Kakinada District Latest News
-
పెట్టుబడి పిడుగు
● అన్నదాతలను దెబ్బతీసిన ఫెంగల్ ● అదనపు ఖర్చులతో ఆవేదన ● ఉమ్మడి జిల్లాలో తుపాను బారిన 45 వేల ఎకరాలు ● యంత్రాల స్థానంలో కూలీల వినియోగం సాక్షి, అమలాపురం: ఫెంగల్ తుపాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు కంటికి కనిపించే నష్టం కొంత చేస్తే, కనిపించని నష్టం అంతకు రెండు, మూడు రెట్లు చేసింది. తుపాను వల్ల వరిచేలు నేలకొరగడం, ఒరిగిన చేలు కొంత మేర నీట నానడం వల్ల ధాన్యం నాణ్యత దెబ్బతిననుంది. ఇదే సమయంలో యంత్రాలతో కోతలు నిలిచిపోవడం, ఆ స్థానంలో కూలీలతో కోతలు, నూర్పిడులు, తడిసిన ధాన్యం ఎండబెట్టడం వంటి పనులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చేదు ఫలితాలు ఫెంగల్ తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలు ఉమ్మడి తూర్పు రైతులకు చేదు ఫలితాలు చూపాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, 1.05 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు జరిగాయి. ఇంకా 58 వేల ఎకరాల్లో కోతలు జరగాలి. కాకినాడ జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, 1.20 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 94 వేల ఎకరాల్లో మిగిలాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,78,447 లక్షల ఎకరాలలో సాగు జరగగా, 1,22,470 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. ఇంకా 55,976 ఎకరాల్లో కోతలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఫెంగల్ తుపాను ఉమ్మడి తూర్పు రైతులను చావు దెబ్బతీసింది. నీటిలోనే వరికంకులు భారీ వర్షాల వల్ల మూడు జిల్లాలో సుమారు 41 వేల ఎకరాల్లో 20 శాతం నుంచి 30 శాతం వరకు వరిచేలు నేలకు ఒరిగి నీట నానుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో మినహా డెల్టా శివారుల్లో నీరు దిగే పరిస్థితి లేక వరి కంకులు నీటిలోనే ఉన్నాయి. డెల్టాలో మురుగునీటి కాలు వ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ముంపునీరు దిగే పరిస్థితి లేదు. కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపునకు ఇచ్చిన నిధులతో పనులు చేపట్టిన దాఖలాలు లేవు. దీనివల్ల నీరు దిగక ధాన్యం దెబ్బతిని రంగు మారిపోతోందని రైతులు వాపోతున్నారు. ఒబ్బిడి చేయడం అదనపు భారం నెలకొరిగిన చేలల్లో పంటను ఒబ్బిడి చేయడం రైతులకు అదనపు భారం కానుంది. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో యంత్రంతో కోతకు, కూలీలతో ధాన్యం ఎండ బెట్టేందుకు కలిపి ఎకరాకు రూ.ఏడు వేల వరకు అయ్యేది. వర్షాలకు చేలు నేలనంటిన చోట మెషీన్‌తో కోతకు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. అదనంగా మరో ముగ్గురు, నలుగురు కూలీలతో కలిపి రూ.పది వేల వరకు అవుతోంది. మనుషులతో కోతకు పదిహేను మంది వరకు మహిళా కూలీలకు, తడిసిన పనలను గట్టు మీదకు తెచ్చేందుకు, పడుగులు వేయడం, ఆరిన తరువాత ట్రాక్టర్‌తో నూర్పిడులకు, చిన్న ఫ్యాను ట్రాక్టరుతో ధాన్యం ఎగరబోత, ధాన్యం పట్టుబడికి కలిపి ఎకరాకు సుమారు రూ.14,400 వరకు అవుతోందని రైతులు లెక్క కడుతున్నారు. ఇప్పటి వరకు యంత్రాలతో కోతలు, ధాన్యం పట్టుబడులకు రెండు, మూడు రోజులు సరిపోతే, ఇదే పనికి ఇప్పుడు ఐదా రు రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు. కోతల ఖర్చు ఎక్కువైంది తుపాను వర్షాల వల్ల వరి చేలల్లో నీరు చేరి కోతలు ఆగిపోయాయి. తుపాను ముందు యంత్రాల సహాయంతో వరి కోతలు సాఫీగా సాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేలల్లో నీరు ఉండడం వల్ల యంత్రాలు నడవటానికి ఇబ్బందిగా ఉంది. పోనీ కూలీలతో వరి మాసూళ్లు చేద్దామంటే రైతులు అదనపు ఖర్చులు భరించవలసి వస్తోంది. ఖరీఫ్‌లో ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో ఖరీఫ్ పంట చేతికందని పరిస్థితి నెలకొంది. – బొక్కా శ్రీనివాస్, రైతు, అల్లవరం దళారుల హవా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. బస్తా (75 కేజీలు) ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,725 కాగా, దీని కన్నా రూ.100 నుంచి రూ.150 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రంగుమారి, మొలక వచ్చిన ధాన్యాన్ని కొంటారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఈ ఏడాది డెల్టా శివారు ప్రాంతాల్లో దిగుబడి సగటు 29 బస్తాలు (21.75 క్వింటాళ్లు) కన్నా తక్కువగా వస్తోందని రైతులు వాపోతున్నారు. -
ప్రత్తిపాడు కోఆర్డినేటర్ గిరిబాబు
● రెండు దశాబ్దాల తరువాత రాజకీయాల్లోకి ముద్రగడ కుటుంబం రీ ఎంట్రీ ● నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్న యువనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఈ మేరకు మంగళవారం గిరిబాబుకు పార్టీ సమన్వయకర్తగా నియామక ఉత్తర్వులు జారీచేసింది. గిరిబాబు హైదరాబాద్, భీమవరంలలో ప్రాథమిక, ఉన్నత విద్య, చైన్నెలో ఇంజినీరింగ్ చదువుకుని ఉన్నత విద్య ఎంఎస్ లండన్‌లో పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకుంటున్న సమయంలో సోదరుడు బాలుకు ఆరోగ్య సమస్య ఏర్పడడంతో స్వగ్రామం కిర్లంపూడి తిరిగొచ్చారు. అప్పటి నుంచి తండ్రి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తోడుగా ఉంటున్నారు. తాత వీరరాఘవరావు, తదనంతరం తండ్రి ముద్రగడ పద్మనాభం నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న గిరిబాబు ఇటీవల ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి తాత వీరరాఘవరావు ఒక పర్యాయం, తండ్రి పద్మనాభం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే, రెండు పర్యాయాలు మంత్రి, 1999–2004 వరకు కాకినాడ ఎంపీగా పనిచేశారు. రెండు దశాబ్దాల తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాల్లో ముద్రగడ కుటుంబం నుంచి మూడో తరం నేతగా గిరిబాబు రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన దగ్గర నుంచి పద్మనాభంతో పాటు అతని వెంట తనయుడు గిరిబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గిరిబాబును ప్రత్తిపాడు కోఆర్డినేటర్‌గా జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన కోఆర్డినేటర్ బాధ్యతలతో పార్టీ పూర్వవైభవానికి శక్తివంచన లేకుండా తండ్రి, పార్టీ నేతల సహకారాలతో కృషిచేస్తానన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతానన్నారు. -
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు బడిలో భాగమే
కాకినాడ రూరల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా బడిలో భాగమేనని వారిని బడుల్లో చేర్చుకుని సహిత విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని వలసపాకల మండల పరిషత్ మెయిన్ స్కూల్ వద్ద గల భవిత సెంటరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త చామంతి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భవిత సెంటరును పరిశీలించి పలు సూచనలు చేశారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి భవిత కేంద్రాల ద్వారా విద్యను అందిస్తుందన్నారు. భవిత సెంటరులో ప్రత్యేకమైన శిక్షణను అందిస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. డీఈఓ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్స్ ఆఫ్ కాకినాడ క్లబ్ సభ్యులు లక్ష్మి, దుర్గ, నివేదిత, వరలక్ష్మి, మల్లేశ్వరి భవిత సెంటరుకు హెచ్‌పీ కలర్ ప్రింటర్‌ను బహూకరించారు. ఎంఈఓ 2 ఏసుదాసు, వాకలపూడి కాంప్లెక్స్ హెచ్ఎం మూర్తి, వలపపాకల స్కూల్ హెచ్ఎం నాగవేణి, భవిత సెంటర్ ఇనస్ట్రక్టర్లు నాగలక్ష్మి, వీరగణేష్, పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా ఎమ్మెల్సీ ఎన్నికలు
కలెక్టర్ ఆదేశం కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ గురువారం స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో ఆర్వో, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఏఆర్వో, కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావుతో కలిసి కాకినాడ, పెద్దాపురం, ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానం, వెబ్‌కాస్టింగ్, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కి తరలించడం, రిసెప్షన్ సెంటర్లు సెక్టార్, రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు వంటి ఏర్పాట్లపై చర్చించారు. ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. కాకినాడ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాలన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. బియ్యం అక్రమ రవాణా నివారించాలి ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీస్ అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దానిని ఎలా పరీక్షించాలి, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పీడీఎస్ బియ్యంగా మార్చడంలో ఉన్న దశలను, రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎన్ని రకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయో పరిశీలించాలన్నారు. వర్క్‌షాపులో పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం దేవులా నాయక్, ఇన్చార్జి డీఎస్వో టి.లక్ష్మీప్రసన్నదేవి, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర పోలీస్ అధికారులు, పౌరసరఫరాలశాఖ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నిక రోజు స్పెషల్ సీఎల్
కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నియోజక వర్గ ఓటర్లుగా కాకినాడ జిల్లాలో నమోదైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్‌సంస్థల్లో పని చేసే ఈ నియోజకవర్గ ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పిస్తూ 5వ తేదీన పోలింగ్ సమయంలో విధులకు ఒక గంట ఆలస్యంగా హాజరయ్యేందుకు లేదా షిఫ్ట్‌ల అడ్జస్ట్మెంటు లేదా కొద్ది సమయం వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయాలు లేదా సంస్థలకు ఈ నెల 4, 5 తేదీల్లోనూ, ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయం, సంస్థకు ఈ నెల 9వ తేదీన స్థానిక సెలవు దినాలు ప్రకటిస్తూ కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 5న టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా టెన్నిస్ సంఽఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపికను నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కె.మోహన్‌బాబు మంగళవారం తెలిపారు. పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. బాలుర విభాగంలో 15 మందిని, బాలికల విభాగంలో 15 మందిని, పురుషులు, మహిళల విభాగాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 25 వరకు కాకినాడ సురేష్నగర్లోని శ్రీప్రకాష్ స్కూల్లో జరిగే అంతర్‌జిల్లాల టేబుల్‌టెన్నిస్ పోటీలలో పాల్గొంటారని టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు, విజయ్‌ప్రకాష్ పేర్కొన్నారు. రా రైస్ ఎగుమతి చేయలేం కలెక్టర్‌కు చాంబర్ వినతి కాకినాడ: జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను మంగళవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలెక్టరేట్లో కలిశారు. ఈ సందర్భంగా చాంబర్ ప్రతినిధులు, ఎక్స్‌పోర్టర్స్, స్టీవ్డోర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. పోర్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో రారైస్ ఎగుమతి చేయడం అసాధ్యమని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేస్తే అంతటి అన్యాయం మరొకటి ఉండదని, అది రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని చాంబర్ అధ్యక్షుడు బాబు వివరించారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేసే వారికి చాంబర్ ఎట్టి పరిస్థితుల్లోను మద్దతు ఇవ్వదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. రా రైస్ ఎగుమతి చేయడంలో ఎదురవుతోన్న ఇబ్బందులతో వాటిని ఆపేయాలనే ఆలోచనతో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేల్పూరి శ్రీనివాస్, లలితా రైస్ ప్రతినిధులు ఉన్నారు. -
సన్నాలు కొనేవారేరి?
● చుక్కలు చూపిస్తోన్న దళారులు ● సాంబ మసూరి రైతుల గగ్గోలు ● కొనుగోలు పట్టించుకోని ప్రభుత్వం ● సీజన్లో 60 వేల ఎకరాల్లో సాగు ● బస్తా రూ.1,500కు కొనుగోలు ● నిల్వ చేసుకుంటే రూ.2,500 పై మాటే సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీపీటీ సన్న రకాలు పండించిన రైతులు గిట్టుబాటు లేక లబోదిబోమంటున్నారు. ప్రకృతి కన్నెర్ర చేసిన విపత్కర సమయంలో రైతులను సకాలంలో ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 80శాతం ఆయకట్టు రైతులు స్వర్ణ మసూరి రకాన్ని సాగు చేశారు. మిగిలిన 20 శాతం ఆయకట్టులో బీపీటీ సాంబమసూరి సన్న రకాన్ని వేశారు. జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే ఇందులో 60వేల ఎకరాలు బీపీటీ సాంబ మసూరి రకాన్ని సాగు చేశారు. పెట్టుబడి కాస్త ఎక్కువైనా ధర ఆశాజనకంగా ఉంటుందని గంపెడాశతో బీపీటీ సాంబ మసూరి రకాన్ని వేసిన రైతులకు దళారులు, కమీషన్ ఏజెంట్లు చుక్కలు చూపిస్తున్నారు. అనుకోకుండా వచ్చిపడ్డ ఫెంగల్ తుపానుతో జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో రైతులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తుపానుతో గడచిన మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది. ధర ఆశాజనకంగా ఉంటుందని సన్నాలు సాగు చేసిన రైతులైతే అసలు ఈ పంట ఎందుకు వేశాం దేవుడా అంటూ కంటతడి పెడుతున్నారు. సహజంగా సన్న రకమైన బీపీటీకి ఈ సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ధర కూడా ఆశాజనకంగా ఉంటుందని రైతులు గంపెడాశ పెట్టుకున్నారు. ఈ పంట సాగుచేసిన రైతులు వరి కోత కోసి స్వయంగా నూర్పిళ్లు చేసుకుని నెల, నెలన్నర నిల్వ చేసుకుని మంచి ధర వచ్చాక అమ్ముకుంటుంటారు. పెట్టుబడి ఎక్కువైనా.. బీపీటీ సాగు కోసం ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల పెట్టుబడి పెట్టారు. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకానికి పెట్టుబడి పదివేలు ఎక్కువే అవుతుంది. స్వర్ణ రకంతో పోల్చుకుంటే బీపీటీ సాంబమసూరి తక్కువ దిగుబడి వస్తుంది. అయినా నిల్వచేసుకుని అమ్ముకుంటే మంచి ధర వస్తుందని రైతులు ఈ రకం సాగు చేశారు. గతేడాది ఒక ఎకరం పొలంలో స్వర్ణ 40 బస్తాలు దిగుబడి రాగా, బీపీటీ సాంబ 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అయినా ధరలో మంచి జరుగుతుందని అనుకున్నారు. ఈసారి అవే అంచనాలతో బీపీటీ సాంబ మసూరి సాగుచేసిన రైతులు వరి కోతలకు సిద్ధమయ్యారు. గొల్లప్రోలు, పిఠాపురం, కరప, పెద్దాపురం, సామర్లకోట తదితర మండలాల్లో రైతులు ఈ రకం పంట కోతలు జరుపుతోన్న సమయంలో తుపాను దెబ్బతీసింది. మెషీన్లతో పంట ఒబ్బిడి చేసినా అప్పటికే ధాన్యం తడిసిపోయింది. దీనిని సాకుగా తీసుకుని దళారులు, కమీషన్ ఏజెంట్లు అమాంతం ధరలను తగ్గించేశారు. వాస్తవానికి ఈ రకాల ధాన్యానికి ధర రూ.2,300 నుంచి రూ.2,500 పలుకుతుందని రైతులు లెక్కలు వేసుకున్నారు. ఇంత లేకున్నా కనీసం రూ.2,200లు తక్కువ కాకుండా వస్తుందనే ఆశతో ధైర్యం చేసి సాగు చేసిన రైతులు ఇప్పుడున్న ధర చూసి గుండెలు బాదుకుంటున్నారు. వర్షాలు దెబ్బ తీశాయి ధర ఎక్కువగా ఉంటుందనే ఆశపడి బీపీటీ సాంబ మసూరి సాగు చేశాను. గత సీజన్లో ఇలానే వేసిన సాంబ మసూరికి మంచి ధర రావడంతో ఈ సారి కూడా అదే సాగు చేశాను. కానీ ఈసారి వర్షాలు దెబ్బ తీశాయి. పెట్టుబడి స్వర్ణ రకం కంటే కాస్త ఎక్కువైనా.. ధర వస్తుందని ఎదురు చూశాను. తీరా వర్షాలకు తడిసి పోవడంతో రూ.1,500కి మించి కొనే నాథుడే లేకుండా పోయాడు. సుందరరెడ్డి రాజు, కౌలు రైతు, పులిమేరు, పెద్దాపురం మండలంఅన్నదాతల ఆవేదన కుప్పలు వేసి ఆరబెట్టి అమ్ముకుంటే అనుకున్న ధర రూ.2,500 వస్తుంది. వర్షానికి తడిసిపోవడంతో ఆరబెట్టి అమ్మే సరికి తూకం తగ్గిపోయి నష్టపోతామని రైతులు పచ్చి ధాన్యం కళ్లాల్లోనే అమ్మేస్తున్నారు. 75 కేజీల బస్తా రూ.1,400, రూ.1,500కి మించి కొనుగోలు చేయడం లేదని రైతులు మొత్తుకుంటున్నా సర్కారు చెవికెక్కడం లేదు. ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బీపీటీ సాంబమసూరి సాగు చేసిన రైతులు దిగులు చెందుతున్నా రు. ఈ తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై కనీసం దృష్టి పెట్టడం లేదంటున్నారు. రైతుల వద్ద నుంచి ఈ రకం ధాన్యాన్ని దళారుల ద్వారా కొనుగోలు చేసిన మిల్లర్లు బాయిల్డ్ చేసి మంచి ధరకు అమ్ముకుంటున్నారు. వాతావరణ పరిస్థితులకు తలొగ్గి తక్కువ ధరకే అమ్మేసుకోవాల్సి వస్తోందని రైతులు మదనపడుతున్నారు. నెల రోజులు ఆగితే సన్న రకాలకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు రూ.1,400కే అమ్ముకుంటున్నారు. అంటే ప్రతి బస్తాపైనా రూ.800 బీపీటీ సాంబ మసూరి రైతులు కోల్పోతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం బీపీటీ స్టీమ్ బియ్యం 25 కేజీల బస్తా రూ.1,500కు అమ్ముడుపోతోంది. ఈ లెక్కన 75 కేజీలు రూ.4,500 పలుకుతుంది. బియ్యం ఇలా మంచి ధర పలుకుతుంటే తమ రెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందని రైతులు మదనపడుతున్నారు. -
సమన్వయంతో అభివృద్ధి
కాకినాడ సిటీ: కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు పారిశ్రామిక, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.మల్లిబాబు కోరారు. కాకినాడ పోర్టు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్‌పోర్టు, ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో మంగళవారం రాత్రి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని అనేక వ్యాపార కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయన్నారు. ఈ కార్యకలాపాలతో వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందన్నారు. కాకినాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్థానికంగా నెలకొల్పిన వివిధ పరిశ్రమలు, రవాణా రంగంలో ఉన్న వివిధ రకాల వాహనదారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలీస్, పరిశ్రమలు, రవాణా శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆర్.సుస్మిత, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, రవాణాశాఖ డీటీసీ మురళీకృష్ణ, పరిశ్రమశాఖ జీఎం సీహెచ్ గణపతి పాల్గొని పోర్టు పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాకినాడ సీ పోర్టు సీఈవో మురళీధర్, జెమిని ఎడిబుల్ ఆయిల్, ఇతర పరిశ్రమ సంస్థల ప్రతినిధులు, ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్, టాంకర్స్, మినీ గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బియ్యం ఎగుమతి మూలాల ధ్రువీకరణలో మా పాత్ర లేదు
కస్టమ్స్ కమిషనర్ నరసింహారెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం మూలాలను ధ్రువీకరించడంలో తమ శాఖ పాత్ర లేదని కస్టమ్స్ కమిషనర్ (విజయవాడ) సాధు నరసింహారెడ్డి తెలిపారు. కస్టమ్స్ నోటిఫైడ్ ఏరియాలోకి బియ్యం ప్రవేశించిన తర్వాత కస్టమ్స్ పాత్ర ప్రారంభమవుతుందన్నారు. కమిషనర్ నరసింహారెడ్డి మంగళవారం కాకినాడ కస్టమ్స్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం అధికారులు, వ్యాపారులతో వివిధ సమస్యలపై చర్చించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన సీకార్గో మేనిఫెస్టో, ట్రాన్స్షిప్మెంట్ రెగ్యులేషన్స్ (ఎస్సీఎంటీఆర్)–టెక్నికల్, సీబీఎల్ఎంఎస్ పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను వాణిజ్య ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై వ్యాపారవేత్తలకు త్వరలో శిక్షణ ఏర్పాటు చేస్తామని కమిషనర్ చెప్పారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి సమస్యపై కూడా కమిషనర్ చర్చించారు. రైస్ ఎక్స్‌పోర్టర్స్ సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. తాము చట్టాన్ని గౌరవిస్తున్నామని, ఎగుమతి కోసం పీడీఎస్ బియ్యాన్ని మళ్లించే ఎటువంటి కార్యకలాపాలకు తమ సంఘం మద్దతు ఇవ్వదన్నారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. స్టీవ్డోర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ బియ్యం ఎగుమతిపై స్పష్టత వచ్చే వరకు తెల్ల బియ్యం ఎగుమతి నిర్వహణను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. పౌరసరఫరాల ఎన్ఓసీ తీసుకోవాలి కాకినాడ కస్టమ్స్ అదనపు కమిషనర్ జి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ జూలై 31 ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోర్టు ఏరియాలో ఆగస్టు 5 నుంచి పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారుల ద్వారా పనిచేసేలా సమీకృత చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. పోర్టులోకి వచ్చే వాహనాలను తనిఖీ చేయించుకుని ఎగుమతిదారులు పౌర సరఫరాల ఎన్ఓసీ తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. పీడీఎస్ బియ్యం మళ్లింపు సహా ఏదైనా ముప్పును అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కస్టమ్స్ విభాగం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్స్, వ్యాపారవేత్తలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్లు ఎన్.రవికుమార్, జీఎస్ఆర్ నాయుడు, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బి.మహేష్‌బాబు, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వీవీ రాఘవులు, కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రామకృష్ణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నిక రోజు స్పెషల్ సీఎల్
కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నియోజక వర్గ ఓటర్లుగా కాకినాడ జిల్లాలో నమోదైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్‌సంస్థల్లో పని చేసే ఈ నియోజకవర్గ ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పిస్తూ 5వ తేదీన పోలింగ్ సమయంలో విధులకు ఒక గంట ఆలస్యంగా హాజరయ్యేందుకు లేదా షిఫ్ట్‌ల అడ్జస్ట్మెంటు లేదా కొద్ది సమయం వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయాలు లేదా సంస్థలకు ఈ నెల 4, 5 తేదీల్లోనూ, ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయం, సంస్థకు ఈ నెల 9వ తేదీన స్థానిక సెలవు దినాలు ప్రకటిస్తూ కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 5న టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా టెన్నిస్ సంఽఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపికను నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కె.మోహన్‌బాబు మంగళవారం తెలిపారు. పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. బాలుర విభాగంలో 15 మందిని, బాలికల విభాగంలో 15 మందిని, పురుషులు, మహిళల విభాగాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 25 వరకు కాకినాడ సురేష్నగర్లోని శ్రీప్రకాష్ స్కూల్లో జరిగే అంతర్‌జిల్లాల టేబుల్‌టెన్నిస్ పోటీలలో పాల్గొంటారని టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు, విజయ్‌ప్రకాష్ పేర్కొన్నారు. రా రైస్ ఎగుమతి చేయలేం కలెక్టర్‌కు చాంబర్ వినతి కాకినాడ: జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను మంగళవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలెక్టరేట్లో కలిశారు. ఈ సందర్భంగా చాంబర్ ప్రతినిధులు, ఎక్స్‌పోర్టర్స్, స్టీవ్డోర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. పోర్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో రారైస్ ఎగుమతి చేయడం అసాధ్యమని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేస్తే అంతటి అన్యాయం మరొకటి ఉండదని, అది రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని చాంబర్ అధ్యక్షుడు బాబు వివరించారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేసే వారికి చాంబర్ ఎట్టి పరిస్థితుల్లోను మద్దతు ఇవ్వదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. రా రైస్ ఎగుమతి చేయడంలో ఎదురవుతోన్న ఇబ్బందులతో వాటిని ఆపేయాలనే ఆలోచనతో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేల్పూరి శ్రీనివాస్, లలితా రైస్ ప్రతినిధులు ఉన్నారు. -
శాంతివర్ధనం.. పరిమళించిన మానవత్వం
పెద్దాపురం: ఒకరిద్దరు బిడ్డలను సాకాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్న ఈ రోజుల్లో సుమారు 150 మంది దివ్యాంగులు, మానసిక చిన్నారుల (విభిన్న ప్రతిభా వంతుల) ఆలనా పాలనా చూసేందుకు వారు ముందుకువచ్చారు. వారి ఆకలి తీర్చిన అమ్మానాన్నలుగా సేవలందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీశాంతి వర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్వాహకులు రాయవరపు వీరబాబు, సత్య దంపతులు.కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన రాయవరపు వీరబాబుకు చిన్నతనంలోనే ఓ కాలికి పోలియో సోకింది. తనలాగే వికలాంగత్వంతో బాధపడే వారి కోసం ఏదైనా చేయాలని భావించాడు. కంప్యూటర్ విద్యార్థిని సత్య వీరబాబును ప్రేమించింది. అతడి భావాలు, ఆలోచనలు నచ్చడంతో తల్లిదండ్రుల అనుమతితో 2002లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. భర్త ఆశయాన్ని విని తాను కూడా చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది భార్య సత్య. మానసికంగా, అంగవైకల్యంతో బాధపడే వారి కోసం ఏదైనా చేయాలని తలపించారా దంపతులు. వారి ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిందే శ్రీశాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల. 2006లో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో ముగ్గురు పిల్లలతో ఓ పాత వీడియో థియేటర్లో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు పులిమేరు కేంద్రంగా, అన్నవరం బ్రాంచితో కలిపి సుమారు 150 మందికి పైగా పిల్లలకు ఆశ్రయం ఇచ్చే స్థాయికి ఎదిగింది. పాఠశాల ప్రారంభించిన మొదట్లో తమ, చేరదీసిన దివ్యాంగ బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టేందుకు ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువునూ తాకట్టు పెట్టేశారు. ఒకానొక సమయంలో చివరకు తాళిబొట్టును కూడా తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చి చిన్నారుల ఆకలిని తీర్చారు అమ్మకు ప్రతిరూపంగా నిలిచిన సత్య. ఇక్కడ ఉంటున్న వారిలో చాలామంది వివిధ రకాలుగా బాధపడుతూ అనాథలుగా మిగిలిన వారే. వారిలో కొందరికి వినిపించదు, మరికొందరికి రెండు కళ్లూ కనిపించవు, మరికొందరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. చాలామంది రాత్రిళ్లు అసలు నిద్రే పోరు. వారందరికీ ఇప్పటికీ ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారా దంపతులు.ప్రముఖుల సందర్శన : ఈ పాఠశాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిలారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు గతంలో సందర్శించారు. పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన వారు పాఠశాలను సందర్శించి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అంగవైకల్యం తెలియనివ్వడం లేదుమాది పిఠాపురం మండలం మంగుతుర్తి 13 ఏళ్ల కిందట గ్రామంలో అందరూ కుంటోడు కుంటోడు అంటే ఏడుపు వచ్చేది. అప్పుడే పులిమేరులో పాఠశాల ఉందంటే మా అమ్మనాన్నలు ఇక్కడ చేర్పించారు. ఇక్కడ చేరిన తరువాత అంగవైకల్యం ఉందన్న ధ్యాస లేకుండా ఆనందంగా గడుపుతున్నాను.–మారే సత్తిబాబు, వికలాంగ విద్యార్థి, మంగుతుర్తి, పిఠాపురం మండలంఇక్కడ ఆనందంగా గడుపుతున్నా..దేవుడు నాకు కళ్లు ఇవ్వలేదు. నా తండ్రి చనిపోవడంతో కుటుంబ సభ్యులకు భారం అయ్యాను. అయిన వారికి కష్టమని ఈ స్కూల్లో జాయిన్ చేశారు సహచర విద్యార్థులతో ఆనందంగా గడుపుతున్నాను.– ఆర్సి సాయిధనలక్ష్మి, అంధ విద్యార్ధి, యర్రవరం, ఏలేశ్వరం మండలం ఇది దైవసేవగా భావిస్తాంఅంగవైకల్యంతో బాధపడేవారి గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకనే వికలాంగులకు సేవ చేయాలనే సంకల్పంతో మేము ఈ పాఠశాలను స్థాపించాం. వీరి సేవలో ఎంతో ఆనందం లభిస్తోంది. వీరు మా పిల్లలతో సమానం. వికలాంగుల సేవచేయడం దైవసేవగా భావిస్తున్నాం.– వీరబాబు సత్య దంపతులు, పాఠశాల నిర్వాహకులు, పులిమేరుదాతల సహకారంతో..ఈ పాఠశాల దాతల సహకారంతో కొనసాగుతోంది. 2006లో ముగ్గురితో ప్రారంభమైన ఈ పాఠశాల ఇప్పటికి 120 మంది విద్యార్థులతో నడుస్తోంది. నిర్వాహకులు ఇచ్చిన శ్రీచేయిచేయి కలుపుదాం.. చేయూతనిద్దాంశ్రీ అనే నినాదంతో జిల్లా నలుమూలల నుంచి దాతలు, పలు స్వచ్ఛంద సంఘాలు ఆర్థిక సహకారం చేస్తుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతివర్ధన సంస్థ ముందుకు సాగుతోంది. అన్నవరంలో శాంతి వర్ధన పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పలువురు పుట్టినరోజు, వివాహ వేడుకలను ఈ పాఠశాలల్లో జరుపుకుని విద్యార్థులకు అవసరమైన వస్త్రాలు, దుప్పట్లు, సంస్థకు అవసరమైన పలు పరికరాలను అందజేస్తున్నారు. -
కాకినాడ పోర్టును దెబ్బతీయవద్దు
● 30 వేల కార్మికులను రోడ్డున పడవేయొద్దు ● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు కాకినాడ సిటీ: కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయన్న సాకుతో కాకినాడ పోర్టును దిగజార్చవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. సోమవారం కాకినాడలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాకినాడ పోర్టుకు చరిత్ర ఉందని 200 సంవత్సరాల క్రితమే కాకినాడ పోర్టు ఏర్పడిందన్నారు. 1995 సంవత్సరం నుంచి బియ్యం ఎగుమతులు ప్రారంభించారన్నారు. ఈ పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు బతుకుతున్నారన్నారు. పోర్టులో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని మధు కోరారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేయడానికి గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కాకినాడ ప్రతినిధులు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఈ రోజు మీరు కొత్తగా వచ్చి పూర్తిగా అవగాహన చేసుకోకుండా రాజకీయ అవసరాల కోసం ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, ఇది సరైనది కాదని మధు పేర్కొన్నారు. నిజంగా పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతులు జరుగుతుంటే గొడౌన్లో చెక్ చేయాలని, రైస్ మిల్లుల్లో సీసీ కెమెరాలు పెట్టి పూర్తిగా నిఘా ఉంచాలని మధు కోరారు. పోర్టు ఎంట్రన్స్‌లో చెక్ పోస్టు పెట్టడం వల్ల 7 గంటల్లో చేసే లోడింగ్ మూడు రోజులు పడుతుందని, దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మధు వివరించారు. కాకినాడ పోర్టులో చొరబాటుదారులు గంజాయి, మత్తు పదార్థాలకు వస్తున్నారని చెప్పడం సింగం సినిమాను తలపిస్తుందన్నారు. నిరంతరం కోర్టుగార్డ్స్, నేవీ పహారాలు పోర్టు నడుస్తుందని అది మీకు తెలియదా అని మధు గుర్తు చేశారు. మీరు పోర్టులో పట్టుకున్న బియ్యం అంతకు ముందే కలెక్టర్ వెళ్లి చూశారని, దానిపై ప్రకటన ఇచ్చారని మళ్లీ మీరు వచ్చి పట్టుకున్నట్లు యాక్టింగ్ చేయడం కరెక్టు కాదని పవన్‌కళ్యాణ్‌కు మధు హితవు పలికారు. ప్రభుత్వంలో ఉన్న మీరు ఈ పాత్ర చేయడం సరైంది కాదన్నారు. కాకినాడ పోర్టును తరుచూ కించపరచవద్దని, తప్పు జరిగితే సీబీఐ విచారణ చేసి బియ్యం దొంగలను అరెస్టు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ పాల్గొన్నారు. డీఎల్ఎడ్–1 సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఎడ్) ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ (2018–20 మేనేజ్మెంట్ అండ్స్పాట్ బ్యాచ్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యాశిక్షణ సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌లో జరిగిన ఈ పరీక్షలకు 917మంది హాజరుకాగా, 544 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 59.32 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. డమ్మీ మార్కుల జాబితా కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బిఎస్ఈ.ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు, ఈ నెల ఏడవ తేదీలోగా డైట్లో కార్యాలయంలో ఫీజు చలానాతో పాటు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. డమ్మీ మార్క్స్ మెమోకాపీ, స్వీయ చిరునామాతో కూడిన ఎన్వలప్ కవర్‌ను తప్పనిసరిగా దరఖాస్తుకు జత చేయాలన్నారు. మార్కుల రీకౌంటింగ్‌కు ఫీజు రూ.500 చలానాను ఏపీ,సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. డిమాండ్డ్రాఫ్ట్లు అంగీకరించబోమని తెలిపారు. -
కనువిందు చేసిన జటాజూటాలంకరణ
పంచారామ క్షేత్రంలో ముగిసిన కార్తిక మాస ఉత్సవాలు సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారి జటాజూటాలంకరణ కనువిందు చేసింది. కార్తిక మాసం ముగింపు రోజు పోలి పాడ్యమి సందర్భంగా స్వామి వారికి వెండి జటాజూటంతో అలంకరణ చేయడం ఆనవాయితీ. ఈ మేరకు బ్యాంకు లాకరులో భద్రపర్చిన వెండి జటాజూటంను ఉత్సవ కమిటీ చైర్మన్, భక్త సంఘం నాయకులు ఆలయానికి తీసుకొని వచ్చారు. జటాజూటంకు వేద పండితులు సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరించారు. స్వామి వారి అలంకరణను తిలకించడానికి సాయంత్రం భక్తులను అనుమతించారు. సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవికి బంగారు కిరీటంతో పాటు బంగారు ఆభరణాలతో అలంకరణ చేశారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకోవడానికి బారులు తీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళల కోలాటం, వీరభద్రుని నృత్యం ఆకట్టుకున్నాయి. పీజీఆర్ఎస్కు 308 అర్జీలు కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో (పీజీఆర్ఎస్) అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, సీపీవో పి.త్రినాఽథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ రామలక్ష్మిలతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, బియ్యం కార్డుల మంజూరు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ల మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 308 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. దివీస్ ఉద్యమ కేసులను కొట్టేసిన కోర్టుతుని: తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన దివీస్ ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తుని కోర్టు కొట్టేసిందని న్యాయవాది ఆకాశపు మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. జూనియర్ సివిల్ కోర్టులో 2016లో సీపీఎంకు చెందిన 13 మందిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి అనేక మంది సాక్షులను విచారించింది. అప్పటి ఎస్‌హెచ్‌వో ఇచ్చిన వ్యతిరేక సాక్ష్యంతో కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు దివీస్ ఉద్యమంలో పోలీసులు పెట్టిన 10 కేసులను కోర్టు కొట్టివేసిందని మల్లేశ్వరరావు తెలిపారు. 13 మందిని నిర్ధోసులుగా భావించిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సి.మధు, రాష్ట్ర నాయకుడు రావుల వెంకయ్య, కాకినాడ జిల్లా నాయకులు పెంట్యాల నరసింహారావు, ఎం.వేణుగోపాల్, దువ్వా శేషుబాబ్జి, కె.సత్య శ్రీనివాస్, కె.సింహాచలం, ఎం.వీరలక్ష్మి, జి.బేబీరాణి, వెంకటలక్ష్మి, సత్యవతులను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించిందని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చిన ఉద్యమ కారులను పలువురు అభినందించారు. -
బియ్యం అక్రమ రవాణాపై నిఘా
కాకినాడ సిటీ: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌కు పాల్పడే వారిపై పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీలను కొనసాగించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్ పాల్పడుతున్న వారిపై ఇప్పటి వరకూ నమోదు అయిన కేసులు, వాటి విచారణ, అక్రమాలపై చేపట్టిన చర్యలపై సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌరసరఫరాలు, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గతంలో నిర్వహించిన తనిఖీలలో భాగంగా బియ్యం అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ పాల్పడుతున్న వారిపై నమోదు అయిన కేసుల్లో దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు లోతైన విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు పౌర సరఫరాలు, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో గత జూన్, జులై నెలల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన తనిఖీల సందర్భంగా నమోదు చేసిన 13 కేసులపై జరిపిన విచారణ, చేపట్టిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆర్.సుస్మిత, సీపీవో పి.త్రినాఽథ్, ఇన్చార్జి డీఎస్వో టి.లక్ష్మీప్రసన్నదేవీ, పౌరసరఫరాల సంస్థ డీఎం దేవులానాయక్, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పాల్గొన్నారు. బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్ -
ధర దక్క లేదు
ఏలేరు వరదల కారణంగా పంట ఆలస్యం అవడమే కాకుండా పెట్టుబడి తడిసిమోపైడెంది. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.40వేలు అయింది. 24 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కనీసం పెట్టుబడి కూడా తిరిగి చూడలేకపోయాను. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని అమ్ముకోలేకపోవడంతో దళారులను ఆశ్రయించి ప్రతి బస్తాకు రూ.150 నుంచి రూ.200 నష్టపోయాం. – ఎస్.ప్రకాశరావు, రైతు, ఇసుకపల్లి, కొత్తపల్లి మండలం మద్దతు ధర దక్క లేదు 30 ఏళ్ల నుంచి కౌలు వ్యవసాయం చేస్తున్నా. మహారాణి సత్రం భూమి సుమారు ఎకరంన్నర సాగు చేస్తున్నా. గతం కంటే ఈ తొలకరిలో పెట్టుబడులు పెరిగిపోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు, వరదలు రావడంతో చాల ఇబ్బందుల్లో సాగు చేశాం. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరంన్నర సాగు చేస్తే చేతికందిందే సుమారు 40 వేల రూపాయలు. వాటిలో కౌలు శిస్తూ 18 వేల రూపాయలు పోనూ నా పంట పెట్టుబడి తీస్తే ఏమీ మిగల లేదు. ప్రస్తుత తుపానుతో వచ్చి పడ్డ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 75 కేజీల బస్తాకు రూ.1,380 ఇచ్చారు. –కొల్లు శాంతమ్మ, కౌలు రైతు, పాత పెద్దాపురం 75 కేజీల బస్తా రూ.1,400కే ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. గత సీజన్లో ఇదే సమయంలో 40 బస్తాల దిగుబడి వచ్చింది. రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు. 75 కేజీల బస్తా పచ్చివి రూ.1,400కు, ఆరబెడితే రూ.1,620లకు మించి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మద్దతు ధర మాత్రం రూ.1,740 ఉంది. వాతావరణ పరిస్థితులతో ఆందోళన చెంది కళ్లాల్లోనే రూ.1,400కే అమ్ముకుంటున్నాం. – అల్లాడి రాజు, రైతు, వడ్లమూరు, పెద్దాపురం -
సర్కారు చోద్యం
ఖరీఫ్‌లో సాగైన భూమి: 2.14 లక్షల ఎకరాలు దిగుబడి లక్ష్యం: ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పూర్తయిన వరి కోతలుః 1,40,000 ఎకరాలు కళ్లాల్లో ఉన్న ధాన్యం: 85 వేలమెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు: 277 ప్రభుత్వం కొన్న ధాన్యం ః 90 వేల మెట్రిక్ టన్నులు కనీస మద్దతు ధర 75 కేజీలు: రూ.1,725 వాస్తవంగా రైతుకు దక్కుతున్న ధర: 1,400 ● తేమ పేరుతో ఖరీఫ్ పంట దోపిడీ ● ప్రతి బస్తాకు రూ.200 నష్టం ● మద్దతు ధరకు కొనుగోలు వట్టిమాటే ● ప్రభుత్వ జాప్యం రైతులకు శాపం సాక్షి ప్రతినిధి, కాకినాడ: శ్రీనేతి బీరకాయలో నెయ్యిశ్రీ చందంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కనిపిస్తోంది. కనీస మద్దతు ప్రకటనలకే పరిమితమైంది. రైతు భరోసా కేంద్రానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు సిబ్బంది కళ్లాల్లో శాంపిల్స్ తీసుకుని, పట్టుబడి చేసి, మిల్లుకు చేరవేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారని చెప్పిన మాటలు నీటిమీద రాతలుగా మిగిలాయి. ధాన్యం కొనుగోలులో అడుగడుగునా దళారీల ప్రమేయంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. తేమ 17శాతం ఉంటేనే అనుమతిస్తున్నారు. ఆపైన 22 శాతం వరకు కేజీ నుంచి ఐదు కేజీల వరకు ధాన్యం కోత పెడుతున్నారు. ఫలితంగా రైతు రూ.150 నష్ట పోతున్నాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తేమ 30 శాతం వరకు కూడా అనుమతించి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడది ఎక్కడా కనిపించడం లేదని రైతులు మండిపడుతున్నారు. పెరిగిన పెట్టుబడి... తరిగిన దిగుబడి ఖరీఫ్ రైతు రెక్కల కష్టం దళారుల పరమవుతోంది. తుపాను ఫలితంగా వచ్చిపడ్డ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే అయిన కాడికి అమ్మేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో సర్కారుకు ముందుచూపు లేకపోవడం రైతులకు శాపంగా పరిణమించింది. అధిక వర్షాలు, వరదలతో పెట్టుబడులు తడిసిమోపైడె ఈసారి ఖరీఫ్ సాగు రైతులకు పెను భారమైంది. పెరిగిన పెట్టుబడికి తగ్గట్టు ధాన్యం దిగుబడులు వచ్చాయా అంటే అదీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలు, వరదలతో దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు కనీసం 40 బస్తాలు దిగుబడి ఖాయమని రైతులు పెట్టుకున్న ఆశలు వాతావరణ ప్రభావంతో అడియాసలయ్యాయి. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గినా కనీసం ధర విషయంలో మంచి జరుగుతుందని ఎదురుచూసిన రైతులకు అక్కడా చుక్కెదురైంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం హడావుడి చేసింది తప్పితే రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేయలేకపోయింది. అయినకాడికి అమ్మకాలు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన వర్షాలు, వరదలతో పెట్టుబడులు పెరిగిపోయాయి. తుని, కాకినాడ సిటీ(ఇక్కడ వ్యవసాయం లేదు) మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో వరి కోతలు 80 శాతం పూర్తి అయ్యాయి. తుని నియోజకవర్గంలో మాత్రం 20 శాతం, పిఠాపురం నియోజకవర్గంలో 50 శాతం మించి వరి కోతలు అవ్వ లేదు. కోతలు పూర్తి అయి పంట చేతికందిందనే తరుణంలో ఫెంగల్ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లి కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందిన పంట కళ్లాల్లోను, రోడ్లపైన బరకాలు వేసి కాపాడుకునే దుస్థితి ఏర్పడింది. తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాక.. తక్కువ ధరకే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు. తుపానుతో తడిసి ముద్దయిన ధాన్యం 90వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో రోడ్లుపైన, కళ్లాల్లో ఉంది. ఎకరాకు దిగుబడి 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వస్తోంది. కౌలుకు చేసిన పంటల్లో ఎకరాకు 30బస్తాలు దిగుబడి వస్తే 10 బస్తాలు కౌలు పోగా, మిగిలిన 20 బస్తాలు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఇక మిగిలేది ఏమీ లేక కౌలు రైతులు కన్నీరు పెడుతున్నారు. దీనికితోడు ఏలేరు, పీబీసీకి వచ్చిన వరదలు కూడా ముంచెత్తడంతో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, సామర్లకోట మండలాలల్లో పంటలు మునిగిపోయి నష్టపోయారు. ఏలేరు వరదతో పెట్టుబడులు తడిసి మోపెడయ్యాయి. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడికి బదులు రూ.40వేలు అయింది. 40 బస్తాలు దిగుబడి వస్తుందనుకుంటే ఎకరాకు 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ తరుణంలో కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తేమ శాతం నిబంధనలు సడలించక పోవడంతో రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని అయినకాడికి అమ్మేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. శంఖవరం మండలంలో కోతలు ప్రారంభం కాలేదు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో 75కేజీల బస్తా రూ.1,400కు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం పెద్ద ప్రతిబంధకంగా మారడంతో రైతులు దళారులను అశ్రయిస్తున్నారు. ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలు పెట్టుబడి పెట్టగా ఎకరాకు 30 బస్తాలు మించి దిగుబడి రాలేదు. అంటే ఎకరానికి 10 బస్తాలు దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ఇటీవల వరదలకు రాజుపాలెం, ముక్కోల్లు, భూపాలపట్నం, రామకృష్ణాపురంలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందనే సాకు చూపి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లకుండా వెనక్కు తగ్గుతున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి 75 కేజీల బస్తా రూ.1,400కే అమ్ముకుంటున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు గోకవరం మండలంలో 7,020, కిర్లంపూడి మండలంలో 361 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగొలు చేశారు. తేమ శాతమే పెద్ద గుదిబండగా మారడంతో రైతులు రూ.1,450 నుంచి రూ.1,550గా దళారులకు అమ్ముకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దళారులే దిక్కు.. ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైంది. జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారీలకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 277 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెబుతోంది. ఆ కేంద్రాలలో నామ్‌కే వాస్తేగా కొనుగోలు జరిగిందని రైతు ప్రతినిధులు ఆరోపిస్తుంటే, 85 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1,725గా నిర్ణయించింది. ఈ ధర ధాన్యం విక్రయించిన మెజార్టీ రైతులకు దక్కనే లేదు. -
వనదుర్గమ్మకు ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరిపై వనదుర్గ అమ్మవారికి కార్తిక అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవారికి వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి నైవేద్యం చెల్లించారు. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, అర్చకులు దత్తాత్రేయశర్మ, కోట వంశీ, పరిచారకుడు వేణు వ్రత పురోహితులు కూచుమంచి ప్రసాద్, దేవులపల్లి ప్రకాష్ హోమం నిర్వహించారు. భక్తులతో నిండిపోయిన హోమ మండపం అమావాస్య ఆదివారం అరుదుగా వచ్చే పర్వదినం కావడంతో సుమారు 60 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రత్యంగిర హోమంలో పాల్గొన్నారు. దీంతో హోమ మండపం భక్తులతో నిండిపోయింది. దీంతో కొంతమంది భక్తులు వెలుపల నిడబడాల్సి వచ్చింది. ఒప్పందం అమలుకు కమిటీ ఎస్ఎస్ఏ జేఏసీ డిమాండ్ కాకినాడ సిటీ: జనవరిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీకి ప్రభుత్వంతో జరిగిన సమ్మె ఒప్పందం అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, జేఏసీ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జీవోలు, సర్క్యులర్లు, హెచ్ఆర్ పాలసీ, మినిమం టైమ్ స్కేల్ అమలు కోరుతూ కాకినాడ టీచర్స్ హోమ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం జరిగి 11 నెలలు గడిచాయని, అనేక అంశాలపై ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందన్నారు. ఈలోపు నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందన్నారు. మరోవైపు టార్గెట్లు పెట్టి మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా రాత్రి వరకు పని చేయిస్తూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను బానిసలకంటే దారుణంగా ట్రీట్ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులపై భౌతికదాడులు చేస్తున్నా, బాధితులనే బాధ్యులను చేస్తూ అన్యాయం చేస్తున్నారని వివరించారు. సమ్మె ఒప్పందం మేరకు అన్ని రకాల ఆదేశాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి, కోశాధికారి పి.రాజు, ఐఈఆర్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాగార్జున, సీఆర్పి రాష్ట్ర నాయకుడు రామ్ జి, జిల్లా అధ్యక్షులు టి మీరా సాహెబ్ పాల్గొన్నారు. -
వైభవంగా కోటి దీపోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలా త్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం జరిగింది. కార్తిక మాసం ముగింపు రోజున అమావాస్యను పురస్కరించుకొని ప్రతీ ఏడాది పంచారామ క్షేత్రంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రి పంచారామ క్షేత్రంలోని ఉప ఆలయమైన గణపతి ఆలయంలో ఈఓ భళ్ల నీలకంఠం, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబులు పూజలు చేసి దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించా రు. ఆలయ దీపారాధన సంఘ సభ్యులు ఆలయం అంతా దీపాలతో నింపారు. భక్తులు దీపాల వద్ద వేచి ఉండి ఆలయ దీపారాధన సంఘ సభ్యులు ఆరు గంటలకు గంట మోగించిన వెంటనే భక్తులు ఒకేసారి హర హర మహేదేవ శంబోశంకరా అంటూ దీపాలను వెలిగించారు. ఆలయంలోని మొదటి అంతస్తు, దిగు వ భాగంలోని స్తంభాలు, ఆలయ గోడల చుట్టూ దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోను భక్తు లు దీపాలు వెలిగించడంతో అడుగు తీసి అడుగు వే యడానికి వీలు లేని విధంగా ఆలయం దీపాలు, భక్తులతో నిండిపోయింది. భక్తులు 365 ఒత్తుల నుంచి 1000 ఒత్తుల వరకు దీపాలు ఏర్పాటు చేసుకొని వెలి గించారు. ఆలయం అంతా దీపారాధన సంఘ సభ్యు లు దీపాలు ఏర్పాటు చేశారు. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
దళితులనే బలి పశువులను చేస్తున్నారు
తుని: అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు దళితులనే బలిపశువులు చేస్తున్నాయని రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఉన్న హోటల్లో దళిత ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దళితులను విభజించి పాలిస్తున్న రాజకీయ పార్టీలను రాజ్యంగ స్ఫూర్తితో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో డీఎస్సీతో సహా వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియా కేసుల విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్ని వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కి నేడు సనాతన ధర్మ రక్షకుడినంటూ రోడ్డెక్కి రచ్చ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దళిత, క్రైస్తవ, మైనార్టీలపై పవన్‌కల్యాణ్ అభిప్రాయం తెలియజేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, దండేల కృష్ణారావు, బోడపాటి సతీష్, పెదపాటి మేగరంజన్, ఇంజరపు నరహింహమూర్తి, గారా చంటి, చోళ్ల రాజు, కాలా మహర్, బర్రే మధు, బోడపాటి శ్రీను పాల్గొన్నారు. -
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వాలి
కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ సిటీ: ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మంచి మార్గాన్ని ఎన్నుకోవడంతో పాటు మన ఆరోగ్యం.. మన హక్కు అనే విధంగా జీవించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాలులో ఎయిడ్స్ బాధిత బాలబాలికలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా నివ్వడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చన్నారు. అపోహలు, ఊహాగానాలకు తావులేకుండా క్రమం తప్పకుండా మందులు వేసుకొని, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఇతర అఽధికారులు పాల్గొని బాలలతో సహపంక్తి భోజనం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి పీఆర్ కళాశాల మీదుగా బాలాజీ చెరువు సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఎయిడ్స్ అనేది అవగాహనతోనే అఅంతమవుతుందన్నారు. ర్యాలీలో రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ వైడీ రామారావు, సెట్రాజ్ సీఈవో కాశీ విశ్వేశ్వరరావు, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగస్తులకు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్, జేసీ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ రమేష్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్ స్వప్న, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్‌రావు, ఓఎన్జీసీ సంస్థ జీఎం సునీల్ కుమార్, రిలయన్స్ సంస్థ డీజీఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 01కెకెడి103: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్ -
నేడు విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డిసెంబరు 3 అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో డీఎస్ఏ మైదానంలో సోమవారం విభిన్న ప్రతిభావంతులకు జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ ఆదివారం తెలిపారు. పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, చెస్, పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 8 గంటలకు కాకినాడలోని డీఎస్ఏ క్రీడామైదానంలో హాజరుకావాలని కోరారు. -
రైతులు పంట నష్టాన్ని నివారించుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుతం జిల్లాలోని తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్ రైతులను కోరారు. రైతులకు ఆదివారం ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ● కోతకి సిద్ధంగా ఉన్న వరి పంట కోయకూడదు. ● వరిపంట కోసి పూర్తిగా ఆరని పనలకు తుపాను నేపథ్యంలో కుప్ప వేసేటప్పుడు ఎకరాకు 25 కేజీల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు. ● కోత కోసి పొలాల్లో ఉన్న పనలు వర్షానికి తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. ఒక వేళ పొలంలో నీరు నిలిచిఉంటే పనలను గట్లపైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. వర్షాలు తగ్గి ఎండలు రాగానే పనలు తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. ● కళ్లాల మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భధ్రపరుచుకోవాలి. ● నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలు కాకపోతే గింజ మొలకెత్తడమే కాకుండా రంగుమారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా ఉంటుంది. ● రంగు మారి, తడిసిన ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. ● పగులు పొట్ట , పూత దశలో ఉన్న వరి పైరు 1 నుంచి 2 రెండు రోజులు కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాల్లో నీరు చేరడం వల్ల ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు, రంగు మారిన గింజలు ఏర్పడతాయి. గింజ రంగు మారకుండా ఉండడానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం, మాంకోజెబ్ మందు పిచికారీ చేసుకోవాలి. ● పాలు పోసుకొనే దశలో ఉన్న పంట మునిగితే పిండి పదార్థాలు గింజల్లో చేరి గింజ బరువు తగ్గి రంగు మారడంతో దిగుబడి , నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం, ప్రొపికొనజోల్ మందు పిచికారీ చేసుకోవాలి. ● గింజ తోడుకునే , గట్టిపడే దశలో ఉన్న వరిపైరు బరువు వల్ల కొద్దిపాటి గాలి, వర్షాలకే ఒరిగిపోయి నేలనంటుందన్నారు. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం , తాలు గింజలు ఏర్పడడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టే చర్యలు తీసుకోవాలి. -
చలి పులి పంజా
గత వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు తేదీ కనిష్ట గతేడాది ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత 25 16 21 26 18 22 27 17 24 28 17 22 29 16 21 30 16 21 1 16 23 ● తీవ్రమవుతున్న శీతల గాలులు ● పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ● వారం రోజులుగా 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు కాకినాడ సిటీ: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు పొగ మంచు వదలడం లేదు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచే శీతల గాలులు వీస్తున్నాయి. ఆరు గంటల నుంచి చలి ప్రభావం ఉంటోంది. వారం రోజుల నుంచి 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు రాత్రి, తెల్లవారు జామున బయటకు రాలేకపోతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు, శీతల గాలుల వల్ల వ్యాధులు ప్రబలుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పొలం పనులకు వెళ్లే రైతు కూలీలు, వేటకు వెళ్లే మత్స్యకారులు, ఇతర పనులకు వెళ్లే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం పూట వ్యాయామానికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో నేలలో తేమ అధికంగా ఉంది. జలవనరులు పుష్కలంగా ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం సాయంత్రం నుంచే కనిపిస్తోంది. ముఖ్యంగా వరి పొలాలు, నీటి ఆధారిత పంటలు సాగు చేస్తున్న పొలాల పై నుంచి వచ్చే తేమ గాలులకు మరింతగా చలి ఉంటోంది. గతేడాది చలి తీవ్రత అంతగా కనిపించలేదు. 21 నుంచి 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచే చలి గాలులు మొదలయ్యాయి. గడచిన వారం రోజుల నుంచి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. 16 నుంచి 19 డిగ్రీల నడుమ నమోదయ్యాయి. ఇక పొగ మంచు తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచే గ్రామాలను మంచు కమ్మేస్తోంది. నడిరాత్రి సమయానికి తీవ్రంగా మారుతోంది. ఇక తెల్లవారే సమయంలో అత్యధికంగా ఉంటోంది. ఉదయం ఏడున్నర గంటలు దాటినా వదలడం లేదు. ఆస్తమా ఉందా.. జాగ్రత్త ఆస్తమా ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోరాదు. కూల్ డ్రింక్స్, ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోరాదు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో ఆహారం తినొద్దు చలికాలంలో మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించాలి. ఫ్రిజ్‌లో ఉండే ఐటెమ్స్ అసలు తినరాదు. కేవలం వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. చలికాాలంలో మద్యంతో పాటు టీ, కాఫీలను అధికంగా తాగుతారు కొందరు. ఇలా అసలు చేయరాదు. మద్యానికి దూరంగా ఉండాలి. టీ, కాఫీ రోజుకు రెండు మూడు కప్పులు మాత్రమే తీసుకోవచ్చు. దీంతో శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. తగనంత నీటిని తీసుకుంటే ద్రవాలు అంది జీవక్రియలు సరిగ్గా ఉంటాయి. చలికాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటివి మూడు రోజులకు మించి వేధిస్తుంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. గుండెకు చలి తిప్పలు తరచూ వాతావరణంలో వచ్చే మార్పులు శరీరంపై రకరకాల ప్రభావాన్ని చూపిస్తాయి. చలికాలంలో హార్ట్ పేషెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో అడ్రినలిన్, నారిటలిన్ వంటి హార్మోన్ల లెవెల్స్‌లో మార్పులొస్తాయి. ఇవి రక్త ప్రసరణలో మార్పులు తెస్తాయి. చలికాలం రక్తనాళాలు సహజంగా ముడుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదముంది. కాబట్టి చలి కాలం గుండె సమస్యలున్నవాళ్లు వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తుండటం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లరాదు. ఇంటి లోపలి ప్రదేశాలు కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు కచ్చితంగా మూసివేయాలి. పండ్లు, కాయగూరలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆస్తమా రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆస్తమా, నిమోనియా వంటి శ్వాసకోశ సమస్యలుంటే జాగ్రత్తగా ఉండాలి. కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, ఐస్ వాటర్‌కు దూరంగా ఉంటే మంచిది. ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉండరాదు. జాగ్రత్తలు ఇలా ● చిన్న పిల్లల్లో చెవిపోటు, గొంతు నొప్పి, జలుబు, వచ్చే అవకాశం ఉన్నందున సూర్యరశ్మి వచ్చాకే బయటకు పంపించాలి. ● ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇన్హేలర్ వాడడానికి బదులు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి నీటి ఆవిరి పట్టడం మంచింది. ● చర్మం పొడిబారిపోకుండా ఔషధ పూరితమైన లేపనాలు వాడాలి. ● రసాయనాలతో కూడిన సబ్బులకు బదులు మైల్డ్ సోప్స్ వాడటం మంచిది. ● గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం ● చలి గాలుల కారణంగా చర్మ సంబంధిత, ఆస్తమా, గుండె జబ్బులు, చెవి, ముక్కు, గొంతు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ● రోజు మూడు నుంచి 9 గ్లాసులు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ● బీపీ, సుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవాలి. ● ఆస్తమా శ్వాసకు సంబంధించిన సమస్యలున్నవారు మంచులో నడిచే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ● అలర్జీలు ఉన్న వారు చలి సమయంలో బయటకు రాకపోవడమే ఉత్తమం. ● జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ పండ్లు మంచివి. ● పిల్లలను చీకటి పడే వరకు బహిరంగ స్థలాల్లో ఆడించకపోవడమే మంచిది. కాచి చల్లార్చిన నీటిని అందివ్వాలి. జాగ్రత్తలు పాటించాలి చలికాలంలో పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అధికం. ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి. రోజులో ఉదయం సాయంత్రం 30 నిమిషాల పాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. విటమిన్–డి, సి అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. చెవిలోకి చల్లగాలి వెళ్లకుండా చూసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ ఐ ప్రభాకర్, ఆర్బీఎస్కె జిల్లా ప్రాజెక్డు ఆఫీసర్, కాకినాడ వ్యాయామం తప్పనిసరి చలికాలంలో చలి దెబ్బకు వ్యాయామానికి స్వస్తి చెప్పి దుప్పట్లో దూరిపోతారు. మరి కొందరు చలిలో కూడా వ్యాయామం చేస్తారు. కానీ ఈ సీజన్లో జాగ్రత్తలతో కూడిన వ్యాయామం చేయడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలంటున్నారు. -
మిగిలింది నాలుగు రోజులే..
ఫ ఇంటర్ పరీక్ష ఫీజుకు సమీపిస్తున్న తుది గడువు ఫ అపరాధ రుసుం లేకుండా ఈ నెల 5 తేదీ ఆఖరు రాయవరం: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్స్ విడుదలయ్యాయి. అపరాధ రుసుం లేకుండా పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఇప్పటికే ముగియగా, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 5వ తేదీ వరకూ కట్టొచ్చు. 2024 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను అక్టోబర్ 17న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృత్తికా శుక్లా విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు నవంబరు 11వ తేదీ వరకూ తొలుత గడువు విధించింది. తర్వాత రెండో సారి నవంబర్ 21వ తేదీ వరకూ గడువు పొడిగించింది. మూడో సారి ఈ నెల 5వ తేదీ వరకూ గడువు విధిస్తూ ఇంటర్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. దీనికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత జాప్యమయ్యే కొద్దీ అపరాధ రుసుం మోత మోగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లిస్తే మంచిదన్న అభిప్రాయం జూనియర్ కళాశాలల వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఫీజుల చెల్లింపు ఇలా.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 కట్టాలి. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరాల థియరీ ఫీజు కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 కట్టాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్లు పరీక్షలకు రూ.330 చెల్లించాలి. ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్‌మెంట్‌కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350 చొప్పున, సైన్స్ విద్యార్థులు రూ.1,600 చొప్పున చెల్లించాలి. కాకినాడ జిల్లాలో.. జిల్లాలో 45,323 మంది ఇంటర్ విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 23,568 మంది ఉండగా, ఇప్పటి వరకూ 22,584 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. సెకండియర్ విద్యార్థులు 21,755 మందికి 19,208 మంది ఫీజు చెల్లించారు. జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు మొత్తం 3,531 మంది పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంది. గడువులోగా చెల్లించాలి పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించాం. గడువు ముగిసేలా చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. –వనుము సోమశేఖరరావు, జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖాధికారి -
94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ సిటీ: జిల్లాలో నవంబర్ 30వ తేదీ సా యంత్రం 7 గంటల వరకు 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ సెలవు కావడంతో శనివారమే పంపిణీ చే యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. డి సెంబర్ నెలలో 2,73,881 మంది పింఛన్‌దారు లకు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా 2,56,202 పింఛన్లు పంపిణీ చేసినట్టు ఆయన తె లిపారు. మిగిలిన లబ్ధిదారులకు 2వ తేదీలోగా పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లిమామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీ తీరంలోని అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయం కార్తిక మాసం చివరి శనివారం సందర్భంగా భక్తులతో శోభిల్లింది. వేకువ జామున వేద మంత్రాల నడుమ సుప్రభాత సేవ, తొలి హారతి సేవలను అర్చకులు వైభవంగా జరిపించారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. పాత గుడితో పాటు నవీన ఆలయాన్ని సందర్శించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన బాల బాలాజీ స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీలక్ష్మీ నారాయణ హోమాన్ని దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి గోవులకు పూజలు చేశారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,60,891 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణ రాజు తెలిపారు. శనైశ్చరునికి తైలాభిషేకాలు కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ ఉప కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో స్వామివారి పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రాతఃకాల సమయంలో ఆలయ ప్రధాన అర్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తైలాభిషేకాలు, పూజల ద్వారా దేవస్థానానికి రూ.1,73,025, అన్న ప్రసాద విరాళాలుగా రూ.48,839 వచ్చినట్టు ఈఓ తెలిపారు. -
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
‘అపార్’మైన భారం అపార్ నమోదు ఉపాధ్యాయులపై అధిక భారం మోపుతోందని, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. అపార్ను నిమిషాలు, గంటల్లో పూర్తి చేయమని ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. అపార్ నమోదు సమయాన్ని పెంచాలని, ఈ ప్రక్రియను సరళతరం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఉపాధ్యాయులపై ఇప్పటికే ఉన్న యాప్‌ల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఉపాధ్యాయ పనిదినాలకు నష్టం లేకుండా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కేవలం ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పుల కోసం అనివార్య పరిస్థితుల్లో శిక్షణ ఇస్తున్నారన్నారు. ఆయన వెంట యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.● భారంగా మారిన ‘అపార్’ నమోదు ● ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. రాయవరం మండలం పసలపూడిలో జరుగుతున్న యూటీఎఫ్ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేలోగా ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత పీఆర్సీకి సంబంధించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.22 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, వాటికి సంబంధించి బడ్జెట్లో ఏ విధమైన ప్రతిపాదనలు చేయకపోవడం దారుణమన్నారు. వీటి చెల్లింపునకు సరైన షెడ్యూల్ ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీతో చర్చించి వెంటనే ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గత ఆరున్నరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నియమించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఎస్సీ రోడ్డు మ్యాప్ వేయాలని, సిలబస్ ప్రకటించాలని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో 16,467 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. 117 జీవోను రద్దు చేసి, ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేస్తే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి ముందుగానే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. అలాగే 117 జీవోను రద్దు చేసి, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.