Groundwater
-
అకాల వర్షాన్ని ఒడిసిపడితే.. బోరులోనూ జలహోరు!
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి.రాంమోహన్అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటి?గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు. ఎప్పుడు? బోరు లోపలికి ట్యాంకర్‌తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం. ఎక్కడ?కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు. ఎలా? బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్‌డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది. ఎవరు?బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్వి.రాంమోహన్ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్‌కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు. మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు. -
అడుగంటిన జలం.. అందని భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీళ్లందక ‘బోరు’మంటున్న పొలాలు.. చేతికందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి, బోర్లు వేయించి అయినా పంటలను కాపాడుకుందామంటే.. నీళ్లు పడక కన్నీళ్లు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వేసవి మరింత ముదురుతుండటం, భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోతుండటంతో మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. వేలకొద్దీ బోర్లు వేస్తున్నా... వేసవి తీవ్రత పెరుగుతుండటం, భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిపోతుండటంతో.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోర్లు వేయిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో.. కనీసం వెయ్యి వరకు బోర్లు వేయించినట్టు అంచనా. పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కొంత మంది కాలువల కింద సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది కొత్తగా బోర్లు వేసి పంటలు కాపాడుకునేందుకు ప్రయతి్నస్తున్నవారే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత రెండున్నర నెలల్లో 1,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోగా.. మహబూబ్‌నగర్‌లో 1,334 కనెక్షన్లు, వరంగల్ జిల్లాలో 1,706 కనెక్షన్లు, ఖమ్మం జిల్లాలో 850 కనెక్షన్లు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలోకి రైతులు పంటను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్న రైతులు.. ఇందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అటు బోర్లలో నీరూ పడక, ఇటు అప్పులూ పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. – యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహడ్ గ్రామానికి చెందిన సైరెడ్డి చంద్రారెడ్డి బావి ఎండిపోవడంతో రెండు నెలల కిందట బోరు వేశారు. నీళ్లు పడలేదు. వారం కింద మరో బోరు 450 ఫీట్లు వేయించగా.. అదీ ఫెయిల్ అయింది. వాటికోసం చేసిన అప్పు రూ.లక్షన్నర, పంట పెట్టుబడి రూ.లక్ష మొత్తం రూ.2.5 లక్షల అప్పులపాలయ్యారు. – నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డకు చెందిన గుర్రం శ్రీనివాస్ 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడెకరాల్లో పంట ఎండిపోతుండటంతో పది రోజుల కింద 3 బోర్లు వేశారు. వాటిల్లో చుక్క నీరు కూడా పడలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. బోర్లు వేసేందుకు చేసిన రూ. 2 లక్షల అప్పు భారంగా మారింది. – కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రవినాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. పంట ఎండిపోతుండటంతో మూడు బోర్లు వేయించినా.. ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. రూ.3.5 లక్షలు అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన చింతాకుల రవి రెండెకరాల్లో వరి వేశారు. బోరు ఎండిపోవడంతో.. 20 రోజుల కింద 600 ఫీట్ల వరకు మరో బోరు వేసినా నీరు పడలేదు. రూ.లక్షన్నర అప్పు అయిందని వాపోతున్నారు. మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి..ఈ చిత్రంలోని రైతు పేరు గోగు హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్‌కు మూడు బోర్లు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి రెండు ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో మూడు బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. లక్షన్నర రూపాయల వరకు ఖర్చయినా.. పంటకు చుక్క నీరు అందలేదు. కళ్లెదుటే పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అప్పులు తీర్చేదెలా? ఐదెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు తగ్గి బోరు ఎత్తిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.1.5 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఏం చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – పెరుగు కొమురయ్య, ఆరేపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా 600 ఫీట్లు వేసినా నీళ్లు పడలే.. నాకు ఆరెకరాలు పొలం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు 600 ఫీట్ల వరకు వేయించా. అయినా నీళ్లు పడలేదు. రూ. లక్ష ఖర్చయింది. మళ్లీ బోరు వేయాలంటే భయంగా ఉంది. – బుర్ర వినయ్‌కుమార్, లక్ష్మిపూర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల ఈయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్లకు చెందిన రైతు మల్గ బీరయ్య. ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోట వేశారు. పదెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో ఉన్న మూడు బోర్లు వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు వారం రోజుల్లో ఏడు బోర్లు వేశారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వరకు వేసినా చుక్క నీరు కూడా పడలేదు. సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 8 ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయిందని ఆయన వాపోతున్నారు. సాగునీరు లేక పాడి గేదెలకు తాగునీరు అందించలేక మూడు పశువులను అమ్మేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నాల్ తండాకు చెందిన ఈ రైతుపేరు మహిపాల్. భూగర్భ జలాలు అడుగంటి పొలంలోని బోరు వట్టిపోయింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించారు. 800 ఫీట్ల లోతు వేసినా నీళ్లు పడలేదు. రూ.1.60 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ చిత్రంలోని రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన ఏలకంటి సత్తిరెడ్డి. 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. పాత బోర్లు వట్టిపోవడంతో.. 20 రోజుల కింద వరుసగా నాలుగు బోర్లు వేయించారు. దేనిలోనూ నీళ్లు పడలేదు. రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని, పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లక్ష ఎకరాల్లో ఎండిన వరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ప్రాజెక్టుల నీటి మీది ఆశతో వరి సాగు చేసిన రైతులతో పాటు బోర్లు, బావుల కింద పంట వేసిన లక్షలాది మంది రైతులు పొట్ట కొచ్చే దశలో ఉన్న వరిని చూసి తల్లడిల్లుతున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు వారబందీ ప్రాతిపదికన నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల,ఎల్ఎండీ, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్ మొదలైన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా కిందకు వదులుతుండడంతో ఆయకట్టు చివర ఉన్న పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పలు జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. పడిపోతున్న భూగర్భ జలాలు: ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలాచోట్ల ఏప్రిల్‌లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నమోదైన భూగర్భ నీటి మట్టాలు ఈసారి మార్చి నెలలోనే ఆ స్థాయికి వెళ్లాయి. గత నెలాఖరు నాటికే వికారాబాద్ జిల్లాలో 13.67 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 14 మీటర్లు దాటింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో.. ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.32 మీటర్లను మించి 9 మీటర్ల నుంచి ఏకంగా 13 మీటర్ల వరకు వెళ్లింది. ఇక మార్చి రెండో వారం దాటే నాటికి కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భూగర్భ మట్టాలు మరింత అడుగంటినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్థాయిలో పంటల సాగు రాష్ట్రంలో ఈ యాసంగిలో అత్యధికంగా 73.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరే 56.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. సన్నాల సాగు పెరగడంతో సాగునీటి అవసరం మరింత పెరిగింది. పంట కాలం ఎక్కువ కావడంతో నీటి తడులు కూడా ఎక్కువ కావలసి ఉంది. అయితే ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల వంటి ప్రాజక్టుల కింద పొలాలకు వారబందీ కింద ఒక వారం నీరిచ్చి, మరో వారం బంద్ చేస్తుండడంతో వారం పాటు పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు వేసిన చాలా గ్రామాల్లో పంటను పశువులకు వదిలేశారు. మొక్కజొన్న పంట కూడా సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి ఏకంగా మూడున్నర లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు 8.09 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆరు తడి పంటగా సాగయ్యే మొక్క జొన్నకు వారం, పదిరోజులకు కూడా ఒక తడి నీరు ఇవ్వని పరిస్థితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మొక్కజొన్న, వేరుశనగ కూడా..నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, మెదక్ మొదలైన జిల్లాల్లో మొక్కజొన్న, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వేరుశనగ పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలో తెలియక నీటిపారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల బాధలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీరు పెద్దపల్లి జిల్లా గుండా మంథని వరకు నిరాటంకంగా వెళ్లేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రయతి్నస్తున్నప్పటికీ, వచ్చే నెలలో ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు. -
మన నీళ్లలో నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని భూగర్భజలాలు శుద్ధిచేయకుండా తాగునీటికి ఉపయోగించడం ఏమాత్రం సురక్షితం కాదని తాజా అధ్యయనం తేల్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) ప్రమాణాల కంటే కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అధిక నైట్రేట్ మోతాదులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27.48 శాతం మేర భూగర్భ నీటి నమూనాలను పరిశీలించగా నైట్రేట్ స్థాయిలు లీటర్‌కు 45 మిల్లీగ్రాముల నిర్దేశిత ప్రమాణాలకన్నా అధికంగా ఉన్నట్లు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా–2024 నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఉత్పాదకతను పెంచేందుకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతుండటం వల్ల నైట్రేట్స్ మోతాదు, గాఢత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల్లేక మురుగునీరు భూగర్భజలాల్లో చేరుతుండటం కూడా నైట్రేట్స్ మోతాదు పెరుగుదలకు కారణమవుతోందని నివేదిక విశ్లేషిoచింది. దేశవ్యాప్తంగా నైట్రేట్స్ మోతాదులు ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి మూడో స్థానంలో నిలవగా ఆదిలాబాద్ 11వ స్థానంలో, సిద్దిపేట 12వ స్థానంలో నిలిచాయి. రసాయన ఎరువుల అధిక వాడకంతో..రాష్ట్రంలో వరిసాగు అధికం కావడంతో అధిక మోతాదులో ఎరువు మందులు వాడుతున్నారని.. అందులో సుమారు 30 శాతం పంటలు పీల్చుకుంటే మిగతా 70 శాతం మాత్రం నీటినిల్వ కారణంగా నెమ్మదిగా భూగర్భజలాల్లో కలుస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలా నైట్రేట్ అధికంగా ఉన్న నీరు తాగేందుకు అనువైంది కాదంటున్నారు. ఢిల్లీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–సేŠట్ట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్–2024 నివేదిక ప్రకారం 2021–22లో తెలంగాణలో ప్రతి హెక్టార్‌కు 297.5 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తున్నారని వారు వెల్లడించారు. అలాగే ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా–2022–23 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో 2021–22 నుంచి 2022–23 మధ్య ఎరువుల వినియోగంలో 4.7 శాతం వృద్ధి నమోదైనట్లు తేలిందని చెప్పారు.నైట్రేట్లు భూగర్భజలాల్లోకి చేరితే వాటిని శుద్ధి చేయడం మరింత కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చెరువులు, కాలువల్లోని కలుíÙతాలనే సరైన పద్ధతుల్లో శుద్ధి చేయలేకపోతున్న నేపథ్యంలో ఇక భూగర్భజలాల్లో కలిసే నైట్రేట్లను శుద్ధి చేయడం ఇబ్బందేనని అంటున్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో ఏటా పండిస్తున్న మూడు పంటల్లో ఎకరానికి 10–15 బస్తాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నారని వివరించారు. దీనివల్ల విత్తనం, నేల వంటివి బలహీనంగా ఉండటమే కాకుండా రసాయన ఎరువుల అవశేషాలు పంటల్లోకి చేరుతున్నాయని.. వాటిని మనం ఆహారంగా తీసుకుంటుండటంతో మన శరీరంలోకి సైతం కెమికల్స్ ప్రవేశిస్తున్నాయని వివరిస్తున్నారు.మురుగు శుద్ధిపై పర్యవేక్షణ ఏదీ? హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి మెరుగుపడట్లేదు. దీనిపై స్వతంత్ర సంస్థతో ఇప్పటిదాకా పర్యవేక్షణే లేదు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల సంఖ్య పెరుగుతున్నా సమర్థంగా శుద్ధిచేయక మురుగునీరంతా భూగర్భజలాల్లో చేరడం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. – ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తనైట్రేట్లతో కేన్సర్ ముప్పు.. పంటల ఉత్పాదకతను పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. అవే నీటిని పంటల సాగుకు ఉపయోగిస్తుండటంతో హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా వాటిలో కలుస్తున్నాయి. చేపల ద్వారా కూడా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. శరీరంలో నైట్రేట్ల శాతాలు పెరిగితే కేన్సర్‌కు దారితీస్తుంది. పంజాబ్‌లో కేన్సర్ కేసుల పెరుగుదలకు పంటల కోసం అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగమే కారణమని తేలింది. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణుడు -
పాతాళానికి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలవక ముందే బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. యాసంగిలో బోరుబావుల కింద సాగుచేస్తున్న పంటలకు నీటి కోసం కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతుగా ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జనవరిలో 7.46 మీటర్ల లోతుకు తగ్గిపోయింది. అంటే నెల రోజుల్లోనే సుమారు 0.74 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోవడం ఆందోళన రేపుతోంది. వ్యవసాయం, ఇతర అవసరాలకుతోడు తాగునీటి కోసం వేసవిలో వినియోగం మరింత పెరగనుండటంతో.. రానున్న రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింతగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. 8 జిల్లాల్లో 10 మీటర్ల కంటే లోతున... రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 12.29 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా భూగర్భ జలశాఖ వర్గీకరించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 6 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్లలోపు భూగర్భ జలమట్టం ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నది కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే. మరో 9 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్య, మిగతా 8 జిల్లాల్లో 10 మీటర్లకుపైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇలా 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 18 జిల్లాల్లో భారీ క్షీణత గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో భారీ క్షీణత నమోదైంది. గత ఏడాది జనవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.72 మీటర్లుకాగా.. ఈ ఏడాది 7.46 మీటర్లకు తగ్గింది. రాష్ట్ర సగటు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా... కొన్ని జిల్లాల్లో బాగా పడిపోయాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 7.29 మీటర్ల నుంచి 10 మీటర్లలోతుకు అంటే.. 2.71 మీటర్ల మేర పడిపోవడం గమనార్హం. ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో.. రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 4 శాతమని అధికారులు చెబుతున్నారు. మరో 18 శాతం భూభాగంలో 10–15 మీటర్ల లోతున.. ఇంకో 54 శాతం ప్రాంతాల్లో 5–10 మీటర్లు లోతున, 25శాతం ప్రాంతాల్లో పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువ లోతున భూగర్భ జలమట్టాలు ఉన్నట్టు గుర్తించారు. 156 మండలాల్లో దశాబ్ద సగటుకన్నా తగ్గి.. గత దశాబ్ద కాల (2015–2024) సగటుతో పోల్చినప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలకుగాను 456 మండలాల్లో భూగర్భ జల మట్టాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిగతా 156 మండలాల్లో క్షీణించాయి. 53 మండలాల్లో 0.5 మీటర్ల మేర, 33 మండలాల్లో 1–2 మీటర్ల మేర, 37 మండలాల్లో 2 మీటర్లకుపైగా పడిపోయాయి. -
ఎండ ముదిరి.. చేను ఎండి
సాక్షి,యాదాద్రి: వేసవి రాకముందే ఎండలు ముదిరిపోయా యి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు. దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సరిగ్గా నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పైరు ఎండిపోతుండగా రైతులు పశువులను మేపుతున్నారు. ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే...వేలాది ఎకరాలకు పంటనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనవరి నాటికి జిల్లాలో భూగర్భ జలాలు రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. యాసంగి ఆశలపై దెబ్బ వానాకాలం సీజన్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. జలకళ సంతరించుకోగా, రైతులు యాసంగి వరిసాగుపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో నీటిగండం వచ్చిపడింది. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు బోరు బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు ఎకరాల వరి బీటలు వారింది నాకున్న ఐదెకరాల్లో వరిసాగు చేశాను. బావి నీటిమట్టం తగ్గడంతో రెండు ఎకరాల వరిపొలం బీటలు వారింది. ఉన్న మూడు ఎకరాలకు రెండు రోజులకో తడి ఇస్తున్నాను. దానిపై కూడా ఆశ లేదు. – వడకాల రాజు, వరి రైతు, మోత్కూర్.నీరు లేక పంట ఎండిపోయింది 3 ఎకరాల్లో వరి వేశా. నాట్ల సమయంలో బావి లో నీరు బాగానే ఉంది. వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. వారం క్రితం రెండు బోర్లు వేశాను. రెండూ ఫెయిల్ అయ్యాయి. నీరులేక పంట ఎండిపోయింది –చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం -
భూగర్భ'గరళం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలం గరళంగా మారిందా? బావులు, బోరు బావుల్లో ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగితే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనా? 26 జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తాగడానికే కాదు.. సాగుకు కూడా భూగర్భ జలాలు పనికి రానంత విషతుల్యంగా మారాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024. దేశవ్యాప్తంగా 2023లో వర్షాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం ముగిసిన తర్వాత కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) భూగర్భ జలాల నమూనాలను పరీక్షించి, వాటి నాణ్యతను తేల్చింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన రసాయనాలు పరిమితికి మించి చేరడం వల్ల విషతుల్యంగా మారాయని సీజీడబ్ల్యూబీ నివేదిక తేల్చింది. ఆర్శనిక్, యురేనియం, క్లోరైడ్, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలతోపాటు ఇనుము వంటి లోహ ధాతువులు భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించింది. పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడం, వ్యవసాయంలో క్రిమి సంహారక మందులు, ఎరువులను అధిక మోతాదులో వినియోగించడం, పట్టణీకరణ పెరిగిపోవడంతో మురుగు నీటిని శుద్ధి చేయకుండా వదిలేయడం, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చింది.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైట్రేట్, 17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము, 7 జిల్లాల్లో ఆర్శనిక్ పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది. ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి సోడియం కార్బొనేట్ ఉండటం వల్ల ఆ నీళ్లు సాగుకు కూడా వాడకూడదని సీజీడబ్ల్యూబీ తేల్చింది.నైట్రేట్భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్రేట్ ఎక్కువ ఉంది. 2023 వర్షాకాలం ముగిసిన తర్వాత 1149 ప్రాంతాల్లో పరీక్షించగా.. 270 ప్రాంతాల్లో పరిమితికి మించి నైట్రేట్ ఉన్నట్లు తేలింది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పల్నాడు జిల్లాలో 70 చోట్ల పరీక్షించగా 36 చోట్ల నైట్రేట్ చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది.క్లోరైడ్లీటర్ నీటిలో 250 మిల్లీ గ్రాముల లోపు క్లోరైడ్ ఉంటే అవి తాగడానికి సురక్షితం. రాష్ట్రంలో 887 చోట్ల పరిమితికి లోపే క్లోరైడ్ ఉన్నట్లు తేలింది. 222 చోట్ల 250 నుంచి 1,000 మిల్లీగ్రాముల మధ్య ఉన్నట్లు తేలింది. వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే ఆ నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకూడదు. రాష్ట్రంలో 40 ప్రాంతాల్లో వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువగా క్లోరైడ్ ఉన్నట్లు తేలింది.ఇనుములీటర్ నీటిలో ఒక మిల్లీ గ్రాముకంటే ఎక్కువ పరిమాణంలో ఇనుప (ఐరన్) ధాతువులు ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో (అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశి్చమ గోదావరి) కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాల్లో పరిమితికి మించి ఇనుప ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.ఫ్లోరైడ్భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 130 ప్రాంతాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. శ్రీసత్యసాయి జిల్లాలో 27 చోట్ల, పల్నాడు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 25 చోట్ల ఫ్లోరైడ్ పరిమితికి మించి చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఎనీ్టఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలోనూ ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్న జిల్లాలు 2015 నుంచి క్రమేణా పెరుగుతున్నాయి.ఆర్శనిక్ఆర్శనిక్ విషతుల్యమైనది. లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాములకు మించి ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఆర్శనిక్ ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.సాగుకూ పనికి రావు..లీటరు నీటిలో 1.25 మిల్లీ గ్రాములకంటే ఎక్కువగా సోడియం కార్బొనేట్ ఉంటే ఆ నీటిని సాగుకు వినియోగించకూడదు. రాష్ట్రంలో 27.68 శాతం నమూనాల్లో సాగుకు పనికిరాని విధంగా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. -
భూగర్భంలో జలరాశులు అపారం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ 2024లో భూగర్భజలాలు అపారంగా పెరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో వర్షపు నీరు భారీగా భూమిలోకి ఇంకి భూగర్భజలంగా మారింది. దేశంలో 2024లో 12,656.20 టీఎంసీలు(446.9 బిలియన్ క్యూబిక్ మీటర్లు) మేర భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర భూగర్భజల మండలి(సీజీడబ్ల్యూబీ) అంచనా వేసింది. ఇందులో 11,503.30 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అందులో 60 శాతం జలాలను వినియోగించుకున్నారని లెక్కగట్టింది. రాష్ట్రంలో 2024లో 787.30 టీఎంసీల మేర భూగర్భజలాలు పెరిగితే.. అందులో 223.17 టీఎంసీలను ఉపయోగించుకున్నారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 2024లో భూగర్భజలాల పరిస్థితి అధ్యయనం చేసిన సీజీడబ్ల్యూబీ ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సీజీడబ్ల్యూబీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ... ⇒ దేశంలో తొలి సారిగా 1980లో భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాత 1995, 2004, 2009, 2011, 2013, 2017, 2020లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. 2022 నుంచి ఏటా భూగర్భజలాల పరిస్థితిపై అంచనా వేస్తోంది. ⇒ దేశంలో కురిసే వర్షం వల్ల వచ్చే నీటిలో 61 శాతం భూమిలోకి ఇంకి, భూగర్భజలాలుగా మారుతున్నాయి. ⇒ 2023తో పోల్చితే 2024లో భూగర్భజలాల పరిమాణం కాస్త తగ్గింది. 2023లో భూగర్భజలాల పరిమాణం 12,717.95 టీఎంసీలు ఉంటే... అది 2024లో 12,656.20 టీఎంసీలకు తగ్గింది. ఇక భూగర్భజలాల వినియోగం 2023తో పోల్చితే 2024లో పెరిగింది. భూగర్భం నుంచి 2023లో 6,834.75 టీఎంసీలను... 2024లో 6,956.52 టీఎంసీలను వినియోగించుకున్నారు. ⇒ దేశంలో భూగర్భజలాలను పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, డయ్యూ డామన్, గుజరాత్‌లలో భారీ ఎత్తున తోడేసి ఉపయోగించుకుంటున్నారు. -
భూగర్భజలం పుష్కలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ భూగర్భ జలాల లభ్యత పెరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో భూగర్భ జలమట్టం 4.19 మీటర్లు పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిన జిల్లాల్లో శ్రీసత్యసాయి జిల్లా (12.69 మీటర్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా (8.52 మీటర్లు), మూడో స్థానంలో పల్నాడు జిల్లా (7.97 మీటర్లు) ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా(1.16 మీటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1.31 మీటర్లు), పార్వతీపురం మన్యం జిల్లా(1.52 మీటర్లు)లో అత్యల్పంగా పెరిగాయి. 26 జిల్లాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో బోరు బావుల కింద రబీలో పంట సాగుకు, వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సగటున 7.6 మీటర్లలో భూగర్భ జలాల లభ్యత నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై.. మే 31తో ముగుస్తుంది. గత నీటి సంవత్సరం ముగిసేటప్పటికి అంటే 2024 మే 31కి రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.79 మీటర్లలో లభ్యమయ్యేవి. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 858 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా 950.57 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10.79 శాతం ఎక్కువ. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 7.6 మీటర్లకు చేరుకుంది. అంటే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 4.19 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.బాపట్ల జిల్లా గరిష్టం.. తూర్పు గోదావరిలో కనిష్టం భూగర్భ జలాల లభ్యతలో బాపట్ల జిల్లా (2.63 మీటర్లతో) ప్రథమ స్థానంలో ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా (2.64 మీటర్లు) రెండో స్థానంలో, గుంటూరు జిల్లా (3.39 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాయి. భూగర్భ జలాల లభ్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా (21.66 మీటర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా(17.59 మీటర్లు) రెండో స్థానంలో, అన్నమయ్య జిల్లా(13.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. -
జీవ మనుగడకు జలం కీలకం
భూగర్భ జలాలు క్షీణించే దిశగా భారత్ వేగంగా పురోగ మిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది.‘ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023’ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 31 ప్రధాన జలాశయాల్లో 27 తిరిగి నింపగలిగే స్థాయి కంటే వేగంగా క్షీణిస్తున్నాయి. భారత దేశం భూగర్భజలాలు క్షీణ దశకు చేరుకున్నాయని ‘యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ’ (యూఎన్ఐ ఈహెచ్ఎస్) ప్రచురించిన కొత్త నివేదిక కూడా హెచ్చరించింది. ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ –2023 నివేదిక ఆరు పర్యావరణ పాయింట్లను పరిశీలిస్తుంది. అవి 1. వేగ వంతమయిన విలుప్తాలు 2. భూగర్భ జలాల క్షీణత. 3. పర్వత హిమానీనదం. 4 ద్రవీభవనం. 5. అంతరిక్ష శిథి లాలు 6. భరించలేని వేడి– బీమా చేయలేని భవిష్యత్తు. నివేదిక ప్రకారం పంజాబ్‌లోని 78 శాతం బావులను అతిగా ఉపయోగించినట్లు పరిగణిస్తున్నారు. మొత్తం వాయవ్య ప్రాంతంలో 2025 నాటికి భూగర్భజలాల లభ్యత బాగా తగ్గిపోతుందని నివేదిక అంచనావేసింది. ‘జలాశ యాలు’ అని పిలువబడే భూగర్భ జలాశయాలలో నిల్వ చేయబడిన ముఖ్యమయిన వనరు మంచినీరు. ఈ జలాశ యాలు 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తాయి. ఇందులో దాదాపు 70 శాతం వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. భూగర్భజలాలు వేలాది సంవత్సరాలుగా ‘పునరుత్పాదక వనరుగా’ ఉంటున్నాయి అని నివేదిక పేర్కొంది. కానీ ఇప్పటికే ఉన్న బావుల్లో నీటిని అందించగల స్థాయికంటే నిల్వలు కిందికి పడిపోతే విపత్తులు ప్రారంభమైనట్లే. వ్యవసాయానికి నీరు అందక ఆహార కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాల క్షీణత అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో భారతదేశం, ఈశాన్య చైనా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఇరాక్, సౌదీ అరేబియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ నీరు అవసరమైన వరి, గోధుమలను పండించడం వల్ల జలవనరులు తొందరగా అడుగంటుతున్నాయని నివేదిక తెలిపింది. గోదుమ, వరి పంటలకు భారత్ అధికంగా భూగర్భ జలాలను వినియో గిస్తోంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలు దేశంబియ్యం సరఫరాలో 60 శాతం, గోధుమల ఉత్పత్తిలో 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే పంజాబ్‌లో 78 శాతం బావులు అతిగా వాడకానికి గురవుతున్నాయనేది నివేదిక సారాంశం. ‘2023 అంచనా నివేదిక’ ప్రకారం దేశం మొత్తం వార్షిక భూగర్భ జలాల రీచార్జ్ 4,49,087 బిలియన్ క్యూబిక్ మీట ర్లుగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 11.48 బిలియన్ క్యూబిక్ మీటర్ల పెరుగుదలను సూచిస్తుంది. దేశం మొత్తం వార్షిక భూగర్భజలాల వెలికితీత 241.34 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోతే తాగునీటి సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలోని 220 కోట్ల మంది ప్రజలు సురక్షితమయిన నీరు అందుబాటులోలేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమయిన నీటిని అందజేయాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం నిర్దేశిస్తోంది. భూగోళం మీద ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదులలో, మిగతా 0.12 శాతం భూగర్భజలాల రూపంలో ఉంది. ఈ వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 760 కోట్ల మందికి పైగా ఆహారాన్నీ, ఇతర అవసరాలనూ తీరుస్తున్నాయి. ‘2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమయిన జలంఉండనే వుండదు. జనం స్నానాలు చేయడం మానేసి శరీరా నికి లేపనాలు పూసుకోవలసి ఉంటుంది. సరిహద్దులో వుండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలాకాస్తుంది...’ అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉంటుందోఅంచనా వేయవచ్చు! – ప్రొ‘‘ గనబోయిన మచ్చేందర్, జియాలజీ విభాగ అధిపతి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ -
జల భద్రతతోనే సుస్థిర సాగు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే.. ♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు. ♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది. ♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది. ♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం. ♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి. ♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం. -
భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మే 31తో ముగుస్తుంది. ప్రస్తుత అంటే 2022–23 నీటి సంవత్సరం మరో మూడురోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సగటున 967 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,046.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రికార్డు స్థాయిలో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకింది. భూగర్భజలాలు 961.42 టీఎంసీలయ్యాయి. ఇందులో సాగు, తాగు, గృహ తదితర అవసరాలకు 913.35 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుందని భూగర్భజలవనరుల అధికారులు లెక్కగట్టారు. కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునేటప్పటికి అంటే ఆదివారానికి కేవలం 263.13 టీఎంసీల భూగర్భజలాలను మాత్రమే ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. జలసంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేసి, భూగర్భజలాలను పెంచడంతోపాటు వాటిని పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అధికారవర్గాలు తెలిపాయి. రబీలోనే భారీగా తోడివేత అక్టోబర్ ఆఖరుకు వర్షాకాలం ముగిసిన తరువాత నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 6.13 మీటర్లలో లభ్యమయ్యేవి. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరుబావులను భూగర్భజలవనరుల శాఖ జియోట్యాగింగ్ చేసింది. వాటికి అదనంగా మరో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉంటాయని అంచనా. భూగర్భజలమట్టాన్ని 1,806 పిజియోమీటర్ల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రబీలో, వేసవిలో సాగు, తాగు, గృహ అవసరాల కోసం బోరుబావుల నుంచి భారీ ఎత్తున ప్రజలు నీటిని తోడేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3.95 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేయగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల మేర భూగర్భజలాలను వినియోగించుకున్నారు. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 2.79, శ్రీసత్యసాయి జిల్లాలో 3.29 మీటర్ల మేర రబీలో భూగర్భజలాలను వినియోగించుకున్నారు. నవంబర్ నుంచి మే వరకు సగటున 2.54 మీటర్ల మేర భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం 8.67 మీటర్లకు పడిపోయింది. బాపట్లలో కనిష్ఠం.. ఏలూరులో గరిష్ఠం.. నీటి సంవత్సరం ముగిసేటప్పటికి రాష్ట్రంలో సగటున 8.67 మీటర్లలో భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. బాపట్ల జిల్లాలో కనిష్ఠంగా 3.59 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండగా.. ఏలూరు జిల్లాలో గరిష్ఠంగా 20.95 మీటర్ల లోతుకు వెళ్తేగానీ భూగర్భజలాలు దొరకని పరిస్థితి. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 7.84, శ్రీసత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండటం గమనార్హం. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం 2023–24 ప్రారంభమవుతుంది. గతేడాదిలానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో.. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
పాతాళగంగ ఉప్పొం'గంగ'
గురజాల డివిజన్లోని బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో గత ఏడాది మేనెలలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. గతేడాది జనవరి, మే నెలల్లో డివిజన్ సరాసరి భూగర్భ జల మట్టాలు వరుసగా 11.10, 13.27 మీటర్లుగా నమోదయ్యాయి. అనంతరం జూన్ నుంచి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత ఆరునెలల కాలంలో సాధారణంగా 666.68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 808.93 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది సాధారణం కన్నా 21.33 శాతం అధికం. ప్రస్తుతం గురజాల డివిజన్లో భూగర్భ జలాలు 7.58 మీటర్లకు ఎగబాకాయి. అంటే మేనెలతో పోలిస్తే 5.69 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి ’’. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో పాతాళ గంగ పైపైకి ఎగబాకుతోంది. చుక్క నీరు కూడా లేక ఎండిన పోయిన బోర్లు నిండైన నీటి ధారతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం, కృష్ణానదికి వరుసగా వరదలు రావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలోనూ భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కరువుసీమ పల్నాడులోనూ జలసిరులు ఉబికివస్తున్నాయి. ఫలితంగా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. గత మే నెలతో పోలిస్తే.. జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.89 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత మే నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.07 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 5.18 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకాయి. ప్రస్తుతం న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో 0.31 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గురజాల డివిజన్లోని వెల్దుర్తి గ్రామంలో 46.24 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో 57 మండలాలు ఉండగా, 34 మండలాల్లో 0 నుంచి 3 మీటర్లలోపు, 18 మండలాల్లో 3 నుంచి 8మీటర్లలోపు, రెండు మండలాల్లో 8 నుంచి 15 మీటర్లలోపు, మూడు మండలాల్లో 15 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు అందుబాటులో ఉంది. నీటికి కటకటలాడే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లోనూ భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందడం విశేషం. ఈ మండలాల్లో ఏప్రిల్ వరకు బోర్లలో నీరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండటంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం ఒక మీటరు లోతులోపే భూగర్భజలాలు లభ్యమవుతుండడం గమనార్హం. గురజాల మండలం చర్లగుడిపాడులో ఓ వ్యవసాయ బోరు నుంచి మోటారు పెట్టకముందే నీరు బయటకు వస్తున్న దృశ్యం (ఫైల్) భూగర్భంలోకి 30.02 టీఎంసీలు గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 746.08 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, 820.31 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంటే 9.94 శాతం అధిక సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గురజాల డివిజన్లో 21.33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల 333.57 టీఎంసీల నీరు జిల్లా భూమిపైకి చేరగా, అందులో 30.02 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. ప్రభుత్వ చర్యల వల్లే మార్పు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత పనులు అధికమొత్తంలో చేపట్టడం సత్ఫలితాలనిస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలు మరింత చైతన్యంతో వ్యవహరించి ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వితే.. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని, జిల్లాలో నీటికి కొదవ ఉండదని అధికారులు సూచిస్తున్నారు. నీటి మట్టాలు పెరిగాయి గతంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. బోరు నుంచి ప్రస్తుతం సమృద్ధిగా నీరువస్తోంది. ఐదెకరాల్లో మిరప, శనగ పంట సాగుచేశా. ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. – తవనం వెంగళరెడ్డి, రైతు, రెమిడిచర్ల గ్రామం, బొల్లాపల్లి మండలం పొదుపుగా వాడుకోవాలి వర్షాలు అధికంగా నమోదు కావడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. సాధారణ వర్షపాతం కన్నా 9.94 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 30 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. జిల్లాలో 34 మండలాల్లో 3 మీటర్ల కన్నా లోపే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. రైతులు జలాలను పొదుపుగా వాడుకోవాలి. – బి నాగరాజు, ఇన్చార్జ్ డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, గుంటూరు -
బొట్టు బొట్టుకూ లెక్క
సాక్షి, అమరావతి: వరదను ఒడిసి పట్టి.. పొదుపుగా వాడుకోవడం ద్వారా జలవనరులను సంరక్షించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని.. ఆవిరి, కడలిలో కలుస్తున్న జలాలు, సాగు, గృహ, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్న నీరు.. ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, భూగర్భంలో లభ్యతగా ఉన్న నీటి లెక్కలను రోజూ లెక్కిస్తోంది. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. జలవనరులను సమర్థవంతంగా పరిరక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ వాటర్ రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్)ను ఏర్పాటుచేసింది. అంతేకాదు.. జలసంరక్షణలో అత్యుత్తమంగా పనిచేస్తున్నందుకు ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నీటి లెక్కలు ఇలా.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. కానీ, నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. నీటి లెక్కలను కూడా జూన్ 1 నుంచి లెక్కిస్తారు. అది ఎలాగంటే.. ► రాష్ట్రంలో రోజూ కురిసే వర్షాన్ని రెయిన్ గేజ్‌ల ద్వారా కొలుస్తున్నారు. ► అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే నీటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైడ్రలాజికల్ అబ్జర్వేషన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన గేజ్‌ల ద్వారా లెక్కిస్తుంది. ఇదే రీతిలో కడలిలో కలిసే జలాలను లెక్కిస్తుంది. ► ఆవిరయ్యే నీటిని ఎవాపరీమీటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తుంది. ► ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు విడుదల చేసే నీటిని.. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే నీటిని టెలీమీటర్ల ద్వారా గణిస్తారు. ► ఫీజియోమీటర్ల ద్వారా భూగర్భంలో ఇంకే నీటిని లెక్కిస్తుంది. ..ఇలా రాష్ట్రంలో రెయిన్ గేజ్‌ల నుంచి ఫీజియోమీటర్ల వరకూ అన్నింటినీ ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌తో అనుసంధానం చేసింది. జూన్ 1 నుంచి మే 31 వరకూ రోజూ నీటి రాక, పోకను లెక్కించి.. లభ్యతగా ఉన్న నీటి వివరాలను వెల్లడిస్తుంది. 7,994.32 టీఎంసీల ప్రవాహం.. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 855 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే 977.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని ద్వారా 5,476.39 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ఇప్పటివరకూ 2,517.93 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అంటే.. ఆదివారం నాటికి రాష్ట్రంలోకి మొత్తం 7,994.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో ఆదివారం నాటికి ఆవిరి రూపంలో 2,829.9 టీఎంసీలు ఖర్చయ్యాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి జలాలు 2,780.6 టీఎంసీలు కడలిలో కలిశాయి. అంటే.. అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన ప్రవాహం కంటే 262.23 టీఎంసీలు అధికంగా సముద్రంలో కలిసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. సాగు, తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటిదాకా 780.15 టీఎంసీలే వాడుకోవడం గమనార్హం. -
చిరపుంజిలా మారిన సీమ
సాక్షి, విశాఖపట్నం: కరువు సీమలో ఈ ఏడాది కుంభవృష్టి కురిసింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడగా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో 2.66 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సకాలంలో నైరుతి రుతుపవనాల రాక, ఈశాన్య రుతుపవనాలు కూడా అదే రీతిలో జోరందుకోవడంతో వరుసగా మూడో ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురిశాయి. వీటికి తోడు అల్పపీడనాలు, వాయుగుండం, తుపాన్లతో కుండపోత వానలు పడ్డాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 950 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 2.66 శాతం అధికంగా 975.29 మి.మీ. వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతంతో పోలిస్తే రాయలసీమలోని మూడు జిల్లాలు అత్యధిక వర్షపాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అనంతపురం జిల్లాలో సగటు వర్షపాతం కంటే 36.36 శాతం అత్యధికంగా వర్షాలు కురవగా వైఎస్సార్ కడప జిల్లాలో 33.81 శాతం, చిత్తూరులో 27.17 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. కడపలో 150 ఏళ్లలో తొలిసారి.. ప్రధాన నగరాల వారీగా చూస్తే కడపలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కడపలో 150 ఏళ్లలో తొలిసారిగా ఏకంగా 1,764 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1,663 మి.మీ.తో విజయవాడ రెండోస్థానంలో ఉంది. విజయనగరంలో 1,476, కాకినాడలో 1,433, విశాఖపట్నంలో 1,421, రాజమండ్రిలో 1,412, తిరుపతిలో 1,395, గుంటూరులో 1,121, నెల్లూరులో 1,061, అమరావతిలో 951 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో అత్యల్పంగా 538 మి.మీ. వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడించాయి. రాష్ట్రమంతటా పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. ప్రతి ప్రాంతంలో నీటివనరులు నిండుకుండల్లా తొణికిసలాడుతుండటం శుభపరిణామమని పేర్కొంటున్నారు. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
అమ్మో ఆర్సెనిక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్ పంజా విసురుతోంది. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ మూలాలు కన్పిస్తున్నాయి. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల్లోపే ఆర్సెనిక్ మూలాలు ఉండొచ్చు. కానీ.. గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల భూగర్భ జలాల్లో బీఐఎస్ ప్రమాణాల కంటే అధికంగా ఆర్సినిక్ మూలాలున్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గుర్తించింది. ఈ నీటిని తాగినా, ఆ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ అతలాకుతలమవుతుందని.. బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో అధికం 1980లో పశ్చిమ బెంగాల్‌లోని భాగీరథి నదీ తీరంలో సీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనంలో ఆర్సెనిక్ మూలాలు తొలిసారి బయటపడ్డాయి. దాంతో దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ వీటిపై క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తోంది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. లీటర్ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల వరకూ ఆర్సెనిక్ విషమూలాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. బోరు బావుల నీటితో అధ్యయనం ఇక ఏపీలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని సేకరించిన సీడబ్ల్యూసీ.. వాటిలో ఆర్సెనిక్ మూలాలపై లోతుగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ► గుంటూరు రూరల్ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి సేకరించిన నీటిలో ఒక లీటర్లో 0.01 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలింది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు వెల్లడైంది. ► అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉన్నట్లు గుర్తించారు. ► కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. ► ఇక తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సినిక్ ఉన్నట్లు గుర్తించారు. ఉపరితల జలాలే సురక్షితం కాగా, ఆర్సెనిక్ మూలాలు బహిర్గతమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలను తాగడానికి, పంటల సాగుకు వినియోగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ సూచించింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపరితల, నదీ జలాలను సరఫరా చేయాలని కోరింది. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను చేపట్టడం ద్వారా జలమట్టాన్ని పెంచవచ్చునని.. తద్వారా ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని తెలిపింది. -
దేశంలో విషతుల్యంగా భూగర్భ జలాలు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం భూభాగంలోని 20 శాతం భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ కలిగి ఉండి, విషతుల్యంగా మారాయని, నీటిలోని ఈ విషతుల్యమైన పదార్థం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సర్వే లో వెల్లడయ్యింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆర్సెనిక్ నమూనాలు ప్రస్తుత సర్వేలో తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గతంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు జరిపిన అధ్యయనాలు సైతం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ స్థాయిని అంచనా వేసేందుకు మరింత విస్తృతమైన పరిశోధనల అవసరాన్ని సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన నొక్కి చెపుతోంది. రక్షిత నీటినే తాగుతున్నామా? దేశవ్యాప్తంగా ప్రజలు తాగుతోన్న నీటిలో అత్యధికంగా 80 శాతం భూగర్భ జలాలే. అత్యధిక జనాభా తాగునీటి కోసం ఆధారపడిన భూగర్భ జలాలు సురక్షితమైనవేనా? అనే విషయంలో అనేక అధ్యయనాలు గతం నుంచి జరుగుతున్నాయి. దేశంలోని 20 శాతం భూభాగంలోని భూగర్భ జలాలు అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్తో నిండి వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆర్సెనిక్ అత్యంత విషపూరితమైనది. తాగు నీరు, ఆహారం ద్వారా ఆర్సెనిక్‌ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు గురికావడం, లేదా తీవ్రమైన చర్మసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నదీపరివాహక ప్రాంతాల్లో ఎక్కువ.. గంగా–సింధు, బ్రహ్మపుత్రా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని కొన్ని ద్వీపకల్ప ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఈ అత్యంత విషతుల్యమైన ఆర్సెనిక్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ‘‘దేశంలోని 250 మిలియన్ల మంది ప్రజలు భూగర్భ జలాల్లో నిక్షిప్తమైన ఉన్న విషతుల్య పదార్థం ఆర్సెనిక్ ప్రభావానికి గురవుతున్నట్టు అంచనా వేశాం’’అని పశ్చిమబెంగాల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలో.. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. జియోలాజికల్, హైడ్రోజియోలాజిక్, ఆంతోపోజెనిక్ ప్రమాణాలను బట్టి లీటరు భూగర్భజలంలో పది మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉండొచ్చు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ స్థాయిని మించి భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. భూగర్భజలాల్లో తీవ్రస్థాయిలో ఉన్న ఆర్సెనిక్ పరిణామాన్ని అంచనా వేయడానికి తీసుకున్న శాంపిల్స్ ఇంకా సరైన స్థాయిలో లేవని సహ రచయిత సౌమ్యాజిత్ సర్కార్, మధుమిత చక్రవర్తి సహా అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అధ్యయనం ఆర్సెనిక్ తీవ్రతని చాలా తక్కువగానే అంచనా వేసినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. సురక్షిత తాగునీరే లక్ష్యం.. ఈ అధ్యయనంలో రాండమ్ ఫారెస్ట్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించామని, ఇది భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్ ని అంచనావేయడంలో సమర్థంగా పనిచేస్తుందని గత పరిశోధనల్లో వెల్లడయ్యింది అని ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్‌లోని, 27 లక్షల క్షేత్రస్థాయి ప్రమాణాల ఆధారంగా ఆర్సెనిక్‌ని అంచనావేశారని, ఈ అధ్యయనం ఫలితాలు సురక్షిత మంచినీటిని ఇంటింటికీ అందిచేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్సెనిక్ ప్రభావం భారత్‌పై అధికం ఆర్సెనిక్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం ఒకటని అధ్యయనవేత్తలు తేల్చి చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విష తుల్యమైన ఆర్సెనిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. భారత దేశంలో 80 శాతం తాగునీరు భూగర్భజలాలపై ఆధారపడినదే. దేశంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడి జీవిస్తోన్న 9 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆర్సెనిక్ వల్ల ప్రమాదంలో పడినట్టు గతంలో జరిపిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ఎక్కువ భాగం స్థానికంగా, క్షేత్రస్థాయి లో జరిగినవే. ఇందులో అత్యధికంగా గంగా పరీవాహక ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇవేవీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్తించవు. -
పట్టణాల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి.. బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. మేలో తొలిదశ ప్రారంభం ► సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్ చేస్తారు. ► మొదటి దశ సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో.. ► మొదటి దశలో అమృత్ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. ► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. ► ఒక్కో ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. ► మరుగుదొడ్ల అవుట్ లెట్లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. ► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. ► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు. -
మూడో పంట పండింది
జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. కొనుగోళ్లు ప్రారంభం కత్తెర పంటకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. -
సమర్థవంతంగా వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఉపరితల, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ సిన్హా సూచిం చారు. బుధవారం జలసౌధలో నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణలో ‘ఐసోటోప్’ల వినియోగంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ నీరు భూమి మీద దొరికే విలువైన వనరన్నారు. రాబోయే కాలంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉండబోతున్నదని, పారిశ్రామికీకరణతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివారణా చర్యలు సూచించడానికి బార్క్ దేశవ్యాప్తంగా ‘ఐసోటోప్’టెక్నాలజీని వినియోగి స్తోందన్నారు. దీని ద్వారా భూగర్భ జలాల రీచార్జి మూలాలను అన్వేషించవచ్చునని, నీటి ఊటలను, ఉపరితల, భూగర్భ జలాల మధ్య అంతర్గత మార్గాలను తెలుసుకోవచ్చని వివరించారు. వాటి కాలుష్య కారకాలను గుర్తించడంతోపాటుగా కాలువలు, సొరంగాలు, జలాశయాలు, డ్యాములు సంభవించే సీపేజ్ను తెలుసుకోవచ్చునని, జలాశయాల్లోకి, చెరువుల్లోకి వచ్చే పూడిక మట్టి పరిమాణాన్ని అంచనా వేయొచ్చునని స్పష్టం చేశారు. గతంలో తెలం గాణలోని నల్లగొండ జిల్లాలో కూడా ధన్ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు పూడిక మట్టి తీసిన,తీయని చెరువుల్లో, భూగర్భ జలాల రీచార్జి స్థితిని తులనాత్మకంగా అధ్యయనం చేశామని గుర్తు చేశారు. పూడిక మట్టి తీసిన చోట భూగర్భ జలాల మట్టం బాగా పెరిగినట్టు తేలిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరితే ఉచితంగానే పరిశోధనలు నిర్వహించి నివారణా చర్యలు సూచిస్తామని అన్నారు. కొత్త సాంకేతిక పద్దతిపై తమకు అవగాహన కల్పించిన సిన్హాను ప్రభుత్వ సలహాదారు ఎస్కే జోషి అభినందించారు. -
కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!
సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్ వేస్ట్) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది. మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు... ►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా తగ్గే అవకాశం ఉండదు. ►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి ►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్ బి వంటి జబ్బులు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెబుతోంది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్ డిగ్రేడబుల్ హౌస్ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది. కేరళలో ‘ప్రౌడ్’ ప్రాజెక్టు వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్ (ప్రోగ్రాం ఆన్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేరళ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది. రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా ►మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు 258 ►రిటైల్ అండ్ హోల్‌సేల్ ►మెడికల్ స్టోర్లు 33,039 ►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు 12 ►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385 ►సీజ్చేసిన షాపుల సంఖ్య 66 అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం మందుల షాపులు గానీ, సీ అండ్ ఎఫ్ (క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం. మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది ఎన్వీరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్‌షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు. – ఎ.విజయభాస్కర్‌రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు -
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
కరువు తీరా వర్షధార
అనంతపురం అగ్రికల్చర్ : అనంతపురం జిల్లా రైతులను ఈసారి వరుణుడు కరుణించాడు. కీలకమైన ఖరీఫ్‌లో ముఖం చాటేసినా.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కరుణించాడు. ఫలితంగా జిల్లాలోనే పెద్దదైన శింగనమల చెరువుకు భారీగా నీరు చేరింది. ఇక 15 ఏళ్లుగా ఎండిపోయిన కంబదూరు చెరువు జలకళను సంతరించుకుంది. పరిగి, నార్పల, గుమ్మఘట్ట చెరువుల్లోకి నీరు చేరగా సమీప ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. నిజానికి నైరుతి రుతుపవనాలు జూన్ 22న జిల్లాలోకి ప్రవేశించినా.. అనుకున్న మేర వర్షాలు కురవలేదు. గతేడాది కూడా 552.3 మి.మీ గానూ సాధారణం కన్నా 40.6 శాతం తక్కువగా 327 మి.మీ వర్షపాతం నమోదైంది. వందేళ్ల చరిత్ర తీసుకుంటే.. 40 శాతం లోటు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోయాయి. జిల్లాలోని 63 మండలాల్లో 50కి పైగా మండలాలు డేంజర్ జోన్లోకి చేరాయి. మే నెలలో భూగర్భ జలమట్టం సగటున 25.96 మీటర్లకు పడిపోయింది. ఆగస్టు 14 నాటికి అది 27.75 మీటర్లకు క్షీణించడంతో సమస్య జఠిలంగా మారింది. ఇది జిల్లా చరిత్రలోనే అత్యంత కనిష్టస్థాయి. 2.45 లక్షల బోరుబావుల్లో కేవలం 1.20 లక్షలు మాత్రమే పనిచేశాయి. ఖరీఫ్‌లో వేసిన 6.10 లక్షల హెక్టార్ల వర్షాధార పంటలు, 2 లక్షల హెక్టార్లలో విస్తరించిన ఉద్యాన తోటలు, 40 వేల ఎకరాల్లో ఉన్న మల్బరీ తోటలు, 10 లక్షల సంఖ్యలో ఉన్న పశుసంపద, 48 లక్షల సంఖ్యలో ఉన్న జీవసంపద మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. రెండు నెలల్లో 352 మి.మీ వర్షం ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వరుణుడు విశ్వరూపం చూపించాడు. ఆగస్టు 16 నుంచి వర్షించడం ప్రారంభించాడు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అంతటా భారీగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రెండు నెలల్లోనే రికార్డుస్థాయిలో 352.7 మి.మీ భారీ సగటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండిపోవడంతో ‘అనంత’కు ఒక్కసారిగా జలకళ వచ్చింది. భూమిలో ఇంకిన 56 టీఎంసీలు భారీ వర్షాలతో సెప్టెంబర్‌లో సాధారణం కన్నా 65 శాతం, అక్టోబర్‌లో 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రెండు నెలల వ్యవధిలో కురిసిన 352.7 మి.మీ వర్షానికి కుంటలు, వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి. పెద్దపెద్ద చెరువులు సైతం నిండిపోయాయి. దశాబ్దాలుగా నీటి చుక్క పారని నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో కళకళలాడాయి. వర్షాధార పంటలు, పాడి, పట్టు, పండ్లతోటలకు ఉపశమనం కలిగింది. 2 నెలల వర్షాలకు 56 టీఎంసీల వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకినట్లు భూగర్భ జలశాఖ నివేదిక చెబుతోంది. జిల్లాలో ఉన్న బోరుబావులకు 50 టీఎంసీల నీళ్లు అవసరం కాగా ఇప్పుడు ఆరు టీఎంల నీళ్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 70 వేల బోర్లు పూర్తిస్థాయిలో రీచార్జ్ అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. నాడు అనంతపురం జిల్లాను కరువు మేఘాలు కమ్మే శాయి.. ఏటా గంపెడంత ఆశతో వేసే గింజ మొలకెత్తి మూడ్రోజులే మురిపించేది. పదిమందికి అన్నం పెట్టే అన్నదాత చివరికి ఊరుకాని ఊరిలో పరాయి పంచన చేరి కడుపు నింపుకునేవాడు. గ్రాసం, నీరు లేక పశువులూ కటకటలాడేవి. ఇలా, ఒక్కో ఇంట్లో ఒక్కో కన్నీటి వ్యథ కనిపించేది.. వినిపించేది. నేడు కరువు నేలను వరుణుడు ముద్దాడాడు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కరువుతీరా వర్షించి పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. చెరువులు, కుంటలు నింపేశాడు. భూగర్భ జలమట్టం భారీగా పెంచాడు. నిలువునా ఎండుతున్న లక్షల హెక్టార్ల పండ్ల తోటలు పచ్చటి కళ సంతరించుకున్నాయి. తాగు, సాగునీటి సమస్య దాదాపు లేనట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ‘అనంత’ రూపురేఖలే మారిపోయాయి. ►2018లో లోటు వర్షపాతం 40 % ►ఆగస్టు 14న భూగర్భ నీటిమట్టం27.75మీటర్లు (అత్యంత కనిష్టం) ►సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షపాతం352.7మి.మీ (రికార్డు స్థాయి) ►నవంబర్‌లో భూగర్భ నీటిమట్టం19.70మీటర్లు ►భూమిలోకి ఇంకిన నీరు56 టీఎంసీలు►రీచార్జ్ అయిన బోర్ల సంఖ్య70 వేలు -
కరువు సీమలో ఆనందహేల
అనంతపురం అగ్రికల్చర్: పాతాళ గంగమ్మ పైపైకి పొంగుతుండగా...బీడువారిన పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రాసం లభించక కబేళాలకు తరలిన మూగజీవాలు కడుపునిండా పచ్చిగడ్డి మేస్తున్నాయి. వర్షాభావంతో పొట్టచేత పట్టుకుని వలస పోయిన జనాలు తమ భూముల సాగుకు తిరుగుపయనమయ్యారు. ఖరీఫ్ సీజన్లో చాలా ఏళ్ల తరువాత అనంతపురం జల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిండిన చెరువులు... పొంగిన నదులు... ఎప్పుడూ నెర్రలు చీలి కనిపించే పెద్ద చెరువులు తాజా వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వందలాది చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ఉధృతంతా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా ఎండిపోయి ఎడారిలా కనిపించిన పెన్నా, చిత్రావతి, కుముద్వతి, వేదవతి, హగరి, జయమంగళి లాంటి నదుల్లోనూ నీళ్లు పారుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో భూగర్భజలాలు 27 మీటర్ల దిగువన కనిష్ట స్థాయిలో ఉండగా అక్టోబర్ మొదటి వారంలో 24 మీటర్లకు ఎగబాకడం విశేషం. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 78.9 మి.మీ నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా ఈ ఏడాది అక్టోబరు 7వ తేదీ నాటికే 411.7 మి.మీ. వర్షం నమోదయింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. లక్ష హెక్టార్లలో సాగుకానున్న పప్పుశనగ భారీ వర్షాలతో ఈ రబీలో పప్పుశనగ కనీసం లక్ష హెక్టార్లలో సాగులోకి వచ్చే పరిస్థితి ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పొలాల్లో నీరు చేరడంతో ఇప్పటికే వేసిన కొన్ని పంటలు దెబ్బతినగా రూ. 20 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఒకేరోజు 30.2 మి.మీ వర్షపాతం వరుణుడి ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25 రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కరువు సీమ కోనసీమలా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 63 మండలాల్లోనూ ఒకే రోజు 30.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుత్తి, పరిగి, పెద్దవడుగూరు, రొద్దం, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కిలోమీటర్ల మేర రహదారులు, పదుల సంఖ్యలో కల్వర్టులు దెబ్బతిన్నాయి. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
కృష్ణా నదిపై కొత్తగా మూడు బ్యారేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన మూడు బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై చోడవరం, గాజులంక, ఓలేరు వద్ద బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి రూ. 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌కు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీపీఆర్‌ల కోసం టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి కృష్ణా డెల్టా సీఈ కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై గత నెల 12న సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు చోట్ల డబుల్‌లేన్ బ్రిడ్జిలు, ఒక బ్యారేజీగానీ లేదా మూడు చోట్ల బ్యారేజీలుగానీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. వీటిపై సీఎం జగన్ స్పందిస్తూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి మూడు చోట్ల బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బ్యారేజీలు నిర్మిస్తే సముద్రపు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దీని వల్ల డెల్టాను చౌడు బారిన పడకుండా రక్షించవచ్చునని.. భూగర్భజలాలు పెంపొందించడమే కాకుండా కలుషితం కాకుండా చూడవచ్చన్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ.ల దిగువన కృష్ణా జిల్లా చోడవరం వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,210 కోట్లు నిండుగా కృష్ణమ్మ.. భద్రాచలం దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి నది ఎప్పుడూ నిండుగా కన్పిస్తుంది. అదే తరహాలో పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా నిర్మించే బ్యారేజీలతో కృష్ణా నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సాగు, తాగునీటి అవసరాలు, పర్యాటక రంగంతో పాటు జలరవాణాకూ ఊతమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 45 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా గాజుల్లంక వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 4.47 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,275 కోట్లు ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 60 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా ఓలేరు వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 3.25 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,350 కోట్లు కృష్ణా వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీల నుంచి కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీటిని అందివచ్చు. తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. -
ట‘మోత’ తగ్గట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల్లో భారీ క్షీణత, బోర్ల కింద సాగు చతికిలబడటంతో జూలై నెలలో సాధారణంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. గతేడాది ఇదే నెలలో గరిష్టంగా కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర ఈ ఏడాది రూ.50కి పైనే పలుకుతోంది. రాష్ట్ర పరిధిలో సాగు పూర్తిగా పడిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడటంతో ధరలు ఏ మాత్రం దిగిరానంటున్నాయి. నిజానికి రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు మించి ఉండదు. నిజామాబాద్, వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో టమాటా సాగు జరుగుతున్నా ఈ ఏడాది అది పూర్తిగా చతికిలబడింది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఈ జిల్లాలో సరాసరి మట్టాలు 10 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు తగ్గాయి. దీంతో బోర్ల కింద టమాటా సాగు పూర్తిగా తగ్గింది. సాగు చేసిన పంటల్లోనూ దిగుబడి తగ్గింది. రాష్ట్రం నుంచి వస్తున్న టమాటా కనీసం 10 శాతం అవసరాలను కూడా తీర్చలేకపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతులు తగ్గడంతో: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్, చింతమణిల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై రాష్ట్రం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, ప్రస్తుతం అక్కడి నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. ముఖ్యంగా మదనపల్లిలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గింది. వస్తున్న కొద్దిపాటి టమాటా కూడా తమిళనాడుకు ఎక్కువగా సరఫరా అవుతుండటంతో రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. గతేడాది జూలై 23న 3 వేల క్వింటాళ్లు, 21న 3,095 క్వింటాళ్లు, 21న 3,490 క్వింటాళ్లు మేర బోయిన్పల్లి మార్కెట్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా రాగా ఈ ఏడాది 23న 2,664 క్వింటాళ్లు, 22న 2,239 క్వింటాళ్లు, 21న 1,800 క్వింటాళ్ల మేర సరఫరా అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1,200 క్వింటాళ్ల మేర ఒక్క బోయిన్పల్లి మా ర్కెట్‌కే సరఫరా తగ్గింది. దీంతో జూలైలో తగ్గాల్సిన ధర ఏమాత్రం తగ్గనంటోంది. ఈ పరిస్థితుల్లో మహా రాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరముంది. దీనికి తోడు ఇప్పు డిప్పుడే పుంజుకుంటున్న వర్షాలతో దిగుబడులు పెరిగితే ధర దిగి వచ్చే అవకాశముంది. లేని పక్షంలో సామాన్యుడికి ట‘మోత’తప్పేలాలేదు. ఇతర కూరగాయలు కిలో రూ.50 పైనే.. టమాటాతో పాటు క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కాకర, బీన్స్, బీరకాయ ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. వీటన్నింటి ధరలు కిలో రూ. 50కి పైనే పలుకుతున్నా యి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో క్యాప్సికం ధర రూ.60కి పైనే ఉంది. క్యారెట్ సైతం రూ.70 వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.50 నుంచి రూ.60కి మధ్యలో ఉంది. -
సిటీకి దూపైతాంది
సాక్షి, హైదరాబాద్: చినుకుల సీజన్లోనూ గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరు బావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ పైకి రావడంలేదు. ఈ జూన్ భూగర్భ జలమట్టాలను గతేడాది జూన్‌తో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 1 నుంచి 3 మీటర్ల మేర తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నగరం సరాసరి భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే.. గతేడాది 20.53 మీటర్ల లోతున భూగర్భజలాలు కనిపించగా, ప్రస్తుతం 22.53 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. కాగా శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీట్ మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భ జలాల వినియోగం రెట్టింపవుతోంది. -
శ్రీసూర్యనారాయణా..కూల్ కూల్!
సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేనంతగా.. ఈసారి సూర్యనారాయణుడు రౌద్రరూపాన్ని చూపిస్తున్నాడు. భగభగా మండుతూ.. రాష్ట్రంలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. దీంతో మండుతున్న ఎండలు.. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో దాదాపు 80 శాతం కరువుఛాయలు కనిపిస్తున్నాయని.. భూగర్భజల మట్టం దారుణంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ నెలాఖరుకు భూగర్భజలాలు మరింత తగ్గిపోయి రాష్ట్రంలో సగటున 15 మీటర్ల లోతుకు వెళతాయని అంచనా. ఠారెత్తిస్తున్న ఎండలతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. పశువులకు తగినన్ని నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాలదిగుబడి తగ్గిపోగా, గడ్డిరేటు రెట్టింపైంది. దీంతో వానలు వచ్చే వరకు రాష్ట్రంలో బతుకు వెళ్లదీయడం అత్యంత దుర్భరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్యలు ఒక ఎత్తయితే.. ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 55 మంది ఎండదెబ్బకు ప్రాణాలు వదలడం గమనార్హం. 28 జిల్లాల్లో పాతాళానికి గంగమ్మ ఎండల తీవ్రత భూగర్భజలాలపై ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ.. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో గంగమ్మ 28 జిల్లాల్లో పాతాళానికి చేరిపోయింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 25.72 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. వికారాబాద్‌లో 20.46, సిద్దిపేటలో 20.04, సంగారెడ్డిలో 23.47 మీటర్ల లోతుకెళ్తే గానీ నీటిచుక్క కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో మాత్రమే 10 మీటర్లకు పైన నీళ్లున్నాయి. గతేడాదితో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగాయి. అది కూడా ఒక మీటరులోపే. రాష్ట్ర సగటును పరిశీలిస్తే.. గత వేసవిలో ఈ సమయానికి 12.77 మీటర్ల లోతులో నీళ్లుంటే ఇప్పుడు 1.37 మీటర్ల లోతుకు వెళ్లి 14.14 మీటర్లకు చేరాయి. 16% లోటు వర్షపాతం రాష్ట్రంలో జూన్, 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు 16% లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో 42% లోటు కనిపిస్తుండగా, సంగారెడ్డిలో అత్యధికంగా 45% లోటు వర్షపాతం నమోదయింది. మెదక్‌లో కూడా సాధారణంతో పోలిస్తే 41శాతం తక్కువ వర్షం పడింది. రాష్ట్రం మొత్తం మీద సగటు వర్షపాతం 877.31 మిల్లీమీటర్లు కాగా, పడింది కేవలం 737.40 మిల్లీమీటర్లే. సాగర్ నీటిమట్టం ఆందోళనకరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది. ఇందులో మన అవసరాలకు వాడుకునే వీలున్నది 1.2 టీఎంసీలు మాత్రమే. అదే గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 512.90 అడుగుల మేర నీళ్లున్నాయి. అప్పుడు అవసరాలకు వినియోగించుకునే నీళ్లు 3 టీఎంసీలుగా ఉంది. 2017–18లో ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజి స్థాయికి వెళ్లింది. ఆ ఏడాది మేలో 508 అడుగులకు చేరింది. 505 అడుగులకు చేరే వరకు నీటి వినియోగం జరిగింది. 2016–17లో ఈ సమయానికి 510 అడుగుల కనీస స్థాయిలో నీళ్లున్నాయి. అయితే, ఈసారి మిషన్‌భగీరథ అవసరాలకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈమేరకైనా నీళ్లున్నాయి. ఆవిరి నష్టాలను కూడా ముందుగానే గుర్తించిన అధికారులు కొంతమేర నివారించే ప్రయత్నం చేశారు. మార్చి–ఏప్రిల్ నెలల్లో ఆవిరి నష్టం నెలకు 0.75 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకుంటుంది. ఇది ఒకనెల హైదరాబాద్ తాగునీటి అవసరాలతో సమానం. కాగా, మే నెలలో ఈ ఆవిరి నష్టం 1.5 టీఎంసీలకు చేరడం ఆందోళనకరం. జూరాల నుంచి సాగర్‌కు 3 టీఎంసీల నీరు విడుదల చేస్తే సాగర్ ప్రాజెక్టు చేరింది 1.1 టీఎంసీలే. ఇందులో 1 టీఎంసీ నీటి ప్రయాణ నష్టం కాగా, మరో టీఎంసీ ఆవిరి అయిపోవడం గమనార్హం. శ్రీశైలందీ అదే పరిస్థితి! శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 885 అడుగులు కాగా ఇప్పుడు 807.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టులో గత మూడేళ్లతో పోలిస్తే ఫరవాలేదనే స్థాయిలో నీళ్లున్నాయి. సింగూరు ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టులో 21.91 టీఎంసీల గరిష్ట నీటిసామర్థ్యానికిగాను కేవలం 0.68 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. అదే గత ఏడాది 8 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ఏడాది మహా రాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాలేదు. నిజాంసాగర్‌లో ఈ ఏడాది 0.63 టీఎంసీల నీరుం డగా, గతేడాది ఇదే సమయానికి 2.61 టీఎంసీలున్నాయి. సింగూరు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఇక్కడా నీళ్లు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే గతేడాది ఇది 6.81 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి కొంత ఇన్‌ఫ్లో ఉండడంతో ఆ కొద్దిమేరనైనా నీళ్లున్నాయి. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద మనం ఎక్కువగా ఆధారపడే సాగర్, సిం గూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎల్ఎండీలలో నీటి నిల్వలు అధమస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తక్కువే రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.70 లక్షల ఎకరాల్లో సాగైనట్లు (89%) వ్యవసాయశాఖ నివేదిక తెలిపింది. అత్యధికంగా పప్పుధాన్యాల సాగయ్యాయి. పప్పుధాన్యాల రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 3.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రబీ వరి సాధారణ విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 17.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు నివేదిక తెలిపింది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన పప్పుధాన్యాల సాగు 103% నమోదు కావడం గమనార్హం. ఇక నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.30 లక్షల (74%) ఎకరాల్లో సాగు జరిగింది. అందులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, 2.80 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 126% రబీ పంటలు సాగయ్యాయి. అక్కడ సాధారణ సాగు విస్తీర్ణం 49 వేల ఎకరాలు కాగా, 62 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలావుంటే రబీ మొక్కజొన్న పంటను కత్తెరపురుగు దెబ్బతీసింది. దీని ప్రభావంతో 8 జిల్లాల్లో మొక్కజొన్న దిగుబడి చాలా తగ్గింది. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), నిర్మల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెరపురుగు వ్యాపించింది. అకాల వర్షాలకు గాను మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. రబీ నాటికి 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ తెగ ఖర్చవుతోంది రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో గృహ అవసరాలకుగానూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మే నెలలో గత 10 రోజుల్లోనే దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. మే 1వ తేదీన రాష్ట్రంలో 7,221 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రాగా, 10వ తేదీన 8,147 మెగావాట్లకు చేరింది. 11న కొంత మేరకు తగ్గి 8,053 మెగావాట్లకు చేరింది. అయితే, వ్యవసాయ పనులు లేకపోవడంతో కొంత డిమాండ్ తగ్గినట్టు కనిపిస్తున్నా.. వ్యవసాయ వినియోగం సగటు 3,500 మెగావాట్లను కలిపితే అది 11,500 మెగావాట్లు దాటనుంది. అయితే, రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకు 10,500 మెగావాట్లు మాత్రమే ఉంది. కానీ, మే నెలలో ఏకంగా వ్యవసాయ వినియోగం లేకుండా 8,147 మెగావాట్లకు చేరడం గమనార్హం. భానుడు దంచేస్తున్నాడు ►రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎంతగా అంటే గ్రామాల్లో నీటిచెల్మలు కూడా లేక పక్షులు చనిపోతున్నాయి. ఇతర మూగజీవాలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి. చాలా జిల్లాల్లో భూగర్భజలాలు పడిపోతుండటం తో నీళ్లు రావడమే గగనమైపోయింది. పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో ఉన్న బోర్లు వట్టిపోతున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా జిల్లాలో రోజుకు 4లక్షల లీటర్ల పాల దిగుబడి తగ్గిపోయింది. మూగజీవాలకు నీళ్లు కరువయ్యాయి. గడ్డి తగ్గిపోయింది. ట్రాక్టర్ గడ్డి రూ.5వేల నుంచి రూ.8వేలకు పెరిగింది. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమను ఎండలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని 50% పౌల్ట్రీ ఉత్పత్తులు ఈ జిల్లా నుంచే ఉండడం గమనార్హం. ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే10వ తేదీన హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 3,102 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గతంలో 2018 మే30న 2,958 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా, ఇప్పుడు 104 మెగావాట్లు పెరిగింది. ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా>కు అంతరాయం కలుగుతోంది. ►మహబూబ్‌నగర్‌లో ట్రాక్టర్ గడ్డి రూ.15వేలు పలుకుతోంది. వలస కార్మికులు నిలువ నీడ లేని పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ►రంగారెడ్డి జిల్లాలో 191 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదయింది. భూగర్భజలాలు 18.43 మీటర్ల లోతుకు వెళ్లాయి. 24 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 200 గ్రామాలు డేంజర్ జోన్లోకి వెళ్లాయి. ►నల్లగొండ జిల్లాలో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ భూగర్భజలాలు 14.89 మీటర్లకు పడిపోగా, వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 31 మండలాలుండగా, 25 మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్ గడ్డి రూ.8వేల నుంచి 12వేలు పలుకుతోంది. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో వడదెబ్బకు 55 మంది వరకు చనిపోయారు. ఇక్కడ 43–46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ►ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ భూగర్భ జలాలు లోపలికి వెళ్లాయి. గత ఏడాదితో పోలిస్తే అరమీటరుకు పైగా ఎక్కువగానే గంగమ్మ పాతాళంలోకి చేరింది. ►నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1015.7 మిల్లీమీటర్లు కాగా, కురిసింది కేవలం 850.9 మిల్లీమీటర్లే. ఇక భూగర్భజలాలు గతేడాది 15.32 మీటర్ల లోతున ఉంటే ఇప్పుడు 17.05 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. ►వరంగల్ జిల్లాలో పది మీటర్లకు అటు ఇటుగా భూగర్భజలాలున్నాయి. అయితే, వర్షపాతం మాత్రం 70 శాతం కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున బోర్లు ఎండిపోయే పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటికి కూడా కష్టమవుతోంది. -
భూగర్భ జలాల్లో ‘ప్లాస్టిక్’
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తున్న భూగర్భ జలాల్లోనూ ప్లాస్టిక్ భూతం ప్రవేశించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘గ్రౌండ్‌వాటర్’ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికాలోని రెండు జలాశయాల్లో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఔషధాలు, గృహోపకరణ వ్యర్థాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ప్లాస్టిక్ పర్యావరణంలోకి సూక్ష్మకణాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఇది జలచర జీవుల నాశనానికి కారణమవుతుంది’ అని ఇలినాయిస్ టెక్నాలజీ సెంటర్ పరిశోధకుడు జాన్ స్కాట్ చెప్పారు. ఫలితంగా మన ఆహార సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సున్నపురాయి పగుళ్ల ద్వారా, కొన్నిసార్లు మురుగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా కూడా భూగర్భంలోకి నీరు చేరుతుంది. అయితే, పరిశోధకులు సెయింట్ లూయిస్ మెట్రోపాలి టన్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో పలు భూగర్భ జల నమూనాలను సేకరించి పరీక్షించగా 15.2 శాతం ప్లాస్టిక్ సూక్ష్మకణాలు కనిపించాయి. 1940 నుంచి 600 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనట్లు ఒక అంచనా. అందులో కనీసం 79 శాతం పర్యావరణంలో కలిసిపోయి ఉంటుందని అనుకుంటున్నామని స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కందకాల వల్ల కాపు నిలిచింది!
గుడి రామ్నా«ద్ విజయ్‌కుమార్ అనే పండ్ల తోటల రైతు కందకాల ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపజేసి తమ పండ్ల తోటకు నీటి భద్రత సాధించుకున్నారు. మామిడి కాపును నిలబెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామ పరిధిలో ఆయనకు 34 ఎకరాల మామిడి, సపోట తోట ఉంది. వర్షాకాలం పోయిన కొద్ది నెలలకే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నోరెళ్లబెడుతున్న నేపధ్యంలో 2016లో కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై దృష్టిపెట్టారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించారు. వీరి ఉచిత సాంకేతిక సహకారంతో మీటరు లోతు, మీటరు వెడల్పున పొలంలో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. 2016లో ఒకటి, రెండు వర్షాలే పడ్డాయి. 2017లో మంచి వర్షాలు పడినప్పుడు రెండు, మూడు సార్లు కందకాలన్నీ నిండి, భూమిలోకి వర్షం నీరు బాగా ఇంకింది. మా తోటలో బోర్లు ఈ వేసవిలో కూడా ఒకటిన్నర – రెండంచుల నీరు పోస్తున్నాయి. అయితే, మా చుట్టు పక్కల తోటల్లో బోర్లు ఈ వేసవిలో చాలా వరకు ఎండిపోయాయి. 24 గంటల కరెంటు ఉన్నా మేం రాత్రిపూట బోర్లకు విరామం ఇస్తున్నాం. ఐదు బోర్లలో రెండు బోర్లకు సోలార్ పంపు సెట్లు పెట్టించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఆగిపోతాయి. రాత్రి పూట బోర్లు రీచార్జ్ కావడానికి విరామం దొరుకుతుంది. అయితే, 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో కొందరు రైతులు రాత్రీ పగలూ బోర్లు ఆడిస్తున్నారు. ఇందువల్ల వారి బోర్లు త్వరగా ఎండిపోతున్నాయి. గత నాలుగేళ్లుగా సరిగ్గా నీరు లేని కారణంగా మా మామిడి తోటలో కాపు రాలేదు. ఈ సంవత్సరం కాపు కొంత నిలిచింది. ఖర్చులు చేతికి వచ్చాయి. తోటలకు మనం నీరు పెట్టేది ఒక ఎత్తయితే, భూమిలోకి ఇంకిన వర్షపు నీటి తేమ మరో ఎత్తు. వర్షంలో చెట్టు తడవడం ద్వారా పొందే నీరు ఇంకో ఎత్తు. నీరు లేని షాక్ వల్ల నాలుగేళ్లు పంట నిలవలేదు. కందకాల ప్రభావం వల్ల ఈ ఏడాది మామిడి చెట్లపై కాపు నిలబడిందని విజయ్‌కుమార్(98490 19454) సంతోషంగా తెలిపారు. -
24 గంటల కరెంటు వద్దు
గోరింటాల రైతుల తీర్మానం గంభీరావుపేట(సిరిసిల్ల): ‘తమకు 24 గంటల కరెంటు వద్దని.. 9 గంటల కరెంట్ చాలని’ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం గోరింటాల రైతులు తీర్మానించారు. మంత్రి కేటీఆర్ ద్వారా తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని సర్పంచ్ వివరించారు. రైతులు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరంతర విద్యుత్‌తో బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. తమ గ్రామం పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంద న్నారు. తమ గ్రామానికి తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చి జలవనరులను కాపాడాలని రైతులు కోరారు. -
భూగర్భజలాలు కలుషితం
క్రషర్ బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాల ఎఫెక్ట్.. పెట్రోలు, డీజిలు వాసన వస్తున్న బోరుబావుల నీరు ఎండిపోతున్న పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ యాటకల్లుకు చెందిన ఈ రైతు పేరు ఈరన్న. ఈయనకు క్రషర్ సమీపంలో పొలం ఉంది. రెండు నెలల కిందట బోరు కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. క్రషర్లో పేలుళ్ల ధాటికి వెలువడే తెల్లని పొగకు, భూగర్భజలం కలుషితమై బోరు నుంచి వస్తున్న నీటికి పంటలో ఎదుగుదల లోపించింది. పైగా బోరు నుంచి వచ్చే నీరు పెట్రోల్, డీజిల్ లాంటి వాసన వస్తోంది. ఇలా ఒక్క ఈరన్నదే కాదు...గ్రామంలో పదుల సంఖ్యలో రైతులకు చెందిన బోరు బావుల్లో నీరు కలుషితం అయ్యింది. శెట్టూరు: యాటకల్లు గ్రామం వద్ద గల క్రషర్ కారణంగా సమీపంలోని పొలాలు బీడుగా మారుతున్నాయి. అసలే వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులు అరకొరగా వచ్చే బోర్ల నీటితోనైనా పంటలు సాగుచేసుకుందామనుకుంటే క్రషర్ రూపంలో అడియాస అవుతోంది. క్రషర్ నుంచి తయారయ్యే కంకరకు భారీ డిమాండ్ పెరగడంతో కొద్ది రోజుల నుంచి క్రషర్లో అధిక సామర్థ్యంతో పేలుళ్లు (బ్లాస్టింగ్) జరుపుతున్నారు. బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాలు, ఇంధనం, దాని సామర్థ్యాలు అధిక మోతాదులో ఉండటంతో గ్రామంలో ఇళ్లు బీటలు వారాయి. క్రషర్ నుంచి వెలువడే తెల్లని పొడి పంట పొలాలను కప్పేసి భూమి సారవంతాన్ని పీల్చి పిప్పి చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. కలుషితమవుతున్న భూగర్భజలాలు క్రషర్కు ఆనుకుని 15 నుంచి 20 దాకా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే నీటితో సమీపంలోని 15 మంది రైతులు వేరుశనగ సాగు చేసుకున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వాడే ఇంధనం వల్ల భూగర్భజలాలు కలుషితం అయ్యాయని రైతులు వాపోతున్నారు. బోరు నుంచి నీరు బయటికి వస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్ వాసన వస్తోందని చెబుతున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే కూలీలు ఈ నీటిని తాగితే ప్రాణాలు ఇక అంతేననే ఆందోళన చెందుతున్నారు. క్రషర్ ప్రభావంతో వట్టిపోయిన బోర్లు క్రషర్ చుట్టూ ఉన్న వ్యవసాయ బోర్లన్నీ పూర్తిగా వట్టిపోయాయి. గ్రామానికి చెందిన పెద్దన్న, వెంకటేశులు, రామచంద్ర, బోయ తిప్పేస్వామి, తిమ్మన్న, ప్రసాద్, రామాంజనేయులు, తిమ్మప్పతో పాటు మరికొంతమందికి చెందిన బోర్లు ఎండిపోయాయి. దీని కారణంగా 100 ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఇటీవల వేసిన కొత్త బోర్లలో సైతం నీరు ఒకటి, రెండు నెలల పాటు వచ్చి వట్టిపోయినట్లు రైతులు చెబుతున్నారు. క్రషర్ బ్లాస్టింగ్ ప్రభావంతో జరుగుతున్న నష్టం గురించి ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు ఇతర అధికారులు పరిశీలనకు వచ్చి, మైనింగ్‌శాఖకు నివేదికలు పంపుతామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
భూగర్భ జలాలకు ‘కరెంట్’ షాక్!
♦ 9 గంటల విద్యుత్‌తో భూగర్భ జలాలపై ఒత్తిడి ♦ అంతటా ఒకేసారి వినియోగిస్తుండడంతో తగ్గుతున్న మట్టాలు ♦ రెండు, మూడు గంటల్లోనే బోర్లు, బావుల్లో నీళ్లు బంద్ ♦ తిరిగి రీచార్జి కావడానికి అవకాశం లభించని స్థితి ♦ మళ్లీ మరునాడే విద్యుత్ సరఫరా.. మళ్లీ అదే పరిస్థితి ♦ సరిగా నీరందక లక్షల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు ♦ మరోవైపు నీటిని విచ్చలవిడిగా తోడేస్తున్న పెద్ద రైతులు ♦ రాష్ట్రంలో అసాధారణంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ♦ రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సరిగా నీరందక బోర్లు, బావుల కింద పంటలు ఎండిపోతున్నాయి.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లేక కాదు.. విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉండడం వల్ల! ఆశ్చర్యంగా అని పించినా... ఇదే వాస్తవమని నిపుణులు చెబుతు న్నారు. వర్షాలు సరిగా కురవకపోవడం, ఎండలతో భూగర్భ జలాలు తగ్గిపోవడంతోపాటు వ్యవసాయా నికి 9 గంటల నిరంతర సరఫరా వల్ల కూడా బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయని చెబుతు న్నారు. ఒకే దఫా విద్యుత్ సరఫరాతో అంతటా ఒకేసారి బోర్లు, బావుల నుంచి భూగర్భ జలాలను తోడేస్తున్నారని, దాంతో కొద్దిసేపటికే నీరు అందడం లేదని చెబుతున్నారు. అదే రెండు దఫాలుగా విద్యుత్ సరఫరా చేస్తే.. ఆ మధ్య సమయంలో బోర్లు, బావుల్లో జలాలు రీచార్జి అవుతాయని, దాంతో పంట లకు సరిగా నీరు అందుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే 1.56 లక్షల ఎకరాల్లో.. వ్యవసాయ బోర్లు, బావులు ఎండిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్లో బోర్లు, బావుల కింద 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాలు వరి పంటే కావడం గమనార్హం. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో భూ గర్భ జలాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయి జల మట్టాలు పడిపోతున్నాయి. దీంతో నీరందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మేలు కోసమే..! గతంలో వ్యవసాయానికి రెండు మూడు విడతల్లో 4 గంటల నుంచి 6 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేది. దాంతో పంటల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బోర్లు, బావుల కింద పంటలు పండించే రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేపట్టింది. ఇక గతేడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం(862 మిల్లీమీటర్లు) కన్నా అధికంగా 1,104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పుష్కలంగా భూగర్భ జలాలు లభిస్తాయని ఆశించిన రైతులు.. రబీలో సాధారణ విస్తీర్ణానికి మించి పంటలు వేశారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 12.09 లక్షల హెక్టార్లుకాగా.. ఈ సారి 27% అధికంగా 15.36 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతోంది. కొందరు విచ్చలవిడిగా తోడేస్తుండడంతో.. ఒకే విడతలో 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులంతా బోర్లు, బావుల నుంచి ఒకేసారి నీటిని తోడేయాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జల మట్టాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. సాధారణంగా రైతులకు 7.5 హార్స్పవర్లోపు సామర్థ్యం గల మోటార్లకే అనుమతి ఉంది. కానీ కొందరు పెద్ద రైతులు 10 హెచ్‌పీ, 15 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లతో భూగర్భ జలాలను తోడేస్తున్నారు. నిబం ధనలకు విరుద్ధంగా మూడు కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లతో విచ్చలవిడిగా భూగర్భ జలాలను వెలికి తీస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా రైతుల కు చెందిన తక్కువ లోతు, తక్కు వ సామర్థ్యమున్న మోటార్లతో కూడిన బోర్లలో నీరు రావడం లేదు. వాటి కింద సాగు చేస్తున్న పంటలు ఎండిపోతు న్నాయి. అంతేకాదు తమ బోర్లు ఎండి పోవడంతో అక్కడక్కడా చిన్న రైతులు దగ్గర్లోని పెద్ద రైతుల బోర్ల నుంచి నీళ్లు కొనుక్కుంటుండడం గమనార్హం. నీటి రీచార్జింగ్‌కు సమయం గతంలో వ్యవసాయానికి రెండు మూడు విడతల్లో కలిపి 4 నుంచి 6 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేది. ఓ విడతలో బోరులోని నీటిని తోడేసినా మరో విడత విద్యుత్ సరఫరా అయ్యే సమయానికల్లా బోరులో భూగర్భ జలాలు రీచార్జి అయ్యేవి. దాంతో రెండు విడతల విద్యుత్ సరఫరాతో చాలా ప్రయోజనమూ ఉండేది. కానీ ప్రస్తుతం 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో.. చాలా చోట్లలో తొలి మూడు గంటలకే బోర్ల నుంచి నీళ్లు రావడం ఆగిపోతోంది. మళ్లీ మరుసటి రోజే విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. పెరిగిన విద్యుత్ వినియోగం! వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఏడాది మార్చి 31న రాష్ట్ర విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 9,191 మెగావాట్లుగా నమోదైంది. 2016లో అత్యధిక వినియోగం 7,720 మెగావాట్లుకాగా.. 2015లో 7,035 మెగావాట్లు మాత్రమే. భూగర్భ జలాలు రీచార్జి కానివ్వాలి.. ‘‘9 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చినా.. చిన్న, సన్నకారు రైతులు మూడు గంటలకు మించి వాడుకోలేరు. తక్కువ లోతు బోర్లు, తక్కువ సామ ర్థ్యమున్న మోటార్ల కారణంగా వారి బోర్ల నుంచి నీళ్లు ఆగిపోతాయి. కొంత విరామం తర్వాతే మళ్లీ నీళ్లు వస్తాయి. పెద్ద రైతులు బాగా ఖర్చు చేసి బోర్లు లోతుగా వేయిస్తారు, అధిక సామర్థ్యం గల మోటా ర్లు వినియోగిస్తారు. దీంతో నీళ్లంతా వాళ్లకు వెళ్లిపో తాయి. ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై మాత్రమే కాకుండా భూగర్భ జలాల పరిస్థితిపై కూడా దృష్టి పెట్టి ఉంచాలి. వ్యవసాయ, విద్యుత్, భూగర్భ జల శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ.. పంటల సాగు విషయంలో రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం మంచింది..’’ – ఎం.వేణుగోపాలరావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కో–ఆర్డినేటర్ పశువుల మేతకే పనికొచ్చింది.. ‘‘రెండెకరాలు కౌలుకు తీసుకుని రూ.25 వేలు అప్పు చేసి వరి పంట సాగు చేశా. బోరులో నీళ్లు రాక చేతికి వచ్చే పంట ఎండి పోయింది. ఇప్పుడు పశు వుల మేతకు మాత్రమే పనికొస్తోంది. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు..’’ – కొమురయ్య, కౌలురైతు, వెల్దుర్తి, మెదక్ జిల్లా వరి ఎండింది.. మొక్కజొన్నా పోయింది.. ‘‘వెల్దుర్తి శివారు హల్దివాగు పరీవాహకంలో ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. రూ.16 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన. వాగులో రింగుల బావి ఎండిపోయింది. పొలంలోని బోరు నుంచి నీళ్లు వస్తలేవు. నాకున్న ఎకరం పొలంలో రూ.10 వేలు అప్పు చేసి మొక్కజొన్న సాగు చేసిన. కానీ చేతికి వచ్చే సమయంలో నీరందక ఎండిపోతుం డడంతో పశువుల మేతకు అమ్ముకున్నా..’’ – నాగులు, కౌలు రైతు, శేరిల, మెదక్ జిల్లా -
సిటీ గొంతులో గరళం
►గ్రేటర్లో కలుషితమవుతోన్న భూగర్భ జలం ►ఎన్జీఆర్ఐ అధ్యయనంలో వెల్లడి ►ముప్పు తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: నగరం గొంతులో గరళం పడుతోంది. ఇప్పటికే తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. కాలుష్య జలాలతో గొంతు తడుపుకొనే పరిస్థితి నెలకొంది. మండు టెండలకు గ్రేటర్లో భూగర్భ జలసిరి ఆవిరయ్యే విషమ పరిస్థితుల్లో ఇది మరో విపత్తు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడలు, వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు భయంకర మైన కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదికలో పేర్కొంది. 160 ప్రాంతాల్లో పరీక్షలు గ్రేటర్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఎన్జీఆర్ఐ నిగ్గుతేల్చడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను పరిశ్రమల యజమానులు స్థానిక చెరువులు, కుంటలు, ఖాళీ ప్రాంతాల్లోకి వదిలిపెడుతున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈ నీరంతా క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనంలో పేర్కొంది. 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలు దశాబ్ధాలు పీసీబీ నిర్లక్ష్యానికి అద్దంపట్టాయి. ఆందోళనకరంగా భారలోహాల ఉనికి.. పలు పారిశ్రామిక వాడల్లోని భూగర్భ జలాల్లో భారలోహలు ఉన్నట్టు ఎన్జీఆర్ఐ నిర్థారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణా రహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది. ప్రధానంగా ఖాజిపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో భారలోహాలైన లెడ్, క్యాడ్మియం, మాలిబ్డనం, ఆర్సినిక్ వంటి లోహాల ఉనికి బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నీటితో అనర్థాలే.. ►భార లోహాలున్న నీటిని తాగిన చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ►గర్భస్రావాలు జరిగే ప్రమాదం ఉంది. ► క్రోమియం వల్ల క్యాన్సర్ ముప్పు అధికం. ► శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులతో సమస్యలు తప్పవు. ►మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది. ►కాలేయం దెబ్బతింటుంది. ►ఈ నీటితో సాగుచేసిన కూరగాయలు తిన్నవారికి తీవ్ర అనారోగ్యం తప్పదు. -
మూగజీవులపై ప్రతాపం
పశువులను కబేళాకు తరుముతున్న కరువు పశ్చిమ మండలాల్లో ఎండిన బోర్లు తాగునీటికి..గ్రాసానికి కొరత గత్యంతరం లేక కబేళాకు పశువులు అల్లాడిపోతున్న పాడి రైతులు జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. మనుషులకే తాగేందుకు నీళ్లు దొరక్క అవస్థలు పడేచోట మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి. క్షామదేవత వికృత విన్యాసాలు చేస్తుంటే పాడిరైతులు అల్లాడిపోతున్నారు. వాగులు, వంకలు, భూగర్భజలాలు అడుగంటిపోయి చుక్క నీరు దొరకడం కష్టమైంది. పశ్చిమ మండలాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఈనేపథ్యంలో చేసేది లేక రైతులు మనసు చంపుకుని పాలివ్వని పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ఆర్థికంగా అండ గా నిలిచిన గొడ్లను అమ్ముకుం టుంటే సొంతమనిషిని కోల్పోయినట్టుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం 100 టన్నుల పశుగ్రాసం కొరత ఉంది. చిత్తూరు, సాక్షి: కరువు రక్కసి ప్రభావం పశ్చిమ మండలాల్లోనే అధికంగా ఉంది. పూట గడవడమే కనాకష్టమయ్యే సమయంలో పశుపోషణ భారమవుతోంది. చేసేది లేక పశువులను తెగనమ్ముకుంటున్నారు. పాలిచ్చేవాటిని రక్షించుకోడానికి వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి గడ్డి తెచ్చుకుంటున్నారు. మండలా ల్లో ఇప్పటికే వేలాది బోర్లు ఎండిపోయాయి. కాసిన్ని నీళ్లు విదిల్చే బోర్లపై ఆధారపడి గ డ్డిని పెంచుకుంటున్నారు. ఇవి కూడా ఈనెలాఖరుకు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. జీవాలకు మేత దొరక్క జిల్లా మొత్తం తిరుగుతున్నామని మ దనపల్లి మండలం గొల్లపల్లికి చెంది న నాగరాజన్న చెప్పారు. రెండు నెలల నుంచి తిరుగుతున్నా గడ్డి ఉన్నవాటిని ఎలా రక్షించుకోవాలో అర్థం కాలేదన్నారు. ఏప్రిల్, మేలో ఎలా..? మార్చి నెలలోనే ఇలా ఉంటే భాను డు విశ్వరూపం చూపే ఏప్రిల్, మేనెలల్లో పశుపోషణ ఎలా అని అన్నదాత దిగులు చెందుతున్నారు. ఖరీఫ్, రబీలో పంటలు చేతికందకపోవడంతో గడ్డిపోచ దొరకడం కూడా మృగ్యమైంది. ఉన్న కొద్దిపాటి గడ్డి ధర చుక్కలను తాకుతుండటంతో కొనే స్థితిలో లేమని పాడి రైతులు అంటున్నారు. జనవరిలో టన్ను గడ్డి ధర‡ రూ.1,500లు ఉండగా ఇప్పుడు రూ.2,500లు నుంచి రూ.3,000లు వరకు పలుకుతోంది. తూర్పు మండలాలల్లో తగినంత గడ్డి ఉన్నా అక్కడకూడా పాడి రైతులు అధికంగా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న జిల్లా వెనుకబడే అవకాశం ఉంది. మేత దొరక్క ఇప్పటికే రెండు పశువులను అమ్ముకున్నామని రామసముద్రం మండలం వనగానిపల్లెకు చెందిన రమణారెడ్డి చెప్పారు. తాగేందుకే నీరు దొరక్క ఇబ్బందులు పడుతుంటే గొడ్లకు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మేలుకోని ప్రభుత్వం జిల్లాలో కరువు వల్ల పశుగ్రాసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డా ఇంతవరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల గడ్డి విత్తనాలు పంచినా నీరు లేకపోవడంతో ఉపయోగించుకోలే ని స్థితి. తీవ్ర పశుగ్రాస కొరతను ఎదుర్కొనడానికి రూ.29 కోట్లు కేటాయిం చాలని జిల్లా పశుసంవర్ధ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. -
అడుగంటిన ఆశలు
► మండుతున్న ఎండలు.. ఎండుతున్న వరి చేలు ► తగ్గుతున్న భూగర్భజలాలు, వట్టిపోతున్న బోరుబావులు ► సాగునీరు అందక 400 ఎకరాల్లో పంట ఎండుముఖం ► పశువులకు మేతగా మారిన పైర్లు ► నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు వరి చేలకు నీళ్లు లేక అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. మండే ఎండలతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా మారుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి చేతికందని పరిస్థితులతో రైతులు వేదనకు గురవుతున్నారు. మండుతున్న భానుడితో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. బోర్లు ఎండిపోతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 400 ఎకరాల్లో వరికి నీళ్లు అందక ఎండిపోయింది. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్ సరాఫరా అవుతున్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్: సాగునీరు పుష్కలంగా ఉంటుందన్న ఆశతో రైతులు యాసంగిలో ఉత్సాహంగా వరి పంట సాగు చేశారు. ఈసారి కాస్తో కూస్తో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు ఉందనే ఆలోచనతో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. గత ఖరీఫ్‌లో 425 హెక్టార్లలో సాగవ్వగా.. ఈ యాసంగిలో సాధారణ విస్తీర్ణం 625 హెక్టార్లు కాగా సుమారు 800 హెక్టార్లలో సాగు చేశారు. ఈ నేపథ్యంలో దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో చేతికొచి్చన పంటలు ఎండుముఖం పట్టాయి. ఎగువ భాగమైన కప్పపహాడ్, ఎల్మినేడు, కొంగరకలాన్, పోచారం, ఉప్పరిగూడ, తులేకలాన్, రాందాస్‌పల్లి గ్రామాల్లో పెద్దగా పంటలు ఎండిపోలేదు. దిగువభాగంలోని దండుమైలారం, నెర్రపల్లి, ముకునూర్ గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. ప్రస్తుతం ఎండలు ఏమాత్రం ముదరక ముందే ఈ పరిస్థితి దాపురించిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తున్నప్పటికీ బోరుబావుల్లో నీరు లేకపోవడంతో ఇంతటి గడ్డు పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.25 వేలకుపైగా పంటకు పెట్టుబడులు పెట్టామని, నీళ్లు లేక వరి చేలు కళ్లముందే ఎండిపోతుంటే తల్లడిల్లుతున్నారు. ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే మండలంలో 400 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేకుండా పోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా బోరుబావులు వేసవికాలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేకుండా బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారు. కొద్దిగా నీరు వచ్చిన తరువాత ఎండిపోతున్నాయి. సహజ వనరులను కాపాడేందుకు తీసుకొచి్చన వాల్టా చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. మండలంలోని వాల్టా చట్టానికి ప్రత్యేక కమిటీలుంటాయి. తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. బోరు వేసే ముందు తహసీల్దార్ అనుమతి తీసుకుని నిర్ణీత రుసుము చెల్లించాలి. అధికారులు సూచించిన లోతును మాత్రమే బోరుబావులు తవ్వించాల్సి ఉంటుంది. ప్రతి బోరుకు 250 మీటర్ల దూరం ఉండాలి. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వేసే బోరు యంత్రాలను వేసిన బోర్లను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది. షాబాద్ పంట నష్టం అంచనా వేస్తాం ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న విషయం మా దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తాం. రైతులను ఆదుకుంటాం. – వరప్రసాద్‌రెడ్డి, ఏఓ, ఇబ్రహీంపట్నం బోరుకు బంగారం తాకట్టు పెట్టాం నాలుగు ఎకరాల్లో వరి పంట వేశా. పుష్కలంగా నీరు ఉందన్న ఆశతో సాగు చేస్తే ప్రస్తుతం ఎండిపోయింది. రూ.70 వేలు ఖర్చు చేసి బోర్లు వేశాం. బంగారం తాకట్టు పెట్టి బోరు వేయిస్తే చుక్క నీరు రాలేదు. అప్పు చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. – దోర్నాల అబ్బసాయిలు, రైతు -
రబీలో మురిపించిన వరి
గతేడాది కంటే 13.73 లక్షల ఎకరాలు అధికం వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి... ముగిసిన రబీ సాగు సాక్షి, హైదరాబాద్ : ఈసారి రబీలో వరి సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. దీనికి గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగడమే కారణం. ఈ రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.22 లక్షల ఎకరాలు కాగా... 35.47 లక్షల (117%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది. గత రబీలో 17.05 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే గతేడాది కంటే 18.42 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగు కావడం గమనార్హం. అందులో ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 21.90 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 29.07 లక్షల (133%) ఎక రాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇక వరిసాగు మాత్రం ఇటీవల ఎన్నడూ లేనంత ఎక్కువగా సాగవడం గమనార్హం. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా 19.30 లక్షల (145%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గతేడాది రబీలో కేవలం 5.57 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 13.73 లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడటం గమనార్హం. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 4.65 లక్షల (147%) ఎకరాల్లో పంటలు వేశారు. వేరుశనగ సాధారణంగా 3.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, అంతే సాగు జరిగింది. మిరప సాగు కూడా సాధారణంతో పోలిస్తే 121 శాతం అయింది. మిరప సాధారణ సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు కాగా... 60 వేల ఎకరాల్లో సాగైంది. అయితే, ఉల్లిగడ్డ సాగు సగానికి పడిపోయింది. సాధారణ ఉల్లిసాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు కాగా... 12 వేల ఎకరాలకే పరిమితమైంది. ఆదిలాబాద్‌లో అధికంగా సాగు: రబీలో ఆదిలాబాద్‌లో అధికంగా పంటలు సాగయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఏకంగా 168 శాతం విస్తీర్ణంలో అన్ని పంటలూ సాగయ్యాయి. ఆ జిల్లాలో రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 39,377 ఎకరాలు కాగా... 66,242 ఎకరాల్లో సాగయ్యాయి. వంద శాతానికి మించి పంటలు సాగైన జిల్లాలు 22 ఉండటం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత తక్కువగా 54 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు కాగా... 81,900 ఎకరాల్లోనే సాగవడం గమనార్హం. ఇక ఈశాన్య రుతుపవనాలు ఈసారి నిరాశపరిచాయి. మొత్తంగా 45 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. అక్టోబర్‌లో 30 శాతం, నవంబర్‌లో 96 శాతం, డిసెంబర్లో 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. -
నీటి గుంత.. తీరని చింత
ఫాంపాండ్ నిర్మాణాల్లో తీవ్ర జాప్యం రైతులకు కరువైన అవగాహన పట్టింపులేని అధికారులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం వర్ధన్నపేట : అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారింది. నీటి గుంతల నిర్మాణంతో వృథా నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు సంకల్పించిన ప్రభుత్వ ఆశయాన్ని వారు నీరుగారుస్తున్నారు. ఫలితంగా సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 15 మండలాల్లో ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రతి రైతుకు నీటి గుంతలపై అవగాహన కల్పించి భూగర్భజలాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఫారంపాండ్స్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే వాటికి సంబంధించిన పనులను ప్రారంభించింది. పర్యవేక్షణ కరువు.. ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఫారంపాండ్స్ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా పనుల్లో వేగం పెరగడం లేదు. వేలల్లో మంజూరు చేసిన అధికారులు నిర్మాణాలపై శ్రద్ధ వహించడం లేదని తెలుస్తోంది. నీటి గుంతల ప్రయోజనాలపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4,417 మంజూరు.. జిల్లాలో ఈ ఏడాది 4,417 మంది రైతులకు ఫారంఫాండ్స్ మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు 2381 పూర్తికాగా, 929 నిర్మాణ దశలోనే ఉన్నా యి. కాగా, 1107 మంది రైతులు ప్రారంభంలోనే వెనకడుగు వేశారు. ఫారంఫాండ్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆదే శాలు జారీ చేస్తున్నా లక్ష్యం పూర్తికాకపోవడం గమనార్హం. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట వెనకంజ.. ఫారంఫాండ్స్ నిర్మాణాల్లో వర్ధన్నపేట మండలం వెనకంజలో కొనసాగుతుంది. మండలానికి 631 మంజూరుకాగా.. ఇప్పటివరకు 82 నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. కాగా, చెన్నారావుపేటలో 470 మంజూరుకాగా 303 పూర్తయ్యాయి. ఆత్మకూరులో 128, దుగ్గొండిలో 425, గీసుకొండలో 45, ఖానాపురంలో 60, నల్ల»ñబెల్లిలో 95, నర్సంపేటలో 55, నెక్కొండలో 343, పరకాలలో 45, పర్వతగిరిలో 283, రాయపర్తిలో 94, సంగెంలో 386, శాయం పేటలో 38 పూర్తయ్యాయి. అవగాహన కల్పిస్తే లక్ష్యం పూర్తి.. ఫారంఫాండ్ నిర్మాణాలతో సాగు భూమిలో కొంత కోల్పోతామనే ఆలోచనతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పల్లపు ప్రదేశంలో గుం తలను నిర్మించడంతో వర్షపు ద్వారా వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండే అవకాశం ఉంది. అవసరమైన సమయాల్లో ఫారంఫాండ్లోని నీటిని సాగునీటిగా పంటలకు ఉపయోగించవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగు నీరు రైతులకు అందుబాటులో ఉంటుంది. నీటి గుంతల నిర్మాణంతో కొంత భూమి కోల్పోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని విష యాలపై అధికారులు అవగాహన కల్పించాలి. తద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది. రమణారెడ్డికి అభినందనలు.. వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో రైతు సొల్లేటి రమణారెడ్డి ఉపాధిహామీ పథకం ద్వారా ఇటీవల ఫారంపాండ్‌ను నిర్మించారు. నీరు నిల్వ ఉండడంతో మోటార్ ద్వారా ఆయన పంటకు సాగునీటినిఅందిస్తున్నారు. కాగా, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫారంఫాండ్‌ను పరిశీలించిన కలెక్టర్ రైతు రమణారెడ్డి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. -
తాగునీటి తండ్లాట షురూ..
► అడుగంటుతున్న భూగర్భ జలాలు ► మరో వారమైతే తాగునీరూ కరువే ► పశువులను అమ్ముకుంటున్న రైతులు ► ఆందోళనలో బాధిత గ్రామాల ప్రజలు ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని పలు ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. ప్రతీ వేసవి కాలం మాదిరిగానే మండలంలోని ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని ఖండాల, పోతగూడ, ఎస్సీగూడ, పూనగూడ, ధర్లొద్ది, మొలాలగుట్ట, చిలాటిగూడతో పాటు పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడికోరి గ్రామంలో రెండు నెలల కిందటనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న వాగులో చెల్మెలు తోడి కలుషిత నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటున్నారు. వాగు నీళ్లు సైతం ఇంకిపోవడంతో గ్రామానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఖండాల గ్రామంలో సుమారు 70 కుటుంబాలలో 600కుపైగా జనాభా ఉంది. వీరి దాహార్తిని తీర్చడానికి గ్రామంలో రెండు బోరు బావులు, మరో వ్యవసాయ బావి ఉంది. వీటిలో బోరు బావుల్లోని నీరు అడుగంటిపోయింది. వ్యవసాయ పొలంలో ఉన్న బావే పెద్ద దిక్కుగా మారింది. ఆ బావిలో నీళ్లు రావాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోతగూడ గ్రామంలోని బోరు బావులు ఇంకిపోవడంతో గ్రామానికి కొంత దూరంలో ఉన్న బావి నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో స్నానాలకు వేరే చోట నుంచి ఎడ్ల బండ్లతో తీసుకువస్తున్నారు. తాగడానికి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఫ్యూరిఫైడ్ నీళ్లను తెచ్చుకుంటున్నారు. వేసవి కాలం ప్రారంభం కాక ముందే నీళ్లు అడుగంటిపోవడంతో రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే అదనంగా బోర్లు వేసి తమ దాహార్తిని తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బురద నీళ్లే తాగుతున్నం డిసెంబర్ చివరి వారం నుంచే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. నీళ్లు దొరకకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నుంచి తెచ్చుకున్న బురదనీరే తాగుతున్నం. – ఆత్రం సీతాబాయి, మామిడికోరి, పిప్పల్‌ధరి పనులకు వెళ్లలేకపోతున్నం ప్రస్తుతం బోరు బావిలోని నీరు అడుగంటింది. గ్రామంలో సోలార్ చేతిపంపు ఉన్నప్పటికీ నీళ్లు లేవు. గ్రామానికి దూరంగా ఉన్న చెరువు నుంచి ఎడ్లబండ్లతో, కాలినడకన వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరించాలి. – ఆత్రం రాము, గ్రామపటేల్, మామిడికోరి చాలా దూరం పోతున్నం రెండు నెలల నుంచి నీళ్ల కోసం మస్తు పరేషానవుతున్నం. మా ఊళ్లో ఉన్న బోరింగ్లు, నూతిల్లో నీళ్లు ఎండిపోయాయి. నీళ్ల కోసం ఎడ్లబండిపై మస్తు దూరం పోతున్నం. ఎండలు ముదిరితే నీళ్లు దొరకేటట్లు లేవు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి. – కొడప జంగుబాయి, మొలాలగుట్ట -
వేసవికి ముందే ఎక్కిళ్లు!
అప్పుడే మొదలైన నీటి కష్టాలు పడిపోతున్న భూగర్భ జలమట్టాలు గ్రామాలు, తండాల్లో తాగునీటి తిప్పలు నీటిఎద్దడి ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వేసవికి ముందే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం.. నీటి వనరులు వట్టిపోతుండటంతో గ్రామాలు, గిరిజన తండాల్లో తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీనికితోడు గ్రామాల్లోని చేతిపంపులు పనిచేయకపోవటం, మరమ్మతులకు సైతం నోచుకోకపోవటంతో నీటి సమస్యకు దారితీస్తోంది. ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలం జప్తిశివనూరు గ్రామంలోని ఎస్పీకాలనీ వాసులు ఇటీవల తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా తెలుస్తోంది. కలుషిత నీరే దిక్కు బోరు మోటారు చెడిపోయి 15 రోజులవుతున్నా.. మరమ్మతు చేయించకపోవడంతో కాలనీలో నీటి ఎద్దడి నెలకొంది. ఫలితంగా కలుషిత నీరే దిక్కవుతోంది. తాము రోజూ రాత్రివేళలో బాలవికాస్‌కు చెందిన నీటి శుద్ధి యంత్రం ద్వారా పడిపోతున్న వృధా నీటిని పట్టుకుంటున్నాం. వెంటనే బోరును మరమ్మతు చేయించాలి. – శ్రీదేవి, నిజాంపేట సాక్షి, మెదక్ : జిల్లాలో మొత్తం 320 గ్రామాలు, వందకుపైగా గిరిజన తండాలున్నాయి. వీటిలో సుమారు 80 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. వర్షా కాలం చివరలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో జిల్లాలో భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అయితే డిసెంబర్ మాసం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో 14 మీటర్ల మేర ఉన్న భూగర్భ జలమట్టాలు ప్రస్తుతం 22 మీటర్లకు చేరుకున్నాయి. రబీలో బోరుబావుల కింద పంటల సాగు గణనీయంగా పెరగటంతో భూగర్భజలాల వాడకం పెరుగుతోంది. దీనికితోడు పట్టణ ప్రాంతాల్లో సైతం భూగర్భజలాలను ఎడాపెడా తోడేస్తున్నారు. దీంతో జల మట్టాలు పడిపోతున్నాయి. అల్లాదుర్గం మండలంలో 22 మీటర్లు, కొల్చారంలో 21.25, టేక్మాల్‌లో 19.69, మెదక్‌లో 15.24, హవేళిఘనపూర్‌లో 14.80 మీటర్ల మేర లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. దీంతో ఆయా మండలాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. భూగర్భ జలమట్టాలు పడిపోవటానికి తోడు జిల్లాలోని నీటి వనరులు సైతం ఎండిపోతున్నాయి. ఇది కూడా తాగునీటి సమస్యకు దారితీస్తోంది. నీటి కోసం తిప్పలు చిన్నశంకరంపేట మండలంలోని జప్తిశివనూర్ గ్రామ ఎస్సీ కాలనీ, గిరిజన తండాలో మంచినీటి సమస్య నెలకొంది. స్థానికులు మంచి నీటి కోసం వ్యవసాయ బోరుబావులతో పాటు స్థానిక చెరువులోంచి బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించాల్సిల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోవడంలేదని కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అలాగే మండలంలోని జంగరాయి నాగులమ్మ తండాలోను నీటి సమస్య నెలకొంది. గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల, దంతెపల్లి, పర్వతాపూర్ పంచాయతీల పరిధిలోని గిరిజన తండాల్లో పదేళ్లక్రితం నిర్మించిన వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉండటంతో, ఈమూడు తండాల్లో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి నెలకొంది. తండాల్లోæ ఉన్న చేతిపంపులు చెడిపోవడంతో నీటికోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రేగోడ్ మండలం దోసపల్లి గ్రామ పంచాయతీలోని సంగమేశ్వర తండాలో సుమారు 225 మంది జనాభా ఉంది. ఇందులో రెండు చేతి పంపులు ఉన్నా నీళ్లు సరిగ్గా పనిచేయటంలేదు. ఇరవై రోజులుగా తాగునీటికి కోసం తండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దశంకరంపేటకు రేగోడ్ మండలం బోరంచ నుంచి మంజీర సరఫరా అవుతుంది. గత ఏడాది నుంచి నూతనంగా పైప్లైన్లు వేస్తుండడంతో పాటు, రహదారి విస్తరణ వల్ల పాత పైపులైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో పెద్దశంకరంపేటకు తాగునీరు నీరు సరఫరా కావడం లేదు. కమలాపూర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ వేసవిలో మాత్రం తాగునీటికి ఇబ్బందులు తప్పేలాలేవు. మండల పరిధిలోని బూర్గుపల్లితాండాలలో మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు సరఫరా లేదు. తండా వాసులు పంట పొలాల్లోంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. చేగుంట మండల కేంద్రమైమైన బుడగ జంగాల కాలనీలో ఏళ్ల నుంచి నీటి తిప్పలు పడుతూనే ఉన్నారు. కాలనీలో 40 కుటుంబాలు ఉండగా కాలనీ సమీపంలోనే ఓ వాటర్ ట్యాంకుతో పాటు మినీ ట్యాంకులను నీటి సరఫరా కోసం నిర్మించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. నీటి సమస్యను తీర్చడానికి కాలనీ సమీపంలో బోరుబావిని తవ్వించినా నీరు రాలేదు. నీటి సమస్యను గుర్తించే పనిలో అధికారులు జిల్లాలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మండలాల వారీగా నీటి సమస్య ఉన్న గ్రామాలను, పనిచేయని బోరుబావుల వివరాలు సేకరిస్తున్నారు. నీటి సమస్య నెలకొంటే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు గురించి ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నీటి ఇబ్బందులు తప్పడం లేదు తండాలో కొత్తగా బోరు వేసినా తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న రెండు చేతిపంపుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తాగునీటి సమస్య ఎప్పటిలాగే ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. – రవి, తండావాసి, రేగోడ్ మండలం. నీళ్ల కోసం పొలాల వద్దకు పోతున్నాం మా కాలనీలో నీళ్ల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. బోర్లలో నీరు లేకపోవడంతో పొలాల దగ్గర బోర్లవద్ద నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎండాకాలం వస్తే నీటి కోసం ఎంత కష్టపడాలో అర్థమైతలేదు. కాలనీలో ఉన్న ట్యాంకుల్లోకి నీళ్లు వచ్చేలా చేసి మావాడలో నీటి సమస్యను తీర్చాలి. అందరం కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లమే ఉన్నాం. నీటి ఇబ్బందులతో ఒక్కో సారీ పనులకు కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే కాలనీలోకి నీళ్లు వచ్చేలా చేయాలి – కడమంచి సత్తమ్మ, బుడగజంగాల కాలనీ, చేగుంట. -
జలం.. జఠిలం
తగ్గుతున్న భూగర్భ జలాలు మెదక్ జోన్ : అన్నదాతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి వల్ల చేతికొచ్చిన పంటలు అందకుండా పోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఖరీఫ్‌లో కాలం కలిసి రాకున్నా.. వర్షాకాలం ఆఖరులో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రైతులు యాసంగిలో జోరుగా నాట్లు వేశారు. కాగా ఎండలు వేసవిని తలపిస్తుండటంతో రోజురోజుకూ భూగర్భజలమట్టం తగ్గిపోతున్నాయి. ఫలితంగా బోరు బావుల్లో నీరు రావడం లేదు. నెలరోజుల వ్యవధిలోనే మీటర్‌కుపైగా నీరు అడుగంటిపోయింది. గత సంవత్సరం డిసెంబర్లో 12.45 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోగా.. జనవరిలో 13.07 మీటర్ల లోతులోకి పడిపోయాయి. యాసంగిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అవుతున్నాయి. భూగర్భజలాలు వేగంగా అడుగంటుతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడు రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 20,561 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఈ సాగు సాధారణంతో పొలిస్తే 40 శాతం అధికంగా నాట్లు వేశారు. బోరు బావుల్లో కేవలం నెలరోజుల వ్యవధిలో సగానికిపైగా నీరు తగ్గిపోవడంతో వరి పంటకు నీటి తడులు అందక భూములు నెర్రలు బారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానురాను ఎండలు తీవ్రం కానున్నాయి. మరి ఈ ఏటా యాసంగి పంటలు చేతికి వస్తాయో..? లేదో..? అని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. గడిచిన మూడేళ్లలో తీవ్ర కరువుతో అల్లాడిన రైతాంగం ఈ ఏడు కురిసిన భారీ వర్షాలవల్ల రైతన్నకు ప్రాణం పోసినట్లయింది. కానీ వేసవికాలం ప్రారంభంలోనే బోరు బావులు, చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల అప్పు చేసి వరి పంటను సాగు చేసిన రైతాంగానికి కన్నీరు మిగిలే పరిస్థితి దాపురించిందని పలు మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీళ్లు అందుత లేవు.. ఎకరంన్నర పొలంలో ఎకరం నాటేసిన.. అద్దెకరంలో మొక్కజొన్న పంట వేసిన. బోర్లో నీళ్లు తగ్గిపోయినాయి. పొలం పారుత లేదు. రూ.20వేల అప్పు చేసిన. ఎట్లా బతకాల్నో అర్థమైత లేదు.. – కేతావత్ శాంతి, ఔరంగబాద్ తండా పంట ఎండిపోతోంది.. ఎకరం పొలం ఉంది. బోరును చూసుకుని నాటేసిన. నెలరోజుల నుంచి బోర్ల నీళ్లు బందైనయి. పొలం పారుత లేదు. పంట కోసం రూ.15వేలు అప్పు చేసిన. గిప్పుడేమో పంట ఎండిపోయింది. పిల్లలను ఎట్లా సాదుకోవాలో అర్థమైత లేదు సారూ.. – లంబాడి లక్ష్మి, ఔరంగబాద్ తండా -
గతం కంటే ఘనం
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు జనగామలో రెట్టింపు స్థాయిలో నీటి మట్టాలు యాసంగికి నీరందించేందుకు ప్రణాళికలు వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. గ్రామాల్లో చిన్న నీటివనరుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు చేపట్టడంతో పాటు దేవాదులు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపారు. అలాగే గత సెప్టెంబర్, అక్టోబర్‌లో విస్తారంగా కురి సిన వర్షాలతో నీటి మట్టాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగి తక్కువ లోతులోనే నీరందుతోంది. దీంతో ఈ ఏడాది యాసంగి పంటలకు కావాల్సిన సాగునీరు సరిపడా అందే అవకాశాలున్నాయి. పునర్విభజన ప్రక్రియతో కొత్తగా ఏర్పాటైన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో సుమారు 3 నుంచి 4 మీటర్ల మేరకు భూగర్భ జలాల మట్టం పెరగడంతో నీరు గతేడాది కంటే ఎక్కువగా లభించే అవకాశాలున్నాయి. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గతేడాది, ఇప్పటి భూగర్భ జలాల మట్టాల నమోదును పరిశీలిస్తే కేవలం మీటరు మాత్రమే పెరిగింది. కాగా, జనగామ జిల్లాలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపడంతో ఈ ప్రాంతంలో గణనీయంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఇక్కడ గతేడాది జనవరిలో నమోదైన భూగర్భ జలాలు.. ప్రస్తుతం నమోదైన మట్టాలను పరిశీలిస్తే సుమారు 4.18 మీటర్లు పెరిగాయి. దీంతో జిల్లాలో యాసంగి పంటలను విస్తారంగా పండిం చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 5459 చెరువులు ఉన్నాయి. చెరువుల నిల్వ నీటి సామర్థ్యం 47,177 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు. ప్రసుత్తం 36,013 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చెరువుల కింద 3,47,949 ఎకరాల ఆయకట్టు ఉంది.అందుబాటులో ఉన్న నీటి లభ్యతతో ఖరీఫ్, యాసంగి సీజన్లలో 1,23,033 ఎకరాల్లో సాగు నీరందించేలా చిన్న నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో యాసంగి పంట సాగుకు భరోసా కలుగనుంది. రబీ సీజన్లో 25,200 ఎకరాలకు సాగునీరందించేందుకు నీటి లభ్యత అందుబాటులో ఉందని నీటిపారుదల శాఖ పేర్కొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.57 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 5.66 మీటర్ల లోతునే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.91 మీటర్ల పైనే నీటి లభ్యత ఉంది.వరంగల్ రూరల్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 10.50 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 7.45 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.05 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.45 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 8.76 మీటర్ల లోతులో ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 6.74 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 6.13 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జనగామ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 13.84 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 9.65 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 4.18 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. -
నిర్వహణ గాలికి..
వృథాగా పాలెం, తొర్తి ఎత్తిపోతల పథకాలు రూ. 6.50 కోట్లతో నిర్మించినా నిరుపయోగమే.. వినియోగంలోకి తెస్తే ఆయకట్టు భూములు సాగులోకి.. మోర్తాడ్ : పెద్దవాగులోని భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా పాలెం, తొర్తిలలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. పాలెం ఎత్తిపోతల పథకానికి రూ. 3 కోట్లు, తొర్తి ఎత్తిపోతల పథకానికి రూ. 3.50 కోట్లను కేటాయించి నిర్మించారు. ఎనిమిదేళ్ల కింద ఈ రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. పెద్దవాగులో బావులు తవ్వించి అందులోకి వచ్చిన ఊట జలాలను పంపుసెట్ల ద్వారా చెరువుల్లోకి తరలించి చెరువులను నింపడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. ఈ రెండు పథకాలను ఒకేసారి చేపట్టి పూర్తి చేశారు. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో చెరువులను సమృద్ధిగా నింపారు. అయితే రైతులకు స్వాధీనం చేసి రైతులతో కమిటీ ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు ఎత్తిపోతల పథకాలను నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీటిని రైతులు నిర్వహించుకున్నా అధికారులు అజమాయిషీ చేయాల్సి ఉంది. కానీ నాసిరకంగా ఉన్న పంపుసెట్లను అమర్చడంతో ఎత్తిపోతల నీరు ఒకటే సంవత్సరం అందింది. వాగు ప్రవహించినప్పుడు బావుల్లోకి ఎక్కువ మొత్తంలో నీరు చేరి పంపుసెట్లు చెడిపోయాయి. కంపెనీలు గ్యారెంటీ ఇచ్చినా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పంపుసెట్లు పనికి రాకుండా పోయాయి. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేక సబ్స్టేషన్లను సైతం నిర్మించారు. ఎత్తిపోతల అధికారులు పట్టించుకోకపోవడం, రైతుల కమిటీలు కూడా పనిచేయకపోవడంతో రెండు ఎత్తిపోతల పథకాలు వృథాగా మారాయి. వినియోగంలోకి వస్తే సాగులో భూములు తొర్తి, పాలెం ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తే చెరువులు నిండడం వల్ల రెండు గ్రామాల్లోని 800 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. అలాగే బోరుబావుల కింద ఉన్న దాదాపు 2,500 ఎకరాల భూములకు పరోక్షంగా సాగునీరు లభ్యమవుతుంది. చెరువులు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెంది బోరుబావులకు సమృద్ధిగా నీరందుతుంది. అలాగే వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపుసెట్లు బాగు చేయించి చెరువులకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ప్రమాద ఘంటికలు!
నిజామాబాద్ : గణనీయంగా పెరిగిన భూగర్భ నీటిమట్టం తగ్గుదల షురువైంది. ఆయా ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ నీటి మట్టం పడిపోవడం ప్రారంభమైంది. గత నెల నవంబర్‌తో పోల్చితే కొన్ని మండలాల్లోనైతే తీవ్ర స్థాయిలో పడిపోవడం మళ్లీ ఆందోళనకు దారితీస్తోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పాతాల గంగ పైపైకి వచ్చింది. అంతకు ముందు రెండేళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు 2016 సీజనులో కురిసిన వర్షాలకు భారీగా పెరిగాయి. ఏకంగా జిల్లా సగటున 7.10 మీటర్లకు పెరిగింది. గత నెలాఖరు (2016 డిసెంబర్) వరకు జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా నిజామాబాద్ డివిజన్లో 4.64 మీటర్లు ఉన్నాయి. ఆర్మూర్‌లో 6.57 మీటర్లు, బోధన్‌లో 10.95 మీటర్ల మేరకు నీటి మట్టం ఉంది. అంటే సగటున 7.10 మీటర్లకు పెరిగాయి. 2015 డిసెంబర్ జిల్లా సగటు 21.23 మీటర్లు ఉంది. అంటే 14.13 మీటర్లు పెరిగాయి. తాజాగా జిల్లాలో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరిగింది. దీంతో పెరిగిన భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రారంభమైంది. నిజామాబాద్ మండలం ముప్కాల్‌లో 2016 నవంబర్‌లో 9.88 మీటర్ల మేరకు నీటిమట్టం ఉండగా, డిసెంబర్ 31 నాటికి 11.40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. అంటే ఒక్క నెలలోనే ఒకటిన్నర మీటర్లు పడిపోవడం గమనార్హం. అలాగే జక్రాన్‌పల్లి, వేల్పూర్, బోధన్, రెంజల్లలోనూ 1.5 మీటర్లకు పైగా పడిపోయాయి. భూగర్భ జల శాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 చోట్ల ఫీజో మీటర్లు ఏర్పాటు చేసి.. భూగర్భ జల మట్టాన్ని లెక్కిస్తోంది. వీటిలో ఐదు చోట్ల టెలీమీటర్లున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ టెలీ మీటర్లు ఉపగ్రహంతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు భూగర్భ జలమట్టాన్ని కొలిచే ఈ టెలీమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇలా జిల్లాలో ఐదు చోట్ల టెలీమీటర్లు పనిచేస్తున్నాయి. ఇప్పటికీ ప్రమాద ఘంటికలే.. జిల్లాలో మొత్తం 29 మండలాలు కాగా, ఎనిమిది మండలాల్లో భూగర్భ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో జిల్లా సగటు నీటి మట్టం కంటే భారీగా పడిపోయింది. జిల్లా సగటు 7.10 మీటర్లు కాగా, ఈ ఎనిమిది మండలాల్లో పది మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. మండలాలవారీగా పరిశీలిస్తే.. మాక్లూర్ మండలంలో 10.8 మీటర్లు, కోటగిరిలో 15.60 మీటర్లు, ఎడపల్లిలో 14.20 మీటర్లు, రెంజల్లో 12.03 మీటర్లు, రుద్రూర్లో 14 మీటర్లు, మోర్తాడ్‌లో 12.82 మీటర్లు, వేల్పూర్‌లో 10.50 మీటర్లు, ముప్కాల్‌లో 11.40 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఎనిమిది మండలాల్లో.. భూగర్భ జల శాఖ అధికారులు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద కూడా నీటిమట్టాన్ని ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. ఈ పనులు చేపట్టిన చెరువుల కింద భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖాలేవీ కనిపించడం లేదు. మిషన్ కాకతీయ ఫేజ్–1, ఫేజ్–2 కింద పనులు చేసిన మొత్తం తొమ్మిది చెరువుల కింద నీటి మట్టం వివరాలు అధికారులు సేకరించారు. రెండు నెలల క్రితం 2016 నవంబర్‌లో లెక్కించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ మండలం చేపూర్ చెరువులో మిషన్ కాకతీయ మొదటి విడత కింద పనులు చేపట్టారు. ఈ చెరువు కింద (టీఐఎన్) నీటి మట్టం 5.29 మీటర్లు ఉండగా.. ఇదే గ్రామంలో చెరువు ప్రభావం ఉండని ప్రాంతంలో(ఎన్ఐజెడ్)లో 5.96 మీటర్లు ఉంది. అంటే ఈ చెరువు పనులు చేసినా ఒక్క మీటరు కూడా నీటి మట్టం పెరగలేదని భూగర్భ జలశాఖ నివేదికలే చెబుతున్నాయి. నామమాత్రంగా 0.67 మీటర్లు మాత్రమే పెరిగాయి. మోర్తాడ్ మండలం దొన్కల్ పెద్ద చెరువు కూడా మొదటి విడతలో పనులు చేశారు. ఈ చెరువు కింద నీటిమట్టాన్ని పరిశీలిస్తే.. ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం (టీఐఎన్)లో 10.09 మీటర్ల లోతులో భూగర్భ నీటి మట్టం ఉంది. ఇదే గ్రామ శివారులో ఈ చెరువు ప్రభావితం లేని ప్రాంతంలో మాత్రం 9.76 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని భూగర్భ జలశాఖే నిర్దారించింది. అంటే ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం కంటే ఈ చెరువు ప్రభావం లేని ప్రాంతంలో నీటి మట్టం పైపైకి రావడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు చాలు జిల్లాలో మిషన్‌కాకతీయ పథకం ఏ మేరకు ఫలితాలనిచ్చిందో చెప్పడానికి.. -
29 మండలాల్లో పెరగనే లేదు
20 మీటర్ల దిగువన భూగర్భ జలాలు.. నివేదిక విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వర్షాలకు భూగర్భ జల మట్టాలు పెరిగినా 29 మండలాల్లో మాత్రం 20 మీటర్ల దిగువన లభ్యమవు తున్నారుు. ఇందులో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనే ఐదేసి మండలాల చొప్పున ఉన్నారుు. 10-20 మీటర్ల మధ్య జలాలున్న మండలాలు 101 ఉండగా, వీటిలో మహబూబ్‌నగర్‌లో 14, రంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 10 మండలా లున్నారుు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలపై భూగర్భ జల విభాగం నివేదిక మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 813 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో 23 శాతం అధికంగా 999 మి.మీ. నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. కరీంగనర్, ఆదిలా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ, మిగతా ఆరు జిల్లాలో అధిక వర్ష పాతం నమోదైందని తెలిపింది. హైదరాబా ద్లో 39 శాతం , నిజామాబాద్‌లో 33 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని.. గతేడాది 11.27 మీటర్ల లోతున నీటి లభ్యతద ఉండగా అక్టోబర్‌లో 7.11 మీటర్లకు చేరిందని వివరించింది. -
భూగర్భానికి ఊపిరి
► గత నెలలో సాధారణ వర్షపాతం కన్నా ► 32 శాతం అధికం సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా ప్రతినెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా ఈ సెప్టెంబర్‌లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవిభాగం గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అధికంగా హైదరాబాద్‌లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్‌లో 43, నిజామాబాద్‌లో 42, నల్లగొండలో 37, వరంగల్‌లో 33, మహబూబ్‌నగర్‌లో 24, కరీంనగర్లో 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే సగటున 6.64 మీటర్ల మేర వృద్ధి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆగస్టుతో పోలిస్తే 3.49 మీటర్లు, గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల మేర భూగర్భ మట్టాలు పెరిగాయి. మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి ,నల్లగొండ, హైదరాబాద్‌లో ఆశాజనకంగా భూగర్భజలాలు పెరిగాయి. మెదక్ జిల్లాలో 8.92 మీటర్లు, హైదరాబాద్‌లో 4.19 మీటర్లు, నల్లగొండ జిల్లాలో 5.57 మీటర్ల చొప్పున భూగర్భ జల మట్టాలు పెరిగాయి. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం 0.91 మీటర్ల జలమట్టం తగ్గిపోయింది. రాష్ట్రంలో 65 మండలాల్లో 2 మీటర్లలోనే భూగర్భ జలాలుండగా, 70 మండలాల్లో 2 నుంచి 5 మీటర్లలో నీటి లభ్యత ఉంది. 95 మండలాల్లో 5 నుంచి 10 మీటర్లలోపు, 113 మండలాల్లో 10 నుంచి 20 మీటర్లలోపు, 56 మండలాల్లో 20 మీటర్ల కింద జలాలున్నాయి. ఇందులో మెదక్‌లో 15, మహబూబ్‌నగర్‌లో 14, నల్లగొండలో 11, నిజామాబాద్‌లో 7 మండలాలు ఉన్నాయి. -
ఇసుక రీచ్ ఇచ్చి మా కడుపు కొట్టొద్దు
సుండుపల్లి: ఇసుక రీచ్ ఇచ్చి తమ కడుపు కొట్టొద్దని ప్రజలు అధికారులను వేడుకున్నారు. వైఎన్‌పాలెం గ్రామ పంచాయతీలోని బహుదా నదిలో ఇసుక రీచ్ పరిశీలనకు గనుల శాఖ అధికారులు శుక్రవారం వచ్చారు. దీంతో వైఎన్ పాలెం కుప్పగుట్ట ప్రజలు కుప్పగుట్టపల్లిలో అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుండుపల్లి, రాయవరం ప్రాంతాల్లో రీచ్ ఏర్పాటు చేయడం వల్ల పైప్రాంతమైన కుప్పగుట్ట వైఎన్‌పాలెం, అడవిపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన ఇసుకంతా తరలిపోతుందని తెలిపారు. రోజురోజుకు భూగర్భజలం అడుగంటిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే పైప్రాంతంలో ఝరికోన ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో కింది ప్రాంతాలకు ఇసుక వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వంకల్లో సైతం చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడం వల్ల.. అక్కడి నుంచి ఇసుక రాదని తెలిపారు. కొండ, గుట్ట ప్రాంతాల్లో ట్రంచ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కొద్ది మేర కూడా నదిలోకి రాదని పేర్కొన్నారు. ఇసుక లేకపోతే నదిలో నీరు నిల్వ ఉండదని, బోర్లు అన్నీ ఎండిపోతాయని అన్నారు. ఇప్పటికి బాగానే ఉన్నామని, రీచ్ ఇస్తే తమకు కష్టాలు మొదలైనట్లేనని అన్నారు. ఈ మేరకు వైఎన్‌పాలెం సర్పంచ్ రామునాయక్ ఆధ్వర్యంలో ప్రజలు గనుల శాఖ ఏడీ కొండారెడ్డికి అర్జీ ఇచ్చారు. ఇందులో మహాజన సోషలిస్టు పార్టీ మండలాధ్యక్షుడు వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు నాగరాజ పాల్గొన్నారు. -
లోటు వర్షం...అడుగంటుతున్న జలం
వర్షపాతంలో 6 శాతం లోటు సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్ల కంటే రాష్ట్రంలో వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా... సాధారణ వర్షపాతంతో పోలిస్తే 6 శాతం లోటు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 548 మిల్లీ మీటర్లు వర్షపాతం (సాధారణం 585 మి.మీ.) నమోదైంది. 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కనిపించినా... మెదక్ జిల్లాలో అత్యల్పంగా 25 శాతం లోటు రికార్డయింది. రాష్ట్రంలోని వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై భూగర్భ జల విభాగం శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఆగస్టులో కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనా... అది యథాతథంగా కొనసాగకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని నివేదిక వివరించింది. గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు భారీగా క్షీణించాయని, అది పూడుకోవాలంటే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుందని పేర్కొంది. నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఆగస్టులో సగటు భూగర్భ మట్టం 12.47 మీటర్లు కాగా ప్రస్తుతం 12.32 మీటర్లుగా ఉంది. కొంతలో కొంత మెరుగ్గా ఆగస్టులో కురిసిన వర్షాలకు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భూగర్భ మట్టాల్లో స్వల్పపెరుగుదల కనిపించింది. -
జలగండం!
♦ మెరుగుపడని భూగర్భజలాలు ♦ వర్షాకాలంలోనూ 1.02 మీటర్లు పతనం ♦ సగటున 16.72 మీటర్ల లోతులో జలాలు ♦ గతనెలలో సాధారణ వర్షపాతం నమోదు ♦ అయినా జిల్లాలో పెరగని నీటిమట్టాలు భూగర్భజలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా జలసిరి పూర్తిగా పాతాళంలోకి జారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం భూగర్భజల మట్టాలు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయి. వానాకాలంలో కురుస్తున్న వర్షాలు భూగర్భజలాలను సమతుల్యం చేస్తాయని భావించినప్పటికీ.. తాజాగా భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించిన గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో కంటే ప్రస్తుత నీటిమట్టాలు మరింత పతనం కావడం కలవరపరుస్తోంది. ఏకంగా 1.02 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమై సగటు 16.72 మీటర్లలోతుకు పడిపోయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత సీజన్లో కురిసిన అడపాదడపా వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. గతనెలలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. ఏకంగా 13.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 3.3 సెంటీమీటర్ల వర్షం ఎక్కువగా కురిసింది. అయినా భూగర్భజలాలు మరింత పడిపోయాయి. జూన్ నెలలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. తూర్పు, ఉత్తర ప్రాంతంలో చిన్నపాటి వానలు కురవగా.. తాండూరు, వికారాబాద్, పరిగి డివిజన్లలోని కొన్ని మండలాల్లో కుండపోత వానలు పడ్డాయి. అయితే ఒక్కసారిగా కురిసిన వానలతో వరదలు పెరిగి చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. అయితే భూమిలోకి ఇంకిన నీటి శాతం పెద్దగా లేకపోవ డంతో భూగర్భజల మట్టాలు పైకిరాలేదు. మరోవైపు భూగర్భనీటి వినియోగం తగ్గకపోవడంతో అవి మరింత పతనమై 16.72 మీటర్ల లోతుకు చేరాయి. 30 మీటర్ల లోతులో.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జిల్లాలో నీటిప్రాజెక్టులు లేనందున వర్షాధార పంటలను నమ్ముకుని రైతులు సాగుపనులు చేస్తున్నాయి. అయితే జిల్లా అంతటా వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళన కలిగించే విషయమే. పశ్చిమ ప్రాంతంలో గతనెలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం మెరుగుపడలేదు. పరిగి, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, గండేడ్ మండలాల్లో 30 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ నీటిమట్టాలు నమోదైనట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా దోమ, వికారాబాద్, మర్పల్లి, పెద్దేముల్, యాచారం, మేడ్చల్, మహేశ్వరం, హయత్‌నగర్ మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలున్నాయి. మిగతా గ్రామీణ మండలాల్లో జిల్లా సగటు కంటే ఎక్కువలోతులోనే నీటిమట్టాలు నమోదు కావడం ఆందోళనకరం. -
పాతాళంలోనే ‘గంగ’
♦ పడిపోతున్న భూగర్భ జలాలు ♦ భారీ వర్షాలు కురిస్తేనే పెరిగే అవకాశం ♦ సాగుపై రైతుల్లో ఆందోళన ఒకపక్క వర్షాలు రేపుమాపంటూ ఊరిస్తూ అడపాదడపా ముంచెత్తుతున్నాయి. ఈ అరకొర వానను నమ్ము కుని రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కానీ, మరోపక్క భూగర్భ జలమట్టాలు జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా ఆందోళనకరస్థాయిలో అడుగంటిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో 54.20 మీటర్ల లోతుకు వెళ్తే కానీ.. భూగర్భజలం జాడ దొరకని దుస్థితి.. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో భూగర్భ జలమట్టాలు ఆందోళన కరస్థాయిలో పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవికాలం ఆరంభం నుంచి జిల్లాలో క్రమంగా భూగర్భజలమట్టాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం 25.52 మీటర్ల లోతుకు భూగర్బజలాలు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో 54.20 మీటర్ల మేరకు భూగర్బజలమట్టాలు పడిపోయాయి. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో 7.53 మీటర్ల లోతునే భూగర్భజలాలు ఉన్నాయి. జిల్లాలో జలమట్టాలు పడిపోతుండటంతో తాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతుండటంతో బోరుబావుల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఉంది. దీంతో చాలా గ్రామాల్లో బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది. మరోవైపు వ్యవసాయ బోరుబావుల్లో సైతం భూగర్భజలాలు ఇంకిపోవ టం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రబీలో కరువు, భూగర్భజలాలు పడిపోవటంతో వ్యవసాయ బోరుబావుల కింద రైతులు పెద్దగా పంటలు సాగు చేయలేదు. వరి, కూరగాయల పంటలు సాగుచేసినా నీళ్లులేక వరి పంట ఎండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పంటచేతికి వచ్చినా దిగుబడి సగానికిపడిపోయింది. కూరగాయల పంటల దిగుబడి అంతంతమాత్రంగా నే ఉండటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సివచ్చింది. దీంతో రైతులు ఖరీఫ్‌పై ఆశలు పెట్టు కున్నారు. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో ఖరీఫ్ సాగు ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. తద్వారా బోరుబావుల కింద రైతులు పంటలు సాగు చేసుకునేందుకు వీలవుతుంది. భారీ వర్షాలు కురిసి భూగర్భ జలమట్టాలు పెరగాలని రైతులు కోరుకుంటున్నారు. పడిపోతున్న భూగర్భ జలాలు... వర్షాభావానికితోడు భూగర్భ జలాలు అవసరానికి మించి తోడుకోవటంతో జిల్లాలో భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 25.52 మీటర్ల లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో భూగర్భ జలమట్టాలు 21.71 మీటర్ల మేర ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 3.81 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. రాయికోడ్ మండలంలో అత్యధికంగా 44.39 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు చేరుకున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 30.25 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోగా మెదక్ నియోజకవర్గంలో 19.39 మీటర్ల మేర జలాలు ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో 28.37, అందోలులో 27.91, సంగారెడ్డిలో 16.45, పటాన్చెరులో 26.23, జహీరాబాద్‌లో 24.33, సిద్దిపేటలో 24.18, గజ్వేల్‌లో 23.43 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే భూగర్భజలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, కుంటల్లో పెద్దఎత్తున పూడికతీత పనులు సాగుతున్నాయి. వర్షాలు బాగా కురిసిన పక్షంలో భూగర్భ జలాలు వచ్చే మాసం నాటికి పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఎర్రనేలలు ఉండటానికి తోడు భూగర్భంలోని శిలాజలాలు నీటిని వేగంగా ఇంకించుకునేందుకు వీలుగా ఉన్నాయని దీంతో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని జియాలజిస్టులు చెబుతున్నారు. భూగర్భ జలమట్టాలు పెరిగిన పక్షంలో ఖరీఫ్‌లో బోరుబావుల కింద పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అయితే బోరుబావుల కింద రైతులు వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే మేలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
భూగర్భజలాలను కాపాడండి
► భావితరాల కోసం నీటిని సంరక్షించండి ► సుదర్శన్, రిటైర్డు రీజినల్ డెరైక్టర్ సీజీడబ్ల్యూబీ హుస్నాబాద్‌రూరల్ : ‘భూగర్భజలాలు కాపాడండి.. భావితరాలకు నీటిని సంరక్షించండి.. చినుకు చినుకు కలిస్తే చెరువు నిండునే.. చెరువు కళకళలాడితే బావులు నిండునే.. ’ అనే నినాదంతో కేంద్ర భూగర్భ జలబోర్డు దక్షణ క్షేత్రం హైదరాబాద్ వారు నీటి పొదుపు భూగర్భజలాల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అతి నీటి వినియోగం, భూగర్భజల సమస్యలు, భాగస్వామ్య పద్ధతులపై వివరిస్తున్నారు. మొదటి రోజు సదస్సును కేంద్ర భూగర్భజల బోర్డు సీనియర్ శాస్త్రవేత్త పి.నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర భూగర్భజల బోర్డు రిటైర్డు రీజినల్ డెరైక్టర్ జి.సుదర్శన్ వర్షపు నీరు పొదుపు పై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో అతిగా బోర్లు, బావుల ద్వారా నీటి వినియోగం జరుగుతోందని, ఫలితంగా 20 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడుగుంతలు, నీటికుంటలు, కాంటూర్ కందకాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచిం చారు. పంటలకు అతిగా నీటిని వినియోగిస్తున్నారని, అలాకాకుండా మైక్రోఇరిగేషన్ వైపు దృష్టి సారించాలని సూచించారు. బిందు, తుంపుర సేద్యం ద్వారా సాగు చేస్తే నీరు పొదుపు అవుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు వృథా నీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి, హరికుమార్ ఏడీఏ మహేష్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సుభాష్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్డి లేకుంటే రేషన్ కట్
ఆత్మకూరురూరల్: స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, లేని పక్షంలో లబ్ధిదారుల రేషన్ నిలిపివే పరిస్థితులు వస్తాయని ఎంపీడీఓ నిర్మలాదేవి అన్నారు. మండల సమావేశ భవనంలో బుధవారం సర్పంచ్, కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారిగా మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలు నిర్దేశించినట్లు కార్యదర్శులు కృషి చేసి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోనే ఆత్మకూరు మండలాన్ని నెలాఖరులోపు 100 శాతం నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. హెక్టారుకు ఒక ఫాంఫాండ్ నిర్మించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీధిదీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛభారత్, భూగర్భ జలాల అభివృద్ధి పథకాల అమలుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. సహకరించకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా వ్యక్తులకు నిలిపివేసే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, ఉపాధి ఏపీఓ మురళీధర్, సర్పంచులు రఘురామిరెడ్డి, మంతు యానాదిరెడ్డి, వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు. -
బోరు రీచార్జి గుంతలు అభినందనీయం
► కలెక్టర్ నీతూప్రసాద్ ► భూగర్భ జలాల పెంపునకు కృషి చేయూలి ► నాబార్డు వాటర్ షెడ్డ్ పనులు పరిశీలన హుస్నాబాద్‌రూరల్: వర్షపు నీరు వృథా పోకుండా భూమిలోకి మళ్లించి భూగర్భజలాల పెంపునకు కృషి చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట పంచాయతీ పరిధిలోని నాబార్డు సహకారంతో సతతహరిత, సహాయ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్డు పథకం పనులను శుక్రవారం పరిశీలించారు. గొల్లకుంటలో సహాయ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడుతున్న బోరువెల్ రీచార్జి గుంతల గురించి నాబార్డు ఏజీఎం రవిబాబు కలెక్టర్‌కు వివరించారు. రైతు శ్రీనివాస్‌ను మాట్లాడుతూ బోరు రీచార్జి గుంత తవ్వడం ద్వారా వర్షంపడ్డ తర్వాత అదనంగా 20 నిమిషాలు నీళ్లు పోసిందని చెప్పారు. వ్యవసాయభూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు. నీటికుంటల్లో నీరు ఉంటే సమీపంలోని అరకిలోమీటర్ వరకు భూమిలో తేమ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 3 వేల వరకు నీటికుంటలు మంజూరు చేసినట్లు చెప్పారు. పత్తికి ప్రత్యామ్నాయం సాగు చేయూలి పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, మొక్కజొన్న, సోయూబీన్ సాగు చేసేలా చూడాలని ఎన్జీవోలను కోరారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనాల గురించి వివరించాలన్నారు. జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ మెట్ట ప్రాంతమని, 700 ఫీట్ల వరకు బోర్లు వేసిన చుక్క నీరు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీపీ భూక్య మంగ మాట్లాడుతు అక్కన్నపేటను మండలం చేయాలని కోరారు. అనంతరం రూ.25లక్షల రుణమంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సర్పంచ్ జాగిరి వసంత, టీజీబీ ఆర్ఎం రవీందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్, ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జి.రాంరెడ్డి,తహసీల్దార్ టి.వాణి, వ్యవసాయశాఖ ఏడీఏ మహేశ్, పశువైద్యులు విజయ్‌భార్గవ్, ఏవో శ్రీనివాస్, ఎంపీటీసీ బండి సమ్మయ్య, వాటర్‌షెడ్డు పథకం చైర్మన్ సూరం సమ్మిరెడ్డి, కట్కూర్ సర్పంచ్ రాంచంద్రం, భీమదేవరపల్లి వైస్ ఎంపీపీ మనోహర, సహాయ ఎన్జీవో సీఈవో రాజ్కమాల్రెడ్డి,జనవికాస ఎన్ జీవో అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌రావు, సంపత్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు కర్ణకంటి శ్రీశైలం, కంది రాంరెడ్డి పాల్గొన్నారు. -
తమ్ముళ్లకు తవ్వుకున్నంత!
► పూడిక తీత పనులన్నీ టీడీపీ కార్యకర్తలకే ► ఒకే చెరువులో రెండు, మూడు పనులుగా విభజన ► నామినేషన్ పేరుతో పనులు కట్టబెడుతున్న అధికారులు ► ఉపాధి పనులకు మెరుగులద్ది బిల్లులు చేసుకునే ప్రయత్నం కర్నూలు సిటీ: చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచి భూగర్భ జలాలు వృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమం అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. ఒకే చెరువులో రెండు, మూడ రకాలుగా పనులను విభజించి అంచనాలు వేసి నామినేషన్లపై టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారు. మొదట్లో పూడికతీతతో పాటు చెరువుల బండ్‌ను బలోపేతం చేసి, తూములకు మరమ్మతులు చేసేందుకు అంచనాలు వేసి టెండర్ల ద్వారా పనులు చేయించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే అధికార పార్టీ నేతలు సీఎం, జల వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకపోయి కలెక్టర్ నిర్ణయాలను రద్దు చేయించారు. ఆ తరువాత ఒకే చెరువులో పనులను విభజించి వర్గాల వారీగా తెలుగు తమ్ముళ్లు పంచుకుంటున్నారు. చెరువుల్లో నీరు వచ్చేందుకు ఫీడర్ చానల్స్, పంట కాల్వలు, వాగులు, వంకలు, కుంటల్లో పూడికతీతకు తీసేందుకు వేరువేరుగా అంచనాలు వేసి పనులు పంచుకున్నారు. ఫీడర్ చానల్స్‌కు, వాగులు, వంకలు చెరువుల్లో పూడికతీత పనులు చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. వాగులు, ఫీడర్ చానల్స్‌కు గతంలో ఉపాధి కూలీలకు చేసిన పనులకే పైపై మెరుగులు దిద్దుతూ బిల్లులు చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడ వేశారు. పనుల విభజన ఇలా.. జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 51,265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది మొత్తం 584 చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని లక్ష్యం. అయితే పనులు మాత్రమే ఈ నెల 21వ తేదీ వరకు 426 పనులు ప్రారంభం అయ్యాయి. వీటితో పాటు వాగులు, వంకలు, కుంటలు, ఫీడర్ చానల్స్లన్నీ కలిపి 968 పనులకు అంచనాలు వేశారు. వీటిలో 421 పనులు మొదలు అయ్యాయి. ఈ పనులకు చెరువుల్లో పూడికతీత కంటే క్యూబిక్ మీటర్ మట్టి రేట్లు అధికంగా ఇస్తుండడంతో పనులు చేసేందుకు తెలుగు తముళ్లు పోటీ పడుతున్నారు. ఉపాధి కూలీలు చేసిన పనులకే అంచనాలు నీరు-చెట్టు కింద చెరువు పూడికతీత పనులకు గతేడాది చేసిన పనులకే అంచనాలు వేస్తున్నారు. ఇందుకు సాక్ష్యం కల్లూరు మండలంలోని ఉలిందకొండ సమీపంలోని పులికుంట, మోత్కమాడ, బొంగటయ్య వంకలు, వడ్డెర కుంటలలో పూడికతీతకు 9.8 లక్షలతో అంచనాలు వేసి పనులు చేసినట్లు కంప చెట్లు తొలగించారు. పైపై మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రతి మండలంలో ఇలాంటి అక్రమాలే చోటు చేసుకుంటున్నాయి. పనులు చేపట్టింది అధికార పార్టీ నేతలే కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేక పోతున్నారు. తాజాగా జిల్లాలోని చెక్ డ్యాంల్లో కూడా పూడికతీత పనులు చేసేందుకు ప్రభుత్వం జల వనరుల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు జరుగుతున్న విషయంపై జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. చంద్రశేఖర్ రావును వివరణ కోరగా.. పనులను పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
మేలు చేసిన ‘రోను’
తగ్గిన వేసవి తాపం ఖరీఫ్‌కు చిగురిస్తున్న ఆశలు నదుల్లో చేరిన వర్షపునీరు భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం విశాఖపట్నం: రోను తుఫాన్ విశాఖకు మేలు చేసింది. రెండు నెలలుగా నిప్పుల సెగలతో, చుక్క నీటి కోసం అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చింది. వేసవి తాపాన్ని ఒక్కసారిగా తగ్గించింది. వాతావరణాన్ని అనూహ్యంగా చల్లబరిచింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడినప్పట్నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయుగుండం బలపడ్డాక బుధ, గురువారాల్లో విశాఖలోను, జిల్లాలోను కుంభవృష్టి కురిసింది. ఏజెన్సీ లోనూ చెప్పుకోదగిన స్థాయిలో వర్షం పడింది. అనూహ్యంగా ఏర్పడిన తుఫాన్‌తో కురిసిన వానలకు రైతన్నల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిన్నటిదాకా బీళ్లు వారిన భూముల్లో ఇప్పుడు నీళ్లు చేరడంతో సంబరపడుతున్నారు. ఇన్నాళ్లూ పాతాళంలోకి పోయిన భూగర్భ జలాలు ఈ వానలకు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాయి. దీంతో చెరువులు, బోర్లు, బావుల్లోనూ జలాలు ఊరుతున్నాయి. ఫలితంగా ఒకింత మంచినీటి ఎద్దడి తీరనుంది. జలాశయాల్లో నీటి నిల్వలు నిలదొక్కుకుంటున్నాయి. చావుబతుకుల్లో ఉన్న చెరకు, కూరగాయలతో పాటు ఇతర మెట్టుపంటలకు వర్షాలు ప్రాణం పోశాయి. మరోవైపు అన్నదాతలు వేసవి దుక్కులతో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఆ తర్వాత మొక్కజొన్న, వేరుశనగ, సజ్జలు (గంటెలు) చోళ్లు (రాగులు), సామలు వంటి పంటలకు, కొన్నిచోట్ల కందులు, మినుములు, పెసలు వంటి అపరాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నిటి కీ మించి రోనో తుఫాన్ పెనుగాలులు, ఈదురుగాలులకు ఆస్కారం లేకుండా భారీ వర్షానికే పరిమితమవడం అన్ని వర్గాల వారికి ఊరటనిచ్చింది. గతంలో వాయుగుండం ఏర్పడగానే వాటికంటే ముందే పెనుగాలులు హోరెత్తేవి. ఈసారి మాత్రం తుఫాన్‌గా మారినా గాలుల్లేకుండానే వర్షం కురిపించి ఒడిశా వైపు వెళ్లిపోయింది. దీంతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా అన్ని వర్గాలకూ ఊరటనిచ్చింది. అంతేకాదు.. తీవ్ర ఎండలు రెండు నెలల పాటు కొనసాగాయి. ఎండల ధాటికి భూమి బాగా ఆరిపోయి ఉంది. ఈ నేపథ్యంలో రోను తుఫాన్ వర్షానికి కురిసిన భారీ వర్షం ఎక్కడికక్కడే ఇంకిపోయింది. ఇదే వర్షం వానాకాలంలో కురిసినట్టయితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయేవి. ఇలా అన్ని విధాలా రోను తుఫాన్ విశాఖకు మేలు చేసింది. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న జనం
కొరివిపల్లి(శింగనమల): మండలంలోని ఉల్లికల్లు ఇసుక రీచు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20 ట్రాక్టర్లను కొరివిపల్లి గ్రామస్తులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం గ్రామం లో ఉద్రిక్తత నెలకొంది. ఉల్లికల్లు ఇసుక రీచులో 65 వేల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి భూగర్భజల, మైనింగ్ అధికారులు గుర్తించి నా అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులు సమాచారహక్కు చట్టం ద్వారా తెలుసుకున్నారు. అనుమతి లేకున్నా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకోగా ట్రాక్టర్ల యజమానులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారంటూ పోలీసులు ముగ్గురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొరివిపల్లి గ్రామస్తులంతా శింగనమల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఐతో తమ బాధను చెప్పుకున్నారు. సమస్యకు ఎలాగొలా పరిష్కారం చూపించాలన్నారు. -
కందకాలు తవ్వుదాం.. కదలిరండి
► జల సిరుల కోసం ‘సాక్షి’ ఉద్యమం ► రేపు మదనపల్లె, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు సదస్సులు ► నిపుణులు, అనుభవజ్ఞుల ద్వారా సూచనలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయ క్షేత్రాల్లో జల సిరుల సంరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైతులను సమీకరించి వర్షపు నీటి పరిరక్షణకు దోహదపడే కందకాల తవ్వకాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగిం చి ఆ దిశగా అన్నదాతలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు అవగాహన సదస్సులను నిర్వహించనుంది. వర్షపునీటి సంరక్షణలో అనుభవజ్ఞులు, రిటైర్డ్ ఇంజినీర్లతో రైతులకు తగిన సూచనలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. చిత్తూరు జిల్లాలో సాగు యోగ్యమైన భూమి 7,12,093 ఎకరాలు ఉంది. ఇందులో నీటిపారుద ల సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 6,35,163 ఎకరా లు. చెరువుల, బోర్లకింద సాగయ్యే పొలాలే ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా సాలీనా సగ టు వర్షపాతం 934 మి.మీ. వర్షం రూపేణా కురిసే నీరు 49515 హెక్టారు మీటర్లు కాగా, ఇందులో 40 శాతం నీరు ఆవిరై పోతుంది. ఏటా భూమిలో ఇంకే నీరు మాత్రం 5447 హెక్టారు మీటర్లేనని జల వనరులు, భూగర్భ జల శాఖల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో పడమర మండలాలైన మదనపల్లి, తంబళ్లపల్లి ప్రాంతాల్లో టమాట ఇతరత్రా వాణిజ్య, కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. సరైననీటి సదుపాయం లేక, భూగర్భ జలాలు అందుబాటులో లేక రైతులు విలవిల్లాడుతున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతాలకు సాగునీటి సదుపాయం లభించే వీలుంది. ఈ నేపథ్యంలో దిగాలుపడ్డ రైతున్నల్లో భరోసా నింపి అధిక దిగుబడుల సాధన దిశగా వీరిని ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. జిల్లాలు, మండలాలవారీగా రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చేను కింద కందకాల ఆవశ్యకతను వివరిస్తోంది. ముందుకొచ్చిన రైతులకు దగ్గరుండి కందకాల తవ్వకంలో సహకారం అందించనుంది. -
బీడు భూములుగా పంటపొలాలు
► ఇసుకరీచ్లతో ఇంకిపోయిన భూగర్భ జలాలు ► ఆందోళ నలో స్వర్ణవుుఖి నది పరివాహక రైతులు ► ఖరీఫ్ సాగుకు క్రాప్‌హాలిడే శ్రీకాళహస్తి మండలంలోని సుమారు 14 గ్రామాల రైతులు స్వర్ణముఖి నదిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. నదిలో పది నుంచి 20 అడు గుల వరకు బావులు తవ్వుకుని వచ్చే నీటితో పంటలు పండించుకుంటు న్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నదిలో ఇసుక రీచులను ఏర్పాటు చేసింది. దీంతో ఇష్టానుసారం ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు ఇంకిపో యాయి. తద్వారా రైతులు తవ్వుకున్న బావులు ఎండిపో యాయి. ఈ క్రమంలో పంటలు పండించుకునే వీలు లేక రైతన్నలు ఖరీఫ్‌కు క్రాఫ్ హాలిడే ప్రకటించి భూములను బీడుగా పెట్టారు. శ్రీకాళహస్తి రూరల్:మండలంలో ఎగువవీధి, తొండవునాడు, వెంకటాపురం, సుబ్బానాయుుడుకండ్రిగ, రావులింగాపురం, పుల్లారెడ్డికండ్రిగ, అవ్ముపాళెం, చుక్కలనిడిగల్లు, వేడాం, రావూపురం, అబ్బాబట్లపల్లి, మిట్టకండ్రిగ గ్రావూల సమీపంలో స్వర్ణవుుఖి నది ప్రవహిస్తోంది. ఈ గ్రావూల రైతులు స్వర్ణవుుఖి నదిలో బావులు తవ్వి సిమెంట్ ఒరలు ఏర్పాటు చేసుకుని అందులోని నీటితో పంటలు సాగుచేసుకుంటున్నారు. స్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల నుంచి ఇసుక తరలింపును రైతులు అడ్డుకునే వారు. ఇప్పుడు ఇసుక రవాణాకు ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. దీనికితోడు ఇక్కడి ఇసుకకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వుంచి డివూండ్ ఉండడంతో అధికార పార్టీ నాయుకులు ప్రభుత్వ పనుల పేరుతో అనువుతులు తీసుకుని సుదూర ప్రాంతాల్లో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు సొవుు్మ చేసుకుంటున్నారు. కళావిహీనంగా స్వర్ణముఖి ఇసుక మొత్తం తరలిపోవడంతో స్వరముఖి కళావిహీనంగా తయూరైంది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోరుు వ్యవసాయుం చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్వస్తి చెప్పకపోతే ఆత్మహత్యలే శరణ్యవుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయుం వల్ల నదిలో ఇసుకను మొత్తం తీసుకెళ్లారు. భూగర్భ జలాలు అడుగంటిపోయూరుు. ఖరీఫ్ సాగు లేకపోరుునా ఇబ్బంది లేదు. కనీసం రబీలో కూడా పంటలు సాగుచేసుకోలేని దుస్థతి ఏర్పడుతోంది. రైతులు పడుతున్న అవస్థలు ప్రభుత్వం అర్థం చేసుకుని ఇసుక రవాణాను అరికట్టాలి. - చంద్రారెడ్డి, రైతు, అమ్మాపాళెం ఎడారిని తలపించనున్న స్వర్ణముఖి గతంలో స్వర్ణవుుఖినది నిండుగా ఇసుకతో కళకలలాడేది. అక్రవు ఇసుక రవాణాదారుల పుణ్యవూ అంటూ, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయుం వల్ల స్వర్ణవుుఖినది ఎడారిలా తయూరై కళాహీనంగా వూరింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్వర్ణవుుఖినదిలో ఇసుకను కాపాడాలి. మునిరత్నం, సర్పంచి, వేడాం -
కరువు నివారణకు కార్యాచరణ
► ఐదుగురు మంత్రులతో కమిటీ ► అధికారులతో మంత్రి రవీంద్ర సమీక్ష సాక్షి,విశాఖపట్నం: రాష్ర్టం శాశ్వత కరువు నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్టు రాష్ర్ట బీసీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.రవీంద్ర అన్నారు. శాశ్వత కరువు నివారణకు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోకరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లాకు ఇన్చార్జిగా వచ్చిన మంత్రి సమీక్షించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపునకు కృషిచేయాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరువు నివారణ పై చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను మంత్రికి జిల్లాకలెక్టర్ ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిం చారు. జిల్లాకు కరువు నివారణకు రూ.3కోట్లు కేటాయించిందన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలో 1470 చలివేంద్రా లు, రాష్ర్టప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో 204 మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హేబిటేషన్ వారీగా గొట్టపుబావుల మరమ్మతులు, కావాల్సిన చోట బోరు బావులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఎంహెచ్‌వో ద్వారా జిల్లాలో 8268 ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా కేం ద్రాలు ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రాల్లో వైద్య రోగ్య సిబ్బంది ద్వారా 2,40,415 ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. 3991 వైద్య అవగాహన శిబిరాలు చేసి చేసి వడగాడ్పులు, వేసవి ఎద్దడిలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఖరీఫ్‌లో పంటలకు నీటిసరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 40వేల హెక్టార్లలో కాఫీ పంటపండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్-1,2ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ వివరించారు.భూగర్భ జలమట్టా లు సాధారణ, క్లిష్ట, ఆందోళనకరంగా నమోదైన వివరాలను గ్రౌండ్ వాటర్ డీడీ శాస్త్రి వివరించారు. డ్రాట్ కంటింజెంట్ యాక్షన్‌ప్లాన్, క్రాష్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులు, స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగాం తదితర పథకాల గురించి వివరించారు. అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కరువు నివారణకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో సభ్యుడిగా విశాఖలో కరువు పరిస్థితిని అంచనా వేసేందుకు వచ్చానన్నారు. వేసవి ఎద్దడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగ పూడి రామకృష్ణబాబు, కాపు కార్పొరేషన్ డెరైక్టర్ వై.వేణుగోపాలరావు, డీఆర్ వో చంద్రశేఖర రెడ్డి, డ్వామాపీడీ శ్రీరాములునాయుడు, ఆర్డీవోలు వెంకటేశ్వలరావు, పద్మావతి డీఎంహెచ్‌వో జె.సరోజని పాల్గొన్నారు. -
భూగర్భ జలాల పెంపే లక్ష్యం
శ్రీకాళహస్తి : భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్థాని క ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక శివం కల్యాణ వుండపం లో నీటి సంరక్షణ-నీటి యుజవూన్యం అనే అంశంపై శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 11వుండలాల ఎంపీడీవోలతో పాటు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మా ట్లాడుతూ వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఇంకుడుగుంతల కార్యక్రవూన్ని చేపట్టామని తెలిపారు. గతేడాది రూ.110 కోట్లతో జిల్లాలో 247 కిలోమీట ర్ల మేర సిమెంట్ రోడ్లు వేశామని చెప్పా రు. వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు, పలువురు టీడీపీ నేతలు, జెడ్పీసీఈవో పెంచల కిషోర్, డ్వావూ పీడీ వేణుగోపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ డీపీఎం ప్రభాకర్‌రావు, ఇరిగేషన్ ఎస్ఈ రావుకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి వేణు పాల్గొన్నారు. -
వాల్టా.. ఇక్కడ ఉల్టా
గాజువాక : నగరంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తోసిరాజని సాగుతున్న ఈ వ్యాపారం పట్ల సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే నగరానికి నీటి లభ్యత తగ్గిపోయి జనం దాహం కేకలు వేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క వ్యాపారులు సబ్ మెర్సిబుల్ పంపులతో భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నగరంలో వేల బోర్లు పనిచేయకుండా మూలకు చేరిపోయాయి. ఇంకోపక్క ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ పేరుతో మరికొంతమంది వ్యాపారులు, సర్వీసింగ్ సెంటర్ల పేరుతో మరికొంతమంది భూ గర్భ జలాలను హరించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టాలను అమలు చేసి జల సంరక్షణకు నడుం బిగించాల్సిన యంత్రాంగం కిమ్మనకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది. విచ్చలవిడిగా నీటి అమ్మకం...: నగరంలో భూగర్భ జలాలతో విచ్చలవిడి వ్యాపారం సాగుతోంది. ప్రైవేట్ నీటి హ్యాకర్ల సంఖ్య నగరం మొత్తంమీద వందల్లో ఉన్నట్టు చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, అగనంపూడి, ఆటోనగర్, చినగంట్యాడ, మింది రామ్‌నగర్, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులకు నీటి అమ్మకమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఆరు, ఎనిమిది అంగుళాల బోర్లను తవ్వించి భూగర్భ జలాలను సబ్ మెర్సిబుల్ పంపులతో తోడేస్తున్నారు. కొంతమంది రోజుకు 20 వేల కిలో లీటర్ల సామర్థ్యంగల సుమారు 150 ట్యాంకర్ల నీటిని తోడి అమ్మేస్తున్నారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యక్తిగత బోర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. అర్బన్ ప్రాంతంలో సుమారు 35 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వాటికి తోడు ఇటీవల కాలంలో మినరల్ వాటర్ పేరుతో వీధికొకటి వెలసిన విషయం తెలిసిందే. ఫర్మ్ రిజిస్ట్రేషన్ విభాగం వద్ద నమోదు చేయించుకొని నెలకొల్పినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని పలు సందర్భాల్లో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. వాల్టా చట్టం ప్రకారం...: వాల్టా చట్టం ప్రకారం ప్రైైవేట్ నీటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరు. ఎవరైనా నీటి వ్యాపారానికి పాల్పడితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అధికారులకు అన్ని అధికారాలూ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా మూసేయాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి జిల్లాలో ఉన్న పలు మినరల్ వాటర్ ప్లాంట్లను మూయించాలంటూ ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయడానికి కూడా జీవీఎంసీ అధికారులకు తీరిక లేకుండా పోయింది. నీటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులు హాకర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ప్రజలకు బాసటగా ‘సాక్షి’
► లింగంపల్లి దళితకాలనీలో ట్యాంకర్లతో నీటి సరఫరా ప్రారంభం ► ముందుకొచ్చిన దాత ముక్కెర తిరుపతిరెడ్డి ► వేసవి కాలం ముగిసే వరకూ కొనసాగింపు.. జనగామ : జిల్లాలో కరువుకు కేరాఫ్‌గా మారిన జనగామ నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఈ సమస్య తీర్చాలని ‘సాక్షి’ సంకల్పించింది. సేవా దృక్పథం గల దాతలను సంప్రదించింది. బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త, టీఆర్ఎస్ నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి సహకారం కోరింది. ఆయన సరేననడంతో లింగంపల్లి గ్రామంలోని దళిత కాలనీ నుంచి తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. పది వార్డులు.. సుమారు 3500 జనాభా ఉన్న లింగంపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ రోజుకు 5,500 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌తో వేసవి కాలం పూర్తయ్యే వరకు తాగునీరందిస్తానని తిరుపతిరెడ్డి చెప్పారు. అల్లాడుతున్న లింగంపల్లి లింగంపల్లి గ్రామంలో దళితవాడలో 80 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కాలనీలో మూడు బోర్లు వేసినా, భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోవడంతో సరిపడా నీరు రావడం లేదు. వీధినల్లా గంటకోసారి రెండు మూడు నిమిషాలు వచ్చి ఆగిపోతోంది. ఇలా నీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. వృద్ధులు, పిల్లలు మంచినీటి కోసం ఎండలో ఉంటూ వడదెబ్బకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు సాక్షి ప్రత్యేక చొరవ చూపగా, ముక్కెర తిరుపతిరెడ్డి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు కిష్టయ్య, వార్డుసభ్యులు బండి వరలక్ష్మి నర్సింహులు, ఎం.కమలాకర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దొంతుల మహేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఇమ్మడి సంతోష్, బి.మధు, కొత్తపల్లి రాము, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ క్రిష్ణగోవింద్, వరంగల్ పశ్చిమ ఇంచార్జి కె.క్రిష్ణకుమార్, జనగామ ఆర్సీ ఇంచార్జి కొత్తపల్లి కిర ణ్‌కుమార్, బచ్చన్నపేట రిపోర్టర్ బిక్షపతి పాల్గొన్నారు. గొంతెండుతున్న ప్రజల దాహార్తి తీరుస్తా వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వేసవి ముగిసేందత వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలని ‘సాక్షి’ దినపత్రిక వారు నన్ను సంప్రదించారు. దీంతో లింగంపల్లి గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టాం. తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో ఇది కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది. - ముక్కెర తిరుపతిరెడ్డి -
భూగర్భ జలాలు అడుగంటాయ్
ఏలూరు (మెట్రో) : పశ్చిమగోదావరి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రైతు భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా పెదవేగి మండలం ముండూరులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పోలవరం కుడికాలువ మీదుగా ఉన్న మార్గంపై ప్రయాణించి సుమారు 25 కిలోమీటర్ల మేర సాగుతున్న పనులను పరిశీంచారు. గుండేరు, జానంపేట అక్విడెక్ట్ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంలో వంగూరులో ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి చర్చాగోష్టిలో మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జాలాలు 19.3 మీటర్ల లోతుకు వెళ్లాయని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. అనంతపురం జిల్లాతో సమానంగా పశ్చిమలోనూ నీటి ఎద్దడి తలెత్తనుందన్నారు. మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్ సాగులో ఉందని, దీనికి నీటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వరి, కొబ్బరి, మొక్కజొన్న వంటి పంటలతోపాటు ఆక్వా సాగు కూడా ఎక్కువగానే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటల కోసమే కాకుండా.. నీటి వనరుల పొదుపుపైనా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో నీటి సమస్య తలెత్తుతోందని చెబుతూనే.. గోదావరి జలాలతోపాటు రామిలేరు, తమ్మిలేరు జలాలను కూడా కృష్ణా జిల్లాకు తరలిస్తామని చెప్పుకొచ్చారు. గత ఏడాది నీరు-చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించారని, ఏ ఏడాది కూడా కాలువలు, చెరువలు పూడికతీత పనులకు ఎన్ని యంత్రాలైనా ఉపయోగిస్తామన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులను ఆదుకుంటామని, ఇందుకోసం కేంద్రంతో చర్చించామని చంద్రబాబు చెప్పారు. భూసేకరణే అసలు సమస్య జిల్లాలో అభివృద్ధి పనులకు భూసేకరణ సమస్య అడ్డంకిగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ దృష్ట్యా దూబచర్ల వద్ద అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇది విజయవంతం అయితే జిల్లాకు మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్, కుడికాలువ నిర్మాణాలు పూర్తయ్యేందుకు 20, 30సార్లైనా పర్యటిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, ఆరిమిల్లి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, గన్ని వీరాంజనేయులు, పులపర్తి రామాంజనేయులు, కలువపూడి శివ, అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కలెక్టర్ కాటంనేని భాస్కర్, మేయర్ షేక్ నూర్జహాన్ ఉన్నారు. -
మూడోజోన్‌కు అందని సాగర్ జలాలు
► పడిపోతున్న భూగర్భజల మట్టం ► తాగునీటికీ తప్పని కటకట ► చోద్యం చూస్తున్న మంత్రి, అధికారులు నూజివీడు రూరల్: జిల్లాలోని మూడో జోన్ పరిధిలోని రైతులకు సాగర్ జలాలు అందని ద్రాక్షగా మారాయి. పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎన్నెస్పీ కాలువల్లో సాగర్ జలాలు సవ్వడులు చేస్తున్నా జిల్లాలోని మూడో జోన్‌కు మాత్రం రావడం లేదు. దీంతో మూడో జోన్‌లోని ప్రజలకు మంచినీటికి పాట్లు తప్పడం లేదు. సాగర్ జలాల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కాలువ కట్టలపైన, ఎన్నెస్పీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సాగర్ జలాలను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు పెదవివిరుస్తున్నారు. మూడోజోన్‌కు నవంబరు 15 నుంచి మార్చి 15వరకు సాగర్‌జలాలను విడుదల చేయాల్సి ఉంది. జిల్లాలోని మూడోజోన్ పరిధిలోని నూజివీడు , మైలవరం బ్రాంచి కాలువల పరిధిలో అనేక మేజర్లు, మైనర్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, నూజివీడు, రెడ్డిగూడెం, ముసునూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, విజయవాడ రూరల్, గన్నవరం మండలాలున్నాయి. సాగర్ నీటితో పశ్చిమకృష్ణాలోని 260 చెరువులను నింపితేనే ఈ మండలాల్లో తాగునీటి ఎద్దడిని నివారించగలమని సాగర్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయినా మంత్రి దేవినేని ఉమా సాగర్ జలాల విడుదలపై దృష్టి సారించం లేదు. మూడోజోన్ సరిహద్దు వరకు వచ్చిన సాగర్‌జలాలు సాగర్ ఎడమకాలువ మూడోజోన్‌కు సాగర్‌జలాలు విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును నీటిపారుదల శాఖ అధికారులు ఏనాడూ అడుగకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని చెరువులను సాగర్‌జలాలతో నింపుకుంటోంది. రెండోజోన్‌లో ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర, బోనకల్ బ్రాంచికాలువలతో పాటు 16,17 నెంబర్ బ్రాంచి కాలువల పరిధిలోను, వైరా చెరువును సాగర్‌జలాలతో నింపుతున్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి 2900క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి చెరువులకు తరలిస్తోంది. దీంతో సాగర్‌జలాలు తిరువూరు సరిహద్దులకు వచ్చాయి. ఈ నీటితో సమీపంలోని లంకాసాగర్ను నింపడానికి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణపై ఒత్తిడి చేయని ప్రభుత్వం పశ్చిమకృష్ణాలోని మండలాల్లో చెరువులన్నీ ఎండిపోయి భూగర్భజలాలు పడిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడోజోన్‌కు సాగర్‌జలాలను తీసుకువచ్చే ఆలోచన చేయడం లేదు. ఎన్నెస్పీ ప్రాజెక్టు కమిటీ ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని అన్ని ఎస్కేప్లను, రెగ్యులేటర్లను మూసేసి నీటినంతా పదిరోజుల పాటైనా మూడోజోన్‌కు సరఫరా చేస్తేనే ఎంతోకొంత నీరు మూడో జోన్‌కు చేరే అవకాశం ఉంది. -
కాలుష్య కోరల్లో భూగర్భ జలాలు
పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి ఇంకడమే ప్రధాన కారణం పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి బెంగళూరు: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారిపోతున్నాయి. దీంతో మనిషికి సంజీవని లాంటి నీరే వ్యాధులను వ్యాపింపజేసే కారకంగా మారిపోతోంది. హానికారక రసాయనాలు భూగర్భజలాల్లో కలిసి పోతుండడంతో నగర జీవి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లుతోంది. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నగరంలోని సరస్సులలోకి వదులుతుండడం భూగర్భజలాలు విషతుల్యం కావడానికి ప్రధాన కారణమవుతోందని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. ఇదిలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో నగరంలోని భూగర్భ జలాలన్నీ పూర్తిగా గరళంగా మారి తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ప్రస్తుతం కాలుష్య భూతం తాండవమాడుతోంది. వాయు కాలుష్యం, శబ్దకాలుష్యం పెరిగిపోతున్నట్లుగానే పరిశ్రమల వ్యర్థాలు, సరస్సుల కబ్జాలతో భూగర్భ జలాలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్, బెంగళూరు శాఖ జరిపిన పరిశోధనలో తేలింది. ప్రతి ఏడాది భూగర్భ జలాల పరిస్థితిపై సర్వే నిర్వహించే ఈ సంస్థ ఈ ఏడాది సైతం నగరంలోని భూగర్భజలాల పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలాల్లో ఏడాదికేడాదికి కాలుష్యం పెరిగిపోవడానికి భూ ఉపరితల కాలుష్యం పెరగడమే ప్రధాన కారణమని ఈ సర్వే వెల్లడించింది. తాగడానికి భూ ఉపరితల నీటిని కాకుండా భూ గర్భజలాల (భూమిలోపల పొరల్లో ఉన్న) పై ఎక్కువగా ఆధార పడటం వల్ల కూడా నగర జీవి మంచినీరు అనుకొని కాలుష్యంతో నిండిన నీటిని తీసుకుంటున్నట్లు సర్వే తెలిపింది. పెరిగిన కాలుష్యం, తగ్గిన సరస్సులు... పట్టణీకరణ పెరగడంతో ఐదేళ్ల కాలంలో నగర శివారు ప్రాంతంలో ఉన్న పలు పరిశ్రమలు జనావాసాల మధ్యకు వచ్చాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలి. ఈ వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పారవేయాలి. ఇందుకు కర్నాటక కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించింది. అయితే నగరంలో ఈ నిబంధనలు అమలైన దాఖలాలు కనిపించడం లేదు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే బయటికి వదులుతున్నారు పరిశ్రమల యజమానులు. దీంతో అవి భూగర్భంలోకి ఇంకిపోయి, జలాలు అత్యంత విషతుల్యమౌతున్నాయి. కాగా, ఐదేళ్ల క్రితం వరకూ బీబీఎంపీ పరిధిలో 294 సరస్సులు ఉండేవి. క్లోరిఫికేషన్, స్ప్రింకలైజేషన్ తదితర పద్ధతులను ఉపయోగించి ఈ సరస్సుల నీటిని తాగునీరుగా మార్చి ప్రభుత్వం సరఫరా చేసేది. పట్టణీకరణ పెరగడం, రియల్ ఎస్టేట్ బూమ్ ఉండడంతో సరస్సులు కూడా ఆక్రమణకు గురయ్యాయి. దీంతో సరస్సులన్నీ మైదాన ప్రాంతాలుగా మారిపోయి అపార్ట్మెంట్లు వెలిశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీబీఎంపీ కూడా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడానికి ఎక్కువగా భూ గర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్నింటి కారణంగా నగరంలోని భూగర్భజలాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎక్కువ పరిమాణంలో కాలుష్య కారకాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ జరిపిన సర్వేలో ఎస్.జీ నగర్ ప్రాంతంలో ఒక లీటర్ నీటిలో 375మిల్లీగ్రాముల నైట్రేట్ నమోదు కాగా ఈఏడాది నైట్రేట్ పరిమాణం 402మిల్లీగ్రాములకు చేరుకుంది. అదే విధంగా బిదరహళ్లిలో ఒక లీటర్ నీటిలో 4.49మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు నమోదు కాగా ఈ ఏడాది ఫ్లోరైడ్ పరిమాణం 5.97మిల్లీగ్రాములకు పెరిగింది. కాలుష్య నియంత్రణ మండలి విఫలమైంది...... భూగర్భ జలాల పరిరక్షణలో కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలి తరచుగా నగరంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని పర్యావరణ నిపుణులు ఎస్.విశ్వనాథ్ తెలిపారు. ‘తరచుగా తనిఖీలు జరిగినపుడే పరిశ్రమల యజమానులు పరిశ్రమ వ్యర్థాలను జనావాసాల మధ్యకాక శుద్ధిచేసి దూరంగా పడేసేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రస్తుతం నగరంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. యజమాన్యాలు వ్యర్థాలను శుద్ధిచేయకుండానే దగ్గరలోని సరస్సుల్లోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమలపై, సరస్సుల కబ్జాపై దృష్టి సారించాలి. లేదంటే మరో 20 ఏళ్లలో భూగర్భ జలాలన్నీ విషంగా మారి తాగడానికి నీరే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది’ అని అన్నారు. -
అవని ఒడి.. కన్నీటి తడి
అడుగంటుతున్న భూగర్భ జలాలు అందని ఎన్టీఆర్ సుజల, కుళాయిల నీరు చెలమలే దిక్కు వేసవి తరుముకొచ్చింది. గుక్కెడు నీళ్ల కోసం గొంతు తడారిపోతోంది.. చెరువులన్నీ నీళ్లు లేక రోదిస్తున్నారుు.. బోర్లు అడుగంటి బోరుమంటున్నారుు.. మూడు కాళ్ల ముసలమ్మ నుంచి ఇంటి పెద్దదిక్కు వరకూ బిందెనెత్తికెత్తి.. కావడి కట్టి మైళ్ల దూరం.. మండే ఎండలో జల పోరాటం చేస్తున్నారు.. ఎడారిలో ఒయూసిస్సులా అక్కడక్కడా చెలమలు.. పేదల ఎక్కిళ్లకు అవే మహా ప్రసాదం.. బిందె నిండితే మహాదానందం.. ఇదీ వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వాసుల నిత్యం జల పోరాటం. వీరులపాడు : మండలంలోని దొడ్డదేవరపాడు ప్రజలు మంచినీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామంలో 2,300 మంది జనాభాకు గానూ రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఒకదానికి వి.అన్నవరం వద్ద రక్షిత చెరువు నుంచి, మరో ట్యాంకుకు దొడ్డదేవరపాడు వద్ద ఏటిలో మోటార్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే, ఈ నీరు చాలడం లేదు. పదిరోజులకోసారి నీటి సరఫరా గ్రామంలో బావులు, బోర్లతోపాటు వైరా, కట్టలేరు పూర్తిగా ఎండిపోయాయి. పంచాయతీ సరఫరాచేసే నీరు పదిరోజులకోసారి కూడా రావడం లేదు. అప్పుడైనా కనీసం గంటసేపు నీరు సరఫరా కావట్లేదు. ఆర్థిక స్తోమత ఉన్నవారు రూ.15 వెచ్చించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి వైరా, కట్టలేరుల్లో చెలమలు తీసుకుని బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. వృద్ధులకు సైతం ఈ తిప్పలు తప్పడంలేదు. ‘ఎన్టీఆర్ సుజల’ హామీకే పరిమితం టీడీపీ అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఇంటింటికీ రూ.2కే మినరల్ వాటర్‌ను అందిస్తామన్న చంద్రబాబు హామీ అమలు కావట్లేదు. తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామారావును వివరణ కోరగా, మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పథకాలు ఏర్పాటు ఆలోచనలేదని తేల్చి చెప్పారు. ఉన్నవాటిని బాగుచేయిస్తామని స్పష్టం చేశారు. -
రైతు కంట్లో ఇసుక!
► కృష్ణా తీరంలో అడ్డగోలు తవ్వకాలు ► అడుగంటుతున్న భూగర్భ జలాలు ► ఉచితం పేరుతో ‘తమ్ముళ్ల ’ ఇష్టారాజ్యం ► పట్టించుకోని అధికారులు తాడేపల్లి రూరల్:- ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు.. ఉచిత ఇసుక సరఫరా అయినప్పటికీ ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతోంది. దీంతో కృష్ణా ఎగువ, దిగువ ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటాయి. దీంతో కృష్ణమ్మకు జలకళ తప్పింది. ఇసుక తవ్వకాలతో పచ్చగా ఉన్న ప్రాంతం బీడుగా మారుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక రీచ్‌ల తవ్వకానికి ప్రథమంగా పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిఉంది. అది కష్టతరమైన పని కావడంతో అక్రమార్కులు చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని అనుమతులు ఇచ్చే భూగర్భశాఖ, జల వనరుల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లా అధికారులు 50 వేల క్యూబిక్ మీటర్ల లోపు ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వవచ్చని తెలుసుకున్న ‘మాఫియా’ ఒకే గ్రామంలో నాలుగు, ఐదు చోట్ల అనుమతులు పొందేలా చూసుకుంది. ఇసుక తవ్వకాలు నిర్వహించే ప్రాంతంలో 8 మీటర్ల (25 అడుగుల) మేర ఇసుక ఉండి, దాని కింద జల వనరులు ఉన్నప్పుడు మాత్రమే ఒక మీటరు వరకు ఇసుక తవ్వుకునే అవకాశం ఉంది. ఇసుక మాఫియా అడుగు పెట్టిన టీడీపీ నేతలకు అధికారులు ఇలాంటి సూచనలే వీ చేయలేదు. దీంతో బరితెగించిన నాయకులు రెండు నుంచి నాలుగు మీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భూగర్భజలాలు అడుగంటడమే కాక అన్నదాతలు నష్టపోవాల్సివస్తుంది. 130 అడుగులు తవ్వినా నీళ్లు పడటం లేదు.. బోరులో నిత్యం మూడు అంగుళాల బోరులో రెండున్నర అంగుళాల నీటి ధార వచ్చేది. మేం రోజుకు రెండెకరాలకు నీళ్లు పెట్టేవాళ్లం. ప్రస్తుతం ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో బోర్ల నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టింది. గతంలో 80 అడుగుల లోతులో నీళ్లు పడేవి, ప్రస్తుతం 130 అడుగుల్లోనూ నీళ్లు పడటం లేదు. ఈ నెలలో మరీ దారుణం. మున్ముందు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. - యేసు ప్రసాద్, చిర్రావూరు -
తాగునీటి కష్టాలు రానివ్వం
► రూ.19 కోట్లతో వేసవి కార్యాచరణ ► 197 ఆవాసాల్లో ప్రైవేటు బోర్లు అద్దెకు ► రెండు ఊళ్లకు బయటి నుంచి నీరు ► ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంచంద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : వేసవిలో నీటి ఎద్దడి నివారణపై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. వరుసగా రెండో ఏడాది కరువు వచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత కిందికి వెళ్లాయి. గ్రామాల్లో మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంముందుగానే ప్రణాళిక రూపొందించిందని ఈ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్.రాంచంద్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలోని 195 ఆవాసాల్లో తాగునీటి ఇబ్బంది నెలకొందని, ఈ ప్రాంతాలకు స్థానికంగా ఉన్న 247 ప్రైవేటు బోర్లను కిరాయికి తీసుకుని తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం నర్మెట మండల కేంద్రం, అంకుశాపూర్(బచ్చన్నపేట)లో తీవ్ర నీటి సమస్య ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా మార్గంలో ఈ రెండు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లు కేటాయిందని ఎస్ఈ తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ పరంగా ఉన్న నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బోరు బావులు, పైపులైన్ మరమ్మతు, పైపులైన్ల విస్తరణ, ఎండిపోయిన నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులను ఈ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. కరువు పరిస్థితి ఉన్న 11 మండలాల్లోని ప్రజల తాగునీటి ఇబ్బందులను అధిగించేందుకు విపత్తు సహాయ నిధి(సీఆర్ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు విడుదల చేసిందని ఆయన వివరించారు. సీఆర్‌ఎఫ్‌లోని రూ. 1.54 కోట్లతో తాగునీటి సరఫరా కోసం 730 పనులు చేపట్టినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ నిధుల కింద గత ఏడాది పనులు చేపట్టిన బిల్లుల కోసం ప్రభుత్వం రూ.3.97 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తున్నామని, రోజువారీగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈ రాంచంద్ చెప్పారు. -
ఇసుక ‘తోడే’ళ్లు
► ఇసుక తరలింపుతో అడుగంటిన భూగర్భజలాలు ► ఎండిపోయిన పరివాహక ప్రాంతాల బోరుబావులు హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలోని పెన్నానదికి ఉపనదులైన జయమంగళి, కుముద్వతీ నదులతో పాటు చిలమత్తూరు మండలంలోని చిత్రావతి, కుషావతి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపుతో భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయి 1000 అడుగుల బోరు వేస్తే కానీ నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని వాగులు, చెరువుల్లో కూడా ఏపీ వాల్టా చట్టాన్ని అధికారులు అమలు చేయడం లేదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో వేసిన పైప్లైన్లను కూడా వదలకుండా ఇసుక తోడేశారు. 2002లో ఏపీ వాల్టా చటాన్ని తీసుకువచ్చినా చంద్రబాబు కేవలం తమ అనుచరుల కోసం ఇసుక టెండర్లకు తెరదీసి స్థాయికి మించి ఇసుకను అక్రమ రవాణా చేశారు. దీంతో సమీప పరిసరాల్లో ఉన్న వ్యవసాయ బోర్లు, తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. పెన్నానది పరీవాహక ప్రాంతం హిందూపురానికి, కర్ణాటక సరిహద్దు నుంచి పరిగి మండలం వరకు సుమారు 30 కిలోమీటర్ల పైన ఇసుక టెండర్లు వేసి ప్రభుత్వం లాంఛనంగా ఇసుక అక్రమ తరలింపునకు పచ్చజెండా ఊపడంతో ఈ నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక అంతా కర్ణాటక కు చేరింది. ఎండిపోయిన బోర్లు, వందలఎకరాల్లో పంట నష్టం పెన్నానది పరీవాహక సమీపాన ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. అనుమతికి మించి ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగంటాయి. తద్వారా వందలాది ఎకరాల్లో రైతులు వేసుకున్న పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. ఫలితంగా వందలాది మంది రైతులు నిరాశ్రయులయ్యారు. వర్షాలు వచ్చినా భూగర్భజలాలు పెరగవు పెన్నానది పరీవాహక ప్రాంత గ్రామాలైన పెద్దిరెడ్డిపల్లి, మోదా, చెర్లోపల్లి, శ్రీరంగరాజుపల్లి, మోతుకుపల్లి, ఉటుకూరు, పైడేటి తదితర గ్రామ ప్రజలు 1980 కంటే ముందు వేసవిలో నీళ్ల కోసం జయమంగళి, పెన్నానదిలో ఇసుక తోడితే నీరు వచ్చేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇసుకను అధికంగా తోడేయడంతో కనీసం నది ఛాయలు కూడా లేకుండా ముళ్లపొదలు దర్శనమిస్తున్నాయి. - వెంకటరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు గతంలో ఇసుక టెండర్లను అడ్డుపెట్టుకుని మితిమీరిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ముసుగులో ఎవరైనా ఇసుక అక్రమంగా సరిహద్దును దాటించేందుకు ప్రయత్నించకుండా సంతేబిదనూర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నాం. - విశ్వనాథ్, తహశీల్దార్ -
ఐదింట్లో అదే గోస
♦ పినపాక నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ♦ అడుగంటుతున్న భూగర్భ జలాలు ♦ శిథిలమవుతున్న తాగునీటి పథకాలు ♦ యథేచ్ఛగా నీటి వ్యాపారం చెంతనే గోదావరి ఉన్నా... మణుగూరువాసులకు తాగునీటి తండ్లాట తప్పడం లేదు. తాగునీటి పథకాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. చివరకు చెలిమల నీరే దిక్కవుతోంది. -మణుగూరు నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పనిచేయని పరిస్థితి. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని తలచుకొని భయపడుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోగా.. కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు మండలం సమితిసింగారం నుంచి అశ్వాపురం మండలం మొండికుంట వరకు ఉన్న 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గ్రామీణ నీటి సరఫరా పథకం ప్రారంభించకుండానే అతీగతీ లేకుండా పోయింది. 2011లో సదరు గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉన్నా.. ఏళ్లు గడిచినా చుక్క నీరు అందించలేదు. 2009లో రూ.5కోట్ల అంచనాతో ప్రారంభించిన పథకానికి నిధులు చాలకపోవడంతో మరో రూ.5కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఆరేళ్లు దాటిపోయాయి. ఇందులో భాగంగా చినరావిగూడెం వద్ద గోదావరి ఒడ్డున ఇన్‌టేక్‌వెల్, కమలాపురం వద్ద ఫిల్టర్‌బెడ్, ఓవర్‌హెడ్ ట్యాంక్, అశోక్‌నగర్ వద్ద సంప్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించారు.. పైపులైన్లు సైతం వేశారు. అధికారుల అలసత్వం వల్ల కాంట్రాక్టర్ నాసిరకం పైపులు వేశాడు. దీంతో నీటి సరఫరా ప్రారంభిస్తే పైపులు పగిలిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఆ పైపులు మార్చాల్సి ఉన్నప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మణుగూరు మండలంలో మొత్తం 205 బోర్లు ఉండగా.. 25 బోర్లు పనిచేయడం లేదు. రామానుజవరం పంచాయతీలోని చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెంతనే గోదావరి ఉన్నా.. అగచాట్లు పడాల్సి వస్తోంది. దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ వాటర్ అంటూ సాధారణ నీటిని అమ్ముతూ భారీగా దోపిడీ చేస్తున్నారు. పినపాక మండలంలో 310 చేతిపంపులకు.. 55 పనిచేయడం లేదు. రక్షిత మంచినీటి పథకాలు 30 ఉండగా.. 20 గ్రామాల్లో అలంకారప్రాయంగా ఉన్నాయి. 90 బోరు మోటార్లు ఉండగా.. ఐదు ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అశ్వాపురం మండలంలో 405 చేతిపంపులు ఉండగా.. 65 పనిచేయడం లేదు. మిట్టగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, మామిళ్లవాయి, వేములూరు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. కుమ్మరిగూడెంలో వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బూర్గంపాడు మండలంలో 528 బోర్లు ఉండగా.. 155 బోర్లు పనికిరాకుండా పోయాయి. మరో 102 బోర్లు మరమ్మతు దశలో ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 15 ఉండగా.. 6 పథకాలు పనిచేయడం లేదు. రెండో దశ మిషన్ కాకతీయ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గత ఏడాది మిషన్ కాకతీయ పనులు 6 చెరువుల్లో అసంపూర్తిగానే చేశారు. ఉప్పుసాక, జిన్నెగట్టు, వడ్డగూడెం, పినపాక పట్టీనగర్, మోరంపల్లిబంజర, కృష్ణసాగర్, గోపాలపురం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుండాల మండలంలో 350 చేతిపంపులు ఉండగా.. 102 పనిచేయడం లేదు. గుండాల, రాయిలంక, ముత్తాపురం, కాచనపల్లి, రాయిపాడు, మర్కోడు, గుండాల, రాఘవాపురం గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిరూపయోగంగా ఉన్నాయి. ఇటీ వల శంభునిగూడెం, నర్సాపురం, రోళ్లగడ్డ గ్రామాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులకు కనె క్షన్ ఇవ్వకపోవడంతో ఆయా గ్రామాలకు నీరందడం లేదు. సాయనపల్లి, చెట్టుపల్లి, మర్కోడు పంచాయతీల్లో డీపీ స్కీంలు నిర్మించగా.. పట్టించుకునే వారు లేక మూలనపడ్డాయి. రూ.22కోట్లతో ఆళ్లపల్లి పంచాయతీలో చేపట్టిన ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు వాగులను ఆశ్రయిస్తున్నారు. మండలంలో ఉన్న 8 రక్షిత మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. వాటర్ గ్రిడ్ పనులు సర్వే దశలోనే ఉన్నాయి. -
బోరుమంటున్నాయ్..
♦ జిల్లాలో 11,664 చేతి పంపులు ♦ ఇందులో పాతిక శాతం కూడా పని చేయని వైనం ♦ మరమ్మతులకు నిధులున్నా పట్టించుకునే వారు కరువు కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో బావులు ఎండిపోయాయి. బోరు బావులు మరమ్మతులకు గురయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు కానీ ఆచరణలో అది వాస్తవం కాదని స్పష్టమవుతోంది. చిన్న చిన్న మరమ్మతులు చేపడితే చాలా చోట్ల ప్రజలకు తాగు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. జిల్లాలో 11,664 చేతి బోర్లు ఉండగా వాటిలో పాతిక శాతం కూడా పని చేయడం లేదు. పదేళ్లుగా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా పైప్లైన్లు వేసి ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఇళ్లలోకే కుళాయిల ద్వారా నేరుగా నీరు వస్తుండటంతో చేతి పంపులకు ఆదరణ కరువైంది. కుళాయిల కంటే చేతి పంపుల నీరే సురక్షితం అని తెలిసినా వీటి గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు. వేసవి తీవ్రత పెరగడంతో ప్రస్తుతం చాలా గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. ఈ స్థితిలో చేతి పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చేతి బోర్ల పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని వాటిని వాడకం లోనికి తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తే నీటి సమస్యను కొంత మేరకు అధిగమించే అవకాశం ఉంది. -
మధిర.. దాహార్తి
వైరానది..మున్నేరు.. కట్లేరు.. మధిర నియోజకవర్గ దాహార్తిని తీర్చే ప్రధాన నీటి వనరులు..కానీ ఇప్పుడవి ఎడారిని తలపిస్తున్నాయి. వీటిలో చుక్కనీరు లేక దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. చెరువులు, కుంటల్లోనూ నీరు లేక భూగర్భజలాలు పడిపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయాయి. చేతిపంపులు సైతం నిరుపయోగంగా మారాయి. అక్కడక్కడ ఒకటి రెండు చేతిపంపులు పనిచేస్తున్నా ఫ్లోరైడ్ ప్రభావంతో ఆ నీరు తాగడానికి పనికి రావడం లేదు. రూ.15 వెచ్చించి మినరల్ వాటర్ కొనుక్కుంటే కానీ దాహం తీరేలా లేదు. మధిర: మధిర నియోజకవర్గం దాహంతో అల్లాడుతోంది. ఎండలు మండుతుండటంతో భూగర్భజలాలు అడుగంటి చెరువులు, కుంటలు, నదులు ఎడారిని తలపిస్తున్నాయి. మంచినీటి పథకాలు, చేతిపంపులు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గంలో మున్నేరు, వైరానది, కట్టలేరు నదులు ఉన్నాయి. ఆరు నెలలుగా వర్షాలు లేకపోవడంతో వీటిలో చుక్కనీరు లేకుండా పోయింది. తాగునీటి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నగర పంచాయతీలో... మధిర నగర పంచాయతీలో 40వేల జనాభా ఉంది. బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా గతంలో నీరందేది. ఈ పథకం మూలన పడటంతో మధిర టూటౌన్‌కు తాగునీటి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇటీవల రూ.5 లక్షలకుపైగా నిధులతో వైరానదిలో 4 బోర్లు వేశారు. వాటిలో రెండు బోర్లు ఫెయిలయ్యాయి. రెండు బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. సుదూర ప్రాంతం నుంచి పైప్లైన్లు వేసి పంపుహౌజ్‌కు నీరు ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా మధిర వన్‌టౌన్‌కు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతానికి రెండు, మూడురోజులకోసారి అరకొరగా నీరు సరఫరా అవుతోంది. పట్టణంతోపాటు పలు గ్రామాల్లో పైప్లైన్లు, గేట్‌వాల్వులు, సంపులకు లీకులు ఏర్పడి తాగునీరు వృథాగా పోతుంది. పట్టణానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వాటర్‌గ్రిడ్ నిర్మిస్తున్నారు. ఈ పథకానికి కూడా వైరా రిజర్వాయర్ నుంచి పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ నిర్మాణం జరిగి తాగునీరు అందించాలంటే ఇంకా సంవత్సరకాలం పట్టే అవకాశం ఉంది. మధిర మండలంలో.. మధిర మండలంలో 29 గ్రామాలు ఉండగా 85 వేలకు పైగా జనాభా ఉంది. మధిర, బోనకల్ మండలంలోని 51 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.40 కోట్లతో మధిర మండలంలోని జాలిముడి వద్ద నిర్మించిన రక్షిత మంచినీటి పథకానికి నీర ందట్లేదు. మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు రూ.82 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. గతంలో సీఆర్ఎఫ్ కింద రూ.2 లక్షలు మంజూరయ్యాయి. గ్రామపంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థికసంఘం నిధులను తాగునీటికి వినియోగిస్తున్నారు. వైరాలోని బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చే నీరు కూడా నెలరోజులుగా మధిర మండలానికి విడుదల కావడం లేదు. మధిర మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంబారుపేట, మాటూరు, దెందుకూరు తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరికొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మినరల్ వాటర్ పేరుతో 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. బోనకల్లో.. బోనకల్ మండలంలో 44,789 జనాభా ఉంది. మండలంలోని 14 గ్రామాలకు బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. వారానికి ఒక్కరోజు కూడా నీరొచ్చే పరిస్థితి లేదు. నక్కలగరుబు, చిలుకూరు గ్రామస్తులు సమీపంలోని వైరానదికి వెళ్లి చెలమ నీరు తెచ్చుకుంటున్నారు. చింతకానిలో.. చింతకాని మండలంలో 48 వేల జనాభా ఉంది. 25 తాగునీటి పథకాలున్నాయి. నాగిలిగొండ, చింతకాని రక్షిత తాగునీటి పథకాలు ఉండగా తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి ఇవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. చింతకాని నల్లచెరువు ఎండిపోవటంతో మండల కేంద్రంలో సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకం ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. ముదిగొండలో.. భూగర్భజలాలు అడుగంటి ముదిగొండ మండలంలో నీటి సమస్య ఏర్పడుతోంది. రూ.70 లక్షల యాక్షన్ ప్లాన్ అమలుకాక పోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలో 60వేల జనాభా ఉంది. వీరికి 6 లక్షల గ్యాలన్ల నీరు అవసరముండగా అందులో సగం మాత్రమే అందుతోంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏ ఒక్క గ్రామంలో నీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎర్రుపాలెంలో.. ఎర్రుపాలెం మండలంలో సుమారు రూ. 40 కోట్లతో నిర్మించిన మామునూరు మంచినీటి ప్రాజెక్టు నుంచి ట్యాంకులకు తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ ప్రాజెక్టులో నీరు ఉండాలంటే సమీపంలోని చెరువు నిండాల్సిందే. సాగర్ జలాలతో చెరువులను నింపి, కట్లేరు ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తేనే వేసవిలో దాహార్తి తీరుతుంది. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎండలు మండుతున్న నేపథ్యంలో మధిరలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. దుకాణాల్లో ఒక్కో బాటిల్ రూ.5 పెట్టి కొనాలంటే భారం అవుతోంది. అధికారులు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. - తోక చిన్నపుల్లయ్య, రిటైర్డ్ టీచర్ వారానికి ఒక్కసారీ నీరు రావడం లేదు మండలకేంద్రంలో వారానికి ఒక్కసారి కూడా బోడేపూడి సుజల స్రవంతి నీరు రావడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావంతో చేతిపంపుల్లో నీరు తాగడానికి పనికి రావడం లేదు. రూ.15కు ఓ క్యాన్ చొప్పున 20 లీటర్ల క్యాన్‌ను కొని దాహం తీర్చుకుంటున్నాం. కొన్ని చేతిపంపుల నుంచి కూడా నీరు రావట్లేదు. -బాణోతు సూరమ్మ , ఎస్టీ కాలనీ, బోనకల్ -
నిత్యం.. నీటి యుద్ధం!
♦ మొయినాబాద్ మండలంలో 35 మీటర్ల లోతున నీళ్లు ♦ పైపులైన్లు వేసి ఐదేళ్లయినా అందని మంజీరా నీళ్లు ♦ ఎండిన గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు గండిపేట, హిమాయత్‌సాగర్‌లు చెంతనే ఉన్నాయి.. ఈసీ, మూసీ వాగులూ అతి సమీపంలోంచి వెళ్తున్నాయి.. కానీ చుక్కనీరు దొరక్క మొయినాబాద్ ప్రాంత ప్రజలు విలవిల్లాడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు తీవ్రమవుతున్న కొద్దీ నీటి సమస్య ఉధృతమవుతోంది. నిత్యం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదు. - మొయినాబాద్ ఇరుపక్కల జంట జలాశయాలు.. ఎన్ని బోర్లు వేసినా నీటికి కరువే. ప్రస్తుతం ఎండలు ముదరడంతో గ్రామాల్లో ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. బొట్టుబొట్టూ నీటిని ఒడిసి పట్టాల్సిన పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తుంది. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లి మోసుకురావాల్సిన దుస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ప్రస్తుతం మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. మండలంలో 21 గ్రామ పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉంది. ప్రధానంగా శ్రీరాంనగర్, పెద్దమంగళారం, సురంగల్, మొయినాబాద్, రెడ్డిపల్లి, మేడిపల్లి, చిన్నమంగళారం, చందానగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, అప్పారెడ్డిగూడ, తోలుకట్ట, నక్కపల్లి, ముర్తూజగూడ, ఎనికేపల్లి, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లో నీటి సరఫరా బోర్లు పూర్తి గా ఎండిపోయాయి. కొన్ని గ్రామాల్లో ప్రైవేటు బోర్లు, రైతు ల బోర్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇవి ఏమూలకూ సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొందరైతే.. వ్యవసాయ బోర ్ల నుంచి బైకులు, సైకిళ్లు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సింగిల్‌ఫేజ్ మోటర్లు ఏర్పాటు చేయడంతో వాటిలో సన్నటి ధారగా వస్తున్న నీటిని పట్టుకోవడానికి మూడు నాలుగు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. పైప్లైన్లు వేసి ఐదేళ్లైనా అందని మంజీరా.. మొయినాబాద్ మండలానికి మంజీరా నీటిని అందించేందుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.13.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. శంకర్పల్లి నుంచి మొయినాబాద్ మండలంలోని సగం గ్రామాలకు నీళ్లు అందించేందుకు పైప్‌లైన్ పనులు చేపట్టారు. మండలంలోని మేడిపల్లి, వీరన్నపేట, చిన్నమంగళారం, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, చందానగర్, పెద్దమంగళారం, మొయినాబాద్, చిలుకూరు, అప్పోజిగూడ, దేవల్ వెంకటాపూర్, హిమాయత్‌నగర్, ఎనికేపల్లి, జీవన్‌గూడ, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం గ్రామాలకు పైప్లైన్లు వేసే పనులు 2011లోనే పూర్తి చేశారు. ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసుందుకు అప్పోజిగూడ సమీపంలో వాటర్‌ట్యాంక్‌ను సైతం నిర్మించారు. ఈ పనులన్నీ జరిగినా మంజీరాల్లో నీళ్లు లేవని, జలమండలి అమనుమతులు ఇవ్వడం లేదనే సాకులతో ఇప్పటి వరకు చుక్క నీటిని వదల్లేరు. 35 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టం.. మండలంలో భూగర్భజలాల నీటి మట్టం 35 మీటర్ల లోతుకు పడిపోయింది. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో రెండు నెలల కాలంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రూ. లక్షలు ఖర్చు చేసి వందకు పైగా కొత్త బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. దీంతో మండలంలో ప్రతి రోజూ వంద ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండిన జంట జలాశయాలు... మొయినాబాద్ మండలానికి ఇరుపక్కల ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇవి కాస్త ఎండిపోయాయి. హిమాయత్‌సాగర్‌లో ఉన్న కొద్ది పాటి నీటితో మండలానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఒక వేళ వర్షాలతో జలాశయాల్లోకి నిండి ఉంటే.. ఎగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగేవి. తద్వారా నీటి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా హిమాయత్‌నగర్ గ్రామం గండిపేట చెరువుకు ఆనుకుని ఉన్నా నీటికి మాత్రం ఇబ్బంది తప్పడం లేదు. మూడు నెలలుగా భూగర్భజలాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు నీటి సరఫరా బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. రైతుల బోర్ల నుంచి నీళ్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అయినా గ్రామంలో సరిపోవడంలేదు. - మల్లేష్ యాదవ్, సర్పంచ్, హిమాయత్‌నగర్ మంజీర నీళ్లు ఇస్తే.. మంజీర నీళ్లు ఇస్తామని గ్రామాల్లో పైప్లైన్లు వేశారు. ఐదేళ్ల నుంచి ఇప్పటికీ నీరివ్వలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మంజీర నీరు ఇచ్చుంటే మండలంలోని సగం గ్రామాలకు నీటి సమస్య తీరేది. ఇప్పుడైతే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. - గీతా వనజాక్షి, సర్పంచ్, పెద్దమంగళారం అడుగంటిన భూగర్భ జలాలు మండలంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. 35 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. దీంతో కొత్తగా బోర్లు వేసినా నీరు రావడం లేదు. గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని గ్రామాల్లో వ్యవసాయ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. - శారద, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మొయినాబాద్ -
నీటిని వృథా చేయొద్దు..
► ప్రాణికోటికి నీరు ఎంతో అవసరం ► నీటిని పొదుపుగా వాడుకోండి కొమరంభీమ్ ఆ రోజుల్లోనే చెప్పారు ► కలెక్టర్ జగన్మోహన్ దత్తత గ్రామంలో జలదినోత్సవం ఆదిలాబాద్ రూరల్ : భూగర్భ జలాలు అడుగుంటి పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయవద్దని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నీటిని వృథా చేయమని, అవసరం ఉన్నంత మేరకే వాడుతామని జిల్లా కలెక్టర్ అంకోలి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం జల దినోత్సవాన్ని పురస్కారించుకొని కలెక్టర్ దత్తత తీసుకున్న అంకోలి గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కొమరం భీం ఆ రోజుల్లోనే నీటి విలువను తెలపడం జరిగిందన్నారు. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో ఎవరూ చదువు చెప్పడం లేదని, ఇలా అయితే తామెలా చదువుకునేదని అంకోలి గ్రామానికి చెందిన వయోజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ చాకటి భారతి, ఎంపీటీసీ కనక రమణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డ్వామా పీడీ శంకర్, డీఎఫ్‌వో గోపాల్‌రావు, ఎంపీడీవో రవిందర్, ఈవోపీఆర్డీ సుదర్శన్ బానోవత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రణాళికబద్ధంగా చదువాలి... అలసత్వాన్ని వీడి ఐక్యతతో ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించడానికి అస్కారం ఉంటుందని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో స్టార్-30 ఏంసెట్ ఐఐటీ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మంచి ర్యాంక్ సాధించాలన్నారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడడంతోనే గుర్తింపు వస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అగస్టిన్, కోర్సు నోడల్ ఆఫీసర్, కోర్సు కోఆర్డినేటర్ శ్రీనివాస స్వామి, ఏటీడబ్ల్యూవో, సిబ్బంది షరీఫ్ ఉన్నారు. -
పాతాళగంగ
అడుగంటుతున్న భూగర్భ జలాలు పది మీటర్ల లోతుకు పడిపోయిన నీటిమట్టం 33 మండలాల్లో కరువు ఛాయలు గతేడాది కంటే ఎక్కువ లోతులో నీరు వేసవిలో తాగునీటికి తిప్పలే... హన్మకొండ : జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికే జిల్లా లో 33 మండలాల్లో ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. వేసవి ప్రారంభంలోనే నీటి కటకట తప్పేలా లేదు. అధికార యంత్రాం గం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ఈ వేసవిలో జిల్లా వాసులకు తాగునీటి గండం తప్పేలా లేదు. ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతం 33 శాతం తక్కువగా నమోదైంది. వరుసగా రెండేళ్లు ఇదే పరిస్థితి నెలకొనడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో బోరుబావులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా భూగర్భ జలవనరులు తగ్గుముఖం పట్టాయి. కరువు ప్రాంతం, అటవీప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా అంతటా అడుగంటారుు. జిల్లాలో కరువు ప్రాంతంగా పేర్కొనే జనగామ సబ్ డివిజన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 33 మండలాల్లో నీటి కటకట.. భూగర్భ జలవనరుల శాఖ లెక్కల ప్రకారం భూ ఉపరితలం నుంచి ఎనిమిది మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లు పరిగణిస్తారు. జిల్లాలో 50 మండలాలు ఉండగా వీటిలో ఎనిమిది మీటర్లలోపు లోపు నీటిమట్టం ఉన్న మండలాలు 17 ఉన్నాయి. మిగిలిన 33 మండలాల్లో నీటిమట్టం ఎనిమిది అడుగుల కంటే కిందికే చేరుకుంది. భూగర్భ జలవనరుల విభాగం నివేదిక 2016 ఫిబ్రవరి ప్రకారం జిల్లా సగటు భూగర్భనీటి మట్టం 11.35 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి జిల్లా సగటు భూగర్భ నీటిమట్టం 11.10 మీటర్లుగా నమోదైంది. అంటే గతేడాది కంటే ఎక్కువ లోతుకు నీటిమట్టాలు పడిపోయాయి. జనగామలో 17.81 మీటర్లకు.. జనగామ సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం 17.81 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ఇక్కడ నీటిమట్టం 14.65 మీటర్లుగా నమోదైంది. డివిజన్లోని రఘునాథపల్లి మండలంలో భూగర్భ జలాలు 42.87 మీటర్ల లోతులోకి వెళ్లారుు. గతేడాది ఇదే సమయానికి ఈ మండలంలో 30.54 మీటర్ల లోతులో ఉండేవి. జిల్లాలోనే అత్యంత దారుణ పరిస్థితి నెలకొన్న ఈ మండలంలో భూగర్భ నీటిమట్టాలు పెంచేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. నర్సంపేట, మహబూబాబాద్‌లో మెరుగు.. నర్సంపేట, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో గతేడాదితో పోల్చితే నీటి మట్టాలు పెరిగాయి. అంతేకాదు.. ఈ నీటి మట్టాలు జిల్లా సగటు కంటే పై స్థా యిలో ఉండటం ఇక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నర్సంపేటలో గతేడాది 7.34 మీటర్ల లోతులో నీరుండగా, ఈసారి ఒక మీటరు పైకి వచ్చి 6.26 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నారుు. మహబూబాబాద్ డివిజన్లో గతేడాది 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 6.77 మీటర్ల లోతులోనే నీరు లభిస్తోంది. జిల్లాలో అత్యంత ఎక్కువగా సంగెంలో 3.56, ఖానాపూర్ మండలంలో 3.68 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ములుగు రెవెన్యూ డివిజన్లో సైతం నీటిమట్టం పడిపోవడం ఈ ఏడాది కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ డివిజన్లో సగటున 12 అడుగుల లోతుకి నీటిమట్టం చేరుకుంది. తాగునీటి కోసం రాస్తారోకో నర్సంపేట : తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మండలంలోని ఇటుకాలపల్లి పంచాయుతీ పరిధిలోని ఆకులతండాలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వుల్లంపల్లి-నర్సంపేట ప్రధాన రహదారిపై పలువురు మహిళలు, తండావాసులు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్య సవ్ముయ్యు మాట్లాడుతూ.. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండావాసులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
జలసిరి.. కిరికిరి!
► బోరులో నీరు పడకపోతే బిల్లు రైతులదే..! ► ఎన్టీఆర్ జలసిరి పథకంలో కొత్త ట్విస్ట్ ► 200 అడుగులు దాటినా అదనపు భారం రైతులపైనే ► అడుగుకు ఏకంగా రూ.90 మేర చెల్లింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎన్టీఆర్ జలసిరి కింద ఉచితంగా బోర్లు వేయిస్తాం..రండి..దరఖాస్తు చేసుకోండి’’ అని మా ఊరు-జన్మభూమి సందర్భంగా ఊదరగొట్టిన ప్రభుత్వం తాజాగా బాంబు పేల్చింది. నీళ్లు పడితేనే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందని.. లేదంటే రైతులే చెల్లించాలని తిరకాసు పెట్టింది. అంతేకాదు నీళ్లు పడినా... 200 అడుగులు దాటితే మాత్రం ఆ అదనపు భారం కూడా రైతులే భరించాల్సి ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పింది. ఫలితంగా ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేయించుకోవాలని దరఖాస్తులు సమర్పించిన రైతులు..ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కోనున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ జలసిరి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే విధంగా తయారయ్యింది. భారీగా దరఖాస్తులు. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి కింద 5 ఎకరాల్లోపు బ్లాక్‌ను ఒక గ్రూపుగా గుర్తించి.. బోర్లు వేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ బోర్లనుకేవలం ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే వేయనున్నారు. వర్షాలు సరిగా పడక కాల్వలకు నీరు రాకపోయినా బోర్ల ద్వారా ఈ పంటలను కాపాడవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఈ విధంగా 10,223 బోర్లను వేయాలని నిర్ణయించారు. వీటి కోసం 16,480 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 360 గ్రామాల్లో మాత్రమే ఎన్టీఆర్ జలసిరి పథకం వర్తించేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామాలను భూగర్భ జలాల అధికారుల నివేదిక ఆధారంగా ఎంపిక చేశారు. ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్తల ద్వారా గుర్తించి... అక్కడే వేస్తారు. ఈ పనిని ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడే కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. మాపై భారమా? ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని స్వయంగా భూగర్భ శాస్త్రవేత్తలు చూపించిన తర్వాత నీరు పడకుంటే... ఆ భారం రైతులపై ఎలా వేస్తారనేది కీలకంగా మారింది. అంతేకాకుండా ఆయకట్టు ప్రాంతంలోనే 200 అడుగులకు మించి లోపలికి బోరు వేయాల్సి రాదనేది భూగర్భజల శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ 200 అడుగులు దాటితే ఆ అదనపు భారం రైతులే భరించాలని ప్రభుత్వం చెబుతుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా ఉచితంగా వేస్తామన్న బోర్లు..అంతిమంగా రైతులపై అదనపు భారం మోపే విధంగానే తయారయ్యాయి. అంతేకాకుండా ఏకంగా అడుగుకు రూ.90లుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం తమకు అదనపు భారంగా తయారుకానుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. లబ్ధిదారులను గుర్తించలేదు జిల్లాలో 10,223 బోర్లను ఎన్టీఆర్ జలసిరి కింద వేయనున్నాం. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించాం. ఇంకా లబ్ధిదారులను గుర్తించలేదు. రైతులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారులు చిన్న, సన్నకారు రైతులై ఉండటంతో పాటు 5 ఎకరాల బ్లాక్ ఉండాలి. ఒక రైతుకు 3 ఎకరాలు ఉండి, ఇంకో రైతుకు 2 ఎకరాలు ఉంటే ఇద్దరికీ కలిపి ఒకే బోరును వేస్తాం. ఈ విధంగా గ్రూపింగ్ చేయడంపై దృష్టి సారించాం. మొత్తం బోరు వేసేందుకు రూ.24 వేలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఒకవేళ బోరు పడకపోతే రైతులే చెల్లించాలనే విషయంలో మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
మిషన్ స్లో
⇒ ముందుకు సాగని మిషన్ కాకతీయ పనులు ⇒ మొదటి విడతలో 830 చెరువులకు 250చెరువుల పనులే పూర్తి ⇒ రెండో విడతలో 110 చెరువులకు ఐదింటిలో పనులు ప్రారంభం ⇒ ఈనెలాఖరు వరకు పనులు పూర్తి అనుమానమే.. మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చెరువుల్లో పూడిక తీసి, ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అధికారుల చిత్తశుద్ధి లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. మార్చి నెలాఖరు వరకు మొదటి విడత పనులు పూర్తి చేయాల్సి ఉన్నా... లక్ష్యం చేరే అవకాశం కనిపించడం లేదు. రెండో విడత పనులు ఇప్పుడే మొదలయ్యాయి. మిషన్ కాకతీయ పథకం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ఫోకస్.. కరీంనగర్ : మిషన్ కాకతీయ పనులు మందకొడిగా జరుగుతున్నాయి. భూగర్భజలాల పెంపు, చెరువుల పూడికతీత లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. జిల్లాలో ఏడాది క్రితం ఫేజ్-1లో 81,940 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 1,188 చెరువుల మరమ్మతు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 830 చెరువులకు అనుమతి లభించగా ఇందుకోసం రూ.313.72 కోట్ల నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేసింది. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేవలం 250 చెరువుల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.62 కోట్లు బిల్లులు చెల్లించారు. ఫేజ్-1 పనులన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇటీవల సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా ఆ మేరకు పూర్తవడం కష్టంగానే ఉంది. ఏప్రిల్, మే నెల వరకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది నిలిచిపోయిన వాటిలో 30 శాతం చెరువుల్లోనే పనులు జరుగుతున్నాయి. తూతూమంత్రం పనులు చాలా ప్రాంతాల్లో పనులు తూతూమంత్రంగా పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల చెరువు కట్టకు మట్టి పోసి పటిష్టంగా పనులు చేపడుతుండగా, మరికొన్ని చోట్ల చెరువులో కొంతభాగం మట్టి తీసి మమ అనిపించారు. వీరికి ఇంజినీరింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. కొందరు 12 శాతం నుంచి 22 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసి ఇప్పుడు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరగడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. మరోవైపు ఫేజ్-2 పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా, ఫేజ్-1 పనులు పూర్తి చేయించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. ఫేజ్-2లో 31,726 ఎకరాల ఆయకట్టు కోసం 1,271 చెరువుల మరమ్మతు లక్ష్యంగా నిర్ణయించుకోగా రూ.159 కోట్లు కేటాయించారు. 110 చెరువులకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కాగా, 5 చెరువుల పనులు ప్రారంభించారు. మిగతా చెరువుల పనులు వారం రోజుల్లోపు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. మినీ ట్యాంక్బండ్లు మిషన్‌కాకతీయ రెండో దశలో భాగంగా జిల్లాలోని 13 నియోజకవర్గాలకు మినీట్యాంకు బండ్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 10 నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్బండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి వచ్చింది. వీటికి గాను రూ.38 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ : మిషన్ కాకతీయ మొదటి దశలో 20 చెరువులు ఎంపిక చేసి 19 చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభించారు. మూడు చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. 14 చెరువుల్లో పూడిక పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరో 3 చెరువుల పనులను అధికారులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఫేజ్-2లో 19 చెరువులు గుర్తించి ప్రతిపాదనలు పంపితే 11 చెరువులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇంకా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కరీంనగర్ : మొదటి విడతలో మిషన్ కాకతీయలో మొత్తం 17 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7 కోట్ల 28 లక్షలు మంజూరు చేసింది. 3 చెరువుల్లో 100 శాతం పనులు పూర్తికాగా, 10 చెరువులు 50 నుంచి 90శాతం పూర్తయ్యాయి. మరో 4చెరువుల్లో పనులు ప్రారంభం కాలేదు. రెండో విడతలో 14 చెరువులకు అనుమతి వచ్చింది. వీటిలో కొత్తపల్లి ఊరచెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చే సేందుకు ప్రభుత్వం రూ.5కోట్ల 60వేలు మంజూ రు చేసింది. టెండర్లు వారం రోజుల్లో పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. -
జలగండం
గ్రేటర్లో తాగునీటి ఇక్కట్లు నిత్యం రెండు వేలకు పైగా జలమండలి ట్యాంకర్ల బుకింగ్ వీరిలో 1500 మందికే సత్వర సరఫరా నిరీక్షణలో 500 మంది వినియోగదారులు అడ్డూ అదుపూ లేని ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ సిటీబ్యూరో: వేసవి ప్రారంభంలోనే గ్రేటర్లో క‘న్నీటి’ కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడం... జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు సరిపోక పోవడంతో ట్యాంకర్ నీటికి డిమాండ్ పెరిగింది. మహా నగరంలో జలమండలి ట్యాంకర్ బుకింగ్‌లు రోజుకు రెండు వేలు దాటుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు 20,965 ట్రిప్పుల ట్యాంకర్ నీళ్లను సిటీ జనం బుక్ చేసుకున్నారు. వీరిలో 15,534 మందికిబుక్ చేసుకున్న 24 గంటల్లోనే నీటి సరఫరా చేశారు. మిగతా 5,431 మందికి నిరీక్షణ తప్పడం లేదు. వీరంతా ట్యాంకర్ నీళ్లకు 48 నుంచి 72 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. నిజాంపేట్, శేరిలింగంపల్లి, మియాపూర్, మల్కాజ్గిరి తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసి వారం రోజులు దాటినా నీరు అందకపోవడం గమనార్హం. దారి తప్పుతున్న ఉచిత ట్యాంకర్లు జలమండలి పరిధిలోని 65 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటి సరఫరాకు సుమారు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. వీటి ద్వారా బుక్ చేసిన వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌కు రూ.400, వాణిజ్య అవసరాలకైతే రూ.700 వసూ లు చేస్తున్నారు. ఇవి కాక ఉచితంగా బస్తీలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ఇవి తరచూ పక్కదారి పడుతున్నాయి. బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సిన నీటిని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లకు రూ.వెయ్యి వంతున విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు దోపిడీ.... జలమండలి ట్యాంకర్లకు సుదీర్ఘ నిరీక్షణ తప్పకపోవడంతో జనం ప్రైవేటు ట్యాంకర్లతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మియాపూర్, వనస్థలిపురం, నిజాంపేట్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. కుంటలు, చెరువులు, పారిశ్రామిక వాడల్లో అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు డిమాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు దండుకుంటున్నారు. వారు సరఫరా చేస్తున్న నీటిలో బురద, వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థజలాలు ఉంటున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆగడాలను అడ్డుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ట్యాంకర్ నీళ్ల లెక్కలివే.. జలమండలి ట్యాంకర్ల బుకింగ్: రోజుకు రెండువేలకు పైగా రోజు వారీగా అందుతున్నది: సుమారు 1500 మందికి నిరీక్షణ జాబితాలోని వినియోగదారులు: సుమారు 500 మంది జలమండలి ట్యాంకర్ నీళ్లకు నిరీక్షించాల్సి సమయం: శివారు ప్రాంతాల్లో 48 నుంచి 72 గంటలు. కొన్నిచోట్ల వారం రోజులు. గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటికి జలమండలి చార్జీ: రూ.400 (ఐదు వేల లీటర్లు) వాణిజ్య అవసరాలకు తరలిస్తున్న నీటికి జలమండలి చార్జీ: రూ.700 (ఐదువేల లీటర్లు) జలమండలి పరిధిలో ట్యాంకర్లు: సుమారు వెయ్యి. మరో 200 ఉచిత ట్యాంకర్లు ప్రైవేటు వ్యాపారులు ప్రతి ట్యాంకర్‌కు వసూలు చేస్తున్న చార్జీ: రూ.1000 నుంచి రూ.1500 -
ఎండిపోయిన పెన్నా
లింగంపల్లిలో 16 అడుగులకు పడిపోయిన భూగర్భ జల మట్టం కడప నగరంలో తీవ్రతరం కానున్న నీటి ఎద్దడి ఎండిపోయిన పెన్నా కడప కార్పొరేషన్: పెన్నా నది ఎండి పోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో కడప నగరానికి తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. అధికమవుతున్న ఎండలకు, వడగాల్పులకు తేమ ఆవిరైపోతోంది. దీంతో నెలకు ముందే మంచి నీటి గండం కడపను పలకరిస్తోంది. కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. ఓ వైపు వర్షాలు కురవక పోవడం, మరోవైపు ఇసుకాసురుల విజృంభిస్తుండటం వల్ల భూగర్భ జలాలు కూడా అదే రీతిలో అడుగంటిపోతున్నాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కడప నగరంలో 3.40 లక్షల జనాభా ఉంది. తాగునీటి పైపులైన్లు సుమారు 490 కీ.మీల మేర విస్తరించి ఉన్నాయి. 30,600 కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. ప్రజలకు తగిన మోతాదులో నీరు సరఫరా చేయాలంటే ప్రతిరోజూ 56.84 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీరు అవసరం. కాగా పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్డీలు లభ్యమయ్యేవి. ప్రస్తుతం గండి, లింగంపల్లిలో భూగర్భ జలాలు 16 అడుగులకు పడిపపోయాయి. దీంతో కేవలం 46 ఎంఎల్డీల నీరే సరఫరా అవుతోంది. గంజికుంట కాలనీ, ప్రకాష్‌నగర్, నకాష్, ఖలీల్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సరోజినీ నగర్, శివానందపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఊటుకూరు, సాయిప్రతాప్ నగర్లతోపాటు నగర శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికైతే అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో 11 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాగే కొనసాగితే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం లేకపోలేదు. వెలిగల్లు నుంచి నీటిని తెచ్చేందుకు ప్రయత్నాలు వేసవిలో నీటిఎద్దడి తలెత్తిన ప్పుడల్లా వెలుగోడు నుంచిగానీ, అలగనూరు రిజర్వాయర్ నుంచిగానీ పెన్నాకు నీటిని విడుదల చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అలగనూరు రిజర్వాయర్‌లో 1.6 టీఎంసీల నీరే ఉంది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేసినా దూరం ఎక్కువగా ఉండటం వల్ల నీరు పెన్నాలోకి చేరే సరికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అధికారులు వెలిగల్లు నుంచి నీటిని విడుదల చేయించేందుకు కలెక్టర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెలిగల్లులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని చక్రాయపేట, గండి, కమలాపురం, పాపాఘ్ని ద్వారా 70 కి.మీ తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, వెలుగోడు రిజర్వాయర్ నుంచి పెన్నాకు స్వల్ప పరిమాణంలో నీరు వదిలారు. ఆ నీరు గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్‌కు చేరేసరికి కనీసం 15 రోజులు పట్టే అవకాశం ఉంది. మధ్యమధ్యలో రైతులు వేసే అడ్డుకట్టలను తొలగిస్తూ కడపకు నీటిని తీసుకురావలసి ఉంది. నీరు సకాలంలో గండి, లింగంపల్లికి చేరితే మళ్లీ బోర్లు రీచార్జి అయ్యే అవకాశం ఉంది. -
గొంతెండుతోంది!
పాలమూరులో వేసవికి ముందే దాహం..దాహం ► అల్లాడుతున్న గ్రామ, నగరవాసులు ► భవిష్యత్‌లో గుక్కెడు నీటికీ కష్టకాలమే ► గరిష్ట స్థాయికి పడిపోయిన భూగర్భ జలాలు ► వట్టిపోతున్న బోర్లు, బావులు ► ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో ఖాళీ అయిన జలాశయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో కరువు కోరల్లో చిక్కుకున్న జిల్లా ప్రజలకు ఈసారి గొంతు తడవడం సైతం గగనంగా మారింది. ప్రతి సంవత్సరం నీటిఎద్దడి జిల్లాలో షరా మామూలే అయినా ఈసారి అప్పుడే తాగునీటిని అందించే జలాశయాలు ఎండిపోవడం.. ఎప్పుడూ లేనంతగా భూగర్భజలాలు అడుగంటడంతో ప్రజల దాహం తీరే పరిస్థితి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. జిల్లాలో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి వందకోట్ల రూపాయలను కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించినా.. దీనికి సంబంధించిన నిధులు క్షేత్రస్థాయికి రాకపోవడంతో పనులు ప్రా రంభం కాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని అనేక మండలాల్లో భూగర్భ జ లాలు వందల అడుగుల లోతుల్లోకి వెళ్లా యి. ఏ జలాశయం చూసినా ఏమున్నదోయ్ గర్వకారణం అన్న రీతిలో గుక్కెడు నీ టిని అందించలేని స్థితిలో ఎండిపోతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీటి నిల్వలు జిల్లా ప్రజల దాహార్తిని ఎన్ని రోజులు తీ రుస్తాయో అనుమానాస్పదంగానే ఉంది. ముందస్తు ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా జలాశయాల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం ఎన్ని నెలలు వినియోగించుకోవచ్చన్న అంశంపై సరైన ప్రణాళికలతో కసరత్తు చేయాల్సిన అధికారులు దానిపై పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో పట్టణ వాసులతో పాటు పల్లె గొంతుకలు ఇప్పటికే ఎండిపోతున్నాయి. అడుగంటిన నీటి నిల్వలు మహబూబ్‌నగర్‌తో పాటు అనేక మున్సిపల్ ప్రాంతాల్లో కనీసం 10 రోజులకొకసారి తాగునీటిని సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాకు తాగునీరు అందించే జూరాల, రామన్‌పాడు, కోయిల్‌సాగర్‌లో రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటి పోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రామన్‌పాడు ద్వారా ఇప్పటికే జడ్చర్ల, అచ్చంపేట పట్టణాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. భూగర్భ జలాలు అడుగంటి నీటిని పంపించే పరిస్థితి లేకపోవడంతో ఆ రెండు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే నాలుగు నెలలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో సామాన్య ప్రజలకే అంతుబట్టడం లేదు. సాధారణంగా జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు పై ప్రాంతాల నుంచి వరదనీరు వస్తేనే ఆయా సమయాల్లో జిల్లా ప్రజల గొంతు తడుస్తుంది. రెండేళ్లుగా జూరాల జలాశయానికి వరద నీరే లేకపోవడంతో ఉన్న నీరునే రాజకీయ కారణాలతో పంటలకు ఉపయోగించేలా ఒత్తిళ్లు రావడంతో ఇ ప్పుడు తాగునీటికి కటకట ఏర్పడింది. ఇ దే పరిస్థితి మహబూబ్‌నగర్, మున్సిపాలిటీలైన వనపర్తి, గద్వాల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో నెలకొంది. కోయిల్‌సాగర్‌లో తగ్గిన నీటిమట్టం దేవరకద్ర : కోయిల్‌సాగర్‌లో ప్రస్తుతం 12.8 అడుగుల మేర నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగ పాత అలుగు స్థాయి నీటి మట్టం 26.6 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటిని పాలమూరు ప్రజల తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేసి ఉంచారు. ర బీ సీజన్ పంటలకు నీటిని వదిలేది లేదని అధికారులు ఇంతకుముందే ప్రకటించారు. అయితే తాగు నీటి అవసరాల కోసం వాగు ద్వారా కొంతమేర నీటిని వదలాలని వాగు పరీవాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
సందిగ్ధం
ప్రస్తుత సాగర్ నీటిమట్టం 508 అడుగులు ముందు తాము వాడుకుంటామంటున్న తెలంగాణ ప్రభుత్వం మంచినీటి కోసం ఎదురుచూస్తున్న కుడికాలువ పరిధి ప్రజలు 1న నీరు వదిలితేనే కోటప్పకొండ తిరునాళ్లకు సరఫరా నరసరావుపేట వెస్ట్ మంచినీటి అవసరాల నిమిత్తం తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు రెండూ 12 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఇప్పటికే ఎడమ కాలువకు, కృష్ణాడెల్టా అవసరాలకు నీరు విడుదల చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజల మంచినీటి అవసరాల కోసం 6 టీఎంసీల నీరు అవసరమని ఎన్ఎస్పీ అధికారులు ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి మున్టిపాల్టీల పరిధిలోని రిజర్వాయర్లు నీరు లేక ఒట్టిపోయాయి. ఆయా మున్సిపాల్టీల్లో రోజు మార్చి రోజు, మూడు రోజులకు ఒకమారు, వారానికి ఒక మారు మంచినీరు సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లకు నీరు అందడం లేదు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 508 అడుగులు ఉంది. ఈ మట్టం 495 అడుగులకు తగ్గితే హైదరాబాద్‌కు నీటి సరఫరా సాధ్యం కాదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆ మట్టం వరకు ముందుగా తాము వినియోగించుకుంటామని, ఆ తర్వాత మీరు వాడుకోవచ్చని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ఫిబ్రవరి నెలాఖరుకు విడుదల కావాల్సిన నీరు ఆగిపోయింది. కోటప్పకొండ తిరునాళ్ల నాటికైనా నీరు చేరేనా..? ప్రస్తుతం రెండు టీఎంసీలకు పైగా నీటినిల్వకు ఆస్కారం ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్ ఒట్టిపోయింది. సాగర్ నుంచి నీరు విడుదలైతే బుగ్గవాగు రిజర్వాయర్ నిండేసరికే రెండు నుంచి మూడురోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి నరసరావుపేటకు చేరుకునేసరికి మరో రెండు మూడురోజులు పడుతుంది. కాలువ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి మోటార్లతో తోడేందుకు నరసరావుపేట మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంతరాలను అధిగమించి మార్చి ఒకటిన నీరు విడుదల చేస్తే కోటప్పకొండ తిరునాళ్లకు రెండురోజుల ముందుగా మాత్రమే నీరు అక్కడకు చేరే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా భక్తులు ఇబ్బందిపడతారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తక్షణ సాగర్ నీరు వచ్చేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
పాడుబడ్డ బావిలో పైపైకి గంగమ్మ!
బొంరాస్‌పేట : భూగర్భజలం అడుగంటిపోతూ ఆందోళన కలిగిస్తుంటే ఓ పాడుబడ్డ బావిలో నీరు ఊరుతూ ఆశ్చర్యం కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం చిల్మల్‌మైలారంలో ఓ రైతు పొలంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో రెండువారాలుగా నీరు ఊరుతుంది. వివరాలు.. గ్రామానికి చెందినబర్ల వెంకటయ్య, రాములు, అంజిలప్ప అన్నదమ్ములు 25ఏళ్ల క్రితం సామూహిక బోర్వెల్ పథకం కింద వ్యవసాయ బోరు తవ్వారు. నీరు పుష్కలంగా రావడంతో ఐదేళ్లపాటు వ్యవసాయం చేశారు. కొన్నాళ్లకు నీరు పూర్తిగా ఇంకిపోవడంతో బాడుబడింది. నెల రోజుల క్రితం ఇదే బావిలో నీటిచెమ్మ మొదలై ప్రస్తుతం రోజుకు 6 ఇంచుల నీరు ఊరుతూ బావి నిండుకొస్తోం -
భూగర్భ ఘోష
సరి‘హద్దులు’ దాటిన దందా పట్టా భూమి ఒడ్డున ఉంటే.. గోదావరిలో ఇసుక తవ్వకాలు నిబంధనలను నదిలోతొక్కుతున్న ఇసుకాసురులు నిత్యం 150 వాహనాల్లో రవాణారోజుకు లక్షలు దండు కుంటున్న అక్రమార్కులు టీఎస్ఎండీసీ పేరుతోకాంట్రాక్టర్లకు కాసులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :చెన్నూరు వద్ద గోదావరిలో సాగుతున్న ఇసుక దందా సరి‘హద్దులు’ దాటిందా? పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు నదిలో ఉన్నట్లు చూపి తవ్వకాలకు తలుపులు బార్లా తీశారా? ఈ క్రమంలో రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములు ఒక చోట ఉంటే, బడా ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ఆ భూములు నదిలో ఉన్నట్లు తేల్చి ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చెన్నూరు గ్రామ శివారులోని సర్వే నెం.230లో 1.12 ఎకరాల్లో 12 వేల క్యూబిక్ మీటర్లు, 227, 227/1లోని 29 గుంటల్లో 6,750 క్యూబిక్ మీటర్లు, అలాగే సర్వే నెం.231లోని 2.19 ఎకరాల్లో మరో 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అధికారులు డిసెంబర్లో అనుమతులు కట్టబెట్టిన విషయం విధితమే. ఆదిలాబాద్ :జిల్లాలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే విధంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా.. ఈ అనుమతుల పేరుతో చేపడుతున్న ఇసుక దందా ఇప్పుడు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అన్న చందంగా నడుస్తోంది. నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల వరకు భారీ వాహనాల్లో ఇసుకను తరలించి రూ.లక్షలు గడిస్తుంటే, అధికార యంత్రాంగం మామూళ్లతో జేబులు నింపుకుంటోంది. అయితే.. ఈ పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు మాత్రం నదిలో ఉన్నట్లు తేల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలే చోటు చేసుకున్నాయి. జైపూర్ మండల పరిధిలో కూడా పట్టా భూముల పేరుతోనే నది గర్భాన్నంతా తొలిచేసే వరకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని కళ్లు మూసుకున్న అధికారులు, అంతా అయ్యాక విచారణల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. నిత్యం రూ.లక్షల్లో... నగరాల్లో ఇసుక ఇప్పుడు బంగారమైంది. ఒక్కో టన్నుకు రూ.వేలల్లో ధర పలుకుతోంది. ఈ ఇసుక రీచ్ నుంచి నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. ఒక్కో లారీలో 15 నుంచి 20 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు తరలించి నిత్యం రూ.లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలు నదిలో తొక్కుతున్నారిలా.. ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పూర్తిగా నదిలో తొక్కుతున్నారు. జీవనదిగా పేరున్న గోదావరిని భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. పేరుకు టీఎస్ఎండీసీ అయినప్పటికీ, బడా ఇసుక కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించకూడదు. కూలీల చేత ఇసుకను తవ్వించి, డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి ఇసుకను తరలించాలి. డంప్ యార్డుల్లో ఇసుక లోడ్ చేసేందుకు యంత్రాలను వాడవచ్చు. కానీ.. ఇక్కడ భారీ యంత్రాలతో నది గర్భాన్ని తొలిచేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లయినర్లతో ఇసుకను తోడేస్తున్నారు.నిర్ణీత లోతుకు మించి ఇసుక తవ్వరాదు. కానీ.. భూమి కనిపించే వరకు తవ్వుతుండటంతో నదిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ గోతుల్లో పడి స్థానికులు చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇసుక తవ్వకాలు జరుపుతున్న చోట్ల టీఎస్ఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ.. అవేవీ లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అటువైపు కన్నెత్తి చూస్తున్న నాథుడే లేకుండా పోవడంతో ఇష్టారాజ్యం కొనసాగుతోంది.రాత్రి ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ.. పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.ఈ ఇసుక రవాణా చేసేందుకు పర్మిట్లు మంజూరు గనుల శాఖకు ఉండేది. కానీ.. టీఎస్ఎండీసీకి లీజుకిచ్చాక.. పర్మిట్ల మంజూరు కూడా ఆ సంస్థే జారీ చేస్తోంది. దీంతో ఒక్కో వే బిల్లుపై పదుల సంఖ్యలో భారీ వాహనాలు రవాణా అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక్కో వాహనంలో పరిమితికి మించి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలను తనిఖీ చేసిన దాఖలాల్లేవంటే రవాణా శాఖకు కూడా ఏ స్థాయిలో ముడుపులందుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు
వేములపల్లి మండలం సల్కునూరు గ్రామ సమీపంలో ఉన్న పాలేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సల్కునూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. నిత్యం ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, రేయింబవళ్లు గ్రామంలో ట్రాక్టర్లు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు 10 ట్రాక్టర్లకు అనుమతి ఇస్తే దళారులు 50 ట్రాక్టర్లలో ఇసుక నింపుకుని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడంతో కూలీలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
బాల్యమంతా నీళ్ల మోతే
బడిక ఎగనామం..నీటికి కోసం పక్క గ్రామం నిత్యం తప్పని నీటి పాట్లుఖేడ్’ తండాల్లోవిద్యార్థుల నీటి గోసక్షేత్రస్థాయిలో‘సాక్షి’ పరిశీలన విద్యార్థి.. స్కూల్ బ్యాగు మోస్తేనే దేశ పార్లమెంటు చలించి పోయింది. పుస్తకాల మోతతో విద్యార్థి బాల్యం బరువెక్కుతోందని ఉభయ సభలు తల్ల‘ఢిల్లి’పోయాయి. బ్యాగు బరువును దించాల్సిందేనని ఎంపీలు అంతా ఏకాభిప్రాయానికి వచ్చి ‘యశపాల్ కమిటీ’ వేశారు.. ఇదీ ఢిల్లీ, హైదరాబాద్ మెట్రో నగరాల్లోని విద్యార్థులకు దొరికిన భరోసా... ఇదిగో...వీళ్లూ విద్యార్థులే. నారాయణఖేడ్ తండాల్లో పుట్టారు. నీళ్ల కోసం స్కూల్ బ్యాగ్‌ను మూలకు పడేశారు. గుక్కెడు నీళ్ల కోసం బడికి ఎగనామం పెట్టి వ్యవసాయ బోరు బావుల దగ్గర పడిగాపులు గాస్తున్నారు. బ్యాగు బరువు కాదు...తమ కంటే మూడింతలు బరువుండే నీళ్ల బిందలతో కిలో మీటర్లు నడుస్తున్నారు. మెడ ఎము కలు చిట్లి పోతున్నా...వెన్నెముక వంగిపోతున్నా ఏ పాలకుడు ఇంత వరకు ఈ విద్యార్థుల వైపు కన్నెత్తి చూడలేదు. విద్యార్థుల నీళ్ల కష్టాలు అసెంబ్లీ వరకైనా తీసుకుపోతాననే భరోసా ఇవ్వలేదు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎండాకాలం వస్తే మంజీర ఎండిపోతుంది. వాగులు, చెరువులు బావుల్లో చుక్కనీరు ఉండదు. బోర్లు ఎండిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. నీళ్ల కోసం జనం వలస బాట పడతారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పల్లెల్లో ఏళ్లకేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇప్పటి వరకు ఏ పాలకుడు ప్రజల కష్టాల వైపు చూడలేదు. గుక్కెడు నీళ్లు తెచ్చి జనం గొంతు తడిపే ప్రయత్నం చేయలేదు. ఇక్కడి జనం కూడా అంతే..! పాలకుల మీద ఆశలు పెట్టుకోకుండా వలసలను నమ్ముకుంటున్నారు. బడికి వెళ్లే పిల్లలను, వయసు మీద పడిన తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలేసి భార్యాభర్తలు ముంబాయి, దుబాయి, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసపోయారు.ఈ ఏడాది దాదాపు 25 వేల కుటుంబాలు వలస పోయినట్లు అంచనా.సాక్షి ప్రతినిధుల బృందం రెండు రోజులుగా దాదాపు 45 గ్రామల్లో, గిరిజన తండాల్లో పర్యటించింది. ప్రతి గ్రామంలో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు నీళ్ల కోసం స్కూల్‌కు గైర్హాజరయ్యారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్, కల్హేరు మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉంది. భార్యభర్తలు, యువతీయువకులు వలసలు పోయి పల్లెలు బోసిపోయి ఉన్నాయి. వయసు మళ్లిన వృద్ధులు, బడికి వెళ్లే పిల్లలు మాత్రమే తండాల్లో కన్పించారు. కంగ్టి మండలం చాప్టా(బీ) గ్రామ తుకారం తండాలో.. స్కూల్ యూనిఫాంతో నెత్తిన నీళ్ల బిందులు బోస్తూ... నిక్కి నీలిగి నడుస్తున్న విద్యార్థుల గుంపులు కన్పించాయి . ‘ స్కూల్ లేదా’ అని సాక్షి ప్రతినిధి పలకరిస్తే.. బడి ఉంది గాని, ‘నీళ్ల కోసం బడికి పోలేదు సార్’ అని సమాధానం చెప్పారు. ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు అని అడిగితే...‘నిజామాబాద్ జిల్లా విఠల్‌వాడీ తండా నుంచి తెచ్చుకుంటున్నాం’ అని చెప్పారు. తుకారం తండాకు విఠల్‌వాడీ తండా దాదాపు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంతకు ముందు సర్ధార్ తండాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ తండాలో దాదాపు 117 మంది విద్యార్థులు వలస వెళ్లగా.. 25 మంది విద్యార్థులు నీళ్ల కోసం బడి మానేశారు. వయసులో ఉన్న వారంతా పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లగా.. గ్రామాల్లో వృద్ధులు మాత్రమే ఉండటంతో పిల్లలకు నీటి కష్టాలు తప్పటం లేదు. పెద్దశంకరంపేట మండలం కోళాపల్లి, మల్కాపూర్, జి.వెంకటాపూర్, కమలాపూర్, బూర్గుపల్లి, తమ్మలకుచ్చ తండా, బూర్గుపల్లి తండాలతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తల్లిదండ్రులు పనులు, వలసలు వెళ్లడంతో పిల్లలు నీళ్లు మోస్తూ కనిపించారు. నారాయణఖేడ్ మండలంలోని పంచగామ, పైడిపల్లి, తుర్కాపల్లి, ర్యాకల్, నిజాంపేట్, హన్మంత్‌రావుపేట్ తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు బడి మాని నీళ్ళు మోస్తున్నారు. వచ్చిరానీ కొద్దిపాటి నీటికోసం వేచి ఉండడం, ఒకరికి ఒక బిందె మాత్రమే నీరు పట్టుకొనే పరిస్థితి ఉండడంతో ఇంట్లో ఉన్న తమ ఆడపిల్లలను తల్లిదండ్రులు బడిమానిపించి నీరుమోయిస్తున్నారు. కుళాయి, బోరుబావి వద్ద గంటలపాటు వేచి ఉండడంతో బడి మానక విద్యార్థులకు తప్పడంలేదు. మనూరులో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది.ఇంట్లో నీళ్లు అయిపోయాయంటే వారు ఆరోజు పాఠశాలకు వెళ్లడం మానెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనూరు మండలం మాయకోడ్ గ్రామంలో బోరుబావుల వద్ద స్కూల్ యూనిఫాంతో ఖాళీబిందెలతో నిలబడిన సాయికుమార్ అనే విద్యార్థి క న్పించాడు, ‘బడికి వెళ్లలేదా?’అని అడిగితే ‘రాత్రి నీళ్లు దొరకలేదు సారు.. పొద్దున బడి మానేసి నీళ్లకు వచ్చిన. ఇంకా కరెంటు రాలేదు, కరెంటు వచ్చాక నీళ్లు తీసుకొని పోతా నని చెప్పాడు. వారంలో రెండు మూడు సారు బడి మానేసి నీళ్ల కోసం వస్తున్నట్టు సాయికుమార్ చెప్పాడు. బోరుబావి యజమానికి నీళ్లు తీసుకోనివ్వకపోతే మరో కిలో మీటర్ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పాడు. ఉపాధ్యాయుల పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లి నీళ్లు నింపి మళ్లీ పాఠశాలలకు వెళుతున్న సంఘటన అనేకంగా నెలకొంటున్నాయని పాఠశాలల ఉపాధ్యాయులు సాక్షి ప్రతినిధికి చెప్పారు. -
మోటార్!
భారీగా పెరిగిన మోటార్ల ధర ఒక బోరుకు మోటారు అమర్చాలంటే రూ.1.5 లక్షలకు పైమాటే అప్పుల వేటలో రైతులు పట్టించుకోని బ్యాంకర్లు జిల్లాలోని పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం వంద అడుగుల్లోనే పుష్కలంగా నీరు లభిస్తోంది. వర్షాభావం కారణంగా వలస వెళ్లిన రైతులు ప్రస్తుతం స్వగ్రామాలకు చేరుకుని సేద్యంబాట పట్టారు. గతంలో నీళ్లు రాక వదిలేసిన బోర్లకు మోటార్లు బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో బోరు మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు ఒక్కసారిగా మోటార్ల రేట్లను పెంచి అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు. పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో బోరు మోటార్ల ధరలు భారీగా పెరిగాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూస్తున్నారు.రూ.1.5 లక్షలుంటేనే గంగ పైకొస్తుంది బోర్లలో ప్రస్తుతం భూగర్భజలాలు సుమారు వంద అడుగులకు చేరాయి. 20 అడుగుల ఇనుప పైపులు కనీసం 20 వరకు వేయాలి. ఒక్కో పైపు ప్రస్తుతం రూ.2 వేలు. ఆ లెక్కన రూ.40 వేలవుతుంది. ఈ పైపులకు అమర్చే 20 కప్లింగ్‌లకు రూ.3 వేలు, బోరులోకి వేసే కేబుల్ వైరు రూ.5 వేలు, బోరు స్టార్టర్ రూ.14 వేలు, 12.5 హెచ్‌పీ 15 స్టేజీల మోటారు కంపెనీది అయితే రూ.70 వేలు, 15 హెచ్‌పీ మోటార్, 20 స్టేజీల పంపు అయితే రూ.85 వేలు, ఒకవేళ లోకల్ మోటార్, పంపులైతే రూ.50 నుంచి రూ.60 వేల వరకు అవుతోంది. ఇక బోరు నుంచి నీటి ట్యాంకు వరకు పైపులకు రూ.20 వేలు, మిగిలిన ఖర్చులు మరో రూ.8 వేలు ఇవన్నీ కలుపుకుంటే సుమారు రూ.1.50 లక్షలకు పైమాటే. పుట్టని అప్పులు.. పట్టించుకోని బ్యాంకర్లు ఓ వైపు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు పుట్టకపోవడం మరోవైపు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఇవ్వకపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి భూములు తనఖా పెట్టడమో, లేదా అధిక వడ్డీలకు అప్పు చేయడమో చేస్తున్నారు. సుమారు 30 శాతం మంది రైతులు పండే పంట ఫలసాయం వ్యాపారులకు ముట్టజెప్పేలా ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకుని మోటార్లు బిగించుకుంటున్నారు. భారీగా పెరిగిన మోటార్ల ధర మోనోబ్లాక్ పంప్‌సెట్స్ 2014 ఆగస్టు వరకు 5హెచ్‌పీ మోటారు రూ.12 వేల రూపాయలుండేది. ఇదే మోటారు ఇప్పుడు రూ.16,600 పలుకుతోంది. 7.5హెచ్‌పీ రూ.14 వేల నుంచి రూ.20,000కు చేరింది. మోనోబ్లాక్ సబ్మెర్సిబుల్ మోటార్లు 7.5హెచ్‌పీ 10 స్టేజీల మోటారు రూ.35వేల నుంచి రూ.65వేలు, 12 హెచ్‌పీ 15 స్టేజ్‌లు రూ.41 వేల నుంచి రూ.69 వేల వరకు చేరింది. 15హెచ్‌పీ 22 స్టేజ్‌లు గతంలో రూ.70 వేలు ఉండగా ప్రస్తుతం రూ.89 వేల వరకు పెరిగింది. ఇదే స్థాయిలో సెకండ్ హ్యాండ్ మోటార్ల ధరా పెరిగింది. గతంలో నీళ్లురాని బోర్ల నుంచి ఊడదీసిన మోటార్లను రైతులు ఒకటికి సగానికి అమ్ముకోగా ఇప్పుడు వాటికి మెరుగులు దిద్ది మెకానిక్‌లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. -
కాసుల కోసం కట్ట తెగ్గొట్టారు!
బరితెగించిన అధికార పార్టీ నేతలు కాంట్రాక్టు పనుల కోసం కట్టమంచి చెరువుకు గండి సహకరించిన కార్పొరేషన్ అధికారులు వేసవిలో చిత్తూరు నగరానికి నీటి సమస్య? ప్రజల ఆగ్రహం కరువు సీమలో చాలా ఏళ్ల తర్వాత కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. భూగర్భ జలాలూ పుష్కలమయ్యాయి. అయితే చెరువుల్లో పూడిక తీసేందుకు కాంట్రాక్టులు దక్కించుకున్న తెలుగుదేశం నాయకులు బరితెగించారు. డబ్బులు మంజూరైందే తడవుగా చెరువు కట్టలను తె గ్గొట్టారు. ముందూ వెనకా చూడకుండా నీటిని వృథాగా వదిలేస్తున్నారు. నాయకులు తమ జేబులు నింపుకోవడానికి ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చిత్తూరు (అర్బన్): ఇటీవల చిత్తూరు లో విస్తారంగా వర్షాలు కురవడంతో నగరంలోని కట్టమంచి చెరువు పూర్తిగా నిండింది. అయితే కట్టమంచి చెరువులో పూడిక తీసి బోటింగ్ ఏర్పాటు చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆదేశించడంతో కార్పొరేషన్ అధికారులు, పాలకులు కలిసి చెరువు కట్టను తెగ్గొట్టి నీళ్లను మురుగునీటి కాలువలో బయటకు వదిలేశారు. చిత్తూరు నగరంలో అధికారపార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పేరుకు సీఎం సొంత జిల్లా అయినా... టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో చిత్తూరు నగరం అభివృద్ధికి దూరంగానే ఉంది. వేసవి వస్తోందంటే నగర వాసులకు కన్నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 1.82 లక్షల జనాభా ఉన్న చిత్తూరు నగరానికి రోజుకు 22 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. కానీ కార్పొరేషన్ అధికారులకు ప్రజలకు ఇస్తున్నది సగటున 15 లక్షల లీటర్ల నీళ్లు మాత్రమే. అది కూడా 120 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న కార్పొరేషన్ యంత్రాంగం నెలకు రూ.44 లక్షలు కరువు నిధులను ట్యాంకర్లకు అద్దె రూపంలో చెల్లిస్తోంది. మిగిలిన 7 లక్షల లీటర్ల నీళ్లను ప్రజలు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఇంత నీటి ఎద్దడి ఉన్న చిత్తూరు నరంలో మూడు నెలల క్రితం విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు నిండాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. అప్పటి మేయర్ కటారి అనురాధ(టీడీపీ) కార్పొరేషన్ సాధారణ పద్దుల నుంచి నగరంలోని కట్టమంచి చెరువుపై కాసుల కోసం కట్టతెగ్గొట్టారు! 8 బోర్లు డ్రిల్ చేయడానికి ప్రతిపాదించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.20 లక్షల వ్యయంతో చెరువు కట్టపై బోర్లు వేసి ప్రజలకు నీళ్లందిస్తూ 60 అద్దె నీటి ట్యాంకర్లను తగ్గించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మేయర్ హత్యకు గురవడం తెలిసిందే. అయితే కట్టమంచి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయాలని, నీరు-చెట్టు కింద పూడిక పనులు చేయించాల్సి ఉందని వెంటనే చెరువులో నీళ్లను ఖాళీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే డీఏ.సత్యప్రభ (టీడీపీ) ఆర్డీవో, కార్పొరేషన్ అధికారులకు గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వేసవి కాలం, రూ.20 లక్షలతో వేసిన బోర్లు ఎందుకూ పనికిరాకుండాపోయి ప్రజలకు నీటి కష్టాలు వస్తాయనే విషయాలు అధికారులకు తెలిసినా ఎదురు చెప్పలేక కట్టమంచి చెరువును తెంపేశారు. ప్రస్తుతం ఇక్కడున్న నీళ్లన్నీ మురుగునీటి కాలువలో కలిసి వృథాగా పోతున్నాయి. దీనిపై అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి గండి కొట్టిన ప్రాంతాన్ని పూడ్చేస్తే, పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ అధికారులు మళ్లీ చెరువుకు గండి కొట్టి నీళ్లను బయటకు పంపేస్తున్నారు. ప్రతీ వ్యక్తి ఇంకుడు గుంతలు తవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు ఊదరగొడుతుంటే సొంతలాభం కోసం అదేపార్టీకి చెందిన నాయకులు ఇలాంటి పనులు చేయడంపై చిత్తూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దక్కన్..ఇదేం పని
• పంటకాలువల్లోకి రసాయనాలు విడుదల • భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం • యాజమాన్యం పోకడపై స్థానికుల ఆందోళన నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేట మండలం కేశవరం దక్కన్ ఫైన్‌కెమికల్స్‌లో ఇటీవల దగ్ధమైన రసాయనాలను యాజమాన్యం దూర ప్రాంతాలకు తరలించ కుండా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వదిలేసింది. దీని వల్ల భూగర్భజలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరైన భద్రత చర్యలు తీసుకోకుండా తరచూ ప్రమాదాలకు నిలయమైన ఈ కంపెనీపై ఇప్పటికే పరిసర గ్రామాల్లోనివారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో రసాయనాలు నిల్వచేసే గోదాము దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రమాదకరమైన రూ.కోట్ల విలువైన రసాయనాలు(పారాసిస్ అనే ద్రావణంగా తెలుస్తోంది.) ముడిసరకులు దగ్ధమయ్యాయి. అప్పట్లో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి నీటిని వెదజల్లడంతో రసాయనాలన్నీ కంపెనీ ఆవరణ అంతా ప్రవహించాయి. వీటిని శుద్ధిచేసి దూరప్రాంతాలకు తరలించాలని, ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీని సందర్శించిన కాలుష్యనియంత్రణ మండలి అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించారు. కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఉంచి శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంది. అధికారులు కూడా ఇవే సూచనలు చేశారు. దీనిని యాజమాన్యం పెడచెవినపెట్టింది. కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులను పీల్చి అనారోగ్యం బారినపడుతున్నామని, కంపెనీ మూసేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా యాజమాన్యం గుణపాఠాలు నేర్వలేదు. ఆందోళనలు చల్లారకముందే పుండుమీద కారం చల్లినట్టుగా దగ్ధమైన రసాయనాలను పక్కనే ఉన్న పంటకాలువలోకి వదిలారు. అది కంపెనీ పక్కనే ఉన్న గజపతినగరం ఎస్సీ కాలనీ మీదుగా ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరుతోంది. ఈలోగా రసాయనాలు భూమిలో ఇంకి భూగర్బ జలాలు కలుషిత మయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలువను ఆనుకుని ఉన్న పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వర్షాలుపడితే అపరాలు, తదితర పంటలు వేస్తారు. ఎస్సీకాలనీని ఆనుకుని కాలువ ఉండటంతో రసాయనాలు భూమిలోకి ఇంకి బోర్లు, బావుల్లోనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అలాగే కాలువలో ప్రవహిస్తున్న రసాయనాలనుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటున్నారు. ఈ రసాయనాలు సముద్రంలో కలవడంతో మత్య్ససంపద కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై కాలుష్యనియంత్రణమండలి అధికారులుకు ఫిర్యాదుకు ఆయా గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. శుద్ధిచేసినా, చేయకపోయినా దగ్ధమైన ప్రమాదకర రసాయనాలను కంపెనీ పరిసరప్రాంతాల్లో వదలడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు. -
మున్ముందు ముప్పే
పడిపోతున్న భూగర్భ జలాలు మారిన వాతావరణ పరిస్థితులతో కరువు ఛాయలు ‘‘నిండుకుండలా కళ కళలాడే చెరువులు... ఇప్పుడు వెలవెలబోతున్నారుు. అలలతో అలరించే జలాశయూలు.. బావురుమంటున్నారుు. పంట పొలాలతోపాటు నిత్యావసరాలకు అండగా నిలిచే నీటి వనరులు ప్రకృతి ప్రకోపానికి కరిగిపోతున్నారుు. ఫలితంగా రానున్న రోజుల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అరిగోస పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ మార్పులతో నీటి ఎద్దడి నెలకొంటుందని.. కాలగమనంలో విపత్కర పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో గణనీయంగా పడిపోతున్న భూగర్భజలాలపై ప్రత్యేక కథనం -
రబీకి కరువు దెబ్బ
♦ రెండు శాతం కూడా మించని వరి నాట్లు ♦ నవంబర్‌లో 92% లోటు వర్షపాతం నమోదు ♦ వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోంది. పంటల సాగు విస్తీర్ణం ఎన్నడూ లేనంత భారీగా తగ్గిపోయింది. రబీ మొదలై రెండున్నర నెలలు దాటినా... వరి నాట్లు కనీసం రెండు శాతానికి మించి పడలేదు. మొత్తంగా రబీ సీజన్లో 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 8.67 లక్షల ఎకరాల (28%)కే పరిమితమైంది. ఇందులో ఆహార ధాన్యాలు 25.20 లక్షల ఎకరాల్లో సాగుకావాల్సి ఉండగా... 5.37 లక్షల ఎకరాల్లోనే వేశారు. ప్రధాన పంట అయిన వరి సాధారణ సాగు 16.12 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లోనే నాట్లు పడడం పడ్డాయి. అత్యంత దారుణంగా రెండు శాతానికి మించి నాట్లు పడకపోవడం రాష్ట్రంలోని దారుణ పరిస్థితికి కళ్లకు కడుతోంది. ఇక 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3.05 లక్షల ఎకరాల్లో (88%) వేశారు. ఇది మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నూనె గింజల సాగు 51 శాతం జరిగింది. ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా ఉల్లి సాగు విస్తీర్ణం 34 శాతానికి మించకపోవడం గమనార్హం. దీంతో వచ్చే సీజన్లో ఆహార ధాన్యాలతోపాటు ఉల్లి కొరత కూడా రాష్ట్రాన్ని వేధించనుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గత నెల 92 శాతం లోటు ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రబీ ప్రారంభమైన అక్టోబర్ నెలలో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. కురిసింది 24.4 మిల్లీమీటర్లే. అంటే 75 శాతం లోటు నమోదైంది. నవంబర్‌లో సాధారణంగా 27.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా... అత్యంత దారుణంగా 2.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఏకంగా 92 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. మొత్తంగా రబీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. నవంబర్ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.69 మీటర్ల అదనపు లోతులోకి వెళ్లిపోయాయి. దీంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మొత్తంగా రబీ పంటల సాగు పడిపోయిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
పాతాళానికి భూగర్భ జలాలు
రాష్ట్రంలో సగటున 2.69 మీ. లోతుకు పడిపోయిన జలాలు రాష్ట్రంలో కరువు పరిస్థితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి తాజా లెక్కలను వ్యవసాయశాఖ బుధవారం వెల్లడించింది. గత ఏడాది నవంబర్ నెలలో తెలంగాణలో సగటున భూ ఉపరితలం నుంచి 9.70 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే... ఈ ఏడాది నవంబర్‌లో ఏకంగా 12.39 లోతుల్లోకి వెళ్లాయి. అంటే గతంతో పోలిస్తే 2.69 మీటర్ల లోతుల్లోకి దిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో 10.23 మీటర్ల లోతుల్లో జలాలు లభించగా... ఈ నవంబర్‌లో 16.96 మీటర్ల లోతుల్లోకి కూరుకుపోయాయి. ఏకంగా 6.73 మీటర్లు అదనపు లోతుల్లోకి వెళ్లాయి. మెదక్ జిల్లాలో గత ఏడాది 15.57 మీటర్ల లోతుల్లో జలాలు లభిస్తే... ఈ నవంబర్‌లో 21.53 మీటర్లకు పడిపోయాయి. ఏ ఒక్క జిల్లాలోనూ భూగర్భ జలాలు పైకి వచ్చిన దాఖలాలు లేవు. రబీలో 75 శాతం లోటు వర్షపాతం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగానే భూగర్భ జలాలు అడుగంటాయి. రబీ సీజన్లో తెలంగాణలో ఏకంగా 75 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రబీ సీజన్లో ఇప్పటివరకు సహజంగా 128 మిల్లీమీటర్ల (ఎం.ఎం.) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 32 ఎం.ఎం.లే నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన 468.42 టీఎంసీల నీరు నిల్వ ఉండగా... ఈ బుధవారం నాటికి కేవలం 326.12 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. ఒక్క శాతానికి పరిమితమైన వరి నాట్లు... తీవ్రమైన వర్షాభావం ఫలితంగా పంటల సాగు దారుణంగా పడిపోయింది. అన్ని పంటల సాగు కేవలం 26 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా... కేవలం 8.22 లక్షల ఎకరాల్లో (26%) మాత్రమే సాగు జరిగింది. అందులో ఆహారధాన్యాల సాగు 25.20 లక్షల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... కేవలం 4.97 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి నాట్లు కేవలం ఒకే ఒక్క శాతానికే పరిమితమయ్యాయి. -
పంటా పోయె.. పాడీ పోయె..!
♦ రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దుర్భరం ♦ వర్షాభావంతో దెబ్బతిన్న పంటలు.. ♦ పాతాళానికి చేరిన భూగర్భ జలాలు పశువులను తెగనమ్ముకుంటున్న రైతులు మేపడానికి మేతలేదు.. తాగించడానికీ నీరు కరువు వేల సంఖ్యలో కబేళాలకు తరలుతున్న మూగ జీవాలు ఎక్కడ చూసినా బీడుగా కనిపిస్తున్న సాగు భూములు రాష్ట్రవ్యాప్తంగా 350కిపైగా మండలాల్లో కరువు.. ప్రభుత్వం ప్రకటించినది 231 మండలాల్లోనే సాక్షి ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో రైతుల ప్రధాన ఆదాయ వనరులు పత్తి, వరి పంటలే. కానీ ఈ సేద్యమే రైతన్నల ప్రాణాలనూ బలి తీసుకుంటోంది. కరువు పరిస్థితులే దీనికి కారణం. అటు ఖరీఫ్‌లోనూ, ఇటు రబీలోనూ వానలు ముఖం చాటేశాయి. అధికారిక గణాంకాల ప్రకారమే... ఈ ఏడాది వర్షపాతం గతేడాది కంటే దాదాపు 41 శాతం తక్కువ. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 713.6 మిల్లీమీటర్లు కాగా... ఈ ఏడాది ఖరీఫ్‌లో 14 శాతం తక్కువగా నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా మైనస్ 45 శాతం తక్కువగా నమోదైంది. ఇక రబీ సీజన్ (అక్టోబర్-నవంబర్ నెలల్లో) సాధారణ వర్షపాతం 112.1 మిల్లీమీటర్లుకాగా.. ఈ నెల 26వ తేదీ నాటికి కురిసింది 24.2 మిల్లీమీటర్లే. అంటే ఇది ఏకంగా 78 శాతం తక్కువ. వ్యవసాయ శాఖ మంత్రికి చెందిన నిజామాబాద్ జిల్లాలో మొత్తం 36 మండలాలను కరువు కబళించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో 46 మండలాల్లో కరువు నెలకొంది. పాలమూరులో పల్లెలన్నీ ఖాళీ.. దేశంలోని కరువు జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ జిల్లాలో మొత్తం 64 మండలాలను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న కల్వకుర్తి సమీపంలోని కొండారెడ్డిపల్లిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ గ్రామంలో ఉపాధి లేక 80 శాతం మంది వ్యవసాయ కూలీలు హైదరాబాద్, ముంబైలకు తరలివెళ్లారు. ఏ పని చేయలేని వృద్ధులు మాత్రమే పల్లెల్లో కనిపిస్తున్నారు. నాగర్‌కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతాల్లో ఇళ్లలో బోర్లు కూడా ఎండిపోయాయి. తన ఆరెకరాల బత్తాయి తోటకు నీరు అందే అవకాశం లేక కళ్ల ముందే ఎండిపోతోందని ఆ గ్రామానికి చెందిన కాయితీ మురళీధర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వలసలు నివారించడానికి ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఈ ఏడాది 55 శాతం కూడా అమలు కాలేదు. వారానికి రెండు రోజులు కూడా ఉపాధి చూపడం లేదని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడుగుల ప్రజలు చెప్పారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచీ వలసలు పెరిగాయి. మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ‘‘సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో మొదలయ్యే వలసలు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే మొదలయ్యాయి. నవంబర్ మొదటి వారానికే గ్రామీణ ప్రాంతాల్లోని 70 శాతం వ్యవసాయ కూలీలు, 40 శాతం మంది రైతులు పట్నం బాట పట్టారు. గ్రామాల్లో పిల్లలు, వృద్ధులే ఉన్నారు..’’ అని ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఒకరు చెప్పారు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్ల మార్గంలో 70 నిమిషాల పాటు ప్రయాణించిన ‘సాక్షి’ ప్రతినిధికి పశువులను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న 11 వాహనాలు కనిపించాయి. ఓ వాహనాన్ని ఆపి పశువులను ఎక్కడికి తీసుకువెళుతున్నారని అడిగితే.. డ్రైవర్ తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ‘‘దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. 15 వేలు ధర పలికే గొడ్డుకు ఆరు వేలు ఇస్తున్నారు. వాటికి మేత లేక వదిలించుకుంటున్నాం. బెంగళూరుకు తీసుకువెడుతున్నామని అంటున్నారు..’’.. అని రోడ్డు మీద పశువులను మేత కోసం తిప్పుతున్న ఏనుబోతుల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పాడి ఇచ్చే నాలుగు పశువులు ఉన్నాయని, వాటి మేత కోసం నాలుగు ఎద్దులను అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే ‘‘జిల్లాలో కరువు పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. అసెంబ్లీలో ప్రస్తావిద్దామంటే మొదటి రోజే సస్పెండ్ చేసి బయటకు పంపారు. కరువు విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది..’’ అని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ ‘గోడు’ దక్షిణతెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడి బాగా తగ్గింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు చుక్క నీరు విడుదల కాలేదు. తాగునీటి కోసం మాత్రం కొన్ని చెరువులు నింపారు. ఈ జిల్లాలోని 59 మండలాల్లో 22 మండలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. కానీ ఈ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కరువు తాండవిస్తోంది. కృష్ణా నది ప్రవహించే దామరచర్ల, నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు ప్రాంతాల్లోనూ పశుగ్రాసం లేక రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. ఈ జిల్లాలోని మొత్తం సాగుభూమిలో 80 శాతానికిపైగా ఇప్పుడు బీడుగానే కనిపిస్తోంది. దేవరకొండ ప్రాంతంలోనైతే తాగునీటికే కటకట నెలకొంది. వారానికి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటికే దిక్కులేకపోవడంతో... పశువులకు మేత, నీరు లేక అందినకాడికి అమ్మేసుకుంటున్నారు. దేవరకొండ మండలం మల్లేపల్లి సంత పశువుల అమ్మకానికి ప్రసిద్ధి. వ్యవసాయ పనులకు పశువులు కావాలనుకునే వారు ఇక్కడకు వచ్చేవారు. కానీ ఇప్పుడీ సంతలో కబేళాలకు పశువులను తరలించే దళారులే కనిపిస్తున్నారు. అమ్ముకునీ నష్టపోతున్నాం.. ‘‘పశువులకు మేత కరువైంది. అందుకే అమ్మేసేందుకు వచ్చినం. వ్యాపారులేమో తక్కువ ధర ఇస్తున్నరు. ఇప్పటికే పంటలు పండక నష్టపోయినం.. ఇప్పుడు పశువులను అమ్ముకున్నా సరిగ్గ పైసలు రాక నష్టపోతున్నం’’ - రాములు, పోచారం గ్రామం, నిజామాబాద్ జిల్లా మూడు పశువులనూ అమ్ముకున్నా.. ‘‘నాకు నాలుగు గేదెలుండేవి. మేపడానికి గడ్డి లేదు. పాడి కోసం ఒక గేదెను ఉంచుకుని మూడు గేదెలను అమ్ముకున్నా. ఇగ ఉన్న 50 గొర్రెలను కూడా మేపడానికి గడ్డి దొరకక బేరం పెట్టాను. నాలాగే గ్రామంలో చాలా మంది రైతులు పశువులను సాకలేక అమ్ముకుంటున్నారు. కొందరు నష్టాలకు గేదెలను అమ్ముకోలేక కష్టనష్టాలకోర్చి సాదుకుంటున్నారు..’’ - పి.దుర్గయ్య, రైతు, రేవూరు, మేళ్లచెర్వు మండలం నల్లగొండ జిల్లా ఎనిమిది బోర్లు వేసినా.. చుక్క నీరు రాలే ఈయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు బుల్లెట్ రాంరెడ్డి. తన 10 ఎకరాల్లో ఐదెకరాలు పసుపు పంట, రెండెకరాల్లో మొక్కజొన్న, మూడెకరాల్లో సోయా పంటలు వేశాడు. పంటలను కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, సుమారు రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాడు. రెండు నెలల వ్యవధిలో 8 బోరు బావులు, ఒక ఊట బావి తవ్వించాడు. అయినా చుక్క నీరు రాలేదు. -
తడారుతున్న గొంతులు
వరుణుడు ముఖం చాటేశాడు. చినుకు నేలరాలడం గగనమైంది. వంకలు, వాగులు, కుంటలు..ఇలా ఎక్కడా చుక్కనీరు లేదు. బోర్లన్నీ బావురుమంటున్నాయి. పంటల సాగు పూర్తిగా పడకేసింది. కనీసం తాగేందుకూ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెసీమల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిగ్గా 20 రోజుల కిందట జిల్లాలో 220 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. తాజాగా ఈ సంఖ్య 266కు చేరింది. జిల్లాలో తాగునీటి సమస్య ఎంత జఠిలంగా ఉందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. - జిల్లాలో గుక్కెడు తాగునీరూ కరువే - వరుణుడి జాడ లేక అడుగంటిన భూగర్భజలాలు - 37 మండలాల్లో 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా - పది మండలాల్లో 22 అద్దె బోర్లు అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. 37 మండలాల పరిధిలోని 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అధికంగా పుట్లూరు మండలంలో 25 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అలాగే ఆమడగూరు మండలంలో 24, తనకల్లు మండలంలో 21, ఓబుళదేవచెరువులో 18, యల్లనూరులో 18, నల్లమాడలో 17, తలుపులలో 14, ధర్మవరంలో 13, ముదిగుబ్బలో 12 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అసలే నీరులేని గ్రామాలకు మనిషికి 40 లీటర్ల మేరకు సరఫరా చేస్తున్నారు. అలాగే 96 గ్రామాల్లో పశువులకు నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో పశువుకు 30 లీటర్ల లెక్కన అందిస్తున్నారు. వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి 22 వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో బోరుకు నెలకు రూ. 6 వేలు అద్దె చెల్లిస్తున్నారు. జఠిలమవుతున్న సమస్య బోర్లలో నీరు అడుగంటుతుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకు జఠిలమవుతోంది. గతేడాదికంటే ఈసారి సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 200 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటే ఈసారి 266 గ్రామాలకు చేస్తున్నారు. అలాగే గతేడాది ఈ సమయానికి కేవలం 7 మాత్రమే వ్యవయబోర్లు అద్దెకు తీసుకుని ఉంటే, ఈసారి 22కు పెరిగింది. రానున్న వారం పదిరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు గ్రామీణ నీటి పథకం అధికారులు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న రూ. 21.78 కోట్లు ఖర్చు చేశారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సమస్య ఎక్కువవుతోంది - కాంతానాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతూ తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ. 21.78 కోట్లు ఖర్చు చేశాం. డిసెంబరు దాకా రూ. 12.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -
మంజీరా.. ఎడారే
మంజీరా నది.. కాలక్రమేణా ఎడారిగా మారబోతుందా? దీని చెంతనే ఉన్న డీఫ్లోరైడ్ పథకానికి ముప్పు ఏర్పడనుందా? మంజీరా నదిలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో ప్రజలను ఈ ప్రశ్నలు కలవరపెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. ‘ఇది నిజం. భవిష్యత్తులో జరిగేది ఇదే’ అని, వారు తీవ్ర భయూందోళన వ్యక్తం చేస్తున్నారు. - ఇసుక రవాణాను అడ్డుకోకపోతే జరిగేది ఇదే - భయూందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు - ఇసుక తవ్వకాలతో ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు.. - అయినప్పటికీ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి కోటగిరి : ఒకవైపు, వర్షాభావ పరిస్థితులతో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోవైపు, భూగర్భ జలాలను పరిరక్షించే నదుల్లోని ఇసుకను ఆసాంతం తోడేసేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది. ప్రజల ప్రయోజనాలను విస్మరించిన ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటగిరి మండలం పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు.. రవాణాకు టీఎస్ ఎండీసీ అనుమతి ఇవ్వడంపై ఆయూ గ్రామాల రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు కారేగాం మంజీరా చెంతన ఢీఫ్లోరైడ్ పథకం ఉంది. సిరికొండతోపాటు బోధన్ మండలంలోని పలు గ్రా మాలకు ఇక్కడి నుంచి డీఫ్లోరైడ్ నీరు సరఫరా అవుతోంది. మంజీరా నుంచి ఇసుక తరలింపుతో ఈ డీ ఫ్లోరైడ్ పథకానికి మున్ముందు ముప్పు (నీళ్లు అందని పరిస్థితి) ఏర్పడే ప్రమాదముందని సిరికొండ, బోధన మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుకను రవాణా చేస్తున్న లారీలను ఆయూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తే భూగర్బ జలాలు అడుగంటే ప్రమాదముందని, అందుకే లారీలను అడ్డుకున్నామని వారు చెబుతున్నారు. ఇసుకను తరలించవద్దంటూ వారంతా రోడ్డెక్కారు. బైండోవర్ కేసులు ఇసుక లారీలను అడ్డుకున్న ప్రజలపై అధికారులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తాం’ అని, అధికారులు బెదిరిస్తున్నారు. అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట ఇసుక రవాణాను నిలిపివేయాలని కోరుతూ కారేగాం గ్రామస్తులు ఇటీవల బోధన్ ఆర్డీఓకు వినతిపత్రమిచ్చారు. పోతంగల్ గ్రామస్తులు కూడా ఇటీవల కోటగిరి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. తవ్వకాల కోసం ఒకచోట అనుమతి తీసుకుని.. మరోచోట తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. మంజీరా చెంతనే బ్రిడ్జి, ఢీఫ్లోరైడ్ పథకం ఉన్నాయని.. ఇసుక తవ్వకాలతో వీటికి మున్ముందు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాలేటుపల్లి
నిత్యం కరువు ఛాయలతో ఉండే కనిగిరి ప్రాంతంలోని కనిగిరి, పీసీపల్లి మండలాల్లో వందలాది ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు అది. బ్రిటీష్ కాలంనాడే ప్రతిపాదించిన పాలేటిపల్లి ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపం దాల్చినా..ఇంకా బాలారిష్టాలు దాటడం లేదు. కాలువలకు భూసేకరణలో జాప్యం..నిధుల గండంతో పది నెలల నుంచి రిజర్వాయర్ పనులు నిలిచిపోయాయి. - పది నెలల నుంచి పాలేటిపల్లి రిజర్వాయర్ పనులకు బ్రేక్ - జరగని కుడి, ఎడమ కాలువల భూసేకరణ పనులు - నిజంగా సర్వే కోసమా.. లేక నిధుల గండమా..! కనిగిరి : కనిగిరి ప్రాంతప్రజల చిరకాలవాంఛ పాలేటిపల్లి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో కనిగిరి, పీసీపల్లి రెండు మండలాల్లోని గ్రామాల ప్రజలకు ఉపయోగం. సాగు, తాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే బ్రిటీష్ కాలం నుంచి ప్రతిపాదనల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనుల వ్యయం లక్షల్లో నుంచి కోట్లకు చేరింది. 15 ఏళ్ల క్రితం దీనికి రూ.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా కాలక్రమేణ రూ.17.8 కోట్లకు ప్రతిపాదనలు చేరాయి. 2013 ఏప్రిల్‌లో పాలేటిపల్లి రిజర్వాయర్‌కు నార్మల్ స్టేట్‌ప్లాన్ జనరల్‌ఫండ్ రూ.17.882 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించారు. కారణాలు ఏమైనప్పటికీ పది నెలల నుంచి పనులు జరగడం లేదు. రిజర్వాయర్ నిర్మాణం ఇలా.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 1500 ఎకరాల ఆయకట్టుతో డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టు చెరువు మునకతో కలిపి విస్తీర్ణం 350 ఎకరాలు. కుడికాలువ 9.2 కి.మీ, ఎడమకాలువ 2.7 కిమీల పొడవుతో డిజైన్ రూపొందించారు. దీనికింద పీసీపల్లి మండలంలో బట్టుపల్లి, పాలేటిపల్లి, తలకొండపాడు, కనిగిరి మండలంలో రాచగుండ్లపాడు, లింగోజిపురం పంచాయతీల్లో పారుదల ఉంటుంది. ఎడమ కాలువ కింద 510 ఎకరాలు, కుడికాలువ కింద 1500 ఎకరాల ఆయకట్టు సాగు ఉండగా, కనిగిరి మండలానికి సంబంధించి 220 ఎకరాల పారుదల ఉంటుందని అధికారులు తెలిపారు. పాలేరువాగు నుంచి పందువగండి, ఎన్.గొల్లపల్లి మీదుగా పాలేటిపల్లిలోకి నీళ్లు చేరుతాయి. పనులు ఆగింది ఇక్కడ.. రిజర్వాయర్‌కు సంబంధించి మంజూరైన రూ.17.8 కోట్లు మూడు దశలుగా ఖర్చు చేయాల్సి ఉంది. ప్రాజెక్టు అలుగులు, కట్టా, తూములు, తొట్టి నిర్మాణానికి కొంత, కుడి, ఎడమ కాలువల నిర్మాణాలకు కొంత, మునక భూములకు నష్టపరిహారం చెల్లింపులకు కొంత నిధులు కేటాయించి విడుదల చేస్తారు. నష్ట పరిహారం చెల్లింపులకు సంబంధించి రూ.2.5 కోట్లు కేటాయించగా, తొట్టి, తూము, కట్టలు, అలుగుకు ఇప్పటికి రూ.8 కోట్ల పనులకు టెండర్ పిలిచి పనులు చేశారు. మిగతా రూ.7.3 కోట్ల నిధులతో కుడి, ఎడమ కాలువలు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అలుగు, తొట్టి, కట్ట పనులు పూర్తయి పది నెలలైనా మిగతా పనులు జరగడం లేదు. సర్వే కోసమా.. నిధుల గండమా..! పాలేటిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 1980లో అప్పటి ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కుడి, ఎడమ కాలువలు 11.7 కిలోమీటర్ల పొడవుతో 1500 ఎకరాల ఆయకట్టుగా రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే పనికి రాదని అధునాతన టెక్నాలజీతో కాలువ రీ సర్వే చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రీ సర్వే కోసం హైదరాబాద్ సీఈకి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు కాలువ రీ సర్వే పనులు జరగలేదు. కాగా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులకు నూతన ప్రభుత్వ నిధుల గండం తగిలిందా.. లేక కాంట్రాక్టర్లకు, అధికారులకు, నేతలకు మధ్య ఆమ్యామ్యాల లెక్క కుదరక పనులు ఆపారా..! అనేది అర్థం కాని ప్రశ్న. వాస్తవానికి సర్వే కోసమే ఆలస్యమైతే.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. నేతలు ఎందుకు ఒత్తిడి తేవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జేఈ ఏమంటున్నారంటే.. రిజర్వాయర్ నిర్మాణంలో జాప్యంపై ఇరిగేషన్ జేఈ లక్ష్మీ నారాయణను ‘సాక్షి’ అడగ్గా పది నెలల నుంచి పనులు ఆగింది వాస్తవమేనన్నారు. కుడి, ఎడమ కాలువ రీసర్వేకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో సర్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. కాలువలకు భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. కాలువల నిర్మాణానికి జరగని భూ సేకరణ: పాలేటిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తొట్టి, అలుగు, తూములు, మునక భూములకు సంబంధించి 350 ఎకరాలకు భూసేకరణ పూర్తయింది. వాటికి మెట్టకు ఎకరాకు రూ.40 వేలు, మాగాణి భూములకు ఎకరాకు రూ.60 వేలు చెల్లించారు. ఇంకా కుడి, ఎడమ కాలువ నిర్మాణానికి భూ సేకరణ జరగాల్సి ఉంది. సుమారు 60 ఎకరాలు కాలువల నిర్మాణానికి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు లక్ష నుంచి లక్షా 20 వేల వరకు చెల్లించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. సుమారు 2 మీటర్ల వెడల్పులో నిర్మించే కాలువలకు ఇప్పటి వరకు భూసేకరణ చేయలేదు. -
యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు - రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం - ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు - కాలనీల్లో నీటి కొరత - ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని అధికారులు పటాన్చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టం అమలు చేయరా? పటాన్చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్చెరు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. - చిదంబరం, శాంతినగర్ -
జల గరళం
భూమిలోకి ఇంకుతున్న రసాయనాలు కలుషితమవుతున్న జలం ఇళ్ల పేరిట అనుమతి... గోదాముల నిర్మాణం చోద్యం చూస్తున్న అధికార గణం ఇదీ దూలపల్లి పారిశ్రామిక వాడ దుస్థితి కుత్బుల్లాపూర్ అదో ప్రత్యేక ప్రపంచం. అక్కడ ‘మంచినీరు’ దొరకదు. తాగునీటి కోసం అక్కడి జనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన దుస్థితి. పొరపాటున ఎవరైనా బోరు వేసి... నీటిని ఒడిసి పడదామని ప్రయత్నించినా... రసాయనాలతో కూడిన ఎర్రటి జలం ఉబికి వస్తుంది. అది తాగితే అంతే. ఇదీ దూలపల్లి పారిశ్రామివాడ పరిస్థితి. ఆ ప్రాంతంలోని రసాయన గోదాముల పుణ్యమా అని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ బోర్లు వేసినా వచ్చేది ఎర్ర నీరే. ఫలితంగా స్థానికులు తాగునీటి కోసం అల్లాడాల్సిన దుస్థితి నెలకొంటోంది. భూమిలోకి రసాయనాలు ఈ పారిశ్రామికవాడలో ఒక్కో గోదామును సుమారు 1000 నుంచి 1500 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. వీటిలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చే రసాయన డ్రమ్ములు (సాల్వెంట్ల) శుభ్రం చేయగా... వచ్చే వ్యర్ధాలను భూమిలో ఇంకే లా ఇంకుడు గుంతల వంటివి తవ్వుతున్నారు. తద్వారా రసాయనాలు భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. దీంతో దూలపల్లితో పాటు ఫాక్స్‌సాగర్ సమీపం వరకు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీరే వస్తుంది. అతి ప్రమాదకరమైన రసాయనాలు ఇక్కడికి తీసుకువచ్చి శుద్ధి పేరిట భూమిలోకి వదలడంతో చెట్లు కూడా మోడువారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో గేదెలు ఇక్కడి రసాయనాలు కలిసిన నీటిని తాగి మృత్యువాత పడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో దూలపల్లి నీటి కోసం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు నెలవు... అక్కడివన్నీ అక్రమ రసాయన గోదాములే. అది తెలిసినా... ఎప్పుడోగానీ అధికారులు కదలరు. ఎప్పుడైనా తనిఖీలకు వారు సిద్ధపడితే గోదాములకు తాళాలు పడతాయి. గతంలో అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాలలో ఎంతో మంది అమాయకులు మృత్యువాత పడ్డారు.ఇంత జరుగుతున్నా నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో వారు సులువుగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మాటకొస్తే వారి కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ గోదాముల వ్యవహారంలో ఇద్దరు ఈవోలు సస్పెండయ్యారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. పత్రికల్లో కథనాలు వచ్చినపుడు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి హడావుడి చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. పీసీబీ అధికారులకు ఇటువైపు చూడాలన్న ఆలోచనే ఉన్నట్టు లేదు. దూలపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 137లో 13.3 ఎకరాలు ఉంది. ఇంటి నిర్మాణం పేరుతో కొందరు పంచాయతీలో అనుమతి తీసుకుని బహుళ అంతస్తులను తలపించేలా గోదాములు నిర్మిస్తున్నారు. వీటిలో 81 గోదాములకు అనుమతులు లేకపోవడంతో ఇటీవల పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు.{పశాంత్నగర్ సర్వే నెంబరు 182లో 15.7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. 2004 ముందు ఎస్సీలకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక్కడ రెవెన్యూ రికార్డుల లో ప్రభుత్వ స్థలం అని ఉండగా... గజం స్థలం ఖాళీ లేకుండా ప్రమాదకర పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అంతా నిమిషాల్లోనే.. గోదాముల్లో రసాయన డ్రమ్ములను నిల్వ చేయాలన్నా... ఇక్కడి నుంచి ఇతర ప్రదేశాలకుతరలించాలన్నా నిమిషాల్లోనే పని జరిగిపోతుంది. గోదాములకు తాళం వేసి, రాత్రి వేళల్లో ఎక్కువగా కార్యకలాపాలు కొనసాగిస్తారు. పగటి వేళల్లో వాహనాల్లో వచ్చే రసాయన డ్రమ్ములను లోపలికి తీసుకెళ్లి... పది నిమిషాల్లోనే నిల్వ చేసి జారుకుంటారు. ఒకవేళ ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే... దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం. స్టీ‘రింగ్’ తిప్పుతారు గోదాముల నిర్వాహకులు రింగై... ఓ సొసైటీని ఏర్పాటు చేసుకుని ఒకరికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కనుసన్నల్లోనే తతంగమంతా జరిపిస్తుంటారు. ప్రతి నెలా నిర్వాహకుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ, పీసీబీ అధికారులకు మామూళ్ల రూపంలో అందజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయగా... గోదాముల నిర్వాహకులంతా కలసి పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తమ్మీద అధికారుల అలసత్వం తమ ప్రాణాల మీదకు తెస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కరువు కాలం
చెరువు కింది పొలం బీడువోయింది ఆబాది జమ్మికుంటకు చెందిన దొడ్డె ముధునయ్య కొన్నేళ్లుగా స్థానిక నాయిని చెరువు కింద ఉన్న మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. చెరువు నిండినప్పుడు పంటలు బాగా పండేవి. ఈ సంవత్సరం వానల్లేక కౌలుకు తీసుకున్న పొలాన్ని బీడుగా వదిలేశాడు. గుండ్ల చెరువు కింద రెండెకరాలుండగా, అందులో ఎకరం పొలం సాగు చేసి, మరో ఎకరం బీడుగా ఉంచాడు. మరో చోట ఎకరం పత్తి వేస్తే మొక్కలు వాలిపోతున్నారుు. హైదరాబాద్‌లో చదువుతున్న కొడుకు అనూప్ ఖర్చుల కోసం అప్పు చేశాడు. ఇప్పటికే అప్పు రూ.3లక్షలు దాటిందని, ఇళ్లు గడవడం ఇబ్బందవుతోందని వాపోతున్నాడు. - కనికరించని వరుణుడు - అడుగంటిన భూగర్భజలాలు - వెలవెలబోతున్న ప్రాజెక్ట్‌లు - ఎండిపోతున్న పంటలు - ఆగస్టుపైనే ఆశలు సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ అగ్రికల్చర్ : కరీంనగర్ జిల్లాను కాలం పగబట్టినట్లుంది. వానల్లేక వరి పైర్లు ఎండిపోతున్నాయి. మక్క పంటమాడిపోతోంది. సోయా సాగు పడకేసింది. పత్తి చేను నీళ్ల కోసం నోరు తెరిచింది. ఫలితంగా అన్నపూర్ణగా వినుతికెక్కిన కరీంనగర్ జిల్లాను కరవుఛాయలు కమ్మేస్తున్నాయి. అన్నదాత అరిగోస ఇక చెప్పనక్కర్లేదు. జూన్ మొదటి వారం నుంచి కార్తెలు కరిగిపోతున్నా వరుణదేవుడు కనికరించకపోవడంతో అన్నదాతలు ఆకాశంవైపు దిగాలుగా చూస్తున్నారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్లో లక్షన్నర హెక్టార్లలో పంటలే వేయలేదు. వేసిన వాటిలోనూ సగానికిపైగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నెలాఖరులోగా వానలు పడకపోతే మిగిలిన వాటి పరిస్థితి ఆగమ్యగోచరమే. రైతులు పరిస్థితిని తలుచుకుంటూ ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. కొందరు ఆత్మహత్య బాట పడుతుండగా, మరికొందరు ఉన్న ఊరును వదిలేసి బతుకు దెరువు కోసం వలసబాట పడుతున్నారు. ఇదీ సాగు పరిస్థితి... జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 463 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 341 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సగటున 26 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో కాటారం, కమలాపూర్ మండలాల్లోనే అధిక వర్షం నమోదు కాగా, 18 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. 35 మండలాల్లో లోటు వర్షం నమోదయ్యింది. గంభీరావుపేట, మేడిపల్లి మండలాల్లో అత్యంత లోటు వర్షం కురిసింది. ఈ ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు 5,14,662 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 3,66,387 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన లక్షన్నర హెక్టార్లలో అసలు పంటే వేయలేదన్నమాట. ఇక పంటల వారీ వివరాలను పరిశీలిస్తే... ప్రధానంగా 54,288 హెక్టార్లలో వరి, 23,0431 హెక్టార్లలో పత్తి, 49,524 హెక్టార్లలో మొక్కజొన్న 10,941 హెక్టార్లలో సోయా తదితర పంటలు సాగులో ఉన్నాయి. వానల్లేకపోవడంతో సుమారు 20 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో సోయా పంటలకు నష్టం కలిగింది. ఆశలన్నీ ఆగస్టుపైనే... పత్తి పంట పెరిగే దశలో చుక్క నీరందక సకాలంలో ఎరువులు వేయలేని దుస్థితి ఎదురయ్యింది. ఎకరాకు రూ.15వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. నేల ఎండిపోయి కలుపుతీయడానికి వీలుకావడం లేదు. మరోవైపు వరినార్లు ఎండిపోతుండగా, పొలాలు బీడువారిపోతున్నారుు. ఎర్రమట్టి, దుబ్బనేలలో పంటలు మరింత దయనీయంగా ఉన్నారుు. వ్యవసాయ బావుల కింద సాగు చేసిన వరి పొలాలు సైతం భూగర్భజలాలు లేక ఎండిపోయే దుస్థితి వచ్చింది. వానలు లేక మొక్కజొన్న పంటలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నారుు. పలు ప్రాంతాల్లో బిందెలతో నీళ్లు తెచ్చి పత్తి పంటకు నీళ్లు చల్లుతూ కాపాడుకుంటున్నారు. మరో పది రోజుల్లో వర్షాలు పడితే పత్తి పంట ఎదుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వానలు కురవకపోవడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు మళ్లించడంలో జిల్లా వ్యవసాయ శాఖ విఫలమైంది. వర్షాల కోసం ఆగస్టు నెలపైనే భారం వేసిన రైతాంగం వరుణుడు మొఖం చాటేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. పశువులకు తాగునీరు, పచ్చి మేతకు కూడా కొరత ఏర్పడుతోంది. ప్రాజెక్టులు వెలవెల... జిల్లాకు ఆధారమైన ప్రాజెక్ట్‌లలో నీళ్లు లేక ఖరీఫ్ పంటలకు చుక్క కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలకు ప్రస్తుతం 7.13 టీ ఎంసీలుంది. గతేడాది ఇదే సమయానికి 23.93 టీఎంసీలుంది. ఎల్ఎండీలో 24 టీఎంసీలకు 4.041 టీఎంసీలుండ గా గతేడాది 9.255 టీఎంసీలుంది. ఇది కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాలకు తాగునీటికి సైతం సరిపోదు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 7.1 టీఎంసీలుంది. నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరడంతో పాటు భూగ ర్భ జలాలు అడుగంటి పోయి జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సగటున 10.11 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోయింది. అధికంగా గంగాధరలో 20.8 మీటర్ల లోతుకు పడిపోయాయి. కరువు కాటుకు వలసలకు బాట హుస్నాబాద్, వేములవాడ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతాంగం కరవు దెబ్బకు వలసబాట పడుతున్నారు. అప్పుతెచ్చి పంట వేసినా నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోతుండటంతో బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు తండాల్లో ఏ ఇంటికి వెళ్లినా తాళాలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో కళకళలాడే గ్రామాలు నేడు జీవకళ లేక నిర్మాణుష్యంగా మారాయి. నష్టపరిహారం చెల్లించాలి నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. ఇప్పుడు రెండెకరాలకు మాత్రమే నీరు పారుతాంది. పెట్టిన పెట్టుబడులు నష్టపోవటమే అనిపిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. - కొండం సంపత్‌రెడ్డి, పెద్దపాపయ్యపల్లి, హుజూరాబాద్ -
పట్టణాలు కటకటా!
* తాగునీటి కోసం అల్లాడుతున్న పురజనులు * నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటికి కరువు * చాలా చోట్ల మూడు నాలుగు రోజులకోసారి నీటి సరఫరా * 68 పట్టణాల్లోనూ ఇదే గోస 17 పట్టణాల్లో ఆందోళనకర స్థితి * రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం * అడుగంటిన జలాశయాలు.. ఎండిపోయిన నదులు, వాగులు * పాతాళానికి చేరిన భూగర్భ జలాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్నవాసుల గొంతెండిపోతోంది... దాహం దాహం అంటూ పురజనులు అల్లాడిపోతున్నారు.. నిండు వర్షాకాలంలోనూ గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.. గత వేసవిలోనే అడుగంటిన జలాశయాలు, వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా జాడలేని వానలే ఈ దుస్థితికి కారణం. రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర కరువు ముంచుకొస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయినా వర్షాల ఊసేలేదు. జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలూ దాదాపు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలే కాదు కృష్ణా, గోదావరి నదులూ ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరులోగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడనుంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా 68 పురపాలక సంస్థలు ఉండగా... 17 పట్టణాలు ఇప్పటికే నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో నాలుగైదు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన నగర, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్ కొద్దిరోజులుగా సమస్యాత్మక పట్టణాల్లో పర్యటిస్తూ, పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని... ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.16 కోట్లను కేటాయించిందని ఆయన తెలిపారు. డెడ్ స్టోరేజీలో జలాశయాలు.. రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న జూరాల, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, సింగూరు, దిగువ మానేరు, పానగల్ ఉదయ సముద్రం, ఎల్లంపల్లి తదితర జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మరో నెల, నెలన్నర వరకై సరఫరా చేసేందుకు ఈ నిల్వలు సరిపోతాయో లేదోనని అధికారులే పేర్కొంటున్నారు. అప్పటికి వర్షాలు కురవకపోతే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టణాలకు కష్టమే! రాష్ట్రంలోని 17 పట్టణాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న జల వనరులు ఈ నెలాఖరులోగా పూర్తిగా అడుగంటనున్నాయని పబ్లిక్ హెల్త్ విభాగం అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఆదిలాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, హుస్నాబాద్, జగిత్యాల, జనగాం, కొల్లాపూ ర్, కోరుట్ల, కొత్తగూడెం, మధిర, మంచి ర్యాల, మణుగూరు, మెదక్, నర్సంపేట, పా ల్వంచ, వేములవాడ, ఇల్లెందు పట్టణాలకు తా గునీటి అవసరాలు తీర్చుతున్న జల వనరులు 30 రోజుల్లోగా వట్టిపోతాయని పేర్కొంది. ‘బోరు’మంటున్న భూగర్భం రాష్ట్రంలోని 16 చిన్న పట్టణాలకు భూ ఉపరితల నీటి సరఫరా వ్యవస్థ లేదు. భూగర్భ జలాలపై ఆధారపడే ఈ పట్టణాల్లో తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం భూగర్భ జలాలూ అడుగంటిపోవడంతో ఈ పట్టణ ప్రాంతాల్లో 272 నీటి సరఫరా బోర్లు ఎండిపోయాయి. దీంతో కొద్దికొద్దిగా నీరు వస్తున్న బోర్ల నుంచి నాలుగైదు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. -
గుండ్లమోటుకు నిర్లక్ష్యం గండ్లు
- రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం శూన్యం - అధికారుల నిర్లక్ష్యానికి బీడువారుతున్న పంట పొలాలు - భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి తంటా గిద్దలూరు: గుండ్లమోటు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. దీంతో పశ్చిమ ప్రకాశంలో ఇటు సాగు నీరుకు, అటు తాగునీరుకు కటకట ప్రారంభమయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టాక మార్కాపురం డివిజన్లోని కొన్ని ప్రాంతాలకైనా తాగు, సాగు నీరు వస్తుందని రైతులు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. 1980లో కొట్టుకుపోయిన గుండ్లమోటు ప్రాజెక్టుకు వై.ఎస్. హయాంలో నిధుల మంజూరయ్యాయి. కంభం చెరువు అభివృద్ధికి జపాన్ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి పరుగులు తీయాల్సిన ప్రగతి పడకేసింది. దీంతో గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణ పనులు సాగుతూ...నే ఉన్నాయి. కంభం చెరువు అభివృద్ధి, గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. దీంతోపాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెంది తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. 2009లో శ్రీకారం... గిద్దలూరు మండలంలోని వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎనుమలేరు వాగుపై 1975వ సంవత్సరంలో పనుల చేస్తున్న సమయంలోనే అధిక వర్షాలకు కట్ట తెగిపోయింది. దీంతో తాత్కాలిక పనులు చేపట్టారు. తిరిగి 1980 నుంచి 2000 సంవత్సరం వరకు కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటి ఉధృతిలో అలుగు, తూముతోపాటు, అప్రాన్, పికప్ ఆనకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నిధులూ విడుదల చేయలేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మొదట రూ.7 కోట్లు నిధులు విడుదల చేసింది. అనంతరం రిజర్వాయర్ డిజైన్ మార్పుల కోసం అదనంగా మరో రూ.4.63 కోట్లను విడుదల చేసింది. పనులు దక్కించుకున్న ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు వెంటనే పనులు ప్రారంభించినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు అర్థ్ధంతరంగా ఏడాదిన్నరపాటు నిలిచిపోయాయి. అటవీశాఖ అనుమతులు తీసుకుని తిరిగి పనులు ప్రారంభించారు. ఐదు సంవత్సరాలపాటు కేవలం 140 మీటర్ల పొడవున్న అలుగు మాత్రమే పూర్తిచేశారు. చెరువు కట్టను ఆనుకుని కరకట్ట నిర్మించేందుకు 8 అడుగుల లోతు వరకు గుంత తీసినా గట్టితనం రాలేదు. దీంతో పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన జియాలజిస్టులు గట్టితనం వచ్చే వరకు గుంత తీయాలని చెప్పడంతో లోతుగా గుంత తీస్తే కట్ట తూలిపడుతుందని పనులను నిలిపేశారు. ఇలా గత రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి. గడువులు పెంచుకోవడంతోనే సరిపెడుతున్నారు... ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరు గడువు మీద గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పెంచారు. గతేడాది డిసెంబరులో తీసుకున్న గడువు ముగియడంతో ఇటీవల చీఫ్ ఇంజినీర్లు పనుల పురోగతిని పరిశీలించి అనుమతులిచ్చారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు కురవక ముందే ప్రారంభించి ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని రైతులు భావించారు. పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పూర్తయితే... ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గిద్దలూరు నగర పంచాయతీతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే భైరేనిగుండాల ప్రాజెక్టుకు నీరు పుష్కలంగా చేరే అవకాశం ఉంది. చుట్టు పక్కలున్న చెరువులు, కుంటల్లోనూ నీరు చేరుతుంది గడువులోగా పనులు పూర్తి చేస్తాం: నాగార్జునరావు, డీఈ, కంభం గుండ్లమోటు ప్రాజెక్టు పనులు గడువులోగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తాను. సాంకేతిక కారణాలతో పనులు ఆపేశారు. కాంట్రాక్టరు పనులు నిలిపారని నోటీసులు జారీ చేశా. ఇటీవల చీఫ్ ఇంజినీరు, ఎస్ఈ వచ్చి పనులను పరిశీలించారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా అనుమతులొచ్చాయి. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. -
‘బిందు’వు కరువు!
అడుగంటిన భూగర్భజలాలు ఒట్టిపోయినబోరుబావులు {yిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపని రైతులు ఈ ఏడాది లక్ష్యం 23,935 హెక్టార్లు దరఖాస్తులు 7వేలు డీడీలు కట్టింది 1,200 మందే తీవ్ర వర్షభావంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావులు ఒట్టిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం బిందుసేద్యంపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో బిందుపరి కరాలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేసి నీటి పొదుపునకు చర్యలు చేపట్టాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. చిత్తూరు :జిల్లాలో 2015-16 సంవత్సరానికి గాను 23,935 హెక్టార్లలో బిందుపరికరా లు బిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు బిం దు పరికరాల కోసం 7వేల దరఖాస్తులు రాగా, 1,200 మంది రైతులు మాత్రమే పరికరాల కోసం డీడీలు చెల్లించారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన రైతులు డీడీలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగండడం, 2వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరందే పరిస్థితి లేకపోడమే అందుకు కారణమవుతోంది. ఇప్పటివరకు బోరుబావుల్లో వస్తున్న అరకొర నీరు సైతం ఇంకిపోవడంతో వేలాది బోర్లు ఒట్టిపోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్న బోర్లు సైతం ఒట్టిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే బిందు పరికరాలను బిగిస్తుండగా, ఐదు ఎకరాలు పైబడిన రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలను ఇస్తున్నారు. జిల్లాలో అధికంగా సాగవుతున్న వేరుశెనగ, మామిడి, చెరకు, కూరగాయల పంటలను సైతం బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు విస్తృత ప్రచారం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 79వేల హెక్టార్లలో బిందుపరికరాలు బిగించారు. ఈ ఏడాది 23,935 హెక్టార్లను బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల ఇందుకు అడ్డంకిగా మారాయి. తాజా గణాంకాలు చూస్తే ఏడాది ముగిసే నాటికి 1500 మంది రైతులకు మించి బిందు పరికరాల కోసం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014-15 లో 6వేల హెక్టార్ల పరిధిలో 7వేల మంది రైతులు బిందుపరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం కూడా బిందు పరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2010-11 లో 7,570 హెక్టార్లు లక్ష్యం కాగా 6,733.38 హెక్టార్లలో బిందు పరికరాలు బింగించారు. 2011-12లో 12,482 హెక్టార్లు లక్ష్యం కాగా 8596.57 హెక్టార్లలో, 2012- 13లో 6712 లక్ష్యంగా, 6494.62 హెక్టార్లలో, 2013-14 లో 7,981 లక్ష్యంగా 6,022.77 హెక్టార్లలో, 2014-15 8,428 హెక్టార్లు లక్ష్యం కాగా, 6169.06 హెక్టార్లలో బిందు పరికరాలను బిగించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావుల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే బిందుపరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదని సూక్ష్మనీటిసాగు పథకం పీడీ శ్రీనివాసులు తెలిపారు. -
కాలకూట విషం
భూగర్భంలోనూ కాలుష్య జలాలే.. పరిశ్రమల ఇష్టారాజ్యమే కారణం యథేచ్ఛగా వ్యర్థ జలాల ప్రవాహం నిఘా శూన్యం..పీసీబీ విఫలం పాలకులు కళ్లప్పగించి చూస్తున్న వైనం కాలుష్యం జడలు విప్పుతోంది.. విష జలాలు ఏరులై పారుతున్నాయి.. వర్షం వచ్చిందంటే వరదలై ఉరకలెత్తుతున్నాయి. ప్రజల జీవితం ప్రాణసంకటంగా మారుతోంది.. నిఘా పెట్టాల్సిన పీసీబీ చోద్యం చూస్తోంది.. భూగర్భంలోంచి సైతం కాలకూటం చిమ్ముతోంది.. పారిశ్రామిక వాడలు కాలుష్యకాసారంలో చిక్కుకుంటున్నాయి. అయినా పాలకుల్లో చలనంలేకపోవడం గమనార్హం. మెదక్(జిన్నారం): జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 200 వరకు వివిధ రకాల రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను నిబంధనలకు విరుద్ధంగా, యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాలకు వదులుతుంటాయి. వర్షాకాలం పరిశ్రమల యాజమాన్యాలకు ఇందుకు వేదికగా మారుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలోనే వర్షం నీటితో కలిపి కాలుష్య జలాలను బయటకు వదులుతున్నారు. దీంతో గ్రామాలు పూర్తిగా కాలుష్య మయంగా మారుతున్నాయి. ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు కిష్టాయిపల్లి, అల్లీనగర్, చెట్లపోతారం తదితర గ్రామాల భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యంగా మారాయి. వ్యవసాయం కోసం భూగర్భ జలాల నుంచి నీటిని తోడితే పసుపు, నీలి రంగుల్లో నీటి ప్రవాహం ఉందంటే ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలుష్య జలాల ప్రవాహాన్ని సైతం నివారించటంలో పీసీబీ టాస్క్‌ఫోర్స్, పీసీబీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను బయటకు వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 86 పరిశ్రమలకు నోటీసులు వర్షా కాలంలో అప్రమత్తంగా ఉండాలని, కాలుష్య జలాలను బయటకు వదలవద్దని సూచిస్తూ మండలంలోని సుమారు 86 రసాయన పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. కాలుష్య జలాలను బయటకు వదలకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తాం. - నరేందర్, పీసీబీ ఈఈ -
ఇసుకాసురులు
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఇసుక మాఫియా ♦ అడ్డగోలు తవ్వకాలతో పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు ♦ అక్రమార్కులు చెలరేగిపోతున్నా కళ్లు మూసుకుంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడానికి, కరకట్టలు బలహీనమవడానికి మాత్రమే కాదు.. అనేక పర్యావరణ దుష్పరిణామాలకు కారణం ఒక్కటే.. ఇసుక మాఫియా! అడ్డూ అదుపు లేని ఇసుక తవ్వకాలు అటు పర్యావరణం, ఇటు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదీతీరాల్లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో చినుకు నేలలోకి ఇంకడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు మరింత కిందకు జారిపోతున్నాయి. జలసిరితో కళకళలాడాల్సిన భూగర్భం తడారి ఎడారిగా మారుతోంది. నదీగర్భంలో సైతం నీటి జాడ కరువవుతోంది. నదిలో ఇసుక కరువవడంతో నీటి ప్రవాహవేగం పెరుగుతోంది. నదీజలాలు భూగర్భంలోకి ఇంకకుండానే వడివడిగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. నీటి గలగలలతో కళకళలాడాల్సిన నదులు సహజఅందాలకు దూరమై వట్టిపోతున్నాయి. ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతుండడంతో కృష్ణా, గోదావరి నదుల కరకట్టలు బలహీనమవుతున్నాయి. ఫలితంగా వరదల సమయంలో గండ్లు పడి సమీప ప్రాంతాలను ముంచెత్తడంతో భారీ నష్టాలు చవిచూడాల్సివస్తోంది. కంట్లో ఇసుక కొట్టారు.. 2009 అక్టోబర్ 2న వరదలతో తుంగభద్ర నది పోటెత్తడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని తీర ప్రాంతాలన్నీ ఇసుకమయం అయ్యాయి. భారీ పరిమాణంలో ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో ఇసుక మాఫియా కోరలు విప్పింది. ఈ రెండు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోజూ వందల లారీల ఇసుక అక్రమ రవాణా జరిగింది. మంత్రాలయం నుంచి జొహరాపురం వరకు తుంగభద్ర తీరంలోని గ్రామాల్లో వేల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు పుట్టుకొచ్చాయి. కళ్ల ఎదుటే ఇసుక లారీలు, ట్రాక్టర్లు తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల అధికారులకు మామూళ్లు ముట్టేవి. రెండేళ్లు గడిచేసరికి తుంగభద్ర నది గర్భం నుంచి ఇసుక కనుమరుగైపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నడుమ నుంచి తుంగభద్ర పారుతున్నా.. ఇసుక లేక భూగర్భంలోకి నీళ్లు ఇంకడం లేదు. భూగర్భ జలాలు లభించక రెండు జిల్లాల పరిధిలో నీటికి కటకట ఏర్పడింది. అంతేనా.. ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకల ఒత్తిడితో తీర ప్రాంత గ్రామాల రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. మం‘జీర’బోతోంది మంజీరా నది పరీవాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాలతో ‘ఇసుకాసురులు’ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు తీసుకున్న మాఫియా ఏకంగా మంజీరానే తోడేసింది. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్‌లోని బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి, మద్నూరు మండలాల్లోని పట్టాభూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇసుక మాఫియా ఈ పట్టా భూముల్లో అనుమతులకు మించి ఇసుకను తోడి.. రోజుకు 600 నుంచి 800 లారీల్లో హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడించింది. 2,14,500 క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు అనుమతులు పొంది.. ఐదు రెట్లు అదనంగా ఇసుక తవ్వుకెళ్లారన్న ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరపాలని నిర్ణయించినా.. ముందుకు సాగడం లేదు. తడారిన భూగర్భం ఇసుక తవ్వకాలు పేట్రేగడం, మరోవైపు భూగర్భ జలాల వినియోగం మితిమీరడంతో నీళ్లు పాతాళానికి వెళ్లిపోతున్నాయి. రెండేళ్లకోసారి భూగర్భ జల శాఖ నిర్వహించే అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల కింద జరిగిన అధ్యయనం నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే అందులోని కీలక సమాచారాన్ని ‘సాక్షి’ సేకరించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలోని 1,057 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు అత్యంత ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థాయికి దిగజారాయి. లభ్యతతో పోల్చితే భూగర్భ జలాల వినియోగం 100 శాతానికి మించడంతో ఆ గ్రామాల్లో భూగర్భం తడారిపోయింది. ఇక 214 గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి విషమం (క్రిటికల్)గా ఉంది. ఇక్కడ భూగర్భ జలాల వినియోగం 90-100 శాతం మధ్యలో ఉంది. 443 గ్రామాల్లో 70-90 శాతం మధ్య వినియోగంతో పరిస్థితి స్వల్ప విషమం (సెమీ క్రిటికల్)గా తయారైంది. పర్యావరణ ధ్యాసే లేదు నదీ తీరంలో 5 హెక్టార్లు, అంతకు మించి ఇసుక ఉన్న ‘రీచ్’లలో ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఇసుక వేలం ప్రక్రియలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రీచ్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి జేసీబీలు, ప్రొక్లెయిన్లతో మితిమీరి ఇసుక తోడేస్తున్నారు. నదుల గర్భంలో రాళ్లు బయటపడే వరకు ఈ తవ్వకాలు జరిగినా అధికారులు ‘మామూళ్లు’గా కళ్లు మూసుకుంటున్నారు. హే కృష్ణా... కృష్ణా జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో లక్షల టన్నుల్లో ఇసుక తవ్వేస్తున్నారు. పదిహేనేళ్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ నీటి నిల్వలు పడిపోతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరదలు వస్తాయి. ఇసుక మేటలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇసుక, మట్టి పొరలు సర్దుకుంటాయి. భారీ వరదలు వచ్చిపోయిన రెండు మూడు రోజులకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిన్నపాటి ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఇసుక, మట్టి పొరలు సర్దుకునే క్రమంలో ఈ ప్రకంపనలు వస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మోతాదుకు మించి ఇసుక తవ్వకాలు కూడా వీటికి కారణమని పేర్కొంటున్నారు. ♦ తుంగభద్ర నది.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య నుంచి ప్రవహిస్తున్నా వందల గ్రామాలు, తండాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి! గుక్కెడు మంచినీటి కోసం గొంతెండుతున్నాయి! ఎందుకు? తీరప్రాంతంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. నీటిచుక్క కరువైంది! ♦ కృష్ణా నది వరదలతో పోటెత్తితే చాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఎక్కడో ఓచోట కరకట్టలకు భారీ గండ్లు పడుతున్నాయి. పంటలు నీటిపాలవుతున్నాయి. ఊళ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎందుకు? నదికి రక్షణగా నిలవాల్సిన కరకట్టలు ఏటేటా బలహీనమైపోతున్నాయి! వాల్టా చట్టం ఏం చెబుతోంది ♦ భూగర్భ జలాలు ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థితికి చేరుకున్నట్లు ప్రకటించిన ప్రాంతాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి. ♦ నోటిఫైడ్ ప్రాంతాల్లో కేవలం స్థానిక గ్రామ/పట్టణ అవసరాలకు మాత్రమే తవ్వకాలు జరపాలి. ♦ డ్యాములు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు. ♦ తీరంలో 8 మీటర్లు ఆపైలోతులో ఇసుక లభ్యత ఉంటే గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వవచ్చు. కనీసం 3 మీటర్ల వరకు ఉంటే మీటర్ వరకు తవ్వకాలకు అనుమతిస్తారు. ♦ నది గర్భం నుంచి తీరం వరకు 15 మీటర్ల వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి జపాన్, చైనా తదితర దేశాలు ఇసుకకు ప్రత్యామ్నాయాలపై విసృ్తతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఉక్కు కర్మాగారాల్లోని శేష పదార్థాలు(స్లాగ్), థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తవుతున్న బూడిద (ఫై ్లయాష్), పాత భవనాల శిథిలాల నుంచి ఇసుకను తయారు చేసుకుని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నాయి. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, మేధావులతో ఏర్పడిన ‘ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ (ఐసీఐ)’ సైతం ఇసుకకు ప్రత్యామ్నాయాలపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన పర్యావరణవేత్త, డాక్టర్ ఎల్.హెచ్ రావు ఉన్నారు. ఆ కమిటీ కూడా పైన చెప్పిన మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది. రహదారుల నిర్మాణం కోసం ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఐరన్ ఓర్ స్లాగ్‌ను వినియోగించేందుకు ఇటీవల జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏ) అనుమతించింది. పాత భవనాల శిథిలాలను క్రషర్ ద్వారా ఇసుకగా మార్చి వినియోగించుకోవచ్చు. జపాన్, చైనా దేశాల్లో చిన్న చిన్న కట్టడాల నిర్మాణం కోసం ఇప్పటికే శిథిలాల ఇసుకను వినియోగిస్తున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి భారీగా ఫై ్లయాష్ ఉత్పత్తి అవుతోంది. 80 శాతం ఇసుకలో 20 శాతం ఫ్లై యాష్‌ను కలిపి వాడవచ్చు. ఉక్కు కర్మాగారాల్లో ఇనుప ఖనిజానికి సున్నపురాయి కలిపి 1,500 డిగ్రీల వద్ద వేడిచేస్తారు. దీంతో ఉక్కుతో విడిపోయిన మాలిన్యాలు పైకి తేలి ఇసుక పదార్థంలా ఏర్పడుతాయి. జపాన్, చైనా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఐరన్ ఓర్ స్లాగ్ ఇసుకకు 100 శాతం ప్రత్యామ్నాయమని గుర్తించారు. దీనిపై అవగాహన లేక మన దేశంలో వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో ఐరన్‌ఓర్ స్లాగ్‌ను అనుమతిస్తే ప్రజల్లోనూ చైతన్యం వస్తుంది. దేశంలో ఏటా 70 మిలియన్ టన్నుల ఇనుముతో పాటు దాదాపు 30 మిలియన్ టన్నుల స్లాగ్ ఉత్పత్తి అవుతోంది. ఉక్కు కర్మాగారాలు సైతం ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. దానిని తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయ సామగ్రితో నిర్మాణాలు చేసే వారికి జపాన్‌లో రాయితీలు కూడా ఇస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే మానవ జాతికి ఇదే చివరి తరం అన్నట్లు సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ప్రకృతి విధ్వంసంతో భవిష్యత్తు తరాల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలు ఆపకపోతే విపరిణామాలు తప్పవు. ఇసుక కొరతను తీర్చుకోవడం కోసం రాక్ సాండ్ పేరుతో కొండలను ధ్వంసం చేయడం ఇంకా ప్రమాదకరం. ప్రత్యామ్నాయ ఇసుక వినియోగమే పరిష్కారం. - రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.పురుషోత్తం రెడ్డి పర్యావరణవేత్త ఆధునిక పరిజ్ఞానమే పరిష్కారం పూర్వం ప్రతి ఊరి శివారులో పుష్కలంగా ఇసుక ఉండేది. వాననీళ్లు ఎక్కడికక్కడే ఇంకి భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చేవి. మట్టి, సున్నం మిశ్రమంతోనే అన్ని రకాల నిర్మాణాలు చేసేవారు. కానీ సిమెంట్ పరిచయం తో ఇసుక తప్పనిసరైపోయింది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోయాయి. ఇసుక తవ్వకాలపై నియంత్రణ కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగించుకోవాలి. ద్రోణ్లతో త్రీడీ మ్యాపింగ్ ఆధారంగా నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే జరపాలి. అనుమతించిన పరిమితులకు లోబడే తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా? అని పరిశీలించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. - డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి, పర్యావరణవేత్త రాళ్ల దిగుమతి తప్పదేమో.. భవిష్యత్తులో గ్రానైట్ చాలా అవసరం. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో ఈ రాళ్లు ఎంతో అవసరం. రాతి ఇసుక కోసం కొండలను కరిగించుకుంటూపోతే భవిష్యత్తులో రాళ్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తవచ్చు. - డాక్టర్ ఎల్.హెచ్ రావు, సాంకేతిక సలహాదారులు, జిందాల్ సిమెంట్ పరిశ్రమలు క్రమపద్ధతిలో జరగాలి ఇసుక తవ్వకాలు క్రమపద్ధతిలో జరగాలి. ఒకచోట ఎక్కువ తవ్వేసి మరొకచోట వదిలేయడం వల్ల నీరు సరిగా పారదు. ఎక్కువ తవ్విన ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతుంది. ఎక్కువ ఇసుక ఉన్నచోట పైపొరను మాత్రమే తీయాలి. లోపలి పొరలు కూడా తవ్వితే నీటిస్థాయి పడిపోతుంది. - డాక్టర్ ఎంవీఎస్ రాజు, ప్రొఫెసర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ -
పూడికమట్టితో కార్బన్ ఉద్గారాల కట్టడి
మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ మేలైన ఫలితాన్నిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడుతుందని అమెరికాకు చెందిన మిషిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. భూగర్భజలాల పెంపు, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పంటల ఉత్పాదకత పెంచడంలో చెరువుల నుంచి తీసిన పూడికమట్టి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించి చెరువుల పునరుద్ధరణ పనులపై అధ్యయనం చేసిన ఐదుగురు విద్యార్థుల బృందం తమ అనుభవాలను గురువారం సచివాలయంలో మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా బృందం సభ్యుడు డి.ఆదిత్య అధ్యయనంలో తేలిన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్న దృష్ట్యా ఎకరాకు 200 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలుస్తోందని తెలిపారు. అదే చెరువుల నుంచి తీసిన పూడిక మట్టిని పంట పొలాలకు వాడటం ద్వారా జింక్, పాస్ఫరస్, ఐరన్, మాంగనీస్ వంటి సూక్ష్మధాతువులు భూమిలో చేరి ఎరువుల అవసరం తగ్గుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై ఎరువులపై భరిస్తున్న సబ్సిడీ భారం, దిగుమతుల భారం, సరుకు రవాణాతో జరిగే కార్బన్ ఉద్గారాలు త గ్గుతాయన్నారు. చెరువుల పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దీంతో బోర్ మోటార్ల వినియోగం, మోటార్లపై పడే కరెంట్ లోడ్ భారం తగ్గుతుందని, ఫ్లోరైడ్ శాతం భూమి కింది పొరలకు చేరుతుందని వివరించారు. ఈ బృందంలోని విదేశీ విద్యార్థులు, జాన్, లియాన్, షమితలు మాట్లాడుతూ తాము రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించామని, అక్కడి రైతుల నుంచి వివరాలు సేకరించామన్నారు. తెలంగాణలో రైతుల జీవన ప్రమాణాలను పెంచి, వారిపై పడే రసాయన ఎరువుల భారాన్ని తగ్గించేందుకు మిషన్ కాకతీయను ప్రభుత్వం చేపట్టడం తమను ఆకర్షించిందన్నారు. -
ధర దడ
- దళారుల చేతుల్లో మార్కెట్ - టమోటా, మిర్చి, కాకర, బీర రేట్లకు రెక్కలు - బహిరంగ మార్కెట్లో కేజీ రూ.30-60 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగవుతున్న కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. నగరం చట్టుపక్క జిల్లాల్లో టమోటా సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి తగ్గిపోయింది. దీన్ని సాకుగా చూపుతూ నగరంలో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా వీటి ధరలు పెంచేశారు. ఏటా జూన్, జులై నెలల్లో ఎదురయ్యే కూరగాయల కొరతను ఆసరాగా చేసుకొని దళారులు ధరలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. హోల్‌సేల్‌తో సంబంధం లేకుండా తమ ఇష్టారీతిన రేట్లు పెంచి వినియోగదారుని దోచుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా... రూ.30-60 మధ్యలో ధర పలుకుతున్నాయి. స్థానికంగా కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో మదనపల్లి, బెంగళూరు, ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ఏర్పడి... ఆ ప్రభావం ధరలపై పడుతోంది. టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంతగా పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కేజీ రూ.60-100 పలుకుతుండడం వాటి కొరతకు అద్దం పడుతోంది. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో టమోటా ధర కేజీ రూ.20 పలుకగా... ఇదే సరుకును బహిరంగ మార్కెట్లో రూ.35కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా 30-40శాతం పెంచేశారు. తగ్గిన సరఫరా... నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 30-35% మేర సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ మాత్రం ఏటా ఈ పెరుగుదల సర్వసాధారణమే అంటూ చోద్యం చూస్తోంది. ఈ సీజన్లో ఎక్కడా సమృద్ధిగా కూరగాయలు దొరకవు గనుక తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే కొత్తపంట వేస్తారు. దిగుబడికి 45-65రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల వరకు కూరగాయల ధరలు అస్థిరంగానే ఉండొచ్చనివారు చెబుతున్నారు. ట‘మోత’ టమోటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమోటా రూ.30 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.14కు లభించిన టమోటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.23కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమోటాకు మంగళవారం బహిరంగ మార్కెట్లో రూ.30-35ల చొప్పున వసూలు చేశారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చే రుకోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఆ ప్రభావం ధరలపై పడింది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. నగరానికి రోజుకు 400 టన్నుల టమోటా అవసరం. ప్రస్తుతం సుమారు 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ కొరతే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. గత పది రోజుల్లోనే ధరలు రెట్టింపవడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ తల్లకిందులైంది. బెంగళూరు, మదనపల్లి మార్కెట్లలోనే మంచి ధర లభిస్తుండటంతో నగరానికి సరఫరా తగ్గి, కొరత ఎదురైందని వ్యాపారులు చెబుతున్నారు. -
గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో..
- అడుగంటిన భూగర్భ జలాలు - రాయచూరు జిల్లాలో - తీవ్ర తాగునీటి ఎద్దడి రాయచూరు రూరల్: ప్రస్తుత వేసవి కాలంలో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని కొళాయిల్లో నీళ్లు రాకపోవడంతో బోర్లలోని ఉప్పు నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రాయచూరు పట్టణం లో దాదాపు 4 లక్షలకు పైగా జనాభా వుంది. పట్టణంలో నేతాజీ నగర్, ఎన్జీఓ కాలనీ, వాసవీనగర్, పంచముఖీ కాలనీ, మడ్డిపేట, విద్యానగర్, గంజ్ఏరియా, షియాతలాబ్, సిటీ టాకీస్ ఏరియా, స్టేషన్ ఏరియా, రామలింగేశ్వర కాలనీ, నీలకంఠేశ్వర నగర్, ఐడీఎంఎస్ లేఅవుట్, నిజలింగప్ప కాలనీ, హరిజనవాడ, బెస్తవారి పేటల్లో నీటి కోసం గంటల తరబడి బోర్ల దగ్గర, కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. రాత్రి పూట కొన్ని ప్రాంతాల్లో నీటిని విడుదల చేస్తుండటంతో జాగరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో ఏ కొళాయి వద్ద, బోరింగుల వద్ద చూసినా జనాలు బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని పథకాల కింద నిర్మించిన ట్యాంకులు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున అవి ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. వేసవి కాలంలో పట్టణంలోని ప్రజల నీటి అవసరాలను గుర్తించి చేపట్టిన కొత్త పథకం పనులు మందకొడిగా జరుగుతున్నా మరో వైపు వున్న మంచినీటి పథకాల ద్వారా నీటిని అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. జిల్లాలోని దేవదుర్గ తాలుకా క్యాదిగేర, రంగనాయకి తండా, మల్లాపూర, సింధనూరు తాలుకా శ్రీనివాస్ క్యాంపు, మాన్వి తాలుకా ఇరకల్, కవితాళ, వక్రాణి, చీకలపర్వి క్యాంపుల్లో తాగునీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేపడుతున్నారు. రాయచూరు తాలుకాలో 16, మాన్విలో 33, దేవదుర్గలో 27, సింధనూరులో 52, లింగసూగూరు తాలూకాలో ఐదు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొం దని అధికారులు చెపుతున్నారు. మరోవైపు గుల్బర్గ ప్రాంతీయ కమిషనర్ బిస్వాస్ రాయచూరు మినహా ఏ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేదని చెప్పడానికి పైగ్రామాలే సాక్ష్యంగా చెప్పవచ్చు. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించి రూ.1.30 కోట్లు మంజూరైనా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా అధికార యంత్రాంగం నిధులు కేటాయిం చినా ఫలితం లేకుండా పోతోంది. ఈనేపథ్యంలో పట్టణంలోని ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటికైనా నీటి సరఫరాను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అన్నదాత ఉసురు తీసిన అప్పులు
♦ పురుగు మందు తాగి రైతు బలవన్మరణం ♦ లింగారెడ్డిపేటలో ఘటన తూప్రాన్ : భూగర్భ జలాలు అడుగంటడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి తుడిచి పెట్టుకుపోయింది. చేతికంద లేదు. దీంతో అప్పులు తీర్చలేక మనో వేదనకు గురై రైతు పురుగు మందు తాగి మంగళవారం తనువు చాలించాడు. ఎస్ఐ సంతోష్‌కుమార్ కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు పిట్ల మల్లేశం (65) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పొలంలో రెండు బోరుబావులను తవ్వించాడు. ఇందుకోసం సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి ఖర్చు చేశాడు. ఎకరంలో టామోటా, వరి నాటు వేశాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు లేక పొలం ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురయ్యాడు. ఇదిలా ఉండగా.. రుణదాతలు అప్పు తీర్చాలని ఒత్తిళ్లు చేశాడు. వీరికి మంగళవారం డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే వాయిదా సమీపంచడంతో అప్పులు తీర్చేమార్గంలేక ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున ఇంట్లో వారు లేచినప్పటికీ మల్లేశం నిద్ర నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించే సరికి అప్పటికే మల్లేశం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సుగుణమ్మ రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. -
భూగర్భ శోకం
- ప్రమాదకర స్థాయికి పడిపోయిన నీరు - ములుగు, తూప్రాన్‌లో 34 మీటర్ల లోతుకు.. - ఏడాదిలోనే 6.31 మీటర్ల దిగువకు - బోర్లు తవ్వుతున్నా పడని నీరు -ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం - వచ్చే సీజన్లో కురిసే వర్షాలే ఆధారం జిల్లాలో ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నాయి... రోజు రోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి... బోరుబావులు, చేతిపంపులు ఎండిపోతున్నాయి... చెరువుల్లో నీరు లేకుండా పోయింది... అక్కడక్కడా అవసరానికి మించి నీటి విని యోగం పెరిగిపోయింది... ఎన్ని బోర్లు వేసినా నీరొచ్చే పరిస్థితి లేదు. విషయం తెలియని రైతులు బోర్ల మీద బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారు... ఈ వేసవిలో తాగు నీటికీ కష్టాలు తప్పేట్టు లేదు... వచ్చే సీజన్లో వాన దేవుడు కరుణించకపోతే నీటి యుద్ధాలు తప్పేట్టు లేదు. సాక్షి, సంగారెడ్డి :జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 6.31 మీటర్ల లోతుకు చేరాయి. గత ఏడాది మార్చిలో 12.48 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 18.79 మీటర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత వేసవిలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. దీనికితోడు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతోండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బోరుబావులు ఇప్పటికే ఎండిపోయాయి. దీనికితోడు చేతి పంపులు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో వ్యవసాయ బోరుబావులు సైతం నీరు పోయడం తగ్గింది. రబీలో వరి, చెరకు పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరానికి మించి బోర్లు వేయటం. భూగర్భజలాలను వాడుకోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బోరుబావుల ద్వారా వందశాతం భూగర్భజలాలు వాడుతున్న గ్రామాలు జిల్లాలో 377 వరకున్నాయి. డార్క్ ఏరియా ప్రాంతాలు అత్యధికంగా ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే మెదక్ అగ్రభాగాన ఉంది. భూగర్భ జలాలు పడిపోతున్నా ఇది తెలి యక రైతులు ఆశతో బోర్లు వేసి నీళ్లు పడక అప్పులపాలవుతున్నారు. ములుగులో 34.03 మీటర్ల లోతుకు చేరిన నీరు.. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా ములుగు గ్రామంలో 34.03 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తూప్రాన్‌లో 33.35 మీటర్లు, గజ్వేల్‌లో 30.80 మీటర్ల మేర పడిపోయాయి. కొల్చారం మండలం రంగంపేటలో 32.50, టేక్మాల్ 29.10, రామచంద్రాపురం 28.38, జిన్నారం మండలం అన్నారం గ్రామంలో 27.90, దౌల్తాబాద్ మండలం రాయిపోల్‌లో 26.31, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో 26.23, దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌లో 25.21 మీటర్ల మేరకు చేరుకున్నాయి. జగదేవపూర్ మండలం ధర్నారంలో 23.59, ములుగు మండలం జప్తిసింగపల్లిలో 23.57 మీ., మునిగడపలో 22.50 మీ., జహీరాబాద్ మండలం రంజోల్‌లో 21.50 మీ., ములుగు మండలం అడవి మజీద్‌పల్లిలో 21.42 మీ., మనూరు మండలం పూసల్‌పాడ్ గ్రామంలో 20.75 మీ., చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో 20.29 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. వీటికితోడు 10 మండలాల్లో 20 నుంచి 15 మీటర్లకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండడంతో గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. బావుల్లో సైతం నీళ్లు అడుగంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో సమస్య మరింత తీవ్రమవుతుంది. వర్షాల పైనే ఆశ.. కురిసిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపితేనే మేలు ఉంటుంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తేనే జిల్లాలో భూగర్భ జలాలు పెరిగే (పైకి వచ్చే) అవకాశం ఉంది. లేనిపక్షంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 1.60 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం అవసరానికి మించి నీటిని వాడుతున్నారు. బోరుబావులున్న రైతులు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వైపు మళ్లితే ఫలితం ఉంటుంది. అధికారులు వాల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే మేలు జరుగుతుంది. -
గోదారికి రాంరాం.. జూరాలకు సలాం!
- ప్రాణ హిత- చేవెళ్ల ప్రాజెక్టు కుదింపు యత్నం - పక్కజిల్లాల వరకే పరిమితం - ప్రత్యామ్నాయంగా జూరాల నుంచి కృష్ణాజలాలు - మూడో దశలో మన జిల్లాకు సాగునీరు - రూ.32వేల కోట్ల అంచనా వ్యయం - ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి దశాబ్ధకాలం అన్నదాతలకు ఆదరువు అవుతుందనుకున్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టు కథ.. కంచికి చేరుతుంది. నెర్రెలు విచ్చుకున్న నేలలను సస్యశ్యామలం చేసి హరితతోరణం సృష్టిస్తుందని భావించిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కుదించే యత్నం చేస్తోంది. గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కలలుగన్న జనహృదయ నేత, స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆశయానికి గండికొడుతూ.. ప్రాజెక్టులో అటు ప్రాణహిత.. ఇటు చేవెళ్లకు కోత పెట్టడం ద్వారా ైరె తాంగం ఆశలపై నీళ్లు జల్లుతోంది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుతో హరితవిప్లవం ఖాయమని భావించిన కర్షకులను ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకంతో ఏమారుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :భూగర్భజలాలపై ఆధారపడుతున్న తెలంగాణ జిల్లాలో హరితసిరులు పండించాలనే సంకల్పంతో ప్రాణహితకు డిజైన్ చేసిన ప్రభుత్వం.. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో రూ.1.40 లక్షల ఆయకట్టును స్థిరీకరించవచ్చని అంచనా వేయడమేకాకుండా.. పంప్‌హౌజ్, సొరంగం, భూసేకరణ, ఇతర పనులకు రూ.1,500 కో ట్లను కూడా ఖర్చు చేసింది. అయితే, ప్రస్తుతం కేసీఆర్ సర్కారు చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ నుంచి చేవెళ్లకు గోదారి నీటిని తరలించడం భగీరథ ప్రయత్నమే అవుతుందని భావిస్తున్న సర్కారు ప్రాజెక్టును పక్క జిల్లాల వరకే పరిమితం చేసి రంగారెడ్డిని తప్పించే యత్నం చేస్తోంది. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న జూరాల నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి జిల్లాలోని బీడు భూములను సాగులోకి తీసుకురావడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పట్లో కష్టమే..! ‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వరద సమయాల్లో వృధాగా పోతున్న 70 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ద్వారా కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు.. అందులో రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సస్యశ్యామలం చేయవచ్చని అంచనా వేసింది. అయితే, నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుండడం.. ముంపు బారిన పడే గ్రామాల సంఖ్య గణనీయంగా ఉండడంతో పునరాలోచనలో పడింది. తొలిదశలో జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు కృష్ణా జలాలను తీసుకురావాలనే ప్రతిపాదనపై ఇంజినీరింగ్ నిపుణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి కేవలం రిజర్వాయర్లలో నీటిని నింపుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని.. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే తప్ప ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని అంటున్నారు. భారీ వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టు మొదటి రెండు దశలు దాటి మూడో దశలో పనులు కార్యరూపం దాల్చాలంటే దాదాపు దశాబ్ధకాలం పట్టే అవకాశం ఉందని విశ్లేషిస్తున్న నిపుణులు.. రంగారెడ్డి జిల్లాకు ఇప్పట్లో జూరాల జ లాలు రావడం కల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
భూగర్భ శోకం!
గ్రేటర్లో గణనీయంగా పడిపోయిన భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే సగటున 2.80 మీటర్లు తగ్గుదల సిటీబ్యూరో: మండు టెండలు గ్రేటర్‌ను మాడ్చేస్తున్నాయి. భూగర్భ జలాలు ఆవిరవుతున్నాయి. మహా నగరంలో వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేకపోవడం... పెరుగుతున్న బోరుబావుల తవ్వకం, విచక్షణా రహితంగా నీటి వినియోగంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్లో సగటున 2.80 మీటర్ల లోతున నీటిమట్టాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది సగటున 7.92 మీటర్ల లోతున ఉన్న పాతాళగంగ ఈ ఏడాది 10.72 మీటర్ల లోతునకు పడిపోయింది. దీంతో శివారు ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోయి జనం విలవిల్లాడుతున్నారు. ఇదీ పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే ఆసిఫ్‌నగర్ మండలంలో 11.11 మీటర్లు, నాంపల్లిలో 8.52, హయత్‌నగర్‌లో 10.65, సరూర్‌నగర్‌లో 4.55 మీటర్లు పడిపోయాయి. ఉప్పల్‌లో 4.30 మీటర్లు, బాలానగర్‌లో 3.40, మారేడ్‌పల్లిలో 3.20 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయాయి. ఇతర మండలాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇవీ కారణాలు... మహానగర పరిధిలో అపార్ట్మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకే ందుకుఅందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు పట్టుమని పాతిక వేలు కూడా లేవు. ఈ కారణంగా భూమిపై పడిన వర్షపు నీటిలో 60 శాతం వృథా అవుతోంది. గ్రేటర్ లో భూగర్భ జలమట్టాలు (వాటర్ టేబుల్) పెంచేందుకు గత ఏడాది జీహెచ్ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతలు తవ్వేందుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్లు రాబట్టాయి. కానీ ఐదు వేల ఇంకుడు గుంతలతో సరిపెట్టడం ఆ శాఖల నిర్లక్ష్యానికి పరాకాష్ట. మహా నగరంలోని అధిక శాతం ఇళ్లు, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అథఃపాతాళానికి చేరుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంకుడు గుంత ఇలా ఉండాలి.. మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీయాలి. అందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు దీనిపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భ జలాల రీచార్జీ సులువవుతుంది. బోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి గుంత సైజు పెరుగుతుందని చెబుతున్నారు. -
రాజధానికి జల గండం
నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో అడుగంటిన నీటిమట్టాలు జంట నగరాలకు పొంచి ఉన్న నీటి కొరత రానున్న రోజుల్లో రాజధాని నగరానికి మంచినీటి ముప్పు తప్పేలా లేదు. ఒకవైపు భూగర్భ జలాలు పది మీటర్ల దిగువకు పడిపోవడం.. మరోవైపు జంట నగరాలకు తాగునీరందించే ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గిపోతుండటం... రాజధానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ప్రాజెక్టుల్లో నీరు అట్టడుగు స్థాయికి చేరడం అధికారులను సైతం కలవరానికి గురిచేస్తోంది. జూలైలో ఏమాత్రం వర్షాలు ఆలస్యమైనా.. తర్వాతి రెండు, మూడు నెలలు జంట నగరాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దుస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏరీతిన సన్నద్ధమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. - సాక్షి, హైదరాబాద్ సాగర్‌లో సంక్లిష్టం సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించే అంశంలో కొంత సంక్లిష్టత నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 24 టీఎంసీల జలాలను సాగుకు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఇవ్వడం, ఆవిరి నష్టాలు పోగా... జంట నగరాలకు ఆగస్టు వరకు తాగునీటిని అందించడం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 515.50 అడుగుల మేర నీరు ఉంది. నీటి నిల్వ 141.20 టీఎంసీలకు చేరింది. ఫిబ్రవరి 14న ఇరు రాష్ట్రాల సీఎంల చర్చల నాటికి సాగర్‌లో లభ్యత నీరు 51 టీఎంసీల మేర ఉండగా.. ఇప్పుడది 14 టీఎంసీలకు తగ్గింది. ఆ చర్చల అనంతరం ఏపీకి ఎడమ కాలువ కింద 2 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటలకు, 5 లక్షల ఎకరాల మేర రబీ అవసరాలతో పాటు కృష్ణా డెల్టాకు నీరందించే లక్ష్యంతో ఇప్పటివరకు 19 టీఎంసీలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు మరో 18 టీఎంసీల నీటిని వాడుకున్నారు. మొత్తంగా ఇప్పుడు మరో 14 టీఎంసీల మేర మాత్రమే నీరు అందుబాటులో ఉంది. అయితే ఎగువన శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 20 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వస్తోంది. ఇలా సుమారు 10 టీఎంసీల మేర నీరు సాగర్‌కు వచ్చే అవకాశముంది. ఆ లెక్కన సాగర్‌లో లభ్యత జలాలు 24 టీఎంసీలకు చేరుతాయి. ఈ మొత్తం నీటిలో సాగర్ ఎడమ కాలువ కింద తాగు అవసరాలకు 6 టీఎంసీలు, పంటల సాగుకు మరో 7 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంది. దీనితోపాటు ఆవిరి నష్టాల కింద 6 టీఎంసీల నీరుపోగా.. మిగిలేది కేవలం 5 టీఎంసీలే. ఈ 5 టీఎంసీలనే నెలకో టీఎంసీ చొప్పున జంట నగరాలకు తాగునీటికోసం సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నల్లగొండ జిల్లాలో తాగు అవసరాలకు డిమాండ్ పెరిగినా, సాగు అవసరాలకు మరింత నీరు అవసరమైనా... హైదరాబాద్‌కు అందే నీటిలో కోత పడక తప్పదు. ఇదే జరిగితే ఆగస్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీటికి కటకట తప్పదు. దానివల్ల పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరే కృష్ణాబేసిన్‌లో సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలుకురవని పక్షంలో మళ్లీ జంట నగరాలకు నీటి సమస్య తప్పే పరిస్థితి కనిపించడం లేదు. సింగూరుపైనే ఆశలు జంట నగరాలకు తాగునీటిని అందించే మరో ముఖ్యమైన ప్రాజెక్టు సింగూరుపైనే ఆశలు ఉన్నాయి. రాజధాని నగరమైన హైదరాబాద్‌కు నీటి సరఫరా కోసం ప్రాజెక్టులో ఆరు టీఎంసీల మేర వాటా ఉండగా.. ఇప్పటికే 5.2 టీఎంసీల మేర వినియోగించారు. మరో 0.8 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం సింగూరులో 7.5 టీఎంసీల మేర నీరు అందుబాటులో ఉంది. అందులో ఆవిరి నష్టాల కింద మూడు టీఎంసీలను తీసేసినా.. మరో నాలుగు టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఈ నీటితో జూన్ నెల వరకు రాజధాని నగరానికి తాగునీరు అందించవచ్చని అధికార వర్గాల అంచనా. ఒకవేళ వర్షాలు పడటం ఆలస్యమైతే మాత్రం ఇబ్బందే. అదే పరిస్థితి ఎదురైతే నీటి కొరత తప్పదని వారు పేర్కొంటున్నారు. గోదావరిలో జూలై నాటికి వర్షాలు సాధారణంగానే ఉంటాయని చెబుతున్నారు. భూగర్భ జలాల పరిస్థితి.. (భూ ఉపరితలం నుంచి లోతుకు-మీటర్లలో) జిల్లా గత ఏడాది ప్రస్తుతం హైదరాబాద్ 7.97 10.46 రంగారెడ్డి 10.18 14.00 ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు (అడుగుల్లో..) నీరు (టీఎంసీల్లో) ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం {పస్తుత మట్టం లభ్యత నీరు గత ఏడాది మట్టం లభ్యత నీరు నాగార్జునసాగర్ 590 516.1 142.3 517.55 144.79 సింగూరు 1,717.93 1,696.92 7.53 1,712.77 21.74 -
జనంపై జలభారం
గ్రేటర్ వాసులకు నీటి కష్టాలు ట్యాంకర్లే ఆధారం ఒక్కో కుటుంబంపైసుమారు రూ.2 వేల అదనపు భారం ఈ నెల 1 నుంచి 18 వరకు 30 వేల ట్రిప్పులకు బుకింగ్ {పైవేటు ట్యాంకర్ యజమానుల దోపిడీ సిటీబ్యూరో: గ్రేటర్లో పెరుగుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వట్టిపోతున్న బోరు బావులతో గ్రేటర్ శివార్లు తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధార పడాల్సిన దుస్థితి తలెత్తింది. జలమండలి పరిధిలో మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా 30 వేల ట్రిప్పులకు ట్యాంక్‌లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇలా బుక్ చేసుకున్న వారిలో 15 వేల మందికి 24 గంటల్లోగా.. మరో పదివేల మందికి 48 గంటల్లోగా ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నట్టు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో 2500 మందికి మాత్రం వారం రోజులైనా ట్యాంకర్ నీళ్లు అందకపోవడం గమనార్హం. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ ఆపరేటర్లు వినియోగదారుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్‌కు (ఐదువేల లీటర్ల నీటికి) రూ.450 వసూలు చేస్తుండగా.. ప్రైవేటు ఆపరేటర్లు ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. ఇక బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ట్యాంకర్లు సైతం పక్కదారి పడుతున్నాయి. పేదల గొంతు తడపాల్సిన నీటిని కొందరు ట్యాంకర్ యజమానులు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు. కొన్ని బస్తీల్లో జలమండలి ఉచిత ట్యాంకర్ల వద్ద మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్న దృశ్యాలు ఇటీవల బాగా పెరిగాయి. అదనంగా ట్యాంకర్ ట్రిప్పులను సరఫరా చేయని కారణంగానే ఈ పరిస్థితి తలెతోంది. టాం్యకర్ల పక్క దారి... జలమండలి పరిధిలో నీటి సరఫరాకు 6,674 ట్యాంకర్లున్నాయి. ఇందులో బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సినవి 125 ఉన్నాయి. కొన్ని బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన ట్యాంకర్లు పక్కదారి పడుతున్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై బోర్డు అధికారులు దృషి ్టపెట్టి ట్యాంకర్ యజమానులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వేసవిలో అదనంగా 500 ట్యాంకర్లతో గ్రేటర్ శివార్లలో మంచినీటి పైప్లైన్లు లేని వెయ్యి కాలనీలు, బస్తీలు, ఎగువ ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయాలని కాలనీ సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గొంతెండుతోంది... గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. ఎండలు తీవ్రమవుతుండడంతో నీటి సమస్య పెరుగుతోంది. మల్కాజ్గిరి, బోడుప్పల్, కాప్రా, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతునకు బోరుబావులు తవ్వినా నీళ్లు లేక బావురుమనాల్సి వస్తోంది. జలమండలి మంచినీటి సరఫరా నెట్వర్క్ లేని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో పానీపరేషాన్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక ఇల్లు లేదా ఫ్లాట్ యజమాని నెలకు ట్యాంకర్ నీళ్లకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదీ లెక్క... గ్రేటర్ పరిధిలోని అపార్ట్మెంట్లు: సుమారు 25 వేలు ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి యజమాని ట్యాంకర్ నీళ్ల కోసం నెలవారీ చేస్తున్న ఖర్చు: ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2వేలు గ్రేటర్ పరిధిలోని మొత్తం భవంతులు: సుమారు 20 లక్షలు జలమండలి నల్లా కనెక్షన్లు: 8.64 లక్షలు జలమండలి సరఫరా నెట్వర్క్ లేని కాలనీలు, బస్తీలు: సుమారు వెయ్యి జలమండలి ట్యాంకర్లు: 674 {పైవేటు నీటి ట్యాంకర్లు: సుమారు నాలుగు వేలు. ఈ నెల 1 నుంచి 18 వరకు ట్యాంకర్ ట్రిప్పులు: 30 వేలు వారం రోజులుగా పెండింగ్‌లో ఉన్న ట్రిప్పులు: 2500 {పైవేటు ట్యాంకర్ నీళ్లకు (ప్రతి ఐదువేల లీటర్లకు) చెల్లిస్తున్న ధర: రూ.750 నుంచి రూ.1000 జలమండలి ట్యాంకర్ నీటికి: రూ.450(గృహవినియోగానికి) -
తెలంగాణ అంతటా.. పాతాళ గంటలు!
దారుణంగా పడిపోతున్న భూగర్భ జలాలు ఫిబ్రవరిలో సగటున 11.73 మీటర్ల లోతులో నీళ్లు గత ఏడాది మేలో 9.89 మీటర్లలో లభ్యం ఎండలు మరింత ముదిరితే గడ్డు పరిస్థితే ఇప్పటికే మెదక్‌లో పాతాళంలోకి జలాలు 18.85 మీటర్లకు పడిపోయిన వైనం ఈ వేసవిలో తాగునీటి కటకటపై సర్కారు ఆందోళన తీవ్ర నీటి కరువును సూచిస్తున్న జలవనరుల శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో ఇక ముందున్న ఎండా కాలాన్ని తలచుకుంటేనే వణుకుపుడుతోంది. గత ఏడాది మే నెలలో నిండు వేసవితో పోల్చినా ఈసారి మార్చిలోనే గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జలవనరులు ఆవిరవడంతో రానున్న రోజుల్లో తాగునీటికి కటకట తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరువు విలయతాండవం చేయనుందని సర్కారే కలవరపడుతోంది. రాష్ర్టంలోని జలవనరుల పరిస్థితిపై భూగర్భ జలవనరుల శాఖ సోమవారం సమగ్ర నివేదికను విడుదల చేసింది. అందులో విస్తుగొలిపే వివరాలను వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ర్టంలో సరాసరి 8.47 మీటర్ల లోతులో నీరు లభిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అవి 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏకంగా 3 మీటర్లకుపైగా జలాలు ఇప్పటికే అదనంగా ఆవిరైపోయాయి. ఎంత దారుణంగా అడుగంటాయంటే గత మే నెలలో కూడా 9.89 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితి ఏర్పడిందన్నమాట! ఇటీవలి కాలంలో ఇంతటి దుస్థితి ఎన్నడూ రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ జిల్లాలో దారుణ పరిస్థితి... భూగర్భ జలాలు అడుగంటిన జిల్లాల్లో మెదక్ తొలి స్థానంలో ఉంది. ఇక్కడ గత ఏడాది ఫిబ్రవరిలో 11.89 మీటర్ల లోతులో జలాలు లభిస్తే.. ఈసారి ఫిబ్రవరికి 18.85 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే 6 మీటర్లకుపైగా నీళ్లు అదనంగా ఆవిరయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఈ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 11.40 మీటర్లలో ఉన్న జలాలు.. ఈసారి 11.82 మీటర్లలో లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యధిక స్థాయిలో పడిపోయిన గ్రామాలను సైతం ప్రభుత్వం గుర్తించింది. మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో అత్యంత గడ్డు పరిస్థితి నెలకొంది. 33.88 మీటర్ల లోతుల్లోకి నీళ్లు అడుగంటాయి. అదే జిల్లా తూఫ్రాన్ మండల కేంద్రం పరిస్థితి కూడా ఘోరంగా మారింది. గత ఏడాది ఫిబ్రవరిలో 5.15 మీటర్లలోనే నీరు లభిస్తే.. ఈ ఫిబ్రవరిలో మాత్రం ఏకంగా 33.10 మీటర్లలోకి నీటి నిల్వలు పడిపోయాయి. ఇలాంటి ప్రాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. దీంతో ఇంకా ఎండలు ముదిరితే తాగునీటి సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నీటి కటకటపై ఇటు ప్రజల్లో, అటు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రచించాల్సి ఉంది. -
జలగండం
అడుగంటుతున్న భూగర్భ జలాలు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి మండలం నీటిమట్టం (మీ.) బంట్వారం 20.97 మొయినాబాద్ 12.11 హయత్‌నగర్ 9.70 గండేడ్ 9.55 మంచాల 7.34 ఎండలు తీవ్రం కాకముందే తాగునీటి కటకట మొదలైంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఫలితంగా రోజురోజుకూ భూగర్భ నీటి మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే జిల్లాలో సగటున నాలుగు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమైనట్లు ఆ శాఖ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటి మట్టం 14 మీటర్లుగా(45 ఫీట్లుగా) భూగర్భజలవనరుల శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే వెయ్యి ఫీట్ల లోతుకు వెళ్లినా నీటి లభ్యత అంతంతమాత్రమే. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో భారీ నీటి ప్రాజెక్టులు లేనికారణంగా సాగు ఆసాంతం బోరుబావులపైనే ఆధారపడింది. ప్రస్తుతం రబీ కీలక దశకు చేరుకోవడంతో నీటి వాడకం పెరిగింది. మరోవైపు తాగునీటికి కీలక వనరు సైతం బోరుబావులే కావడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో భూగర్భజలాలు క్రమంగా పతనమవుతున్నాయి. గత నెలలో 11 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతుండగా.. ప్రస్తుతం 14 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. తాజాగా అధికారుల పరిశీలన ప్రకారం బంట్వారం మండలంలో నీటి మట్టం 28.77 మీటర్లుగా నమోదైంది. అదేవిధంగా మొయినాబాద్‌లో 27.11 మీటర్లు, మల్కాజిగిరి 23.66 మీటర్లు, మర్పల్లిలో 22.70 మీటర్లలోతులో నీరున్నట్లు చెబుతున్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రత్యామ్నాయ చర్యలతో గట్టెక్కించకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముంది. జాడలేని వేసవి ప్రణాళిక జిల్లాలో మెజారిటీ గ్రామాలకు ఇప్పటికీ భూగర్భజలాలనే తాగునీటి కింద సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జిల్లా తూర్పు డివిజన్ ప్రాంతాలకు కృష్ణా నీటిని అందిస్తుండగా.. ఉత్తర ప్రాంతానికి గోదావరి నీరందిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నీటి సరఫరాలో లోటు ఏర్పడింది. ఫలితంగా వాస్తవ సరఫరా కంటే తక్కువ మోతాదులో నీటిని సరఫరా చేస్తుండగా.. వినియోగం మాత్రం రెట్టింపయ్యింది. దీంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో గ్రామీణ నీటిసరఫరా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. అధికారులు ఇప్పటివరకు ప్రత్యేక ప్రణాళికలేవీ రూపొందించలేదు. ఆ విభాగానికి పూర్తిస్థాయి అధిపతి లేకపోవడంతోనూ ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పక్కా ప్రణాళిక లేనందున ఈ సీజన్లో జిల్లా ప్రజానీకానికి తాగునీటి ఇబ్బందులు తప్పేలాలేవు. -
పాతాళంలో నీరు
- పడిపోతున్న భూగర్భ జల మట్టం - భవిష్యత్తులో తాగు నీటికి కటకటే - వర్షపాతం పడిపోవడమే కారణం - పొదుపుగా వాడుకోకపోతే తిప్పలే మోర్తాడ్ : పోయిన వానాకాలంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఇప్పుడు భూగర్భ జల మట్టం పడిపోతోంది.ఈ పరిస్థితులలో నీటిని పొదుపుగా వాడుకోవడం తప్ప మరో మార్గం లేదని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. లేకపోతే వేసవిలో తాగునీటికి ప్రమాద ఘంటికలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గత ఫిబ్రవరిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 45 ఫీజో మీటర్ల నుంచి భూగర్భ జలమట్టం వివరాలను శాస్త్రవేత్తలు సేకరించారు. జనవరి నెల కంటే ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం చాలా వరకు పడిపోయినట్లు తేలింది. గత సంవత్సరం వివరాలను,ఇప్పటి వివరాలను పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టం ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లే అని శాస్త్ర వేత్త లు చెబుతున్నారు. అనేక ప్రాంతాలలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జల మట్టం ఉంది. నాన్ కమాండ్ ఏరియాలో నీరు లోతులో ఉండటం సాధారణ విషయం. కమాండ్ ఏరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో నీటికి తిప్పలు తప్పేలా లేవు. ఇదీ పరిస్థితి 17 ఫీజో మీటర్లలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్బ జలాలు నమోదై ఉన్నాయి. ప్రధానంగా కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోనే ఇబ్బందికర పరిస్థితులు ఎ క్కువగా కనిపిస్తున్నాయి. భిక్కనూర్ వద్ద జనవరిలో 20.83 మీటర్ల లోతులో ఉన్న జలం ఇప్పుడు 21.68 మీటర్ల లోతుకు చేరింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో 9.63 మీటర్ల లోతులో ఉంది. దోమకొండ ప్రాంతంలో 23.57 మీటర్ల లోతులో ఉంది. గాంధారి మండలంలో సర్వాపూర్‌లో 19.11 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండగా గడ చిన జనవరిలో 15.98 మీటర్లుగా నమోదైంది. నెల రోజుల వ్యవధిలోనే మూడున్నర మీటర్ల లోతుకు మట్టం పడిపోయింది. భిక్కనూర్ మండలంలోని మల్లారెడ్డి ప్రాం తంలో అత్యధికంగా 30.11 మీటర్ల లోతులో ఉంది. జనవరిలో కూడా ఇదే స్థాయిలో నీటి మట్టం ఉంది. గత సంవత్సరం మాత్రం 20.11 మీటర్ల లోతులో నీటి మట్టం నిక్షిప్తమై ఉంది. ఈ ప్రాంతంలో వర్షపు నీటిని పరిరక్షించడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. బీబీపేట్, సదాశివ్‌నగర్, కామారెడ్డి ప్రాంతాలలో కూడా జల మట్టం ఎక్కువ లోతులో ఉంది. ఈ డివిజన్లో ఎర్రాపహాడ్, రెడ్డిపేట్, తాడ్వాయి, లింగంపేట్, మాచారెడ్డి ప్రాంతాలలో మాత్రం కొంత పర్వా లేదనిపించే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లోని జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, భీమ్‌గల్, బాల్కొండ మండలం ముప్కాల్ ప్రాంతాల్లో నీటి మ ట్టం 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయి. వేల్పూర్ మండలంలోనైతే, ఏకంగా 22 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. బోధన్ డివిజన్లో కోటగిరి, మ ద్నూర్, రెంజల్ మండలాలలో ఎక్కువ లోతులో నీటి మట్టం ఉంది. జిల్లా సాధారణ నీటి మట్టం 13.26 మీటర్లుగా ఉంది. జనవరిలో 12.19 మీటర్ల నీటి మట్టం ఉంటే ఒక నెల వ్యవధిలోనే ఒక మీటరు లోతుకు నీటి మట్టం పడిపోయింది. గత సంవత్సరం అయితే 8.72 మీటర్ల లోతులోనే నీటి మట్టం ఉండటంతో ఎలాంటి ఇబ్బంది క లుగలేదు. జిల్లా సాధారణ వర్షపాతం 1,007 మిల్లిమీటర్లు అయితే నమోదైన వర్షపాతం 509 మి.మీ. 49.5 శాతం లోటు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత సంవత్సరం అయితే 1,145 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గడచిన సీజనులోనే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి భూగర్భ జలాలు తక్కువగా ఉండటంతో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక, వచ్చే వర్షాకాల సీజనులో కురిసే వర్షాలతో చేరే నీ టిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నీటి కష్టాలు తీవ్రమవుతాయి. అందరూ నీటిని పొదుపుగా వినియో గించాలి. ఈ విషయంపై అవగాహన పెంపొందించుకోవాలి. - పి. శ్రీనివాస్‌బాబు, భూగర్భ జల శాస్త్రవేత్త, నిజామాబాద్ -
తాగునీటి కష్టాలు షురూ
తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవి ఆరంభానికి ముందే తాగునీటి కటకట తీవ్రమవుతోంది. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా నీటి సమస్య జటిలమవుతోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇంతకాలం గొంతు తడిపిన చేతిపంపులు కూడా వట్టిపోతున్నాయి. బావుల్లో నీరు ఆవిరైపోయింది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకంపై దృష్టి పెట్టినప్పటికీ ప్రస్తుతం దాహం తీరేదెలాగన్నదే ప్రశ్నార్థకంగా మారింది. - సాక్షి నెట్వర్క్ ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నీటి కోసం అల్లాడుతున్నారు. ఏ గూడెం చూసినా బిందెడు నీటి కోసం రెండుమూడు కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. జిల్లాలో 33 మండలాల పరి ధిలో 307 ఆవాసాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం గుర్తించింది. ఇందులో 141 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. అలాగే 27 నివాసిత ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని భావిస్తోంది. మట్టి కూరుకుపోయిన 419 బోర్‌వెల్స్‌ను ఫ్లషింగ్ చేయాలని నిర్ణయించిం ది. మరో 81 చోట్ల బోర్లను మరింత లోతుకు తవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ పనుల కోసం రూ. 3.73 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, వేసవి ముం చుకొస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. ఖమ్మంలో నీటి కటకట మూడున్నర లక్షల జనాభా కలిగిన ఖమ్మం వాసులకు రోజు విడిచి రోజు తాగునీరు అందుతోంది. మున్నేరు జలాశయం, ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ ద్వారా సరఫరా జరుగుతోంది. అయితే ఇప్పటికే మున్నేరు అడుగంటింది. పాలేరు రిజ ర్వాయర్ నుంచి కాల్వద్వారా నీటిని తెస్తున్నా రు. ఈ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. నగర శివారు ప్రాంతాల వాసులు ట్యాం కర్లతో నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోం ది. రెండేళ్ల క్రితం సుమారు రూ. 74 కోట్లతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో వేసవిలో నీటి ఎద్దడి తప్పేలా లేదు. కొత్తగూడెం పట్టణానికి కూడా మూడురోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం నిర్మించిన కిన్నెరసాని పథకం పై ప్లైన్ తరుచూ లీకేజీ అవుతోంది. పాల్వం చ, ఇల్లెందు తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. నిజామాబాద్‌లో ప్రమాద ఘంటికలు నిజామాబాద్ జిల్లాలో 137 గ్రామాల్లో భూగ ర్భ జలాలు అడుగంటిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. జిల్లాలో 1,091 ఆవాసాల్లో తాగునీటి సమస్య నెలకొందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గుర్తించారు. 2,603 చేతిపంపులు ఎండిపోయాయి. 56 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. రూ. 158.82 కోట్లతో చేపట్టిన 374 చిన్న చిన్న తాగునీటి పథకాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 16 సీపీడబ్ల్యుఎస్ పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 16 మంచినీటి పథకాల నిర్వహణకు విద్యుత్ కొరత, భూగర్భజలాల కొర త, తరచూ పగిలిపొతున్న పైపులైన్లు ప్రతిబంధకంగా మారాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి పరి దిలో 369 ఆవాసాలకు రక్షిత మంచినీటి సరఫరా చేసే పథకం అసంపూర్తిగానే మిగిలింది. కరీంనగర్లో వెయ్యికిపైగా గ్రామాల్లో.. కరీంనగర్ జిల్లాలో 1,092 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని ఎదుర్కొనేందుకు రూ. 16కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పెద్దపల్లి, మంథని, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా అవసరాలు తీర్చే మానేరు డ్యాంలో 7.82 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట తాగునీటి పథకానికి, కరీంనగర్ పట్టణ అవసరాలకు మాత్రమే ఈనీటిని సరఫరా చేస్తున్నారు. మహబూబ్‌నగర్ గొంతెండుతోంది మహబూబ్‌నగర్ జిల్లాలో 2,688 గ్రామాల్లో తాగునీటి కి కటకట నెలకొంది. బోంరాస్పేట్, మాడ్గుల్, కొత్తూరు, మద్దూరు, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, బిజినేపల్లి, దౌల్తాబాద్ మండలాల పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. 195 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరానే శరణ్యమని అధికారులు గుర్తించా రు. పలు ప్రాంతాల్లో ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. బురదనీటిలో వెదుకులాట.. మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే సమస్య తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎద్దడి తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోనే మం జీరా నది ప్రవహిస్తున్నా తండాలు, గ్రామాల్లోని ప్రజలకు మాత్రం గుక్కెడు నీరు దొరకడం కష్టమవుతోంది. నియోజకవర్గం పరి దిలో 124 పంచాయతీలు, 180 తండాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో 90 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పను లు నత్తనడకన సాగుతున్నాయి. ‘ధర్మ’ సందేహమే.. వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ధర్మసాగర్, భద్రకాళి, వడ్డేపల్లి చెరువుల నీటిని కేటాయించారు. పెరిగిన నగర జనాభా అవసరాలను ఈ మూడు చెరువులు తీర్చలేకపోతున్నాయి. దిగువ మానేరు, దేవాదుల ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా 1.8 టీఎంసీల నీటితో ఈ చెరువులను నింపుతున్నారు. దీంతో ఏడాది పొడవునా రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ధర్మసాగర్ చెరువు నీటిమట్టం 29.0 అడుగులకు, భద్రకాళి చెరువు 13.2 అడుగులకు, వడ్డేపల్లి చెరువు నీటిమట్టం 11.6 అడుగులకు పడిపోయింది. రామప్ప చెరువులో 19 అడుగల వద్ద నీటిమట్టం ఉంది. దీని ద్వారా ములుగు, ఘణపురం, వెంకటాపురం మండలాల పరిధిలో 49 గ్రామాలకు తాగునీరు అందుతోంది. నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఇకపై సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. -
‘నీరు-చెట్టు’ మట్టి.. లే అవుట్లకే
సదాశయంతో సర్కారు చేపట్టిన పథకం రైతులకే తొలి {పాధాన్యమంటున్న అధికారులు అయితే రియల్టర్లకే దక్కనున్న ప్రయోజనం ఏది విత్తినా విరగపండే ‘నేలమ్మ కడుపు’లాంటి మాగాణాలే.. సేద్యానికి దూరమై, కేవలం ‘అమ్మకపు సరుకు’లా మారిపోతున్న రియల్ ఎస్టేట్ యుగం ఇది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ పథకం.. మన్నును పచ్చని పైర్లకు వేదికగా మార్చి, మల్లెల రాశిలాంటి అన్నాన్ని సృష్టించే రైతులకు కాక.. భూమిని పచ్చనోట్లు ఉత్పత్తి చేసే కార్ఖానాగా మార్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపయోగపడనుంది. రాజానగరం : భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు చెరువుల్లో నీటి నిల్వలను వృద్ధి చేయాలని, తద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నీరు - చెట్టు’ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారనుంది. భూగర ్భ జ లాలతోపాటు పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ద్వారా పచ్చదనాన్ని వృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ఆశయం మంచిదే అయినా ఆచరణ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 40 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఉపాధి పనుల్లో అభివృద్ధి చేసే అవకాశమున్నా అలాంటి వాటిని అభివృద్ధి చేసే కంటే 100 ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువుల పట్లే రియల్ ఎస్టేట్ వ్యా పారులు మక్కువ చూపిస్తారనేది వాస్తవం. అలాంటి చెరువుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు (లోతు చేయడం, చెరువు గర్భాన్ని విస్తరించడం) యంత్రాలను కూడా వాడవచ్చనే సవరణను ఈ వ్యాపారులు అనువుగా మలచుకుంటారని రైతులు అంటున్నారు. రాజమార్గం అంటున్న రియల్టర్లు.. కాగా ఈ పనులకు నిర్దేశించిన నియమ, నిబంధనల్లో చెరువు విస్తీర్ణాన్ని బట్టి మట్టిని ఎంతవరకు తీయవచ్చో సంబంధిత ఇంజనీరింగ్ అధికారి నిర్ణయిస్తారు. దానిని అనుసరించి మట్టి తవ్వకాలు చేపట్టాలి. తమ లే అవుట్లను ఎత్తు చేసుకునేందుకు అవసరమైన మట్టిని చెరువుల అభివృద్ధి నెపంతో తమకు అవసరమైన మేరకు తవ్వుకునేందుకు ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటారని రైతు ప్రతినిధులు అంటున్నారు. వాస్తవానికి ఈ పథకంలో చెరువులను అభివృద్ధి చేసే సమయంలో వెలికి తీసే మట్టిని పొలాల్లో వేసుకునేందుకు రైతులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. కాని ఆ విధంగా రైతులు మట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఎక్కడా లేదు. లే అవుట్లు మారుమూల గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏటా రెండు పంటలు పండే భూములను సైతం మంచి ధర వస్తే అమ్ముకోవాలని చూస్తున్న రైతులు చెరువుల్లో మ ట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసే అవకాశాలు లేవు. ఇంతవరకు లేఅవుట్లలో మట్టిని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు మామూళ్లు చెల్లించి అనధికారికంగా తీసుకుంటున్న తమకు ఈ పథకం నిజంగా రాజమార్గాన్ని చూపిస్తుందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే పేర్కొన్నారు. ఈ పను లు మండలస్థాయి కమిటీ పర్యవేక్షణ లో జరగవలసి ఉంది. ఆ కమిటీ సభ్యులు అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులే కావడంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ‘నీరు - చెట్టు’ పథకం నుంచి నిజమైన లబ్ధిని పొందుతారని జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా అభిప్రాయపడ్డారు. రూ.105.92 కోట్లతో 2,850 పనుల గుర్తింపు జిల్లాలో ఈ పథకం ద్వారా రూ.105.92 కోట్ల వ్యయం కాగల 2,850 పనులు గుర్తించారు. వీటిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న 324 భారీ సేద్యపు నీటి చెరువులు, 6,135 చిన్నతరహా సేద్యపు నీటి చెరువులు కూడా ఉన్నాయి. అలాగే 675 చెరువులకు మరమ్మతులతోపాటు 176 చెక్‌డ్యామ్‌లు, 400 మినీ ఇరిగేషన్ చెరువులు, 361 చిన్నపాటి చెరువులను అభివృద్ధి చేయనున్నామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. చెరువుల మట్టిని రవాణా చేసుకునేందుకు ట్రాక్టర్లు, లారీలకు నిబంధనల మేరకు అనుమతి అవసరమన్నారు. మొదటి ప్రాధాన్యం రైతులకే ఇస్తామని, వారు ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ లే అవుట్లకు ఈ మట్టిని తరలించడానికి వీలుందనే విషయాన్ని ప్రస్తావించగా వారిది ఆఖరు ప్రాధాన్యం మాత్రమేనన్నారు. -
నీళ్లివ్వండి బాబూ..
కరువు దరువు తీవ్ర వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు గుక్కెడు మంచి నీళ్లకోసం ఇక్కట్లు పనులు లేక వలసలు కబేళాలకు తరలుతున్న మూగజీవాలు మొర ఆలకించాలని ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల వేడుకోలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో సేద్యం పడకేసింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులు ఒట్టిపోతున్నాయి. జిల్లాలో కొన్నిచోట్ల పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉపాధి పనుల్లేక కూలీలు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ముఖ్యంగా పడమటి మండలాల్లో పశుగ్రాసం కొరతతో అన్నదాతలు కంట తడి పెడుతూ వాటిని పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కళ్లముందే కన్పిస్తున్నా ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లావాసి అయినప్పటికీ కనీసం ప్రజల గొంతు తడపడంలో కూడా చొరవ చూపలేదనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమౌతోంది. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతాంగం కుప్పకూలి పనులు లేక వలస పోతున్నా కనీసం ధైర్యం చెప్పి పనులు కల్పించిన దాఖలాలు కూడా లేవు. జిల్లాలో వేసవికి ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందుకాలంలో మరింత గడ్డు పరిస్థితులు తప్పవని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గురువారం నీరు-చెట్టు కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి కనీసం తాగునీరు, ఉపాధి పనులు కల్పించాలని వేడుకుంటున్నారు. గుక్కెడు మంచి నీళ్లకోసం.. జిల్లాలో ఇప్పటికే దాదాపు 2000లకు పైగా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు మూడు రోజులకు కూడా నీటి ట్యాంకరు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కుటుంబానికి బిందె నీటితోనే గడపాల్సిన గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పడమటి మండలాల్లో మంచినీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 216 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో 1,000 నుంచి 1,200 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాక రైతులు విలవిలలాడుతున్నారు. పనులు లేక.. జిల్లాలో వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటడంతో పనులు లేక కుటుంబాలు కుటుంబాలే గ్రామాలను వదలి పనుల కోసం వలసలు వెళుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే చిన్నపిల్లలు, ముసలి వాళ్లే దర్శనమిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఇప్పటికే 2.2 లక్షల మంది వలస వెళ్లినట్లు సమాచారం. ఇందులో కుప్పం నియోజకవర్గం నుంచే 45 వేల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. చెరువుల్లో పూడికతీత పనులను సైతం యంత్రాలతో చేయిస్తుండడంతో ఇంకా ఈ వలసల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మూగజీవాల రోదన జిల్లాలో పశువులకు మేత దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్ గడ్డి 7 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నా దొరకడం లేదు. తాగునీటితో పాటు గడ్డి లేకపోవడంతో పడమటి మండలాల్లో పశువుల ఆకలి బాధను చూడలేక సంతలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వాటిని కబేళాలకు తెగనమ్ముకుంటున్నారు. దీంతో అన్నదాత కుదేలు కావడంతో పాటు పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
కరువు కాటు!
- రబీలో భారీగా తగ్గిన పంటల సాగు - వేసిన పంటలూ చేతికొచ్చేది అనుమానమే - జిల్లాలో పడిపోయిన భూగర్భజలాలు - బోర్లలో అడుగంటిన జలాలు - ఎండిపోతున్న పంటలు - కష్టాల ఊబిలోకి అన్నదాతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు పరిస్థితులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండుముఖం పట్టగా.. భూగర్భజలాలు భారీగా పతనమయ్యాయి. దీంతో తాజాగా సాగుచేస్తున్న పంటలు కరువుదాటికి గట్టెక్కుతాయా.. లేదా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 43,100 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. వాస్తవానికి ఈ పాటికే సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగవ్వాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 32,725 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే తక్కువగా.. రబీ సీజన్లో జిల్లాలో ప్రధానంగా వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కానీ కరెంటు సమస్యతోపాటు భూగర్భజలాలు సైతం పతనమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిందిగా వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. ఈ క్రమంలో ప్రస్తుతసీజన్లో 16,269 హెక్టార్లలో వరి సాగవుతుందని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులతో జిల్లాలో వరిసాగు ముందుకు కదలలేదు. దీంతో కేవలం సాగు 12,312 హెక్టార్లకే పరిమితమైంది. నిర్దేశించిన విస్తీర్ణంలో 25 శాతం తగ్గడం గమనార్హం. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సైతం సాధారణ విస్తీర్ణం కంటే తక్కువగా సాగయ్యాయి. గట్టెక్కేదెలా..! జిల్లాలో సాగుకు కీలకమైన భూగర్భజలాలు ఈ ఏడు భారీగా పతనమయ్యాయి. గతేడాది జనవరిలో జిల్లాలో భూగర్భజల సగటు నీటిమట్టం 9.41 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరికి నీటి మట్టంలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో 13.30 మీటర్లకు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ నివే దికలు చెబుతున్నాయి. నీటి మట్టంతగ్గడంతో ఈ ప్రభావం పంటల సాగుపై చూపనుంది. ప్రస్తుతం జిల్లాలో 12,312 హెక్టార్లలో వరి సాగవుతుండగా.. ఈ పంట పూర్తిగా భూగర్భజలాలతోనే సాగవుతోంది. తాజాగా నీటి మట్టం పతనమవడంతోపాటు కరెంటు కోతలు సైతం మొదలవ్వడంతో వరిసాగు రైతులకు కష్టంగా మారింది. రెండువిడతలుగా ఆరుగంటలపాటు కరెంటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాలుగు గంటలకు మించి కరెంటు అందడం లేదు. సరఫరాలో సమస్యతో పలుమార్లు ఆటంకాలు తలెత్తుతున్నాయని యాచారం మండలం మెండిగౌరెల్లి గ్రామ రైతు నారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
జల గ్రహణం
శివారుల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు {పైవేటు ట్యాంకర్లే గతి అపార్ట్మెంట్లలో పెరుగుతున్న నిర్వహణ వ్యయం నల్లాల వద్ద భారీ క్యూలు. బోర్ల వద్ద జన సమూహాలు. ట్యాంకర్ల చెంత బిందెలతో యుద్ధాలు. గంటల తరబడి ఎదురు చూపులు... ఎక్కడికక్కడ వెక్కిరిస్తున్న బావులు...అడుగంటిన భూగర్భ జలాలు... ఇవీ నగర శివారుల్లో నీటి కష్టాలకు నిదర్శనాలు. వేసవి ఛాయలు పూర్తిగా కనిపించకముందే నగరంలో ప్ర‘జల’ఘోష మొదలైంది. భవిష్యత్తుపై బెంగను పెంచుతోంది. సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో వేసవికి ముందే బోరు బావులు బావురుమంటున్నాయి. మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 800కు పైగా కాలనీలు, బస్తీల్లో ఫిబ్రవరి మొదటిలోనేప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుమారు 30 లక్షల మందికి నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. వేలాది నివాసాలు, అపార్ట్మెంట్ల వాసులు నీటి ముప్పును తలచుకొని తల్లడిల్లుతున్నారు. జలమండలికి మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, ఇంకుడు గుంతలు లేక బోరుబావులు వట్టిపోవడంతో నిత్యం ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడక తప్పని దుస్థితి నెలకొంది. అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు ఒక్కొక్కరు రోజు వారీ వినియోగం, ప్రాంతాన్ని బట్టి నీటి కోసం నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా ఖర్చు చేయక తప్పని దుస్థితి నెలకొంది. ప్రగతి నగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, యాప్రాల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఎల్బీనగర్, బండ్లగూడ, గాజులరామారం..అన్నిచోట్లా ఇదే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుండడం గమనార్హం. మరోవైపు బస్తీల్లో ట్యాంకర్ల వద్ద అప్పుడే మహిళల ‘పానీ పట్టు’ యుద్ధాలు మొదలయ్యాయి. జనం అవస్థలకు నిదర్శనాలివీ ఉప్పల్‌లో: సర్కిల్లోని మూడు డివిజన్లలో 2014 జనవరిలో సగటున 8.20 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం కాగా... 2015 జనవరి లో 12.45 లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. రామంతాపూర్‌లోని వెంకట్‌రెడ్డి నగర్, రాంరెడ్డి నగర్, వివేక్‌నగర్, శ్రీనివాసపురం, గోఖలే నగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్, ప్రగతి నగర్, సాయిచిత్రా నగర్ తదితర బస్తీలు... కాలనీల్లో 1500-2000 అడుగుల వరకు బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. ఇటీవల నెహ్రూ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు 1500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించకపోవడం గమనార్హం. స్థానిక అపార్ట్మెంట్లలో ఉంటున్న ప్రతి కుటుంబం నెలకు నీటి కోసం రూ.2000-రూ.3000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. హైటెక్ నగరిలో: మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటాయి. ఈ ప్రాంతాల్లో 1500 అడుగుల లోతుకు బోరు వేసినానీరు రావడం లేదు. కొండాపూర్, శ్రీరాంనగర్ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాలలోని అపార్ట్మెంట్లలో ఒక్కో ఫ్లాట్ యజమాని నెలకు రూ.2500 చొప్పున నీటి కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ నిత్యం 35 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ (5000 లీటర్లు)కు రూ.650 వంతున చెల్లిస్తున్నారు. వేసవి కాలం వస్తే ట్యాంకర్‌కు రూ.వెయ్యికిపైగా చెల్లించాల్సి వస్తుంది. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు అద్దె రూ.9,000 కాగా నిర్వహణ ఖర్చు అందులో 25 శాతం కావడం గమనార్హం. నిజాంపేట్‌లో: బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిజాంపేట్‌లో ఎక్కడ చూసినా దాహార్తితో జనం అల్లాడుతున్నారు. ఫ్లాట్లలో నివసిస్తున్నవారు ఇంటి అద్దె రూ.6 వేలు, నీటి కోసం మరో రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరనీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి స్థానిక హైస్కూల్ పక్కనే వాటర్ ట్యాంక్ నిర్మించారు. నీరు మాత్రం స్థానికుల అవసరాలకు సరిపడే స్థాయిలో అందడం లేదు. దీంతో చాలా భవన సముదాయాలు బోర్లపై ఆధార పడుతున్నాయి. ప్రస్తుతం ఆ బోర్లు కూడా నీరిచ్చే స్థితిలో లేవు. దాదాపు రెండు వేల అడుగుల లోతుకు వెళ్లినానీటి జాడ దొరకడం లేదు. పంచాయతీ పరిధిలో దాదాపు 50వేల మంది కష్టాలు పడుతున్నారు. దీంతో భవన యజమానులు, అపార్టుమెంట్ అసోసియేషన్లు, ప్లాట్ల యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1400కు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ పంచాయతీలోనూ ఇదే దుస్థితి. 15 ఫ్లాట్లు ఉండేఅపార్ట్మెంట్కు నిత్యం ఐదు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. -
రబీ పంటలకు ‘లోటు’ తెగులు!
అదనులో కురవని వర్షాలు.. పాతాళంలో భూగర్భ జలాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రబీ పంటల సాగు విస్తీర్ణం ఆందోళన కలిగిస్తోంది. రబీ పంటలు సాగయ్యే 25.89 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటివరకు 21 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇప్పటికే 24.12 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. ప్రైవేటు సంస్థల సమాచారం ప్రకారం ఫిబ్రవరి తొలివారం నాటికి 18 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలించక భూగర్భ జలాలు అడుగంటడం, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదలయ్యే పరిస్థితి లేకపోవడంతో రైతులు అదునులో పంటలు వేయలేకపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు వాడిపోతున్నాయి. పత్తి, పొద్దు తిరుగుడు, కంది, రాగి, మొక్కజొన్న, నూగు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం చాలా చోట్ల మిర్చి పంట కల్లాల్లో ఉంది. ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి తీతలు ఊపందుకున్నాయి. చెరకు కొట్టుడు కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. మొక్కజొన్న, నువ్వులు పూత, పిందె దశలో ఉన్నాయి. వరి ఊడ్పులు పూర్తయ్యాయి. రెండో పంటకు నీళ్లు ఇస్తారన్న ఆశతో కోస్తా జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలో నీళ్లు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. -
జల శోకం
అడుగంటుతున్న భూగర్భ జలాలు జనవరి చివరి నాటికే భారీగా తగ్గిన నీటిమట్టం {Vేటర్‌లోని అన్ని మండలాల్లో ఇదే దుస్థితి {పైవేటు ట్యాంక ర్లే ఆధారం సిటీబ్యూరో: వేసవి రాకముందే మహా నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తు నీటి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతున్నాయి. నగరంలో 2014 జనవరిలో సగటున 7.33 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. ఈ ఏడాది అదే సమయానికి 9.91 మీటర్ల లోతుకు తవ్వితేగానీ గంగచిరునామా దొరకడం లేదు. గత ఏడాది కంటే 2.58 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. శివారుల్లోని ఇళ్లు, అపార్ట్మెంట్లలో బోరుబావులు చుక్క నీరు లేక బావురుమంటున్నాయి. అపార్ట్మెంట్ వాసులు భారీ మొత్తం వెచ్చించి నీటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటోంది. అన్ని మండలాల్లోనూ అంతే... గ్రేటర్ పరిధిలోని అన్ని మండలాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు అనూహ్యంగా తగ్గాయి. అత్యధికంగా ఘట్కేసర్ మండలంలో 11.75 మీటర్లు తగ్గాయి. హయత్ నగర్లో 9.05 మీటర్లు, నాంపల్లిలో 8.97, ఆసిఫ్‌నగర్‌లో 6.21, బండ్లగూడలో 2.40, చార్మినార్‌లో 2.72, మారేడ్‌పల్లిలో 3.51, శేరిలింగంపల్లిలో 0.45, సైదాబాద్‌లో 2, ఖైరతాబాద్‌లో 0.35, కుత్బుల్లాపూర్‌లో 0.20, సరూర్‌నగర్‌లో 4.95, ఉప్పల్‌లో 4.25, బాలానగర్‌లో 2.70, మల్కాజ్‌గిరిలో 1.41, రాజేంద్రనగర్‌లో 1.35, శేరిలింగంపల్లిలో 0.70 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. అపార్ట్మెంట్లకు తప్పని కష్టం గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 900 కాలనీలు, బస్తీల్లోని బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోయాయి. స్థానికులు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించి... జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఉదాహరణకు 22 ఫ్లాట్స్ ఉన్న ఒక అపార్ట్మెంట్లో రోజుకు ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ఏడు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. ఒక్కో ట్రిప్పునకు రూ.550 వంతున వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు రూ.3,850 అన్న మాట. ఈ లెక్కన నెలకు ప్రైవేటు ట్యాంకర్ల నీటికి రూ.1,15,500 చెల్లించక తప్పని దుస్థితి. ఒక్కో ఫ్లాట్ యజమాని ప్రతినెలా నీటి కోసం రూ.5250 వంతున ఖర్చు చేయక తప్పడం లేదు. వేసవిలో ట్యాంకర్ల ట్రిప్పులు పెరిగితే ఈ ఖర్చు కూడా భారీగా పెరుగుతుందని అపార్ట్మెంట్ల వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇక 22 ఫ్లాట్స్‌కు మించి ఉన్న బహుళ అంతస్తుల భవంతుల్లో రోజుకు సగటున పది నుంచి పదిహేను ట్యాంకర్ల నీరు అవసరం ఉంటుంది. రాబోయే మూడు నెలల్లో ట్యాంకర్ నీళ్ల ఖర్చు ఇంటి బడ్జెట్‌ను మించిపోతుందని శివారు వాసులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లోనే 2.41 మీటర్ల లోతుకు... నగర వ్యాప్తంగా 2014 డిసెంబరు నెలాఖరున సగటున 7.50 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. జనవరి చివరికి 9.91 మీటర్ల లోతునకు వెళితే గానీ పాతాళ గంగ జాడ దొరక లేదు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే గ్రేటర్ పరిధిలో పాతాళగంగ 2.41 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. ఇంకుడు గుంతలు లేనందునే... కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో ఇళ్లు, అపార్ట్మెంట్లు, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్) లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 60 శాతం వర్షపు నీరు వృథాగా పోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం వృథా కావడం సర్వసాధారణమే. నగరంలో అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోతోంది. దీనిలో సింహభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని వదులుకుంటున్న పాపం జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలదేనన్నది సుస్పష్టం. -
ప్రతి చుక్కా పట్టాలి
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో భూగర్భజలాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వృథాగా పోతున్న వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసేలా ‘బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్’ను ఏర్పాటు చేస్తూ అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. తద్వారా ఏ పొలంలో పడిన వర్షపు నీరు ఆ పొలంలోనే ఇంకి భూగర్భజలాలు పెరగనున్నాయి. ఇందుకు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని అధికారులు ప్రతిపాదనలకు సిద్ధం చేశారు. * భూగర్భ జలమట్టం పెంచేందుకు ప్రణాళిక * పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ నియోజకవర్గం * రూ.66.49 కోట్లతో రూపకల్పన * ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగ ర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాలు డార్క్ ఏరియాలోకి వెళ్లాయి. కొత్త బోరుబావుల తవ్వకాల సంఖ్య పెరుగుతుండడం, అవసరానికి మించి భూగర్భ జలాలు వాడుకోవడం వల్ల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుతోంది. దీని ప్రభావం సాగుపై చూపడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో భూగర్భ జలమ ట్టాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రతి వర్షపు చుక్కనూ వడిసి పట్టి భూగర్భంలోకి ఇంకిపోయేలా (వాటర్ రీచార్జ్) చేసి తద్వారా భూగర్భ జల మట్టాలను పెంచేలా రూ.66.49 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజే సి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదానికి అధికారులు వేచి చూస్తున్నారు. సీఎం కేసీఆర్ భూగర్భ జలశాఖ అధికారు లు ప్రతిపాదించిన పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఏటా భూగర్భ జల మట్టాలు 0.66 మీటర్లు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 68 పెద్ద చెరువులు, 823 చిన్న చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల ద్వారా తక్కువ మొత్తంలో పంటలు సాగు అవుతున్నాయి. దీంతో రైతులు బోరు బావులను తవ్వుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 33,722 బోర్లు ఉన్నాయి. ఆయా బోర్ల ద్వారా పంటల సాగు కోసం ఖరీఫ్, రబీ సీజనల్ పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. 2011-12 భూగర్భ జలశాఖ నివేదికను పరిశీలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో 13,568 హెక్టా మీటర్ల భూగర్భ జలాలు ఉంటే, బోరుబావుల ద్వారా 11,984 హెక్టా మీటర్ల నీటిని తోడేశారు. 2013-14 నివేదికను అనుసరించి 11,019 హెక్టా మీటర్ల నీటిని వాడుకున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలను విరివిగా వినియోగిస్తుండడంతో క్రమంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 15 నుంచి 25 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు పడిపోయినట్లు అంచనా. ప్రతి వర్షం బొట్టూ ఇంకించేందుకు ప్రతిపాదన వర్షాకాలంలో కురిసే ప్రతి నీటిబొట్టును భూగర్భంలోకి ఇంకించి తద్వారా గజ్వేల్ అంతటా భూగర్భ జల మట్టాలు పెంచాలని భూగర్భ జల శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే బోరు బావి సమాంతరంగా పది మీటర్ల దూరంలో పది మీటర్ల లోతుతో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తారు. పొలంలో కురిసిన వర్షం నీరంతా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ ద్వారా భూమిలోకి ఇంకిపోయేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా బోరు బావులు ఉన్న ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలో మొదటి దశలో దళితులు, గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు వీలుగా రూ. 66.49 కోట్లతో 16,624 బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చారు. ఒక్కో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం రూ.40 వేలు ఖర్చు అవుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బోరుబావుల కింద సాగు అవుతున్న 39,459 హెక్టార్లలకు అదనం గా మరో 11,665 హెక్టార్లలో రైతులు డ్రిప్ ద్వారా పం ట లు సాగు చేసుకోవచ్చని భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు రూపొందించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. -
కన్నీటి వ్యథేనా?
అనంతపురం అగ్రికల్చర్ : వరుణుడు మొహం చాటేయడంతో జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లా వార్షిక వర్షపాతం 522 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. అందులో డిసెంబర్ చివరి నాటికి 494 మి.మీ వర్షం పడాల్సి ఉండేది. ఈ సారి 274 మి.మీ మాత్రమే వర్షం కురిసింది. అంటే 45 శాతం తక్కువగా పడింది. జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షపాతం తక్కువగానే నమోదైంది. అందులోనూ అనంతపురం, బత్తలపల్లి, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, చిలమత్తూరు, ధర్మవరం, గాండ్లపెంట, కొత్తచెరువు, ముదిగుబ్బ, పామిడి, పరిగి, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్లూరు, పుట్టపర్తి, రాప్తాడు, రొద్దం, శింగనమల, సోమందేపల్లి, తలుపుల, తనకల్లు తదితర మండలాల్లో 50 నుంచి 75 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. కనిష్టస్థాయికి పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ లాంటి కీలకమైన మాసాల్లో కూడా వర్షాలు మొహం చాటేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భూగర్భజల శాఖ అధికారులు జిల్లాలో బోరుబావులకు అనుసంధానం చేసిన 192 ఫిజోమీటర్ల నుంచి ఈ నెల మొదటి వారంలో వివరాలు సేకరించారు. వాటి ప్రకారం సగటు నీటి మట్టం 20.41 మీటర్లుగా నమోదైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే వేసవిలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వ్యవసాయ బోర్లు చాలా వరకు ఎండిపోయూరుు. 800 నుంచి 1000 అడుగుల లోతుకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా నీరు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటలను కాపాడుకోవడం ఈ వేసవిలో కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు తాగునీటి ముప్పును ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార యంత్రాంగంలో ఆందోళన కనిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో 19.53 మీటర్లు ఉన్న భూగర్భజల మట్టం ఇప్పుడు 20.41 మీటర్లకు చేరుకుంది. ఇలా నెలా నెలా ఒక మీటర్ లోతుకు పడిపోతే ఏప్రిల్, మే, జూన్ మాసాల నాటికి చరిత్రలో ఎన్నడూ లేని కనిష్టస్థాయికి చేరుకునే ప్రమాదం లేకపోలేదని భూగర్భజల శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.పురుషోత్తమరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నగరూరులో 82.15 మీటర్లు జిల్లా సగటు నీటి మట్టం 20.41 మీటర్లుగా నమోదైనా... కొన్ని ప్రాంతాల్లో మరీ లోతుకు పడిపోరుుంది. యాడికి మండలం నగరూరు గ్రామంలో ఏకంగా 82.15 మీటర్ల లోతులో నీరు ఉండడం గమనార్హం. అగళి మండలం మధూడిలో 71.03 మీటర్లు, గాండ్లపెంట 69.38 మీటర్లు, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో 63.06 మీటర్లు, తలుపులలో 60.36 మీటర్లు, తాడిమర్రి మండలం పిన్నదరిలో 51.47 మీటర్లు, సోమందేపల్లి మండలం చాలకూరులో 48.34 మీటర్లు, గోరంట్ల మండలం పులగూర్లపల్లిలో 42.91 మీటర్లు, గుమ్మఘట్ట మండలం తాళ్లకెరెలో 41.08 మీటర్లు... ఇలా చాలా మండలాలు, గ్రామాల్లో నీటిమట్టం కనిష్టస్థారుుకి చేరుకుంది. 15 మండలాల్లో మాత్రమే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ముందస్తు చర్యలు చేపట్టకపోతే వేసవిలో వందలాది గ్రామాల్లో క‘న్నీటి’ కష్టాలు తప్పవు. -
ఖమ్మం జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, ఖమ్మం : గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒకరకంగా ఉంటే.. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో మాత్రం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ మండలాల్లో రబీకి సాగుతోపాటు తాగునీటికీ ఇబ్బందులు తప్పేలా లేదు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో వర్షపాతం లోటు ఉంది. దీంతో వర్షాధార పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. గత ఐదేళ్లలో చూస్తే ఈ సీజన్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. నైరుతి రుతుపవన కాలం లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జూన్‌లో అత్యధికంగా 77.5 మి.మీ, ఆగస్టులో 32.8 మి.మీ లోటు ఏర్పడ డం, ఆ తర్వాత కూడా తగిన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతానికి కీలకమైన ఈ రెండు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో, ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ప్రస్తుతం ప్రారంభమైన రబీ సీజన్లో వర్షాలు అంతగా లేకపోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 2013 డిసెంబర్లో సగటున 6.70 మీటర్ల లోతులో నీరు ఉంటే.. గత ఏడాది డిసెంబర్లో 7.75 మీటర్ల లోతుకు వెళ్లింది. సత్తుపల్లిలోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలో 29.80 మీటర్లు, అశ్వారావుపేటలో 32 మీటర్ల లోతులో నీరు ఉందని, ఇక్కడ ఇసుక పొరలు ఉన్నందున కొద్దిపాటి వర్షం పడినా మళ్లీ భూగర్భ జలం పైకి వస్తుందని జియాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. కానీ కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ బోర్లు, బావులతో అధికంగా నీటి వినియోగంతో భూగర్భ జల మట్టం పడిపోతోంది. పడిపోతున్న జలాలు.. భూగర్భ జలవనరుల శాఖ అంచనా ప్రకారం రబీ సీజన్లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోతే సాగు, తాగునీటికి అంతగా ఇబ్బం ది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీ చివరి నాటికి తీవ్రతరమై నీటి కష్టాలు వస్తాయి. డిసెంబర్ చివరినాటికి కూసుమంచి మండలంలో 14.45 మీటర్లు, చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో 14.80 మీటర్లు, తిరుమలాయపాలెం మండలంలో 13.35 మీటర్లు, బూర్గంపాడులోని ఎంపీ బంజరలో 9.90, ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో 9.10మీటర్లు, చండ్రుగొండ మండలం రావి కంపాడులో 8.85, కామేపల్లి మండలం కొత్తలింగాలలో 7.57, ఇల్లెందు మండలం ఎస్.నారాయణపురంలో 7.51 మీటర్లలోకి భూగర్భ జలాలు వెళ్లాయి. గత డిసెంబర్‌తో పోలిస్తే సగటున ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింతగా అడుగంటడం గమనార్హం. ఇక్కడ వేసవికాలంలో భూగర్భ జలం మరింత లోతుల్లోకి వెళ్లి పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది. అధిక వినియోగంతో పాతాళంలోకి... కురిసిన వర్షం 100 శాతం భూమిలోకి ఇంకితే.. అంతకంటే ఎక్కువగా వినియోగిస్తుండటంతో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని 19 గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లాయి. తిరుమలాయపాలెం మండలం ముజాహిద్పురంలో 118 శాతం, కాకరవాయిలో 103, రఘునాధపాలెంలో 106, సుబ్లేడులో 125, హస్నాబాద్‌లో 103 , లక్ష్మీదేవిపల్లిలో 128, జూపెడలో 104, పైనంపల్లిలో 132, సోలీపురంలో 156, మహ్మదాపురంలో 142, బచ్చోడులో 127, బీరోలులో 114, బంధంపల్లిలో 112, హైదర్‌సాయిపేటలో 116, పాతర్లపాడులో 102 శాతం, కూసుమంచి మండలం గైగోళ్లపల్లిలో 203 శాతం, చౌటపల్లిలో 140, పోచారంలో 124, కూసుమంచిలో 116 శాతం నీటి ని వినియోగిస్తున్నారు. ఇక్కడ సాగునీటి కోసం బోర్లు, బావులు వందల సంఖ్యలో ఉండటంతో నీటి వినియోగం అధికంగా ఉంది. రబీలో నీటిని తోడటం ఎక్కువైతే గ్రామాల్లో మంచినీటికి తల్లడిల్లక తప్పదు. వాల్టా..ఉల్టా.. భూగర్భ జల వనరులను పరిరక్షించడానికి వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టం ప్రధానమైనది. భూగర్భ జలవనరుల శాఖ అనుమతి లేకుండా ఎక్కడైనా ఇసుక తవ్వినా, బోర్లు, బావులు తీసినా కేసు నమోదు చేస్తారు. అయితే గ్రామాల్లో వాల్టా చట్టాన్ని అతిక్రమించి వేల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. అంతేకాకుండా వాగులు, వంకల్లో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పొక్లెయిన్లతో ఇసుకను భారీ ఎత్తున తీయడంతో వాగులు, వంకల తీరప్రాంతాల్లో భూగర్భ జలం పడిపోతోంది. వర్షాభావ పరిస్థితులతో నీరు మరింత లోపలికి వెళ్లడంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే కొంత మేరకైనా భూగర్భ జలమట్టం పడిపోకుండా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రైతన్న జలఘోష
బోయినపల్లి: రైతన్న సాగు నీటికోసం పెద్ద సమరమే చేస్తున్నాడు. రబీ పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. గత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వరదకాలువ పరిస ర ప్రాంతాల్లోని బోర్లు, బావులు సైతం ఎండిపోయాయి. రబీలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను దక్కించుకోవడం రైతులకు కష్టతరంగా మారింది. ఇక ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరదకాలువ లో నీటివేట సాగిస్తున్నారు. కాల్వలో పెద్ద ఎత్తున గుంతలు తవ్వి వాటి ద్వారా పంటలకు నీరందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటికోసం రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోవడం అన్నదాతలకు గుదిబండగా తయారైంది. గతంలో ఎస్సారెస్పీ నిండగా వరదకాలువ ద్వారా భారీగా నీరు విడుదల చేశారు. బోయినపల్లి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, మల్యాల, ఇల్లంతకుంట తదితర వరదకాలువ పారకం ఉన్న మండలాల్లోని రైతులు పంటలు సాగు చేసుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ త ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటివరకు వర్షాభావంతో శ్రీరాంసాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. నీరు సమృద్ధిగా లేక ఖరీఫ్‌లో వరద కాలువకు అరకొరగా నీటిని వదిలారు. దీంతో జిల్లాలో దాదాపు 125 కిలోమీటర్లున్న వరద కాలువ వట్టిపోయింది. సాగు నీటి కోసం తపిస్తున్న రైతులు వరద కాలువలో పొక్లెయిన్లతో గుంతలు తవ్వుతున్నారు. గుంతలు, పైప్లైన్ల నిర్మాణానికి ఒక్కో రైతు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా తవ్విన గుంతల్లో సైతం నీటి ఊటలు కరువై అన్నదాతలు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. మరోవైపు బావుల్లో నీరు అడుగంటడంతో మెజారిటీ రైతులు బోరు బావుల తవ్వకాలు చేపడుతున్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి బోర్ల తవ్వకాలు చేస్తున్న రైతులకు బోరు సక్సెస్ కావడం లక్కీ లాటరీగా మారింది. అయినా పట్టువదలని అపరభగీరథుల్లా కొంతమంది రైతులు నాలుగైదు బోర్లు వేస్తున్నారు. వేసవికి ముందే నీటి ఊటలు అడుగంటడంతో వేసవికాలం ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. -
రబీ పంట చేతికందేనా ?
ఈ నెలాఖరు వరకే సాగునీరు అసలే పంటసాగులో ఆలస్యం అడుగంటిన భూగర్భజలాలు అయోమయంలో రైతులు జిల్లాలో ఈ రబీ సీజను పంట రైతుల చేతికందేనా ? అనే సందేహం కలుగుతోంది. తెలుగుగంగ ద్వారా పంటలకు సాగునీరు ఈ నెలాఖరు వరకు మాత్రమే అందే పరిస్థితులు ఉన్నాయి. అంతేగాక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారుు. చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రతి ఏటా రబీ సీజన్లో సాధార ణంగా 59,885 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లా వ్యాప్తంగా 934 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటికీ 531 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. ఇందులో అధిక శాతం తూర్పు మండలాల్లోనే నమోదవడం గమనార్హం. ఈ క్రమంలో రైతులు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజనుకుగాను 25,139 (42 శాతం) హెక్టార్లలో మాత్రమే పంటలు సాగుచేశారు. ప్రధాన పంటలైన వరి 36,338 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 16,416 హెక్టార్లలో, వేరుశెనగ 14,092 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 4,796 హెక్టార్లలో, కంది 61 హెక్టార్లకు గాను 3 హెక్టార్లలో, పెసర 255 హెక్టార్లకుగాను 59 హెక్టార్లలో, రాగి,సజ్జ మిగిలిన ఇతర పంటలు 760 హెక్టార్లకుగాను 11 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అందులో తూర్పు మండలాల్లోనే అధికంగా దాదాపు 70 శాతం పంటలను సాగుచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ రబీ సీజన్లో పంట సాగు గణనీయంగా తగ్గింది. సాగునీరు అంతంత మాత్రమే జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. తూర్పు మండలాలైన తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరులో సాగుచేస్తున్న 10,748 హెక్టార్ల పంటలకు తెలుగుగంగ నీటిని చెరువులకు మళ్లించి సాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువుల్లో కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే పంటలకు అందించేందుకు సరిపడా నీరు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి తెలుగుగంగ నీటని చెరువులకు మళ్లించే పరిస్థితులు లేవని చెబుతున్నారు. పంటలను వదులుకోవాల్సిందే జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రబీ పంటల సాగు కూడా ఆలస్యంగా మొదలయింది. దీంతో వరి, వేరుశెనగ పంటలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల చేతికి అందనున్నాయి. అయితే ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలకు నీటిని ఆశించిన మేరకు అందించలేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. తెలుగుగంగ ద్వారా తూర్పు మండలాల్లోని పంట పొలాలకు ఈ నెలాఖరు వరకు మాత్రమే నీరు అందించగలిగే పరిస్థితులు ఉన్నాయి. మరో రెండు నెలల పాటు నీరందితేనే పంటలు పండుతారుు. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అర్ధాంతరంగా వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. -
ముంచుకొస్తున్న ముప్పు
కడప ఎడ్యుకేషన్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో మంచినీటి ఎద్దడి రోజురోజుకు ముంచుకొస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 అడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. దీనికి తోడు ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కరువు తాండవం చేయనుంది. సాధారణ వర్ష పాతం 644 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకూ 322.7 మిల్లీ మీటర్లు వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రాయచోటి, సుండుపల్లి, గాలివీడు, పులివెందుల, లింగాల మండలాల్లో చాలా మేర పంటలు ఎండుముఖం పట్టాయి. అక్కడ జనం మంచి నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకులతో మంచి నీరు సరఫరా : జనవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని రాయచోటి, రాజంపేట, కోడూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు ట్యాంకుల ద్వారా ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 16 గ్రామాలకు 19 ట్రిప్పులతో 32 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అలాగే లక్కిరెడ్డిపల్లె మండలంలో 11 గ్రామాలకు 13 ట్రిప్పులతో 11 ప్రైవేటు బోర్లను, రామాపురం మండలంలో 12 గ్రామాలకు 23 ట్రిప్పులతో 7 ప్రైవేటు బోర్లను, రాయచోటి మండలంలో 21 గ్రామాలకు 24 ట్రిప్పులతో 18 ప్రైవేటు బోర్లను, సంబేపల్లి మండలంలో 6 గ్రామాలకు 8 ట్రిప్పులతో 8 ప్రైవేటు బోర్లను, చిన్నమండెం మండలంలో 17 గ్రామాలకు 16 ట్రిప్పులతో 4 ప్రైవేటు బోర్లను ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే రాజంపేట మండలంలో 69 గ్రామాలకు 134 ట్రిప్పులతో, 21 ప్రైవేటు బోర్లతో, కోడూరు మండలంలో 17 గ్రామాలకు 33 ట్రిప్పులను, కమలాపురం మండలంలో 8 గ్రామాలకు 16 ట్రిప్పులతోపాటు 4 ప్రైవేటు బోర్లతో, పులివెందుల మండలంలో 12 గ్రామాలకు 58 ట్రిప్పులతోపాటు 5 ప్రైవేటు బోర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. రూ.14 కోట్ల 40 లక్షలతో ప్రణాళిక సిద్ధం: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ కోసం రూ.14కోట్ల 40 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 4031 గ్రామాలకు గాను 608 గ్రామాలకు మంచినీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేసేందుకు రూ.10 కోట్ల 41 లక్షలతో, 605 గ్రామాల్లో 605 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు రూ.కోటి 81 లక్షలతో, 255 బోర్లలో పూడికను తీసేందుకు రూ.కోటి రెండు లక్షలను, ప్రస్తుతం ఉన్న 127 బోర్లను మరింత లోతుగా వేసేందుకు రూ.కోటి 14 లక్షలతో నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నిధులను ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేస్తే మంచినీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అడుగంటిన భూగర్భ జలాల వివరాలు మండలం లోతులో ఉన్న నీరు పులివెందుల 95 మీటర్లు వీరపునాయునిపల్లె 80 మీటర్లు చిట్వేలి 73 మీటర్లు లింగాల 70 మీటర్లు అట్లూరు 65 మీటర్లు పెండ్లిమర్రి 62 మీటర్లు కలసపాడు 60 మీటర్లు చింతకొమ్మదిన్నె 50 మీటర్లు కోడూరు 47 మీటర్లు -
బోరుమంటున్న రైతు
జిల్లాలో నెలకు 5 వేల కొత్త బోర్లు! ⇒ 20 శాతం మేర నిరుపయోగమే.. ⇒ కానరాని జియాలజిస్టులు ⇒ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్న రైతులు ⇒ కొబ్బరికాయ తిరిగిందని కొనితెచ్చుకుంటున్న కష్టాలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కలిసిరాని కాలంతో అన్నదాతలు పోటీ పడుతున్నారు. పాతాళానికి పైపులు వేసి గంగను పైకి తెచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నెర్రెలు బారిననేల మీద నీరు పారించే ప్రయత్నం అపర భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. సాగునీటి సమస్య తీవ్రంగా జిల్లాలోని రైతన్నలు నెలకు సగటున 5 వేల బోర్లు వేయిస్తున్నట్టు అంచనా. ఈ ఏడాది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం సాగు, తాగు నీటి కోసం భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పటి కీ అన్నదాతలు అప్పటి వరకు ఆగలేకపోతున్నారు. అందిన చోట అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేసుకుంటున్నారు. రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్న, చిన్నకారు రైతులు కూడా పదుల సంఖ్యలో బోర్లు వేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో రిగ్గులకు డిమాండ్ పెరగటంతో ఆఫ్రికా దేశాలకు పంపించాల్సిన రిగ్గులను కూడా ఇక్కడికే తీసుకు వస్తున్నట్లు బోర్స్వెల్స్ మిషన్ల యాజమానులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉండగా, జిల్లా సగటు వర్షపాతం 808.4 మిల్లీమీటర్లు ఉంది. ఈ లెక్కన చూస్తే మెతుకు సీమ అర్ధ ఉష్ణ, అర్ధమెట్ట ప్రాంతంలోనే ఉంది. నల్లవాగు, ఘణపురం ప్రాజెక్టు కింద 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయి. మిగిలిన ప్రాంతంలో చెరువులు, కుంటల ద్వారా సాగునీరందుతున్నప్పటికీ, మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చెరువులు కుంటలు అవన్నీ ఎండిపోవడంతో సాగునీటికి సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి కేవలం బోర్లు మాత్రమే ఆధారం అయ్యాయి జియాలజిస్టుల లేక.... ప్రస్తుతం జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం 16.98 మీటర్లు ఉంది. మండలాల వారీగా చూస్తే ములుగు మండల కేంద్రంలో 39.78 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. వర్గల్ మండలం మజీద్‌పల్లిలో అత్యల్పంగా 6.02 మీటర్లలో నీళ్లు ఉన్నట్లు భూగర్భ జలాల నిర్ధారణ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ తారతమ్యాలు రైతులకు తెలియదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి ఏడాది 50 వేల నుంచి 60వేల బోర్లు వేస్తున్నట్లు అంచనా. వీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఫలితం చూపుతున్నాయి. భూగర్భ జలాల నిల్వలు ఎక్కడ ఉన్నయో... ఎంత లోతులో ఉన్నయో నిర్ధారణ చేసి, ఆ తర్వాత బోరు వేసుకుంటే అన్నదాతలకు కొంతలో కొంత మేలు జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. జియాలజిస్టులు అంటే ఎవరో కూడ రైతులకు తెలియని పరిస్థితి. ప్రభుత్వ వైపు ప్రోత్సాహం కూడా అలానే ఉంది. నిజానికి జిల్లాకు 10 మంది జియాలజిస్టులు అవసరం కాగా, ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆర్డబ్ల్యూఎస్, ఇందిర జలప్రభ తదితర శాఖలు ఇచ్చిన బోర్ పాయింట్లు చూసి నిర్ధారణ చేయడానికే సరిపోతున్నారు. ఇక రైతులను పట్టించుకునే వారే లేరు. దీంతో రైతులు అమాయకత్వంతో ఒక బోరు పడకపోతే... రెండవ బోరైన పడక పోతుందా... మూడోదైన కాకపోతుందా..! అనే ఆలోచనతో బోర్ల మీద బోర్లు వేసి ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. దొరికిన వెసులుబాటుతో... ఈ ఏడాది బోర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో రైతులు షావుకార్ల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకొని సాగు చేసుకునేవాళ్లు. పంట చేతికి వచ్చినపుడు షావుకారి పంట తీసుకొని, తన బాకీ పట్టుకొని మిగిలినది రైతు చేతిలో పెట్టేవాళ్లు. ఈ మిగిలిన డబ్బు బ్యాంకు లోన్ కట్టేవాళ్లు. ఈ ఏడాది ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది, రైతులు కూడా నేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చి పంటను అమ్మడంతో వారి చేతికే డబ్బు వచ్చింది. దీంతో రైతులు షావుకారికి వడ్డీ మాత్రమే కట్టి, అసలు మరుసటి పంట మీద ఇస్తానని చెప్తున్నారు. ఈ డబ్బుతో రైతులు బోర్లు వేసుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీంతో ఏడాది జిల్లాలో బోర్ల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త దేవుళ్లతో మోసం... రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొత్త దేవుళ్లు బయలు దేరారు. చేతిలో కర్రతో ఒకరు..కొబ్బరికాయతో మరొకరు...నిమ్మకాయతో ఇంకొకరు పంట పొలాల్లో భూగర్భ జలాలలను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. ఏదో కుంకుమ బొట్లు పెట్టి, కర్రపుల్ల పట్టుకొని పొలంలో ఐదు, ఆరు బోరు పాయింట్లు చూపిస్తున్నారు. బోరులో నీళ్లు పడితే ఇతగాని క్రెడిట్. లేదంటే రైతు దురదృష్టం. ఇక ఈ మోసగాళ్ల మాయలో పడి రైతులు తమ ఆర్థిక స్థితిని మరిచిపోయి బోర్లు వేస్తున్నారు. జిల్లాలో నాలుగైదు బోర్ల కంటే తక్కువ వేయించని రైతులు లేకపోవడం గమనార్హం. -
కరువు మండలాలే ప్రధానం
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 45 శాతం తక్కువ నమోదైంది. జిల్లాలోని 46 మండలాల్లోనూ కరువు ప్రభావం ఉంది. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 7 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. వాటిని పెంచే విధంగా చూడటంతో పాటు జిల్లాను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోనున్నట్లు కలెక్టర్ జానకి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం 13 జిల్లాల కలెక్టర్లతో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ జానకి మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. జిల్లాకు సంబంధించి సమగ్ర వివరాలను సిద్ధం చేసుకొని వెంట తీసుకుని వెళ్లారు. జిల్లా కలెక్టర్ ఎం. జానకి ప్రధానంగా 7 ఆంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కరువు మండలాల పెంపుపై మాట్లాడనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్‌యార్డులు, ఇసుక విక్రయాలు, గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం, పర్యాటక అభివృద్ధి తదితరాలపై కలెక్టర్ చర్చించనున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న నీటితో పంటలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఉన్న 90 శాతం చెరువుల్లో నీరులేదు. వచ్చేది ఎండాకాలం..కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టకపోతే ప్రజలు మంచినీటికి నానా అవస్థలుపడవలసి వస్తుంది. వందల సంఖ్యలో బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఎండకాలంలోపు వాటికి మరమ్మతులు చేపట్టాలి. మంచినీటి ఎద్దడి నివారించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో లేదో చూడాలి. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వనరులు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల గుర్తింపుపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలని కోరనున్నారు. ఇసుక విక్రయాలు, సామాజిక పింఛన్లు, చంద్రన్న సంక్రాంతి కానుక తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆదేవిధంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ, ముగ్గుల పోటీలు తదితర వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. -
మీనమేషాలు ఇక చాలు
తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే, అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం. దేశాన్ని పట్టిపీడిస్తున్న తీవ్ర ఆరోగ్య సమస్యల గురించి కేంద్రంలోను, మన రెండు రాష్ట్రాలలోను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆశాజనకమైన ప్రయా ణాన్నే ఆరంభించాయని అనిపిస్తోంది. వాతావరణ కాలుష్యంతో, పర్యావరణం దెబ్బ తినడంతో పాత రుగ్మతలు తీవ్ర రూపం దాల్చడం ఇటీవలి విషాదం. అందుకు గొప్ప ఉదాహరణ ఫ్లోరోసిస్ వ్యాధి. చిత్రం ఏమిటంటే, ఈ వ్యాధికి తెలంగాణలో 1975 వరకు ఉన్న స్వరూపం వేరు. తరువాతే ఇది తీవ్రరూపం దాల్చి కాళ్లూ చేతులూ వంకర్లు పోయే విపరిణామానికి దారి తీసింది. భూగర్భ జలాలు విపరీతంగా కాలుష్యానికి గురికావడం ఇందుకు కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి తగినంత ప్రచారం జరిగింది గానీ, నివారణ చర్యలు చిత్తశుద్ధితో ఆరంభం కాలేదు. కొనసాగలేదు కూడా. తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ వ్యాధిని నివారించడం ఒక బడ్జెట్ కాలంలోనో, ఒక దశాబ్ద కాలంలోనో జరిగేది కాదు. అదొక సుదీర్ఘ ప్రణాళిక . నివారణ పనులు అసలు ఆరంభం కాలేదని చెప్పడం సరికాకపోయినా, ఆ చర్యలన్నీ అరకొర చర్యలేనని చెప్పడం సత్యదూరం కాదు. భారత్‌కు పక్కనే ఉన్న చైనాలోను ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది. కానీ వారి అనుభవాలు వేరు. ఎందుకంటే వారు తీసుకున్న చర్యలు కూడా వేరుగానే ఉన్నాయి. భయపెడుతున్న వాస్తవాలు 2014 నాటి తాజా గణాంకాల ప్రకారం దేశంలో 676 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 230 జిల్లాలకు ఫ్లోరోసిస్ సమస్య ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో (డిసెంబర్ 19) ప్రకటించారు. నిజానికి దేశంలోని 20 రాష్ట్రాలలో, 275 జిల్లాలలో ఇది వ్యాపించి ఉందని 2009లోనే తేలింది. దేశంలో మూడు రాష్ట్రాలు -రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఈ వ్యాధి మరీ తీవ్రంగా ఉందని మంత్రి చెప్పారు. అంటే దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న రాష్ట్రాలు మూడైతే అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కావడం అత్యంత విషాదం. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అడిగిన ప్రశ్నతో మంత్రి పలు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. నిజానికి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఈ సమస్య ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని చర్యలు తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించడం అత్యాశ కాకపోవచ్చు. తెలంగాణలోని పది జిల్లాలకు 9 జిల్లాలు ఆ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న సంగతిని కూడా మంత్రి వెల్లడించారు. ఇంకా విషాదం ఏమిటంటే, తెలంగాణలోనే వెనుకబడిన నల్లగొండ జిల్లాలోని 59 మండలాల్లో 58 మండలాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. అదుపుతప్పుతున్న వ్యాధి విస్తృతి? దేశంలో పది లక్షల మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియచేశారు కానీ, అది అస్పష్ట సమాచారం. మంత్రి చెప్పిన పది లక్షలు ఈ వ్యాధి బారిన పడి మంచం కూడా దిగలేని స్థితిలో ఉన్న వారి లెక్క కావచ్చు. మాలాంటి నిపుణుల అంచనా ప్రకారం దేశంలో ఆరు కోట్లకు పైనే ఈ వ్యాధిన బారిన పడిన వారు ఉన్నారు. కాళ్లూ చేతులూ పూర్తిగా పట్టు తప్పిన వారు అరవై లక్షల వరకు ఉన్నారు. ఈ వ్యాధిలో దశల వారీగా రోగాన్ని గుర్తించవలసి ఉంటుంది. పళ్లు పసుపు రంగులోకి మారడం తొలి దశ. తరువాత ఎముకలకు వ్యాపిస్తుంది. ఆపై ఎముకలు సుద్దముక్కలంత అల్పంగా మారిపో వడమే కాక, బిగుసుకుపోతాయి. వెన్నెముక బిరుసెక్కి, కాళ్లు చేతులు వంకర్లు పోయి, అవి చెట్టు బెరడు మాదిరిగా తయారు కావడం చివరి దశ. ఈ వ్యాధి స్వరూప స్వభావాలను బట్టే కాదు, అది విస్తరిస్తున్న తీరు కూడా ఘోరమైనద న్న సంగతిని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి. సరైన వ్యూహం ఏదీ? ఈ గణాంకాలు ప్రభుత్వం వద్ద ఇప్పటిదాకా లేవని కాదు. కానీ ఇంత పెద్ద ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి అవసరమైన వ్యూహం గురించి గట్టిగా ఆలోచించలేదు. దాని ఫలితమే ఈ విపరిణామాలు. ఫ్లోరోసిస్ వ్యాధిని తొలుత భారతదేశంలో 1937లోనే కనిపెట్టారు. కానీ నివారణ కోసం తీసుకున్న చర్యలు తక్కువే. ఈ వ్యాధి ఏటా తీవ్ర రూపం దాలుస్తున్న సంగతిని నిపుణులు వెల్లడిం చడమే ఇందుకు తార్కాణం. ఫ్లోరైడ్ మానవదేహంలోకి అధిక మోతా దులో ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి సోకుతోంది. ఇది తాగునీటితోనే సంక్రమిస్తుందని చాలా కాలం భావించారు. కానీ ఫ్లోరైడ్ శాతం ఉన్న నీరు ఉన్న ప్రాంతాలలో పండే పంట, తాగే టీ కాఫీల వంటి వాటి వల్ల కూడా ఇది సంక్రమిస్తుందని కొద్ది కాలం క్రితమే తెలుసుకున్నారు. అధిక మొత్తంలో టీ ఇంకా హానిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం శరీరంలోకి చేరడం వల్ల, అసలే పోషకాహార లోపంతో ఉండే జనంలో ఫ్లోరోసిస్ తీవ్రమవుతోంది. ఇవన్నీ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, వైద్యులకు సంబంధించిన సాంకేతిక విషయాలు. కానీ సమస్య పరి ష్కారంలో ఈ వాస్తవాలే కీలక పాత్ర వహిస్తాయి. వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడతాయి. కొన్ని జాగ్రత్తల గురించిన స్పృహనూ కలిగిస్తాయి. కొంప ముంచుతున్న బోరుబావులు ఫ్లోరోసిస్ సమస్య మూలాల గురించి కొత్త ఆవిష్కరణలు జరిగిన తరువాత ప్రభుత్వాలు కూడా కొత్త దృక్పథంతో ఆలోచించవలసి వచ్చింది. తాగునీటితోనే ఫ్లోరోసిస్ సోకుతోందని అనుకున్నంత కాలం, శుద్ధమైన తాగునీరు అందించ డానికే ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. అంటే ప్రవాహ శీలత ఉండే నదీజలాలను వ్యాధిపీడిత ప్రాంతాలకు తరలించేందుకు పథకాలు వేశా యి. ఈ అవకాశం లేనిచోట డిఫ్లోరైడేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచించాయి. చాలా చోట్ల ఆ ప్రయత్నం కూడా జరిగింది. ఇలాంటి ప్లాంట్ల నిర్మాణానికే ‘నల్లగొండ విధానం’ అని పేరు కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దిరిశవంచ గ్రామంలో వ్యాధిపీడితులకు కృష్ణాజలాలను అందించే అవకాశం వచ్చింది. కనిగిరి జలాశయం ద్వారా దీనిని సాధించగలి గారు. అయితే పదహారేళ్ల పాటు కృష్ణా నీరు అందించిన తరువాత చేసిన పరి శోధనలు మళ్లీ శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసే తీరులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోగుల ఎముకలు, దంతాలను పరీక్షిస్తే వ్యాధి తీవ్రతలో ఏమీ మార్పు కనిపించలేదు. మళ్లీ కొత్త ప్రశ్నలు ఉదయించాయి. అయితే నల్లగొండ జిల్లాలోని పీడిత ప్రాంతాల మాదిరిగానే, ప్రకాశం జిల్లాలో కూడా క్రమం తప్ప కుండా కృష్ణా నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. శుద్ధమైన తాగునీటితోనే ఈ వ్యాధిని అరికట్టలేమని మరోసారి రుజువైంది. ఆయా ప్రాంతాల ప్రజలు తీసుకొనే ఆహార పదార్థాలు, ఇతర పానీయాల విషయంలో కూడా జాగ్రత్త పడవలసిందే. ఈ ప్రాంతాలలో ఎక్కువ వ్యవసాయం బోరు బావుల ద్వారానే జరుగుతోంది. నిజానికి ఫ్లోరోసిస్ అనే ఈ రుగ్మతా భూతానికి మూలం బోరు బావులే. దీనికితోడు 46 శాతం బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారే. 70 శాతం గర్భిణులు రక్తహీనతతో ఉంటున్నారు. ఇవన్నీ కలసి దేశంలో ఫ్లోరోసిస్ వ్యాధి విశ్వరూపం దాల్చేటట్టు చేస్తు న్నాయి. దేశంలో ఈ వ్యాధి ఇంత వెర్రి తలలు వేస్తున్నా వైద్య విద్యలో దీని గురించి సరైన అధ్యయనం లేదు. కనీసం పౌష్టికాహార లోపానికీ, ఫ్లోరోసిస్ వ్యాధికీ ఉన్న సంబంధం గురించి కూడా వారి పుస్తకాలలో ఉదహరించడం లేదు. ఆ మధ్య 28 వ్యాధి నిరోధక కార్యక్రమాలను ప్రకటించారు. అందులో ఫ్లోరోసిస్ వ్యాధికి చోటు ఇవ్వలేదు. అనుభవాలు, ఆచరణలు మధ్యప్రదేశ్‌లోని జాబువా గ్రామంలో జరిగిన ప్రయత్నం పేర్కొనదగినది. అక్కడ శుద్ధమైన తాగునీరు సరఫరా చేశారు. లేదంటే డిఫ్లోరైడేషన్ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి అందించారు. డిఫ్లోరైడేషన్ కిట్‌ను కాన్పూర్ ఐఐటీ సంస్థ నిపుణులు తయారు చేసి ఇచ్చారు. స్థానికంగా పండే పంటలను ఆహారం గా తీసుకోవద్దని, హెచ్చరించి ప్రభుత్వం గోధుమలు సరఫరా చేసింది. పిల్లలకు సోయా లడ్డులను అందించింది. దీనితో పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు తగ్గు ముఖం పట్టాయి. దీనిని గమనించడం అవసరం. కాగా, తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకం చేపట్టడం వెనుక ఉన్న ఉద్దేశాలలో ఫ్లోరోసిస్‌ను అరికట్టే ఆశయం కూడా ఉందని ప్రకటించారు. అలాగే కేంద్ర ఆరోగ్యమంత్రి నడ్డా కూడా 2017 నాటికి దేశంలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలన్నింటికీ పైప్లైన్ల ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపితే నిధులు ఇస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్లోరోసిస్ వ్యాధి నివారణను కూడా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత తొమ్మిది తెలంగాణ జిల్లాలలో మూడింటిని 2013-14ల నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోకి తెచ్చామని చెప్పారు. దీని ప్రకారం అవసరమైతే ఆపరేషన్లు, పునరావాసం, ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తారు. ఇవన్నీ శుభ పరిణామలే. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి సరైన హామీ ఇచ్చారనే అనిపిస్తుంది. 2015 జనవరిలో ఎయిమ్స్ నిర్మాణానికి మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్నట్టు కామినేని శ్రీనివాస్ చెప్పారు. కాబట్టి మొదటి నుంచీ ఫ్లోరోసిస్ వ్యాధి గురించిన పరిశోధన కూడా మంగళగిరి ఎయిమ్స్‌లో ఉండేటట్టు చర్యలు తీసుకోవడం అత్యవసరం. శుద్ధ మైన నీరు అందించడం ప్రభుత్వాలు ప్రాథమికంగా చేయగల కార్యక్రమం. అలాగే ఆకుకూరలు, పిల్లలకు పాలు సరఫరా చేసే కార్యక్రమం కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రజల్లో చైతన్యం అంతకంటే ప్రధానం. (వ్యాసకర్త ప్రఖ్యాత వైద్యులు) మొబైల్: 98480 18660 - డాక్టర్ డి. రాజారెడ్డి -
క్యారీబ్యాగ్లతో స్వచ్ఛభారత్?
