Delhi
-
సమాజానికి ‘ఎక్స్‌రే’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని... ఇది సమాజానికి ‘ఎక్స్‌రే’వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ‘మెగా హెల్త్ చెకప్’జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం చేపట్టే మూడో ఉద్యమంలో కులగణన భాగమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’కార్యక్రమంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి తెచ్చారు. 140 కోట్ల మంది పేదలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూమి హక్కులు కలి్పంచి వారి గౌరవాన్ని రెట్టింపు చేశారు. అది చరిత్రలో 1.0గా నిలిచింది. ఇక 2.0లో భాగంగా రాజీవ్‌గాంధీ మొదలు పీవీ నర్సింహారావు వరకు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు తెచ్చారు. ఐఐటీ, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు సామాజిక న్యాయం చేశారు. ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఇక 3.0లో భాగంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల నిర్దేశంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశీ్మర్ వరకు పాదయాత్ర చేసి... నిరుద్యోగులు, పేదలు, రైతులను కలసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ‘జిత్నీ భాగీ దారీ.. ఉత్నీ హిస్సే దారీ (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)’అని నినదించారు. ఈ కులగణన అనేది ఎక్స్‌రే వంటిది. సమాజానికి ఇది ‘మెగా హెల్త్ చెకప్’వంటిదే. దేశంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన తప్పనిసరి. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన మొదలుపెట్టాం. 92శాతం పూర్తయింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాం. సామాజిక న్యాయం చేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాల్సిందే. కులగణన చేసేంతవరకు మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఒత్తిడి తెస్తూనే ఉంటారు.గాంధీ పరివార్.. మోదీ పరివార్ మధ్య యుద్ధందేశంలో ప్రస్తుతం మోదీ పరివార్, గాంధీ పరివార్‡ అని రెండు వర్గాలే ఉన్నాయి. ఇందులో గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని రక్షించాలని భావిస్తుంటే... మోదీ పరివార్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలంతా రాజ్యాంగ రక్షకులైన గాంధీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి. గతంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచి్చన నల్లచట్టాలపై రాహుల్ దృఢంగా నిలబడి కొట్లాడారు. రాహుల్ పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసింది. అదే రీతిలో కులగణనపై కొట్లాడాలి. ఈ అంశంలో రాహుల్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా మేముంటాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఖర్గేతో భేటీ.. ప్రియాంకకు శుభాకాంక్షలు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడిగా కొంతసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జనగణన ప్రక్రియ సాగుతున్న తీరును వివరించినట్టు సమాచారం. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. డిసెంబర్ ఒకటి నుంచి జరగనున్న ప్రజా పాలన దినోత్సవాల ఏర్పాట్లపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల వయనాడ్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకా గాం«దీని రేవంత్, భట్టి విక్రమార్క కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల సహకార సంస్థలకు నాఫ్స్కాబ్ అవార్డులు
న్యూ ఢిల్లీ: నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (నాఫ్స్కాబ్) 60ఏళ్ల ఉత్సవ వేడుకలు కొత్త ఢిల్లీలోని భారత్ మండపం సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత సహకారవేత్తలు కొండూరు రవీంద్రరావు, భీమా సుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తున్న ఈ జాతీయ సహకార సంస్థ 60ఏళ్ల వేడుకలను కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉత్తమ సేవలకు గాను నాఫ్స్కాబ్ ప్రతి ఏటా ఇచ్చే అవార్డులను ఇదే వేదికపై మంత్రి అమిత్ షా ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు.కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేడీసీసీబీ పర్సన్ ఇంచార్జ్, జెసి గీతాంజలి శర్మ, సీఈవో శ్యామ్ మనోహర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) మూడో బహుమతి పొందింది. ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మొదటి బహుమతిని, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మూడో బహుమతిని పొందాయి. కరీంనగర్ డిసిసి పొందిన అవార్డును అధ్యక్షులు రవీందర్ రావు, సీఈవో సత్యనారాయణ రావు కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. కెడిసిసి బ్యాంక్ బహుమతిని పర్సన్ ఇంచార్జ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షా చేతులమీదుగా అందుకున్నారు. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
ఢిల్లీలో మరింతగా పెరిగిన చలి.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా చలి వాతావరణం నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందడం లేదు. మరోవైపు కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.ఈరోజు(మంగళవారం) ఉదయం ఢిల్లీలో అంతటా పొగమంచు కమ్మేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 26, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశాలున్నాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ ఒకటి వరకు ఏర్పడే వాతావరణం విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉండవచ్చు. నవంబర్ 28, 29 తేదీలలో పొగమంచు కమ్మేయనున్న దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీచేశారు. అ సమయంలో వర్షాలు కురిసే అవకాశం కూడా లేదు.ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి మొదలైంది. నవంబర్ 27, 28, 29 తేదీలలో ఉదయం వేళ పొగమంచు కమ్మేయనుంది. చండీగఢ్‌లో ఫాగ్ అలర్ట్ ఉంది. ఈ రోజు హర్యానాలో గరిష్ట ఉష్ణోగ్రత 26-27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11-12 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. పంజాబ్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 25-26 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10-11 డిగ్రీల మధ్య ఉండనుంది.జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత -2 నుండి -3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ఈరోజు జమ్మూలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉంది. ఈ పరిస్థితి నవంబర్ 29 వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో కూడా చలి అధికంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్‌లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్‌పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
విపక్షాల ఆందోళన..పార్లమెంట్ ఎల్లుండికి వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 25) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడంతో ఉభయసభలను బుధవారానికి వాయిదా వేశారు.పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ కామెంట్స్..పార్లమెంటులో నిర్మాణాత్మక చర్చలు జరగాలిఎంపీలు అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలికానీ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయిప్రజలు తిరస్కరించిన పార్టీలు, పార్లమెంటులో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయిపార్లమెంటును అడ్డుకునే వారికి ప్రజలు సమయం చూసి శిక్ష విధిస్తారుగందరగోళం సృషించే పార్టీలు పశ్చాతాపం చెందాలిఅదానీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..తొలి రోజే అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం. సంభల్‌లో అల్లర్లపై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానం.ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
ఢిల్లీ కాలుష్యం.. జాతీయ అత్యవసర పరిస్థితే: రాహుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై కాంగ్రెస్ ఎంపీ. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరగడంపై అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న వేళ.. ఈ సంక్షోభాన్నిపరిష్కరించడానికి అందరూ ఐక్యంగా స్పందించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను జాతీయ అత్యవసర స్థితిగా అభివర్ణించారు.ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో నమోదవుతున్న గాలి కాలుష్యంపై రాజకీయ విమర్శలు, నిందలు వేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. కాలుష్య నివారణకు తక్షణ, సామూహిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా తన కళ్ళు కూడా మండుతున్నాయంటూ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారని తెలిపారు.‘సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు, పేదలు వాయు కాలుష్యం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషపూరితమైన గాలిని తప్పించుకోలేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వృద్ధులు బాధలు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. ప్రపంచంలో దేశ ఖ్యాతి పడిపోతుంది. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరుల నుంచి జాతీయ స్థాయిలో సమిష్టి ప్రతిస్పందన అవసరం. రాజకీయ నిందలు కాదు. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలిపారు.మరికొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్య రూపంలో ముంచుకొస్తన్ను ముప్పును అరికట్టడానికి కలిసి కట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.Air pollution in North India is a national emergency—a public health crisis that is stealing our children’s future and suffocating the elderly, and an environmental and economic disaster that is ruining countless lives. The poorest among us suffer the most, unable to escape the… pic.twitter.com/s5qx79E2xc— Rahul Gandhi (@RahulGandhi) November 22, 2024 -
ఢిల్లీ ఎంట్రీ పాయింట్లను పర్యవేక్షించండి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.ఇక జీఆర్ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు. ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్లైన్లో చేపట్టాల్సి ఉంటుంది. -
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ తనయుడు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ (623/5) చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌటైంది.తండ్రి బాటలోనే తనయుడుఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు. 2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్‌లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ఢిల్లీ ఖాన్ మార్కెట్.. చాలా కాస్ట్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ప్రపంచంలో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక చదరపు అడుగు రిటైల్ స్థలానికి వార్షికంగా చెల్లించాల్సిన అద్దె 229 డాలర్లు (రూ.19,000). ఈ వివరాలను కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ‘మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ద వరల్డ్ 2024’ పేరుతో విడుదల చేసింది.2,047 డాలర్ల వార్షిక అద్దెతో ఇటలీలోని మిలాన్‌లో ‘మాంటే నెపోలియన్’ ప్రపంచంలోనే ఖరీదైన రిటైల్ మార్కెట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని 138 అత్యుత్తమ ప్రాంతాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ప్రతీ మార్కెట్లోని అత్యంత ఖరీదైన రిటైల్ షాపింగ్‌ల కేంద్రాన్ని జాబితాలోకి తీసుకుంది. ఖాన్ మార్కెట్ దేశంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ వ్యాపార సంస్థల కేంద్రంగా నిలిచింది. వార్షికంగా ఇక్కడి అద్దె 7 శాతం పెరిగింది.సంపన్నుల షాపింగ్ కేంద్రం.. ఖాన్ మార్కెట్ అంతర్జాతీయంగా ప్రముఖ రిటైల్ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం భారత దేశ రిటైల్ రంగం బలాన్ని తెలియజేస్తోందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్, ఎండీ సౌరభ్ షట్దాల్ పేర్కొన్నారు. ప్రీమియం బ్రాండ్లు, బోతిక్లతో సంపన్న షాపర్లను ఖాన్ మార్కెట్ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. సదరు ప్రాంతంలో రిటైల్ వాణిజ్య స్థలాల లభ్యత తక్కువగా ఉండడంతో, పోటీ పెరిగి అద్దెలు పెరిగేందుకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు.అంతేకాదు దేశవ్యాప్తంగానూ ప్రముఖ రిటైల్ మార్కెట్లలో షాపింగ్ స్థలాల సరఫరా అంతగా లేదని, అదే సమయంలో బలమైన డిమాండ్ తోడు కావడంతో అద్దెల్లో పటిష్ట వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ఆర్థికంగా బలమైన వృద్ధి, వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో దేశ రిటైల్ రంగం స్థిరమైన విజయ బాటలో కొనసాగుతున్నట్టు షట్దాల్ వివరించారు. టాప్–10 రిటైల్ లొకేషన్లు న్యూయార్క్‌లోని ‘ఫిఫ్త్ అవెన్యూ’ 2,000 డాలర్ల వార్షిక అద్దెతో మాంటే నెపోలియన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 1,762 డాలర్ల వార్షిక అద్దెతో లండన్‌లోని న్యూబాండ్ స్ట్రీట్ మూడో స్థానంలో ఉంది. హాంగ్‌కాంగ్‌లోని సిమ్షాసుయ్ 1,607 డాలర్లు, ప్యారిస్‌లోని అవెన్యూ డెస్ చాంప్స్ 1,282 డాలర్లు, టోక్యోలోని గింజా 1,186 డాలర్లు, జ్యూరిస్లోని బాన్హోఫ్స్ట్రాస్సే 981 డాలర్లు, సిడ్నీలోని పిట్స్ట్రీట్మాల్ 802 డాలర్లు, సియోల్‌లోని మయాంగ్డాంగ్ 688 డాలర్లు, వియన్నాలోని ఖోల్మార్కెట్ 553 డాలర్ల అద్దెతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు. ‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధనకాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది. పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు. -
మెగా ఆటో షో!
అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ షోలో భాగంగా జరగనున్న వాహన ప్రదర్శన కోసం దేశ, విదేశీ దిగ్గజాలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన బిగ్–5 ప్రపంచ వాహన ప్రదర్శనలను తలదన్నేలా ఢిల్లీ ఆటో ఎక్స్పో కనువిందు చేయనుంది!దేశంలో మరో వాహన జాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కొంగొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్... మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలు టయోటా, చైనా బీవైడీ వరకు దాదాపు 28 కంపెనీలు తమ కొత్త వాహన ఆవిష్కరణలతో సందర్శకులను అలరించనున్నాయి. దేశంలో తొలిసారిగా ఆటో షోతో పాటు దీనికి అనుబంధంగా పలు ప్రదర్శనలను కలిపి భారత్ మొబిలిటీ షో–2025 పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు జరగనున్న ఆటో ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత్ మండపం ఈ కార్ల మేళాతో భారత్ సత్తాను చాటిచెప్పనుంది.. ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలపైనే కంపెనీలన్నీ మరింత ఫోకస్ చేస్తుండటం విశేషం. 2023లో జరిగిన ఆటో షోతో పోలిస్తే రానున్న షో నాలుగు రెట్లు పెద్దది. అంతేకాదు 1986లో దేశంలో మొదలైన ఆటో ఎక్స్పో నుంచి చూస్తే.. 2025 షో కనీవినీ ఎరుగని స్థాయిలో చరిత్ర సృష్టించనుంది. డెట్రాయిట్, జెనీవా దిగదుడుపే...!ఈసారి ఆటో షో.. విదేశాల్లో పేరొందిన ప్రదర్శనలన్నింటినీ మించిపోయే రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్పోలను ‘బిగ్–5’గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పాల్గొంటున్న కంపెనీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధిక వ్యయాలు, సందర్శకులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. మ్యూనిక్ ఆటో షోలో 13 కార్ల కంపెనీలు పాల్గొనగా... ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా షోలో 20 వాహన సంస్థలు పాలు పంచుకున్నాయి. ఇక పారిస్‌లో 11, టోక్యోలో 22 కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేశాయి. గతేడాది జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో 13 కంపెనీలు 35 వాహన బ్రాండ్లను ప్రదర్శించాయి. కాగా, రాబోయే మన ఆటో ఎక్స్‌పోలో 16 కార్ల కంపెనీలు, 6 వాణిజ్య వాహన తయారీదారులు, 6 ద్విచక్ర వాహన సంస్థలు.. వెరసి 28 సంస్థలు అదరగొట్టేందుకు సై అంటున్నాయి. గత ఎడిషన్ (2023)కు దూరంగా ఉన్న హీరో మోటో, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా తదితర కంపెనీలు మళ్లీ తిరిగొస్తున్నాయి. మరోపక్క, ఈసారి అర డజను కొత్త కంపెనీలు రంగంలోకి దూకుతున్నాయి. ఇందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్, టీఐ క్లీన్ మొబిలిటీ, పోర్‡్ష తదితర కంపెనీలు ఉన్నాయి.వీటిపై ఫోకస్మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రి్టక్ ఎస్యూవీ వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు వేవ్ మొబిలిటీ భారత్‌లో తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు ఈవీల హల్చల్.. గత షోలో కంపెనీల సంఖ్య తగ్గినప్పటికీ 75 వాహనాలను ఆవిష్కరించారు. ఈసారి కొత్త మోడళ్లతో పాటు ఆవిష్కరణలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఈవీ రంగంలో తన తొలి మోడల్‌ను ప్రపంచానికి చూపనుంది. టాటా మోటార్స్ సైతం కొత్త ఈవీలను ప్రదర్శించనుంది. వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ కార్లు కూడా షో కోసం ఫుల్ చార్జ్ అవుతున్నాయి.మన మార్కెట్ రయ్ రయ్... ఈ ఏడాది మన వాహన మార్కెట్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ టాప్–10 ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యంత వేగవంతంమైన వృద్ధితో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రధాన వాహన మార్కెట్లలో ఒక్క భారత్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే 2019 ముందు నాటి కోవిడ్ ముందస్తు స్థాయి అమ్మకాలను చేరుకోగలిగాయి. అత్యంత కీలక ఆటోమొబైల్ మార్కెట్లయిన అమెరికా, జర్మనీ, జపాన్‌లో 2019 నాటి ఉత్పత్తి కోవిడ్ ముందు స్థాయిని అందుకోలేకపోవడం గమానార్హం. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. ఇది వాహన కంపెనీలకు అపారమైన అవకాశాలను షృష్టించనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే కావడం, తలసరి ఆదాయం (ప్రస్తుతం దాదాపు 2000 డాలర్లు. 2030 కల్లా 5,000 డాలర్లను చేరుతుందని అంచనా) పెరుగుతుండటం కూడా సానుకూలాంశం! -
హిమాచల్ భవన్ జప్తు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్లను నడుపుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హిమాచల్‌లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్ భవన్‌ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం! చేతికందినన్ని అప్పులు చెయ్యడం! ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం! ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు! గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7— KTR (@KTRBRS) November 20, 2024 -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.కృత్రిమ వర్షం అంటే..?కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది. -
ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..
ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కుటుంబంలో మొత్తం 140 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎక్కడోగానీ జరగదు. తరతరాలు ఓకే వృత్తిని కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తూ.. ప్రతి తరంలో ఒక వ్యక్తి దాన్ని అనుసరించడం విశేషం. ఇలా ఐదు తరాలు వైద్య వృత్తినే అనుసరించారు. ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా డాక్టరే అయ్యి ఉండాలట. అంతేగాదు ఐదు తరాలుగా ప్రతి ఒక్క సభ్యుడు డాక్టర్‌గా ఉన్న ఏకైక కుటుంబంగా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..డిల్లీకి చెందిన సబర్వాల్ కుటుంబం ఈ ఘనతను దక్కించుకుంది. ఇదంతా వారి ముత్తాత లాలా జీవన్మల్ నుంచి మొదలయ్యిందని డాక్టర్ రవీంద్ర సబర్వాల్ చెబుతున్నారు. లాహోర్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్న లాలా జీవన్ముల్ ఒకరోజు మహాత్మా గాంధీ ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విన్నాడట. ఇక అప్పుడే ఆయన ఆస్పత్రిని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతేగాదు తన నలుగురు కుమారులు బోధిరాజ్, త్రిలోక్ నాథ్, రాజేంద్ర నాథ్, మహేంద్ర నాథ్ లను మెడిసిన్ చదివించాలని భావించాడట. అలా వారి కుటుంబంలో 1902లో తొలి డాక్టర్‌గా బోధిరాజ్ ఈ వృత్తిని చేపట్టారు. అదే ఏడాది పాకిస్తాన్‌లోని జలాల్పూర్ జట్టన్లో జీవన్ ఆసుపత్రిని నిర్మించారు. ఆయన అక్కడ వైద్యుడిగా సేవలందించారు. అప్పటి నుంచి ఈ వృత్తిని కుటుంబంలోని తదుపరి తరం చేపట్టాలని, అలాగే వైద్య విద్యనభ్యసించిన వధువునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విభజన సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లాల్సి వచ్చింది ఈ కుటుంబం.ప్రస్తుతం ఢిల్లీలో ఆ కుటుంబానికి మొత్తం ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. అంతేగాదు కరోల్ బాగ్, ఆశ్రమం, వసంత్ విహార్‌లో వాటికి సంబంధించిన వివిధ శాఖలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి తరం డాక్టర్ కావడంతో ఆస్పత్రి కారిడార్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేగాదు ఆ కుటుబంలోని తొలి డాక్టర్ భోధిరాజ్ హయాం నుంచి.. తర్వాతి తరం మెడిసిన్ నాల్లోవ సంవత్సరం చదువుతుండగానే.. ఒక సరికొత్త స్టెతస్కోప్‌ను అందజేయడం ఆచారంగా పాటిస్తారట. దీన్ని వాళ్లు ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ మేరకు నేత్ర నిపుణుడు డాక్టర్ వికేష్ సబర్వాల్ మాట్లాడుతూ..డాక్టర్ బోధిరాజ్ కుటుంబ సభ్యులందర్నీ వైద్యులుగా తీర్చిదిద్దేలా గట్టిగా కృషి చేశారని చెప్పారు. తమకు అరటిచెట్టుకు ఇంజెక్షన్లు ఇవ్వడం నుంచి ప్రాక్టీస్ చేయించినట్లు తెలిపారు. ఆఖరికి డిన్నర్ టేబుల్ సంభాషణల్లో కూడా ఆస్పత్రి గురించే మాట్లాడటం, చర్చలు జరుగుతాయని అన్నారు. అలాగే తమ పిల్లలు ఆపరేషన్ థియేటర్ లోపలే హోంవర్క్‌లు చేస్తారని గర్వంగా చెప్పారు. ప్రమాద బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలియగానే తమ కుటుంబం అప్రమత్తమైపోతుందని చెబుతున్నారు. ఎవ్వరూ వ్యతిరేకించ లేదా..?కుటుంబంలో ప్రతి ఒక్కరినీ డాక్టర్‌గా మార్చే నినాదాన్ని ఎవ్వరు వ్యతిరేకించి లేదా అంటే..? వారి ఆలోచనని మార్చడంలో కుటుంబం పూర్తిగా విజయం సాధించిందని అంటారు ఆ కుటుంబ సభ్యులు. ఎవ్వరైనా తాము వేరే కెరీర్‌ని ఎంచుకుంటాం అనగానే కుటుంబ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారట. అదికూడా ఆస్పత్రిలోనే సమావేశమై నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని చెబుతోంది ఆ కుటుంబం. ఇక కుమారుల్లో ఒకరు బయోకెమిస్ట్ చేసిన భార్యను వివాహం చేసుకుంటే..ఆమెను పదేపదే మెడిసిన్ చదవమని చెప్పడంతో..ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిందని చెబుతున్నారు నాలుగోతరం కోడలు డాక్టర్ గైనకాలజిస్ట్ శీతల్. ఇక ఆ కుటుంబంలోని ఆరవతరం సమర్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా తనని తాను డాక్టర్ సమర్వీర్గా పరిచయం చేసుకోవడం విశేషం. అయితే తమ కుటుంబంలోని ఆరవ తరం దియా సబర్వాల్ అనే 21 ఏళ్ల అమ్మాయి తమ కుటుంబ వారసత్వ వృత్తికి విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్‌లలో డబుల్ డిగ్రీని పూర్తి చేసిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 16 ఏళ్ల ఆర్యన్ కూడా ఇలానే వేరే రంగం(క్రికెట్) అంటే మక్కువ..కానీ నానమ్మ కుటుంబ వారసత్వం వృత్తినే ఎంచుకోమని బలవంతం చేస్తోందని చెబుతున్నాడు. ఇలా ఒక నినాదంతో కుటుంబం అంతా ఒక తాటిపై నిలబడి ఆ వృత్తినే చేపట్టడం అంత ఈజీ కాదు కదా..!.(చదవండి: తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్..!) -
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
రాష్ట్రపతిని కలిసేదాకా ఇక్కడే ఉంటాం: లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు