Padipanta
-
సేంద్రియ సాగు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో రైతులు రసాయన ఎరువులు వాడి లాభాల కంటే నష్టాలే చవిచూస్తున్నారు. అదే సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. వానపాముల వ్యర్థ పదార్థాలతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ విధానం, వానపాముల అభివృద్ధి గురించి వివరించారు. వర్మీకంపోస్టు తయారీ విధానం కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి. అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే ‘సీడ్’ తయారీపై దృష్టి పెట్టాలి. వ ర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా ‘సీడ్’ తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని. నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటాం. సాధారణంగా ఈ వర్మీబెడ్పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది. దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తాం. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి. అయితే ఈ విధానం సీడీ తయారీకి అనుకూలం కాదు. వానపాముల అభివృద్ధి ఇలా.. కుండీల్లో ‘వర్మీబెడ్’ వేసిన తర్వాత ఒక కుండీలో చిన్న భాగంలో ఎండిన పేడ చిన్నచిన్న ఉండలుగా బెడ్‌పై సమానంగా 1/2 అంగుళం ఎత్తున వేయాలి. రోజు క్యాన్‌తో బాగా తడిపి చదరపు మీటర్‌కు కేజీ వానపాముల విత్తనం చల్లాలి. తినే పదార్థం చాలా తక్కువగా ఉండడంతో కేవలం 20 రోజుల్లో వర్మీకంపోస్టు 1/2 అంగుళం ఎత్తున తయారవుతుంది. దీనిని సేకరించరాదు. దీనిపై మరో 1/2 అంగుళం ఎత్తున ఎండిన పేడ పలచగా వేసి తడపాలి. ఈసారి మరో పది రోజులల్లోనే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇలా ప్రతీ పది రోజులకు 1/2 అంగుళం ఎత్తున పశువుల పేడ వేసి తయాైరె న ఎరువును ఎత్తకుండా ఉంచితే కుండీ పైభాగం వరకు చేరేందుకు సుమారు 70 రోజులు పడుతుంది. దీనిలో సమృద్ధిగా ‘కకూన్స్’ వానపాములు చిన్న పిల్లలు చాలా అధికంగా ఉంటాయి. దీనిని సేకరించి మరో కొత్త ప్రదేశంలో వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవచ్చు. గమనించాల్సిన విషయాలివి.. {పతీ కకూన్కు (గుడ్లు) నాలుగు నుంచి ఆరు వానపాములు వస్తాయి. 90 రోజుల వయస్సు కలిగిన పెద్ద వానపాములు తన క్రైటెల్లం (గుడ్ల శేరు) నుంచి ప్రతి 15 రోజులకోకసారి ఒక కకూన్ విడుదల చేస్తుంది. 90 రోజుల తర్వాత నుంచి రెండేళ్ల వరకు ప్రతీ 15 రోజులకు ఒక కకూన్ చొప్పన సుమారు 168 నుంచి 252 వానపాములు పెరుగుతాయి. వీటిలో ప్రతీ వానపాము 90 రోజుల వయసు వచ్చిన తర్వాత మళ్లీ 168 నుంచి 252 రేట్లు పెరిగేందుకు దోహదపడతాయి. వీటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ‘సీడ్’ పెద్దవి కాకుండా వేరే కుండీల్లోకి తరలించాలి. పెద్ద వానపాములు వలస (మైగ్రేషన్) తట్టుకోలేవు. చిన్నచిన్న పాములు, కకూన్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వీటిని ప్లాస్టిక్ తొట్టెల్లో కూడా సేకరించి ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేయవవచ్చు. వానపాములు కకూన్స్ బాగా ఫలప్రదం. (హేచింగ్) కావడానికి ప్రతీ 30 రోజులకోసారి పశువుల మూత్రం 1:10 నిష్పత్తిలో నీరు కలిపి బెడ్స్‌పై గోనెలు తడపాలి. నీరు అధికంగా పోయకూడదు. గోనె తట్టును మాత్రమే తడిగా ఉండేటట్టు తడిపితే సరిపోతుంది. ఏడాది పొడుగునా కకూన్స్ ఉన్నా శీతాకాలంలో కకూన్స్ పెట్టేందుకు, అవి హెచ్ అయ్యేందుకు మరింత అనుకూలం. సీడ్ పెంచే కుండీలు ప్రతీ ఆరునెలలకోసారి శుభ్రం చేయాలి. వర్మీబెడ్ను కూడా మార్చి కుండీ రెండు రోజులు డ్రై (ఆరబెట్టాలి) చేయాలి. -
డ్రమ్ సీడర్‌తో వరిసాగు మేలు
డ్రమ్ సీడర్ గురించి.. ఈ పరిక రాన్ని ఫైబర్‌తో తయారు చేస్తారు. సుమారు 9-10 కిలోల బరువు ఉంటుంది. కావాల్సిన ప్రదేశానికి తీసుకెళే ్లందుకు వీలుగా ఉంటుంది. రెండు చక్రాలు ఇరుసు ద్వారా కలిసి ఉంటాయి. ఇరుసు మీద నాలుగు డ్రమ్ములు బిగించి ఉంటాయి. ప్రతి డ్రమ్ము 60 సెం.మీ చుట్టుకొలత, 27 సెం.మీ పొడవు కలిగి ఉండి, దానిపై 2 వరుసల్లో 9 మి.మీ వ్యాసం గల రంధ్రాలు, సాళ్ల మధ్య 20 సెం.మీ దూరం ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలంటే రంధ్రాలను మూసేయవచ్చు. కానీ సాళ్ల మధ్య దూరం మాత్రం 20 సెం.మీ ఉంటుంది. ప్రతి డ్రమ్ము పైన విత్తనాలు వేసేందుకు, తీసేందుకు అనుకూలంగా మూత ఉంటుంది. డ్రమ్ సీడర్‌ను ఒక మనిషి సునాయసంగా పొలంలో లాగవచ్చు. డ్రమ్ సీడర్ ధర రూ.4,400 కాగా ప్రభుత్వం రైతులకు రూ.2,200కే అందజేస్తోంది. ఉపయోగాలు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుకు నార్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నాటు వేసే పని లేదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో వరి సాగుకు ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే డ్రమ్ సీడర్ పద్ధతిలో అయితే ఎకరానికి 8 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఒక నిర్ధిష్ట దూరంలో డ్రమ్‌సీడర్ ద్వారా విత్తనం వేయవచ్చు. కాబట్టి గాలి, వెలుతురు బాగా ప్రసరించి చీడపీడల సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా సుడిదోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు వరిసాళ్ల మధ్య కోనో వీడర్(కలుపు తీసే యంత్రం) నడపవచ్చు. దీని ద్వారా కలుపును సేంద్రియ ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతర కృషి వల్ల పిలకల శాతం బాగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. వర్షాలు కురవడం ఆలస్యమైనా, కాలువల ద్వారా నీటి విడుదల సకాలంలో జరగకపోయినా, ముదురు నార్లు నాటిన వరిలో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో డ్రమ్‌సీడర్ పద్ధతిని అనుసరించవచ్చు. నాటు వేసిన వరి కన్నా 8 నుంచి 10 రోజులు ముందే డ్రమ్ సీడర్‌తో వేసిన వరి కోతకు వస్తుంది. విత్తనాల తయారీ.. శుద్ధి కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునే వడ్లను ఒక గోనె సంచిలో నింపి వదులుగా ఉండేలా మూట కట్టి 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నానిన వడ్లను బయటకు తీసి సన్న రకాలైతే 12 గంటలు.. లావు రకాలైతే 24 గంటలపాటు మండె కట్టాలి. మండె కట్టే విధానం ఇక్కడ చాలా కీలకమైనది. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుకు.. వరి విత్తనాల ముక్కు పగిలి తెల్ల పూత కొద్దిగా వస్తే సరిపోతుంది. మొలక ఎక్కువ వస్తే డ్రమ్ సీడర్లో విత్తనాలు పోసినప్పుడు రంద్రాల ద్వారా కిందకు రాలవు. తెల్ల పూత రంధ్రాల్లో చిక్కుకుని ఇరిగిపోతుంది. దీనివల్ల విత్తనాలు మొలకెత్తవు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పొలం తయారీ పొలానికి కొద్దిగా నీరు పెట్టి భూమి బాగా గుల్లబారేలా దున్నుకోవాలి. బాగా చివికిన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. విత్తనాలు వే యడానికి 15 రోజుల ముందు పొలాన్ని దమ్ము చేసి ఉంచాలి. ఆ తర్వాత విత్తనాలు వేసే నాలుగు రోజుల ముందు మరోసారి దమ్ము చేసి సమానంగా చదును చేయాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. కాబట్టి మురుగు పోవడానికి తగిన ఏర్పాటు చేయాలి. నీటి వసతిని బట్టి డ్రమ్ సీడర్ ద్వారా వరి నాటుకోవచ్చు. -
విత్తనశుద్ధితో తెగుళ్లు దూరం
రాయికోడ్: రబీలో భాగంగా శనగ పంటలు సాగు చేసే వారు తప్పకుండా విత్తనశుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అభినాష్‌వర్మ రైతులకు సూచించారు. మండలంలోని పాంపాడ్ గ్రామంలో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో శనగ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ద్వారా పంట తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సూచించారు. మందుల వినియోగంలో విధిగా అధికారుల సూచనలు పాటించి పంటను కాపాడుకోవాలన్నారు. రసాయన ఎరువులను అధికంగా వాడితే నష్టం తప్పదని హెచ్చరించారు. అనంతరం రైతులు సాగు చేసిన శనగ పంటలను సందర్శించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఏఈఓ యాదయ్య, స్థానిక నాయకులు హన్మన్నపాటిల్, రైతులు గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
పాల దిగుబడిని పెంచుకోండిలా..!
సాధారణంగా 12 గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటలనుంచి 7 గంటల మధ్య, సాయంత్ర 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం అదనపు ఆహారం అందజేయాలి. లేకపోతే పశువు మేత సరిగ్గా తినక పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పశువులకందించే దాణలో పిండి పదార్థాలు అధికంగా, మాంసకృతులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లూసర్న్వంటి పశుగ్రాసం సాగు చేపట్టి పశువులకు అందజేస్తే పాల దిగుబడి అధికంగా ఉంటుంది. వరికోతలు పూర్తవగానే మిగిలిఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులకు ఎదకు వచ్చి పొర్లుతాయి. పశువులను కనీసం రెండుమూడు సార్లైన ముందుభాగం, వెనుక భాగం పరిశీలించాలి. వెనుక భాగం పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల వ్యవధిలో పశువుల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలి. పాల ఉత్పత్తిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచుకురవడం వల్ల పశువులకు న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. పశువులను, దూడలను ఆరుబయట కట్టేయకూడదు. ఈదురు గాలులు నివారించడానికి వాతవరణంలో ఉష్ణాగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పశువుల పాకలకు పరదాలు కట్టాలి. లేగదూడల వెంట్రుకలు చలికాలంలో కత్తిరించకూడదు. రోజూ రెండుసార్లు పశువుల పాకలను శుభ్రం చేయాలి. సోడా, కార్బోనెట్, 10 శాతం బ్లీచింగ్ పౌడరు వంటి క్రిమి సంహారక మందులు వాడాలి. నీటి తొట్టెలను వారానికోసారి శుభ్రం చేయాలి. వాటికి తరచూ సున్నం వేస్తుండటం మరవద్దు. దీంతో పశువులకు కావాల్సినంత కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. పశువులకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో రెండుమూడు సార్లు నీరు అందజేయాలి. తాగేందుకు నీరు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితకడానికి రెండు గంటల ముందు, పితికిన తర్వాత మరో గంటకు పశువులకు దాణ ఇవ్వాలి. -
పాటిస్తే మెళకువలు..పత్తిలో లాభాలు
మద్నూర్: జిల్లాలో ఈ ఏడాది యాభై వేల ఎకరాలలో పత్తి సాగైంది. ప్రస్తుతం చేతికందే దశలో ఉంది. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాని కి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వ మద్ద తు ధర రూ.4050 ప్రకటించినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడం రైతులను ఆవేదన కలిగిస్తోంది. పత్తిలో తేమశాతం 8 ఉంటే ఈ ధర లభిస్తుంది. ఆపైన వచ్చిన ఒక శాతానికి రూ.40.50 పైసల చొప్పున కోత విధిస్తోంది. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తోంది. 12 శాతంలోపు వచ్చిన పత్తిని మాత్రమే వారు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ గా వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకు ని రూ. 200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నా రు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎం డ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయెద్దు. ఆ సమయంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలుస్తాయి. పొద్దున, సాయత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మాత్రమే తీయా లి. పత్తిని తీసేటప్పుడు అది పొడిగా ఉండాలి. వర్షం పడిన తర్వాత తీయొద్దు. పంటకు దిగుబడి బాగా రావాలంటే పత్తి తీయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు (8886613150) సూచిస్తున్నారు. జాగ్రత్తలు పంట కాలంలో కనీసం మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళీ, ఎరువులు,పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరుచేయాలి. దీన్ని మంచి పత్తిలో కలప కూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది.కాబట్టి దాన్ని ప్రత్కేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి.పత్తి పూర్తిగా ఆరిన తర్వాతనే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఆరిన తర్వాతే తీయాలి వర్షానికి తడిసిన, మంచుబిందువులతో చల్లబడిని పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి. గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్దారణకు వచ్చిన తర్వాత తీయాలి. ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు నీరు లేని సమయంలో తీయాలి. ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి. తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరే(సంచు)ల్లో నింపాలి. కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు. తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకే విధంగా ఉండాలి. ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. -
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
లక్సెట్టిపేట/జైపూర్ : ప్రస్తుత తరుణంలో వ్యవసాయం రైతులకు భారంగా మారుతోంది. పంటల సాగుకు పెట్టుబడిని తగ్గించుకుని ఉన్న వనరులతో పంటలు సాగు చేస్తే నష్టాలను అధిగమించి లాభాలు సాధించవచ్చని లక్సెట్టిపేట, జైపూర్ మండలాల వ్యవసాయాధికారులు ప్రభాకర్, సుధాకర్ వివరించారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. పాత పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే ఖరీఫ్ వరి కోసిన తర్వాత పొలాన్ని రెండుసార్లు దుక్కిదున్ని నీటిని బాగా పట్టించాల్సి వచ్చేది. తేమ తగ్గిన తర్వాత మక్కలు వేయాల్సి వచ్చేది. ఇదంతా జరగడానికి సుమారు 25 రోజుల సమయం వృథా అయ్యేది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే వరి కోసిన తర్వాత దున్నకుండానే ఒకసారి నీళ్లు పట్టించి ఆరిన వెంటనే మక్కలు వేస్తే చాలు మొలకెత్తుతాయి. ఐదు రోజుల్లో మొలకెత్తి 60 రోజుల్లో అధిక దిగుబడితో పంట చేతికొస్తుంది. జీరోటిల్లేజ్ సాగు ద్వారా లాభాలు వరి పంట కోసిన తర్వాత పొలం దున్నకుండానే మొక్కజొన్న విత్తడాన్ని జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు. నాణ్యమైన సంకర జాతి విత్తనాన్ని ఎంచుకోవాలి. దుక్కి దున్నాల్సిన పని లేకుండా సాగు చేయవచ్చు. దీని వల్ల ఎకరానికి సుమారు రూ.2వేల వరకు ఖర్చు తగ్గుతుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో దున్నడం, బోదెలు చేయడం ఉండదు. దీంతో రైతుకు ఒక ఎకరానికి రూ.1500-2000 వరకు ఖర్చు ఆదా అవుతుంది. నీటిని, పంట కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు సరిపడా సాగు నీటితో ఒకటిన్నర నుంచి రెండెకరాల మొక్కజొన్న పండించవచ్చు. వరి తర్వాత మొక్కజొన్న సాగు చేయడం వల్ల పంట మార్పిడితోపాటు చీడపీడల సమస్య తగ్గుతుంది. బయంత్ర పరికరాలతో దుక్కి చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడితోపాటు నాణ్యత గల మొక్కజొన్న పంట చేతికి వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తడానికి వీలుగా ఖరీఫ్ వరిని కింది వరకు నేలకు దగ్గరగా కోయాలి. వరి కోసిన తర్వాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి నీటి తడి ఇచ్చి మొక్కజొన్న విత్తుకోవాలి. తాడును ఉపయోగించి వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. వరుసలను తూర్పు పడమరలుగా విత్తుకోవాలి. సస్యరక్షణ వరి మాగాణిల్లో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు విత్తనం విత్తిన 48గంటల్లోపు ఎకరాకు కిలో అట్రాజిన్ 50శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్యాట్ డైక్లోరైడ్ ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తేముందు పిచికారీ చేయాలి. అట్రాజిన్ మందు కలుపు రాకుండా నివారిస్తుంది. ప్యారాక్యాట్ డైక్లోరైడ్ కొయ్యకాల్లని మొలకెత్తకుండా చేస్తుంది. విత్తనం మొలకెత్తిన 25 నుంచి 30 రోజల వ్యవధిలో వెడల్పు ఆకు గడ్డి జాతి మొక్కల నివారణకు 2, 4డీ సోడియం సాల్ట్ 500 గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. -
ఈ సమయం.. అగ్గికి అనుకూలం
ముందు జాగ్రత్త చర్యలు నత్రజని ఎరువును తక్కువగా వేయడం, పొటాష్ ఎరువును ప్రతిసారీ ఎకరాకు 15 కేజీల చొప్పున వినియోగించడం, పొలం గట్లపై కలుపు మొక్కలు, గరిక తొలగించడం, పొట్ట దశలో 50 శాతం, వెన్నుదశలో ఒకసారి ట్రైసైక్లోజోల్ పొడి మందు 100 గ్రాములను 100 లీటర్ల నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. అగ్గి తెగులు వ్యాప్తి ఇలా.. వాతావరణం చల్లగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వరి ఆకుల అంచు వెంట ముదురు గోధమ రంగులో నూలుకండె ఆకారంలో, ఆకుల మధ్యలో బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అగ్గి తెగులు అంటారు. మంచు కురవడం, వర్షపు చిరు జల్లులు పడటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వెన్ను మొదటి భాగంలో కణుపుల వద్ద అగ్గి తెగులు వస్తే వెన్ను విరిగి కిందకు వాలిపోతాయి. గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తాలు గింజలు ఏర్పడతాయి. సుడిదోమ, దోమపోటు గోధుమ రంగులో ఉన్న దోమలు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బులపై ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు, మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా సుడులు సుడులుగా ఎండిపోతాయి. చిన్న చిన్న రెక్కలు గల పురుగులు పూతదశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిపురుగులు ప్రత్యేక కాళ్ల నిర్మాణం వల్ల అవి ఒక మూలగా కదులుతాయి. అన్ని పురుగులు మూలగా తిరగడం వల్ల పైరు సుడులుగా చనిపోతుంది. అందుల్లే వీటిని సుడిదోమ అని అంటారు. పైరు వెన్ను దశలో 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పొలంలో నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ చొప్పున తూర్పు, పడమర దిశలో కాలిబాటలు వదలాలి. పొలంలో నీటి మట్టం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. చివరి దఫా ఎరువుల మోతాదుతో పాటు కార్భోప్యూరాన్ 3జీ పది కేజీలు లేక కార్భాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కేజీల గుళికలు వాడాలి. కనీస ప్రమాద స్థాయిని గమనించిన వెంటనే క్రిమిసంహారక మందులైన ఇంనోఫెన్ప్రాజె 2.0 మి.లీ లేదా బూప్రోఫెజిమ్ 2 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లే దా డైనటోఫ్యూరాన్ 0.5 గ్రాములను లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్లకు తగిలేలా వృత్తకారంగా పొలం గట్ల నుంచి లోపలికి పిచికారీ చేస్తే దోమపోటు బారి నుంచి వరిపైరును సమర్థవంతంగా నివారించవచ్చు. నివారణ మార్గాలు అగ్గి తెగులు ఆశించిన వెంటనే ఐసోప్రొథియోలేన్ 1.5 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకు ఎండు తెగులు, వెన్ను తీసిన పొలాల్లో మానిపండు తెగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకు ఎండు తెగులు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల అంచుల వద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కిందకు ఎండిపోతాయి. దీనికి ఎటువంటి నివారణ మందులు లేవు. నత్రజని ఎరువులను ఒకే సారి కాకుండా మూడు నుంచి నాలుగు దఫాలుగా వేయాలి. తెగులు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు వేయడం ఆపాలి. పొలంలో నీటిని తీసివేయాలి. పూతదశలో అండాశయం శిలీంద్రం వల్ల పసుపు పచ్చ ముద్దగా, ఆకుపచ్చ రంగులోకి మారి చివరకు నల్లబడి చిన్న చిన్న ఉండలుగా తయారవుతాయి. కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో పిచికారీ చేసుకోవాలి. -
సేద్యమేవ జయతే!
మూడెకరాల్లో పంటలతో యేటా రూ.2.5 లక్షల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చౌదర్పల్లి రైతు రాములు మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాములుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల్లోని కొద్దిపాటి నీటితో ఇంటి అవసరాలకు సరిపోను వరి పండిస్తున్నాడు. మిగతా పొలంలో బిందుసేద్యంతో కూరగాయలు పండిస్తున్నాడు. అక్షర జ్ఞానం లేని రాములు వ్యవసాయాధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తుంటాడు. ఏయే సీజన్లలో ఆయా కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం 5 నుంచి 10 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ.250 వరకు కూలిడబ్బులు ఇస్తుంటాడు. దిగుబడులను సరూర్‌నగర్ రైతు బజారులో విక్రయిస్తుంటాడు. యేటా కూరగాయల విక్రయాలతో రూ.6 లక్షలు వస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు, కూలీల ఖర్చులుపోను రూ. 2.5 లక్షలు మిగులుబాటవుతోందని చెబుతున్నాడు రాములు. రైతు సదస్సులన్నీ రాములు పొలంలోనే.. బిందుసేద్యంతో పలు రకాల కూరగాయలు పండిస్తూ.. రాములు మంచి లాభాలు పొందుతుండడంతో మిగతా గ్రామాల రైతులకు సూచనలు, సలహాలు తెలియజేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తరచూ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ‘మేం చదువుకున్నవాళ్లమైనా నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని రాములుతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏడాది క్రితం అప్పటి ఉద్యాన శాఖ కమిషనర్ రాణీకుముదిని.. రాములు కూరగాయల పంటలు చూసి అభినందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారులు కనకలక్ష్మి, యాదగిరి, వ్యవసాయాధికారులు కవిత, సందీప్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు రాములును ఆదర్శంగా తీసుకుని కూరగాయలు సాగు చేసుకోవాలని మిగతా గ్రామాల రైతులకు సూచిస్తున్నారు. ఇటీవల రాములు వ్యవసాయ పొలంలో సదస్సుకు వచ్చిన మైక్రో ఇరిగేషన్ ఏపీడీ హరిప్రసాద్‌రెడ్డి ఆయనను అభినందించారు. నిత్యం 12 గంటలు శ్రమిస్తూ.. టమాటా, చిక్కుడు, బెండ, దోస, కీర, దొండ, కాకర, వంగ, బీర, మిర్చి, పొట్లకాయ, దోస, మునగ పంటలను రాములు సాగు చేస్తున్నాడు. నిత్యం 12 గంటల పాటు శ్రమించడంతో పాటు రోజూ సరూర్‌నగర్ రైతు బజారుకు వెళ్లి కూరగాయల విక్రయించడం, మళ్లీ మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటాడు. -
వేరుశనగలో సస్యరక్షణ
ఆకు ముడత తామర పురుగులు, పచ్చ దోమలు ఆకుల కింది భాగన రసం పీల్చడం వల్ల ఆకులు ముడ్చుకుని మొక్కలు గిడస బారిపోతాయి. ఆకుల అడుగు భాగన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తామర పురుగు నివారణకు క్లోరో ఫిరిపాస్ 400 మిల్లీలీటర్లు ఒక లీటర్ వేపనూనెతో కలిసి 200 లీటర్లతో ఎకరానికి పిచికారి చేయాలి. పచ్చదోమ నివారణ కోసం డైమిదేమెట్ 400 మిల్లీలీటర్లు లేదా 300గ్రాముల ఎసిఫేట్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎర్ర గొంగళి పురుగు లార్వ దశలో ఉండే పురుగులు ఆకుల్లో పత్రహరితాన్ని తింటాయి. ఎదిగిన పురుగులు ఆకులను తినేసి కొమ్మలను, మొదళ్లను మాత్రమే మిగుల్చుతాయి. వీటి నివారణకు ప్రధానంగా ఆముదం పంటను ఎరగా వేసి నివారించవచ్చు. లేదా డైమిదేమెట్ 400 మిల్లీ లీటర్లు లేదా 300గ్రాములు మోనోక్రోటోపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వేరు పురుగులు ఇసుక నేల ల్లో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగులు నేలపై నివసిస్తూ వేర్లను కొరికి వేయడం వల్ల మొక్కలు నిలువుగానే వాడి, ఎండిపోతాయి. వీటి నివారణకు 3జీ గుళికలను ఎకరానికి 10 కేజీలు చల్లాలి. తిక్క మచ్చ తెగుళ్లు తిక్కమచ్చ తెగుళ్లు వేరుశనగ పంటను 30 రోజుల నుంచి ఆశిస్తున్నాయి.ఆకుపై గుండ్రటి మచ్చలు ఏర్పడి గోధుమ రంగులోకి ఆకు మారుతుంది. దీని నివారణకు ఎకరానికి మ్యాంకోజెబ్ 400గ్రాములు, క్లోరోథలిన్ 400గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుకుళ్లు తెగుళ్లు పల్లిలో వేరుకుళ్లు తెగుళ్లు 30రోజుల నుంచి ఆశిస్తుంది. వేరుకుళ్లు తెగుళ్లకు వర్షభావ పరిస్థితులు అనుకూలం. మొదట కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. త ర్వాత నలుపు రంగులోకి మారి వేరు కుళ్లిపోతుంది. నివారణకు ట్రైకోడర్మా పౌడర్‌ను చల్లాలి. లేదా మ్యాంకోజబ్ను 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి మొదళ్ల పై చల్లాలి. సకాలంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు. -
మురి‘పాలు’ కావాలంటే..!
చలికాలంలో పశువులపై దృష్టి సారించాలి యాజమాన్య పద్ధతులు పాటించాలి సమీకృత దాణా విడిగా ఇవ్వాలి శరీర ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక ఆహారం ఇవ్వాలి సాధారణంగా 12గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. కానీ చలికాలంలో పగటిపూట సమయం తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేకపోతే మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రెండు మూడుసార్లు ముందూ, వెనకా పరిశీలించాలి. పశువు వెనక భాగంలో పరిశీలిస్తే, మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతు వాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పశువులు, దూడలను ఆరుబయటే కట్టేయకూడదు. ఈదురుగాలిని నిరోధించడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించకూడదు. {పతి రోజు పశువులశాలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడా కార్బోనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచూ వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగేందుకు నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తర్వాత దాణా ఇవ్వాలి. -
వేరుశనగ కు తరుణమిదే..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తారు. దర్శి, మార్కాపురం ఏరియాలో కూడా కొంత సాగు చేస్తుంటారు. ట్యాగ్-24, ధరణి రకం విత్తనాలు అనుకూలం. వీటినే జిల్లాల్లో రైతులు ఉపయోగిస్తున్నారు. ఇది నూనెగింజ పంటల్లో ప్రధానమైనది. డిసెంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రబీలో శనగ సాగుకు ఇదే అదును. ప్రస్తుతం శనగ సాగు చేయాలనుకునే రైతులకు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన వాతావరణ పరిస్థితికి అనువైన విత్తనాలు ఎంచుకుని, తగినంత మోతాదులో వేస్తే అధిగ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. అనుకూలమైన నేలలు ఇసుకతో కూడిన నేలలు, చెలక, ఎర్రగరప నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య గల నేలలు ఉత్తమమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు. నేల తయారీ లోతుగా దుక్కి దున్నడం ద్వారా పంటను నష్టపరిచే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేల మొత్తాన్ని దుక్కి దున్ని చదును చేయాలి. విత్తనాలు అరకలు లేదా ట్రాక్టర్ల సహాయంతో వేయవచ్చు. ట్రాక్టర్ యంత్రంతో వేయడం వల్ల కూలీ ఖర్చు తగ్గుతుంది. విత్తన మోతాదును మన ఎంపిక ప్రకారం వేసుకోవచ్చు. అంటే పలుచగా లేదా చిక్కగా విత్తనం విత్తుకోవచ్చు. విత్తన మోతాదు గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరానికి 60 నుంచి 70 కిలోల విత్తనం సరిపోతుంది. మన జిల్లాలో నేలలకు ట్యాగ్-24, ధరణి రకాలను ఉపయోగిస్తుంటారు. నీటి పారుదల కింద సాగు చేసే వారు సాళ్ల మధ్య 22.5 సెంటీమీటర్లు, విత్తనాల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్లు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలు, వేరు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి. నిద్రావస్థను తొలగించడానికి.. నిద్రావస్థలో ఉన్న విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇథిరికలన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి అందులో 12 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎరువుల వినియోగం భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. నత్రజని ఎకరాకు(యూరియా రూపంలో) 12 కిలోలు, భాస్వరం(సింగిల్ సూపర్‌ఫాస్పేట్ రూపంలో) 16 కిలోలు, జిప్సం 200 కిలోలు వినియోగించాలి. నీటి పారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సం పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి కలుపు తీయాలి. అనంతరం మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపు నివారణ కలుపు మొలకెత్తక ముందే నశింపజేసే కలుపు నాశనులను వినియోగించాలి. పెండి మిథాలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా భ్యూటోక్లోరా మందు 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు లేక మూడు రోజుల వ్యవధిలో నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల్లోగా గొర్రుతో అంతర కృషి చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు. అలా చేస్తే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన 21 నుంచి 25 రోజులలోపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిల్ 300 మిల్లీలీటర ్లను 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి నాశనం చేయాలి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో సాగు చేసిన వేరుశనగకు 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. ఊడలు దిగే దశ నుంచి కాండం ఊరే దశ వరకు నీరు సక్రమంగా తగిన మోతాదులో పెట్టుకోవాలి. -
భూమికి బలం.. పోషకాల యాజమాన్యం
జొన్న పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి. రబీలో సాగు చేసే జొన్నకు ఎకరానికి 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా అంటే విత్తేటప్పుడు , మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు , పొటాష్ పూర్తి మోతాదును విత్తే సమయంలో వేయాలి. మొక్కజొన్న నీటి పారుదల కింద సాగు చేసి మొక్కజొన్నకు ఎకరానికి 80-100 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజనిని 4 సమ దఫాలుగా విభజించి వేయాలి. మొదటి దఫాను విత్తేటప్పుడు, రెండవ దఫాను విత్తిన 25-30 రోజులకు, మూడవ దఫాను 45-50 రోజులకు, నాలుగవ దఫాను 60-65 రోజుల మధ్య వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలోనే వేయాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును రెండు దఫాలుగా వేసుకోవాలి. సగభాగం విత్తే సమయంలోను, మిగిలిన సగభాగాన్ని విత్తిన నెలరోజులకు వేయాలి. భూమిలో జింక్ లోపముంటే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటును మూడు పంటలకు ఒకసారి వేయాలి. అదే జింకు లోప లక్షణాలు పంటపై కనిపించినట్లయితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని(లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ ) వారానికి ఒకసారి చొప్పున 2,3 సార్లు పంటపై పిచికారి చేయాలి. శనగ శనగ సాగులో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంథకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. పెసర పెసర సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసి దుక్కిలో బాగా కలియదున్నాలి. తర్వాత విత్తనం వేసే ముందు దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. వరి మాగాణుల్లో పెసర సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మినుము మినుము సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి గొల్లతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు. పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు సాగులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును విత్తటానికి 2-3 వారాల ముందు వేసుకోవాలి నీటి పారుదల కింద హైబ్రిడ్లను సాగు చేసినట్లయితే ఎకరానికి నల్లరేగడి నేలల్లో 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా విభజించి వేయాలి. వేయాల్సిన నత్రజని మోతాదులో సగభాగాన్ని మొదటి దఫా గా విత్తేటప్పుడు, నాలుగో వంతును రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో.. మిగి లిన నాలుగో వంతును మూడవ దఫాగా విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరపు, పొటాష్ పూర్తి మోతాదులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. సూక్ష్మ పోషకాలలో పొద్దుతిరుగుడు సాగుకు బొరాన్ అత్యంత ఆవశ్యకమైనది. పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకొన్నప్పుడు 0.2 శాతం బొరాక్స్( లీటరు నీటికి 2 గ్రా బొరాక్స్) మందు ద్రావణాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే గింజలు ఎక్కువగా తయారై, దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లేదా ఆఖరి దుక్కలో ఎకరానికి 8 కిలోల బొరెక్ ఆమ్లాన్ని వేసుకోవాలి. గంధకం లోపించిన నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే గింజలో నూనె శాతం పెరగడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు( ఎకరానికి 55 కిలోల జిప్సం) -
ధాన్యం నిల్వ చేయండిలా..
మందమర్రి రూరల్ : ఖరీఫ్ ముగిసింది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుంది. ఇంటికొచ్చిన ధాన్యాన్ని ఎలా భద్ర పర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ధాన్యాన్ని పండించడం ఒకత్తై దానిని నిల్వ చేయడం మరో ఎత్తు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పండించిన పంటలో 10 శాతం నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి సుజాత అంటున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ధ్యానం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలు, కూలీలు ఇలా సుమారు రెండేళ్ల వరకైనా ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో నాణ్యత తగ్గుతుంది. ధాన్యం రంగు, రుచిలో తేడా వస్తుంది. ముఖ్యంగా వరి కోత సమయంలో గింజలో 20 శాతం తేమ ఉంటుంది. గింజలు ఆరిన మూడు నాలుగు రోజుల తర్వాత 3 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే బూజు పట్టే అవకాశం ఉంది. నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు కూడా ధాన్యానికి కీటకాలు ఆశించి నష్ట పరుస్తాయి. ఎలుకలు తినడమే కాకుండావాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు 3 రకాల కీటకాలు నష్టం కలిగిస్తాయి. అవేంటంటే.. వడ్ల చిలుక ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే చెడు వాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపుగా లేదా విడిగా గుడ్లు పెడుతుంది. గుడ్డు పగిలి లార్వా (గొంగళి పురుగు) గింజలోపలికి తొలచుకొనిపోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరకముందే పైపొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తర్వాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వ డ్ల మూటల మీద, గిడ్డంగి గోడల మీద కనిపిస్తుంది. ముక్క పురుగు ముక్క పురుగు పంట కోయడానికి ముందే నష్టం కల్గించడం ప్రారంభిస్తుంది. బియ్యంలో తెల్లని పరుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ కీటకాలే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి లోపల గుడ్ల పెట్టి తన నోటి నుంచి వెలుబడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా, ప్రౌఢ దశలోని ముక్క పురుగు గింజలోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. ప్రౌఢ దశలోని కీటకం 3 మి.మీ పొడువు ఉంటుంది. ఇది ఎగరదు. నుసి పురుగు దీనిని పుచ్చపురుగు లేదా పెంకు పరుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నగా 3 మి.మీ. పొడవుంటుంది. ఫౌడ కీటకం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, తర్వాత గింజపై పొరను ఆతర్వాత లోపలి బియ్యపు గింజను తింటు తీవ్ర నష్టం కలిగిస్తుంది. లార్వా దశలో గింజ ముక్కలను తింటుంది. తక్కువ ధాన్యం నిల్వ ఉంచే పద్ధతులు తక్కువ ధాన్యాన్ని నిల్వ ఉంచాల్సి వస్తే అంటే ఒక్క సంవత్సరం 50 బస్తాలు నిల్వ ఉంచినప్పుడు వెదురు గాదెలు, సిమెంట్ గాదెలు, లోహపు గాదెలు పుసా బిన్స్‌ల ద్వారా నిల్వ ఉంచుకోవచ్చు. వెదురు గాదెలు ఈ గాదెలు వెదురుతో రెండు పొరల గోడలతో అల్లుతారు. రెండు గోడల మధ్యలో పాలిథిన్ కవర్ పెడతారు. దీనివల్ల తేమ, వర్షపు నీరులోనికి పోకుండా ఉంటుంది. బయట పేడతో అలుకుతారు. ఇది ఖర్చుతక్కువ. కానీ లోపాలు ఉంటాయి. లోహపు గాదెలు ఇనుము లేదా అల్యూమినియంతో 18 నుంచి 20 గెజ్ రేకుతో తయారు చేస్తారు. రెండు క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంచాలంటే దీని తయారీకి సుమారుగా రూ.7000 వరకు ఖర్చవుతుంది. రూ.40 వేలతో తయారు చేయిస్తే 10 క్వింటాళ్ల ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ గాదెల్లోకి నీరు, తేమ, ఎలుకలు, కీటకాలు చేరవు. వర్షపు నీరుకు తడవకుండా నెలమీద కొంత ఎత్తు దిమ్మ కట్టించి దానిపై ఉంచాలి. అంతే కాకుండా ఇటుకలతో కట్టిన నిర్మాణంలో కూడా 500 కిలోల నుంచి 4000ల కిలోల ధాన్యాన్ని దాచి ఉంచవచ్చు. గాదెల్లో నిల్వ చేసిన ధాన్యం కీటకాలు ఆశించకుండా రెండు శాతం వేపగింజల పొడి లేదా పనుపు కొమ్మల పొడి కలపడం మంచిది. 100 కిలోల ధాన్యానికి రెండు కిలొల చొప్పున వేపగింజలు పొడి లేదా పనుపు కొమ్ముల పొడి కలిపి నిల్వ చేస్తే 8 నెలల వరకు కీటకాలు ఆశించవు. కీటకాల నివారణకు ఇథైల్‌డైబ్రోమైడ్ అనే రసాయనం కూడా దొరుకుతుంది. ఇది చిన్న గొట్టంలో ప్యాక్ చేసి అమ్ముతారు. వాయువుకూడా బయటకుపోని కట్టుదిట్టమైన గాదెలలో దీనిని వాడవచ్చు. ఎక్కువ ధాన్యం నిల్వ చేసే పద్ధతులు అమ్మాలనుకునే ధాన్యాన్ని రైతులు ఎక్కువ ధర వచ్చే వరకు నిల్వ ఉంచుతారు. పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉంచాల్సి వస్తే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మిస్తే పూర్తి రక్షణ ఉంటుంది. పాత ఇంటిలో అయితే కీటకాలు, తే మ, వర్షపు నీరులోనికి ప్రవేశించకుండా గోడలు, నెల పైకప్పులలో పగుళ్లు , రంధ్రాలు లేకుండా సిమెంట్‌తో పూడ్చి వేయాలి. ఎలుక కన్నాలను గాజు ముక్కలు, సిమెంటు కాంక్రీట్‌తో మూసివేయాలి, పక్షలు రాకుండా కిటికీలు, ఇనుప జాలీలు బిగించి దుమ్ముధూళీ లేకుండా శుభ్రం చేయాలి. ధాన్యం నిల్వకు కొత్త గోనే సంచులు ఉపయోగించాలి. ధాన్యం నింపే ముందు గోనె సంచుల మీద లోపల మలథాయన్ లేదా ఎండోసల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన మరునాడు వాటిని ఎండలో పెట్టాలి. ఏ విధమైన పురుగు మందు వడ్లకు కలుపరాదు. ఇది చట్టరీత్యానేరం. ఎలుకల నివారణకు చర్యలు గిడ్డంగి చుట్టూ పక్కల చెత్త లేకుండా ప్రతీరోజు తుడిచి శుభ్రం చేయాలి. ఎలుకలు గిడ్డంగిలోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలు ఉపయోగించి ఎలుకలను చంపివేయాలి. ఒకే రకం బోనును ఎప్పుడు వాడకూడదు. గిడ్డంగి తలుపుల కింద భాగాలకు జింకు రేకులు అమర్చాలి. తూములు, రంధ్రాలకు వైర్‌మెష్ మూతలు అమర్చాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. -
బోదె పద్ధతిలో మొక్కజొన్న
ట్రాఫిక ల్టర్ సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు. ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది. ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు. బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది. ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్ సాగు చేసుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది. పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ. =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది -
చామంతులు.. ప్రగతి కాంతులు!
హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్(9705524169), శ్రీనివాస్‌లు మండల పరిధిలోని కొడిప్యాక శివారులో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. సాగుకు యోగ్యం కావనుకున్న నేలలో చామంతి సాగు చేపట్టారు. మొత్తం భూమిలో చామంతికి సంబంధించిన మ్యారీగోల్డ్తోపాటు వివిధ రంగుల చామంతి పూలను సాగు చేస్తూ హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడు నెలలకు కోతకు వచ్చే ఈ పంటను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తోట పనులను చూసుకునేందుకు నాయుడు అనే వ్యక్తిని నియమించారు. తరచూ వచ్చిపోతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అతనికి వివరిస్తుంటారు. ఎకరా భూమిలో సుమారు 10నుంచి 12వేల మొక్కలు సాగు చేయవచ్చన్నారు. ఒక చామంతి మొక్కను సీజన్‌ను బట్టి రూ.4 నుంచి రూ.12కు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడు నెలల పాటు మొక్కను సంరక్షించేందుకు సుమారు రూ.40నుంచి రూ.50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూడు నెలల తర్వాత ఒక మొక్క నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు పువ్వులు చేతికి వస్తాయని చెప్పారు. కిలో పూలకు మార్కెట్లో స్థిరంగా రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతుందని తెలిపారు. దీపావళి, కార్తీకపౌర్ణిమ, బతుకమ్మ పండుగ తదితర సీజన్లలో వీటి ధర కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలుకుతుందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నందున కూలీల అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం చామంతి సాగు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక రైతులు కూడా తమ తోటను చూసేందుకు వస్తున్నారని తెలిపారు. సలహాల కోసం సంప్రదించాలన్నారు. -
మిరపకు వైరస్
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన మిరప తోటలకు వైరస్ తెగుళ్లు ఆశిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 25 వేల హెక్టార్లలో మిర్చిని సాగు చేశారు. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మిరప తోటలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. జిల్లాలో సాగు చేసిన మిర్చిని తెగుళ్లు ఆశించినట్లు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. మిర్చికి ఆశించిన తెగుళ్ల నివారణ చర్యలను డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (8332951138) వివరించారు. ఆకుముడత తెగులు (జెమిని వైరస్) తెల్లదోమ ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించి మొక్కలు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి. కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. నల్లని మసి లేదా బూజు ఆకులు, కాయలపై కనిపిస్తాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. మొవ్వకుళ్లు తెగులు (పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్) ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్లు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వ లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణ చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నైక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. నివారణ చర్యలు గట్లమీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2-3 వరుసల జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. విత్తనం ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోపాస్పేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగుళ్లను వ్యాప్తిచేసే రసంపీల్చు పురుగులను సమర్థవంత ంగా నిర్మూలించాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. గ్రీజు లేదా ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొని కొంతవరకు వాటిని నివారించవచ్చు. పేనుబంక నివారణకు 2 గ్రాముల ఎసిఫేట్, లేదా 2 మి.లీ మిథైల్ డెమటాన్ లేదా 0.25 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేట్ 2 గ్రాములు లేదా 2 మి.లీ ప్రాపోనిల్ లేదా 0.25 మి.లీ స్పైనోసాడ్ లేదా 2 గ్రాముల డెపైన్థియోరాన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా ఎకరానికి 300 గ్రాముల ఎసిఫేట్ లేదా ట్రైజోఫాస్ 250 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 60 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 40 గ్రాముల మందులను మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. -
జాతి కొద్ది పాలు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పాడిపరిశ్రమ పెట్టుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే డెయిరీ పెట్టే రైతులు ఎలాంటి పశువులు కొనాలి.. ఏం చూడాలి..ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వామా సహాయ సంచాలకులు మధుసూదనరావు వివరిస్తున్నారు. కృత్రిమ పాల దిగుబడితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాల విక్రయం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చు. ఇందుకోసం ఆరోగ్యవంతమైన పశువులను ఎంచుకోవాలి. ‘పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు’ అన్నారు. మేలుజాతి పశువులతోనే మంచి పాల దిగుబడి వస్తుంది. తద్వారా పాడి పరిశ్రమ లాభసాటిగా సాగుతుంది. కొనే ముందు జాగ్రత్తలివి.. పశువును కొనుగోలు చేసే ముం దు శరీర లక్షణాలు, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి వీలైనంత వరకూ ఏ ప్రాంతంలో డెయిరీఫాం పెట్టాలనుకుంటున్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెయిరీఫారంలో అమ్మకానికి ఉంటే అట్టి పాడి పశువులను కొనడం మంచిది. ఎందుకనగా, ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, కేరళ నుంచి తెచ్చిన పాడిపశువులు మంచివే. కానీ ఆ పశువులు అక్కడి మేతకు అలవాటు పడి ఉంటాయి. వాటికి అనుగుణంగా దాణా, నిర్వహణ లేకుంటే దూడలు చనిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోతాయి. కొన్ని రోజుల వరకు అక్కడ అలవాటు పడిన మేతతోపాటు మనకు అందుబాటులో ఉన్న దాణా కూడా అందించాలి. ఇవి గమనించాలి దూర ప్రాంతాల పశువలను కొనే ముందు వాటి, జాతి రికార్డులు చూడడం మంచిది పాడిపశువులు నిండుగా చురుకగా ఉండాలి {తికోణాకారంలో ఉండి, చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి మెడ పొట్టిగా, డొక్కులు నిండుగా పొదుగు విస్తరించి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. నాలుగు చనుకట్లు సమానంగా ఉండాలి, కాళ్లు , కాలిగిట్టలు ధ్రుడంగా కనిపించాలి. బెదరకుండా ఎవరు పాలు పితికినా ఇచ్చేలా ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. కొనుగోలు చేసే ముందు ఎన్నో ఈతనో గమనించి 4 ఈతల లోపు పశువులే కొనాలి. పాడిపశువు కొనాలనుకుంటే రెండు మూడురోజులు దగ్గర ఉండి పాల ఉ త్పత్తిని రెండుపూటల గమనించాలి. ముందు నుంచే గడ్డి పెంచుకోవాలి డెయిరీ ఫాం పెట్టే ముం దు 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం పెంపకం చేపట్టాలి. తృణజాతి, గడ్డిజాతి గ్రాసాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే పశువులు తెచ్చుకోవాలి. సంకరజాతి ఆవు రోజు కు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ముర్ర జాతి గేదె అయితే 8 నుం చి 10 లీటర్ల పాలిస్తాయి. ఈనిన గేదె, ఆవు దూడ తో కొనడం మంచిది. పశువు కొనేందుకు వెళ్లినప్పుడు ఆ పాడిపశువు నిర్వహణ ఎలా ఉంది అనేది గమనించాలి. అదే పద్ధతి కొనసాగించడం పాల ఉత్పత్తి నిలకడగా ఉండడానికి దోహద పడుతుంది. వాహనంలో తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలివి.. దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చేటప్పుడు రవాణా సమయంలో వాహనాన్ని ఆపి, పశువులను దించి కొంత దూరం నడిపించాలి నీరు, దాణా పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల కాళ్ల మధ్య వాహనంలో వరిగడ్డి మందంగా పరిచి వాహనంలోపలి అంచులకు గడ్డితో నింపిన సంచులను వేలాడదీయాలి. {పయాణంలో రాపిడివల్ల గాయాలు కాకుండా చూడాలి. పశువుల మధ్యలో వెదురుకర్రలు కట్టి తలభాగంపైన ఉండేలా చూడాలి. వేసవిలో అయితే రాత్రి ప్రయాణం చేయ డం మంచిది.రవాణా బీమా చేయించాలి. మంచిపాడి పశువు కొనుగోలు ఎంతముఖ్యమో కొన్న పశువును క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా అంతే ముఖ్యం. పాడిపశువుల కొనుగోలు, రవాణాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువు, డెయిరీఫాంలో కాసుల కురిపించే కనక మహాలక్ష్మీ కాగలదనడం నిర్వివాదాంశం. -
‘పాడిపై దృష్టి సారించాలి’
నందిపేట : సహకార సంఘాలు పాడిపై దృష్టి సారించి, లాభాలు ఆర్జించాలని జిల్లా సహకార అధికారి శ్రీహరి సూచించారు. గురువారం డొంకేశ్వర్ సొసైటీలో 61వ జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు బాగుందన్నారు. సొసైటీలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతుల నుంచి పాలను సేకరించడం, వే బ్రిడ్జిలను నెలకొల్పడంలాంటి వ్యాపారాలను చేపట్టాలన్నారు. వారానికోసారి ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజనల్ సహకార అధికారి మనోజ్ కుమార్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డెరైక్టర్లు సాయరెడ్డి, నరేందర్, రాజన్న, భూమేశ్, గంగారెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అనగనగా శనగ..
ఒంగోలు టూటౌన్ : శనగ సాగును రైతులు దాదాపు పక్కన పెట్టేశారు. పంట వేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయడం లేదు. వ్యవసాయ శాఖ విత్తనాలు సరఫరా చేస్తున్నా.. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కారణం.. మూడేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక.. పండించిన శనగలన్నీ గోడౌన్లలో పేరుకుపోవడమే. దాదాపు 17.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో శనగ పంట అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో రబీ సీజన్లో శనగ పంటను ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. 2013-14 రబీలో కూడా 69,465 హెక్టార్లలో శనగ సాగయింది. ప్రస్తుత రబీ సీజన్లో 88,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 2,349 హెక్టార్లకే పరిమితమైంది. అంటే మూడు శాతం మాత్రమే పంట సాగయింది. 62 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా.. 25 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్లో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,500 క్వింటాళ్ల శనగ విత్తనాలనే రైతులు రాయితీపై కొన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నా శనగలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ శాఖ జేడీ జే మురళీకృష్ణ తెలిపారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని జేడీఏ పేర్కొన్నారు. ఎక్కువగా యూకలిప్టస్, మిర్చి, మినుము, అలసంద, మొక్కజొన్న, జొన్న లాంటి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. జిల్లాలో పంటల సాగు 32 శాతం ‘జిల్లాలో ఇప్పటి వరకు మిరప 7,914 హెక్టార్లు, అలసంద 5,356 హెక్టార్లు, జొన్న 5,865 హెక్టార్లు, మొక్కజొన్న 2,145 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు వరి 28,080 హెక్టార్లు, రాగి 42 హెక్టార్లు, వేరుశనగ 74 హెక్టార్లు, నువ్వులు 2,853 హెక్టార్లలో వేశారు. పత్తి రబీలో 1352 హెక్టార్లకు గాను 50 హెక్టార్లు, పొగాకు 36,983 హెక్టార్లలో సాగయింది. ఇంకా ఉల్లి, పసుపు, చెరకు, పెసర, చిరుధాన్యపు పంటలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 1,10,004 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 3,44,321 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 32 శాతం పంటలు వేశారని’ జేడీఏ వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 870 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,648 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, నువ్వుల విత్తనాలు 95 క్వింటాళ్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని స్పష్టం చేశారు. విత్తనాల ధరను బట్టి కిలోకు రూ.25 రాయితీ ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు పదునెక్కాయని, సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని జేడీఏ తెలిపారు. -
బిందుసేద్యంతో సాగునీరు ఆదా
యాచారం: నీటి వనరులున్న ప్రతి రైతు బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసుకోవాలని, తక్కువ నీటి వాడకంతో మూడింతల పంటలు తీయవచ్చని మైక్రో ఇరిగేషన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని చౌదర్పల్లిలో బిందుసేద్యం వాడకంపై కాశమల్ల రాములు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కాల్వల ద్వారా నీటిని పారించడం వంటి పద్ధతుల వల్ల నీరు వృథా కావడంతో పాటు తక్కువ పొలంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే బిందుసేద్యం పద్ధతుల్లో తక్కువ నీటితో మూడింతల పొలంలో పంటలు తీయవచ్చని సూచించారు. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం బిందుసేద్యం పరికరాలు సరఫరా చేసే జైన్ కంపెనీ ప్రతినిధులు ఫ్లోరైడ్ వల్ల బిందు పరికరాల్లో చేరే వ్యర్థాన్ని తొలగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి యాదగిరి, ఇబ్రహీంపట్నం డివిజన్ మైక్రో ఇరిగేషన్ రాజేష్‌కుమార్, సర్పంచ్ గౌర నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ శ్రీధర్‌గౌడ్, రైతులు శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు, బుగ్గరాములు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా సాగితే.. పౌల్ట్రీ లాభమే!
మోమిన్‌పేట: కోళ్ల పెంపకం వైపు గ్రామీణ ప్రాంతాల్లోని యువరైతులు దృష్టి సారిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల్లోనే లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రణాళిక ప్రకారం చేస్తే ఎంత లాభం వస్తుందో ప్రణాళిక లేకుండా పెంపకం చేపడితే అంత నష్టం వస్తుందంటున్నారు. కోడిపిల్లలు, మందులు, దాణాలను పలు కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. కేవలం పెంపకం బాధ్యతలనే రైతులకు అప్పగిస్తున్నాయి. వాటిపై కమీషన్ కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారు.మండల పరిధిలోని చీమల్‌దరి, టేకులపల్లి, ఏన్కతల, మల్‌రెడ్డిగూడెం, ఎన్కేపల్లి, కేసారం, మోమిన్‌పేట, దుర్గంచేర్వు, బూర్గుపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సుమారు 26 మంది యువ రైతులు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తే ఎక్కువ మొత్తంలో పెంపకాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. షెడ్ల నిర్మాణం.. మూడు వేల బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి శాశ్వత షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.5.50 లక్షలు అవసరమవుతాయి. మరో రూ.లక్షతో నీటి తొట్లు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లల కొనుగోలు మూడు వేల కోడి పిల్లల కొనుగోలుకు మార్కెట్‌ను బట్టి రూ.90 వేలు అవసరమవుతాయి. ఒక్కో కోడిపిల్ల సగటున మూడు కిలోల నుంచి నాలుగు కిలోల దాణా తింటుంది. కిలో దాణా రూ.35. కాగా కోడి ఒక్కటి 40 రోజుల్లో రూ.180 నుంచి రూ.190 వరకు దాణా తింటుంది. మందులు, కూలీలు, విద్యుత్ బిల్లులతో పాటు ఒక్కో కోడికి 40 రోజులలో సగటున రూ.210 ఖర్చవుతాయని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లో కిలో కోడి రూ.90కి అమ్ముడు పోతే మంచి లాభాలు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. 40 రోజులు దాటితే దాణా ఖర్చు పెరిగి నష్టాలు వస్తాయని రైతులు తెలిపారు. మార్కెటును దృష్టిలో పెట్టుకొని రైతులు వెంకటేశ్వర, సుగుణ కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. దాణా, మందులు, కోడిపిల్లలు కంపెనీ వారు ఇస్తే కూలీలు, విద్యుత్ బిల్లులను యజమాని భరించాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం బాగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
పట్టుదలే.. పెట్టుబడి!
