Extra
-
పూల పండుగ..ఏడోరోజు వేపకాయల బతుకమ్మ..
తెలంగాణలో అమ్మవారిని పుష్పాలతో బతుకమ్మలా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా సాగే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలు ఏడో రోజుకి చేరుకున్నాయి. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. నిన్న అలిగిన బతుకమ్మతో మూగబోయిన ప్రతి ఇల్లు ఇవాళ పూల జాతరలా సందడిగా ఉంటుంది.ఈ బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి జీవితాలు పూల మకరందం వలె సుమనోహరంగా సాగిపోవాలని ప్రార్థిస్తారు.(చదవండి: బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి) -
శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..
శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.మంగళ ప్రదాయినిఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే.."నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని. కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!) -
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్‌పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
పూల పండుగ..ఆరో రోజు అలిగిన బతుకమ్మ..
తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే..ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు. అంటే.. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు. ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.మరొక కథనం ప్రకారం..దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించడంతో అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలానే ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.నైవేద్యం: స్త్రీలంతా ఉపవాసం ఉండి ఆమె అలక తీరాలని ప్రార్థిస్తారు. పైగా ఈ రోజు అమ్మవారు అలకతో ఉండటం వల్ల బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.(చదవండి: శరన్నవరాత్రులు..ఐదోరోజు మహాచండీ అలంకారం..!) -
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!
మన పురాణాల్లో ప్రతి దేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా అక్కడక్కడ అరుదైన దేవాలయాలు ఉన్నాయి. కానీ వర్ష దేవుడికి ప్రత్యేకంగా ఆలయం ఉన్నట్లు విన్నారా..?. మహా అయితే వర్షాలు రావాలని యజ్జ యాగాదులు వంటిటి చేయడం చూశాం. కానీ ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఆరాధించడం గురించి విన్నారా..?. మరీ ఇది ఎక్కడుందంటే..?అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లోని కరాచీ తీరంలోని మనోరా దీవిలో ఉంది. ఇక్కడి సింధీ ప్రజలు వరుణదేవుడిని భక్తిగా ‘ఝూలేలాల్’ పేరుతో కొలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలిపే ఆధారాలేవీ లేవు. సింధ్ రాష్ట్రంలోనిభిరియా పట్టణానికి చెందిన సేఠ్ హర్చంద్మల్ దయాల్ దాస్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.(చదవండి: ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!) -
ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!
దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ప్రకృతి పండుగకు నివాళులర్పిస్తూ పెద్ద ఇండోర్ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్ బ్యాంక్. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్లో ఈ అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసింది. సుమారు 14 అడుగులు మేర ఎత్తు వరకు అద్భుతమైన బతుకమ్మను ఏర్పాటు చేశారు. రంగురంగుల పూల ప్రదర్శనతో ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సామాజికి స్ఫూర్తిని మా బ్యాంకు గౌరవిస్తుందని సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్లతో సహా ఇంటరాక్టివ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
ఐదో రోజు అట్ల బతుకమ్మ..!
తెలంగాణ పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం సందడే వేరు. జీవితాన్ని ఎలా అద్బుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్‌ఫుల్ పండుగా ఈ బతుకమ్మ పండుగా. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగా. బతుకమ్మ సంబరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) రోజున తెలంగాణ ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ ప్రత్యేకతలేంటి, ఏం నైవేద్యం సమర్పిస్తారు వంటివి తెలుసుకుందామా..!. బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఎత్తుల్లో లేదా ఐదు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు.(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!
త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ దేవి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులై త్రిమూర్తల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరీ అనే నామంతో పూజలందుకుంటోందని పురాణాలు చెబుతున్నాయి.సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.మరోవైపు శ్రీశైలం, అల్లంపురం వంటి పుణ్యక్షేత్రాల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ నవరాత్రుల్లో కూష్మాండ అవతారంలో అమ్మని ఆరాధిస్తే అపూర్వ శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నైవేద్యం: అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. (చదవండి: దుర్గార్తిశమనీ దశదిశలా దసరా) -
వరల్డ్ యానిమల్ డే : అమ్మలా ప్రేమను పంచుతున్నారు!
జంతు సంక్షేమం. సంరక్షణకు సంబంధించి మహిళల కృషి నిన్నామొన్నటిది కాదు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా జంతుసంరక్షణకు సంబంధించిన ఉద్యమాలు, సంస్థలలో ఎక్కువగా మహిళలే నాయకత్వ బాధ్యత వహిస్తున్నారు. మన దేశంలో జంతుసంక్షేమ విధానానికి వెన్నెముక అయిన పీసీఏ యాక్ట్‌లో అప్పటి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నృత్యకారిణి రుక్మిణీ ఆరండల్ కీలకపాత్ర పోషించింది.‘మన దేశంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరో«ధించే విషయంలో మహిళా నాయకుల చొరవ, శ్రమ ఎంతో ఉంది. జంతు సంరక్షణ ఉద్యమంలో ఎన్నో వినూత్న విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. నా మిత్రురాలు స్వర్ణాలీరాయ్ కోల్‌కతాలో బడులు, కాలేజీలకు వెళుతూ వ్యవసాయ రంగంలో జంతువులను ఎలా చూస్తున్నారు నుంచి జంతు సంక్షేమం వరకు ఎన్నో విషయాల గురించి అవగాహన కలిగిస్తుంది. పంజాబ్ యూనివర్శిటీలో వందలాదిమంది విద్యార్థులకు వ్యవసాయంలో భాగమైన జంతువుల సంక్షేమం గురించి ఎంతో అవగాహన కలిగించింది. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు’ అని చెబుతున్నారు అలోక్పర్ణ సేన్‌గుప్తా.అలోక్పర్ణసేన్ యానిమల్ రైట్స్ అడ్వకేట్. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. వీధికుక్కల సంక్షేమం నుంచి వ్యవసాయ రంగంలో జంతు సంరక్షణ వరకు ఎన్నో అంశాలపై పనిచేస్తోంది.‘రుక్మిణీదేవి కృషి వల్లే పీసీఏ చట్టం, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చాయి. జంతుసంక్షేమానికి సంబంధించిన లక్ష్యాల కోసం మహిళలు అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. తాము పనిచేయడమే కాదు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. జంతు సంక్షేమ ఉద్యమంలో కూడా ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. కొందరు ప్రముఖంగా కనిపించవచ్చు. చాలామంది తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు’ అంటుంది జంతు సంక్షేమ ఉద్యమకారిణి నజరేత్. -
పూల పండుగ..మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో అంటూ ప్రారంభమయ్యే ఈ పండుగ ఆటపాటల సందడితో ఆనందభరితంగా ఉంటుంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈరోజు మూడో రోజు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలంతా ముద్దపప్పు బతకమ్మను జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటారుబతుకమ్మ పండుగలో మూడవ రోజు ‘విదియ’ కాబట్టి ఈ రోజున‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి, అందంగా అలంకరిస్తారు. నైవేద్యంగా..ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు.(చదవండి: Dussehera 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?) -
శరన్నవరాత్రులు..రెండో రోజు గాయత్రీ దేవి అలంకారం
పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ శరన్నవరాత్రులు కోలహలం ప్రారంభమయ్యింది. రోజుకో అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు శరన్నవరాత్రి రెండో రోజు గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. వేదాలకు అధిదేవత అయిన గాయత్రి మాత ఆరాధనతో సమస్త విద్యలు ఒంటబడతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారు ఆయా ప్రాంతాల వారిగా పసుపు లేదా కనకాంబరం లేదా నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం.."ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:యుక్తామిందు నిబద్ధరత్నమకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!గాయత్రీం వరదాభయాంకుశమ్ కశాశ్శుభ్రం కపాలం గదాంశంఖం చక్రమధారవింద యుగళం హసైర్వాహంతీం భజే"శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో రెండో రోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలవడం జరిగిందనేది పురాణ కథనం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు.'ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః’ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరిక సిద్ధిస్తుందని నమ్మకం.నైవేద్యం: అల్లం గారెలు, పులిహోర (చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!) -
అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!
ఇవాళ నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో, స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదనాల్లో పలువురు అమ్మవారి శక్తి పీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంత ఇంత కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్‌కి చెందిన ఇడాన మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్సుకే అంతు చిక్కని మిస్టరిగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఆ ఆలయ విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో దుర్గమ్మ ఇడాన మాతగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భతం తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు అగ్నిస్నాన మాచరిస్తుందట. ఉన్నట్టుండి సడెన్‌గా దానంతట అవే అగ్నికీలలపు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చత్రుస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. దాదాపు 10 నుంచి 20 అడుగులు మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. అంతేగాదు ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రుల ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానమాచరిస్తారట. అప్పటి దాక ఆలయంలో పూజల జరుగుతూ కోలహాలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో.. ఎలా జరుగుతుందో.. తెలయదు గానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్సుకే అంతు చిక్కని మిస్టరీలా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం కారణం ఏంటనేది నిర్థారించలేకపోయారు. విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి ఏం వెలిగించరట. ఇక పురాణల ప్రకారం..వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు "జైసమంద్"ను నిర్మించే క్రమంలో రాజస్తాన్ రాజు జై సింగ్ ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారని అప్పటి నుంచే ఈ అమ్మవారు "ఇడానా మాత"గా పూజలు అందుకుంటోందని చెబుతుంటారు. చాలామంది భక్తులు ఈ వింత చేసేందుకు ఈ ఆలయానికి తరలివస్తుంటారని చెబుతున్నారు.త్రిశూలం విశిష్టత..పక్షవాత రోగులు, మానసిక విలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడూ..మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారికి త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే.. సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.उदयपुर शहर से 60 किलोमीटर दूर स्थित ईडाणा माता ने नवरात्रि के पहले दिन अंग स्नान किया है. माता ने अपना अग्नि स्वरूप दिखाया. हजारों साल से यहां प्रतिमा है. यहां माता ईडाणा अग्नि स्नान करतीं है. पिछला अग्नि स्नान पिछले वर्ष इन्ही दिनों में किया था.@abplive #idanamatamandir pic.twitter.com/nMx9sfKTC4— vipin solanki (@vipins_abp) April 9, 2024 (చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..
త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ముఖ్యంగా వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వయుజం. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారాలను ధరించిన మాసం...ఇవాళ నుంచే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మహిళలు, భవాని భక్తులు, నియమ నిష్టలతో అమ్మవారిని ఆరాధించటం ప్రారంభిస్తారు. తొలిరోజు నుంచి మొదలు పెట్టి చివరి రోజు వరకు అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుచుకుంటారు. ఆ క్రమంలో తొలిరోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు ధర్శనమివ్వనుంది, ఏ నైవేద్యం నివేదిస్తారో చూద్దామా..!అమ్మవారిని బుధవారం అక్టోబర్ 03న సుమహుర్తంలో నవరాత్రలు పూజలందుకోమని స్వాగతం పలుకుతూ కలశస్థాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని రోజుకో అవతారం రూపంలో అలంకరణ చేసి భక్తితో ఆరాధిస్తారు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు ఎవరైనా కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే, 8 గంటలలోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే ఆఖండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఎవరీ శక్తిసామర్థ్యాల మేరకు వారు వివిధ స్తోత్ర పారాయణాదులతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటారుతొలిరోజు..తొలి రోజు ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను తొలిరోజు బాలా త్రిపురసుందరీగా అలంకారిస్తారు. ఈ అమ్మ దర్శనం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి ఉంటారు. ఈ అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే..సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.నైవేద్యంగా కట్టుపొంగలి లేదా పులగం నివేదిస్తారు.మరి కొన్నిచోట్ల తొలిరోజు పాఢ్యమి తిథి పురస్కరించుకుని అమ్వవారిని శైలపుత్రిగా లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తారు.శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్! వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది. -
పూల సంబరం..రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన పూల సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇల్లు పూల రంగులతో కళకళలాడుతుంటుంది. ఎటు చూసిన జానపద గీతాల సందడులే. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రజలంతా బతుకమ్మ పండుగకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సంబరాలు అంబారాన్నంటేలా అంగరంగ వైభవంగా సాగాయి. ఇక రెండో రోజు అంటే ఈరోజున(అక్టోబర్ 03) అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి అందంగా తీర్చి దిద్దుతారు.. గౌరమ్మ పాటలతో రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగ వేడుకగా చేసుకుంటారు. అయితే దీన్ని చిన్నారులే ఎక్కువగా చేసుకోవడంతో ఈ బతుకమ్మకు అటుకల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కథనం. అయితే పిల్లలు ఆటకు అటుకులు, పప్పులు, బెల్లమే కదా ఉపయోగిస్తారు. అందుకనే ఈ బతుకమ్మకు చిన్నిపిల్లలు ఇష్టంగా తినే అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు. (చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
దసరా.. ఆ సరదానే వేరు..!
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు..రంగురంగుపూల బతుకమ్మలు.. ఇంటింటా పిండి వంటలు.. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు..పిల్లల కేరింతలు... పెద్దల పలకరింపులు.. రాత్రుళ్లు దీపాల కాంతులు.. టపాసుల మోతలు ఇవే కదా.. దసరా సంబురాలు..చిన్నపండుగొస్తుందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. . అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ దసరా వచ్చిందంటే.. ఊరూవాడంతా సంబురాలే. పట్నం విడిచి పల్లెకు పోవడానికి రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుకింగ్ అయిపోతాయి. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడతాయి. స్వీట్ షాపుల్లో ఆర్డర్లు పెరిగిపోతాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే పండుగ రోజుల్లో ప్రతి క్షణం మనసుకు సంతోషాన్నిచ్చేదే.తొమ్మిది రోజుల పండుగతొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో.. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజిస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల పేర్లు.. శైల పుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ, మహా సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరి దేవి.ఇక పదవ రోజు.. విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. రకరకాల ఆకులు, పండ్లు కూరగాయలు, ధూపదీపనైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.పురాణాల్లో రాక్షస వధ కోసంమహిషాసుర మర్దిని స్తోత్రందసరా రోజున మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ‘అయిగిరి నందిని' స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుంది అంటారు. దసరా రోజునే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ స్తోత్రం చదవొచ్చు. జీవితంలో నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలచుకుంటే కొత్త శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు.*అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే! గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే! భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!*మంచి తరపున పోరాడిన వాళ్లు తమ ఆయుధాలకి పని చెప్పిన సందర్భం ఇదే. కాబట్టి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయుధపూజ చేస్తారు. రంగురంగుపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్న ముద్దల, సద్దుల బతుకమ్మ అంటూ పూజిస్తారు.జమ్మి చెట్టు కథమహాభారతంలోని ఒక కథ కూడా విజయదశమి పండుగ నేపథ్యంగా ఉంది. పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, 'తిరిగొచ్చేవరకూ వాటిని చూసుకో” అని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజున తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్లు దశమిరోజున జమ్మిచెట్టు దగ్గరకు తిరిగి రావడం వల్లే దసరా పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆరోజున జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాలపిట్టను చూశారు. అందుకని దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆయుధపూజ చేస్తారు.దసరా రోజు రావణ సంహారం ఎందుకు ?దసరా రోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణ నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది. కాబట్టి దసరా రోజున రామున్నిస్మరించుకుంటారు. పెద్ద మైదానాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. పది తలల రావణుడి బొమ్మను చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే.విజయదశమి విజయగాథదసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్ధిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్నే కాకుండా విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. త్రిమూర్తులతో శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని.. ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు.ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది అమ్మవారు. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడు దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే. అందుకే దసరా అనగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు కళ్లముందుకొచ్చేస్తాయి.అలయ్ బలయ్జమ్మి చెట్టు ఆకుల్ని ‘బంగారం'తో పోలుస్తారు. అందుకని జమ్మి చెట్టుకు మొక్కినాక జమ్మి ఆకుల్ని తెంపి బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. అంటే బంగారాన్ని చేతిలో పెట్టి కౌగలించుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం పేరే అలయ్ బలయ్. మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మ, అమ్మమ్మ, మేనత్త, అమ్మ, చిన్నమ్మలే కాదు.. అక్క, చెల్లి, వదినల కాళ్లు కూడా మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉంది. జమ్మి చెట్టును పూజిస్తూ చదివే స్తోత్రం..శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!! కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితా!!ఆయుధ పూజ విశేషంకులవృత్తులు చేసేవాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజున దసరా. అందుకే ఆయుధపూజ చేయిస్తారు. బండి, మెషిన్, నాగలి, కొడవలి, పిల్లలకైతే పుస్తకాలు కూడా ఆయుధాలే. ఆయుధపూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందని నమ్ముతారు.వంటింటి ఘుమఘుమలుదసరా వస్తుందంటేనే రకరకాల పిండి వంటలు చేయడానికి రెడీ అయిపోతారు. అరిసెలు, అప్పలు, సకినాలు, లడ్డూలు.. ఇలా ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు వండిపెడతారు. వీటితోపాటు అమ్మవారికి రోజుకో వెరైటీలు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. దసరా పండుగకు నోరూరించే నాన్‌వెజ్ స్పెషల్స్ అస్సలు మిస్సవ్వరు.(చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
బతుకమ్మకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమై పండుగ ఇది. జానపద గీతాలతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చేసుకునే గొప్ప పండుగ. రంగురంగుల పూలతో తెలంగాణలోని ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే కలర్‌ఫుల్ పండుగ ఇది. ఇవాళ నుంచే (అక్టోబర్ 2) బతుకమ్మ సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ పండుగ విశిష్టత, తొలిరోజు జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది తదితర విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడడం సంప్రదాయం. అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.ఆ పేరు ఎలా వచ్చిందంటే..బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం. ఈ రోజున మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారునైవేద్యంగా..నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. -
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
ట్రెక్కింగ్‌కి కేరాఫ్‌గా భువనగిరి కోట..!
హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగి ఇల్లు చేరాలంటే భువనగిరి కోట ఒక చక్కటి టూరిస్ట్ ప్లేస్. ఐదు వందల అడుగుల ఎత్తులో, నలభై ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం ఇది. భువనగిరి కోటను నిర్మించిన రాజు పేరు త్రిభువన మల్ల విక్రమాదిత్య. ఈ కోట 11వ శతాబ్దం నాటిది. చరిత్ర పుటల్లో అతడి పేరుతోనే త్రిభువనగిరిగా ఉంటుంది. వ్యవహారంలో భువనగిరి, బోన్గిర్ అయిపోయింది. ఈ కోట ముందు సర్దార్ సర్వాయపాపన్న విగ్రహం ఉంటుంది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ కోట సమీపం వరకు మాత్రమే. ఎంట్రన్స్ ఎటు వైపు ఉందో తెలియక తిరిగిన రోడ్లలోనే చుట్టు తిరగాల్సి వస్తుంది. కాబట్టి స్థానికుల సహాయంతో ముందుకెళ్లాలి. టూరిస్ట్ ప్లేస్‌గా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఎంట్రీ టికెట్, కెమెరాకి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిళ్లు, తినుబండారాలు తగినన్ని వెంట తీసుకువెళ్లాలి. కోట సమీపంలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు పెద్దగా లేవు. వాహనం పార్కింగ్‌కి కోట ముందు విశాలమైన ప్రాంగణం ఉంది. కానీ నీడ కోసం ఎటువంటి ఏర్పాటూ లేదు. తగినన్ని ఏర్పాట్లు లేవనే అసౌకర్యం నిజమే. కానీ వాహనాల హారన్ల మోతలు లేకుండా, పిన్ డ్రాప్ సైలెన్స్‌తో కూడిన వాతావరణం హైదరాబాద్ నగరవాసికి స్వర్గమనే చెప్పాలి. స్వచ్ఛమైన చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే కలిగే హాయిని ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో వర్ణించలేం. పదిహేనేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వాళ్లు కూడా ఈ ట్రెక్కింగ్ టూర్‌ను చక్కగా ఆస్వాదించగలుగుతారు.ఈ టూర్‌కి వెళ్లేటప్పుడు షూస్ చక్కగా ట్రెకింగ్‌కి అనువుగా ఉండాలి. అలాగే హైదరాబాద్– వరంగల్ హైవే మీద ఉన్న హోటళ్లలో తినేసి వెళ్లాలి. తిరుగు ప్రయాణంలోనూ ఆకలి తీర్చేది కూడా హైవే మీదున్న హోటళ్లే. ట్రెకింగ్ పూర్తయిన తర్వాత తిరుగుప్రయాణంలో చేసే భోజనంలో థాలి రుచి కూడా అంతే అద్భుతం. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
శబరిమలలో హరివరాసనం: అద్వితీయంగా చిన్నారి నృత్యాభినయం
ప్రసిద్ధ గాయకుడు కే జే ఏసుదాసు నోట అత్యంత అద్భుతంగా పలికిన ‘‘హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే’’ అయ్యప్పస్వామి పాటను వింటే ఎలాంటి వారికైనా అద్భుతం అనిపిస్తుంది. ఇక అయ్యప్ప భక్తులైతే భక్తిపరవశంతో తన్మయులౌతారు. ఈ పాటకు చిన్నారి చేసిన నృత్యాభినయం విశేషంగా నిలుస్తోంది.శబరిమలలో హరివరాసనం పఠిస్తున్నపుడు చిన్నారి అద్భుతంగా నృత్యం చేసింది. ఆ పాటకు చక్కటిన హావభావాలు, అభినయానికి అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ‘‘ఆమె అభినయం, చూపించిన భావాలు చాలా బావున్నాయి. ఈ చిన్నారికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప!’’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.Harivarasanam with a small Ayyappa Devotee girl dancing to the song .Ayyappa Sharanam1/2 pic.twitter.com/2XyE5Lrme7— @Bala (@neelabala) March 30, 2024ఇటీవల స్వామి వారి సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, రాత్రి 10 గంటలకు, విష్ణుప్రియ ఈ మధురమైన పాటకు, లయకు అనుగుణంగా నృత్యం చేయడం ప్రారంభించింది. దీన్ని చూసిన భక్తులు చిత్రీకరించడంతో అది తరువాత వైరల్‌గా మారింది.కాగా స్థానిక మీడియా మాతృభూమి కథనం ప్రకారం విష్ణుప్రియ కేరళలోని ఎడపల్లిలోని అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కొచ్చిలోని అమృతా టెక్నాలజీస్‌లో పని చేస్తున్నారు. ఆమె తల్లి పలరివట్టం వెక్టర్ షేడ్స్ కంపెనీలో ఇంజనీర్. ఆమె సోదరుడు 1వ తరగతి విద్యార్థి. -
పొలాన్నే కాన్వాస్‌గా మార్చి.. సరికొత్త ఆర్ట్‌కి ప్రాణం పోసిన రైతు!
కొన్ని కళలను కళ్లారా చూడాల్సిందే తప్ప వాటికి కొత్త అర్ధాలు చెప్పలేం. కానీ, తన కళతో యువతకు ఏది ముఖ్యమో వివరిస్తున్నారు కేరళలోని వాయనాడ్‌కు చెందిన ప్రసీత్కుమార్ తయ్యిల్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేశాడా అంటారా.. ఫొటో చూడండి... ఇంకా అర్ధం కాలేదు విషయమేంటో స్వయంగా తెలసుకోండి. వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరీకి చెందిన ఒక రైతు తన వరి పొలాన్ని కాన్వాస్‌గా మార్చేశాడు. వివిధ రకాలైన వరి రకాల నారు ఉపయోగించి క్లిష్టమైన శివుని రూపాన్ని ఆవిష్కరించాడు. యువతను వ్యవసాయంవైపు మళ్లించేందుకు ఈ కళను సృష్టించాను అని చెబుతున్నాడు. ఆ రైతు పేరు ప్రసీద్ కుమార్ తయ్యిల్. వరి పొలంలో వరి కళకు ప్రాణం పోసిన ఈ రైతును అభినందించకుండా ఉండలేం. పంట పొలాలతో కళను సృష్టించడాన్ని పాడీ ఆర్ట్ అంటారు. ఇన్‌స్టాలేషన్‌లో టాన్బో ఆర్ట్ లేదా రైస్ పాడీ ఆర్ట్ అని పిలువబడే జపనీస్ కళారూపం ఇది. దీనిని వ్యూహాత్మక పద్ధతిలో నాటిన వేలాది వరి నారు పెరిగి, ఆ తర్వాత రెమ్మల ద్వారా ఓ రూపం కనిపిస్తుంది. అరుదైన వరి వంగడాలను సంరక్షించడమే ధ్యేయంగా! ఈ కళాత్మక వెంచర్ కోసం తన 10 ఎకరాల వరి పొలంలో 30 సెంట్ల భూమిని అంకితం చేశాడు శ్రీ కుమార్. తన ప్రయత్నం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదని చెబుతున్నాడు. ‘అరుదైన స్థానిక వరి జాతులను సంరక్షించడం, వాటిని ప్రచారం చేస్తూనే, వ్యవసాయం ఒక ఆచరణీయ వృత్తిగా యువతకు అవగాహన కల్పించడం లక్ష్యం‘ అంటున్నాడు. ఆర్ట్‌కి నాలుగు రకాల వంగడాలువరి కళతో పాటు కుమార్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలను పండిస్తుంటాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన 100 రకాల వరి వంగడాలతో పంటలు పండించాడు. ఈ కళాకృతి కోసం మాత్రం నాలుగు విభిన్న వరి రకాలను ఉపయోగించాడు: నాజర్ బాత్ రకానికి ఊదా ఆకులతో, రక్తశాలి, చిన్నార్, జీరకసాల, ముదురు– లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటాయి. పర్యాటకులకు ఆకర్షణ మంత్రకుమార్ మాట్లాడుతూ– ‘ఆధునికతరం వ్యవసాయం నుండి డిస్కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగులో తరచుగా అధిక ఖర్చులతో తక్కువ రాబడి వచ్చేదిగా భావిస్తుంటారు. అయితే, మూడు దశాబ్దాలుగా జపాన్, చైనాలోని రైతులు వరి కళ వంటి వినూత్న పద్ధతులను ఆవలంబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రాబడితోపాటు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సహజ సౌందర్యంతో వయనాడ్ దేశంలోనే ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతోంది. జిల్లాలోని రైతులు తమ వరి పొలాలకు పర్యాటకులను ఆకర్షించగలిగితే, వారు మరిన్ని మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధిస్తారు అని ఆయన చెప్పారు. కిందటేడాది విద్యార్థులు, రైతులు, పర్యాటకులతో సహా 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తన సైట్‌ను సందర్శించారని శ్రీ కుమార్ చెబుతున్నాడు.అంతేకాదు, ఈ వంగడాల ద్వారా ఆకర్షణీయమైన అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పటికి పది సార్లు కుమార్ తన పొలాల్లో వరి కళాకృతిని రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.20,000 ఖర్చుతో కూడుకున్నది. ప్రారంభ రూపురేఖలను ముందగా నేలపైన గీసుకని, ఆ తర్వాత 36 మంది కార్మికులతో కూడిన బృందంతో ఈ ఆర్ట్‌ను సాధించాడు కుమార్. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!
ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌కెళ్లే పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.ఈ టూర్లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండి΄ోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది.ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగుమ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది. బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.బాపూ మందిర్, కీర్తిమందిర్లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్లో బోనస్.(చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..)