Stunning Catch
-
పుష్ప 2 కిస్సిక్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అదిరిపోయే లేటెస్ట్ లుక్స్ (ఫొటోలు)
-
వారెవ్వా బదోని.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్(వీడియో)
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత-ఎ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా తమ సెమీఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆయుష్ బౌండరీ లైన్ వద్ద తన అద్బుత విన్యాసంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ ఆఖరి బంతిని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జవదుల్లా తన ఫ్రంట్ ఫుట్‌ను క్లియర్ చేసి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి కచ్చితంగా బౌండరీకి పోతుందని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న బదోని అందరి అంచనాలను తారుమారు చేశాడు.వైడ్ లాంగ్-ఆన్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బదోని.. గాలిలో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండగ? 𝐅𝐥𝐢𝐠𝐡𝐭 𝐦𝐨𝐝𝐞 🔛A super catch by Ayush Badoni! 👐@BCCI#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/imOQae1Xu6— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024 -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా?
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భారత్ ఎ జట్టు శుభారంభం చేసింది. శనివారం(అక్టోబర్ 19) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య చేధనలో పాక్-ఎ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ తిలక్ వర్మ(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(35), ప్రభుసిమ్రాన్ సింగ్(36) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.రమణ్‌దీప్ సింగ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాక్ స్టార్ బ్యాటర్ యాసిర్ ఖాన్‌ను సింగ్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమంలో యాసిర్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ కూడా సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న రమణ్‌దీప్ సింగ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. డిప్ మిడ్ వికెట్లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి విన్యాసం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.చదవండి: పాక్‌పై విజయం.. భారత్ ‘ఎ’ శుభారంభం ONE OF THE GREATEST EVER CATCHES FROM RAMANDEEP SINGH. 🥶 pic.twitter.com/5gM0L02eDv— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024 -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.సూపర్ మ్యాన్‌లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో)
ది హాండ్రడ్ లీగ్-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ తన ఫీల్డింగ్ విన్యాసాలను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాంట్నర్ మరోసారి సంచలన క్యాచ్‌తో మెరిశాడు.మంగళవారం(ఆగస్టు 13) లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ను ఈ కివీ స్టార్ అందుకున్నాడు. సూపర్ క్యాచ్‌తో లండన్ స్పిరిట్ బ్యాటర్ మైఖేల్ పెప్పర్‌ను సాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.లండన్ ఇన్నింగ్స్ 11వ బంతిని పేసర్ రీస్ టాప్లీ.. పెప్పర్‌కు ఫుల్ అండ్ మిడిల్లో సంధించాడు. పెప్పర్ ఆ బంతిని మిడ్ ఆన్ మీదగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సాంట్నర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన బ్యాక్వర్డ్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. చివరి క్షణం వరకు బంతిపై తన దృష్టిని కోల్పోకుండా వెనక్కి వెళ్లిన సాంట్నర్.. డైవ్ సంచలన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఘన విజయం సాధించింది. Mitchell Santner, that is UNBELIEVABLE 🤯Enjoy every angle of 𝘵𝘩𝘢𝘵 catch 👇#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oJupXTP3hR— The Hundred (@thehundred) August 13, 2024 -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
Suryakumar Yadav Catch: 'సూపర్ మేన్' సూర్య.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2007లో మీకు శ్రీశాంత్ పట్టిన క్యాచ్ గుర్తుందా? అదేనండి పాక్ బ్యాటర్ మిస్బా కొట్టిన బంతిని అనూహ్యంగా షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ పట్టి భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్‌ను అందించాడు కదా. శ్రీశాంత్ పట్టంది ఈజీ క్యాచే అయినా అంతటి ఒత్తిడిలో బంతిని ఒడిసిపట్టడం అంత సులభం కాదు. అప్పుడు ఏ క్యాచ్ అయితే భారత్‌ను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిందో.. ఇప్పుడు అటువంటి మరో అద్భుత క్యాచే 17 ఏళ్ల తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది.టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ అద్బుతం చేశాడు. సూర్య సంచలన క్యాచ్‌తో భారత్ రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.అసలేం జరిగిందంటే?దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షుకులతో పాటు టీవీల ముందు కూర్చుకున్న భారత అభిమానల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ మేన్ సూర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. What A Catch By Suryakumar Yadav 🔥🔥Game changing catch 🥹❤️Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024 -
కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో డర్హామ్ ఆల్‌రౌండర్ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్ను సంచలన క్యాచ్‌తో కొగ్లిన్ పెవిలియన్‌కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ కొగ్లిన్ ప్లాన్‌ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్ ఫ్రంట్‌పుట్‌కు వచ్చి స్టైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్‌లో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. What a ludicrous catch.pic.twitter.com/ucPjKpeH0Z— The Cricketer (@TheCricketerMag) June 16, 2024 -
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏 ..#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024 -
సిరాజ్ మియా మ్యాజిక్.. కళ్లు చెదిరే క్యాచ్! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. గ్రూపు-ఎ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేన అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో 110 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా సత్తాచాటింది. 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(50), శివమ్ దూబే(31) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకుముందు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.సిరాజ్ సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన క్యాచ్‌తో అమెరికా బ్యాటర్ నితీష్ కుమార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతిని నితీష్ కుమార్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫుల్ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు.కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో సిరాజ్ బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. అయినప్పటకి బంతిని మాత్రం జారవిడచలేదు. సిరాజ్ క్యాచ్ చూసిన ప్రతీఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Siraj took a stunner pic.twitter.com/kJYMmupOS5— mohsinali (@mohsinaliisb) June 12, 2024 -
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా పాకిస్తాన్-యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 30 పరుగులకే పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్ రిజ్వాన్(9), ఫఖార్ జమాన్(11), ఉస్మాన్ ఖాన్(3) వంటి స్టార్ బ్యాటర్లు ఎటువంటి ప్రభావం చూపకలేకపోయారు. నేత్రవల్కర్,నోస్తుష్ కేంజిగే, అలీ ఖాన్ తలా వికెట్ సాధించారు.సూపర్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను టేలర్ పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన నేత్రవల్కర్ మూడో బంతిని రిజ్వాన్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో రిజ్వాన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త లేట్‌గా స్వింగ్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ల్ స్లిప్‌లో ఉన్న టేలర్ తన కుడివైపునకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు.దీంతో రిజ్వాన్ మైండ్‌బ్లాంక్ అయిపోయింది. చేసేదేమి లేక రిజ్వాన్(9) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్‌తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్‌లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్‌తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
వారెవ్వా సాల్ట్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయిట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సాల్ట్ అద్భుతమైన క్యాచ్‌తో లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిష్ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 11 ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాలుగో బంతిని గుగ్లీగా సంధించాడు. అయితే ఆ డెలివరీని స్టోయినిష్ లెగ్ సైడ్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్టోయినిష్ థై ప్యాడ్‌కు తాకి ఆనూహ్యంగా ఆఫ్‌సైడ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ సాల్ట్ తన కుడివైపున్కు జంప్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో స్టోయినిష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నిలిచిపోతుందని కామెట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మరో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ సైతం సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ✌️wickets in ✌️ overs for @KKRiders! A wicket each for @Russell12A & @chakaravarthy29 👍 👍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvLSG pic.twitter.com/HDTLXUDgOK — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో)
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని రోహిత్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న టాప్లీ ఎడమవైపు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. టాప్లీ క్యాచ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. రోహిత్ కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక 38 పరుగులు చేసిన రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61), కార్తీక్(53) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. WHAT A CATCH! Reece Topley takes a blinder to dismiss Rohit Sharma. Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/wBAiSbBCoW — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
LSG Vs GT: వావ్ వాట్ ఏ క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! మైండ్‌బ్లోయింగ్
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపుల సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ స్టైట్‌గా సింగిల్ కోసం చిప్ చేశాడు. అయితే బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బిష్ణోయ్ తన కుడివైపున్కి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్ మామతో పాటు గ్రౌండ్లో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసిన విలియమ్సన్.. నిరాశతో మైదానాన్ని వీడాడు. బిష్ణోయ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటంటూ కామెంట్లు చేస్తున్నారు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲 Flying Bishoni ✈️ Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏 Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
వారెవ్వా పతిరాన.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! ఒంటి చేత్తో
ఐపీఎల్-2024లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరనా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పతిరనా అద్భుతమైన క్యాచ్‌తో ఢిల్లీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఢిల్లీ ఏకంగా 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పేసర్ ముస్తఫిజర్ రెహ్మాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన ముస్తఫిజర్ మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని వార్నర్ షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న పతిరనా తన కుడివైపున్కు గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో పతిరాన బౌలింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 3 వికెట్లు పడగొట్టి 31 పరుగులిచ్చాడు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩 Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
CSK Vs GT: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే మాత్రమే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతమకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ధోని సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సంచలన క్యాచ్‌తో మెరిశాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన వికెట్ కీపింగ్‌తో ఔరా అన్పించాడు. అద్బుతమైన క్యాచ్‌తో గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను ధోని పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో డారిల్ మిచెల్ మూడో బంతిని విజయ్ శంకర్‌కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ వర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు వెళ్లింది. దీంతో వికెట్ల వెనక ఉన్న ధోని చిరుత పులిలా డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 -
RCB Vs PBKS: వారెవ్వా అనూజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యశ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఈ క్రమంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ పై నుంచి వెళ్లింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావత్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. Athletic Anuj! A sharp catch behind the stumps from @RCBTweets wicketkeeper-batter as #PBKS reach 154/6 with 8 balls to go Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3snw3syupr — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వివిలవిల్లాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. అశ్విన్ రెండు, జడ్డూ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ క్రాలే మినహా మిగితా బ్యాటర్లు నిరాశపరిచారు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి మార్క్ వుడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమలో స్లిప్‌లో ఉన్న రోహిత్ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/RkDk3S3gqY — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 7, 2024 -
వారెవ్వా గిల్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 18 ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఆరో డెలివరీని బెన్ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు. ఈ క్రమంలో డకెట్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో ఎక్స్ట్రా కవర్స్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే భారత ఆటగాళ్లంతా గిల్ దగ్గరకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో సైతం గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. Catching game 🔛 point! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/DdHGPrTMVL — BCCI (@BCCI) March 7, 2024 -
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను వేడ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది. pic.twitter.com/Wkw2LZb1JX — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. మెరుపు వేగంతో! వీడియో వైరల్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లీష్ బ్యాటర్ ఆలీ పోప్‌ను సంచలన క్యాచ్‌తో హిట్‌మ్యాన్ పెవిలియన్‌ను పంపాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన జడేజా బౌలంగ్‌లో నాలుగో బంతిని పోప్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మెరుపు వేగంతో స్పందిస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్ బ్యాటర్ ఒక్కనిమషం పాటు అలా క్రీజులో ఉండిపోయాడు. చేసేదేమిలేక పోప్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాజ్‌కోట్ టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత విజయానికి ఇంకా 4 వికెట్లు కావాలి. pic.twitter.com/JhFcWH9hht — Sitaraman (@Sitaraman112971) February 18, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
కాన్బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లాన్స్ మోరిస్ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే విధంగా ఆసీస్ ఆటగాళ్లందరూ లబుషేన్‌కు వద్దకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 6.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చదవండి: IND vs ENG: శ్రీకర్ భరత్‌కు బైబై.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!? MARNUS! Whatta catch - and first international wicket for Lance Morris too!#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/KwZP43hEFd — cricket.com.au (@cricketcomau) February 6, 2024 -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న స్టోక్స్.. నిశ్చేష్ఠుడిగా ఉండిపోయిన అయ్యర్
వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 377 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసింది. అశ్విన్ (8), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో కదంతొక్కాడు. అక్షర్ పటేల్ (45) పర్వాలేదనిపించాడు. రోహిత్ (13), శ్రేయస్ (29), కేఎస్ భరత్ (6) మరోసారి నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ సెన్సేషన్, డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ 9 పరుగులకు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 209 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా (6/45), కుల్దీప్ (3/71) ధాటికి 253 పరుగులకే ఆలౌటైంది. A STUNNER FROM STOKES. 🔥🫡pic.twitter.com/7Ml2YADBEE — Johns. (@CricCrazyJohns) February 4, 2024 కళ్లు చెదిరే క్యాచ్.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. స్టోక్స్ దాదాపు 23 మీటర్లు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. స్టోక్స్ క్యాచ్ పట్టిన తీరును చూసి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిశ్రేష్ఠుడిగా ఉండిపోయాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో స్టోక్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.