ticket
-
టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!
అనుకోకుండా రైల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు మహిళలకు చాలా ఆందోళనగా ఉంటుంది. అదీ టిక్కెట్ లేకుండా అయితే ..ఫైన్ కట్టాలన్న భయం వెంటాడుతుంది. సరే.. ఇక తప్పదు కదా ఫైన్ కడదాంలే అని పర్సు చూసుకుంటే.. సరిపడా డబ్బుల్లేకపోతే.. అమ్మో.. ఈ పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది కదా. గుండె గుభేలు మంటుంది. ఏం చేయాల్రా దేవుడా అంటూ ఆ సమయంలో పడే బాధ వర్ణనాతీతం. మరి ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే... ఏం చేయాలి? మహిళలు ఒంటరిగా రైలు ప్రయాణం చేస్తున్నట్టయితే ఈ రైల్వే యాక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! ద రైల్వే యాక్ట్ 1989, సెక్షన్ 139 ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా ఆందోళన చెందక్కర్లేదు. టికెట్ లేదని రైల్లోంచి దింపే అధికారం టీటీఈకి లేదు. ఫైన్ కట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేకపోయినా భయపడక్కర్లేదు. లేడీ కానిస్టేబుల్ లేకుండా రైలు దింపడానికి వీల్లేదు.సెక్షన్ 311 ప్రకారం ఎట్టిపరిస్థితుల్లో మహిళల కంపార్ట్మెంట్లోకి మిలటరీ సహా పురుషులెవరూ ఎక్కడానికి వీల్లేదు. ఎక్కితే వారు శిక్షార్హులు. సెక్షన్ 162 ప్రకారం.. పన్నెండేళ్ల లోపు మగపిల్లలు మాత్రం తల్లి, సోదరి, అమ్మమ్మ, నానమ్మ లాంటి వాళ్లతో కలసి మహిళల కంపార్ట్మెంట్లో ప్రయాణించవచ్చు. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అలాగే ప్రతి స్లీపర్ (మెయిల్, ఎక్స్‌ప్రెస్) క్లాస్‌లో, గరీబ్‌రథ్, రాజధాని, దురంతో లాంటి రైళ్లు లేదా మొత్తం ఎయిర్ కండిషన్డ్ రైళ్లలోని థర్డ్ ఏసీ (3 ఏసీ)లో మహిళలకు 6 బర్త్‌లు రిజర్వ్ అయి ఉంటాయి. గ్రూప్‌గా ప్రయాణిస్తున్న మహిళలూ వీటిని వినియోగించుకోవచ్చు. రైలు ఎక్కినప్పటి నుంచి గమ్యానికి చేరేవరకు మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘మేరీ సహేలీ’ యాప్‌నూ లాంచ్ చేశారు. అంతేకాదు రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమేరాలు, మానిటరింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితుల్లో రైల్వే హెల్ప్‌లైన్ 139 ఉండనే ఉంది. ఇదీ చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?
భారతీయ రైల్వే జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.ప్రతిపాదిత సవరణలు ఇలా..నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్‌పై రైలు పేరు ప్రింట్ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.మార్పు ఎందుకు అవసరం?రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓప్రయాణికులపై ప్రభావం ఇలా..ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే. -
టిక్కెట్ లేకున్నా వెళ్లొచ్చని మోదీయే చెప్పారు!
పట్నా: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు జన జాతర కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ఈ మేళా సాగనుంది. ఇక ముఖ్యమైన దినాలేవీ లేనప్పటికీ జనం లక్షలు, కోట్ల సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలి వెళ్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఇదే అదనుగా జనం టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ ఘటనే..! బిహార్‌లోని దానాపూర్ డివిజన్ రైల్వే మేనేజర్ జయంత్ కుమార్ ప్రయాణికుల రద్దీతో నెలకొన్న పరిస్థితిపై రెండు రోజుల క్రితం బక్సార్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. అదే సమయంలో గ్రామీణ మహిళల బృందం ఒకటి ఆయనకు తారసపడింది. వారిని వివరాలడగ్గా కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు. టిక్కెట్లు కొన్నారా అని ప్రశ్నించగా ముక్తసరిగా లేదని బదులిచ్చారు. టిక్కెట్లు కొనకుండానే రైలు ప్రయాణం చేయవచ్చని ఎవరు చెప్పారని జయంత్ కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీయే అలా తమకు చెప్పారంటూ ఆ మహిళలు ఠకీమని ఇచ్చిన సమాధానంతో ఆయన షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి, ‘అలాంటిదేమీ లేదు. ప్రధాని మోదీయే కాదు, ఏ అధికారి కూడా టిక్కెట్ లేకుండా ప్రయాణం చేయనివ్వరు. ప్రయాణం చేయాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకుంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం డీఆర్ఎం జయంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పండగ సీజన్లప్పుడు చేసినట్లుగానే కుంభ్ మేళాకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, జనం రద్దీ తగ్గాల్సిన వేళ పెరుగుతుండటాన్ని తామస్సలు ఊహించలేదన్నారు. లేకుంటే, మరింతగా ఏర్పాట్లు సిద్ధం చేసి ఉండేవారమని వివరించారు. -
పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్‌ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్‌తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తివైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు. -
IND vs ENG: 1 టికెట్ ప్లీజ్!
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్లో విక్రయించే టిక్కెట్లు కోసం అర్ధరాత్రి నుంచి జనాలు చేరడంతో ఒకానొక సమయంలో తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది. 4 కౌంటర్లు.. 12 వేల టికెట్లు టిక్కెట్ల విక్రయానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్లైన్లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్‌లైన్‌లో కొనాలని ఎగబాకడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్‌క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ల గురప్రు గేట్ ప్రాంగణంలో టికెట్లు విక్రయించారు. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్‌లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపడుతోంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల ముంగిటకు పౌరసేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నిపుణులను భాగస్వాములను చేస్తూ పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’యాప్‌ను గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్ ఫాం పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించామన్నారు.భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ‘ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చు.పర్యాటకులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీప ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి చార్జీలను వసూలు చేయం’అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా.జి.మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!
భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 13 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక రైలు మాత్రం గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. టిక్కెట్ లేకుండా ఫ్రీగా ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఇలాంటి రైల్వే సర్వీస్ కూడా ఉందా..? ఇంతకీ ఏ ట్రైయిన్ ఈ ఉచిత సర్వీస్‌ని అందిస్తుంది. ఇది నిజమేనా అంటే..ఇలా 75 ఏళ్లుగా ఉచిత సర్వీసులందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్ రైలు. ఇది నంగల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని భక్రా మధ్య నడుస్తుంది. చెప్పాలంటే సుందరమైన సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా వెళ్తోంది. ఈ రైలుని భాక్రానంగల్ డ్యామ్ నిర్మించే నిమిత్తం కార్మికులను తరలించడానికి ఉపయోగించేవారు. ఈ రైలు 1948 నుంచి పనిచేస్తుంది. ఇక 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో ఈ రైలుని అత్యాధునికంగా మార్చారు అధికారులు. ఈ రైలులోని సీట్లు కూడా నాటి రైళ్లులో ఉండే విధానాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది మన సుదీర్ఘ రైల్వే చరిత్రకు ప్రతిబింబంగా నిలిచిన రైలు కావడంతో ఉచిత సర్వీస్‌ను అందించాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిగంటకు ఈ రైలుకి సుమారు 18 నుంచి 20 లీటర్ల ఇంధనం ఖర్చు అవ్వుతుంది. అలాగే భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(బీబీఎంబీ) నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఛార్జీలు వసూలు చేయాలని భావించినా..మన సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత సర్వీస్ అందించడమే సముచితమని నిర్ణయించారు అధికారులు. అందువల్లే ఈ రైలు ఎక్కాలంటే టిక్కెట్ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులందరికీ ఉచితంగానే సర్వీస్ అందిస్తోంది. ప్రతిరోజూ 800 మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తున్నారు. చాలామంది సందర్శకులకు ఇది ఓ అద్భుతమైన రైలు ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలు నడిచే మార్గంలో కనిపించే అద్భుతమైన భాక్రా-నంగల్ డ్యామ్, శివాలిక్ కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సర్వీస్:ప్రతి రోజు ఉదయం 7:05 గంటలకు, రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు మరొక ట్రిప్‌కు బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు భాక్రా రైల్వేలో ప్రయాణీకులను దింపుతుంది. (చదవండి: ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!) -
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్తో పీఆర్టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు. గతంలో.. బలమున్నా బరికి దూరం మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. -
మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. తెలుగు ప్రేక్షకులంటే ఎందుకంత చిన్నచూపు
-
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
దేవర మూవీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.రిలీజ్‌కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ ప్రీసేల్స్‌లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ అయినట్లు దేవర టీమ్ ట్వీట్ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్ ప్రీసేల్స్‌తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్‌లో సెప్టెంబర్ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్)ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. What do we call his mayhem? #Devara 🔥 pic.twitter.com/0rxdYD1JPJ— Devara (@DevaraMovie) September 14, 2024 -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.ఎక్స్‌ప్రెస్ కన్నా కాస్త ఎక్కువ టికెట్ ధరతో.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వాటిల్లో టికెట్ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణగతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. -
తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.ప్లాట్ఫారం టిక్కెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ప్లాట్ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ప్లాట్ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. -
అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!
యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
ఆ తాను ముక్కలే..
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) : మరో నెలరోజుల్లో రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖరారు చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే 17 నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించగా, అధికార కాంగ్రెస్ మాత్రం మరో మూడుచోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఈసారి అన్ని పార్టీలు విచిత్ర పద్ధతులను అనుసరించగా, అభ్యర్థులు కూడా టికెట్ దక్కించుకునేందుకు విచిత్ర విన్యాసాలు చేశారు. దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరి పోటీ చేస్తున్నారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులుగా పేర్కొంటూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. పార్టీలో సీనియారిటీ, విధేయత వంటి వాటిని పక్కనపెట్టి వలస నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. సొంత పార్టీలో సమర్థులైన అభ్యర్థులు లేరనే సాకుతో ఆర్థిక బలం, కుటుంబ నేపథ్యం, సామాజికవర్గాల లెక్కలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేశాయి. మరోవైపు ఇన్నాళ్లూ కొనసాగుతున్న పార్టీలో పోటీ అవకాశం దక్కినా కాలదన్ని మరీ ప్రత్యర్థి పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఎవరైనా ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లోనో.. కాంగ్రెస్‌లోనో కొనసాగిన వారే కావడం ఆసక్తికరం. అన్ని పార్టీల్లోనూ ‘గులాబీ’ గుబాళింపు రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే ఉన్నారు. బీజేపీలో 12 మంది, కాంగ్రెస్‌లో ఆరుగురు లేదా వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్లో కొనసాగిన వారే. బీఆర్ఎస్ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లోనూ ఆరుగురు కాంగ్రెస్ జీన్స్ కలిగిన వారున్నారు. పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ (బీజేపీ), పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), వరంగల్‌లో కడియం కావ్య (కాంగ్రెస్), నాగర్‌కర్నూలులో పి.భరత్ (బీజేపీ) బరిలో ఉన్నారు. వీరి తండ్రులు గతంలో బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన వారు కావడం గమనార్హం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వినోద్‌కు మూడు పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. ♦ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో గోడెం నగేశ్ (ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరు రమేశ్ (వరంగల్), సీతారాం నాయక్ (మహబూబాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), పి.భరత్ (నాగర్‌కర్నూలు), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), ఎం.రఘునందన్‌రావు (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్) గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారే. ♦ కాంగ్రెస్ తరపున టికెట్లు దక్కిన గడ్డం వంశీ (పెద్దపల్లి), కడియం కావ్య (వరంగల్), పి.రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నీలం మధు (మెదక్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), పట్నం సునీత మహేందర్‌రెడ్డి (మల్కాజిగిరి) గతంలో బీఆర్ఎస్తో సంబంధాలు కలిగిన వారే. ♦ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), మాలోత్ కవిత (మహబూబాబాద్), క్యామ మల్లేశ్ (భువనగిరి), రాగిడి లక్ష్మారెడ్డి (మల్కాజిగిరి), గాలి అనిల్ కుమార్ (జహీరాబాద్) కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వాసన కలిగిన వారే. సిట్టింగుల్లో 9 మందే తిరిగి బరిలోకి.. 17 మంది సిట్టింగ్ ఎంపీల్లో 9 మంది మాత్రమే తిరిగి బరిలోకి దిగుతున్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 9 మందికిగాను ముగ్గురు, బీజేపీలో నలుగురికిగాను ముగ్గు రు తిరిగి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌లో మాత్రం ముగ్గురు సిట్టింగుల్లో ఒక్కరూ తిరిగి పోటీ చేయడం లేదు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజ య్ (కరీంనగర్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత (మహ బూబాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం– హైదరా బాద్) తిరిగి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు సోయం బాపూరావు (ఆదిలాబాద్), వెంకటేశ్ నేత (పెద్దపల్లి) పసునూరు దయాకర్ (వరంగల్), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), పి.రా ములు (నాగర్‌కర్నూలు), రేవంత్‌రెడ్డి (మల్కాజి గిరి), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) పోటీకి దూరంగా ఉన్నారు. వెంకటేశ్ నేత, దయాకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవంత్‌రెడ్డి సీఎంగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రులు గా ఉండగా, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. నాగర్‌కర్నూలు ఎంపీ పి.రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి తన కుమారుడు పి.భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు. -
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లి.. ఎంపీ టిక్కెట్‌తో తిరిగొచ్చి..
ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్న యువకునికి కాంగ్రెస్ ఎన్నికల టిక్కెట్టు ఇచ్చింది. ఈ ఉదంతం బీహార్ కాంగ్రెస్ నేత రామ్ భగత్ పాశ్వాన్ విషయంలో జరిగింది. 1970లో బీహార్‌లోని దర్బంగాకు చెందిన రామ్‌భగత్ పాశ్వాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు లలిత్ నారాయణ్ మిశ్రా, వినోదానంద్ ఝా, నాగేంద్ర ఝాలను కలుసుకున్నారు. ఆ సమయంలో వారంతా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయాలని పాశ్వాన్‌ను కోరారు. దీనికి ఎంటనే ఆయన అంగీకరించారు. గతంలో రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ, పాశ్వాన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని రోస్రా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పాశ్వాన్ బరిలోకి దిగారు. సైకిల్‌పై ప్రచారం సాగించారు. నాటి ఎన్నికల్లో ఆయన సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థి రామ్‌సేవక్ హజారీని ఓడించారు. రోస్రా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరకాలంలో కాంగ్రెస్ అతనిని రాజ్యసభకు పంపింది. దాదాపు 17 ఏళ్ల పాటు రామ్‌భగత్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. నాడు రామ్‌భగత్ పాశ్వాన్ పోస్ట్‌మాస్టర్‌గా ఉంటూనే సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోస్ట్‌మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతని జీతం నెలకు రూ.150. ఉద్యోగం మానేయడంతో భార్య జీతం రూ.75పైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. భర్త ఎంపీ అయిన తర్వాత కూడా రామ్‌భగత్ పాశ్వాన్ భార్య విమలాదేవి ఉద్యోగం వదల్లేదు. ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లాహెరియాసరాయ్లో ఉంటున్నారు. రామ్‌భగత్ పాశ్వాన్ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్‌తో సమావేశమయ్యారు. శంకర్‌కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్‌రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్‌లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది. -
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్‌సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఏలూరు ఎంపీ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ నేత తపన చౌదరి హడావుడి చేస్తుండగా.. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. కూటమిలో కీలక నేతలుగా ఉన్నవారు రాజీనామాల బాట పట్టి అధికార వైఎస్సార్సీపీలో చేరుతుండటంతో కూటమి రాజకీయాల్లో తీవ్ర గందరగోళం రేగింది. ఉండిలో రామరాజుకు షాక్ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. శనివారం ఉదయం పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతా టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామరాజు వర్గానికి సర్ధిచెప్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా జనసేనకు కేటాయించిన నర్సాపురం అసెంబ్లీ సీటులో చంద్రబాబునాయుడు సభ నిర్వహించడంపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏలూరు పార్లమెంట్లో వరుస షాక్‌లు ఏలూరు పార్లమెంట్లో కూటమి పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దెందులూరు నియోజకవర్గ టీడీపీ సీటు ఆశించి భంగపడిన అశోక్‌గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అశోక్‌గౌడ్‌కు బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటంతో పాటు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తపన చౌదరి బల ప్రదర్శన ఏలూరు పార్లమెంట్ బీజేపీ నేత తపన చౌదరి బలప్రదర్శనకు దిగారు. పోలవరం నుంచి కై కలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీకి వెనక్కి తగ్గేది లేదని టీడీపీ కుట్ర రాజకీయాలకు బీజేపీని బలి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ నుంచి పోటీ తప్పనిసరిగా చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు. -
కూటమి.. నిప్పుల కొలిమి
అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘పొత్తు’గట్టిన దుష్టగ్రహ కూటమి నిప్పుల కొలిమై రగులుతోంది. మండుతున్న ఎండలకు దీటుగా అసమ్మతి జ్వాలతో ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతోంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలు పట్టుకుంటోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ/ఎంవీపీకాలనీ (విశాఖజిల్లా): తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకు సొంత పార్టీలోనే నిరసన ఎదురవుతోంది. ఆది నుంచి ఆయన వివాదాస్పద తీరు పార్టీ కార్యకర్తలకు, ఆయనకు మధ్య అంతరం పెంచుతోంది. ఆయన ఏకపక్ష ధోరణి ఇప్పుడు సీటుకే ఎసరు తెచ్చేలా ఉంది. అసలు ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కొలికపూడి అమరావతి జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ పార్టీకి అనుకూలంగా పని చేయడంతో పారాచ్యూట్ నేతగా ఊడిపడ్డారు. స్థానిక ముఖ్యనేతలకూ సమాచారం ఇవ్వకుండానే ఆయనను అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. టీడీపీ అధినేత సొంత సామాజికవర్గ నేతలే కొలికపూడి తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మరో అభ్యర్థిని పరిశీలించాలని విన్నవించారు. లేకుంటే ఓటమి తప్పదని కరాఖండిగా చెప్పారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలూ మాజీ మంత్రి జవహర్‌కు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. దీంతో అభ్యర్థి«త్వం మార్పుపై అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రజల నుంచీ కొలికపూడికి నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల గంపలగూడెం మండలం మంచిరాలపాడులో ప్రచారానికి వెళ్లిన ఆయన సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి అని అనడంతో మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు.ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ చేతులూపుతూ కౌంటర్ ఇచ్చారు. ♦ అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పార్టీలో చేరడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీను ఇంటి నుంచి బయలుదేరిన ర్యాలీ మండలి కార్యాలయం ముందు నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ పార్టీ కోసం తొలి నుంచీ కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని కోరారు. డబ్బులే పరమావధిగా సాగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని చెప్పిన బుద్ధప్రసాద్ వారంలోనే రూ.50 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని విక్కుర్తి శ్రీను ప్రశ్నించారు. మండలి స్వగ్రామమైన భావదేవరపల్లికి చెందిన జనసేన నాయకుడు భోగాది భానుప్రకాష్ మాట్లాడుతూ ఆయనకు సీటిస్తే 150 కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. బచ్చు వెంకటనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విక్కుర్తి శ్రీనుకు టికెటిస్తే గెలిపించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కండువాలు మార్చే బుద్ధి తనకు లేదంటూ మండలి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను జనసేన నేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. సీటు కోసం రాత్రికి రాత్రే ఆయన పార్టీ మారడంపై నెటిజన్లూ మండిపడుతున్నారు. ♦ విశాఖపట్నం ఎంపీ సీటును టీడీపీకి కేటాయించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈమేరకు మంగళవారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని ఆ పార్టీ నగర కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. విశాఖలో తొలి నుంచి బీజేపీకి పట్టుందని, సీటును టీడీపీకి కేటాయించడం తగదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో బీజేపీ గాజువాక సమన్వయకర్త కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ అభివృద్ధికి కృషి చేశారని, ఆయనకు ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రకు అందించారు. ఈ పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపిస్తున్నట్లు వివరించారు. వీలులేకుంటే బీజేపీ విడిగా స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలువురు నేతలు మాట్లాడుతూ పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి అమ్మేశారని దుయ్యబట్టారు. యనమల కోటలో నిట్టనిలువునా చీలిపోయిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ: యనమల రామకృష్ణుడు, కృష్ణుడు ఇద్దరూ అన్నదమ్ముల బిడ్డలు. అయినా ఒక తల్లి కన్న బిడ్డల కంటే ఎక్కువగానే కలసిమెలిసి ఉన్నారు. ఏకంగా 40 ఏళ్లు పాటు కలసి నడిచారు. రాష్ట్రమంతా వారిద్దరూ సొంత అన్నదమ్ములనే అనుకునేంతగా పేరుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబు తరువాత పెద్దన్న పాత్ర పోషించిన రామకృష్ణుడు రాష్ట్రంలో.. తునిలో కృష్ణుడు చక్రం తిప్పారు. అటువంటి వారిద్దరి మధ్య ఇన్నేళ్ల తరువాత తొలిసారి తలెత్తిన ఆధిపత్య పోరు వల్ల తునిలో టీడీపీ తునాతునకలైంది. తునిలో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక రామకృష్ణుడు స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో కృష్ణుడు పదేళ్లుగా పోటీ చేస్తున్నా.. వైఎస్సార్ సీపీ హవా ముందు నిలబడలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉనికి కోసం పాకులాడుతున్న రామకృష్ణుడు ఈసారి తన కుమార్తె దివ్యను బరిలోకి దింపారు. దశాబ్ద కాలంగా తునిలో టీడీపీని నడిపించిన కృష్ణుడిని దూరం పెట్టారు. టీడీపీ అభ్యర్థి దివ్య ప్రచారంలోనూ పాల్గొనవద్దని కృష్ణుడికి తెగేసి చెప్పేశారనే చర్చ జరుగుతోంది. తునిలో టీడీపీ అంటే కృష్ణుడు అని భావించిన ఆ పార్టీ శ్రేణులు ఈ పరిణామాలతో కంగుతిన్నాయి. దీంతో పార్టీ రెండువర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురైపోతున్నారు. కొందరు ఎవరిపక్షాన నిలవాలో అర్థంకాక స్తబ్దుగా ఉండిపోతున్నారు. రామకృష్ణుడి ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశానని, ఇప్పుడు తననే ఆయన దూరం పెట్టారని కృష్ణుడు సన్నిహితుల వద్ద మధనపడుతున్నట్టు సమాచారం. ఇంత అవమానం భరిస్తూ టీడీపీలో కొనసాగలేమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుందామని అనుచరుల నుంచి కృష్ణుడిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. అన్నదమ్ముల తగవు చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఆయన కిమ్మనకుండా ఉండడంపైనా కార్యకర్తలు పెదవివిరుస్తున్నారు. -
కూటమిలో కుతకుత
సాక్షి నెట్వర్క్: క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతున్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపికకు నిరసనగా రాజీనామా చేస్తుండగా... మరికొందరు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు శిరోభారంగా మారుతున్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. అక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు టికెట్ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్‌పై కొనసాగుతున్న టీడీపీ నిరసన పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కిల్లు రమేష్‌నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. జీసీసీ మాజీ చైర్మన్ ఎం.వి.ఎస్.ప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొయ్యూరులో ఆదివారం ఆ పార్టీ నేతలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ప్రసాద్‌కు అన్యాయం చేయడం తగదని అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డారు. రమేష్ నాయుడు ఎవరో కనీసం కార్యకర్తలకు కూడా తెలియదని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ప్రభాకర్ చౌదరి నిర్ణయం అనంతపురం అర్బన్ నుంచి అభిమానులు కోరితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని కమ్మభవన్‌లో పార్టీ కార్యకర్తలు, తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని, కేసుల్లో ఇరుక్కున్నానని, అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషా దేవిని తక్షణమే మార్చాలని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజవొమ్మంగిలో వారు సమావేశమై అభ్యర్థిని మార్చకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ‘మన పల్లెకు మన సౌమ్య’ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. ♦ అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్ తప్పు పట్టారు. ♦ గుంతకల్లులోని తన కార్యాలయంలో పార్టీ క్లస్టర్, బూత్ ఇన్చార్జులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉండాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర సభ టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటో లేకపోవడంపై ఆ పార్టీ బీజేవైఎం రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ జి.వి.రెడ్డి, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కిసాన్‌మోర్చా ఇన్చార్జి కె.వి.రమణారావు కూడా టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. పేరుకే కూటమిలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం టీడీపీ నాయకులు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ అరకు ఎంపీ టిక్కెట్ ఆర్థిక నేరస్తురాలైన కొత్తపల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నిమ్మక జయరాజ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గీత నిజమైన ఎస్టీ కాదని కూడా చెప్పారు. ♦ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జనసేన కార్యకర్తలను విస్మరిస్తున్నారని పార్టీ అద్దంకి మండల కార్యదర్శి సాధు వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్దేశ పూర్వకంగానే జనసైనికులను దూరం పెడుతున్నారని ఆరోపించారు. -
టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ టీడీపీని వీడారు. ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కట్టారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈలి నానితో మొదలై.. తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో వైఎస్సార్సీపీలో చేరారు. ♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు. ♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు. యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త జోష్ నెలకొంది. టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు. -
తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు నిల్!
రాజస్థాన్‌లో లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్ చరిత్రలో ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వరుణ్ పురోహిత్ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్‌రూమ్ అధ్యక్షుడు జస్వంత్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్‌బ్యాక్, డిమాండ్ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. -
వరుణ్‌కు కాంగ్రెస్ ‘ఆఫర్’? బీజేపీకి గట్టిపోరు?
గాంధీ కుటుంబంలో దశాబ్దాల నాటి రాజకీయ శత్రుత్వం ముగియనుందా? రాహుల్, వరుణ్ కలిసి నడుస్తారా? వరుణ్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వరుణ్ గాంధీపైనే నిలిచింది. యూపీలోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీకి బీజేపీ టిక్కెట్ కేటాయించకపోవడంతో ఈ చర్చ మరింత వేడందుకుంది. పిలిభిత్ సీటు గాంధీ కుటుంబీకుల సంప్రదాయ సీటు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ఈ స్థానం నుండి ఆరు సార్లు, వరుణ్ గాంధీ ఈ స్థానం నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి పిలిభిత్ టికెట్ ఇవ్వలేదు. జతిన్ ప్రసాద్‌ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ వరుణ్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ గాంధీ తదుపరి స్టెప్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వరుణ్‌గాంధీ కాంగ్రెస్ ఆఫర్‌ను అంగీకరిస్తే గాంధీ కుటుంబం మధ్య కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వానికి తెరపడుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అప్పుడు అన్నదమ్ములైన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ మరోసారి రాజకీయంగా ఏకమవుతారని అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. వరుణ్ గాంధీ చాలా కాలంగా సొంత పార్టీని పలు అంశాలలో విమర్శిస్తూ వస్తున్నారు. వరుణ్ వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, కేంద్ర ఉచిత రేషన్ స్కీమ్ మొదలైనవాటిపై వరుణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ వరుణ్‌కు టిక్కెట్ కేటాయించలేని తెలుస్తోంది. అయితే అతని తల్లి మేనకాగాంధీకి మాత్రం బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో వరుణ్ కాంగ్రెస్ ఆఫర్‌ను అందుకుంటారా? సోదరుడు రాహుల్‌తో కలిసి ముందుకు అడుగులు వేస్తారా? అనేది త్వరలో తేలిపోనుంది. -
తమ్ముళ్ల తిరుగుబాటు
అవనిగడ్డ/పెందుర్తి/పెద్దతిప్పసముద్రం/ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులనుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఎన్నో ఏళ్లుగా సీటుపై ఆశలు పెంచుకుని పార్టీ కార్యక్రమాలకోసం డబ్బు తగలేసుకుని, కష్టకాలంలో జెండా మోస్తే తీరా ఎన్నికలు వచ్చేసరికి పొత్తులో భాగంగా వేరొకరికి ఇస్తామంటే ఎందుకు సహకరించాలని వారు నిలదీస్తున్నారు. అక్కడ టికెట్ దక్కించుకున్నవారికి సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోనైతే ఒక అడుగు ముందుకేసి 30మంది నాయకులు తమ పార్టీ పదవులకు ఏకంగా రాజీనామా చేస్తూ ఆ లేఖలను పార్టీ అధిష్టానానికి పంపించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు అక్కడి టికెట్ కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ 30 మంది పార్టీ నాయకులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసి, ఆ లేఖలను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నియోజకవర్గంలో గెలిచే సత్తా బుద్ధప్రసాద్‌కే ఉందని, పొత్తుని పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారనీ, కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనకు కనీసం టికెట్ గురించి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. రాజీనామా చేసిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, అశ్వరావుపాలెం సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, క్లస్టర్ ఇన్చార్జి బండే రాఘవ, మాజీ ఉపసర్పంచ్లు ఘంటసాల కన్నయ్య, అడపా శ్రీనివాసరావు తదితరులున్నారు.కాగా పొత్తు ధర్మం పాటిస్తామంటూనే టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడటంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారుకు అన్యాయంపై రగులుతున్న కేడర్ 40 ఏళ్లుగా టీడీపీ జెండాను మోస్తూ పార్టీ మనుగడకోసం పాటుపడిన బండారు సత్యనారాయణమూర్తిని కాదని ఎక్కడి నుంచో పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తికి పెందుర్తి టికెట్ ఇస్తారా అంటూ అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ కేడర్ మండిపడుతోంది. టీడీపీ నుంచి జనసేనకు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడి జనసేన అభ్యర్థి పంచకర్ల తలకిందులుగా తపస్సు చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దానికి ప్రతిగా జనసేన నాయకులు పొత్తు ధర్మం ప్రకారం జనసేనకు సహకరించడం న్యాయమని భావిస్తున్నాం. తామేమీ టీడీపీ నాయకుల ఓట్ల మీద ఆధారపడి పోటీ చేయడం లేదని సమాధానమిస్తున్నారు. మొత్తమ్మీద పెందుర్తిలో కూటమి వికటిస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులైన బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు కలసి పనిచేయడం ఇక కల్లే అని అక్కడి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు ధర్మంలో జనసేనకే టికెట్ ఇవ్వవలసి వస్తే టి.శివశంకర్‌కు టికెట్ ఇవ్వాలని, పంచకర్లకు వద్దని మొదటినుంచీ చెబుతున్నారు. కానీ వారి డిమాండ్‌ను జనసేన అధినేత పట్టించుకోకపోవడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారు. తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డికి చుక్కెదురు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. సోమవారం రాత్రి ఆయన మండలంలోని బూర్లపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఇంటింటా తిరిగి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఇదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు జయచంద్రారెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కు మద్దతుగా జై శంకర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో జయచంద్రరెడ్డి తీవ్ర అసహనానికి లోనై వెను తిరిగారు. గిద్దలూరు జనసేనకుఇవ్వాల్సిందే ఒంగోలు జిల్లా గిద్దలూరు సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ నాయకుడు, కాపు సంఘం జిల్లా అ«ధ్యక్షుడు ఆమంచి స్వాములు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కల్యాణమండపంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 శాతం కాపు జనాభా ఉన్నారని, వైఎస్సార్సీపీ 31 సీట్లు ఇస్తే కనీసం అన్ని సీట్లు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. తెనాలిలో జనసేనకు కేటాయించినా అది కాపు సామాజిక వర్గం కాదన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులకు కూటమి టికెట్ కేటాయించలేదని, ఈ నేపథ్యంలో గిద్దలూరు సీటును జనసేనకు కేటాయించాల్సిందేనన్నారు. ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాల్సిందే అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కాపు సంఘం నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి మనసు మార్చుకుని గిద్దలూరు టికెట్‌ను జనసేనకు కేటాయించకపోతే కాపులు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జి.వెంకటేశ్వర్లు(కొండపి), బి.బ్రహ్మయ్య(అద్దంకి), ఆర్.శ్రీనివాసరావు(పర్చూరు) తదితరులు పాల్గొన్నారు. -
దిక్కుతోచని ‘కూటమి’!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. తొలుత రాఘవరెడ్డి పేరు.. టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డం పడింది. దాంతో రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్ట్ చేయగా తీహార్ జైలులో కొంతకాలం రిమాండ్‌లో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమానంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే. మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్ స్కాం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే. ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి టీడీపీ, ఎన్డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలుకల చందంగా ఉంటే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. -
భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా
తన భార్యకు సీటవ్వలేదని ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా.. తన భార్యకు లోక్‌సభ టికెట్ నిరాకరించడంతో తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లఖింపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి తన సతీమణి, మాజీ ఎంపీ రాణీ నారాకు పార్టీ టికెట్ నిరాకరించడంతో భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఏప్రిల్ 19న ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఈమేరకు ఆదివారం సాయంత్రం భరత్ చంద్ర నారా తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. భరత్ చంద్ర నారా రాజీనామాను అస్సాం సీఎల్పీ నాయకుడు దేబబ్రత సైకియా ధ్రువీకరించారు. అంతకుముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ సస్పెండ్ అయ్యారు. మిగిలిన శాసనసభ్యులు శశికాంత దాస్, సిద్ధిక్ అహ్మద్, కమలాఖ్య డే పుర్కాయస్థ, బసంత దాస్‌లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో బీజేపీ 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగలిగింది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను నిలుపుకొంది. ఏఐయూడీఎఫ్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. Assam Congress MLA Bharat Chandra Narah tenders his resignation from the party. pic.twitter.com/3aauZNQFYm — ANI (@ANI) March 25, 2024 -
వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం!
రంగుల పండుగ హోలీకి ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ ఎన్నికల వేడిని మరింత పెంచింది. యూపీలోని పిలిభిత్ స్థానం ఎవరికి కేటాయిస్తారన్న చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. పిలిభిత్ స్థానం వరుణ్ గాంధీకి కేటాయిస్తారా లేదా అనే దానిపై ఇన్నాళ్లూ పలు ఊహాగానాలు కొనసాగాయి. వాటికి ఇప్పుడు తెరపడింది. వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే వరుణ్ గాంధీ చాలా కాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. అయితే ఇటీవల ఆయన పార్టీ విషయంలో కాస్త మెత్తబడ్డారు. దీంతో వరుణ్‌కు టికెట్ ఇస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ తొలి జాబితా విడుదలైన తర్వాత పిలిభిత్ నుంచి పోటీ చేసేది వీరేనంటూ పలువురు పోటీదారుల పేర్లు చర్చకు వచ్చాయి. వారిలో ఒకరే జితిన్ ప్రసాద్. ఆదివారం రాత్రి వెలువడిన బీజేపీ జాబితాలో జితిన్ ప్రసాద్ పేరు కనిపించింది. దీంతో జిల్లాలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. జితిన్ ప్రసాద్ ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన పిలిభిత్, లఖింపూర్, సీతాపూర్ తదితర జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. జితిన్ ప్రసాద్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్ నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో జితిన్ కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. -
ఏపీలో ‘పార్టీ’ లేదా పుష్పా?
సాక్షి, అమరావతి : ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని దానికోసమే అహరహం శ్రమిస్తున్న అసలు సిసలైన బీజేపీ నేతలకు ఊహించినట్లుగానే షాక్ తగిలింది. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ సీట్లలో ఒక్క నరసాపురం మినహా మిగిలిన అరకు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, రాజంపేట, తిరుపతి స్థానాలను వలస పక్షులే దక్కించుకున్నాయి. దీంతో బీజేపీకి అసలైన పార్టీ అభ్యర్థులే కరువయ్యారా అన్న అంశం ఇప్పుడు కరడుగట్టిన కమలనాథుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. 2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చవిచూసిన తర్వాత చంద్రబాబు డైరెక్షన్లో హుటాహుటిన బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆయన నమ్మినబంటు సీఎం రమేశ్‌కు అనకాపల్లి ఎంపీ స్థానం కేటాయించారు. ఈయన నిజానికి వైఎస్సార్ జిల్లా వ్యక్తి. ఎక్కడో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వలస నేతను దిగుమతి చేయాల్సిన ఖర్మ ఏంటని 20–30 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న వారుప్రశ్నిస్తున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరి కూడా 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పరాజయం పాలయ్యాక బీజేపీలోకి వచ్చిన వ్యక్తే. ఈమెకు రాజమహేంద్రవరం టికెట్ దక్కింది. అలాగే, రాజంపేట టికెట్ దక్కిన మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈమధ్యే బీజేపీలో చేరారు. అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత అయితే గతంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత ఆమె జనజాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుని అనంతరం దానిని బీజేపీలో విలీనం చేశారు. ఇక గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అయితే బీజేపీ కండువా కప్పుకున్న రోజే పార్టీ ఆయనకు తిరుపతి టికెట్ కేటాయించింది. ఇలా.. ఒక్క నరసాపురం అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మినహా మిగిలిన అందరూ వలస నేతలకే టికెట్లు దక్కాయి. ఎక్కువగా తన మనుషులకే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పొత్తులున్నా.. లేకున్నా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసేందుకు రెండు మూడేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి వంటి బీజేపీ సీనియర్లు ఎంపీ అభ్యర్థుల జాబితా చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక నిన్నటివరకూ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని తిరుపతి జిల్లా గూడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఒక్కసారిగా తిరుపతి లోక్‌సభ సీటు దక్కడం వారిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాక పార్టీలో ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బాబు, పవన్ చుట్టూ వరప్రసాద్ చక్కర్లు.. వాస్తవానికి.. వరప్రసాద్‌కు ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. 20 రోజుల క్రితం బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరక ముందు తిరుపతి లోకసభ సీటును జనసేనకు కేటాయించాలని భావిస్తున్న సమయంలో చంద్రబాబు సూచన మేరకు వరప్రసాద్ నెలరోజుల క్రితమే మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌ను కలిశారు. ఆ తర్వాత.. పొత్తులో బీజేపీ కూడా చేరడంతో తిరుపతి లోకసభ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. దీంతో చంద్రబాబు డైరెక్షన్లోనే వరప్రసాద్ మళ్లీ బీజేపీ చుట్టూ తిరగడం మొదలుపెట్టినట్లు కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐదారు రోజులుగా ఢిల్లీలో వరప్రసాద్‌ను వెంటబెట్టుకుని కొందరు జాతీయ పెద్దల వద్ద లాబీయింగ్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె ప్రతిపాదన మేరకే బీజేపీ జాతీయ నాయకత్వం వరప్రసాద్‌కు బీజేపీలో చేరక మునుపే తిరుపతి లోకసభ సీటు కేటాయించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో చేరేందుకు బద్వేలు అభ్యర్థి ‘నో’.. మరోవైపు.. పొత్తులో బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో బద్వేలు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ స్థానంలో బీజేపీకి సరైన అభ్యర్థి కూడా లేనందున ఆ సీటును బలవంతంగా బీజేపీకి అంటగట్టారని మొదటి నుంచి పార్టీలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆ సీటులో బీజేపీ తరఫున పోటీచేసేందుకు పురందేశ్వరి ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించారని.. ఆ ముగ్గురూ ఇప్పటిదాకా పార్టీలో చేరని వారేనని వారంటున్నారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరైన రోశన్న పేరుకు ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో రోశన్నను బీజేపీలో చేర్చేందుకు పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లా నాయకులు ఆదివారం ప్రయత్నించగా, ఆయన అందుకు విముఖత చూపారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సీటు వ్యవహారాన్ని కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారు. సీనియర్ల ఆగ్రహావేశాలు.. ఇదిలా ఉంటే.. పొత్తు ఉన్నా, లేకపోయినా పార్టీ తరఫున పోటీచేసేందుకు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న చాలామంది ఆసక్తి వ్యక్తంచేశారని.. అలాంటప్పుడు పార్టీకి మంచి అభ్యర్థులున్న నియోజకవర్గాలే కేటాయించాలని పట్టుబట్టి ఉండొచ్చు కదా అని పలువురు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు ఇస్తామన్న నియోజకవర్గాలను ఒప్పుకుని, ఇప్పుడా స్థానాల్లో పార్టీ సభ్యత్వంలేని వారికి సీట్లు కేటాయిస్తే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకుల పరిస్థితి, పార్టీ పరువు ఏం కావాలని పార్టీ హార్డ్‌కోర్ సీనియర్లు రగిలిపోతున్నారు. -
ఎల్లో కల్లోలం
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ... సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం... టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్ నేత భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంతో అక్కడి ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అభ్యర్థులకు గడ్డు పరిస్థితి నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్ చాంద్‌బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రమేష్‌కుమార్‌రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. శ్రీకాకుళం ఆగని ఆందోళనలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు. మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
టీడీపీలో ఆరని మంటలు
సాక్షి నెట్వర్క్: టీడీపీలో టికెట్ల లొల్లి చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడినవారు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని డబ్బు మూటలతో వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే జరిగితే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని పార్టీకి హెచ్చరికలు పంపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ జిల్లా నాయకులు కోరుతున్నారు.సంవత్సరాల తరబడి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గారపాటిని కాదని స్థానికేతరుడైన పుట్టాను ఖరారు చేయడం అన్యాయమని ఆ పార్టీ నేతలు ఏలూరు జిల్లా భీమడోలులో వాపోయారు. మరోవైపు ఇదే పార్లమెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. సింగపూర్‌లో ఉన్నతస్థితిలో ఉన్న తనను ఏలూరు టికెట్ ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారని నిలదీశారు. తనతో కోట్లు ఖర్చు చేయించారని, చివరికి మొండిచేయి చూపారని వీడియో విడుదల చేశారు.ఆదివారం కామవరపుకోటలో ఏర్పాటు చేయబోయే ఆత్మీయ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు. శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి మంటలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి మామిడి గోవిందరావుపై దుమ్మెత్తిపోశారు. అవసరమైతనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సానా సతీష్ కు చుక్కెదురైంది. జనసేన నుంచి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఈ సీటు ఖరారు చేయడంతో టిక్కెట్టు ఆశించిన సతీష్ వర్గీయులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పైలా ప్రసాదరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంపై మాడుగుల మండలం కె.జె.పురంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గవిరెడ్డి అనుచరులు దేవరాపల్లిలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ప్రతిసారీ మోసం: దేవినేని స్మిత టీడీపీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత ఆరోపించారు. పెనమలూరు టికెట్ తమకెందుకు ఇవ్వలేదని, తమ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అధిష్టానాన్ని ఆమె నిలదీశారు. ఆడవాళ్లమైనా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేస్తే లాబీయింగ్ చేసుకున్న బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ముందు బోడెకు ఇవ్వబోమని ప్రకటించిన చంద్రబాబు తర్వాత ఎందుకు మొత్తబడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గారో ఆయన చెప్పాలని నిలదీశారు. తమకు టికెట్ కేటాయిస్తేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలను, నమ్మి పదవి కట్టబెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, పార్టీ మారి టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పులిపాక ప్రకాష్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తాను వసంతను ఓడించడానికే పని చేస్తానని స్పష్టం చేశారు. -
జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్
జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వర్గ రాజకీయాలకు ఆజ్యం దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో మొండిచేయి ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దామచర్ల తీరుతో మనస్తాపం... ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్‌ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మా కార్యకర్తలతో సమావేశమా... అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
కాళ్లు మొక్కినా.. ఆత్మభిమానం తాకట్టు పెట్టినా!
రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు.. ఐదేళ్లు మంత్రి పదవి, ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్.. ఇదీ గుమ్మనూరు జయరాంకు వైఎస్సార్సీపీ ఇచ్చిన ప్రాధాన్యత. బోయ సామాజిక వర్గం కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని.. రాజకీయంగానూ ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇదే సమయంలో జిల్లాలో మరికొందరికి కూడా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది. అలాంటి పార్టీని గుమ్మనూరు జయరాం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పంచన చేరి ఏకంగా కాళ్లు మొక్కడం ద్వారా, బోయల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. టిక్కెట్ విషయానికొచ్చే సరికి చంద్రబాబు అసలు నైజం బయటపడింది. గుమ్మనూరు కోరుకున్న గుంతకల్లు విషయంలో మూడో విడత జాబితాలోనూ చోటు దక్కకపోవడం, కనీసం ఆలూరునైనా ఇస్తారనుకుంటే ఇప్పటికే మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం టీడీపీ ప్రకటించింది. అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు. టీడీపీలో చేరికకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసే సమయంలో గుంతకల్లు టిక్కెట్ తనకు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో జయరాం వెల్లడించారు. మంత్రిగా ఉండి పారీ్టలో చేరడంతో గుంతకల్లు టిక్కెట్ వస్తుందనే భావనలోనే అంతా ఉన్నారు. అయితే గుంతకల్లు అభ్యరి్థని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో జయరాంకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా గుంతకల్లు టీడీపీ నేతలు స్థానికేతరుడిని తమపై రుద్దడం ఏంటని, జిల్లాలో ఎప్పుడూ లేని సంప్రదాయం తీసుకొస్తున్నారని వాపోయారు. గుంతకల్లు, గుత్తి, పామిడి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకు మద్దతు లభించలేదని సమాచారం. పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు జితేంద్రగౌడ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాయదుర్గం అభ్యరి్థగా కాల్వ పోటీ చేయబోతున్నారు. గుంతకల్లులో జయరాంకు టిక్కెట్ ఇస్తే వాలీ్మకుల్లో మరో పవర్ సెంటర్‌గా, తనకు ప్రత్యామ్నాయంగా జయరాం ఉండొచ్చనే ఆలోచనతో కాల్వ పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జయరాంను వ్యతిరేకిస్తూ జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గుంతకల్లు టిక్కెట్ ఇస్తే రూ.50కోట్ల వరకూ పెట్టుకుంటానని గుమ్మనూరు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ‘డబ్బు మూటల’ బరువు పెరిగి తనకు టిక్కెట్ వస్తుందనే ఆశతోనే జయరాం ఉన్నారు. ఇప్పటికైతే జయరాం అభ్యరి్థత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆలూరు టిక్కెట్‌పైనే ఆశలు గుంతకల్లు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయనే భావనలో జయరాం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆలూరు టిక్కెట్ తనకు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకు కోట్ల సుజాతమ్మ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ విషయంలో తనకు సహకరిస్తే, ఆ ‘రుణం’ తీర్చుకుంటానని జయరాం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రాలయం టిక్కెట్ వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకు ఇవ్వడంతో మరో టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే జయరాం మాత్రం గుంతకల్లు, ఆలూరులో ఏదో ఒక టిక్కెట్ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదనే ఆవేదనలో ఉండటం గమనార్హం. ఎరక్కపోయి వచ్చి.. చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాంకు చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉండి, టిక్కెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేనపుడు రేపు అధికారంలోకి వస్తే తనకేం న్యాయం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పైగా తాను టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రాలేదని, ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతోనే వచ్చానని, గుంతకల్లు టిక్కెట్ తనకు, ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టిక్కెట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్యనేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్‌రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తి జ్వాలలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
-
ఆందోళనలతో ‘కూటమి’ కుతకుత
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్/డోన్/కాళ్ల/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/వెంకటగిరి రూరల్ (తిరుపతి జిల్లా)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా)/దేవరపల్లి: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబును ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి విలేకరుల సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరసరావుపేట మండలం పాలపాడులోని తన స్వగ్రహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరవిందబాబుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇంకా పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తి, మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇప్పించేందుకు ఆయన పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ద్రోహి శ్రీకృష్ణదేవరాయలు అని మండిపడ్డారు. అనంతరం పక్కనే ఉన్న పురుగుమందు డబ్బాను అందుకుని తాగారు. కార్యకర్తలు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇదంతా చదలవాడ ఆడిస్తున్న డ్రామా అని ప్రత్యర్థివర్గాలు ఆరోపిస్తున్నాయి. కేఈ, కోట్లది చీకటి ఒప్పందం కేఈ, కోట్ల కుటుంబాలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని తాము మాత్రమే డోన్ రాజకీయాలను శాసించాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే తాను పార్టీని బతికించానని, రెండున్నరేళ్ల క్రితమే తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మోసం చేసింది : శివరామరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో బుధవారం జైన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తే తనను అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్ విమర్శించారు. తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలోని తనచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోసం సేవ చేస్తే చివరకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మస్తాన్ యాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్దిపాటిని మార్చకుంటే బరిలోకి రెబల్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజును మార్చకుంటే పార్టీలో తిరుగుబాటు తప్పదని కార్యకర్తలు హెచ్చరించారు. బుధవారం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్ హాల్లో మద్దిపాటి వ్యతిరేకవర్గం సమావేశమైంది. మద్దిపాటిని మార్చకుంటే రెబల్ అభ్యర్థిని బరిలో దింపుతామని అలి్టమేటం జారీ చేశారు. బొజ్జలకు మద్దతు లేదు బొజ్జల సుదీర్‌రెడ్డికి తాము మద్దతివ్వలేదని మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య స్పష్టం చేశారు. ఎస్సీవీ నాయుడు స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సు«దీర్‌రెడ్డి తమను కలిశారని, అయితే మద్దతిస్తున్నట్టు ఆయనకు తాము చెప్పలేదని పేర్కొన్నారు. తానూ చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే టికెట్ కోరతానని స్పష్టం చేశారు. బలిచ్చే మేకపోతు మాకొద్దు విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో సాధిక్ కార్యాలయం వద్ద వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్ వర్గీయులు బుధవారం బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. దీంతో సాధిక్, వీరమహిళలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ‘‘బలిచ్చే మేకపోతు మాకొద్దు’’ అంటూ ఓ మేకను తీసుకొచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. -
లాలూతో పప్పు యాదవ్ భేటీ.. మాధేపురా సీటుకు వినతి!
బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్‌పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్‌ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్‌ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. -
వరుణ్‌కు టిక్కెట్ ప్లాన్ చేసిన అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూపీలోని పిలిభిత్ స్థానానికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుణ్‌గాంధీని బరిలోకి దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడి టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ మార్చి 28. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఏప్రిల్ 30. ఎన్నికల తేదీ ఏప్రిల్ 19. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
AP,TG: చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్‌ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్‌భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్భాషాకి టికెట్ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్‌తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
దర్శి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
దర్శి: టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గోరంట్ల రవికుమార్‌కు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, వివిధ హోదాల్లోని నాయకులతో ఆ పార్టీ కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దర్శి మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, ముండ్లమూరు మాజీ ఎంపీపీ వెంకట్రావు, కురిచేడు మండల మాజీ అధ్యక్షుడు నాగరాజు, దొనకొండ మండల అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఎవరినడిగి రవికుమార్‌ను ఇన్చార్జిగా రవికుమార్‌కు ఇచ్చారంటూ అధిష్టానంపై మండిపడ్డారు. అధిష్టానానికి అనుకూలంగా ఉండే రియల్టర్లు, డబ్బున్న వాళ్లను తెచ్చుకుంటున్నారని, వాళ్లు ఇక్కడ ఓడిపోగానే వెళ్లిపోతున్నారని, దీంతో ఇక్కడ పార్టీకి దిక్కు లేకుండాపోతోందన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లందరికీ దర్శి కనబడుతుందని, బయట నుంచి వచ్ఛిన మన్నెం వెంకటరమణ, కదిరి బాబూరావు, శిద్ధా రాఘవరావు, పమిడి రమేష్, వేమా సుబ్బారావు వంటివారు ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయారని, అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వవద్దని కోరారు. స్థానికులు కాకపోవడం వల్ల ఓడిన వెంటనే వెళ్లిపోయి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక రాజీనామాలకు సిద్ధం దర్శి సీటును జనసేనకు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదని.. ఇక్కడ నివాసం ఉండే వారికే టికెట్ వ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, మండల టీడీపీ అధ్యక్షులు, అన్ని హోదాల్లో ఉన్న నాయకులు రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ లేకపోయినా పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం బాధాకరమన్నారు. మూడేళ్లుగా టీడీపీకి నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం, స్థానిక నాయకులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. దీంతో సమావేశం ఆద్యంతం రసాభాసగా మారింది. గతంలో ఇన్చార్జిలను ప్రకటించినప్పుడు ఏం చేశారని రవికుమార్‌కు మద్దతుగా కొందరు మాట్లాడారు. దీంతో పారీ్టలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. -
టీడీపీలో ఎగసిన ఆగ్రహ జ్వాలలు
పొత్తుల వ్యవహారం పలు జిల్లాల్లో చిచ్చురేపింది. ఇప్పటికే జనసేన పొత్తు ఖరారు కాగా.. తాజాగా బీజేపీ కూడా చేతులు కలపడం.. సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల శనివారం తమ అనుచరులతో నిరసన గళాలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతుంటే తమ ఆశలను నట్టేటా ముంచారని అధినేతపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పలు చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. యలమంచిలి రూరల్/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, పుట్టపర్తి/పాడేరు: పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జనసేనకు టికెట్ కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు తీవ్ర అన్యాయం చేశారని పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రగడ నాగేశ్వర్రావుకు మొండిచెయ్యి చూí³స్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సీనియర్లతోపాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. పోలవరంలో పొత్తు రగడ ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తు రగడ తారస్థాయికి చేరింది. టికెట్ జనసేనకు కేటాయించామని టీడీపీ నేతలకు పార్టీ స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం తెలుగుదేశం పార్టీలో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఏళ్ల తరబడి నుంచి టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించవద్దంటూ జిల్లా అధ్యక్షుడు మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ విన్నవించారు. కట్ చేస్తే.. ఈ సీటు జనసేనకు కేటాయించి.. పొత్తు ధర్మం పాటించండి అంటూ చంద్రబాబునాయుడు నుంచి ఫోన్ రావడంపై బొరగం శ్రీనివాస్ వర్గం మండిపడుతోంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ నేతృత్వంలో బుట్టాయగూడెంలో ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సీటు ఇవ్వకపోతే సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయోమయంలో టీడీపీ శ్రేణులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని సీటు వరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సారీ జనసేనకో, బీజేపీకో కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్‌నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ‘శంఖారావం’ను పట్టించుకోని నేతలు నారా లోకేశ్ చేపట్టిన శంఖారావ సభలు ‘శంకా’రావాలుగా మారిపోతున్నాయి. పుట్టపర్తి జిల్లాలో శంఖారావ సభలకు శుక్రవారం వచ్చిన లోకేశ్ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తారని స్థానిక టీడీపీ నేతలు భావించారు. కానీ ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఫలితంగా ధర్మవరం టికెట్ ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్, కదిరిపై ఆశలు పెట్టుకున్న వెంకటప్రసాద్, పుట్టపర్తి టికెట్ కోరుతున్న పల్లె రఘునాథరెడ్డి అలకబూనారని తెలిసింది. బీజేపీతో పొత్తులో భాగంగా హిందూపురం పార్లమెంటులో ఏ సీటు ఇస్తారనే దానిపై టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. లోకేశ్ శంఖారావం సభలను కీలక నేతలు పట్టించుకోలేదు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, పెనుకొండలో బీకే పార్థసారథి వర్గాలు లోకేశ్ సభలకు గైర్హాజరయ్యాయి. నాయకులు పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి లేకుండా ఫ్లెక్సీలు, పేపరు ప్రకటనలు రావడం గమనార్హం. పల్లెకు టికెట్ వద్దని కొందరు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది. -
బండారు కథ కంచికి!
పెందుర్తి (విశాఖ జిల్లా): బండారు సత్య నారాయణమూర్తి... 40 ఏళ్ల రాజకీయానుభవం. ఐదుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి.. కానీ ఏం లాభం. చంద్రబాబు ఛీ పొమ్మన్నారు. టికెట్ లేదనేశారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో బండారు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. బీసీలపై చంద్రబాబు చూపించే కపట ప్రేమకు బండారు ఉదంతమే తాజా ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికార పక్షంపై, మహిళా మంత్రి రోజాపై బండారు నోరు పారేసుకుని అభాసుపాలయ్యారు. పార్టీ కోసం చేతి చమురు వదిలించుకున్నారు. అయినా వాడుకుని వదిలేసే చంద్రబాబు చివరకు అదే చేశారు. తన అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, వియ్యంకుడైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుల సిఫార్సులు కూడా బండారును గట్టెక్కించలేక పోయాయి. దీంతో టికెట్ రేసు నుంచి తప్పుకుని పత్తాలేకుండా పోయారు. రెండు వారాలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు. ముఖ్యమైన ఏ సమావేశంలోనూ కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ–జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా, జయహో బీసీ సభలకు కూడా దూరంగా ఉండడంతో కేడర్‌కు ఏమీ పాలుపోవడంలేదు. ఒక్కసారిగా సీన్ రివర్స్ పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకోవడంతో గత కొన్నాళ్లుగా ‘టికెట్ మాదంటే మాది’ అంటూ జనసేన, టీడీపీలు ప్రచారం చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ చరమాంకంలో ఉన్న టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గంపెడాసలు పెట్టుకున్నారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు. ‘తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆఖరి కదా.. చంద్రబాబు కూడా అవకాశం ఇస్తారు’ అన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ వేదికలపై అధికార పక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో టికెట్ బండారుదేనని టీడీపీ కేడర్ కూడా ధీమాగా ఉంది. అయితే పెందుర్తి టికెట్ కోసం పంచకర్ల రమేష్‌బాబు పట్టుపట్టడం, సీట్ల పంపకాల్లో కచ్చితంగా పెందుర్తిని జనసేనకే కేటాయిస్తారని బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచకర్ల కూడా నియోజకవర్గంలో జోరు పెంచడంతో అవమానభారంతో కేడర్‌కు బండారు మొహం చూపించట్లేదు. వరుస ఓటములతో అవమానం ఒకప్పుడు రాజకీయంగా వైభవం చూసిన బండారులో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత మరింత జోష్ కనిపించింది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో లెక్కలేని అవినీతి.. కొడుకు అప్పలనాయుడు వ్యవహారశైలి కారణంగా సత్యనారాయణమూర్తి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామం వెన్నెలపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన భార్య మాధవీలత సహా పంచాయతీలో పది వార్డుల్లోనూ బండారు అనుచరులు చిత్తుగా ఓడిపోయారు. దెబ్బ మీద దెబ్బ.. చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెన్నెలపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ప్రజాతీర్పును గౌరవించని బండారు ఆ తరువాత పూర్తిగా అదుపు తప్పారు. వరుస ఓటముల అవమానభారంతో అధికార పార్టీపై నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా అని బయటకు ప్రచారం చేసుకుంటున్నా.. జనంలో పూర్తిగా గుర్తింపు కోల్పోయారన్న కారణంతోనే బండారును చంద్రబాబు పక్కన పెట్టారని టీడీపీ నాయకులే అంటున్నారు. -
నమ్మించి ముంచేశారు
సాక్షి, గుత్తి/పెద్దతిప్పసముద్రం/నిడదవోలు/పిఠాపురం/నెల్లూరు: నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్న చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇంతవరకు పార్టీని అంటిపెట్టుకున్న తాము అంటరానివారైపోయామని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నేతల అనుచరవర్గాలు దీన్ని జీర్ణించుకోలేక రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గుమ్మనూరుకు సీటిస్తే ఓడిస్తాం మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టీడీపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు గుత్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా నుంచి గాందీ, రాయల్, ఎన్టీఆర్ సర్కిళ్ల వరకు ర్యాలీ చేశారు. ‘గుమ్మనూరు వద్దు, జితేందర్ గౌడ్ ముద్దు’, ‘ఆలూరులో పనికి రాని చెత్త గుంతకల్లులో పనికి వస్తుందా’, ‘పేకాట, మద్యం గుమ్మనూరు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ... గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే సీటు ఇస్తే డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడిస్తామన్నారు. రౌడీ భావజాలమున్న గుమ్మనూరుకు సీటు ఇస్తే ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 35 సంవత్సరాల పాటు జితేందర్ గౌడ్ కుటుంబం టీడీపీకి సేవలు చేసిందని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి పేకాట నిర్వాహకుడు గుమ్మనూరుకు ఎలా సీటు కేటాయిస్తారని ప్ర శ్నించారు. టి.సదుంలో ఉద్రిక్తత అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో విభేధాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కే అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైందని అనుకుంటున్న సమయంలో రాజకీయ అరంగేట్రానికి తెర లేపిన జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై పునరాలోచించి ప్రజాదరణ ఉన్న శంకర్‌కు టికెట్ కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఇటీవల రోడ్లెక్కి నిరసనలకు దిగారు. తాజాగా గురువారం టి.సదుంలో జయచంద్రారెడ్డి ఇంటింటా ప్రచారానికి రావడంతో ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి జయచంద్రారెడ్డి కారు అద్దాలను పగులగొట్టాడు. దీంతో కొంతసేపు గ్రామంలో ఘర్షణ నెలకొంది. ఎస్ఐ రవీంద్రబాబు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జయచంద్రారెడ్డి నిరాకరించారు. ఆయన వెంట ప్రచారం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆలయంలో పూజలు నిర్వహించి వెనుదిరిగారు. నిడదవోలులో ఆందోళన పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు నిడదవోలు టికెట్ కేటాయిస్తున్నారనే ప్రచారంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిడదవోలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిడదవోలు పట్టణం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా ప్లకార్డులతో పాదయాత్ర చేపట్టారు. గణేష్ చౌక్ సెంటర్, గణపతి సెంటర్ మీదుగా యర్నగూడెం రోడ్డులోని టీడీపీ పట్టణ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్థిల్లాలి, శేషారావు జిందాబాద్, నిడదవోలు గడ్డ – శేషారావు అడ్డా అంటూ నినదించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, నిడదవోలు టికెట్ శేషారావుకు కాకుండా బయటి వ్యక్తులకు ఎవరికిచ్చినా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కారింకి సాయిబాబు, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల టీడీపీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అతికాల శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. పిఠాపురంలో అసమ్మతి సమావేశం చంద్రబాబుకే క్లారిటీ లేదు.. ఇంక మా భవిష్యత్తుకేం గ్యారెంటీ ఇస్తాడు’ అంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ లేఖలను తగులబెట్టారు. తనకు టికెట్ నిరాకరించి, జనసేనకు కేటాయిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మకు సమాచారం అందడంతో.. టీడీపీ వర్గాలు గురువారం పిఠాపురంలో ఆందోళనకు దిగాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో వర్మకు టికెట్ నిరాకరించడంతో టీడీపీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలను సైతం పట్టుకునేది లేదని చెప్పారు. రాజీనామాలకు సంతకాలు సేకరించారు. వర్మ మాట్లాడుతూ ‘నేనేమన్నా నేరం చేశానా? నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేసిన సేవను గుర్తించి చంద్రబాబు తనకే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, పిఠాపురం వర్మ అడ్డా అని, దానిని వేరేవారికి కేటాయించడానికి ఎవరికీ హక్కు లేదని వ్యాఖ్యానించారు. కోవూరులో పోలంరెడ్డి కుటుంబం కుతకుత కోవూరు టికెట్ విషయంలో రెండు దశాబ్దాల కాలంగా టీడీపీని నమ్ముకున్న పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యండిచ్చారు. ఇటీవలే పార్టీ ఫిరాయించిన వేమిరెడ్డి కుటుంబానికి కోవూరు సీటు ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పోలంరెడ్డి వర్గం మండిపడుతోంది. నిన్నటి వరకు సీటు తనదేనంటూ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలారు. ఇటీవల పార్టీ అధినేత పర్యటనల సమయంలో చేతిచమురు కూడా వదిలించుకుంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కోవూరు సీటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖరారు చేస్తున్నట్లు లీకులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. మూడు సార్లు టీడీపీ తరుపున పోటీచేసి రెండుసార్లు విజయం సాధించారు. పోలంరెడ్డికి అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం తన రాజకీయ వారసుడిగా తనయుడు దినేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధిష్టానం కూడా దినేష్ రెడ్డిని ప్రోత్సహించింది. ఈ క్రమంలో సీటు విషయంలో చంద్రబాబు పేచీ పెట్టడంతో దినేష్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్థంలో పడింది. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంటూ పార్టీ ఫిరాయించిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కోవూరు సీటు ఖరారు చేస్తుండడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అందలం ఎక్కించడం వెనుక కేవలం డబ్బుమూటలే పనిచేస్తున్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. -
సీనియర్లు.. ఎదురు‘తన్నులు’
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు. చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు. చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. లాబీయింగ్ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా ! మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. యరపతినేనికి ఎసరే! ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు. ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు. -
బాబు లీల.. కేడర్ గోల
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కేడర్‌కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్‌ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
సీటివ్వకపోతే చచ్చిపోతా..!
తాడేపల్లిగూడెం/తణుకు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఏలూరు(టూటౌన్)/గోకవరం: పదేళ్లపాటు టికెట్ ఇస్తానని నమ్మబలికి ఇప్పుడు తణుకు టికెట్‌ను పొత్తులో టీడీపీకి కేటాయించడం న్యాయం కాదని, తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు హెచ్చరించారు. టికెట్ కేటాయింపుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ఆయన సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్‌తోపాటు ఇతర నాయకులు చేపట్టిన బుజ్జగింపులు ఫలించలేదు. తనకు సీటు కేటాయించకపోవడంపై సోమవారం రాత్రి మనోహర్‌ను ప్రశ్నించేందుకు ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌కు నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన విడివాడను మనోహర్ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విడివాడ తణుకు వెళ్లిపోయారు. తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. తణుకు టికెట్‌ను పవన్ గతంలో హామీ ఇచ్చిన విధంగా విడివాడ రామచంద్రరావుకు కాకుండా టీడీపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో రగిలిపోతున్న జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్లో ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన జనసేన, టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ క్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కన్వినర్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌ని ముట్టడించారు. మనోహర్ బయటికి రావాలని, విడివాడకు న్యాయం చేయాలంటూ నినాదాలిచ్చారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోపల ఉన్న మనోహర్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రగిలిపోయిన శ్రేణులు తోపులాటకు దిగాయి. ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు. ఈ క్రమంలో సహనం నశించిన కార్యకర్తలు గెస్ట్‌హౌస్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడానికి యత్నించారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీను, కొటికలపూడి గోవిందరావు తదితరులు ప్రయత్నించినా ఎవ్వరూ లెక్కచేయలేదు. ఈ సందర్భంగా విడివాడ మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ పంచాయితీని తణుకులోనే తేల్చుకుంటామని తన అనుచరులతో కలసి వెనుదిరిగారు. అనంతరం మనోహర్ సూచనలతో జిల్లా నాయకులు తణుకు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడివాడ గెస్ట్ హౌస్‌కు తీసుకొచ్చారు. పదేళ్లపాటు జనసేన టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి టికెట్ల పంపకాల్లో మొండిచేయి చూపడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ప్లెక్సీలను చించేస్తూ జనసేన అధినేత పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు నన్ను కాదని మరో వ్యక్తికి తణుకు టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన విడివాడ మండపాక గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన నాయకుడిని పక్కన పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తే సహకరిస్తామని, అంతే తప్ప తెలుగుదేశం జెండా మోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేన పార్టీకి సంబంధం లేని వారిని టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తనతో పాటు తిప్పుకోవడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. మరోవైపు నెల్లూరులో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్ సీటు ఇస్తారని ఆశ పెట్టుకున్న మనుక్రాంత్‌రెడ్డికి పవన్ కళ్యాణ్ పెద్ద షాకిచ్చారు. పవన్‌కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని టికెట్ వస్తుందని ఆశిస్తే అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సోమవారం నెల్లూరులోని మినీబైపాస్‌లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు మాయలోపడి పవన్ మోసపోయాడని వారు మండిపడ్డారు. టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నిరసన సమయంలో మనుక్రాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. రెడ్డి అప్పలనాయుడు కన్నీటిపర్యంతం పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీనిపై జనసేన, టీడీపీ నేతలు వపన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటును జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మాకు న్యాయం చేయాలి’, ‘రెడ్డి అప్పలనాయుడుకు సీటు ఇవ్వాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవసరమైతే జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు రెబల్‌గా పోటీలో నిలవాలంటూ నినదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్‌ను టీడీపీకి కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి లోనయ్యారన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి అత్యధికంగా బలం ఉన్న నియోజకవర్గం ఏలూరు అని సర్వేలో మొదటి స్థానం వచ్చిన ఏలూరు సీటుపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందించని పక్షంలో ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. గత ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమించిన రెడ్డి అప్పలనాయుడుకు పొత్తుల పేరుతో మొండిచేయి చూపడాన్ని పార్టీ కార్యకర్తలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల సమావేశం నుంచి లోపలికి వెళుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని చూసిన జనసైనికులు పెద్దగా నినాదాలు చేశారు. కార్యాలయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఫ్లెక్సీల్లోని చంద్రబాబు ఫొటోలను చించేశారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించి, తనకు అన్యాయం చేయడంపై జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరం మండలంలోని అచ్యుతాపురం కనకదుర్గమ్మ ఆలయం వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షా శిబిరాన్ని సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులను పరామర్శించారు. -
సమన్వయం లేనిచోటే సమన్వయ సభ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు. కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్–2 కోఆర్డినేటర్ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్చార్జి మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న మాటల యుద్ధం తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్‌ను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. -
గ్రూపులతో గుంజాటన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే. విజయనగరంలో మూడు ముక్కలాట... విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్‌కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు. బేబినాయనకు కేడర్ సమస్య బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్‌కృష్ణ రంగారావు సీన్లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది. కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్‌కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు. కోళ్లకు కృష్ణ సెగ శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్‌ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో అంతా అయోమయం నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్‌కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు. నిమ్మకకు పెరిగిన అసమ్మతి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’ గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. గంటా పేరుతో గందరగోళం చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు. కురుపాంలో కుమ్ములాట... కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్‌కుమార్ దేవ్ తనయుడు వీరేశ్‌దేవ్ కూడా టికెట్‌కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సాలూరులో ఆగని వర్గపోరు... సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్‌దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
హే..‘కృష్ణా’ .. ఇదేమి తంటా ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా హఠాత్తుగా దిగిపడుతున్న పారాచూట్ నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తుండటం టీడీపీలో తమ్ముళ్లను కకావికలం చేస్తోంది. జనసేన పొత్తుతోపాటు, బీజేపీతో కూడా ఖాయం అనుకుంటున్న పొత్తు టీడీపీ నేతల టికెట్ అవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సీనియర్ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొండి చెయ్యి మిగలనుందని స్పష్టం అవుతోంది. దీంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అన్న స్పష్టత లేక టీడీపీ తమ్ముళ్లు మరింత గందరగోళానికి గురవుతున్నారు. బొండా ఉమాకు సీటు గండం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేదని భావిస్తున్న బొండా ఉమాకు గడ్డుకాలం మొదలైంది. బీజేపీ పొత్తు రూపంలో ఆయనకు గండం పొంచి ఉంది. దీనికితోడు వంగవీటి రాధా సైతం తనకే సీటు కావాలని పట్టు పడుతుండటంతో విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరన్నది తేలక నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే బొండా టికెట్ గల్లంతు కావడం ఖాయం. తిరువూరు తెరపైకి రోజుకో అభ్యర్థి... తిరువూరు నియోజకవర్గంలో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్చార్జిగా శావల దేవదత్తు ఉన్నారు. ఆయనను కాదని కొలికిపూడి శ్రీనివాస్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తమదే టికెట్ అని చేసుకొంటున్న ప్రచారం అక్కడ తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా టీడీపీ తరఫున టికెట్ రేసులోకి వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఇక్కడికి పారాచూట్ నేతలను తీసుకొస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది. జగ్గయ్యపేట అభ్యర్థి నేనే‘నయా’ ఇప్పటికే చంద్రబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం పర్యటనలో పార్టీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్యను ప్రకటించారు. కానీ అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ పేరుతో ‘గెలిస్తే న్యాయం చేస్తా, ఓడినా సాయం చేస్తా, మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా’ అంటూ జగ్గయ్యపేటలో వెలిసిన ఫ్లెక్సీలు అక్కడ టికెట్‌పై కొత్త చర్చకు దారితీసేలా చేశాయి. చంద్రబాబు ఇప్పటికే ఇన్చార్జిలుగా ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం తమకు బీ ఫాం ఇచ్చే వరకు టికెట్ అనుమానమే అన్న భావనను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇది క్యాడర్లో తీవ్ర గందరగోళం రేపుతోంది. సీట్లు తన్నుకు పోతున్న పారాచూట్లు... ఇప్పటికే నూజివీడులో కొలుసు పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పారాచూట్లుగా వచ్చి టికెట్లు తన్నుకుపోయారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా పారాచూట్లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో పారీ్టకోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మైలవరంలో తెరపైకి కేశినేని చిన్ని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతో పొత్తు ఆయన సీటుకు ఎసరు పెట్టనుంది. ఎంపీ సీటుపై బీజేపీ కర్చిప్ వేసింది. ఈ నేపథ్యంలో చిన్నికి ఎక్కడైనా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ను మైలవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అదే జరిగితే మైలవరంపై ఆశలు పెట్టుకున్న వసంతకు ఆశాభంగమే. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పెనమలూరు టికెట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ బోడే ప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. మరోవైపు దేవినేని ఉమా పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మైలవరంలో టికెట్ ఆయనకు లేదని తేలిపోవడంతో పెనమలూరుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ బోడే వర్గంతోపాటు, వసంత పోటీకి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కన్ను పెనమలూరుపై పడిందని సమాచారం. అదే జరిగితే బోడే ప్రసాద్, వసంత, దేవినేని ఉమా ముగ్గురి సీట్లు గల్లంతయినట్టే. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్‌తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్‌కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
‘పొత్తు’లాటతో అంతర్యుద్ధం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్‌పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్సీపీ దూసుకుపోతూ... ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో... భవిష్యత్తులో ఏం చేస్తామో... చెప్పుకోలేక... డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు... ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం... సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు. – సాక్షి నెట్వర్క్ బత్తులకు ఉత్తచెయ్యేనా... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభేదాలు బట్టబయలు శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం. పెనుకొండలో నియోజకవర్గ ఇన్చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది. వియ్యంకుల్లో ఒకరికేనట! పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల టికెట్ల కేటాయింపునకు బంధుత్వం అడ్డుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వియ్యంకులైన ఈ ఇద్దరిలో జీవీ వినుకొండ, కొమ్మాలపాటి పెదకూరపాడు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే కోరికతో వారు చంద్రబాబును ఇటీవల కలిశారట. అప్పుడు ఆయన ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చుకోండని వారిపైనే ఆ భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారట. పరోక్షంగా పెదకూరపాడులో డబ్బు దండిగా పెట్టగల భాష్యం ప్రవీణ్‌కు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పడంతో శ్రీధర్ తన వర్గీయులతో శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి తనకు అండగా నిలవాలని కోరారు. మిత్రత్వంలో శతృత్వం ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య టిక్కెట్ ఫైట్ తీవ్రంగా ఉంది. జనసేనకు టిక్కెట్ ఇస్తే కాపుకాసేది లేదని టీడీపీ నేతలు చెబుతుంటే... టీడీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకుంటే తాము సహకరించబోమని, పోటీలో కచ్చితంగా ఉంటామని జనసేన నేతలు బహిరంగంగా చెబుతున్నారు. పొత్తుల్లో ఈ స్థానం టీడీపీకి ఖరారైందని ఆ పార్టీ ఇన్చార్జి బడేటి చంటి ప్రచారం చేసుకుని ఏకంగా హోర్డింగులతో హడావుడి చేశారు. దీనికి కౌంటర్‌గా జనసేన నాయకులు ‘మేము రెడీ.. టిక్కెట్ మాదే..’ అంటూ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. అంతేనా... ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడే అంటూ అతను నిర్వహించిన ఆతీ్మయ సమావేశంలో జిల్లా జనసేన నేతలే ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగా జనసేనలో అకస్మాత్తుగా తెరపైకి మరో కొత్త నేత వచ్చి తనకే టికెట్ అంటూ నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి దారితీశారు. అనంతపురంలో అంతర్గత పోరు అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి అసమ్మతి బెడద ఎక్కువైంది. ఆయన మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ పవన్‌కల్యాణ్ పోటీచేస్తే తాను తప్పుకుని ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్ చెబుతుండగా ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా!’ అని తెలుగుదేశం పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ‘తమ్ముళ్ల’ హడావుడితో జనసైనికుల ఆగ్రహం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. కానీ దానిని పట్టించుకోకుండా అమలాపురం టీడీపీ ఇన్చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి తేలాల్సి ఉంది. కొత్తపేట, ముమ్మిడివరంలో టీడీపీ ఇన్చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. యర్రగొండపాలెంలో డిష్యుం..డిష్యుం యర్రగొండపాలెంలో టీడీపీపై అసమ్మతి బుసలు కొడుతోంది. డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలవడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం చెబుతుండగా ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయనకు టికెట్ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోమని డాక్టర్ రవీంద్ర వర్గం కరాఖండీగా చెబుతోంది. -
అందరి గురి మల్కాజిగిరి!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్‌రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్‌రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్‌రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్‌నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్‌రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్‌కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. -
ధర్మపురి అరవింద్‌కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి అరవింద్‌కు టికెట్ ఇవ్వద్దని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ‘వి వాంట్ జస్టిస్, అహంకార అరవింద్ మాకొద్దు.. అరవింద్ డౌన్ డౌన్ , అరవింద్ కీ హటావో బీజేపీ బచావో’ అంటూ మెడలో దండలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈసారి అరవింద్‌కు టికెట్ ఇస్తే ఒడిస్తాం’ అని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు -
ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్వర్క్ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్‌నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. వరదపై మల్లెల మండిపాటు ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు. సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం. ప్రవీణ్‌కు వాసు వత్తాసు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్, ప్రవీణ్ నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్చార్జి ప్రవీణ్ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘డోన్’టాక్..!
సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీన్ ! ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం. వాడీవేడిగా విమర్శలు ! మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. -
17 సీట్లు.. 306 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లో లోక్‌సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు రోజుల్లో 41 దరఖాస్తులు రాగా శుక్రవారం 100 దరఖాస్తులు, శనివారం ఏకంగా 165 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నల్లగొండ స్థానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. శనివారం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ (ఖమ్మం), చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, రేవంత్‌రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ (భువనగిరి), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు పిడమర్తి రవి (వరంగల్), టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు (మెదక్), సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం (కరీంనగర్) తదితరులున్నారు. బరిలోకి బంధుగణం.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాలకు పార్టీలోని ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఇతర ముఖ్య నేతల బంధువులు, వారి సన్నిహితులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్లో గడ్డం వంశీ, ఊట్ల వరప్రసాద్, గోమాస శ్రీనివాస్, పెరిక శ్యామ్ (పెద్దపల్లి), సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్ (వరంగల్), మల్లు రవి, ఎస్. సంపత్‌కుమార్ (నాగర్‌కర్నూల్), కుందూరు రఘువీర్, పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్, కుంభం కీర్తిరెడ్డి, చనగాని దయాకర్, పున్నా కైలాశ్‌నేత (భువనగిరి), జగ్గారెడ్డి, సోమేశ్వరరెడ్డి (మెదక్), బండ్ల గణేశ్, దిలీప్ కుమార్, హరివర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ (మహబూబాబాద్), వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, వి.వి. రాజేంద్రప్రసాద్ (ఖమ్మం) ఉన్నారు. దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 6లోగా టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై వాటిని షార్ట్‌లిస్టు చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. -
ఖమ్మం రేసులో డిప్యూటీ సీఎం భార్య.. ఎంపీ టికెట్‌కు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియాగాంధీ, ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్త చేశారు. దేశంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని పలు లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇదీ చదవండి: టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్! -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
సైకిలెక్కితే సైడ్‌ట్రాకే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలపడ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కోట్ల కోటకు బీటలు కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా.. డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. భూమా కుటుంబం తంటాలు వైఎస్సార్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్‌కు టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే.. నమ్మితే నిండాముంచారు శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు అసలు టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్మోహన్రెడ్డిని కాదని టీడీపీలో చేరితే 2019లో ఓడిపోయారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు. అంతర్మథనంలో నేతలు రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీలో కొనసాగుతున్నామని, ఏ ఆప్షన్ ఉన్నా వెంటనే సైకిల్ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతున్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన వారిలో కర్నూలు, కోడుమూరు, కదిరి, బద్వేల్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, అత్తర్ చాంద్‌బాషా, జయరాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో మోహన్‌రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్‌బాషా, జయరాములు పూర్తిగా రాజకీయ భవిష్యత్ కోల్పోయారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు. -
టీడీపీలో సెల్ఫ్‘షో’లు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేని ఆ పార్టీ సీనియర్ నేతలు ‘సెల్ఫ్ షో’లకు దిగుతున్నారు. ఏదో సాకుతో తీవ్రస్థాయిలో హడావుడి చేస్తేగాని తమకు టికెట్ దక్కేట్టు లేదన్న అనుమానాలతో భావోద్వేగాల ముసుగేస్తున్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ నానా హంగామాతో రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ప్రధానంగా బాబు సామాజిక వర్గానికే చెందిన వివిధ జిల్లాల సీనియర్ నేతలు ఉండటం గమనార్హం. వైఎస్సార్సీపీపై ఒంటరిగా పోటీచేసి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమనే నిర్ధారణకు వచ్చిన బాబు జనసేనతో సహా కలిసొచ్చే ఏ పార్టీనైనా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికొచ్చి పావులు కదుపుతున్నది బహిరంగ రహస్యమే. మరోవైపు బాబు, లోకేశ్ పలు నియోజకవర్గాలలో వేర్వేరుగా మద్దతిస్తూ నేతల మధ్య పోటీ పెంచుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో తమకు సీటు నిరాకరిస్తారేమోననే అనుమానాలతో ఎవరికివారు వ్యక్తిగత వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పులివర్తి నాని, యరç³తినేని శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. ఆలపాటి అలక.. గుంటూరు జిల్లా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారని, సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారనే ప్రచారం విస్తతంగా జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలపాటికే టికెట్ ఇవ్వాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని ఆయన అనుయాయులు వేదికనెక్కి గందరగోళం చేశారు. ఆరేడు శాతం ఓట్లు కూడా లేని మనోహర్‌కు సీటివ్వాలని కోరడమేంటని నిలదీశారు. మీటింగ్ హాల్ బుక్ చేసింది, సమావేశానికి వెళ్లమని పురమాయించింది, పెట్రోల్ డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరనేది టీడీపీ అధిష్ఠానం గుర్తించి సెల్ఫ్షోలు చాలించాలని తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో ఆలపాటి వర్గం మౌనం దాల్చక తప్పలేదని స్వపక్షీయులు అంటున్నారు. పులివర్తి ఆందోళన చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి టీడీపీ ఇన్చార్జిగా పులివర్తి నాని వ్యవహరిస్తున్నారు. నానికి టికెట్ ఇవ్వవద్దని అదే నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణకుమారి కుటుంబం అడ్డుకుంటోంది. మరో సామాజికవర్గానికి చెందిన రియల్టర్ పేరు బాబు పరిశీలనలో ఉందని తెలియడంతో టికెట్ దక్కించుకునే ఎత్తుగడలో పులివర్తి తనదైన శైలిలో డ్రామాకు తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఈనెల 8న తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన నాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ నానా హంగామా చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు నానిని పరామర్శించారు కూడా. యరపతినేని ఎత్తుగడ పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎత్తుగడ మరోవిధంగా ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరగుతోంది. సీటు దక్కుతుందో.. లేదోనన్న అనుమానంతో యరపతినేని పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. వైఎస్సాఆర్సీపీ వారే ఇలా చేయించారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవంగా తప్పుడు ట్రోల్ చేయించింది ఎవరనేది అధిష్ఠానానికి బాగా తెలుసని టీడీపీలోని నాయకులే అంటున్నారు. బాబును నమ్మిబాగుపడినోడు లేడు విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత సోదరుల మధ్య రాజకీయ వివాదం రేపింది, సీటు అంశంలో వారివురిని తగాదా వరకు తీసుకెళ్లింది, పార్టీలోని ఇతర నాయకుల చేత ఎంపీని తిట్టించింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని పరిశీలకులు అంటున్నారు. బాబును నమ్మి బాగుపడినోడు లేడనేది స్వపక్షీయుల మాట. ఈ విషయం ముఖ్యంగా ఆయన సామాజికవర్గానికి చెందిన సన్నిహిత సీనియర్లకు బాగా తెలుసని గుర్తుచేస్తున్నారు. -
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్‌ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
ఆదినారాయణకు మంత్రి పదవి ఆశచూపించి టీడీపీలోకి లాక్కున్న చంద్రబాబు
-
నల్లగొండ ఎంపీ టికెట్‌కు డిమాండ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి ఎంపీ టికెట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఆయా పార్టీల్లోని ఆశావహులు తమ గాడ్ ఫాదర్ల ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఆశావహుల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎవరనేది ఇంకా నిర్ణయించకపోయినా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. నల్లగొండలో ఎక్కువ మంది.. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తాను ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్‌ను మాజీమంత్రి దామోదర్‌రెడ్డికి కేటాయించడంతో ఆ టికెట్‌ను ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ప్రస్తుతం రఘువీర్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్న నేపథ్యంలో పటేల్ రమేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారా? లేదా ఎంపీ టికెట్ ఇస్తారా? ఏం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పటేల్ రమేష్‌రెడ్డికి ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ఇస్తారనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లోనూ పలువురు ఆశావహలు ఎంపీ టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించారు. అయినా అధిష్టానం ఇవ్వలేదు. తన కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్ కావాలని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం నల్లగొండ లేదా భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు చర్చ సాగుతోంది. వారే కాకుండా ఓ వ్యాపారవేత్తతోపాటు మరికొందరు కూడా నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి నుంచి పోటీకి పలువురి ఆసక్తి భువనగిరి పార్లమెంట్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా పోటీ ఉంది. ఏడెనిమిది మంది అక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి ఎంపీగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేస్తారని గతంలో చర్చ జరగ్గా.. ఇటీవల కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన కూతురు కీర్తిరెడ్డి కోసం టికెట్ అడుగుతుండగా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి మహేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమవేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపైనా చర్చ జరక్కపోయినా ఆశావహలు మాత్రం తమకు టికెట్ కావాలన్న విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌తోపాటు మరో ఇద్దరు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పది మంది.. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉంది. పది మంది ఆశావహులు తమకు టికెట్ కావాలని అడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో గార్లపాటి జితేందర్, మన్నెం రంజిత్‌యాదవ్, నూకల నర్సింహారెడ్డి, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్‌రెడ్డి, లాలూనాయక్, నాగం వర్షిత్‌రెడ్డి, నివేదితారెడ్డి, సత్యనారాయణ, మన్మథరెడ్డి తమకు ఎంపీ టికెట్ కావాలని అడిగారు. బీజేపీ నుంచి కూడా అంతమంది టికెట్ అడుగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీట్లు
-
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
TS: నేటినుంచి జీరో టికెట్
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. మహిళలకు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నా, వారికి ఎలాంటి టికెట్ జారీ చేయటం లేదు. అయితే ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయటం ద్వారా సమకూర్చనుంది. అందువల్ల ప్రతినెలా ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు, అందువల్ల ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది.. అన్న లెక్కలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. టికెట్‌పై చార్జీ సున్నా అని చూపించినా, ఆ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించిందో టికెట్లో నమోదవుతుంది. అంతదూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేయాల్సిన టికెట్ మొత్తం కూడా అందులో ఉంటుంది. వాటి ఆధారంగానే ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ జీరో టికెట్ విధానాన్ని సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోల్లో వీటిని జారీ చేసి పరిశీలించారు. శుక్రవారం నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్ జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గుర్తింపు కార్డు తప్పనిసరి తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. దీంతో శుక్రవారం నుంచి కండక్టర్‌కు మహిళలు కచ్చితంగా తెలంగాణ ప్రాంత నివాసితులుగా ధ్రువపరిచే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఎవరైనా గుర్తింపు కార్డు మరిచిపోతే, మళ్లీ మరిచిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మాత్రం అనుమతించరని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలపై హర్షం మహాలక్ష్మి పథకానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్టీసీకి రూ.374 కోట్లు విడుదల చేయటంపై కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీని ఆదుకోవాలని ఎన్ఎంయూ నేతలు నరేందర్, కమాల్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఖదీర్ తదితరులు కోరారు. ఇక ప్రజావాణి మాదిరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకోసారి కార్మిక వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు. -
రె‘బెల్స్’ కాదు ... ప్రత్యర్థి పక్షమే!
ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఒకెత్తయితే... సొంత పార్టీ నుంచి రెబెల్‌గా ఎవరూ లేకుండా చూసుకోవడం మరోఎత్తు. తాము ఎప్పటి నుంచో ఉంటున్న పార్టీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానో, మరో పార్టీ నుంచో పోటీ చేసి గెలిచిన నాయకులు తెలంగాణలో చాలా మందే ఉన్నారు. ఒకవేళ గెలవకపోయినా, సొంత పార్టీ అభ్యర్థిని ఓడించి ప్రత్యర్థి పార్టీ గెలుపునకు పరోక్షంగా కారకులైన వారూ ఉన్నారు. కొన్నిసార్లు పేరున్న రెబెల్ కారణంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లోని ఏ అభ్యర్థి ఓడిపోతాడో చెప్పలేని పరిస్థితి. కానీ ఈసారి సీన్ మారింది. రెబెల్స్ పోటీలో నిలిచిన నియోజకవర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెబెల్స్‌గా పోటీ చేసే బదులు ప్రత్యర్థి పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయడం అనే పద్ధతిని ఈసారి చాలామంది ఫాలో అయిుపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా , రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మొదలు మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి(నాగర్‌కర్నూలు), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి), మాజీ ఎమ్మెల్యేలు పి. విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), ప్రేంసింగ్ రాథోడ్(గోషామహల్), చందర్రావు(కోదాడ), బిరుదు రాజమల్లు (పెద్దపల్లి) వంటి వారు ఇందులో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ రాక బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు రెబెల్స్‌గా బరిలో దిగాలని తొలుత భావించినప్పటికీ, ‘సింబల్’ లేకుండా గెలవడం కష్టమనే భావనతో మధ్యే మార్గంగా ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకున్నారు. బీఆర్ఎస్ కూడా టికెట్ రాని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి మరీ సాదరంగా ఆహా్వనించింది. కొట్లాడుతామనుకున్న వాళ్లకే మద్దతుగా ప్రచారం చేయాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది. ఇలాంటి వారిలో చెరుకు సుధాకర్ (నల్లగొండ), తాటి వెంకటేశ్వర్లు (అశ్వరావుపేట), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గండ్రత్ సుజాత (ఆదిలాబాద్) వంటి వారున్నారు. బీజేపీ నుంచి కూడా రాకే‹Ùరెడ్డి (వరంగల్), తుల ఉమ (వేములవాడ), రమాదేవి (ముధోల్) టికెట్ రాక భంగపడి బీఆర్ఎస్లో చేరారే తప్ప రెబెల్స్‌గా పోటీ చేసే సాహసం చేయలేదు. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి బరిలో... ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది. కొందరు మినహా సిట్టింగ్‌లకే ఆ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన వారు రెండు నెలలు ఆలోచించిన అనంతరం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్నారు. తన కొడుకుకు మెదక్ సీటివ్వలేదని అలిగిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే టికెట్ దక్కని రేఖా నాయక్(ఖానాపూర్) కాంగ్రెస్‌లో చేరగా, ఆమె భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ లభించింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతుగా ఆపార్టీలో చేరారు. నిర్మల్ నుంచి శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. సంగారెడ్డి టికెట్ ఆశించిన పులిమామిడి రాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కరీంనగర్లో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పురమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, మునుగోడు నుంచి చెలిమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. చేవెళ్లలో రత్నం, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారెందరో...! తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1983లో వచ్చిన ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి రాష్ట్రంలో 19 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, అందులో తెలంగాణ నుంచే తొమ్మిది మంది విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో 8 మంది తెలంగాణ నుంచి కావడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో తెలుగుదేశం టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులే ఉన్నారు. 1989 ఎన్నికల్లో ఏకంగా 15 మంది స్వతంత్రులు విజయం సాధించగా, అందులో 8 మంది తెలంగాణ నుంచే. ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్లో బి.జగపతి రావు వంటి నేతలు అప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కక రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారే. 1994లో మరోసారి ఎన్టీఆర్ ప్రభంజనంలో 12 మంది ఇండిపెండెంట్లు గెలవగా, అందులో తెలంగాణ నుంచి గెలిచిన ఐదుగురు ఇండిపెండెంట్లలో తుంగతుర్తి నుంచి ఆర్.దామోదర్ రెడ్డి , గద్వాల నుంచి డీకే.భరత్ సింహారెడ్డి, కల్వకుర్తి నుంచి ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2004లో 11 మంది ఇండిపెండెంట్లు గెలవగా తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురిలో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు వంటి వారు ఉన్నారు. 2004 నుంచి ఇతర పార్టీల గుర్తుల మీద... 2004 ఎన్నికల నాటి నుంచి టికెట్లు రాని వారు రెబెల్స్‌గా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ గుర్తుల మీద పోటీ చేసే ఆచారం మొదలైంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున మెట్పల్లి నుంచి పోటీ చేసిన కొమిరెడ్డి రాములు, సమాజ్‌వాది పార్టీ టికెట్ మీద గద్వాల నుంచి పోటీ చేసిన డీకే.అరుణ కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించగా, అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి సీట్లు రాని వారు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు పోటీ చేసినప్పటికీ... నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, బాల్కొండ నుంచి అనిల్‌కుమార్ విజయం సాధించి, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీని తెరపైకి తెచ్చిన అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్‌గా దొంతు మాధవరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైరా నుంచి రాములు నాయక్ కాంగ్రెస్ రెబల్‌గా విజయం సాధించగా, రామగుండం నుంచి కోరుకంటి చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి గెలుపొంది, తర్వాత బీఆర్ఎస్లో చేరారు. -పోలంపల్లి ఆంజనేయులు -
నేటి రాజకీయాల్లో సామాజిక దృక్పథమేదీ?
పార్టీ టికెట్ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు ముడిపడటంతో పోటీచేసే వారిలో సామాజిక కోణం, సేవాదృక్పథం లోపిస్తోంది. రియల్ వ్యాపారులు, పెద్దఎత్తున భూములు కబ్జా చేసినవారు, ఇతర వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే వారి వద్ద అడ్డగోలుగా అక్రమ సంపాదన పెరిగి రాజకీయాల్లోకి వస్తుండటంతో ఎన్నికల్లో మామూలు వ్యక్తులు, సేవా దృక్పథం ఉన్నవారు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కె.గోవర్ద్ధన్‌రెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు. 1985 ఎన్నికల్లో రూ.లక్షన్నర ఖర్చుతో పోటీచేశా.. నేను ఓ డాక్టర్‌గా, ఓ సామాజిక కార్యకర్తగా దరఖాస్తు చేసుకుంటే.. 1985లో మలక్‌పేట నుంచి పోటీచేసేందుకు అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.లక్షన్నర (పార్టీ ఇచ్చిన రూ.50 వేలు కలిపి). అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు, బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డితో పోటీపడి ఓటమి చవిచూశాను. ఆంధప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితి అధ్యక్షుడిగా, వివిధ సామాజిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేశాను. సాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం వద్దని రాజీవ్‌ని కోరాను.. నాగార్జునసాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం పెడతారని ప్రచారం కావడంతో వెంటనే స్పందించాను. అప్పటి నల్లగొండ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉన్నందున ఈ కేంద్రం పెడితే పర్యవసానాలు వివరిస్తూ దీనిని విరమించుకోవాలంటూ, నేరుగా ప్రధాని రాజీవ్‌గాంధీ కార్యాలయానికి లేఖ రాశాను. రెండువారాల్లోనే ప్రధాని సెక్రటరీ దూబే నుంచి ఆ లేఖ అందినట్టుగా జవాబు వచ్చింది. మూడునెలల తర్వాత ముంబైలోని అణు విద్యుత్ విభాగం డైరెక్టర్ విజయ మనోరమ నుంచి మరో వివరణ లేఖ (పీఎంఓ నుంచి నా వినతిపత్రం కాపీ వారికి అందాక) వచ్చింది. సమీప భవిష్యత్‌లో ఈ కేంద్రాన్ని పెట్టే ఉద్దేశం లేదని, పెట్టదలిస్తే అందరి అభిప్రాయాలు తీసుకుని, పబ్లిక్ హియరింగ్ నిర్వహించాకే దానిని చేపడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి ప్రజాప్రయోజన వ్యాజ్యం నాదే... 1991లో సిరీస్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భజలాలు కలుషితం కావడంపై ఉమ్మడి ఏపీ హైకోర్టులో నేను మొట్టమొదటి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాను. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ భగవతి సూచనలు జారీచేసిన మూడు నెలల్లోనే సీనియర్ న్యాయవాది, పీయూసీఎల్ నేత ప్రతాపరెడ్డి ద్వారా పిల్ దాఖలు చేశాను. కేసు జస్టిస్ రామాంజనేయులునాయుడు బెంచ్‌కు వెళ్లగా 24 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు మంచినీటిని పంపిణీ చేసేలా సిరీస్ సంస్థ ద్వారా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టారు. ఎఫ్లూయెంట్స్‌ను ట్రీట్ చేసి బయటకు పంపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం... రేడియాలజిస్ట్‌గా మొదటి ప్రైవేట్ క్లినిక్ పెట్టాక...నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ దాకా ఎక్స్‌రే యూనిట్లే లేకపోవడంతో కాళ్లు వంకర అని, నడవలేకపోతున్నామని నా దగ్గరకు చాలా మంది వచ్చేవారు. అన్నిఎక్స్‌రేలలో తెల్లటి చారలు కనిపించడంతో దానిపై పరిశోధన జరిపితే ఫ్లోరోసిస్ జబ్బు అని తేలింది. ఎముకల్లో ఫ్లోరిన్ జమ కావడంతో ఈ జబ్బుకు కారణమని స్పష్టమైంది. ఇతరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టాను. 30 ఏళ్లకే ముసలితనం అనే వీడియోను చిత్రీకరించి ఫ్లోరోసిస్‌పై విస్తృత ప్రచారం చేశాము. సాగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే కృష్ణా జలాల్లో మార్గ మధ్యలో ఉన్న ఫ్లోరోసిస్ ప్రభావిత దాదాపు 150 గ్రామాలకు (శివన్నగూడెం దాకా) నీరు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఏఎంఆర్ ప్రాజెక్ట్ వచ్చాక ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు కట్టి ఇచ్చారు. మిషన్ భగీరథ రావడంతో ఈ సమస్య దాదాపుగా తగ్గిపోయింది. -
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజ్..బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ కోసం బాల్‌రాజ్ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం బాన్సు వాడలో తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పా టు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014 నుంచి పార్టీని నమ్ముకుని కార్యకర్తలను కా పాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చివరకు తనను కాదని, వేరే ప్రాంతం వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమరణ దీక్షకు దిగి ఇంతలోనే.. కాంగ్రెస్ అధిష్టానం మరోమారు టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరుతూ బుధవారం ఉదయం బాల్‌రాజ్ తన ఇంటి ముందు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో తనతో పాటు దీక్షలో కుర్చున్న కార్యకర్తలను భోజనం చేయండంటూ ఇంట్లోకి పంపించారు. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చారు. వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కార్యకర్తలు కంగారు పడిపోయారు. కొందరు బాత్రూం లోపలకి వెళ్లి చూశారు. మోనో–65 పురుగుల మందు డబ్బా కనిపించడంతో బాల్‌రాజ్‌ను హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీజేపీ బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని బాల్‌రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
ఆ టోకెన్‌తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్‌లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్‌ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్‌లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్‌కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్‌కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్‌ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్‌లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
ఆసక్తికరంగా మునుగోడు కాంగ్రెస్ రాజకీయం
సాక్షి, యాదాద్రి: మునుగోడు కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల.. ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్‌ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు చౌటుప్పల్‌లో అనుచరులు, మండలాధ్యక్షులతో టికెట్ ఆశావాహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. అందరి దృష్టి మునుగోడుపైనే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. . -
సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై సుమారు మూడు నెలలుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ప్రగతిభవన్‌లో నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చేతుల మీదుగా కేసీఆర్ సమక్షంలోనే బుధవారం సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ బీ ఫాం అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీ ఎన్నికల కోర్ కమిటీ సభ్యులు, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు సమక్షంలో ప్రగతిభవన్‌లో మదన్‌రెడ్డి, సునీత రెడ్డి మధ్య టికెట్ వివాదానికి తెరదించారు. సీఎం సమక్షంలో హామీ ఇవ్వడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా నర్సాపూర్‌ను పెండింగ్ జాబితాలో పెట్టా రు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి సుమారు నెల రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ లభించినా అధికారికంగా ఆమె పేరును ప్రకటించలేదు. మదన్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు మంత్రి హరీశ్‌రావు నివాసం ఎదుట ఆందోళన కూడా చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు తరచూ వెళ్తూ తనకు టికెట్ ఇవ్వా లని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పలుమార్లు మదన్‌రెడ్డితో భేటీ అయి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆయన సునీతా లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మదన్‌రెడ్డి సీనియారిటీని గుర్తిస్తాం: కేసీఆర్ ‘మదన్ రెడ్డి నాతో పారీ్టలో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజస్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆయన స్థానంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డికి వివాద రహితుడిగా పేర్కొంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్‌రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినందుకు ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి: కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి -
ఎమ్మెల్యే టిక్కెట్ పేరుతో రూ. 255 కోట్లకు టోకరా.. ముగ్గురు బీజేపీ నేతలపై కేసు!
కర్ణాటకలో బీజేపీ మరోసారి వివాదాస్పర వార్తల్లో నిలిచింది. అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముగ్గురు బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయనగర్ జిల్లాలో పార్టీ టిక్కెట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి ఈ ముగ్గురూ రూ. 2.55 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ పి.శివమూర్తి ఫిర్యాదు మేరకు కొట్టూర్ పోలీసులు బీజెపీ జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు మోహన్ కటారియా, స్థానిక నాయకులు రేవణ సిద్దప్ప, శేఖర్ పురుషోత్తంపై కేసు నమోదు చేశారు. ఈ బీజేపీ నేతలు శివమూర్తికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి, అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు రిజర్వ్ అయిన హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గం నుంచి శివమూర్తికి బీజేపీ టిక్కెట్టు ఇస్తామని ఈ ముగ్గురు నేతలు అతనిని నమ్మించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రికి శివమూర్తి లేఖలు రాశారు. కొట్టూర్ సబ్ఇన్స్పెక్టర్ గీతాంజలి తెలిపిన వివరాల ప్రకారం శివమూర్తి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై సెక్షన్ 420 (మోసం), 506 (చంపేందుకు నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సబ్ఇన్స్పెక్టర్ గీతాంజలి తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు -
రూపాయికే బస్ టికెట్..అయితే ఈ చాన్స్ ఎంతమందికి దక్కుతుందో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బుకింగ్ యాప్ అభిబస్ ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్ టికెట్ వోచర్స్ ఇస్తారు. ఈ ఆఫర్ ప్రైవేట్ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
సునీతారెడ్డికే టికెట్..
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది. మీ స్థాయికి తగిన పదవి వస్తుంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. -
కొత్త అభ్యర్థికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఎవరంటే ?
-
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TS: టికెట్ దక్కని సిట్టింగ్‌లకు ‘పవర్’ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి నెల రోజులు కావస్తోంది. మరో నాలుగు నియోజకవ ర్గాలు జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఇచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీ నామా చేయడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థులను బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రాథోడ్ బాపూరావు (బోథ్), భేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), రాములు నాయక్ (వైరా), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి) టికెట్ దక్కకున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. అధికారాలకు కత్తెర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజ కవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరును సీఎం కె.చంద్రశేఖర్‌రావు మదింపు చేశారు. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ అభ్యర్థి ఇద్దరూ క్షేత్రస్థాయి లో పర్యటనలు చేస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయా నికి గురవు తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరిగేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం చేస్తుందనే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ అధికారిక అభ్యర్థితో కలిసి పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులోభాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అందే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దనే సంకేతాలు స్థానిక నేతలకు వెళ్లాయి. మరోవైపు అధికారిక యంత్రాంగానికి కూడా ఇదే తరహా సంకేతాలు అందినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయ నిరాకరణ ఎదురవు తోంది. స్థానిక నేతలు, పార్టీ కేడర్ ఒకరొకరుగా అధికారిక అభ్యర్థికి చేరువవుతుండగా, అధికార కార్యకలా పాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మారు తోంది. దీంతో తమను అధికార కార్యకలాపాలకు దూరంగా పెట్టడంపై టికెట్ దక్కని సిట్టింగులు అసంతృప్తికి లోనవుతున్నారు. వేములవాడ చెన్న మనేని రమేశ్ బాబును వ్యవసాయ రంగ ప్రధాన సలహా దారుగా నియమించడంతో ఆయన నియోజకవర్గానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకపోయినా ఆయన నియోజకవర్గంలో విస్తృ తంగా పర్యటించగా తాజాగా పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజీ కుదిరింది. రాజయ్యకు ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు దూరం పాటిస్తున్నారు. -
బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఎంపీగా పోటీ చేసిన మర్రి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించే యోచన లో కేసీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్‌లో డిష్యూం.. డిష్యూం
ఖమ్మం సహకారనగర్: జిల్లా కాంగ్రెస్‌లో రోజు రోజుకు గ్రూపు తగాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 17న హైదరాబాద్‌లో జరగనున్న విజయ భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహ్మద్ ఆరిఫ్ నసీంఖాన్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొనగా, ఖమ్మం టికెట్ బీసీలకు కేటాయించాలని పుచ్చకాయల వీరభద్రం కోరారు. వైరా నియోజకవర్గాల నాయకులు కష్టపడే వారికి గుర్తింపునివ్వాలని విన్నవించారు. అనంతరం సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మానవతారాయ్, మట్టా దయా నంద్ వర్గీయులు నినాదాలు చేస్తూ కుర్చీలు విసురు కున్నారు. ఇందులో ఒకరిద్ద రికి గాయాలయ్యాయి. బీసీ కేటగిరీకి చెందిన మట్టా దయానంద్‌కు ఎస్సీ రిజర్వ్ స్థానంలో టికెట్ కేటాయించొద్దని మానవ తారాయ్ అనుచరులు అడ్డు చెప్పగా, వివాదం పెరిగి దాడుల దాకా వెళ్లింది. ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో రేణుకా చౌదరి బయటకు వెళ్లారు. ఆతర్వాత టికెట్ తమకే ఇవ్వాలని మానవతా రాయ్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, డాక్టర్ మట్టా రాగమయి తదితరులు కోరారు. -
సచిన్‌కు ‘గోల్డెన్ టికెట్’
ముంబై: భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్ టికెట్’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఈ టికెట్ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. కొత్త టికెట్లూ హుష్ కాకి! వరల్డ్ కప్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లకు ‘సోల్డ్ అవుట్’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్‌లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్ మై షో’ చెబుతోంది. గతంతో పోలిస్తే టికెట్ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్‌కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది. -
రెండోరోజూ అదేజోరు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీకి పోటీ చేయాల నుకునే బీజేపీ ఆశావహుల నుంచి పార్టీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ తొలిరోజున సోమవారం 182 దరఖాస్తులు అందగా, రెండోరోజు మంగళవారం మరో 178 అందినట్టు పార్టీవర్గాల సమాచారం. ముహూర్తాలు, మంచిరోజు చూసుకునే వారికి మంగళవారం అంత మంచిరోజు కాదనే అభిప్రాయం ఉంటుంది. అయితే మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం విశేషం. సిరిసిల్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, మహేశ్వరం నుంచి బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కోలన్ శంకర్‌రెడ్డి, కార్వాన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టాల ఉమారాణి తదితరులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. ఈ నెల 10 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ కావడంతో రాబోయే రోజుల్లో ఆశావహుల తాకిడి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మంచిరోజులు ఉండడంతో, పార్టీ ముఖ్య నేతలతో పాటు ఇతరులు కూడా ఈ మూడురోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. క్రిమినల్ రికార్డ్ కోసం ఓ పేజీ దరఖాస్తులో ఆశావహులు తమపై ఉన్న క్రిమి నల్ కేసులు, శిక్షలు పడిన కేసుల వివరాలు, వాటి సంపూర్ణ సమాచారం వెల్లడించాలనే నిబంధన పెట్టారు. మూడు పేజీల దరఖాస్తు పత్రంలో రెండు పేజీలు వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాల కోసం కేటాయించగా పూర్తిగా ఒక పేజీ క్రిమినల్ కేసుల సంబంధిత వివరాల కోసం కేటాయించారు. క్రిమినల్ కేసులున్న ట్టైతే ఎఫ్ఐఆర్, పోలీస్‌స్టేషన్ చిరునామా, ఫోన్ నంబర్లు, కేసు వివరాలు, ఏయే సెక్షన్ల కింద ఏయే అభియోగాలు మోపారు, వాటిపై అప్పీ లుకు వెళ్లారా లేదా? కోర్టు పరంగా ఏవైనా ప్రొ సీడింగ్స్ ఉంటే వాటిపై పిటిషన్లు దాఖలు చేశారా? తదితర వివరాలన్నీ తెలియజేయా లని సూచించారు. ఏవైనా కేసుల్లో శిక్ష పడితే వాటి వివరాలు..ఏకోర్టులో, ఏ సెక్షన్ కింద పడింది? అనే వివరాలతో పాటు నమోదైన నేరానికి సంబంధించి క్లుప్తంగా సమాచారం. శిక్ష వేస్తూ వెలువడిన ఉత్తర్వులు, తదితర వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. -
అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’
భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంటుంది. మహానటుడే కాకుండా క్రికెట్ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, ఎప్పటిలాగే టీమిండియాకు ఆయన మద్దతు కొనసాగాలని జై షా వ్యాఖ్యానించారు. -
కడియం శ్రీహరి గుంటనక్క లాంటివాడు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్‌లో, ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు. -
కమ్యూనిస్టులతో కలిసుంటే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు. మండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. అవకాశమిస్తేనే గుత్తా అమిత్ పోటీ నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు. తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు. బట్టకాల్చి మీదేయడమే రేవంత్ పని బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ లీడర్ షిప్ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమండేషన్‌తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్‌తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. -
ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంట చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చందర్రావుతో సర్దుబాటు చేసుకునేందుకు మల్లయ్యయాదవ్ గురువారం ఆయన ఇంటికి వెళ్లారు బొల్లం వెంట అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మునగాల మండల నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేశ్ తదితరులు ఉన్నారు. ఇంటిలోపలే ఉన్న చందర్రావు తన ఇంటికి ఎమ్మెల్యే బొల్లం వచ్చారని చెప్పినా గది నుంచి బయటికి రాలేదు. దీంతో హాల్లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూశారు. అప్పటికీ చందర్రావు బయటికి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. -
కొడంగల్ సీటుకు రేవంత్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే వివిధ నియోజకవర్గాల నుంచి 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 700కు చేరినట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈసారి ఎన్నికల్లో తనకు కొడంగల్ అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడంగల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అనుచరులు, నియోజకవర్గ నేతలు గురువారం గాందీభవన్‌కు వచ్చి రేవంత్ తరఫున దరఖాస్తు అందజేశారు. దీంతో రేవంత్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానికి తెరపడినట్టేనని గాందీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. మధిర టికెట్ కోసం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తన దరఖాస్తును అందజేశారు.సీఎల్పీ కార్యాలయ కార్యదర్శి పూర్ణబోధ శ్రీకాంత్.. భట్టి తరఫున గాందీభవన్‌లో దరఖాస్తును సమర్పించారు. కాగా, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, జనగామ టికెట్‌కోసం పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డిలు కూడా గురువారమే దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, మునుగోడు టికెట్ కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కై లాశ్‌నేత, కరీంనగర్ టికెట్ కోసం మాజీ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యారావు కూడా దరఖాస్తులు సమర్పించారు. కాగా, కాంగ్రెస్ టికెట్లకోసం దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారంతో ముగియనుంది. ఎంపీ ఉత్తమ్‌తోపాటు సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు చివరి రోజున దరఖాస్తులు సమర్పిస్తారని తెలిసింది. -
కేసీఆర్ గీసిన గీత దాటను
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్పూర్ టికెట్ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు. -
వారికి ఇవ్వొద్దు... మా నేతలకివ్వండి: బీఆర్ఎస్లో టికెట్ల లొల్లి
భూపాలపల్లి రూరల్/ మెదక్/ తరిగొప్పుల/ స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందంటూ జరుగుతున్న ప్రచారంతో రగడ మొదలైంది. అసమ్మతి లొల్లి మరింతగా ముదురుతోంది. తమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ పలుచోట్ల.. ఇతర నేతలకు ఇవ్వాలంటూ మరికొన్నిచోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో ఆయా నేతల అనుచరులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. మధుసూదనాచారికే టికెట్ ఇవ్వాలంటూ.. భూపాలపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో.. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గం ఆదివారం ఆందోళనకు దిగింది. మధుసూదనాచారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మెరుగు శ్రీకాంత్, పూర్ణయాదవ్, పృథ్వీ తదితరులు సెల్‌ఫోన్ టవర్ ఎక్కారు. మరికొందరు కార్యకర్తలు ఇక్కడి అంబేడ్కర్ సెంటర్లో ధర్నా చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుసూదనాచారికి అన్యాయం చేయవద్దని కోరారు. గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇస్తే.. సుమారు 200 మంది ఉద్యమకారులం నామినేషన్లు వేసి బరిలో దిగుతామని, గండ్రను ఓడిస్తామని హెచ్చరించారు. పోలీసులు, నేతలు అక్కడికి చేరుకుని టవర్ ఎక్కిన వారితో మాట్లాడి కిందికి దింపారు. పద్మా దేవేందర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ.. మెదక్ బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ మైనంపల్లి రోహిత్ వర్గీయులు ఆదివారం పట్టణంలో ధర్నాకు దిగారు. అధిష్టానం ఆదేశాల మేరకే యువ నాయకుడు రోహిత్ ‘సోషల్ సరీ్వస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్)’ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, టికెట్ ఆయనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మా దేవేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. యువత ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంఎస్ఎస్ఓ ఆర్గనైజింగ్ సభ్యులు బొజ్జ పవన్, బోసు, మేడి గణేశ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ముత్తిరెడ్డి, జెడ్పీ చైర్మన్ వర్గాల మధ్య ఘర్షణ జనగామ బీఆర్ఎస్ టికెట్ విషయంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య ఇప్పటికే ఘర్షణ కొనసాగుతుండగా ఆదివారం అది మరింత పెరిగింది. నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం మరియపురంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి నివాసంలో మండల ప్రజా ప్రతినిధులతో జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరులు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పింగళి జగన్మోహన్రెడ్డి, కో–ఆర్డినేటర్ జొన్నగోని కిష్టయ్య, గ్రామ అధ్యక్షుడు అంకం రాజారాం, యూత్ అధ్యక్షుడు మల్యాల సు«దీర్ తదితరులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. టి.రాజయ్యకే టికెట్ ఇవ్వాలంటూ.. బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గం ఆందోళనకు దిగింది. ‘స్థానికుడైన రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వాలి. వలసవాద రాజకీయాలు వద్దు. కడియం గోబ్యాక్’అంటూ రాజయ్య అనుచరులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ధర్నా చేశారు. ఇది కూడా చదవండి: ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు -
హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దు
ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు మరోమారు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే భర్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బానోతు హరిసింగ్ అరాచకాలు మితిమీరాయని, సెటిల్మెంట్లు, భూదందాలేకాక సొంత పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హరిప్రియకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ మేరకు శనివారంరాత్రి ఇల్లెందులోని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశమయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ అ«ధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఇల్లెందు, బయ్యారం సొసైటీల చైర్మన్లు మెట్ల కృష్ణ, మూల మధుకర్‌రెడ్డి, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు తండ్రి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఇల్లెందులో ఎమ్మెల్యే భర్త తీరుతో బీఆర్ఎస్కు నష్టం చేకూరుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇల్లెందు అభివృద్ధి నిధులను ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు పొందారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులను పక్కనబెట్టి పీఆర్ శాఖ ఇంజనీర్లతో సుమారు రూ.30 కోట్ల నిధులతో పనులు చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు సీఎంను కలిసే అవకాశం తమకు లేనందున మీడియా ద్వారా ప్రజలు, సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. అభ్యరి్ధని మారిస్తే తప్ప ఇల్లెందులో పార్టీ గెలిచే అవకాశం లేదని, అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసా వహిస్తామని స్పష్టం చేశారు. -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
జనగామకు ‘పల్లా’ వద్దే వద్దు
జనగామ: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయం మరింత వేడెక్కింది. తమ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోక్యం ఏమిటంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలు రోడ్డెక్కాయి. నియోజకవర్గంలోని 8 మండలాలతోపాటు జనగామ అర్బన్‌కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ‘పల్లా గో బ్యాక్’, ‘ముత్తిరెడ్డికి మూడోసారి టికెట్ ఇవ్వండి.. లేదంటే పోచంపల్లికి ఇచ్చినా పర్వాలేదు’అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో హైదరాబాద్–వరంగల్ హైవేపై నిరసనకు దిగాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు జనగామ బీఆర్ఎస్ టికెట్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. పల్లాకు జనగామతో పనేమిటని, ఆయనకు టికెట్ ఇస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఆందోళనకారులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేసేందుకు ప్రయతి్నంచినా తర్వాత విరమించుకున్నారు. మొత్తంగా ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల ఆందోళనతో జనగామలో నాలుగు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీనివాస్, మసివుర్ రెహమాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, రేఖ, శ్రీనివాస్, మల్లాగారి రాజు, స్వప్నరాజు, శ్రీశైలం, మామిడాల రాజు, రామక్రిష్ణ, ఉడుగుల కిష్టయ్య, ప్రభాకర్, తిప్పారపు విజయ్, నాగరాజు, మిద్దెపాక లెనిన్, జూకంటి కిష్టయ్య, రమేష్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లాకు జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి సింహం లాంటి సీఎం కేసీఆర్ పక్కన ఉండి కూడా పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. శనివారం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనగామ టికెట్ కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారంటూ ప్రచారం జరిగినప్పుడు ఆయన నా ఆఫీసుకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అది అబద్ధమని చెప్పారు. ఆయన చూపిన సంస్కారానికి నా నమస్కారం. కానీ పల్లా ఎంత ఎత్తులో ఉన్నారో అంతటి స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నా వెనుక ఉన్న నాయకులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. జనగామను మరో హుజూరాబాద్ చెయ్యాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. నా కుటుంబంలో కలహాలు రేపించినది ఎవరో అందరికీ తెలుసు..’’అని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో 2002 నుంచి కేసీఆర్ వెంట సైనికుడిలా పనిచేస్తున్నానని, తనకు తొలి జాబితాలోనే టికెట్ ప్రకటించాలని సీఎంకు దండం పెట్టి విన్నవిస్తున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
దరఖాస్తు చేసుకుంటేనే టికెట్: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సామాజిక సమీకరణలు, ఆశావహుల బలాబలాలు, ఇతర పార్టీల్లోని అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని పలు దశల్లో వడపోత జరిగిన అనంతరం అభ్యర్థి ఎవరనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఆశావహుల దరఖాస్తులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు కూడా పరిశీలిస్తాయని చెప్పారు. శుక్రవారం గాం«దీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలిసి ఆయన పార్టీ దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గాంధీభవన్‌లో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు, ఇతర వర్గాలకు రూ.50 వేలుగా నిర్ణయించినట్టు రేవంత్ చెప్పారు. ఒకవేళ ఈనెల 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టికెట్ అడిగితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుంది.. గెలుపు ప్రాతిపదికన మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. దరఖాస్తుల స్వీకరణతో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, తాము అభ్యర్థులమని ఎవరైనా చెప్పుకున్నా, ఫలానా వ్యక్తి అభ్యర్థి అంటూ తనతో సహా ఎవరైనా ప్రకటించినా, అభ్యర్థులు ఖరారయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దని, అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో ఎవరూ పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తొలి దరఖాస్తు దాఖలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ దరఖాస్తు సమర్పించారు. సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తన దరఖాస్తును అందజేశారు. మానవతారాయ్ వెంట సత్తుపల్లి కాంగ్రెస్ నేతలు రావి నాగేశ్వరరావు చౌదరి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు ఓయూ జేఏసీ నేతలున్నారు. -
నన్ను కాదని.. నిన్నమొన్న వచ్చిన వారికి టికెట్లా?
పంజగుట్ట: ‘రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియర్‌ను.. అనుభవం ఉన్న వాడిని. కాంగ్రెస్ పార్టీని ఎన్నో సంవత్సరాలుగా నాగర్‌కర్నూల్‌లో కాపాడుకుంటూ వస్తున్నా. నన్ను కాదని నిన్న, మొన్న వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారు?’అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు పార్టీని కాపాడుతుంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన జూపల్లి కృష్ణారావు... కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల సీట్లు తన వారికే కావాలంటున్నాడని, ఆయన అంత పెద్ద నాయకుడు ఎప్పుడయ్యాడో అర్థం కావడంలేదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి, ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి పార్టీని నడిపిన మేము ఏం కావాలి? ఆయన గెలిచిన తర్వాత ఇక్కడే పార్టీలోనే ఉంటారన్న నమ్మకం ఉందా..ఆ గ్యారెంటీ ఎవరిస్తారని నాగం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి... కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగిందని నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా సీఎం కేసీఆర్ దాన్ని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ అవినీతి గురించి మాట్లాడుతోందని, అయితే ఎవరూ ప్రశ్నించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు, టీపీసీసీ అధ్యక్షుడు దీనిపై తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఏసీబీ డీజీని కలసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మహిళ ఓవర్ యాక్షన్.. టికెట్ అడిగాడని కండక్టర్‌పై తిట్ల పురాణం
యశవంతపుర(బెంగళూరు): బస్ కండక్టర్‌ను మహిళ ఒకరు నోటికొచ్చినట్లు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. బెంగళూరులో సిటీ బస్ ఎక్కిన మహిళ టికెట్ తీసుకోలేదు. కండక్టర్ ఆమెను టికెట్ తీసుకోవాలని కోరగా ఉచిత ప్రయాణమని తెలిపింది. ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ కోరగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని అని ఆమె ఐడీ కార్డు చూపారు. స్థానిక చిరునామా కార్డును చూపించాలని, లేదా టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో మహిళ రౌద్రరూపం దాల్చింది. ఇష్టానుసారం తిట్ల పురాణం వినిపించింది. కొందరు ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. #FreebusJourney in #KSRTCBus in #Karnataka An argument started between a woman passenger and a #bmtc bus conductor when the Conductor asked the woman to show Aadhar Card or Voter Card of Karnataka only to avail the free bus ride. The woman showed her Aadhaar card in her phone… pic.twitter.com/DoKMOsAvkQ — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 26, 2023 చదవండి: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు. కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. -
అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఇండియాలోనూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. (ఇది చదవండి: స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది! ) అయితే భారత్‌లో ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఐమాక్స్‌లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర రూ.2450 పలుకుతోంది. గతంలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 సినిమా టికెట్ ధర బెంగళూరులో గరిష్ఠంగా రూ.1700 మాత్రమే పలికింది. అంతటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అవతార్‌ను సినిమాను మించి టికెట్ ధరలు ఉండడంతో సినీ ప్రియులు ఆశ్చర్య పోతున్నారు. మనదేశంలో సాధారణంగా టిక్కెట్ ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. తాజాగా ముంబయిలో ఓపెన్ హైమర్ మూవీ టికెట్ ధర రూ.2450 ( ఎలాంటి పన్నులు లేకుండా) ఇప్పటికే అమ్ముడయ్యాయి. ముంబయిలోని పీవీఆర్ ఐకాన్, ఫీనిక్స్ పల్లాడియంలో సాయంత్రం ఏడు, రాత్రి పది గంటల షో కోసం సినిమా రిలీజ్ రోజున టిక్కెట్స్ బుక్ కావడంతో అందరి కళ్లు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ భారీ టికెట్ ధరలు చూస్తే ఓపెన్ హైమర్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. గతవారంలో టామ్ క్రూజ్ మూవీ మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్ ఇండియాలో మొదటి రోజు రూ.12.50 కోట్లు వసూలు చేసింది. తాజాగా సిలియన్ మర్ఫీ నటించిన ఓపెన్‌హైమర్ ఆ చిత్రాన్ని అధిగమిస్తోందేమో వేచి చూడాల్సిందే. అసలేంటీ ఓపెన్‌హైమర్? ఒపెన్‌హైమర్ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె.రాబర్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయన మొదటి అణు బాంబును అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్రవేత్త. కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన రాబర్ట్ జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్ ఆధారంగా రూపొందించారు. కాగా.. ఇప్పటికే హాలీవుడ్ సమ్మె ప్రభావం ఈ చిత్రంపై ఉండదని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీరనుకునే హీరోయిన్ మాత్రం కాదు!) -
టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా?
