ITC
-
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్‌లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్‌ను చేపడుతున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్‌టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్‌యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్‌యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్‌యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్‌ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్‌యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్‌జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
తగ్గిపోయిన ఐటీసీ లాభం..
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ (ITC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,103 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 5,407 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా బలపడి రూ. 20,946 కోట్లను తాకింది.గత క్యూ3లో రూ. 19,309 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 12 శాతం పెరిగి రూ. 14,414 కోట్లకు చేరాయి. కాగా.. రెడీ టు కుక్ ఫుడ్స్ విభాగంలోని ప్రసూమాలో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. తొలుత 62.5 శాతం వాటాకుగాను రూ. 187 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.తదుపరి మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 37.5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. తొలుత ప్రసూమా మాతృ సంస్థ యాంపిల్ ఫుడ్స్ నుంచి 43.8 శాతం వాటాకు రూ. 131 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో మరో రూ. 56 కోట్లతో వాటాను 62.5 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 441 వద్ద ముగిసింది. -
అపుడు వాచ్‌మెన్‌గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్‌కు భార్యతో కలిసి గెస్ట్‌గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్‌కి డిన్నర్‌కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు. -
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది. -
అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!
న్యూఢిల్లీ: తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి విభాగంలోనూ దిగ్గజంగా అవతరించడమే లక్ష్యమని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ప్రకటించారు. ‘ఐటీసీ నెక్ట్స్ స్ట్రాటజీ’ కింద పోటీతత్వాన్ని పెంచుకోవడం, ఆవిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. భవిష్యత్‌కు అనుగుణంగా సంస్థను మార్చడం కోసం ఈ విధానాన్ని కంపెనీ చేపట్టడం గమనార్హం. డిజిటలైజేషన్, సుస్థిరత, ఆవిష్కరణలు, సరఫరా వ్యవస్థ సామర్థ్యం పోటీతత్వం పెంపునకు కీలకంగా గుర్తించినట్టు, వీటిలో ప్రత్యేక జోక్యం అవసరమని సంజీవ్ పురి తెలిపారు. ‘మా వరకు ఐటీసీ నెక్ట్స్ స్ట్రాటజీ అన్నది ఓ ప్రయాణంలో అడుగు మాత్రమే. ఎన్నో విభాగాల్లో చెప్పుకోతగ్గ పురోగతి సాధించాం. ఈ ప్రయాణం ముగింపు దశలో ఉందని చెప్పడం లేదు. మేము పనిచేసే ప్రతి విభాగంలో పెద్ద సంస్థగా అవతరించడమే లక్ష్యం. కొన్ని విభాగాల్లో మేము ఇప్పటికే ప్రముఖ సంస్థగా ఉన్నాం’అని వివరించారు. ఇదీ చదవండి: ఆటో ఎక్స్పో.. స్పందన అదరహోచురుగ్గా ఉండాల్సిందే..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ సంక్షోభాల నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు అనిశి్చత వాతావరణంలో ఉన్నట్టు సంజీవ్ పురి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐటీసీ మాదిరి బడా సంస్థలు చురుకుగా, వినియోగదారు కేంద్రీకృతంగా మసలుకోవడం అవసరమన్నారు. ‘‘భారత్‌లో తలసరి ఆదాయం, తలసరి వినియోగం దృష్ట్యా భారీ అవకాశాలున్నాయి. మా ప్రధాన వ్యాపారాన్ని పెంచుకుంటూనే, అనుబంధ వ్యాపారాల్లోకి విస్తరించడంతోపాటు, భవిష్యత్ విభాగాలను సృష్టించాల్సి ఉంది’’అని తమ వ్యూహాలను వెల్లడించారు. ప్రస్తుతం ఐటీసీ వ్యాపారంలో 70 శాతం మేర ఒక్క సిగరెట్ల నుంచే వస్తుండడం గమనార్హం. నెక్ట్స్ స్ట్రాటజీలో భాగంగా వివిధ వ్యాపారాలపై మధ్య కాలానికి రూ.20,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఐటీసీ ఇప్పటికే ప్రకటించింది. పేపర్ బోర్డ్ తయారీ సామర్థ్యాన్ని గత కొన్నేళ్లలో 33 శాతం మేర పెంచుకుంది. పేపర్ బోర్డ్‌తో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల తయారీ అవకాశాలను గుర్తించినట్టు సంజీవ్ పురి తెలిపారు. మొక్కల ఆధారిత మౌల్డెడ్ ఫైబర్‌తో సుస్థిర ప్యాకేజింగ్ నూతన వృద్ధి విభాగంగా పేర్కొన్నారు. రూ.8,000 కోట్ల విలువైన ఆశీర్వాద్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో కింద.. ఆశీర్వాద్ ఫ్రోజెన్ ఫుడ్, ఫ్రోజన్ స్నాక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు పురి చెప్పారు. -
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
25 కోట్ల కుటుంబాలకు ఐటీసీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్‌లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్‌ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్బుక్లలో క్లాస్మేట్, నూడుల్స్‌లో ఇప్పీ, బాడీవాష్లో ఫియామా, అగర్‌బత్తీల్లో మంగళ్‌దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగం పుంజుకుంటుంది.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. ‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది. -
కోటీశ్వరుల్ని చేస్తున్న కంపెనీ!.. భారీగా పెరిగిన వేతనాలు
ఇండియా టొబాకో లిమిటెడ్ కంపెనీ (ITC) తన ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 62 మంది ఉద్యోగులు ఈ జాబితాలోకి చేరారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24 శాతం ఎక్కువని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 350 కంటే ఎక్కువ మంది కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. 2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారి సంఖ్య 282 మంది మాత్రమే. కంపెనీలో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారు నెలకు రూ.9 లక్షల కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నట్లు సమాచారం.ఐటీసీ కంపెనీలో చైర్మన్ అండ్ ఎండీ సంజీవ్ వేతనం 49.6 శాతం పెరిగింది. దీంతో ఈయన జీతము రూ. 28.62 కోట్లకు చేరింది. శాలరీ పెరుగుదలకు ముందు (గత ఏడాది) ఈయన వేతనం రూ. 19.12 కోట్లుగా ఉండేది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ వేతనం 52.4 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం రూ. 13.6 కోట్లకు చేరింది. ఈడీలు సుప్రతిమ్ దత్తా, హేమంత్ మాలిక్ జీతాలు కూడా వరుసగా 59 శాతం, 30 శాతం పెరిగాయి. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 24,567గా ఉంది. -
350 మందికి రూ.1 కోటికి పైగా వేతనం ఇస్తున్న కంపెనీ
పురాతన సంస్థగా పేరున్న ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్(ఐటీసీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 మంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..ఏటా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న వారి సంఖ్య 350కు చేరింది. గతంలో ఇది 282గా ఉంది.కంపెనీ ప్రకటించిన లెక్కల ప్రకారం..కోటి రూపాయలు వేతనం తీసుకుంటున్న ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.9 లక్షలు జీతం వస్తుంది. 2022-23 ఏడాదికిగాను రూ.1 కోటి వేతన బ్రాకెట్లోని ఉద్యోగుల సంఖ్య 282గా ఉంది. 2021-22 కంటే అదనంగా 62 మంది చేరారు. తాజాగా 68 మంది ఈ బ్రాకెట్లో చేరి మొత్తం 350 మంది రూ.1 కోటికిపైగా వేతనం అందుకుంటున్నారు.ఇదీ చదవండి: ‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరీ రూ.28.62 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇది గతంలో కంటే 50 శాతం పెరిగింది. కీలక నిర్వహణ సిబ్బంది (కేఎంపీ) వేతనం 59 శాతం పెరిగినట్లు కంపెనీ చెప్పింది. ఏడాదిలో దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను చెల్లించడం, మధ్యంతర కాలానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి కారణమని పేర్కొంది. కేఎంపీ మినహా ఉద్యోగుల సగటు వేతనం 9 శాతం పెరిగినట్లు చెప్పింది. మార్చి 31, 2024 నాటికి ఐటీసీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 24,567కు చేరింది. సిగరెట్లు, ఎఫ్ఎంసీజీ, హోటళ్లు, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్‌లు, పేపర్ అండ్ ప్యాకేజింగ్ వంటి అనేక రకాల వ్యాపారాలను కలిగి ఉన్న ఐటీసీ 2023-24లో రూ.76,840.49 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. -
బిజినెస్: నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్‌లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం. ట్రస్ట్ ఫిన్‌టెక్ @ రూ.95–101 సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు -
దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : రూ.5.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వేగంగా విస్తరిస్తోంది. ఫైవ్‌స్టార్ హోటల్స్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, స్పైసెస్ పార్క్, వైఎస్సార్ చేయూత వంటి అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. గుంటూరు పట్టణంలో తొలి ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఐటీసీ ఏర్పాటుచేసింది. సుమారు రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఈ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించారు. జనవరి 12, 2022న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి మాట్లాడుతూ.. తమ వ్యాపార విస్తరణకు ఏపీ ఎంతో కీలకమని.. విశాఖ, విజయవాడతో పాటు ఆధ్యాత్మిక నగరాల్లో హోటళ్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.200 కోట్లతో ఐటీసీ స్పైసెస్ పార్క్ మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను ఐటీసీ అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నారు. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పార్క్‌ను సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్, 2022లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక.. 5,500 మంది రైతు కుటుంబాలు ఈ పార్క్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటుచేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగుచేయిస్తోంది. ఈ పంటలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘చేయూత’లో భాగస్వామిగా.. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన చేయూత పథకంలో ఐటీసీ ప్రధాన భాగస్వామిగా చేరింది. ఇందులో భాగంగా.. మహిళలు చేసే వ్యాపారాలు, మహిళా మార్ట్ల పేరుతో ఏర్పాటుచేస్తున్న సూపర్ మార్కెట్లకు ఐటీసీ ఉత్పత్తులను అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం ఐటీసీకి రాష్ట్రంతో సుదీర్ఘ అనుబంధముంది. మా నిర్ణయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం బాగుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యాం. త్వరలో మరో రూ.400 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నాం. ముఖ్యమంత్రి విజన్‌తో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక కార్యక్రమంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగస్వామ్యం కావడంతో పాటు ఫుడ్ ప్రోసెసింగ్, ఆక్వారంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాం. – గుంటూరులో ఐటీసీ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ సీఎండీ సంజీవ్ పూరి -
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రూ.13.83 కోట్ల జీఎస్టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..
ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్లాల్ చోక్సీ, చిమన్లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. -
ఆ ఒక్క బిస్కెట్ విలువ రూ.1 లక్ష !
తిరువల్లూర్(తమిళనాడు): చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది. -
‘ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్’, కోర్టు మెట్లెక్కిన ఢిల్లీ బాబు.. చివరికి ఏమైందంటే?
తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువైందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. రెండేళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏమని ఇచ్చింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ. ఢిల్లీ బాబు అనే వ్యక్తికి మూగ జీవాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజు వీధికుక్కలకు బిస్కెట్లను ఆహారంగా అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఢిల్లీ బాబు ఎప్పటిలాగే కుక్కలకి బిస్కెట్లు అందించేందుకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థకు చెందిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించగా అందులో ఓ తప్పు జరుగుతున్నట్లు గుర్తించారు. సంస్థ రేపర్ (చాక్లెట్ కవర్) మీద 16 బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది. కానీ తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో రేపర్ మీద పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరణ కోసం స్థానిక స్టోర్‌తో పాటు ఐటీసీకి మెయిల్ చేసినా స్పందన లేదు. ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్ దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కంపెనీ వినియోగదారులను ప్రతిరోజూ రూ.29 లక్షలు మేర మోసం చేస్తోంది అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా ఐటీసీ సంస్థ బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తారని వాదించింది. ఇరు వాదనల విన్న కోర్టు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించింది. ప్రతి ప్యాకెట్‌పై పేర్కొన్న నికర బరువు 76 గ్రాములు. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అసంతృప్తికి గురైన కోర్టు 2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించాయని కోర్టుకు విన్నవించుకుంది. అయితే, అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని కోర్టు సంస్థ ఇచ్చిన వివరణను తిరస్కరించింది. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి నియమం వర్తించదు అని స్పష్టం చేసింది. పైగా, రేపర్‌పై ఐటీసీ 16 బిస్కెట్లను పేర్కొన్నందున, సంఖ్య కాకుండా.. బరువు ఆధారంగా బిస్కెట్లు విక్రయించారనే వాదన కూడా కొట్టివేసింది. లక్ష చెల్లించాలని ఆదేశాలు బిస్కెట్ ప్యాకెట్లో రేపర్‌పై పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కట్ తక్కువగా ప్యాక్ చేశారంటూ ఐటీసీకి వినియోగదారుల కోర్టు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడు ఢిల్లీ బాబుకు చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రూ. 1500 కోట్ల పెట్టుబడి.. ఐటీసీ ఆలోచన ఏంటంటే?
సెహోర్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ & స్థిరమైన ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 'ఐటిసి' తాజాగా వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల.. రాష్ట్రంలో వ్యవసాయ, తయారీ రంగాలకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'శివరాజ్ సింగ్ చౌహాన్' ఈ ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. బడియాఖేడిలోని రెండు కర్మాగారాలకు భూమి పూజ జరిగింది. ఇక్కడ దాదాపు 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి జరగబోతోంది, దీని వల్ల దాదాపు 5000 మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. మనం పండించే ప్రతిదానికి ఇక్కడే సరైన ధర లభించేలా.. మన పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించేలా చేయడమే లక్ష్యమని కూడా శివరాజ్ తెలిపారు. వ్యవసాయానికి పరిమితులున్నాయి, కావున శాశ్వత ఉద్యోగావకాశాలు లభించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. దీని కోసం పెట్టుబడులను తీసుకురావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. ఇదీ చదవండి: చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా.. ఐటీసీ కంపెనికి చెందిన ఫుడ్ ప్లాంట్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్.. సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఇప్పీ నూడిల్స్ కోసం ఉత్పత్తులు తయారు చేస్తోంది. అంతే కాకుండా స్థిరమైన ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ డ్రింకింగ్ రంగం వంటి రంగాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా ITC ఇప్పటికే రాష్ట్రంలో ఫుడ్స్ అండ్ అగర్బత్తీల కోసం సహ తయారీ యూనిట్లతో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. आज बड़ियाखेड़ी में दो फैक्ट्रियों का भूमिपूजन हुआ है। लगभग ₹1500 करोड़ का निवेश यहाँ होने वाला है, जिससे हमारे 5 हजार बच्चों को रोजगार मिल सकेगा। pic.twitter.com/zOKMTvrTTI — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 3, 2023 -
చిరుధాన్యాలతో అద్భుతం.. చూడచక్కని ఐటీసీ పోస్టల్ స్టాంప్
న్యూఢిల్లీ: ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్న నేపథ్యంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ, తపాలా శాఖ కలిసి మిల్లెట్స్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించాయి. ఐటీసీ హెడ్ (అగ్రి బిజినెస్) ఎస్ శివకుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మంజు కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ స్టాంపును తీర్చిదిద్దారు. మిల్లెట్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ఎస్ శివకుమార్ తెలిపారు. ‘శ్రీ అన్న’ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కైలాశ్ చౌదరీ ఈ సందర్భంగా వివరించారు. -
భారీగా పెరిగిన ఐటీసీ చైర్మన్ వేతనం - ఎన్ని కొట్లో తెలుసా..?
ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్ బోనస్ అండ్ కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు. (ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?) నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది. -
వరుస రికార్డులు, ఇన్వెస్టర్లకు సుమారు 2 లక్షల కోట్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు బుల్ రన్‌ను కొనసాగించాయి. ద్వారా మరోసారి రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 65,205 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 133.50 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 19,322.55 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో సెన్సెక్స్ తాజా రికార్డు గరిష్ట స్థాయి 65,300ని తాకగా, నిఫ్టీ 19,345 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బీఎస్సీ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో 296.5 లక్షల కోట్ల నుంచి రూ.298.2 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో రూ.1.7 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. జూన్ నెల జీఎస్టి వసూళ్లు పటిష్టంగా ఉండటంతో మార్కెట్ రికార్డు-బ్రేకింగ్‌కి స్థాయికి చేరిందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలను రుతుపవనాలపై అందిన శుభవార్త కూడా పెట్టుబడిదారులకు ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ర్యాలీ కొనసాగుతోందని అంచనా. నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం , నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడింది. అలాగే మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎమ్‌సిజి సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం ఎగిసాయి. ఇక ఫార్మా ,హెల్త్‌కేర్ ఐటీ, ఆటో ,కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్‌లు వెనుకబడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ , ఐటీసీ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెరిగింది. ఇంకా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి, అల్ట్రాటెక్ సిమెంట్ , ఒఎన్‌జిసి టాప్ విన్నర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా 2 శాతం చొప్పున క్షీణించగా, సిప్లా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా , ఎల్ అండ్‌టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. -
ఎలక్ట్రిక్ వాహనం వాడే ప్రతిఒక్కరికి ఇది ఒక శుభవార్త..!
-
ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఆర్థిక సేవలు అందించే దిశగా పారిశ్రామిక దిగ్గజం ఐటీసీతో యాక్సిస్ బ్యాంక్ చేతులు కలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న రైతుల ఆర్థిక సర్వీసుల అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని తెలిపింది. రైతు రుణాలు, బంగారంపై రుణాలు మొదలైనవి అందించడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. ఐటీసీకి చెందిన ఐటీసీమార్స్ అనే అగ్రిటెక్ యాప్ ద్వారా రైతులకు చేరువ కానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వివరించింది. అలాగే 656 గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ శాఖల ద్వారా విస్తృతమైన సాధనాలు, సర్వీసులు అందించగలమని యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ విభాగం హెడ్ మునీష్ సర్దా తెలిపారు. 40 లక్షల పైచిలుకు రైతులు తమ ఈ–చౌపల్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారని ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్ పేర్కొన్నారు. -
డిజిటల్ తరగతులకు దన్ను
అనంతపురం: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డిజిటల్ ఇన్షియేటివ్స్‌లో భాగంగా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు నిర్వహించనున్నారు. ఐసీటీ, స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటుకు సమగ్రశిక్ష దన్నుగా నిలుస్తోంది. విద్యారంగంలో ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది. ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషన్ స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది. అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల ఆధారంగా స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలో 100లోపు విద్యార్థులు ఉంటే రూ.2.5 లక్షలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.4.50 లక్షలు, 250 నుంచి 700 మంది ఉంటే రూ.6.4 లక్షల గ్రాంట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ గ్రాంట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతులు రాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 957 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లు పూర్తిగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ, వీజే కనెక్టివిటీ, రికార్డెర్డ్ బోర్డు వర్క్, డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం, ఆడియో, వీడియోలు ప్రదర్శనకు వీలు, ప్యానల్లోనే స్పీకర్ల ఏర్పాటు, స్పెసిఫికేషన్ల ఇంటెల్‌కోర్ ఐ–5, ఏఎండీ రీజెఎన్5 ప్రాసెసర్, కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నారు. నాడు–నేడు బడుల్లో చకచకా ఏర్పాట్లు మనబడి ‘నాడు – నేడు’ కింద తొలి దశ పనులు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసి డిజిటల్ బోధన చేస్తారు. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. 65 ఇంచులతో ఉండే 1,463 స్మార్ట్ టీవీలను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. డిజిటల్ కంటెంట్ సిద్ధం డిజిటల్ విద్యాబోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ సిలబస్‌కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఈ –కంటెంట్‌ను సీబీఎస్ఈ విధానంలో రూపొందిస్తోంది. వీటిలో ఆడియో, వీడియో తరహాలో కంటెంట్ ఉండనుంది. స్మార్ట్ తరగతులకు చర్యలు మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ తరగతులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తక్కిన వాటిలో కొత్తగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ, స్మార్ట్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి సమగ్రశిక్ష విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,061 ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 957 స్మార్ట్ తరగతులు రానున్నాయి. – బి.ప్రతాప్‌రెడ్డి, ఆర్జేడీ, విద్యాశాఖ -
అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. విభాగాలవారీగా.. క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్ఎంసీజీ విభాగం టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ టర్నోవర్ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
ఇషా అంబానీ దూకుడు: శ్రీలంక కంపెనీతో డీల్, వాటికి బిగ్ షాకే!
సాక్షి,ముంబై: రిలయన్స్ మరో వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆయిల్‌నుంచి టెలికాం దాకా అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్న రిలయన్స్ త్వరలోనే ఇండియా బిస్కెట్ల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం శ్రీలంక ఆధారిత మాలిబాన్ బిస్కెట్ మాన్యుఫాక్టరీస్ (ప్రైవేట్) లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మాలిబాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తెలిపింది. దేశీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వినియోగదారు బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగానే మాలిబన్ బిస్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే దేశీయ బిస్కెట్ల మార్కెట్లో 80 శాతం వాటా ఉన్న దిగ్గజాలు బ్రిటానియా,ఐటీసీ, పార్లేకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతోషం ప్రకటించారు. తమ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోను గొప్ప బ్రాండ్ ద్వారా బలోపేతం చేయడమే కాకుండా, తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా అద్భుత సేవలందించ గలుగుతామన్నారు. కాగా ఏడాది డిసెంబరులో గుజరాత్లో మేడ్-ఫర్-ఇండియా కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిదే. RCPLతో భాగస్వామ్యంపై మాలిబాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కుముదిక ఫెర్నాండో మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాలిబన్‌తో భాగస్వామ్యాన్ని ఎంచు కోవడం సంతోషమని, దాదాపు 70 సంవత్సరాలుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలోతమ అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 1954లో స్థాపితమైన మాలిబాన్ శ్రీలంకలో రెండవ అతిపెద్ద బిస్కెట్ కంపెనీగా పాపులర్. బిస్కెట్లు, క్రాకర్లు, కుకీలు, ఇతర ఉత్పత్తులను 35 దేశాలకు ఎగుమతి చేస్తోంది. -
కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ కేరళలో 63 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ ఈడీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
గుడ్‌న్యూస్: ఎఫ్‌ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంపై ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుతోందని ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్ 2022లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ విషయాలు వివరించారు. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉందని పురి చెప్పారు. గతంలో దాదాపు అయిదేళ్లలో పెరిగేంత స్థాయిలో ప్రస్తుతం చాలా మటుకు ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని, వినియోగ ధోరణులపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, వర్షపాత ధోరణులను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గానే ఉండబోతోందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడులకు ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పురి తెలిపారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నిధుల లభ్యత, కార్పొరేట్ల ఆదాయాలు మొదలైనవన్నీ బాగున్నాయన్నారు. సామర్థ్యాల వినియోగం కూడా పుంజు కుంటోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడమనేది ఎగుమతులపరంగా ప్రతికూలాంశంగా ఉంటోందని పురి తెలిపారు. ప్రధానంగా దేశీ మార్కెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టే తమ కంపెనీల్లాంటివి ప్రైవేట్ పెట్టుబడులను యథాప్రకారం కొనసాగిస్తున్నాయన్నారు. తయారీ రంగం కీలకమైనదే అయినప్పటికీ మిగతా రంగాల్లోనూ భారత్ పుంజుకోవాలని పురి చెప్పారు. ఆదాయాల స్థాయిలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కార్పొరేట్ వైద్యం మరింత ‘ప్రియం’
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ వైద్యాన్ని మరింత ప్రియం చేసేలా జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. వైద్యసేవలపై విధించే జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకునే వెసులుబాటుపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేట్ లేదా ఖరీదైన వైద్య సేవలు పొందే రోగుల నుంచి ఆసుపత్రులు ఆమేరకు పన్నును వసూలు చేయనున్నాయి. గతంలో ఐసీయూ, సీసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ చికిత్సలు కాకుండా రూ.5 వేల కన్నా ఎక్కువ రోజువారీ అద్దె చెల్లించి ఆసుపత్రిలో ఉండే రోగులకు వైద్యసేవలపై జీఎస్టీ విధించేవారు. ఈ జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తిరిగి మళ్లీ ఆ జీఎస్టీని మొత్తాన్ని పొందేవి. తదనుగుణంగా రోగులకు ఇతర సేవల రూపంలో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేవి. ఇప్పుడు తిరిగి ఐటీసీ పొందే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో జీఎస్టీకి అదనంగా ఇతర సేవలపై కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఫలితంగా రోగులపై పన్నుభారం పెరగనుంది. అయితే, ఈ నిబంధన మినహాయింపు రాష్ట్రస్థాయిలో జరిగేది కాదని, జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. -
పారిశ్రామికవేత్తలే ప్రచారకర్తలు
సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు. వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం.. రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు.. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది. – అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. – యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు.. తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత
సాక్షి, నరసరావుపేట: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా గత మూడేళ్లుగా మన రాష్ట్రం వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ఐటీసీ సంస్థ సుమారు రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు) ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. వేలాది మంది రైతులకు మేలు చేసేలా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఐటీసీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పరిశ్రమలు పెట్టే వాళ్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం గొప్ప మార్పునకు నిదర్శనం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండేళ్లలోనే పూర్తి ► దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్లాంట్ ప్రారంభమవ్వడం ఒక అద్భుత ఘట్టం. ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల దాకా ప్రాసెస్ చేసి, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తారు. ► ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి చెప్పారు. ► ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరం. వీరి ఉత్పత్తులకు గిరాకీ లభిస్తుంది. 2020 నవంబర్‌లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. 2022 నవంబర్.. అంటే కేవలం 24 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ మేరకు ఉందో అందరికీ తెలుస్తోంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ► ఐటీసీ సంస్థ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన స్థితికి ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల మద్దతు ఇచ్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు ఉండదని యాజమాన్యానికి చెబుతున్నా. ► ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుందనే విషయాన్ని సంజీవ్ పూరి మనసులో పెట్టుకోవాలి. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. రూ.3,450 కోట్లతో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. 26 జిల్లాల్లో రైతులు స్థానికంగా పండించే పంటలన్నింటికీ ఇంకా మెరుగైన ధర రావాలి. వ్యాల్యూ ఎడిషన్ ద్వారా అది సాధ్యమవుతుందని 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ.3,450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ► తద్వారా ప్రతి జిల్లాలోని రైతులందరికీ మేలు చేయడమే కాకుండా, దాదాపు 33 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్–1కు సంబంధించి రూ.1,250 కోట్ల పెట్టుబడితో 10 యూనిట్ల కోసం డిసెంబర్, జనవరిలో శంకుస్థాపన చేయనున్నాం. మరో రెండు మూడేళ్లలో మొత్తం 26 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇవి ఒక పెద్ద వరంగా మారనున్నాయి. ► ఈ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పూరి, స్పైసెస్ బోర్డు సెక్రటరీ సతియాన్, రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసుమహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, కిలారి రోశయ్య, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్ ► ఐటీసీ స్పైసెస్ ప్లాంట్‌కు సంబంధించిన వీళ్ల ప్రొసీజర్ పక్కాగా ఉంటుంది. సరుకు వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీ స్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్ స్టెరిలైజేషన్ చేశాక, ప్యాకింగ్ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవడం వల్ల రైతులు పండించిన పంటకు వ్యాల్యూ ఎడిషన్ తోడవుతుంది. ► ఎక్స్పోర్ట్ మార్కెట్లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నాం. ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి, మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తోంది. ► ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల స్థాపనతో ఇందుకు తొలి అడుగు పడింది. రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్యాడ్యుయేషన్ చదివిన ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను నియమించాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపించేలా గొప్ప విప్లవం సృష్టించాం. ప్రతి దశలో అండగా నిలిచిన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే నంబర్ వన్. ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ మరో 15 నెలల్లో పూర్తవుతుంది. అది కూడా పూర్తయితే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా 14 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. కేవలం రెండేళ్లలోనే ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాం. ఇంత వేగంగా అడుగులు పడటానికి కారణం ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలవడమే. – సంజీవ్‌పూరి, ఐటీసీ చైర్మన్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి గొప్పగా చెప్పారు. ఆయన నోటి వెంటæ ఈ మాటలు రావడం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్. ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం ఉందని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలా వచ్చే వారందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా వరుసగా మొదటి స్థానంలో నిలిచామంటేనే మన చిత్తశుద్ధి ఏమిటో చేతల్లోనే తెలుస్తోంది. – సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఆదర్శవంతమైన పాలన మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ యూనిట్‌ను ప్రారంభించడం శుభ పరిణామం. ఇందులో స్థానికులకు.. ప్రత్యేకించి 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ ప్రాంతానికి స్పైసెస్ పార్క్ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి, సాధించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దే. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తుండడం శుభ పరిణామం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సింది 40 ఏళ్ల అనుభవం కాదు. మంచి మనసు, పట్టుదల. ఇవి మా ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చదవండి: సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు -
మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫాబెల్ కొత్తగా ఫైనెస్ పేరిట మరో కొత్త చాక్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్ షెఫ్ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్ చేతులు కలిపింది. ది కోకో ఫైనెసర్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్ సవాలు కూడా విసిరారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
రూ.5 కోట్ల పైగా జీఎస్టీ ఎగవేస్తే ఇక తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించి రూ.5 కోట్లకుపైగా ఎగవేత, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం అంశాలను తీవ్ర నేరంగా పరిగణించడం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే ప్రాసిక్యూషన్ చర్యలు ఉంటాయని ఉద్ఘాటించింది. కాగా, ఎప్పుడూ ఎగవేతలకు పాల్పడే వారు లేదా ఆయా కేసులకు సంబంధించి అప్పటికే అరెస్ట్ అయిన సందర్భాల్లో ప్రాసిక్యూషన్‌కు తాజా నోటిఫికేషన్‌తో సంబంధం లేదని ఫైనాన్స్ శాఖ జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పష్టం చేసింది. -
ఐటీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 4,462 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,343 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్‌చేసి రూ. 19,831 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 14,241 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. -
7 దిగ్గజ కంపెనీలకు అప్పులు అసలే లేవు, ఆదాయం మాత్రం లక్షల కోట్లలోనే!
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ దేశ ఆర్ధిక వృద్ది కోసం ఆర్బీఐ స్వల్ప కాలానికి తక్కువ వడ్డీ రేట్లను అమలు చేసింది. క్రమేపీ ఆ వడ్డీ రేట్లను పెంచింది. ఈ తరుణంలో ఆర్బీఐ అమలు చేసిన తక్కువ ఇంట్రస్ట్ రేట్లతో పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపార కార్యకలాపాల కోసం భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాయి. అయితే రుణాలు తీసుకొని, అనుకున్న ఫలితాలు రాబట్టలేక, పెరిగిపోతున్న ఖర్చుల కారణంగా కొన్ని సంస్థలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ-50లో నమోదైన మొత్తం 7దిగ్గజ కంపెనీలు సున్నా రుణం లేని సంస్థలుగా అవతరించాయి. ఈ ఏడు నిఫ్టీ 50 కంపెనీలు కలిపి రూ.31 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఆ సంస్థల ఆర్ధిక స్థితి గతుల్ని పరిశీలిస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సున్నా రుణంతో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. 12లక్షల మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఆర్ధిక సంవత్సరం 2022లో 26బిలియన్లకు పైగా ఆదాయం గడించింది. 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర లాభంతో కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్‌తో పోటీ పడుతుంది. ఆర్ధిక సంవత్సరం 2022లో దాని ఆదాయం 16 బిలియన్లకు పైగా ఉండగా నికర లాభం దాదాపు 3 బిలియన్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.5లక్షల కోట్లకు పైగా ఉంది. 14 విభాగాల్లో దాదాపూ 44 బ్రాండ్లతో మార్కెట్‌ను శాసిస్తున్న హెచ్‌యూఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాని ఆదాయం దాదాపు 2.4 నుంచి 6.5 బిలియన్ డాలర్ల వృద్దిని సాధించింది. ఐటీసీ టుబాకో-టు-పేపర్ దిగ్గజం ఐటీసీ 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. కాగితం, పొగాకు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో రాణిస్తుంది. కంపెనీ ఆర్ధిక సంవత్సరం 2022లో ఆదాయం 8.4 బిలియన్గా ఉంది. నికర లాభం దాదాపు 2 బిలియన్లకు చేరింది. మారుతీ సుజుకి ఇండియా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సున్నా రుణం లేని సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ 2.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో.. మారుతి సుజుకి ఆర్ధిక సంవత్సరం 11 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.దాని లాభం 497 మిలియన్లకు చేరుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ 1.08 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఆర్ధిక సంవత్సరం ఆదాయం 10.6 బిలియన్లు కాగా, నికర ఆదాయం 193 మిలియన్లుగా ఉంది. దివీస్ లాబొరేటరీస్ రూ.96వేల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఫార్మా రంగం నుండి రుణ రహిత సంస్థగా దివిస్ లాబొరేటరీస్ అవతరించింది. జెనరిక్స్, న్యూట్రాస్యూటికల్ తయారీ కంపెనీ దివీస్ ఆదాయం1.2 బిలియన్లు కాగా నికర లాభం 378 మిలియన్లుగా ఉంది. చదవండి👉బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా! కానీ.. -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
చదివింది 12.. అకౌంటెంట్‌గా ఘరానా మోసం
వెయ్యి కోట్ల రూపాయలకు బోగస్ బిల్లులు జారీ చేయడంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద 181 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఏళ్ల వయసున్న ఆ నిందితుడి పేరు, ఇతర వివరాలను వెల్లడించని పోలీసులు.. సదరు వ్యక్తి 12వ తరగతి వరకు మాత్రమే చదివాడని మాత్రం చెప్పారు. అకౌంటెంట్‌గా, జీఎస్టీ కన్సల్టెంట్‌గా ఈ భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ముంబై జోన్ పాల్ఘడ్ సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. డేటా మైనింగ్, డేటా విశ్లేషణ ఆధారంగా అందిన నిర్దిష్ట ఇన్‌పుట్‌లతో అధికారులు తీగను లాగారు. M/s నిథిలన్ ఎంటర్ప్రైజెస్ ‘గూడ్స్ లేదా సేవల’ రసీదు లేకుండా నకిలీ ఇన్వాయిస్లను జారీ చేయడంతో నకిలీ ITCని పొందడం లాంటి విషయాలు అధికారుల దృష్టికి రావడంతో ఈ డొంక అంతా కదిలింది. అంతేకాదు తన క్లయింట్లలోని ఓ వ్యక్తి ఐడెంటిటీ ద్వారా నిందితుడు జీఎస్టీ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీనివెనుక పెద్ద ముఠా ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. ముఠా నెట్‌వర్క్‌ను చేధించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్‌లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్‌ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: AP: మిడిల్‌క్లాస్‌కి జాక్'ప్లాట్' -
కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..
కర్నూలు జిల్లా మిర్చి రైతులకు మంచిరోజులు వచ్చాయి. పంట అమ్ముకోవడానికి ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అగత్యమూ తప్పింది. నంద్యాలలో త్వరలోనే మిర్చి యార్డు ఏర్పాటు కానుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలో మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతం నంద్యాల డివిజన్. ఇక్కడ పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు గుంటూరు మిర్చి యార్డును ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు చేస్తే రైతులకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తీసుకునివెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నంద్యాలలో మిర్చియార్డు ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ కార్యదర్శి ప్రద్యుమ్నకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తయిన కసరత్తు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. నంద్యాల పట్టణంలోని 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెక్కె మార్కెట్‌యార్డులో యార్డును ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పంట కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం రైతులు, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు, వ్యాపారులతో 2 విడతలుగా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా పంటను కొనుగోలు చేసే వారికి లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు మిర్చి యార్డులో ఐటీసీ సంస్థ ఎక్కువగా పంటను కొనుగోలు చేస్తోంది. ఆ సంస్థ అధికారులతో కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడారు. నంద్యాల యార్డులో పంటలు కొనుగోలు చేసేందుకు వారు ముందుకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలో 34వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుండగా ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. ఈ పంటను నిల్వ ఉంచడానికి తగినంత కోల్డ్ స్టోరేజ్‌లు లేవు. నంద్యాలలో 10, కోవెలకుంట్లలో 2, మహానందిలో 3, ఓర్వకల్లులో 2, నందికొట్కూరులో 1, ఆళ్లగడ్డలో 1..మొత్తం 19 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం లక్ష టన్నులకు మించి లేదు. దీంతో వ్యాపారులు గుంటూరు జిల్లాను ఆశ్రయించాల్సి వస్తోంది. నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటైతే కోల్డ్ స్టోరేజ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మిర్చి హబ్‌గా నంద్యాల... మిర్చియార్డు ఏర్పాటైతే నంద్యాల మిర్చి హబ్‌గా మారనుంది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, ఆదోని, పత్తికొండ, కర్నూలు, ఆలూరు, పాణ్యం, డోన్, కోడుమూరు, నంద్యాల నియోజకవర్గాల్లోని రైతులు గుంటూరుకు వెళ్లకుండా నంద్యాల మిర్చి యార్డుకు పంటను అమ్ముకొనేందుకు వస్తారు. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాల రైతులు కూడా నంద్యాలలో పంటను అమ్ముకునేందుకు వస్తారు. దీంతో నంద్యాల పట్టణంలో కోల్డ్ స్టోరేజ్‌ల సంఖ్య పెరగడమే కాకుండా, హమాలీలకు, లారీ డ్రైవర్లకు పనులు దొరకడం, కమీషన్ వ్యాపారులు, రైతులతో నంద్యాల మార్కెట్‌యార్డు కిటకిటలాడే అవకాశం ఉంది. మిర్చి రైతుల ఇబ్బందులివీ.. ►మిర్చి పంటను అమ్ముకోవడానికి గుంటూరుకు వెళ్లాల్సి ఉండటం. ►గుంటూరులో బ్రోకర్‌కు రూ.లక్షకు రూ.3వేలు చెల్లించాలి. ►ధర వచ్చేంత వరకు మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండాలి. ►ధర రాకపోతే కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచడానికి బస్తాకు అదనంగా రూ.20 చెల్లించాలి. ►మిర్చిని తీసుకొని వెళ్లడానికి లారీకి రూ.20వేలు ఖర్చు. మూడు రోజులు ఆగితే రూ. 60వేలు బాడుగ చెల్లించాలి. ఈ ఏడాదే ప్రారంభం ఈ ఏడాది నుంచే నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి యార్డును ప్రారంభించి, కొనుగోలు చేస్తాం. మిర్చి యార్డుకు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్ కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడాం. ఆయన అనుమతి ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు, వ్యాపారులు, రైతులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. మిర్చి వ్యాపారులకు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నాం. అన్నీ కుదిరితే డిసెంబర్ నెల నుంచే మిర్చి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. – ఇసాక్‌బాషా, మార్కెట్‌యార్డు చైర్మన్, నంద్యాల రైతులకు ఉపయోగకరం మిర్చి యార్డు ఏర్పాటు అయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గుంటూరుకు వెళ్లే ప్రయాస తగ్గుతుంది. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, కడప, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసులు కూడా నంద్యాలకు వచ్చి మిర్చి అమ్ముకునే అవకాశం ఉంది. – బీవీ రమణ, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, నంద్యాల -
ఐటీసీ కొనుగోళ్ల వేట
న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్ భవిష్యత్తు వృద్ధి మార్గాలపై దృష్టి పెట్టింది. ఆకర్షణీయమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతోపాటు.. ‘ఐటీసీ నెక్ట్స్’ వ్యూహంలో భాగంగా సామర్థ్య విస్తరణకు రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొనుగోళ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే కొనుగోళ్లకు చేసే ఖర్చు ప్రతిపాదిత పెట్టుబడులకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. డిమాండ్‌ను చేరుకునేందుకు, పోటీతత్వంతో కొనసాగేందుకు, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకునేందుకు అదనపు పెట్టుబడుల అవసరాన్ని ప్రస్తావించారు. వృద్ధికి మార్గాలను గుర్తించినట్టు చెప్పారు. కొత్త మార్గాలు..: ‘భవిష్యత్తు వినియోగ ధోరణులను గుర్తించాం. ఈ దిశగా ఏదైనా అవకాశం కనిపిస్తే.. అది మాకు విలువను తెచ్చిపెడుతుందని భావిస్తే ముందుకు వెళతాం (కొనుగోళ్లు). మధ్య కాలానికి దృష్టి సారిస్తూ.. అందులో భాగంగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాం. ఒక విభాగంలో సామర్థ్య వినియోగం గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చే స్తాం. ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకోవ డ మూ అవసరమే. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం (పేపర్), సూపర్ యాప్, ఐటీసీ మార్స్ (చిన్న రైతుల సామర్థ్య పెంపునకు సంబంధించి) అన్నవి కొత్త వృద్ధి విభా గాలు అవుతాయి’ అని సంజీవ్‌పురి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పైస్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మసాలా దినుసుల ప్లాంట్‌ను ఐటీసీ ఏర్పాటు చేయనుంది. దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాంట్‌ను వినియోగించనున్నట్టు పురి ప్రకటించారు. ఐపీఎం సర్టిఫైడ్ ఆహార, మసాల ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కఠినమైన నిబంధనలను అందుకునేలా ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు. -
వర్చ్యువల్‌లో... ‘నో ఫీల్’ అంటున్న లవర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి జీవన శైలిపైనా, చేసే పనులపైనా కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ప్రభావం ఎన్నింటికో అతీతమైన ప్రేమ ప్రపంచాన్నీ వదలలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎవరి ఇంట్లో వారు బందీలుగా గడిపిన దాదాపు ఏడాదిన్నర కాలం.. పరస్పర ప్రేమ, సాన్నిహిత్యాలను ను పునః సమీక్షించుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. ఈ నేపథ్యంలో ‘లవ్ సర్వే 2021’ను ఐప్సోస్ భాగస్వామ్యంతో ఐటీసీ ఎంగేజ్ నిర్వహించిన తొలి ప్రేమ అధ్యయనం.. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 63% మంది స్పందన దారులు దీర్ఘకాలపు బంధాలను విశ్వసిస్తున్నారు. భౌతికదూరం..ప్రేమకు అవరోధం ఈ ప్రశ్నకు సమాధానంగా నాన్ మెట్రో నగరాలలోని 36% మంది, భౌతికంగా దూరంగా ఉండాల్సి రావడమనేది ప్రేమానుబంధాలకి అవరోధం కానే కాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే దీనిపై నాన్ మెట్రో నగరాల ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కేవలం 24% మంది మెట్రో సిటిజనులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు. లవ్‌కి లాక్... దాదాపుగా 80% సింగిల్/క్యాజువల్ డేట్స్, తమ లవ్ జర్నీ ఆరంభించడం/ ఓ బంధాన్ని అల్లుకోవడం ఈ సమయంలో కష్టంగానే భావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 75% మంది లాక్డౌన్ల కారణంగా కొత్త లవ్ అఫైర్‌ను స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, తాజాగా అల్లుకున్న అనుబంధాలను బలోపేతం చేయడం కూడా కష్టంగానే మారిందన్నారు. అయితే అదే సమయంలో మరో కోణంలో నుంచి చూస్తే తమ సంబంధాల లోతుపాతుల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడిందని అంగీకరించారు. వర్చ్యవల్...రియల్? వాస్తవ ప్రేమతో పోల్చినప్పుడు వర్చ్యువల్ ప్రేమాయణం పూర్తి భిన్నమైనదని 98% మంది భావించారు. వర్చ్యువల్ ప్రేమాయణంలో ప్రామాణికత ఉండదని, కొన్ని సార్లు ప్రమాదకరమైనదిగా కూడా అత్యధికులు భావిస్తున్నారు. అయితే వాస్తవ జీవితంలో ఎవరైతే కాస్త సిగ్గరిగా అంతర్ముఖులుగా ఉంటారో అలాంటి వారికి వర్చ్యువల్ ప్రేమాయణం సహాయపడవచ్చని 50% మంది భావించారు. అలాగే 50% మంది వర్చ్యువల్ ప్రేమ సరసమైనది/క్యాజువల్‌గా ఉంటుందని.. అయితే తీవ్రంగా మాత్రం ఉండదని చెబుతున్నారు. అదే విధంగా ఈ తరహా ప్రేమానుబంధం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని 46% మంది అభిప్రాయపడ్డారు. కలివిడిగా...విడివిడిగా... మహమ్మారి కాలంలో ప్రేమికుల లవ్‌జర్నీ స్లోగా మారింది. కోవిడ్ నేపధ్యంలో ‘కలిసి ఉండటం’ అనే పద ప్రయోగం 23% తగ్గగా, ‘కెమిస్ట్రీ’ అనే పద ప్రయోగం ఇప్పటి వాతావరణంలో 14%కి పడిపోయింది. అయితే ప్రేమికుల మధ్య నెగిటివ్ వర్డ్స్‌గా పేర్కొనే ‘ కష్టం’, ‘ఆందోళన’, ‘అసహనం’ వంటి పద ప్రయోగాలు వరుసగా 25%, 15%, 20% పెరిగాయి. ఈ ఎంగేజ్ లవ్ సర్వే 2021ను 18-35 సంవత్సరాల వయసు కలిగిన, మెట్రో, మెట్రోయేతర నగరాలలో ఉన్న యువతీయువకులతో నిర్వహించారు. -
ఈ–కామర్స్‌పై మరింతగా ఐటీసీ దృష్టి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌పై, ఆధునిక వ్యాపార విధానాలపై పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ మరింతగా దృష్టి పెడుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకుంటోంది. 2020–21 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు ఇళ్ల నుంచే కొనుగోళ్లు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో ఈ–కామర్స్‌కు ఊతం లభించిందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం .. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు పెరగడం, ఆకర్షణీయమైన పథకాలు, ఉత్పత్తుల విస్తృత శ్రేణి, వేగవంతమైన డెలివరీలు మొదలైనవి ఈ విభాగం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు దోహదపడుతున్నాయని ఐటీసీ అభిప్రాయపడింది. ఇలాంటి అంశాలన్నింటి తోడ్పాడుతో గత నాలుగేళ్లుగా తమ మార్జిన్లు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొంది. డోమినోస్, స్విగ్గీ, జొమాటో, డుంజో వంటి సంస్థలతో చేతులు కలపడం ద్వారా వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత పెరిగిందని ఐటీసీ తెలిపింది. ’ఐటీసీ స్టోర్ ఆన్ వీల్స్’ మోడల్‌తో 13 నగరాల్లో 900 పైగా రెసిడెన్షియల్ కాంప్లెక్సులకు ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొంది. గతేడాది సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు ప్రారంభించిన ఐటీసీ ఈ–స్టోర్‌కు మంచి స్పందన లభిస్తోందని, రాబోయే నెలల్లో దీన్ని మరింత వేగవంతంగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
మీరేం పెద్దమనుషులయ్యా, 35వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు
న్యూఢిల్లీ: ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగం చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత మోసాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి 426 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 14 మంది సీఏలు, లాయర్లు, డైరెక్టర్ల వంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. 2020–21లో సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ).. నకిలీ ఐటీసీల విషయంలో 8,000 పైచిలుకు కేసులు నమోదు చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. సాధారణంగా జీఎస్టీ విధానంలో.. ఉత్పత్తిపై పన్ను చెల్లించేటప్పుడు సంస్థలు తాము ముడి వస్తువులపై (ఇన్పుట్) కట్టిన పన్ను తగ్గించుకుని, చెల్లించవచ్చు. అయితే, ఇన్పుట్ విషయంలో కొందరు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం ద్వారా ఐటీసీ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లు సీబీఐసీ వివరించింది. దీనిపై దేశవ్యాప్తంగా 2020 నవంబర్ 9 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,200 సంస్థలకు సంబంధించి 500 కేసులు గుర్తించినట్లు, 24 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐసీ పేర్కొంది. చదవండి: మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు -
stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కీలక సూచీలు మంగళవారం నాటి బలహీనతను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు పతనమై 51704 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 15524 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మార్చి క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో ఐటీసీ కుప్పకూలింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభాలు 1.3 శాతం క్షీణంచాయి. మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3,748 కోట్ల రూపాయలుగా నమోదైంది..దీంతో ఐటీసీ షేరు 3 శాతం నష్టపోయింది. ఇంకా ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, సిప్లా, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్, డివిస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఎస్బిఐ లైఫ్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం వెల్లడించనుంది. చదవండి : నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర -
మారుతున్న ‘5 స్టార్’ రుచులు
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్డౌన్లు స్టార్ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్డౌన్లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్ (దశ) వచ్చి పడింది. ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఫీల్ మెనూ ఐటీసీ హోటల్స్ కూడా ఇదే విధంగా ‘ఫీల్మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్ కార్పొరేట్ చెఫ్ మనీషా బాసిన్ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్లైన్ హోమ్ డెలివరీ బ్రాండ్ గోర్మెట్కచ్తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్ బ్రాండ్ హోటళ్లను కలిగిన ఇండియన్ హోటల్ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ క్యుమిన్పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్ హోటల్ ‘క్యుమిన్’ కమర్షియల్ డైరెక్టర్ జహంగీర్ తెలిపారు. ఒబెరాయ్ సైతం..: ఒబెరాయ్ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్ గ్రూపు హోటళ్లు ఆఫర్ చేస్తున్నాయి. మూడ్ డైట్స్... మారియట్ ఇంటర్నేషనల్ ‘మూడ్ డైట్స్’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ‘మారియట్ ఆన్ వీల్స్’ బ్రాండ్ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్ డైట్స్‌ను సైతం మారియట్ ఆన్ వీల్స్ వేదికగా అందించనుంది. ‘‘డార్క్ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్ఇంటర్నేషనల్ కలినరీ డైరెక్టర్ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు. -
ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తుల మీద పన్నుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు 6.5 శాతానికి పైగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఇతర సిగరెట్ తయారీ సంస్థల షేర్ ధరలు కూడా పెరిగాయి. విఎస్టి ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల షేర్లు కూడా 2.06 శాతం, 7.94 శాతం, 0.83 శాతం పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున బడ్జెట్ కు ముందు పొగాకు, మద్యం వంటి వాటిపై పన్ను పెంపు ఉంటుందని అందరు భావించారు. కానీ ఎటువంటి పెంపులేకపోవడంతో సిగరెట్ తయారీ దారులు ఊపిరి పీల్చుకున్నారు.(చదవండి: బడ్జెట్ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!) వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రవేశపెట్టిన అగ్రిసెస్‌ను మద్యం మీద ప్రవేశపెట్టారు. కానీ, పొగాకు ఉత్పత్తులపై మీద విధించలేదు. ఐటీసీ, ఇతర సిగరెట్ తయారీ సంస్థల స్టాక్స్ బడ్జెట్ ప్రకటనకు ముందు ఎక్కువ మంది తమ స్టాక్స్ ను అమ్ముకోవడాని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సిగరెట్ తయారీ సంస్థలు కొంచం ఉపశమనం లభించింది. బ్రోకరేజ్ సంస్థ ఎడెల్విస్ సెక్యూరిటీస్ ప్రకారం, ఈ ఏడాది బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై పన్నుల పెంపు విధించే అవకాశం తక్కువగా ఉంటుంది అని అంచనా వేసింది. ఎందుకంటే గత ఏడాది 2020 బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో పన్ను విధించారు. -
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్‌స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్‌గా తేలింది. ఈ హోటల్‌కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
పల్లె ఆర్థికంగా బలపడితేనే.. మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: మహిళల స్వయం సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వారి జీవితాలను మార్చే క్రమంలో ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా.. తాజాగా సోమవారం మరో నాలుగు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను సర్కారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – అణగారిన వర్గాల వారికి చేయూతనివ్వకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయకుండా ఎలాంటి మార్పులను తీసుకురాలేం. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయకుండా ఎలాంటి ఫలితాలు సాధించలేం. – అందుకే మా ప్రభుత్వం మహిళా సాధికారతపై దృష్టిపెట్టింది. వారి జీవితాలను మార్చేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్ చేయూత’ను ప్రారంభిస్తున్నాం. – దీని ద్వారా రూ.4,500 కోట్లను మహిళలకు అందజేస్తాం. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత ఉన్న మహిళలకు ఈ ‘చేయూత’ను అందిస్తున్నాం. – దీనికింద ఎంపికైన మహిళలకు ఏటా రూ.18,750లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. – చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలామందికి ‘వైఎస్సార్ ఆసరా’ కూడా వర్తిస్తుంది. – ఏటా దాదాపు రూ.6,700 కోట్లను ‘ఆసరా’ కింద ఇస్తాం. సెప్టెంబరులో దీనిని కూడా అమలుచేస్తాం. – ఇలా ఈ రెండు పథకాలకు ఏటా రూ.11వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్లను దాదాపుగా కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం. – ఈ సహాయం.. వారికి స్థిరమైన ఉపాధి, ఆదాయం ఇచ్చేదిగా ఉండాలి. – ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. – ప్రభుత్వం చేయూతనిస్తుంది.. బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. – మహిళల స్వయం సాధికారత కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. – ఈ కంపెనీలన్నీ ముందుకు వచ్చి మహిళలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించాలి. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సీఎం అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం మహిళలు సాధికారిత సాధించడం అంటే.. కుటుంబం వృద్ధిలోకి వస్తున్నట్లే. ముఖ్యమంత్రి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాకు చాలా ముఖ్యమైనది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషకరం. మహిళలకు చేయూతనిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేయూత పథకం మైలురాయిగా నిలిచిపోతుంది. సమగ్రాభివృద్ధి కోసం సీఎం చేస్తున్న ప్రయత్నాలు ముందుకుసాగాలని ఆకాంక్షిస్తున్నాం. – సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏడాదిలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు ఏడాది కాలంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. ఆర్థిక సామాజిక రంగాల్లో ఈ సంస్కరణలు పెనుమార్పులు తీసుకువస్తాయి. మహిళల సాధికారత ద్వారా అభివృద్ధి సాధించాలన్న సీఎం ఆలోచన మంచి మార్పులకు నాంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం పేదరికాన్ని నిర్మూలించడంలో కీలకమైనది. సామాజిక రంగంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మేం కూడా ఆ దిశగా కార్యకలాపాలు చేస్తున్నాం. – సంజీవ్ పూరి, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎం దార్శినికత బాగుంది ముఖ్యమంత్రి దార్శినికత బాగుంది. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు మా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం గొప్ప అవకాశాలను కల్పిస్తోంది. మేం భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మా అనుభవాలను పంచుతాం. మీతో కలిసి ముందుకు సాగుతాం. – మధుసూదన్ గోపాలన్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ సీఎం జగన్ సమక్షంలో ఒప్పందాలు అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్‌యూఎల్ జీఎస్ఎం చట్ల రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐటీసీ గ్రూప్ హెడ్ సంజీవ్ రాంగ్రాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌లో మహ్మద్ అన్సారి, క్లస్టర్ సీఈఓ, ఏపీ–తెలంగాణ.. జెబాఖాన్, వైస్‌ప్రెసిడెంట్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ పాల్గొన్నారు. -
కరోనా : ఐటీసీ లాభాలు 25 శాతం ఢమాల్
సాక్షి,ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం మధ్య ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ జూన్ త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదుచేసింది. జూలై 24 తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నుల తర్వాత ఏకీకృత లాభంలో 25 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన 3,437 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే 2,567 కోట్లను సాధించింది. ఏకీకృత ఆదాయం 2020 10,478.46 కోట్లుగా ఉందని ఐటీసీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిందిఅంతకుముందు ఏడాది కాలంలో 12,657.90 కోట్ల రూపాయలతో పోలిస్తే ఆదాయం 17 శాతం తగ్గింది. సిగరెట్ల వ్యాపారంఈ త్రైమాసికంలో 4,330.05 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది, ఏడాది క్రితం ఇది 6,141.92 కోట్ల రూపాయలు. అలాగేఅంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 411.60 కోట్లు సాధించిన హోటళ్ల వ్యాపార ఆదాయం 4.92 కోట్లకు పడిపోయింది. ఇతర ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఆదాయం 3,378.84 కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం 3,068.07 కోట్లుగా ఉంది. మరోవైపు, ఈ త్రైమాసికంలో వ్యవసాయ వ్యాపారం లాభపడిందని ఐటీసీ ప్రకటించింది. ఏడాది క్రితం 3,622.40 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,764.56 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపింది. -
జొమాటోతో ఐటీసీ జోడీ..
