Delhi Capitals
-
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం.. ఒక్కసారిగా డబ్బు రాగానే..
క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబైకర్.. ఇప్పుడు కెరీర్లో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చినా.. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.ఫలితంగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు పృథ్వీ. ఇందుకు ప్రధాన కారణం ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణా రాహిత్యమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు పృథ్వీ షాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు.తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం..ఈ నేపథ్యంలో పృథ్వీ షా చిన్ననాటి కోచ్ రాజు పాఠక్.. ఈ బ్యాటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు బయటపెట్టాడు. ‘‘వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం ఉండేది కాదు. అతడి తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. అందువల్ల షా చిన్నప్పటి నుంచి ఇతరుల సాయంపై ఆధారపడేవాడు.అలా ప్రతిదానికి ఇతరుల వద్ద చేయి చాచినట్లుగా ఉండటం మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అతడికి తల్లి కూడా లేదు. అతడు అంతగా పరిణతి చెందక ముందే ఆమె కన్నుమూసింది. ఎవరికైనా తల్లి ఉంటేనే కదా.. తప్పొప్పుల గురించి సరిగ్గా తెలుస్తుంది. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానేఎన్ని కష్టాలు ఉన్నా.. ఆటపై దృష్టి పెట్టి చిన్న వయసులోనే విజయవంతమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నపుడు డబ్బుల్లేక పేదరికంలో మగ్గిన ఓ కుర్రాడు.. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే మారిపోవడం సహజం.అతడు కూడా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. దాదాపుగా అందరూ ఇదే పని చేస్తారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని భావిస్తారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు కారణంగా కొంతమంది విలాసాలకు అలవాటు పడతారు. పృథ్వీ షా 25 ఏళ్ల కుర్రాడుఅయినా పృథ్వీ షా కేవలం 25 ఏళ్ల కుర్రాడు. అతడిని 40 ఏళ్ల, పరిణతి చెందిన మనిషిగా ఉండాలని కోరుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అని రాజు పాఠక్ పృథ్వీ షాను విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు కరువుకాగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా తొలి టెస్టులోనే శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోతాడని భావించగా.. శుభ్‌మన్ గిల్‌తో పోటీలో వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున పృథ్వీ షా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు.. ఆయా ఫార్మాట్లలో 339, 189 పరుగులు చేశాడు.ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక గత వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి వేలానికి ముందే రిలీజ్ చేసింది. ఇక ఐపీఎల్ కెరీర్లో పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 రన్స్ సాధించాడు.చదవండి: ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా! కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్‌గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్‌లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
'ఏమి తప్పుచేశానో అర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది'
టీమిండియా తరుపున అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకరు. తొలుత అతడి ఆట తీరును చూసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యం, ఫిట్నెస్ ఫామ్ లేమి కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. క్రమంగా తన ఫిట్నెస్ను కూడా కోల్పోయిన పృథ్వీ షా ముంబై రంజీ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఈ ముంబై ప్లేయర్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి గత సీజన్ వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.దీంతో పృథ్వీ షాను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్‌పై పృథ్వీ షా మాట్లాడిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియా ఒకటి వైరలవుతోంది. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు షా చెప్పుకొచ్చాడు.ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే.. నన్ను మీరేలా ఎలా ట్రోల్ చేస్తారు? అంటే అతడి కళ్లన్నీ నా మీదే ఉన్నాయని ఆర్దం. ట్రోలింగ్ చేయడం మంచిది కాదు, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి వారిని టార్గెట్ చేయడం మంచిది కాదు. క్రికెటర్లతో పాటు ఇతర వ్యక్తులను ట్రోల్ చేయడం నేను చాలా సందర్బాల్లో చూశాను. నాపై చేస్తున్న ట్రోలింగ్లు, మీమ్‌లు అన్నీ చూస్తున్నాను. అటువంటి చూసి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.నేను బయట కన్పిస్తే చాలు ప్రాక్టీస్ చేయకుండా తిరుగుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. నా పుట్టిన రోజున కూడా నేను బయటకు వెళ్లకూడదా? నేను ఏమి తప్పుచేశానో కూడా నాకే అర్ధం కావడం లేదు. కానీ మనం ఏమి చేసినా తప్పుబట్టేవాళ్లు ఉంటారని మాత్రం ఆర్ధం చేసుకున్నా అని ఆ వీడియోలో పృథ్వీ షా పేర్కొన్నాడు.చదవండి: ICC Rankings: సత్తాచాటిన జైశ్వాల్.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో -
'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ముంబై ఓపెనర్.. అప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నాడు. కానీ ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని కనీసం వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని భావించారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.అందుకు కారణాలు లేకపోలేవు. పృథ్వీ షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అతడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ కారణాల చేతనే షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనీస ధరకు కూడా వేలంలో అమ్ముడుపోనుందన పృథ్వీ సిగ్గుపడాలంటూ కైఫ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.పృథ్వీ సిగ్గు పడాలి: కైఫ్"ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పృథ్వీ షాకు చాలా సపోర్ట్ చేసింది. అతడు పవర్ ప్లేలో అద్బుతంగా ఆడుతాడని, ఒకే ఓవర్లో 6 బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉందని ఢిల్లీ నమ్మింది. కొన్ని సీజన్లలో ఢిల్లీ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.ఢిల్లీ ఫ్రాంచైజీ ఆశించినట్టే ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టి చూపించాడు. అతడికి చాలా అతడు బాగా ఆడితేనే మేము గెలుస్తామని భావించేవాళ్లం. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాము. కొన్ని సార్లు వరుసగా విఫలమైనా కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అతడికి జట్టులో అవకాశమివ్వకూడదని చాలా సందర్భాల్లో నిర్ణయించుకున్నాం.కానీ ఆ తర్వాత మ్యాచ్ రోజున మా మా నిర్ణయాన్ని మార్చుకుని అతడికి ఛాన్స్ ఇచ్చేవాళ్లం. ఎందుకంటే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండేది. కానీ అతడు మాత్రం తనకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.దీంతో అతడిని ఢిల్లీ కూడా విడిచిపెట్టింది. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోకపోవడం నిజంగా సిగ్గుచేటు. పృథ్వీ షా తిరిగి వెనక్కి వెళ్లి బేసిక్స్ నేర్చుకోవాలి అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్
‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా ప్రయాణం ఒక అద్భుతం. మైదానంలో ఎన్నెన్నో ఉత్కంఠభరిత క్షణాలు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఓ టీనేజర్‌గా ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఈ తొమ్మిదేళ్లలో నేనూ ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేనిది ఎన్నడూ ఊహించలేదు.నా ప్రయాణం ఇంత ప్రత్యేకంగా మారడానికి ప్రధాన కారణం అభిమానులు. నన్ను అక్కున చేర్చుకున్నారు. నా జీవితంలోని కఠిన సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను.అయితే, నాపై మీకున్న ప్రేమాభిమానాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నా ఆటతో మీకు వినోదం అందిస్తాను. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు.. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు.. ఏదేమైనా వీడ్కోలు చెప్పడం అంత సులువేమీ కాదు’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.వీడలేక వీడిపోతున్నట్లు..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేక వీడిపోతున్నట్లు తన మనసులో ఉన్న మాటలను లేఖ రూపంలో వెల్లడించాడు. కాగా ఐపీఎల్- 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ పంత్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి ఆసక్తి చూపింది.అయితే, పంత్ ధర రూ. 20 కోట్లకు చేరుకున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవాలని చూసింది. కానీ లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. అమాంతం ఏడు కోట్లు పెంచి మొత్తంగా రూ. 27 కోట్లకు రిషబ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు.ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధంకాగా పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2016లో ఢిల్లీ జట్టుతో తన ఐపీఎల్ జర్నీ ఆరంభించిన పంత్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2017లో 366 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 2018లో మాత్రం దుమ్ములేపాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 684 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు ఫిప్టీలు ఉండటం విశేషం.ఇక 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనూ అభిమానులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి అండగా ఉంది. అయితే, వేలానికి ముందు అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో పంత్ బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి పంత్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా జట్టును ఆరో స్థానంలో నిలపగలిగాడు.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి! -
