fornication
-
స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం
సాక్షి,బళ్లారి: నగరంలోని ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఇన్ఫ్యాంట్రీ రోడ్డులో వేశ్యవాటికపై కౌల్‌బజార్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. తనిఖీలు చేసి పలువురు మహిళలను రక్షించడంతో పాటు సెంటర్‌ను నిర్వహిస్తున్న ప్రభుగౌడతో పాటు మరో ఏడుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగాల్యాండ్, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలను రక్షించి, అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిని పట్టుకున్నారు. నగరంలో పలు స్పా(మసాజ్) సెంటర్ల పేరుతో లోపల అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే స్పా సెంటర్లలో అసాంఘీక కార్యకాలాపాలు జరుపుతూ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయిలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లను తనిఖీ చేస్తే పైన బోర్డులు మాత్రం మసాజ్ సెంటర్లు అని చూపుతూ లోపల మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు సమాచారం. -
భార్య కువైట్‌లో.. భర్త దారుణ హత్య
నాగోలు: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భరత్‌నగర్‌కు చెందిన తంగడపల్లి రాములు(50)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విజయలక్ష్మీ ప్రస్తుతం కువైట్‌లో ఉండగా, రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్‌లో నివాసముంటోంది. రాములుపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 5 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాయినగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయమై జరిగిన గొడవలో జైలుకు వెళ్లిన రాములు ఏప్రిల్ 24న బయటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఫతుల్లాగూడ, ఆప్కోకాలనీ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ పృధ్వీదర్‌రావు, సీఐ కాశిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
సేలం: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె కుమారుడు స్నేహితులతో కలిసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం అలగాపురం పెరియపుదూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ (36). ఇతనికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గోపాల్‌కు పెరియపుదూర్‌కు చెందిన జ్యోతి (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జ్యోతికి భర్త లేకపోవడంతో గోపాల్ భార్య పిల్లలను వదిలేసి ఆమె ఇంటి వద్దకే వెళ్లిపోయాడు. జ్యోతికి కుమారుడు ఉలగనాథన్, మరో కుమార్తె ఉన్నారు. గోపాల్‌కు జ్యోతి కుమారుడు ఉలగనాథన్కు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం జ్యోతి ఉద్యోగానికి వెళ్లగా, గోపాల్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం 4గంటల సమయంలో ఉలగనాథన్ నలుగురు స్నేహితులతో ఇంటికి వచ్చి గోపాల్‌తో గొడవకు దిగాడు. తర్వాత వారంతా కలిసి కత్తితో గోపాల్‌ను నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన గోపాల్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలగాపురం పోలీసులు పరారైన ఉలగనాథన్ సహా ఐదుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
కిరాతకం
భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త కిరాతకుడిగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. విచక్షణా రహితంగా కత్తితో నరికి భార్యను హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పున్నపాక్కం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. తిరువళ్లూరు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలిగొంది. భర్త కాలయముడై ఆమెను హత్య చేశాడు. వివరాలు... తిరువళ్లూరు జిల్లా ఆట్రంబాక్కం గ్రామానికి చెందిన నాగరాజ్‌కు, బీమంతోపు గ్రామానికి చెందిన నందినితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అడపిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజ్‌కు, నందినికి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. నాగరాజ్ తీరుతో విసుగు చెందిన నందిని, భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ స్థితిలో ఆమెకు పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నందిని తిరువళ్లూరులోని ప్రయివేటు నగల దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని రాత్రి 10.20 గంటలకు ప్రియుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరింది. పున్నపాక్కం సమీపంలో వస్తుండగా నాగరాజ్ వారిని అడ్డుకుని భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. భయాందోళన చెందిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నందినిని అటువైపు వెళుతున్న వారు తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత ఫలించక నందిని బుధవారం ఉదయం నాలుగు గంటలకు మృతి చెందింది. నందిని హత్యపై కేసు నమోదు చేసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతోనే హత్య చేసినట్టు నాగరాజ్ పోలీసులు ఎదుట నేరం అంగీకరించాడు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నామక్కల్ జిల్లా కుమార పాళయంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. నామక్కల్ జిల్లా కుమార పాళయం సమీపం కోట్టైమేడు ప్రాంతానికి చెందిన ఆర్ముగం(43). ఇతని భార్య నాగమ్మాళ్. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్ముగం పక్క ఇంట్లో నివశిస్తున్న కన్నియప్పన్(45), అతని భార్య మరకదం(35). వీరి కుమారుడు గౌరిశంకర్(22). ఇలాఉండగా మరకదంకు ఆర్ముగంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు ఏర్పడేవి. ఈ స్థితిలో మూడు రోజుల కిందట ఆర్ముగం, మరకదం గదిలో ఏకాంతంగా ఉండగా గౌరిశంకర్ చూశాడు. దీంతో ఆవేదన చెందిన గౌరిశంకర్ తండ్రితో చెప్పి బోరున విలపించాడు. అనంతరం గౌరిశంఖర్, కన్నియప్పన్లు కలిసి ఆర్ముగంను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్ముగం వీధిలో వస్తుండగా ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న కుమారపాళయం పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్ముగం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కుమార పాళయం జీహెచ్‌కు తరలించారు. గౌరిశంఖర్, కన్నియప్పన్లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఏఎస్ఐ భార్య అనుమానాస్పద మృతి
అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ దేవదాస్ భార్య సరళ (48) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే తన బావే హత్య చేసి ఉంటాడని మృతురాలి చెల్లెలు ఆరోపించింది. అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిందని భర్త చెబుతున్నాడు. అనంతపురం సెంట్రల్: నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు భాగ్యనగర్ కాలనీలో ఏఎస్ఐ దేవదాసు, సరళ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కీర్తి, హరితారాణి, మనోహర్‌లు సంతానం. పెద్ద కుమార్తె బీటెక్ చదువుతుండగా, మిగతా ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సరళకు అన్నదమ్ములు లేకపోవడంతో తండ్రి నుంచి రూ.కోట్లు విలువజేసే ఆస్తులు వచ్చాయి. తొలినాళ్లలో అన్యోన్యంగా సాగిన వీరి సంసారంలో కొన్నేళ్ల నుంచి కలహాలు ప్రారంభమయ్యాయి. దేవదాసు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అనేకసార్లు ఆమె తన చెల్లెలుకు చెప్పుకొని బాధపడింది. దీనిపై గతంలో డీఎస్పీ మల్లికార్జునవర్మకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సరళ మృతి చెందింది. గుట్టుగా ఖననానికి ఏర్పాట్లు! బంధువులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా ఖననం చేయడానికి దేవదాసు యత్నించడం అనుమానాలకు దారితీసింది. విషయం తెలుసుకున్న మృతిరాలి చెల్లెలు వారి ఇంటికి వచ్చి గొడవకు దిగింది. తన అక్కను బావే హింసించి చంపారంటూ ఆరోపించింది. మృతురాలి బంధువులను పక్కకు తోసేసి ఖననం చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగించి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు యత్నించారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం తమ అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుపట్టారు. చేసేదిలేక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలనే.. ఏఎస్ఐ దేవదాసు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనకు అడ్డుగా ఉందనే కారణంతో తమ అక్క సరళను హింసించి హత్య చేశాడని మృతురాలి చెల్లెళ్లు కమల, వర్ణ, అనితలు ఆరోపించారు. అక్క మృతి చెందితే మరో వివాహం చేసుకోవాలని కుట్ర పన్నాడన్నారు. అనేక సార్లు హింసించాడని, దీనిపై గతంలో పనిచేసిన డీఎస్పీ మల్లికార్జునవర్మకు ఫిర్యాదు కూడా చేశామని వివరించారు. అయితే వారు దుప్పటి పంచాయితీ చేసి పంపించారని ఆరోపించారు. దేవదాసు, ఆయన అన్న ఇద్దరూ ఏఎస్ఐలు అని, కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో పాటు దేవదాస్ ఆస్తులు కూడా పిల్లల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతోనే చనిపోయింది.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ సరళ మృతి చెందింద భర్త దేవదాసు తెలిపారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లామని, వ్యాధిని పరిశీలించిన అనంతరం అడ్మిషన్ చేసుకోలేదని వివరించారు. పరిస్థితి విషమించి ప్రాణం విడిచిందని చెప్పారు. -
కామాంధుడు
♦ ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం ♦ ఆమె కుమార్తెపై అత్యాచారం ♦ వారం క్రితం బిడ్డకు జన్మనిచ్చిన యువతి ♦ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్యాపిలి: మండల కేంద్రమైన ప్యాపిలిలో ఘోరం చోటు చేసుకుంది. భర్త లేని ఒంటరి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ కామాంధుడు ఆమె కూతురిపై కూడా అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను తల్లిన చేసిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. మండల పరిధిలోని హెచ్ఆర్ పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు 18 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో ఆమె ప్యాపిలికి వచ్చి ఓ హోటల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ప్యాపిలికి చెందిన వారం సుబ్రమణ్యం (60)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచూ ఆమె ఇంటికి వచ్చే సుబ్రమణ్యం కన్ను ఆమె కుమార్తె(22)పై పడింది. తల్లి ఇంట్లో లేని సమయంలో వెళ్లి బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాది కాలంగా ఇలానే ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నాళ్ల తర్వాత నెల తప్పిన ఆమె.. విషయాన్ని తల్లికి చెప్పేందుకు భయపడింది. ఏడో నెలలో కుమార్తె కడుపు ముందుకు రావడాన్ని గమనించిన తల్లి ఆమెను గట్టిగా నిలదీసింది. బోరుమని ఏడుస్తూ కుమార్తె జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించిన తల్లి..కుమార్తెను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది. అయితే ఏడో నెల కావడంతో అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పడంతో నిరాశతో వెనుతిరిగింది. వారం రోజుల క్రితం కుమార్తె ఆడపిల్లను జన్మనిచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయిందని భావించిన తల్లి..తన కూతురుతో కలసి ఆదివారం ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారం సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. -
ప్రియుడే కడతేర్చాడు
అన్నానగర్: వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. ఆనంది పెద్ద కుమారుడు సుజీధరన్ డిగ్రీ, రెండవ కుమారుడు అస్సుధన్ ప్లస్‌ఒన్ చదువుతున్నాడు. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది. దీంతో ఆనంది కుటుంబం సహా పేటైలో నివాసం ఉంటోంది. వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్ సమీపంలో ఉన్న సింగమ్‌పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు. విచారణలో ఆనంది భర్త చంద్రశేఖర్, చెల్లప్ప స్నేహితులని, తరచూ వారి ఇంటికి వెళ్లే వాడని చంద్రశేఖర్ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్‌కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానంతో అంతమొందించాడు!
- మహిళను చంపేసి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం - కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు - నలుగురి నిందితుల అరెస్ట్ - మరొకరి కోసం గాలిపు నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి, అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె.. శ్రీనివాసులుగా దూరంగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కడతేర్చాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్ సహాయం తీసుకున్నాడు. మే 8వ తేదీన పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20వ తేదీన పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం సంఘటన స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురి నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు. -
ఉసురు తీసిన అవమానభారం
ఇద్దరు పిల్లల గొంతు నులిమి తండ్రి ఆత్మహత్య - భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడమే కారణం – కర్నూలు మండలం శివరామపురంలో ఘటన కర్నూలు సీక్యాంప్: భార్య వివాహేతర సంబంధం ముగ్గురి ఉసురు తీసింది. పల్లెటూరు కావడంతో తలా ఒక మాట అనడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కర్నూలుకు శివారులోని శివరామపురం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, బంధువులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన వికలాంగుడు చాకలి మహేష్(32) స్థానికంగా కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి(26), కుమార్తె హారిక(5), కుమారుడు ఆకాష్(4) సంతానం. మహేష్ తండ్రి నడిపెన్న(60), తల్లి పాపమ్మ(52) ఇతని వద్దే ఉంటున్నారు. ఎనిమిది నెలల క్రితం లక్ష్మి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారనే ఆలోచన లేకుండా భార్య వెళ్లిపోవడం.. స్థానికుల సూటిపోటి మాటలతో మహేష్ ఇంటికే పరిమితమయ్యాడు. చివరకు చావే శరణ్యంగా భావించాడు. అయితే తను చనిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారనే భావనతో ముందుగా ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేవాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
మబ్బువాళ్లపేటలో దారుణం
⇒బడిలోనే టీచర్ హత్య ⇒ ఆర్థిక లావాదేవీలే కారణమా..? ⇒ అనాథలైన ఇద్దరు చిన్నారులు ⇒ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు విద్యార్థులకు నీతి బోధనలు చేస్తూ సమాజానికి మంచి పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. వివాహితురాలైన టీచర్‌ను ప్రేమ పేరిట వంచించాడు. ఆర్థిక లావాదేవీలతో గొడవ పడ్డాడు. చివరికి ఆమెను అందరూ చూస్తుండగానే బడిలోనే హత్య చేశాడు. ఈ సంఘటన గంగవరం మండలం మబ్బువాళ్లపేటలో గురువారం జరిగింది. పలమనేరు:పాఠశాలలోనే ఉపాధ్యాయురాలు హత్యకు గురైన సంఘటన జిల్లాలో సంచల నం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలం సూరయ్యగారిపల్లికి చెంది న చంద్రమౌళి(45) గంగవరం మండలం లోని గుండుగల్లు బొమ్మనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఓ టీచర్‌ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇదే మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పలమనేరుకు చెంది న ప్రేమకుమారి(40)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలి యడంతో చంద్రమౌళి భార్య అతన్ని వదిలేసింది. ఈ నేపథ్యంలో చీటీలు వేస్తానని చెప్పి ప్రేమకుమారి నుంచి చెక్కులు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంగా 2014 మేలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. అప్పట్లో తనను తిరుపతికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ప్రేమకుమారి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పిం చారు. తనకున్న పలుకుబడితో మళ్లీ ఉద్యోగంలో చేరిన చంద్రమౌళి ఆరునెలలుగా ప్రేమకుమారి వెంట పడుతున్నాడు. భార్య ప్రేమకుమారి ప్రవర్తనపై విసుగు చెందిన భర్త రమేష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఎక్సైజ్ ఎస్ఐగా చేరాల్చి ఉండగా.. ఎక్కైజ్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో ప్రేమకుమారి పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇంటర్వూ్యల్లో ఎస్ఐగా ఎంపికైంది. త్వరలోనే ఆమె ఆ పోస్టులో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె గత వారం నుంచి పాఠశాలకు వెళుతోంది. ఎక్సైజ్ ఎస్ఐగా వెళ్లొద్దని ప్రియుడు బెదిరిస్తుండడంతో బెదిరింç ³#ల నేపథ్యంలో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకుని బడికి వెళుతోంది. గురువారం సైతం ఆమె తండ్రి అర్జునయ్యతో కలిసి వెళ్లింది. ఇంతలో మంకీ క్యాప్‌తో వచ్చిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో ప్రేమకుమారిని కత్తితో 12 చోట్ల పొడిచాడు. విద్యార్థులు కేకలు వేయడంతో అర్జునయ్య అగంతకున్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. 108లో ఆమెను పలమనేరు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందింది. తమ కుమార్తెను ముసుగులో వచ్చి నరికింది చంద్రమౌళేనని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనాథలైన పిల్లలు ప్రేమకుమారికి బంగారుపాళ్యం మండలానికి చెందిన రమేష్‌తో పెళ్లి జరిగింది. వీరికి లయగ్రేస్(11), గిరిగ్రేస్(6) పిల్లలు ఉన్నారు. రమేష్ స్థానికంగా హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు. తల్లి మృతిచెందడం, తండ్రి దూరంగా ఉండడంతో పిల్లలకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డలను బాగా చూసుకోండి రెండు రోజుల క్రితం ప్రేమకుమారి పాఠశాలకు వెళుతూ తన బిడ్డలకు మీరేదిక్కని, బాగా చూసుకోవాలని తమతో చెప్పిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
నిజామాబాద్ రూరల్ (నిజామాబాద్ అర్బన్): వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భార్య, భర్త ను దారుణంగా చంపిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తానాఖూర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన గీత కార్మికుడైన వెల్పూర్ సాయిలు (38) హత్యకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సాయిలు స్వగ్రామానికి వచ్చి పదిరోజులైంది. భర్త విదేశాలకు వెళ్లడంతో సాయిలు భార్య నీలావతి అలియాస్ లీలా గ్రామానికి చెందిన తిరుపతి రమేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం విషయంలో లీలావతి, సాయిలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పథకం ప్రకారం సోమవారం రాత్రి తిరుపతి రమేశ్, లీలావతి కలిసి సాయిలును ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశారు. మంచంపై పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. బయట నుంచి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయం ఇంట్లో నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక దళ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి మంటలు ఆర్పారు. అప్పటికే మంచంతో పాటు సాయిలు మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో వస్తువులు, దుస్తులు బూడిదయ్యాయి. హతుడికి 6వ, 7వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సతీశ్ సందర్శించారు. నిందితులు ఇరువురు పరారీలో ఉన్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విజయవాడలో పట్టపగలే దారుణహత్య
-
విజయవాడలో దారుణహత్య
⇒ పట్టపగలే యువకుడిపై దాడి ⇒ అడ్డుకున్న మృతుడి తల్లికి కత్తిపోట్లు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పట్టపగలు నడిరోడ్డుపై యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన విజయవాడలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోలా పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర(21) పండ్ల మార్కెట్లో కూలీ పనులు చేస్తుంటారు. పద్మ భర్తను వదిలివేసి ఒంటరిగా ఉంటోంది. మార్కెట్లో మేస్త్రీగా పనిచేస్తున్న ఫ్రైజర్పేటకు చెందిన గణపా శివతో పద్మకు వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తన ఇంటికి రావద్దంటూ శివకు పద్మ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. తన సొమ్ము కాజేసి చివరికి ఇంటికి రావద్దంటూ గెంటివేశారని కక్ష పెంచుకున్న శివ అదనుకోసం ఎదురు చూశాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నరేంద్ర తను పనిచేస్తున్న దుకాణం వద్దకు బైక్‌పై వచ్చాడు. రోడ్డుపక్కన బైక్ పార్క్ చేయబోతున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న శివ కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగెడుతుండగా శివ వెంటాడి నరికాడు. తన కుమారుడిపై దాడి చేస్తున్న విషయం తెలుసుకున్న పద్మ కేకలు వేస్తూ పండ్ల దుకాణం నుంచి బయటకు రాగా ఆమెపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న పద్మ, ఆమె కుమారుడు నరేంద్రను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన నరేంద్ర మార్గమధ్యంలో చనిపోగా అతని తల్లి చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కానిస్టేబుల్ హత్య
► మహిళా కానిస్టేబుల్ సహా ఇద్దరి అరెస్ట్ ► మరో ముగ్గురు కానిస్టేబుళ్ల వద్ద విచారణ తిరువళ్లూరు: తిరువళ్లూరులో మహిళా కానిస్టేబుల్ నడిపిన వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. మృతుడు, హంతకుడు ఇద్దరూ పోలీసులు కావడం గమనార్హం. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తేనీ జిల్లా కూంబై గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్(30) బీఎస్ఎఫ్ ఉద్యోగి. ఇతని భార్య (23) తిరువళ్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయుధ విభాగం (వీఆర్)లో కానిస్టేబుల్. ఈమె తిరువళ్లూరులోని పూంగానగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని తండ్రి (70), అక్క తో కలిసి నివసిస్తోంది. ఇలాఉండగా తిరునల్వేలి జిల్లా వన్నియకుళం గ్రామానికి చెందిన ఇరుళపాండ్యన్ కుమారుడు అమృతరాజ్(25) చెన్నైలో వీఆర్ కానిస్టేబుల్. ఆరు నెలల కిందట ఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతకుముందు తిరువళ్లూరులో పనిచేస్తున్న వీఆర్ కానిస్టేబుల్ కల్లన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి అమృతరాజ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు కల్లన్ తో సబంధం గురించి తెలుసుకుని అతనికి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. మద్యం మత్తులో వెళ్లి హత్యకు గురైన కానిస్టేబుల్: అమృతరాజ్ హెచ్చరించిన విషయాన్ని కల్లన్ తన సహచరులతో చెప్పాడు. అనంతరం సహచరులు మదురై ఉసిలంబట్టికి చెందిన సుందరపాండ్యన్ (24), ఊత్తపాళ్యంకు చెందిన చంద్రన్ మదురైకు చెందిన సంతానకుమార్(26)తో కలిసి మద్యం తాగి సదరు మహిళ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అమృతరాజ్ అక్కడే ఉండడంతో వారు అతనితో ఘర్షణ పడ్డారు. అమృతరాజ్ ఇంటిపైకి వెళ్లగా సుందరపాండ్యన్ అతన్ని వెంబడిస్తూ వెళ్లాడు. ఆ సమయంలో అమృతరాజ్ పక్కన ఉన్న కత్తితో సుందరపాండ్యన్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీనిపై అతని సహచరులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సుందరపాండ్యన్ ను తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అమృతరాజ్, కల్లన్, చంద్రన్, సంతానకుమార్, మహిళా కానిస్టేబుల్ వద్ద విచారణ చేపట్టారు. నిందితులను డీఐజీ ఆదివారం మధ్యాహ్నం విచారించారు. -
హత్య చేసి.. కాల్చివేసి...
