YSR Cheyutha Scheme
-
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
మన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు..!
-
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
వైఎస్ఆర్ చేయూతతో మహిళల జీవితాల్లో వెలుగులు
-
మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
సుస్థిర ప్రగతే లక్ష్యం ఆపొద్దు ఈ పయనం
‘సమాజ పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తూ రాష్ట్రాభివృద్దికి బాటలు వేసింది. పేద, మధ్య తరగతి వారికి మంచి జరగాలంటే పాలకుడికి అనుభవం ఉంటే సరిపోదు. మంచి మనస్సు, వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం, సామాజికం, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అనేక అవకాశాలను కల్పించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టింది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పేద మహిళా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం ‘వైఎస్సార్ చేయూత పథకం’ అమలు చేసింది. ఈ రెండు పథకాలు లక్షలాది కుటుంబాల వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం సొమ్మును నాలుగు ధపాలుగా వారికి అందిస్తామ’ని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరిగి ఎన్నికల జరిగే సమయానికల్లా ఆక్షరాల అమలు చేసి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి నూరు శాతం బ్యాంకులకు తమ అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ దశలో దేశంలో ఇతర రాష్ట్రాల పొదుపు సంఘాలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ♦ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నాన్ డీబీటీ ద్వారా రూ. 2,72,811 కోట్లు సాయం అందించింది. ♦ ఇంతకు ముందు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం అంత భారీగా స్థాయిలో పేద మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ♦ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చే సుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించింది. ♦ ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా అంతర్జాతీయ సంస్థలు, పేద మహిళల మధ్య సమన్వయం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్త (సెర్ప్) కార్యాలయంలో ప్రత్యేక విభాగం కొనసాగిస్తున్నారు. అతివలను అందలం ఎక్కించాలనే.. ♦ 57 నెలల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన సహాయం, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కువడానికి అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలోని 18,37,568 మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ♦ అంతకు ముందు లేనివి, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాలకు అందించిన తోడ్పాటుతో 54 శాతం మంది రూ. 5 వేలకు పైనే అంటే ఏడాదికి రూ. 60 వేలకు పైబడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ♦ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 14,01,519 మంది పొదుపు సంఘాల మహిళలు ఏటా రూ. లక్ష చొప్పున ఆదాయం పొందుతూ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నారు. ♦ మరో 31,04,314 మంది ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ. 5 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ. లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు ♦ 2021–2023 ఆర్థిక సంవత్సరంలో 1,126 మంది పొదుపు సంఘాల మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ఏర్పాటు చేసుకుని భావి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ♦ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ,ఎస్టీ మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తే ప్రత్యేకంగా ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో నైపుణ్యాలపై శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తోంది. స్వయం కృషి ‘వనిత’ర సాధ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 250 స్వయం సహాయ సంఘాల మహిళలంతా కలిసి కార్పొరేట్‌కు దీటుగా చేయూత మహిళా మార్ట్ పేరిట షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ కేవలం రూ.210 పెట్టుబడితో దీనిలో భాగస్తులయ్యారు. కేవలం పది నెలల్లోనే ఈ మార్ట్ మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. గత సంక్రాంతి సీజన్లో రూ.రెండులక్షల వరకు అమ్మకాలు జరిపి అందరినీ అబ్బురపరిచింది. డాంబికాల ‘డప్పు’తో సరి ♦ 2014 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ♦ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే డ్వాక్రా అప్పులు మహిళలు బ్యాంకులకు కట్టొద్దని గొప్పగా డప్పు కొట్టారు. ♦ ఆయన చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మందికి పైగా తమ అప్పులు కట్టలేదు. ♦ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దీనివల్ల ఏకంగా 18.36 శాతం పొదుపు సంఘాలు (అంటే దాదాపు 14 లక్షల మందికి సంబందించిన సంఘాలు) ఎన్పీఏ (బ్యాంకుల వద్ద రుణ ఎగవేతదారు)లుగా ముద్రవేయించుకున్నాయి. నూరుశాతం మహిళా సాధికారత మహిళా సాధికారత అనే మాట గతంలో వినడం తప్ప సాధించింది లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారత నూటికి నూరుశాతం అమలవుతోంది. మహిళలు సంక్షేమ పరంగా, రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ ప దవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. – తానేటి వనిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజకీయంగా ఇంకా చైతన్యం రావాలి మహిళలు రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావాలి. గృహిణిగా పరిమితం కాక సమాజంలో అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉండాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సంక్షేమంతోపాటు రాజకీయంగా మహిళలకు పురుషులతోపాటు సమభాగం కల్పిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళకు కేటాయించడం అభినందనీయం. –ఘంటా పద్మశ్రీ, చైర్పర్సన్, పశ్చిమగోదావరి జెడ్పీ ధైర్యంగా ముందడుగు వేయాలి మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలి. మహిళలు మానసికంగా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం బలంగా ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపదలో ఉన్నవారికి, అన్యాయం జరిగిన మహిళలకు మహిళా కమిషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. – బూసి వినీత, మహిళా కమిషన్ సభ్యురాలు -
‘చేయూత’ పండుగ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మనందరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళా దినోత్సవం ముందు రోజు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదన్నారు. 45 – 60 ఏళ్ల వయసున్న మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అనకాపల్లి జిల్లాలోనే నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సాయంతో ఎదిగిన మహిళలంతా తమ విజయగాథలను వివరిస్తూ రానున్న 14 రోజుల పాటు సచివాలయాలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు గతంలో మేనిఫెస్టోలో అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మండిపడ్డారు. వారి పేరు చెబితే 8 రకాల మోసాలు, దగా గుర్తురాగా మన ప్రభుత్వం పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబును చూస్తే విశ్వసనీయతలేమి గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చేలా కార్లను మార్చినట్లు భార్యలను మార్చే వ్యవహారం గుర్తుకొస్తుందని విమర్శించారు. వారిని నమ్మితే కాటేసే పాముని నమ్మినట్టేనని, తినేసే పులిని ఇంటిని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపైనర్లుగా నిలిచి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్ ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే.. 14 రోజులు పండుగ వాతావరణంలో.. మహిళా సాధికారతకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించే వైఎస్సార్ చేయూతలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకుంటారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి? అనే స్ఫూర్తిదాయక కధనాలను ప్రతి సచివాలయం, ప్రతి మండలంలో చర్చించుకునేలా తెలియచేయాలని ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ కోరుతున్నా. 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు? వారికి తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు. ఇంటిని నిలబెడుతూ.. ప్రతి అక్కచెల్లెమ్మ సొంత కాళ్లపై నిలబడేలా క్రమం తప్పకుండా చేయూత సాయంతోపాటు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, హిందుస్తాన్న్ లీవర్ తదితర కంపెనీలతో అనుసంధానించి తోడ్పాటునిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రూ.18,500 చొప్పున ఇస్తోంది కాబట్టి కంపెనీలు, బ్యాంకులు కూడా వారికి అండదండలు అందించాయి. 1.69 లక్షల మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు నిర్వహిస్తుండగా 85,630 మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. 3,80,466 మంది గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు. ఇంకో 2,59,997 మంది రకరకాల వ్యాపారాలతో సొంత కాళ్లపై నిలబడ్డారు. 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. నాలుగు విడతల్లో రూ.19,189 కోట్లు.. ఒక్క వైఎస్సార్ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. వారికి ఒక మంచి తమ్ముడిగా, అన్నగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రుణపడి ఉంటా. నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 వేల కోట్ల మేర లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను చూస్తే మరో రూ.56,188 కోట్ల మేర కూడా మంచి జరిగింది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలని ప్రతి అడుగూ ముందుకు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ వారికి రిజర్వేషన్ కల్పించిన తొలి ప్రభుత్వం ఇదే. గత ప్రభుత్వానికి ఇలా మేలు చేసిన చరిత్రే లేదు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. వసతి దీవెన మొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ వారి ఖాతాలకే డబ్బులను జమ చేసి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. నాడు ఛిన్నాభిన్నం.. నేడు నెంబర్ వన్.. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మనం మళ్లీ ఊపిరి పోశాం. నాడు చంద్రబాబు రుణమాఫీ మోసానికి పొదుపు సంఘాలన్నీ ఏకంగా 18.36 శాతం ఎన్పీఏలు, ఔట్ స్టాండింగ్‌లుగా చిన్నాభిన్నమయ్యాయి. ఇవాళ ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే ఉన్నాయి. ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచాయి. వైఎస్సార్ చేయూత ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఏకంగా రూ.19,190 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం అందించింది. కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే ప్రతి అడుగులో అండగా నిలిచిన ఘనత మనది.గతానికి, ఇప్పటికి తేడా చూడమని కోరుతున్నా. మాట ఇచ్చిన చోటే... అత్యంత బాధ్యతగా వ్యవహరించే 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారే కాకుండా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చేశాం. క్రమం తప్పకుండా ఏటా రూ.18,750 చొప్పున వారి చేతిలో పెట్టి జీవనోపాధి మార్గాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నాం. చేయూత ద్వారా మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో నాడు చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళి్టతో నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తూ ఇదే అనకాపల్లి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు.. సొంతిల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందచేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చారా అంటే ఇచ్చింది సున్నా. తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం సచివాయాల్లో మహిళా పోలీసును నియమించాం. దిశ యాప్, భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలాంటి వ్యవస్థను తెచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలో ఏకంగా 50 శాతం వరకు మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే సేవలందిస్తున్నారు. పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి.. చంద్రబాబు పాలనకు మన పాలనకు వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు తెలియాలంటే గత పదేళ్లుగా మీ బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకుని ఒక్కసారి పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంటుకు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయో మీరే గమనించండి. లక్షాధికారులైన మహిళల జాబితాలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం కూడా చెప్పింది. మేనిఫెస్టోలో హామీలలో 99% అమలు చేసి మరోసారి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం మనదే. ఈ 58 నెలల కాలంలో మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరుతున్నా. చెడిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఆ పని చేయలేడు. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే సాధ్యం. బాబు – దత్తపుత్రుడు 8 మోసాలివిగో.. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది. 2014లో చంద్రబాబు – దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? ► రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు. అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్ వచ్చేది. ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు. ► ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు. ► మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ► ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. ► మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. ► పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ► బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు.. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు. అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం. అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా. -
వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్
-
బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి జిల్లా: చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ‘‘2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు. కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్‌కారు ఇస్తామంటారు. చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ♦ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతున్నాం ♦అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని మీ అందరిక సమక్షంలో అనకాపల్లి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ♦భారతదేశ చరిత్రలోనే, ఉన్న 28 రాష్ట్రాల్లో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా ♦మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తర్వాత వైయస్సార్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 4560 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజులపాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులందరూ పాలు పంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ♦ఈ కార్యక్రమంలో అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి అన్న కథలు ప్రతి సచివాలయంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరూ చర్చించుకొనేలా, స్పూర్తిదాయకమయ్యేలా పండుగ వాతావరణంలో ప్రతి అక్కచెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడాలని కోరుతున్నా ♦గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. ♦45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు, వారి కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, వారికి తోడుగా, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. ♦ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా. 4560 మధ్య వయసున్న నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్పూర్తిగా వారి గురించి ఆలోచన చేసి, అదే అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.18750 చేతిలో పెడుతూ, నాలుగేళ్లలో ఏకంగా 75000 ఆర్థిక సాయం నా అక్కచెల్లెమ్మలకు చేస్తానని మాట ఇచ్చాను. ♦ఇదే జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో ఇదే చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా 75 వేలుగా ఇచ్చే కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే చేస్తున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా. ♦ప్రతి అక్కచెల్లెమ్మకూ క్రమం తప్పకుండా సాయం చేస్తూ, బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ, మల్టీ నేషనల్ కంపెనీలతో తోడ్పాటునిస్తూ, ఏకంగా 1.69 లక్షల మంది కిరాణా షాపులు అక్కచెల్లెమ్మలు పెట్టుకుని నడుపుతున్నారు. ♦85630 మంది చెల్లెమ్మలు వస్త్రవ్యాపారం, 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొన్నారు. ♦1,34,514 మంది అక్కచెల్లెమ్మలు మేకలు కొన్నారు. ♦ 88,923 మంది అక్కచెల్లెమ్మలు ఫుడ్ ప్రాడక్ట్స్ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారు. ♦3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారు ♦మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఇంటిని కూడా నడుపుతున్నారంటే అక్షరాలా 16.55,991 మంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ♦ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ప్రతి అక్కచెల్లెమ్మ కనీసం రూ.610 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ, తన కుటుంబానికీ తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించాలి. ♦వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు 22,98,931 మంది నా అక్కచెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు ఈరోజు నుంచి మరో 14 రోజులపాటు పండుగ వాతావరణంలో మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తున్నాడు. ♦దీంతో నా అక్కచెల్లెమ్మలకు ఒక్క వైయస్సార్ చేయూత ద్వారా ఏకంగా 75000 పెట్టినట్లయింది. ♦వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి పంపించినట్లయింది. ♦ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి. ♦నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటాను ♦ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు. ♦ఇదే అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే మరో రూ.56,188 కోట్లు కూడా మంచి జరిగింది ♦ప్రతి అడుగూ కూడా మీ బిడ్డ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆలోచన చేస్తూ విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రతపరంగా వారందరి సాధికారత లక్ష్యంగా గొప్పగా అడుగులు వేశాం ♦గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి అక్కచెల్లెమ్మ, వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా ♦నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ, నామినేషన్ పోస్టులు, కాంట్రాక్టులు, 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ♦గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేయాలని మనసే లేదు ♦చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా స్కూళ్ల రూపురేఖలు మీ బిడ్డ మారుస్తాడు. అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తూ అండగా నిలబడిన ప్రభుత్వం ♦ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎక్కడా చూసిందీ లేదు. కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిన మార్పు ♦గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు ♦గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, పెద్ద చదువులు చదవాలని, ఏ తల్లీదండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు ♦పిల్లల తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెనమొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయినీ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు ♦దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది. ♦వైఎస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం ♦గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగులుగా 18 శాతం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. ♦అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి. ♦గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది. ♦గతానికి, ఇప్పటికి తేడా చూడమని మిమ్మల్ని కోరుతున్నా ♦గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి ♦వైఎస్సార్ చేయూత ద్వారా 4560 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ ♦తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ♦గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? ♦4560 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ♦గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు ♦సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. ♦చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే... ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లు. ♦చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించాం ♦ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమే ♦1.30 కోట్ల అక్కచెల్లెమ్మలు వాళ్ల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ♦ఏ అక్కచెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, పోలీస్ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే ♦ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి తోడుగా నిలబడినందువల్ల మంచి జరిగింది. ♦గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లోగానీ, మన వాలంటీర్ వ్యవస్థ గానీ, ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా అందులో ఏకంగా 50 శాతం చదువుకున్న మన ఇరుగుపొరుగు చెల్లెమ్మలే ♦గతంలో ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అందే పరిస్థితి ఉంటుందని 58 నెలల కిందట మీకు ఎవరైనా చెబితే నమ్మి ఉండేవారా? ఈ రోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, రూ.2.65 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అందింది ♦గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ♦మీ కుటుంబ సభ్యులతో మీరంతా బ్యాంకులకు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల మీ స్టేట్మెంట్ ఇవ్వమని అడగండి. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన, 5 సంవత్సరాల మీ బిడ్డ పాలన ♦బ్యాంకు స్టేట్మెంట్లు చూసినప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంటుకు వచ్చింది ఒక్కరూపాయి అయినా కనిపిస్తుందా? ♦అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంటులోకి వచ్చిందో మీరే గమనించండి. ♦ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది ♦లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. ♦మహిళా సాధికారత పరంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం ♦ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి, విశ్వసనీయత అన్న ♦పదానికి అర్థం చెబుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ♦ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ♦మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? ♦చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి ♦పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు ♦మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని ♦గుర్తుకొస్తుంది. ♦వీరిద్దరూ కలిసి ఇంటింటికీ పంచిన, వీరిద్దరి ఫొటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టోఅని చెప్పి 2014లో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తుకుచేసుకుందామా? ♦రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు. ♦అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశాంరు. ♦టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు. ♦ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 చొప్పున సంవత్సరానికి 1200, 5 సంవత్సరాల్లో 6 వేల సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు. ♦మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు. ♦ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు ♦పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు. ♦ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి. ♦బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు ♦ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. ♦2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? అని అడుగుతున్నా? ♦ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి అక్కచెల్లెమ్మలు నమ్మిన వారిని నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. ♦అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. ♦బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆదుకోవాలని మనసు రాలేదు. ♦గ్యాస్ సిలిండర్ల మీద నెలకు ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ♦ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోగా, విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించి వీరి జాయింట్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాబిన్నం చేసింది. ♦ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్ చేసిన వీరు.. మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? ♦ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం, మోసం, దగా, దగా. ♦చివరకు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుల్లా ఉపయోగించుకున్నారు. ♦అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మహాశక్తి అని మోసానికి తెరతీస్తున్నారు. ♦బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలికి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణ మాఫీ దారుణమైన మోసం ♦బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం ♦పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది వెయ్యి. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే 2 వేలు ఇచ్చేశాం అని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొడుతున్నారు ♦కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ వీరు చేసిన మోసం, దగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ♦మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంత ఇస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు. ఇవి మళ్లీ మొదలయ్యాయి. ♦ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. ♦ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా ♦సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి ♦పలాన మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాం అని ఓట్లు అడిగే పరిస్థితి వీరిద్దరికీ లేదు ♦చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు ♦రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది ♦ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా ♦ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ♦రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి ♦మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు ♦దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది ♦చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు ♦ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా ♦మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు ♦చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు ♦చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు ♦దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతున్నా -
Watch Live: అనకాపల్లి సాక్షిగా సీఎం జగన్ సమర నినాదం
అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత సభ సందర్భంగా సీఎం జగన్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని మీ అందరిక సమక్షంలో అనకాపల్లి నుంచి శ్రీకారం చుడుతున్నాం. భారతదేశ చరిత్రలోనే, ఉన్న 28 రాష్ట్రాల్లో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తర్వాత వైయస్సార్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజులపాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులందరూ పాలు పంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి అన్న కథలు ప్రతి సచివాలయంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరూ చర్చించుకొనేలా, స్పూర్తిదాయకమయ్యేలా పండుగ వాతావరణంలో ప్రతి అక్కచెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడాలని కోరుతున్నా. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు, వారి కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, వారికి తోడుగా, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. 45-60 మధ్య వయసున్న నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్పూర్తిగా వారి గురించి ఆలోచన చేసి, అదే అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.18750 చేతిలో పెడుతూ, నాలుగేళ్లలో ఏకంగా 75000 ఆర్థిక సాయం నా అక్కచెల్లెమ్మలకు చేస్తానని మాట ఇచ్చాను. ఇదే జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో ఇదే చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా 75 వేలుగా ఇచ్చే కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే చేస్తున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా. ప్రతి అక్కచెల్లెమ్మకూ క్రమం తప్పకుండా సాయం చేస్తూ, బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ, మల్టీ నేషనల్ కంపెనీలతో తోడ్పాటునిస్తూ, ఏకంగా 1.69 లక్షల మంది కిరాణా షాపులు అక్కచెల్లెమ్మలు పెట్టుకుని నడుపుతున్నారు. 85630 మంది చెల్లెమ్మలు వస్త్రవ్యాపారం, 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొన్నారు. 1,34,514 మంది అక్కచెల్లెమ్మలు మేకలు కొన్నారు. 88,923 మంది అక్కచెల్లెమ్మలు ఫుడ్ ప్రాడక్ట్స్ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారు. 3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారు. మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఇంటిని కూడా నడుపుతున్నారంటే అక్షరాలా 16.55,991 మంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ప్రతి అక్కచెల్లెమ్మ కనీసం రూ.6-10 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ, తన కుటుంబానికీ తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించాలి. వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు 22,98,931 మంది నా అక్కచెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు ఈరోజు నుంచి మరో 14 రోజులపాటు పండుగ వాతావరణంలో మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తున్నాడు. దీంతో నా అక్కచెల్లెమ్మలకు ఒక్క వైయస్సార్ చేయూత ద్వారా ఏకంగా 75000 పెట్టినట్లయింది. వైయస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి పంపించినట్లయింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి. నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు. ఇదే అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే మరో రూ.56,188 కోట్లు కూడా మంచి జరిగింది. ప్రతి అడుగూ కూడా మీ బిడ్డ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆలోచన చేస్తూ విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రతపరంగా వారందరి సాధికారత లక్ష్యంగా గొప్పగా అడుగులు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి అక్కచెల్లెమ్మ, వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. *నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ, నామినేషన్ పోస్టులు, కాంట్రాక్టులు, 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేయాలని మనసే లేదు. చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా స్కూళ్ల రూపురేఖలు మీ బిడ్డ మారుస్తాడు. అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తూ అండగా నిలబడిన ప్రభుత్వం. ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎక్కడా చూసిందీ లేదు. కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిన మార్పు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, పెద్ద చదువులు చదవాలని, ఏ తల్లీదండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పిల్లల తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెనమొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయినీ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది. వైయస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగులుగా 18 శాతం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది. గతానికి, ఇప్పటికి తేడా చూడమని మిమ్మల్ని కోరుతున్నా. గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. వైయస్సార్ చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా? 45-60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే... ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమే. 1.30 కోట్ల అక్కచెల్లెమ్మలు వాళ్ల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఏ అక్కచెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, పోలీస్ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి తోడుగా నిలబడినందువల్ల మంచి జరిగింది. గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లోగానీ, మన వాలంటీర్ వ్యవస్థ గానీ, ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా అందులో ఏకంగా 50 శాతం చదువుకున్న మన ఇరుగుపొరుగు చెల్లెమ్మలే. గతంలో ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అందే పరిస్థితి ఉంటుందని 58 నెలల కిందట మీకు ఎవరైనా చెబితే నమ్మి ఉండేవారా? ఈరోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, రూ.2.65 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అందింది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ కుటుంబ సభ్యులతో మీరంతా బ్యాంకులకు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల మీ స్టేట్మెంట్ ఇవ్వమని అడగండి. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన, 5 సంవత్సరాల మీ బిడ్డ పాలన. బ్యాంకు స్టేట్మెంట్లు చూసినప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంటుకు వచ్చింది ఒక్కరూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంటులోకి వచ్చిందో మీరే గమనించండి. ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. మహిళా సాధికారత పరంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. వీరిద్దరూ కలిసి ఇంటింటికీ పంచిన, వీరిద్దరి ఫొటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టోఅని చెప్పి 2014లో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తుకుచేసుకుందామా? రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశాంరు. టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 చొప్పున సంవత్సరానికి 1200, 5 సంవత్సరాల్లో 6 వేల సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి. బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు. ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? అని అడుగుతున్నా? ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి అక్కచెల్లెమ్మలు నమ్మిన వారిని నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆదుకోవాలని మనసు రాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద నెలకు ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోగా, విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించి వీరి జాయింట్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాబిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్ చేసిన వీరు.. మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం, మోసం, దగా, దగా. చివరకు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుల్లా ఉపయోగించుకున్నారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మహాశక్తి అని మోసానికి తెరతీస్తున్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలికి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణ మాఫీ దారుణమైన మోసం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం. పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది వెయ్యి. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే 2 వేలు ఇచ్చేశాం అని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ వీరు చేసిన మోసం, దగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంత ఇస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు. ఇవి మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా. సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి. పలాన మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాం అని ఓట్లు అడిగే పరిస్థితి వీరిద్దరికీ లేదు. చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది. ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు. దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది. చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు. చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతున్నా. -
గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదు: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ ప్రసంగం: ►మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది ►58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం ►అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం ►వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది. ►14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది. ►గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదు ►అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నాం ►పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం ►అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నా ►1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారు ►3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు. ►1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారు ►అమ్మఒడి పథకంతో 53లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది. ►పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదు. ►గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. ►గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా? ►వైఎస్సాఆర్ చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు. ►నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళా రిజర్వేషన్లు కల్పించాం. ►మహిళల రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం. ►కోటి 30 లక్షల మంది మహిళల ఫోన్లలో దిశ యాప్ ఉంది. ►మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు వేశాం. ►వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. ►99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే పొదుపు సంఘాలు నెంబర్ వన్‌గా ఉన్నాయి. ►చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నాం. ►31 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చాం. ►గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా?. ►ఎక్కడా లంచాలు లేవు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీరిద్దరి పేర్లు చెబితే ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే ఆయన మోసాలు.. పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతారు. 2014లో వీరిద్దరి మేనిఫెస్టోలో ఏం చెప్పారు.. 2014లో పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. ఆడ బిడ్డ పుట్టిన వెంనే రూ.25వేలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నారు. దీనికి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. కానీ, వారు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నియమించలేదు. ►పిసినికాడ చేరుకున్న సీఎం జగన్ ►అనకాపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ►అనకాపల్లి బయలుదేరిన సీఎం జగన్ ►గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్ ►తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. ►రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గురువారం నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ►వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. ►నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది. 14 రోజులపాటు ఉత్సవంలా.. ►ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార దిగ్గజాల ద్వారా అదనపు తోడ్పాటు ♦ వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలు ఆ మొత్తాలను వారివారి ఇష్టం మేరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ♦ లబ్దిదారుల్లో ఎవరైనా ప్రభుత్వం అందజేసే సాయంతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తే వారికి అదనపు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం గతంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది. ♦ మూడు విడతల్లో లబ్ధి పొందిన మహిళల్లో ఇప్పటివరకు 16,55,591 మంది వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా స్ధిర ఆదాయం పొందుతున్నారు. ♦ ఈ ఏడాది కొత్తగా జీవనోపాధులు ఏర్పాటుకు ముందుకొచ్చే లబ్దిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా లేదంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇప్పించేందుకు మండల అధికారులు తగిన చర్యలు చేపడతారు. ♦ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి విజయగాధలను ఇతర లబ్దిదారులకు తెలియజేసేలా కార్యక్రమాలను, ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. -
నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల
‘మహిళ బాగుంటే.. కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే ప్రాంతం బాగుంటుంది. ప్రాంతం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచీ అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నారు. లక్షలాది మంది మహిళలకు ఆర్థికంగా ఆసరా అందిస్తూ వ్యాపారాలు, చేతివృత్తులు, చిన్నపాటి పరిశ్రమల వైపు చేయిపట్టి నడిపిస్తున్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగా గురువారం వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయం అందజేయనున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు గురువారం నుంచి నాలుగో విడత వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేసింది. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుంది. 14 రోజులపాటు ఉత్సవంలా.. ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే నాలుగో విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార దిగ్గజాల ద్వారా అదనపు తోడ్పాటు ♦ వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలు ఆ మొత్తాలను వారివారి ఇష్టం మేరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ♦ లబ్దిదారుల్లో ఎవరైనా ప్రభుత్వం అందజేసే సాయంతో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసేందుకు ముందుకొస్తే వారికి అదనపు తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం గతంలోనే హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంది. ♦ మూడు విడతల్లో లబ్ధి పొందిన మహిళల్లో ఇప్పటివరకు 16,55,591 మంది వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించి ప్రతి నెలా స్ధిర ఆదాయం పొందుతున్నారు. ♦ ఈ ఏడాది కొత్తగా జీవనోపాధులు ఏర్పాటుకు ముందుకొచ్చే లబ్దిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా లేదంటే స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద ఇప్పించేందుకు మండల అధికారులు తగిన చర్యలు చేపడతారు. ♦ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి విజయగాధలను ఇతర లబ్దిదారులకు తెలియజేసేలా కార్యక్రమాలను, ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. నేడు సీఎం జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకుని.. ‘వైఎస్సార్ చేయూత’ 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. -
YSR Cheyutha: రేపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.45 గంటలకు కశింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. 11.20 గంటలకు వేదికపై మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు గంట పాటు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్ నొక్కి ప్రారంభిస్తారు. మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం 2.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తిరుగుపయనమవుతారు. -
చిరు జీవితాలకు కొండంత చేయూత
-
జగనన్న చేసే ప్రతి ఆలోచన మహిళా పక్షపాతమే..!
-
ఆర్థిక చక్రానికి 'ఆసరా'
‘మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అనే సూత్రంపైనే ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతగా ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేశారు. నా అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యమని చెబుతూ మేనిఫెస్టోలో చెప్పినట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు పథకాల ద్వారా అందిన రూ.38,273.95 కోట్ల (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు) సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి తమ కుటుంబాలను ఒడ్డున పడేశారు. వెరసి బ్యాంక్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గ్రామీణ ఆర్థిక చక్రం వేగంగా తిరిగింది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. ఎల్లుండి నుంచి ఆఖరి విడత ‘వైఎస్సార్ ఆసరా’ గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570. 80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి : వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 79 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో సమూల మార్పులకు, వారి ఆత్మగౌరవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా వారి ఆర్థిక కష్టాలు తీర్చింది. అంతటితో ఆగకుండా వారు సొంతంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చేయి పట్టుకుని నడిపించింది. పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకానికి ఊతం అందించింది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పరిస్థితి అగమ్యగోచరం. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కారు. దీంతో ఆ సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. వీరి దుస్థితిని తన పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న రూ.25,570.80 కోట్ల అప్పును మనందరి ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆసరా’ పథకం పేరుతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఆ మాట మేరకు ఇప్పటికే మూడు విడతలుగా రూ.19175.97 కోట్ల సొమ్ము చెల్లించారు. దీనికి తోడు చేయూత పథకం కింద రూ.14,129 కోట్లు లబ్ధి చేకూర్చారు. సున్నా వడ్డీ పథకం కింద రూ.4,969 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.38,274 కోట్లు లబ్ధి కలిగించారు. తద్వారా ఇప్పుడు ఆ పేదింటి పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ఆర్థిక వ్యవçస్థకే ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల క్రితం బ్యాంకుల వద్ద ఎన్పీఏలుగా ముద్రపడిన లక్షలాది పొదుపు సంఘాలు నేడు బలపడ్డాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మ«ధ్యలో ఆపేసిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ.. సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ డబ్బులను ప్రభుత్వమే ఏ ఏడాదికి ఆ ఏడాదే చెల్లిస్తుండడంతో ఇప్పుడు వందకు 99.83 శాతం పొదుపు మహిళలు అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో పొదుపు సంఘాల మహిళలకు చాలా తక్కువ వడ్డీకే ఎంతైనా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు గత 56 నెలల కాలంలో రూ.1,54,929.92 కోట్లు బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలకు రుణాలుగా అందజేశాయి. 83 శాతం సంఘాలు రూ.ఐదు లక్షలకు పైబడే రుణాలు తీసుకోగలిగాయి. అంటే దాదాపు ప్రతి పొదుపు సంఘం మహిళ గత 56 నెలల కాలంలో ఏడాదికి దాదాపు రూ.50 వేల చొప్పున కొత్త రుణం అందుకోగలిగారు. తీసుకున్న అప్పును కూడా మహిళలు తమ కుటుంబ ఆదాయాలు పెంచుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు. పెట్టుబడి పెట్టగలిగేలా ప్రోత్సాహం ప్రపంచంలోనే ఎక్కువ జనాభాకు తోడు పేదరికం కలిగిన మన దేశం ఆర్థికాభివృద్ధిలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలంటే ప్రజల్లో పెట్టుబడి పెట్టగలిగే స్థాయి పెరగాలి. అంటే ఆ పెట్టుబడి ఏదో రూపంలో వారికి అందాలి. తద్వారానే దేశ ఆర్థికవృద్ధి చక్రం ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వాల నుంచే ప్రత్యేకించి పేద ప్రజలకు రకరకాల రూపాల్లో డబ్బులు చేరాల్సి ఉంటుంది. ఈ పరంపరలోనే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. తద్వారా వారు ఆ డబ్బులను పూర్తి స్థాయిలో తమ కుటుంబ ఆదాయం పెంచే మార్గాల్లో తిరిగి పెట్టుబడి పెట్టేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబ స్ధిర ఆదాయాలు పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. వెరసి రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పెరుగుదలలో భాగస్వాములవుతున్నారు. – ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ 54 శాతం మందికి అదనంగా రూ.60 వేల ఆదాయం పొదుపు సంఘాల మహిళల ఐదేళ్ల క్రితం నాటి మొత్తం అప్పు రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేçయడంతో పాటు ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. పేద కుటుంబాల్లో టర్నోవర్ పెరిగింది. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. లక్షల పేద కుటుంబాల్లో ఇటీవల కొత్తగా ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. చాలా కుటుంబాలు అప్పు తీసుకొనే అవసరం లేకుండానే వ్యవసాయ పెట్టుబడులు మ కూర్చుకోగలుగుతున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై నిర్వహించిన ఓ సర్వేలోనే ఈ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్ధిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. 31,04,314 మంది పేదింటి పొదుపు మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. నాడు బాబు హామీ నమ్మి దివాలా 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,203.58 కోట్ల మేర అప్పులున్నాయి. ఆ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే.. ‘తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణ మాఫీ చేస్తుంది.. బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను ఎవరూ చెల్లించొద్దు.. బ్యాంకుల్లో కుదువ పెట్టిన మీ బంగారాన్ని విడిపించేస్తాం’ అని చంద్రబాబు ఊరూరా ప్రచారం చేశారు. అంతకు ముందు వరకు కిస్తీల రూపంలో సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే అలవాటు ఉన్న లక్షలాది మంది మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకులకు కిస్తీలు చెల్లించడం మానేశారు. మాయ మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీతనే అసెంబ్లీలో తమ (టీడీపీ) ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. దీంతో పొదుపు సంఘాల మహిళలందరూ అప్పట్లో తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. పేద మహిళలందరూ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాధారణంగా గ్రామాల్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని చెల్లించకపోతే దివాలా తీశారని ప్రచారం చేస్తుంటారు.. అలా, అప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్న మహిళలు ప్రతి ఐదుగురిలో ఒకరిని బ్యాంకులు ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ – ఒక రకంగా దివాలా) జాబితాలో పెట్టాయి. -
విశ్వసనీయత చాటుకున్నాం
అమరావతి: అవ్వాతాతలకు పెన్షన్ల పెంపుతో పాటు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేస్తూ ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చడం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు అని మరోసారి రుజువు చేసుకుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇదే సందేశాన్ని అవ్వా తాతలతో పాటు ప్రతి లబ్ధిదారుడికీ, ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని అధికార యంత్రాంగానికి సూచించారు. జనవరిలో మూడు కార్యక్రమాలతోపాటు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం కలిపి మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలను తలపెట్టామని, వీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా బ్రహ్మాండంగా జరిగేలా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి నిర్దేశించిన విధంగా ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. జనవరి నుంచి 8 వరకు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ రూ.3 వేలకు పెంపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, రెండో కార్యక్రమంగా జనవరి 19న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, మూడోది జనవరి 23 నుంచి 31 వరకు ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని తలపెట్టగా నాలుగో కార్యక్రమం ‘వైఎస్సార్ చేయూత’ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టా్మత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3,000 1వతేదీ నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచుతూ అవ్వాతాతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారు పేరు అని మరోసారి రుజువు చేస్తున్నాం. పెన్షన్ల పెంపు సందర్భంగా జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019లో మన ప్రభుత్వం రాక ముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 చేశాం. ఇప్పుడు రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తున్నాం. గత సర్కారు హయాంలో పెన్షన్ల కోసం సగటున నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇవాళ మన ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. మనం రాక ముందు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు దాకా పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే కాగా ఇవాళ దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మంచి మార్పు తేగలిగాం ప్రతి అడుగులోనూ అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఎవరూ ఇబ్బందులు పడకూడదని మునుపెన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా ఒకటో తారీఖు రోజు.. అది ఆదివారమైనా, పండుగైనా సరే పొద్దునే వలంటీర్ చిక్కటి చిరునవ్వుతో ఇంటివద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఈ మార్పు ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. 1.17 లక్షల కొత్త పెన్షన్లు కూడా 1 నుంచే.. అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ (ఏడాదికి రెండు దఫాలు) కార్యక్రమం జనవరి 5వతేదీన జరుగుతుంది. ఆలోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల కొత్త పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు. దీంతో 66,34,742మందికి సుమారు రూ.1,968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. క్రెడిబిలిటీకి అర్ధం చెబుతూ పని చేస్తోంది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి. అవ్వాతాతలు వేచి చూడకుండా పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేను (సీఎం జగన్) కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో వీటిని నిర్వహించాలి. 8 రోజులపాటు పెంచిన పెన్షన్ల పెంపు కార్యక్రమాలు జరుగుతాయి. ఏ మండలాల్లో ఏ రోజుల్లో నిర్వహించాలో ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలి. లబ్ధిదారులకు సీఎం లేఖ, వీడియో సందేశం పెంచిన పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, ఉత్సాహవంతులు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలి. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా పట్టించుకున్న ప్రభుత్వం చరిత్రలో లేదు రాష్ట్ర చరిత్రలో అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో లేదు. పెద్దల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దే పెన్షన్ డబ్బులు అందిస్తున్నాం. వారి కోసం పట్టించుకునే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ లాంటివి గతంలో ఎప్పుడూ లేవు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బులు ఎక్కడా ఇవ్వలేదు. చెప్పిన మాటను నెరవేర్చాలనే కృత నిశ్చయంతో మన ప్రభుత్వం అడుగులు వేసింది. ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రతి లబ్ధిదారుడికీ తెలియచేయాలి. ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.23 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలుస్తూ సమర్థంగా దీన్ని నిర్వహిస్తున్నాం. -
మేము ఈ స్థాయికి రావడానికి జగనన్నే కారణం
-
‘వైయస్ఆర్ చేయూత’తో మారుతున్న అక్కచెల్లెమ్మల భవిత.. సాకారమవుతున్న మహిళా సాధికారత
-
మహిళల జీవనోపాధికి ఊతంగా వైఎస్ఆర్ చేయూత పథకం
-
వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత ద్వారా సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి..!
-
ఈ పేద జీవితంలో ఆశలు చిగురించాయి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరుపేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్ఎన్ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది. అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లెక్సీలో ఇలా రాశాడు.. ♦ వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది. ♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి. ♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది. -
జగనన్న ప్రభుత్వం చొరవతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు
-
విజయానికి చేయూత
-
విజయానికి చేయూత
నర్సీపట్నంలో కిరాణా షాపు నడుపుకుంటున్నాం. మా ఇంట్లో నలుగురుంటారు. కుటుంబ పోషణకు ఈ దుకాణమే ఆధారం. గతంలో చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడేవాళ్లం. కరోనా సమయంలో వ్యాపారం చేయడానికే లేదు. బతుకు కష్టమే అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకుంది. గతంలో మాలాంటి వారికి ఎలాంటి సాయం ఉండేది కాదు. మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక నరకం చూశాం. ఈ ప్రభుత్వంలో పథకాలు వరంలా ఆదుకుంటున్నాయి. మెప్మా అందించిన రుణ సాయంతో పాటు, చేయూత డబ్బులతో దుకాణాన్ని విస్తరించుకున్నాం. ఇప్పుడు రోజుకు రూ.800 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. – కొల్లాన లక్ష్మి, నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద బొడ్డేపల్లికి చెందిన బంగారు లక్ష్మికి భర్త లేడు. తన ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఎన్నో కష్టాలు పడింది. బతుకుదెరువు కోసం ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్ముకున్నా, పెద్దగా ఫలితం లేకపోయింది. జగనన్న ఇచ్చిన చేయూత పథకం సొమ్ము రూ.18,750కి తోడు కొంత పొదుపు రుణం తీసుకుని ఇంటి వద్దే కిరణా దుకాణం ప్రారంభించింది. మెప్మా ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తోంది. నర్సీపట్నంలో ఉంటున్న పెదపూడి అరుణకుమారి, లక్ష్మి తోడికోడళ్లు. వీరి భర్తలు ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వం వీరికి చేయూత, ఆసరా, రైతు భరోసా కింద ఇచ్చిన నగదును వర్క్‌షాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వీరికి బ్యాంకు రూ.5 లక్షలు రుణంగా మంజూరు చేసింది. పొదుపు నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్న వీరు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ‘మా పని రైతులతో ముడి పడింది. ఆర్డరు రాగానే డబ్బులు ఇవ్వరు.. ముందు పెట్టుబడి పెట్టాలి. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఉపయోగపడింది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం గతంలో ఎప్పుడూ అందలేదు’ అని తెలిపారు. ఇలా ఒక్క నర్సీపట్నంలోనే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు 10,071 మంది ఉంటే, వారిలో 4,067 మంది చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు. విశాఖ, నర్సీపట్నం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: అసలే పట్టణాలు.. ఆపై అదనపు ఖర్చులు.. ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ప్రతి ఖర్చుకు ఓ లెక్క.. అవసరమైన వస్తువు కొనాలంటే మరో అవసరాన్ని వాయిదా వేసుకోవాలి.. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా’ పథకాలను మహిళా లబ్ధిదారులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ‘చేయూత’గా ఇస్తున్న రూ.18,750కు తోడు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు. వయసు పైబడిందని, కుంటుంబానికి భారంగా మారామని కుంగిపోతున్న మహిళలు సైతం ఇప్పుడు సంపాదన మార్గంలో పయనిస్తున్నారు. దాంతో సగటున ఒక్కో మహిళ నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పైగా సంపాదిస్తోంది. పెద్ద చదువులు లేకపోయినా తోచిన చిరు వ్యాపారం చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పుడా మహిళల కళ్లల్లో కుటుంబానికి అండగా నిలబడగలిగామన్న సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్ విశాఖపట్నంలో చేయూత, ఆసరా లబ్ధిదారులు 2,83,440 మంది ఉంటే, వారిలో 90,491 మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో స్వయం ఉపాధి మార్గాల ద్వారా కుటుంబానికి అండగా ఉన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మారిన రాతలు రాష్ట్ర ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ తరహా ఆర్థిక సాయం పొందిన మహిళలు 5,32,393 మంది ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.998,23,68,750 చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల సాయం అందించింది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చెల్లించాల్సిన బ్యాంకు అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇచ్చిన హామీ మేరకు ఆ సాయాన్ని ‘ఆసరా’ రూపంలో చెల్లిస్తున్నారు. ఇలా పట్టణ ప్రాంతాల్లోని 1,54,921 స్వయం సహాయక సంఘాల్లో 14,75,883 మందికి గత మూడేళ్లల్లో రూ.3,300 కోట్లు చెల్లించారు. పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 20,08,276 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారులు స్థానిక యూఎల్బీలో స్వయం ఉపాధి మార్గాలపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఆసక్తి గల వారికి వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణనిచ్చారు. అసరమైన వారికి మెప్మా రుణాలు ఇప్పించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 2,56,959 మంది, ఆసరా లబ్ధిదారుల్లో 5,19,400 మంది మొత్తం 7,76,359 మంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు. సమర్థవంతమైన సీఎం జగన్ పాలన వల్లే అక్కచెల్లెమ్మలు ఈ విజయం సాధించారని, ఆర్థికంగా నిలదొక్కుకుని తల రాతలు మార్చుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగనన్న చలవతో నిలదొక్కుకున్నా నా భర్త చనిపోయాడు. ఉన్న ఒక్క బిడ్డను పోషించుకునేందుకు నాకు వచ్చిన టైలరింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నాను. ఆర్టర్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘చేయూత’ వరంగా మారింది. వచ్చిన రూ.18,750కు తోడు మెప్మా రుణం తీసుకుని ఎన్ఏడీ సెంటర్లో పళ్ల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఈ వ్యాపారంలో రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. నా కాళ్లమీద బతకగలనన్న భరోసా కలిగింది. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తాననే నమ్మకం ఉంది. ఇదంతా జగనన్న చలవే. – మళ్ల అన్నపూర్ణ, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం ఆత్మవిశ్వాసం పెరిగింది గతంలో నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు సత్తువ తగ్గిపోయింది. పనులకు పిలవడం లేదు. కుటుంబానికి భారం అవుతాననుకున్నాను. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. చేయూత డబ్బులతో రోడ్డు పక్కన కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు నేను రోజూ రూ.400 సంపాదిస్తున్నా. ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నా. ఇదంతా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే. – కరణం లక్ష్మి, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం -
Andhra Pradesh: చేయూతతో రాణింపు
శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురానికి చెందిన కె.సుగుణ కుమారి కుటుంబం మూడేళ్ల క్రితం దాకా ఇడ్లీలు విక్రయించి పొట్ట పోసుకుంది. కరోనాలో ఉపాధి పూర్తిగా కోల్పోయిన సమయంలో వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం ఆదుకుంది. మొదటి దఫా రూ.18,750 ఆర్థిక సాయంతోపాటు మరో రూ.50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించడంతో కిరాణా, ఫ్యాన్సీ షాపు ఏర్పాటు చేసుకుంది. తర్వాత మరో రెండు విడతల్లో చేయూత ద్వారా రూ.37,500 లబ్ధి చేకూరడంతో వ్యాపారాన్ని విస్తరించి షాపుపై ఆదాయంతో నిశ్చింతగా జీవిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గోకుల బృందావనం గ్రామానికి చెందిన ఏ.రమాదేవి కుటుంబం రెండేళ్ల క్రితం వరకు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున వరుసగా మూడేళ్లు రూ.56,250 మేర అందించడంతో ఆ కుటుంబం కొత్తగా వ్యాపారం ప్రారంభించుకునేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 వేలు బ్యాంకు రుణం కూడా ఇప్పించింది. దీంతో రమాదేవి కుటుంబం గ్రామంలోనే కిరాణా సరుకుల దుకాణం ప్రారంభించి తొలిసారి వ్యాపారం బాట పట్టింది. గతంలో పొదుపు సంఘాలకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలకు మించి బ్యాంకు రుణాలు అందని పరిస్థితి. ఇప్పుడు పొదుపు మహిళలు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకం ద్వారా సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లిస్తుండడంతో విరివిగా రుణాలందుతున్నాయి. తమ సంఘానికి ఏకంగా రూ.20 లక్షల రుణం రావడంతో తన వాటా డబ్బులతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన బండి రమణ ఊళ్లో జిరాక్స్ షాపు ఏర్పాటు చేసుకుంది. బధిరురాలైన రమణకు మాట సరిగా రాదు. మూడేళ్ల క్రితం వరకు ఇళ్లలో బట్టలు ఉతుకుతూ జీవించిన రమణ సొంతంగా షాపు ప్రారంభించి సగర్వంగా ఉపాధి పొందుతున్నట్లు ‘రాధా స్వయం సహాయక సంఘం’ గ్రూపు లీడర్ రజని ‘సాక్షి’కి తెలిపింది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో నిజమైన సాధికారిత దిశగా సాగుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గత మూడేళ్లలో 8,65,918 నిరుపేద కుటుంబాలు కొత్తగా వ్యాపారాల బాట పట్టాయి. ఇప్పటిదాకా గ్రామాల్లో కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు, చేతి వృత్తులతో తగినంత ఆదాయం లేక సతమతమవుతున్న కుటుంబాలు ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకుంటున్నాయి. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించడం, వ్యాపారాల్లో తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూస్థాన్ యూనీ లీవర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ, రిలయెన్స్ లాంటి ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటి సహకారంతో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన పేదింటి మహిళలు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా లాభదాయకంగా నడిపిస్తున్నారు. పొదుపు సంఘాల సభ్యులైన పేదింటి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 21 మండల కేంద్రాల్లో సూపర్ మార్కెట్లను నెలకొల్పి వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు. నేరుగా రూ.32,470.33 కోట్లు లబ్ధి.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం మొత్తాన్ని ప్రభుత్వం తొలగిస్తోంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల అప్పుల భారాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తోంది. మొత్తం రూ.25,517 కోట్ల రుణంలో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,578.28 కోట్లను వారికి నేరుగా ప్రభుత్వం అందజేసింది. దీనికి తోడు గత మూడున్నరేళ్లలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీ భారం రూ.3,615.29 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా సాయం పొంది మహిళలు ఏర్పాటు చేసుకున్న షాపులు మరోవైపు 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఈబీసీ నేస్తం పథకం ద్వారా ప్రత్యక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చింది. కాపు సామాజిక వర్గం మహిళలకు వేరుగా కాపు నేస్తం పేరుతో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది. మొత్తం 34.19 లక్షల మంది మహిళలకు ఈ మూడు పథకాల ద్వారా మరో రూ.16,276.76 కోట్ల లబ్ధి చేకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 34 సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా కేవలం ఈ ఐదు పథకాల ద్వారానే మహిళలకు నేరుగా రూ.32,470.33 కోట్ల మేర ప్రయోజనాన్ని అందించింది. అప్పుల ఊబి నుంచి ఆదర్శంగా.. ప్రత్యక్షంగా మహిళలకు లబ్ధి చేకూర్చడానికి తోడు రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా పొదుపు సంఘాల మహిళలకు గత మూడున్నరేళ్లలో తక్కువ వడ్డీకీ రూ.1.05 లక్షల కోట్ల మేర బ్యాంకు రుణాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పించింది. ఫలితంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల్లో మూడో వంతుకు పైగా సంఘాలు రూ.10 లక్షలకు పైగా రుణాలు పొందాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా డ్వాక్రా రుణమాఫీ హామీని నిలబెట్టుకోకుండా మోసం చేయడంతో మహిళా సంఘాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. ఇప్పుడు పొదుపు సంఘాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో 99.7 శాతం సంఘాలు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లిస్తూ దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. బ్యాంకుల నుంచి మునుపెన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున రుణాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు ప్రత్యేకించి పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమాలను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో అత్యున్నత సంస్థగా భావించే నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్యూడీఎస్టీ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సెర్ప్‌తో శిక్షణ ఇస్తోంది. -
Andhra Pradesh: మహిళా శక్తికి ‘చేయూత’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల సహకారంతో కాకినాడ జిల్లాలో మొదలైన ఓ మహిళా మార్టు నాలుగు నెలల్లోనే రూ.74 లక్షల టర్నోవర్‌ను సాధించింది. గత డిసెంబర్ 31న ఒక్క రోజులో రూ.2.5 లక్షల విలువైన సరుకులను విక్రయించి రికార్డు నెలకొల్పింది. నెల క్రితమే అనకాపల్లి జిల్లాలో మొదలైన మరో మహిళా మార్టు పది మందికి ఉపాధి కల్పిస్తూ ప్రస్తుతం నిత్యం రూ.40 వేల విలువైన సరుకులను విక్రయించే స్థాయికి వేగంగా ఎదిగింది. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతో సంఘటితమైన పొదుపు మహిళల వ్యాపార దక్షతకు ఈ రెండు జిల్లాల్లోని మార్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల సభ్యులు సంఘటితమై నెలకొల్పిన చేయూత మహిళా మార్టులు కార్పొరేట్ కంపెనీల సూపర్ బజార్లకు పోటీగా విక్రయాలు నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 మార్టులు ఏర్పాటు కాగా రూ.లక్షల్లో విక్రయాలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా పథకాల ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయానికి పొదుపు సంఘాల మహిళలు మరికొంత జోడించి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయన్స్ లాంటి ప్రముఖ కంపెనీలు ఈ మార్టులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే సరఫరా చేస్తున్నాయి. ఖర్చుల నియంత్రణ.. బంపర్ డ్రాలు చేయూత మహిళా మార్టుల నిర్వహణ ద్వారా పది మంది మహిళలు ఉపాధితోపాటు విక్రయాల ద్వారా వచ్చే లాభాలతో మెరుగైన జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు 14 మహిళా మార్ట్లు ఏర్పాటయ్యాయి. మరో 9 ఈ నెలలోనే ఏర్పాటు కానుండగా ఇంకా 11 చేయూత మహిళా మార్ట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంలో 500 చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచించారు. కనీసం 15 నుంచి 20 శాతం మార్జిన్‌తో ప్రముఖ కంపెనీల నుంచి ఉత్పత్తుల కొనుగోలుకు మార్టులను అనుసంధానించి డోర్ డెలివరీ, ఆన్లైన్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆన్లైన్ ఆర్డర్లను ఇంటివద్ద అందించేందుకు మార్టు సిబ్బందికి ఒక ద్విచక్ర వాహనం ఉండాలన్నారు. పండుగ సీజన్లలో బంపర్ డ్రాలతో వ్యాపారాలను ప్రోత్సహించాలని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నెలకు రూ.30 లక్షల టర్నోవర్ దిశగా కృషి చేయాలన్నారు. గ్రామీణ, మండల సమాఖ్య సభ్యులు పట్టణ ప్రాంతాల్లో మార్ట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లాభాల బాటలో మహిళా సంఘాల సభ్యులు 23 వేల మంది కలసి మార్టు ఏర్పాటు చేసుకున్నాం. నిత్యం 200 మంది సరుకులు కొనుగోలు చేస్తున్నారు. సుమారు 60 వేల కుటుంబాలకు తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందచేస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.74 లక్షల టర్నోవర్ సాధించి లాభాల బాటలో ఉన్నాం. డిసెంబరు 31వ తేదీన రూ.2.5 లక్షల సరుకులు విక్రయించి రాష్ట్రంలో అత్యధిక అమ్మకాలు జరిపిన మార్టుగా రికార్డు సృష్టించాం. తక్కువ ధరకు సరుకులు లభిస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం చేయూత, ఆసరా ద్వారా అందించిన సాయానికి మరికొంత జోడించి మార్టు ఏర్పాటు చేశాం. – ఉప్పాడ ఎల్లేశ్వరి, చేయూత మహిళా మార్టు అధ్యక్షురాలు, యు.కొత్తపల్లి మండలం, –కాకినాడ జిల్లా పది మందికి ఉపాధి నాణ్యమైన సరుకులను బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. 1,500 సంఘాల ద్వారా సమకూరిన రూ.30 లక్షలకు తోడు ప్రభుత్వం అందించిన చేయూతతో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు చేతులమీదుగా నెల క్రితం మార్ట్ ప్రారంభించాం. ప్రస్తుతం రోజూ రూ.40 వేల మేర విక్రయాలు జరుగుతున్నాయి. పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. ఒక్కో సభ్యురాలు రూ.200 చొప్పున మూల ధన పెట్టుబడిగా పెట్టారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోకుండానే ఏర్పాటు చేశాం. –అడపా అరుణ, చేయూత మహిళా మార్టు అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా మాడుగల మండలం ఈ నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తొమ్మిది మహిళా మార్ట్లు –నెల్లూరు జిల్లా కందుకూరు –విజయనగరం జిల్లా గరివిడి –శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి –ఏలూరు జిల్లా చింతలపూడి –డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం –బాపట్ల జిల్లా నిజాంపట్నం –చిత్తూరు జిల్లా తవణంపల్లె –నెల్లూరు జిల్లా వింజమూరు –గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఏర్పాటు సన్నాహక ప్రక్రియలో ఉన్న 11 మహిళా మార్ట్లు –పల్నాడు జిల్లా నాదెండ్ల –పల్నాడు జిల్లా పిడుగురాళ్ల –శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం –విజయనగరం జిల్లా కోట –ప్రకాశం జిల్లా సింగరాయకొండ –బాపట్ల జిల్లా చీరాల –విశాఖపట్టణం జిల్లా ఆనందపురం –అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల –పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం –పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం –నంద్యాల -
జగనన్న తోడుగా.. ఊరూవాడా పండగ
సామాన్య మహిళలను చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా క్రమం తప్పకుండా అందిస్తున్న ‘వైఎస్సార్ చేయూత’ పథకంతో లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ పథకం నిధులతో పాటు బ్యాంక్ రుణాలు అందించి ఇప్పటికే వ్యాపారవేత్తలుగా మారిన ఎందరో అక్కచెల్లెమ్మలు చేయూత పథకం కార్యక్రమాన్ని ఊరూవాడా పండగలా సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. ప్రధానంగా అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలనే ఉద్దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అండగా ఉంటున్నారు. బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని చేపట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మహిళలు వ్యాపార వేత్తల నుంచి పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తున్నారు. గత నెల 23 నుంచి సంబరాలు గత నెల 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత సంబరాలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాల అభివృద్ధి కోసం తపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎదుగుతామని పలువురు మహిళలు ప్రతినపూనారు. పాలాభిషేకాలు.. పుష్పాభిషేకాలు వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో తమ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుతుందని, గత మూడేళ్లుగా వరుసగా నగదు ఇస్తుండడంతో సంతోషంగా ఉన్నామని పలువురు మహిళలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు. 1,23,838 మందికి లబ్ధి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,23,838 మందికి లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 వంతున రూ.232.20 కోట్లను జమ చేశారు. వరుసగా మూడో ఏడాది క్రమం తప్పకుండా నగదు తమ ఖాతాల్లో ముఖ్యమంత్రి వేయడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. -
మహిళా పక్షపాత ప్రభుత్వం ఇది
సాక్షి, నెట్వర్క్: దేశ చరిత్రలోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి కుటుంబాల్లో వెలుగునింపేందుకు నిత్యం సంక్షేమ పథకాల ద్వారా వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు అన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి సంబంధించి మహిళలకు చెక్కులను రాష్ట్రవ్యాప్తంగా శనివారం కూడా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ క్షీరాభిషేకాలు నిర్వహించారు. తమకు ఆసరాగా నిలుస్తోన్న సీఎం జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మహిళలు చెప్పారు. -
సంబరంలా వైఎస్సార్ చేయూత
సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు ఈ పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు మహిళలు వెల్లువలా తరలి వచ్చారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతితో కలిసి 4,885 మందికి రూ.9.15 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలకు సొంత సోదరునిలా మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ జిల్లా ఎస్.అన్నవరం వద్ద జరిగిన కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి దాడిశెట్టి రాజా రూ.9.89 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల గుండెల్లో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ సుస్థిరంగా ఉండిపోతారని మంత్రి రాజా చెప్పారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా బాగు పడడం కాదని, రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన వైఎస్సార్ చేయూత సంబరాల సభలో వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 13,989 మంది లబ్ధిదారులకు రూ.25.28 కోట్లు అందజేశారు. సీఎం జగన్ మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమాంతర అభివృద్ధిని కాంక్షిస్తుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతే రాజధాని అంటూ తన కులం, కుటుంబీకులు, బంధువుల లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రమేష్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో జరిగిన సభలో మంత్రి ఆర్కే రోజా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 11,530 మందికి రూ.21.69 కోట్లు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేది లేదని, జగనన్న తగ్గేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. -
చేయూత సాధికారిత
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ చేయూత పథకం జిల్లాలోని మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు దోహదపడుతోందని, వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో బహిరంగ సభ నుంచి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజు, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ సు«దీర్‌రెడ్డి, అడా చైర్మన్ గురుమోహన్, సగర ఉప్పర కార్పొరేషన్ చైర్ పర్సన్ రమణమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ∙ఈ సందర్భగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఈ సాయం మొత్తాన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించుకోవాలన్నారు. వారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ముందుకు సాగేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందన్నారు. కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ సు«దీర్‌రెడ్డిలు మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా సాగుతున్న ప్రభుత్వం.. అన్ని పథకాలకు మహిళలనే ప్రధాన అర్హులుగా గుర్తించారంటే.. ముఖ్యమంత్రి మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోందన్నారు. మీ నైపుణ్యంతో చేయగలిగిన ఏ పనైనా వ్యాపారంగా కొనసాగించి ముందుకు సాగవచ్చన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను మహిళలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ∙కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ పెద్దిరాజు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ వి.బ్రహ్మయ్య, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ హెచ్.వెంకట సుబ్బయ్య, మైనార్టీ సంక్షేమశాఖ ఈడీ ఫరీద్‌సాహెబ్, సెర్ఫ్ ఉద్యోగులు, సంబం«ధిత సంక్షేమశాఖ అధికారులు, లబ్దిదారులైన మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికప్రగతికి వారధిగా మారింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని పాలించడం అదృష్టంగా భావిస్తున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా మా సంఘంలో మహిళలందరికీ మూడో విడత ఆర్థికసాయం అందింది. ఆయన చేస్తున్న సాయం మా ఆర్థిక ప్రగతికి ఒక వారధిగా మారింది. – బి.మార్తమ్మ, ప్రకాశ్‌నగర్, కడప జగనన్న రుణం తీర్చుకోలేం మహిళల సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాల్లో వారికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కరోనా కష్టంలోనే వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. –పి.గౌరీదేవి, వల్లూరు మండలం సీఎం సేవలు వెలకట్టలేనివి రాష్ట్రంలో పేద మహిళలందరికీ జగనన్న అన్నలా మారాడు. ఆడ పడుచులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆయన చేసిన సాయం వెలకట్టలేనిది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా పథకాలను ఇప్పటికే మా కుటుంబం అందుకుంటోంది. – ఇ.సరిత, ఖాజీపేట మండలం ప్రభుత్వ సంక్షేమ నీడలోనే బతుకుతున్నాం మా కుటుంబం మొత్తం సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నీడలో బతుకుతోంది. పెద్ద మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్ల మా కుటుంబానికి వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, వృద్ధాప్య పెన్షన్ అందుతోంది. – ఎస్.ఫైజున్, వీరపునాయునిపల్లె మండలం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మహిళలు లక్షాధికారులు కావాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం. నిరుపేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ఒక వరం. రెండో ఏడాది చేయూత లబ్ధి పొందుతున్న తాను వితంతు పెన్షన్ హౌస్ సైట్ పొందాను. మాట తప్పని ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్రలో నిలుస్తారు. – బి.మనోరహమ్మ, ఎర్రముక్కపల్లె, కడప ‘చేయూత’ అందకపోతే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 90,369 మందికి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మూడో ఏడాది లబి్ధచేకూరిందన్నారు. ఇందులో ఎస్సీలు 24,432 మంది, ఎస్టీలు 2,340, బీసీలు 60,691, మైనారీ్టలు 2849, క్రిస్టియన్ ఫైనాన్షియల్ 120 మంది ఉన్నారన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ. 18,750 చొప్పున మొత్తం రూ. 169,44,00,000 ఆర్థికసాయాన్ని విడుదల చేశారన్నారు. ఏ ఇతర కారణాల చేతనైనా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అర్హతలు ఉండి లబ్ధిపొందలేక పోయిన వారు సచివాలయాల్లో వలంటీర్ల ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చన్నారు.ముఖ్యమంత్రి ప్రసంగ కార్యక్రమం అనంతరం వైఎస్సార్ చేయూత పథకం కింద జిల్లా వ్యాప్తంగా 90,369 మందికి సంబంధించిన రూ. 169,44,00,000 మెగా చెక్కును ముఖ్య అతిథులతో కలిసి కలెక్టర్ అందజేశారు. -
సీఎం జగన్ కుప్పం పర్యటన (ఫొటోలు)
-
చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్: సీఎం జగన్
సీఎం జగన్ కుప్పం పర్యటన.. అప్డేట్స్ 1:48PM మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల వైఎస్సార్ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 12:50PM సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం 26,39, 703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్సార్ చేయూత అమలు చేస్తున్నాం ఈ ఏడాది అందిస్తున్న ఆర్థిక సహాయంతో అక్షరాల రూ. 4,949.44 కోట్లుతో మొత్తంగా రూ.14,110.62 కోట్లు వారంరోజులపాటు చేయూత ఉత్సవాలు వారంరోజుల పాటు ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేయూత పంపిణీ చేయూత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మార్పులు వరుసగా నాలుగేళ్లపాటు అదే అక్క చెల్లెమ్మకు రూ.75వేలు అందిస్తామని హామీ ఇచ్చాం మనసా , వాచా, కర్మణా అమలు చేశాం ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుంది 45–60 సంవత్సరాల మధ్యలో నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చాం ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారు వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆకుటుంబం ఎదుగుతుందని విశ్వసించాం ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్ ఒకటో తారీఖున వస్తోంది పెన్షన్ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నాను అమ్మ కడుపులోని బిడ్డ నుండి, ఆప్యాయంగా ఆశీర్వదించే బిడ్డ వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించాం అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈప్రభుత్వం అడుగులు ముందుకేసింది అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షలమందికి రూ.19,617 కోట్లు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ఇచ్చాం వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74లక్షలమందికి రూ. 12,757 కోట్లు ఇచ్చాం రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి మూడో దఫా జనవరి మాసంలో ఇస్తున్నాం చెప్పిన మాటమేరకు నాలుగు దఫాల్లో ఇస్తున్నాం చేయూత ద్వారా 26.4లక్షలమందికి రూ. 14,111 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సున్నా వడ్డీ పథకానికి రూ. 3,615 కోట్లు ఇచ్చాం కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా 39 నెలల కాలంలో రూ.51వేల కోట్లు ఇచ్చాం బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,666 కోట్లు ఇచ్చాం అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే.. రూ. 1.71లక్షల కోట్లు అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం మార్పును చూడమని, తేడాను చూడమని కోరుతున్నాను అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడండి నాన్ డీబీటీ పథకాలతో కలుపుకుంటే.., అక్షరాల ఈ 39 నెలల కాలంలో ప్రతికుటుంబానికీ ఇచ్చిందిమొత్తం రూ.3,12,764 కోట్లు ఇచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల ఇస్తి ఇచ్చినట్టు అవుతుంది ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది తేడా గమనించమని ప్రతి అక్కా చెల్లెమ్మను కోరుతున్నాం ఇంతకుముందు పరిపాలనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడూ అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి... అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే కాని, ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి.. ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు ఇవాళ బటన్ నొక్కుతున్నాం... నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి అందుకనే ఇప్పుడు జరుగుతున్నాయి..., ఇప్పుడు జరగలేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారం చేయూత ద్వారా వచ్చే డబ్బును ఎలా వాడుకోవాలన్నది మీ చేతిలో పెట్టాను చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి ఎలా వాడుకోవాలా? అన్నది మీ నిర్ణయమే చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారికి వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్చేశాం మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందిచేలా కూడా చేస్తున్నాం ప్రతి అక్కా.. చెల్లెమ్మ మరో రూ.7–10వేల ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని ప్రభుత్వం చూపించనుంది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనాలన్నా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం గతంలో కన్నా కనీసం రూ.5–15లు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థకూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది వైఎస్సార్ ఆసరా, చేయూతల ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షలమంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు మరో 60,995 మంది వస్త్రవ్యాపారం చేస్తున్నాం 2.96లక్షలమంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు 1.15లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో వారు ఉపాధి పొందుతున్నారు 12:25PM 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం. కుప్పం అభివృద్ధశిని వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి: మంత్రి పెద్దిరెడ్డి కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు: ఎమ్మెల్సీ భరత్.సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ భరత్ 12:00PM ‘వైఎస్సార్ చేయూత’ వేదిక వద్దకు చేరిన సీఎం జగన్ 11:15AM కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కుప్పంలో అడుగడుగునా సీఎం జగన్‌కు నీరాజనం సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కుప్పం ప్రజలు 10:50AM సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరలు ఉన్నారు. 9:15AM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ► పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. ► బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద.. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. -
కుప్పం వేదికగా 'చేయూత'
సాక్షి, అమరావతి/చిత్తూరు: వైఎస్సార్ చేయూత పథకం కింద శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు. పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. ► వీటితో పాటు 60 ఏళ్లు నిండిన అర్హులైన వారికి వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే కచ్చితంగా పింఛన్ పంపిణీ చేస్తోంది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి అవ్వల వరకు అందరినీ అన్ని దశల్లోనూ కంటికి రెప్పలా ఆదుకుంటోంది. జీవనోపాధి పెంపు ఇలా.. ► ఇప్పటి వరకు 5,82,662 మంది అక్కచెల్లెమ్మలు వైఎస్సార్ చేయూత ద్వారా కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్నారు. వీరిలో 1.10 లక్షల మంది కిరాణా దుకాణాలు, 60,995 మంది వస్త్ర వ్యాపారం, 1,15,446 మంది ఇతర జీవనోపాధి, 2,96,221 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► ప్రతి మండలానికి ఒక వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ద్వారా అక్కచెల్లెమ్మలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ► కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న అక్కచెల్లెమ్మలకు ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేటు కంటే తక్కువకు నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు తీసుకుంది. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్ భాగస్వామ్యంతో మార్కెట్లో ఇస్తున్న ధర కంటే లీటర్ పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అందిస్తోంది. ► పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక శక్తిని అందిస్తే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, జీవన స్థితిగతులు మెరుగు పడతాయన్న ఉద్దేశంతో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,39,013.40 కోట్లు లబ్ధి చేకూర్చారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కుప్పంలో పర్యటించనున్నారు. అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కుప్పం నిండిపోయింది. కుప్పం చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు మూడు కిలోమీటర్ల మేర దారిపొడవునా స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, ముఖ్యమంత్రి ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, రేణిగుంట మీదుగా 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ఇక్కడ కార్యక్రమాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. -
23న కుప్పంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఈ నెల 22నే కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్.. ► ఈ నెల 23 ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు. ► 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ► 11.15–12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు ► అనంతరం వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ► 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: ఈ ఏడాది 45 ఏళ్ల వయసు నిండి అర్హత పొందిన మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45–60 మధ్య వయసున్న మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంలో ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. చదవండి: ‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా మహిళలకు రూ. 9,179.67 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 22వ తేదీన వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని తొలుత గడువు నిర్ధారించగా దానిని ఏడవ తేదీ వరకు పొడిగించారు. తాజాగా ఆ గడువును మళ్లీ ప్రభుత్వం పొడిగించింది. -
‘చేయూత’కు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇందుకు గాను ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 –60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 2020 ఆగస్టు 12వ తేదీ తొలి విడతలో 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు పంపిణీ చేసింది. రెండు విడతల్లో కలిపి రూ.9179.67 కోట్లను ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు అందజేసింది. తిరిగి ఇప్పుడు సెప్టెంబర్‌లో మూడో విడతగా ఈ పథకం లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా అర్హత పొందిన వారి పేర్ల నమోదుతో పాటు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల తాజా స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకొని.. అనంతరం ఆయా దరఖాస్తులపై 8వ తేదీ లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. -
సూపర్మార్కెట్ల ‘చేయూత’
సాక్షి, అమరావతి: మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్మార్కెట్లను ఏర్పాటుచేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. ప్రయోగాత్మకంగా జూలై నాటికల్లా జిల్లాకు రెండేసి చొప్పున 52 మండలాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. చేయూత మహిళా మార్ట్‌గా వీటికి నామకరణం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ మహిళా మార్ట్లను ఏర్పాటుచేస్తారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన పేద మహిళలకు ఏటా దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక లబ్ధిపొందిన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, రిలయెన్స్, అమూల్ వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు సాధారణ మార్కెట్ ధర కన్నా తక్కువకే తమ కిరాణా సరుకులను 78,931 మహిళా సంఘాల రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాయి. తక్కువ ధరకే సేకరణ.. విక్రయాలు ఇక సూపర్ మార్కెట్‌కు అవసరమైన ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కారం, పసుపు, వివిధ రకాల మసాలాలతో పాటు నెయ్యి, పల్లీచిక్కీ వంటి స్థానికంగా దొరికే నాణ్యమైన ఉత్పత్తులను పొదుపు సంఘాల్లోని మహిళలు సేకరిస్తారు. మరోవైపు.. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను హోల్‌సేల్ వ్యాపారులకు ఇచ్చే ధరకే మహిళా సంఘాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో సాధారణ వ్యాపారుల కన్నా తక్కువ ధరకు ఈ సూపర్ మార్కెట్లు నాణ్యమైన నిత్యావసర సరుకులు సేకరించే వీలుందని.. అదే సమయంలో కొంత లాభం వేసుకుని మార్కెట్ ధర కన్నా తక్కువకు వినియోగదారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళా మార్ట్ల ఏర్పాటు ఇలా.. మండలంలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఫెడరేషన్‌గా ఏర్పడతారు. అందులో ప్రాథమికంగా ఒకొక్కరు రూ.150ల నుంచి రూ.200ల మధ్య షేర్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెడతారు. అదనంగా అవసరమైన నిధులను మండల సమాఖ్య ద్వారా స్త్రీనిధి, లేదంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కనీసం రూ.30 లక్షలతో ఈ సూపర్ మార్కెట్లను ఏర్పాటుచేస్తారు. ఆ మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ప్రతినెలా తమ కుటుంబ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఆ సూపర్‌మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఇతర వినియోగదారులను కూడా ఆకర్షించేలా హోల్‌సేల్ ధరలకే సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. మండల పరిధిలో ఎక్కువమందికి అందుబాటులో ఉండేలా ఓ పెద్ద గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడ కనీసం 1000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా నెలకు కనీసం లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల ప్రాథమిక అంచనా. వచ్చే లాభాలను మొదట్లో ఫెడరేషన్ సభ్యుల్లో అవసరమైన వారికి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడం.. తర్వాత దశలో లాభాలను సమానంగా పంచుకోవడం వంటివి ఉంటాయి. సూపర్‌మార్కెట్ నిర్వహణకు కమిటీలు ఇక సూపర్ మార్కెట్ నిర్వహణకు పొదుపు సంఘాల్లోని మహిళలతో కమిటీలను ఏర్పాటుచేస్తారు. వాటిల్లో పనిచేసేందుకు సిబ్బందిని కూడా పొదుపు సంఘాల్లోని చురుకైన మహిళలనే ఎంపిక చేస్తారు. ఇక సూపర్ మార్కెట్ రోజు వారీ నిర్వహణ, కావాల్సిన సరుకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం.. అమ్మకాలకు సంబంధించి రికార్డుల నిర్వహణపై సభ్యులకు సెర్ప్ అధికారులతో పాటు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో శిక్షణ ఇప్పిస్తారు. 15, 16 తేదీల్లో జిల్లా పీడీల భేటీ పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ చేయూత మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు రెండేసిచోట్ల జూలై నాటికి వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15, 16 తేదీల్లో అన్ని జిల్లాల పీడీలతో సమావేశం ఏర్పాటుచేశాం. – మహ్మద్ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లవుతోంది.. మనది హామీలను నెరవేర్చే ప్రభుత్వమని ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చి తనది ప్రజా ప్రభుత్వమని చాటారు. పాదయాత్ర అనుభవాలే పునాదిగా, ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించిన వైఎస్ జగన్.. దాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో పక్కాగా అడుగులు వేశారు. దాంతో ఆయా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో సంతోషం కనిపిస్తోంది. వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమందించే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు గతానికి ఇప్పటికి వున్న తేడాను స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో! పేద కుటుంబాలను పేదరికాన్నించి బైట పడేయాలనేది అసలైన లక్ష్యం.. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక పథకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా ఈ పథకాలన్నీ ప్రజాసంకల్ప పాదయాత్ర అనుభవాలతో రూపొందినవే.. వాటిలో చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలున్నాయి. నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తే వారు ఆ డబ్బుతో కుటుంబ ఆదాయాలను పెంచుకుంటారని తద్వారా వారు పేదరికాన్నించి బైటపడాలని ఈ పథకాలను తయారు చేశారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చెరుకు రసం విక్రయిస్తు కుటుంబాన్ని నడిపిస్తోంది అనసూరి వెంకటలక్ష్మీ. వెంకటలక్ష్మీ, అప్పారావు దంపతులకు నలుగురు పిల్లలున్నప్పటికీ వారు ఉపాధి కోసం ఇతర ఊళ్ళకు వెళ్లిపోయారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు పడ్డామని అలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ఆదుకున్నదని వీరు అంటున్నారు. చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అందుతున్న 18,750 రూపాయలతో వీరు ఈ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి దంపతులకు సొంత ఇళ్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీరికి ఇళ్ల స్థలం లభించేలా చూశారు. చేయూతతోపాటు పలు పథకాలు వెంకటలక్ష్మి అప్పారావులాంటివారికి అందుబాటులోకి వచ్చి వీరి కష్టాలను తీరుస్తున్నాయి. నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తే వారు నిలదొక్కుకుంటారనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. అందుకోసం తయారు చేసిన పథకాలే చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం. వీటిలో చేయూతను ఉపయోగించుకున్నవారిలో కాకినాడ జిల్లా గైగోలపాడుకు చెందిన మల్లేశ్వరి కూడా వున్నారు. ఈమె భర్త చాలా కాలం క్రితమే చనిపోయారు. నలుగురు పిల్లలుంటే వారికి వివాహాలైపోయి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయూత పథకం ద్వారా లభిస్తున్న డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం చేసి కొంతమేరకు ఆదాయం పొందుతున్నట్టు మల్లేశ్వరి అంటున్నారు. చదవండి: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు చేయూత ఉపయోగపడుతోంది. అయితే అదే సమయంలో అగ్రవర్ణ పేద కుటుంబాల మాటేమిటి? వారిని కూడా ఆదుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తాయి.. దీనికి సమాధానంగా కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకొచ్చారు.. వీటిలో కాపునేస్తాన్ని ఉపయోగించుకొని కొంతమేరకు ఉపశమనం పొందిన వారిలో జగత జ్యోతి వున్నారు. ఈమె రెండు దశాబ్దాల క్రితమే భర్తను కోల్పోయారు. ఒక కుమార్తె వుంటే ఆమెకు వివాహమై వెళ్లిపోయిందని.. తాను మాత్రం నాలుగైదు ఇళ్లలో ఇంటి పనులు చేసుకొని బతుకుతున్నానని జ్యోతి చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈమె కాపులు పేరుకే అగ్రవర్ణమని కాపుల్లో తనలాంటి పేదలు చాలా మంది వున్నారని అంటున్నారు. అగ్రవర్ణాల పేద కుటుంబాల్లో కాపులనే కాకుండా ఇతర అగ్రవర్ణాల పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఈబీసీ నేస్తం రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో మనం చూస్తున్న ఈ బ్రాహ్మణ కులానికి చెందిని శివరామజోగి శర్మ దంపతులున్నారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన శివరామజోగిశర్మ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయామని ఈ మధ్యనే ఈబీసీ పథకం అందిందని వీరు చెబుతున్నారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం...ఈ మూడు పథకాలు నలభై ఐదునుంచి అరవై సంవత్సరాల మధ్యన వయస్సున్న పేద కుటుంబాల మహిళలకు వర్తించే పథకాలు. అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛను వస్తుంది కాబట్టి అంతకంటే తక్కువ వయస్సు వున్న పేద కుటుంబాల మహిళల్ని ఆదుకుంటే అది వారి కుటుంబాల కష్టాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఈ ఆలోచన మూడు మానవీయ పథకాలుగా రూపొంది ఈ మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని శనగపప్పు బజార్లో దాసరి కిషోర్.. కుటుంబం నివసిస్తోంది. భార్య సత్య భారతి గృహిణి.. వీరికి పూజిత అనే కూతురు.. గతంలో లారీ యజమాని అయిన దాసరి కిషోర్ వ్యాపారంలో నష్టం రావడంతో దానిని అమ్మేసి ఆటో కొనుక్కున్నారు. ప్రతి రోజూ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాసరి కిషోర్ కుటుంబానికి మొత్తం నాలుగు పథకాలు అందుతున్నాయి. తనకు వాహనమిత్ర, కూతురుకు అమ్మ ఒడి, తండ్రికి వైఎస్సార్ పింఛన్ కానుక, భార్యకు కాపునేస్తం పథకాలు వస్తున్నాయని.. ఇలా అందించే ప్రభుత్వం లభించడం సంతోషంగా వుందని అంటున్నాడు. కరోనా మహమ్మారితో దాదాపు రెండు సంవత్సరాలపాటు భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దాసరి కిషోర్ స్పందిస్తున్నారు. అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అంతే తప్ప ఒక కుటుంబానికి ఒక పథకం అందిస్తే సరిపోతుందిలే అని చేతులు దులుపుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సామాన్య కుటుంబాలు తగిన విధంగా ఆర్ధిక అండదండలు పొందుతున్నాయి. ఇక ఇదే ఏలూరులో మరో ఆటో డ్రైవర్ కుటుంబాన్ని సాక్షి టీవీ పలకరించింది.. ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అన్నయ్య దివ్యాంగుడు.. తల్లికేమో వయస్సు మీద పడి తన పని చేసుకుంటే చాలు అన్నట్టుగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ కష్టాలను తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకొని కుంగిపోలేదు. జీవితం.. తాను అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా లేదని అదే పనిగా ఆందోళన చెందలేదు. కష్టమైన పనయినా సరే ఎలాంటి అదురు బెదురు లేకుండా ఆటో డ్రైవర్ పని చేపట్టింది. ఏలూరు నగరంలోని 43వ డివిజన్ ఏకే సెంటర్లో ఆటో డ్రైవర్ ఊట అంబిక కుటుంబం నివసిస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆటో డ్రైవర్ గా మారి ఇంటికి అండగా నిలిచింది.. ఈ పని కష్టమైనదైనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డ ఈ పని చేస్తోందని..డిగ్రవీరకూ చదువుకుంది కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుంటుందని ఈ పెద్దామె భావిస్తోంది. ప్రస్తుతం అంబికకు వాహనమిత్ర పథకం, అంబిక తల్లి ఊట నూకరత్నానికి వృద్ధాప్య పింఛన్, అంబిక అన్నయ్యకు దివ్యాంగుల పింఛన్ పథకాలు అందుతున్నాయి ఇలాంటి లక్షలాది మంది ఆటో డ్రైవర్లందరిదీ దాదాపుగా ఒకటే పరిస్థితి...బండి తిరిగితేనే బతుకు బండి నడుస్తుంది. ఆటో మీటరు తిరిగితేనే...ఇంటిల్లిపాదీ భోజనం చేయగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల గాధలగురించి పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ అదే సమయంలోనే వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాత ఆటో , ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అండగా వుంటానని భరోసానిచ్చారు. అలా చెప్పిన మాటకు కట్టుబడి తన పాలన ప్రారంభమైన తర్వాత వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ ఈ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
శ్రమ విలువ తెలుసు కాబట్టే...
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్. – కె.వి. రమణ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ -
‘చేయూత’తో లక్షల కుటుంబాల్లో మార్పు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో మార్పు తెచ్చిందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇళ్ళకే పరిమితమైన మహిళలు కొత్తగా వ్యాపారదక్షతను అలవరుచుకుని, ఆర్థికంగా కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. చేయూత పథకం అమలుపై బుధవారం సచివాలయంలో మంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశమైంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, పినిపే విశ్వరూప్, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎం సలహాదారు (నవరత్నాల అమలు) శామ్యూల్‌తో పాటు పలువురు అధికారులు, భాగస్వామ్య కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు చేయూత కింద మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహం, చేపడుతున్న కార్యకలాపాలను మంత్రులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల ద్వారా అందిస్తున్న 11 వేల ఉత్పత్తుల టర్నోవర్ ఈ ఏప్రిల్ నుంచి నెలకు రూ.కోటి నుంచి రూ. 5 కోట్లకు చేరుకోవాలన్నది లక్ష్యమని అధికారులు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో 7,597 మంది మహిళా పారిశ్రామికవేత్తలు రూ.29.29 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. రెండో ఏడాది ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 12,208 రెడీమేడ్, వస్త్ర దుకాణాలు, నాన్ ఫార్మ్ లైవ్లీహుడ్ కింద 20,049 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు. సెర్ప్ సహకారంతో 78,066 వ్యాపారాలు, ఏజియో రిలయన్స్ భాగస్వామ్యంతో పదమూడు జిల్లాల్లో టెక్స్టైల్, అప్పారెల్, ఫుట్ వేర్ వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 36,162 రిటైల్ షాప్‌లతో హిందూస్థాన్ లీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ వంటి సంస్థలతో మహిళల మధ్య వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. 17 నెలల్లోనే రూ.783.93 కోట్ల విక్రయాలు జరిగాయని, రూ.94.07 కోట్ల నికర లాభాన్ని మహిళలు అందుకున్నారని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్ సుమారు కోటిన్నర టర్నోవర్ సాధించి లాభాలతో నడుస్తోందని, దీని ద్వారా 8 వేల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని అధికారులు తెలిపారు. -
అందుకో ‘నేస్తం’ ఆత్మగౌరవంతో
ఇది ఎన్నికల వాగ్దానం కాదు... మేనిఫెస్టోలోనూ చెప్పలేదు. అయినప్పటికీ ఈబీసీ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేదలు వారిలో కూడా ఉన్నారు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నాం. ఆర్ధిక, రాజకీయ, విద్యా సాధికారతకు మద్దతు పలుకుతూ ఒక అన్నగా, తమ్ముడిగా మంచి చేయాలనే ఈ బాధ్యత తీసుకుంటున్నా. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు. ప్రతి అక్కచెల్లెమ్మ జీవిత చరిత్ర కూడా గొప్పదే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవం ఇనుమడించేలా ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వకపోయినా, పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరచనప్పటికీ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, వారి మోములో సంతోషం వెల్లివిరిస్తేనే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తితో రెండున్నరేళ్లుగా ప్రతి అడుగు ముందుకేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. వివిధ జిల్లాల్లో లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలివీ.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తున్నాం. ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు అందచేస్తాం. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుందనే సంకల్పంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా.. ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందచేస్తున్నాం. అమూల్, రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, మహీంద్రా, యూనిలీవర్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించి వారికి అండగా నిలిచాం. వైఎస్సార్ కాపు నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, ఒంటరి మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఇస్తూ 3.27 లక్షల మంది ఆర్ధిక స్వావలంబనకు తోడుగా నిలిచిన ప్రభుత్వం కూడా ఇదే. 60 ఏళ్లు పైబడిన వారికి వైఎస్సార్ పెన్షన్ కానుక అమల్లో ఉంది. దీనివల్ల ప్రతి నెలా రూ.2,500 చొప్పున ఏటా రూ.30 వేలు అందుతాయి. జగనన్న కాలనీలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. తద్వారా ఆయా కుటుంబాల్లో 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి మేలు జరుగుతోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. ఈ ఇళ్లన్నీ పూర్తయితే 32 లక్షల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. మొత్తం రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ అమలు చేస్తున్నాం. దీనికోసం రూ.2,354 కోట్లు అందచేసి వారికి తోడుగా నిలిచాం. విద్యా, వసతి దీవెన జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లల చదువుల ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 18.81లక్షల మంది తల్లులకు ఈ రెండేళ్లలో రూ.6,258 కోట్లు అందించాం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, ఐటీఐకి రూ.10 వేలు, డిగ్రీ చదివే వారికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.2,267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే అందచేశాం. ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణిలు, 6 నుంచి 72 నెలలున్న చిన్నారులకు ప్రయోజనం చేకూరుతోంది. గతంలో రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనే పరిస్థితుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లుల ఆరోగ్యాలను మనసులో పెట్టుకుని ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 77 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మరింత మేలు జరగాలని గిరిజన మహిళలకు సంపూర్ణ పోషణ ప్లస్ తీసుకొచ్చాం. రాజకీయ సాధికారిత రాజకీయంగా మహిళా సాధికారితకు కూడా అత్యంత ప్రాధాన్యం కల్పించాం. శాసన మండలి తొలి మహిళా వైస్ ఛైర్మన్‌గా సోదరి జకియా ఖానమ్, తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి, మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆమె రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇవన్నీ మన ప్రభుత్వంలో వేసిన ముందడుగులు. నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 51 శాతం ఇచ్చేందుకు ఏకంగా చట్టమే తీసుకొచ్చాం. మొత్తం నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు 202 కాగా 102 మహిళలకే ఇచ్చాం. 1,154 డైరెక్టర్ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వగా అక్కచెల్లెమ్మలకు 586 కేటాయించాం. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు కలిపి 1,356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పాలక సంస్ధలకు సంబంధించి చైర్మన్, మేయర్ల పదవుల్లో సగానికి పైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులే ఇవ్వాల్సినా అంతకంటే ఎక్కువగా 52 చైర్మన్ల పదవులు వారికిచ్చాం. 60.47 శాతం మంది అక్కచెల్లెమ్మలే మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నగర పంచాయతీల్లో ఉన్నారు. 202 వ్యవసాయ మార్కెట్ కమిటీ ౖచైర్మన్ పదవుల్లో 101 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మకంగా 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఏడుగురు అక్కచెల్లెమ్మలే ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి 26 పోస్టుల్లో 15 మంది మహిళలే ఉన్నారు. మహిళల రక్షణకు ‘దిశ’ దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్ధాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మన రాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు 1,01,19,642 మంది ఫోన్లలో దిశ యాప్ ఉంది. అక్కచెల్లెమ్మలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకుని తోడుగా నిలుస్తారు. అలాంటి గొప్ప వ్యవస్ధను రాష్ట్రంలో తెచ్చాం. గతంలో బెల్ట్ షాపులు గుడి పక్కన, బడి పక్కన కనిపించేవి. ఇవాళ అవి ఎక్కడా లేకుండా కట్టడి చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం. అమ్మ ఒడితో తల్లులకు రూ.13,023 కోట్లు రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మకు మేలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మంది తల్లులు, 85 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తూ ఏటా రూ.6,500 కోట్లు అందిస్తున్నాం. ఇలా రెండేళ్లలో రెండు దఫాలుగా ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 61.73 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా వారిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలకు మంచి జరిగేలా ప్రతినెలా రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు ఇస్తూ తోడుగా నిలబడగలిగాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసగించగా, ఇప్పుడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు నేరుగా అందించాం. ఫలితంగా నిరర్థక ఆస్తులు, అవుట్ స్టాండింగ్ ఖాతాలు 0.73 శాతానికి తగ్గిపోయాయి. -
ఏపీకి ‘స్కోచ్’ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్ స్కోచ్ మెడల్స్ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’కు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ కేటగిరిలో గోల్డ్ స్కోచ్ దక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్తో పాటు 100కు పైగా రిటైల్ అవుట్‌లెట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్ ఫోర్టిఫికేషన్) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ వరించింది. ఐదు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్ విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్ యాప్‌కు సిల్వర్ స్కోచ్ అవార్డులు వరించాయి. ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సిల్వర్ స్కోచ్ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్ స్కోచ్ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్ ఫార్మింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ దక్కింది. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది
నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇలా దశ తిరిగిన జీడిమామిడి రైతుల కథాకమామిషు ఏమిటంటే.. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతోంది. 90 శాతం పంట ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతోంది. పైసా విలువ కూడా చేయదని పిక్క తీసేసిన జీడి పండు చెత్తకుప్పల పాలయ్యేది. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. కానీ, మూణ్నెల్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ‘వైఎస్సార్ చేయూత’, ‘ఆసరా’ మహిళా లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్లు తయారుచేసే ఓ కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి రూ.18 లక్షల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు, ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారుచేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు. వీటి అమ్మకాల ద్వారా ఈ మూడున్నర నెలల్లో రూ.3.68 లక్షల ఆదాయం పొందారు. వృధాగా పడేసే ఆ జీడి పండును గంగవరం మండలంలో 240 మంది జీడి మామిడి రైతుల నుంచి కిలో రూ.1.50–రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దానిని ప్రాసెసింగ్ చేసి 15,400 యూనిట్ల జ్యూస్, సోడా బాటిళ్లను తయారుచేశారు. తద్వారా ఒక్కో జీడి మామిడి రైతుకు రూ.3 వేల చొప్పున అదనపు ఆదాయం రాగా.. మూడున్నర నెలల్లో నిర్వహణ ఖర్చులు పోను రూ.లక్ష నికర ఆదాయాన్ని మహిళలు పొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా శాశ్వత జీవనోపాధి కోసం 23లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికీ విడతల వారీగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రభుత్వమే అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వ్యాపార సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌లోనూ సహకరిస్తుంది. అవసరమైతే బ్యాంకుల ద్వారా అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఆర్గానిక్ బట్టల తయారీ, చిరుధాన్యాల మార్కెటింగ్‌లో కొత్త అవకాశాలు కల్పించేందుకు ఆలోచిస్తున్నాం. ఇందుకోసం వాల్‌మార్ట్ వంటి సంస్థలతో ఒప్పందానికి సర్కారు పరిశీలిస్తోంది. – ఇంతియాజ్, సెర్ప్ సీఈవో 600 కేజీల పండు ద్వారా అదనపు ఆదాయం మా పొలంలోని జీడి మామిడి పండ్లు సుమారు 600 కేజీలను విక్రయించడంవల్ల ఈ ఏడాది రూ.1,200లు అదనపు ఆదాయం లభించింది. అలాగే, ఇందుకు సంబంధించిన కర్మాగారంలో హెల్పర్‌గా పనిచేయడంవల్ల అదనంగా నెలకు రూ.7,000 జీతంగా లభిస్తోంది. – వై. రాణి, పావని స్వయం సహాయ సంఘం సభ్యురాలు జీడిమామిడి రైతులకు ఎంతో మేలు జీడిమామిడి పండ్ల రసంతో ఆపిల్ సోడా, ఆపిల్ సిరప్ తయారుచేసే యూనిట్ నెలకొల్పేందుకు సెర్ప్, టానేజర్ సంస్థ ప్రతినిధులు ఎంతో కృషిచేశారు. ఏజెన్సీలో జీడిమామిడి సాగుచేసే గిరిజన రైతులకు ఆర్థికంగా మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేందుకు వారపు సంతల్లో అవగాహన కల్పిస్తున్నాం – కంగల అబ్బాయిదొర, ఎఫ్‌పీఓ, అధ్యక్షులు, గంగవరం మండలం వివిధ వ్యాపారాల్లో 7.17లక్షల మంది పెట్టుబడి ఇక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో రూ.8,839 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిచేకూర్చింది. ఇదే సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా కూడా రెండేళ్లలో దాదాపు రూ.12,800 కోట్ల మొత్తాన్ని పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. మహిళలు ఈ ప్రయోజనాలను ఉపయోగించుకుని 2020–21లో 2.68 లక్షల మంది వివిధ వ్యాపార, జీవనోపాధులు ఏర్పర్చుకున్నారు. వీరిలో 78 వేల మంది కిరాణా దుకాణాలు పెట్టుకుని నెలకు రూ.5 వేల అదనపు ఆదాయం పొందగా.. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తే, 70 వేల మంది గొర్రెలు మేకలను కొనుగోలు చేశారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు మరో రూ.1,510 కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4.49 లక్షల మందికి వ్యాపార, జీవనోపాధులు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 1.06 లక్షల మందికి తోడ్పాటు అందించింది. వంద కోట్ల అదనపు ఆదాయం గంగవరం కుటీర పరిశ్రమ ద్వారా తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండడంతో ఈ ప్రాంతంలో ఈ తరహా చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు వీలు ఏర్పడినట్లయింది. రానున్న రోజుల్లో ఈ తరహా పరిశ్రమల సంఖ్య పెరిగి రైతులందరి నుంచి పండు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులకే ఏటా రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయన్నారు. -
చిట్టితల్లుల సాధికారతకు ‘స్వేచ్ఛ’
మహిళల నిజమైన సాధికారత గురించి ఆలోచిస్తూ, ఈ దిశగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా కిశోరబాలి కల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఒక్కరోజు కూడా పాఠశాలకు దూరంకారాదనే సమున్నత ఆశయంతో ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. యుక్తవయసు వచ్చిన బాలికలకు రుతుక్రమం సమయంలో కొన్ని సమస్యలు రావడం, వీటి కారణంగా వీరు పాఠశాలకు వెళ్లలేకపోవడం దశాబ్ధాలుగా జరుగుతోంది. దీని కారణంగా వీరు తరగతులకు సరిగా హాజరు కాలేకపోవడం, విద్యలో కొంత వెనకబడటం సర్వసాధారణంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కిశోరబాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 32 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించి, అమలు చేస్తున్నారు. రుతుక్రమం ఇబ్బందులతో ఏ ఒక్కరూ పాఠశాలకు దూరం కారాదనే సదుద్దేశంతో ప్రతి నెల 10 నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ను అందించే ప్రక్రియను చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగాన్ని ఖర్చుగా చూడకుండా భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జగనన్న విద్యా కానుకగా 9 వస్తువులు, పుస్తకాలు అందిస్తూ చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను ప్రభుత్వం తన భుజాలపై వేసుకుంది. దీనిలో భాగంగా అమలు చేసిన ‘నాడు–నేడు’లో జరిగిన అభివృద్ది ప్రశంసనీయం. దీనిలో భాగంగా ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిరంతర నీటి సరఫరా కలిగిన టాయిలెట్లు బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో దోహదకారిగా నిలుస్తున్నాయి. నేడు ప్రారంభించిన స్వేచ్ఛ పథకం బాలికా విద్యను మరో మెట్టు ఎక్కిస్తుంది. పథకం అమలుకు ప్రత్యేక అధికారిగా అధ్యాపకురాలిని ఏర్పాటు చేయడం వలన బాలికలకు తమ భావాలను, ఇబ్బందులను చెప్పుకునే అవకాశం, వాటికి పరిష్కారాలు పొందడం సాధ్యపడుతుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా నెలకు10 చొప్పున ఏడాదికి 120 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ప్రభుత్వమే అందించనుంది. వేసవి సెలవుల్లో సైతం వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందుగానే విద్యార్థినులకు వీటిని అందించాలనే నిర్ణయం వారిపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తాయి. గ్రామీణ మహిళలపై సైతం దీనిపై అవగాహన కల్పిస్తూ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా తక్కువ ధరకే నాప్కిన్స్ అందించడం మరొక మంచి నిర్ణయం. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా వారి చిన్నారులకు అవసరమైన నాప్కిన్స్ సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తుంది. కిశోర బాలికల్లో అవగాహన కల్పించే విధంగా పాఠశాల అధ్యాపకులు, ఏఎన్ఎంలతో కార్యక్రమాలు చేపట్టడం, నాప్కిన్స్ ఉపయోగించే విధంగా ప్రోత్సహించడం, వినియోగించిన నాప్కిన్స్ సురక్షితంగా డిస్పోజ్ చేయడానికి సైతం 6417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డస్ట్ బిన్లు ఉంచడం పర్యావరణానికి మేలు చేసే ప్రయత్నాలుగా మనం భావించవచ్చును. దేశంలో 23 శాతం మంది చిన్నారులు రుతుసంబంధ సమస్యలతో పాఠశాలకు దూరం అవుతున్నారని యుఎన్ నివేదికలో పేర్కొన్న పరిస్థితులను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వేచ్ఛ పథకం నిలుస్తుంది. రాష్ట్రంలో నూరుశాతం కిశోర బాలికలు ‘స్వేచ్ఛ’గా తమ పాఠశాల విద్యను పొందే అవకాశాన్ని ఈ పథకం అందిస్తూ వారి కలలను సంపూర్ణంగా సాకారం చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషి యోను పెంపుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయా నికి, లక్ష్యానికి ఇటువంటి పథకాలు పునాదిరాళ్లుగా మారతాయి. - డాక్టర్ దిగుమర్తి సాయి బాల పల్లవి అసిస్టెంట్ ప్రొఫెసర్, గాయత్రీ విద్యాపరిషత్ పీజీ కళాశాల, విశాఖపట్నం -
‘స్వేచ్ఛ’గా చదువుదాం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. అపోహలు తొలగిస్తూ.. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్కిన్స్ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్ సప్లయి, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ లేకపోవడమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి -
Andhra Pradesh: ఆర్థిక శక్తికి ప్రతిరూపం
గత ఏడాది ప్రాక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. తద్వారా మరింత మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. – సీఎం జగన్‌తో అధికారులు సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు చూపుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆసరా, చేయూత ద్వారా మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఉపాధి మార్గాలు, వాటి అమలు కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు వివరించారు. మొదటి విడత ఆసరా కింద 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరిందని, ప్రభుత్వం రూ.6,330.58 కోట్లు మహిళల చేతిలో పెట్టిందని తెలిపారు. రెండో విడత ఆసరాకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో ఆ జాబితాలను ప్రదర్శించామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయం సాధించిన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని, ఇందు కోసం వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశు పోషణ ద్వారా పొందుతున్న ఆదాయ వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసింది ► గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీ కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది. ► 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీ చేసి ఉండి ఉంటే, అక్కడితో భారం పోయేది. కానీ చంద్రబాబు కట్టవద్దని చెప్పి, హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను ఆదుకోకపోవడం వల్ల మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. ► ఈ పరిస్థితిలో అక్కచెల్లెమ్మలు నా పాదయాత్రలో అడుగడుగునా బాధలు చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని, మా పరిస్థితి బాగోలేదని కోరారు. మనందరి ప్రభుత్వం అండగా నిలిచింది ► అక్కచెల్లెమ్మల కష్టాలను కళ్లారా చూసిన నేపథ్యంలో మనందరి ప్రభుత్వం ఆసరా, చేయూతలను తీసుకొచ్చింది. వారు కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా 2016లో రద్దు అయిన సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింప చేసింది. ► మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది. ► మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి, మరింత మందికి లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక చేపట్టాలి. చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా ఏ విధంగా ఉపాధి పొందవచ్చో అవగాహన కల్పిస్తూ పది రోజుల పాటు విస్తృత ప్రచారం చేపట్టాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి. ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం ► రెండో విడత ఆసరాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలి. ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్ ఇంకంబర్డ్ ఖాతాల్లో జమ చేయాలి. ► స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు స్పాట్ డాక్యుమెంటేషన్ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. ► మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి. మనం ఎలాంటి ఉపాధి మార్గం చూపినా మహిళలు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి మార్గాలు ► వైఎస్సార్ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ► రిటైల్ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించామని వివరించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గత టీడీపీ ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసింది: సీఎం జగన్
-
‘చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడ్‌లోకి పడిపోయాయి’
సాక్షి, తాడేపల్లి: ‘గత ప్రభుత్వం మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కాచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీలు కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కాచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 2016లో రద్దయిన సున్నావడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింపచేసి, మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్‌లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోంది’ అని తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు రూ.6330.58 కోట్లు మహిళలకు ప్రభుత్వం అందించిందని వివరించారు. దాంతోపాటు రెండో విడత ఆసరా సన్నాహాకాలను అధికారులు వివరించారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని సీఎం జగన్‌కు అధికారులు చెప్పారు. ఆసరా, చేయూతల కింద మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఉపాధి మార్గాలు, వాటి అమలు కార్యక్రమాలను సీఎం సమగ్రంగా సమీక్షించారు. 2014లో చంద్రబాబు అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే అక్కడితో భారం పోయేది. కానీ చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. మహిళలను ఆదుకోకపోవడంతో మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. పాదయాత్రలో నేను వెళ్లినప్పుడు ప్రతి మహిళా చేసిన డిమాండ్ .. డ్వాక్రా రుణాల మాఫీ. మా పరిస్థితి బాగోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకువచ్చాం. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి. రెండో విడత ఆసరాను ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలి’ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ‘ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్ ఇంకబర్డ్ ఖాతాల్లో జమచేయాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్ డాక్యుమెంటేషన్ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ తెలిపారు. అనంతరం వైఎస్సార్ చేయూతపైన ఆయన సమీక్షించారు. చేయూతపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. వైఎస్సార్ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రిటైల్ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించినట్లు వెల్లడించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం కావొద్దని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మనం ఎలాంటి ఉపాధిమార్గం చూపినా మహిళలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది ప్రాక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి సుస్థిర ఆర్థిక ప్రగతి కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికి వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయవంతమైన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణ ద్వారా పొందుతున్న ఆదాయాల వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సెర్ఫ్ సీఈఓ ఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్, సెర్ఫ్ ప్రాజెక్టు మేనేజర్ మహిత తదితరులు హాజరయ్యారు. చదవండి: Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట -
తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన SLBC సమావేశం
-
కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది. మరుసటి ఏడాది అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది’’ అన్నారు. ‘‘దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను’’ అన్నారు సీఎం జగన్. ‘‘గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి ‘‘కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్‌కార్డ్స్ (సీసీఆర్సీ)లను ఇచ్చాం. వీరికి సీసీఆర్సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఈ–క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి’’ అని సీఎం జగన్ సూచించారు. ఆర్బీకేలు– విత్తనం నుంచి విక్రయం వరకూ... ‘‘రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. ఆర్బీకేల్లోనే ఈ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌చేసి మరీ ఈ– క్రాపింగ్ చేస్తున్నాం. పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ఆర్బీకేలు–బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ‘‘ఇప్పటికే బ్యాంకర్లు 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడమే కాక.. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. ఆ బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆర్బీకేను వినియోగించాలి.. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెంట్ సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. ఈ–క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి’’ అన్నారు సీఎం జగన్. ‘‘బ్యాంకింగ్ విషయంలో వైయస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్ దిశగా గొప్ప అడుగు వేసినట్టు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఈ– క్రాపింగ్ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా చేయాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి’’ అని సీఎం జగన్ కోరారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4–5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం. ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్. జగనన్న తోడు– చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ‘ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. లబ్ధిదారులందరికి రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి’’ అన్నారు సీఎం జగన్. ‘‘ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఇవీ చదవండి: శిశు మరణాలకు కళ్లెం AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు -
వైఎస్సార్ చేయూతపై ఏపీ హైకోర్టులో వాదనలు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ చేయూత పథకంపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) శ్రీరాం వాదనలు వినిపించారు. వైఎస్సార్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం. ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి.. ఈ వ్యవహారంలో కోర్టులకు ఉండే పాత్ర పరిమితం అన్నారు శ్రీరాం. (చదవండి: Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!) పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. వరుసగా నాలుగేళ్ల పాటు వాళ్ల చేతికే డబ్బు అందుతుంది. పథకం అమల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఉన్నారు. అర్హులైన అందరికీ పథకం అందించాలన్నదే విధానం. ఈ విషయంలో తరతమ బేధం చూపరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు అని ఏజీ శ్రీరాం కోర్టుకు తెలిపారు. -
మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో 45–60 ఏళ్లలోపు ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ చేయూత’ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థికసాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా తొలిదశలో 24 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్లను గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు జతగా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మరింత సొమ్మును ఇప్పించి ఆ మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసేలా తోడ్పాటునందించింది. ఇలా తొలిదశలో బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు ఆ మహిళలకు రూ.1,507.24 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాయి. కేవలం రిటైల్ షాపులు, గేదెలు, ఆవుల, గొర్రెలు, మేకలు పెంపకం కార్యకలాపాలకే ఈ మొత్తం అందించాయి. ఇలా ప్రభుత్వం ఇచ్చిన సహాయానికి తోడు బ్యాంకుల నుంచి తోడ్పాటు అందడంతో వారు విజయవంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. మరోవైపు.. వీరు చేసే వ్యాపారాలకు మార్కెటింగ్ కల్పించేందుకు.. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను సమర్థవంతంగా వినియోగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, అలానా, హిందుస్థాన్ లీవర్ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. లబ్ధిదారులందరినీ బ్యాంకులతోనూ, కార్పొరేట్ కంపెనీలతో అనుసంధాం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటికి 0866–2468899, 9392917899 నెంబర్లను ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత చేయూతలో ఇలా.. ఇక రెండో విడత చేయూత కింద ఈ ఏడాది జూన్ 22న 23.44 లక్షల మంది మహిళలకు రూ.4,400 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించింది. ఇందులో 23.41 లక్షల మంది జీవనోపాధి రంగాలను ఎంపిక చేసుకున్నారు. అత్యధికంగా 7.66 లక్షల మంది వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా, 5.72 లక్షల మంది పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. వీరందరినీ వివిధ కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, బ్యాంకుల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ► ఈమె పేరు లక్ష్మమ్మ. అనంతపురం జిల్లా మడకశిర మండలం జీవీ పాళ్యం గ్రామం. ‘వైఎస్సార్ చేయూత’ పథకం ఈమెకు కొండంత భరోసా కల్పించింది. అప్పటివరకు ఆమె కుటుంబానికి అంతంతమాత్రపు ఆదాయం వచ్చేది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ ఇచ్చి నీలకంఠాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా మరింత సహకారం ఇప్పించిందో లక్ష్మమ్మ దశ తిరిగింది. ఆ డబ్బులతో ఉన్న ఊర్లోనే చిల్లర దుకాణం ప్రారంభించింది. రోజూ రూ.3వేలకు తగ్గకుండా వ్యాపారం సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ పుణ్యమా అని మా కుటుంబం ఇప్పుడు ఎవరిపై ఆధారపడకుండా సంతోషంతో జీవిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నామంటూ ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. ► ఈమె చిత్రాడ ముత్యాలమ్మ. స్వస్థలం విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామం. భర్త సంపాదన పైన ఈమె కుటుంబమంతా ఆధారపడేది. పోయిన ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ కింద రూ.18,750లు ఆర్థిక సాయం అందించింది. బ్యాంకు కూడా తోడుగా నిలిచి రూ.50వేల రుణ సాయం చేసింది. ఈ డబ్బుతో ముత్యాలమ్మ ఇంటివద్దే కిరాణా దుకాణం ప్రారంభించింది. ఆమె రోజువారీ వ్యాపారం బాగుండడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇప్పుడు రోజురోజుకూ మా వ్యాపారం పెరుగుతోందంటూ ఆమె ఆనందపడుతోంది. రాజమండ్రికి చెందిన యర్రా సాయికుమారి భర్తది సైకిళ్లకు పంక్చర్లు వేసే వృత్తి. దీంతో కుటుంబం గడవడం భారంగా ఉండేది. ప్రభుత్వం గత ఏడాది మొదటి విడత కింద వైఎస్సార్ చేయూత ఇవ్వడం.. వేరే ఇతర ఆర్థిక సంస్థతో మరింత తోడ్పాటు ఇప్పించడంతో ఈమె టైలరింగ్ షాపు ప్రారంభించింది. అందులోనే దుస్తులనూ విక్రయిస్తోంది. అప్పటివరకు నెలకు రూ.4వేలు ఉన్న ఆ కుటుంబ ఆదాయం ఇప్పుడు రెట్టింపయ్యింది. చేయూత పథకం గొప్ప వరమంటూ ఆమె సంతోషం వ్యక్తంచేస్తోంది. -
Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!
సాక్షి, అమరావతి: బ్యాక్వర్డ్ క్లాస్!!. బీసీలంటే అంతే!!. చంద్రబాబు దృష్టిలోనూ ఇంతే!!. వారికో ప్రత్యేక గుర్తింపునివ్వాలని... ఆర్థికంగానే కాక అధికారం కూడా ఇచ్చి బలోపేతం చేయాలని చంద్రబాబుకు తాను అధికారంలో ఉన్నపుడెప్పుడూ అనిపించలేదు. అలా అనిపించకపోవటం తప్పు అని ఆయనకు బాజా కొట్టే ‘ఈనాడు’కూ అనిపించలేదు. మా బాబు వాళ్లకేది విదిలిస్తే అదే గొప్ప... అన్న రీతిలో దాని వార్తాకథనాలు సాగిపోయాయి అప్పట్లో!. కానీ వైఎస్ జగన్ విషయంలో అలా కాదు.. వారిని సమాజానికి వెన్నెముకలా (బ్యాక్‌బోన్) చూశారు. అలా మార్చే పనిలో పడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లకు స్థానమివ్వటమే కాదు... శాశ్వత బీసీ కమిషన్నూ ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనులు అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగం వాటా ఇవ్వాల్సిందే అని తీర్మానించటమే కాక... ప్రతి అడుగులోనూ దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం ఇవన్నీ ఒకెత్తు. గడిచిన 26 నెలల్లో బీసీలకు ఏకంగా రూ.54,878 కోట్ల నగదు అందజేయటం ఇంకో ఎత్తు. వివిధ పథకాల ద్వారా 3.44 కోట్ల మంది బీసీల ఖాతాల్లోకి ఈ నగదు నేరుగా చేరింది!. మరి ఇవన్నీ ‘ఈనాడు’కో... చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకో కనిపించవా? బాబు హయాంలో బీసీలకిచ్చిన అప్పులు మాత్రమే కనిపిస్తాయా? అవి ఇప్పుడివ్వటం లేదంటూ కథనాలేల? బీసీల అప్పుల కోసం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఐదేళ్లలో బాబు ప్రభుత్వమిచ్చింది రూ.1,695 కోట్లట! మరి వై.ఎస్.జగన్ హయాంలో పథకాల రూపేణా వారికి నేరుగా ఇచ్చిన రూ.54,878వేల కోట్ల నగదుతో పోలిస్తే అదెంత? ఈ నిజాలు రాయటానికి ‘ఈనాడు’కు మనసొప్పదెందుకు? బీసీల విషయంలో అసలు ‘ఏది నిజం?’. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలే కాదు... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ బ్యాంకు రుణాలే దిక్కు. ఆ రుణాలేమైనా ఉదారంగా వస్తాయా అంటే... అదీ లేదు. లంచాలు ఇచ్చిన వారికి... పార్టీ– ప్రభుత్వ పెద్దల చేత సిఫార్సులు చేయించుకున్న వారికి మాత్రమే!! ఎందుకంటే వారికే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసేది. అలా విడుదల చేశాకే బ్యాంకులు రుణాలిచ్చేవి. అవి కూడా అరకొరే!!. ఇక బీసీల కోసమంటూ చంద్రబాబు సర్కారు ఒక్క పథకాన్ని అమలు చేస్తే ఒట్టు!. చదవండి: Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు బీసీలను అప్పుల ఊబిలోకి నెట్టడమే ఆయనకిష్టం లేదు. అందుకే నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ వారికి వర్తింపజేశారు. మారుమూలనున్న చిన్న చిన్న బీసీ కులాలకు కూడా గుర్తింపునిస్తూ... ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వారిలో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారు. ‘‘మా కులం ఉత్తరాంధ్రలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితం. అలాంటిది మాకూ ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మేం కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఇటీవల ఓ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపికైన మహిళ తండ్రి భావోద్వేగపూరితమయ్యారు. దీన్నిబట్టే వారికిచ్చిన ఈ గుర్తింపు వారిలో ఎంత ఆత్మ విశ్వాసాన్ని నింపిందో ఊహించొచ్చు. మీరు సగం.. ఏమీ తక్కువ కాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే తక్కువేమీ కాదు. ఖచ్చితంగా సగం!! ఇదీ జగన్ ఆలోచన. ఆచరణలో కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా దాన్ని అమలుచేస్తూనే వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులైనా, నామినేటెడ్ పనులైనా... ఈ సగాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతున్నారు. అంతేకాదు! దీన్లో మహిళలకూ సమాన వాటా ఇవ్వాల్సిందేనంటూ... దాన్నీ అమలు చేస్తున్నారు. డెప్యూటీ సీఎం పదవి మాత్రమే కాదు... కేబినెట్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఇంతటి చిత్తశుద్ధి... పోనీ దీన్లో ఓ 10 శాతమైనా చంద్రబాబులో ఏ కోశానైనా కనిపించిందా? లేనప్పుడు ‘ఈనాడు’ ప్రశ్నించలేదేం? ఇప్పుడు జరుగుతున్నదాన్ని ప్రశంసించడం సరే... ఉన్నది ఉన్నట్టు రాయరెందుకు? 26 నెలల్లో ...రూ.54,878 కోట్ల నగదు బదిలీ ‘మేనిఫెస్టోయే భగవద్గీత.. ఖురాన్... బైబిల్’ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్... అందులో పేర్కొన్న విధంగా గత 26 నెలల పాలనలో 3.44 కోట్ల మంది బీసీల బ్యాంకు ఖాతాలకు రూ.54,878 కోట్ల నగదును నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 1.27 కోట్ల మంది బీసీలకు రూ.21,981 కోట్లు లబ్ధి చేకూర్చారు. మరి బీసీలను అప్పులు పాలు చేయకుండా నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ చేయటం... ఇతర పథకాల ద్వారా వారిని అప్పులపాలు కాకలుండా ఆదుకోవటం ‘ఈనాడు’కు కనిపించవా? వాటిని ప్రస్తావించరెందుకు? ఇవన్నీ పక్కనబెట్టి రుణాల సంగతే చూసినా... బలహీన వర్గాలకు గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో బ్యాంకులు రూ.90,624 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఆ వర్గాలకిచ్చిన రుణాలు రూ.95,526 కోట్లకు చేరాయి. నిజానికి బాబు హయాంలోనూ బీసీలకు బ్యాంకు రుణాలు ఇంతకన్నా ఎక్కువేమీ లేవని సాక్షాత్తూ ఎస్ఎల్బీసీ నివేదికే చెబుతోంది. బీసీలకు ప్రత్యేకం... అధికారంలోనూ పెద్ద పీట... ఆర్థికంగానే కాదు. రాజకీయంగానూ బీసీల అభ్యున్నతి ప్రధానమనేది ముఖ్యమంత్రి జగన్ భావన. అందుకే వారికి రాజ్యాధికారంలోనూ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జానాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. వీటిలోనూ 50 శాతం మహిళలుండాలన్న నియమాన్ని మాత్రం వీడలేదు. నవరత్నాలతో బీసీల్లోని అర్హులందరికీ ఆర్ధిక ప్రయోజనం చేకూర్చటమే కాక బీసీల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రత్యేకగా వైఎస్సార్ చేయూత అందించారు. వైఎస్సార్ ఆసరా పేరిట స్వయం సహాయక బందాల్లోని బీసీ మహిళలకు ఆర్దిక సాయం... వారి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా... ప్రత్యేకంగా మత్స్యకార భరోసా... వైఎస్సార్ చేనేత పథకాలు అమలు చేస్తున్నారు. రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు పథకం అందించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీటిలో ఒక్కటీ అమలు చేయకున్నా... బీసీల ఊసే ఎత్తకున్నా... ‘ఈనాడు’ పెన్ను మాత్రం లేవలేదెప్పుడూ!!. -
వైఎస్సార్ చేయూతతో పల్లెల్లో ‘క్షీర విప్లవం’
విజయనగరం ఫోర్ట్: పాడి పశువులు పెంచే వారి ఇల్లు పది కాలాల పాటు పచ్చగా ఉంటుందన్నది పెద్దల నానుడి. గ్రామీణ ప్రజలు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అని గట్టిగా నమ్ముతారు. దీనిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద మహిళలకు పాడి, జీవాల యూనిట్లను మంజూరు చేస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఊతమిస్తోంది. రైతుల ఇళ్లు పాడి పశువులు, జీవాలతో కళకళలాడేలా యూనిట్లు మంజూరు చేస్తోంది. ప్రభుత్వం అందించిన ‘చేయూత’ ఇలా... వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.75 వేల విలువ చేసే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఆవు లేదా గేదె అయితే ఒకటి, 8 ఆడగొర్రెలు, ఒక గొర్రెపోతు, 8 మేకలు, ఒక మేకపోతును యూనిట్‌గా సమకూర్చుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,245 ఆవులు, గేదెలు యూనిట్లు అందజేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.16.83 కోట్లు ఖర్చుచేసింది. రూ.7.53 కోట్ల విలువైన 1004 గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేసింది. పెరగనున్న పాల ఉత్పత్తి... ప్రస్తుతం జిల్లాలో పాలిచ్చే ఆవులు 2,28,773, గేదెలు 73,554 ఉన్నాయి. సగటున రోజుకి జిల్లాలో 3.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేసిన 2,245 ఆవులు, గేదెల యూనిట్ల నుంచి రోజుకు 18 వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ‘చేయూత’ను అందిస్తోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తోంది. పాడి పశువులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు తీసుకున్న మహిళలు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. - వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ జగన్‌బాబు మేలు మరచిపోలేం జగన్‌బాబు మాలాంటి పేదోళ్ల మనుగడకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత కింద ఇచ్చిన ఆవును బాగా పోషిస్తున్నాను. పాలు విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నా. - రెడ్డి కొండమ్మ, వసాది గ్రామం, గంట్యాడ మండలం ప్రస్తుతం జిల్లాలో ఉన్న పశువుల వివరాలు జిల్లాలో 6,26,847 పశువులు ఉన్నాయి. ఇందులో 4,90,998 ఆవులు, 1,35,858 గేదెలు, 5,40,336 గొర్రెలు, 2,71,205 మేకలు, 54,92,310 కోళ్లు ఉన్నాయి. -
‘వైఎస్సార్ చేయూత’లో టీడీపీ నేత మోసాలు
గిద్దలూరు రూరల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకాన్ని అభాసుపాల్జేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు. అధికారులు రూపొందించిన జాబితాలో అర్హుల పేర్లను తారుమారు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాలని పథక రచన చేసి అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని సంజీవరాయునిపేట పంచాయతీ పరిధి చేయూత యాప్‌లో 96 మంది అర్హుల పేర్ల స్థానంలో అనర్హుల పేర్లను దొంగచాటుగా చేర్చి గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇలా ఎందుకు జరిగిందో అర్థంగాక.. ఓ టీడీపీ నేత కుట్రను తొలుత కనిపెట్టలేక తలలు పట్టుకున్నారు. ఇదీ..జరిగింది గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలో 105 మంది లబి్ధదారులు ఉన్నారు. అందులో ఒకరి వేలిముద్ర పడని కారణంతో, మరొకరు టైలర్ కావడంతో నగదు పడలేదు. మిగిలిన 103 మందిలో కేవలం ఏడుగురు అర్హులకు మాత్రమే పథకం వర్తించింది. మిగిలిన 96 మందిలో 24 మందికి బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు కావడంతో నగదు పడలేదు. 72 మంది అనర్హులకు బ్యాంకులో నగదు జమ కావడంతో వెంటనే విత్‌డ్రా చేసుకున్నారు. అర్హులకు అందాల్సిన రూ.18 లక్షల నగదు అనర్హులకు చేరడంతో అర్హులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల జాబితాను ఓ టీడీపీ నేత ఆన్లైన్లో తారుమారు చేశాడు. ఓసీలు, మగవారు, చిన్న పిల్లల పేర్లు నమోదు చేశాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిపై అర్హులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులకు నగదు మంజూరైంది. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎక్కడ అవినీతి జరిగిందో బయటకు తీయాలని అర్హులు కోరుతున్నారు. అవును..నిజమే గ్రామ సచివాలయం నుంచి మేము పంపిన జాబితా తారుమారైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. అనర్హులకు నగదు వచ్చినట్లు గుర్తించి నగదు విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంకులకు నోటీసులు పంపించాం. అప్పటికే అంతా నగదు విత్‌డ్రా చేసుకున్నారు. పూర్తి విచారణ చేసి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. - రంగనాయకులు, ఇన్చార్జి ఎంపీడీఓ, గిద్దలూరు -
‘వైఎస్సార్ చేయూత’తో మా కుటుంబానికి భరోసా లభించింది
కింది ఉన్న మహిళ పేరు పిన్నబోయిన అంజమ్మ. గుంటూరు జిల్లా ఈపూరు మండలం చిట్టాపురానికి చెందిన ఈమెకు పాడి పశువులే జీవనాధారం. ఆమె వద్దనున్న రెండు గేదెలు కొంతకాలం కిందట అనారోగ్యం తో మృతి చెందాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను ‘వైఎస్సార్ చేయూత’ పథకం ఆదుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పాడి గేదెల కోసం దరఖాస్తు చేసుకుంది. ‘జగనన్న పాలవెల్లువ’ పథకం కింద ఒక్కొక్కటి రూ.55 వేల విలువైన 2 మేలు జాతి గేదెలను అధికారులు ఆమెకు ఇప్పించారు. ప్రస్తుతం ఒకటి చూడుపోయగా, మరొకటి 4 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తోంది. లీటర్‌కు రూ.65 వరకు వస్తున్నాయని.. తమ కుటుంబానికి భరోసా లభించిందంటూ అంజమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా ఆమె ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో భరోసా లభించింది. వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఆర్థికంగా బలపడుతూ తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. లబ్ధిదారులకు ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే అండగా నిలిచి ‘జగనన్న పాల వెల్లువ’ కింద మేలు జాతి ఆవులు, గేదెలు.. జగనన్న జీవ క్రాంతి ద్వారా మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్లు, మేకపోతులను అందిస్తోంది. వాటి పెంపకం ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు పెరిగేలా, ఆర్థిక పురోగతి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. లక్ష్యానికి మించి యూనిట్ల మంజూరు.. పాడి పశువులకు సంబంధించిన జగనన్న పాల వెల్లువ పథకం కింద 1,13,008 యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో 1,13,854 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిచ్చింది. ఇందులో 78,003 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 47,387 మంది, ఎస్సీలు 26,883 మంది, ఎస్టీలు 3,192 మంది, ఓసీలు 494 మంది, మైనార్టీలు 47 మంది ఉన్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన పది జిల్లాల్లో 100 శాతానికి మించి యూనిట్లు మంజూరు చేశారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 6,405 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 8,504 యూనిట్లు మంజూరయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 9,815కు గానూ 4,321 యూనిట్లు మంజూరు చేశారు. అన్ని వర్గాలకూ.. మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్ల పిల్లలకు సంబంధించిన జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా 72,179 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 71,576 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇచ్చింది. వాటిలో 46,342 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 27,183 మంది, ఎస్సీలు 11,927 మంది, ఎస్టీలు 6,902 మంది, మైనార్టీలు 47 మంది, ఓసీలు 283 మంది ఉన్నారు. వైఎస్సార్, విశాఖ, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్ష్యానికి మించి యూనిట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21,113 యూనిట్లు మంజూరు చేయగా, ఇప్పటికే 15,512 యూనిట్ల సన్నజీవాలను లబ్ధిదారులకు అందించారు. ఒక్కొక్క యూనిట్లో 14 గొర్రె పిల్లలు లేదా 14 మేక పిల్లలతో పాటు పొట్టేలు లేదా మేకపోతు ఉంటాయి. మొత్తంగా 15 సన్నజీవాలుంటాయి. మా కుటుంబానికి ఆసరా దొరికింది.. నేను వైఎస్సార్ చేయూత సొమ్ములతో మేకలు, గొర్రెలు తీసుకుంటానని అధికారుల ను అడిగాను. వారు కూడా వెంటనే స్పందించి.. జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా 14 మేక పిల్లలు, ఒక మేకపోతును ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వీటి వల్ల మా కుటుంబానికి ఆసరా దొరికింది. – తుపాకుల కుమారి, ముప్పాళ్ల, గుంటూరు జిల్లా -
సాధికార యజ్ఞం
-
వైఎస్సార్ చేయూతతో కోటి మందికి మేలు
ఆర్థిక స్థోమత మరింత పెరిగేలా.. ► ప్రతి అక్కా చెల్లెమ్మ ఖాతాలో చేయూత కింద జమ చేస్తున్న ఈ డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలన్నది వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం. వీరు బాధ్యతాయుతమైన మహిళలు. ఆర్థిక స్థోమత మరింత పెరిగే విధంగా బాధ్యతాయుతంగానే అడుగులు వేస్తారు. వ్యాపారంలో అండగా నిలుస్తాం.. ► అక్కచెల్లెమ్మలు వ్యాపారం చేసేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను సమర్థంగా వినియోగించేలా.. వీరందరి జీవనోపాధి కోసం అమూల్, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్ తదితర వ్యాపార సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. – సీఎం వైఎస్ జగన్ ఏ ముఖ్యమంత్రి కూడా మీలాగా మేలు చేయలేదు మీరు చెప్పిన మాట ప్రకారం మాకు గత ఏడాది చేయూత డబ్బు అందింది. బ్యాంకులతో మాట్లాడి రుణం కూడా ఇప్పించారు. ఆ డబ్బులతో మేకలు కొనుక్కున్నాను. ఏ సీఎం కూడా మీలాగా మేలు చేయలేదు. మీరు రెండు చేతులతో పథకాలు ఇస్తున్నారు. మహిళలు అందరూ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. రెండేళ్లలోనే ఎన్నో పథకాల ద్వారా అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారు. పెద్ద కొడుకులా సాయం చేస్తున్నారు. మహిళలందరి తరపున మీకు ధన్యవాదాలు. – రాజేశ్వరమ్మ, పుసర్లపాడు, శ్రీకాకుళం ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మహిళల కష్టాలే ఎక్కువ అని భావించాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత వర్తిస్తుంది. ఈ వయసు వారికి నాలుగేళ్లలో రూ.75 వేలు చేతికి వస్తుంది. 60 ఏళ్లు దాటిన వారికి వెంటనే పెన్షన్ వస్తుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ రూ.1,000 నుంచి రూ.2,250 చేశాం. జనవరిలో రూ.2,500 చేయబోతున్నాం. అలా దీన్ని రూ.3 వేల వరకూ తీసుకుపోతామని భరోసా ఇస్తున్నాం. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని మన పని తీరుతో ఇట్టే అర్థం అవుతుంది. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఈ చట్టం చేశాం కాబట్టి ఆలయ బోర్డుల్లో, కార్పొరేషన్ పదవుల్లో, మార్కెట్ యార్డుల్లో, బీసీ కార్పొరేషన్లలో ఇవాళ అక్క చెల్లెమ్మలు అగ్రభాగాన కనిపిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో నా చెల్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో చెల్లి హోం మంత్రిగా ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ చేయూత పథకం ద్వారా దాదాపు 23.44 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరనుంది. రూ.4,395 కోట్లు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే గొప్ప కార్యక్రమం ఇది. వారి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే దాదాపు కోటి మంది జనాభాకు మంచి జరుగుతుంది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి చేసే అవకాశం వచ్చింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 45–60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి అక్క, చెల్లెమ్మకూ వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లపాటు మొత్తంగా రూ.75 వేలు ఇస్తామని చెప్పామన్నారు. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఈ అక్కచెల్లెమ్మలందరూ అత్యంత బాధ్యతాయుతమైన వారని, వారి కుటుంబాలకు రథసారథులని చెప్పారు. వీరి చేతిలో డబ్బు పెడితే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగు పడతాయన్న ఆలోచనతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ సామాజిక ఫించన్ వారికీ చేయూత ► వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్న 45 నుంచి 60 ఏళ్లున్న మహిళల్లో దాదాపు 6 లక్షలకుపైగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్నారు. వీరికి సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధి కలుగుతున్నా, అటువంటి వారికే ఎక్కువ సహాయం అందించాలన్న దృఢ నిర్ణయంతో ఈ సహాయం చేస్తున్నాం. ► గత సంవత్సరం దాదాపు 24 లక్షల మందికి రూ.18,750 చొప్పున జమ చేశాం. రెండవ ఏడాది ఇప్పుడు 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున నేరుగా దాదాపు రూ.4,400 కోట్లు వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. ► ఈ రెండేళ్లలో అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, సున్నా వడ్డీ కాకుండా.. కేవలం వైఎస్సార్ చేయూత ద్వారా మన ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం దాదాపు రూ.9 వేల కోట్లు. తద్వారా మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపుతుందని ఆశిస్తున్నాను. ఇంట్లో అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని ప్రగాఢంగా నమ్ముతాను. కార్పొరేట్ కంపెనీలతో టై అప్ ► అక్కచెల్లెమ్మలు ఎవరికైనా సహాయం కావాలన్నా, వ్యాపారం చేసేందుకు ఏదైనా తోడ్పాటు కావాలన్నా అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను మరింత సమర్థవంతంగా వినియోగించేలా ఆరాటపడుతూ వీరందరి జీవనోపాధి కోసం అనేక కంపెనీలతో టై అప్ చేశాం. ► రిస్క్ లేకుండా వ్యాపారం చేసే విధంగా అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, అలానా, హిందుస్థాన్ లీవర్ లాంటి భారీ వ్యాపార సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. నాణ్యమైన ఉత్పాదనలు డీలర్లకిచ్చే రేటు కన్నా తక్కువకు అక్క చెల్లెమ్మలకు వచ్చేలా చూశాం. ► ఆ ఉత్పత్తులు అమ్మినప్పుడు రూ.7 వేల నుంచి 10 వేల వరకూ ప్రతి ఒక్కరికీ లాభం ఉంటుంది. వీరి వ్యాపారాల కోసం బ్యాంకులతో కూడా మాట్లాడి టై అప్ చేశాం. ఇందుకోసం ప్రభుత్వమే అక్కచెల్లెమ్మలను, బ్యాంకులను, కంపెనీలను ఒక తాటిమీదకు తీసుకొచ్చింది. ► ఇలా 78 వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారు. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలు కొనుగోలు చేయగలిగారు. అమూల్ ద్వారా రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి లీటర్‌కూ గతంలో ఇచ్చిన రేటు కన్నా ఎక్కువ రేటు వచ్చేలా చేయగలిగాం. మరో 70 వేల మందికి మేలు జరిగేలా 70 వేల యూనిట్ల గొర్రెలు, మేకలు కొనుగోలు చేశారు. వాటి పెంపకం ద్వారా వాళ్ల ఆదాయం పెరిగి మేలు జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల అధికారులు, లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం జగన్ చేయూత కాల్ సెంటర్లు ► తొలి ఏడాది వైఎస్సార్ చేయూత ద్వారా బ్యాంకులు, స్త్రీనిధి, కార్పొరేట్ సంస్థలు.. ఇలా వ్యవస్థలన్నింటినీ భాగస్వామ్యం చేసి రూ.1,510 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. అనుసంధానం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్ సెంటర్లు కూడా ప్రారంభించాం. ► కాల్ సెంటర్ల కోసం 08662468899, 9392917899 నంబర్లను ప్రారంభించాం. అవసరమైన సహాయం, శిక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. మరో నెల రోజులు అవకాశం ► అర్హత ఉండీ ఎవరికైనా చేయూత రాకపోతే.. కంగారు పడవద్దు. సమీపంలోని గ్రామ సచివాలయానికి వెళ్లండి. వలంటీర్ సహాయం తీసుకోండి. గ్రామ సచివాలయంలో వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరో నెల రోజులపాటు ఇటువంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పిస్తామని మీకు భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో మహిళ మహారాణి జగనన్నా.. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నేను కిరాణా కొట్టు పెట్టుకున్నాను. మెప్మా అధికారులు సాయం చేయడంతో పలు కంపెనీల ద్వారా తక్కువ ధరకు సరుకులు అందాయి. రోజుకు రూ.600 నుంచి రూ.700 లబ్ధి పొందుతున్నాను. ఇతరత్రా పథకాల ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. మీ పాలనలో ఏ సేవ కావాలన్నా వెంటనే లభిస్తోంది. మీ కార్యక్రమాలు, చర్యల వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఇంటిలో మహిళ మహారాణిలా ఉంటోంది. – జుజ్జవరపు మేరి, ఉయ్యూరు, కృష్ణా జిల్లా సొంత అన్నదమ్ముల కంటే మిన్నగా చూస్తున్నారు అన్నా నేను మహిళా సంఘం సభ్యురాలిని. మీరు పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఆ మాట నిలుపుకుంటూ మా కష్టాలు తీరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత కింద రూ.18,750 నా అకౌంట్లో పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సొంత అన్నదమ్ముల కంటే మీరు ఎక్కువ మేలు చేస్తున్నారు. మాకు ఇంత సాయం ఎవరూ చేయలేదన్నా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నా. – గీతాంజలి, కన్యకాపురం, గుంటిపల్లి పంచాయతీ, చిత్తూరు జిల్లా -
‘మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యం’
లక్కిరెడ్డిపల్లె : మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లె మండలంలో రెండవ విడత వై ఎస్ ఆర్ చేయూత ప్రారంభ కార్య క్రమాన్ని ఎం.ఎల్.సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి రెడ్డేయ్య ,తదితరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలోనే ఏ రాష్ట్రము లోను కూడా అమలు చేయలేని విధంగా మన రాష్ట్రములో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ, సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి , ఏ పథకాన్నైనా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. మహిళలకు మహిళా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు,దిశ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందుతూ పైకి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లును కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాల పై బడిన వారికి ఇస్తానన్న పెంచన్ బదులు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18 వేల 5 వందలు నేరుగా మహిళల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. జగనన్నకు జేజేలు... ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ జీవితాలలో సీఎం జగనన్న వెలుగులు నింపుతున్నారని మండలంలోని పలు గ్రామాల అక్క చెల్లెమ్మలు తెలిపారు. మీ మేలు మరువలేము జగనన్న అంటూ జై జగన్, జై శ్రీకాంతన్న అంటూ పెద్ద ఎత్తున జేజేలు పలికారు. మెగా చెక్కు అందచేత... లక్కిరెడ్డిపల్లె మండలంలోని 1497 మంది లబ్ధిదారులకు రూ.265.875 లక్షల మెగా చెక్కును లబ్దిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపిపి రెడ్డెయ్య లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ్ రాఘవ రెడ్డి, ఏ.పి.ఎం శ్రీనివాసులు రెడ్డి, సింగిల్ విండో మాజి ప్రెసిడెంట్ యర్రంరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, మహిళలు,వెలుగు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్‌రెడ్డి -
మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ
-
మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మట్లాడుతూ.. వైఎస్ఆర్ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని, మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 సాయం అందిస్తున్నామని తెలిపారు. కుటుంబానికి మహిళలే రథసారధులు నాలుగేళ్లలో రూ.75వేల చొప్పున సాయం చేసే గొప్ప కార్యక్రమం అని, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారధులు సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం, ఆర్ధిక సాయంతో పాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అమూల్, రిలయన్స్, పీ అండ్ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, 78వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని సీఎం జగన్ తెలిపారు. లక్షా 19వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారని, లీటర్ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యత కేబినెట్లోనూ మహిళలకు ప్రాధాన్యతఇచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు నామినేటెడ్ పదవులను కేటాయించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి రంగంలో అధిక శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పించామని, వారి కోసం దిశ, అభయం యాప్ తీసుకొచ్చామని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని, వారికోసం ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అయింది. ఇప్పటికే 78వేల మందికి ఏపీ ప్రభుత్వం కిరాణా షాపులు పెట్టించింది. కిరాణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.10వేల వరకు అదనపు ఆదాయం రానుంది. 1,90,517 మందికి ప్రభుత్వం గేదెలు, ఆవులు, మేకలు అందించింది. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
అక్క చెల్లెమ్మలకు రెండో విడత ‘చేయూత’
-
నేడు అక్క చెల్లెమ్మలకు రెండో విడత ‘చేయూత’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున నేడు ఆర్థిక సహాయం అందజేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. రెండేళ్లలో రూ.8,943.52 కోట్లు సాయం.. 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అవుతుంది. సాయం సద్వినియోగం... ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు. కిరాణా షాపులు, పాడి పశువులు, జీవాల పెంపకంతో... వైఎస్సార్ చేయూత ద్వారా తొలి ఏడాది అందజేసిన సాయంతో ఇప్పటికే 78,000 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా 1,90,517 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న మహిళలకు మార్కెట్ ధర కన్నా కంటే తక్కువకే ఆయా సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్న ధర కన్నా లీటర్ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు మహిళలకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా లబ్ధి... ►ఇప్పటికే ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందుకుంటున్న 45 – 60 ఏళ్ల వయసు కలిగిన ఆరు లక్షల మందికిపైగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు తమ కాళ్లపై నిలబడేందుకు పింఛన్‌కు అదనంగా వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ►60 ఏళ్ల లోపు వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ప్రయోజనం కోసం వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అర్హత ఉంటే 60 ఏళ్ల తర్వాత వారికి పెన్షన్ మంజూరు చేసేలా పింఛను అర్హత వయసును వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు వృద్ధాప్య పింఛనుకు 65 ఏళ్లు కనీస అర్హతగా ఉన్న వయసును ఈ ప్రభుత్వం 60 ఏళ్లకు తగ్గించింది. -
రేపు రెండో విడత వైఎస్సార్ చేయూత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) వర్చువల్‌గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లలో లబ్ధిదారులకు రూ.8,943.52 కోట్ల సాయం అందింది. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కాచెల్లెమ్మలకు ప్రభుత్వం ఏటా రూ.18,500.. నాలుగేళ్లలో రూ.75వేలు సాయం అందించనుంది. ఎంచుకున్న వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు ఏర్పాటు చేయిస్తోంది. అమూల్, రిలయన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే 78వేల మందికి కిరాణా షాపులు పెట్టించింది. 1,90,517 మందికి గేదెలు, ఆవులు, మేకలు ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు అందిస్తోంది. కిరణా షాపుల ద్వారా ఒక్కో మహిళకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది. ఇక్కడ చదవండి: రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్: సీఎం జగన్ అభినందనలు -
AP Budget 2021: మహిళా సాధికారతకు పెద్ద పీట
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021 ఏడాదికి గాను బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు. ఇందుకోసం రూపొందించిన వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాలకు కేటాయింపులు చేశారు. వైఎస్ఆర్ ఆసరా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కలగజేయడం కోసం.. అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2019, ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిల్లో.. మొదటి విడతగా 2020 సెప్టెంబర్ 11న 6,337 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రెండవ విడతలో భాగంగా 2021-22 ఏడాదికి గాను మరో 6,337 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఏపీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా 2019-20 సంవత్సారానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి 1400 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. 2021-22కు గాను మరో 1,112 కోట్ల రూపాయలను కేటాయించింది. వైఎస్ఆర్ చేయూత మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం 2020 ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 45-60 ఏళ్ల లోపు షెడ్యూల్డ్ కులాల, తెగల, వెనకబడిన తరగతుల, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండో విడతలో భాగంగా 2021-22కు గాను మరో 4,455 కోట్లు కేటాయించింది. చదవండి: AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు -
కొత్తగా 45 ఏళ్లు నిండే మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కొత్తగా 45 ఏళ్లు నిండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కూడా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 45 ఏళ్ల వయస్సు నిండిన అర్హులైన మహిళలను వలంటీర్ల ద్వారా గుర్తించే ప్రక్రియను మొదలు పెట్టారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులైన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొదటి విడతలో 24 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.4,500 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. కాగా, గత ఏడాది 44 ఏళ్ల వయస్సు పూర్తయి పథకానికి అర్హత పొందలేకపోయిన వారిని ఈ ఏడాది అధికారులు గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది 60 ఏళ్ల వయస్సు పూర్తయిన వారిని కూడా వలంటీర్లు గుర్తిస్తారు. ఇకపై వీరు పెన్షన్ పథకం కిందకు వస్తారు. ఈ మేరకు రెండో ఏడాది పథకం అమలుకు వలంటీర్ల ద్వారా ఆయా వయస్సు వారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచారు. వలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు లేఖ రాశారు. -
అక్కచెల్లెమ్మల ఆర్థిక ప్రగతికి సర్కార్ ‘చేయూత’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా.. వ్యాపారవేత్తలుగా రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను ప్రవేశపెట్టి అక్కచెల్లెమ్మల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత, అలాగే పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకాల పేరుతో ఇప్పటికే రూ.వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వైఎస్సార్ చేయూత కింద 24.56 లక్షల మందికి తొలి విడతగా రూ.4,604 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద 87.75 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తొలి విడతగా రూ.6,792 కోట్లు సాయం అందించారు. వీటికి అదనంగా బ్యాంకుల నుంచి కూడా మరింత ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ రెండు పథకాలను అందిపుచ్చుకున్న మహిళలు గత ఆరు నెలల్లో రిటైల్ స్టోర్స్ ద్వారా రూ.74.91 కోట్ల విలువైన వస్తువులను విక్రయించారు. ఇప్పటికే 67,055 రిటైల్ స్టోర్స్ రాష్ట్రంలో ఇప్పటికే 13,757 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 67,055 రిటైల్ స్టోర్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలకు చెందిన 50,491 మంది అక్కచెల్లెమ్మలకు రూ.221.50 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. మిగిలిన 1,247 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా కనీసం ఒకటి చొప్పున చేయూత రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయించేందుకు సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,846 చేయూత రిటైల్ స్టోర్స్‌కు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించేందుకు చర్యలను చేపట్టారు. ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు.. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అక్కచెల్లెమ్మలకు వ్యాపారంలో సహకరించేందుకు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు.. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్, అల్లానా, అమూల్, రిలయన్స్ రిటైల్ వంటి ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పాడి పరిశ్రమతోపాటు రిటైల్ స్టోర్స్, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాలకు బ్యాంకుల నుంచి అవసరమైన రుణాలను ఇప్పించేందుకు చర్యలను తీసుకుంటోంది. మరోవైపు జగనన్న పాలవెల్లువ కింద ఇప్పటికే చేయూత లబ్ధిదారులకు 16,203 యూనిట్లు, జగనన్న జీవక్రాంతి కింద 22,518 యూనిట్లను మంజూరు చేసింది. చేయూత, ఆసరా లబ్ధిదారులైన 16.25 లక్షల మహిళలకు మూడేళ్లలో జీవనోపాధిని కల్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్ ) కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. వైఎస్సార్ చేయూత ఉమ్మడి బ్రాండ్ పేరుతో ఆసరా, చేయూత లబ్ధిదారుల ఉత్పత్తులు, వస్తువులకు మార్కెటింగ్ కల్పించనుంది. వచ్చే మూడేళ్లలో అక్కచెల్లెమ్మల వ్యాపారాలకు మద్దతుగా పలు ఏజెన్సీలు, కంపెనీలను భాగస్వాములను చేసేందుకు సెర్ప్ చర్యలు తీసుకుంటోంది. ‘చేయూత’ ఆసరా ఇచ్చింది.. వైఎస్సార్ చేయూత పథకం మాకు ఆర్థిక భరోసా కల్పించింది. నాకు ముందుగా రూ.18,750 అందించారు. తర్వాత మా గ్రామంలో బ్యాంకు ద్వారా రూ.56,250 అందుకున్నాను. వీటితో నేను కిరాణా దుకాణాన్ని నడుపుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – గొట్టాపు రమణమ్మ, మండవల్లి, కృష్ణా జిల్లా జిరాక్స్ మిషన్ పెట్టుకున్నా.. పన్నెండేళ్ల నుంచి నేను డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నాను. ఆసరా పథకం కింద మా గ్రూపునకు లక్ష రూపాయలు రుణమాఫీ అయ్యింది. సెర్ప్ తరఫున కూడా రుణం ఇచ్చారు. దీంతో నేను జిరాక్స్ మిషన్ పెట్టుకున్నాను. మరోవైపు చీరల దుకాణం కూడా నడుపుతున్నాను. సున్నా వడ్డీ డబ్బులు కూడా వచ్చాయి. ఇన్ని పథకాలను మాకు వర్తింపజేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – బి.సుజాత, ఎర్రముక్కపల్లె, వైఎస్సార్ జిల్లా -
వెటర్నరీ పోస్టులన్నీ భర్తీ
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాలైన పశువుల సంరక్షణ, బాగోగులపై కూడా పెద్ద మనసుతో దృష్టి సారించింది. అనారోగ్యం బారిన పడకుండా పశువులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ల (పశువుల వైద్యులు) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో వెటర్నరీ వైద్య సేవలను అనుసంధానించాలని సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట విధానం (ఎస్వోపీ) రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నాసిరకం వాడకూడదని, కచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలందించాలన్నారు. బయో పెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు కన్నబాబు, అప్పలరాజు నకిలీలకు అడ్డుకట్ట వేయాలి కియోస్క్‌ల ద్వారా ఇప్పటికే ఫీడ్, సీడ్ సరఫరా చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. రైతులకు ఏది అవసరమో తెలియచెప్పడంతోపాటు వాటిని అందించాలని సీఎం సూచించారు. నకిలీలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్ ట్యాగ్ చేయించాలని సూచించారు. మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లియర్ వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించి ప్రతి మూడు నెలలకోసారి బీమా పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి రూ.98 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పశువులకే కాకుండా బీమాకు సంబంధించి అందరికీ 3 నెలలకు ఒకసారి పరిహారం క్లెయిమ్స్ పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేయాలని, సీఎంవో అధికారులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్బీకే కాల్ సెంటర్ పనితీరును తనిఖీ చేయాలి ఆర్బీకేల ఇంటిగ్రేడెట్ కాల్ సెంటర్ నంబర్ 155251 సరిగా పనిచేస్తోందా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కాల్ సెంటర్ నంబరు పనితీరుపై తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్యారెంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నామని, వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఓకే ఖాళీగా ఉన్న 6,099 పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పశు సంరక్షక్ యాప్ పనితీరును ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్ ఫీడ్ యాక్ట్ నేపథ్యంలో క్వాలిటీ సీడ్ ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. జగనన్న పాలవెల్లువ, జీవక్రాంతి పథకాలు విస్తృతం వైఎస్ఆర్ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం జగన్ సమీక్షించారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఈ పథకాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మిగతా దరఖాస్తుదారులకు కూడా వీలైనంత త్వరగా బ్యాంకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వారం గుంటూరులో అమూల్ పాల వెల్లువ చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైన పాలవెల్లువ కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. వచ్చే వారం గుంటూరు జిల్లాలో అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్ ఏర్పాటు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. భవనాలన్నీ జూన్ 1 నాటికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్లు, 21 లాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు నాడు– నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు సంవత్సరాల్లో అన్ని పశు వైద్యశాలలు ఆధునీకరణ పూర్తి చేయాలని, నాడు–నేడు (పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మొబైల్ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్ 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించడంతో పాటు నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్ యాంబులేటరీ సర్వీసెస్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో జబ్బు పడిన పశువులను సైతం ఆసుపత్రికి తరలించే వీలుంటుందన్నారు. కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణ వైఎస్సార్ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. కడక్‌నాథ్ చికెన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మత్స్య శాఖపై సమీక్ష సందర్భంగా విలేజీ ఫిషరీష్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆక్వాసాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఎక్కువగా అందాలని, మందులు కల్తీ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా సీఎం ఆదేశించారు. అర్హులందరికీ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద అర్హులెవరూ ఈ పథకం వర్తించకుండా మిగిలిపోకూడదని, అదే సమయంలో అనర్హులకు పథకం అందకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. జలాశయాల్లో కేజ్ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించి జలవనరులశాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు మత్స్య ఉత్పత్తుల స్ధానిక వినియోగాన్ని పెంపొందించేలా మార్కెటింగ్ చర్యలను వేగవంతం చేయాలని, మే నెల నాటికి ఇవి ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్ – 1 కింద జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో ఫిషింగ్ హార్బర్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఫేజ్ – 2 కింద బుడగట్ల పాలెం, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, పూడిమడక, మంచినీళ్లపేటలలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వివరాలను అధికారులు సీఎంకు వెల్లడించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు, ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. – సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఏ, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, పశు సంవవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేయూత, ఆసరాతో ఆర్థిక చక్రం వేగం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు రాష్ట్రంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో ఈ పథకాలను అమలు చేయడమే కాకుండా, ఈ పథకాల లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించడానికి తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక చక్రం వేగం పుంజుకుంటోంది. ఈ పథకాలను ప్రకటించినప్పుడు కొంత మంది పెదవి విరిచినా, ప్రస్తుతం అమలు అవుతున్న తీరు చూసి, వాటి ఫలితాలను బేరీజు వేసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పథకాలు వృథా ఖర్చు అన్న నోళ్లే.. ఇప్పుడు సరికొత్త వ్యాపారాలకు ఈ పథకాలు నాంది పలికాయంటుండటం విశేషం. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఏర్పడిన నేపథ్యంలో, రాష్ట్రంలో సంప్రదాయ, ఆధునిక సాంకేతికత మేళవింపుతో పెద్ద సంఖ్యలో పేద మహిళలు వ్యాపార రంగంలోకి అడుగిడటాన్ని యావత్ దేశం ఆసక్తిగా పరిశీలిస్తోంది. చేయూత, ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన సొమ్ముతో లబ్ధిదారులైన మహిళలు ఏ విధంగా ఉపాధి పొందుతున్నారనే విషయం శుక్రవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. ► వైఎస్సార్ ఆసరా, చేయూత వల్ల 16 లక్షల మందికిపైగా లబ్ధి కలిగింది. వీరిలో 66,702 మంది రిటైల్ దుకాణాలకు ఆప్షన్ ఇచ్చారు. వీరిలో ఇప్పటికే 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో వ్యాపారాలు ప్రారంభించడానికి మరింత మంది మహిళలు సమాయత్తమవుతున్నారు. ► గేదెలు, ఆవుల కోసం 4 లక్షల మంది ఆప్షన్ ఇచ్చారు. 1.06 లక్షల మంది సమగ్రంగా దరఖాస్తు పూర్తి చేశారు. వీరిలో 20 వేల మందికి ఇప్పటికే గేదెలు, ఆవులను అందజేశారు. ► మేకలు, గొర్రెలకు 2 లక్షల మందికి పైగా ఆప్షన్ ఇవ్వగా, 70 వేల మంది సమగ్రంగా దరఖాస్తు పూర్తి చేశారు. వీరిలో ఇప్పటికే 20 వేల మందికి వాటిని అందజేశారు. ► మిగిలిన లబ్ధిదారుల్లో సింహభాగం ఇతరత్రా వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు. కొందరు ఇళ్లలోనే వ్యాపారాలను ప్రారంభించగా, మరికొందరు చిన్నపాటి దుకాణాలను బయట ఏర్పాటు చేసుకుంటున్నారు. చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీని ఏర్పాటు చేయండి ► వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల కింద ఆప్షన్లు ఎంచుకున్న వారికి ఉపాధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు ఒక ఏజెన్సీని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ► వీలైనంత త్వరగా వీరందరికీ తోడుగా నిలవాలని.. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు కదలాలని చెప్పారు. రెండో విడత ఆసరా, చేయూత అందించేలోగా ఈ ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ► గొర్రెలు, మేకలు, పాడి పశువులు కోరుకున్న లబ్ధిదారులకు గడువుకన్నా ముందుగా వాటిని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ► చేయూత, ఆసరా కింద వ్యాపారాలు నడుపుకుంటున్న వారికి ఏదైనా సమస్య వస్తే, వెంటనే తీర్చడానికి రిటైల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారు దాదాపు 16.25 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ► వీరందరికీ స్థిర ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉపాధి మార్గాలను చూపుతున్నామని వివరించారు. జీవనోపాధిపై దృష్టి సారించాలి ► జగనన్న జీవక్రాంతి ద్వారా డిసెంబర్ 2021 నాటికి మరో 70,719 మందికి మేకలు, గొర్రెలు అందజేస్తామని, ప్రతి నెలా 5 వేల మందికి మేకలు, గొర్రెలు అందజేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా డిసెంబర్ 2021 నాటికి మరో 1,06,376 యూనిట్లు అందజేస్తామని తెలిపారు. ► జగనన్న తోడు కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరయ్యేలా చూడాలని బ్యాంకర్లను సీఎం ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా మిగిలిన వారికి కూడా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వివిధ పథకాల అమలులో ఏపీ చాలా ముందుకు దూసుకుపోతోందని బ్యాంకర్లు తెలిపారు. ► ఉపాధి హామీ పథకం ప్రారంభమయ్యాక 2020–21లో అత్యధికంగా 23.28 కోట్ల పనిదినాలు కల్పించామని అధికారులు తెలిపారు. జూన్‌లో అత్యధికంగా 7.98 కోట్ల పని దినాలు కల్పించామని చెప్పారు. ► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాల పురోగతిపై సీఎం చర్చిస్తూ.. ఈ పనులు వేగంగా ముందుకు సాగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డు
సాక్షి, అమరావతి: పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు స్కోచ్ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. మంగళవారం క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందజేశారు. ఆదర్శంగా ఆర్బీకేలు.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూ త, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళ ల ఆర్ధిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుం దని తెలిపారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. కోవిడ్ నియంత్రణలో సమర్థంగా.. కోవిడ్–19 నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్ గ్రూప్ చైర్మన్ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందన్నారు. చదవండి: పల్లెపల్లెన 540 సేవలు ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
స్కాచ్ ‘సీఎం ఆఫ్ ది ఇయర్’గా వైఎస్ జగన్
-
అత్యధికులకు జీవనోపాధి
వైఎస్సార్ చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్ షాపులకు ప్రాముఖ్యత కల్పించడం చాలా అవసరం. ఈ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించాలి. మరింత పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక అధ్యయనం చేయాలి. వీటి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి. నాడు–నేడు ద్వారా జరుగుతున్న విద్యా, వైద్య రంగాల్లో మార్పులను కూడా ఈ తరహా సంస్థల దృష్టికి తీసుకెళ్లి అధ్యయనం చేయించాలి. ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్న కంపెనీలతో మాట్లాడి.. చేయూత లబ్ధిదారులకు వారిని అనుసంధానం చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలి. సాక్షి, అమరావతి: జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, ఆసరా, బీమా పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ మార్చి ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు. వైఎస్సార్ చేయూత కింద చేపడుతున్న వివిధ ఉపాధి కల్పనా కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. ఇటువంటి మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉందని, రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది ఈ కార్యక్రమంలోకి వచ్చేటట్లు చేయాలని చెప్పారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, బీమా, జగనన్న తోడు పథకాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడం కన్నా, ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడి పెట్టేలా చేస్తే బాగుంటుందని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ఆ కుటుంబం జీవనోపాధి మెరుగు పడుతుందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీతో పాటు, రిటైల్ స్టోర్స్ ఏర్పాటు అంశాలపై లోతుగా సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఫీడ్ నుంచి అమ్మకం దాకా.. ► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పాల వెల్లువ, జీవక్రాంతి లబ్ధిదారులు ఆర్డర్ చేస్తే పశుదాణా, మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఈ పథకం కింద సరఫరా చేస్తున్న పశువులకు యూనిక్ ఐడీ నంబర్‌తో పాటు జియో ట్యాగింగ్ చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి. ► లబ్ధిదారులు పశువులను అమ్మాలనుకుంటే కూడా ఆర్బీకేల ద్వారా అది జరిగేలా చూడాలి. పశువులకు సంబంధించిన పూర్తి హెల్త్ రికార్డు నిర్వహించాలి. విత్తనం నుంచి విక్రయం దాకా తరహాలో.. ఫీడ్ నుంచి అమ్మకం దాకా అన్నట్లు అన్ని సేవలు ఆర్బీకేలలో అందుబాటులో ఉండాలి. ► జగనన్న తోడు పథకానికి సంబంధించి అర్హత ఉన్న మిగిలిన లబ్ధిదారులకు కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. బీమా పథకం అమలుపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై సమీక్షించాలి. 2022 మార్చికి ఏపీ అమూల్ ప్రాజెక్టు విస్తరణ ► ఏపీ అమూల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో (ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప) అమలవుతున్న ప్రాజెక్టును ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ► 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఈ ప్రాజెక్టును విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. పాలసేకరణకు సంబంధించి డెయిరీల సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల గురించి వివరించారు. ► పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు, పశువుల చికిత్స కోసం కొత్త టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. పశువుల ఆస్పత్రులను కూడా నాడు–నేడు తరహాలో ఆధునికీకరించాలని సీఎం ఆదేశించారు. ► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకాల్లో రుణాల మంజూరును మార్చిలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది సంక్షేమ పథకాల్లో వచ్చేట్లు చూడాలని సూచించారు. పశువులకు సంబంధించి పూర్తి హెల్త్‌కార్డులను కొనసాగించాలన్నారు. పశువుల ఆస్పత్రులను నాడు-నేడు తరహాలో ఆధునీకరించాలని తెలిపారు. అన్ని సేవలు ఆర్బీకేల్లో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని సీఎం జగన్ ఆమోదించారు. (చదవండి: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్) -
అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని.. అక్క చెల్లెమ్మలు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. అందుకే వారి ముఖాల్లో అహర్నిశలు సంతోషం ఉండేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో భాగంగా అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో మేకలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేసే ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను బహూకరించారు. అనంతరం జిల్లాల్లోని లబ్ధిదారులనుద్ధేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు మూడు దశల్లో పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పథకం అత్యంత తృప్తి ఇచ్చే పథకాల్లో ఒకటి అని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.. ► గ్రామీణ ప్రాంతాల్లో చేయూత, ఆసరా కింద ఇచ్చిన డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేసుకునేలా సహకారం అందిస్తున్నాం. దాని వల్ల అదే గ్రామంలో వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ఆదాయ వనరు ఏర్పరచినట్లు అవుతుంది. తద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మారుతాయి. ► చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వడంతో పాటు, కుటుంబ సభ్యుడిగా వారిని చేయి పట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఇదే ఉదాహరణ. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ► అమూల్‌తో ఒప్పందం తర్వాత రూ.3,500 కోట్లతో 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు.. అంటే ఒక ఆవు, దూడ.. లేదా కడుపుతో ఉన్న గేదె పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఇవాళ రూ.1,869 కోట్లతో 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీకి శ్రీకారం చుట్టాం. ఒక్కో యూనిట్లో ఐదారు నెలల వయసున్న 14 మేకలు లేదా గొర్రెలు.. ఒక మేకపోతు లేదా పొట్టేలు ఉంటుంది. మొత్తంగా రూ.5,500 కోట్ల వ్యయంతో అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ► 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్ల పంపిణీని వారం క్రితం ప్రారంభించాం. ఈ పథకం ప్రారంభం రోజున 7 వేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరి (2022) వరకు 3.69 లక్షల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఆ విధంగా దాదాపు 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ జరుగుతుంది. ► 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం. తొలి దశలో వచ్చే మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు, రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడో విడతలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం. ఇందుకోసం దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలను ఎక్కడెక్కడి నుంచో సేకరించాల్సి వస్తోంది. అందుకే మూడు దశల్లో కార్యక్రమం చేపట్టాం. పలు సంస్థలతో ఒప్పందం ► చేయూత సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా జీవనోపాధి కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చూసేందుకు ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్ఎల్ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ► స్థానిక జాతుల్లో నచ్చిన మేకలు, గొర్రెలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. సరైన ధరకు వచ్చేలా, అన్నీ సవ్యంగా జరగడం కోసం ప్రత్యేకంగా ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్ అధికారులు, బ్యాంక్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ లబ్ధిదారుడికి అడుగడుగునా తోడుగా నిలుస్తుంది. ► రాష్ట్రంలో మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే అంత కంటే ఎక్కువ ధర వస్తే అక్కచెల్లెమ్మలు నేరుగా అమ్ముకోవచ్చు. అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఆర్బీకేల ద్వారా మరిన్ని సేవలు ► గ్రామాలలో ఆర్బీకేలు రైతులకు వ్యవసాయ పరంగానే కాకుండా, పశు పోషణలో కూడా తోడ్పడతాయి. రైతులు, అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తాయి. పశువుల మంచి చెడులు చూసే వ్యవస్థ కూడా ఆర్బీకేలలో ఉంటుంది. ► నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ, సమతుల్యమైన దాణా సరఫరా వంటివి ఆర్బీకేల పరిధిలో ఉంటాయి. వైఎస్సార్ సన్నజీవుల నష్ట పరిహారం పథకాన్ని (ఇన్సూ్యరెన్స్), టీకాలు వేయడం, వెటర్నరీ సర్వీసులను కూడా ఆర్బీకేల పరిధిలోకి తెస్తాం. ► పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాటు కోళ్ల పెంపక కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తే బాగుంటుందని ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరింత తోడుగా నిలుస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు మరింత తోడుగా నిలుస్తాం. రాష్ట్రంలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా (సీఎం స్వాగతించారు) ఇదే సరైన సమయం. బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మేకలు, గొర్రెలలో మంచి బ్రీడ్ ఉంది. వాటిని ఇక్కడికి కూడా తీసుకువస్తే.. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందుకు మేము సహకరిస్తాం. (ఈ విషయాన్ని వెంటనే పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు) – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇర్ఫాన్ అల్లానా, అల్లానా గ్రూప్ చైర్మన్ అక్క చెల్లెమ్మలు చేపట్టబోయే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తీసుకు వచ్చేందుకు ఏడాదిన్నరగా ఎన్నో పథకాలు అమలు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఇస్తూ చట్టం చేశాం. మరోవైపు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబోతున్నాం. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం. వీరికి ఇంకా మేలు చేసే అవకాశం దేవుడు కల్పించాలి. గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని భావించలేదు. వ్యవసాయంతో పాటు మేకలు, పశువులు, కోళ్లు, చేపల సాగు వంటివి చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. కరవు కాటకాలు వచ్చినా అవి ఆదుకుంటాయి. రైతన్నలు, అక్క చెల్లెమ్మలకు అదనంగా ఆదాయం కల్పించే వనరులివి. నాన్న గారిని మించి మేలు చేస్తున్నారు నాకు 47 ఏళ్లు. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 తీసుకున్నాను. బ్యాంకు ద్వారా రూ.56,250 రుణం వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఏపీఎం, బ్యాంకు ఆఫీసర్ వచ్చి మొత్తం రూ.75 వేలతో జీవాలు కొనిచ్చారు. చాలా ఆనందంగా ఉంది. రైతు భరోసా కేంద్రం ద్వారా టీకాలు, మందులు ఉచితంగా ఇస్తారు. మహిళలందరం పలు పథకాల వల్ల లబ్ధిపొందుతున్నాం. నాన్న గారి కంటే మించి మీరు మేలు చేస్తున్నారు. మా మహిళల దీవెనలన్నీ మీకే ఉంటాయి. – మరియమ్మ, రుద్రవరం గ్రామం, బేతంచర్ల మండలం, కర్నూలు జిల్లా. జీవనాధారం దొరికింది వైఎస్సార్ చేయూత సొమ్ము, లోన్ ద్వారా 14 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఇచ్చారు. మేం నష్టపోకుండా ఎలా సాకాలన్న దానిపై మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మాకు జీవనాధారం దొరికింది. గతంలో రుణాల కోసం పనులు మానుకుని, తిండి లేకుండా పడిగాపులు కాసేవాళ్లం. ఇప్పుడు మీరు పెట్టిన గ్రామ సచివాలయాల వల్ల, వలంటీర్ల వల్ల మా పనులు సులభంగా అవుతున్నాయి. రైతు భరోసా, పింఛన్లు, అమ్మ ఒడి, విద్యా కానుక.. ఇలా ఎన్నో పథకాల వల్ల అందరికీ మేలు జరుగుతోంది. కరోనా కష్టకాలంలో మీ వల్ల మూడు పూటలా అన్నం తిన్నాం. చాలా సంతోషంగా ఉంది. – దానమ్మ, ఎరుమల్లపాడు, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా. మా కాలంలో నువ్వే రాముడివి 14 గొర్రెలు, ఒక పొట్టేలు డాక్టర్లు సూచించినవే తీసుకున్నాను. వాటిని బాగా మేపుకుంటే మంచిగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఎక్కడా పనికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆదాయం పెరుగుతుంది. పిల్లలను ధైర్యంగా చదివించుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాపకు అమ్మఒడి వచ్చింది. నాకు వితంతు పింఛన్ వస్తోంది. మా సంఘానికి రుణమాఫీ కూడా వచ్చింది. ‘ఇప్పుడు మా దేవుడు ఇంటికాడ కొచ్చి పింఛన్ ఇత్తాండు’ అని మా నాన్న పొగుడుతున్నాడు. అన్నా.. రాఖీ పండుగ రోజు నీ ఫొటో గూట్లో పెట్టి రాఖీ కట్టాను. రామ రాజ్యం గొప్పదని పెద్దలు అంటారు.. అదెలాంటిదో మేం చూడలేదన్నా.. మా కాలంలో నువ్వే రాముడివి. దేవుడివి. – లక్ష్మీదేవి, నాయనపల్లి, అనంతపురం జిల్లా మీ మేలు మరవలేం పాదయాత్రలో మీరు ప్రకటించిన విధంగా మాకు అన్ని విధాలా మేలు చేస్తున్నారు. జగనన్న జీవ క్రాంతిలో భాగంగా మేకలను పొందడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి ద్వారా బాగా అభివృద్ధి చెందుతామనే నమ్మకం ఉంది. నా ముగ్గురు పిల్లలకు విద్యా దీవెన అందింది. మా అత్తకు పింఛన్ వస్తోంది. ఇంటింటికీ తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు. కరోనా సమయంలో బాగా ఆదుకున్నారు. మీ మేలు మరవలేము. – సవర ఇవాంజెలిన్, సిరిపురం గ్రామం, పలాస, శ్రీకాకుళం జిల్లా. జగనన్న జీవక్రాంతి పథకం లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు రైతుల మాదిరిగా పశువులకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొన్న వారికి ఇది ఉపయోగ పడుతుంది. కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు జారీ చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ -
ఎల్లో మీడియా విష ప్రచారం నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పెన్షన్లు, వైఎస్సార్ చేయూత పథకాలపై ఎల్లో మీడియా పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ వెళ్తామని పునరుద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాడు జూలై 8న పెన్షన్‌ను రూ.2,500కు పెంచుతున్నామని స్పష్టం చేశారు. అమూల్‌పై శుక్రవారం శాసనసభలో చర్చ చేపడుతున్నట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించాక, ఈ అంశం చర్చకు రాకుండా విపక్షం అడ్డుకుంది. ఉపాధి హామీపై చర్చ చేపట్టాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడమే కాకుండా, సభాపతి సీటు వద్దకు వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. అనంతరం ఈ విషయంపై సీఎం మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దుర్బుద్ధితోనే అల్లరి ► రైతులకు ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు అమూల్ ద్వారా ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో శాసనసభ చర్చ ద్వారా చెప్పాలనుకున్నాం. ► కుళ్లు, కుట్ర రాజకీయాలు తెలిసిన చంద్రబాబు అమూల్‌పై చర్చ రాకుండా, కావాలని తన ఎమ్మెల్యేలను పోడియం దగ్గరకే కాదు, ఏకంగా స్పీకర్ సీటు వద్దకే పంపాడు. ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ వరకూ తీసుకెళ్లాడు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి ► చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటు. పెన్షన్లు, వైఎస్సార్ చేయూతపై అన్ని ఆధారాలతో శాసనసభలో ప్రభుత్వం వివరిస్తే ఈనాడు పత్రిక దాన్ని వక్రీకరించింది. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా ఒక పార్టీకి అమ్ముడు పోయి, వాస్తవాలను ఎలా వక్రీకరిస్తున్నాయనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. పెన్షన్లపై చంద్రబాబు హయాంలో జరిగిందేంటో తెలుసా? ► 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం జనవరి (నాలుగు నెలల ముందు) పెన్షన్‌ను రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతూ జీవో ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి అమలు చేశారు. 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నామని తెలిసి, పెన్షన్‌ను పెంచడం అంటే అది మోసం, అబద్ధం, అన్యాయం కాదా? ఇది ఎల్లో మీడియాకు కన్పించదా? ► చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు (2018 అక్టోబర్) వరకు ఇస్తున్న పెన్షన్లు 45.98 లక్షలు. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావించి (జనవరి నుంచి మే వరకూ) ఆ పెన్షన్లను 51 లక్షలకు పెంచారు. అంటే అర్హత ఉన్న దాదాపు 5 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. ఇది అన్యాయం, మోసం కాదా? ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కు కన్పించదా? ► ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా ప్రస్తుతం మనం 59,54,000 పెన్షన్లు ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు రూ.550 కోట్లు కూడా లేదు. ఇవాళ మనం నెలకు రూ.1,500 కోట్లు ఇస్తున్నాం. ఈ వాస్తవాలు కనిపించవా? పచ్చ మీడియా గోబెల్స్ ప్రచారం ► వైఎస్సార్ చేయూత విషయంలోనూ ఈనాడు తప్పుడు రాతలు రాయడం దారుణం. ఆ రోజు నేను చెప్పిందిదీ.. ► ‘ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలు అనారోగ్యంతో వారం రోజులు పనులకు పోలేకపోతే, పస్తులుండే పరిస్థితి ఉంది. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోనికి తీసుకున్నాం. ► వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కల కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. ► మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం.’ ► వాస్తవం ఇదైతే.. ఈర‡్ష్యతో, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదని బాధ, కడుపు మంట, దుగ్దతో ఇలా బాధ్యత మరిచి తప్పుడు వార్తలు రాయడం మంచిదేనా? ► 24,55,534 మంది అక్కలకు చేయూత పథకం ద్వారా రూ.4,604 కోట్లు వాళ్ల అకౌంట్లకు పంపాం. వారి ఆర్థిక స్వావలంబన కోసం రిలయన్స్, ఐటీసీ, హిందూస్థాన్ లీవర్, పీ అండ్ జీ, అమూల్, అలానా గ్రూపు వంటి పెద్ద పెద్ద కంపెనీలను తెచ్చి, వాళ్లతో ఎంవోయూలు చేశాం. ► అక్కచెల్లెమ్మలకు వ్యాపార లావాదేవీల దిశగా అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు 77 వేల రిటైల్ షాపులు గ్రామాల్లో కన్పిస్తున్నాయి. 4.69 లక్షల మందికి ఆవులు, గేదెలు అందజేస్తున్నాం. అమూల్ సంస్థకు పాలు పోసే అక్కచెల్లెమ్మలే యజమానులు. ► 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు (యూనిట్ అంటే 15 గొర్రెలు, మేకలు.. ఇందులో 14 ఆడవి, ఒకటి మగది) అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ లబ్ధిదారుల్లో 6 లక్షల మందికిపైగా వితంతువులకు కూడా మేలు చేస్తున్నాం. ఒక్క మాటైనా తప్పామా? ► ఎన్నికలప్పుడు ప్రతీ మీటింగ్‌లోనూ అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పాం. పెన్షన్ అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నాం. (వీడియో ప్రదర్శించారు) ► అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి 2,250 చేశాం. వచ్చే జూలై 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రూ.2,500కు పెంచుతాం. 2022 జూలై 8న మళ్లీ రూ.2,750 చేస్తాం. ఆ తర్వాత 2023 జూలై 8న రూ.3 వేలకు తీసుకెళ్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం మాది. -
పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, పెన్షన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్న వారికి శాశ్వతంగా సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని స్పీకర్‌ను కోరారు. సంక్షేమ పథకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల సొమ్మును రూ.3 వేలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడంపై సీఎం జగన్ స్పందించారు. మంచి చర్చను ఎప్పుడైనా స్వాగతించాల్సిందేనని, దుర్బుద్ధితో వక్రీకరించే చర్చ ముమ్మాటికీ తప్పేనన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ వెయ్యి రూపాయలనేది జగమెరిగిన సత్యమన్నారు. తాను సీఎం అయ్యాక మొట్ట మొదటి నెల నుంచే రూ.2,250 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నాలుగేళ్ల పది నెలల పాటు కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చి, రూ.2 వేలిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మోసం కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారికి, మాకు ఇదీ తేడా ► ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు (2018 అక్టోబర్ దాకా) టీడీపీ ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 44,32,592. ఇవాళ మా ప్రభుత్వం 61,94,000 మందికి పెన్షన్లు ఇస్తోంది. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. ► చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు నెలకు రూ. 500 కోట్లు కూడా లేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పెన్షన్ల బిల్లే రూ.1,500 కోట్లు. ఇదీ.. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. ఎన్నికలప్పుడే వాళ్లకు ప్రజలు గుర్తుకొస్తారు. అందుకే ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. సభా హక్కుల తీర్మానం ► శాసనసభలో ఉద్దేశ పూర్వకంగా అబద్ధాలాడుతూ, సభను తప్పుదారి పట్టిస్తున్న టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నా. ఇలాంటి వ్యక్తికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. ► రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్పి, ప్రజలకు కావాలని తప్పుడు సంకేతాలివ్వడాన్ని అనుమతించకూడదు. ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇవ్వలేం. ప్రతిపక్షం పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తోంది. ► ఏం చేస్తామో ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. దాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నాం. ఇలా అబద్ధాలాడే వ్యక్తిని డ్రామా నాయుడు అనడంలో తప్పేంటి? ► సీఎం ప్రతిపాదించిన సభా హక్కుల తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సమర్థించారు. టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. నేను చెప్పింది ఇదీ.. ► పాదయాత్రలో అనేక మంది బాధలు నా దృష్టికి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించాం. చంద్రబాబులా వందల కొద్దీ కాకుండా, కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాం. అందులో ఉన్నదే చెప్పి ఓట్లు అడిగాం. ఈ విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో వివరించాను. ► 2018 సెప్టెంబర్ 3వ తేదీన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పథకాన్ని ఎలా మారుస్తామో నిజాయితీగా చెప్పాం. దాన్నే మేనిఫెస్టోలో పెట్టాం. సభా హక్కుల తీర్మానం కోసం సాక్ష్యంగా నేను ఆ రోజు పాదయాత్ర సభలో ఏం మాట్లాడానో వినండి. (మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నది వీడియో ప్రదర్శించారు) ► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు వైఎస్సార్ చేయూత పథకాన్ని తెస్తాం. అనారోగ్యంతో వాళ్లు వారం రోజులు పనులకు పోలేకపోతే పస్తులుండే పరిస్థితి. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు, కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం. జూలై 8న పెన్షన్ రూ.2,500 చేస్తాం ► ప్రస్తుతం ఉన్న పెన్షన్ల వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోతామని తెలిపాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.2,250 చేశాం. మళ్లీ దాన్ని జూలై 8న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రూ.2,500 చేస్తాం. చెప్పిన విధంగా ఆ తర్వాత రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాం. ► వైఎస్సార్ చేయూత పథకం కింద 24,55,534 మంది అక్క చెల్లెమ్మలకు, దాదాపు కోటి జనాభా(ఇంటికి నలుగురుని లెక్కిస్తే)కు మేలు చేస్తాం. వారికి అక్షరాల రూ.4,604 కోట్లు ఇస్తాం. ► మా పార్టీ వాళ్లు తప్పులు చేసినా కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరించే ఇలాంటి వ్యక్తికి సభలో శాశ్వతంగా మాట్లాడే హక్కు తీసేయాలి. -
ఇది మనసున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి ► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో.. ► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. ► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర ► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. ► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు ► ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం. ► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం. ► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం. పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే ► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. ► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. ► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. ► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాం. దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే. -
విప్లవాత్మక పథకం అమ్మఒడి: మంత్రి వనిత