Sangareddy District Latest News
-
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
సంగారెడ్డి జోన్: నేరాల నియంత్రణ కోసమే ప్రజలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో ఎస్పీ చెన్నూరి ఆదేశాల మేరకు 100 పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ ప్రోగ్రామ్ (కార్డెన్ సెర్చ్) నిర్వహిచారు. కాలనీలో వివిధ పరిశ్రమల్లో పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చే మైగ్రేట్ లేబర్ అధిక సంఖ్యలో నివాసం ఉంటారని ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తిని, సరైన పత్రాలు లేని 42 బైక్స్, 3 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. మీ చుట్టూ జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలని, అసాంఘీక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీసు శాఖకు నంబర్ 87126 56777 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, జోగిపేట సీఐ అనిల్, కొండాపూర్ సీఐ వెంకటేశం, సబ్ డివిజన్ ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీ సత్తయ్య గౌడ్ -
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
సంగారెడ్డి జోన్: క్రీడాకారులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్లి జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్విమ్మింగ్ పోటీలను టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, డీవైఎస్ఓ కాసీంబేగ్, అథ్లెటిక్స్ పోటీలను మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ ప్రారంభించారు. భెల్‌ను సందర్శించిన వెంకటేశన్ రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్‌ను బుధవారం నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కరంచరీస్ చైర్మన్ ఎం.వెంకటేశన్ సందర్శించారు. ఈ సందర్భంగా బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకు భెల్ ఈడీ కె.బి.రాజా స్వాగతం పలికారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు గౌరవ వందనం చేశారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిశ్రమలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీఎంహెచ్ఆర్ శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు. -
టాలెంట్ టెస్ట్‌లతో ప్రతిభ వెలికితీత
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్ట్‌లు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో బయోలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. తెలుగు మీడియంలో జెడ్పీహెచ్ఎస్ అంతారం విద్యార్థి జశ్వంత్ ప్రథమ, జెడ్పీహెచ్ఎస్ తెల్లాపూర్ విద్యార్థి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో జెడ్పీహెచ్ఎస్ మిర్జాపూర్ విద్యార్థి సాదియానౌషిన్, లింగంపల్లిలోని టీజీఆర్ఎస్ గురుకుల విద్యార్థి వినయ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈనెల 28వ తేదీన రాష్ట్రస్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్దారెడ్డి, జీవశాస్త్ర జిల్లా ఫోరం అధ్యక్షుడు మురళి, కార్యదర్శి రామకృష్ణ, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.డీఈఓ వెంకటేశ్వర్లు -
పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి
సంగారెడ్డి: చలి కాలంలో పిల్లలు, వృద్ధులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య నియమాలు పాటించాలి.జలుబు, దగ్గు ఉన్న వారు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఎప్పటికప్పుడు వేడి పదార్థాలను తీసుకోవాలి. చలి కాలంలో శరీరం పొడిబారి దురద, మంట వంటివి కలుగుతుంటాయి. పిల్లల చర్మం పొడి బారకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్‌తో బాగా మసాజ్ చేయాలి. అలాగే పిల్లల బట్టలు తడిగా లేకుండా చూసుకోవాలి. మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది కాబట్టి బట్టలు తడిచిన వెంటనే మార్చితే మంచిది. శరీరాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. స్వెట్టర్, తల, చెవులను కప్పి ఉంచే క్యాప్ కూడా ధరించడం ముఖ్యం. అస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు చలికి మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు చల్లటి గాలులతో ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అలాగే.. చలికాలంలో వృద్ధులకు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వారి పట్ల ఇంట్లో వారు పలు జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. బలమైన ఆహార పదార్థాలు పెట్టాలి. ఒకే దగ్గర ఉండకుండా నడక, వ్యాయామ ప్రక్రియలు చేయించాలి. చలి తీవ్రతతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్తలు తప్పనిసరి. – డాక్టర్ అనిల్‌కుమార్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డిసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చలికాలంలో ఉదయం పొగమంచు పడుతుంటుంది. ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించవు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు పొగమంచు ఉన్నప్పడు వాహనం నడపకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెడ్‌లైట్ వేసుకుని వాహనం నడపాలి. బీమ్ డిప్పర్ లాంగ్ రేంజ్లో పెట్టుకోవాలి. వీలైనంత తక్కువ వేగంతో వెళ్లాలి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా.. కొంత జాగ్రత్త పడవచ్చు. వీలైతే ఫ్లాష్ లైట్లు వేసుకోవాలి. వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఉండేలా చూసుకోవాలి. ముందువైపు వైట్ కలర్, వెనుక వైపు రెడ్, సైడ్‌కు ఎల్లో స్టికర్లు ఉంచుకోవాలి. వాహనాన్ని నిలపాల్సి వస్తే తప్పనిసరిగా రోడ్డు కిందకి దించి ఆపుకోవాలి. లేదంటే ఇతర వాహనాలు వచ్చి ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. మెకానికల్‌కు సంబంధించి 15 సంవత్సరాలు పైబడిన వాహనాలకు సంబంధించి బ్రేక్‌లైట్లు పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంజన్ హీటర్ ప్లగ్ పనిచేస్తుందా చూసుకోవాలి. లేకపోతే వాహనం తొందరగా స్టార్ట్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు ప్రశాంతంగా ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలి. విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు వాహనాన్ని నడిపితే ఇబ్బందులు వస్తాయి. – ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ -
పంచాయతీ పోలింగ్ కేంద్రాలు
● తుది పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ● వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా జాబితా ● గతంలో కంటే తగ్గిన పోలింగ్ కేంద్రాలుసంగారెడ్డి జోన్: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ కొరకు పోలింగ్ కేంద్రాలనుసిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా అధికారులు కేంద్రాలను గుర్తించి వాటి స్థితిగతులను పరిశీలించారు. వాటన్నింటిని క్రోడీకరించి జాబితాను రూపొందించారు. నివేదికలను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిసి 27 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో విలీనం అయిన ఒక పంచాయతీతో కలిసి 646 గ్రామ పంచాయతీలు, 5718 వార్డులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబరు 7వ తేదిన సిద్ధం చేసిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీఓలచే ప్రచురణ చేసి, 10వ తేదీన జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12న మండల స్థాయిలో అధికారులు రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముసాయిదా జాబితాపై 7నుంచి 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 13న అభ్యంతరాలను పరిష్కరించి, 16న కలెక్టర్ ఆదేశాలతో ఆమోదం చేసి, 17న మండల అధికారులు తుది జాబితాను విడుదల చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసింది. అదే విధంగా గ్రామ జనాభా ఆధారంగా నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గతంలో 5,778 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 5,718 వార్డులు ఉన్నాయి. వార్డులతో పాటు ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే 650 కంటే ఎక్కువగా ఉంటే మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో గతంలో 5,778 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 5,732 కేంద్రాలను గుర్తించి, జాబితాను విడుదల చేశారు.మౌలిక వసతులు.. దూరభారం తగ్గింపుపోలింగ్ కేంద్రాలలో విద్యుత్, తాగు నీరు, వికలాంగుల కొరకు ర్యాంపు, టాయిలెట్, బాత్రూం వంటి వసతులు కల్పిస్తూ కేంద్రాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఓటు వేసేందుకు దూర భారం తగ్గించేందుకు గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.నియోజవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం సీ్త్రలు పురుషులు ఇతరులు మొత్తం పోలింగ్ కేంద్రాలుఅందోల్ 84214 81407 6 165627 1252 నారాయణఖేడ్ 94093 95116 6 189215 1620 నర్సాపూర్ 21697 20651 2 42350 334 పటాన్చెరు 59497 61107 9 120613 454 సంగారెడ్డి 67990 65322 27 133339 810 జహీరాబాద్ 100248 100026 2 200276 1262 మొత్తం 423629 427739 52 851420 5732 -
21న పెన్షనర్ల నూతన భవన ప్రారంభం
సంగారెడ్డి: పెన్షనర్ల నూతన భవనం ఈ నెల 21న శనివారం ప్రారంభించనున్నట్లు పెన్షనర్ల రాష్ట్ర సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పదివేల మంది పెన్షనర్స్ ఉండగా, సంగారెడ్డి ఎస్టీఓ పరిధిలో 4500 మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు. 2018లో మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ హన్మంతరావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆశీర్వాదంతో సంఘ భవనానికి స్థలం కేటాయించారని గుర్తు చేశారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి, కొత్తవారికి సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నర్సారెడ్డి, భక్కరెడ్డి, జగదీశ్వర్, మురళీధర్ పాల్గొన్నారు. వేస్ట్ డీకంపోజర్‌తో అధిక దిగుబడి రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ కంగ్టి(నారాయణఖేడ్): పంటల వ్యర్థాలు, ఆకు లు, చెత్తతో పంటలకు బలాన్ని చేకూర్చడంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు వేస్ట్ డీకంపోజర్ విధానంతో సాధ్యమని ఏడీఏ నూతన్‌కుమార్ తెలిపారు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి యూనిట్లు నెలకొల్పి రైతులతో తయారు చేయిస్తున్నట్లు ఏఈఓ సంతోష్ కుమార్ చెప్పారు. కంగ్టి మండంలోని నాగుర్(కే)లో రైతులకు ఈ విధానంపై శిక్షణ ఇస్తున్నామని, రూ.20లతో 30గ్రాముల డీకంపోజర్ మదర్ కల్చర్‌తో వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తేవచ్చని తెలిపారు. ఆవుపేడ నుంచి అభివృద్ధి చేసిన సూక్ష్మజీవుల పదార్థంతో నేలలో సారం పెంచడంతో పాటు జైవిక ఎరువుగాను, పంటలు రోగాల బారిన పడకుండా జైవికంగా నియంత్రిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మునిపల్లి(అందోల్): విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మునిపల్లి మోడల్ స్కూల్, హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఉన్నతికి ప్రభు త్వం అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందన్నారు. మోడల్ స్కూల్, హాస్టల్‌కు ఏమే మి కావాల్లో పూర్తి వివరాలు అందజేయాలని ప్రిన్సిపాల్ మల్లికను ఆదేశించారు. సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, డ్యూయల్ డేస్కులు, లైబ్రరీకి పుస్తకాలు, ఆటలు, స్పోర్ట్స్ మెటీరియల్, వాష్ రూమ్‌లకు మరమ్మతులు చేయాల్సి ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంపీఓ, ఎంఈఓ పాల్గొన్నారు. -
ఖేడ్‌లో ఉచితకంటి పరీక్షలు
నారాయణఖేడ్: పట్టణంలో బుధవారం సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాదు నానక్ రాంగూడలోని శంకర కంటి ఆస్పత్రి వైద్యులు ఖేడ్ ప్రాంతానికి చెందిన 50 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో 26 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి, వారిని ప్రత్యేక వాహనంలో శంకర కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సత్యసాయి 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతీనెల సంగారెడ్డి జిల్లాలో మూడు ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. -
జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. బుధవారం మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో ఇంటింటికీ సీపీఎం పేరుతో విరాళాల సేకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు. సంగారెడ్డి పట్టణంలో వచ్చే నెల 25 నుంచి 28 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండలం కార్యదర్శి ప్రవీణ్, నాయకులు అనిల్, మల్లేశ్, పుష్పమ్మ, ప్రసాద్, శ్రీనివాస్, మోహన్, పాండురంగం, మోహన్‌చారి తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు -
అంగన్వాడీలను మెరుగ్గా నిర్వహించాలి
జహీరాబాద్ టౌన్: అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని శిశుసంక్షేమ శాఖ జిల్లా డీడబ్ల్యుఓ లలిత కుమారి అన్నారు. జహీరాబాద్ మండలం రంజోల్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రాజెక్టు మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు మెరుగు పడాలంటే సూపర్వైజర్లు ప్రతి నెల సెంటర్లను తనిఖీలు చేయాలన్నారు. కేంద్రాల నిర్వహణ శుభ్రంగా ఉండాలని, టీచర్లు సమయపాలన పాటించాలని, పిల్లలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. గుడ్లు, బాలామృతం ప్లస్‌కు లోటురాకుండా చూసుకోవాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటున్నారా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వీటిపైన సూపర్వైజర్లు దృష్టి పెట్టాలని సూచించారు.జిల్లా శిశు సంక్షేమశాఖ డీడబ్ల్యుఓ లలిత కుమారి -
కోర్టు తీర్పు చారిత్రాత్మకం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని హాస్మి మజీద్ ఆస్తులకు సంబందించి కోర్టు ఇచ్చి న తీర్పు చారిత్రాత్మకమని మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం నారాయణఖేడ్‌లో విలేకర్లతో మైనార్టీ నాయకులు మాట్లాడారు. పట్టణంలోని హాస్మి మజీద్‌కు 500 ఏళ్ల పూర్వం నుంచి 80 ఎకరాల వరకు భూమి ఉందన్నారు. మజీద్ ముత్తవల్లిగా డాక్టర్ ఎస్ఏ మాజీద్ కుటుంబ సభ్యులు ఉండగా మజీద్ నిర్వహణ బాధ్యత చేపట్టాల్సి ఉండగా దాయాదులు దశాబ్దాల క్రితం నుంచి భూములు అనుభవిస్తున్నారని అన్నారు. ఎస్ఏ మాజీద్ స్థానిక మజీద్ కమిటీ బాధ్యులతో కలిసి ఈ భూములు నిబంధనల ప్రకారం ముత్తావలి కుటుంబంలో పెద్దవారి పర్యవేక్షణలో ఉండాలని సూచిస్తూ వక్ఫ్‌బోర్డు ద్వారా ఉత్తర్వులు ఇప్పించారన్నారు. ఆనంతరం హాస్మి మజీద్‌కు సంబంధించి సర్వే నంబరు114లోని దాదాపు 40 ఎకరాల భూములకు సంబంధించి ఖాజీ తమకు సైతం భూములను అనుభవించే హక్కు ఉంటుందని ప్రయత్నాలు చేశారన్నారు. తాము అప్పట్లో కోర్టును ఆశ్రయించి ఆ ప్రయత్నాలను అడ్డుకొని స్టే తీసుకొచ్చామన్నారు. స్టే ఉన్నప్పటికీ ఇటీవల మళ్లీ వక్ఫ్‌బోర్డు ద్వారా హాస్మి మజీద్ భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు మళ్లీ హాస్మి మజీద్‌కే ఈ భూములు ఉంటాయని, మజీద్ నిర్వాహణ బాధ్యతలు చేపట్టే వారు భూములను అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను మైనార్టీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ రాజుకు అందించారు. కార్యక్రమంలో మోయిద్‌ఖాన్, ముత్తవలి డాక్టర్ ఎస్ఏ మాజీద్, మీర్ అంజద్ అలీ, ఖాదర్‌సాబ్, ముంతాజ్, సికిందర్ అలీ, జకిర్యా ఖురేషి, అజీం, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.ఖేడ్ మైనార్టీ నాయకులు -
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్) : సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో శివ్వంపేట మండల క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 17, 18 తేదీల్లో మెదక్ జరిగిన వివిధ క్రీడా పోటీల్లో శివ్వంపేట మండలం నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం ఖో ఖో ఫైనల్ కొల్చారం జట్టుతో తలపడి విజయం సాధించి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ఎంఈఓ బుచ్చనాయక్, పీడీ చంద్రమోహన్ అభినందించారు. వాలీబాట్ క్రీడలో ధర్మాజీపేట విద్యార్థులు దుబ్బాకటౌన్: ఈ నెల 17, 18వ తేదీల్లో సిద్దిపేటలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ క్రీడలో దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అభిజ్ఞ, అక్ష య బాలికల విభాగంలో, అభినవ్ బాలుర విభా గంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవా రం పాఠశాల హెచ్ఎం సాదత్ ఆలీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. జీవశాస్త్ర ప్రతిభా పరీక్షల్లో.. సిద్దిపేటజోన్: జీవశాస్త్ర ప్రతిభా పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం స్థానిక టీటీసీ భవన్లో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో ఇరుకోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థి వేణు ప్రథమ స్థానంలో నిలువగా, మర్పడగ పాఠశాల విద్యార్థి అభివర్ణిక, సంజనలు ద్వితీయ స్థానంలో నిలిచారు. అదే విధంగా తెలుగు మీడియం విభాగంలో చికోడ్ పాఠశాల విద్యార్థి భువన ప్రథమ స్థానంలో నిలువగా, వెల్కటూర్ పాఠశాల విద్యార్థి సంజన ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, పరీక్షల విభాగం కార్యదర్శి శౌకత్ అలీ, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖో ఖోలో శివ్వంపేట జట్టు ప్రతిభ -
వేడి వేడి ఆహారం తీసుకోవాలి
సాక్షి సిద్దిపేట : చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఉదయం 10 గంటల వరకు బయటకు రాకూడదు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. తాజా వేడి వేడి ఆహారం తీసుకోవాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. రూమ్ హీటర్స్ వాడాలి. కానీ అతిగా వినియోగించొద్దు. బయటకు వెళ్లే సమయంలో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ ధరించాలి. సిద్దిపేటలో ప్రస్తుతం 75 నుంచి 80 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. ఇది 50 కి తక్కువగా ఉంటే మంచిది. చలి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.– డాక్టర్ గణేశ్ వెనిశెట్టి, జనరల్ ఫిజీషియన్ సిద్దిపేట -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): మంజీరా వాగులోకి చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన జలగం ఏసు(36) చేపల వేట కోసం 16వ తేదీన మంజీరా వాగులోకి వెళ్లాడు. రెండు రోజులు అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకు తుండగా మంజీరా పాయలోని ఓ గుండు పై మృతదేహమై కనిపించాడు. ఏసుకు తరచూ ఫిట్స్ వచ్చేదని, అదే మృతికి కారణమై ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మహిళ.. కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారి లోతు వాగు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రేపల్లె వాడుకు చెందిన పిట్ల సాయిలు ఆరేళ్ల కిందట బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. భార్య స్వప్న (26) రెండేళ్ల నుంచి పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ కారు షోరూం లో పని చేస్తుంది. స్వప్న మేన బావ శ్రీనుతో కలిసి బైక్ పై ఎల్లారెడ్డికి వస్తుంది. బైక్ లోతు వాగు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి మామ సంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు రెండో అంతస్తు నుంచి పడి కార్మికుడు పటాన్చెరు టౌన్: రెండో అంతస్తుపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు మండలం భానూరు గ్రామా నికి చెందిన యోగీశ్వర్ రెడ్డి (30) కేకే ఎనర్జీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పాశమైలారంలోని ఓ పరిశ్రమలో సోలార్ పలకలు కడిగే పని కోసం బుధవారం వెళ్లాడు. రెండో అంతస్తులో పని చేస్తుండగా కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఇద్దరికి గాయాలు.. కొండపాక(గజ్వేల్): బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అక్బర్, మహమ్మద్ రియాన్ సిద్దిపేటలో బంధువు మృతి చెందడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. దుద్దెడ శివారులో మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక 108 అంబులెన్సు సిబ్బంది గణేశ్, శ్రీనివాస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మొసళ్ల కలకలం
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ గ్రామ శివారులో గల మంజీరా వాగు తీరానికి బుధవారం రెండు మొసళ్లు వచ్చాయి. వాటిని చూసిన పలువురు రైతులు భయాందోళనకు గురయ్యారు. మంజీరాలో ఉంచిన మోటార్లు చెడిపోతే వాటి కోసం నదిలో దిగాల్సి ఉంటుందని, మొసళ్లను చూసిన తర్వాత నదిలో దిగడం అసాధ్యమన్నారు. సంబంధిత అధికారులు మొసళ్లను పట్టుకొని మంజీరా పరివాహా ప్రాంత రైతులకు ధైర్యం కల్పించాలన్నారు. ఎనగండ్ల చెక్ డ్యాంపై.. కొల్చారం(నర్సాపూర్): ఎనగండ్ల గ్రామ శివారులోని మంజీరా చెక్ డ్యాం పైన బుధవారం మొసలి కలకలం సృష్టించింది. చేపల వేటకు వెళ్లిన జాలర్లకు మిట్ట మధ్యాహ్నం చెక్ డ్యాంపై సేద తీరుతూ కనిపించింది. దాదాపు 60 కిలోల వరకు ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ మర్కూక్(గజ్వేల్): జాతీయస్థాయి సైన్స్ టాలెంట్ పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజ ప్రతిభ చాటి తృతీయ స్థానంలో నిలిచిందని ఎంఈఓ వెంకటరాములు తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థినికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో 2024 జాతీయస్థాయి వినూత్న ఆలోచనలు సేకరణలో భాగంగా పాఠశాల నుంచి ఆరు టీమ్స్ ద్వారా ప్రాజెక్టు నమూనాలను ఆన్లైన్లో పొందుపరిచిన సందర్భంగా 18 మంది విద్యార్థులకు, గైడ్ ఉపాధ్యాయుడు బ్రహ్మయ్యకు ప్రశంసాపత్రం అందజేశారు. వినూత్న ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.20 లక్షలు నుంచి రూ.1.50 లక్షల వరకు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ.2.46 కోట్లు పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల ఆలయం వద్ద వివిధ విక్రయాల కోసం బుధవారం నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.2.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈఓ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీల్డ్, ఓపెన్ టెండర్లు నిర్వహించారు. కొబ్బరికాయలు, బోండాలు విక్రయించుకునే హక్కు కోసం వేలం పాట నిర్వహించగా 8 మంది పాల్గొన్నారు. ఇందులో రూ.కోటి 11 లక్షల 20 వేల పాట పాడి మెదక్ పట్టణానికి చెందిన లింగోజీ వేలం దక్కించుకున్నారు. అలాగే, ఒడి బియ్యం పోగు చేసుకునే హక్కును జీవన్‌రెడ్డి అనే వ్యక్తి రూ.కోటి 9 లక్షల 50 వేలకు పాడారు. పూజ సామగ్రి విక్రయాలు చేసుకునేందుకు రూ.17 లక్షలు పాట పాడి బుడాల నర్సింలు వేలం దక్కించుకున్నారు. తల నీలాల కోసం నిర్వహించిన టెండర్లలో ఖమ్మంకు చెందిన ఎస్.దుర్గారావు రూ.8,30,000 పాట పాడారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేటెండర్ కొనసాగుతుంది. -
హెడ్ కానిస్టేబుల్‌పై దాడి
– వ్యక్తి రిమాండ్ పుల్కల్(అందోల్) : విధులకు ఆటంకం కలిగించి, హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెష్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పుల్కల్ ఎస్సై క్రాంతికుమార్ కథనం మేరకు.. పుల్కల్ గ్రామానికి చెందిన సంగమేశ్ బస్టాండ్ ప్రాంతంలో న్యూసెన్స్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ 100కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యూసెన్స్ చేస్తున్న వ్యక్తికి నచ్చజెప్పినా వినలేదు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణకు గాయాలయ్యాయి. న్యూసెన్స్ చేసి, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించినందుకు సంగమేశ్పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య పాపన్నపేట(మెదక్): మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఏడుపాయల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా బిలాల్పూర్ గ్రామానికి చెందిన బలుపాటి ఆనంద్ (33) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం ఏడుపాయల దుర్గా భవానీ ఆలయ సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. యువకుడి అదృశ్యం టేక్మాల్(మెదక్): యువకుడు అదృశ్యమైన ఘటన టేక్మాల్ మండలంలోని కోరంపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేష్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయిని మధు వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో తల్లిగారింటికి వెళ్లిపోయింది. 17న రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో మధు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు బ్లూ కలర్ షర్ట్, జీన్స్ పాయింట్ వేసుకున్నట్లు తెలిపారు. తల్లి బోయిని సంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడి పిల్లలు.. విలవిల
సంగారెడ్డి జోన్: చలికి తట్టుకోలేక కోడి పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఝరాసంగం మండల పరిధిలోని ప్యారవరం గ్రామంలో సంగమేశ్వర్ తన వద్ద ఉన్న పౌల్ట్రీ షెడ్డులో కోడి పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాడు. షెడ్డు లోపలికి గాలి వెళ్లకుండా బయటి భాగంతో పాటు లోపలి భాగంలో టార్పిన్ కవర్‌ను కట్టాడు. షెడ్డులో 9,000 కోడి పిల్లలు ఉన్నాయి. అందులో 1,000 కోడిపిల్లలను ఒక విభాగంగా 9 విభాగాలను ఏర్పాటు చేశారు. 9 బ్యాలర్ (డబ్డా)లను ఏర్పాటు చేసి కట్టెలు వేసి మంటతో వెచ్చదనం అందిస్తున్నాడు. ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు, అర్థరాత్రి 12 గంటలకు, వేకువ జామున 3 గంటలకు, ఉదయం 6 గంటలకు మంటలను వేస్తూ కాపాడుకుంటున్నాడు. అయినప్పటికీ ప్రతి రోజూ సుమారు 15 నుంచి 20 కోడి పిల్లల మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి తీవ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో పశు సంరక్షణ కోసం కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్యారవరం గ్రామంలో చలికి మృత్యువాత -
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
డీఆర్డీఏ అదనపు పీడీ బాలకృష్ణకొండపాక(గజ్వేల్): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తూ తగిన ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని డీఆర్డీఏ అదనపు పీడీ బాలకృష్ణ పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతి లబ్ధిదారులకు టైలరింగ్, డైరీ, ఫార్మ్, వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కోసం శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల నుంచి రుణ సాయం పొందేలా ప్రోత్సాహకాన్ని అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఐకేసీ ఏపీఓ సర్వర్ పాషా, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, ట్రైనర్ రేణుక, సంస్థ సిబ్బంది నజీమ్, నాగరాజు, స్వప్న, కనకయ్య పాల్గొన్నారు. -
టీచర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర కుటుంబ సర్వే విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించడంతో పాటు అటెండెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓ పరమేశ్వర్, సీపీఓ బాలశౌరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసి 20 రోజులు దాటిందని, ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ అందడంలో జాప్యం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్‌తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు నాజర్ పటేల్, రాష్ట్ర బాధ్యులు కౌన్సిలర్లు లక్ష్మయ్య యాదవ్, సంజీవయ్య, కమ్రొద్దీన్, జిల్లా కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ -
మెరుగైన సేవలు.. పెరిగిన ప్రసవాలు
న్యాల్కల్(జహీరాబాద్): ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలకు సరైన నమ్మకం లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడ సరైన వైద్యం అందకపోయినా వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా గర్భిణులు అధిక శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. కాని నేడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు భరోసా కలిస్తూ మంచి వైద్యం అందించడంతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. జిల్లాలో జిల్లా ఆస్పత్రి 1, ఏరియా ఆస్పత్రులు 4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2, పీహెచ్‌సీలు 29, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు 445 ఉన్నాయి. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడకు వెళ్లిన వారికి వైద్యులు అధిక శాతం గర్భిణులకు అవసరం లేకున్నా సీజరింగ్ చేసి అధిక డబ్బులు వసూలు చేసేవారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారిని ప్రభుత్వాస్పత్రులకు వచ్చేలా చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యులకు, వైద్య సిబ్బందికి తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అధిక ప్రసవాలు నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందిస్తుంది. దీంతో ఆస్పత్రులకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు గర్భిణులకు నమ్మకం కలిగేలా, సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది.జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకుక్యూ కడుతున్న గర్భిణులు 2024లో లక్ష్యానికి మించి23,811 ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యంలక్ష్యానికి మించి.. 2023లో 22,263 ప్రసవాలు లక్ష్యం కాగా 24,489 ప్రసవాలు జరిగాయి. 2024లో 21,618 ప్రసవాలు లక్ష్యం కాగా 23,811 ప్రసవాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమష్టి కృషితో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య లక్ష్యానికి మించి జరుగుతున్నాయి. ఈనెల 16న న్యాల్కల్ పీహెచ్సీలో కేవలం 17 గంటల వ్యవధిలో ఐదు ప్రసవాలు చేసి న్యాల్కల్ పీహెచ్సీ రికార్డు సృష్టించింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. -
అంతర్జాతీయస్థాయిలో రాణించాలి
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి టౌన్: విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లాకు చెందిన అబ్దుర్ రెహమాన్, అలియా ఫాతిమా, అబ్దుల్ నజీర్ ఈ నెల 6, 7వ తేదీలలో భూపాలపల్లిలో జరిగిన 9వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2024 రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మంగళవారం కలెక్టర్‌ను కలవగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో స్విమ్మింగ్ పూల్‌లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. సంగారెడ్డి బైపాస్‌లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి -
‘సంగమేశ్వర’ పనులు ప్రారంభించాలి
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే మాణిక్రావుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతానికి సాగు నీరు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...జహీరాబాద్ ప్రాంతం సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉందని, శాశ్వత నీటి వనరులు ఇక్కడలేవన్నారు. ప్రాజెక్టులు, చెరువులు లేని కారణంగా బోరు బావులపై ఆధారపడిరైతులు పంటలు సాగుచేస్తున్నారని పేర్కొన్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలో ఇదే పరిస్థితి ఉందని, నియోజకవర్గానికి లక్ష ఎకరాల్లో సాగు నీరు అందించాలని మాజీ సీఎం కేసీఆర్ ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకానికి భూసేకరణ, శంకుస్థాపనలు చేశారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. -
చలించని.. శ్రమైక సౌందర్యం
వణికిస్తున్న చలిలోనూ చిరువ్యాపారుల ఉపాధిబాట ● అనేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు ● అత్యధిక చలి ప్రదేశాల్లో రాష్ట్రంలో రెండోస్థానం.. ● కోహీర్తోపాటు నల్లవల్లిలోనూ 6.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ● ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖఎముకలు కొరికే చలి...రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణాగ్రతలు.. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే గజగజ వణికే పరిస్థితి..రాత్రయితే మరింత పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారులు బతుకు వేట కొనసాగిస్తున్నారు. పొట్ట కూటి కోసం పేద, మధ్యతరగతి ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా తమ దైనందిన పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఆటోవాలాలు, కూరగాయల వ్యాపారులు, ఛాయ్ హోటళ్లు, సఫాయి కార్మికులు, బస్సు డ్రైవర్లు, పేపర్ బాయ్‌లు ఇలా వివిధ వర్గాల ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిరువ్యాపారులు, పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులపై రాత్రి ‘సాక్షి’విజిట్ నిర్వహించింది. కూరగాయల వ్యాపారుల ఇక్కట్లు.. నిత్యం సంగారెడ్డి రైతు బజార్‌కు వచ్చి హోల్‌సేల్ వ్యాపారుల వద్ద కూరగాయలు కొనుక్కుని చిరు వ్యాపారులు ఉదయం 5 గంటలు దాటితే అనుకున్న సరుకు దొరకదని అంత చలిలోనూ నాలుగు గంటలకే ఇక్కడి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. కూరగాయల బండ్లు వచ్చే వరకు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. బస్సు డ్రైవర్ల వెతలు.. బస్సు డ్రైవర్లు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్సులకు సైడ్ అద్దాలు సరిగ్గా లేకపోవడంతో బస్సు నడిపేటప్పుడు చల్లగాలులు డ్రైవర్లను వణికిస్తున్నాయి. డ్రైవర్లతోపాటు, కండక్టర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పూల వ్యాపారుల పాట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పూల ఆటోలు ఉదయమే పూల మార్కెట్‌కు చేరుకుంటాయి. ఈ పూల వ్యాపారులు ఉదయమే వచ్చి వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. చలి తీవ్రత కారణంగా పూల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కమ్మేస్తున్న పొగ మంచు.. సాధారణంగా తెల్లవారు జామున ఉండే పొగమంచు రాత్రి 11 గంటల ప్రాంతంలోనే పొగమంచు షురువవుతోంది. దీంతో వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడవుతున్నా లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సి వస్తోందని అంటున్నారు.జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే.. కోహీర్ 6.7 నల్లవల్లి (గుమ్మడిదల) 6.7 అల్మాయిపేట (అందోల్) 6.8 అల్గోల్ (జహీరాబాద్) 6.8 సత్వార్ (జహీరాబాద్) 7.3 మొగుడంపల్లి 7.4 కంగ్టి 7.4 మల్చెల్మ 7.6 లక్ష్మిసాగర్ పుల్కల్) 7.6 చౌటకూర్ 7.7 అన్నాసాగర్ (ఆందోల్) 7.8దాదాపు జిల్లా అంతటా ఆరెంజ్ అలర్ట్.. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గుమ్మడిదల మండలం నల్లవల్లిలో ఏకంగా 6.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక చలి ప్రదేశాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాలుగైదు మండలాలు మినహా జిల్లా అంతటా ఈ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా 4 డిగ్రీల నుంచి పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ అలర్టు జారీ చేస్తారు. కాగా, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి (నల్లవల్లి), నిర్మల్ (పెంబి)లు 6.7 డిగ్రీలతో రెండోస్థానంలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మానుష్యంగా వ్యాపార కూడళ్లు.. సాధారణ రోజుల్లో జిల్లా కేంద్రంలోకొన్ని వ్యాపార కూడళ్లు, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంట దాటే వరకు జన సంచారం ఉంటుంది. అయితే చలి తీవ్రత కారణంగా రాత్రి 10.30 దాటితే చాలు ఈ ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆటోవాలాల అవస్థలు.. జిల్లా కేంద్రంలోని పొత్తిరెడ్డిపల్లి చౌరస్తాలో దిగే ప్రయాణికులను ఇంటికి చేర్చేందుకు ఆటో డ్రైవర్లు చలికి వణుకుతూ ఆటోలు నడుపుతుంటారు. చలి అని ఇంట్లో ఉంటే ఆటో ఫైనాన్స్ కిస్తీలు ఎలా కడతామని లక్ష్మణ్ అనే ఆటోవాలా చెప్పుకొచ్చారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణకుతున్నారు. రాత్రివేళల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. జానెడు పొట్ట కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు చలైనా, ఎండైనా, వానైనా అడ్డేమీకాదని చలిపులిని గేలి చేస్తూ తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు సాక్షి బృందం సంగారెడ్డి లో పర్యటించింది. అర్ధరాత్రి వేళ.. శ్రమైక జీవన సౌందర్యం కనిపించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా శ్రమ జీవులు ముందుకు సాగుతూనే ఉన్నారు. – పాత బాలప్రసాద్, సాక్షిప్రతినిధి, సంగారెడ్డి -
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
తపస్ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలోని చాకలి ఐల్లమ్మ విగ్రహం వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ...ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న ధర్నా శిబిరానికి వచ్చి టీ తాగినంత సేపట్లో మీ సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ ఏడాది గడిచినా ఇంతవరకు నెరవేరలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ విద్యాలయాల్లో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని, తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించి సమ్మె విరమణ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ వారి కార్యక్రమాల నిర్వహణకు తపస్ జిల్లా శాఖ తరఫున ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా కార్యదర్శి అడివప్ప, రాష్ట్ర సహాయ కోశాధికారి భాస్కర్‌దేశ్, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి నరసింహారెడ్డి, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు తుక్కప్ప, ఝరాసంఘం మండల అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 23న రైతు దినోత్సవం విజయవంతం చేయాలి సంగారెడ్డి టౌన్: ఈ నెల 23న నిర్వహించనున్న రైతు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మంజీర రైతు సమైక్య అధ్యక్షుడు తుమ్మల పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లిలో మంగళవారం రైతు దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతు ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక దినంగా ఏర్పాటు చేశారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు శేఖర్, ధనుంజయ, మల్లికార్జున్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంఘంగా ఏర్పడటం సంతోషం: ఎస్పీ చెన్నూరివిశ్రాంత పోలీస్ అధికారుల కార్యాలయం ప్రారంభం సంగారెడ్డి జోన్: అంతర్జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం సంగారెడ్డిలో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారులు అందరు కలసి సంఘంగా ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రిటైర్డ్ అయినా కూడా మీరందరూ పోలీసు కుటుంబమేనని, మీ సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తరుచూ యోగ వ్యాయామంతోపాటు కార్యాలయంలో ఇండోర్ గేమ్స్ వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, లేదా ఇతర కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అవసరమైతే ఎల్లవేళలా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, రిటైర్డ్ పోలీసు ఎంప్లాయ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లయ్య, రిటైర్డ్ డీఎస్పీ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు!
సంగారెడ్డి: లగచర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు బేడీలపై సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ...లగచర్ల గిరిజన రైతులు తమ భూములను ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే వద్దు అని అధికారులను అడ్డుకున్నందుకు రైతులను జైలు పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దక్కుతుందన్నారు. లగచర్ల రైతులను విడుదల చేయాలని నెల రోజుల నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలిపిన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులను ఏడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, డా.శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, జీవీ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌లో...నారాయణఖేడ్: లగచర్ల గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. చేతులకు బేడీలు వేసుకుని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ...ప్రజా పాలన అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందన్నారు. లగచర్ల గిరిజనుల భూములు లాక్కోవడమే కాకుండా తమకు న్యాయం చేయాలని కోరితే అక్రమంగా కేసులు నమోదు చేసి, బేడీలు వేశారని మండిపడ్డారు. లగచర్ల గిరిజనులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మిబాయిరవీందర్, మాజీ ఎంపీటీసీ ముజమ్మిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన -
అందరికీ అందుబాటులోకి వైద్యం
● జిల్లాలో ఐదు పీహెచ్‌సీలు ● రెండు ఉప కేంద్రాలు ఏర్పాటు ● జనాభాకు అనుగుణంగానే.. ● వైద్య సదుపాయాల్లో జిల్లాపై ప్రత్యేక దృష్టి నారాయణఖేడ్: గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా అందుబాటులో ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఉపకేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 78 పీహెచ్‌సీలు, 200వరకు సబ్సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, జిల్లాకు ఐదు పీహెచ్‌సీలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే మునిపల్లి మండలం కంకోల్, రాయికోడ్ మండలం సింగితంలో పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా ఝరాసంఘం మండలం బర్దీపూర్, అందోల్ మండలం నేరే డిగుంట, చౌట్కూర్ మండలం సుల్తాన్‌పూర్‌లలో నూతన పీహెచ్‌సీలు ఏర్పాటు కానున్నాయి. రాయికోడ్ మండలం చిమ్నాపూర్, మొగుడంపల్లిలో నూతన సబ్సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. జనాభా ఆధారంగానే.. ఇదివరకు ఏర్పాటు చేసిన పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటంవల్ల ప్రజలు వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రభుత్వం జనాభా సంఖ్యకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతిలో పీహెచ్‌సీలు, సబ్సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటైన మండలాలు, గ్రామాలకు తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. 2012నాటి ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) నివేదిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 20వేల జనాభాకు ఒక పీహెచ్సీ ఉండాలనే నిబంధన ఉంది. ఈ లెక్కన గిరిజన ప్రాంత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలతోపా టు, జనాభా అధికంగా ఉండి పీహెచ్సీ దూరంగా ఉన్న ప్రాంతానికి అనుగుణంగా పీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. పీహెచ్‌సీలన్నీ గ్రామీణ ప్రజలను దృష్టిలో ఏర్పాటు చేసినవే. దీంతోపాటు ప్రతీ 30– 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా వీటిని జాతీయ రహదారులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. 24గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా వీటిని ఏర్పాటు చేస్తారు. హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటం, తక్షణం వైద్యం అందక చాలామంది మృత్యువాత పడుతుండటం, తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరుగుతోంది. తక్షణం ప్రాథమిక చికిత్స అందిన పక్షంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైవేలకు అనుగుణంగా ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నిజాంపేట్, జోగిపేటతోపాటు వట్పల్లి ప్రాంతంలోనూ ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదించాం జిల్లాలో బర్దిపూర్, నేరేడిగుంట, సుల్తాన్పూర్ పీహెచ్‌సీలకు ప్రతిపాదించాం. కంకోల్, సింగీతంలో ఏర్పాటవుతున్నాయి. చిమ్నాపూర్, మొగుడంపల్లి సబ్‌సెంటర్లకు ప్రతిపాదించాం. మెరుగైన వైద్యం పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. – గాయత్రీదేవి, జిల్లా వైద్యాధికారిణి, సంగారెడ్డి