Magic shows
-
ప్రధాని మోదీ మ్యాజిక్ ట్రిక్.. ఫిదా అయిన చిన్నారులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి వచ్చిన కొందరు చిన్నారులను కాయిన్ ట్రిక్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ "మ్యాజిక్ ట్రిక్" చేశారు. ప్రధాని మోదీ నుదిటికి నాణెం పెట్టుకుంటారు. తల వెనుక భాగంలో తట్టగానే ఆ నాణెం ముందుకు పడిపోతుంది. ఈ దృగ్విశయాన్ని పిల్లలు విస్మయంతో చూశారు. #Watch | PM Modi's "Memorable Moments" With Children pic.twitter.com/4r2AysENHu — NDTV (@ndtv) November 16, 2023 పిల్లల నుదిటిపై నాణెం అంటించి వారి తల భాగంలో నొక్కినప్పుడు మాత్రం నాణెం పడిపోదు. ఇదిలాగో తెలియక పిల్లలు విచిత్రంగా చూస్తారు. అయితే.. ఈ క్రమంలో పిల్లల నుదిటిన అంటించిన నాణాన్ని మోదీ మరో చేతితో లాక్కుంటారు. సరదాగా పిల్లలతో ప్రధాని మోదీ పిల్లలతో ఈ మ్యాజిక్ చేశారు. ఈ విషయాన్ని మరిచిపోలేని జ్ఞాపకాలుగా పేర్కొంటూ ప్రధాని మోదీ ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేశారు. ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకల్లోనూ ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. పిల్లలు ప్రధానికి ఘనస్వాగతం పలికి రాఖీ కట్టారు. అఖిల భారతీయ శిక్షా సమాగమ్ వేడుకలో భాగంగా కూడా ప్రధాని మోదీ పిల్లలతో ముచ్చటించారు. పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
ఇదేం మ్యాజిక్ రా బాబు
-
ఇదేంది రా మామా...ఈ వయ్యారి యాడికెల్లి వచ్చింది? కనిపెట్టగలరా?
న్యూఢిల్లీ: మెజీషియన్లు తమ అద్భుతమైన యామాజాలంతో జనాన్ని మెస్మరైజ్ చేస్తారు. రకరకాల జిమ్ముక్కులతో మంత్రం వేసి మాయచేసి మ్యాజిక్ చేయడం మనందరికి తెలిసిందే. పిట్టల్ని, బట్టల్ని మన ముందే కనికట్టు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిలను క్షణాల్లో మాయం చేసిడం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ప్రముఖ మెజీషియన్లు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓరి నీ మ్యాజిక్కో! ఇదేం మ్యాజిక్ రా మామా సాధారణ ప్రజలు అబ్బుర పడిపోవడం కూడా సహజమే.అలాంటి మ్యాజిక్కు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. 1.3 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై పలు ఫన్నీ ఫన్నీ కమెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. మరి వీకెండ్ మూడ్‌లో ఉన్న మీరు కూడా ఆ అమ్మడు ఎక్కడనుంచి ఎలా వచ్చింది అనే విషయాన్ని బాగా పరిశీలించండి. ఆ కనికట్టు ఏంటో కనిపెట్టండి. (ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) Next-level magic ✨ pic.twitter.com/AxrzcAOJKy — Next Fucking Level (@NxtFuckingLvl) February 3, 2023 -
వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..!
ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్. పోరస్ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్ సైజ్‌లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది. కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు ఫ్యాన్స్ బౌల్డ్..!
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల తనకు తెలిసిన ట్రిక్స్‌తో అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. హౌస్ మాజీషియన్‌గా మారిపోయి కార్డ్ ట్రిక్ షోను ప్రదర్శించి బీసీసీఐని సైతం అబ్బుర పరిచాడు. ఇలా కార్డ్ ట్రిక్ ద్వారా నవ్వులు తెప్పించిన అయ్యర్ వీడియోకు థాంక్యూ చాంపియన్ అంటూ బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తాజాగా పోస్ట్ చేసిన వీడియోకు బీసీసీఐ ఏమంటుందో చూడాలి. వివరాల్లోకి వెళితే.. హర్మన్ ప్రీత్ కౌర్ అద్దం ముందు నిల్చుని మ్యాజిక్ ట్రిక్‌ను చేసింది. (అతనికి గాయం.. నాకు ఒక జ్ఞాపకం!) ఆ వీడియోలో హర్మన్ చేతిలో ఓ గాజు గ్లాసు అందులో బాల్ పట్టుకొని నిల్చొని ఉంది. ఆ బంతిని ఎదురుగా ఉన్న అద్దం వైపు విసరగా అది మళ్లీ హర్మన్ వైపు రావడం గ్లాస్లో పడటం జరిగింది. అవతలి వైపు గ్లాస్‌లోకి వెళ్లి అక్కడ్నుంచి మళ్లీ హర్మన్ గ్లాస్‌లోకి రావడం టాప్ మ్యాజిక్‌గా నిలిచింది. ఈ వీడియోను ఎలా చేశానో చెప్పాలంటూ హర్మన్.. అభిమానులకు పజిల్ విసిరింది. అయితే అభిమానులు మాత్రం అది ఎలా సాధ్యం అనే విషయంలో పరేషాన్ అవుతున్నారు. హర్మన్ విసిరిన మ్యాజిక్ ట్రిక్‌ను కనుక్కొనే పనిలో తలలు పట్టుకుని అన్వేషణ సాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో మ్యాజిక్ అనేదే ప్రధానాంశం కాబట్టి లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులు ఎలాగైనా కనుక్కోవాలనే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హర్మన్ మ్యాజిక్ ట్రిక్కు బౌల్డ్ అయిన ఫ్యాన్స్.. ఇందులోని అసలు విషయాన్ని కనుక్కోంటే మాత్రం హర్మన్ ‘బౌల్డ్’ కావడం ఖాయం. View this post on Instagram Mirror, mirror on the wall, who the realest of them all. A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) on Apr 22, 2020 at 2:30am PDT -
ఒక లడ్డూ నన్ను జాదూగర్‌గా మార్చింది
ఐదు దశాబ్దాలుగా 36 దేశాల్లో 37 వేలకుపైగా ఇంద్రజాల ప్రదర్శనలు. నాలుగు ప్రపంచ రికార్డులు. వేలాది సన్మానాలు. మ్యాజిక్ షోలతో పిల్లలు, పెద్దలను అమితాశ్చర్యంలో ముంచెత్తే ఫీట్స్. జాదూగర్ ఆనంద్‌గా ప్రసిద్దికెక్కిన ప్రముఖ ఇంద్రజాలికుడు అవస్తి ఆనంద్ సాధించిన ఘనత ఇది. ఇంద్రజాల ప్రదర్శనలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన జాదూగర్ ఆనంద్ ‘సాక్షి’తో ముచ్చటించారు. మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వాటిలో అమితంగా ఆకట్టుకున్నవి..? పద్ధెనిమిదేళ్ళ వయస్సులో ‘అండర్ వాటర్ ఎస్కేప్’గా మొదటి రికార్డు, ఆ తర్వాత ఏడు ‘బ్లైండ్ ఫోల్డ్ ఫో’తో రెండో ప్రపంచ రికార్డు సాధించాను. ఇండోర్ నుంచి భూపాల్ వరకు 210 కిలో మీటర్లు కళ్లకు గంతలు కట్టుకుని స్కూటర్ మీద ప్రయాణం చేయడం మర్చిపోలేని సంఘనలు. ఇప్పటి వరకు నాలుగు ప్రపంచ రికార్డులు, 36 దేశాలలో 37 వేలకు పైగా ప్రదర్శనలు నిర్వహించి మూడో ప్రపంచ రికార్డు, అత్యంత వేగవంత మెజీషియన్‌గా నాల్గవ ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా అనిపిస్తోంది. షో జరిగే సమయంలో అకస్మాత్తుగా ప్రేక్షకుల్లో ఒక అమ్మాయిని స్టేజీ మీదకు పిలిపించి, ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో పైకి లేపడం, మరొకరిని క్షణాల్లో మాయం చేయడం, తిరిగి వారిని ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమయ్యేలా చేయడం... ఒకటి కావు అన్నీ ఆకట్టుకునేవే. స్టేజీ మీద ప్రదర్శించబడుతున్న సినిమా తెరలోకి వెళ్లి అక్కడి నటుల్ని స్టేజీ మీదకు తీసుకురావడం, అండర్ వాటర్ ఎస్కేప్ ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఏదైనా ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ప్రతీసారి వారు ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చానన్న సంతృప్తి అన్ని రికార్డులకన్నా మించినదిగా భావిస్తాను. మీ పేరు అవస్తి ఆనంద్. జాదూగర్ ఆనంద్‌గా ఎలా మారారు? నేను పుట్టిపెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ లో. మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవారే. ఆ రోజుల్లోనే నాన్న ఏ.పి.అవస్తి డాక్టర్, అమ్మ మహేశ్వరిదేవి ఫ్రొఫెసర్. మా ముగ్గురు అక్కయ్యలూ బాగా చదువుకున్నవారు. ఆఖరివాడినైన నేనూ పీజీ చేశాను. ఇప్పుడు నా వయసు అరవైఏడేళ్లు. ఆరేళ్ల వయసులో మా స్కూల్‌కి వెళ్లేదారిలో కొందరు గారడీవిద్య ప్రదర్శించేవారు. రోజూ అక్కడికి వెళ్లి ఆ గారడీ చూసేవాడిని. వాళ్లు గాల్లో నుంచి నాకు లడ్డూలు తీసి ఇచ్చేవారు. రోజూ లడ్డూలు తినేవాడిని. అప్పుడే అనిపించింది ‘నేనే సొంతంగా గారడీ చేసి లడ్డూలు తెచ్చేసుకుంటే..’ అని. ప్రయత్నించా.. లడ్డూ రాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఒక్క లడ్డూ కూడా రాలేదు. కానీ నిరాశపడలేదు, ప్రయత్నాన్నీ వదలలేదు. ఎక్కడ ఏ చిన్న గారడీ, మ్యాజిక్ షోలు జరిగినా ఎంత దూరమైనా వెళ్లి చూసేవాడిని. అలా అలా చిన్న చిన్న మేజిక్‌లు నేర్చేసుకున్నా. వాటిని మా స్కూల్లో ప్రదర్శించేవాడిని. చుట్టూ ఫ్రెండ్స్ బాగా ప్రోత్సహించేవారు. ఆ తర్వాత టీచర్లూ మెచ్చుకున్నారు. అక్కణ్ణుంచి గణేష్, దుర్గాదేవి నవరాత్రులలో జరిగే ఉత్సవాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అక్కడ వారు ఇచ్చే డబ్బులు, అమ్మా–నాన్న ఇచ్చే పాకెట్ మనీతో ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలు కొనేవాడిని. చదివేవాడిని. ప్రాక్టీస్ చేసేవాడిని. అలా మొదలైన నా ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయి ‘జాదూగర్’గా మార్చింది. నాకెవ్వరూ గురువులు లేరు. స్వయంకృషి, స్వంతప్రయత్నంతోనే ఈ విద్యను సాధించాను. మీకు గురువెవ్వరూ లేరు అంటున్నారు.. మీ తల్లిదండ్రుల సహకారం లభించలేదా? లేదు. మా కుటుంబంలో ఏకైక మగ పిల్లవాడైనందున మా అమ్మానాన్నలు నాపై అనేక ఆశలు పెట్టుకుని, నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. నేను మెజీషియన్‌గా మారడం వారికి ఇష్టం వుండేది కాదు. అదేమైనా తిండి పెడుతుందా, దేనికి ఉపయోగపడుతుంది..? అనేవారు. అయితే వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంద్రజాల విద్యలోనే రాణించాను. నీళ్లలోనూ విన్యాసాలు చేశారు.. స్కూల్లోనూ, కాలేజీలోనూ చిన్న చిన్న మేజిక్ షోలు చేసిన నేను పద్దెనిమిదేళ్ల వయసులో సొంతంగా వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ‘అండర్‌వాటర్ ఎస్కేప్’లో భాగంగా తలకు ముసుగు వేసి, కాళ్లను, చేతులను సంకెళ్లతో బంధించి, ఒక పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఆ పెట్టెను నదిలో పడేస్తారు. ఆ పెట్టెలో నుంచి తప్పించుకుని బయటకు రావాలి. సంకెళ్లను విడదీసేదెలా? పెట్టె తాళం పగలగొట్టేదెలా? బయటకు ఎలా వస్తాను అని పైన అంతా ఉత్కంఠ. కానీ, నేను కేవలం నలభైసెకన్లలో ఈ విన్యాసాన్ని ప్రదర్శించి నది నుంచి బయటకు వచ్చేశాను. ఇది కూడా స్వతహాగానే నేర్చుకున్నాను. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మీరు ఇక ముందు ఏం చేయబోతున్నారు? ఇంద్రజాలాన్ని ప్రభుత్వాలు ఓ కళగా గుర్తించాలి. అప్పుడే ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇంద్రజాలాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సర్కస్ అంటే రష్యాది అని... ఇంద్రజాలం అంటే ఇండియాది అని ప్రపంచం అంతటా పేరుంది. దేశానికి పేరు తెచ్చిన ఇంద్రజాల విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుంది. అన్ని రాష్ట్ర్రాల రాజధానుల్లో మ్యాజిక్ అకాడమీలు ఏర్పాటు చేసి ఇంద్రజాలాన్ని ప్రోత్సహించాలి. ఆ దిశగా నా కార్యాచరణను కొనసాగిస్తున్నాను. – మాడా చంద్రమోహన్, సాక్షి, మదనపల్లె, చిత్తూరు -
గుంటూరులో జాదుగర్ ఆనంద్ మ్యాజిక్ షో
-
గుంటూరులో జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో
-
ఆ సర్వేలో బీజేపీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ప్రస్తుతం ఆశావహ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు బీజేపీ చేరుకోలేదని ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ చేపట్టిన మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంఓటీఎన్) సర్వే వెల్లడించింది. 543 స్ధానాలున్న లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు కేవలం 281 స్ధానాలు లభిస్తాయని, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి 122 స్ధానాలు లభిస్తాయని అంచనా వేసింది. జులై 18 నుంచి జులై 29 మధ్య జరిగిన ఈ సర్వేలో ఇతరులకు గణనీయంగా 140 సీట్లు లభిస్తాయని పేర్కొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 స్ధానాలను గెలుచుకోగా ఎన్డీఏ కూటమికి 336 సీట్లు దక్కాయి. విపక్ష కాంగ్రెస్ భారీ పరాజయం మూటగట్టుకుని కేవలం 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఎంఓటీఎన్ సర్వే ఎన్డీఏకు 36 శాతం ఓట్లు లభిస్తాయని, యూపీఏకు ఐదు శాతం తక్కువగా 31 శాతం ఓట్లు పోలవుతాయని లెక్కగట్టింది. ఇతరులకు యూపీఏ కన్నా అధికంగా 33 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. -
అబద్ధం చెప్పని ఓ అద్దం కథ!
అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ ‘నేక్డ్ ల్యాబ్స్’ ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి? రోజూ పేపర్ తిరగేస్తే.. భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్’ అనే ఈ మ్యాజిక్ మిర్రర్ మన ముందుంచుతుందట. అదెలా? ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్ రియల్ సెన్స్ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్ యాప్‌లోకి వివరాలు స్టోర్ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్మాస్, ఫ్యాట్మాస్ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్ అని చెబుతున్నారు. సురక్షితమేనా? యాప్‌లో స్టోర్ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్ మాత్రమేనని.. అది ఎక్స్రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట.. ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కూటమి తప్పదా?
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీగా నిలిచిన పీటీఐ మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా వెల్లడైన 265 స్థానాల ఫలితాల్లో పీటీఐ 118 చోట్ల విజయం సాధించగా.. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. పీఎంఎల్ ఎన్ 62 స్థానాల్లో, పీపీపీ 43 చోట్ల గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు 12 చోట్ల గెలిచారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మతతత్వ పార్టీల కూటమి అయిన ఎంఎంఏపీ 11 స్థానాల్లో గెలవగా.. ఎంక్యూఎం 4 చోట్ల గెలిచింది. గెలిచిన ఎంపీ సీట్ల ఆధారంగా మహిళలు, మైనారిటీ సభ్యుల కోటాలో పీటీఐ ఖాతాలోకి మరో 34–35 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా కలుపుకుంటే పార్లమెంటులో పీటీఐ ఎంపీ సీట్ల సంఖ్య 160 వరకు ఉంటుందని అంచనా. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మొత్తం 172 స్థానాలు అవసరం. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం పీటీఐ ముఖ్యనేతలతో ఇస్లామా బాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై వీరితో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు దక్కుతుందని, ఆందోళన అవసరం లేదని ఆయన పార్టీ నేతలతో దీమా వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌కు వీవీఐపీ ప్రొటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు.మరోవైపు, పాక్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. పారదర్శకత లేని ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబించడం లేదని అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో స్పష్టం చేశాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో పీటీఐ నవాజ్ షరీఫ్ కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో తొలిసారిగా పీటీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. 297 అసెంబ్లీ స్థానాల్లో పీఎంఎల్ఎన్ 127 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. 117 స్థానాలు గెలిచిన పీటీఐ.. స్వతంత్రుల (27 సీట్లు)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అటు 140 సీట్లున్న సింధ్ ప్రావిన్స్‌లో 72 చోట్ల గెలిచిన పీపీపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక్కడ పీటీఐ 20 చోట్ల గెలిచింది. అటు, 99 స్థానాలున్న ఖైబర్–ఫక్తున్ఖ్వా అసెంబ్లీలో పీటీఐ 66 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బెలూచిస్తాన్ అసెంబ్లీలో 51 స్థానాలుండగా.. కొత్తగా ఏర్పాటైన బెలూచిస్తాన్ అవామీ 13 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. రాజకీయ అస్థిరతపై ఆందోళన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగిన తీరు ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ దేశ తదుపరి ముఖచిత్రంలో అస్థిరత తప్పదని పాక్ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు, ముఖ్యనేతలంతా వారి కంచుకోటల్లో ఓడిపోవడం వంటి కారణాలతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు. ప్రజల్లో పీటీఐ పట్ల సానుభూతి లేనప్పటికీ ఈ ఫలితాలు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ రాజకీయాల్లో వచ్చే కొద్ది రోజులు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిన పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి’ అని పాక్ రాజకీయ నిపుణుడు ఒమైర్ అలావీ పేర్కొన్నారు. కుట్ర జరిగింది: విపక్షాలు పార్లమెంటులో 68 స్థానాలు గెలవడం, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో 122 స్థానాల్లో గెలవడం తమ పార్టీపై జరిగిన కుట్రేనని పీఎంఎల్–ఎన్ ఆరోపిస్తోంది. అటు పీపీపీ కూడా తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల కూడా ఓడిపోయామని.. ఏకంగా పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో కంచుకోట అయిన కరాచీలో ఓడిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలను హైజాక్ చేశారని.. ఫలితాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ గెలవలేదని.. ఆయన్ను కొందరు (ఆర్మీ, ఎన్నికల సంఘం పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ) గెలిపించారన్నారు. తొలి హిందూ ఎంపీ పాకిస్తాన్లో తొలిసారిగా ఓ హిందువు ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్–2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003–08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు. -
‘మెజారిటీ’ సర్కారే..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్‌కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. యూపీలో గతితప్పిన అంచనాలు గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది. సిద్దరామయ్య విశ్వాసం కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు. క్షేత్రస్థాయి పనిలో బీజేపీ! కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్‌షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు. లింగాయత్‌లు ఎటువైపు? ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్‌లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
బోస్.. మ్యాజిక్ బాస్
భీమవరం: ఇంద్రజాలంలో రాణిస్తూ.. అంతర్జాతీయస్థాయి కీర్తిని సొంతం చేసుకున్నారు డాక్టర్ బోస్. ఆయన పూర్తిపేరు దంతులూరి సత్యనారాయణరాజు. ఊరు భీమవరం. ఇంద్రజాల ప్రదర్శనలు, పుస్తక రచన, పరిశోధనలతో ఆయన మ్యాజిక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. సుమారు 50 ఏళ్లుగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ.. అనేక అవార్డులు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు పొందారు. 1948లో జన్మించిన బోస్ కామర్స్‌లో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ అకౌంట్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో పూర్తిచేశారు. పీపుల్స్ మ్యాజిక్ సర్కిల్(ఇండియా) అధ్యక్షునిగా, ఇంద్రజాలం, ఇంద్రజాల ప్రపంచం, మాయాదండం వంటి పత్రికలకు ఎడిటర్‌గా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మ్యాజిక్ డైరెక్టర్‌గా, నేషనల్ మ్యాజిక్ కళాశాల కర్సపాండెంట్గా పనిచేశారు. 16 మ్యాజిక్ పుస్తకాల రచన డాక్టర్ బోస్ ఇంద్రజాలం, మ్యాజిక్ గైడ్, మాయా బజార్, మ్యాజిక్ షో, మహిమలు, మర్మాలు, బుద్ధ గాథ–బుద్ధ బోధ వంటి ఇంద్రజాలానికి సంబంధించిన 16 పుస్తకాలను రచించారు. వివిధ పత్రికల్లో వ్యాసాలూ రాశారు. బిరుదులు, అవార్డుల పరంపర ఆయన ఇంద్రజాల కళా సార్వభౌమ, మ్యాజిక్ చక్రవర్తి, మెగా మెజీషియన్, మ్యాజిక్ మాస్టర్ వంటి 11 బిరుదులు పొందారు. అలాగే మ్యాజిక్ రత్న, ఆంధ్ర రత్నం, విశిష్ట ఇంద్రజాలికుడు అవార్డు, నేతాజీ అవార్డు, శాంతి సామరస్యం వంటి దాదాపు 27 అవార్డులను కుబుద్బెన్జోషి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, బీష్మనారాయణసింగ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. 13 వరల్డ్ రికార్డులు ఆయన సొంతం సత్యనారాయణరాజు మ్యాజిక్‌లో అద్భుతాలు సృష్టించి వరల్డ్ రికార్డులనూ సొంతం చేసుకున్నారు. యూనిక్ వరల్డ్ రికార్డు, ఎమేజింగ్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు వంటి 13 రికార్డులను తన కీర్తిమకుటంలో పొందుపరుచుకున్నారు. అంతేనా.. బోస్ స్వయంగా వంద మ్యాజిక్ ట్రిక్కులను మరొక 100 మ్యాజిక్ పరికరాలను తయారు చేయడం విశేషం. గతంలో భీమవరం పట్టణంలో కళ్ళకు గంతులు కట్టుకుని మోటారు సైకిల్ నడిపి అబ్బురపర్చడమేగాక మ్యాజిక్కు సంబంధించి రాష్ట్ర, జాతీయస్థాయి సమావేశాలు, తరగతులు నిర్వహించారు. వేలాది ప్రదర్శనలిచ్చిన డాక్టర్ బోస్ సమాజంలోని మూఢ నమ్మకాలపై ప్రచారం చేయడంతోపాటు శాంతి, అహింసలను ప్రబోధించే బౌద్ధ పుస్తకాలను రచించి జైళ్లలోని ఖైదీలకు ఉచితంగా పంపిణీ చేశారు. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడానికి కృషి చేశారు. విదేశీ పర్యటనలు సత్యనారాయణరాజు మ్యాజిక్‌ను ప్రదర్శించడానికి సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాడ్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించారు. తోటి మేజీషియన్లను గౌరవించాలనే సంకల్పంతో ఏటా బోస్ మ్యాజిక్ నగదు అవార్డును అందజేస్తున్నారు. -
మూఢనమ్మకాలు హాంఫట్!
చేతుల్లో వస్తువులు మాయం చేసి మస్కా కొడుతూ తాను భగవత్ స్వరూపునిగా అభివర్ణించుకుంటుంటారు కొందరు. నిమ్మకాయ కోసి రక్తం చూపి తమను తాము దైవాంశ సంభూతులమనుకొమ్మంటారు మరికొందరు. చేతబడులకు తిరుగుబడి చేస్తే జ్వరాలు తగ్గుతాయంటూ కోళ్లు, కానుకలు దండుకుంటుంటారు ఇంకొందరు. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత అడ్డం పెట్టుకుని కొందరు స్వాములు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంద్రజాలాన్ని అస్త్రంగా వాడుతున్నారా ముగ్గురు. వారే మ్యాజిక్ సిస్టర్స్ అయిన మౌనిక, సుస్మిత. వారి తండ్రి జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). మ్యాజిక్ సహోదరీమణుల ఆ ద్వయం... తమ తండ్రితో కలిసి త్రయంగా ఏర్పడి... మూఢనమ్మకాలు తొలగించాలని పడుతున్న తాపత్రయం వారిది. వాళ్ల జీవిత‘ఆదర్శం’ ఆ అక్కాచెల్లెళ్ల మాటల్లోనే... ఇంద్రజాలంతో ఎందరో మోసగాళ్లు అమాయకులను మోసం చేస్తుంటారు. అదే ఇంద్రజాలంతో మోసాన్ని మాయం చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు... మా నాన్న పేరు జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). విజయనగరం పట్టణంలోని గంటస్థంభం దగ్గర కానుకుర్తివారివీధిలో నివాసం. నాన్న న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్. బీవీ పట్టాభిరామ్ వంటి ప్రముఖుల షోలు చూసి తానూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు నాన్న. తన పదహారేళ్ల వయసులో తొలి ప్రదర్శనను తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎమ్మార్ కళాశాలో ఇచ్చారు. అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా ఆయన దాదాపు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మా అమ్మ పేరు రమణి. పెళ్లి తర్వాత ఆమె సహకారంతో తన ప్రవృత్తికి మరింత పదును పెట్టి మూఢనమ్మకాలపై కత్తి దూశారు. కొరడా ఝుళిపించారు. మేమింకా మ్యాజిక్ యవనికపైకి అడుగుపెట్టకముందే ఒక ఇంద్రజాలికునిగా పది వేలకు పైగా ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డు అందుకున్నారు మా తండ్రి. మాది సమాజం హర్షించే మాయ అవును... మేమూ మాయ చేస్తున్నాం. కాకపోతే మాది సమాజం హర్షించే మాయ. నిజం చెప్పాలంటే మా మాయతో మేము మూఢనమ్మకాలను మాయం చేస్తున్నాం. అంధ విశ్వాసాలను అంతం చేస్తున్నాం. మాయలతో మోసపుచ్చే మాయగాళ్ల గారడీ చేతబడికి తిరుగుబడి చేస్తున్నాం. ఇందుకు తగిన కారణమూ, నేపథ్యమూ ఉంది. మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమూ, అక్కడ అమాయక గిరిజనులు ఎక్కువ. అప్పట్లో క్యాన్సర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మరణిస్తే ప్రజలకు వాటి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల చేతబడి, చిల్లంగి, బాణామతి వంటి క్షుద్ర ప్రయోగం వల్ల చనిపోయి ఉంటారని అపోహ పడేవారు. అవన్నీ కేవలం మూఢనమ్మకాలంటూ మేము మ్యాజిక్ సాయంతో నిరూపిస్తున్నాం. విజయనగరం జిల్లాలోని సాలూరు, పి కోనవలస, నీలకంఠాపురం, మొండెంకళ్లు, చినమేరంగి, కురుపాం, మక్కువ, కూనేరు, పార్వతీపురం, పెదబొండపల్లి, పాచిపెంట, మామిడిపల్లి, గుమ్మలక్ష్మీపురం, ఇంగిలాపల్లి, బొద్దాం, అలమండ, కొత్తవలస, కొట్యాడ, ఎస్‌కోట ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రదర్శనలిచ్చాం. మాయను మాయతోనే ఎలా ఛేదిస్తామంటే... మా ప్రాంతంలోని మాయలోళ్లు అమాయకులను బుట్టలో వేసుకోడానికి రకరకాల ప్రదర్శలను ఇస్తుంటారు. వాటి సాయంతో తమకు మహిమలున్నాయని చెప్పుకుంటుంటారు. మహిమల పేరు చెప్పి వారు చేసేవన్నీ మేమూ చేస్తాం. నిమ్మకాయ నుంచి రక్తం రావడం, కొబ్బరి కాయలో నుంచి పువ్వులు, రక్తం రావడం, నాలుకపై త్రిశూలం గుచ్చుకోవడం, నోట్లో బ్లేడులు వేసుకుని నమిలి, మింగిన తర్వాత తోరణంగా వాటిని బయటకు తీయడం, విభూది సృష్టించడం, మెడలో కత్తి గుచ్చుకోవడం, తాడుమీద కొబ్బరికాయను అటూ ఇటూ నడిపించడం, దయ్యాలు, భూతాలపై భయాన్ని పోగొట్టేందుకు మనిషిని హిప్నటైజ్ చేసి తలపై మంటపెట్టి పాలు, నీరు మరిగించడం వంటి విద్యలను ప్రదర్శిస్తాం. అవి కేవలం సైంటిఫిక్‌గా ప్రదర్శించే విద్యలే తప్ప మహిమలు కాదని చాటి చెబుతాం. ఊరూరా కేవలం ఈ ప్రదర్శనలే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని రోడ్లపై మోటార్ సైకిల్ నడిపి ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలే ప్రయత్నాలూ మా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. మాది సఫల ప్రయత్నం.. అందుకు ఇదీ ఉదాహరణ! మా ప్రదర్శనలు ఎంతో విజ్ఞానవంతమైనవి. మరింత చైతన్యపరిచేవి. మా ప్రయత్నం ఎంత సఫలమో చెప్పేందుకు ఉదాహరణ ఒకటుంది. మా నాన్నగారు మ్యాజిక్ చేస్తుండగా విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు. తాను చిల్లంగి చేస్తున్నాననే నెపంతో కొందరు తన భార్యను పొట్టనబెట్టుకున్నారట. తననూ చంపేస్తామంటున్నారంటూ బోరున విలపించాడు. ఇవే ప్రదర్శనలు తమ గ్రామంలో ఇచ్చి తన ప్రాణాలు నిలపమంటూ నాన్నను ప్రాధేయపడ్డాడు. నాన్న కారణంగా తన ప్రాణం దక్కుతుందంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇలా మా ప్రదర్శనలతో ప్రజలు చైతన్యవంతం కావడమే కాదు... చాలామంది ప్రాణాలూ నిలిచాయి. కొన్ని జీవితాల్లో మార్పులూ వచ్చాయి. వినోదంతో పాటు సామాజిక బాధ్యత మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాలు ఎక్కువ. గర్భిణీ ఆరోగ్యం విషయంలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మందులు, వైద్యం కూడా అందదు. ఇక పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం కూడా ఉండదు. ఈ కారణంగా బిడ్డలు పౌష్టికాహార లోపంతో చిన్న వయసులోనే మృత్యువాత పడుతుంటారు. కనీసం వారికి తల్లిపాలైనా సరిగ్గా ఇస్తే కొంతమందినైనా బతికించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టత, శిశువులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గిరిజనులు తమ పిల్లలను బడికి పంపకుండా, కూలీ పనులకు పంపిస్తుంటారు. అలా చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు ఎన్నటికీ రావంటూ, విద్య ఆవశ్యకతపైనా ప్రదర్శనలిస్తుంటాం. ఆడపిల్లను చంపుకుంటే ఇంటి లక్ష్మిని చంపుకున్నట్టేనంటూ మా ఇద్దరినీ ఉదాహరణగా చూపిస్తూ.. భ్రూణహత్యలు, స్త్రీ శిశు హత్యలకు వ్యతిరేకంగా చైతన్యం తెస్తుంటారు నాన్న. చిన్నారి పొన్నారి చిరు వయసు నుంచే... మా ఇద్దరిలో మూడున్నర ఏళ్ల వయసప్పుడు నాచేత ప్రదర్శన ఇప్పించారు నాన్న. నన్ను చూసి చెల్లెలు రెండున్నర ఏళ్లున్నప్పుడే వేదిక ఎక్కడానికి ఉత్సాహం చూపింది. తాను అంత చిన్న వయసు నుంచే మ్యాజిక్ మొదలుపెట్టింది. అలా నాన్నతో పాటు మేమిద్దరమూ 28కి పైగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాం. మాది ఒక్కటే కోరిక. సమాజంలోని మూఢనమ్మకాలు అంతమైపోవాలి. అందుకు మా మ్యాజిక్ ఉపయోగపడి... అది మూఢనమ్మకాలను మాయం చేసేస్తే మాకు అంతకంటే ఏం కావాలి? జాతీయ స్థాయి గుర్తింపు ఇంద్రజాల ప్రదర్శనలో ప్రతిభకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి 2006లో మా అక్కాచెల్లెళ్లమిద్దరమూ ఢిల్లీకి వెళ్లాం. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ నుంచి అవార్డు తీసుకుంటుండగా మా విజిటింగ్ కార్డును ప్రధానికి ఇచ్చి ‘హమారా ఐడెంటిటీ కార్డ్’ అన్నాం. వెంటనే స్పందించిన మన్మోహన్సింగ్ ‘తుమ్హారా ఐడెంటిటీకార్డ్!’ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు ముఖం పెట్టి ఆయన ఫక్కున నవ్వేశారు. విజిటింగ్ కార్డుకి ఐడెంటిటీ కార్డుకీ తేడా తెలియని వయసులో ఇంద్రజాలంలో జాతీయ అవార్డు అందుకున్నాం మేం. బహుశా ఇలా అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంద్రజాలం ప్రదర్శించే మ్యాజిక్ సిస్టర్స్ మేమే కాబోలు. లాయర్ని అవుతా నాన్న కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావడంతో తరచుగా అక్కడికి తీసుకువెళ్లేవారు. దాంతో న్యాయవాద వృత్తిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మరి కొద్ది నెలల్లో ఎల్ఎల్బి పట్టా అందుకోబోతున్నాను. ఆటబొమ్మల బదులు మ్యాజిక్ వస్తువులు ఇచ్చి నాన్న ఆడుకోమనేవారు. ఆలా ఇంద్రజాలాన్ని ఉగ్గుపాలతోనే అలవాటు చేశారు. చెల్లి కూడా నాతో జతకలిసిన తర్వాత ఏ ప్రదర్శన చేసినా ఇద్దరం కలిసే చేస్తున్నాం. – మౌనిక, ఇంద్రజాలికురాలు, విజయనగరం షార్ట్ ఫిల్మ్స్‌కు ఎడిటర్‌గా చేస్తున్నా మానవ వనరులను సబ్జెక్ట్‌గా తీసుకుని డిగ్రీ చదువుతున్నాను. యానిమేషన్‌పై ఇష్టంతో అదీ నేర్చుకుని ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్నేహితులతో కలిసి తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటర్‌గా కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు అక్క మ్యాజిక్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం చూసి నాకూ మ్యాజిక్ చేయాలనిపించింది. నాన్న అక్కకూ, నాకూ దానిలో మెళకువలు నేర్చించారు. ఒకప్పుడు మేం చేస్తుంటే విమర్శించిన వారు ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. – సుష్మిత, ఇంద్రజాలికురాలు, విజయనగరం చాలా విమర్శలు ఎదుర్కొన్నా ఆడపిల్లల ముఖానికి రంగేసి తిప్పుతున్నానని, పెళ్లి చేయకుండా ఈ గారడీ ప్రదర్శనలేంటని బంధువర్గంలో సూటిపోటి మాటలు బాధించేవి. మ్యాజిక్‌ను చాలా చులకనగా చూసేవారు. ఒకానొక దశలో క్షుద్ర విద్యలు నేర్పుతున్నాననేవారు. ఇది క్షుద్రవిద్య కాదని, ఇంద్రజాలం అనేది ఓ కళ అని నమ్మిన నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిరుత్సాహ పరిచినా వెనుదిరిగి చూడలేదు. వాళ్లన్న క్షుద్ర విద్యలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రదర్శనలిస్తున్నాం. – జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి, తండ్రి, ఇంద్రజాలికుడు, విజయనగరం – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
అమిత్ షాది కాలం చెల్లిన మ్యాజిక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి భారతీయ జనతాపార్టీ చీఫ్ అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షావి కాలం చెల్లిన వ్యూహాలని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ విజయం తరువాత కర్ణాటక మీద బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ పాగా వేసేందుకు కమల దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం బెంగళూరు వచ్చారు. అమిత్ షా బెంగళూరు రావడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. అమిత్ షాది కాలం చెల్లిన వ్యూహాలని ఆయన మీడియాతో అన్నారు. అమిత్ షా మ్యాజిక్కు కాలం చెల్లిందని.. ఇప్పుడు అది పనిచేయదని సిద్దరామయ్య అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ద రామయ్య బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. నవంబర్లోనూ బీజేపీ చీఫ్‌పై సిద్దరామయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన అమిత్ షాను.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక పర్యాటకుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
ఇతర మెట్రో నగరాల్లో పరిస్థితేంటి?
900–1,200 చ.అ. ఫ్లాట్లకు 40 శాతం డిమాండ్ వచ్చే ఐదేళ్లూ అందుబాటు గృహాలదే ఆధిపత్యం: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్ల కాలం దేశీయ స్థిరాస్తి రంగంలో అందుబాటు గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుందని మ్యాజిక్‌బ్రిక్స్ ఎడిటోరియల్ అండ్ అడ్వైజరీ హెడ్ ఈ జయశ్రీ తెలిపారు. ♦ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 900–1,200 చ.అ. మధ్య ఉండే మిడిల్ ఇన్‌కం గ్రూప్ (ఎంఐజీ) గృహాలకు 40 శాతం డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా పుణె, నోయిడా, థానే, నవీ ముంబై నగరాల్లో అయితే మరీనూ. రూ.6 లక్షల వరకు వార్షిక వేతనముండే వాళ్లూ సీఎల్ఎస్ఎస్కి అర్హులవుతుండటంతో 300–600 చ.అ. ఫ్లాట్లకూ గిరాకీ ఉంది. ♦ 600 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రధాన నగరాల్లో ఈ తరహా గృహాలకు 11 శాతం డిమాండ్ ఉంది. నోయిడా, పుణె, హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో 300 చ.అ.లోపుండే ఫ్లాట్లకు గిరాకే లేదు. ఆయా నగరాల్లో 450 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంది. ♦ గుర్గావ్లో మాత్రం 2,200 చ.అ. కంటే పైనుండే ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. 1,000 చ.అ. ఫ్లాట్లు ఆ తర్వాత నేరుగా 1,300 చ.అ. ఫ్లాట్లకే గిరాకీ ఎక్కువగా ఉందిక్కడ. ♦ నగరాలను బట్టి అందుబాటు గృహాల ఎంపికలోనూ కొనుగోలుదారుల దృష్టి మారడానికి కారణముంది. ఫరీదాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో చ.అ.కు నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. దీంతో ఆయా నగరాల్లో 1,000–1,200 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంటుంది. అదే ఢిల్లీ, నవీ ముంబై వంటి ప్రీమియం నగరాల్లో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుండటంతో ఇక్కడ చిన్న ఫ్లాట్లకు మొగ్గు చూపుతుంటారు. -
సెన్సేషన్ సృష్ఠిస్తున్న ఆడమ్ ట్రెంట్ మేజిక్
-
అప్పణంగా భోంచేశారు!
జేఎన్టీయూలో మెస్ బిల్లుల మాయాజాలం లెక్కల్లో చూపకుండా రూ.8 లక్షలు స్వాహా కలికిరి కళాశాల విద్యార్థులతో చలానాకు బదులు నగదు రూపంలో వసూలు హాస్టల్ ఖాతాకు జమ చేయకుండా దారి మళ్లించిన వైనం! సాఫ్ట్వేర్ రూపకల్పనకు అనధికారికంగా రూ.4లక్షల చెల్లింపు!! జేఎన్టీయూ(ఏ)కు కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయాలు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తుంటారు. ఏడాదిలో నాలుగు పర్యాయాలకు పైగా ఇక్కడి ల్యాబ్‌లను వారు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా మెస్ బిల్లు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి హాస్టల్ అధికారులు నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. కానీ ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపలేదు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి రూ.8లక్షలకు పైగానే నగదు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తారో వారందరి మీద మెస్ బిల్లు సమానంగా వేస్తారు. వసూలు చేసిన రూ.8లక్షలను హాస్టల్ ఖాతాకు చేర్చకపోవడంతో ఆ భారం కాస్తా స్థానిక కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులపై పడింది. వ్యూహంతో విద్యార్థులు బలి సాధారణంగా ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్హాజరయితే సెలవులో ఉన్నట్లు గుర్తించాలి. సెలవు రోజులకు మెస్ బిల్లు వేయకూడదు. కానీ ఇందుకు భిన్నంగా నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో మెస్‌కు నిరంతరంగా హాజరైన విద్యార్థులకు బిల్లు తక్కువగా వచ్చింది. బిల్లు తక్కువగా వచ్చిన అంశాన్ని ముమ్మర ప్రచారం చేస్తూ హాస్టల్స్‌లో అంతా సజావుగా ఉందన్న భ్రమ కల్పించేందుకు ప్రయత్నించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండెంట్‌కు.. బిల్లులకు భారీ వ్యత్యాసం మెస్‌లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సంబంధించి ఇండెంట్లో నిర్ధారించిన ధరకు, కొనుగోలు బిల్లుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. జనవరి 24న ఇండెంట్లో ఉల్లిగడ్డలు కిలో రూ.14, మిర్చి రూ.10గా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కిలో ఉల్లిగడ్డలు రూ.20, మిర్చి రూ.13గా చూపించారు. అంటే కిలోకు ఆరు రూపాయలు అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్లో ఉల్లిగడ్డలు రూ.13, ఆలూ రూ.10, కానీ బిల్లులో ఉల్లి రూ.20. ఆలూ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనపు ధరలతో దండుకున్నారు. సాప్ట్వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు మెస్‌బిల్లు వసూలుకు సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పనకు రూ.4 లక్షలు వెచ్చించారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతులు లేకుండానే హాస్టల్ అధికారులు ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రాంను రూపొందించిన కంపెనీ సైతం లోకల్‌దే చూపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండడంతో మెస్ బిల్లులు భారంగా పరిణమించాయని విద్యార్థులు బాహాటంగానే వాపోతున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన మ్యాజిక్
♦ విజిల్ మింగిన విద్యార్థి ♦ శ్వాసనాళంలో ఇరుక్కుని అవస్థలు ♦ విజయవంతంగా బయటికి తీసిన గాంధీ వైద్యులు గాంధీ ఆస్పత్రి: డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు విజల్‌ను మింగాడు. నోటి నుంచి మాటకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి శ్వాసనాళంలో ఇరుకున్న విజల్‌ను విజయవంతంగా బయటికు తీయడంతో ప్రాణాపా యం తప్పింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఈఎన్టీ హెచ్ఓడీ హన్మంతరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఒండ్రుగొండకు చెందిన భిక్షపతి (21) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం ఇంట్లో విజిల్ ఊదుతూ చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. మ్యాజిక్ చేయాలని పిల్లలు కోరడంతో విజల్‌ను నోటి లోపలదాచుకున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి భిక్షపతి కడుపుపై సరదాగా కొట్టడంతో పెద్దగా ఊపిరితీసుకున్నాడు.దీంతో నోట్లో ఉన్న విజిల్ ప్రమాదవశాత్తు గొంతులోకి జారిపోయి ఎడమవైపు ఊపిరితిత్తి శ్వాసనాళంలో ఇరుక్కుంది. పలువిధాలుగా యత్నించిన విజిల్ బయటకు రాకపోవడంతోపాటు మాటలకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. సూర్యాపేట వైద్యుల సూచన మేరకు నగరంలోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకురాగా, ప్రాణాలకు ప్రమాదం ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో గురువారం గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చారు. ఇటీవల విజిల్ మింగిన చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ వైద్యులకు సమాచారం అందించారు. ఈఎన్టీ విభాగాధికారి హన్మంతరావు ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించి ఎడమ ఊపిరితిత్తి శ్వాసనాళంలో విజిల్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. బ్రాంకోస్కోపీతో పాటు ట్రకాస్టమీ సర్జరీలు నిర్వహించి విజిల్‌ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడు బిక్షపతి కోలుకుంటున్నాడు. శ్వాసనాళంలో ఇరుకున్న విజిల్‌ను తొలగించకుంటే ఇన్ఫెక్షన్కు గురై ప్రాణాపాయం సంభవించేందని వైద్యులు తెలిపారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు హన్మంతరావు, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, అరుణ, అప్పారావు, సాధన, సంజీవ్, శ్యాంసన్, రాథోడ్, పీజీలు సునీల్, అభినవ్, చంద్రశేఖర్, డిపిన్, శ్రావణి వైద్య ఉన్నతాధికారులు అభినందించారు. -
మీ సేవలో.. మాయా దర్పణం!
అలెక్సా... సిరి... కోర్టానా. ఈ పేర్లు మనకు పెద్దగా పరిచయం లేకపోవచ్చుగానీ... ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్లంతా! మన మాటే మంత్రంగా... మనం చెప్పే పని (మెయిల్ చూడటం, సమాచారం ఇవ్వడం వంటివి) చేసి పెట్టేస్తాయి ఇవి. అయితే ఇప్పటివరకూ ఇవన్నీ కేవలం ఆడియోకే పరిమితమైపోయాయి. ఇప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ అద్దంతో పరిస్థితి మారిపోనుంది అంటోంది డాప్ట్లీ డిస్ప్లే! అమెరికన్ కంపెనీ ఈ డిస్ప్లేని అభివృద్ధి చేసింది. పొద్దున్న లేవగానే... మీరు ఈ అద్దం ముందు నిలబడితే చాలు.. డాప్ట్లీ మిమ్మల్ని గుర్తు పడుతుంది. హలో చెబుతుంది. ఈలోపు మీరు బ్రష్‌పై పేస్ట్ వేసేసుకుని.. ‘‘ఏంటి ఈ రోజు వార్తలు’’ అని అనడం ఆలస్యం.. ఆవేళ్టి ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపిస్తూంటుంది. ఇంకోవైపు మీకు ఇష్టమైన న్యూస్ ప్రోగ్రామ్ ప్రత్యక్షమవుతుంది. ఈలోపుగానే మీరు మెయిల్స్ ఓపెన్ చేయి అనేసి వాటిని చూస్తూండవచ్చు కూడా. చేతి కదలికలతోనే... అద్దంపై కనిపించే మెయిల్స్‌ను వరుసగా చూడవచ్చు. అనవసరమైన వాటిని అక్కడికక్కడే ట్రాష్‌లో పడేయవచ్చు కూడా. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి. సింపుల్. వారికి కాల్ చేయమని డాప్ట్లీకి చెబితే చాలు. మొబైల్ అవసరం లేకుండానే వీడియోకాల్ రెడీ ఐపోతుంది. మీరు అద్దం ముందు నుంచి తప్పుకున్న వెంటనే ఈ సమాచారమంతా మాయమైపోతుంది. ఇతర కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారిని కూడా పేరుపేరునా గుర్తుపెట్టుకుని పలకరించడంతోపాటు వారికి కావాల్సిన సమాచారం ఇస్తుంది కూడా. అంతేకాదు.. ఈ సూపర్ హైటెక్ అద్దాన్ని ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, లైట్ బల్బులకు అనుసంధానించుకుంటే చాలు.. వాటిని కూడా మన మాటలతో నియంత్రించవచ్చు. ఉదాహరణకు పడుకోబోయే ముందు బెడ్రూమ్లోని ఏసీ ఆన్ చేయమని, మిగిలిన గదుల్లోని అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయమని ఆర్డర్ ఇవ్వవచ్చు. ఎవరూ వాడని సమయంలో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే... అందమైన ఫొటోఫ్రేమ్గానూ ఉపయోగపడుతుంది. అబ్బో... భలే ఉందే వ్యవహారం.. మా ఇంట్లోనూ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి. ఇది అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో తొమ్మిది నెలలు పడుతుంది. ధర దాదాపు రూ.50 వేల వరకూ ఉండవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాయలో మొనగాడు
ఇంద్రజాలం.. అదో అద్భుతం! ప్రేక్షకులను సంభ్రమ సాగరంలో ముంచెత్తి, విభ్రమంలో ఓలలాడించి, ఊహాలోకాల్లో విహరింపజేసే వర్ణనాతీత విచిత్రం. అతి ప్రాచీన విన్యాసం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు.. ఓ చిత్రమైన భ్రాంతిని కలిగించి పరవశింపజేసే అనుభవం. ఏకకాలంలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే ఈ ఇంద్రజాలం మన భారతీయ కళల్లో అంతర్భాగం. నాటికీ, నేటికీ ఎన్నో మార్పులకు లోనయిన ఈ కళలో విశాఖ వాసులెందరో ప్రతిభ చూపుతూ ఉండడం విశేషం. వాళ్లలో ప్రతిభ చూపుతున్న సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ నైపుణ్యం మరీ రసవత్తరం. 8,500 ప్రదర్శనలతో గుర్తింపు 15వ ఏట నుంచే మ్యాజిక్‌పై ఆసక్తి విలక్షణ ప్రదర్శనలతో విశ్వవ్యాప్త ఖ్యాతి సింహాచలం వాస్తవ్యుడు రవిశంకర్ ప్రతిభ సింహాచలం(పెందుర్తి) : అబ్రకదబ్ర అంటూ ఆ యువకుడు చేసే అద్భుతాలు మనల్ని అప్రతిభుల్ని చేస్తాయి. క్షణమయినా చూపు తిప్పుకోనివ్వని భ్రాంతిలో తేలుస్తాయి. మెరుపులా కదిలే అతడి వేళ్లు అపూర్వ హస్త లాఘవంతో చిటికెలో ఎన్నో చిత్రాలు చేస్తాయి. అవి అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టాయి. కేవలం స్వయంకృషి పెట్టుబడిగా, నిర్విరామ సాధనతో ఇంత ఖ్యాతిని సొంతం చేసుకున్నారు సింహాచలం ప్రాంతానికి చెందిన కలగొట్ల రవిశంకర్. ఆసక్తే ఆలంబన రవిశంకర్ అడవివరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1997లో టెన్త్ చదువుతున్నప్పుడు పాఠశాలలో మ్యాజిక్ షో జరిగింది. ఆ కార్యక్రమం అతడి జీవిత గమ్యాన్నే మార్చేసింది. మాజిక్లో ఎలాగైనా రాణించాలన్న పట్టుదల అప్పుడే కలిగింది. దాంతో పదో తరగతి పూర్తి కాగానే ఏడాది పాటు కోల్‌కతలోని కొంతమంది ఇంద్రజాలికుల దగ్గర, విజయనగరానికి చెందిన శ్యామ్, విశాఖకు చెందిన షరీఫ్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నారు. 1998 నుంచి సొంతంగా మ్యాజిక్షోలు ప్రారంభించారు. విశ్వమంతా వేలాది ప్రదర్శనలు 1998 నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్లలో రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా 8500 ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు. చెన్నైలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ, భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల పోటీల్లో ప్రథమ బహుమతులు పొందారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటి వరకు 10 ప్రదర్శనలు చేశారు. మెజీషియన్‌గా గుర్తింపు పొందుతున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్‌గా రవిశంకర్‌కు ఉద్యోగం వచ్చినా ఆయన తన ప్రవృత్తికే ప్రాధాన్యమిచ్చారు. థాయ్‌లాండ్‌లో మువ్వన్నెల రెపరెపలు 2016లో థాయ్‌లాండ్‌లో ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన థాయ్ ఇండియన్ ఫెస్టివల్లో మ్యాజిక్ షో చేసేందుకు రవిశంకర్‌కు ఆహ్వానం అందింది. అక్కడ ప్రదర్శనలో మన మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి రవిశంకర్ మన్ననలు పొందారు. జగన్మోహన్రెడ్డి పర్యటనల్లో ఆకర్షణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో స్టేజీలపై రవిశంకర్ దాదాపు 40 ప్రదర్శనలు ఇచ్చారు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్న సైనికుల వద్దకు వెళ్లి వాళ్లను మ్యాజిక్ షో ద్వారా ఆనందపరచాలన్నది తన ఆలోచనని, అందుకు అనుమతి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ‘ఇంటర్ చదివిన 60 మంది నిరుద్యోగ యువతకు శిబిరం నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇచ్చాను. ఉత్సాహం ఉన్న ఎవరికైనా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అన్నారు. ఎన్నో ప్రత్యేకతలు రవిశంకర్ క్లోజప్ మ్యాజిక్, స్టేజ్ మ్యాజిక్, గ్రాండ్ ఇల్యూషన్ మ్యాజిక్‌లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. డవ్ యాక్ట్ (గాల్లోంచి పావురాలను సృష్టించడం), ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ (ప్రాచీన ఇంద్రజాలికుల మాదిరిగా గాలిలో తాడు నిలపడాన్ని నూతన పద్ధతుల్లో ప్రదర్శించడం), లేడీ లివియేషన్ (అమ్మాయిని గాల్లో నిలబెట్టడం), జిగ్‌జాగ్ లేడీ (అమ్మాయిని మూడు భాగాలుగా చేయడం) వంటి ప్రదర్శనలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జపాన్‌లో ఉన్న ఫ్లాష్ యాక్ట్ ప్రదర్శనను రవిశంకర్ మన దేశానికి పరిచయం చేశారు. గిరిజనుల్లో మూఢనమ్మకాలు తొలగించడానికి కృషి చేశారు. -
మందుల మాయాజాలం
ప్రజల ప్రాణాలతో చెలగాటం విచ్చల విడిగా శాంపిల్స్ విక్రయాలు మెడికల్ షాపుల్లో నకిలీ, కాలం చెల్లిన మందులు గ్రామీణ ప్రజలకు అంటగడుతున్న వైనం.. జగిత్యాల అర్బన్ : ‘ధర్మపురి మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన కోరెపు శంకర్‌కు జ్వరం రావడంతో పట్టణంలోని జంబిగద్దె ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అయితే సదరు వైద్యుడు పరీక్షలు అన్ని నిర్వహించి మందులు రాసి ఇచ్చాడు. శంకర్ మెడికల్ షాపుకు వెళ్లగా కొన్ని మంచి మందులు ఇచ్చి, మిగతావి శాంపిల్స్ ఇచ్చి వెనుక ఉన్న ‘నాట్‌ఫర్‌సేల్’ లేబుల్ తీసేశాడు. అతను ఇంటికి వెళ్లి మందులు వేసుకోగా, విరేచనాలై అస్వస్థతకు గురయ్యాడు.’ ‘జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన వెంకటేశ్వర్రావు కోర్టు సమీపంలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూసుకోగా అవి అప్పటికే కాలం చెల్లినవి అని గుర్తించాడు’ అమాయకులు, గ్రామీణ ప్రజలే లక్ష్యంగా జగిత్యాల పట్టణంలో మందుల షాపుల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. నకిలీ, కాలంచెల్లిన మందులు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడి గ్రామీణప్రాంతాలకు చెందిన విద్యార్థుల, ప్రజల అనవసరపు ఆపరేషన్లు చేసి అందినంత దోచుకున్న వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడి జైలు పాలైన సంగతి తెలిసిందే. కొందరు వైద్యులు తమ వృత్తని వ్యాపారం చేస్తూ దోచుకున్నట్లుగానే మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ, మెడికల్ ఏజెన్సీలు ఇచ్చే శాంపిల్స్ అంటగడుతున్నారు. ఆర్ఎంపీల వద్ద స్టాక్ మెడికల్ శాంపిల్స్, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా ఆర్ఎంపీలే చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మెడికల్ ఏజెన్సీల రిప్రజెంటేటివ్‌లు తమ వద్దకు వచ్చే శాంపిల్స్‌ను ఆర్ఎంపీలకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆర్ఎంపీలు ఈ మందులనే గ్రామీణులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా జిల్లా డ్రగ్ అధికారులు తమకేమీ తెలియనట్లు ఉంటున్నారు. ఫిర్యాదులు అందినపుడు, పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మాత్రం మూకుమ్మడిగా ఒకరోజు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ‘సాక్షి’లో కథనం రాగా పాతబస్టాండ్‌లోని ఓ ఆస్పత్రి, పలు మెడికల్‌షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఒక్కరిపైనా చర్య తీసుకోలేదు. గతంలో టవర్‌సర్కిల్ ప్రాంతంలో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంట్లో మందులు దొరికాయి. తర్వాత ఆ అంశం కూడా అటకెక్కింది. లక్షల్లో వ్యాపారం ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన జగిత్యాలలో శాంపిల్స్ దందా, నకిలీ మందులు, కాలం చెల్లిన మందుల దందా ఎక్కువగా జరుగుతోంది. లాట్ల రూపంలో మెడికల్ శాంపిల్స్ తెప్పిస్తూ కంపెనీల ప్రచారం చేపిస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలను మచ్చిగ చేసుకుని వారి ద్వారా ప్రజలకు అంటగడుతున్నారు. కానరాని డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు జిల్లా డ్రగ్ అధికారుల నియంత్రణ లేకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో జగిత్యాల పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు ఆడిందే ఆటగా మారింది. నకిలీ మందులు, శాంపిల్స్ విక్రయిస్తున్నా, కాలం చెల్లిన మందులను అమ్ముతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పొరపాటున ఎప్పుడైనా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నకిలీ, కాలం చెల్లిన మందులు దొరికినా వారు ‘మామూలు’గానే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జగిత్యాల పట్టణంలోని పలు మెడికల్షాపులో మందుల మాయాజాలం దందా విచ్చలవిడిగా సాగుతోంది. -
మందుల గాలం
పీడీ కంపెనీల మందులే అధిక విక్రయం లాభాలు చూస్తున్న కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు ఫారిన్ ట్రిప్పులు, నజరానాలతో ఆకట్టుకుంటున్న ఆయా కంపెనీలు ‘పది కొంటే మరో పది ఉచితం.. మా మందులు అధికంగా రోగులకు రాసి, ఎక్కువ వ్యాపారం చేస్తే ఫారిట్ ట్రిప్, నగదు బహుమతి..’ ప్రస్తుతం ఔషధ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరిది. ‘ఇదేదో బాగుందే.. రోగి జేబు గుల్లయితే మనికేంటి.. కానిచ్చేద్దాం’ అన్న రీతిలో కొందరు వైద్యులు, మందుల దుకాణదారులు ఉన్నారు. – కంబాలచెరువు (రాజమహేంద్రవరం) వీరి ఆర్జన దండిగా ఉండడంతో.. చివరకు రోగి జేబుకు చిల్లుపడుతోంది. ఒకవేళ ఆ మందులను బయట ఎక్కడైనా కొందామంటే అవి దొరకవు. వాటిని ఏ వైద్యుడు రాశారో, అతని ఆస్పత్రిలోని మందుల దుకాణంలో మాత్రమే లభిస్తాయి. జిల్లాలో ఈ రకమైన దందా ఎక్కువగా సాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు చిక్కకుండా వీరు వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. ఒకవేళ పట్టుబడితే వైద్య లైసెన్సు రద్దు చేయడమే కాక, జైలు శిక్ష కూడా తప్పదు. వ్యాధులను నయం చేసేందుకు ఇటీవల కాలంలో మందులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో వచ్చాయి. ఆయా ఔషధ కంపెనీలు అదే స్థాయిలో పోటీపడుతూ, వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో వృద్ధి చేసుకుంటున్నాయి. లాభం అధికంగా ఉండడంతో వైద్యులతో పాటు మందుల దుకాణాల్లోను పీడీ మందులనే ఎక్కువగా రోగులకు అంటగడుతున్నారు. ప్రముఖ కంపెనీలు ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోవడంతో.. వ్యాపారులు పీడీ కంపెనీల మందులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పీడీ కంపెనీ అంటే..? ప్రొపగండ ఫర్ డిస్ట్రిబ్యూషన్(పీడీ) అంటే.. నేరుగా కంపెనీ నుంచి హోల్‌సేల్ లైసెన్సుదారుడు తెచ్చుకుని, విక్రయించే మందులు. ఇవి జిల్లాలో సుమారు 50 కంపెనీలు వాటిని సరఫరా చేస్తున్నాయి. ఈ మందుల కంపెనీలు వైద్యులనే టార్గెట్‌గా పెట్టుకుని, ఏడాదికి లక్షల రూపాయల్లో కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి. ఆ ఏడాదికి ఆ కంపెనీ చెప్పిన టార్గెట్‌ను ఆ వైద్యుడు పూర్తిచేస్తే, ఫారిన్ ట్రిప్‌లు, భారీ నజరానాలు ఇస్తున్నాయి. దీంతోపాటు పది బాక్సులు కొంటే, మరో పది ఉచితంగా ఇస్తున్నాయి. సగానికి సగం లాభం వస్తుండడంతో ఆ వైద్యులు.. రోగికి ఆ మందులనే అంటగడుతున్నారు. అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు మందులు రాసిచ్చేస్తున్నారు. కేవలం ఆ ఆస్పత్రిలోనే అవి దొరకుతాయి. రోగికి ఆ మందులు అవసరమైతే మళ్లీ అక్కడకే రాకతప్పదు. ఔషధ నియంత్రణ శాఖ నిఘా! దీనిపై కన్నేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు.. ఫారిన్ట్రిప్లు, నజరానాల విధానంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పలు ప్రాంతాల్లో కొందరు వైద్యులు ఇలా దొరికితే, వారి లైసెన్సు రద్దు చేశారు. అంతేకాక కొందరికి జైలుశిక్షలు కూడా పడ్డాయి. వీటిపై అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఔషధ కంపెనీల ప్రతినిధులతో పాటు వైద్యులూ రూటు మార్చుకున్నారు. నేరుగా నగదు తీసుకోవడం లేదా అందుకు సరిపడా మందులు స్వీకరిస్తున్నారు. మరో పద్ధతి కూడా ఇటీవల ప్రారంభించారు. ఆ పీడీ కంపెనీ పేరిట వైద్య శిబిరం నిర్వహించి, రోగులకు ల్యాబ్టెస్ట్లు, ఇతర వైద్యసేవల రూపంలో ఆ వైద్యుడికి లబ్ధి చేకూరుస్తున్నారు. కాగా ప్రైవేట్ ఆస్పత్రులు డీఎంహెచ్ఓ పరిధిలో ఉంటాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను నిత్యం తనిఖీ చేయాలి. పీడీ మందుల విక్రయం జిల్లాలో అధికంగా సాగుతున్నా, వాటిని రోగులకు అంటగడుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దృష్టి సారిస్తాం ఆస్పత్రులకు వచ్చే రోగులకు వ్యాధి నయం చేసే మందులు రాయడం వైద్యుడు పని. వాటిని సక్రమంగా రాయకుండా, ప్రజలను దోచుకోవడం తప్పు. పీడీ మందుల విషయం ఇప్పటివరకూ మా దృష్టికి రాలేదు. వెంటనే వాటిపై దృష్టి సారిస్తాం. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీ చేపడతాం. వైద్యులెవరైనా అలా చేస్తే చర్యలు చేపడతాం. –చంద్రయ్య, డీఎంహెచ్ఓ, కాకినాడ పీడీ మందుల నాణ్యత తనిఖీ జిల్లాలో సుమారు 50 పీడీ కంపెనీల మందులు సరఫరా అవుతున్నాయి. మందు ఒకటే, కంపెనీయే వేరు. హోల్‌సేల్ విక్రయదారుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. శాంపిల్స్‌ను ల్యాబ్ రిపోర్టుకు పంపాం. కొన్ని స్టాండర్డ్స్‌కు అనుగుణంగానే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. వాటి నాణ్యత, లైసెన్సు వరకు మాత్రమే మా పరిధి ఉంటుంది. ఆస్పత్రులు, డాక్టర్లపై మాకు అధికారం లేదు. – పి.శ్రీరామమూర్తి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, రాజమహేంద్రవరం -
మరో అద్భుతాన్ని సృష్టించిన చైనా
బీజింగ్: అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకొనే ఓ అద్భుతమైన మెటీరియల్‌ను చైనా సృష్టించింది. ఇప్పటిదాకా తయారు చేసిన లోహాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే లోహమిదేనని ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సీనియర్ ఇంజనీర్ జు జంగ్‌ఫెంగ్ తెలిపారు. అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, స్పేస్‌క్రాఫ్ట్‌లు, శాటిలైట్ల తయారీలో ఈ లోహాన్ని వినియోగించవచ్చని చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామి దేశాలుగా చెప్పుకుంటున్న అమెరికా, రష్యా మరికొన్ని ఐరోపా దేశాలు రాకెట్ల తయారీ కోసం ఏరోజెల్ మెటీరియల్‌ను ఉపయోగిస్తున్నాయని, దానికి మించి ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి తాము రూపొందించిన లోహానికి ఉందన్నారు. ఏరోజెల్‌ను సైతం తమ సంస్థే తయారు చేసిందని, అన్ని దేశాలూ ఇప్పుడు ఏరోజెల్నే ఉపయోగిస్తున్నాయన్నారు. కొత్తగా తాము తయారుచేసిన లోహం కేవలం ఉష్ణోగ్రతనే కాకుండా భారీ వైబ్రేషన్‌ను సైతం తట్టుకుంటుందని జంగ్‌ఫెంగ్ చెప్పారు. -
బీమా... ఓ డ్రామా
– గతేడాది ఆగస్టు 1 8 నాటికి 40 శాతం తక్కువగా వర్షాలు – అన్ని మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని నివేదిక – కానీ.. 24 మండలాలకే బీమా పరిమితం చేయడం విశేషం అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా పథకం ‘అనంత’ వేరుశనగ రైతులను మాయ చేస్తోంది. ఈ ఏడాది జరిగిపోయింది. వచ్చే ఏడాదైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ‘పాలిచ్చే ఆవును అమ్మేసి దున్నను కొన్న’ చందంగా గ్రామం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా ద్వారా లబ్ధి పొందుతున్న తరుణంలో 2011లో బలవంతంగా వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చి ఇబ్బందుల్లోకి నెట్టేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వాతావరణ బీమా కింద విడుదలవుతున్న పరిహారాన్ని చూస్తే నిజంగానే రైతులకు ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు. 2015కు సంబంధించి తాజాగా మంజూరు చేసిన రూ.109 66 కోట్లు పరిహారాన్ని చూస్తే వాతావరణ బీమా ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. చివరకు రైతులు చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కి రాని విధంగా బీమా కంపెనీ మాయ చేస్తోంది. ఈ క్రమంలో ఈసారి కూడా 24 మండలాల రైతులకు కూడా కంటి తుడుపుగా పరిహారం మంజూరు చేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలో కరువు ఉందని అధికారిక నివేదిక వర్షాలు లేక జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బ తిని కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని గతేడాది ఆగస్టు మూడో వారంలో జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో 52 మండలాలు కరువు బారిన పడ్డాయని ప్రకటించింది. జూన్, జూలై, ఆగస్టు 18వ తేదీ నాటికి జిల్లాలో ఉన్న 63 మండలాల్లో 45 మండలాల్లో వర్షపాతం తక్కువగానూ (డెఫిసీట్), 7 మండలాల్లో మరీ తక్కువ (స్కానిటీ)గానూ మిగతా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సుమారు 40 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని అధికార యంత్రాంగం నివేదించింది. కానీ.. వాతావరణ బీమా కొన్ని మండలాలకు పరిమితం చేస్తూ పరిహారం మంజూరు చేయడం.. 39 మండలాలను పూర్తిగా విస్మరించడంపై రైతులు కన్నెర చేస్తున్నారు. ఆగస్టు చివర్లో ఆశాజనకంగా వర్షాలు జూన్ నుంచి మొహం చాటేసిన వరుణుడు ఆగస్టు 18 తర్వాత కరుణించాడు. ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లో కూడా మంచి వర్షాలు పడ్డాయి. ఖరీఫ్ ముగిసే నాటికి 40 శాతం తక్కువగా ఉన్న స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషం. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్లకు గానూ 88, సెప్టెంబర్‌లో 118.4కు గానూ 111 మి.మీ కురిసింది. ఎట్టకేలకు సీజన్ ముగిసేనాటికి 338.4 మి.మీకు 319 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ.. వాతావరణ బీమా మాయాజాలంతో ‘అనంత’ వేరుశనగ రైతులకు మరోసారి అన్యాయం జరిగిపోయింది. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేష్టన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేష్టన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేష్టన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేçÙన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేçÙన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేçÙన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. -
మోసమే మ్యాజిక్
హాలీవుడ్ థ్రిల్లర్ / నౌ యు సీ మీ ప్రపంచంలో నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో లైఫ్‌లో ఒక్క మ్యాజిక్ జరిగితే బాగుండుఅనుకుంటుంటారు. కానీ మెజీషియన్లు ఇంద్రజాలం చేస్తే నమ్మరు. గారడీ అని కొట్టి పారేస్తారు. అలాంటి మ్యాజిక్ షో ఓ క్రైమ్‌కి తెర తీస్తే? అదే 2013లో విడుదలైన ‘నౌ యు సీ మీ’. లూయిస్ లెటరిర్స్ ఓ ఫ్రెంచి దర్శకుడు. ‘ట్రాన్స్పోర్టర్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన... ‘ది ఇన్క్రెడిబుల్ హల్క్’ సినిమాతో హాలీవుడ్లో పాగా వేశాడు. ఓ కథని వేగంగా, ఆసక్తిగా చెప్పడంతో పాటు సక్సెస్ చేసి, సీక్వెల్ రెడీ చేయడం లూయిస్ స్టయిల్. ‘ది ట్రాన్స్పోర్టర్’ సినిమాతో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్న లూయిస్ ‘నౌ యు సీ మీ’ కూడా అలాగే రూపొందించాడు. అందుకే 2013లో ఈ సినిమా విజయవంతం అయ్యింది. 2016లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కి బీజం పడింది (అయితే లూయిస్ దర్శకుడు కాదు. జాన్ బౌ అనే చైనీస్ డెరైక్ట్ చేశాడు). నలుగురు కుర్ర మెజీషియన్లు అనుకోకుండా నలుగురికి విడివిడిగా కార్డ్స్ వచ్చాయి. ఆ పేక ముక్కల ఆధారంగా న్యూయార్క్‌లో ఓ అపరిచితుణ్ని కలుసుకున్నారు.ఏడాది తర్వాత ఆ నలుగురు మెజీషియన్లు ఓ గ్రూప్‌గా ఫామ్ అయ్యి, లాస్ వేగాస్‌లో ఓ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో భాగంగా ప్యారిస్‌లోని ఓ బ్యాంక్ లాకర్లలో ఉన్న డబ్బుని బయటికి గాలికి ఎగురుకుంటూ వచ్చేలా చేయడం వీళ్లు ప్లాన్ చేసిన ట్రిక్. కానీ నిజంగానే ఆ బ్యాంక్‌లో కరెన్సీ మాయమైంది. దాంతో ఇంటర్‌పోల్ ఏజెంట్, ఎఫ్‌బీఐ ఏజెంట్ ఈ నలుగురు మెజీషియన్ల వెనక పడ్డారు. వాళ్లు సహజంగానే తమకేమీ తెలియదన్నారు. సీనియర్ మెజీషియన్ సహకారంతో ఈ కేసు పరిశోధన కొనసాగించారు. రెండోసారి మరో నగరంలో ఇదే తరహా మ్యాజిక్ షో ఇవ్వడానికి నలుగురు మెజీషియన్లు ప్లాన్ చేశారు. ఈసారి ఇన్సూరెన్స్ కంపెనీ అధినేత ఆర్థర్ డ్రెప్లర్ కంపెనీలో డబ్బుని మాయం చేశారు. ఆర్థర్ పగతో రగిలిపోయాడు. ఇంటర్‌పోల్ ఏజెంట్ అల్మా న్యూయార్క్‌లోని ఈ నలుగురు మెజీషియన్లూ ఉండే అపార్ట్మెంట్ మీద రైడ్ చేసింది. ముగ్గురు తప్పించుకుంటారు. ఒకడు (జాక్) ప్రమాదవశాత్తూ చనిపోతాడు. అక్కడ విలువైన డాక్యుమెంట్లు దొరుకుతాయి. వాటి ఆధారంగా మెజీషియన్స్ హార్స్‌మెన్ గ్రూప్ ఆ తర్వాత ఎక్కడ నేరం చేయబోతున్నారనే ఆధారాలు లభిస్తాయి. ఆ చివరి షోని పోలీసులు ముట్టడిస్తారు. షోలో భాగంగా జనంపై డాలర్ల వర్షం కురిపిస్తారు. నిజానికవి దొంగనోట్లు. అయినా ప్రదర్శనకి వచ్చినవాళ్లు వాటిని నిజం నోట్లే అని భ్రమించి, ఎగబడతారు. ఈ హడావుడిలో ముగ్గురు తప్పించుకుంటారు. అయినా అల్మా వెంట పడుతుంది.చివరికి తెలిసేది ఏమిటంటే... ఆ ముగ్గురిలో ఒకడయిన డైలాన్ తండ్రిని ఆ బ్యాంక్, ఇన్యూరెన్స్ కంపెనీలు మోసం చేస్తాయి. అందుకే ప్రతీకారంగా ఈ మ్యాజిక్ క్రైమ్‌లు చేసినట్లు చెబుతాడు. డెబ్భై అయిదు మిలియన్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 352 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. - తోట ప్రసాద్ -
ట్వీట్టర్ చేతికి మ్యాజిక్ పోనీ
డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ! న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్టర్, లండన్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోన్’ను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ కొనుగోలు కారణంగా తమ మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అంశాల్లో తమ సామర్థ్యాలు మరింతగా విస్తరిస్తాయని ట్వీట్టర్ తెలిపింది. 2014 జూలైలో మ్యాడ్బిట్స్ ఇమేజ్ సెర్చ్ స్టార్టప్‌ను, గత ఏడాది జూన్‌లో వెట్ల్యాబ్ మెషీన్ లెర్నింగ్ స్టార్టప్‌ను కొనుగోలు చేశామని ట్వీట్టర్ సీఈఓ జాక్ డార్సే.. ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా మ్యాజిక్ పోన్‌ను కొనుగోలు చేయడం... మెషీన్ లెర్నింగ్‌పై పెట్టిన ఇతర పెట్టుబడులకు అదనమని వివరించారు. తమ లైవ్, వీడియోలను మరింత పటిష్టం చేసేందుకు మ్యాజిక్ పోనీ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. మ్యాజిక్ పోనీ ఉద్యోగులను మెషీన్ లెర్నింగ్ అంశంపై పరిశోధనలు చేసే ట్వీట్టర్ కోర్టెక్స్ సంస్థలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. మ్యాజిక్ పోనీ సంస్థను కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను డార్సే వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని టెక్క్రంచ్డాట్కామ్ వెల్లడించింది. -
లండన్ స్టార్టప్ ను ట్విట్టర్ కొనుగోలు
న్యూయార్క్ : మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, లండన్ కు చెందిన 18నెలల స్టార్టప్ మ్యాజిక్ పోని టెక్నాలజీని కొనుగోలు చేసింది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించేందుకు ట్విట్టర్ ఈ కొనుగోలు చేపట్టింది. నిలిచిపోయిన వృద్ధిని పెంచడం కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు ప్రకటించిన తర్వాతి వారంలోనే ఈ కొనుగోలును ప్రకటించడం విశేషం. మిషన్ లెర్నింగ్ సామర్థ్యాలను విస్తరించుకోవడం కోసం మ్యాజిక్ పోని కొనుగోలు సాయపడుతుందని, 2014లో ఇమేజ్ సెర్చ్ స్టార్టప్ మ్యాడ్ బిట్స్ కొనుగోలుతో ఈ విస్తరణ ప్రారంభించామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే బ్లాగ్ లో పోస్టు చేశారు. 2015 జూన్ లో మరో మిషన్ లెర్నింగ్ స్టార్టప్ వెట్ ల్యాబ్ ను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. మ్యాజిక్ పోని టెక్నాలజీ కొనుగోలుకు ట్విట్టర్ ఎంతమొత్తంలో చెల్లించబోతుందో పేర్కొనలేదు. అయితే బోనస్ లతో కలిపి దాదాపు 1500లక్షల డాలర్లను ట్విట్టర్ ఆ కంపెనీకి చెల్లించస్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్.కామ్ తెలిపింది. లైవ్, వీడియోల్లో తమ బలాన్ని విస్తరించేందుకు, ఉత్తేజపూర్వకమైన సృజనాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మ్యాజిక్ పోని టెక్నాలజీ ద్వారా ట్విట్టర్ కు ద్వారాలు తెరుచుకుంటాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రతిభతో లెర్నింగ్ టీమ్స్ బలాన్ని నిరంతరంగా పెంచడం కోసం ఇది ట్విట్టర్ కు సహకరిస్తుందని డోర్సే తెలిపారు. లోతైన లెర్నింగ్ రీసెర్చ్ అనేది తమ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుందని, తమ పనిని, లెర్నింగ్స్ ను కమ్యూనిటీలతో పెంచుకోవడం కోసం తోడ్పడుతుందని డోర్సే పేర్కొన్నారు. మరోవైపు నుంచి ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ను టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంతంచేసుకోబోతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ ను సొంతం చేసుకునే రేసులో గూగుల్ ముందంజలో ఉందని, దాని తర్వాతి స్థానంలో ప్రపంచ మీడియా ప్లేయర్ కంకాస్ట్ పోటీపడుతుందని తెలుస్తోంది. అంతేకాక ఇంటర్నెట్ ఆధారిత సంస్థ యాహులోనైనా దీన్ని విలీనం చేయాలని ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు ఆ కంపెనీతో సంప్రదింపులు జరిపినట్టు రిపోర్టులు వచ్చాయి. -
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!
మన ఫోన్లోని ఫీచర్స్‌ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది. ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్‌ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది. ప్రస్తుతం గూగుల్‌తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. -
మ్యాజిక్ బ్రిక్స్ చేతికి ప్రోపర్టీడాట్కామ్
న్యూఢిల్లీ: రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్ సంస్థ ప్రొపర్టీ విశ్లేషణ ప్లాట్ఫార్మ్ ప్రోపర్జీడాట్కామ్ను కొనుగోలు చేసింది. కొనుగోలు వివరాలను మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్ వెల్లడించలేదు. 2013లో బెంగళూరులో ప్రారంభమైన ప్రోపర్జీడాట్కామ్ సంస్థ ప్రోపర్టీ అధ్యయన నివేదికలను కొనుగోలు దారులకు అందిస్తుంది. ప్రోపర్టీ కొనుగోలుదారులు నిర్ణయాలు తీసుకోవడంలో ప్రోపర్జీడాట్కామ్ అందించే సమాచారం ఇతోధికంగా ఉపయోగపడుతుందని, అందుకని ప్రోపర్జీడాట్కామ్ను నిర్వహించే ఇన్వాక్ట్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేశామని మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్ సీఈఓ సుదీర్ పాయ్ చెప్పారు. ఇది తమ తొలి కొనుగోలు అని ఈ సందర్భంగా తెలిపారు. -
విద్యార్థులు రంగులు పూయించారు
అది... ఇప్పటిదాకా ఓ మారుమూల పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల. ఇప్పుడు మాత్రం గోడలపై వివిధ సందేశాలతో, పెయింటింగ్స్ తో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది ఆ మున్సిపల్ స్కూల్. ఓ సేవా సంస్థ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థుల్లోని ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యాలయం. ర్యాంకులు, మార్కులే కాదు పిల్లల్లోని ఇతర కళలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమ ఫలితం ఇది. సూరత్ లోని పాఠశాల విద్యార్థులకు గత ఆదివారం ఫన్ స్టెయిన్ సేవాసంస్థ ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. స్థానిక పేద విద్యార్థులకు కళలు, నృత్యం, సంగీతం,ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వంటి అనేక అంశాల్లో తర్ఫీదునిచ్చింది. సుమారు 300 పాఠశాలల్లోని విద్యార్థులు సహా కళాకారులతో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. సూరత్ లోని గిజూభాయ్ బధేకా మున్సిపల్ స్కూల్ సహాయంతో ఫన్ స్టెయిన్ సేవాసంస్థ 'ర్యాంగ్ నెస్ బ్రింగింగ్ కలర్స్ ఎలైవ్' పేరున నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసింది. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ముందుగా పాఠశాల గోడలకు పెయింటింగ్ వేయడాన్నే విద్యార్థులకు పనిగా ఇచ్చారు. ఇంకేముందీ వాల్ ఆర్ట్ వేయాలన్న సంస్థ సలహా మేరకు పిల్లలంతా తమలోని సృజనను జోడించి, స్కూలు గోడలను కళాత్మకంగా తీర్చిదిద్ది పరిసర ప్రాంతాలనూ ప్రకాశింపజేశారు. ముందుగా కార్యక్రమాన్నిస్థానిక మేయర్ అస్మితాబెన్ షిరోయా, గుజరాత్ కళా ప్రతిష్టాన్ సెక్రెటరీ రమణిక్ భాయ్ జపాడియాన ప్రారంభించగా... విద్యార్థులకు సేవా సంస్థ బ్రష్ లు, పెయింట్ లు అందజేసింది. దీంతో సేవ్ గల్స్, సేవ్ వాటర్, ప్రిజర్వ్ ఫారెస్ట్స్, స్లాప్ పొల్యూషన్, క్విట్ స్మోకింగ్ వంటి ఎన్నో సామాజిక సందేశాలను విద్యార్థులు గోడలపై ఆకట్టుకునేలా చిత్రించారు. పాఠశాల నగరానికి ప్రధాన మార్గంలో ఉండటంతో చూసినవారంతా అభినందనలు తెలపడంతోపాటు... తాము కూడ అటువంటి కార్యక్రమాల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముందుగా స్కూలు ముందువైపు గోడలకు మాత్రమే పెయింటింగ్ వేద్దామనుకున్నామని, మొదలు పెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఉత్సాహం చూసి మొత్తం స్కూలు కాంపౌండ్ ను రంగులతో నింపాలని నిశ్చయించుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ఓ చిన్న గ్రూప్ లా ఏర్పడిన విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి సుమారు మధ్యాహ్నానికల్లా రంగులు, పెయింట్ వేయడం పూర్తి చేసేశారని ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
మండపంలో వధువు మాయం!
ఓ మెజీషియన్ వధువు... తన పెళ్ళి వేడుక అతిథులందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలనుకుంది. అందుకే ఏదైనా భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. మండపంలో పెళ్ళి సందడి మొదలైంది. బంధువులంతా పీటల మీదకు పెళ్ళికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె మాయమైపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు కూడ సిద్ధమైపోయారు. ఇంతలో బంగారు రంగు దుస్తులతో దట్టమైన పొగ మధ్య మండపంలో ప్రత్యక్షమైన వధువును చూసి ఖిన్నులైపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఎంతో అద్భుతంగా ఫీలయ్యారు. కేరళ అలప్పూజ ప్రాంతంలోని ఆనంద్, అమ్ముల వివాహంలో జరిగిన ఈ అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతోపాటు... స్థానికంగా వార్తలకెక్కింది. అలాగే ఆమె రిసెప్షన్ కార్యక్రమం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈసారి అమ్ము తన ఇంద్రజాల ప్రతిభతో పిల్లగాలిలో మెల్లగా కలసిపోయి... రిసెప్షన్ కు ఏర్పాటు చేసిన ఓ పెద్ద కమలం నుంచీ ప్రత్యక్షమైంది. అతిథులు, బంధువుల చప్పట్ల మధ్య కల్యాణ మండపం మారుమోగింది. వివాహ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చిన ప్రముఖ మెజీషియన్ సమరాజ్... డైరెక్టర్ బాలచంద్రన్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి... వేడుకకు గ్లామర్ టచ్ తెచ్చి పెట్టారు. రచయిత రాజశేఖరన్ ముత్తుకులమ్, శ్రీలతల ఏకైక సంతానం అమ్ము.. మూడేళ్ళ వయసులోనే ఇంద్రజాలాన్ని ఎంతో ఇష్టపడేది. కళ్ళకు గంతలు కట్టుకొని వాహనాలు నడపడం వంటి అనేక ట్రిక్కులను ఆమె స్వయంగా నేర్చుకుంది. సినిమా అండ్ టెలివిజన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె... మ్యాజిక్ లో అద్భుతాలను ప్రదర్శించి ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకుంది. వివాహ సందర్భంలో ప్రదర్శనకు అమ్మూకు ఆమె దగ్గరి బంధువులు, స్నేహితులు సహకరించారు. తన పెళ్ళి సందర్భంలో ఏదైనా ప్రత్యేకత ఉండాలన్న తన కోర్కెను అమ్మూ ముందుగానే తన తండ్రికి తెలిపింది. ఆయన అంగీకారంతో ప్రదర్శనకు అనువుగా వేదికను డిజైన్ చేయించుకుంది. -
మ్యాజిక్ వాల్
చరిత్ర ఊహించని మార్పు తిరిగింది అనే మాట లెనన్ గోడను చూసిన వారికి, ఆ గోడ చరిత్ర చూచాయగానైనా తెలిసిన వారికి తెలుస్తుంది. చెక్ రిపబ్లిక్ రాజధాని నగరం ప్రేగ్లో చార్లెస్ బ్రిడ్జి దగ్గర ఉన్న లెనన్ గోడ తొలి చరిత్ర వేరే అయినా అది తిరిగిన మలుపు, చేరిన ప్రస్థానం వేరు. ఒకప్పుడు ఈ గోడ భావస్వేచ్ఛకు, రాజకీయ అభిప్రాయాలకు నిలువెత్తు అద్దంలా కనిపించేది. ‘ఈ దేశంలో అన్నీ ఉన్నాయి బతుకు తప్ప’... ‘శాసనాలతో సూర్యోదయాన్ని ఆపలేరు’ ఇలాంటి నినాదాలు కనిపించేవి. అయితే ఇప్పుడు మాత్రం నిప్పు లాంటి నినాదాల కంటే భావుకతతో నిండిన వాక్యాలు, సెంటిమెంట్ వాక్యాలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి వల్లే లెనన్ గోడ సరికొత్త ట్రావెల్ స్పాట్‌గా మారి పర్యాటకులను ఆకర్షిస్తుంది.లెనన్ వాల్ అనేది 1980 ముందు వరకు సాధారణ గోడ. అయితే కవి, గాయకుడు జాన్ లెనన్ అభిమానులు తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఈ గోడను వాహికగా చేసుకునేవారు. లెనన్‌కు సంబంధించి గ్రాఫీటీతో పాటు అతడి పాటల చరణాలను గోడపై రాసేవారు. 1988 నుంచి ఈ గోడ కొత్త అవతారం ఎత్తింది. ఒకప్పుడు కనిపించే లెనన్ పాట చరణాలు, గ్రాఫిటీ స్థానంలో కమ్యూనిస్ట్ వ్యతిరేక నినాదాలు కనిపించడం మొదలైంది. చెకోస్లోవియాకు అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చెకొస్లోవియాకు చాలా కాలం పాటు కార్యదర్శిగా పని చేసిన గుస్తావ్ హుసక్కు వ్యతిరేకంగా రాతలు కనిపించేవి. ఈ రాతల పుణ్యమా అని రాతకారులకు, పోలిసులకు మధ్య ఎప్పుడూ ఘర్షణ జరిగేది. ఈ రాతకారులు తమది ‘లెనినిజం’ కాదని ‘లెనోనిజం’ అని చెప్పుకునేవాళ్లు.పోలిసులు మాత్రం- ‘‘వాళ్లు మతిభ్రమించిన వాళ్లు, పెట్టుబడి దారి వ్యవస్థకు దాసోహం అంటున్న వాళ్లు’’ అని తిట్ల వర్షం రిపించేవాళ్లు.ఇలా లెనన్ గోడ ఎప్పుడూ నిప్పుల కుంపటిలా కనిపించేది.అలాంటి గోడ కాస్త ఇప్పుడు రూపం మార్చుకుంది.రుగుబాటు నినాదాల స్థానంలో ప్రేమ, శాంతి సందేశాలు కనిపిస్తున్నాయి. శాంతి సందేశం ఇచ్చిన ప్రేమస్పదులైన మహానుభావుల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తై, లెనన్ గోడ ఆశీస్సులు, కోరికలు ఫలించే గోడగా సరికొత్త ప్రాచుర్యం పొందడం ఒక ఎత్తు. ఇప్పుడు వాడి వేడి మాటల కంటే చల్లని వెన్నెల లాంటి ప్రేమ వాక్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘జాన్ లెనన్ పాడిన ఒక పాటలో- ‘మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ వాజ్ మ్యాజిక్ ఇన్ ది ఎయిర్? ఐ బిలీవ్ యస్ ఐ బిలీవ్’ అనే చరణాలు వినిపిస్తాయి. నేను లెనన్ గోడ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాట చప్పున గుర్తుకు వచ్చింది. ‘నా స్నేహితుడి ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్లిద్దరు ఒక ఇంటి వాళ్లు కావాలి...అని రాశాను. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే రెండు నెలలు తిరక్కుండానే నేను రాసిన వాక్యం ఫలించింది. ఈ గాలిలో ఏదో మ్యాజిక్ ఉంది’’ అంటున్నాడు ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ రిచర్డ్. వాస్తవం, అవాస్తవం, అతిశయాల గురించి ఎలా ఉన్నా... మనసులో మాట రాసుకోవడానికి, అది ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి లెనన్ గోడ పర్యాటక ఆకర్షణగా మారింది. -
ఐఫోన్‌తో పెళ్లి వీడియో షూటింగ్!
పెళ్లి వీడియో తీయాలంటే ఎంత తతంగం ఉంటుంది.. రెండు మూడు కెమెరాలు, అందులోనూ కాస్త ఖరీదైన వెడ్డింగ్ అయితే క్రేన్ కెమెరాలు, భారీ లైట్లు ఒకటే హడావుడి. ఇదేమీ లేకుండా కేవలం సెల్‌ఫోన్‌తోనే పెళ్లి వీడియో తీస్తే ఎలా ఉంటుంది? ఏకంగా పెళ్లి వీడియో.. సెల్ఫోన్లోనా! అసలు ఇలాంటి ఆలోచన రావడమే కష్టం అనుకుంటే, దానికి అంగీకరించే వధూవరులు దొరకడం ఇంకా కష్టం. దీన్నంతటినీ సాధ్యం చేసిన ఘనత బెర్గర్సన్ సెఫీకి దక్కింది. షూటింగ్ మాత్రమే కాదు.. ఎడిటింగ్ కూడా తన ఐఫోన్లోనే చేసి తన సత్తా చాటాడు. ఏడేళ్లుగా పెళ్లి వీడియోలు తీస్తూ సెఫి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐఫోన్‌తో పూర్తి భారతీయ పెళ్లిని చిత్రీకరించాలని ఉందన్న తన కోరికను ప్రొఫెషనల్ కెమెరామెన్ బెర్గర్ సన్ సెఫి కొన్నాళ్ల క్రితం తన ఫొటోగ్రఫీ బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఆయన మిత్రులు ఆయుషి, అభిషేక్... సెఫి కోరికను తీర్చేందుకు ముందుకొచ్చారు. తమ పెళ్లిని ఐ ఫోన్ 6ఎస్ ద్వారా చిత్రీకరించేందుకు అనుమతినిచ్చారు. మూడు రోజులపాటు అట్టహాసంగా జరిగిన పెళ్లి మొత్తాన్ని సెఫి తన ఐ ఫోన్లో చిత్రీకరించి, అదులోనే ఎడిటింగ్ కూడా చేశాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా వీడియో వచ్చింది. అయితే ఐఫోన్ ప్రయోగంతో పగటిపూట దృశ్యాలు అద్భుతంగానే ఉన్నా... రాత్రి షూటింగ్ మాత్రం ఇబ్బందిగానే ఉందని చెప్పాడు సెఫీ. ఈ వీడియోకు ఎన్నో ఫిల్టర్లను, ఎడిటింగ్ ఆప్షన్లను వాడిన తర్వాత తుది రూపాన్నిచ్చామని, ఈ ప్రస్తుత ప్రయోగం 70ల నాటి పోలరాయిడ్ కెమెరాలతో తీసిన తృప్తినిచ్చిందని అంటున్నాడు. తన కోర్కెను మన్నించి ఆయుషీ, అభిషేక్ తనకీ అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు. డీఎస్ఎల్ఆర్ కెమెరాను ఐఫోన్ భర్తీ చేయలేకపోయినా, ఫొటోగ్రఫీలోనే ఓ కొత్త మీడియాన్ని పరిచయం చేసినట్లవుతుందని అంటున్నాడు. ఐఫోన్‌తో తక్కువ కాంతి ఉన్నప్పుడు చిత్రించడం కొంత కష్టమని, ఈ సందర్భంలో ఎల్ఈడీ లైట్లను వినియోగించి సమస్యను అధిగమించానని సెఫీ తెలిపాడు. డాక్యుమెంటరీలకు, ఫొటో జర్నలిజానికి అందుబాటులో ఉండే ఈ చిత్రాలు ఫైన్ ఆర్ట్‌ను తలపిస్తాయని, ఓ అద్భుత పెయింటింగ్ చూసిన అనుభూతి ఇస్తాయని చెబుతున్నాడు. -
ఈ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉంది..
‘తొలిసారి ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రానికి తేజగారు అడిగినప్పుడు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు. కన్ఫ్యూజన్, బెరుకు, భయంతో ఇక్కడికి వచ్చాను. నేను నార్త్ అమ్మాయినే అయినా ఇక్కడివారు నన్ను తెలుగమ్మాయి గానే భావించి చాలా ఆదరించారు. ఇక్కడివారి ప్రేమాభిమానాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. నేను లంగా వోణి వేసుకోవడం నేర్చుకున్నది ఇక్కడే. సైకిల్ తొక్కడం కూడా ఇక్కడే నేర్చుకున్నా. సౌత్ కల్చర్ మీద నాకు అవగాహన వచ్చింది కూడా ఇక్కడ ఉన్నాకనే. ఇక బోనాల పండగప్పుడు సిటీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అది చూడ్డం భలేగా ఉంటుంది. నాకు హైదరాబాద్ ఎంత నచ్చిందంటే రద్దీ రోడ్లు, మార్కెట్లు కూడా మురిపంగానే అనిపిస్తాయి. విదేశాలు వెళ్లి మళ్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు సొంతూరుకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ మట్టిలో మ్యాజిక్ ఉందనిపిస్తుంది.’ అని చెబుతోంది ప్రముఖ హీరోయిన్ - కాజల్ అగర్వాల్ -
లక్షణంగా.. లగ్జరీగా..
