England Vs Pakistan
-
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
మరీ స్కూల్ పిల్లల్లా ఆడారు: పాక్ మాజీ బ్యాటర్ విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ సేన మరీ స్కూల్ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్ టైగర్స్’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్)కే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్ సేన పేపర్‌పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగాఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో.. ‘‘న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది. ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్ టైగర్స్ అంటారు.మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయినపుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓటమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్ శర్మ అంటున్నాడు.కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్ గెలిచింది. మీ సంగతి ఏమిటి?మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టైటిల్ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్‌లు ఓడిన పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్‌పై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాక్.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై ఘన విజయం సాధించింది. పాక్ గెలుపులో ఆ జట్టు స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కోల్పోయిన 20 వికెట్లను పాక్ స్పిన్నర్లే పడగొట్టారు. పాక్ స్పిన్నర్లలో సాజిద్ ఖాన్ 10 వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ 9, జహీద్ మెహమూద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.The wait is over for the Pakistan team 🔥pic.twitter.com/gLY4p3gaur— CricTracker (@Cricketracker) October 26, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (52), జేమీ స్మిత్ (89) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ 6, నౌమన్ అలీ 3, జహీద్ మెహమూద్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ సూపర్ సెంచరీతో (134) పాక్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో నౌమన్ అలీ (45), సాజిద్ ఖాన్ (48 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ 3, అట్కిన్సన్ 2, జాక్ లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.77 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. నౌమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) దెబ్బకు 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం 36 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 3.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.చదవండి: Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్‌కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్‌పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్‌మ్యాన్’?! -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
సౌద్ షకీల్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా పాక్!
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తోంది. పాక్ స్పిన్నర్ల దాటికి పర్యాటక ఇంగ్లీష్ జట్టు విల్లవిల్లాడుతోంది. 77 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్నర్లు నోమన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.షకీల్ సూపర్ సెంచరీ..అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన సెంచరీతో షకీల్ గట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న షకీల్ 5 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ 4 వికెట్లతో మెరవగా.. షోయబ్ బషీర్ మూడు, అట్కినసన్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్ చిత్తు -
PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..!
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం. 52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ సొంతగడ్డపై 11 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్ డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ ఏడు, నౌమన్ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, జాక్ లీచ్ 3, బ్రైడన్ కార్స్ 2, మాథ్యూ పాట్స్ ఓ వికెట్ పడగొట్టారు.297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నౌమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్‌గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్‌ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్‌కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్‌లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
PAK VS ENG 2nd Test: బెన్ డకెట్ వరల్డ్ రికార్డు
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డకెట్ టెస్ట్ క్రికెట్ అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. డకెట్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 2293 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉండేది. సౌథీ 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో బంతుల పరంగా వేగవంతమైన 2000 పరుగులు..బెన్ డకెట్ 2293 బంతులుటిమ్ సౌథీ 2418 బంతులుఆడమ్ గిల్‌క్రిస్ట్ 2483 బంతులుసర్ఫరాజ్ అహ్మద్ 2693 బంతులువీరేంద్ర సెహ్వాగ్ 2759 బంతులురిషబ్ పంత్ 2797 బంతులుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. బెన్ డకెట్ సెంచరీతో (114) కదంతొక్కగా.. జాక్ క్రాలే 27, ఓలీ పోప్ 29, జో రూట్ 34, హ్యారీ బ్రూక్ 9, బెన్ స్టోక్స్ ఒక్క పరుగు చేశారు. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నౌమన్ అలీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చదవండి: రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్ -
బెన్ డకెట్ సెంచరీ.. అయినా కష్టాల్లో ఇంగ్లండ్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఉన్నట్లుండి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో సాజిద్ ఖాన్ (పాక్ స్పిన్నర్) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లండ్ స్కోర్ 124/1 వద్ద ఉన్న సమయంలో సాజిద్ ఖాన్ వరుసగా ఓలీ పోప్ (29), జో రూట్ (34), సెంచరీ హీరో బెన్ డకెట్ (114), హ్యారీ బ్రూక్ (9) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 14 పరుగుల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 239/6గా ఉంది. జేమీ స్మిత్ (12), బ్రైడన్ కార్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది.బెన్ డకెట్ సెంచరీబెన్ డకెట్ 120 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. డకెట్‌కు టెస్ట్‌ల్లో ఇది నాలుగో సెంచరీ. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ ఆది నుంచి పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. డకెట్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బౌండరీలు బాదాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్ -
అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్ అయూబ్ అర్ద సెంచరీతో (77) రాణించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 7, షాన్ మసూద్ 3, సౌద్ షకీల్ 4, మహ్మద్ రిజ్వాన్ 41, అఘా సల్మాన్ 31, ఆమెర్ జమాల్ 37, సాజిద్ ఖాన్ 2, నౌమన్ అలీ 32, జహిద్ మహమూద్ 2 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బ్రైడన్ కార్స్ మూడు, మాథ్యూ పాట్స్ రెండు, షోయబ్ బషీర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 7 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. బెన్ డకెట్ 26, జాక్ క్రాలే 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’ -
అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్
‘‘అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను.. కానీ ఎప్పుడూ నిరాశ చెందలేదు. నాదైన రోజు వస్తుందని ఓపికగా వేచిచూశా’’.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ గులామ్ అన్న మాటలు ఇవి. 29 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపాడు.అనూహ్య రీతిలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడగా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 224 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితంగా కమ్రాన్ గులామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శతక ధీరుడిపై బాబర్ పోస్ట్ వైరల్ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కమ్రాన్‌ను కొనియాడుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. శతకం బాదిన తర్వాత కమ్రాన్ నేలతల్లిని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన బాబర్.. ‘‘చాలా బాగా ఆడావు కమ్రాన్’’ అంటూ అభినందించాడు. కాగా పాకిస్తాన్ తరఫున అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 13వ క్రికెటర్‌గా కమ్రాన్ గులామ్ రికార్డు సాధించాడు.తొలి ఆటగాడిగా మరో రికార్డుగతంలో పాక్ తరఫున ఖాలిద్ ఇబాదుల్లా (ఆస్ట్రేలియాపై 1966లో), జావేద్ మియాందాద్ (న్యూజిలాండ్‌పై 1976లో), సలీమ్ మాలిక్ (శ్రీలంకపై 1982లో), మొహమ్మద్ వసీమ్ (న్యూజిలాండ్‌పై 1996), అలీ నక్వీ (దక్షిణాఫ్రికాపై 1997లో), అజహర్ మహమూద్ (దక్షిణాఫ్రికాపై 1997లో), యూనిస్ ఖాన్ (శ్రీలంకపై 2000లో), తౌఫీక్ ఉమర్ (బంగ్లాదేశ్‌పై 2001లో), యాసిర్ హమీద్ (బంగ్లాదేశ్‌పై 2003లో), ఫవాద్ ఆలమ్ (శ్రీలంకపై 2009లో), ఉమర్ అక్మల్ (న్యూజిలాండ్‌పై 2009లో), ఆబిద్ అలీ (శ్రీలంకపై 2019లో) ఈ ఘనత సాధించారు. అయితే, ఇంగ్లండ్‌పై ఓ అరంగేట్ర పాకిస్తాన్ ఆటగాడు శతకం బాదడం ఇదే తొలిసారి.తొలిరోజు.. తడబడి.. నిలబడికమ్రాన్ గులామ్ (224 బంతుల్లో 118; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం కారణంగా రెండో టెస్టులో పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ముల్తాన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కాగా తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం పలు మార్పులు చేసిన పాకిస్తాన్ జట్టు... కమ్రాన్ గులామ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ అయూబ్ (77; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (7), కెప్టెన్ షాన్ మసూద్ (3), సౌద్ షకీల్ (4) విఫలమయ్యారు. ఒకదశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అయూబ్‌తో కలిసి కమ్రాన్ ఆదుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 29 ఏళ్ల కమ్రాన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసి గత కొంత కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న అతడికి ఎట్టకేలకు అవకాశం దక్కగా... తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, జాక్ లీచ్, కార్స్, పాట్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆఘా సల్మాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.బాబర్ స్థానంలో ఆడితే ఏంటి?‘ఈ అవకాశం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... దాన్నే ఇక్కడ కూడా కొనసాగించా. బాబర్ ఆజమ్ ఓ దిగ్గజం. అతడి స్థానంలో ఆడుతున్నా అనే విషయం పక్కనపెట్టి కేవలం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా. క్రీజులోకి వచ్చిన సమయంలో జట్టు ఇబ్బందుల్లో ఉంది.దీంతో ఆచితూచి ఆడాలనుకున్నా. దేశవాళీ అనుభవం బాగా పనికొచ్చింది’ అని కమ్రాన్ అన్నాడు. కాగా కమ్రాన్ గులామ్ ఇప్పటి వరకు 59 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4377 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పాక్ ప్లేయర్
బాబర్ ఆజమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ పాక్ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గులామ్.. 224 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన గులామ్.. చాలా బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. The Moments Kamran Ghulam completed his Hundred on Test Debut. 👏He came as Babar Azam's replacement and when came to bat Pakistan were 19/2 & then he smashed Hundred - THE FUTURE OF PAKISTAN. ⭐pic.twitter.com/Z33V23vVgV— Tanuj Singh (@ImTanujSingh) October 15, 2024అతడికి సైమ్ అయూబ్ (77) సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 86 ఓవర్ల అనంతరం ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (7), సైమ్ అయూబ్ (77), షాన్ మసూద్ (3), కమ్రాన్ గులామ్ (118), సౌద్ షకీల్ (4) ఔట్ కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (31), అఘా సల్మాన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ తుది జట్టు ప్రకటన
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించారు. తొలి టెస్ట్ ఆడిన పాక్ జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ స్థానాల్లో కమ్రాన్ గులామ్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్ తుది జట్టులోకి వచ్చారు. ఈ జట్టుకు సారధిగా షాన్ మసూద్ కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్‌గా సౌద్ షకీల్ వ్యవహరించనున్నాడు. రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును కూడా ఇవాళే ప్రకటించారు. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి రాగా.. పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో మరో పేసర్ మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ స్థానంలో బెన్ స్టోక్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఓలీ పోప్ నుంచి స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ కోసం పాక్ తుది జట్టు..సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఆమెర్ జమాల్, నౌమన్ అలీ, సాజిద్ ఖాన్, జహిద్ మెహమూద్పాక్తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే? -
పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ రేపటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. స్టోక్స్ గాయం కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టుకు ఓలీ పోప్ నాయకత్వం వహించాడు. పోప్ నాయకత్వంలో ఇంగ్లండ్ నాలుగింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా స్టోక్స్ చేరికతో ఇంగ్లండ్ జట్టు బలం మరింత పెరిగినట్లైంది. స్టోక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్న క్రమంలో క్రిస్ వోక్స్‌కు తప్పించించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్. ఈ మార్పుతో పాటు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మరో మార్పు కూడా చేసింది. తొలి టెస్ట్‌లో ఆడిన గస్ అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్‌ను తుది జట్టులోకి తీసుకుంది. స్టోక్స్ జట్టులో చేరిన క్రమంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి స్టోక్స్‌కే అప్పజెప్పాడు.మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా భారీ మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను పక్కకు పెట్టింది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడే రెండు టెస్ట్‌లకు వీరు దూరంగా ఉంటారు. వీరితో పాటు డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్ కూడా రెండో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.పాక్‌తో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్ -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
పాక్ క్రికెట్‌కు ఏమైంది? పిచ్చి నిర్ణయాలు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డాడు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్ల తెలివితక్కువతనానికి అద్దం పడుతోందన్నాడు. పీసీబీ అర్థంపర్థంలేని నిర్ణయాలకు ఇది పరాకాష్ట అంటూ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బాబర్‌పై వేటుముఖ్యంగా టెస్టుల్లో దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. అతడి స్థానాన్ని షాన్ మసూద్‌తో భర్తీ చేసింది పీసీబీ. అయితే, అప్పటి నుంచి పరిస్థితి ఇంకా దిగజారింది. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్టు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ అయింది.ఫలితంగా మసూద్ కెప్టెన్సీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ పాక్ వైఫల్యం కొనసాగిస్తోంది. తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 15 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.పీసీబీ మూర్ఖత్వానికి ఇది పరాకాష్టఈ నేపథ్యంలో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టు నుంచి టాప్ బ్యాటర్ బాబర్ ఆజంను తప్పించింది. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్.. ‘‘చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. అయినప్పటికీ అత్యుత్తమ ఆటగాడు బాబర్ ఆజంను తప్పించింది. పాకిస్తాన్ క్రికెట్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో ఇది పరాకాష్టలాంటిది. ఇంతకంటే తెలివి తక్కువతనం, మూర్ఖత్వం మరొకటి ఉండదు! ఒకవేళ అతడే స్వయంగా విరామం కావాలని గనుక అడిగి ఉండకపోతే!’’ అని ఎక్స్ వేదికగా పీసీబీ విధానాలను, సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.మూడు ఫార్మాట్లలోనూ ఆటగాడిగా, కెప్టెన్‌గా బాబర్ భేష్ తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో బాబర్ ఆజం పాకిస్తాన్ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో పలు కీలక విజయాలు అందించడంతో పాటు కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగ్గ ఘనతలు సాధించాడు. అంతేకాదు.. సుదీర్ఘ కాలం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా కూడా కొనసాగాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయిన అతను టెస్టుల్లో పరుగులు చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.గడ్డుకాలంచివరగా... డిసెంబర్ 2022లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్...గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా బాదలేకపోయాడు. ఇర 2023 నుంచి ఆడిన 9 టెస్టుల్లో అతడు సాధించిన పరుగుల సగటు 21 మాత్రమే. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన ముల్తాన్ పిచ్‌పై బాబర్ 30, 5 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ముఖ్యంగా బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని వికెట్‌పై అతను పేలవంగా ఆడి నిష్క్రమించడం విమర్శలకు తావిచ్చింది.కొత్త సెలక్టర్లు వచ్చారు.. వేటు వేశారు!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో పాక్ ఓడిపోగానే... మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో పాక్ బోర్డు హడావిడిగా కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఆటగాళ్లే బాబర్‌ను తప్పించాలని నిర్ణయించారు. అయితే, టాప్ బ్యాటర్ బాబర్‌పై వేటు పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలన చర్చకు కారణమైంది. ఇటీవల ఫామ్ కోల్పోయినా సరే...ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో అందరికంటే పెద్ద స్టార్ ఆటగాడు అతడేనన్నది వాస్తవం.ఇతరులలో మరో ఆటగాడు అతడి దరిదాపుల్లో కూడా లేడు. జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా బాబర్‌కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఒక దశలో తన నిలకడైన ఆటతో ‘ఫ్యాబ్ 4’తో పోటీ పడుతూ ఐదో ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌పై వేటు నిజంగా అసాధారణమనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మైకేల్ వాన్ కూడా ఘాటుగా స్పందించాడు. కాగా బాబర్ 55 టెస్టుల్లో 43.92 సగటుతో 9 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సహా 3997 పరుగులు చేశాడు.చదవండి: India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ! -
ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
బాబర్ ఆజంకు భారీ షాక్.. జట్టు నుంచి ఔట్?
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్‌లో జరగనున్న సెకెండ్ టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ESPNCricinfo నివేదిక ప్రకారం.. అలీమ్ దార్, ఆకిబ్ జావేద్ ,అజహర్ అలీలతో కూడిన సెలక్షన్ కమిటీ ఆజం ప్రదర్శన పట్ల తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు సమచాం. ఈ క్రమంలోనే అతనిని జట్టు నుండి తప్పించి యువ ఆటగాడు కమ్రాన్ గులాంకు ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నరట.బాబర్ కథ ముగిసినట్లేనా?బాబర్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసి సుమారు ఏడాది దాటింది. బాబర్ చివరగా గతేడాది ఆగస్టులో నేపాల్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే బాబర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 355 పరుగులు మాత్రమే చేశాడు. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని పీసీబీ ఫిక్స్ అయినట్లు వినికిడి.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
కషాల్లో పాకిస్తాన్ క్రికెట్.. ఆ స్టార్ క్రికెటర్‌కు మళ్లీ పిలుపు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరు ఏ మాత్రం మారలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో రెడ్ బాల్ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది.దీంతో సర్వాత్ర పాక్ జట్టు, మెనెజ్‌మెంట్ విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా జరిగే రెండు టెస్టుకు ముందు తమ జట్టులో పలు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్రకారం.. స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను తిరిగి జట్టులోకి తీసుకు రావాలని పీసీబీ సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. అతడితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జట్టులో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇమామ్ ఉల్ హక్ చివరగా పాకిస్తాన్ తరపున గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి పాక్ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ కెప్టెన్‌పై వేటు?
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరుస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమి చవిచూసింది.తొలి ఇన్నింగ్స్‌లో 550కు పైగా పరుగులు చేసి ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన మొదటి జట్టు పాకిస్తాన్ చెత్త రికార్డును మూటకట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసిన పాక్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 220 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 823 పరుగుల భారీ స్కోర్ చేసింది.మసూద్‌పై వేటు..కాగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్‌పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత అతడిని తమ జట్టు పగ్గాలను తప్పించాలని పాక్ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు పాక్ వెళ్లనుంది.ఈ టూర్‌కు ముందు పాక్‌కు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ ఆఘా సల్మాన్ లేదా వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. ఇక ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిఇక ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్‌ను కోల్పోలేదు.అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్‌ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా పాక్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే చివరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసంభవమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 115 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (41), అమెర్ జమాల్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..?