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరింది. నేతల సంగతి దేవుడెరుగు.. కార్యకర్తలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారనే కలరింగ్ ఇస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ అభ్యరి్థత్వంపై హామీ ఇచ్చి మభ్యపెడుతున్నారు. ప్రధానంగా బొజ్జల సుదీర్‌రెడ్డి.. ఎస్సీవీ నాయుడు.. మునిరామయ్య మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అరకొరగా మిగిలిన శ్రేణుల్లో సైతం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తమ్ముళ్ల నడుమ తకరారు పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ఏ నేత వెంట వెళితే ఏం ముంచుకొస్తుందో అని కార్యకర్తలు అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, తిరుపతి : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరి రోజులు గడవక ముందే ఆ పారీ్టలో కోల్డ్ వార్ మొదలైంది. నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోసం చంద్రబాబు వేసిన ఎత్తులకు బొజ్జల, ఎస్సీవీ, సత్రవాడ బలవుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆ ముగ్గురు నాయకుల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సర్వేల్లో తేలిపోయింది. విషయం తెలిసినా.. బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్రవాడ మునిరామయ్య, ఎస్సీవీ నాయుడు నడుమ అగ్గి రాజేసి ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థత్వం కోసం ఈ ముగ్గురు నేతలు పోటీపడుతున్నారని, అందుకే ఎవరినీ ఖరారు చేయకుండా మభ్యపెడుతూ వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తరచూ పారీ్టలు మారే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ.. చిన్నగా అందులోనే చేరడం ఎస్సీవీ నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా టీడీపీ అధికారం కోల్పోవటంతో వైఎస్సార్సీపీలో కొనసాగుతూ శ్రీకాళహస్తిలో చక్రం తిప్పాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుండటంతో వ్యక్తిగతంగా తనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని భావించిన ఎస్సీవీ నాయుడు మరోసారి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరక ముందు నుంచే వర్గాలు ! శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేయాలనే లక్ష్యంతో టీడీపీలో చేరిన ఎస్సీవీ నాయుడు ఆరు నెలల ముందు నుంచే తమ్ముళ్లందరితో సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. బొజ్జల, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య వర్గీయులతో తరచూ మాట్లాడుతుండటం, వారిని ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ అ«ధినేత చంద్రబాబుని కూడా తరచూ కలిసేవారని విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం లేదని చంద్రబాబుకు పదే పదే చెప్పేవారని తెలిసింది. అందులో భాగంగానే ఎస్సీవీని టీడీపీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థగా ఎస్సీవీకి గట్టి హామీ ఇవ్వటంతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఎస్సీవీ నాయుడు పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీని నమ్ముకుని ఉన్న బొజ్జల సు«దీర్‌రెడ్డి తనకే టికెట్ అని భావించి తన వంతు నియోజక వర్గంలో పర్యటించటం, నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడటం చేస్తున్నారు. అయితే చంద్రబాబు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా ఎస్సీవీ నాయుడికే టికెట్ అనే విషయం బొజ్జలకు ఆలస్యంగా తెలియటంతో పలుమార్లు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. బస్సుయాత్రలో బయటపడిన విభేదాలు టీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తనకు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తనకు పొలం ఇచ్చారని, అందులో తననే సాగు చేసుకోమని చెప్పారని పరోక్షంగా తెలియజేశారు. సందర్భం లేకుండా ఎస్సీవీ నాయుడు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయం టీడీపీ శ్రేణులకు అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న బొజ్జల సుదీర్‌రెడ్డి మాత్రం ఎస్సీవీ నాయుడు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, నేటి వరకు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కూడా తన వంత తాను ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పైకి తామంతా ఒక్కటేనని, ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని చిలక పలుకులు వల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల బొజ్జల సు«దీర్‌రెడ్డి, ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరికి వారు తనకే టికెట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా బస్సుయాత్రలోనే ఎస్సీవీ నాయుడు, ఆయన వర్గీయులకు బొజ్జల ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులను బస్సులో ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారే ప్రచారం జరుగుతోంది. ఇలాగైతే కొనసాగలేం అడుగడుగునా అవమానాలు భరిస్తూ టీడీపీలో కొనసాగలేమని ఎస్సీవీ నాయుడు ముఖ్య అనుచరుడు శివా యాదవ్ తదితరులు ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో నిమ్న వర్గాలకు ప్రాధాన్యత లేదని మీడియా ఎదుట వాపోయారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్రలో పాలుపంచుకున్న తనపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని శివ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్సీవీ నాయుడు అనుచరుడినని చెబుతున్నా వినకుండా బస్సు దిగమన్నాడని, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు నాయుడుని ఎస్సీవీ సుమారు 500 మందితో కలిశారని, అప్పుడు కూడా బొజ్జల సుధీర్‌కి టికెట్ ఇస్తామని పార్టీ అధినేత చెప్పలేదని వివరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఆఫీసుకి వస్తే దాడి చేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, బొజ్జల సు«దీర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని శివ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు వర్గం దూసుకుపోవడం సహించలేక బొజ్జల సు«దీర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేయటం గమనార్హం. తుస్సుమన్న బస్సు యాత్ర! – వరదయ్యపాళెంలో వెలవెల పోయిన రచ్చబండ వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల నుంచి యాత్ర ప్రారంభించారు. బీఎన్‌కండ్రిగ, వేణుగోపాలపురం మీదుగా వరదయ్యపాళెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంతో యాత్ర ముగిసింది. అయితే రచ్చబండ జనం లేక వెలవెల పోయింది. రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ వారి ఊక దంపుడు ప్రసంగాలు వినలేక జనం నెమ్మదిగా జారుకున్నారు. అంతకు ముందు వరదయ్యపాళెంలో నిర్వహించిన ర్యాలీలో సైతం పట్టుమని 100 మంది కూడా లేకపోవడం గమనార్హం. కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్షి్మ, మాజీ ఎమ్మెల్యేలు హేమలత, ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, పరసారత్నం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి హెలన్ ఉన్నారు. -
రూ. 14 వేల ఫ్లైట్ టిక్కెట్ ఛార్జీకి రిఫండ్‌గా 2 కప్పుల చాయ్!
ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లోఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయాల్సివస్తే ఎంత రిఫండ్ వస్తుందోనని ఆందోళనపడుతుంటాం. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత ఉంటాయోనని అనుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో టిక్కెట్ ఛార్జీలోని సగం మొత్తం అయినా రిఫండ్ రూపంలో మనకు అందదు. బీహార్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాహుల్ కుమార్‌కు ఫ్లయిట్ టిక్కెట్ రిఫండ్ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాహుల్ కుమార్ రూ. 13,820కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోగా, అతనికి రిఫండ్ రూపంలో కేవలం రూ. 20 చేతికి అందింది. అంటే రెండు కప్పుల చాయ్ పైసలు రిఫండ్ రూపంలో తిరిగి వచ్చాయి. ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే.. ఐఎస్ అధికారి రాహుల్ కుమార్ ఫైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న అనంతరం ఎయిర్‌లైన్స్.. ఫ్లైట్ క్యాన్సిలేషన్ రిఫండ్ ఆఫ్ టిక్కెట్‌ను ఆయనకు పంపింది. దానిలో టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ.11,800, జీఐ క్యాన్సిలేషన్ ఛార్జీ 1,200గా ఉంది. కన్వీనియన్స్ ఛార్జీలు రూ. 800. మొత్తంగా క్యాన్సిలేషన్ ఫీజు 13,800. ఫలితంగా రాహుల్ కుమార్‌కు రిఫండ్ రూపంలో కేవలం రూ.20 తిరిగి వచ్చాయి. దీనికి క్యాప్షన్‌గా ఆయన తనకు రిఫండ్ అయిన ఈ మొత్తంతో ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే తెలియజేయాలని వ్యంగ్యంగా కోరారు. రాహుల్ కుమార్ పోస్టుకు 5 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. 5 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
BRS Party: కొత్త ముఖాలు.. కోటి ఆశలు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి తరఫున బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహిక నేతలు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి ఈసారి అవకాశం లభించకపోవచ్చనే వార్తల నేపథ్యంలో పార్టీలో కొత్త ముఖాలు అభ్యర్థిత్వంపై ఆశతో విస్తృతంగా లాబీయింగ్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి ఏర్పాట్లు కొనసాగిస్తూనే కేసీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్‌తో పాటు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల ద్వారా టికెట్ వేట కొనసాగిస్తున్నారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరితో పాటు సుమారు 40 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్ల వంటి కీలక పదవుల్లో ఉన్న నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరు కాకుండా మరో 30 మంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు తదితరాలు.. టికెట్ వేటలో తమకు అనుకూలిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆశావహులు అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇటీవలి మహారాష్ట్ర పర్యటనకు తమ అనుచరులతో సహా తరలివెళ్లారు. సిట్టింగులకు దక్కని స్థానాల్లో.. ప్రస్తుత శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను 103 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పార్టీ టికెట్ దక్కుతుందని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించినా.. పనితీరు సరిగా లేని వారిని పక్కన పెడతామనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 15 నుంచి 20 మంది సిట్టింగులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కదని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులో సుమారు 75 శాతం స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతరులను కలుపుకొని సుమారు 20 మందికి టికెట్ ఖరారుపై కేసీఆర్, కేటీఆర్‌లు సంకేతాలు ఇచ్చారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పిడికి అవకాశమున్న చోట తమకు అవకాశం ఇవ్వాలని కొత్తగా టికెట్ ఆశిస్తున్న నేతలు కోరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ గతంలోనే తమకు హామీ ఇచ్చారని కొందరు చెప్తుండగా, మరికొందరు తమ పనితీరు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నారు. ఆశగా ఎదురుచూపులు కొత్తగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ప్రధానంగా గడాల శ్రీనివాసరావు (కొత్తగూడెం), మన్నె గోవర్ధన్‌రెడ్డి (ఖైరతాబాద్), మోతె శోభన్‌రెడ్డి (సికింద్రాబాద్), రేణికుంట్ల ప్రవీణ్ (బెల్లంపల్లి), మిట్టపల్లి సురేందర్ (మానకొండూరు), మైనంపల్లి రోహిత్ (మెదక్), చల్లా నారాయణరెడ్డి (మంథని) మరికొందరు ఉన్నారు. మన్నెం రంజిత్ యాదవ్ (నాగార్జునసాగర్), కందుల సంధ్యారాణి (రామగుండం), బొద్దుల లక్ష్మీనర్సయ్య అలియాస్ లక్ష్మణ్ (పెద్దపల్లి), వలిదాస్ జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), నీలం మధు ముదిరాజ్ (పటాన్చెరు), ఢిల్లీ వసంత్ (జహీరాబాద్) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు గడాల శ్రీనివాసరావు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నద్ధతను ప్రారంభించారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్ మానకొండూరు నుంచి టికెట్ కోసం ఇప్పటికే కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టికెట్‌ను ఆశించిన మన్నెం రంజిత్ యాదవ్ తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో నియోజకవర్గంలో విçస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు తమకు అనుకూలిస్తాయని కందుల సంధ్యారాణి (పెఱిక), బొద్దుల లక్ష్మీనర్సయ్య (పద్మశాలి), నీలం మధు (ముదిరాజ్) భావిస్తున్నారు. ఇటీవల పటాన్చెరు పర్యటన సందర్భంగా ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా మధుకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఢిల్లీ వసంత్ పార్టీలో చేరికకు సంబంధించి షోలాపూర్ పర్యటన సందర్భంగా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి..
వందేభారత్ రైలులో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన ఒక యువకుడు వాష్‌రూమ్‌లోకి దూరి, డోర్ లాక్ చేసుకున్నాడు. అధికారులు ఎంతచెప్పినా బయటకు రానంటూ మొండికేశాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కి, వాష్‌రూమ్‌లో నక్కిన ఆ యువకుడు ఎవరు చెప్పినా బయటకు రాలేదు. అయితే రైలు పాలక్కడ్ పరిధిలోని షోర్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అధికారులు వాష్‌రూమ్ డోర్ పగులగొట్టి ఆ యువకుడిని బయటకు తీసుకువచ్చారు. ఆ యువకుడు ఎరుపురంగు చెక్స్ కలిగిన టీ ధరించివున్నాడు. అధికారులకు ఎంతో భయపడుతూ కనిపించాడు. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడిని ఆర్పీఎఫ్ పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తాను మహారాష్ట్రకు చెందినవాడినని తెలిపాడు. ఆ యువకుడు హిందీలో మాట్లాడుతున్నాడు. తాను కాసర్గోడ్లో ఉంటానని కూడా ఆ యువకుడు రైల్వే పోలీసులకు తెలిపాడు. టిక్కెట్ లేకుండానే ప్రయాణిస్తూ.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకునికి సంబంధించిన ఖచ్చితమైన గుర్తింపు లభ్యం కాలేదు. పైగా ఆ యువకుడు టిక్కెట్ లేకుండానే రైలు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ యువకుడు భయపడుతూ పోలీసులతో తనను ఎవరో వెంబడిస్తున్నారని, వారి నుంచి తప్పించుకునేందుకే రైలులోకి ఎక్కి, వాష్‌రూమ్‌లో దాక్కున్నానని తెలిపాడు. కాగా కోజికోడ్, కన్నూర్‌లలో రైలు ఆగినప్పుడు అధికారులు ఆ యువకుడిని వాష్‌రూమ్ నుంచి బయటకు రావాలని కోరినా, బయటకు రాలేదు. దీంతో అధికారులు ఆ యువకుడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడని గుర్తించి, వాష్‌రూమ్ డోర్ పగులగొట్టి, అతనిని బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
ఐ-టిక్కెట్, ఈ- టిక్కెట్.. ఏది వెంటనే కన్ఫర్మ్ అవుతుంది?.. ముందుగానే తెలిస్తే..
రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్ టిక్కెట్ ఒక టాస్క్ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్ టిక్కెట్ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్లను బుక్ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్ టిక్కెట్ లభించడం అంత సులభం కాదని అంటుంటారు. దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్, ఈ -టిక్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్సీటీసీ వెబ్సైట్ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్ అంటారు. దీనికి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ టిక్కెట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఐ-టిక్కెట్ విషయానికొస్తే దీనిని ప్రింట్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్ కూడా ఐఆర్సీటీసీ నుంచే బుక్ చేయాలి. ఈ తరహా టిక్కెట్ ప్రింటెడ్ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్‌ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ బుకింగ్ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్, ఐ- టిక్కెట్లలో ఏది త్వరగా కన్ఫర్మ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్, ఈ-టిక్కెట్ల కారణంగా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ ఆధారంగా టిక్కెట్ బుక్ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం. రైలు టిక్కెట్ల బుకింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్ టిక్కెట్ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్ లేదా ఈ-టిక్కెట్ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్ వెయిటింగ్, పీక్యూడబ్ల్యుఎల్, ఆర్క్యూడబ్ల్యుఎల్ల ఆధారంగా టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ వెయింటింగ్ టిక్కెట్ త్వరగా కన్పర్మ్ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్ అవుతాయి. ఈ-టిక్కెట్ వలన ప్రయోజనం ఏమిటి? ఈ- టిక్కెట్ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ట్రైన్లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది. ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే.. -
రైలు రిజర్వేషన్లో సరిదిద్దలేని పొరపాట్లివే.. పరిష్కారం ఏమిటంటే..
ఇంటర్నెట్ అన్నిచోట్లా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అన్నిపనులు ఎంతో సులభం అయ్యాయి. గతంలో ఇటువంటి పనుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ముఖ్యంగా ట్రైన్ టిక్కెట్ బుకింగ్ విషయంలో అందరికీ భారీ ఉపశమనం లభించింది. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో వయసు, జండర్ మొదలైనవాటిని తప్పుగా నమోదు చేస్తే రైల్వే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పులు దొర్లుతుండటం అనేది అందరి విషయంలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం ప్రయాణంపై పడుతుంది. ఒకవేళ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసే సమయంలో వయసు లేదా జండర్ తప్పుగా నమోదు చేస్తే ఆ టిక్కెట్ మార్చేందుకు అవకాశం ఉండదు. వీటిని సరిదిద్దే అవకాశం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదు. అయితే కౌంటర్ దగ్గరకు వెళ్లి, ఈ పొరపాటును దిద్దుకోవచ్చా లేదా అనే విషయం కూడా వెబ్సైట్లో అందుబాటులో లేదు. అలాగే పేరును పొరపాటుగా రాసినా కూడా దానిని మార్చుకునేందుకు అవకాశం లేదు. దీని గురించి రైల్వే అధికారులను సంప్రదించగా అక్రమాలను, మోసపూరిత చర్యలను అరికట్టేందుకే ఐఆర్సీటీసీ ఈ విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం ఒకరి టిక్కెట్‌పై మరొకరు ప్రయాణించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఐఆర్టీసీ విధించిన నిబంధనలను ఎవరూ అతిక్రమించలేరు. అయితే టిక్కెట్ బుకింగ్ సమయంలో పేరు, వయసు, జండర్ ఇలా ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా నమోదు చేస్తే, ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు. అలా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత సరైన రీతిలో తిరిగి టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వయసు ఒక్కటి తప్పుగా నమోదు చేసిన సందర్భాల్లో తమకు కేటాయించిన సీటును కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడి రిజర్వేషన్ సూపర్వైజర్ను సంప్రదించి, జరిగిన పొరపాటు గురించి తెలియజేయాలి. అప్పడు అతను దానిపై అధికారికి స్టాంపు వేస్తారు. అప్పుడు ఈ టిక్కెట్‌కు వయసు నిర్ధారిత పత్రాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు టిక్కెట్ నమోదులో జరిగిన పొరపాటును గుర్తించిన 24 గంటల ముందుగానే ఈ పని చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేసినా సఫలం అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. రిజర్వేషన్ సూపర్వైజర్ నిర్ణయంపై ఇది ఆధారపడివుంటుంది. ఇదేవిధంగా సంబంధిత ట్రైన్ టీటీని సంప్రదించి, తగిన ఐడెంటిటీ చూపిస్తే, ఆయన మానవత్వ దృష్టితో మీ పొరపాటును గ్రహించి, ఆ టిక్కెట్‌తో ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించవచ్చు. ఇది కూడా చదవండి: రూ. 8 కోట్లు కొట్టేసి.. ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోయింది! -
పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్
సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్‌కు అదే వర్తిస్తుంది. విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది. ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్గేట్ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. ఆటోల దూకుడుకు కళ్లెం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు. -
అనితకు టికెట్ ఇవ్వొద్దు జనసేన బిగ్ షాక్..!
-
Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే..
రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'ఆదిపురుష్' శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్' టీమ్ ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆ సీటును ఎలా ఏర్పాటు చేశారనే ఉత్కంఠ నెలకొంది. (ఇదీ చదవండి: Adipurush: దశరథుడి పాత్రలో ఎవరు నటించారో తెలిస్తే...) తాజాగా ఆ సీటుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సీటును కాషాయ వస్త్రంతో కప్పి.. హనుమంతుని ఫోటోను పెట్టి.. జై శ్రీరామ్ అంటూ చైర్‌పై రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్లో ఈ సీటుకు అభిమానులు పూజలు కూడా చేస్తున్నారు. థియేటర్ యాజామాన్యం కూడా హనుమాన్కు కేటాయించిన సీటుకు పూల మాలలతో డెకరేషన్ చేశారు. విజయవాడలోని శైలజ థియేటర్లో హనుమంతుని కోసం J1 సీటును కేటాయించారు. సినిమా ప్రదర్శన ఉన్నన్ని రోజులు ఆ టికెట్ అమ్మబడదని వారు తెలిపారు. అంతేకాకుండా సినిమా ఆడినన్ని రోజులు శైలజ ధియేటర్లో శ్రీరామునికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విటర్ రివ్యూ) -
Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్'. రేపు (జూన్ 16)న విడుదుల కానుంది. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో 'ఆదిపురుష్' టీమ్ ప్రతి థియేటర్లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించింది. ఈ నేపథ్యంలో మరికొందరు వేల సంఖ్యలో టికెట్లను కొని.. విద్యార్థులకు, పేదలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని టికెట్లు కొన్నారంటే.. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ముందుగా 10 వేల టికెట్లను కొనుగోలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ , ప్రముఖ సింగర్ అనన్య బిర్లా ఒక్కొక్కరు 10 వేల టికెట్లు బుక్ చేశారు. వాటిని పేద చిన్నారులకు ఇవ్వనున్నారు. (ఇదీ చదవండి: తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి) ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి 101 టికెట్లు ఇవ్వనున్నుట్టు ప్రకటించారు. అంటే, ఆ టికెట్ల సంఖ్య దాదాపు 1,40,000 కానుంది. మంచు మనోజ్ దంపతులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లోని చిన్నారుల కోసం 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. -
చిక్కమగళూరుకు టికెట్ అడిగితే మంగళూరుకు..
కర్ణాటక: చిక్కమగళూరుకు టికెట్ అడిగితే మంగళూరుకు టికెట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణకులకు ఇబ్బంది కలిగించిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు...కడూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 మంది తెలుగువారు ఎక్కారు. వీరు గురువారం చిక్కమగళూరు దత్తపీఠకు వెళ్లటానికి కడూరులో రైలు దిగి, అక్కడ నుంచి మంగళూరు బస్సు ఎక్కి చిక్కమగళూరుకు టికెట్ తీసుకున్నారు. అయితే కండక్టర్ మంగళూరుకు టికెట్ ఇచ్చి దత్తపీఠం భక్తులకు మోసం చేశాడు. చిక్కమగళూరుకు రూ. 45 చార్జీ ఉండగా మంగళూరుకు రూ. 202 తీసుకున్నాడు. కేవలం 40 కి.మీ ఇంత చార్జీ అవుతుందా అని ప్రయాణికులు ప్రశ్నించారు. చిక్కమగళూరులో దిగుతుండగా 18 మంది నుంచి టికెట్ వాపస్ ఇవ్వాలని అడగటంపై ప్రయాణికులు కండక్టర్‌పై ఆక్రోశం వ్యక్తం చేశారు. -
ఇదేంటి బాబూ.. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు.. అసలేం జరుగుతోంది?
ఆత్మకూరు: తన పాత విద్యను చంద్రబాబు మరోసారి ఆత్మకూరు నియోజకవర్గ నేతలపై ప్రయోగిస్తున్నారు. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు పొడుస్తున్నారు. పార్టీని అంటి పెట్టుకొని ఉన్న ఆ ముగ్గుర్నీ కాదని.. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తికి పగ్గాలు అప్పగించబోతున్నారు. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హాట్ టాపిక్ గా మారింది. ఆత్మకూరు టీడీపీలో ఏం జరుగుతుంది? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీని నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని కృష్ణయ్య, గుటూరు కన్నబాబు టీడీపీ పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. బొల్లినేని కృష్ణయ్య గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గుటూరు కన్నబాబు స్థానికంగా టీడీపీలో పనిచేస్తున్నారు. అయితే టీడీపీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణ అసలు లేదనే విషయం అందరికీ అర్థమవుతోంది. విషయం గ్రహించిన మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డారు. ఇంచార్జీ లేకపోవడం.. నేతలు పార్టీ వీడుతుండటంతో వారి క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. పార్టీ కుప్పకూలిపోవడంతో ఆత్మకూరు నియోజకవర్గానికి నాలుగేళ్లుగా ఇంచార్జీనే నియమించలేకపోయారు. బొల్లినేని కృష్ణయ్య లేకపోయినా..కొమ్మి లక్ష్మయ్య, కన్నబాబు పార్టీ జెండాను మోస్తున్నప్పటికీ వారి నాయకత్వం మీద చంద్రబాబుకు గురి కుదరడంలేదట. పైగా వీళ్లిద్దరూ సొంత సామాజికవర్గమే కనుక ఎక్కడికీ పోయే అవకాశం లేదని.. వారిని అసలు పట్టించుకోవడంలేదని సమాచారం. చంద్రబాబు తీరుపై కమ్మ సామాజిక వర్గం నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే చర్చ ఆత్మకూరులో జరుగుతోంది. మరోవైపు లోకేష్ పాదయాత్రకు సంఘీబావ ర్యాలీలో వర్గ విభేదాలు బయటికొచ్చాయి. ఇదీ చదవండి:కోడెలకు అన్యాయం చేస్తున్నారు నియోజకవర్గంలో పార్టీని అంటి పెట్టుకుని ఉన్న కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కన్నబాబు, బొల్లినేని కృష్ణయ్యలను కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనం రామనారాయణ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఆత్మకూరులో జరుగుతుంది. ఇప్పటికే అనంకి లైన్ క్లియర్ అయిందనే టాక్ నడుస్తోంది. ఆనం కూడా తన పాత పరిచయాలను కలుపుకునేందుకు నియోజకవర్గాన్ని చుట్టబెట్టేస్తున్నారు. శుభ కార్యాలకు వెళ్తూ అందరికీ టచ్‌లో ఉండమని ఆనం రామనారాయణరెడ్డి తన అనుచరులకు చెబుతున్నారట. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డికి ఇంచార్జీ పదవి, టిక్కెట్ ఇచ్చేందుకే చంద్రబాబు వేచి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే గుటూరు కన్నబాబు వర్గం పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆత్మకూరులో పాత తరం నేతలకు, ఆశావహులకు ఆనం రామనారాయణ భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి:ఏపీలో కులాల పోరు కాదు, వర్గ పోరాటమే! -
పంచ్ డైలాగ్స్ తో టీడీపీకి ఝలక్ ఇస్తున్న కేశినేని నాని..!
-
ట్రైన్ టిక్కెట్ల కేటాయింపు కసరత్తు సాగుతుందిలా..
ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 12 కోచ్‌లు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు. వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు. ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది. -
టికెట్ లేని ప్రయాణం .. రైల్వే శాఖకు కోట్లలో లాభం
-
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ సేల్ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జులై 1, 2023 నుంచి మార్చ్ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్‌ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్ కోసం జూన్ 10 తేదీలోపు స్పైస్‌జెట్‌కు తమ వివరాలను ఈమెయిల్ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్ బుకింగ్ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్‌జెట్ తెలిపింది. స్పైస్‌మ్యాక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్‌తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54 — SpiceJet (@flyspicejet) May 23, 2023 -
హజ్ యాత్ర అదనపు భారం ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారిపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల 1,813 మంది హజ్ యాత్రికులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. హజ్ యాత్రికుల అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. హజ్ యాత్ర ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని హజ్ కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే వారికంటే గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులు ఒక్కొక్కరిపై రూ.80 వేల అదనపు భారం పడుతుందన్నారు. ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ కేంద్ర విమానయాన మంత్రిత్వ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారన్నారు. సీఎం ఆదేశాలతో ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి తాము సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు టికెట్ ధర నిర్ణయించాలని కోరినట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మంత్రిత్వ శాఖలు నిస్సహాయత వ్యక్తంచేశాయని తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చి, ఉత్తర్వులు జారీ చేశారని, నిధులు కూడా విడుదల చేశారని వివరించారు. దీనిద్వారా సీఎం వైఎస్ జగన్ ముస్లిం పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు : ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్ హజ్ యాత్రికుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల టూర్ ప్యాకేజీ కేంద్ర హజ్ కమిటీ నిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హజ్ కమిటీకి సంబంధం ఉండదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. ఏపీ హజ్ యాత్రికులపై అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. జూన్ 7 నుంచి 22వ తేదీ వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. ముస్లిం మైనార్టీల విషయంలో ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుచాటుకుంటున్నారన్నారు. ఇప్పటికే కడపలో హజ్ హౌస్ ఆధునీకరణ చేపట్టిన ప్రభుత్వం తాజాగా విజయవాడ సమీపంలో రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం ముస్లింలకు సంతోషం కలిగించే విషయమని తెలిపారు. -
TSRTC: మహిళలకు శుభవార్త.. రూ.80కే సిటీ మొత్తం చుట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అనూహ్య స్పందన ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ''సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్ అందించాలని సంస్థ నిర్ణయించింది." అని వారు పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. (చదవండి: TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!) -
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్
సాక్షి, అమరావతి: కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశాఖ గదులను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్ వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆలయం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చు. తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్లైన్లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్లైన్లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్లైన్ సేవలు ఈ వెబ్‌పోర్టల్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
ఢిల్లీ వెళ్లిన కర్ణాటక మాజీ CM జగదీష్ షెట్టర్
-
హాసన్ విషయంలో నా వైఖరి మారదు
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు. -
టీటీ వర్సెస్ పోలీస్: ట్రైన్ ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదు!
రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు బృందం పట్టుబడింది. టిక్కెట్ కలెక్టర్ తనిఖీ చేయడానికి వస్తూ..వారిని టిక్కెట్ చూపించమని అడగగా.. బెదిరింపులకు దిగారు. దాదాగిరి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైలులో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించి మరీ ఈ పోలీసు బృందం కూర్చొన్నారు. ఐతే ఇంతలో టిక్కెట్ కలెక్టర్ వచ్చి టిక్కెట్లు గురించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఆ పోలీసు బృందం టిక్కెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికుల సీట్లను ఆక్రమించారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ వారిని ఈ విషయమై నిలదీయగా..రకరకాలుగా బెదిరింపులకు దిగడం, దాదాగిరి చేయడం వంటివి చేశారు. ఐతే టీటీ కూడా ఏమాత్రం తగ్గకుండా వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దాదాగిరి చేసేందుకు రైలు ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. దీంతో ఆ పోలీసులు ఇక చేసేది లేక అలా నుంచునే ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ పవర్ ఉపయోగించడం కుదరదు. అది కూడా నిజాయితీగా తమ డ్యూటీని నిర్వర్తించే వారి వద్ద అస్సలు కుదరదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఐతే ఈ విషయంపై స్పందించిన సంబంధిత రైల్వే పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు నివేదించినట్లు తెలిపారు. …तू शेर तो मैं सवा शेर.. A team of @Uppolice at receiving end from an empowered senior citizen passenger who objected the ‘दादागिरी’ of men in uniform. A regular in trains crossing UP where reserved passengers are intimidated to share space @RailMinIndia pic.twitter.com/ZJUiDicnCv — Deepak Kumar Jha (@journalistjha) March 13, 2023 (చదవండి: భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్) -
ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు..చివరకు..
బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్‌కే వదిలేసి వెళ్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్‌కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విషయం రూపాయి గురించే కాదు.. అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. చదవండి: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు.. -
పఠాన్ టికెట్ ఇప్పించండి.. లేదంటే చచ్చిపోతా: షారుక్ ఫ్యాన్ ఆవేదన
పలు వివాదాల తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ పఠాన్ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతోంది. హై వోల్డేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందిన ఈ మూవీ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు అయిదేళ్ల తర్వాత షారుక్ వెండితెరపై సందడి చేయబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాద్షా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుక్ వీరాభిమాని ఓ వీడియో షేర్ చేశాడు. తనకు పఠాన్ మూవీ టికెట్ ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రియాన్ అనే అభిమాని ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఈ మేరకు అతడు ట్విటర్లో వీడియో షేర్ చేశాడు. ‘నేను షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని. ఐ లవ్ మై షారుక్. జనవరి 25న నేను పఠాన్ మూవీ చూడాలి, షారుక్‌ను కలవాల్సిందే. కానీ సినిమా టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్ నాకు ఎవరైనా సాయం చేయండి. పఠాన్ మూవీ టికెట్ పంపించండి. ప్లీజ్ భయ్యా నాకు మద్దతు ఇవ్వండి. లేదండే ఈ పౌండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరి అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ వల్ల ఈ దేశానికి, నీ కుటుంబానికి ఏం ఉపయోగం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్నే పొగొట్టుకునేందుకు సిద్దపడ్డావు. ఈ సినిమా వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదేం నీకు గుర్తింపు, గౌరవం ఇవ్వదు. సినిమాకు వినోదంలా మాత్రమే చూడండి’ అంటూ కామెంట్ చేయగా ‘మీరు ఎక్కడ ఉంటారు భయ్యా.. నేను మీకు సాయం చేస్తాను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మరి ఇంత డ్రామా చేయకు’ అంటూ ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. కాగా పఠాన్ మూవీ టికెట్లు ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుక్ అయినట్లు ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. #Pathaan plz support me friends plz Pathaan 1 tickets plz help 😭😭 #PathaanMovie #PathaanFirstDayFirstShow pic.twitter.com/1ue59cw2OJ — Riyan (@Riyan0258) January 19, 2023 -
అంతా అయిపోయింది.. అమ్మకానికి కావలి టీడీపీ టికెట్.. ఆయన పరిస్థితేంటో?
వరుస ఓటములు.. పటిష్ట నాయకత్వ లేమితో కకావికలమైన కావలి టీడీపీ టికెట్‌ను ఆ పార్టీ అమ్మకానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చతికిలపడిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తిగా అంతర్థానం అయినట్లే అనిపిస్తోంది. నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ తన స్వగ్రామంలోనే రాజకీయ పరిపతి లేని ఒక ఫైనాన్షియర్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. అయితే సదరు నేతను కార్యకర్త నుంచి పార్టీ షాడో లీడర్ వరకు ఆసాంతం నాకేశారు. తాజాగా షాడో ఇన్చార్జి పెట్టుబడిదారులతో బేరసారాలు మొదలు పెట్టిన విషయం తెలుసుకుని సదరు ఇన్చార్జి గొల్లుముంటున్నాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కావలి నియోజకవర్గం టికెట్‌ను పెట్టుబడిదారులకు బేరం పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలకంటే 2019 ఎన్నికలకు మరింతగా బలపడిన వైఎస్సార్సీపీ తాజాగా క్షేత్రస్థాయిలో ఎదురులేని స్థాయిలో వేళ్లూనుకునిపోయింది. ఇదే సమయంలో వరుసగా రెండు దఫాలు ఓటమిని చవిచూసిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో బలమైన నేత లేకపోవడం చూస్తే ఆ పార్టీ స్థాయిని తెలియజేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై పైచేయి సాధించేందు డబ్బులు కుమ్మరించే పెట్టుబడిదారుడి కోసం వెతుకుతోంది. ఫైనాన్షియర్‌కు నియోజకవర్గ బాధ్యతలు ఏడాదిన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పూర్తిగా ప్రాభవం కోల్పోయిన టీడీపీ కావలి నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ కార్యకర్తలకు పెట్టుబడిదారుడిగా ఉండే నేత కోసం అన్వేషణ చేసింది. నియోజకవర్గంలోని దగదర్తి మండలానికి చెందిన గ్రామ స్థాయిలో కూడా రాజకీయ పరిపతి లేని వ్యక్తిని ఇన్చార్జిగా నియమించింది. ఫైనాన్షియర్ అయిన ఆయన ఏడాది కాలంగా కార్యకర్తల నుంచి నియోజకవర్గ షాడో ఇన్చార్జి వరకు వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడంలో తన శక్తి మేరకు పాకులాడుతున్నాడు. సదరు నేత రాజకీయంగా స్వగ్రామంలోనే విఫల నేత అని తెలిసినా.. ఏదోక రకంగా పార్టీ నావను నడిపించాలని పార్టీ అగ్ర నాయకత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఔత్సాహికులకు షాడో నేత గాలం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కావలి నియోజకవర్గానికి చెందిన షాడో నేత కావలి టీడీపీ టికెట్ ఇప్పిస్తానని ఔత్సాహికులకు గాలం వేస్తున్నట్లు సమాచారం. గడిచిన రెండు దఫాల సార్వత్రిక ఎన్నికల్లో కావలి టికెట్ ఆశించి చివరి క్షణంలో భంగపడిన సదరు నేత, ఆ పార్టీ వరుస ఓటములతో నియోజకవర్గానికి షాడో నేతగా మారారు. పార్టీని కాపాడుతున్నానని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేస్తూ.. రాజకీయాలు నెరుపుతున్న ఆ షాడో నేత రాజకీయ ఖర్చులకు ప్రస్తుత ఇన్చార్జిని వాడేసుకుని, తాజాగా కొత్త వ్యక్తులకు టికెట్ ఇప్పిస్తానని బేరం పెట్టినట్లు రాజకీయ గుసగసలు ఇప్పుడు కావలి టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. కావలిలో ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నేతలకు తప్ప కార్యకర్తలకు కనీసం అందుబాటులో ఉండని సదరు షాడో ఇప్పుడు పార్టీ శ్రేణులను మభ్యపెట్టిందుకు ఇటీవల కావలిలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పతనం కావడానికి మాజీనే కారణమని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కావలి టీడీపీకి సమర్థ నాయకుడు కావాలంటూ ఇన్చార్జిగా ఉన్న నేత ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికి సమర్థవంతుడు కాదనే భావం కలిగేలా ఆయన నాయకత్వాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తం మీద ‘కావలి టీడీపీ టికెట్ ఫర్ సేల్’ అనే ట్యాగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పకనే చెబుతోంది. మనస్తాపంలో టీడీపీ ఇన్చార్జి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ అధికార పార్టీపై పైచేయికి సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు ధనవంతులైన ఆశావహుల పేర్లను సర్వే టీమ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏడాదిగా తన శక్తికి మించి కావలిలో పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ పార్టీ అగ్ర నాయకత్వం తనను గుర్తించకపోవడం, రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న తనను కాదని మరొకరికి అవకాశం కల్పించామన్నారనే విషయం తెలిసి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. -
బాహుబలి నాయకుడికి..మొండి చేయి చూపిన బీజేపీ
గుజరాత్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాహుబలి నాయకుడిగా పేరుగాంచిన మధుబాయ్ శ్రీవాస్తవ్‌కి బీజేపీ అధిష్టానం మొండిచేయి చూపింది. ఆయన ఈసారి నామినేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో బీజేపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శ్రీ వాస్తవ్ ఇండిపెండింట్‌గా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఏమి చేయలేరని, అంతా ఢిల్లీలోని అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని అన్నారు. శ్రీ వాస్తవ్ 2002 గుజరాత్ అల్లర్ల కేసులో స్థానికి బలమైన రాజకీయ నాయకుడిగా పేరొందాడు. తనకు టిక్కెట్ నిరాకరించడంతో ప్రధాని మోదీని, అమిత్‌షాను ఇక కలవలేదని చెప్పారు. తాను 1995లో స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడంతో నరేంద్ర మోదీ, అమిత్‌షాలు తనను పార్టీలో చేరాలని అభ్యర్థించారని, అదువల్లే బీజేపీలోకి చేరానని చెప్పారు. తన కుటుంబ సభ్యులంతా ఇతర పార్టీల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో బీజేపీ కార్యకర్త అని, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అప్పుడూ రాష్ట్ర స్థాయి నాయకుడని అన్నారు. ఆయన స్థానంలో టిక్కెట్ పొందిన వదోదర జిల్లా బీజేపీ చీఫ్ అశ్విన్ పటేల్ స్థానిక ఎన్నికల్లో కూడా గెలవలేదని విమర్శించారు. తనపట్ల బీజేపీ చూపించిన వైఖరికీ చాలా కలతా చెందానని ఆవేదనగా చెప్పారు. ఐతే శ్రీవాస్తవ్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీని కలవడానికి నిరాకరించిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరని అధికారిక వర్గాల సమాచారం. కానీ శ్రీ వాస్తవ్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈసారి బీజేపీ గుజరాత్లో మొత్తం 282 సీట్లలో 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఐదుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్‌తో సహా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది. -
టిక్కెట్ ఇవ్వలేదని.. టవర్ ఎక్కిన ఆప్ నేత..
-
కాణిపాకం వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన
-
బీసీలకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ పెడతా: జాజుల
మునుగోడు: త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రానున్న 2023 ఎన్నికల ముందు బీసీల పార్టీ పెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బీసీల ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లు, మరో 30 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారని, అందువల్ల బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీలకు టికెట్ ఇస్తే గెలవరని చెబుతున్నారని, మంత్రి పదవులు చేసిన అభ్యర్థులను ఓడించిన చరిత్ర బీసీలకు ఉందని జాజుల గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రాకు చెందిన నెల్లూరు ఆడబిడ్డకు ఎలా ఇస్తారని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలా తయారైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీల పార్టీ పెట్టి తాను మునుగోడు నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీసీల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరం కోసం పోరాడుతానని జాజుల వెల్లడించారు. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలని ఆయన కోరారు. -
అయ్యో.. రైలు టిక్కెట్ ఉన్నా ఫైన్ కట్టారు!
కొరుక్కుపేట(చెన్నై): రైలు ప్రయాణికులు టిక్కెట్లు తీసుకుని ముందుగానే ప్లాట్ఫారానికి వెళ్లి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే రైలు టిక్కెట్ ఉన్నా ప్లాట్ ఫామ్ మారడంతో రైల్వే అధికారులు జరిమానా విధించిన ఘటన చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగింది. దీంతో ప్రయాణికులు కంగుతిన్నారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5 గంటలకు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఆరుగురితో కూడిన ఒక కుటుంబం రైలు ఎక్కాల్సిన ఫ్లాట్ ఫామ్ బదులుగా వేరే ప్లాట్ ఫారానికి వెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇన్స్పెక్టర్లు, ఎగ్జామినర్లు జరిమానా విధించారు. దీంతో ప్రయాణికులు ఎంత వేడుకున్నా టిక్కెట్ ఇన్‌స్పెక్లర్లు వదల్లేదు. మహిళా ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అరగంట పాటు హడావుడి నెలకొంది. జరిమానా కచ్చితంగా కట్టాలని చెప్పటంతో చివరికి రూ.1040 జరిమానా చెల్లించి ట్రైన్ ఎక్కారు. చదవండి: వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే! -
ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....
యూఎస్‌లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్‌ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు. ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్‌మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్‌కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్‌ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్‌కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది. అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్లలోనూ, గ్యాస్స్టేషన్లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
Telangana RTC: తెలంగాణ ఆర్టీసీకి గి‘రాఖీ’.. భారీగా ఆదాయం.. ఏకంగా..!
సాక్షి, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రోజువారీ టికెట్ ఆదాయం రూ.20 కోట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ అనుకున్నది సాధించింది. ఆగస్టు చాలెంజ్ పేరుతో తనకు తాను సవాలు విసురుకుని దాన్ని అధిగమించి చూపింది. రాఖీ పౌర్ణమి రోజు టికెట్ రూపంలో ఏకంగా రూ.20.10 కోట్ల ఆదాయాన్ని పొంది ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఆర్టీసీలో ఓరోజు టికెట్ ఆదాయం రూ.21 కోట్ల రికార్డు కాగా, ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ టీఎస్ఆర్టీసీ ఒక్కటే దానికి అతి చేరువగా వచ్చి సత్తా చాటింది. ఇదే రోజు అటు ఏపీఎస్ఆర్టీసీ రూ.19.79 కోట్ల ఆదాయాన్ని పొందింది. విస్తృత పరిధి ఉన్న ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ ఆదాయాన్ని పొంది టీఎస్ఆర్టీసీ కొత్త మైలురాయిని దాటింది. ఈ నెల 12న 38,76,824 మంది ప్రయాణికులను బస్సులు గమ్యస్థానాలకు చేర్చాయి. ఏకంగా 35.54 లక్షల కి.మీ. మేర బస్సులు తిరిగాయి. ఎన్నడూలేనట్టు కి.మీ.కి రూ.56.56 చొప్పున ఆదాయాన్ని సంస్థ నమోదు చేసుకుంది. వెరసి 86.84 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.8.79 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.84 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల ఆదాయం సమ ూరింది. రాఖీ పౌర్ణమితో పాటు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బస్సులు కిటకిటలాడాయి. ముందుగానే ఈ రద్దీని ఊహించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉద్యోగులకు ఆగస్టు ఛాలెంజ్ పేరుతో లక్ష్యాన్ని నిర్ధారించారు. -
అది వేసుకుని వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్...ఐతే
ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్ షర్టు లేదా షార్ట్స్ వంటి ఇతర ఫ్యాషెన్ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు బంగ్లాదేశ్‌లోని సమాన్ అలీ సర్కార్ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్ రాజధాని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్ థియేటర్లో 'పురాణ్' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది. దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్ థియేటర్ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. (చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా) -
‘పల్లెకు టికెట్ ఇస్తే పనిచేయం’
అనంతపురం (పుట్టపర్తి టౌన్): వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పనిచేసేది లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ మాజీ కార్యవర్గ సభ్యుడు పెద్దరాసు సుబ్రహణ్యం స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి వ్యవహార శైలితో నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవుతోందని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, సీనియర్ నాయకులకు వెన్నుపోటు పొడిచారన్నారు. కియా వద్ద, అనంతపురం పట్టణాల్లో 1,300 ఎకరాలు, రూ. 4 వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి కానీ పల్లె ఆస్తులపై ఈడీ ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. తమకు ఒక్క కళాశాల ఉంటే సీ గ్రేడ్‌లో ఉందని, పల్లెకు 40 కాలేజీలు ఉంటే అన్నీ ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ ఏ లోటు లేకుండా అందుతోందన్నారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అవకాశం కల్పిస్తే అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తామని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో, ప్రత్యామ్నాయం ఎంచుకోవడమో చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారాదప్ప, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంకు తొలి టిక్కెట్టు కొనుగోలు చేసిన ప్రధాని మోదీ