మండల పరిధిలోని బోక్కస్‌గాంకు చెందిన జార పోతిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సంగారెడ్డి అధికారుల సాయంతో వర్మీ కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నాడు. రసాయన మందులు వద్దు సేంద్రియ ఎరువులే ముద్దు అనే సూత్రాన్ని పాటిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. గ్రామ శివారులో ఇతనికి రెండు చోట్ల 4.26 ఎకరాలు భూమి ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా సాగుతూ ఆదర్శ రైతుగా కూడా గుర్తింపు పొందాడు. వ్యవసాయం పట్ల ఆసక్తితో వానపాములతో ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాడు. జేడీఏతోపాటు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల మన్ననలు పొందుతున్నాడు. ప్రారంభంలో కష్టాలు... వానపాములతో ఎరువుల తయారీ ప్రారంభ దశలో నెలకొన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంగారెడ్డి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఏడాది క్రితం వర్మీయాచర్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు గాలివాన బీభత్సంతో ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ, రూ.1 లక్ష వరకు సొంత డబ్బులు నష్టపోయాడు. అయినా ధైర్యం కోల్పోకుండా మరోసారి షెడ్డును నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు. వర్మీ ఎరువు తయారీ విధానం... వర్మీయాచర్ యూనిట్ విలువ రూ.2 లక్షలు ఉంటుంది. దీనికి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా ఖర్చును రైతు భరించాల్సి ఉంటుంది. షెడ్డు, 5 బెడ్లు, ఎరువుల నిల్వకు గోదాం నిర్మించాలి. 54 అడుగుల పొడవు, 27 అడుగులు వెడల్పు షెడ్డు నిర్మించాలి. అందులో 50 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు, ఒక అడుగు ఎత్తున 5 బెడ్లు నిర్మించాలి. ఒక్కో బెడ్లో 20 కిలోల చొప్పున వానపాములు (ఐదు బెడ్లలో కలిపి క్వింటాలు) వేయాలి. వీటికి ఆహారంగా వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థాలు వేయాలి. మూడు నెలల్లో ఎరువు తయారవుతుంది. వానపాముల ఎరువుల సరఫరా కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంగారెడ్డికి ఆర్డరు ఇచ్చారు. 126 బెడ్లకు సరిపోయేన్ని వానపాములను పంపిణీ చేసేందుకు ఆయన శ్రమిస్తున్నాడు. సొంత పొలంలో వర్మీ ఎరువుల వాడకం... వానపాములతో తయారు చేసిన ఎరువులను సంగారెడ్డి ఇతర రైతులకు సరఫరా చేస్తున్నాడు. సొంత భూమిలో క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ వర్మీకంపోస్టునే వాడుతున్నాడు. ఖరీఫ్‌లో ఒక ఎకరం కావేరి కేవీ 21 రకం వరి సాగు చేశాడు. మరో 20 గుంటల్లో సాయిరాం సన్న రకం వరి వేశాడు. మరి కొంత మొక్కజొన్న, కూరగాయలు సాగు చేపట్టాడు. వీటన్నింటికీ తన షెడ్లో తయారైన ఎరువులనే వినియోగిస్తున్నాడు. దిగుబడులు ఆశాజనకం గా ఉన్నాయి. వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులతో సంగారెడ్డి పండించిన కూరగాయలు, బియ్యాన్నే ఇంట్లో వాడుతున్నాడు. ఇతను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు పలువురు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. వర్మీ ఎరువులు తీసుకెళ్లేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బోక్కస్‌గాంకు వస్తున్నారు. వ ర్మీఎరువును రూ.6 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు తాను రూ.1 లక్ష వరకు లాభం పొందానని చెప్పాడు. వ్యవసాయం ఉన్న మక్కువతో తన రెండో కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డిని అగ్రీకల్చర్ డిప్లొమా చదివించాడు. వర్మీయూనిట్లను ఏర్పా టు చేసుకునే వారికి సలహాలిస్తానని చెప్పారు. -
జీవాలతో జీవానోపాధి
నిజామాబాద్ వ్యవసాయం:నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన బైర సుభాష్ ఉన్నత చదువులు చదివారు. ఉపాధి కోసం హైదరబాద్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అలా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయన ఓ గోట్ డెయిరీని చూశారు. బర్రెలు, ఆవుల డెయిరీల గురించే తెలిసిన ఆయన దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ దేశంలో పాల కోసం మేకలను పెంచుతారు. అయితే మనదేశంలో మేకలు, గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించారు. అలా సుభాష్ స్వదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్ల క్రితం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో సుమారు 25ఎకరాల్లో గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటికి కావల్సిన దాణాను సైతం స్వయంగా సమకూర్చుకుంటున్నారు. పెట్టుబడి గొర్రెల పెంపకం కేంద్రానికి కావల్సిన పెట్టుబడి, ఖర్చులు, ఆదాయం వివరాలను సుభాష్ వివరించారు. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవసరం ఉంటుంది. రూ.3లక్షలు పెడితే.. మిగితా రూ.9లక్షలు బ్యాంకు రుణం ఇస్తుంది. దీనికి రూ.రెండున్నర లక్షలు సబ్సిడీని జాతీయ పశుగణాభివృద్ధి సంస్థ(నేషనల్ లైవ్ స్టాక్మిషన్) ద్వారా వస్తుంది. ఏర్పాటు చేయడానికి స్థలం వంద ఆడ గొర్రెలు, ఐదు మగ గొర్రెలు(పొట్టేళ్లు) కలిపి ఒక యూనిట్ అంటారు. వీటికి మూడు ఎకరాల స్థలం కావాలి. ఇందులో రెండు ఎకరాల్లో గడ్డిజాతి పశుగ్రాసం, ఎకరంలో పప్పుజాతి పశుగ్రాసం పెంచాలి. ఖర్చు పెంపకం కేంద్రం నడపడానికి ఇద్దరు కార్మికులు అవసరం. వీరికి నెలకు రూ.6వేల చొప్పున ఇద్దరికి కలిపి రూ.12వేలు అవుతుంది. పశుగ్రాసం పెంపకం కోసం రూ.6వేలు, ఆరోగ్య సంబంధ టీకాలు, మందుల కోసం రూ.6వేలు, మిశ్రమ దాణా కోసం రూ.15వేలు. మొత్తం ఒక నెలకు రూ.39వేలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 8 నెలలకు మొత్తం రూ.3లక్షల 12వేలు ఖర్చు. లాభాలు పుట్టిన గొర్రె పిల్లలను 8 నెలలు పెంచాలి. ఈ 8 నెలల్లో దాదాపుగా 30 కిలోల బరువు పెరుగుతుంది. ఒక్కో కిలోకు రూ.250 చొప్పున 30కిలోలకు రూ.7500 వస్తాయి. వంద గొర్రెలను పెంచితే అందులో పదిశాతం మృతిచెందినా దాదాపు 81పిల్లలు ఉంటాయి. 8 నెలల తర్వాత అవి 30 కిలోల బరువు అవుతాయి. ఈలెక్కన 81 గొర్రెలకు 2,430 కిలోల మాంసం అవుతుంది. దీన్ని కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తే రూ. 6లక్షల 7వేల 5వందలు వస్తాయి. ఇందులో నుంచి పెట్టుబడి రూ.3లక్షల 12వేలు తీసివేస్తే.. రూ.2లక్షల 95వేల 5వందలు మిగులుతాయి. ఇది 8 నెలల ఆదాయం. -
పత్తిలో బోరాన్ లోపం
పర్చూరు : పత్తి పంటలో బోరాన్ లోపం ఎక్కువగా ఉందని ఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ తెలిపారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, పర్చూరు, నాగులపాలెం, బోడవాడ, ఉప్పుటూరు గ్రామాల్లో పత్తి, పొగాకు, మిరప పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. పంటలను ఆశించిన తెగుళ్లను ఎలా నివారించుకోవాలో శాస్త్రవేత్త రమేష్ రైతులకు వివరించారు. ‘పత్తిలో బోరాన్ లోపాన్ని అధిగమించేందుకు బోరాక్స్ లేదా ఫార్ములా 4 మందును 1.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చే యాలి. రసం పీల్చే పురుగులు ఉధృతంగా ఉన్నాయి. వాటి నివారణకు అక్తరా లేదాప్త్రెడ్ 100 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో ఆకుమచ్చ తెగులు, తెల్లదోమ ఎక్కువగా ఉంది. ఆకు మచ్చతెగులు నివారణకు స్కోర్ 100 మి.లీ లేదా సాఫ్ పావు కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చే సుకోవాలి. తెల్లదోమ నివారణకు ట్త్రెజోఫాస్ పావు లీటరు+నువాన్ 200 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో పైముడత నివారణకు ఇమిడా ఒక మి.లీ మందును లీటరు నీటికి, కింది ముడత నివారణకు ఓమైట్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మినుములో పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలగించాలి. పల్లాకు తెగులు ఉధృతంగా ఉంటే ట్త్రెజోఫాస్ లేదా నువాన్ను అధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి. పొగాకులో లద్దెపురుగు నివారణకు లార్విన్ లేదా రీమాన్ పావు లీటరు మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంటల పరిశీలనలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ వరప్రసాద్, పర్చూరు ఏడీఏ కే కన్నయ్య, ఏఓ గౌతమ్ ప్రసన్న, టెక్నికల్ ఏఓ సుమతి పాల్గొన్నారు. -
పొద్దుతిరుగుడు మేలు
అనువైన నేలలు, విత్తన రకాలు డీఆర్ ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్-66తో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల సంకరాలను ఎంచుకోవచ్చు.ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూ ములు, ఎర్ర, ఇసుక, రేగడి, నల్ల ఒండ్రుమట్టి నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనశుద్ధి మొలకశాతం పెంపొందించేందుకుగాను విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్+కార్బండిజం అనే మందు 2 గ్రాములను కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. విత్తేదూరం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఉంచాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు వేయాలి. విత్తనం మొలకెత్తిన 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి. ఎరువులు ఎకరాకు 3-4 టన్నుల చివికిన పశువుల ఎరువు వేయాలి. నత్రజని ఎరువును విత్తనాలు వేసేటప్పుడు 26 కిలోలు, మొగ్గ తొడిగే దశలో 13 కిలోలు, 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 13 కిలోలు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, మొత్తం భాస్వరం 150 కిలోలు వేసుకోవాలి. పూత దశలో 2.0 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే విత్తనాలు అధికంగా ఏర్పడతాయి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో పది రోజులకు ఒకసారి, బరువు నేలల్లో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గ దశ, పూత దశ, గింజ కట్టే దశ, గింజ నిండే దశలో నీటి తడులు ఇవ్వాలి. చీడపీడల నివారణ ఇలా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు 30-40 రోజుల పంటగా ఉంది. ఈ దశలో పంటలను ఆశించే చీడపీడలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగు లేదా నల్లటి వలయకారపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో మచ్చలన్నీ కలిసిపోయి, ఆకులు ఎండి పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించి న వెంటనే కార్బండిజం+మాంకోజబ్ మందు 2.0 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1.9 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్లు లేదా తల కుళ్లు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. ప్రథమ దశలో మొక్క చివరి భాగం, పువ్వు కింద ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత దశల్లో పువ్వు తొడిమ దగ్గర కుళ్లిపోయి ఎండిపోతుంది. నివారణకు ఫెన్థియాన్ ఒక మిల్లీలీటరు+నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు పచ్చదీపపు పురుగులు, తెల్లదోమలు, తామర పురుగులు, ఆకుల్లో రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఆకులన్నీ పసుపు పచ్చగా మారిపోయి, ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లేదా ట్రైకోఫాస్ 2.0 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు పొద్దు తిరుగుడు పండించే ప్రాంతాల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగు లార్వాలు.. పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రాము థయోడికార్బ్+నోవాల్యురాన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
కరెంటు సమస్యను అధిగమించిన నలుగురు రైతులు
షాబాద్: పంటల సాగులో కరెంటు పాత్ర ఎనలేనిది. ప్రస్తుత తరుణంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఆ నలుగురు రైతులకు మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు ప్రభుత్వం అందజేసే కరెంట్‌పై ఆధారపడి వ్యవసాయం చేయడంలేదు. సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ పంటలు పండిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాలు.. షాబాద్ మండలం మన్‌మర్రికి చెందిన రైతులు భిక్షపతి, లక్ష్మయ్య, రాంచంద్రయ్య, యాదయ్య. వీరికి ప్రభుత్వం 2012లో ఇందిర జలప్రభ పథకం కింద సోలార్ పరికరాలను అందజేసింది. రూ.6 లక్షల విలువైన ఈ పరికరాలను ప్రభుత్వం వందశాతం రాయితీపై అంద జేసింది. దీంతో వారు అప్పటినుంచి సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ బోరుబావుల ద్వారా తలా రెండు ఎకరాల్లో పత్తి, వరి, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో 24 గంటలపాటూ కరెంట్ ఉత్పత్తి అవుతోంది. దీంతో వారు విద్యుత్ సమస్యను అధిగమించి పంటల సాగులో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా రైతులను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని మిగతా రైతులు సౌరశక్తిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోలార్ ద్వారా రానున్న వేసవిలో విద్యుత్ కోతలను అధిగమించవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ విద్యుత్ కోతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. రైతులకు సబ్సిడీపై సోలార్ సిస్టమ్‌ను పంపిణీ చేస్తోంది. వాటర్‌షెడ్ పథకంతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీలను అందిస్తూ సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతల సమస్యకు సౌరశక్తితో చెక్ పెట్టవచ్చంటున్నారు. రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. మన్మర్రి గ్రామంలో సౌరశక్తిని ఉపయోగించే నలుగురు రైతులను చూసి మిగతావారు కూడా సోలార్ సిస్టమ్ కోసం వ్యవసాయ శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు. -
మందుల కన్నా..కషాయాలే మేలు
టమాటా ఆ కాయతొలుచు పురుగు: ఇది పంటను అధికంగా ఆశిస్తుంది. లేత ఆకులు, కొమ్మలను తినేస్తుంది. కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు లీటరు నీటిలో రెండు గ్రాముల చొప్పున నీటిలో కరిగే కార్బోరిల్ పొడిని కలుపుకుని పిచికారీ చేయాలి. ఆ పచ్చదోమ, పిల్లపురుగు: పెద్ద పురుగు ఆకు అడుగు భాగాన ఉండి రసం పీలుస్తుంది. ఆకులు వడిలిపోతాయి. మొక్కలు చేవ తగ్గి దిగుబడులు తగ్గుతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మెటాసిస్టాక్ మందును కలుపుకుని పిచికారీ చేయాలి. వంగ అక్షింతల పురుగు: వీటిలో పెద్ద పురుగులు, పిల్ల పురుగులు ఆకులను తింటాయి. దీంతో మొక్కలు శక్తిహీనంగా మారుతాయి. వీటి నివారణకు లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల మలాథియాన్, లీటరు నీటిలో .03 శాతం మిథైల్ పెరాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. బెండ పువ్వు, కాయ తొలుచు పురుగు: ఇవి లేతకొమ్మలు, ఆకులు, కాయలను తొలిచి గింజలతో సహా లోపలి భాగాలను తినేస్తాయి. వీటి నివారణకు పురుగు ఆశించిన కొమ్మలు, కాయలను తుంచి దూరంగా పడేయాలి. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందు లేదా మూడు లీటర్ల నీటిలో 0.15 శాతం మందును కలిపి పిచికారీ చేయాలి. -
వ్యాధులకు తెర
శీతాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు గొంతు వాపు వ్యాధి ఇది పాశ్యురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా ఒక పశువు నుంచి మరో పశువుకు, నీరు, మేత, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో అధిక జ్వరం, గొంతువాపు, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పశువులు 48 గంటల వ్యవధిలో చనిపోతుంటాయి. నివారణకు ఆరు నెలలు పైబడిన పశువులకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలి. ఆ తర్వాత ఏటా వ్యాధి నివారణ కోసం టీ కాలు వేయిస్తూ ఉండాలి. జబ్బ వాపు కాస్ట్రీడియం అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో జ్వరం, తుంటి కండరాల్లో నొప్పి, వాపు లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు వర్షాకాలం ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పొట్ట జలగ వ్యాధి ఇది వర్షాల వల్ల, ఎక్కువగా నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల, నత్తల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పశువులు నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గొర్రెల్లో వచ్చే వ్యాధులు.. నీలి నాలక వ్యాధి : ఇది క్యూలికాయిడిస్ అనే ఇన్సెక్ట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు ముందస్తు టీకాలు వేయించాలి. ఫుట్రాట్ : ఈ వ్యాధి శీతాకాలంలో గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కాలివేళ్ల మధ్య ఎర్రగా మారడం, వాపు, పగుళ్లు రావడం, కుంటడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు కాపర్సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్‌తో గొర్రెల పాకలను శుభ్రం చేయాలి. కాళ్లపై గాయాలు, పుండ్లు ఏర్పడితే యాంటీ బయాటిక్స్ వాడాలి. -
కలుపు మొక్కలు.. సమస్యలు
కలుపు మొక్కలు.. సమస్యలు కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడపీడల మాదిరిగా పంటలపై తక్షణం కనిపించదు. కలుపు మొక్కలు ప్రధాన పైర్లతో గాలి, వెలుతురు, నీరు, పోషకాల కోసం పోటీపడి వాటిని ప్రధాన పంటకు అందకుండా చేస్తాయి. పంట దిగుబడులు 20-60శాతం వరకు తగ్గిస్తాయి. వీటి వల్ల పంట దిగుబడి తగ్గడమే కాక నాణ్యత కూడా తగ్గుతుంది. చీడపీడలకు ఆశ్రయం ఇచ్చి ప్రధాన పైరుపై వాటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. నివారణ ఆవశ్యకత పంటలను చీడపీడల నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో.. కలుపు మొక్కల నుంచి పోటీ లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా, పెరిగినా పుష్పించి, విత్తనోత్పత్తి దశకు చేరుకోకుండా సకాలంలో నిర్మూలించాలి. పంట తొలిదశలోనే, అంటే పంట కాలంలో మూడింట ఒకవంతు సమయంలో పైరుకు కలుపు నుంచి ఎలాంటి పోటీ లేకుండా చూడాలి. కలుపు మందులను తేలికపాటి(ఇసుక,గరప) నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్రనేలల్లో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వాడాలి. సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, అంతరకృషి చేయుట మొదలగు సేద్యపద్ధతులను అవలంబిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న విత్తనం వేసిన 2-3రోజులలోపు తేలిక నేలల్లో అయితే ఎకరానికి 800గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరానికి 1200గ్రాముల అట్రజిన్‌ను 200లీటర్లల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను ఒకనెల వరకు అదుపు చేయవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం ఎకరానికి 1లీటరు పిండిమిథలిన్ను 200లీటర్ల నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల్లో పిచికారి చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే ఎకరానికి 500గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్ను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 30-35రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్‌తో అంతర పంట కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. జొన్న జొన్న విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల ఎకరానికి 800గ్రాముల అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్ల నీటిలోకలిపి తడినేలపై పిచికారి చేయాలి. జొన్న విత్తిన 35-40రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 2గ్రాముల 2,4డి సోడియం సాల్ట్ లేదా 50గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 200గ్రాముల యూరియాను కలిపి మల్లెపై పిచికారి చేసి నిర్మూలించవచ్చు. శనగ విత్తే ముందు ఎకరానికి 1లీటరు ప్లూక్లోరాలిన్ 45శాతం మందును పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని ఎకరానికి 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20,25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. పెసర, మినుము విత్తనం విత్తిన వెంటనే గాని, మరుసటి రోజుగాని ఎకరానికి 1లీటరు 50శాతం అలాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21-28రోజుల మధ్య ఎకరానికి 250మి.లీ. ఫినాక్సిప్రాప్ఇథైల్ (ఉదాహరణకు నివారణకు) 250 మి.లీటర్ల ఇమాజితాఫిర్(వెడల్పుకు కలుపు, బంగారుతీగ నివారణకు), 400మి.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ (ఊవ, చిప్పిర, గరిక నివారణకు) 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పొద్దుతిరుగుడు విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి లీటరు పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50%ను కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి. 30-40రోజుల వరకు పంటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగ విత్తిన వెంటనే గాని లేదా 2-3రోజుల లోపు ఎకరానికి 1లీటరు అలాక్లోర్ 50శాతం లేదా 1.25-1.5లీటర్ల బుటాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండెమిథాలిన్ 30శాతం 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయరాదు. విత్తిన వెంటనే కలుపు మందులు వాడలేకపోయిన లేదా 20రోజుల వరకు కలుపు తీయలేని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును నిర్మూలించవచ్చు. విత్తిన 21రోజుల లోపు కలుపు 2-3ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300మిల్లీలీటర్ల ఇమాజిలిఫిర్ 10శాతం లేదా 400మీ.లీటర్ల క్విజాలోఫాప్ఇథైల్ 5శాతంను 200లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారి చేసి కలుపును నిర్మూలించవచ్చు. కుసుమ విత్తిన వెంటనే గాని, మరుస టి రోజుగాని ఎకరానికి 1లీట రు అలాక్లోర్ 50శాతం లేదా పెండమిథాలిన్ 30శాతం కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-30రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25రోజులకు, 45-50రోజుల వరకు దంతులు తొలి అంతర కృషి చేయాలి. -
జిప్సంతో దిగుబడులు అధికం
ఖమ్మం వ్యవసాయం : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైనది. ప్రస్తుత రబీలో జిల్లాలో సుమారు ఆరువేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. నీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వేరుశనగను రబీ పంటగా సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, బోనకల్లు, చింతకాని, మధిర, గార్ల, బయ్యారం, ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు తదితర మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. వేరుశనగకు జిప్సం ప్రాముఖ్యతపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ యం.వెంకట్రాములు(89856 20346), ఆర్. శ్రీనివాసరావు(83329 51138) వివరించారు. కాల్షియం లోపంతో అంతంత మాత్రంగా దిగుబడులు వేరుశనగలో కాయ బాగా వృద్ధి చెంది గట్టి విత్తనంతోపాటు అధిక నూనె శాతం కలిగి ఉండటానికి కాల్షియం, గంధకం పోషకాలు ప్రధానమైనవి. ఈ పోషకాలు సాధారణంగా నేలలో, పొలానికి వేసే సేంద్రియ, చాలా వరకు ప్రధాన పోషకాల కోసం వాడే రసాయన ఎరువుల్లో ఉండలం వల్ల పైర్లకు కావాల్సిన మోతాదులో అందుతుండేవి. కానీ.. ఒకే భూమిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు ఒక సంవత్సరంలో పండించటం, సిఫార్సు మేరకు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ఇటీవల కాల్షియం, గంధకం లేని సంకీర్ణ ఎరువులను రైతులు విరివిగా వాడుతుండటం తదితర కారణాల వల్ల వీటి లోపాలు పైర్లపై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేరుశనగలో కాల్షియం, గంధకం లోపాల వల్ల దిగుబడులు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాల్షియం లోపం కాల్షియం లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరగటం, ఆకులు కొసల నుంచి ఎండిపోవటం, వేరు పెరగక వేరుకుళ్లు రోగం రావడం, కాండం బలహీనంగా ఉండి తప్పకాయలు ఏర్పడడం తదితర లక్షణాల వల్ల పైరు సరిగా ఎదగక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. గంధకం లోపం గంధకం లోపం ఏర్పడినప్పుడు లేత ఆకులు చిన్నవిగా, ముడుచుకుని కాండం పొట్టిగా సన్నగా ఉండి, వేరుబుడిపలు తక్కువగా ఉండటం వల్ల వాతావరణం నుంచి సరిగా నత్రజనిని గ్రహించలేక పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. నూనె శాతం, దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. జిప్సం వాడకం రైతులు వేరుశనగ పైరులో కాల్షియం, గంధకం పోషకాలు విరివిగా లభించే చౌకైన జిప్సంను వాడుకోవటం మంచిది. జిప్సంలో కాల్షియం 24 శాతం, గంధకం 18 శాతం ఉంటుంది. ప్రతి 100 కిలోల జిప్సంలో 24 కిలోల కాల్షియం, 18 కిలోల గంధకం ఉంటుంది. ఎకరా వేరుశనగ పంటకు నీటిపారుదల కింద 200 కిలోల జిప్సంను తొలిపూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. వర్షాభావ పరిస్థితుల్లో విత్తిన 45 రోజుల్లో అంటే.. ఊడలు దిగే సమయంలో రెండో కలుపునకు ముందు జిప్సంను వేయాలి. కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాల్షియం, గంధకం పోషకాలు పైరుకు కావాల్సిన మోతాదులో అంది గింజ, నూనె దిగుబడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. -
మామిడి పూత, కాతలను నిలుపుకొంటేనే..
మామిడి పూత సాధారణంగా డిసెంబర్ - జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో మాసం మొత్తం పూత కాలంగా ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో, కోత కోయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు.. తేమ తక్కువగా ఉండే నేలల్లో, ఇసుక నేలల్లో మొగ్గ బయటకు వచ్చే ముందు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గలు బయటకు వచ్చే ముందు గానీ పగిలే సమయంలో గానీ పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ-కేను లీటరు నీటికి ఐదు గ్రాముల యూరియాలో కలిపి పిచికారీ చేయాలి. అక్టోబర్ తర్వాత.. అక్టోబర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దుక్కి దున్నవద్దు. చెట్టుకింద పాదులను కదిలించకూడదు. లేదంటే చెట్ల వేర్లు, పోషక పదార్థాల సమతుల్యత దెబ్బతిని పూత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత ఎరువులు వేయకూడదు. చెట్టుకు నీటి తడులు సైతం ఇవ్వవద్దు. మామిడిలో ఆశించే బూడిద రంగు తెగులు నివారణ... లేత ఆకులు, పూత కాండం, పూలమీద, చిరు పిందెల మీద తెల్లని పౌడర్ లాంటి బూజు చేరుతుంది. ఇదే బూడిద తెగులు. ఇది ఎక్కువగా రాత్రిపూట చల్లగా, పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. దీని వల్ల పూత, కాత రాలిపోతుంది. దీని నివారణ కోసం మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో తెగులు కనిపిస్తే హెక్బాకోనజోల్ 2 మి.లీ. లేదా ప్రాసికోనజోల్ ఒక మి.లీ. లేదా డినోకాఫ్ లేదా ట్రైడిమాల్స్ ఒక మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు... వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. లేత ఆకులు, రెక్కలు, పూలను పండ్లను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల మీద గోధుమరంగులో మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పెరిగిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చిపూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్ మిథైల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5గ్రాముల మండోజెల్ లేదా 2గ్రాముల ఆంట్రాకాల్ కలిపి పిచికారీ చేయాలి. తేనెమందు పురుగులు... తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులను, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీల్చుతాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్ల మాడిపోతాయి. పూత మాడిపోతుంది. పిందెలు బలహీనపడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగు తేనెలాంటి తియ్యని పదార్థాన్ని విసర్జిం చడం వల్ల ఆకులు, కాండలు, కాయలపై మసిపొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగక కాయలు రాలిపోతాయి. పూత, పిందె దశలో ఈ పురుగుల ఉద్ధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో ఈ పురుగులు చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి నాణ్యత లోపిస్తాయి. వీటి నివారణకు 1.5 మి.లీ. మోనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూత, మొగ్గ దశలో లీటరు నీటికి ఒక మి.లీ. డైక్లోరోఫాస్ లేదా 3గ్రాముల కార్పోరిల్ కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. పచ్చపూత దశలో కాండలు బయటకు వచ్చి పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మి.లీ. మోనోక్రొటోపాస్, లేదా డైమిథోయేట్, లేదా 3 మి.లీ. జిథైల్డెమాటాన్, లేదా0.25మిల్లిలీటర్ల ఇమిడాక్లోపిడ్ పిచికారీ చేయాలి. నవంబర్ మాసంలో ఈజాగ్రత్తలు.. సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, మూడు గ్రాముల బోరాక్స్ 5గ్రాముల ఫెర్రిస్ సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపి 10 నుంచి 15రోజుల వ్యవధిలో రెండుమార్లు పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా చూడాలి. వర్షం పడితే రసం పీల్చే పురుగులు ఎక్కువగా చేరతాయి. వీటి నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లేదా పిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫిడ్ ఏడు మి.లీ. ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. తోటలో పూత, మొగ్గలు ప్రారంభమైన తర్వాత మొగ్గలు పగిలి పూత రావడానికి రెండు గ్రాముల బోరాన్ లేదా 10 గ్రాముల మల్టీ-కేతో పాటు 5 గ్రాముల ఫార్ములా-4 మందును లీటరు నీటికి కలికి పిచికారీ చేయాలి. సందేహాలున్న రైతులు 89744 49325ను సంప్రదించవచ్చు. -
సాగులో.. స్వయంకృషి
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న స్వయం సహాయక సంఘాల మహిళలు సాగులోనూ సగం అని నిరూపిస్తున్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి, వెల్టూర్ గ్రామాల్లో ఎన్‌పీఎం ఆధ్వర్యంలో వీరు పండిస్తున్న పంటలు సాగు రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని పరిశీలించేందుకు వస్తున్న దేశ, విదేశాల ప్రతినిధులు, అధికారులు భేష్ అని మెచ్చుకుంటున్నారు. మండలంలో ప్రస్తుతం 15 గ్రామాల్లో ఈ పద్ధతిన పలు రకాల పంటలు సాగవుతున్నాయి. 400 గ్రూపులకు చెందిన 4,792 మంది మహిళా రైతులు 10,393 ఎకరాల్లో శ్రీవరి, పసుపు, కంది, బెం డ, కాకర, వంకాయ, మిర్చి, టమాటా, సోరకాయ, బీరకాయ, ఆకు కూరలతో పాటు ఉల్లిగడ్డ తదితర పంటలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఎన్‌పీఎం తరఫున కంబాలపల్లి, పొట్టిపల్లి, మద్దికుంట, వెల్టూర్, నిజాంపూర్ గ్రామాలకు 50 వేలు మంజూరయ్యాయి. సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే మహిళలకు ఎన్‌పీఎం నిధులను సమానంగా పంపిణీ చేశారు. స్త్రీనిధి ద్వారా కూడ కూరగాయల పంటలు పండించేందుకు మహిళలు డబ్బులు రుణంగా తీసుకున్నారు. పంటచేతికి వచ్చిన తరువాత నెలసరి వాయిదాల్లో వీటిని తిరిగి చెల్లిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి విక్రయించేందుకు ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన ఒక్కో మహిళకు రూ.10 వేలు అందజేశారు. ఈమె ఇంటి వద్ద ఎన్‌పీఎం దుకాణం ఏర్పాటు చేసి ఒక లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు తీసుకుంటుంది. ఎన్‌పీఎం ఆధ్వర్యంలో మహిళలు పండించిన కూరగాయలను సదాశివపేట పట్టణానికి తరలించి విక్రయిస్తున్నారు. ఎరువుల తయారీ ఇలా రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే మహిళలు కూరగాయల పంటలు పండిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎన్‌పీఎం దుకాణంలో ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో నాడెపు కంపోస్టు ఎరువు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎరువులను వాడుతున్నారు. నాడెపు కంపోస్టు దీని తయారీకి ఇంటి వద్ద పెరట్లో ఇటుకలతో 60 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల ఎత్తులో గొయ్యి తీస్తారు. దీనిలో 100 కిలోల ఆకులు (ఏవైనా), వ్యర్థాలు వేసి వాటిపై ఆవుపేడ పూసి మూడు నెలల పాటు నిల్వ ఉంచ డంతో నాడెపు కంపోస్టు తయారవుతుంది. దీన్ని పంట వేసే ముందు దుక్కుల్లో వేసుకుంటే భూసారం పెరగడంతో పాటు మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. నీమాస్త్రం కూరగాయ మొక్కలు మొలకెత్తాక ఎలాంటి చీడపీడలు సోకకుండా నీమాస్త్రం అందించాలి. ఒక ఎకరాకు సరిపడా ఎరువు, ద్రావణ తయారీకి.. 10 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవుపేడ తీసుకుని డ్రమ్ములో వేసి 100 లీటర్ల నీటితో కలియబెట్టాలి. ఇలా 48 గంటలపాటు ఉంచాక నీమాస్త్రం తయారవుతుంది. దీన్ని నీటి కాలువల ద్వారా కానీ, మొక్కలపై కానీ పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి దీన్ని మొక్కలకు అందించాలి. బ్రహ్మాస్త్రం మొక్కలకు తెగుళ్లు సోకకుండా దీన్ని వాడతారు. దీని తయారికి ఐదు రకాల చెట్ల ఆకులను 2 కిలోల చొప్పున తీసుకుని ముద్దగా నూరి 10 లీటర్ల ఆవు మూత్రంలో కలపాలి. ఒక పాత్రలో పోసి మూతపెట్టి అరగంటపాటు ఉడకబెట్టాలి. ద్రావణం చల్లారిన తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. 100 లీటర్ల నీటికి 2 నుంచి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కలపై స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
పూతను కాపాడితేనే కాత
మంచిర్యాల రూరల్ : మామిడి సాగు చేసిన రైతుకు ముందు చూపు అవసరం. మామిడి తోటల్లో సరైన యాజమాన్యం పాటించి సాగు చేస్తూ, మామిడి పూత, కాత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సా ధ్యం. మామిడి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే చిట్కాలు, నవంబర్‌లో రైతులు పాటించాల్సిన పద్ధతులను మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారి సౌమ్య వివరించారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు, చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడుల్లో తగ్గుదల, నాణ్యత తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు అవగాహన లేమితో తమకు తోచిన విధంగా సేద్యం పనులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. నవంబర్‌లో మామిడి రైతులు చేపట్టాల్సిన, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఇవీ. చేయాల్సిన పని ఈ నెలలో చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయరాదు. ముఖ్యంగా ఈ నెలలో రైతులు ఎలాంటి కత్తిరింపులు చేపట్టకూడదు. నీటిని కూడా వదలొద్దు. ఒక్కోసారి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. వాటిని ఉత్తేజ పరిచి పూత త్వరగా రావడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ కింది పద్ధతులు పాటించాలి. నీటి వసతి ఉన్న తోటల్లో తేలికపాటి తడి ఇవ్వడం లేదా లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం, నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు వస్తాయి. సస్యరక్షణ తప్పనిసరి మామిడి పూతకు ముందు, పూత సమయం, కాయ ఎదిగే దశలో అనేక రకాల పురగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. అలాగే సరైన నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం సరిగా చేపట్టని తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోయి, కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. దీని నివారణకు కింది జాగ్రత్తలు పాటించాలి. బూడిద తెగులు లేత ఆకులు, పూత, కాండాలను, పూల మీద, చిరుపిందెల మీద, తెల్లని పౌడరు లాంటి బూజు రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి. నివారణ మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం(నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేయాలి పూత దశలో తెగులు కనిపించిన హెక్సాకోన జోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా డినోకాప్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు చొప్పున నీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ/పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు వర్షాలు/పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. ఈ తెగులు లేత ఆకులు, పూలు, పండ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పోయి ఆకు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. నివారణ పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి. సూర్యరశ్మి సోకేలా కొమ్మలను జూన్, జూలై మాసంలో కత్తిరింపులు చేసి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. పూతకు ముందే 3 గ్రాముల కాపర్ ఆక్సీ ఫ్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్, మిథైల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మండోజెల్ లేదా రెండు గ్రాముల ఆంట్రాకాల్ కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగులు తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు, పూత మాడిపోతాయి. పిందెలు ఏర్పడవు, ఏర్పడినా బలహీనంగా ఉండి రాలి పోతాయి. అంతేకాకుండా తేనెలాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జింజడం వల్ల ఆకులు, కాండాలు, కాయలపై మసి పొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణ జన్య సంయోజన క్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి, నాణ్యత కోల్పోతాయి. నివారణ పూత మొగ్గ దశలో : లీటరు నీటికి 1 మిల్లీలీటరు డైక్లోరోఫాస్ లేదా 3 గ్రాముల కార్బోరిల్ కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేయాలి. పచ్చపూత దశ : పూత కాండలు బయటకు వచ్చి, పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయాలి. నల్లపూత దశ : ఈ దశలో పిందెలు బఠాణి గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. లీటరు నీటికి ఒక మిల్లీలీటరు పాస్పోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా గ్రాము ఎఫిసేట్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పురుగులు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై గోకి బయటకు వచ్చి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి గ్రాము ఎఫిసేట్ లేదా 1 మిల్లీలీటరు పాసోమిడాన్ లేదా 2 మిల్లీలీటరు రిజెంటును కలిపి పిచికారీ చేయాలి. -
రైతులూ ..ఈ సూచనలు పాటించండి
మినుము ప్రస్తుతం రబీలో మినుము సాగు చేసేందుకు అనువైనం సమయం. ఆయూ సమయూల్లో కింది రకాలు వేసుకుంటే మేలు. నవంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు మొదటి పక్షం వరకు విత్తుకొనే మినుము రకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-648 డిసెంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు చివరి వరకు విత్తుకొనే మినుము రాకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-685 జన వరిలో విత్తుకొనే రకాలు-ఎల్బీజీ-752, ఎల్బీజీ-623 పల్లాకు తెగులు తట్టుకునే పీయూ-31 రకాన్ని అన్ని కాలాల్లో విత్తుకోవచ్చు. పెసర నవంబరు రెండో పక్షం నుంచి జనవరి వరకు విత్తుకొనే రకాలు ఎల్జీజీ-42, టీఎం96-2, ఎల్జీజీ-410. విత్తనమోతాదు ఒక చదరపు మీటరుకు సుమారు 30-35 మొక్కలు ఉండేలా మినుము అరుుతే ఎకరాకు 16-18 కిలోలు, పెసర అరుుతే 10-12కిలోల విత్తనాలు వెదజల్లితే మంచి దిగుబడులు సాధించవచ్చు. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 30 గ్రా.కార్బోసల్ఫాస్ మందును వాడి విత్తనశుద్ధి చేయూలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేస్తే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. కలుపు నివారణ: గడ్డి, వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉంటే ఇమిజితాఫిర్ పది శాతం మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొన్ని భూముల్లో బంగారుతీగ సమస్య ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఆశించిన ప్రదేశాల్లో మాత్రమే పారాక్వాట్ 24 శాతం ద్రావకం 50 మిల్లీలీటర్లు, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయూలి. పత్తి తీతలో మెలకువలు పత్తి తీయడం మొదలైనందున మంచి నాణ్యత కోసం కింది మెలకువలు పాటించాలి. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి వేరుచేయూలి. మంచువల్ల పత్తి నాణ్యత దెబ్బతింటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పత్తి తీయూలి. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తి తీస్తే వాటితోపాటు గుల్ల వద్ద ఉన్న తొడిమలు, ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై పత్తికి అంటుకొంటారుు. పత్తి తీయగానే నీడలో మండెలు వేసి తగు తేమ శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. మొదటిసారి తీసిన పత్తిని తరువాత తీసిన పత్తితో కలపకుండా విడిగా అమ్ముకోవాలి. అప్పుడు తరువాత తీసిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుంది. వేరుశనగ రబీ సీజనుకు అనువైన వేరుశనగ రకాలు చిన్నగుత్తి రకాలు: కదిరి-6, కదిరి-9 కదిరి హరితాంధ్ర, అనంత మరియు ధరణి పెద్ద గుత్తి రకాలు: కదిరి-7 బోల్డ్ మరియు కదిరి-8 బోల్డ్ రబీలో వేరుశనగ డిసెంబరు 15 వరకు వేసుకోవచ్చు. విత్తన శుద్ధి: కిలో వేరుశనగ విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల డైథేన్ ఎం45 కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు సమస్య ఉన్న నేలలకు ఫ్యురడాస్ 4 జీ గుళికలు 5 కేజీలు ఎకరాకు దుక్కిలో వేసుకోవాలి. వేరుశనగ విత్తనం మొలకెత్తాక తొలి పూత కనిపించేవరకు (25 నుంచి 30 రోజులు) తడి ఇవ్వకూడదు. తరువాత నుంచి బెట్ట రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. రబీ పంట కాలం వేరుశనగ విత్తనోత్పత్తికి చాలా అనువైన కాలం. విత్తిన మూడు రోజుల్లోపు పై సాళ్లు వేసిన తరువాత ఒక లీటరు పెండి మెథాలిన్ కలుపు మందును ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన 40 నుంచి 50 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. -
పత్తిలో మెగ్నీషియం, జింక్ లోపం
మార్కాపురం : జిల్లాలో పత్తి పంట(వేసవి పత్తి+ఖరీఫ్ పత్తి) 77 వేల హెక్టార్లలో సాగవుతోంది. వేసవిలో సాగు చేసిన పత్తి దిగుబడి ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని పత్తి ఆకులు కుంకుమ రంగులోకి మారి పొలం మొత్తం ఎర్రగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ దృష్టికి తీసుకెళ్లగా మెగ్నీషియం, జింక్ లోపం వల్లే ఆకులు ఎర్రగా కనిపిస్తున్నాయని వివరించారు. సూక్ష్మ ధాతు లోపాలను నివారించుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు. ‘పత్తి పంట 90 నుంచి 120 రోజుల దశల్లో ఉంది. వర్షపాతం ఎక్కువైనా, వర్షం లేకపోయినా పత్తిలో ఈ లోపం కనిపిస్తుంది. ఆకులు కుంకుమ రంగులోకి మారి పత్ర హరితాన్ని కోల్పోతాయి. ఎరుపుగా మారిన ఆకు పచ్చగా మారి రాలిపోతుంది. పక్వానికి రాని కాయలు పగలడం, మొక్క ఎత్తు పెరగకపోవడం, ఉన్న పత్తి బరువు తగ్గిపోవటం జరుగుతుంది. పూత, పిందె రాలిపోతాయి. దీని వల్ల పంట దిగుబడి 60 నుంచి 80 శాతం తగ్గిపోతుంది. మోతాదుకు మించి నత్రజని, భాస్వరం, పొటాష్ వాడటం, సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల జింక్, మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆకుల మధ్య భాగం పసుపు పచ్చగా మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క ఆహారం తయారు చేసుకునే శక్తి కోల్పోతుంది. కొమ్మలు రాలిపోయి తక్కువ పూత వస్తుంది. పిందె పెరుగుదల ఉండదు. నివారణకు ఎకరాకు 20 కిలోల మెగీషియం సల్ఫేట్ భూమిలోగానీ లేదా పైపాటుగా ఎకరాకు 2 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, ఈడీటీఏ 12 శాతం జింక్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. దీంతో కొత్తగా వచ్చే ఆకుల్లో మెగ్నీషియం లోపం ఉండదు’. -
బిందుసేద్యంపై..రైతుల దృష్టి
పరిగి రూరల్: వర్షాభావ పరిస్థితులు, క రెంటు కోతల దృష్ట్యా రైతులు బిందుసేద్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం బిందుసేద్యం, స్ప్రింక్లర్ల సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు కూడా ఇస్తోంది. అంతేకాకుండా కూరగాయల సాగుకు డ్రిప్ ఎంతో బాగుంటంతో రైతులు మక్కువ చూపిస్తున్నారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, మాదారం, ఖుదావంద్‌పూర్, పొల్కంపల్లి తదితర గ్రామాల్లో రైతులు డ్రిప్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. బీర, కీర, కాకర, సొరకాయ తదితర కూరగాయలను పండిస్తున్నారు. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా ఉన్న బోరు బావిలోని నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు శ్రీకారం చుట్టారు. తీగజాతి కూరగాయల సాగుతో మరింత లాభం డ్రిప్‌తో ఎక్కువగా కీర, కాకర, సొరకాయ తదితర తీగజాతి కూరగాయల సాగును ఎంచుకున్నారు. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం ఉండటంతో రైతుల ఈ సాగుపై దృష్టి సారించారు. మార్కెట్లో కీర, కాకర, సొరకాయలకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో మూడేళ్లుగా రైతులు ఈ పంటలను సాగు చేస్తూ మంచి లాభాన్ని ఆశిస్తున్నారు. ఎకరా కీర సాగులో ఖర్చులన్నీ పోనూ ఈసారి రూ.70 వేలకు వరకు లాభం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. -
సూక్ష్మలోపం.. భారీ నష్టం!
సూక్ష్మధాతు లోపం వల్ల బొప్పాయి (పొప్పడి) పంట దిగుబడి తగ్గుతుంది. అవగాహన లోపం వల్ల దీన్ని సవరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గటంతో పాటు వివిధ రకాల తెగుళ్ల బారిన పడి పంట పూర్తిగా పాడవుతుంది. సమస్యను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడితే ధాతులోపాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పంటకు ప్రధానంగా జింక్, మెగ్నీషియం, బోరాన్, ఐరన్ ధాతు లోపాలు వస్తుంటాయి. ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తే దీన్ని అధిగమించడం సులువే. జింక్ లోపం లక్షణాలు ఆకు కణజాలం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈనెల మధ్యభాగం పసుపు పచ్చరంగులోకి మారి వాడిపోయినట్లుగా ఉంటుంది. పిందె సైజు పెరగదు. దిగుబడి తగ్గుతుంది. నాణ్యత, రుచి లోపిస్తుంది. నివారణ... జింక్‌లోపం నివారణకు లీటరు నీటిలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మెగ్నీషియం లోపిస్తే మెగ్నీషియం లోపం వల్ల ఆకు పూర్తిగా మూడతపడి తిరగబడుతుంది. దీంతో ఆకు మొత్తం పేలవంగా మారుతుంది. మొక్క ఎదుగుదల లోపిస్తుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి. ఐరన్ లోపంతో... ఆకులు బంగారు వర్ణంలోకి మారుతాయి. ఈనెల మధ్య భాగం తెల్లగా మారుతుంది. ఐరన్ లోపం ఎక్కువైతే ఈనెలు, ఈనెల మధ్యభాగం పూర్తిగా తెలుపు రంగులోకి మారుతుంది. నివారణ... లీటరు నీటికి 2 గ్రాముల ఫైసల్ఫేట్ మరియు 1గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని స్ప్రేచేయాలి. బోరాన్ లోపం... బొప్పాయి ఆకులు పూర్తిగా జీవం కోల్పోతాయి. పిందె తక్కువగా కడుతుంది. పిందె రాలిపోవడం ప్రారంభమవుతుంది. కాయలపై మచ్చలు ఏర్పడుతాయి. కాయ రూపం మారుతుంది. నివారణ... దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 4గ్రాముల ఫార్ముల-4 అనే మందును పిచికారీ చేయాలి. -
రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి
కూసుమంచి : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, అధిక దిగుబడులు పొంందాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ చేరాలు అన్నారు. మండలంలోని పెరికసింగారం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతు డ్రమ్‌సీడర్‌తో సాగు చేసిన వరి పంటలో శుక్రవారం క్షేత్రప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఈ పంటను పరిశీలించారు. అనంతరం డాక్టర్ చేరాలు రైతులకు డ్రమ్‌సీడర్‌తో వరి సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డ్రమ్‌సీడర్‌తో వరిని నాటడం వల్ల తడులు తక్కువగా అవసరం అవుతాయని, దిగుబడి కూడా ఎక్కువ ఉంటుందని అన్నారు. సస్యరక్షణ కోసం పెట్టుబడులు కూడా ఎక్కువ అవసరం ఉండవని అన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన పంట మిగతా పద్ధతిలో వేసిన పంట కంటే పది రోజుల తక్కువ సమయంలో కోతకు వస్తుందని అన్నారు. కంకి పొడవు, గింజలు, నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు. డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరిని నాటిన రైతు శ్రీనివాసరావును మిగిలిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడి, ఎరువులు తక్కువ వేశానని రైతు శ్రీనివాసరావు వివరించారు. ఒక్కో కంకికి 200 గింజలు ఉన్నాయని, ధాన్యం కూడా నాణ్యంగా ఉందని రైతులకు వివరించారు. ఎకరాకు 45 బస్తాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త బాలాజీనాయక్, హెచ్డీ డాక్టర్ శివాని, డాట్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రాములు, డీడీఏ రత్నమంజుల, ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఏఓ టి.అరుణజ్యోతి, ఏఈఓ .జయరాములు, రైతులు పాల్గొన్నారు. -
శ్రమ తక్కువ.. ఆదాయం ఎక్కువ
షాబాద్: మార్కెట్లో అలంకరణ పూలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే జెర్బరా పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని కక్కులూర్, కేసారం, షాబాద్, అప్పారెడ్డిగూడ, రేగడిదోస్వాడ, నాగరగూడ, తిమ్మారెడ్డిగూడ తదితర గ్రామాల రైతులు ఎక్కువగా జెర్బరా పూల సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ైెహ దరాబాద్ మార్కెట్లోకి వస్తున్న అలంకరణ పూలలో 90శాతం బెంగళూరు, మహారాష్ట్ర, పుణెల నుంచే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ ఉన్న ఈ పూలను ఇక్కడ ఎందుకు సాగు చేయకూడదని ఆలోచనతో కొందరు రైతులు అలంకరణ పూల సాగు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మండలంలో రైతులు జెర్బరా, కార్నేషన్, కట్ ఫ్లవర్స్ సాగు చేస్తున్నారు. పూలసాగుపై రైతులు ఏమంటున్నారంటే... ఐదేళ్లపాటు రాబడి.. ఎండల తీవ్రత, అధిక వర్షాలు వంటి ప్రకతి వైప్యరీత్యాలను తట్టుకునే పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయలను సాగు చేయవచ్చు. ఇందుకు ఖర్చు బాగానే అయిన రైతులకు ఎంతో లాభసాటిగా ఉంది. పాలీహౌస్ విధానంలో అలంకరణ పూలసాగు చేపట్టాలంటే ఎకరాకు రూ.52 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇది పెద్ద రైతులకే సాధ్యమనే అపోహ ఉంది. కాని ప్రభుత్వం పాలీహౌస్ విధానంతో పూలు, కూరగాయల సాగు చేపట్టే రైతులకు తగు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 30 శాతం రాయితీపై పాలీహౌస్ ఏర్పాటుకు కావాల్సిన పరికరాలు అందజేస్తోంది. రుణాలు అందజేసేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. చిన్న రైతులు 5 గుంటల విస్తీర్ణంలో పాలీహౌస్ ద్వారా పూలు, కూరగాయలు సాగు చేపట్టవచ్చు. దీనికి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 30 శాతం రాయితీ చెల్లిస్తుడండంతో రైతు వాటాగా 3.60 లక్షలు పెట్టుబడి పెడితే చాలు. ఐదేళ్ల వరకు లాభాలు పొందవచ్చు. రోజుకు రూ.2 వేల రాబడి.. ఐదు గుంటల స్థలంలో చేపట్టిన పూల సాగులో మొదటి రెండు నెలలకు రూ.10వేల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఆదాయం మొదలవుతుంది. కాపు ఆరంభమైన తర్వాత నెలకు 10వేల వరకు ఖర్చు వస్తుంది. రోజుకు ఎంత లేదన్నా 500 పూలు వస్తాయి. సీజన్లో ఒక్కో పువ్వు రూ.7 నుంచి 10 రూపాయల వరకు ధర పలుకుతుంది. మిగతా రోజుల్లో రూ. 1.50 నుంచి 4 రూపాయల వరకు ధర పలుకుతాయి. సీజన్ లేని సమయంలో వ్యాపారులు పూలను కొనుగోలు చేసి తమిళనాడు, చైన్నైలకు పంపిస్తున్నారు. పూలసాగు ద్వారా రోజుకు రూ.2వేల చొప్పున నెలకు రూ.60వేల వరకు ఆదాయం వస్తుంది. అందులో 10 వేల నుంచి 15వేల ఖర్చులు పోను రూ. 40నుంచి 45వేల వరకు ఆదాయం వస్తుంది. పాలీహౌస్‌పై వేసే పాలిషీట్స్ ఐదేళ్ల వరకు ఉంటాయి. ఇనుప పైపులకు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదు. తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండదు.. సాంప్రదాయ పంటలతో పోల్చితే వీటికి ఎరువుల వినియోగం తక్కువగానే ఉంటుంది. పూలమొక్కలు నాటే ముందు 25 ట్రాక్టర్ల పశువుల ఎరువుకు రూ.20 వేలు, ఉనకకు రూ.5వేలు అవుతాయి. మొక్కలకు పోషక పదార్థాలనందించే ఎరువులు బెడ్‌పైన వేసుకోవడానికి రూ.3వేల వరకు ఖర్చు వస్తుంది. నాటిన వారం రోజుల తర్వాత డ్రిప్ ద్వారా రసాయనిక ఎరువులు అందించాల్సి ఉంటుంది. ఈ విధమైన సాగులో చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. కలుపు సమస్య అసలే ఉండదు. కేవలం ఇద్దరు కూలీలు... రోజు రెండు గంటలు పని చేస్తే సరిపోతుందని అంటున్నారు రైతులు. -
ఈము పక్షుల పెంపకంతో మంచి లాభాలు
‘వ్యవసాయ క్షేత్రాల వద్ద ఈము పక్షుల పెంపకం చేయవచ్చు. వీటితో మంచి లాభాలు పొందవచ్చు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలోని మా బంధువులు వీటిని పెంచడాన్ని చూసి నేను కూడా ఈము పక్షుల పెంపకం చేపట్టాలనుకున్నా. దీంతో గుంటూరు ప్రాంతం నుంచి మూడు నెలల వయసున్న 50 పిల్లలను తెప్పించా’నని వెంకాగౌడ్ తెలిపారు. పెంపకం ఇలా... ఈము పక్షుల ఫాం నిర్వహణకు మొదటగా వ్యవసాయ భూమిని చదను చేసుకోవాలి. 10 ఫీట్ల ఎత్తులో 200ల మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో నెట్ ఫెన్సింగ్(జాలి)ను ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం రూ.60 వేల ఖర్చు వస్తుంది. ఈము పక్షులకు దాణాగా తవుడు, కుసుమలు, సోయా, జొన్న, మక్కజొన్న, ఆముదాలు, బాదం ఆకులు అందించాలి. ప్రతి రోజూ ఒక్కో పక్షికి సుమారు 600 గ్రాముల దాణా అందించాలి. నీటిని బకెట్లలో పోసి ఉంచాలి. ఒక్క పక్షిని పెంచేందుకు రోజుకు రూ.20 చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నా ఇవి వ్యాధుల బారిన పడవు. ఎండ, చలి, వర్షాన్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. మార్కెటింగ్... ఈము పక్షులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈము పక్షిలోని ప్రతీ భాగం విలువైనది. ఈము పక్షి మాంసం కిలోకు రూ.2వేల వరకు ఉంటుంది. వీటి గోళ్ళు, ఈకలు కిలోకు రూ.12వేల వరకు పలుకుతాయి. కొవ్వును రూ.60వేల వరకు విక్రయించవచ్చు. పక్షి కనుగుడ్లను మార్కెట్ ధర ప్రకారం రూ.1,800 వరకు విక్రయించవచ్చు. -
విత్తనమే కీలకం!