పావగడలో యువకుడి దారుణ హత్య హతుడు దేవరకొండ వాసిగా గుర్తింపు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు పావగడలోని మున్సిపల్ బస్టాండు సమీపంలో దేవరకొండకు చెందిన రంగనాథ్(35) దారుణ హత్యకు గురయ్యాడని ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి మంజునాథ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బస్టాండు సమీపంలోని ఎస్బీఐ సమీపంలో చరండీలో పడేశారన్నారు. అంతటితో ఆగక హతుడ్ని గుర్తు పట్టకుండా ఒంటిపై పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేరుుంచిన భార్య నిందితుడి అరెస్ట్ బెంగళూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి తన భర్తను హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. వివరాలు...జిల్లాలోని ఎన్.ఆర్‌పుర తాలూకాలోని కట్టినమనె గ్రామానికి చెందిన యోగేంద్ర (42)కు సమీప గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది కాలంగా వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కుందాపురకు చెందిన బస్ డ్రైవర్ వినయ్‌గౌడతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి విషయం ఆమె భర్త యోగేంద్రకు తెలియడంతో పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. పెద్దల ఎదుట పంచాయతీ పెట్టడానికి యోగేంద్ర నిర్ణరుుంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వినయ్‌తో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం వేసింది. కుటుంబ విషయం మాట్లాడాలని భర్త యోగేంద్రను ఇంటికి పిలిపించింది. దీంతో శుక్రవారం రాత్రి యోగేంద్ర భార్య ఇంటికి బయలుదేరాడు. అప్పటికే గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు వినయ్‌గౌడ యోగేంద్రను తలపై బండరాళ్లతో మోది హత్య చేసి పారిపోయాడు. భార్యతో మాట్లాడ్డానికి వెళ్లిన తమ కుమారుడు ఎంతకీ తిరిగి రాకపవోడంతో యోగేంద్ర కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో యోగేంద్ర విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వినయ్‌గౌడను అరెస్ట్ చేసి విచారించగా యోగేంద్రను అతడి భార్యతో కలసి హత్య చేసినట్లు అంగీకరించారు. -
కొడుకులు కొట్టిన కేసులో రూ.10 లక్షలకు సెటిల్మెంట్
కాశిబుగ్గ(వరంగల్): కొడుకులు కొట్టారని.. కోర్టుకెక్కిన తండ్రి! శీర్షికన మంగళవారం ‘సాక్షి’ మెరుున్ ఎడిషన్ లో కథనం ప్రచురితమవడంతో బాధితుడి కుమారులు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ స్థానిక మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో తండ్రి పోషాల రమేశ్ మీద ఫిర్యాదు చేశారు. గతంలోనూ బ్లాక్ మెరుుల్ చేసి, డబ్బు వసూలు చేశాడని, తమకు ఎలాంటి ఆస్తి సంపాదించి ఇవ్వలేదని తెలిపారు. గతంలోనూ తమ ను డబ్బుకు ఇబ్బందిపెట్టి కోర్టుకు వెళ్లాడని చెప్పారు. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకుని తమను, తమ తల్లిని వేధిస్తున్నాడని, ఉన్న కొద్ది ఆస్తిని రెండో భార్య పేరున రాశాడని వివరించారు. 2 నెలలుగా తమ టెంట్‌హౌస్‌లో తిష్టవేసి తమను షాపులోకి రానివ్వకుండా, రూ.20 లక్షలివ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, తామందుకు నిరాకరించడంతో తమపైనే రాడ్‌తో దాడి చేశాడని, ఆ రాడ్‌తోనే తానూ కొట్టుకుని కోర్టుకు వెళ్లాడని ఆరోపించారు. కాగా పెద్ద మనుషుల సమక్షంలో రూ.10 లక్షలిస్తే తమ జోలికి రానని చెప్పాడని, ఈ అవమానాలను భరించలేక అందుకు కూడా ఒప్పుకున్నామని వారు చెప్పారు. -
రాధాకృష్ణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల అదుపులో బాబాయి, అబ్బాయి, మేనమామ వీరులపాడు : తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కక్షతో మెండెం రాధాకృష్ణ(35)ను గ్రామానికి చెందిన కామాల యాకోబు, అతని బాబాయి కామాల జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. హత్యకు పాల్పడిన ఇరువురితో పాటు వారికి ఆశ్రయమిచ్చిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావును అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన మెండెం రాధాకృష్ణ ఈ నెల 7న గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలోని ఆర్అండ్బీ రహదారి పక్కనున్న పంట బోదెలో శవమై కనిపించాడు. మృతుని తల్లి వెంకట్రావమ్మ తన కుమారుడిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందిగామ రూరల్ సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. రాధాకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతుని శరీరంపై గాయాలుండడమే కాక ఊపిరి ఆడక మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దీంతో మృతుని తల్లి ఇచ్చిన అనుమానితుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టగా యాకోబు, తన బాబాయి జమలయ్యతో కలిసి హత్య చేసినట్లు తేలింది. నిందితులను విచారించగా తల్లితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కక్షతో తన బాబాయితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దొరికిపోయారు ఇలా.. ఈనెల 7న రాత్రి సమయంలో రాధాకృష్ణ మద్యం దుకా ణం సమీపంలో ఉండడాన్ని గమనించిన యాకోబు, జమలయ్యలు గొంతు నులమడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. రాధాకృష్ణను హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న పంట బోదెలో పడేసి ఇబ్రహీం పట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన యాకోబు మేనమామ దాసరి చెన్నకేశవరావు ఇంటికి నిందితులు వెళ్లారు. వీరు ముగ్గురు కలిసి విజయవాడ పరి సర ప్రాంతాల్లో ఉన్నారు. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో గురువారం ఉదయం 7 గంటల సమయంలో కంచికచర్ల బస్టాండ్‌కు చేరుకున్నారు. వీరు బస్టాం డ్ సమీపంలో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో సీఐ సత్యకిషోర్ సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. ఎస్ఐ అవినాష్, ట్రైనీ ఎస్ఐ ప్రియకుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది
జోగిపేట : అందోలు మండలం డాకూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జహంగీర్ (65)హత్య కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి జోగిపేట సీఐ వెంకటయ్య గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మతో జహంగీర్‌కు అక్రమ సంబంధం ఉందని, అయితే రెండు సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందిన అర్జునయ్య ఎల్లమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నారు. ఈ విషయం జహంగీర్‌కు తెలియడంతో పలుసార్లు ఇద్దరిని పిలిచి మందలించారు. అయినా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. తమ సంబంధానికి అడ్డుతగులుతున్నాడని భావించిన అర్జునయ్య ఎలాగైనా జహంగీర్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్జునయ్య, తన బావమరిది అనిల్, ఎల్లమ్మలు కలిసి జహంగీర్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. జూలై 24వ తేదీ రాత్రి జహంగీర్ ఇంట్లో ఎల్లమ్మతో కలిసి నిద్రిస్తున్న సమయంలో బావ, బావ మరిది కలిసి జహంగీర్ ఇంటి వద్దకు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఎల్లమ్మ ముందు రచించిన పథకం ప్రకారం తలుపులు తెరచింది. వారిద్దరూ గదిలోకి ప్రవేశించి జహంగీర్ తలపై కట్టెలతో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మ ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి అర్జునయ్య, అనిల్, వారికి సహకరించినందుకు ఎల్లమ్మలపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. ఎస్ఐ విజయ్‌రావు, ట్రైనీ ఎస్ఐ గౌతంలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను జోగిపేట మున్సిఫ్‌కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కుటుంబంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
పిల్లలను వదిలి ప్రేమికుడితో వెళ్లిన వివాహిత ప్రియుడు హ్యాండివ్వడంతో తిరిగి భర్త చెంతకు భర్త అంగీకరించకపోవడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ మండ్య: పరపురుషుడి వ్యామోహంలో పడిన ఓ వివాహిత భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత సదరు ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. తనతో కాపురం చేయకపోతే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే తనను వదిలి వెళ్లిన భార్యను స్వీకరించేది లేదని భర్త చెబుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. మహిళ రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసమున్న సాగర్‌కు పరిచమేర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో భర్తను వదిలి సాగర్‌తో వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. దీంతో భార్య,భర్తల మధ్య గొడవలు మొదలయ్యి శశి బంధువులు సాగర్‌కు దేహశుద్ధి చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసుల సమక్షంలోనే తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్‌ను పెళ్లి చేసుకొని అతనితోనే జీవిస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా అంగాకరించాడు. ఇకపై రశ్మికి,తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం రశ్మి ప్రేమికుడు జరుగుతున్న పరిణామాలతో బెదిరిపోయి పారిపోయాడు. దీంతో రశ్మి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడంతో తిరిగి భర్త వద్దకే చేరుకుంది. ఇకపై భర్తతోనే ఉంటానని, అందుకు ఒప్పుకోకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇంట్లో తిష్టవేసింది. దీంతో ఏమి చేయాలో తోచని స్థితిలో రశ్మిపై అమె భర్త శశి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కాగా ప్రజలు మందు, మీడియా ముందు తనను తన పిల్లను వదిలేసి వెళ్లిన రశ్మిని తిరిగి భార్యగా స్వీకరించేది లేదని ఆమె భర్త శశి తేల్చి చెప్పారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
అనంతగిరి: మండలంలో భీంపోలు పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మద్దేల సరోజిని అలియాస్ చిన్ని(22) అనే యువతి ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనిఓ మహిళ వేధించడంతో భరించలేక సరోజిని మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు శృంగవరపు కో ట కమ్యూనిటీహెల్త్సెంటర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను సరోజిని సూ సైడ్ నోట్లో రాసినట్టు అనంతగిరి ఎస్ఐ పి.దామోదరనాయుడు తెలి పారు. గుమ్మకోటకు చెందిన పెరుమాళ్ళ మహేష్, అతని భార్య గీత,మహేష్ వదిన భవానీ వివాహేతర సంబంధం పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని, బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నట్టు సరోజీని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి దేముడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.సోమవారం శృంగవరపుకోటసీహెచ్ిసీలోమృతదేహానికిపోస్టుమార్టంపరీక్షలు నిర్వహించారు. -
‘రఘుపై నిర్భయ కేసు నమోదు చేయాలి’
అనంతపురం : గుమ్మఘట్ట మండలం బైరవానితిప్పకు చెందిన ఇద్దరు మహిళలను వంచించిన అధికార పార్టీ నేత సోదరుడు రఘుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, బీకేఎస్ కొండమ్మ మాట్లాడారు. రఘు ఓ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు తన అక్క కూతురిని వివాహం చేసుకున్నాడన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి మనస్థాపానికి గురైన కట్టుకున్న భార్య గతంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. మరోవైపు గర్భవతి అయిన బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో అధికారబలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో సదరు బాలిక కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. తన సోదరుడు టీడీపీ నాయకుడనే ధైర్యంతోనే రఘు బరి తెగించాడని ధ్వజమెత్తారు. ఇద్దరు యువతుల జీవితాలతో చెలగాటం ఆడిన రఘును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష మహిళా సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పైసాచికం!
చిన్న మొత్తాల కోసమే ప్రాణాలు తీస్తున్నారు బయటపడకూడదని చేసినవే ఎక్కువ నేరగాళ్లలో విద్యాబుద్ధులు లేనివారే అత్యధికం సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మి హత్య సైతం ఇలానే సిటీబ్యూరో: భారీ ఆస్తి/సొత్తు కోసం... వ్యక్తిగత కక్ష... భూ వివాదం... వివాహేతర సంబంధం... ఒకప్పుడు ఇవే హత్యలకు దారి తీసేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న చిన్న మొత్తాల కోసమూ కిరాతకులు తెగిస్తున్నారు. ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మీ హత్య ఈ కోవకు చెందినదే. అతడి నుంచి రూ.10 వేలు తీసుకోవడానికి ప్రయత్నించిన స్నేహితుడు నరేష్‌కుమార్‌రెడ్డి... అది సాధ్యం కాకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. ఓతప్పు కప్పిపుచ్చేందుకు ‘మరోటి’... ఈ తరహా చిన్న మొత్తాల కోసం జరుగుతున్న హత్యల్లో అనేకం ఉనికి బయటపడకూడదనే చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. నేరగాళ్లు తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల నుంచి తొలుత డబ్బు మాత్రమే తీసుకోవాలని ఆశిస్తుంటారు. అయితే ఎదుటి వారి స్పందన ఆధారంగా దోపిడీకి తెగబడతారు. ఆపై బాధితుల ద్వారా విషయం బయటకు రాకుండా ఉండటం, పోలీసుల ఫిర్యాదులు తదితరాలు తప్పించుకోవాలని భావిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బరితెగిస్తున్న నేరగాళ్లు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తులు పరిచయస్థులైతేనే ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు. ‘భవిష్యత్తు’ లేని వాళ్లే నేరగాళ్లు... చిన్న మొత్తాల కోసమూ బరితెగించి హత్యల వరకు వెళ్తున్న నేరగాళ్ల సామాజిక, ఆర్థిక నేపథ్యమూ కీలకమైన అంశమని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉంటున్న వారిలో నిరక్షరాస్యులు, సామాజిక హోదా లేని వాళ్లు, భవిష్యత్తుపై ఆలోచనలు లేని వాళ్లే ఎక్కువగాా ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వీరికి చదువు, ఉద్యోగం వంటివి లేకపోవడం, కుటుం బాలకూ దూరంగా ఉండటం, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యాలకు దూరంగా ఉండటం, బయట ఉన్నా-జైల్లో ఉన్నా సామాజిక జీవితంలో మార్పుచేర్పులు లేకపోవడం తదితరాల వల్లే ఈ నేరగాళ్లు బరితెగిస్తున్నారని అంటున్నారు. హష్మీని హత్య చేసిన నరేష్‌కుమార్‌రెడ్డి విషయాన్నే తీసుకుంటే ఇతడు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వాడు. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు సరిగ్గా అబ్బకపోవడంతో ఐటీఐతో సరిపెట్టాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ నగరానికి చేరుకున్నాడు. చివరకు పనీ పాటా మానేసి అవారాగా మారాడు. చివరకు రూ.10 వేల కోసం హష్మీని హత్య చేసి హంతకుడిగా మారాని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. క్రైమ్ కేస్ స్టడీస్... ఉప్పల్ బీరప్పగూడలో నివసించే కురుమ వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా డ్రైవర్. ఇందిరానగర్‌లోని హిజ్రా వద్దకు వచ్చిన ఇతడు మద్యం తాగాడు. అదే ప్రాంతానికి వచ్చిన కావూరి బ్రహ్మం అనే యువకుడిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అతడు కాదనడంతో వెం టాడి మరీ బండరాయితో మోది చంపేశాడు. కర్ణాటకకు చెందిన నెహామియా, జహీరాబాద్‌కు చెందిన అనిల్ నగరంలో ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ చిన్నచిన్న పనులు చేసుకునేవారు. వీరిద్దరూ రెతిఫైల్ సమీపంలో జేబులో నగదుతో ఉన్న ఓ వ్యక్తిని వీరిద్దరూ చూశారు. దీంతో అతడికి మాయమాటలు చెప్పి చిలకలగూడలోని పాడుబడిన రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ వ్యక్తిని చంపేసిన ఇద్దరూ... రూ.5 వేలతో ఉడాయించారు. బాలాపూర్‌కు చెందిన అంజయ్య కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్ నిర్వాసితులకు పాలు విక్రయించే వాడు. నిత్యం ఇతడి వద్దకు ఓ వ్యక్తి వచ్చి రూ.10 తీసుకునే వాడు. ఓరోజు ఆ నగదు ఇవ్వడానికి అంజయ్య నిరాకరించడంతో సదరు వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశాడు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..
దోమతోటి హత్యకేసులో నిందితుల అరెస్టు తిరువూరు: డీసీసీ కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు హత్య కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కపాలేనికి చెందిన కొర్రప్రోలు శ్రీనివాసరెడ్డి, గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన మున్నంగి హనుమారెడ్డి, సింగంశెట్టి హనుమంతరావు, శివశంకరరెడ్డి కలిసి నాగేశ్వరరావును 17వ తేదీ రాత్రి అక్కపాలెం వాటర్‌ట్యాంకు వద్ద కత్తులు, రాడ్లతో హతమార్చారు. శ్రీనివాసరెడ్డి భార్యతో హతుడు నాగేశ్వరరావుకు వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు తమ దర్యాప్తులో వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య జరగడానికి ఒకరోజు ముందు వీఎంబంజరులోని ఒక హోటల్లో మకాం వేశారని, హత్య చేసిన వెంటనే నిందితులు అంతకు ముందు కొనుగోలు చేసిన అంబాసిడర్ కారులో పారిపోయారని తెలిపారు. హతుడి ద్విచక్రవాహనం సహా పరారైన శివశంకరరెడ్డి మైలవరం వద్ద ఒక లారీని ఢీకొన్న ప్రమాదంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. శివశంకరరెడ్డి మినహా మిగిలిన ముగ్గురిని ఉండవల్లిలో అరెస్టు చేశామని, విజయవాడ ఆటోనగర్‌లో కొనుగోలు చేసిన మారణాయుధాలు, అంబాసిడర్ కారును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు, తిరువూరు సెక్టార్-2 ఎస్ఐ కన్నప్పరాజు, పీఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 302 సెక్షను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. దర్యాప్తు కొనసాగింపు నాగేశ్వరరావు హత్యకేసులో మరికొందరు నిందితులున్నట్లు కాంగ్రెస్ నాయకులు, మాల మహానాడు ప్రతినిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానితుల్ని విచారిస్తున్నామని, ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వేధిస్తున్నాడని చంపేసింది!
భర్తను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన భార్య నల్లకుంట: అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్తను చాకుతో పొడిచి చంపిందో భార్య. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. నల్లకుంట సీఐ వి.యాదగిరి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నాగారానికి చెందిన మాట్లా గంగాధర్(48), విజయలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి నల్లకుంట నర్సింహ బస్తీలో అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. గంగాధర్ ఏ పని చేయకుండా ఖాళీ ఉంటుం డగా.. విజయలక్ష్మి శివం రోడ్డులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఆయాగా పని చేస్తోంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గంగాధర్ అనుమానం పెంచుకున్నాడు. నిత్యం తాగి వచ్చి ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురి చేసేవాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు పీకలదాక మద్యం తాగి ఇంటికి చేరుకున్న గంగాధర్ భార్యతో గొడవపడ్డాడు. నిత్యం తనను వేధించుకుతింటున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని విజయలక్ష్మి నిర్ణయించుకుంది. రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తర్వాత విజయలక్ష్మి తల్లి నాగమ్మ, చిన్న కుమార్తె పక్క గదిలో పడుకోగా, భార్యాభర్తలు మరో గదిలో పడుకున్నారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం విజయలక్ష్మి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త కడుపులో చాకుతో నాలుగు పోట్లు బలంగా పొడిచింది. కడుపు బాగా చీరుకు పోవడంతో పేగులు బయటకు వచ్చి గంగాధర్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం వరకూ శవంతో పాటు ఇంట్లోనే ఉన్న నిందితురాలు విజయలక్ష్మి ఉదయం 6.15 గంటలకు నేరుగా నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గంగాధర్ మృతదేహాన్ని అతడి పెద్దకుమార్తెకు అప్పగించారు. విధిలేని పరిస్థితుల్లోనే హత్య: నిందితురాలు అనుమానంతో తనను భర్త నిత్యం వేధిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో హత్య చేశానని నిందితురాలు విజయలక్ష్మి తెలిపింది. మద్యానికి బానిసై వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేసేవాడని, దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో తాను ఓ కళాశాలలో ఆయాగా చేరానని చెప్పింది. అయితే, వివాహేతర సంబంధం పెట్టుకున్నానని భావించి నిత్యం మానసిక వేధింపులకు గురి చేసేవాడని, జీహెచ్ఎసీలో పని చేసి పదవీ విరమణ పొందిన తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బు కూడా తీసుకొని తాగేవాడని తెలిపింది. నన్ను చంపి జైలుకెళ్తానని ఒకసారి హెచ్చరించాడని, అంతేకాకుండా పెద్ద చాకు కొని తెచ్చి ఇంట్లో దాచాడని విజయలక్ష్మి చెప్పింది. ఎప్పటికైనా తనను చంపేస్తాడనే భయంతోనే శనివారం తెల్లవారుజామున తానే భర్తను పొడిచి చంపానని ఆమె పేర్కొంది. -
ఎంత పని చేశావు తల్లీ?
గుత్తి(అనంతపురం): వారిద్దరు. వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. చిన్ని కుటుంబం. చింతల్లేకుండా సాగిపోతోంది. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి మరో మహిళ దెయ్యంలా ప్రవేశించింది. వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ఆమె భర్తను తనవైపు తిప్పుకుని ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను అతను నిర్లక్ష్యం చేసేలా చేసింది. తమ వైవాహిక జీవితంలో ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ఆమె నాలుగేళ్ల కిందట ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత భర్తను మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఈ జీవితం వద్దనుకుందా ఇల్లాలు. తనతో పాటే తన ఇద్దరూ బిడ్డలనూ తీసుకెళ్లింది. గుత్తిలో మంగళవారం జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. దాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చున్నీలు వేసిన నేత్రావతి, వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరివేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతోందని అందులో పేర్కొన్నాడు. అందుకు తాను అంగీకరించకపోవడంతో ఇలా చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతో అమానుషం
బండరాయితో మోది భార్యను చంపిన భర్త నేరేడ్మెట్: అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించి భార్యను అతిదారుణంగా అంతం చేశాడో భర్త. నేరేడ్మెట్ డీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన బెజవాడ గణేష్, అదే జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి (34)లకు 2001లో పెళ్లైంది. వీరికి శిరీష (14), సందీప్ (12) సంతానం. జీవనోపాధి కోసం 2005లో నగరానికి వచ్చారు. ప్రగతినగర్‌లో నివాసముంటూ గణేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వరలక్ష్మికి కొన్ని రోజుల క్రితం కాకినాడకు చెందిన వెంకటేష్‌తో పరి చయం ఏర్పడింది. గత నవంబర్‌లో లక్ష్మి కాకినాడకు వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఈ నెల 20న తిరిగి ప్రగతినగర్‌లోని తన భర్త వద్దకు వచ్చింది. మంగళవారం అర్దరాత్రి తిరిగి కాకినాడ వెళ్తానని భర్తతో అనడం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్ భార్యను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి.. ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డుకు తలను బలంగా కొట్టాడు. అంతటితో ఆగకకుండా పక్కనే ఉన్న బండరాయితో వరలక్ష్మి తలపై మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!
శిక్ష మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 37 ఆ హత్యకి కారణం వైవాహిక జీవిత వ్యవస్థ పుట్టాక కొన్ని కోట్ల సార్లు జరిగిన హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం! తన భార్య లూసీకి, తన ఫ్రెండ్ లేన్సింగ్‌తో గల సంబంధం గురించి హెన్రీకి తెలిసి నమ్మలేకపో యాడు. కానీ తను నియమించిన డిటెక్టివ్ ఋజువు సంపాదించి తెచ్చి చూపించాక నిర్ఘాంతపోయాడు. లేన్సింగ్ని చంపాలని నిర్ణ యించుకున్నాడు. లూసీ కోసం చంపు తున్నాడు కాబట్టి ఆమె కళ్ల ముందే అతణ్ని చంపదలచుకున్నాడు. తనని పోలీసులకి పట్టిస్తే తనమీద కన్నా లేన్సింగ్ మీదే ఆమెకి అధిక ప్రేమ ఉన్నట్లు లేదా తనని గాఢంగా ప్రేమిస్తున్నట్లు అని భావిం చాడు. తగిన అవకాశం కోసం ఓపికగా వేచి ఉన్నాడు.ఆ శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన లేన్సింగ్‌తో కలిసి ఎప్పటిలా హెన్రీ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరూ పిట్ట గోడ దగ్గర నిలబడి ఉండగా హెన్రీ తన భార్యతో చెప్పాడు. ‘‘ఇటు చూడు లూసీ.’’ ఆమె తల తిప్పి చూడగానే లేన్సింగ్ రెండు కాళ్లూ పట్టుకుని ఎత్తి అతన్ని కింద పడేసాడు. ఏడో అంతస్థు నించి తలకిందు లుగా పడ్డ లేన్సింగ్ తల పగిలి పుర్రెలోని మెదడు కూడా బయటికి వచ్చేసింది. ఆడవాళ్లు ఎమోషనల్‌గా ప్రవర్తిస్తారు. ఆ ఎదురు చూడని దుర్ఘటనకి లూసీ సరిగ్గా అలాగే ప్రవర్తించింది. అయితే హెన్రీ పోలీసులు వచ్చేలోగా లూసీని తన అధీనంలోకి తీసుకోగలిగాడు. ‘‘లేన్సింగ్ తాగిన మత్తులో జారి కిందపడ్డాడని నేను పోలీసులతో చెప్తాను. నువ్వూ అదే చెప్పడం మంచిది. నువ్వు నిజం చెప్పినా అందుకు ఋజువు లేదు. ఋజువు లేని సాక్ష్యాన్ని కోర్టులో కొట్టే స్తారు. మనిద్దరి మీదా పత్రికల్లో అవా కులు, చెవాకులు రాస్తారు. వాటిలో ఒకటి లేన్సింగ్‌తో నీకు గల సంబంధం. ఆ ఋజువు కోర్టుకిస్తే, నాకు శిక్షపడే పక్షంలో నా ఆస్తిలోంచి నీకు పెన్నీ కూడా రాదు. కాబట్టి లేన్సింగ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడం నాకన్నా నీకే మంచిది. నేను అన్నిటికీ తెగించినవాణ్ని.’’ లూసీ పోలీసులు వచ్చేసరికి షాక్‌లోనే ఉంది. తన భర్త చెప్పిందే వారికి చెప్పింది. ఆమె మానసిక స్థితిని గమనించిన పోలీసులు కూడా లూసీని గుచ్చి గుచ్చి ప్రశ్నించలేదు. ‘‘లేన్సింగ్ డిప్రెస్డ్గా కనిపించాడు. ఒంటరిగా ఉండలేనని ఫోన్‌చేసి ఇంటికి వచ్చాడు. భోజనానికి మునుపు, తర్వాత చాలా తాగాడు. లాయర్‌గా లేన్సింగ్ ఆదాయం ఈ మధ్య బాగా తగ్గడం అందుకు కారణం’’ హెన్రీ పోలీసులకి చెప్పాడు. చివరగా లేన్సింగ్ టై పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాక అతని కదలికల్ని గురించి కూడా చెప్పాడు. వాళ్లకి ఆ దంపతులు అబద్ధం ఆడుతున్నా రన్న అనుమానం కలగలేదు. లేన్సింగ్ ఆదాయం తగ్గిందన్న సంగతి వారి విచారణలో నిర్ధారణయ్యాక ఆ కేసుని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా మూసేసారు. తనకి వచ్చిన కేన్సర్.. మూలాల నించి తొలగిపోయిందని తెలిసిన రోగిలా ఆనందించాడు హెన్రీ. ‘‘లూసీ! లేన్సింగ్ చేసిన ద్రోహానికి అతన్ని నేను చంపాను. నేనిక ఎన్నటికీ వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు’’ కొద్ది రోజుల తర్వాత హెన్రీ తన భార్యతో చెప్పాడు. ఆ హత్య జరిగాక మొదటిసారి లూసీ తన భర్త మొహం వంక కొద్దిసేపు దీర్ఘంగా చూసింది. ఆ మొహంలో పగ కాని, బాధ కాని, క్రోధం కాని, జాలి కాని... అసలెలాంటి భావాలు కనిపించలేదు. ‘‘ఏమిటా చూపు?’’ అడిగాడు. లూసీ జవాబు చెప్పలేదు. ఓ ప్రశ్న అడిగింది. ‘‘ఏం జరగనట్లే మానసిక క్షోభ లేకుండా జీవించగలరా? మీ ప్రియ మిత్రుడ్ని చంపాననే బాధ లేదా? మీరు శిక్షకి అర్హులని మీకు అనిపించడం లేదా?’’ ‘‘నా మీదకి దాడి చేసిన క్రూర మృగాన్ని చంపినట్లుగానే నీ ప్రియుడ్ని చంపాను. ఇది అతి పాత న్యాయం. కన్నుకి కన్ను. చేతికి చెయ్యి. శిక్ష దేనికి?’’ వారిద్దరి మధ్యా లేన్సింగ్ గురించి జరిగిన ఆఖరి సంభాషణ అది. హెన్రీ ఆమెకి ఇంకో ప్రియుడు లభించే అవకాశం కల్పించదలచుకోలేదు. తన భార్య పూర్తిగా తనకే దక్కాలనే స్వార్థంతో తన పన్నెండు మంది మగ మిత్రులకి దూరం అయ్యాడు. కాని ఆమె పెట్టెలో అడుగున వెదికి ఉంటే లూసీ లేన్సింగ్ని మర్చిపో లేకపోతోందని అతని ఫోటోని చూసి గ్రహించేవాడు. ఆఫీస్ పనిమీద హెన్రీ చికాగోకి కారులో బయదేరాడు. అకస్మాత్తుగా మంచు కురవసాగింది. కార్ రేడియోని ఆన్ చేస్తే మంచు తుఫాను అని తెలిసింది. ఇంకో అరగంటలో గమ్యానికి చేరతాడు కాబట్టి హెన్రీ కారుని మధ్యలో ఆపదలచు కోలేదు. కారుని జాగత్తగా, వేగం పరిమితి మించకుండా పోనివ్వసాగాడు. పొగ మంచు వల్ల రోడ్డు ఐదారు అడుగుల మేర దూరమే కనిపించసాగింది. పక్క రోడ్లోంచి వచ్చిన కలప లారీ డ్రైవర్‌కి హెన్రీ కారు కనపడలేదు. రెండు లైట్ల కాంతి హెన్రీ కంట్లో గుచ్చుకుంది. సరిగ్గా నాలుగైదు క్షణాల్లో అతని కారు ఆ పద హారు చక్రాల లారీ కిందికి వెళ్లిపోయింది. హెన్రీ మరణించలేదు. లూసీ హాస్పి టల్‌కి హెన్రీని చూడడానికి వచ్చినప్పుడు చెప్పింది. ‘‘డాక్టర్ ఇది అద్భుతం అని చెప్పాడు. మీ మొహానికి తప్ప శరీరంలోని ఇంకే భాగానికీ దెబ్బ తగల్లేదుట.’’ అతను ఆరు వారాలు హాస్పిటల్లోనే గడిపాడు. ఆరో వారం డాక్టర్ హెన్రీతో చెప్పాడు. ‘‘కట్లు విప్పాక తెలిసింది. మీ మొహం బాగా దెబ్బతింది. పిల్లలు చూస్తే జడుకునేలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. కాని అది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. మీరు వ్యక్తిగతంగా బిల్ చెల్లిస్తే ప్లాస్టిక్ సర్జన్ వచ్చి మిమ్మల్ని చూస్తాడు.’’ కట్లు విప్పిన అతని మొహాన్ని చూడ గానే లూసీ మొహం వివర్ణమైంది. ‘‘అంత భయంకరంగా ఉందా?’’ అడిగాడు. ‘‘అవును. మన ఇల్లు అమ్మయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి.’’ ‘‘ఇది నువ్వు కోరిన శిక్ష అనుకుంటు న్నావా? కాదు’’ చెప్పాడు. ఎనిమిది వారాల తర్వాత కట్లు విప్పారు. భర్తకి అద్దం ఇచ్చి చెప్పింది లూసీ... ‘‘చూసుకోండి.’’ అద్దంలోకి చూసిన హెన్రీ కెవ్వున అరిచాడు. ఎదురుగా లేన్సింగ్ ప్రతిబింబం కనిపించింది. ‘‘ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్‌కి ముందు మీ ఫోటో అడిగితే లేన్సింగ్ ఫోటోని ఇచ్చాను. ఇది మీ నేరానికి తగిన శిక్ష’’ లూసీ నెమ్మదిగా చెప్పింది. (మిరియం లించ్ కథకి స్వేచ్ఛానువాదం) -
అనుమానం పెనుభూతం
ప్రియురాలిపై కొడవలితో దాడి పరారీలో నిందితుడు కలకడ: అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మహిళపై ప్రియుడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా సంబేపల్లె మండలం నగిరి గ్రామానికి చెందిన బత్తల రెడ్డెమ్మ(40) తన ప్రియుడు రెడ్డిశేఖర్(రంగ)తో కలిసి కలకడ మండలం కె.బాటవారిపల్లెలో మూడు నెలలుగా నివాసం ఉంటోంది. మరొకరితో రెడ్డెమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం వచ్చిన రెడ్డిశేఖర్ పథకం ప్రకారం హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమె మెడపై నరకడానికి ప్రయత్నం చేశాడు. అతనితో పోరాడిన ఆమె తప్పించుకున్నప్పటికీ ఎడమ భుజంపై తీవ్ర గాయమైంది. తిరిగి తలపై నరకడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది. మరణించిందని భావించి రెడ్డి శేఖర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ రెడ్డెమ్మను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రితో కలిసి తల్లిని చంపిన తనయుడు
సహకరించిన కానిస్టేబుల్ వివాహేతర సంబంధమే మహిళ హత్యకు కారణం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు ముగ్గురి అరెస్ట్ నల్లబెల్లి : మండలంలోని గుండ్లపాహాడ్ శివా రు బజ్జుతండాలో ఈ నెల 16న జరిగిన వివాహిత హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమె కుమారుడు తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ నల్లబెల్లి ఎస్సై ఎస్కె హమీద్‌తో కలిసి కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. గీసుగొండ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కొర్ర సోమ్లి, బాలాజీ దంపతుల చిన్న కుమార్తె విజయ(36)కు నల్లబెల్లి మండలం గుండ్లపాహాడ్ శివారు బజ్జుతండాకు చెందిన బాదవత్ వీరన్నతో 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 15 ఏళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు కొంతకాలంగా తల్లిపై అనుమానం పెంచుకున్నాడు. ఆ బాలుడు తండ్రి వీరన్న, కొత్తగూడలో పోలీస్ కానీస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దన్నాన్న స్వామినాయక్‌తో చర్చించాడు. ఈ క్రమంలో స్వామినాయక్ సహకారంతో బాలుడు తండ్రి వీరన్నతో కలిసి తల్లిని చిత్రహింసలకు గురిచేసి హతమార్చి మృతదేహాన్ని ఇంట్లో ఫ్యాన్ కర్రకు ఉరివేశారు. తెల్లావారుజామున విజయ మృతిచెందిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నా భార్య మోసం చేసింది
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం సెల్ఫ్ వీడియోలో ‘మరణ వాంగ్మూలం’ రికార్డు గాంధీ ఆస్పత్రి : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని, తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి దారితీసిన పరిస్థితుల్ని తన సెల్ఫోన్లో సెల్ఫ్ వీడియో ద్వారా చిత్రీకరించాడు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డి.నాగేశ్వరరావు(28) కరాటే మాస్టర్. బామవరిది చెల్లెలైన బాపట్లకు చెందిన వరలక్షి్ష్మని ప్రేమించి గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు. వరలక్షి్ష్మ హైదరాబాద్ చంచల్‌గూడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. బన్సీలాల్‌పేటలో వీరి నివాసం. తెనాలిలోనే ఉంటున్న నాగేశ్వరరావు వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి వెళతాడు. కొద్దిరోజులగా వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు గమనించిన నాగేశ్వరరావు... ఆమె ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా చూసి మందలించాడు. ఆమెలో మార్పు లేకపోవడంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లగా వారు కౌన్సెలింగ్ చేశారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నాగేశ్వరరావు మంగళవారం బన్సీలాల్‌పేటలోని ఇంట్లో పురుగుల మందు తాగి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న నాగేశ్వరరావును గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య తనను మోసం చేసి పదిమందిలో పరువు తీసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమకు నాగేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడని అతడి తల్లి పాపమ్మ, సోదరి ఆదిలక్షి్ష్మ ఆస్పత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అదే విషయాన్ని తన వీడియోలో బందించాడు బాధితుడు. నాగేశ్వరరావు తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, తనను వెంటపడి పెళ్లి చేసుకున్న నాగేశ్వరరావు అనుమానంతో నిత్యం వేధించేవాడని వరలక్ష్మి చెప్పారు. -
ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది
కైకలూరు: ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో కైకలూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కైకలూరు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. కైకలూరు మండలం వరాహపట్నంకు చెందిన లక్ష్మినరసింహస్వామికి విజయలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం సూరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో దంపతుల మధ్య గొడవలు ఏర్పడి వారు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆమె సూరితో సహజీవనం చేస్తోంది. ఎలాగైనా భర్తను మట్టుబెట్టాలని పథకం పన్నిన విజయలక్ష్మి ప్రియుడు సూరి, మరో వ్యక్తి శ్రీనివాస్‌తో కలిసి లక్ష్మినరసింహస్వామిని వారం రోజుల క్రితం హతమార్చి చేపల చెరువులో పడేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
తల్లిబిడ్డల హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుడి అరెస్టు రేపల్లె: నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో సెప్టెంబర్ 25తేదీన జరిగిన తల్లిబిడ్డల హత్యకేసులో మిస్టరీ వీడింది. హత్య చేసింది కట్టుకున్న వాడేనని పోలీసులు నిర్ధారించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ పెంచలరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో ఉప్పాల శివరామకృష్ణ అలియాస్ వెంకట కృష్ణ భార్య తిరుపతమ్మ కాపురం ఉంటున్నారు. గత కొంత కాలంగా తిరుపతమ్మ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం పెనుభూతంగా మారింది. శివరామకృష్ణ ప్రతి రోజు తెనాలిలో తాపీపని చేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా సెప్టెంబర్ 25వతేదీ రాత్రి ఇంటికి వచ్చిన శివరామకృష్ణకు ఆయన భార్య తిరుపతమ్మకు మధ్య వివాహేతర సంబంధంపై వివాదం తలెత్తింది. ఈక్రమంలో భార్య తిరుపతమ్మపై కత్తితో దాడిచేయగా అడ్డం వచ్చిన కుమార్తె నాగశ్రీ, కుమారుడు యశ్వంత్లకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. గమనించిన శివరామకృష్ణ కుమార్తె మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న తాడిదిబ్బలో పాతిపెట్టి కుమారుని శవాన్ని పక్కనే ఉన్న కాల్వలో పడవేసి పరాయ్యాడు. కేసును అన్ని కోణాలలో విచారించటం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణ శుక్రవారం ఉదయం ఏలేటిపాలెం వీఆర్వో కర్రా రవి వద్ద లొంగిపోయి విషయాన్ని చెప్పి తమ వద్ద లొంగిపోయినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని గ్రామస్థుల సమక్షంలో కాల్వలో నుంచి తమకు స్వాధీనం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. -
బ్యూటీషియన్ హత్య
వివాహేతర సంబంధం కొనసాగించేందుకు విముఖత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడి యత్నం గుంటూరు రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి అడవితక్కెళ్ళపాడు గ్రామంలోని రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించడం గమనార్హం! ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు పోలీసుస్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. తెనాలికి చెందిన జయలక్ష్మి(32)కి నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన పసుపులేటి శ్రీనివాసరావుతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీనివాసరావు లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో జయలక్ష్మి నేతాజీనగర్‌లోనే అత్తమామల వద్దే ఉండేది. ఆమె మూడేళ్ల క్రితం బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఇళ్ల వద్దకు వెళుతూ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లోని బ్యూటీపార్లర్లలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో నేతాజినగర్‌కు చెందిన కారుడ్రైవర్ రవీంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రవీంద్ర, జయలక్ష్మిలు అడవితక్కెళ్ళపాడులోని రాజీవ్‌గృహకల్పలో ఏడాది క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీలున్నప్పుడల్లా అక్కడ గడిపివస్తున్నారు. ఈ విషయం జయలక్ష్మి బంధువులకు తెలిసి ఆమెను హెచ్చరించడంతో ఆమె వెనక్కుతగ్గింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రవీంద్ర జయలక్ష్మికి ఫోన్ చేసి రాజీవ్‌గృహకల్పకు రమ్మని కోరాడు. లారీ డ్రైవర్ అయిన ఆమె భర్త శ్రీనివాసరావు డ్యూటీ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లడంతో ఆమె రాజీవ్‌గృహకల్పకు వెళ్లింది. శుక్రవారం అక్కడే రవీంద్రతో గడిపి శనివారం జయలక్ష్మి ఇంటికి వచ్చింది. మళ్లీ రాజీవ్‌గృహకల్పకు ఆమె వెళ్లి రాత్రికి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించే విషయమై వారి మధ్య అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర జయలక్ష్మి చున్నీతో ఆమె మెడకు బిగపట్టి హతమార్చాడు. అనంతరం ఇంటిలోని స్టాండ్ ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జయలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడ పరిస్థితులు వీలుగా లేకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించగా విషయం బయట పడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. -
కన్నతండ్రే కాలయముడు
అనుమానంతో కుమార్తెపై తండ్రి కత్తితో దాడి హాస్పటల్‌కు తరలిస్తుండగా మృతి ఉత్తరచిరువోలులంక (మోపిదేవి) : వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తండ్రే కాలయముడయ్యాడు. కన్నకుమార్తెపై కత్తితో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మోపిదేవి మండలం ఉత్తరచిరువోలులంకకు చెందిన నడకుదుటి మాధవి (35)పై తండ్రి చింతా వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం కత్తితో దాడిచేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను చూసి తండ్రి కూడా సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు హాస్పటల్‌కు తరలించారు. 108లో మాధవిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరిలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. సమాచారం అందుకున్న అవనిగడ్డ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకట్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మనమరాలి వివాహం ఆగిపోవడానికి కుమార్తె కారణమని.. మృతురాలి మాధవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెండ్లి సంబంధం రాగా మాధవి ప్రవర్తన వల్లే చెడిపోయిందని, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని తండ్రి వెంకటేశ్వరరావు హెచ్చరించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం మృతురాలి ఇంటివద్ద వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో మాధవి గొడవపడుతుండగా తండ్రి కల్పించుకోవడంతో తోపులాట జరిగిందని, ఆవేశంతో తం డ్రి కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడని సమాచారం. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి పరారైనట్లు తెలిసింది. పుట్టింటి వద్దే ఉంటూ.. మాధవిని తొలుత గ్రామంలో బంధువుకే ఇచ్చి వివాహం చేయగా కొద్దికాలంలోనే అతనికి విడాకులు ఇచ్చి పుట్టింటికి వచ్చేసింది. అనంతరం ఆమె కోరుకున్న వ్యకి ్తతో స్థానిక పెద్దలు రెండో వివాహం చేశారు. అతనితో ఇద్దరు ఆడపిల్లలను కన్న తరువాత గొడవలు పడి పుట్టింటి వద్దనే ఉంటూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తోంది. మాధవి మృతి చెందగా ఆమె కుమార్తెలు ఇద్దరూ తల్లిదండ్రులకు దూరం అయి అనాధలుగా మిగిలిపోయారని గ్రామస్తులు విచారం వ్యక్తంచేస్తున్నారు. -
జంట హత్యలు
దాచేపల్లి: వివాహేతర సంబంధం నేపథ్యంలో దాచేపల్లి మండలంలో ఆదివారం జంట హత్యలు జరిగాయి. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఆమెను, ఆమె ప్రియుడిని భర్త కత్తితో నరికి చంపడం సంచలనం కలిగించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన అక్కినపల్లి హనుమయ్యకు రెంటచింతల గ్రామానికి చెందిన దివ్య(23)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే వీరికి కుమారుడు మణికంఠ ఉన్నాడు. తన ఇంటి ఎదురుగా ఉన్న వీధిలో నివసించే చెన్నబోయిన నాగేశ్వరరావు(32)తో దివ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని హనుమయ్య అనుమానించాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో భార్యభర్తలకు పంచాయితీ కూడా జరిగింది. దివ్యపై హనుమయ్యకు రోజురోజుకూ అనుమానం బలపడటంతో నాగేశ్వరరావును హతమార్చేందుకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో గామాలపాడు పంచాయతీ పరిధిలోని సిక్కులదాబాలో నాగేశ్వరరావు ఉన్నట్లు హనుమయ్య సమాచారం తెలుసుకున్నాడు. కారంపూడి మండలం పేటసన్నెగళ్ల గ్రామానికి చెందిన సమీప బంధువు నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్రవాహనంపై సిక్కులదాబా వద్దకు వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గొంతు, మెడ వద్ద కత్తితో కోయటంతో తీవ్ర రక్తస్రావం అయి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి వద్ద భార్యను.. నాగేశ్వరరావు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని పరిశీలిస్తున్న క్రమంలో దివ్య సెల్‌ఫోన్ నుంచి కాల్వచ్చినట్లు హనుమయ్య గుర్తించాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న హనుమయ్య ద్విచక్రవాహనంపై నడికుడికి వచ్చి ఇంట్లో ఉన్న దివ్యపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కుమారుడు మణికంఠను తన సమీప బంధువు నాగేశ్వరరావుకు ఇచ్చి పేటసన్నెగళ్లలోని తన బం ధువుల ఇంటికి పంపాడు. అనంతరం హనుమ య్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య, ఆమె ప్రి యుడిని హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. జంట హత్యల సమాచారం అందుకున్న గురజా ల సీఐ ఆళహరి శ్రీనివాసరావు వెంటనే దాబా లో, నడికుడిలో ఉన్న నాగేశ్వరరావు, దివ్య మృతదేహాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హత్యలకు సహకరించిన పేటసన్నెగళ్లకు చెందిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లక్ష్మి ఉంది. -
అతడు.. ఆమె హత్యలు
ప్రాణం తీస్తున్న వివాహేతర సంబంధాలు ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి విజయవాడ : గతంలో ప్రత్యర్థి హత్యలకు పేరొందిన కమిషనరేట్ ప్రస్తుతం వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగే హత్యలకు వేదికగా మారుతోంది. కొన్ని నెలలుగా జరిగిన హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే వివాహేతర సంబంధాలు ఏ మేరకు దుష్పరిణామాలు పెంచుతున్నాయో స్పష్టమవుతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికను పరిశీలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత కక్షల కారణంగా జరుగుతున్న హత్యలు ఏయేటికాయేడు పెరుగుతున్నట్టు వెల్లడవుతోంది. ఆర్థిక స్థితిగతులు, జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. తాహతుకు మించిన కోర్కెలతో దారి తప్పుతున్న జీవితాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్యాణి అనే మహిళ కారణంగా చనిపోయారు. వీరిలో ఇద్దరిని ఆమే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మరో యువకుడితో కలిసి పరారై కేరళలో ఆత్మహత్యకు పాల్పడింది. తనతోసహా కుమారుడు, భర్త, మరో ఇద్దరి ప్రాణాలు పోయేందుకు ఆమె వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. గన్నవరానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రి నర్సురాణి పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మొదటి వ్యక్తిని వదిలించుకునేందుకు కొత్త ప్రియుడితో కలిసి ఆమె పథకం రచించగా కుట్ర వికటించి ఆమె ప్రాణాలనే బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలను వదిలేసి మరో వివాహితతో నగరానికి వచ్చాడు. నున్న పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేందుకు అడ్డుగా ఉందని ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలో వివాహం విషయమై నెలకొన్న విభేదాలకు ఓ ఐటీ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణలంకలో మరో మహిళ తన ప్రియుడిని చంపేసి కాల్వలో పడేసేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. ఇలా అనేక కేసుల్లో హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలు కారణమని వెల్లడవుతోంది. ఆర్థిక స్థితిగతులు ఉన్నంతలో సరిపెట్టుకోలేని తత్వమే వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాస్తవిక ఆలోచనలకు దూరంగా వచ్చే ఆదాయానికి మించి జీవితం గడపాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. జీవన శైలిలో వచ్చిన మార్పులకు సరిపడా ఆదాయం లేక పరాయి వ్యక్తులపట్ల ఆకర్షితులవుతున్నారు. ఇంతకంటే మరో మెరుగైన అవకాశం రావడంతో స్పర్థలకు దారితీసి హత్యలకు పురిగొలుపుతోంది. మరికొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ కట్టుబాట్లపై తగిన అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనేది పోలీసు అధికారుల అభిప్రాయం. -
భర్తను నరికి.. శవాన్ని మూటగట్టి..
శివ్వంపేట: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో భర్తను నరికి చంపిందో భార్య. శవాన్ని మూటకట్టి ఆటోలో తరలించేందుకు యత్నిస్తూ పట్టుబడింది. మెద క్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ఎర్రోల్ల చెంద్రయ్య (50) రైతు. ఆయన భార్య రేణుక.. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక.. సోమవారం గొడ్డలితో చంద్రయ్య తలపై మోది హతమార్చింది. శవాన్ని సంచిలో మూటకట్టి ప్రియుడి సాయంతో ఆటోలో తరలించేందుకు పథకం వేసింది. బియ్యం తీసుకెళ్లాలంటూ ఆటోను అద్దెకు మాట్లాడింది. ఆటోలో బియ్యం సంచులతోపాటు మృతదేహం ఉన్న సంచిని వేస్తుండగా అందులో నుంచి రక్తం కారసాగింది. గమనించి ఆటోడ్రైవర్.. గ్రామస్తులకు తెలిపాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు అనుమానంతో మూటవిప్పి చూడగా చంద్రయ్య మృతదేహం బయటపడింది. ఈ సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్సై రాజేష్‌నాయక్ రేణుకను పోలీస్టేషన్‌కు తరలించారు. ఆమె ప్రియుడు పరారయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న వివాహేతర సంబంధం
వీడిన జూపాక హత్య కేసు మిస్టరీ భార్య, అత్తమామల పథకం ప్రకారమే హత్య హుజూరాబాద్‌టౌన్ : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హుజురాబాద్ మండలం జూపాక గ్రామ శివారులో గత నెల 20న గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి బండరాళ్లు కట్టి వ్యవసాయ బావిలో పడవేసిన హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించా రు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే భర్తను ఓ భార్య తనతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని హత్యచేశారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ సిహెచ్.శ్రీనివాస్, ఎస్సైలు బొల్లం రమే ష్, రాజేందర్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు. మృతుడు వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన సాంబశివరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడికి వరంగల్ జిల్లా మొగుళ్ళపెల్లి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన లకిడె రమ అలియాస్ కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగిం ది. వీరికి ఇద్దరు కూతుళ్ళు జన్మించారు. రమకు బంధువైన కమలాపూర్ మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన భాసిడి ఓంకార్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు సాంబశివరావు గుర్తించాడు. తన భర్త అడ్డును తొలిగించాలనుకొని ఓంకార్‌కు రూ.50 వేలిచ్చి హతమార్చాలని చెప్పింది. దీనికి రమ తల్లిదండ్రులు లింగంపల్లి రాములు, కమలాభాయిల సహకారం ఉంది.ఈక్రమంలో ఓంకార్ సాంబశివరావును హత్య చేసేందుకు నేరేళ్ల గ్రామానికి చెందిన పైడి, దేవేందర్, కుమారస్వామి, స్వామిలతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేశారు. హత్యచే యాలని పథకం పన్నిన రమా, తల్లి దండ్రులు పరారీలో ఉన్నారు. ప్రాధాన నిందితుడైన ఓంకార్‌తో పాటు నలుగును నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారీలోఉన్న నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
తండ్రిని కడతేర్చిన నర్సు
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాన్ని ఖండించినందుకు ఆగ్రహం చెందిన నర్సు ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చింది. ఈ సంఘటన సేలం సమీపంలో చోటుచేసుకుంది. సేలం సమీపం వీరాణం, సుక్కంపట్టికి చెందిన తొప్ప గౌండర్ (67). అక్కడున్న పాఠశాలలో సెక్యూరిటీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇతని భార్య ధనం. వీరికి శశికళ (37) అనే కుమార్తె, సదాశివం అనే కుమారుడు ఉన్నాడు. శశికళ సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నది. ఈమె భర్త భగత్‌సింగ్ పల్లడం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉన్నాడు. వీరికి జనని (8) అనే కుమార్తె ఉంది. శశికళ తండ్రి వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నలుగురి వ్యక్తులు తొప్ప గౌండర్ ఇంటికి వచ్చి అతనిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న వీరాణం ఇన్స్పెక్టర్ శరవణన్, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో శశికళకు, సేలం ఆసుపత్రిలో పని చేస్తున్న రాజా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని ఈ సంగతి తెలుసుకున్న తోపు గౌండర్ కుమార్తెను మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన శశికళ తన ప్రియుడితో కలసి తండ్రిని కడతేర్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో నర్సు శశికళ సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
అడ్డుగా ఉన్నాడని హతమార్చారు
ప్రియునితో కలిసి భర్తను చంపిన వైనం మర్రివలసలో దారుణం ప్లాస్టిక్ వైర్లతో ఉరి సహజమరణంగా నమ్మించేందుకు యత్నం నిలదీసిన గ్రామస్తులు నేరం అంగీకరించిన మృతుని భార్య పరారీలో ప్రియుడు కె.కోటపాడు : వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ప్రియునితో కలిసి ఉరివేసి హతమార్చిన సంఘటన మర్రివలస గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలావున్నాయి. మర్రివలస గ్రామానికి చెందిన సీముసురు కొండమ్మ (42), సీముసురు కోనారితో 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కొండమ్మ భర్త సీముసురు బంగారయ్య (52) ఇంటివద్ద భోజనం చేసి రోజూమాదిరిగానే గ్రామ శివారులోని పాకవద్దకు వెళ్లి పడుకున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భార్య కొండమ్మ, కోనారి కలిసి మంచంపై పడుకున్న బంగారయ్యను ప్లాస్టిక్ వైర్లతో గొంతునులిమి హతమార్చారు. అనంతరం వారు అక్కడినుంచి జారుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో కుమారుడు పైడిరాజు, కోడలు కృష్ణవేణి వద్దకు వెళ్లి తండ్రి బంగారయ్య పాకవద్ద చనిపోయి ఉన్నాడని కొండమ్మ చెప్పింది. దీంతో వారు పాకవద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బంగారయ్య మెడచుట్టూ ఉరితీసిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానించిన వారు పరిసరాలను పరిశీలించారు. మంచంపక్కనే ప్లాస్టిక్ వైర్లు ఉండటంతో హత్యకు గురైనట్టు అనుమానించిన గ్రామస్తులు కొండమ్మను నిలదీశారు. భర్త బంగారయ్యను తాను చంపుకున్నానని ఆమె బదులివ్వడంతో సర్పంచ్ ఎ. కోడూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, ఎ.కోడూరు ఎస్ఐ అల్లు స్వామినాయుడు కొండమ్మను విచారించారు. భర్తను ప్లాస్టిక్ వైరుతో మెడకు ఉరివేసి తాను, కోనారి కలసి హతమార్చామని ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. కొండమ్మను అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న కోనారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ హత్యాయత్నం! వివాహేతర సంబంధంపై నిలదీస్తున్న భర్తను హతమార్చేందుకు గతంలోను ప్రయత్నించిందని గ్రామస్తులు తెలిపారు. అప్పటిలో స్థానికులు మందలించడంతో వి రమించిందని వారు పేర్కొన్నారు. కొండమ్మ, కోనారి వివాహేతర సంబంధంపై బంగారయ్య తరచూ నిలదీ యడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. నెలరోజులపాటు వేరే గ్రామం లో ఉన్న కొండమ్మ ఇటీవల గ్రామానికి వచ్చిందని, కూలిసొమ్ముకోసం భర్తతో ఘర్షణ పడిందని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో బంగారయ్యను అడ్డుతొలగించేందుకు కొండమ్మ, కోనారి పథకం ప్రకారం హత్యచేశారని పోలీసులు తెలిపారు. మృతుడు బంగారయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
భర్త కిరాతకం
♦ భార్య, బిడ్డ, వృద్ధురాలిపై పెట్రోలు పోసి హత్యాయత్నం ♦ చికిత్సపొందుతూ భార్య, బిడ్డ మృతి ♦ చికిత్స పొందుతున్న వృద్ధురాలు విజయవాడ : జీవితాంతం తోడూనీడగా ఉంటానని అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. భార్యతోపాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డను సైతం మట్టు పెట్టాలని చూశాడు. పర స్త్రీ వ్యామోహంలో ఓ మృగాడు భార్య, నెలలు కూడా నిండని బిడ్డతో పాటు భార్య అమ్మమ్మను కూడా మట్టుపెట్టేందుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య, బిడ్డ మృతిచెందారు. వృద్ధురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన చిట్టినగర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ ఈద్గామహల్ కొండ ప్రాంతంలో కొరికాని వెంకటమ్మ (60) మనవరాలైన రోజాను సుమారు 18 నెలల కిందట మంగళగిరి సమీపంలోని ఎర్రుబాలెంకు చెందిన ఆకుల రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 2 లక్షల కట్నం, లాంఛనాలతో పాటు కొండపై ఇంటిని ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే రాజేంద్రకు పెళ్లికి ముందు నుంచే వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు రోజాకు తెలిసింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వివాహం జరిగిన కొన్ని నెలలకే రోజాకు వేధింపులు ఎక్కువ కావడంతో పాటు విడాకులు ఇవ్వాలని అత్తింటి వారు పట్టుబట్టారు. గర్భవతి అయిన రోజా ఇక అత్త గారి ఇంట్లో ఉండలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చేసింది. మగ బిడ్డ పుట్టిన తర్వాత కూడా భర్తలో మార్పు రాకపోవడంతో అమ్మమ్మ వద్దే ఉంటోంది. కాపురానికి రావాలని రాజేంద్ర భార్యను అడిగే వాడు. ప్రవర్తన మార్పువస్తే గాని కాపురానికి రానని ఆమె తేల్చి చెప్పింది. ఈ క్రమంలో శనివారం ఉదయం భార్య వద్దకు వచ్చిన రాజేంద్ర ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం తన బైక్ వద్దకు వెళ్లి బైక్‌లో నుంచి పెట్రోల్‌ను క్యాన్‌లోకి పట్టి మళ్లీ ఇంటివద్దకు వచ్చాడు. ఇంటి వరండాలో ఉన్న వెంకటమ్మపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. వెంకటమ్మ కేకలు వేస్తూ వరండాలో నుంచి పరుగులు తీసింది. ఇంటి లోపల ఉన్న రోజాతో పాటు 8 నెలల చిన్నారి విద్యాసాగర్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు. భ యంతో కేకలు వేస్తూ రోజా తన బిడ్డను బొంతలో చుట్టి మేడపై నుంచి కిందికి విసిరేసింది. చుట్టు పక్కల వారు రోజా ఇంటి వద్దకు చేరుకునే సరికి దట్టమైన పొగలు వ్యాపించాయి. కొంతమంది పైకి వెళ్లి మంటలను అదుపు చేస్తుండగా, మరి కొందరు బిడ్డను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోజాతో పాటు అమ్మమ్మ వెంకటమ్మను ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. రోజాకు 60 శాతానికి పైగా కాలి న గాయాలయ్యాయి. 8 నెలల విద్యాసాగర్‌కు 70 శాతానికి పైగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ భార్య, బిడ్డ మృతిచెందారు. వృద్ధురాలు మృత్యువు తో పోరాడుతోంది. ఈ ఘటనపై బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కొత్తపేట పోలీ సులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని....
కిరాతకం.. వివాహేతర సంబంధాన్ని నిలదీసిందన్న అక్కసుతో.. భార్య, కుమారుడిని హతమార్చిన కర్కోటకుడు పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వైనం అనాథగా మారిన మూడు నెలల చిన్నారి కోలారు : వివాహేతర సంబంధం వద్దన్న భార్యను కిరాతకంగా నరికి వేశాడు ఓ కర్కోటకుడు. అంతటితో ఆగకుండా ఘటనను కళ్లార చూసిన కన్న కుమారుడిని సైతం అదే కొడవలికి బలి చేశాడు. శ్రీనివాసపుర పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా... శ్రీనివాసపురం తాలూకాలోని మీనగానహళ్లికి చెందిన గంగాధర్(35)కు ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన శాంతమ్మ(29)తో వివాహమైంది. వీరికి గజేంద్ర(3) కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన శాంతమ్మ తొమ్మిది నెలల పసిగుడ్డుతో పదిరోజుల క్రితం భర్త వద్దకు చేరుకుంది. తాను కాన్పు కోసం వెళ్లిన సమయంలో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన శాంతమ్మ, అలాంటి వ్యవహారాలను వద్దని భర్తకు నచ్చచెప్పింది. అయినా ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. నిత్యం మరో మహిళతో గడిపి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. దీంతో సహనం కోల్పోయిన శాంతమ్మ మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న భర్తను నిలదీసింది. వివాహేతర సంబంధం మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తోందన్న అక్కసుతో కొడవలి తీసుకుని భార్యను నరికి వేశాడు. తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండగా మేల్కొన్న గజేంద్ర, ఘటనను చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. కొడుకును ఊరడించాల్సిన చేతులు కొడవలిని ఝుళిపించాయి. గొంతు తెగడంతో చిన్నారి ఏడుపు ఆగిపోయింది. రక్తపు మడుగులో తల్లీకొడుకులు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. ఘటనకు సంబంధించి పోలీసులు... కేసులు కళ్లముందు కదలాడడంతో ఇంటి బయట ఉన్న చింత చెట్టుకు గంగాధర్ ఉరి వేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనాథగా మిగిలిన చిన్నారిని ఇరుగుపోరుగు వారు ఆదుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు -
హోలీ వేడుకల్లో ఒకరి హత్య
వివాహేతర సంబంధమే కారణం ఇద్దరిపై కేసు నమోదు భీమారం : హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తన రక్తసంబంధీకురాలితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడనే నెపంతో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసిన సం ఘటన నగంరలోని భీమారంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కరీం నగర్ జిల్లా కేశవపూర్‌కు చెందిన ఎ. రవికుమార్(43)కు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం రవికుమార్ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు 20 ఏళ్ల క్రితం హసన్‌పర్తిలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా స్థా నిక మహిళతో రవి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాన్ని భీమారానికి మా ర్చాడు.ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకు భీమారంలో అతడు హోలీ సంబరాల్లో ఉండగా అక్కడికి హసన్పర్తికి చెం దిన ప్రసాద్ వెళ్లాడు. అతడితోపాటు భీమారానికి చెందిన జితేందర్ జతయ్యాడు. ఈ సందర్భంగా రవికుమార్ తన రక్తసంబధీకురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడనే కోపంతో ప్రసాద్ అతడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అతడి దాడిలో రవికుమార్ కుప్పకూలాడు. దీంతో భయపడిన ప్రసాద్ తన స్నేహితుడు అనిల్ సహకారంతో ద్విచక్ర వాహనంపై రవికుమార్‌ను వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికీ తీసుకెళ్లాడు. అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి వైద్యు లు నిరాకరించారు.దీంతోఎంజీఎంఆస్పత్రికితీసుకెళ్లారు అప్పటికే భయంతో ప్రసాద్ ఆస్పత్రి బయటే ఉండగా, రవి కుమార్‌ను అనిల్ స్ట్రెచర్‌పై క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేయగా వైద్యులు అతడిని గమనించి వివరాలు అడిగారు. జరిగిన సంఘటనను అనిల్ వైద్యులకు చెప్పాడు. వారు రవికుమార్‌ను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. పోలీసులకు అప్పగింత కాగా అనిల్‌ను ఔట్‌పోస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేయూసీ పోలీసులకు సమాచారంఇచ్చారు.విషయం తెలుసుకున్న కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి మార్చురీకి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. వివాహేతర సంబంధం కారణంతోనే హత్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రసాద్, జితేం దర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనిల్ కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, రవికుమార్‌ను ఆస్పత్రికి తరలించడానికి మాత్ర మే సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నప్రసాద్ హ న్మకొండ మార్కెట్లో కూరగాయాల వ్యాపారం చేస్తుండగా, మరో నిందితుడు జితేందర్ సైతం భీమారంలో కూరగాయలు అమ్ముతున్నాడు. -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే....
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘నన్ను క్షమించు ప్రియా... నేనేమీ చేయలేను. చేయగలిగివుంటే ఈపాటికే చేసేవాడిని. కానీ ఇక నావల్ల కాదు. దయచేసి నన్ను క్షమించు.’’ గుండెల్లో ఎవరో గునపాలను దింపుతున్నట్టుగా ఉంది. నిప్పు కణికలను పేర్చి నరనరాలనూ కాలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏదో బాధ. ఎలా అణచుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని భయంకరమైన బాధ! ఏం మాట్లాడాలో తెలియక, ఎలా స్పందించాలో అర్థం కాక సోఫాలో కూలబడ్డాను. నా కళ్లముందే తను బయటకు నడచుకుంటూ వెళుతున్నా ఆపలేకపోయాను. కనురెప్పల్ని దాటి పరుగులు తీస్తోన్న కన్నీళ్లను వాటి మానాన వాటిని వదిలేశాను. వాటితోపాటే నా బాధ కూడా బయటకు పోతుందేమోనని ఆశపడ్డాను. కానీ అది తీరని ఆశ అని నాకు తర్వాత అర్థమయ్యింది. ఎంత ఏడ్చినా నా వేదన కాస్తయినా తగ్గలేదు. దాన్ని గుండె గడప దాటించి పంపించెయ్యాలని నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఇక మీదట ఆ మౌనమే నా నేస్తమవుతుందని ఆ క్షణం నేను ఊహించలేకపోయాను. సంగీత్ మళ్లీ రాలేదు. వస్తాడని కూడా నేను అనుకోలేదు. కానీ ఎక్కడో చిన్న ఆశ మిణుకుమిణుకు మనేది. కాలింగ్‌బెల్ మోగిన ప్రతిసారీ తలుపు అవతల అతడే ఉన్నాడేమో అనిపించేది. ఇంట్లో ఏమూల చిన్న సవ్వడి అయినా, నాకు తెలియకుండా వచ్చి ఎక్కడైనా దాగాడేమో అన్న చిలిపి ఊహ అంత బాధలోనూ తొంగిచూసేది. కానీ నా ఆశలు నిజమయ్యేవి కావు. నా ఊహలకు వాస్తవంగా మారే శక్తి లేదు. అందుకే నేను మళ్లీ సంగీత్ని చూడలేదు. నేటి వరకూ అతని జాడ నాకు తెలిసిందీ లేదు. సంగీత్ని నేను ప్రేమించాను. ఎంతగా ప్రేమించానంటే... అతను తప్ప నాకు వేరే ప్రపంచమే లేద నేంత. అతడు ఉంటేనే నాకు జీవితం ఉంది అను కునేంత. తొలిసారి నేను ఆఫీసులో అడుగు పెట్టి నప్పుడు, అప్పటికే అక్కడ పనిచేస్తోన్న సంగీత్ నన్ను పలకరించాడు. నన్ను పరిచయం చేసు కున్నాడు. అందరికీ నన్ను పరిచయం చేశాడు. అతడి మాట, నవ్వు, మర్యాద, నడవడిక... వంక పెట్టడానికి వీల్లేని వ్యక్తి. మగాళ్ల అందానికి మెజర్ మెంట్లా ఉన్నాడనిపించింది. మనసు నాకు తెలియకుండానే అతని వశమవుతూ వచ్చింది. నా కనులు అతని కోసం వెతికేవి. పెదవులు అతనితో ఊసులాడాలని తహతహలాడేవి. కానీ ఆడపిల్ల నన్న సంకోచం, బయటపడితే చులకన అయి పోతానేమోనన్న సంశయం నన్ను ఆపుతూండేవి. కానీ ఆ రోజు మాత్రం బయటపడకుండా ఉండలేకపోయాను. ఎలా ఉంటాను.. నేను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమించానంటూ వస్తే! తన మనసులోని ప్రేమనంతా అక్షరాలుగా మార్చి అందమైన లేఖగా అందిస్తే!! నా ఆనందానికి అవధులు లేవు. సంతోషానికి ఎల్లలు లేవు. అదృష్టదేవత వచ్చి నా ముంగిట్లో కొలువు తీరిందని మురిసిపోయాను. కానీ సంగీత్ చెప్పిన మాట వింటూనే ఒక్కసారిగా నా సంతోషం ఆవిరై పోయింది. ‘‘నాకు ఇదివరకే పెళ్లయ్యింది ప్రియా... కానీ తన నుంచి ఏ ప్రేమనూ పొందలేదు. తను నన్ను అర్థం చేసుకున్నదే లేదు. నాకేం కావాలో తనకు అవసరం లేదు. తనకు ఏం కావాలో నాకు అంతుపట్టదు. ఒక ఇంట్లో ఇద్దరు శత్రువుల్లా బతుకుతున్నాం. నీ కళ్లలో నా మీద ప్రేమ కనిపించింది. అది నాకు కావాలని పించింది. దాన్ని నాకు దూరం చేయకు ప్లీజ్’’... తను చెప్పిన వాస్తవం నన్ను నిలువున్నా కుదిపేసినా, తన గొంతులోని ఆవేదన, కళ్లలోని తడి నన్ను కదిలించాయి. అందుకే కాదనలేకపోయాను. నా ప్రేమను చంపుకోలేకపోయాను. తనకు నా గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని తుడిచేసే సాహసం చేయలేకపోయాను. అది ఎంత తప్పో తర్వాత నాకు అర్థమైంది. తన భార్య నుండి శాశ్వతంగా విడిపోయి నా దగ్గరకు వస్తానన్న సంగీత్ మాట మీద కలిగిన నమ్మకం... నన్ను అన్ని హద్దులనూ దాటించింది. నన్ను తనకు పూర్తిగా సొంతం చేసింది. కానీ సంగీత్ మాత్రం నాకు ఎప్పటికీ సొంతం కాడన్న నిజం చాలా ఆలస్యంగా అవగతమయ్యింది. అతడు తన భార్యను వదిలి పెట్టలేదు. నా మెడలో తాళి కట్టలేదు. నాకు భార్య హోదానీ ఇవ్వలేదు. నాలుగు గోడల మధ్య నేను తన అర్థాంగిని. బయట కూడా నాకు ఆ గుర్తింపు కావాలని అడిగినప్పుడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా నని అనిపించుకున్న దానిని. మొదట్లో కాస్త సమయం పడుతుందనేవాడు. కొన్నాళ్లు గడిచాక ఆ పనిలోనే ఉన్నానని చెప్పేవాడు. అయినా నేను సహించాను. తన కోసం భరించాను. ఓ పక్క తప్పటడుగు వేశావంటూ మనసు నిందిస్తున్నా... దాని నిండా నిండిపోయిన ప్రేమ మాత్రం కొన్నాళ్లు వేచి చూడమనేది. అందుకే మళ్లీ రాజీపడిపోయేదాన్ని. కానీ అలా పడిన తర్వాత... ప్రతిక్షణం నరకం కనిపించేది. భర్త చేతులు పట్టుకుని సంతోషంగా నడుస్తోన్న ప్రతి భార్యా నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. బిడ్డను ఒడిలో లాలిస్తోన్న ప్రతి తల్లీ నీకా అదృష్టం లేదు అని నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించి మనసు మెలికలు పడేది. చివరకు తట్టుకోలేక సంగీత్ని నిలదీశాను. ఇక ఎదురు చూడలేను, నా దగ్గరకు వచ్చేమని అడిగాను. కుదరదన్నాడు. తన భార్య ఒప్పుకోవడం లేదన్నాడు. కేసు పెడతానంటోందంటూ భయాన్ని వ్యక్తం చేశాడు. చివరికి ఓ క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. నా ప్రేమను ఎంగిలాకులా విసిరేశాడు. నా మనసును ముక్కలుగా విరిచేశాడు. నన్ను ఒంటరిగా వదిలేసి తన దారిన తాను పోయాడు. నేనేం చేయలేకపోయాను. అప్పుడు తనతో ఉండలేనన్నవాడివి ఇప్పుడెలా ఉంటావని ప్రశ్నించలేక పోయాను. అలా చేసి ఏం లాభం? అతను స్వార్థపరుడు. నన్ను తన స్వార్థానికి బలి తీసుకున్నాడు. కానీ బలైపోవడానికి నేనేగా సిద్ధపడి వెళ్లింది? నేనేగా తనకి ఆ అవకాశాన్ని కల్పించింది? అందుకే మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాను. నా తప్పుకు శిక్షను అనుభవించాలని నిర్ణయించుకున్నాను. జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక, మరో మహిళకు అన్యాయం చేయబోయి నేనే అన్యాయమైపోయానన్న వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం లేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. బతుకంతా అనుభవించినా తీరని కఠినమైన శిక్ష!! - ప్రియాంక (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఒక వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతడి భార్యే కాదు, ఆ రెండో మహిళా నష్టపోతుంది. అందుకే నేనెప్పుడూ అవగాహనా సదస్సుల్లో మహిళలకు చెబుతుంటాను.. వివాహేతర సంబంధాల జోలికి పోవద్దు అని. దానివల్ల వాళ్లేమయినా సంతోషంగా ఉంటారా అంటే అదీ లేదు. చట్టబద్దమైన హక్కులుండవు. సమాజంలో సరైన స్థానం, గౌరవం ఉండవు. అందరూ అతని భార్య మీద జాలి చూపిస్తారు. ఆమెను భర్తకు దూరం చేసినందుకు ఈమెను నిందిస్తారు. సదరు వ్యక్తి కూడా చివరకు తన భార్యాపిల్లల వైపే మొగ్గు చూపుతాడు తప్ప ఈమె గురించి ఆలోచించడు. ఎటు చూసినా నష్టపోయేది కచ్చితంగా రెండవ మహిళే. అందుకే అలాంటి జీవితంవైపు అడుగు వేసేముందు ప్రతి మహిళా ఆలోచించాలి. మరో మహిళకు అన్యాయం చేయడంతో పాటు తనకు తానూ అన్యాయం చేసుకుంటున్నానన్న వాస్తవాన్ని గ్రహించాలి. మహిళకు తోడు అవసరమే. కానీ ఆ తోడును చట్టబద్దంగానే సంపా దించుకోవాలిగానీ ఇలా కాదు. చట్ట విరుద్ధంగా చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. త్రిపురాన వెంకటరత్నం చైర్ పర్సన్ రాష్ట్ర మహిళా కమిషన్ -
ప్రాణం తీసింది
మరికల్: ధన్వాడ మండలం లాల్కోట చౌరస్తా సమీపంలో ఈనెల 7న సంచలనం రేపిన వ్యక్తి హత్యకేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. వివరాలను సోమవా రం మరికల్ ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. చిన్నచింతకుంట మం డలం పర్దీపూర్ గ్రామానికి చెందిన వడ్ల సత్యానారాయణ(36) అదే గ్రామానికి చెందిన పంతులు విజయ్‌భాస్కర్ భార్య తో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలుసుకున్న భర్త భార్య, సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. చివరికి సత్యనారాయణను మట్టుబె ట్టేందుకు పథకం రచించాడు. ఇదిలాఉండగా, విజయ్‌భాస్కర్ వృత్తిరీత్యా డ్రైవర్. వరంగల్ జిల్లా కుర్వి మండలం నారాయణపురం గ్రామం కొత్తతండాకు చెందిన ఐదుగురు యువకులతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. తన భార్య వివాహేతర సంబంధం విషయాన్ని వారికి వివరించారు. కొత్తతండాకు చెందిన ఐదుగురు యువకులతో నెలరోజుల క్రితం ధన్వాడ మండలం పర్దీపూర్ పక్కనే ఉన్న పళ్లమారి గ్రామానికి చేరుకుని తన స్నేహితుడు రాజుతో కలిసి హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో సత్యనారాయణ రోజువారీ కార్యకలాపాలను ఆరాతీశారు. ఏం జరిగిందంటే.. ఎలక్ట్రికల్ వర్కర్ అయిన సత్యనారాయ ణ ఈనెల 7న సామగ్రి కోసం దేవరకద్ర కు వెళ్లి బైక్‌పై పర్దీపూర్‌కు వస్తుండగా.. మార్గమధ్యంలో ధన్వాడ మండలం లాల్కోట చౌరస్తా సమీపంలో గల రైల్వేవంతెనపై భూక్యా శ్రీధర్ అతడిని ఢీకొట్టాడు. బానోత్ ఆంజనేయులు, బానోత్ లాలు అనే వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లగా బానోత్ కిషన్, మాల్గోతు లింగన్న, శ్రీధ ర్ కలిసి సత్యనారాయణను వేటకోడవళ్ల తో దారుణంగా నరికిచంపారు. అక్కడినుంచి దుండగులు దేవరకద్ర వైపునకు పరారయ్యారు. అన్నికోణాల్లో విచారిం చిన పోలీసులు ఈనెల 17న లాల్కోట చౌరస్తా సమీపంలో నిందితుల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. హత్యకు సూత్రధారి రాజు పరారీలో ఉన్నాడని ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. -
వివాహిత సజీవ దహనానికి యత్నం
ఫిరంగిపురం : వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అంగీకరించని ఓ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన మండలంలో ఆదివారం సంభవించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నారుు. ఫిరంగిపురం మండలం మునగపాడులో భర్తతో కాపురం ఉంటున్న ఓ మహిళ అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఆదంషఫీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త గ్రామపెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను, ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించారు. మనసు మార్చుకున్న ఆమె షఫీతో సంబంధం కొనసాగించలేనని తేల్చిచెప్పింది. కానీ షఫీ మాత్రం ఆ మాట వినలేదు. పైగా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆమె బాత్రూమ్కు వెళ్లేందుకు నిద్రలేవగా అప్పటికే కాపు కాసి వేచిచూస్తున్న ఆదం షఫీ వెంట బాటిల్‌తో తెచ్చుకున్న కిరోసిన్ ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు పరారవ్వగా తుళ్లిపడి లేచిన భర్త మంటలను ఆర్పేసి, బంధువుల సాయంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ సీఐ యు.శోభన్‌బాబు, ఎస్ఐ పి.ఉద యబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యాయత్నానికి ఉపయోగించిన కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె, మంటలు ఆర్పిన క్రమంలో కాలిన దుప్పటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఉదయబాబు తెలిపారు. సూపరింటెండెంట్‌కు మహిళామోర్చా ఫిర్యాదు విద్యానగర్(గుంటూరు): ఫిరంగిపురం మండలం మునగపాడులో జరిగన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు జీజీహెచ్‌లో చికిత్సపొందుతోంది. బాధితురాలి శరీరం 60శాతం కాలిపోయిందని రెండు రోజులు గడిస్తేకాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితురాలిని భారతీయ జనతా మహిళామోర్చా నేతలు పరామర్శించారు. ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికి తీసుకువస్తే 10 గంటల వరకు వైద్యచికిత్స ప్రారంభించలేదని బంధువులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహిళానేతలు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు పరశరం రంగవల్లితో కలిసి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో వైద్యులు బాధితురాలికి చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళానేతలు మాట్లాడుతూ మహిళపై దాడిచేసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
భర్తను కడతేర్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చంపేసిందన్న బంధువులు పోలీసుల అదుపులో మృతుడి భార్య, అత్తామామలు పీలేరు: మండలంలోని దేశిరెడ్డిగారిపల్లెలో ఓ వివాహిత తల్లిదండ్రులతో కలసి భర్తను హతమార్చింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం బాలంవారిపల్లె పంచాయతీ పరిధిలోని దే శిరెడ్డిగారిపల్లెకు చెంది వీరయ్య, సరస్వతమ్మల ఏకైక కుమార్తె సుజాతను 17 ఏళ్ల కిందట ఎర్రావారిపాళ్యం మండలం వీఆర్ అగ్రహారానికి చెందిన రామకృష్ణ కుమారుడు మోహన్రావ్తో వివాహం జరిగింది. సుజాత ఒక్కటే సంతానం కావడంతో ఇల్లరికం వచ్చేశాడు. ఆటో నడపడం, కూలే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించేవాడు. వీరి కుమార్తె మౌనిక తొమ్మిదో తరగతి, కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. మృతుడు మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంటిలో గొడవలు జరిగేవి. ఏడాది కిందట మోహన్రావ్పై భార్య సుజాత పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కొంత కాలం జైలుకు వెళ్లి వచ్చాడు. నూతన సంవత్సరం కావడంతో గురువారం పిల్లలను ఆటోలో తలకోనకు తీసుకుపోయి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగిన మోహన్‌రావు మత్తుగా నిద్రపోయాడు. భార్య సుజాత, మామ వీరయ్య, ఇతర కుటుంబ సభ్యులు రోకలిబండతో తలపై కొట్టడంతో నిద్రలోనే మృతిచెందాడు. స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ టి.నరసింహులు, ఎస్ఐ సిద్ధతేజమూర్తి సిబ్బందితో దేశిరెడ్డిగారిపల్లెకు చేరుకున్నారు. స్థానికులు, బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం భార్య, అత్తమామలు హత్య చేశారని మృతుడి అన్న సుధాకర్, వదిన పార్వతి, బంధువులు ఆరోపించారు. భార్య, అత్తమామలు మరో వ్యక్తితో కలసి నిద్రలో హత్యచేశారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుజాత, మామ వీరయ్య, అత్త సరస్వతమ్మ, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పథకం ప్రకారం భార్య, మామే హత్య చేశారని పోలీసులు చెపుతున్నారు. -
కన్న పేగే కడతేర్చింది
ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు తాగించిన మహిళ పెద్ద కుమార్తె మృతి అపస్మారక స్థితిలో చిన్నకూతురు అనంతరం తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం సూదనపల్లిలో విషాద ఛాయలు సూదనపల్లి(కురవి) : నవమాసాలు మోసి, పురిటినొప్పులు పడి జన్మనిచ్చిన తల్లే తన పేగు బంధాన్ని తెంచేసుకుంది. పరారుు పురుషుడి మోజులోపడి మాతృత్వాన్ని, మానవత్వాన్ని మరిచింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో కడుపున పుట్టిన బిడ్డలకు విషమిచ్చింది. వారిలో పెద్దకుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా, చిన్నకూతురు అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ తర్వాత సదరు మహిళ తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆస్పత్రి పాలైంది. నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ సంఘటన కురవి మండలంలోని సూదనపల్లిలో విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మట్టెగజపు లింగయ్య కుమార్తె కవితతో సూదనపల్లికి చెందిన తోట పాపయ్యకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు గీతిక(4), సాయి దీప్తి జన్మించారు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే వీరు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ కూలీ చేసుకుంటున్నారు. బ్యాం కు అకౌంట్ తీసేందుకని ఇటీవల స్వగ్రామం చేరుకున్నారు. 15వ తేదీన వారు మానుకోటలోని ఓ బ్యాం కులో అకౌంట్ తీసేందుకు వెళ్లి, ఖాతా తెరవకుండా నే తిరిగొచ్చారు. అదే రోజు కవిత తన భర్తకు తెలి యకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెప్పాపెట్టకుండా వెళ్లిపోరుుంది. భార్య పుట్టింటికి వెళ్లిందని భావించిన పాపయ్య హైదరాబాద్ వెళ్లేందుకు ఆది వారం బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడి మామ లింగయ్య ఫోన్‌చేసి పిల్లలకు కవిత పురుగులమందు తాగించిన విషయం చెప్పాడు. దీంతో అతడు హైదరాబాద్‌కు వెళ్లకుండ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ప్రియుడితో కలిసి వెళ్లి.. అఘారుుత్యం.. సూదనపల్లి నుంచి పిల్లలను తీసుకుని బయల్దేరిన కవిత నేరుగా తన మేనత్త ఊరైన నూతనకల్ మండలంలోని జి.కొత్తపల్లికి వెళ్లింది. అనంతరం తన మేనత్త కుమారుడు శ్రీపాల్‌తో కలిసి కూతుళ్లకు పురుగుల మందు తాగించి హత్య చేయూలని పథకం రచించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-చిట్యాల మధ్యలో ఉన్న గుట్ట వద్ద పిల్లలిద్దరికి వారు పురుగుల మందు తాగించారు. దీంతో పెద్దకుమార్తె గీతిక అక్కడికక్కడే మృతిచెందగా, సారుుదీప్తి పరిస్థితి విషమంగా మారింది. అనంతరం కవిత, శ్రీపాల్ కూడా పురుగుల మందు తాగి సారుుదీప్తిని తీసుకుని ప్రధాన రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీపాల్ తన తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, అతడు వెంటనే కవిత తండ్రి లింగయ్యకు సమాచారమిచ్చాడు. దీంతో లింగయ్య సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గీతిక మృతదేహం కనిపించింది. సాయిదీప్తి, కవిత, శ్రీపాల్ అంబులెన్స్‌లో హైదరాబాద్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్లు లింగయ్య చెప్పాడు. ఇదిలా ఉండగా గీతిక మృతదేహాన్ని ఆదివారం సూదనపల్లికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యూరు. అయితే కేసు పెట్టకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడంతో వారు సీరోలు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఇక్కడ కేసు నమోదు చేయడం కుదరదని, సంఘటన జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయూలని సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారుు. -
అక్కను చంపిన తమ్ముడు
పచ్చడిబండతో కొట్టి.. పీక నొక్కి.. వివాహేతర సంబంధాన్ని భరించలేకే.. ఇంటివద్ద గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహం కంకిపాడులో ఘటన కంకిపాడు : ఓ వితంతువు వివాహేతర సంబంధం ఆమె ప్రాణాలనే బలిగొంది. ఆమె ప్రవర్తన కారణంగా గొడవ జరగడంతో భరించలేక తోబుట్టువే ఆమెను హతమార్చాడు. కంకిపాడులో గురువారం ఈ దారుణ ఘటన జరిగింది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పు శివపార్వతి (38) వ్యవసాయ కూలీ. ఆమె భర్త రాంబాబు తొమ్మిదేళ్ల కిందట కుటుంబ పరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. శివపార్వతికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. కంకిపాడు పోలీస్‌స్టేషన్ ఎదుట తన తల్లి నర్సమ్మతో కలిసి నివాసం ఉంటోంది. గొడవ జరిగిందని తెలుసుకుని వచ్చి.. శివపార్వతికి, పునాదిపాడుకు చెందిన దుర్గారావుకు వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలియడంతో అతడి భార్య గురువారం ఉదయం శివపార్వతి ఇంటికి వచ్చి గొడవ పడి వెళ్లింది. అదే ప్రాంతంలో ఉంటున్న శివపార్వతి (38) రెండో తమ్ముడు డేరంగుల శివనాగేశ్వరరావు(32)కు ఈ విషయం తెలిసి అక్కడికొచ్చి అక్కతో గొడవ పడ్డాడు. గొడవ ముదిరి ఆవేశంతో అందుబాటులో ఉన్న పచ్చడిబండతో తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా కోపం చల్లారక ఆమె పీక పిసికాడని, తరువాత మళ్లీ పచ్చడిబండతో మోదాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆటోలో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిం దని నిర్ధారించారు. సీఐ రవికుమార్ ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ జి.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే.. దాడికి పాల్పడిన శివనాగేశ్వరరావును ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ పంచకర్ల వెంకటేశ్వరరావు (కొండా) అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్క వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో గొడవలు వస్తున్నందున కోపం వచ్చి ఆమెపై దాడి చేశానని.. చంపాలనే ఉద్దేశం లేదని అతడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శివపార్వతి రెండో కుమార్తెకు కొన్ని నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు గోపి విజయవాడ ఆటోనగర్‌లో పనిచేస్తున్నాడు. గొడవలో తన తల్లికి గాయాలైన సమాచారం తెలియగానే అతడు హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తల్లి పరిస్థితి గురించి అతడు అడిగి తెలుసుకుంటున్న తీరు స్థానికులను కలచివేసింది. మృతురాలి పెద్ద కుమార్తె భవాని భర్తతో కలిసి కొద్దిరోజుల కిందట తల్లి వద్దకు వచ్చి, మరో ఊరు వెళ్లింది. భవాని ఇక్కడ ఉండి ఉంటే గొడవను అడ్డుకుని ఉండేదని, శివపార్వతి చనిపోయేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. న్యాయం చేయాలని ఆందోళన మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితులు గురువారం సాయంత్రం పునాదిపాడులోని దుర్గారావు ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. దుర్గారావుతో శివపార్వతికి అక్రమ సంబంధం ఉందనే నెపంతో దుర్గారావు భార్య మరో పది మందితో కలసి వచ్చి గొడవ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించారు. ఆందోళన సమయంలో దుర్గారావు కుటుంబసభ్యులు ఇంటివద్ద లేకపోవడం గమనార్హం. -
రేమిడిచర్లలో యువకుడి హత్య
మరదలితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఓ ప్రబుద్ధుడు ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. నమ్మకంగా పొలానికి తీసుకెళ్లి తోడల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో శనివారం వెలుగుచూసింది. రేమిడిచర్ల(బొల్లాపల్లి): వినుకొండ రూరల్ సీఐ బి.చిన మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేమిడిచర్లకు చెందిన భూక్యా వాగ్యానాయక్ ఉరఫ్ సాయినాయక్, అదే గ్రామానికి చెందిన భూక్యా బుజ్జినాయక్లు తోడల్లుళ్లు. వీరిద్దరూ ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లను వివాహమాడారు. గ్రామంలో సౌమ్యుడిగా పేరున్న వాగ్యానాయక్కు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసు కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరం పొలాన్ని సాగుచేసుకుంటూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుజ్జినాయక్ పొలంలో కూడా పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుజ్జినాయక్కు మరదలైన వాగ్యానాయక్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్త హత్యకు కుట్రపన్నాడు. పత్తి పొలానికి నీరు పెట్టాలని చెప్పి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై తోడల్లుడిని పొలానికి తీసుకెళ్లాడు. అప్పటికి బుజ్జినాయక్ తల్లిదండ్రులు కూడా పొలంలోనే ఉండటంతో నలుగురు కలిసి పొలానికి నీరు కట్టారు. అనంతరం శనివారం తెల్లవారుజామున పొలంలోనే వాగ్యానాయక్ను హతమార్చిన బుజ్జినాయక్.. ప్రమాదంగా చిత్రీకరించేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఉన్న గుంతలో మృతదే హాన్ని, ద్విచక్ర వాహనాన్ని పడవేసి వెళ్లాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఐ చిన మల్లయ్య, బండ్లమోటు పోలీసు సిబ్బందితో కలసి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడు భూక్యాకుమార్నాయక్ పిర్యాదు మేరకు బుజ్జినాయక్తో పాటు అతడి తల్లిదండ్రులు కోటేశ్వరావునాయక్, కేస్లీబాయిలపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. వీఆర్వో శ్రీనునాయక్ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. -
‘ఆ బంధం’ ఇక వద్దన్నదని..
మండపేట రూరల్ :వివాహేతర సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ మదాంధుడు ఓ మహిళను ఆమె బిడ్డల ముందే హతమార్చాడు. తర్వాత పురుగులమందు తాగి, అదే కత్తితో తానూ పొడుచుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట రూరల్ మండలం జెడ్.మేడపాడులో జరిగిన ఈ ఘాతుకం వివరాలు స్థానికులు, పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జెడ్.మేడపాడు చర్చి కాలనీలో నివసిస్తున్న నక్కా సత్యనారాయణ, సరస్వతి (34) దంపతులకు 8, 4 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, 5వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నారు. గతంలో వారు అనపర్తిలోని కంటి ఆస్పత్రి వద్ద కాఫీహోటల్ నడిపేవారు. అక్కడ ఉండగా పరిచయమైన అనపర్తి మండలం పొలమూరుపాకలుకు చెందిన గెద్దాడ త్రిమూర్తులుతో సరస్వతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడేళ్ల క్రితం సత్యనారాయణ కుటుంబం జెడ్.మేడపాడు చర్చి కాలనీలో ఇల్లు నిర్మించుకుని వచ్చేశారు. సత్యనారాయణ ఇప్పనపాడులో కాఫీ హోటల్ నడుపుతున్నాడు. ఊరు మారినా త్రిమూర్తులు సరస్వతి కోసం వస్తూనే ఉండేవాడు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నందున తమ సంబంధాన్ని కొనసాగించేందుకు సరస్వతి నిరాకరించసాగింది. ఈ క్రమంలో త్రిమూర్తులు శనివారం ఉదయం చర్చి కాలనీలోని సరస్వతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సత్యనారాయణ హోటల్ వద్ద ఉన్నాడు. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని త్రిమూర్తులు పట్టుబట్టడమే కాక పిల్లల ముందే సరస్వతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పడంతో కోపోద్రిక్తుడైన త్రిమూర్తులు తన దగ్గరున్న కత్తితో ఆమె ముఖం, కంఠం, భుజం, ఇంకా మరికొన్ని చోట్ల పొడిచాడు. భీతిల్లిన పిల్లలు కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలుచుకు వచ్చారు. అప్పటికే మరణించిన సరస్వతి నెత్తుటి మడుగులో పడి కనిపించింది. ఈలోగా పురుగుమందు తాగి, కత్తితో పొడుచుకున్న త్రిమూర్తులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు మండపేట రూరల్ సీఐ పీవీ రమణ, ఎస్సై ఎల్.శ్రీను సిబ్బందితో అక్కడకు చేరుకుని త్రిమూర్తులును 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్ఓ మేకా శ్రీను, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నతల్లి కత్తిపోట్లకు గురై మరణించడాన్ని కళ్లారా చూసిన ముగ్గురు పిల్లలూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనతో చర్చి కాలనీలో కలవరం రేగింది. -
చిన్నారి హత్య: మహిళ అరెస్ట్
వేలూరు: వివాహేతర సంబంధం ప్రియుడి భార్యకు తెలిసిపోవడంతో కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకుని ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం ప్రాంతానికి చెందిన మురళి. ఇతనికి ముగ్గురు పిల్లలున్నారు. రెండవ కుమారుడు దినేష్(3) శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటలాడుతూ కనిపించకపోవడంతో వేలూరు నార్త్ పోలీసులకు మురళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తుమండపం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన వెంటనే మురళి ఇంటి ముందు నివశిస్తున్న పెయింటర్ ప్రభు భార్య సుమతి ఇంటికి తాళం వేసి బయట వచ్చి కూర్చుంది. అనుమానించిన పోలీసులు సుమతి వద్ద విచారణ జరపగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో గాలించారు. బీరువాను పగలగొట్టి చూడగా అందులో చిన్నారి నోటిలో గుడ్డలు పెట్టి కాళ్లు,చేతులు కట్టి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో చిన్నారి తండ్రి మురళీకి, తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. ఈ విషయం మురళి భార్యకు తెలిసి పోవడంతో ఆమె తనతో ఇటీవల ఘర్షణ పడిందని పోలీసులకు చెప్పింది. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం వీధిలో ఆటలాడుకుంటున్న దినేష్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు, చేతులు కట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని బీరువాలో పెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది. కేసు దర్యాప్తులో ఉంది. -
వివాహానికి అడ్డొస్తుందనే..
చౌటుప్పల్ :చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం శివారులో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసినమహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహానికి అడ్డొస్తుందనే కారణంతోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు విలేకరులకు హత్యకేసు వివరాలు వెల్లడించారు. నార్కట్‌ప ల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన నల్ల నీలమ్మ(28)కు రామన్నపేట మం డలం కక్కిరేణికి చెందిన కిష్టయ్యతో 10ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు కుమారు డు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(21) ఇంటర్ ఫెయిల్ అయి, వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వరికోత యంత్రాన్ని కొనుగోలు చేశా డు. వరికోత యంత్రం డ్రైవర్‌గా ఈయనే పనిచేస్తున్నాడు. గత ఏడాది వరిచేలు కోసేం దుకు కక్కిరేణికి వెళ్లాడు. వరికోత మిషన్ వద్దకు నీలమ్మ కూలి పనికి వచ్చింది. అక్కడ నీలమ్మతో రాజశేఖర్‌రెడ్డికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజశేఖర్‌రెడ్డికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. ఈ విషయా న్ని రాజశేఖర్‌రెడ్డి నీలమ్మకు తెలిపాడు. నేనుం డగా, నీవు పెళ్లి ఎలా చేసుకుంటావని నీలమ్మ నిలదీసింది. దీంతో రాజశేఖర్‌రెడ్డి నీలమ్మను వదిలించుకోవాలని హత్యకు పథకం వేశాడు. నీలమ్మ పేరుతోనే సిమ్‌కార్డు తీసుకుని.. రాజశేఖర్‌రెడ్డి తన సెల్‌నంబర్ నుంచి నీలమ్మ తో నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో హత్య చేస్తే, సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులకు దొరికి పోతామని, ఆమెకు మాయ మాటలు చెప్పి అడ్రస్ ప్రూఫ్ తీసుకున్నాడు. ఆ అడ్రస్ ప్రూఫ్‌తో నీల మ్మ పేరు మీద సిమ్‌కార్డు తీసుకున్నాడు. ఈ నంబరుతోనే మాట్లాడుతున్నాడు. దసరా పం డగకు రెండు రోజుల ముందుగానే నీలమ్మ, తల్లిగారి ఊరైన చిన్నతుమ్మలగూడేనికి వెళ్లింది. సద్దుల బతుకమ్మ రోజు, రాజశేఖర్‌రెడ్డి నీలమ్మ కు ఫోన్ చేసి పండగకు బట్టలు ఇప్పిస్తా, చౌటుప్పల్‌కు రమ్మని చెప్పాడు. దీంతో ఆమె ఈ నెల 2వ తేదీన రాత్రి పిల్లలను ఇంటి వద్దే వదిలి, చౌటుప్పల్‌కు వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి ఆమెను చౌటుప్పల్ నుంచి బైకుపై ఎక్కించుకుని ఎస్.లింగోటం శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. గొంతు నులిమి, బండరాయి తలపై ఎత్తేసి, హత్య చేశాడు. ఆమె ఒంటిపైనున్న బంగారు పుస్తె, చెవి కమ్మలు, పట్టాలను తీసుకుని పరారయ్యాడు. ఈ నెల 4వ తేదీన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4, 5తేదీల్లో నీలమ్మ మృతదేహాన్ని ఆసుపత్రిలోనే భద్రపరిచారు. అప్పటికే శవం కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండడంతో గ్రామపంచాయతీ సిబ్బందితో పూడ్చివేయించారు. కాగా, నీలమ్మ కనిపిం చ డం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 7వ తేదీన నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఇక్కడ గుర్తు తెలియని శవం లభిం చడంతో, ఇక్కడికి వచ్చి, ఆమె వస్త్రాలను చూ సి, నీలమ్మగా గుర్తించారు. నీలమ్మ సెల్‌నంబరు తీసుకుని, పోలీ సులు దర్యాప్తు చేశా రు. రాజశేఖర్‌రెడ్డి నీలమ్మతో అప్పటి వరకు తన సెల్‌నంబరుతో మాట్లాడి, హత్యకు వారం రోజుల ముందు నుంచి కొత్త నంబరుతో పదేపదేమాట్లాడుతుండడంతో అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించడంతో, హత్య కేసు మిస్టరీ వీడింది. అతడి వద్ద నుంచి సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో ఎస్ఐలు హరిబాబు, మల్లీశ్వరి పాల్గొన్నారు. -
సెల్’కిల్..!
బొంరాస్‌పేట: సెల్‌ఫోన్ సాఫీగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. వివాహేతర సంబంధాన్ని అంటగట్టి ఓ ఇల్లా లు ప్రాణం తీసింది. ఫోన్లో వివాహేతర సంబంధం కలిగి ఉన్నవ్యక్తితో తరచూ మాట్లాడుతుందని అనుమానించిన ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చా డు. ఆపై మృతదేహాన్ని దహనం చేసి తా ను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి పరారయ్యాడు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం మండలకేంద్రంలో వెలుగుచూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కొడంగల్‌కు చెందిన నందారం మిడిదొడ్డి రాజేందర్, మురళమ్మ రెండోకూతురు స్వప్నశ్రీ(32)ను 17ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం మోమిన్కల్ గ్రామానికి చెందిన రాజుగుప్తకు ఇచ్చి వివాహం చేశారు. రాజు కిరాణావ్యాపారం నిర్వహిస్తూ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. స్వప్నశ్రీ స్థానికంగా ఓ ప్రైవే ట్ పాఠశాలలో పనిచేస్తుంది. వీరికి కూతురు విణీత, కొడుకు భరత్ ఉన్నారు. కాగా, తనభార్య స్వప్నశ్రీ రహస్యంగా సెల్ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందని రాజు అవమానించాడు. అలాగే తన భర్త కూ డా ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె అనుమానించసాగింది. వీరిఅన్యోన్య దాంపత్యజీవితం చెదిరి అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో స్వప్నశ్రీ తనమామ పెంటయ్య(భర్త తండ్రి) వద్ద ఉంటుంది. రాజు తన భార్యను కొడంగల్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి సోమవారం రాత్రి కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో స్వప్నశ్రీని హత్యచేసి తన అన్నదమ్ములు, భార్య కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా విషయం చెప్పాడు. కొద్దిసేపటికి బొంరాస్‌పేట శివారులోని సంఘయ్యగడ్డ శివాలయం సమీపంలో దహనం చేశానని, తాను సైతం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలియజేసి ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన రాజుగుప్త అన్నదమ్ములు నర్సిములు, మాణిక్‌ప్రభు, వీరేశం శివాలయం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వెతకగా కాలిపోయిన స్థితిలో ఉన్న స్వప్నశ్రీ మృతదేహం లభ్యమైంది. మృతురాలు దివంగత ఎమ్మెల్యే నందారం నడిదొడ్డి వెంకటయ్య మనవరాలు, దివంగత ఎమ్మెల్యే నడిదొడ్డి సూర్యనారాయణ తమ్ముడు కూతురు. సీఐ విచారణ హత్యజరిగిన స్థలాన్ని మంగళవారం ఉదయం కొడంగల్ సీఐ విశ్వప్రసాద్ సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో నిందితుడు ? తన భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫోన్‌ద్వారా కుటుంబీకులకు రాజుగుప్త చెప్పినప్పటికీ తన కారులోనే తిరిగి ధారూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడని, అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో ఉన్నట్లు మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే నందా రం సూర్యనారాయణ భార్య అనురాధ, టీడీపీ నేత నర్సిములుగౌడ్, సీపీఐ నాయకుడు ఇందపూర్ బషీర్ సంఘటన స్థలానికి వచ్చి పరామర్శించారు. -
అమ్మా! నాకెందుకీ శిక్ష..?
నాగలాపురం: ఇదిగో ఇక్కడ ఫొటోలో కుమిలి కుమిలి ఏడుస్తున్న బాలుడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కన్న తల్లి చేసిన తప్పిదానికి అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తండ్రి హత్యోదంతం గురించి తెలిసినా ఎవరికీ చెప్పలేదని హతుని బంధువులు ఆ బాలుడిని చీదరించుకుంటున్నారు. మరోవైపు- బాలుడిని చేరదీస్తే తమను చిన్నచూపు చూస్తారని నిందితురాలి కుటుంబ సభ్యులు అతడి దరికే రావడం లేదు. దీంతో ‘అమ్మా! నాకెందుకీ శిక్ష?’ అని పోలీస్‌స్టేషన్ నాలుగు గోడల మధ్య ఆ బాలుడు కుమిలిపోతున్నాడు. దీనికి తోడు హతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కొచ్చి శాపనార్థాలు పెడుతుండడం ఆ పసి మనసును కుంగదీ స్తోంది. వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలను, కుటుంబాలను ఎంతగా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పడాని కి ఇదో ఉదాహరణ. మండలంలోని గోపాలపురానికి చెందిన కందస్వామి తల్లి సుమతి వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడి సహకారంతో తన భర్త మునయ్యను వారం క్రితం హతమార్చడం విదితమే. దీంతో ఆమె కుమారుడు కందస్వామి(14) తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యాడు. తల్లి జైలు పాలైంది. విచారణ నిమిత్తం అతడిని నాగలాపురం పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ నేపథ్యం లో, తన తల్లి కన్నతండ్రినే హతమార్చినా ఆ విషయాన్ని దాచాడని తండ్రి తరపున బంధువులు కందస్వామి సంరక్షణకు ముందుకు రావడం లేదు. తమ కుమార్తె అల్లుడిని హతమార్చి తమ పరువు తీసిందని కందస్వామి తాత య్య సైతం అతడిని తమతో తీసుకెళ్లేం దుకు నిరాకరించారు. హత్య కేసు దర్యా ప్తు పరంగా కందస్వామిని ప్రశ్నించడం తప్పితే అతడి సంరక్షణ, బాగోగుల వ్యవహారం తమది కాదని విచారణ నిమిత్తం వచ్చిన పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, సత్యవేడు సీఐ భక్తవత్స లం తేల్చిచెప్పారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కందస్వామి భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. బంధువులున్నా అనాథగా మిగిలాడు. ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. కేవీబీపురం మండలం జ్ఞానాం బకండ్రిగలోని తన తండ్రి సంబంధీకుల ఇళ్లకు వెళ్తానని కందస్వామి చెబుతున్నా వారు మాత్రం ససేమిరా అంటుండటం గమనార్హం! -
భర్త కళ్లల్లో జిల్లేడు పాలు
ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం చూపు కోల్పోయిన భర్త నిందితుల రిమాండ్ నాగోలు: వివాహేతర సంబంధం పెట్టుకొని.. కట్టుకున్న భర్త కళ్లల్లో జిల్లేడు పాలు పోసి కళ్లు పోవడానికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్మెంట్లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్‌రెడ్డి (37) ఇంట్లో ఓ శుభకార్యానికి డెకరేషన్ చేశాడు. నగరానికి వచ్చిన గోపాల్‌రెడ్డి ఓసారి ఎల్బీనగర్లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్‌లైన్‌తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్‌ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్‌రెడ్డితో కలిసి పథకం వేసింది. 2012, డిసెంబర్, 29న రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదే సమయంలో సరిత కొడుకును హయత్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పోయిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే, గోపాల్‌రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ. లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఇద్దరి దారుణ హత్య
ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం కత్తితో స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు రసూల్‌పురా: ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం వారి ప్రాణాలు బలిగొంది. నిందితుడు కత్తితోవచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన బోయిన్పల్లి, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. తాడ్బంద్ కంటోన్మెంట్ సిబ్బంది క్వార్టర్స్‌లో నివసించే రాకేష్ (40) వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇతడికి భార్య జయశ్రీ (36), కుమారులు రోహిత్ (17) హేమంత్ (14) ఉన్నారు. బేగంపేట పాటిగడ్డలో ఉంటున్న రాకేష్ చిన్నాన్న కుమారుడు నరేన్(30)తో జయశ్రీ కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతోంది. ప్రవ ర్తన మార్చుకోవాలని పలు మార్లు కౌన్సెలింగ్ ఇప్పించిన ఆమె మారలేదు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం భర్త నుంచి విడిపోయి బోడబండ కబీర్‌నగర్‌లో ఉంటున్న తల్లి హేమలత ఇంట్లో జయశ్రీ ఉంటోంది. కాగా గతంలో రాకేష్ అన్న పోతురాజు భార్య స్యరూపతో నరేన్‌కు అక్రమ సంబంధం ఉండేది. దీంతో మనస్తాపానికి గురైన పోతురాజు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం నరేన్ స్యరూపను పెళ్లిచేసుకున్నారు. ప్రస్తుతం వారి మధ్య గొడవలు జరుగుతుండటంతో స్వరూప వేరుగా ఉంటుంది. కాగా శనివారం ఉదయం కబీర్‌నగర్‌కు రాకేశ్ వచ్చి తన యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని కలిసిమెలసి ఉందామని బైక్‌పై జయశ్రీని తాడ్బంద్ తీసుకువచ్చాడు. సాయంత్రం వారి ఇంటికి సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న కత్తితో జయశ్రీ ఛాతీపై పొడిచి, గొంతు కోసి హతమార్చాడు. అక్కడినుంచి బైక్‌పై నేరుగా పాటిగడ్డ ఎన్బీటీ నగర్‌లోని నారాయణ అలియాస్ నరేన్ ఇంటికి వెళ్లి నిద్రలో నుంచి లేపి అదే కత్తితో అతడ్ని హతమార్చాడు. తిరిగి ఇంటికి చేరుకుని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించారు. ఆధారాలు సేకరించి జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అదనపు డీసీపీ వీవైగిరి పీఎస్‌కు చేరుకుని హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
జగ్గయ్యపేట(కృష్ణా) :ఓ మహిళ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. వివరాలు.. బోదవా డ గ్రామానికి చెందిన దారావత్ కామేష్(32) పదమూడేళ్ల కిందట నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కృష్ణపట్నం తండాకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కు మారుడు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో కొంతకాల ంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మి గ్రామంలో ఒకరితో వివాహేతర సం బంధం ఏర్పరచుకుందని కామేష్‌కు ఇటీవల తెలిసింది. దీంతో అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 20న ఇద్దరి మ ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సమయం లో వైరుతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం వేకువజామున మూడు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో నడుచుకుంటూ జగ్గయ్యపేట బయలుదేరింది. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో.. అదే సమయంలో గ్రామంలోని గొర్రెల పెంపకందార్లు శనివారం చిల్లకల్లులో జరిగే సంత కోసం బయలుదేరారు. లక్ష్మి పిల్లలతో వెళుతుండటాన్ని చూసి కామేష్ బంధువులకు సమాచారం అం దించారు. వారు అతడి ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా కామేష్ చని పోయి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్సైలు నాగరాజు, శ్రీను షణ్ముఖసాయి, ఉమామహేశ్వరరావు సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీ లించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ చిన్నహుస్సేన్ కూ డా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు గ్రామంలోని సుగాలీల కులదేవత సీత భవాని ఆలయంలో పురోహితుడు. కామేష్ కుమార్తె విజయవాడ సమీపంలో ఓ ప్రాంతంలోప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. పోలీసుల అదుపులో నిందితురాలు ఈ ఘటనపై కేసు నమోదవగా పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్య ంలో ఎస్సై షణ్ముఖసాయి ప్రత్యేక బృం దంతో నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్నం వెళ్లారు. ఈలోగా లక్ష్మి పిల్లలతో సహా కృష్ణానదిలో దూకిందంటూ ప్రచారం జరిగింది. ఈ ఘటన జరిగిన ఏడు గం టల్లోనే ఆమెను పుట్టినింటిలో పోలీ సు లు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మితోపాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
‘పేట’ మండలం బోదవాడలో ఘటన వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని దుశ్చర్య బోదవాడ (జగ్గయ్యపేట) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేసింది. మండలంలోని బోదవాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థాని కంగా కలకలం సృష్టించింది. సేకరించిన సమాచారం ప్రకారం.. బోదవాడ గ్రామానికి చెందిన దారావత్ కామేష్(22) పదమూడేళ్ల కిందట నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కృష్ణపట్నం తండాకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. లక్ష్మి గ్రామంలో ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందని కామేష్‌కు ఇటీవల తెలిసింది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో లక్ష్మి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వైరుతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం వేకువజామున మూడు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో నడుచుకుంటూ జగ్గయ్యపేటకు బయలుదేరింది. బంధువులకు సమాచారమిచ్చిన గొర్రెల కాపరులు అదే సమయంలో గ్రామంలోని గొర్రెల పెంపకందార్లు శనివారం చిల్లకల్లులో జరిగే సంత కోసం బయలుదేరారు. లక్ష్మి పిల్లలతో వెళుతుండటాన్ని చూసి కామేష్ బంధువులకు సమాచారం అందించారు. వారు అతడి ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా కామేష్ చనిపోయి ఉన్నాడు. వారు అందించిన సమాచారంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్సైలు నాగరాజు, శ్రీను షణ్ముఖసాయి, ఉమామహేశ్వరరావు సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ చిన్నహుస్సేన్ కూడా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు గ్రామంలోని సుగాలీల కులదేవత సీత భవాని ఆలయంలో పురోహితుడు. కామేష్ కుమార్తె విజయవాడ సమీపంలో ఓ ప్రాంతంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. పోలీసుల అదుపులో నిందితురాలు ఈ ఘటనపై కేసు నమోదవగా పోలీసులు దర్యా ప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై షణ్ముఖసాయి ప్రత్యేక బృందంతో నల్గొండ జిల్లాలోని కృష్ణపట్నం వెళ్లారు. ఈలోగా లక్ష్మి పిల్లలతో సహా కృష్ణానదిలో దూకిందంటూ ప్రచారం జరి గింది. ఈ ఘటన జరిగిన ఏడు గంటల్లోనే ఆమెను పుట్టినింటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మితోపాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు పేట సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. మృతదే హాన్ని సందర్శించిన ఉదయభాను కామేష్ మృతదేహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను పేట ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఇంటూరి చిన్నా, నీలం నరసింహారావు, బూదవాడ మాజీ సర్పంచ్ పరిటాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కామేష్ మృతదేహాన్ని బోదవాడలో గ్రామ సర్పంచ్ పి.బాబూరావు, ఎంపీటీసీ సభ్యురాలు జి.సైదమ్మ, వైఎస్సార్ సీపీ నేత దారావత్ బాల్యనాయక్, బూడిద నరసింహారావు సందర్శించారు. -
తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!
తమ్ముడిని, తాళికట్టిన భార్యను నరికి చంపేశాడు.. తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు! విశాఖపట్నం: వివాహేతర సంబంధం నేప థ్యంలో తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అంతటితో ఆగక వారి తలలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని గొప్పులపాలేనికి చెం దిన చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. గుండన్న తమ్ముడు నారాయణ (40), వదిన జానకమ్మతో వెళ్లిపోయి మరో గ్రామంలో మూడు వారాల క్రితం కాపురం పెట్టాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న గుండన్న సోమవారం తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకుని, పొరుగూరులో ఉన్న భార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. వెంటాడి మరీ ఆమెను హతమార్చాడు. ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి తాను పోలీసులకు లొంగిపోతున్నట్టు చెప్పి నడుచుకుంటూ బయల్దేరాడు. చేతిలో కత్తితో నడిచి వస్తున్న గుండన్నను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. బాకూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్‌కు నడిచివెళ్లి, లొంగిపోయాడు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
మూడు నెలల తరువాత వెలుగు చూసిన హత్యోదంతం కోలారు : వివాహేతర సంబంధం కొనసాగించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఈ హత్యోదంతం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..విజయపుర తాలూకా గురప్పనమఠ ప్రాంతానికి చెందిన హరీష్ (29)కు సవిత (25)అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వీరు విజయపురం సమీపంలోని భట్రేనహళ్లి వద్ద నివాసం ఉండేవారు. వివాహానికి ముందే సవితకు సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. వివాహం తర్వాత కూడా దాన్ని కొనసాగించింది. విషయం తెలిసి భర్త నిత్యం గొడవ పడేవాడు. దీంతో సవిత ప్రియుడుతో కలిసి వెళ్లిపోగా మనో వేదనకు గురైన హరీష్ ఆత్యహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. తర్వాత పెద్దలు కల్పించుకొని సవితను కాపురానికి పంపారు. అయినప్పటికీ సవిత నడవడికలో మార్పు రాలేదు. ఈక్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సవిత సునీల్‌తో కలిసి పథకం రచించింది. అందులో భాగంగా హరీష్‌తో స్నేహంగా ఉండాలని సునీల్‌కు సూచించింది. అదే సమయంలో హరీష్‌కు డబ్బు అవసరం కాగా భార్య సలహాతో సునీల్‌ను ఆశ్రయించాడు. కేబి హొసహళ్లిలో డబ్బు ఇస్తానని హరీష్‌ను సునీల్ గత ఏప్రిల్ 7న ఆ గ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజు హరీష్‌ను గ్రామ సమీపంలోని చెరువువద్దకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో తూగుతున్న సమయంలో గొంతు, ఎద భాగంలో సునీల్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంద మీటర్ల దూరంలోని నీటికుంట వద్దకు తీసుకెళ్లి మృతదేహానికి రాళ్లు కట్టి నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత సవిత తన భర్త కనిపించలేదని విజయపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్‌ను అదుపులోకి విచారణ చేపట్టడంతో హత్యోదంతం వెలుగు చూసింది. సునీల్ ఇచ్చిన సమాచారంతో బుధవారం ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు తహశీల్దార్ సమక్షంలో హరీష్ మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలాన్ని దొడ్డబళ్లాపురం డీవైఎస్పీ కోనప్పరెడ్డి, విజయపుర సీఐ మహేష్‌కుమార్, వేమగల్ ఎస్ఐ యశ్వంత్ పరిశీలించారు. నిందితులు సవిత, సునీల్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అనుమానం... పెనుభూతమై
- పాడిపేటలో యువకుడి హత్య తిరుచానూరు: అనుమానం పెనుభూత మై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్యచేసి ఇసుకలో పాతిపెట్టారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం పాడిపేట అరుంధతివాడలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన అమ్ములు, ఆరుముగం దంపతులతో పాటు మరి కొన్ని కుటుంబాలు ఏడేళ్ల క్రితం పాడిపేట అరుంధతివాడకొచ్చి స్థిరపడ్డా యి. వీరు ఇటుకల బట్టీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అమ్ము లు తమ్ముడు అయిలు(25) భార్యతో గొడవపడి సుమారు నెల తన అక్క ఇంటికి వచ్చాడు. ఇక్కడే కూలి పనులు చేసుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే లక్ష్మి, ఆమె భర్త శివాజీ కాపురం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వీరు గొడవపడి వేరుగా ఉంటున్నారు. లక్ష్మి అయిలుకు వరుసకు బావ కూతురు. ఈ కారణంగా అతను లక్ష్మితో స్నేహంగా ఉండేవాడు. దీంతో శివాజీకి అనుమా నం వచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రోజురోజుకూ పెరిగింది. అయిలును హతమార్చాలని నిర్ణయిం చుకున్నాడు. గురువారం సాయంత్రం గుంతలు తవ్వే పనుందని అయిలును ఇంటి నుంచి శివాజీ తీసుకెళ్లాడు. అరుంధతివాడకు సమీపంలోని స్వర్ణముఖినది పరీవాహక ప్రాంతానికి తీ సుకెళ్లి అయిలుకు మద్యం తాపించా డు. మద్యం మత్తులో ఉన్న అతని తల పై రాయితో కొట్టి హతమార్చాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి లాక్కెళ్లి ఇసుకలో పూడ్చి పరారయ్యాడు. అర్ధరాత్రి అయినా అయిలు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో అమ్ము లు, ఆరుముగం, బంధువులు వెతికారు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్తున్న కొందరు రక్తపు మరకలు, మృతదేహాన్ని లాక్కెళ్లిన ఆనవాళ్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ రామకృష్ణాచారి, ఎస్ఐలు సూర్యనారాయణ, చిరంజీవి, ఏఎస్ఐ శంకర్, సిబ్బంది అక్కడి చేరుకున్నారు. రూరల్ తహశీల్దార్ యుగంధర్, ఆర్ఐ శ్యాం, వీఆర్వో రవి, తలారి సాంబ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. శివాజీ, అతని మిత్రుడు మురగ కలిసి అయిలును హత్యచేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని సీఐ రామకృష్ణాచారి తెలిపారు. -
దొంగ ప్రేమికులకు, అడ్డదారి భర్తలకు ఇలా చెక్ పెట్టొచ్చు
లండన్: మీ భర్త మీకు అన్యాయం చేస్తున్నారని అనుమానమా..? సీక్రెట్‌గా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని డౌటా..? అయితే వెంటనే ‘ఎంకపుల్’ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.. దీనితో మీ భర్తకు సంబంధించిన డిజిటల్ సమాచారం మొత్తం సులువుగా తెలుసుకోవచ్చు. లండన్‌కు చెందిన ‘ఎంస్పై’ అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా మీ భాగస్వామికి వచ్చే ప్రతి కాల్, మెసేజ్, ఈ-మెయిల్ సమాచారం మీకు అందుతుంది. స్కైప్, ఫేస్బుక్ ఉపయోగించి చాటింగ్ చేసినా ఇట్టే పట్టేస్తుంది. అలాగే మీ భాగస్వామి స్మార్ట్‌ఫోన్‌లో తీసి ఫేస్బుక్, స్కైప్‌లో పోస్ట్ చేసిన లేదా షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు కూడా మీకు అందిస్తుంది. అంతేనా మీ భాగస్వామి ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసే సౌకర్యం కూడా ఇది మీకు కల్పిస్తుంది. అలాగే జీపీఎస్ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అయితే మీ భాగస్వామి అనుమతి ఉంటేనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ పిల్లల కదలికలపై నిఘా పెట్టే తల్లిదండ్రులు, ఆఫీసుల్లో సిబ్బంది పనితీరుపై కన్నేసే కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ యాప్‌తో ప్రేమ పేరుతో చేసే చీటింగ్‌లకు చెక్ పెట్టొచ్చని ఎంస్పై వర్గాలు నమ్మకంగా చెపుతున్నాయి. -
నిందితుడు వెంకన్నేనా?
మరికొందరి ప్రమేయంపై మృతుడి బంధువులు, స్థానికుల అనుమానం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు గూడూరు : గూడూరులో సంచలనం కలిగిం చిన తల్లీకూతుళ్ల హత్య, యువకుడి ఆత్మహ త్య ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లీకూతుళ్లను హ త్య చేసింది ఆత్మహత్య చేసుకున్న వెంకన్నే నా? లేక వేరే వ్యక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిసింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో సంపతి కుమారి ఇంట్లో ఆమెతోపాటు ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె దుర్గాభవాని దారుణహత్యకు గురవగా, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఏలూరు వెంకన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వెంకన్న, కుమారి కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నట్లు కాలనీ వాసులు తెలి పారు. వెంకన్న కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంకన్నే ఈ సంఘటనలో ప్రధాన ముద్దాయిగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుమారి భర్త శ్రీనివాసరావు డ్యూటీలకు వెళ్లిన సమయంలో వెంకన్న ఆ మెతో సన్నిహితంగా ఉంటున్నందున ఘర్షణ పడి హత్య చేసేంత పరిస్థితి ఉండదని మృతుడి తండ్రి, సోదరి అంటున్నారు. వెంకన్నను, కుమారిని వేరే వారు హత్య చేసి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు ముందు కుమారిపై లైంగికదాడి జరిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న ఒక్కడే ఇంతటి దుస్సాహసం చేయలేడని, ఇందులో మరికొందరి పాత్ర ఉంటుందని గ్రామంలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కుమారి ఇంట్లోకి నలుగురు వ్య క్తులు చొరబడి ఉంటారని, తొలుత వెంకన్నను, అనంతరం తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. నేరాన్ని వెంకన్నపై తోసేందుకు అతడు ఉరి వేసినట్లు శనివారం పుకార్లు షికార్లు చేశాయి. పోలీ సులు విభిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దీనిగురించి ఎస్సై అడపా ఫణిమోహన్ను వివరణ కోరగా, మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిం దన్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. ఈ ఘటనకు వెంకన్నే కారకుడని ప్రాధమిక నిర్థారణకు వచ్చామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి గూడూరులో హత్యలు, ఆత్మహత్య ఘటనలో మూడు మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై ఫణిమోహన్ తెలిపారు. శనివారం ఉదయం ముం దుగా కుమారికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కడుపులోని ఎనిమిది నెలల శిశువును కూ డా బయటకు తీశారు.ఆమె కుమార్తె దుర్గాభవాని మృతదేహానికి కూడా పోస్టుమార్టం నిర్వహించారు. మూడు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. వెంకన్న మృతదేహానికి కూడా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో మృతదేహాలను గూడూరులోని వారి వారి స్వగృహాలకు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు వెంకన్నను పోగొట్టుకున్నామంటూ తండ్రి ఉ మామహేశ్వరరావు, తల్లి నాగలక్షి, సోదరి కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారి, ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలు చూసిన తల్లి సుభద్ర, సోదరుడు సురేష్, పిన్నమ్మ సు మతి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
తల్లీ కూతుళ్ల హత్య నిందితుడి అరెస్టు
తనను కాదని వేరొకరితో చనువుగా ఉండటమే కారణం ఆమెను ప్రోత్సహిస్తోందని తల్లిని కూడా .. డీఎస్పీ కే సూర్యచంద్రరావు వెల్లడి నూజివీడు, న్యూస్‌లైన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో తల్ల్లీకూతుళ్లను అతి కిరాతకంగా నరికి తలలు వేరుచేసి హతమార్చిన పోట్రు శివనాగరాజును అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ కే సూర్యచంద్రరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన వివరాలను డీఎస్పీ వివరించారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరానికి చెందిన పోట్రు శివనాగరాజు(25) చుట్టుపక్కల గ్రామాల్లో అరటిపళ్లు అమ్ముకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో దాదాపు 9నెలల క్రితం అతనికి బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన భర్త లేకుండా ఒంటరిగా ఉంటున్న పల్లపు చిన్ని(28)తో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంలో చిన్ని తల్లి చందమ్మ కూడా ప్రోత్సహించింది. అయితే ఈ విషయం నిందితుడి తండ్రి వెంకటేశ్వరరావుకు తెలియడంతో అతను నెల రోజుల క్రితం మల్లవల్లి వచ్చి చిన్నిని, ఆమె తల్లి చంద్రమ్మను ప్రవర్తన మార్చుకోవాలని మందలించి వెళ్లాడు. అప్పటి నుంచి చిన్ని శివనాగరాజుతో సరిగా ఉండటం లేదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు, ఇంటికి రావద్దని చెబుతుండడం, వేరొకరితో తిరుగుతుండడం, దీనికి ఆమె తల్లి ప్రోత్సాహం ఉండటంతో వారిపై శివనాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన చిన్ని ఇంటికి వచ్చి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం మానుకోమని చిన్నిని హెచ్చరించగా, తల్లి కూతుళ్లు ఇద్దరూ అవమానకరంగా మాట్లాడి పంపారు. తనతో వివాహేతర సంబంధాన్ని మానుకోవడం, అవమానకరంగా మాట్లాడటం, మరొకరితో తిరగడంతో వారిద్దరినీ తుదముట్టించాలనే నిర్ణయానికి వచ్చి ఈనెల 5వ తేదీ తెల్లవారుజామున కృష్ణవరం నుంచి కత్తితో టీవీఎస్ మోపెడ్‌పై వచ్చి పల్లపు చిన్నిని, ఆమె తల్లి అచ్చి చందమ్మలను అతి కిరాతకంగా కత్తితో నరికి వారి పీకలను కోసి తలలను వేరుచేశాడు. అనంతరం నిందితుడు పారిపోగా ఆగిరిపల్లి మండలం సగ్గూరు వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి నరకడానికి ఉపయోగించిన కత్తిని, అతనివంటిపై ఉన్న రక్తపు మరకల దుస్తులను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అచ్చి చందమ్మ చిన్న కుమార్తె చల్లా శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి జంక్షన్ సీఐ వైవీ రమణ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన వీరవల్లి ఎస్ఐ పీ వాసు, ఆగిరిపల్లి ఎస్ఐ ఎం.వెంకటనారాయణను డీఎస్పీ అభినందించారు.