్స్‌లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు. ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు. 65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కార్పొరేషన్‌తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్‌లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు. ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు. డీహెచ్ పనితీరుపై అసంతృప్తి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు. యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. -
హైదరాబాద్ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్‌కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు.