Jackie Chan
-
జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్‌ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఫైర్‌బ్రాండ్. ఆమె పేరుకు తగ్గట్టుగానే విడాకులు తీసుకున్న నాగచైతన్య-సమంత విషయంలో చైపై విరుచుకుపడింది. దీనికి కారణం అమీర్‌ఖాన్ అంటూ ఆరోపించింది. అనంతరం ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కి మద్దతుగా నిలిచిన తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌ని విమర్శించింది. తాజాగా బాలీవుడ్ బాద్షాను టార్గెట్ చేసింది ఈ బ్యూటీ. డ్రగ్స్ కేసు విషయమై బాలీవుడ్ ప్రముఖులు అందరూ ఆర్యన్‌కి సపోర్టుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీ చాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టింది కంగనా. జాకీచాన్ కుమారుడు జైసీ చాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ అది తన ఫెయిల్యూర్ అని అందరికి క్షమాణలు తెలిపాడు. కేసులో తన కొడుకును కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయనని నటడు చెప్పాడు. అంతేకాకుండా జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్ హీరో. ఆర్యన్ విషయంలో బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాల గురించి రియాక్ట్ అవుతూ ఈ పోస్టుని పెట్టింది కంగనా. దీంతో ఫైర్ బ్రాండ్ మరోసారి బాంబు పేల్చిందని అందరూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. చదవండి: ఆల్ మాఫియా పప్పంటూ.. హృతిక్‌కి కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్ -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్‌ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్‌గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
కమ్యూనిస్టు పార్టీలోకి ప్రపంచ ప్రఖ్యాత నటుడు
బీజింగ్: వందేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లోకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్ర నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ చర్చలో ఆయన పేర్కొన్నారు. ఇంతకు ఆయనెవరో కాదు హాలీవుడ్ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో ప్రపంచ ప్రజలను ఆకర్షించిన జాకీ చాన్ (67 ఏళ్లు). జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. జాకీ చాన్ నటుడు, దర్శకుడు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. గతంలో జాకి చాన్చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు. -
‘అసలు జాకీకి ఒంట్లో భయమే లేదా’
జాకీచాన్ అసలు పేరు చాన్ కాంగ్–సాంగ్. ‘లిటిల్ జాక్’ అనే నిక్‌నేమ్ ఉండేది. అది కాస్తా ‘జాకీ’గా మారింది. ఆతరువాత ‘చాన్’ వచ్చి చేరి ‘జాకీ చాన్’ అయింది. జాకీ చాన్ ఫైటర్ మాత్రమే కాదు... చక్కని గాయకుడు కూడా. ‘ఒపేరా అకాడమీ’ లో కుంగ్ఫూతోపాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకున్నాడు. 11 మ్యూజిక్ ఆల్బమ్‌లను విడుదల చేశాడు. ‘బెస్ట్ సింగర్’ అవార్డ్ కూడా అందుకున్నాడు. ►సీఫూ(గురువు) చెప్పేదానికి ప్రకారం మార్షల్ ఆర్ట్స్‌లో జాకీకి అసాధారణమైన ప్రతిభ ఏమీలేదు. కానీ చిలిపితనం, నవ్వించే గుణం ఎక్కువ. గంభీరమైన మార్షల్ ఆర్ట్స్‌కు కడుపుబ్బా నవ్వించే కామెడీని జత చేసి వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ►బ్రూస్లీ లెవెల్‌కు తీసుకువెళదామనే ఉద్దేశ్యంతో ఒక హాంకాంగ్ నిర్మాత జాకీకి ‘బికమ్ ది డ్రాగన్’ అనే స్క్రీన్‌నేమ్ తగిలించాడు. అయితే అది అట్టే కాలం నిలవలేదు. ►‘డ్రాగన్ లార్డ్’లో ఒక సీన్ కోసం ఏకంగా 2,500 టేక్‌లు తీసుకున్నాడట! ఇది అనధికార గిన్నిస్ రికార్డ్. ఇక నిజమైన రికార్డ్ విషయానికి వస్తే ‘చైనీస్ జోడియాక్’ అనే సినిమా కోసం దర్శకత్వం, నిర్మాణం, నటన,సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్, ఫైట్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్. కేటరింగ్... ఇలా పదిహేను విభాగాల్లో పనిచేసి గిన్నిస్‌బుక్ రికార్డ్ సృష్టించాడు. ►‘అసలు ఇతడి ఒంట్లో భయమే లేదా’ అనుకునే జాకీకి రెండు భయాలు ఉన్నాయి. ఒకటి సూదులు, రెండోది జనాల మధ్య మాట్లాడడం. ►జీవితంలో తాను పశ్చాత్తాప పడే ప్రధాన విషయం...తాను సరిగా చదువుకోకపోవడం అంటాడు. పిల్లలకు ‘రోల్ మోడల్’గా ఉండాలనేది కల. ఒకప్పుడు తన రోల్ మోడల్ చార్లీ చాప్లిన్. -
కరోనాకు మందు కనిపెడితే రూ. కోటి ఇస్తా!
బీజింగ్ : చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు వుహాన్ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తమ దేశ పరిస్థితిని చూసి అక్కడి బహళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నాయి. అలీబాబా గ్రూప్, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సహా పలువురు వ్యాపారవేత్తలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి. తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్‌పై స్పందించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన.. మరో కీలక ప్రకటన చేశారు. కరోనాకు మందు కనిపెట్టిన వారికి 1 మిలియన్ యువాన్(రూ. 1 కోటి) రివార్డ్‌గా ఇస్తానని ప్రకటించారు. (ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!) కరోనాపై పోరాటం కోసం చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) సాయం చేశారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వేలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో చైనాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
ఈ ఫోటోలో ఉన్న సూపర్స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్
ముంబై : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram Breaking the internet z pic of the day can you name all superstar in this picture? #ShahRukhKhan #TeamShahRukhKhan 😍 A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan) on Oct 13, 2019 at 7:40am PDT ‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్‌లతో షారూఖ్ షేర్ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు అభిమానులు షేర్ చేసిన ఓ వీడియోలో షారుఖ్ తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్.. జాసన్ అభిమానని షారుఖ్ తెలిపారు. ఏప్రిల్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. View this post on Instagram Khan, Damme, Chan at the #JoyForum19. The joys all mine as I got to meet my heroes. @jcvd @jackiechan @joyforumksa A post shared by Shah Rukh Khan (@iamsrk) on Oct 13, 2019 at 8:17am PDT సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు. అనుష్కశర్మ, కత్రినాకైఫ్ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్ బిజీ బిజీగానే గడుపుతున్నారు. -
యాక్షన్ అవార్డ్స్
బాలీవుడ్లో విద్యుత్ జమాల్‌కు యాక్షన్ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్ నటించిన ‘జంగిల్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్ మూవీ లవర్స్ మనసు గెల్చుకున్నారు జమాల్. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో భాగంగా ఇండియన్ చిత్రం ‘జంగిల్’కు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్ యాక్షన్ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్ టుక్కర్ (చైనీస్ యాక్షన్ హీరో) కూడా మా యాక్షన్ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్. -
జాకీచాన్‌తో హృతిక్
సినీ ప్రపంచంలో జాకీచాన్ తెలియని వారుండరు. యాక్షన్ చిత్రాలకు జాకీచాన్ ఫేమస్. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జాకీచాన్. ప్రస్తుతం ఈ సూపర్‌స్టార్‌ను హృతిక్ రోషన్ కలిసి కాసేపు ముచ్చటించాడు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైనాకు వెళ్లిన హృతిక్ జాకీచాన్‌ను కలిశాడు. హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా వచ్చిన కాబిల్(తెలుగులో ‘బలం’) చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయనున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి చిత్రయూనిట్ ప్రమోషన్స్ పెంచేసింది. ఇందులో భాగంగానే జాకీచాన్‌ను హృతిక్‌రోషన్ కలిశాడు. ఇప్పటికే చైనా మార్కెట్లో ఇండియన్ సినిమాలు దుమ్ములేపుతుండగా.. హృతిక్ నటించిన కాబిల్ ఏమేరకు రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. 2017లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. -
అభద్రతాభావమే అందుకు కారణం
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది. అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్. -
చాన్‌తో చైనాలో...
బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ జాకీచాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ఈ సూపర్ కాంబినేషన్‌ని సెట్ చేశారు దర్శకుడు అనీష్ బజ్మీ. 2002లో వచ్చిన ‘ఆంఖే’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆంఖే 2’ రూపొందిస్తున్నారాయన. ఫస్ట్ పార్ట్‌లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ తాజా సీక్వెల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, విక్కీ కౌశల్‌ను తీసుకోవాలనుకుంటున్నారట దర్శకుడు అనీష్. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఎక్కువ శాతం చైనాలో జరగబోతోందట. దాంతో యాక్షన్ హీరో జాకీచాన్ అయితే సూపర్ చాయిస్ అని దర్శకుడు భావించారట. చాన్‌తో చైనాలో కామెడీ డ్రామాగా సాగనుంది. 2019లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, తరుణ్ అగర్వాల్ నిర్మించనున్నారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది. -
ట్రక్కుతో చిక్కు తప్పెన్
చైనా యాక్షన్ సూపర్ స్టార్ జాకీ చాన్ అంటే యాక్షన్ సినిమా ప్రియులందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎంతో రిస్కీ స్టంట్స్‌ని కూడా అవలీలగా స్క్రీన్ మీద చేసేస్తారు. కానీ స్క్రీన్ వెనక ఆ స్టంట్స్ కోసం ఎంత సాహసానికైనా రెడీ అంటారు. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు ఒళ్లు జల్లెడ అయిపోయేలా దెబ్బలు తగిలించుకొన్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు. ఆయన శరీరం మీదున్న ప్రాక్చర్స్ అయితే లెక్క లేనన్ని. తాజాగా ‘ప్రాజెక్ట్ ఎక్స్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు జాకీ. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫేమ్ జాన్ సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కూడా ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట జాకీ చాన్.జాకీ మాత్రమే కాదు మొత్తం చిత్రబృందం ‘మడ్‌స్లైడ్’ (మట్టి దానంతట అదే కుదించుకుపోయే ప్రకృతి వైపరీత్యం) నుంచి తప్పించుకున్నారట. ఈ విషయాన్ని జాకీ పంచుకుంటూ – ‘‘లొకేషన్లో షూటింగ్ చేస్తుండగా వాతావరణంలో మార్పు వచ్చేసి మట్టి కుదించుకుపోవడం స్టార్ట్ అయింది. మా ప్రొడక్షన్ ట్రక్కులన్నీ అందులో చిక్కుకుపోయాయి. మా టీమ్ అంతా భయపడిపోయాం. ఇంతలో పెద్ద ట్రక్ వచ్చి మమ్మల్ని కాపాడింది. వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవం వల్ల మాకో పాఠం బోధపడింది. వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిసింది’’ అని పేర్కొన్నారు. -
యాక్షన్ మీట్స్ యాక్షన్
మార్షల్ ఆర్ట్స్ అంటే జాకీ చాన్ చేస్తేనే చూడాలి. ఆయన చేసే ఫైట్స్ అంత బాగుంటాయి. సినిమా లవర్స్‌కి, యాక్షన్ లవర్స్‌కి ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా స్టార్స్‌లోనూ ఆయన ఫ్యాన్స్ ఉంటారు. ‘దంగల్’ చిత్రంలో నటించిన ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా కూడా జాకీ అభిమానులు. ఆ చిత్రంలో ఈ ఇద్దరూ మల్లయోధులుగా విజృంభించిన సీన్స్‌ని అంత సులువుగా మరచిపోలేం. ఈ యాక్షన్ స్టార్స్ ఇద్దరూ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ని కలిశారు. చైనాలో జరిగిన జాకీ చాన్ యాక్షన్ మూవీ వీక్‌లో పాల్గొనడానికి ఫాతిమా, సాన్యా వెళ్లారు. అప్పుడు జాకీ చాన్ని కలిసి, ఫొటో దిగారు. ‘‘ఓ లెజెండ్‌ని కలిశాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ సింపుల్ పర్సన్’’ అని ఈ ఇద్దరూ పేర్కొన్నారు. -
క్రేజీ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్
లాస్ ఏంజెల్స్: క్రేజీ కాంబినేషన్లో హాలీవుడ్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కోబోతోంది. యాక్షన్ హీరో జాకీ చాన్, ప్రముఖ రెజ్లర్ జాన్ సీనా హీరోలుగా ఓ చిత్రం రాబోతుంది. అమెరికన్ డైరెక్టర్ స్కాట్ వా డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ ఎక్స్’ గా చిత్రం తెరకెక్కబోతుండగా.. చాన్-సీనాలను హీరోలుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాకు ఎక్స్-బాగ్దాద్ పేరును పరిశీలించగా.. హాలీవుడ్ దిగ్గజం సిల్వస్టర్ స్టాలోన్ పేరును హీరోగా పరిశీలించారు. అయితే అనూహ్యాంగా సిల్వస్టర్ను తప్పించి.. ఆప్లేస్‌లో జాన్ సీనాను తీసుకున్నారు. టైటిల్‌ను కూడా ప్రాజెక్టు ఎక్స్‌గా మార్చినట్లు స్కాట్ ఓ ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఈ చిత్రానికి జాకీ చాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. కాగా, హాంగ్ కాంగ్‌కు చెందిన జాకీ చాన్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఆ మధ్య ‘ది ఫారినర్’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం షాంగై నూన్, రష్ హవర్ సీక్వెన్స్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా పేరొందిన జాన్ సీనా.. 2006లో ది మెరైన్ ద్వారా హీరోగా మారారు. సుమారు అరడజనుపైగా చిత్రాల్లో నటించిన సీనా.. త్వరలో ‘ది రాక్’(డ్వెన్ జాన్సన్) నిర్మాతగా తెరకెక్కించనున్న ఓ చిత్రంలో కూడా నటించబోతున్నాడు. -
జాకీ కూతురికి కష్టాలా?
