Padma Devender Reddy
-
ఈసారి రసవత్తవరంగా మెదక్ ఎన్నికలు
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 7 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014, 2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. ధీమాగా బీఆర్ఎస్ నేతలు.. టికెట్ కోసం ఎదురుచూపులు! తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్కు మెదక్ కంచుకోటగా మారింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో ఇక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారంటీ అనేది బీఆర్ఎస్ నేతల ధీమా. ఈ క్రమంలోనే సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. విజయశాంతి, బట్టి జగపతి వంటి హేమాహేమీలను సైతం ఆమె ఓడించారు. మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలాకాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్‌లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈసారి ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రాజకీయ పార్టీల వారీగా టికెట్లు కోసం పోటీపడుతున్న అభ్యర్థులు : బీఆర్ఎస్ పద్మాదేవేందర్ రెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పట్లోళ శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) కంఠ తిరుపతిరెడ్డి(మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు) మ్యాడo బాలకృష్ణ(టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ) సుప్రభాత్ రావ్(టిపిసిసి సభ్యులు). బిజెపి తాళ్లపల్లి రాజశేఖర్(న్యాయవాది బిజెపి నాయకులు) గడ్డం శ్రీనివాస్(బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు) నందా రెడ్డి(బిజెపి నాయకులు మెదక్ ) చోళ రాంచరణ్ యాదవ్(బిజెపి నాయకులు మెదక్) నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు: గత కొన్ని రోజులుగా రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.. అన్ని ప్రాంతాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం జరగలేదు. అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్. నిజాంపేట, నార్సింగీ నూతన మండల కేంద్రముల లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. బస్టాండ్ కూడా లేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదని ఈ ప్రాంత యువత భావిస్తున్నారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేటలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నూతన రోడ్లు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. రామయంపేట మున్సిపాలిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థుల అభ్యర్థన. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బస్టాండ్, మరియు డిగ్రీ కళాశాల నిర్మించాలని ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన. ధరణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఒకరి భూమి మరొకరిపై పడిందని అట్టి సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని ధరణి సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే కీలకంగా ఉన్నాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళల రుణాలు మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఏం తినలేక పోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇంటి ఖర్చులు వ్యయం పెరిగి ఇబ్బందుల పాలవుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని కొన్ని కంపెనీల వారు పిఎఫ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు అత్యంత ప్రభావితం చేసే రాజకీయ అంశాలు : మెదక్‌లో మెడికల్ కాలేజ్నిని మంజూరు చేపిస్థామని ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నిజాం షూగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తామని 9 సంవత్సరాలు అవుతున్న దానిని ఓపెన్ చేయించకపోవడం ముఖ్యంగా మెదక్‌కు రింగ్ రోడ్ లేదు.. 9 సంవత్సరాల పాలనలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి భౌగోళిక పరిస్థితులు: పర్యాటకం: కాకతీయులు పరిపాలించిన మెదక్ కిల ఉంది ఇక్కడే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ(CSI) చర్చి. నదులు: మంజీరా నది, వనదుర్గ ప్రాజెక్టు, పసుపులేరు వాగు. పోచారం అభయారణ్యం కొంత భాగం మెదక్ నియోజకవర్గంలో ఉంది. చిన్న శంకరంపేట రామయంపేట హవేలీ ఘనపూర్ మండలాలు అడవులు విస్తరించి ఉన్నాయి. ఆలయాలు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ csi చర్చి అత్యంత పర్యాటక ప్రాంతాలు.. -
పద్మక్క డాన్స్ అదరగొట్టింది
-
సొంత గూటిలోనే కుంపటి.. హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు ఈసారి కష్టమే!
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. మరి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సీటు గురించి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు నాలుగోసారి సీటు కష్టమేనా? ఇంతకీ మెదక్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్యాడర్‌ను పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి తాను పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఇన్ని రోజులు తనకు పెద్దగా పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రాక తలనొప్పిగా మారింది. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మైనంపల్లి తనయుడు రోహిత్. సీఎం కేసీఆర్‌తో మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా.. మెదక్ సీటుపై ఎక్కడో తేడా కొడుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో రోహిత్ ఎంట్రీతో జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే రామాయంపేట అభివృద్ధి చెందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా పద్మా దేవేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతను తనకు సానుకూలంగా మార్చుకునేందుకు మైనంపల్లి రోహిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలే లక్షంగా నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద యువతుల వివాహానికి పుస్తెలు, కాలి మట్టెలు అందిస్తున్నారు. నిరుపేదలు మృతి చెందితే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నిజాంపేట మండలంలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రామాయంపేట మండలం, చిన్నశంకరంపేట మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ కొనసాగుతున్నారు. మూడు సార్లు గెలిచి, డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వరిస్తుందని ఆశించినా నెరవేరలేదు. టిక్కెట్ ఆశించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తమ నాయకురాలు పద్మా దేవేందర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. -
టీఆర్ఎస్ నుంచి మురళీయాదవ్ సస్పెన్షన్
మెదక్ మున్సిపాలిటీ: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి, ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం..
సాక్షి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనకాల నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో పద్మాదేవేందర్ రెడ్డి వాహంలోనే ఉన్నారు. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది. మెదక్ పర్యటన అనంతరం రామాయంపేటలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. చదవండి: రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయం.. 410 కిలోల గంజాయి స్వాధీనం -
లాక్డౌన్: దండంపెట్టి చెబుతున్నా..!
సాక్షి, రామాయంపేట(మెదక్) : దండంపెట్టి చెపుతున్నా... ఎవరూ దయచేసి బయట తిరగకండని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా బాలాజీ ఫంక్షన్‌హాలులో గురువారం మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. భయంకరమైన కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్షి్మతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆమె వెంట ఎంపీపీ భిక్షపతి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పుట్టి యాదగిరి, సరాపు యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సుందర్‌సింగ్, దేమె యాదగిరి పాల్గొన్నారు. (కరోనా వైరస్ ; నటుడిపై దాడి ) వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం నిజాంపేట(మెదక్): ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని గురువారం నిజాంపేటలో నిత్యావసర సరుకులు పంపీణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తన స్నేహితుల ఆర్థిక సహాయంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆటో కార్మికులకు, పారిశుధ్య కారి్మకులకు నిత్యావసర సరుకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుందని, దీన్ని నిర్మూలించాలంటే ప్రతీ ఒక్కరు ఇంటిలో ఉంటూ బయటకు రాకుండా ఉండడమే సరైన మార్గమని తెలిపారు. (మంచి వార్త తెలిసింది : ట్రంప్ ) కొనుగోలు కేంద్రాన్ని సది్వనియోగం చేసుకోండి పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందన్నారు. (కరోనా: మరో 5 పాజిటివ్‌లు) విరాళాల వెల్లువ రామాయంపేట(మెదక్): లాక్డౌన్ దరిమిలా పేదలను ఆదుకోవడానికి వ్యాపారులు, ఎన్ఆర్ఐ ముందుకువచ్చారు. ఇందులో భాగంగా గురువారం రామాయంపేటకు వచి్చన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డికి 1987 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి పూర్వ విద్యార్థులు రూ. 30 వేల నగదును అందజేశారు. వీరితోపాటు కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఐ రవీందర్‌రెడ్డి రూ. రెండు లక్షలు, వ్యాపారులు మంచికట్ల శ్రీనివాస్ రూ.లక్ష, పల్లెర్ల అశోక్ రూ. 75 వేలు, మురికి రవీందర్ రూ. 71వేలు, పుట్నాల రాములు రూ. 50వేలు, సరాపు శిల్ప ప్రవీణ్, తోటరాజు, కొత్త శ్రీనివాస్, మద్దెల రమేశ్ రూ. 25 వేల చొప్పున సీబీఆర్ రూ. 15వేలు, మెట్టు యాదగిరి రూ. 12 వేలు, బట్టల వర్తక సంఘం ప్రతినిధులు, వెంకటేశ్వర్రావు, మాసులరామరాజు, అభిరుచి హోటల్, గజం యాదగిరి, మాసుల రామరాజు, సహాయం అందజేశారు. విరాళాలు అందజేసినవారిని ఎమ్మెల్యే ప్రశంసించారు. (కరీంనగర్లో కరోనా కేసులు ఇలా...) -
నేనున్నా.. ఆదుకుంటా
సాక్షి, రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించి నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నాలుగు పురిళ్లు దగ్ధంకాగా, నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు, ఇతర వస్తువులు మంటలకు ఆహుతై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పూర్తివివరాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులను ఆదుకుంటామని, పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె నాలుగు కుటుంబాలకు సరిపడే దుప్పట్లు, వంట సామగ్రి, దుస్తులు, కూరగాయాలు, ఇతర నిత్యావసర సరుకులు, బకెట్లు, ఇతర సామగ్రిని ప్రత్యేకంగా ఆటోలో తెప్పించి వారికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని దయాలక్ష్మి స్వామి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మకమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, సహకార సంఘం చైర్మన్ బాజ చంద్రం, కౌన్సిలర్ నాగరాజు, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శేఖర్‌రెడ్డి, సర్పంచులు సుభాశ్రాథోడ్, మైలారం శ్యాములు పాల్గొన్నారు. -
మీకు కడుపు నిండా భోజనం పెడతాం: మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్ : మంత్రి చొరవ తీసుకొని రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను సోమవారం పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి ముందుగా నేను రావాలని అనుకోలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ వాటాదారులు. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ తప్పింది. అందుకు కారణం మీరే. మంత్రివర్గ సమావేశంలో మీకు శుభవార్త తీసుకు వస్తా.. ఈ మేరకు సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. మీకు కడుపునిండా భోజనం పెడతాం’ అని పేర్కొన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పగా.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. సమిష్టిగా సేవ చేస్తున్న రేషన్ డీలర్ల కష్టానికి తగిన ఫలం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 7000 వేలు రేషన్ డీలర్లు సేవ చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. -
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సాక్షి, మెదక్: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అంగన్వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంగారెడ్డి: ఆందోల్, జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. -
విషయం తెలియక వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదని వచి్చన వార్తలపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘గవర్నర్ వీడ్కోలు సమావేశానికి రావాల్సిందిగా నాకు ప్రగతిభవన్ నుంచి ఫోన్ వచి్చంది. అయితే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయాల్సిన ఫోన్ నాకు పొరపాటున వచి్చనట్లుగా తర్వాత గుర్తించారు. ఆ విషయం తెలియక నేను ప్రగతిభవన్‌కు వెళ్లాను. మంత్రు లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం ఉండటంతో.. అదే సమయంలో వచి్చన మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ లోనికి వెళ్లి ఉంటారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఏమీలేదు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు’ అని ఆమె అన్నారు. -
రేక్ పాయింట్ వచ్చేనా?
సాక్షి, రామాయంపేట: రైతన్నలకు మరింతగా ఎరువులను అందుబాటులోకి తీసుకురావడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది రేక్‌పాయింట్ల ఏర్పాటుకై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు కోసం రెండేళ్లక్రితమే ఆ శాఖ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో ముఖ్య కూడలిలో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటుచేస్తే అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది. ఇక్కడి రేక్ పాయింట్‌ను అర్థాంతరంగా ఎత్తివేశారు. ఇక్కడ రేక్‌పాయింట్ కొనసాగిన సమయంలో ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎరువుల సరఫరా జరిగిందని, స్టేషన్‌లోని షెడ్డులో ఎరువుల స్టాక్ దించి జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారని అధికారులు తెలిపారు. గతంలో నిర్మించిన పెద్ద షెడ్డు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరాకు గాను ప్రస్తుతం ఉన్న తొమ్మిది రేక్ పాయింట్లతోపాటు మరో అదనంగా మరో తొమ్మిదింటిని ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు గతంలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేశారు. జిల్లాలోని అక్కన్నపేటతోపాటు బీబీనగర్, మహబూబాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, ఉప్పల్, కొత్తగూడెం, వికారాబాద్, బాసరలో రేక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖవారు ప్రతిపాదనలు పంపారు. రేక్‌పాయింట్ ఏర్పాటైతే... అక్కన్నపేటస్టేషన్‌లో రేక్‌పాయింట్ ఏర్పాటైతే రైళ్లలో నేరుగా పరిశ్రమల నుంచి స్టేషన్‌కు ఎరువుల బస్తాలు వస్తాయి. దీంతో ఇక్కడ స్టాక్‌పెట్టి జిల్లాపరిధిలో అవసరమైన పట్టణాలకు, గ్రామాలకు సరఫరా చేస్తారు. సకాలంలో రైతులకు ఎరువులు అందడంతోపాటు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్కన్నపేట స్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేస్తే ఈప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని, తద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖవారు పలుమార్లు శిథిలమైన గోదాంను పరిశీలించారు. నాలుగైదు నెలల్లో రేక్‌పాయింట్ ఏర్పాటుకై ఆదేశాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం సుముఖత అక్కన్నపేట రైల్వేస్టేషన్‌వద్ద రేక్ పాయింట్ ఏర్పాటుకోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు విన్నవించాం. ఈ మేరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ స్టేషన్నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, సమీపంలో ఉన్న జిల్లాలకు ఎరువులు, సిమెంట్, తదితర సామగ్రి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ రేక్‌పాయింట్ ఏర్పాటు చేయాలి జిల్లా వ్యాప్తంగా అన్నివిధాలుగా అందుబాటులో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలి. గతంలో ఇక్కడ రేక్ పాయింట్ ఉండేది. ఈ మేరకు పెద్ద షెడ్డుకూడా సిద్ధంగా ఉంది. అవసరమైతే అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తాం. ఇది ఏర్పాటుచేస్తే రైతులకు ఎంతోమేలుగా ఉంటుంది. వ్యవసాయరంగానికే కాకుండా వ్యాపారానికి సంబంధించి ఉత్పత్తులు సరఫరా చేసుకోవచ్చు. – ముస్కుల స్రవంతి, వైస్‌ఎంపీపీ, రామాయంపేట -
రైతుబీమాతో కుటుంబాలకు ధీమా
సాక్షి, మెదక్: రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలోని వేలాది మంది రైతులకు మేలు జరుగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది మరికొందరు కొత్తగా ఈ బీమాపథకంలో చేరే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ప్రమాదవశాత్తు లేక ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల తరఫున ఎల్ఐసీకీ బీమా ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని తక్షణం అందించేలా ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. రైతు కుటుంబంలో భరోసా పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం పెరిగిన ప్రభుత్వం పథకం అమలును కొనసాగిస్తుంది. గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ కాలపరిమితికి ప్రీమియం రూపంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3457 చొప్పున ప్రీమియం చెల్లిస్తోంది. భూములు కలిగిన వారికి ఈ నెల 14 నుంచి 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇది నిరంతర పక్రియగా కొనసాగనుంది. 615 మంది రైతు కుటుంబాలకు పరిహారం జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా వారిలో బీమా పథకానికి అర్హులైన వారు 1.8 లక్షల మందిరైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో 675 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారిలో 615 మంది రైతులకు రూ.30.7 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 60 మంది రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. యువరైతుల నమోదు ఇలా... రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఏళ్లు నిండిన యువరైతుల పేర్లు నమోదు చేస్తారు. వీరు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి రైతుపట్టాపాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు ఆధార్ కార్డు ఇస్తే సంబంధిత అధికారులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలి.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ఒక్క ఏడాదితో ఆగేదికాదు గతేడాది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడు సైతం దాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇది నిరంతర పక్రియగా కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ -
ప్రజాధనం వృథా చేయొద్దు
సాక్షి, మెదక్: ప్రభుత్వ సొమ్మును నాశనం చేస్తున్నారు. నాణ్యత లోపం పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. రూ.200 కోట్లతో జరుగుతున్న రైల్వేలైన్ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ వద్ద నిర్మిస్తున్న ప్లాట్‌ఫాం నాణ్యతా లోపంతో నిర్మించడంతో పూర్తిగా కుంగిపోయింది. ఫ్లాట్‌ఫాం రెండు ముక్కలుగా పగిలిపోవడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. ఇంత దారుణంగా నిర్మాణం జరుగుతున్నా అధికారుల కంటికి కనిపించడం లేదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పనులు జరుగుతుంటే అధికారులకు కనిపించడం లేదా? ఏం చేస్తున్నరంటూ మండిపడ్డారు. అరకిలో మీటర్ మేర వేసిన ప్లాట్‌ఫాం పూర్తిగా దెబ్బతిన్నదని, దాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఖర్చు కాంట్రాక్టరే భరించాలన్నారు. ఈ విషయంపై రైల్వే ఇంజనీర్ ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడుతూ నాణ్యతలేని పనులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే విధంగా రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లోపల అన్ని పగుళ్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం ఇప్పుడే పగుళ్లుంటే ఎన్నిరోజులుంటుందని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలన్నారు. మంగళవారం ఎంపీ ఆధ్వర్యంలో రైల్వే అధికారులతో రివ్యూ నిర్వహిస్తానని, అధికారులంతా హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీవైస్‌చైర్మన్ లావణ్యరెడ్డి, ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ రవికుమార్, ఎంపీపీ యమున, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్కెశ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, కృష్ణ, తొడుపునూరి శివరామకృష్ణ, గూడూరి అరవింద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే -
కాళేశ్వరం నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి,మెదక్: కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శంకరంపేట కాలువకోసం భూములు అందించిన మడూర్ గ్రామ రైతులకు 26 ఎకరాలకు రూ.1కోటి94 లక్షలను 94 మంది రైతులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. కాళేశ్వరం కాలువ కోసం భూములను అందిస్తున్న రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకరంపేట కాలువ ద్వారా మండలంలోని 18 వేల ఎకరాల భూములకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. కరువును పారదోలి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్సింగి మండలంలోని శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రె కృపావతి, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, నూతన జెడ్పీటీసీ పట్లోరి మాధవి, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మల్లేశం, షరీఫ్ పాల్గొన్నారు. -
మా ఆయన బంగారం: పద్మా దేవేందర్ రెడ్డి
సాక్షి, మెదక్ : అమ్మే ధైర్యం.. ఆమె ఆశీర్వాదమే నా బలం అని అంటున్నారు అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి. అమ్మకు తోడుగా మా వారి అండతోనే ఈ స్థాయికి చేరా.. ఆయనే నా రాజకీయ గురువు.. వారి ప్రోద్బలంతోనే తెలంగాణ ఉద్యమం, ప్రత్యక్ష రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకున్నా.. అని గర్వంగా చెబుతున్నారు. వరుస ఎన్నికలు, నిత్య రాజకీయాల్లో తలమునకలైన ఆమె శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. చిన్ననాటి తీపి గుర్తులు, ఇష్టమైన వంటకాలు, స్నేహితులు, బంధువులతో అనుబంధాన్ని పంచుకున్నారు. పుట్టినిల్లయినా.. అత్తారిల్లయినా.. మా ఇళ్లే ఒక బృందావనం అని అంటున్న పద్మాదేవేందర్‌రెడ్డి ‘పర్సనల్ టైం’ ఆమె మాటల్లోనే.. పుట్టినింట్లో ప్రెండ్లీగా ఉండేటోళ్లం. అత్తారింటికి వచ్చాక పద్ధతులు మారాయి. అక్కడైనా, ఇక్కడైనా క్రమశిక్షణతో ఉండడం అలవర్చుకున్నా. ఏ ఇల్లు అయినా ఒక బృందావనమే. చిన్న కోడలు కావడంతో అత్తవారింట్లోకి ఒకింత భయంతో అడుగుపెట్టినా.. మా ఆయన బంగారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆ ఉత్తరం తీపి జ్ఞాపకం మాది కరీంనగర్ జిల్లా నామాపూర్ గ్రామం. అమ్మ విజయ, నాన్న భూమిరెడ్డి. మేం ముగ్గురు సంతానం. నేనే పెద్ద కూతురిని. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆదిలాబాద్ జిల్లా తోటపల్లి జెడ్పీహెచ్ఎస్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటి వద్ద అమ్మ ఒక్కతే మా ఆలనాపాలనా చూసేది. నాన్న సెలవు రోజుల్లో వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుని.. మళ్లీ డ్యూటీకి వెళ్లేవారు. దీంతో అమ్మతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. అమ్మ నాతో స్నేహితురాలిగా మెలిగేది. అమ్మ ఆశీర్వాద బలంతోనే తెలంగాణ ఉద్యమంలోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. నాన్న దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ నాతో మొదటిసారి నాన్నకు ఉత్తరం రాయించింది. నేను అప్పుడు మూడో తరగతి చదువుతున్నాను. అది ఎప్పటికీ మరువలేని తీపి జ్ఞాపకం. విద్యాభ్యాసం సొంతూరు కరీంనగర్ జిల్లా నామాపూర్‌లో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించా. ఎనిమిది నుంచి డిగ్రీవరకు కరీంనగర్లో చదువుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పెండెకంటి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసించా. స్నేహబంధం కంటిన్యూ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ, మంగ, అరుణ ఇంకొందరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. పెళ్లి అయినప్పటికీ స్నేహితుల ఇళ్లలో జరిగే ఏ కార్యక్రమాలకైనా హాజరయ్యేదాణ్ని. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కొంత తగ్గినప్పటికీ.. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ఇంట్లో అందరం స్నేహితులం కలుస్తాం. నేను వెళ్లినా.. వెళ్లకున్నా.. ఈ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతుండడం సంతోషంగా ఉంది. గ్రామాలే విడిది కేంద్రాలు చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాం. కోడి కూతతో తెల్లవారడం.. పాడి పశువులు ఇంటిబాట పట్టినప్పుడు పొద్దుగూకడం వంటి వాతావరణంలో పెరిగినం. చిన్నప్పుడైనా కావొచ్చు.. ఇప్పుడైనా కావొచ్చు విలేజీ వాతావరణంలోనే ఉండాలని అనిపిస్తుంది. మేము, మా కుటుంబ సభ్యులం ప్రత్యేకంగా ఎలాంటి టూర్లకు వెళ్లం. చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం ఉంటే అమ్మమ్మ, నానమ్మ వాళ్లింటికి వెళ్లేటోళ్లం. ఇప్పడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. మాకు గ్రామాలే విడిది కేంద్రాలు. ప్రస్తుతం పల్లెలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నప్పటికీ.. పల్లె వాతావరణమే మాకు ఇష్టం. చెంపదెబ్బలు ఫన్నీ నేను ఐదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది. మా సార్ చొక్కారావు.. ‘బృహలేశ్వరాలయం’ అని పలకాలని విద్యార్థులకు చెప్పారు. ఎవరు కూడా ఆ పేరు పలకలేకపోయారు. నేను మాత్రమే చెప్పడంతో సార్ నన్నెంతో మెచ్చుకుని, తోటి విద్యార్థులకు చెంపదెబ్బలు వేయించారు. నేను మెల్లిగా కొడితే దగ్గరుండి మరీ గట్టిగా వేయించారు. ఈ సంఘటన నాకు చిన్ననాటి తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. పునీత్.. హ్యాపీ మూమెంట్ నా కొడుకు పునీత్‌రెడ్డి పుట్టడం జీవితంలో మరచిపోలేను. అది ఇప్పటికి, ఎప్పటికీ నాకు హ్యాపీ మూమెంట్. డిప్యూటీ స్పీకర్ అయ్యే వరకు నేనే స్వయంగా వంట చేసే దాణ్ని. నేను వంట చేస్తేనే నా కొడుకు పునీత్ తినేటోడు. ఇప్పటికీ అప్పుడప్పుడు నా కొడుకు కోసం వంట చేస్తా. కూరగాయలతో భోజనం ఇష్టమైనప్పటికీ.. నాన్‌వెజ్ వంటకాలు బాగా చేస్తా. గోళీలాట, చిర్రగోనె ఇష్టం రాజకీయ రంగంలోకి రాకముందు ఖాళీ సమయాల్లో సినిమాలు చూసేదాణ్ని. దోస్త్‌లతో కలిసి షాపింగ్ అంటే ఇష్టముండేది. ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే టీవీ చూస్తున్నా. పుస్తకాలు, నవలలు చదువుతా. చిన్నప్పుడు గోళీలాట, చిర్రగోనె ఆడడం ఇష్టం. రాజకీయాల్లోకి రాక ముందు దినపత్రికలు చదివేదాణ్ని కాదు. ఇప్పుడు ప్రతి పేపరు తప్పకుండా చదువుతా టీచర్. న్యాయవాది కావాలనుకున్నా.. చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలని కోరిక. నాన్న టీచర్ కాబట్టి చిన్నçప్పుడు నాకు టీచర్కావాలనే కోరిక ఉండేది. పెళ్లి అయిన తర్వాత మా ఆయనను చూసి న్యాయవాది కావాలనుకున్నా. లా చదివినప్పటికీ ఆ తర్వాత వృత్తిని చేపట్టలేదు. ఆ తర్వాత తల్లి ధైర్యం, భర్త ప్రోత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్నా. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. మా ఆయన బంగారం మా ఆయన దేవేందర్‌రెడ్డి బంగారం. మా మధ్య చిన్న తగవు కూడా లేదు. దేవేందర్‌రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, రాజకీయ రంగంలో నా భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఉద్యమ సమయంలో జైలుకెళ్లడం వంటి ఘటనలతో నా పుట్టింటి వారు, అత్తింటి వారు కొంత ఆందోళనకు గురయ్యారు. మా ఆయన పూర్తిగా సహకారం అందించడంతో తెలంగాణ సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించా. అనంతరం మా ఆయన ప్రోద్బలంతో 2001లో జెడ్పీటీసీగా గెలిచా. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయ్యా. అప్పుడు నాకు ఎలా చేయాలి.. ఏం చేయాలి వంటి విషయాలు పెద్దగా తెలవదు. నా భర్త సహకారంతో అన్నీ తెలుసుకున్నా. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2004లో రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో మూడు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యా. కూతురుగా అభివర్ణించడం మరిచిపోలేను తెలంగాణ ఏ విధంగా అన్యాయానికి గురైంది వంటి అంశాలను పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకున్నా. ప్రధానంగా ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పీచ్ నన్ను ఆకట్టుకుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్.. నన్ను కూతురుగా అభివర్ణించడం, అలానే చూసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఎంతో సంతోషాన్నిచ్చిన సంఘటన అది. విద్యతోనే మహిళా సాధికారత ఆడ, మగ పిల్లలనే తేడా చూపొద్దు. నేటి సమాజంలో ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలి. అదే నా మొదటి ఆకాంక్ష. మహిళల ఆర్థిక స్వాలంబన, మహిళా సాధికారత రావాలంటే విద్యే మూలం అని నా నమ్మకం. మహిళలను పురుషులతో సమానంగా చదివించాలి. ప్రొఫైల్ పేరు : పద్మాదేవేందర్‌రెడ్డి పుట్టిన తేదీ : 1969 జనవరి 6 పుట్టిన ఊరు : నామాపూర్ (కరీంనగర్) అత్త గారి ఊరు : కోనాపూర్ (మెదక్) వివాహం : 1988 చదువు : ఎల్ఎల్బీ కుటుంబం తల్లి : విజయ తండ్రి : భూమిరెడ్డి సోదరుడు : వంశీధర్‌రెడ్డి చెల్లెలు : అనిత సంతానం : పునీత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం : 2001–04 : జెడ్పీటీసీ (రామాయంపేట), టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ 2009–14 : మెదక్ ఎమ్మెల్యే 2014–18 : మెదక్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 2018 డిసెంబర్ నుంచి : మెదక్ ఎమ్మెల్యే -
‘ఆయన గాలిలో కొట్టుకుపోవడం ఖాయం’
దుబ్బాక: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కేసులు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిపైనే ఉన్నాయని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హరీష్ రావు, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. రోజుకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణా ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్చూచిగా తెలంగాణా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఓటు వేసి ఢిల్లీ చుట్టూ తిరుగుడు అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్ర నిథులు ముక్కు పిండి రాబట్టవచ్చునని అన్నారు. వచ్చే నెల 3న నర్సాపూర్‌లో కేసీఆర్ సభ ఉందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాలిలో కొట్టుకుపోవడం ఖాయం: పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాస్యమాడారు. దుబ్బాకలో చెల్లని రూపాయి అయిన రఘునందన్ రావు మెదక్‌లో చెల్లడం సాధ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి పుట్టగతులు లేవని, 16 ఎంపీ సీట్లు గెలిచినట్లయితే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కీలకమవుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. -
బోనమెత్తిన ఎమ్మెల్యే
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ఉండే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్ (ఖానాపూర్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్. రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. అనంతరం రెడ్యానాయక్ టీఆర్ఎస్లో చేరినా సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భావిస్తున్నారు. -
జిల్లాకు మొండిచేయి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్వపు మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు వరుసగా ఆరో పర్యాయం విజయం సాధించడంతో పాటు, ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చిన శాసనసభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏ ఒక్క శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గజ్వేల్ నుంచి వరుసగా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హోం శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు రెండు నెలల తర్వాత తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో తొమ్మిది మంది శాసనసభ్యులకు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉద్యమనేతగా, నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. పిన్న వయసులోనే వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డుతో పాటు, ఏకంగా లక్షా ఇరువై వేల మెజారిటీతో విజయం సాధించిన ఘనత హరీశ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కుతుందని భావించినా, తాజా విస్తరణలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. మరో ఇద్దరు నేతలకు నిరాశ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, అసెంబ్లీకి నాలుగో పర్యాయం ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. మరో ఉద్యమ నేత, అసెంబ్లీకి మూడో పర్యాయం ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, హరీశ్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో హరీశ్‌కు చోటు కల్పించిన విషయాన్ని ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు. 70వ దశకం తర్వాత ఇదే తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1970వ దశకం నుంచి ఏర్పాటైన ప్రతీ మంత్రిమండలిలోనూ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 1970వ దశకంలో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లా నుంచి మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలోనూ మదన్‌మోహన్‌తో పాటు బాగారెడ్డికి మంత్రి పదవి దక్కింది. టి.అంజయ్య జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనూ మదన్మోహన్కు మంత్రి పదవి దక్కింది. 1983, 85లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరణం రామచంద్రరావు, 1989లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం పి.రామచంద్రారెడ్డి కూడా కోట్ల మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 1994 నాటి ఎన్టీఆర్ కేబినెట్లో కరణం రామచంద్రరావు, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో కరణం, ముత్యంరెడ్డి, బాబూమోహన్ పనిచేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ అటు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లోనూ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో గీతారెడ్డి, ఫరిదుద్దీన్, దామోదర రాజనర్సింహ, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
హ్యాపీ క్రిస్మస్
మెదక్ జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఏసీ సాలమాన్‌రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్చార్జి ఆండ్రోస్ ప్రేమ్ సుకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్ మెదక్ డీలర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పద్మ వికాసం!
మెతుకుసీమగా పేరొందిన మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడ గెలుపుపై గురిపెట్టారు. కూటమిలో లుకలుకలు, టీజేఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన ఆమెకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళా ఎమ్మెల్యేగా ఆమెకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. ఇక తాను చేపట్టిన పనులు, టీఆర్ఎస్కున్న బలమైన కేడర్, ప్రత్యర్థుల బలహీనతలే తన బలంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నియోకజవర్గం పరిధిలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మరోసారి తనను గెలిపిస్తే మెదక్ రూపురేఖలు మారుస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సీటు ముందే ఖరారు కావడంతో ఆమె రెండు నెలల ముందునుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి ఎవరనే విషయంలో కొంత స్పష్టత లోపించింది. మొదట ఈ స్థానాన్ని మహా కూటమి తరపున టీజేఎస్‌కు కేటాయించారు. టీజేఎస్ తరపున చిన్నశంకరం పేటకు చెందిన జనార్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాపన్నపేటకు చెందిన ఉపేందర్‌రెడ్డికి కూడా బీ ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా నామినేషవేశారు. సిట్టింగ్ ప్రొఫైల్ రామాయంపేట మండలం కోనాపూర్‌కు చెందిన మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. బీఏ ఎల్ఎల్బీ చదివిన ఆమె 2001లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2001 నుంచి 2004 వరకు రామాయంపేట జెడ్పీటీసీగా పనిచేశారు. 2004లో మొదటి సారిగా రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి తిరిగి ఓటమి చవిచూశారు. 2014లో విజయశాంతిపై పోటీచేసి 39,600 మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ తొలి శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. Segment Graph ప్రత్యేకతలు - పంచాయతీరాజ్ ద్వారా రూ.156 కోట్లతో రహదారుల నిర్మాణం - మెదక్ పట్టణానికి రూ.880 కోట్లతో రింగ్‌రోడ్డు - రూ.38 కోట్లతో సమీకృత కలెక్టరేట్, రూ.18 కోట్లతో పోలీసు కార్యాలయం భవనాలు నిర్మాణం - రైతుల కోసం మండలానికి ఒక గోదాము నిర్మించారు. - మెదక్ పట్టణంలో 300 పడకల ఆసుపత్రి - వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. - మెదక్ పట్టణంలో మినీట్యాంక్‌బండ్, బ్యూటిఫికేషన్ - రైతు బంధు ద్వారా 59,835 మందికి లబ్ది చేకూరింది. - సీఎంఆర్ఎఫ్ ద్వారా 2329 మంది సహాయం. ప్రధాన సమస్యలు - వ్యవసాయ ప్రధానమైన మెదక్‌లో సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. - చెరుకు రైతులకు ఉపయోగపడే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించాల్సి ఉంది. - ఘనపురం ప్రాజెక్టు పనులు పెండింగ్. - పీజీ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు లేవు. యువత ఉపాధి సమస్య ఎదుర్కొంటోంది. .:: ఇన్పుట్స్: నాగరాజు కాకోళ్ల, మెదక్ -
మిలియన్ మామ్స్ ర్యాలీ ప్రారంభించిన ఆకాశ్ పూరీ
శంషాబాద్: నిత్యం కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే అమ్మలందరూ ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నొవాటెల్ హోటల్ వద్ద మిలియన్ మామ్స్ కార్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమ్మ బాగుంటేనే కుటుంబంలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీ విజయవంతం కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆకాంక్షించారు. సమయం, వేగం, గమ్యం ఆధారితంగా నిర్వహించే ఈ ర్యాలీలో మొత్తం 75 మంది మహిళలు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులైన షాదాన్ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇందులోంచి ఇద్దరిని విజేతలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నొవాటెల్ నుంచి కాళీమందిర్ సమీపంలోని షాదాన్ కాలేజీ వరకు ఉంటుందన్నారు. మొత్తం మిలియన్ మంది మహిళలను చైతన్యం చేసే విధ ంగా కార్యక్రమాలను రూపొందించినట్లు డాక్టర్ మనిపవిత్ర తెలిపారు. విజేతలను సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు, నటుడు ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లకు బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష
-
‘అలాంటిది ఏదైనా ఉంటే గుండు కొట్టించుకుంటా’
లక్డీకాపుల్ : వచ్చే నెల(జూలై) 5వ తేదీ వరకు రేషన్ డీలర్లకు రావాల్సిన బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్డీకాపుల్‌లో శుక్రవారం జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ... సమ్మె నోటీసులు ఇచ్చిన చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ రాష్ట్రంలో డీలర్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఒకవేళ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు లారీలతో పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ల అసోసియేషన్ తమకు మద్దతుగా ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది డీలర్లు తమతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు శాంతియుతంగా దీక్ష చేశామని, ఇకపై జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓఆర్ కట్టకుండా సహకరించిన ప్రతీ ఒక్క డీలర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కడుపు కాలినా పట్టించుకోరా.. రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్స్ సప్లై విభాగంలో అవార్డులు రావడానికి కారణం మేము కాదా అంటూ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి డీలర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం దారుణమన్నారు. కడుపు కాలి బాధను వెళ్లగక్కుతూ సమ్మె చేసినా తమను ప్రభుత్వం పట్టించుకోలేవడం లేదని ఆరోపించారు. నకిలీ వేలి ముద్రలు, బ్లాక్ మార్కెట్‌తో డీలర్లకు ఎటువంటి సంబంధం లేదన్న రాజు.. అలాంటిది ఏమైనా ఉందని తేలితే గుండు కొట్టించుకుంటానంటూ వ్యాఖ్యానించారు. 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని.. 2015 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పోరాటం చేస్తామన్నారు. డీలర్లను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సరుకులు సరఫరా చేసేందుకు మహిళ సంఘాలు 80శాతం వరకు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలు తమకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. డీలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ముఖం చూసైనా తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ విషయంలో ఆమె చెప్పినట్లుగా నడుచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
అంత్యక్రియల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్
దుబ్బాక: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మేనమామ దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొత్త గాలిరెడ్డి(71) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. బుధవారం ఉదయం జరిగిన గాలిరెడ్డి అంత్యక్రియల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి పాల్గొన్నారు. గాలిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తలచారు. గాలిరెడ్డి గంభీర్పూర్ గ్రామ పంచాయతీకి 15 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. -
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం
మెదక్ మున్సిపాలిటీ : ఈ నేలసాక్షిగా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజల తరుపున జీవితాంతం రుణపడి ఉంటానని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన సీఎం బహిరంగ సభలో డిప్యూటి స్పీకర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంగా చేయాలని ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుంచి ఎంతో మందికి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టుకున్న ఈ ప్రాంత ప్రజల కోరిక నేరవేరలేదన్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క కార్యాలయం తరలివెళ్తుంటే గుండె తరుక్కుపోయేదన్నారు. కానీ 2014లో సీఎం కేసీఆర్ మెదక్ వచ్చిన సందర్భంగా మెదక్ జిల్లాను చేస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని, నేడు కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మెదక్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టెందుకు సీఎం కేసిఆర్ ప్రత్యేశ్రద్ధ వహించారని తెలిపారు. రైతు బాంధవుడు కేసీఆర్ అడగకుండా సింగూర్ నీళ్లు ఇచ్చారన్నారు. -
సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, మెదక్ : సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు వరాలు కురిపించారు. నర్సాపూర్ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్‌డిపోను నర్సాపూర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు బస్‌డిపోకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మెదక్ పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి రూ.కోటి రూపాయల నిధులు ప్రకటిం చారు. అలాగే మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. మెదక్ మండలం ఔరంగాబాద్‌లో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. ‘నేను మెదక్ జిల్లా ముద్దుబిడ్డను.. మీ సొంత బిడ్డను.. సిద్దిపేట ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాను.. బక్కపేదోడు నాతో ఏమైతదని అందరూ అవహేళన చేసిండ్రు.. మీ ఆశీర్వాద బలంతో తెలంగాణ సాధించా.. సీఎంగా రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తున్నా.. సొంత జిల్లా వాసుల అనుమతితో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానా లు, రెండు ఎంపీ స్థానాలను గెలిపించి ఆశీర్వదించాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మ డి మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పిచ్చిపిచ్చి ఆరోపణలను చేస్తూ ప్రజల ను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిం చారు. ఆ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో సైతం విజయం సాధించటం ఖాయమన్నారు. కాంగ్రెస్ వల్లే ఘనపురం నాశనమైంది.. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలోని ఘనపురం ప్రాజెక్టు నాశనం కావటానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కూచన్‌పల్లి గ్రామంలోని రైతు కుర్మ దుర్గయ్య ఆత్మహత్య చేసుకోగా మిత్రుడు సుభాష్‌రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఘనపురం ప్రాజెక్టు కాల్వలు పూర్తి గా ధ్వంసమై కనిపించాయన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.100 కోట్లతో ఘనపురం ప్రాజెక్టు అభివృద్ధి చేయడంతోపాటు చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఏడా ది చివరి వరకు మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందజేస్తామన్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మంజీరాపై ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందేస్తామని ప్రకటించారు. మంజీరా, హల్దీవాగులపై 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో జీఓ తీసుకువస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. రూ.1000 కోట్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు సాగుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఇంటింటికీ నీటి కనెక్షన్లు ఇచ్చి ఆడపడచుల నీటి కష్టాలు తీరుస్తామని తెలిపారు. హరీశ్‌రావుపై పొగడ్తల వర్షం ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను ప్రజలు విశ్వసించరని తెలిపారు. అందోలు నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రులు పనిచేశారని, అయితే చెరువుల తవ్వుకున్నట్లు బిల్లులు ఎత్తుకుని అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. కాగా జిల్లా మంత్రి హరీశ్‌రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. మంత్రి హరీష్‌రావు చురుగ్గా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నట్లు చెప్పారు. బహిరంగసభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాశ్‌రెడ్డి, దేవీప్రసాద్, భూమిరెడ్డి, కొలను దామోదర్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘వాట్సప్’తో స్పందించిన డిప్యూటీ స్పీకర్
రామాయంపేట, నిజాంపేట(మెదక్) : దుబాయ్ నుంచి వచ్చిన వాట్సప్ సమాచారానికి స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అక్కడి ఎన్ఆర్ఐల సహకారంతో క్షత్రగాత్రున్ని ఆసుపత్రిలో చేర్పించి మంచి మనసును చాటుకున్నారు. టూరిస్ట్ వీసాపై వెళ్లి.. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు అనుప పరశురాములుకు భార్యతోపాటు బాబు ఉన్నాడు. పేదస్థితిలో ఉన్న పరశురాములు ఐదారు నెలలక్రితం బతుకుదెరువు నిమిత్తం విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. వీసా గడువు ముగియగా, అతడు షార్జాలోని ఒక కంపెనీలో రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. ఇటీవలే అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పరశురాములు కాలు విరిగింది. ఆసుపత్రిలో చేర్పించడానికి అక్కడి చట్టాలు అంగీకరించకపోవడంతో అతన్ని ఒక గదిలో ఉంచారు. ఈవిషయమై అక్కడ ఉన్న అతని స్నేహితులు కొందరు ఈ విషయమై రాత్రి నేరుగా ఫోన్లో వాట్సప్ ద్వారా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె అక్కడి ఎన్ఆర్ఐలు శ్రీనివాసరావు, అనిల్, ఉపాసన సహాకారంతో పరశురాములును చికిత్స నిమిత్తం అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. పరుశరాంలు తన స్వగ్రామానికి వచ్చేవిధంగా సహాకరించాలని డిప్యూటీ స్పీకర్ వారిని కోరారు. త్వరలో పరశురాములు తన స్వగ్రామానికి చేరుకుంటారని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమయానికి స్పందించిన పద్మాదేవెందర్‌రెడ్డి మంచి మనసును గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. -
డబుల్ రగడ
రామాయంపేట, నిజాంపేట(మెదక్): రెండు పడకల ఇళ్ల నిర్మాణంకోసం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అయితే అరగంటలోపే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు నిర్మాణ స్థలం తమదిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి 40 రెండు పడకల ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి డిప్యూటీస్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడికి సమీపంలో తిరుమలస్వామి గుడివద్ద కార్యక్రమం జరుగుతుండగా గ్రామానికి చెందిన కొంతమంది దళిత మహిళలు శిలాఫలకం వద్ద వచ్చిన నిరసన తెలిపారు. ఈస్థలం తమదని, తమ అంగీకారం లేకుండా ఇక్కడ ఎలా పనులు ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహంతో ఊగిపోతూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనితో టీఆర్ఎస్ కార్యకర్తలకు, నిరసన తెలిపిన మహిళలకు మధ్య కొద్దిసేపు తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. అక్కడే ఉన్న విలేకరులకు తమకు ఎప్పుడు స్థలాలు మంజూరు చేశారో వివరించారు. ఇళ్లు నిర్మించుకోవడానికి 1999లో తమకు పట్టాసర్టిఫికెట్లు ఇచ్చారంటూ వాటిని చూపించారు. ఇప్పుడు అదేస్థలంలోడబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తే తామంతా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారని, అంతేకాకుండా తమ స్థలంలో ఇళ్లు నిర్మించడమేమిటని ప్రశ్నించారు. నిజాంపేట ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈవిషయంపై నిజాంపేట తహసిల్దార్ ఆనందరావును వివరణకోరగా కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని, స్థలం చదును చేసేటప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తంచేయలేదని చెప్పారు. -
అన్నదాతకు అండ
మెదక్ జోన్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమితులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పంటసాగు కోసం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రెవెన్యూ రికార్డులని ఎన్నోళ్లుగా తప్పుల తడకగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి తప్పులను పూర్తిగా సరిచేయడం జరుగుతోందన్నారు. రైతు శిక్షణతో సమగ్ర సమాచరాన్ని రైతు సమితులు తెలుసుకుని పల్లెలో పంటలసాగు విషయంలో రైతులకు సహాయపడాలని ఆమె కోరారు. అనంతరం జరిగిన రైతు సమితుల శిక్షణలో భాగంగా వ్యసాయ జిల్లా అధికారులు పరుశురాం రసాయన ఎరువులతో భూసారం దెబ్బతింటుందని, సేంద్రియ ఎరువులతోనే రైతుకు మంచి ఆదాయం లబిస్తోందని తెలిపారు. అనంతరం రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు మాట్లాడుతూ, నాలుగురోజల పాటు కొనసాగే ఈ రైతు సమితుల శిక్షణలో రోజులు ఐదు మండలాల సమితుల మండల, గ్రామ, జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొంటారని తెలిపారు. శిక్షణలో అధికారులు చెప్పే ప్రతి విషయాన్ని అవగతం చేసుకుని పల్లెలో రైతులకు వివరించాలన్నారు. వే బ్రిడ్జి ప్రారంభం.. మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.13 లక్షలతో నిర్మించిన ధర్మ కాంటను ఈ సందర్భంగా ఆమె ప్రారంభించారు. అలాగే పశువుల షెడ్డు నిర్మాణం రూ.19 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మెన్ రాగి అశోక్, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, జెడ్పిటీసీ లావణ్యరెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి చక్రపాణి తదితరులు ఉన్నారు. -
గ్రామీణ మహిళలకు ఉపాధి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు. -
నిర్లక్ష్యం
సాక్షి, మెదక్ : పొరుగు జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తి కావచ్చాయి. మెదక్ జిల్లాలో మాత్రం క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ జిల్లాలో ఉన్నదే రెండు నియోజకవర్గాలు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూ ర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయిం చడంలో ఆర్‌ఆండ్‌బీ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు బహిరంగగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నియోజకవర్గ కేం ద్రాల్లో జీప్లస్ వన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. 2016లో ఒక్కో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయిం చింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేలను కలిసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయాలను డిజైన్ చేయించారు. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక చాంబర్‌తోపాటు నాలుగు గదులు, హాల్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మించనున్నారు. ప్రభుత్వం మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి 2016 డిసెంబర్ నెలలో నిధులు కేటాయించింది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు సందర్భాల్లో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకా పిల్లర్ల దశలోనే.. డిప్యూటీ స్పీకర్ నివాసం మెదక్ పట్టణంలో ఉంది. నియోజకవర్గ ప్రజలను ఆమె ప్రస్తుతం అక్కడే కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారితో సమావేశమయ్యేందుకు అనువైన వసతులు అక్కడ లేవు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం త్వరగా పూర్తయితే అక్కడే అధికారులు, ప్రజలను కలవవచ్చని ఆమె భావిస్తున్నారు. అయితే క్యాంపు ఆఫీసు నిర్మాణం పనులు ఎంతకూ పూర్తి కాలేదు. పట్టణ ప్రధాన రహదారి పక్కన ఫారెస్టు రేంజ్ ఆఫీస్ సమీపంలో ఈ క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉన్నాయి. పనులు పూర్తి అయ్యేందుకు మరో 8 నెలలకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటివరకు ఎన్నికలు వస్తే నిర్మా ణం పనులు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. నర్సాపూర్‌లో పూర్తి కాని పనులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులు సైతం ఇంకా పూర్తి కాలేదు. నర్సాపూర్‌లోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఎంపీపీ ఇంటి నిర్మాణం చేపడుతుండగా ఆ భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆసక్తి చూపారు. దీంతో ఆర్అండ్బీ అధికారులు ఎంపీపీ క్వార్టర్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనంగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. మొత్తం రూ.70 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. -
15న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను 12 రోజులు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సోమవారం అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, కడియం, ఈటల, పోచారం, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేï ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీఎల్పీ నేత సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. మూడు రోజులు సెలవులు: గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 27 దాకా జరుగుతాయి. 13, 14వ తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ప్రభుత్వ వివరణ ఉంటాయి. 15న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 16, 17, 18 తేదీల్లో ఉగాది సెలవులు. 19న బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి వివరణ, 20 నుంచి 25 వరకు డిమాండ్లు, పద్దుల మీద చర్చ, వివరణలు, ఓటింగ్ ఉంటాయి. 25న ఆదివారమైనా కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. 26న శ్రీరామనవమి సందర్భంగా సెలవు. 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. -
సాధికారతతోనే అతివకు అందలం
అల్గునూర్(మానకొండూర్): సాధికారతతోనే అతివలకు సముచిత గౌరవం దక్కుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని రాంలీలా మైదానంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవ సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి ఎదుగుదలకు తల్లిదండ్రులు, సమాజం సహకరించాలని కోరారు. ఆడపిల్లలపై వివక్ష పోవాలని అన్నారు. మహిళలకు ఇప్పటికీ పురుషులతో సమానంగా హక్కులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ గుండు సుధారాణి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
జై దుర్గాభవానీ..
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో చివరి రోజైన గురువారం రాత్రి జై దుర్గాభవానీ నామ స్మరణతో అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సాయిరెడ్డిలు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథంగోలి వద్ద ఉన్న రథాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలు, మెరుపు కాగితాలు, పూలదండలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం రథంపై పలువురు దేవతల చిత్ర పటాలను అలంకరించి, మధ్యలో దుర్గమ్మతల్లి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రథం ముందు పట్టు పరిచి 18 కులాల పనిబాటలవారు తమ తమ వృత్తులు, సాంప్రదాయాలకనుగుణంగా మంత్రాలను పటించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు వందలాది మంది భక్తులు రథాన్ని తాళ్లను పట్టి జై దుర్గాభవాని అంటూ నినాదాలు చేస్తూ రథాన్న లాగారు. భారీ బందోబస్తు.. రథం ముందు డప్పుచప్పుళ్ల కనుగుణంగా యువకులు నృత్యాలు చేస్తుండగా రథోత్సవ ఊరేగింపు ముందుకు సాగింది. దారి పొడుశున వేలాది భక్తులు బండరాళ్లపై నిలబడి దుర్గమాతకు జై అంటూ చేసిన నినాదాలతో ఏడుపాయల కొండకోనలు మారుమ్రోగాయి. రాజగోపురం వరకు అత్యంత వైభవంగా రథోత్సవం కొనసాగింది. ఎస్పీ చందనాదీప్తి, అదనపు ఎస్పీ నాగరాజుల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పాలకవర్గ డైరెక్టర్లు శివాజి, ఇతర శాఖల అధికారులు తమ తమ సేవలందించారు. పలువురు భక్తులు విందులతో.. జాతరలో 3వ రోజు గురువారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. తొగిట పిఠాధిపతి మాధవానంద స్వామి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. మంజీరా నదిలో స్నానాలు చేసిన భక్తులు క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా పలువురు భక్తులు విందులు ఏర్పాటు చేసుకుని ఏడుపాయల్లోని పచ్చని చెట్ల నీడన ఆనందంగా గడిపారు. -
అసెంబ్లీ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ ముగిసిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సభ్యులు అడిగిన సందేహాలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా టీఎస్ఆర్టీసీ బలోపేతం, రుణాల వడ్డీ మాఫీ, మురుగు కాల్వల నిర్వహణకు చర్యలు, ఫాతిమా నగర్ రైల్వే బ్రిడ్జి, నాయీ బ్రహ్మణులకు క్షౌరశాలలు, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాల పెంపు, దివ్యాంగుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. -
నిరసనలతో అసెంబ్లీ ఆరంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ తొలిరోజే నిరసనలతో ఆరంభమైంది. రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రశ్తోత్తరాలు పూర్తయ్యే వరకు పోడియంలోనే బైఠాయించారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డికి సమయం ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కోరినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. శుక్రవారం సభ ఆరంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. తాము రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని, దానిపై మొదట చర్చించాలని కాంగ్రెస్ పక్షఉపనేత టి.జీవన్‌రెడ్డి పేర్కొ న్నారు. ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ సభ్యులు సైతం తమ స్థానాల్లోంచి లేచి రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసన.. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో కాంగ్రెస్ సభ్యు లంతా పోడియం ముందు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ కోరినా వినిపించుకోలేదు. కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘పత్తి రైతులను ఆదుకోవాలి’, ‘15 శాతం తేమ ఉన్న పత్తిని ప్రభు త్వమే కొనుగోలు చేయాలి’అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలోనే ఉన్నారు. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని డిప్యూటీ స్పీకర్ కోరినా వినకపోవడంతో, ప్రశ్నోత్తరాలు యథావిధిగా కొనసాగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా పోడియం వద్దే కూర్చొని నినా దాలు చేశారు. ప్రశ్నోత్తరాల మధ్యలో డిప్యూటీ స్పీకర్ మరోమారు కల్పించుకుని సభ్యులు తమ స్థానాల్లో వెళ్లి కూర్చుంటే ప్రతిపక్ష నేతకు మైక్ ఇస్తానని చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. మధ్యలో కొన్ని ప్రశ్నలపై సీఎం సమాధానం ఇచ్చిన సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. కొందరే సభను శాసించలేరు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ‘సభా నాయకుడు సభలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నారు. రేపు మరొకరు ఉంటారు. అక్కడ ఎవరున్నా మనం వారిని గౌరవించాలి. కొందరు సభ్యులు మొత్తం సభను అడ్డుకోవడం సరికాదు. కొద్దిమందే మొత్తం సభను శాసించలేరు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలి’ అని ఆయన పేర్కొన్నారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పినా.. ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్బర్ సూచనను సైతం పట్టించుకోని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం ముగిసి, సభ వాయిదా పడేంత వరకు పోడియం ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ రైతు సమస్యలపై ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాలు ముగిశాక డిప్యూటీ స్పీకర్ ప్రకటిం చారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. -
ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. శాసన సభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్, టీడీపీలు గైర్హాజరయ్యాయి. ప్రతి రోజూ ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. పార్టీ సభ్యుల సంఖ్యా బలం ఆధారంగా స్వల్పకాలిక అంశాలను, రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయనున్నారు. అన్ని బిల్లులు ఒకేసారి కాకుండా వేర్వేరు రోజుల్లో పెట్టాలని ప్రతి పక్షాలు సూచించగా ప్రభుత్వం అందుకు అంగీకరించింది. బిల్లులపై చర్చను మధ్యాహ్నం సెషన్లలో చర్చిద్దామని ప్రతిపా దించింది. 15 రోజులపాటు సభ నడిపితే చాలంటూ ఈ భేటీలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లేఖ ఇచ్చారు. ఎన్ని రోజులు సభ జరపాలన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం ఏదీ జరగలేదని, ఎన్ని రోజులైనా జరిపేం దుకు సిద్ధమని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఫ్లోర్ లీడర్లతో అన్నట్టు తెలిసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పది పనిదినాలకు సరిపోను రోజుకు పది ప్రశ్నల చొప్పున వంద ప్రశ్నలను ఎంపిక చేశారు. టీఆర్ఎస్–69, కాంగ్రెస్–16, ఎంఐఎం–6, టీడీపీ–3, సీపీఎం–1, ఇండిపెండెంట్–1 చొప్పున ప్రశ్నలను కేటాయించారు. -
పేదల కష్టం తెలిసినోడు కేసీఆర్
► డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి ► కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మెదక్ మున్సిపాలిటీ: మన కడుపునొప్పి తెలిసినోడు కేసీఆర్ అని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మాయ గార్డెన్లో నియోజకవర్గంలోని 214మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 45వేల చెరువులను గుర్తించి మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తోందన్నారు. చెరువులకు జలకళ రావడంతో ఊర్లు బాగుపడుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పైప్లైన్ల నిర్మాణం పూర్తైందని, డిసెంబర్‌లోగా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. మెదక్ నియోజకవర్గానికి రెండు వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులకు వాటిని కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్యుత్ కొరత లేకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ. నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తోందన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, రామాయంపేట ఎంపీపీ విజయలక్ష్మి, పాపన్నపేట జెడ్పీటీసీ స్వప్న, పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, తహసీల్దార్ యాదగిరి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ప్రతిపక్ష నేత మైకునే కట్ చేస్తున్నారు
⇒ ఇక్కడ ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నాం: హరీశ్‌రావు ⇒ అయినా హుందాగా వ్యవహరించడం లేదంటే ఎలాగని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: పద్దులపై చర్చ సంద ర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వ్యవహరించిన తీరు హుందాగా లేదన్న ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డిల ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఆ చర్చలో డిప్యూటీ స్పీకర్ ప్రతి పక్షానికే ఎక్కువ అవకాశమిచ్చారని స్పష్టం చేశారు. ఎక్కువ సభ్యులున్న అధికార పక్షం 25 నిమిషాలు మాట్లాడితే.. కాంగ్రెస్ సభ్యులు గంటా ముప్పై నిమిషాలు, బీజేపీ సభ్యులు 46 నిమిషాలు మాట్లాడారని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల మొత్తంగా చూసినా.. టీఆర్ఎస్ సభ్యులు ఆరు గంటల ముప్పైనిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడారని తెలిపారు. ప్రతిపక్ష నేత లేచిన ప్రతిసారి డిప్యూటీ స్పీకర్ మైకు ఇచ్చారని.. దాదాపు ఐదుసార్లు ఆయన చర్చ మధ్యలో మాట్లాడారని చెప్పారు. అయినా ప్రతిపక్షం పట్ల హుందాగా వ్యవహరించడం లేదన్న వ్యాఖ్యలు బాధాకరమని హరీశ్ వ్యాఖ్యా నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత మైకును పదే పదే కట్ చేస్తున్నారని.. అదే మన శాసనసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ తీరు ఆక్షేపణీయం మంగళవారం డిప్యూటీ స్పీకర్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్ దృష్టికి తెచ్చారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని లేవనెత్తారు. సభ సజావుగా జరిగేందుకు అధి కార పక్షానికి ప్రతిపక్షం పూర్తిగా సహకరి స్తోందని.. ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడినా సమయమిచ్చిన డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి మాట్లాడితే అవకాశం ఇవ్వ లేదని ఆరోపించారు. దీనిపై ప్రతిసారి లేచి చెప్పడానికి తనకు హుందాగా లేదని, పద్దులపై తమ అభ్యంతరాలు వినకపోవడం విచారకర మన్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్‌కు తగిన సూచ నలు, సలహాలు ఇవ్వండి. అవవసరమైతే ప్యానల్ స్పీకర్‌ను సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి డిప్యూటీ స్పీకర్‌తో చర్చించండి. సభను ఇలాగే జరుపుతామంటే ఇక్కడ కూర్చో వడంలో అర్థం లేదు..’’అని జానా వ్యాఖ్యానిం చారు. ఇక ప్రజల ఆవేదనను సభలో చెప్పేం దుకు వస్తే డిప్యూటీ స్పీకర్ పదేపదే తమ మైక్ కట్ చేశారని.. విపక్షాలను మాట్లాడ నివ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపిం చారు. జానారెడ్డి అంటే అపార గౌరవముంది రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న జానారెడ్డి అంటే తమకు అపార గౌరవం ఉందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్నా హుందాగానే వ్యవహరిస్తారని.. ఏపీలో కన్నా ఇక్కడ హుం దాగా సభను నడుపుకొంటున్నామని వ్యాఖ్యా నించారు. ఎవరికెంత సమయం ఇవ్వాలన్న దానిపై కొన్ని మినహాయింపులు ఉన్నాయని.. వాటిని పక్కనపెట్టి కూడా డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించారని చెప్పారు. -
అన్నింటా ఆమె
నేడు మహిళా దినోత్సవం ఆకాశంలో సగం.. సమాజ నిర్మాణంలో మహోన్నతం.. అన్ని రంగాల్లోనూ పాత్ర అమోఘం.. మహిళల కృషి అనిర్వచనీయం.. వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నూతనంగా మనుగడలోకి వచ్చిన మెతుకుసీమలో మహిళా జనాభా అధికమే. అయితే ఇప్పటికీ చాలా మందికి ప్రతిభ పాటవాలున్నా వెనుకబాటుకు గురవుతున్నారు. రాజకీయరంగంలో మహిళలు రాణిస్తున్నా.. కొందరు భర్తచాటునే ఉంటున్నారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని మహిళా ప్రజాప్రతినిధులు సాధికారతకు దూరమవుతున్నారు. మరోవైపు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరం. జిల్లాలో 51 శాతానికిపైగా ఉన్న మహిళలు జిల్లా సమగ్ర అభివృద్ధి, సమాజంలో మార్పునకు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. సాక్షి, మెదక్ : జిల్లాలో మహిళలదే పైచేయి. జిల్లా జనాభా 7,67,428 ఉంటే అందులో పరుషులు 3,78,654 కాగా 3,88,774 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 10,120 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. జనాభా పరంగా మహిళలు 51 శాతంపైగా ఉన్నప్పటికీ మహిళా సాధికారత విషయంలో వెనబడే ఉన్నారని చెప్పవచ్చు. విద్య, వృత్తి వ్యాపారులు, రాజకీయాలు, సామాజికరంగాల్లో జిల్లాలోని మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉందని చెప్పువచ్చు. మహిళల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతోపాటు వివక్షను ఎదుర్కొవటం మహిళలు రాణించకపోవటానికి కారణంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం 3,77,984 మంది అక్షరాస్యులు ఉండగా వీరిలో 1,54,915 మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. మహిళా అక్షరాస్యత కేవలం 45.15 శాతం ఉంది. అదే పురుషుల అక్షరాస్యత శాతం 67.15 శాతంగా ఉంది. మహిళా అక్షరాస్యత శాతం పెరిగితేనే మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలవుతుందని ఆ దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మహిళా సంఘాల చెబుతున్నాయి. సంఖ్య పెరిగినా..కానరాని సాధికారత స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఫలితంగా జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. అయితే మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మాత్రం కానరావటంలేదు. జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణితోపాటు 9 మంది జెడ్పీటీసీలు, 10 మంది ఎంపీపీలు, 137 మంది మహిళా సర్పంచ్‌లు, 14 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణిలు గృహిణి స్థాయి నుంచి ఉన్నత పదవులకు ఎదిగారు. వీరిద్దరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ తమదైన శైలిలో పనిచేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించే మహిళలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు. అయితే మిగతా మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో ఇది కానరావటంలేదు. కిందిస్థాయిలో ఉండే జెడ్పీటీసీ, ఎంపీపీ , సర్పంచ్, కౌన్సిలర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మహిళా ప్రజాప్రతినిదులు స్వయం నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగి ఉన్నప్పటికీ ఇంకా భర్తచాటు భార్యలుగానే ఉంటున్నారు. అండగా నిలవాల్సిన భర్తలు రాజకీయపెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లాలోని మండల పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో భర్తలు పాల్గొంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులు స్వయం నిర్ణయాధికారాలతో ముందుకు సాగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్న భావన వ్యక్తం అవుతోంది. పాలనలో మహిళా అధికారుల ముద్ర పాలనకు సంబంధించి మహిళా అధికారుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భిణులు ఇంటి వద్దకాకుండా ప్రభుత్వ ఆసపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌడిపల్లి పీహెచ్సీలో ప్రయోగాత్మకంగా అమలు చేయిస్తున్నారు. మహిళల గౌరవం కాపాడేందుకు వీలుగా జిల్లాలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో మహిళా అధికారి చందన దీప్తి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో డీఆర్ఓ సహా అన్నిశాఖల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతూనే సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న దాడులు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరమైన అంశం. దీనికితోడు మహిళలు పనిచేసే చోటా అభద్రతా భావాన్ని ఎదుర్కొనటంతోపాటు వివక్షను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీనికితోడు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటలను కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 10 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించి 12, మహిళలపై వేధించటానికి సంబంధించి 18 కేసులు నమోదయ్యాయి, ఈవ్‌టీజింగ్ 21, . గృహహింస 20, కిడ్నాప్ 6, ట్రాఫికింగ్ 22 కేసులు నమోదయ్యాయి. ఇటీవల జప్తిశివనూరు వేశ్యావాటికపై పోలీసు దాడిచేస్తే అందులో 10 మంది మైనర్ బాలికలను పోలీసులు గుర్తించారు. దాడుల నివారణకు చర్య లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జిల్లాలో పొదుపు సంఘాల పనితీరు ఆందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. జిల్లాలో 13వేల సంఘాల్లో 1.38 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పొదుపు మంత్రం పాటిస్తూ ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్నారు. అలాగే మహిళా సాధికారతకు మార్గనిర్దేశకులుగా మారుతున్నారు. అయితే మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్య, వైద్య, రాజకీయ, ఉద్యోగ రంగాలతోపాటు వృత్తి, వ్యాపార, స్వయం ఉపాధి, సామాజికసేవ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. కుటుంబంలోని సభ్యులతోపాటు మహిళలు ఎన్నుకున్న రంగంలో తగిన ప్రోత్సాహం లభిస్తే మంచి స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. -
సభలో నవ్వుల పువ్వులు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ నడుమ జరిగిన చిన్న ఘటనతో కొద్దిసేపు నవ్వుల పువ్వులు విరిశాయి. చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు మాట్లాడే అవకాశమిచ్చారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంపత్.. త్వరలోనే మీరు మంత్రి పదవితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇంతలోనే స్పీకర్ మధుసూదనాచారి రావడంతో ఆమె కుర్చీ దిగారు. సంపత్ స్పందిస్తూ.. మంత్రి పదవి ఇస్తారని అనుకుంటుంటే.. ఉన్న పళంగా కుర్చీ నుంచి దించేస్తారా అనడంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మోమున చిరునవ్వులు చిందులేశాయి. -
ఐలమ్మ.. తెలంగాణ ఐకాన్
పద్మా దేవేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాధన ఉద్యమానికి ఒక ఐకాన్‌గా నిలిచారని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. త్యాగం, సాహసం,ఓర్పునకు ఆమె మారుపేరన్నారు. ఐలమ్మ ఆశయాలు, ఆదర్శాల కొనసాగించాల్సిన అవసరముందన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిట్యాల(చాకలి) ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలం తా ముందుకు నడిచారన్నారు. అమరుల స్ఫూర్తితో ట్యాంక్‌బండ్‌పై స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జడ్జి జె.పి.జీవన్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేశ్‌కుమార్ రూపొందించిన ‘వీరనారి చాకలి ఐలమ్మ’ లఘుచిత్రం సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, రజక సమాజం రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాహితం కోసం మొక్కలు నాటాలి
పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్ సాక్షి, హైదరాబాద్ : ప్రజా హితం కోసం ప్రజలందరూ మొక్కలు నాటాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ‘ మొక్కలు నాటాలి.. అడవులను ప్రేమించాలి. సాంకేతికత పెరిగే కొద్దీ ప్రజాహితాన్ని మరిచిపోతున్నారు..’ అని ఆయన అన్నారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో మంగళవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడానికే సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వెయ్యేళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం హరిత హారం ప్రారంభించారని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ప్రపంచంలో తొలిసారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజలంతా భాగ స్వాములు కావాలని కోరారు. హరితహారంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదిరులు పాల్గొని మొక్కలు నాటారు. -
మెదక్ బల్దియాలో సిబ్బంది కొరత
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రజలకు సత్వర సేవలు అందటం లేదు. మొత్తం 18 పోస్టులకు గాను ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లకు ఒక్కరే విధులు సాగిస్తున్నారు. శానిటరీ సూపర్వైజర్ ఒక పోస్టు ఖాళీగానే ఉంది. టౌన్ ప్లానింగ్(టీపీబీవో) అధికారులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఆస్తిపన్ను వసూలు చేసే బిల్‌కలెక్టర్ రెండు పోస్టులు, జూనియర్ హెల్త్ అసిస్టెంట్ ఒక పోస్టు, పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఆరు పోస్టులు, మరో టౌన్‌ప్లానింగ్(టీపీఎస్) ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కుర్చీ కూడా ఖాళీయే. ఇలా మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందడం కష్టంగా మారింది. -
సభలో ‘సంస్కారం’ రగడ
♦ సంస్కారం లేనివారు సభ నడుపుతున్నారంటారా ♦ సారీ చెప్పకుంటే సస్పెండ్ చేస్తాం ♦ డీకే అరుణ సస్పెన్షన్‌కు సిద్ధపడ్డ అధికారపక్షం ♦ సర్దిచెప్పేందుకు యత్నించిన జానా ♦ డిప్యూటీ స్పీకర్‌పై ఆ వ్యాఖ్యే చేయలేదన్న డీకే అరుణ ♦ సస్పెన్షన్ ప్రతిపాదనను వారించిన డిప్యూటీ స్పీకర్ ♦ తీవ్ర ఆవేదనకు గురైన పద్మా దేవేందర్‌రెడ్డి.. కంటతడి సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా ప్రశాంతంగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి! ‘సంస్కారం’పై రాజుకున్న వివాదం ఓ మహిళా సభ్యురాలి సస్పెన్షన్ ప్రతిపాదన వరకు వెళ్లింది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కలగజేసుకుని.. సస్పెన్షన్ కాకుండా పరిస్థితిని చక్కదిద్దారు. ఉప సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అంశంపై ఈ గొడవ మొదలుకాగా.. చివరకు ఉప సభాపతే దాన్ని సద్దుమణిగేలా చేయటం విశేషం. కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ... ఉప సభాపతిని ఉద్దేశించి ‘సంస్కారం లేనివారు సభను నడుపుతుంటే ఇట్లాగే ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారన్న విషయంపై ఈ గొడవ మొదలైంది. ఏం జరిగింది? నీటిపారుదల, ఆర్అండ్బీ శాఖల పద్దులపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. సమయం మించిపోయిందంటూ స్పీకర్ స్థానంలో ఉన్న ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మైక్ కట్ చేసి అధికారపక్ష సభ్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మొదటి వరుస సీట్ల వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయినా మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి నిష్ర్కమించి, కొద్దిసేపటి తర్వాత సభలోకి వచ్చారు. ‘‘సభ్యులు మాట్లాడేటప్పుడు ప్రభుత్వానికి సూచనలు చేయటం, ఏవైనా తప్పులుంటే ఎత్తి చూపటం వరకు సరేగానీ..’’ అంటూ జానారెడ్డి పేర్కొంటుండగా పద్మాదేవేందర్‌రెడ్డి కలగజేసుకున్నారు. ‘‘సంస్కారం లేని వారు సభ నడిపితే ఇలానే ఉంటుంది..’’ అని సీనియర్ సభ్యురాలు (డీకే అరుణ) అన్నారని, అలా అనవచ్చా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చర్య తప్పదని హెచ్చరించారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని... ‘‘జానారెడ్డి గారూ మీరంటే మాకు గౌరవం. మీ సభ్యురాలు అనుచితంగా మాట్లాడినందున ఆమెతో బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తే హుందాగా ఉంటుంది. లేకుంటే చర్య తప్పదు’’ అని అన్నారు. ‘‘మా ప్రభుత్వం బాగా చేస్తోందని చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలే పనిగా పెట్టుకోవటం సరికాదు. దానివల్లే ఆరోపణలు-ప్రత్యారోపణలు వస్తున్నాయి. సభ ముగిసే వేళ ఆవేశాలు వద్దు. దాన్ని అక్కడితో వదిలేద్దాం’’ అని జానా సర్దిచెప్పారు. వారి విచక్షణకే వదిలేద్దాం.. తాను అసలు ఆ వ్యాఖ్యే చేయలేదని, అధికార పక్ష సభ్యులే తమ పట్ల అనుచితంగా మాట్లాడారని డీకే అరుణ పేర్కొన్నారు. కావాలంటే రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్.. లేచి ఆమెపై సస్పెన్షన్ ప్రతిపాదనకు మరోసారి సిద్ధపడగా పద్మా దేవేందర్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ అంశాన్ని సభ్యురాలి విచక్షణకే వదిలేద్దామంటూ వారించారు. ఈ సమయంలో పద్మా దేవేందర్‌రెడ్డి పలుమార్లు ఆవేదనకు గురై కంటతడి తుడుచుకున్నారు. ఎప్పుడూ వాళ్లదే నడుస్తదా?: డీకే ‘‘నడుస్తున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్లదే నడుస్తదా? ఇంతకంటే పెద్దపెద్ద సామ్రాజ్యాలు కనిపించకుండా పోయినయి. చూద్దాం మూడేళ్ల తర్వాత ఏమైతదో?’’ అని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను డిప్యూటీ స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. పక్క సభలో చూస్తున్నారు కదా? ‘‘19 మంది సభ్యులున్న మీరు గంటకుపైగా మాట్లాడితే 80 మంది సభ్యులున్న మేం 48 నిమిషా లే మాట్లాడాం. ఇంకా సమయం కావాలని పట్టుపట్ట డం.. ఇవ్వకుంటే అనుచితంగా మాట్లాడ్డం, రన్నింగ్ కామెంట్రీ, బయటకు వెళ్లి రావటం ఏంటిది?’’ అని హరీశ్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి ప్రశ్నించారు. ‘‘గతంలో మైక్ విరిచిన సంస్కృతి ఆమె(అరుణ)ది. ఇప్పుడేమో ఉపసభాపతి పట్ల అనుచిత వ్యాఖ్యలు. పక్క రాష్ట్ర సభ(ఏపీ)లో చూస్తున్నారు కదా.. ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన వాటిపై ఓ సభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. మేం దాన్ని కోరుకోవటం లేదు. గతంలో మా సభ్యులు అనుచితంగా వ్యవహరిస్తే క్షమాపణ చెప్పించాం. ఇప్పుడు ఆమె కూడా క్షమాపణ చెప్పాలి’’ అని స్పష్టంచేశారు. ఈ సమయంలో జానా జోక్యం చేసుకుని.. గతంలో తాను కూడా డీకే అరుణ, సంపత్‌లతో క్షమాపణ చెప్పించానన్నారు. ఎవరి విజ్ఞతకు వారికి వదిలేయాలని, వారే ఆత్మవిమర్శ చేసుకుంటారన్నారు. తమనేమన్నా ఊరుకుంటామని.. కానీ స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడితే ఊరుకోమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరుణను సస్పెండ్ చేయాల్సిందేనని అధికార సభ్యురాలు గొంగిడి సునీత డిమాండ్ చేశారు. దీంతో మంత్రి హరీశ్ సస్పెన్షన్ ప్రతిపాదించేందుకు సిద్ధపడ్డారు. అరుణకు చివరి అవకాశం ఇస్తున్నానని, క్షమాపణ చెప్పాలని సూచించారు. -
'బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నా'
వనదేవతలను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు వరంగల్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు మేడారం సమ్మక్క-సారలమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మను మొక్కుకోగా, ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నానని తెలిపారు. వారంలో 3 రోజులపాటూ మేడారం జాతర జరిగేలా కృషి చేస్తామన్నారు. వచ్చే మేడారం జాతర వరకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గతంలో కంటే ఇప్పటి జాతరకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. -
విద్యార్ధులతో కలిసి 'పద్మ' ప్లాష్మబ్
-
'మేము ప్రజలకు జవాబుదారులం'
మెదక్ : తాము ప్రజలకు జవాబుదారులుగా పనిచేస్తామే కానీ ప్రతిపక్షాలకు కాదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంపై పలువురు అఖిలపక్ష నాయకులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కానీ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తాము పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అభివృద్ధికి కొంత ఆటంకం కలుగుతోందని చెప్పారు. -
'ఆదుకోండి మేడమ్..అప్పుల పాలయ్యాను'
మెదక్ : దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల పరిస్థితి నేడు దీనంగా మారింది. సోమవారం మెదక్ మండలం కూచన్‌పల్లికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని సాయం చేయాలంటూ ఓ రైతు అర్థించడం చూసినవారిని కదిలించింది. 'ఆదుకోండి మేడమ్.. బోర్లువేసి అప్పులపాలయ్యాను..' అంటూ డిప్యూటీ స్పీకర్‌కు చిలుముల దశరథం అనే రైతు వినతి పత్రం అందజేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని చెప్పాడు. వర్షాధార పంటలు సాగు చేద్దామన్నా... ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో ఎలాంటి పంట వేయలేదన్నాడు. బోర్లు వేసేందుకు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోయాయని, వాటిని తీర్చే మార్గం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ డిప్యూటి స్పీకర్ ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఆర్డీఓకు ఆదేశాలిస్తూ... రైతు దశరథంకు సబ్సిడీపై రెండు గేదెలు ఇప్పించడంతోపాటు అప్పులవారి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. -
'తెలంగాణ ఇస్తే అంధకారం అవుతుందన్నారు'
మెదక్: "ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది" అని సమైక్యాంధ్ర నాయకులు అన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆమె సొంత జిల్లా మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 24 గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ అందిస్తున్నారని ఆమె చెప్పారు. -
మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన స్పీకర్
-
కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్
కరీంనగర్ (మహదేవపూరం): త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం చేరుకున్న డిప్యూటి స్పీకర్ కుటుంబసభ్యులతో సహా పూజలు నిర్వహించారు. -
వనిత మహా విద్యాలయ వార్షికోత్సవం
-
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
మెదక్ మున్సిపాలిటీ: వైద్యులు నిస్వార్థంగా పని చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం శూన్యమని డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ రాహుల్ బొజ్జాతో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఆస్పత్రి వై ద్యులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల్లో ఉన్న సమస్యలతో పాటు వైద్యుల పని తీరుపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు. చాలా చోట్ల వైద్యులు మొక్కుబడిగా పని చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రామాయం పేట పీహెచ్సీ పని తీరు రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని అక్కడే ఉన్న డీఎంహెచ్ఓకు సూచించారు. వైద్యులు పని తీరు మెరు గు పరుచుకోవాలని లేనిపక్షంలో చర్య లు తప్పవన్నారు. పలు పీహెచ్‌సీల్లో ఓపీ రోగులను చూడకపోయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్లు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు. మెదక్ ఏరియా ఆస్ప త్రి పని తీరు గతంలో కన్నా కొంత మెరుగైనప్పటికీ రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో అంబులెన్స్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్యవృత్తి పవిత్రమైందన్నారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు కింది సిబ్బందిని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. వైద్యులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాలన్నారు. త్వరలో మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఒక చిన్న పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజిషియన్, అనస్థీషియా నిపుణుడిని నియమించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, డీసీఏహెచ్ నరేంద్ర బాబు, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓ జగన్నాథం, ఈఈ రఘు, డిప్యూటీ ఈఈ రమేశ్, ఆర్డీఓ నగేశ్ గౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, వివిధ ఆస్పత్రుల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అర్హులందరికి అసరా వర్తింపు చిన్నశంకరంపేట: ‘ఆసరా’ పథకం కింద అర్హులందరికీ పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలం శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో పేర్లు లేనంత మాత్రాన ఆందోళన చెందవద్దన్నారు. మరో సారి దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు అందించేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 15 వందలు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని అసరా పథకం కింద పింఛన్ అందించి ఆదుకుంటామన్నారు. నియోజకవర్గలో రూ.125 కోట్లతో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ నగేష్, ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరుప, శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల సర్పంచ్‌లు మూర్తి పెద్దులు, సిద్దాగౌడ్, ఎంపీటీసీలు యాదమ్మ సత్యగౌడ్, పెంటమ్మ, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ మోహన్, సర్పంచ్‌లు రంగారావు, సత్యనారాయణ,నాగరాజ్, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట: ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా...ఆధ్యాత్మిక నిలయంగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్ - ఏడుపాయల బస్సును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడుపాయల అభివృద్ధికోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందుకనుగుణంగా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రోడ్డు వెడల్పు కోసం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడుపాయల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాటేజీలు నిర్మిస్తామన్నారు. ఘనపురం ఆనకట్టను అభివృద్ధి చేసి పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. స్నానఘాట్లు ఏర్పాటు చేస్తామని, హోమశాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మెదక్ జిల్లాలో తాగునీటికోసం మూడు గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పింఛన్ల పంపిణీ ఏడుపాయల దుర్గమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మిన్పూర్లో తాగునీటి పథకానికి శంకుస్థాపన, తమ్మాయిపల్లిలో పింఛన్ల పంపిణీ, చీకోడ్, కొంపల్లి, రాంతీర్థం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్, కోకన్వీనర్, ఆశయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట్రాములు, విజయలక్ష్మి , ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మంగ రమేష్, చింతల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
గంటల్లో నిర్ణయం తీసుకోలేం
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై గంటల్లో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, కార్యదర్శి రాజా సదారాం, మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్ వి.ఈశ్వర్రెడ్డిలతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని చాలా ఫిర్యాదులు వచ్చాయని స్పీకర్ చారి తెలిపారు. వీటిపై రాజ్యాంగపరంగా, సంప్రదాయాలను పాటిస్తూనే స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇది రాజ్యాంగానికి లోబడి, సంప్రదాయాలను అనుసరిస్తూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అంశమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా శాసనసభలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. 19 రోజుల పాటు జరిగిన చర్చల్లో 6 తీర్మానాలు, మూడు బిల్లులు ఆమోదం పొందగా, మూడు సభాసంఘాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఆసరా పింఛన్లు, జూబ్లీహిల్స్ కాల్పుల సంఘటనపై ప్రభుత్వం రెండు ప్రకటనలను చేసిందని చారి తెలిపారు. సభలో సహకరించిన అని పక్షాలను స్పీకర్ అభినందించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా, స్ఫూర్తిదాయకంగా అసెంబ్లీలో నిర్మాణాత్మక అంశాలపై అర్థరాత్రిదాకా అర్థవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు. -
తెలంగాణవాదులకు ఇదేనా గౌరవం?
మైకు ఇవ్వక పోవడంపై కోమటిరెడ్డి నిరసన పదవికి రాజీనామా చేస్తా.. సభపై అలిగితే ఎలా అని సీఎం అనునయింపు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొద్ది సేపు హల్ చల్ చేశారు. గురువారం అసెంబ్లీలో కొత్త పారిశ్రామిక విధానంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న తరుణంలో, తన కు ఒక నిమిషం అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, స్పీకర్ స్థానంలోఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని కోరారు. ఆయన రెండు సార్లు అభ్యర్థించినా పార్టీ నుంచి ఒకరికే అవకాశం ఇస్తామంటూ డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన విసురుగా బయటకు వచ్చేశారు. ‘ తెలంగాణ కోసం మేమూ పోరాడాం. నా మంత్రి పదవినే వదులుకున్నా. తెలంగాణ వాదులకు సభలో ఇచ్చే గౌరవం ఇదేనా ’? అంటూ ఆయన లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హడావుడిగా బయటకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు రాను, రేపు రాను, ఎల్లుండి రాను. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించడంతో, సీఎం రమ్మంటున్నారంటూ బాలరాజు మరీమరీ చెప్పడంతో తిరిగి సభలోకి వెళ్లారు. కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ అయినా తనకు మైక్ ఇవ్వక పోవడంపై నిరసన తెలిపారు. దీంతో సీఎం సమాధానం చెబుతూ ‘ తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి అంటే మాకు గౌరవం ఉంది. సభపై అలిగితే ఎలా’? అని వ్యాఖ్యానించంగా, తాను సభపై అలగలేదని, స్పీకర్‌పై అలిగానని కోమటిరెడ్డి ప్రతిస్పందించారు. ఆతర్వాత వెంటనే సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి సభనుంచి బయటకు వచ్చి ఇదే విషయంపై వాదించారు. ‘నన్ను సభకు రమ్మని ఇబ్బంది పెట్టొద్దు. రేపే రాజీ నామా చేస్తా’ అంటూ పేర్కొనడంతో జానారెడ్డి, కోమటిరెడ్డిని బుజ్జగించారు. ‘మాట్లాడడానికి అవకాశం ఇమ్మని నీ పేరునే రాసిస్తా’ అంటూ అనునయించారు. -
రాజీనామా చేయాలనుకున్నా: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అలకబూనారు. శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోడంతో ఆయన నొచ్చుకున్నారు. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు నచ్చచెప్పడంతో ఆయన సభలోకి వచ్చారు. కీలకమైన విషయం గురించి ప్రస్తావించేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మీద అలిగానని వెంకట్‌రెడ్డి తెలిపారు. రేపు రాజీనామా చేయాలనుకున్నట్టు వెల్లడించారు. సభ మీద అలగాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. సీనియర్ సభ్యుడైన వెంకట్‌రెడ్డి అంటే తమకెంతో గౌరవం ఉందని చెప్పారు. ఆయన తమ దృష్టికి అంశాలపై వెంటనే స్పందిచినట్టు కేసీఆర్ వెల్లడించారు. -
తపోభూమికి తళుకులు
మెదక్: మెతుకు సీమకే మణిహారం ఏడుపాయల. దేశంలోని రెండే రెండు వనదుర్గ క్షేత్రాల్లో ఒకటి. కాశ్మీర్‌లోని వనదుర్గ ఆలయం మూతపడగా, ఏడుపాయల్లోని వనదుర్గాదేవి క్షేత్రం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కల్గిన ఏడుపాయల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇటీవల బడ్జెట్లో నిధులను సైతం కేటాయించింది. ఈమేరకు ఈనెల 19న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డిలు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడుపాయలను ఆధ్యాత్మిక క్షేత్రంగా...యాగాజ్ఞి కేద్రంగా,...పర్యాటక నిలయంగా మార్చేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. హరితవనం...పుణ్యక్షేత్రం 50 ఎకరాల్లో ఉన్న ఏడుపాయలను వంద ఎకరాల మేర విస్తరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తుండడంతో ఏడుపాయల విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తున్నారు. అందువల్లే క్షేత్రం సమీప ప్రాంతాల్లోని భూములు అటవీశాఖ పరిధిలో ఉండడంతో వారి నుంచిఅనుమతి తీసుకునేందుకు నిర్ణయించారు. స్నాన ఘట్టాలతో మృత్యుఘోషకు చెక్ మంజీరాపాయల్లో స్నాన ఘట్టాలు లేక ఐదేళ్లలో ఇప్పటి వరకు సుమారు 56 మంది భక్తులు నీటమునిగి దుర్మరణం చెందారు. దీంతో దుర్గమ్మ ఆలయం నుంచి ఘనపురం ఆనకట్ట వరకు మంజీరపాయకు ఇరుపక్కలా మెట్లు నిర్మించి నీటిలోపల స్నానం చేసేందుకు వీలుగా మెష్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. అద్దాలు మేడలు... అందాల ఆశయాలు ఏడుపాయలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బహుళ అంతస్తుల మేడలు నిర్మించేందుకు తీర్మానించారు. అధునాతనంగా నిర్మించే గదుల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్మిస్తున్న హరిత హోటల్ దాదాపు పూర్తికావొచ్చింది. ప్రసుత్తం ఏడుపాయల్లో 42 సత్రాలు ఉండగా, అన్నీ దాతల ఔదార్యంతో నిర్మించినవే. యజమానులు వస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు కనీసం తలదాచుకునేందుకు నీడలేక చెట్ల నీడన, బండరాళ్ల మాటున పడిగాపులు కాస్తుంటారు. కళకళలాడే రోడ్లు... అడుగడుగున మరుగుదొడ్లు ప్రస్తుతం ఏడుపాయల్లో ఉన్న మట్టిరోడ్లతో యాత్రికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. దీంతో ఏడుపాయల్లోని రోడ్లన్నీ సీసీ రోడ్లుగా మార్చి రోడ్డుపక్కల డ్రైన్లు ఏర్పాటు చేస్తారు. అలాగే అవసరమైన టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. నిత్యపూజలు... యాగశాలలు ఏడుపాయల్లో అనునిత్యం శాస్త్రోత్తయుక్తమైన పూజలు నిర్వహించేందుకు అదనంగా ఆగమ పండితులను నియమించనున్నారు. దీంతో క్షేత్రంలో అనునిత్యం వేద పూజలు జరుగనున్నాయి. ఏడుపాయల్లో జనమే జయుడు సర్పయాగం నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్తగా యాగశాలలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం నిర్వహించేందుకు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘనపురం గలలు... మంజీరా పరవళ్లు పరవళ్లు తొక్కే మంజీరమ్మకు నిలకడ నేర్పింది ఘనపురం ప్రాజెక్ట్. 0.2 టీఎంసీ నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ వర్షాకాలంలో కళకళలాడుతుంది. ఎగిసిపడే చేప పిల్లలు...పొంగిపొర్లే ఘనపురం..పాల నురగలాంటి నీళ్లు...పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఆనకట్ట చుట్టూరా రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసి బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. శిల్పారామ సృష్టికర్త... ఏడుపాయల వ్యూహకర్త గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టేలా, పల్లె సంస్క ృతిని ప్రతిబింబించేలా శిల్పారామాన్ని సృష్టించిన కిషన్‌రావుకు ఏడుపాయల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఈ ప్రణాళికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. -
ఏడుపాయలకు పర్యాటక శోభ
మెదక్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల ఆలయానికి పర్యాటక శోభ కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయల రూపు రేఖలు మార్చి ఆలయ కీర్తిని ఎల్లలు దాటేలా చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ భారత దేశంలో వనదుర్గా ఆలయాలు రెండే ఉన్నాయని, అందులో కశ్మీర్‌లోని ఆలయం మూతపడిందన్నారు. ప్రస్తుతం ఏడుపాయల్లోని వనదుర్గమాత ఆలయం మాత్రమే నిత్యపూజలందుకుంటోందన్నారు. జనమే జేయుని సర్పయాగస్థలిగా వినుతికెక్కిన ఏడుపాయలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రాహుల్‌బొజ్జాకు సూచించారు. ఏడుపాయలకు వచ్చే వేలాది భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయ విశిష్టతను ఇనుమడింపజేసేందుకు ఆగమ శాస్త్ర పండితులను సంప్రదించి చండీయాగం నిర్వహణకు శాశ్వత యాగశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. మహాశివరాత్రి లోగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ నగేష్‌గౌడ్, ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఈఓ, వెంకటకిషన్‌రావు, డీఎఫ్ఓ సోనిబాల పాల్గొన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
రామాయంపేట: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రామాయంపేటలోని జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన హోటల్‌ను ఆమె సోమవారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ సెగ్మెంట్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈమేరకు నిధుల మంజూరు కోసం సీఎంకు ప్రతిపాదనలు కూడా సమర్పించామన్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతగా మండలంలోని 15 చెరువులను తీసుకున్నామని, వీటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామన్నారు. పింఛన్ల మంజూరీలో అర్హులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అనంతరం ఆమె అయ్యప్పస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెతో పాటు మెదక్ ఆర్డీఓ నగేశ్‌ను, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డిని ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల ఏసుపాలు, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ‘సి’ గ్రేడ్ ధాన్యాన్యి కొనుగోలు చేసేలా చర్యలు చేగుంట, వెల్దుర్తి: కొనుగోలు కేంద్రాల్లో ‘సి’ గ్రేడ్ ధాన్యాన్ని కూడా సేకరించేలా చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వడియారం శివారులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు. రైతుల వద్ద ‘సి’ గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1180ల మద్దతు ధరకు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. జిల్లాలో రూ.17వేల కోట్లను రైతు రుణాలను మాఫీ చేశామని, 25 శాతం డబ్బులను తిరిగి రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో రూ.900 కోట్లను రైతులకు రుణాలుగా అందించామన్నారు. రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు రూ.70 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపల్లెకు బస్సు సౌకర్యం
మెదక్‌టౌన్: రాష్ట్రంలోని పల్లెపల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ బస్ డిపోలోని నూతన బస్సులకు ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీను లాభాల్లోకి తీసుకవెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 500 హైర్, 500 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బంది సేవా ధృక్పథంతో పని చేయాలన్నారు. మెదక్ బస్ డిపోకు 10 బస్సులు అవసరం ఉండగా ఇప్పటికి ఐదు బస్సులు వచ్చాయని, మరో ఐదు బస్సులు త్వరలో వస్తాయన్నారు. మెదక్ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో పార్కింగ్ స్థలానికి నిధులు కేటాయించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పద్మాదేవేందర్ దృష్టికి తీసుకవెళ్లగా, పార్కింగ్ స్థలానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ నగేష్, తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జునగౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఎంయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, షకయ్య, పృధ్వీరాజ్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుభాష్‌చంద్రబోస్, మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ఆమె
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి: లక్ష్మణ్ గారూ... మీ ప్రసంగం త్వరగా ముగించాలండీ... సమయం మించిపోతోంది. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్: అధ్యక్షా... గౌరవ మంత్రి వర్యులు హరీష్‌రావు గారు అవసరమైతే 50 గంటలు 100 గంటలు సభ కొనసాగిద్దాం అని చెప్పారు. మీరేమో సమయం మించి పోతుంది అంటున్నారు. మేం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి..! (కొంత ఆవేశం... మరికొంత వెటకారంతో) ఉప సభాపతి: మీ తర్వాత చాలా మంది గౌరవ సభ్యులు ఉన్నారు.. వాళ్ల సలహాలు, సూచనలు కూడా వినాలి కదా... మొత్తం మీరే మాట్లాడుతా అంటే ఎలా? లక్ష్మణ్: లేదు అధ్యక్షా... ముగించేస్తున్నా.... ఇది మంగళవారం శాసనసభలో జరిగిన ఓ సన్నివేశం. మంగళవారం పద్మాదేవేందర్‌రెడ్డి ఆద్యంతం అన్నీ తానై సభ నడిపించారు. శాసనసభ సంప్రదాయాలను పాటిస్తూ...ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి స్వపక్ష, విపక్షాలను సమన్వయం చేశారు. ఈ నెల 5న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో తనకు అవకాశం వచ్చిన సమయంలో వాదోపవాదనలు... గందరగోళం మధ్య విలువైన సభాసమయం క్షణం కూడా వృథా కాకుండా అర్థవంతంగా సభను నడిపిస్తున్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి సభ్యుని మదిని తడిమి చూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం విపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూ...నిర్మాణాత్మకమైన చర్చకు స్వాగతం పలుకుతూ...వినూత్నమైన సాంప్రదాయానికి తెరలేపారు. కొంత ఉత్కంఠత ఉంది సీనియర్ల మధ్య సభ నిర్వహించడం కొంత ఉత్కంఠగా ఉన్నా, బాగానే ఉంది. తొలి అసెంబ్లీ సమావేశాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్థాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సమస్యలపై మాట్లాడే అవకాశం ఉండేదే కాదు, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలంగాణపై అర్థవంతమైన చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్షాలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాయి. వాళ్లిచ్చే సలహాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, అంతా కలిసి ఐక్యంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తాం. విద్యుత్ సమస్యపై 7 గంటలపాటు ఏకధాటిగా చర్చ కొనసాగింది. విద్యుత్ సమస్య అధికమించడానికిప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించాం. విద్యుత్ సమస్యపై అఖిల పక్షంతో కలిసి త్వరలోనే కేంద్రం వద్దకు వెళ్తాం. తెలంగాణ ప్రజల కష్టాలను వివరించే ప్రయత్నం చేస్తాం. - పద్మాదేవేందర్‌రెడ్డి,డిప్యూటీ స్పీకర్ -
రైతులను అన్నివిధాల ఆదుకుంటాం
రామాయంపేట: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రామాయంపేట వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో గ్రేడ్, మూడో గ్రేడ్ మక్కలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రైతులకు కొంతమేర మేలు జరుగుతుందన్నారు. కరువు మూలంగా మొక్కజొన్న సరిగా ఎదగక పోవడంతో చాలావరకు రైతులు నష్టపోయారని, గ్రేడ్లవారీగా మక్కలను కొనుగోలు చేయడంతో వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను మభ్యపెడుతున్నాయని, ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అనవసర విమర్శలు చేయకుండా అభివృద్ధి విషయమై సహకరించాలన్నారు. విలేకరులకు హెల్త్‌కార్డులతోపాటు ఇళ్ల స్థలా లు మంజూరు చేస్తామన్నారు. ఈసందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య డిప్యూటీ స్పీకర్, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, నరేన్ ట్రస్ట్ అధినేత చాగన్ల నరేంద్రనాధ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, సర్పంచులు పాతూరి ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పార్టీ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, చంద్రపు కొండల్‌రెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
రంగుల ‘బతుకమ్మ’
మహిళా కళాకారుల కుంచెల నుంచి వర్ణభరితంగా జాలువారిన బతుకమ్మ చిత్రాలు కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, జీవకళ ఉట్టిపడే చిత్రాలను రూపొందించిన మహిళా కళాకారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు, గౌరవ పారితోషికంతో సత్కరించారు. ఈ చిత్రప్రదర్శన ఈ నెల 17 వరకు కొనసా గుతుంది. - మాదాపూర్ -
పదివేల బతుకమ్మలతో ముగింపు వేడుక
దేశంలోనే అతిపెద్ద పూల వేడుక అయిన బతుకమ్మ పండుగ ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పదివేల బతుకమ్మలు గురువారం ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. స్టేడియంలో 1200 వుంది వుహిళలు పదివేల బతుకమ్మలను తీర్చిదిద్దనున్నారు. వీటిలో వంద బతుకమ్మలను ఐదడుగుల ఎత్తున నిలపనున్నారు. ముగింపు వేడుకలు తిలకించేందుకు వీలుగా 650 బస్సులను స్టేడియం వరకు ప్రత్యేకంగా నడపనున్నారు. వీటి ద్వారా దాదాపు పాతికవేల మంది మహిళలు ఇక్కడకు చేరుకోనున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు హుస్సేన్‌సాగర్ వరకు కనుల పండువగా సాగనుంది. హుస్సేన్‌సాగర్ వద్ద జరగనున్న కార్యక్రమాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌లతో పాటు జ్వాలా గుత్తా, పి.వి.సింధు తదితర సెలిబ్రిటీలు హాజరు కానున్నారు. -
' సింగపూర్, మాదాపూర్ ల వెంటబడొద్దు'
హైదరాబాద్: అభివృద్ధి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... సింగపూర్, మాదాపూర్ ల వెంటబడడం సరికాదని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. పేదల అభ్యున్నతి, సమగ్ర సామాజిక అభివృద్ధితో సమాజంలో అంతరాలను తగ్గించడంపై కేసీఆర్ దృష్టి సారించాలని ఆమె సూచించారు. తెలంగాణ సచివాలయంలో బుధవారం జరిగిన బతుకమ్మ పురస్కారాల ప్రదానోత్సంలో ఆమె పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఇద్దరక్కచెల్లెళ్లు ఉయ్యాలో..