సాక్షి, ముంబై: దేశంలోని ఎఫ్ఎమ్సీజీ రంగానికే బ్రాండ్ ఇమేజ్ క్రియెట్ చేసిన ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో భాగస్వామ్యంతో 'కాంటాక్ట్‌లెస్ డెలివరీస్'ని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఇప్పటికే పుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ తో ఐటీసీ హౌటల్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జోమాటోతో భాగస్వామ్యపై ఐటీసీ హోటల్స్ అధికారి అనిల్ చాదా స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో 'కాంటాక్ట్‌లెస్ డెలివరీతో వినియోగదారులకు ఇంటి నుంచే ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చని తెలిపారు. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్‌లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్‌ను కేటాయించడమైంది. -
ఐటీసీ, ఐడీబీఐ బ్యాంక్.. లాభాల్లో
ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నీరసంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 395 పాయింట్లు పతనమై 34,776కు చేరింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు కోల్పోయి 10,261 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ నష్టాలలోనూ విభిన్న వార్తల కారణంగా డైవర్సిఫైడ్ బ్లూచిప్ ఐటీసీ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. ఐటీసీ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 199వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ బలపడింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 9 శాతం పెరిగి రూ. 3927 కోట్లకు చేరింది. ఇందుకు పన్ను ఆదా దోహదపడగా.. మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 12,561 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 10.15 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఐడీబీఐ బ్యాంక్ తాజాగా పేర్కొంది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్‌లో బ్యాంక్‌కు 48 శాతం వాటా ఉంది. ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్, డచ్ కంపెనీ ఏజియస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ విడిగా 26 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 42కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభపడి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. -
లాభాల మార్కెట్లో ఐటీసీ షేరు దూకుడు
మార్కెట్ లాభాల ట్రేడింగ్‌లో భాగంగా ఐటీసీ షేరు భారీగా లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 4.50శాతం ర్యాలీ చేసింది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ క్రిడెట్ సూసీ ... ఐటీసీ షేరు కొనుగోలు టార్గెట్ ధరను పెంచింది. అలాగే కలకత్తా ఆధారిత మసాలా, సుగంధ ద్రవ్యాల తయారీ కంపెనీ సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంటున్నట్లు ఐటీసీ ప్రకటించింది. నేడు ఐటీసీ షేరు బీఎస్ఈలో 1.69శాతం లాభంతో రూ.189.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 4.61శాతం లాభపడి రూ.194.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30ని.లకు మునుపటి ముగింపు(రూ.186.35)తో పోలిస్తే 3శాతంలాభంతో రూ. 192 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.134.60, రూ.305.60గా నమోదయ్యాయి. సన్‌రైజ్ ఫుడ్స్‌ను టోకోవర్ చేసిన ఐటీసీ సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎఫ్పీఎల్) కంపెనీని కొనుగోలు చేసినట్లు ఐటీసీ ఆదివారం ప్రకటించింది. అయితే ఎంత విలువకు కంపెనీని టేకోవర్ చేసిందో ఐటీసీ సమాచారం ఇవ్వలేదు. డీల్ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు చెల్లించి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ టేకోవర్‌తో దేశ తూర్పు ప్రాంతంలోని ఐటీసీ అమ్మకాలు మరింత ఊపందుకుంటావని బ్రోకేరేజ్ సంస్థ క్రిడెట్ సూసీ తెలిపింది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన ‘‘న్యూట్రల్’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ, షేరు టార్గెట్ ధరను రూ.190గా నిర్ణయిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
సన్‌రైజ్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిన ఐటీసీ
ముంబై: దేశంలోని ఎఫ్ఎమ్సీజీ రంగానికే బ్రాండ్ ఇమేజ్ క్రియెట్ చేసిన ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం వెల్లడించింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎ్‌ఫపీఎల్) కంపెనీని కొనుగోలు చేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐటీసీ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 మేర చెల్లించి ఉంటుందని మార్కెట్ నిపుణల అంచనా వేస్తున్నారు. దేశంలోని మసాలా, సుగంధ ద్రవ్యాల మార్కెట్లో సన్‌రైజర్స్ ఫుడ్‌కు మంచి పేరుంది. ఎఫ్ఎమ్సీజీ మార్కెట్లలో మరింత వృద్ధిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఐటీసీ లిమిటడ్ పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేలో ఆశీర్వాద్ గోదుమపిండి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకుందో .. సన్‌రైజ్ ఫుడ్స్ ద్వారా దేశ వ్యాప్తంగా ఐటీసీ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. రైతుల ఆదాయాలు పెంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. చదవండి: చాక్లెట్@:రూ.4.3 లక్షలు -
వారికోసం ఐటీసీ రూ. 150 కోట్ల ఫండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ కరోనా వైరస్ (కోవిడ్ -19) పై పోరులో తాను సైతం అంటూ ముందుకు ఒచ్చింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకుంది. సమాజంలోని బలహీన వర్గాల కోసం రూ .150 కోట్ల కరోనావైరస్ తక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. అలాగే లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఫండ్ ఏర్పాటుతో పాటు, సమాజంలోని బలహీన వర్గాల కోసం జిల్లా ఆరోగ్య, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు సహాయం అందించడానికి అధికారులతో కలిసి పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ సంక్షోభ సమయంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్న క్రమంలో, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రూ. 150 కోట్ల తక్షణ నిధిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన, లేదా జీవనోపాధిని కోల్పోతున్న సమాజంలోని బలహీన వర్గాలకు ఈ సాయం అందుతుందని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని అత్యంత పేద వర్గాలకు ఉపశమనం కలిగించడానికి ఈ నిధిని ప్రధానంగా ఉపయోగించనున్నామని వెల్లడించింది. తద్వారా కరోనా వ్యాప్తి నిరోధానికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతును అందిస్తున్నట్టు ఐటీసీ తెలిపింది. కరోనాపై పోరులో ముందు నిలబడి సేవలందిస్తున్న, ప్రజలకు నిత్యావసరాలను చేరవేస్తున్న యోధులకు వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన పరికరాలను దేశ వ్యాప్తంగా అందిస్తామని తెలపింది. అలాగే రక్షణాత్మక వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనాకు చెక్ పెట్టాలని ఐటీసీ కోరింది. కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
లాభాల్లోకి సూచీలు, ఐటీసీకి పన్ను పొగ
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శనివారం బడ్జెట్ ప్రత్యేక ట్రేడింగ్‌లో వెయ్యి పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ ఆరంభంలో 120 పాయింట్లకుపైగా నష్టపోయింది. అనంతరం 220పాయింట్లు కుప్పకూలింది. లాభనష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడుతున్న సూచీ ప్రస్తుతం 83 పాయింట్లుఎగసి 39799 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11688 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ప్రధానంగాబ్యాంకింగ్ షేర్లలోఅమ్మకాలు కనిపిస్తుండగా, ఆటో, మెటల్,మీడియా కొనుగోళ్ల ధోరణి ఉంది. ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఓఎన్జీసీ నష్టపోతుండగా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, భారతి ఎయిర్టెల్ లాభాలతో ట్రేడవుతున్నాయి. -
కొనసాగిన రికార్డ్ లాభాలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాలు బుధవారం కూడా కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ వరుసగా రెండో రోజూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. తొలిసారిగా సెన్సెక్స్ 41,500 పాయింట్లు, నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువన ముగిశాయి. ఇంట్రాడేలో 41,615 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 206 పాయింట్ల లాభంతో 41,559 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 12,238 పాయింట్ల ఆల్‌టైమ్ హైను తాకి చివరకు 57 పాయింట్ల లాభంతో 12,222 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల లాభాలకు కళ్లెం పడింది. లోహ, ఐటీ, ఫార్మా, రియల్టీ, కన్సూమర్ రంగ షేర్లు లాభపడగా, ప్రభుత్వ రంగ, టెలికం, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోయాయి. జోరుగా కొనుగోళ్లు.... ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలను తీసుకుంటుందన్న అంచనాలు, ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని నిపుణులంటున్నారు. బుధవారం జీఎస్టీ మండలి సమావేశం జరగ్గా... మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కానీ శ్లాబ్‌లను మార్చే అవకాశాలు లేవన్న వార్తలతో మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఆర్డర్లు పెరుగుతాయనే అంచనాలతో లోహ, ఐటీ షేర్లు పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. త్వరలో రొసారి బయోటెక్ ఐపీఓ! ప్రత్యేక రసాయనాలు తయారు చేసే రొసారి బయోటెక్ కంపెనీ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సైజు రూ.700 కోట్లు మేర ఉంటుందని అంచనా. -
ఐటీసీ లాభం 4,173 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్ఎమ్సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఐటీసీ వెల్లడించింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం (రూ.166 కోట్ల మేర) సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.12,019 కోట్ల నుంచి 6% వృద్ధితో రూ.12,759 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.5,842 కోట్లకు, ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం(సిగరెట్లు కలుపుకొని) 6 శాతం వృద్ధితో రూ.9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీయేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి రూ.3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.2,674 కోట్లకు, పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,565 కోట్లకు పెరిగాయని పేర్కొంది. -
చాక్లెట్@:రూ.4.3 లక్షలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ – ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా ఒక కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తాగి అన్నారు. -
ఎల్లలు దాటే..మిర్చీ ఘాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్దఎత్తున పండించే మిర్చిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా ఐటీసీ, రాష్ట్ర ఉద్యాన శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య నమూనా కింద ఈ ఏడాది పది వేల ఎకరాల్లో మిర్చి సాగును లక్ష్యంగా నిర్ణయించగా వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన భౌతిక, సాంకేతిక సహకారాన్ని ఐటీసీ, ఉద్యాన శాఖ అందిస్తాయి. ఈ మేరకు శనివారం గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో ఉద్యాన శాఖ, ఐటీసీ అధికారులు చిరంజీవి చౌధరి, సంజీవ్ రంగరాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కాల్ సెంటర్, మొబైల్ యాప్.. ఐటీసీ ఇప్పటికే ఎంపిక చేసిన రైతులతో మిర్చి సాగు చేయించి ఎగుమతులు చేస్తుండగా దీన్ని తాజాగా మరింత విస్తరించారు. మొదటి ఏడాది కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 41 గ్రామాల్లో నాలుగు వేల మంది రైతులతో 10 వేల ఎకరాల్లో మిర్చిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగు చేయిస్తారు. రైతు సేవల కోసం ఐటీసీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, పురుగు మందుల నిర్వహణ, పంట నాణ్యత, దిగుబడి పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాల్‌సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ సేవలు అందుతాయి. మిర్చి మార్కెట్ అవసరాలను తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐటీసీ సంయుక్తంగా హ్యాండ్ బుక్‌ను రైతులకు పంపిణీ చేస్తాయి. ఇ–చౌపల్ 4.0 పేరుతో మొబైల్ యాప్ కూడా రైతులకు అందుబాటులోకి రానుంది. రూ.200 కోట్లతో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రయోగాత్మకంగా కనీసం వెయ్యి ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చేపట్టాలన్న విజ్ఞప్తిపై ఐటీసీ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (అగ్రి బిజినెస్) సంజీవ్ సానుకూలంగా స్పందించారు. రూ.200 కోట్లతో గుంటూరు సమీపంలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రత్యేకించి మిర్చి కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఐటీసీ సన్నాహాలు చేస్తోందని, ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. పర్యావరణానికి నష్టం లేకుండా మిర్చి సాగు చేస్తున్న వివిధ జిల్లాల రైతులకు ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, వైఎస్సార్ సీపీ నేత ఏసురత్నం, ఉద్యానశాఖ అధికారులు ఎం.వెంకటేశ్వర్లు, పి.హనుమంతరావు పాల్గొన్నారు. కల్తీలను సహించం గుంటూరు కేంద్రంగా కొందరు మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని దోపిడీ చేస్తున్నారని, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు హెచ్చరించారు. కల్తీ ఏ రూపంలో ఉన్నా సహించవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కిలో మిర్చి విత్తనాలు రూ.వేలు, లక్షల్లో ఉండటమేమిటని ప్రశ్నించారు. పరిశోధనల ద్వారా నాణ్యమైన మిర్చి విత్తనాలు రైతులకు సరసమైన ధరలకు సరఫరా చేసేలా చూస్తామన్నారు. ఈనెల 15వతేదీ నుంచి ప్రతిష్టాత్మక వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాయలసీమలో మిల్లెట్స్ (చిరుధాన్యాల) బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. -
కాఫీ డే రేసులో లేము: ఐటీసీ
న్యూఢిల్లీ: రుణభారంలో ఉన్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ను (సీడీఈ) కొనుగోలు చేయబోతోందన్న వార్తలను వ్యాపార దిగ్గజం ఐటీసీ ఖండించింది. సీడీఈ కొనుగోలు రేసులో తాము లేమని స్పష్టం చేసింది. ‘ఐటీసీకి ఇలాంటి ప్రతిపాదనలు తరచూ వస్తుంటాయి. వాటిని పరిస్థితులను బట్టి మదింపు చేయడం జరుగుతుంటుంది. కేఫ్ కాఫీ డేకి సంబంధించి ఒక మధ్యవర్తిత్వ సంస్థ నుంచి ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. అయితే, ఈ విషయంలో ఎలాంటి పురోగతి మాత్రం లేదు‘ అని ఐటీసీ ప్రతినిధి తెలిపారు. రూ. 4,970 కోట్ల రుణభారం ఉన్న కాఫీ డే గ్రూప్ ప్రమోటరు వీజీ సిద్ధార్థ జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్థిక సమస్యలే కారణమనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణభారాన్ని తగ్గించుకోవడానికి సీడీఈ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ అసెట్స్‌ను విక్రయించడంపై దృష్టి సారిస్తోంది. -
నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా: ఐటీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోట్‌బుక్స్ మార్కెట్ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్, స్టేషనరీ ప్రొడక్టస్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్ హెడ్ రవినారాయణన్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4–5 శాతముంది. క్లాస్మేట్ రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 38 కోట్ల నోట్‌బుక్స్ అమ్ముతున్నాం. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో భద్రాచలం యూనిట్ 60 శాతం సమకూరుస్తోంది’ అని వివరించారు. -
ఐటీసీ లాభం 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల పనితీరు బలంగా ఉండటమే మెరుగైన ఫలితాలకు కారణం. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల విభాగంపై ఒత్తిళ్లు కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల విభాగం వారీగా రూ.2,932 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆయిల్ సీడ్స్, గోధుమ, కాఫీ, అగ్రి వ్యాపారాల్లో స్థూల ఆదాయం అధికంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. పేపర్ బోర్డ్స్ విభాగంలో అధిక అమ్మకాల ఆదాయం, హోటల్స్ వ్యాపారంలో రూమ్ వారీగా ఆదాయంలోనూ మెరుగుదల ఉందని పేర్కొంది. రాణించిన అన్ని విభాగాలు సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.8,759 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.7,988 కోట్లు కావడం గమనార్హం. సిగరెట్ల విభాగం ద్వారా ఆదాయం రూ.4,936 కోట్ల నుంచి రూ.5,486 కోట్లకు వృద్ధి చెందింది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల ఆదాయం రూ.3,051 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగింది. ఎఫ్ఎంసీజీ కాకుండా ఇతర విభాగాల ద్వారా (పేపర్, హోటళ్లు తదితర) ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి 4,148 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.52,035 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12,824 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,485 కోట్లు, ఆదాయం రూ.49,520 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. ఐటీసీ చైర్మన్‌గా సంజీవ్ పూరి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ‘ఐటీసీ’కి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ పూరి నియమితులయ్యారు. సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈయన్ను సీఎండీగా నియమించినట్లు.. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) హఠాన్మరణంతో సంజీవ్ పూరిని చైర్మన్‌గా నియమిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. సీఎండీ స్థానంలో తొలిసారిగా మాట్లాడిన సంజీవ్ పూరి.. ‘ఈ నూతన పదవిని నాకు దక్కిన ప్రత్యేక అధికారం, గౌరవంగా భావిస్తున్నా. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో బలమైన సంస్థగా ఎదిగిన ఐటీసీని మరింత బలపరచడం నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. 2015లో బోర్డు సభ్యునిగా నియమితులైన సంజీవ్.. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటీ కాన్పూర్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
ఐటీసీని మలిచిన శిల్పి
సాధారణ ఉద్యోగిగా చేరిన ఓ వ్యక్తి తనకు ఉపాధినిచ్చిన కంపెనీకి కొత్త జీవాన్నిచ్చారు. చిన్న చెట్టును మర్రిమానును చేశారు. కేవలం సిగరెట్లను అమ్ముకునే ఓ కంపెనీని, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, అగ్రి, తదితర ఉత్పత్తులతో ప్రతీ భారతీయ ఇంటికీ చేరువ చేశారు. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో ఓ చెక్కు చెదరని, బలమైన కంపెనీగా ఐటీసీని మలిచిన శిల్పి యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్). కేవలం వ్యాపార కోణంతో కాకుండా సామాజిక కోణాన్ని జోడించి, దేశానికి అవసరమైన సంస్థగా ఐటీసీని దేవేశ్వర్ నిలిపారనడం సరైనది. దేశంలో 60 లక్షల మందికి ఉపాధి కూడా చూపించారు. తాను పెంచి పెద్ద చేసిన కంపెనీని, కోట్లాది వినియోగదారుల్ని 72వ ఏట విడిచి మే 11న దిగంతాలకు వెళ్లిన గొప్ప దార్శనికుడు, పద్మభూషణ్ దేవేశ్వర్ గురించి. శాఖోపశాఖలుగా... కాలేజీ నుంచి బయటకు వచ్చి ఉద్యోగిగా చేరిన కంపెనీకే అధినేతగా ఎదగడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు అంటే 23 ఏళ్లు ఐటీసీకి చైర్మన్ గా పనిచేయడం దేవేశ్వర్‌కే సాధ్యమైంది. చిన్న వయసులోనే చైర్మన్ అయిన వ్యక్తిగానూ, ఓ కార్పొరేట్ సంస్థకు సుదీర్ఘకాలం పాటు అధినేతగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. 1968లో దేవేశ్వర్ ఐటీసీ ఉద్యోగిగా తన ప్రయాణం ఆరంభించారు. 1984లో కంపెనీ బోర్డులో చేరారు. 1996లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఐఐటీ ఢిల్లీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి ఆయన. దేవేశ్వర్ కంపెనీ సారధ్య బాధ్యతలు చేపట్టే నాటికే కోల్‌కతా కేంద్రంగా నడిచే ఐటీసీ కంపెనీ నాన్ టొబాకో వ్యాపారాల్లోకీ ప్రవేశించింది. కానీ, వాటి పరిధి చాలా తక్కువ. రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పొగాకును ఆరోగ్యాన్ని కబళించే ఉత్పత్తిగా చూసే పరిస్థితులను దేవేశ్వర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఐటీసీని ఇతర వ్యాపారాల్లో బలమైన కంపెనీగా నిలిపే ప్రణాళికలను అమల్లో పెట్టారు. ఫలితమే ఎఫ్ఎంసీజీ, హోటల్స్, పేపర్ బోర్డు పరిశ్రమల్లోనూ ఐటీసీ బ్రాండ్ అగ్రగామిగా ఎదిగింది. పాలు, పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అగర్బత్తీలు, సబ్బులు, స్టేషనరీ, వస్త్రాలు, ప్యాకేజింగ్, లగ్జరీ, హోటళ్లు, అగ్రి ఇలా ఎన్నో వ్యాపార విభాగాలు ఐటీసీ కింద ఉన్నాయి. ఎన్ని వ్యాపారాల్లోకి ప్రవేశించినా వాటన్నింటినీ ఐటీసీ కొమ్మలుగా, ఒకే కంపెనీగా దేవేశ్వర్ కొనసాగించారు. ఇప్పుడు ఐటీసీకి సిగరెట్లు ఒక్కటే ప్రధాన వ్యాపారం కాదన్నట్టుగా మార్చారు. 2018 మార్చి నాటికి ఐటీసీ స్థూల ఆదాయం రూ.67,081 కోట్లు కాగా, నికర లాభం రూ.11,223 కోట్లు. 2018–19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి వుంది. గ్రామీణ రైతులతో అనుసంధానం ఈచౌపల్ ఐటీసీ ప్రారంభించిన ఓ వినూత్న విధానం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను ఇంటర్నెట్కు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. తద్వారా రైతుల నుంచి నేరుగా ఉత్పత్తుల సమీకరణకు ద్వారాలు తెరిచారు. ప్రారంభంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ దీర్ఘకాల దృష్టితో దాన్ని కొనసాగించింది ఐటీసీ. దేవేశ్వర్ క్లిష్ట సందర్భాల్లోనూ దృఢంగానే వ్యవహరించారు. కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న బ్రిటిష్ అమెరికన్ టుబాకో (బీఏటీ) ఐటీసీని పూర్తిగా సొంతం చేసుకునే వ్యూహాలు పన్నగా, దాన్ని నిరోధించడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఐటీసీలో అత్యధిక వాటా దేశీ మ్యూచువల్ ఫండ్స్, భారత ప్రభుత్వం వద్ద వుంది. ఎయిర్ ఇండియా బాధ్యతలు భారత ప్రభుత్వం కోరిక మేరకు 1991–94 మధ్య కాలంలో ఐటీసీ నుంచి విరామం తీసుకుని ఎయిర్ ఇండియా చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను దేవేశ్వర్ చూశారు. ఆ సమయంలోనే బీఏటీ ఐటీసీని తన సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాలను మొద లు పెట్టడం గమనార్హం. ఐటీసీకి తిరిగొచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గా బాధ్యతల్లోకి చేరిపోయారు. ఎయిర్ ఇండియాలో పనిచేసిన కాలం ఆయనకు గొప్ప అనుభవాన్నిచ్చింది. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, వాటితో ఎలా మెలగాలో తెలుసుకోగలిగారు. ఉద్యోగులకు మార్గదర్శకుడు బహుముఖ వ్యాపారాలతో కూడిన ఐటీసీ అన్ని విభాగాల్లో రాణించడానికి కారణం... ఆయా విభాగాల్లోని యువ ఉద్యోగులపై నమ్మకం ఉంచడం. వారికి మార్గదర్శకులుగా వ్యవహరించడమే. అందుకే కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు వీడినప్పటికీ... 2022 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఐటీసీ బోర్డు ఆయన్ను నియమించుకుంది. ప్రస్తుతం ఐటీసీ ఎండీ బాధ్యతలను సంజయ్‌పురి నిర్వహిస్తున్నారు. దేవేశ్వర్కు కేన్సర్ ఉన్నట్టు కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఏడాది క్రితం ఢిల్లీకి ఆయన మకాం మార్చారు. అయినప్పటికీ ఐటీసీ సీనియర్ మేనేజ్మెంట్కు అందుబాటులోనే ఉన్నారు. ఇంటింటికీ ఐటీసీ బ్రాండ్లు ఇతర వ్యాపారాల్లోకి బహుముఖంగా ఐటీసీ చొచ్చుకుపోయినా గానీ, తొలుత ఆరంభించిన సిగరెట్ల వ్యాపారాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. దేశ సిగరెట్ల మార్కెట్లో 80 శాతానికి పైగా వాటా ఐటీసీ చేతుల్లోనే ఉంది. ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, క్లాస్మేట్, బింగో, బీ నేచురల్, ఫియామో ఇలా 50 టాప్ బ్రాండ్లను ఐటీసీ సృష్టించింది. ఎనలేని సేవలు దేశ పారిశ్రామిక రంగానికి వైసీ దేవేశ్వర్ ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషి వల్లే ఐటీసీ వృత్తి నైపుణ్యం కలిగిన కంపెనీగా అంతర్జాతీయంగా విస్తరించింది– ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మైలురాళ్లు ♦ 1968లో ఐటీసీలో ఉద్యోగం. 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు. ♦ 2017లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలకు ముగింపు. ఆ తర్వాత గౌరవ చైర్మన్ బాధ్యతల్లోకి. ♦ ఆర్బీఐ సెంట్రల్‌బోర్డు డైరెక్టర్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స సభ్యునిగానూ సేవలు అందించారు. ♦ 2011లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను గౌరవించింది. ♦ ప్రపంచంలోనే ఏడో అత్యుత్తమ పనితీరు చూపిన సీఈవోగా 2012లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గుర్తించింది. ♦ దేవేశ్వర్కు భార్య భారతి, కుమారుడు గౌరవ్, కుమార్తె గరిమ ఉన్నారు. -
ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూత
ముంబై : దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవేశ్వర్ మృతిపట్ల ఐటీసీ కంపెనీ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. భారతీయ కార్పొరేట్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగిన అతికొద్ది మందిలో దేవేశ్వర్ ఒకరు. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1996లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవిని అలంకరించారు. ఫిబ్రవరి 5, 2012న మరోసారి డైరెక్టర్‌గా, ఛైర్మన్‌గా దేవేశ్వర్ ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2017 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా దేవేశ్వర్ కొనసాగుతున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. -
ఫ్యాషన్ మెరుపుతీగలు
-
రిలయన్స్ రిటైల్ చేతికి ఐటీసీ ‘జాన్ ప్లేయర్స్’
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మగవాళ్ల దుస్తుల బ్రాండ్, జాన్ ప్లేయర్స్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. డీల్‌లో భాగంగా ట్రేడ్‌మార్క్, మేధోపరమైన హక్కులనూ రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్‌ను బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించామని ఐటీసీ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ రూ.150 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం. ఈ బ్రాండ్ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్, ఈ సంస్థ ఆన్లైన్ప్లాట్ఫామ్, అజియోడాట్కామ్లు మరింత పటిష్టమవుతాయని నిపుణుల అంచనా. 2002లో ఆరంభమైన జాన్ ప్లేయర్స్ బ్రాండ్...యూత్ ఫ్యాషన్ అప్పారెల్ బ్రాండ్‌గా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్స్‌ను ఐదేళ్లలో 2,500కు పెంచాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది. -
జీఎస్టీ 5%, 1% ప్రయోజనం శూన్యమే
హమ్మయ్య! జీఎస్టీ తగ్గింది. నిర్మాణంలో ఉన్న గృహాల మీద 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు గృహాల మీద 8 శాతం నుంచి 1 శాతానికి! బావుందని సంబరపడిపోకండి.. తగ్గిన జీఎస్టీ శ్లాబును కాస్త లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఐటీసీ లేకుండా జీఎస్టీ తగ్గింపుతో పెద్దగా ప్రయోజనం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే తాజా జీఎస్టీలో పన్ను రేటు తగ్గలేదు.. ఐటీసీ ఎంతొస్తుందనే అంశం మీద డెవలపర్లకు, కస్టమర్లకు మధ్య సందిగ్ధత తొలగిందంతే! సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ తగ్గింపు కస్టమర్లకు లాభమా? నష్టమా? అంటే నష్టమే అని చెప్పాలి. పాత, కొత్త రెండు జీఎస్టీ శ్లాబుల్లోనూ ప్రభుత్వానికొచ్చే పన్ను ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ‘‘కేంద్రం ఐటీసీని నికరంగా 7 శాతంగా గణించింది. ఈ లెక్కన పాత జీఎస్టీలో 7 శాతం ఐటీసీ, 8 శాతం జీఎస్టీ.. రెండు కలిపి 12 శాతంగా ఉండేది. తాజా జీఎస్టీలో 7 శాతం ఐటీసీని ఇవ్వకుండా 1 శాతం జీఎస్టీ కేటాయించింది. తన్ని పడేసినా.. పడేసి తన్నినా తగిలే దెబ్బ కొనుగోలుదారునికే! గత జీఎస్టీలో కస్టమర్లకు ఐటీసీ 7–8 శాతం వరకొచ్చేది. 12 శాతం జీఎస్టీలో మిగిలిన 4–5 శాతం జీఎస్టీ కట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే 1–2 శాతం జీఎస్టీ పెరిగినట్టేగా! చ.అ.కు రూ.300–500 పెంపు.. 12 శాతం జీఎస్టీ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో చాలా మంది డెవలపర్లు ఏం చేసేవారంటే.. కస్టమర్ల నుంచి 12 శాతం జీఎస్టీకి బదులు 8 శాతం వసూలు చేసేవాళ్లు. ఐటీసీని బదలాయించేవాళ్లు కాదు! ఒక్కోసారి డెవలపర్లకు ఐటీసీ 7–9 శాతం వరకూ వచ్చేది. దీంతో నిర్మాణ వ్యయం, తిరిగొచ్చిన ఐటీసీ అక్కడికక్కడే సరిపోయేది. కానీ, ఇప్పుడు కేంద్రం ఐటీసీని ఎత్తేసింది. అంటే డెవలపర్లకు నిర్మాణ సామగ్రి మీద వెచ్చించే ఐటీసీ తిరిగి రాదన్నమాట. హైదరాబాద్‌లో డెవలపర్లకు 15–20 శాతం వరకు మార్జిన్లుంటాయి. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి ఐటీసీ రాదు కాబట్టి మార్జిన్లు 5–10 శాతం వరకు తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తారు. అంటే ప్రాపర్టీ ధరలను పెంచుతారన్నమాట. దీర్ఘకాలంలో ధరలు చ.అ.కు రూ.300–500 వరకూ పెరిగే అవకాశముంది. ఐటీసీ లేకపోతే వ్యయం పెరుగుతుంది.. కొత్త జీఎస్టీ వల్ల స్థలాల ధరలు ఎక్కువ ఉన్న చోట లాభదాయకమని, తక్కువగా ఉన్న చోట పెద్దగా ప్రయోజనం ఉండదని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. అర్బన్, నాన్–అర్బన్ ఎక్కడైనా సరే నిర్మాణ వ్యయం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. మెట్రో నగరాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 1/3 వంతు వ్యయం స్థలం మీదనే పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చోట ఐటీసీ లేకపోవటం అనేది డెవలపర్లకు భారమే. ఇదిలా ఉంటే 1 శాతం జీఎస్టీ ఉన్న అందుబాటు గృహాలు కొందామంటే.. 60 చ.మీ., రూ.45 లక్షల లోపు గృహాలు మెట్రో నగరాల్లో దొరకడం కష్టమే. కొత్త జీఎస్టీలోనూ కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏంటంటే.. ఒక ప్రాజెక్ట్‌లో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. గతంలో 25 ఫ్లాట్లను విక్రయించిన డెవలపర్.. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి విక్రయించే మిగిలిన ఫ్లాట్లకు ఐటీసీ తీసుకోవాలా? వద్దా? మరి, గతంలో విక్రయించిన ఫ్లాట్లకు ఐటీసీ తిరిగి వస్తుందా? రాదా?! తగ్గించాల్సింది నిర్మాణ సామగ్రి మీద సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి మీద జీఎస్టీని తగ్గించకుండా ప్రాపర్టీలపై జీఎస్టీని తగ్గించి లాభం లేదని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యయంలో అత్యంత కీలకమైన సిమెంట్, స్టీల్ వంటి ఉత్పత్తుల మీద జీఎస్టీ భారం తగ్గించకుండా ప్రాపర్టీల మీద జీఎస్టీ తగ్గించడం.. అది కూడా ఐటీసీ లేకుండా సరైంది కాదని తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ మీద 28 శాతం, స్టీల్, టైల్స్, రంగులు, సీపీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రిక్ వంటి ఉత్పత్తుల మీద 18 శాతం, ఇటుకల మీద 5 శాతం, ఇసుక, మెటల్స్ మీద 8 శాతం జీఎస్టీ ఉంది. ఇక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వర్క్ కాంట్రాక్టర్స్ వంటి నిర్మాణ సంబంధమైన సేవల మీద 18 శాతం జీఎస్టీ ఉంది. నిర్మాణ ఉత్పత్తులు, సేవలు అన్నింటినీ 5– 8 శాతం జీఎస్టీలోకి తీసుకురావాలి. భవిష్యత్తులో జనప్రియ గృహాలే! ముందునుంచి కూడా కేంద్రం అందుబాటు గృహాల మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ విభాగానికి 1 శాతం జీఎస్టీతో పాటూ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కింద రూ.2.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ, పరిశ్రమ హోదాతో చౌక వడ్డీ రేట్లకు గృహ రుణాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. పైగా అఫడబుల్ హౌజింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే భవిష్యత్తులో జనప్రియమైన అందుబాటు గృహాల నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆధునిక వసతులు, సౌకర్యాలు, లగ్జరీ ఏర్పాట్ల మీద దృష్టిపెట్టిన డెవలపర్లు మళ్లీ పాత బాట పడతారని ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు. దశాబ్ధం క్రితం హైదరాబాద్‌లో నిర్మించిన 1000 లోపు చ.అ. ఫ్లాట్లు మళ్లీ దర్శనమిస్తాయని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలు, అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు గృహాలను నిర్మిస్తారు. -
నిర్మాణంలోని ఇంటిపై జీఎస్టీ తగ్గింపు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఆదివారం స్థిరాస్తి రంగ వ్యాపారులతోపాటు ఇల్లు కొనాలనుకునే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, నిర్మాణం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన (నిర్మాణం పూర్తయినట్లుగా) ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్లు, అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల (అఫోర్డబుల్ హౌసెస్) కొనుగోలుపై జీఎస్టీ రేటును తగ్గించింది. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం ఇంకా రాని ఇళ్ల కొనుగోలుపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాపారులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా ఇస్తున్నారు. తాజాగా ఈ కేటగిరీ ఇళ్లపై పన్నును జీఎస్టీ మండలి 5 శాతానికి తగ్గించింది. ఐటీసీని ఎత్తివేసింది. అలాగే అందుబాటు ధరల్లో లభించే ఇళ్ల కొనుగోలుపై ప్రస్తుతం 8 శాతంగా ఉన్న జీఎస్టీని 1 శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది. అందుబాటు ధరల ఇల్లు అంటే ఏంటనే నిర్వచనాన్ని కూడా సవరించింది. కొత్త పన్ను రేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి (ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి) అమలు కానున్నాయి. లాటరీలపై జీఎస్టీ రేటు విషయంలో నిర్ణయాన్ని తదుపరి సమావేశానికి మండలి వాయిదా వేసింది. ఢిల్లీలో జరిగిన 33వ జీఎస్టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఐటీసీ ప్రయోజనాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఐటీసీని తొలగించామని తెలిపారు. దీంతో ఈ రంగంలో మళ్లీ నగదు లావాదేవీలు పెరిగే అవకాశం ఉన్నందున, దాన్ని అరికట్టడం కోసం బిల్డర్లు తమ మొత్తం కొనుగోళ్లలో 80 శాతాన్ని జీఎస్టీ నమోదిత వ్యాపారుల వద్దే చేసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చామన్నారు. అందుబాటు ధరలో ఇల్లు అంటే ఇదే.. ‘అందుబాటు ధర ఇల్లు’కి నిర్వచనాన్ని కూడా జీఎస్టీ మండలి ఆదివారం సవరించింది. ఇకపై రూ. 45 లక్షల విలువ కలిగి ఉండి, దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై–ఎంఎంఆర్, కోల్‌కతా) అయితే 60 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం, మిగతా ఏ ప్రాంతంలోనైనా అయితే 90 చదరపు మీటర్ల కార్పెట్ వైశాల్యం ఉన్న ఇళ్లను ఇకపై అందుబాటు ధరల్లోని ఇళ్లుగా పరిగణించనున్నారు. ఈ లెక్కన నిర్మాణాలను బట్టి మెట్రో నగరాల్లో అయితే రెండు పడక గదులు, మిగతా ప్రాంతాల్లో అయితే మూడు పడక గదుల ఇళ్లు కూడా అందుబాటు ధరల ఇళ్ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. ఇక కార్పెట్ వైశాల్యం అంటే ఇంటి నాలుగు గోడల మధ్యలో ఉండే ప్రాంతం. అందునా ఇంటి లోపల, గదుల విభజన కోసం నిర్మించిన గోడలు ఆక్రమించిన ప్రాంతం కూడా కార్పెట్ వైశాల్యం కిందకు రాదు. -
మార్కెట్‌ను మెప్పించని ఐటీసీ
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, వ్యవసాయోత్పత్తుల విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ నికర లాభం 4 శాతం పెరిగి రూ. 3,209 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3,090 కోట్లు. ‘క్యూ3లో స్థూల ఆదాయం రూ. 15 శాతం పెరిగి రూ. 9,853 కోట్ల నుంచి రూ.11,340 కోట్లకు చేరింది. ఎఫ్ఎంసీజీ, అగ్రి బిజినెస్, పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ తదితర విభాగాలు రాణించడం ఇందుకు తోడ్పడింది‘ అని ఐటీసీ పేర్కొంది. సిగరెట్స్ విభాగంలో పెను సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగామని ఐటీసీ తెలిపింది. మూడో త్రైమాసికంలో వ్యయాలు 17% పెరిగి రూ. 7,446 కోట్లకు చేరాయి. స్థూల లాభం 11.2 శాతం పెరిగినా.. అధిక వ్యయాల కారణంగా మార్జిన్లు 39.8 శాతం నుంచి 38.5 శాతానికి తగ్గాయి. పరిశ్రమవర్గాలు 40 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాయి. మొత్తం మీద ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించలేకపోవడంతో ఐటీసీ షేరు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 277.70 వద్ద క్లోజయ్యింది. విభాగాలవారీగా ఆదాయాలు చూస్తే .. ►మొత్తం ఎఫ్ఎంసీజీ వ్యాపార ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,274 కోట్లకు పెరిగింది. ఇందులో సిగరెట్స్ వ్యాపార విభాగం ఆదాయం సుమారు 10 శాతం పెరిగి రూ. 5,073 కోట్లకు చేరింది. ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విభాగం 11% పెరిగి రూ. 3,201 కోట్లకు చేరింది. ►ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం 12 శాతం పెరిగి రూ. 452 కోట్లకు చేరింది. సగటు రూమ్ రేటు (ఏఆర్ఆర్) మెరుగుపడటం దీనికి తోడ్పడింది. ►అగ్రిబిజినెస్ వ్యాపార విభాగం 26 శాతం ఎగిసి రూ. 1,531 కోట్ల నుంచి రూ.1,925 కోట్లకు చేరింది. ►పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 1,543 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవటంతో ఫలితాల వెల్లడి అనంతరం ఐటీసీ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. షేరు ఏకంగా 4 శాతానికి పైగా పతనమై రూ.277.70 వద్ద ముగిసింది. -
ఎం అండ్ ఎండ్‌కు పేటెంట్ షాక్
అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది. జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు
న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు. హిదూస్తాన్ యూనిలివర్ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్, 250 కేసుల స్పైసస్ మిక్స్ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీ మిల్క్‌ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్ మిలో, 10వేల ప్యాక్‌ల సెరిగోలను సరఫరా చేయనుంది. ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్, 9000 ప్యాకెట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది. కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది. పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్ ఓట్స్‌ను సరఫరా చేసింది. బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్‌కు తరలించింది. వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్ ఫుడ్ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్‌ను వయనాడ్‌కు పంపించింది. డాబర్ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్ జ్యూస్‌లను, జీఎస్కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్ మెటీరియల్స్‌ను, 10 లక్షల హార్లిక్స్ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్‌ను కేరళ ప్రజలకు పంపించాయి. -
హార్లిక్స్ బ్రాండ్ కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి
సాక్షి,ముంబై: అత్యంతవిలువైన ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలిచిన ఐటీసీ హార్లిక్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తోంది. జీఎస్కేకు చెందిన హార్లిక్స్ బ్రాండును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అమ్మకానికి సరైన ధరను నిర్ణయింస్తే హార్లిక్స్ కొనుగోలు చేస్తామని ని ఐటీసీ ఎండీ సంజయ్ పురి చెప్పారు. ఐటీసీతో పాటు నెస్లే, డాబర్, మోండలేజ్, క్రాఫ్ హీంజ్, హిందుస్తాన్ యునిలీవర్ హార్లిక్స్‌ను కొనేందుకు పోటీలో ఉన్నాయి. మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ఉన్న హార్లిక్స్ దేశంలో మంచి ఆదరణనుపొందింది.నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీఎస్కే భారత అనుబంధ విభాగంలో హార్లిక్స్ కు 72.5 శాతం వాటా ఉండగా, దీన విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 3.1 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుదని అంచనా. -
హెచ్‌యూఎల్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ను వెనక్కి నెట్టింది. హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది. కాగా మార్కెట్వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో నిలిచాయి. -
ఐటీసీ మరో 24 హోటళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న ఐటీసీ వచ్చే అయిదేళ్లలో కొత్తగా 24 హోటళ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సంస్థకు నాలుగు బ్రాండ్లలో 107 హోటళ్లున్నాయి. వీటి సామర్థ్యం 9,500 గదులు. కొత్త హోటళ్ల రాకతో గదుల సంఖ్య 12,000లకు చేరనుందని సంస్థ ఎండీ సంజీవ్ పురి సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. హైటెక్ సిటీ సమీపంలో కంపెనీ నెలకొల్పిన లగ్జరీ హోటల్ ఐటీసీ కోహినూర్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఐటీసీ చైర్మన్ వై.సి.దేవేశ్వర్ ప్రారంభించారు. రూ.775 కోట్లతో 271 గదులతో దీనిని నిర్మించారు. కొత్త హోటల్ సహా ఇప్పటి వరకు తెలంగాణలో ఐటీసీ రూ.2,500 కోట్లదాకా పెట్టుబడి పెట్టింది. రూ.25,000 కోట్లతో.. వచ్చే అయిదేళ్లలో ఐటీసీ వివిధ రంగాల్లో రూ.25,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో రూ.10,000 కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్‌కు వ్యయం చేయనుంది. వినియోగ వస్తువుల తయారీ, సరుకు రవాణా కోసం 20 కేంద్రాలను దేశవ్యాప్తంగా నెలకొల్పుతామని సంజీవ్ పురి వెల్లడించారు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయని, తెలంగాణలో సైతం ఇటువంటి కేంద్రం రానుందన్నారు. భద్రాచలం పేపర్‌బోర్డ్ యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు. రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సేవల్లోకి ప్రవేశించేందుకు సాధ్యాసాధ్యాలపై అంతర్గతంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని సంజీవ్ చెప్పారు. బిల్ట్ యూనిట్ తెరవండి.. వరంగల్ సమీపంలో ఉన్న బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) యూనిట్ పునరుద్ధరణ చేపట్టాల్సిందిగా ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్‌ను కేటీఆర్ కోరారు. యూనిట్ తెరుచుకుంటే 2,000 మంది ఉద్యోగులకు తిరిగి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే ముందుకు వస్తామని ఈ సందర్భంగా దేవేశ్వర్ స్పష్టం చేశారు. ఆర్సేసియంలో కేటీఆర్.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు టెక్నాలజీ సేవలు అందిస్తున్న యూఎస్ సంస్థ ఆర్సేసియం భారత్‌లో అడుగుపెట్టి మూడేళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇండియా ఫెసిలిటీలో జరిగిన వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూయార్క్‌లో ఉన్న ఆర్సేసియం పేరెంట్ కంపెనీ డి.ఈ.షా గ్రూప్ కార్యాలయాన్ని 2015లో తాను సందర్శించానని, హైదరాబాద్‌లో కంపెనీ ఫెసిలిటీ ఏర్పాటుపై చర్చించినట్టు గుర్తు చేశారు. -
ఐటీసీ లాభం 10% అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,932 కోట్లకు పెరిగింది. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 2,669 కోట్లు. సమీక్షా కాలంలో ఐటీసీ అమ్మకాలు రూ. 10,706 కోట్లు. 2016–17 క్యూ4లో ఆదాయం రూ. 14,883 కోట్లు. జీఎస్‌టీపరమైన మార్పుల కారణంగా ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని ఐటీసీ తెలిపింది. క్యూ4లో మొత్తం వ్యయాలు రూ. 6,996 కోట్లు. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో ఇవి రూ. 11,364 కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 5.15 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని సంస్థ బోర్డు సిఫార్సు చేసింది. బుధవారం బీఎస్ఈలో ఐటీసీ షేర్లు 1.47 శాతం పెరిగి రూ. 285.95 వద్ద క్లోజయ్యింది. -
దత్తతకి తాజ్
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్‌మహల్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్‌ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ? మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజ్‌పై జీఎంఆర్ విజన్ డాక్యుమెంట్ తాజ్‌మహల్‌కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యజమాని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజ్‌మహల్‌ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్‌మహల్ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్ కారిడార్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్‌ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్‌తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్–ఉద్–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్‌లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్‌లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అప్పులే మిగిలాయ్!
శాంతినగర్ (అలంపూర్) : కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మూడేళ్లక్రితం మార్కెట్లో ధరలు బాగా ఉండటం, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందకపోవడం, ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్న తరుణంలో రైతులకు సుబాబుల్ సాగే దిక్కయింది. అయితే ప్రస్తుతం ధరలు పడిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో 15వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్డేపల్లి మండలంలో గతేడాది హరితహారంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలను అధికారులు ఉచితంగా రైతులకు అందజేశారు. ఈ ఏడాది మరో నాలుగు లక్షల మొక్కలు కావాలని రైతులు కోరుతున్నారు. మూడేళ్లపాటు మొక్కలు పెంచడానికి పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద అధిక వడ్డీకి డబ్బలు తెచ్చుకుని పంట సాగు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మూడేళ్లలో కోతకు వచ్చేసరికి పెట్టుబడి కంటే వడ్డీ అధిక మవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల భోజ్యం రైతులు పండించిన సుబాబుల్‌ను ము ఖ్యంగా పేపర్ తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పేపర్ తయారీ కేంద్రాలు ఐ టీసీ భద్రాచలం, కర్ణాటకలోని డోంగోల్లో మాత్రమే ఉన్నాయి. దగ్గర్లో మిల్లులు లేకపోవడం, నేరుగా రైతులతో సుబాబు ల్ కొనుగోలు చేయకపోవడం, స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారు ఎంత చెబితే అంత ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సుబాబుల్ మార్కెట్‌ను దళారులే శాసిస్తున్నారు. కం పెనీకి రైతులకు ఎలాంటి సంబంధం లేకపోవడం వారిపాలిట వరంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.3,800 నుంచి రూ. నా లుగు వేల వరకు టన్ను కొనుగోలు చేశా రు. ఈ ఏడాది రూ.2,500కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. మూడేళ్లపాటు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల నష్టం వస్తోందని చెబుతున్నారు. ఎకరా కు 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఆరు లక్షల టన్నుల దిగుబడిలో టన్నుకు రూ.1,500 చొప్పున మొ త్తం రూ.90 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోతున్నట్లు సమాచారం. కనీసం రూ.నాలుగు వేలకు టన్ను కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు అవుతుందన్నారు. మొక్కలే ఉచితంగా ఇస్తాం ఈజీఎస్ ద్వారా సుబాబుల్ మొక్కలు మాత్రమే ఉచితంగా ఇస్తాం. వడ్డేపల్లి మండలంలోనే రెండేళ్లలో నాలుగు లక్షల మొక్కలు ఉచితంగా ఇచ్చాం. ఈ ఏడాది ఎక్కువ మొక్కలు కావాలని రైతులు కోరడంతో నాలుగు లక్షల వరకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సరీల్లో పెంచుతున్నాం. సుబాబుల్‌కు రాయితీలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. – ఐ.ప్రకాష్, జిల్లా అటవీశాఖ అధికారి, గద్వాల ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మూడేళ్లపాటు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మిన తరువాత డబ్బులకోసం మూడు నెలలపాటు వేచి ఉండాల్సిన పరిస్తితులు ఉన్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక ఓవైపు రైతులు అల్లాడుతుంటే అమ్మిన తరువాత డబ్బులకోసం ఎదురుచూడాల్సిన దుస్తితులు దాపురించాయి. సుబాబుల పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలి. – సత్యప్రసాద్‌రెడ్డి, రైతు, కొంకల, వడ్డేపల్లి మండలం మూడేళ్లపాటు పెట్టుబడికి ఇవ్వాలి సుబాబుల్ పంట కోతకు రావాలంటే మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. బయట వడ్డీకి డబ్బులు తీసుకుని సాగు చేస్తే మూడేళ్లలో అంతకు అంత రెట్పింపవుతుంది. పంట వల్ల వచ్చే లాభం వడ్డీకే సరిపోతుంది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్లతోటలకు ఇచ్చే రాయితీలు మాకు కల్పించాలి. – ఎస్.వెంకటనారాయణరావు, రైతు, శాంతినగర్ యార్డు ఏర్పాటు చేయాలి కిలో విత్తనం రూ.150 ప్రకారం ఐటీసీ పేపర్‌మిల్లు భద్రాచలం నుంచి తెచ్చుకుని 40ఎకరాల్లో పంట సాగు చేశాను. విత్తనాలు ఇవ్వడమేగాని కొనుగోలు చేసేందుకు వారు ముందుకు రావడంలేదు. ఈ ఏడాది టన్నుకు మార్కెట్లో రూ.2,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దళారులు ఎంత చెబితే అంత ధరకు అమ్మాల్సి వస్తోంది. జిల్లాలో నేషనల్ హైవేకు దగ్గర్లో ఎక్కడైనా యార్డు ఏర్పాటుచేసి నేరుగా ఐటీసీ కంపెనీ ద్వారా కొనుగోలు చేయించాలి. – వి.జోగేంద్రప్రసాద్, రైతు, శాంతినగర్ -
అదరగొట్టిన ఐటీసీ
సాక్షి, ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గంజం ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించి ఆదాయం, నికర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. ఐటీసీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ.9522 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో రూ .9248 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నికర లాభం 17 శాతం పెరిగి 3,090 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికరలాభం 2,647 కోట్ల రూపాయలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సిగరెట్ల ఆదాయం మాత్రంక్షీణించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 10 శాతం పుంజుకుని రూ. 3904 కోట్లను తాకగా.. మార్జిన్లు 38 శాతం నుంచి 40 శాతానికి ఎగశాయి. ఇయర్ ఆన్ ఇయర్ సిగరెట్ల అమ్మకాల 44శాతం తగ్గాయి. తద్వారా రూ. 4629 కోట్లు లభించినట్లు కంపెనీ పేర్కొంది. అగ్రి బిజినెస్ కూడా 8.44 శాతం తగ్గి రూ .1,530.86 కోట్లకు పడిపోయింది. అయితే పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారాలు 4.20 శాతం పెరిగి 1,279.6 కోట్లకు తగ్గాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం దాదాపు 27 శాతం క్షీణించి రూ. 9,772 కోట్లకు చేరింది. -