సాధారణంగా విత్తనాలు సూటి రకాలు, హైబ్రీడ్ రకాలుగా ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తరువాత పంటగా వేసుకోవచ్చు. విత్తనాలను మార్చుకునేటప్పుడు ధ్రువీకరించిన వాటినే వేసుకోవడం మంచిది. హెబ్రిడ్ రకాలంటే ఏటా సంకర పర్చి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలను వాడినట్లయితే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ధ్రువీకరణ విత్తనం జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఇతర వంట విత్తనాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు లేకుండా ధ్రుడమైన విత్తనాలు ఎక్కువ శాతం కల్గి ఉంటాయి. బాగా మొలకెత్తే ఎక్కువ మొలక సాంద్రత కల్గిన విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడతాయి. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. విత్తనంలో నిర్ణీత తేమ శాతం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నాణ్యమైన విత్తన లక్షణాలు నాణ్యమైన విత్తనమంటే వంద శాతం జన్యు స్వచ్ఛత మొలక శాతం కలిగి ఉండాలి. మేలైన విత్తనం 20 నుంచి 25 శాతం అవసరాల్లో 8 నుంచి 9 శాతం దిగుబడిని పెంచుతుంది. అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైన విత్తనమే నాణ్యంగా ఉన్నట్లు లెక్క. విత్తనాలు తయారు చేసుకోవడం ఇలా.... ప్రతి రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచి లేదా బాగా పండిన ఇతర రైతుల పంట నుంచి సేకరించాలి. భద్రంగా దాచుకోవాలి. స్వపరాగ సంపర్కం జరిగే పంటలలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చూసుకుంటే విత్తనంపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదిగా ఉండాలి. నీటి వసతితో పాటు మురుగునీరు పోయేలా ఏర్పాట్లు ఉండాలి. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాల పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదల్చిన పొలంలో నీటితడి ఇచ్చినట్లయితే అంతకు ముందు పండించిన రకం విత్తనాలు మొలకెత్తుతాయి. తరువాత గొర్రు, గుంటుకతో దుక్కి చేయిస్తే పొలంలో ఉండే కల్తీ మొక్కులతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి. విత్తనోత్పత్తి చేసే పొలంలో బెరుకులు (కేశీలు) ఏరి వేయాలి. మొక్క ఎదుగుదల దశలో పంట పూత దశలో గింజ గట్టిపడే దశలో మూడు సార్లు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. మొదటి దశ ఎత్తులో తేడా ఉన్న మొక్కలను పీకేయాలి. ఆకుల రంగు, ఆకారం, అమరికలో తేడా లేకుండా చూడాలి. రెండో దశలో కంకుల్లో తేడా ఉన్న మొక్కలను తొలగించాలి. రెమ్మల అమరిక, పుప్పొడి రంగులో తేడా పుప్పొడి తిత్తుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. మూడోదశలో గింజ ఆకారం, పరిమాణం, గింజ రంగు వీటన్నింటినీ రెండు మూడు సార్లు విత్తన క్షేత్రమంతా తిరిగి ఏరి వేయాలి. -
పెసర..రైతుకు ఆసరా
బాల్కొండ : సాధారణంగా అక్టోబర్ నెలాఖరు వరకు పెసర సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్లోనూ కొందరు రైతులు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని, సుమారు రెండు నెలల్లో చేతికి వచ్చే పెసరను రబీలో ఈనెల మూడో వారం వరకు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు. మాగాణుల్లో అయితే వచ్చేనెల 15వ తేదీ వరకు పంటను సాగు చేయవచ్చని పేర్కొన్నారు. విత్తన శుద్ధి పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇడిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ. మోనోక్రొటోఫాస్, 3 గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్‌లతో విత్తన శుద్ధి చేయాలి. మొదటిసారి పెసర పంట సాగు చేసే భూముల్లో అయి తే.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తనం శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది. విత్తనం ఎకరానికి పది కిలోల వరకు విత్తనం అవస రం. అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. నేల తయారీ, విత్తేవిధానం ఒకసారి నాగలితో దున్నాలి. రెండు సార్లు గొర్రు కొట్టాలి. తర్వాత గుంటుకతోలి నేల ను తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెం టీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. -
ఖనిజ, లవణాలు సమపాళ్లలో అందించాలి
దండేపల్లి : పశువులకు ఖనిజ, లవణాలు (మినరల్ మిక్చర్) సమపాళ్లలో అందించాలి. లేదంటే అనారోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. ఖనిజ లవణాలు లోపించకుండా అన్ని పోషకాలతో కూడిన మిశ్రమాన్ని కలిపి ఇవ్వాలి. ఈ పోషకాలు లోపిస్తే రక్తహీనత, సరైన శరీర ఎదుగుదల ఉండకపోవడం..ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, ఎదకు రాకపోవడం, మూగఎద, తిరిగిపొర్ల డం, పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని లక్సెట్టిపేట పశుసంవర్ధకశాఖ అదనపు సహాయ సంచాలకులు వీరయ్య వివరించారు. పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర కీలకం పశువు ఆరోగ్యంలో ఖనిజ, లవణాల పాత్ర ఎనలేనిది. పశువు శరీరం సక్రమంగా పనిచేయడానికి పిండి పదార్థాలు, మాంసకృతులతోపాటు కొద్ది పరిమాణంలో ఖనిజ, లవణాలు, విటమిన్లు అవసరమవుతాయి. మొక్కలు, పశువుల్లో సుమారు 40శాతం ఖనిజ, లవణాలు ఉండగా వాటిలో 15శాతం మాత్రమే ప్రధానంగా అవసరమవుతాయి. పశువు శరీరంలో ఉండే పరిమాణం బట్టి స్థూల, సూక్ష్మపోషకాలుగా విభజించారు. శరీరానికి ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే స్థూల ఖనిజ , లవణాలైన కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం క్లోరిన్, పోటాషియం, తక్కువ మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ ఖనిజ లవణాలైన కాపర్, కోబాల్ట్, ఐరన్, జింక్, మాంగనీస్, అయోడిన్, సెలీనియం, ప్లోరిన్, మాలిబ్దమ్, క్రోమియం. ఖనిజ, లవణాల విధులు.. ఖనిజ, లవణాలు విడిగా కాకుండా ఇతర లవణాలతో కలిసి విధులు నిర్వహిస్తాయి. శరీరం లో జరిగే వివిధ జీవన ప్రక్రియలకు ఎంజైమ్‌లకు మధ్యవర్తిగా పనిచేస్తూ, సమతుల్యాన్ని కాపాడుతాయి. శరీరంలోని అన్ని రకాల ఎముకలు, దంతాల ఎదుగుదలకు, వాటి పటిష్టానికి , వెంట్రుకలు తయారీలో ఉపయోగపడతాయి. పశువు జీర్ణ ప్రక్రియ రక్త కణాల్లో హిమోగ్లోబిన్, తయారీ, రక్తం గడ్డకట్టుటకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తి లోనూ, పునరుత్పత్తి, హార్మోన్స్, ఎంజైమ్‌ల తయారీలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తకణాల అభివృద్ధికి తోడ్పడతాయి. స్థూల పోషక లోపాలు- లక్షణాలు కాల్షియం : ఈ లవణం లోపిస్తే పునరుత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపకపోయినా.. చూడి పశువుల్లో ‘మయ్య’(ఈనక ముందు, ఈనిన తర్వాత) సరిగా ఈన లేకపోవడం, ఈనిన తర్వాత పాల జ్వరం రావ డం జరుగుతుంది. మయ్య వేయకపోవడంతో పాల ఉత్పత్తి తగ్గుతుంది. లేగ దూడల్లో ఎముకలు అసమానంగా పెరుగుట వల్ల రికెట్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. పెద్దపశువుల్లో ఎముకలు బలహీనపడి ‘అస్టియోషి మలేషియా’ వస్తుంది. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, పప్పుజాతి గడ్డిలో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాస్పరస్ : దీని లోపంతో యుక్త వయస్సు పశువుల్లో రికెట్స్, పెద్దపశువుల్లో ‘అస్టియో మలేషియా’ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా మట్టి నాకుతాయి. తద్వారా ఆకలి మందగిస్తుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. పెరుగుదల లోపిస్తుంది. పెయ్యలు ఆలస్యంగా యుక్త వయస్సుకు వస్తాయి. కొన్నింటిలో మూగ ఎద, మరి కొన్నింటిలో పూర్తిగా ఎదకు రాక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈతల మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది. చూడిశాతం తక్కువగా ఉండడం.. తిరిగి పొర్లడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎముకల పొడి, ఎండు చేపల దాణా, తవుడు , తృణధాన్యాలలో పాస్పరస్, అధికంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్ ఎప్పుడు 2:1 నిష్పత్తిలో ఉండాలి. మెగ్నీషియం : ఈ లోపంతో ‘మెగ్నీషియం టెంటాని’ సంభవించి పశువు నీరసంగా ఉంటుంది. కేవలం పాలతోనే పెరిగే దూడల్లో మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. గోధుమలు, తవుడు, పప్పు జాతి పశుగ్రాసాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. సోడియం, క్లోరిన్ : దీని లోపం పెద్దగా పైకి కనిపించదు. ఒకవేళ ఇది లోపిస్తే పశువుల్లో ఆకలి మందగిస్తుంది. పెరుగుదల ఉండదు. ఈ రెండు ఖనిజాలు ఉప్పు రూపంలో ఇవ్వవచ్చు. పోటాషియం : దీని లోపం అరుదుగా ఉంటుంది. ఇది లోపిస్తే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి త గ్గి లేగ దూడల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. సూక్ష్మ పోషక లోపాలు-లక్షణాలు కాఫర్ : దీని లోపంతో పశుల్లో రక్తహీనత, వెంట్రుకలు రంగు మారుట, పెరుగుదల మందగించడం, నాడీ మండల వ్యాధులు, కండరాల బలహీనత, విరేచనాలు, పునరుత్పత్తి సమస్యలు, ఎదకు రాకపోవడం, ఆలస్యంగా యుక్త వయస్సుకు రావడం, తిరిగి పొర్లడం, మూగ ఎద లక్షణాలు కనిపిస్తాయి. గేదెల్లో శరీరంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. గోధుమలు, తవుడు లో కాఫర్ అధికంగా ఉంటుంది. కోబాల్ట్ : ఈ దాతు లోపంతో పశువుల్లో ఆకలి, మందగించి రక్తహీనత ఏర్పడుతుంది. చర్మం బిరుసుగా ఉంటుంది. గేదెలు, ఆవుల్లో ఈతల మధ్య ఎక్కువ విరామం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ : దీని లోపం కేవలం పాల మీద మాత్రమే ఆధార పడే లేగదూడల్లో కనిపిస్తుంది. రక్త హీనత ఏర్పడుతుంది. పప్పు జాతి పశుగ్రాసాల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. జింక్ : దీని లోపంతో పశువుల్లో ఎదుగుదల స్తంభిస్తుంది. చర్మవ్యాధులు, వెంట్రుకలు రాలుట అధికమై పశువులు మృత్యువాత పడతాయి. తువుడు, పిండి చెక్కల్లో జింక్ అధికంగా ఉంటుంది. అయోడిన్ : ఇది థైరాయిడ్ గ్రంథిలో ఉండి థైరాక్సిడ్ అనే హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరిగి ‘గాడర్’ అనే వ్యాధి సోకుతుంది. చూడి పశువులకు వెంట్రుకలు లేని, బలహీనమైన దూడలు జన్మిస్తాయి. పునరుత్పత్తి సమస్యతో ఎదకు రాకపోవడం, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మాంగనీసు : దీని లోపంతో పెరుగుదల మందగిస్తుంది. గర్బస్రావం జరుగుతుంది. ఎదకు రాకపోవడం, అండం ఆలస్యంగా విడుదల కావడం.. చూడి కట్టక పోవడం, మూగ ఎద లక్షణాలు, లేగ దూడల్లో కీళ్ల వాపు వస్తాయి. తవుడు, పశుగ్రాసాలు, ఎండు గడ్డిలో మాంగనీసు అధికంగా లభిస్తుంది. సెలీనియం : దీని లోపం వలన కీళ్లు గట్టిపడుతాయి. పశువులు కుంటుతాయి, శరీరం మీద, తోక వెంట్రుకలు రాలిపోతాయి. కండరాల బలహీనత, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పొదుగు వాపు వ్యాధులు కూడా వస్తాయి. క్రోమియం : ఈ ఖనిజ లోపంతో పశువుల్లో పెరుగుదల స్తంభిస్తుంది. కంటి సమస్యలు తలెత్తుతయి. ప్లోరిన్ : ఎముకలు, దంత నిర్మాణానికి ఇది కొంత మోతాదులో అవసరమవుతుంది. ఈ ఖనిజ లోపంతో ఏర్పడే సమస్యలు అరుదుగా ఉంటాయి. మారిబ్దనమ్ : వీటి లోపంతో పశువులు నీరసంగా ఉంటాయి. శరీరంపై గల వెంట్రుకలు బిరుసుగా మారతాయి. నేల ప్రభావంతో.. పశుగ్రాసాలు సాగుచేసే నేలలో ఖనిజ, లవణాలు లోపిస్తే ఆ నేలలో సాగు చేసిన మేతను తిన్న పశువులో ఆయా ఖనిజ లవణాల లోపాలు కనిపిస్తాయి. పశుపోషకులు ఈ పద్ధతులు పాటిస్తే పశుసంపద వృద్ధి చెంది ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. -
జాగ్రత్తలతో జామ సాగు.. బాగుబాగు
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుమారు 600 ఎకరాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. మద్దిపాడు మండలంలోని ఇనమెనమెళ్లూరు, కీర్తిపాడు, చుట్టుపక్కల గ్రామాల్లో పంట సాగవుతోంది. తీరప్రాంత మండలాలైన కొత్తపట్నం, చిన్నగంజాం, పందిళ్లపల్లి, వేటపాలెం మండలాల్లో కూడా జామ సాగులో ఉంది. ప్రస్తుతం తోటలు పూత, పిందె, కాయ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లోనే పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణ చర్యల గురించి ఉద్యాన శాఖ ఏడీ పి.జెన్నెమ్మ (83744 49051) వివరించారు. పండు ఈగ.. కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉృదతి ఎక్కువగా ఉంటుంది. 2 మిల్లీ లీటర్ల మిథైల్యూజినాల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేయాలి. ఒక్కో ప్లాస్టిక్ పళ్లెంలో 200 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి. తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వాటిని వేలాడదీయాలి. మగ ఈగలు ఆకర్షణకు గురై ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మిల్లీలీటర్ల మలాథియన్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో పండు ఈగ ఆశించి రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి. తెల్లదోమ.. తెల్లదోమ ఆకులపై చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను రాత్రివేళల్లో తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి. వేప నూనె 0.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సమస్య పరిష్కారమవుతుంది. పిండినల్లి.. కొమ్మల చివర కాయలను ఆశించి రసాన్ని పీలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వస్తుంది. వీటి నివారణకు అక్షింతలు పురుగు బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ గ్రాము, లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీ లీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
భయపెడుతున్న వర్షాలు
ముందస్తు నూర్పిడి కృత్తివెన్ను : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గురువారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో ఆందోళన మరింత పెరింగింది. ప్రస్తుతం వరిచేలు అధికశాతం పాలు పోసుకుంటున్న, పొట్ట దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఏమాత్రం గాలులు వీచినా, భారీ వర్షం పడినా పంట నీటిపాలవుతుందని రైతులు భయపడుతున్నారు. మండలంలో చాలా చోట్ల రబీ విత్తనాల కోసం కోసిన వరి పంటను పూర్తిగా ఎండకుండానే రైతులు హడావుడిగా నూర్చుకున్నారు. జి.కొండూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులను కలవర పెడుతోంది. పంటలు చేతికి అందే సమయంలో కురుస్తున్న ఈ వర్షాలతో నష్టమేనని రైతులు భయపడుతున్నారు. తీతలకు సిద్ధంగా ఉన్న పత్తితో పాటు కోత దశకు చేరుతున్న వరి, టమోటా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముమ్మరంగా పత్తి తీతలు నియోజకవర్గంలో జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మొదటి తీతలు పూర్తవుతున్నాయి. తీతలు ముమ్మరంగా సాగుతున్న గ్రామాల్లో పత్తి కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎకరాకు సుమారుగా ఐదు క్వింటాళ్ల వరుకు పత్తి దిగుబడి వస్తోంది. కొన్ని పొలాల్లో పత్తి తీతకు సిద్ధంగా ఉండగా, మరి కొన్ని పొలాల్లో కాయలు పగిలే దశలో ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పడుతున్న ఈ వర్షాలకు పత్తి పూర్తిగా దెబ్బతినటంతో పాటు మొక్క కింది భాగంలోని కాయలు కుళ్లిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు ముందు తీసిన పత్తి క్వింటాకు గరిష్టంగా రూ.3500లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని, వర్షాలకు ధర మరింత తగ్గించి అడుగుతారని రైతులు పేర్కొంటున్నారు. కోత దశకు చేరుకుంటున్న వరి... ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, రెడ్డిగూడెం మండలాల్లో చెరువులు, బోర్ల కింద ముందస్తుగా సాగు చేసిన వరి చేలు కంకి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో పడుతున్న వర్షాలకు పైరు నేలవాలి, కంకులపై నీరు చేరితే పూర్తిగా దెబ్బతింటామని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు సంవత్సరాల నుంచి వరి కోత దశకు చేరుకుంటున్న తరుణంలో కురుస్తున్న వర్షాల కారణంగా పైరు నేల వాలి దెబ్బతింటోందని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు వాపోయారు. మరో వైపు టమోటా కోతలు ప్రారంభమయ్యాయి. తేలికపాటి నేలల్లో సాగయ్యే ఈ పంటకు నేలలో తేమ అధికమైతే మొక్కలు వడలి చనిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కోట్లు వద్దు..వ్యవసాయమే ముద్దు
ఆదిబట్ల: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం మమ్‌రాజిగూడ. ఇక్కడ దాదాపు 480 ఎకరాల వరకు భూమి ఉంది. ఈ భూములలో రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదిబట్లలో రియల్టీ ఓ ఊపు ఊపుతున్న ఈ గ్రామ వాసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ ఒక్కరు కూడా తమ వ్యవసాయ భూములను అమ్మడానికి ఎలాంటి ఆసక్తి చూపడం లేదుజ అప్పట్లో సరూర్‌నగర్ మండలం నాదర్గుల్, అల్మాస్గూడ గ్రామాలకు చెందిన కొంత మంది ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్నారు. గుర్రంగూడలోని ఎవియేషన్ అకాడమీ ఏర్పాటుతో అక్కడ వ్యవసాయ భూములు కోల్పోయినవారు వచ్చిన పరిహరంతో 1957లో ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల సమీపంలో భూములు కొని వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. ఈ గ్రామంలో దాదాపు 40 కుటుంబాలున్నాయి. వారందరూ రైతులే కావడం విశేషం. గ్రామంలో ఎటు చూసినా పచ్చని పంటలతో పొలాలు కళకళలాడుతుంటాయి. ఈ గ్రామంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండడానికి మహేశ్వరం మండలంలోని రావిరాల చెరువు ప్రధాన కారణం. ఇక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయం మూడు పూవ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. రియల్టర్లకు అందని గ్రామం ఆదిబట్ల గ్రామం పలు కంపెనీల రాకతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల రాకతో రియల్ వ్యాపారం పుంజుకుంది. ఇంకా రియల్ వ్యాపారులు ఈ ప్రాంతంలో భూములు కనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిబట్ల గ్రామం చుట్టుపక్కన భూములను ఇప్పుడు రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆదిబట్ల అనుబంధ గ్రామమైన మమ్‌రాజిగూడ వైపు మాత్రం రియల్ వ్యాపారుల తాకిడి లేదు. ఎందుకంటే ఇక్కడి రైతులు మట్టినే నమ్ముకొని పంటలనే ప్రాణంగా చుసుకొని నివసిస్తున్నారు. కోట్లు వద్దు వ్యవసాయమే ముద్దు అంటున్నారు. ఇక్కడ భూములకు రెండు నుంచి మూడు కోట్ల ధరలు పలుకుతున్నా .. అయినా వ్యవసాయమే జివనాధరం అని తేగేసి చేబుతున్నారు. ఆదిబట్ల గ్రామంలో భూములు వెంచర్లుగా మారిన తరువాత రియల్ వ్యాపారుల కన్ను ఆదిబట్ల అనుబంధ గ్రామమైన మమ్రాజ్గూడపై పడింది. రైతులకు ఆశలు రేపే పనిలో రియల్ వ్యాపారులు పడ్డారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు రైతన్నలకు భారీ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా భూములు అమ్మడానికి ససేమిరా అంటున్నారు ఇక్కడి రైతులు. -
శ్రేష్టమైన పశుగ్రాసం ‘న్యూట్రిఫీడ్’
విత్తుకునే విధానం: న్యూట్రిఫీడ్ను అన్ని రకాల నేలల్లో విత్తుకోవచ్చు. దీని వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైన పిలకలు వచ్చేం దుకు విత్తనాలను 2-3 సెంటీ మీటర్లు లోతులో వేయాలి. మొక్కకు మొక్కకు మధ్య సుమారు 25 సెంటీమీటర్ల దూరం, సాలుకు సాలుకు మధ్య సుమారు 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలాగైతే మొదటి కోత అనంతరం ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి పారుదల: న్యూట్రిఫీడ్ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అయినా తేలిక నేలల్లో 5-7 రోజులకు ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజులకు ఒక తడి నీటి అవసరం ఉంటుంది. లాభాలు: న్యూట్రిఫీడ్ తినడం ద్వారా పశువులు ఎక్కువ రోజులు పాలిస్తాయి. పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఈ పశుగ్రాసం తినడం ద్వారా పశువులు సరైన సమయంలో గర్భధారణ అవుతాయి. ఇతర దాణా ఖర్చులు తగ్గుతాయి. విత్తిన సమయంలో మంచి ఎరువులు వేసుకుంటే 40 రోజుల్లో మొదటి దఫా కోతకు వస్తుంది. ప్రతి కోత తర్వాత ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకుంటే ఆరోగ్యవంతమైన పశుగ్రాసం పెరుగుతుంది. -
సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడులు
జోగిపేట: సేంద్రియ ఎరువులతోనే మంచి ఫలితాలు ఉంటాయని సెర్ప్ నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం) రాష్ట్ర డెరైక్టర్ డి.వి.నాయుడు అన్నారు. గురువారం అందోలు మండలం పరిధిలోని నాదులాపూర్, నేరడిగుంట గ్రామాల్లో పర్యటించారు. ఈ ఎరువుల వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వస్తాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడుతూ పంటలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రసాయన ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న నాదులాపూర్ గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య పొలాన్ని సందర్శించారు. ఆయన పండిస్తున్న పాలకూర, కొత్తిమీర, బీర తదితర పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు తయారు చేసుకున్న అజోలాను పరిశీలించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నాడెపు కంపోస్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఫెర్టిలైజర్ వాడకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. డీపీఎం వాసుదేవ్, ఏపీఎం సీఎంఎస్ఏ సంగీత, ఏపీఎం విశ్వేశ్వర్‌గౌడ్, సీఏ చెన్నయ్య, సీఆర్పీ రమేశ్, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామమ్మ భూమయ్య, వైస్ ఎంపీపీ రమేష్ , సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ సభ్యురాలు నల్లోల బాలమ్మ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
వ్యవసాయంలో.. ఆవుసాయం!
విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల సాగు ఖర్చు విపరీతంగా పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారని స్తంభాద్రిరెడ్డి అన్నారు. భూసారాన్ని పెంచడం, ఆచ్ఛాదన (మార్చింగ్), సహజ వనరులతో కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేయడం వల్ల పంట ఉత్పత్తులు విషతుల్యం కావన్నారు. రసాయన ఎరువులు వాడిన ధాన్యాన్ని తినడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ట్రస్టు వ్యవ స్థాపకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాతలకు తమ వంతు సాయంగా ఏదైనా చేయాలనే తలంపుతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, వ్యవసాయశాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డెరైక్టర్ సుధాకర్, జాన్‌లు పుడమి పుత్రులకు సాగుపై సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ పిండి కనకయ్య పాల్గొన్నారు. భూసారం పెంపునకు పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వాడాలి. జీవన ఎరువులు, ఘన, ద్రవ ఎరువులు తయారు చేసుకోవాలి. పొలాల్లో చెరువు మట్టిని వేసుకోవాలి. అంతర పంటలు సాగు చేయాలి. భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను రక్షించుకునేందుకు పంట వ్యర్థాలను వాడటంతో పాటు మిశ్రమ పంటలు సాగు చేయాలి. చీడపీడలు సోకిన చేలపై ఆవు పెడ, మూత్రంతో కొన్ని మిశ్రమాలు కలుపుకొని నిమ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్రి అస్త్రం, భీజామృతం, పుల్లటి మజ్జిగ, సొంటి పాల కషాయం తయారు చేసుకోవాలి. కషాయాల తయారీ జీవామృతం... 5 కిలోల ఆవు పేడను పల్చటి గుడ్డలో కట్టి 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల ఆవు పంచకం, 50గ్రాముల సున్నం, గుప్పెడు మట్టిని కలిపి 12 గంటల వరకు నానబెడితే ఎకరాకు కావాల్సిన జీవామృతం సిద్ధమవుతుంది. వరి, ఉల్లి, మిరప, టమాట, వంగ తదితర పంటలు వేసుకునే ముందు విత్తనాలను వీటిలో ముంచి విత్తుకుంటే తెగుళ్లను బాగా తట్టుకుంటాయి. ఘన జీవామృతం పంటకు కావలసిన సూక్ష, స్థూల పోషకాలు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసులు (రైతులు పండించినవి), గుప్పెడు మట్టిని ఆవు మూత్రంతో తడిపి 7 రోజుల పాటు నీడలో ఆరబెడితే ఘనజీవామృతం రెడీ అవుతుంది. 20 కిలోల ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. పంట వేసిన నెల నుంచి రెండు నెలల కాలంలో సాళ్ల మధ్య వేయాలి. ద్రవ జీవామృతం... పంటకు అవసరమైన పోషకాలను అందజేయడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల గోవు మూత్రం, 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం, 2 కిలోల రైతులు పండించిన పప్పు దినుసులు, గుప్పెడు మట్టిని కలిపి 4 రోజులు పులియబెట్టాలి. దీనిని డ్రిప్పు ద్వారా, స్పే చేయడం ద్వారా పంటలకు అందించవచ్చు. నిమ్మాస్త్రం... రసం పీల్చే పురుగు, చీడపీడల నివారణకు బా గా పనిచేస్తుంది. 10 కిలోల వేపాకును మెత్తగా రుబ్బి 10 లీటర్ల గోమూత్రం, 2 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి 48 గంటలు ఆరబెట్టి పంటలపై పిచికారీ చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం... పంటలను తిని నష్టం చేసే పురుగుల నివారణకు దీన్ని వాడొచ్చు. 10 లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల వేప ఆకు, 2 కిలోల సీతాఫల ఆకులు, 2 కిలోల ఆముదం ఆకులు, 2 కిలోల కత్తెర ఆకులు, 2 కిలోల బొప్పాయి ఆకు, 2 కిలోల ఉమ్మెత్త ఆకులు, 2 కిలోల జామ, 2 కిలోల వయ్యారిభామ ఆకులను మెత్తగా నూరి నీటిలో ఉడికించాలి. ఎకరాకు 2.5 లీటర్లు, 100 లీటర్ల నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి. అగ్ని అస్త్రం... కాండం, కాయతొలుచు పురుగు నివారణకు దీన్ని వాడాలి. మట్టి కుండను తీసుకుని 15 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో వెల్లుల్లి, 500 గ్రాముల పచ్చిమిర్చి, 500 గ్రాముల వేపాకు, పొగాకును వేసి వేడి చేయాలి. పురుగు ఆశించిన పంటకు 100 లీటర్ల నీటికి 3 లీటర్ల మిశ్రమాన్ని కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ... ఆకు మచ్చ, కాయమచ్చ, బూజు తెగులు నివారణకు ఉపకరిస్తుంది. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను 100 లీటర్ల నీటిలో కలిపి మూడు రోజులు పులియబెట్టాలి. పురుగు ఆశించిన పంటను 20, 40 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సొంటి పాల కషాయం... అన్ని రకాల తెగుళ్ల నివారణకు దీన్ని వాడుకోవచ్చు. 200 గ్రాముల సొంటిని మెత్తగా నూరి నీటిలో మరిగించాలి. 2 లీటర్ల ఆవు పాలు లేదా మజ్జిగలో వేసి రెండిటికి కలిపి మరిగించాలి. అదే రోజు పంటపై పిచికారీ చేయాలి. పంచగవ్య... మొక్కలు ఆరోగ్యంగా పెరిగి తెగుళ్ల దాడిని తట్టుకునేందుకు వాడాలి. 5 కిలోల ఆవుపేడ, 3 లీటర్ల గోమూత్రం, 2 లీటర్ల ఆవుపాలు, 2 లీటర్ల పెరుగు, 500 గ్రాముల నెయ్యి, 1 కిలో వేరుశనగ పట్టీలు, 12 మాగిన అరటిపండ్లు, 3 లీటర్ల కొబ్బరి నీళ్లు, 3 లీటర్ల చెరుకు రసం, లేదా బెల్లం, 3 లీటర్ల కల్లును కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో 20 రోజులు పులియనివ్వాలి. 100 లీటర్ల నీటిలో మిశ్రమాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పిచికారీ చేయాలి. -
‘మల్బరీ’కి మంచి రోజులు
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో మల్బరీ తోటలు సాగే చేసే రైతులకు మంచి రోజులొచ్చాయి. మల్బరీ తోటల సాగును ఉపాధి హామీ పథకానికి అనుసంధానించారు. దీంతో సన్న, చిన్నకారు, బలహీన వర్గాల రైతులకు మేలు జరగనుంది. మల్బరీ సాగుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక వెనుకంజ వేసిన చిన్న, సన్నకారు రైతులు ఇప్పుడు ముందుకొస్తున్నారు. పథకం కింద పొలం దున్నడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు యజమానికే ఉపాధి హామీ పథకం కింద కూలి డబ్బులు చెల్లించనున్నారు. ఎకరం పొలం ఉన్న రైతుకు మూడేళ్లలో రూ.1.63 లక్షలు, రెండు ఎకరాలు ఉన్న రైతుకు రూ.3.26 లక్షలు మంజూరు చేస్తారు. మొదటి ఏడాది రూ.63 వేలు, రెండో ఏడాది రూ.50 వేలు, మూడో సంవత్సరం మరో రూ.50 వేలు మంజూరవుతాయి. ఈ ఏడాది నుంచే ఈ పథకం ప్రారంభించారు. ఒంగోలు, మార్కాపురం డివిజన్లలోని కనిగిరి, పొన్నలూరు, చీమకుర్తి, కొనకనమిట్ల, అద్దంకి, ముండ్లమూరు ప్రాంతాల్లో మల్బరీ తోటలు ఎక్కువగా సాగు చేస్తారు. సొంత పొలం, నీటి వసతి కలిగి, జాబ్ కార్డు ఉన్న రైతులను క్షేత్ర స్థాయిలో ఇప్పటికే 120 మందిని గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 800 మంది రైతుల వరకు మల్బరీ తోటలు సాగు చేస్తున్నారు. వీరిలో పెద్ద రైతులే అధికంగా ఉన్నారు. సన్న, చిన్నకారు రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆసక్తి కలిగి, అర్హులైన రైతులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. కేవలం ఒకటి లేక రెండు ఎకరాలు ఉన్న రైతులకు వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే 8 జిల్లాల్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రకాశం జిల్లా కూడా ఉంది. ప్రయోజనాలు ఇవీ.. అర్హులకే పథకం వర్తింపు ఒకసారి ఈ పథకం కింద ఎంపికైతే మూడేళ్లు లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతు తన పొలంలో తాను చేసుకునే పనికి కూలి దక్కుతుంది. పొలం దున్నకం, మొక్కల ఖరీదు, నాటుకోవడం వంటి వాటికి ఏ రోజుకారోజుకు సంబంధించి పట్టు పరిశ్రమ శాఖ అధికారులు గుర్తించి డ్వామా సిబ్బందికి తెలియజేస్తారు. ఎరువులు, పురుగు మందుల ఖరీదు, సస్యరక్షణ చర్యలకు ఎప్పటికప్పుడు నగదు అందజేస్తారు. నగదు రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు సొంత డబ్బులు పైసా ఖర్చు కావు. నెలనెలా ఆదాయం వచ్చే పంట కావడం వల్ల గ్రామీణ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుపరిశ్రమ శాఖ ఏడీ సీహెచ్ చిత్తరంజన్ శర్మ తెలిపారు. -
మేలైన పద్ధతులతో పశుపోషణ పండగే..
చీరాల : పాడి పశువుల పోషణలో ఆశించిన లాభాలను గడించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించాలని అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. దాణా ఖర్చులు తగ్గించుకోవడం, పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య పరిరక్షణ ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. పశుపోషణపై ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు. తాగునీటి యాజమాన్యం.. పాడిపశువులకు ఎప్పుడూ పరిశుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి. రోజూ నీటి తొట్టెలను శుభ్రం చేయాలి. 15 రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్‌తో నీటి తొట్టెలను శుభ్రపరచాలి. మురుగు నీరు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగించకూడదు. ఈ నీటిలో హానికర బ్యాక్టీరియా, నట్టలు ఉండడం వల్ల పారుడు వ్యాధి సోకవచ్చు. పోషణ.. రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడి పశువుకు రోజూ 20 కిలోల పచ్చిమేత, 7 కిలోల ఎండుమేత, కిలో దాణా ఇవ్వాలి. 3 లీటర్ల పాలు ఇచ్చే వాటికి 2 కిలోల దాణా అదనంగా ఇవ్వాల్సిఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమం రోజూ 50 గ్రాముల చొప్పున దాణాలో కలిపి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పచ్చిమేత లభించని సమయంలో పాతరగడ్డి, సుపోషకం చేసిన వరిగడ్డిని వాడుకోవాలి. గడ్డిని కట్టర్ ద్వారా ముక్కలుగా చేసి పశువులకు వేయడం ద్వారా వృథాను అరికట్టవచ్చు. పునరుత్పత్తి సామర్థ్యం.. పాడిపశువుల పెంపకంలో లాభదాయకత పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈతకు-ఈతకు మధ్య 13-14 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు. పశువు ఈనిన 90-120 రోజుల మధ్య కాలంలో ఎదకు వస్తుంది. ఈ ఎద చాలా ఫలప్రదమైంది. చాలామంది రైతులు ఈ సమయంలో గేదెను దాటిస్తే పాల ఉత్పత్తి తగ్గిపోతుందనే భ్రమతో ఆ ఎదను ఉపయోగించుకోరు. దీంతో కొన్ని పశువుల్లో గర్భకోశం నిద్రావస్థలోకి వెళ్లి మళ్లీ ఎద లక్షణాలు వెంటనే కనిపించవు. పూర్తిగా పాల ఉత్పత్తి తగ్గిన తర్వాత మాత్రమే పశువు ఎదకు రాలేదన్న సంగతి గుర్తించి, ఎద వచ్చేందుకు మందులు వాడుతారు. కొందరు పశుపోషకులు ఈ సమయంలో అలాంటి పశువులను అమ్మేయడమో లేక కబేళాకు తరలించడమో చేస్తుంటారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ విధంగా కబేళాలకు తరలించే పశువుల్లో 8-12 శాతం పశువులు చూడివిగా ఉంటున్నాయి. పునరుత్పత్తి యాజమాన్యంపై రైతులకు అవగాహన లేమితో ఈ ఘోరం జరుగుతోంది. ఏమి చేయాలి.. పాడి పశువు ఈనిన 90-120 రోజుల మధ్య వచ్చే ఎదలో పశువును కచ్చితంగా కట్టించాలి. 3 నెలల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. చూడి నిర్ధారణ అయితే మరో 4 నెలల (అంటే 7 నెలలు చూలు వచ్చేంత వరకు) పాలు పిండుకోవాలి. ఆ తర్వాత చివరి మూడు నెలలు చూడి గేదెకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా 10 నెలలు (300 రోజులు) పాల ఉత్పత్తిని పొందినట్లయితే మరో 3 నెలల తర్వాత గేదెమళ్లీ ఈని పాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇది లాభదాయకం. -
చేదెక్కిన చెరకు సాగు
మోర్తాడ్ : అందరికీ తీపిని పంచే చెరకును సాగు చేసే రైతుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో ఫలితంగా చెరకు సాగు అంతరించిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెల్లో ఒకప్పుడు చెరకు పంట అత్యధికంగా సాగయ్యేది. పం టపండిన తర్వాత చెరకును నరకడానికి వచ్చే కూలీలు, ఫ్యాక్టరీకి పంటను తరలించడానికి వినియోగించే వాహనాలతో పల్లెలు కళక ళలాడేవి. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో బాల్కొండ నియోజకవర్గం ఉండేది. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 హెక్టార్లలో చెరకును సాగు చేసేవారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పండించే చెరకును ముత్యంపేట్ ఫ్యాక్టరీకి తరలించేవారు. చెరకుకు గిట్టుబాటు ధరను కల్పించకపోవడం, క్రషింగ్‌కు తరలించిన పంటకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురయ్యాయి. చెరకు సాగుకు ప్రోత్సాహం కరువు కావడంతో రైతులు ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం మొదలు కాగా చివరకు పూర్తి గా పంట అంతరించిపోయింది. ఇప్పటి తరం వారికి చెరకు గడల రుచి తెలియదంటే అతిశయోక్తి కాదు. చెరకు పంట సాగు చేయడం వల్ల కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు, చెరకు రుచులు ప్రజలకు అందేవి. చెరకును పంచదార తయారీ కోసమే కాకుండా చెరకు ఆకులు, గడలను శుభ కార్యాలకు ఇండ్లలో వినియోగించేవారు. ఆరేళ్లు చెరకు పంట అంతరించిపోయినా పంటను సాగు చేయించడంపై ముత్యంపేట ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టిని సారించలేదు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో కొనసాగిన చెరకు కార్యాలయాలనూ ఎత్తివేశారు. -
తడులిస్తే మక్క మస్తు
ఖమ్మం వ్యవసాయం: రబీలో మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించేందుకు సాగునీటిని సక్రమంగా పారించాలి. మొక్కలకు నీరు, సూర్యరశ్మిని పెరుగుదలకు అనుకూలంగా ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. తడుల మెలకువలను జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) చెబుతున్నారు. విత్తేముందు జాగ్రత్తలు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. విత్తనం నీటిని గ్రహించి దాదాపు రెండింతల బరువు పొందిన తరువాత మొలకెత్తుతుంది. మొక్కజొన్న అధికనీరు(నీటి ముంపు) లేక బెట్ట(నీటి ఎద్దడి) పరిస్థితులను తట్టుకోలేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపునకు గురైతే అంకురోత్పత్తి శాతం తగ్గుతుంది. పైరు లేత దశలో (విత్తిన తరువాత 30రోజుల వరకు) నేలలో నీరు నిలువ ఉంకుండా జాగ్రత్త పడాలి. నీటిముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపు పచ్చగా మారి, పెరుగుదల తగ్గి దిగుబడి పడిపోతుంది. నేలలో మురుగు నీరు పోయే విధంగా చూసుకోవాలి. లేదా బోదెసాళ్ల పద్ధతులను పాటించాలి. తేమ సున్నిత దశలు పంట మోకాలెత్తు దశ, పూతదశ, గింజపాలుపోసుకునే దశ, గింజనిండే దశ. విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందొచ్చు. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పుష్పించు దశలు ఆలస్యమవుతాయి. మొక్క 30-40 సెం.మీ ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువ. పూత దశలో (జల్లు, పీచు వేసి పరాగ సంపర్కం జరగటం) అత్యధికంగా అంటే రోజుకు 8-12 మి.మీ ఉంటుంది. ఈ దశలోని 15-20 రోజులు మొక్కకు అత్యంత కీలకం. పూతదశ కీలకం పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీడి ఎద్దడికి గురైతే 40-80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజకట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ గింజ గట్టి పడే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. నీటి ఎద్దడి వలన మగపూత దశలో 25 శాతం, ఆడపూత దశలో 50 శాతం పరాగ సంపర్కం తరువాత 21 శాతం గింజ దిగుబడి తగ్గుతుంది. పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టాలి. ఎన్నితడుల నీరు కట్టాలంటే... నీరు సమృద్ధిగా ఉంటే నల్లరేగడి నేలల్లో 5-6 తడులు, ఎర్రనేలల్లో 8 తడుల వరకు అవసరం. ఒకవేళ 6 తడులు ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక తడి మొలక దశ, ఒక తడి పంట మోకాలెత్తు దశ, ఒక తడి పూత దశ, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు, గింజ నిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ 5 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే పంట మొలక దశ ను తీసివేసి మిగతా దశల్లో ఇచ్చుకోవాలి. అదే విధంగా సాగు నీరు 4 తడులకే ఉంటే ఒక తడి మోకాలెత్తు దశలో, ఒక తడి పూత దశలో, రెండు తడులు పూత దశ నుంచి గింజపాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి. -
నల్లరేగడి నేలల్లో శనగ సాగు నయం
కందుకూరు/మొయినాబాద్: రబీలో నల్లరేగడి భూముల్లో రైతులు శనగ పంట సాగుచేసి లబ్ధి పొందవచ్చు. ఈ పంట లెగ్యూమ్ జాతికి చెందిన పంట కావడంతో దీని వేర్లలో రైజోబియం బాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి ఒక హెక్టార్‌కు దాదాపు 140 కిలోల నత్రజనిని అందించి భూసారాన్ని పెంచుతుందని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.ప్రవీణ్ పేర్కొన్నారు. శనగ సాగులో మెలకువలపై రైతులకు ఆయన సలహాలు, సూచనలు అందించారు. వర్షాధారంతోనే గాక చలిలో మంచుతో పెరిగే పంట శనగ . వీలైతే తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. అంతర పంటగా ఆవాలు లేదా ధనియాలు వేసుకుంటే అధిక లాభదాయకం. ఒక పంట దిగుబడి తగ్గినా ఇంకో పంట నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎండు తెగులును తట్టుకునే రకాలు, త్వరగా కాపునకు వచ్చే రకాలు, కాబూలీ రకాలు అనువైనవి. పంట సరాసరి దిగుబడి హెక్టారుకు 1025 కిలోలు మాత్రమే వస్తుంది. దీనికి ముఖ్యకారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, గింజ పట్టే దశలో పంట బెట్టకు గురయ్యే విషయంలో అవగాహన లేకపోవడమే. అవసరమైన ఒకటి రెండు నీటి తడులు ఇచ్చి సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చు. రబీలో శనగ సాగుకు అవకాశాలు.. కారణాంతరాలతో తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు. అధిక వర్షాలకు, బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలు. తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము, సోయాచిక్కుడు) వేసుకుని రెండో పంటగా శనగ వేసుకోవచ్చు. స్వల్పకాలిక వరి రకాల తర్వాత కూడా శనగ పంటకు అవకాశం ఉంది. శనగ పంట ఎత్తు తక్కువగా ఉండటంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక. రకాలు.. క్రాంతి(ఐసీసీసీ-37): పంట కాలం- 100 నుంచి 105 రోజులు. ఎకరాకు దిగుబడి- 8 నుంచి 10 క్వింటాళ్లు. పంట గుబురుగా పెరిగి గింజ మధ్యస్థం లావుగా ఉంటూ ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. శ్వేత (ఐసీసీవీ-2): పంట కాలం- 80 నుంచి 85 రోజులు. దిగుబడి-6 నుంచి 7 క్వింటాళ్లు. త్వరగా కాపునకు వచ్చే రకం. ఎండు తెగుళ్లను తట్టుకొనే కాబూలీ రకం. ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలం. అన్నిగిరి: పంట కాలం-100 నుంచి 110 రోజులు. దిగుబడి-7 నుంచి 9 క్వింటాళ్లు. మొక్క గుబురుగా పెరిగి కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి. కేఏకే-2: పంట కాలం-95-100 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ, కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. జేజీ-2: పంట కాలం-100 నుంచి 105 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. ఎండు తెగులు తట్టుకుంటుంది. లావుపాటి గింజలు గల దేశీ రకం. లామ్ శనగ: పంట కాలం-90 నుంచి 95 రోజులు. దిగుబడి-8 నుంచి 10 క్వింటాళ్లు. లావు గింజ కాబూలీ రకం, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. విత్తనం: ఎకరాకు 20 నుంచి 26 కిలోల విత్తనం అవసరం. ఆలస్యంగా వేసినప్పుడు నవంబర్‌లో విత్తన మోతాదు 20 శాతం పెంచాలి. లావు కాబూలీ రకాలు 40 నుంచి 60 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి: ఎండు తెగులు ఉన్నచోట కిలో విత్తనానికి 4 గ్రా. ట్రెకోడెర్మావిరిడిని వాడితే మంచి ఫలితం ఉంటుంది. రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 10 నుంచి 20 శాతం అధిక దిగుబడి పొందవచ్చు. 8 కిలోల విత్తనానికి ఒక రైజోబియం పాకెట్(200 గ్రా.)వాడాలి. విత్తటం: గొర్రుతో విత్తుకోవాలి. పదును తక్కువగా ఉన్నప్పుడు నాగలితో విత్తుకోవచ్చు. విత్తే దూరం: సాళ్ల మధ్య 30, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా విత్తుకోవాలి. ఎరువులు: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం: శనగ వర్షాధారపు పంట. తేలికపాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి తడులను పెట్టేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూత దశకు ముందు ఒకసారి, కాయ దశలో మరోసారి తడులు ఇవ్వాలి. కలుపు నివారణ: విత్తే ముందు ప్లూక్లోరలిన్ ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి, భూమిలో కలియదున్నాలి. లేదా పెండి మిథాలిన్ ఎకరాకు 1 నుంచి 1.6 లీటర్లతో విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. -
బెండంత అండ!
అనువైన నేలలు సారవంతమైన నీరు నిలిచే తేలికపాటి నేలలు, మురుగు నీరు నిల్వని నల్లరేగడి నేలలు అనుకూలం. సాగు భూమిని 2 నుంచి 4 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి. ఎకరాకు రబీ సీజన్లో 7 నుంచి 8 కిలోలు, ఖరీఫ్‌లో అయితే ఐదు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన రకాలు పర్బనీ క్రాంతి అనే రకం మొక్కలు కొమ్మలు వేయకుండా ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. అర్క అనామిక రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది. అర్క అభయ రకం విత్తనాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సంకర జాతికి చెందిన వర్ష, విజయ్, మహికో హైబ్రిడ్ నంబరు 10, 64, ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, సింజెంటా ఓహెచ్ 597, తులసి తదితర రకాల విత్తనాలు వేసుకోవచ్చు. ఈ రకాల విత్తనాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తాయి. విత్తనశుద్ధి, నాటే విధానం కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేలను 4 నుంచి ఐదు సార్లు దున్నిన తర్వాత బోజెలు వేసుకోవాలి. వీటి మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి. విత్తనం విత్తిన వెంటనే నీటి తడి పెట్టాలి. అనంతరం నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఎరువుల యాజమాన్యం రబీలో సాగు కోసం ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అలాగే భాస్వరం వేసుకుంటే పంట బాగా ఎదుగుతుంది. ఎకరాకు 48 కిలోల నత్రజనిని రెండు విడతలుగా 30 నుంచి 45 రోజుల మధ్యలో వేయాలి. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలో నత్రజని ఎరువును వేసుకోవాలి. పంట పూత దశలో లీటరు నీటిలో 10 గ్రాముల యూ రియా కలిపి పిచికారీ చేయాలి. తద్వారా 25 శాతం వరకు నత్రజని ఆదాతోపాటు అధిక దిగుబడి పెరుగుతుంది. మొవ్వ, కాయ తొలుచు పురుగు విత్తిన 30 రోజుల నుంచి ఈ పురుగు మొక్కలను ఆశిస్తుంది. మొవ్వు, పూత, కాయలను తొలిచి వేయడం ద్వారా నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు మొవ్వు, పూత కాయలకు రంధ్రాలు చేసి లోనికి వెళతాయి. అక్కడి పదార్థాన్ని తినేయడం వల్ల కొమ్మలు వాలిపోవడం, కాయలు పుచ్చులుగా మారడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి. నివారణ చర్యలు... మొవ్వు పురుగుల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్ మందును కలిపి 10 రోజల వ్యవధిలో రెండు సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. శంకు లేదా పల్లాకు తెగులు బెండ పంటపై ఆశించే తెగుళ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. దీనిని వైరస్ తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు గిడసిబారి తెల్లగా మారిపోతాయి. ఆకులు చిన్నవిగా ముడతపడి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. నివారణ చర్యలు... తెగుళ్లను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను అరికట్టవచ్చు. మచ్చతెగులు ఇది సోకితే ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనినే మచ్చతెగులు అంటారు. ఈ తెగులు పెరినోస్లిరోపారా అనే శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎరిసావిటిల్లా అనే రెక్కల పురుగు ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ పురుగు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకులపై మచ్చలు వచ్చినట్లు గుర్తిస్తే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెల్లదోమ, బూడిద తెగులు తెల్లదోమ ఆశిస్తే బెండ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇవి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకితే ఆకుల పైభాగంలో, కింది భాగంలోను బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్, 2 మి.లీ. హెక్సాకోనజోల్ స్ప్రే చేయాలి. -
విత్తనం మనదైతే.. ఆ దిగుబడే వేరబ్బా!
ఒంగోలు టూటౌన్ : రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం.. అవి సరిగ్గా మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా దిగుబడి లేకపోవడం వెరసి అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులే నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకుంటే ఆశించిన దిగుబడి దక్కుతుందని వ్యవసాయశాఖ జిల్లా సంచాలకుడు జే ముర ళీకృష్ణ పేర్కొన్నారు. మేలైన విత్తనం వాడితే.. జన్యు, స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి ఉండటంతో పాటు అధిక దిగుబడిని ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మేలైన విత్తనం వాడితే 20 శాతం నుంచి 25 శాతం అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది. విత్తనాల్లో రకాలు విత్తనాల్లో సూటి, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ఏటా తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటగా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు తమ విత్తనాలను ప్రతి మూడు, నాలుగేళ్లకోమారు మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను మార్చే సమయంలో ధ్రువీకరించిన విత్తనాలు ఎంచుకోవాలి. హైబ్రిడ్ రకాలంటే ఏటా ఆడ, మగ రకాలను సంకరపరిచి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలు అంతగా పనికిరావు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విత్తనం తయారీ ఇలా.. స్వపరాగ సంపర్కం జరిగే పంటలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చేసుకుంటే విత్తనంపై పెట్టుబడి తగ్గడంతో పాటు మేలు రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదై ఉండాలి. మురుగు నీరు నిల్వ ఉండకూడదు. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాలు సాగవుతున్న పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదలచిన పొలానికి నీరు పెడితే అంతకు ముందు పండించిన పంట రకం మొలకెత్తుతుంది. వాటిని గొర్రు, గుంటకతో నాశనం చేయాలి. పొలంలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. మొక్క ఎదిగేటప్పుడు పూత, గింజ గట్టిపడే దశలో ఏరిపాయాలి. ఎత్తులో తేడాలున్నా ఆకుల రంగు, ఆకారం, అమరిక సరిగా లేకున్నా వెంటనే గుర్తించి తొలగించాలి. ఏ విత్తనమైనా నారు పోసే ముందు విత్తన శుద్ధి తప్పని సరి. రైతులు తమ పంట నుంచి గానీ లేదా బాగా పండించిన ఇతర రైతుల నుంచి గానీ విత్తనాలు సేకరించి నిల్వ చేసుకోవాలి. -
గొర్రెలకు బీమాతో రైతుకు ధీమా
శామీర్‌పేట్: ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికైనా, పశువుకైనా బీమా తప్పనిసరి అయ్యింది. జీవాలు మృతి చెందితే వచ్చే భీమా సొమ్ముతో రైతులు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు. గొర్రెలు, మేకల పెంపకం దారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూడుచింతలపల్లి పశువైద్యుడు తిరుపతి సూచించారు. భీమా పథకం వివరాలు ఆయన మాటల్లోనే... వ్యవసాయ అనుబంధ రంగంగా పలువురు జీవాలను పోషిస్తున్నారు. కొందరు కేవలం పెంపకాన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. మండలంలో 19,081 గొర్రెలు, 6,844 మేకలు ఉన్నాయి. మేకలు ఆకులు అలుమలు తిని కొద్దిమేరకు రోగాలను తట్టుకుంటాయి. కానీ గొర్రెలు మాత్రం గడ్డి తింటూ చిత్తడి నేలల్లో తిరుగుతూ ఉండటంతో వ్యాధుల బారిన పడి మృతిచెందితే అవకాశాలు ఎక్కువ. దీంతో పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి పెంపకం దారులను కాస్తై గట్టెక్కించేందుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహకారంతో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గొర్రెల బీమాపథకాన్ని అమలు చేసింది. బీమా పథకం ఇలా... మూడు నెలల నుంచి సంవత్సరం లోపువయసు ఉండే గొర్రెకు బీమా ప్రీమియం రూ. 118. అయితే ఇందులో రైతు వాటాగా రూ.48 చెల్లిస్తే రాష్ట్ర పశుసంవర్థక శాఖ తన వాటాగా రూ.70 జమ చేస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే రూ.1500 దక్కుతాయి. సంవత్సరం పైబడి ఏడేళ్లలోపు వయసు ఉన్న గొర్రె కు బీమా ప్రీమియం రూ.236 కాగా ఇందులో రైతు తన వాటాగా రూ.96 చెల్లిస్తే, రాష్ట్ర సంవర్థక శాఖ రూ.140 చెల్లిస్తుంది. సదరు గొర్రె మరణిస్తే రూ.3వేల పరిహారం దక్కుతుంది. ప్రీమియం చెల్లించిన నాటి నుంచి ఏడాదిపాటు భీమా అమలులో ఉంటుంది. బీమా చేయించే గొర్రెల కాపరి సమీప పశువుల ఆస్పత్రి వైద్యుడిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బీమా చేయించే గొర్రెల సంఖ్యకు అనుగుణంగా చెవి పోగులు తెప్పించి నిర్ణీత తేదీన భీమా చేయిస్తారు. రైతు వాటాగా ప్రీమియాన్ని ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద చెల్లింపు అయ్యేలా డీడీ తీయాలి. బీమా దరఖాస్తులను పశువైద్యుడు పూర్తి చేసి బీమా కంపెనీకి పంపుతారు. దరఖాస్తులను కంపెనీకి అందజేసిన వారంలోపు బీమా పత్రాలుపెంపకం దారులకు చేరుతాయి. బీమా కంపెనీ గొర్రె చెవులకు వేసిన చెవి పోగులను పోగుట్టుకోకుండా చూసుకుంటుండాలి. ఒక వేళ చెవి పోగు పోతే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి, పశువైద్యుడికి సమాచారం అంద జేయాలి. 15 రోజుల్లోగా వివరాలివ్వాలి... వ్యాధులతో చనిపోయినా, ప్రమాదవశాత్తు గొర్రె మృతిచెందినా బీమా వర్తిస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే వెంటనే బీమా కంపెనీకి, పశువైద్యుడికి తెలియజేయాలి. పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని, గొర్రెకు వేసిన చెవిపోగును దరఖాస్తులతోపాటు 15రోజుల్లోగా బీమా కంపెనీకి అందజేయాలి. అనంతరం సదరు కంపెనీ గొర్రెల కాపరి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు జమచేసి సమాచారాన్ని అందజేస్తుంది. ఇవి తప్పని సరిగా చూసుకోవాలి... గొర్రె మరణించిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయాలి. అవ సరమైన సందర్భాల్లో కంపెనీ ప్రతినిధులు వివరాలు సేకరణ, ఫొటోలను తీసుకుని వెళేవరకు గొర్రె చనిపోయిన చోటే ఉంచాలి. కదిలించడం పక్కకి తీసుకుపోవడం చేయరాదు. బీమా కంపెనీ వేసే చెవిపోగు లేకపోతే బీమా వర్తించదు. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ గొర్రెలు చనిపోతే చనిపోయిన గొర్రెలతో పాటు కాపరి కూడా ఫొటో తీయించుకుని ఆ ఫొటోలను ఫిర్యాదుకు జతపరిచి బీమా కంపెనీకి పంపాల్సి ఉంటుంది. -
కట్టం తక్కువ.. లాభాలెక్కువ!
ఆకు కూరల సాగుతో ఎంతో మంది రైతులు తక్కువ కాలంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి, శ్రమ కూడా చాలా తక్కువ. విత్తిన నెల రోజుల్లో రైతన్న చేతికి డబ్బు అందించే పంటల్లో ప్రధానమైనవి ఆకు కూరలేనంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ నీటితో ఈ తోటలను సాగు చేయవచ్చు. కొద్ది విస్తీర్ణంలో పంట వేసుకుంటే వాటరింగ్ కేన్ల (నీటిని తుంపరగా పోసే డబ్బాలు)తో కూడా నీటిని అందించొచ్చు. తోట కూరల్లో ఏడెనిమిది రకాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఎన్, ఏ-1, కో-1, పూసా చోటీ చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్, ఔలై, అర్కసుగుణ, అర్కఅరుణ (ఎర్ర తోటకూర) రకాలు ఎంపిక చేసుకోవచ్చు. నాటిన 25 రోజులకే కోసి విక్రయించే వీలున్న సిరికూర రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. సస్యరక్షణ చర్యలు... తోట కూరకు తెల్ల మచ్చ తెగులు, ఆకులను తినే గొంగళి పురుగుల బెడద ఉంటుంది. తెల్ల మచ్చ తెగులు ఆశిస్తే ఆకుల అడుగు భాగాన తెల్లని బుడిపెలు ఏర్పడుతాయి. పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పండుబారి ఆకులు ఎండిపోతాయి. తెల్ల మచ్చల నివారణకు గాను లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మలాథీన్ కలిపి స్ప్రే చేయాలి. ఆకు కూరలకు సాధ్యమైనంత వరకు వేప సంబంధ మందులతోనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే తక్కువ విషపూరితమైన మందులను వినియోగించాలి. ముందు చల్లే ముందు ఆకులను కోసుకోవాలి. పురుగు మందు పిచికారీ చేసిన నాలుగైదు రోజుల వరకు కూర కోయకూడదు. విత్తే విధానం... తోటకూర సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి ఇసుక నేలలు పనికి రావు. విత్తనాలు అలికే ముందు నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి దున్నుకోవాలి. అనంతరం చదను మళ్లు చేసుకోవాలి. సన్నటి ఇసుకతో విత్తనాలు కలిపి మళ్లలో వెదజల్లాలి. నారు పెంచి మొక్కల్ని కూడా నాటుకోవచ్చు. విత్తనం చల్లే విధానంలో ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం. నారు నాటే పద్ధతిలో అయితే కిలో విత్తనం సరిపోతుంది. కలుపు నివారణ కోసం విత్తనం చల్లిన ఒకటి రెండు రోజుల తర్వాత వ్యవసాయ అధికారుల సూచన మేరకు గడ్డి మందుల పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చె ఎరువులను వేసి కలియదున్నాలి. కత్తిరింపుల ద్వార ఆకు కోసుకొనే రకాలకు 30 కిలోల నత్రజని మూడు భాగాలు చేసి కత్తిరింపు తరువాత ఒక భాగం వేసి నీరు పెట్టాలి. -
రబీలో అధిక దిగుబడుల కోసం..
నేలలు.. పంటల ఎంపిక నేలలో నీటి నిల్వ శక్తి, భౌతిక, రసాయనిక స్థితిగతులు, పోషక పదార్థాల స్థాయి ఆధారంగా పంటలను ఎంపిక చేయాలి. నాణ్యమైన విత్తనం విత్తుకొద్ది పంట అనే సామెత మనందరికి తెలిసిందే. యథాబీజం తథా ఫలం. ఏ పంటలోనైనా ఆయా వంగడాల పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పొందాలంటే నాణ్యమైన విత్తనం ద్వారానే సాధ్యపడుతుంది. నాసికరమైన, కల్తీ విత్తనం ఎంత సారవంతమైన భూమిలో వేసినా, నీరు, ఎరువులు, కలుపు, క్రిమిసంహారక మందులు ఎన్ని వాడినా అధిక దిగుబడులు పొందడం అసాధ్యం. అందువల్ల అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనమే కీలక పెట్టుబడి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనం వాడి, మంచి సేద్య పద్ధతులను పాటించినప్పుడు మాత్రమే అధిక దిగుబడులు సాధించవచ్చు. సరైన విత్తన ఎంపిక, నాణ్యమైన విత్తనం రైతు ఆదాయాన్ని పెంచుతుంది. అందువల్ల ధృవీకరించిన, గుర్తింపు పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చే సి, మొలక శాతం పరీక్ష చేసుకొని విత్తుకోవడం శ్రేయస్కరం. విత్తన మోతాదు.. మొక్కల సాంద్రత సిఫారసు చేసిన మోతాదు కన్న విత్తనాన్ని అధికంగా లేదా తక్కువగా వాడినప్పుడు దిగుబడిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదును వాడి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని సరిగ్గా పాటిస్తే మొక్కల సాంద్రత సరిగ్గా ఉండి.. నేల, నీరు, ఎరువుల వినియోగం సరిగ్గా జరిగి పూర్తిస్థాయి దిగుబడులను ఇస్తాయి. విత్తన శుద్ధి వివిధ పైర్లలో రైతాంగం విస్మరిస్తున్న అంశం విత్తన శుద్ధి. తక్కువ ఖర్చుతో సులువుగా పైర్లను వివిధ చీడపీడలు, తెగుళ్ల నుంచి కొంతకాలం వరకు కాపాడేందుకు విత్తన శుద్ధి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు సిఫారసు చేసిన రసాయనిక మందులతో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం రైతుల భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదు కన్న ఎక్కువగా వాడరాదు. పోషక పదార్థాల స్థాయిలో ప్రతికూలమైన నిష్పత్తి ఏర్పడితే నేల స్థితిగతుల్లో మార్పులు రావడమే కాకుండా పైర్ల దిగుబడులు సన్నగిల్లుతాయి. రసాయనిక ఎరువుల్లో ఉండే వివిధ పోషకాలను మొక్కలు భూముల్లో ఉండే ఎలజైములు, సూక్ష్మజీవుల సహాయంతో గ్రహిస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువులను పంటలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రైతులు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, జీవన ఎరువులను తగినంతగా వేసి భూభౌతిక స్థితిని తద్వారా పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవుల వృద్ధిని పెంచాలి. వివిధ పైర్లకు సిఫారసు చేసిన పోషకాల మోతాదును 75శాతం రసాయనిక ఎరువుల ద్వారా 25శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పైర్లకు వేసే ఎరువులను సరైన మోతాదులో, సరైన రూపంలో, సరైన సమయంలో, సరైన చోట వేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చు. నీటి యాజమాన్యం నీటి లభ్యత ఆధారంగా పంటను ఎంపిక చేయాలి. నీటి లభ్యత సమృద్ధిగా లేని చోట ఆరుతడి పంటలు సాగుచేయాలి. {పస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీటి సమర్థ వినియోగం కోసం బిందు,తుంపర్ల విధానాన్ని వినియోగించాలి. సూక్ష్మనీటి సాగు పద్ధతుల వల్ల నీటి ఆదాతో పాటు, ఎరువుల సమర్థ వినియోగం, చీడ పీడల ఉధృతి తగ్గడంతో పాటు నాణ్యమైన దిగుబుడులు సాధించవచ్చు. వివిధ పైర్లలో కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు యాజమాన్యం పంట దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనది కలుపు యాజమాన్యం. కలుపు మొక్కలు పైరు పాలు పెరిగి నీరు,ఎరువులను వినియోగించుకొని పంట దిగుబడులను తగ్గిస్తుంది. చేతితో కలుపు తీయడం వీలు కాని పక్షంలో సిఫారసు చేసిన రసాయనిక మందులతో సకాలంలో కలుపును నివారించుకున్నట్లైతే దిగుబడుల మీద ప్రభావం ఉండదు. సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చీడపీడలను, తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి అవసరం మేరకు రసాయనికి మందులను, భౌతిక, యాజమాన్య, జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించి సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.వాతవరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎప్పుడు ఒకే పంటను సాగుచేయకుండా, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు విధానాన్ని అవలంబిస్తూ అన్ని సాగు పద్ధతులు సక్రమంగా పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. సలహాలు తీసుకోవాలి సాగులో వివిధ సమస్యలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు, పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక శాస్త్రవేత్తలతో పాటు వివిధ సంస్థల ఏర్పాటు ఏసిన కిసాన్ కాల్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. -
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చర్యలు పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి. వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది. ‘ఈగ’ను గమనిస్తే.. దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి. తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి. వచ్చే సీజన్‌కోసం.. వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి. కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు. -
జంతువులను పాము కాటు నుండి .....
ప్రథమ చికిత్స ఇలా.. పాము కరిచిన చోట పైభాగాన బట్టతో గట్టిగా కట్టాలి కాటేసిన స్థలంలో బ్లేడుతో కోసి రక్తాన్ని పిండేయాలి {పతి 20 నిమిషాలకు కట్టును వదులుగా మళ్లీ కట్టు కట్టాలి పాము కరిచిన పశువుకు ఫామ్, ఆట్రోఫిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్లను ఎక్కించాలి ఈ మందు ఖరీదు రూ100 నుంచి రూ.200 వరకు ఉంటుంది. పశువులు కోలుకునే వరకు ఈ మందును ప్రతి గంటకు ఎక్కిస్తుండాలి యాంటీబయాటిక్స్, అనెల్జెసిక్స్, కార్టికోస్టిరియాడ్స్, గ్లూకోస్ వంటి మందులను అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి శ్యాస క్రియను ఉత్తేజం చేయడానికి కొరమిన్, నికతాబైడ్ వంటి ఇంజక్షన్లు ఇస్తూ ఉండాలి ఇలా చేస్తే పాము కరిచిన పశువులను సులభంగా రక్షించుకోవచ్చు. ఈ విష సర్పాలు కరిచే అవకాశం.. అటవీ ప్రాంతంలో సాధారణంగా కట్ల పాము, తాచుపాము, రక్త పింజరలు పశువును కాటు వేస్తాయి. ఇవి ఎక్కువ విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పాములు సాధారణంగా పశువుల ముట్టె, కాళ్లు, పొదుగు భాగంలో కాటు వేస్తాయి. తాచుపాము, కట్ల పాము కాటువేస్తే తాచుపాము, కట్లపాము కరిస్తే న్యూటాక్సీన్ (విషం)విడుదలై పశువుల నాడీ మండలం దెబ్బతినే ప్రమాదం ఉంది.దీంతో శ్వాసకోశ వ్యవస్థ స్తంభిస్తుంది. పాము కరిచిన చోట మంట ఉండదు. కానీ నోటినుంచి నురగ వస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లి సరైన కాలంలో మందులు వేయకపోతే మృతి చెందుతాయి. రక్త పింజర కరిస్తే.. రక్త పింజర కరిచినప్పుడు హిమోటాక్సిన్ (విషం) విడుదల రక్తంలో కలిసి రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పశువుల ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. కాటు దగ్గర మంటగా ఉంటుంది. వాపు వచ్చి పాము కరిచినచోట చర్మం రంగు మారి రక్తం కారుతుంది. మూత్రం ఎరుపురంగులో ఉంటుంది. రక్తపింజర కాటు బారిన పశువు పది గంటల్లోగా మృతి చెందుతుంది. -
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. -
పూతను కాపాడితేనే కాత
ఖమ్మం వ్యవసాయం : భారతదేశంలో పండించే ఫలాల్లో మామిడిని ‘రారాజు’గా అభివర్ణిస్తారు. జిల్లాలో 43,391 హెక్టార్లలో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, పాల్వంచ, ముల్కలపల్లి, చండ్రుగొండ, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర మండలాల్లో పండిస్తున్నారు. మామిడి సాగుకు తెలంగాణ రాష్ట్ర వాతావరణం అనుకూలంగా ఉంటుందని, మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పూత ఆలస్యంగా రావడం, పలు దఫాలుగా రావడం, పిందెలు ఆలస్యంగా కట్టడం వల్ల పంట సకాలంలో (మే నెలలో) కోతకు రావటం లేదు. ఈ మారుతున్న వాతావరణ ప్రభావాలను అధిగమించాలంటే రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2 కె.సూర్యనారాయణ తెలిపారు. పూత, పిందె సకాలంలో వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జూన్, జూలై నెలల్లో మామిడి కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ముఖ్యంగా ఎండు పుల్లలను మొత్తం తీసివేయటం ద్వారా చెట్టంతా శుభ్రంగా ఉంటుంది. ఆగస్టులో చిలేటెడ్ జింక్ 1 గ్రాము లీటరు నీటికి, బోరాన్ (19 శాతం) 1.25 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అక్టోబర్ / నవంబర్ నెలల నుంచి మామిడి చెట్లకు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురి చేయాలి. నవంబర్‌లో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత, మొగ్గలు సకాలంలో వస్తాయి. పూమొగ్గ పెరుగుదల దశలో (జనవరి 15 నుంచి) తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల త్వరగా పూత విచ్చుకుని ఫలదీకరణ చెందుతుంది. పదేళ్లకు పైబడిన చెట్లకు 4 డిప్పర్లు చెట్టు కాండం నుంచి మీటరు దూరంలో ఉండేటట్లు అమర్చి ఒక చెట్టుకు 60 నుంచి 80 లీటర్ల నీరు అందేటట్లు (రోజుకు 2 గంటలు) ఇవ్వాలి. సూక్ష్మధాతు లోపం ఉన్న తోటల్లో 1.25 గ్రాముల బోరాన్ (19 శాతం) లీటరు నీటిలో కలిపి పూమొగ్గల పెరుగుదల దశలో పిచికారీ చేయడం ద్వారా ఫలదీకరణం బాగా జరిగి పిందె బాగా కట్టి అధిక దిగుబడి ఇస్తుంది. మామిడి పిందె దశలో (జొన్న పరిమాణం) ఉన్నప్పుడు నాఫ్తిలిన్ అసిటిక్ ఆమ్లం(ఎన్ఏఏ) 20-20 నపీపీఎం గాఢతతో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తద్వారా పూత, పిందె బాగా నిలుస్తుంది. కాయలు నిమ్మకాయల పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్‌ను (13-0-45) 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ద్వారా కాయ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని త్వరగా పెరుగుతుంది. -
రబీ.. ఆరుతడి పంటలే మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా జిల్లాలో 60 వేల హెక్టార్లకు గాను 20వేల హెక్టార్లలోనే వరి సాగైంది. ఇదే ప్రభావం వల్ల మెట్ట పంటల్లోనూ దిగుబడి తగ్గింది. ఖరీఫ్ ప్రభావం ప్రస్తుతం రబీ కాలంలో కరెంటు కోతలతో సహా అదే విధంగా ఉంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే దిగుబడి సాధించి అవసరమైన ఆదాయం పొందవచ్చని ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు. ప్రత్యామ్నాయ పంటల్లో మొక్కొజన్న, జొన్న, పెసర, మినుము, కుసుమ, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయొచ్చు. ఆరుతడి పంటలు సాగు చేస్తే అవసరమైన నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడులు తగ్గుతాయి. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో కనీసం రెండు నుంచి నాలుగెకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. పంట మార్పిడి వల్ల పంటను ఆశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పైరులో పప్పు ధాన్యాల పంటలతో భూసారం వృద్ధి చెందుతుంది. మొక్కజొన్న అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు వేసుకోవచ్చు. జీరోటిల్లేజి పద్ధతిలో మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కేజీల విత్తనం అవసరమవుతుంది. డీహెచ్ఎం-111/ 117 వంటి మధ్యకాలిక రకాలు, డీహెచ్ఎం-115 వంటి స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు. హైబ్రిడ్లలో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకుని వేసుకోవచ్చు. కోహినూర్, బియో-9637 95రోజుల నుంచి వంద రోజులు, పయనిర్ 3342, డీకేసీ-7074, జేకేఎంహెచ్-1701, 85- 90 రోజుల పంట కాలం. మొక్కజొన్నకు 600 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 450 యూనిట్లు విద్యుచ్ఛక్తి అవసరం. పొద్దుతిరుగుడు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. ఊష్ణోగ్రతలు 38డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి అంతగా రాదు. పంట కాలం 90 రోజులు. హైబ్రిడ్లు కేబీఎస్‌హెచ్1/14, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్ 66, ఇంకా ప్రైవేట్ హైబ్రిడ్లను కూడా వేసుకోవచ్చు. దీనికి 400 మిల్లీమీటర్ల నీటి పరిమాణం, 300 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం. శనగ వరికి ప్రత్యామ్నాయమే కాకుండా సోయాబీన్ తర్వాత కూడా ఆరుతడి పంటగా నవంబర్ వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరం. జేజీ11, అన్నెగిరి, జేఏకేఐ 9218 రకాలు ఎంచుకోవచ్చు. 100-105 రోజుల పంట కాలం. దీనికి 150 మిల్లీమీటర్ల నీటి పరిమాణం. 112 యూనిట్ల విద్యుచ్ఛక్తి అవసరం. -
పంటమార్పిడితో ప్రయోజనం
నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు. అవగాహన అవసరం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. రైతులు గమనించాల్సినవి భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు. పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి. సూచనలు జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు. దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. -
‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు మేలు
నర్కూడ (శంషాబాద్ రూరల్ ): రైతులు ‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా సమయం కలిసివస్తుందని డాట్ శాస్త్రవేత్త డాక్టర్ అమ్మాజీ సూచించారు. శుక్రవారం మండలంలోని నర్కూడలో రైతు రామారావు వ్యవసాయ క్షేత్రంలో పొలం బడి నిర్వహించారు. వరి సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులు అదే పొలంలో దున్నే అవసరం లేకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను నేరుగా విత్తుకోవచ్చన్నారు. ఇందులో కలుపు నివారణకు అట్రాజిన్ కలుపు మందు పిచికారీ చేయాలన్నారు. ఈ పద్ధతిలో నెల సమయం ఆదా కావడమే కాకుండా పంట త్వరగా కోతకు వస్తుందన్నారు. వరి పంటకు ప్రస్తుత వాతావరణం కారణంగా కంకినల్లి, దోమ తెగుళ్లు ఆశించినట్లు తెలిపారు. కంకినల్లి నివారణ కోసం డైకోఫాల్ 2 మి.లీ. ఒక లీటరు నీళ్లలో కలిపి లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ను ఒక లీటరు నీళ్లలో కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. పంటలో పొట్ట ఆకుపై గోధుమరంగు చారలు కనిపించిన వెంటనే మందులను పిచికారీ చేస్తే గింజలు రంగు మారడం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా వరిలో తెగుళ్లు ఆశించకుండా రైతులు తప్పనిసరిగా కాలిబాటను వదులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మోహన్‌రెడ్డి, ఇన్చార్జి ఏఓ విద్యాధరి, ఏఈఓలు ఉదయ్‌సింగ్, రాఘవేందర్, ‘ఆత్మ’ బీటీఎం సూర్యమూర్తి, ఎస్ఎంఎస్ జ్యోత్స్న పాల్గొన్నారు. -
బీ(ధీ)మా లేక బిక్కుబిక్కు!
ప్రమాదంలో పశువులు మృత్యువాతపడితే రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన బీమా పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. గడువు ముగిసి నెలరోజులు గడిచినా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంపై పశుపోషకులు, అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగి జీవాలు మరణిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవులు, గేదెలు, గొర్ల కోసం బీమా పథకం ప్రవేశపెట్టింది. మూగజీవాలు మృతి చెందితే ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం గత సంవత్సరం న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అక్టోబర్ 18 నుంచి నవంబర్ వరకు ప్రీమియం కట్టుకునేం దుకు గడువు విధించారు. దీంతో జిల్లా వ్యాప్తం గా 4,626 మంది రైతులు బీమా డబ్బులు చెల్లించగా, సిద్దిపేట డివిజన్లో 1,650 మూగజీవాలకు రైతులు ఇన్సూరెన్స్ చేయించారు. రైతు ఒక్కో గేదెకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు రూ.10 నుంచి రూ.30 వేల వ రకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిం చారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న పశువులను వెటర్నరీ వైద్యులు పరీక్షించిన అనంతరం సర్టిఫైడ్ చేసిన తర్వాత పశువులకు పోగులు వేసి వాటిని ఫొటోలను బీమా కంపెనీ వారికి అందజేస్తారు. ఒక్క గేదె లేదా ఆవుకు ప్రీమియం కట్టుకుంటే రూ.50 వేలు, రెండు కంటే ఎక్కువ పశువులకు బీమా కట్టి అవి చనిపోతే రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ఇదే కాకుం డా పశువులకు బీమా చేయించిన ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి కూడా బీమా వర్తించేది. దీంతో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందేది. పట్టించుకోని ప్రభుత్వం... బీమా గడువు అక్టోబర్ నెలతో ముగిసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధివిధానాలు ప్రకటించలేదు. జిల్లా వ్యాప్తంగా అందరు రైతులు తమ పశువులకు సంవత్సరం వరకే బీమా చేయించి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల బీమా ముగిసిన 15 రోజుల వరకు గ్రేస్ పీరి యడ్ ఉంటుంది. ఇది కూడా ముగి యడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సీజన ల్ వ్యాధులు ప్రబలడంతో పాటు చాల చోట్ల ఎన్నో మూగజీవాలు ప్రమాదవశా త్తు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యం లో అక్టోబర్ మాసంలోనే ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకటించకపోవడంతో రైతులకు నష్టం జరిగే అవకాశముంది. అధికారులు స్పందించి ఇన్సూరెన్స్ మార్గదర్శకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
సిరుల ‘ఫ్లవర్’
ఆత్మకూరు : ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు.. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన, మార్కెట్లో డిమాండ్ ఉన్న కాలీఫ్లవర్ సాగుపై మక్కువచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమ యం.. అధిక లాభాలు ఉండడంతో పంట విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పంటను మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కాలీఫ్లవర్ సాగు-పంటకు వచ్చే చీడపీడలు-నివారణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు వివరించారు. చలికాలం చివరి వరకునాటుకోవచ్చు.. మెలకువలు పాటిస్తే కాలీఫ్లవర్‌లో అధికదిగుబడి సాధించవచ్చు. ఈ పంటను చలికాలం చివరివరకు నాటుకోవచ్చు. వేసవి తీవ్రత మొదలుకాకముందే పంట చేతికి వస్తుం ది. కాలీఫ్లవర్‌లో ముఖ్యంగా నల్లి, మచ్చతెగులు, ఆవాలరంపపు పురుగు, తొలుచు పురుగు, డైమండ్ బ్యాక్‌మాస్(మచ్చలు)తో పాటు కొరడా తెగులు, బ్రౌనింగ్, రైజీనెస్, పేనుబంక, బట్టరింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. చీడపీడలు-నివారణ డైమండ్ బ్యాక్‌మాస్ : దీని లార్వాలు ఆకుల కణజాలాన్ని గీకి జల్లలాగా మారుస్తాయి. పెద్ద లార్వాలు ఆకుపై రంధ్రాలు చేస్తాయి. చెట్టు రంధ్రాలతో కనిపిస్తుంది. దీని నివారణకు ముందు గుడ్లను నాశనం చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 5శాతం వేపగింజల కశాయాన్ని పిచికారీ చేస్తే గుడ్లు కుళ్లిపోతాయి. మలాథియాన్ లేదా క్లోరో ఫైరిఫాస్ లీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక : పేను బంక వారణకు లీటరునీటిలో ఒక మిల్లీలీటరు రోగోర్‌ను కలిపి పిచికారీ చేయాలి. రైజీనెస్ : దీని లక్షణం పువ్వు వదులుగా ఉండడం. గడ్డమీద నూగు ఉంటుంది. దీంతో విలువ తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వులు వదులవుతాయి. దీని నివారణకు పూలను సమయానికి కోయాలి. కొరడా తెగులు : ఆకులు పసుపు రంగుగా మారుతాయి. అంచులు తెల్లబడుతాయి. మధ్యభాగం ఈనె కొరడా లాగా బయటకు కనబడుతుంది. మాలిబ్డినమ్ లోపం వల్ల, నత్రజని ఎక్కువ కావడం వల్ల ఈతెగులు వస్తుంది. దీని నివారణకు సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఎకరానికి 400 గ్రాముల అమ్మోనియం మాలిబిడేట్‌ను 200లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. బ్రౌనింగ్ : బోరాన్ లోపం వల్ల పువ్వుపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. పువ్వుపెరిగే దశలో లీటరు నీటిలో 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8కిలోల బోరాక్స్ వేయాలి. బట్టరింగ్ : కాలీఫ్లవర్లు చిన్న పరిమాణంలో ఉండడాన్ని బట్టరింగ్ అంటారు. ముదిరిన నారు నాటడం వల్ల బట్టరింగ్ వస్తుంది. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా వేయొద్దు. తగిన మోతదులో ఎరువులు వేయాలి. సిపారసు చేసిన ఎరువులనే వాడాలి. - సంజీవరావు(83744 49385),హార్టికల్చర్ ఆఫీసర్ నారు నర్సరీలో పోసుకోవాలి నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. నారు నర్సరీలో పోసుకోవాలి. 30రోజుల సమయం పడుతుంది. సాగు చేసిన తర్వాత సుమారు మూడునెలల్లో పంట చేతికి వస్తుంది. రెండున్నర నెలల్లో ఫ్లవర్ కోయడానికి 15రోజులు అనువుగా ఉంటుంది. ఈపదిహేను రోజుల్లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. అయితే హోల్‌సేల్‌గా అమ్మేదానికంటే రిటైల్‌గా అమ్ముకుంటేనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగుకు తేమలేకుండా ఉండే నేల అనుకూలం. మొక్కలు పెట్టేముందు భూమిని చదునుచేసుకోవాలి. తర్వాత సాళ్లు తీసి భూమిని తడిపి గడ్డిమందు పిచికారీ చేయా లి. తర్వాత మొక్కలు పెట్టాలి. ఎకరానికి 14వేల మొక్కలు పెట్టాలి. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. రూ.80వేల వరకు లాభం పొందవచ్చు. - బిల్లా విష్ణువర్ధన్‌రెడ్డి(98667 06483), గుడెప్పాడ్ చీడపీడలు ఆశించకుండా చూసుకోవాలి నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. ఈ పంటకు ఎక్కువగా లద్దె పురుగు, పచ్చ పురుగులు ఆశిస్తాయి. ఇవి రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. నిరంతరం పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య పంటలకటే కాలీఫ్లవర్ సాగు చాలా లాభదాయకం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది. - తీనేటి ఇంద్రారెడ్డి(97046 31975), గుడెప్పాడ్ -
సాగు తీరు మారాలిక
నిజామాబాద్ వ్యవసాయం : ఆరు తడి పంటలు సాగు చేయుడం వల్ల అధిక విస్తీర్ణాన్ని సాగు చేయగలగటమే కాక ఎక్కువ లాభాన్ని కూడా పొందవచ్చు. రబీ కాలంలో వరికి బదులు గా ఆరుతడి పైర్లు సాగు వల్ల కలిగే ప్రయోజనాలు... వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుత్ శక్తి, పెట్టుబడులు తక్కువ. ఒక ఎకరం వరి సాగుకు కావాల్సిన నీటితో కనీసం 2-8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పైర్లను సాగు చేయవచ్చు. ఆరుతడి పైర్లు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పుదినుసులు, నూనె గింజల కొరత తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల పైర్లను ఆశించే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. {పస్తుతం మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా ‘‘జీరోటిల్లేజి’’ విధానం ద్వారా విత్తే పద్ధతి వచ్చింది. వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచి ఉన్న కలుపును నివారించేందుకు ‘‘పారాక్వాట్’’ అనే కలుపు నివారణ మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8 మి.లీ.ల కలుపు మందును(పారాక్వాట్) వరి దుబ్బులు, కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి. పారాక్వాట్ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పలుచని తడి ఇచ్చి విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు నివారణ మందులను వాడాలి. మొక్కజొన్నలో అయితే అట్రజిన్ (లీటరు నీటికి 4-5 గ్రాములు) పొద్దుతిరుగుడు, శనగ, ఆముదం అయితే పెండిమిథాలిన్ (లీటరు నీటికి 5-6 మి.లీ.) కలుపు నివారణ మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. రబీ కాలంలో వివిధ పంటలకు కావాల్సిన నీటి పరిమాణం, నీరు పెట్టడానికి ఖర్చయ్యే విద్యుత్చ్చక్తి యూనిట్లు, ఎకరం వరికి ఇచ్చే నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటల విస్తీర్ణం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త వివరించారు. -
వేసెయ్జీ.. క్యాబేజీ
ఖమ్మం వ్యవసాయం: క్యాబేజీ పంట సాగుకు ఇది అనుకూలమైన సమయం. ఈ పంటను జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇల్లెందు, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంట సేద్యమవుతోంది. క్యాబేజీ పంటలో రకాలు, విత్తన మోతాదు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ తదితర అంశాలను ఖమ్మం ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న వివరించారు. క్యాబేజీ రకాలు: గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రీమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు. విత్తనమోతాదు: ఎకరానికి 100 నుంచి 150 గ్రాముల విత్తనాలు. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తే విధానం: మొక్కల మధ్య, వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండాలి. ఎరువులు, నీటి యాజమాన్యం ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో, 50 కిలోల వరకు నత్రజనిని ఇచ్చే ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి. (నాటిన 25-30 రోజులు, 50-60 రోజులు, 75-80 రోజులు). బిందు సేద్యం ద్వారా నీరు పారించటం శ్రేయస్కరం. సస్యరక్షణ తల్లి రెక్కల పురుగులు: ఇవి చిన్నవిగా గోధుమ రంగులో ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఈ పురుగులు ఉంటాయి. కనుక వీటిని డైమండ్ బాక్ మాత్ అంటారు. ఈ పురుగులు గుడ్లను పెట్టి పొదుగుతాయి. వీటి నుంచి వచ్చే లార్వాలు అడుగు భాగాన చేరి ఆకులను తినేస్తాయి. నివారణ: ప్రతి 25 వరుసల క్యాబేజి పంటకు 2 వరుసల చొప్పున ఆలా మొక్కలు ఎర పంటగా నాటాలి. 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతిని బట్టి లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పెనోశాడ్ మందును పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా నల్లకుళ్లు: దీని వల్ల ఆకులు పత్రహరితం కోల్పోయి ‘వి’ ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. నివారణ: 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ , 5 మి.గ్రా, స్పెప్ట్రోసైక్లిన్ మందును పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో పైపాటుగా వేయాలి. -
గొర్రెలను వ్యాధుల నుంచి రక్షించుకోండి..
మంచిర్యాల రూరల్ : గొర్రెల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుంటే మంద త్వరగా వృద్ధి చెందదు. గొర్రెల్లో వచ్చే వ్యాధులపై కాస్త అవగాహన కలిగి ఉండి, వాటికి సరైన చికిత్స సమాయానికి అందించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెలను వ్యాధుల బారి నుం చి కాపాడుకోవచ్చు. నవంబర్ నెల నుంచి ఏప్రి ల్ వరకు గొర్రెలకు మశూచి వ్యాధి(పాక్స్ వైరస్) ముప్పు పొంచి ఉంటుందని, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని హాజీపూర్ పశువైద్యాధికారి అర్చన సూచించారు. ముందస్తుగా టీకాలు వేయించడం మంచిదని, గాలిద్వారా వచ్చే ఈ వైరస్ వ్యాపించిన గొర్రెలు ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. గొర్రెల మంద వృద్ధి చెందాలంటే.. గొర్రెల మంద రోగాల బారిన పడితే వాటికి పశు వైద్యుల సలహాతో మందులను వాడాలి. తెలిసీ తెలియకుండా మందులను వేయవద్దు. పుట్టిన జీవాలను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంద త్వరగా వృద్ధి చెందుతుంది. గొర్రెల దొడ్లను ప్రతీ రోజు శుభ్రం చేయాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చేయాలి. వారానికి ఒకసారి సున్నం చల్లాలి. సాయంకాలం వేళల్లో దోమల నివారణకు పొగబెట్టాలి. మందతో తరచూ రోగాల బారిన పడే జీవాలను తొలగిస్తూ ఉండాలి. పుష్టికరమైన మేత జీవాల ఆరోగ్యం, ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బయటమేపే ప్రదేశాల్లో గొర్రెలు శుభ్రమైన నీటిని తాగేలా చూడాలి. మంద ఒక దగ్గర పెడితే ఖనిజ లవణాలు గల ఇటుకలు, కల్లుప్పును నాకించాలి. బయట మేపడమే కాకుండా, మంద వద్ద కూడా చౌకగా తయారు చేసిన దాణా అందించాలి. మశూచి వ్యాధి లక్షణాలు.. వ్యాధి సోకిన గొర్రెల్లో వారం రోజుల్లో దాని లక్షణాలు బయటపడతాయి వ్యాధి సోకిన గొర్రెలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది. చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు, పాల పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. కళ్ల నుంచి నీరు, నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చిక్కటి చీముడు కారుతుంది. శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్యవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు అవుతాయి. చూడి గొర్రెలకు వ్యాధి ప్రబలితే ఈసుకుని పోతాయి. వ్యాధి వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా మశూచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త గొర్రె నుంచి మరొక దానికి వ్యాప్తిస్తుంది. దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది. నివారణ చర్యలు.. ప్రతి సంవత్సరం నవంబర్‌లో గొర్రెలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. కొత్త జీవాలను మందలో చేర్చే ముందు వాటిని కొద్ది రోజులు మందకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి. వ్యాధి సోకిన గొర్రెల వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్లనీయకూడదు. వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించాలి. వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. వ్యాధి వల్ల చనిపోయిన గొర్రెలను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి. వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రపర్చాలి. -
పశు పోషణలో.. దూడల సంరక్షణే కీలకం
న్యూమోనియా దూడ పుట్టిన నెల రోజుల తర్వాత ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. శీతాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దూడలు ఉన్న షెడ్లలో తేమ ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులు రావటం, రాత్రి సమయంలో లేగదూడలను బయట కట్టేయడం, చలి గాలుల బారిన పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. న్యూమోనియా సోకిన దూడల్లో జ్వరం, అజీర్ణం, ముక్కు నుంచి చీమిడి కారటం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి తక్షణమే చికిత్స అందించాలి. లేదంటే దూడలు మరణించే ప్రమాదం ఉంటుంది. నివారణ చర్యలు... దూడలు ఉండే పాకల్లో తేమ శాతం అధికంగా లేకుండా చూసుకోవాలి. ఈదురు గాలులు, చలి లేకుండా జాగ్రత్తపడాలి. పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు తాగించాలి. లేదంటే ఈ వ్యాధి సులభంగా సోకుతుంది. వ్యాధి బారిన పడిన దూడలకు యాంటీబయోటిక్స్, యాంటీహిస్టమీన్ సూదులు ఇప్పించాలి. పారుడు వ్యాధి లేగదూడల్లో ఎక్కువ శాతం పారుడు వ్యాధి సోకి మృత్యువాత పడుతుంటాయి. నట్టలు, ప్రోటోజువా, వైరస్, బ్యాక్టీరియా వలన దూడలకు తెల్లని, పచ్చని విరేచనాలవుతాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసపడి మరణిస్తుంటాయి. మట్టి, అపరిశుభ్ర పరిసరాలు తదితర కారణాల వల్ల దూడల్లో నట్టలు తయారవుతాయి. సకాలంలో దీన్ని గుర్తించకపోతే తర్వాత చికిత్స అందించినా ఫలితం ఉండదు. లేగదూడలకు జున్నుపాలు అందించకపోవడం, తగిన మోతాదులో పాలు లేకపోవటం, పోషకాల లోపం, చలిగాలులు, మట్టితినడం లాంటి లోపాల వల్ల కూడా లేగదూడల్లో పారుడు వ్యాధి వస్తుంది. నివారణ చర్యలు... లేగలు పుట్టిన వెంటనే జున్నుపాలు తాగించాలి. వైద్యుల సలహా ప్రకారం నట్టల నివారణ మందులు వేయాలి. లేగదూడ పుట్టిన ఐదురోజుల లోపు టెటానస్, విటమిన్-ఏ ఇంజక్షన్లు తప్పక ఇప్పించాలి. దూడలు మట్టి తినకుండా మూతికి ప్రత్యేకంగా తయారు చేసిన బట్టలు కట్టాలి. బొడ్డు, కీళ్ల వాపు లేగదూడ యొక్క బొడ్డు నరం ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని ద్వారా దూడలు జ్వరంతో బాధపడుతుంటాయి. బొడ్డు వాచి లోపల చీము చేరుతుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. సూక్ష్మజీవులు కీళ్లకు కూడా వ్యాపిస్తాయి. దీని ద్వారా దూడలు పాలు తాగవు. పుట్టిన నాటినుంచి ఆరు వారాల్లోపు ఎప్పుడైనా బొడ్డు, కీళ్ల వ్యాధి రావచ్చు. మెదడు వాపు క్లామిడియా సూక్ష్మజీవుల వల్ల దూడలకు మెదడు వాపు వ్యాధి వస్తుంది. దీంతో జ్వరం, ఆకలి మందగించడం, కండరాల వణుకు, నిలబడలేకపోవటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్సలు అందించాలి. లేదంటే దూడలు వారం రోజుల్లో మరణించే ప్రమాదం ఉంటుంది. అంధత్వం గర్భస్థ సమయంలో పశువులకు విటమిన్-ఏ సరిగ్గా అందించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో లేగదూడలు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంధత్వం సోకిన దూడల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. కండరాలు వణుకుతుంటాయి. నరాల్లో పటుత్వం కోల్పోయి లేగదూడలు సరిగా నిలబడలేవు. నివారణ చర్యలు... గర్భం సమయంలో పశువుకు తగిన నీటిని అందించటంతో పాటు, విటమిన్-ఏ విధిగా ఇవ్వాలి. దీనికోసం మేలురకం పశుగ్రాసం అందించాలి. విటమిన్ -ఏ ఇంజక్షన్లు వేయించడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు. పుట్టిన దూడలకు సమృద్ధిగా జున్ను పాలు తాగించాలి. -
పురుగుల నివారణకు చక్కటి మార్గం
లింగార్షక బుట్టలతో.. పురుగులు ఒకదానికొకటి సంభాషించుకుంటాయి. కొన్ని రకాల వాసనల ద్వారా ఆకర్షించుకుంటాయి. వీటి ద్వారా పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పురుగుల నివారణకు కృత్రిమంగా తయారు చేసిన ‘ఎర’ లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవచ్చు. వీటిలో కొన్ని రకాల వాసనలను ఉపయోగించి ఆడ పురుగులను ఆకర్షించేందుకు వీలుంటుంది. ఇలా ఉపయోగించాలి లింగాకర్షక బుట్టలు ఒకటి రూ.14, ఫిరమోన్ (ఎర) రూ.8 ఉంటాయి. నెలకు ఒకటి చొప్పున మార్చా లి.పురుగుల ఉనికి గుర్తిస్తే ఎకరాకు4బుట్టలు, వాటిని నివారించేందుకు ఎకరాకు 10 బుట్టలు ఆమర్చుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు బుట్టల వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట 30 రోజుల వయసు నుంచి వాడాలి. ఎరలను ప్రతి 30 రోజులకోసారి తప్పకుండా మార్చాలి. బుట్టను పైరు మీద సరైన ఎత్తులో అమర్చుకోవాలి. ఎరలను మార్చేటప్పుడు చేతులకు ఎటువంటి వాసన లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. బుట్టల్లో పడిన పురుగులను ప్రతి 2-3 రోజులకు గమనించడం ద్వారా పురుగు గుడ్లు పెట్టకుండా చూడాలి. పొలంలో లింగాకర్షక బుట్టలు వాడడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు. లాభాలెన్నో.. పంటలో లింగాకర్షక బుట్టలు అమర్చడం వల్ల హానికారకమైన పురుగులను అదుపు చేయవచ్చు. ఇందులో ప్రధానంగా కంది, మొక్కజొన్న, జొన్న పంట ల్లో కాండం తొలుచు పురుగు, వరిలో కాండం తొలుచు తెల్ల రెక్క పురుగు, వేరుశనగలో ఆకుమడతతోపాటు పచ్చపురుగు, పత్తి, బెండలో తలనత్త పరుగు, పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారించుకోవచ్చు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ దీనిని స్టిక్ ఎ ఫ్లయ్ అని అంటారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుమడత పురుగు, పచ్చదీపపు పురుగులను అరికట్టుకోవచ్చు. ఇందులో చిన్నగా ఎగిరే రసం పీల్చు పురుగులు ప్రత్యేకమైన వి. పసుపు రంగుకు ఆకర్షణకు గురై ట్రాప్‌పై ఉన్న జిగురుకు అంటుకుపోయి పురుగులు అదుపులోకి వస్తాయి. వాడకం ఇలా.. 50 శాతం కన్నా ఎక్కువ పురుగుల తో లేదా దుమ్ముతో నిండగానే ఎరను మార్చుకోవాలి. ఎరను పంటపై 25-30 సెంటీ మీటర్ల ఎత్తులో అమర్చుకోవాలి. పిదప పైన ఉన్న పేపరును తొలగించాలి. ఎరను తూర్పు- పడమర దిక్కులను చూసేటట్లుగా అమర్చాలి. {పతి వారం గమనించి పురుగు ఉద్ధృతి తెలుసుకుంటూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎకరాకు 10 ఎరల చొప్పున అమర్చుకోవాలి. ఒక్కో ట్రాప్స్ రూ.10 ప్రకారం లభిస్తుంది. -
అంతర పంట లాభదాయకం
వలేటివారిపాలెం : సపోట, మామి డి, జామ పండ్ల తోటల్లో కూరగాయలు, మినుమును అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వలేటివారిపాలెం మండలంలో పలువురు రైతులు మినుము, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, వంగ, గోంగూర, తోటకూర, పాలకూరను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేసినా, చేయకపోయినా దుక్కి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకుగాను ఏడాదికి రూ.7 వేలు ఖర్చు చేయాలి. అంతర పంటలు సాగు చేసినా అదే ఖర్చు అవుతుంది. పండ్ల తోటలో కూరగాయలు, మినుము పంట లను సాగు చేస్తే వాటికి వాడే మందులు పండ్ల తోటలకు కూడా ఉపయోగపడతాయి. పండ్ల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన పని ఉండదు. పైగా పండ్ల మొక్కలు త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు మూడు నెలలు శ్రమిస్తే ఆ తర్వాత మూడు నెలలపాటు పంటను కోసి విక్రయించుకోవచ్చు. పండ్ల తోటల్లో అంతర పంటలను ఆరేళ్లపాటు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు ఎదిగిన త ర్వాత అంతర పంటలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు. -
‘పాడి’లో పరిశుభ్రతే ప్రధానం
నిజామాబాద్ వ్యవసాయం: పశువుల నుంచి పాలు పితికే సమయంలో తగు జాగ్రత్తలను పాటిస్తే అటు పశువుల ఆరోగ్యంతో పాటు ఇటు పాలను స్వచ్ఛంగా ఉంచవచ్చు. దీంతో ఎక్కువ సమయం పాలు చెడిపోకుండా ఉంటాయి. వీటి నుంచి తీసిన వెన్న, నెయ్యి మంచి రుచి, వాసన కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పాల శుభ్రత అనేది పశువులు ఆరోగ్య స్థితి, పశుశాలలు, పాలు పితికే మనిషి, పాల నిల్వ ఉంచే పాత్రల శుభ్రత మీదా ఆధారపడి ఉంటుందని పశుసంవర్థక శాఖ సహాయక సంచాలకులు లక్ష్మణ్ పేర్కొంటున్నారు. పాలు పితికే సమయంలో పాటించాల్సిన పద్దతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పశువుల ఆరోగ్యస్థితి గమనించాలి పాలిచ్చే పశువుల ఆరోగ్యం పట్ల రైతులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి పశువైద్యుల సలహా మేరకు అవసరమైన చికిత్సను అందించాల్సి ఉంటుంది. పశువు శరీర భాగాలైన కడుపు, డొక్కలు పొదుగు,పాలు పితికే ముందు శుభ్రంగా కడిగి తడి బట్టతో తుడవాలి. డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగకుండా కతిరించాలి. పొదుగును శుభ్రపరచి బట్టతో తుడవాలి. ఆ తర్వాత పాలు పితకాలి. పాలు తీయడం పూర్తయిన తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం(ఉదాహరణకు కోర్సలిన్ ద్రావణం లీటరు నీటికి 2మి.లీ.కలపాలి)తో కడగాలి.అదే నీటితో పిండిన వ్యక్తి తన చేతులను కడుక్కోవాలి. పితికిన వెంటనే నేలపై పశువును అరగంట వరకు పడుకోనియవద్దు. అప్పుడే పాలు పిండటంతో చను రంధ్రాలు తెరచుకొని ఉంటాయి. దీంతో ఒక వేళ పశువు పడుకుంటే ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా త్వరగా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితికిన వెంటనే పశువు పడుకోకుండా ఉంచాలంటే వాటి ముందు గడ్డి కాని లేదా దాణా పెట్టాలి. పశువుల షెడ్లో పశువుల షెడ్లను ఎత్తయిన, నీరు నిల్వ ఉండని ప్రాంతంలో నిర్మించుకోవాలి. దీంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. షెడ్ లోపల గడ్డి గాని లేదా ఇటీవల మార్కెట్లో ప్రత్యేకంగా వస్తున్న రబ్బరు షీట్లను గాని పరుచుకోవచ్చు. షెడ్లో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త వహించాలి. అవసరాన్ని బట్టి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. దుమ్ము లేచే నేల అయితే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి. పాలు తీసే వ్యక్తి పశువుల నుంచి పాలు తీసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు,చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగించవద్దు. పాలు తీసే వారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుని పాడి గుడ్డతో తుడుచుకోవాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని పాలు తీయాలి. లేక పోతే ఆ పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వేడి నీటితో పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. -
శీతాకాలంలో పశువులపై దృష్టి పెట్టాలి
ఖమ్మం వ్యవసాయం: పశు పోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం డాక్టర్ జి.మోహనకుమారి తెలిపారు. శీతాకాలంలో ఆచరించాల్సిన పద్ధతులను ఆమె వివరించారు. పాలను సాధారణంగా ప్రతిరోజు 12 గంటల వ్యవధిలో పితుకుతుంటారు. కానీ శీతాకాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలను చలికాలంలో ఉదయం 6-7 గంటలు, సాయంత్రం 4-5 గంటల సమయంలో పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండటానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేని పక్షంలో మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రోజుకు రెండు సార్లు ముందు, వెనుక పరిశీలించాలి. పశువు వెనుక భాగంలో పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించటం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తరువాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచుకురవటం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవటం వంటి సమస్యలుత్పన్నమవుతాయి. పశువులు, దూడలను ఆరుబయట కట్టివేయకూడదు. ఈదురుగాలి నిరోధించటానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించ కూడదు. ప్రతిరోజు పశువులశాలలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడాకార్బొనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్ర పరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచుగా వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజలవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తరువాత దాణా ఇవ్వాలి. పాడి పశువులకు సమీకృత దాణాను తాగే నీళ్లతో కలిపి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పోషక పదార్థాలు ముఖ్యంగా మాంసకృత్తులు నీళ్లలో కరిగి పొట్టలోని నాల్గవ అర(అబోమేసం)లోకి నేరుగా వెళ్తాయి. రూమెన్‌లోని సూక్ష్మజీవులకు పోషకపదార్థాలు అందవు. తద్వారా రూమెన్‌లో వృద్ధి, ఉత్పాదక క్రియలు కుంటుబడి, ఆమ్లజనిత అజీర్తి చోటుచేసుకుంటుంది. కాబట్టి సమీకృత దాణాను తాగే నీళ్లతో కాకుండా విడిగా ఇవ్వటం మంచిది. -
శ్రీవరి.. సిరులే మరి!
కొత్త పద్ధతి మంచిగనిపిస్తన్నది నాకు నీళ్ల సవులత్కు బోరున్నది. ఎప్పుడు ఏసినట్టె ఆనకాలంల ఎకరం ఒరేయాలనుకున్న. పొలం తయారు చేసేటందుకు దుక్కి దున్నుకుంటున్న. గప్పుడే మా ఉళ్లే ఉన్న సీనువాస్ సార్, ఆంజనేయులుతోని నా పొలం కాడికి వచ్చిండ్రు. శ్రీ పద్ధతిల ఒరి వేయమని ఒక్క తీరుగ జె ప్పిండ్రు. ఎట్లయితె అట్లయితదని ఆ ళ్లు చెప్పినట్టె నారు పోసిన. జెరంత ముదిరిన నారు ఏసిన. అయినా పె ద్దగ కష్టం లేకుండనె శేను బాగా ఎది గింది. నిరుడు 30 బస్తాలు పండిన శేన్ల 40-45 బస్తాలు మోస్తదనిపిస్తున్నది. ఒక్కరోజుల నలుగురు నాటేసిండ్రు. అన్ని ఖర్సులు బాగా తగ్గినయ్. - బాలయ్య, నెంటూరు వరి పొలంలో ఎల్లప్పుడూ నీరుంటే.. వరి పొలంలో ఎల్లపుడు సమృద్ధిగ నీరుంటేనే అధిక దిగుబడి వస్తుందన్నది అపోహ మాత్రమే. పొలంలో నీరు నిల్వ ఉన్నట్లయితే మొక్క వేరులో గాలి సంచులు తయారు చేసేందుకు ఎక్కువ శక్తి వినియోగించాల్సి ఉంటుంది. ధాన్యం తయారీకి దోహదపడాల్సిన ఈ శక్తిని గాలి సంచులు తయారు చేసి మొక్క బతకడానికి వాడుకుంటుంది. వేరు వ్యవస్థ కొసలు వరి పూత దశకు వచ్చేటప్పటికి 70 శాతం మేర కుళ్లి పోషకాలను తీసుకోలేవు. దీంతో దిగుబడి పడిపోతుంది. శ్రీ పద్ధతిలో సాధారణ వరి సాగుకులో మూడో వంతు నీరు మాత్రమే సరిపోతుంది. నీరు నిల్వ ఉండదు కాబట్టి వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోయి మొక్కలు దృఢంగా, బలంగా పెరుగుతాయి. విత్తనంలో తాలు గింజల తొలగింపు విత్తుకొద్ది పంట అంటారు పెద్దలు. అందుకే మనం ఎంపిక చేసుకున్న విత్తనంలో తాలు గింజలు, రోగ కారక విత్తనాలు లేకుండా చూసుకోవాలి.శ్రీ వరి విధానంలో ఒక ఎకరం పొలంలో నాటు వేసేందుకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. తాలు తొలగించేందుకు విత్తనాలను మొదట మంచినీటిలో వేయాలి. తేలిన తాలు గింజలను తొలగించాలి. తరువాత విత్తనాలను ఉప్పు నీటిలో వేసి తేలిన వాటిని తీసేయాలి. నీటి అడుగు భాగానికి చేరిన విత్తనాలను (గట్టి గింజలు) మంచి నీటితో రెండు సార్లు కడిగి ఆవు మూత్రం, పేడ ద్రావణం పట్టించి నీడలో ఆరబెట్టి 24 గంటలు మండెకట్టాలి. నారుమడి యాజమాన్యం ‘శ్రీ’ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారు నాటాలి కాబట్టి నారు పెంచడంలో మెలకువలు పాటించాలి. ఒక సెంటు మడిలో 2 కిలోల విత్తనం చల్లి నారు పెంచితే ఎకరం పొలానికి సరిపోతుంది. భూమిని మెత్తగా దున్ని దమ్ము చేసి, ఎత్తుగా తయారు చేసి చుట్టూ కాలువలు తీయాలి. తడిమట్టి జారిపోకుండా నారుమడి చుట్టూ చెక్కతోగాని, బొంగులతోగాని ఊతం ఏర్పాటు చేయాలి. నారుమడి తయారైన తరువాత చివి కిన మెత్తటి పశువుల ఎరువును ఒక పొరలాగా చల్లి, 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన మొలకెత్తిన విత్తనాన్ని పలుచగా చల్లాలి. విత్తనాలపైన మరోపొర పశువుల ఎరువు చల్లి గడ్డిని కప్పాలి. మొలకెత్తిన వెంటనే గడ్డిని తీసేయాలి. శ్రీపద్ధతిలో లాభాలు మెండు శ్రీపద్ధతిలో విత్తన ఖర్చు బాగా తగ్గుతుంది. సాధారణ పద్ధతికి భిన్నంగా ఆరుతడి పంట కాబట్టి 30 నుంచి 40 శాతం వరకు నీటి వినియోగం తగ్గుతుంది. సేంద్రియ విధానం ఆచరించడం వల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన ధాన్యంతోపాటు, నాణ్యమైన పశుగ్రాసం లభ్యమవుతుంది. రసాయన ఎరువులు, పురుగుల మందుల ఖర్చు తగ్గుతుంది. వీడర్‌తో ఎక్కువగా మట్టిని గుల్ల చేయడంతో పోషక పదార్థాల లభ్యత అధికమై కంకి పొడవు, గింజ బరువు పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది. 10 రోజుల వరకు పంటకాలం తగ్గుతుంది. ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది. నీటి కష్టాలుండవు. చీడపీడల నివారణ సేంద్రియ ఎరువుల వాడకం, మొక్కల మధ్య దూరం వల్ల ఈ పద్ధతిలో చీడపీడలు ఆశించే అవకాశాలు తక్కువ. ఎప్పుడైనా వీటిని నివారించాల్సిన సమయంలో సంప్రదాయ పద్ధతులు, సహజ జీవన ఎరువులు వాడాలి. వేపనూనె లేదా వేప గింజల కషాయంతో పురుగుల సంతతి అరికట్టవచ్చు. ప్రధాన పొలం తయారీ సాధారణ పద్ధతి మాదిరిగా ఎక్కువ రోజులు పొలంలో నీరు నిలబెట్టి లోతుగా దుక్కి దున్నకూడదు. పొలం దున్నడానికి, పచ్చిరొట్ట ఎరువు మురగడానికి సరిపడా నీటిని దాదాపు వారం రోజులపాటు పొలంలో ఉంచాలి. 3-4 అంగుళాల లోతుకు మించకుండా దుక్కి దున్నుకోవాలి. దీనివల్ల వీడర్ దిగబడదు. వరి మొక్కను పైననే నాటాలి కాబట్టి ఈ లోతు దుక్కి సరిపోతుంది. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు దమ్ములో వేయాలి. దమ్ము చేసిన పొలంలో చేతితో లాగే రోలర్ మార్కర్‌తో 25ఁ25 సెంటీ మీటర్ల దూరంలో నిలువు, అడ్డంగా గీతలు గీయాలి. నాలుగు గీతలు కలిసిన చోట వరి నారు మొక్కలు నాటాలి. నాట్లు వేయడంలో జాగ్రత్తలు శ్రీపద్ధతిలో 8నుంచి 12 రోజుల వయసు లేత నారును నాటాలి. చలికాలంలో 13-15 రోజుల నారు వేయవచ్చు. నాటుకు ముందే ఎరువులు దుక్కిలో వేసి దమ్ము చేయాలి. లేత మొక్కను తక్కువ ఎత్తులో నాటడం వల్ల తొందరగా నిలదొక్కుకుని పిలకల సంఖ్య పెరుగుతుంది. నారు పీకిన తరువాత సాధ్యమైనంత త్వరగా అదేరోజు మొక్కలు నాటాలి. మొక్క అంటిపెట్టుకున్న గింజను వేర్లు దెబ్బతినకుండ బొటన వేలు, చూపుడు వేలు సహాయంతో గీతలు కలిసే చోట తక్కువ ఎత్తులో జాగ్రత్తగా నాటాలి. దూరంగా మొక్కలు నాటడం వల్ల ప్రతి మొక్క ఆకులకు సూర్యరశ్మి బాగా సోకుతుంది. దీంతో తగినంత స్థలం, నీరు, పోషకాలు అంది వేర్లు దృఢంగా పెరిగి మొక్క చకచకా వృద్ధి చెందుతుంది. నారువేసిన మరుసటి రోజు నుంచి 10 రోజుల వరకు పలుచగా నీరుపట్టాలి. నీటి పారుదల శ్రీపద్ధతిలో పొలం తడిచేలా మాత్రమే నీళ్లు పెట్టాలి. నేల సన్నటి నెర్రెలు ఏర్పడుతున్న దశలో మళ్లీ నీళ్లు పెట్టాలి. నేల, వాతావరణం ఆధారంగా ఎన్ని రోజులకోసారి నీళ్లు పెట్టాలో నిర్ణయించుకోవాలి. వీడరు తిప్పుటకు ఒకరోజు ముందు నీరు పెట్టాలి. శ్రీ పద్ధతిలో తడుల సంఖ్య 30 శాతం మేర తగ్గుతుంది. సాధారణ వరిలో ఒక కిలో విత్తనం పండించేందుకు 5,000 లీటర్ల నీరు అవసరం కాగా శ్రీపద్ధతిలో 2,000-2,500 లీటర్ల నీరు సరిపోతుంది. పొలాన్ని నిరంతరం తడుపుతూ ఆరబెట్టడం వల్ల నేలలోని సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది ఎక్కువ పోషకాలు సులభంగా మొక్కలకు అందుతాయి. పునరుత్పత్తి, పొట్ట దశలో కూడా పొలానికి పలుచగా నీళ్లు పెట్టాలి. కలుపు యాజమాన్యం పొలంలో నీరు నిలువకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య అధికం. కలుపు నివారణకు వీడర్‌తో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తరువాత 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మరో మూడుసార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. తద్వారా ప్రతిసారి హెక్టారుకు ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు భూమికి చేరుతుంది. అంతేకాకుండా మొక్కల వేళ్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీంతో సూక్ష్మజీవులు వృద్ధిచెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీడర్ చేరుకోలేని కుదుర్ల పక్కన ఉన్న కలుపు మొక్కలను చేతితో తీసేయాలి. వీడర్‌ను మహిళలు సైతం సులభంగా తిప్పి కలుపు నివారించుకోవచ్చు. -
కలవరిమాయె..
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన వరి వివిధ దశల్లో ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో దీనికి చీడపీడలు ఆశించి నష్ట పరుస్తున్నాయి. వీటిని ఎలా నివారించాలో జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), డాక్టర్ ఎం.వెంకట్రాములు (89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (83329 51138) వివరించారు. సుడిదోమ గోధుమ వర్ణపు లేదా తెల్లమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటిమట్టంపై ఉండి దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతోంది. దోమ ఆశించినప్పుడు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీల బాటలు వదలాలి. దీని నివారణకు బుప్రొపెజిన్ 1.6 మి.లీ లేదా ఇతోఫెన్ప్రాక్స్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్, ఎథిప్రొల్ 0.25 గ్రాములు లేదా మోనోక్రొటోఫాస్ 2.2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయచాలి. కంకినల్లి కంకినల్లినే నల్లకంకి అని కూడా అంటారు. ఈ నల్లులు కంటికి కనబడని సూక్ష్మసాలీడు వర్గానికి చెందిన పురుగులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడుతాయి. క్రమేపి ఆకుతొడిమెల లోపల, ఆకు ఈనెల్లో వృద్ధి చెందుతాయి. ఆకు అడుగు భాగం, ఈనెలు, ఆకు తొడిమలపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. గింజలపైనా నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలు అవుతాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా డైకోపాల్ 5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెడవిరుపు తెగులు ఈ తెగులు సోకిన వరి ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. వెన్నుల మెడ భాగంలో ఇది ఆశించటం వల్ల వెన్నులు విరిగి కిందకు వాలిపోతాయి. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొట్టకుళ్లు తెగులు పోటాకు తొడిమలపై నల్లని, లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్లిపోతాయి. వెన్ను పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది. వెన్నులు తాలు గింజలుగా ఏర్పడుతాయి. గింజలు రంగుమారుతాయి. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండి, మంచుపడటం, వాతావరణం చల్లగా ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పొట్ట దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండోసారి కార్బండిజమ్ లీటర్ నీటిలో గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మానిపండు తెగులు పూతదశలో గాలిలో ఎక్కువ తేమశాతం ఉన్న, మంచు లేదా మబ్బులతో కూడిన వర్షపు జల్లులు ఈ తెగులు వృద్ధికి దోహదపడుతాయి. అండాశయంలో ఈ శిలీంధ్రం పెరుగుదల వల్ల ఆకుమచ్చ రంగు ముద్దగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడిపోతుంది. దీని నివారణకు ప్రొపికొనజోల్ 1మి.లీ లేదా కార్బండిజమ్ గ్రాము, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి, వారం రోజుల తరువాత రెండోసారి పిచికారీ చేయాలి. -
ఆదాయ పంట.. అలసంద
పంట సాగుకు ఇదే అదును రబీలో ఈ పంట వేసుకోవడానికి నవంబర్ నెల నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగు నిల్వ ఉండని ఒండ్రు మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో వేసుకోవాలి. సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే విత్తన నాణ్యత పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. రసాయనిక ఎరువులైతే.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఈ ఎరువులు ఏవీ వాడాల్సిన అవసరం లేదు. ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి. చీడపీడల నుంచి రక్షణ ఇలా : చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి. పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి. బొబ్బర్ల సాగులో ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది. విత్తనాల రకాలు : జీసీ-3 : ఈ రకం విత్తనాలు వేస్తే 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3-4క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీ-2 : ఈ రకం విత్తనం ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.పంట 90 నుంచి 95 రోజుల్లో దిగుబడి వస్తుంది. కో-7 : ఈ విత్తనం 70 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. పంట దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది. సీ 152 : ఈ రకం విత్తనంతో 90 నుంచి 100 రోజులో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. టీపీటీసీ-29 : ఈ రకం విత్తనం 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరక దిగుబడి వస్తుంది. -
పాల దిగుబడిపై వ్యాధుల ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘వాతావరణాన్ని బట్టి పశువులకు వ్యాధులు సోకుతుంటాయి. వ్యాధుల ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. దుక్కులు దున్నే పశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పెయ్యలు ఎదకు రాకపోవడం లాంటి నష్టాలు వాటిల్లుతుంటాయి. వ్యాధులను సకాలంలో గుర్తించి, వైద్యం అందించకపోతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంద’ని ఒంగోలు పశువైద్యాధికారి సురేంద్రప్రసాద్ తెలిపారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులను పరిశీలించడం ద్వారా పశువుల అనారోగ్య సమస్యలు, ఎద లక్షణాలు గమనించవచ్చని చెప్పారు. అనారోగ్య లక్షణాలను గుర్తించడం ఇలా.. పశువులు నిలబడటం, కదలిక, ప్రవర్తనలో మార్పులు కనపడతాయి. యజమాని పిలిచినా స్పందించవు. పశువు నిలబడినప్పుడు వంగిపోయినట్లు, తలను నేలకు ఆనించి ఉంటాయి. నడకలో నెమ్మది ఉంటుంది. మేత, నీరు సక్రమంగా తీసుకోవు. నెమరు వేయవు. నోటి నుంచి సొంగ కారుతుంది. చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. వెంట్రుకలు (రోమాలు) పైకి లేస్తాయి. జ్వరం ఉంటుంది. ముట్టె తడారిపోయి, పొడిగా ఉంటుంది. శ్వాస వేగంగా లేదా కష్టంగా ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకొంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పుసులు వస్తాయి. పేడ పలుచగా లేదా గట్టిగా, రక్తంతో, జిగురుగా, నల్లగా ఉంటుంది. మూత్రం చిక్కగా, తక్కువ పరిమాణంలో, రంగుమారి, వాసనతో వస్తుంది. వ్యాధుల రకాలు వైరస్ ద్వారా గాలికుంటు, శ్వాసకోశ, మెదడువాపు, మశూచి, తలవాపు లాంటి వ్యాధులు వస్తాయి. నూతన కాంగో వైరస్ జ్వరం పొంచి ఉంది. సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసీస్, లెప్టోస్పైరోసిస్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పరాన్న జీవుల ద్వారా కుందేటి వెర్రి, బేబీ సియోసిస్, మైక్రోఫైలేరియా, కాలేయవుజలగ, జీర్ణాశయపు జలగ, మూగబంతి, తదిరర వ్యాధులు సోకుతాయి. జీర్ణక్రియలో లోపాల వల్ల పాలజ్వరం,పొదుగు వాపు, పడకజబ్బు, కిటోసిస్ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించి పశువైద్యాధికారులను సంప్రదించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. -
చీడపీడల నివారణే కీలకం
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ముగిసింది. దీంతో రైతుల ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. ప్రధానంగా చీడ పీడల నుంచి కాపాడుకుని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఖరీఫ్‌లో కన్నా రబీలోనే వరి పంటలో అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయు అధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. వరిలో విత్తన ఎంపిక, నారుమళ్లు, సస్యరక్షణపై ఆయన వివరించారు. - చెన్నారావుపేట అనువైన విత్తన రకాలు జగిత్యాల సన్నాలు(జేజీఎల్-1798) : ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది. వర్ష(ఆర్డీఆర్-355) : ఎకరానికి 2 టన్నుల దిగుబడి ఇస్తుంది. కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకువుుడుత పురుగుల్ని తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది. జగిత్యాల సాంబ(జేజీఎల్-3844) : ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని, ఉల్లికోడును తట్టుకుంటుంది. 125 రోజుల్లో కోతకు వస్తుంది. జగిత్యాల వుసూరి( జేజీఎల్-11470) : పంటకాలం 130-135 రోజులు. ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. చలిని పూర్తిగా, చీడ పీడలను కొంత వరకు తట్టుకుంటుంది. వరంగల్ సన్నాలు(డబ్యూజీఎల్-32100) : పంటకాలం 135 రోజులు. ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. నెల్లూరి వుసూరి(యున్యుల్ఆర్-34449) : పంటకాలం 125 రోజులు. ఎకరానికి 3.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులు, చౌడును తట్టుకుంటుంది. పద్యువ్ను(జేజీఎల్-17004) : ఇది స్వల్పకాలిక పంట రకం. 110 రోజుల్లో కోతకు వస్తుంది. చదరపు మీటరకు 60-65 కుదుర్లు ఉండేలా నాటుకుంటే ఎకరానికి 2.8 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఉల్లికోడు, చలిని సవుర్థవంతంగా తట్టుకుంటుంది. కాటన్దొర సన్నాలు(ఎంటీయూ-1010), విజేత(ఎంటీయూ-1001) : దొడ్డు రకాలు సాగు చేసే రైతులకు ఇవి అనువుగా వుంటారుు. 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. సుడి దోవు, అగ్గి తెగులును తట్టుకుంటారుు. ఎకరానికి 3.5 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. వీటిని సాగు చేస్తున్నపుడు పొలంలో విధిగా జింక్ సల్ఫేట్ వేసుకోవావలి. వీటితో పాటు ఐఆర్-64 రాశి, తెల్లహంస, పోతన, కృష్ణహంస, దివ్య, ఎర్రవుల్లెలు, శీతల్, వరాలు, రాజేంద్ర వంటి రకాలు కూడా అనువుగానే ఉంటారుు. ఆయూ ప్రాంతాల రైతులు వ్యవసాయు శాస్త్రవేత్తలు, వ్యవసాయూధికారుల సలహాలు తీసుకుని అనువైన రకాలను ఎంచుకోవాలి. విత్తన మోతాదు-విత్తన శుద్ధి సన్న రకాలైతే ఎకరానికి 10-15 కిలోలు, దొడ్డు రకాలైతే 20-25 కిలోల విత్తనాలు అవసరవువుతారుు. లీటరు నీటికి ఒక గ్రావుు కార్భండిజమ్ కలపాలి. ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. వురో 24 గంటలు వుండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాలను నారువుడిలో చల్లాలి. నారు పోసుకునే సమయం దీర్ఘకాలిక రకాలైతే నవంబర్ మొదటి వారం లోపు, వుధ్య కాలిక రకాలైతే రెండో వారం లోపు, స్వల్ప కాలిక రకాలైతే వుూడో వారం లోపు విత్తనాలు చల్లుకోవాలి. సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేనివారు డిసెంబర్ చివరి వరకు నారు పోసుకోవ చ్చు. ఏప్రిల్ మొదటి వారానికి కోతలు పూర్తయ్యేలా చూసుకోవడం వుంచిది. నారువుడి కోసం ఎంచుకున్న ప్రదేశాన్ని వుూడుసార్లు దవుు్మ చేసి, చదును చేయూలి. నీరు పెట్టడానికి, తీయుడానికి వీలుగా వేర్వేరు కాలువలు ఏర్పాటు చేయూలి. నారు త్వరగా ఎదగాలంటే.. రబీలో నారు మొక్కలు త్వరగా ఎదగాలంటే ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయుడానికి సరిపడే నారువుడిలో 2 కిలోల నత్రజని(కిలోఎరువును విత్తనాలు చల్లేటపుడు, మిగిలిన ఎరువును 12-14 రోజులకు) ఎరువు వేయూలి. దుక్కిలో 1.5 కిలోల భబాస్వరం, కిలో పోటాష్‌ను అం దించే ఎరువులు వేయూలి. రాత్రి సవుయుంలో నారువుడిపై టార్పాలిన్షీట్ లేదా యుూరియూ సంచులతో కుట్టిన పరదాల్ని కప్పాలి. నారువుడిలో రాత్రిపూట నిల్వఉన్న నీరు చలి కారణంగా చల్లగా ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయుం నీటిని తేసేసి కొత్త నీరు పెట్టాలి. కాలిబాటలతో మేలు పొలంలో కాలిబాటలు తీసి నాట్లు వేయడం ద్వారా పంటలో చీడపీడలు తగ్గుతారుు. సస్యరక్షణ చర్యలకు అనువుగా ఉంటుంది, ఎరువులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. -
బోడో మిశ్రమంతో క్రిమికీటకాలు దూరం
కొండాపూర్: క్రిమికీటకాలు, పురుగులు మామిడి చెట్లపైకి వెళ్లకుండా ఉండాలంటే మొదళ్లకు బోడో పేస్ట్ మిశ్రమాన్ని పూయాలని రావేఫ్ విద్యార్థులు రైతులకు సూచించారు. మండల పరిధిలోని మల్కాపూర్‌లో కౌలు రైతు శ్రీనివాస్ పొలంలో మంగళవారం అన్నదాతలకు పలు సలహాలు అందజేశారు. బోడో మిక్చర్ తయారీ విధానం.. కిలో కాపర్ సల్ఫేట్లో 10 లీటర్ల నీళ్లు పోసి కేసీ సున్నం వేసి కలిపితే బోడో మిక్చర్ తయారవుతుంది. దీన్ని చెట్ల మొదళ్లకు, కొమ్మలకు పూయడం వల్ల చీమలు, కీటకాలు, పురుగుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. పిండి నల్లులు, పండు ఈగలు చెట్లపై వాలకుండా ఉండాలనుకుంటే కొమ్మలకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిలాండేశ్వరి, శ్రీవర్ధ, లిఖిత, దివ్య, శైలజ, అల్ఫియా, సుస్మితారెడ్డి, అసా సుష్మ, పూర్ణిమ, జఫీలా, సింధు, మేఘన, నిస్సీ, ఫెమి, వర్షారెడ్డితో పాటు గ్రామ రైతులు నారాయణ, పాపయ్య, చంద్రకళ, చెంద్రయ్య, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత పాటిస్తే మద్దతు!
వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం రూ.1,360, పత్తి (పొడవు పింజ రకం) రూ.4,050, పత్తి (మధ్యరకం) రూ.3,750, మొక్కజొన్న రూ.1,310, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.2,560, సోయాబీన్ (నలుపు) రూ.2,500, కందులు రూ.4,350, మినుములు రూ.4,350, పెసలు రూ.4,600, వేరుశనగ కాయ రూ.4,000, పొద్దుతిరుగుడు రూ.3,750, సజ్జలు రూ.1,250, జొన్నలు (హైబ్రిడ్) రూ.1,530, జొన్నలు (మలదండి) రూ.1,550, రాగులు రూ.1,550, నువ్వులు రూ.4,600 మద్దతు ధర ప్రకటించిందన్నారు. వడ్లు ఆరబోసి తేవాలి వరి పంట కోసిన తర్వాత మట్టి పెళ్లలు, రాళ్లు, చెత్త, తాలు రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం, తక్కువ రకాల మిశ్రమం, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌కు తరలించే ధాన్యాన్ని బాగా ఆరబోసి తేమ శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ధాన్యం ఎండిన తర్వాత 17 శాతం కన్నా ఎక్కువ తేమ లేకుండా చూసుకుని విక్రయానికి తరలించాలి. మక్కలను బాగా ఎండనివ్వాలి మొక్కజొన్న ధాన్యంలో వ్యర్థ పదార్థాలు, ఇతర తిండి గింజలు, దెబ్బతిన్న, రంగు మారిన గింజలు, పరిపక్వం కానీ నాసిరకం, పుచ్చిపోయిన గింజలు లేకుండా ఉండాలి. మొక్కజొన్న కంకులను ఒలిచేందుకు మిషన్లను వాడటం వల్ల జొన్నలు పాడవకుండా వస్తాయి. బూజుపట్టిన, రంగుమారిన కంకులను మంచి కంకుల్లో కలవకుండా చూడాలి. కంకులను ఒలిచిన తర్వాత రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తెగుళ్లు సోకిన, రంగు మారిన ముడుచుకుపోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరేయాలి. రాళ్లు, మట్టిపెడ్డలు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు లేకుండా చూడాలి. పత్తిలో చెత్త ఉండొద్దు పత్తిమొక్క సహజమైన రంగు మారకూడదు. పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల పత్తి రంగు మారి పోగుల నాణ్యత తగ్గుతుంది. బాగా ఆరి, శుభ్రం చేసిన పత్తినే మార్కెట్‌కు తరలించాలి. పత్తిలో 8 శాతం మాత్రమే తేమ ఉండాలి. 12 శాతంకంటే ఎక్కువ ఉంటే బాగా ఎండబెట్టిన తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్లాలి. -
మెలకువలు పాటిస్తే.. నాణ్యమైన ధాన్యం
పాటించాల్సిన సూచనలు వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి. వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసివేయాలి. కోతకు 15 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి. 1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు ఆగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి. కోసిన వరి మొదలును నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి. అనంతరం ఒక్కో రకం వరికి వేరు వేరు కల్లాలు చేసి, వాటిపై పరదాలు వేసి వరి మొదలు పెట్టి ట్రాక్టర్‌తో తొక్కించాలి. ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరొక రకం వరి ధాన్యంతో కలుపరాదు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి. గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో తాలు లేకుండా శుభ్రంగా తూర్పార పట్టాలి. 13 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి గోనె సంచుల్లో పోయాలి. హార్వెస్టర్‌తో కోస్తే మొదటిసారి పోసే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒకచోట పోయాలి. ఇలా చేయడం ద్వారా కల్తీ ప్రమాదం తప్పుతుంది. వరి గింజలన్నీ సిమెంటు కల్లాలపై లేదా టార్పాలిన్ షీట్లపై ఆరబెట్టా లి. రోజుకు మూడుసార్లు బాగా ఎండేలా కాళ్లతో కలియదున్నాలి. పంట కోశాక సరిగా ఆరబెట్టకపోతే గింజలకు తెగుళ్లు సోకి, రంగుమారి, పంట నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టిపెళ్లలు, చెత్త, చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి. నిల్వ చేసే పక్షంలో గోనె సంచులను కింద వేయకుండా బల్లలు పరిచి వాటిపై బస్తాలు నెట్టుగా వేయాలి. పురుగులు ఆశించకుండా లీటరు నీటిని 5 మిల్లీలీటర్ల మలాథియన్ మందును కలిపి బస్తాలపై పిచికారి చేయాలి. ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల నెట్టుల మధ్య జింక్పాస్ఫైట్ ట్యాబ్లెట్లు ఉంచాలి. ఒకరోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండాపోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయవచ్చు. -
ముడతలు ముంచేస్తాయ్..
తామర పురుగులు ఆకుల అడుగ భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. మొక్కలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. నివారణకు కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోశాడ్ 75 మిల్లీలీటర్లు లేదా పెసగాన్ 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. మిరప నారు నాటిన 15, 45వ రోజు పిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా పై ముడత ను నివారించవచ్చు. పై ముడతతో పాటు కింది ముడత కూడా ఉంటే కార్బరిల్, ఎసిఫేట్ మందులు వాడకూడదు. తెల్లనల్లి (కింది ముడత) తెల్లనల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దగా మారతాయి. కింది ముడత నివారణకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీటిలో కరిగే గంధ కం 600 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పంటకు ఆకులు తడి చేలా పిచికారీ చేయాలి. పై ముడత ఉధృతి ఒకేసారి గమనిస్తే ఉధృతిని బట్టి ఎకరాకు జోలోన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చే సుకోవాలి. పేనుబంక లేత కొమ్మల ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గుతుంది. ఇది తియ్యటి పదార్థాలను విసర్జించడం వల్ల చీమలను ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు మసిపూసినట్లుగా నల్లగా మారిపోతాయి. పేనుబంక నివారణకు మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత పురుగులు పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. తొలిచి చూస్తే ఈగ పిల్ల పురుగులు, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 40 శాతం వరకు పూత రాలిపోతుంది. కాయలు ఏర్పడవు. ముందే ఏర్పడిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకర్లు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధరపలకదు. నివారణకు ట్రైజోపాస్ ఎకరానికి 250 మిల్లీలీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 400 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత మరలా క్లోరోపైరిఫాస్ 500 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాయతొలుచు పురుగు పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగులు మొదటి దశలో మిరప ఆకులను నష్టపరిచి తర్వాత కాయల్లోకి చేరి గింజలను తినేస్తాయి. నివారణకు థయోడికార్బ్ 200 గ్రాములు లే దా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా టోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా ఫినాల్‌ఫాస్ 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. గుడ్ల నుంచి అప్పుడే బయటికి వచ్చే పిల్లపురుగులను అరికట్టేందుకు నోవాల్యురాన్ 150 మిల్లీలీటర్లు లేదా డైప్లూబెంజురన్ 200 గ్రాముల మందును 200 లీటర్ల నీటికి ఎకరాకు పిచికారీ చేయాలి. విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దెపురుగులను నివారించవచ్చు. విషపు ఎర తయారీకి.. 5 కిలోల తవుడుకు 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 500 గ్రాముల బెల్లం, తగినంత నీటిని కలిపి చిన్నచిన్న గుళికలుగా తయారు చేసి సాయంత్రం వేళ చేలో సమానంగా చల్లితే నెర్రెల్లో దాగి ఉన్న పురుగులు రాత్రి వేళ బయటికి వచ్చి తిని చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతిని గుర్తించడానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎరలను మాత్రం 25 రోజులకు ఒకసారి మార్చాలి. ఆకర్షణ పైరుగా చేనులో ఆముదం, బంతి మొక్కలు వేసుకోవాలి. మిరప పంటకు పురుగుల మాదిరిగా పలురకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తాయి. -
ఉల్లిపైనే ఆశలు!
ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు.. తల్లికూడా చేయదంటారు. అంటే దీన్ని తీసుకోవడం ఎంత ఆరోగ్యదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలోనే ఈ పంట సాగుకు పేరుగాంచినది మనూరు మండలం. ఇక్కడ చాలా మంది రైతులు ప్రతిఏటా ఉల్లిని విస్తారంగా పండిస్తారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలో 100 హెక్టార్లకుపైగానే ఈ పంట సాగవుతోంది. అయితే దీని సాగులో పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై ఏఓ శ్రీనివాస్‌రెడ్డి (సెల్: 9676606020) అందించిన సలహాలు, సూచనలు... పంట సాగుకు ముందు విత్తనశుద్ధిని విధిగా పాటించాలి. దీనివల్ల చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. కిలో విత్తనానికి 1గ్రాము కొర్బండిజం, 2.5గ్రాముల మ్యాంగోజబ్ను కలిపి శుద్ధి చేసుకోవాలి. ఉల్లినారు వేసే సమయంలో 20 నుంచి 30 రోజుల ముందు ఒక్క అంగుళం ఎత్తులో మట్టి బెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్డు 10 నుంచి 15గజాల పొడవు ఉండాలి. బెడ్డుపైన ఆకులు, అములు వంటి చెత్త వేసి కాల్చివేయాలి. దీంతో బెడ్డుపైన ఉన్న శిలీంద్రాలు, బ్యాక్టీరియా చనిపోతాయి. అనంతరం బెడ్డును నీటితో తడిపి ఉల్లి విత్తనాలు చల్లుకోవాలి. ఒక్క ఎకరాకు నాలుగు కిలోల ఉల్లి విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని బెడ్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో నారుకు నీటి తడులు అందించాలి. సాగు నేలను సిద్ధం చేసుకోండిలా... ఉల్లినారు చేతికి వచ్చిన సమయంలో సాగు నేలను సిద్ధం చేసుకోవాలి. ఇందులో భాగంగా ఒక్క ఎకరాకు ఒక కిలో డీఏపీ, 30 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా చల్లిన తరువాత భూమిని చదనుగా దున్ని మడులను సిద్ధం చేసుకోవాలి. నాట్లు వేసే ఒకరోజు ముందు మడులను నీటితో తడపాలి. అనంతరం నారును నాటేయాలి. 5 నుంచి 7 రోజుల అనంతరం మడులలో నెర్రెలుబారిన తర్వాత తిరిగి నీటిని వదలాలి. కలుపు నివారణ పంట నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల అనంతరం మొదటి కలుపు తీయాలి. కలుపు నివారణకు గాను ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఆక్సాడయాక్సిన్ను పిచికారీ చేసుకోవాలి. ఈ మందు పిచికారీ చేసే సమయంలో భూమి తేమగా ఉండాలి. అనంతరం 30 నుంచి 35 రోజుల మధ్య రెండోసారి కలుపు తీసి ఎకరాకు 35 కిలోల యూరియా చల్లి నీటిని అందించాలి. 40 నుంచి 45 రోజుల్లో మూడోసారి కలుపు తీసి 30 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ చల్లితే పంట ఏపుగా పెరుగుతుంది. ప్రత్యేక జాగ్రత్తలు 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంటను తీయడానికి వారం రోజుల ముందు మడులకు నీరు పారించొద్దు. దీంతో ఉల్లిగడ్డ దిగుబడి, బరువు పెరుగుతుంది. మళ్ల నుంచి తొలగించిన ఉల్లిని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. లేక చెట్టు నీడ అయిన ఫర్వాలేదు. దీంతో ఉల్లి కుళ్లి పోకుండా ఉంటుంది. వారం రోజుల్లో మార్కెట్‌కు తరలించుకోవచ్చు. లేకుంటే గిడ్డంగులకు తరలించి నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ రేటును బట్టి రైతులు ఉల్లిని విక్రయించుకోవచ్చు. తెగుళ్ల నివారణ ఉల్లి పంటకు రసం పీల్చే పురుగు బెడద ఉంటుంది. దీని నివారణకు గాను ఎకరాకు 1లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. లేదా ఒక లీటరు నీటిలో 1మి.లీ. టిప్రోనిల్ను కలిపి స్ప్రే చేయాలి. లీటరు నీటిలో 3గ్రాముల చొప్పున ఎం.45 మందును కలిపి కొట్టినా పురుగును నివారించవచ్చు. రసం పీల్చే పురుగు బెడద మరీ ఎక్కువగా ఉంటే 30నుంచి 45రోజుల మధ్య 10లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును స్ప్రేచేయాలి. ఎకరా భూమిలో దాదాపు 80నుంచి 90 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద క్వింటాళ్ల వరకు తీయొచ్చు. -
నువ్వు పంట సాగు నాలుగు విధాల బాగు
మరిపెడ : తెలంగాణ ప్రాం తంలో ఖరీఫ్ సీజన్లో పసుపు, మొక్కజొన్న తరువాత వేసవి వరి మాగాణులో నిల్వ ఉన్న తేమ కింద నువ్యు పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసుకుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. తద్వారా విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొం దవచ్చని మరిపెడ మండల వ్యవసాయ అధికారి సీహెచ్.యాకయ్య (88866 14594) తెలిపారు. నువ్వు పంట సాగు-యాజమాన్య పద్ధతులపై ఆయన వివరించారు. అనువైన నేలలు మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచి ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు. నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని రెండు సార్లు గుంటుకతోలి చదును చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతలు ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తన రకాలు ఖరీఫ్‌లో గౌరి, మాధవి, ఎలమంచిలి-11, ఎల మంచిలి-17 రకాలు అనుకూలం. ఎలమంచిలి-66(శారద) ఖరీఫ్ లేదా రబీ, వేసవిలో వేసుకోవచ్చు. రబీలో రాజేశ్వరి, శ్వేతాతిల్, చందన, హిమ(జేసీఎస్-9426) రకాలు వేసుకోవాలి. విత్తనశుద్ధి - విత్తే విధానం కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టన్-ఎ లేదా మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఖరీఫ్‌లో జూలై చివరి వారం నుంచి ఆగస్టు తొలి వారం వరకు, రబీలో జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు పంట వేసుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం ఖరీఫ్‌లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల ప శువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం మరియు పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలపు తీసివే యాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అబివృద్ధి మరియు గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుంచి 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణ - అంతరకృషి విత్తేముందు ప్లూకోరలిన్ 45శాతం ఎకరాకు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కలియ దున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కను తీసి వేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. రసం పీల్చే పురుగులు (తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చడోమ) : పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశించి న ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకుపోయి పాలిపోతాయి. నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగులు : ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులు లోనికి ముడుచుకోని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగుచారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబి రంగు శీలింధ్రం బీజాల సముదాయం కనిపిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుంది. నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండం ఎండు తెగులు : కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతుంది. నివారణ : మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లీటరు నీటితో కలిపి చల్లుకోవాలి. వెర్రితెగులు : ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఎర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది. నివారణ : రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకుంటాయి. తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్డెమోటాన్ 1మిల్లీలీరు లేదా డైమిథోయోట్ 3మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దీపపు పురుగులను కూడా అరికట్ట వచ్చు. బూడిద తెగులు : లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించి న ఆకులు మాడి రాలిపోతాయి. నివారణ : నీటిలో కరిగే గంధకపు పొడి 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
సోయా పొట్టే కదాని.. తగలబెట్టకండి
బాల్కొండ: ఖరీఫ్‌లో సాగుచేసిన సోయా పంట నూర్పిళ్లు ప్రస్తుతం రైతులు చురుగ్గా చేపడుతున్నారు. సోయా పంటను ప్రస్తుత సంవత్సరం నేరుగా నూర్పిడి చేయడంతో పాటు కోత కోసి కుప్ప వేసి హర్వేస్టర్‌తో నూర్పిడి చేస్తున్నారు. ఇలా నూర్పిడి చేయడంతో సోయా విత్తనాలు ఓ వైపు, సోయా పొట్టు మరోవైపు వేరవుతుంటాయి. కాని సోయా పొట్టును రైతులు సాధారణంగా తగలబెడతారు. సోయా పొట్టే కదాని రైతులు నిర్లక్ష్యంగా పంట భూములను శుభ్రం చేయాలనే ఆలోచనతో తగుల బెడుతుంటారు. సోయా పొట్టులో భూమిలో భూసారం పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. సోయా పొట్టును కుప్పలుగా చేసి పంట భూమి వద్ద పెద్ద గుంతను తవ్వి గుంతలో వేయాలి. మంచిగా మాగిన తర్వాత తీసి వేస్తే భూసారం పశువుల పేడ వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా పెంచుతుంది. ఎకరా సోయా పంట లో వెళ్లే పొట్టు ఓ లారీ పశువుల పేడతో సమానం. ఖరీఫ్‌లో పశువుల పేడ లారీ సుమారు రూ.15 వేల ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులు, సోయా పొట్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. తవ్విన గుంతలో సోయా పొట్టు వేసిన త ర్వాత బాగా నీరు పట్టాలి. అలా చేయడం వల్ల అది మంచి ఎరువుగా తయారవుతుంది. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా సాగయ్యే పంట కాబట్టి సోయాలో అనేక పోషకాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. సోయా పొట్టును తగుల పెట్టడం వల్ల పొట్టుతో పాటు భూమికి చేటు అవుతుందంటున్నారు. వేడి వల్ల భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. వాటి తో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పంట పండించే నేలలో నిప్పు పెట్టరాదంటున్నారు. భూసారం కూడా తగ్గుతుందంటున్నారు. భూమి వదులుగా మారుతుంది. సోయా పొట్టును మంచి ఎరువుగా మలుచుకొని పసుపు సాగుచేసే భూమిలో వేయాలి. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూసారం పెరిగి పంట దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రైతులారా ఆలోచించండి..! -
కట్టెల పందిరిపై టమాటా సాగు
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నేను వ్యవసాయం చేయాలని ఈ ఏడు వరితో పాటు టమాటా సాగు చేపట్టాను. టమాట పంట సాగు వర్షాకాలంలో చేయడం చాలా కష్టం. వర్షానికి చేను కుల్లిపోతుంది. అందుకే నేను ఏపుగా పందిరి పైకి పెరిగే ఇన్‌సోనా రకం టమాటా రకాన్ని సుమారు అర ఎకరం పొలంలో నాటు వేశాను. నాటు వేసిన అనంతరం పొలం పరిసర ప్రాంతాల్లో మీటరు ఎత్తు గల కర్రలను కొట్టుకుని తెచ్చి ఈ పొలంలో పాతాను. కర్రలకు జీఐ వైరును కట్టి టమాట మొక్కలకు జనపనార తాడు, మందం దారం సాయంతో ఈ వైరుకు వేలాడదీసాను. దీంతో టమాట మొక్కలు భూమి మీద పరుచుకోకుండా ఎత్తుగా పెరిగాయి. టమాట చెట్టుకు కాత ఎక్కువ పట్టింది. వర్షాలకు కాయ, మొక్కలు కుళ్లిపోలేదు. టమాటా పంటకు సోకే పచ్చ పురుగు నుంచి పంటను కాపాడుకోవడానికి చుట్టూ బంతి మొక్కలను నాటాను. దీంతో పచ్చ పురుగు ఉధృతి తగ్గింది. అర ఎకరంలో పంటకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాను. టమాటా దిగుబడితోపాటు బంతిపూలు కూడా చేతికందివచ్చాయి. కాయను సులువుగా తెంపొచ్చు : జయరాజ్, ఉద్యాన శాఖ అధికారి సాధారణ పంటకు బదులు పందిరి మీదకు పాకే విధంగా టమాటా సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పద్ధతితో చెట్టు ఏపుగా పెరిగి అధిక శాతం కాత పడుతుంది. నేలమీద పారితే వర్షాకాలంలో నీరు నిలిచినా, గాలి సోకక మొక్కలు, కాయలు కుళ్లిపోతాయి. ఎత్తుగా పెరగడంతో పొలంలో గాలి సోకి చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. కాయను తెంపడానికి కూడా సులువుగా ఉంటుంది. దిగుబడి కాలం పెరిగి 25 శాతం మేరకు అధిక దిగుబడి సాధించవచ్చు. టమాటాలో ఇన్‌సోనా వంగడం ఎత్తుగా పెరుగుతుంది. ఈ రకం పందిరి సాగుకు అనుకూలంగా ఉంటుంది. 1 ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి.. తొలిసారిగా ముందస్తు బుకింగ్స్ రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్లో ధరలు న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లు, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను ఈ నెల 17 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. ఈ కొత్త ఐఫోన్ ల ధరలు రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్లో ఉన్నాయి. ఈ ధరలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేసిన ధరల కంటే తక్కువగా ఉండడం విశేషం. అయితే అమెరికాలో ఐఫోన్ రిటైల్ ధరలతో పోల్చితే ఈ ధరలు 10-17% అధికం. అమెజాన్ వెబ్సైట్ ఐఫోన్ 6ను డెలివరీ చార్జీలతో కలిపి 750 డాలర్లు (సుమారురూ.46,000)కు విక్రయిస్తోంది. తొలిసారిగా ముందస్తు బుకింగ్స్ గత నెలలో యాపిల్ కంపెనీ పెద్ద స్క్రీన్ ఉన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, కొత్తగా యాపిల్ వాచ్, యాపిల్ పే(మొబైల్ వాలెట్)లను ఆవిష్కరించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ల విక్రయలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత డిస్ట్రిబ్యూటర్లుగా రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో, రాశి పెరిఫెరల్స్, రిలయన్స్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. భారత్‌లో ఐఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ ఇదే తొలిసారి. వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 7 నుంచే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ మైక్రో పేర్కొంది. యాపిల్ కంపెనీకి ఈ సంస్థ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్. 24 నగరాల్లోని 1,200 అవుట్లెట్లతో పాటు, తమ వెబ్సైట్ ద్వారా కూడా ముందస్తుగా ఈ ఐఫోన్లను బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 2జీ, 3జీ, 4 జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 6.9 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6లో 4.7 అంగుళాల స్క్రీన్ ఉండగా, 7.1 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంది. గత ఏడాది యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను రూ.53,500 ధరకు భారత్‌లో అందించింది. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.30,000 రేంజ్లో ఉంది. -
క(న)ష్టాలను జయించిన ఆత్మవిశ్వాసం
మహారాష్ట్ర నుంచి మొక్కలు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా మహాత్మాపూలే రావూర్ విద్యాపీఠ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 3,200 దానిమ్మ మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున చెల్లించాడు. వీటిని తన పొలానికి తరలించే సరికి రవాణా కోసం రూ.80,000 వరకు ఖర్చు అయ్యింది. దానిమ్మ రకం ‘బగువా’ సాగు కోసం ‘బగువా’ రకానికి చెందిన మొక్కలను ఎంచుకున్నాడు. ఒక్కో దానిమ్మ పండు 150 నుంచి 400 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఒక్కో చెట్టుకు 300ల వరకు కాయలు వస్తాయి. మొదటి కాతలో ఒక్కో చెట్టుకు 80 కాయలు కాసి పండ్లుగా మారుతున్నాయి. తెగుళ్లు దానిమ్మ తోటలకు అత్యధికంగా మ చ్చతెగుళ్లు వస్తాయి. దీంతో దానిమ్మ పండ్లు నేలరాలిపోతాయి. అయితే మొక్కలకు ఎలాంటి తెగుళ్లు రాకుండా ఎథ్రిల్ అనే మందును పిచికారీ చేశాడు. తోట పర్యవేక్షణ కోసం పూణెకు చెందిన హార్టికల్చర్ అధికారి గణేశ్ కడాయ్‌ను నియమించుకున్నాడు. ప్రతీ 20 రోజుల కోసారి అతను వచ్చి మొక్క ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికోసం అతనికి ప్రతీసారి రూ.10వేలు చెల్లిస్తున్నాడు. ఎరువుల వాడకం వెంకటరాంరెడ్డి సాగు చేసిన తోటలో అత్యధికంగా సేంద్రియ ఎరువులను వాడాడు. పచ్చిరొట్ట ఎరువుతో పాటు ప్రతీ మొక్కకు రెండుగంపల పశువుల పేడ ఎరువును మొక్కకు నాలుగు వైపులా వేశాడు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇదే పద్ధతిలో ఎరువులు వాడారు. ఏపుగా పెరిగిన తోట మూడో ఏడాది వరకు ఒక్కో మొక్క 12 ఫీట్ల వరకు పెరిగింది. ఏపుగా పెరిగిన మొక్కల కొమ్మలను పూత రాకముందే కత్తిరించాడు. అనంతరం ప్రతీ మొక్కకు వెదురు కట్టెలతో ప్రత్యేక పందిరి వేయించాడు. దీనికోసం రూ.2లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ పందిరి ద్వారా మొక్కల కొమ్మల బరువు వెదురు కట్టెలపై పడుతుంది. దీంతో చెట్టు కొమ్మలు విరిగిపోకుండా కాయలు ఏపుగా ఎదగడంతో పాటు మొక్కకు అవసరమైన వాతావరణం లభిస్తుంది. దానిమ్మ తోట చుట్టూ రూ.60వేలతో 5 లైన్ల సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాను. దీంతో తోటకు అడవి జంతువుల నుంచి రక్షణ లభించింది. మొక్కలు నాటే ముందు... 12 ఎకరాల భూమిలో 14-11 ఫీట్ల మేర జేసీబీతో 3,200ల గోతులు తీయిం చాడు. దీనికోసం రూ.1.5లక్షల వరకు పెట్టుబడి వచ్చింది. అనంతరం ప్రతీ గోతిలో చెత్తను నింపి కాల్చేశాడు. ఇలా చేయడం వల్ల గోతిలోని హానికారక క్రిములు (బాక్టీరియా, వైరస్ వంటివి) చనిపోతాయి. అనంతరం ఒక్కో గోతి లో పచ్చిరొట్ట వేసి మొక్కను పెట్టి మట్టితో పూడ్చాడు. అంతకు ముందే డ్రి ప్పు ఏర్పాటు చేసుకుని ప్రతీ గోతి నీటి చుక్కలు పడేలా పైపులు బిగించాడు. మొదటిసారి దిగుబడి పంట వేసి మూడేళ్లైంది. ఈ ఏడాది కాపుగా ఒక్కో మొక్కకు 80 వరకు కాయలు కాశాయి. వీటిని పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్‌కు తరలించాడు. ఒక్కో కాయకు రూ.5 నుంచి రూ.8 వరకు ధర లభించింది. దీంతో 12 ఎకరాల దానిమ్మ తోటలో మొదటి సారి కాసిన పండ్ల విలువ రూ.12లక్షలు. కూలీలు, రవాణా చార్జీలకు గాను రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. వచ్చే ఏడాది నుంచి వచ్చే కాతంతా లాభాల పంటే. చాలా కష్టపడ్డా నాకు 12 ఎకరాల బీడు భూమి ఉంది. దాన్ని ఎలాగైనా సాగులోకి తేవాలని చాలా కష్టపడ్డా. రెండేళ్ల క్రితం వేసిన బోరులో అంగుళంన్నర నీరు రావడంతో దానిమ్మ తోటను సాగు చేయాలని నిర్ణయించుకున్నా. దీనికోసం మహారాష్ట్రలోని షిర్డీ ప్రాంతంలో సాగవుతున్న దానిమ్మ తోటలను సందర్శించా. అక్కడి రైతుల కష్టమే నాకు స్ఫూర్తిదాయకంగా మారింది. - వెంకటరమణారెడ్డి -
కూర మిరపతో లాభాల మెరుపు
ఖమ్మం వ్యవసాయం: వివిధ కూరగాయ పంటలతో పాటు కూరమిరప అత్యంత ప్రాచుర్యం పొందింది. దీనిలో క్యాప్సికం(కూర మిరప)ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీని సాగు పద్ధతులను ఉద్యానశాఖ సహాయ సంచాలకులు-2 కె.సూర్యనారాయణ (83744 49066) వివరించారు. ఈ క్యాప్సికం కాయలు ఎక్కువ కండ కలిగి గంట ఆకారంలో ఉండటం వలన దీన్ని ‘బెల్ పెప్పర్’ అని కారం లేకపోవడం వలన లేదా తక్కువ కారం ఉండటం వలన ‘స్వీట్ పెప్పర్’ అని అంటారు. ఈ కాప్పికం కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లు టమాటాలో కన్నా అధికం. మన జిల్లాలో ఏటేటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంటకు అనువైన సమయం: క్యాప్సికం సాగు చేయటానికి అక్టోబర్- నవంబర్, జూలై- ఆగస్టు నెలలు అనుకూలం. నేలలు: మురుగు నీరు నిలువ ఉండని నల్లభూములు, ఎర్రభూములు అనుకూలం. ఉదజని సూచిక 6.0 - 6.5 ఉన్న నేలలు బాగా అనుకూలిస్తాయి. చౌడు భూముల్లో ఈ పంట పండించకూడదు. సాధారణ రకాలు: కాలిపోర్నియా వండర్, ఎల్లో వండర్, అర్కమోహిని (సెలక్షన్-13) లర్కగౌరవ్ (సెలక్షన్-16) అర్కబసంత్ (సెలక్షన్-3), నాంధారి-10, నాంధారి-33. సంకర జాతి రకాలు: భారత్, మాస్టర్ మాస్టర్, ఇంద్రా, లారియో, ఎస్.ఎస్-436, ఎస్.ఎస్-625, నాథ్ హీరా, తన్వి, విక్రాంత్, గ్రీన్ గోల్డ్, సన్ 1090, సన్ 1058. విత్తన శుద్ధి: ఎన్నుకున్న రకానికి థైరమ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పెపంకం: ఎత్తై నారుమళ్లు లేదా ప్రొట్రేల ద్వారా నారు పెంచుకోవచ్చు. ప్రోట్రేల ద్వారా నారు పెంచితే దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాటు విధానం: మొక్కకు, సాళ్లకు మధ్య దూరం 2.5ఁ2.5 అడుగులలో నాటాలి. ఇలా నాటితే ఎకరానికి 8 వేల నుంచి 9 వేల మొక్కలు పడతాయి. రబీ పంటగా 2ఁ2 అడుగుల దూరంలో నాటాలి. ఈ విధానంలో ఎకరాకు 11 వేల నుంచి 12 వేల మొక్కలు పడతాయి. ఎరువుల యాజమాన్యం: ఎకరానికి 50 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులను పంట పెరిగే వివిధ దశల్లో వేసుకోవాలి. నీటి యాజమాన్యం: నేల స్వభావాన్నిబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. {yిప్ పద్ధతిలో నీరు పెట్టేటట్టయితే 10-20 శాతం దిగుబడిలో వృద్ధి పొందటమేగాక నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు. తెగుళ్లు-నివారణ పంట పెరిగే వివిధ దశల్లో కాయ తొలుచు పురుగు, పై ముడత, కింది ముడత, కాయ ఈగ పురుగు, కోనోఫారా కొమ్మ ఎండు తెగులు, బూడిద తెగులు, కాయ కుళ్లు తెగులు, వైరస్ తెగులు, ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయి. పై ముడత నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ రీజెంట్ లేదా 2 మి.లీ డైమిథోయెట్ లేదా 0.2 గ్రాములు ట్రేసర్ పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు లీటర్ నీటిలో 5 మి.లీ డైకోపాల్ లేదా 3 మి.లీ ట్రైజోఫాస్ మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఆకులు కింద, పైనా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొక్కల్లో సూక్ష్మదాతు లోపాలు కనిపిస్తే తొలి దశలో లీటర్ నీటిలో 3 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, పై సల్ఫేట్, 1.5 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా పిచికారీ చేయాలి. దిగుబడి: నేల స్వభావం, యాజమాన్య పద్ధతులపై దిగుబడి ఆధార పడి ఉంటుంది. మొక్క నాటిన 50-60 రోజుల నుంచి ఉత్పత్తి వస్తుంది. సగటున ఎకరాకు 40-60 క్వింటాళ్ల మేరకు దిగుబడులు వస్తాయి. పంట సాగులో ఆదాయం మార్కెట్ ధరపై గాకుండా రైతులు పొందే దిగుబడులపైనే ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో కనీస దర దొరికినా దిగుబడి ఎక్కువపొందటం వలన రైతుకు నికరాదాయం అధికంగా లభిస్తుంది. -
పూలుంటే తేనె ‘పంటే’!
‘తేనెటీగల పెంపకంలో అతిముఖ్యమైనది ఆహారం. అంటే పుష్పించే కాలం. మామిడి, జీడి మామిడి తదితర తోటలు డిసెంబర్ నెలలో పూత మొదలై ఫిబ్రవరి నెల సగం వరకు పిందె కట్టుతాయి. వివిధ రకాల పూల మొక్కలు, కుంకుడు, కంది వంటివి కూడా చలికాలంలో పుష్పిస్తాయి. కావున తేనెటీగల పెంపకం ఈ కాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్న చిన్నతరహా పరిశ్రమ ఇది. దీనికి విశాలమైన స్థలంతో పనిలేదు. చదువులాంటి అర్హతలు అక్కర్లేదు. సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువత... ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. తేనెటీగలు పెంచే ముందు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. పెంపకం పద్ధతులను ఆకళింపు చేసుకుంటే చాలు. తొలి దశలో శిక్షణ తప్పని సరి.’ తేనెటీగల పెంపకం గురించి సూర్యనారాయణ ఇంకా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే... పూలే ప్రధానం తేనెటీగలు పెంచాలనుకునే ప్రాంతంలో పుష్పసంపద కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రుతువులు, నెలల్లో పుష్పించే మొక్కల సమాచారాన్ని సేకరించాలి. వీటి పుష్పీకరణ వ్యవధిని కూడా గమనించాలి. పుష్ప సాంద్రత కూడా చాలా ప్రధానం. పూలు అధికంగా ఉండే సీజన్లోనే తేనెటీగలను పెంచాలి. తేనెటీగల పెంపకానికి కావలసిన సామగ్రిలో తేనెటీగల పెట్టే, హైవ్స్టాండ్ ముఖ్యమైనవి. తేనెటీగల పెట్టెగా టేకుతో చేసిన గూడు ఉపయోగించాలి. హైవ్ స్టాండ్: తేనెటీగల గూళ్లను నేలమట్టం కంటే కొంత ఎత్తులో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. తేనెటీగలను చీమలు, చెద పురుగులు, కీటకాల నుంచి రక్షించేందుకు ఇది దోహదపడుతుంది. నేలలోని తేమ గూళ్లను తాకకుండా ఉండేందుకు అడుగున ఉన్న గూడుకు సైతం గాలి వెలుతురు సోకేం దుకూ ఈస్టాండ్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఐదు ఎకరాల మామిడి తోట ఉన్న రైతు 20-25 బాక్సులు తోట అంతటా అమర్చితే మూడు నుంచి ఐదునెలల కాలంలో సుమారు 25 లీటర్ల తేనె ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా సుమారు రూ. 18,000 నుంచి రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఈ ఆదాయం మామిడి, జీడి మామిడి పంటలకు అదనం. తేనెటీగల వలన పరపరాగ సంపర్కం జరిగి మామిడి, ఇతర పంటల్లో పిందెకట్టు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. -
బెరుకు..బెంగ
సాక్షి, ఖమ్మం : నాణ్యత లేని విత్తనాలతో ఏటా ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ఏపీ సీడ్స్, ఇతర కంపెనీలు సరఫరా చేసిన వరి విత్తనాలు నాసిరకమని తేలగా, ఈ ఖరీఫ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. కారేపల్లి మండలంలో నాటిన పదిహేను రోజులకే బెరుకులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లో సత్తుపల్లి డివిజన్లోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, కొణిజర్ల, ఖమ్మం రూరల్ మండలాల్లో లక్ష ఎకరాల్లో వరిసాగు చేశారు. ఏపీ సీడ్స్ సరఫరా చేసిన బీపీటీ-5204, నాగార్జున, గ్రోమోర్ కంపెనీలకు చెందిన సాంబమసూరి విత్తనాలు వేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఈ మండలాల్లో అప్పట్లో సాగు చేసిన వరి మరో నెలరోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో బెరుకులు కనిపించాయి. పంటంతా ఇలాగే రావడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ కంపెనీలు సరఫరా చేసిన విత్తనాల్లో ఇతర రకాల వరి విత్తనాలు కలవడంతో పంటలో ఎక్కువగా బెరుకులు వచ్చాయి. ప్రధానంగా రైతులకు నమ్మకం కలిగించాల్సిన ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాల్లోనే నాణ్యత లేకపోవడం గమనార్హం. తమకు పరిహారం చెల్లించాలని అప్పట్లో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయినా ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం నుంచి పరిహారం మాత్రం అందలేదు. ఈ విత్తనాలు సాగు చేసి నష్టపోయిన వారిలో ఎక్కువ మంది కౌలురైతులే. ఇక ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులున్నా సాగర్ ఆయకట్టుతో పాటు బోరు, బావులు, చెరువుల కింద రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం పొలాలు కలుపు తీసే దశలో ఉన్నాయి. అయితే నాటిన పదిహేను రోజులకే బెరుకులు వస్తుండడంతో తాము వేసిన విత్తనాలు నాణ్యత లేనివని గ్రహించి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కారేపల్లి మండలంలో నాణ్యతలేని విత్తనాలతో వరినాట్లు వేయడంతో బెరుకులు వచ్చాయి. కారేపల్లిలో 500 ఎకరాల్లో.. ఈ ఖరీఫ్‌లో కారేపల్లి మండలంలో చెరువులు, బోరు బావుల కింద వరి సాగు చేశారు. ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆశతో 1010 రకం విత్తనాలు వేశారు. రావోజితండా, గేటుకారేపల్లి, సీతరాంపురం, కమలాపురం, విశ్వనాథపల్లి, కారేపల్లి, చీమలగూడెం, పేరుపల్లి, మాదారం, మాణిక్యారం గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో ఈ విత్తనాలే వేసినట్లు సమాచారం. రావోజితండా, గేటుకారేపల్లి, కారేపల్లిలో నాటిన పదిహేను రోజులకే వరిలో బెరుకు కంకులు రావడంతో రైతులు ఈ విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాల వద్ద ఆందోళన చేశారు. బెరుకులు వచ్చిన విషయాన్ని కంపెనీలకు తెలియజేస్తామని దుకాణదారులు అంటున్నారు. అయితే తమ నష్టాన్ని ఎవరు పూడ్చుతారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల్లో చేతికి రావాల్సిన పంట అప్పుడే బెరుకుల కంకులు రావడంతో లబోదిబోమంటున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎవరిదీ పాపం.. ఏసీ సీడ్స్, ఇతర ప్రైవేట్ డీలర్లు విక్రయించే విత్తనాలు నాణ్యమైనవేననే నమ్మకంతో రైతులు సాగు చేస్తున్నారు. అయితే వేలకు వేలు పెట్టుబడి పెట్టి, శారీరకంగా శ్రమించి.. తీరా పంట చేతికొచ్చే తరుణంలో ఇలా నష్టపోవాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ ముందస్తుగా మేల్కొని ఖరీఫ్ సీజన్లో పలు కంపెనీలు సరఫరా చేసే విత్తనాల నాణ్యత పరిశీలించాలి. కానీ ఇదేమి చేయకుండా ఆయా కంపెనీల వద్ద సదరు అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా నాణ్యత లేని విత్తనాలతో కంపెనీలు రైతుల మీద ప్రయోగం చేస్తుండడంతో చివరకు అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత ఖరీఫ్‌లో బెరుకుల వ్యవహారంతో జిల్లా రైతాంగం ఆందోళనతో కన్నెర్రజేసినా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉండడం గమనార్హం. -
పశువులు ఈనే ముందు..ఈనిన తర్వాత..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన త ర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువులు ఈనే సమయంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. పశుపోషకులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువులు ఈనే ముందు.. చూడి పశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. వాటిని మందతో పాటు బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు. ఈనిన తర్వాత.. వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుని సంప్రదించాలి. మాయని ఆశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి, రక్తస్రావం కలిగి పశువులు తిరిగి పొర్లకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పశువు మరణించే ప్రమాదం ఉంది. ఈనిన తర్వాత పశువులు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. ఆధిక పాల దిగుబడి ఉండే పశువులు ఈనిన వెంటనే రెండు రోజుల వరకు పాలను సంపూర్ణంగా పితకకూడదు. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత విటమిన్ డీ ఇవ్వాలి. -
పెట్టుబడి కొంత..లాభం కొండంత
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోయాయి. విత్తనాలు, క్రిమిసంహారక మందుల్లో ఏది మంచిదో, ఏది నకిలీదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. విచక్షణారహితంగా పురుగుమందులు వాడటం వల్ల ఆర్థికంగా భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండని పరిస్థితి. ఆదీగాక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం తెలిసీ తెలియని విత్తనాలు వేయడం, అవి మొలకెత్తకపోవడం, ఒక వేళ మొలకెత్తినా కాపు సరిగా రాకపోవడం లాంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులు తగ్గించడానికి వివిధ రకాల రాయితీలను అందుబాటులో ఉంచింది. వాటిని సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు పొందవచ్చు. విత్తన శుద్ధి తప్పని సరి భూ సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తప్పకుండా పాటించాలి. సూటి ఎరువులు(యూరియా, దుక్కిలో సూపర్, విత్తిన తర్వాత పొటాష్) వాడాలి. సూక్ష్మధాతు లోపాలను కచ్చితంగా సవరించాలి. మూస పద్ధతి ఖర్చులకు స్వస్తి చెప్పి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఖర్చు తగ్గించుకునే మార్గాలు రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను వాటి మోతాదు మేరకే వాడాలి. భాస్వరం.. మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీన్ని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. వేపపిండి, యూరియా కలిపి వాడితే పోషకాలు వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందుతాయి. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. వ్యవసాయ భూముల్లో ఎక్కువగా జింక్, ఐరన్, బోరాన్, మెగ్నీషియం లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ఎరువులను తరచుగా వాడటం వల్ల భూముల్లో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్నాయి. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సస్యరక్షణ మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిపార్సు చేసిన మందును, సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. ఇవి చేయకండి కాంప్లెక్స్ ఎరువులు వాడితే మన భూముల్లో అంతగా ఫలితం ఉండదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ. పిచికారీ చేసే మందులు మోతాదుకు మించి వాడటం మానుకోవాలి. ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మందుకు ఇష్టారీతిగా నీటిని కలపకూడదు. 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. పురుగుమందులు, వ్యాధి మందులు కలిపి (ఉదా : ప్రాఫినోపాస్-ఎక్సాకొనగోట)వాడకూడదు. ఒకేసారి రెండు మూడు మందులను మిశ్రమంగా వాడరాదు(ఉదా : ఇమిడాక్లోఫిడ్, అసిటేట్‌ను వరి, వేరుశనగలో కలిపి వాడుతుంటారు). ఇలా కలిపి వినియోగిస్తే రైతుకు ఖర్చు పెరగడమేకాక మందులు సరిగా పనిచేయవు. ఒక్కోసారి పంటను నాశనం చేస్తాయి. -
సోయా.. గయా...
వేల్పూర్ /బాల్కొండ : తీవ్ర వర్షాభావం, తెగుళ్లు వెరసి సోయాబీన్ పంటను దెబ్బతీశాయి. తక్కువ పెట్టుబడితో సాగుచేసే పంట కావడం వలన ఈ ఖరీఫ్‌లో సోయా సాగు వైపు రైతులు అధికంగా దృష్టిసారించారు. అయితే ఈసారి దిగుబడులు సగానికి తగ్గడంతో కష్టాలే మిగిలేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2 నుంచి 4 క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. వేల్పూరు, బాల్కొండ మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు సోయాబీన్ పంటను సాగుచేశారు. వారం రోజుల నుంచి సోయా పంట నూర్పిళ్లు చురుగ్గా చేపడుతున్నారు. కొందరు రైతులు నేరుగా హార్వేస్టర్తో నూర్పిడి చేపడుతుండగా, మరికొందరు కోత కోసి కుప్ప వేసి నూర్పిడి చేపడుతున్నారు. ఎకరానికి 2 నుంచి 4 క్వింటాళ్ల కంటే ఎక్కువ పంట దిగుబడి రావడం లేదని రైతులు తెలిపారు. విత్తనాల ఖర్చు తడిసి మోపెడు.. సోయా పంటను జూన్ మాసం చివరలో విత్తుతారు. 100 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా, తక్కువ నీటితో పంటను సాగు చేయవచ్చు. కాని ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతులు కుదేలయ్యారు. తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడులు తడిసి మోపెడైనట్లు రైతులు తెలిపారు.ఆకుముడత, రసం పీల్చే తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. మొదట్లో పంటవేసే సమయంలో వర ్షం లేక విత్తనాలు మొలకె త్తలేదు. దాంతో రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి మళ్లీ విత్తారు. రెండుసార్లు విత్తనాలు విత్తాల్సి రావడంతో ఆర్థికంగా వారిపై భారం పడింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి నెలకొన్నప్పటికీ, అడపా దడపా కురిసిన వర్షాలకు పంట మంచిగానే మొలకెత్తింది. కాని తెగుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పంటను తెగుళ్లు నాశనం చేశాయి. ఎకరాకు ఎంత లేదన్నా దాదాపు 15 వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని వాపోతున్నారు. విత్తనాల మాయేనా..! సోయా దిగుబడి భారీగా తగ్గడంపై విత్తనాల మాయేనా అంటూ రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీపై సోయా విత్తనాలు లేవని చివరి వరకు ప్రచారం చేసిన అధికారులు, చివరికి సబ్సిడీపై సోయా విత్తనాలను అందించారు. చివరికి అందించిన విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు మొలకెత్త లేదని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. నీరు పెట్టినా కూడా విత్తనాలు మొలకెత్త లేదని రైతులు అప్పుడే వాదించారు. కాని వారి మాట పట్టించుకునేవారు కరువయ్యారు. తీరా ఇప్పుడు దిగుబడులు తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాల కొనుగోలుకు ఎకరాకు రూ. 3 నుంచి 5 వేల వరకు ఖర్చు అయ్యిందని, తెగుళ్లు వ్యాపించడం వలన అధికంగా క్రిమిసంహారక మందులు వాడాల్సి వచ్చిందన్నారు. దీంతో పెట్టుబడులు పెరిగినట్లు చెప్పారు. కలుపు తీయడం, నీరు పెట్టడం, యంత్రాల ఖర్చు మొత్తం కలిపితే ఎకరాకు 15 వేల పెట్టుబడి అయిందని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం దిగుబడి చూస్తే పంట కోసిన యంత్రాలకు కిరాయి చెల్లించేంత డబ్బులు సైతం రాావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఈ ఖరీఫ్‌లో సోయాబీన్ సాగు అన్నివిధాలుగా నష్టాలను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడులు, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది.తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. పంటకు మార్కెట్లో ఎక్కువ ధర లభించినా, పెట్టుబడి ఖర్చులైనా వచ్చేవి. ప్రభుత్వం సోయా రైతులను ఆదుకోవాలి. - బద్ధం హరికిషన్, రైతు వేల్పూర్ -
సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు
సేంద్రియ ఎరువుల్లో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, దశపత్రి ఎరువులను సుద్దాల రైతులు తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నారు. ఘన జీవామృతం ఎరువు ద్వారా భూసారం పెరుగుతుంది. ఘన జీవామృతం తయారు చేయడానికి పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఒక డ్రమ్ములో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఘన జీవామృతం ఎరువు ఎకరానికి సరిపోతుంది. ఈ ఎరువును దుక్కి దున్నాక మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా శత్రు పురుగులు నశించి, మిత్ర పురుగులు పెరుగుతాయి. పంట దిగుబడీ పెరుగుతుంది. ద్రవ జీవామృతం పంటలు వేసి మొలకలు వచ్చాక ద్రవ జీవామృతం ఎరువు చల్లుకోవాలి. పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టి లేదా చెట్టు కింది మట్టిని తీసుకొని డ్రమ్ములో వేసుకోవాలి. అందులో 200 లీటర్ల నీటిని పోసి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. 48 గంటల తర్వాత ఎకరానికి సరిపడా ద్రవజీవామృతం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని పంటలకు నీరందించే కాలువల్లో వేయాలి. ఇలా చేస్తే ఎరువు మొక్కల వేర్లకు పట్టుకొని బలంగా తయారవుతాయి. ఇలా 15 రోజులకోసారి చల్లుకుంటే పంటలకు చీడ, పీడలు ఆశించవు. దశపత్రి.. దశపత్రి ఎరువు తయారు చేయడానికి పది రకాల ఆకులు అవసరం. ఒక్కో రకం ఆకులు 2 కిలోలు.. ఇలా పది రకాల ఆకులు 20 కిలోలు తీసుకొని ఒక డ్రమ్ములో ఉంచాలి. ఆ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల ఆవు పేడ వేసి నలభై రోజులపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఎరువు 30 ఎకరాలకు సరిపోతుంది. దీనిని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దశపత్రి ఎరువును వినియోగించడం ద్వారా పంటలకు తెగుళ్లు ఆశించకుండా కాపాడుతుంది. ఉత్తమ దిగబడులూ సాధించొచ్చు. దశపత్రి ఎరువును నెల రోజులకోసారి పంటలపై పిచికారీ చేయాలి. ఈ మూడు ఎరువులను సుద్దాలకు చెందిన సుమారు 10 మంది రైతులు చేల వద్ద తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడులూ పొందుతున్నామని వారంతా చెబుతున్నారు. -
గట్లపై విత్తు.. ‘శత్రు’ చిత్తు
చేలల్లో గట్ల వెంబడి కంది నాటితే వరికి హాని కల్గించే శత్రు పురుగులైన ఆకుముడత, కాండం తొలుచు పురుగులు, సుడిదోమను నివారించవచ్చు. రైతుకు మిత్రులైన సాలీడు, తూనీగ, అక్షింతల పురుగులు కంది మొక్కలపై నివాసం ఉంటాయి. ఇవి శత్రు పురుగులను నాశనం చేసి పంటను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వరికి తీవ్ర నష్టం కలిగించే అగ్గితెగులు, పొడతెగులు, ఆకుముడత ఎండు తెగుళ్లకు కారణమైన సిద్ద బీజాలు (వ్యాధి కారకాలు) ఒక చోట నుంచి మరోచోటకు గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా కంది నిరోధిస్తుంది. చేలగట్ల వెంట కంది నాటడం వల్ల ప్రధాన పంటకు అవసరమైన నీరు, ఎరువుల విషయంలో ఎటువంటి నష్టం ఉండదు. గాలి వానలకు ప్రధాన పంటను కాపాడే కవచంలా కంది మొక్కలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పొలం గట్లపై మొలిచే గడ్ది ద్వారా పంటకు నష్టం కల్గించే కీటకాల నివారణకు కూడా కింది మొక్కలు పనికొస్తాయి. దీంతో పాటు గట్లను పటిష్టంగా ఉంచి ఎలుకలు కన్నాలు పెట్టకుండా వీటి వే రు వ్యవస్థ నివారిస్తుంది. కంది పంట పక్షి స్థావరాలకు ఆవాసంగా ఉండటం వల్ల పంటను పాడు చేసే క్రిములను పక్షులు తినేస్తాయి. దీని వల్ల పంటకు రక్షణ కలుగుతుంది. ఎకరం వరి చేలోని గట్లపై విత్తడానికి 100గ్రాముల కంది విత్తనం సరిపోతుంది. దీనిపై సుమారు 10 నుంచి 15కేజీల వరకు కంది దిగుబడి వస్తుంది. ఇది రైతు కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అమ్ముకుంటే మార్కెట్ ధరను బట్టి ఎంతోకొంత ఆదాయం వస్తుంది. ప్రస్తుతం భూచేతన పథకంలో భాగంగా ఎంపికి చేసిన గ్రామాల్లో ఎకరానికి 100 గ్రాముల చొప్పున కంది విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. 40 శాతం యూరియా ఆదా.. వరి చేలగట్ల వెంబడి కందిని సాగు చేయడం వల్ల 32నుంచి 40శాతం వరకు నత్రజని ఎరువును ఆదాచేయవచ్చు. కందిని ఏక పంటగా వేయడం వల్ల భూమిలో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. భూమిలో కంది వేరు బుడిపెలపై ‘రైజోబియం’అనే బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టిరియా గాలి నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందిస్తుంది. దీనివల్ల భూమిలో న త్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా భూ భౌతిక రసాయన స్థితిగతులు మెరుగుపడతాయి. తద్వారా నత్రజని (యూరియా) వినియోగం తగ్గించుకోవచ్చు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే 88866 13853 సంప్రదించవచ్చు. అంతర పంటతోనూ లాభాలు.. కందిని తోటలు, ఇతర పంటల్లో అంతర పంటగా సాగుచేయడం ద్వారా అధిక ఆదాయం పొందవ చ్చు. 1:7 నిష్పత్తిలో కంది, వేరుశెనగ, పెసర, మినుము, సోయా, సాగు చేయవచ్చు.1:2 నిష్పత్తిలో కంది మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేయవచ్చు. ఈ విధంగా అంతరపంటగా కంది వేస్తే భూసారం పెరుగుతుంది. -
‘గ్రీన్హౌస్’కు ప్రోత్సాహం
ఖమ్మం వ్యవసాయం: వాతావరణ పరిస్థితులను నియంత్రించి నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే ఆధునిక గ్రీన్హౌస్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే, నాగపూర్ వంటి నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో గ్రీన్హౌస్లలో ఉద్యానపంటలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆధునిక విధానాన్ని రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాలన్నింటికీ విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జిల్లాలోని నేలలూ అనువైనవిగా ఉద్యానశాఖ గుర్తించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దగ్గరలో ఉండటం, రేల్వే రవాణా సౌకర్యం ఉండటం, ఖమ్మంతో పాటు విజయవాడ, వరంగల్ వంటి నగరాలు సమీపంలో ఉండటంతో గ్రీన్హౌస్ విధానానికి మన జిల్లా అనుకూలమని గుర్తించారు. కూరగాయలు, పూల సాగుకు ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. గ్రీన్హౌస్లకు రాయితీలు, వాటి వల్ల రైతులకు ఉపయోగాల గురించి ఉద్యానశాఖ ఉపసంచాలకులు కె.సూర్యనారాయణ -83744 49066 వివరించారు. గ్రీన్‌హౌస్‌లతో ఉపయోగాలు పూలసాగు దిగుబడి 10-12 రెట్లు అధికంగా (ఆరుబయట సాగుతో పోలిస్తే) ఉంటుంది. జెర్బెరా, కార్నేషన్స్, గులాబి వంటి పంటలకు గీన్హౌస్లు ఎంతో అనువైనవి. సంవత్సరం పొడవునా పూలు, కూరగాయల వంటివి సాగు చేయవచ్చు. వివిధ రకాల శిలీంద్రాలు, కీటకాల నుండి పంటలకు రక్షణ ఉంటుంది. ఎరువులు, పురుగు మందులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. నీటి వినియోగం తక్కువగా ఉండటమేగాక, డ్రిప్, ఫాగర్స్ ద్వారా నీటి యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా ఉద్యాన సాగు లాభదాయకం. ఈ విధానంలో ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు చేయూతనిస్తుంది ఒక రైతుకు సుమారు 4000 చ.మీ వరకు రాయితీ ఇస్తారు. పూల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు నీరు, భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసుపుస్తకం నకలు, రేషన్కార్డునకలు, బ్యాంక్ ఖాతా నకలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో వివరాలతో అందుబాటులోని ఉద్యాన అధికారిని సంప్రదించాలి. గ్రీన్‌హౌస్‌ల ద్వారా పూలసాగుకు ఎంపికైన రైతులకు వారం రోజుల పాటు పూర్తి శిక్షణ ఇస్తారు. గ్రీన్‌హౌస్‌లు నిర్మించే ప్రతి దశలోనూ ఫొటోలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుకు రావల్సిన రాయితీ మొత్తాన్ని గ్రీన్హౌస్ నిర్మించిన తరువాత వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 10,000 చ.మీ -
కలుపు తీత భలే తేలిక
ఖమ్మం వ్యవసాయం: ‘నా 16వ ఏటనుంచే వ్యవసాయం చేస్తున్నా. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించి ఏ విషయమైనా నాకు ఆసక్తి. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసే శిక్షణ తరగతులకు వెళ్తుంటాను. సాగు సంబంధ విషయాలను టీ వీలు, పేపర్లలో చూస్తుంటాను. వ్యవసాయాధికారులు, రైతులు ఎవరు చెప్పినా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలనే చెబుతుంటారు. కూలీల కొరత, కూలి రేట్లు పెరగటం, సకాలంలో కూలీలు దొరకపోవడం, ఇవన్నీ చూశాక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనుకున్నాను. గడ్డికోసే యంత్రానికి గేర్ బాక్స్‌ను అమర్చి, దానికి బ్లేడ్లు బిగించి ఈ యంత్రాన్ని తయారు చేశాను. గడ్డి కోసే పవర్ వీడర్ యంత్రానికి అదనంగా పనిముట్లు బిగించాను. పవర్ వీడర్‌కు రెండు వీల్స్ ఏర్పాటు చేశాను. దానికి గేర్ బాక్స్‌ను అమర్చాను. ఈ యంత్రం కోసం వివిధ సైజుల్లో బ్లేడ్లు తయారు చేశాను. అవసరాన్ని బట్టి ఏ బ్లేడ్ సరిపోతుంది దాన్ని బిగిస్తాను. పైనీర్ కంపెనీకి చెందిన 27364 హైబ్రిడ్ వరి విత్తనాలను సాగు చేస్తున్నాను. ఎకరానికి నాలుగు కిలోల విత్తనాలను 10 కిలోల నూకలతో కలిపి తాను రూపొందించుకున్న డ్రమ్ సీడర్ (కేసింగ్ పైపు)తో వేశాను. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ, సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ చొప్పున ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను. నేనే స్వయంగా విత్తనాలు వేసుకున్నాను. కలుపు నివారణ కూడా ఈ యంత్రంతోనే చేయాలని భావించి పవర్ వీడర్‌కు గేర్ బాక్స్, వీల్స్, బ్లేడ్లు ఏర్పాటు చేశాను. దీని సహాయంతో కలుపు కూడా నేనే స్వయంగా తీసుకుంటున్నాను. సాళ్ల మధ్య యంత్రాన్ని నడుపుతూ కలుపు తొలగిస్తున్నాను. పొలంలో గడ్డి ఉండటాన్ని బట్టి ఎకరానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. గంటకు లీటర్ పెట్రోలు ఖర్చవుతుంది. మొత్తంగా ఎకరానికి పెట్రోలుకు రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే కూలీలకైతే కలుపును బట్టి ఎకరానికి ఒకసారికి దాదాపు రూ.2 వేలకు వరకు ఖర్చు వస్తుంది. ఈ యంత్రం ద్వారా కలుపు తీయటం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. కలుపు మట్టిలోనే కలిసిపోయి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. వానపాముల చర్యలు క్రియాశీలకంగా ఉంటాయి. ఎరువుల విని యోగం కూడా తగ్గుతుంది. కలుపు నివారించబడి వరి మొక్కలకు గాలి, వెలుతురు సరిగా సోకుతుంది. తెగుళ్లు, పురుగులు సోకవు. పొ లంలో చాలినంతగా నీరు పెట్టి కలుపును బట్టి రెండు సార్లు కలుపు తీసుకుంటే మంచిది. ఎకరానికి మొత్తంగా 10 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. గతంలో శ్రీ వరి సాగు పద్ధతిలో సేద్యం చేసి ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి సాధిం చాను. వరి వేసే ముందు పచ్చిరొట్ట వేసి దున్నటం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించటం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నాను. -
జరభద్రం.. జలపుష్పం
చినగంజాం : చేపలు నీటిలో నివసించే జీవులు కావడం వల్ల వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చేపల్లో అనారోగ్యాన్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. ప్రవర్తన భేదాలు, భౌతిక మార్పులను గమనించి అంచనా వేయవచ్చు. ప్రవర్తన భేదాలు.. రైతులు చెరువుల వద్ద చేపలను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవర్తన భేదాలను తేలికగా కనిపెట్టే వీలుంటుంది. అనారోగ్యంతో ఉండే చేపలు ఈత సమయంలో సమన్వయం, స్థిరత్వం కోల్పోయి వెల్లకిలా తిరిగిపోతాయి. అనారోగ్యంతో ఉన్న చేపలు బాధతో నోటిని తెరుస్తూ.. మూస్తూ, చెరువు గట్టుకు రాసుకుంటూ తిరుగుతాయి. భౌతిక మార్పులు.. చేపలు అనారోగ్యంతో ఉన్నాయని అనుమానం వస్తే కొన్ని చేపలను పట్టుకుని పరిశీలించినట్లయితే కొన్ని భౌతికపరమైన మార్పులను గమనించవచ్చు. చేప శరీరం రంగు, మెరుపుదనంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంపై కురుపులు, ఎరుపు మచ్చలు, పుండ్లు ఏర్పడి రక్తం కారడం కనిపిస్తుంది. చేపల్లో వచ్చే సాధారణ వ్యాధులు చేపల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో ఫంగస్, హెల్మంథిస్, బ్యాక్టీరియల్ వ్యాధులు ప్రధానమైనవి. వీటి తో పాటు వాతావరణ సంబంధిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. ఫంగస్ వ్యాధులు : ఫంగస్ వ్యాధుల్లో శాఫ్రోలెగ్నియా ముఖ్యమైంది. చేప చర్మం, మొప్పలపై బూజు పట్టినట్లుగా ఉంటే ఫంగస్ వ్యాధిగా గుర్తించాలి. నీటిలో ఉదజని సూచిక తగ్గినప్పుడు ఫంగస్ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. నివారణ : 3 చెరువుల్లో ఉదజని తగ్గకుండా ఉండేలా పర్యవేక్షిస్తుండాలి. -
అంతర్ పంటతో ‘అసలు’కు దెబ్బ
బాల్కొండ: పసుపు పంటలో మొక్కజొన్న పంటను అంతర్ పంటగా సాగు చేస్తారు. కేవలం పసుపు పంటకు మర్రిఆకు తెగులు సోకకుండ కాపాడుకోవడానికి మొక్కజొన్నను పలుచగా సాగు చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తారు. కానీ కొందరు రైతులు రెండు పంటలలో అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో పసుపు పంటలో మొక్కజొన్నను అధికంగా సాగుచేస్తుంటారు. దీంతో పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది. బాల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాగే పసుపు పంట దెబ్బతింది. పసుపు మధ్యలో వేసిన మొక్కజొన్న కోసిన తరువాత పసుపు పూర్తిగా తెలుపు రంగులో మారి ఎండినట్లు అయింది. ఇలా పసుపు పంట దెబ్బతినే అవకాశం ఉందని హర్టికల్చర్ అధికారులు అంటున్నారు. మొక్కజొన్న ఎక్కువగా ఉండటం వలన సరైన గాలి, సూర్యరశ్మి లభించక పసుపు పంట ఆకులపై మచ్చలు ఏర్పాడుతాయని వారు పేర్కొంటున్నారు. పసుపుపంట ఆకుపై హరితాన్ని మొత్తం చీడలు వ్యాపించి తినేస్తాయి. దీంతో పసుపు పంట వేళ్లు వదులుగా మారి ఎండుతాయి. పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను తక్కువ మోతాదులో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నివారణ చర్యలు అంతరపంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చే య డం వల్ల పసుపు పంట పత్ర హరితం కోల్పోయి.. ఎండిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. పొటాష్ హెక్టార్‌కు 60 కిలోలు వెదజల్లాలి. కాపర్ ఆక్సైడ్ 3 గ్రా ములు లీటర్ నీటిలో, 19 :19: 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. లేదా ఎకరానికి 10 లీటర్ల వేపనూనెను పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఫోన్ కొట్టు.. పరిష్కారం పట్టు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా..? తెగుళ్లు, చీడపీడల నివారణకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియడం లేదా..? పంటలో ఎదుగుదల లోపించిందా..? అయితే ఒక్క ఫోన్ కొట్టండి చాలు. ఇట్టే పరిష్కారం మార్గం లభిస్తుంది. చేనులోనే ఉండి పైసా ఖర్చు లేకుండా పంటలకు సంబంధించిన సస్యరక్షణ చర్యలు తెలుసుకోవచ్చు. అందుకు రైతుల వద్ద సెల్‌ఫోన్ ఉంటే చాలు. ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. ‘కిసాన్ కాల్‌సెంటర్’కు ఫోన్ చేస్తూ అక్కడ ఉండే వ్యవసాయ శాఖ ప్రతినిధులు రైతుల సమస్యలు తెలుసుకుని సలహాలు, సూచనలు అందిస్తారు. సమస్యలు తెలియజేసేందుకు.. సాగులో ఎదుర్కొంటున్న పంటల చీడపీడల నివారణకు కిసాన్ కాల్ నంబర్లు 1551 లేదా 18001801551, 18004251556, 18004251110కు ఫోన్ చేస్తే ‘కిసాన్ కాల్ సెంటర్’కు స్వాగతం అని వినిపిస్తుంది. కాసేపటి తర్వాత అక్కడి ప్రతినిధులు మిమ్మల్ని పలుకరిస్తారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేరు, పంట సాగు విస్తీర్ణంపై ప్రశ్నలు అడుగుతారు. పంటల సాగులో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఏం చేయాలో సూచిస్తారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వీరు అందుబాటులో ఉంటారు. రాత్రి 11గంటల తర్వాత ఫోన్ చేసినా కూడా మీ నంబరు అక్కడ రికార్డు అవుతుంది. ఉదయం కాల్‌సెంటర్ సిబ్బంది రాగానే ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేస్తారు. సంక్షిప్తంగా సూచనలు కావాలంటే.. సాంకేతిక సమాచారం సలహా, సూచనలను సంక్షిప్త సందేశం ద్వార వినేందుకూ ఇందులో వీలుంది. ఇం దుకోసం చేయాల్సిందల్లా.. ‘అగ్రిస్.నెట్’ వెబ్సైట్లోకి వెళ్లి ఎస్సెమ్మెస్ ద్వారా సూచనలు పొందేందు కు అంటూ కనిపించే అక్షరాలపై నొక్కాలి. ప్రత్యక్షమయ్యే దరఖాస్తు పత్రంలో పేరు, ఫోన్ నంబరు, రాష్ట్రం, మండలం, గ్రామం, విస్తీర్ణం వివరాలు నింపాలి. సలహాలు, సూచనలు మెస్సెజ్ ద్వారా కావాలా..? ఫోన్ ద్వారా వినాలనుకుంటున్నారా..? అనే రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. అనంతరం వ్యవసాయం, పశువైద్యం, ఉద్యానవన, మత్స్యశాఖకు సంబంధించి ఏది అవసరమైతే దానిని ఎంపిక చేసుకోవాలి. వివరాలను అందులో పొందుపరిస్తే ‘కిసాన్ కాల్‌సెంటర్’ నుంచి సలహాలు, సూచనలు అందుతాయి. -
అంతర పంటలపై అమితాసక్తి
పెద్దేముల్: అంతర పంటలు వేయటంతో ఏదైనా ఓ పంట చేతికి వస్తుందని... వరుణుడు అనుకూలిస్తే రెండు పంటలూ చేతికి వస్తాయనే నమ్మకంతో రైతులు మండలంలో అంతర పంటసాగుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పెద్దేముల్ ఏఓ వెంకటేశం తెలిపారు. మండలంలోని పాషాపూర్, సిద్దన్నమడుగు తండా, ఓగ్లాపూర్, మారేపల్లి, ఇందూరు, నాగులపల్లి, నర్సపూర్, తట్టెపల్లి, రుద్రారం, మంబాపూర్ తదితర గ్రామాల్లో రైతులు ఖరీఫ్ విత్తనాలు నాటుకునే సమయంలో కంది పంటలతో పాటు, మెక్కజొన్న, కంది- మినుము, కంది- పెసర, కంది- తెల్లజొన్న పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా పంటల్లో ఏ ఒక్క పంటయినా దక్కుతుందన్న నమ్మకంతో రైతులు సాగు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది మినుము, పెసర పంటలు రైతులకు అనుకూలించలేదు. కొన్ని గ్రామాల్లో తెల్లజొన్న పంటలు అనుకూలించాయి. ప్రస్తుతం కంది పంటలు మాత్రం బాగా ఉన్నాయని రైతులు అంటున్నారు. అన్ని పంటల కంటే రైతులు ఈ ఏడాది కంది, పత్తి పంటలను సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. -
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
మొయినాబాద్: వరిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తేనే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో తెగుళ్లను గుర్తించి వాటి నివారణ చర్యలు పాటించాలి. యాజమాన్య పద్ధతుల్లో పంటకు కావాల్సిన ఎరువులు అందించాలి. ఏయే సమయంలో ఎలాంటి ఎరువులు అందించాలి, ఏయే తెగుళ్లకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో మొయినాబాద్ మండల వ్యవసాయాధికారిణి రాగమ్మ వివరించారు. మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర మండలాల్లో వర్షాలు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కురవలేదు. ఆగస్టులో వర్షాలు కురవడంతో వరినాట్లు చాలా ఆలస్యంగా వేశారు. ప్రస్తుతం వరి పిలకలు పెట్టే దశనుంచి చిరుపొట్ట దశలో ఉంది. వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ చర్యలపై రాగమ్మ సూచనలు, సలహాలు అందజేశారు. ఎరువుల యాజమాన్యం వరిలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. నాట్లు వేసే ముందు పూర్తి భాస్వరం, సగం పొటాష్ ఎరువులను ఆఖరు దమ్ములో వేసుకోవాలి. ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి కనుక మిగిలిన సగం పొటాష్‌ను వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమ భాగాలుగా చేసి 1/3వ భాగం విత్తిన 15-20 రోజులకు, రెండో భాగాన్ని పిలక దశలో విత్తిన 40-45 రోజులకు, మిగిలిన భాగాన్ని చిరుపొట్ట దశలో విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి సాధారణంగా ఎకరా వరికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను వాడుకోవాలి. ఉదాహరణకు.. ఒక బస్తా డీఏపీ, 15 కిలోల ఎంఓపీ విత్తిన 15 రోజులకు, పిలక దశలో, చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చల్లుకోవాలి. ఆఖరి దఫా యూరియాతోపాటు 20 కిలోల ఎంఓపీ తప్పనిసరిగా వేసుకోవాలి. తెగుళ్లు.. వాటి నివారణ.. కాండంతొలుచు పురుగు, ఆకుముడత తెగులు ఈ తెగులు పూత దశలో, ఈనిక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా కార్బోప్యూరాన్ 3జీ 10 కిలోలు, కార్టప్ హైడ్రోక్లోరైడ్ 4జీ ఎ కిలోలు ఎకరాకు వేసుకోవాలి. అగ్గితెగులు (మెడవిరుపు) వరి పిలకదశ, పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోధయోలేన్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. హిస్పా (ఎండాకు తెగులు) ఈ పురుగు పిలక దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ప్రొఫేనోఫాస్ 2 మిల్లీ లీటర్లు, క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పిలక దశ, చిరుపొట్ట దశ, పూత దశలో పలు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వాటికి తగిన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరిచేలు పిలక దశ దాటాయి. పంటను రైతులు ఎప్పటికప్పుడు పరిశీలించి తెగుళ్లను గుర్తిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తగు జాగ్రత్తలు పాటించి రైతులు అధిక దిగుబడులు పొందాలి. పాముపొడ తెగులు ఈ తెగులు పిలక దశ నుంచి దుబ్బకట్టే వరకు ఆశిస్తుంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ తెగులు ఈ తెగులు పిలక దశ, పూత దశలో ఆశిస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు, మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు, ఎథోఫెన్ఫ్రాక్స్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
మక్క దక్కేనా?
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి కొందరు మొక్కజొన్న పంటలు వేశారు. ప్రస్తుతం చేలన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ప్రస్తుతం వాన చాలా అవసరం. కానీ వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు ప్రస్తుతం కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకులు విత్తులు పట్టే అవకాశం ఉంది. కీలకమైన ఈ సమయంలో వరుణుడి జాడ లేక అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఎండలు మండి పోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక్క వాన పడితే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇన్నాళ్లూ పడిన కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. వర్షం పడాలని కోరుతూ ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు. -
దోమపోటు..పంటకు చేటు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా తదితర ప్రాంతాల్లో దోమపోటు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది వ్యాపిస్తోందని చెబుతున్నారు. వరి 25 రోజుల నుంచి పొట్ట దశ వరకు ఉంది. ముందుగా వేసిన వరి పొట్టదశలో ఉంది. ప్రధానంగా 5204 సాంబ మసూరీ రకం వరిలో అధికంగా దోమపోటు ఉన్నట్లు వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎంటీయూ 1010, 1001 వంటి రకాలు దోమను తట్టుకొనే గుణం ఉన్నా వాతావరణం అనుకూలించకపోవటంతో వీటినీ దోమ ఆశించిందని జిల్లా వ్యవసాయ ఉప సంచాలకులు ఎం.రత్నమంజుల తెలిపారు. వరి పంట దిగుబడులను దెబ్బతీసే దోమ పోటును సమర్థంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. దోమపోటు నివారణ చర్యల గురించి వివరించారు. వరిని ఆశించే దోమల రకాలు వరిని రెండు రకాల దోమలు ఆశించి నాశనం చేస్తాయి. 1.గోధుమ రంగు వర్ణపు దోమ (బ్రేన్ ప్లాంట్ హాపర్) 2. తెల్లవీపు దోమ ( వైట్ బ్లాక్ ప్లాంట్ హాపర్) దోమ ఉధృతికి అనుకూల పరిస్థితులు వాతావరణంలో 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80-90 శాతం ఉంటే దోమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. నత్రజనిని అధికంగా వాడిన ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్న పొలాల్లో దోమపోటు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దోమ జీవిత చరిత్ర ఆడదోమ మొక్క అడుగు భాగంలోని ఆకు తొడుగులో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు కంటికి కనిపించని పరిమాణంలో ఉంటాయి. సుమారు వారం రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. రసాన్ని పీల్చి పెరుగుతాయి. ఈ పిల్ల పురుగులు 12-17 రోజుల్లో 5 దశల్లో పెరిగి క్రమేపి పెద్దవవుతాయి. ఈ పెద్ద పురుగులు తిరిగి గుడ్లు పెడతాయి. ఆడదోమలు, మగ దోమల కన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి. పంటను ఇలా నష్టపరుస్తాయి గోధుమ రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్ల దగ్గర గుంపులుగా చేరి కాండం నుంచి రసాన్ని పీల్చి వేయడం వల్ల మొక్కకు పోషక పదార్థాలు అందక బలహీనపడతాయి. క్రమేపీ మొక్కలు సుడులుగా ఎండిపోతాయి. దీన్నే సుడి తెగులు అంటారు. తెల్లవీపుదోమ కూడా గోధుమ వర్ణపు దోమవలె వరిమొక్కలోని రసాన్ని పీల్చి పంటకు నష్టం చేస్తుంది. నివారణ చర్యలు నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. పైపాటుగా వాడేటప్పుడు 2-3 దఫాలుగా వాడాలి. వరి నాటే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ (తూర్పు. పడమర) పాయలను వదిలి నాటితే గాలి ప్రసరించి దోమల ఉధృతి తక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉంటే దోమ ఉధృతి పెరుగుతుంది. పొలాన్ని ఆరగట్టి తిరిగి నీటిని పెట్టడం ద్వారా దోమల ఉధృతిని తగ్గించవచ్చు. విచక్షణ రహితంగా పురుగుమందులను వినియోగించవద్దు. ఉదాహరణకు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేస్తే దోమ ఉధృతి తగ్గటానికి బదులు ఎక్కువవుతుంది. వాడాల్సిన పురుగు మందులు మోనోక్రొటోఫాస్ 36 శాతం ద్రావణం ఎకరాకు 440 మి.లీ లేదా ఎసిఫేట్ 75 శాతం 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వీటి ప్రభావం 3-4 రోజుల వరకు ఉంటుంది. ఫిప్రోనిల్ 5 శాతం 400 మి.లీ పిచికారీ చేసి కూడా నివారించుకోవచ్చు. అయితే దీని ప్రభావం కన్పించడానికి 2-3 రోజుల సమయం పడుతుంది. 15-20 రోజుల వరకు కీటకాలను నాశనం చేస్తుంది. ఎథోఫెన్ ప్రాక్సి 10 శాతం ద్రావణం ఎకరాకు 400 మి.లీ లేదా బూప్రోఫెజిన్ 25 శాతం 320 మి.లీ మందు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ రెండు కీటక నాశినులు దోమ ఉధృతిని తగ్గించటమేగాక దోమ సహజ శత్రువైన మిరిడీ బగ్స్ సాలీడులకు తక్కువ హాని చేస్తాయి. పిచికారీ విధానం: నాజిల్‌ను మొక్క మొదలు వైపు ఉంచి క్రిమిసంహారక మందును పిచికారీ చేయాలి. దోమ మొక్కల కాండం అడుగు భాగాన ఉంటుంది. కాబట్టి పంటపైన పిచికారీ చేస్తే ప్రయోజనం ఉండదు. -
శీతకాలం.. ఆలు సాగుకు అనుకూలం
బాల్కొండ : చల్లని వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలం అని వ్యవసాయ శాఖ అధికారి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బంగాళదుంప పెరుగుదలకు వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రత దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఆలు సాగు నామమాత్రమే అయినా.. బాల్కొండ ప్రాం తంలో ఈ పంట సాగుకు పలువురు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలుగడ్డ సాగు గురించి వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు. పంట కాలం.. ఏ నేల అనుకూలం బంగాళదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక, ఎర్రగరప నేలలు అనుకూలం. బరువైన నేలల్లో ఈ పంట సాగు చేయవద్దు. అక్టోబర్ రెండో వారం నుం చి నవంబర్ మొదటి వారం వరకు ఆలూ సాగు చేయవచ్చు. ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట. సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పదినుంచి పది హేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. నేల తయారీ నేలను నాలుగు నుంచి ఐదు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్పెట్, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తర్వాత భూమిని చదును చేసుకోవాలి. బోదెలు చేసుకొని ఆలుగడ్డలు నాటుకోవాలి. విత్తన ఎంపిక 30 నుంచి 40 గ్రాముల బరువుండి, రెండు నుంచి మూడు కళ్లున్న విత్తన దుంపలను ఎన్నుకోవాలి. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి నీటి తడులు అందించాలి. సాధారణంగా వారానికి ఒక తడి సరిపోతుంది. దుంపలు ఏర్పడే సమయంలో నాలుగైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది. కలుపు పెరగకుండా చూసుకోవాలి. ఎరువులు ఆలుగడ్డలను విత్తిన 30 రోజుల తర్వాత 40 కిలోల యూరియా, 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. సస్యరక్షణ బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి. రసం పీల్చే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి. ఆకుమాడు తెగులు, మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటు పంటలకు తెగుళ్ల బాధ తగ్గుతాయి. అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి. అందువల్ల విత్తిన 30 రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి. -
నువ్వుల సాగు ఇలా..
విత్తన మోతాదు, శుద్ధి చేసే విధానం.. ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం. విత్తన పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి విత్తనానికి ఐదింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ. లోతు మించకుండా వేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. రబీలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియ దున్నాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెలరోజులకు కలుపుతీసి వేయాలి. భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో పడినపుడు అదనంగా క్యాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం.. విత్తిన వెంటనే మొదటి త డి ఇవ్వాలి. పూత, కాయ, అభివృద్ధి, గింజ కట్టు దిగేట్లు తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు నివారణ.... విత్తే ముందు పుక్లొరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ.. సస్యరక్షణ చర్యలు.. ఈ పంటకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశిస్తుంది. దీని లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. తొలి దశలో చిన్న లార్వాలు కలిసి గూడు కట్టి లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని కొరుక్కు తింటాయి. తద్వారా ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉద్ధృతి అంతగా ఉండదు. పురుగు ఆశించిన ఆకులను లార్వాలతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిపాస్ 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
బిర బిరా.. లాభాలు
ఏడాదంతా సాగు ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు. విత్తిన మూడు వారాలకే కాతకు రావడం దీని విశిష్టత. కాయలు తెంపడం, మార్కెట్‌కు తరలించడం తేలికగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది కూలీల అవసరం ఉండదు. ఫలితంగా ఖర్చు కలిసొస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తీగజాతి కూరగాయల పంటలకు తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. డ్రిప్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. విత్తన రకాలు.. పలు కంపెనీలకు చెందిన హైబ్రిడ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రెండు వరుసల మధ్య దూరం ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్లు, రెండు పాదుల మధ్య దూరం 0.6 నుంచి 0.9మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. విత్తనశుద్ధి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6నుంచి 8టన్నుల పశవుల ఎరువు, 40కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులను గుంతల్లో వేసుకోవాలి. విత్తిన 25 రోజులకు పూత, పిందె దశలో 40 కిలోల నత్రజని ఎరువులు వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఒకవేళ వేసినట్లయితే వెంటనే నీటి తడి అందించాలి. కలుపు నివారణ పంటల సాగులో కలుపు మొక్కల నివారణ అతిముఖ్యమైన అంశం. బీర తోటలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. విత్తనం నాటిన మరుసటి రోజున తేలిక నేలల్లో లీటరు మెటాక్లోర్ (డ్యుయల్) మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. బరువు నేలల్లో1.5 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి. మొక్కలు రెండు, నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పౌడర్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూత ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. రెండుమూడు తడులు అందించిన తర్వాత మట్టిని గుళ్ల చేయాలి. నీటి యాజమాన్యం పాదు చుట్టూ 3-5సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వారానికో తడి అందిస్తే పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి. తెగుళ్లు తీగజాతి రకం పంటలపై తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి బూజు తెగులు, బూడిద తెగులు, వేరు కుళ్లు తెగులు, పక్షికన్ను తెగులు ప్రధానమైనవి. వీటిని సకాలంలో గుర్తించి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు తగిన మందులు పిచికారీ చేయాలి. సస్యరక్షణ చర్యలు ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంటమార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంద గ్రాముల విత్తనానికి రెండు గ్రాముల డెర్మా విరిడి మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లి రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుంచి పూతకు వచ్చే వరకు వేపగింజల కషాయాన్ని తగిన మోతాదులో 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. -
పొగనారుకు తెగులు
మాగుడు, నల్లకాడ తెగులు ఇది మట్టి ద్వారా పెరిగే బూజు. మాగుడు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. తేమ ఎక్కువైతే నారుమడి మొత్తం వ్యాపిస్తుంది. నారు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. తెగులు సోకిన నారుపై తెల్లబూజు ఏర్పడుతుంది. నల్లకాడ తెగులు సోకితే పొగనారు వేర్లు, కాండం నల్లగా మారి మొక్కలు చనిపోతాయి. నివారణ చర్యలు 4 గ్రా. మైలుతుత్తం, 4 గ్రా. సున్నాన్ని లీటరు నీటికి కలిపితే బోర్డో మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తడానికి ముందు మడులను తడిపితే మాగుడు, నల్లకాడ తెగులు రాకుండా చేయొచ్చు. 2 గ్రా. బ్లైటాక్స్ మందును లీటరు నీటికి కలిపి పొగ నారు మొలకెత్తిన 2 వారాల తర్వాత మడులపై చల్లితే మాగుడు, నల్లకాడ తెగులును అరికట్టవచ్చు. మెటలాక్సిల్, మాంకోజబ్ రసాయనాలు 2 గ్రాములను లీటరు నీటికి కలిపితే రిడోమిల్ మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తనం మొలకెత్తిన 21 రోజులకు మడులపై పిచికారీ చేయాలి. రిడోమిల్ గోల్డ్ 2 గ్రా. మందును లీటరు నీటికి కలిపి 20-30 రోజుల నారుమళ్లపై రెండుసార్లు పిచికారీ చేయాలి. సినామిడన్ 10 శాతం, మాంకోజబ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది. అజోక్సీస్ట్రోబిన్ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేస్తే మాగుడు, నల్లకాడ తెగుళ్లను అరికట్టవచ్చు చుక్క, కప్పకన్ను తెగులు తెల్ల చుక్క తెగులు ఏ దశలోనైనా సోకుతుంది. ఆకులపై చిన్న చిన్న చుక్కలు, వాటి మధ్య భాగంలో గుంటల మాదిరిగా ఏర్పడి తెల్లగా అవుతాయి. కప్పకన్ను తెగులు 4-5 వారాల నారులో కనిపిస్తుంది. ఇవి తెల్ల చుక్కల కంటే పెద్దవి. అధిక వర్షాలకు ఈ తెగులు ఉధృతి పెరుగుతుంది. ఇటీవల పర్చూరు, కందుకూరు, కనిగిరి, అద్దంకి తదితర ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిశాయి. కాబట్టి నారుమళ్ల రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఆకు చుక్క, కప్పకన్ను తెగులు నివారణకు 0.5 గ్రా బావిస్టిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులను నివారిస్తేనే పంట దక్కేది పొగాకు లద్దె పురుగును సమర్థంగా నివారించకపోతే నారు మొత్తం కోల్పోయే ప్రమాదముంది. లద్దె పురుగులను గుర్తిస్తే.. 5 గ్రా. ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 10 లీటర్ల నీటికి, స్పైనోసోడ్ 3 గ్రా. మందును 10 లీటర్ల నీటికి, ఫ్లూ బెంజోయేట్ 2.5 మి.లీ మందును 10 లీటర్ల నీటికి కలిపి నారుమళ్లపై చల్లితే లద్దె పురుగును అరికట్టవచ్చు. కాండం తొలుచు పురుగు ఉండే చోట బుడగ లాగా ఉబ్బి ఉంటుంది. పురుగు ఆశించిన మొక్క పెరుగుదల క్షీణించి వెర్రి తలలు వేస్తుంది. ఇది ముందుగా నారుమళ్లను ఆశించి, ఆ తర్వాత తోటలకు విస్తరిస్తుంది. నివారణకు ప్లూబెండయమైడ్ 0.25 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే కాండం తొలిచే పరుగును నివారించవచ్చు. తెల్ల దోమలు ఆకు అడుగు భాగంలో కనిపించే తెల్లని చిన్న కీటకాలు. ఆకు కదపగానే ఇవి ఎగిరిపోతాయి. ఇవి ఆకుల నుంచి రసాన్ని పీల్చి ఆకులు ముడత పడేలా చేస్తాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ మందును లీటరు నీటికి, థయోమిథాక్సమ్ మందు 0.3 గ్రా. మందును లీటరు నీటితో కలిపి నారుమళ్లపై పిచికారీ చేయాలి. మిడతలు ఆకులను తిని నష్టం కలి గిస్తాయి. నారు మడి స్థలాన్ని, గట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గడ్డి, కలుపు జాతి మొక్కలను నివారించాలి. ఇలా చేస్తే మిడతలను పంట నుంచి దూరం చేయొచ్చు. -
గొర్ల పెంపకం.. లాభదాయకం
గొర్లను పెంచే వారు తప్పకుండా మొదట షెడ్డు నిర్మించుకోవాలి. ఎండ, చలి, వర్షాల నుంచి పూర్తి రక్షణ ఉండేలా చూసుకోవాలి. పిల్లిపెసర, బబ్బెర్లు, గడ్డితో పాటు సుబాబుల్ చెట్ల పెంపకం కోఫార్ రకం గడ్డి, జొన్నను మేతగా వేయాలి. అటవీ ప్రాంతాలు ఉన్న చోట వీటిని మేతకోసం బయటకు కూడా తీసుకెళ్లవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షకాలంలో గొర్ల కాళ్లకు పుండ్లు కావడం, ముక్కు నుంచి చీము కారడం, చిటుకు వ్యాధులు వంటివి వస్తాయి. వీటి నివారణకు ప్రతిఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను వేయించాలి. జీవాలు కుంటినా, ముక్కు నుంచి చీమిడి కారినా వెంటనే వెటర్నరీ అధికారులకు చూపించాలి. గొర్లు షెడ్డు లోపలకు వెళ్లే దారిలో చిన్నపాటి నీటి తొట్టిని నిర్మించుకుని పొటాషియం పర్మాంగనేట్ వేసి గొర్లు ఉదయం మేతకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి పాకలోకి వచ్చేటప్పుడు జీవాలు ఈ నీటిలో నుంచి నడిచేలా చూడాలి. దీంతో కాళ్లకు పుండ్లు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. నెల్లూరు క్రాస్ బ్రీడ్ మేలైన రకం గొర్లలో అనేక రకాలు ఉంటాయి. వీటిలో నెల్లూరు క్రాస్ బ్రీడ్ బాగుంది. ఈ రకం జీవాలను ఎనిమిదేళ్లపాటు పెంచవచ్చు. ఇవి ఏడాదికి మూడు పిల్లల చొప్పున 8 ఏళ్లకు 12 ఈతలు ఈనుతుంది. అప్పటికి ముప్పై కిలోల బరువు ఉంటుంది. ఒక్కో గొర్రెకు బహిరంగ మార్కెట్లో రూ.6వేల ధర పలుకుతుంది. ఎనిమిదేళ్లు నిండిన గొర్లు బరువు పెరగవు కాబట్టి వెంటనే వీటిని విక్రయించాలి. గొర్రెలు ఈనగానే పుట్టిన పిల్లలను 15 రోజుల పాటు పాకలోనే ఉంచాలి. తల్లిగొర్రె వెంట పంపరాదు. 15 రోజుల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి. 40 గొర్లకు ఒక విత్తన పొటేలును పెంచుకోవాలి. దీన్ని కూడా ఎనిమిది ఏళ్ల వరకు విత్తన పొటేలుగా ఉపయోగించుకుని అనంతరం అమ్మేయాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రభుత్వం గొర్ల పెంపకానికి నాబార్డ్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గొర్ల పెంపక సంఘం దారులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. గొర్లకు మేత కోసం సబ్సిడీపై మినరల్ మిక్చర్‌తో పాటు కంది, పెసర, మినుముల పొట్టు, పల్లి చెక్కను సబ్సిడీపై అందజేస్తోంది. గొర్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కోదానికి నిత్యం 150 నుంచి 200 గ్రాముల వరకు బలవర్ధక ఆహారం ఇవ్వాలి. జీవాలకు విధిగా బీమా చేయించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొర్లకు బీమా అందడం లేదు. దీంతో వీటి పోషకులు నష్టపోయే ప్రమాదముంది. -
రసాయనేతర సస్యరక్షణ
వరిని ఆశించే క్రిమికీటకాల నివారణ వరినాట్లు వేసిన తర్వాత 30 రోజులకు 10కిలోల వేప పిండిని లేదా కానుగ పిండిని పొడి చేసి ఎకరం పొలంలో చల్లాలి. ఇది గొంగలి పురుగులను నివారిస్తుంది. వేప ఆకులను కట్టగా కట్టి ఎకరం పొలంలో పలు ప్రదేశాల్లో 10 చోట్ల పెట్టడం ద్వారా కూడా ఈ పురుగులను తరిమివేయవచ్చు. 5కిలోల ఆముదం గింజలను పెనంపై వేయించి, పొడి చేసి, దీనికి తగువిధంగా నీరు కలిపి పేస్టు(ముద్ద)గా తయారు చేయాలి. - దీన్ని మట్టి కుండలో ఉంచి ఎకరా పొలంలో 5, 6చోట్ల పెట్టాలి. ప్రతి పది రోజులకోసారి పేస్టును మారుస్తుండాలి. మట్టి కుండలపై మూత పెట్టకూడదు. ఇది రెక్కల పురుగులను ఆకర్శించడానికి ఎరగా ఉపయోగపడుతుంది. వరి పొలాల్లో నిండా నీరు పెట్టడం వల్ల నేలల్లో దాగి ఉన్న డింబక, కోశస్థ దశ క్రిములు బయటకు రావడంతో పక్షలు వీటిని తినేస్తాయి. దీనికోసం ఎకరం పొలంలో నాలుగైదు చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. వరి ఈనిన తర్వాత టీ ఆకారంలో కర్రలను క ట్టి పొలంలో అక్కడక్కడ పాతాలి. వీటిపై వాలే పక్షులు పంటలను పాడు చేసే పురుగులను తినేస్తాయి. లీటరు కిరోసిన్(గ్యాస్‌నూనె)లో అర కిలో వెళ్లుల్లిని రాత్రంతా నాబెట్టాలి. ఉదయం దీనికి పావు కిలో అల్లం, పావుకిలో పచ్చిమిర్చిని కలిపి తగినంత నీటిని వేసుకుని దీన్ని పేస్టుగా నూరుకోవాలి. దీనిలో కొన్ని మిరపకాయలు వేసి తగినంత నీటితో కలిపి పేస్టుగా చేసుకోవాలి. దీన్ని 60లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేయాలి. మిడతలు, నల్ల నల్లులు, తాటాకు తెగులు నివారణ పొలంలోని పలు ప్రదేశాల్లో కొన్ని జిల్లేడు ఆకులను ఒకదానిపై ఒకటి పేర్చాలి. వీటి ప్రభావం వల్ల మితడత లు, నల్లనల్లు, తాటాకు తెగులు నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఎకరానికి 10-15 కిలోల విప్ప పిండి లేదా వేప చెక్కలతో పదిహేను రోజులకు ఒకసారి పొలంలో పొగబెట్టాలి. 5లీటర్ల కిరోసిన్‌ను 30లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పొలంలో స్రే చేస్తే చేలకు హానిచేసే పురుగులు నివారించబడుతాయి. పిండి నల్లి, ఎర్ర నల్లి నివారణ వేపగింజల పొడిని ఒక గుడ్డ సంచిలో రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ సంచిని పిండగా వచ్చిన కషాయాన్ని వడబోసి 50-60 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పైరుపై పిచికారీ చేస్తే ఫలితం కనిపిస్తుంది. గింజలు మగ్గే దశలో ఆశించే కంపు నల్లి నివారణ సైకస్ పువ్వును 5-10 ముక్కలుగా చీల్చి కర్రలకు కట్టి ఎకరా పొ లంలో 15-20చోట్ల ఉంచితే చిన్న, పెద్ద కంపు నల్లులు ఆ పూల వాసన భరించలేక నివారించడుతాయి. 3 శాతం వేప నూనె ద్రా వకాన్ని గానీ, 5శాతం వేప గింజల కషాయాన్ని గానీ కంకి ఏ ర్పడే దశలో స్ప్రే చేస్తే ఈ కంపు నల్లి బెడదను నివారించవచ్చు. -
వ్యాధుల కాలం.. పశువులు పైలం
గొంతువాపు వ్యాధి వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. నీరసంగా ఉండే పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. చికిత్స.. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. వ్యాధి ముదిరితే ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువుకు బూస్టర్ డోస్ తప్పక వేయించాలి. జబ్బవాపు.. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది. చికిత్స.. వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్, ఆక్సివంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వాటితో పాటు డెక్ట్రోజ్ నార్మల్ సెలైన్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి.. గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాల బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకొనే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. చికిత్స వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా స్థానిక పశువైద్యాధికారులు జాతీయ గాలికుంటు వ్యాధి నివా రణ పథకం కింద టీకాలు కూడా ఉచితంగా వేస్తున్నారు. గొర్రెల్లో కాలి పుండ్లు.. వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్ల వ్యాధి సోకుతుంది. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్‌సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అంతే కాకుండా గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయొద్దు. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి. -
మొక్కజొన్న దక్కేనా!
చేవెళ్ల రూరల్: ఈ ఏడాది ఖరీప్ ప్రారంభం నుంచీ వరుణ దేవుడు రైతులతో దోబూచులాడుతూనే ఉన్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది రైతులు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వర్షాలకు ధైర్యం చేసి మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, జొన్న, కూరగాయ పంటలు ప్రస్తుతం మంచి కాత దశలో ఉన్నాయి. మొక్కజొన్న కంకులు పట్టి పాల దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకుల్లో విత్తులు గట్టి పడే అవకాశం ఉంది. పత్తి పంట కూడా పూత, కాత దశలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వానలు పడితే మంచి కాత వస్తుందని రైతులు అంటున్నారు. కానీ వరుణ దేవుడు కరుణ చూపించటంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండలు మండిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక పెద్ద వాన పడితేనే అన్ని పంటలు గట్టెక్కుతాయని అంటున్నారు. లేదంటే ఇన్నాళ్లూ కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే పాడయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే వర్షాధారంగా వేసిన కూరగాయ పంటలు వానలు లేక రోగాల బారిన పడి నాశనమవుతున్నాయన్నారు. వేల రూపాయల పెట్టుబడులు మట్టిలో పోసినట్లేనని ఆవేదన చెందుతున్నారు. -
పసుపు పంట..తెగుళ్లను నివారిస్తే సిరులే రైతు ఇంట
దుంప, వేరుకుళ్లు తెగులు దీనిని కొమ్ముకుళ్లు, అడుగు రోగం అనికూడా అంటారు. దీనివల్ల దిగుబడి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది జులైలో మొదలై అక్టోబర్, నవంబర్‌లో తీవ్రమవుతుంది. తెగులు సోకడానికి కారణాలు. తెగులు ఆశించిన పొలం నుంచి విత్తనం వాడటం. విత్తన శుద్ధి చేయకపోవడం. విత్తన పసుపును లోతుగా నాటడం. మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో సాగుచేయటం. ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం. పొటాష్, వేప పిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం. తెగులు లక్షణాలు పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు(పైనుంచి 3వ ఆకు) వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్ములు కుళ్లి మెత్తబడతాయి. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తాయి. తెగులు నివారణ తెగులను తట్టుకునే రకాలను(సుగుణ, సుదర్శణ, ప్రతిభ) మాత్రమే సాగుచేసుకోవాలి. చీడపీడలు, తెగులు సోకని పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలి. విత్తనశుద్ధి ముందుగా లీటరు నీటికి 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్+2 మిల్లీలీటర్ల మెనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోదర్మా విరిడి కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాలపాటు కొమ్ములను నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కి లోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితు ల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నేలలో పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తేగులు ఉధృతి కొంత వరకు తగ్గించవచ్చు వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రాము మేటాలాక్సిల్+మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫోరేట్ 10జీ గుళికలను 1 కిలో సైమాక్సోనిల్+మాంకోజెబ్ పొడి, తగినంత యూరియా(10 నుంచి 20 కిలోలు)లో కలుపుకొని పొలం అంతటా చల్లుకోవాలి. తాటాకు మచ్చ తెగులు దీనిని పక్షి, బెబ్బల, మర్రి ఆకు తేగులు అని కూడా అంటారు. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు కనిపిస్తుంది. తెగులు సోకడానికి కారణాలు ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం తెగులు సోకిన పొలం నుంచి విత్తనం వాడటం, విత్తన శుద్ధి చేయకపోవడం పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టు ఉండటం. తెగులు లక్షణాలు ఆకులపై అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందికి వాలుతుంది. తెగులు తీవ్రమైతే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. నివారణ తెగులు సోకని పొలం నుంచి మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి విత్తన శుద్ధి లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి, తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగులతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి వెంటనే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 2 గ్రాముల కార్బెండజిమ్+మాంకోజెబ్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్, 0.5 మి.లీ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధితో సెప్టెంబర్ నుంచి 3 నుంచి నాలుగు సార్లు పిచికారి చేయాలి. -
మల్చింగ్ పద్ధతితో పంటలకు మేలు
మల్చింగ్ అంటే.. మొక్కల చుట్టూ నేలను ఏదైనా పదార్థంతో కప్పి పెట్టడాన్ని మల్చింగ్ అంటారు. ఈ పద్ధతిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొదటి పద్ధతి ఎండుగడ్డి, ఎండిన ఆకులు, వరిపోట్టు, రంపం పొ ట్టులు మొక్క చుట్టూ రెండు నుంచి ఐదు అంగుళాల మందంలో వేయాలి. ఇవి పంటకాలంలో పంటకు మల్చింగ్‌తోపాటు ఆతర్వాత సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. రెండో పద్ధతి... ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి మొక్క చుట్టూ నేలను కప్పి ఉంచుతారు. వేసవిలో నీరు ఎండ వేడిమికి ఆవి రికాకుండా తేమ నిలుపుకొనడం, కలుపు మొక్కలు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల తోటలకు ఇలా... మొక్క పాదుకు సరిపడా షీట్‌ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి. చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పాలి. తర్వాత మూడు నాలుగు అర్థచంద్రకారంలో రంధ్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది. కూరగాయల పంటల్లో ... కూరగాయల పంటల్లో మల్చిం గ్ షీట్‌ను పంట విత్తేముందు లేదా మొక్కలు మొలి చిన తర్వాత గానీ వేసుకోవచ్చు. విత్తే ముందు వేయడం ఇలా.. మొక్కల మధ్య, వరుసల మధ్య గల దూరాన్ని బట్టి ముందే షీట్‌కు రంధ్రాలు చేయాలి. రంధ్రాలు చేసిన షీట్‌ను నాగలి సాలు మీద పరిచి, రెండు వైపులా కొనళ్లపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుని పోకుండా ఉంటాయి. రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టిని కప్పాలి. మొలిచిన పంట మీద ఇలా.. మొక్క చుట్టూ వేసేందుకు అనుకూలంగా షీట్‌ను తగిన సైజులో కత్తిరించి, ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి. ఉపయోగించుకోవడం ఇలా... మల్చింగ్ షీట్లు చాలా రంగుల్లో, వివిధ రకాల మందంతో మార్కెట్లో లభిస్తాయి. సీజన్, వేసే పంటను బట్టి మల్చింగ్ షీట్లను ఎంపిక చేసుకోవాలి. ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ చేసుకోవాలో అందుకు తగ్గట్టుగా సాళ్ల పొడువును బట్టి లెక్క వేయాలి. వర్షాకాలంలో రంధ్రాలున్నవి, తోటలకైతే ఎక్కువ మందంగలవి, వేసవి పంటలకు తెల్లని పురుగుల నివారణకు వెండి రంగు, కలుపు నివారణకు నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించాలి. షీట్లను పశువులు తొక్కకుండా చూసుకోవాలి. -
ఫోన్ ఇన్‌కు చక్కటి స్పందన
నిజామాబాద్ వ్యవసాయం : రైతుల సమస్యలపై గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి తెలిపారు. పలువురు రైతులు ఫోన్ చేసి పం టలను ఆశించిన చీడపీడల గురించి తెలిపారని, వాటి నివారణ చర్యలను తాము సూ చించామని పేర్కొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో రుద్రూర్‌లోని వరి, చెరుకు పరిశోధ న స్థానం శాస్త్రవేత్తలు కేఆర్.ఠాగూర్, కేఎన్.సంధ్యకిషోర్, జి.ప్రవీణ్, జె.కమలాకర్, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.వెంకట్రాజకుమార్ పాల్గొన్నారని తెలి పారు. రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తల సూచనలు.. వరిలో ఆకునల్లి నివారణకు.. వరి గింజలను ఆకునల్లి, కలకెనల్లి పురుగు లు ఆశించినట్లయితే లీటరు నీటికి 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 మి.లీ. ప్రొఫార్గైట్ కలిపి ఎకరానికి 400 మి.లీటర్ల మందును గింజలపై పిచికారి చేయాలి. వరిలో దోమపోటు నివారణకు.. గోధుమ వర్ణపు/తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. దీని వల్ల పైరు ఎండిపోతుంది. దోమపోటు నివారణకు పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతుండాలి. పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు వదలాలి. సుడి దోమ నివారణకు ఎకరానికి 320 మి.లీ. బుప్రొఫెజిన్ లేదా 400 మి.లీ. ఇతోఫెన్ప్రాక్స్ లేదా 50 గ్రాముల ఇయడాక్లోప్రిడ్ + ఎఫిప్రోల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పిచికారి చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు.. జిల్లాలో వరి పైరు వివిధ దశలలో ఉంది. కాండం తొలిచే పురుగు పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. అదే ఈనిక దశలో ఆశిస్తే తెల్ల కంకులు వస్తాయి. పైరు నాటిన 15-30 రోజులలోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు లేదా 4 కిలోల క్లోరాన్ట్రనిలిప్రోల్ 0.4 జీ గుళికలు వేసుకోవాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి 80 మి.లీ. క్లోరాన్ట్రనిలిప్రోల్ 20 ఎస్సీ మందును పిచికారి చేయాలి. సోయాలో పొగాకు లద్దె పురుగు నివారణకు.. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 1.6. మి.లీ. మోనోక్రొటోఫాస్(ఎకరానికి 320 మి.లీ.) లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్(ఎకరానికి 500 మి.లీ.) పిచికారి చేయాలి. టమాటలో ఆకు మాడు తెగులు నివారణకు.. ఈ తెగులు నివారణ కోసం లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోథలోనిల్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 3 గ్రాముల కాప్టాన్(ఎకరానికి 600 గ్రాములు) లేదా 3 గ్రాముల మాంకోజెబ్(ఎకరానికి 600 గ్రాములు) లేదా ఒక మి.లీ. ప్రొపికొనజోల్(ఎకరానికి 200 మి.లీ.) కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. -
మక్కను కోశాక..పసుపులో సస్యరక్షణ
పసుపులో అంతర పంటగా వేసిన మొక్కజొన్నను కోయగానే కలుపు తీయాలి. పసుపులో ఉండే కలుపుతో పాటు మొక్కజొన్న ఆకులను, కొయ్యలను తీసేయాలి. 20 రోజులకొకసారి చొప్పున మూడుసార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన ప్రతిసారి పొటాష్ వెదజల్లాలి. కలుపు తీసిన తర్వాత పంటకు తడి అందించాలి. తేమ ఉన్నప్పుడు ఒక హెక్టార్ పసుపు పంటకు 60 కేజీల పొటాష్ వెదజల్లాలి. లేదా లీటర్ నీటికి కార్బండైజమ్ 1.5 మి.లీటరు, కాపర్ ఆక్సైడ్ 3 గ్రాములు, 19:19 10 గ్రాములు కలిపి 400 లీటర్ల మందును పిచికారి చేయాలి. పసుపు ఆకుపై మచ్చలు ఉంటే మర్రి ఆకు తెగులు సోకిందని గుర్తించి 400 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్ల మోనో క్రొటోఫాస్, వంద గ్రాముల కాపర్ ఆక్సైడ్ కలిపి ఆకులపై పిచికారి చేయాలి. మొక్కజొన్న కోసిన తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువు 20:20 ను పొటాష్‌తో కలిపి వేస్తారు. కానీ ప్రస్తుత దశలో పసుపు పంటకు కాంప్లెక్స్ ఎరువుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకితే పసుపు ముదురు ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఆకులను తీస్తే దుర్వాసన వస్తుంది. పసుపులో నీటి నిలువ ఎక్కువగా ఉంచరాదు. నీరు తక్కువ మోతాదులోనే పంటకు అందించాలి. దుంప కుళ్లను ప్రస్తుత దశలో పూర్తిగా నివారించలేం. కేవలం వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చు. -
బాగు బాగు బొప్పాయి సాగు
ఖమ్మం వ్యవసాయం: గత ఏడాది వరకు జిల్లాలో 300 ఎకరాల మేరకు బొప్పాయి సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యాన మిషన్ ఈ పంట సాగుకు ఉత్పాదకాల రూపంలో రాయితీ కల్పించి ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటునిస్తోంది. ఈ పంట సాగు పద్ధతులు, మెళకువలు, తెగుళ్ల నివారణ గురించి కొత్తగూడెం, మధిర ఉద్యానశాఖ అధికారి బి. శ్రావణ్ వివరించారు. వాతావరణం: బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. నేలలు: సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం. వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రకాలు: బొప్పాయిలో రెండు రకాల మొక్కలు ఉంటాయి. డైయోషియస్కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనోడయోసియస్కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. వీటిలో మన జిల్లా రైతులు అధికంగా తైవాన్ రెడ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రవర్దనం: విత్తనం ద్వారా ప్రవర్దనం చేస్తారు. పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. ఎకరాకు గైనోడయోసియస్ రకాలు 20 గ్రాములు సరిపోతాయి. అంతర పంటలు, అంతర కృషి బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. అంత వరకు మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది . మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగ, శనగ, పెసర, మినుము, అలసంద, సోయాచిక్కుడు, నేల చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. మిరప, వంగ, టమాట వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. బొప్పాయిని అంతరపంటగా మామిడి, సపోట, కొబ్బరి వంటి తోటల్లో కూడా వేసుకోవచ్చు. ఎరువులు: చె ట్టు వయసును బట్టి ఎరువులను వినియోగించాలి. ఒక్కో చెట్టుకు నాటే గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క 2, 4, 6, 8, 10, 12 నెలల్లో 90 గ్రాముల చొప్పున యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాలి. తెగుళ్ల నివారణ కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్ లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. ఇలా వారంలో రెండుసార్లు తడపాలి. ఆంత్రక్నోన్ ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. దీని నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడీ+90 కిలోల పశువుల ఎరువు+ 10 కిలోల వేపపిండి+ కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయాలి. ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను అరికట్టాలి. పండు ఈగ: కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఈగ లార్వాలు కాయలోని గుజ్జును తింటాయి. నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. రాలిన పండ్లను ఎప్పటికప్డుపు ఏరివేయాలి. మి.లీ మిథైల్ యూజినాల్, రెండు గ్రాముల కార్బోఫ్యూరాన్, ఒక లీటర్ నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. -
ఏఫీమెరల్ ఫీవర్‌తో జాగ్రత్త
జన్నారం : పాడి పశువులు ప్రస్తుత సీజన్లో ఏఫీమెరల్ ఫీవర్‌కు గురవుతున్నాయి. ముందస్తుగా గుర్తించి వైద్య చికిత్స అందిస్తే నివారణ సులభమేనని, లేదంటే ప్రమాదకరమని తపాలపూర్ పశువైద్యాధికారి అజ్మీరా రాకేశ్ వివరించారు. దోమకాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనిని మూడు రోజుల జ్వరంగా పేర్కొంటారు. వర్షాకాలంలో జూలై నుంచి అక్టోబర్ మాసాల మధ్య పాడిపశువులను పట్టి పీడిస్తుంది. దీనిపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్లో సంప్రదించవచ్చు. లక్షణాలు దోమకాటుకు గురైన పశువుల్లో 104 నుంచి 106 ఫారెన్ హీట్ డిగ్రీల జ్వరం వస్తుంది. ఆకలి మందగిస్తుంది. నెమరు వేయవు. గడ్డి తినవు. నీళ్లు తాగవు. పార్డు లేక మలబద్ధకం కలిగి కంటి, ముక్కు నుంచి నీరు కారుతుంది. కీళ్లనొప్పులతో పశువులు లేవలేని స్థితిలో ఉంటాయి. కుంటుతాయి. జబ్బవాపు వ్యాధి వలే ఉంటుంది. ఆయాసం, దగ్గుతో పశువులు బాధపడుతాయి. ఇది మనుషులకు సోకే చికున్‌గున్యా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది. చికిత్స అతి జ్వరంతో బాధపడుతున్న పశువులకు సోడియం సాలిస్టేట్, పారాసెట్మాల్, నొప్పులు నివారించే ఇంజక్షన్‌ను పశువైద్యుల సూచన మేరకు ఇప్పించాలి. ఇది వైరల్ ఫివర్ కాబట్టి ఎటువంటి యాంటీబయాటిక్ మందులు ఇప్పించాల్సిన అవసరం లేదు. జ్వరం తగ్గిన తర్వాత నీరసం తగ్గించేందుకు బెలామీల్ ఇంజక్షన్ ఇప్పించాలి. జాగ్రత్తలు ఈ వ్యాధికి ప్రస్తుతం ఎలాంటి మందులు లేవు. వ్యాధి బారిన పడిన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. ఈ వ్యాధికి గురైన పశువుల పాకలో దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. పాడి పశువుల పాకల్లో వేప ఆకులు, గుగ్గిలం పొగ పెట్టాలి. దోమ చక్రాలు వెలిగించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. జ్వరం మూడు రోజులు ఉంటుంది కాబట్టి ప్రమాదకరం కాదు. అయితే సకాలంతో వైద్యం అందించకపోతే పశువు ప్రమాదానికి గురవుతుంది. -
శ్రీగంధం.. శ్రీమంతుడు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : చాలామంది రైతులు తక్షణ ఆదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి చూపుతారు. వాటినే పండిస్తుంటారు. కానీ అందరు రైతుల్లా కాకుండా తన కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బహుదూరపు పంట శ్రీగంధం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాడో రైతు. ఆయనే బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్. శ్రీగంధం మొక్కల పెంపకంపై ఆయన మాటల్లోనే.. నాకు లంబాడితండా గ్రామ చిరకలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలు నాటాను. ఈ కర్రకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ.10 లక్షల నుంచి రూ.15.లక్షల వరకు పలుకుతోంది. భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి చదువు, పెళ్లిళ్లకు భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా లేదు. గతంలో పత్తి, కంది, తదితర పంటలు సాగు చేశాను. కానీ ఆశించినంతగా లాభం రాలేదు. శ్రీగంధం మొక్కల పెంపకాన్ని నా స్నేహితుడు ప్రోత్సహించాడు. దీంతో ఈ మొక్కల పెంపకంపై దృష్టి సారించాను. ఒక్కో మొక్కను రూ.164 చెల్లించి బెంగళూరు నుంచి 520 మొక్కలు కొనుగోలు చేశాను. మొక్కల కొనుగోలుకు రూ.85.280 వరకు ఖర్చయింది. రవాణా, గుంతలు తవ్వడానికి, కూలీలు తదితర ఖర్చు మరో రూ.55వేల వరకు వచ్చింది. మొక్కలు నాటుకునే ముందు వాటికి ఎరువుగా ఆవుపేడ, యాపపిండి గుంతలో వేసిన. ఏడాదికి ఒకసారి చెట్టు మొదట్లో కిలో యాపపిండి వేస్తా. రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. అటవీశాఖ లెక్కల ప్రకారం ఎకరానికి 580 మొక్కలు నాటు కోవచ్చు. కానీ 520 మొక్కలు నాటిన. 15ఏళ్ల వరకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మొక్కల అమ్మకందారుడు తెలిపాడు. నేను ఈ చెట్లను 20ఏళ్ల వరకు పెంచాలనుకుంంటున్న. అప్పుడు ప్రతీ మొక్క కనీసం 200 కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఎకరంలో నాటిన 520 మొక్కల నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్న. టన్నుకు రూ.15లక్షల వరకు వచ్చినా రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ధర తగ్గవచ్చు. మరింత పెరగవచ్చు. ఇవన్నీ అంచనా లెక్కలు మాత్రమే. భవిష్యత్ తరాల వారికి మంచి ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీగంధం సాగుపై దృష్టి సారించాను. దీనికి నీరు, విద్యుత్ వంటి సమస్యలేవీ ఉండవు. మొక్కల పెంపకానికి నేల అనువైనదిగా ఉందని మొక్కల విక్రయ కేంద్రం వారు వచ్చి పరిశీలిస్తారు. మొక్కలు నాటే ముందు వారు భూమి స్వభావం, మొక్కలకు అనుకూలంగా ఉందా లేదా అని చూసిన తర్వాతనే మొక్కలు అందజేశారు. మొక్కలు విక్రయించిన వారే భవిష్యత్‌లో కొనుగోలు చేస్తారు. అంతర పంటగా.. శ్రీగంధం మొక్కల మధ్యలో పసుపు, ఆలు, పెసలు వంటివి అంతర పంటగా సాగు చేస్తున్న. ఈ ఏడాది పసుపు పంట విత్తుకున్న. దీని ద్వారా కూడా ఏడాదికి రూ.35 వేల నుంచి రూ.45వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు, విద్యుత్ మోటారు సౌకర్యం ఉండడంతో అంతరపంటకు శ్రీకారం చుట్టాను. గత ఏడాది అర ఎకరం భూమిలో పసుపు పండించాను. 5క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.38వేల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా పసుపు సాగు చేసిన. -
శ్రీవరి సాగులో ఆదర్శం
షాబాద్: మండలంలోని గూడెం ఊరు రైతులంతా శ్రీవరి సాగు పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు వీరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం గూడెం గ్రామానికి చెందిన రైతు శ్రీవరి పద్ధతికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మిగతా రైతులకు వివరించారు. మొదట తనకున్న ఎకరం పొలంలో శ్రీవరి సాగుచేశారు. ఈ పద్ధతిలో ఒక పంట పొందేందుకు సంప్రదాయ పద్ధతిలో అవసరమయ్యే నీటిలో కేవలం 40 శాతం నీరు ఉంటే చాలు. నీటి సమస్య, విద్యుత్ సమస్యలు ఉన్నప్పటీకీ శ్రీవరి సాగు ద్వారా పంట నష్టపోవడం ఉండదని గ్ర హించారు. దిగుబడి బాగా రావడంతో మిగతావారు అదే పద్ధతిలో వరి సాగు చేయడం మొదలుపెట్టారు. మండలంలోని రైతులు ప్రస్తుతం 30 ఎకరాల్లో సాగు చేశారు. సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన వరి ఎకరాకు 25 నుంచి 30 బస్తాలలోపు దిగుబడి చేతికొస్తుంది. శ్రీవరి పద్ధతిలో ఐతే ఎకరాకు 40 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి పొందుతున్నారు. శ్రీవరి సాగు ఇలా.. మొదట సాగు పొలాన్ని కరిగెటుగా సిద్ధం చేసుకోవాలి. ఎంచుకున్న వరి విత్తనాలను ఒకరోజు నీటిలో నానబెట్టి మరుసటి రోజు మండె కట్టాలి. వరినారు మడి ఎత్తులో ఉండేందుకు పశువుల ఎరువు వేసి అర్ధ అడుగు ఎత్తు పెంచుకోవాలి. అనంతరం మూడవరోజు నారుమడి మొలక వచ్చిన విత్తనాన్ని చల్లాలి. లేత నారు (12 రోజుల లోపు) నాటువేయాలి. నాటు విధానంలో కొలతలు... నాటు వేసే విధానంలో శ్రీవరికి కొన్ని కొలతలున్నాయి. పొడవు, వెడల్పులో అనగా సాళ్ల మధ్య 10 ఇంచుల దూరం పాటించి నాటు పెట్టాలి. దీని ద్వారా మొక్కలకు గాలి విరివిగా సోకి ఏపుగా పెరుగుతాయి. ప్రతి 10 రోజులకోసారి కలుపుతీత వేర్లకు పిలకలు ఎక్కువ రావడానికి సాళ్ల మధ్యన వీడర్ అనే చిన్నపాటి పరికరంతో తిప్పాలి. పొలంలో నీళ్లు పలుచని పార మాదిరి పెట్టి తొలగించాలి. సస్యరక్షణకు సాధారణ పద్ధతులు వాడవచ్చు. -
సిరుల వేరుశనగ!
విత్తన శుద్ధి ఇలా.. విత్తనాలు పురుగు పట్టినవి కాకుండా చూసుకోవాలి. ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజబ్ పొడి మందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు విత్తనానికి రైజోబియం లేక 6.5 మిల్లిలీటర్ల క్లోరో ఫైరిఫాస్ కానీ, రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి తయారీ దుక్కి మెత్తగా చదును చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో 4, 5 టన్నుల సేంద్రియ ఎరువులు వేయాలి. నీటి పారుదలకు కింద అయితే ఎకరానికి వంద కిలోల సూపర్‌ఫాస్పెట్, 33 కిలోల మ్యూరెట్ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. 9 కిలోల యూరియా, ఎకరానికి 200 కిలోల జిప్సంను పంట విత్తిన 30 రోజుల త ర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. కలుపు నివారణ కలుపు నివారణ కొరకు ఫ్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున దుక్కిపై పిచికారీ చేసి కలియ దున్నాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు మొక్కులూ లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఎలాంటి అంతరకృషి చేయకూడదు. ఆకుముడత తెగులు పురుగు ఆకు పొరల మధ్య తొలుస్తూ పత్రహరిత పదార్థాన్ని తింటుంది. దీంతో ఆకులు గోధుమ రంగులోకి మారి ముడతలుగా మారుతాయి. పురుగు లార్వా దశలో రెండు ఆకులను దగ్గరకు చేర్చి వాటి మధ్య గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఆకుపై పొరకు, కింది పొరకు మధ్య ఉన్న కణజాలాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎక్కువ సంఖ్యలో రాలిపోయి మొక్కల పెరుగుదల కాయల అభివృద్ధి తగ్గుతుంది. నివారణ ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేరుశనగ పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్ల మొనోక్రోటోఫాస్, రెండు మిల్లిలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. లద్దె పురుగు.. లద్దె పురుగు నివారణకు వేసవిలో దుక్కి లోతుగా దున్ని నత్రజని, వేపపిండి వేసుకోవాలి. పురుగు తొలి దశ లలో ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే పిచికారీ చేసుకోవాలి. పురుగు లార్వా దశకు ఎదిగాక ఐదు కిలోల తవుడు, అరకిలో బెల్లం, అరలీటర్ మోనోక్రోటోఫాస్ లేదా అర లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి విషపు ఎరువు తయారు చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క మొదళ్ల వద్ద వేసినట్లయితే లద్దె పురుగును నివారించవచ్చు. తెగుళ్లు.. నివారణ చర్యలు పంటకు జింకులోపం ఏర్పడితే ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. లేత ఆకుమచ్చ తెగులు.. మొక్కలు 20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆకుపై మచ్చలు కనిపి స్తే ఒక లీటరు నీటికి 2.5 గ్రామాలో మంకొజెబ్, లీటరు నీటికి ఒక గ్రాము కార్బడిజం కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి. ముదురు ఆకుమచ్చ తెగులు.. ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత వంద రోజుల్లోపు ఆశించే అవకాశం ఉంది. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజెబ్ గానీ లీటరు నీటికి గ్రాము కార్బడిజం గానీ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. -
సాగుకు సర్కారీ సాయం
వ్యవసాయ శాఖ పథకాలు 1. మాగాణి భూములకు పచ్చి రొట్ట పైర్ల విత్తనాలు, అంతర పంటల విత్తనాలు 50శాతం సబ్సిడీపై సరఫరా. 2. విత్తన గ్రాస పథకం కింద రైతులు వారికి కావాల్సిన విత్తనం వారే తయారు చేసుకునేందుకు ఫౌండేషన్ విత్తనాల సరఫరా. 3. భూసార వారోత్సవాల నిర్వహణ- మట్టి నమూనాల విశ్లేషణ ఆధారంగా ఎరువుల వాడకానికి ప్రోత్సాహం. 4. మండలానికి పది చొప్పున ముఖ్యమైన పంటల్లో ఆధునిక పద్ధతుల సమగ్ర ప్రదర్శనకు పదెకరాల ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ. 5. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ప్రచారానికి వరి, పత్తి, వేరుశనగ, కంది పంటల్లో క్షేత్ర పాఠశాల నిర్వహణ. 6. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు సరఫరా. 7. పురుగు మందులు కల్తీల నిరోధానికి శాంపుల్స్ రహస్య కోటింగ్ పద్ధతిన కొనసాగింపు. 8. జీవ నియంత్రణ విధానాల ప్రచారానికి తక్కువ ధరకు ట్రైకోడెర్మా విరిడి, ఎన్పీవీ ద్రావణం, ట్రైకోగ్రామా కార్డుల సరఫరా. 9. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, రైతు గ్రూపులు తదితర కార్యక్రమాల నిర్వహణ. ఉద్యానవన శాఖ పథకాలు 1. ఆయిల్ ఫామ్ తోటల అభివృద్ధి. 2. అధిక దిగుబడి నిచ్చే కూరగాయ, ఉల్లి విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా. 3. మేలు రకం పండ్ల మొక్కలు, టిష్యూ కల్చర్ మొక్కలను రాయితీపై అందజేత. 4. ఉద్యాన పంటల ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెంపునకు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు సరఫరా. 5. సమగ్ర పండ్ల అభివృద్ధి పథకం, కూరగాయల అభివృద్ధి పథకం, సమగ్ర సుగంధ ద్రవ్యాల అభివృద్ధి పథకం. 6. పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక పథకాల అమలు. 7. ఆకులలో పోషకాలను విశ్లేషణ చేసే లేబొరేటరీ ద్వారా ఆకులను విశ్లేషించే సమగ్ర పోషక యాజమాన్యం అమలు. 8. రైతు బజార్ల రైతులకు విత్తనాల సబ్సిడీ, సాంకేతిక సలహాలు అందజేయడం. 9. రైతు శిక్షణా కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటు, రైతు విజ్ఞాన యాత్రల ద్వారా అవగాహన పెంపొందించడం. 10. మామిడి, ద్రాక్ష, గులాబీ, పుట్టగొడుగుల ఎగుమతి ప్రోత్సాహానికి చర్యలు. -
కాలిఫ్నోరియా.. బాగుందయా
కంగ్టి: మండల పరిధిలో సోయాబీన్ సాగు చేస్తున్న వారికి రెండేళ్లుగా మంచి దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో సకాలంలో విత్తనాలు వేయలేకపోయారు. బోర్లు, బావులు ఉన్న కొంత మంది మాత్రం పంటలు సాగు చేశారు. వర్షాధారం కింద సోయా వేసిన రైతులు రెండు నెలలు ఆలస్యంగా విత్తనం నాటారు. వీరిలో కంగ్టికి చెందిన దుబాయ్ దత్తు (దత్తాగౌడ్) వేసిన పంట ఏపుగా పెరిగి పూత, కాతతో కళకళలాడుతోంది. గతంలో బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఈయన ఆరేళ్ల పాటు అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. ఐదేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమిలో బోరు వేయగా పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న తమ పాలోళ్ల (దాయాదుల) భూమిని కూడా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామంలో ఉండే తమ బంధువులు గతేడాది ఖరీఫ్ సీజన్లో ఎకరానికి 15 కిలోల విత్తనాన్ని మాత్రమే వాడి తక్కువ ఖర్చుతో మూడు ఎకరాల్లో 50 క్వింటాళ్ల దిగుబడులు సాధించారని తెలిపాడు. కానీ ఇక్కడి రైతులు మాత్రం ఎకరానికి పలు కంపెనీలకు చెందిన 30 కిలోలు విత్తితే ఇంతవరకు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి దిగుబడి పొందలేదని చెప్పాడు. తమ బంధువుల సలహా మేరకు మహారాష్ట్రలో కాలిఫోర్నియా రకానికి చెందిన 30 కిలో విత్తనాలను కొనుగోలుచేసి తెచ్చాడు. వీటిని గత జూలై 15న తన రెండెకరాల పొలంలో విత్తాడు. ప్రస్తుతం మంచి పూత, కాతతో మూడు ఫీట్ల ఎత్తులో ఏపుగా పెరిగింది. ఒక్కో పైరుకు 100 నుంచి 150 వరకు సోయాబీన్ పిందెలు ఉన్నాయి. దున్నకాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ కోసం రెండెకరాలకు మొత్తం రూ.15వేల పెట్టుబడి వచ్చిందని రైతు దత్తాగౌడ్ తెలిపాడు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విత్తనంతో మరింత మంది సాగుకు ముందుకు రావాలని కోరుతున్నాడు. -
అరటిలో పోషక లోపం.. దిగుబడిపై ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘అరటి చెట్లలో పోషకాలు లోపిస్తే ఎదుగుదల ఉండదు. దిగుబడి తగ్గుతుంద’ని ఉద్యానశాఖ ఏడీ బీ రవీంద్రబాబు(83744 49050) తెలిపారు. పోషక లోపాలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. పోషక లోపాలను ఎలా గుర్తించాలి, రైతులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : అరటిలో ఏఏ పోషకాలు లోపిస్తాయి? జ : జింక్, బోరాన్, ఇనుము, మాంగనీస్ లాంటి సూక్ష్మ పోషకాలు లోపిస్తాయి. ప్ర : జింకు లోపాన్ని గుర్తించడం ఎలా. నివారణ చర్యలేంటి? జ : అరటి ఆకుల ఈనెల వెంట తెల్లని చారలు మొదలై ఆకులు పాలిపోతాయి. దీని నివారణకు మొక్కకు 10 గ్రాముల చొప్పున జింక్ సలే ్ఫట్ను భూమిలో వేయాలి. 2 గ్రా.జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్ర : బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించాలి. నివారణ మార్గాలు? జ : ఆకులపై ఈనెలు ఉబ్బెత్తుగా తయారై, పెలుసుగా మారతాయి. ఆకులపై నిలువు చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము బోరాక్స్ మందు కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్ర : అన్నబేధి మందును ఏ ధాతు లోపానికి వాడతారు? జ : ఇనుప ధాతు లోప నివారణకు వాడతారు. మొక్కలో ఇనుప ధాతువు లోపిస్తే లేత ఆకులపై తెలుపు చారలు ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు 5 గ్రాముల అన్నబేధిని లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపిస్తే.. ముదురు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి ఆకులన్నీ తడిసేలా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే లోపించిన పోషకాలు మెరుగుపడతాయి. -
పల్లి సాగుకు తరుణమిదే
బాల్కొండ : వేరుశనగ దిగుబడిలో విత్తే సవుయుం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. జిల్లాలో సెప్టెంబర్ మధ్యలోనుంచే విత్తుకుంటున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు పల్లీలను విత్తుకోవచ్చు. నీరు నిలువని ఇసుక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో పంట వేయుకపోవడం వుంచిది. విత్తనశుద్ధి వుంచి కాయులను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి. వుుడతలు పడిన, పగిలిన, రంగు వూరిన గింజలు పనికిరావు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి గ్రావుు కార్బండైజమ్‌తో శుద్ధి చేసి 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. నేల తయారీ వేరుశనగ పంట వేసే భూమిలో ఎలాంటి కలుపు మొక్కలు ఉండకుండా ట్రాక్టర్‌తో లేదా నాగలితో మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలి. సాధారణంగా జిల్లాలో మొక్కజొన్న పంట కోసిన తర్వాత రెండుసార్లు ట్రాక్టర్‌తో దున్నుతారు. పల్లి విత్తనాలను చల్లిన తర్వాత మరోసారి దున్నుతారు. కొందరు రైతులు నాగలితో దున్నుతూ సాళ్లలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేముందే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తే సమయంలో 18 కిలోల యూరియాను, విత్తన 30 రోజుల తర్వాత 9 కిలోల యూరియాను వేయాలి. తగినంత తేమ ఉన్నప్పుడే నేలలో విత్తనాలు వేయాలి. విత్తన 15 రోజుల తర్వాత నీటిని అందించాలి. నేల స్వభావాన్ని బట్టి తర్వాతి తడులను అందించాలి. సాధారణంగా ఎనిమిదినుంచి తొమ్మిది తడుల్లో పంట చేతికి వస్తుంది. -
ఎలుకల పని పట్టండిలా..
సిమెంటు, మైదాపిండిలను సమ భాగాలుగా కలిపి పొట్లాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలి. వాటిని తిన్న తర్వాత ఎలుకలు నీరు తాగడం వల్ల నోటి భాగాలు పిడుచకట్టుకుపోతాయి. కడుపులో సిమెంట్ గడ్డకడుతుంది. దీంతో ఎలుకలు చనిపోతాయి. బొరియల్లో తడిగడ్డితో నింపిన కుండల ద్వారా పొగబెడితే రంధ్రాల్లో ఉన్న ఎలుకలు చనిపోతాయి. పొలం గట్లపై జిల్లేడు, ఆముదం మొక్కలు పెంచితే ఎలుకలు పొలం గట్లపై బొరియలు పెట్టే అవకాశం ఉండదు. ఐరన్ బుట్టలను అమర్చి ఎలుకలను పట్టుకోవచ్చు. ఎలాస్టిక్ తాళ్లతో పెట్టే బుట్టల ద్వారా కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. ఎకరా పొలంలో సుమారు 20 వరకు బుట్టలు ఉంచాలి. ఈ బుట్టల్లో బియ్యాన్ని ఎరగా వాడాలి. ఇందులోకి ఎలుక రాగానే దీనిలో ఉన్న ఎలాస్టిక్ వల్ల పీక నొక్కకుపోయి మరణిస్తుంది. రసాయనాల ద్వారా.. చాలామంది రైతులు జింక్ ఫాస్ఫైట్ వినియోగిస్తుంటారు. ఈ మందుతో ఒకసారి ఎలుకలను నిర్మూలించినా.. రెండో దఫా మందు పెట్టినప్పడు ఎలుకలు గుర్తించి తప్పించుకుంటాయి. {బోమోడైల్ మందు ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చు. 480 గ్రాముల నూకలకు పది గ్రాముల నూనె పట్టించి మరో 10 గ్రాముల బ్రొమోడైల్ మందు కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఆ ఎరను బొరియల వద్ద ఉంచాలి. దీనిని తిని ఎలుకలు చనిపోతాయి. అయితే పొలంగట్లపై కనిపించిన ప్రతి బొరియ వద్ద ఎర పెట్టడం వల్ల ఫలితం ఉండదు. ముందుగా బొరియలను గుర్తించి వాటిని మట్టితో మూసేయాలి. తర్వాతి రోజు గమనించాలి. తెరుచుకున్న బొరియల్లో ఎలుకలు ఉంటున్నట్లు అర్థం. వాటి వద్ద మందు పెడితే ఉపయోగం ఉంటుంది. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. రైతులు విడివిడిగా ఎలుకలు నివారించేకంటే ఒక ఆయకట్టు రైతులంతా ఒకేసారి ఈ విధానాన్ని అవలంబిస్తే ఎలుకలను శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో పెడితే మేలు.. పంట పొలాల్లో, బొరియల వద్ద పెట్టే మందును కొబ్బరి చిప్పల్లో ఉంచడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చు. మందు పొట్లాల్లో ఉంచితే వర్షాలకు కరిగిపోవడంతోపాటు కాకులు, పక్షులు తినే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పలో మందు ఉంచి పైన మరో చిప్పను ఉంచాలి. చిప్పల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం నుంచి ఎలుకలు అందులోకి ప్రవేశించి మందును తింటాయి. పంట పొలాల్లో నీరు ఉన్న ఎత్తులో చిప్పలను కర్రలకు కట్టి ఎరలు ఏర్పాటు చేయాలి. పొలం మధ్యలోకి ఈదుకుంటూ వచ్చే ఎలుకలు చిప్పల్లోకి ప్రవేశించి మందును తిని చనిపోతాయి. -
ఆదిలోనే అదుపుచేద్దాం..