శాస్త్ర సాంకేతికపరిజ్ఞాన ప్రగతిలో భాగంగా సదుపాయంగా అందుబాటులోకి వచ్చి, ఉపద్రవంగా పరిణమించిన వస్తువుల్లో ముఖ్యమై నవి పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లు. ‘యూజ్ అండ్ త్రో’ అంటూ, ఇలా వాడి అలా పారేసే అతి పలుచని క్యారీ బ్యాగ్‌లు పర్యావరణాన్ని, భూగర్భ జలాలను, భూసారాన్ని కలుషితం చేయడమే కాదు, జంతువులు, మొక్కలు, మనుషులలో కూడా తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ రీత్యా అత్యంత ప్రమాద కరమై నవిగా పరిగణిస్తున్న 20 మైక్రాన్ల కంటే పలచని క్యారీ బ్యాగ్‌ల తయా రీని, వాడకాన్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే నిషేధించాయి. నిషేధించిన చోట్ల కూడా వాటి వాడకం విస్తృతంగానే కొనసాగుతుండటం ఆందో ళనకరం. అంతకు మించి కేంద్రం ఇటీవల వాటి వాడకంపై నిషేధ మేమీ లేదని ప్రకటించడం మరింతగా వాటి వాడకాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. పాలిథిన్ క్యారీ బ్యాగ్‌ల కాలుష్యం భూమికి మాత్రమే పరిమితం కాకుండా సముద్రాలకు కూడా వ్యాపించి పోయింది. వెయ్యి కోట్లకుపైగా క్యారీ బ్యాగ్‌లు సముద్రంలో కలసిపోయి, సముద్ర జీవ రాశికి ప్రాణాంతకంగా మారాయి. ఒక వంక పాలిథిన్ కాలుష్యాన్ని అనుమతిస్తూనే స్వచ్ఛ భారత్ సాధన సాధ్యమేనా? పాలకులు ఆలోచించాలి. కె. రవికుమార్ శ్రీకాకుళం -
అప్పులే కాటికి పంపాయి..
కంగ్టి : వరుణుడు కరుణ చూపకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయి. కుమారులకు వివాహాలు చేయడంతో వారు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. ఇప్పటికే పంటపెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 4 లక్షల మేర అప్పు చేశాడు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురైన ఆ అన్నదాతకు గుండెపోటుతో మృతి చెందాడు. ఈసంఘటన మండలంలోని నాగూర్ (బీ) గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందినచిన్న కారు రైతు గాళప్ప (62) రైతుకు ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి భార్య గంగమ్మతో పాటు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వీరిలో నలుగురు కుమారులకు వివాహాలు చేయడంతో వారు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. కుమార్తె సంతోషి పెళ్లీడుకొచ్చింది. గడిచిన రెండేళ్లలో చేసిన అప్పు వడ్డీతో సహా మొత్తం రూ.4 లక్షలు అయింది. గత ఖరీఫ్‌లో వేసిన పంటలు కూడా చేతికందలేదు. కంగ్టిలో బ్యాంకులో అప్పు తీసుకుందామని దరఖాస్తుతో పాటు పహణి, చౌపాస్లా రికార్డులు సమర్పించాడు. సకాలంలో బ్యాంకు రుణం అందక పోవడం, రుణ దాతలు అప్పులు కట్టాలని ఒత్తిళ్లు చేశారు. ఈ బాధలు భరించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో భార్య, పిల్లలు గుండెలివిసేలా రోదించారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో పెళ్లీడుకొచ్చిన కుమార్తె సంతోషి భవిష్యత్, చిన్న వయస్సులో ఉన్న మరో ఇద్దరు కుమారులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీటీసీ తిప్పప్ప, గ్రామస్తులు కోరుతున్నారు. ధర్మాజీపేటలో రైతు ఆత్మహత్య దుబ్బాక : తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. వేసిన నాలుగు బోర్లలో చుక్క నీరు రాక.. విద్యుత్ కోతలతో కళ్ల ముందే ఎండిపోయిన పంటలు.. వెరసి వీటికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక యువరైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుబ్బాక నగర పంచాయతీ ధర్మాజీపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బుంగ కనకయ్య (35)కు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో గత వర్షాకాలంలో రెండెకరాల్లో మొక్కజొన్న వేయగా వర్షాభావంతో చేతికొచ్చే పంట పూర్తిగా ఎండిపోయింది. మరో రెండెకరాల్లో వరి పంట వేశాడు. ఈ పంటను దక్కించుకోవడానికి నాలుగు బోర్లు వేశాడు. వీటిలో చుక్క నీరు రాలేదు. పంటలకు పెట్టిన పెట్టుబడి, బోర్లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కలతచెందాడు. దీంతో శనివారం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. పొస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు వంశీ(3), వృద్ధులైన తల్లిదండ్రులు నాగవ్వ, రాములు ఉన్నారు. -
రైతన్నల ఉసురు తీస్తున్న అప్పులు
కష్టాలను తీరుస్తాడన్న వరుణుడు నిలువునా ముంచేశాడు. దీనికితోడు భూగర్భజలాలు ఎండిపోవడంతో సాగు చేసిన పంటలు కళ్లె ఎదుటే ఎండిపోవడంతో ఆ ఇద్దరు రైతులూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఓ రైతు ఉరేసుకుని ప్రాణాలను వదలగా.. మరో రైతు గుండె పోటుకు గురై పొలంలోనే మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వల్లపు కిష్టయ్య (35)కు సొంత భూమి పది గుంటలు మాత్రమే ఉండడంతో ఏటా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈసారి ఖరీఫ్‌లో ఆరు ఎకరాలకుపైగా భూమిని ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. ఇందులో పత్తి సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతింది. రెండ్రోజుల క్రితం సుమారు పది క్వింటాళ్ల పత్తి ఏరి అమ్మాడు కూడా. ఈ విధంగా వచ్చిన డబ్బులు కౌలు కూడా చెల్లించడానికి సరిపోకపోవడం, రెండోసారి తీయడానికి పత్తి లేకపోవడంతో కలత చెందాడు. తన శ్రమంతా వృథా అయ్యిందని మనోవేదన చెందాడు. అప్పటికే కుటుంబ అవసరాల కోసం చేసిన సుమారు రూ.3 లక్షలకుపైగా అప్పులున్నాయి. అప్పులకు పత్తి నష్టం తోడై పుట్టి మునిగే స్థితి వచ్చిందని భావించిన కిష్టయ్య ఆత్యహత్య చేసుకోవాలనే నిర్ణయించాడు. ఈ క్రమంలోనే బుధవారం భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధర్రాతి నిద్రలేచి కుటుంబీకులకు పడుకున్న గది పక్కనున్న మరో గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గమనించిన భార్య యాదమ్మ, పిల్లలు సందీప్ (12), సతీష్ (10)లు రోదించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ రమేష్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో.. శివ్వంపేట : మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన చెంది రాములు (55) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇందులో వరి, కూరగాయలు సాగు చేశాడు. నెల రోజుల క్రితం మూడు బోరుబావులు తవ్వించగా చుక్క నీరు పడలేదు. ఈ క్రమంలో ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశాడు. బోర్లు వేసేందుకు, పంటపెట్టుబడులు, కుమార్తెల వివాహాల కోసం సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పు తీర్చవచ్చని భావించిన రైతు ఆశలు అడి ఆశలయ్యాయి. సాగుచేసేందుకు నీటి వసతి లేకపోవడం, కాలం కలిసి రాకపోవడం చేసిన అప్పుడు తీర్చే పరిస్థితి కనిపించ లేదు. మూడు రోజులుగా ఇదే విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చెప్పుకుని మనోవేదనకు గురయ్యాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే గుండె పోటుకు గురయ్యాడు. కాగా రాత్రి అయినా రాములు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ విగతజీవుడై కనిపించాడు. మృతుడి భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ ఇసుబ్ తెలిపారు. రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం : డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్ రూరల్ : అప్పులబాధతో మనోవేదనకు గురై గుండె ఆగి మృతి చెందిన శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రైతు రాములు మృతదేహాన్ని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి గురువారం స్థానిక ఆస్పత్రిలో సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగాఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రుణమాఫీ పథకం ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కొత్తరుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ సరైన వర్షాలు పడకపోవడం, తీవ్ర కరెంట్ కోతల కారణంగా వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీంతో అప్పులపాలై, వాటిని తీర్చలేక కొందరు ఆత్మహత్మలకు పాల్పడుతుంటే మరి కొందరు గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారని తెలిపారు.రైతులతో పాటు ఇతర అర్హులైన పింఛన్‌దారుల సమస్యల కోసం తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
కన్నీటి గోస
గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మైళ్ల దూరం వెళుతున్నారు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా, పాలకులు మారినా వీరి రాతమాత్రం మారడంలేదు. కంగ్టి మండలంలోని చౌకాన్‌పల్లి గ్రామ జనాభా 2,500. పంచాయతీ పరిధిలోని రాంసింగ్, మెట్టు, జీర్గి తండాల జనాభా సుమారుగా 1,400 వరకు ఉంటుంది. అంటే చౌకాన్‌పల్లి పంచాయతీ జనాభా 3,900. రోజుకు ఓ మనిషి 5 లీటర్ల చొప్పున వాడినా 20 వేల లీటర్ల నీరు అవసరం. కానీ గ్రామంలో ఉన్న చేదబావులు గానీ, చేతిపంపులు కానీ కనీసం 5 వేల లీటర్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి. పంచాయతీ పరిధిలో ఐదు చేదబావులు...నాలుగు చేతిపంపులున్నా, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భజలాలు తగ్గి అవన్నీ ఎండిపోయాయి. దీంతో పల్లెజనమంతా బిందె చేత పట్టుకుని మైళ్లకు మైళ్లు పరుగులు తీస్తున్నారు. గొంతు తడిపే గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పెద్దలంతా పనులకు వెళ్తుంటే, చిన్నారులు మాత్రం ఎడారిలో ఒయాసిస్సును వెత్తుక్కుంటూ బాల్యాన్ని నీటికి అంకితం చేసేస్తున్నారు. శీతాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక వే సవిలో వీరి కష్టాలు ఎలా ఉంటాయో ఊహించడానికే కష్టం. పల్లెజనం నీటిగోస గురించి తెలుసుకోవాలంటే సెంటర్ స్ప్రెడ్‌కు వెళ్లండి. రాజులు మారినా.. రాజ్యాలు మారినా.. వీరి తల రాతలు మాత్రం మారడం లేదు. గుక్కెడు నీటి కోసం ఈ అభాగ్యులు పడుతున్న నరడక యాతన మాటలకందనిది. గొంతు తడవాలంటే.. బిందెలు పట్టుకుని పరుగులు తీయాల్సిందే!. వృద్ధులు.. చిన్నారులనే తేడా లేకుండా ‘పానీ’పట్టు యుద్ధాలు చేయాల్సిందే. చేదబావి వద్దకు వెళ్లి పాతాలంలో ఉన్న గంగను తోవేడుకోవాల్సిందే. ఇదీ .. కంగ్టి మండల పరిధిలోని చౌకాన్‌పల్లి పంచాయియతీ పరిధిలోని ప్రజల దుస్థితి. వీరి కష్టాలను తీర్చేందుకు తెచ్చిన నాబార్డ్ మంజీరా, కౌలాస్ పథకాలు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో మధ్యలోనే చేతులెత్తేశాయి. సమస్య శాశ్వత పరిష్కారం కోసం బాబుల్‌గాం ఓపెన్‌హౌస్ నుంచి చౌకాన్‌పల్లి వరకు ఆరు కిలో మీటర్ల మేర పైప్‌లైన్ విస్తరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి. కౌలాస్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒడ్డునే జాక్ వెల్ నిర్మించి నీళ్లను లిఫ్ట్ చేయాలి. సమీపంలోనే సంప్, పంపింగ్ హౌస్ నిర్మించి నీటిని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా చౌకాన్‌పల్లి సంపులోకి వాటర్‌ట్యాంకు అందించాలి. కంగ్టి మండల పరిధిలోని చౌకాన్పల్లితో పాటు అనుబంధ గ్రామాలైన రాంసింగ్, మెట్టు, జీర్గితండాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో 4వేల మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఆయా ప్రాంతాల్లో అరకొరగా ఉన్న చేదబావులు, చేతిపంపులే దిక్కయ్యాయి. అందని నాబార్డ్ మంజీరా నీరు... గ్రామానికి నాబార్డ్ మంజీరా తాగు నీటి పథకం వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కానీ ఇది ఎన్నడూ ప్రజల దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చలేదు. మనూరు మండలం గూడూర్ మంజీరా నది ఒడ్డున జాక్వెల్ ద్వారా కంగ్టి మండలంలోని 24 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగు నీరు అందిస్తున్నారు. కంగ్టి వరకు నేరుగా పైప్‌లైన్ ద్వారా సంప్‌హౌస్‌కు నీరందుతుంది. ఇక్కడ నుంచి మోటార్ల ద్వారా చౌకాన్‌పల్లి, బోర్గి, కంగ్టి, ముకుందతండాలకు తాగు నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ఒక రోజు వస్తే.. వారం వరకు నీళ్లు రావు. నేరవేరని కౌలాస్ నాలా... మండలంలోని చౌకాన్‌పల్లి, బోర్గి గ్రామాలకు శాశ్వత మంచి నీటి సరఫరా అందించాలనే ఉద్దేశంతో 2004-05లో రూ.1కోటి వెచ్చించి కౌలాస్ నాలా నీటి పథకం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఓపెన్ వెల్ నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణకు రూ.50లక్షలు, కరెంటు సరఫరాకు రూ.50 లక్షలు వెచ్చించారు. చౌకాన్‌పల్లికి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా బాబుల్‌గాం శివారులోని కౌలాస్ నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద తొలుత ఓపెన్ వెల్ నిర్మించారు. నీటి సరఫరా పంపింగ్‌కోసం కరెంటు అవసరమని ఆరు కిలో మీటర్ల మేర విద్యుత్ స్తంభాలు పాతి, తీగలు బిగించి కరెంటు సరఫరా చేశారు. దీనికోసం 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేశారు. బాబుల్‌గాం వాగు సమీపంలోని ఓపెన్ వెల్ నుంచి చౌకాన్‌పల్లి వరకు మొత్తం ఆరు కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. ఈ పనులు చేయడానికి ఐదేళ్లు పట్టింది. చౌకాన్‌పల్లి వద్ద ఒక సంప్‌హౌస్ నిర్మించి దీనికి పైప్‌లైన్ కనెక్షన్ ఇచ్చారు. బాబుల్‌గాం నుంచి మార్గ మధ్యలో జీర్గితండా వరకు కొన్ని రోజులు నీళ్లు వచ్చాయి. అక్కడి నుంచి చౌకాన్‌పల్లి సంప్‌హౌస్‌కు మాత్రం నీరందడం లేదు. కాంట్రాక్టర్ తీరు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ అస్తవ్యస్తం... ఓపెన్ వెల్ ద్వారా వేసిన పైప్‌లైన్ అస్తవ్యస్తంగా మారడంతో నీటి పంపింగ్‌కు అంతరాయం కలిగింది. పైప్‌లైన్ విస్తరణ సక్రమంగా లేక లీకేజీలు అధికమయ్యాయి. ఓపెన్ వెల్ మోటార్లకు సరైన కరెంటు ఓల్టేజీ అందక పోవడంతో నీటి సరఫరా జరుగడం లేదు. ఈ పథకాన్ని పటిష్ట పరచాలని మరిన్ని నిధులు వెచ్చించి కౌలాస్ నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒడ్డున మరో బావి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రెండు బావుల ద్వారా నీరందించేందుకు రెండు 10 హెచ్‌పీ మోటార్లతో పంపింగ్ చేసేందుకు అధికారులు తూతూమంత్రంగా ప్రయత్నాలు జరిపారు. దీంతో గత ఐదేళ్ల నుంచి ఈ పథకం ప్రజలకు శాపంగానే మారింది. -
రైతన్నను వెంటాడుతున్న అప్పులు
నంగునూరు/తూప్రాన్ : భూగర్భజలాలు ఎండి పంటలు దక్కక పోవడంతో చేసిన మయ అప్పులు ఎలా తీర్చాలో కలత చెంది ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహ త్యకు పాల్పగా.. మరో రైతు గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలు జిల్లాలోని నంగునూరు, తూప్రాన్ మండలాల్లో మంగళవారం చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. నం గునూరు మండలంలోని సిద్ధన్నపేటకు చెందిన బోడ సంపత్‌రెడ్డి (32) తనకున్న మూడెకరాల్లో వ్య వసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న పొలం పక్కనే వాగు ఉండడంతో రైతు మూ డు బోర్లు వేయించాడు. మూడింటిలో నీరు పడడంతో మొక్కజొన్నతో పాటు కూరగాయలను సాగు చేశాడు. ప్రతిరోజూ పండే కూరగాయలను సైకిల్‌పై తిరుగుతూ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో విక్రయించేవా డు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయాయి. కోత కొచ్చిన పంటలకు తోడు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. ఇటీవల కా లంలో పంట పెట్టుబడులు, బోర్ల వేసేందుకు, కుటుంబ పోషణ తదితరాల కోసం సుమారు రూ. 3 లక్షల వరకు అప్పుచేశాడు. అయితే వీటి ఎలా తీ ర్చాలంటూ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉద యం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన సంపత్‌రెడ్డి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నా డు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు పొ లాల రైతులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి చి కిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించాడు. ఈ క్ర మం లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవా రం సంపత్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య మం గవ్వ, కుమారుడు రమణారెడ్డి, కుమార్తె అశ్వితలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మృతుడి భార్య మంగవ్వ ఫిర్యాదు మేరకు రాజ్‌గోపాల్‌పేట ఎస్ఐ గోపాల్‌రావు కేసు నమోదు చేసుకు ని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆగిన రైతు గుండె తూప్రాన్ : ఎండిన పంటలను చూసిన ఓ రైతన్న గుండె ఆగింది. ఈ సంఘటన మండలంలోని ఘనపూర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుల చంద్రయ్య (58)కు ఎకర పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. తన కున్న పొలంలో మూడు బోర్లు వేశాడు. కానీ వాటిల్లో నీరు పడలేదు. దీంతో ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంట కూడా చేతికందక ఎండిపోయింది. ఈ క్రమంలో పంటల పెట్టుబడు లు, కుమార్తె వివాహం, బోర్లు వేసేందుకు సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఏయేటికి ఆ యేడు పంటలు వస్తాయి.. అప్పులు తీరుద్దామనుకోవడంమే తప్ప తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమం లో రుణదాతలు కూడా అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో అంతుపట్టక ఇదే విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద తరచూ ప్రస్తావిస్తూ కలత చెందే వాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గుండెలో నొప్పి వస్తోందని కుటుం బీకులకు తెలిపాడు. వారు చంద్రయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. త మకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుం బాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
యథేచ్ఛగా వాటర్ ప్లాంట్ల నిర్వహణ
పటాన్చెరు పారిశ్రామికవాడలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో భూగర్భ జలాలకు డిమాండ్ పెరిగి వందల సంఖ్యలో ఆర్వో నీటి శుద్ధి కేంద్రాలు వెలిశాయి. వీటిలో ఏ ఒక్క దానికీ అనుమతి లేదు. రెవెన్యూ అధికారులకు ఠంచనుగా మామూళ్లు అందిస్తున్న నిర్వాహకులు యథేచ్ఛగా నీళ్ల దందా నిర్వహిస్తున్నారు. సీఎం సొంత జిల్లా.. రాష్ట్ర రాజధానికి పక్కనే ఉన్న పటాన్చెరులో ‘రెవెన్యూ’ పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బోరు నీటినే.. శుద్ధి చేసిన జలమని చెబుతూ విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితమే తేల్చారు. కానీ వీటినే ఆర్వో ప్లాంట్లలో ఫిల్టర్ చేశామని చెబుతున్న వ్యాపారులు 12వేల లీటర్ల ట్యాంకర్ల పరిణామాల్లో విక్రయిస్తున్నారు. ఈ నీటిని స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో రసాయనాల తయారీకి, తాగునీటి కోసం వాడుతున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో చాలా రసాయన పరిశ్రమల్లో భూగర్భ జలాలు లేవు. దీంతో దూర ప్రాంతాల నుంచి వాడుక, తాగు నీటి అవసరాల కోసం నీటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు పనిలో పనిగా వాటర్ బబూల్స్ (20 లీటర్ల బాటిళ్లు) ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇస్నాపూర్, ముత్తంగి, పాటిలో తయారు చేస్తున్న నీరు శేరిలింగంపల్లి వరకు అమ్ముతున్నారు. చిన్న సైజు బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో కూడా విక్రయిస్తున్నారు. వంద గజాల నిడివిలో నాలుగు బోర్లు వేసి ఆ నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండ... గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఒకరి సూచన మేరకు ముత్తంగి చర్చి ముందు వైపు ఉన్న వాటర్ ప్లాంట్ కోసం ఓ మైనార్టీ నేత కోరిక మేరకు ఏకంగా ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. అక్కడ వ్యవసాయం లేదు. కనీసం ఆవాసాలు కూడా లేవు. కేవలం వాటర్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్లకు స్థానిక రెవెన్యూ అధికారుల పూర్తి సహకారం అందిస్తున్నారు. ముత్తంగిలో ప్రధాన రహదారిపై, రైస్‌మిల్లు, కట్టెల మిల్లు దగ్గర నిత్యం వందలాది ట్యాంకర్లు నిలబడి ఉన్నా అధికారులు మాత్రం కనీసం వాటిని పట్టించుకోవడంలేదు. పాశమైలారంలో నీటి వ్యాపారం కోసం చేసిన నిర్మాణాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఇంద్రకరణ్(సంగారెడ్డి) మండలం వైపు వేసిన బోర్ల నుంచి పైప్లైన్లు వేసి పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ సంపులను నింపుతున్నారు. 24 గంటలు మోటర్లు పెట్టి నీటిని ఉపరితల ట్యాంకులకు ఎక్కిస్తుంటారు. పైవైపున్న ట్యాంకుల కింద ట్యాంకర్లను నిలబెట్టి క్షణాల్లో నింపే ఏర్పాట్లు చేశారు. వందలాది లారీల్లో రాత్రింబవళ్లు సరఫరా కొనసాగుతూనే ఉంటుంది. ముత్తంగిలో కూడా ఇదే పరిస్థితి. ముత్తంగి చర్చి ముందు దాదాపు డజనుకుపైగా నీటి వ్యాపార క్షేత్రాలు కొనసాగుతున్నాయి. అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువులో శిఖంలోనే వాటర్ ట్యాంకర్ క్షేత్రాలు నిర్వహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటితో తమ బోర్లు ఎండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల అధికారులు కూడా అది తమ పరిధిలోనిది కాదని చేతులెత్తేస్తుండటంతో వ్యాపారులకు అడ్డు లేకుండా పోయింది. దాడులు చేస్తాం... దీనిపై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి అడగగా గతంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చాయన్నారు. అప్పట్లో వాటర్ ప్లాంట్లపై దాడులు చేశామని తెలిపారు. రెండుమూడు రోజుల్లో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దాడులు చేస్తామని చెప్పారు. అక్రమంగా కొనసాగుతున్న నీటి క్షేత్రాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. -
జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి ....
సాక్షి, మంచిర్యాల : ఇంకా చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. వేసవికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది. కానీ.. అప్పుడే జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. వేసవికి ముందే వేసవిని గుర్తుచేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. 16 మండలాల్లో పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే గతనెల అక్టోబర్ వరకు 14 మండలాల్లో భూగర్భ జలాలు లోతులోకి వెళ్లాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనని భూగర్భ జల శాఖ అధికారులే స్వయానా చెబుతున్నారు. వేసవి ప్రారంభంలోగా రెండు..మూడు మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య జఠిలంగా మారే ప్రమాదం ఉందని అంచ నా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాకు రూ.12.20 కో ట్లు అవసరమని ప్రభుత్వానికి ఇటీవల నివేదికలు పంపారు. జిల్లాలో 52 మండలాలుం డగా.. ప్రతినెలా సుమారు 30 మండలాల్లో భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేయ గా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బెజ్జూర్, బోథ్, దహెగాం, దిలావర్పూర్, కాగజ్‌నగర్, కెరమెరి, లోకేశ్వరం, ముథోల్, సారంగాపూర్, తాండూర్, తానూర్ మండలాల్లో నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఖానాపూర్, మందమర్రి, తాంసి, వాంకిడి మండలాల్లో ఎనిమిది మీటర్లకు చేరాయి. ఇప్పటికే 200లకు పైగా ఆవాసాల్లో నీటి సమస్య నెలకొంది. రూ.12.20 కోట్ల పనులకు ప్రతిపాదనలు.. జిల్లాలో దారుణంగా పడిపోయిన భూగర్భ జల మట్టంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉన్నందునా.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణకు అత్యవసరంగా రూ.12.20 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందు లో బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు కా వాలని నివేదించారు. జిల్లాలో 3,490 తాగునీటి పథకాలుండగా.. అందులో 425 పథకాలు పని చేయడం లేదని వాటి మరమ్మతు, నిర్వహణ కోసం రూ.10.40 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే బోర్‌వెల్స్ మరమ్మతు, నీటి ట్రాన్స్‌పోర్టేషన్, బావులు అద్దెకు చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో కాలిపోయిన మోటార్ల మరమ్మతు, కొత్త మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ పనులపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21,682 బోర్వెల్లలో సుమారు తొమ్మిది వేల బోర్లు పనిచేయడం లేదు. 13వ ఫైనాన్స్ నిధులు రూ.2.50 లక్షల (మూడు నెలలకోసారి)తో వీటి మరమ్మతు చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు పంపాం.. - ఇంద్రసేన్, ఎస్ఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ సారి వేసవికి ముందే నీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నెలారంభంలో భూగర్భ జల శాఖ ఇచ్చిన నివేదికలు చూసి మరింత అప్రమత్తమయ్యాం. బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు, పనిచేయని 425 నీటి పథకాల నిర్వహణకు రూ.10.40 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. -
కుప్పెయ్.. కుమ్మెయ్
జిల్లాలో వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నదులు, వాగులు, వంకలు ఇసుక అక్రమరవాణాకు కేంద్ర బిందువుగా మారాయి. సులభంగా కాసులు కురుస్తుండటంతో ఇసుకమాఫియాకు కాసులు కురిపిస్తున్నాయి. చోటామోటా నేతలు, కొందరు నేరచరిత్ర కలిగిన వ్యక్తులు అక్రమరవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తున్నారు. దీంతో పోగేసిన ఇసుకడంప్లను రాత్రికిరాత్రే లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలోని కృష్ణా, తుంగభద్రతో పాటు దుందుబీ, ఊకచెట్టువాగు తదితర వాగులు, వంకలు జిల్లాలో సుమారు రెండువేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు మైనింగ్‌శాఖ లెక్కలు చెబుతోంది. వీటిలో వేలకోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక మేటలు ఉన్నాయి. భూగర్భజలాలు తగ్గుతాయనే ఉద్ధేశంతో జిల్లాలో ఇసుక క్వారీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. ప్రభుత్వం అధికారింగా ఇంకా నూతన ఇసుక విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. నదులు, వాగుల నుంచి ఇసుకను తోడి తీర ప్రాంతాల్లోని పొలాలు, గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక డంప్‌లు గుట్టలను తలపిస్తున్నాయి. రాత్రివేళ ల్లో నకిలీ పర్మిట్లతో కొందరు, దొంగచాటున మరికొందరు లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏదో ఒక సంస్థ పేరిట పర్మిట్లు సృష్టించి ఒకే పర్మిట్‌పై వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా కర్నూలు నుంచి రోజూ వందల లారీలు హైదరాబాద్‌కు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం, అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించడం, ఆ ఇసుకను అలాట్ చేయించుకుని హైదరాబాద్‌కు తరలించడం అనే ప్రక్రియను కొన్ని ముఠాలు కానిచ్చేస్తున్నాయి. 40 టన్నుల సామర్థ్యం ఉన్న ఒక్కోలారీ ఇసుకధర హైదరాబాద్ మార్కెట్లో రూ.లక్ష పైనే పలుకుతున్నట్లు సమాచారం. అక్రమ రవాణాకు తలోచేయి ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా, పరోక్షంగా వారే ఇసుక మాఫియాకు తరలిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ముఠాలకు స్వయంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నాయకత్వం వహిస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు తమకు రావాల్సిన మామూళ్ల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా అక్రమ ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ మండల, జిల్లా స్థాయి పోస్టింగుల్లో అధికారుల నియామకాన్ని ఇసుక మాఫియాలే శాసిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుపడే అధికారులకు ఉన్నతస్థాయిలో బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుండటంతో చేతులెత్తేస్తున్నారు. ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చే విషయంలోనూ ఇటీవల జిల్లా స్థాయిలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండల, డివిజన్ స్థాయిలో కాకుండా మైనింగ్ అధికారులు ఇసుక పర్మిట్లు జారీ చేస్తారని తొలుత ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకోలేక మైనింగ్ అధికారి ఒకరు సెలవుపై వెళ్లారు. దీంతో తిరిగి ఇసుక పర్మిట్ల జారీ అధికారాన్ని కలెక్టరేట్‌కు కట్టబెట్టడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా, కేవలం మామూళ్ల వసూలుకే పరిమితం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆగని అక్రమరవాణా వడ్డేపల్లి మండల పరిధిలో ప్రవహించే తుంగభద్ర నదీతీరం నుండి ఇసుక అక్రమరవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని రాజోలి, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి, తూర్పుగార్లపాడు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ గ్రామాల సమీపంలోని తుంగభధ్ర నది నుండి ట్రాక్టర్లద్వారా తెచ్చి కుప్పలుగా పోస్తున్నారు. ఈ డంప్‌ల నుంచి రాత్రివేళల్లో లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. కాగా, ఇటీవల జేసీ ఎల్.శర్మన్ ఇటీవల రాజోలి గ్రామాన్ని సందర్శించి ఇళ్లముందు ఉన్న ఇసుక డంప్‌లను చూసి నివ్వెరపోయారు. కేవలం రాజోలిలోనే అక్రమంగా నిల్వచేసిన సుమారు 50 ఇసుక డంప్‌లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయమై స్థలం యజమానులు, ట్రాక్టర్లు, లారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని తహశీల్దార్ శాంతకుమారి, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, గద్వాల డీఎస్పీని ఆదేశించి వెళ్లినా నేటికీ చర్యలు తీసుకోవడంలేదు. -
నియోజకవర్గానికో.. మినీ ట్యాంకుబండ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామాలకు ప్రధాన నీటివనరైన చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో చెరువులను పరిరక్షించడంతోపాటు అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విడతల వారీగా చెరువులు పునరుద్ధరించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పనుల కేటాయింపులపైనా ఇంజినీర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వారంలోగా చెరువుల పునరుద్ధరణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని, వాటి ఆమోదం అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఇంజినీర్లు.. జిల్లాలో ఉన్న 3400 చెరువుల్లో తొలివిడత 683 చెరువులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. చెరువుల అభివృద్ధితోపాటు పర్యటక పరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో చెట్ల పెంపకాన్ని సైతం ఈ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చెరువును ఎంచుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువును ఎంచుకుని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మార్గనిర్దేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో రావిరాల చెరువులతోపాటు లక్నాపూర్, కోట్‌పల్లి తదితర ప్రాజెక్టులన్నీ పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో చెరువుకు గరిష్టంగా రూ.50లక్షలు.. చెరువుల మరమ్మతు పనులకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. చెరువులో పూడికతీత, కాల్వ పనులు, ఫీడర్ చానళ్ళ మరమ్మతులు తదితర పనులకు సంబంధించి ఒక్కో చెరువుపై గరిష్టంగా రూ.50లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈలెక్కన తొలివిడత చేపట్టే 683 చెరువుల మరమ్మతుకుగాను రూ.350 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మినీట్యాంక్‌బండ్‌ల అభివృద్ధి ఈ ప్రణాళికలో రూపొందిస్తున్నప్పటికీ.. నిధులు మాత్రం ఇతర కోటాలో ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోచోట ఒక్కోవిధంగా పనులు చేయాల్సి ఉన్నందున ప్రణాళిక తయారైన అనంతరం ప్రభుత్వ ఆమోదంతోనే వీటిని నిధులిస్తారు. -
‘తెల్ల’బోతున్న ‘బంగారం’
అక్రమార్కుల ధాటికి తెల్ల బంగారం తెల్లబోతోంది. ఇసుకాసురులు దీనినే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుని విచ్చలవిడిగా నదీమ తల్లి గర్భాన్ని తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతం, పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆవేదన ప్రజలు, రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓవైపు ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇసుకాసురులకు కళ్లెం వేసే వారే లేకుండా పోయూరు. రొద్దం మండలంలోని పెన్నానది పరీవాహిక ప్రాంతం నుంచి తరలి పోతున్న తెల్ల బంగారం కథాకమామిషు ఇది. * కర్ణాటకకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా * జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు రొద్దం: గత నెల రోజులుగా కర్ణాటకకు ఇసుకను అక్రమార్జనపరులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రొద్దకంపల్లి గ్రామ సమీపాన పెన్నానది నుంచి పెద్ద ఎత్తున పావగడకు ఇసుకను రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతూ నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు ఎండి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. నల్లూరు, కల్లుకుంట, నాగిరెడ్డిపల్లి, నారనాగేపల్లి, కందుకూర్లపల్లి, పెద్దమంతూరు, చిన్నకోడిపల్లి, కనుమర, ఆర్ కుర్లపల్లి, రొద్దం, చెరుకూరు, ఉప్పర్లపల్లి, సుబ్బరాయప్పగారి కొట్టాల, తదితర గ్రామాల్లో పెన్నానది ఒడ్డున వివిధ పూల తోటలను రైతులు సాగు చేశారు. వీటిపై ఆధారపడి దాదాపు 3 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికే పెన్నా నుంచి అత్యధికంగా ఇసుకను అక్రమార్కులు తరలించడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. దీంతో రైతులు అప్పులు చేసి ఫిల్టర్ బోర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోవడంతో వాటి ల్లో కూడా నీటి మట్టం అడుగంటి పోరుుంది. దీంతో రైతుల కుటుంబాలు పంటల్ని కోల్పోరుు తీవ్రంగా నష్ట పోయి బజారున పడే దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇసుక రవాణా భారీగా సాగుతోందని పలువురు రైతులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు ఇసుక ధర దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందన్నారు. కేవలం ఇసుకను తరలించడానికే కొందరు కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చే శారని చెబుతున్నారు. రాత్రంతా ఇసుక తరలించడం.. పగలు మిన్నకుండిపోవడం అక్రమార్కులు పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. రొద్దంకపల్లి, రొద్దం, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరుకూరు, పెద్దమంత్తూరు, ఉప్పరపల్లి, తదితర గ్రామాల నుంచి ఇసుక భారీగా తరలుతోందని సమాచారం. అధికారులకు చెప్పినా స్పందించిన నాథుడే లేదని రైతులు వాపోతున్నారు. రాత్రి వేళలో లారీలకు ఇసుకను లోడు చేసి టార్పలిన్లతో కప్పి బెంగళూరుకు రవాణా చేస్తునట్లు తెలుస్తోంది. ఇలాగే ఇసుక తోడేస్తే కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నానదిలో బోర్లు లోతుగా వేస్తున్నా ప్రస్తుతం నీరు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తమను కాపాడాలని రైతాంగం కోరుతోంది. -
రబీకి సన్నద్ధం
గజ్వేల్: వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులు ‘రబీ’లోనైనా కోలుకోవాలనే ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే భూగర్భజలాలు పడిపోయినందువల్ల ‘వరి’కి సాగుకు స్వస్తి పలికి ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయాశాఖ సూచిస్తున్నారు. ఈ తరుణంలో రైతుల ‘ఆరుతడి’ పంటల సాగుపై దృష్టి సారించారు. రెండురోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలతో రైతులు శనగ, ఇతర ఆరుతడి పంటల సాగును వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రబీకి ఊతమిచ్చిన వర్షం ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావం రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. కళ్ల ముందే వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ కారణంగా చేలన్నీ న్లై బారాయి. రేగడి భూముల్లోనూ తేమ కరువైంది. మొక్కజొన్న పంట కోసిన తర్వాత అదే భూమిలో రబీలో శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర ఆరుతడి పంటలు వేసుకోవాలంటే తేమ తప్పనిసరి. ఎక్కడా కూడా తేమ లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్న తరుణంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు‘రబీ’సాగుకు ఊతమిచ్చాయి. అంచనా తప్పింది! గతేడాది రబీలో జిల్లాలో 1.49 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి 1.52 లక్షల హెక్టార్లలో శనగ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, ఆముదం, జొన్న, మినుములు, వరి, కూరగాయలు తదితర పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 626.1 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 399.8 మి.మీలు మాత్రమే నమోదైంది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం వల్ల కరెంట్ సరఫరా చేసినా నీరు పారే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ‘వరి’కి దూరంగా ఉండాలని రైతులకు సూచిస్తున్నారు. ఫలితంగా వరి సాగు గణనీయంగా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పడిపోనున్న వరి సాగు విస్తీర్ణం గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లో గతేడాది శనగ పంట 2,083 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,700 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1,117 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 600 హెక్టార్లు, మొక్కజొన్న 233 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,000 హెక్టార్లు, ఇతర పంటలు 790 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 509 హెక్టార్లలో సాగయ్యాయి. ఇదిలావుంటే వరి మాత్రం 4,356 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 3,200 హెక్టార్లలో సాగైంది. ఈసారి వ్యవసాయశాఖ పంటలు ఇదే విధంగా సాగులోకి వస్తాయని భావించింది. ప్రధానంగా శనగ పంట 2,700 హెక్టార్లలో సాగులోకి వస్తుందని భావించి 2,000 క్వింటాళ్ల విత్తనం అవసరముంటుందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 400 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు రాగా, వ్యవసాయాధికారులు ఇప్పటివరకు అతికష్టం మీద 300 క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే పంపిణీ చేయగలిగారు. 100 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేసేవారు లేక వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఉండిపోయింది. వాస్తవానికి ఈపాటికి విత్తనాల పంపిణీ పూర్తయి, విత్తడం కూడా ముగింపు దశకు చేరుకోవాల్సి ఉండగా, అందుకుభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులుగా కురిసిన వర్షంతో శనగ సాగు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘వరి’కి దూరంగా ఉండాలి ఖరీఫ్‌లో ఏర్పడిన వర్షాభావం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. అందువల్ల ప్రస్తుత రబీలో వరి సాగు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి. సబ్సీడీ విత్తనాలు వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. -జేడీఏ హుక్యా నాయక్ -
శాండ్ రిచ్
అనంతపురం సెంట్రల్ : ఇసుక రీచ్‌లపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. త్వరితగతిన సంపాదనకు ఏకైక వనరుగా ఇసుక రీచ్‌లే కనిపిస్తున్నారుు. దీంతో తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా నేతల ఒత్తిళ్లు మాత్రం ఆగడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో తాగునీటికి కొరత ఉందేమో కానీ అనేక నదీ పరివాహక ప్రాంతాలు ఉండడంతో ఇసుకకు కొదవలేదు. ఇన్నాళ్లు తెరవెనుక ఉండి ఇసుక వ్యాపారం చేస్తున్న నాయకులు.. ఈ ప్రభుత్వ హయాంలో అధికారికంగానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక వ్యాపారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తాడిమర్రి మండలం సీసీ రేవు గ్రామంలో చిత్రావతి నది, పెన్నానది పరివాహక ప్రాంతాలైన పెద్దపప్పూరు, చిన్న ఎక్కలూరు గ్రామం, శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ మూడు రీచ్‌లలో లక్ష క్యూబిక్ మీటర్లు తవ్వుకోవచ్చునని గుర్తించారు. ఆమేరకు మహిళా సంఘాల ద్వారా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సీసీరేవు, చిన్న ఎక్కలూరులో ఇసుక రీచ్‌లు ప్రారంభించగా.. వ్యాపారం కూడా మొదలైంది. శింగనమల మండలంలోని ఉల్లికల్లులో మొదలు కావాల్సి ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆ గ్రామ ప్రజలు ఇసుక రీచ్‌లను వ్యతిరేకిస్తున్నారు. గత నెలలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ ప్రజలతో సంప్రదింపులు జరిపినా ఫలితం రాలేదు. లక్ష్యం పెంచి.. ప్రతిపాదనలు స్వయం సహాయక సంఘాలను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతలు ఇసుక రీచ్‌లపై పెత్తనం చెలాయిస్తున్నారు. డ్వాక్రా మహిళలకే ఇసుక రీచ్‌లు కేటారుుస్తామని బయటకు చెబుతున్నా, లోలోపల మాత్రం అంతా టీడీపీ నేతలే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ప్రారంభించిన ఇసుక రీచ్‌లలో లక్షలాది రూపాయల విక్రయాలు జరిపారు. వ్యాపారం జోరందుకోవాలంటే ఇబ్బడిముబ్బడిగా తవ్వుకోవాలని భావించిన నేతలు లక్ష క్యూబిక్ మీటర్లు ఏమాత్రం సరిపోదని, మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలల క్రితం ఉల్లికల్లు గ్రామంలో పోలీసు బందోబస్తు మద్య స్థానిక ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ను ప్రారంభించినా, ఇప్పటికీ తవ్వకాలు మొదలు పెట్టనివ్వడం లేదు. మిగిలిన చోట్ల కూడా ప్రజల అభిప్రాయాన్ని కాదని తవ్వకాలు చేపడుతున్నారు. తొలుత లక్ష క్యూబిక్ మీటర్లు మాత్రమేనని చెప్పడంతో ప్రజలు అంగీకరించారు. ప్రస్తుతం మూడు లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అణచివేయూలా అని అలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇసుక తవ్వకాల్లో నిర్వాహకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పది ట్రిప్పులు పంపితే ఏడెనిమిది మాత్రమే నమోదు చేస్తున్నట్లు సమాచారం. మిగతా రెండు మూడు ట్రిప్పులు దొడ్డిదారిన అమ్ముకుంటున్నట్లు తెలిసింది. -
కష్టకాలం
సాక్షి, ఖమ్మం: నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఆశతో ఖరీఫ్ సాగు మొదలుపెట్టిన రైతన్నకు ఆ తర్వాత నిరాశేమిగిలింది. విత్తునాటడానికే చినుకులు రాలకపోవడంతో అప్పుడుప్పుడు కురిసే జల్లులతోనే 3,31,494 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, మధిర, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. విద్యుత్ కోతలతో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బయ్యారం, గార్ల, కామేపల్లి, కారేపల్లి, టేకులపల్లి, గుండాల, బూర్గంపాడు, కొత్తగూడెం, ముల్కలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ తదితర మండలాల్లో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి చేతికి అందే దశలో ఎండిపోతోంది. ఆయా మండలాల్లో పత్తి పంట కూడా వాడిపోవడంతో దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగు చేసిన మిరప తోటలు ఆశాజనకంగా లేవు. వర్షాభావంతో అన్ని పంటల దిగుబడులు తగ్గాయి. అడుగంటిన భూగర్భ జలాలు తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లో 2 నుంచి 3 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోతే అంతగా పంటలు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఈ స్థాయే ఖరీఫ్‌లో దాటితే రబీలో మరింత తీవ్రతరమై నీటి కష్టాలు ఎదురవుతాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర (వీఎంల)లో గత నెలలో అత్యధికంగా 6.33 మీటర్లకు నీటిమట్టం పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. దళారీ చేతిలో రైతు దగా అరకొరగా చేతికి అందిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం రైతును మరింత కుంగదీస్తోంది. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు దక్కపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వం 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం ఖమ్మంలో ఒక్క కేంద్రాన్ని మాత్రమే తెరిచారు. ఈ కేంద్రంలోనూ వ్యాపారుల దందానే కొనుసాగుతండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మద్దతు ధర రూ.4,050 అయితే దళారులు రూ.3వేల నుంచి రూ. 3,500 వరకే పెడుతున్నారు. రుణమాఫీకి ఎదురుచూపులు.. ఈ ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,400 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4.81 కోట్లు మాత్రమే కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చారు. రూ.724 కోట్లు రెన్యూవల్స్ చూపించారు. జిల్లా వ్యాప్తంగా రూ. 1,700 కోట్లు రుణమాఫీ కావాలి. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ కింద జిల్లాకు రూ.427.85 కోట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రూ.285 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. నూతన రుణాలు, రుణమాఫీ అంటూ కాగితాల్లోనే ప్రభుత్వం అంకెల గారిడి చేసింది. కొత్తగా రుణాలు ఇవ్వకపోవడం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణం.. జిల్లాలో 12 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఏ ఒక్కటీ నమోదుకాకపోవడం గమనార్హం. మధిర మండలం రొంపిమళ్ల గ్రామానికి చెందిన మొగిలి నాగేశ్వరరావు (30) పత్తి సాగుతో అప్పులపాలై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పినపాక నియోజకవర్గంలో ఈ సీజన్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వాపురం మండంలోని అమెర్ధ పంచాయతీ చండ్రలబోడు గ్రామానికి చెందిన ఎనిక తిరుపతి(40), గుండాల మండలం దామర గూడెం వాసి పాయం పాపయ్య(30), నడిమిగూడెంకు చెందిన పాయం రాంబాబు(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామ రైతు తమ్మినేని వెంకటేశ్వరరావు (40), తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం శివారు అజ్మీరాతండాకు చెందిన భూక్యా సామ్యా (35), ఏన్కూరు మండలం రాయమాధారానికి చెందిన జబ్బ శ్రీనివాసరావు (30), జూలూరుపాడు మండలం భీమ్లాతండాకు చెందిన బాదావత్ వెంకట్రామ్(45), పాల్వంచ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తాటి శ్రీను(39) బలవన్మరణానికి పాల్పడ్డారు. వర్షాభావం వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని 32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, వైరా, చింతకాని, ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, ఏన్కూరు, తల్లాడ, వేంసూరు, దమ్మపేట, ముల్కలపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం, సింగరేణి, ఇల్లెందు, పాల్వంచ, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వాపురం, గుండాల, చర్ల, వేలేరుపాడు, కొణిజర్ల మండలాలను కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు. -
అంతా కరువే
జిల్లా రైతాంగాన్ని ఖరీఫ్ ముంచేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాత కుదేలయ్యాడు. ఎక్కడ చూసినా కరువుఛాయలే కన్పిస్తున్నాయి. భూగర్భజలాలు సైతం అడుగంటడంతో తాగునీటికీ కష్టకాలమొచ్చింది. అడపాదడపా కురిసిన వర్షాలు పంటలను గట్టెక్కించలేకపోయాయి. సీజన్ మొత్తంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 781 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. సీజన్ చివరినాటికి కేవలం 554.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సాధారణం కంటే 29శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికల్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జిల్లాలోని 37 మండలాలనూ కరువు పీడిత ప్రాంతాలుగా అందులో ప్రస్తావించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * 29 శాతం లోటు వర్షపాతం, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం * కరువు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన జిల్లా యంత్రాంగం * ఖరీఫ్‌లో మిగిలింది అప్పులే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 37 మండలాలున్నాయి. ఇందులో నాలుగు మండలాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా.. మిగతా 33 గ్రామీణ మండలాలు. తాజాగా జిల్లా యంత్రాంగం రూపొందించిన కరువు నివేదికల్లో అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా పేర్కొంది. పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో కరువు మండలాలుగా గుర్తించారు. 33 గ్రామీణ మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజన్ చివరలో అధిక వర్షాలు కురిసి వర్షపాతం నమోదైనప్పటికీ.. వాటి మధ్య అంతరం హెచ్చుగా ఉందని అధికారులు తేల్చారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.84లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను సీజన్ ముగిసే నాటికి 1.62లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా వేలాది హెక్టార్లలో విత్తనాలు మొలకెత్తలేదు. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులను పంట తట్టుకున్నప్పటికీ దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో సీజన్ ముగిసిన అనంతరం చేసిన సర్వేలో పంటల దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు తేల్చారు. మొత్తంగా అన్నివిధాలా నష్టం జరగడంతో జిల్లాలోని 37 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. నాలుగు అంశాలే ప్రామాణికం.. కరువు నివేదికలపై యంత్రాంగం నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారించింది. వర్షపాతం, వర్షాల మధ్య అంతరం, సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాల ఆధారంగా కరువును ఖరారు చేసింది. జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. వర్షాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సాగు విస్తీర్ణం, దిగుమతుల అంశాల్లోనూ ఆశాజనక పరిస్థితులు లేక పోవడంతో ఆమేరకు అన్ని మండలాలు కరువు నివేదికల్లోకి ఎక్కాయి. లబ్ధి ఇలా.. జిల్లా యంత్రాంగం సమర్పించిన నివేదికల్ని ప్రభుత్వం ఆమోదిస్తే రైతులకు పెట్టుబడి రాయితీ అందుతుంది. అదేవిధంగా పంటరుణాలు రీషెడ్యూల్ చేసే వెసులుబాటు వస్తుంది. అదేవి దంగా తాగునీటి సరఫరా మొరుగుపర్చేందుకు ప్రత్యేక నిధులు అందుతా యి. ఇవేకాకుండా కరువు ప్రభావంతో కలిగిన నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -
జలగండం
వర్షాభావ పరిస్థితుల్లో ‘అథః’పాతాళానికి చేరిన గంగ 52 మండలాల్లో ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలమట్టం! ఇప్పటికే 65 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయిన దుస్థితి 1,468 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న వైనం నెలకు 0.85 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేస్తున్న జనం వేసవిలో తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారుల ఆందోళన సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. వర్షాకాలంలోనే ఇలా ఉంటే వేసవి వచ్చేనాటికి నీటి ఎద్దడి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే జనం భయపడుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం 918.1 మిల్లీమీటర్లు. పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుం ది. ఐదేళ్లుగా నైరుతి రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉండడం వల్ల సగటు వర్షపాతం నమోదు కాలేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తూర్పు మండలాల్లో కాస్తోకూస్తోనైనా వర్షం కురుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి సగటున 439.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 271.4 మిమీల మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో సాగు, తాగునీటి కోసం 90 శాతం మంది ప్రజలు భూగర్భ జలాలపైనే ఆధారపడతారు. మన జిల్లాలో 2.85 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తాగునీటి, సాగునీటి బోరు బావుల నుంచి ప్రతి నెలా సగటున 0.85 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేస్తున్నారు. కానీ.. వర్షం ఆ మేరకు కురకపోవడం లేదు. ఇది భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని రీతిలో 17.68 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోవడం గమనార్హం. 52 మండలాల్లో ఆందోళనకరం భూగర్భజలమట్టం 52 మండలాల్లో ఆందోళన కలిగించే రీతిలో పడిపోయింది. మదనపల్లె డివిజన్లోని 31 మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏ ఒక్క మండలంలోనూ 25 మీటర్ల కన్నా తక్కువ లోతులో భూగర్భజలాలు లభించకపోవడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో భూగర్భజలమట్టం ఏకంగా 33.78 మీటర్లకు పడిపోయింది. తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో భూగర్భజలమట్టం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఈ నియోజకవర్గాల్లో 1200 అడుగుల లోతుకు బోరు బావిన తవ్వితేగానీ నీళ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పు మండలాల్లో సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మాత్రమే భూగర్భజలాలు ఆశించిన రీతిలో అందుబాటులో ఉన్నాయి. భూగర్భజలమట్టం అథఃపాతాళానికి చేరడంతో ఫ్లోరైడ్ భూతం వికటాట్టహాసం చేస్తోంది. పశ్చిమ మండలాలతోపాటు తూర్పు ప్రాంతంలోని 11 మండలాలపై ఫ్లోరైడ్ భూతం పంజా విసురుతోందని అధికారిక గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. వేసవిని తలపిస్తున్న నీటి ఎద్దడి జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల వందలాది మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 1,468 గ్రామాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో 242 గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. మరో వెయ్యికిపైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల రాజ్యమేలుతుండడం.. ప్రతి నెలా సగటున 0.85 మీటర్ల మేర భూగర్భజలాలు తోడేస్తుండడం వల్ల జిల్లాలో భూగర్భజలాలు 17.68 మీటర్లకు పడిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 65 వేలకుపైగా సాగు, తాగునీటి బోరు బావులు ఎండిపోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇదే రీతిలో నెలకొంటే మార్చి నాటికి 22.78 మీటర్లకు భూగర్భజలమట్టం పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరో లక్షకుపైగా బోరు బావులు ఎండిపోయే అవకాశం ఉందని.. 50 శాతానికిపైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వేసవిలో గుక్కెడు తాగునీటి కోసం వేలాది గ్రామాల్లో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. -
గంగ ఉన్నా.. రుణాల బెంగ
ప్రారంభమైన రబీ.. ఇంతవరకు అందని బ్యాంక్ రుణాలు తూర్పు మండలాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే శ్రీకాళహస్తి: జిల్లాలోని తూర్పుమండలాల్లో కరువు ఛాయలు కనిపించడంలేదు. ఓ పక్క తెలుగుగంగ.. మరో పక్క స్వర్ణముఖి.. ఎంతోకొంత భూగర్భజలాలు ఉండడంతో రైతులు రబీ సాగుకు రెడీ అయిపోయారు. దుక్కులు దున్ని.. నార్లు పోసేందుకు సిద్ధమయ్యారు. గంగ ఉంటే బెంగ ఎందుకు? తెలుగంగ నీరు శ్రీకాళహస్తితోపాటు సత్యవేడు ని యోజకవర్గాలకు సాగునీటినందిస్తోంది. మూడు రో జుల క్రితం గంగ నీరు విడుదల కావడంతో శ్రీకాళహ స్తి, తొట్టంబేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల్లోని 150 గ్రామాల ప్రజలు రబీ సా గుకు సమాయత్తమయ్యారు. 6.25 లక్షల ఎకరాల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లుపోసేందుకు ఉరకలు వేస్తున్నారు. పెట్టుబడే ప్రధాన సమస్య శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో మొత్తం 11 మండలాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని రైతు లు సింగిల్‌విండోలు, బ్యాంకుల్లో ఇప్పటికే చాలా అప్పులు చేశారు. గత ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గిపోయింది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇదీగాక వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ నాయకులు గత ఎ న్నికల్లో హామీ ఇవ్వడంతో రైతులు రుణాలు కట్టడం మానేశారు. దీంతో ఆయా బ్యాంకులు, సింగిల్ విండోలకు రుణాల చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకురావడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయలేక కుమిలిపోతున్నారు. ఎరువులు కొనలేం ఐదు ఎకరాల్లో నాట్లు వేసేందుకు దుక్కిసిద్ధం చేశాను. పెట్టుబడులకు రూ.1.25 లక్షల వరకు అవసరం. ముందస్తుగా పంట పెడితే ఆశించిన దిగుబడి వస్తుందనే చిన్న ఆశ ఉంది. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకులు రుణాలిస్తేనే సేద్యం చేయగలను.. లేదంటే రబీలో బీడుగా వదిలేయాల్సిందే. -బాలాజీరెడ్డి, కొత్తకండ్రిగ గ్రామం పెట్టుబడి లేదు ఆరెకరాల్లో వరి పంట సాగుచేయాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కి దున్నలేదు. చేతిలో డబ్బులుంటే ఈపాటికే దుక్కిదున్ని నారుపోసుండేవాడ్ని. ఎరువులు, విత్తనాలకే ఇబ్బందులెదురవుతున్నాయి. గతంలో చేసిన అప్పులు తీరక కొంత భూమి అమ్మాను. ఈసారీ..అంతేనేమో.. -గురవయ్య, గురప్పనాయుడుకండ్రిగ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నా పంటసాగుకు సమయం ఆసన్నమైంది. పెట్టుబడికి డబ్బుల్లేదు. రుణమాఫీ చేస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు మాఫీ చేయలేదు. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పు తెద్దామంటే వడ్డీ ఎక్కువడుగుతున్నారు. పంట రాకపోతే పొలం అమ్మాల్సిందే. -సుబ్బరామయ్య, ఇలగనూరు గ్రామం