‘ఇన్పుట్’ లాభం అందదెందుకు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శ్రీనివాస్.. ఓ మధ్యతరగతి వాసి. ఓ ప్రభుత్వ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్లాట్ కోసం పైసా పైసా కూడబెట్టాడు. ఈ మధ్య ఉప్పల్‌లోని ఓ నిర్మాణ సంస్థను సంప్రదించాడు. 12 శాతం జీఎస్టీతో కలిసి రూ.60 లక్షలకు బేరం కుదిరింది. సరేనని.. బుకింగ్ కోసం 10 శాతం సొమ్ము చెల్లించేశాడు. ఇంటికొచ్చి తెలిసిన బంధువుతో ఈ విషయం చెప్పాడు. బంధువేమో జీఎస్టీ కన్సల్టెంటు. ‘‘జీఎస్టీ 12 శాతమే కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) బదిలీ చేస్తే ధర తగ్గాలిగా’’ అని అడిగాడు! షాక్‌కు గురైన శ్రీనివాస్.. వెంటనే సదరు బిల్డర్‌కు ఫోన్ చేశాడు. అవునండి.. ఐటీసీ పోనూ మిగిలిందే ప్రాపర్టీ ధర అని నింపాదిగా చెప్పాడు. ఇదే విషయాన్ని జీఎస్టీ కన్సల్టెంటుకు చెబితే తానూ షాక్! అదెలా కుదురుతుంది? అసలు ఐటీసీ ఎలా లెక్కగట్టారు? ఏ కస్టమర్‌కు ఎంతెంత బదిలీ చేశారు? అనడిగితే.. ‘‘అవన్నీ మాకు తెలియదు కావాలంటే తీసుకోండి! లేకపోతే లేదు అంతే!’’ అంటూ ఫోన్ పెట్టేశాడు యజమాని. చేసేదేం లేక గమ్మునుండిపోయాడు శ్రీనివాస్! ఇక్కడ గమనించాల్సినదేమంటే... ఐటీసీ బదిలీ చేయకపోవటంతో శ్రీనివాస్ నష్టపోయాడని! అతనే కాదు జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా మంది ఫ్లాట్ కొనుగోలుదారులు నష్టపోతూనే ఉన్నారు. పన్ను ఎక్కువ చెల్లిస్తున్నారు కానీ... ఐటీసీ ప్రయోజనం మాత్రం అందటం లేదు. దీనికి ప్రధాన కారణం ఎలా అడగాలనే అవగాహన కొనుగోలుదారులకు... ఎలా బదిలీ చేయాలనేది డెవలపర్లకు తెలియకపోవటమే!! అదీ కథ. ఐటీసీ అంటే? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రధాన ఉద్దేశం.. తయారీదారు లేదా వ్యాపారస్తుడిపై ద్వంద్వ పన్ను భారం నుంచి విముక్తం చేయడమే. పరోక్ష పన్ను వ్యవస్థలో ప్రభుత్వానికి పన్ను చెల్లించేది వ్యాపారస్తుడే. కానీ దాని అంతిమ భారం మోసేది వినియోగదారుడే. అందుకే జీఎస్టీలో ఐటీసీని తెచ్చారు. దీంతో వ్యాపారస్తుడికి కొంత పన్ను భారం తగ్గుతుంది. ఈ తగ్గిన పన్ను భారాన్ని వినియోగదారుకు బదిలీ చేయాలి. అంటే అంతిమంగా ఉత్పత్తు ల ధరలు తగ్గాలన్నమాట. కానీ రియల్టీలో అది జరగటం లేదు. అపార్ట్మెంట్లకు 12 శాతం జీఎస్టీ.. గతంలో అపార్ట్మెంట్లకు 4.5% సర్వీస్ ట్యాక్స్, 1.25% వ్యాట్ ఉండేది. అంటే మొత్తంగా దాదాపు 6% పన్ను ఉండేది. కానీ, జీఎస్టీలో అపార్ట్మెంట్లను 12% శ్లాబ్‌లోకి తెచ్చారు. అంటే గతంతో పోలిస్తే అపార్ట్మెంట్లకు 6% పన్ను అదనమన్నమాట. కానీ, ఇది నిజంగా పెరిగినట్లు కాదు. ఎందుకంటే ఇన్పుట్ ట్యా క్స్ క్రెడిట్ రూపంలో నిర్మాణ సామగ్రికి చెల్లించిన పన్నులన్నీ తిరి గి బిల్డర్ చేతికొస్తాయి. వాటిని తను కొనుగోలుదారుకు బదలాయిస్తే.. వాస్తవంగా మునుపటికన్నా పన్ను తక్కువే అవుతుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యాకే ఐటీసీ..: ఇతర రంగాల్లాగా రియల్టీలో ఐటీసీ ఎంతొస్తుందో ముందే ఊహించలేమన్నది బిల్డర్ల మాట. ప్రాజెక్ట్ పూర్తయ్యాకే ఐటీసీ ఎంతొస్తుంది? దాన్ని ప్రాజెక్ట్‌లోని కస్టమర్లందరికీ ఎంతెంత బదిలీ చేయాలనేది తెలుస్తుందని పంజగుట్టకు చెందిన ఓ డెవలపర్ చెప్పారు. ‘‘కానీ ఐటీసీ అనేది నిర్మాణ వ్యయానికే వర్తిస్తుంది. నిర్మాణంలో చాలా వరకు వ్యయం అసంఘటిత రంగంతోనే ముడిపడి ఉంటుంది. ఎర్ర ఇటుకలు, ఇసుక, కంకర, రాళ్లు, కూలీలు, సెంట్రింగ్, ప్లంబర్ వంటివన్నీ అలాంటివే. వీటిలో దేనికీ బిల్లులుండవు. వాటికెలా ఐటీసీ క్లెయిమ్ చెయ్యాలి?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యయ భారం నుంచి తప్పించుకోవటానికి కొనుగోలుదారుల నుంచి నగదు రూపంలో లావాదేవీలు జరిపి.. వాటిని ఇతరత్రా ఖర్చులకు వాడుతున్నామని చెప్పారాయన. కాదు.. కాదు నిర్మాణ దశలోనే.. ఏ నిర్మాణ సంస్థకైనా ఒక్కో ఫ్లాట్‌కు ఎంతమేర సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, టైల్స్, శానిటరీ వంటి నిర్మాణ సామగ్రి అవసరముంటుందో ముందే అవగాహన ఉంటుంది. వీటి కొనుగోలుకయ్యే వ్యయాన్ని లెక్కించాకే ఫ్లాట్ ధరను నిర్ణయిస్తారు కూడా. ఎప్పుడైతే ఇన్పుట్ వ్యయం తెలుస్తుందో దానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెక్కించటం సమస్య కాదు. ఈ మొత్తాన్ని ఫ్లాట్కయ్యే ఖర్చు నుంచి తగ్గించుకుంటే వినియోగదారుడికి ఐటీసీని బదిలీ చేసినట్లవుతుంది. నిర్మాణ వ్యయం మీదే జీఎస్టీని వసూలు చేయాలి. కానీ, డెవలపర్లు లాభం కలపగా వచ్చిన మొత్తంపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేస్తుండటం గమనార్హం. ఐటీసీలో ధరలెలా తగ్గుతాయంటే? ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధర రూ.50 లక్షలనుకుందాం. నిర్మాణ సంస్థ లాభం 10% కలిపితే ఫ్లాట్ ఖరీదు రూ.55 లక్షలు. జీఎస్టీ అమల్లోకి రాకముందైతే 6 శాతం పన్ను (వ్యాట్+సర్వీస్ ట్యాక్స్) కలిపి కస్టమర్ రూ.58,30,000 చెల్లించాల్సి వచ్చేది. జీఎస్టీ వచ్చాక ఇదే ఫ్లాట్ విషయంలో.. కస్టమర్ 12% జీఎస్టీ కలిపి 61,60,000 చెల్లించాల్సి వస్తోంది. నిజానికి ఫ్లాట్ ఖరీదు రూ.50 లక్షలనుకుంటే... దీనికి వాడే నిర్మాణ సామగ్రిపై బిల్డర్‌కు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేతికందుతుంది. ఇది ధరలో 6% వరకూ ఉంటుంది. అంటే రూ.3 లక్షలన్న మాట. దీని ప్రకారం ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.47 లక్షలే. దీనికి నిర్మాణ సంస్థ లాభం కలిపితే 52 లక్షలవుతుంది. 12% జీఎస్టీ (6.24 లక్షలు) కలిపితే 58.24 లక్షలవుతుంది. ఈ లెక్కన జీఎస్టీ వల్ల కొనుగోలుదారులకు కొంత కలిసి వచ్చినట్లే. కానీ బిల్డర్లు జీఎస్టీ పేరు చెప్పి 12% వసూలు చేస్తుండటం.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఊసెత్తకపోవటం.. దానిపై కొనుగోలుదారులకూ అవగాహన లేకపోవటంతో అధిక ధర చెల్లించాలివస్తోంది. చివరికి దీన్ని ‘జీఎస్టీ ఎఫెక్ట్’ అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. బదలాయించకపోవటమే అసలు సమస్య రియల్టీకి సంబంధించి ఔట్పుట్ అంటే నిర్మాణం పూర్తయిన ఫ్లాట్. ఇన్పుట్ అంటే నిర్మాణ సామగ్రి. ఫ్లాట్‌పై జీఎస్టీ చెల్లిస్తున్నారు కనక నిర్మాణ సామగ్రికి చెల్లించిన పన్నులు ఇన్పుట్ క్రెడిట్ రూపంలో తిరిగి బిల్డర్ చేతికొస్తాయి. మొత్తం జీఎస్టీని (12%) ఫ్లాట్ కొనుగోలుదారుడే కడుతున్నాడు కనక ఈ ఇన్పుట్ క్రెడిట్ లాభాన్ని తనకు బదలాయించాలి. బిల్డర్లు అలా చేయకపోవటంతో కొనుగోలుదారులకిది మరింత భారంగా మారుతోంది. – రాంబాబు గొండేల సెంట్రల్ ట్యాక్స్ సూపరింటెండెంట్ జీఎస్టీకి ముందు కొంత, తర్వాత కొంత విక్రయాలు చేస్తే.. దేశంలో 2017, జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది కనక ఆ తర్వాత ప్రారంభమైన ప్రాజెక్ట్‌ల్లో కొనే ఫ్లాట్లకే జీఎస్టీ వర్తింస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైనా... జూన్ 30 తర్వాత కొన్న ప్రతి ప్రాపర్టీకీ జీఎస్టీ చెల్లించాలి. కాకపోతే సదరు ప్రాజెక్ట్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చి ఉంటే... ఆ ప్రాజెక్ట్‌లో కొనే ఫ్లాట్లకు జీఎస్టీ వర్తించదు. డెవలపర్ కూడా ఐటీసీ క్లెయిమ్ చేసుకోవటానికి వీలుండదు. ఒకవేళ అప్పటికే డెవలపర్ సంబంధిత ప్రాజెక్ట్‌కు ఐటీసీ పొంది ఉంటే నిబంధనల మేరకు డెవలపర్ దాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది. -
చాంపియన్ రూహి
సాక్షి, హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లీగ్ (ఐటీసీ) టోర్నమెంట్లో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీ విద్యార్థి రూహి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని నూర్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన టైటిల్‌పోరులో రూహి 4–1, 4–2తో రహీన్పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌లో 2–4, 4–1, 4–4 (10–8)తో చరికా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో నలమర్తిపై విజయం సాధించింది. ఐటీసీ టైటిల్‌ను సాధించిన రూహిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీఆర్ కిరణ్ అభినందించారు. , -
అదరగొట్టిన ఐటీసీ
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద సిగరెట్ మేకర్, ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ ఐటీసీ లిమిటెడ్ లాభాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐటీసీ నికర లాభం దాదాపు 6 శాతం ఎగిసి రూ .2,640 కోట్లకు పెరిగింది. . గత ఏడాది ఇదే కాలంలో రూ .2,500 కోట్లను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రెవెన్యూ కూడా7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్ ఆదాయం రూ. 9,661కోట్లతో పోలిస్తే రూ .10,314 కోట్లను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో వ్యవయాలను భారీగా తగ్గించుకున్నట్టు ఐటీసీ తెలిపింది. 39 శాతం క్షీణించిన ఖర్చులు 6,314 కోట్లకు దిగి వచ్చాయి. అయితే ఎఫ్ఎంసీజీ ఆదాయం మాత్రం భారీగా క్షీణించింది. సిగరెట్లతో సహా ఎప్ఎంసీజీ ద్వారా ఆదాయం రూ.7,358కోట్లుగా ఉండగా గత ఏడాది రూ.11,200కోట్లుగాఉంది. హోటల్ బిజినెస్ ఆదాయం పెరిగింది. రూ. 297.ద్వారా ఉన్న ఆదాయం రూ.300 కోట్లకు పెరగింది. అలాగే అగ్రి బిజినెస్ ఆదాయం కూడా రూ.1,880కోట్ల నుంచి రూ.1,968 కోట్లకు పెరిగింది మరోవైపు ఫలితాల ప్రకటనతో లాభాల ఆర్జించిన ఐటీసీ షేరు మార్కెట్ క్లోజింగ్‌లో ఐటీసీ షేరు స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. -
ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం
అగ్రి బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి ► కొత్త వ్యాపార విభాగాలపైనా కసరత్తు ► ఐటీసీ సీఈవో సంజీవ్ పురి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మరిన్ని హెల్త్‌కేర్ తదితర కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి కొన్ని నెలలకు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టే దిశగా.. త్వరలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా విక్రయించడం ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ‘రాబోయే రోజుల్లో ఆలూ, గోధుమ మొదలుకుని పళ్లు, ఇతర కూరగాయలు, సముద్ర ఆహారోత్పత్తులు వంటివాటిపై మరింతగా దృష్టి పెట్టనున్నాం’ అని ఆయన వివరించారు. అలాగే ఉల్లి డీహైడ్రేట్స్పైనా కసరత్తు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని పురి తెలిపారు. ఐటీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58% వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్ఎంసీజీ, హోటల్, అగ్రి బిజినెస్, పేపర్ మొదలైన వాటిదే. హెల్త్‌కేర్ టీమ్ ఏర్పాటు ప్రక్రియ.. ఇక, హెల్త్‌కేర్ వ్యాపార విభాగంపై స్పందిస్తూ ఇందుకు సంబంధించి ప్రస్తుతం టీమ్‌ను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోణానికే పరిమితం కాకుండా దాని పునాదిపై సామాజిక ప్రయోజనాలకూ పాటుపడాలన్నది ఐటీసీ వ్యూహమని పురి పేర్కొన్నారు. ఇండియా ఫస్ట్ వ్యూహం కింద 2030 నాటికల్లా వ్యాపారాలు, వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా 1 కోటిపైగా మందికి జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐటీసీ, దాని గ్రూప్ సంస్థల్లో 32,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, సుమారు 60 లక్షల మందికి జీవనోపాధి దక్కేలా కృషి చేస్తోంది. అగ్రి బిజినెస్, విలువ జోడింపు వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐటీసీ ప్రస్తుతం సుమారు 20 కన్జూమర్ గూడ్స్, లాజిస్టిక్స్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 24.78 పాయింట్ల లాభంలో 31,687.52 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 4.90 పాయింట్ల లాభంలో 9,934.80 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్‌గా మెటల్ ధరలు పరుగులు పెడుతుండటంతో, వరుసగా ఆరు సెషన్ల నుంచి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 6.5 శాతం పైగా లాభాలు పండించింది. ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ సెన్సెక్స్ లాభాల్లో ముగియడానికి దోహదం చేయగా.. ఎం అండ్ ఎం 3 శాతం మేర నష్టాలు పాలైంది. ఎన్ఎస్ఈలో రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాలు 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి, ఇటు దేశీయ మార్కెట్ల నుంచి మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు ఏమీ లేకపోవడంతో, రెండు సూచీలు కూడా పరిమిత స్థాయిలోనే నడిచి, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ నిన్నటితో పోలిస్తే బాగానే బలపడింది. 17 పైసలు బలపడి 63.88 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 106 రూపాయల లాభంలో 30,388 రూపాయలుగా ఉన్నాయి. -
ఐటీసికి డౌన్‌గ్రేడ్ షాక్
సాక్షి, ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు భారీగా నష్టపోతోంది. విదేశీ బ్రోకింగ్ సంస్థ మక్వారీ సహా రెండు కంపెనీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఐటీసీ కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు 2.25 శాతం క్షీణించి రూ. 275 దిగువకు చేరింది. రెండు బ్రోకరేజ్ సంస్థలు సంస్థకు డౌన్ గ్రేడ్ ర్యాంక్‌ను ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాలకు తెర తీసింది. మార్చి 2018 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 4శాతం తగ్గిపోతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి. ముఖ్యంగా సిగరెట్ అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఐటీసీకంటే హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) పెట్టుబడులకు అనుకూలమంటూ మెక్వారీ తాజాగా పేర్కొంది. గత రెండు నెలల్లో అంటే జూలై-ఆగస్ట్‌లలో సిగరెట్ అమ్మకాల పరిమాణం క్షీణించినట్లు తెలియజేసింది. దీంతో వచ్చే ఏడాదికి టార్గెట్ ధరను రూ. 340 నుంచి రూ. 304కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఐటీసీ సిగరెట్లు, హోటళ్ళు, కాగితపుఅట్టలు, స్పెషల్ పేపర్లు, ప్యాకేజింగ్, అగ్రి-బిజినెస్, ప్యాక్ చేసిన ఆహారాలు, మిఠాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్, స్టేషనరీ తదితర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులతో పాటు ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తిలో మార్కెట్ లీడర్‌గా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : కన్సాలిడేషన్ నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగాయి. సెన్సెక్స్ 50.95 పాయింట్ల నష్టంలో 31,904 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.30 పాయింట్లు కిందకి పడిపోయి 9,873 వద్ద సెటిలైంది. నేటి ట్రేడింగ్‌లో టాటాస్టీల్, కొటక్ మహింద్రా బ్యాంకు, వీఏ టెక్ వాబ్యాక్, కెనరా బ్యాంకులు టాప్ టూజర్లుగా ఎక్కువగా నష్టాలు గడించాయి. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీలు రెండు సూచీల్లోనూ లాభాలు పండించాయి. కొటక్ మహింద్రా బ్యాంకు, ఐటీ కంపెనీ మైండ్‌ట్రి కంపెనీలు అంచనాలను మిస్ చేయడంతో వీటి షేర్లు నష్టాల్లో కొనసాగగా... వీటితో పాటు ఐటీసీ, ఇన్ఫోసిస్‌లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. మైండ్‌ట్రి, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు ఒత్తిడిలో కొనసాగడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.88 శాతం మేర పడిపోయింది. మరిన్ని కార్పొరేట్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నేడు మార్కెట్ అవర్స్ తర్వాత రానున్న ఫలితాల ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా 0.26శాతం నష్టాల్లో ముగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పడిపోయింది. డాలర్ బలపడుతుండటంతో రూపాయి నష్టాలు పాలై 64.45గా ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 70 రూపాయల నష్టంలో 28,180 రూపాయలుగా ఉన్నాయి. -
ఐటీసీ దెబ్బ: సెన్సెక్స్ అతిపెద్ద పతనం
-
దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్
ముంబై : సిగరెట్ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్, సిగరెట్ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీకి షాకిచ్చింది. ఈ షాక్‌కు ఇన్వెస్టర్లందరూ ఒక్కసారిగా అమ్మకానికి పోటెత్తారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తూ 15 శాతం మేర క్రాష్ అయ్యాయి. ఈ క్రాష్‌తో కంపెనీ మార్కెట్ విలువ రూ.3.37 లక్షల కోట్లకు పడిపోయింది. సోమవారం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.96 లక్షల కోట్లు. అంటే దాదాపు రూ.60వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఐటీసీ దెబ్బ ఇటు స్టాక్ మార్కెట్లకు భారీగానే కొట్టింది. సెన్సెక్స్ ఈ ఏడాదిలో అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. స్టాక్ మార్కెట్లో హై వెయిటేజీ ఉన్న షేర్లలో ఐటీసీ ఒకటి. నిఫ్టీలో కూడా ఇదే రెండో అతిపెద్ద వెయిటేజీ సంస్థ. బ్లూబర్గ్ రిపోర్టు ప్రకారం ఐటీసీ షేర్లు 25 ఏళ్లలో అతిపెద్ద నష్టాలను నమోదుచేశాయని తెలిసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే 28 శాతం పన్నుతో పాటు, అదనంగా పరిహారాల సెస్‌ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అదనంగా 5 శాతం సెస్‌ను ఆమోదించారు. ఇది సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. దీంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచే ఐటీసీ షేర్లు భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం పెంచిన పన్నుతో సిగరెట్ ఉత్పత్తుల ఎంఆర్పీ ధరలు కూడా 8-9 శాతం పెరగనున్నాయని దేశీయ బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయి. అంతేకాక స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ కూడా చేస్తున్నాయి. నేటి ట్రేడింగ్ చివరికి ఐటీసీ షేర్లు 12.63 శాతం నష్టంలో రూ.284.60 వద్ద ముగిశాయి. -
ఐటీసీ దెబ్బ: సెన్సెక్స్ అతిపెద్ద పతనం
ముంబై : ఆల్టై హైలతో రికార్డుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది.మంగళవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో హెవీ వెయిటేజీగా ఉన్న ఐటీసీ లిమిటెడ్ షేర్లు 1992 నాటి కనిష్టస్థాయిలను నమోదుచేసి, అతిపెద్ద పతనాన్ని ఎదుర్కొనడంతో, స్టాక్ సూచీలు కూడా తీవ్ర నష్టాలు పాలయ్యాయి. ఐటీసీ దెబ్బకు ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలోకి వెళ్లిన మార్కెట్లు, చివరికి మరింత నష్టాలను నమోదుచేశాయి. ముగింపు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 363.79 పాయింట్లు క్రాష్ అయింది. దీంతో సెన్సెక్స్ 31,710 వద్ద సెటిలైంది. నిఫ్టీ కూడా 88.80 పాయింట్ల నష్టంలో 9,827 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ ఇంత భారీ మొత్తంలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఐటీసీ దెబ్బకు ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 7 శాతం నష్టపోయింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా సగం శాతం పైగా నష్టాలు గడించింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఐటీసీ, రిలయన్స్, గెయిల్ ఎక్కువగా నష్టపోగా, ఏసియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. ఐటీసీ టాప్ లూజర్‌గా 12.44 శాతం నష్టాలను గడించడానికి ప్రధాన కారణం సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సిగరెట్ ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనంగా 5 శాతం సెస్‌ను విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించడమే. దీని ప్రభావంతో నేడు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఇంట్రాడేలో 15 శాతం మేర నష్టపోయింది. మరో సిగరెట్ ఉత్పత్తుల తయారీ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కూడా 10 శాతం మేర నష్టపోయింది. ఐటీసీ దెబ్బకు దానిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా భారీగా తమ మొత్తాలను కోల్పోయారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.33 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 32 రూపాయల లాభంలో 28,152 రూపాయలుగా ఉన్నాయి. -
అరగంటలో ఎల్ఐసీకి రూ.7,000కోట్లు మటాష్
న్యూఢిల్లీ : సిగరెట్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఐటీసీ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఢమాల్‌మన్నాయి. దాదాపు 26 ఏళ్ల కనిష్టస్థాయిల వద్ద ఐటీసీ స్టాక్ అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తుండటంతో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న ఎల్ఐసీ అరగంటలో రూ.7000 కోట్లను కోల్పోయింది. ఈ సిగరెట్ కంపెనీలో 2017 జూన్30 నాటికి ఎల్ఐసీ 16.29 శాతం స్టేక్‌ను కలిగి ఉంది. దీని ప్రభావంతో ఎల్ఐసీ భారీ మొత్తంలో నష్టాలను ఎదుర్కొంటోంది. అంతేకాక అరగంట వ్యవధిలోనే 7వేల కోట్ల నష్టాలను నమోదుచేయడం ఇదే మొదటిసారి. ఈ నష్టాలంతటికీ ప్రధాన కారణం సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సిగరెట్ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడమే. 28 శాతం జీఎస్టీతో పాటు, అదనంగా 5 శాతం సెస్‌ను విధిస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం మార్నింగ్ ట్రేడింగ్‌లో 15 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ నష్టాలు ఎల్ఐసీకి దెబ్బకొట్టాయి. ఒక్క ఎల్ఐసీ మాత్రమే కాక, ఐటీసీలో పెట్టుబడులు పెట్టిన ఇతర ఇన్సూరర్స్‌కు కూడా నష్టాలు వాటిల్లాయి. మొత్తంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.10వేల కోట్లను కోల్పోయాయి. గత నాలుగేళ్ల క్రితం నుంచి ఎల్ఐసీ, ఐటీసీలో తన వాటాను పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఎల్ఐసీకి ఈ దెబ్బ అధికంగా కొట్టింది. నాలుగేళ్ల క్రితం ఐటీసీలో ఎల్ఐసీ వాటా 12.63 శాతంగా ఉండగా.. 2016 జూన్ నాటికి 14.34 శాతానికి ఎగిసింది. ఇటీవలే ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ కూడా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు టుబాకో మేజర్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సపోర్టుచేశారు. కంపెనీలో షేర్లను కలిగి ఉండటం, కలిగి ఉండకపోవడం అనేది స్మోకింగ్ సమస్యపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. సిగరెట్ ఉత్పత్తుల కంపెనీల్లో ఎల్ఐసీ, ఇతర నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బొంబై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా ఎల్ఐసీ ఈ విధంగా వాదించింది. కాగ, జీఎస్టీ కౌన్సిల్ పెంచిన సెస్‌తో సిగరెట్ ఉత్పత్తుల తయారీదారులు, ఎల్ఐసీ, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కోనున్నాయి. సిగరెట్ ఉత్పత్తుల తయారీదారులైతే వార్షికంగా రూ.5000 కోట్లను కోల్పోనున్నారు. -
జీఎస్టీ సెగ: ఐటీసీ క్రాష్
ముంబై: జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీగా పతనమైంది. సిగరెట్లపై సెస్ పెంపు కారణంగా ఐటీసీ తదితర సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు నేడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాల ఒత్తిడిని పెంచింది. సోమవారం జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన షాక్‌తో దాదాపు సిగరెట షేర్లన్నీ నీరసించాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా లాభపడిన ఐటీసీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో 14శాతం పతనాన్ని నమోదు చేసింది. 15ఏళ్ల కనిష్టానికి చేరింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు కూడా నెగిటివ్ ట్రేడ్కాల్ ఇస్తుండటం గమనార్హం. గాడ్ఫ్రే ఫిలిప్స్ 4.5 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్ 4.5 శాతం నష్టపోయాయి. ఈ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ రంగం ఏకంగా 7.5 శాతం పతనమైంది. ఇది మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇక మిగతా షేర్ల విషయానికి వస్తే గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టపోయాయి. గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, ఫలితాల జోష్‌తో ఏసీసీ 3.16 శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇంకా భారతీ ఎయిర్టెల్ 2.71 శాతం, విప్రో 1.57 శాతం, అంబుజా సిమెంట్స్ 1.47 శాతం, టీసీఎస్ (1.47 శాతం) లాభపడుతున్నాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భాగంగా సిగరెట్లపై సెస్ పెంపును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. సిగరెట్లపై వాలోరెమ్ సెస్ విధించాలని జిఎస్టి కౌన్సిల్ సోమవారం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 5వేల కోట్లమేర అదనపు ఆదాయం లభించనుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కాగా సిగరెట్లపై ఇప్పటికే జిఎస్టిలో భాగంగా 28 శాతం పన్నురేటు వుందని, దీనికి అదనంగా 5 శాతం వాలోరెమ్ సెస్‌ను అమలు చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తొలిసారి 32వేలకు పైన సెన్సెక్స్
ముంబై : దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా నిన్న వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు రేట్ల కోతకు సానుకూలంగా రావడంతో ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు మరోసారి ఆల్‌టైమ్ హైలో ముగిశాయి. సెన్సెక్స్ మొదటిసారి 32 మార్కును చేధించి 232.56 పాయింట్ల లాభంలో 32,037 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 75.60 పాయింట్ల జోరుతో మొదటిసారి 9,900 మార్కుకు దగ్గర్లో సెటిల్ అయింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు షేర్లు దేశీయ సూచీలకు రికార్డుల మోత మోగిస్తున్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.92 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకులు 1.05 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసు 1.02 శాతం లాభాలు పండించాయి. నేటి మార్కెట్లో ఐటీసీ, భారతీఎయిర్‌టెల్, యస్ బ్యాంకులు ఎక్కువగా లాభపడగా.. ఓఎన్జీసీ, ఆసియన్ పేయింట్స్, ఐఓసీ నష్టాలు గడించాయి. నిన్న వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. దీంతో వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ నిర్వహించనున్న ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రేట్ల కోత చేపడుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలతో పాటు మార్కెట్లు కూడా గతకొన్నిరోజులుగా రికార్డుల మోతమోగించడం నేడు మరింత సహకరించింది. చారిత్రాత్మక 10వేల మార్కును నిఫ్టీ వచ్చే సెషన్లలో తాకవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు లాభపడి 64.45గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 61 రూపాయల లాభంలో 27,912 రూపాయలుగా ఉన్నాయి. -
మార్కెట్లో జీఎస్టీ మెరుపులు
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నేడు జీఎస్టీ మెరుపులు మెరిపించాయి. త్రిపుల్ సెంచరీని క్రాస్ చేసిన సెన్సెక్స్ చివరికి 300 పాయింట్ల లాభంలో 31,221 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94.10 పాయింట్ల లాభంలో తన ప్రధాన మార్కు 9,600కి పైన నిలిచింది. జీఎస్టీ బూస్ట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లు దేశీయ సూచీలకు బాగా సహకరించాయి. ఐటీసీ రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. ట్రేడింగ్ ప్రారంభంలో 8 శాతం మేర ఎగిసిన ఐటీసీ, చివరకు 5.92 శాతం లాభంలో క్లోజైంది. నిఫ్టీ ఇండెక్స్‌లో 50 శాతం మేర లాభాలను ఐటీసీనే పండించింది. జీఎస్టీ అమలుతో రిటైల్ ధరలు తగ్గి, విక్రయాలు పెరుగుతాయనే ఆశలతో ఐటీసీ ఈ మెరుపులు మెరిపించింది. 2017 ఏడాదిలోనే రెండో అతిపెద్ద సింగిల్-డే గెయినర్‌గా ఐటీసీ నిలిచింది. ఒక్క ఐటీసీ స్టాక్ మాత్రమే కాక, మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల దూకుడును కొనసాగించాయి. ఐటీసీ, హీరో మోటోకార్పొ, భారతీ ఇన్ఫ్రాటెల్లు నేటి మార్కెట్లు టాప్ గెయినర్లుగా నిలవగా.. ఎన్టీపీసీ, కొటక్ మహింద్రా బ్యాంకు, జైపీ ఇన్ఫ్రా బాగా నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో టాప్ గెయినర్‌గా అశోక్ లేల్యాండ్ ఉంది. కంపెనీ విక్రయాలు 11 శాతం మేర పెరుగడంతో దీని షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఇటు ఎరువులపై కూడా ఆఖరి క్షణంలో పన్ను రేట్లను తగ్గించడంతో ఈ కంపెనీ స్టాక్స్ కూడా పెరిగాయి. జీఎస్టీ అమలుతో దీర్ఘకాలికంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయని ఓ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ సింగి చెప్పారు. ఇది దీర్ఘకాలికంగా జీడీపీ వృద్ధికి కూడా సహకరించనుందని విశ్లేషకులు చెప్పారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 27పైసలు బలహీనపడి 64.85గా ఉంది. గ్లోబల్‌గా బంగారం ధరలు బలహీనంగా ఉండటంతో పాటు దేశీయంగా జీఎస్టీ అమల్లోకి రావడంతో ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు 96 రూపాయలు నష్టపోయి 28,343 వద్ద నమోదయ్యాయి. -
జీఎస్టీతో లాభాలివీ..