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్‌లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్‌లో ట్రయల్స్ సమయంలో వైభవ్‌ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్‌లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు షాక్ తగిలింది. భారీ ధరకు అమ్ముడుపోతాడనుకున్న రాహుల్‌ను నామమాత్రపు ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో వచ్చిన రాహుల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఆర్సీబీ, కేకేఆర్ వెనక్కి తగ్గాయి. అయితే ఆఖరికి సీఎస్కే కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ ఢిల్లీ సొంతమయ్యాడు. అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పగ్గాలను అప్పగించే అవకాశముంది. కాగా ఈ వేలంలో ఆర్సీబీ రాహుల్‌ను కొనుగోలు చేస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ వేలంలో మాత్రం అతడికి కోసం ఆర్సీబీ ప్రయత్నించలేదు.కాగా ఐపీఎల్-2022 నుంచి 2024 వరకు రాహుల్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండుసార్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్చేర్చాడు. కానీ అతడిని ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు లక్నో రిటైన్ చేసుకోలేదు. అందుకు జట్టు యాజమాని సంజీవ్ గోయెంకాతో విభేదాలే కారణమని వార్తలు వినిపించాయి.కాగా ఐపీఎల్లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 45.47 సగటుతో 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 37 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Yuzvendra Chahal: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు -
నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి అది కారణం కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు.ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉండడంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది.క్లారిటీ ఇచ్చిన పంత్..అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్బుతంగా రాణించినప్పటికి ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికి ఆర్ధం కావడం లేదు. ఢిల్లీ మేనెజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అతడు ఎక్కువ డబ్బు అడిగిన కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను జట్టులో ఉంచుకోకపోవడానికి డబ్బు కారణం కాదని కచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్‌లో రిషబ్ పోస్ట్ చేశాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాప్‌లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని, సౌరవ్ గంగూలీ ప్లేస్‌లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరగనుంది.చదవండి: BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్? The curious case of Rishabh Pant & Delhi! 🧐🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96— Star Sports (@StarSportsIndia) November 19, 2024 -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ పని చేశాడు. ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్‌తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్నారు.41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. -
WPL 2025: రిటైన్ చేసుకున్న భారత్ ప్లేయర్లు వీరే
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలానికి ముందు ఐదు జట్లు కూడా తమ ప్రధాన ప్లేయర్లను అట్టి పెట్టుకున్నాయి. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లతో పాటు మెగ్ లానింగ్, మరిజాన్ కాప్, అమెలియా కెర్, అనాబెల్ సదర్లాండ్లను కూడా ఆయా టీమ్‌లు అట్టి పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్‌లకు గత సీజన్లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా... ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ. 15 కోట్లు చేశారు. ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్‌లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్‌లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు. రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు. గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్, అమన్‌దీప్, అమన్‌జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక. యూపీ వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్. -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.మళ్లీ సొంతగూటికి?కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్‌గా రిషబ్‌ను విడిచిపెట్టి అయ్యర్‌ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.చదవండి: IND vs NZ: నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో -
IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి సంచలన మార్పు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వచ్చింది. భారత వికెట్ కీపర్, హిట్టర్ రిషభ్ పంత్‌ను క్యాపిటల్స్ వదిలేసుకుంది. ఐపీఎల్-2025లో క్యాపిటల్స్ యాజమాన్య ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ టీమ్ నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. జీఎంఆర్ ప్రతినిధులతో పలు అంశాల్లో పంత్ విభేదించడమే అందుకు కారణమని తెలిసింది. కోచ్ ఎంపికతో పాటు ఇతర సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కూడా పంత్ పట్టుబట్టినట్లు... గత నెల రోజులుగా దీనిపై తీవ్ర చర్చలు జరిగిన తర్వాత పంత్ డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించలేదని సమాచారం. ఆ నలుగురు జట్టుతోనేదాంతో తమ స్టార్ ఆటగాడినే వదులుకునేందుకు క్యాపిటల్స్ యాజమాన్యం సిద్ధమైంది. 2016 నుంచి 2024 సీజన్ వరకు ఢిల్లీ జట్టుతో ఉన్న పంత్... 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రయిక్ రేట్‌తో 3,284 పరుగులు సాధించాడు. ఈ ఏడాది సారథిగా వ్యవహరించి జట్టును పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిపాడు. కాగా ఢిల్లీ ఈసారి నలుగురు ఆటగాళ్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టి పెట్టుకుంది. ఏదేమైనా.. వేలంలో పంత్‌కు భారీ డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
దాదా స్థానంలోకి అతడు.. గంగూలీకి ‘కొత్త’ బాధ్యతలు!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగనున్నాడు.ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్‌డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపిక చేసింది.గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మూడు సీజన్లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్‌గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్టి20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు శిక్షకుడిగా పనిచేశాడు.‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు. ‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్‌డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ బ్యాటింగ్ కోచ్‌గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి పంత్‌ను తప్పించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తమ జట్టు పగ్గాల అప్పగించాలని సదరు ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షర్ గత కొన్ని సీజన్లగా ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ప్రతీ సీజన్లోనూ అక్షర్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లోనూ అక్షర్ పటేల్ అదరగొట్టాడు.14 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లతో పాటు 235 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ కెప్టెన్‌గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను మాత్రం తమ టాప్ రిటెన్షన్ ప్లేయర్‌గా అంటిపెట్టుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని రూ. 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ సిద్దంగా ఉందంట. పంత్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకున్నట్లు వినికిడి.ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ న్యూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. పంత్‌ను ఢిల్లీ టాప్ రిటెన్షన్‌గా అంటిపెట్టుకోనుంది. అతడి కెప్టెన్సీ ఒత్తడి లేకుండా పూర్తిగా తన ఆటపై దృష్టిపెడతాడని మెనెజ్‌మెంట్ భావిస్తోంది అని ఐపీఎల్ మూలాలు వెల్లడించాయి.చదవండి: IPL 2025: డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం.. ఎస్ఆర్హెచ్కు గుడ్ బై -
రిషబ్ పంత్‌కు ఢిల్లీ షాక్ ఇవ్వనుందా? ట్వీట్ వైరల్
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టనుందా? చెన్నైసూపర్ కింగ్స్‌కు పంత్ వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధనామే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ కూడా ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గొంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా? ఎంత ధరకు అమ్ముడు పోతాను? అంటూ రిషబ్ ఎక్స్లోక్రిప్టిక్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఈ క్రమంలో కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీని పంత్ వీడనున్నాడని అభిప్రాయపడుతుంటే, మరి కొంత మంది అతడు ఏదో ఫన్నీగా పోస్ట్ చేసి ఉంటాడని చెప్పుకొస్తున్నారు.ఢిల్లీ విడిచిపెట్టనుందా?కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇటువంటి అద్భుత ఆటగాడిని ఢిల్లీ విడిచిపెట్టే సాహాసోపేత నిర్ణయం తీసకుంటుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే భారీ ధర పలకడం ఖాయం. -
IPL 2025: పంత్ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది!
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఏ జట్టుకు ఆడనున్నాడో తెలిసిపోయింది. వచ్చే ఏడాది కూడా అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తమ జట్టులోని ఇతర ఆటగాళ్ల గురించి కూడా ప్రస్తావించాడు.త్వరలోనే ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే రిటెన్షన్ పాలసీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసింది. ఫ్రాంఛైజీల పర్సు వాల్యూను 120 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటాంఈసారి.. ఒక ఫ్రాంఛైజీ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్థ్ జిందాల్ తాజాగా హర్యానాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిబంధనలకు అనుగుణంగా మేము ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలి. సహ యజమాని జీఎంఆర్ గ్రూపుతో పాటు మా క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.మా జట్టులో చాలా మంది అద్భుతంగా ఆడతారు. రిషభ్ పంత్‌ను మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటాం. అక్షర్ పటేల్ కూడా గొప్ప నైపుణ్యాలున్న క్రికెటర్. అలాగే ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.. అంతా బాగా ఆడతారు. అయితే, వేలం నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వీలుంది. అందరితో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు.వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడంతో పాటు.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ సీజన్లో 446 పరుగులు సాధించాడు. అయితే, జట్టును టాప్-4లో నిలపలేకపోయాడు. దీంతో సారథిగా మాత్రం విఫలమయ్యాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కాగా పంత్ వచ్చే సీజన్లో ఆర్సీబీ లేదంటే సీఎస్కేకు ఆడతాడనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ -
ఇంగ్లండ్ కౌంటీ జట్టును కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ గ్రూప్... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసుకుంది. కౌంటీ జట్టు హాంప్‌షైర్ క్లబ్లో 53 శాతం వాటా కొనుగోలు చేసినట్లు సోమవారం జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుదీంతో కౌంటీ జట్లలో విదేశీ యాజమాన్యం కలిగిన తొలి జట్టుగా హాంప్‌షైర్ నిలిచింది. ప్రస్తుతానికి సగానికి పైగా వాటా కొనుగోలు చేసుకున్న జీఎంఆర్ గ్రూప్... వచ్చే రెండేళ్లలో హాంప్‌షైర్ జట్టును పూర్తిగా హస్తగతం చేసుకోనుంది. ప్రస్తుతం హాంప్‌షైర్ క్లబ్‌కు జీఎంఆర్ గ్రూప్ రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం.వచ్చే 24 నెలల్లో పూర్తి యాజమాన్య హక్కులు‘హాంప్‌షైర్ క్లబ్ యజమాని, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చే 24 నెలల్లో క్లబ్ పూర్తి యాజమాన్య హక్కులు జీఎంఆర్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి’ అని సోమవారం హాంప్‌షైర్ క్లబ్ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యువతరంతో సంబంధాలు కొనసాగిస్తూ... నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు హాంప్‌షైర్ జట్టును కొనుగోలు చేసినట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తెలిపారు.మా లక్ష్యం అదే‘భారత్‌తో పాటు దుబాయ్, అమెరికాలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. యువతరం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. యువతను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. క్రీడలను సంస్కృతిలో భాగం చేయడమే మా లక్ష్యం. భవిష్యత్ ప్రపంచ చాంపియన్లను సృష్టించడంపై దృష్టి పెడతాం’ అని కిరణ్ కుమార్ అన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50 శాతా వాటా ఉన్న జీఎంఆర్ గ్రూప్‌నకు ఐఎల్టి20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఎ20లో ప్రిటోరియా క్యాపిటల్స్‌లో కూడా వాటా ఉంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లోనూ జీఎంఆర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. చదవండి: CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లనుందా? బీసీసీఐ ఏమంటోంది? -
మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్ పంత్ ఆగ్రహం
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు కోపమొచ్చింది. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలని.. మరీ ఇంత చెత్తగా ఎలా తయ్యారంటూ గాసిప్ రాయుళ్లకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం దుర్మార్గమని పేర్కొన్నాడు.ఆర్సీబీని అడిగితే నో చెప్పిందిఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పంత్‌ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టాడు. ‘‘రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు.అక్కడ కెప్టెన్సీ పదవి ఖాళీగా ఉంటే.. తనకు ఇవ్వమని కోరాడు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతడి అభ్యర్థనను తిరస్కరించింది. విరాట్‌కు పంత్ అక్కడికి రావడం ఇష్టం లేదు.ఎందుకంటే.. భారత క్రికెట్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌లో మాదిరి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తాడని విరాట్ భయపడ్డాడు. ఆర్సీబీ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది’’ అని సదరు యూజర్ పేర్కొన్నారు. ఇందుకు పంత్ ఘాటుగా స్పందించాడు.మీ ఇంగితానికే అంతా వదిలేస్తా..‘‘నకిలీ వార్తలు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు. కాస్త పద్ధతిగా ప్రవర్తించండి గయ్స్. కారణం లేకుండా ఇలాంటివి రాసి.. ఎందుకు ప్రశాంతంగా ఉండేవాళ్ల మనసులను చెడగొడతారు.అయినా... ఇలాంటి వదంతులు ఇదే మొదటిసారి కాదు.. ఇదే ఆఖరూ కాదు. కానీ పరిస్థితి రోజురోజుకీ మరింత చెత్తగా మారుతోంది. ఇక మీ ఇంగితానికే అంతా వదిలేస్తా. ఇది కేవలం మీ ఒక్కరికే కాదు.. మీలా అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లందరికీ వర్తిస్తుంది’’ అని రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్లో పంత్ చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. రోడ్డు ప్రమాదం అనంతరం.. ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చిన.. ఈ లెఫ్టాండర్ 446 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన.. టెస్టులకు గుడ్‌బై Fake news . Why do you guys spread so much fake news on social media. Be sensible guys so bad . Don’t create untrustworthy environment for no reason. It’s not the first time and won’t be last but I had to put this out .please always re check with your so called sources. Everyday…— Rishabh Pant (@RishabhPant17) September 26, 2024 -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
IPL 2025: కొత్త హెడ్‌కోచ్.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. అభిమానులకు ఇదే నా ప్రామిస్ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్‌ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్ కింగ్స్‌ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్ ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్‌తో ప్రయాణంఅయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా పాంటింగ్ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్‌గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. మరో ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవర్ బైలిస్ స్థానాన్ని రిక్కీ పాంటింగ్‌తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్!