ఈ డ్రెస్‌ల ధరలు లక్షల్లో పలుకుతాయి. రోహిత్ బాల్ మ్యాజిక్ ఇది. కంటికి ఇంత ఇంపుగా ఒంటికి ఎంతో సొంపుగా ఉండటానికి అంత ధరపలకడానికి సృజనే కారణం. లక్షలు పోయలేకపోతేనేం... ఈ డిజైన్స్‌తో స్ఫూర్తిపొంది మన డిజైన్లు మనమే చేసుకొని లక్షణంగా వెలిగిపోవచ్చు. బంగారు, జరీ దారాలతో ఆప్లిక్ వర్క్ చేసిన హాఫ్‌వైట్ శారీపై పువ్వుల మోటిఫ్స్.. బంగారు వర్ణపు చారల అంచు... అదే రంగు బ్రొకేడ్ బ్లౌజ్‌కు గోల్డెన్ కాలర్ ఈ చీరను గ్రాండ్‌గా నిలిపాయి. ధర: రూ. 2,50,000/- పసుపు, గులాబీ కలగలిసిన నారింజ రంగు బ్రొకేడ్ లాంగ్ జాకెట్... దానికి మాండరిన్ కాలర్, ముందు భాగంలో బటన్ ప్లాకెట్. పొడవాటి చేతులు, వాటికి బటన్స్ కఫ్స్.. హాఫ్‌వైట్ ముడతల లెహంగా... బ్రొకేడ్ దుపట్టా ఈ డ్రెస్ ప్రత్యేకతలు. ధర రూ.94,990/- కట్‌దానా వర్క్ చేసిన పువ్వుల జాకెట్టు.. లెహంగా మీద గోల్డెన్ సీక్వెన్స్, కట్‌దానా ఎంబ్రాయిడరీ కాంబినేషన్.. మ్యాచింగ్ దుపట్టా ఈ లెహంగా సూట్ స్పెషల్. ధర. రూ. 2,49,990/- ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డిజైనర్ రోహిత్‌బాల్. యాభైనాలుగేళ్ల వయసులోనూ ఇరవై నాలుగు గంటలూ సృజనాత్మకతకు ప్రాముఖ్యం ఇచ్చే బాల్ కాశ్మీర్వాసి. మనదేశంలోని ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరు. పాతికేళ్ల క్రితం న్యూఢిల్లీలో ఓ చిన్న స్టోర్‌తో ప్రారంభించి అనతి కాలంలోనే ప్యారిస్, న్యూయార్క్, లండన్, సింగపూర్ వంటి మహానగరాలలో తన సత్తా చాటుకున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ రోహిత్‌బాల్ స్టోర్స్ ఉన్నాయి. మహిళల, పురుషుల వస్త్రనైపుణ్యంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న బాల్ డిజైన్స్‌లో ఎక్కువగా నెమలి అలంకారాలు చూస్తాం. అలాగే వెల్వెట్, బ్రొకేడ్ ఫ్యాబ్రిక్స్, బంగారు జరీ అంచులను తన డిజైన్స్‌లో విరివిగా వాడతారు. హాఫ్‌వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌తో అబ్బురపరిచే డిజైన్లు సృష్టించడం బాల్ ప్రత్యేకత. భారతదేశ గొప్పదనాన్ని, రాచకళను తన డిజైన్స్‌లో చూపించడం మరో ప్రత్యేకత. న్యూఢిల్లీ ఫ్యాషన్ టెక్నాలజీలో పట్టా అందుకున్న బాల్ రూపొందించిన ఆభరణాలకు కూడా దేశ విదేశాలలోనూ మంచి పాప్యులారిటీ ఉంది. డిజైనర్‌గానే కాకుండా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు బాల్. రోహిత్ బాల్ మరిన్ని డ్రెస్ డిజైన్స్ కోసం http://www.rohitbal.com కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. -
ప్రేమ సంగీతం
హాలీవుడ్ సినిమా / స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్ ప్రేమలో ఎన్నిసార్లు ఓడిపోయినా, గెలవడానికి ప్రయత్నిస్తూ, తమ మనసులను పట్టి ఉంచే మ్యాజిక్ కోసం అన్వేషించి, ఆ ప్రేమలోనే మునిగిపోయిన రెండు హృదయాల ప్రేమకథ - హాలీవుడ్ చిత్రం ‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ (1993). 1957లో వచ్చిన హాలీవుడ్ లవ్ క్లాసిక్ ‘యాన్ ఎఫైర్ టు రిమెంబర్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకురాలు నోరా ఎఫ్రాన్ ఈ చిత్రాన్ని ఓ మోడ్రన్ లవ్ క్లాసిక్‌గా మలిచారు. కథలోకి వెళితే... భార్యకు దూరమైన దుఃఖంలో శామ్ బాల్డ్విన్ (టామ్ హ్యాంక్స్) కొడుకు జోనా (రోస్ మాలింజర్)తో కలిసి తన సొంత ఊరైన చికాగో నుంచి సియాటిల్ నగరంలో సెటిల్ అవుతాడు. మరోవైపు బాల్టిమోర్‌లో యానీ రీడ్ (మెగ్ రియాన్) రిపోర్టర్ తనను ఎంతగానో ప్రేమించిన వాల్టర్ (బిల్ పుల్‌మ్యాన్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. అయితే అనూహ్యంగా సియాటిల్, బాల్టిమోర్.. నగరాల మధ్య నాలుగు వేల కి.మీ. దూరం శామ్‌ను, యానీ రీడ్‌ను కలుపుతుంది. అవి క్రిస్మస్ రోజులు. శామ్ తన భార్య చనిపోయిన దుఃఖంలో కుంగిపోతూ ఉంటాడు. కొడుకు ఎనిమిదే ళ్ల జోనా తన తండ్రి బాధ చూడలేక ఓ రోజు రేడియో షోకు ఫోన్ చేస్తాడు. తన తండ్రి బాధలో ఉన్నాడని, ఇప్పుడు ఆయన జీవితానికి కొత్త తోడు కావాలని రేడియోలో మాట్లాడుతున్న డాక్టర్‌కు చెబుతాడు. ఫోన్ ‘మీ డాడీకి ఇవ్వమన’గానే శామ్‌ను పిలిచి ఇచ్చేస్తాడు. శామ్ మొదట్లో కాస్త కోప్పడినా భార్యను కలిసిన క్షణాలను గుర్తుచేసుకుని, అందరితో పంచుకుంటాడు. కొన్ని వేల మంది అతని మాటలు విని బాధపడతారు. అందులో యానీ కూడా ఉంటుంది. ఎందుకో భార్య మీద అతనికున్న ప్రేమ యానీ మనసును తాకుతుంది. వాల్టర్‌తో తాను గడుపుతున్న క్షణాల్లో లేని మ్యాజిక్ అతని గొంతులో ధ్వనించింది. మెల్లగా శామ్ ఆలోచనలు ఆమె మనసును ఆక్రమించుకుంటాయి. శామ్కు తోడవుతామంటూ, అతని అడ్రస్‌కు బోలెడన్ని ఉత్తరాలు పోస్ట్‌లో వస్తాయి. శామ్ వాటిని చూసి కూడా పట్టించుకోకుండా వదిలేస్తాడు. కొడుకు జోనా మాత్రం తన తండ్రికి తగ్గ అమ్మాయి కోసం ఆ ఉత్తరాలు చదువుతూనే ఉంటాడు. ఆ క్రమంలో యానీ ‘వేలెంటైన్స్ డే’ రోజున న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద కలుద్దామని శామ్కు ఉత్తరం రాస్తుంది. ఆఫీస్ పని మీద అని ప్రేమికుడు వాల్టర్‌కు అబద్ధం చెప్పి, శామ్‌ను కలవడానికని సియాటిల్‌కు ఫ్లైట్ ఎక్కుతుంది. ఇటువైపు తన స్నేహితురాలు విక్టోరియాను ఫ్లయిట్ ఎక్కించడానికి వచ్చిన శామ్ అప్పుడే అక్కడ ఫ్లైట్ దిగిన యానీ అందాన్ని చూసి మైమరిచిపోతాడు. అయితే అక్కడ శామ్ ఒక అమ్మాయితో ఉండడాన్ని దూరం నుంచి గమనించిన యానీ, ఆమె అతని ప్రియురాలేమో అని పొరపాటుపడుతుంది. దాంతో మళ్లీ వాల్టర్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో వేలంటైన్స్ డే రానే వస్తుంది. శామ్ వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో కొడుకు జోనా ఆ రోజు ఆమెను కలవడానికి న్యూయార్క్ వెళ్లిపోతాడు. యానీ కూడా తన బోయ్‌ఫ్రెండ్ వాల్టర్‌తో కలిసి న్యూయార్క్‌కు వెళుతుంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీదకు చేరుకున్న జోనా ఉదయం నుంచి యానీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ అతని ఆశ నిరాశగానే మారుతుంది. మరో పక్క...వాల్టర్‌తో కలిసి ఉన్నా సరే యానీ మనసులో ఏదో తెలియని దిగులు. యానీకి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కళ్ల ముందు మెదిలే సరికి ఇక అసలు విషయం వాల్టర్‌కు చెబుతుంది. వాల్టర్ ఆమెను అర్థం చేసుకోవడంతో యానీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు వెళుతుంది. ఇంతలో శామ్ తన కొడుకు జోనాను కలుస్తాడు. జోనా కూడా ఆమె ఇక రాదని అర్థమై తండ్రితో కలిసి కిందకు వెళ్తాడు. ఆమె పైకి వెళితే, వీళ్లిద్దరూ కిందకు వెళతారు. పైన ఎవరూ లేకపోయే సరికి, యానీ కూడా ఇక నిరాశగా వెళ్లే టైంకి జోనా బిల్డింగ్ మీద మర్చిపోయిన తన బ్యాగ్ కోసం తండ్రితో కలిసి మళ్లీ వెనక్కు వస్తాడు. అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో చూసిన అమ్మాయేనా యానీ అని శామ్ ఆశ్చర్యపోతాడు. జోనా తన తండ్రిని ఆమెకు పరిచయం చేస్తాడు. ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లగానే, శ్యామ్‌తో ‘‘నైస్ టూ మీట్ యూ శామ్’’ అని యానీ చెప్పగానే.... కథ ముగుస్తుంది. - బి.శశాంక్ వసూళ్లు 1500 కోట్లు! ‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ చిత్రాన్ని 2.1 కోట్ల డాలర్ల (ఇప్పటి మన లెక్కలో రూ. 138 కోట్ల 60 లక్షలు) బడ్జెట్‌తో తీస్తే, 22.78 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 1500 కోట్లు) వసూలు చేసి, సంచలన విజయం సాధించింది. ‘స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట ప్రముఖ నటి జూలియా రాబర్ట్స్‌ను ఎంచుకున్నారు. కానీ, ఆమె ఈ పాత్ర చేయడానికి తిరస్కరించారు. దాంతో, మెగ్ రియాన్‌ను ఈ పాత్ర వరించింది. సియాటిల్‌లో టామ్ హ్యాంక్స్ ఇల్లుగా చూపించిన బోట్ హౌస్ ఈ మధ్యే 20 లక్షల డాలర్ల (దాదాపు రూ. 13.2 కోట్లు)కు అమ్ముడైంది. -
మోదీ మ్యాజిక్!
కొన్ని నిర్వచనాలకు అందవు. మూసలో ఇమడవు. సంప్రదాయాలకూ, నియమా లకూ లొంగవు. ఈమధ్యకాలంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సాగుతున్న దౌత్యం ఎలాంటిదో, దానికి ఏం పేరు పెట్టాలో తెలియక చాలామంది విశ్లేషకులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ శుక్ర వారం ఉన్నట్టుండి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టి అందరినీ చకితుల్ని చేశారు. రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్నాక అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వెళ్లి అక్కడి కార్యక్రమాలు ముగిశాక ఢిల్లీకి బయల్దేరినట్టే కనబడి మార్గమధ్యంలో లాహోర్ వెళ్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. అప్పటివరకూ ప్రధానులిద్దరూ కలవబో తున్నారని అటు పాకిస్థాన్‌లోగానీ, ఇటు భారత్‌లోగానీ ఎవరికీ తెలియదు. ఈ హఠాత్తు పరిణామం వెనకున్న కారణాన్ని మోదీ ట్విటర్ సందేశం ద్వారానే చెప్పారు. నవాజ్ షరీఫ్‌కు ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు... తన మనవరాలి పెళ్లి వేడుకలు కూడా జరుగుతున్నాయని కనుక తప్పకరావాలని షరీఫ్ ఆహ్వానించడంతో వెళ్లానన్నది మోదీ చెబుతున్న మాట. ఇదంతా నిజమని, యాదృచ్ఛికంగా జరిగిందేనని నమ్మేవాళ్లున్నట్టే...అందులో వాస్తవం లేదని వాదించేవారూ ఉంటారు. ‘ఒక ప్రోటోకాల్ లేదు...ఒక పద్ధతీ లేదు, ఇదేం దౌత్యమ’ంటూ విమర్శలకు దిగిన కాంగ్రెస్ నేతల సంగతలా ఉంచితే... ఇరు దేశాలమధ్యా సత్సంబంధాలను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మోదీ పాకిస్తాన్ పర్యటనతోసహా ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. చైనా నాయ కుడు డెంగ్ జియావో పెంగ్ వేరే సందర్భంలో అన్నట్టు ‘పిల్లి నల్లదైతేనేం, తెల్లదై తేనేం...కావలసింది ఎలుకల్ని పట్టడం’. దశాబ్దాలుగా పరస్పరం విద్వేషాగ్నులతో రగిలిపోతున్న రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొనడం, చెలిమి చిగురించటం ముఖ్యంగానీ అందుకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారన్నది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. అధికార పీఠం అధిష్టించిననాటినుంచీ దౌత్యరంగంలో తనదైన శైలిలో వ్యవహరిస్తూ వస్తున్న మోదీ...పాకిస్థాన్‌తో చర్చల విషయంలోనూ వినూత్న విధానాన్ని అవలంబి స్తున్నారు. ముందూ, మునుపూ ఇలాంటి పద్ధతుల్లో దౌత్యాన్ని నెరపలేదు గనుక ఇప్పుడూ వీల్లేదనడం సరికాదు. దౌత్య పరిభాషలో మోదీ లాహోర్ సందర్శనను దేశాధినేత పర్యటనగా పరిగణించడం సాధ్యంకాదు. అధికారికంగా ఖరారయ్యే అలాంటి పర్యటనల వెనక బోలెడు లాంఛనాలుంటాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు మొదలుకొని అనేకమంది ఉన్నతాధికారులు చర్చించుకుని వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అంగీకారయోగ్యమైన ఎజెండాను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రధాని స్థాయి నేత పర్యటన తేదీలు ఖరారవుతాయి. ఇప్పుడు అటువంటివేమీ లేవు. అలాగని తెరవెనక ఏమీ జరగకుండానే యథాలాపంగా మోదీ అటువైపు విమానం మళ్లించమన్నారని నమ్మనవసరం లేదు. ఈమధ్య ఇరు దేశాల సంబంధాల్లోనూ చోటుచేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమని స్తున్నవారికి తాజా ఉదంతంలోని ఆంతర్యం బోధపడుతుంది. దౌత్యంలో పైకి కనబడేది వేరు...వెనక జరిగేది వేరు. ముఖ్యంగా పరస్పరం కత్తులు నూరుకునే దేశాలైతే వేర్వేరు స్థాయిల్లో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ చర్చలకు ప్రచారం ఉండదు. ప్రకటనలుండవు. అసలు వాటిల్లో పాల్గొనేది అధికారులు కాదు. దౌత్య రంగంలో నిపుణులైన ప్రభుత్వేతర వ్యక్తుల పాత్రే అందులో ఉంటుంది. సమ స్యలపై ఎవరి అవగాహనేమిటో...వాటి పరిష్కారానికి ఏ ఏ మార్గాలున్నాయని అవతలి పక్షం అనుకుంటున్నదో తెలుసుకోవడం ఈ మంతనాల ఆంతర్యం. వాటిపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుని చివరకు చర్చల కోసం నిర్దిష్టమైన ప్రాతిప దికను ఏర్పర్చుకోవడం పరిపాటి. ఇలాంటి మంతనాలను నిర్వహించే పక్షాలకు ఎంతో ఓపిక అవసరమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడానికి సిద్ధపడవలసి ఉంటుంది. ఒక మెట్టు దిగక తప్పదని అనుకున్నప్పుడు అలాంటి పరిణామానికి పౌరుల్ని సంసిద్ధుల్ని చేయాల్సి ఉంటుంది. ‘ట్రాక్-2 దౌత్యం’గా పిలిచే ఈ వ్యవహారం సహజంగానే అత్యంత రహస్యంగా సాగుతుంది. ఇందులో విజయం సాధించాకే ఆయా దేశాల్లోని అధికార యంత్రాంగాల పాత్ర మొదల వుతుంది. ఆ స్థాయిలో కూడా అంతా సవ్యంగా ముగిశాక అధినేతల సమావేశం సాధ్యపడుతుంది. 90వ దశకంలో ఇజ్రాయెల్, పాలస్థీనా విమోచనా సంస్థ (పీఎల్ఓ) మధ్య కుదరిన ఓస్లో ఒప్పందాలైనా, 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్- పాలస్థీనాల మధ్య కుదిరిన కేంప్డేవిడ్ ఒప్పందమైనా నెలల తరబడి సాగిన ‘ట్రాక్-2 దౌత్యం’ వల్లనే సాధ్యమయ్యాయి. అంతర్జాతీయ సదస్సుల సందర్భాల్లో భారత్-పాకిస్తాన్ అధినేతలు కలుస్తు న్నారు. అయితే నిర్దిష్టమైన సమస్యలపై ఇరు దేశాలమధ్యా అధికారుల స్థాయి సంప్రదింపులు జరిగి ఏడేళ్లు కావస్తున్నది. అనేకసార్లు వీటిపై సంకేతాలు రావడం... చివరి నిమిషంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగానో, కొన్ని అంశాల్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరి కారణంగానో నిలిచిపోవడం సర్వసాధారణమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు...గత నెలాఖరున థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకా క్లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులూ, విదేశాంగ కార్యదర్శులూ గుట్టుచప్పుడు కాకుండా భేటీ అయి నిర్ణయాలు ప్రకటించారు. దానికి కొనసాగిం పుగానే ఈమధ్య విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటించడం, ఇప్పుడు మోదీ లాహోర్ సందర్శనవంటివి చోటుచేసుకున్నాయి. క్రిస్మస్ పర్వదినాన, ఇరు దేశాల సఖ్యతకూ కృషి చేసిన మాజీ ప్రధాని వాజపేయి పుట్టినరోజున తాజా పరిణామం చోటుచేసుకోవడం శుభదాయకం. ఈ పరిణామాలన్నీ రెండు దేశాల సాన్నిహిత్యానికీ దారితీయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. -
మళ్లీ తెరపైకి చిరంజీవి - శ్రీదేవి!
హైదరాబాద్: అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అంటూ కుర్రకారు గుండెల్లో హుషారెత్తించిన ఆ దృశ్యకావ్యం మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం కాబోతోంది. 26 ఏళ్ల క్రితం క్రేజీ కాంబినేషన్‌తో వెండితెరపై సంచలనం సృష్టించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వెండితెరపై మెరవనుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ స్కై ఫెస్ట్ 2015లో అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టన్నింగ్ బ్యూటీ శ్రీదేవి జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రాన్ని మళ్లీ అభిమానుల ముందుకు తేనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ ప్రదర్శనను కేన్సర్ బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27న 'శ్రీమంతుడు' సినిమాను ప్రదర్శించనున్నట్టు కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. తద్వారా వచ్చిన నిధులను కేన్సర్ బాధితులకు అందించనున్నామన్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమకు సహకరించాలని కోరారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, చిరంజీవి, శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చిరంజీవి కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే మెగాహిట్గా నిలిచింది. చిరంజీవి, శ్రీదేవిల మధ్య కెమిస్ట్రీ, ఇళయారాజా సంగీతం, అమ్రేష్ పూరి విలక్షణ డైలాగ్ డెలివరీ సినిమా విజయానికి పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ చిత్రం ఓ సుందర దృశ్యకావ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. -
మ్యాజిక్ స్క్వేర్‌లో సిద్దిపేట విద్యార్థుల ప్రతిభ
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం సిద్దిపేట జోన్: మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబిటస్ పాఠశాల విద్యార్థులు మ్యాజిక్ స్క్వేర్‌లో విశేష ప్రతిభ చాటారు. వారం రోజులుగా కఠిన శిక్షణతో గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటుకు ప్రయత్నిస్తూ.. యునెటైడ్ వరల్డ్ రికార్డు (చెన్నై), స్టార్ వరల్డ్ రికార్డు (యూఎస్), బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు (తెలంగాణ)లను వీరు సొంతం చేసుకున్నారు. ఈ మూడు సంస్థల ప్రతినిధి వై.రమేశ్ సమక్షంలో వీరు ఈ రికార్డుల్ని సాధించారు. 333 మంది విద్యార్థులు గ్రూప్ విధానంలో 8 నిమిషాల 22 సెకండ్లలో 7 రకాల గణిత గడులను మ్యాజిక్ స్క్వేర్ పద్ధతిన పూరించారు. అలాగే 555 మంది విద్యార్థులు ఏకకాలంలో 99 మ్యాజిక్ స్క్వేర్ను 3 నిమిషాల 29 సెకండ్లలో గడులను పూరించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ వివరాలను ప్రతినిధి రమేష్ త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు అందజేయనున్నారు. మ్యాజిక్ స్క్వేర్ అంటే: చతురస్ర గడుల్లో వరుస అంకెలను నింపడం ద్వారా ఎటు నుంచి కూడినా ఒకే మొత్తం వచ్చే విధానాన్ని మ్యాజిక్ స్క్వేర్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియను చైనాకు చెందిన గణిత శాస్త్రవేత్త లోషు తొలిసారిగా ప్రపంచానికి తెలియజేశారు. వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జర్మనీకి చెందిన నార్బర్క్ బెంకె అనే వ్యక్తి 1111 గీ 1111 గడులను నింపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని అంబిటస్ పాఠశాల విద్యార్థులు 555 మంది ఒకేసారి మ్యాజిక్ స్క్వేర్ను నిర్ణీత గడువులో పూరించి రికార్డును సొంతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని చేపట్టారు. -
అదే కథ.. అదే వ్యధ
వ్యూహం పన్నడమే కాదు.. అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. తొలి రెండు టెస్టుల మాదిరిగామూడో టెస్టులోనూ భారత్ ఇదే సూత్రాన్ని అమలు చేసింది. అస్త్రం మార్చకుండా.. వ్యూహం చెడకుండా... దక్షిణాఫ్రికాను మళ్లీ బలంగా దెబ్బకొట్టింది. 215 పరుగులకే పరిమితమైనా... ‘మ్యాజిక్’ బౌలింగ్‌తో అప్పుడే సీన్ రివర్స్ చేసింది. బంతిని గింగిరాలు తిప్పుతూ తొలిరోజే ఊహించని షాక్ ఇవ్వడంతో... అటు దక్షిణాఫ్రికా టర్నింగ్ ట్రాక్‌పై మరోసారి ‘వ్యధ’ చెందుతోంది. * మూడో టెస్టులోనూ తడబడిన బ్యాట్స్‌మెన్ * తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215 ఆలౌట్ * రాణించిన రవీంద్ర జడేజా, మురళీ విజయ్ * దక్షిణాఫ్రికా 11/2 నాగ్‌పూర్: అందరూ ఊహించినట్లుగానే మూడో టెస్టులోనూ తొలి రోజే తమాషా మొదలైంది. పూర్తిగా స్పిన్ వికెట్‌పై ఇరుజట్ల బ్యాట్స్‌మెన్ తడబడటంతో ఈసారి కూడా భారీ స్కోరు చేసే అవకాశాలు లేకుండా పోయాయి. జామ్తా మైదానంలో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (84 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (54 బంతుల్లో 34; 6 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (106 బంతుల్లో 32; 4 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. తర్వాత దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు చేసింది. ఎల్గర్ (7 బ్యాటింగ్), ఆమ్లా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ బిన్నీ, ఆరోన్‌ల స్థానంలో రోహిత్, మిశ్రాలను తుది జట్టులోకి తీసుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 40; ధావన్ (సి అండ్ బి) ఎల్గర్ 12; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) హార్మర్ 21; కోహ్లి (సి) విలాస్ (బి) మోర్కెల్ 22; రహానే (బి) మోర్కెల్ 13; రోహిత్ (సి) డివిలియర్స్ (బి) హార్మర్ 2; సాహా (సి) డుమిని (బి) హార్మర్ 32; జడేజా (బి) రబడ 34; అశ్విన్ (బి) తాహిర్ 15; మిశ్రా ఎల్బీడబ్ల్యు (బి) హార్మర్ 3; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (78.2 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1-50; 2-69; 3-94; 4-115; 5-116; 6-125; 7-173; 8-201; 9-215; 10-215. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 16.1-7-35-3; రబడ 17-8-30-1; హార్మర్ 27.2-2-78-4; ఎల్గర్ 4-0-7-1; తాహిర్ 12.5-1-41-1; డుమిని 1-0-6-0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ బ్యాటింగ్ 7; వాన్ జెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0; తాహిర్ (బి) జడేజా 4; ఆమ్లా బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (9 ఓవర్లలో 2 వికెట్లకు) 11. వికెట్ల పతనం: 1-4; 2-9. బౌలింగ్: ఇషాంత్ 2-1-4-0; అశ్విన్ 4-2-5-1; జడేజా 3-1-2-1 సెషన్-1 విజయ్ నిలకడ ఆరంభంలో పిచ్ పేస్‌కు అనుకూలించినా భారత ఓపెనర్లు విజయ్, ధావన్ (12)లు ఓ గంటపాటు మంచి సమన్వయంతో ఆడారు. సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ నిలకడను చూపారు. మోర్కెల్, రబడ 142 కి.మీ వేగంతో బంతులు విసిరినా ఈ జోడి ఎక్కడా తడబడలేదు. దీంతో ఆమ్లా... 9వ ఓవర్లోనే స్పిన్నర్‌ను రంగంలోకి తెచ్చాడు. 11వ ఓవర్లో హార్మర్ బౌలింగ్‌లో విజయ్ భారీ సిక్సర్ బాదడంతో భారత్ స్కోరు 13.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. ఈ దశలో ధావన్ ఓ నిర్లక్ష్యమైన షాట్‌కు వికెట్‌ను సమర్పించుకున్నాడు. తర్వాత విజయ్‌తో జతకలిసిన పుజారా (21) కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. తాహిర్ ఓవర్లలో రెండు ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించుకున్నాడు. అయితే రెండో ఎండ్‌లో మోర్కెల్ ఓ ఫుల్ లెంగ్త్ బంతితో విజయ్ను అవుట్ చేయడంతో భారత్ లంచ్ వరకు 2 వికెట్లు కోల్పోయింది. ఓవర్లు: 27; పరుగులు: 85; వికెట్లు: 2 సెషన్-2 మోర్కెల్ ప్రతాపం లంచ్‌కు కొద్ది ముందు క్రీజులోకి వచ్చిన కోహ్లి (22) జాగ్రత్తగా ఆడినా... తొలి గంటపాటు మోర్కెల్ రివర్స్ స్వింగ్‌తో, హార్మర్ నాణ్యమైన స్పిన్‌తో భారత్‌ను వణికించారు. షాట్ ఎంపికలో పొరపాటు వల్ల పుజారా వెంటనే అవుటైనా.. రహానే (13) వచ్చి రావడంతో సిక్సర్ బాదాడు. కోహ్లితో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా మోర్కెల్ వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని అవుట్ చేసి షాకిచ్చాడు. సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ (2) పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడగా, సాహా నెమ్మదిగా ఆడాడు. 47వ ఓవర్లో హర్మర్... రోహిత్‌ను అవుట్ చేయడంతో భారత్ కేవలం 31 పరుగులు మాత్రమే జోడించి 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారత్ స్కోరు 94/2 నుంచి 125/6గా మారింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా షాట్లలో దూకుడు చూపించినా... స్పిన్‌లో చాలా పరిణతితో ఆడాడు. ఓవర్లు: 28; పరుగులు: 64; వికెట్లు: 4 సెషన్-3 స్పిన్ మ్యాజిక్ టీ తర్వాత రెండు ఎండ్ల నుంచి మోర్కెల్, తాహిర్‌లు బౌలింగ్‌కు దిగారు. అయితే సాహా, జడేజా సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. రెండుసార్లు ఎల్బీ అప్పీల్ నుంచి బయటపడిన జడేజా ఫోర్లతో ఇన్నింగ్స్‌లో వేగం పెంచగా, సాహా ఎక్కువగా భాగం సహచరుడికి స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. అయితే ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక జడేజా అవుటయ్యాడు. ఈ దశలో అశ్విన్ (15) నిలబడే ప్రయత్నం చేసినా సాహాను హార్మర్ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత అశ్విన్ భారత్ స్కోరు 200 పరుగులు దాటించాడు. అయితే మూడు బంతుల వ్యవధిలో అశ్విన్‌తో పాటు మిశ్రా (3) కూడా అవుట్ కావడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను ఆరంభం నుంచే అశ్విన్ ఇబ్బందిపెట్టాడు. ఇషాంత్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న స్పిన్నర్ నాలుగో ఓవర్లో వాన్ జెల్ (0)ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన జడేజా... తన రెండో ఓవర్ (7వ)లో తాహిర్ (4)ను వెనక్కిపంపడంతో ప్రొటీస్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓవర్లు: 23.2; పరుగులు: 66; వికెట్లు: 4 (భారత్) ఓవర్లు: 9; పరుగులు: 11; వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా) -
శింబు చిత్రానికి హైకోర్టు బ్రేక్
వాలు చిత్రానికి హైకోర్టు బ్రేక్ వేసింది. శింబు, హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు టి.రాజేందర్ ప్రకటించారు. అయితే మ్యాజిక్ దేస్ సంస్థ వాలు విడుదల హక్కులు తాము పొందినట్లు ఈ చిత్రాన్ని వేరే వ్యక్తి విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు వాలు చిత్ర విడుదలకు పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని టి.రాజేందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. టి.రాజేందర్ పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. చిత్ర నిర్మాత చక్రవర్తి తరపు వాదనలను మేజిక్ దాస్ సంస్థ తరపు వాదనలు విన్న న్యాయస్థానం వాలు చిత్ర విడుదలపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వాలు చిత్రంపై నిషేధం విధించాలంటూ మరో ఐదు పిటిషన్లు కోర్టులో దాఖ లయ్యాయి. వీటిపై బుధవారం విచారణ జరగనుంది. దీంతో చిత్రం ఈ నెల 17న విడుదల సాధ్యం కాదని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
స్పెషల్ ఎడిషన్: ఛూ...మంతర్..!
