cricket news
-
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్సర్లు.. వీడియో
స్పెయిన్ టీ10 క్రికెట్లో సంచలనం నమోదైంది. యునైటెడ్ సీసీ గిరోనాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్సిలోనాకు మెరుపు ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. pic.twitter.com/Mpq9PeLddD— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024ఈ దశలో బరిలోకి దిగిన అలీ హసన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు.. ఆతర్వాత ఎనిమిదో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న అలీ హసన్ 8 సిక్సర్లు, బౌండరీ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కడపటి వార్తలు అందేసరికి ఛేదనలో గిరోనా జట్టు ఎదురీదుతుంది. ఆ జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో బార్సిలోనా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయిన పేర్లలో అల్ హసన్ పేరు లేకపోవడం విచారకరం. -
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా చీఫ్ సెలెక్టర్
పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ ఆకిబ్ జావిద్ ఎంపికయ్యాడు. జావిద్ ఎంపిక టెంపరరీ బేసిస్ (తాత్కాలికం) మీద జరిగింది. జావిద్ వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పదవిలో కొనసాగుతాడు. జావిద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.కాగా, కొద్ది రోజుల కిందట గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ పదవికి అర్దంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెడ్‌బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పీ పాక్ వైట్‌బాల్ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో (2-1) ఓడించింది. అయితే పాక్ టీ20 సిరీస్‌ను మాత్రం 0-3 తేడాతో కోల్పోయింది.గిల్లెస్పీకి ముందు పెర్మనెంట్ వైట్‌బాల్ కోచ్‌గా ఎంపికైన గ్యారీ కిర్‌స్టన్ బోర్డుతో విభేదాల కారణంగా ఒక్క వన్డేలో కూడా కోచ్‌గా పని చేయకుండా వైదొలిగాడు. పాక్ గత ఏడాది కాలంలో ఐదుగురు వైట్‌బాల్ కోచ్‌లను మార్చింది. పాక్ పెర్మనెంట్ వైట్‌బాల్ హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోగా ముగుస్తుందని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అనంతరం పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సిరీస్లన్నిటికీ పాక్ హెడ్‌కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించనున్నాడు.కాగా, పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రిత్యా భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని తేల్చిచెప్పింది. దీంతో టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ నుంచి ఇతర దేశానికి మార్చాలని ఐసీసీ చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని తటస్ఠ వేదికపై నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు పాక్ నో చెప్పడంతో ఐసీసీ పునరాలోచనలో పడింది. -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 117 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
హోబర్ట్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ (4-1-21-3), ఆడమ్ జంపా (4-0-11-2), స్పెన్సర్ జాన్సన్ (3.1-0-24-2), జేవియర్ బార్ట్లెట్ (3-0-25-1), నాథన్ ఇల్లిస్ (3-0-20-1) ధాటికి 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సాహిబా్జాదా ఫర్హాన్ 9, ఉస్మాన్ ఖాన్ 3, అఘా సల్మాన్ 1, అబ్బాస్ అఫ్రిది 1, జహందాద్ ఖాన్ 5, సూఫియాన్ ముఖీమ్ 1 పరుగు చేశారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన తొలి గేమ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టీ20లో 13 పరుగుల తేడాతో నెగ్గింది. టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్ పోలార్డ్ పేరిట ఉండేది. పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్ గేల్ (6705), అలెక్స్ హేల్స్ (6774), జోస్ బట్లర్ (6928) ఉన్నారు.పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు దక్కుతుంది. గేల్ ఈ ఫార్మాట్లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య ఇవాళ (నవంబర్ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
శివాలెత్తిన తిలక్, సంజూ.. విధ్వంసకర శతకాలు.. టీమిండియా అతి భారీ స్కోర్
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో శివాలెత్తిపోయారు. సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేయగా.. తిలక్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. సంజూకు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. తొలి టీ20లో సెంచరీ అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న సంజూ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. తిలక్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపామ్లాకు అభిషేక్ శర్మ వికెట్ దక్కింది. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు...భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
IND VS SA 3rd T20: చరిత్ర సృష్టించిన టీమిండియా
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో వెళ్లింది. మూడో టీ20లో గెలుపు అనంతరం టీమిండియా ఓ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. పాక్ తర్వాత విదేశాల్లో 100 విజయాలు సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 241 టీ20 మ్యాచ్‌లు ఆడి 164 మ్యాచ్‌లో విజయాలు సాధించింది. విదేశాల్లో 152 టీ20లు ఆడిన భారత్ 100 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. విదేశాల్లో 203 టీ20లు ఆడిన పాక్ 116 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా..!సౌతాఫ్రికాతో మూడో టీ20లోనే టీమిండియా మరో రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 సిక్సర్లు బాదిన భారత్.. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 200 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.శతక్కొట్టిన తిలక్ వర్మ.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మసౌతాఫ్రికాతో మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (56 బంతుల్లో 107 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీ20ల్లో 200 పరుగుల మార్కు దాటడం భారత్‌కు ఈ ఏడాది ఇది ఎనిమిదోసారి. టీ20 చరిత్రలో ఏ జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సార్లు 200 పరుగుల మార్కును దాటలేదు.పోరాడి ఓడిన సౌతాఫ్రికా..220 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా చివరి నిమిషం వరకు అద్భుతంగా పోరాడి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హెన్రిచ్ క్లాసెన్ (41), మార్కో జన్సెన్ (54) సఫారీలను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్‌సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. హార్దిక్ పాండ్యాపై వేటు..?
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాత రెండో టీ20 బ్యాట్‌తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్‌ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్‌కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.మరోవైపు ఈ సిరీస్‌లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు.. రికార్డులు బద్దలు
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌ల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు గోవా బ్యాటర్లు అజేయ ట్రిపుల్ సెంచరీలతో చెలరేగారు. స్నేహల్ కౌతంకర్ 215 బంతుల్లో 45 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 314 పరుగులు చేయగా.. కశ్యప్ బాక్లే 269 బంతుల్లో 39 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 300 పరుగులు చేశారు. స్నేహల్, కశ్యప్ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్నేహల్, కశ్యప్ ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో (93 ఓవర్లలోనే) రెండు వికెట్ల నష్టానికి 727 పరుగులు చేసింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకు ఆలౌటైంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 643 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ ఈ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించి 92 పరుగులకు చాపచుట్టేసింది. ఫలితంగా గోవా ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విశేషాలు.. నమోదైన రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి మాత్రమే.1989లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్, అర్జున్ క్రిపాల్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీలు చేశారు.స్నేహల్, కశ్యప్ మూడో వికెట్‌కు అజేయమైన 606 పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్ (727/2) రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నమోదైంది.రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో అత్యధిక స్కోర్ మేఘాలయ చేసింది. 2018 సీజన్లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయ 826 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో గోవా చేసిన స్కోర్ (727/2) యావత్ రంజీ ట్రోఫీ చరిత్రలోనే తొమ్మిదో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది.ఈ మ్యాచ్‌లో స్నేహల్ చేసిన ట్రిపుల్ సెంచరీ మూడో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా (205 బంతుల్లో) రికార్డైంది.రంజీల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. తన్మయ్ గత రంజీ సీజన్లో 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రమణ్‌దీప్ సింగ్ అరంగేట్రం, అభిషేక్‌కు మరో అవకాశం
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రమణ్‌దీప్‌కు ఇది డెబ్యూ మ్యాచ్. సౌతాఫ్రికా తరఫున న్కాబయోమ్జి పీటర్ స్థానంలో లూథో సిపమ్లా తుది జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సైమ్‌లేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా -
ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్ భావోద్వేగం(ఫొటోలు)
-
పాకిస్తాన్ రికార్డు..టాప్-6లో మూడు సార్లు భారత్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. దాయాది జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో (పొట్టి ఫార్మాట్లో) అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పాక్ 2018లో 89.47 శాతం విజయాలు సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం కలిగిన జట్ల జాబితాలో పాకిస్తాన్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ టీ20ల్లో ఈ ఏడాది 83.33 శాతం విజయాలు సాధించింది. పాక్, భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. టీ20ల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది 77.77 శాతం విజయాలు సాధించింది. టీ20ల్లో అత్యధిక విజయాల శాతం కలిగిన టాప్-6 జట్ల జాబితాలో టీమిండియా మూడు స్థానాల్లో నిలిచింది. భారత్ రెండు, నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం (టీ20ల్లో) కలిగిన జట్ల జాబితా..పాకిస్తాన్-89.47 (2018)భారత్- 83.33 (2024)ఆస్ట్రేలియా- 77.77 (2024)భారత్- 73.68 (2018)ఆఫ్ఘనిస్తాన్- 73.33 (2016)భారత్- 71.43 (2016)కాగా, పాకిస్తాన్ జట్టు నవంబర్ 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. నవంబర్ 14, 16, 18 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు పాక్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది. ఇందులో పాక్ ఆసీస్‌ను 2-1 తేడాతో ఓడించింది. మరోవైపు భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచాయి. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు జరుగనుంది. -
తొమ్మిది వికెట్లు తీసిన పాక్ పేసర్లు
స్వదేశంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ పేసర్లు చెలరేగిపోయారు. కషిఫ్ అలీ, ఖుర్రమ్ షెహజాద్ ఇద్దరు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 115 పరుగులకే ఆలౌటైంది.కషిఫ్ అలీ నాలుగో ఓవర్లో తొలి వికెట్ (ఒషాడో ఫెర్నాండో) పడగొట్టాడు. అనంతరం ఖుర్రమ్ షెహజాద్ అహాన్ విక్రమసింఘేను పెవిలియన్‌కు పంపాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన కషిఫ్ 8వ ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఓవర్లో అతను రెండు వికెట్లు (నిపున్ ధనంజయ, పవన్ రత్నాయకే) పడగొట్టాడు. దీంతో శ్రీలంక జట్టు 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆతర్వాత బరిలోకి దిగిన సోనల్ దినుష (110 బంతుల్లో 30), పసిందు సూరియబండార (84 బంతుల్లో 28) కొద్ది సేపు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి పుణ్యమా అని శ్రీలంక 100 పరుగుల మార్కును దాటింది. నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించిన కషిఫ్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహజాద్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాక్ ఆదిలోనే కెప్టెన్ మొహమ్మద్ హురైరా వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే అబ్దుల్ ఫసీ కూడా ఔటయ్యాడు. అలీ జర్యాబ్ 18 పరుగులతో.. మొహమ్మద్ సులేమాన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. వాతావరణం అనూకూలించని కారణంగా తొలి రోజు కేవలం 57.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.కాగా, పాక్-ఏ, శ్రీలంక-ఏ జట్లు చివరి సారిగా ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఎదురెదురుపడ్డాయి. ఆ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను మట్టికరిపించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేయగా.. శ్రీలంక కేవలం 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అహాన్ విక్రమసింఘే (52), లహీరు ఉదారా (20 బంతుల్లో 43) శ్రీలంకను గెలిపించారు. -
సెంచరీ చేజార్చుకున్న మహ్మదుల్లా.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..?
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మెహిది హసన్ మీరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు), మహ్మదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మహ్మదుల్లా ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటై సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ 19, సౌమ్య సర్కార్ 24, జకీర్ హసన్ 4, తౌహిద్ హృదోయ్ 7, జాకెర్ అలీ 1, నసుమ్ అహ్మద్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు తీసి 37 పరుగులిచ్చాడు. ఇవి అతని వన్డే కెరీర్లో అత్యుత్తమ గణంకాలు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. -
బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన
మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. రెనెగేడ్స్ 17.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో కూడా ఈ రికార్డు రెనెగేడ్స్ పేరిటే ఉండేది. 2019-20 సీజన్లో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెనెగేడ్స్ 184 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక లక్ష్య ఛేదనలు..186- మెల్బోర్న్ రెనెగేడ్స్184- మెల్బోర్న్ రెనెగేడ్స్180- పెర్త్ స్కార్చర్స్179- సిడ్నీ సిక్సర్స్ (2020-21)179- సిడ్నీ సిక్సర్స్ (2024-25)కాగా, హేలీ మాథ్యూస్ (54 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డియాండ్రా డొట్టిన్ (18 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని మెల్బోర్న్ రెనెగేడ్స్ సునాయాసంగా ఊదేసింది. మాథ్యూస్, డొట్టిన్ రెండో వికెట్‌కు కేవలం 33 బంతుల్లో 85 పరుగులు జోడించి రెనెగేడ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.అడిలైడ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (49), స్మృతి మంధన (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. లారా వోల్వార్డ్ట్ (27), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (24) పర్వాలేదనిపించారు. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇల్లింగ్‌వర్త్, అలైస్ క్యాప్సీ, డియాండ్రా డొట్టిన్, సారా తలో వికెట్ దక్కించుకున్నారు.రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో హేలీ మాథ్యూస్, డొట్టిన్తో పాటు కోట్నీ వెబ్ (37 రిటైర్డ్ హర్ట్) కూడా రాణించింది. అలైస్ క్యాప్సీ ఒక్కరే తక్కువ స్కోర్‌కు (4) నిష్క్రమించారు. క్యాప్సీ వికెట్ డార్సీ బ్రౌన్కు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో సీడ్నీ థండర్ టాప్‌లో ఉండగా..మెల్బోర్న్ రెనెగేడ్స్ రెండో స్థానంలో నిలిచింది. -
రాణించిన సఫారీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
గెబెర్హాలో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. గత రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ మూడు బంతులు ఆడి డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 4) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. స్కై 9 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. తిలక్ వర్మను డేవిడ్ మిల్లర్ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపగా.. అక్షర్ పటేల్.. హార్దిక్ ఆడిన రిటర్న్ షాట్ కారణంగా రనౌటయ్యాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ చాలా నిదానంగా ఆడి 45 బంతుల్లో 4 బౌండీరలు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ తొమ్మిది పరుగులు చేసి ఔట్ కాగా.. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కాస్త వేగంగా ఆడి ఉంటే భారత్ మరింత మెరుగైన స్కోర్ చేసేది. ఇన్నింగ్స్ ఆఖర్లో హార్దిక్ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఇష్టపడలేదు. అతను సొంతంగా స్కోర్ చేయకపోగా.. బంతులను అనవసరంగా వృధా చేశాడు. -
SA VS IND 2nd T20: మార్పులు లేని టీమిండియా
గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. క్రూగర్ స్థానంలో రీజా హెండ్రిక్స్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.తుది జట్లు.. భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్ -
WI VS ENG 1st T20: ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర
ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్ వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్ తన టీ20 కెరీర్లో చేసిన మూడు సెంచరీలు విండీస్‌పై చేసినవే కావడం విశేషం. సాల్ట్ తర్వాత ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఎవిన్ లెవిస్ (భారత్‌పై 2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (భారత్‌పై 2), ముహమ్మద్ వసీం (ఐర్లాండ్‌పై 2), లెస్లీ డన్బర్లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన సాల్ట్తాజాగా విండీస్‌పై చేసిన సెంచరీతో సాల్ట్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్ 34 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్‌వెల్ (5 సెంచరీలు), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), ఎస్ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్, డవిజి సహా ముహమ్మద్ వసీం, కొలిన్ మున్రో, బాబర్ ఆజమ్‌లు తలో మూడు సెంచరీలు చేశారు. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడకేశ్ మోటీ (33), ఆండ్రీ రసెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సాల్ట్ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్‌తో పాటు జాకబ్ బేతెల్ (58 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 17 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ గోల్డన్ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ తరఫున కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు తాకలేకపోయారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ ఆసీస్ టాప్ స్కోరర్‌గా జోస్ ఇంగ్లిస్ నిలిచాడు. ఇంగ్లిస్ తొలి వన్డేలో 49 పరుగులు చేశాడు. ఇదే ఈ సిరీస్ మొత్తానికి ఆసీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్.పాక్‌తో సిరీస్‌లో బ్యాటర్ల చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆసీస్ 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 22 ఏళ్లలో సొంతగడ్డపై పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం ఆసీస్‌కు ఇదే మొదటిసారి. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి వన్డేలో గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో గెలిచింది.ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..జోస్ ఇంగ్లిస్- 49 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 44 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 35 (రెండో వన్డే)పాట్ కమిన్స్- 32 (తొలి వన్డే)సీన్ అబాట్- 30 (మూడో వన్డే) -
సంచలనం.. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన పాక్
అంతర్జాతీయ క్రికెట్లో పాక్ చాలా రోజుల తర్వాత తమ స్థాయి మేరకు రాణించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించడం విశేషం. 22 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌ను ఇది తొలి వన్డే సిరీస్ విజయం. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (7), కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ (7), కూపర్ కన్నోలీ (7), మార్కస్ స్టోయినిస్ (8), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), లాన్స్ మోరిస్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో జయకేతనం ఎగురవేసింది. -
ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో
కల్నల్ సికె నాయుడు ట్రోఫీ-2024లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా గుర్‌గ్రామ్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో యశ్వర్ధన్ ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్లను యశ్వర్ధన్ ఊచకోత కోశాడు. వన్డే తరహాలో ఈ హర్యానా బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 463 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్ దలాల్ 46 ఫోర్లు, 12 సిక్స్‌లతో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్ష్ రంగతో కలిసి యశ్వర్ధన్ 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.అర్ష్ రంగ(151) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 748 పరుగుల భారీ స్కోరును సాధించింది.తొలి ప్లేయర్‌గా..ఇక ఈ మ్యాచ్‌లో క్వాడ్రపుల్ సెంచరీతో మెరిసిన యశ్వర్ధన్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా యశ్వర్ధన్ దలాల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్ స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరాష్ట్రపై సమీర్ రిజ్వీ(312) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వీ ఆల్‌టైమ్ రికార్డును యశ్వర్ధన్ బ్రేక్ చేశాడు.చదవండి: ENG vs WI: సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
IND VS SA 1st T20: తుది జట్లు ఇవే..!
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డర్బన్ వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 8) జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానున్నారు.భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్‌లు జరగగా.. భారత్ 15, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో టీమిండియానే పైచేయి సాధించింది. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా తలపడగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించి రెండో సారి వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్