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది పరోక్ష పన్ను విధానంలో వర్తించని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ).. జీఎస్టీలో వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక తయారీ సంస్థ ఒక వస్తువు తయారు చేయటానికి కావాల్సిన ముడి సరుకులను రూ.100 పెట్టి కొనుగోలు చేసిందనుకుందాం. దీనిపై 10 శాతం అంటే రూ.10 రాష్ట్రానికి ఇన్పుట్ ట్యాక్స్ కడుతుంది. ఆ ముడి సరుకులతో వస్తువును తయారు చేసి.. అదే రాష్ట్రంలో లాభం కలిపి రూ.200కు విక్రయించిందనుకుందాం. అప్పుడు అదే రాష్ట్రానికి ఈ సంస్థ అమ్మకం పన్ను (అవుట్‌పుట్ ట్యాక్స్) కూడా చెల్లిస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఒక ఉత్పత్తి తయారీ, విక్రయం రెండూ ఒకే రాష్ట్ర పరిధిలో జరిగినప్పుడు ఇన్పుట్, ఔట్పుట్ ట్యాక్స్ రెండూ కట్టాల్సి వస్తోంది. అయితే జీఎస్టీలో మాత్రం ఏ రాష్ట్రంలో తయారు చేసి.. ఏ రాష్ట్రంలో అమ్మినా సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అంటే ముడి పదార్థాల కొనుగోలు సమయంలోనే ఇన్పుట్ ట్యాక్స్ కట్టేసింది కనక... అమ్మకం సమయంలో ఆమేరకు పన్ను మొత్తాన్ని మినహాయిస్తారన్న మాట. పన్నులపై పన్నులుండవు జీఎస్టీ వచ్చాక పన్ను మీద పన్ను భారం ఉండదు. ఉదాహరణకు ఉత్పత్తిదారుడు ఒక వస్తువు తయారీ కోసం ముడిసరుకును రూ.100 పెట్టి కొనుగోలు చేశాడు. వస్తువు తయారీకి మరో రూ.100 ఖర్చయింది అనుకుందాం. అంటే ఆ ఉత్పత్తి వ్యయం రూ.200. దీని మీద ఎక్సైజ్ డ్యూటీ (12 శాతం) రూ.24. అంటే మొత్తం రూ.224 అయింది. ఇప్పుడా వస్తువును ఒక రాష్ట్రంలో విక్రయించాలంటే సేల్స్‌ట్యాక్స్ (10 శాతం) కట్టాలి. అంటే రూ.224 మీద 10 శాతం కట్టాలి. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... వాస్తవంగా ఉత్పత్తికి అయిన ఖర్చు రూ.200 మాత్రమే. ఎక్సైజు పన్ను కలిపాక రూ.224 అవుతోంది. అంటే అమ్మకం సమయంలో సేల్స్ట్యాక్స్ను ఉత్పత్తి వ్యయం మీద (అంటే రూ.200 మీద) కాకుండా ఎక్సైజ్ సుంకంతో కలిపిన మొత్తంపై (అంటే రూ.224పై) చెల్లించాల్సి వస్తుంది. ఇది తయారీదారులకు రెండు రకాల పన్ను భారంగా మారుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ పన్నుల మీద పన్నుల భారం ఉండదు. ఒకే రిటర్న్ సరిపోతుంది ప్రస్తుతం మన దేశంలో ఒక్కో పన్ను చెల్లించటానికి ఒక్కో తరహా రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీ ఇలా ఒక్కో దానికి ఒక్కో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్‌ను ప్రిపేర్ చేయాలి కూడా. కానీ జీఎస్టీతో ఇవేవీ అవసరం ఉండదు. దేశమంతా ఒకే పన్ను విధానం లాగా.. ఒకే ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేస్తే సరిపోతుంది. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా పేపర్ వర్క్ తప్పుతుంది. జీఎస్టీ అమలు ద్వారా పన్నులు వసూలు చేయటంలో సమర్థత పెరుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇబ్బందులు.. నష్టాలు దేశంలో జీఎస్టీని ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వేగంగా నిర్ణయాలు కూడా ప్రకటిస్తోంది. కానీ ప్రస్తుతం మనం 2017–18 ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్నాం. అప్పటివరకు పాత పన్ను విధానాన్ని పాటిస్తూ... రాత్రికి రాత్రే జీఎస్టీలోకి మారడం కంపెనీలకు, వర్తకులకు కొంత గందరగోళాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత విధానంలో రూ.1.50 కోట్ల టర్నోవర్పైన ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అన్ని కంపెనీలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టర్నోవర్ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించారు. ఇది చిన్న, మధ్యతరహా (ఎస్ఎంఈ) కంపెనీలకు ఇబ్బందికరం, నష్టం కూడా. జీఎస్టీతో నిర్వహణ వ్యయం పెరుగుతుంది. దీన్ని పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉండడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కంపెనీలు ఐటీ నిపుణులను నియమించుకుని జీఎస్టీని నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుతమున్న అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేదా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)లను మార్చి వాటి స్థానంలో కొత్తగా జీఎస్టీ టెక్నాలజీ ఉండే అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తయారీ రంగాలకు చెందిన పలు సంస్థలు పన్ను రాయితీలున్న, పన్నులపరంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాయి. ఈ–కామర్స్ సంస్థలైతే ప న్నుల్లో వెసులుబాటు కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గిడ్డంగుల్ని ఏర్పాటు చేస్తున్నాయి. జీఎస్టీతో దేశమంతటా ఒకే రకమైన పన్ను విధానం ఉన్నప్పుడు ఇవి అన్ని రాష్ట్రాల్లో గిడ్డంగులను నిర్వహిం చాల్సిన అవసరం ఉండదు. డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరుగుతుంది. సరుకుల రవాణా సమయం కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఔట్ ఆఫ్ స్టాక్ పరిస్థితి ఏర్పడొచ్చు కూడా. గిడ్డంగులపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు దూరమై భూములు ధరలూ పడిపోయే ప్రమాదమూ ఉంది. తాజాగా శ్లాబులు ప్రకటించటంతో ఏ వస్తువు పై జీఎస్టీ ఎంత అనేది స్పష్టమైపోయింది. కాకపోతే ఏ వస్తువు విషయంలోనైనా ప్రస్తుత వ్యాట్ రేటు క న్నా జీఎస్టీ రేటు అధికంగా ఉంటే వ్యాపారులకు ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటికే రిటైలర్ స్టోర్లలో బోలెడంత స్టాక్ ఉంది. ఆయా ఉత్పత్తులపై ఎంఆర్ పీ ధర ముద్రించి ఉంటుంది కూడా. జీఎస్టీ రేటు పెరగడంతో కంపెనీలకు లాభాలు తగ్గిపోతాయి. ఉత్పాదక రంగంపై మూలధన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం స్టాక్ బదిలీపై ఎలాంటి పన్నులూ లేవు. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక సరఫరా జీఎస్టీ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది గనక.. కంపెనీలు సరఫరా చైన్ నిర్వహణ వ్యూహాలపై పునరాలోచనలో పడతాయి. ఇది కంపెనీల నగదు ప్రవాహంపై ప్రభావాన్ని చూపిస్తుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపై నియంత్రణ కోల్పోతాయి. ఎలాగంటే దేశంలో నిర్వహించే ప్రతీ వ్యాపారం మీద కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాల రూపంలో ద్వంద్వ నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర పరిధిలో పన్ను రేట్లను మార్చుకునే లేదా తగ్గించుకునే అవకాశం, అధికారం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవు. అది పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ పరిధిలో ఉంటుంది. -
ఐటీసీ ఆకర్షణీయ ఫలితాలు
⇔ మార్చి క్వార్టర్లో లాభం రూ.2,669 కోట్లు ⇔ 12 శాతం వృద్ధి... అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు ⇔ రూ.4.75 డివిడెండ్ న్యూఢిల్లీ: ఐటీసీ మార్చి క్వార్టర్‌తోపాటు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అగ్రి కమోడిటీలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు అధికమయ్యాయి. దీంతో మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం 12 శాతం అధికంగా రూ.2,669.47 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,380.68 కోట్లు మాత్రమే. ఆదాయం సైతం 6 శాతం పెరిగి రూ.15,009 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న ఆదాయం రూ.14,139 కోట్లు. ఎఫ్ఎంసీజీ విభాగం, సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం పెరిగి రూ.11,256 కోట్ల నుంచి రూ.11,840 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా సిగరెట్ల ద్వారా ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.8,955 కోట్లుగా నమోదైంది. ఇతర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6.45 శాతం పెరుగుదలతో రూ.2,886 కోట్లకు చేరింది. పండ్ల రసాలు, డైరీ, చాక్లెట్లు, కాఫీ తదితర విభాగాల్లో ముడి సరుకుల ధరలు పెరగడం, అప్పెరల్ విభాగంలో డిస్కౌంట్ల కారణంగా ఇతర ఎఫ్ఎంసీజీ విభాగం ఫలితాలపై ప్రభావం చూపినట్టు ఐటీసీ తెలిపింది. ఐటీసీ హోటల్ వ్యాపార ఆదాయం సైతం 6.48 శాతం వృద్ధితో రూ.386 కోట్లు, అగ్రి ఉత్పత్తుల ద్వారా ఆదాయం 6 శాతం పెరుగుదలతో రూ.1,918 కోట్లు... పేపర్బోర్డుల ద్వారా ఆదాయం రూ.4.38 శాతం వృద్ధితో రూ.1,372 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.10,447 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2015–16 ఆర్థిక సంవ్సరంలో వచ్చి రూ.9,500 కోట్లతో పోలిస్తే 10.27 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకాలు 6.66 శాతం పెరుగుదలతో రూ.55,061 కోట్ల నుంచి రూ.58,731 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.4.75 డివిడెండ్‌ను కంపెనీ సిఫారసు చేసింది. -
జీఎస్టీ జోష్: మార్కెట్లు పరుగులు
రికార్డుల ర్యాలీకి బ్రేక్ పడిన స్టాక్ మార్కెట్లలో, మళ్లీ పరుగులు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ బూస్ట్ తో సెన్సెక్స్, నిఫ్టీ బుల్ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 266.26 పాయింట్ల లాభంలో 30,701 వద్ద, నిఫ్టీ 74.55 పాయింట్ల లాభంలో 9,504 వద్ద లాభాలు పండిస్తున్నాయి. ఐటీసీ, హిందూస్తాన్ యూనిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్ వంటి వాటిపై తక్కువ జీఎస్టీ రేట్లను నిర్ణయించడంతో ఈ కంపెనీల షేర్లకు మంచి జోష్ వచ్చింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3.42 శాతం పైకి ఎగిసింది. పవర్ , బ్యాంకింగ్, మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. మార్కెట్లో బిగ్గెస్ట్ గెయినర్ గా ఐటీసీ 5 శాతం మేర దూసుకెళ్తోంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయడం మార్కెట్లకు సానుకూల దశ అని విశ్లేషకులు చెప్పారు. అయితే ప్రాఫిట్ బుకింగ్ తో ఏసియన్ పేయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీలు మార్కెట్లో నష్టాలు పాలవుతున్నాయి. గురువారం భారీగా పతనమైన రూపాయి నేటి ట్రేడింగ్ లో 6 పైసలు బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 64.79 వద్ద ట్రేడవుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 44 రూపాయల లాభంతో 28,663 వద్ద ట్రేడవుతున్నాయి. -
సిగరెట్ల పన్నుపై క్లారిటీ: దూసుకెళ్తున్న ఐటీసీ
పొగాకు, సిగరెట్ల ఉత్పత్తుల పన్ను పరిమితిపై జీఎస్టీ కౌన్సిల్ క్లారిటీ ఇవ్వడంతో సిగరెట్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో ఐటీసీ 7 శాతం మేర లాభపడి రూ.288 వద్ద ట్రేడైంది. ప్రతి వెయ్యి సిగరెట్లకు రూ.4,170 లేదా 290 శాతం పన్ను పరిమితిని విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసిందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. బీడీలపై సెస్సు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో ఐటీసీతో పాటు మిగతా సిగరెట్ కంపెనీలు వీఎస్టీ ఇండస్ట్రీస్, గాడ్ఫ్రే ఫిలిప్స్, గోల్డెన్ టుబాకోలు దాదాపు 5 శాతం మేర లాభాలార్జిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడింగ్ లో ఐటీసీ టాప్ నిఫ్టీ గెయినర్ గా ఉంది. పన్ను పరిమితిపై క్లారిటీ ఈ కంపెనీలకు ఎక్కువగా సాయపడింది. నిఫ్టీ కీలక మార్కు 9200 స్థాయిని చేరుకోవడానికి ఐటీసీ ర్యాలీ ఎక్కువగా దోహదం చేసింది. దీంతో నిఫ్టీ సైతం రికార్డు బద్దలు కొడుతూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. లగ్జరీ వస్తువులు, శీతల పానీయాలపై అత్యధికంగా 28శాతం జీఎస్టీని వసూలు చేయనున్న ప్రభుత్వం.. వీటిపై అదనంగా విధించే సెస్సు పరిమితి 15 శాతం పెంపుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. జీఎస్టీ అమలుతో భారీగా రెవెన్యూలు కోల్పోతున్న రాష్ట్రాలకు ఈ సెస్ ను ఉపయోగించనున్నారు. -
కేంద్రానికి ‘ఐటీసీ’ పంట!
• 2 శాతం వాటా విక్రయం • రూ.6,700 కోట్లు సమీకరణ • వాటా కొనుగోలు చేసిన ఎల్ఐసీ... న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి ‘ఐటీసీ’ పంట పండింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో 2 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాలోకి ఏకంగా రూ.6,700 కోట్లు వచ్చిపడ్డాయి. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(ఎస్‌యూయూటీఐ) నుంచి ఈ వాటాను కేంద్రం మంగళవారం విక్రయించింది. బ్లాక్ డీల్స్ రూపంలో జరిగిన ఈ లావాదేవీలో మొత్తం 2 శాతం వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘కేంద్రం ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన రూ.275.85 ధరకు ఎల్ఐసీ ఈ వాటాను దక్కించుకుంది. ఈ డీల్‌తో ప్రభుత్వానికి దాదాపు రూ.6,700 కోట్లు లభించాయి’ అని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇంకా 9.17 శాతం కేంద్రం వద్దే... ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(యూటీఐ) నుంచి కొన్ని ఆస్తులు, అప్పులను టేకోవర్ చేసుకొని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే ఎస్‌యూయూటీఐ. వివిధ ప్రైవేటు రంగ కంపెనీల్లో ఉన్న వాటాల్లో చాలా వరకూ ఎస్‌యూయూటీఐ ద్వారానే కేంద్రం కలిగి ఉంది. ప్రస్తుతం ఐటీసీలో దీనికి 11.17 శాతం వాటా ఉండగా.. తాజాగా 2 శాతం వాటా విక్రయం తర్వాత ఇది 9.17 శాతానికి తగ్గింది. కాగా, ఐటీసీతో పాటు మొత్తం 51 కంపెనీల్లో ఎస్‌యూయూటీఐకి వాటాలున్నాయి. ఇందులో ఎల్ అండ్ టీలో 6.53 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 11.53 శాతం వాటాలు ప్రధానమైనవి. ఈ కంపెనీల్లో కొంత వాటాలను విక్రయించడం కోసం కేంద్రం మూడేళ్ల ప్రణాళికను నిర్ధేశించింది. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే మర్చెంట్ బ్యాంకర్లను కూడా నియమించింది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్‌లో ఎల్ అండ్ టీలో 1.63 శాతం, యాక్సిస్‌లో 9 శాతం చొప్పున వాటాలను విక్రయించింది. దీని ద్వారా రూ.5,500 కోట్లను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.45,000 కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం(సవరించిన అంచనాల ప్రకారం). ఇందులో ఇప్పటివరకూ 12 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 39,000 కోట్లు ఖజానాలోకి చేరాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి ఐటీసీ షేరు.. ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో ఐటీసీ షేరు దూసుకెళ్లింది. మంగళవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 5.6 శాతం ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్టాన్ని(రూ.291.95) తాకింది. అయితే, చివరకు స్వల్ప లాభంతో(0.25%) రూ.277.10 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. రూ.3,36,015 కోట్లకు చేరింది. కొత్త ఈటీఎఫ్‌లో సర్కారీ బ్యాంకులు, ఎయూయూటీఐ వాటా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లకు సంబంధించిన రెండో ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)పై మోదీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో ప్రారంభించనున్న కొత్త ఈటీఎఫ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు, గతంలో పీఎస్యూలుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల్లోని వాటాలతోపాటు ఎస్‌యూయూటీఐ ద్వారా వివిధ కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా చేర్చాలని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది పీఎస్‌యూలకు(ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) చెందిన షేర్లతో 2014లో ఏర్పాటు చేసిన తొలి సీపీఎస్ఈ ఈటీఎఫ్ మెరుగైన పనితీరును కనబరుస్తుండటంతో రెండో ఈటీఎఫ్ కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఏ కంపెనీల షేర్లను చేర్చాలనేది పరిశీలిస్తోంది. గతంలో పీఎస్యూలుగా ఉన్న హిందుస్థాన్ జింక్ వంటి కంపెనీల్లో ప్రభుత్వానికి ఉన్న మైనారిటీ వాటాను రెండో ఈటీఎఫ్‌లో చేర్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలి ఈటీఎఫ్ దాదాపు మూడేళ్లలో 14.4 శాతం రాబడిని అందించినట్లు ఆయన వెల్లడించారు. 2014 మార్చిలో ఆరంభం సందర్భంగా దీని ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లను సమీకరించింది. తాజాగా గత నెలలో రెండో దశలో రూ.6,000 కోట్లు ఖజానాకు లభించాయి. కాగా, రెండో సీపీఎస్ఈ ఈటీఎఫ్ నిర్వహణ కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కొత్త సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐటీసీ లాభం 2,647 కోట్లు
6 శాతం వృద్ధి • పెద్ద నోట్ల రద్దుతో మందగించిన వ్యాపారం న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం పడింది. డిమాండ్ తగ్గి వ్యాపారం మందగించింది. మొత్తం మీద కంపెనీ ఆర్థిక ఫలితాలు ఓ మెస్తరుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నికర లాభం 6 శాతం పెరిగిందని ఐటీసీ తెలిపింది. గత క్యూ3లో రూ.2,504 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,647 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ వ్యాపారంలో ప్రతికూలతలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా డిమాండ్ తగ్గడం ప్రభావం చూపాయని వివరించింది. గత క్యూ3లో రూ.12,962 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం వృద్ధితో రూ. 13,570 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇబిటా రూ.3,475 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,546 కోట్లకు పెరగ్గా, మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.1 శాతానికి పడిపోయాయని తెలిపింది. మందకొడిగా సిగరెట్ల వ్యాపారం... పెద్ద నోట్ల రద్దు, నిబంధనలు కఠినంగా మారుతుండడం, పన్నుల భారం తదితర అంశాల కారణంగా సిగరెట్ల వ్యాపారం మందకొడిగా ఉందని ఐటీసీ పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం ఆదాయం రూ.8,106 కోట్ల నుంచి 2.2 శాతం ఎగసి 8,288 కోట్లకు చేరిందని వివరించింది. సిగరెట్లతో కలుపుకొని ఎఫ్ఎంసీజీ వ్యాపారం రూ.10,591 కోట్ల నుంచి 2.5 శాతం పుంజుకొని రూ.10,857 కోట్లకు, ఇతర ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ వ్యాపారం రూ.2,485 కోట్ల నుంచి 3.3 శాతం వృద్ధితో 2,569కు పెరిగాయని వివరించింది. హోటల్ వ్యాపారం రూ.345 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.371 కోట్లకు, వ్యవసాయ వ్యాపారం ఆదాయం రూ.1,481 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.1,672 కోట్లకు పెరిగాయని, పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం ఆదాయం రూ.1,338 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు తగ్గిందని తెలిపింది. అన్ని సెగ్మెంట్లపై నోట్ల రద్దు ఎఫెక్ట్.. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఎఫ్ఎంసీజీ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఐటీసీ పేర్కొంది. బిస్కెట్స్, స్నాక్స్, నూడుల్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, బ్రాండెడ్ దుస్తులు.. అన్నిరంగాలపై నోట్ల రద్దు ప్రభావం పడిందని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తట్టుకోవడానికి పలు చర్యలు తీసుకున్నామని, త్రైమాసికం చివర్లో నోట్ల కొరత సమస్య తగ్గుముఖం పట్టడంతో అమ్మకాలు పుంజుకున్నాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. డీమోనిటైజేషన్ పరిస్థితుల్లోనూ నికర లాభం పెరగడంతో ఈ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి రూ.267ను తాకింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 6 శాతం వరకూ ఈ షేర్ పెరిగిన నేపథ్యంలో ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరకు 2.7 శాతం నష్టంతో రూ.257 వద్ద ముగిసింది. -
ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లు రూపొందిస్తాం
న్యూఢిల్లీ: 2030 నాటికి ఎఫ్ఎంసీజీ విభాగం ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఐటీసీ ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్ల రూపకల్పనపై దృష్టి సారించింది. క్లాస్మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్ల విజయం ఇచ్చిన ఉత్సాహంతో... ప్రస్తుత విభాగాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తుల వంటి నూతన విభాగాల్లోకి విస్తరించే లక్ష్యాలతో ఉంది. ప్రస్తుతం క్లాస్మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్లు రూ.1,000 నుంచి రూ.3,000 కోట్ల ఆదాయ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లతోపాటు, ఈ దేశానికి మేధో పరమైన ఆస్తులు సృష్టించాలన్నదే తమ అభిలాష అని ఐటీసీ సీఈవో సంజీవ్‌పూరి తెలిపారు. ఈ లక్ష్యం దిశగా తమ పని ప్రారంభించినట్టు చెప్పారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం నుంచి ఆహారం, విద్య, స్టేషనరీ, అగర్బత్తి వరకు అన్నింటా ప్రపంచ స్థాయి ఉత్పాదనలు రూపొందించడం ద్వారా తమ లక్ష్యాలను చేరుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుత విభాగాల్లో బలోపేతం కావడమే కాకుండా నూతన విభాగాల్లోకీ ప్రవేశిస్తామన్నారు. 2015–16లో ఐటీసీ ఎఫ్ఎంసీజీ మొత్తం ఆదాయం రూ.28.410 కోట్లుగా ఉండగా ఇందులో ఒక్క సిగరెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.18,686 కోట్లు. వచ్చే కొన్నేళ్లలో ఎఫ్ఎంసీజీ విభాగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడి ద్వారా 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చేరుకుంటామని ఐటీసీ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. మాకు ఎన్నో బలాలున్నాయ్... ఎఫ్ఎంసీజీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు తమకు ఎన్నో బలాలున్నాయని పూరి తెలిపారు. భారీ స్థాయిలో అగ్రి వ్యాపార విభాగం, పాక శాస్త్ర నిపుణులు, సంప్రదాయ బ్రాండ్ విలువ, మార్కెటింగ్ తదితరమైనవి తమ బలాలుగా పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ విభాగంలో ఇప్ప టి వరకు 350 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. ఈ బలాలతో ఎఫ్ఎంసీజీ రంగంలో వేగంగా వృద్ధి చెందగలమనే ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. ఐటీసీకి 25 బ్రాండ్లు ఉన్నాయ ని, కొన్నింటిలో నంబర్1, కొన్నింటిలో నంబర్ 2, 3 స్థానాల్లో ఉండగా... అన్నింటా నంబర్ 1 స్థానానికి చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ఈక్విటీ బెంచ్మార్కులు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ముగిశాయి. గత మూడు నెలల కాలంలో అతిపెద్ద వారాంత లాభాలుగా మార్కెట్లు రికార్డు కెక్కాయి. సెన్సెక్స్ 52.90 పాయింట్ల లాభంలో 26,747.18వద్ద, నిఫ్టీ 14.90 పాయింట్ల లాభంలో 8,261.75 పాయింట్ల లాభంలో ముగిశాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ లాభాలు పండించగా.. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, మహింద్రా అండ్ మహింద్రా, సిప్లా సెన్సెక్స్‌లో నష్టాలు గడించాయి. ప్రారంభ లాభాలను మార్కెట్లు నిలబెట్టుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రేట్లను యథాతథం కొనసాగిస్తున్నట్టు ప్రకటించి మార్కెట్లను నిరాశపరిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజీని కొనసాగిస్తుందనే అంచనాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి మంచి వారాంత లాభాలను రెండు ఇండెక్స్‌లు నమోదుచేశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు బలహీనపడి 67.45గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర కూడా 50 రూపాయల నష్టంతో రూ.27,727గా నమోదైంది. -
ఐటీసీ సిగరెట్ అమ్మకాలు పెరిగాయ్
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయత్రైమాసిక ఫలితాలు బుధవారం ప్రకటించింది. క్యూ2లో ఐటీసీ 10 శాతం ఎగిసిన నికర లాభాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో సిగరెట్ అమ్మకం అదాయంలో కూడా ఆశ్చర్యకరమైన వృధ్ధిని నమోదుచేసింది. గత ఏడాదితో పోలిస్తే రూ.7963 కోట్లతో పోలిస్తే రూ. 8,528కోట్లను తాకినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర లాభాలను రూ. 2,500 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.2,262కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన సంస్థ రూ.13,616 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రూ.12,611కోట్లతో పోలిస్తే ఇది 8 (7.97)శాతం పుంజుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 7 శాతం ఎగసి రూ. 3630 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 26.8 శాతం నుంచి 26.9 శాతానికి నామమాత్రంగా బలపడ్డాయి. దీంతో మార్కెట్లో ఐటీసీ షేర్ ధర స్వల్ప లాభంతో ముగిసింది. -
అమెరికా సబ్సిడరీ వాటా అమ్మనున్న ఐటీసీ
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం, సిగరెట్ ఉత్పత్తి మేజర్ ఐటీసీ అమెరికాలోని తన సబ్సిడరీ సంస్థ 'కింగ్ మేకర్ మార్కెటింగ్' లో పూర్తి వాటాను విక్రయించాలని భావిస్తోంది. అమెరికా మార్కెట్ లో ఐటీసీ సిగరెట్ ఉత్పత్తులను విక్రయించే ఈ కంపెనీలోని వాటా విక్రయానికి (24 మిలియన్ డాలర్లు) రూ.160 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ ప్రతిపాదనకు కార్పొరేట్ నిర్వహణ కమిటీ ఆమోదం లభించిందనీ బీఎస్ఈ ఫైలింగ్ లో ఐటీసీ తెలిపింది. అక్టోబర్ 8, 2016 న ఈ ఒప్పందం నమోదు చేయబడిందనీ, ఈ డీల్ ముగిసిన అనంతరం అమెరికా లోని కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థతో తమ సబ్సిడరీ ముగుస్తుందని స్పష్టం చేసింది. కాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం కేంద్రంగా కింగ్ మేకర్ మార్కెటింగ్ సేవలు అందిస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ లో ఏస్, చెకర్స్ , హెచ్ఐ వాల్, గోల్డ్ క్రెస్ట్ బ్రాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ వార్తలతో ఐటీసీ షేర్ 1,85 శాతం లాభపడి రూ 240.85 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ టెక్నాలజీ కేంద్రం!
♦ 20-30 మిలియన్ యూరోల పెట్టుబడి ♦ 2017 జనవరిలో ప్రారంభం ♦ 2020 నాటికి 2,500 మందికి ఉపాధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ కంపెనీ అడుగుపెట్టింది. జర్మనీకి చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ ఫ్రీడ్రిచ్షవెన్ సంస్థ దేశంలో తొలి టెక్నాలజీ సెంటర్‌ను (ఐటీసీ) గచ్చిబౌలిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారమిక్కడ తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు, జెడ్ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ సురేష్ కేవీ, వైస్ ప్రెసిడెంట్ (ఆర్అండ్డీ) డాక్టర్ ఎక్కార్ట్ వోన్ వెస్టర్హాల్ట్, ఇండియా టెక్నాలజీ సెంటర్ (ఐటీసీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మమతా చామర్తి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కొన్నేళ్లుగా జెడ్ఎఫ్ భారత అవసరాలకు తగ్గట్టుగా విడిభాగాలను స్థానికీకరిస్తోందని, భారత్‌లోని టాలెంట్‌ను ఆకర్షించడానికి ఈ కేంద్రం కీలకమని ఈ సందర్భంగా జెడ్ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. ఇక్కడి నుంచి టెక్నాలజీ సొల్యూషన్లను వివిధ దేశాలతో పాటు స్థానిక కంపెనీలకూ అందిస్తామన్నారు. విలేకరులతో మమతా చామర్తి మాట్లాడుతూ... 20-30 మిలియన్ యూరోల పెట్టుబడితో (దాదాపు రూ.150- 200 కోట్లు) ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సెంటర్ నుంచి అంతర్జాతీయంగా ఉన్న ఇతర జెడ్ఎఫ్ డెవలప్మెంట్ సెంటర్లకు ఐటీ సహకారాన్ని అందించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారామె. ‘‘ఈ కేంద్రంలో 2020 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుతం ఇందులోని 1,000 మంది ఉద్యోగులు టీసీఎస్, టెక్ మహీంద్రాలో ఆన్సైట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు’’ అని తెలియజేశారు. ప్రస్తుతానికైతే గచ్చిబౌలిలో స్థలాన్ని లీజుకు తీసుకున్నామని.. త్వరలో సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారామె. మూడు దశాబ్ధాలకు పైగా దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెడ్ఎఫ్ గ్రూప్‌కు దేశంలో 26 ప్లాంట్లలో 12 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 టెక్నాలజీ సెంటర్లున్నాయి. 40 దేశాల్లో 230 ప్రాంతాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులున్నారు. 2015లో కంపెనీ అమ్మకాలు 29.2 బిలియన్ యూరోలని కంపెనీ నివేదించింది. -
లాభాల్లో దేశీయ సూచీలు
ముంబై : బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగనుందన్న నేపథ్యంలో మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 105.36 పాయింట్ల లాభంతో 28,108 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27.95 పాయింట్ల లాభంతో 8664 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఐటీసీ, ఎల్&టీ, మారుతీ సుజుకీ షేర్లలో కొనుగోలు మద్దతు జోరు కొనసాగుతుండటంతో, ఈ షేర్లు మార్కెట్లో లాభాలను పండిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, విప్రోలు నష్టాలను గడిస్తున్నాయి. 8,625 కు 8750 మార్కుకు మధ్య కీలకమైన పరిధిలో నిఫ్టీ నేడు ట్రేడ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.. అమెరికా మార్కెట్లు సైతం సోమవారం రోజు కిందకే నమోదయ్యాయి. దీంతో గ్లోబల్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడొచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.26 పైసలు బలపడి, 66.74గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పడిపోయి 31,545గా నమోదవుతోంది. -
ఐటీసీ కొత్త సీఓఓగా సంజీవ్ పురి
న్యూఢిల్లీ: ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, సీఓఓగా, పూర్తికాల డెరైక్టర్‌గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. సంజివ్ పురిని డెరైక్టర్(ఎఫ్ఎంసీజీ బిజినెస్)గా పి.ధోబలే స్థానంలో గత ఏడాది డిసెంబర్ 6న కంపెనీ నియమించింది. -
ఐటీసీ సీవోవో గా సంజీవ్ పూరి
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సంజీవ్పూరిని నియమించింది. 1986లో పూరి ఐటీసీలో చేరిన పూరి ప్యాకేజింగ్, అండ్ ప్రింటింగ్ బిజినెస్ లో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవ్ పరి పూర్తి కాలపు డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ బోర్డ్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఎస్ఈ కి సంస్థ నివేదించింది. జులై 22న నిర్వహించిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఈయన నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది . ఈ మేరకు సమాచారాన్ని సంస్థ బీఎస్ఈకు తెలియజేసింది. 53 సంవత్సరాల పూరికి ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. ఐటీసీ సంస్థలో ఆయన చాలా వేగంగా ఎదిగారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన ఫలితాలో ఐటీసీ మెరుగైన ఫలితాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఐటీసీ లాభం 2,385 కోట్లు క్యూ1లో 10 శాతం వృద్ధి
ఆదాయం 8 శాతం అప్; రూ.13,157 కోట్లు న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో (2016-17, క్యూ1) స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే కాలంలో లాభం రూ.2,166 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 8.3 శాతం వృద్ధితో రూ. 12,233 కోట్ల నుంచి రూ.13,253 కోట్లకు పెరిగింది. వ్యాపారంలో పలు సవాళ్లు, ఎఫ్ఎంసీజీ రంగంలో డిమాండ్ మందగమనం, సిగరెట్ల పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణల ప్రభావం ఉన్నప్పటికీ స్థిరమైన పురోగతిని సాధించినట్లు ఐటీసీ పేర్కొంది. కంపెనీకి ప్రధాన ఆదాయ వనరైన సిగరెట్ల వ్యాపారం ఆదాయం క్యూ1లో రూ. 8,231 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయం రూ. 7,734 కోట్లతో పోలిస్తే 6.4 శాతం వృద్ధి చెందింది. ఇతర విభాగాలను చూస్తే... ⇒ సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ, ఇతరత్రా విభాగాల ఆదాయం క్యూ1లో 9.5 శాతం పెరిగి రూ. 2,385 కోట్లుగా నమోదైంది. ⇒ హోటళ్ల వ్యాపార ఆదాయం మాత్రం స్వల్పంగా 0.16 శాతం తగ్గి రూ. 287 కోట్లకు పరిమితమైంది. ⇒ అగ్రి బిజినెస్ ఆదాయం 20.15 శాతం ఎగసి రూ. రూ.2,325 కోట్ల నుంచి రూ. 2,794 కోట్లకు వృద్ధి చెందింది. ⇒ పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార ఆదాయం 1.57 శాతం క్షీణించి రూ. 1,322 కోట్లకు తగ్గింది. ⇒ ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో ఐటీసీ షేరు స్వల్ప నష్టంతో రూ.251 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సీఈఓగా దేవేశ్వర్కు చివరి ఏజీఎం.. ఐటీసీ 105వ వాటాదారుల వార్షిక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనుంది. ప్రస్తుతం కంపెనీ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న యోగేష్ చందర్ దేవేశ్వర్ చివరిసారిగా సీఈఓ హోదాలో ఏజీఎంలో మాట్లాడనున్నారు. సీఈఓగా ఆయన పదవీకాలం 2017 ఫిబ్రవరి 4తో పూర్తికానుంది. యువతరానికి అవకాశమివ్వటం కోసం మరోవిడత సీఈఓ బాధ్యతలను చేపట్టకూడదని యోగేశ్వర్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అయితే, చైర్మన్‌గా మాత్రం ఆయన కొనసాగుతారు. సిగరెట్ల వ్యాపారమే ప్రధానంగా కొనసాగుతున్న తరుణంలో 1996లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వచ్చిన యోగేశ్వర్... విభిన్న రంగాల్లోకి కంపెనీని విస్తరించి ఎఫ్ఎంసీజీ దిగ్గజంగా మార్చారు. ఆయన సారథ్యం చేపట్టేనాటికి ఐటీసీ వార్షికాదాయం రూ.5,200 కోట్లు కాగా, ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరింది. ఇక వార్షిక స్థూల లాభం రూ.452 కోట్ల నుంచి 33 రెట్లు ఎగబాకి రూ.14,958 కోట్లకు పెరిగింది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్ 150 పాయింట్ల లాభంతో మొదలైంది. ఇక నిఫ్టీ 7,750 పాయింట్ల బెంచ్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 25,366 పాయింట్లుతో, నిఫ్టీ 7,770 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఐటీసీ షేర్లు దూసుకు పోతున్నాయి. మరోవైపు టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నాయి. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి, 25,302 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి. మరోవైపు రూపాయి కూడా 16 పైసలు లాభపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.25గా ఉంది. -
త్వరలో ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తి పునఃప్రారంభం!
న్యూఢిల్లీ: సిగరెట్ల ఉత్పత్తిని త్వరలో పునఃప్రారంభిస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది. పొగతాగడం హానికరమని సూచిస్తూ... సిగరెట్ కవర్‌పై 85 శాతం మేర ‘హెచ్చరిక చిత్రం’ ముద్రించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ... టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నేతృత్వంలోని పలు కంపెనీలు ఏప్రిల్ 1 నుంచీ తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. టీఐఐలో ఐటీసీసహా గాడ్ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటివి సభ్యత్వ సంస్థలుగా ఉన్నాయి. అసలు ఈ నిబంధనల్లో స్పష్టతలేదని కూడా ఆయా కంపెనీలు పేర్కొన్నాయి. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఐటీసీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చినందువల్ల త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి సమర్పించిన ఒక ఫైలిం గ్లో తెలిపింది. కంపెనీకి ఐదు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. అయితే ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ స్పష్టమైన తేదీని తెలపలేదు. కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఉత్పత్తి ఆగినా.. సరిపడినంత సరుకుంది: ఐటీసీ
న్యూఢిల్లీ: ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ మార్కెట్లో సరిపడినంత సిగరెట్ స్టాక్ అందుబాటులో ఉందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ స్పేస్‌లో 85 శాతాన్ని పెద్ద పెద్ద హెచ్చరిక గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే కొత్త నిబంధనల (ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వ చ్చాయి) నేపథ్యంలో ఐటీసీ కంపెనీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. నిబంధనల అమలుకు ఇంకా తాము సంసిద్ధమవ్వలేదని, ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫ్యాక్టరీలు కార్యకలాపాలు జరగవని ఐటీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. హెచ్చరిక గుర్తుల ప్యాకేజింగ్ స్పేస్ సగటు అంతర్జాతీయంగా 31 శాతంగా, టాప్-5 పొగాకు ఉత్పత్తి దేశాల్లో (చైనా, బ్రె జిల్, అమెరికా, మలావి, జింబాంబ్వే) 20%గా ఉందని తెలిపారు. -
ఐటీసీ చేతికి టెక్నికో ఆగ్రి సైన్సెస్
డీల్ విలువ రూ.121 కోట్లు కోల్‌కతా: బయోటెక్నాలజీ వ్యాపార సంస్థ అయిన టెక్నికో ఆగ్రి సెన్సైస్ ఇండియా(టెక్నికో ఇండియా) కంపెనీని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కొనుగోలు చేసింది. టెక్నికో ఆగ్రి సెన్సైస్‌కు చెందిన పూర్తి ఈక్విటీ వాటాను ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికో పీటీవై లిమిటెడ్ నుంచి రూ.121 కోట్లకు కొనుగోలు చేశామని ఐటీసీ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. ఈ వాటా కొనుగోలు కారణంగా ఇప్పటిదాకా టెక్నికో పీటీవై లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీగా ఉన్న టెక్నికో ఇండియా ఇక నుంచి ఐటీసీ అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. ఈ కంపెనీ కొనుగోలు వల్ల తమ వ్యాపారం మరింతగా మెరుగవుతుందని, నిర్వహణ సామర్థ్యాలు కూడా పెరుగుతాయని ఐటీసీ వెల్లడించింది. -
3వ అత్యంత విలువైన కంపెనీగా ఐటీసీ
ముంబై: ఐటీసీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి. -
ఐటీసీ లాభం రూ.2,653 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి స్వల్పంగా వృద్ధి చెందింది. గత క్యూ3లో రూ.2,635 కోట్లుగా ఉన్న నికరలాభం(స్డాండోలోన్) ఈ క్యూ3 లో 2,653 కోట్లకు పెరిగిందని ఐటీసీ తెలిపింది. సిగరెట్ల వ్యాపారంపై ఒత్తిడి కొనసాగుతుండడం, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో డిమాండ్ మందగించడం, వ్యవసాయ కమోడిటీల్లో వ్యాపార అవకాశాల్లేకపోవడం దీనికి కారణాలని కంపెనీ పేర్కొంది. నికర అమ్మకాలు రూ.8,800 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ.9,103 కోట్లకు ఎగసినట్లు వివరించింది. తగ్గిన వ్యవసాయ వ్యాపారం గత క్యూ3లో రూ.6,456 కోట్లుగా ఉన్న సిగరెట్లతో సహా ఎఫ్ఎంసీజీ వ్యాపార ఆదాయం ఈ క్యూ3లో 6 శాతం వృద్ధితో రూ.6,858 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సిగరెట్ల వ్యాపారం రూ.4,142 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.4,380 కోట్లకు పెరిగిందని వివరించింది. అధిక పన్నులు, కేంద్రం నిబంధనలు.. సిగరెట్ల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. ఎఫ్ఎంసీజీ విభాగం రూ.2,314 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.2,478 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డిమాండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉండడం, చెన్నై వరదల కారణంగా సరఫరాలు అతలాకుతలమవడం వల్ల ఎఫ్ఎంసీజీ విభాగ ఆదాయం దెబ్బతిన్నదని వివరించింది. హోటల్ వ్యాపారం రూ.330 కోట్ల నుంచి 4.5 శాతం వృద్ధితో రూ.345 కోట్లకు పెరిగిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ.308 వద్ద ముగిసింది. -
ఫలితాలతో నిరాశ...
ఐదో రోజూ నష్టాల్లోనే మార్కెట్ * 181 పాయింట్ల నష్టంతో 26,657కు సెన్సెక్స్ * 46 పాయింట్ల నష్టంతో 8,066కు నిఫ్టీ ముంబై: ఐటీసీ, లార్సెన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈ రెండు కంపెనీల ఆర్థిక ఫలితాలతో భారత కంపెనీల ఆర్థిక స్థితిగతులపై తాజాగా ఆందోళనలు తెరమీదకు రావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 181 పాయింట్లు నష్టపోయి 26,657 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 8,066 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుతుండడం, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం.. ఈ అంశాలు ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాలపాలయ్యాయి. వరుసగా ఐదో రోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలొచ్చాయి. ఈ వారంలో సెన్సెక్స్814 పాయింట్లు(3 శాతం), నిఫ్టీ 230 పాయింట్ల (2.84 శాతం)చొప్పున నష్టపోయాయి. లాభాల నుంచి నష్టాల్లోకి... బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఒక దశలో 105 పాయింట్లు లాభపడింది. ఐటీసీ, ఎల్ అండ్ టీ నిరాశమయ ఫలితాలతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 181 పాయింట్ల నష్టంతో 26,657 పాయింట్ల వద్ద ముగిసింది. -
తెలంగాణలో 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు రూ.8 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలోని పేపర్ బోర్డు మిల్లు విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో రూ.800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో రూ.1,000 కోట్లతో ఐటీసీ హోటల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. నియామకాలు - ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ - ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సీఈవోగా జేమ్స్ మర్డోక్? - మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తాజాగా ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని, కుమారుడు జేమ్స్‌కి (42) పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. - ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉమాంగ్ నరులా నియమితులయ్యారు - ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఎంట్రప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్’గా ఐటీ రంగ నిష్ణాతుడు రవి గరికపాటి నియమితులయ్యారు. - ప్రభుత్వ రంగంలోని సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా స్టీల్ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. -
తెలంగాణలో రూ. 8 వేల కోట్ల పెట్టుబడులు: ఐటీసీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించిన పారిశ్రామిక విధానానికి భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా ఐటిసీ కంపెనీ ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడుల వివరాలను కంపెనీ ఛైర్మన్ వై.సి. దేవేశ్వర్ శుక్రవారం వెల్లడించారు. దాదాపు రూ. 8 వేల కోట్లతో వివిధ ప్రాంతాల్లో తమ కంపెనీని విస్తరించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో పేపర్ బోర్డు ప్లాంట్ విస్తరణకు రంగం సిద్ధం చేశామన్నారు. మెదక్ లో రూ. 800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. మరో వెయ్యి కోట్లను వెచ్చించి తమ రెండో ఐటీసీ హోటల్‌ను మెదక్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హెచ్ఐసీసీలో శుక్రవారం టీఆర్ఎస్ ప్రభుత్వం టీఐ పాస్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. పారిశ్రామిక వేత్తలు, కంపెనీల సీఈవోలతో జరిగిన ఈసమావేశంలో మైక్రోసాఫ్ట్, టాటా, ఐటీసీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. అమెరికా, కెనడా, స్వీడన్, గల్ప్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు హాజరయ్యారు. -
స్టాక్స్ వ్యూ
ఐటీసీ - బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.329, టార్గెట్ ధర: రూ.394 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం 0.6 శాతం వృద్ధితో రూ.9,290 కోట్లకు పెరిగింది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల అమ్మకాల పరిమాణం 10 శాతం తగ్గింది. వ్యవసాయ విభాగపు రాబడులు 29 శాతం తగ్గాయి, కొత్త కంపెనీల చట్టం ప్రకారం అదనపు తరుగుదల వ్యయాల కారణంగా హోటల్ విభాగం రాబడులు కూడా తగ్గాయి. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు 11 శాతం వృద్ధిని సాధించాయి. వచ్చే బడ్జెట్లో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం హేతుబద్ధీకరణ జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి సిగరెట్ల విభాగం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు కూడా దూసుకుపోతుండడం సానుకూలాంశం. 2007-08లో 16 శాతంగా ఉన్న మొత్తం అమ్మకాల్లో ఎఫ్ఎంసీజీ వాటా 2013-14లో 25 శాతానికి పెరిగింది. ఇదే జోరు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. కొత్త కొత్త కేటగిరీల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలనే సావ్లాన్, షవర్ టు షవర్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఎస్బీఐ - బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.282, టార్గెట్ ధర: రూ.357 ఎందుకంటే: ట్రెజరీ ఆదాయం 314 శాతం పెరగడం, ఆదాయపు పన్ను రీఫండ్‌పై వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, తక్కువ కేటాయింపులు తదితర కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం అంచనాలను మించింది. 23 శాతం వృద్ధి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 29 శాతం)తో రూ.3,740 కోట్లకు పెరిగింది. గత ఏడాది కాలం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 4.9శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4.25 శాతానికి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు మరింతగా తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రుణాలు 8 శాతం, డిపాజిట్లు 13 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆస్తుల నాణ్యత, పనితీరుల్లో మంచి వృద్ధినే సాధించింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఈ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ జోరు పెరుగుతుంది. టీవీ టుడే - బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ - ప్రస్తుత ధర: రూ.184, టార్గెట్ ధర: రూ.240 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.114 కోట్లకు పెరిగింది. ఢిల్లీ ఎన్నికలు, ఆస్ట్రేలియాలో క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా కంపెనీ నిర్వహణ వ్యయాలు పెరిగాయి. పోటీ పెరగడంతో మార్కెటింగ్ వ్యయాలు కూడా పెరిగాయి. దీంతో మొత్తం వ్యయాలు 46 శాతం పెరిగాయి. నికర లాభం రూ.8.7 కోట్లకే పరిమితమైంది. హిందీ వార్తా చానెళ్లలో ఈ సంస్థకు చెందిన ఆజ్ తక్ అగ్రస్థానం గత పదేళ్లుగా కొనసాగుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయ్, కరణ్ థాపర్ వంటి హేమాహేమీలు డెరైక్టర్ల బోర్డ్లోకి రావడంతో ఈ సంస్థ ఇంగ్లీస్ న్యూస్ చానెల్, హెడ్‌లైన్స్ టుడే జోరు పెరుగుతోంది. ప్రకటనల ఆదాయం 18 శాతం పెరిగింది. డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయితే, మరింత మంది చందాదారులకు చానెల్ చేరువవుతుంది. ఆదాయం 7 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఇబిటా 26 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. -
ఐటీసీ లాభం రూ.2,361 కోట్లు
- క్యూ4లో 3.65 శాతం వృద్ధి - షేరుకి రూ.6.25 డివిడెండ్ న్యూఢిల్లీ: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీ లాభాల జోరు తగ్గింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్(2014-15, క్యూ4)లో సంస్థ నికర లాభం స్వల్పంగా 3.65 శాతం వృద్ధి చెంది రూ.2,361 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.2,278 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి మందగించడం, వ్యవసాయోత్పత్తుల విభాగ ఆదాయాలు క్షీణించడం.. లాభాలపై ప్రభావం చూపాయి. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.9,188 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరం క్యూ4లో రూ.9,145 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా 0.47 శాతమే ఆదాయం పెరిగింది. విభాగాల వారీగా...: - కంపెనీకి అత్యంత ప్రధానమైన ఎఫ్ఎంసీజీ(సిగరెట్లతో సహా) విభాగం ఆదాయం క్యూ4లో 6 శాతం పెరిగి రూ.6,771 కోట్లుగా నమోదైంది. ఇందులో సిగరెట్ల వ్యాపారం నుంచి ఆదాయం కేవలం 3.23 శాతం వృద్ధితో రూ.4,211 కోట్లుగా ఉంది. సిగరెట్లేతర ఎఫ్ఎంసీజీ వ్యాపారం ఆదాయం 10.88 శాతం వృద్ధి చెంది రూ.2,567 కోట్లను తాకింది. - హోటళ్ల వ్యాపారం క్యూ4 ఆదాయం 8.08 శాతం వృద్ధితో రూ.321 కోట్ల నుంచి రూ.346 కోట్లకు పెరిగింది. - అగ్రి(వ్యవసాయ సంబంధ) బిజినెస్ ఆదాయం 28.75 శాతం పడిపోయి రూ.1,428 కోట్లకు పరిమితమైంది. - పేపర్, పేపర్‌బోర్డులు, ప్యాకేజింగ్ వ్యాపారానికి సబంధించి ఆదాయం కూడా 4.64 శాతం దిగజారి రూ.1,203 కోట్లుగా నమోదైంది. - ఇక 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ నికర లాభం రూ.9,608 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది రూ.8,785 కోట్లతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధితో రూ.32,883 కోట్ల నుంచి రూ.36,083 కోట్లకు ఎగసింది. - కంపెనీ బోర్డు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకి రూ.6.25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. -
ఎస్బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి
⇒ రూపాయి విలువ, క్రూడ్ ధరల ప్రభావం ⇒ వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం కోసం చూపు న్యూఢిల్లీ: ఎస్బీఐ, ఐటీసీతో సహా ఇతర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత అంశం, రూ పాయి మారకపు విలువ, ముడి చమురు ధర కూడా మార్కెట్ కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. ఈ వారం ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టాటా పవర్, డీఎల్ఎఫ్ తదితర ప్రధాన కంపెనీలు క్యూ4 కార్పొరేట్ ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్ల నిరుత్సాహకర ఫలితాల్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, రాబోయే ఫలితాలు ప్రోత్సాహకరంగావుంటే ట్రెండ్ మెరుగుపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి రెండూ తగ్గడంతో వడ్డీ రేట్లపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గడంతో పాటు మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి ఐదునెలల కనిష్టస్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2 నాటి పరపతి విధాన సమీక్షలోగానీ, లేదా అంతకుముందుగానీ ఆర్బీఐ చర్యలు (వడ్డీ రేట్లు తగ్గించడం) తీసుకొనే అవకాశం వుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలవల్ల ఏర్పడిన లిక్విడిటీ కొరత మార్కెట్‌కు ఆందోళనకారకమని ఆమ్రపాలి ఆద్యా రీసెర్చ్ హెడ్ అబ్నీష్ కుమార్ అన్నారు. గతవారం మార్కెట్... ఆటో, బ్యాంకింగ్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా రెండోవారం దేశీ మార్కెట్ పెరిగింది. క్రితం వారం సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. గత 2 వారాల్లో సెన్సెక్స్ 312 పాయిం ట్లు మెరుగుపడింది. గతవారం నిఫ్టీ 71 పాయింట్లు ర్యాలీ జరిపి 8,262 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎఫ్ఐఐల అమ్మకాలు రూ. 17,000 కోట్లు పన్నుల వివాదం కొనసాగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మే నెల తొలి రెండు వారాల్లో దాదాపు రూ. 17,000 కోట్లు నికరంగా విక్రయించారు. రూ. 7,635 కోట్ల విలువైన షేర్లను, రూ. 9,088 కోట్ల విలువైన రుణపత్రాల్ని వారు విక్రయించడంతో, మొత్తం నికర అమ్మకాలు రూ. 16,723 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. ఎందుకు పెరిగాయంటే... ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి చేరింది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి క్షీణించింది. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త కనిష్ట స్థాయిలకు చేరింది. గత వారంలో వెలువడిన ఈ గణాంకాల కారణంగా ఆర్బీఐ కీలక రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగాయి. దీంతో వడ్డీరేట్లతో సంబంధమున్న బ్యాంక్, వాహన, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఇటీవల స్టాక్ మా ర్కెట్ పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఎందుకు తగ్గాయంటే... నికర లాభం 72 శాతం క్షీణించడంతో హెచ్‌డీఐఎల్, ఫ్లాట్ల విక్రయాల్లో డీఎల్ఎఫ్ కంపెనీ అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో డీఎల్ఎఫ్ షేర్లు పతనమయ్యాయి. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ కూడా జరిగింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై ఆందోళన, నిరాశజనకంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, డాలర్‌తో రూపాయి మారకం 64కు క్షీణించడం, జీఎస్టీ, భూ సేకరణ బిల్లుల ఆమోదంలో అనిశ్చతి, తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను కొనసాగించారు. -
ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు
⇒ క్యూ3లో 10.5% పెరుగుదల ⇒ సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతే... న్యూఢిల్లీ: బహుళ వ్యాపార రంగ దిగ్గజం ఐటీసీ.. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.2,635 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,385 కోట్లతో పోలిస్తే లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. అయితే, కంపెనీ ఆదాయం మాత్రం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ.8,800 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో ఆదాయం రూ.8,623 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగా కొనసాగడం మొత్తం ఆదాయాల పెరుగుదలపై ప్రభావం చూపింది. ఫలితాల్లో ముఖ్యాంశాలివీ... * సిగరెట్లు, ఇతరత్రా ఎఫ్ఎంసీజీ విభాగాల నుంచి క్యూ3లో రూ.6,456 కోట్ల ఆదాయం కంపెనీకి సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 4.23% పెరిగింది. ఇందులో ఒక్క సిగరెట్ల విభాగం నుంచి రూ.4,142 కోట్ల ఆదాయం లభించింది. వృద్ధి 0.62%కి పరిమితమైంది. * గతేడాది బడ్జెట్లో సిగరెట్లపై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు పూర్తి ప్రభావంతో పాటు.. తమిళనాడు, కేరళ, అసోంలు వ్యాట్‌ను పెంచడంతో ఈ విభాగం నుంచి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. * ఇక హోటళ్ల వ్యాపార ఆదాయం మూడో క్వార్టర్లో 4.69% పెరిగి రూ.330 కోట్లుగా నమోదైంది. * అగ్రి బిజినెస్ ఆదాయం 10.55 శాతం దిగజారి రూ.1,598 కోట్లకు పరిమితమైంది. * పేపర్ బోర్డులు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార విభాగం ఆదాయం కూడా 4.66 శాతం క్షీణించి రూ.1,199 కోట్లకు తగ్గిపోయింది. * ఆదాయాల్లో వృద్ధి మందగమనంతో ఐటీసీ షేరు కుప్పకూలింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 5.01%(రూ.18.60) క్షీణించి రూ.352.60 వద్ద ముగిసింది. -
చివర్లో అమ్మకాలు
105 పాయింట్లు నష్టం 28,458 వద్దకు సెన్సెక్స్ నిఫ్టీ 26 పాయింట్లు డౌన్ చివర్లో పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,458 వద్ద నిలవగా, 26 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,538 వద్ద స్థిరపడింది. దీంతో వారం మొత్తంగా కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఏడు వారాల తరువాత మళ్లీ సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయింది. కాగా, బీఎస్ఈలో ప్రధానంగా ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1.5% స్థాయిలో నష్టపోయాయి. మరోపక్క ఎఫ్ఎంసీజీ, రియల్టీ ఇండెక్స్‌లు 1%పైగా బలపడ్డాయి. ఏడు మాత్రమే... సెన్సెక్స్ దిగ్గజాలలో ఏడు షేర్లు మాత్రమే లాభపడగా, ఐటీసీ, ఎంఅండ్ఎం, సెసాస్టెరిలైట్ 2% స్థాయిలో పుంజుకున్నాయి. అయితే హెల్త్‌కేర్‌లో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, ఐటీ బ్లూచిప్స్‌లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1.5% మధ్య నీరసించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో భాగమైన స్పైస్‌జెట్ 14% పతనమైంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రుణ సౌకర్యాన్ని రద్దు చేయడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో షసున్ ఫార్మా, కేశోరామ్, అలోక్, సుజ్లాన్, ఎల్జీ, సద్భావ్ ఇంజినీరింగ్, ఏపీఎల్, ఐడియా, వైభవ్ గ్లోబల్, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, హాట్సన్, త్రివేణీ, బీఎఫ్ యుటిలిటీస్, జెట్ ఎయిర్వేస్ తదితరాలు 5-3% మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్ 5% పుంజుకోగా, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్, యూనిటెక్ 1% చొప్పున లాభపడ్డాయి. -
3 రోజుల నష్టాలకు చెక్
సెన్సెక్స్ 120 పాయింట్లు ప్లస్ 28,563 వద్ద ముగింపు కొత్త గరిష్టాన్ని తాకిన నిఫ్టీ మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మార్కెట్ పురోగమించింది. ప్రధానంగా సెన్సెక్స్ దిగ్గజం ఐటీసీ 5.5% పుంజుకోవడం ద్వారా మార్కెట్‌కు అండగా నిలిచింది. ప్రభుత్వం విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించబోవడంలేదన్న వార్తలు ఇందుకు దోహదపడ్డాయి. వెరసి బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ రంగం అత్యధికంగా 3% జంప్‌చేసింది. సెన్సెక్స్ 120 పాయింట్లు లాభపడి 28,563 వద్ద నిలవగా, 27 పాయింట్లు పురోగమించిన నిఫ్టీ 8,564 వద్ద ముగిసింది. అంతకుముందు ఒక దశలో 8,627కు చేరడం ద్వారా కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల్లో విదేశీ మార్కెట్లు: ఆర్థిక వ్యవస్థ పటిష్టస్థాయిలో పురోగమిస్తున్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు బుధవారం కొత్త గరిష్టాలనుతాకగా, ఈ ప్రభావంతో గురువారం చైనా ఇండెక్స్ 4% పుంజుకుంది. ఈ బాటలో ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. కాగా, గురువారం సాయంత్రం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగిస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. వచ్చే డిసెబర్కల్లా 9,500కు నిఫ్టీ :గోల్డ్‌మన్ శాక్స్ 2015 డిసెంబర్‌కల్లా నిఫ్టీ 9,500 పాయింట్లను తాకుతుందని తాజా గా యూఎస్ బ్రోకరేజీ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో వర్థమాన దేశాలలో భారత్ ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తుందని తన తాజా నివేదికలో తెలిపింది. -
ఐటీసీ లాభం రూ. 2,425 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ రూ. 2,425 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది (2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,230 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధికాగా, ఎఫ్ఎంసీజీ, సిగరెట్ల బిజినెస్‌లో సాధించిన పురోగతి ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఆదాయం రూ.7,863 కోట్ల నుంచి రూ.9,024 కోట్లకు ఎగసింది. అయితే విమ్కోకు చెందిన ఇంజనీరింగ్యేతర బిజినెస్‌ను విడదీసి, కంపెనీలో విలీనం చేసినందున ఫలితాలను పోల్చిచూడలేమని ఐటీసీ పేర్కొంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ: క్యూ2లో సిగరెట్ల బిజినెస్ నుంచి రూ.4,251 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఇది రూ. 3,724 కోట్లు. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 6,447 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఇది రూ. 5,686 కోట్లు మాత్రమే. పన్నుల పెంపు, చట్టవిరుద్ధ తయారీ, స్మగ్లింగ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిగరెట్ల బిజినెస్‌లో వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. సిగరెట్ ప్యాక్‌పై 85% వరకూ చట్టబద్ధ హెచ్చరికలతోనే నింపమంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాల కారణంగా బిజినెస్‌కు విఘాతం కలిగే అవకాశముం దని తెలిపింది. వ్యవసాయ బిజినెస్ ఆదాయం రూ. 1,772 కోట్ల నుంచి రూ. 2,059 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 355 వద్ద ముగిసింది. -
తయారీ రంగ ఆందోళనలు
గత తొమ్మిది నెలల్లోలేని విధంగా సెప్టెంబర్ నెలకు తయారీ రంగం మందగించిన సంకేతాలు తాజాగా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. వెరసి సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 26,568 వద్ద ముగిసింది. హెచ్ఎస్బీసీ ఇండియా పీఎంఐ సూచీ గణాంకాలు త యారీ రంగ మందగమనాన్ని వెల్లడించడంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 7,945 వద్ద నిలిచింది. బీఎస్ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ నష్టపోవడం గమనార్హం. డాలరుతో మారకంలో రూపాయి 62కు పడటం ద్వారా ఏడు నెలల కనిష్టానికి చేరడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. విప్రో 3.2%, ఇన్ఫోసిస్ 2.7%, టీసీఎస్ 1.4% చొప్పున ఎగశాయి. గ్లోబల్ దిగ్గజం ఒరాకిల్‌తో సర్వీసుల ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పేర్కొన్న ఇన్ఫోసిస్ ఐటీ షేర్లకు జోష్‌నిచ్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆయిల్, ఎఫ్ఎంసీజీ డీలా బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 2% పుంజుకోగా, ఆయిల్, ఎఫ్ఎంసీజీ 1.5% స్థాయిలో నీరసించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో మారుతీ, టాటా పవర్, టాటా స్టీల్, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్ 3-1.5% మధ్య నష్టపోయాయి. మరోవైపు ఎంఅండ్ఎం 2%, హీరోమోటో 1% చొప్పున లాభపడ్డాయి. నేటి నుంచి వరుస సెలవులు గురువారం(2) నుంచి స్టాక్ మార్కెట్లకు మంగళవారం(7) వరకూ వరుసగా సెలవులు వచ్చాయి. గురువారం(2న) మహాత్మా గాంధీ జయంతికాగా, శుక్రవారం(3న) విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. ఇక శని, ఆదివారాలు యథాప్రకారం సెలవులుకాగా, సోమవారం(6న) బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ మళ్లీ మంగళవారమే(7న) మొదలుకానుంది. కాగా, ఐదు రోజులపాటు వరుసగా స్టాక్ మార్కెట్లకు సెలవులు రావడం అరుదైన విషయమని విశ్లేషకులు పేర్కొన్నారు. -
రూ.100 లక్షల కోట్లకు చేరువలో మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళుతున్న నేపథ్యంలో మార్కెట్ విలువసైతం భారీగా పుంజుకుంటోంది. వెరసి బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 100 లక్షల కోట్లకు చేరువైంది. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 96,25,517 కోట్లను తాకింది. మరో రూ. 3.74 లక్షల కోట్లు జమ అయితే రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని చేరుతుంది. గత శుక్రవారానికి ఈ విలువ డాలర్ల రూపేణా 1.58 ట్రిలియన్లకు చేరింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ విలువ మళ్లీ 1.5 ట్రిలి యన్ డాలర్లను తాకగా, తొలిసారి 2007లో ట్రిలియన్ డాలర్ల క్లబ్లో భారత్ మార్కెట్ చేరింది. అయితే మార్కెట్ల పతనంతో 2008 సెప్టెంబర్‌లో మార్కెట్ విలువ పడిపోగా, తిరిగి 2009 మేలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ బాటలో 2013 ఆగస్ట్‌లో మరోసారి మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడినప్పటికీ 2014లో తిరిగి ప్రాభవాన్ని పొందింది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డు సృష్టించింది. -
నెల రోజుల్లో గరిష్ట నష్టాలు
ఇటీవల వరుస లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ నీరసించాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయింది. 27,057 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆయిల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% చొప్పున తిరోగమించాయి. వెరసి నిఫ్టీ సైతం 59 పాయింట్లు క్షీణించి 8,094 వద్ద నిలిచింది. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే వారం జరగనున్న ఫెడ్ సమావేశంపై మారెట్లు దృష్టిపెట్టాయని చెప్పారు. దీనికితోడు ఇటీవల సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61 స్థాయికి బలహీనపడటం కూడా అమ్మకాలకు కారణమైనట్లు తెలిపారు. దిగ్గజాలకు నష్టాలు: సెన్సెక్స్ దిగ్గజాలలో హీరో మోటో, ఐటీసీ, ఇన్ఫీ, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, భెల్, టీసీఎస్ 2.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోపక్క సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% చొప్పు న లాభపడ్డాయి.కాగా, ట్రేడైన షేర్లలో అత్యధికం లాభపడటం విశేషం. 1,741 షేర్లు లా భాలతో పుంజుకోగా, 1,272 నష్టపోయాయి. -
చిన్న షేర్లు విలవిల
ఇటీవల నెమ్మదించిన చిన్న, మధ్యతరహా షేర్లలో బుధవారం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% పతనంకాగా, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 2.5% జారింది. వెరసి ట్రేడైన షేర్లలో ఏకంగా 2049 నష్టపోగా, కేవలం 871 బలపడ్డాయి. మరోవైపు రోజంతా లాభనష్టాల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 25,919 వద్ద ముగియగా, 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7,740 వద్ద స్థిరపడింది. ఇది 2 వారాల గరిష్టం. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగం 2.2% పుంజుకోవడం మార్కెట్లకు అండగా నిలిచింది. దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 2.5% స్థాయిలో జంప్‌చేయగా, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా 2% లాభపడటం ద్వారా మద్దతు అందించాయి. బ్లూచిప్స్ డీలా, రియల్టీ బోర్లా సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 6.5% పతనమైంది. క్యూ1 ఫలితాలు నిరుత్సాహపరచడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో కోల్ ఇండియా, హిందాల్కో, టాటా పవర్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ 3-2% మధ్య నీరసించాయి. ఇక మరోవైపు అమ్మకాలు పెరగడంతో రియల్టీ ఇండెక్స్ సైతం 5%పైగా తిరోగమించింది. యూనిటెక్ 17% కుప్పకూలగా, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ, డీఎల్ఎఫ్ 8-4% మధ్య దిగజారాయి. -
ఇక రైళ్లలోనూ హైదరాబాదీ బిర్యానీ
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ప్రకటించినట్లుగా ముందుగానే వండి తినేందుకు సిద్ధంగా ఉండే ఆహారాన్ని రైళ్లలో సరఫరా చేసేందుకు ఐటీసీ, ఎంటీఆర్, హల్దీరామ్ వంటి అగ్రశ్రేణి క్యాటరింగ్ సంస్థలను రంగంలోకి దించినట్లు రైల్వే అధికారి ఒకరు వివరించారు. చికెన్ చెట్టినాడ్, హైదరాబాదీ బిర్యానీ, సాంబార్ అన్నం, రాజ్మా చావల్ తదితర వంటకాలను రాజధాని, దురంతో, శతాబ్ది సహా ఆరు రైళ్లలో వారంపాటు ప్రయోగాత్మకంగా అందిస్తామన్నారు. ప్యాకింగ్ చేసి ఉండే ఈ వంటకాలను వడ్డించేందుకు ముందుగా మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేస్తే సరిపోతుందన్నారు. ఈ విధానంపై ప్రయాణికుల నుంచీ వచ్చే స్పందననుబట్టి ఇతర రైళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. -
ఇక ఐటీసీ చాక్లెట్లు...
కోల్‌కతా: దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ.. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. పండ్ల రసాలు, టీ, కాఫీ వంటి పానీయాల(బెవరేజెస్)తో పాటు చాక్లెట్లు, పాల ఉత్పత్తుల(డెయిరీ) రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ ప్రకటించారు. కొత్త విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఇదే అదునైన సమయమని, భవిష్యత్ వ్యాపారాభివృద్ధికి ఈ నిర్ణయాలు దోహదం చేయనున్నాయని బుధవారం ఇక్కడ జరిగిన కంపెనీ 103వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారం నుంచే కంపెనీకి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఆ తర్వాత అగ్రి బిజినెస్ నిలుస్తోంది. ఇంకా హోటళ్లు, పేపర్ తదితర విభాగాల్లో బహుముఖ వ్యాపారాలను ఐటీసీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టిస్తాం... ‘1996లో కంపెనీ పొగాకు ఉత్పత్తుల నుంచి ఇతర రంగాల్లోకి విస్తరించడంపై వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటన్నింటినీ పట్టించుకోకుండా కంపెనీ ముందుకెళ్లడం సంతోషించదగ్గ విషయం. కంపెనీ వృద్ధిని విస్తృతం చేయడంలో ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్)యే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు భారత్‌లో ఐటీసీకి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రంగం కూడా ఇదే. అయితే, దీన్ని ఇంకా బలోపేతం చేసేందుకు భారత్ నుంచి అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టించాలనేది కంపెనీ యోచన. బ్రాండ్ల నిర్మాణం సులువేమీ కాదు. మన బ్రాండ్లు ఇక్కడ పూర్తిస్తాయిలో ఆధిపత్యం చాటుకున్నాక.. ఇతర దేశాలకూ వీటిని విస్తరించడంపై దృష్టిపెడతాం’ అని వాటాదారులకు దేవేశ్వర్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ అమలు చేస్తున్న, ప్రణాళికల్లో ఉన్న ప్రాజెక్టులు 65కు పైగా ఉన్నాయని.. వీటిలో పెట్టుబడుల విలువ రూ.25,000 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారాల నుంచి 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని ఈ సందర్భంగా దేవేశ్వర్ చెప్పారు. -
ఐటీసీ నికర లాభం 18% అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 2,278 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,928 కోట్లతో పోలిస్తే ఇది 18%పైగా వృద్ధి. ఇక నికర అమ్మకాలు సైతం దాదాపు 12% పెరిగి రూ. 9,145 కోట్లను దాటాయి. గతంలో రూ. 8,180 కోట్ల ఆదాయం నమోదైంది. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం వ్యయాలు 8%పైగా తగ్గి రూ. 5,273 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. సమస్యాత్మక బిజినెస్ వాతావరణంలోనూ మంచి ఫలితాలను సాధించగలిగినట్లు వ్యాఖ్యానించింది. కాగా, సిగరెట్లు తదితర ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఆదాయం దాదాపు 13% ఎగసి రూ. 4,079 కోట్లకు చే రగా, సిగరెట్లేతర విభాగం నుంచి 14% అధికంగా రూ. 2,315 కోట్లు లభించింది. పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం 17% పుంజుకుని రూ. 8,891 కోట్లను అధిగమించింది. ఇక నికర అమ్మకాలు దాదాపు 12% ఎగసి రూ. 34,985 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.8% నష్టపోయి రూ. 342 వద్ద ముగిసింది. -
కొత్త గరిష్టం నుంచి జారుడు...
కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి కిందకు దిగిపోయాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మంగళవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 22,041 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్ల పెరుగుదలతో 6,575 పాయింట్లకు చేరాయి. ఇవి రెండు కొత్త రికార్డుస్థాయిలు. చివరకు సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్పలాభంతో 21,833 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 6,516 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ రెండురోజుల సమావేశం మంగళవారం ప్రారంభంకానుండటం, క్రిమియా రష్యాలో విలీనమయ్యే ప్రక్రియ ప్రారంభంకావడం వంటి అంశాలతో గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఎస్బీఐ నేతృత్వంలో యూనియన్‌బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 2-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మారుతి సుజుకి 7 శాతంపైగా పెరగ్గా, ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 1.5-2.5 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రోలు 1-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,012 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 202 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఎస్బీఐ కౌంటర్లో షార్ట్ కవరింగ్..... ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లతో పోలిస్తే వెనుకబడివున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ మంగళవారం స్థిరంగా ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టు నుంచి 1.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 70.26 లక్షల షేర్లకు తగ్గింది. రూ. 1,700 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ ఫలితంగా ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.40 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 64 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లలో వరుసగా 4,80 లక్షలు, 2.08 లక్షల షేర్ల చొప్పున ఓఐ వుంది. రూ. 1,750 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా 3.11 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో ఓఐ 7.14 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,700పైన స్థిరపడితే రూ. 1,750 స్థాయిని సమీపించవచ్చని, రూ. 1,700 దిగువన క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
షేర్లకూ లాభాల మెరుపు
బంగారంపై భారతీయ మహిళల మోజు అంతా ఇంతా కాదు. మెరిసే నగలు ధరించి మురిసిపోతుంటారు. పురుషులు కూడా తక్కువేం తినలేదు. చెయిన్లు, బ్రేస్లెట్లు ధరించాలని ఉవ్విళ్లూరుతుంటారు. బంగారంపై పెట్టుబడి అత్యుత్తమమనీ, మంచి రాబడి వస్తుందనీ చాలామంది భావిస్తుంటారు. కానీ, మెరుగైన రాబడినిచ్చే సాధనం అదొక్కటే కాదు. షేర్లలో పెట్టుబడులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయమిది. అదెలాగో చూద్దాం... ఇంతింతై పదేళ్ల క్రితం 100 ఇన్ఫోసిస్ షేర్ల ధర సుమారు రూ.50 వేల వరకు ఉంది. వాటి విలువ ప్రస్తుతం రూ.3.50 లక్షలు. నాడు 100 ఐటీసీ షేర్ల ధర రూ.5 వేల వరకు ఉండగా, నేడది రూ.35 వేలకు పెరిగింది. అంటే, ఈ పదేళ్లలో ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్ల విలువ 600 శాతం వృద్ధిచెందింది. ఇదేకాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.5,800 నుంచి రూ.29 వేలకు చేరింది. అంటే, వృద్ధి రేటు 400 శాతం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయనడానికి ఇదో నిదర్శనం. చౌకగా దొరికినపుడే కంపెనీలు అభివృద్ధి సాధించేకొద్దీ వాటి షేర్ల విలువ పెరుగుతుంది. కంపెనీ లాభాల కంటే షేరు ధర పెరుగుదల రేటు తక్కువగా ఉంటే ఆ కంపెనీ షేర్లు చౌక ధరకే లభిస్తున్నట్లు లెక్క. దీన్నే పీఈ నిష్పత్తిలో లెక్కిస్తారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ పీఈ నిష్పత్తి ప్రస్తుతం మూడేళ్ల తక్కువ స్థాయిలో ఉంది. అంటే, ఆయా కంపెనీల అభివృద్ధి స్థాయి కంటే వాటి షేర్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగదు. చౌక ధరలో లభిస్తున్నాయి కనుక షేర్లను కొనడానికి ఇదే సరైన సమయం. విజయం మీదే ఓ కంపెనీ షేర్లను మీరు కొన్నారంటే... ఆ కంపెనీలో కొంత భాగాన్ని మీరు కొన్నట్లే. ఆ కంపెనీ లాభాలను ఆర్జిస్తూ ఉంటే ఆ లాభాల్లో కొంత భాగం మీకూ వస్తుంది. కంపెనీ అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. దేశం బాగుంటే ఆ దేశంలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇవి పరస్పర ఆధారితాలు. అంటే, ఎలా చూసినా ఓ ఇన్వెస్టరుగా విజయం మీదేనన్న మాట. -
ఐటీసీ అప్, ఆర్ఐఎల్ డౌన్
అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించిన ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్లు ర్యాలీ జరిపి 21,205 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదలతో తిరిగి 6,300 స్థాయిపైన క్లోజయ్యింది. లాభాల స్వీకరణతో క్రితం ట్రేడింగ్ రోజున 5 శాతంపైగా నష్టపోయిన ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు తాజాగా తిరిగి అంతేశాతం ర్యాలీ జరపడంతో సూచీల పెరుగుదల సాధ్యపడింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత 27 శాతం నికరలాభం పెరుగుదలను ప్రకటించిన మరో ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 4 శాతం పెరిగి 14 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 573 వద్ద క్లోజయ్యింది. ఇదేబాటలో హెచ్‌సీఎల్ టెక్ 3.5 శాతం ర్యాలీ జరిపి ఆల్‌టైమ్ గరిష్టస్థాయి రూ. 1,430 వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగింపురోజున మార్కెట్ అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించిన ఎఫ్ఎంసీజీ షేరు ఐటీసీ ర్యాలీ జరపగా, ముకేశ్ అంబానీ గ్రూప్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షీణించింది. ఐటీసీ 1.5% ఎగిసి రెండునెలల గరిష్టస్థాయి వద్ద క్లోజ్‌కాగా, రిలయన్స్ వారం రోజుల కనిష్టస్థాయికి దిగింది. కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ మిడ్‌క్యాప్ షేర్లు జోరందుకున్నాయి. అరబిందో ఫార్మా, ఆర్‌కామ్, ఓల్టాస్, పీటీసీ, హెక్సావేర్, హవెల్స్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్థాన్ జింక్, ఫ్యూచర్ రిటైల్ షేర్లు 4-7% మధ్య పరుగులు తీసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 385 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 310 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. టీసీఎస్ కౌంటర్లో యాక్టివిటీ.... నగదు విభాగంలో 5.5 శాతం ర్యాలీ జరిపిన టీసీఎస్ ఫ్యూచర్ కాంట్రాక్టులు, ఆప్షన్లలో చురుగ్గా ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది. షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ టీసీఎస్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 2.85 లక్షల షేర్లు కట్‌కావడంతో మొత్తం ఓఐ 37.88 లక్షల షేర్లకు దిగింది. శుక్రవారం ఈ షేరు క్షీణించిన సందర్భంగా రూ. 2,300 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున రైట్ చేసిన కాల్ ఆప్షన్లను సోమవారం అంతేవేగంతో ఇన్వెస్టర్లు అన్వైండ్ చేయడంతో ఈ కాల్ ఆప్షన్ నుంచి 3.38 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 2,350, 2,400 స్ట్రయిక్స్ వద్ద కూడా కాల్ కవరింగ్ జరినప్పటికీ, 2,400 కాల్ ఆప్షన్లో ఇంకా 6.75 లక్షల షేర్ల బిల్డప్ వుంది. రూ. 2,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ ఫలితంగా ఈ పుట్ ఆప్షన్లో 1.85 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 3.73 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 2,300 స్థాయిపైన స్థిరపడితే 2,400 స్థాయిని తాకవచ్చని, ఆ స్థాయిని కూడా భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే మరో రౌండు షార్ట్ కవరింగ్ జరగవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. అయితే 2,300 స్థాయిని కోల్పోతే క్రమేపీ బలహీనపడవచ్చని ఈ స్ట్రయిక్ వద్ద ఏర్పడిన పుట్ బిల్డప్ విశ్లేషిస్తున్నది. -
ఐటీసీకి ఎఫ్ఎంసీజీ అండ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో రూ. 2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 2,052 కోట్లతో పోలిస్తే ఇది 16%పైగా వృద్ధి. ఇందుకు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ బిజినెస్ విభాగాల అమ్మకాలు పుంజుకోవడం సహకరించింది. నికర అమ్మకాలు సైతం 13% పెరిగి రూ. 8,623 కోట్లకు చేరాయి. గతంలో రూ. 7,627 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.ఎఫ్ఎంసీజీలో భాగమైన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కేటగిరీ నష్టాల నుంచి బయటపడి రూ. 10.3 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ కేటగిరీ కింద రూ. 24 కోట్ల నికర నష్టాలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వ్యవసాయ విభాగం నుంచి 19% అధికంగా రూ. 205 కోట్ల లాభం సమకూరగా, అమ్మకాలు రూ. 1,786 కోట్లకు చేరాయి. ఈ బాటలో హోటళ్ల (ఆతిథ్యం) బిజినెస్ నుంచి రూ. 62 కోట్ల నికర లాభం, రూ. 315 కోట్ల ఆదాయం లభించింది. కాగితం, ప్యాకేజింగ్ బిజినెస్ నుంచి రూ. 1,257 కోట్ల ఆదాయాన్ని సాధించగా, రూ. 232 కోట్ల నికర లాభాన్ని పొందింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర నామమాత్ర నష్టంతో రూ. 325 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం 21 శాతం జూమ్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ అగ్రగామి ఐటీసీ.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ నికర లాభం 21 శాతం దూసుకెళ్లి రూ.2,231 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,836 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.7,146 కోట్ల నుంచి రూ.7,776 కోట్లకు పెరిగింది. 8.81 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రధాన విభాగమైన ఎఫ్ఎంసీజీ వ్యాపారం మెరుగైన పనితీరు కంపెనీకి క్యూ2లో లాభాల జోరుకు తోడ్పాటునందించింది. ఎంఫ్ఎంసీజీ(సిగరెట్లు, ఇతరత్రా) విభాగం ఆదాయం క్యూ2లో రూ.5,076 కోట్ల నుంచి రూ.5,686 కోట్లకు పెరిగింది. 12 శాతం వృద్ధి చెందింది. ఇక ఇదే విభాగంలో కీలకమైన సిగరెట్ల వ్యాపార ఆదాయం 10 శాతం ఎగసి రూ.3,724 కోట్లకు చేరింది. నాన్ ఎఫ్ఎంసీజీ విభాగం(హోటళ్లు, అగ్రి, పేపర్‌బోర్డు, పేపర్, ప్యాకేజింగ్) ఆదాయం మాత్రం స్వల్పంగా 3.08 శాతం క్షీణించి రూ.3,198 కోట్లుగా నమోదైంది. కాగా, ఐటీసీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 0.74 శాతం క్షీణించి రూ.340 వద్ద స్థిరపడింది. -
ఐటీసీకి భూముల కేటాయింపు రద్దు చేయాలి
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: ఐటీసీ విస్తరణ కోసం బూర్గంపాడు మండలంలో 1/70 చట్టానికి విరుద్ధంగా చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సుంవరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ పరిశ్రమ నెలకొల్పాలని కోరారు. భూముల కేటాయింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీసీకి 837 ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో ఇచ్చిన భూమి కంటే ఐటీసీ అదనంగా భూమి కబ్జాచేసి వినిమోగించుకుంటోందని ఆరోపించారు. కనీసం పంచాయతీకి పన్ను కూడా చెల్లించడం లేదన్నారు. ఒప్పందం ప్రకారం స్థానికులకు, గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని చెప్పారు. 1500 మంది కార్మికులుంటే అందులో గిరిజనులు 1 శాతం కుడా లేరన్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారికి కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమలు చేయాలని కోరితే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఐటీసీ నుంచి వెలువడే కాలుష్యంతో బూర్గంపాడు, కుక్కునూరు, భద్రాచలం మండలాల్లో అత్యధిక మంది మహిళలు గర్భకోశ, క్యాన్సర్ వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు. కాలుష్య నివారణ విషయంలో ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. -
పాల్వంచలో పేపర్ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశం సిఫార్సు చేసింది. కిష్టాసాగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో 300 హెక్టార్లలో ఐటీసీ కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు భూమి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చేసిన ప్రతిపాదనను సమావేశం ఆమోదించింది. కర్మాగారం ఏర్పాటు చేసే సంస్థ ప్రతి ఏటా రూ. 50 లక్షలు లేదా లాభాల్లో ఒక శాతం నిధులను ఇస్తుందని ఏపీఐఐసీ పేర్కొంది. ఈ ప్రతిపాదనను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు పంపనున్నారు. అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రిటైల్‌లో ప్రైవేట్ లేబుల్స్
హైదరాబాద్: ప్రైవేట్ లేబుల్స్ దిగ్గజ కంపెనీల ఫుడ్ బిజినెస్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీ వంటి కంపెనీల ఆహార ఉత్పత్తులకు ప్రైవేట్ లేబుల్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. బిగ్‌బజార్ రిటైల్ చెయిన్లను నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ సంస్థల ఆహార ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా పెరుగుతోంది. ఈ రిటైల్ చెయిన్ షాపుల్లో ఆహార పదార్ధాల అమ్మకాల్లో 75 శాతం ప్రైవేట్ లేబుల్స్వే ఉండడం విశేషం. ప్రైవేట్ లేబుల్స్ ఎందుకంటే..., పెద్ద కంపెనీ బ్రాండ్ల ఉత్పత్తులు ఖరీదెక్కువనే కారణంతో వినియోగదారులు తక్కువ ధరలకు లభించే ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని నీల్సన్ తాజా సర్వేలో వెల్లడైంది. నాణ్యతతో రాజీపడకుండానే తక్కువ ధరకే ఆహార ఉత్పత్తులను ప్రైవేట్ లేబుల్స్ అందిస్తున్నాయని నీల్సన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆడ్రియన్ టెర్రాన్ చెప్పారు. కొత్త బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేద్దామనుకుంటున్న వినియోగదారులు పెరిగిపోతున్నారని వివరించారు. ఈ పోకడ హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, నెస్లే, ఐటీసీల వంటి కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల ధరలు అందరికీ అందుబాటులో ఉండడం వాటి అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. మార్కెటింగ్, పంపిణీ వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులు చౌక ధరల్లో లభ్యమవుతున్నాయి. ఫ్యామిలీ బడ్జెట్లో కోత... ఇప్పుడు వీకెండ్ సరదాల్లో షాపింగ్ కూడా ఒక భాగమైపోయింది. ఫ్యామిలీలు శని, ఆది వారాల్లో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఎంచుకోవడానికి అధిక ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, ఊరిస్తున్న ఆఫర్లు వంటి కారణాల వల్ల షాపింగ్ ఖర్చు ఇబ్బడి ముబ్బడి అవుతోంది. దీంతో బడ్జెట్ కోతలో భాగంగా అధిక ధరలున్న పెద్ద కంపెనీల బ్రాండ్ల ఆహార ఉత్పత్తులకు బదులు తక్కువ ధర ఉన్న ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తుల వినియోగం వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. పెద్దస్థాయి కాదు కాగా ప్రస్తుతం పెద్ద కంపెనీలను సవాల్ చేసే స్థాయిల్లో ప్రైవేట్ లేబుల్స్ లేవని కొందరు నిపుణులంటున్నారు. భారత ఆహార, కిరాణా మార్కెట్లో ప్రైవేట్ లేబుల్స్ వాటా 0.3 శాతం మాత్రమేనని రాబొబ్యాంక్ ఇంటర్నేషనల్ అంచనా వేస్తోంది. ఫలానా బ్రాండ్ వస్తువే కొనాలనుకునే వినియోగదారులు బాగా ఉన్నారని, ఇది పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమని విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి వారి సంఖ్య పెంచుకోవడం ద్వారా ప్రైవేట్ లేబుల్స్ పోటీని తట్టుకోవడం కోసం పెద్ద కంపెనీలు బ్రాండ్ బిల్డింగ్‌పై బాగానే వ్యయం చేస్తున్నాయి. ఐదు రెట్ల వృద్ధి.. దేశంలోని ప్రైవేట్ లేబుల్స్ అన్నీ ఒక గొడుగు కిందకు వస్తే, అది దేశంలోనే మూడవ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సరఫరా సంస్థ అవుతుందని నీల్సన్ సంస్థ అంచనా. ఈ సంస్థ అంచనా ప్రకారం, ప్రైవేట్ లేబుల్స్ వ్యాపారం 2015 కల్లా ఐదు రెట్ల వృద్ధితో రూ.3,000 కోట్లకు పెరగనున్నది. భారత్‌లోని మోడ్రన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఇప్పటికే ప్రైవేట్ లేబుల్స్ వాటా 5 శాతంగా ఉంది. ఇది చైనాలో 1 శాతమే ఉంది. మొత్తం ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో మోడ్రన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు భారత్‌లో 10 శాతంగా ఉండగా, చైనాలో మాత్రం 70 శాతంగా ఉన్నాయి. భారత్‌లో ప్రైవేట్ లేబుల్స్‌కు భారీగా అవకాశాలున్నాయని రిటైలర్లు అంటున్నారు. చాలా కేటగిరిల్లో పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తులు లేవని, ఇది ప్రైవేట్ లేబుల్స్ విజృంభణకు మంచి అవకాశమని వారంటున్నారు. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ సంస్థ నిర్వహించే బిగ్ బజార్‌ల్లో పన్నెండుకు పైగా వివిధ సెగ్మెంట్లలలో ప్రైవేట్ లేబుల్స్ అమ్మకాలు బాగా ఉన్నాయని ఫుడ్ బజార్ ప్రెసిడెంట్ దేవేంద్ర చావ్లా చెప్పారు. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన మోర్, ఆర్పీజీ గ్రూప్‌కు చెందిన స్పెన్సర్స్ రిటైల్‌లో కూడా వివిధ కేటగిరిల్లో ముఖ్యంగా ఆహార పదార్ధాలు, గృహ సంరక్షణ కేటగిరిల్లో ప్రైవేట్ లేబుల్స్ హవా జోరుగా ఉంది. -
వ్యవసాయ ఎగుమతుల్లో వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్లుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఏటా సగటున 20 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఇది 12 శాతానికి సమానమని, కాని ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగం అధిపతి ఎస్.శివకుమార్ సోమవారం తెలిపారు. సరైన మౌలికవసతులు లేకపోవడంతో దేశీయంగా రూ.50,000 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఏటా వృధా అవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్తో ఈ నష్టాన్ని అరికట్టవచ్చన్నారు. హైదరాబాద్‌లో ‘ఫుడ్ 360’ పేరిట నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సు వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం పెట్టుబడుల విలువ రూ.1.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. వ్యవసాయరంగంలో దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని ప్రోసెస్ చేస్తే మరిన్ని ఎగుమతికి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. గతంలో రెండుసార్లు నిర్వహించిన ఫుడ్ 360 విజయవంతమయ్యిందని, ఈ సంవత్సరం నవంబర్ 6-7 తేదీల్లో జరిగే ఈ రెండురోజుల సదస్సును లక్షమంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు ఫిక్కీ ఏపీ చాప్టర్ కోచైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. గత సంవత్సరం 2,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.