చిన్నశంకరంపేట: ఇద్దరక్క చెల్లెళ్లు ...ఉయ్యాలో ఒక్కూరికిచ్చినారు...ఉయ్యాలో..ఒక్కడే మాఅన్న...ఉయ్యాలో..వచ్చన్నపోడే ఉయ్యాలో అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తనకిష్టమైన బతుకమ్మ పాటను పాడి మహిళలతో కలిసి పోయారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన సంప్రదాయలు, సంస్కృతులకు సమైక్య రాష్ట్రంలో సరైన గౌరవం దక్కలేదని అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన గౌరవం కల్పించారన్నారు. ఇది తెలంగాణ మహిళలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మన ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఉపాధ్యక్షురాలు బుజ్జి,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, సర్పంచ్‌లు కుమార్‌గౌడ్,ే హమలత, మాధవి,శోభ, ప్రియా నాయక్, రంగారావు,సత్యనారాయణ,మూర్తి పెద్దులు, అంజయ్య, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ నిర్మల, ఐకేపీ ఏపీఎం ఇందిర, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,ర ామ్రెడ్డి, రాజు,నరేందర్,రమేష్‌గౌడ్ పాల్గొన్నారు. శుద్ధమైన నీటితోనే ఆరోగ్యం మెదక్‌రూరల్: శుద్ధి చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరందించేందుకు బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సోమవారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రజలకు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తాగునీటిని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల వల్ల డయేరియా, కలరా తదితర వ్యాధులు దరిచేరవని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సువర్ణ నారంరెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు జయరాంరెడ్డి, అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ రైలు మార్గం.. సాధించి తీరుతాం
మెదక్: మెదక్‌కు రైలు మార్గం సాధించి తీరుతామని, ఇది తమకు ప్రతిష్టాత్మకమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మెదక్ పట్టణానికి వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కు, మంత్రికి, ఇద్దరు ఎంపీలకు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. మెదక్ ప్రజల చిరకాల స్వప్నమైన రైలు మార్గాన్ని సాధించితీరుమన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తపల్లి మార్గాలు పూర్తయ్యేందుకు కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ తెస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధి చేసేందుకు సైనికునిలా పనిచేస్తాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ఎంపీకి వారధిగా పనిచేసి మెదక్‌ను కడిగిన ముత్యంలా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యారెడ్డితో పాటు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, దేవేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. -
ఉప పోరుకు సై
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యూహ రచనలో ప్రత్యర్థి కంటే ఎప్పుడూ మూడు అడుగులు ముందే ఉంటారు గులాబీ దళపతి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మెదక్ పార్లమెంటు నియెజకవర్గంలో తన బలగాల మోహరింపుపై కసరత్తు మొదలు పెట్టారు. ఉప పోరుకు సిద్ధం కావాలని, 4 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ లక్ష్యంగా కృషి చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా మంత్రి, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు మీదనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కేసీఆర్ సోమవారం మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితర నాయకులతో సమావేశమయ్యారు. గెలుపు నల్లేరు మీద నడకేనని, ఉహించని విధంగా అధిక మెజార్టీ సాధించాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2 లక్షలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించాలని జిల్లా పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. అభ్యర్థిని ఎవరిని నిలబెడితే బాగుంటుందనే అంశంపై ఆయన నాయకులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. బీసీ,లేక ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడా సభలు నిర్వహించాలి? అనే అంశంపై కూడా కూలంకశంగా చర్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉప ఎన్నికలో అధిక మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. -
ప్రజల నిర్ణయాల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు
కమాన్‌పూర్: నవ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల నిర్ణయూల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు చేసినట్లు డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆమె ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-1 ఫేస్-2లోని భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సస్యశ్యామలం కోసం అందరూ కృషిచేయూలన్నారు. ఆమేరకు ప్రభుత్వం నిధుల కేటారుుంపూ చేపడుతుందన్నారు. ఇప్పటికే 42 అంశాలపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల సౌభగ్యం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీన్నీ తెలంగాణ పునఃనిర్మాణానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కటారి రేవతిరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భూక్య ఆశాకుమారి, వకులా దేవి, నాగరాజ కుమారి, రమాదేవి, చంద్రకళా, కాపురబోయిన భాస్కర్, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిసారిగా వచ్చిన డెప్యూటీ స్పీకర్‌ను సెంటినరీకాలనీ పార్టీ కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
సంక్షేమ పథకాలు పేదలకు అందాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట: ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.25కోట్లు వెనక్కి మళ్లిపోగా తాను ఆ నిధులను మళ్లీ వెనక్కి రప్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతోపాటు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, రామాయంపేట, మెదక్ జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్‌కు ఘన స్వాగతం డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా గురువారం రామాయంపేటకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేలుస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ బైక్షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రామాయంపేట జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పుట్టి విజయలక్ష్మి, సంపత్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ యువత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, ఇతర నాయకులు నార్లపూర్ నర్సింలు, స్థానిక సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
హుందాగా సభ నిర్వహిస్తా
మెదక్: తనను డిప్యూటీ స్పీకర్ పదవి వరిస్తుందని ఊహించలేదని పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు డిప్యూటీ స్పీకర్ పదవి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, మెదక్ ప్రజలకు వినమ్రంగా నమస్కరిస్తున్నానన్నారు. ఉన్నత పదవిలో ఉన్న తాను సభా సంప్రదాయాలను, మర్యాదను, హుందాతనాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా సభా కార్యకలాపాలు నిర్వహిస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిణిగా పోరాట పటిమను ప్రదర్శించామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమపట్ల కఠినంగా వ్యవహరించిందన్నారు. నిర్దాక్షిణ్యంగా మార్షల్స్‌తో అసెంబ్లీ నుంచి బయటకు గెంటివేయించారన్నారు. తాము మాత్రం గత అనుభవానుల దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. సద్విమర్శలను ఆహ్వానిస్తామన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా రూ.18వేలకోట్లను మాఫీ చేశామని, దీంతో 25 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీఓ వనజాదేవి డిప్యూటీ స్పీకర్‌ను సన్మానించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆమె వెంట జెడ్పీటీసీ లావణ్యారెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌గౌడ్, రాగి అశోక్, నాయకులు కృష్ణారెడ్డి, లింగారెడ్డి, పద్మారావుతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మెదక్‌లో ఘన స్వాగతం మెదక్ మున్సిపాలిటీ: డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం సోమవారం మొదటిసారిగా నియోజక వర్గానికి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డికి మెదక్‌లో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు మంగళ హారతులతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్థానిక ఆర్డీఓ వజనాదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, టీఆర్ఎస్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కరణం వెంకటేశంతో పాటు పలువురు నేతలు, అధికారులు వేర్వేరుగా ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధి విషయంలో అధికారులు, నాయకులు తనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంజినీర్ చిరంజీవులు, టీపీఎస్ కొమురయ్య, మెదక్ డీఎస్పీ గోద్రు, పట్టణ సీఐ విజయ్ కుమార్, ఎస్సై అంజయ్య, వేణు, ఏఎస్సై రాజశేఖర్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు మల్లికార్జున్ గౌడ్, రాగి ఆశోక్, మాయ మల్లేశం, సలాం, జెల్ల గాయత్రి, చంద్రకళ, ఆరేళ్ల గాయత్రి, మెంగని విజయ లక్ష్మి, గోవిందు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు క్రిష్ణా రెడ్డి, లింగారెడ్డి, గంగాధర్, హామీద్‌లతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చిన్నశంకరంపేట: తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి త్యాగం వెలకట్టలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంత సమస్యలపై శాసనసభలో జరిగే చర్చలకు సంపూర్ణ సహకారం అందించి తెలంగాణ అబివృద్ధికి కృషిచేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిన వనరులను కాపాడుకుంటూ నవ తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట జెట్పీటీసీ స్వరూప,ఎంపీటీసీలు విజయలక్ష్మి,వెంకటి,టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,రామ్‌రెడ్డి, తదితరులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేం
విపక్షాలకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సంప్రదాయం ప్రకారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కేటాయించాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డి పేరును ఇప్పటికే ఖరారుచేశామన్నారు. విపక్ష నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్(బీజేపీ) బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను కలిశారు. పార్లమెంట్ సంప్రదాయాల ప్రకారం అధికార పక్షానికి స్పీకర్, విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉందని ప్రతిపాదించారు. అందులో భాగంగానే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు తామంతా అధికార పక్షానికి సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. విపక్ష పార్టీల్లో డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా సహకరిస్తామని చెప్పారు. కేసీఆర్ మాత్రం వారి ప్రతిపాదనను తిరస్కరించారు. టీఆర్ఎస్ తరపున పద్మాదేవేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశామని, ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో విపక్ష నేతలు ‘ఈ విషయాన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాం’ అని పేర్కొంటూ బయటకు వచ్చేశారు. -
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మా దేవేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ శాసనసభ రేపటకి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
తెలంగాణ స్పీకర్‌గా మధుసూదనాచారి ఏకగ్రీవం
-
స్పీకర్ గా మధుసూదనాచారి ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లు మధుసూదనచారిని స్పీకర్ స్థానం వరకు గౌరవంగా తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో ఆయన ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మధుసూదనాచారి సేవలను కొనియాడారు. మధుసూదనాచారి వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. -
తెలంగాణ స్పీకర్‌గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవందర్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వీరిద్దరినీ ఎంపిక చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించనుంది. ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజున స్పీకర్‌ను ఎన్నుకుంటారు. -
మెతుకు సీమలో లేడీ బాస్ ల బిగ్ ఫైట్!
మెతుకు సీమ మెదక్ అసెంబ్లీ స్థానానికి ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిగ్ ఫైట్ జరగనుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే కాదనక తప్పదు. ఈ నియోజకవర్గంలో పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు వారి వారి విజయంపై ధీమాగా ఉన్నా.. ఇద్దరు మహిళా నేతల మధ్యే ముఖ్య పోటీ జరుగనుంది. ఇందులో ఒకరు లేడీ అమితాబ్ విజయశాంతి అయితే..మరొకరు పద్మా దేవేందర్ రెడ్డి. వారు నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో ఉంటూ క్రియా శీలక రాజకీయాల్లో పాలు పంచుకున్న ఈ నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులగా మారి కత్తులు దూసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు భుజాలు కలుపుకుంటూ తిరిగిన వారే వేరువేరు పార్టీల నుంచి బరిలో దిగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పట్నుంచో కేసీఆర్ పై గుర్రుగా ఉన్న విజయశాంతి.. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటనతో ఊపిరి పీల్చుకుంది. ఇక ఒక నిమిషం కూడా వెనుకడగువేయని లేడీ బాస్ కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ తో పోరుకు సన్నద్ధమైంది. దీంతో టీఆర్ఎస్ కూడా వేగంగానే పావులు కదిపింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా ఇంఛార్జి పద్మా దేవేందర్ రెడ్డికి ఆ పార్టీ టికెట్ కేటాయించి విజయశాంతిపై రాజకీయ సమరానికి సై అంటూ సవాల్ విసిరింది. పద్మా దేవేందర్ రెడ్డి.. తొలిసారి 2004 లో టీఆర్ఎస్ తరుపున గెలుపొందారు. కాగా, 2009లో టీఆర్ఎస్ -టీడీపీలో పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ రాలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ రెబల్ గా మారి పోటీకి దిగారు. ఆ పోరులో ఆమె 24 వేల ఓట్లు సాధించి తన ఇమేజ్ ను కాపాడుకున్నారు. ఆ తరువాత ఆమె టీఆర్ఎస్ లో నే కొనసాగారు. విజయశాంతిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. బీజేపీని వీడి టీఆర్ఎస్ చలవతో మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం రాములక్క కేసీఆర్ అన్నపై అలిగి పార్టీని వీడారు. ఇలా మొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ మిఠాయిలు తినిపించుకుని ఉన్న వీరు ప్రత్యర్థులుగా మారడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ముందంజలో ఉండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతుంది. ఇందులో పద్మా దేవేందర్ రెడ్డి స్థానిక అభ్యర్థి కావడం ప్రధానంగా కలిసొచ్చే అంశం. అంతే కాకుండా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయడం పద్మకు లాభిస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా, విజయశాంతి ఎంపీగా ఉన్న సమయంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతి తాగునీటి సమస్యలకు నిధులు తీసుకురావడమే కాకుండా, అక్కన్నపేటకు కొత్తగా రైల్వే లైన్ లు తేవడంలో సఫలమైయ్యారు. ఇవే కాంగ్రెస్ గెలుపుకు దోహద పడగలవని కాంగ్రెస్ నేతలు ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా, విజయశాంతికి స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత కూడా ఉండటంతో రాములమ్మ గెలుపుపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను ఎదురించి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగడం నిజంగానే విజయశాంతికి ఛాలెంజ్. ఇక ఈ పోరులో నెగ్గికొస్తే మాత్రం ఆమె స్థానికంగా తిరుగులేని నాయకురాలిగా వెలుగొందే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమి పాలైనా అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.