-
మాటల మాయాజాలం?
తన కుశాగ్రబుద్ధి, వాగ్ధాటి కలిపి పదకొండు మాసాలుగా తెలంగాణ సమాజాన్ని మంత్రించి శాసించగలిగారు కేసీఆర్. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. వెనక్కి తిరిగి చూస్తే మాటలే మిగులుతాయా? చేతలు ఏమైనా ఉంటాయా? ప్రాంతీయ నాయకులు తమ పార్టీలకు అధ్యక్షులుగా ఏకగ్రీవం గా ఎన్నిక కావడంలో విశేషం లేదు. బహుజన సమాజ్‌కు మాయావతి, అన్నా డీఎంకేకి జయలలిత, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబునాయుడు, బీజేడీకి నవీన్ పట్నాయక్ పోటీ లేకుండా అధినేతలుగా ఎన్నికైనట్టే కల్వ కుంట్ల చంద్రశేఖరరావు కూడా మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఎన్నికై నారు. అధినేతలతో పోటీకి నామినేషన్ దాఖలు చేసే దమ్ములు ఎవరికుం టాయి? పదమూడు సంవత్సరాలుగా పెంచి పోషించిన పార్టీలో ఆయనను కాదనే శక్తి ఎవరికుం టుంది? కల్వకుంట్లవారికిది కలిసొచ్చే కాలం. వాగ్దేవీకటాక్షం దండిగా ఉన్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయిస్తున్నారు. ఆ కుటుంబాన్ని అడ్డుకొని ఆపుచేసే శక్తిసామర్థ్యాలు కలిగిన వ్యక్తులు కానీ పార్టీలు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేసీఆర్ ఎంతటి శక్తిమం తుడైన మాటల మాంత్రికుడు కాకపోతే సోనియా గాంధీ లాంటి వ్యక్తిని బురిడీ కొట్టించగలడు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే, టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంద శాతం ఖాయ మంటూ నమ్మబలికిన కేసీఆర్ విభజన బిల్లు పార్ల మెంటు ఆమోదం పొందిన మరుక్షణంలో విలీనం, గిలీనం జాన్తా నై అంటే నివ్వెరబోయిన సోనియా గాంధీకి నోట మాట రాలేదట కొన్ని రోజుల పాటు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో మెజా రిటీ స్థానాలు గెలుచుకొని అనూ హ్యంగా అద్భుత విజయం సాధించిన అనంతరం ముఖ్య మంత్రి కేసీఆర్ పని నల్లేరుమీద బండి చందమే. ఒక భుజం కుమారుడు కేటీఆర్, రెండో భుజం మేనల్లుడు హరీశ్‌రావు, తన కుశాగ్రబుద్ధి, వాగ్ధాటి కలిపి పదకొండు మాసాలుగా తెలం గాణ సమాజాన్ని మంత్రించి శాసించగలిగారు కేసీఆర్. అరు దైన జ్ఞాపకశక్తి, రాజకీయ వ్యూహ రచనా సామర్థ్యం, అసాధారణమైన చొరవ కేసీ ఆర్‌ను రాజకీయ శిఖరాగ్రంలో నిలిపాయి. తెలం గాణ జలవనరులూ, జనవనరులూ ఆయనకు తెలి సినంత లోతుగా మరొకరికి తెలియవు. ఏ విషయం ఎట్లా చెబితే ప్రజలకు అర్థం అవుతుందో ఆయనకు తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి ఏడాది కావ స్తున్నది. వెనక్కి తిరిగి చూస్తే మాటలే మిగులు తాయా? చేతలు ఏమైనా ఉంటాయా? ప్రజ లు ఆలోచిస్తారు? మాటల మంత్రం అన్ని వేళలా పని చేయదు. జనం అనుభవానికి భిన్నంగా మనం ఏమి చెప్పినా వారు నమ్మరు. మాటలతో చేతలు కూడా సరితూగినప్పుడే ప్రజలు హర్షిస్తారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పథకాలు సకాలంలో, అవి నీతికి అతీతంగా, సమర్థంగా అమలు జరిగితే, విద్యుచ్ఛక్తి లోటు పూడ్చగలిగితే, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే కేసీఆర్‌కు తెలం గాణ ప్రజలు బ్రహ్మరథం పడతారు. లేకపోతే ఏమి జరుగుతుందో చరిత్ర చదువుకున్న వారికి ప్రత్యే కంగా చెప్పవలసిన అవసరం లేదు. -క్రీడి -
గాలిలో గారడి
-
కొల్లాపూర్ మామిడికి కోటి కష్టాలు
కొల్లాపూర్... ఈ పేరు మామిడి పండ్ల ప్రియులందరికీ సుపరిచితం. నూజివీడు, బంగినపల్లి తర్వాత మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం కొల్లాపూర్. ఇక్కడ పండించే పండ్లను విదేశాల్లో ఉండే వారు సైతం ఇష్టంగా తెప్పించుకుని తింటుంటారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులకు పంపించే వారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న కొల్లాపూర్‌లో ఈసారి మామిడి పంట దిగుబడి భారీగా పడిపోయింది. గతేడాది పండించిన పంటలో ఈ సంవత్సరం 25శాతం మాత్రమే పండింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానలు రైతులను నష్టాల బారిన పడేశాయి. గత సంవత్సరం పంట దిగుబడి భారీగా ఉన్నా ధరలు లేక మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ధరలు ఉన్నా పంటలు అంత దిగుబడి లేక నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ మాయాజాలం రెండూ మామిడి రైతులను నష్టాలు, కష్టాలపాల్జేస్తున్నాయి. కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ రువేలకు పైగా హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, వీపనగం డ్ల మండలంలో మామిడి సాగు అధికంగా జరుగుతోంది. మామిడి పంటలకు ప్రతి సం వత్సరం డిసెంబర్, జనవరి నెలలో పూతలు వస్తుంటాయి. ఈసారి మాత్రం ఫిబ్రవరిలో పూత ప్రారంభమైంది. కొన్నిచోట్ల మార్చిలో కూడా పూత వచ్చింది. ఫిబ్రవరిలో భారీ వరా లు, ఈదురు గాలుల కారణంగా పెద్ద మొత్తం లో పూత రాలిపోయింది. మళ్లీ మార్చి నెలాఖ రులో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వాన లు కురవటంతో పిందె, కాయ దశలో కూడా మామిడి పంట భారీగా నేలరాలింది. వడగం డ్లు పడడంతో కాయలకు దెబ్బతగిలి పాడయ్యాయి. కాయ సైజు పెరగకముందే గత్యం తరం లేని పరిస్థితుల్లో రైతులు వాటిని తెంచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మార్కెట్ మాయాజాలం గతేడాది హైదరాబాద్‌లోని హోల్‌సెల్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడికి వ్యాపారులు ట న్నుకు *15వేల నుంచి రూ.30వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటలు బాగా పండినా రైతులకు ఆశించిన స్థాయిలో లాభా లు రాలేదు. అయితే ఈ సారి పంటల దిగుబడి తగ్గిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లో వ్యాపారులు గత మార్చి లో టన్ను మామిడి కాయలను రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. పంటల దిగుబడి లేకున్నా మార్కెట్లో భారీ ధరలు ఉండడంతో రైతులు తోటల్లోనే కాయలను పెద్దమొత్తంలో తెంచేసి విక్రయాల కు తీసుకెళ్లారు. దీన్ని గమనించిన వ్యాపారు లు ఏప్రిల్‌లో టన్ను ధరను ఏకంగా *25వేల నుంచి రూ.30వేలకు పెంచేశారు. దీంతో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు. విదేశాలకు ఎగుమతులు.. కొల్లాపూర్ మామిడికి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌లో వ్యాపారస్తులు కొనుగోలు చేసే మామిడి కాయలను దేశంలోని ప్రధాన నగరాలతోపాటు విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు ఆర్జిస్తుంటారు. ఎగుమతుల వ్యాపారం మామిడి రైతులకు తెలియకపోవడంతో వారు పంట విక్రయాలకు దళారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పంటనష్ట పరిహారం మంజూరుకు నిబంధనల అడ్డంకి ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందేలా కనిపిం చ డం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పం ట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటే వింత నిబంధనలు అడ్డు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం పరిహారం మంజూరు కావాలంటే ఈదురు గాలులు, వర్షాల కారణంగా మామిడిచెట్లు వేర్లతో సహా విరిగి పడా లి. లేదంటే చెట్ల కొమ్మలు పూర్తిస్థాయిలో వి రిగిపోవాలి. లేదా వర్షాభావ పరిస్థితుల కారణంగా 50శాతం చెట్లు ఎండిపోవాలి. ఇలా ఉ ంటేనే ప్రభుత్వం పరిహారం మంజూరు చే స్తుంది. ఈ వింత నిబంధనలతో పరిహారంపై రైతులు ఆశలు వదిలిపెట్టుకున్నారు. -
మంత్రాల నెపంతో మహిళపై దాడి
- పోలీసుల రాకతో దక్కిన మహిళ ప్రాణాలు - ఘటనలో 35 మంది వరకు ఉన్నట్టు అనుమానం - ఏడుగురి రిమాండ్ వర్ని : మంత్రాలు చేయడానికి వచ్చిందనే అనుమానంతో నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని రుద్రూర్ జవహర్‌నగర్ కాలనీలో ఓ అపరిచిత మహిళను కొందరు దారుణంగా చితకబాదారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నారుు. రుద్రూర్ గ్రామ శివారులోని బారెడు పొశమ్మ మందిరం వద్ద బుధవారం రాత్రి దాదా పు 45 ఏళ్లున్న అపరిచిత మహిళ అనుమానాస్పదంగా తిరగడాన్ని కొందరు గుర్తించారు. ఎవరని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో గాంధీచౌక్ వద్దకు తీసుకు వచ్చి చితకబాదారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న కల్లు దుకాణం వైపు పరుగెత్తింది. తన దగ్గర ఉన్న బియ్యం, ఎం డుమిర్చి, నిమ్మకాయలను అక్కడ పారవేసింది. ఇది చూసిన కాలనీవాసులు కొందరు ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదారు. కటింగ్ ప్లేయర్‌తో దంతాలను ఊడబెరికారు. విషయం తెల్సుకున్న పోలీసులు కాలనీకి వచ్చి దారుణాన్ని అపడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. మంత్రాలు చేసి తమను చంపడానికి వచ్చిందని, మీరెందుకు మధ్యలో వస్తారని పోలీసులను దగ్గరికి రానివ్వలేదు. వారు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో బోధన్ డీఎస్పీ రాంకుమార్,బో ధన్ రూరల్ సీఐ దామోదర్ రెడ్డి, బోధన్‌టౌన్ ఎస్హెచ్ఓ వెంకన్న, కోటగిరి ఎస్ఐ బషీర్ అహమ్మద్ ఏఎస్ఐలు సైదుల్లా, రజాక్ సంఘటన స్థలా నికి చేరుకుని దుం డగులను త రిమికొట్టారు. బాధిత మహిళను పోలీస్ వాహనంలో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ దాడిలో సూమారు 35 మంది వరకు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాలనీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఉదయం భూమాగౌడ్, నర్సింహులు, శంకర్, శ్రీనివాస్, బాబు,లక్ష్మణ్, గంగామణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిం చామని ఇన్చార్జి ఎస్ఐ బషీర్ అహమ్మద్ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. బాధిత మహిళ మూడు రోజుల క్రితం వరకు మండలంలోని అక్బ ర్‌నగర్ గ్రామంలో సంచరించినట్టు తెలుస్తోంది. పిచ్చి చేష్టలు చేయడం, రాళ్లతో కొట్టడంలాంటివి చేయడంతో గ్రామం నుంచి వెళ్లగొట్టారని సమాచారం. -
మేకప్‌తో మాయాజాలం
-
ఇది అలెక్స్ మాయ
ఇందులో మాయా లేదు.. మంత్రం లేదు.. గ్రావిటీ మహిమ అసలే లేదు.. అది నిజమైన రోడ్డే.. కారు కూడా నిజమైనదే. కాకపోతే ఈ రెంటినీ ఇలా అమర్చిన ఘనత మాత్రం అలెక్స్ చిన్నెక్ది. లండన్‌లోని సౌత్‌బ్యాంక్ సెంటర్లో వ్యాక్స్హాల్ కోర్సా కారును భూమికి 4.5 మీటర్ల ఎత్తులో ఇలా అమర్చారు. దీనిని ఈనెల 25 వరకు ఇలా ఉంచుతారు. -
అబ్రకదబ్ర మాయూ లేదు.. మర్మం లేదు..
నేడు వరల్డ్ మెజీషియన్ డే ఇంద్రజాలం.. ఆనందం, ఉత్కంఠను కలిగిస్తోంది.. కార్పొరేట్ జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు.. మనసును రీచార్జి చేసేందుకు మేజిక్ దోహదపడుతుంది. మాయలోళ్లు (మెజీషియన్) చేసే విన్యాసాలు అబ్బురపరచడంతో విశ్వవాప్తంగా ఈ కళ పేర్గాంచింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇంద్రజాలం రానురానూ చిన్నచూపునకు గురవుతోంది. ఉత్సవాలు, వివాహ, పుట్టినరోజు వేడుకలు, రాజకీయ నాయకుల సభావేదికలపై ఆహుతులను ఉత్తేజపరిచేందుకు ఈరోజుల్లో ఎక్కువుగా మేజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పలువురు మెజీషియన్లు ఇతర వృత్తులవైపు చూస్తున్నారు. గతంలో జిల్లాలో 100 మందికిపైగా ఉన్న ఇంద్రజాలికులు ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉండటం ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచ ఇంద్ర జాలికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. - ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) మేజిక్‌లు 23 రకాలు ఇంద్రజాల కళలో 23 రకాలు ఉన్నారుు. ఒక్కో కళాకారుడూ కొన్ని రకాలను మాత్రమే ప్రదర్శించడంలో నిష్ణాతులవుతుంటారు. అన్ని రకాల కళలను ఒకే వ్యక్తి చేసే అవకాశం ఉండదని మెజీషియన్లు అంటున్నారు. సుమారు 10 రకాల మేజిక్‌లు మాత్రమే తరచుగా చేస్తుంటారు. వాటిలో మెకానికల్ రకం మొదటిది దీనిలో కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి ఇంద్రజాలికులు మేజిక్ చేస్తారు. హస్త లాఘవం మరో రకం. వస్తువులను చేతిలోనే దాచి, గాలిలో నుంచి తీసినట్టుగా చూపించడం దీని ప్రత్యేకత. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ.. ఇల్యూయన్ మరో రకం. ఇది ఆహుతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మనిషి లేదా జంతువును ముక్కలుగా చేయడం, అక్కడి నుంచి మాయం చేయడం. మరలా యథావిధిగా అమర్చడం దీని ప్రత్యేకత. ఇటువంటి మేజిక్‌లను మనం ఎక్కువుగా ఎగ్జిబిషన్లలో చూస్తుంటాం. వెంట్రిలాక్విజం రకానికి ప్రత్యేక స్థానం ఉంది. బొమ్మతో మాట్లాడించడం ఇందులో మనకు కనిపిస్తోంది. సైంటిఫిక్ మేజిక్ మరో రకం. లెక్కలు, సైన్స్‌పై మేజిక్‌లు చేయడం ఈ రకంలోకి వస్తుంది. ఇటువంటి రకాలు ఎక్కువుగా ప్రాచుర్యంలో ఉన్నారుు. కొత్తవారు రావడం లేదు మెజీషియన్ వృత్తిలోకి కొత్తగా ఎవరూ రావడం లేదని కళాకారులు అంటున్నారు. అభిరుచి మేరకు నేర్చుకుని వారి ఖాళీ సమాయాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులను మెప్పించడానికే ఈ కళను నేర్చుకున్న వారు తప్ప ఇదే జీవనాధారంగా గడిపేవారు జిల్లాలో ఒకరిద్దరూ తప్ప ఎవరూ లేరనే చెప్పాలి. 14 ఏళ్ల వయసు నుంచీ.. ఏలూరుకు చెందిన సాయిరామ్ ఈవెంట్స్ అధినేత కొవ్వలి శ్రీనివాస్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఇంద్రజాలికుడిగా నిలిచారు.1964లో కొవ్వలి సేతు మాధవరావు, లక్ష్మి నరసమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన శ్రీనివాస్ చిన్నతనం నుంచి ఇంద్రజాలంపై ఆసక్తి పెంచుకున్నారు. విఠలాచార్య చిత్రాలు చూసి మాయలు, మంత్రాలకు ఆకర్షితులయ్యూరు. 14 ఏళ్ల వయసులో ఏలూరులో ఆచార్య జి.డీలానంద్ అనే సినీ ఆర్చురీ డెరైక్టర్ (లవకుశ చిత్రంలో ధనుర్ విద్య) వద్ద శిష్యునిగా చేరారు. 1979 నుంచి మెజీషియన్‌గా షోలు చేస్తున్నారు. దీనినే జీవనాధారంగా భావించి ముందుకు సాగుతున్నారు. ఆదరణ తగ్గలేదు దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది కార్యక్రమాలను నిర్వహించి అభిమానులను సొంతం చేసుకున్నాను. నా వద్ద సుమారు 30 మంది ఇంద్రజాల విద్యను నేర్చుకుని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిరుచి ఉన్నవారే. ఇంద్రజాల కళకు ఆదరణ తగ్గలేదు. గతంలో కంటే ఎక్కువ షోలు చేస్తున్నాం. - కొవ్వలి శ్రీనివాస్, సీనియర్ మెజీషియన్ -
అలలపై నడుస్తా
‘నాకు గానీ ఒక అవకాశం గానీ ఇస్తే.. హుస్సేన్‌సాగర్ అలలపై నడిచి చూపిస్తా..’ అంటున్నారు ప్రపంచ మాయలోడు పీసీ సర్కార్. ఒక్క ఈలతో కళ్లముందున్నవి కనిపించకుండా చేసే మాయావి ఆయన. అబ్రకదబ్ర అని మంత్రదండం తిప్పారో.. అద్భుతాలు జరిగిపోతాయి. మాయాలేదు, మర్మం లేదు అంటూనే కనికట్టుతో ఓ పట్టుపడతారు. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యల్లో ఆరితేరిన ఈ మాయలోడు హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో షో ఇవ్వడానికి వచ్చిన ఆయన సిటీప్లస్‌తో ముచ్చటించారు. - కోన సుధాకర్‌రెడ్డి మేజిక్కు కులగోత్రాలు లేవు. ఎనిమిదేళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ అందరికీ ఇది ఆనందం పంచుతుంది. మా తాత పీసీ సర్కార్ వారసత్వంగా ఇంద్రజాలం నాకు లభించింది. పీసీ సర్కార్ వంశంలో నాది మూడో జనరేషన్. దీన్నో గొప్ప వరంగా భావిస్తున్నాను. మేజిక్ అంటే నాకు ఆసక్తి మాత్రమే కాదు, నా జీవితం. నాకు అబ్బిన విద్య ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాను. అనుమతిస్తే.. అద్భుతాలే..1999, 2009, 2010 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు వచ్చాను. 2009లో ఒకే నెలలో 42 ప్రదర్శనలిచ్చి రికార్డు సృష్టించా. ఈసారీ ఈ సిటీలో రికార్డు సాధించాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం అనుమతిస్తే హుస్సేన్‌సాగర్ నీటిపై నడిచి చూపిస్తా. నెక్లెస్ రోడ్డులో కళ్లకు గంతలు కట్టుకుని ఓపెన్ టాప్ జీప్ నడిపిస్తా. అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంకా కొంచెం.. మా తాత పీసీ సర్కార్ 101వ జయంతి ఉత్సవంగా హరిహరకళాభవన్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్నాను. ఇందులో ట్రెడిషనల్ ఐటమ్స్‌తో పాటు నా తరహా ప్రదర్శనలు కూడా ఉంటాయి. వ్యానిషింగ్ యాక్ట్ (మనిషి మాయం చేయడం) కూడా ఉంటుంది. స్టేజ్ నుంచి మాయం కావడం, వెంటనే బాల్కనీ నుంచి హాయ్ అంటూ ముందుకు రావడం ఇలాంటి మేజిక్స్ ఎన్నో ఉంటాయి. ప్రదర్శనకు వస్తే మీకే తెలుస్తాయి. సహకరించాలి.. మేజిక్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చాలామంది వసతులు లేక ఈ విద్య నేర్చుకోలేకపోతున్నారు. 1935 లోనే పీసీ సర్కార్ కోల్‌కతాలో మ్యాజిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సిటీల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అందుకు స్థానిక మెజీషియన్స్ ముందుకు రావాలి. అంతేకాదు ప్రభుత్వం కూడా స్థలం, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెన్నైలో కొంతమంది మేజీషియన్స్ సహకారంతో ఓ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్‌లో ప్రదర్శనల ఏర్పాటుకు ఇక్కడి ప్రియ కల్చరల్ అకాడమీ మాకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. చప్పట్లే అవార్డులు.. దేశవ్యాప్తంగా వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చాను. యురోపియన్, ఆఫ్రికా దేశాలు, అమెరికా, కెనడా, సౌత్ఆఫ్రి కా, జపాన్ ఇలా ఎన్నో దేశాలు తిరిగాను. ప్రజలను ఆనందపర్చడమే మా పని. వారి చప్పట్లే మాకు అవార్డులు, రివార్డులు. హైదరాబాద్‌లో ఈ నెల 24 నుంచి జనవరి 8 వరకూ ప్రదర్శనలు ఇస్తున్నాను. సిటీవాసులకు సరికొత్త వినోదం అందిస్తాననే నమ్మకం ఉంది. నేటి నుంచే ఇంద్రజాల ప్రదర్శన పీసీ సర్కార్ (యంగ్ అండ్ మాస్టర్) ప్రదర్శన తేదీలు: 24 డిసెంబర్, 2014 నుంచి 8 జనవరి, 2015 వరకు ప్రదర్శన వేళలు: రోజూ రాత్రి 7 గంటలకు.. శని, ఆదివారాలు: సాయంత్రం 4, రాత్రి 7 గంటలకు వేదిక: హరిహర కళాభవన్, సికింద్రాబాద్. ఆన్లైన్ బుకింగ్: bookmyshow వివరాలకు ఫోన్: 97006 66061 -
‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ..నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్నపదవ కథనమిది... మురికి వీధుల్లో మసులుతున్న బాల్యం.. పెద్దయ్యాక భారంగా మారుతుంది. అదే బాల్యాన్ని అక్కున చేర్చుకుని అక్కరకు వచ్చే విషయాలు చెబితే.. భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. గుడిసెల చుట్టూ గిరి గీసుకుని బతుకుతున్న పేదపిల్లలకు ప్రపంచాన్ని దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తోంది ‘మ్యాజిక్ బస్’. అక్షర జ్యోతి వెలిగించినంత మాత్రాన పేదరికం చీకట్లలో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు ప్రకాశించవు. మారుతున్న లోకంలో నిలబడే జ్ఞానం అందించాలి. ఆ పని మేం చేస్తామంటోంది ‘మ్యాజిక్ బస్’. మాథ్యూస్పేసి ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారి. ఓసారి ముంబై వీధుల్లో ఆయనేదో గేమ్ ఆడుతున్నాడు. అదే సమయంలో ఆ పక్కనే మురికివాడల్లో ఉన్న యువకులను గమనించి.. నిండు మనసుతో వారికి ఉద్యోగాలు ఇప్పించాడు. కానీ.. ఏం లాభం.. కాస్తో కూస్తో చదువున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ యువకులు ఉద్యోగాల్లో కొనసాగలేకపోయారు. ఇచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోవడం మాథ్యూస్పేసికి కోపం తెప్పించలేదు. వారికే కాదు.. మురికివాడల్లో ఉన్న మరెందరికో దారి చూపాలన్న ఆలోచనకు బీజం వేసింది. అలా పుట్టిందే ‘మ్యాజిక్ బస్’ అనే స్వచ్ఛంద సంస్థ. రైట్.. రైట్.. మురికివాడల్లో మరుగున పడి పోతున్న బాల్యాన్ని మేలిమి ముత్యంలా తయారు చేయడమే మ్యాజిక్ బస్ లక్ష్యం. ఆ సంస్థ సభ్యులు వారాంతాల్లో స్లమ్స్‌కు వెళ్తారు. చిన్నారులను ఆటపాటలతో ఆకట్టుకుంటారు. ఆ తర్వాత పాఠాలు చెబుతారు. విద్య, వైద్యం, జెండర్ ఈక్వాలిటీ, సోషియల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్.. ఇలా ఐదు అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్విహ స్తారు. పదిహేనేళ్ల కిందట ముంబైలో స్టార్ట్ అయిన మ్యాజిక్ బస్ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లోని మురికివాడల్లో చక్కర్లు కొడుతోంది. మూడు లక్షల మంది పేదపిల్లల జీవితాలను మ్యాజిక్ చేసే పనిలో బిజీగా ఉంది. భాగ్యనగరంలో.. మ్యాజిక్ బస్ సేవలు 2009 నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో రెండు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. పాతబస్తీలోని మురికివాడల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సాయం చేయాలనే తపన ఉన్న యువకుల సహకారంతో చిన్నారుల జీవితాల్లో చిరునవ్వులు నింపుతోంది. ‘పాతబస్తీలో 90 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా వారి వారి ప్రాంతాల్లోని మురికివాడల్లో పనిచేస్తారు. ఉదయం రెండు గంటల పాటు పాఠాలు బోధిస్తారు. తర్వాత పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడిస్తారు. వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఖోఖో వంటి ఆటలకు కావాల్సిన కిట్స్, డ్రెస్‌లను కూడా మా సంస్థే సమకూరుస్తుంది. ఆటల్లో ప్రతిభ కనబరిచే పిల్లలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. పాతబస్తీ ఏరియాలో రెండున్నర వేల మంది చిన్నారులు మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా సంస్థ రెండో కేంద్రం శామీర్‌పేట దగ్గర్లోని బాలాజీ నగర్లో ఉంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో పిల్లలున్నారు’ అని చెప్పారు మ్యాజిక్ బస్ సీనియర్ జనరల్ మేనేజర్ సంధ్యాశ్రీనివాస్. దేశవ్యాప్తంగా 7,500 మంది వాలంటీర్లు మ్యాజిక్బస్లో పని చేస్తున్నారు. వీరిని కమ్యూనిటీ యూత్ లీడర్ అని పిలుస్తారు. నాలుగు అక్షరం ముక్కలు.. ఆటపాటలు పిల్లల దగ్గరికి వెళ్లి జీవిత పాఠాలు నేర్పిస్తాం రండి అంటే ఎవరొస్తారు..? అందుకే ముందుగా ఆటలు.. ఆ తర్వాత పాఠాలు చెబుతూ పిల్లలకు చేరువవుతోంది మ్యాజిక్ బస్. నాలుగు అక్షరం ముక్కలు.. కాసింత లోక జ్ఞానం.. కొద్దిపాటి ప్రోత్సాహం.. ఈ మూడూ ఉంటే ఓ సామాన్యుడు కూడా మాన్యుడు కాగలడని చరిత్రలో ఎన్నోసార్లు చదువుకున్నాం. ఈ మూడింటినీ అందిస్తున్న మ్యాజిక్ బస్, ఈ సంస్థ పయనంలో అండగా నిలుస్తున్న యువ వాలంటీర్లకు సలామ్ చేద్దాం. బస్తీల్లో తిరుగుతున్న ఈ బస్ మరెందరో చిన్నారులను పికప్ చేసుకోవాలని, వారిని బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలని కోరుకుందాం. గేమ్ అండ్ గోల్ ‘మా చేతిలో వాలీబాల్ ఉంటే పిల్లలు మా చుట్టూ చే రిపోతారు. కాసేపు ఆడుకున్నాక.. మిగతా విషయాలను కూడా వారి బుర్రలకెక్కిస్తాం. పేదరికంలో పెరిగే చిన్నారులకు అక్షరజ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. వ్యక్తిత్వ వికాసానికి అవకాశం కూడా ఇవ్వాలి. మ్యాజిక్‌బస్ ఇదే చెబుతుంది. వారి జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతామని చెప్పడం లేదు. కానీ, వారిని అమాయకత్వం నుంచి జ్ఞానం వైపు నడిపించగల్గుతున్నామని.. గర్వంగా చెప్పగలం’. - ధీమంత్ టొవాటియా, సీనియర్ మేనేజర్ ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
చిరంజీవి రామస్వామి
హన్మకొండ కల్చరల్: అబ్రకదబ్రా.. అంటూ ఆయన చేసే ఇంద్రజాల ప్రదర్శనలు అబ్బురపరిచేవి. సంబ్రమాశ్చర్యాలకు గురిచేసేవి. మ్యాజిక్కు కేరాఫ్‌గా నిలిచి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ ఇంద్రజాలికుడు కెమిడి రామస్వామి. జీవితాంతం ఇంద్రజాలాన్నే శ్వాసించిన రామస్వామి.. తుది శ్వాస విడిచిందీ కళావేదిక సమీపంలోనే. శుక్రవారం సాయంత్రం ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు రామస్వామి. వేదిక దిగిన కొద్దినిమిషాల్లోనే గుండెపోటుతో కుప్పకూలడం అందరినీ కలచివేసింది. తండ్రి స్ఫూర్తితో.. జిల్లాలోని జనగామలో 1947 నవంబర్ 4న జన్మించారు రామస్వామి. బాల్యంలోనే తల్లి మరణించింది. తండ్రి మల్లయ్య మేజిక్ ప్రదర్శనలు రామస్వామిని ఆకట్టుకునేవి. అలా తండ్రి వద్దే అసిస్టెంట్‌గా చేరి తన ఆసక్తి.. పరిశీలన శక్తితో ఇంద్రజాలాన్ని ఔపోసన పట్టారు. స్వయంకృషితో క్రమక్రమంగా ఎదిగారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. దేశసేవలో.. పదహారేళ్ల ప్రాయంలో దేశసేవ చేయాలని ఆయన భావించారు. కానీ ఎత్తు తక్కువ కావడంతో మిలటరీలో ఎంపిక కాలేకపోయారు. 1964లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసులో చేరారు. 1965-66 పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఇంఫాల్, మణిపూర్ నాగాలాండ్, బర్మా సరిహద్దుల్లో ఏడాదిపాటు పోరుసల్పారు. తర్వాత వరంగల్ తిరిగి వచ్చారు. 1966లో పెళ్లి చేసుకున్నారు. 2005లో అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డయ్యారు. వెయ్యికి పైగా ప్రదర్శనలు 1979 మార్చి 11న ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ఓపి అగర్వాల్ వరంగల్‌లో ఇచ్చిన మ్యాజిక్ ప్రదర్శన రామస్వామిని ఆకర్షించింది. అదే ఏటా ఆగస్టు 7న పీసీ సర్కార్ జూనియర్ హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వగా రామస్వామి వెళ్లొచ్చారు. విశాఖపట్నంలోని అరిపాక సూరిబాబు వద్ద మేజిక్‌లో శిక్షణ పొందారు. 1986 మే 25న జగిత్యాలలో డాక్టర్ కేసినో ప్రదర్శన చూసి ఆయనకు శిష్యుడిగా చేరారు. వరంగల్‌లో డాక్టర్ కేసినో ప్రదర్శన ఇచ్చినప్పుడు వారం పాటు అసిస్టెంట్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో డాక్టర్ వాసూస్ వద్ద హిప్నాటిజంలో శిక్షణ పొందారు. 1993 డిసెంబర్ 2న మొదటిసారిగా మామునూరు క్యాంప్‌లో మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాతా పోలీసు క్యాంపులలోనే ఎక్కువసార్లు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలు ఇచ్చారు. అవార్డులు.. 1993 నవంబర్ 7న మంగపేటలోని నవభారత్ స్కూల్ వారు ఆయన్ను మైటీస్టార్ బిరుదుతో సత్కరించారు. 2012లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇంద్రజాల ప్రదర్శన పోటీల్లో పాల్గొని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. గుంటూరులో జరిగిన పోలీసు స్కౌట్ మీట్స్ బంగారు పతకాన్ని పొందారు. నెక్కొండ కళారంజన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అద్భుతంగా ఇంద్రజాల ప్రదర్శన చేసి జాదూగర్ ప్రవీణ బిరుదాంకితుడయ్యారు. నటుడిగానూ.. ఇంద్రజాలికుడి, హిప్నాటిస్టుగానేకాక నటుడిగానూ రామస్వామి పేరు తెచ్చుకున్నారు. పలు టెలీఫిల్మ్ల్లో నటించారు. 2006లో పిల్లలుకాదు పిడుగులు, 2007లో ఇదీ ప్రేమంటే, రేపటి పౌరులు, 2008లో అడవిలో, 2011 ఆటమొదలైంది. 2011లో వైఎస్ మహాప్రస్థానం తదితర చిత్రాల్లో నటించారు. 2006లో మంచుముల్లు, సందేశం, 2007లో నాప్రేమ, 2009లో హారిక, స్నేహలత, మగువ తదితర టెలీఫిల్మలలో నటించారు. -
కంప్యూటరూ మ్యాజిక్ చేస్తుంది
లండన్: ఇంద్రజాలికులు చేసే మ్యాజిక్ ట్రిక్కులను తొలిసారిగా ఓ కంప్యూటరూ చేసి చూపింది. కృత్రిమ తెలివి(ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్)పై పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ లండన్ పరిశోధకులు ఈ మేరకు ఓ కంప్యూటర్‌తో మ్యాజిక్ జిగ్సా పజిళ్లు, మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్కులను చేసి చూపించారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న ట్రిక్కులనే కాకుండా కొత్త ట్రిక్కులను కూడా ఈ కంప్యూటర్ చేసిం దని పరిశోధకులు వెల్లడించారు. పెద్ద మొత్తంలో సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించడం ద్వారా కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ఈ కొత్త ట్రిక్కులను చేసిందని తెలిపారు. -
ఆదాయం
పంచ సూత్రాలు భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితుల కోసం ఎంతో కొంత పొదుపు చేయాలన్నది నిర్వివాదాంశం. కానీ అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. ఎంత ఆదాయం వచ్చినా ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఇలాంటప్పుడు పొదుపు అనేది అనుకోవడానికి మాత్రమే పరిమితమై.. ఆచరణలో పెట్టాలంటే అసాధ్యంగా ఉంటుంది. అయితే, ఇందుకోసం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ట్రై చేసి చూడండి.. మ్యాజిక్ వర్డ్ పెట్టుకోండి .. భవిష్యత్‌లో తలెత్తే ఏదో ఒక అవసరం కోసమని సర్ది చెప్పుకుంటూ పొదుపు విషయాన్ని ఒకోసారి అలక్ష్యం చేయొచ్చు. ఈ కాస్తే కదా అని దుబారాలు చేసే అవకాశమూ ఉంది. అలా కాకుండా ఎందుకోసం పొదుపు చేస్తున్నామన్నది నిరంతరం గుర్తుండేలా ఏదో ఒక మ్యాజిక్ పదం పెట్టుకోండి. ఉదాహరణకు వాహనం కోసం పొదుపు చేస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు ఆన్లైన్ షాపింగ్‌పై అనవసర ఖర్చులు చేయకుండా పాస్వర్డ్ కింద సేవింగ్4కార్ అనో మరో లక్ష్యం అయితే దానికి తగ్గట్లుగా మరొకటో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సదరు పాస్‌వర్డ్‌ను టైప్ చేసిన ప్రతిసారీ లక్ష్యం గుర్తుకొచ్చి.. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే.. షాపింగ్‌కి వెళ్లినప్పుడు గాజులో, ఇయర్ రింగ్సో మరొకటో మురిపిస్తుంటాయి. అవి మనకు నప్పవని తెలిసినప్పటికీ, అనవసరం అనిపించినప్పటికీ .. అప్పటికప్పుడు మాత్రం కొనేయాలనిపించి తెచ్చేస్తుంటాం. ఈసారి అలాంటివి కొనాలనిపించినప్పుడు.. ఆయా ఉత్పత్తుల రేటు చూసి.. అంత మొత్తాన్ని మీ అకౌంటులో నుంచి పొదుపు ఖాతాలోకి మళ్లించండి. నెల చివర్లో జమయిన దాన్ని బట్టి చూస్తే.. ఎంత వధా ఖర్చును నియంత్రించుకోగలిగారో తెలుస్తుంది. నంబర్ గేమ్ .. ఒకటి.. రెండు.. మూడు .. ఇలా ఏదో ఒక నంబరు ఎంచుకోండి. ప్రతి రోజూ రాత్రి మీ పర్సులో ఆ నంబరుతో ముగిసే కరెన్సీ నోటు ఏదైనా ఉందేమో చూసి.. దాన్ని తీసి పక్కన పెట్టండి. వారం రోజులు తిరిగేసరికి మీరు రెగ్యులర్‌గా చేసే పొదుపు మొత్తానికి ఇది అదనంగా తోడవుతుంది. సెట్ చేయండి.. వదిలేయండి.. శాలరీ అకౌంటులో జీతం పడగానే కొంత మొత్తం పొదుపు ఖాతాలోకి మళ్లే విధంగా ఆటోమేటిక్‌గా సెట్ చేసి ఉంచండి. దీంతో పొదుపు కోసం కేటాయించిన దానికి పోగా మిగిలినదే సరిపెట్టుకోవడం అలవాటవుతుంది. ముందుగా.. ఒక్క రోజు శాలరీలాగా చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. క్రమక్రమంగా వెసులుబాటును బట్టి పెంచుకుంటూ పోవచ్చు. డీల్స్‌ను ఉపయోగించుకోండి.. పండుగలప్పుడు, ఇతరత్రా ప్రత్యేక సందర్భాల్లోనూ రిటైలర్లు డిస్కౌంట్లు ఇస్తుంటారు. దీన్ని కూడా పొదుపు కోసం ఉపయోగించుకోవచ్చు. ఆఫర్లలో ఏదైనా కొన్నప్పుడు .. అసలు ధర, డిస్కౌంటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని పొదుపు ఖాతాలోకి జమచేసి చూడండి. ఫైన్ వేసుకోండి.. ఎంత కాదనుకున్నా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక్కటైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఊసుపోక యూట్యూబ్ వీడియోల్లో మునిగిపోవడమో.. అయిన దానికి కాని దానికి అందరి మీదా అరిచేయడమో ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. ఇలా చేసిన ప్రతిసారీ మీకు మీరు ఫైన్ విధించుకుని కొంత మొత్తాన్ని డిబ్బీలో వేయండి. క్రమక్రమంగా అందులో డబ్బూ పోగవుతుంది.. ఫైన్ సంగతి గుర్తొచ్చి మెల్లమెల్లగా అలవాటునూ తగ్గించుకునే అవకాశమూ ఉంటుంది. కేవలం చెడు హ్యాబిట్సే కాకుండా మంచి అలవాట్లకు కూడా దీని వర్తింప చేసుకోవచ్చు. -
వేలిముద్రలను గుర్తించేందుకు మ్యాజిక్ పెన్ను!
నేరం జరిగిన స్థలంలో వేలిముద్రలను సేకరిస్తే నేరస్తులను పట్టుకునేందుకు, నేర నిరూపణకు కీలక ఆధారం దొరికినట్లే. అందుకే.. పెట్రో లు పంపులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఏటీఎంలు, తదితర చోట్ల బిల్లులు ముద్రించేందుకు ఉపయోగించే థర్మల్ కాగితాలపై సైతం నేరస్తుల వేలిముద్రలను గుర్తించేందుకు ఉపయోగపడే ఓ సరికొత్త మ్యాజిక్ పెన్నును ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన డాక్టర్ జాన్ బాండ్ రూపొందించారు. సాధారణంగా థర్మల్ కాగితాలు వేడి తగలగానే రంగు మారతాయి. అలాగే ఈ కాగితంపై ప్రత్యేక రసాయనం ఉండే ఈ పెన్నుతో మార్కర్‌లా గీస్తే.. ఆ కాగితంపై రసాయన చర్యల్లో మార్పులు వస్తాయట. ఆ మార్పులను ప్రత్యేక కాంతిని ప్రసరించడం ద్వారా పరిశీలించి వేలిముద్రలను గుర్తించవచ్చట. వాడేందుకు సులభంగా ఉండే ఈ మ్యాజిక్ పెన్ను నేర దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
ఎర్న్జాయ్
పాకెట్ మనీ ఇమ్మంటే పేరెంట్స్ లెక్కలడుగుతారు. స్మార్ట్ ఫోన్ కావాలంటే ‘అంతొద్ద’ంటారు. చివరికి బండిలో పెట్రోల్ పడాలన్నా.. పైసల కోసం దిక్కులు చూడాల్సిందే. ఇంత భరించడం కన్నా... సొంతంగా సంపాదించుకోవడం మిన్న. అందుకే ఇప్పుడు సిటీ యూత్ ‘వీకెండ్ వర్క్’ మనీ మ్ంరత్రాన్ని జపిస్తోంది. సంపాదనలో పడి స్టడీస్ నుంచి వారానికోసారి దొరికే హాలిడేని మిస్సయిపోతున్నారనుకోకండి.. ఇటు ఇన్‌కమ్‌తో పాటు అటు ఫన్‌టైమ్ కూడా ఎంజాయ్ చేస్తున్న వీరి స్టైల్ తెలుసుకోవాలంటే- గెట్ ఇన్ టు దిస్ స్టోరీ.. వీకెండ్స్ అంటే ఇంట్లో కూర్చుని హోంవర్క్ చేసుకోవడం.. టీవీ చూడటం.. ఫ్రెండ్స్‌తో కలసి జాలీగా గడపడం.. లేదంటే బద్ధకంగా రోజుని లాగించేయడం... ఇంతేనా?. చదువుకునే వయసులో ఎంజాయ్ చేయాలంటే జేబు నిండుగా ఉండాలి. ప్రతి అవసరానికీ అయిన వాళ్ల దగ్గర చేయిచాచి.. బతిమాలి.. ఎన్నాళ్లు?. ఇటువంటి సమస్యతో బాధపడే యూత్.. ‘వీకెండ్ వర్క్’ను నమ్ముకుంటున్నారు. తమ టాలెంట్‌ని మెరుగు పెట్టుకుంటూ, అదే చేత్తో పాకెట్ మనీ సంపాదించుకుంటూ, వీకెండ్ ఫన్ని మిస్సవ్వకుండా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.. మొబైల్ రీచార్జ్, పెట్రోల్ ఖర్చులు, షాపింగ్ వంటి చిన్ని చిన్ని అవసరాల కోసం తామే డబ్బు సంపాదించుకుంటున్నారు. మనసుకు నచ్చిన పని చేస్తూ గుండె నిండా సంతోషాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలో వీరిని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయటంతో మరింత ఉత్సాహంతో ముందుకెళుతున్నారు ఈ యంగ్‌స్టర్స్. - ..:: సిద్ధాంతి మ్యూజిక్‌తో మ్యాజిక్ నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్. అందరూ లీజర్ టైంలో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నాకు సింగింగ్ అంటేనే లీజర్ టైం స్పెండ్ చెయ్యటం లాంటిది. ఎక్కువగా ఇంగ్లిష్ పాటలు వింటూ ఉంటాను. అవే పాటలు కాఫీ షాప్స్, రెస్టారెంట్స్‌లో వీకెండ్స్‌లో పాడుతుంటాను. నా వాయిస్‌లో ఉండే హస్కీనెస్ వల్లనేమో చాలామందికి నా పాటలు బాగా నచ్చుతాయి. మంచి ఇన్కమ్ వస్తుంది. - ప్రణిత, స్టూడెంట్ ఆడుతూ ‘పాడుతూ’.. స్కూల్ డేస్ నుంచీ పాడటం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీస్‌లో, స్కూల్ ఫంక్షన్స్‌లో పాటలు పాడేదాన్ని. ఇప్పుడు ప్రతి వీకెండ్లో సిటీలోని ఒక కాఫీ షాప్‌లో హిందీ, ఇంగ్లిష్ పాటలు పాడుతుంటాను. అక్కడికి వచ్చిన వారు నా పాటలు విని ఎంజాయ్ చేయటం నాకు చాలా తృప్తినిచ్చే విషయం. మ్యాషప్ తరహా సింగింగ్ నా ప్రత్యేకత. అంటే ఒక భాషలో పాటలోని చరణంతో మొదలుపెట్టి, వేరే భాషలోని పాటల పల్లవితో చేసే తమాషా సంగీతమిది. నా టాలెంట్ నా ఖర్చులకు సరిపడా ఇన్కమ్ ఇస్తోంది. దీంతో నా పర్సనల్ ఎక్స్‌పెన్సెస్‌కు ఇప్పుడు నో ప్రాబ్లమ్. - వాణిశ్రీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లిక్‌మనిపిస్తే క్యాష్... క్యాండిడ్ ఫొటోగ్రఫీ, నేచర్ ఫొటోగ్రఫీ, గెలాక్సీ ఫొటోగ్రఫీ.. ఇలా ప్రతి క్లిక్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకోవటం అంటే నాకు ఇష్టం. కెమెరా క్లిక్‌మన్న ప్రతిసారీ నాకు సంతోషం కలుగుతుంది. ఫ్రెండ్స్‌కి సర్ప్రైజ్ ఫొటోషూట్స్, కపుల్ ఫొటోషూట్స్ అంటే మహా సరదా. ఫొటోగ్రఫీతో పాకెట్ మనీ సంపాదించుకోవటం అనేది ఓ అంశమైతే... దానివల్ల నేను పొందే ఆనందం వెలకట్టలేనిది. నా కెమెరాతో ప్రపంచం చుట్టి రావాలన్నదే నా జీవిత లక్ష్యం. - భార్గవ అయ్యర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ రాక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్.. స్టూడెంట్ గ్రూప్ ద్వారా ర్యాప్ ప్రదర్శనలు ఇస్తుంటాం. వీకెండ్ అంటే మా టీం అందరితో కలిసి ఒక చక్కటి ర్యాప్ ప్రదర్శన ఇవ్వాల్సిందే. నాతో పాటు సహీం అలీ, ఆసిఫ్ పటేల్, ఆక్విబ్ సయ్యద్ వీరంతా మా టీం సభ్యులు. మేం పెర్ఫార్మ్ చేసే ప్రతి పాటలో ఒక కథ ఉంటుంది. అసలు ర్యాప్ అంటేనే స్టోరీ టెల్లింగ్.. దీనికి సిటీలో మంచి డిమాండ్ ఉంది. అదే మాకు ఇన్కమ్ సోర్స్‌గా మారింది. - సైఫ్ తుంబీ, యంగ్ గన్స్ గ్రూప్ -
తన బాధను దిగమింగి...
సావో పాలో: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో చేసిన మ్యాజిక్‌తో ఉరుగ్వే స్టార్ స్వారెజ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. కానీ అతడి విజయం వెనుక ఓ శక్తి ఉంది. ఓ వ్యక్తి తన బాధను దిగమింగి దేశం కోసం పడిన తాపత్రయం ఉంది. ఆ శక్తి పేరు వాల్టర్ ఫెరీరా. ఉరుగ్వే ఫుట్‌బాల్ జట్టు ఫిజియో. మే 22న స్వారెజ్ మోకాలికి ఆపరేషన్ జరిగాక.. ఫెరీరా ప్రతిరోజూ స్వారెజ్ ఇంటికి వెళ్లి చికిత్స అందించారు. చికిత్సతో పాటు తనలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. దీంతో ఈ స్టార్ ఆటగాడు 28 రోజుల్లోనే మైదానంలోకి దిగాడు. ఇదంతా ఒక ఎత్తయితే... 62 ఏళ్ల ఫెరీరా క్యాన్సర్ బాధితుడు. తాను కీమోథెర ఫీ చికిత్స తీసుకుంటూనే స్వారెజ్‌కు చికిత్స చేశారు. ప్రపంచకప్‌కు 21 రోజుల ముందు కూడా ఫెరీరా కీమోథెరఫీ చేయించుకున్నారు. అయినా ఆయన తన బాధను లెక్కచేయకుండా... దేశానికి అత్యంత విలువైన ఆటగాడిని ప్రపంచకప్‌కు సిద్ధం చేయడమనే లక్ష్యంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం దక్కింది. అందుకే రెండో గోల్ చేయగానే స్వారెజ్ పరుగున ఫెరీరా దగ్గరకు వెళ్లాడు. ఆయనను హత్తుకుని క్రెడిట్ ఆయనదేనంటూ ప్రేక్షకులకు చూపించాడు. హ్యాట్సాప్ ఫెరీరా. -
ఎక్స్ఛేంజీలకు ఎన్నికల ఫీవర్
న్యూఢిల్లీ: రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్ర సృష్టిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వచ్చే నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడవచ్చన్న అంచనాలే మార్కెట్ దూకుడుకు దోహదం చేస్తోంది. కాగా, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలకు వెన్నుదన్నుగా ఎఫ్ఎంసీజీ ఇతరత్రా ‘డిఫెన్సివ్’ స్టాక్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. మరోపక్క, ఫలితాల రోజు అకస్మాత్తుగా స్టాక్ సూచీలు అనూహ్య హెచ్చుతగ్గులకులోనైతే మౌలిక వ్యవస్థలు, సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు అప్రమత్తమవుతున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా అనుకోనిరీతిలో లావాదేవీలు పెరిగిపోవడం వల్ల తలెత్తే ఒత్తిడిని ఎదుర్కోవడంకోసం సెబీ పర్యవేక్షణలో స్టాక్ ఎక్స్ఛేంజీలు ‘మాక్ స్ట్రెస్ టెస్ట్’లను నిర్వహిస్తున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2009 మే 18 నాటి అనుభవాన్ని దృష్టిలోపెట్టుకొని సెబీ తాజా ఎన్నికల ఫలితాలకు సన్నద్ధమవుతోంది. అప్పటి ఎన్నికల పలితాల సందర్భంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ట్రేడింగ్‌ను నిలిపేయాల్సి వచ్చింది. ‘మేజిక్ మండే’గా నిలిచిపోయిన ఆనాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్క నిమిషంలోనే 2,100 పాయింట్లు ఎగబాకి అతిపెద్ద లాభాన్ని నమోదు చేయడం తెలిసిందే. ప్రధానంగా యూపీఏ కూటమికి అనుకూలంగానిర్ణయాత్మక ఫలితాలు వెలువడటమే దీనికి కారణం. అదేవిధంగా 2004 మే 14న ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా మార్కెట్లు తీవ్రంగానే స్పందించాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో సంస్కరణలపై నీలినీడలు అలముకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలేందుకు దారి తీసింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే సెన్సెక్స్ 7% పైగా ఎగబాకి 23,000 పాయింట్ల స్థాయివైపు పరుగులు తీస్తోంది. అయితే, అందరూ అంచనావేస్తున్నట్లు స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా తాజా ఎన్నికల ఫలితాలురాకపోతే మార్కెట్లో క్రాష్‌కు ఆస్కారం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
ఆ గారడీ నిండా గుండె తడి
మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడాయన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్రలతో, మార్మికమైన తీరులో మార్క్వెజ్ అక్షరబద్ధం చేశాడు. లాటిన్ అమెరికా కరీబియన్ సాగర తీరా ల సొగసులనీ, ఆ జాతి ప్రజల పగలనీ, ఉద్వేగాలనీ రంగరించి ఆ ప్రాంతం గాథని అక్షరబద్ధం చేసినవాడు గాబ్రియెల్ గార్షి యా మార్క్వెజ్ (మార్చి 6, 1927-ఏప్రిల్ 17, 2014). మేజిక్ రియలిజమ్తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. పుక్కిట పురాణగాథలూ, అసాధా రణ ఊహాచిత్రాలూ, వీటితో చేసే గారడీనే మేజిక్ రియలిజమ్ అంటాడాయన. కానీ ఈ అసాధారణ శైలిని లాటిన్ అమెరికా చరి త్ర పుటల నుంచి జారే విషాదాన్ని చెప్పడా నికి ఆ మహా రచయిత ఉపయోగించుకు న్నాడు. అందుకే, లాటిన్ అమెరికా వర్షించే ఉత్తేజంలో మార్క్వెజ్ నిరంతరం తడిసిపో తూనే ఉంటాడు అని క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో వ్యాఖ్యానించాడు.కొలంబియాలోని అరాకటాక అనే గ్రామంలో (ఆయన రచనలలోని అద్భుత కల్పిత గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను ప్రభావితం చేసిన స్థానిక అంశాలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. కొలంబియా అంతర్యుద్ధం, అక్కడి ఉద్వేగా లు, విశ్వాసాలు, ఘర్షణలు, లిబరల్ పార్టీ ప్రభావం, తరువాత పెరిగిపోయిన మాఫి యాలు, వారి హింసతో కరీబియన్ తీరాన్ని తడిపేసిన కన్నీళ్లు - అన్నీ ప్రభావితం చేసి నవే. అరాకటాకలో అమ్మమ్మ, తాతయ్యల పెంపకం, తరువాత పత్రికా రచయితగా గడించిన అనుభవాలూ మార్క్వెజ్ సాహి త్యానికి పునాదులయ్యాయి. ‘నేను ఏనాటికీ పత్రికా రచయితనే. ఇన్ని రచనలు చేయగలి గానంటే అదే కారణం. ఆ రచనలలోని ఇతి వృత్తాలు. జర్నలిజం ఇచ్చిన వాస్తవ సమా చారమే’ అంటాడాయన. 30 మిలియన్ ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వ వీధులలో ఎగురవేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ (నూరేళ్ల ఏకాం తం, 1967)నవల కథానాయ కుడి పాత్రను తన ఇంటిలోనే వెతికి పట్టుకున్నాడు. ఆ పాత్రకు ప్రేరణ తన తాతగారే. కొలంబి యా అంతర్గత పోరులో ఆయనది కీలక పాత్ర. ఈ నవలలోని ఏడు తరాల బ్యుండి యా కుటుంబ గాథ ఆవిష్కరణకు ఎన్నుకు న్న మేజిక్ రియలిజమ్ శైలిని సయితం తన ఇంటిలోనే కనుగొన్నాడా యన. బాల్యంలో అమ్మమ్మ చెప్పిన జానపద, కాల్పనిక కథల ద్వారా దానిని సాధించాడు. కొలంబియా రాజకీయ వాస్తవికతలను జానపద పాత్ర లతో, మార్మికమైన తీరులో ఆయన అక్షర బద్ధం చేశాడు. అందుకే ఈ నవలలో లాటిన్ అమెరికా జాతీయులు తమ ఆత్మను దర్శించుకోగలిగారన్న ఖ్యాతి వచ్చింది.మిత్రులూ, అభిమానులూ ‘గాబో’అని ఆప్యాయంగా పిలుచుకునే మార్క్వెజ్ ప్రకృ తి సౌందర్యాలనూ, రాజకీయ సామాజిక స్పృహనూ కలిపి మార్మికంగా పెనవేస్తాడు. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం, శాంతి కోసం పడిన తపనకు ప్రతి బింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యా న్ని సదా వ్యతిరేకించాడు. ఇదే క్యూబా వి ప్లవ పిత కాస్ట్రోతో మైత్రిని ప్రసాదించింది. తన రాత ప్రతులను ఆ విప్లవ ద్రష్టకు చూపించి అభిప్రాయం తెలుసుకు నేంతగా బంధం బలపడింది. మరో వైపు అమెరికా ఆయన రాక మీద పదేళ్లు నిషేధం విధించింది. తరువాత క్లింటన్ మార్క్వెజ్ మిత్రుడయ్యాడు. తన పద్దెనిమిదో ఏట రచనా వ్యాసం గం ఆరంభించిన మార్క్వెజ్ విశేషమైన సాహిత్య సంపదను ఇచ్చి వెళ్లాడు. ‘ఇన్ ఈవిల్ అవర్’ (1962), ‘ది ఆటమ్ ఆఫ్ ది పేట్రి యార్చ్’ (1975), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985), ‘ది జనరల్ ఇన్ హిజ్ లెబైరింత్’(1989), మార్క్వెజ్ నవలలు. నవలికలు కూడా ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చాయి. ‘ఐస్ ఆఫ్ ఏ బ్లూ డాగ్’(1947), ‘బిగ్ మామాస్ ఫ్యునరల్’(1962) వంటి పలు కథా సంకలనాలను ఆయన వెలువ రించారు. ‘భగవంతుడు నాకు ఒక్క సెకను అదనంగా జీవితాన్ని ప్రసాదించినా, నా శక్తిని మరింత గొప్పగా ఉపయోగించడా నికే వినియోగిస్తాను’ అని జబ్బు పడిన తరువాత మిత్రులకు రాసిన వీడ్కోలు లేఖ లో మార్క్వెజ్ రాశాడు. కానీ ఆ క్షణం వరకు సృజనాగ్నిలో ఆయన ఎంతగా కాగి పోయా డో రోజూ ఒక పసుపు గులాబీ గమనిం చింది. వేకువనే కొద్దిసేపు పుస్తకం చదువు కుని, తరువాత వార్తాపత్రికలు చదివి, ఆపై నాలుగు గంటలు ఏకబిగిన రచనలు చేసే వాడు మార్క్వెజ్. ఆ సమయానికి నిత్యం ఒక పసుపు గులాబీని తెచ్చి ఆయన రాత బల్ల మీద ఉంచేది ఆయన భార్య మెర్సిడెస్. అక్షరార్చనతో మార్క్వెజ్ గుండె ఎంత అలసిపోయిందో ఆ గులాబీకి తెలుసు. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
మ్యాజిక్, మ్యూజిక్, గ్లామర్ కలబోతగా బెంగాల్ ఎన్నికలు
-
బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ టెన్షన్
-
సినీ మాయలోళ్లు
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇది ఇంద్రజాలానికి కూడా వర్తిస్తుంది. కాగితపు ముక్క, బ్లేడు ముక్క, పేకముక్క.. కాదేదీ మేజిక్కుకి అనర్హం. అయితే తెలియాల్సిందల్లా రెప్పపాటులో ప్రేక్షకులను మాయ చేయడమే. వాస్తవానికి ఇంద్రజాలం తెలిసినవారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ, వారు చేసే ఆ మేజిక్ చూసినప్పుడు ఎంచక్కా మనక్కూడా ఆ విద్య తెలిస్తే బాగుండు అనుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలు చందమామ కావాలని మారాం చేసినప్పుడో, ప్రేయసికి ఇవ్వాలనుకున్న గులాబీ దొరకనప్పుడో మేజిక్ తెలిస్తే చటుక్కున సృష్టించేయొచ్చుగా అనుకోకుండా ఉండరు. ఇలా సందర్భానికి తగ్గట్టు మేజిక్ తెలిసుంటే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది పనిగట్టుకుని ఆ విద్యను నేర్చుకుంటారు. అదే వృత్తిగా స్వీకరించేవాళ్లూ ఉంటారు. అలాగే ప్రవృత్తిగా చేసుకునేవాళ్లూ ఉంటారు. అలాంటి కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోతున్నవారు సినిమా పరిశ్రమలో తెరవెనుకా, తెరపైనా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినవారే. సినిమా కళతో పాటు వారికి మేజిక్ అనే కళ కూడా తెలుసు. నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఆ సినీ మేజిక్ కళాకారుల గురించి తెలుసుకుందాం... తెరపై ఇందజ్రాలికుడుగా: నాటితరం ప్రేక్షకులను ఓ స్థాయిలో నవ్వించిన అద్భుతమైన హాస్యనటుడు రమణారెడ్డి.. తన కామెడీతో మేజిక్ చేసిన రమణారెడ్డికి నిజంగా కూడా మేజిక్ తెలుసు. ఎంతో పట్టుదల, క్రమశిక్షణతో నేర్చుకుని ప్రజల ముందు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బ్లేడు ముక్కను అమాంతంగా మింగేసి, ప్రేక్షకులను అబ్బురపరిచేవారు రమణారెడ్డి. ఆయన చేసే ఈ రిస్కీ మేజిక్‌ను అప్పట్లో ఎంతో ఉత్కంఠగా చూసేవారట. ఇంకా పలు వస్తువులతో ఆయన మేజిక్ చేసేవారు. వెండితెరపైన ఆయన ‘అక్కాచెల్లెలు’ చిత్రంలో మెజిషియన్‌గా చేశారు. ఆయన కలం ఓ మేజిక్: ఆరుద్ర వాడే కలానికి ఏదో మేజిక్ ఉంది. ఆ కలం నుంచి జాలువారిన ప్రతి కవితా, పాటా ఓ మేజిక్కే. అదే కలంతోనే ఆయన మేజిక్ చేసేవారు. ఇష్టమైన పువ్వు పేరు తల్చుకోమని అడిగేవారట. ఆ తర్వాత పేపర్ మీద పెన్నుతో ఏదైనా రాసి, వాసన చూడమనేవారట ఆరుద్ర. వాసన చూడగానే ఆ పువ్వు తాలూకు పరిమళం ముక్కుపుటాలను తాకేదని ఆ అనుభూతి పొందినవారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ముక్కలతో మేజిక్: హాస్యం అపహాస్యం కాకుండా కుటుంబమంతా కలిసి ఆస్వాదించదగ్గ చక్కని కామెడీ చిత్రాలను అందించిన జంధ్యాల నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉండేవారు. జంధ్యాల చమత్కారాలు బాగుంటాయని ఆయన స్నేహితులు అంటుంటారు. అలాగే, తీరిక చిక్కినప్పుడు పేకముక్కలు, అగ్గిపుల్లలతో ఆయన బోల్డన్ని మేజిక్కులు చేసేవారనీ అవన్నీ రసవత్తరంగా ఉండేవని చెబుతుంటారు. జంధ్యాల తీసే సినిమాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఆయన మేజిక్ కూడా అదే విధంగా ఉండేదట. భలే మాయలోడు: వెండితెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించే రాజేంద్రప్రసాద్‌కి మేజిక్ తెలుసు. ‘మాయలోడు’ సినిమాలో బోల్డన్ని మాయలు చేసిన రాజేంద్రుడు నిజంగా కూడా కొన్ని మేజిక్‌లు చేస్తుంటారు. మేజిక్ అంటే తనకు వచ్చిన కళను చేసుకుంటూ పోవడం కాదు. కొన్ని చమత్కారాలు జోడించాలి. హావభావాలు పలికించాలి. వీటిలో దిట్ట అయిన రాజేంద్రప్రసాద్ చేసే మేజిక్స్ భలే పసందుగా ఉంటాయట. రబ్బర్ బ్యాండ్స్‌తో: ఆడవాళ్లు జడలకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లే శరత్‌బాబు మేజిక్‌కి ఆయుధాలు. వాటితో శరత్‌బాబు చేసే మేజిక్కులు వీక్షకులను అబ్బురపరుస్తాయి. శరత్‌బాబుకి ఉన్న ఈ ప్రతిభ తెలుసుకుని, ఆయన్ను కదిలిస్తే... రబ్బర్ బ్యాండ్స్‌తో బోల్డన్ని ప్రదర్శనలు ఇస్తారట. - డి.జి. భవాని -
ఘనంగా ‘ప్రోగ్రెసివ్’ వార్షికోత్సవం
-
కేరళలో ‘మయసభ’!
గాల్లోంచి వస్తువులను సృష్టించడం.. కళ్ల ముందే దేనినైనా మాయం చేయడం.. మనిషి తల, శరీరాన్ని ముక్కలుగా చేసి తిరిగి అతికించడం.. ఇదంతా ఇంద్రజాలం (మ్యాజిక్) మహిమ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో, ఎంతో మంది ఇంద్రజాలికులు ప్రదర్శించే ట్రిక్కులన్నింటినీ ఒకే చోట చూడగలిగితే.. బాగుంటుంది కదూ! ఈ అవకాశం మన దేశంలోనే తొలిసారిగా కేరళ రాజధాని తిరువనంతపురంలో అందుబాటులోకి రానుంది. ‘మ్యాజిక్ ప్లానెట్’ పేరిట అకాడమీ ఆఫ్ మ్యాజికల్ సెన్సైస్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మ్యాజిక్ ప్లానెట్’ను ప్రపంచ ఇంద్రజాల దినోత్సవమైన అక్టోబర్ 31న ప్రారంభిస్తారు. దీని మస్కట్ ‘హారీ’ని, యానిమేటెడ్ సినిమాను 10న విడుదల చేయనున్నామని మ్యాజిక్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గోపీనాథ్ ముతుకాడ్ వెల్లడించారు. ‘మ్యాజిక్ ప్లానెట్’లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి నుంచి ఇంద్రజాలానికి చెందిన అంశాలతో కూడిన మ్యూజియం, వర్చువల్ సూపర్‌మార్కెట్, షేక్స్పియర్ ‘ది టెంపెస్ట్’ ఆధారంగా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంటాయన్నారు. -
మంత్ర దండం లేదు కానీ.. మంచి చేస్తాను
నిజాయితీగల అధికారులు తోడుంటే సాధ్యంకానిది లేదు: అరవింద్ కేజ్రీవాల్ అలాంటిఅధికారులందరూ మమ్మల్ని ఎస్ఎంఎస్లు, ఈమెయిళ్ల ద్వారా సంప్రదించండి ఢిల్లీ ప్రజలకు సేవ చేసేలా తగిన స్థానంలో మిమ్మల్ని నియమిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సమస్యలన్నీ పరిష్కరించేందుకు తన దగ్గర మంత్రదండమేదీ లేదని, అయితే నిజాయితీపరుల సహకారం లభిస్తే అసాధ్యమనేది ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిజాయితీపరులు, సమర్థులైన అధికారుల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో నిజాయితీపరులైన అధికారులు, ఉద్యోగులు తనను ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్ల ద్వారా సంప్రదించాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ సమస్యలు పరిష్కరించడానికి వీలుగా వారిని తగిన స్థానాల్లో నియమిస్తామన్నారు. గురువారం కూడా ఆయన కౌశంబీలోని తన నివాసం వద్ద ‘జన సభ’ను నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిజాయితీపరులైన అధికారుల సహకారం లభించినట్లయితే తాము అవినీతిరహిత పాలనను అందించగలమన్నారు. అలాంటి అధికారులను ఎలా గుర్తిస్తారని అడిగిన ప్రశ్నకు తమకు నెట్వర్క్ ఉందని, దాని ద్వారా నిజాయితీపరుల గురించి తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న రాజేంద్రకుమార్ వంటి అధికారులతో కూడిన బృందం నిజాయితీపరులు, సమర్థులైన అధికారుల ఆచూకీ తీస్తోందన్నారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ హామీ అమలు: అధికారాన్ని చేపట్టిన తరువాత 700 లీటర్ల నీటిని సరఫరా చేసే హామీతోపాటు మిగిలిన హామీలను వీలైనంత త్వరగా అమలుచేస్తామని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైనప్పుడు ఐఐటీ, ఐఐఎం నిపుణుల బృందం సలహా తీసుకోనున్నట్లు చెప్పారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే వారిలో ప్రముఖులెవరూ ఉండరని, ఈ కార్యక్రమానికి సామాన్యులందరూ రావొచ్చని ఆయన ఆహ్వానించారు. సామాజిక సేవా కార్యకర్త అన్నాహజారే తన గురువని, ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆయనను ఫోన్లో కోరతానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, జనసభలో పాల్గొన్న వారిలో చాలా మంది కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపగా కొందరు సలహాలు ఇచ్చారు. ఢిల్లీవాసులు నీటి సరఫరా, విద్యుత్తుకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తన నివాసం వద్ద భద్రత కోసం వచ్చిన పోలీసులను కేజ్రీవాల్ గురువారం వెనక్కి పంపారు. తనకు భద్రత అక్కర్లేదని చెప్పారు. ‘ఆప్’ ఖాతాలను తనిఖీ చేయనున్న హోంశాఖ ఆప్ విదేశీ విరాళాలపై సందేహాల నివృత్తి కోసం ఆ పార్టీ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఆప్‌కు అందిన విదేశీ విరాళాల గురించి హోంశాఖ లేఖలు రాయగా వాటికి ఆ పార్టీ ఇచ్చిన జవాబులపై కొన్ని అనుమానాలు కలిగినందున ఖాతా పుస్తకాలు తనిఖీ చేయనుంది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం కింద తామడిగిన ప్రశ్నలకు ‘ఆప్’ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనందుకే ఈ చర్య చేపట్టనుంది. ఒక పిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలకు ఆప్ సన్నాహాలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో విజయోత్సాహంలో ఉన్న ‘ఆప్’... లోక్‌సభ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించింది. వివిధ రాష్ట్రాలతో పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు పంకజ్ గుప్తా, సంజయ్ సింగ్‌లతో రాజకీయ సబ్‌కమిటీని నియమించింది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడంపై పార్టీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ‘ఆప్’ నేత యోగేంద్ర యాదవ్ గురువారం మీడియాతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘ఆప్’ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారి కోసం పార్టీ గురువారం ఒక ఫామ్ విడుదల చేసింది. వీటిని దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో గల ‘ఆప్’ కార్యాలయాల్లో ఇస్తున్నట్లు యాదవ్ తెలిపారు. ఈ ఫామ్‌ను ఆన్‌లైన్‌లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తాము పోటీ చేయదలచిన లోక్‌సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తమ అభ్యర్థిత్వానికి మద్దతుగా వంద చొప్పున సంతకాలను సేకరించి, దరఖాస్తు ఫామ్‌కు జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. -
‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో మేజిక్ మధు
జిన్నూరు (పోడూరు), న్యూస్‌లైన్ : పోడూరు మండలం జిన్నూరు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు, మెజీషియన్ ఖండవల్లి మధుసూదనరావుకు ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’లో స్థానం లభించింది. గతేడాది డిసెంబర్ 12న ప్రపంచశాంతి, సామాజిక చైతన్యం కోసం 12 గంటల 12 నిముషాల 12 సెకన్లకు వీరవాసరం మండలం రాయకుదురులో కళ్లకుగంతలు కట్టుకుని 12 కి.మీ.దూరం 12 మోటర్ సైకిళ్లు మారుతూ 12 ఫైర్రింగ్లను దాటుకుంటూ మధుసూదనరావు విన్యాసం చేశారు. ఇందుకు ఆయనకు అరుదైన గౌరవం అభించింది. జెడ్పీ హైస్కూల్లో బుధవారం జ్యూరీ మెంబర్ చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూగర్) నుంచి ‘బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్’ ధ్రువీకరణపత్రాన్ని మధు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజిక్ విద్యను మూఢనమ్మకాలను పారద్రోలేందుకు, ఎయిడ్స్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యం, విద్య, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఆకి రామకృష్ణ, జీవీ సుబ్బారావు, హైస్కూల్ హెచ్ఎం సీహెచ్ సురేష్‌బాబు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ఆనందరావు, కలిదిండి వెంకటపతివర్మ, మెజీషియన్లు ప్రవీణ్, లిఖిత ఆయన్ను అభినందించారు. -
మోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరు: వెంకయ్య
చెన్నై: దేశంలోని ఏ రాజకీయ పార్టీలోనూ నరేంద్రమోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందిరాగాంధీ కాలంనాటి ఎమర్జెన్సీ కంటే ఘోరంగా తయారైందని విమర్శించారు. ఇటీవలి 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం రుజువైందన్నారు. ఈ మేరకు ఇక్కడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా భావించే ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడాపార్టీకి దూరమయ్యూరని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ముస్లింలు సైతం బీజేపీకి అండగా నిలిచారన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రవేశ పెట్టిన ఆధార్ కార్డులు, నగదు బదిలీ, ఆహార భద్రత పథకాలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాపాడలేవని జోస్యం చెప్పారు. ‘అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటైన సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోలేదా?. కాంగ్రెస్ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ విషయంలో సీబీఐని వాడుకోలేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సోనియా బహుమతి అని, సీమాంధ్ర వారికి బీజేపీ కారణంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు.