rgv
-
ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ. ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్, అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. -
RGVకి నోటీసులు ఇస్తే.. పవన్ కళ్యాణ్‌కు ఇవ్వరా?
-
హైకోర్టులో ఆర్జీవీకి భారీ ఊరట!
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదేళ్ల క్రితం(2019)లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఏం జరిగింది?2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'(kamma rajyam lo kadapa reddlu) పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పిటిషన్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆ సినిమాతో రూ. 40 వేలు కాస్త రూ. 40 లక్షలు అయింది: అభిమన్యు
‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యు సింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు. అలా ఆయనకు తెలుగులో భారీగా ఛాన్సులు దక్కించుకున్నాడు. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. అందులో బుక్కారెడ్డిగా వణుకు పుట్టించాడు. ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని అభిమన్యు నిరూపించకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. తన రెమ్యునరేషన్‌తో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.2001లోనే అభిమన్యు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2010లో ఆర్జీవీ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. రక్తచరిత్రలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపుతుంది. సినిమా చూసే వారిలో భయాన్ని నెలకొలుపుతుంది. అలా తన నటనతో దుమ్మురేపాడు. ఆపై 2017లో అతను ఏకంగా శ్రీదేవితో కలిసి మామ్ చిత్రంలో నటించాడు. హిందీ చిత్రాలలో కనిపించడమే కాకుండా, ఆయన తమిళం, తెలుగు భాషా చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం పవన్ ఓజీలో చాలా కీలక పాత్రలో అభిమన్యు ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.మొదటి రెమ్యునరేషన్'నేను నటించిన మొదటి సినిమా (అక్స్) కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 12 వేలు మాత్రమే. చాలా ఏళ్ల పాటు ఒక సినిమాకు రూ. 20 వేల లోపే ఇచ్చేవారు. కానీ, రక్తచరిత్ర సినిమాకు రూ. 40 వేలు ఇచ్చారు. ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీలో నటించాను కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌లో ఛాన్స్ వచ్చింది. నేను డబ్బును నమ్ముకోలేదు. అందువల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చాను. గబ్బర్ సింగ్ కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు. దీంతో లైఫ్ మొత్తం మారిపోయింది. అలా 2010లో తొలిసారి ఎక్కిన కార్వాన్ 2025 వచ్చినా సరే నేను ఇంకా దిగలేదు. ఆ రెండు సినిమాలు నా జీవితంలో అంతలా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఓజీలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పుడు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని తెలిపాడు.చీపురుతో ఫ్లోర్లు ఊడ్చేవాడుఅభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు. ‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్. ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి. పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అలా ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
విచారణకు వర్మ టైం అడిగారు
-
అధికారులను విసిగించేలా ఈనాడు తీరు..
-
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ
-
సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్‌ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్మనోజ్ బాజ్‌పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే? -
రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష
ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరి మెజిస్ట్రేట్.. ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితంనాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దర్శకుడు విచారణకు గైర్హాజరవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు ఇప్పటిది కాదు! 2018లో రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మశ్చీంద్ర మిశ్రా తరపున శ్రీ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్‌లో వర్మ ఈ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.వర్మ రియాక్షన్దీనిపై వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఏడేళ్లనాటి కేసు. నా దగ్గర పని చేసిన మాజీ ఉద్యోగితో రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. ప్రస్తుతం మా లాయర్లు ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అన్నాడు. With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025 చదవండి: ‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో సత్య ఒకటి. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలైంది.ఎవర్నీ పట్టించుకోకుండా ఏడ్చేశా..రీరిలీజ్ సందర్భంగా సత్య సినిమాను వీక్షించిన దర్శకుడు ఆర్జీవీ (Ram Gopal Varma) భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రెండు రోజుల క్రితం సత్య సినిమా చూశాను. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లాగలేవు. నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా ఏడ్చేశాను. సినిమా చూసి ఎమోషనలవలేదు. సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాను.సినిమా అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిదేఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే! సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందనేది తెలియదు. షూటింగ్ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో చెప్తూ ఉంటారు. నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించాను. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. నా కన్నీళ్లకు కారణం..అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమా (Satya Movie)ను బెంచ్‌మార్క్‌గా తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు. నేను సినిమాలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చేశాను. సత్య సినిమాతో నన్ను నమ్మినవారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. రంగీలా, సత్య సినిమా సక్సెస్ వల్ల నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్‌ను కోల్పోయాను. కళ్లకు గంతలు కట్టుకున్నా..తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు, అసభ్యకరమైన ప్రదర్శనలు.. ఇలా అర్థంపర్థం లేని ప్రయోగాలు చేశాను. అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెసయ్యాయి. కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. చిత్రపరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నాను. నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను. ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్‌ను కాళ్ల కిందే తొక్కిపెట్టాను. తప్పుల్ని సరిదిద్దుకోలేనుఅప్పుడే నా పతనం మొదలైంది. నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది! సత్యలాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. దీనర్థం నేను సత్యలాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు. ఇకపై ఆ రూల్ పాటిస్తాజానర్ ఏదైనా సరే, తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట ప్రతి సినిమాపై చూపిస్తాను. సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవరూ అడగలేదు. కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం. అందుకే మళ్లీ నేను వెనక్కు వెళ్లాలనుకుంటున్నాను. ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను. ఇదేదో ముందు నుంచీ పాటించుంటే చాలావరకు నా సినిమాలు వచ్చేవే కాదు.ఒట్టేసి చెప్తున్నా..ప్రతి దర్శకుడికి ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నాను. చివరగా నా జీవితంలో మిగిలిన భాగం.. సత్యలాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తానని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఆర్జీవీ కొత్త వర్షన్ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. A SATYA CONFESSION TO MYSELF —— Ram Gopal Varma By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see The tears were not…— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025 చదవండి: Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు.. -
ఈ వీడియో బయటకు రాగానే మీ అందరి మీద కేసు పెడతారు..
-
రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్ లీగల్ నోటీసులు
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
అల్లు అర్జున్ అరెస్ట్ పై RGV కామెంట్స్
-
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆర్జీవీపై ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ
-
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్‌కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్‌కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
RGV: తొమ్మిది చోట్ల కేసులు పెట్టారు..
-
RGV: రామ్ గోపాల్ వర్మను ఈడ్చుకుని వెళ్లారు... వినడానికి నాకు బాగుంటుంది
-
గుర్తుపెట్టుకోండి! రాబోయేది మేమే వడ్డీతో ఇస్లాం
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సోషల్ మీడియా పోస్టులపై కేసులో విచారణకు వచ్చామంటూ హల్ చల్
-
RGV పై అక్రమ కేసు.. లోకేష్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
హైదరాబాద్ లో ఆర్జీవీ కి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్న (ఫొటోలు)
-
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
'అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెంట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.Her GUN was aimed at @KTRBRS and she SHOT @iamnagarjuna and @chay_akkineni and APOLOGIED to @Samanthaprabhu2 ..I DOUBT even ALBERT EINSTEIN can decipher this EQUATION 😳😳😳— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2024 -
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
ఆర్జీవీ 'శారీ' సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ విడుదల
కాంట్రవర్సీ టాపిక్స్‌తో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ విడుదల కానుంది. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది. -
ఉద్వేగం సినిమా టీజర్‌ని RGV విడుదల చేశారు
-
స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ నిర్మాత శ్రావ్య వర్మ నిశ్చితార్థం చేసుకుంది. ప్రపంచ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఈమెతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా శనివారం రాత్రి ఈ విషయాన్ని వీళ్లిద్దరూ బయటపెట్టారు. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఐశ్వర్యరాయ్‌తో విడాకుల రూమర్స్.. వైరల్‌గా డీప్ ఫేక్ వీడియో!)బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా శ్రీకాంత్ తెలుగు వాళ్లందరికీ తెలుసు. ఇక శ్రావ్య వర్మ విషయానికొస్తే.. దేవదాసు, చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. అలానే కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించింది.మరీ ముఖ్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాకు దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ.. తన మేనకోడలు అని చెప్పి శ్రావ్య వర్మని పరిచయం చేశాడు. ఈ చిత్రానికి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినట్లు అప్పట్లో వెల్లడించాడు. శ్రావ్య ఇన్ స్టా ప్రొఫైల్ చూస్తే ఆమె ఎవరెవరికి కాస్ట్యూమ్ డిజైన్ చేసిందనేది మీకు తెలుస్తోంది. ఏదేమైనా నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పిన కొత్త జంట.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత ఎంగేజ్మెంట్.. వాలైంటెన్స్ డే వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Srikanth Kidambi (@srikanth_kidambi) -
ఆ సినిమాలు డేంజర్, అలాంటివాటి జోలికి వెళ్లడం అవసరమా?: ఆర్జీవీ
ఇతిహాసాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాగని అన్నీ ఆదరణకు నోచుకోలేదు. అందుకు ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే పురాణాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన మైథాలజీ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీని సినీప్రియులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలో కల్కికి సీక్వెల్ కూడా రానుంది.డేంజర్ఇదిలా ఉంటే బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రామాయణ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. పురాణాల మీద సినిమాలు తీయడం డేంజర్.. ఎందుకంటే వాటి గురించి జనాలకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాన్ని మీరు మరోలా చూపిస్తే అది బెడిసికొడుతుంది. పైగా పురాణాల్లో పేర్కొన్న వ్యక్తులను మన దేశంలో దేవుళ్లుగా పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అలాంటి సాహసాలు చేయలేము.ట్రోలింగ్ ఎక్కువ..ఒకప్పుడు బాబూభాయ్ మిస్త్రీ.. సంపూర్ణ రామాయణ వంటి పౌరాణిక సినిమాలు తీశాడు. ఎన్టీ రామారావు కూడా అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. వాటిని ఇప్పటికీ అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. వాళ్ల వేషధారణను చూసి చేతులెత్తి మొక్కుతారు కూడా! అదే ఆదిపురుష్‌ను తీసుకోండి. అందులో లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్ లుక్, హనుమాన్ లుక్ మీద ఎంత రచ్చ జరిగిందో.. ఇలా పదేపదే విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఈ తరహా జానర్‌పై సినిమాలు తీయడం చాలా డేంజర్.చూసే విధానమే మారిపోయిందినేనేమంటానంటే.. కొత్త కథను తీసుకుని దానికి రామయణ అనే పేరు పెట్టకుండా తీయండి. ఇప్పుడు ఆదిపురుష్.. ప్రభాస్ సినిమా అంటే జనాలు ఒకలా ఆలోచిస్తారు. అది రామాయణం అంటే జనాల ఆలోచన మరోలా ఉంటుంది. ఇలాంటి సున్నిత అంశాల జోలికి వెళ్లడం అవసరమా? ఏదేమైనా ధైర్యం చేసి మరీ ఇలాంటి మూవీస్ తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నవారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అన్నాడు.చదవండి: తన సినిమా చూసి షాకైన డైరెక్టర్.. తనకు తెలియకుండానే మార్చేశారు! -
'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్‌లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
పుష్ప పాటకు RGV డ్యాన్స్
-
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024 -
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్‌డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్‌పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
ఆర్జీవీ యువర్ ఫిల్మ్
దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ‘యువర్ ఫిల్మ్’ అంటూ ఓ కాన్సెప్ట్‌ను క్రియేట్ చేశారు. ప్రేక్షకులే ఓ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే విధానానికి శ్రీకారం చుడుతూ ఆర్జీవీడెన్.కామ్ అనే వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు ఆర్జీవీ. ఈ వెబ్సైట్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, క్లుప్తంగా సినిమా కథాంశం వంటి వివరాలను ఉంచుతారు. ఆడిషన్స్ ఇచ్చే వారి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆడిషన్స్‌లో ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే, వారు ఆ ప్రాజెక్ట్‌కి ఫైనలైజ్ అవుతారు. అలా ఫైనల్ అయినవారితో ఆరు నెలల్లో సినిమా నిర్మిస్తారట రామ్‌గోపాల్ వర్మ. ఆర్జీవీ డెన్ ద్వారా భాషతో సంబంధం లేకుండా ఈ ఎంపిక జరుగుతుందని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
హీరో, హీరోయిన్, డైరెక్టర్.. మీరు సెలక్ట్చేసినవారితో సినిమా!
రామ్‌గోపాల్ వర్మ ఐడియాలే వేరు! సినిమా కథను ఆన్లైన్లో పెట్టి.. అందులో ఎవరు నటిస్తే బాగుంటుందనేది ప్రేక్షకులు నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? మెజారిటీ ఓటింగ్‌ను ప్రాతిపదికలోకి తీసుకుని అదే తారాగణంతో సినిమా వస్తే.. ఐడియా అదుర్స్ కదూ! దీన్ని రియాలిటీలో చేసి చూపిస్తానంటున్నారు వర్మ. ఆర్జీవీ డెన్ వేదికగా శనివారం నాడు ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా తీస్తారు. ఆర్జీవీ నిర్మాతగా దాన్ని ఆరు నెలల్లో తీసి రిలీజ్ చేస్తారు. సినిమా కథనీ RGV వెబ్సైట్లో (rgvden.com) ఒక రెండు లైన్లలో పెట్టి, ఆ కథ లైను నచ్చిన యాక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారిని.. ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుంచి 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్కులను బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరినీ ప్రేక్షకులే ఎన్నుకుంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం.. అలానే ప్రెక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా. To know how to involve the audience in the making of a film , Click https://t.co/4u0rJD7Jn3 YOUR FILM concept #RgvYourFilm pic.twitter.com/MVSoiUFtXU — Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2024 -
Aaradhya Devi HD Photos: హాట్ లుక్స్ తో ఆర్జీవి ‘శారీ’ భామ (ఫోటోలు)
-
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ
-
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆసక్తిర ట్వీట్ చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్’ హ్యాండిల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా. ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్ థ్రిల్లర్లుగా వ్యూహం, శపథం రూపొందించి సక్సెస్ సాధించారు ఆర్జీవీ. SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐 — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 -
థియేటర్లో సినిమా చూసిన ఆర్జీవీ.. లోకేష్‌ను అలా చూపించానంటూ..
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వ్యూహం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమాను రామధూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన పరిణామాల సమూహమే వ్యూహం. ఈ చిత్రం మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ ఎలా ఉంటాడో.. ఆదివారం నాడు ఆర్జీవీ, వ్యూహంలో సీఎం జగన్ పాత్రను పోషించిన అజ్మల్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు. అక్కడ జైరామ్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించాను. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా ఫస్ట్ పార్ట్‌లో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు. ఎన్నికలపై వ్యూహం ప్రభావం.. హీరో అజ్మల్.. సినిమాకు మంచి స్పందన వస్తోందని సంతోషించాడు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారు. గుండె ధైర్యంతో ఎవరికీ భయపడకుండా సినిమా తీశారు. వచ్చే ఎన్నికలపై సినిమా ప్రభావం ఉండబోతోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా మార్చి 8న శపథం రిలీజ్ చేయనున్నారు. Me and VYOOHAM’s JAGAN MOHAN REDDY on our way to Vijaywada to watch the film in Jairam theatre matinee show pic.twitter.com/jRE9BjD1fU — Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2024 చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
చంద్రబాబు రాత్రి లోకేష్ ని రూమ్ లోకి పిలిచి
-
'వ్యూహం' సక్సెస్ మీట్.. చంద్రబాబుపై ఆర్జీవీ సెటైర్లు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' థియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లో సక్సెస మీట్ ఏర్పాటు చేశారు. దర్శకుడు ఆర్జీవీ అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. ఇలా ముగ్గురిపై సెటైర్లు వేశారు. అలానే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా లోకేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ) 'ఆరోజు జగన్ గారు జైలు నుంచి వచ్చినట్టు నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయినందుకు హ్యాపీగా ఉంది. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారు ఫైనల్‌గా వ్యూహం రిలీజ్ అయ్యింది. సినిమాలో బిహైండ్ సీన్స్‌ని ఆడియెన్స్ చూస్తున్నారు. అసలు కంటెంట్ అంతా 'శపథం'లో ఉంటుంది. 'వ్యూహం'.. 'శపథం' సినిమాకు ట్రైలర్ లాంటిది. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుంది. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కల్యాణ్‌లకే. 'వ్యూహం' హిట్ అయింది. మరి ఇపుడు రఘురామకృష్ణం రాజు తన మాట మీద నుంచుంటాడో లేదో చూడాలి? మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్' అని దర్శకుడు ఆర్జీవీ చెప్పుకొచ్చారు. నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. 'లోకేష్ గత ఆరు నెలల నుంచి వేరే ఏ పని లేకుండా 'వ్యూహం' సినిమా ఆపడమే పనిగా పెట్టుకున్నారు. ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. లోకేష్ ఘోరంగా ఓడిపోయాడు' అని అన్నారు. (ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?) -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్‌ను నింపడం ఖాయం. -
మార్చి 2న ‘వ్యూహం' రిలీజ్
-
షర్మిల పాత్రపై క్లారిటీ ఇచ్చిన RGV
-
RGV Den: హైదరాబాద్‌కు అమితాబ్ బచ్చన్.. ఆర్జీవీ డెన్‌లో సందడి (ఫొటోలు)
-
ఆర్జీవీ డెన్‌లో అమితాబ్ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్‌ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్‌ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. (చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్) అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్(2005) సినిమా తెరకెక్కించి బిగ్ హిట్ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్కార్ రాజ్’ అనే సినిమా చేశారు. అదీ సూపర్ హిట్ అయింది. 2017లో సర్కార్ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్‌లో సందడి చేశారు. డెన్ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 తన కార్యాలయానికి వచ్చిన సర్కార్(అమితాబ్‌ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్‌లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. సర్కార్ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ సైతం ఆర్జీవీ డెన్‌లో ఆమితాబ్ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్‌లో షేర్ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్‌తో ‘వ్యూహం’ రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్ కోసమే అమితాబ్ హైదరాబాద్ వచ్చారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం కల్కీ 2898 సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది. SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
మార్చి 2న 'వ్యూహం'...RGV ఇంట్రెస్టింగ్ ప్రకటన
-
ప్రపంచ వ్యాప్తం గా వ్యూహం శపథానికి సిద్ధం! అవ్వుతున్న అభిమానులు
-
Vyuham fever @ US : అమెరికాలో వైఎస్సార్సిపి సిద్ధం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‌గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్సిపి నాయకులు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) -
బాబు కుతంత్రాలకు చెక్ పెట్టి రిలీజ్ అవుతోన్న వ్యూహం
-
ఈనెల 23న వ్యూహం సినిమా విడుదలవుతోంది-రామ్ గోపాల్ వర్మ
-
వాళ్ల బాత్రూమ్ల్లో చూస్కుంటారు!: RGV
హైదరాబాద్, సాక్షి: ఏపీ రాజకీయాల స్ఫూర్తితో పొలిటికల్ థ్రిల్లర్లుగా వ్యూహం, శపథం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు రెడీ అయ్యారు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో రాజకీయ పరమైన ప్రశ్నలు.. అలాగే సోషల్ మీడియాలో పలు అభ్యంతరాలు.. విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తాజాగా వాటికి ఓ వీడియోతో ఆయన సమాధానం ఇచ్చారు. బాక్సింగ్ రింగ్‌లో ఎంటర్ అయితే గట్టిగా గుద్దాలి. అంతేగానీ జుట్టు పీకుతా.. చెంప గిల్లుతా అనే ఆటిట్యూడ్‌తో ఉండకూడదు. అది నా ఫిలాసఫీ. వ్యూహం, శపథం సినిమాలతో నిజాన్ని బట్టలిప్పి చూపించడం అనేదే నా ఉద్దేశం కూడా. ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా.. టీడీపీ, జనసేవాళ్లు చూస్తారా? అని కొందరు అడుగుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెబుతా.. సికింద్రాబాద్‌లో లంబా థియేటర్ అనేది ఉండేది. అందులో సెక్స్ సినిమాలు ఆడేవి. సెక్స్ అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది భయం భయంతో ఆ థియేటర్‌కు వెళ్లేవాళ్లు కాదు. కానీ, నా దృష్టిలో లంబా థియేటర్ చేసింది ప్రజాసేవ. నేను పోర్న్ చూసినట్లే.. ఎవ్వరికీ తెలియకుండా టీడీపీ, జనసేన వాళ్లు బాత్రూమ్లలో కూర్చుని వ్యూహం, శపథం సినిమాలు చూస్తారు. న్యూట్రల్ వాళ్లు మాత్రం లివింగ్ రూంలో హాయిగా సినిమాలు చూసేయండి. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది.. చూస్తే చూడండి లేకుంటే లేదు అంటూ తనదైన స్టైల్లో ముగింపును ఇచ్చారాయన. My personal philosophy on @ncbn , @naralokesh @ysjagan and VYOOHAM pic.twitter.com/2NAm6f6TPr — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 అంతకు ముందు.. సీఎం జగన్ రాప్తాడు సిద్దం సభ వీడియోను పోస్ట్ చేసిన వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎండిపోయిన రాయలసీమలో.. సీఎం జగన్ సమావేశం కోసం జన సముద్రం కదిలి వచ్చిందని.. దేశంలోనే ఇప్పటివరకు ఇలాంటి జనసమీకరణ జరిగి ఉండకపోవచ్చంటూ ట్వీట్ చేశారాయన. అదే సమయంలో.. సీఎం జగన్ పంచులను.. డైలాగ్ అంటే ఇది రా అంటూ వర్మ పోస్ట్ చేశారు. ఇక ఈ ఉదయం నుంచి టీడీపీకి.. మరోవైపు జనసేనకు ట్వీట్ల రూపంలో కౌంటర్లు వేస్తూ వస్తున్నారాయన. pic.twitter.com/o3EMhMJ57S — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 🤣🤣🤣🤣 pic.twitter.com/KoKIW1DA5c — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 ఈ లెక్కన CBN సభలకి పది మందే వచ్చినట్టా?????????😳😳😳 pic.twitter.com/LrGahAZMj3 — Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024 Dialogue ante idhi ra ! 👏👏👏🙌🙌🙌😘😘😘😘💐💐💐💃💃💃😍😍😍🔥🔥🔥🙏🙏🙏💪💪💪 ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్‌ను బయట పడేయండి తాగేసిన టీ గ్లాస్ సింక్‌లో పడేయండి - సీఎం వైఎస్ జగన్ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 -
'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియెరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: Lal SalaamTwitter Review: 'లాల్ సలాం' ట్విటర్ రివ్యూ) వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
RGV వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్
-
ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్ క్లియర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను గతంలో తాత్కాలికంగా నిలువరించింది. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్ ఇవ్వాలని గతంలో కొర్టు తెలిపింది. (ఇదీ చదవండి: థియేటర్లో అలజడి రేపిన పవన్ ఫ్యాన్స్.. ఇంకెప్పుడు మారుతారో..!) కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్ బోర్డు తెలపడంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం
-
AI Video: అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు
ప్రస్తుతం టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త సాంకేతికతను అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) మరో మెట్టు ఎక్కించింది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024 తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేశారు. ఇటీవల ఆర్జీవీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అందగాడు అనే పేరు సొంతం చేసుకున్న నటుడు శోభన్ బాబుకు సంబంధిచిన రీక్రియేటెడ్ వీడియోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే! -
చంద్రబాబు అరెస్ట్..వ్యూహంలో అదిరిపోయే ట్విస్ట్..
-
ఆడిషన్‌కు వెళ్తే ఆర్జీవీ బెంచ్ మీద కూర్చోబెట్టి..: పంకజ్
కొన్నిసార్లు నిరాశ, ఓటములు కూడా మంచే చేస్తాయంటున్నాడు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి. ఓసారి రామ్‌గోపాల్ వర్మ సినిమా ఆడిషన్‌కు వెళ్తే తనను సెలక్ట్ చేయలేదని, కానీ తర్వాత మాత్రం వేరే చోట్ల ఆఫర్స్ రావడంతో కెరీర్లో ముందుకు వెళ్లానని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. 'ముంబైలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అవకాశాల కోసం తిరిగాను. అలా ఓసారి రామ్‌గోపాల్ వర్మ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికే చాలామంది ఉన్నారు. వాళ్లంతా గూండాల్లా కనిపించారు. నా ముఖమేమో చూడటానికి కాస్త అమాయకంగా కనిపిస్తుంది. అందరూ భయంకరంగా.. మరి గూండా పాత్రకు నేను సూటవుతానా? లేదా? అన్న అనుమానంతోనే లోపలకు వెళ్లాను. కొందరికైతే ముక్కు, ముఖం మీద దెబ్బ తాకినట్లుగా గాయాలు కనిపించాయి. మీరు నటులేనా? అని అడిగితే అవునన్నారు. మరి ఎందుకింత భయంకరంగా రెడీ అయి వచ్చారని ప్రశ్నిస్తే.. ఆర్జీవీ ఖతర్నాక్‌గా కనిపించేవాళ్లనే సెలక్ట్ చేసుకుంటాడని చెప్పారు. తర్వాత వర్మ నన్ను పిలిచి బెంచీ మీద కూర్చోమన్నాడు. నా ఎదురుగా కూర్చుని 10-15 నిమిషాలపాటు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. ఎవరైనా మనల్ని అదేపనిగా చూస్తే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతా మన మంచికే! కాసేపటికే అతడు నన్ను వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత మళ్లీ ఎప్పుడూ పిలవలేదు. కానీ అతడు అద్భుతమైన దర్శకుడు. మేము కలుసుకున్న ప్రతిసారి నా పనిని, నన్ను పొగుడుతూ ఉంటాడు. కాకపోతే ఆ సమయానికి మాకు సెట్ అవ్వలేదంతే! ఒకవేళ ఆరోజు ఆయన నన్ను సెలక్ట్ చేసి ఉంటే తను, నేను ఈ క్రేజ్ కోల్పోయేవాళ్లమేమో! ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. దేనికీ బాధపడకూడదు. ఏదో మంచి జరగబోతుందన్న ఆశతో బతికేయాలి' అని చెప్పుకొచ్చాడు. నాటకాల నుంచి సినిమాలకు.. కాగా పంకజ్ త్రిపాఠి.. స్కూల్లో నాటకాలు వేసేవాడు. అది కూడా అమ్మాయిల వేషాలు ఎక్కువగా వేసేవాడు. ఐటం సాంగ్స్‌కు డ్యాన్స్ చేసేవాడు. సరాదా కోసం వేసిన నటనే తర్వాత ఆయనకు జీవితంగా మారిపోయింది. బరేలీ కీ బర్ఫీ, న్యూటన్, స్త్రీ, గుంజన్ సక్సేనా వంటి పలు సినిమాల్లో నటించిన ఆయన మంచు విష్ణు 'దూసుకెళ్తా' మూవీలో విలన్‌గా నటించి తెలుగువారికీ దగ్గరయ్యాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్‌లతో మరింత క్రేజ్ తెచ్చుకుని బిజీ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అతడు 'మై అటల్ హూన్' సినిమా చేస్తున్నాడు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 19న విడుదల కానుంది. చదవండి: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్ -
నేడు సీఐడీ విచారణకు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు
-
'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా నేడు (డిసెంబర్ 29) థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాతిపదికన సెన్సార్ ఇచ్చారో తెలుపుతూ ఆ రికార్డులను కోర్టుకు అందించాలని CBFCని కోరింది. జనవరి 11 వరకు కోర్టు సమయం ఇచ్చింది. చినబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న వర్మ వ్యూహం సినిమాను అడ్డుకునేందకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ వ్యూహానికి చినబాబు లిటిగేషన్ పెట్టాడు. తప్పు చేయని వాడిపై ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికీ భయపడడు కదా..! మరి ఎందుకు చినబాబులో ఇంత భయం. తప్పు చేయకుంటే ఉలుకు ఎందుకు..? చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎవరైనా కానీ గతంలో ఏం చేశారు...? ఉన్నది ఉన్నట్లు ప్రపంచానికి చూపుతాను అని వర్మ అంటున్నాడు. అలా కాకుండా లేనివి ఉన్నట్లు సినిమాలో చూపుతే నిజం ఏంటో టీడీపీ కూడా మరో సినిమా తెరకెక్కించ వచ్చు కదా.. ఎటూ తన వర్గం వారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు వెంటే తిరుగుతున్న పవన్ కూడా పచ్చ బ్యాచ్‌లోనే ఉన్నాడు.. డబ్బుకు కొదవ లేదు, డైరెక్టర్లకు కొదవ లేదు, చేతిలో రామోజీ ఫిలిమ్ సిటీ.. ఇలా ఎన్నో చంద్రబాబు గుప్పెట్లోనే ఉన్నాయి. మా నాన్నే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని సినిమా తియొచ్చు కదా చినబాబు... గతంలో తమరి రాజకీయ జీవితంలో ఎలాంటి వెన్నుపోట్లు లేకుంటే ఒక్క సినిమా తీసి ప్రజలకు చూపించండి.. అందులో నిజం ఉంటే యాత్ర సినిమా మాదిరి సూపర్ హిట్ చేస్తారు.. లేదంటే తొక్కి పాతరేస్తారు.. ఇప్పుడు వర్మ వ్యూహం సినిమా కూడా అంతే సినిమాలో నిజం ఉంటే ఆదరిస్తారు... లేదంటే వారానికే మరిచిపోతారు... వెన్నుపోటు నుంచి బాబు కథ తెలిసిందే కదా..! వర్మ వ్యూహానికే భయపడిపోయి వ్యవస్థల ద్వారా ఎటాక్ చేసి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు చినబాబు నానాపాట్లు పడుతున్నాడు. సినిమా నచ్చితే చూస్తారు లేదంటే వదిలేస్తారు. మేము సుద్దపూసలం అని చెప్పుకుంటున్న పచ్చ బ్యాచ్ మంద.. వర్మ వ్యూహానికి ఎందుకు వణుకుతున్నారు..? గతంలో ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..? వెన్నుపోటు రాజకీయం నుంచి ఓటుకు నోటు వరకు బాబు గారి చరిత్ర తెలుగు ప్రజలకు తెలిసిందే కదా.. నారా వారి రాజకీయ చరిత్రే ఇదీ.. ఇందులో వర్మ కొత్తగా చూపించేది ఏముంది..? మహా అయితే కొత్తగా వచ్చిన ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొస్తాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల రాజీకీయ జీవిత కథ మధ్యయుగం నాటిదికాదు కదా.. నిజం ఎంటో ఇప్పుడున్న వారందరికీ తెలుసు కదా.. వర్మ వ్యూహం సినిమాలో తప్పుంటే వెంటనే సోషల్‌మీడియాలో ఉతికేస్తారు.. నిజం ఉంటే మెచ్చుకుంటారు. అసలు సినిమానే వద్దనుకుంటే చూడకుంటే సరిపోయే.. అలాంటి దానికి ఇంత గోల ఎందుకు చినబాబు.. ఉచితంగానే వ్యూహం సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వర్మ కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. వర్మకు కూడా కావాల్సింది ఇదే. ఈ విషయంలో ఆయన భారీగానే సక్సెస్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా సీనియర్ ఎన్టీఆర్ యుగపురుషుడు, దేవుడు.. అని తెలుగు ప్రజలు అంటారు. అందులో అభ్యంతరం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడ ఒక జిల్లాకు ఆయన పేరే పెట్టారు. కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదని ప్రచారం ఉండనే ఉంది. ఈ కారణమే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు. ఇదే కథతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వచ్చింది. చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయలేదా..? లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం. చరమాంకంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని ఆయన దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్ అవసరం తమకులేదని ప్రకటించడం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఎల్లో మీడియా పేపర్ క్లిప్పింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు కూడా ఉన్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా వర్మ ఇదే చూపించాడు.. ఒక్క పచ్చ బ్యాచ్ మాత్రమే సినిమాను తప్పబట్టింది.. మిగిలన ఎవరూ తప్పబట్టలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వర్మను అభినందించడం విశేషం. చంద్రబాబు పాత్ర గత సినిమాల్లోనే ఉంది.. వర్మ చూపించేది ఏంటి..? సీనియర్ ఎన్టీఆర్ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించలేదు. ఈ సినిమాల్లో కథను ఎంతడేర్గా చూపించారంటే... చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఆ సినిమాల మేకర్లు. ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తే.. గండిపేట రహస్యంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్ మీద సంధించిన అస్త్రాలు. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆరే వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్ ఆ దాడులను వారించాడంటారు. -
ఎల్లో మీడియాకు RGV స్ట్రాంగ్ కౌంటర్
-
'వ్యూహం' సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' మూవీ.. ఈ రోజు అంటే డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్ పిటిషన్ వేయడంతో.. జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్‌ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికే పచ్చ బ్యాచ్ తెగ హడావుడి చేస్తోంది. ఏకంగా సినిమా సెన్సార్ రద్దు చేశారన్నంత రేంజులో హడావుడి చేస్తోంది. (ఇదీ చదవండి: కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్) ఇలా పచ్చ బ్యాచ్ చేస్తున్న ఓవరాక్షన్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు. 'ఏబీఎన్ ఛానల్‌కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరికొన్ని ఛానెల్స్ చెప్తున్నట్టు 'వ్యూహం' సినిమా సెన్సార్ సర్టిఫికేట్ 'రద్దు' అవ్వలేదు. నిజం ఏంటంటే కోర్ట్.. సీబీఎఫ్సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని అడిగారు' అని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. దీనిబట్టి చూస్తే త్వరలో ఈ ఇష్యూ క్లియర్ అయి సినిమా విడుదలవుతుంది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ ఛానల్ @abntvtelugu కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారు https://t.co/hB5ak477cR — Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023 -
నా తలకు కోటి రూపాయలు..TV5 కొలికిపూడిపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు
-
నన్ను చంపడానికి కాంట్రాక్ట్.. చంద్రబాబు, లోకేశ్ ఖండించనేలేదు!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెచ్చినవారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ పోలీసులకు ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (ఇది చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ!) విజయవాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్‌లో డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడున్న యాంకర్ సాంబశివరావు మాటవరసకు వద్దని వారిస్తున్నా కొలికపూడి అదే మాట మూడుసార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరేవాళ్లు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది. దీనిపై కొలికపూడి, యాంకర్ సాంబశివరావు, ఛానల్ ఎండీ బిఆర్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఖండించలేదు. ఇక వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు ఆర్జీవీ. (ఇది చదవండి: ధనుష్‌తో లింక్ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా) -
'వ్యూహం' సినిమాలోని జగనన్న సాంగ్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొత్త సినిమా 'వ్యూహం'. పొలిటికల్ డ్రామా కథతో తీసిన ఈ చిత్రంలో ఏపీ రాజకీయాల్ని చూపించనున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జర్నీ ఎలా సాగింది? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యారు అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) డిసెంబరు 29న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న 'వ్యూహం' నుంచి ఇప్పుడు జగనన్న అని సాగే లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజువల్స్ ని ఎక్కువగా చూపించారు. ప్రధాన పాత్రలో అజ్మల్ అమీర్ నటించారు. ఈ పాట ఇప్పుడు సీఎం జగన్ అభిమానుల్ని అలరిస్తోంది. ఇకపోతే 'వ్యూహం' రిలీజ్ విషయంలో పచ్చ బ్యాచ్ పలు ఇబ్బందులు పెట్టినప్పటికీ.. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా.. డిసెంబరు 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఆర్జీవీ బులెట్స్
-
'వ్యూహం' సినిమాని.. 2024లో జగనన్న విజయాన్ని ఆపలేరు: మంత్రి రోజా
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పార్ట్-1.. డిసెంబరు 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) 'వ్యూహం' చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం'. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్‌గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వ్యూహం చిత్రానికి కర్తకర్మ క్రియలైన వర్మ, కిరణ్‌కు అంభినందనలు. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' విషయంలో చంద్రబాబు,లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. ముంబై మాఫియాకే ఆర్జీవి భయపడలేదు...మీకు భయపడతారనుకుంటున్నారా?చంద్రబాబు కుట్రలు... పవన్ కమెడియన్ వేషాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం రూపొందించారనుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది' అని అన్నారు. ఇక పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఫైబర్ నెట్‌కు సినిమాను ఇస్తే పదిలక్షల మంది ఒకేసారి సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా 'మంగళవారం'.. డేట్ ఫిక్స్) -
నేను ఎవరికీ బర్త్ డే విషెస్ చెప్పను...కానీ జగనన్నకు చెప్తా..
-
సెన్సార్ U సర్టిఫికెట్ పొందిన వ్యూహం మూవీ
-
వ్యూహం సినిమా ట్రైలర్
-
'వ్యూహం' నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆర్జీవీ
డైరెక్టర్ ఆర్జీవీ పుట్టినరోజు వేడుకల్లో కనిపించాడు. అవును మీరు సరిగానే విన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆయన్ని తన డెన్‌కి ఆహ్వానించి నిలువెత్తు పూలమాలతో సత్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!) రామదూత క్రియేషన్స్ అధినేత నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబోలో ప్రస్తుతం 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో తొలి భాగమైన 'వ్యూహం' మూవీ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) Wishing a very very HAPPY BIRTHDAY to my VYOOHAM film producer @dkkzoomin 💐💐💐🔥🔥🔥 pic.twitter.com/QlpN8HAgY2 — Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2023 -
'కృతిశెట్టి, శ్రీలీల మాదిరి నేనూ చేసుంటే ఛాన్సులు వచ్చేవి'
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించి భారీగా వైరల్ అయింది. ఆ ఒక్క వీడియో వల్ల ఆమెకు బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్స్ వచ్చింది. అక్కడ తన టాలెంట్‌తో ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆటలో కొనసాగింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అవకాశాలు వరుస కడతాయని ఆశించినా ఫలితం దక్కలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇనయా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్లోనే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. 16, 17 ఏళ్ల వయసులోనే వారు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కృతిశెట్టి, శ్రీలీల వంటి వారు కూడా ఆ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి వచ్చాను. వాళ్లతో కంపేర్ చేస్తే నేను 7 ఏళ్లు వృధా చేసుకున్నాను. వాళ్ల మాదిరి నేను కూడా ముందే ఇండస్ట్రీలోకి వచ్చుంటే నా లైఫ్ మరోలా ఉండేదని అనుకుంటున్నా.. కానీ ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోను.' అని ఇనయా తెలిపింది. ఈ ఫోటోలు శాంపిల్స్ మాత్రమే.. అన్నీ పోస్ట్ చేస్తే అంటూ.. 'ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టం. ఎప్పుడు ఉంటామో.. పోతామో..? ఎవరికీ తెలియదు. ప్రస్తుతం నా వయసు 25. దేవుడు దయ వల్ల మహా అయితే మరో 25 ఏళ్లు బతుకుతానేమో. ఈ జీవితంలో నేను ఎంజాయ్ చేసేది మాగ్జిమమ్ 10 - 15 ఏళ్లు మాత్రమే! ఆ తర్వాత ఎంజాయ్ చేద్దామని ఉన్నా మనకు బాడీ కూడా సహకరించదు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న టైమ్‌లోనే ఆనందంగా గడుపుతున్నాను. షోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే ఫోటోలు శాంపిల్స్ మాత్రమే... ఇంకా నా దగ్గర మస్త్ షేడ్స్ ఉన్నాయి. అవన్నీ పోస్ట్ చేస్తే ఏమైపోతారో..?' అంటూ చివరగా హాట్ కామెంట్ చేసింది. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను బిగ్‌బాస్ నుంచి వచ్చాక మంచి అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ ఎలాంటి ఛాన్స్‌లు దొరకలేదని ఇనయా తెలిపింది. సినిమా ఛాన్స్‌ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. కానీ అలాంటి సమయంలో కూడా తాను ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లలేదని ఇలా తెలిపింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సినిమాల్లో స్థిరపడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అవకాశాల కోసం అడుక్కున్నప్పటికి ఫలితం లేకుండా పోయిందని ఇనయా సుల్తానా తెలిపింది. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్‌తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్‌ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్‌ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
RGV నాకు ఇన్స్పిరేషన్.. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను
-
RGV వల్ల చిరంజీవి నాకు ఛాన్స్ ఇచ్చారు..!
-
నీకు సాంగ్స్ కంపోజ్ చేయడం రాదు అని RGV ఏడిపించారు
-
ఆ హీరో హీరోయిన్ ని డైరెక్ట్ చేయడం నాకు చాలా..!
-
రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన మావయ్య ఏం చెప్పాడో చూడండి
-
ఆర్జీవీ భార్య పై ఉత్తేజ్ కామెంట్స్
-
బాగా వెటకారం.. సంస్కారం కాదు: చిరంజీవి
-
Inaya Sultana Pics: ఆర్జీవీ చేతిలో పడి ఓవర్‌నైట్ సెలిబ్రిటీగా మారిన భామ (ఫోటోలు)
-
ఆర్జీవీకి పట్టిన గతే మనకు పట్టేలా ఉంది: రాహుల్ రామకృష్ణ
-
నా కూతురే నన్ను మనిషిగా చూడదు: RGV
-
రెండు భాగాలుగా వ్యూహం, రిలీజ్ డేట్లు ఇవే!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? అనేది వ్యూహంలో చూపించనున్నారు. అలాగే 2015-2023 వరకు సీఎం జగన్ జీవితంలోని అంశాల నేపథ్యంలో వ్యూహం 2(శపథం)ను తెరకెక్కించారు. తాజాగా ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్లు విడుదల చేశారు. వ్యూహం సినిమాను నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండగా శపథం చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. pic.twitter.com/bXL9aw578N — Ram Gopal Varma (@RGVzoomin) October 11, 2023 చదవండి: అమర్ చాలా మంచివాడు.. దయచేసి అలా మాట్లాడొద్దంటూ నటుడి తల్లి భావోద్వేగం -
రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్స్
-
మన సాంప్రదాయాలు గురించి మాట్లాడుతున్న ఆర్జీవీ..!
-
ఆస్తుల పరంగా చూస్తే మొదటి స్థానంలో తెలుగు ఇండస్ట్రీ ఉంటుంది
-
వాళ్ళ అమ్మ గురించి బాధపడిన ఆర్జీవీ
-
రజినీకాంత్ కి పోటీ ఎవరు లేరు: RGV
-
డిపెండ్ అయ్యే రోజు వస్తే నేను చచ్చిపోతా: రామ్ గోపాల్ వర్మ
-
శ్రీదేవి అంటే అదో టైప్ అభిమానం నాకు: RGV
-
నేను తన కొరకే డైరెక్టర్ అయ్యాను..!
-
షూటింగ్ టైంలో ఆమె నాకు వార్నింగ్ ఇచ్చింది
-
ఆర్జీవీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విశ్వనాథ్
-
ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ఆగ్రహం..!
-
దేశంలో మహిళా మంత్రికి దక్కే గౌరవం ఇదేనా : RGV
-
టీడీపీ నేత కామెంట్లపై డైరెక్టర్ ఆర్జీవీ ఫైర్
-
మహిళలంటే టీడీపీ నేతలకు చిన్నచూపా?
-
ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!
టాలీవుడ్లో విలక్షణమైన దర్శకుడు ఎవరంటే గుర్తొచ్చేది ఆయన పేరే. సంచలనాలకు పేరు పొందిన ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్) టాలీవుడ్ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఓ అమ్మాయి వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. కెమెరా పట్టుకుని.. ఎల్లో శారీలో ఉన్న అమ్మాయి ఫోటోలు తీస్తూ ఆ వీడియోలో కనిపించింది. అయితే ఆ వీడియోతో పాటు ఓ ప్రశ్న అడిగారు ఆర్జీవీ. ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి అర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరో కానీ కొందరు మాత్రం ఆమె చాలా అందంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అంటూ కొందరు నెటిజన్స్ తెలియజేస్తున్నారు. మరో నెటిజన్ ఏకంగా ఆ అమ్మాయి సోషల్ మీడియా ఐడీని కూడా షేర్ చేశాడు. మీలో ఎవరికైనా ఆమె గురించి తెలిస్తే చెప్పండి. (ఇది చదవండి: విశాల్ అలా అనడం కూడా సనాతనమే : నిర్మాత ) Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J — Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023 -
చంద్రబాబు 3 లాయర్లపై ఆర్జీవీ కామెంట్స్
-
లోకేష్ ఢిల్లీ టూర్ పై ఆర్జీవీ కామెంట్స్
-
బాబు సీటుపై అచ్చెన్నాయుడు నజర్..
