Mancherial District Latest News
-
చర్లపల్లిలో చిరుత సంచారం
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి పంచాయతీ పరిధి చర్లపల్లి గ్రామ శివారు అట వీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం ఉదయం గ్రామస్తులు పొలాలు, చేలకు వెళ్లే మార్గంలో చిరుతపులి పాదముద్రలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పాదముద్రలు గుర్తించి చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఆయన మాట్లాడుతూ.. చిరుతపులి రాత్రివేళ ఈ ప్రాంతంలోకి వచ్చినట్లు తెలిపారు. రాత్రి ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామస్తులకు సూచించా రు. వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. చిరుత సంచారంతో చర్లపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు. -
విద్యార్థుల మానసిక స్థితిని పరీక్షించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇంటర్ విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్యతో కలిసి సంక్షేమశాఖల అధికా రులు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రి న్సిపాల్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మా నసిక వైద్యనిపుణుడు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యసేవలందించనున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా 14416 నంబర్ ద్వారా టెలీ మానస్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతీ కళాశాల నుంచి ఒక నోడల్ అధికారి ఐఎస్వో రిజి స్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో 13,018 మంది విద్యార్థులకు యూ–డైస్ పోర్టల్‌లో 11,500 మంది వివరాలు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు త్వరగా నమోదు చేసుకునేలా యాజమాన్యాలు చర్య తీసుకోవాలని కోరారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో అనుసరించే విధానాన్ని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ సూచించారు. -
అన్ని రంగాల్లో రాణించాలి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగ విద్యార్థులు అ న్ని రంగాల్లో రాణించాలని డీఈవో యాదయ్య సూచించారు. మంగళవారం మంచిర్యాల భవి త కేంద్రంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యసాధనకు చదువు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉచిత వి ద్య, పెన్షన్, ఉపకరణాలను సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. భవిత కేంద్రంలో వారానికోరోజు ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటలపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగ విద్యార్థులకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్య కో–ఆర్డినేటర్ చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈవో మా లవీదేవి, కాంప్లెక్స్ హెచ్ఎం పద్మజా, ఐఈఆ ర్పీలు సృజన, శ్రీలత తదితరులున్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా దివ్యాంగుల దినోత్సవంమంచిర్యాలఅగ్రికల్చర్: దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మ హిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణితో కలిసి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హక్కులపై అవగాహన కలిగి ఉండాలని దివ్యాంగులకు సూచించారు. ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమస్యలపై ఆన్లైన్లో ఉన్న నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంకల్పం, మనోధైర్యంతో ముందు కు సాగాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన దివ్యాంగులను ఆదర్శంగా తీసుకో వాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి నీరటి రాజేశ్వరి, గణపతి, ఇతర అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
శ్రీరాంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్ హెచ్ఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టీ.సారయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం కో కన్వీనర్ సమ్ము రాజయ్య మాట్లాడుతూ సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పెద్దపల్లి సభ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించామని, దీనిని అడ్డుకునేందుకు హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమావేశంలో ఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల రాములు, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.బ్రహ్మానందం, ఏఐఎఫ్టీయూ నాయకులు పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్, హెచ్ఐవీ పై అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అ ధికారి హరీశ్‌రాజ్ సూచించారు. డీఎంహెచ్‌వో కా ర్యాలయంలో మంగళవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. హెచ్ఐవీ, ఎ యిడ్స్పై విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి వి జేతలకు బహుమతులు అందించారు. అనంతరం హెచ్ఐవీపై అపోహలను తొలగించడంలో భాగస్వాములవ్వాలని కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. బెల్లంపల్లి ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసా ద్, పీవో డాక్టర్ అనిల్, డెమో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, సీపీఎం నీలిమ, సీఎస్‌వో రాజేశ్, డీఎండీవో సంతోష్, ఐసీటీసీ కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్, ఆంజనేయులు, నర్మద, డీఎస్ఆర్సీ కౌన్సిలర్ నరేందర్, ఉపాధ్యాయులు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత పాల్గొన్నారు. -
శ్రీరాంపూర్‌లో కొత్త క్వార్టర్లు
మోడళ్లు, క్వార్టర్ల సంఖ్యమిలీనియం–ఏ 15 మిలీనియం–బీ 36 మిలీనియం–సీ 98 మిలీనియం–డీ 1,078 మొత్తం 1,227ప్రతిపాదనలు పంపాంశ్రీరాంపూర్ ఏరియాలో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. కార్పొరేట్ కమిటీ కూడా స్థలాలను పరిశీలించింది. కార్పొరేట్ అధికారులు ఆమోద వేస్తే క్వార్టర్ల నిర్మాణం జరుగనుంది. – ఎల్వీ సూర్యనారాయణ, జీఎం, శ్రీరాంపూర్శ్రీరాంపూర్: కంపెనీలోనే అతిపెద్ద ఏరియా, ఎక్కు వ ఉద్యోగులున్న శ్రీరాంపూర్‌లో కొత్తగా 1,227 క్వా ర్టర్ల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా అధికారులు కొద్దిరోజుల క్రితం కార్పొరేట్ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై కార్పొరేట్ నుంచి ప్రత్యేక కమిటీ వారం క్రితం వచ్చి శ్రీరాంపూర్‌లో పర్యటించింది. కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు. ఎస్సార్పీ 3, 3 గనికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల కంపెనీ స్థలంతోపాటు నస్పూర్ కాలనీలోని మార్టిన్ గ్రామర్ స్కూల్, కంపెనీ డీ టైప్ క్వార్టర్ల మధ్యనున్న సుమారు నాలుగెకరాలనూ పరిశీలించారు. భూగర్భ గనులకు దగ్గరగా కంపెనీ స్థలాలున్నప్పటికీ అవి ఎప్పటికై నా ఓసీపీలుగా మారితే క్వార్టర్లకు ఇబ్బంది ఉంటుంది. దీంతో నస్పూర్ వైపు ఉన్న స్థలాల్లోనే క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని ఏరియా అధికారులు, కమిటీ సభ్యులు భావిస్తున్నారు. శిథిలావస్థలో క్వార్టర్లు ప్రస్తుతం శ్రీరాంపూర్‌లో 8,746 మంది ఉద్యోగులుండగా, వీరికి 7,147 క్వార్టర్లున్నాయి. వీటిలో ఆర్కే 5 కాలనీ, శ్రీరాంపూర్ కాలనీలోని ఉన్న రేకు ల క్వార్టర్లు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. డీ టైప్ క్వార్టర్లూ కొన్ని కాలనీల్లో శిథిలావస్థకు చేరా యి. ఇవి 40 ఏళ్ల క్రితం నిర్మించగా, షిర్కే క్వార్టర్లు 33 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా కొత్తక్వార్టర్లు నిర్మించకపోవడంతో ఉన్నవాటిలోనే కార్మికులు నివసించాల్సి వస్తోంది. కొత్త క్వా ర్టర్లు నిర్మిస్తే శిథిలావస్థలోనివి కూల్చివేశే అవకాశముంది. కాగా, చెన్నూర్‌లో మరో 292 క్వార్టర్లుండగా, అక్కడి గనులు మూతపడగా చాలా ఏళ్లుగా అవి ఖాళీగా ఉంటున్నాయి. మిలీనియం మోడళ్లలో నిర్మాణాలు భూపాలపల్లి లాంటి ఏరియాల్లో కంపెనీ ఇటీవల నూతనంగా చేపట్టిన నాలుగు రకాల మిలీనియం మోడల్ క్వార్టర్లనే ఇక్కడా నిర్మించనున్నారు. అధికా రులు, ఉద్యోగుల హోదాలకు తగినట్లు వేర్వేరు ని ర్మాణాలు చేపట్టనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కం ఫస్ట్ ఫ్లో ర్, డబుల్ బెడ్రూం తరహాలో ఒక బ్లాక్‌కు 14 క్వా ర్టర్లు ఉండేలా నిర్మాణ స్వరూపం ఉండనుంది. తా గునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, ఎస్టీపీ, మైదానం వసతితో అంతా మోడ్రన్‌గా ఉండేలా నిర్మించనున్నారు. ఈ మేరకు ఏరియా అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కార్పొరేట్ ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది. ప్రతిపాదనలు పంపిన అధికారులు స్థలాలు పరిశీలించిన కార్పొరేట్ కమిటీ జీ ప్లస్ వన్, డబుల్ బెడ్రూం ఇళ్ల మోడళ్లలో చేపట్టనున్న నిర్మాణాలు -
ఏడు నెలలుగా ఎదురుచూపులు
● జీతాలు రాక ఇబ్బందుల్లో ఆర్పీలు ● వెంటనే వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చెన్నూర్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ, బ్యాంకర్లతో మాట్లాడి చిరువ్యాపారులకు సూక్ష్మ రుణాలిప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడంలేదు. దీంతో వారు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో సుమారు 232 మంది పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6వేల గౌరవవేతనం ఇస్తోంది. వచ్చే అరకొర వేతనం సకాలంలో అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల క్రితం చెన్నూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, కలెక్టర్ కుమార్‌దీపక్‌కు రిసోర్స్ పర్సన్లు వినతిపత్రం ఇచ్చినా నేటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవీ.. ఆర్పీల విధులు ఆర్పీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీ సుకువెళ్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం, స్వ చ్ఛభారత్లో పాల్గొంటున్నారు. తడి, పొడి చెత్త వే రు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు. బ్యాంక్ లీంకేజీ రుణాలిప్పిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఏ సర్వే చేసినా భాగస్వాములవుతున్నారు. ఇలా.. మున్సిపాలిటీల్లో చేపట్టే కార్యక్రమాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న వీరికి సకాలంలో వేతనాలు అందడంలేదు. ఉద్యోగ భద్రత కల్పించడంలేదు. దీంతో వీరు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీల వారీగా ఆర్పీల వివరాలు మంచిర్యాల 58 బెల్లంపల్లి 35 మందమర్రి 39 క్యాతన్‌పల్లి 19 లక్సెట్టిపేట 17 చెన్నూర్ 19 నస్పూర్ 45 మొత్తం 232 -
అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలి
కాసిపేట: అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలని అటవీశాఖ డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని ముత్యంపల్లి, ధర్మరావుపేట సెక్షన్ల పరిధిలో మామిడిగూడ, పెద్దధర్మారం, బుగ్గగూడ, చింతగూడ, గురువాపూర్ గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫైర్లైన్లు చేస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్బ్లోయర్లతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నష్టం పెద్దగా జరుగుతోందని చెప్పారు. వన్యప్రాణుల ఆవాసం చెదిరి విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపా రు. పశువుల కాపరులు తమవెంట గొడ్డళ్లు తీసుకువెళ్లరాదని, చిన్నచిన్న చెట్లను మేతకు నరికితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఎఫ్‌బీవోలు శ్రీధర్, యుగేందర్ పాల్గొన్నారు. -
ఎస్టీపీపీ కార్మిక సమస్యలపై చర్చలు
జైపూర్: మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై హైదరా బాద్‌లో డిప్యూటీ సీఎల్సీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్టీపీపీ బీఎంఎస్ యూనియన్ నాయకులు ప వర్మేక్ కంపెనీ అధికారులతో చర్చించారు. యూ నియన్ నాయకులు ప్రతిపాదించిన సమస్యలపై రెండ్రోజుల్లో ఎస్టీపీపీ ఈడీతో చర్చించి పరిష్కారాని కి చర్యలు తీసుకుంటామని యాజమాన్యం అంగీకరించిందని, దీనికి యూనియన్ నాయకులు కూడా అంగీకరించినట్లు తెలిపారు. ఈ నెల 17వరకు అ న్ని డిమాండ్లు అంగీకరించని పక్షంలో ఎఫ్‌వోసీకి వె ళ్తామని పేర్కొన్నారు. బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడకంట శ్రీధర్, ఉపాధ్యక్షుడు పెద్దపల్లి ప్రభాకర్‌చారి, సెక్రటరీ కిషన్‌రెడ్డి, పాత శివకృష్ణ తదితరులున్నారు. -
చెన్నూర్ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ● లబ్ధిదారులకు చెక్కుల పంపిణీభీమారం: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కోతు ల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి కల్పన, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, నాయకులు రవి, సత్యనారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, సత్తిరెడ్డి పాల్గొన్నారు. రూ.125కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ జైపూర్: నియోజకవర్గంలో రూ.125కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించుకోవడం జరుగుతుందని ఎ మ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తెలిపారు. టేకుమట్లలో ఇటీవల సింగరేణి రైల్వేట్రాక్లైన్కు తీసిన గుంతలో పడి చిప్పకుర్తి రాజ్‌కుమార్ మరణించగా అతడి కు టుంబానికి యాజమాన్యం ద్వారా మంజూరైన రూ.15లక్షల పరిహారం చెక్కును కలెక్టర్ దీపక్‌కుమార్‌తో కలిసి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ.. నియోజకవర్గంలో రూ.70కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భీమారం జోడువాడు వద్ద రూ.180కో ట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రాథమికో న్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. స్థానిక రైతులు పా ర్వతీబ్యారేజీ ముంపు కింద సుమారు 150ఎకరాల్లో పంట పొలాలు నష్టపోతున్నామని, స్థానికంగా తాగునీటి సమస్య ఉందని బోర్లు వేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, నాయకులు గోనె నర్సయ్య, సత్యనారాయణరావు, వెంకటేశ్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఫయాజ్ తదితరులున్నారు. -
ప్రమాదాల నివారణకు..
సాధారణంగా పార్కింగ్ చేసిన వాహనాల కింద జంతువులు పడుకోవడం, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉండటం గమనిస్తూ ఉంటాం. డ్రైవర్ వాహనం ముందుభ, వెనుకభాగం మాత్రమే చూసే వీలుంటుంది. కిందిభాగం చూడలేని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తాయి. వాహనం ముందు వైపు కింది భాగంలో ఒక చిన్న కెమెరా అమర్చి డ్రైవర్ ముందుభాగంలో ఉన్న స్క్రీన్కు లేదా స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. డ్రైవర్ వాహనం స్విచ్ ఆన్‌చేసిన వెంటనే స్క్రీన్‌పై వాహన కిందిభాగం కనిపిస్తుంది. కెమెరాకు ఉన్న చిన్న మోటర్ సాయంతో కెమెరాను రొటేట్ (వాహన 360 డిగ్రీల వ్యూయర్) చేసుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. – రజనీకాంత్, జెడ్పీహెచ్ఎస్, వేమనపల్లి -
హామీలు అమలు చేయాలి
శ్రీరాంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ.శ్రీనివాస్ హెచ్ఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టీ.సారయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం కో కన్వీనర్ సమ్ము రాజయ్య మాట్లాడుతూ సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పెద్దపల్లి సభ సందర్భంగా కార్మికుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించామని, దీనిని అడ్డుకునేందుకు హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమావేశంలో ఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల రాములు, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.బ్రహ్మానందం, ఏఐఎఫ్టీయూ నాయకులు పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన విద్య, వైద్యం అందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల డీటీడీవో, ఏటీడీవోలను ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన పోషణ మిత్ర ద్వారా విద్యార్థులకు రక్తహీనత లేకుండా చూడాలన్నారు. అలగే మోవా లడ్డూ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. స్నానానికి వేడినీళ్లు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఏటీడీవోలకు సూచించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించాలన్నారు. సమావేశంలో ఏటీఎంహెచ్వో మనోహర్, డీటీడీవో రమాదేవి, ఉమ్మడి జిల్లాల ఏటీడీవోలు, జీసీడీవోలు, ఏసీఎంవోలు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలిఇంద్రవెల్లి: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించి సబెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. అనంతరం ఉట్నూర్ మండలంలోని సుక్యతాండ, లంబాడీతండాల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. -
ఎస్టీపీపీ జీఎం ఆత్మహత్య
జైపూర్: 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో నూతనంగా ఎఫ్‌జీడీ నిర్మాణం చేపడుతున్న పీఈ ఎస్ ఇంజనీరింగ్ సర్విస్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ (జీఎం)గా విధులు నిర్వర్తిస్తున్న బొబ్బా తిరుపతిరావు (అలియాస్ బీటీరావు)(56) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన తిరుపతిరావు రెండేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా ఆపరేషన్ సైతం చేయించుకున్నాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఒంటరి జీవితం గడుపుతుండడంతో మనస్తాపానికి గురై మంగళవారం తాను నివాసం ఉంటున్న క్వార్టర్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని సోదరుడు శ్రీనివాస్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. యువ ఇంజినీర్ కిరీటీ ఆత్మహత్య మరువక ముందే మరో అధికారి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులో దూకి ఒకరు .. ఆసిఫాబాద్‌రూరల్: కుమురం భీం ప్రాజెక్టులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అడ గ్రామానికి చెందిన భీమయ్య (70) కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని కుమురం భీం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతునికి భార్య రుక్ముబాయి, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మద్యం మత్తులో యువకుడు.. చింతలమానెపల్లి: మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గూడెం గ్రామానికి చెందిన మండిగా సాయి (23) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటి సమీపంలోని పెరట్లో చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి భీమారం: విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన పప్పు చంద్రమౌళి (53) భీమారంలోని ఐటీడీఏ కాలనీలో నివస్తున్న అతని అల్లుడు రాంటెంకి రంజిత్ కుమార్ ఇంటికి మూడురోజుల క్రితం వచ్చాడు. మంగళవారం ఇటీవల నిర్మించిన భవనంపైకి 20 ఫీట్ల ఇనుపరాడ్ తీసుకెళ్తుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు రాడ్ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అతనికి సహాయం చేస్తున్న పక్కింటికి చెందిన బాలుడు వంశీకృష్ణకు గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రమౌళి మృతి చెందాడు. రంజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. -
గ్యారంటీకి వెనుకడుగు
● సీఎంఆర్‌కు దూరంగా మిల్లర్లు ● జిల్లాలో 13 మందే సుముఖత ● మిగతా ధాన్యం గోదాములకే.. ● సన్న వడ్ల సాగుతో కాస్త ఊరటతిప్పలు తప్పినట్లేనా?ధాన్యం కొనుగోళ్లలో యాసంగితో పోలిస్తే వానాకాలంలో ఇబ్బందులు తక్కువ. చాలా మంది రైతుల సొంత వినియోగం పోను అ మ్మకానికి కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ఈ సారి సన్నాలకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్‌లోనూ అధిక ధరలు చెల్లిస్తున్నారు. దీంతో సర్కారుకు భారం తగ్గింది. ప్రస్తుతం అండర్ టేకింగ్ ఇచ్చి ముందుకు వచ్చిన మిల్లులకు సరిపోను, మరో మూడు, నాలుగు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. ఇక మిగతా ధాన్యం జిల్లాలోని గోదా ముల్లో నిల్వ ఉంచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ ఇ బ్బంది ఉంటే పొరుగు జిల్లాకు ధాన్యం సరఫరా చేయనున్నారు. అయితే బ్యాంక్ గ్యారంటీల నిబంధనతో జిల్లాలోని రైస్‌మిల్లర్లకు నష్టం వాటిల్లుతోందని మిల్లర్ల సంఘం నాయకులు వాపోతున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బ్యాంక్ గ్యారంటీల మెలిక జిల్లాలో మిల్లర్లకు ఇబ్బందికరంగానే మారింది. వానాకాలంలో వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు వస్తున్నప్పటికీ ఇప్పటికీ 13మంది మిల్ల ర్లు మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. అయితే బ్యాంక్ గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ రాసి ఇవ్వడంతోనే ఆ మి ల్లులకు అధికారులు ధాన్యం అప్పగిస్తున్నారు. దీంతో కొంత మేర భారం తగ్గింది. ఈ సీజన్ నుంచి ప్ర భుత్వం మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇస్తేనే ధా న్యం సీఎంఆర్ (కస్టం మిలింగ్ రైస్) ఇస్తామని షర తు పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో చాలా మిల్లులు సీఎంఆర్‌కు దూరంగా ఉన్నాయి. ప్రతీ సీ జన్‌లో జిల్లాలో దాదాపు 55మిల్లులకు పైగా పౌరసరఫరాల శాఖకు సీఎంఆర్ ఇచ్చేందుకు అందుబా టులో ఉండేవి. అయితే బ్యాంక్ గ్యారంటీలకు ఆస క్తి చూపిన వారికే ధాన్యం ఇస్తున్నారు. ఈసారి 3.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే అంచనాతో కొనుగోళ్లు సాగుతున్నా యి. మరోవైపు ఈ సీజన్ నుంచే సన్నాలకు క్వింటా ల్కు రూ.500 బోనస్ వర్తింపజేయడంతో ఈ రకం వడ్లకు డిమాండ్ పెరిగింది. ఇక జిల్లాలో గతం కంటే అధికంగా సన్న రకం సాగు చేశారు. దీంతో ప్రైవేట్‌లోనూ ధర పెరిగింది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రత్యేక యంత్రంతో పరీక్షించాకే కొంటు న్నారు. అయితే కొన్ని సన్నాలను గుర్తించడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 326 కేంద్రాల ఏర్పాటుకు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 317 సెంటర్లల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం గోల్మాల్ చేస్తున్నారని.. జిల్లాలో ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతూ వస్తోంది. గతేడాది వానాకాలం 1.39లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అయితే ఆయా సీజన్లలో మిల్లులకు పంపిన ధాన్యం సకాలంలో పౌరసరఫరాల శాఖకు బియ్యంగా అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ బియ్యం పొందడంలో జాప్యం జరిగింది. కొన్ని చోట్ల ధాన్యమే లేకపోవడం, అమ్ముకోవడం, పలు కారణాలతో ప్రతీ సీజన్లోనూ జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో ఆయా మిల్లులకు నోటీసులు, జరిమానాలు విధించారు. చివరకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి కచ్చితంగా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలనే నిబంధన చాలామంది మిల్లర్లను ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం అందించే ధాన్యం విలువకు కనీసం 10శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఇక గతంలో సీఎంఆర్ బకాయిలున్న మిల్లులకు 25శాతం చొప్పున ఇవ్వాలంటూ షరతు విధించారు. దీంతో జిల్లాలో చాలా మిల్లులు బకాయిలు ఉండటంతో అంతమేర గ్యారెంటీలు ఇవ్వలేక ముందుకు రావడం లేదు. -
క్లుప్తంగా
విదేశాల్లో ఉద్యోగావకాశాలు పాతమంచిర్యాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద ఆరోగ్య, ఆరోగ్యేతర రంగాలలో విదేశాల్లో పనిచేసేందుకు అర్హత గల వారికి శిక్షణ, ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9440051452, 9951 909863 నంబర్లలో సంప్రదించాలన్నారు. 7 నుంచి డీఎడ్ వెబ్ ఆప్షన్లు ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో డీఎడ్‌లో ర్యాంక్‌లు సాధించిన అభ్యర్థులు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ను ఎంచుకోవాలని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు, 13న సీట్ల కేటాయింపు, 13 నుంచి 15 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయడం, 18 న స్లైడింగ్, 21 వరకు కళాశాలల్లో రిపోర్టు చే యాలని పేర్కొన్నారు. ఇదివరకు సర్టిఫికెట్లను పరిశీలించని అభ్యర్థులు 5న సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు. దూడను హతమార్చిన పులి? ఇంద్రవెల్లి: మండలంలోని గట్టెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రైతుకు చెందిన దూడపై పులి దాడిచేసి హతమార్చినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మెస్రం బాదిరావ్కు చెందిన దూడ ఐదు రోజుల క్రితం అటవీప్రాంతానికి మేతకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో గాలించగా ఆలికోరి అటవి ప్రాంతంలో దూడ కళేబరం గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని దూడ కళేబరాన్ని, పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఆర్వో సంతోష్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 2, 3 తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల బాక్సింగ్ పోటీల్లో 3 పతకాలతో మెరిశారు. 46–48 కేజీల విభాగంలో టీ.నిహారిక స్వర్ణ పతకం, 40–42 కేజీల విభాగంలో వివేకవర్ధిని రజత పతకం, 40–44 కేజీల విభాగంలో అనూష కాంస్య పతకం సాధించినట్లు బాక్సింగ్ కోచ్ సాయి తెలిపారు. నిహారిక ఈ నెల 7నుంచి 12 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. డిగ్రీ పరీక్షల్లో 42మంది డీబార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల్లో మంగళవారం నిర్వహించిన మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో వివిధ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ 42 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. వరంగల్ జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్‌లో 35 మంది, ఖమ్మం జిల్లాలో ఆరుగురు డీబార్ అయినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచా రి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి తెలిపారు. -
మెట్రో అంబులెన్స్‌తో..
మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల అంబులెన్స్ సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మెట్రో అంబులెన్స్ సర్వీసు ప్రాజెక్టు తయారు చేశాడు. ఈ సర్వీసు మెట్రోలైన్ ఫిల్లర్స్‌ను ఉపయోగించుకుని ఒక ఫిల్లరు నుంచి మరో ఫిల్లర్‌కు రోప్‌వే ద్వారా అనుసంధానించబడుతుంది. ఒక ప్రదేశంలో ఉన్న మెట్రో ఫిల్లర్ పైకి లిఫ్ట్సాయంతో ప్రమాదానికి గురైన వ్యక్తిని పంపించి అక్కడి నుంచి రోప్‌వేకి కనెక్ట్ చేయబడిన మెట్రో అంబులెన్స్ ద్వారా మరో ప్రదేశానికి సులువుగా తరలించి మరో లిఫ్ట్ ద్వారా అంబులెన్స్ లేదా సమీపంలోని ఆస్పత్రికి చేర్చడం ప్రాజెక్టు ఉద్దేశం. – ఇంద్రవర్మ, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్, గుడిపేట్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
● రహదారిపై కుటుంబ సభ్యుల ఆందోళనకోటపల్లి(చెన్నూర్): ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పానెం గంగయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు సూర్యకిరణ్ (25) మంగళవారం ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా లక్ష్మీపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించే క్రమంలో సిరోంచ నుంచి చెన్నూర్ వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాత్రివరకూ ఆందోళన విరమించలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా నీల్వాయి ఎస్సై శ్యామ్‌పటేల్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఆల్టర్నేట్ ప్రాజెక్టు వాటర్ డ్రైనింగ్ సిస్టమ్
ఒక్కోసారి ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాదకరస్థాయిని చేరుకుంటుంది. ఆనీటిని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతారు. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో గేట్లు జామ్ అయ్యి ఎత్తలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో నీటిని ఏదో విధంగా తోడివేయడం తప్పనిసరి. లేదంటే లోతట్టు ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించాలనే ఆలోచనతో ఆల్టర్నేట్ ప్రాజెక్టు వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ రూపొందించారు. – సాయితేజ, జెడ్పీఎస్ఎస్ జన్నారం -
బాల శాస్త్రవేత్తలు భళా..!
● ఇన్‌స్పైర్‌లో విద్యార్థుల ప్రతిభ ● 15 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికసురక్షిత కొడవలి..సురక్షిత కొడవలితో గడ్డి కోస్తున్నప్పుడు సేఫ్టీ సికిల్ స్విచ్ ఆన్‌చేస్తే పాములు రైతు వైపునకు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. టార్చిలైట్ ఆన్‌లో ఉండడం వలన చీకట్లో కూడా రైతులు సురక్షితంగా గడ్డి కోయవచ్చు. ఈ కొడవలి హ్యాండిల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ పొందటానికి సేఫ్టీ సికిల్ చివర క్యాప్ తెరిస్తే కాటన్, ట్యాబ్లెట్లు కనిపిస్తాయి. – నందం శరణ్య, జెడ్పీహెచ్ఎస్, ఇంక్లైన్–2, బెల్లంపల్లి మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఆలోచనాశక్తిని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 30, డిసెంబర్ 1న జిల్లాస్థాయిలో వైజ్ఞానిక, ఇన్స్పైర్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు తాము రూపొందించిన 149 ప్రాజెక్టులను ప్రదర్శించగా 15 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులపై ‘సాక్షి’ కథనం..జిల్లా కేంద్రంలో ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్న విద్యార్థులుఆటోమెటిక్ టాయిలెట్ క్లీనింగ్ సిస్టంగాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి..పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ ఇలా జనసాంద్రత ఎక్కువగా ఉండేచోట టాయిలెట్లు వాటర్ పోయకుండా వెళ్లడం వలన అపరిశుభ్రంగా ఉంటాయి. ఇలాంటి సమస్యలను నివారించేందుకు ఆటోమెటిక్ ఆప్డేటెడ్ టాయిలెట్ క్లీనింగ్ సిస్టం రూపొందించారు. డోర్ తెరవగానే ట్యాంక్‌నుంచి నీటిసరఫరా జరిగి టాయిలెట్ శుభ్రం అవుతుంది. ఇలా లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు డోర్లు ఓపెన్ కావడంతో రెండుసార్లు నీటితో శుభ్రం చేసేందుకు దోహదపడుతుంది. – శ్రావణ్‌కుమార్, జెడ్పీహెచ్ఎస్ అన్నారం గాలినుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రాజెక్టు ముఖ్యఉద్దేశం. ఈపద్ధతిలో పూర్తిగా పర్యావరణ హిత పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో బొగ్గు, పెట్రోలియం వంటి వాటిని కాకుండా కేవలం వాహనాల చలనం వల్ల వచ్చే గాలి వేగంను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం. ఒక పరికరం ద్వారా సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అరవై నుంచి వంద వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు. – ఆరాథ్య, టీఎస్ఎంఎస్, మంచిర్యాల -
రుణమాఫీ చేయాలని రైతుల ఆందోళన
తలమడుగు(బోథ్): రెండు లక్షలలోపు ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని బాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే మేము సమాచారం పూర్తిగా పంపించామని సమాధానం ఇస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రాథోడ్ షేకు, జాదవ్ మణిరాం, రాథోడ్ శివలాల్, చౌహాన్ పరశురాం, రఘుపతి, వెంకట్‌రెడ్డి, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
పూలకోసం వెళ్లి.. శవమై
● చెరువులో నీటమునిగి వ్యక్తి మృతిచెన్నూర్: పూలకోసం వెళ్లిన వ్యక్తి శవమైన వచ్చిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బట్టిగూడెం కాలనీకి చెందిన పందుల రమేశ్ (40), జిట్టవేన రాజబాపు మంగళవారం తామరపూలకోసం పెద్ద చెరువుకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిన రమేశ్ కాలికి తామరచెట్టు వేర్లు చుట్టుకుని అడుగుభాగంలో ఇరుక్కుపోయాడు. గమనించిన రాజబాపు కేకలు వేయగా పలువురు ఈతగాళ్లు చెరువులోకి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
మంచిర్యాలకు చేరుకున్న హ్యాండ్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: గత నెల 29న నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 46వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం మంచిర్యాలకు విచ్చేసిన జట్టుకు ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, కార్యదర్శి కనపర్తి రమేశ్ ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జట్టుతో సెమీఫైనల్లో తలపడి 17–05 గోల్స్ తేడాతో గెలుపొంది, ఫైనల్లో మహబూబ్‌నగర్ జిల్లాతో పోరాడి 21–14 గోల్స్ తేడాతో చిత్తుచేసి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. -
పెండింగ్ బిల్లుల పంచాయతీ
● ప్రజావాణిలో నిరసన తెలిపిన సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మల్‌చైన్‌గేట్: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సర్పంచులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజావాణి నిర్వహించే కార్యాలయం వైపు ఒక్కసారిగా దూసుకెళ్లారు. కలెక్టర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులను అప్పుల ఊబి నుంచి బయటపడేలా ఆదుకోవాలని కోరారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గత నవంబర్ 27న పెంబి సర్పంచ్ పూర్ణచందర్‌గౌడ్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తుచేశారు.