Ravichandran Ashwin
-
IND VS AUS 1st Test: అశ్విన్, జడేజా లేకుండానే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా ఇద్దరు స్ట్రయిట్ స్పిన్నర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి అనుభవజ్ఞులను పక్కన పెట్టి అంతంతమాత్రం అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. మ్యాచ్ ముందు వరకు ఆ ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అని అంతా అనుకున్నారు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఆఖరి నిమిషంలో సుందర్వైపు మొగ్గు చూపింది. అశ్విన్‌తో పోలిస్తే సుందర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడన్న కారణంగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడమైంది. మరి టీమిండియా అవళభించిన ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేక బెడిసికొడుతుందా అన్నది వేచి చూడాలి.ఎందుకంటే అశ్విన్, జడేజా ఇద్దరికి కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ సుందర్‌నే ఎంచుకుని పెద్ద సాహసమే చేసింది. ఇటీవలికాలంలో అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా బరిలోకి దిగిందే లేదు. వీరిద్దరు లేకుండా 2021 గబ్బా టెస్ట్‌లో భారత్ చివరిసారిగా బరిలోకి దిగింది.మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఒకరు నితీశ్ కుమార్ రెడ్డి కాగా.. రెండో ఆటగాడు హర్షిత్ రాణా. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. హర్షిత్ రాణా రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పెర్త్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించనుండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది. బుమ్రా భారత పేస్ అటాక్‌ను లీడ్ చేయనుండగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ మరో ఇద్దరు పేసర్లుగా ఉన్నారు. నితీశ్ కుమార్ నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్‌గా ఉంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. జైస్వాల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు పంపగా.. పడిక్కల్‌ను హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. 14 ఓవర్ల అనంతరం భారత స్కోర్ 20/2గా ఉంది. కేఎల్ రాహుల్ (14), విరాట్ కోహ్లి (0) క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. జడేజాకు నో ప్లేస్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తుది జట్టు కూర్పు సమస్యగా మారింది. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం.. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో టీమిండియా ప్రత్యామ్నాయ ఆటగాళ్లను వెతుక్కునే పనిలో పడింది.రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్న టీమిండియా మేనేజ్మెంట్.. శుభ్‌మన్ గిల్ స్థానంలో (వన్‌డౌన్‌లో) ఎవరిని ఆడించాలో అర్దం కాక తలలు పట్టుకుని కూర్చుంది. జట్టులో లేని దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలని కొందరంటుంటే.. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మరికొందరంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో విరాట్, రిషబ్ పంత్ మినహా పెద్ద అనుభవజ్ఞులు లేరు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగాలని భావిస్తుంది. స్పెషలిస్ట్ పేసర్ల కోటాలో బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ తుది జట్టులో చోటు దక్కించుకోనుండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. పెర్త్ పిచ్ పేసర్లకు సహకరించనుండటంతో భారత్ తప్పకుండా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది.జడేజాకు నో ప్లేస్ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒకే ఒక స్పిన్నర్ ఫార్ములాతో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాను పక్కన పెట్టి అశ్విన్‌ను తుది జట్టులో ఆడించనుంది. ఆసీస్ జట్టులో ఎక్కువగా లెఫ్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కోచ్ గంభీర్ సైతం ఇదే నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్ట్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా -
వాషింగ్టన్ సుందర్‌కు భారీ ధర.. ఏకంగా రూ. 15.5 కోట్లు!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్లైన్లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు.న్యూజిలాండ్‌పై అదుర్స్..కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!? -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
ఆసీస్ తొలి టెస్టు.. టీమిండియా తుది జట్టు ఇదే! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టుతో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు మొదటి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ఆసీస్ పర్యటనను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అయితే తొలి టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంచుకున్నాడు. తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను రవిశాస్త్రి ఎంపిక చేశాడు. అదే విధంగా కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రావాలని అతడు సూచించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్‌కు సైతం శాస్త్రి చోటిచ్చాడు."తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ను ప్రమోట్ చేయాలి. అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతడు టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఒకవేళ గిల్ జట్టులో లేకపోయింటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సి ఉండేది. రోహిత్ బ్యాకప్‌గా ఎంపికైన ఈశ్వరన్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన సిరీస్‌లో ఈశ్వరన్ కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. అయితే నెట్స్‌లో ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో జట్టు మేనెజ్‌మెంట్‌కే తెలియాలి. తుది జట్టులో అశ్విన్ లేదా జడేజాకు చోటు ఇవ్వాలా అన్న చర్చ నడుస్తోంది. నేను అయితే జడేజాతోనే వెళ్తాను. ఎందుకంటే అతడు ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అశ్విన్‌కు ఓవర్సీస్లో పెద్దగా రికార్డు లేదు" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.రవిశాస్త్రి ఎంచుకున్న భారత తుది జట్టు ఇదేశుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.చదవండి: #Tilak Varma: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన మిస్టరీ స్పిన్నర్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టిస్తాడు.2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఏ భారత స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్‌కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 5.25 సగటున 8 వికెట్లు తీశాడు.డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ డేంజరెస్ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.అశ్విన్ అరుదైన రికార్డు..ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్? -
నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ సాధించలేకపోయిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తాచాటాడు. తన క్యారమ్ బంతులతో కివీస్ బ్యాటర్లను అశ్విన్‌ను బోల్తా కొట్టించాడు. రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 63 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.ప్రతీకారం తీర్చుకున్న అశ్విన్..ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్‌ను అశ్విన్ ఔట్ చేసిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన అశ్విన్‌ను ఫిలిప్స్ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో తొలి మూడు బంతుల్లో ఫిలిప్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అశూపై పైచేయి సాధించినట్లు ఫిలిప్స్ థీమాగా కన్పించాడు. కానీ అశ్విన్ మాత్రం దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.ఓ సంచలన బంతితో ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్‌కు సదరు కివీ బ్యాటర్ దగ్గర సమాధానమే లేకుండాపోయింది. అతడిని బౌల్డ్ చేసిన వెంటనే అశ్విన్ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా అన్నట్లు ఫిలిప్స్ వైపు చూస్తూ అశ్విన్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.పట్టు బిగించిన భారత్..ఇక ముంబై టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విల్ యంగ్(51) సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి A special effort to dismiss Glenn Phillips 🔥Ashwin takes Phillips as New Zealand loses their 6th wicket. Lead is 103 now. #INDvNZ #ashwin #IndiaVsNewZealand #3rdtest #Mumbai #bcci pic.twitter.com/BbNWJ2ylBR— Abhinandan Bhattacharjee (@Abhi11590) November 2, 2024 -
ముంబై టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.263కు భారత్ ఆలౌట్..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
కివీస్‌తో మూడో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్‌ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్‌కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్‌లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు. హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్‌గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్‌కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లు బంతితో మ్యాజిక్ చేశారు. తమ స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించారు.ఈ ఇద్దరు తమిళ తంబీల దాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే తొలుత అశ్విన్ వికెట్ల వేటను మొదలు పెట్టగా.. సుందర్ ముగించాడు. కివీస్ మొత్తం పది వికెట్లను ఈ ఇద్దరే పడగొట్టారు.వాషింగ్టన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ 10 వికెట్లు పడగొట్టిన అశ్విన్-సుందర్ జోడీ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నారు.వరల్డ్ రికార్డు..→టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన ఆఫ్-స్పిన్ జోడీగా అశ్విన్-సుందర్ నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.→అదే విధంగా టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన భారత ఆఫ్ స్పిన్ జోడీ కూడా వీరిద్దరే కావడం విశేషం.వీరికంటే ముందు ఏ భారత కుడిచేతి వాటం స్పిన్నర్లు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.→మరోవైపు భారత్ గడ్డపై టెస్టుల్లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పది వికెట్లు స్పిన్నర్లే తీయడం ఇది ఆరోసారి. ఈ ఘనతను అంతకంటే ముందు భారత్ నాలుగు సార్లు సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి సాధించింది. -
ఏడేసిన వాషింగ్టన్.. 259 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ల దాటికి కివీస్ 259 పరుగులకు ఆలౌటైంది. అనుహ్యంగా పుణే టెస్టుకు భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను సుందర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా వాషీ తన సెకెండ్ స్పెల్‌లో అయితే అద్భుతమైన బంతులతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అతడితో పాటు మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సాధించి తనవంతు పాత్ర పోషించాడు.మరోసారి కాన్వే, రచిన్..ఇక కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాన్వే 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రవీంద్ర(65) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో శాంట్నర్(33) కాసేపు అలరించాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. అయితే ఆదిలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. -
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల వీరులు.. ఏడో స్థానానికి ఎగబాకిన అశ్విన్
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 24) మొదలైన రెండో టెస్ట్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్ తన వికెట్ల సంఖ్యను 531కి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసీస్ స్పిన్ లెజెండ్ నాథన్ లయోన్ను (530) అధిగమించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) అశ్విన్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అశ్విన్.. టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డెవాన్ కాన్వే (76) వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్ర (43), డారిల్ మిచెల్ (12) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ లియోన్ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.తొలుత నాథన్ లియోన్ రికార్డు సమం చేసిఈ క్రమంలో భారత్- కివీస్ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(15)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్. కివీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్‌ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్ మరో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్‌ను అవుట్ చేశాడు. లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించిఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్ డబ్ల్యూటీసీ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 47, రచిన్ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు -
IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్
పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.ఇన్నింగ్స్ 24వ ఓవర్లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈసారి యాష్ విల్ యంగ్‌ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యంగ్ పెవిలియన్ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 76/2గా ఉంది. డెవాన్ కాన్వే (38), రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నారు.ASHWIN STRIKES IN HIS FIRST OVER 👌- What a champion, India on charge at Pune. pic.twitter.com/oJOCsGZPAZ— Johns. (@CricCrazyJohns) October 24, 2024కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేసింది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106 -
Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన
న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. కివీస్‌తో పుణె, ముంబై మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(462) చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి పిలిపించడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు టెస్టులో విఫలమైన రవీంద్ర జడేజా నేపథ్యంలో ఈ తమిళనాడు క్రికెటర్‌పై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ సెంచరీతో మెరిసిన వాషీకాగా రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా తమిళనాడు తరఫున వాషింగ్టన్ సుందర్ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీ(269 బంతుల్లో 152; 19 ఫోర్లు, ఒక సిక్సర్)తో సత్తా చాటాడు.తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు(674/6 డిక్లేర్డ్) సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు మూడేళ్ల తర్వాత టెస్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వాషింగ్టన్ సుందర్ 2021లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు.‘పెద్దోడి’కి తోడుగా చిన్నోడు!ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కివీస్‌తో సిరీస్‌లో చెన్నై దిగ్గజ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ‘పెద్దోడి’కి చిన్నోడు జతకావడం విశేషం. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24- 28 వరకు పుణె వేదికగా రెండో టెస్టు, నవంబరు 1-5 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో రెండు, మూడో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్ 🚨 News 🚨Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBankDetails 🔽— BCCI (@BCCI) October 20, 2024 -
అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
భారత క్రికెట్‌కు మరో అసలుసిసలైన ఆల్‌రౌండర్ దొరికేశాడు. బ్యాట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసే సత్తా అతడిది. మరోవైపు బంతితో బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెట్టే మాస్టర్ మైండ్ అతడిది. జట్టులో కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే ఆపద్బాంధవుడు. అతడే ముంబై యువ సంచలనం తనీష్ కోటియన్. కోటియన్ గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌ను ముంబై సొంతం చేసుకోవడం లోనూ తనీష్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోటియన్.. రెండో ఇన్నింగ్స్‌లో సంచలన సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరి కోటియన్ సెంచరీ చేయడం గమానార్హం. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 3 వికెట్లతో సత్తాచాటాడు.అశ్విన్ వారుసుడు దొరికినట్లేనా?ఫస్ట్ క్రికెట్లో అతడి ప్రదర్శన చూసిన క్రికెట్ నిపుణులు త్వరలోనే భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఈ యువ సంచలనం.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారుసుడుగా బాధ్యతలు చేపడతాడని జోస్యం చెబుతున్నారు.కాగా అశ్విన్‌కు, తనీష్‌కు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషేన్ కూడా దాదాపు సమానంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్ ఏ విధంగా అయితే ఆదుకుంటాడో, కోటియన్ కూడా విరోచిత పోరాటం కనబరుస్తున్నాడు. అశ్విన్ రిటైరయ్యాక భారత టెస్టు జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా తనీష్ మారే అవకాశముంది.ఎవరీ తనీష్.. ?25 ఏళ్ల తనీష్ కోటియన్ ముంబైలో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ముంబైకు తనీష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 రంజీ సీజన్‌తో సౌరాష్ట్రపై కోటియన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 30 రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అతడు 88 వికెట్లతో పాటు 1451 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది రంజీ సీజన్లో కోటియన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన కోటియన్.. 502 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో కూడా తనీష్ 121 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.చదవండి: -
అశ్విన్‌కే సాధ్యం.. ముత్తయ్య మురళీధరన్ వరల్డ్ రికార్డు సమం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ సెంచరీతో ఆదుకున్నాడు.సొంత మైదానం చెపాక్‌లో నిలకడగా ఆడి 113 పరుగులు సాధించాడు. అంతేకాదు.. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి.. బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి అశూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.రెండో టెస్టులోనూ అదరగొట్టిఇక కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అశ్విన్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను తిప్పలుపెట్టి కీలక వికెట్లు కూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(31), షకీబ్ అల్ హసన్(9) వికెట్లు తీసిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్(10), మొమినుల్ హక్(2), హసన్ మహమూద్(4)లను పెవిలియన్‌కు పంపాడు. అలా మొత్తంగా రెండో టెస్టులో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సమంఈ మ్యాచ్‌లోనూ భారత్ బంగ్లాపై గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన అశ్విన్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. అశూ టెస్టుల్లో ఈ పురస్కారం అందుకోవడం ఇది పదకొండోసారి కావడం విశేషం. తద్వారా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ చెన్నై బౌలర్ సమం చేశాడు. మురళీధరన్ కూడా సంప్రదాయ క్రికెట్లో 11 సార్లు ఈ అవార్డు గెలిచాడు. కాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన రోహిత్ సేన.. కాన్పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.టెస్టుల్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన క్రికెటర్లుముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 11 సార్లురవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 11 సార్లుజాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా)- 9 సార్లుసర్ రిచర్డ్ హాడ్లీ(న్యూజిలాండ్)- 8 సార్లుఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్)- 8 సార్లుషేన్ వార్న్(ఆస్ట్రేలియా)- 8 సార్లు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు -
WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో ఇంత వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఘనత నమోదు చేశాడు. కాగా సొంతగడ్డపై భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డుఈ క్రమంలో సొంతమైదానం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో అశూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెపాక్‌లో రెండో టెస్టు సందర్భంగా అశూ సెంచరీ(113) చేయడంతో పాటు.. ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. కాన్పూర్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టు సందర్భంగా అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా సీజన్లో ఆడిన తొలి పది మ్యాచ్‌లలోనే ఈ రికార్డు నెలకొల్పాడు.డబ్ల్యూటీసీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వికెట్స్ బౌలర్ అశూ2019-21 సీజన్- 14 మ్యాచ్‌లలో 71 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 7/1452021-23 సీజన్- 13 మ్యాచ్‌లలో 61 వికెట్లు- అత్యుత్తమ గణాంకాలు 6/912023-25 సీజన్- 10* మ్యాచ్‌లలోనే 50* వికెట్లు()-అత్యుత్తమ గణాంకాలు 7/71.ధనాధన్‌ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయమే లక్ష్యంగా ఐదో రోజు ఆట మొదలుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 26/2(11) ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ను అశూ ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొమినుల్ హక్‌ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆకాశ్ దీప్ షాద్మన్ ఇస్లాం, రవీంద్ర జడేజా నజ్ముల్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ వికెట్లు కూల్చారు. దీంతో వందలోపు(94) పరుగులకే బంగ్లా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి..బజ్‌బాల్ క్రికెట్‌తో గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు.తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే తన కెరీర్లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లోఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇంకొక్క వికెట్ తీస్తే..కాన్పూర్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరతాడు. తద్వారా.. సంప్రదాయ క్రికెట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు.. ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గానూ రికార్డు సాధిస్తాడు.టీ20లకు గుడ్బైకాగా 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 73 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ టెస్టులో 3122 పరుగులు, 299 వికెట్లు.. వన్డేల్లో 2756 రన్స్, 220 వికెట్లు, టీ20లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో సభ్యుడైన 35 ఏళ్ల జడ్డూ.. ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టులు, ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్ -
Ind vs Ban: 'టీమిండియాకు ఇది మంచికాదు'
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు బరిలో దిగిన భారత క్రికెట్ జట్టు విజయంతో పునరాగమనం చేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.ఇక బంగ్లాదేశ్‌తో టెస్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ శతకాలతో మెరవగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. సెంచరీ కొట్టడంతో పాటు ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలంఅంతాబాగానే ఉన్నా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైఫల్యం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ 11, కోహ్లి 23 పరుగులు మాత్రమే చేయడం మేనేజ్మెంట్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.టీమిండియాకు ఇది మంచికాదురోహిత్, కోహ్లి దులిప్ ట్రోఫీ-2024లో ఆడితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయినా.. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతుల ఆధారంగా తారతమ్యాలు చూపించడం.. భారత క్రికెట్‌కి మంచిది కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరు వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు. తిరిగి ఫామ్‌లోకి రాగలరు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ ఆడితే బాగుండేది.వారిని ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆడించే వీలున్నా విశ్రాంతినిచ్చారు. మిగతా వాళ్లకు మాత్రం ఆ వెసలుబాటు లేదు. అయినా.. ఒక్కక్కళ్లను ఒకలా ట్రీట్ చేయడం భారత క్రికెట్‌కు నష్టంచేకూర్చే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిల క్రేజ్ దృష్ట్యా వారు కోరినట్లు చేయడం సరికాదు. దులిప్ ట్రోఫీ ఆడి ఉంటే వారిద్దరు ఫామ్‌లోకి వచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో మిగతా ప్లేయర్లు రాణించారు కాబట్టి సరిపోయిందని.. లేదంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్, కోహ్లితో పాటు అశ్విన్, బుమ్రా సైతం దులిప్ ట్రోఫీ ఆడలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా: విండీస్ స్టార్