తామర పురుగులు ఆకుముడత లేదా తామర పురుగులు మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుంచి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి. రసాన్ని పీల్చడం వలన పై ముడత వస్తుంది. ఆకులు, పిందెలు రాగి లేదా ఇటుక రంగులలోకి మారి పూత, పిందె నిలిచి పోతుంది. మొక్కలు గిడసబారి పూత రాలిపోతుంది. పూత పిందెగా మారదు. లేతకాయలు గిడసబారి చారలు ఏర్పడుతాయి. కాయల నాణ్యత లోపిస్తుంది. దిగుబడి తగ్గుతుంది. నివారణ: కార్బరిల్ 3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ, డెఫైన్ థియోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. నాటిన 15, 45 రోజుల్లో ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేస్తే పై ముడతను నివారించుకోవచ్చు. తెల్లనల్లి చిన్న, పెద్ద పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసంపీల్చుతాయి. ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో ఉం టాయి. ఆకు పెరుగుదల తగ్గి పూత పూయటం నిలిచిపోతుంది. దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో తేమ అధికంగా ఉన్న సమయంలో ఉంటుంది. నివారణ: డైకోపాల్ 5 మి.లీ లేదా ఫోసలోన్ 3 మి.లీ లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగుభాగం కూడా తడిచేటట్లు పిచికారీ చేయాలి. కింది ముడత ఎక్కువగా ఉన్నప్పుడు సింతటిక్ పైరిథ్రాయిడ్ మందును వాడొద్దు. నత్రజని ఎరువు వాడకాన్ని తగ్గించాలి. పేనుబంక ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసం పీలుస్తాయి. ఇవి తేనెవంటి పదార్థాన్ని విసర్జించటం వల్ల చీమలు చేరుతాయి. ఈ పదార్థంపైన నల్లని శిలీంద్రపు పెరుగుదల వల్ల ఆకులు, కాయలు మసిబారి పోతాయి. ఇవి ఆశించిన ఆకులు మెలికలు తిరిగి మొక్కల ఎదుగుదల నశిస్తుంది. నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. నివారణ: మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ తెల్లదోమలు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చుతాయి. ఆకుల ఎర్రబారి మొక్కల ఎదుగుదల క్షీణిస్తుంది. ఠనివారణ: ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా లీటర్ నీటిలో దయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగులు మిరపనాశించు కాయతొలుచు పురుగుల్లో పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగులు ముఖ్యమైనవి. వీటి వల్ల పంటకు 50 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. శనగపచ్చ పురుగు పిల్లలు మొదట ఆకులు, పూత దశలో పూభాగాలు తిని పంటకు నష్టం చేస్తాయి. కాపు దశలో కాయలో తల భాగాన్ని జొప్పించి మిగిలినదాన్ని తినడం వల్ల తాలు కాయలుగా మారుతాయి. పొగాకు లద్దె పురుగు పిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి పచ్చని పదార్థాన్ని తిని జల్లెడలా మారుస్తాయి. కాపు దశలో ముచ్చిక వద్ద రంధ్రం చేసి కాయ లోపలకు చేరి గింజలు, గుజ్జును తింటాయి. ఫలితంగా కాయను ఆరబెట్టినప్పుడు తాలుబారుతాయి. పచ్చరబ్బర్ పరుగు కూడా మొదటి దశలో ఆకులు, తరువాత దశలో కాయలను నష్టపరుస్తాయి. ఠనివారణ: 2 మి.లీ ఎండోసల్ఫాన్ లేదా 2 మి.లీ క్లోరిఫైరీఫాస్ లేదా 3 గ్రాముల కార్బరిల్ లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎర ద్వారా కూడా నివారించవచ్చు. ఐదు కిలోల తవుడు, 500 గ్రాముల కార్బరిల్ లేదా 500 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా క్లోరిఫైరీఫాస్ను 500 గ్రాముల బెల్లంతో కలపాలి. తగినంత నీటిని జోడించి చిన్నచిన్న ఉండలుగా తయారు చేయాలి. సాయంత్రం వేళ పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర పెట్టడం వల్ల లార్వాలను నివారించవచ్చు. వేరుపురుగు ఇటీవలి కాలంలో మిరప పండించే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు సమస్య అధికంగా ఉంది. వీటి పిల్ల పురుగులు భూమిలో 5-10 సెం.మీ లోతులో మిరప వేర్లు, కాండాలను తిని నష్టం కలుగ జేస్తాయి. ఫలితంగా మొక్కలు వడలి చని పోతాయి. నివారణ: ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు వాడాలి. ఈ గుళికలు భూమిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. మట్టితో కప్పి పెట్టాలి. -
‘వయ్యారిభామ’ పనిపట్టండి
మంచిర్యాల రూరల్ : కలుపు మొక్కలు అంటేనే రైతులకు ఎంతో దిగులు. వాటిని ఎలాగైనా తొలగించి, పంటను కాపాడుకోవాలని నిరంతరం శ్రమిస్తుంటారు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. అయితే పంటలపై తీవ్ర ప్రభావం చూపే కలుపు మొక్క వయ్యారిభామ(పార్థీనియం హిస్టిరోపోరస్) పంట ఎదుగుదలతోపాటు దిగుబడి రాకుండా అడ్డుకుంటుందని, పశువుల్లో వివిధ వ్యాధులు వచ్చేలా చేస్తుందని మంచిర్యాల ఏడీఏ వీరయ్య తెలిపారు. వయ్యారిభామ వల్ల కలిగే నష్టాలు, నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. మొక్క ఎలా వచ్చిందంటే.. అమెరికాలోని ఉష్ణప్రాంతంలో వయ్యారిభామ మొక్క ప్రస్థానం మొదలైంది. ఆహార ధాన్యాల దిగుమతి ద్వారా 1956లో మన దేశంలోకి ఈ మొక్క వచ్చి చేరిందని, 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నట్లు ఏడీఏ తెలిపారు. ఈ మొక్క సీజన్‌తో సంబంధం లేకుండా నిరంతరం మొలుస్తుంది. ఒక్కో మొక్క పది వేలకుపైగా విత్తనాలను తయారు చేస్తుంది. ద్విదళ బీజంకు సంబంధించిన జాతి మొక్క కావడంతో ఒక్కో మొక్క ద్వారా కొన్ని వేల మొక్కలు వృద్ధి చెందుతాయి. ఇవి గాలి, నీరు, కీటకాల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లి దేశమంతా వ్యాపించాయి. ఇవి ఎక్కువగా రోడ్లు, పంటపొలాల గట్లు, బంజరు భూములు, చేలు, కాలువలు, రైల్వే ట్రాకుల వెంట ఎక్కువగా మొలుస్తుంటాయి. ఈ మొక్క ఎత్తు 0.5 మీటర్ల నుంచి 1.5 మీటర్లు ఉంటుంది. ఎక్కువ కొమ్మలను కలిగి ఉంటుంది. వీటి ఆకులు చీలి ఉండగా.. పూలు 4 నుంచి 5 మిల్లీమీటర్ల(చుట్టుకొలత) మేరకు విస్తరించి పూస్తాయి. ఈ మొక్క కేవలం విత్తనం ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్క పూలు తెల్లగా ఉండడంతో వీటిని కాంగ్రెస్ గడ్డి, నక్షత్ర గడ్డి, పార్థీనియం అని పిలుస్తారు. మన వాడుక భాషలో మాత్రం వయ్యారిభామ మొక్క అని అంటాం. -
కూరగాయల సాగే మేలు
వర్గల్: వరికి బదులుగా కూరగాయ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని గజ్వేల్ డివిజన్ ఉద్యాన అధికారి చక్రపాణి అన్నారు. ‘గడా’ వ్యవసాయ విభాగం ఓఎస్డీ అశోక్ కుమార్‌తో కలిసి మండల పరిధిలోని అంబర్‌పేటలో బుధవారం ఉద్యాన రైతులతో సమావేశం నిర్వహించారు. కూరగాయల సాగు, వివిధ ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కూరగాయలు సాగు చేస్తే తక్కువ నీరు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల సాధన కోసం పందిరి నిర్మాణాలు, మల్చింగ్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. బొప్పాయి, అరటి లాంటి ఉద్యాన పంటల సాగుతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వివరించారు. రైతులు సంఘంగా ఏర్పడి కూరగాయల సాగుకు ముందుకు వస్తే వేసవిలో ఉద్యాన క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. క్లస్టర్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. గడా ఓఎస్డీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు బతకాలి, వ్యవసాయం బాగుండాలంటే గ్రామానికి వచ్చే ప్రతి అధికారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులతో రైతులు మమేకం కావాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కేశవరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్, వెంకటేష్, మాణిక్యం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
పంట దిగుబడిని శాసించే జింక్
పంటలో జింక్ లోపం ఉంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. దీనివల్ల ఎరువుల ఖర్చు భారంగా మారుతుందే తప్ప దిగుబడి పెరగదు. మొక్క పెరుగుదలలో జింక్ వివిధ క్రియలను నిర్వర్తిస్తుంది. మొక్కల పెరుగుదల కోసం వివిధ రసాయనిక క్రియల్లో అవసరమయ్యే ఎంజైముల చురుకుదనాన్ని పెంచడానికి, ఉత్తేజపరచడానికి, రసాయనిక క్రియల్లో కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన రసాయన పదార్థాల తయారీకి జింక్ ఉపయోగపడుతుంది. పంటపై జింక్ లోపం కనిపిస్తే.. జింక్ లోప లక్షణాలు పంటపై కనిపిస్తే.. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింక్‌ను కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200 లీటర్ల ద్రావణం సరిపోతుంది. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. రెండు క్వింటాళ్ల పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల వ్యర్థాలు, ఫిల్టర్ మడ్డి లాంటి సేంద్రియ ఎరువులతో 15 కిలోల జింక్‌ను కలిపి ఒక నెల మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పైరు వేసే ముందు దుక్కిలో చల్లితే అధిక దిగుబడిలో మార్పు కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం జింక్ లోపం వరి పైరుకు ఇబ్బందిగా మారింది. నారుమడిలోనూ.. నారు నాటిన తర్వాత కూడా జింక్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా నాట్లు వేసిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల మధ్య, నాలుగు నుంచి ఆరో వారం వరకు జింక్ లోపం లక్షణాలు బయటపడతాయి. గుర్తించడం ఇలా.. జింక్ లోపం ఉన్నప్పుడు ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగా పెరగదు. పిలకలు పెట్టదు. పంట గుంపులు గుంపులుగా చనిపోయి ఖాళీగా కనిపిస్తుంది. పొలమంతా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే మొక్కల్లో పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు లేక పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగతా భాగమంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. నివారణ చర్యలు పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. జింక్ తగినంత ఉందో లేదో తెలుసుకోవాలి. జింక్ లోపమున్నట్లు తేలితే తప్పని సరిగా ముందుగానే సరైన మోతాదులో జింక్ సల్ఫేట్‌ను వేసుకోవాలి. వరి పంటకైతే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను దుక్కిలో నాటే ముందు వేసుకోవాలి. మూడు పంటలకు ఒకసారి గానీ, రెండేళ్లకోసారి గానీ ఇలా చేయాలి. ఏటా వరి వేసుకోవాలనుకుంటే మాత్రం రబీలోనే జింక్ వేసుకోవాలి. సమస్యాత్మక నేలలు అంటే క్షార, చవుడు, సున్నపు, నేలలైతే జింక్ సల్ఫేట్‌ను ఎకరానికి 40 కిలోల చొప్పున వేసుకోవాలి. -
పసుపు సాగు.. కాపాడితే బాగు
అల్లిక రెక్కనల్లి (తెగులు) కారణాలు... ఎక్కువ నీడ, తక్కువ గాలి, వెలుతురు ఉండడం. పైరులో సూక్ష్మ వాతవరణం పొడిగా, చల్లగా ఉండడం. పొలంలో పరిశుభ్రత పాటించకపోవడం. లక్షణాలు ... ఆకుల అడుగు భాగంలో తల్లి, పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకుపై భాగాన తెల్లని వచ్చలు ఏర్పడుతాయి. మొక్క పేలవంగా కనిపిస్తుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. నివారణ... విత్తనాన్ని సరైన సాంధ్రతతో నాటి మొక్కలకు గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. వేప పిండిని పైపాటు ఎరువుగా వేయాలి. పైరుపై పురుగును గమనించగానే లీటరు నీటిని 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా, 2 మిల్లీలీటర్ల డైమిథోఏట్ను కలపి పైరుపై పిచికారి చేయాలి. ఎర్రనల్లి(పొగచూరు తెగులు) : లక్షణాలు... పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. నివారణ... లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్, 1 మిల్లీలీటరు సబ్బు నీరు కలపి ఆకుల అడుగు భాగాన తడిచేటట్టు పిచికారి చేయాలి. పొలుసు పురుగు(స్కేల్స్) లక్షణాలు.. ఇవి తెల్లని చుక్కల వలే దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్ముల నుంచి రసాన్ని పీల్చి వదలి పోయే టట్లు చేస్తాయి. విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ములను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల మలాథీయన్ మందు కలిపిన ద్రవంలో 30 నిమిషాలు ఉంచి, ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పొలుసు పురుగులు ఆశించవు. దుంప తొలుచు ఈగ : కారణాలు.. చీడపీడలు ఆశించిన తోట నుంచి విత్తనం ఎన్నుకోవటం. విత్తనశుద్ధి చేయక పోవటం. పసుపు తర్వాత పసుపు పంట సాగుచేయడం. తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువ ఉండటం. తేమ నిల్వ ఉండే పల్లపు భూముల్లో సాగుచేయడం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకాశం మేఘావృతమై చెదురుముదురుగా వర్షాలు పడడం. నష్టపరిచే విధానం... అక్టోబర్ నె నుంచి పంట చివరి వరకు దుంప తొలుచు ఈగ సమస్య ఉంటుంది. చిన్నవిగా, నల్లగా ఉండే ఈగలు మొక్కల మొదల్లపై నుంచి లోపలికి చేరి గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చే పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల మాదిరిగా ఉంటాయి. ఇది భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తింటాయి. లక్షణాలు... దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్క, సుడిఆకు దాని దగ్గరలో ఉన్న లేద ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మొవ్వు లాగితే సులభంగా ఊడివస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్రమాదిరి కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి, దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది. నివారణ... విత్తనశుద్ధి దుంపలను విత్తే ముందు లీటరు నీటికి 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్, లేదా 3మిల్లీలీటర్ల మలథీయాన్,కలిపిన ద్రావణంలో దుంపల్ని నానబెట్టి తర్వాత నాడలో ఆరబెట్టి విత్తుకోవాలి. సమతుల ఎరువులను వాడాలి. మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి.మొక్కల మధ్య నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. ఇది దుంపపుచ్చు కలిగించే ఈగను దగ్గిరకు రానీయదు. సత్తువగా కూడా పనిచేస్తుంది. వేపపిండి లేకపోతే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను అంతే పరిమాణం కలిగిన ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. వేరు నులిపురుగులు : కారణాలు.. పుచ్చు ఉన్న తోట నుంచి విత్తనం ఎన్నుకోవడం. పసుపులో అంతర పంటగా సొలనేసి కుటుంబానికి చెందిన మిరప, టమాట, వంగపైర్లను సాగుచేయడం. మురుగునీరు పోయే అవకాశం లేకపోవడం. పంట మార్పిడి చేయకపోవడం. సేంద్రియ ఎరువులు వేయకపోవడం. నష్టపరిచేతీరు... నులిపురుగులు చేసిన గాయాల ద్వారా నేలలోని వ్యాధి కారణాలు వేళ్లలోకి వ్రవేశిస్తాయి. తద్వారా వేర్లు ఉబ్బిపోయి, కణతులు కలిగి ఉంటాయి. లక్షణాలు.... ఆకులు పాలిపోయి, మొక్కలు బలహీనంగా, పొట్టిగా ఉంటాయి. నులి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నివారణ... చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యమైన విత్తనాన్ని ఉపయోగించాలి. పసుపులో అంతర పంటగా బంతిని వేసుకోవాలి. పచ్చి ఆకులు లేదా ఎండిన ఆకులతో మల్బింగ్ చేసుకోవాలి. ఎకరాకు 500 కిలోల వేపపిండిని వేసుకోవాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను వేసుకోవాలి. -
రకాలు వేరైనా దిగుబడి సమానమే
న్యాల్కల్: బీటీ పత్తి విత్తనాలు ఏవైనా ఒకే రకం దిగుబడులను ఇస్తాయని ఆత్మకమిటీ జిల్లా ఇన్చార్జ్ డీపీడీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో మంగళవారం బీటీ పత్తి రకాల వ్యత్యాసాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ రకాలు వేరైనప్పటికీ దిగుబడులు మాత్రం ఒకే రకంగా వస్తాయని చెప్పారు. దీనిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అధిక ధరలకు విత్తనాలు కొని నష్టపోతున్నారని తెలిపారు. వీరికి అవగాహన కల్పించేందుకు స్థానిక రైతు వామన్‌రావుకు చెందిన నాలుగు ఎకరాల పొలంలో ప్రయోగాత్మకంగా మల్లికగోల్డ్, భాస్కర్, వర్మ, జాదు అనే నాలుగు రకాల బీటీ పత్తి విత్తనాలను ఎకరం చొప్పన నాలుగు ఎకరాల్లో సాగు చేశామని చెప్పారు. అన్ని రకాల పంటలకు సమాన పరిమాణంలో ఎరువులు, నీరు అందిస్తున్నామన్నారు. మొక్కల ఎదుగుదలలో మార్పు అన్నింటిలోనూ ఒకే రకంగా ఉందని తెలిపారు. దిగుబడులు కూడా ఒకే రకంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. లేత కాండంపై బొట్టు పెట్టే కార్యక్రమం పలుమార్లు నిర్వహించామన్నారు. దీంతో రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. అంతే కాకుండా పొలంలో అక్కడక్కడ జిగురుతో ఉండే పసుపు రంగు ప్లేట్లను పెట్టాలన్నారు. పంటకు నష్టం చేసే పురుగులు దీనికి అతుక్కుని చనిపోతాయని వివరించారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక దిగుబడులు రావడమే కాకుండా 50 శాతం మేర ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రసాయన మందులను అధికంగా వాడొద్దని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య రైతులు పాల్గొన్నారు. -
‘మన ఊరు- మన కూరగాయలు’ గ్రామాల్లో.. కొనుగోలు కేంద్రాలు
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన కూరగాయలు’ పథకంలో భాగంగా ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు (వెజిటబుల్ కలెక్షన్ సెంటర్స్) ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వ మార్కెటింగ్ సీనియర్ ఫీల్డ్ అధికారి కర్మజిత్‌సింగ్ షెకాన్ పేర్కొన్నారు. చేవెళ్లలోని ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం దేవునిఎర్రవల్లి, చనువల్లి గ్రామాల రైతులకు కూరగాయల కొనుగోలు కేంద్రాలపై అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా కర్మజిత్‌సింగ్ షెకాన్, ఉద్యానశాఖ డివిజన్ అధికారి సంజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ.. మన ఊరు- మన కూరగాయల పథకంలో భాగంగా చేవెళ్ల ఉద్యాన డివిజన్ పరిధిలోని చనువల్లి, దేవునిఎర్రవల్లి, కొత్తగడి, నారాయణపూర్ గ్రామాల్లోని రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించినట్లు తెలిపారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 120 హెక్టార్లలో సాగు కోసం విత్తనాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ పంట ఉత్పత్తులు అమ్మకానికి వచ్చే దశలో ఉన్నాయన్నారు. దీంతో మొదటగా ఆ గ్రామాలలో ప్రభుత్వం తరపున కూరగాయల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరిస్తే రైతులకు దళారుల బెడద నుంచి విముక్తి కావడమే కాకుండా ఏజెంట్ కమీషన్ కూడా ఉండదన్నారు. ఆ గ్రామ రైతులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా కూరగాయల కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు తమ పొలంలో నుంచి నేరుగా గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి అప్పగించడమేనని తెలిపారు. తీసుకున్న కూరగాయలను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన వాహనంలోనే తీసుకెళ్లి నగరంలోని మార్కెట్లలో విక్రయిస్తారని చెప్పారు. మార్కెట్లో ఆ రోజు ఏ ధర ఉంటే ఆ ధరను రైతులకు చెల్లిస్తారని చెప్పారు. రైతులకు మార్కెట్‌కు వెళ్లే పరిస్థి తి ఉండదని, ఏజెంట్ కమీషన్ కూడా ఉండదన్నారు. దీంతో రైతుల సమయం, రవాణా ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రతి గ్రామంలో కూరగాయల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఫీల్డ్ కన్సల్టెంట్ రాఘవేందర్‌రెడ్డి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు సుభాష్, నరేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
‘లూసన్’.. లాభాలు చూపెన్
ఘట్కేసర్: పశువులకు మేతగా ఉపయోగపడే లూసన్ గడ్డి సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ రైతు.. ఈ గడ్డిని పెంచడానికి అంతగా శ్రమించాల్సిన పని లేదని, నీరు ఎక్కువగా అవసరం లేదని, పెట్టుబడి కూడా తక్కువే అంటున్నాడాయన. ఈ పంటపై చీడపీడలు ఆశించే అవకాశం తక్కువ అని చెబుతున్నాడు రైతు కృష్ణ. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే... గతంలో పాడి పశువులకు లూసన్ గడ్డి వేయడంతో పాల దిగుబడి పెరుగుతుందని గ్రహించాను. దీంతో లూసన్ గడ్డికి కోసం ప్రతి రోజు మార్కెట్ వెళ్లేవాడిని. అక్కడ ఈ గడ్డికి గిరాకీ బాగా ఉండటం చూశా. దానిని సాగు చేస్తే ఎక్కువ ఆదాయం పొందవచ్చని గ్రహించా. దీంతో యంనంపేట్‌లో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని సాగు చేస్తున్నా. లూసన్ గడ్డి విత్తనాలు తెచ్చి వాటిని పొలంలో సాగు చేస్తూ నాలుగు రోజులకోసారి నీళ్లు పెడుతున్నా. కలుపు మొక్కలను ఎప్పటికప్పడు తొలగించాలి. దీనికోసం నలుగురు మహిళా కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.150 కూలి ఇస్తున్నా. కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది కూలీలు అవసరపడుతుంది. ఎకరానికి రూ.25 వేల ఖర్చు.. లూసన్ గడ్డి సాగు చేయడానికి భూమిని సిద్ధం చేయడానికి, ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ.25 వేలు ఖర్చవుతుంది. గడ్డి ఏపుగా పెరగడానికి ఎరువులు, క్రిమిసంహారక మందులు వేస్తున్నా. విత్తనాలు వేసిన రెండు నెలల తర్వాత చిన్న కొమ్మలుగా కోసి వాటిని రూ.5 కట్టలు కడుతున్నా. వాటిని మోపులుగా తయారు చేస్తున్నా. ఒక్కో మోపులో 100 వరకు కట్టలు ఉంటా యి. ప్రతి నిత్యం 4 మోపులను నగరానికి తరలిస్తున్నా. నగరంలోని గోశాలలు, పరిశోధన నిమిత్తం వాడే ఎలుకలు, కుందేళ్లకు మేతగా విక్రయిస్తున్నా. ప్రతిరోజు రూ.2 వేలు వస్తున్నాయి. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.800 నుంచి రూ. వెయ్యి సంపాదిస్తున్నా. లూసన్ గడ్డిని గుర్రాలు, ఆవులు, కుందేళ్లు, ప్రయోగాలకు ఉపయోగించే ఎలుకలకు మేతగా వేస్తారు. దీంతో అవి ఎక్కువ శక్తిమంతమవుతాయి. పాడి పశువులకు వేస్తే ఎక్కువ పాల దిగుబడి పెరుగుతుంది. -
కందిలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు మేలు
పెసర ఎల్బీజీ-407, 457, 450, 410 రకాలు ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలం. మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పై భాగాన కాయలు కాస్తాయి. ఇవి పల్లాకు, వేరుకుళ్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్లను తట్టుకుంటాయి. వరి మాగాణుల్లో అయితే నీటి తడి అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. పెసర, అలసంద, మినుమును రబీ కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేసుకోవాలి. అలసంద స్థానికంగా దొరికే విత్తనాలను రైతులు సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. ఎం-45 మందుతో కలిపి శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించవచ్చు. చివరి దుక్కిలో 50 కిలోల డీఏపీ వేసుకోవాలి. మినుము ఎల్బీజీ-752, ఎల్బీజీ-20, 623 రకాలను సాగు చేసుకోవచ్చు. 70-80 రోజుల్లో పంట చేతికొస్తుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 6-7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 752, 20 విత్తన రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. ఎల్బీజీ-623 రకం బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. ఈ విత్తనాలను నాటుకోవచ్చు, వెదజల్లుకోవచ్చు. ఎల్బీజీ-645 రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవుగా ఉంటాయి. కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనాలను శుద్ధి చేస్తే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం స్థానికంగా దొరికే రకాలతో పాటు క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్, జ్వాలా హైబ్రిడ్ రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519 రకాలను సాగు చేసుకోవచ్చు. క్రాంతి రకం త్వరగా కోతకు వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత, జ్యోతి రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. విత్తిన 7-10 రోజుల్లో మొలక వస్తుంది. 15-20 రోజుల తర్వాత కనుపునకు ఒకే మొక్క ఉండేలా.. చుట్టూ ఉన్న మొక్కలను పీకేయాలి. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. వివిధ రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. -
‘సేంద్రియం’ వైపు చూపు..
‘‘సాధారణంగా పంటల సాగులో రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువుల ప్రభావం ఆయా పంటలపై ఉంటోంది. రసాయన ఎరువుల ప్రభావంతో భూమిలో సారం తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసా రం పెరుగుతుందని, అలా పండించిన పంట లు ఆరోగ్యానికీ మంచివని పేర్కొంటున్నారు. నేను సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. ఏడాది క్రితమే ఈ నిర్ణయానికి వచ్చాను. రుద్రూర్‌లోని కృషి విజ్ఞా న కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. అంబం(ఆర్) రోడ్డు సమీపంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు ప్రారంభించాను. ఆరు నెలల క్రితం సొంతంగా అభ్యుదయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాను. వంకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, చెర్రి టమాట, కీరదోస, కాకర, సోరకాయ పండిస్తున్నాను. కూరగాయలను అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నాను. ఎందరు వారించినా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తాననగానే తెలిసిన వారు వారించారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని, నష్టపోతావని పేర్కొన్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు. లాభమైనా.. నష్టమైనా.. అనుభవించాలని నిర్ణయించుకుని ముందుకే సాగాను. మా నాన్న రాజారాం మాజీ వైస్ ఎంపీపీ. ఆయనను ఒప్పించి సేంద్రియ పద్ధతు ల్లో కూరగాయల సాగు మొద లు పెట్టాను. పొలంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశాను. మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాను. డ్రిప్ కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రూ. 12 వేలు ఖర్చయ్యాయి. మిత్రులు చెప్పినట్లుగానే పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. సాధారణ పద్ధతులకంటే దిగుబడి కూడా తక్కువగానే వస్తోంది. దీంతో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మా ల్సి వస్తోంది. సాధార ణ పద్ధతుల్లో పండించి న కూరగాయలకంటే కిలోకు రూ. 10 నుంచి రూ. 15 ఎక్కువ ధర తీసుకుంటున్నాను. మొదట్లో ఎక్కువ ధర చెల్లించడానికి ప్ర జలు వెనుకంజ వేశారు. అయితే ఇప్పు డు ఆ సమస్య లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇచ్చేవారు సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ బాగానే ఉంది. ధర ఎక్కువైనా.. కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్.. వ్యవసాయ క్షేత్రం వద్దే కాకుండా సమీప గ్రామాల్లో జరిగే సంతలకు కూరగాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. డిమాండ్ బాగానే ఉంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు వైద్యులు ఇక్కడి నుంచి కూరగాయలను తీసుకెళ్తున్నారు. చాలా మంది రెగ్యులర్‌గా మా వద్దే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చెర్రి టమాట ధర కిలో రూ. 60, కీరదోస కిలో రూ. 40గా నిర్ణయించాను. ఏడాది వరకు ధరలో మార్పుండదు. ఇతర కూరగాయలను మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాను. నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల ఆదాయం వస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగును ప్రోత్సహించడమే నా ధ్యేయం. పలువురు రైతులు ఈ పద్ధతిలో కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నాను. త్వరలో నా మిత్రులు మూడెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయనున్నారు’’ అని రామరాజు వివరించారు. -
అంతర పంటలు.. అదనపు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. -
మామిడి మొక్కల పెంపకానికి అనువైన సమయం
ఎవరు అర్హులు జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ పథకాల కింద పండ్ల తోటలు సాగు చేయాలనుకునే వారికి ఉపాధిహమీ జాబ్‌కార్డు ఉండాలి. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి. మెట్ట భూముల్లో, నీటి వసతి గల బోర్ల వద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. ఉపాధిహమీ, ఉద్యానవన శాఖ నుంచి ఎలాం టి లబ్ధి పొందని వారు మాత్రమే అర్హులు. తోటలు పెట్టే ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరలకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తారు. ఈ రకాలు మేలు అందుబాటులో బంగినపల్లి, బేనిషాన్, దశరి, కొత్తపల్లి కొబ్బరి, రసాలు మొక్కలు ఉన్నాయి. నేలను సిద్ధం చేయాలిలా.. నీరు నిలవని సారవంతమైన నేలలు మామిడి సాగుకు అనూకులం. చౌడు నేలలు పనికిరావు. భూమిని రెండు మూడుసార్లు బాగా కలియదున్నాలి. మొక్కలు నాటడానికి 3.4 వారాల ముందే మూడు ఫీట్ల లోతు, వెడల్పుతో 7.5 మీటర్ల విడిది ఉండేలా గుంతలకు తవ్వాలి. మొక్కలు నాటేముందు ఒక్కో గుంతలో 50 కిలోల ఎండిన పశువుల ఎరువు, చెదలు పట్టకుండా 2 కిలోల సింగల్ సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల పారిడీల్ పొడిని మట్టిలో కలిపి మొక్కను పాతుకోవాలి. ఎకరాకు 70 మొక్కలను నాటాలి. నీటి యాజమాన్యం మొక్కలు నాటిన వెంటనే ఒకటిన్నర పాదు వేసి నీరు ఇవ్వాలి. వర్షాలు లేకుంటే 6 నెలల వరకు క్రమం తప్పకుండా 3-4 రోజులకోసారి నీరు పెట్టాలి. 2-3 సంవత్సరాల వరకు మొక్కను భద్రంగా కాపాడాలి. {yిప్పు ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాలాన్ని బట్టి రోజుకు 8-13 లీటర్లు మేర నీరందేలా చూడాలి. సూక్ష్మపోషక లోపాల నివారణ మొక్కల ఎదుగు దశలో సూక్ష్మపోషక లోపాల నివారణకు ఏడాదికి 2-3 సార్లు జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో గానీ, మొక్కలు కొత్త చిగుళ్లు తొడుగుతున్నా దశలో గానీ లీటరు నీటిలో 3-5 గ్రాముల మల్టీప్లెక్స్ మందును కలిపి 2-3 సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి. కత్తిరింపులు మొక్కలు నాటిన మొదట సంవత్సరం మొక్క కాండం మీద 50 సెంటీమీటర్ల వరకు ఎటువంటి కొమ్మలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క 60-90 సెంటిమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన కాండం చివరకు కత్తిరించి 2-3 బలమైన కొమ్మలను ఎంచుకుని పెరగనివ్వాలి. మిగిలిన వాటిని కత్తిరించాలి. పక్క కొమ్మల 80-90 సెంటీమీటర్లు పెరిగాక రెండోసారి కత్తిరించి రెండుమూడు కొమ్మలను ఉంచాలి. మూడో దశలోనే కొమ్మలను కత్తిరించి చెట్లు గొడుగు ఆకారంలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆర్థిక ప్రోత్సాహం మామిడి సాగులో ఒక్కో మొక్కకు రోజుకు 50 పైసల చొప్పున నెలకు రూ.15లు ఇస్తారు. ఈ లెక్కన ఎకరంలోని 70 మొక్కలకు నెలకు రూ.1,050 చొప్పున ఇస్తారు. అంటే సంవత్సరానికి రూ.12,600ల చొప్పున మూడేళ్ల కాలానికి 37,800లు అందుతాయి. ఆ తరువాత తోట కాపునకు వచ్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుంది. చెట్లు పెరిగిన కొద్ది కాత అధికమై ఆ ప్రకారం దాయం కూడా పెరుగుతుంది. అంతర పంటలతో అదనపు ఆదాయం మామిడిలో అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. తీగ జాతికి చెందిన కాకర, బీర, సోర, దోస, ఉల్లి, బీన్స్, క్యాబేజీతో పాటు పప్పు దినుసులైన పెసర, మినుమును అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. -
బిందువు..రైతు బంధువు..
టేకులపల్లి : బిందు సేద్యం ద్వారా సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని బిందు సేద్యం జిల్లా ఏపీడీ రావిలాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన రైతు వజ్జా రమేష్ పొలంలో బిందు సేద్యంను శనివారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బిందు సే ద్యం పరికరాల ఉపయోగాలు, బిందు సేద్యం వల్ల కలిగే లాభాలపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమతుల నీరు, ఎరువులు బిందు సేద్యం ఉన్న అపోహలను రైతులు తొలగించుకోవాలని, ఇప్పటి వరకు కూడా రైతులు ‘పొలం నిండా నీరు పెట్టాం.. ఇక చాలు పంట బాగా పంట బాగా పండుతుంద’ని అనుకుంటున్నారని, కానీ మొక్కలకు కావాల్సింది సమతుల నీరు, ఎరువులు, తేమ అని అన్నారు. అలా కాకుండా మొక్కలకు విపరీతంగా నీరు పెట్టడం వల్ల భూమిలోని గాలి తగ్గుతుందని, దీంతో తేమ శాతం తగ్గి చీడపీడలు ఆశించి మొక్క ఎదుగుదల లోపిస్తుందని బిందు సేద్యం ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. బిందు సేద్యం వల్ల మొక్కకు ఎంత నీరు కావాలి, ఎంత ఎరువు కావాలో అంతే వేసే వెసులుబాటు ఉంటుందని, సమయం, నీరు, విద్యుత్, ఎరువులు ఆదా కావడమే కాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైతులు మైండ్ సెట్ మార్చుకుని బిందు సేద్యంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇంకా ఎన్నో ఉపయోగాలు మామూలు సాగుతో పోలిస్తే బిందు సేద్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన రైతులకు వివరించారు. విద్యుత్ కోతల నేపథ్యంలో రైతన్నలు రాత్రి పూట పొలాల్లో జాగరణ చేయాల్సిన అవసరం ఉండదని, బిందు సేద్యం వల్ల ప్రతీ మొక్కకు సమస్థాయిలో నీరందుతుందని అన్నారు. ఆకులు కూడా పొడిగా ఉండడంతో చీడపీడలు ఆశించే అవకాశం కూడా చాలా తక్కువని అన్నారు. మరోపక్క కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుందని అన్నారు. మొక్క మొక్కకు ఎరువులు, రసాయన మందులు చల్లాల్సిన పని ఉండదని, బిందు సేద్యానికి ఉపయోగించే పరికరమే ఈ పనులన్నీ చేస్తుందని అన్నారు. సాధారణ సాగులో నూటికి 60 శాతం ఎరువులు వృథా అవుతాయని, బిందు సేద్యంలో మాత్రం ఎరువులు వృథా కావని అన్నారు. దిగుబడులు అధికంగానే ఉంటాయని అన్నారు. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం వందశాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇది అన్నదాతలకు మరింత లాభాన్ని ఇస్తుందని అన్నారు. చాలా గ్రామాల్లో వర్షాధార సాగు కావడంతో మొక్కలు సరిగా మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో బిందు సేద్యంతో చేపట్టిన పంటలు కళకళలాడుతున్నాయని అన్నారు. జిల్లాలో 2160 హెక్టార్లలో 2014 - 15 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 2160 హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. వీటిలో 1650 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్, 510 హెక్టార్లలో స్పింక్లర్ల ద్వారా బిందు సేద్యం సాగు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గతేడాది 75 వేల ఎకరాల్లో బిందు సేద్యం సాగు చేపట్టారని, దీని ద్వారా 30 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అర్హులైన వారందరికీ సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నామని అన్నారు. ఎవరు అర్హులు ? ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల వరకు పూర్తిగా ఉచితం. లక్ష దాటితే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు 90 శాతం సబ్సిడీ. బిందు సేద్యం పరికరం కావాల్సిన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, టైటిల్ డీడ్, ఇ పహాణీ, వీఆర్వో ధ్రువీకరించిన నక్షా జిరాక్స్ కాపీలతో ఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి , వీఆర్వో, సంతకాలు అయిన తర్వాత మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఏఓలతో కూడిన కమిటీ ధ్రువీకరించిన తర్వాత దరఖాస్తులను ఏపీడీ కార్యాలయానికి పంపితే మంజూరు చేస్తారు. -
అందుబాటులో బిందు సేద్యం పరికరాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో వివిధ రకాల పంటలు పండించుకోవడానికి నీటి సరఫరా కోసం బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు అందుబాటులో ఉన్నాయని బిందు సేద్యం పథకం సంచాలకులు నర్సింగ్ తెలిపారు. జిల్లాకు భౌతిక లక్ష్యం 2,500 హెక్టార్లకు పైపులు, నాజిల్లు మంజూరైనట్లు తెలిపారు. పత్తి, పసుపు, మిర్చి, సోయా, మొక్కజొన్న పంటలకు రెండు వేల హెక్టార్లకు, కూరగాయల సాగుకు 500 హెక్టార్లకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి వద్ద దరఖాస్తులు లభిస్తాయని, వాటిని పూర్తి చేసి అక్కడే గానీ, ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో గానీ అందించవచ్చని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దరఖాస్తు చేసుకునే విధానం టైటిల్ బుక్ జిరాక్స్‌పై తహశీల్దార్ లేదా డెప్యూటీ తహశీల్దార్ సంతకం ఉండాలి. లేదా మీ సేవ ద్వారా తీసుకున్న 1బీ ఫారం జతపర్చాలి. కౌలు రైతులు రిజిస్ట్రార్ లీజు డాక్యుమెంటు ఐదేళ్ల వరకు తీసుకున్నది జతపర్చాలి. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకంతోపాటు ఈసీ జతచేయాలి. ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఏదేని ఒకటి జతచేయాలి. ఎస్సీ, ఎస్టీ రైతులు సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ జతపర్చాలి. దరఖాస్తు ఫారంపై ఇటీవల కాలంలో దిగిన పాస్‌పోర్టుసైజ్ ఫొటో అతికించాలి. ఒకసారి రాయితీ పొందిన రైతులకు పదేళ్ల వరకు ఈ పథకం వర్తించదు. రాయితీ వివరాలు.. ఐదెకరాల్లోపు విస్తీర్ణం కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.లక్షకు మించకుండా వంద శాతం రాయితీ ఇస్తారు. చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్షకు మించకుండా 90శాతం రాయితీ లభిస్తుంది. ఐదు నుంచి పదెకరాల భూమి ఉన్న రైతులకు రూ.లక్షకు మించకుండా 75శాతం సబ్సిడీ వర్తిస్తుంది. పదెకరాల కంటే ఎక్కువగా ఉంటే రూ.లక్షకు మించకుండా 60శాతం రాయితీ అందిస్తారు. ధర రూ.లక్షకు పైగా అయితే 12ఎకరాల వరకు బిందు సేద్యం ఏర్పాటు చేసుకునే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు. తుంపర్ల(స్ప్రింక్లర్స్) సేద్య పథక ం తుంపర్ల సేద్యం ద్వారా సాగు చేసుకోవడానికి జిల్లాలోని 52 మండలాలకు గాను ప్రతి మండలానికి 24 చొప్పున తుంపర్ల సేద్య పరికరాలు అందజేస్తాం. బిందు సేద్య పరికరాల దరఖా స్తు నమూనా వలనే దరఖాస్తుతో జిరాక్స్ పత్రాలు జతపరిచి ఏంపిడీవో లేదా మండల వ్యవసాయ అధికారికి అందించాలి. 8 రకాల కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రాయితీ వివరాలు పరికరాల ఖరీదు రూ.18,417.. ప్రభుత్వ రాయితీ 50 శాతం రూ.9.208 చెల్లిస్తుంది. రైతు రూ.9.209 భరించాలి. ఒక సెట్‌కు 25 హెచ్‌డీఈపీ పైపులు, 5 నాజిల్స్, 5 జీఐ పైపుల(రైజర్స్)తోపాటు ఇతర సామగ్రి అందజేస్తారు. గతంలో లబ్ధి పొందిన రైతులకు పదేళ్ల వరకు అవకాశం ఉండదు. -
భర్త సహకారంతో పంటల సాగు..
నర్సాపూర్ (దండేపల్లి) : నర్సాపూర్ గ్రామానికి చెందిన నరెడ్ల సత్యనారాయ, విజయ దంపతులు పదిహేనుళ్లుగా వ్యవసాయం చేస్తున్నాయి. వారికి ఉన్న ఐదెకరాల భూమిలో ఏడేళ్లపాటు వరి సాగు చేశారు. దిగుబడి అంతంతమాత్రమే కావడంతో వరి సాగుకు స్వస్తి పలికారు. సత్యనారాయణ ఐటీఐలో మెటార్ మెకానిక్ చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయన్నే వృత్తిగా మలుచుకున్నాడు. వరి సాగుతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వరికి బదులు ఐదెకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగు చేశారు. లాభాల పంట పండడంతో కూరగాయలే సాగు చేస్తున్నారు. సత్యనారాయణ కూరగాయలను జన్నారం, ముత్యంపేట, దండేపల్లి, మేదర్పేట, తాళ్లపేట, లక్సెట్టిపేట, ద్వారకలో జరిగే వారసంతలకు తరలించి విక్రయిస్తుంటాడు. సాగు పనులన్నీ విజయ ముందుండి చేస్తోంది. సాగు వివరాలు ఆ దంపతుల మాటల్లోనే.. ఏడాది పొడవునా సాగు.. వరి, పత్తి వంటి పంటల సాగు మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తవుతుంది. కూరగాయల సాగు ఏడాదంతా చేపట్టవచ్చు. సీజన్ వారీగా డిమాండ్ ఎక్కువ ఉన్న వాటిని సాగు చేసి లాభాలు సాధించవచ్చు. మిర్చి, వంకాయ, టమాటా, బెండ, అలసంద, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నాం. వీటి సాడు ఏడాదంతా చేపడుతాం. సేంద్రియ పద్ధతిలో.. సత్యనారాయణ ఎన్‌పీఎం(నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్) వీఏ(విలేజ్ అక్టివిటిస్ట్)గా పని చేస్తుం డడంతో కూరగాయల సాగును పూర్తిగా సేంద్రి య పద్ధతిలో చేపడుతున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇంటి వద్దనే సేం ద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. కూరగాయల దిగుబడి బాగా వచ్చేందు కు నాడెపు కంపోస్టు ఎరువు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పంచగవ్వ, పేడ ఎరువును వాడడంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు పంట చేళల్లో తెలుపు, పసుపు ప్లేట్ల ఏర్పాటు, వావిలాకు కషాయం, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి మందులు కూడా తయారు చేసి పిచికారీ చేస్తున్నట్లు విజయ పేర్కొన్నారు. డ్రిప్‌తో నీరు.. కూరగాయల సాగుకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నాం. కాలువలు ఏర్పాటు చేసి నీళ్లందించడంతో ఎక్కువ నీరు పడుతుంది. కాబట్టి వ్యవసాయ బావికి డ్రిప్ సిస్టమ్‌ను బిగించాం. డ్రిప్ తో మొక్కకు నేరుగా నీరందడంతోపాటు నీరు వృథా కాదు. ఎరువుల తయారీ ఇలా.. మనం పడేసే వ్యర్థ పదార్థాలు, పిచ్చిమొక్కలు, పశువుల పేడ, ఆవు మూత్రం వంటి వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. నాడెపు కంపోస్టు ఎరువు.. దీంతో భూసారం పెరిగి పంట దిగుబడి వస్తుం ది. గడ్డి, కలుపు మొక్కలు ఒక చోట కుప్పగా వేయాలి వాటిపై ఆవుపేడ, మూత్రం చల్లాలి. ఒకసారి కుప్పగా వేసింది కొంత కుళ్లిపోగానే దానిపై మరో సారిగడ్డి, కలుపు మొక్కల కుప్ప వేసి మళ్లీ ఆవుపేడ, మూత్రం చల్లాలి ఇలా ఒకటి నుంచి 5 స్టెప్ల వరకు కుప్పగా వేయాలి 70 రోజుల్లో నాడెపు కాంపోస్టు ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వేసుకోవచ్చు. ఘనజీవామృతం.. ఇది కూడా భూసార పెంపునకు ఉపయోగ పడుతుంది. క్వింటాళు ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పిండి(పప్పుధాన్యాలతో తయారు చేసిం ది)తో తయారు చేసుకోవాలి. గుప్పెడు మట్టి వీ టన్నింటిని చూర్ణం చేసి చెట్టు మొదట్లో వేసినట్లయితే కాత బాగా కాస్తుంది. మొక్క, చెట్టు బలం గా ఉంటుంది. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ధ్రవ జీవామృతం.. దీన్ని పిచికారీ చేయాలి.. 10 కిలోల ఆవుపేడ, 2 కిలోల బెల్లం, 2కిలోల పిండి(పప్పుదినుసులతో తయారు చేసింది) 200 లీటర్ల నీటిలో కలిపాలి. వారం రోజులపాటు నానబెట్టాలి. ప్రతి రోజు కలియ తిప్పాలి. ఆ తర్వాత పంటలకు పిచికారీ చేయవచ్చు. ఇది కూడా ఒక ఎకరానికి సరిపోతుంది. దీని ద్వారా చీడలను నివారించవచ్చు. పంచగవ్వ.. ఇది సూక్ష్మధాతు లోపానికి వినియోగించవ చ్చు. పావుకిలో ఆవునెయ్యి, 2 లీటర్ల చొప్పున ఆవు పాలు, పెరుగు, డజను అరటి పండ్లు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లతో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎకరాకు పిచికారీ చేయొచ్చు. పసుపు, తెలుపు ప్లేట్లు.. చేనులో పసుపు, తెలుపు రంగుతో ఇనుప ప్లేట్లు ఏర్పాటు చేసి వాటికి నాలుగురోజులకోసారి గ్రీసు రాస్తే రసం పీల్చే పురుగులు వాటిపై వాలి అతుక్కుంటాయి. ఇలా చేయడంతో రసం పీల్చు పురుగులు నివారించవచ్చు. ఇవే కాకుండా వివిధ రకాల తెగుళ్ల నివారణకు వావిలాకు, వేప ఆకులతో తయారు చేసిన కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్రిహస్త్రం వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. -
పెసర రైతును ముంచిన వాన
న్యాల్కల్: ఆరు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పెసర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రతిఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. అతివృష్టి, అనావృష్టి ఫలితాలతో పంటలు దెబ్బతింటున్నాయి. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు జాడ లేకపోవడం, తీరా పంట చేతి వచ్చే సమయంలో ఏకధాటిగా వానలు కురవడం వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం పెట్టుబడులకు కూడా సరిపోవడం లేదు. మండలంలో ప్రస్తుతం పెసర పంట చేతి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా కురవరడంతో రైతులు విత్తనాలను కూడా ఆలస్యంగా వేశారు. పం టలు వేసుకునే సమయం మించి పోవడంతో పంటలు అవుతాయో లేదోననే సందేహంతో రైతులు కొన్ని రకాల పంటలను తక్కువ విస్తీర్ణంలో విత్తుకున్నారు. మండలంలో ఖరీఫ్‌లో 13వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అధికంగా పత్తి పంటను సాగు చేసుకోగా మిగతాది పెసర, మినుము, సోయా, జొన్న తదితర పంటలను సాగు చేసుకున్నారు. పెరస పంట సాధారణ సాగు విస్తీర్ణం 4వే ల హెక్టార్లు కాగా వర్షాభావ పరిస్థితుల కా రణంగా మండలంలో ఈ సారి 1,850 హెక్టార్లలో మాత్రమే సాగు చేసుకున్నారు. ప్రస్తుతం చేతికి వచ్చిన పెసర పంటను రాసులు చేసుకుం దామనుకుంటే ఆరు రోజులుగా నిత్యం వర్షం పడుతుండడంతో పంట దెబ్బతిం టోంది. ఎంతో కొంత ఏరిన పంట కూడా వర్షానికి తడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెసర పంటకు మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.6వేల పైచిలుకు ఉండడంతో రైతులు పంటపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీడని వ ర్షం రైతుల పాలిట శాపంగా మారింది. వరు ణుడు శాంతించాలని వీరు కోరుతున్నారు. -
సాగు ఖర్చు తగ్గించుకుంటే ఆదాయం
రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయాధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు వాడాలి. భాస్వరం మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీనిని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండకపోగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. చీడపీడలు ఎక్కువగా ఆశించడం వల్ల సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తోంది. తద్వారా ఖర్చు పెరుగుతుంది. వేప పిండి, యూరియా కలిపి వాడితే నత్రజని వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందించే వీలుంటుంది. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. జిల్లాలోని వ్యవసాయ భూముల్లో భాస్వరం శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫాస్పేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టిరీయా(పీఎస్బీ)ను వాడితే భూమిలో నిక్షేపంగా ఉన్న భాస్వరాన్ని కరిగించి పంటకు అందించవచ్చు. సూక్ష్మపోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను వ్యవసాయాధికారుల సూచనలు పాటించి సవరించాలి. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిఫార్సు చేసిన మందును.. సిఫార్సు చేసిన మోతాదులో.. సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. పంటలపై చీడపీడలు ఆశించినంతనే నివారణ చర్యలు చేపట్టనవసరం లేదు. ఎందుకంటే ప్రతి పురుగుకు, తెగులుకు ప్రతి పంటపై సహన పరిమితి ఉంటుంది. ఆ స్థాయి దాటిన తర్వాతే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సస్య రక్షణపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదు కంటే అధికంగా వాడితే పంటలకు చీడపీడలు ఆశిస్తాయి. దాని కోసం మళ్లీ సస్యరక్షణ మందులు వాడాల్సి వస్తుంది. తద్వారా సాగు ఖర్చు పెరుగుతుంది. ఇలా జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనశుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా కూడా సస్యరక్షణ మందులపై ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు.. పత్తి పంటలో రసం పీల్చే పురుగులను నివారించడానికి బ్రష్ ఈజీ పరికరం బాగా ఉపయోగపడుతుంది. మోనోక్రోటోఫాస్ లేదా ఇమిడాక్లోప్రిడ్ మందును బ్రష్ ఈజీ పరికరంతో కాండానికి రాసిన ట్లయితే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. కొందరు రైతులు విత్తనాలు ఎక్కువగా చల్లి దిగుబడి రాలేదని బాధపడుతుంటారు. అలా కాకుండా విత్తనాలను సిఫార్సు చేసిన మోతాదులో వాడితే ఖర్చు తగ్గుతుంది, ఆశించిన దిగుబడి దక్కుతుంది. -
మల్చింగ్‌తో మేలెంతో..
బీర్కూర్ : వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుంటూ, వాటిని క్షేత్రంలో అమలు చేస్తూ పురోగమిస్తున్నారు పలువురు రైతులు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అధిక దిగుబడులూ సాధిస్తున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ విధానంలో పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకుంటున్నారు రైతునగర్‌కు చెందిన మద్దుకూరి గౌతమ్ కుమార్ అనే రైతు. ఆయన సాగు పద్ధతుల గురించి తెలుసుకుందామా మరి.. ‘‘పదేళ్ల క్రితం బిందు సేద్యం గురించి తెలుసుకున్నాను. అప్పట్లో ప్రభుత్వం 60 శాతం రాయితీపై పరికరాలను సరఫరా చేసింది. మూడెకరాల్లో పరికరాల ఏర్పాటుకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చయ్యాయి. గతేడాది రెండెకరాల్లో బిందు సేద్యం పరికరాలను(90 శాతం రాయితీ) ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, టమాట, మొక్కజొన్న సాగు చేస్తున్నాను. బోధన్, వర్ని, బాన్సువాడ అంగడులలో విక్రయిస్తున్నాను. ఇటీవలి కాలంలో మల్చింగ్ విధానం గురించి తెలిసింది. ఆ పద్ధతిని కూడా అవలంబిస్తున్నాను. ఈసారి మూడెకరాల్లో టమాట, రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను. బిందు సేద్యం, మల్చింగ్ విధానంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. ఈ విధానాలు అవలంబిస్తూ ఎకరానికి సరిపోయే నీటితోనే ఐదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను’’ అని గౌతమ్ కుమార్ వివరించారు. ఈ విధానాల్లో పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, రాబడి కూడా పెరిగిందని తెలిపారు. -
అన్నదాతకు బంగారు భవిత
వర్గల్: అన్నదాత భవితను బంగారుమయం చేస్తామని నాబార్డు ఏజీఎం జీ రమేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని కూరగాయల క్లస్టర్ రైతులకు ‘నాబార్డు’ ద్వారా తగిన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఫార్మర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి అధిక దిగుబడుల సాధనపై రైతులకు అవగాహన, శిక్షణ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు చేయూతగా నిలుస్తామని చెప్పారు. మండల పరిధిలోని గౌరారం సర్పంచ్ నర్సారెడ్డి అధ్యక్షతన, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం కూరగాయల క్లస్టర్ రైతులతో ‘మన ఊరు- మన కూరగాయలు’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంఘటితమై సహకార సొసైటీలుగా ఏర్పడాలన్నారు. వీటిని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని, నిర్వహణ పరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ ఎన్జీఓకు సంఘ పురోగతి బాధ్యత అప్పగిస్తామని, వ్యయ సంబంధ నిధులు అందజేస్తామని వివరించారు. తద్వారా సొసైటీ, రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఆవిర్భవించి తమ కార్యకలాపాలను మరింత అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. మూడేళ్ల కాలం పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘం సాధించిన పురోగతి (బ్యాలెన్స్ షీట్) ఆధారంగా ‘నాబార్డు’ ద్వారా రుణ పరపతికి ఆ సంఘం అర్హత పొందుతుందని వివరించారు. మన ఊరు-మన కూరగాయలు కార్యక్రమం కింద కూరగాయలు పండిస్తున్న గౌరారం క్లస్టర్ పరిధిలోని రైతులకు శాశ్వత పందిరి నిర్మాణానికి బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడి సాధించాలని, గౌరారంలో మంజూరైన కూరగాయల కొనుగోలు కేంద్రం ప్రారంభం వర కు ఇక్కడి రైతు సహకార సొసైటీ, రైతు ఉత్పత్తి దారుల సంఘంగా రూపొందాలని ఆకాంక్షించారు. గౌరారం గ్రామానికి నాబార్డు రైతు క్లబ్ మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి నాబార్డు తగు ఆర్థిక సహకారం అందిస్తుందని వివరించారు. రైతులు సహకరించాలి... మన ఊరు- మన కూరగాయలు కార్యక్రమ సలహాదారు, మార్కెటింగ్ అడ్వైజర్ డాక్టర్ సెకాన్ మాట్లాడుతూ.. ఏడాది పాటు తమ సలహాలు, సూచనలకు అనుగుణంగా రైతులు కూరగాయలు సాగు చేసి సహకరించాలని, అందుకు తగిన గిట్టుబాటు ధర కల్పించి తీరుతామని భరోసా కల్పించారు. గ్రామస్థాయిలోనే ఉత్పత్తులను సేకరించి దళారుల బెడద లేకుండా కూరగాయలు అక్కడికక్కడే విక్రయించే సదుపాయం కోసం గౌరారంలో కూరగాయల సేకరణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సలహాలిస్తాం.... సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కూరగాయ పైర్లు తెగుళ్లు, చీడల బారినపడి రైతులు నష్టపోకుండా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని, క్షేత్రాన్ని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. పందిరి సాగుకు సబ్సిడీ పెంపు... జిల్లా ఉద్యాన అధికారిణి రామలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం శాశ్వత కూరగాయల పందిరికి ఇచ్చే సబ్సిడీని పెంచిందని, ఎకరానికి రూ. లక్ష చొప్పున గరిష్టంగా రెండున్నర ఎకరాలలో పందిరి వేసి రూ. రెండున్నర లక్షల సబ్సిడీని రైతులు పొందవచ్చన్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి... గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి మాట్లాడుతూ ‘మన ఊరు- మన కూరగాయలు’ కార్యక్రమం ద్వారా అందివచ్చిన అవకాశాన్ని గౌరారం క్లస్టర్ రైతులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును బంగరుమయం చేసుకోవాలని కోరారు. ట్రీస్ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కూరగాయలు సాగు చేసే గౌరారం క్లస్టర్ రైతుల పురోగతికి అవసరమైన దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రామ రైతు సహకార సొసైటి అధ్యక్షుడు పాశం నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన కూరగాయలు కార్యక్రమ లక్ష్యాలు సిద్ధింపజేసి సంఘాన్ని ఆదర్శంగా నిలబెట్టుకుంటామని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు కూరగాయల సాగు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితర అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు. -
జోరందుకున్న మిరప సాగు
అనుకూలమైన నేలలు: నల్లరేగడి, ఒండ్రు, ఎర్రమట్టి, ఇసుక నేలలు. నేల తయారీ: పంట నాటుకు ముందు మూడుసార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటక కొట్టాలి. విత్తనశుద్ధి: మొదటి సారి ఒక కిలో విత్తనానికి గ్రామున్నర టైసోడియం, ఆర్థోపాస్పేట్, రెండోసారి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, మూడోసారి 3 గ్రాముల కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు పెంచడం: ఎత్తై నేలను చదను చేసి విత్తనాలు వేసుకోవాలి. నారు 12-15 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత పది లీటర్ల నీటిలో రెండున్నర మిల్లీలీటర్ల ఫైటోలిస్ మందును కలిపి పిచికారీ చేయాలి. పంట వేసే విధానం: వర్షాధార పంట కాబట్టి తేమశాతం అధికంగా ఉన్నప్పుడూ కానీ వర్షం పడిన సమయాల్లో కానీ ఒక తాడు సాయంతో అరగజం దూరంలో వరుస క్రమంలో తగినన్ని నారు పోచలను నాటుకోవాలి. అనంతరం తగినంత మోతాదులో నత్రజని, పొటాషియం, భాస్వరం కలిపి చల్లాలి. కొన్ని రోజులకు చేనులో వరుస సాళ్లలో దంతెలు పట్టడం, కలుపు తీయడం చేస్తూ పిచ్చి మొక్కలను తీసేయాలి. పంటలో గడ్డి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకు ఆశించే తెగుళ్లు ట్రీప్స్, ఎఫైడ్స్ (వెంట్రుక పురుగులు) వంటివి ఆశిస్తే మోనోక్రొటోఫాస్ లేదా కార్బైల్ మందును తగినంత మోతాదులో నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. బూజు, బూడిద తెగులు, మచ్చలు ఏర్పడితే ఆంత్రోసిన్ మందును నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి. కలుపు తీయడం పంటలో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి కలుపు తీయడం చాలా అవసరం. కలుపు తీసేముందు చెట్టు మొద ళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపుతీతకంటే ముందుగా దంతెలు పడితే మరింత మంచిది. కలుపును నిర్లక్ష్యం చేస్తే తెగుళ్లు ఆశించడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నీటి తడులిస్తే మేలు: సకాలంలో వర్షాలు పడకపోతే నీటి సదుపాయం ఉన్న రైతులు పంటకు తడులు అందించొచ్చు. దంతెపట్టి, కలుపు తీశాక నీటిని పెడితే పంట ఎదుగుదల బాగుంటుంది. ఇలా చేస్తే దిగుబడిని కూడా పెరుగుతుంది.