wrestling
-
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
భారత్‌కు పెద్ద దెబ్బ
ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్ కామన్వెల్త్ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్–10, టాప్–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. భారత్ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్‌గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది. లండన్: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ సిద్ధమైంది. గత బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను తప్పించారు. షూటింగ్‌ను బర్మింగ్‌హామ్‌లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే భారత్ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు. బడ్జెటే ప్రతిబంధకమా? నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటుంది. ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, లాన్ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్ జరుగుతుంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్ బౌల్స్ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. తొలగించిన క్రీడాంశాలు... హాకీ, క్రికెట్ టీమ్ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (టీటీ), స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాలు రెజ్లింగ్ (12), వెయిట్‌లిఫ్టింగ్ (10), అథ్లెటిక్స్ (8), టేబుల్ టెన్నిస్ (7), బ్యాడ్మింటన్ (6), జూడో (3), బాక్సింగ్ (7), హాకీ (2), లాన్ బౌల్స్ (2), స్క్వాష్ (2), క్రికెట్ (1), పారా పవర్‌లిఫ్టింగ్ (1).బ్యాడ్మింటన్‌ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్‌లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఇంకెందుకు కామన్వెల్త్ గేమ్స్? పూర్తిగా ఈవెంట్‌నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపించాల్సిన అవసరమే లేదు. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్ కమల్, భారత టీటీ దిగ్గజం -
వినేశ్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది: యోగేశ్వర్ దత్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్‌పై ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయటం సరికాదని విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకవేళ నేను ఇటువంటి అనర్హత వేటు పరిస్థితిని ఎదుర్కొంటే.. తక్షణమే దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పేవాడిని. ఈ అంశాన్ని వినేశ్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురయ్యాను. ఒలింపిక్స్ జరిగిన అంశంపై వినేశ్ ఫోగట్ వ్యాప్తి చేసిన కుట్ర పూర్తిత విధానాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.అదీకాక.. ఈ విషయంలో ఆమె ప్రధానమంత్రి మోదీని నిందించే స్థాయికి వెళ్లిపోయారు. ఆమె ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైతే.. జరిగిన పొరపాటుకు దేశానికి క్షమాపణలు తెలపాలి. కానీ, ఆమె ఈ విషయంలో కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. గ్రాము కంటే ఎక్కువ బరువు ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలుసు. కానీ ఆమె ఒలింపిక్స్‌లో ఏదో తప్పు జరిగిందని పేర్కొంది.ఫైనల్ వెళ్లిన సమయంలోనే ఆమె దేశం దృష్టిలో చాలా గౌరవం సంపాదించుకున్నారు’ అని అన్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడి పతకం కోల్పోయిన వినేశ్ అనంతం రాజకీయాల్లో చేరారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జులానా నియోజకవర్గంలో బరిలోకి దించిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విధితమే.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
వినేశ్ ఫోగట్‌కు బంగారు పతకం
ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను రోహ్తక్లోని (హర్యానా) సర్వ్‌ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..Haryana Khap Panchayat gave gold medal to Vinesh Phogat. Can someone tell me what is India's ranking at Olympics after this medal? pic.twitter.com/h6EBOCXQrj— BALA (@erbmjha) August 25, 2024“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.కాగా, వినేశ్ ఫోగట్ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్ లీడర్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా హర్యానా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు ముందు ఫోగట్ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్ సీఏఏస్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్ రూల్సే అని సీఏఏస్ ఫోగట్ అభ్యర్థనను కొట్టిపారేసింది. -
‘అతడు లేకుంటే నేను లేను’.. వినేశ్ ఫొగట్ భర్త గురించి తెలుసా?
Vinesh Phogat's Love Life: Who Is Somvir Rathee: ‘‘సోమ్‌వీర్.. నా జీవితంలోని ముఖ్యమైన పాత్రలన్నింటినీ అతడే పోషించాడు. ప్రతీ విషయంలోనూ నాకు అండగా నిలిచాడు. కఠినసవాళ్లు ఎదురైన ప్రతిసారీ.. నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నాకు రక్షణగా నిలిచాడు. నా ప్రయాణం సజావుగా సాగేందుకు తను ఎన్నో వదులుకున్నాడు. అత్యంత విశ్వసనీయత, అంకితభావం, నిజాయితీ ఉన్న వ్యక్తి. తను గనుక నాతో లేకుంటే అన్న ఊహే కష్టంగా ఉంటుంది.తన తోడు లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు. ఎల్లవేళలా నాతో కలిసి అడుగులు వేశాడు. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు.. అవసరమైన వేళ నాకు రక్షణంగా ముందు వరుసలో నిలబడ్డాడు. నా విజయాల్లో మాత్రం వెనకే ఉన్నాడు నా ప్రియమైన స్నేహితుడు’’- భర్త సోమ్‌వీర్ రాఠీ గురించి భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ భావోద్వేగంతో రాసిన వాక్యాలు. తన జీవితంలో తల్లి పాత్ర ఎంత ఉందో జీవన సహచరుడి పాత్ర కూడా అంతకంటే తక్కువేమీ కాదని అతడిపై ఇలా అక్షరాల రూపంలో ప్రేమను వ్యక్తపరిచింది.తండ్రి ప్రేమ చిన్ననాడే దూరం.. తల్లి ఇచ్చిన స్ఫూర్తితోహర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ తనకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు తండ్రిని కోల్పోయింది. బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోవడంతో ఆ బాధ్యత భార్యపై పడింది. ముగ్గురు పిల్లల పోషణే గగనమైన సమయంలో క్యాన్సర్ రూపంలో ప్రాణాంతక వ్యాధి బారిన పడిన విషయం ఆమెకు తెలిసింది. అయినా.. ఆ తల్లి కుంగిపోలేదు. ధైర్యంగా మహ్మమారితో పోరాడి గెలిచింది. తన పిల్లల్లోనూ ధైర్యం నూరిపోసి.. కఠిన సవాళ్లకు ఎదురీదేలా చేసి.. రెజ్లర్లుగా తీర్చిదిద్దింది. అలా తల్లి నుంచి స్ఫూర్తి పొందిన వినేశ్ ఫొగట్.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సోమ్‌వీర్ రాఠీతో 2011లో పరిచయం ఏర్పడింది.వినేశ్ ప్రేమ కథ అక్కడే మొదలుఅతడు కూడా హర్యానాకు చెందినవాడే. వినేశ్ మాదిరి తనూ రెజ్లరే. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్న సోమ్‌వీర్ రాఠీ కూడా రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. విధి నిర్వహణలో భాగంగా వినేశ్తో మాట కలిపిన సోమ్‌వీర్.. అనతికాలంలోనే ఆమెకు మంచి స్నేహితుడయ్యాడు. సంతోషం.. బాధ ఏదైనా ముందుగా తనతోనే పంచుకునేంతగా వినేశ్ మనసుకు చేరువయ్యాడు.కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో అన్నిరకాలుగా అండగా ఆమెకు నిలిచాడు. కష్టసుఖాల్లో వెంట ఉండే తన ప్రియమైన స్నేహితుడే.. భర్తగా మారితే ఇంకెంత బాగుంటుందోనని భావించిన వినేశ్ కలను నిజం చేస్తూ.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు సోమ్‌వీర్.ఎనిమిదో అడుగు2018 నాటి జకార్తా ఆసియా క్రీడల్లో వినేశ్ స్వర్ణం గెలిచి స్వదేశానికి చేరుకున్న శుభముహూర్తాన.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోనే ఆమె వేలికి ఉంగరం తొడిగి.. తన మనసులోని మాటను వెల్లడించాడు. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు నిండు మనసుతో ఆశీర్వదించాయి. అదే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశాయి.అయితే, ఆ సమయంలో వినేశ్- సోమ్‌వీర్ తమ కుటుంబ సభ్యులకు ఓ షరతు విధించారు. పెళ్లి వేడుకలోని ప్రతీ తంతులో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉపయోగించాలని కోరారు. తద్వారా రెండు మనసుల కలయికను సంప్రదాయబద్దంగా తెలియజేసేందుకు ఆడంబరాలు అవసరం లేదనే సందేశాన్ని యువ జంటలకు ఇచ్చి కపుల్ గోల్స్ సెట్ చేశారు.అంతేకాదు.. వివాహ సమయంలో ఏడడుగులతో పాటు ఎనిమిదో అడుగు కూడా కలిసి వేశారు వినేశ్- సోమ్‌వీర్. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ పరస్పర అవగాహన, ప్రేమతో ముందుకు సాగుతున్నారు.వినేశ్ తన ఆరో ప్రాణంవినేశ్కు రెజ్లింగ్ అంటే ప్రాణం. సోమ్‌వీర్‌కు ఆమె ఆరోప్రాణం. అందుకే ఆమె ఆశయం కోసం తన కెరీర్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. అంతేకాదు అన్యాయాన్ని సహించలేని గుణం ఉన్న వినేశ్ తోటి మహిళా రెజ్లర్ల కోసం న్యాయపోరాటానికి దిగినప్పుడూ నా మద్దతు నీకేనంటూ కొండంత భరోసా ఇచ్చాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య నాటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు వెనుక నుంచే ప్రోత్సాహం అందించాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆమె వెంటే ఉన్న సోమ్‌వీర్.. పతకం లేకుండా తన సహచరి స్వదేశానికి తిరిగి రావడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.మరేం పర్లేదు సోమ్వీర్భార్యకు దక్కిన అపూర్వ స్వాగతానికి, మద్దతుకు సంతోషిస్తూనే.. దేశం మొత్తం ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్దుడవుతూనే... మెడల్ గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరేం పర్లేదు సోమ్‌వీర్.. నీ సహచరి వినేశ్ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే యావత్ భారతావని హృదయాలు గెలిచింది. నీ పట్ల తన ప్రేమను చాటుకుని మీ బంధం ఎంత దృఢమైందో కూడా చెప్పింది!!అనర్హత వేటు.. పతక నిరాకరణప్యారిస్ ఒలింపిక్స్-2024లో సంచలన విజయాలతో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్ అనూహ్య రీతిలో విశ్వ క్రీడల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)పై గెలుపొందిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఓడించింది.ఈ క్రమంలో సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అయితే, పసిడి పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా ఆమెపై వేటు పడింది. అయితే,సెమీస్ వరకు తన ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్‌ను కోరగా.. వినేశ్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.pic.twitter.com/8iu2vs21Wq— Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024 -
తను చచ్చిపోతుందేమోనని భయపడ్డాం: వినేశ్ కోచ్
‘‘సెమీ ఫైనల్ తర్వాత తను 2.7 కిలోల అధిక బరువు ఉన్నట్లు తేలింది. గంటా ఇరవై నిమిషాల వ్యాయామం తర్వాత కూడా ఇంకా కిలోన్నర బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేము మరో యాభై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయిస్తూనే ఉన్నాం. తన శరీరం నుంచి ఒక్క చెమట చుక్క కూడా బయటకు రాలేదు.తనను నిర్ణీత బరువుకు రావడమే లక్ష్యంగా అర్ధ రాత్రి నుంచి మొదలు పెడితే తెల్లవారుజామున 5.30 నిమిషాల వరకు తను భిన్న రకాల కార్డియో ఎక్సర్సైజులు, రెజ్లింగ్ మూవ్స్ చేస్తూనే ఉంది. గంట గంటకు కేవలం రెండు- మూడు నిమిషాల విశ్రాంతి మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కసరత్తులు మొదలు.ఫలితంగా కాసేపటి తర్వాత ఆమె కుప్పకూలిపోయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ గంటపాటు వ్యాయామం చేసింది. నేనేదో ఉద్దేశపూర్వకంగా తన కష్టం గురించి చెప్పడానికే ఈ పోస్టు పెట్టడం లేదు. తనను చూస్తే ఆరోజు నిజంగా భయం వేసింది. ఒకానొక దశలో చచ్చిపోతుందేమోనన్న భావన కలిగింది’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు. గోల్డెన్ బౌట్లో పాల్గొనేందుకు వినేశ్ ఎంతగా శ్రమించిందో తమకు మాత్రమే తెలుసునంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన హర్యానా అథ్లెట్ వినేశ్ ఫొగట్‌పై.. స్వర్ణ పతక రేసుకు ముందు అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండానే ఆమె వెనుదిరగాల్సి వచ్చింది.నంబర్ వన్ను ఓడించాను కదా!అయితే, తుదిపోరుకు అర్హత సాధించే క్రమంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదు గనుక.. సెమీస్ వరకు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాల్సిందిగా వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేసింది. కానీ.. కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ వినేశ్‌కు అమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. నిజమైన చాంపియన్ నువ్వేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో వినేశ్ కోచ్ వోలర్ సైతం ఫేస్బుక్ వేదికగా పైవిధంగా పోస్ట్ పెట్టాడు. అంతేకాదు.. వినేశ్ వరల్డ్ నంబర్ వన్ యూ సుసాకీ ఓడించినందుకు గర్వంగా ఉందని.. ఈ విషయంలో వినేశ్ సైతం సంతృప్తిగా ఉందని తెలిపాడు. నిర్విరామ కసరత్తుల నేపథ్యంలో ఆస్పత్రి పాలై.. తిరిగి వచ్చిన తర్వాత.. ‘‘మన ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలమని నిరూపించాం. అత్యుత్తమ రెజ్లర్‌ను నేను ఓడించాను. పతకాల కంటే మన ప్రదర్శనే ముఖ్యం’’ అని వినేశ్ తనతో అన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే, కాసేపటికే పోస్ట్ డిలీట్ చేయడం గమనార్హం. చదవండి: Vinesh Phogat: రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ.. -
రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ..
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ఉద్దేశించి ఆమె బంధువు, రెజ్లర్ బజరంగ్ పునియా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ఒలింపిక్ చేజారినా.. వినేశ్ పేరుప్రతిష్టలకు వచ్చిన నష్టమేమీ లేదని.. ఇప్పటికే అందరి హృదయాల్లో చాంపియన్‌గా ఆమె స్థానం దక్కించుకుందని పేర్కొన్నాడు. పతకాన్ని మాత్రమే కోరుకునే వారు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటూ వినేశ్‌ను విమర్శిస్తున్న వాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘ఈ అంధకారంలో నీ పతకాన్ని ఎవరో మాయం చేశారు. అయినా సరే.. నువ్వొక వజ్రంలా మెరిసిపోతున్నావు. ఈరోజు ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది. వరల్డ్ చాంపియన్. వినేశ్ ఫొగట్.. నువ్వు మన దేశపు కోహినూర్వి.వినేశ్ ఫొగట్ అంటే వినేశ్ ఫొగట్ మాత్రమే. హిందుస్థాన్ రుస్తం-ఇ-హింద్ నువ్వు. ఎవరైతే పతకాలు కావాలని కోరుకుంటున్నారో వారు రూ. 15 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు’’ అని బజరంగ్ పునియా ఎక్స్ వేదికగా వినేశ్ ఫొగట్ మెడల్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.విశ్వ క్రీడల్లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఈ హర్యానా సివంగి.. పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) బుధవారం తమ తీర్పును వెలువరించింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.కాగా మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన వినేశ్.. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్పై విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి.. యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో మట్టికరిపించింది. ఫలితంగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన భారత తొలి రెజ్లర్‌గా రికార్డు నమోదు చేసింది.అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు అనూహ్య రీతిలో వినేశ్ ఫొగట్‌పై వేటు పడింది. నిర్ణీత 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య. ఈ నేపథ్యంలో తన అనర్హత, సెమీస్ వరకు చేరిన కారణంగా సంయుక్త రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే పలుమార్లు తీర్పును వాయిదా వేసిన స్పోర్ట్స్ కోర్టు వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు అభిమానులు అండగా నిలుస్తుండగా.. కొంతమంది మాత్రం బరువు పెరగటంలో తప్పంతా ఆమెదే అన్నట్లుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బజరంగ్ పునియా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ వారి తరఫున ఢిల్లీలో ముందుండి పోరాటం చేయగా.. బజరంగ్ సహా సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ను వ్యతిరేకించేవారు.. ఆటపై కాకుండా క్రీడేతర విషయాలపై దృష్టి పెట్టిందని.. అందుకే ఈ ఫలితమని ఆమెపై విద్వేష విషం చిమ్ముతున్నారు. -
ధిక్కారానికి ఇది మూల్యమా?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో దేశం సాధించిన పతకాల కన్నా వినేశ్ ఫోగట్‌కు అక్కడ ఎదురైన అనూహ్య పరిణామం అందరినీ ఖిన్నులను చేసింది, స్వాభిమానంతో క్రీడాపెద్దలకు ఎదురొడ్డి నిలవడమే ఈ అపరాజిత చేసిన నేరమా? క్రీడా రంగం నుంచి సినీ, రాజకీయ, మీడియా రంగాల దాకా ప్రతిచోటా ప్రశ్నించే మహిళలను పితృస్వామ్య భావజాలం తొక్కేస్తూనే ఉంది.ప్యారిస్‌లో భారత్ సాగించిన 2024 ఒలింపిక్ ప్రయాణంలో సాధించిన పతకాలను చాలా తక్కువగానే గుర్తుంచుకుంటాం. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో కంటే ఒక పతకాన్ని తక్కువగా భారత్ ఈ ఒలింపిక్‌లో గెల్చుకుంది. దానికంటే ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ చాంపియన్ వినేశ్ ఫోగట్ అందరికంటే ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఫోగట్ కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఒక సామాజిక పురోగతికి, కట్టుబాట్ల నుండి విముక్తికి, కఠినమైన స్వావలంబనతో కూడిన స్వతంత్ర ముద్రకు ఆమె ప్రతినిధి. పితృస్వామ్య అధికారాన్ని ధిక్కరించడానికి ఆమె ఏమాత్రం భయపడదు. దాడిని ఎదుర్కొనేందుకు భయపడదు, గట్టిగా అరుస్తూ, వీధిలో నిరసన వ్యక్తం చేయడానికి, తన లక్ష్యం కోసం తనను తాను పణంగా పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ తిరుగుబాటు చేసే ఇలాంటి మహిళలపై భారతీయ సామాజిక విధానాలు విరుచుకుపడు తున్నాయి. బలీయమైన వ్యవస్థీకృత శక్తులు స్త్రీలను లొంగిపోవాలని బలవంతం చేస్తాయి. కానీ ధిక్కరించే స్త్రీ ధైర్యంతో కూడిన కొత్త ట్రెండ్‌ని వినేశ్ ఫోగట్ సృష్టించారు.మారని పితృస్వామ్య భావజాలంనిర్భయంగా ఉంటూ, కొన్నిసార్లు ప్రకాశించే, కొన్నిసార్లు కన్నీరు కార్చే ఫోగట్ గత కొద్ది రోజులుగా మన హృదయాలను కట్టివేశారు. ప్యారిస్‌లో ఆమెమీదే మనం దృష్టి పెట్టాం. అజేయమైన జపాన్ ప్రపంచ ఛాంపియన్ యుయి సుసాకీని ఓడించి, రెజ్లింగ్‌లో భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్ బంగారు పతకాన్ని చేజిక్కించుకునే స్థాయికి వినేశ్ చేరుకున్నప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఆమె ఫైనల్‌కు సిద్ధమవుతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. అంతు చిక్కని సాంకేతిక విషయాలపై ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు మాత్రం మనందరి ఊపిరి ఆగిపోయినంత పనయింది. ఫైనల్స్‌కు ముందు ఆమె గడిపిన సుదీర్ఘ రాత్రి గురించి మనం తెలుసుకున్నాము. 50 కిలోల ఫైనల్‌కు అర్హత సాధించడానికి, చివరి 100 గ్రాముల బరువు కోల్పోవడానికి ఆమె రాత్రంతా మేల్కొని ఉంది. ఒక ముద్ద తినలేదు. జాగింగ్చేసింది, స్కిప్పింగ్ చేసింది, సైకిల్ తొక్కింది, ఆవిరి స్నానంతో చెమటోడ్చింది, మైకంతో బాధపడింది. బరువు తగ్గడానికి ఆమె జుత్తును కూడా కత్తిరించుకుంది. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండి ఆమె చివరి తూకంలో విఫలమైనప్పుడు, 140 కోట్ల మంది భారతీయుల గుండె ఆగిపోయినంత పనయింది.ఖచ్చితంగా మన దేశ క్రీడా వ్యవస్థ ద్వారా ఫోగట్‌కు మెరుగైన సేవలందించవచ్చు. భారతదేశ పితృస్వామ్య, వీఐపీలతో కూడిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ బాడీలు... క్రీడాకారులను, అథ్లెట్లను నిరంతరం ఎలా విఫలం చేస్తున్నాయనడానికి వినేశ్ ఫోగట్ సంఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తమను తృణీకరించడం, తమ పట్ల అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం పట్ల ఫోగట్, ఆమె తోటి ఒలింపిక్ రెజ్లింగ్ ఛాంపియన్లు తిరగబడ్డారు. ఆరుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధినేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోప ణలతో వారు వీధుల్లో నిరసన తెలపవలసి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నుంచి సస్పెండ్ అయినప్పటికీ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించింది. క్రీడా మంత్రిత్వ శాఖ మల్లయోధులపై గురిపెట్టి దాడులను కొనసాగించింది. బ్రిజ్ భూషణ్ బినామీ అయిన సంజయ్ సింగ్ భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడయ్యాడు. ఫోగట్ మాట ఎవరూ వినలేదు. తనకు అవసరమైన వైద్యం, ఫిజియోథెరపీ అందడం లేదని ఆమె ఆరోపించారు. చివరికి, ఆమె ఇష్టపడే విభాగం 53 కిలోల పోటీ అయితే... 50 కిలోల విభాగంలో పోటీ చేయవలసి వచ్చింది. ఫోగట్‌కు అన్యాయం జరిగింది. ఒలింపిక్ పతకాల కోసం పోటీపడే వారికి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు, వైద్య సహాయం, ఉన్నత స్థాయి నిపుణుల పర్యవేక్షణను అందించాలి. కానీ తాను ప్రదర్శించిన ధిక్కారానికి ఫోగట్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈరోజు, ఫోగట్ గాథ చాలా కారణాల వల్ల కుస్తీ మ్యాట్ కంటే ముఖ్యమైనది. ఎలాంటి ఆధారాలూ లేకుండా జోక్యం చేసుకునే ప్రభుత్వం చేతిలో భారతదేశ శ్రేష్టమైన క్రీడాకారులు అనుభవిస్తున్న బాధలను అది ప్రతిబింబిస్తుంది. అది క్రీడలు లేదా ఇతర రంగాలలో అయినా, అధికారాన్ని సవాలు చేసే స్త్రీల విషయానికి వస్తే, వారు అధిరోహించడానికి ఇప్పటికీ ఒక పర్వతం అడ్డుగా ఉంది అనేదానికి ఫోగట్ ఒక ప్రతీక. ఆమె తోటి మహిళా రెజ్లర్లు, మల్లయోధుల జీవితాలు, వారి కెరీర్లపై పూర్తి నియంత్రణను కోరుకునే ఆధిపత్య వ్యక్తిగా అపఖ్యాతిపాలైన బ్రిజ్ భూషణ్ వంటి కరుడు గట్టిన పితృస్వామ్య ప్రతినిధి... అందరూ పురుషులతోనే కూడిన రెజ్లింగ్ సమాఖ్యను కైవసం చేసుకున్నాడు. పూర్తిగా రాజకీయాలతో అనుసంధానంలో ఉండే పురుషులు నిర్వహించే క్రీడాసమాఖ్యలు ఆధునిక క్రీడల నిర్వహణకు అత్యంత విరుద్ధం. ప్రధాన క్రీడా సంఘానికి నాయకత్వం వహించే స్థానంలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరన్నది పెద్ద ప్రశ్న. ఫోగట్ ఈ ఉక్కిరి బిక్కిరి అధికార ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన స్వరం పెంచింది కాబట్టే మూల్యం చెల్లించుకుంది.అయితే క్రీడలు మాత్రమే మినహాయింపుగా లేవు. ధిక్కరించే స్త్రీలు, అణచివేయలేని మహిళల పట్ల అసహనం ఇప్పుడు కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లు, న్యూస్రూమ్లతోపాటు రాజకీయ రంగానికి కూడా విస్తరించింది. మహిళలు, ఎంత ఎక్కువ సాధించినా, తమను తాము నిరూపించుకోవాలని వారిని నిరంతరం అడుగుతారు. వారు మగ అధికారాన్ని సవాలు చేసే ’తప్పు’ చేస్తే, వారిని వెంటనే తిప్పికొడతారు, బహిష్కరిస్తారు. లేదా దూరంగా ఉంచుతారు.సినిమా ప్రపంచంలో కూడా, చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ సంవత్సరాల్లో, మహిళా నటీనటులు ఆఫ్–స్క్రీన్, ఆన్–స్క్రీన్ పై ’సద్గుణ’వంతురాలైన విధేయ మహిళా ఇమేజ్‌కి అనుగుణంగా ఉండాలని భావించారు. నర్గీస్, మధుబాల, మీనా కుమారి వంటి మహిళా నటీనటులు అత్యంత విజయవంతమైన వృత్తినిపుణులు. వారు తమ వ్యక్తిగత జీవితాల్లో స్వయంప్రతిపత్తి కోసం పట్టుబట్టారు. కాబట్టే వారు అవిధేయ మహిళలుగా లేదా విఘాతం కలిగించే వ్యక్తులుగా కళంకిత ముద్ర పొందారు, సంప్రదాయ కుటుంబ ఆధారిత కట్టుబాటుకు వీరిని వ్యతిరేకులుగా పరిగణించారు. వెండి తెరపై ఆధునిక వ్యక్తిత్వాన్ని సృష్టించడానికి 1970లలో జీనత్ అమన్ శృంఖలాలను ఛేదించారు.నిజానికి, ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు భారత్ చాలా దూరంలో ఉంది. విభిన్నంగా ఉండటానికి, తమ గుర్తింపులను వ్యక్తీకరించడానికి భయపడని, సంప్రదాయ ఆలోచనా విధానాలను సవాలు చేసే మహిళల పట్ల సంబరాలు జరుపుకోవడంలో కూడా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ విషయంలో ప్రేరణ కోసం, ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్ బంగారు పతకాన్ని, మరో రెండు డిస్టెన్స్ పతకాలను గెలుచుకున్న ఇథియోపియన్ సంతతి డచ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన సిఫాన్ హసన్ ను మనం చూడవచ్చు. హసన్ ఒక శరణార్థి. ఆమె నెదర్లాండ్స్‌కు చేరుకుంది. నర్సుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఆమె విరామ సమయాల్లో పరిగెత్తింది. గెలుపు సాధించింది. స్త్రీలో ఉన్న ప్రతిభ, తేజస్సు, ధిక్కరించడం అనే గుణాలు సామాజిక దురాచారాలు కావు; మనం క్రీడలలో, ఇతర రంగాలలో ఛాంపియన్ల దేశంగా ఉండాలంటే ఇలాంటి వారిని పెంచి పోషించాలి. వారి విజయాలను చూసి పండగ చేసుకోవాలి.సాగరికా ఘోష్ వ్యాసకర్త టీఎంసీ రాజ్యసభ ఎంపీ (‘ది ప్రింట్’ సౌజన్యంతో...) -
CAS: వినేశ్ విషయంలో చారిత్రాత్మక తీర్పు ఆశిస్తున్నాం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీలుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ హర్యానా అథ్లెట్‌కు రజతం ఇవ్వాలా? లేదా అన్న అంశంపై మరికొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ నేపథ్యలో వినేశ్ ఫొగట్ తరఫున CASలో వాదనలు వినిపించిన న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చారిత్రాత్మక తీర్పు ఆశిస్తున్నాం‘‘వినేశ్ పతకం వస్తుందనే అందరం ఆశిస్తున్నాం. సీఏఎస్(CAS) అడ్ హక్ ప్యానెల్.. అప్పీలు నమోదైన 24 గంటల్లోనే తీర్పునిస్తుంది. అయితే, వినేశ్ విషయంలో రోజుల తరబడి వాయిదా వేశారు కాబట్టి వారు ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారని అర్థమవుతోంది. ఒకవేళ ఆర్బిట్రేటర్ ఎంత ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తే.. మనకు అంత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.గతంలో సీఏఎస్(CAS)లో నేను కేసులు వాదించాను. నిజానికి ఇక్కడ సక్సెస్ రేటు తక్కువే. అయితే, చరిత్రలో గుర్తుండిపోయే తీర్పు కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నాం. అందరికీ చిరస్మరణీయంగా మిగిలే తీర్పు ఇవ్వాలని ఆర్బిట్రేటర్‌ను కోరాం. ఇది కాస్త కష్టమే. అయితే, అంతా మంచే జరుగుతుందని మనం ఆశిద్దాం.వినేశ్ కోసం మనమంతా ప్రార్థిద్దాం. తనకు పతకం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఒకవేళ పతకం రాకపోయినా.. తనెప్పటికీ చాంపియనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని విదుష్పత్ సింఘానియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో వినేశ్ ఫొగట్ అద్భుత విజయాలతో మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది వినేశ్.అనూహ్య రీతిలో అనర్హత వేటుఅయితే, అనూహ్య రీతిలో స్వర్ణ పతక బౌట్‌కు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. దీంతో ఫైనల్‌కు వినేశ్ దూరమైంది. ఈ నేపథ్యంలో తనను పోటీకి అనుమతించాలని, లేనిపక్షంలో సంయుక్త రజత పతకం ఇవ్వాలని సీఏఎస్(CAS)కు అప్పీలు చేసింది.ఈ నేపథ్యంలో ఫైనల్‌కు అనుమతించలేమని ముందే స్పష్టం చేసిన స్పోర్ట్స్ కోర్టు.. రజత పతకం ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై ఆగష్టు 10నే తీర్పు ఇస్తామని చెప్పిన కోర్టు.. తదుపరి ఆగష్టు 13కు వాయిదా వేసింది. చదవండి: రూ. 1.5 కోట్లా? ఎవరిచ్చారు?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆగ్రహం -
Paris olympics: ముగిసిన భారత ప్రస్థానం.. ఆరుతో సరి
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. శనివారం రెజ్లింగ్ ఈవెంట్‌తో భారత పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఆమెను ఓడించిన కిర్గిస్తాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఫలితంగా రీతికకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కనీసం కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లేకుండా పోయింది. ‘పారిస్’లో భారత్‌కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 70వ స్థానంలో ఉంది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఫలితంగా చివరిరోజు పతకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచి 48వ స్థానంలో నిలిచింది. పారిస్: విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. శనివారంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 76 కేజీల విభాగంలో రీతిక కాంస్య పతక పోరుకు అర్హత సాధించి ఉంటే ఆదివారం కూడా భారత్ పతకం రేసులో నిలిచేది. కానీ రీతిక పతకం రేసులో స్థానం సంపాదించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ రీతిక క్వార్టర్ ఫైనల్లో కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెదెత్ కిజీ చేతిలో ఓడిపోయింది. మూడు నిమిషాల నిడివి గల రెండు భాగాలు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. స్కోరు సమమైతే నిబంధనల ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ బౌట్లో ముందుగా రీతిక ఒక పాయింట్ సాధించింది. రెండో భాగంలో కిర్గిస్తాన్ రెజ్లర్ పాయింట్ స్కోరు చేసి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ పాయింట్ లభించలేదు. దాంతో చివరి పాయింట్ స్కోరు చేసిన కిర్గిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం కిర్గిస్తాన్ రెజ్లర్ సెమీఫైనల్లో 6–8 పాయింట్ల తేడాతో కెన్నీడీ అలెక్సిస్ బ్లేడ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. దాంతో ‘రెపిచాజ్’ రూపంలో రీతికకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం చేజారింది. అంతకుముందు తొలి రౌండ్లో రీతిక కేవలం 29 సెకన్లలో హంగేరి రెజ్లర్ బెర్నాడెట్ నగీపై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో గెలిచింది. ఇద్దరు రెజ్లర్ల మధ్య పాయింట్ల తేడా 10 పాయింట్లకు చేరుకున్న వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేస్తారు. బెర్నాడెట్‌తో జరిగిన బౌట్లో 29 సెకన్ల సమయానికి రీతిక 12–2తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి రీతికను విజేతగా ప్రకటించారు. -
Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మరో భారత రెజ్లర్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16(ప్రిక్వార్టర్స్)కు అర్హత సాధించిన రితికా హుడా.. హంగేరికి చెందిన బెర్నాడెట్ న్యాగీతో తలపడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ బౌట్లో బెర్నాడెట్‌పై 12-2తో రితికా పైచేయి సాధించింది.ఈ క్రమంలో.. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడాను విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఆమె క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా బౌట్ జరుగుతున్నపుడు ఇద్దరు రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా తేలుస్తారు. క్వార్టర్ ఫైనల్లో రితిక.. కిర్గిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడిట్ కిజీతో తలపడనుంది.ఇప్పటికి ఆరు కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల 57 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించిన అమన్ భారత్ పతకాల సంఖ్యను ఆరుకు చేర్చాడు. ఇక మరో రెజ్లర్ వినేశ్ ఫొగట్ సైతం 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వెయింగ్ రోజున 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంగా స్వర్ణ పతక బౌట్లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు భారత్‌కు ప్యారిస్‌లో ఐదు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ ఒకటి, రెజ్లింగ్‌లో ఒకటి), ఒక రజతం(నీరజ్ చోప్రా- జావెలిన్ త్రో) వచ్చాయి.చదవండి: CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. ప్రకటన విడుదలShe's UNSTOPPABLE!! 🔥Reetika Hooda dominated her Hungarian opponent with a 12-2 victory in her first bout & storms into the quarterfinals! Catch all the Olympic action LIVE on #Sports18 and stream FREE on #JioCinema 👈#OlympicsOnJioCinema #Paris2024 #Wrestling pic.twitter.com/tbqoXjPb2K— JioCinema (@JioCinema) August 10, 2024 -
CASలో ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదా
ముగిసిన వినేశ్ కేసు వాదనలు.. తీర్పు వాయిదాఅయితే తాజాగా CAS మరో ప్రకటన విడుదల చేసింది. తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు 11 సాయంత్రం ఆరు గంటల తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో విచారణ పూర్తైంది. సీఏఎస్ అడ్‌హక్ కమిటీ ఆర్బిట్రేటర్ డాక్టర్ అనాబెలె బెన్నెట్ ముందు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తరఫున సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, విదూశ్‌పత్ సింఘానియా వాదనలు బలంగా వినిపించారు. ప్రతివాదులైన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లు ప్రధానంగా నిబంధనల గురించే వివరించింది. దీనిపై తమ వాదనే పైచేయి సాధిస్తుందని, సానుకూల తీర్పు వస్తుందని ఐఓఏ కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. మొత్తానికి రెండు రోజులుగా జరుగుతున్న విచారణ శుక్రవారంతో పూర్తైంది. ప్రకటన విడుదల చేసిన సీఏఎస్ఆదివారం మెగా ఈవెంట్ ముగియనున్న నేపథ్యంలో ఈరోజే తీర్పు వెలువడే అవకాశముందని తెలిసింది. అయితే, శనివారం రాత్రి 9.30 నిమిషాల తర్వాత తమ తీర్పును వెలువరించనున్నట్లు సీఏఎస్ ప్రకటన తాజాగా విడుదల చేసింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అథ్లెట్.. తదుపరి రెండు ఆటంకాలను కూడా దిగ్విజయంగా దాటేసింది. రజతమైనా ఇవ్వండిక్వార్టర్ ఫైనల్స్, సెమీస్‌లో వరుస విజయాలతో స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్స్ రోజు వేయింగ్‌లో 100 గ్రాముల అధిక బరువు వల్ల వినేశ్ అనర్హతకు గురైంది. దీంతో కనీసం ఖాయమనుకున్న రజతం కూడా చేజారింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వినేశ్ ఫొగాట్.. తన సెమీస్ ప్రదర్శన వరకు వేయింగ్‌లో ఏ సమస్యా లేదని కాబట్టి సంయుక్తంగా రజత పతకం బహూకరించాలని అప్పీలు చేసుకుంది. ఈ క్రమంలో వినేశ్ ఫొగాట్ తరఫున వాదనలు వినిపించేందుకు ఐఓఏ ప్రముఖ లాయర్లు హరీశ్ సాల్వే, విదూశ్‌పత్ సింఘానియాను నియమించుకుంది. దాదాపు గంటకు పైగా హరీశ్ తన వాదనలు వినిపించారని.. ఇందుకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. వినేశ్‌కు రజతం వస్తుందని తాము ధీమాగా ఉన్నామని ఐఓఏ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న భారత క్రికెటర్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్ -
అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Olympic 2024: అనాథగా వచ్చి అద్భుతం చేసి... అమన్ 'కాంస్య' కథ
‘గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్లు’... ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ‘ఛత్రశాల్’లో అమన్ సెహ్రావత్ గదిలో అతని మంచం పక్కన చేతి రాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు ‘క్వాలిఫైడ్ అథ్లెట్’ అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ ఐదు రింగులతో పాటు పతకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు అసలు ఒలింపిక్ పతకమే వేలాడనుంది! ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీలు కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఛత్రశాల్ సెంటర్లో యువ రెజ్లర్లకు స్ఫూర్తినివ్వడం కోసం దేశానికి కీర్తిని తెచ్చిన రెజ్లర్ల ఫొటోలను పెట్టారు.ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్, రవి దహియాలతో పాటు వరల్డ్ చాంపియన్ షిప్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన అమిత్ దహియా ఫోటో కూడా ఉంటుంది. ప్రతీ రోజూ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచే నడిచే అమన్ తన గురించి కూడా కలకన్నాడు. అతను ఢిల్లీ చేరేసరికి అతని ఫొటో కూడా సిద్ధమైపోతుందేమో! తల్లిదండ్రులను కోల్పోయి... హరియాణాలోని బిరోహర్కు చెందిన అమన్ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసిన అతను ఎప్పటికైనా ఢిల్లీలో ఛత్ర్శాల్ స్టేడియానికి వెళ్లి గొప్ప రెజ్లర్‌ను అవుతానంటూ నాన్నకు చెప్పేవాడు. దురదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోగా అతని తల్లిదండ్రులు అనూహ్యంగా మరణించారు. దాంతో కొందరు సన్నిహితులు 11 ఏళ్ల వయసులో ఛత్రశాల్ స్టేడియంకు తీసుకొచ్చి చేర్పించారు. అప్పటి నుంచి అతనికి ఆ కేంద్రమే సొంత ఇల్లుగా, అతని లోకమంతా రెజ్లింగ్మయంగా మారిపోయింది. ప్రాక్టీస్ తప్ప మరో పని లేకుండా అమన్ గడిపేవాడు. కోచ్ లలిత్ కుమార్ అతడిని తీర్చిదిద్దాడు. అండర్–23 ప్రపంచ విజేతగా... 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచిన అనంతరం అమన్ జూనియర్ స్థాయిలో పలు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. ఆసియా క్యాడెట్స్, వరల్డ్ క్యాడెట్స్, ఆసియా అండర్–20, ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లలో అతను సాధించిన విజయాలు అమన్‌కు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే 19 ఏళ్ల వయసులో అండర్–23 వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణం సాధించడంతో అతనిపై అందరి దృష్టి పడింది. భవిష్యత్తులో అద్భుతాలు చేయగల ఆటగాడిగా అందరూ అంచనాకు వచ్చారు. వేర్వేరు గ్రాండ్‌ప్రిలు, ఇన్విటేషన్ టోర్నీలలో కూడా వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ స్థాయిలో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అమన్ ఎక్కడా తగ్గకుండా తన ఆటలో మరింత పదును పెంచుకున్నాడు. ఫలితంగా 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం అతని ఖాతాలో చేరాయి. సుశీల్ ఫోన్ కాల్‌తో... ఆసియా క్రీడల సెమీఫైనల్లో, ఆ తర్వాత ఆసియా క్వాలిఫయిర్స్లో బలహీన డిఫెన్స్‌తో అమన్ పరాజయంపాలై కాస్త నిరాశ చెందాడు. ఆ సమయంలో అతనికి తీహార్ జైలు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి0ది. అది చిరపరిచితమైన గొంతే. తన కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించి నువ్వు గొప్పవాడిని అవుతావని ఆశీర్వదించిన సుశీల్ కుమార్ చేసిన ఫోన్ అది. ‘నీ ఆటకు డిఫెన్స్ పనికిరాదు. అలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు. ఒక్క సెకను కూడా డిఫెన్స్‌పై దృష్టి పెట్టకుండా ఆరంభం నుంచి అటాక్ చేస్తేనే నీకు సరిపోతుంది. సీనియర్ స్థాయిలో డిఫెన్స్ టెక్నిక్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు. నేను కూడా అలాగే చేశాను’ అంటూ సుశీల్ చెప్పడం అమన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత అతని ఆటలో దూకుడు మరింత పెరిగింది. గురువునే ఓడించి... పారిస్ ఒలింపిక్స్ అవకాశం అమన్‌కు అంత సులువుగా రాలేదు. ఛత్ర్శాల్లో తాను ఎంతో అభిమానించే రెజ్లర్ రవి దహియా. అతడిపై ఇష్టం కారణంగా అన్ని చోట్లా అతడినే అనుకరిస్తూ అతని శిష్యుడిగా తనను తాను భావించుకునేవాడు. కానీ గురువుతోనే పోటీ పడాల్సిన స్థితి వస్తే! అమన్‌కు అదే అనుభవం ఎదురైంది. రవి దహియా కేటగిరీ అయిన 57 కేజీల విభాగంలోనే తానూ పోటీ పడుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఒకరికే అవకాశం ఉంది. కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్‌లో రవి చేతిలో 0–10తో అమన్ చిత్తుగా ఓడాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది తాను గురుభావంతో చూస్తే పని కాదని, ఒక ప్రత్యర్థి గా మాత్రమే చూడాలని. 2024 ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో చెలరేగి రవిని ఓడించడంలో సఫలమైన అమన్... గురువు స్థానంలోకి వచ్చి కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత క్వాలిఫయర్స్‌లోనూ చెలరేగి ఒలింపిక్ బెర్త్‌ను సాధించాడు. ఈ క్రమంలో వాంగెలోవ్, ఆండ్రీ యెట్సెంకో, చోంగ్ సాంగ్వంటి సీనియర్లను అతను ఓడించగలిగాడు. ఘనమైన రికార్డుతో... ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత ప్రపంచ రెజ్లింగ్‌కు రాజధాని లాంటి ‘డేగిస్తాన్’లో అతను సన్నద్ధమయ్యాడు. ఛత్రశాల్లో మినహా అతని కెరీర్లో శిక్షణ తీసుకున్న మరో చోటు డేగిస్తాన్ (రష్యాకు సమీపంలో) మాత్రమే. అత్యుత్తమ సౌకర్యాలతో పాటు పలువురు చాంపియన్ ప్లేయర్ల మధ్య సాధన చేయడం, పదునైన స్పేరింగ్ పార్ట్నర్లు ఉండటంతో అమన్ ప్రాక్టీస్ జోరుగా సాగింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అమన్ ఆగలేదు. ఫిబ్రవరి 2022లో సీనియర్ స్థాయిలో తొలిసారి అంతర్జాతీయ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అమన్ అప్పటి నుంచి ఈ ఒలింపిక్స్‌కు ముందు వరకు 39 బౌట్లలో పాల్గొంటే 31 విజయాలు సాధించాడు. అంటే 79.4 విజయశాతం. ఇదే అతనిపై ఒలింపిక్ పతకం అంచనాలను పెంచింది. ఇప్పుడు తనకంటే ముందు ఒలింపిక్ పతకాలు సాధించిన తనలో స్ఫూర్తిని నింపిన దిగ్గజాల సరసన అతను సగర్వంగా నిలబడ్డాడు. –సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన అమన్ సెహ్రావత్.. పతకానికి అడుగు దూరంలో..!
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. అల్బేనియాకు చెందిన జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0 తేడాతో గెలుపొందాడు. AMAN SEHRAWAT, THE NEW HERO OF INDIAN WRESTLING. 🌟🔥 pic.twitter.com/rafzNRz9q4— Johns. (@CricCrazyJohns) August 8, 2024ఇవాళ (ఆగస్ట్ 8) రాత్రే జరిగే సెమీఫైనల్లో సెహ్రావత్.. జపాన్‌కు చెందిన రె హిగుచితో తలపడతాడు. ఈ బౌట్లో సెహ్రావత్ గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. భారత కాలమానం ప్రకారం సెమీఫైనల్ బౌట్ రాత్రి 9:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 8) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. ఉత్తర మాసిదోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగొరోవ్పై 10-0 తేడాతో గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో సెహ్రావత్ ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇవాళే జరిగే క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. జెలిమ్ఖాన్ అబాకరోవ్ లేదా దియామ్యాంటినో లూనా ఫఫేతో తలపడతాడు. -
వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?
50 కిలోల 100 గ్రాములు... వెయింగ్ స్కేల్‌పై వినేశ్ ఫొగాట్ బరువు కనిపించింది! అంతే... అక్కడే ఆశలు నేలకూలాయి. మరో మాటకు తావు లేకుండా అనర్హత... బంగారు పతకం కోసం కన్న కలలు అక్కడే కల్లలయ్యాయి... ఆ 100 గ్రాములను తగ్గించేందుకు మరికొంత సమయం కావాలంటూ భారత బృందం చేసిన అభ్యర్థనను నిర్వాహకులు లెక్క చేయనేలేదు.అసాధారణ ఆటతో ఫైనల్ వరకు చేరి తన ఒలింపిక్ పతక లక్ష్యాన్ని నిజం చేసుకున్న ఫొగాట్‌కు తుది సమరానికి కొన్ని గంటల ముందు ఆ పతకం కూడా దక్కదని తేలిపోయింది. రెజ్లింగ్‌లో భారత మహిళ తొలిసారి ఫైనల్‌కు చేరడంతో పసిడి పతకాన్ని ఆశించిన మన అభిమానులకు కూడా అది దక్కదని అర్థమైపోవడంతో అన్నింటా నిరాశ అలముకుంది. ఆమె మూడు మ్యాచ్‌ల కష్టాన్ని కూడా నిర్వాహకులు లాగేసుకోవడం ఎవరూ ఊహించని విషాదం.ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్ చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌కు కొన్ని గంటల ముందు జరిగే ‘వెయింగ్’లో వినేశ్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా తేలింది. నిబంధనల ప్రకారం అనుమతించిన బరువుకంటే ఏమాత్రం ఎక్కువ బరువు ఉన్నా ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుంది.ఫైనల్ కోసమే కాకుండా ఓవరాల్‌గా ఆమె గెలిచిన మూడు బౌట్లను కూడా గుర్తించకుండా వినేశ్‌ను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిన యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్ (క్యూబా) ఫైనల్ చేరింది. దాంతో ఎలాంటి పతకం లేకుండా చివరి స్థానంతో ఫొగాట్ నిష్క్రమించింది. వినేశ్ అనర్హత నేపథ్యంలో అసలు ఏం జరిగింది... ఎలాంటి పరిణామాలు సంభవించాయో చూస్తే...కేటగిరీని మార్చుకొని... కెరీర్ ఆరంభం నుంచి కొన్నాళ్ల క్రితం వరకు కూడా వినేశ్ 53 కేజీల విభాగంలో పోటీ పడింది. అయితే ఢిల్లీలో వివాద సమయంలో కొంత కాలం ఆటకు దూరమయ్యాక అందులో మరో ప్లేయర్ రావడంతో కేటగిరీ మార్చుకుంటూ 50 కేజీలకు తగ్గింది. ఇందులోనే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి రోజు ఏం జరిగింది...పోటీలకు ముందు బరువు తూచే సాధారణ ప్రక్రియ ‘వెయింగ్’లో వినేశ్ బరువు 49.90 కిలోలుగా వచ్చింది. అక్కడే కాస్త ప్రమాదం కనిపించినా, 50కి లోపు ఉండటంతో సమస్య రాలేదు. మూడు బౌట్లు ఆడి వరుస విజయాలతో ఫొగాట్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత ఏమైంది... పోటీ పడే క్రమంలో విరామాల మధ్య ఆహారం, నీళ్లు తీసుకోవడంతో ఆమె సహజంగానే బరువు పెరిగింది. సెమీస్ తర్వాత ఇది 52.70 కేజీలుగా ఉంది. బుధవారం ‘వెయింగ్’లోగా 2.70 కేజీలు తగ్గించాల్సిన అవసరం వచి్చంది.ఏం చేశారు...?వినేశ్తో పాటు ఆమె న్యూట్రిషనిస్ట్, భారత చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్షా పర్దివాలా తదితరులు కలిసి రాత్రికి రాత్రే బరువు తగ్గించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆహారం, నీరు ఇవ్వకపోవడంతోపాటు 12 గంటల వ్యవధిలో వివిధ రకాల ఎక్సర్సైజ్లు, ఆవిరి స్నానాలువంటి వాటితో వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే బరువు తగ్గించాలని చూశారు. చెమట రావడం తగ్గిపోవడంతో జుట్టు కూడా కత్తిరించారు. ఒకదశలో రక్తం తగ్గించాలని కూడా భావించారు. అయితే వీటన్నింటి కారణంగా వినేశ్ దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినా అన్నింటికీ సిద్ధమైంది. అన్నింటికీ సిద్ధపడ్డా... సందేహంగానే వినేశ్ ‘వెయింగ్’కు సిద్ధం కాగా... చివరకు 50 కేజీలకంటే మరో 100 గ్రాములు ఎక్కువగానే వచి్చంది. కొంత సమయం ఉంటే అదీ తగ్గించే వాళ్లమని మెడికల్ ఆఫీసర్ పర్దివాలా వెల్లడించారు. ఒక్కసారి అనర్హురాలని తేలడంతో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్‌తో ఆమెకు చికిత్సను అందించారు. తప్పెవరిది? ప్లేయర్ సాధారణంగా తన ఆటపైనే దృష్టి పెడతారు. ఆమెతో పని చేసే వైద్యబృందం ఇలాంటి విషయాలను చూసుకోవాలి. పోటీలు జరిగే సమయంలో జాగ్రత్తగా ఆహారం అందించాలి. ముఖ్యంగా బౌట్ల మధ్య ఆమెకు ఇచి్చన ఆహారం విషయంలో బరువు పెరిగే అంశాలను చూసుకోవాల్సింది. ఒలింపిక్స్‌లాంటి ఈవెంట్లో ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఎంత పెరిగినా సెమీఫైనల్ బౌట్ తర్వాత చూసుకోవచ్చు... ఎలాగైనా తగ్గించవచ్చనే అతి విశ్వాసమే దెబ్బ కొట్టిందని అర్థమవుతుంది. ఈ విషయంలో వైద్య బృందాన్ని తప్పు పట్టవచ్చు. రజతం కూడా ఇవ్వరా! 2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్‌కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్ మార్చారు. నిబంధనల ప్రకారం రెండు రోజులూ బరువు చూస్తారు.రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్‌కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు.కానీ అదీ నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్‌లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయింగ్‌లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్‌కు ఆ అవకాశమూ లేకపోయింది.వినేశ్ ఊహించలేదా! సాధారణంగా ఆటగాళ్లు తమ శరీర బరువుకు దగ్గరలో ఉండే వెయిట్ కేటగిరీల్లో పోటీ పడతారు. అలా అయితే సన్నద్ధత సులువవుతుంది. పోటీలు లేని సమయంలో వినేశ్ 56–57 కేజీల బరువుంటుంది. ఏదైనా టోర్నీ రాగానే ఆ సమయంలో ఎలాగైనా కష్టపడి తన బరువును తగ్గించుకుంటూ వచ్చి ఆటకు సిద్ధమైపోయేది. ఈసారి కూడా అలాగే ఆశించి ఉండవచ్చు.కానీ బుధవారం ఉదయం అది సాధ్యం కాలేదు. అంచనాలు తప్పడంతో 100 గ్రాముల తేడా వచ్చేసింది. ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో 2 కిలోల వరకు సడలింపు ఉంది. ఆ టోర్నీల్లో అయితే 52 కేజీలు వచ్చినా సమస్య రాకపోయేది. కానీ ఒలింపిక్స్ నిబంధనలు చాలా కఠినంగా ఉండి అలాంటి సడలింపు లేదు. భారత్‌లో నిరసన... వినేశ్ ఉదంతంపై భారత పార్లమెంట్లో కూడా తీవ్ర చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిరసనను తెలియజేయాలని, ఆమెకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు వినేశ్తో ఉన్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.పారిస్‌లో పీటీ ఉష నేతృత్వంలో ఐఓఏ అధికారికంగా ఫిర్యాదు చేసినా... అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాత్రం ‘అన్నీ నిబంధనల ప్రకారమే’ అంటూ అన్నింటినీ కొట్టిపారేసింది. మాజీ బాక్సర్, 2008 బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్... ఇందులో ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. అసాధారణంగా సాగిన వినేశ్ ఎదుగుదలను చూసి ఎవరైనా ఏదైనా చేసి ఉంటారని, 100 గ్రాములు అనే విషయం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. -
ఒలింపిక్స్‌లో అనర్హతపై వినేశ్ ఫొగట్ భావోద్వేగం
-
చెదిరిన స్వప్నం
భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్‌లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్‌పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది. ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్‌లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది. ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది. కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్బ్రాంట్తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం. గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్‌సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్‌లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్‌కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్‌ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్‌కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి. -
వినేశ్ కోసం రూల్స్ మార్చలేం: యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు లలోవిక్
పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వినేశ్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు. బరుపు తగ్గేందుకు వినేశ్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నాడు. ఏదిఏమైనా రూల్స్‌ను గౌరవించాల్సిందేనని తెలిపాడు. ఇందుకు వినేశ్ మినహాంపు కాదని వివరించాడు. వినేశ్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని తెలిపాడు. బరువు పెరిగిన అథ్లెట్‌ను పోటీకి అనుమతించడం అసాధ్యమని పేర్కొన్నాడు. నిబంధనల ప్రకారం అనర్హతకు గురైన అథ్లెట్ పోటీలో చివరి స్థానంలో ఉంటారని తెలిపాడు.కాగా, వినేశ్ ఫైనల్లో అమెరికాకు చెందిన సారా హిల్డర్‌బ్రాండ్‌తో తలపడాల్సి ఉండింది. వినేశ్ నిష్క్రమణతో సెమీఫైనల్లో ఓడిన క్యూబా క్రీడాకారిణి యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది.నిబంధనలు ఇలా..ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో పోటీపడే అథ్లెట్ల బరువును ఏ రోజైతే బౌట్ ఉంటుందో ఆరోజు ఉదయం తూస్తారు. ప్రతి వెయిట్ క్లాస్‌లో పోటీపడే అథ్లెట్లకు తగినంత సమయం ఉంటుంది. రెండు రోజుల వ్యవధిలో తొలి రోజు బరువు కొలిచేందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లైనా బరువు కొలుచుకోవచ్చు. అయితే, రెండోరోజు మాత్రం ఇందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. ఈలోపు నిర్ణీత బరువు ఉంటేనే బౌట్‌కు అనుమతిస్తారు. -
వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు.వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. Vinesh, you are a champion among champions! You are India's pride and an inspiration for each and every Indian. Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.At the same time, I know that you epitomise resilience. It has always…— Narendra Modi (@narendramodi) August 7, 2024పీటీ ఉషకు మోదీ కీలక ఆదేశాలు మరోవైపు ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వినేశ్‌కు సహాయం చేసేందుకు వీలైన అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆదేశించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని.. అదే విధంగా అనర్హత వేటు విషయంలో న్యాయబద్ధంగా పోరాటం చేయాలని కూడా ఉషను ఆదేశించారని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది. -
Vinesh Phogat: ఊహించని షాక్.. వినేశ్‌పై అనర్హత వేటు!
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. స్వర్ణ పతక ఆశలు రేపిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిందని వార్తా సంస్థ ANI ఎక్స్ వేదికగా వెల్లడించింది.కాగా హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ రీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. అయినప్పటికీ ప్యారిస్‌లో అసాధారణ విజయాలతో వినేశ్ ఫైనల్ వరకు చేరింది.వరల్డ్ నంబర్ వన్ను ఓడించిప్రిక్వార్టర్స్లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)ని ఓడించిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్పై గెలుపొందింది. తద్వారా సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.ఈరోజు రాత్రి పసిడి పతకం కోసం వినేశ్.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్తో తలపడాల్సి ఉంది. అయితే, వినేశ్ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆమెపై వేటు పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పతకానికి ఈ రెజ్లర్ దూరం కానుంది.చింతిస్తున్నాం‘‘50 కేజీల విభాగంలో ఉన్న వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడినట్లు తెలిపేందుకు చింతిస్తున్నాం. 50 కిలోల కంటే ఆమె కాస్త ఎక్కువ బరువే ఉన్నారని తేలింది. రాత్రి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉదయం ఆమె ఉండవలసిని దాని కంటే అధిక బరువు ఉన్నారు కాబట్టి అనర్హత వేటు పడింది.వినేశ్ గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాం’’ అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. ‘‘వినేశ్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నారు. ఫలితంగా నిబంధనల ప్రకారం.. ఆమె పోటీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది’’ అని భారత కోచ్ ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు. Indian Wrestler Vinesh Phogat disqualified from the Women’s Wrestling 50kg for being overweight. It is with regret that the Indian contingent shares news of the disqualification of Vinesh Phogat from the Women’s Wrestling 50kg class. Despite the best efforts by the team through… pic.twitter.com/xYrhzA1A2U— ANI (@ANI) August 7, 2024 -
Olympics: సెమీస్‌లో వినేశ్.. పతకం ఖాయం చేసే దిశగా
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మరో సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకేకు షాకిచ్చిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ క్రమంలో ఉక్రెయిన్ రెజ్లర్ లివాచ్‌తో తలపడ్డ వినేశ్ ఫొగట్.. శుభారంభం చేసింది. 4-0తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే, లివాచ్ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఈ క్రమంలో తన శక్తినంతటినీ ధారపోసిన వినేశ్ ఫొగట్.. ఆఖరికి లివాచ్‌ను 7-5తో ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.వినేశ్ ఫొగట్ తదుపరి క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో సెమీ పోరులో తలపడనుంది. మంగళవారం రాత్రి 10.15 నిమిషాలకు ఈ బౌట్ ఆరంభం కానుంది. కాగా వినేశ్ ఫొగట్ ప్రస్తుతం వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్ కాగా.. వరుసగా వరల్డ్ నంబర్ వన్ సుసాకే, ఎనిమిదో సీడ్ లివాచ్‌లను ఓడించి... తన కెరీర్లో తొలిసారిగా ఒలింపిక్స్ సెమీస్‌కు చేరుకుంది. రియో 2016లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన వినేశ్.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్లోనే ఓడిపోయి.. రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్ చోప్రా Vinesh Phogat in control💪The 🇮🇳 WRESTLER is closing on a semi-final spot in #Paris2024!#Cheer4Bharat & watch the Olympics LIVE on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/mNajPsKh2V— JioCinema (@JioCinema) August 6, 2024 -
Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాకిచ్చిన వినేశ్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఊహించని పరిణామం!!!.. వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్.. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్‌ను మట్టికరిపించిన వైనం!!!. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బకొట్టి పతక రేసులో నిలిచిన అపూర్వ తరుణం. ఈ సంచలనం సృష్టించింది మరెవరో కాదు.. మన రెజ్లర్ వినేశ్ ఫొగట్.అవును... భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చారిత్రాత్మక విజయం సాధించింది. వుమెన్స్ 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత యీ సుసాకీని 3-2తో ఓడించింది.జపాన్ రెజ్లర్‌పై పైచేయి సాధించి సగర్వంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఒక్సానా లివాచ్‌తో వినేశ్ తలపడనుంది. WHAT HAVE YOU DONE VINESH!!!Vinesh Phogat has defeated the Tokyo Olympics GOLD medalisthttps://t.co/IPYAM2ifqx#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/RcnydCE3mk— JioCinema (@JioCinema) August 6, 2024 -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో ఓడిన నిషా దాహియా
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ (ఆగస్ట్ 5) భారత్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇవాళ జరిగిన రెండు కాంస్య పతక పోటీల్లో భారత్ ఆటగాళ్లు పరాజయాలు ఎదుర్కొన్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో భారత షూటర్లు జోడీ అనంత్‌జీత్ సింగ్ నరౌకా-మహేశ్వరి చౌహాన్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన నిషా దాహియా మహిళల రెజ్లింగ్ 68 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ నిషా దాహియా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. నిషా ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్‌తో చేతిలో 8-10 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిషా ఆధిక్యంలో ఉన్నప్పుడు గాయపడింది. తద్వారా స్వల్ప తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఓటమి అనంతరం నిషా కన్నీటిపర్యంతమైంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో నిషా.. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా సోవాపై 6-4 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నిషా 1-4తో వెనుకపడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.