-
ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్!?
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని పరోక్షంగా కోహ్లిపై రాయుడు విమర్శలు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో నిష్క్రమించినప్పటకి.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ నిలిచాడు.ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు కంగ్రాట్స్. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. కాగా విరాట్‌పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు. ఎలిమేనిటర్‌లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్‌ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్‌కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. -
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్) -
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కేకేఆర్.. ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్కు రూ.13 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్‌కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్‌కు చెరో రూ. 10లక్షల ప్రైజ్‌మనీ లభించింది.⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో16 మ్యాచ్‌లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. -
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి అనంతరం కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సందర్భంగా కలిశాను. బహుశా దక్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదే మొదటి సారి. అతడు చాలా సరదాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్-2022లో నేను పెద్దగా రాణించలేదు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్ నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ, ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. -
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
టీమిండియా దిగ్గజ బ్యాటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు మాజీ క్రికెటర్ అంబటి రాయుడుపై మండిపడుతున్నారు. కోహ్లిపై విద్వేష విషం చిమ్మటం ఇకనైనా మానుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభం నుంచి వరుస ఓటముల పాలైనా.. తర్వాత తిరిగి పుంజుకుని అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది ఆర్సీబీ. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో సీఎస్కేను చిత్తు చేసింది.అంబరాన్నంటిన సంబరాలుఈ క్రమంలో కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికాలోనూ ఆర్సీబీ విక్టరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. సీఎస్కేను విమర్శిస్తూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు.ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో చెన్నై ఆటగాళ్లు ఐదు అంటూ తాము ఐదుసార్లు ట్రోఫీ గెలిచామన్నట్లుగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు..సీఎస్కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లేనా?‘‘ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్టు నుంచి మీకొక రిమైండర్’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మండిపోయింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే రాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ చేరినంత మాత్రాన.. సెలబ్రేషన్స్ విషయంలో రెచ్చిపోతే ఎవరూ టైటిల్ గెలవరు. కేవలం సీఎస్కేను ఓడిస్తే ట్రోఫీ గెలిచినట్లే అని భావించకూడదు’’ అని మరోసారి పుండు మీద కారం చల్లాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కోహ్లి ఫ్యాన్స్ అంబటి రాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 వరల్డ్‌కప్‌నకు ఎంపిక కాని కారణంగా ఇప్పుడు ఇలా కోహ్లిని, అతడి టీమ్‌ను టార్గెట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకున్న రాయుడుఅయినప్పటికీ అంబటి రాయుడు వెనక్కి తగ్గలేదు. మరోసారి కోహ్లి ఫ్యాన్స్‌తో పెట్టుకుని చివాట్లు తింటున్నాడు. తాజాగా.. ‘‘ఆర్సీబీకి మద్దతుగా ఏళ్లకు ఏళ్లుగా ఆ జట్టుతోనే ఉన్న అభిమానులను చూసి నా గుండె తరుక్కుపోతోంది.మేనేజ్మెంట్, కెప్టెన్లు కేవలం వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి ఉంటే ఇప్పటికే ఆర్సీబీ ఎన్నోసార్లు టైటిళ్లు గెలిచేది.ఇప్పటికైనా జట్టు ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా భావించే ఆటగాళ్లను తీసుకోవాలని మేనేజ్మెంట్పై ఒత్తిడి తీసుకురండి. అలా అయితే మెగా వేలం నుంచే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది’’ అని అంబటి రాయుడు కోహ్లి, ఆర్సీబీ ఫ్యాన్స్‌పై ఎక్స్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించాడు.కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ఇందుకు స్పందించిన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ‘‘61 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మీరు.. 80 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన కోహ్లి గురించి ఇలా మాట్లాడటం అస్సలు బాగాలేదు సర్!.. ఒక్కసారి ఐపీఎల్‌ను పక్కన పెడితే మీ కెరీర్లో మీరేం సాధించారో చెప్పండి. కోహ్లి 2011 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడు. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. రిటైర్మెంట్పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరేం చేశారు?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.చదవండి: నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య దీపిక భావోద్వేగం -
Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీలో కోహ్లి రెస్టారెంట్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్.. వన్ 8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్ 8 కమ్యూన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టంనగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ 8 కమ్యూన్లో కోహ్లి భాగస్వామి వర్తిక్ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్ ఓపెన్ చేశాం.అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! ఇక్కడి ఫుడ్, సిటీ వైబ్.. అన్నీ తను చాలా ఎంజాయ్ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.అతడి ఫేవరెట్ డిష్ ఇదేఅదే విధంగా.. గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్ తిహారా పేర్కొన్నారు.ఇక విరాట్ కోహ్లి వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్ డిమ్సమ్ అతడి ఫేవరెట్ డిష్ అని తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్‌మెషీన్ కోహ్లి ఫిట్నెస్, డైట్ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.భోజనం బాగుందంటూ కితాబులుఇదిలా ఉంటే.. వన్ 8 కమ్యూన్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇప్పటికే కింగ్ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఫుడ్, పార్టీ ప్లేస్ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్ -
