business man
-
కంపెనీ దురాశే.. ఉద్యోగుల తొలగింపు: శ్రీధర్ వెంబు ట్వీట్ వైరల్
కరోనా సమయంలో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు సంస్థలు ఆర్థికంగా కుదుటపడుతున్నాయి, లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఉద్యోగుల తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ.. జోహో ఫౌండర్ 'శ్రీధర్ వెంబు' కీలక వ్యాఖ్యలు చేశారు.100 కోట్ల రూపాయల క్యాష్ ఉన్న కంపెనీకి.. వార్షిక ఆదాయం 1.5 రెట్లు కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ 20 శాతం లాభాలను గడిస్తోంది. మూడో త్రైమాసికంలో ఏకంగా రూ.18 కోట్ల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా రూ. 40కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడానికి కూడా సంస్థ సిద్ధమైంది. ఇంత లాభాలతో ముందుకు సాగుతున్న కంపెనీ.. ఉద్యోగులలో 12 నుంచి 13 శాతం తొలగింపులు చేపట్టడం అంటే.. ఇది పెద్ద దురాశే అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'ప్రెష్‌వర్క్స్' కంపెనీని ఉద్దేశించి శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితమే సుమారు 660 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనకంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఉద్యోగులను తొలగించే సంస్కృతి కొన్ని అగ్రదేశాల్లో ఉంది. దానిని మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది ఉద్యోగులకు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని చెరిపివేస్తుంది. సంస్థలో ఎప్పుడూ.. కస్టమర్లను, ఉద్యోగులను మొదటి స్థానంలో ఉంచాలి. ఆ తరువాత స్థానంలో వాటాదారులు ఉండాలని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.A company that has $1 billion cash, which is about 1.5 times its annual revenue, and is actually still growing at a decent 20% rate and making a cash profit, laying off 12-13% of its workforce should not expect any loyalty from its employees ever. And to add insult to injury,…— Sridhar Vembu (@svembu) November 7, 2024 -
38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
హురున్ ఇండియా విడుదల చేసిన 2024 దాతృత్వ జాబితాలో.. టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు 'శివ్ నాడార్' రూ. 2153 కోట్లు విరాళమిచ్చి అగ్రగామిగా నిలిచారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమారమంగళం బిర్లా.. వంటి వారు ఉన్నారు. అయితే ఈ కథనంలో పిన్న వయసులో ఎక్కువ విరాళమిచ్చిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం.38 ఏళ్ల నిఖిల్ కామత్ రెయిన్‌మాటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 120 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు హురున్ ఇండియా జాబితా ద్వారా తెలిసింది. దీంతో భారతదేశంలో చిన్న వయసులో ఎక్కువ డబ్బును దాతృత్వ కార్యక్రాలకు వెచ్చించిన వ్యక్తిగా నిఖిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారిలో ఈయన 15వ స్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్నిఖిల్ కామత్ తరువాత.. జాబితాలో ఎక్కువ విరాళాలు అందించిన ఇతర యువ పరోపకారులలో వివేక్ వకీల్, మాధవకృష్ణ సింఘానియా, సరందర్ సింగ్, వరుణ్ అమర్ వాకిల్, రాఘవపత్ సింఘానియా కూడా వున్నారు. అయితే నిఖిల్ కామత్ ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. యువ వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. -
ఎలాన్ మస్క్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు
యూఎస్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. రిపబ్లికన్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. అధ్యక్ష ఎన్నికలలో టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడారు.ఒక స్టార్ ఉంది.. అని మస్క్ గురించి మాట్లాడుతూ.. అతను ఒక మేధావి. మన మేధావులను మనం రక్షించుకోవాలి. అంతే కాకుండా తన సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయత్నాలతో అమెరికా అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మస్క్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడారు.ట్రంప్ ప్రసంగం సమయంలో మస్క్ స్వయంగా ఈవెంట్‌కు హాజరు కానప్పటికీ.. ఓటింగ్ రోజు వరకు రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. మొత్తానికి ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఆశించిన విధంగానే.. ట్రంప్ మరో మారు అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నారు.'ట్రంప్'కు మద్దతుగా మస్క్ ఫిలడెల్ఫియా ప్రాంతంలో అక్టోబర్ 17న తొలి వ్యక్తిగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతకు ముందు ట్రంప్ పాలనలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలను గురించి వెల్లడించారు. అప్పటి నుంచి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం.. మస్క్ గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు.చదవండి: తెలుగింటి అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుట్రంక్ విజయం కోసం మస్క్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్స్ కూడా సమకూర్చారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రైజ్ మనీరూపంలో 100 డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఈ ప్రైజ్ మనీ అని డెమోక్రట్లు ఆరోపించారు.జోష్‌లో ఎలాన్ మస్క్డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అమెరికా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేర్కొంటూ.. అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న రాకెట్ ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. అమెరికా ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని, డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని మస్క్ వ్యాఖ్యానించారు. The future is gonna be fantastic pic.twitter.com/I46tFsHxs3— Elon Musk (@elonmusk) November 6, 2024 -
నోయల్ టాటా ఎంట్రీ: ఒకేసారి రెండు బోర్డులలో..
దివంగత పారిశ్రామిక దిగ్గజం.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా 'నోయల్ టాటా' ఇప్పటికే నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన టాటా సన్స్ బోర్డులో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా వెల్లడించింది.2011 తర్వాత టాటా సన్స్, టాటా ట్రస్ట్ బోర్డులు రెండింటిలోనూ టాటా కుటుంబ సభ్యుడు స్థానం పొందడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్, ఇప్పుడు నోయెల్ టాటా సారథ్యంలో ముందుకు సాగుతుంది. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా పనిచేస్తున్నారు.ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు నోయల్ టాటా.. టీటా గ్రూపుకు చెందిన రిటైల్ బిజినెస్ చూసుకున్నారు. ఇకపైన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించనున్నారు.ఎవరీ నోయల్ టాటానోయల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. టాటా ఇంటర్నేషనల్‌లో కెరియర్ ప్రారంభించిన నోయెల్ 1999లో రిటైల్ వ్యాపారం ట్రెంట్కి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నోయల్ టాటా గ్రూపుతో 40 సంవత్సరాల అనుభవం ఉంది. కంపెనీలోని వివిధ బోర్డుల్లో వివిధ పదవులను నిర్వహించారు. అప్పటికి కేవలం ఒకటే స్టోర్ ఉన్న ట్రెంట్.. నోయల్ సారథ్యంలోకి వచ్చాక గణనీయంగా వృద్ధి చెంది 700 పైచిలుకు స్టోర్స్‌కి విస్తరించింది. ముఖ్యంగా వెస్ట్‌సైడ్ రిటైల్ చెయిన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇది మరింత వేగవంతమైంది.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2003లో వోల్టాస్, టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. టాటా ఇంటర్నేషనల్ ఆయన సారథ్యంలో 500 మిలియన్ డాలర్ల టర్నోవర్ నుంచి 3 బిలియన్ డాలర్లకు ఎదిగింది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్లకు వైస్ చైర్మన్‌గా నోయెల్ వ్యవహరిస్తున్నారు. -
తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్!! కారణం ఏంటంటే..
ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్‌హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్‌లో 14,000 అపార్ట్మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్‌ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్‌లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్తో పోటీ పడుతున్నారు. -
స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్‌లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్‌ను 1998లో అహ్మదాబాద్‌లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్. -
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
విమానాశ్రయంలో ఇదో కొత్త రకం: జారుకుంటూ వెళ్లిపోవడమే..
విమానాశ్రయం అంటే.. అక్కడ మెట్లు లేదా ఎస్కలేటర్స్ వంటివి ఉంటాయి. కానీ సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ఎత్తైన ఇండోర్ స్లయిడ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఇండోర్ స్లయిడ్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెండు గేట్స్ ఉన్నాయి. వీటిని దాటేసిన తరువాత స్లయిడ్ దగ్గరకు వెళ్ళవచ్చు. దీని ద్వారా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్ళవచ్చు. అంటే మెట్లు వంటివి ఉపయోగించకుండానే.. కిందికి వెళ్లొచ్చన్నమాట.నిజానికి ఇలాంటివి పార్కుల్లో లేదా ఎగ్జిబిషన్స్ వంటి వాటిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో కనిపించడంతో.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో దీనిని పోస్ట్ చేశారు. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్చాంగీ విమానాశ్రయంలో ఇప్పటికే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా టెర్మినల్ 3లో ఈ స్లయిడ్‌ను ఇన్స్టాల్ చేసారు. దీనిని స్లయిడ్@T3 అని పిలుస్తారు. 12 మీటర్ల ఎత్తైన ఇండోర్ స్లయిడ్, ప్రయాణికులు సెకనుకు 6 మీటర్ల వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. దీనిని పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు.Apparently at Singapore’s Changi airport you can take a slide to your gate. That’s the way to view Monday mornings & a new week…Beat uncertainty by sliding right into it… #MondayMotivation pic.twitter.com/ZZPuyJX7Kf— anand mahindra (@anandmahindra) October 21, 2024 -
ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..
రతన్ టాటా తన 86వ ఏట అక్టోబర్ 9న ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనేక గొప్ప విజయాలు, దాతృత్వ కార్యక్రమాలతో నిండిన ఈయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాటా స్టీల్ కంపెనీ కోసం ఒక అమెరికన్ సంస్థలో జాబ్ ఆఫర్‌ను సైతం రతన్ టాటా అవలీలగా వదులుకున్న సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..ఐబీఎమ్ కంపెనీ ఆఫర్1961లో రతన్ టాటాకు అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా టాటా స్టీల్దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా స్టీల్ కంపెనీను జంషెడ్జీ టాటా 1907లో ప్రారంభించారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్టీల్ కంపెనీగా అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు, ఆ తరువాత ఈ సంస్థ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం దేశానికి ఉక్కు చాలా అవసరం అయినప్పుడు, టాటా స్టీల్ దేశాభివృద్ధికి భుజం భుజం కలిపి నిలబడింది. ఈ కంపెనీ దేశ ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచింది.ప్రస్తుతం టాటా స్టీల్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ షేరు ప్రస్తుత విలువ రూ.159. అయితే రతన్ టాటా జాబ్ ఆఫర్ వద్దనుకున్న కంపెనీ.. ఐబీఎమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. ఇది టాటా స్టీల్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.ఇదీ చదవండి: వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలుటాటా స్టీల్‌తో రతన్ టాటా సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ ఆయన కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ వంటి విలువైన పాఠాలను కూడా నేర్పింది. టాటా స్టీల్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దేశాభివృద్ధికి మాత్రమే.. సమాజ శ్రేయస్సును మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. -
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.అంబానీ డ్రైవర్ జీతం2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్‌కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి. -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్: ఎవరీ ప్రభాకర్ రాఘవన్..
గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా 'ప్రభాకర్ రాఘవన్' నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గత 12 సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్.. గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.ఎవరీ ప్రభాకర్ రాఘవన్?భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రభాకర్ రాఘవన్ 1981లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత 1982లో శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1986లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు.2012లో ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో చేరారు. అంతకంటే ముందు ఈయన యాహూలో పనిచేశారు. యాహూ నుంచి గూగుల్‌లో చేరిన తరువాత సెర్చ్ అండ్ యాడ్ ర్యాంకింగ్‌తో పాటు యాడ్ మార్కెట్‌ప్లేస్ డిజైన్‌లో పనిచేశారు. ఆ తరువాత గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్లలోనూ పనిచేసారు. ఈ సమయంలోనే ఈయన స్మార్ట్ రిప్లై అండ్ స్మార్ట్ కంపోజ్ వంటి ఏఐ ఫీచర్స్ ప్రారంభిచడంలో కీలకపాత్ర పోషించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..ప్రభాకర్ రాఘవన్ వివిధ విభాగాల్లో పనిచేస్తూ 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాఘవన్ నాయకత్వంలోనే ఏఐ ఓవర్వ్యూస్, సర్కిల్ టు సెర్చ్, లెన్స్‌లో మీరు చూసే వాటిని షాపింగ్ చేయండి వంటి ఫీచర్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు ఈయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు. -
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్‌గా జుకర్‌బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్‌బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్‌బర్గ్ టేబుల్‌పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్‌ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్‌గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్‌బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్‌పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుసంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు. -
'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్ఇన్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రారతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
డెలివరీ ఏజెంట్లుగా దీపిందర్ గోయల్ దంపతులు
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెలివరీ ఏజెంట్ యూనిఫామ్ వేసుకుని గురుగ్రామ్‌లో కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు.దీపిందర్ గోయల్ ఆయన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి బైకుపై డెలివరీ ఏజెంట్లుగా వెళ్లడం ఇక్కడ చూడవచ్చు. అలా.. మోడ్ బై ఆకాంక్ష ఆఫీసులో గోయల్ ఫుడ్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అక్కడ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరిగ్గా ఎలా చేయాలో బాస్ నుంచి నేర్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.డెలివరీ ఏజెంట్‌గా తన రోజు గురించి గోయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం గ్రేసియా మునోజ్‌తో ఆర్డర్లను డెలివరీ చేయడానికి బయలుదేరాను అని గోయల్ పేర్కొన్నారు. ఇందులో గోయల్ డెలివరీ బ్యాగ్ భుజాన వేసుకుని, తన భార్యతో కలిసి లొకేషన్ చూసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఇదీ చదవండి: రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలుదీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేసిన తన అనుభవాలను పంచుకుంటూ.. మా కస్టమర్లకు ఆహారం అందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రైడ్‌ను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.మూడు విషయాలుపెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj— Harsh Goenka (@hvgoenka) October 5, 2024 -
ఎక్స్‌లో మస్క్ ఘనత.. ప్రపంచంలో తొలి వ్యక్తిగా రికార్డ్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుగా మాత్రమే కాకుండా.. ఎక్స్(ట్విటర్)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం (అక్టోబర్ 03) నాటికి ఎక్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ ఈ ఘనత సాధించారు.మస్క్ తరువాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 131.9 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్ల ఫాలోవర్స్) నిలిచారు. జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, 108.4 మిలియన్ల ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!భారత ప్రధాని నరేంద్ర మోదీ 100 మిలియన్ ఫాలోవర్స్ మార్కును దాటారు. కాగా 'ఎక్స్' నెలవారీ యాక్టివ్ యూజర్లు 600 మిలియన్ల కంటే ఎక్కువ, డైలీ యాక్టివ్ యూజర్లు 300 మిలియన్స్ కంటే ఎక్కువని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఎక్స్ విలువ భారీగా తగ్గినట్లు సమాచారం. -
జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్!
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్‌బర్గ్'.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానాల్లో జుకర్‌బర్గ్, బెజోస్ ఉన్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇలాన్ మస్క్ నికర విలువ రూ. 256 బిలియన్ డాలర్స్, జుకర్‌బర్గ్ నికర విలువ 206 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ విలువ 205 బిలియన్ డాలర్లు. మెటా ప్లాట్‌ఫామ్ షేర్లు పెరగడంతో.. మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.నికర విలువ పరంగా జుకర్‌బర్గ్.. బెజోస్ కంటే 1.1 బిలియన్ డాలర్ల ముందు, టెస్లా సీఈఓ కంటే 50 బిలియన్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఎల్లిసన్, బిల్ గేట్స్, లారీ పేజీ, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ వరుస పది స్థానాల్లో ఉన్నారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో భారతీయులుప్రపంచ ధనవంతుల జాబితాలో భారతీయ ధనవంతులైన ముకేశ్ అంబానీ 14వ స్థానంలో, గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో శివ నాడార్, 38వ స్థానంలో షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్ 49వ స్థానంలో, 61వ స్థానంలో దిలీప్ శాంఘ్వీ, 62వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ, సునీల్ మిట్టల్ 72వ స్థానంలో, 89వ స్థానంలో రాధాకిషన్ దమాని, 90వ స్థానంలో కుమార మంగళం బిర్లా, 97వ స్థానంలో లక్ష్మీ మిట్టల్, 100వ స్థానాల్లో సైరస్ పూనావల్ల ఉన్నారు. -
వేణుగోపాల్ ధూత్‌కు రూ.కోటి డిమాండ్ నోటీస్
ముంబై: వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను దాదాపు రూ.1.03 కోట్లు చెల్లించాలని పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్, మరో రెండు సంస్థలకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ డిమాండ్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపుల్లో విఫలమైతే అరెస్ట్‌కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆయన ఆస్తులతో పాటు ఇతర సంస్థలను ఆస్తులనూ జప్తు చేస్తానని రెగ్యులేటర్ హెచ్చ రించింది.ధూత్‌తో పాటు, ఎలక్ట్రోపార్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నోటీసులు అందుకున్న సంస్థల్లో ఉన్నాయి. 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను 2021 సెపె్టంబర్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తమపై విధించిన రూ. 75 లక్షల జరిమా నాను చెల్లించడంలో ధూత్‌తో సహా ఈ సంస్థలు విఫలమైన నేపథ్యంలో తాజా డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ధూత్, మరో రెండు సంస్థలు ప్రచురితంకాని ప్రైస్ సెన్సి టివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ) వద్ద మార్కె ట్ లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించిన నేపథ్యంలో సెబీ ఈ చర్యలు తీసుకుంది. -
సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం
వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
ఎట్టకేలకు.. అనిల్ అంబానీకి భారీ ఊరట
అప్పుల భారం తగ్గించుకుంటున్న అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వివాదంలో తమకు అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. డీవీసీ-రియలన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసుపై కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా డీవీసీ.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోల్కత్తా హైకోర్టు సమర్ధించింది.పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దశాబ్దం క్రితం రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఈ సమయంలో డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టును ఆశ్రయించింది. 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ.896 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది. కానీ డీవీసీ దీనిపైన కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కేలా గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది. -
చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
ఈ రోజు ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ 'బుక్ మై షో' (Book My Show). ఇంతకీ ఈ బుక్ మై షో ఎలా ప్రారంభమైంది. ఎవరు స్థాపించారు, దీని నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'ఆశిష్ హేమ్రజని' (Ashish Hemrajani), మరో ఇద్దరు స్నేహితులతో (పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండే) కలిసి బుక్ మై షో స్థాపించారు. ఆశిష్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం జుహులో పూర్తయింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో గ్రాడ్యుయేట్, సిడెన్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత జే.వాల్టర్ థాంప్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు.ఆశిష్ హేమ్రజని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఒక రోజు చెట్టుకింద కూర్చుని రేడియోలో ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు. ఆ సమయంలో రబ్బీ గేమ్ టికెట్లకు సంబంధించిన ప్రకటన గురించి విన్నారు. ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నారు.సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత సిడెన్హామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థులు.. ఆశిష్ స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేతో కలిసి 'గో ఫర్ టికెటింగ్' ప్రారభించారు. ఇదే తరువాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరకు బుక్ మై షోగా స్థిరపడింది.ఆశిష్ బుక్ మై షో ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ఫోన్స్, ఆన్లైన్ చెల్లింపులు పెద్దగా అందుబాటులో లేదు. దీంతో చాలా రోజులు ఇందులో ఒడిదుడుకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బుక్ మై షో మూసి వేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆశిష్ వెనుకడుగు వేయలేదు. ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి అనే మాటలను గట్టిగా నమ్ముకున్న ఆశిష్ ఎప్పుడూ నిరాశ చెందలేదు.ఇదీ చదవండి: భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?2006లో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అంతే కాకుండా దేశంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆశిష్ బుక్ మై షో ఎదగడం ప్రారంభించింది. ఆన్లైన్ చెల్లింపులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయి.. క్రమంగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో కంపెనీ 2011లో 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ ఏకంగా రూ. 7500 కోట్లకు చేరింది. -
భార్యామణికోసం ఏకంగా ఐలాండ్నే కొనేసిన వ్యాపారవేత్త?!
కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చుతున్న భర్తల్ని చూశాం. జీవిత సహచరి కోసం ఎన్నో త్యాగాలను చేసే పుణ్యపురుషుల గురించి విన్నాం. కానీ ఒక భర్త భార్య ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఇంకెవ్వరూ చూడకుండా ఉండేందుకు ఏకంగా ఐలాండ్నే కొనేశాడు. విచిత్రంగా అని పిస్తోందా? అయితే ఈ కథనం చదవాల్సిందే.దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్ కోసం హిందూ మహా సముద్రంలోని ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.418 కోట్లు) వెచ్చించి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. View this post on Instagram A post shared by Soudi✨ (@soudiofarabia)దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ సదాక్ కథనం ప్రకారం మిలియనీర్ అయిన తన భర్త బీచ్‌లో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అదీ తాను బికినీ వేసేందుకు, ఇబ్బంది పడకుండా, సురక్షితంగా ఉండేందుకు ఇలా చేశాడని ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అయితే గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ద్వీపం ఖచ్చితమైన లొకేషన్‌ను షేర్ చేయడం లేదు కానీ, ఇది మాత్రం ఆసియా ఖండంలోనే ఉంది అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు 30 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కాగా ఈ జంట దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వీరికి పెళ్లయ్యి మూడేళ్లు. సౌదీ అల్ సదాక్ ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ ద్వారా ఆమె లగ్జరీ స్టయిల్‌తో బాగా పాపులర్. ఇదీ చదవండి: రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) 'ట్విటర్'ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులను తొలగించడం, బ్రాండ్ లోగో మార్చడం వంటి వాటితో పాటు పేరును కూడా 'ఎక్స్'గా మార్చేశారు. ఇప్పుడు ఎక్స్‌లోని 'బ్లాక్ బటన్' తీసివేస్తున్నట్లుగా ప్రకటించారు.ఎక్స్ ప్రస్తుత బ్లాక్ బటన్‌ను తీసివేయబోతోంది. అంటే అకౌంట్ పబ్లిక్‌గా ఉంటుంది. ఒక వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన వినియోగదారులకు కూడా కనిపిస్తుంది. అయితే వారు దీనిని లైక్, షేర్, కామెంట్ వంటివి చేయలేరు. కాబట్టి పోస్టును ప్రతి ఒక్కరూ చూడగలరు.బ్లాక్ బటన్ తొలగింపుకు సంబంధించిన పోస్ట్‌కు మస్క్ స్పందిస్తూ.. ''బ్లాక్ ఫంక్షన్ అనేది అకౌంట్ ఎంగేజ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది, కానీ పబ్లిక్ పోస్ట్‌లను చూడకుండా నిరోధించదు'' అని అన్నారు.ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..ఎక్స్ ఫ్లాట్‌ఫాంలో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు మస్క్ గతంలోనే ప్రకటించారు. ఈ ఆప్షన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని.. ఈ కారణంగానే దీనిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తుందని చాలామంది యూజర్లు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పోస్ట్ చేస్తే.. బ్లాక్ చేసిన యూజర్ దానిపై స్పందించడానికి అవకాశం లేదు.High time this happened. The block function will block that account from engaging with, but not block seeing, public post.— Elon Musk (@elonmusk) September 23, 2024