delivery
-
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
ఫుడ్ డెలివరీ వేగంగా రావాలంటే?.. ఇలా చేయండి
ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్‌కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు. -
రోడ్డుపై మహిళ డెలివరీ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్ వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్లో ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్‌కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్‌లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్‌ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు. Short of words to express my appreciation for the presence of mind & composure displayed by Dongri Pstn Nirbhaya Squad, in helping a lady deliver a baby on road. The Dongri Pstn Nirbhaya squad while patrolling found a 45-year-old lady bleeding in labour pain on the road near… pic.twitter.com/QPKqmkOhTc— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) September 20, 2024ఇది కూడా చదవండి: సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?
మనం సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్‌లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్ క్రియేటర్స్ ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్ ఓ పేపర్ బ్యాగ్‌లో ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు. ఆ తర్వాత ఆ డిజిటల్ క్రియేటర్లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది. కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్‌లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్ బెన్‌లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌ని క్లీన్ చేసి పడేయాలి. అప్పుడే అది రీసైకిలింగ్‌కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jordindian (@thejordindian) (చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!) -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్‌లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
క్విక్ డెలివరీకి క్రేజ్
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల అభిరుచులు..అవసరాలకు తగ్గట్టుగా వేగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి వంటి వాటిని అందించేందుకు క్విక్ (క్యూ)కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తకొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురావడంతోపాటు, విభిన్నమైన సర్వీసులను త్వరితంగా అందించడం ద్వారా వినియోగదారుల మనసును గెలుచుకునే దిశగా ఈ సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ‘ప్రీ ప్రిపేర్డ్ ఫుడ్’క్విక్ డెలివరీ పేరిట టీ, కాఫీ, సమోసా, ఇతర స్నాక్స్ అందించేందుకు జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి క్యూ–కామర్స్ దిగ్గజాలు పోటీకి సై అంటున్నాయి. తమతమ యావరేజ్ ఆర్డర్ వాల్యూ (ఏవోయూ)లను పెంచుకునేందుకు 10 నిమిషాల్లో కుక్కుడ్ ఫుడ్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో ఈ సేవలు ›మొదలై ఆదరణ పొందుతున్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర నగరాలకు తమ ప్రణాళికలను ఈ సంస్థలు విస్తరించనున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలతోపాటు నా¯Œన్ మెట్రో నగరాలకు ఈ సేవల విస్తరణకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. రోజువారీ బిజీ జీవితం, ఆఫీసు నుంచి ఇళ్లకు సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ సమస్యలు తదితరాలతో క్విక్ ఫుడ్ డెలివరీ యాప్స్ వైపు వినియోగదారుల మొగ్గు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. » జెప్టో ప్రయోగాత్మకంగా గతేడాది ముంబైలో ‘జెప్టో కేఫ్’ను ప్రారంభించింది. ఇప్పుడు ముంబైతోపాటు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది. » స్విగ్గీ కూడా బెంగళూరులో ఇన్‌స్టామార్ట్ ద్వారా ఇన్స్టాకేఫ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. » క్యూ– కామర్స్ సంస్థల మధ్య పోటీ తీవ్రంకావడంతో తమతమ సరాసరి ఆర్డర్ల విలువలను గణనీయంగా పెంచుకోవడంపై ఇవి దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న స్నాక్స్ , ఇతర ఆహార పదార్థాలు దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ చెయిన్లలో రూ.30 నుంచి 300 లోపు అందుతున్నా, హోం డెలివరీ రూపంలో కోరుకున్న సమయానికి వేగంగా ఇళ్లకు ఆర్డర్లు అందజేయడమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికైతే కస్టమర్లు ఈ సంస్థలు అందిస్తున్న సేవలను ఆహా్వనిస్తున్నారు. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరిగా కాకుండా వివిధ రకాల వస్తువులతో (రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా) పాటుగా ఫుడ్ ఐటెమ్స్ కూడా ఒకేసారి తెప్పించుకునేందుకు అవకాశం ఉండటమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. యూఎస్ఏ, యూకే, లాంటి దేశాల్లో ఈ ఐడియాను ముందుగా అమలు చేయడంతోపాటు వినియోగదారులు చేసే ఆర్డర్ల సంఖ్యను పెంచేందుకు స్నాక్స్ ఇతర ఆహార పదార్థాలను చేర్చారు. ఎల్రక్టానిక్ గాడ్జెట్స్, ఇతర లగ్జరీ వస్తువులతో పోలి్చతే స్నాక్ ఐటెమ్స్‌కు వచ్చే మార్జిన్ అంత హెచ్చుస్థాయిలో లేకపోయినా రోజువారీ నిత్యావసర వస్తువుల కంటే మాత్రం స్నాక్స్ రేట్స్‌కు అధిక మార్జిన్‌తో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నట్టుగా నిపుణులు లెక్కలు వేస్తున్నారు. » కోల్‌కతాకు చెందిన సౌమాసేన్ ప్రతీరోజు ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు లోకల్ మార్కెట్‌కు వెళ్లి తాజా పండ్లు, కూరగాయలు తెచ్చుకోవడంతోపాటు అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో అత్యవసరంగా ఎండు మిర్చీ, మస్టర్డ్ ఆయిల్, తదితర వస్తువుల కోసం దగ్గరలోని మార్కెట్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడేది. అదే ఇప్పుడు క్విక్ డెలివరీ యాప్, సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఆయన కోరుకున్న రోజువారి వస్తువులు కేవలం ఏడు నిమిషాల సమయంలోనే హోం డెలివరీ ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. అయితే మామూలుగా కొనుగోలు చేస్తున్న దాని కంటే ఈ సర్వీసులకు కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తున్నా సేన్, ఆయన భార్య ఉద్యోగులు కావడంతో యాప్‌లపై ఆర్డర్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. నేడు వేగంగా మారుతున్న పరిస్థితులు..క్విక్ కామర్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో వస్తువుల ఆర్డర్ అనేది సులభమై పోయింది. » రోజువారీ జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులను 10 నుంచి 15 నిమిషాల్లో ఇళ్ల వద్దనే తెప్పించుకోవడం అనేది నవయువ తరానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. రోజువారీ జీవనశైలి అలవాట్లలో మార్పులు, వేగం పెరిగిన బిజీలైఫ్ తదితరాలకు తగ్గట్టుగా వివిధ వర్గాల కస్టమర్ల అభిరుచులు, అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. వీటన్నింటిని తీర్చేలా క్విక్ కామర్స్ సంస్థలు పోటీపడి కొత్త కొత్త ఆలోచనలతో డెలివరీ యాప్స్‌కు పదును పెడుతున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు ఈ విధమైన వ్యాపారంలో ముందంజలో ఎందుకు నిలవడం లేదన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇవేకాకుండా దేశీయంగా పెద్ద పెద్ద కంపెనీలు, దేశవ్యాప్తంగా సప్లయి చెయిన్లు ఉన్న బడా సంస్థలు కూడా క్యూ–కామర్స్ మార్కెట్‌ను అధిగమించలేకపోవడం కూడా ఓ సవాల్‌గానే నిలుస్తోంది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు డెలివరీ
ఏదైనా వస్తువులను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్సైట్లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.Thank you Amazon for delivering my order after 2 years. The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024 -
చౌకలో ఫుడ్, క్యాబ్.. ఇలా బుక్ చేసుకోండి
అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే కొన్ని యాప్‌లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్‌ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్‌లను ఒకసారి వినియోగించి చూడండి. -
బుక్ చేసుకున్న 7 నిమిషాల్లో డెలివెరీ!.. ఫిదా అయిన కస్టమర్
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్విక్ కామర్స్ సర్వీస్ ప్రారంభించింది. అంటే ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తారన్నమాట. బెంగళూరు వాసి ల్యాప్‌టాప్ బుక్ చేసుకున్న ఏడు నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ అతనికి డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన సన్నీ గుప్తా అనే వ్యక్తి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసుకున్నారు. అతినికి నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అయింది. ఈ అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో వివరించారు. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ నుంచి ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేసాను. 7 నిమిషాలలోనే డెలివరీ అయింది. బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే అని తెలుస్తోంది.చాలాకాలంగా గుప్తా ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు, ఇందులో భాగంగానే ఏసర్ ప్రిడేటర్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశారు. దీని ధర రూ. 95000 నుంచి రూ. 2.5 లక్షల మధ్య ఉంది. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో డెలివరీ రావడం చాలా గొప్ప విషయం. దీనికి గుప్తా ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.గుప్తా తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇది నా కొత్త భారతదేశం, ఇలాంటి సేవలు మున్ముందు ఇంకా వేగంగా ఉంటాయని అన్నారు. మరొకరు ఇది నిజంగా ఒక విప్లవం. ఫ్లిప్‌కార్ట్ విజయవంతమైతే, ఇది ఖచ్చితంగా అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు.Just ordered a laptop from @Flipkart minutes.7 minutes delivery.Will keep this thread posted.— Sunny R Gupta (@sunnykgupta) August 22, 2024 -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్‌రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపుపైలట్ అప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్‌ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న మహిళ
-
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్‌సైకిల్‌పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్‌ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్‌కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్‌పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
ఆరేళ్లుగా అందని డెలివరీ.. ఇన్నాళ్లకు స్పందించిన ఫ్లిప్‌కార్ట్
ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్‌కార్ట్‌లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్‌లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్సైట్లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.After 6 yrs @Flipkart called me for this order 😂Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్‌కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024 -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్, అవ్రా క్యాపిటల్‌సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్‌లో ఉంది. -
మొబైల్ ఆర్డర్ పెడితే.. ఏమొచ్చిందో తెలుసా? ఖంగుతిన్న కస్టమర్
ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. డెలివరీ తీసుకునే వరకు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ అవునా? కాదా? అని సందేహమే. ఎందుకంటే గతంలో కొందమంది పెట్టిన ఆర్డర్స్ కారకుండా రాళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.ఒక వ్యక్తి అమెజాన్‌లో వివో వై20ఏ మొబైల్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా వచ్చింది. వచ్చిన డెలివరీని అన్బాక్సింగ్ చేసి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌కు బదులు అందులో మూడు సబ్బులు ఉన్నాయి. ఇది చూసి ఖంగుతిన్న కస్టమర్ అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి సహాయం పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యడు.తాను ఎదుర్కొన్న సమస్యను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోలను కూడా షేర్ చేశారు. అమెజాన్‌లో మొబైల్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయని, దీనిపైన అమెజాన్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్లో ఎంత పెద్ద మోసాలు జరుగుతున్నాయో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు.मेरी भांजी @Anuja7Jha ने @amazonIN से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। @AmazonHelp कोई मदद भी नहीं कर रहा है। सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB— Narendra Nath Mishra (@iamnarendranath) June 14, 2024 -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు. -
పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా భారత్‌లో వివిధ డెలివరీ యాప్‌లు వేగంగా కస్టమర్లను చేరుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. యూఎస్‌లోని డెలివరీ దిగ్గజ కంపెనీలు యాప్‌లపై ఆర్డర్ అందుకున్నాక లొకేషన్ ఆధారంగా అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకు భిన్నంగా మన దేశంలో ‘క్విక్ సర్వీస్’అనేది నాణ్యమైన సేవకు గీటురాయిగా మారింది. స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్‌లు...చిన్న చిన్న నిత్యావసరాలను సైతం అత్యంత వేగంగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో మనదేశంలో... ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నాక అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఔట్లెట్ల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని కస్టమర్లకు చేర్చేవారు. ఐతే గత దశాబ్దకాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి ద్వారా ఈ–కామర్స్ ఒక్కసారిగా పుంజుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత్‌లో వేగంగా నిత్యావసర సరుకులు అందించే డెలివరీ సంస్థలు ఆన్లైన్ షాపింగ్‌పై అధిక నమ్మకాలు పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్సంస్థలు ఉనికిలో నిలిచేందుకు కష్టపడుతుంటే, అదేకోవలోని భారత్ మార్కెట్ మాత్రం అంతకంతకు వృద్ది చెందుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 లాక్‌డౌన్‌తో... ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు పెరగగా..ఆ తర్వాత కొన్నిదేశాల్లో షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కునేందుకు మొగ్గుచూపడంతో అవి వెనకడుగు వేయక తప్పలేదు. భారత్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్టప్‌లు మరింత వృద్ది చెందడంతో పాటు సేవలో వేగం, నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టడం గమనార్హం. పచారీ కొట్లకు తప్పని పోటీ ఇప్పుడు డెలివరీ యాప్‌లు వేగం పుంజుకోవడంతో...పది నిమిషాల్లోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు చేరవేయడం అనే దాన్ని ఈ సంస్ధలు ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేశాక పదినిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలను డెలివరీ ఏజెంట్లు అందజేయడాన్ని కూడా సెకన్ల వారీగా ట్రాక్ చేస్తుండటం విశేషం. ఆన్లైన్లో ఆర్డర్లను అందించే క్రమంలో ఏ కారణంచేతనైనా ఏజెంట్లు నెమ్మదిస్తే వారి ఫోన్లలో ‘ఎరుపు ఫ్లాష్’ద్వారా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దేశంలోని వివిధ డెలివరీ యాప్‌ల ద్వారా పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల వద్దకు చేరేలా సర్వీసులు అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పలు రకాల నిత్యావసరాలకు ఆర్డర్ అందగానే పది నిమిషాల్లో ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరుకులను నిమిషాల్లో డెలివరీ చేసే యాప్‌లు పచారీ కొట్లకు సవాల్‌గా మారాయి. సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివర్లలోని షాపులకు గట్టి పోటీ తప్పడం లేదు. మనదేశంలోని వివిధ వర్గాల ప్రజలు... తమ ఇళ్లకు దగ్గరలోని షాపుల నుంచి బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను తెచ్చుకోవడమో లేదా ఫోన్లో ఆర్డర్ చేసే ఆ దుకాణాల్లో పనిచేసే వారు ఇళ్లకు చేరవేయడమో చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెలివరీ యాప్‌ల యుగంలో...రోజువారీ అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులను సైతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లోని ఇంటి గుమ్మం వద్దకు తెప్పించుకుంటున్నారు. స్విగ్గీలో ఐతే ఒకేఒక మామిడిపండును ఆర్డర్ చేసినా దానిని కూడా కస్టమర్‌కు డెలివరీ చేస్తోంది. వేగం, కచ్చితత్వం గత ఏప్రిల్‌లో భారత్‌లోని ఆన్లైన్ సరుకుల మార్కెట్, క్విక్ డెలివరీని గోల్డ్‌మాన్ సాక్స్ విశ్లేíÙంచినపుడు... ప్రస్తుతం భారత్ ఆన్లైన్ సరుకుల మార్కెట్ 11 బిలియన్ డాలర్లుగా నిలుస్తుండగా వాటిలో క్విక్ డెలివరీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా సరుకులను చేరవేయడంలో వేగం, కచ్చితత్వం పెరుగుదలతో 2030 కల్లా 60 బిలియన్ డాలర్లుగా చేరుకుని ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో క్విక్ కామర్స్ 70 శాతంగా నిలుస్తుందని ఈ సంస్ధ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 1.30 కోట్ల నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు, షాపులు ఉండగా, వీటికి సంబంధించిన రిటైల్ అసోసియేషన్ల అంచనాల ప్రకారం... క్విక్ కామర్స్యాప్ల ద్వారా అమ్మకాలు తగ్గుదల పుంజుకోవడంతో... వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల వారీగా చూస్తే సంప్రదాయ దుకాణాల్లో పది నుంచి 60 శాతం దాకా అమ్మకాలు నమోదైనట్టుగా తెలుస్తోంది. -
మొబైల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్‌కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్‌కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది.