Shaheen Afridi
-
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ షా అఫ్రిది, నసీం షా తలా మూడు వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించగా, హారిస్ రౌఫ్ రెండు, హస్నన్ ఒక వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ సీన్ అబాట్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు రెగ్యూలర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు. వీరిందరూ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఆఖరి వన్డేకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది.చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో Congratulations to pakistan winning series against australia.All World class field. Most hyped team Australia in the world 😁 #PAKvsAUSpic.twitter.com/AiwacybfvT— JassPreet (@JassPreet96) November 10, 2024 -
PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్ అఫ్రిది
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో అఫ్రిది మరో 12 వికెట్లు తీస్తే.. పాకిస్తాన్ ఆల్‌టైమ్ గేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొడతాడు. వకార్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో 48 వికెట్లు ఉన్నాయి. ఆసీస్‌పై వకార్ ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. షాహీన్ కూడా ఓ సారి ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ఇవాళ తొలి వన్డే ఆడింది. ఈ పర్యటనలో పాక్ మరో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో షాహీన్ మరో 12 వికెట్లు పడగొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ పర్యటనలోనే షాహీన్ వకార్ యూనిస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.షాహీన్ ఆల్‌రౌండ్ షోమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో షాహీన్ అఫ్రిది ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ బ్యాట్‌తో, బంతితో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. -
Aus vs Pak: ఆసీస్‌తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్‌లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్‌తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్‌ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్‌ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అవుట్.. జట్టులో నో ఛాన్స్! అయినా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా.. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. ఇక పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ సారథి బాబర్ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్నెస్ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఆదివారం వెల్లడించాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్ జమాన్ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్నెస్ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్ జమాన్ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ ఫఖర్ జమాన్. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
Pak Vs Eng: పాక్ తుదిజట్టు ఇదే.. సూపర్ స్టార్ రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆమీర్బంగ్లాదేశ్తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్‌లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.ఆ ముగ్గురూ అవుట్అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్‌తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవుఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్‌తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుపాకిస్తాన్సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
పాక్‌కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్‌కు దూరం?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుకు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్ 2024లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో అతడి మెకాలికి గాయమైంది. డాల్ఫిన్స్ ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్‌కు దూరమయ్యాడు.గతేడాది కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. షాహీన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లే ఆఫ్స్‌కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సమయానికి అఫ్రిది ఫిట్నెస్ సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించనుంది. ఆక్టోబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. -
మోర్నీ మోర్కెల్ పనికిరాడన్నట్లు చూశారు: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్‌లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరుస వైఫల్యాలతో..గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లనూ ఇదే తంతు.ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.టీమిండియా వరుస విజయాలతోమరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్‌కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్‌లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.బౌలింగ్ కోచ్గాటీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్ -
Pak vs Ban: షాహిన్ ఆఫ్రిదిపై వేటు వేయడానికి కారణం అదే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బతీసినందుకే అతడిని జట్టు నుంచి తప్పించారనే వదంతులు వస్తున్నాయి. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి అనంతరం.. షాన్ మసూద్- షాహిన్ ఆఫ్రిది మధ్య సఖ్యత లోపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.కొట్టుకునే దాకావెళ్లిన ఆటగాళ్లుషాహిన్ భుజంపై మసూద్ చేయి వేయగా.. అతడు విసురుగా తీసివేసిన దృశ్యాలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకావెళ్లగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్ ఆఫ్రిది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఘోర పరాజయం నేపథ్యంలోకాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు... టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా... లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కోచ్ చెప్పిందిదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ మాట్లాడుతూ.. షాహీన్ షా భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ విరామం అతడికి ఉపయోగ పడుతుందనిఅన్నాడు. ‘షాహిన్‌తో చర్చించాం. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అత్యుత్తమ కూర్పుతో బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గెలెస్పీ పేర్కొన్నాడు. అయితే, సహచర ఆటగాళ్ల పట్ల షాహిన్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.చదవండి: లక్షల కోట్లకు వారసుడు.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే! -
బంగ్లాతో రెండో టెస్టు.. షాహీన్ అఫ్రిది దూరం! అతడికి ఛాన్స్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రావల్పండి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడా ప్రిలిమనరీ జట్టును పాకిస్తాన్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది దూరమయ్యాడు. ఇటీవలే అఫ్రిది భార్య అన్షూ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి పాక్ జట్టు మెనెజ్‌మెంట్ పితృత్వ సెలవు మంజారు చేసింది. ఇక అతడి స్ధానంలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఈ 12 మంది సభ్యుల జట్టులో పేసర్ మీర్ హమ్జాకు కూడా చోటు దక్కింది. అయితే మీర్ హమ్జా బెంచ్‌కే పరిమిత మయ్యే అవకాశముంది. అర్బర్ ఆహ్మద్‌కు ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే తొలి టెస్టులో చేసిన తప్పిదాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేయకూడదని పాక్ భావిస్తోంది. మొదటి టెస్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్తాన్ బరిలోకి దిగింది. అందుకు ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్‌కోచ్ గిల్లెస్పీ మరోసారి అటువంటి ఘోర తప్పిదం చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది."రావల్పిండి పిచ్ పరిస్థితులపై మా అంచనా ఆధారంగా 12 మంది సభ్యుల జట్టులో అబ్రార్ అహ్మద్‌కు చోటు ఇచ్చాము. అయితే మేము ఆడాల్సిన వికెట్‌ను ఇంకా పరిశీలించలేదని" గిల్లెస్పీ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడ.బంగ్లాతో రెండో టెస్టుకు పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, మహమ్మద్ అలీ, మీర్ హమ్జా -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్?
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్రయ్యాడు. అతడి భార్య అన్షా శనివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు అలీ యార్గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అఫ్రిది కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోషల్ మీడియా వేదికగా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహీద్ అఫ్రిది కుమార్తే.రెండో టెస్టుకు దూరం..?కాగా షాహీన్ అఫ్రిది ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తరపున ఆడుతున్నాడు. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కరాచీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు
-
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు: షాహీన్ షా అఫ్రిది
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో మెల్బోర్న్ వేదికగా పాక్‌పై విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను అఫ్రిది కొనియాడాడు.అంతర్జాతీయ క్రికెట్లో తను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ కోహ్లిదే అని ఈ పాక్ స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. మాపై కోహ్లి (58 బంతుల్లో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నా కెరీర్లోనే ఇప్పటివరకు ఇంతకంటే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూడలేదు. ఆ రోజు హ్యారీస్ రవూఫ్ వేసిన అద్భుతమైన బంతిని కోహ్లి బౌలర్ తలపై నుంచి కొట్టిన సిక్స్ నమ్మశక్యం కానిది" అంటూ స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.వన్ మ్యాన్ కింగ్ షో..కాగా కోహ్లి కెరీర్లో మెల్బోర్న్లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా మిగిలుపోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా . 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హ్యారీస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్‌లు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా నిలిచిపోయాయి. ఆ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
Pak vs Ban: పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్‌కు చోటు
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు పేసర్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా ఒక్కడికే స్థానం ఇచ్చారు సెలక్టర్లు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు షాన్ మసూద్. అయితే, ఆ టూర్ అతడికి చేదు అనుభవం మిగిల్చింది. అతడి కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది.బంగ్లాపై పైచేయి బంగ్లాతో ఇప్పటి వరకు 13 టెస్టుల్లో పన్నెండు గెలిచి ఘనమైన టెస్టు రికార్డు కలిగి ఉన్నా.. పాకిస్తాన్ ఈ సిరీస్‌లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే మరింత వేగంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌తోనే ఆస్ట్రేలియన్ జాసన్ గిల్లెస్పి పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.యువ సంచలనానికి చోటుఇక ఆగష్టు 21 నుంచి రావల్పిండి వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం పాకిస్తాన్ సోమవారమే తమ తుదిజట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా అబ్దుల్ షఫీక్, సయీమ్ ఆయుబ్.. వన్‌డౌన్‌లో షాన్ మసూద్ ఆడనున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన సౌద్ షకీల్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ఆ తర్వాతి స్థానాల్లో ఆడనున్నారు.ఇక పేస్ విభాగంలో షాహిన్ ఆఫ్రిది, నసీం షా, యువ సంచలనం ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ బరిలోకి దిగనున్నారు. కాగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా పాక్ తరఫున అరంగేట్రం చేసిన షెహజాద్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మెరిశాడు. అయితే, ఇప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే.. బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత 14 మందికి తగ్గించింది. ఆమీర్ జమాల్ వెన్నునొప్పి కారణంగా దూరం కాగా.. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను బంగ్లాదేశ్-ఎ జట్టుతో బరిలోకి దించనుంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తుదిజట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఇషాన్‌కు టీమిండియాలో నో ఛాన్స్! -
అఫ్రిది, షమీ కాదు.. అతడే నా ఫేవరెట్ బౌలర్: వసీం అక్రమ్
భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం తరంలో బుమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అని అక్రమ్ కొనియాడాడు. బుమ్రా టీమిండియాలో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వరల్డ్ క్రికెట్లో టీమిండియా నెం1 జట్టుగా ఎదగడంలో బుమ్రాది కీలక పాత్ర. అంతేకాకుండా గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సైతం తన అద్బుత ప్రదర్శనతో బుమ్రా అందించాడు. తాజాగా అక్రమ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ బౌలర్ ఎవరన్న ప్రశ్న వసీంకు ఎదురైంది. వెంటనే అక్రమ్ ఏమీ ఆలోచించకుండా బుమ్రా పేరు చెప్పాడు.వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన వారు లేరు. ప్రస్తుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందున్నాడ. అతడి బౌలింగ్ ఒక అద్భుతం. బంతితో అతడి కంట్రోల్ చేసే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.జస్ప్రీత్ బౌలింగ్‌లో ఎక్కువగా వేరియేషన్స్ ఉంటాయి. తన బౌలింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. కొత్త బంతితో కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. న్యూబాల్‌తో బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడి ఔట్స్వింగర్లను ఎదుర్కొవడం చాలా కష్టం.చాలా సార్లు నేను ఔట్స్వింగర్లను బౌలింగ్ చేసినప్పుడు నియంత్రణ కోల్పోయి పరుగులు ఇచ్చేవాడిని. కానీ బుమ్రా మాత్రం అలా కాదు. బంతితో పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. కొత్త బంతితో బుమ్రా నాకంటే బెటర్‌గా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడని అమ్రిక్క్రిక్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ పేర్కొన్నాడు. కాగా వసీం తమ జట్టు స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదిని తన అభిమాన బౌలర్‌గా ఎంచుకోకపోవడం గమనార్హం. -
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. షాహీన్ అఫ్రిది రికార్డు బద్దలు
ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్ 100 వికెట్స్ రికార్డు నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ పేరిట ఉంది. లామిచ్చేన్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్ క్రుగెర్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్ ఇలియాస్ (68), ఖలీద్ కైల్ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ భట్ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసల్ 2, బెన్ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్ దక్కించుకున్నారు.వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లుబిలాల్ ఖాన్- 49 మ్యాచ్లుషాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52షేన్ బాండ్- 54ముస్తాఫిజుర్ రెహ్మాన్- 54వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లుసందీప్ లామిచ్చేన్- 42రషీద్ ఖాన్- 44బిలాల్ ఖాన్- 49షాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52 -
పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.సంస్కరణలకు శ్రీకారంఅదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో లాహోర్‌లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.ఆ రెండిటి ఆధారంగాక్రికెటర్ల ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్‌లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.కోచ్‌తో అతడి గొడవకాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వెంటనే అతడు కోచ్‌కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్‌గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు -
తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్ దూరం
పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పి ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందే పాక్ క్రికెట్ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ సమయంలో బాబర్‌తో పాటు కోచ్‌లతోనూ షాహిన్ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్‌కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్ యూసఫ్‌తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు షాహిన్ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.కాగా పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.