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
-
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
-
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్.వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్‌కు ఒకే ఒక్క అడుగు దూరం..ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?ఈ ఎడిషన్‌లో కోహ్లి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.ఆర్సీబీని వీడటమే ఉత్తమంఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్‌క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రాండ్‌వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్‌లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.ఢిల్లీకి ఆడాలివచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు బెక్హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
ఆర్సీబీ అవుట్ కోహ్లీ రికార్డ్
-
RR Vs RCB Highlights Photos: ఆర్సీబీ కల చెదిరే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విక్టరీ (ఫొటోలు)
-
Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్‌నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్‌లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్‌కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు ప్రీ- ప్రెస్‌మీట్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్‌లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
Virat Kohli: రాజస్తాన్‌తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.రాజస్తాన్ రాయల్స్‌తో అమీ తుమీఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది.ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి 708 పరుగులు సాధించాడు.తద్వారా టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్‌కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. బేసిక్స్ మర్చిపోనుకంప్యూటర్ అనాలసిస్‌తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్‌ను నేనెప్పుడూ మర్చిపోను. వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
-
కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్మ్యాన్గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్. ప్రతి ఐపీఎస్ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్ కప్ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్లో ఉందంటే..విరాట్‌ని డిఫెరెంట్ డిఫెరెంట్ స్టయిల్ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్ నైపుణ్యంతో విరాట్ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యి స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్ని ఎంచుకున్నట్లు హకీమ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్ హెయిర్లెస్గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్ స్టయిల్ని సెట్ చేశాడు హకీమ్. ఇక హకీమ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్ చేస్తాడు.కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్ స్టయిల్ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్‌కి విరాట్ కొత్త హెయిర్ స్టైల్ అని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.New hairstyle for T20 WC🙂👍🏻#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 16, 2024 (చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?) -
SRH Vs PBKS: చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 209.42 స్ట్రైక్ రేటుతో 467 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. -
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అంచనాలు తలకిందులు చేస్తూ అద్బుతం చేసింది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇవేనంటూ సాగిన విశ్లేషణలను తలదన్నుతూ విలువైన విజయం సాధించింది.అసలు టాప్-4లో నిలిచే జట్టే కాదంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలుపొంది జయభేరి మోగించింది.సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఆద్యంతం ఆసక్తి రేపిన పోరులో పైచేయి సాధించిన ఆర్సీబీ టోర్నీలో ముందుకు సాగేందుకు అర్హత సాధించింది.కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక బెంగళూరు జట్టు ముఖచిత్రమైన విరాట్ కోహ్లి ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ.. ‘‘సాధించాం’’ అన్నట్లుగా ఉద్వేగానికి లోనయ్యాడు.కోహ్లిని చూస్తూ అనుష్క శర్మ సైతం.. ‘అవును’ అన్నట్లుగా ఆనంద భాష్పాలు రాలుస్తూ భర్తను చీర్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విరుష్క జోడీని చూస్తూ తాము ఉద్వేగానికి లోనయ్యామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ కోహ్లిదేకాగా ఈ సీజన్లో కోహ్లి అదరగొట్టినా అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్ట్రైక్‌రేటు గురించి సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ అతడిని విమర్శించారు. ఇందుకు కోహ్లి కూడా ధీటుగానే బదులిచ్చాడు.అయినప్పటికీ జట్టు కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకపోతే ఏమిటన్న బాధ మాత్రం అతడిలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాటి విజయంతో కోహ్లి ఇలా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 708 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. చదవండి: RCB Vs CSK: నా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అతడికి అంకితమిస్తున్నా: డుప్లిసిస్Aaarrr Ceeee Beeee ❤️👏6️⃣ in a row for Royal Challengers Bengaluru ❤️They make a thumping entry into the #TATAIPL 2024 Playoffs 👊Scorecard ▶️ https://t.co/7RQR7B2jpC#RCBvCSK | @RCBTweets pic.twitter.com/otq5KjUMXy— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
No Headline
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
వేప చెట్టుకు మామిడి కాయలు.. మరో వింత
మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి
మూడు దశల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు
చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్ ప్రముఖులు
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement