interest
-
రుచుల రివ్యూ.. సిటీకి క్యూ
విభిన్నమైన ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్... ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చారిత్రక విశేషాల ద్వారా మాత్రమే కాకుండా చవులూరించే ఘుమఘమల ద్వారా కూడా ఆకర్షిస్తోంది. అలా వచ్చి వెళ్లేవారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న అనుభవాలు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీ రుచులకు సంబంధించి ఉన్న అభిప్రాయాలపై చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి. నగరానికి ఉన్న గొప్ప వంటల వారసత్వం పుణ్యమాని.. మొఘలాయ్, తెలుగు హైదరాబాదీ రుచులను మిళితం చేసిన సిటీ ఫుడ్ వెరైటీ రుచులను ఇష్టపడే ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. బిర్యానీల నుంచి ఇరానీ చాయ్ వరకు, బిస్కెట్ల నుంచి డబుల్ కా మీఠా వరకూ.. ఆహార ప్రియులకు హైదరాబాద్ స్వర్గధామం. ఈ నేపథ్యంలో నగరాన్ని సందర్శించే చాలా మంది విదేశీ సందర్శకులు సిటీ ఫుడ్‌ని ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో స్పందనను పంచుకోవడం కూడా పరిపాటిగా మారింది. స్కాట్లాండ్ సే ఆయే మేరా దోస్త్.. సాధారణంగా నగరాన్ని సందర్శించే విదేశీయులు మన రుచుల్ని పొగుడుతూనో, లేదా అరుదుగా బాగోలేదు అనో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అయితే తాజాగా ఒక (స్కాట్లాండ్) స్కాటిష్ ట్రావెలర్ మాత్రం భిన్నంగా స్పందించి సోషల్ మీడియాలో తన పోస్ట్‌ల ద్వారా సిటీ ఫుడీస్ని ఆకర్షించాడు. స్కాటిష్ అయిన హ్యూ అబ్రాడ్ అనే విదేశీయుడు నగరాన్ని సందర్శించాడు. నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వంటకాలు రుచి చూశాడు. అనంతరం వీటిని అందిస్తున్న హోటల్స్ రెస్టారెంట్స్‌పై తనదైన రీతిలో వీడియో పోస్టులు చేశాడు. అయితే ఇవి ఏదో యథాలాపంగా చేసినట్టు కాకుండా ఈ పోస్టులు చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రేటింగ్స్ సైతం.. హ్యూ అబ్రాడ్ తన వీడియోలలో హోటల్ షాదాబ్‌లో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీని తాను రుచి చూసినట్లు తెలిపాడు. ఆ రుచి అమోఘం అంటూ మెచ్చుకుని షాదాబ్ బిర్యానీకి 10/10 రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో అనేక మంది ఇష్టంగా తినే నిమ్రా కేఫ్లోనిఉస్మానియా బిస్కెట్ రుచిని మాత్రం తీసిపారేశాడు. అదొక ‘డ్రై’గా అతను పోస్ట్‌లో పేర్కొన్నాడు. అలాగే షహ్రాన్ హోటల్ కబాబ్‌ల కోసం మొజాంజాహీ మార్కెట్‌ను సందర్శించాడు. అక్కడి బోటీ, కబాబ్ రుచికరమైందిగా అంటూనే.. అందులో ఒక కబాబ్ ముక్కలో వైర్‌ను కనుగొనడంతో తానిచ్చే రేటింగ్ నుంచి ఒక పాయింట్ తగ్గించాడు. అదేవిధంగా మొజాంజాహీ మార్కెట్లోని ఒక దుకాణంలో పిస్తా ఐస్‌క్రీమ్‌ను కూడా టేస్ట్ చేసి ‘నేను ఇప్పటి వరకు రుచి చూసిన వాటిలో అత్యంత నకిలీ పిస్తా’ ఇది అంటూ విమర్శించాడు. రుచి అతి కృత్రిమంగా ఉందని దానికి 3/10 రేటింగ్ ఇచ్చాడు. ఇంకా ఇరానీ చాయ్, బిస్కెట్లు, బుర్హాన్పూర్ ఖోవా జిలేబి, మిలన్ జ్యూస్ సెంటర్లోని షెహదూద్ మలై ఇంకా ఇతర స్ట్రీట్ ఫుడ్స్‌పై కూడా ఇలాగే రివ్యూలను, రేటింగ్స్‌ను రివ్యూ అందించాడు. లైక్స్.. కామెంట్స్.. స్కాట్లాండ్వాసి హ్యూ అబ్రాడ్ పోస్టులకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. అనేక మంది ఈ వీడియోలను లైక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోల శ్రేణి హైదరాబాదీల మధ్య పరస్పరం చర్చకు సైతం దారి తీసింది. చాలామంది స్థానికులు ఆ పోస్టుల్లో నిజాయితీ ఉందని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం అతను నగరంలోని మరింత ఉత్తమమైన, మరింత ప్రమాణాలు పాటించే ఆహార కేంద్రాలను సందర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు సిటీ వంటకాల నిజమైన సారాన్ని అందించే మరికొన్ని వంటలు, వాటి చిరునామాలను సూచించారు. అంతేకాదు స్థానిక భాషలో విక్రేతలతో ఎలా సంభాíÙంచాలనే దానిపై చిట్కాలను కూడా అతడికి అందించారు. ఏదేమైనా మన రుచులపై విదేశీయుల అభిప్రాయాలకు దక్కుతున్న స్పందనకు స్కాటిష్ టూరిస్ట్ పోస్టులు అద్దం పట్టాయని చెప్పొచ్చు. -
పొదుపు పథకాల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై 2025 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే నాలుగో త్రైమాసికానికి (జనవరి–మార్చి) వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాపూర్వం కొనసాగించింది. వడ్డీ రేట్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి కొన్ని పథకాలలో ప్రభుత్వం చివరిసారి మార్పులు చేసింది.2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు) కోసం నోటిఫై చేసిన రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ పేర్కొంది. పోస్టాఫీసులు, బ్యాంకులు(Banks) నిర్వహించే స్మాల్ సేవింగ్స్ పథకాలనుపై వడ్డీ రేట్లను ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి త్రైమాసికం ఆర్థికశాఖ నోటిఫై చేసే సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..తాజా నోటిఫికేషన్ ప్రకారం జనవరి-మార్చి 2025 వరకు వడ్డీరేట్లు..పథకం-రేటు(%)సుకన్య సమృద్ధి 8.2 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7.1 పీపీఎఫ్ 7.1 పోస్టాఫీ సేవింగ్స్ డిపాజిట్ 4.0 కిసాన్ వికాస్ పత్ర 7.5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4 -
పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల నుంచి రావాల్సిన పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయడం లేదంటే తగ్గించి తీసుకోవచ్చంటూ అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సూచించింది. నోటీసులో పేర్కొన్న మేరకు పన్ను చెల్లించడంలో జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, చీఫ్ కమిషనర్, ప్రన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ ర్యాంక్ అధికారి ఎవరికి అయినా సరే వడ్డీని మినహాయించడం లేదంటే తగ్గించేందుకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 220 (2ఏ) కింద అధికారులున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది.వడ్డీ మాఫీ చేసే లేదా తగ్గించే అధికారాలపైనా స్పష్టత ఇచి్చంది. ‘‘రూ.1.5 కోట్లకుపైన వడ్డీ మాఫీ చేయడమా లేదంటే తగ్గించడమా అన్నది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. రూ.50 వేల నుంచి 1.5 లక్షల మధ్య ఉంటే చీఫ్ కమిషనర్‌కు అధికారం ఉంటుంది. రూ.50 లక్షల వరకు వడ్డీ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది’’అని సబీడీడీ పేర్కొంది. ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారుల దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వీలు కల్పిస్తుందని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్గార్గ్ అభిప్రాయపడ్డారు.మోసం కేసులకు ఏడాదిలో పరిష్కారం ఎగుమతులు/దిగుమతుల మోసాల కేసుల విచారణలో క్షేత్రస్థాయి కస్టమ్స్ అధికారులు తటస్థంగా వ్యవహరించాలని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) కోరింది. విచారణకు ముందే సమాచారం మొత్తాన్ని విశ్లేషించి, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. కమర్షియల్ ఇంటెలిజెన్స్ ఫ్రాడ్ కేసుల్లో విచారణను ఏడాది దాటకుండా ముగించాలని కూడా కోరింది. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
బ్యాంకు డిపాజిట్లపై గరిష్ట వడ్డీ
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్‌కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతాయని అంచనా. ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకుంటుండగా.. ద్రవ్యోల్బణం సాకుతో ఆర్బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతికనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులుదేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు. -
రూ.229 కోట్ల మోసం..ఇద్దరి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అధిక వడ్డీ ఆశ చూపి రూ.229 కోట్లు కొల్లగొట్టిన మాదాపూర్ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డైరెక్టర్లు సయ్యద్ అష్ఫక్ రాహిల్ ఈ కేసులో ఏ2గా ఉండగా అయిషా నాజ్ ఏ9గా ఉన్నారు.17 వేల 5 వందల మంది నుంచి పెట్టుబడికి రెండింతలువ లాభం ఇస్తామని ఆశ చూపి రూ.229 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన డీకేజెడ్ కంపెనీ ఇటీవల బోర్డు తిప్పి డిపాజిట్‌దారులను మోసగించింది. -
EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది. -
అధికంగా వడ్డీ ఇస్తున్న చిన్న బ్యాంకులు
Best FD Rates: దేశంలో చాలా మంది అధిక రాబడుల కోసం ఇప్పుడు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను వదిలి కొత్త ఎంపికల కోసం చూస్తున్నారు. అయితే, మొత్తం పెట్టుబడిని మార్కెట్లో పెట్టే బదులు కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటిలో మదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.మరి ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా అని అపోహ పడవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక మాత్రమే కాకుండా వడ్డీ కూడా బాగానే వస్తుంది. కొన్ని బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎఫ్డీపై ఎక్కువ వడ్డీ ఇస్తాయి.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పోలిస్తే చిన్న బ్యాంకులు కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీపై 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీపై ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్డీపై దేశంలోనే అత్యధిక వడ్డీని ఇస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ బ్యాంకులో 3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ ఖాతాను తెరిస్తే సంవత్సరానికి 9.5 శాతం వడ్డీని ఇస్తుంది.సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీపై అత్యధిక వడ్డీ ఇచ్చే విషయంలో రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9.1 శాతం వడ్డీని ఇస్తోంది.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75 శాతం వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీని అందించే బ్యాంకుల జాబితాలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఆఫర్ 3 సంవత్సరాల వ్యవధిలో చేసిన బ్యాంక్ ఎఫ్డీలకు కూడా వర్తిస్తుంది. -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్‌లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
శబరిమల యాత్రికులకు బీమా.. కంపెనీల ఆసక్తి
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.గరిష్ట ప్రయోజనాలుశబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్‌పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
అధిక చార్జీల రిఫండ్
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. పలు నియంత్రిత సంస్థలను (ఆర్ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది. -
సౌత్ డైరెక్షన్‌కి సై అంటున్న బాలీవుడ్ హీరోలు!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.సౌత్ డైరెక్టర్ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తమిళ దర్శకుడు అట్లీ వంటి వారు బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులతో ఉత్తరాది హీరోలు చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. సికందర్ సిద్ధం దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీ ‘గజిని’ కోసం హిందీ హీరో సల్మాన్ ఖాన్, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి పని చేయాల్సింది. అయితే ఆ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించగా మురుగదాస్ దర్శకత్వం వహించారు. ‘గజిని’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ మురుగదాస్ మాత్రం సల్మాన్ ఖాన్‌తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్‌కు ఓ కథ చెప్పారు మురుగదాస్. ఈ కథ సల్మాన్‌కు నచ్చలేదట. దీంతో సెట్ కాలేదు. కానీ తనతో సినిమా చేయాలనుకుంటున్న మురుగదాస్‌కు మరో నరేషన్ ఇచ్చే చాన్స్ ఇచ్చారు సల్మాన్. ఈసారి సల్మాన్‌కు కథ నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమాకు ‘సికందర్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ఆరంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ ‘ది బుల్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు ‘షేర్షా’ వంటి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. బాలీవుడ్ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాను రణ్వీర్ సింగ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాల పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాలు విడుదలయ్యాక రణ్వీర్ సింగ్‌తో శంకర్ సినిమా ఉంటుందట. అయితే ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రణ్వీర్తో ‘అన్నియన్’ సినిమానే శంకర్ చేస్తారా? లేక కొత్త కథతో సెట్స్‌పైకి వెళ్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. దసరాకు దేవా ఈ దసరాకి షాహిద్ కపూర్‌ను ‘దేవా’గా థియేటర్స్‌కు తీసుకురావాలనుకుంటున్నారు మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్‌లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హిందీలో రోషన్ ఆండ్రూస్‌కు ‘దేవా’ తొలి చిత్రం. కాగా షాహిద్ కపూర్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా దక్షిణాది దర్శకుడుతోనే ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవితో ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ ఫిల్మ్ కమిటయ్యారు షాహిద్. ‘దేవా’ పూర్తి కాగానే ‘అశ్వత్థామ: ది సాగా...’ షూటింగ్ ఆరంభం అవుతుందట. బేబీ జాన్ వస్తున్నాడు వరుణ్ ధావన్‌ను ‘బేబీ జాన్’గా మార్చేశారు తమిళ దర్శకుడు కాలిస్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. కాలిస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లు. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. హిట్ రీమేక్‌తో... తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిందీలో ‘సర్ఫిరా’గా రీమేక్ అవుతుండగా, అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. మాతృతకు దర్శకత్వం వహించిన సుధ కొంగరయే ‘సర్ఫిరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘సూరరై పోట్రు’లో నటించిన సూర్య ‘సర్ఫిరా’కు ఓ నిర్మాతగా ఉంటూ, గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.ఇంకా తెలుగు దర్శకులు తేజ, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, తమిళ దర్శకుడు పా. రంజిత్ తదితరులు చెప్పిన కథలను హిందీ హీరోలు విన్నారని సమాచారం. -
ఇన్వి ట్స్‌లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్‌షాప్‌లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిరీక్షణ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్‌లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్‌ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్‌పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్‌టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్
-
దేశ చరిత్రలో ఎవరూ చేయని సాహసం ఇది..
-
పేద అక్కచెల్లెమ్మలకు అండగా సీఎం వైఎస్ జగన్
-
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. -
దివాలా తీసిన ‘గో ఫస్ట్’పై 3 కంపెనీల కన్ను!
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్, ఆఫ్రికా కేంద్రంగా పని చేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. గో ఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలియజేసింది. మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్ధనలు వచి్చనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గో ఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 22తో ముగిసింది. అయితే, గడువు లోపల స్పందించని కంపెనీలు.. ఆ తర్వాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం. దీనిపై రుణదాతల కమిటీ (సీఓసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 270 మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
వారి మనసంతా ఇక్కడే!
సిరిసిల్ల: విదేశాల్లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపుతున్నారు. వారంతా నిత్యం ఇక్కడ ఉన్న మిత్రులతో టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ సరళి, స్థానిక రాజకీయాలపై చర్చిస్తున్నారు. జనం ఎటు వైపు ఓట్లు వేశారు.. ఎంత పోలింగ్ జరిగింది.. ఎవరు గెలుస్తారంటూ.. ఫోన్లలో మిత్రులను ఆరా తీస్తున్నారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో శనివారం రాత్రి నుంచే మిత్రులకు, బంధువులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా అంతటా వలసలే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా వారి కుటుంబాలకు చెందిన మరో 5 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయినా కుటుంబసభ్యులతో ఫోన్లో టచ్‌లో ఉన్నారు. ప్రతీక్షణం ఎన్నికల సరళిపై ఆరా తీశారు. ఎన్నారై పాలసీపై ఆశలు.. కేరళ తరహాలో విదేశీ విధానంపై తెలంగాణ ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గల్ఫ్ వలసజీవులు ఆశిస్తున్నారు. నిజానికి వీసా ఉండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణవసతి కల్పించడం, గల్ఫ్ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, నకిలీ ఏజెంట్లను కట్టడిచేయడం, చట్టబద్ధమైన ఏజెన్సీల ద్వారా గల్ఫ్ దేశాలకు పంపడం, పొరుగుదేశాలకు వెళ్లేవారికి ఏదో ఒక రంగంలో నైపుణ్య శిక్షణనివ్వడం, అక్కడి పరిస్థితులపై ముందే అవగాహన కల్పించడం వంటి విధానాలను ఎన్నారై పాలసీలో రూపొందించాలని గల్ఫ్ వలస జీవులు కోరుతున్నారు. రూ.వంద కోట్ల బడ్జెట్‌ను ఏటా కేటాయిస్తూ గల్ఫ్ వలసజీవుల ఇబ్బందులను పరిష్కరించాలని వలస కార్మికులు కోరుతున్నారు. మనుషులు అక్కడే ఉన్నప్పటికీ మనసులు మాత్రం ఎన్నికల ఫలితాలపైనే ఉన్నా యి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత వస్తుందని ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. మాది వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం శివంగాలపల్లె. నేను మలేసియాలో దశాబ్దకాలంగా ఉద్యోగం చేస్తున్న. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ పరిశీలిస్తున్న. ప్రచార సభలను కూడా టీవీల్లో చూశాను. ఎన్నికల సరళి, ఎగ్జిట్ పోల్స్‌ను కూడా తెలుసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అనే ఆసక్తి మా దగ్గర ఉండే తెలంగాణ వాసులు అందరిలోనూ ఉంది. – శివంగాల రమేశ్, మలేసియా ఏ పార్టీ గెలుస్తుందోనని.. మాది సిరిసిల్ల. ఎక్కడ ఉన్నా.. ఇండియాలో.. ప్రధానంగా మన తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని చూస్తున్నాం. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే వాటిని పరిశీలిస్తుంటాం. ఇటీవల ఇక్కడ వీకెండ్స్‌లో రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఈసారి తెలంగాణలో ఎన్నికలు భిన్నంగా ఉన్నా యి. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఉంది. – నక్క శశికుమార్, హాంకాంగ్ గల్ఫ్‌కార్మికుల బాధలు తీరాలి మాది కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఎవరు గెలిచినా గల్ఫ్ కార్మికుల బాధలు తీర్చే ప్రభుత్వం రావాలి. నిజానికి ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గల్ఫ్ కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అమలు కాలేదు. గల్ఫ్ కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రభుత్వాలు రావాలని ఆశిస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. – ఎస్వీ రెడ్డి, దుబాయ్ -
ప్రైమ్ మినిస్టరే కెప్టెన్‌గా క్రికెట్ మ్యాచ్ ఆడిన ఘటన..!
పంచభూతాలు కూడా ఫైనల్ మ్యాచ్ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నాయి. మరి సోషల్ మీడియా గమ్మున ఉంటుందా? అక్కడ సందడే సందడీ. అందులో నుంచి కొంచెం.. సూపర్ హిట్ అందుకున్న క్రికెట్ సినిమాలు.. మన దేశంలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో క్రికెట్‌కు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండు క్రేజ్‌లను కలిపితే సూపర్ హిట్టే అనుకుంటూ క్రికెట్ ప్రధానంగా, క్రికెటర్ల జీవితకథల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని... 22 యార్డ్స్, 83, 1983, ఆల్ రౌండర్, బియాండ్ ఆల్ బౌండ్రీస్, లగాన్, ఇక్బాల్, దిల్ బోలే హడిప్పా, పాటియాల హౌజ్, ఫెరారీ కీ సవారీ, కై పో చే, ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ, అజార్, జెర్సీ, సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (డాక్యుమెంటరీ స్పోర్ట్స్ ఫిల్మ్), వరల్డ్ కప్ 2011, హాట్రిక్ (స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్), గాడ్ ఆఫ్ క్రికెట్ (బయోపిక్ స్పోర్ట్స్ ఫిల్మ్), గోల్కొండ హైస్కూల్. స్పోర్ట్స్ కామెడీ యాక్షన్ ఫిల్మ్ ఫెండ్షిప్ (2021)లో హర్బజన్ సింగ్ ‘భజ్జీ’ అనే పాత్రలో నటించాడు. వెంకటేష్ నటించిన ‘వసంతం’ సినిమాలో వీవీఎస్ లక్ష్మణ్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడు.కెప్టెన్ చాచా నెహ్రూ కెప్టెన్‌గా చాచా నెహ్రు.. మన దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రుకు ఆటలు అంటే అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కాదు బ్రహ్మాండంగా ఆడతాడని పేరు కూడా. ప్రధాని అయిన తరువాత కూడా క్రికెట్‌పై ఆయన అభిమానం తగ్గలేదు. 1953లో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వరద బాధితుల కోసం దిల్లీలో ఛారిటీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ వైస్–ప్రెసిడెంట్ క్రికెట్ మ్యాచ్ ఇది. నెహ్రూజీ ప్రైమ్‌మినిస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చాలా సంవత్సరాల తరువాత బ్యాట్ చేతుల్లోకి తీసుకోవడం ఒక విశేషం అయితే ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగా ఆడడం మరో విశేషం. అబ్బే... కవిత్వం కాదండీ! దిలీప్ వెంగ్‌సర్కార్ నిక్‌నేమ్ కల్నల్. ఈ ఫొటోను చూస్తే కల్నల్ కవిత్వం రాసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అయితే అది నిజం కాదు. ప్లేయింగ్ డేస్‌లో వెంగ్‌సర్కార్ పత్రికలకు కాలమ్ రాసేవాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కాలమ్ రాస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. అట్లెట్లంటవయ్యా? ఇట్లెట్ల తింటవయ్యా! 1983 క్రికెట్ వరల్ కప్ సమయంలో ‘ఇండియా జట్టు గ్రూప్ స్టేజీ దాటి ముందుకు వెళ్లదు’ అని రాశాడు విజ్డన్ క్రికెట్ మంత్లీ ఎడిటర్ డేవిడ్ ఫ్రిత్. రాస్తే రాశాడుగానీ ఒక మంగయ్య శపథం కూడా చేస్తూ...‘ఈట్ మై వర్డ్స్’లాంటి ఇంగ్లిష్ ఎక్స్ప్రెషన్ ఏదో వాడాడు. ఇండియా ప్రపంచ కప్ గెలిచిన తరువాత ఒక పాఠకుడు ‘ఇప్పటికీ మీరు మాట మీదే నిలబడతారా?’ అని కవ్వించాడు. ‘ఏదో మాట వరుసకు అన్నాను లేవయ్యా’ అనకుండా మాట మీద నిలబడ్డాడు ఫ్రీత్. మ్యాగజైన్లో ప్రచురితమైన వ్యాసం కాగితాన్ని కెమెరా ముందు తిన్నాడు. యస్... ఏనుగే గెలిపించింది!‘.. మిత్రులారా ఈ పుస్తకం చదవండి. క్రికెట్‌కు సంబంధించి సకల వివరాలు, విశేషాలు, వినోదాలు, గణంకాలు... ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు’ అని అభిషేక్ ముఖర్జీ, జాయ్ భట్టాచార్య రాసిన ‘గ్రేట్ ఇండియన్ క్రికెట్ సర్కస్’ పుస్తకం గురించి గత నెలలో రాజకీయ నాయకుడు, రచయిత శశి థరూర్ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. దీని ప్రభావమేమో తెలియదుగానీ చాలామంది ఈ పుస్తకంలోని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని... 1971లో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వినాయక చవితి వచ్చింది. లండన్‌లోని స్థానిక భారతీయులు చెస్సింగ్టన్ జూ నుండి బెల్లా అనే మూడేళ్ళ ఏనుగును తీసుకువచ్చి స్టేడియం చుట్టూ తిప్పారు. మన జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఈ ఏనుగు ఆశీస్సుల వల్లే మన జట్టు గెలిచింది అని చాలామంది బలంగా నమ్మారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కపిల్‌దేవ్ షాట్‌కు ఒక సీగల్ చనిపోయింది. (మనస్తాపానికి గురైన కపిల్ ఈ బాధ నుంచి కోలుకోవడానికి గ్లాసు నీళ్లు కావాలని కోరాడని, ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలన్ బోర్డర్ తిరస్కరించాడని రచయితలు రాశారు). చండీగఢ్‌లో జరిగిన లోకల్ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ (పేరు రాయలేదు) సిక్సర్‌కు ఒక గుర్రం చనిపోయింది. తన తోటలో పండించిన హైబ్రీడ్ మ్యాంగోకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు పెట్టాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఖలీముల్లా ఖాన్. ‘ప్రపంచంలో సచిన్‌లాంటి ప్లేయర్ మరొకరు లేరు. అందుకే హైబ్రీడ్ మ్యాంగోకు ఆయన పేరు పెట్టాను’ అంటాడు ఖాన్. తీహార్ జైలులోని ఒక బ్లాక్‌కు మనోజ్ ప్రభాకర్ పేరు ఉండేది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో మనోజ్ పేరు వినిపించిన తరువాత బ్లాక్‌కు ఆయన పేరును తొలగించారు అధికారులు. (చదవండి: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర) -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్‌కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్‌ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్‌లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్‌ను మినహాయించి మిగతా బ్రాంచ్‌లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్‌లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్‌ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్‌వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
డిస్కంల ప్రతిపాదనలపై రోత రాతలా?
గడచిన నాలుగేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం చేస్తున్న రుణాలకు ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 650 కోట్ల వరకూ డిస్కం అదనంగా చెల్లిస్తోంది. ఇదేమీ కొత్తగా తీసుకున్నది కాదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. రూ. 1,468.98 కోట్లు ఆ ఐదేళ్లలో తీసుకున్నవే. సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి ఓ అబద్ధపు కథనాన్ని అచ్చేసింది. ‘విద్యుత్ వినియోగదారులపై వడ్డీ బాదుడు’ శీర్షికన మంగళవారం అభాండాలను రాష్ట్ర ప్రభుత్వంపై వేయాలని ప్రయత్నించింది. కానీ ఎప్పటిలాగే రామోజీ రాతల్లో వాస్తవాలు లేవని తేటతెల్లమైంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన ప్రతిపాదనలకు, ఈనాడు కథనంలో అంశాలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఐ.పృథ్వీతేజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ప్రజలపై భారం వేయడానికి కాదు సంప్రదాయ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా విద్యుత్ కొంటే పంపిణీ సంస్థకు దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విద్యుత్ వ్యయ చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం విద్యుత్ ఒప్పందాలు(పీపీఏ)కు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తోంది. దానికి బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ ఖర్చు డిస్కంలు భరిస్తున్నాయి. అదే బహిరంగ మార్కెట్లో రోజు వారీ లోటు విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపు చేయాలి. దానికి డిస్కంల వద్ద తగినంత నగదు లేక పోవడం వల్ల బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకోవలసివస్తోంది. ఆ రుణాలపై వడ్డీలు కట్టవలసిన బాధ్యత కూడా డిస్కంలపై ఉంది. ఆ స్వల్పకాలిక రుణాలపై అయ్యే వడ్డీ మాత్రమే సంస్థ వార్షిక ఆదాయ వ్యయ (ఏఆర్ఆర్) నివేదికలో పొందుపరచాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఏపీఈపీడీసీఎల్ కోరింది. అంతేకానీ ఈనాడు చెప్పినట్లు గత నాలుగేళ్లలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చేసిన ఖర్చుపై వడ్డీ లెక్కించి, ఆ మొత్తాన్ని ప్రతి నెలా విద్యుత్ బిల్లుతో కలిపి వసూలు చేయడానికి కాదు. ఏపీఈఆర్సీకి చెప్పాల్సిందే విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణకు సహేతుకంగా అయ్యే ఖర్చు మొత్తం నిబంధనల ప్రకారం ఈఆర్సీకి నివేదించాల్సిందే. వాటిపై కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వాడుకుంటున్నందుకు వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అప్పులపై వడ్డీ, వీలింగ్ చార్జీలు వర్కింగ్ కేపిటల్ పరిధిలోకి వస్తాయి. అందువల్ల వీటిని కూడా వాస్తవ ఆదాయ వ్యయాల పద్దులో చేర్చాలని నివేదికలో డిస్కం పొందుపరిచింది. ప్రభుత్వం సక్రమంగానే ఇస్తోంది వివిధ సంక్షేమ పథకాలకు, వ్యవసాయ వినియోగానికి ప్రభుత్వం నుంచి డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ ప్రతినెల సకాలంలోనే వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిలకు ప్రతినెల సర్ చార్జీలు విధిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సరిపోవటం లేదనే వాదన వాస్తవం కాదు. అంతే కాకుండా విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేసే సెక్యూరిటీ డిపాజిట్‌పై ప్రతి ఏటా మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రేట్ల ప్రకారం వడ్డీ మొత్తాన్ని వినియోగదారులకు డిస్కంలు చెల్లిస్తున్నాయి. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బు విద్యుత్తు కొనుగోలు అవసరాలకు సరిపోదు. -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్‌తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్‌షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది. కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్‌కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. -
భారత్‌ను గెలిపించడానికి ప్రపంచం ఏకమవుతోంది - సంజీవ్ మెహతా
ముంబై: గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అనేక బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీ) భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ సీఈవో సంజీవ్ మెహతా తెలిపారు. భారత్‌ను గెలిపించడానికి యావత్ప్రపంచం ఏకమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మెహతా ఈ విషయాలు చెప్పారు. వలస పాలన కారణంగా భారత్ తొలి రెండు పారిశ్రామిక విప్లవాల్లో పాలుపంచుకోలేకపోయిందని తెలిపారు. మూడో పారిశ్రామిక విప్లవ సమయంలో భారత్ ఆర్థికంగా బలహీనంగా ఉందన్నారు. తాజాగా నాలుగో పారిశ్రామిక విప్లవం .. భారత వృద్ధి, పురోగతికి దోహదకారిగా నిలవగలదని మెహతా చెప్పారు. మరోవైపు, హెచ్‌యూఎల్ నిర్వహణ మార్జిన్లు ఎంతో మెరుగ్గా ఉంటాయని, 75 బిలియన్ డాలర్ల పైచిలుకు వేల్యుయేషన్‌తో కోల్గేట్ పామోలివ్, రెకిట్ బెన్కిసర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల కన్నా విలువైన కంపెనీగా ఉందని పేర్కొన్నారు. -
పొదుపు సంఘాల రుణాల వడ్డీ తగ్గింపునకు కెనరా బ్యాంకు ఒకే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ తగ్గించగా, ఇప్పుడు కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలిపే ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌కు అందజేశారు. ఇటీవలే ఎస్బీఐ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.15 శాతానికి బదులు 9.70 శాతం చేసింది. కెనారా బ్యాంకు కూడా ‘ఎ’ కేటగిరీలో ఉండే పొదుపు సంఘాలకు రూ. 5 లక్షల పైబడి రుణాలపై 9.70 శాతం వడ్డీనే వసూలు చేస్తామని తెలిపింది. దీంతో పాటు రుణాలపై ఎలాంటి అదనపు, ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యువల్ చార్జీలను పూర్తిగా మినహాయించింది. బుధవారం సెర్ప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్ బ్యాంకు లింకేజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.కేశవకుమార్, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ ఐ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే
సాక్షి, అమరావతి : అవును.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతే. ‘ఈనాడు’ తనకు నచ్చలేదని ‘పచ్చ’వాతం జబ్బుతో తప్పుడు రాతలు రాస్తే కాకుండాపోతారా! డ్వాక్రా (పొదుపు సంఘాల) మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక పైసా విదల్చకుండా రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఎవ్వరూ పైసా కట్టొద్దంటూ 2014 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మహిళలు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మోసానికి బలైన పేదింటి మహిళలు వారు తీసుకున్న రుణాలపై ఐదేళ్ల పాటు వడ్డీలపై వడ్డీలు కట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ. 25,571 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. ఇంకొకటి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రూ. 4,969.05 కోట్లు వడ్డీని చెల్లించి, అక్కచెల్లెమ్మలపై భారాన్ని తగ్గించారు సీఎం వైఎస్ జగన్. అడుగడుగునా వంచించిన చంద్రబాబును మహిళా వ్యతిరేకిగా, అన్ని విధాలుగా ఆదుకొంటున్న సీఎం వైఎస్ జగన్ సర్కారును మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పేద మహిళలు ఎందుకు భావించకుండా ఉంటారు? డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పి, అక్కచెల్లెమ్మలను మోసం చేసిన వైనాన్ని ఏ రోజూ ప్రశ్నించలేని ‘ఈనాడు’ పత్రిక.., ఇప్పుడు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఈనాడు ఆరోపణ: డ్వాక్రా సున్నా వడ్డీ కోత. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల రుణం వరకు వర్తింపు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలకు కుదింపు. వాస్తవం: సున్నా వడ్డీ పథకానికి గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడేసింది. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. మొత్తం ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు చివరి మూడేళ్లు పథకాన్ని చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన పథకానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కోత పెట్టిందని రాయడం ‘ఈనాడు’ ప్రజలను వంచించడమే. ఆరోపణ: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రుణ పరిమితిని తగ్గించింది వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సి, డి గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఎ, బి‘ గ్రేడ్ లోకి చేరాయి. మరోవైపు గత నాలుగేళ్లుగా ఏటా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆరోపణ: సున్నా వడ్డీ పథకంలోనూ కేంద్రం వాటా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. వాస్తవం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు సంవత్స రాలలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలు బ్యాంకులకు కట్టవ లసిన వడ్డీని వారి తరపున ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969.05 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. రాష్ట్రంలోని పేద మహిళలపై ఒక్క పైసా భారం వేయలేదు. ఆరోపణ: గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం మహిళాపక్షపాతమా? వాస్తవం: గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీకి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పులు మొత్తం సుమారు రూ. 25,571 కోట్లు. ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఆయా మహిళలందరికీ చెల్లించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ పథకం అమలు చేస్తోంది. అంటే, చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తానన్న రూ. 14 వేల కోట్ల అప్పులు, ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. ఈ మొత్తం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పేద మహిళలను మోసం చేసి ఎగ్గొట్టిందే. ఇందులో డ్వాక్రా మహిళల రుణ మొత్తాలతో పాటు ఆ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ రూపంలో పెరిగిన అదనపు భారం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. అలాంటప్పుడు.. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న ఆరోపణే అబద్ధం. అయినా, రూ.2100 కోట్లు బకాయిలు ఎగవేత అని ప్రచురించడం లో ‘ఈనాడు’కున్న ‘పచ్చ’వాతం జబ్బును తెలియజేస్తోంది. -
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్‌పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. గత నాలుగేళ్లుగా మన విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్ కార్యాదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడిబయటి పిల్లలను ట్రాక్ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఇక్కడి అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షలమంది విద్యార్థులు, మూడులక్షలకు పైగా ఉపాధ్యాయులను నూరుశాతం పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్) ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు. యాప్స్ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్యను లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్ అమలును తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపించారు. సిమ్స్, యాప్స్ పనితీరును వివరించిన అధికారులు విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్), దానికి అనుసంధానంగా కీలక విభాగాలకు మొబైల్ యాప్స్ రూపకల్పన ద్వారా విద్యార్థి ట్రాకింగ్‌ను ఏపీ సమగ్ర శిక్ష అధికారులు తెలంగాణ అధికారుల బృందానికి వివరించారు. ఇందులో ప్రధానంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ విభాగంలో పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, చేస్తున్న మార్పులను నమోదు చేస్తారు. టీచర్స్ ప్రొఫైల్‌లో వారి హాజరు, ఎన్వోసీ, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవులు, గ్రీవెన్స్ వంటివి, విద్యార్థుల విభాగంలో ఆధార్ నంబరు ఆధారంగా విద్యార్థి పాఠశాలలో ఉన్నారా, బడిబయట ఉన్నారా అని ట్రాకింగ్ చేసి, గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించి వారిని తిరిగి బడిలో చేరుస్తున్నారు. ఇలా గత విద్యాసంవత్సరంలో సుమారు లక్షమంది పిల్లలను తిరిగి బడిలో చేర్చారు. ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే వేగవంతమైన విజయాలు నమోదు చేయడాన్ని తెలంగాణ అధికారులు అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలోను అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి: నాడు–నేడు’ పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు వారి రాష్ట్రంలో ‘మన ఊరు–మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. -
TSRTC: సీసీఎస్ నిధులు వాడుకుని.. వడ్డీకి ఎసరు పెట్టిన ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది. అంత మేర నష్టపోవాల్సిందేనా.. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం.. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ కార్మికులను బలిపశువులను చేయటమే ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే. – వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
పీఎఫ్ వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయి? ఈపీఎఫ్ఓ ఏం చెప్పింది?
వేతన జీవులు డబ్బులు పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (PF)లో డిపాజిట్ల వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సును ప్రభుత్వం జులై 24న ఆమోదించింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మంది సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం ఎప్పుడు జమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఓ చందాదారు 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన వడ్డీ ఎప్పుడు జమవుతుందని అడిగారు. దీనికి ఈపీఎఫ్ఓ స్పందిస్తూ, ప్రాసెస్ జరుగుతోందని, అతి త్వరలో వడ్డీ సొమ్ము జమవుతుందని బదులిచ్చింది. వడ్డీ సొమ్ము ఎప్పుడు జమయినా మొత్తం జమవుతుందని, కాస్త ఓపిక పట్టాలని కోరింది. EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం సాధారణంగా పీఎఫ్ వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇలా జమయిన వడ్డీ.. తర్వాత నెల బ్యాలెన్స్‌కి యాడ్ అవుతుంది. ఆ మొత్తం అంతటికీ మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. వడ్డీ మొత్తం జమయిన తర్వాత పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్లు లేదా ఉమంగ్ యాప్‌తో సహా వివిధ మోడ్ల ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. EPFO Provides dedicated portal for the members of EPF For more details please click on the below link 👇https://t.co/Y6MCy1V8rx#epf #ईपीएफ #पीएफ #epfowithyou #AmritMahotsav #HumHaiNa #epfo@PMO @byadavbjp @Rameswar_Teli @MIB_India @LabourMinistry @PIB_India @AmritMahotsav — EPFO (@socialepfo) August 4, 2023 -
రిటైర్మెంట్ తరువాత పీఎఫ్ వడ్డీ ఎన్ని సంవత్సరాలు జమవుతుంది?
నా వయసు 59 ఏళ్లు. నేను పదవీ విరమణ తీసుకున్నప్పటికీ, నా పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోలేదు. అయినప్పటికీ నా పీఎఫ్ బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుందా? – నానీ పార్థీ పదవీ విరమణ అనంతరం, పీఎఫ్ ఖాతాకు వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి చందాలు జమ అవ్వకపోతే, అప్పుడు ఆ ఖాతా ఇన్ఆపరేటివ్గా మారిపోతుంది. అక్కడి నుంచి ఇక వడ్డీ జమ అవ్వడం కూడా నిలిచిపోతుంది. అంటే పదవీ విరమరణ తర్వాత మూడేళ్ల పాటే వడ్డీ జమ అవుతుంది. పదవీ విరమణ అనంతరం భవిష్యనిధి ఖాతాలోని బ్యాలన్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు. ఐదేళ్లు సర్వీసు నిండిన తర్వాత ఉపసంహరించుకునే పీఎఫ్ బ్యాలన్స్ మొత్తంపై పన్ను ఉండకపోవడం అదనపు ప్రయోజనం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోకపోతే, జమయ్యే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. కనుక పీఎఫ్ బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుని, మీ లక్ష్యాలు, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఏదైనా ఒక కంపెనీ షేరు ముఖ విలువ రూపాయి ఉంటే దాన్ని ఎలా విభజిస్తారు? వారి ముందున్న ఆప్షన్లు ఏంటి? – అరుణ్ పాలస్ మన దేశంలో ఒక షేరు కనిష్ట ముఖ విలువ రూ.1గా ఉంది. దీని ప్రకారం ఒక షేరు ముఖ విలువ రూపాయిగా ఉంటే, దాన్ని విభజించడానికి అవకాశం ఉండదు. ఒక కంపెనీ ముఖ విలువను విభజించడం వెనుక ఉద్దేశ్యం ఆయా కంపెనీ షేర్ల లిక్విడిటీని (అందుబాటు) పెంచడమే. షేరు ధరను విభజించడం వల్ల మూలధనంలో ఎలాంటి మార్పు ఉండదు. కనుక ఒక ఇన్వెస్టర్‌గా ముఖ విలువను విభజించే విషయంలో పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే, నష్టపోయేదీ ఉండదు. ఉదాహరణకు ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీ షేరు మార్కెట్ ధర రూ.100 ఉందనుకుందాం. మార్కెట్లో 50,000 వేల షేర్లు ఉన్నాయి. మిస్టర్ ఏ రూ.5,000 పెట్టి ఈ కంపెనీలో 50 షేర్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కంపెనీ 5:1 స్టాక్ స్లి్పట్ను ప్రకటించింది. అంటే ప్రతి ఒక్క షేరు ఐదు షేర్లుగా విభజించనున్నారు. విభజన తర్వాత మిస్టర్ ఏ వద్దనున్న 50 షేర్ల స్థానంలో 250 షేర్లు జమ అవుతాయి. అప్పటి వరకు రూ.10గా ఉన్న ముఖ విలువ రూ.2గా మారుతుంది. (ఇదీ చదవండి: 7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?) విభజన తర్వాత షేరు మార్కెట్ ధర కూడా రూ.100 నుంచి రూ.20కు సవరణ అవుతుంది. 250 షేర్లు, రూ.20 చొప్పున వాటి మొత్తం మార్కెట్ విలువలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒక కంపెనీ షేరు ముఖ విలువను విభజిస్తుందా, లేదా? అన్నది ముఖ్యం కాదు. స్టాక్ ముఖ విలువ విభజన అంచనా ఆధారంగా పెట్టుబడులు పెట్టకూడదు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తగినంత సమయం, కృషి అవసరం. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు వ్యాపార నమూనా, ఆర్థిక మూలాలు, యాజమాన్యం సమర్థత, కార్యకలాపాలను నైతికంగా నిర్వహిస్తున్నారా? వృద్ధి అవకాశాలు, వ్యాల్యూషన్ సహేతుక స్థాయిలోనే ఉందా? పోటీ కంపెనీలతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించగలదా? తదితర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం సూచనీయం. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రామోజీ రాసిందే రశీదు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ సంస్థలో చిట్టీపాట పాడిన చందాదారులకు ఆ చిట్టీ మొత్తాన్ని చెల్లించకుండా కొంత మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఈమేరకు ఓ రశీదు ఇస్తోంది. ఆ చిట్టీకి సంబంధించి మిగిలిన చందాల చెల్లింపునకు ష్యూరిటీగా ఆ మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్‌గా ఉంచుతున్నట్లు చెబుతోంది! అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజి ట్లను సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4–5 శాతం వడ్డీ చెల్లిస్తామంటోంది. కొన్ని దశాబ్దాలుగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అక్రమాల దందా ఇదీ! చందాదారులు మునుముందు చెల్లించాల్సిన చందా మొత్తానికి ష్యూరిటీగా ఆ నగదును అట్టి పెట్టుకుంటున్నట్లు మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున రామోజీరావు తమ పత్రికలో ఈనాడు అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఆర్థిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఉల్లంఘిస్తున్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాటవేస్తున్నారు. అవి అక్రమ డిపాజిట్లే... ఏదైనా ఓ ఆర్థిక సంస్థ తమ ఖాతాదారుల నగదును తమ వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే వాటిని డిపాజిట్లుగానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలను అనుసరించాలి. ఆ నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి మాత్రం చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లను సేకరిస్తోంది. ష్యూరిటీగా నగదు డిపాజిట్లు తీసుకోకూడదు చిట్‌ఫండ్స్ సంస్థలు తమ వద్ద చిట్టీ పాడిన చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకునేందుకు కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం అనుమతిస్తోంది. ఈమేరకు నిర్దిష్ట విధానాలను కూడా స్పష్టం చేసింది. జాతీయ / షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు, ముగ్గురు వ్యక్తుల హామీని ష్యూరిటీగా పరిగణించేందుకు అవకాశం ఉంది. అంతేగానీ చిట్టీ పాట కింద తాము చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత మొత్తాన్ని ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి వీలులేదు. అలా కొంత మొత్తాన్ని చిట్‌ఫండ్ సంస్థలు తమ వద్ద ఉంచుకుంటే దాన్ని డిపాజిట్ల సేకరణగానే పరిగణిస్తారు. చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లను సేకరించడం చట్ట విరుద్ధం కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే అవుతాయి. నల్లధనం దందానే...! ష్యూరిటీ పేరుతో సేకరిస్తున్న డిపాజిట్లకు జారీ చేస్తున్న రశీదులో కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. వాటిపై చందాదా రుడి పాన్ నంబరు పొందుపరచడం లేదు. చందాదారుల పాస్ పుస్తకంలో వారి బ్యాంకు ఖాతా వివరాలుగానీ ఆధార్ నంబరుగానీ ఉండటం లే దు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సదరు వ్యక్తుల పాన్ కార్డ్, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రశీదు రూపంలో అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చెలామణిలోకి తెస్తున్న ట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ(ఈడీ)కి నివేదించారు. నా డిపాజిట్లు.. నా వడ్డీ! దేశంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు తమ ఖాతాదారులకు చెల్లించాల్సిన వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్బీఐ నిర్దిష్ట విధానాలను రూపొందించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ మాత్రం రశీదు రూపంలో తమ చందాదారుల నుంచి వసూలు చేస్తున్న అక్రమ డిపాజిట్లకు వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తోందో ఆ రహస్యం రామోజీకే తెలియాలి! 6 నెలల నుంచి 12 నెలల వరకైతే 4 శాతం, ఏడాది పైబడితే 5 శాతం వడ్డీ చెల్లిస్తామని రశీదులో మార్గదర్శి పేర్కొంటోంది. వడ్డీ రేటును ఏ ప్రాతిపదికన నిర్ణయించారని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తే సమాధానం లేదు. అక్రమ డిపాజిట్ల కట్టడికే బీయూడీఎస్ చట్టం దేశంలో వివిధ రూపాల్లో సాగుతున్న అక్రమ డిపాజిట్ల దందా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2019లో బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్డీఎస్) చట్టాన్ని తెచ్చింది. ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్స్ సంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తులు యథేచ్ఛగా వివిధ రూపాల్లో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నియంత్రణ లేని డిపాజిట్లపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా వాటిని నిషేధించేందుకు చట్టం చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వం 2022లో మార్గదర్శకాలను జారీ చేసింది. సీఐడీ విభాగం ఆ చట్టం ప్రకారమే మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో తమ బండారం బట్టబయలవుతోందని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ గగ్గోలు పెడుతోంది. రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లు ఓ చందాదారుడి నుంచి రూ.2.20 లక్షలు డిపాజిట్ రూపంలో తీసుకున్న నగదుకు ప్రతిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇచ్చిన రశీదు ఇదీ! భవిష్యత్ చందాలకు సెక్యూరిటీ పేరుతో ఇలా దశాబ్దాలుగా అక్రమంగా డిపాజిట్లను సేకరి స్తోంది. ఆర్బీఐ నిబంధనలను లెక్క చేయకుండా, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. – స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ,సీఐడీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
లోన్ యాప్‌లకు కళ్లెం..వేధింపుల కట్టడికి గూగుల్ చర్యలు
సాక్షి, అమరావతి : లోన్ యాప్ సంస్థల వేధింపులకు ఎట్టకేలకు కళ్లెం పడనుంది. భారీ వడ్డీలతో బెంబేలెత్తిస్తూ, రుణ గ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించే లోన్ యాప్ సంస్థల కట్టడికి గూగుల్ సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త విధానం మే 31 నుంచి అమలులోకి రానుంది. ఫొటోలు, వీడియోల మార్ఫింగులతో వేధింపులు చైనా కేంద్రంగా పనిచేస్తున్న లోన్ యాప్ సంస్థలు అత్యధిక వడ్డీలు, పారదర్శకతలేని విధానాలతో రుణ గ్రహీతలను వేధిస్తున్నాయి. ఎంతగా వాయిదాలు చెల్లిస్తున్నా వడ్డీ, అసలు కలిపి అప్పు కొండలా పెరుగుతుందే తప్ప తగ్గదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేస్తే రుణ గ్రహీతల మొబైల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బంధువులు, మిత్రులకు వాట్సాప్ చేస్తూ వేధిస్తున్నాయి. ఈ అవమాన భారంతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్ నిర్వాహకులకు అందుబాటులోకి తేవాలి. ఈమేరకు యాక్సెస్‌కు అనుమతిస్తేనే లోన్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. రుణం కావాలన్న ఆతృతలో వ్యక్తులు యాక్సెస్‌కు అనుమతిస్తున్నారు. దీన్నే ఆ సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం, ఆర్థిక శాఖలు లోన్‌యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించాయి. మనీలాండరింగ్‌కు, ఆర్థి క మోసాలకు పాల్పడుతున్న పలు లోన్ యాప్ కంపెనీలపై కేసులు పెట్టాయి. 2022లో 2 వేల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ఇవ్వొద్దని గూగుల్‌కు ఆదేశం వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా చేయడమే దీనికి పరిష్కారమని కేంద్ర హోం శాఖ భావించింది. వ్యక్తిగత సమాచారం కోరే లోన్ యాప్‌లకు ప్లే స్టోర్‌లో అవకాశం ఇవ్వద్దని గూగుల్‌కు కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ యాప్ సంస్థలతో పాటు గూగుల్‌పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేలి్చచెప్పింది. దాంతో గూగుల్ దిగి వచ్చింది. వ్యక్తిగత సమాచారం లోన్‌యాప్‌లకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. లోన్ యాప్ కంపెనీలకు గూగుల్ మార్గదర్శకాలు భారత్‌లో వ్యాపారం చేసే లోన్ యాప్ సంస్థలకు గూగుల్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు యాప్‌ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని చెప్పింది. భారత్‌లో నాన్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను పాటించాలని, ఈమేరకు డిక్లరేషన్ ఇచ్చే యాప్ సంస్థలనే గూగుల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం లోన్ యాప్‌లను మాడిఫై చేసి ఈ ఏడాది మే 31లోగా అప్లోడ్ చేయాలని చెప్పింది. వాటినే ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో దేశంలో లోన్ యాప్‌ల వేధింపులకు కళ్లెం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఆరుశాతం వడ్డీ చెల్లించండి: హైకోర్టు
కోవిడ్ సమయంలో ఆపిన ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కాలం కొనసాగే వరకు 50 శాతం వేతనం, పింఛన్లలో కోత విధిస్తూ 2020, మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27ను తీసుకొచ్చింది. తర్వాత దీనిపై ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు. కోవిడ్ సమయంలో ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛన్లు కూడా ఆపారన్నారు. మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు.. మూడు నెలలపాటు 50 శాతం వేతనాలు, పింఛన్లు నిలిపేయడంతో వారు ఇబ్బందులు పడ్డారని నివేదించారు. మూడు నెలలు ఆపిన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేదని, వాటిని కూడా విడతల వారీగా చెల్లించారని చెప్పారు. ఈ మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు, పింఛన్లకు 6 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలు ముగించింది. 2020, మార్చిలో జీవో విడుదల చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెల వేతనాల్లో కోత విధించారు. వీటిని ఇదే సంవత్సరం నవంబర్, డిసెంబర్, 2021 జనవరి, ఫిబ్రవరిలో విడతలవారీగా చెల్లించారు. -
అధిక వడ్డీ తిరిగి ఇచ్చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా నెలరోజుల్లో చెల్లించాలని బ్యాంకర్లను ఆర్థిక, వైద్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. భారత రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌హెచ్‌జీల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, గృహ సంబంధ, వ్యవసాయ, అనుబంధ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు రుణాలు ఎక్కువగా ఇచ్చి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆయిల్ సాగుకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలన్నారు. కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ వసూలు... ఎస్‌హెచ్‌జీలు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తున్నా కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయని మంత్రి చెప్పారు. నిబంధనల ప్రకారం రూ.3లక్షల లోపు రుణాలకు 7శాతం, రూ. 3లక్షల నుంచి రూ.5లక్షల దాకా 10శాతం వడ్డీ రేటు అమలు చేయాలని సూచించారు. బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సె్పక్షన్, పోర్ట్ ఫోలియో వంటి సేవల పేరుతో రూ.500 నుంచి రూ.5000 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఎస్‌హెచ్‌జీల రుణాలకు బ్యాంకులు చార్జీలను వసూలు చేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. మొబిలైజేషన్, ఇతర సేవలను విలేజ్ ఆర్గనైజర్లు (వీవోలు) నిర్వహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల బ్యాంకర్లు వడ్డీల్లో కొంత భాగం వీవోలు, ఎంఎస్(మండల సమాఖ్య), జెడ్ఎస్ (జిల్లా సమాఖ్య)లకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డేబశిష్ మిత్రా, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ అమిత్ జింగ్రాన్, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల, ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ కెఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత దూషించి, దాడి చేశాడు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం) -
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్‌వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్‌కు వెళ్లాలి. ట్యాబ్‌లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్‌ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్‌బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్‌బుక్‌లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
ఐటీ రిఫండ్ చెక్ చేసుకున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి!
ఆదాయపు పన్ను శాఖ ఈ మధ్య అంటే.. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకూ రూ. 1.14 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్లు జారీ చేసింది. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారు మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. రిఫండ్ క్రెడిట్ అయి ఉంటుంది. క్రెడిట్ కాకపోతే వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోండి. అన్ని వివరాలు కరెక్టుగా ఉండి.. పన్నుకి సంబంధించిన వివరాలు ఫారం 26 అ ప్రకారం సరిగ్గా ఉంటే మీరు క్లెయిం చేసిన రిఫండు క్రెడిట్ అవుతుంది. ఎంత మొత్తం రిఫండు వస్తుంది.. మీరు దాఖలు చేసిన రిటర్నులోని అన్ని అంశాలు క్షుణ్నంగా చెక్ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే మీరు క్లెయిం చేసినదంతా వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసినట్లయితే, రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. మీరు క్లెయిం చేసిన మొత్తం కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆ ఎక్కువ మొత్తం వడ్డీ అనుకోండి. ఈ రెండింటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఫారం 26 అ లో ఈ మేరకు ఎంట్రీలు కనిపిస్తాయి. అప్పుడు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఫారం 26 అ డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీని మీ ఇన్‌కంట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. మీ సులువు కోసం .. సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఒక ఫైల్ నిర్వహించుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మీ రిఫండు.. మీ ఆదాయం కాదు. దాని మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. మీకు వచ్చిన ఈ రిఫండుని ప్రస్తుత సంవత్సరం రిటర్ను వేసినప్పుడు ‘మినహాయింపు ఆదాయం‘ కింద చూపెట్టుకోవచ్చు. లేదా అధికారులు అడిగినప్పుడు ఈ జమ మొత్తం .. ఆదాయం కాదు అని, రిఫండు వచ్చిందని రుజువులతో పాటు విశదీకరించాలి. అదనంగా వచ్చిన మొత్తం వడ్డీని మాత్రం ప్రస్తుత సంవత్సరంలో ఆదాయంగా, ఇతర ఆదాయాల కింద చూపించాలి. దీని మీద ఎటువంటి మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ.. పన్నుకి గురి అవుతుంది. ఈ వడ్డీ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి. రిఫండు తక్కువ రావచ్చు.. మీ రిఫండు క్లెయిం చేసినప్పటికీ పూర్తి మొత్తం రావచ్చు .. లేదా తగ్గవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల, అంకెల తప్పుల వల్ల, ట్యాక్స్ క్రెడిట్లు తప్పుగాా రావడం వల్ల మీ ఆదాయం పెరగవచ్చు .. మినహాయింపులు తగ్గనూ వచ్చు. ఆదాయంలో మార్పుల వల్ల, పన్నుల చెల్లింపులు తక్కువ కావడం వల్ల, రిఫండు తక్కువ రావచ్చు. ఇందులో తప్పులుంటే మీరు తెలియజేయవచ్చు. రాకపోనూ వచ్చు .. అవును. ఒక్కొక్కప్పుడు ఈ సంవత్సరం రిఫండును అసెస్ చేసి, ఆర్డర్ పాస్ చేసి.. గత సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం సర్దుబాటు చేసుకుంటున్నాం అని కూడా అంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆ మేరకు నిజమే అయితే ఊరుకోండి. కాకపోతే వివరణ ఇచ్చి, సవరించుకోండి. చివరిగా మీకు వచ్చిన రిఫండు అనేది ఆదాయం కాదని, అదనంగా వచ్చేది వడ్డీ అని, పన్నుకు గురవుతుందని గుర్తుపెట్టుకోండి. -
ఆరోగ్య బీమా పట్ల జీవిత బీమా కంపెనీల ఆసక్తి
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించేందుకు జీవిత బీమా కంపెనీలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి తిరిగి అనుమతించే అంశాన్ని బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సానుకూలంగా పరిశీలిస్తుండడం వాటిల్లో ఉత్సాహానికి కారణం. ఎల్ఐసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 2016లో ఐఆర్డీఏఐ నిషేధం విధించే వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించినవే. ఐఆర్డీఏఐ ఆదేశాలతో నాటి నుంచి ఇవి కేవలం ఫిక్స్డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్లకు పరిమితం అయ్యాయి. ఇండెమ్నిటీ (హాస్పిటల్లో చేరినప్పుడు చెల్లించేవి) పాలసీలను విక్రయించేందుకు అనుమతి లేదు. జీవిత బీమా కంపెనీలను తిరిగి హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి అనుమతించడానికి ఇది సరైన తరుణమని, లాభ, నష్టాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవలే ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా సంకేతం ఇవ్వడం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో తిరిగి ఆశావహ పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవాలి. 2030 నాటి కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను చేరువ చేయాలన్న లక్ష్యంతో మరిన్ని సంస్థలను ఈ విభాగంలోకి అనుమతించాలన్నది ఐఆర్డీఏఐ యోచనగా ఉంది. సిద్ధంగా ఉన్నాం.. హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు ఎల్ఐసీ పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారానికి హెల్త్ ఇన్సూరెన్స్ సమన్వయంగా ఉంటుందని తెలిపింది. ‘‘మేము ఇప్పటికే దీర్ఘకాల ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను, గ్యారంటీడ్ హెల్త్ ప్లాన్లను విక్రయిస్తున్నాం. ఐఆర్డీఏఐ చేసిన సూచనను పరిశీస్తున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ ఎంటీ కుమార్ తెలిపారు. అచ్చమైన హెల్త్ ప్లాన్ల విక్రయం తమకు కష్టమేమీ కాదని, ఇప్పటికే తాము కొన్ని రకాల హెల్త్ ప్లాన్లను (ఫిక్స్డ్ బెనిఫిట్) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు 24.50 లక్షల మంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు 3.60 లక్షలకు మించి లేరు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలను సైతం హెల్త్ ఇన్సూరెన్స్‌కు అనుమతిస్తే అప్పుడు భారీగా ఏజెంట్లు ఆయా ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేయగలరన్న అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలను ఒకే సంస్థ మార్కెట్ చేసుకునే విధానం ఉందని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇప్పటికీ 2.63 లక్షల మంది కస్టమర్లకు ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్కవరేజీని అందిస్తోంది. 2016లో నిషేధం తర్వాత మిగిలిన కస్టమర్లు పోర్ట్ పెట్టుకుని వెళ్లిపోగా, వీరు ఇంకా మిగిలే ఉన్నారు. అలాగే, హెచ్డీఎఫ్సీ లైఫ్ వద్ద కూడా ఇలాంటి కస్టమర్లు కొందరు మిగిలే ఉన్నారు. అందుకనే ఈ సంస్థలు మళ్లీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సైతం తాము హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించింది. తమకు ఈ విభాగంలో ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పింది. -
ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. మారిన రూల్స్ ఇవే!
Provident Fund Tax Rules: బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నిబంధనలల్లో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు ప్రకారం.. ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి పన్ను విధించేవి, మరొకటి పన్ను మినహాయింపు ఖాతాలు అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. గడిచిన నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. అయితే ఈ నిర్ణయం మాత్రం ఈపీఎఫ్ఓ చందాదారులకు షాక్ అనే చెప్పాలి. ఈపీఎఫ్ఓ చందాదారులు ఇవి తప్పక తెలుసుకోవాలి..! ►పీఎఫ్ FY 2021-22కి గాను వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. చివరి సారిగా 1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు చేరింది. ►ఈపీఎఫ్ఓ చందాదారుల వాటా.. వార్షికంగా రూ.2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ►ఉద్యోగులు వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే.. వారిపై పన్ను భారం ఉండదు. ►ఒక యజమాని ఉద్యోగి ఈపీఎఫ్‌కి నగదు జమ చేయకపోతే (contribution threshold) కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ ₹ 5 లక్షలకు పెంచనున్నారు. ►కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ పెంచిన అనంతరం.. అదనంగా పెంచిన నగదుపై మాత్రమే పన్ను విధిస్తారు, మొత్తానికి కాదు. ►ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే నగదు, దానిపై వచ్చే వడ్డీ ఈపీఎఫ్‌లో ప్రత్యేక అకౌంట్లో నిర్వహించనున్నారు. ►యజమానులు(Accruals) అక్రూవల్స్ ఆధారంగా పన్నులను నిలిపివేస్తారు కాబట్టి, ఈ వివరాలను తప్పనిసరిగా ఫారమ్ 16, ఫారమ్ 12BAలో నింపాలి. ►నెలవారీ ఆదాయం ₹ 15,000 వరకు ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో యజమానులు తప్పనిసరిగా ఈపీఎఫ్ నగదు జమ చేయాల్సి ఉంటుంది. చదవండి: విమానయాన సంస్థలకు భారీ ఊరట -
5జీ వేలంపై టెల్కోల్లో ఆసక్తి
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఉపయోగపడే 5జీ స్పెక్ట్రంపై టెలికం సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, వేలంలో ఉత్సాహంగా పాల్గొంటాయని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. 5జీ సర్వీసులతో దేశం ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. స్పెక్ట్రం బేస్ ధరను గణనీయంగా తగ్గించడంతో పాటు, యూసేజీ చార్జీలనూ ఎత్తివేయడంతో టెల్కోలపై ఆర్థిక భారం చాలా మటుకు తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఇక టెక్ కంపెనీలు సొంతంగా క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కేటాయించే విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెలికం శాఖ జూలై 26న స్పెక్ట్రం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనుంది. దీనికి సంబంధించి జూన్ 20న ప్రీ–బిడ్ కాన్ఫరెన్స్‌ను టెలికం శాఖ నిర్వహించనుంది. -
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఇంకా కొన్ని రోజులే ఛాన్స్..! లేకపోతే..!
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఏప్రిల్ 1, 2022 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీని నగదు రూపంలో చెల్లించడాన్ని నిలిపివేస్తాయని పోస్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటికి అందించే వడ్డీలను ఖాతాదారుడి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే వడ్డీ జమ చేయబడుతుందని పోస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఖాతాదారుడు పొదుపు ఖాతాను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ , టర్మ్ డిపాజిట్ ఖాతాల ఖాతాలతో లింక్ చేయలేకపోతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసులు అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటి పథకాలు ఎక్కువగా ఆదరణను పొందాయి. ఈ పథకాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా ఖాతాదారులు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతాకు మాత్రమే జమ చేస్తామని పోస్టల్ శాఖ ప్రకటించింది. సదరు స్కీమ్‌కు సంబంధించిన వడ్డీ నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, లేదా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాలను పోస్టాఫీసు పొదుపు ఖాతా, బ్యాంక్ అకౌంట్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ తేదీలోపు అనుసంధానించకపోతే వడ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ అకౌంట్‌కు బదిలీ చేయనుంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని పోస్టల్ శాఖ. స్పష్టం చేసింది. చదవండి: ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా -
రెలిగేర్ ఫిన్వెస్ట్ చెల్లింపుల డిఫాల్ట్
న్యూఢిల్లీ: గతంలో జారీ చేసిన మార్పిడి రహిత బాండ్ల (ఎన్సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) విఫలమైంది. కంపెనీ బాండ్లు కలిగినవారికి ఈ నెల 25న చెల్లించవలసి ఉన్న రూ. 96 లక్షల వడ్డీ చెల్లిం పుల్లో డిఫాల్ట్ అయినట్లు కంపెనీ తాజాగా వెల్ల డించింది. మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్(ఆర్ఈఎల్) గత ప్రమోటర్లు కంపెనీ నిధులను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేయడంతో ఆస్తి, అప్పుల సమన్వయంలో తేడాలొచ్చినట్లు వివరించింది. దీంతో తాజా సమస్య తలెత్తినట్లు ఆర్ఈఎల్ అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ పేర్కొంది. కాగా.. ఈ సమస్యల నేపథ్యంలోనే ఆర్ఎఫ్ఎల్ను 2018 జనవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ)లోకి తీసుకువచ్చింది. -
వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్బీఐ?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆరుగురు సభ్యుల కమిటీ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ కీలక నిర్ణయాలు బుధవారం (8వ తేదీ) వెలువడతాయి. అయితే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని (2–6 శ్రేణిలో) అదుపులో ఉంచుతూ, బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) యథాతథ పరిస్థితికే ఆర్బీఐ మొగ్గు చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పర్యవసానాలు ఈ అంచనాలకు తాజా కారణం. యథాతథ రెపో రేటు విధానం కొనసాగిస్తే, ఈ తరహా నిర్ణయం వరుసగా ఇది తొమ్మిదవసారి అవుతుంది. 2019లో రెపో రేటును ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్ పాయింట్లు 1%). 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పార్లమెంటులో ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెడుతుండడం తాజా సమావేశాల మరో కీలక నేపథ్యం కావడం గమనార్హం. అంచనాలు ఇవీ... రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. ఇదే జరిగితే సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో ఆర్బీఐ అంచనాలను (7.9 శాతం) మించి 8.4 శాతం వృద్ధిని ఎకానమీ నమోదుచేసుకుంది. వెరసి 2021–22 తొలి ఆరు నెలల్లో 13.7 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. చదవండి : ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే.. -
Jagananna Thodu: లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం జగన్
-
Jagananna Thodu: లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: 'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేయనున్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన (సెప్టెంబర్ 30లోగా) 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.10వేల వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభించునుంది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. చదవండి: (‘కోవిడ్’ కారుణ్య నియామకాలు) -
ఈ సేవ్సింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్‌కి ఆసరా
కేంద్రం అమలు చేస్తోన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. మలి దశలో అండగా నిలుస్తోంది. అతి తక్కువ మొత్తంతో ఈ స్కీములో చేరడమే కాకుండా ఎప్పుడైనా సరే డిపాజిట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉండటంతో గత ఐదేళ్లుగా ఈ స్కీమ్‌లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వడ్డీ ఎక్కువ సాధారణ సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోల్చితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఈ పథకంలో జమ చేసే సొమ్ముకు 7.40 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం. మినహాయింపులు ఐదేళ్ల కాల పరిమితికి సీనియర్ సిటిజన్ పథకంలో పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1.5 శాతం మినహాయించుకుని చెల్లింపులు చేస్తారు. రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1 శాతం మినహాయించుకుంటారు. మరిన్ని వివరాలు - సీనియర్ సిటీజన్స్ సేవింగ్స్‌లో డిపాజిట్ చేయాలంటే 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ముందస్తుగా వీఆర్ఎస్ పెట్టుకుని 55 ఏళ్లు నిండిన వారూ ఈ పథకానికి అర్హులే. - కనీస మొత్తం రూ. 1000 కాగా గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది - ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు - ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపు - ఈ పథకంలో సేవ్ చేసిన వారు గరిష్టంగా 1.5 లక్షల రూపాలయను పన్ను మినహాయింపు పొందవచ్చు. - పోస్టాఫీసు, బ్యాంకులలో ఈ సేవింగ్స్ పథకం అందుబాటులో ఉంది - ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు పెరుగుతున్న ఆదరణ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవడం, స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ కావడంతో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకానికి ఆదరణ పెరుగుతోంది. వాస్తవానికి 2018 వరకు ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండేంది. ప్రస్తుతం తగ్గించి 7.4 శాతానికే పరిమితం చేశారు. ఐనప్పటికీ ఈ పథకాన్ని సీనియర్స్ ఆదరిస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇందులో డిపాజిట్లు రూ. 24,754 కోట్లు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.73,051 కోట్లకు చేరుకుంది. చదవండి : gratuity amount: ఆ 9 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు? -
ఏపీ: అన్నదాతలకు అక్టోబర్‌లో సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఖరీఫ్–2019 సీజన్లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019–20 సీజన్లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అలాగే టీడీపీ హయాంలో 42.32 లక్షల మందికి బకాయిపడిన రూ.784.72 కోట్లను కూడా చెల్లించింది. ఇప్పుడు ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు వచ్చే అక్టోబర్‌లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్లో 86.17 లక్షల మంది రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. నిబంధనల ప్రకారం.. పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయించుకుని ఉండాలి. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం తెస్తున్నారు. అలాగే వారు సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్‌ఎస్‌వీపీఆర్ పోర్టల్‌లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్లోడ్ చేసేలా పర్యవేక్షించనున్నారు. సకాలంలో చెల్లించి రాయితీ పొందండి.. ఖరీఫ్–2020 సీజన్లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్ నెలాఖరులోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ
ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అతి త్వరలో సుమారు ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వడ్డీని క్రెడిట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ఖాతాదారుడు ట్విటర్ లో అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ఇలా ట్వీట్ చేసింది.. "ఈ ప్రక్రియ పైప్ లైన్ లో ఉంది. అతి త్వరలో మీ ఖాతాలో చూపించవచ్చు. ఇప్పటి వరకు పొగుచేసిన వడ్డీ పూర్తిగా క్రెడిట్ చేయబడుతుంది. వడ్డీలో ఎటువంటి నష్టం ఉండదు. దయచేసి సహనాన్ని పాటించండి" అని పేర్కొంది. ఇప్పటివరకు తెలిసిన నివేదికల ప్రకారం.. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ ఈ నెలాఖరునాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని క్రెడిట్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ ఇంకా పైప్ లైన్ లో ఉంది. ఈపిఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వారి ఖాతాలో ఏదో ఒక రోజు ఈ నెలలో క్రెడిట్ చేసే అవకాశం ఉంది. చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience. — EPFO (@socialepfo) July 28, 2021 ఆన్లైన్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే
ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంటస్ట్ర్ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్ ను చెల్లిస్తున్నట్లు 'బ్యాంక్ బజార్' తన డేటాలో వెల్లడించింది. . ఇప్పుడు మనం ఎఫ్డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్స్ కోసం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయల మొత్తం మూడు సంవత్సరాలలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ.1,000. డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీని అందిస్తాయి. రూ .1 లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ. 10,000. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. ఆర్బిఎల్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. -
‘ఓయో’లో వాటాలపై మైక్రోసాఫ్ట్ ఆసక్తి
న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల్లోని భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఓయో’లో వాటాలు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపిస్తోందని సమాచారం. 9 బిలియన్ డాలర్ల విలువ ఆధారంగా (రూ.67,000 కోట్లు) వాటాల కొనుగోలుపై చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు ఒప్పంద పరిమాణం గురించి వివరాలను బయటపెట్టలేదు. ఓయో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రావడానికి ముందుగానే మైక్రోసాఫ్ట్ వాటాలను కొనుగోలు చేయడం పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఈ విషయమై మైక్రోసాఫ్ట్, ఓయో అధికారికంగా స్పందించలేదు. ఓయో ఈ నెల మొదట్లోనే 660 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,920 కోట్లు) నిధులను టర్మ్ లోన్ బి (టీఎల్‌బీ/రుణం) రూపంలో అంతర్జాతీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. దీనికి ఇన్స్టిట్యూషన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. బిలియన్ డాలర్ల వరకు రుణాలను సమకూర్చేందుకు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఓయోలో ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్, విజన్ ఫండ్, సీక్వోయా క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్స్, హీరో ఎంటర్ప్రైజ్ తదితర సంస్థలకు వాటాలున్నాయి. -
ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన మరికొద్ది క్షణాల్లో వెలువడనుంది. కాగా కరోనామహమ్మారి నేపథ్యంలో పీఎఫ్ వడ్డీరేటును తగ్గనుందనే అంచనాలు వెలువడ్డాయి. 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉండగా, గత ఏడాది 8.5 శాతం వద్ద 7 సంవత్సరాల కనిష్టానికి చేరింది. తాజాగా దాదాపు దశాబ్దం కనిష్టానికి చేరింది. -
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం న్యూ ఇయర్ కానుక అందించింది. సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. 2019-20 ఏడాదికిగాను వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ గురువారం వెల్లడించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కాగా ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా ఈ వడ్డీ రేటును విభజించి రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్‌లో ప్రకటించింది. మొదటి విడతగా 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్ బాలెన్స్‌ను ఎస్ఎంఎస్, ఆన్లైన్, మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. I am happy to inform you that a notification has been issued & for year 2019-2020, our over 6 crore subscribers will receive 8.5 percent interest on PF amount. We have made such arrangements that you'll start receiving these benefits from today: Union Minister Santosh Gangwar https://t.co/gmQ5WAzLXf— ANI (@ANI) December 31, 2020 -
ఈ నెల్లోనే ఈపీఎఫ్ వడ్డీ జమ!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఆరు కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ 8.5 శాతాన్ని డిసెంబర్ నెలాఖరులోపు జమ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశంలో 8.5 శాతాన్ని రెండు భాగాలుగా చేసి.. తొలుత 8.15 శాతం, తర్వాత డిసెంబర్ చివరిలోపు 0.35 శాతం చొప్పున జమ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలోనే 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు ఆర్థిక శాఖా సమ్మతి కోరుతూ కార్మిక శాఖ ప్రతిపాదన పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల్లోనే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావచ్చని, దాంతో ఈ నెల చివర్లోగా వడ్డీ జమ చేయడం పూర్తవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, లౌక్‌డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త అందించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు) 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్లో జమ చేస్తాయి. దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది. -
ఆర్బీఐ పేరుతో కాలయాపన: సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మంజూరు చేసిన మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. వడ్డీ మీద వడ్డీ విధిస్తారా అంటూ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం బుధవారం మరోసారి కేంద్రం వైఖరిపై మండిపడింది. ఆర్బీఐ పేరు చెప్పి ఎంతకాలం దాక్కుంటారని వ్యాఖ్యానించింది. ఆర్థిక ఉద్దీపన వల్ల ఎంత మందికి ప్రయోజనం, నిజంగా ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించింది. వ్యాపార ఉద్దేశ్యాలు పక్కనబెట్టి ప్రజలకష్టాలు తీర్చాలని సూచించింది. దీనిపై సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలతోనే ఆర్బీఐ సరిపెట్టుకుందని, ప్రభుత్వం కూడా ఆర్బీఐ వెనుక దాక్కుంటోందని సుప్రీం విరుచుకుపడింది. వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంది. వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1 కి వాయిదా వేసింది. ప్రభుత్వం వ్యాపారం గురించి మాత్రమే కాకుండా ప్రజల దుస్థితి గురించి కూడా ఆలోచించాలని హితవు చెప్పింది. రెగ్యులేటర్‌గా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఒత్తిడితో కూడిన ఖాతాలను గుర్తించి, తక్కువ వడ్డీ రేట్ల పరంగా ఉపశమనం కల్పించాలని ఆర్బీఐ చూస్తోందని కేంద్రం తరపున వాదిస్తున్నసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగే ఇలాంటి అభిప్రాయానికి రావద్దని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సమీక్షించి,నివేదిక అందిస్తామని మెహతా తెలిపారు. కాగా కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా బ్యాంకు రుణాలపై రిజర్వు బ్యాంకు విధించిన మారిటోరియం గడువు ఆగస్టు 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
రెడీ టు ఈట్!
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు.. నచ్చిన హోటల్‌కు వెళ్లి మెచ్చిన ఆహారాన్ని లాగించేవారు. హోటల్‌కు వె ళ్లే స్థోమత లేనివారుæ స్ట్రీట్ ఫుడ్ తిని ఎం జాయ్ చేసేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంట ర్లన్నీ మూతపడ్డాయి. కరోనా కారణంగా కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. నూడుల్స్, ఫ్రైడ్‌రైస్, పిజ్జా, బ ర్గర్లు, మంచురియా లాంటి జంక్‌ఫుడ్‌ను లాగించినవాళ్లు ఇప్పుడు నోళ్లు కట్టేసుకో వాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందు కు ఇంట్లోనే ఈ ఫుడ్‌ను సిద్ధం చేసుకుం టున్నారు. కరోనా రాకముందు షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన నూడుల్స్, సేమియా, పాస్తా ఇప్పు డు ఖాళీ అయిపోయా యి. ఫింగర్ చిప్స్, బ్రె డ్, చీజ్, బట్టర్, కార్న్ ఫ్లేవర్లు, ఫాస్ట్‌ఫుడ్‌లో ఉపయోగించే చిల్లీ, సోయా, టమోటా సాస్‌ల ర్యాక్‌లు ఖాళీఅయ్యాయి. లాక్‌డౌన్‌తో ముందుచూపు... కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియ ని పరిస్థితి... ఒకవేళ కేసుల సంఖ్య పెరి గితే మరికొన్నాళ్లు ఇంటికే పరిమితం కా వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని అ ధిగమించేందుకు చాలా మంది ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. రెడీ టు ఈట్ లాంటి ఆహార పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. నూడుల్స్, సాస్ లు, జంక్‌ఫుడ్‌లో వినియోగించే ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. -
అది ఓ చెత్త సలహా..
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజల జీవితాలను కాపాడటం ముఖ్యమని, జీడీపీ లెక్కలు కాదని చిదంబరం హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెత్త సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయనే విషయం తనకు తెలుసని, అయితే ఇంత చెత్త సలహా పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని వ్యాఖ్యానించారు. పీపీఎఫ్, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు తగ్గించడం సాంకేతికంగా సరైనది కావచ్చు..కానీ నిర్ణయం తీసుకున్న సమయం సరైంది కాదని చిదంబరం ట్వీట్ చేశారు. ప్రజల రాబడి అనిశ్చితిలో పడిన ఇలాంటి సందర్భాల్లో వారు తమ పొదుపుపై వచ్చే రాబడిపై ఆధారపడతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించి జూన్ 30 వరకూ పొదుపు ఖాతాలపై పాత వడ్డీరేట్లనే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు కేవలం 4.8 శాతానికే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు. చదవండి : చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులకు భవిష్యనిధి సంస్థ తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచినట్టు ఈపీఎఫ్ఓ బుధవారం ప్రకటించింది. ఆరు కోట్ల మందికి పైగా చందాదారుల ఖాతాలపై రూ 54,000 కోట్ల మేర వడ్డీ జమ చేస్తామని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై 8.65 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక 2017-18లో గత ఐదేళ్లలో అత్యంత కనిష్టస్ధాయిలో 8.55 శాతం వడ్డీరేటును వర్తింపచేశారు.ఇక 2013-14లో ఈపీఎఫ్ఓ పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటును 8.75 శాతం అందించింది. -
ఐటీ రిటర్న్ దాఖలు ఆలస్యమైతే...
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో అశ్రద్ధ వహించి గడువులోపు ఆ పనిచేయకపోతే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఈ లోపు దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ కింద ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసిన వారికి రూ.10,000 వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు రిటర్నులు దాఖలు చేశారన్న దానిపై ఈ పెనాల్టీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే చెల్లించాల్సిన పన్ను మొత్తంపై వడ్డీ అదనంగా చెల్లించుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సకాలంలో రిటర్నులు దాఖలు చేయడమే సరైనది. సెక్షన్ 139 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆలస్యంగా దాఖలు చేసే వివిధ రకాల రిటర్నుల వ్యవçహారాలకు సంబంధించినది. ఓ వ్యక్తి లేదా సంస్థ నిర్దేశిత గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే ఈ సెక్ష¯Œ తగిన మార్గదర్శకాలను తెలియజేస్తోంది. ఈ సెక్షన్ లో ఉప సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇవి విడిగా భిన్న రిటర్నుల వ్యవహారాల పరిష్కారానికి సంబంధించినవి. కనుక వీటిపై ఓ సారి దృష్టి సారించాలి. సెక్షన్ 139(1) ఈ సెక్షన్ కింద వ్యక్తులు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. చట్టం అనుమతించిన బేసిక్ పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు గడువు లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. భారత్‌కు వెలుపల ఏదైనా ఆస్తి ఉన్న వారు (ఏదైనా సంస్థతో ఆర్థిక ప్రయోజనం ముడిపడి ఉన్నా) లేదా విదేశీ ఖాతాకు సంబంధించి సంతకం చేసే అధికారం కలిగి ఉంటే అప్పుడు ఆదాయం ఎంతన్నదానితో సంబంధం లేకుండా రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సిందే. ఇక చట్టంలోని నిబంధనల మేరకు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆ పనిచేస్తే స్వచ్చంద రిటర్నులుగా పరిగణిస్తారు. ఇవి చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే రిటర్నులు. ఈ సెక్షన్ కొన్ని రకాల వ్యక్తులను పన్ను రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు కూడా ఇస్తోంది. సెక్షన్ 139 (3) పన్ను చెల్లింపుదారులు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయడం వల్లే ప్రయోజనం పొందగలరు. అందుకే ఈ విషయంలో కొన్ని నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. ‘క్యాపిటల్ గెయి¯Œ ్స’ (మూలధన లాభాలు), ‘ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ్స ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ’ కింద నష్టాలను ఎదుర్కొన్న వారు, వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరాల ఆదాయంలో సర్దుబాటు చేసుకోదలిస్తే తప్పనిసరిగా గడువులోపే ఐటీఆర్ దాఖలు చేయాలి. ఒకవేళ ఇంటిపై నష్టం ఎదురైతే మాత్రం గడువు దాటిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినా గానీ, ఆ నష్టాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు ఈ సెక్షన్ అనుమతిస్తోంది. ఇక ఇతరత్రా ఏ నష్టమైనా కానీ సకాలంలో రిటర్ను లు దాఖలు చేసినా, చేయకపోయినా వాటిని సెట్ ఆఫ్ (ఆదాయంలో సర్దుబాటు) చేసుకోవచ్చు. సెక్షన్ 139(4) పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(1)లో పేర్కొన్న మేరకు గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, అసెస్మెంట్ సంవత్సరం నుంచి ఏడాదిలోపు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేయవచ్చు. లేదా సెక్షన్ 144 ప్రకారం మదింపు పూర్తవకముందు దాఖలు చేయవచ్చు. కాకపోతే సెక్షన్ 271ఎఫ్‌లో పేర్కొన్న ప్రకారం రూ.5,000 జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సెక్షన్ 139(1) కింద రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినప్పటికీ పెనాల్టీ ఉండదు. సెక్షన్ 139(5) గడువులోపు ఐటీఆర్ దాఖలు చేసిన వారు, ఆ తర్వాత అందులో ఏదైనా తప్పున్నట్టు గుర్తిస్తే, సవరణ రిటర్నులు సమర్పించే హక్కు ఉంటుంది. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాదిలోపు ఈ పని చేయవచ్చు లేదా ఐటీఆర్ అసెస్మెంట్ పూర్తి కాకముందు వీటిల్లో ఏది ముందు అయితే అదే అమల్లోకి వస్తుంది. ఈ గడువులోపు ఎన్ని సార్లయినా సవరణ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. అయితే, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల ఈ సెక్షన్ పరిధిలోకి రారు. సవరణ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉండదు. సవరణ రిటర్ను దాఖలు చేయడం ఆలస్యం సెక్షన్ 139(5) కింద అదే అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. అంతకుముందు సెక్షన్ 139(1) కింద దాఖలు చేసినది అమల్లో ఉండదు. అయితే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్నుల్లో లోపాలు లేదా తప్పుడు ప్రకటనలన్నవి ఉద్దేశపూర్వకంగా చేయకపోతేనే సవరణ రిటర్నులు దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా లోపాలు లేదా తప్పిదాలతో దాఖలు చేసినా, మోసానికి పాల్పడినా పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. సెక్షన్ 139 (9) లోపాలతో కూడిన ఐటీ రిటర్ను దాఖలు చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేయనప్పుడు సెక్షన్ 139(9) మార్గదర్శకాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని పూర్తి చేయాల్సిన కాలమ్స్‌ను వదిలి వేయడం లోపంగానే పరిగణిస్తారు. టీడీఎస్ మినహాయించిన సందర్భాల్లో ఆధారం జత చేయకపోయినా దాన్ని లోపంతో కూడిన రిటర్న్గానే చూస్తారు. పన్ను అధికారి ఇలా గుర్తించిన సందర్భంలో ఈ సమాచారం పన్ను చెల్లింపుదారునికి తెలియజేస్తారు. అప్పటి నుంచి 15 రోజుల్లోపు ఆ తప్పులను సవరించుకోవాల్సి ఉంటుంది. అయితే, దరఖాస్తు ద్వారా ఈ గడువు పొడిగించాలని కోరొచ్చు. పన్ను అధికారి ఇచ్చిన సమయంలోపు తప్పులను సవరిస్తూ రిటర్ను ఫైల్ చేయకపోతే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్న్ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోవాలి. ఆలస్యం చేయడం వల్ల ప్రతికూలతలు ♦ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి రావచ్చు. సెక్ష 234ఎఫ్ ప్రకారం సకాలంలో రిటర్నులు దాఖలు చేయడంలో విఫలం చెందితే.. రూ.10,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణ గడువు ముగిసిన తర్వాత, అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 లోపు రిటర్ను దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అదే జనవరి 1 తర్వాత రిటర్ను ఫైల్ చేస్తుంటే ఈ జరిమానా రూ.10,000. అయితే, రిటర్ను దాఖలు చేసే వారి వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉంటే, జరిమానా కేవలం రూ.1,000 మాత్రమే ఉంటుంది. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారిపై భారం ఎక్కువ ఉండకూడదని తక్కువగా నిర్ణయించారు. ♦ గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, మూలధన నష్టాలను, వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చిన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు వీలుండదు. ♦ ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే, అంతకాలానికి నిర్ణీత పన్నుపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి. ♦ ఆలస్యంగా రిటర్నుల వల్ల, రిఫండ్ వచ్చేది ఉంటే ఆ మొత్తంపై వడ్డీ రాదని గుర్తుంచుకోవాలి. ఆలస్యపు రిటర్నుల్లో పన్నుపై వడ్డీ ఆలస్యపు రిటర్నుల్లో జరిమానాకు తోడు పన్ను మొత్తంపై ఆలస్యమైన కాలానికి వడ్డీ చెల్లించాలి. సెక్షన్ 234ఏ కింద నెలకు ఒక శాతం వడ్డీ ఉంటుంది. నిర్ణీత గడువు, దాఖలు చేసిన గడువు మధ్య కాలానికి దీన్ని వసూలు చేస్తారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు ఆగస్టు 31. ఈ నెల 31లోపు దాఖలు చేయకుండా వచ్చే డిసెంబర్ 30న దాఖలు చేశారనుకోండి. రూ.1,00,000 పన్ను చెల్లించాల్సి ఉంటే, ఈ మొత్తంపై ఒక శాతం వడ్డీ చొప్పున నాలుగు నెలలకు రూ.4,000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. -
తమిళనాడు ధర్మపురిలో రాజకీయాల్లో ఆసక్తికర పోరు
-
ముమ్మరంగా పారిశుధ్య పనులు
సాక్షి, పెన్‌పహాడ్ : నూతన సర్పంచ్‌లు తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ ముగురుకాల్వలను శూభ్రం చేస్తూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనులను వేగవంతంగా చేశారు. మండలంలోని 29గ్రామపంచాయతీలకు గాను దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యం గా మేజర్ గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పనులు.. కాలనీల్లోని మురికి కాల్వల్లో, రోడ్లకు ఇరుపక్కల పేరుకుపోయి ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో పాటు సర్పంచ్‌లు మురికి కాల్వలను శుభ్రం చేశారు. గత సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలలపాటు గ్రామాల ప్రత్యేక అధికారుల చేతిలో ఉండడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పలు సమస్యలు నెలకొన్నాయి. కొత్త సర్పంచ్‌లు పదవి చేపట్టగానే వారికి అనేక సమస్యలు స్వాగతం పలికినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండగా ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా కొత్త పైపులైన్లు వేయించి వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల మధ్యన ఉంటూ గ్రామ అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లను గ్రామస్తులు కొనియాడుతున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యం గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా, మురికి కాల్వల్లో పెరిగిన పిచ్చిమొక్కలను, పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్నాం. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. లీకైన పైపులైన్‌ను సరిచేసి కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం. – బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, అనంతారం ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా.. చీదెళ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న అందులో భాగంగా మురికి కాల్వలు, రోడ్లపై పడిన చెత్తా, చెదారాన్ని కూలీల చేత తొలగించి పరిశుభ్రం చేయిస్తున్నాం. అలాగే వేసవికాలం ఆరంభమైన సందర్భంగా గ్రామంలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తాం. – పరెడ్డి సీతారాంరెడ్డి, సర్పంచ్, చీదెళ్లగ్రామాభివృద్ధే లక్ష్యం -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
లాల్బాష ప్లాన్
నేను వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మాఊరు చూడ్డానికి సరదాగా వచ్చాము. అదికూడా ఎన్నో ఏళ్ళ తర్వాత. పొద్దున్నే రమీజాబీవచ్చి మాఇల్లు శుభ్రంచేసి, మాకు టిఫిన్స్ , వడ్డించి రాత్రి మిగిలినకొన్ని తిండిపదార్థాలు ఇంటికితీసుకెళ్ళింది.టిఫిన్ తిన్నాక అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చునే ఉన్నాం బద్ధకంగా. మా ఊరు కథలు వినాలంటే నాభార్యకు చాలా ఆసక్తి. మా ఇరవైఏదేళ్ళ అబ్బాయికికూడ. నా పెళ్ళయినప్పటి నుండి ముప్పైఏళ్ళుగా హైదరాబాదులో సెటిల్ అయిఉన్నాము. మా అత్తమామ తరుపువాళ్ళు బీచ్సిటీ విశాఖపట్నంలో పెరిగినవాళ్ళు. కర్నూలు దగ్గర ఒక చిన్నప్రాంతంలోఎలాంటి కథలు, ఎలాంటి ఉద్వేగాలు, ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయో తెలుసుకుని ఇద్దరూ కొత్తలోకంలోకెళ్ళినటు ్టఫీలవుతారు. మధ్యలో నాప్రాంతీయభాష విని మురిసిపోతుంటారు. కథ విన్నంతసేపు వాళ్ళకు యమ్నూరు అంటే యమ్మిగనూరు నుండి తెచ్చుకున్నభర్త, నాన్నకొత్తగాఉంటాడు. అలానే కూర్చున్నాంకదా అని మాఆవిడ కథ చెప్పమని అడిగింది. ముప్పైసంవత్సరాలపైచిలుకు మాట ఇది! చనిపోయిన లాల్బాష మళ్ళీ బతికొచ్చాడని చూడ్డానికి జనాలు రౌండ్‌కట్ట వేపు వెళ్ళి చూసివచ్చేవాళ్ళు చూసివస్తున్నారు. రంధ్రాలఎర్రబనీను వేసుకున్న బాడీ మాఊరు పెద్దకాల్వలో కొట్టుకుపోతుంటే ఎవరోచూసారు. రక్షించడానికి ప్రయత్నించారుగాని, ఆ ప్రవాహంలో తుంగభద్రలో కొట్టుకువెళ్ళిపోయింది. ఆరోజునుండి ఇప్పటివరకు కనిపించని లాల్బాష, నెలరోజులతర్వాత హఠాత్తుగా బతికిఉన్నట్టు తెలవడంతోఅందరికి సంభ్రమం కలిగింది. లాల్బాష అంటే అందరికీ అభిమానమే. రౌండ్కట్టను ఆనుకునే లాల్బాష అంగడి ఉంటుంది. లాల్బాష అంగడి ఊరికి మధ్యలో రౌండ్‌కట్ట దగ్గర ఉండడంతో, సంతమార్కెటుకు దగ్గరగా ఉంటుంది. ఆ రౌండ్ కట్ట దగ్గర ఎప్పుడూ జనాలు బాగా జమకూడేవాళ్ళు. ఊరిలో విషయాలన్నీఅక్కడే తేలేవి. ఎలక్షన్ల దగ్గర నుండి, బుడ్డలపంటల పరిస్థితినుండి, సీడువ్యాపారం మొదలుకుని అన్ని విషయాలు అక్కడే జమ కట్టబడేవి. ఎవరన్నా టీ అడిగితే లాల్బాష డబ్బులు కూడా అడిగేవాడు కాదు. ఇస్తేమాత్రం నవ్వుతూ తీసుకునేవాడు. చిన్నభార్య అంగట్లోఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకునేది. లాల్బాష నెమ్మదితనానికి అందరికీ లాల్బాష అంటే ఇష్టమే. మాఊర్లో చిన్నపిల్లలకు పొదుపు నేర్పింది లాల్బాషనే.బడిపిల్లలకు ఒక చిన్నకార్ద్ ఇచ్చేవాడు. దానిలో నిలువువరుసల్లో 5,10, 25 పైసల సంఖ్యలుండెవి. అడ్డువరసల్లో 1,2,3 వరుస సంఖ్యలుండేవి.మేము ఐదుపదిపైసలు లాల్బాష వద్ద పొదుపు చేసినప్పుడల్లా ఒక్కో అంకెనుపెన్నుతో కొట్టేస్తూ వెళ్ళేవాడు. ఒకనెల తర్వాతో రెన్నెల్ల తర్వాతో ఎన్ని అంకెలు కొట్టేసాడొ అన్నిపైసల మొత్తం ఒకేసారి చేతిలోపెట్టేవాడు. లేదా తన అంగడిలో ఏవన్న బిస్కెట్పేకెట్లు, చాక్లెట్లు పొదుపు విలువకు తగ్గవస్తువులు ఇచ్చేవాడు. అప్పట్లో బేంకులు పెద్దోల్లకే అందుబాటులోఉండేవికావు. ఆరకంగా మాఊర్లోఉండే మా బడిపిల్లలందరికీ పొదుపులోఉండే ఒక ఎగ్జాయిట్మెంట్ క్రియేట్ చేశాడు. లాల్బాష అంగడికి మాఊరవతల ఉండే నపుంసకులు ఒకేసారిగుంపుగా ఊర్లోఉండే షాపులన్నితిరిగి డబ్బులు కలెక్టే్చసుకునేవాళ్ళు. ఇంచుమించు అన్నిపెద్దషాపుల వాళ్లు వాళ్ళని తిరస్కరించేవాళ్ళు. కాని లాల్బాష అంగడి దగ్గర మాత్రం వాళ్ళకు దానమే కాదు కాఫీటీలుకూడా దొరికేవి. ఊర్లోవాళ్ళు రౌండ్‌కట్ట దగ్గర ఈ విషయమై విసుక్కుంటే అల్లా ఎవర్నీ శపించడు అందర్నీ దీవిస్తాడు అని సర్దిచెప్పేవాడు.లాల్బాష ఎందుకు చనిపోయాడోఎవరికీతెలీదు. ఒక్కొక్కరిది ఒక్కో ఊహాగానం. ఒకరు పెద్దభార్యతమ్ముడు అంటే బామ్మర్ది డబ్బుల కోసంపెట్టే సతాయింపు భరించలేకఅని, కొంతమంది వారమొడ్డిఆంజనేయులు తన వడ్డీగురించి పెట్టే సతాయింపువల్లఅని, కొంతమంది లాల్బాష చిట్టీలడబ్బులు తిరిగికట్టలేక పడే ఇబ్బందులవల్ల చనిపోయాడని అనుకున్నారు ఇన్నాళ్ళు. వారమొడ్డిఆంజనేయులు దగ్గర లాల్బాష ఎంతోఅప్పుచేసాడు. మాఊరికంత ఎన్ఫీల్డ్ కలిగిన ఒకేఒక వ్యక్తి వారమొడ్డిఆంజనేయులు. బైకులో ’భడ్ భడ్’మని తిరుగుతూ అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర వారంవారం రుపాయి లెక్కన వడ్డీ వసూలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. మొహమాటంలేకుండా, ఒక్కరోజువృథా పోనీకుండా వడ్డీ వసూలుచేస్తాడు. లాల్బాష చిన్నచిన్న చిట్టీలు కూడా నడుపుతాడు. ఆవి సరిగ ్గనడపలేక, కొంతమంది కట్టాల్సినౖ టెములో కట్టకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డాడు.పెద్ద భార్య గయ్యాళి అని జనాలు అనేవాళ్ళు. ఆమెతో పడక, ఆమెను వదిలేసి రెండో భార్యను కట్టుకుని అక్కడే దగ్గర్లో ఉండేవాడు. పెద్దభార్య తమ్ముడు అల్లరిచిల్లరివేషాలేసే ్తభరించలేకపోయేవాడు. అయితే పెద్దభార్యతమ్ముడు అప్పటికీ లాల్బాష దగ్గర ఏదోలా డబ్బులు పిండుకుని వెళ్ళిపోయేవాడు. చిన్నభార్య కుటుంబం కూడా తన మీద ఆధారపడ్డంతో, చిట్టీడబ్బులుకట్టలేక, వారమొడ్డీ తీర్చలేక బాగా సతమతమయ్యేవాడు. అయితే అందరు ఇన్నాళ్ళు అనుకున్నట్టు లాల్బాష చనిపోలేదు. నెలరోజులుగా హైదరాబాదులో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలీదు. కానీ ఒక మేలైన పని చేసాడు మాఊరికి. అదిమాత్రం తెలిసింది అందరికి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినరోజులుఅవి. నెలరోజులు హైదరాబాదులోనే తిష్ట వేసి ముఖ్యమంత్రిని కలిసాడట. కలవడమేకాక మాఊరి ప్రయోజనాల గురించి మంకుపట్టుపట్టి తనప్రతిపాదనను వివరించాడట. మాఊరిబయట పెద్దకాలువ ఉంది. అదివెళ్ళి తుంగభద్రలో కలిసే ఒకపాయ. సంవత్సరంలో రెండునెలలో మూడునెలలు మాత్రమే ప్రవహిస్తుంది అది. అది సరిగ్గా రెండుకొండల మధ్య నుండి ప్రవహిస్తుంది. ఒకేఒకపక్క మాత్రమే ఆనకట్టలాంటి గోడకడితేచాలు ఒకరిజర్వాయర్ తయారౌతుంది. ఆ రిజర్వాయర్ వల్ల కొన్నివేలఎకరాలు సాగు చేయబడేంత సామర్థ్యం వస్తుంది. మొత్తం రిజర్వాయర్ కట్టవలసిన పనిలేదు కాబట్టి ఖర్చు కూడ సాధారణ రిజర్వాయర్ కన్నా మూడోవంతులోపు అయిపోతుంది. అంతేకాక మంత్రాలయం చుట్టుపక్కల్లో ఒక్కసారి అయిన వసతిసదుపాయం కలిగిన హోటల్లేదు కాబట్టి పదహైదుకిలోమీటర్లు మాత్రమే దూరమున్న పెద్దకాలువపైన కట్టే రిజర్వాయర్ ఒడ్డున ఒక హోటల్ కడితే పుణ్యయాత్రలకు వచ్చిన వాళ్ళకు సదుపాయంగా ఉంటుంది. రిజర్వాయిర్ చుట్టూ హోటల్ కడితే కొండపైన నీళ్ళ పక్కన వ్యూ అహ్లాదకరంగా ఉండడండవల్ల్ల ఎంతోమంది టూరిస్టులు పక్కనే ఉన్న కర్ణాటక నుండి కూడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందువలన ఆచుట్టుపక్కల గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. నీళ్ళు ఉండడం వల్ల ఒకపక్కసేద్యం పుంజుకుంటే సీడువ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఎరువుల వ్యాపారం కూడా పెరుగుతుంది. అప్పటిదాకా ఆయిల్ కంపనీ మీద మాత్రమే ఆధారపడ్డ ప్రజలకు ఒక ప్రత్యమ్నాయం దొరకడం వలన, సన్‌పవర్ రైతులకు కూడా మంచిధర పలికేలా కంపనీ ప్రవర్తిస్తుంది. అప్పుడే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఆపెద్దకాలువ పక్కనేపెడితే పిల్లలకు ఆహ్లాదకరైమైన వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంటుంది. జిల్లాకలెక్టరు లాల్బాషకు ఇరవైఐదువేలు పారితోషికం ఇవ్వమని, ఆప్రతిపాదనకు సంబంధించిన మొత్తం ప్లాను లాల్బాష నుండి సేకరించమని ఎన్టీఆర్ ఆజ్ఞా జారీ చేసినట్టు అందరికి తెలిసింది. ఒక్కసారిగా లాల్బాష గురించి రౌండ్‌కట్ట దగ్గర ఒకటే చెప్పుకున్నారు జనాలు. ఊరంతా పాకిపోయింది ఈవిషయం. వారమొడ్డిఆంజనేయులుగాని, చిట్టీవాళ్ళుగాని ఎవరూ లాల్బాషను సతాయించడం ఆపేసారు. లాల్బాషకెలాగూ ఇంకొన్నిరోజుల్లో ఇరవైఐదువేలు ప్రభుత్వం నుండి అందుతుంది. దానితో అందరి అప్పులు కూడా తీరుతాయి. లాల్బాష పెద్దభార్య తమ్ముడి దౌర్జన్యం కూడా కొంతవరకు ఆగింది..లాల్బాష వల్ల రౌండుకట్టకే ఒక వెలుగు వచ్చినట్టు అయ్యింది. లాల్బాష ఈద్ రోజులు కావడంతో ‘రోజా’ చేస్తూ రోజూ గడిపేస్తున్నాడు. ప్రభుత్వంకు ఇవ్వాల్సిన ప్రతిపాదనల మొత్తం వివరాలు లాల్బాష రాసి పెట్టుకున్నాడు. జనాలు వాకబు చేసినప్పుడల్లా బాగాశ్రద్ధగా వివరించేవాడు. తనదగ్గర చిన్నచిన్న వివరాలతోసహాఎన్నోరీములపేపర్లలో ప్లాన్రాస్తున్నాడని చెప్పేవాడు. కలెక్టర్నుండి వార్తకోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక పదహైదురోజులకు కలెక్టర్నుండి ఫోన్ వచ్చిందనే వార్త రౌండ్‌కట్ట నుండి ఊరంతాపాకింది. మాఊరు రౌండ్‌కట్ట దగ్గిర మళ్ళీ ఎంతో సంబరంగా మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఇక రంజాన్ అయిన వెంటనే లాల్బాష ప్లాన్ ప్రభుత్వానికి చేరిపోతుందని ఊరు ఇక ఒకవెలుగు వెలిగిపోతుందని అందరూ చెప్పుకున్నారు. వారమొడ్డిఆంజనేయులు, చీటి వేసినవాళ్ళు ఇకత్వరలో వాళ్ళ అప్పులు తీర్చేస్తాడని, పెద్దభార్యతమ్ముడు కూడా ఇక లాల్బాష జీవితంలో లేనిపోని జోక్యం చేసుకోడని కూడా జనాలకు తెలిసిపోయింది. ఒకపక్క లాల్బాష బాగుపడ్డమే కాక ఊరంతా బాగుపడేలా ప్లాన్వేసాడని లాల్బాష గురించి అందరు తెగమెచ్చుకునేవాళ్ళు. పదిమందిబాగులోనే తనబాగును కూడా కలిపేసుకున్న లాల్బాష మాఊర్లోమంచితెలివైనవాడికి ఉదాహరణగాచెప్పుకునేవాళ్ళు.రంజాన్ రానే వచ్చింది. ఆరోజు పొద్దున లాల్బాష చనిపోయాడు. ఈసారి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు!ఆరోజు ఊరిపెద్దకాలువ యమ్మిగనూర్ చెక్కిళ్లపైన పారే కన్నీటిధారలాఉంది.జనమంతా లాల్బాష అంగడి దగ్గర పోగయ్యారు. జనాలు చూడ్డం కోసం బాడీని రౌండ్‌కట్ట దగ్గర తీసుకొచ్చిపెట్టారు. ఎంతోమంది వచ్చి చూసివెళ్ళారు. చాలామంది లాల్బాష మంచితనం తల్చుకుని కంటతడిపెట్టారు. మరికొంతమంది రంజాన్రోజు చనిపోవడం వల్ల జన్నత్ కెల్తాడు అని అనుకుంటూ బాధపడ్డారు.అతని బాడీ మీద పడి హృదయవిదారకంగా ఏడుస్తున్న అతని చిన్నభార్యను ఎలాఓదార్చాలో తెలీక సతమతమయ్యారు. బాడీని పాతిపెట్టడానికి తీసుకెల్తుండగా చిన్నభార్య తనభర్త తయారు చేసిన పేపర్లను కూడా లాల్బాషతో పాటేపూడ్చిపెట్టేసేయమనిపెద్దల్ని బ్రతిమాలి చిన్నట్రంకుపెట్టెను అతని శవపేటిక మీద పెట్టేసింది. ఆమె భోరుమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ఆరోజు లాల్బాషతో పాటూ లాల్బాష ప్లాన్కూడా సమాధిలో కప్పివేయబడ్డది. అయితే ప్రపంచం మనమనుకున్నంత మంచిగాఉండదు. మరుసటి రోజే వారమొడ్డిఆంజనేయులు చిన్నభార్య ఇంటిమీద జనాలనేసుకునిపడ్డాడు. అసలు లాల్బాష ప్లాన్పేపర్లు ఎందుకు కప్పేసారని గొడవచేసాడు. సెంటిమెంట్లు అవ్వన్నీ చెల్లవని తెగేసి గొడవచేసాడు.చిట్టీకట్టినవాళ్ళు కూడా ఆయన చుట్టూచేరడంతో పెద్దరసాభసఅయ్యింది. చిన్నభార్యకు ఏమిపాలుపోక ఒక్కతేమౌనంగా కళ్ళు నేలకేసిపెట్టుకుంది. ఆమె కళ్ళ నిండా నీళ్ళు మాత్రం కారిపోతూనే ఉన్నాయి. జుట్టుచెదిరిపోయిఉంది. మాఊరి తేరులా ఒంటరిగా చలనం లేనట్టు గోడకానుకుని ఉంది. పెద్దభార్యతమ్ముడు వచ్చినాయకత్వం మీద వేసుకుని అయ్యిందేదో అయిపోయింది ఆపేపర్లట్రంకుపెట్టేబయటకు తీస్తే తానువారమొడ్డిఆంజనేయులుతోకలిసి ఎలాగోలా ప్రభుత్వం నుండి కొంచెమన్నడబ్బు అందేలా కర్నూలుకెళ్ళిట్రైచేస్తామని, కర్నూలులోతిష్టవేసిపని అయ్యేంత వరకు తనదేబాధ్యత అనిగట్టిగా అరిచిగీపెట్టడంతో అక్కడుండేవాళ్ళు సమాధి తవ్వి ట్రంకు పెట్టె బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. సమాధి తవ్వడం కోసం మాఊరు పాలెంవాల్లను కబురుపెటి ్టపిలిచారు. చివరికి సమాధి తవ్వాలని వాల్లందరూ నిర్ణయించుకున్నట్టు తెలపడంతో ఇకలాల్బాష చిన్నభార్య ఏదో సముద్ర ఉప్పెనలా రోదించింది. వద్దనిబతిమాలింది. పరిగెత్తికెళ్ళి లాల్బాష పెద్దభార్య కాళ్ళ మీద పడింది. అక్కడ మెజారిటీజనాలు డబ్బులు రాబట్టుకోవడం కోసమే ఉన్నారు కాబట్టి ఆమె రోదనకు తగిన మద్దతు లేకుండాపోయింది. పాలేంవాళ్ళువచ్చారు. అందరూ స్మశానానికివెళ్ళారు.వాళ్ళు సమాధి తవ్వి ట్రంకుపెట్టె బయటకుతీసారు. ఎవరో ఆత్రంగా ట్రంకు పెట్టె ఓపెన్‌చేసి చూస్తే ఒక కట్టపేపర్లు కనిపించాయి.లాల్బాష ప్లాన్దొరకడంతో గబాల్న పేపర్కట్ట విప్పిచూసారు. అన్నీ తెల్లకాగితాలే !లాల్బాష చిన్నభార్య ఒక్కఉదుటునవెళ్ళి ఆపేపర్కట్టవిప్పిన వాడిచొక్కాపట్టుకుని ‘ఒరేయ్! నాబట్ట! సచ్చిన కూడ ఇడ్సలె కద్రామీరు?! సచ్చేముందు రెండునెల్లనుండి ఇంతకూడబెట్టుకున్న మనశ్శాంతి కూడా వాయనకి లేకుండ లాక్కుంట్రికదరా..ఓయప్పో సచ్చినోన్ని కూడా మల్ల సంపితిరికద్రామీరు !’’ అని కుప్పకూలిపోయింది.ఆరోజు రౌండ్‌కట్ట దగ్గర అందరు లాల్బాషప్లాను గురించే మాట్లాడుకున్నారు. అతని అసలు ప్లాన్తెలిసిన ఒకేఒక్కవ్యక్తి ఆరాత్రి రౌండ్‌కట్ట బల్బువెలుగులోజీవచ్చవంలాఉంది. మరుసటిరోజుపొద్దున వరకు మాఇంట్లో మాఆవిడ, మాఅబ్బాయి ఇద్దరు ఇంచుమించు మౌనంగానేఉన్నారు. మరుసటిరోజు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర మాఆవిడ అడిగింది‘కథ మొత్తానికి ఒకే ఒక్క డైలాగ్. అదికూడా ఆవిధంగా ముగిస్తు పెట్టడంలో రైటర్‌గా నీ శాడిజం కనిపిస్తుందని నాకనిపిస్తుంది’ అని బలవంతంగా విసుక్కుంది.ఇంట్లోపొద్దున్నే పనిచేసివెళ్ళిన రమీజాబీని గమనించి ఉంటే వాళ్ళిద్దరికి అందరం కలిసున్నామనే ఈ సమాజం బతికే అవగాహనలో ఉండే శాడిజం ఏంటోతెలిసేది ! పి. విక్టర్ విజయ్‌కుమార్ -
మళ్లీ డిఫాల్టయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్
ముంబై: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెల్లింపుల సంక్షోభం మరింత ముదురుతోంది. వాణిజ్య పత్రాలపై వడ్డీ చెల్లింపుల్లో ఈ కంపెనీ మరోసారి విఫలమైంది. సోమవారం చెల్లించాల్సిన వడ్డీని తాము చెల్లించలేకపోయినట్లు ఈ కంపెనీ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. అయితే ఎంత మొత్తం చెల్లించటంలో విఫలమయ్యారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. చెల్లింపుల్లో విఫలం కావడం ఈ గ్రూప్‌కు ఈ నెలలో ఇది మూడో సారి. ‘సిడ్బీ’ నుంచి తీసుకున్న రూ.1,000 కోట్ల స్వల్పకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ విఫలమైంది. ఈ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి రూ.500 కోట్ల రుణ చెల్లింపులో కూడా విఫలమైంది. కాగా రుణ చెల్లింపులు, కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధిత అంశాలపై ఆరోపణలు రావడంతో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ సి బావా, కొందరు కీలకమైన బోర్డ్ సభ్యులు గత శుక్రవారం రాజీనామా చేశారు. రూ.91,000 కోట్ల రుణ భారం... కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.91,000 కోట్లుగా ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నొముర ఇండియా తెలియజేసింది. ఈ రుణంలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ వాటా రూ.35,000 కోట్లని, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటా రూ.17,000 కోట్లుగా ఉంటుందని వివరించింది. తనే పరిష్కరించుకుంటుంది: గర్గ్ న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వ్యాఖ్యానించారు. ‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. దానికంటూ స్వతంత్ర బోర్డు, షేర్హోల్డర్లు ఉన్నారు. కాబట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమర్ధత ఉందనే నేను భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. ఆస్తులు, అప్పుల మధ్య తాత్కాలిక వ్యత్యాసం ఏర్పడవచ్చని.. కానీ అంతిమంగా ఆ సంస్థే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని గర్గ్ చెప్పారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో కేంద్రానికి నేరుగా వాటాలేమీ లేకపోయినప్పటికీ.. ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీకి నాలుగో వంతు వాటా ఉండగా, జపాన్‌కి చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కు 23.5 శాతం, ఎస్బీఐకి 6.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకీ 9 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 7.67 శాతం మేర వాటాలు ఉన్నాయి. సిడ్బి నుంచి తీసుకున్న రూ. 1,000 కోట్ల స్వల్పకాలిక రుణాలను చెల్లించలేక ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిఫాల్ట్ అయిందన్న సంగతి సెప్టెంబర్ 4న బైటపడిన సంగతి తెలిసిందే. -
రూ.కోటి కవరేజీ చాలా..?
కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఓ బ్రహ్మచారి ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నాడనుకోండి. ఆ మొత్తం అతడి కుటుంబ అవసరాలు, జీవిత లక్ష్యాల కోసం సరిపోకపోవచ్చు. చాలామంది తమకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే రూ.కోటి మొత్తం సరిపోతుందని అనుకుంటుంటారు. రూ.కోటి ఈ రోజు పెద్ద మొత్తంగానే కనిపించొచ్చు. ‘‘చాలా మంది తమకు సౌకర్యవంతమైన మొత్తానికి కవరేజీ తీసుకుంటుంటారు. అలా చూస్తే రూ.కోటి ఎక్కువగా ప్రచారంలో ఉన్న నంబర్. కానీ సరిపోతుందా? తమ అవసరాలకు సంబంధించి ఏ విధమైన లెక్కలు వేసుకోకుండా రూ.కోటి మొత్తానికి పాలసీ తీసుకుంటారు’’ అని కవర్‌ఫాక్స్ డైరెక్టర్ మహావీర్ చోప్రా పేర్కొన్నారు. ఇలా తోచిన మొత్తం కాకుండా అసలు ఎంత మేరకు బీమా తీసుకోవాలన్నది నిపుణుల సూచన... రూ.కోటిని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే... 7 శాతం వడ్డీ రేటుపై ప్రతీ నెలా రూ.58,333 ఆదాయం లభిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నేటి జీవన అవసరాలకు ఇది సరిపోతుంది. కానీ, అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకుని, ద్రవ్యోల్బణ ప్రభావం, ఆదాయపన్ను ప్రభావాలను కూడా చూస్తే రూ.కోటి పెద్ద మొత్తం కాదన్నది నిపుణుల అభిప్రాయం. పిల్లల విద్య, వివాహం, జీవిత భాగస్వామి పదవీ విరమణ అనంతర జీవిత అవసరాలకు ఏక మొత్తంలో నిధిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇంటి రుణం తీసుకుని, ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉంటే, అకాల మరణంతో వచ్చే రూ.కోటి పరిహారం అతని కుటుంబ అవసరాలను 12–13 ఏళ్లకు మించి తీర్చలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇప్పటికీ సరిపడా బీమా కవరేజీ లేనివారే. 2014లో స్విస్ ఆర్ఈ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో 92 శాతం మందికి జీవిత బీమా రక్షణ కొరత ఉంది. రూ.కోటి బీమా అవసరమైన చోట సగటున రూ.8 లక్షల బీమా కవరేజీయే ఉంది. బీమా రక్షణపై తగినంత అవగాహన లేకపోవడం, పెట్టుబడి ఆధారిత బీమా పథకాలకు పరిమితం కావడం ఇందుకు కారణంగా తెలిసింది. అన్నీ చూడాలి... వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ కనీసం 10 రెట్ల మొత్తం అయినా బీమా ఉండాలన్నది సాధారణ సూత్రం. కానీ, ఇది అందరికీ సరిపోయే పరిపూర్ణ సూత్రం కాదు. ఇది ఓ వ్యక్తి రుణ బాధ్యతలను, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చెప్పే సంఖ్య కాదు. వాస్తవంగా చూస్తే ప్రతీ వ్యక్తి ఆర్థిక పరిస్థితి, అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందరికీ ఒకటే మూల సూత్రం పనికిరాదు. అందరూ ఇదే సూత్రాన్ని పాటిస్తే వారి ఆశించిన లక్ష్యం నెరవేరకపోవచ్చు. తనకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే తనపై ఆధారపడి ఉన్న వారికి ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలి? అలా ఎన్నేళ్ల పాటు అవసరం అన్న స్పష్టత ఉండాలి. ‘‘రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని ఉంటే, దాన్ని రూ.కోటి బీమా పరిహారం మొత్తం నుంచి మినహాయించి చూడాలి. మిగిలిన రూ.50 లక్షలను ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేసినా గానీ దీర్ఘకాలం పాటు ఆ వ్యక్తి కుటుంబ అవసరాలకు సరిపోదు’’ అని ఆప్టిమా మనీ మేనేజర్స్ సీఈవో పంకజ్ మంత్పాల్ తెలిపారు. గృహ రుణం ఇచ్చిన బ్యాంకులు అది తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భాల్లో, అతని కుటుంబ సభ్యులు తిరిగి బకాయిలు చెల్లించేందుకు అదనపు కాలాన్ని ఇచ్చేందుకూ అంగీకరించే పరిస్థితి లేదు. కనుక బీమా మొత్తాన్ని నిర్ణయించే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. జీవిత భాగస్వామికి చివరి వరకూ... జీవిత భాగస్వామి జీవించి ఉండేంత వరకు అవసరాలను తీర్చే విధంగానూ బీమా మొత్తం ఉండాలి. ముఖ్యంగా అతను లేదా ఆమె ఎటువంటి ఆర్జనా పరులు కాకపోయి ఉంటే, వృద్ధాప్యంలో వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా, హాయిగా జీవించేలా, ఆ అవసరాలను బీమా పరిహారం తీర్చే విధంగా ఉండాలి. వైద్య చికిత్సలు, జీవిత అవసరాలకు అయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ హెడ్ రిషి మాథుర్ సూచించారు. ప్రతీ వ్యక్తి, అతని కుటుంబ అవసరాలు భిన్నంగా ఉంటాయన్నారు. జీవిత విలువ మదింపు బీమా కవరేజీ నిర్ణయించుకునే ముందు వ్యక్తి ‘జీవిత విలువ’ను కూడా అంచనా వేసుకోవాలంటారు నిపుణులు. అంటే ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి తన మిగిలిన జీవితంలో ఎంత మేర సంపాదించుకోగలరన్నది. ఈ మొత్తం నుంచి సగటు ద్రవ్యోల్బణ అంచనాను తీసివేయాలి. అంటే, నేటి అవసరాలను భవిష్యత్తులోనూ కొనుగోలు చేసే సామర్థ్యం ఉండేలా చూడాలి. ఈ జీవిత విలువ నుంచి బీమా తీసుకునే వ్యక్తి వ్యక్తిగత ఖర్చులను తీసేయాలి. దీంతో తన కుటుంబానికి ఎంత మేర అవసరం అవుతుందన్నది లెక్క వస్తుంది. ద్రవ్యోల్బణం అంచనా భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసే సమయంలో కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే కుటుంబ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. 2018లో నెలకు రూ.50,000 అవసరం ఉంటే, 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా మేరకు చూస్తే... ఐదేళ్ల తర్వాత అదే కుటుంబం అవసరాలకు రూ.70,000 కావాల్సి ఉంటుంది. ఇక పదేళ్ల తర్వాత 2028లో ఇదే ద్రవ్యోల్బణం అంచనా ప్రకారం చూస్తే ప్రతీ నెలా అవసరాల కోసం రూ.లక్ష అవసరం అవుతుంది. బీమా రక్షణ అన్నది ఈ మేరకు అవసరాలను తీర్చేదై ఉండాలి. అందుకే నిపుణులు బీమా పాలసీ తీసుకోవడంతోపాటు ప్రతీ ఐదేళ్లకొకసారి అది ఏ మేరకు సరిపోతుందన్నది సమీక్షించుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా వివాహమై పిల్లలు కలిగితే వ్యయాలు పెరిగిపోతాయి. కొన్ని పాలసీల్లో ప్రతీ ఐదేళ్ల కొకసారి బీమా కవరేజీ మొత్తం పెరిగే ఆప్షన్ కూడా ఉంది. దీన్నే లైఫ్ స్టేజ్ ఎన్హాన్స్మెంట్ అంటారు. ఇటువంటి పాలసీ తీసుకుంటే బీమా కవరేజీని ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇలా పాలసీలోనే ఇన్‌బిల్ట్ ఫీచర్ ఉంటే ఎంతో సౌకర్యం. ఎందుకంటే మధ్యలో స్వయంగా పెంచుకోవాలంటే వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. అలా అని అందరికీ పెద్ద మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం పడకపోవచ్చు. ‘‘తమపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు రక్షణనిచ్చేదిగా ఉంటే చాలు. ఒకవేళ తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, టర్మ్ ప్లాన్‌కు దూరంగాను ఉండొచ్చు’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ ప్రేరణ సలాస్కర్ సూచించారు. -
ఆకలి లౌకికమా?!
పండిట్ శేఖరమ్ గణేష్ దియోస్కర్ హితవాది పత్రిక సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఒకరోజు ఆయన తన మిత్రులిద్దరితో స్వామి వివేకానందను కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఇద్దరి మిత్రులలో ఒకరు పంజాబీ అని తెలుసుకున్న స్వామీజీ, అప్పుడు పంజాబ్‌లో నెలకొని ఉన్న తీవ్ర ఆహార కొరతను గురించి వారితో ఆదుర్దాగా మాట్లాడారు. ఆ సమయంలో భారతదేశంలో తాండవిస్తున్న కరువు కాటకాలను గురించే స్వామీజీ మనస్సులో మథన పడుతున్నారు. అందువల్ల వచ్చిన సందర్శకులతో ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి అసలు మాట్లాడనే లేదు. స్వామీజీ నుంచి సెలవు పుచ్చుకునే సమయంలో ఆ పంజాబీ వ్యక్తి అసంతృప్తి వెలిబుచ్చుతూ ఇలా అన్నాడు : ‘‘మహాశయా, ఆధ్యాత్మికపరమైన విషయాలను మీ ముఖతా వినాలని మేము ఆసక్తితో ఎదురు చూశాం. కాని దురదృష్టవశాత్తూ మన సంభాషణ లౌకిక విషయాల మీదకు వెళ్లింది. మన సమయం వృథా అయిందని భావిస్తున్నాను’’ అన్నారు. ఈ మాట వినగానే స్వామీజీ గంభీర ముద్ర దాల్చి ఇలా స్పందించారు : ‘‘మహాశయా! నా దేశంలో ఒక వీధి కుక్క సైతం పస్తున్నా, దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే అప్పటికి నా వంతు అవుతుంది’’ అన్నారు. స్వామీజీ మహాసమాధి తర్వాత కొన్ని సంవత్సరాలకు పండిట్ దియోస్కర్ ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆనాటి స్వామీజీ వచనాలు తన మనస్సులో చెరగని ముద్రవేసి దేశభక్తి అంటే ఏమిటో నిజమైన ఆర్థాన్ని ప్రప్రథమంగా తెలియజేశాయని చెప్పాడు. మంటే మట్టి కాదు.. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, జప తపాలు మాత్రమే కాదు అని దీని అర్థం. -
పన్నుభారం... తగ్గించుకుందాం!
ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరే!! కాకపోతే కొందరు పన్ను తగ్గించుకోవటానికి తాము గరిçష్టంగా ఎంత పొదుపు చేయగలమో అంతా చేస్తారు. ఆ రకంగా పొదుపును కూడా పెంచుకుంటారు. ఇవన్నీ ప్రతిబింబించేలా పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. మరికొందరు మాత్రం నామమాత్రపు కార్యక్రమంగా కానిచ్చేస్తుంటారు. తమకున్న అన్ని రకాల ఆదాయం, ఖర్చులు, వాటికి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉన్న మినహాయింపుల గురించి అవగాహన కలిగిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. దీంతో ఆ మినహాయింపులను ఉపయోగించుకోరు. ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద ఉన్న పన్ను మినహాయింపుల గురించే సాధారణ అవగాహన ఉంటుంది తప్ప, ఇతర సెక్షన్ల గురించి తెలిసిన వారు కూడా తక్కువ మందే!! కొంత సమయం వెచ్చించి అవేంటన్నది తెలుసుకుంటే మినహాయింపుల ద్వారా పన్ను భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్‌పై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమవుతుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఏటా ఈ వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్‌పై వడ్డీకి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంతకు మించితే మాత్రం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు మినహాయింపు అంటే... మొత్తం ఆదాయంలో రూ.10,000 తగ్గించి చూపించుకోవడం అని పొరపడొద్దు. ఇతర ఆదాయం కాలమ్‌లో వడ్డీ ఆదాయాన్ని చూపించి అది రూ.10 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అది ఈ సెక్షన్ కిందికి రాదు. ఇంటి అద్దె చెల్లింపులు... చట్టంలోని సెక్షన్ 80జీజీ ప్రకారం, వేతన ప్యాకేజీలో భాగంగా హెచ్ఆర్ఏ లేకపోతే... వేతన ఉద్యోగి కాని వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. తన పేరు, తన జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట ఇల్లు ఉండి, ఆ ఆంట్లో నివసిస్తుంటే మాత్రం ఈ ప్రయోజనానికి అనర్హులు. మొత్తం ఆదాయంలో 10 శాతాన్ని అద్దెగా చెల్లిస్తుంటే లేదా, మొత్తం ఆదాయంలో 25% లేదా ప్రతీ నెలా రూ.5,000 మొత్తం వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఆదాయం అంటే సెక్షన్ 80సీ, 80యూ, 80జీజీ కింద మినహాయింపులు పోనూ మిగిలింది. తీవ్ర అనారోగ్యాలు, వ్యాధులు ఈ వ్యయాలను 80డీడీబీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా రూ.40,000 వరకు చేసే ఖర్చుకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయితే ఈ పరిమితి రూ.60,000. సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్లకుపైన) అయితే... పరిమితి రూ.80,000. అయితే, ఈ వ్యాధులకయ్యే ఖర్చును బీమా పాలసీ ద్వారా పొందితే పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండదు. పాక్షికంగా రీయింబర్స్మెంట్ వస్తే, మిగిలిన మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు లేదా అతని జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణులకు సంబంధించి ఖర్చు చేసినా ఈ చట్టం కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు... నివసిస్తున్న భవనం కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. 2016 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణం తీసుకుని ఉండాలి. ఇంటివిలువ రూ.50 లక్షల్లోపు, రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. అలాగయితే సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పైన ఉంటే, అప్పుడు సెక్షన్ 80ఈఈ కింద మరో రూ.50వేలకు పన్ను మినహాయింపు పొందే అవకాశముంది. హోమ్ లోన్ అనుబంధ చార్జీలకూ... ఇంటి రుణం తీసుకునే సమయంలో చేసే ఇతర చెల్లింపులక్కూడా పన్ను మినçహాయింపు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజుపైనా సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చెల్లింపులను సైతం వడ్డీగానే చట్టం పరిగణిస్తోంది. డౌన్ పేమెంట్... రుణాల కోసం కొందరు స్నేహితులు లేదా తెలిసిన వారి నుంచి చేబదులు తీసుకుని డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటారు. ఈ మొత్తంపై వడ్డీ చెల్లించినా సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, ఆధునికీకరణ, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులు సైతం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వైకల్యం కలిగిన వారికి... 40 శాతం వైకల్యం కలిగిన వారు వార్షికంగా రూ.75,000 వరకు సెక్షన్ 80యూ కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. తమపై వైకల్యం కలిగిన వారు ఆధారపడి ఉన్నా గానీ, వారిపై చేసే ఖర్చులకు సెక్షన్ 80డీడీ కింద 75,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ వైకల్యం తీవ్రత 80 శాతంపైన ఉంటే అప్పుడు వార్షికంగా రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే పెట్టుబడులపై వచ్చే ఆదాయం తమ ఆదాయం కిందే చూపించి పన్ను చెల్లించాలి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా వైకల్యంతో ఉంటే, వారి పేరిట చేసే పెట్టుబడులకు ఇది వర్తించదు. వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట పెట్టుబడులపై ఆదాయం తండ్రి ఆదాయంగా చట్టం చూడదు. కనుక పన్ను వర్తించే పెట్టుబడులను వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట చేసుకుంటే పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. నష్టాలు చూపించుకోవచ్చు... గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై నష్టపోయిన వారు, అదే సంవత్సరంలో షేర్లు, ప్రాపర్టీ, బంగారం, డెట్ ఫండ్స్ విక్రయంపై వచ్చిన మూలధన లాభాల పన్ను నుంచి నష్టాలను మినహాయించుకోవచ్చు. స్వల్ప కాలిక మూలధన నష్టాలను, స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది. వివిధ సంస్థలకు విరాళాలిస్తే... విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయంలో ఇది 10 శాతాన్ని మించకూడదు. ముఖ్యంగా ఈ సెక్షన్ కింద ప్రభుత్వం నోటిఫై చేసిన ఫండ్స్‌కు ఇచ్చే విరాళాలకే ఈ పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే, నగదు రూపంలో విరాళం రూ.2,000 మించి ఇస్తే మినహాయింపునకు అవకాశం లేదు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు ఉపశమన నిధి, జాతీయ చిన్నారుల నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, క్లీన్ గంగా ఫండ్ తదితరమైనవి ప్రభుత్వం నోటిఫై చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే, ఆలయాలు, చర్చిలు, మసీదుల నవీకరణకు ఇచ్చే విరాళాలకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రత్యేకమైన పరిశోధనలు లేదా యూనివర్సిటీ లేదా కాలేజీలను ప్రభుత్వం సెక్షన్ 35(1)(2), సెక్షన్(1)(3), 35సీసీఏ, 35సీసీబీ కింద ఆమోదించి ఉంటే, వీటికి చేసే విరాళాలకు సెక్షన్ 80జీజీఏ రూ.10,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందుకు నగదు రహితంగానే విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం రూపంలో లేదా వృత్తి రూపంలో ఆదాయం కలిగిన వారికి ఈ ప్రయోజనం లేదు. వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలపైనా సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు పరిమితి లేదు. ఎంత మొత్తాన్నయినా విరాళంగా అందించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే నగదు రహితంగానే విరాళాలు అందించి ఉండాలి. వైద్య బీమా ప్రీమియం చెల్లిస్తే.. వైద్య బీమా పాలసీకి ఏటా చెల్లించే ప్రీమియం మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, వారి జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు వీరిలో ఎవరి పేరిట తీసుకున్నా గానీ, చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా తన పేరిట, జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే వైద్య బీమా ప్రీమియం రూ.25,000పై ఈ పరిమితి పొందొచ్చు. దీనికి అదనంగా తల్లిదండ్రుల వైద్య బీమా పాలసీకి చేసే చెల్లింపులు మరో రూ.25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీరు 60 ఏళ్లు దాటిన వారు అయితే రూ.30,000 వరకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) అయితే, ఏ సభ్యులు ప్రీమియం చెల్లించినా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం చేసే చెల్లింపులు రూ.5,000 వరకు కూడా మినహాయింపు అమల్లో ఉంది. విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు ఉన్నత విద్య కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులకు సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా చట్టబద్ధంగా వేరెవరైనా విద్యార్థి తన సంరక్షణలో ఉంటే, వారి పేరిట తీసుకునే విద్యా రుణాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కేవలం వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు, అది కూడా రుణం తీసుకున్న తర్వాత ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్ తర్వాత చేసే ఉన్నత విద్యా కోర్సుల కోసం తీసుకునే రుణాలకే ఈ ప్రయోజనం. వడ్డీ రూపంలో చెల్లింపుల పరిమితి లేదు. ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాయల్టీ ఆదాయానికీ మినహాయింపు... రచయితలకు వారి రచనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, వార్షికంగా రూ.3 లక్షలకు సెక్షన్ 80క్యుక్యుబి ప్రకారం పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రాయల్టీ ఆదాయం ఏక మొత్తంలో వచ్చి ఉండాలి. ఏక మొత్తంలో కాకుండా వాయిదాలుగా అందుకుంటే మాత్రం రాయల్టీ ఆదాయంలో 15 శాతానికే పన్ను మినహాయింపు పరిమితం అవుతుంది. మేథో సంపత్తి హక్కులు 2003 ఏప్రిల్ 1 తర్వాత నమోదయిన ఏ పేటెంట్ ద్వారానైనా రాయల్టీ ఆదాయం అందుకుంటుంటే సెక్షన్ 80ఆర్ఆర్బి కింద ఒక ఏడాదిలో రూ.3లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. పన్ను వర్తించని ఆదాయాన్ని చూపించాలి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం కచ్చితంగా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ, 80 శాతం పన్ను చెల్లింపుదారులు వడ్డీ ఆదాయాన్ని చూపించడంలేదని ట్యాక్స్ స్పానర్ అనే పోర్టల్ పరిశీలనతో తేలింది. పన్ను చెల్లించకూడదన్న ఉద్దేశంతో, పన్ను నోటీసు అందుకోకూడదన్న అభిప్రాయంతో ఈ ఆదాయాన్ని చూపించడం లేదని ట్యాక్స్ స్పానర్ డాట్ కామ్ సీఎఫ్‌వో కౌశిక్ చెప్పారు. ♦ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పన్ను లేదని పైన చెప్పుకున్నాం. నిజానికి రూ.2.5 లక్షలను ఏడాది పాటు బ్యాంకులో ఉంచితే ఈ మేరకు వడ్డీ ఆదాయం వస్తుంది. రూ.10,000కు పైన వడ్డీ ఆదాయం అందుకునే వారు తక్కువ మందే ఉంటారు. కానీ, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం రూ.10,000లోపు ఉన్నా పన్ను రిటర్నుల్లో తప్పకుండా ఆ ఆదాయాన్ని చూపించాలి. ♦ ఐటీఆర్–1లో ఎగ్జెంప్ట్ ఇన్కమ్ అనే కాలమ్‌లో ఇలా పన్ను రహిత ఆదాయాన్ని పేర్కొనాలి. ♦ డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఉంటే సెక్షన్ 10 (34) కింద పన్ను ఉండదు. అలాగే, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ రూపంలో వచ్చే ఆదాయం లేదా పరిహారానికి సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ఉంది. వీటిని సైతం రిటర్నుల్లో పేర్కొనడం ద్వారా పన్ను అధికారులకు సందేహాలు తలెత్తితే సమాధానం చెప్పడం సులభం అవుతుందని నిపుణుల సూచన. ♦ ఇక అధిక విలువతో కూడిన పెట్టుబడుల వివరాలను కూడా పన్ను రిటర్నుల్లో పేర్కొనాలని సూచిస్తున్నారు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించాలా? ♦ ఇక్కడ నివసించేవారు, ఎన్ఆర్ఐలకు వేర్వేరుగా నిబంధనలు ♦ ఎన్ని రోజులున్నారన్న అంశం ఆధారంగా వర్గీకరణ ♦ స్వదేశంలో ఉండే వారు విదేశీ ఆదాయం చూపించాల్సిందే ♦ ఎన్ఆర్ఐలు భారత్‌లో ఆదాయాన్ని రిటర్నుల్లో పేర్కొనాలి ♦ రిటర్నుల దాఖలు పత్రాలు కూడా వేరే పనిచేస్తున్న కంపెనీ తరఫున కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి విదేశీ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వీరు ఆర్జించే విదేశీ మారకాన్ని తమ పన్ను రిటర్నుల్లో చూపించాలా? స్వదేశానికి వెలుపల ఆర్జించిన మొత్తంపై పన్నుకు సంబంధించి నిబంధనలేంటి? విదేశీ ఆర్జనను పన్ను రిటర్నుల్లో ఎలా చూపించాలి? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానమే ఈ కథనం... విదేశీ ఆదాయం భారతీయ పన్ను చట్టాలు పన్ను చెల్లింపుదారులను ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు స్వదేశంలో ఉన్నారనే వివరాల ఆధారంగా వారిని నివాసితులు (రెసిడెంట్), నివాసేతరులు (నాన్ రెసిడెంట్)గా వర్గీకరించింది. వారి నివాస హోదాకు అనుగుణంగా భారతీయ పన్ను చట్టాల పట్ల వారికున్న బాధ్యతను విస్తృతంగా నిర్వచించాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ తమ హోదాను బట్టి వారు తమ ఆదాయాన్ని చూపించాలి. పన్ను చట్టాల ప్రకారం... దేశంలో నివసించే ప్రతి పౌరుడూ, దేశం వెలుపల తాను ఆర్జించిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ అయితే కేవలం భారత్‌లో ఆర్జించిన దాన్నే స్వదేశంలో దాఖలు చేసే రిటర్నుల్లో చూపిస్తే సరిపోతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో స్వదేశంలోను, విదేశంలోనూ ఒక కంపెనీ తరఫున పనిచేయడం ఇటీవల సాధారణంగా కనిపిస్తోంది. కంపెనీలు కొందరు ఉద్యోగులను విదేశాల్లోని కార్యాలయాల్లో విధుల కోసం కొంత కాలం పాటు పంపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను తరచుగా ఇలా పంపిస్తున్నాయి. ఆ పనికి చెల్లింపులను విదేశీ కార్యాలయం చేస్తుంటుంది. అప్పుడది విదేశీ ఆర్జన అవుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఇంటి నుంచి అద్దె రూపంలో కొందరికి ఆదాయం ఉండొచ్చు. ఇటువంటి ఆదాయాన్ని భారత్‌లో నివసించే వారు తప్పకుండా తమ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలు ఈ తరహా వ్యక్తులు అంటే విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించదలిస్తే వారికి ఐటీఆర్–1 వర్తించదు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించే వారు ఐటీఆర్–2ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్–2 లేదా ఐటీఆర్–3 ఈ రెండింటిలో ఒక దానిని వారి ఆదాయ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎఫ్ఎస్ఐ షెడ్యూల్లో చూపించాలి. రెండు పన్నులు భారత్‌లో నివసించే వారు తమ విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించి ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి అని చెప్పుకున్నాం. అయితే, ఒకవేళ పన్నులను విదేశాల్లోనే మినహాయిస్తే ఆ ఆదాయాన్ని ఇక్కడ చూపించి పన్ను చెల్లిస్తే అప్పుడు రెండు సార్లు పన్నులు చెల్లించినట్టు అవుతుంది. అందుకే ఒకసారి పన్ను మినహాయిస్తే దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. పలు దేశాలతో మనకు ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం ఉంది. విదేశీ ఆదాయంపై పన్నును అక్కడే మినహాయించేస్తే ఇక్కడ మరోసారి పన్ను చెల్లించే పని లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్నే విదేశీ పన్ను జమగా (ఎఫ్‌టీసీ) పేర్కొంటారు. -
ప్రైవేటు బీమా కంపెనీల అడ్డగోలు దారులు!
ముంబై: ప్రైవేటు బీమా సంస్థలు బ్యాంకుల భాగస్వామ్యంతో విక్రయించే పాలసీల విషయంలో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రావడంతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) రంగంలోకి దిగింది. సాధారణంగా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని పాలసీలను విక్రయిస్తుంటాయి. అయితే, కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల విక్రయంపై నిబంధనలకు మించి అధిక కమీషన్లు, ప్రతిఫలాలను బ్యాంకులకు ఆఫర్ చేస్తున్నట్టు ఐఆర్డీఏ దృష్టికి వచ్చిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం... ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ‘‘కొన్ని పెద్ద బీమా కంపెనీలు, వాటి మాతృ సంస్థలు పలు బ్యాంకుల వద్ద కరెంటు అకౌంట్ బ్యాలన్స్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాలన్స్‌లపై వడ్డీని బీమా కంపెనీలు వదులుకుంటున్నాయి. బీమా ఉత్పత్తుల విక్రయంపై పరిహారంగా వాటిని పరిగణిస్తున్నాయి. దీంతో ఈ విధమైన చర్యలు పాలసీదారుల ప్రయోజనాలకు చేటు చేస్తాయని, బ్యాంకుల్లో ఉంచే ఈ డిపాజిట్లపై రాబడులు సున్నాయే’’నని ఆ అధికారి వివరించారు. ఈ తరహా విధానాలు ఐఆర్డీఏ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిపారు. దీనిపై ఐఆర్డీఏ ప్రభుత్వానికి తెలియజేయగా, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఆమోదం లభించినట్టు చెప్పారు. ‘‘కార్పొరేట్ ఏజెన్సీ నిబంధనల మేరకు బ్యాంకుల ద్వారా బీమా కంపెనీలు పాలసీలను విక్రయిస్తే, వాటిపై బ్యాంకులకు కేవలం కమీషన్లను మాత్రమే ఇవ్వాలి. ఇక బ్యాంకులు బీమా సంస్థలకు మార్కెట్ రేటు కంటే అధిక ఫారెక్స్ రేట్లను ఆఫర్ చేయడం, మార్కెట్ రేటు, ఆఫర్ చేసిన రేటు మధ్య వ్యత్యాసం బ్యాంకులకు పాలసీలను విక్రయించినందుకు ప్రోత్సాహకరంగా వెళుతోంది. అలాగే, చాలా బీమా కంపెనీలు బ్యాంకుల ఏటీఎంలపై తమ ఉత్పత్తుల ప్రకటనలను ప్రదర్శించినందుకు ఫీజులు చెల్లిస్తున్నా యి. నిజానికి బ్యాంకులు ఫీజులు వసూలు చేయరాదు. ఆ భారాన్ని అవే భరించాలి. కానీ, ఈ ఫీజుల భారం పాలసీదారులపైనే పడుతోంది’’ అని అన్నారు. -
అడుగుకో అక్రమ ఫైనాన్షియర్
సాక్షి, హైదరాబాద్: అవసరాలకు అప్పులిస్తూ అధిక వడ్డీలు వసూలు చేసి అక్రమ దందా సాగిస్తున్న లింగోజిగూడకు చెందిన తండ్రీకొడుకులు హేమ్రాజ్, సాయిబాబాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇలాంటి వ్యవహారాలు రాజధానిలోని మూడు కమిషనరేట్లలో సర్వసాధారణం. గతంలో ఓసారి సిటీ పోలీసులు ఈ అక్రమ ఫైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపారు. దీనిపై ‘ఫిర్యాదు’చేయడానికి ఓ ఉన్నతాధికారిణి దగ్గరకు ఓ యూనియన్ వచ్చింది. వారిని చూసిన సదరు అధికారి ‘మీ అందరికీ లైసెన్స్‌లు ఉన్నాయా?’అంటూ ప్రశ్నించగా... ‘అవి ఎక్కడ తీసుకోవాలి?’అని అడిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు ఉదాహరణలు చాలు నగరంలో సగానికంటే ఎక్కువ ఫైనాన్స్ సంస్థలు అక్రమంగా నడుస్తున్నాయని చెప్పడానికి. రాజధానిలో డైలీ ఫైనాన్షియర్లు, పాన్‌బ్రోకర్లు దాదాపు పది వేల మందికి పైగా ఉంటారని పోలీసుల అంచనా. వీరిలో సగం కంటే తక్కువమందే రెవెన్యూ నుంచి లైసెన్స్‌లు తీసుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ వారి దందా యథేచ్ఛగా సాగుతోంది. అడుగడుగునా ఉల్లంఘనలే... నగరంలోని పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోజుకు 18 శాతం వరకు వడ్డీ వసూలు చేసేవారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అప్పటికే ఫైనాన్స్ ఉన్న ద్విచక్ర, తేలికపాటి వాహనాలపై వీరు రీ–ఫైనాన్స్ సైతం చేస్తుంటారు. చిరు వ్యాపారులకు ఉదయం రూ.900 ఇచ్చి సాయంత్రానికి వారి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తుంటారు. ఇవన్నీ ఎక్కడా రికార్డుల్లోకి ఎక్కవు. కేవలం నోటి మాటలు, చిత్తుకాగితాల పద్దులతో నడిచిపోతుంటాయి. ఫలితంగా లైసెన్స్, ఆదాయ పన్ను సహా ఇతర పన్ను వంటివి వీరికి తెలియని విషయాలుగా మారిపోయాయి. ఆయా అధికారులకు ఈ ఉల్లంఘనలపై సమాచారం అందించే నాథుడు లేకుండా పోయాడు. ఎప్పుడైనా ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు అందినా.. తగిన సిబ్బంది, వనరులు లేక అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రికవరీలకు ప్రైవేట్ సైన్యాలు ఈ దందాలో దేహదారుఢ్యం కలిగిన ‘ప్రైవేట్ సైనికులకు’డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మొండి బకాయిలు రాబట్టుకోవడానికి బెదిరింపులు, అవసరమైతే కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడటం వీరి అనధికారిక విధి. ఇలాంటి ప్రైవేట్ సైన్యాలు దాదాపు ప్రతి ఫైనాన్షియర్ అధీనంలోనూ పని చేస్తుంటాయి. వీరి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నా బా«ధితులు మాత్రం ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. సదరు ఫైనాన్షియర్లతో ‘మళ్లీ అవసరం’వస్తుందనే భయమే దీనికి ప్రధాన కారణం. అందరికీ తెలిసినా చర్యలు శూన్యం... ఈ వ్యవహారాలు రాజధానిలోని మూడు కమిషనరేట్లలో జరిగేవే. పాతబస్తీతో పాటు సికింద్రాబాద్, పాట్ మార్కెట్, బేగంబజార్, సిద్ధి అంబర్‌బజార్, అమీర్‌పేట్, కోఠి, సుల్తాన్‌బజార్ ఇలా అనేక ప్రాంతాల్లో నిత్యకృత్యాలే. నగరానికి చెందిన కొందరు పాన్‌బ్రోకర్లు అనేక మంది బడా వ్యాపారులకు బినామీలుగా ఉంటూ వ్యవహారాలు సాగిస్తున్నారు. వీరిలో కొందరు అధికారులకు నిత్యం ‘అవసరాలు’ తీరుస్తుంటారని సమాచారం. ఆటో ఫైనాన్షియర్లే ఎక్కువగా ప్రైవేట్ సైన్యాలు నిర్వహిస్తున్నారు. వీరి వ్యవహారాలపై ‘సమాచారం, ఫిర్యాదు లేకపోవడంతో’ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. రాచకొండ పోలీసులు పట్టుకున్న ఇద్దరే కాదు.. పక్కాగా నిఘా ఉంచితే ప్రతి రోజూ పదుల సంఖ్యలో అక్రమ ఫైనాన్షియర్లు పట్టుబడతారు. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మాత్రమే స్పందించి హడావుడి చేసే పోలీసులు, ఇతర విభాగాల అధికారులు ఆపై మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. -
ఇంటి రుణం.. వడ్డీ మినహాయింపు
ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు ఎలా ఉంటుంది? ఏ మేరకు వర్తిస్తుంది? ఎంత పొదుపు చేయొచ్చు? ఇవన్నీ ఈ సారి ట్యాక్స్ కాలమ్‌లో చూద్దాం... సెక్షన్ 80 ఈఈ ప్రకారం రూ.50,000... 1–4–2017 నుంచి అమల్లోకి వచ్చిన నియమాల ప్రకారం ఇంటి రుణం మీద వడ్డీ రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది. అయితే కొన్ని నిబంధనలకు లోబడి ఈ మినహాయింపు ఉంటుంది. అవి... 1. ఇది వ్యక్తులకు మాత్రమే. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఏర్పడ్డ బ్యాంకుల నుంచే రుణం తీసుకోవాలి. 3.ఇంటి రుణం మంజూరు కోసం ఏర్పడిన పబ్లిక్ కంపెనీ అయినా ఫరవాలేదు. 4. ఇంటి నిమిత్తం రుణం తీసుకోవాలి. 5. 1–4–2016 నుంచి 31–3–2017 మధ్య మంజూరై... ఖర్చయిన రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. 6.రుణం రూ.35,00,000పైగా ఉండకూడదు. 7. ఇంటి విలువ యాభై లక్షలు దాటకూడదు. 8.రుణం తీసుకున్న రోజు నాటికి వ్యక్తికి సొంతిల్లు ఉండకూడదు. 9. ఈ వడ్డీ మినహాయింపు మరే ఇతర సెక్షన్ ప్రకారం పొందకూడదు. 10. ఇది 1–4–2016 తర్వాత ఇల్లు కట్టుకున్న లేదా కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుంది. పట్టణాల్లో ఈ బడ్జెట్ల ఇల్లు లోబడ్జెట్ ఇల్లనే చెప్పాలి. అయితే అంతకు ముందు కొన్న ఇల్లు విషయంలో తీసుకున్న రుణాల విషయంలో సెక్షన్ 24 ప్రకారం ఇచ్చిన వడ్డీ తగ్గింపులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంటి విషయంలో వడ్డీ రూ.2,00,000 దాటి ఇచ్చే వారు కాదు. అలాగే అద్దెకిచ్చిన ఇంటి రుణం విషయంలో వడ్డీ మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సెక్షన్ 71బి కొత్తగా తెచ్చి, కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎన్ని ఇళ్ల మీద రుణాలున్నా వడ్డీ మొత్తాన్ని రూ.2,00,000 దాటి సర్దుబాటు చేయరు. సర్దుబాటు కాని వడ్డీ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు... ఒక వ్యక్తి నికర జీతం రూ.15,00,000 అనుకోండి. సొంత ఇల్లుంది. అప్పు కూడా ఉంది. రుణం మీద వడ్డీ రూ.1,00,000 అనుకోండి. ఇది కాకుండా మరో ఇల్లును రుణం మీద కట్టించాడు. అది అద్దెకిచ్చాడు. అద్దె నెలకు రూ.10,000. రుణం మీద వడ్డీ రూ.3,00,000 అనుకోండి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్‌ను లెక్కిస్తే.. ఈ కేసులో ఒకప్పుడు రూ.3,18,600 పూర్తిగా సెటాఫ్ చేసేవారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తం నష్టంలో కేవలం రూ.2,00,000 సర్దుబాటు చేస్తారు. మిగిలిన సర్దుబాటు కాని మొత్తాన్ని రూ.1,18,600 తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2018–19) సర్దుబాటు చేస్తారు. ఈ మార్పు వ్యక్తులకు పన్నుభారం పెంచుతుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఇన్కమ్ ట్యాక్స్‌ను లెక్కించండి. -
వడ్డీ లేని రుణానికి క్యూ!
డీమోనిన్యూఢిల్లీ: వడ్డీ ఉండదు. అసలు మొత్తాన్నే నెలసరి వాయిదాల్లో చెల్లించొచ్చు. ఇదే... నో కాస్ట్ ఈఎంఐ. ఇపుడు ఎంత ఖరీదైన వస్తువైనా ఈ ‘నో కాస్ట్ ఈఎంఐ’ సదుపాయంతో కొనుగోలు చేసే ధోరణి పెరిగిపోతోంది. దీంతో ఈ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు మొత్తం అమ్మకాల్లో నోకాస్ట్ ఈఎంఐపై వైట్ గూడ్స్ (రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు తదితర ఉత్పత్తులు) విక్రయాలు 25 శాతంగా ఉంటే, ప్రస్తుతం అవి 40 శాతానికి చేరాయి. ఈ మార్కెట్ ఎంత శరవేగంగా వృద్ధి చెందుతుందో చెప్పటానికి ఈ గణాంకాలు చాలు. అందుకే ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హోమ్ క్రెడిట్ ఇండియా, టీవీఎస్ గ్రూపు ఈ మార్కెట్ అవకాశాలను అందుకునేందుకు చొరవ చూపిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ మార్కెట్లో లీడర్‌గా ఉంది. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 25 శాతం ఫైనాన్స్‌పైనే జరుగుతుండడం వినియోగదారుల ఆసక్తిని తెలియజేస్తోంది. డీమోనిటైజేషన్‌కు ముందు ఇది 10 శాతమే. దేశీయ వైట్‌గూడ్స్, స్మార్ట్ఫోన్ల మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని, ఏటా ఇది 10 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని అంచనా. డీమోనిటైజేషన్ తర్వాత వినియోగదారుల ఆలోచనలు మారాయని, నగదు రహిత లావాదేవీలు పెరిగాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్‌నంది తెలిపారు. వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు టైర్–2, టైర్–3 పట్టణాల్లోకి చొచ్చుకుపోవడంతో ఫైనాన్స్ పథకాల విస్తరణ పెరిగిందన్నారు. పోటీ పడుతున్న కంపెనీలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు తమ సబ్సిడరీల ద్వారా సున్నా వడ్డీ రుణ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అనుబంధ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, టీవీఎస్ గ్రూపులు ఇప్పటికే డ్యురబుల్స్, స్మార్ట్ఫోన్ల ఫైనాన్స్ మార్కెట్లో పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాయి. బ్యాంకుల పరిధిలోని వైట్‌గూడ్స్ ఫైనాన్స్ మార్కెట్ 2017లో రూ.18,400 కోట్లకు పరిమితం కావడం గమనార్హం. దీంతో ఈ మార్కెట్లో ఉన్న భారీ అవకాశాలు ఎన్బీఎఫ్సీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. హోమ్ క్రెడిట్ సంస్థ ఎల్జీ, శామ్సంగ్తో కస్టమర్లకు సున్నా వడ్డీకి రుణాలిచ్చేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ‘‘కొత్త కస్టమర్లే మా లక్ష్యం. నగదు రహిత లావాదేవీలు మాకు పెద్ద అవకాశం’’ అని హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ ఆర్టెమ్ పొపోవ్ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ సోనీ, ఇంటెక్స్ కంపెనీలతో టైఅప్ అయి సున్నా వడ్డీ రుణాలను ఆఫర్ చేస్తోంది. మెట్రోల్లో అధికం మెట్రోల్లో మొత్తం జరిగే కన్జ్యూమర్ ఉత్పత్తుల విక్రయాల్లో ఫైనాన్స్‌పై జరిగేవి 60 శాతానికి చేరినట్టు ముంబై కేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్ చెయిన్ సంస్థ విజయ్‌సేల్స్ మేనేజింగ్ పార్ట్నర్ నీలేశ్ గుప్తా తెలిపారు. పెద్ద పట్టణాల్లో రానున్న కాలంలో మొత్తం విక్రయాల్లో ఫైనాన్స్ మార్కెట్ 70–75 శాతానికి వృద్ధి చెందగలదన్నారు. పలు బ్యాంకులు డ్యురబుల్, ఎలక్ట్రానిక్స్ ఫైనాన్స్‌లోకి ప్రవేశిస్తున్నాయని, రుణ జారీ ప్రక్రియ అంతా ఆటోమేషన్ చేయడంతో వినియోగదారులు ఈ పథకాలను ఎంచుకోవడం సులభంగా మారిందని రిలయన్స్ డిజిటల్ సీఈవో బ్రియాన్ బేడ్ తెలిపారు. -
క్రెడిట్ కార్డు విషయంలో ఇలా..
నిడమర్రు:ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. అయితే చాలామంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. కార్డు పరిమితి, చెల్లించాల్సిన ఫీజు, వడ్డీ శాతం మొదలైన వివరాలపై అవగాహన ఉండాలి. ఆ సమాచారం తెలుసుకుందాం. మొదట క్రెడిట్, డెబిట్ కార్డుమధ్య తేడా గుర్తించాలి. క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డులా డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీయబడవు. క్రెడిట్ కార్డుకి వడ్డీ కూడా ఉంటే అదనపు పాయింట్లు జోడించబడతాయి. బిల్లింగ్ చక్రంలోపు క్రెడిట్ కార్డు బిల్లు కట్టేస్తే ఆ వడ్డీని నివారించవచ్చు. ఏపీఆర్ అంటే.. వాణిజ్య ప్రకటనల్లో చూసి ఏపీఆర్ అంటే వార్షిక రేటు శాతం. ఏపీఆర్ అంటే గుర్తు ఉండకపోయినా పర్వాలేదు కానీ, మీరు క్రెడిట్ కార్డుకి దరఖాస్తు చేసేముందు సరైన ఏపీఆర్ శాతం చూసుకోవాలి. ఎందుకంటే మీ బిల్లు బాకీ ఉంటే కట్టాల్సింది ఏపీఆర్యే. కొన్ని ఏపీఆర్లు రూ.30 శాతం అంతకంటే ఎక్కువగా కూడా ఉంటాయి. ప్రామాణికం కాని ఫీజు గురించి కొన్ని క్రెడిట్ కార్డులకి ప్రామాణికం కాని ఫీజులు ఉంటాయి. మీరు అంచనా వేసిన విధంగానే వాటి పేర్లు వైవిధ్యమైనవి, మంచి క్రెడిట్ కార్డులకు ఎప్పుడూ ప్రామాణికం కాని ఫీజులు ఉండవు. అడిట్ ఫీజు, మార్పిడి ఫీజు, త్రైమాసిక టెక్నాలజీ ఫీజు, భద్రతా ఫీజు మొదలైనవి ఉండవు. కనీస చెల్లింపు కంటే ప్రతీ నెల కేవలం క్రెడిట్ కార్డు బిల్ మీద కనీసమే చెల్లించాల్సి వస్తే, కొంచెమే కదా అని చెల్లించకుండా వదిలేయవద్దు. అలాగే మొత్తం నెలలో వచ్చిన కార్డు బిల్లు కట్టేయండి. వార్షిక ఫీజు గురించి మీరు తరచూ క్రెడిట్ కార్డు వాడకపోతే, వార్షిక ఫీజు లేని క్రెడిట్ కార్డు తీసుకోవడమే మంచిది. ఈ ఫీజు ఏడాదికి రూ.100 నుంచి రూ.300 దాకా ఉంటుంది. కార్డుల ప్రయోజనం తెలుసుకోవాలి క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కొన్ని నిబంధనలు మరియు షరతులతో వస్తాయి. ఉదాహరణకు మీకు రివార్డు పాయింట్స్ ఇస్తామంటారు. కానీ అవి నాణ్యమైన వస్తువుల కొనుగోలుపై మాత్రమే ఉండవచ్చు. మరియు ప్రతీ త్రైమాసికానికి మారవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు ప్రయోజనాల గురించి క్షుణంగా తెలియకపోతే, క్రెడిట్ కార్డ్ నుంచి మొత్తం లాభం పొందలేము. కొనుగోలు చేయటం మర్చిపోకండి లెక్కలేనన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అందుకే ఏదైనా కొనుగోలు చేసేముందు వేరే వాటితో పోల్చుకుని కొనండి. బిల్లు కట్టే సమయంలో ఒత్తి డికి లోనయ్యి స్కోర్ క్రెడిట్ కార్డు తీసుకోకండి. క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విషయంలో చాలా మంది తికమకపడుతూ ఉంటారు. మీరు బిల్లులో ఇంత మొత్తం చెల్లిస్తే అని ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని మినిమమ్ బ్యాలెన్స్ అంటారు. ఈ మినిమం అమౌంట్ డ్యూలను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్టు కాదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు బాగా ఉంటాయి. అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ తుది గడువులోపు కట్టేయాలి. సాధారణంగా మనం వాడుకున్న బ్యాలెన్స్‌లో 5 శాతం మినిమం అమౌంట్ డ్యూగా వ్యవహరిస్తుంటారని గమనించాలి. -
అమెరికా ఫెడ్ రేటు పావు శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం– 1.75 శాతానికి చేరింది. ఈ ఏడాది ఇది తొలి విడత పెంపు కాగా.. మరో రెండు దఫాలుగా పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఏడాది రెండు దఫాలు, ఆ పై ఏడాది కూడా మరో రెండు విడతలు పెంచవచ్చని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. 2020లో అమెరికా వృద్ధి 2 శాతం ఉండొచ్చని, దీర్ఘకాలికంగా 1.8 శాతం ఉండొచ్చని ఫెడరల్ రిజర్వ్ అంచనా వేసింది. రెండు రోజుల సమీక్ష అనంతరం అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) బుధవారం రాత్రి ఈ మేరకు నిర్ణయాలు వెలువరించింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా జేనెట్ యెలెన్ స్థానంలో జెరోమ్ పావెల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫెడ్ రేటు పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రేటు నిర్ణయంతో అమెరికా మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. డౌజోన్స్ ఒక దశలో సుమారు 200 పాయింట్లు, నాస్డాక్ 40 పాయింట్లు లాభంలో ట్రేడయ్యాయి. -
పీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం!
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీనే కొనసాగించే అవకాశాలున్నాయి. నేడు(బుధవారం) జరిగే సమావేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈపీఎఫ్ఓ ఈ నెలలో ఈటీఎఫ్‌లపై రూ.1,054 కోట్ల రాబడులు సాధించిందని దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటును ఇవ్వడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వడ్డీరేట్లపై నిర్ణయంతో పాటు నిర్వహణ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించే ప్రతిపాదనపై కూడా నేటి సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్ఓ 2015 ఆగస్టు నుంచి ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ రూ.44,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటివరకైతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించలేదు. ఇప్పటివరకైతే ఈటీఎఫ్‌లపై 16 శాతం రాబడి వచ్చింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది. -
‘క్రెడిట్’ బాకీలకు.. బదిలీ మందు!
వరుసగా పండుగలు. ఇంటి నిండా బంధువులు. కొందరైతే పండగలకు ఊళ్లకు వెళ్లటం. ఏదైనా పండగలంటే అదనపు ఖర్చులు తప్పవు. ఆ సందడి, సంతోషాలతో పోలిస్తే ఖర్చులు పెద్ద లెక్కేమీ కావనుకోండి!!. క్రెడిట్ కార్డులున్నాయి కనక ఆ ఖర్చుల్ని అప్పటికప్పుడు తేలిగ్గానే అధిగమించేశారు. అంతా సవ్యంగా గడిచిపోయింది. కాకపోతే క్రెడిట్ కార్డుపై తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిన గడువు రానే వచ్చింది. ఇప్పుడేంటి పరిష్కారం...? సకాలంలో బకాయి చెల్లించకపోతే వడ్డీ మామూలుగా ఉండదనేది క్రెడిట్‌కార్డు వాడేవారికి తెలిసిన విషయమే. మరి వడ్డీ బాదుడు ఇష్టం లేని వారు, తమ దగ్గర తిరిగి చెల్లించేంత వెసులుబాటు కూడా లేనివారు ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కుని ఆ క్రెడిట్ కార్డు భారాన్ని దింపుకోవాలి కదా..?!! ఇదిగో... సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారికోసం ఓ ఆప్షన్ ఉంది. అది... ఆ బకాయిలను మరో క్రెడిట్ కార్డుకు బదిలీ చేసుకోవటం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం క్రెడిట్ కార్డు సంస్థలు కార్డుపై మిగిలి ఉన్న బకాయిని మరో కార్డుకు బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ...ఇలా బదిలీ చేసుకునే బకాయిలపై పరిమిత కాలం పాటు తక్కువ వడ్డీ చార్జీలను ఆఫర్ చేస్తున్నాయి. అయితే, దీన్ని చేతిలో తగినన్ని డబ్బుల్లేనపుడు చేసుకునే తాత్కాలిక సర్దుబాటుగానే చూడాలి తప్ప శాశ్వత పరిష్కారంగా చూడకూడదనేది నిపుణుల సలహా. బ్యాలెన్స్ బదిలీ కొంత కాలానికే... బ్యాలెన్స్ బదిలీ ఆప్షన్ కింద ఒక కార్డుపై చెల్లించాల్సిన రుణ బకాయిలను మరో కార్డుకు బదలాయించుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న మొత్తంపై కొత్త సంస్థ కొన్నాళ్లపాటు తక్కువ చార్జీలే తీసుకుంటుంది. ఓ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ మొత్తాన్ని వాడేసి సకాలంలో చెల్లించకపోతే పడే వడ్డీ చార్జీల కంటే బదిలీ చేసుకునే బకాయిలపై ఆయా సంస్థలు విధించే వడ్డీ చార్జీలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపులు ఆలస్యమైతే వాటిపై విధించే వడ్డీ చార్జీలు నెలవారీగా 2– 3.5 శాతం మధ్య ఉన్నాయి. అదే బదిలీ చేసుకునే బకాయిలపై ఇదే సంస్థ కేవలం 0.99 శాతమే వసూలు చేస్తోంది. కాకపోతే ఈ సదుపాయం కొంత కాలం పాటే అమల్లో ఉంటుంది. చాలా బ్యాంకులు మూడు నుంచి ఆరు నెలల వరకే తక్కువ చార్జీల అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిమిత కాలం ముగిసిన తర్వాత సాధారణ వడ్డీ చార్జీలు అమల్లోకి వస్తాయి. ఒక్క సిటీ బ్యాంకు మాత్రం బదిలీ చేసుకున్న బకాయిలపై తక్కువ వడ్డీ చార్జీలను 15 నెలల నుంచి 21 నెలల వరకు అమలు చేస్తోంది. ఎలా పనిచేస్తుంది...? కనీస అర్హతలుంటేనే బ్యాలెన్స్ బదిలీకి క్రెడిట్ కార్డు కంపెనీలు ఆమోదం తెలుపుతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు అయితే, ఇతర బ్యాంకు క్రెడిట్ కార్డుపై కనీసం రూ.15,000 బకాయి ఉంటేనే ఆ మొత్తాన్ని బదిలీ చేసుకోవటానికి ఓకే చెబుతోంది. గరిష్ట బదిలీపై కూడా పరిమితులున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు సంస్థయితే బకాయిల మొత్తంలో 75 శాతాన్నే ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తోంది. మిగిలిన 25 శాతం బకాయిలను కార్డు దారుడే సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఆన్‌లైన్‌లోనూ బ్యాలెన్స్ బదిలీకి ఎస్బీఐ అవకాశమిస్తోంది. ఇలా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ బదిలీకి సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. ఒక్కసారి విధించే ప్రాసెసింగ్ చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులయితే వడ్డీ రేట్లు, కాల వ్యవధి, ప్రాసెసింగ్ ఫీజుల్లో కస్టమర్ ఇష్టానికి అనుగుణంగా పలు ఆప్షన్లను కూడా అందిస్తున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు సంస్థ రెండు ఆప్షన్లిస్తోంది. 60 రోజుల కాల వ్యవధిని ఎంపిక చేసుకుంటే బదిలీ చేసుకునే మొత్తంపై 2 శాతం లేదా రూ.199 వీటిలో ఏది ఎక్కువయితే దాన్ని వసూలు చేస్తోంది. వడ్డీ రేటు మాత్రం ఉండదు. మరో ఆప్షన్లో ఎస్బీఐ ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీ తీసుకోదు. కాకపోతే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను 180 రోజుల కాల వ్యవధికి ఎంచుకుంటే నెలకు 1.7 శాతం చార్జ్ చేస్తోంది. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏ కార్డుకు అయితే బకాయిలను బదిలీ చేసుకున్నారో ఆ కార్డుపై క్రెడిట్ లిమిట్ ఆ మేరకు తగ్గిపోతుంది. ఇవి గుర్తుంచుకోవాలి సుమా... వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాలెన్స్ బదిలీ అనేది మెరుగైన ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, తక్కువ వడ్డీ చార్జీలు అన్నవి పరిమిత కాలం పాటే ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వ్యవధిలోపు చెల్లించలేకపోతే తిరిగి అధిక వడ్డీ చార్జీలను భరించాల్సి వస్తుంది. అయితే, బదిలీ చేసుకునే బకాయిలపైనే తక్కువ వడ్డీ చార్జీలు వర్తిస్తాయే గానీ ఆ కార్డుతో చేసే నూతన చెల్లింపులపై కాదు. ఒక్కసారే అయినా ప్రాసెసింగ్ ఫీజు విషయమూ పరిశీలించాలి. బ్యాలెన్స్ బదిలీపై ఉన్న అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత ఏది లాభదాయకం అనిపిస్తే దాన్ని అనుసరించడం మంచిది. -
వడ్డీలేని రుణం.. అందనంత దూరం!
కోవెలకుంట్ల : అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ భేషరుతుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి గద్దెనెక్కిన సర్కార్ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. పొదుపు సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోకపోవడంతో సంఘాలపై వడ్డీభారం పడి కుదేలవుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 4,770 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజి,ఎస్ఎస్జీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘం నుంచి రుణాలు తీసుకొని, ఆ రుణాలతో చీరెల వ్యాపారం, కిరాణ, కొవ్వొత్తుల తయారీ, పాడిపరిశ్రమ, తదితర యూనిట్లు స్థాపించి జీవనంసాగిస్తున్నారు. పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా సక్రమంగా చెల్లించే గ్రూపులకు ప్రభుత్వం వడ్డీలేని రుణం వర్తింప చేయాల్సి ఉండగా అరకొరగా వర్తింపజేస్తుండడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు . ఐదవ విడత జన్మభూమిని పురస్కరించుకొని ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు మాత్రమేవర్తించడంతో మిగతా గ్రూపులు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016 జూన్ వరకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులకు ఈ రుణం విడుదల అయినట్లు చెబుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించినా కొన్నిగ్రూపుల్లోని సభ్యుల ఖాతాల్లో జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సకాలంలో వడ్డీతో సహా రుణాలు చెల్లించినా నాలుగు మండలాల్లో 1,884 గ్రూపులకుమాత్రమే వడ్డీలేని రుణాలు వర్తించగా మిగిలిన గ్రూపులకు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణం వర్తిస్తుందని పొదుపు మహిళలు అప్పులు చేసి నెలనెలా వడ్డీతో సహా రుణాలు చెల్లించినా రుణం వర్తించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పొదుపు గ్రూపులన్నింటికీ వడ్డీలేని రుణంవర్తింపజేయాలని సభ్యులు కోరుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించలేదు పొదుపు గ్రూపు ద్వారా రూ. 7 లక్షల రుణం తీసుకొని బర్రెలు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం కింద రూ. 6వేలు అందజేసింది. వడ్డీలేని రుణం ఇప్పటి వరకు వర్తించలేదు. వడ్డీలకు వడ్డీలు చెల్లించడం కష్టమవుతోంది. – లక్ష్మిదేవి, చందన గ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల ఇప్పటికైనా రుణం అందించాలి పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణం వర్తింపజేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలి. మా గ్రూపు ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకొని పశుపోషణతో జీవనంసాగిస్తున్నాం. అన్ని గ్రూపులకు వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలి. – వెంకటలక్ష్మి, రామలక్ష్మిగ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల జమ అవుతోంది పొదుపు గ్రూపు సభ్యుల ఖాతాల్లో వడ్డీలేని రుణం జమ అవుతోంది. 2017 మార్చి నెలాఖరు వరకు గ్రూపులకు వడ్డీలేని రుణం మంజూరైంది. విడతలవారీగా అన్ని గ్రూపులకు వర్తిస్తుంది. – బాబు, ఏపీఎం, కోవెలకుంట్ల -
చైనా చదువుకు జై..!
న్యూఢిల్లీ : చైనాలో ఉన్నతవిద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నతవిద్యావకాశాల కోసం ఇప్పుడు బ్రిటన్ కన్నా చైనా వైపే భారతీయ విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా, 2010–11 విద్యాసంవత్సరం నుంచి వైద్యవిద్యను అభ్యసించేందుకు చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో రెండేళ్లుగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా వైద్యవిద్య సీట్లను భర్తీ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో విదేశీ వైద్య చదువులకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలోనే పొరుగునే ఉన్న చైనాలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యకోర్సులకు తక్కువ ఖర్చుతో పాటు, ఆంగ్లంలో బోధన, మెరుగైన ప్రయోగశాల (లేబొరేటరీ) సౌకర్యాలు, స్కాలర్షిప్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. దీనికితోడు చైనా వైద్య పట్టాకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఇస్తుండటం మరో సానుకూల అంశంగా మారింది. ప్రస్తుతం ఎంసీఐ గుర్తింపు ఉన్న జాబితాలో చైనాలోని 45 ప్రభుత్వ వైద్యవిద్యాసంస్థలున్నాయి. ఈ కాలేజీల్లో విదేశీ విద్యార్థుల కోసం 3,470 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చైనాలో ఉన్నతవిద్య కోసం వెళ్లే భారతీయుల సంఖ్య పదేళ్ల క్రితం వందల్లోనే ఉండేది. కానీ.. 2015లో 13,500 మంది, 2016లో 18,171 మంది ఆ దేశంలో వివిధ కోర్సులు నేర్చుకునేందుకు చైనా వెళ్లారు. ఇతర కోర్సుల విషయంలోనూ అమెరికా, యూకే తర్వాత చైనానే విదేశీవిద్యార్థులు తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. తక్కువ ఖర్చూ ఓ కారణమే! ‘పశ్చిమదేశాలతో పోల్చితే చైనాలో ఖర్చు తక్కువ, ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. నాణ్యమైన విద్యతోపాటు ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలూ చైనాపై ఆసక్తి పెంచుకునేందుకు ఓ కారణం’ అని కెరీర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కరణ్ గుప్తా పేర్కొన్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్‌లతో పాటు హ్యుమానిటీస్, సోషల్‌సైన్సెస్, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు కూడా చైనా ప్రభుత్వ స్కాలర్షిప్లు ఇవ్వడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. చైనా అధికారిక లెక్కల ప్రకారం... 2016లో అత్యధికంగా దక్షిణ కొరియా (70,540 మంది విద్యార్థులు), అమెరికా (23,838), థాయ్‌లాండ్ (23,044), పాకిస్తాన్ (18,626), భారత్ (18,171), రష్యా (17,971), ఇండోనేషియా (14,714)ల విదేశీ విద్యార్థులున్నారు. 2020 కల్లా చైనాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని నిపుణుల అంచనా. -
బాబోయ్.. ‘వడ్డీ’ జోలికెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీకి సంబంధించి వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. విపక్షాల విమర్శలు, ఫిర్యాదుల నేపథ్యంలో వడ్డీ చెల్లింపులను ఆరా తీసిన ప్రభుత్వానికి.. ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలున్నట్లు, కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీనీ వసూలు చేసినట్లు తెలిసింది. వడ్డీ లెక్కలన్నీ నిగ్గుతేల్చగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుందని తేలింది. బ్రాంచీల వారీగా రైతుల ఖాతాలు మళ్లీ పరిశీలించి ఎవరిపై వడ్డీ భారం పడింది, ఎంత చెల్లించాలి లాంటి లెక్కలు తీయ డం అసాధ్యమని, ఎక్కువ సమయం పడుతుందని సర్కారు అభిప్రాయానికి వచ్చింది. మూడేళ్లలో రూ.17 వేల కోట్లు.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసింది. రూ.లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేసింది. రూ. 17 వేల కోట్లను మూడేళ్లలో బ్యాంకులకు చెల్లించి 35 లక్షల మంది రైతులు రుణ విముక్తులైనట్లు ప్రకటించింది. కొన్ని బ్యాంకులు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశాయని ఆరోపణలొచ్చాయి. శాసనసభలో విపక్షాలూ ఈ అంశాన్ని లెవనెత్తడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ‘ఎక్కడైనా ఫిర్యా దులుంటే.. రూ.100 కోట్లు.. రూ. 200 కోట్లు ఉంటే చెల్లించేద్దాం.. విచారణ చేప ట్టండి’అని అధికారులను పురమాయించారు. మాఫీ అమలును పరిశీలించిన అధికారులు.. వడ్డీల అంశం సంక్లిష్టంగా ఉందని, సమస్యను జటిలం చేయకుండా ఉండటమే మంచిదని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. రాష్ట్రం 4 శాతం.. కేంద్రం 7 శాతం.. సాధారణంగా పంట రుణాల వడ్డీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రాష్ట్రం 4, కేంద్రం 7 శాతం బ్యాంకులకు చెల్లిస్తాయి. రుణాల గడువు మీరితే నిబంధన వర్తించకపోతే వడ్డీ లేని రుణ పథకం వర్తించకపోగా.. 11 శాతం వడ్డీని రైతులే భరించాల్సి వస్తుంది. ప్రభుత్వం రుణమాఫీని దశల వారీగా చెల్లించడంతో కొన్నిచోట్ల రుణాలను గడువు మీరిన ఖాతాలో వేసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులు ఒక్కోచోట ఒక్కో తీరుగా లెక్కలు ఉండటం.. కొన్ని చోట్ల రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించారు. -
రైతుల వడ్డీ చెల్లిద్దాం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలపై బ్యాం కులు వసూలు చేసిన వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముందు బ్యాంకుల వారీగా లెక్కలు తీసి, తనకు అందించాలని ఆర్థిక శాఖకు సూచించారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నాలుగు దశల్లో రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. కానీ బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ అదనంగా వసూలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తాయి. దీనిపై స్పందించిన సీఎం వడ్డీ కట్టిన రైతుల వివరాలు ఇస్తే చెల్లిస్తామని ప్రకటించారు. ఆ వివరాలను స్పీకర్ ద్వారా పంపాలని కోరారు. ప్రతిపక్షాలు కొన్ని వివరాలు అందించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. తామే లెక్కలు తీసి చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక శాఖ అధికారులు కొన్ని బ్యాంకులను సందర్శించి లెక్కలు తీయనున్నారు. దీన్నిబట్టి ఓ ఫార్మాట్ రూపొందించి బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులకు వెళ్లనున్నారు. -
మళ్లీ ‘మైక్రో’.. గద్దలు!
-
మళ్లీ ‘మైక్రో’.. గద్దలు!
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని వందలాది కుటుంబాలు ఇలా మైక్రోఫైనాన్స్ ఊబిలో చిక్కి నరకయాతన పడుతున్నారు. 3 నెలల వ్యవధిలో కోరుట్లలోని అల్లమయ్యగుట్ట కాలనీ, కథలాపూర్ మండలం కల్వకోట గ్రామా ల్లో ఇదే రీతిలో మైక్రోఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టినా మార్పులేదు. పేదల కాలనీలు లక్ష్యంగా ‘మైక్రో గద్దలు’ జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో యథేచ్ఛగా వడ్డీలకు డబ్బులు ఇస్తూ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. టార్గెట్.. స్లమ్ ఏరియాలు.. ఏపీలోని పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొంత మంది నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాలుగా మైక్రోఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతులు లేకుండా.. కనీసం మనీ లెండింగ్ లైసెన్సులు లేకుండా అడ్డగోలు వడ్డీలకు అప్పులు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలను టార్గెట్‌గా చేసుకుని బ్యాంకులు.. ఇతరత్రా సంస్థల నుంచి అప్పులు పుట్టని పేదలకు అప్పుల ఎర వేస్తారు. ఇదీ.. అప్పు తీరు పట్టణ ప్రాంతాల్లోని పేదలు నివాసముండే కాలనీల్లో రోజువారీ పనిచేసుకునే మహిళలను పది మందిని గ్రూపుగా ఏర్పాటుచేస్తారు. ఈ గ్రూపులో ఒక్కొక్కరికి అప్పుగా రూ.5 వేల నుంచి 25 వేలవరకు ఇస్తారు. అప్పు తీసుకున్న వారిలో ఏ ఒక్కరు డబ్బులు చెల్లించకున్నా గ్రూపులోని మిగిలినవారు ఆ డబ్బులు చెల్లించాలన్న నిబంధన పెడతారు. అప్పు ఇవ్వడానికి ముందే వడ్డీ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత వారానికి ఓసారి వచ్చి డబ్బులు వసూలు చేసుకుంటారు. రూ.12వేలు వడ్డీకి తీసుకున్న వారు మూడు నెలల్లో రూ. 14,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీ రూ.8 శాతం వరకు పడుతోంది. ఒకవేళ మూడు నెలల్లోగా తీసుకున్న అప్పు తీర్చని వారికి మిగిలిన డబ్బులతో కలుపుకుని మళ్లీ అప్పు ఇస్తారు. ఇలా వరసబెట్టి అప్పు మీద అప్పులు ఇస్తూ అడ్డగోలు వడ్డీతో తీరని రుణాలను మిగుల్చుతారు. ఇక వసూళ్ల కోసం పగలు..రాత్రి తేడా లేకుండా ఇళ్లకు వచ్చి మహిళలను వేధిస్తారు. ఈ రీతిలో రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు రాత్రి వేళ తన ఇంటికి వచ్చి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేశారు. నియంత్రణ కరువు.. అప్పుల పేరిట పేదలను వడ్డీల ఊబిలోకి దించుతున్న మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై నియంత్రణ కరువైంది. మూడు నెలల క్రితం కోరుట్లలోని అల్లమయ్యగుట్టకాలనీలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మైక్రోఫైనాన్స్ నిర్వాహకులపై కేసు పెట్టి అరెస్టు చేశారు. అయినా, ఎప్పటిలాగే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కోరుట్ల లోని మాదాపూర్ కాలనీలో సుమారు నాలుగేళ్లుగా 120 మంది మహిళలు మైక్రో ఉచ్చులో పడి ఆందోళన చెందుతున్నారు. మెట్పల్లి, జగిత్యాల పట్టణాల్లోనూ రెండు కాలనీల్లో మైక్రో నిర్వాహకులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ పేదలను అప్పుల ఊబిలోకి దించుతున్నట్లు సమాచారం. అప్పు కట్టాలని సతాయిస్తున్నారు మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు అప్పుల కోసం రోజు కాలనీకి వచ్చి వేధిస్తున్నారు. దీపావళి రోజూ కాలనీకి వచ్చి చాలామంది మహిళలను డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టారు. పండుగ రోజు వేధింపులతో చాలా మంది అవస్థలు పడ్డారు. వడ్డీల లెక్క చెప్పడం లేదు.. ఎంత కట్టినా మళ్లీ ఎంతో కొంత అప్పు ఉందని తేలుస్తారు. – రేష్మా, మాదాపూర్కాలనీ, కోరుట్ల ఈ యువకుడి పేరు అఫ్రోజ్(18). తొమ్మిదో తరగతి చదివి ఆపేశాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఇతని తల్లి ఇర్ఫానా బీడీలు చుడుతుంది.. తండ్రి ఆసిఫ్ ఐస్‌క్రీం అమ్ముతాడు. ఏడాది క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికి వచ్చి రూ. 6 వేలు అప్పు ఇచ్చారు. వారానికి రూ.600 చొప్పున 12 వారాల్లో రూ.7,200 కట్టాలన్నారు. అయితే, ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అప్పు తీర్చలేకపోతోంది. పొద్దస్తమానం పనిచేసి సంపాదించిన డబ్బులు పొట్ట కూటికే సరిపోతుండగా.. మైక్రో అప్పుల ఊబి నుంచి బయటపడటానికి అఫ్రోజ్‌ను సెంట్రింగ్ పనులకు పంపుతున్నారు. ఈమె పేరు సుజాత కోరుట్లలో నివాసముంటుంది. భర్త కిషన్ వంటలు చేస్తాడు. రెండేళ్ల క్రితం మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు ఇచ్చిన రూ.5 వేల అప్పు కట్టలేక అవస్థలు పడుతోంది. వడ్డీల భారంతో తీసుకున్న రుణం తీరకపోవడంతో కూతుర్ని కాలేజీ బంద్ చేయించి తనతోపాటు బీడీలు చేయిస్తోంది. -
రిస్కులేని పథకాలివి... ఎంచుకోండి..!
వడ్డీ రేట్లు బాగానే దిగివచ్చాయి. మరికొన్నాళ్ల పాటు ఈ స్థాయిలోనే ఉంటాయంటున్నారు విశ్లేషకులు. నిజం చెప్పాలంటే బ్యాంకుల్లోని రేట్ల కంటే ప్రస్తుతం పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనే కాస్తంత మెరుగైన వడ్డీ రేట్లున్నాయి. ప్రస్తుతమున్న రేట్లే కొన్ని త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా పథకం రాబడులు, పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. ఏఏ పథకం ఎంత రాబడినిస్తోంది, లాభనష్టాలేంటన్న వివరాలివిగో... రిస్క్ వద్దా?... ఇదిగో పీపీఎఫ్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) చక్కని సాధనం. దీనికి ఉన్న పన్ను మినహాయింపుల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై రేటు 7.5 శాతం ఉంటే 30 శాతం పన్ను పరిధిలోని వారికి పన్ను పోను నికరంగా గిట్టుబాటయ్యేది 5.25 శాతమే. కానీ, పీపీఎఫ్‌లో 7.5 శాతం వడ్డీ రేటు పూర్తిగా పన్ను రహితం. కాకపోతే పీపీఎఫ్‌లో వార్షిక పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలే. అంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీలుండదు. పీపీఎఫ్‌లో మరో ఆకర్షణీయమైన అంశం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇష్టమైతే మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత మూడు ఆప్షన్లు ఉంటాయి. మూల నిధిని వెనక్కి తీసుకుని, ఖాతాను తదుపరి ఎటువంటి చందాలు లేకుండా కొనసాగించుకోవడం... లేదా పెట్టుబడి కొనసాగించుకోవడం! పెట్టుబడిని కొనసాగించే ఆప్షన్ ఎంచుకుంటే అందుకోసం మరో ఐదేళ్ల పాటు కాల వ్యవధికి పొడిగించాలని దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిశాక ఏడాది లోపు ఎప్పుడైనా దరఖాస్తును (ఫామ్ హెచ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కాల వ్యవధి పొడిగించాలని కోరుతూ దరఖాస్తు చేయకుండా అలానే వదిలేస్తే దానంతట అదే ఐదేళ్లకు పొడిగింపునకు లోనవుతుంది. ఇలా జరిగితే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండదు. ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌పై మాత్రం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగుల మాదిరిగా నెలసరి వేతనం లేని, జీవిత మలి సంధ్యలో రిటైర్మెంట్ ప్రయోజనాలు లేనివారికి ఇది అత్యంత అనుకూల సాధనం. వైద్యులు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్ల తరహా వృత్తులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ పెట్టుబడుల్లో డెట్ విభాగం కోసం పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు. అయితే, అందరికీ పీపీఎఫ్ ఆకర్షణీయం కాదనే చెప్పాలి. యువతీ యువకులై ఉండి... పన్ను ఆదా కోరుకునేట్టు అయితే అటువంటి వారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్లే పీపీఎఫ్ కంటే అధిక రాబడులను ఇస్తాయనేది వ్యాల్యూ రీసెర్చ్ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్ సూచన. భార్యాభర్తలు ఉద్యోగులై ఉంటే వారికి అప్పటికే ఈపీఎఫ్ ఉంటుంది కనుక దానికి బదులు పన్ను ఆదా చేసే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడులు పొందొచ్చు. కూతుళ్లకు ప్రత్యేకం... సుకన్య సమృద్ధి పదేళ్లలోపు కుమార్తెలున్న తల్లిదండ్రుల కోసం ప్రవేశపెట్టిన పథకమిది. అలాంటి కుమార్తెల పేరిట మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వీలుంది. ఆమె ఉన్నత విద్య, వివాహం వంటి అవసరాల కోసం ఈ సుకన్య సమృద్ధి యోజనను మంచి పెట్టుబడి సాధనమనే చెప్పాలి. 14 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకంపై ప్రస్తుతం 8.3 శాతం వడ్డీ రేటుంది. ఇది ఎప్పటికప్పుడు మారుతుంది కూడా. రాబడులు పీపీఎఫ్ కంటే దీన్లోనే ఎక్కువ. పీపీఎఫ్ మాదిరే సుకన్య సమృద్ధి యోజనలోనూ వార్షికంగా రూ.1.50 లక్షలకు మించి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. ఏదైనా పోస్టాఫీసు, ఎంపిక చేసిన బ్యాంకుల్లో రూ.1,000తో ఖాతాను ప్రారంభించుకోవచ్చు. తండ్రి లేదా తల్లి గరిష్టంగా తన ఇద్దరు కుమార్తెల కోసం రెండు ఖాతాల వరకే దీన్ని ప్రారంభించే అవకాశముంది. రెండు ఖాతాలున్నప్పటికీ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు రూ.1.50 లక్షల పెట్టుబడికే పరిమితం. కుమార్తె భవిష్యత్తు అవసరాలకు డెట్ పథకమైన సుకన్య సమృద్ధి యోజన ఒక్కటే సరైనది కాదన్నది కొందరి నిపుణుల సూచన. దీనితోపాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయం లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో ముందుగా డబ్బులను వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడం సానుకూలం. మెచ్యూరిటీనాటికి కుమార్తె ఉన్నత విద్య, వివాహ బాధ్యతలు ఉంటాయి కనుక దాదాపుగా దుర్వినియోగానికి అవకాశం ఉండదు. ఎఫ్డీకన్నా బెటర్... పొదుపు సర్టిఫికెట్లు పీపీఎఫ్ మాదిరిగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పెట్టుబడులకు వార్షిక పరిమితి లేదు. ఐదేళ్ల కాల వ్యవధిపై వడ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. కాకపోతే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు చూస్తే 5.38 శాతంగా ఉంటాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని అర్థమవుతుంది. వడ్డీ రేటు పరంగా మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఒక శాతం వరకు ఎన్‌ఎస్‌సీలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ఎస్సీలో ఏటా వడ్డీ రూపంలో పొందే ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 9–9.5% వడ్డీ రేట్లున్న సమయంలో తక్కువ వడ్డీ రేటుతో ఎన్ఎస్సీ వెలవెలబోయింది. బ్యాంకు రేట్లు బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఎన్ఎస్సీకి తిరిగి డిమాండ్ ఏర్పడింది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7% మించి లేవు. దీనిప్రకారం ఎన్ఎస్సీ ఆకర్షణీయమే. సీనియర్ సిటిజన్స్‌కు... సేవింగ్ స్కీమ్ ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన ఈ పథకంలో పెట్టుబడిపై ప్రస్తుతం 8.3% వడ్డీ లభిస్తోంది. కాల వ్యవధిని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చు. రిటైర్ అయిన వారికి క్రమం తప్పకుండా ఆదాయాన్నందించే పథకమిది. ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకే పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. 60 ఏళ్లు దాటిన వారే అర్హులు. ముందుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరకపోతే 58 ఏళ్లకే ఈ ఖాతా తెరుచుకోవచ్చు. రక్షణ శాఖలో పనిచేసిన వారికి వయసుపరంగా పరిమితులు లేవు. రిటైర్ అయిన వారికి నిరంతర ఆదాయం కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అనువైనదని నిపుణుల సూచన. హామీతో కూడిన రాబడులను ప్రతి 3 నెలలకు అందిస్తుంది. రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశాక ఇంకా కార్పస్ మిగిలితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
51% పడిపోయిన అపోలో లాభం
► జూన్ క్వార్టర్లో రూ.35కోట్లు ► వడ్డీ వ్యయాలు, తరుగుదల ప్రభావం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ లాభం జూన్ త్రైమాసికంలో ఏకంగా 51 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ లాభం రూ.35.21 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.72.17 కోట్లుగా ఉండటం గమనార్హం. ఆదాయం రూ.1,684 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.1,465 కోట్లతో పోలిస్తే 14% పెరిగింది. పన్ను అనంతరం లాభాలు తరిగిపోవడానికి ప్రధానంగా అధిక తరుగుదలకుతోడు... కొత్తగా పెరిగిన పేషెంట్ల బెడ్లపై వడ్డీ వ్యయాలే కారణమని అపోలో హాస్పిట ల్స్ తెలిపింది. గత మూడేళ్లలో 2,000 బెడ్లు ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది. వీటికి సంబంధించి ప్రయోజనాలు వచ్చే రెండు మూడేళ్ల కాలంలో ప్రతిఫలిస్తాయని పేర్కొంది. హాస్పిటల్స్ విభాగంలో ప్రముఖ సంస్థగా అపోలో కొనసాగుతుందని, ఆంకాలజీ, న్యూరోసైన్స్, ఆర్థోపెడిక్, ట్రాన్స్‌ప్లాంట్ విభాగాల్లో తమ సేవలను మరింత విస్తరించేందుకు స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నట్టు కంపెనీ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మరోవైపు ఐటీ కంపెనీ సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డిని అడిషనల్ డైరెక్టర్‌గా నియమించగా, ఇండిపెండెంట్ డైరెక్టర్లు అయి న హబీబుల్లా బాద్షా, రాజ్‌కుమార్ మీనన్, రఫీఖ్ అహ్మద్‌ల రాజీనామాలను అమోదించినట్టు అపోలో హాస్పిటల్స్ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. -
వయ వందన యోజన.. మంచిదేనా?
► వడ్డీ రేటు తక్కువే; కానీ స్థిరంగా పదేళ్లు ► గరిష్టంగా రూ.7.5 లక్షలు మాత్రమే పెట్టొచ్చు ► అంటే ఒక కుటుంబానికి నెలకొచ్చేది రూ.5వేలే ► ఇది చాలదు కనక దీనిపై ఆధారపడలేం: నిపుణులు ► పోస్టాఫీసు పథకం కొంత బెటర్; వడ్డీ 8.3 శాతం ► కానీ దీన్లో కాలపరిమితి ఐదేళ్లే; తరవాత వడ్డీ మారొచ్చు ► వడ్డీ తగ్గుతున్న ఈ సమయంలో స్థిర రేటు మంచిదే!! ప్రతినెలా ఆదాయం కోరుకునే పెద్దల కోసం కేంద్రం... ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ పేరిట ఓ పథకాన్ని తెచ్చింది. ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెడితే, దానిపై 8 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా ఆదాయం వస్తుంటుంది. దీని నిర్వహణ బాధ్యతల్ని ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ చూస్తోంది. అసలు ఈ పాలసీ ప్రయోజనాలేంటి? ఇతర నిబంధనలేంటి? ఇది మంచిదేనా? ఇలాంటి ప్రత్యామ్నాయాలు వేరే కూడా ఉన్నాయా? ఇవన్నీ ఒకసారి చూద్దాం... ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం విధి, విధానాలు అన్నీ కూడా ఎల్ఐసీ గత పథకం వరిష్ట బీమా యోజనలో మాదిరిగానే ఉన్నాయి. వరిష్ట బీమా యోజనను 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు వరకు ఏడాది కాలం పాటు పెట్టుబడుల కోసం అందుబాటులో ఉంది. దీని స్థానంలో తాజాగా వచ్చిందే వయ వందన యోజన. కాకపోతే వరిష్ట బీమా యోజనలో 9 శాతం వడ్డీ రేటు ఉండగా, తాజా పథకంలో అది 8 శాతంగా మారిపోయింది. ఈ పథకంలో చేరేందుకు 2018 మే 3 వరకు అవకాశం ఉంది. ఇది తక్షణం పెన్షన్‌ను అందించే పాలసీ. పెట్టుబడి పెట్టిన మొత్తంపై 8 శాతం వడ్డీ ప్రకారం ప్రతి నెలా చెల్లింపులు జరుగుతాయి. ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే పెన్షన్ అందుతుంది. 60 ఏళ్లు దాటినవారే ఇందులో చేరేందుకు అర్హులు. కాల వ్యవధి పదేళ్లు. కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీదారుడు కాల వ్యవధి తీరక ముందే కాలం చేస్తే, పెట్టుబడి మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా పాలసీని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న పరిస్థితుల్లో పదేళ్ల కాలానికి 8 శాతం వడ్డీ రేటు చెల్లింపు హామీ ఇవ్వడం అన్నది ఆకర్షణీయమైనదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి ఉంది కనుక, ఒకరు పూర్తిగా దీనిపైనే ఆధారపడలేని పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు. సదుపాయాలు ప్రతి నెలా లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు, ఏడాదికోసారి పెన్షన్ అందుకునే సౌలభ్యం ఉంది. ప్రతి నెలా పెన్షన్ కోరుకుంటే 8 శాతం, ఏడాదికోసారి పెన్షన్ ఆశిస్తే 8.3 శాతం వడ్డీ ప్రకారం రాబడి ఉంటుంది. ప్రతి నెలా పెన్షన్ వచ్చే ఆప్షన్ కోరుకుంటే కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు దీనిపై రూ.1,000 పెన్షన్‌గా లభిస్తుంది. గరిష్టంగా రూ.7.50 లక్షలే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది. అప్పుడు నెలవారీ పెన్షన్ రూ.5,000 వస్తుంది. అదే ఏడాదికోసారి పెన్షన్ రావాలనుకుంటే అప్పుడు కనీసం రూ.1,44,578 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఏడాదికి రూ.12,000 చొప్పున పదేళ్ల పాటు చెల్లిస్తారు. గరిష్టంగా రూ.7,22,892 ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏటా రూ.60,000 చొప్పున పదేళ్ల పాటు పెన్షన్ వస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... గరిష్ట పరిమితి పాలసీదారుడికి మాత్రమే పరిమితం కాదు. పాలసీదారుడి కుటుంబం మొత్తానికి గరిష్ట పరిమితి వర్తిస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి, జీవిత భాగస్వామి, పిల్లల్ని కలిపి ఒక కుటుంబంగా పరిగణిస్తారు. రుణం కూడా తీసుకోవచ్చు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఉన్న మరో సదుపాయం అవసరమైన సందర్భాల్లో రుణం తీసుకోవటం. కాకపోతే ఇందుకోసం మూడేళ్లు వేచి చూడాల్సి ఉం టుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్టంగా 75 శాతం వరకు రుణంగా ఇస్తారు. వడ్డీ రేటు 10 శాతం. వైదొలగటానికీ అవకాశం! పథకం కాల వ్యవధి పదేళ్లు కాగా, ఈ లోపే తప్పుకునేందుకు ఒక్క అవకాశం ఉంది. పాలసీదారుడు లేదా వారి జీవిత భాగస్వామి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే (ఏవన్నది నిర్వచించలేదు) పెట్టుబడి పెట్టిన మొత్తంలో 98 శాతాన్ని వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అనుకూలమేనా..? ఈ పథకంలో ఒక లోపం గరిష్ట పెట్టుబడిని రూ.7,50,000 పరిమితం చేయడమేనంటున్నారు విశ్లేషకులు. గరిష్ట పెట్టుబడిపై వచ్చే పెన్షన్ కేవలం రూ.5,000. రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఎదురయ్యే ఖర్చులను ఈ మొత్తం తీర్చలేదు. రిటైర్ అయిన తర్వాత తమపై జీవిత భాగస్వామి, మరెవరైనా ఆధారపడి ఉంటే అధిక మొత్తంలో కావాల్సి ఉంటుంది. పైగా దీని గడువు పదేళ్లతో తీరిపోతుంది. ఆ తర్వాత మరో పథకం చూసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వెంటనే తక్షణం పెన్షన్‌ను ఇచ్చే యాన్యుటీ పథకాలపై వడ్డీ రేటు 6–7 శాతం మించి లేదు. ఆ ప్రకారం చూసుకుంటే వడ్డీ రేటు పరంగా ఈ పథకం మెరుగైనదే. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు కూడా 7.50 శాతం మించిలేదు. ఇక పోస్టాఫీసు అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక్కటే కొంచెం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ పథకంలో ఒకరు గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ వార్షికంగా 8.3 శాతం ఉంది. కాకపోతే కాల వ్యవధి ఐదేళ్లు మాత్రమే. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. నెలవారీ పెన్షన్ సదుపాయం ఇందులో లేదు. మూడు నెలలకోసారి మాత్రమే చెల్లిస్తారు. పైగా వయ వందన యోజనలో పదేళ్లూ వడ్డీ రేటు మారదు. కానీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకంపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఐదేళ్ల పాటు వడ్డీ రేటు మారదు. ఇన్వెస్ట్ చేసిన సమయంలో ఉన్న వడ్డీ రేటే అమలవుతుంది. కానీ, ఆ తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకునే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. వయవందన యోజనలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడికి అవకాశం లేదు కనుక పరిమితి మేరకు ఇన్వెస్ట్ చేసుకుని, అదనంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ఎంచుకోవడాన్ని పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేదు కచ్చితంగా ప్రతీ నెలా ఆదాయం రావాలనుకుంటే వయవందన యోజనతోపాటు బీమా కంపెనీలు ఆఫర్ చేసే యాన్యుటీ పథకాలను పరిశీలించొచ్చు. -
సకాలంలో చెల్లిస్తేనే 4 శాతం...లేదంటే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా రైతులకిచ్చే పంటరుణాల కోసం ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనే పథకం కింద స్వల్పకాలిక (సం.రం లోపు)రుణాలపై కేవలం నాలుగు శాతం వడ్డీని వసూలు చేయనునున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే 3 లక్షల రూపాయల స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే 4 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంచడం కొనసాగుతుందని తెలిపింది. 2017-18 సంవత్సరం కోసం ఈ కొత్త తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ. 20,339 కోట్ల ఖర్చుతో స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ సబ్సిడీగా కేబినెట్ ఆమోదం తెలిపిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 2 శాతం సబ్‌వెన్షన్‌తో చిన్న వ్యవసాయ రుణదాతకు 3,00,000 రైతులకు అందివ్వబడుతుందని చెప్పారు. మూడులక్షల లోపుతీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే 4శాతం వడ్డీ రేటు అమలు చేయనున్నామన్నారు. లేదంటే 7శాతం వడ్డీ రేటు కొనసాగనుందని పేర్కొన్నారు. ఏడాది పాటు కొనసాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్‌ను నాబార్డ్, ఆర్బీఐలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ప్రైవేటు, కార్పొరేటివ్, రీజినల్ బ్యాంకుల ద్వారా రైతులకు నిధులను అందిచనున్నారు. వ్యవసాయ రుణాలు క్షేత్ర స్థాయిలో రైతులకు అందాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. అలాగే 2017-18 నాటికి, వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. 2016-17లో ఇది రూ. 9 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటడడంతో రుణమాఫీ ప్రకటించిన ముఖ్యంగా మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా వర్తించనుంది. -
అప్పుల కుప్ప.. ఆర్‌కామ్
రూ. 42,000 కోట్లకు పైగా రుణభారం ► బ్యాంకులకు వడ్డీ డిఫాల్ట్ ► కంపెనీ ఖాతాను ఎస్ఎంఏ–1 కింద వర్గీకరించిన బ్యాంకులు ► బాండ్ల రేటింగ్ కూడా డౌన్‌గ్రేడ్ ► ఆల్‌టైమ్ కనిష్టానికి షేరు దిగ్గజ టెలికం సంస్థగా వెలుగొందిన రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రస్తుతం రుణాల భారంతో కుదేలవుతోందా? వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉందా? ఇటీవలి పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. వడ్డీ బకాయి కారణంగా దేశీయంగా కనీసం 10 బ్యాంకులు ఆర్‌కామ్‌కి ఇచ్చిన రుణాలను ఎస్ఎంఏ–1, ఎస్ఎంఏ–2 కేటగిరీల్లో వర్గీకరించినట్లు తెలుస్తోంది. మరో పక్షం రోజులు దాటితే కొన్ని బ్యాంకులు ఇక వీటిని మొండి బకాయి ఖాతాల (ఎన్పీఏ) కింద కూడా వర్గీకరించాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఆర్‌కామ్‌కి రుణభారంతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో రేటింగ్ ఏజెన్సీలు కేర్, ఇక్రా ఇప్పటికే కంపెనీ బాండ్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు కూడా వీటికి తోడవడంతో గడిచిన రెండు వారాలుగా క్షీణిస్తున్న ఆర్‌కామ్ షేర్లు సోమవారం ఒక్కరోజే ఏకంగా 24 శాతం పతనమయ్యాయి. బ్యాంకులు ఎస్ఎంఏ కింద వర్గీకరించిన రుణాలకు సంబంధించిన సమాచారం ఇంకా లభ్యం కావడానికి ముందే రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. రిలయన్స్ జియో పోటీ కారణంగా ఆర్కామ్పై ప్రతికూల ప్రభావం పడగలదని పేర్కొన్న కేర్.. తాజాగా డిఫాల్ట్ సంగతి కూడా తెలిస్తే మరింతగా కఠినతరమైన రేటింగ్ ప్రకటించే అవకాశముందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక ఆదాయాల ఆర్జనపై కంపెనీ సామర్ధ్యంపై సందేహాలు, జియో కారణంగా లాభదాయకతపై ప్రతికూల ప్రభావ అంచనాల మూలంగా.. ఆర్‌కామ్ గ్రూప్ రేటింగ్‌ను ఇక్రా బిబిబి నుంచి బిబి స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసింది. మొండిబకాయిల వసూళ్లపై బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎన్పీఏ స్థాయికి అటూ ఇటూగా ఉన్న ఖాతాలపై కూడా మరింతగా దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు ప్రత్యేకంగా ఆర్‌కామ్‌ను ప్రస్తావించకుండా డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా డైరెక్టర్ యూఆర్ భట్ అభిప్రాయపడ్డారు. పెరిగిన నష్టాలు.. పోటీతో పాటు పెరుగుతున్న వడ్డీ వ్యయాలు మొదలైనవి ఆర్‌కామ్ ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. జనవరి–మార్చ్ త్రైమాసికంలో ఆర్‌కామ్ ఏకంగా రూ. 966 కోట్ల నష్టం ప్రకటించడంతో వరుసగా రెండో క్వార్టర్లో కూడా నష్టం నమోదు చేసినట్లయింది. మార్చి 31 ఆఖరు నాటికి కంపెనీ రుణభారం రూ. 42,000 కోట్ల పైచిలుకు ఉంది. జియో ఆఫర్ల నేపథ్యంలో గడిచిన 20 ఏళ్లలో టెలికం రంగం ఆదాయాలు తొలిసారిగా తగ్గాయని, దాంతో ఆపరేటింగ్ మార్జిన్లు భారీగా తగ్గగా.. రుణాల కారణంగా వడ్డీ భారం గణనీయంగా పెరిగిపోయిందని శనివారం ఫలితాల ప్రకటన సందర్భంగా ఆర్‌కామ్ పేర్కొంది. కంపెనీ వద్ద నగదు నిల్వలు, నిర్వహణాపరమైన ఆదాయాలు చూస్తుంటే.. స్వల్పకాలిక రుణాల చెల్లింపులు, మూలధన వ్యయాలకు కూడా సరిగ్గా సరిపోకపోవచ్చని లుక్రోర్ అనలిటిక్స్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. నిధులొస్తున్నాయ్..కట్టేస్తాం.. ఎయిర్‌సెల్, బ్రూక్‌ఫీల్డ్ లావాదేవీలు పూర్తయితే వచ్చే నిధుల నుంచి సుమారు రూ. 25,000 కోట్ల మేర తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే బ్యాంకులకు తెలియజేసినట్లు ఆర్‌కామ్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా చెల్లింపులు జరుపుతామని చెప్పినట్లు వివరించాయి. నిర్దేశిత రీపేమెంట్స్ అన్నింటితో పాటు ప్రోరాటా ప్రాతిపదికన అన్ని బ్యాంకులకు గణనీయంగా ప్రీపేమెంట్ (ముందస్తుగా రుణ చెల్లింపు) చేసేందుకు కూడా ఈ మొత్తం సరిపోతుందని వివరించాయి. వీలైనంత త్వరగా సెప్టెంబర్ 30లోగానే ఈ రెండు లావాదేవీలు పూర్తయ్యేలా అనుమతులు పొందడంపై ఆర్‌కామ్ దృష్టి సారించింది. ఇప్పటికే పలు అనుమతులు వచ్చాయని సంస్థ పేర్కొంది. టవర్స్ విభాగం రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో 51 శాతం వాటాలను కెనడాకి చెందిన బ్రూక్‌ఫీల్డ్ గ్రూప్‌కి ఆర్‌కామ్ దాదాపు రూ. 11,000 కోట్లకు విక్రయిస్తోంది. అలాగే, ఎయిర్‌సెల్, ఆర్‌కామ్‌ల వైర్లెస్ విభాగాలు విలీనం కానున్నాయి. ఈ లావాదేవీలన్నీ పూర్తయితే 2018 నాటికి తమ రుణభారం 70 శాతం మేర తగ్గగలదని ఆర్‌కామ్ గతంలో పేర్కొంది. 52 వారాల కనిష్టానికి షేరు.. ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపర్చిన నేపథ్యంలో సోమవారం ఆర్‌కామ్ షేరు బీఎస్ఈలో ఏకంగా 24 శాతం క్షీణించింది. రూ. 25.65 వద్ద ప్రారంభమైన షేరు ధర ఆ తర్వాత ఒక దశలో 23.64 శాతం పతనమై రూ. 19.70కి పడిపోయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. చివరికి 20.54 శాతం నష్టంతో రూ. 20.50 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలో కూడా ఆర్‌కామ్ షేరు 23.49 శాతం తగ్గి రూ. 19.70 స్థాయికి పతనమైంది. ఆఖరికి రూ. 19.22 శాతం క్షీణతతో రూ. 20.80 వద్ద ముగిసింది. ఈ షేరు 2008 జనవరి నెలలో రూ. 800కుపైగా ధరతో ట్రేడయ్యింది. ఎస్ఎంఏ అంటే .. వడ్డీ కట్టడంలో జాప్యం జరిగిన ఖాతాలను ఎస్ఎంఏ (స్పెషల్ మెన్షన్ అకౌంట్స్) అసెట్స్ కింద వర్గీకరిస్తారు. జాప్యం 30 రోజుల్లోపు ఉంటే ఎస్ఎంఏ–1 కింద, 60 రోజులు ఆపైన అయితే ఎస్ఎంఏ–2 కింద వర్గీకరిస్తారు. అదే 90 రోజులయితే బ్యాంకులు సదరు రుణ ఖాతాను నికర నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా రాస్తాయి. -
ఐసీఐసీఐ కూడా గుడ్ న్యూస్ చెప్పిందోచ్!
న్యూఢిల్లీ: ప్రయివేటుబ్యాంక్దిగ్గజం ఐసీఐసీఐ కూడా గృహకొనుగోలు దారులకు శుభవార్త అందించింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్టు ను తగ్గించిన అనంతరం తాజాగా ఐసీఐసీఐ హెం లోన్లపై తగ్గింపు వడ్డీరేటును ప్రకటించింది. గృహ రుణాల రేట్లపై 0.3 శాతం తగ్గించాలని నిర్ణయించినట్టు బ్యాంకు సోమవారం ప్రకటించింది. రూ. 30లక్షలలోపు రుణాలపై ఈ తగ్గింపును అమలు చేయనుంది. ఎఫర్డబుల్ హౌ సింగ్ పథకానికి ఊతమిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వ పథకం కింద, రూ.30 లక్షల రూపాయల కింద ఉన్న రుణాలు సరసమైన గృహాల రుణాలపై 0.3శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. ఈ తగ్గింపుతో, పరిశ్రమలో అతి తక్కువ ధరల్లో గృహ రుణాలను జీతాలు తీసుకునేవారికి అందుబాటులో తెచ్చింది. సాలరీడ్ మహిళా ఉద్యోగులు 8.35 శాతం రేటులోనూ, ఇతరులు 8.40 శాతం గృహ రుణాలు పొందనున్నారని ఒక ప్రకటనలోతెలిపింది. కాగా ఇప్పటికే ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం మేరకు సరసమైన గృహ రుణ రేనుఏ తగ్గించింది. దీని ప్రకారం 25 లక్షల రూపాయల లోపు రుణగ్రహీతలకు 8.40 శాతం, రు .1 కోట్ల వరకు వడ్డీ రేటును 8.50 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానుంది. మహిళల రుణగ్రహీతలకు రు. 25 లక్షల వరకు రుణాలకు 8.35 శాతం ప్రత్యేక వడ్డీని అందిస్తోంది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. 'గ్రాహ సిద్ధి' పేరుతో లాంచ్ చేసిన ఈ పథకంలో నిర్మాణం, గృహ లేదా ఫ్లాట్, మరమ్మత్తు లేదా పునర్నిర్మాణాల కోసం రుణాలను మంజూరు చేయనున్నట్టుప్రకటించిన సంగతి తెలిసిందే. -
గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది. జాప్యం చేసే ప్రాజెక్టులపై గృహ కొనుగోలుదారులకు చెల్లించే వడ్డీరేట్టు 10 శాతంగా నిర్ధారించినట్టు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్(ఆర్ఈఆర్ఏ) తెలిపింది. సేల్స్ అగ్రిమెంట్ లో భాగంగా హౌజింగ్ ప్రాజెక్టులు జాప్యమవుతున్నట్టు తాము పెట్టుబడి పెట్టిన మొత్తంపై కొనుగోలుదారులు ఈ మొత్తాన్ని పొందవచ్చు. అంతకముందు ఒక్కో చదరపు అడుగులకు 5గా ఉన్న రేటు, దీని ప్రకారం ప్రస్తుత రేటు 10గా నిర్ణయించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ చట్టం అమలవుతుందని, మరో 14 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలుచేసే ప్రక్రియ జరుగుతుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ఈ చట్టం కింద ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ వద్ద ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ జూలై ఆఖరికల్లా రిజిస్ట్రర్ చేసుకోవాలని హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఆల్లేవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. ఈ చట్టం ఆపరేటర్ల బారిన పడుతున్న కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. 2016 మార్చిలో ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందగా.. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నోటిఫై అయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీష్ ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఐలాండ్స్, చంఢీఘర్, దాద్రా అండ్ నగేర్ హవేళి, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్ లు ఉన్నాయి. మే 1వరకు కూడా తాము నిర్మించబోయే, నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్ పొందనివారు మూడు నెలల్లో పొందాల్సి ఉంటుందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లాట్లను డెవలపర్లు జూలై వరకు విక్రయించాలని కూడా రెగ్యులేటరీ ఆదేశించింది. -
ఈ బ్యాంకులు పొదుపు ఖాతాలపై 7.25శాతం వడ్డీ!
ముంభై: ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో కొత్త పేమెంట్ బ్యాంకులు , స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రంగంలో దిగనున్నాయి. 300 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువగా పొదుపు ఖాతాలపై సుమారు 7.25 శాతం వడ్డీని అందించనున్నాయి. త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. విశ్వబ్యాంకులు పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేటుతో పోలిస్తే..అధిక వడ్డీ చెల్లించడానికి ముందుకు రావడానికి విశేషం. ముఖ్యంగా ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇప్పటికే పే మెంట్ బ్యాంకింగ్ సేవలకోసం ఆర్బీఐ అనుమతి లభించిన ఫినో టెక్ ఈ భారీ ఆఫర్ ను అందించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫినో పేటెక్ చెల్లింపు బ్యాంకునుత్వరలో లాంచ్ చేయనుంది. కొద్ది కాలంలో తమ చెల్లింపు బ్యాంకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, ఇందుకు ఐసీఐసీఐ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని ఫినో పేటెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిషి గుప్తా తెలిపారు. దాదాపు రూ.లక్షవరకు డిపాజిట్లను స్వీకరించనున్నట్టు చెప్పారు. ఈ చెల్లింపు బ్యాంకులో ఐసీఐసీఐ బ్యాంకు 20 శాతం వాటాను కలిగి ఉంటుందన్నారు. మరోపక్క వ్యూహాత్మక భాగస్వామి అయిన ఐసీఐసీఐ గ్రూప్ అందించే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ పుడెన్షియల్ పాలసీలను ఈ బ్యాంకు ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలకు నోచుకోని ప్రాంతాల్లో ఈ బ్యాంకులు సేవలందించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులు దేశంలో ఎక్కడైనా శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రుణ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం వాటి విలువ రూ.25 లక్షల వరకు ఉండాలి. షెడ్యూలు వాణిజ్య బ్యాంకులకు వర్తించే నిబంధనలన్నీ చిన్న బ్యాంకులకూ వర్తిస్తాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లు సేకరించడంతోపాటు రైతులు, అసంఘటిత రంగానికి చెందిన చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చేందుకు వీలుంటుంది. అలాగే యూనివర్సల్ బ్యాంకుల్లాగే ఇవి కూడా ఆర్బీఐ వద్ద విధిగా నగదు నిల్వ నిష్పత్తి(సీఆర్ఆర్) నిబంధన ప్రకారం డిపాజిట్లలో కొంత వాటాను జమచేయాల్సి ఉంటుంది. అలాగే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాగా భారతి ఎయిర్‌టెల్‌కుచెందిన ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంకు వినియోగదారుల ఖాతాలోని సొమ్ముకు 7శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
గోల్డ్లోన్లపై వడ్డీరేటు తగ్గింపు
- రైతునేస్తం రుణ పరిమితి రూ. 5లక్షలకు పెంపు - 1997కు ముందటి రుణాల రికవరీ కోసం వన్‌టైమ్ సెటిల్మెంట్ - డీసీసీబీ బోర్డు, సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నుంచి తీసుకునే గోల్డ్లోన్లపై వడ్డీరేటును 11.50 శాతానికి తగ్గించినట్లు బ్యాంకు చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు 12 నుంచి 14శాతం వరకు వడ్డీ రేటుందని, ఇక నుంచి కామన్‌గా తగ్గించిన వడ్డీ రేటు వసూలు చేస్తామన్నారు. నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్‌లో శుక్రవారం చైర్మన్ అధ్యక్షతన డైరెక్టర్ల బోర్డు సమావేశం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. 1997కు ముందు రుణాలు తీసుకొని ఇప్పటి వరకు బకాయి పడిన వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణాలపై వడ్డీ అసలుకు రెండు, మూడు రెట్లు అయి ఉంటుందని చెప్పిన చైర్మన్.. వన్‌టైమ్ సెటిల్మెంట్లో భాగంగా అసలుకు సమానంగా వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతు నేస్తం కింద ఇప్పటి వరకు సహకార సంఘాలు రూ.3లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయని, ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఎర్రగుంట్ల, రామదుర్గం,పెద్దహరివాణం, పాములపాడు రైతు సహకార సేవా సంఘాలకు సభ్యత్వం ఇచ్చినట్లు తెలిపారు. ఇందువల్ల డీసీసీబీకి దాదాపు రూ. 11కోట్లకు పైగా డిపాజిట్లు పెరిగాయన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రూపే కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్.. రూపే కార్డును ఆవిష్కరించారు. 1.05 లక్షల కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని సహకార సంఘాలకు మైక్రో ఏటీఎంలు ఇస్తున్నామని, వీటి ద్వారా నగదు తీసుకోవడంతో పాటు జమ కూడా చేసుకోవచ్చన్నారు. ఎరువుల వ్యాపారానికి అవసరమైన బ్యాంకు గ్యారంటీని కూడా ఇస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యాళ్లూరుకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఐసీడీపీ కింద జిల్లాకు రూ.126 కోట్లు విడుదలయ్యాయన్నారు. రానున్న రోజుల్లో అన్ని సహకార సంఘాలు ధాన్యం సేకరణకు ముందుకు వస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశాల్లో ఆప్కాబ్ జీఎం బాణుప్రసాద్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అపరాధ రుసుంతో అధిక భారం..
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రిటర్నులు సకాలంలో దాఖలు చేయని వారికి అపరాధ రుసుం విధిస్తూ ప్రతిపాదనలు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం పడనుంది. అదెలాగో చూద్దాం.. ప్రస్తుతం అమల్లో ఉన్నది.. ♦ రిటర్నులు గడువు తేదీలోపు దాఖలు చేయాలి. ♦అలా చేయకుండా ఆ తర్వాత చేస్తే... చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ విధిస్తారు. ♦ఒకవేళ చెల్లించవలసిన పన్ను లేకపోతే... వడ్డీ పడదు. ♦నష్టం ఉన్న కేసుల్లో సకాలంలో రిటర్నులు దాఖలు చేయకపోతే నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయరు. ♦పనాల్టీ రూ.5,000 విధిస్తారు. ♦ఎటువంటి అపరాధ రుసుం వసూలు చేయరు. తాజా ప్రతిపాదనలు ఏం చెబుతున్నాయంటే... ♦ తొలి నాలుగు అంశాల్లో ఎలాంటి మార్పూ లేదు. ♦ ఇక్కడ పెనాల్టీని మాత్రం రద్దు చేస్తున్నారు. ♦ కొత్తగా అపరాధ రుసుం ప్రవేశపెడుతున్నారు. ♦రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్న వారికి అపరాధ రుసుం రూ.1,000గా నిర్ణయించారు. ♦ ఇతర కేసుల్లో డిసెంబర్ లోపల దాఖలు చేస్తే రూ.5,000 చెల్లించాలి. ♦ డిసెంబర్ తర్వాత దాఖలు చేస్తే రూ.10,000 చెల్లించాలి. పైన పేర్కొన్న రెండింటినీ నిశితంగా పరిశీలిస్తే... తాజా ప్రతిపాదనల వల్ల అసెసీకి పన్ను భారం పెరుగుతోంది. సాధారణంగా పెనాల్టీలు విధించరు. పెనాల్టీలు విధించడమన్నది అధికారులకున్న విచక్షణాధికారం మాత్రమే. పన్నులు సకాలంలో చెల్లించి రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినా.. అదనంగా వడ్డీ చెల్లిస్తూ రిటర్నులు దాఖలు చేసినా.. ప్రభుత్వానికి ఆర్థికపరమైన నష్టం లేదు కాబట్టి అధికారులు పెనాల్టీలు విధించకుండా విడిచిపెడుతున్నారు. అటువంటి విచక్షణాధికారాన్ని తాజా ప్రతిపాదనల ప్రకారం రద్దు చేస్తున్నారు. దాని బదులుగా ఎటువంటి విచక్షణకు/సడలింపునకు ఆస్కారంలేని విధంగా విధిగా ఈ అపరాధ రుసుం విధించబోతున్నారు. ఈ ఉదాహరణను గమనిద్దాం... 1.4.2017 నుంచి 31.3.2018 వరకు ఒక వ్యక్తి నికర ఆదాయం రూ.3,40,000 అనుకోండి. ► పన్ను భారం రూ.4,500 ►రిబేటు రూ.2,500 ►చెల్లించవలసిన పన్ను రూ.2,000 ► విద్యా సుంకం రూ.60 ► బకాయి లేదు ►బకాయి లేనందున ఈ వ్యక్తి రిటర్నులు వేయలేదు. ►కానీ కొత్త రూల్స్ ప్రకారం రూ.1,000 చెల్లించాలి. ఒక వ్యక్తి నికర ఆదాయం రూ.7,00,000 అనుకోండి. ♦ పన్ను భారం రూ.54,075 ♦ టీడీఎస్ రూ.54,075 బకాయి లేనందున లేటుగా వేసిన అదనంగా చెల్లించనవసరం లేదు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం జూలై దాటి డిసెంబర్ లోపు అయితే రూ.5,000.. డిసెంబర్ దాటితే రూ.10,000 చెల్లించాలి. ఇది ఎంతో అదనపు భారం. రిటర్నులు ఆలస్యంగా వేసే వారికి శిక్ష. కాగా ఈ ప్రతిపాదనలు అన్నీ 2018–19 అసెస్మెంట్ సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. -
ఫైనాన్స్ కంపెనీలపై ఉక్కుపాదం
► నెలవారీ చిట్టీలపై జిల్లా పోలీసు బాస్ ఆరా ► ప్రజలను బురిడీ కొట్టించే సంస్థలపై నజర్ ► మండలాల వారిగా వివరాల సేకరణ ఎల్లారెడ్డిపేట: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి సన్నద్దమవుతున్నారు. ఫైనాన్స్ కంపెనీల ద్వారా చిరువ్యాపారులు, రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులు ఇస్తూ అధిక మొత్తంలో వడ్డీలు గుంజడమే కాకుండా వారి ఆస్తులను కాజేస్తున్న తీరుపై ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులందగా వీటిపై లోతుగా పరిశీలన ప్రారంభించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టిలపై నజర్ వేశారు. జిల్లా బాస్ ఆదేశాలతో జిల్లాలోని 13మండలాల్లో పోలీసులు గ్రామాల్లో జరిగే నెల వారి చిట్టిలు, ఫైనాన్స్ కంపెనీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఎంటర్ప్రైజెస్లపై కఠిన చర్యలు తీసుకున్న ఎస్పీ జిల్లాలో అనుమతులు లేకుండా నెల వారి చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ దిశలో వీటిపై పూర్తివివరాలు, నిర్వాహకులు, వడ్డీల వసూలుపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించడానికి స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపినట్లు సమాచారం. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టీలు జోరుగా సాగుతున్నట్లు తెలుసుకొని వాటిని అదుపు చేయడానికి ఆ ప్రాంతాల్లోని పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఇసుకపై సీరియస్.. అక్రమంగా ఇసుక తరలించే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఎల్లారెడ్డిపేటలో ఇసుక తరలించే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జిల్లా వ్యాప్తంగా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని జిల్లా బాస్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. -
సేవింగ్స్ వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుందా..?
నేను బిర్లా సన్ లైఫ్‌కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్‌లో ఏడాదిన్నర క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ యూనిట్లను విక్రయించాను. అయితే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ 30 శాతం మూల««దlన లాభాల పన్ను విధించింది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే ఎలాంటి మూలధన లాభాల పన్ను ఉండదు కదా? మరి ఈ సంస్థ ఎందుకు పన్ను విధించింది? – పరమేశ్వర్, విజయవాడ దేశీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్స్‌కే మీరు చెప్పిన పన్ను నిబంధనలు లేదా రాయితీలు వర్తిస్తాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌కు ఈ రాయితీలు వర్తించవు. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఇలాంటి గ్లోబల్ ఫండ్స్‌కు వర్తిస్తాయి. వీటిని ఈక్విటీ(ఇంటర్నేషనల్) ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, స్వల్ప కాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. ఈ పరంగానే బిర్లా సన్ లైఫ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్ మీకు 30 శాతం పన్ను విధించి ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నా వయస్సు 50 సంవత్సరాలు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద ఇప్పటికే రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందుతున్నాను. అదనపు పన్ను ప్రయోజనాలు పొందడం కోసం ఏదైనా బీమా లేదా పెన్ష న్ ప్లాన్ ను తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – సుధాకర్, విశాఖపట్టణం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద జీవిత బీమా ప్రీమియమ్‌లు, పెన్షన్ ప్లాన్ ప్రీమియమ్లకు రూ. లక్షన్నర వరకూ పన్ను రాయితీ లభిస్తుంది. మీరు ఇప్పటికే ఈ పరిమితి వరకూ ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి, అదనంగా బీమా, పెన్షన్ ప్లాన్ లు తీసుకున్నా, ఈ సెక్షన్ కింద ఎలాంటి పన్ను మినహాయింపులు మీరు పొందలేరు. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80 సీ కింద మరో రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఆరోగ్య బీమా తీసుకుంటే దానికి సెక్షన్ 80 డి కింద మరో రూ.25,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటితో పాటు కొన్ని రుణాలు, వ్యయాలు, విరాళాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నేను నా తల్లిదండ్రుల కోసం ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నాను. దీని నుంచి సూపర్ టాప్ అప్ ప్లాన్ కు పోర్ట్ చేసుకోవచ్చా ? – గణేశ్, తిరుపతి సాధారణంగా మీరు ఒక సంస్థ నుంచి వైద్య బీమాను తీసుకున్నారనుకోండి. ఈ బీమా పాలసీని మరో సంస్థకు పోర్ట్ (బదిలీ) చేసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, బీమా తీసుకోకముందే ఉన్న జబ్బుల కవరేజ్ వంటి ప్రయోజనాలు నష్టపోకుండా ఇలా పోర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్ పీ)లాగానే ఈ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కూడా మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో మీ నంబర్ మారకుండానే టెలిఫోన్ ఆపరేటర్‌ను మార్చుకునే వీలు ఉంది కదా. ఇలాంటిదే ఇది కూడా. ఈ బీమా పోర్టబిలిటీలో ఒకే విధమైన లేదా ఒకే సెగ్మెంట్ పాలసీలను బదిలీ చేసుకోవడానికే వీలుంటుంది. అంతేకాని మీరు తీసుకున్న బీమా పాలసీల నుంచి సూపర్ టాప్–అప్ ప్లాన్లకు పోర్ట్ చేసుకోవడానికి వీలుండదు. నేను, నా భార్య కలసి ఒక బ్యాంక్‌లో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరిచాము. ఈ ఖాతాలోని నిల్వపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాలా ? సేవింగ్స్ ఖాతాపై వచ్చిన వడ్డీ ఆదాయంపై ఏమైనా రాయితీలు ఉన్నాయా? ఐటీ రిటర్న్‌ల్లో ఏ పద్దు కింద ఈ వడ్డీ ఆదాయాన్ని చూపాలి ? – జావేద్, కరీంనగర్ సేవింగ్స్ ఖాతాలోని మొత్తంపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాల్సిందే. మీది జాయింట్ అకౌంట్ కాబట్టి, మీ భార్యకు ఎలాంటి సంపాదన లేకపోతే, ఈ వడ్డీ ఆదాయాన్ని మీ ఆదాయంతో కలిపి చూపాలి. ఒక వేళ మీ భార్య ఉద్యోగం / వ్యాపారం నిర్వహిస్తున్నట్లయితే మీ ఆదాయంతో కానీ, లేద , మీ భార్య ఆదాయంతో కానీ కలిపి చూపించాలి. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అనే పద్దు కింద సేవింగ్స్ ఖాతా నుంచి వచ్చే వడ్డీని చూపించాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ ఖాతాల్లోని వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకు మించిన వడ్డీ ఆదాయం ఆర్జిస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు వడ్డీ సర్టిఫికెట్లు దాఖలు చేయాల్సిన పనిలేదు. అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్‌ను మాత్రం మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ స్క్రూటినీ నిర్వహిస్తే అప్పుడు ఈ వడ్డీ సర్టిఫికెట్ ఒరిజినల్‌ను చూపించాల్సి ఉంటుంది. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆ పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
హైదరాబాద్: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వాడుకలోలేని పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక అందించారు. వాడుకలో లేని పీఎఫ్ అకౌంట్లకు 8.8 శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి కార్యాలయం (ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుందని దత్తాత్రేయ పీటీఐకి తెలిపారు. 2011 నుంచి వడ్డీ చెల్లించని ఈ ఈపీఎఫ్ అకౌంట్లకు వడ్డీ చెల్లించడం ద్వారా ఆయా ఖాతాలను వాడుకలోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నోటిషికేషన్ విడుదల చేయనున్నదని ఆయన సోమవారం తెలిపారు. తమ నిర్ణయం దాదాపు 9.70 కోట్ల మంది కార్మికులకు లేదా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లావాదేవీలు జరపని అకౌంట్లలో రూ.42 వేల కోట్ల నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.సంబంధిత ఫైల్స్ పై ఇప్పటికే తాను సంతకం చేశానని, మరోవారంలోగానే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఇది ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే దీపావళి కానుక అని ప్రకటించారు. పీఎఫ్ ఉపసంహరించుకోవడానికి ఇష్టపడని , లావాదేవీలు జరపని ఖాతాదారులు కూడా ఇక ముందు వడ్డీ పొందడానికి అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇది సురక్షితమైన పెట్టుబడిగా ఉండి, ఇవాళ కాకపోతే రేపు హక్కుదారులకు చెల్లిస్తామన్నారు. ఈపీఎఫ్ విషయంలో గత 36 నెలలుగా లావాదేవీలు జరపని ఖాతాలను "పనిచేయని" గా వర్గీకరిస్తారు. ఇలాంటి ఖాతాలను గుర్తించే పనిలోఉన్నామని, ఈ ప్రక్రియ ముగియగానే ఖాతాలకు వడ్డీ పంపిణీ ప్రారంభిస్తామని దత్తాత్రేయ చెప్పారు.అన్ని ప్రభుత్వ రంగాల్లో సామాజిక భద్రతా పథకం పెంచాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలోభాగంగా ఇపీఎఫ్ఓ నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరాన్ని ఉంది అన్నారు. కాబట్టి ప్రస్తుత జోనల్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయబడుతుందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక జోనల్ కార్యాలయం ఏర్పాటు కానున్నట్టుచెప్పారు. ఈ అంశంపై నేడు (మంగళవారం) వివరంగా చర్చించడానికి ఇపిఎఫ్ఓ సమీక్షా సమావేశమవుతోందని తెలిపారు. అలాగే ఇపిఎఫ్ఓ , పెట్టుబడులు పునర్నిర్మాణ తదితర సమస్యలపై ధర్మకర్తల మండలి తదుపరి సమావేశంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతరులతో చర్చించనున్నట్టు తెలిపారు. -
టాటాల మరో కీలక అడుగు?
టాటా గ్రూప్ లోసైరస్ మిస్త్రీ తొలగింపు దుమారం చల్లారకముందే టాటాలు కీలక పావులు కదుపుతున్నారు. ఈ వివాదంలో మిగిలిన కార్యక్రమాలను చకచకా చక్క పెట్టే పనిలో టాటా గ్రూప్ బిజీగా ఉంది. ముఖ్యంగా టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారులకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల ఫ్రెండ్లీ పార్టనర్స్ కోసం వెతుకుతోందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. సమర్థవంతమైన కొనుగోలుదారులకోసం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే టాటాలు మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలుకు ఆసక్తి వున్న సావరిన్ హెల్త్ ఫండ్ (ప్రభుత్వ ఆధీనంలో ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ఇతర దీర్ఘకాల పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు నివేదించింది. టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలో 65 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది. అయితే ఈవార్తలను ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా ఖండించారు. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదనీ, మిస్త్రీ తన పోరాటాన్ని వదులుకోరని వ్యాఖ్యానించారు. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి టాటాసన్స్, షాపూర్జీ పల్లాంజీ గ్రూపు తిరస్కరించాయి. కాగా టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి అకస్మాత్తుగా ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్ లోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ షాపూర్జీ , పల్లోంజి గ్రూప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. , -
ఇతర ఆదాయాలతో జాగ్రత్త!
• డివిడెండ్లుగుర్రపు పందేలు/లాటరీ మీది ఆదాయం • వడ్డీ బహుమతులు ఇంటి మినహా • ఇతరమార్గాల్లో వచ్చే అద్దె ఆదాయం నాలుగు రకాలు. ఇదేంటనుకుంటున్నారా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మనం సంపాదించే డబ్బుని నాలుగు రకాల ఆదాయాలుగా విభజిస్తారు. అవే.. జీతం, ఇంటి మీద ఆదాయం, వృత్తి/వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు. ఇవి కాక మనం చాలా మార్గాల్లో డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాం. అప్పుడు ఆ సంపాదనను ఇతర ఆదాయాల కింద పేర్కొంటాం. అవేంటో ఒకసారి చూద్దాం.. ఈ మార్గాల్లో వచ్చే డబ్బుని ఇతర ఆదాయంగా పరిగణిస్తాం. డివిడెండ్ల మీద వచ్చే ఆదాయానికి పూర్తిగా మినహాయింపు ఉంది. కుటుంబ పెన్షన్ విషయంలో కొంత మినహాయింపు పొందొచ్చు. ఫర్నీచర్ అద్దెకిస్తే వచ్చే ఆదాయంలోంచి వాటి మీది తరుగుదల మినహాయిస్తారు. బహుమతుల మీద పరిమితులు ఉన్నాయి. సంవత్సర కాలంలో రూ.50,000 లోపు బహుమతులకు పన్ను భారం లేదు. పెళ్లి కానుకలకు మినహాయింపు ఉంది. వీలునామా ద్వారా సంక్రమించే ఆస్తులకు పన్ను లేదు. రక్తసంబంధీకులిచ్చిన బహుమతులకు కూడా పన్నుభారం ఉండదు. ఈ బహుమతుల స్టోరీ చదవండి.. సుబ్బారావు, పార్వతమ్మ ఒకేసారి స్వర్గస్తుల య్యారు. సుబ్బారావు రాసిన వీలునామా ప్రకారం.. కొడుకు సత్యానికి ఒక భవంతి సంక్రమించింది. దీనికి పన్ను లేదు. తల్లి నుంచి పెద్ద కూతురు అన్నపూర్ణకి వంద తులాలు బం గారం, చిన్నకూతురు కృష్ణవేణికి రూ.5,00,000ల నగదు వచ్చింది. ఇద్దరికీ పన్ను భారం ఉండదు. స్వంత వ్యాపారం కోసం సత్యానికి ఆయన మామ, అత్త, మేనత్త, మేనమామ తలా రెండు లక్షల చొప్పున ఇచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యానికి తన చిన్నప్పటి స్నేహితుడు ప్రసాద్ రూ.2,00,000లు బహుమతిగా ఇచ్చాడు. దీన్ని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. సత్యం వ్యాపారం ‘మూడు పూలు.. ఆరు కాయలు’ లాగా అభివృద్ధి చెందింది. విపరీతమైన లాభాలు వచ్చాయి. ఈయనకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి లావ ణ్య పెళ్లి ఘనంగా చేశాడు. పెళ్లికి నగదు, ఆభరణాలు కానుకగా వచ్చాయి. దీని మీద పన్ను భారం లావణ్యకి లేదు. లావణ్యకు ఆమె మామ పెద్ద ఫ్లాటు రాసిచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యం కొడుకు చైతన్య, చిన్న కూతురు అరుణ ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. చైతన్య అక్క లావణ్యకి ఎన్నో సార్లు అక్కడి నుంచి డబ్బు బదిలీ చేశాడు. దీనికి సంబంధించి లావణ్యకి పన్ను భారం లేదు. అలాగే లావణ్య కూడా అరుణకి కొన్ని బహుమతులు పంపించేది. ఇక్కడ ఇరువురికీ పన్ను భారం లేదు. అంటే రక్తసంబంధీకులు ఇచ్చిపుచ్చుకునే వాటికి పన్ను భారం ఉండదు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాత నిజంగా ఉండాలి. అతనికి ఇచ్చే సామర్థ్యముండాలి. అన్ని కల్పితాలైతే మాత్రం బహుమతులన్నీ ఆదాయం కిందకు వచ్చేస్తాయి. -
ఆదాయం వడ్డీకీ చాలట్లేదు: క్రెడిట్ సూసీ
న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఊబి అంతకంతకూ విస్తరిస్తోందని క్రెడిట్ సూసీ సంస్థ తెలిపింది. రుణ భారంతో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న కంపెనీల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని క్రెడిట్ సూసీ ఇండియా కార్పొరేట్ హెల్త్ ట్రాకర్ సర్వేలో వెల్లడైంది. దాదాపు 39 శాతం కంపెనీలు ఆర్జిస్తున్న ఆదాయం వడ్డీ వ్యయాలకు కూడా సరిపోవడం లేదని సర్వే పేర్కొంది. దీని ప్రకారం ఆదాయం వడ్డీకీ సరిపోని కంపెనీల సంఖ్య ఈ ఏడాది తొలి క్వార్టర్లో 39 శాతానికి పెరిగింది. -
ప్రకృతి వ్యవసాయంపై రైతుల ఆసక్తి
దెందులూరు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనబరచడం అభినందనీయమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వై.ఆనందమయి అన్నారు. శుక్రవారం దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో దెందులూరు ఏఎంసీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రైతులకు అవగాహన సమావేశం ఏలూరు ఏడీఏ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల బలోపేతం, సంక్షేమం, అధిక దిగుబడులు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరి సాగు చేస్తున్న ఒక్కొక్క ఎకరానికి రూ.2వేలు చొప్పున ఆరుగురికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీడీ విజిఎస్‌ఈ హరి, ఏఈవో వై.నాయుడు, ఆత్మ ఏపీఎం టి.స్వర్ణలత, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించాలి
డీఈఓ పి.రాజీవ్ అక్టోబర్‌లో జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ విద్యారణ్యపురి: విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదిక అని డీఈఓ పి.రాజీవ్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని న్యూసైన్స్ పీజీ కళాశాలలో 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లోని ప్రధాన అంశమైన ‘సుస్థిర అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం’పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. అనంతరం నిజాం కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చాంద్‌పాషా, ఎన్సీఎస్సీ రాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ ఎం.సాంబశివారెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను ఈఏడాది నవంబర్ 10,11 తేదీల్లో మెదక్ జిల్లా నందిగ్రామ్‌లో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. అందువల్ల జిల్లా స్థాయిలో పోటీలను అక్టోబర్‌లో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సీహెచ్.కేశవరావు, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ కె.రాంగోపాల్‌రెడ్డి,అకాడమిక్ కోఆర్డినేటర్ వి.గురునాథరావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. -
ఇన్వెస్టర్లకు పెరిగిన రిస్క్: ఫిచ్
ముంబై: డెట్ ఇన్స్ట్రుమెం ట్లపై దక్షిణాదికి చెందిన ధనలక్ష్మి బ్యాంకు జూలై నెలలో కూపన్(వడ్డీ) చెల్లించడంలో విఫలం కావడం... నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ), నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటున్న దేశీయ బ్యాంకుల నుంచి ఇన్వెస్టర్లకు ముప్పు పెరిగిం దని సూచిస్తున్నట్టు రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. బ్యాంకు క్యాపిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌పై ఇన్వెస్టర్లు వడ్డీ వదులుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలుంటాయని అధిక అంచనాలున్న చోట ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం వ్యవస్థకు మంచిదేనని ఫిచ్ పేర్కొంది. ధనలక్ష్మి టైర్-1 మూలధనం జూన్ చివరి నాటికి నిర్ధేశించిన 9.62 శాతానికి బదులు 7.44 శాతానికి తగ్గిపోవడంతో కూపన్ చెల్లించడాన్ని ఆర్బీఐ నిలిపివేసింది. బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనతో ధనలక్ష్మి బ్యాంకు మూలధనంపై మార్కె ట్ వర్గాల్లో ఆందోళనలు పెరిగాయని, దీంతో కొత్తగా మూలధనం సమీకరించుకునే అవకాశాలను ఇది క్లిష్టతరం చేసిందని ఫిచ్ పేర్కొంది. -
'రికరింగ్'తో రిలీఫ్!
కొందరు రికరింగ్ డిపాజిట్ అనొచ్చు. మరికొందరు ఆర్డీ అనొచ్చు. ఎలా పిలిచినా... పొదుపు చేసేవారి జీవితంలో ఇది ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటుంది. కాకపోతే ఈ సులువైన పొదుపు సాధనంలో ఉన్న ప్రయోజనాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. వాటి పై అవగాహనే ఈ కథనం... నిజానికి ఆర్డీ అనేది ఈజీగా ఎంచుకునే పొదుపు సాధనం. నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా మదుపు చేసే సౌలభ్యం ఈ డిపాజిట్లో ఉంది. రెండేళ్లో, నాలుగేళ్లో... ఎంతో కొంత కాలాన్ని ముందే నిర్ణయించుకుని, అప్పటిదాకా నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేస్తే... ముందే నిర్ణయించిన రేటు మేరకు వడ్డీ అందుతుంది. ఉదాహరణకు నెలకు రూ.1,000 చొప్పున 24 నెలలు పొదుపుచేద్దామనుకుంటే బ్యాంకులో ఆర్డీ ఖాతా తెరవొచ్చు. ఎంచుకునే కాలాన్ని బట్టి వడ్డీరేటు దాదాపు 7.5 శాతం వరకూ ఉంది. ⇒ స్వల్ప మొత్తాల పొదుపునకు మెరుగైన సాధనం ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈజీగా తెరవొచ్చు ⇒ ఆన్‌లైన్‌లోనూ సొంతగా తెరుచుకునే వీలు ⇒ నిర్దిష్ట వ్యవధికి వడ్డీ గ్యారంటీ; నష్టభయం ఉండదు ⇒ స్వల్పకాలిక లక్ష్యాలకు ఆర్డీ మేలంటున్న నిపుణులు స్వల్పకాలిక లక్ష్యాలంటే...? కొత్తింటి కొనుగోలుకు కొంత డౌన్‌పేమెంట్ కావాలి. ఉంటున్న ఇంటికి మరమ్మతులు, అదనపు హంగులు కావాలంటే... రెండు మూడేళ్ల వ్యవధిలో ఇంట్లో వారికి పెళ్లి చేయాల్సి రావటం. సెలవుల్లో కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లటం ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, మోటార్‌సైకిల్, కారు లేదా ఫ్రిజ్, టీవీ, వాషింగ్‌మెషీన్ల వంటి వైట్ గూడ్స్ కొనుగోలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఉత్తమం... ఆర్డీ చాలా సురక్షితం. తప్పనిసరిగా రాబడులొస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సహజంగా విశ్లేషకులు చెప్పేదేంటంటే... 8 నుంచి 9 సంవత్సరాల్లో అవి మంచి ఫలితాలిస్తాయని. స్వల్పకాలంలో అయితే నష్టాలు రావొచ్చని హెచ్చరిస్తుంటారు. తప్పుడు షేర్లలో పెట్టుబడులు పెడితే లాభం కాదుకదా... అసలుకే ఎసరు రావొచ్చు. ఆర్డీతో అలాంటిదేమీ ఉండదు. మార్కెట్ రేటు రిటర్న్ గ్యారంటీ. దీన్నిబట్టి చూస్తే ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలకు రికరింగ్ డిపాజిట్ ఉత్తమం. నిజానికి మనం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాం తప్ప... స్వల్పకాలం అవసరాలను గుర్తించం. స్వల్ప మొత్తం... తేలిగ్గా పరి ష్కారం అయిపోతుం దిలే అనుకుంటాం. కానీ అక్కడే ఇబ్బంది పడతాం. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాల పెట్టుబడులకు సైతం అమాంతంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎలా బాగుంటుంది.... ఉదాహరణకు మీరు వచ్చే 18 నెలల్లో మూడు లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో రూ.20,000 ఫోన్, పాపకు రూ.30,000 చిన్న ఆభరణం. అబ్బాయి ఉన్నత విద్యకు తొలి విడత ఫీజు రూ. 25,000. వీటిని తేలిగ్గా చేరుకోడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలానికి తగిన నెలవారీ చెల్లింపులతో మూడు ఆర్డీలను తెరిస్తే చాలు. అనుకున్నది సాధించొచ్చు. ఇంకో విషయమేంటంటే... ఆర్డీలు తెరిచాక తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి కనుక... సహజంగానే మీరు పొదుపరులుగా మారిపోతారు. దుబారా తగ్గించుకుంటారు. ఖర్చులపై ఆచితూచి తీసుకునే నిర్ణయాలు... దీర్ఘకాలంలో చక్కని ఫలితాలనిస్తాయి. అకౌంట్ తెరవడమూ కష్టం కాదు... బ్యాంక్‌కు వెళ్లి... అకౌంట్ కాగితాలు తీసుకుని... పూర్తిచేయాల్సిన అవసరమేదీ ఇప్పుడు లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజీకి వెళ్లి... క్షణాల్లో అకౌంట్‌ను స్వయంగా తెరవొచ్చు. నెలవారీ ఎంత చెల్లించాలనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? ఏ తేదీన మీ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆన్లైన్ అప్లికేషన్లోనే పూర్తిచేసేయొచ్చు. మరో విషయమేంటంటే... మీరు ఆర్డీలను ప్రత్యక్షంగా బ్యాంక్ అకౌంట్‌కే లింక్ చేసుకుంటే... నెలనెలా మీరు నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిగ్గా మీ ఖాతా నుంచి డబ్బులు ఆర్డీకి జమ అయిపోతాయి. వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే... వడ్డీపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. ఇపుడు లేదు. ఆర్డీ మొత్తానికి మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. కొంత వడ్డీ కోతతో ఎప్పుడైనా మీ ఆర్డీని బ్రేక్ చేసుకునే వీలుంది. కొన్ని బ్యాంకుల్లో నెలవారీ డిపాజిట్ మొత్తాన్ని కొంత పెంచుకోవచ్చు కూడా. కాకపోతే తగ్గించడానికి వీలుపడదు. ఆర్డీ వడ్డీని చక్రగతిన మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఆర్డీలో నామినేషన్ సౌలభ్యం ఉంది. దీన్లో జమయిన మొత్తంపై 80 నుంచి 90 శాతం వరకూ రుణం కూడా తీసుకోవచ్చు. పోస్టాఫీసుల విషయంలో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అకౌంట్‌ను మార్చుకోవచ్చు. ఇద్దరు పెద్దలు కలసి జాయింట్ అకౌంట్‌నూ తెరవొచ్చు. నెలలో నిర్దిష్ట కాలంలో డిపాజిట్ చెల్లించకపోతే రూ.5కు ఐదు పైసల జరిమానా ఉంటుంది. నాలుగు రెగ్యులర్ డిఫాల్ట్స్కు అనుమతి ఉంది. అలా జరిగితే రెండునెలల్లో డిపాజిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే తదుపరి డిపాజిట్ చెల్లించడానికి కుదరదు. కనీసం ఆరు విడతల డిపాజిట్లు ముందే కట్టేస్తే... రాయితీ లభిస్తుండడం మరో విశేషం. డిపాజిట్‌కు ఒకవేళ మీరు చెక్ ఇస్తే... ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో పడిన తర్వాతే మీరు చెల్లింపులు జరిపినట్లుగా భావిస్తారు. డిపాజిట్-కాలం.. కనీసం ఎంత? రికరింగ్ డిపాజిట్లో నెలకు డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం... కాల వ్యవధి బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీసం రూ.100 తోనే ఆర్డీ ప్రారంభించవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ మొత్తం కనీసం రూ.500 లేదా రూ.1,000గా ఉంది. పోస్టాఫీసులో కనిష్టంగా రూ.10. గరిష్ట పరిమితి ఎక్కడా లేదు. ఇక కాల వ్యవధి ఆరు నెలల నుంచి పదేళ్ల వరకూ ఉంది. -
పసిడి బాండ్లు... డబ్బు ఆర్బీఐకి
చేరేవరకూ 4% వడ్డీ! న్యూఢిల్లీ: నాలుగవ విడత పసిడి బాండ్లను కొన్నవారికిది శుభవార్తే. ఎందుకంటే బాండ్లకోసం ఇన్వెస్టర్లు చెల్లించిన డబ్బు ఎక్స్ఛేంజ్ లేదా ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ (ఐసీసీఎల్) నుంచి రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. అప్పటి నుంచే బాండ్లు జారీ అయి... వాటిపై వడ్డీ కూడా అందుతుంది. అయితే ఈ లోగా ... అంటే ఆర్బీఐకి చేరేలోగా ఎన్నిరోజులైతే అన్ని రోజులకు 4 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రస్తుత సేవింగ్స్ బ్యాంక్ రేటుకు సమానం కావడం గమనార్హం. ఈ రేటు ప్రత్యక్షంగా ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుందని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఈ ప్లాట్‌ఫామ్‌పై సావరిన్ గోల్డ్ బాండ్ అలాట్ అయ్యేంతవరకూ బిడ్స్‌కు సంబంధించి వచ్చిన డబ్బుపై ఈ వడ్డీని ఐసీసీఎల్ ద్వారా చెల్లిస్తుందని తెలియజేసింది. అయితే డబ్బు విత్‌డ్రాయెల్స్ విషయంలో ఈ వడ్డీ చెల్లింపులు ఉండబోవని స్పష్టం చేసింది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ పథకం 18న ప్రారంభమైంది. జూలై 22న ముగుస్తుంది. తరువాత బాండ్లు జారీ అవుతాయి. ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ కూడా జరిగే ఈ బాండ్ కూపన్ వార్షిక రేటు 2.75 శాతం. -
రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దు!
♦ బ్యాంకర్లకు మంత్రి పోచారం విజ్ఞప్తి ♦ ప్రైవేటు అప్పుల నుంచి అన్నదాతలను విముక్తి చేయాలి ♦ బ్యాంకులు ఒకే విధానాన్ని అవలంబించాలి ♦ రైతులందరికీ పంట బీమా వర్తింపజేయాలి ♦ బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం జిల్లా పరిషత్ : రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ వసూలు చేయడం బాధాకరమని, వడ్డీ డబ్బులు వసూలు చేయొద్దని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు. నాన్ లోన్ రైతులందరికీ రుణాలు ఇచ్చి ప్రైవేటు కబంధహస్తాల నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. రైతులకు పంట బీమాను వర్తింపజేసేలా వారికి అవగాహన కల్పించాలని కోరారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గతనెలలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నేటికీ జిల్లాలో లోటు వర్షపాతమే ఉందని, 126.7 మిల్లీమీటర్లకు 124.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం విత్తనాల కొరత లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రైతులు పంటలు సాగు చేసుకోవాలంటే కావాల్సింది డబ్బులు మాత్రమేనని, వాటిని రుణాల రూపంలో బ్యాంకులు ఇవ్వాలని కోరారు. రుణాలు, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.. జిల్లాలో 4.73 లక్షల మంది పట్టదారులు ఉంటే అందులో ఇప్పటికే 3.79 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఇంకా 94 వేల మంది పట్టాదార్లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, వారికి కూడా అప్పు లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని బ్యాంకు లు రైతుల విషయంలో ఒకే విధమైన పద్ధతిని అవలంభించాలని సూచించారు. సర్కా ర్ బ్యాంకు అధికారులకు రాష్ట్రస్థాయిలో కు దుర్చుకున్న ఒప్పందం ప్రకారం బ్యాంకు రు ణాలు, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలి పారు. అయితే అందుకనుగుణంగా కాకుం డా కొన్ని బ్యాంకులు రైతుల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయన్నారు. లక్షలోపు రు ణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ దిశగా ఇప్పటికి రూ.200 కోట్లకుపైగా ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. కేవలం రూ.20 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. లక్షపైన రుణాలకు కేవలం సంవత్సరానికి 4 శాతం వడ్డీని మాత్రమే తీ సుకోవాలని సూచించారు. ఇంత చెప్పినప్పటికీ బ్యాంకులు వడ్డీని వసూలు చేసినట్లయి తే ప్రభుత్వం, తమల్ని అవమానించినట్లేనని అన్నారు. వీలైనంత త్వరలో రుణాలు మంజూరు చేసి సహకరించాలని కోరారు. పంటల బీమాకు నిర్ణీత సమయంలో పంట బీమా ప్రీమియం తగ్గించడానికి సంబంధిత బీమా కంపెనీలకు ఆ మొత్తాలను చెల్లించి రైతులకు బీమా వర్తించేలా బ్యాంకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన పత్తి ైరె తులు జూన్ 14లోగా బీమా కోసం డీడీ కట్టి ఉంటే వాటిని ఆమోదించేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మూడో విడత రుణమాఫీలో సగం చెల్లించిందని, మిగతాది కూడా చెల్లిస్తుందని పేర్కొన్నారు. అలాగే రెన్యూవల్లో వెనకబడి ఉన్న ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్, ఇండియన్ బ్యాంకులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. జులై 4న సమావేశం పంటలకు బీమా వర్తింపజేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. ఈ దిశగా గ్రామం యూనిట్‌గా వర్తింపజేయడానికి అసెంబ్లీలో చర్చ జరగడం, రెండేళ్లుగా రైతుల నిరీక్షణకు ఫలితం లభించిందని అన్నారు. తద్వారా నిజామాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం పెలైట్ జిల్లాగా గుర్తించిందని తెలిపారు. వ్యవసాయానికి ఆరు రకాలుగా బీమా సదుపాయాలు ఉన్నాయని, వాటిని రైతులకు అనుకూలంగా లబ్ధి చేకూర్చడానికి అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు. జులై 4న బ్యాంకర్లతో తిరిగి సమావేశం ఉంటుందని తెలిపారు. కాగా ఆంధ్రాబ్యాంకు మినహా మిగిలిన బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జేడీఏ నర్సింహా తెలిపారు. ప్రభుత్వం నుంచి వడ్డీ వచ్చిన తర్వాత తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తున్నాయని, ఇప్పటికే అలా చేసిన బ్యాంకుల వివరాలను సేకరించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల విషయంలో అవినీతి చోటుచేసుకుంటుందని, దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కోరారు. లక్ష రుణం తీసుకుంటే 80శాతం సబ్సిడీ ఉండటంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పశుసంవర్థకశాఖ అధికారులు పథకాలు, సబ్సిడీలు, తదితర విషయాలను వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ డి రాజు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఏజేసీ రాజారాం, జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్, ఇన్య్సూరెన్స్ అధికారిణి రాజేశ్వరి, ఇన్చార్జి ఎల్డీఎం వెంకటేశ్వర్లు, ఉద్యానవనశాఖ డీడీ సునంద, పశుసంవర్ధకశాఖ జేడీ ఎల్లన్న, ఏడీఏలు, బ్యాంకుల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఔషధంలా వాడితే మంచిదే!
ఓవర్ డ్రాఫ్ట్... వెంకట్ మొబైల్‌కు తన బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి క్రమం తప్పకుండా ఆరు నెలలుగా వేతనం మీ ఖాతాలో జమ అవుతోందా? అయితే... ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం కోసం మా బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించండి.’ ఇదీ ఆ మెసేజ్ సారాంశం. దీంతో వెంకట్ ఆలోచించటం మొదలెట్టాడు. చివరకు తన ఆఫీసులో ఆర్థికాంశాలపై అవగాహన ఉన్న స్నేహితుడు రామును దీని గురించి అడిగాడు. రాము ఏం చెప్పాడనేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేకం... ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఆస్తులు, ఎఫ్డీలు, బీమా పాలసీలు తనఖా పెట్టి కూడా మిగిలిన రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువే విత్‌డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ కనక ఉత్తమం ఈ రుణంతో రిస్కు చేస్తే మాత్రం ఇబ్బందులే!! వినియోగించుకున్న డబ్బుపైనే వడ్డీ... ఉదాహరణకు మీకు రూ.6 లక్షలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మంజూరు చేశారనుకుందాం. ఆ మేరకు డబ్బు మొత్తాన్ని మీ చేతికివ్వటం జరగదు. అలాగని వారి దగ్గరే ఉంచుకోరు కూడా. ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే... రూ.6 లక్షలనేది మీ రుణ పరిమితి. అక్కడి వరకూ మీరు ఉపయోగించుకోవచ్చన్న మాట. అందులో మీరు ఎంత వినియోగించుకున్నారో.. అంత మొత్తానికే వడ్డీరేటు పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాతిపదికనే వడ్డీని కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారే కాకుండా.. మీ అవసరాన్ని బట్టి కావాల్సినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ.. అంతే మొత్తానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఇక్కడ లభిస్తుంది. అత్యవసర సమయాల్లో... మనలో ప్రతి ఒక్కరికీ ఒకో సమయంలో డబ్బు అవసరం పడుతుంది. సిద్ధంగా ఉంటే సరే. లేదంటే ఎక్కడన్నా... అప్పు పుడుతుందా? అని చూస్తాం. క్రెడిట్ కార్డు వాడాలా..! దానిపై లిమిట్ అయిపోతే రుణం తీసుకోవాలా? లేకపోతే బ్యాంక్‌లో పర్సనల్ లోన్ దొరుకుతుందా? ఇవన్నీ చూస్తాం. ఇంత చేసినా మనకు కావాల్సిన మొత్తానికి కొంత అటు, ఇటు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం గురించి తెలిసిన వారికి ఈ దారి కొండంత అండలా కనిపిస్తుంది. చాలా మందికి దీని గురించి తెలియకపోవడమే ఇక్కడ సమస్య. తనఖాతో తక్కువ వడ్డీపైనే... మీకు వస్తున్న వేతనం ప్రాతిపదికగా... లేదా మీరేదైనా ఆస్తిని తనఖా పెట్టిన సందర్భంలో స్వల్పకాలానికి బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. మిగిలిన వివిధ రకాల రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. గృహం, జీవిత బీమా పాలసీ, బ్యాంక్ స్థిర డిపాజిట్లు, షేర్లు, బాండ్లు వంటి వాటిని ఆస్తులుగా ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ మీరు తనఖాగా బ్యాంకు దగ్గర ఏం పెట్టారన్న విషయంపైనే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. వడ్డీలు ఎలా ఉంటాయి...? ఆస్తిని తనఖా పెట్టి తీసుకున్న రుణమైతే వడ్డీరేటు సంవత్సరానికి 12 నుంచి 14 శాతం వరకూ ఉంది. ఒకవేళ స్థిర డిపాజిట్లను తనఖాగా పెట్టారనుకుందాం. ఇందులో 70 శాతం వరకూ రుణంగా లభిస్తుంది. గృహ తనఖాపై విధించే వడ్డీరేటుకన్నా... తక్కువ వడ్డీరేటు ఉంటుంది. స్థిర డిపాజిట్ పథకంపై చెల్లించే వడ్డీరేటుకన్నా ఒకశాతం వడ్డీని మాత్రమే బ్యాంకు అదనంగా వసూలు చేస్తుంది. అంటే మీకు స్థిర డిపాజిట్‌పై వచ్చే వడ్డీ 9 శాతం అయితే మీ నుంచి వసూలు చేసేది 10 శాతం ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ వాడుకునే ముందు ఇవి గుర్తుంచుకోండి... * ఓవర్‌డ్రాఫ్ట్ కేవలం అత్యవసరాలకు ఉద్దేశించిన ఒక సౌలభ్యం. * ఈ రుణంతో తీవ్ర ఒడిదుడుకులతో కూడిన స్టాక్స్, కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. * మీ ఓవర్‌డ్రాఫ్ట్‌పై వడ్డీని సకాలంలో సక్రమంగా చెల్లించండి. * సకాలంలో ఓవర్‌డ్రాఫ్ట్ మొత్తాన్ని బ్యాంకుకు జమ చేసేయండి. * ఒకవేళ మీరు చెల్లించలేకపోతే... మీరు తనఖాగా ఉంచిన ఆస్తిని బ్యాంక్ లిక్విడేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. * మరిన్ని అంశాలను స్పష్టంగా మీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌ను అడిగి తెలుసుకోండి. రుణ మంజూరు ఎలా...? ఉదాహరణకు మీరు మీ ఇంటిని తనఖాగా ఉంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుంటున్నారనుకోండి. ఆస్తి విలువ రూ.10 లక్షలు అనుకుందాం. ఇందులో 50 నుంచి 60 శాతం వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ మీరు గనక అదే బ్యాంకులో రుణం తీసుకుని ఉంటే... దానిని తిరిగి సరిగా చెల్లించారా లేదా? మీ పునఃచెల్లింపుల సామర్థ్యం ఎంత? వంటి అంశాలను కూడా బ్యాంక్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆయా అంశాల ప్రాతిపదిన ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఇస్తుంది. ఉద్యోగికి వేతనం విషయంలోనూ ఇలాంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే... ఇక మీరు వేతన జీవి అనుకోండి. మీ నెలవారీ వేతనంపై బ్యాంకు తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీకు నెలకు రూ.50వేలు వేతనం ఉంటే రూ.25 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నిచ్చే అవకాశముంది. మీ అవసరం, గతంలో మీ రుణ చెల్లింపు సామర్థ్యం... అదే ఖాతాలో మీరు పని చేస్తున్న సంస్థ నుంచి వేతన జమ... వంటి అంశాలపై కూడా ఈ పరిమితి ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్కన్నా తక్కువ రుణ రేటుకు ఓవర్‌డ్రాఫ్ట్ దొరుకుతుందనేది గమనార్హం. ఓవర్‌డ్రాఫ్ట్‌కు చేయాల్సిందేంటి? మీకు ఎంత వేగంగా రుణం మంజూరవుతుందనేది మీరు తనఖా పెట్టే ఆస్తిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆస్తిని తనఖాగా ఉంచితే... దానికి విలువ కట్టడం, దాన్ని వెరిఫై చేయటం వంటివి ఆలస్యమవుతాయి కనక కొంత సమయం పడుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివైతే వెంటనే మంజూరవుతుంది. ఈ రుణాల ఫీజుల విషయానికొస్తే 0.5 శాతం నుంచి రూ.25,000 వరకూ ఉంటాయి. మీరు పెట్టిన తనఖా ప్రాతిపదికన ఓవర్‌డ్రాఫ్ట్ పునః చెల్లింపు గడువు ఆధారపడి ఉంటుంది. దీనిని బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. -
మహిళలకు వడ్డీ లేని రుణాలందించాలి
మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సృజన ఆదిలాబాద్ అగ్రికల్చర్ : గతంలో స్త్రీనిధి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఉండేవని, ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలను పునరుద్ధరించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వి.సృజన అన్నారు. శుక్రవారం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సదుస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు మహిళా గ్రూపులకు రూ.10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగానే డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలకు స్కాలర్షిప్ను రూ.1500 అందించాలని, అభయహస్తం పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అఘారుుత్యాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. షీ టీంలను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా మండల, గ్రామ స్థాయిలో కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి, అధ్యక్షురాలు చంద్రకళ, ప్రభావతి, టీ.రాజకుమారి, కవిత, బోథ్ మండల కార్యాదర్శి గోదావరి, వై.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు... వాయిదా రూట్లో వెళితే జాగ్రత్త!!
కిషోర్, సురేష్... ఇద్దరూ మంచి స్నేహితులు. సహోద్యోగులు కూడా. కాకపోతే ఖర్చుల విషయంలో ఇద్దరూ భిన్నధ్రువాలు. కిషోర్ కాస్తంత పొదుపరి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెడతాడు. సురేష్ అలాకాదు. ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేసేసి... తరవాత తీరిగ్గా బాధపడతాడు. ఇద్దరికీ క్రెడిట్ కార్డులున్నాయి. కార్డు చెల్లింపుల్లోనూ ఇద్దరివీ రెండుదారులు. కిషోర్ ప్రతినెలా తను ఖర్చు చేసిన మొత్తం బిల్లును గడువు తేదీ లోపల ఠంచనుగా చెల్లించేస్తుంటాడు. సురేష్ మాత్రం కాస్త పెద్ద బిల్లుల్ని ఈఎంఐ కింద మార్చేసు కుంటూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల కార్డు తీసుకుని రెండేళ్లు తిరిగేసరికి కిషోర్ ఎప్పట్లానే ఉన్నా... సురేష్‌కు మాత్రం ఈఎంఐ పెరిగి పోయింది. ప్రతినెలా వాడే బిల్లు... దానికితోడు అప్పటికే చెల్లించాల్సిన ఈఎంఐలు... ఇవన్నీ కలిసి భారమయ్యాయి. అసలు సురేష్‌లా చెయ్యటం మంచిదేనా? ఇలా క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐలుగా మార్చుకోవటం లాభమా? నష్టమా? వడ్డీ తక్కువే ఉంటుంది కనక లాభమనుకోవచ్చా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం చెల్లించ గలిగితే ఒకేసారి చెల్లించటమే బెటర్ # ఆ సామర్థ్యం లేనప్పుడే ఈఎంఐ మార్గం # ఎంచుకునే ముందు వడ్డీ, గడువు చూడాల్సిందే # వీలైనంత తక్కువ గడువు ఎంచుకుంటే బెటర్ # గడువు పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఎగువ ముఖమే # ఈఎంఐ అవకాశం కూడా కొందరికే ఇస్తున్న బ్యాంకులు # దీనిక్కూడా కస్టమర్ల క్రెడిట్ హిస్టరీనే ఆధారం క్రెడిట్ కార్డు కస్టమర్లు బిల్లు మొత్తం ఒకేసారి కట్టకుండా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేలా వారిని ప్రోత్సహించటం బ్యాంకుల వ్యాపారం. కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ... కావాలంటే ఈ బిల్లును మీరు ఈఎంఐలోకి మార్చుకోవచ్చని సూచిస్తూ కస్టమర్లకు ఓ ఎస్ఎంఎస్ రావటం అందరికీ తెలిసిందే. కాకపోతే మరీ చిన్నచిన్న బిల్లుల్ని కాకుండా... కాస్త పెద్ద మొత్తంలో బిల్లులకే బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఈ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ మధ్య పలు బ్యాంకులు ఈ మొత్తాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఎస్బీఐ ప్రస్తుతం రూ.2,500 బిల్లును కూడా ఈఎంఐకి మార్చుకునే అవకాశమిస్తోంది. ఒకరకంగా ఇది కస్టమర్లకు, బ్యాంకులకు ఇద్దరికీ మంచిదే. గడువు తేదీలోపు మొత్తం బిల్లు కట్టలేని కస్టమర్లకు ఇలా మార్చుకోవటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులకు కూడా డిఫాల్ట్‌లు తగ్గి అదనపు వడ్డీ వస్తుంటుంది. కాకపోతే ఈ అవకాశాన్ని ఆచితూచి వాడుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘బిల్లును ఒకేసారి కట్టలేని సందర్భాల్లో మాత్రమే ఈఎంఐ ఎంచుకోవాలి. లేకపోతే ఇది భారంగా మారుతుంది’’ అనేది వారి సూచన. ఈ రెండూ గుర్తుంచుకోండి... ‘‘ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేటపుడు ప్రధానంగా ఎన్ని నెలల్లో చెల్లించాలి? వడ్డీ రేటెంత? అనే రెండు అంశాలూ తెలుసుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు స్థిరంగా ఉండేది కాదు. కస్టమర్‌ను బట్టి, బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఒకే కస్టమర్‌కు ఒకోసారి 14 శాతం వడ్డీకే ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోవటానికి ఛాన్సిచ్చే బ్యాంకులు... ఒకోసారి అంతకన్నా ఎక్కువ వడ్డీరేటు వేస్తుంటాయి. అందుకని చూసి ఎంచుకోవాలి’’ అని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ విజయ్ జసుజ చెప్పారు. చెల్లించని మొత్తంపై వడ్డీ మిగులుతుంది... మామూలుగా కూడా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీస బిల్లుగా పేర్కొనే మొత్తాన్ని చెల్లిస్తే చాలు. ఇది సహజంగా వాడినదాంట్లో 5 శాతంగా ఉంటుంది. కాకపోతే మిగిలిపోయే మొత్తంపై 30-40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈఎంఐ మార్గాన్ని ఎంచుకుంటే... వడ్డీ రేటు పర్సనల్ లోన్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వడ్డీ మిగులుతున్నట్టే కదా!!. పెపైచ్చు పర్సనల్ లోన్ మాదిరి డాక్యుమెంట్లు సమర్పించటం వంటి తతంగం ఉండదు. వడ్డీ రేటెంత? మామూలుగా ఈఎంఐ మొత్తంపై 12-20 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. చెల్లించాల్సిన గడువు కూడా మూడు నెలల నుంచి కొన్ని సందర్భాల్లో మూడేళ్ల వరకూ కూడా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి... సాధ్యమైనంత వరకు తక్కువ గడువును ఎంచుకుంటే మంచిదన్నది నిపుణుల సూచన. ఈఎంఐ మార్గం వల్ల మరో ప్రయోజనమేంటంటే డీల్స్, ప్రమోషన్ల ఖర్చును ఆయా వస్తువుల తయారీ కంపెనీలు భరిస్తాయి. దీంతో వడ్డీ మరికాస్త తగ్గుతుంది. ఈఎంఐ పనిచేసేదిలా... ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.50వేలు. మీరు ఓ నెలలో ఒకే లావాదేవీలో రూ.15వేల బిల్లు చేశారు. దాన్ని మీరు వడ్డీతో కలిపి ఆరు నెలల పాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలనుకున్నారు. తదుపరి బిల్లింగ్ గడువు వచ్చేసరికి మీ క్రెడిట్ లిమిట్ రూ.35వేలే ఉంటుంది. కాకపోతే ఒక వాయిదా చెల్లించాక దాన్లో వడ్డీపోను అసలుగా ఎంత చెల్లించారో అది మీ లిమిట్‌కు కలుస్తుంది. ఆ తరవాత మీ లావాదేవీల బిల్లు ఎప్పటికప్పుడు కట్టాల్సిందే. క్రెడిట్ లిమిట్ దాటడానికి కూడా వీలుండదు. ఒకవేళ దాటితే లావాదేవీ చెల్లకపోవచ్చు. కొన్ని బ్యాంకులు ఒకోసారి అనుమతిస్తాయి కానీ... ఓవర్ లిమిట్ ఛార్జీలు బాగానే వడ్డిస్తాయి. నిజానికి ఈఎంఐ ఆప్షన్ అన్ని బ్యాంకుల దగ్గరా ఉంటుంది. కాకపోతే అందరు కస్టమర్లకూ ఇవ్వరు. వారి క్రెడిట్ హిస్టరీ చూసి... కస్టమర్‌ను బట్టి బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కూడా గడువులోపు చెల్లించకపోతే మామూలుగా కార్డుపై వడ్డీ రేట్లెంత ఉంటాయో అవే వర్తిస్తాయి. అదనంగా రీపేమెంట్ ఫెయిల్యూర్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
రాజన్‌పై మౌనం వీడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మౌనం వీడారు. ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ రెండవసారి ఎంపికను సమర్థిస్తారా అని అడిగినపుడు.. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన విషయమన్నారు. దీంట్లో మీడియాకు సంబంధంలేదని వ్యాఖ్యానించారు. రాజన్ పై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వరుస సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించడం ఇదే మొదటిసారి. రాజన్ నియామకం ఎడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన వ్యవహారమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అవసరం లేదనుకుంటున్నానంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు సెప్టెంబర్ లోనే ఈ విషయాన్ని పరిశీలిద్దా మని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తో చెప్పారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది కనుక అప్పుడు చూద్దామన్నట్టు చెప్పారు. అయితే ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ రాజన్ ను తక్షణమే తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. రాజన్ ఉద్దేశపూర్వకంగానే దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారని, దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ తీవ్రమైన ఆరోపణల పరంపర ను కొనసాగించారు. ఈ విషయంలో పట్టువీడని స్వామి ..మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు కూడా రాశారు. కాగా రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి అర్హుడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు రాజన్ సమర్థతతపై అనేక సర్వేల్లో సానుకూలంగా స్పదించారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ ముగియనుంది. -
అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్
ఏలూరు (సెంట్రల్) : అధిక వడ్డీలు ఆశచూపి ప్రజల నుంచి రూ.వేలాది కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. గడువు దాటినా తిరిగి చెల్లించని కేసులో అరెస్టయిన అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరికి ఇద్దరు హామీదారులు రూ. 5 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరి పాస్‌పోర్టులను సీఐడీ అధికారులకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి బుధవారం రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని జిల్లా న్యాయమూర్తి తుకారాంజీ ఆదేశించారు. ఈ మేరకు ఏలూరులోని జిల్లా న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... పెదపాడు మండలం వడ్డిగూడేనికి చెందిన ఘంటశాల వెంకన్నబాబు ఫిర్యాదు మేరకు 2015 జనవరి 3న పెదపాడు పోలీసులు అగ్రిగోల్డ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును రాష్ర్ట ప్రభుత్వం సీఐడీ అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. న్యాయస్థానం అనుమతితో ఏపీ, తెలంగాణ సీఐడీ అధికారులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారణ జరిపారు. -
గాజిరెడ్డిపల్లిలో ‘వడ్డీ’ జలగ
♦ అప్పులిచ్చి ఇళ్లు, పొలాలు రాయించుకుంటున్న వడ్డీ వ్యాపారి ♦ గ్రామస్తుల అమాయకత్వమే ఆసరా.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో కొందరు కుటుంబ పోషణ, ఇతరాత్ర అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ అవసరమే ఓ వడ్డీ వ్యాపారికి కలిసొచ్చింది. అప్పులిస్తూనే ఇళ్లు, పొలాలు రాయించుకుంటున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తీగలాగే పనిలో పడ్డారు. మెదక్: మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.3 వడ్డీతో స్థానికులకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు అప్పులు ఇస్తున్నాడు. అంతేకాదు అప్పు తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఇళ్లు, పొలాలను రిజిస్ట్రేషన్, లేదంటే మార్టిగేజ్ చేయించుకున్నట్టు సమాచారం. ఇదంతా తెలిసే జరుగుతున్నా బాధితులు నేరు మెదపని స్థితిలో ఉండిపోతున్నారు. సదరు వడ్డీ వ్యాపారి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. అప్పుతీసుకుని ఆరు నెలలు కాగానే అసలుకు వడ్డీ, ఆపై చక్రవడ్డీ వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనుమతులు లేని దందా అప్పులు ఇవ్వాలంటే సంబంధిత అధికారుల నుంచి వ్యాపారి అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అప్పులిచ్చిన వ్యక్తి నుంచి అవసరమైన కాగితాలు తీసుకుంటారు. కానీ, ఇళ్లు, పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకోరు. అయితే, గాజిరెడ్డిపల్లిలో సదరు వ్యాపారి మాటే శాసనంగా నడుస్తోంది. బూర్గుపల్లి గ్రామంలోనూ ఈ వ్యాపారి పాగా వేసినట్టు తెలిసింది. వీటితో పాటు వెండి, బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టుకుని వడ్డీ రూ.3 చొప్పున అప్పులిస్తున్నాడు. అంతేకాదు గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నా పట్టించుకునేవారు లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడ దందా నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గాజిరెడ్డిపల్లిలో అప్పు చెల్లించే విషయంలో ఓ వ్యక్తి గొడవ పడటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. -
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను పీఎఫ్ వడ్డీ రేటును 8.71 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాతపూర్వక సమాధానంలో సోమవారం లోక్ సభలో ప్రకటించారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపినట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2016 లో సమావేశంలో 8.8 శాతం ప్రతిపాదనలకు భిన్నంగా వడ్డీ రేటును నిర్ణయించడం మరో వివాదానికి దారితీయనుంది. మధ్యంతర ఉత్తర్వులపై ప్రశ్నించగా దీనిపై పురాలోచించే ఆలోచన లేదని దత్రాత్రేయ స్పష్టం చేశారు. సెవెన్త్ పే కమిషన్, దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తదుపరి సమీక్ష ఉంటుందన్నారు. మరోవైపు మంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సీబీటీ కమిటీ ప్రతిపాదించిన 9శాతం పెంపును కూడా వెనక్కి పెట్టి, మరింత తగ్గించడం అన్యాయమని విమర్శించాయి. మరోవైపు బంగారు ఆభరణాలపై విధించిన 1 శాతం పన్ను విషయంలో ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. ఒక శాతం తగ్గించే ఆలోచన లేదని మంత్రిత్వ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. కాగా ప్రభుత్వం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఫిక్స్ చేశారంటే... వడ్డించిన విస్తరే!
ఉమన్ ఫైనాన్స్ చాలామంది పెట్టుబడి మార్గాలు ఎన్ని అందుబాటులో ఉన్నా కానీ... సంప్రదాయక పెట్టుబడి మార్గమైన, తక్కువ రిస్క్‌తో కూడిన సురక్షితమైన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వైపే మొగ్గు చూపుతారు. ఇలాంటి వారికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వడ్డీని అందజేసే కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక మంచి అవకాశం. కానీ వీటిలో డిపాజిట్ చేసే సమయంలో క్షుణ్ణంగా అన్ని వివరాలూ తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. కొన్ని కంపెనీలు తమ కంపెనీ పెట్టుబడికి అవసరమైన నిధులను ప్రజల నుండి ఫిక్స్డ్ డిపాజిట్ రూపేణా సమీకరిస్తాయి. ఇవి సాధారణ బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. కాల పరిమితిని కూడా పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం వివిధ వ్యవధులలో అందజేస్తాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు మొదట గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి సెక్యూరిటీ లేనివి. అంటే కంపెనీ కనుక దివాళా తీస్తే పెట్టిన పెట్టుబడిని కూడా నష్టపోవలసి ఉంటుంది. కనుక ఏ కంపెనీలోనైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయదలచుకున్నారో తప్పనిసరిగాఆ కంపెనీ రేటింగ్ చూసుకోవాలి. ఇఖఐఐఔ, ఐఇఖఅ మొదలైన ఫైనాన్షియల్ సంస్థలు వివిధ కంపెనీలకు, ఆ కంపెనీలు జారీ చేసే వివిధ ర కాల పెట్టుబడి మార్గాలకు రేటింగులను అందచేస్తుంటాయి. వాటిని ఫాలో అవొచ్చు. కంపెనీ గురించి, గడిచిన సంవత్సరాలలో కంపెనీ స్థితిగతుల గురించి, మేనేజ్మెంట్ గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. కంపెనీ డిపాజిట్స్‌పై అందే వడ్డీ రు.5,000 దాటితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీకైతే రు.10,000 దాటితేనే టి.డి.ఎస్. వర్తిస్తుంది. కనుక కంపెనీ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కంపెనీ రేటింగ్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాల వ్యవధిలో డిపాజిట్ చేయడం ఉత్తమం. ఒకవేళ ఎక్కువ కాల వ్యవధితో డిపాజిట్ చేసినట్లయితే కంపెనీ స్థితిగతులు సరిగా లేనట్లయితే సొమ్మును నష్టపోవలసి వస్తుంది. కనుక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ వడ్డీ రావాలని కోరుకునేవారు, మంచి కంపెనీలు అందజేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి పూర్తిగా చదువుకుని, అర్థం చేసుకుని పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
వడ్డీ.. విరిచేను నడ్డి!
► రైతులను బజారుకీడుస్తున్న రుణమాఫీ ► విడత వారీ సర్దుబాటుతో అవస్థలు అమలుకు నోచుకోని రెండో విడత మాఫీ ► ఏడాది దాటితే 12 నుంచి 14.5 శాతం వడ్డీ వసూలు ► ఆర్థిక ఇక్కట్లలో అన్నదాత రుణాలన్నీ మాఫీ చేస్తాం.. ఒక్క పైసా కట్టక్కర్లేదని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ రైతులను బజారుకీడుస్తోంది. ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారిన అన్నదాతలు.. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో దొంగలు. ఏడాది గడువు దాటినా రుణాలు చెల్లించలేని రైతుల పేర్లు మొండి ఖాతాల జాబితాలో చేరనున్నాయి. ఇదే సమయంలో వడ్డీ తడిసి మోపెడు కానుంది. నోటీసు ఇవ్వడంతో రుణం చెల్లించినా నా పేరు ఏసయ్య. అవుకులో 4.50 ఎకరాల పొలం ఉంది. పెట్టుబడి కోసం స్థానిక స్టేట్ బ్యాంక్‌లో 2012లో రూ.65 వేల రుణం తీసుకున్నా. అసలు, వడ్డీ కలిపి రూ.1.35 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ కింద కేవలం రూ. 20వేలు మాత్రమే బ్యాంకులో జమ అయింది. అసలు వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు గత జనవరిలో నోటీసులు పంపగా.. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొని రూ. 1.15 లక్షలు చెల్లించినా. - ఏసయ్య, రైతు, అవుకు రుణమాఫీ మోసం నా పేరిట రాయలసీమ గ్రామీణ బ్యాంక్‌లో రూ.52,300 అప్పుంది. కోడుమూరు సొసైటీలో రూ.25 వేల అప్పు తీసుకున్నా. ఇందులో గ్రామీణ బ్యాంక్‌లో ఒక్కటే అప్పు ఉన్నట్లు ఆన్లైన్లో చూపించినా.. 20 శాతం మాత్రమే మాఫీ చేసినారు. మిగిలిన అప్పు బ్యాంక్‌లో రెన్యూవల్ చేసుకునేందుకు ప్రైవేట్‌గా రూ.3ల వడ్డీకి తీసుకొచ్చి కట్టినా. మాఫీ డబ్బులు వడ్డీకి కూడా సరిపోలేదు. ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసగిస్తోంది. - బ్రహ్మయ్య ఆచారి, రైతు, కోడుమూరు సాక్షి, కర్నూలు: జిల్లాలో మొత్తం రైతులు 6.50 లక్షలు. ఇందులో 5.25 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో సుమారు రూ.2,500 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని నమ్మించిన బాబు.. అధికారంలోకి రాగానే అసలు రూపం బయటపెట్టారు. మాట మార్చి.. కొర్రీలు పెట్టి.. మమ అనిపించారు. జిల్లా విషయానికొస్తే 4,41,782 మంది రైతులకు మూడు విడతల్లో రూ.680.75 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన 83వేల మంది రైతులను వివిధ కారణాలతో అనర్హులుగా తేల్చారు. అరకొర మాఫీ అయినా సక్రమంగా చేశారా అంటే అదీలేదు. ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం వడ్డీలకూ సరిపోని పరిస్థితి. ఫలితంగా ఏడాది లోపు రుణాలను పునరుద్ధరించుకోకపోతే వడ్డీ భారం ఉక్కిరిబిక్కిరి చేయనుంది. మరో విడత మాఫీ కోసంఎదురు చూపులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మరో విడత రుణమఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఆ మొత్తం విడుదలయితే వడ్డీ, రుణాలను పునరుద్ధరించుకోవాలని చూస్తున్నా ఎప్పటికి చేస్తారో తెలియని పరిస్థితి. ఈలోపు గడువు దాటిపోతే బ్యాంకర్లు పునరుద్ధరిస్తారో లేదోనని రైతుల్లో ఆందోళన మొదలయింది. అదే జరిగితే.. అసలు, వడ్డీ చెల్లించే స్థోమత లేని అన్నదాత వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. పునరుద్ధరణ తప్పదు.. పంట రుణాలకు ఏడాది వరకు ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఏడాది దాటి ఒక్క రోజు గడిచినా వడ్డీ 12 శాతం నుంచి 14.5 శాతానికి పెరిగిపోతుంది. ఏడాది గడువులోపు చెల్లిస్తే ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 3 శాతం వడ్డీ తిరిగి చెల్లిస్తుంది. దాన్ని ఆ రైతు పొదుపు ఖాతాలో జమ చేస్తారు. నికరంగా 4 శాతం అంటే పావలా వడ్డీ చెల్లించినట్లు అవుతుంది. అయితే ఏడాది గడువు దాటితే రూ.12వేల నుంచి రూ.14,500 వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలు గడిచే కొద్డీ ఆరు నెలలకు ఒకసారి అసలు, వడ్డీ కలిసి మరింత ఊబిలోకి నెట్టనుంది. ఈ నేపథ్యంలో రుణాలను పునరుద్ధరించుకోవడం మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఓబీసీ పొదుపు ఖాతాల్లో ఇక నెలవారీ వడ్డీ
ముంబై: సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి నెలా ఒకసారి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వడ్డీ జమ చేయనుంది. ఇప్పటి వరకూ ఆరునెలలకోసారి వడ్డీని జమ చేస్తుండగా ఇకపై దీన్ని నెలరోజులకు కుదిస్తున్నట్లు ఓబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచీ ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేయాలని ఇటీవలే ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఓబీసీ ఒక అడుగు ముందుకువేసి... నెలకొకసారి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ జమ అవుతుందని ప్రకటించింది. 2010 ఏప్రిల్ 1 నుంచీ రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ వడ్డీ ఇప్పటి వరకూ ఆరు నెలలకు ఒకసారి జమవుతోంది. ఆర్బీఐ వడ్డీ జమ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించడం వల్ల బ్యాంకింగ్‌పై మొత్తంగా రూ.500 అదనపు భారం పడే అవకాశం ఉందన్నది ఈ రంగంలో నిపుణుల విశ్లేషణ. సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వ బ్యాంకులు 4% వరకూ వడ్డీ ఇస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు 6 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. -
నక్షత్ర ఫలాలు
అశ్వని: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు సాత్వికులు, అందరితోనూ స్నేహంగా మెలగుతారు. నేర్పు, ఓర్పు కలిగి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. ధైర్యం ఎక్కువ. ఆభరణాలపై మక్కువ చూపుతారు. పొదుపు గుణం ఉంటుంది.. మంచి రూపవంతులు. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతివిషయంలోనూ సమర్థతను చాటుకుంటారు. నక్షత్రాధిపతి కేతువు. మేషరాశికి అధిపతి కుజుడు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. కేతువు జ్ఞానకారకుడు. జ్యోతిష్యం, వేదాంతం, యోగశాస్త్రాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. భరణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు అభిమానవంతులు, ధైర్యవంతులు కాగలరు. కళల పట్ల ఆసక్తి మెండు. అలంకారప్రియులై ఉంటారు. వస్త్రాభరణాలపై మక్కువ అధికం. భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. రాజకీయ, విద్య, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. లౌకికజ్ఞానం ఎక్కువ. దూరదృష్టి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. పదవులు, హోదాలు చేపడతారు. జీవిత మధ్య కాలం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. వీరు వజ్రం ధరించాలి. కృత్తిక: ఈనక్షత్రంలోని మొదటి పాదం మేషరాశిలోకి, మిగతా మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. మేషరాశికి కుజుడు, వృషభరాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). మంచి వర్చస్సు, రూపం కలిగి ఉంటారు. ైైధైర్యసాహసాలు అధికం. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. పరిపాలకులుగా, మంచి హోదాలలో బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందుతారు. బంధువుల పట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు పడ్డా మధ్య వయస్సు నుంచి అభివృద్ధి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు. జనాకర్షణ కలిగి ఉంటారు. దానగుణం, దైవభక్తి మెండుగా ఉంటాయి. వీరు కెంపు ధరించాలి. రోహిణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి చంద్రుడు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా, క్లిష్టమైన సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. మేధావులు, విజ్ఞానవంతులై ఉంటారు. స్నేహితులు అధికం. ఆకర్షణీయమైన రూపం. కార్యసాధకులు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే గుణం ఉంటుంది. తెలివితేటలతో ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. భోగభాగ్యాలు, సుఖసంతోషాలతో జీవిస్తారు. వీరు ముత్యం ధరించవచ్చు. మృగశిర: ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభరాశిలోకి, చివరి రెండు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. వృషభరాశికి శుక్రుడు, మిథునరాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. ఎప్పుడూ ఉత్సాహవంతులుగా ఉంటారు. కోపం కూడా ఎక్కువే. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. స్వాభిమానం, దైవభక్తి అధికం. ఎవరికీ తలవంచని మనస్తత్త్వం. శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, వ్యవసాయదారులుగా, అధ్యాపకులుగా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించాలన్న పట్టుదల ఉంటుంది. పరోపకారులు. త్యాగాలకు సైతం సిద్ధపడే గుణం ఉంటుంది. వీరు పగడం ధరించాలి. ఆరుద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మిథునరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి రాహువు. రాశ్యాధిపతి బుధుడు. వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లుగా రాణిస్తారు. ఫొటోగ్రఫీ, ప్రచురణలు, కళారంగాలపై మక్కువ చూపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. గర్వం, పట్టుదల అధికం. చపలత్వం కలిగి ఉంటారు. ప్రతివిషయంపై వాదనలంటే ఇష్టపడతారు. మేధావులై సన్మానాలు కూడా పొందుతారు. పెద్దలంటే గౌరవం అధికం. నిగ్రహశక్తి ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు విద్యల్లో ప్రవేశం కలిగి ఉంటారు. వీరికి ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. వీరు గోమేధికం ధరించాలి. పునర్వసు: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు మిథునరాశిలోకి, చివరి పాదం కర్కాటకరాశిలోకి వస్తాయి. మిథునరాశికి బుధుడు, కర్కాటకరాశికి చంద్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. మంచిరూపం, తెలివితేటలు కలిగి ఉంటారు. ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభ క్తి ఉంటుంది. యుక్తిగా పనులు చక్కదిద్దుకునే నేర్పు ఉంటుంది. పరోపకారులై మంచి గుర్తింపు పొందుతారు. హాస్యచతురులు. తరచూ శ్వాససంబంధ వ్యాధులు బాధిస్తాయి. అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉన్నత విద్యావంతులు, పండితులు కాగలరు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగాల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రంపై ఆసక్తి చూపుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు. పుష్యమి: ఈనక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు. మొరటుతనం కలిగి ఉంటారు. స్ఫురద్రూపి, సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో పాటు ధనాపేక్ష అధికం. ఉత్తమ గుణాలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏకాంత జీవనానికి ఇష్టపడతారు. మధుర పదార్థాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. మధ్య వయస్సులో రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. న్యాయ, తర్కశాస్త్రాలపై మక్కువ చూపుతారు. వీరు నీలం ధరించవచ్చు. ఆశ్లేష: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి చంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు. మంచి పనులతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలపై ఆసక్తి అధికం. దైవభక్తి, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. మంచి దేహదారుఢ్యంతో పాటు భాగ్యవంతులై ఉంటారు. శాంతస్వభావులు. చపలత్వం కూడా ఎక్కువే. ఆగ్రహం వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. ప్రశాంత జీవనం అంటే ఇష్టపడతారు. ఏదో ఒక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టునే గుణం కలిగి ఉంటారు. మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురైనా మొత్తంమీద జీవితం సాఫీగానే సాగుతుంది. చిన్నతనంలో కష్టాలు అనుభవించినా మధ్య వయస్సు నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు పచ్చ ధరించవచ్చు. మఖ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు) అధిపతి. నక్షత్రాధిపతి కేతువు. ధైర్యవంతులై ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావన అధికం. పెద్దల పట్ల గౌరవం కలిగి బంధువులకు ఉపకారం చేస్తారు. కార్యసాధకులు. కళలపై ఆసక్తి ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. విలాసజీవనం గడుపుతారు. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. యుక్తాయుక్త విచక్షణ కలిగి ఎదుటవారి సమస్యలు సైతం పరిష్కరించే సత్తా కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, కళాకారులుగా రాణిస్తారు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. పుబ్బ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి అధిపతి రవి(సూర్యుడు), నక్షత్రాధిపతి శుక్రుడు. కళాభిరుచి కలిగి ప్రసంగాలు, తర్కం అంటే ఇష్టపడతారు. దైవభక్తి మెండు. అలంకారప్రియులు, ఆభరణాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. కార్యసాధకులు, నేర్పరులై ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే తత్వం. గణాంకాలు, కళారంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. స్నేహానికి ప్రాణమిస్తారు. అందర్నీ ప్రేమించే గుణం ఉంటుంది. చిన్నతనంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరు వ జ్రం ధరించవచ్చు. ఉత్తర: ఈ నక్షత్రంలోని మొదటి పాదం సింహరాశిలోకి, మిగతా మూడు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు), కన్యారాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి. సాధుప్రవర్తన, త్యాగనిరతి కలిగి ఉంటారు. సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు. తరచూ సన్మాన, సత్కారాలు జరుగుతాయి. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి చూపుతారు. పరాక్రమవంతులై శత్రువులను జయిస్తారు. బంధుప్రియులు. మిత్రులు అధికంగా ఉంటారు. వ్యాపారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులుగా రాణిస్తారు. ప్రకృతి ఆరాధకులు. ఉన్నత విద్యావంతులై ప్రతిభను చాటుకుంటారు. వీరు కెంపు ధరించాలి. హస్త: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు అధిపతి. నక్షత్రాధిపతి చంద్రుడు. మంచి రూపంతో అందర్నీ ఆకర్షిస్తారు. దైవభక్తి, పెద్దలయందు గౌరవం ఎక్కువ. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. రెండుమూడు విధాలుగా ధనసంపాదన ఉంటుంది. ఉన్నత విద్యావంతులు కాగలరు. నిపుణ్యత, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, న్యాయనిపుణులుగా రాణిస్తారు. మంచి ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. వీరు ముత్యం ధరించవచ్చు. చిత్త: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు కన్య, చివరి రెండుపాదాలు తులారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటాయి. తాము చెప్పిందే వేదమనే తత్వం. అలంకారప్రియులై ఉంటారు. రెండుమూడు విద్యలలో ప్రవేశం ఉంటుంది. శాస్త్రవిజ్ఞానం, వ్యవసాయరంగాలపై ఆసక్తి చూపుతారు. అందరిలోనూ గుర్తింపునకు ఆరాటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కువగా ఉద్యోగులు, వ్యవసాయదారులు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు పగడం ధరించవచ్చు. స్వాతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు. స్వతంత్రంగా జీవించాలనే తపన ఉంటుంది. ఎవరినీ లెక్కపెట్టరు. బాధ్యతలు అప్పగిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని పూర్తి చేసే మనస్తత్త్వం. బుద్ధిమంతులు, బంధువర్గానికి అత్యంత ఇష్టులై ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. న్యాయదృష్టి, విజ్ఞత కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాలలో రాణిస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా కూడా కొనసాగుతారు. వీరు గోమేధికం ధరించాలి. విశాఖ: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు తుల, చివరి పాదం వృశ్చిక రాశిలోకి వస్తాయి. తులా రాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. సూక్ష్మబుద్ధి కలిగి, వివేకంతో వ్యవహరిస్తారు. విద్యావేత్తలు, పండితులు కాగలరు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటారు. ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. జీవిత మధ్య భాగం నుంచి భోగభాగ్యాలు అనుభ విస్తారు. ఉపకార గుణం ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలుగా ఎక్కువగా రాణిస్తారు. కనకపుష్యరాగం ధరించవచ్చు. అనూరాధ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కాగా, నక్షత్రాధిపతి శని. భోగభాగ్యాలు అనుభవిస్తారు. కష్టజీవులుగా ఉంటారు. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారు. మంచిరూపం, పాపభీతి కలిగి ఉంటారు. శౌర్యవంతులు, మేధావులు కాగలరు. సంగీత, సాహిత్య, లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. కష్టాలెదురైనా ఎప్పుడూ చింతించక సంతోషంగా ఉంటారు. కొందరు గణితం, జ్యోతిషం, సాముద్రికాలలో ఆసక్తి చూపుతారు. వీరు నీలం ధరించాలి. జ్యేష్ఠ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి బుధుడు. వ్యాపారదృక్పథం కలిగి ఉంటారు. పొదుపు గుణం ఎక్కువ. బాగా ఆలోచిస్తే గానీ ఒక నిర్ణయానికి రారు. స్నేహితులంటే ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రాణిస్తారు. చమత్కారులు, హాస్యచతురులు. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి మెండు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరి పచ్చ ధరించాలి. మూల: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి కేతువు. వీరు యజమానులకు మేలు చేసే వారై ఉంటారు. సమాజసేవపై మక్కువ చూపుతారు. రహస్యాలు పసిగట్టే తత్వం. బంధువులంటే ఇష్టపడతారు. ఎంతటి సమస్య ఎదురైనా ఏమాత్రం భ యపడరు. విషయ పరిజ్ఞానం అధికం. శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఉద్యోగులుగా రాణిస్తారు. క ష్టపడి పైకి వస్తారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరు వైఢూర్యం ధరించాలి. పూర్వాషాఢ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనూరాశికి గురుడు అధిపతి, నక్షత్రాధిపతి శుక్రుడు. ఉన్నత విద్యావంతులు, సంగీత, సాహిత్యకారులు కాగలరు. వినయవిధేయతలు , దానగుణం కలిగి ఉంటారు. సంపన్నులతో స్నే హం చేస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తరచూ సన్మాన, సత్కారాలు పొందుతారు. అధ్యాపకులు, కళాకారులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు వజ్రం ధరించాలి. ఉత్తరాషాఢ: ఈ నక్షత్రంలోని మొదటి పాదం ధనుస్సు రాశిలోకి, మిగతా మూడు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశికి గురుడు, మకర రాశికి శని అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). వీరికి రవి దశతో జీవితం ప్రారంభమవుతుంది. అందరికీ ఆప్తులై ఉంటారు. శ్రమ, కష్టాలను తట్టుకునే తత్వం. నాయకత్వ లక్షణాలు కలిగి జనాకర్షణ ఉంటుంది. స్వశక్తితో పైకి వస్తారు. ఇతరుల మేలు మర్చిపోరు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. శాస్త్రవిజ్ఞానం, న్యాయశాస్త్రాలంటే ఇష్టపడతారు. ఉన్నతపదవులు చేపడతారు. వీరు కెంపు ధరించాలి. శ్రవణం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. బంధువులకు సాయపడతారు. విద్యావంతులై ఉన్నత హోదాలు చేపడతారు. ఔదార్యం, ఉపకారబుద్ధి, మాటల చాతుర్యం కలిగి ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టమెక్కువ. వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. వ్యవసాయంపై కూడా ఆసక్తి ఉంటుంది. సంగీత, సాహిత్య ప్రియులు కాగలరు. ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. వీరు ముత్యం ధరించాలి. ధనిష్ఠ: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు మకరరాశిలోకి, చివరి రెండుపాదాలు కుంభరాశిలోకి వస్తాయి. మకర, కుంభరాశులకు శని అధిపతి. నక్షత్రాధిపతి కుజుడు. ఎరుపు దుస్తులు, వస్తువులంటే ఇష్టపడతారు. దానగుణం, సౌమ్యగుణం కలిగి ఉంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకునే లక్షణం ఉంటుంది. శ్రమించే తత్వం. క్రీడాకారులుగా, వ్యవసాయదారులుగా రాణిస్తారు. ఉన్నతోద్యోగులుగా కూడా స్థిరపడతారు. సంగీతంపై మక్కువ చూపుతారు. అధిక సంపాదనపై అభిలాష ఉంటుంది. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. భూములు, వాహనాలు కలిగి ఉంటారు. వీరు పగడం ధరించవచ్చు. శతభిషం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి శని అధిపతి. నక్షత్రానికి రాహువు అధిపతి. బంధువులకు ఉపకారం చేస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. నీతినిజాయితీలు, ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. వాక్చాతుర్యం కలిగి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. పరిశోధనలు, వైద్యం, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. వాదనల్లో ఆరితేరతారు. వక్తలుగా కూడా రాణిస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వీరు గోమేధికం ధరించాలి. పూర్వాభాద్ర: ఈ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశిలోకి, చివరి పాదం మీన రాశిలోకి వస్తాయి. కుంభానికి శని, మీనరాశికి గురుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. వినయవిధేయతలు, సేవాభావం కలిగి ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విచక్షణాజ్ఞానంతో మంచిచెడ్డలను అంచనా వేస్తారు. గొప్ప పనులు చేసి అందరి ప్రశంసలు పొందుతారు. రెండు మూడు విద్యల్లో రాణిస్తారు. ధనవంతులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. కళాభిరుచి, వైద్య నైపుణ్యం ఉంటుంది. ప్రతిభావంతులై సన్మానాలు పొందుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు. ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీన రాశికి గురుడు అధిపతి. నక్షత్రాధిపతి శని. ధైర్యం వీరి సొంతం. నీతినిజాయితీలకు ప్రాణం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మనస్సు చంచ లం. వీరు నాయకులుగా, వ్యాపారులుగా, ఉద్యోగులుగా రాణిస్తారు. నమ్మినవారికి ఎన్ని కష్టాలెదురైనా సాయం అందించే గుణం ఉంటుంది. జీవిత ప్రారంభంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వీరు నీలం ధరించాలి. రేవతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీనరాశికి గురుడు, నక్షత్రానికి బుధుడు అధిపతులు. వ్యాపార లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పట్టుదల అధికం. శ్రమకు, కష్టాలకు భయపడరు. మేధావులై ఉంటారు. రచనలు, జ్యోతిషం, గణిత శాస్త్రాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. విద్యావేత్తలు కాగలరు. జీవిత మధ్య దశలో ధనవంతులు, ఆస్తిపరులు కాగల అవకాశాలు ఉంటాయి. వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. వీరు పచ్చ ధరించాలి. -
తలసరి అప్పు రూ.35,373
రెండేళ్లలో రెండింతలు అవుతున్న అప్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతోంది. ఏటికేడు అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్ల అప్పులు ఉండగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లకు చేరుతున్నాయి. అంటే రుణభారం రెట్టింపవుతోంది. ఇదే సమయంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్లు, ఈ ఏడాది నిర్మించే 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.15 వేల కోట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.5వేల కోట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.50 వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో అప్పుల భారం వచ్చే ఏడాది రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతేడాది వడ్డీల కోసమే ప్రభుత్వం రూ.7,162 కోట్లు వ్యయం చేసింది. 2016-17లో వడ్డీల చెల్లింపులకు రూ.7,706 కోట్లు కావాలని తాజా బడ్జెట్లో అంచనా వేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.35,373 చేరుతోంది. -
స్పందిస్తున్న హృదయాలు
అవయవ దానంపై పెరుగుతున్న ఆసక్తి పేర్ల నమోదులో దక్షిణాదిలోనే కర్ణాటక ముందంజ యువతలో స్ఫూర్తి నింపుతున్న హరీష్ చివరి కోరిక సగటున రోజూ 20 మంది జెడ్సీసీకే వద్ద పేర్ల నమోదు బెంగళూరు: అవయవ దానంపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. తాము చనిపోయిన తర్వాత తమతో పాటు విలువ కట్టలేని అవయవాలు మట్టిలో కలిసిపోకూడదని రాష్ట్ర యువత భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో అవయవ దానం చేయడానికి యువత ముందుకు వస్తున్నారు. 2015లో 60 మంది అవయవ దానం చేయగా వారి ద్వారా సేకరించిన 158 అవయవాలు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇతరులకు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అవయవదానం విషయమై దాతలకు, గ్రహీతలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న జోనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ట్రాన్స్ప్లాన్టేషన్ (జెడ్సీసీకే) సంస్థ వద్ద 10 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడం కర్ణాటకలోనే ఎక్కువ ని జెడ్సీసీకే సంస్థ చెబుతోంది. అంతేకాకండా అవయవదానం కోసం ముందుకు వచ్చేవారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు కావడమే గమనార్హం. ఇదిలా ఉండగా నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు ముక్కలు అయినా తన కళ్లను దానం చేయాలని హరీష్ చెప్పిన సంగతి తెలిసిందే. అ ఘటన జరిగినప్పటి నుంచి అవయవదానం కోసం ముందుకు వ చ్చేవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున 20 మంది జెడ్సీసీకే వద్ద తమ పేర్లను అవయవదానం కోసం నమోదు చేయించుకుంటున్నారు. అవయవదానం అంటే... ఏదేని వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు బ్రెయిడ్‌డెడ్ స్థితికి చేరుకుంటే సదరు వ్యక్త్తి నుంచి (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా బంధువులు అనుమతితో) కళ్లు, మూత్రపిండాలు, లివర్ తదితర అవయవాలను సేకరిస్తారు. అటుపై వాటిని అవసరమైన వారికి శ స్త్ర చికిత్స ద్వారా అమరుస్తారు. దీనినే వైద్య పరిభాషలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. దీని వల్ల అత్యంత విలువైన మానవ అవ యవాలు మరోకరికి జీవం పోస్తాయి. జెడ్సీసీకే పాత్ర ఏంటంటే... ప్రతి రాష్ట్రంలో అవయవదానంపై జాగృతి కోసం ఒక సంస్థ పనిచేస్తుంటుంది. అంతేకాకుండా ఈ సంస్థ అటు వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వంతో పాటు అవయవదానం కోసం ముందుకు వచ్చే వారి మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో జెడ్సీసీకే సంస్థ ఈ విధులను నిర్వర్తిస్తోంది. ఇదిలా ఉండగా ఆయా అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు మొదట రూ.2వేలు చెల్లించి జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జెడ్సీసీకే సంస్థ సదరు వ్యక్తి బ్లడ్‌గ్రూప్, వ యస్సు తదితర విషయాలన్నీ (హెల్త్ హిస్టరీ) నమోదు చేస్తారు. ప్రమాద సమయంలో బ్రెయిడ్‌డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తే వారి వయస్సు, బ్లడ్‌గ్రూప్ తదితర విషయాలను అప్పటికే సదరు అవయవాల కోసం తమ వద్ద పేర్లు నమోదు చేసుకొన్న వ్యక్తుల వివరాలతో జెడ్సీసీకే సిబ్బంది పోల్చి చూస్తారు. అన్నిరకాలుగా ఇరువురి హెల్త్హిస్టరీ సరిపోతే సదరు అవయవాలను పేషెంట్‌కు ఉచితంగా అందజేస్తారు. ఇక శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును (ప్రైవేటు ఆస్పత్రుల్లో) వ్యాధిగస్తుడే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధ ఆర్గాన్ట్రాన్స్ప్లాంట్ విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎంత మంది ఎదురు చూస్తున్నారంటే... ప్రస్తుతం కిడ్నీ, లివర్ తదితర అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 2,502 మంది... జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో కిడ్నీ కోసం 1,834 మంది, లివర్ కోసం 600, హృదయం కోసం 40, ఊపిరితిత్తుల కోసం 6 మంది, కిడ్నీ, లివర్ రెండింటీ కోసం 11 మంది, హృదయం, ఊపిరితిత్తుల కోసం 8 మంది, ప్యాంక్రియాస్ కోసం ముగ్గురు ఎదురు చేస్తున్నారు. పేర్ల నమోదు ఇలా... అవయవదానంతో పాటు కిడ్నీ, లివర్ తదితర అవయవసంబంధ వ్యాధులతో బాధవపడుతూ సదరు అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారు 9845006768, zcckbangalore@gmail.com, www.zcck.in లో సంప్రదించవచ్చు. -
వడ్డీ ఇవ్వండి లేదా.. మొత్తం ఇచ్చేయండి!
న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగం వదిలిపెట్టేంతవరకు దాచుకున్న దానికి వడ్డీ ఇవ్వాలని లేని పక్షంలో దాచుకున్న మొత్తాన్ని ఇచ్చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ సహా కార్మిక సంఘాలు ఈపీఎఫ్‌వోను డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక మంత్రిని కూడా ఇదే విషయంపై డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించాయి. పీఎఫ్ నిధులను ఉద్యోగులు తీసుకోవటంపై ఈ నెలారంభంలో కార్మిక మంత్రి చట్టాలను కఠినతరం చేయనున్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం ఇన్నాళ్లూ ఉద్యోగి.. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత తాను దాచుకున్న మొత్తాన్ని తీసుకునే సౌకర్యం ఉండేది. అయితే మారిన నిబంధనల ప్రకారం ఇందులో 90 శాతం మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని సంఘాలు ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
రైతన్న ఆగమాగం!
♦ బ్యాంకులకు ‘వడ్డీ’ ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ♦ క్షేత్రస్థాయిలో రైతులపై ప్రతాపం చూపుతున్న బ్యాంకులు ♦ అనధికారికంగా నిలిచిపోయిన రబీ పంట రుణాల పంపిణీ ♦ ఏడాదిగా రూ. 250 కోట్లకుపైగా బ్యాంకులకు బాకీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పంట రుణాలకు ఎసరు పెడుతోంది.. బ్యాంకులకు ‘వడ్డీ’ ఎగ్గొట్టిన సర్కారు నిర్వాకం అన్నదాతలను ఆందోళనలో ముంచెత్తుతోంది. ‘వడ్డీ రహిత పంట రుణాల’ కింద వడ్డీ రీయింబర్స్‌ను ప్రభుత్వం వాయిదా వేస్తూ పోతుంటే... అటు బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వకుండా మొండికేస్తున్నారు. రుణాల మంజూరును వాయిదాలు వేస్తూ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే అసలు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే పరిస్థితే ఉండదని హెచ్చరిస్తున్నాయి. ఏడాదిగా పంట రుణాలకు సంబంధించిన వడ్డీని చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ వడ్డీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకులకు దాదాపు రూ. 250 కోట్లకుపైగా బాకీ పడింది. తమకు వడ్డీ సొమ్ము రీయింబర్స్ చేయాలంటూ బ్యాంకులు వరుసగా క్లెయిమ్‌లు దాఖలు చేయడంతో పాటు లేఖల మీద లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. అసలే రబీ సాగుకు పెట్టుబడులు లేక తల్లడిల్లుతున్న లక్షలాది మంది రైతులను ప్రభుత్వ నిర్వాకం మరింత ఆందోళనలో కూరుకుపోయేలా చేసింది. గత ఆరు నెలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశాలన్నింటిలోనూ బ్యాంకర్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సర్కారు ప్రతిసారీ దాటవేసే వైఖ రిని అనుసరిస్తోంది. దీంతో ఆర్థిక లావాదేవీలు తక్కువ మొత్తంలో ఉండే చిన్న బ్యాంకులు దిక్కులు చూస్తున్నాయి. వడ్డీ సొమ్మును విడుదల చేయాలంటూ సర్కారుకు పదే పదే విన్నవించుకుంటున్నాయి. బడా బ్యాంకులు సైతం వడ్డీ సొమ్ము రాబట్టుకునేందుకు ఉన్నతాధికారులకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి. కేంద్రం ఇచ్చినా లెక్కచేయని రాష్ట్రం రాష్ట్రంలో పంట రుణాలకు ‘వడ్డీ లేని రుణ పథకం’ అమలవుతోంది. దాని ప్రకారం రైతులకు ఇచ్చే పంట రుణాలకు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం, రాష్ట్ర ప్రభుత్వం మిగతా నాలుగు శాతం వడ్డీ సొమ్మును తమ వాటాగా బ్యాంకులకు అందజేస్తాయి. నిబంధనల ప్రకారం పంట రుణాలను ఆరు నెలలకోసారి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం తమకు ఎంత మొత్తం వడ్డీ సొమ్మును రీయింబర్స్ చేయాల్సి ఉందో బ్యాంకులు లెక్కగట్టి, సంబంధిత రైతుల వివరాలతో వ్యవసాయ శాఖకు క్లెయిమ్‌లు సమర్పిస్తాయి. వ్యవసాయ శాఖ వాటిని పరిశీలించి, ధ్రువీకరించినట్లుగా ‘క్లియరెన్స్’ ఇస్తుంది. ఈ జాబితాను బ్యాంకులు రిజర్వు బ్యాంకుకు పంపించి కేంద్రం నుంచి రావాల్సిన మూడు శాతం వడ్డీ రీయింబర్స్‌ను పొందుతాయి. అదే సమయంలో మిగతా నాలుగు శాతం వడ్డీ సొమ్మును చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాయి. క్లెయిమ్‌లు అందిన మూడో రోజున ప్రభుత్వం ఈ మేరకు నిధులను బ్యాంకులకు అందజేయాలి. కేంద్రం ఎప్పటికప్పుడు తాను చెల్లించాల్సిన వాటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత ఏడాదిగా బ్యాంకర్లకు వడ్డీ సొమ్ము చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న బ్యాంకర్లు... ఆ ప్రభావాన్ని రైతులపై చూపుతున్నారు. పంట రుణాల పంపిణీకి రకరకాల కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. ఫలితంగా రబీ పంట రుణాల పంపిణీ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఇప్పటికి వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యంలో నాలుగోవంతు రుణాలూ పంపిణీ కాలేదు. వచ్చే సీజన్‌పై ఆందోళన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2015 ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాల పథకంలో 25.91 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు వారందరికీ రూ. 12,757.29 కోట్లు పంట రుణాలను పంపిణీ చేశాయి. వీటి క్లెయిమ్‌లను వ్యవసాయ శాఖ పరిశీలించడంతో పాటు బ్యాంకులకు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ సర్కారు వడ్డీ సొమ్ము ఇవ్వక పరిస్థితి ఇబ్బందికరంగా మారిం ది. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఏడాది వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే పరిస్థితి లేదని బ్యాంకర్లు ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. -
అధిక వడ్డీలు ఆశ చూపి...
* రూ.8కోట్ల సొమ్ముతో ఉడాయించిన పెద్ద మనిషి * లబోదిబోమంటున్న పేదలు, చిరు వ్యాపారులు * షిర్డీకి వెళ్తున్నామని ఉడాయింపు విజయనగరం కంటోన్మెంట్ : అత్యవసర పని ఉంది.. అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి సుమారు రూ. 8 కోట్లకు కుచ్చు టోపీ వేశారు ఆ దంపతులు. పాఠశాల యజమానిగా పరిచయం చేసుకొని దొరికిన కాడికి దోచుకుపోయారు. షిర్డీ వెళ్తున్నామని చెప్పి పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల టీసీలు తీసుకొని మరీ ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒబ్బిలిశెట్టి రాజశేఖర్, గాయత్రి దంపతులు విజయనగరంలోని వక్కలంకవారి వీధిలో అద్దె ఇంట్లో ఉండేవారు. పదేళ్ల క్రితం సాయిరాం పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు. మరో పక్క లార్వెన్స్ స్కూల్లో ఓ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. చుట్టుపక్కల అందరితో వరుసలు కలిపారు. లార్వెన్స్, పెన్ స్కూళ్లలో భాగస్వామ్యం ఉందన్నారు. రోటరీ క్లబ్లో కూడా సభ్యులయ్యారు. పాఠశాలకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో కలుపుగోరుగా ఉండేవారు. కల్లబొళ్లి కబుర్లు చెప్పి ఎక్కువ వడ్డీలిస్తామని ఆశచూపి దొరికిన వారి వద్ద వేలు, లక్షల్లో అప్పులు చేశారు. సమాజంలో స్థితిమంతులైన వారి దగ్గరి నుంచి ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారిని, పాల ప్యాకెట్లు అమ్ముకునే వారిని బుట్టలో వేసుకున్నారు. ఫంక్షన్లకు వెళ్తామని చెప్పి మహిళల వద్ద నగలు కాజేశారు. పథకం ప్రకారం... దాదాపు రూ.8 కోట్ల సొమ్ము, విలువైన నగలతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం షిర్డీ వెళ్తున్నామని చెప్పి ఉడాయించేశారు. షిర్డీ వెళ్లిన వీరు ఇంకా రాలే దేంటని బాధితులు సాయిరాం పబ్లిక్ స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. మరొకరికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉడాయించేశారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిన వారు కూడా ఇన్‌కంటాక్స్ ఇబ్బందులు ఉన్నాయని బయటకు రాలేదని బాధితులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసంపై టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన వీరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లోను ఫిర్యాదు చేశారు. నగలు తీసుకుపోయారు ఎన్నాళ్లో కూడబెట్టిన డబ్బులతో సంక్రాంతి పండగ ముందు నల్లపూసలు, నగలు చేయించుకున్నాను. 8 తులాల నగలు దాదాపు రెండున్నర లక్షల విలువైనవి. మెచ్యూర్ ఫంక్షన్‌కు వేసుకెళ్తామని చెప్పి తీసుకుపోయారు. ఇలా ఊరొదిలి వెళతారనుకోలేదు. - సీహెచ్ సూర్యకళ, విజయనగరం పారిపోతామా? అన్నారు. పాఠశాల అభివృద్ధి చేసుకుంటానంటే నా వద్ద ఉన్న డబ్బులతో పాటు వస్తువులు పెట్టి పలుమార్లు రూ.7.50లక్షలు అప్పిచ్చాను. వడ్డీ కూడా ఇస్తామన్నారు. ఇటీవల నా కుమార్తె అల్లుడు కలసి వచ్చారు. అల్లుడు వెళ్లి గట్టిగా అడిగాడు. మార్చిలో స్కూల్ ఫీజులొస్తాయి. అప్పుడిస్తానన్నాడు. గాయత్రి వచ్చి ఇప్పుడు అంత డబ్బులు మీకేం అవసరం వదినా? మేమేం పారిపోతామా అని అడిగింది. ఇస్తారు కదా అనుకుంటే పారిపోయారు. - గూడిపూడి నాగమణి, వక్కలంక వీధి రూ.7.50 లక్షలు ఇచ్చాను టిఫిన్ దుకాణం నడుపుతున్నాను. చీటీలు ఎత్తేవారు నాకు డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా ఇచ్చిన డబ్బులను వారికిచ్చాను. దాదాపు రూ.7.50లక్షలు ఇచ్చాను. దీంతో పాటు మరో రూ.60 వేల చీటీ డబ్బులు ఇచ్చాను. దేనికీ కాగితాలు రాసివ్వలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. - పి అప్పలకొండ, చిన్నిపిల్లి వీధి నాకు తెలియకుండా నా భార్య ఇచ్చేసింది రాజశేఖర్ భార్య గాయత్రి వచ్చి మాయ చేసి అడిగితే నాకు తెలియకుండా నా భార్య పద్మజ రూ.7 లక్షలు ఇచ్చేసింది. భూమి అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకుని వచ్చి మాయ చేశారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ దృష్టిలో పెట్టాలని అందరం వచ్చాం. - ఎం జగదీశ్వరరావు, బాధితుడు నా డబ్బులెలా వస్తాయో.. నేను నాలుగైదు వీధుల్లో పాల ప్యాకెట్లు విక్రయిస్తాను. అలాగే సాయిరాం ఆలయం ముందు కొబ్బరి కాయలు విక్రయిస్తాను. నేను పైసా పైసా కూడబెట్టి రూ.30 వేలు పోగేశాను. ఆ డబ్బులు ఉన్నాయని తెలిసి వచ్చారు. మళ్లీ వడ్డీతో సహా ఇస్తామని చెబితే ఇచ్చాను. నా డబ్బులెలా వస్తాయో..! - చిన్నిపిల్లి రమణమ్మ, పన్నీరువారి వీధి రూ. 3లక్షల చీటీ, రెండు లక్షల అప్పు ఇచ్చాం నా భర్త ప్రైవేటు ఇన్‌కంటాక్స్ ఫైళ్లు రాస్తుంటారు. మేం చీటి వేసిన రూ. 3లక్షలకు నేనే ష్యూరిటీ ఉంటానని తీసుకెళ్లిపోయాడు. అలాగే మరో రెండు లక్షలకు మధ్య ఉన్నాం. మొత్తం ఐదు లక్షలు కాజేశారు. ఇలా అర్ధాంతరంగా స్కూల్ మూసేసి వెళ్లిపోతారనుకోలేదు. - కె.సూర్యకళ, విజయనగరం -
ఈపీఎఫ్‌పై వడ్డీ ఇక 9 శాతం ?
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ డిపాజిట్లపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)... తొమ్మిది శాతం వడ్డీ చెల్లించనుంది. ప్రస్తుతం ఈ ఖాతాలపై 8.75 శాతం వడ్డీ చెల్లిస్తోన్న సంగతి విదితమే. ఇందువల్ల ఐదుకోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి కలగనుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ ట్రస్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి పీజే బనాసురే వెల్లడించారు. ఇటీవల సమావేశమైన ఈపీఎఫ్ఓ అనుబంధ ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ)... పీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 8.95 శాతం వడ్డీ చెల్లించాలంటూ సిఫారసు చేసింది. కాగా ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశమవనున్న ఎఫ్ఏఐసీ.. పీఎఫ్ డిపాజిట్లపై తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాలంటూ తన సిఫారసును మార్చే అవకాశం ఉంది. -
ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా?
సాక్షి, హైదరాబాద్: పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీకి ఇవ్వడమే కాక, వడ్డీ కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుైడైన కరీంనగర్ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారం ద్వారా మోహన్‌రెడ్డి రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు అదనపు పీపీ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఓ ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు ఏఎస్ఐ మోహన్‌రెడ్డి నుంచి రూ.75 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్‌రెడ్డి, మరికొందరు తన ఆత్మహత్యకు కారణమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు నిరాకరించడంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. సీఐడీ అధికారుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ మోహన్‌రెడ్డి ఏఎస్ఐ విధులు నిర్వర్తిస్తూనే భారీ మొత్తాలను వడ్డీకి ఇస్తూ వ్యాపారం చేశారన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం సాక్షులపై ఉంటుందని ఆయన కోర్టుకు నివేదించారు. -
వడ్డీ కోసం తహ..తహశీల్దార్!
రెవెన్యూ కార్యాలయమే వడ్డీ వసూళ్ల కేంద్రం! రూ.2 కోట్లు టర్నోవర్? అధికార పార్టీ నేతలే బాధితులు తిరుపతి రూరల్: ఆయనో మండల తహశీల్దార్. అటెండర్ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. తహశీల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందాక ఆయన ఆహార్యం మారింది. తన చేతులకున్న పదివేళ్లలో ఏడు వేళ్లకు పెద్దసైజు ఉంగరాలు, మెడలో భారీగా బంగారు గొలుసులు వేసుకుని ఫైనాన్స్ వ్యాపారిగా కనిపిస్తుంటాడు. ఆయన అసలు వ్యవహారం కూడా అదే! వడ్డీ వ్యాపారానికి తెరతీసి ప్రభుత్వ కార్యాలయాన్నే వసూళ్ల కేంద్రంగా మార్చుకున్నాడు. వ్యవహారంలో ఇతర వడ్డీ వ్యాపారులకేమీ తీసిపోడు. ఇప్పుడు అత్తగారి మండలంలోనే విధులు నిర్వర్తిస్తూ ‘మూడు చెక్కులు ఆరు ప్రామిసరీ నోట్లు’గా వడ్డీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ మండలంలో తహశీల్దార్ కాల్‌మనీని తలపించేలా దందా నడిపిస్తున్న తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మెక్రోఫైనాన్స్ను తలదన్నేలా జలగల్లా పీక్కుతింటున్నట్లు చెబుతున్నారు. అవసరాలను ఆసరాగా చూసుకుని అధికవడ్డీలతో అప్పుల వల వేస్తాడు. అప్పు ఇచ్చిన సాకుతో బయటకు చెప్పుకోలేని విధంగా యాతనపెడతాడు. మధ్య తరగతి ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు ఈయన చేతికి చిక్కుతున్నారు. డైలీ, వారం, నెల వారిగా ఫైనాన్స్ ఇస్తున్నారు. నూటికి రూ.10, అంతకంటే ఎక్కువకు కూడా వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తాడని చెబుతున్నారు. కొందరు అప్పులు కట్టలేక ఆస్తులను ఆయనకు వదిలేసినవారు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన డాబు, దర్పం చూసి పలువురు బాధితులు బయటపడి చెప్పలేక లోలోన వేదన పడుతున్నారు. దాదాపు 70 మందికి ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా వడ్డీలకు ఇచ్చినట్లు సమాచారం. కాగా, సదరు అధికారి ముందుచూపుతో కొందరు అధికార పార్టీ నాయకులను తన కస్టమర్లుగా మార్చుకున్నాడని తెలుస్తోంది. వారిని తనకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వారికి పనులు చే సి పెడుతున్నట్లు టీడీపీ నాయకులే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి సైతం చెప్పారు. వడ్డీకి అప్పు తీసుకున్న వారితో సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ తన కార్యాలయంలోనే సాయంత్రం 6 నుంచి రాత్రి 11గంటల వరకు ఆయన చక్కబెడుతుంటారని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య కోసం పాకాలలోనూ, పూతలపట్టు మండలంలో అనధికారికంగా ఉన్న మూడో భార్య కోసం ఇళ్లలో కాపురం పెట్టాడని.. ఆయా ఇళ్లు సైతం వడ్డీబాధితులవేనని తీవ్రమైన ఆరోపణలున్నాయి. కాగా, ఇలా వడ్డీ దందాతో వచ్చిన డబ్బులతోనే రాజకీయంగా ఎదగాలని ఆ తహశీల్దార్ తహతహలాడుతున్నట్లు సమాచారం. డీకేటీ పట్టాలు సైతం.. పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను సదరు తహశీల్దార్ గద్దలా తన్నుకుపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆర్ఐగా, డెప్యూటీ తహశీల్దార్‌గా, తహశీల్దార్‌గా పనిచేసిన ఈయన తన భార్య పేరుతో నేండ్రగుంట-పెనుమూరు రోడ్డులో ఐదు ఎకరాల భూమికి డీకేటీ పట్టా తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో తన భార్య పేరు నుంచి కుటుంబ సభ్యుల పేరుతో డీకేటీ పట్టాను మార్చుకున్నాడు. ఏదేమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటివారిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే..
తమ పిల్లలు అన్నింట్లోనూ రాణించాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. అన్ని అంశాల్లోనూ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ రోజుల్లో పిల్లలను చిన్నప్పటినుంచే తగిన రీతిలో తీర్చిదిద్దడం చాలా అవసరం. ముఖ్యంగా ఇది స్మార్ట్ యుగం కాబట్టి వారిని మరింత స్మార్ట్ కిడ్స్‌గా మార్చాలి. చిన్నప్పటి నుంచే వారిపై శ్రద్ధపెట్టి సరైన స్థాయిలో రాణించేలా చూడాలి. ఈ విషయంలో పిల్లల్ని స్మార్ట్ కిడ్స్‌గా మార్చేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం... క్రీడల్లో ప్రవేశం.. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఆటల వల్ల వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలే చదువులోనూ రాణించేందుకు వీలుంటుంది. అందుకే మీ పిల్లల్ని క్రీడల దిశగా ప్రోత్సహించండి. చిన్నప్పటినుంచి కనీసం ఒక్క క్రీడలోనైనా ప్రవేశం ఉండేలా చూడండి. ఆటలతో శరీరం దృఢంగా తయారవుతుంది. దీంతో వారు సరిగ్గా ఎదుగగలుగుతారు. ఆటలు ఆడిన తర్వాత కానీ, వ్యాయామం చేసిన తర్వాత కానీ పిల్లలు కొత్త పదాల్ని 20 శాతం త్వరగా నేర్చుకుంటారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. క్రీడలతో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. గ్రూప్‌తో కలిసి సమన్వయంతో ఎలా విజయం సాధించవచ్చో వారు తెలుసుకోగలుగుతారు. నాయకత్వ పటిమ, పోరాట పటిమ కూడా పెరిగేందుకు క్రీడలు తోడ్పడతాయి. ఒక హాబీ తప్పనిసరి.. చిన్నప్పటినుంచే ఏదైనా ఒక హాబీని వారికి తప్పనిసరిగా అలవాటు చేయండి. మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలాంటి హాబీ ఏదైనా సరే వారిలో సృ జనాత్మక శక్తి పెరిగేందుకు ఉపకరిస్తుంది. మంచి హాబీలు కలిగి ఉన్న పిల్లలు చదువుతో పాటు ఇతర అంశాల్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. వీటితో ఎన్నో మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు హాబీగా మొదలు పెట్టినా అంశంలోనే వారు రాణించి కీర్తి ప్రతిష్టలు పొందే వీలుంది. బాల్యంలో హాబీగా మొదలెట్టిన అంశాలతోనే ప్రపంచ గుర్తింపు పొందినవారు చరిత్రలో ఎందరో ఉన్నారు. పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికి ఏదైనా ఒక ప్రయోజనకరమైన హాబీని అలవర్చండి. ఈ హాబీల వల్ల పిల్లల ఖాళీ సమయం కూడా సద్వినియోగం అవుతుంది. చాలినంత నిద్ర.. మీ చిన్నారుల్ని వారికి తగినంత సమయం నిద్రపోనివ్వండి. ఎందుకంటే నిద్రతో అనేక ప్రయోజనాలున్నాయి. చాలినంత నిద్ర పోవడం వల్ల పిల్లల మెదడు సక్రమంగా, సరైన స్థాయిలో ఎదుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. నిద్ర విషయంలో చిన్నారులకు స్వేచ్ఛనివ్వండి. వ్యాయామం, ఆహారం లాగే నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. మెదడు సరిగ్గా పనిచేసేందుకు, త్వరగా నేర్చుకునేందుకు నిద్ర ఉపయోగపడుతుంది. ఆసక్తిని ప్రోత్సహించండి.. మనం క్రీడల్ని, చదువుని, ఇతర హాబీల్ని వారికి తప్పనిసరిగా నేర్పించేందుకు ప్రయత్నిస్తాం. అందులో తప్పులేదు కానీ వారు మరేదైన అంశంపై ఆసక్తి చూపిస్తున్నారేమో గమనించండి. మనం సూచించిన మార్గంలోనే కాకుండా, వారికి నచ్చిన మార్గంలో వెళ్లేందుకు కూడా వారిని ప్రోత్సహించండి. వాళ్లు ఆసక్తి కనబరిచిన రంగం ఏదైనా మీరు తగిన ప్రోత్సాహం అందిస్తే అందులోనే వారు మరింతగా రాణించే వీలుంది. అది మీకు గతంలో సంబంధం లేని రంగమైనా సరే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే వీలుంది. సంతోషమే సగం భలం.. పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు. మీ పిల్లల్ని మీరు వీలైనంత సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. అతిగా బెదిరించడం, ఆంక్షలు విధించడం సరికాదు. వారి ఆలోచనల్ని గౌరవించండి. ఎక్కువ సమయం మీ చిన్నారులతో గడిపేందుకోసం ప్రయత్నించండి. తల్లిదండ్రుల సాంగత్యం, ప్రేమాభిమానాలు చిన్న వయసు పిల్లల మెదడుపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పిల్లల్లో సానుకూల, ఆశావహ దృక్పథం ఏర్పడేందుకూ కారణమవుతుంది. ఎప్పడూ ఆనందంగా ఉండే పిల్లలే చదువులో ఎక్కువగా రాణిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు కలిగినవారు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకుంటున్నారు. వారితోపాటే చదవండి.. మీ పిల్లల్ని చదవమని చెప్పి మీరు మాత్రం టీవీ చూస్తూనో, మరో పని చేస్తూనే ఉంటే ప్రయోజనం ఉండదు. మీ పిల్లలు చదువుకునే సమయంలో వీలైనంత వరకు వారికి దగ్గర్లోనే ఉండండి. మీరు ఏదైనా న్యూస్ పేపరో, పుస్తకమో చదువుతుంటే వాటివైపు మీ పిల్లలు తొంగిచూస్తూ అందులోని అంశాల గురించి, కొత్త పదాల గురించి ఆసక్తిగా అడుగుతారు కదూ! మీరు ఇలా చేయడం వల్ల వారిలో చదువుపై ఆసక్తి పెంచిన వారవుతారు. మీ పిల్లల్తోపాటే మీరు కూడా ఏదైనా చదువుకునేలా చూడండి. అలాగే వారికొచ్చే సందేహాల్ని నివృత్తి చేయండి. దీనివల్ల వారు చదువును భారంగా కాకుండా, ఆసక్తిగా ఫీలవుతారు. సాక్షి, స్కూల్ ఎడిషన్ -
రూ.10 వేలు ఇచ్చి.. రూ.70 వేలు కట్టాలంటోంది..
విలేకరులతో బాధితురాలి ఆవేదన మాచర్ల: పట్టణంలోని నెహ్రునగర్‌లో హోటల్ నిర్వహించే కుమారి రూ.10 వేలు వడ్డీకి ఇచ్చి రూ.70 వేలు క ట్టాలని వేధిస్తోందని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని బాధితురాలు పోతునూరి వెంకటమ్మ చెప్పారు. ఆమె బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కూలి చేసుకునే తాను నాలుగేళ్ల కిందట కుమారి వద్ద పది రూపాయల వడ్డీకి రూ.పదివేలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. రోజుకు రూ.100 చొప్పున కొంతకాలం చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత చెల్లించలేకపోవడంతో కొన్ని రోజుల కిందట తనతో రూ.70 వేలు కట్టాలని నోటు రాయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ రూ.70 వేలు కట్టాలని రోజూ కూమారి తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. -
రుణమాఫీ వడ్డీకే సరి!
♦ నాలుగు విడతలుగా రుణమాఫీ వల్లే గందరగోళం ♦ రెండు విడతల సొమ్మును వడ్డీ కిందే జమచేసుకున్న బ్యాంకులు ♦ గడువులోగా చెల్లించలేదంటూ అధిక వడ్డీ ♦ ఆ వడ్డీని అసలు రుణంలో కలిపేస్తున్న వైనం ♦ మాఫీ సొమ్ము వడ్డీ కింద జమ.. రుణమంతా అలాగే ఉన్నట్లు లెక్కలు ♦ సర్కారుకు నివేదించిన ఇంటెలిజెన్స్ విభాగం ♦ వడ్డీ సహా అప్పు చెల్లిస్తున్నామన్న సర్కారు ♦ అడకత్తెరలో పోకచెక్కలా అన్నదాత ♦ అప్రమత్తమైన ఆర్థిక శాఖ.. నేడు ఎస్ఎల్బీసీ సమావేశం ♦ లబ్ధిదారుల రుణాల సమగ్ర వివరాల ప్రకటనకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసిన తొలి రెండు విడతల సొమ్మును బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకున్నాయని... రైతుల ఖాతాల్లో ఇంకా ఎక్కువ బాకీ ఉన్నట్లుగా చూపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నాలుగు విడతలుగా రుణమాఫీయే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లింపుల విషయంలో కొన్ని బ్యాంకులకు ఇప్పటికీ అవగాహన లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని తేల్చి చెప్పింది. అందువల్లే రైతులకు కొత్త రుణాలు అందడం లేదని, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ‘‘మీరు తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించలేదు. అందుకే నిబంధనల ప్రకారం గడువు మీరిన పంట రుణాలకు వర్తించే 11 శాతం వడ్డీ చెల్లించాలి.’’ అంటూ కొన్ని బ్యాంకులు 11 శాతం వడ్డీని రైతుల ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకుంటూ పోతున్నాయని తెలిపింది. కొన్నిచోట్ల పంట రుణాలకు సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఖాతాల్లో అప్పు రికవరీ, జమ అవుతుందని.. బ్రాంచి మేనేజర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. ఈ నివేదికలతో అప్రమత్తమైన ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని గుర్తించింది. వెంటనే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కావాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మరోవైపు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది, ఇంకా ఎంత ఉందనే వివరాలతో జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల తిరకాసు వల్లే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకు పంట రుణాలను వడ్డీతో సహా మాఫీ చేసింది. దీంతో 36.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. గత ఏడాది మార్చి 31 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఆగస్టు వరకు అయ్యే వడ్డీని సైతం లెక్కగట్టి ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. మొత్తం రూ.17 వేల కోట్లు అవసరంకాగా.. నాలుగు విడతలుగా చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.8,450 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసుకుని, కొత్త రుణాలు ఇవ్వాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. కానీ కొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీ చెల్లింపులకు సంబంధించి తిరకాసు పెట్టడంతో రుణమాఫీ పథకం ప్రయోజనం నెరవేరకుండా పోయిందని సర్కారు భావిస్తోంది. దీంతోపాటు రుణమాఫీ గందరగోళం, రైతుల ఆత్మహత్యలు ఇటీవల అసెంబ్లీ సమావేశాలను కుదిపేశాయి. వీటిపై విపక్షాల నిలదీతతో ఒక దశలో అధికార పార్టీ ఇరుకునపడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌తో సర్వే చేయించింది. ఇప్పుడేం చేద్దాం.. రుణమాఫీతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని.. అయితే ఇప్పటికీ తమ రుణం ఎంత మాఫీ అయింది, ఎంత మిగులు ఉందనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ పథకంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యను పక్కాగా తెలుసుకునేందుకు గతంలో ప్రభుత్వం బ్యాంకులు, బ్రాంచీల వారీగా జాబితాలను ప్రకటించింది. అదేతీరులో లబ్ధిదారుల రుణ వివరాలను సైతం వెల్లడిస్తే... ఈ గందరగోళానికి తెరపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. బ్రాంచీల వారీగా లబ్ధిదారులు తీసుకున్న రుణమెంత, ఎంత వడ్డీ చెల్లించాలి, అందులో ఎంత మొత్తం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది, మిగులు రుణమెంత..? అనే వివరాలన్నీ పేర్కొనాలని నిర్ణయించారు. వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని, మొండికేస్తున్న కొన్ని బ్యాంకులతో అమీతుమీ తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట రుణాలకు వర్తించే వడ్డీమాఫీ పథకం అమల్లో ఉందని... కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీని ఏటా చెల్లిస్తున్నాయని బ్యాంకులకు స్పష్టత ఇవ్వటం ద్వారా రైతులపై ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించింది. -
పన్నులేని వడ్డీ కావాలా?
ఒక వైపేమో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. అంతేకాదు!! వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి కూడా వస్తోంది. అలా జరిగితే వడ్డీయే ఆదాయంగా బతికేవారికి ఇబ్బంది కాదా? మరేం చేయాలి? ఇపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ ప్రశ్నలన్నీ సామాన్యులనిపుడు వేధిస్తున్నాయి. ఇదిగో... ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమా... అన్న రీతిలో వస్తున్నాయి ట్యాక్స్ ఫ్రీ బాండ్లు. ఒకవైపు వడ్డీ కాస్త ఎక్కువ. పెపైచ్చు స్థిరంగా ఉంటుంది. వీటికితోడు పన్ను కూడా ఉండదు. అందుకే ఇన్వెస్టర్లు వీటికోసం ఎగబడుతున్నారు. ఉదాహరణకు రూ.400 కోట్లు ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా సమీకరించాలని భావించిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ... ఆ మేరకు తొలివిడత బాండ్ల జారీకి వచ్చింది. ఊహించని విధంగా ఇష్యూ ఆరంభమైన తొలి రోజే 11 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. దీంతో ఈ నెల 30వ తేదీ వరకూ ఉండాల్సిన ఇష్యూ... ఒక్క రోజులోనే ముగిసిపోయింది. ఎన్టీపీసీ సక్సెస్‌తో మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ట్యాక్స్ ఫ్రీ బాండ్లు జారీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే... ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లకు ఎందుకింత డిమాండ్ వచ్చింది? ఇవి ఎవరికి అనుకూలం? వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు గమనించాల్సిన అంశాలేంటి? అనేవి వివరిస్తున్న ‘ప్రాఫిట్ ప్లస్’ ముఖ్య కథనమిది.. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఇదిగో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు వస్తున్నాయ్ * రూ.400 కోట్ల మేర బాండ్లు జారీచేసిన ఎన్టీపీసీ * మొదటిరోజే 11 రెట్లు అధికంగా బిడ్లు... * ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపులేవీ ఉండవు * అధిక ట్యాక్స్ శ్లాబుల్లో ఉన్నవారికి చక్కని ఊరట * మరిన్ని బాండ్ల జారీకి సిద్ధమవుతున్న సంస్థలు దాదాపు ఏడాది కాలంగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ఇష్యూలేవీ రాలేదు. అయితే గత బడ్జెట్లో ప్రభుత్వం ఈ ఏడాది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించుకోవటానికి ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ మొదటి విడతగా జారీచేసిన రూ. 400 కోట్ల ఇష్యూకి అనూహ్య స్పందన వచ్చింది. దీనికి మరో కారణం కూడా ఉంది. మంగళవారం ఆర్బీఐ పరపతి విధానాన్ని సమీక్షించనుంది. ఈ సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చని చాలామంది అంచనా వేస్తున్నారు. దీంతో మున్ముందు వచ్చే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాతో ఎన్టీపీసీ ఇష్యూకి భారీగా స్పందన వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిగిలిన సంస్థలు వడ్డీరేట్ల కదలికలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఇష్యూకు రావడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. మొత్తం రూ.40,000 కోట్ల ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు సుమారు రూ.11,000 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎవరైనా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సాధారణంగా ఈ బాండ్లలో కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.5,000గాను, గరిష్ట మొత్తం రూ.10 లక్షలుగాను ఉంటుంది. డీమ్యాట్ లేదా ఫిజికల్ రూపంలో తీసుకోవచ్చు. కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం పాన్‌కార్డు తప్పనిసరి. అలాగే ఈ బాండ్స్ ఇష్యూలో మొదట అప్లై చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానంలో బాండ్స్‌ను కేటాయించడం జరుగుతుంది. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇష్యూ ప్రారంభంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీర్ఘకాలికం... భద్రం వీటి జారీకి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే వీటిని జారీ చేస్తాయి కూడా. అందుకే ఈ సంస్థలు అందించే బాండ్లకు అధిక రేటింగ్ ఉంటుంది. వీటిని రిస్క్‌లేని ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా కూడా పరిగణిస్తారు. ఈ బాండ్ల కాలపరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. కాలపరిమితిని బట్టి వడ్డీరేటు మారుతుంటుంది. సాధారణంగా 10, 15, 20 ఏళ్ల కాలానికి ఈ బాండ్లను జారీ చేస్తారు. మధ్యలో వైదొలగవచ్చు... ఈ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారు. కాబట్టి నగదు అవసరమైనప్పుడు మధ్యలో వైదొలగవచ్చు. కానీ ఇలా మధ్యలో వైదొలిగితే ఇబ్బంది ఉంటుంది. మధ్యలో నగదు తీసుకుంటే మాత్రం పన్ను భారం ఏర్పడుతుంది. ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోగా వైదొలిగితే మీ వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబు ప్రకారం... ఈ బాండ్లపై వచ్చే వడ్డీకి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది దాటిన తర్వాత అయితే 10.3 శాతం క్యాపిటల్ గెయిన్ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. వీటన్నింటిపైనా ఒక అవగాహన అవసరం. చక్కటి అవగాహనకు అవసరమైతే ఈ విభాగంలో నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం వల్ల అనవసర వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. వడ్డీ తక్కువైనా లాభమెక్కువ... సాధారణంగా ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అందించే వడ్డీ... బ్యాంకు డిపాజిట్ల కంటే పావు నుంచి అర శాతం తక్కువగానే ఉంటుంది. కాకపోతే బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ ఆ వడ్డీ ఏడాదికి రూ. 10,000 దాటితే టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను కోత) కూడా వర్తింప చేస్తారు. అదే ట్యాక్స్ ఫ్రీ బాండ్ల విషయానికొస్తే వీటిపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్నూ ఉండదు. అందుకని వడ్డీని, పన్ను లాభాన్ని కలిపితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరో రకంగా చెప్పాలంటే అధిక ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో ఉండేవారికి దీనివల్ల ఎక్కువ లాభం. ఉదాహరణకు ప్రస్తుతం ఎస్బీఐ 5-10 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ 30 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో ఉన్నవారు గనక ఈ వడ్డీపై చెల్లించే పన్నును పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ రాబడి 5 శాతమే అవుతుంది. అదే ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో అయితే వడ్డీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని పన్ను పరిధి నుంచి మినహాయించటం వంటివేవీ ఉండవు. వీటిపై వచ్చే వడ్డీకి పన్ను విధించరు. అంతే!!. అందుకే ఇవి 20, 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్న వారికి అనువైనవని చెప్పొచ్చు. -
ఎంత పని చేశావమ్మా..
రుణాలు ఆమె పాలిట మరణ శాసనాలయ్యాయి... అప్పులు ఆమెను అథఃపాతాళానికి తొక్కేశాయి. వడ్డీలకు అప్పు తీసుకుని వేసిన బోర్లు ఆ కుటుంబాన్నే మింగేశాయి. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానాలు ఆమెకు భరోసా ఇవ్వలేకపోయాయి. తానుపోతే.. పెళ్లికెదిగిన కూతుళ్లు ఏమైపోతారన్న భయం ఆ తల్లిని కుంగదీసింది. రక్తం పంచి ప్రాణం పోసిన తల్లే.. విషమిచ్చే పాషాణమైంది.. చివరికి పెద్దబిడ్డతో పాటు తనూ తనువు చాలించింది. మరో బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పుత్తూరు: ఎన్ని కష్టాలొచ్చినా నిబ్బరంతో ఎదుర్కొన్న బిడ్డల్ని కాపాడుకున్న ఆ తల్లి ఆత్మస్థైర్యాన్ని అప్పులు దెబ్బతీశాయి. తిండికున్నా.. లేకున్నా.. కాడిని నమ్ముకుని జీవించిన తల్లికి. రుణాలు.. పాడెనే మిగిల్చాయి. మనస్సున్న ప్రతి ఒక్కరికీ కదలిస్తున్న ఈ విషాదమంతా...నగరి నియోజకవర్గం మండల కేంద్రమైన నిండ్ర బీసీ కాలనీలోని మాధవి కుటుంబానిదే. వివరాల్లోకి వెళితే... క్రిష్ణయ్య, మాధవి దంపతులు. వీరికి శరణ్య, గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానికంగా వీరికి ఎకరా పొలం ఉంది. ఇందులో బోరు వేసి పంటలు పండించుకుని తద్వారా సంఘంలో గౌరవంగా బతకాలని వారు భావించారు. శరణ్య, గాయిత్రిలను బాగా చదివించాలనుకున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఉన్న పొలంలో మల్లెపూల తోట నాటి సాగు చేస్తే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో అప్పలు చేసి బోర్లు వేశారు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో అప్పులు చేసి 12 బోర్లు వేశారు. అయినా దురదృష్టం వారిని వెంటాడింది. బోర్లనుంచి నీరు రాలేదు సరికదా... అందుకు చేసిన అప్పు రూ.3 లక్షలు కొండలా పేరుకుపోయింది. ఇదే సమయంలో మాధవి డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న రుణం మాఫీ కాలేదు. దీంతో అప్పుతో పాటు వడ్డీ భారీగా కట్టాల్సివచ్చింది. దంపతులిద్దరూ... కూలీ పనులకు వెళ్లగా వచ్చిన సొమ్ము కాస్తా రోజూవారి జీవనానికే సరిపోయేది. ఈ సమయంలో పుత్తూరులోని ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో పెద్ద కుమార్తె శరణ్య ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుకు ఫీజు చెల్లించాలనే ఒత్తిడి ఏర్పడింది. ఇంట్లో పరిస్ధితి తెలుసుకున్న శరణ్య తన చదువును మానేస్తాని తల్లి మాధవికి తెలిపింది. మూడు రోజులుగా ఇంటిలోనే ఉన్న శరణ్యను చూసిన మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. చిన్నకుమార్తె గాయత్రీ 8 వ తరగతి చదువుకుంటోంది. ఒకవైపు ఎదిగిన కుమార్తెలు వారిని చదివించలేని పరిస్థితి, అప్పులిచ్చిన వారి ఒత్తిడి సమాధానం చెప్పలేని పరిస్ధితిలో భర్త క్రిష్ణయ్యను చూసి పూర్తిగా నిస్సహాయలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే భర్త ఇంటిలో లేని సమయంలో మాధవి కుమార్తెలిద్దరితో కలసి కఠిన నిర్ణయం తీసుకుని పురుగుల మందు వారికి ఇచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు ప్రభావానికి పిల్లలిద్దరూ కేకలు వేయడంతో స్థానికులు వైద్యశాలకు తరలించారు. తల్లి మాధవి, పెద్దకుమార్తె శరణ్యలు మృతిచెందగా గాయిత్రి తిరుపతి రూయాలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. -
వడ్డీజలగలు
సగటు జీవి విలవిల చక్రవడ్డీలతో ఆస్తులు స్వాహా బెదిరింపులు.. ఆపై దాడులు కొత్త సీపీ జోక్యం కోసం ఎదురుచూపులు నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నెలవారీ, రోజువారీ, కాల్‌మనీ.. ఇలా రకరకాల పేర్లతో అవసరమైన వారికి వల విసిరి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆపై బెదిరింపులకు దిగుతున్నారు. తీసుకున్న అప్పుకు చక్రవడ్డీ వేసి మరీ ఆస్తులు గుంజుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి వేధింపులు తాళలేక, పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. వీధికో వడ్డీ వ్యాపారి దర్శనమిస్తూ అభాగ్యుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. విజయవాడ సిటీ : నగరంలో నెలకు రూ.100 కోట్ల మేర వడ్డీ వ్యాపారం జరుగుతోందంటే వడ్డీ వ్యాపారులు ఏ మేరకు వేళ్లూనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వీరి ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతుంటే.. రాజకీయ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నెలవారీ ముఠాలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్‌గా నెలవారీ వడ్డీ వ్యాపారం చేసే ముఠాలున్నాయి. వీరు ఆయా కార్యాలయాల్లో తమ ఏజెంట్లను పెట్టుకుని డబ్బులు అవసరమైనవారిని ఆకర్షిస్తుంటారు. నెలకు నూటికి రూ.7 నుంచి రూ.10 వరకు వడ్డీకి అప్పు ఇస్తారు. హామీగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటారు. ఆపై ఉద్యోగుల ఏటీఎం కార్డు తీసుకుని జీతం పడగానే వడ్డీ సొమ్ము డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ వీరికి పట్టదు. పైగా సంబంధిత కార్యాలయాల ప్రధాన అధికారులతో వీరిని బెదిరిస్తారు. రోజువారీ.. : మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ముఠా కూలీల కోసం రోజువారీ వడ్డీ వ్యాపారం సాగుతోంది. రూ.1000 నుంచి రూ.10 వేల వరకు రోజువారీ వడ్డీకి అప్పు ఇస్తారు. ఈ పద్ధతిలో నూటికి రూ.15 నుంచి రూ.20 వరకు వడ్డీ కింద ముందుగానే తీసేసుకుంటారు. రూ.10 వేలు తీసుకుంటే వడ్డీ కింద రూ.1500 నుంచి రూ.2 వేల వరకు మినహాయించుకుంటారు. మిగిలిన మొత్తాన్ని 100 రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. నెలకు నూటికి రూ.6.50 వరకు వడ్డీ పడుతుంది. పైగా వడ్డీని ముందే తీసుకోవడం ఈ విధానంలో ముఖ్యం. సాయంత్రమైతే చాలు రోజువారీ వడ్డీ వ్యాపారులు వసూళ్ల బాట పడతారు. ఎవరైనా కట్టబోమంటే దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. కాల్‌మనీ : పెద్ద వ్యాపారులు నగదు సర్దుబాటు చేసేందుకు వీరిని ఆశ్రయిస్తుంటారు. ఆకస్మికంగా సరుకు తీసుకోవాల్సివస్తే కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. రూ.1000కి రూ.12 వడ్డీ. సాయంత్రం వడ్డీతోసహా అసలు కట్టాలి. అసలు మరుసటి రోజు ఇచ్చినా తీసుకుంటారు కాని వడ్డీ ఇవ్వకుంటే మాత్రం అంగీకరించరు. ఉదాసీనత : వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిలువరించడంలో ప్రభుత్వ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఏ విధమైన లెసైన్స్‌లు లేకుండా ఆదాయ పన్ను శాఖను ఏమార్చుతూ వీరు తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సంస్థల తోడ్పాటు అందని స్థితిలో వీరి విషవలయంలో చిక్కుకుని వ్యాపారులు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. పోలీసు కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు ఉన్న సమయంలో వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఆయా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి బైండోవర్ కేసులు పెట్టడంతో పాటు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. వడ్డీ వ్యాపారులు రాజకీయ నేతల ప్రాపకంతో పోలీసులకు మామూళ్లు ఇచ్చి తమ ఆగడాలు కొనసాగిస్తున్నారు. నూతన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటే అనేక కుటుంబాలు వీధినపడకుండా కాపాడినవారవుతారనేది పలువురి అభిప్రాయం. -
‘రుణ’రంగం..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాల పంపిణీ ఇప్పటికీ తేలలేదు. దాదాపు రూ.30 వేల కోట్ల అప్పులపై తెలంగాణ, ఏపీల మధ్య పీటముడి పడింది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. గత బడ్జెట్ నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంపిణీ చేసింది. పక్కాగా ఉన్న ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.48 లక్షల కోట్ల అప్పులు పంపిణీ చేయగా, రూ.30 వేల కోట్ల అప్పుల పంపకం పూర్తి కాలేదు. ప్రస్తుతం వీటికి వడ్డీని ఏపీ సర్కారే చెల్లిస్తోంది. నాబార్డు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వివిధ పథకాలకు విడుదలైన నిధులు, మౌలిక సదుపాయాలకు జైకా విడుదల చేసిన నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు రాష్ట్రానికి మంజూరైన నిధుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వీటిలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ఖర్చు చేశారు.. ఏపీలోని జిల్లాలకు ఎంత కేటాయించారనే అంశంపై మల్లగుల్లాలు తొలగిపోలేదు. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిదాటినా ఈ వివాదం సమసిపోలేదు. ఆర్టీసీది ఒక మచ్చుతునక... మిగులు అప్పును అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం రికార్డుల ఆధారంగా పంచుకోవాలా? లేక తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఆస్తులు, అప్పుల విభజనకు నియమించిన షీలా బిడే కమిటీ సూచనల మేరకు పంచాలా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలన్నీ తమకు తాముగా సిద్ధం చేసుకున్నాయి. ఉమ్మ డి రాష్ట్రంలో జమా ఖర్చుల వివరాలన్నీ ఏజీ కార్యాలయం రికార్డు చేసింది. ఏజీ రికార్డులే అప్పుల పంపిణీకి కీలకంగా మారాయి. కానీ, కొన్ని సంస్థల్లో ప్రభుత్వం చూపిస్తున్న పెట్టుబడుల లెక్కల్లో తేడాలుండటంతో వివాదాస్పదమైంది. ఉదాహరణకు ఆర్టీసీ లాంటి సంస్థకు ఉమ్మడి ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు ఏజీ రికార్డులు చెబుతున్నాయి. కానీ తమకు ఉమ్మడి రా ష్ట్రం కేవలం రూ.2 వేల కోట్లే కేటాయిం చిందని, మిగతా చెల్లింపులన్నీ బకాయిలని ఆర్టీసీ లెక్కలు వేలెత్తి చూపుతున్నాయి. దీంతో మిగతా రూ.3 వేల కోట్లను రుణంగా పరిగణిం చాలా? లేదా? అనేది చిక్కుముడి. ఆర్టీసీ తరహాలో మిగతా సంస్థల్లోనూ ఇలాంటి తేడాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సరిచూసుకోవాలి ప్రధానంగా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థల పెట్టుబడులు, ఖర్చుల వివరాల్లోనే ఈ గందరగోళం ఉంది. అందుకే ఏజీ రికార్డుల్లో ఉన్న రుణాలు నిజంగా పంపిణీ అయ్యాయా? గ్రాంట్లుగా మంజూరయ్యాయా? లేక సర్కారు రుణంగా ఇస్తే సంస్థలు గ్రాంట్లుగా చూపించుకున్నాయా? అనేది సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన అప్పును ఏజీ రికార్డుల ప్రకారం పంచాలంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది సరికాదంటూ తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. సంస్థల దగ్గరున్న రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. లేకుంటే షీలాబిడే కమిటీ సైతం భవిష్యత్తులో ఈ విషయాన్ని వేలెత్తి చూపుతుందని తెలంగాణ వాదిస్తోంది. అప్పుల వడ్డీల భారం పడుతుండటంతో పాటు.. వడ్డీల చెల్లింపుల విషయంలోనూ రుణాలిచ్చిన సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగాఅప్పులు పంచుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చారు. వచ్చే వారం వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకొని ఏజీని రంగంలోకి దింపే అవకాశముంది. -
ప్రైవేట్ రుణమే దిక్కు
అన్నదాతకు అందని రుణాలు వడ్డీ కట్టించుకుని పునరుద్ధరణతోనే సరి వాణిజ్య బ్యాంకుల్లో కొనసాగుతున్న తంతు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడంతోనే ఇబ్బంది హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతోంది. మరో పక్క రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులన్నీ వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేసి పంపించేస్తున్నాయి. కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడమే. అంటే.. పంటల వారీ ఏటా పెంచే రుణపరిమితిని ఈ ఏడాది పెంచలేదు.ఇలా రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతలను వడ్డీ వ్యాపారుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ఇచ్చిన నిధులు ఆయా రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మాఫీ పేరుతో ఇచ్చిన 20 శాతం నిధులు ఆయా రైతుల అప్పులపై ఉన్న వడ్డీకిసరిపోలేదు. దీంతో ఆయా రైతుల రుణాలు గత ఖరీఫ్ సీజన్లో రెన్యువల్ కాలేదు. ఈ ఖరీఫ్‌లోనైనా వడ్డీలు చెల్లించి రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే 18 శాతం వరకు వడ్డీ భారం పడుతోందంటూ బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. రైతులు వడ్డీలు చెల్లించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సహకార బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి సన్న, చిన్న కారు రైతులకు ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచీ రుణం మంజూరు కావడం లేదు. నాబార్డు ఆప్కాబ్‌కు రుణం మంజూరు చేస్తేనే ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఆ నిధులను ఇస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు ఆ నిధులను ప్రాథమిక సహకార బ్యాంకులకు అందజేస్తాయి. వాటిని ప్రాథమిక సహకార బ్యాంకులు రైతులకు రుణంగా ఇస్తాయి. నాబార్డు రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి దీనికి 0.05 శాతం ఆప్కాబ్ కమిషన్‌గా ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ఆర్థిక స్తోమత లేదని, కమిషన్ లేకుండా గ్యారెంటీ ఇవ్వాల్సిందిగా ఆప్కాబ్ కోరినప్పటికీ ఆర్థిక శాఖ కరుణించడం లేదు. . -
వడ్డీపై పన్ను మినహాయింపు
బంగారం డిపాజిట్ స్కీమ్... ముసాయిదా పథకం, మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ⇒ కనీస డిపాజిట్ 30 గ్రాములు.. ⇒ డిపాజిట్లకు కనీన వ్యవధి ఏడాది న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు, వివిధ సంస్థల వద్ద ఉత్పాదకత లేకుండా పడిఉన్న బంగారంలో కొంత మొత్తాన్నైనా చలామణీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ముసాయిదాను, సంబంధిత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బంగారంపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నులూ ఉండవు. ఆదాయపు పన్ను(ఐటీ)తో పాటు మూలధన లాభాల పన్ను నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ప్రజలు/సంస్థలు కనిష్టంగా 30 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసే వీలుంటుంది. ఈ స్కీమ్‌పై వచ్చే నెల 2వ తేదీకల్లా ప్రజలు, సంబంధిత వర్గాలంతా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే, ప్రతిపాదిత స్కీమ్‌ను తొలుత కొన్ని నగరాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పథకం ఎలా పనిచేస్తుందంటే... ⇒ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థ తమవద్దనున్న బంగారాన్ని ముందుగా బీఐఎస్ ధ్రువీకృత హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో విలువ కట్టించాలి. ⇒ ఆతర్వాత బ్యాంకుల్లో ఒక ఏడాది కనీస కాలపరిమితితో గోల్డ్ సేవింగ్స్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో తమ దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్ చేయాలి. ⇒ డిపాజిట్ చేసిన పసిడి విలువకు అనుగుణంగా వడ్డీని నగదు లేదా బంగారం యూనిట్ల రూపంలో పొందొచ్చు. ఖాతా తెరిచిన 30/60 రోజుల తర్వాత ఖాతాదారులకు వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీ ఎంత ఉండాలో నిర్ణయించే అధికారం బ్యాంకులకు వదిలేయాలని స్కీమ్‌లో ప్రతిపాదించారు. ⇒ అదేవిధంగా గోల్డ్ డిపాజిటర్లకు అసలు, వడ్డీ చెల్లింపు అనేది బంగారం రూపంలోనే బ్యాంకులు విలువకడతాయి. ⇒ మెచ్యూరిటీ తర్వాత లేదా ముందైనా కస్టమర్లు తాము ఖాతా నుంచి నగదు రూపంలో లేదా బంగారం రూపంలోగాని డిపాజిట్లను వెనక్కితీసుకునే(రిడంప్షన్) ఆప్షన్ ఉంటుంది. అయితే, ఈ ఆప్షన్‌ను డిపాజిట్ చేసేటప్పుడే ఎంచుకోవాలి. ⇒ స్కీమ్ కనీస కాలపరిమితి ఏడాది. ఫిక్సిడ్ డిపాజిట్ల మాదిరిగానే లాక్-ఇన్ వ్యవధికి ముందే తీసుకునే వెసులుబాటు ఇస్తారు. ⇒ ఉదాహరణకు ఒక కస్టమర్ 100 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసిన పక్షంలో వడ్డీరేటు 1 శాతంగా గనుక నిర్ణయిస్తే.. నిర్దేశిత కాల వ్యవధి తర్వాత(మెచ్యూరిటీ) ఖాతాలో 101 గ్రాముల పసిడి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ⇒ బ్యాంకులు ఇతర డీలర్లు ఈ విధంగా లభించిన బంగారాన్ని కరిగించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు వీలవుతుంది. నాణేల రూపంలో కస్టమర్లకు విక్రయించగలుగుతాయి. ⇒ అదేవిధంగా డిపాజిట్ల రూపంలో వచ్చే పసిడిని విక్రయించి విదేశీ కరెన్సీని కూడా బ్యాంకులు పొందగలుగుతాయి. ఎగుమతి/దిగుమతిదారుల అవసరాలకు ఈ విదేశీ కరెన్సీని ఉపయోగించొచ్చు. బంగారం దిగుమతులు తగ్గి.. దేశీయంగా ఉన్న పసిడినే మళ్లీ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. బ్యాంకులకూ సీఆర్ఆర్ వెసులుబాటు! బ్యాంకులకు కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కొన్ని ప్రోత్సాహకాలను అందించనుంది. డిపాజిట్లద్వారా వచ్చిన బంగారం నిల్వలను ఆర్బీఐ నిర్దేశించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)/చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్) నిబంధనల్లో భాగంగా చూపించుకునేందుకు అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన మొత్తాన్ని సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ బాండ్లు ఇతరత్రా సాధనాల్లో పెట్టుబడిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం ఎస్ఎల్ఆర్. ప్రస్తుతం సీఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 21.5%గా ఉన్నాయి. అంటే బ్యాంకులు సమీకరించిన మొత్తం డిపాజిట్లలో 25.5% ఈ రెండింటిలో లాక్ అయిపోయినట్లే. ఇప్పుడు బంగారం డిపాజిట్లను వీటిలో భాగంగా పరిగణిస్తే.. బ్యాంకులకు అదనంగా రుణాలివ్వడానికి నగదు లభ్యత పెరుగుతుంది. 20,000 టన్నుల పైనే... దేశవ్యాప్తంగా ఎలాంటి లావాదేవీలూ జరగకుండా, వ్యవస్థలోకి తిరిగిరాని బంగారం పరిమాణం 20 వేల టన్నులకు పైనే ఉంటుందని అంచనా. ఇలా ఉత్పాదకత రహితంగా ఉన్న పుత్తడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.60 లక్షల కోట్లు ఉండొచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. ముఖ్యంగా అధిక మొత్తంలో పసిడి గుడులు, మతపరమైన లేదా ధార్మిక సంస్థల వద్ద ఉంది. అయితే, ముసాయిదా స్కీమ్‌లో ఎలాంటి సంస్థలకు అనుమతి ఉంటుందన్న విషయాన్ని నిర్ధిష్టంగా పేర్కొనలేదు. ప్రపంచంలో అత్యంత భారీగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉంది. మన దేశంలోకి ఏటా 800-1,000 టన్నుల పుత్తడి దిగుమతి అవుతోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలను అధికంగా వెచ్చించాల్సి రావడంతోపాటు రూపాయి మారకం విలువపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. -
విద్య పట్ల ఆసక్తిని పెంచడానికే...
నందిగామ(కొత్తూరు): విద్యా పట్ల మరింత ఆసక్తిని పెంచడానికే ప్రభుత్వం విద్యార్థులకు వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై వేసవి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. ఎండల్లో తిరగకుండా విద్యార్థులు చక్కగా తరగతులకు హాజరు కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఉండే పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వేసవి తరగతుల్లో భాగంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి అంతకు ముందు తరగతుల్లో బీసీ గ్రేడుల్లో ఉంటే మరింత రాణిస్తారని తెలిపారు. అనంతరం డీఈవో నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ.. వేసవి తరగతులు నిర్వహించే ఉపాధ్యాయులకు ఇది వరకే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆటపాటల ద్వారా ఆహ్లాదకరంగా ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. వేసవి తరగతులు 33 మూడు రోజులు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. తరగతుల నిర్వహణకు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఈటా గణేష్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, రత్నం, నాయకులు ఆల్వాల వెంకటయ్య, జహీరోద్దిన్, జంగయ్య, సురేష్, ఆశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ, తహశీల్థార్ నాగయ్య, ఇన్చార్జీ ఎంఈవో రాఘవారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
అసలు కాదు కదా... వడ్డీ కూడా మాఫీ కాలేదు
రైతుల తీవ్ర ఆవేదన.. హైదరాబాద్ వచ్చినా ఒరిగింది లేదని నిట్టూర్పు సాక్షి, హైదరాబాద్: ‘‘బ్యాంకుల్లో అసలూ వడ్డీ కలిపి అప్పు పెరిగిపోయింది. వడ్డీ కట్టి రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలంటున్నారు. బంగారం వేలం వేస్తామంటూ నోటీసులిచ్చారు. పంటలు లేవు. దిక్కుతోచడం లేదు. హైదరాబాద్‌కు వెళితే అక్కడ పరిష్కరిస్తారని చెబితే ఈడ్చుకుంటూ ఇంతదూరమొచ్చాం. ఇక్కడికొస్తే మీ పేర్లను బ్యాంకులు తొలగించాయి. మేమేం చేయలేమంటున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థంకావడంలేదు’’.... రాష్ట్ర సచివాలయానికి తండోపతండాలుగా తరలివస్తున్న రైతులు మొర ఇది. రుణ మాఫీని అమలు చేశామని ప్రభుత్వం గొప్పగా చేస్తున్న ప్రచారం ఉత్త డొల్ల అని సచివాలయానికి తరలివస్తున్న రైతులను బట్టి స్పష్టమవుతోంది. అసలు సంగతి దేవుడెరుగు... కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదంటూ మండిపడుతున్నారు. రెండు విడతలుగా చెల్లించామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఉత్తిదేననడానికి వారే నిదర్శనంగా నిలుస్తున్నారు. సచివాలయానికి తండోపతండాలుగా.. రుణ మాఫీకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి నివేదించాలని ప్రభుత్వం పేర్కొంది. దాంతో గత కొద్దిరోజులుగా రుణమాఫీ కాని వేలాదిమంది రైతులు తమ బాధలు నివేదించడానికి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు మాఫీ కాక మరోవైపు వడ్డీ పెరిగిపోతుంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినందుకు చార్జీలు, భోజనం, బస.. పేరిట అదనంగా చేతి చమురు వదుల్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉపయోగం లేదు.. ఉపశమనమూ లేదు... వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్‌కు వస్తున్న రైతులకు సచివాలయంలో సరైన ఆదరణ కూడా లభించడం లేదు. వారు ఎక్కడ ఎవరిని కలవాలన్న విషయంలోనూ అధికారులు కనికరం చూపించట్లేదు. కొందరు రైతులనుంచి వారిచ్చిన పత్రాలను తీసుకుని నమోదు చేసుకున్నాం.. మీరెళ్లొచ్చంటూ ఛీదరించుకుంటుంటే దిక్కుతెలియని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరుగుతున్నారు. బంగారు రుణాల వేలం వేస్తామంటూ వచ్చిన నోటీసులను చూపించినా ఎవరూ స్పందించట్లేదని రైతులు బోరుమంటున్నారు. బ్యాంకులకు వెళితే హైదరాబాద్‌లో ఫిర్యాదుల విభాగంలో చెప్పుకోవాలన్న సమాధానం వస్తుంటే, తీరా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత బ్యాంకులు తప్పుచేశాయని అధికారులు చెప్పిపంపిస్తున్నారు. గత సోమవారం హైదరాబాద్ వచ్చి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలసిన రైతులకు నిరాశే ఎదురైంది. బ్యాంకులు తప్పు చేశాయని, అందువల్ల మాఫీ కాలేదని, ఇప్పుడేమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఎంతో వ్యయప్రయాసలకు లోనై హైదరాబాద్ వచ్చిన రైతులు ఈ మాటలు వినేందుకా తాము ఇంతదూరం వచ్చింది అనుకుని నిర్ఘాంతపోయారు. రెండు విడతల్లోనూ సక్రమంగా రుణమాఫీ జరగలేదు. దీంతో రుణమాఫీ కానివారిని హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరడం తెలిసిందే. ఇదిలా ఉండగా మీ ప్రాంతంలో ఎవరికైనా రుణాలు మాఫీ అయ్యాయా? అని ఇక్కడికొస్తున్న రైతులను ఎవర్ని అడిగినా మాఫీ అయిందని చెబుతున్నవారు ఒక్కరూ కనిపించట్లేదు. ఇదేం తీరు...: మాఫీ కానివారి సమస్యలు పరిష్కరించడానికి మండల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయకుండా హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదులు చేయాలని ప్రభుత్వం పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్, ఆన్లైన్ యుగం నడుస్తుండగా.. మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించలేరా? అని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. ఈ మాటేదో ముందే చెప్పవచ్చు కదా... బంగారంపై పంట రుణం తీసుకున్నప్పటికీ రుణ మంజూరు పత్రాల్లో ఏ పంటకు రుణం ఇచ్చిందో బ్యాంకులు రాయనందున రుణమాఫీకి అర్హత లేదంటూ ప్రభుత్వం తిరస్కరించింది. అలాంటివారు ఇప్పుడు హైదరాబాద్ బాట పడుతున్నారు. తీరా అష్టకష్టాలు పడి హైదరాబాద్ వచ్చినా వారికి ఉపశమనం కలగకపోగా మరింత వడ్డీ భారం పడుతోంది. బ్యాంకులు సరిగా వివరాలను నింపనందున మీ రుణాలు మాఫీ కావని ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఈ మాటేదో హైదరాబాద్ రాక ముందే చెప్పవచ్చు కదా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. 14వ తేదీ తర్వాతే రండి... ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక ప్రకటన జారీ చేసింది. రెండో శనివారం, ఆదివారం సెలవులైనందున, అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి సెలవు ఉన్నందున... 14వ తేదీ వరకు రైతులెవరూ హైదరాబాద్ రావద్దని, ఆ తరువాతనే రావాలని ఆ ప్రకటనలో పేర్కొంది. -
ఆస్తి పన్ను పోటు
వడ్డీ పన్నుతో వడ్డింపు ఆస్తిపన్ను బ కాయి రూ.100 కోట్లు వడ్డీ రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఈ ఏడాది వడ్డీ మాఫీ లేనట్టే! గృహ యజమానులు గగ్గోలు గృహ యజమానులకు జీవీఎంసీ చుక్కలు చూపిస్తోంది. ఆస్తిపన్నుకు వడ్డీ కలిపి నడ్డివిరుస్తోంది. అసలెంతో.. వడ్డీ ఎంతో..ఎందుకంత ఎక్కువ మొత్తం కట్టాలో తెలియక ఇంటి యజమానులు తలపట్టుకుంటున్నారు. విశాఖపట్నం సిటీ: ఆస్తి పన్నుపై ఏటా వడ్డీ మాఫీ అయ్యేది. ఏడాదికి రెండు విడతలుగా ఇచ్చే అసెస్మెంట్ బిల్లులు మొత్తాన్ని మార్చి నెలాఖరులోగా చెల్లించేవారు. కానీ ఈసారి డిసెంబర్ నుంచే ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆధార్‌తో పాటు అసెస్మెంట్ను జారీ చేసేస్తున్నారు. అసెస్మెంట్ చూసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇంత ఎక్కువ పన్ను వచ్చిందేమిటని వాపోతున్నారు. -
బినామీలపై సీఐడీ విచారణ
రైతుల పేరుతో రుణాలు తీసుకున్న పెద్దమనుషులను వదలం కొండపి సదస్సులో సీఎం హెచ్చరిక 50 వేలలోపు రుణం చెల్లించవద్దు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతుల పేరుతో కొందరు పెద్ద మనుషులు బినామీ రుణాలు పెద్ద ఎత్తున తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, వీటిపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సోమవారం కొండపి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయనగరం, కడప, గుంటూరు జిల్లాల్లో వేరే వ్యక్తులు బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అక్రమార్కులున్నారని, వారిపై సీబీసీఐడీ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రూ.50 వేలకన్నా తక్కువ రుణం తీసుకున్నవారు ఒక్కపైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, తామిచ్చే రుణవిముక్తి ఫారం ఇస్తే సరిపోతుందని స్పష్టంచేశారు. డ్వాక్రా మహిళలందరికీ ఒక్కొక్క సభ్యురాలికి రూ. పది వేల చొప్పున చెల్లించడానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ప్రకటించినప్పటి నుంచి రుణాలు చెల్లించని వాటికి పడిన వడ్డీని తామే చెల్లిస్తామని స్పష్టం చేశారు. 40 టీఎంసీల నీటిని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తీసుకువస్తే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, చిత్తూరు, అనంతపురంలో కరువు పరిస్థితులు వచ్చాయని తెలిపారు. తొలుత రుణమాఫీ జరిగిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడించారు. అనంతరం డ్వాక్రా మహిళలు మాట్లాడారు. వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తమకు పాస్ బుక్కులు లేవని రుణ మాఫీ ఇవ్వడం లేదని ఒక మహిళ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, డోలా వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉరి కొయ్యకు మరో యువరైతు
తొగుట : అప్పులు రైతుల పాలిట ఉరి కంబాలుగా మారుతున్నాయి. వర్షాలు పడకపోవడం, సాగు చేసిన పంటలు ఎండిపోతుండడం, చేసిన అప్పులు తీర్చేమార్గంలేక అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తూ ఉరికంబాలు ఎక్కుతున్నారు. శుక్రవారం కూడా జిల్లాలకు చెందిన ఓ యువరైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన తుడుం రాజయ్య - దుర్గమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడైన సాంసోని (25)లు ఉన్నారు. అయితే రాజయ్య ఇటీవల కాలంలో రూ. 1.50 లక్షలు అప్పు చేసి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ఉన్న రెండు ఎకరాల భూమిలో సాంసోని ఏడాది కిందట సుమారు రూ. లక్ష అప్పులు చేసి రెండు బోరుబావులను తవ్వించగా అందులో చుక్కా నీరు పడలేదు. దీంతో తండ్రీకొడుకు చేసిన అప్పులు, వడ్డీలతో కలిసి సుమారు రూ. 3 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో పంటలు పండకపోవడంతో అప్పులుతీర్చే మార్గం లేక సాంసోని భార్యతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. వారం రోజుల కిందట గ్రామానికి చేరుకున్న సాంసోని అప్పుల విషయంలో గ్రామస్తులతో చర్చిస్తూ బాధపడ్డాడు. అప్పుల విషయంలో తీవ్రమనస్తాపానికి గురైన సాంసోని శుక్రవారం గ్రామ శివారులో చాకలి ఆనందం వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అటుగా వెళుతున్న వారు గమనించి కుటుంబీకులకు, గ్రామస్తులకు సమాచారం అందించారని తెలిపారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, సాంసోని భార్య అరుణ రోదనలు పలువురిని కంటతడిలు పెట్టించాయి. ఈ మేరకు మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మిరుదొడ్డి పోలీసులు తెలిపారు. -
సులభంగా గృహరుణం..
మిగిలిన రుణాలతో పోలిస్తే గృహరుణం తీసుకోవడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. గృహరుణం మంజూరు సుదీర్ఘమైన ప్రక్రియే కాకుండా అనేక పత్రాలను రుణం మంజూరు చేసే ఆర్థిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎవర్ని అడిగినా... వారు రుణం పొందేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది చెపుతారు. అయితే దరఖాస్తుకు ముందుగానే కొన్ని అంశాలపై దృష్టిసారిస్తే... ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా గృహరుణం పొందడమే కాకుండా వ్యయభారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మన దేశంలో గృహ రుణాల మార్కెట్ చాలా పెద్దది. అనేక రకాల గృహరుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ గృహరుణాలు, ఇంటిని విస్తరించడం కోసం, ఇంటి మరమ్మతుల కోసం, మార్టిగేజ్, ఉమెన్ హోమ్లోన్స్, నాన్ రెసిడెన్షియల్, లీజ్ రెంటల్ ఫైనాన్స్, స్టెప్ అప్ ఈఎంఐ ప్రొడక్టు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పొచ్చు. ఈ రుణాలను జీతం ఆదాయంగా ఉన్న వాళ్లు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులతో పాటు కో-ఆపరేటివ్ బాడీస్, కొంత మంది సంఘంగా ఏర్పడి తీసుకోవచ్చు. ఇంటి విలువలో 80% కంటే తక్కువ మొత్తానికే గృహరుణం లభిస్తుంది. కొత్తగా గృహరుణం తీసుకునే వారికి బ్యాం కులు అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అం దిస్తున్నాయి. బ్యాంకులు పోటీపడి అతి తక్కువ రేట్లకే గృహరుణాలను ఇస్తుండటంతో పాటు, చెల్లింపు సామ ర్థ్యం ఆధారంగా మరింత తక్కువ రేటును కూడా ఇస్తున్నాయి. దీనికి తోడు పన్ను మినహాయింపులు ఉండనే ఉన్నాయి. గృహరుణం తీసుకునే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత రుణం వస్తుంది? రుణం ఎంత వస్తుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉం టుంది. వ్యక్తి చెల్లింపు సామర్థ్యం, వయసు, చదువు, స్థిరమైన ఆదాయమా కాదా? అతనిపై ఎంత మంది ఆధారపడి జీవిస్తున్నారు? ఆస్తులు-అప్పు లు, పొదుపు అలవాట్లు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే గరిష్టంగా ఎంత రుణం ఇవ్వొచ్చన్న దానిపైన బ్యాం కులు ఒక నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ముందునుంచే దృష్టిపెట్టడం ద్వారా గరిష్ట మొత్తాన్ని రుణంగా పొందొచ్చు. కాలపరిమితి ముఖ్యమే.. రుణ ఎంపికలో కాలపరిమితి చాలా ముఖ్యమైన అంశం. ఈ కాలపరిమితిపైనే చెల్లించే వడ్డీ ఆధారపడి ఉంటుంది. అధిక కాలపరిమితి ఎంచుకుంటే వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోండి. సాధారణంగా బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్లలోపు చెల్లిం చే విధంగా గృహరుణాలను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఇస్తున్నాయి. రుణ కాలపరిమితిని ఎంచుకోవడంలో పదవీ విరమణ వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట కాలపరిమితి, పదవీ విరమణ వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అది రుణ కాలపరిమితిగా నిర్ణయిస్తారు. అదే వృత్తి నిపుణులు, వ్యాపారస్తులకైతే 65 ఏళ్ల వరకు రుణం చెల్లించడానికి అనుమతిస్తారు. చెల్లింపు సామర్థ్యం రుణ మంజూరు, ఎంత రుణం వస్తుందన్నది మీ చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బ్యాంకులు అనేక అంశాలను పరిశీలించి చెల్లింపు సామర్థ్యంపై అంచనాకి వస్తాయి. సాధారణంగా వివాహమై కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తి విషయంలో నెల జీతంలో 40 శాతానికి మించి ఈఎంఐ లేకుండా చూస్తారు. అదే ఎటువంటి బాధ్యతలు లేని వారికి మాత్రం మొదటి ఐదేళ్లు నెల జీతంలో 60 శాతం వరకు ఈఎంఐకి అనుమతిస్తారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు గృహరుణాలకు దరఖాస్తు చేసుకుంటే, పదవీ విరమణ తర్వాత రుణం చెల్లించే విధంగా తక్కువ వయసు ఉన్న మరో వ్యక్తిని కో-అప్లికెంట్‌గా పెట్టుకోవడానికి కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి. అర్హతలు..! ఒకసారి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత బ్యాంకులు లేదా ఇతర గృహరుణ సంస్థలు రెండు అంశాలను పరిశీలించిన తర్వాతనే రుణాన్ని మంజూరు చేస్తాయి. అందులో మొదటిది వ్యక్తిగత సమాచార పరిశీలన. మీరిచ్చిన కాగితాల ఆధారంగా మీ ఆర్థిక సామర్థ్యాన్ని లెక్కించి రుణం ఇవ్వచ్చా లేదా అన్న అంశాన్ని లెక్కిస్తాయి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న ప్రాపర్టీ కాగితాలను పరిశీలించి న్యాయపరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. ఇవి కావాలి.. రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు బ్యాంకులకు విధిగా కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే కస్టమర్ ప్రొఫైల్, నివాసం ఉండే ప్రాంతాలనుబట్టి అదనపు కాగితాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం. దీంతోపాటు శాలరీ స్లిప్, ఫామ్ 16 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే వ్యాపారస్తులు అయితే లాభనష్టాల స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ గుర్తింపుతోపాటు, నివాస ధ్రువీకరణపత్రాలు కావాలి. ఎంచుకున్న ప్రాపర్టీకి సంబంధించిన జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. -
రుణాలు కట్టడానికి రైతులు ఇష్టపడటం లేదు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామన్ని హామీ ఇవ్వటంతో రైతులు ఎవరూ రుణాలు కట్టడానికి ఇష్టపడటం లేదని బ్యాంకర్లు పేర్కొన్నారు. అందువల్లే ఖరీఫ్ లో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని బ్యాంకర్లు తెలిపారు. 186వ రాష్ట్రా స్థాయి బ్యాంకర్ల సమావేశం మంగళవారమిక్కడ జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లు మాట్లాడుతూ పావలా వడ్డీపై ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావలని, లేదంటే వడ్డీ రైతులపై పడే అవకాశం ఉందని బ్యాంకర్లు అన్నారు. ప్రభుత్వం రుణ ఖాతాదారుల వివరాలు కోరిందని, అక్టోబర్ 10కల్లా నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ కవరేజీలను మరొక నెల పొడిగించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. -
తొమ్మిదేళ్ల బాలుడు కిడ్నాప్
చింతలగ్రహారంలో ఘటన కిడ్నాపర్ల నుంచి తండ్రికి ఫోన్.. రూ.30 లక్షలు డిమాండ్ పెందుర్తి: పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఓ బాలు డు కిడ్నాపయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు కుమార్తె యమున, కుమారుడు దామోదర్(9) సంతానం. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. దామోదర్ స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దరి కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్ వ చ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని..లేకుంటే మీ కుమారిడ్ని చంపుతామంటూ బెదిరించారు. ఆయా ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు.పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి కేసును అత్యంత వేగంగా ఛేదిస్తామని నార్త్ ఏసీపీ సీఎం నాయుడు విలేకరులకు చెప్పారు. నాలుగు బృందాలతో ముమ్మర గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ వెనుక ఆర్థిక పరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వివాదాలు లేవని తండ్రి చెబుతున్నా ఈ వ్యవహారంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఆస్తి అమ్మకంలో శ్రీనివాసరావు వద్ద కొంత మొత్తం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం తెలిసిన ఎవరైనా దామోదర్‌ను కిడ్నాప్ చేశారా అని అనుమానిస్తున్నారు.