-
పవన్ పై ఆర్జీవీ సెటైర్లు
-
చంద్రబాబు లాయర్ లూథ్రాకు ఆర్జీవీ చురక
స్కిల్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ పొడిగింపుతో పాటు సీఐడీ కస్టడీకి అప్పగించాయి న్యాయస్థానాలు. ఈ పరిణామాలపై చంద్రబాబు తరపున కేసు వాదిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా ఎక్స్(పాత ట్విటర్) వేదికగా మరోసారి స్పందించారు. చంద్రబాబు కేసును వాదిస్తోన్న ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ‘‘ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది, ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే.. లూథ్రా ట్వీట్‌ను ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. But days and nights also are same in jail cell no sir ? https://t.co/omOH3PjKDJ — Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2023 లూథ్రా ట్వీట్‌కు కొనసాగింపు అన్నట్లుగా... 'అయితే జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయ్ కదా సర్?' అని పేర్కొన్నారు. దానికి ముందు చేసిన ట్వీట్లో.. స్కిల్ స్కామ్ ద్వారా తెలిసిన వాస్తవం ఏమంటే డబ్బులతో నిజాన్ని దాచలేరు అంటూ ఆర్జీవీ చురకలు అంటించారు. Siddharth Luthra + Siddhardh Agarwal x Harish Salve is not = PONNAVOLU SUDHAKAR REDDY ..TRUTH SUM of SKILL SCAM is that you can’t hide TRUTH with MONEY — Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2023 సిద్ధార్థ లూథ్రా సిద్ధార్థ అగర్వాల్ X హరీశ్ సాల్వే ఈజ్ నాట్ = (ఈక్వల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి ఇవాళ వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగింది. ఇంకోవైపు ఏసీబీ కోర్టు రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు సోమవారానికి(సెప్టెంబర్ 25) వాయిదా వేసింది. -
బాబు అరెస్ట్.. లైట్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే! టీడీపీకి దూరంగా తారక్ ఇప్పుడదే జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టయి రోజులు గడుస్తున్నా జాతీయ స్థాయిలో కనీస మద్దతు లభించలేదు. అంతదాకా ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం బాబు అరెస్ట్‌పై పెదవి విప్పట్లేదు. ఇప్పుడనే కాదు.. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్.. టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ కోసం చెల్లని నాణెం విడుదల చేసినప్పుడు, ప్రత్యేక ప్రచారాలు, సభలు నిర్వహించినప్పుడు సైతం తారక్ తనకు పట్టనట్లే ఉండిపోయాడు. ఇక దబిడి దిబిడే తాజాగా ఈ అరెస్ట్ పైనా స్పందించకపోవడంతో తారక్.. బాబును లైట్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దిబిడి దిబిడే' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. హరికృష్ణను వాడుకొని వదిలేసిన చంద్రబాబు! ఆగస్టు వెన్నుపోటు ఎపిసోడ్లో భాగంగా నాడు అన్న ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులను విచ్చలవిడిగా వాడేశాడు. బావ నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులకు మంత్రి పదవులిస్తానంటూ ఆశ పెట్టాడు. ఇక్కడ హరికృష్ణతో మరో గేమ్ ఆడుకున్నాడు. ఆగస్టు ఎపిసోడ్ నాటికి.. హరికృష్ణ ఏ చట్టసభలోనూ సభ్యుడు కాదు. అయినా ఆ విషయం పట్టించుకోకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆరు నెలలకే ఆక్ పాక్ కరివేపాక్ ఓ వైపు తన పదవికి ఇబ్బంది ఉందని, తనను ఎమ్మెల్సీగా చేయాలని హరికృష్ణ అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో ఆరు నెలల గడువు ముగియగానే హరికృష్ణ అర్ధాంతరంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు గానీ చంద్రబాబు కొట్టిన దెబ్బ హరికృష్ణకు అర్థం కాలేదు. ఎంతైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరని హరికృష్ణ తరచుగా చెప్పేవారని ఆయన సన్నిహితులు అంటారు. సిగ్గు మాలిన రాజకీయాలు ఇక హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోయేంత వరకు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏపీ ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. హరికృష్ణను దరిదాపుల్లోకి రానివ్వలేదు. యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మాత్రం హరికృష్ణ కుటుంబాన్ని మరో రకంగా వాడుకున్నాడు చంద్రబాబు. ఓవైపు హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు వందల మంది వస్తుంటే.. ఆ సందడిలో.. అక్కడే తమతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించాడని స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పాపం సుహాసిని.. మామ మాటలకు నవ్వుల పాలయి హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్పల్లి నుంచి నిలబెట్టి నవ్వులపాలు చేశాడు. సానుభూతితో సుహాసిని గెలిస్తే.. ఆ క్రెడిట్ కొట్టేద్దామని ప్లాన్ చేసి మొత్తం కుటుంబాన్ని రోడ్డునపడేలా చేశాడు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సుహాసిని కూకట్‌పల్లిలో ఓడిపోగా.. ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కనబెట్టాడు. ఏపీలో అధికారంలో ఉన్నా.. దాని వల్ల ఎలాంటి ప్రతిఫలం ఎన్టీఆర్ కుటుంబానికి గానీ, హరికృష్ణ కుటుంబానికి గానీ అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదే. The fact that @tarak9999 dint even care about condemning @ncbn ‘s arrest clearly proves that future of TDP is DABIDI DIBIDI — Ram Gopal Varma (@RGVzoomin) September 13, 2023 చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. కొంచమైనా సిగ్గుండాలి కదా? అనారోగ్యంతో ఆస్తి అమ్మేయాలనుకున్న నటి.. తల్లీకూతుళ్లను చంపుతామంటూ బెదిరింపులు -
స్కిల్ స్కామ్‌లో మీకేమర్థమైంది?: పవన్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్నలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ వేదికగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘స్కిల్ స్కామ్ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి’’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో అసలు స్కిల్ స్కామ్ జరిగిందా? లేదా?. ఒకవేళ స్కామ్ జరిగితే.. సీబీఎన్ (చంద్రబాబు)కు తెలియకుండా జరిగిందా?. రూ.300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా?లేదా?. అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్ జరిగిన తర్వాత విషయం తెలిసి ఉంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైనదేనా?. దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా?. సీఐడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం తప్పా? సెక్షన్ 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్ విధించిన న్యాయమూర్తి అవినీతిపరురాలా? నాయకులంటే 40 ఏళ్లు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి కాదు.. వాళ్లు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలీదా?’’ అంటూ ప్రశ్నలను పోస్టు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఏమి అర్థమైందో, దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్ కెమెరావైపు చూస్తూ వీడియోను విడుదల చేయాలన్నారు. -
పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ
-
మణి శర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్జీవీ..!
-
దయచేసి నా కూతురు గురించి అడగొద్దు : రామ్ గోపాల్ వర్మ
-
రామ్ గోపాల్ వర్మ తన హెల్పింగ్ నేచర్ గురించి
-
రామ్ గోపాల్ వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో..!
కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు త్రిగుణ్. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. తాజాగా ఈ హీరో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. బంధుమిత్రుల సమక్షంలో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!) -
పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..!
సాహో తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్ యాక్షన్‌లో మోడ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. హంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్ చేసిన రోజా) పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చేశారు. 'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పీకే ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సైతం క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఊహించని ట్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఓజీ గ్లింప్స్ ఆ రేంజ్లో అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో గ్లింప్ల్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) కాగా.. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. This has to be the HAPPIEST BIRTHDAY for @PawanKalyan #OGGlimpse is simply OUT OF THE WORLD ..This is the BESTEST among all P K trailers I have ever seen Hey #Sujeeth YOU KILLED IT 💪 https://t.co/yrcB6JMd9O — Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2023 -
రాఖీ కట్టిన చెల్లికి రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
నేడు రాఖీ పండుగ సందర్భంగా అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముడు ఇలా తమ అను బంధాన్ని తెలుపుతూ రాఖీ కట్టడం సహజం. ఒకే ఇంట్లో పుట్టి ఆపై ఊహ తెలిసింది మొదలు ఆటపాటలతో కలిసి పెరుగుతారు. అలా కాలం గడిచేకొద్ది పెళ్లిళ్లయ్యి ఎవరి దారిన వారెళ్లినా. ఎవరికి నచ్చిన ప్రపంచంలో వారు ఉన్నా రక్తసంబంధం మధ్య ఉండే ఆ ప్రేమ అంతే తియ్యందనం పంచుతుంది. కొండంత ఆలంబన అందిస్తుంది. ఇలా తన అన్నయ్య అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని సాక్షి ఛానల్‌తో విజయ లక్ష్మీ పంచుకున్నారు. రామూ కూడా సెంటిమెంట్లు ఫాలో అవుతారని ఆమె చెప్పారు. ఒక అన్నగా తమకు చాలా రక్షణగా ఉంటరాని విజయ తెలిపారు. రామూతో పాటు తన తమ్ముడు అయిన కోటికి కూడా రాఖీ కడుతానని ఆమె చెప్పారు. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) చిన్నప్పడు రామూకు రాఖీ కట్టినప్పుడు ఏం జరిగింది.. ఇప్పుడు రాఖీ కట్టేందుకు వెళ్తే వర్మ ఏం అన్నారు.. తిరిగి చెల్లెలు కోసం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు.. చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సాయం చేశారు.. వంటి విషయాలు ఈ పూర్తి వీడియోలో తెలుసుకోండి. -
ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ
నోటికొచ్చింది మాట్లాడతా.. ఎవరినైనా తిట్టేస్తా.. హద్దూఅదుపూ లేకుండా విచ్చలవిడిగా వాగుతా.. నన్ను ఆపేవాళ్లే లేరు.. ప్రశ్నించేవాళ్లే లేరు.. అంటూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేశ్! మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారు.. ఎప్పుడూ అడ్డగోలు ఆరోపణలు చేసే ఆయన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విమర్శించారు. మిమ్మల్ని కనాలనుకోలే.. మీరు పుట్టారు 'ఎవడో నిర్మాత రామ్‌గోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్... ప్రజల తరపున పోరాడుతున్న లోకేశ్‌కు ఆంక్షలా..' అని పెదవి విరిచారు. దీనిపై వర్మ యూట్యూబ్ వేదికగా చెంప చెళ్లుమనేలా సమాధానమిచ్చాడు. 'లోకేశ్.. నేను థర్డ్ గ్రేడా? ఫిఫ్త్ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశాను. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్ యాక్సిడెంట్ అంటారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధమేంటి? ఇంతవరకు మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండి. అయినా నేను థర్డ్ గ్రేడ్ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదు. మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు. అభద్రతాభావంలో లోకేశ్! మీరు తెలియక మాట్లాడతారా? జనాలకు తెలియదని మాట్లాడతారా? జనాలు పట్టించుకోరని మాట్లాడతారా? కొందరు ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మాట్లాడతారా?.. మీరు ఓ వ్యూహం ప్రకారం మాట్లాడితే నాకు ఎలాంటి సమస్యా లేదు. మీరు అబద్ధం చెప్పినా, చెప్పాలనుకున్నా అందులో ఓ ఎజెండా ఉందనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మీరు ఏదేదో మాట్లాడితే.. మీకంటూ గుర్తింపు లేదని, తండ్రికి తగ్గ కొడుకుని కాదేమోనన్న అభద్రతాభావంలో ఉన్నారనిపిస్తోంది. మీకు నిజంగా ఈ సమస్య ఉంటే సైకియాట్రిస్ట్‌కు చూపించుకుంటే మంచిది. ఇదే నేను మీకిచ్చే సలహా' అని చెప్పుకొచ్చాడు వర్మ. చదవండి: National film awards 2023: అల్లు అర్జున్... ఉత్తమ నటుడు మరి నీ సంగతేంటి లోకేషం.. ఎన్ని కేసులు పెట్టవచ్చు? -
RGV గురించి అసలు విషయం చెప్పిన తనికెళ్ళ భరణి...!
-
అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?
బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలతో ఎప్పుడూ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ట్రాక్ చేంజ్ చేసి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ. దీంతో ఎప్పుడూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో కూడా భాగమవుతూనే.. బీబీ జోడీ ప్రోగ్రామ్‌తో అరియానా ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్ చేస్తుంటుంది. తాజాగా అరియానా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అస్సలు గుర్తుపట్టలేని విధంగా కనిపించడంతో.. అభిమానులు షాక్ అయ్యారు. ఆ ఫోటోల్లో ఉండేది నిజంగానే అరియానానేనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా టూర్లో ఉన్నట్లు ఫోటోలను షేర్ చేసింది. (ఇదీ చదవండి: ధోని ఎంట్రీ ఖాయం ..ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త) అరియానా తాజా లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. డబుల్ చిన్తో ఏ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో అభిమానులతో పాటు కొందరు నెటిజన్లు అరియానాపై ఇలా కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి బాగా తిని నిద్రపోతున్నావా..? మరీ బొద్దుగా అయ్యావ్ అంటూనే గతంలో మాదిరే సన్నగా ఉంటేనే బాగుంటావ్ అని కామెంట్ల ద్వారా తెలుపుతున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎలా అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నావా? అంటున్నారు. షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పి పెళ్లి కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా? ఏంటి అని మరికొందరు అంటున్నా... సాధ్యమైనంత త్వరగా మళ్లీ సన్నగా అవ్వండని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా ఎవరికి తోచింది వారు కామెంట్ల చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
రామ్ గోపాల్ వర్మ నాటి హాట్ బ్యూటీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే
బర్ఖా మదన్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించడమే కాకుండా.. పలు సినిమాలకు నిర్మాత కూడా. అంతే కాదు తనొక మోడల్, చివరకు టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. ఇలా సినిమా రంగానికి దగ్గరగా ఉన్న తను బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకుంది. తను ఇప్పడు ఇండియన్ నన్‌గా గుర్తిపు పొందింది. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లతో పోటీ బర్ఖా మదన్ 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. బర్ఖా మదన్ మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. బాలీవుడ్లో ఎంట్రీ 1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి'లో బర్ఖా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ యొక్క నాల్గోవ సీజన్లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది. రామ్ గోపాల్ వర్మ భూత్‌లో బర్ఖా మదన్ బర్ఖా తన కెరీర్లో సెలెక్టివ్‌గా ఉంటూ, రామ్ గోపాల్ వర్మ యొక్క అతీంద్రియ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించినప్పుడు విమర్శకులతో పాటు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ సినిమా మెప్పస్తుంది. 2003 చలన చిత్రం అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్‌లతో కలిసి కూడా నటించింది. బర్ఖా మదన్ ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్ సోచ్ లో,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను కూడా నిర్మించిన బర్ఖా మదన్‌కు బౌద్ధ గురువు దలైలామా అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మారి తన పేరును గ్యాల్టెన్ సామ్టెన్గా మార్చకున్నారు. ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) -
స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడు: రాంగోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం, నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యథాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పవన్ ఏదైనా ఆలోచనతో చేయడని, స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడన్నారు. సినిమాలో నటించే హీరో బయట హీరో కాలేడు. పవన్‌కు తనపైనే తనకు నమ్మకం లేదన్నారు. ఈ సారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని పవన్ భావిస్తున్నాడన్న ఆర్జీవీ.. విప్లవానికి, పవన్ పార్టీకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘రాజకీయాలను పవన్ సినిమాలా చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాడు. నిఘా వర్గాలు తమ పని చేసుకోకుండా పవన్‌కు నివేదికలు ఇస్తున్నాయా? ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనేదే పవన్ ఆలోచన. సినిమాల్లో సీన్స్ రియాక్షన్నే పవన్ బయట చూపిస్తాడు’’ అని ఆర్జీవీ దుయ్యబట్టారు. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్‌నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా శివ సెట్స్‌లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
పవన్ పై ఆర్జీవీ ఆగ్రహం
-
ఆర్జీవీ బాధపెట్టాడు.. అది సంస్కారం కాదు..
-
నాకు అమ్మ ప్రేమ బోర్ కొట్టింది..
-
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
'వ్యూహం' మూవీ టీజర్ విడుదల
-
వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా!
టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే నేడు (జూన్ 24) వ్యూహం టీజర్‌ను రిలీజ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదంతో టీజర్ ప్రారంభం అవుతుంది. సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది ?, ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? లాంటి అంశాలను ప్రస్తావిస్తూ టీజర్ సాగింది. టీజర్ మొత్తంలో ఒకేఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలను వర్మ పెంచేశాడు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'వ్యూహం' టీజర్ విడుదలపై అప్డేట్ ఇచ్చిన వర్మ
టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నట్లు గతంలో ఆయన తెలిపారు. అయితే ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ను ఆయన రివీల్ చేశారు. జూన్ 24న ఉదయం 11 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీటర్ ద్వారా ఆయన ప్రకటించారు. pic.twitter.com/p2ydsvMKxz — Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2023 -
దొంగ సీడీలు అమ్ముతుంటే పోలీసులు లాక్కెళ్లి జైల్లో వేశారు.
-
2024 లో గెలిచేది ఎవరు ?
-
నైనా గంగోలి కి రిటర్న్ ఏం ఇచ్చారు ?
-
ఈ సంవత్సరంలో 10 సినిమాలు రాబోతున్నాయి
-
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఇరిటేట్ చేయడానికి కారణం ఏంటంటే
-
వాళ్ళని వాడుకోవడానికి ఈ డెన్
-
నేను ఫామిలీ కి ఎందుకు వాల్యూ ఇవ్వనంటే