‘‘నాకు ఇల్లు లేదు’’ అంటున్నారు జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్జీ. మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీ చాన్ కుమార్తెకు ఇల్లు లేకపోవటమేంటి? అనే సందేహం కలగవచ్చు. కానీ ఎట్టా ఎన్జీ జాకీ చాన్ సొంత కుమార్తె కాదు. హాంగ్‌కాంగ్ బ్యూటీ క్వీన్ ఎన్జీతో జాకీ ఎఫైర్ సాగించినప్పుడు కలిగిన సంతానమే ఎట్టా. ‘‘ప్రస్తుతం నేను ఉండటానికి ఇల్లు కూడా లేదు, కారణం మా పేరెంట్స్ బిహేవియరే’’ అని ఓ వీడియో అప్లోడ్ చేశారు ఎట్టా. ‘‘నేను జాకీచాన్ కూతుర్ని. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు ఆండీ. నెల రోజులుగా మేం ఇల్లు లేకుండా ఉన్నాం. బ్రిడ్జ్‌ల కింద పడుకున్నాం. మా పేరెంట్స్ ‘హోమోఫోబిక్’ బిహేవియర్ కారణంగానే మేం ఇల్లు లేనివాళ్లం అయ్యాం. మేం పోలీసుల దగ్గరకు, హాస్పిటల్స్, ఫుడ్ బ్యాంక్స్, ఎల్జీబీటి (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్) సెంటర్స్‌కు వెళ్లాం సహాయం కోసం. కేవలం మేమిద్దరం లెస్బియన్స్ (స్వలింగ సంపర్కులం) అనే కారణంగానే మాకెవరూ సహాయపడటంలేదు. ఈ కారణంగానే కన్నవాళ్లు కూడా దూరం పెట్టేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టా. అయితే విషయం ఏంటంటే.. జాకీచాన్‌కు ఒకప్పుడు ఎన్జీతో సంబంధం ఉన్నప్పటికీ ఆమె ద్వారా కలిగిన ఎట్టాను ఆయన ఓన్ చేసుకోలేదనే టాక్ ఉంది. -
బ్రిడ్జి కింద తలదాచుకుంటున్న జాకీ చాన్ కూతురు
-
యాక్షన్ హీరో కూతురికి ఇల్లు కూడా లేదట..
తండ్రేమో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాక్షన్ హీరో...మరి అలాంటప్పుడు ఆయన వారసులకు దేనికి కొరత ఉండదు అనే అభిప్రాయం సహజం. కానీ జాకీ చాన్(62) కూతురు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. జాకీ చాన్ కుతూరు ఎట్టా ఎన్(18) ‘ప్రస్తుతం నాకు ఉండేందుకు ఇల్లు లేదు. నెల రోజుల నుంచి నేను నా గర్ల్‌ఫ్రెండ్ ఇద్దరమూ హంగ్‌కాంగ్‌లోని ఒక బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నాము’ అంటూ ఒక వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఎట్టా పోస్టు చేసిన వీడియోలో ‘మేము ఒక నెల నుంచి ఈ బ్రిడ్జి కిందనే తలదాచుకుంటున్నాము. తినడం, పడుకోవడం అంతా ఇక్కడే. మాకు ఆశ్రయం కల్పించమని పోలీసులు, ఆస్పత్రి, ఆహార బ్యాంకు, ఎల్జీబీటీక్యూ(లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి) కమ్యూనిటిల దగ్గరకు కూడా వెళ్లాము. కానీ వారు మాకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎవ్వరు మాకు సాయం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ విషయాలన్నింటిని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ’ అని తెలిపింది. ఈ వీడియోలో ఎట్టాతో పాటు ఆమె స్నేహితురాలు అండీ ఆటుమాన్ కూడా ఉన్నది. ఎట్టా మాజీ అందాల రాణి ఎలెన్ ఎన్, జాకీ చాన్ల కూతురు. ఈ యాక్షన్ హీరో ప్రస్తుత భార్య జోన్ లిన్ కంటే ముందు ఎలెన్‌తో జాకీ చాన్‌కు సంబంధం ఉంది. వీరి బంధం గురించి ఈ హీరో బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ కూతురు ఎట్టా విషయంలో మాత్రం మౌనంగానే ఉన్నాడు. అయితే ఎలెన్ కూతురు చేసిన ఆరోపణనలను ఖండిస్తూ ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా పని వెతుక్కుంటే మంచిదని హితవు పలికారు. ‘నీకు డబ్బులు కావాలంటే కష్టపడి పనిచేసి సంపాదించు, అంతేకానీ ఇలా ఒకరి పేరు ప్రతిష్టల మీద ఆధారపడటం మంచి పద్దతి కాద’ని తెలిపారు. ఎట్టా గతంలో తన తండ్రి జాకీ చాన్ గురించి ‘అతను నా జీవితంలో లేడు...నేను అతన్ని ఒక తండ్రిగా ఎప్పటికి పరిగణించను’ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
డియర్ సోనూ... ఇది నీకోసం
ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రత్యేక బహుమతితో పాటు ఆత్మీయ లేఖ అందుకోవడమే సోనూ ఆనందానికి కారణం. ఇంతకీ ఆ ఆత్మీయులు ఎవరంటే.. ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్. ఇండో- చైనీస్ భాగస్వామ్యంలో ‘కుంగ్ ఫూ యోగా’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో జాకీ చాన్, సోనూ సూద్ మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి జాకీ చాన్ సోనూ సూద్‌కు ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నాడు. తాజాగా జేసీ స్టంట్ టీమ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లెదర్ జాకెట్‌ను సోనూకి పంపించాడు. దానితో పాటు ఒక ఆత్మీయ లేఖ కూడా రాసి సర్ప్రైజ్ చేశాడు. ‘మై డియర్ సోనూ.. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న సోదరులతోపాటు అతి కొద్ది మంది ఆత్మీయులకు మాత్రమే ఈ కానుక ఇస్తున్నాను. ఇది చిన్న కానుకే అయి ఉండవచ్చు కానీ దీన్ని చూసిన ప్రతీసారీ నీకు నేను గుర్తొస్తాను. అప్పుడు నేను నీతోపాటుగా ఉన్నట్టే నువ్వు భావిస్తావు’ అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ జతచేశాడు. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ నుంచి బహుమతులతో పాటు ఆత్మీయ లేఖలు కూడా అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా.. సోనూ సూద్ కూడా ఇపుడు ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో కూడా జాకీ చాన్ ‘అయామ్ జాకీచాన్: మై లైఫ్ ఇన్ యాక్షన్’ అనే బుక్‌తో పాటు, నీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ లేఖ రాశాడు. -
భీమ్ కీ గురు?
మోహన్‌లాల్ భీముడిగా ‘మహాభారతం’ ఆధారంగా వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని భారతీయ భాషలకు చెందిన టాప్ హీరోలు ఈ సినిమాలో ఏదో ఓ పాత్రలో తళుక్కున మెరుస్తారని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడీ సినిమా తారగణంలోకి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరో జాకీచాన్ కూడా యాడ్ అయ్యారు. భీమసేనుడికి యుద్ధవిద్యలు నేర్పిన నాగరాజు పాత్రలో జాకీచాన్ కనిపించనున్నారని సమాచారం. మలయాళ రచయిత ఎమ్.టీ వాసుదేవన్ నాయర్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ ‘మహాభారతం’ సినిమాను ఆల్రెడీ మోహన్‌లాల్‌తో ‘ఒడియన్’ అనే సినిమాను తెరకెక్కించిన శ్రీకూమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. -
లవర్ ప్రెగ్నెంట్.. రహస్యంగా సూపర్‌స్టార్ పెళ్లి!
హాలీవుడ్ టాప్ యాక్షన్ సూపర్ స్టార్లలో జాకీ చాన్ ఒకరు. ఆయన 2015లో చైనా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. గతంలో ఈ ఇంటర్వ్యూ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చాలా నిజాయితీగా జాకీ చాన్ పలు విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాలు జోవన్ లిన్ గర్భవతి కావడంతో 1982లో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జాకీ స్పష్టం చేశాడు. ఆ తర్వాత తమకు మొదటి కొడుకు పుట్టాడని చెప్పాడు. జోవన్ లిన్, జాకీ చాన్ దంపతులు గత 35 ఏళ్లుగా వైవాహిక జీవితంలో కొనసాగుతున్నారు. ‘అది అనుకోకుండా జరిగింది. లిన్ గర్భవతి అవుతుందని, జాయ్సీ (కొడుకు) పుడుతాడని నేను అనుకోలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు ఉండేది కాదు. కానీ నాకు బలవంతంగా పెళ్లి చేశారన్న భావన ఇప్పుడు కలుగుతోంది’ అని జాకీ చాన్ చెప్పాడు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు తనకు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారని జాకీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. 1982లో లాస్ ఏంజిల్స్‌లోని కాఫీషాప్‌లో లిన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. జాకీ చాన్ లిన్‌తో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూనే.. అనేక మందితో ఎఫైర్లు పెట్టుకున్నాడని రూమర్లు ఉండేవి. మాజీ బ్యూటీక్వీన్ ఎలైన్ ఎన్జీ ఆయన రహస్యంగా ఎఫైర్ కొనసాగించాడు. ఆ ఫలితంగా 1999లో జాకీ చాన్ కూతురు ఎట్టాకు ఎలైన్ జన్మనిచ్చిందని షాంఘైయిస్ట్.కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కూరుతు ఎట్టాతో జాకీకి ఇప్పుడు అంతంతమాత్రంగానే సంబంధాలు ఉన్నాయట. ఇక, ఆయన కొడుకు 2014లో మాదక ద్రవ్యాలతో బీజింగ్‌లో అరెస్టైన సంగతి తెలిసిందే. -
ఇండియాలో ఫ్లాప్.. రూ.1200 కోట్ల కలెక్షన్లు!
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’ భారత్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా అంతర్జాతీయంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లు(180 మిలియన్ డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందని ‘బాక్సాఫీస్ మోజో’ వెల్లడించింది. ఇందులో ఒక్క చైనాలోనే 179 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. జాకీచాన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన రోజు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే రాబట్టిందని ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో బాలీవుడు నటులు సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. -
జాకీ మార్క్ యాక్షన్‌తో...
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’. సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో తెలుగులో వచ్చిన జాకీచాన్ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. స్టాన్లీ టాంగ్, జాకీచాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రంబుల్ ఇన్ ది బ్రాంక్స్’, ‘ది మిత్’, ‘చైనీస్ జోడియాక్’ వంటి చిత్రాలు కలెక్షన్ లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. మరోసారి వీరి కలయికలో వస్తోన్న ‘కుంగ్ ఫూ యోగ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాకీచాన్ మార్క్ యాక్షన్ కామెడీతో పాటు ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలోని పలు రకాల జంతువులు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు. -
జాకీచాన్ ఇన్ ముంబై...
-
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
-
క్లిక్.. క్లిక్...
రిపబ్లిక్ డే వర్ణాలు... జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం. న్యూఢిల్లీ రాజ్‌పథ్‌లో సైనిక విన్యాసాలు, రాష్ట్రాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలు, విద్యార్థుల నృత్యాలు... చూడటానికి రెండు కళ్లూ చాలవు. సోమవారం అక్కడ డ్రస్ రిహార్సల్స్ జరిగాయి. పిల్లలు ఉత్సాహంగా నృత్యం చేస్తున్న ఫొటో ఇది. ఖైదీ నృత్యం ఈ ఫొటోలో ఉత్సాహంగా నృత్యం చేస్తున్నది డాన్సర్లు కాదు. జబల్పూర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్ జైల్లో ఉన్న మహిళా ఖైదీలు. నిన్న నేతాజీ జయంతి సందర్భంగా జైలులో వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలను ఉల్లాసభరితం చేయడానికి మహిళా ఖైదీలు ఇలా నృత్యాలు చేశారు. చాన్ ఇన్ ముంబై... జాకీచాన్ అంటే తెలియనిది ఎవరికి? భారతీయ నటులతో చైనా– భారత్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమైన ‘కుంగ్‌ఫూ యోగా’లో జాకీచాన్ హీరో. అతడితో పాటుగా మన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా నటించాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం నిన్న జాకీచాన్ ముంబై చేరుకున్నాడు. అభిమానులంతా తమ హీరోని చూసి పులకించిపోయారు. -
కపిల్ షోలో ఈసారి గెస్ట్ ఎవరో తెలుసా?
టీవీ టాక్ షోలలో కపిల్ శర్మ పేరు దేశంలో మార్మోగిపోతుంటుంది. సినిమా సెలబ్రిటీలను పిలవడం, త్వరలో విడుదల కాబోతున్న వాళ్ల సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఆగకుండా గంట పాటు విపరీతంగా నవ్వించే కపిల్ షో అంటే చాలామందికి క్రేజ్. హీరోయిన్లను తనదైన శైలిలో ఆరాధించే కపిల్ చేష్టలు చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. అలాంటి షోకు ఈసారి ఎవరు వస్తున్నారో తెలుసా.. సాక్షాత్తు జాకీ చాన్!! అవును.. ఇప్పటికే షారుక్, సల్మాన్ సహా పెద్ద పెద్ద స్టార్లందరినీ తన షోలోకి తీసుకొచ్చిన కపిల్ శర్మ ఇప్పుడు రాబోతున్న అతిథి గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యాడు. తాను నటించిన సినిమా 'కుంగ్‌ఫూ యోగా' ప్రమోషన్ కోసం జాకీ చాన్ ఈ షోకు రావాలని నిర్ణయించుకున్నాడట. ఆ విషయాన్ని కపిల్ ట్వీట్ చేశాడు. 'ఓ మై గాడ్.. కపిల్ షోలో జాకీచాన్' అని ఒక్క లైన్ మాత్రమే పెట్టాడు. కుంగ్‌ఫూ యోగా సినిమాలో బాలీవుడ్ నటీ నటులు దిశాపటానీ, సోనూ సూద్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో జాకీచాన్‌ది ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్ర. Oh my god .. #jackiechanontkss — KAPIL (@KapilSharmaK9) 23 January 2017 -
కుంగ్ ఫూ ఇన్ ఇండియన్ స్టైల్
-
జాకీచాన్‌కు హిందీలో తిట్లు నేర్పించా: నటి
ఇండో-చైనీస్ ప్రొడక్షన్లో వస్తున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో జాకీచాన్ సరసన హీరోయిన్గా నటిస్తున్న అమైరా దస్తురా తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ ఇంటర్నేషనల్ మెగాస్టార్‌కి సరదాగా హిందీలో కొన్ని చెడ్డ పదాలు, తిట్లు నేర్పించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో ముచ్చటించిన ఈ భామ అయితే తాను ఏం పదాలు జాకీచాన్‌కు నేర్పించాననే విషయాన్ని వెల్లడించలేదు. 'షుక్రియా' అన్న పదానికి బదులు ఓ సభ్యోక్తిని జాకీచాన్‌కు తాను నేర్పించానని, ఆ పదాన్ని తన భారతీయ సహ నటుడు సోనూ సోద్ను ఉద్దేశించి జాకీచాన్ అనడంతో ఆయన కంగుతిన్నారని పేర్కొంది. 'సోనూ నా దగ్గరికి వచ్చి జాకీచాన్ మంచి హిందీ పదాలు నేర్పించాలని కోరాడు. ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడు పొరపాటున ఇలాంటి చెడ్డ పదాలు ఉపయోగిస్తే.. చిక్కులు వస్తాయని చెప్పాడు. ఆయన ముందు నాకేం తెలియనట్టు అమాయకంగా నటించాను' అని అమైరా కొంటెగా తెలిపింది. జాకీచాన్ గొప్ప నటుడని, ఆయనలో అపారమైన ఎనర్జీ ఉంటుందని అమైరా ప్రశంసల్లో ముంచెత్తింది. ఇంతటి స్టార్డమ్ ఉన్నా ఆయన ప్రజలకు నిత్యం ఏదో ఇవ్వాలని తపిస్తుంటారని కొనియాడారు. -
హాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్
త్వరలో డియర్ జిందగీ, రాయిస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న షారూఖ్, ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడట. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్, అలెక్సీతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రణబీర్ కపూర్ కూడా నటిస్తున్నాడు. వీఐవై సీరీస్‌లో తెరకెక్కిన 'వీఐవై - ఏ జర్నీ టు ది చైనా' సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 40 మిలియన్ల అమెరికన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం షారూఖ్, రణబీర్‌లను జాకీచాన్ స్వయంగా ఎంపిక చేసాడట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీగా తెరకెక్కించి అదే స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్
ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ గుర్తుందా? ఈ బ్లాక్‌బస్టర్ సినిమాతో పాటు ఇంతకు ముందు లోఫర్ సినిమాలో కూడా చేసిన ఈ హీరోయిన్.. ఏకంగా జాకీచాన్‌కు డాన్సు నేర్పించిందట. కుంగ్‌ఫూ యోగా సినిమాలో చాన్‌తో పాటు కలిసి చేసిన ఈమె.. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలో ఒక పాటకు సంబంధించిన డాన్సును చాన్‌కు నేర్పించిందట. నిజానికి జాకీచాన్‌కు కూడా డాన్సు అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. భారత-చైనా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న కుంగ్‌ఫూ యోగా సినిమాలో సోనూ సూద్, అమైరా దస్తూర్ కూడా నటిస్తున్నారు. జాకీ చాన్ తనకు చైనా పాట నేర్పించారని, అందుకు బదులుగా తనవద్ద డాన్సు, హిందీ కూడా నేర్చుకున్నారని దిశా పటానీ చెప్పింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలోని 'తూ మేరీ' పాటకు జాకీచాన్ డాన్సు చేశాడట. సహజంగానే యాక్షన్ స్టార్ కాబట్టి ఆయన శరీరంలో మంచి లయ ఉందని, అందువల్ల మంచి డాన్సర్ కూడా అయ్యారని ప్రశంసలు కురిపించింది. 62 ఏళ్ల వయసులో కూడా చాన్ బలే చురుగ్గా కదులుతారని చెప్పింది. తొలిసారి తాను ఆయనను కలిసినప్పుడు అసలు నమ్మలేకపోయానని, తన దగ్గరకు వచ్చి మాట్లాడగానే.. 'ఓ మై గాడ్.. ఆయన నాతో మాట్లాడారు, నా పేరు కూడా తెలుసు' అనుకున్నానని దిశా పటానీ చెప్పింది. ఫైట్లకే మారుపేరు అయిన చాన్‌తో కలిసి ఫైట్లు చేయడం అంటే.. తనకు నవ్వు వచ్చేదని కూడా తెలిపింది. ఈ సినిమాలో ఫైట్లు చేసే హీరోయిన్ కోసం వాళ్లు చూస్తున్నారని.. తాను అప్పటికే ఏడాదిన్నర నుంచి జిమ్నాస్టిక్స్, కిక్స్ చేస్తున్నానని, దాంతో వాళ్లు తనను పిలిచి ఆడిషన్ పెట్టగానే ఎంపికయ్యానని చెప్పింది. -
జాకీచాన్‌కు గౌరవ ఆస్కార్
యాక్షన్ మూవీ హీరో, రచయిత, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన జాకీచాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు, ఆయన సాధించిన విజయాలకు గాను గౌరవ ఆస్కార్‌ను అందించాలని ఆస్కార్ జ్యూరీ నిర్ణయించింది. జాకీతో పాటు ఎడిటర్ అన్నేకోట్స్, కాస్టింగ్ డైరెక్టర్ లెన్ స్టేల్మాస్టర్, డాక్యుమెంటరీ దర్శకుడు ఫ్రెడ్రిక్ వైజ్మన్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నవంబర్‌లో జరగనున్న ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ నలుగురికి అవార్డు ప్రధానం జరుగనుంది. ప్రస్తుతం జాకీచాన్ ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనూసూద్, దిశాపటాని లాంటి భారతీయ నటీనటులు కూడా నటిస్తుండగా, పలువును ఇండియన్ టెక్నిషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. -
జాకీచాన్ చిత్రాన్ని సూపర్‌స్టార్ చూస్తారా?
జాకీచాన్ ఈ పేరు వింటేనే అబ్బురపరచే యాక్షన్ చిత్రాలు గుర్తుకొస్తాయి. బ్రహ్మాండ చిత్రాలకు మారుపేరు జాకీచాన్ అనవచ్చు. ఆయన నటించిన అనేక చిత్రాలు భారతీయ సినీ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేశాయి. జాకీచాన్ చిత్రాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ప్రపంచ హీరో నటించిన తాజా చిత్రం స్కిప్ ట్రాస్. ఈ చిత్రం ఈ మధ్యనే చైనాలో విడుదలై ఒక్క రోజులోనే 420 కోట్లు వసూలు చేసిందని, వారానికే వెయ్యికోట్లు కలెక్ట్ చేసిందని ఈ చిత్రాన్ని తమిళంలోకి ఇరు కిల్లాడిగళ్ పేరుతో అనువదించి విడుదల చేస్తున్న సన్‌మూన్ పిక్చర్స్ విశ్వాస్ సుందర్ తెలిపారు. విశేషం ఏమిటంటే మన సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి విడుదలైన రోజునే స్కిప్ ట్రాస్ చిత్రం చైనాలో విడుదలైంది. కబాలి చిత్రాన్ని విడుదలైన రోజునే జాకీచాన్ చూసి బ్రహ్మాండం అని అభినందించారట. కాగా ఇరు కిల్లాడిగళ్ పేరుతో సెప్టెంబర్ రెండో తేదీన విడుదల కానున్న స్కిప్ ట్రాస్ చిత్రాన్ని రజనీకాంత్ చూస్తారా? అన్న ఆసక్తిని జాకీచాన్ వర్గం వ్యక్తం చేస్తోందట. ఇది పక్కా కమర్షియల్ కథా చిత్రం అని నిర్మాత విశ్వాస్సుందర్ తెలిపారు. -
జాకీచాన్‌తో తెలుగమ్మాయి?
ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే, దిశా పటాని, అమైరా దస్తూర్.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఇండియన్ హీరోయిన్లు. ఈ జాబితాలో త్వరలోనే ఓ తెలుగుమ్మాయ్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చైనీస్ సూపర్‌స్టార్ జాకీ చాన్ ‘స్కిప్‌ట్రేస్-2’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో ఇండియన్ హీరోయిన్లనే ఎంపిక చేయమని జాకీచాన్ కండీషన్ పెట్టారట. దాంతో దర్శక - నిర్మాతలు ఆ పనిలో పడ్డారు. ‘రమణ్ రాఘవ్ 2.0’తో హిందీలో హీరోయిన్గా పరిచయమైన తెలుగమ్మాయ్ శోభితా ధూళిపాళతో పాటు తిలోత్తమ షోమెలను ఆడిషన్ చేశారు. శోభితా ధూళిపాళ దాదాపు ఖాయమైనట్లేనట. అయితే, ఇంకా సంతకం చేయలేదంటున్నారు. ‘ది మిత్’లో మల్లికా శెరావత్, ‘కుంగ్ ఫూ యోగా’లో దిశా పటాని, అమైరా దస్తూర్లకు జాకీ అవకాశం ఇచ్చారు. 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ కిరీటం సొంతం చేసుకున్న శోభిత పుట్టింది గుంటూరులో, పెరిగింది విశాఖలో. ‘రమణ్ రాఘవ్ 2.0’లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. -
అభినేత్రి ప్రమోషన్లో జాకీచాన్
తమన్నా లీడ్ రోల్లో ప్రభుదేవా, సోనూసూద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభినేత్రి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తమిళంలో డెవిల్ పేరుతో, హిందీలో టూ ఇన్ వన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్‌ను ప్రభుదేవా, హిందీ వర్షన్‌ను సోనూసూద్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్, కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ ప్రమోషన్ ప్రారంభించిన సోనూ, పోస్టర్ లాంచ్‌కు ఏకంగా హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్‌ను ఆహ్వానించాడు. ప్రస్తుతం జాకీతో కలిసి కుంగ్ ఫూ యోగా అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు సోనూ. ఆ అనుబంధంతోనే సోనూసూద్ నిర్మించిన తొలి సినిమా పోస్టర్‌ను లాంచ్ చేశాడు జాకీ. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న అభినేత్రి హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ప్రభుదేవా, సోనూసూద్‌లు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అభినేత్రి సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎలుకకు డబ్బింగ్ చెపుతున్న జాకీచాన్
ప్రస్తుతం ఇండో చైనీస్ కథతో తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా చిత్రంలో నటిస్తున్న జాకీచాన్ మరో హాలీవుడ్ సినిమా కోసం గాత్రదానం చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ యానిమేషన్ సీరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న ది నట్ జాబ్ 2 సినిమాలోని లీడ్ క్యారెక్టర్‌కు జాకీ చాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. ఎలుకల గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించే ఎలుక పాత్రకు జాకీ గాత్రదానం చేయటం విశేషం. గతంలోనూ కుంగ్ ఫూ పాండా సీరీస్‌లో రూపోందిన చిత్రాలకు జాకీ డబ్బింగ్ చెప్పారు. కాల్ బ్రంకర్, కేథెరిన్ హీగిల్, విల్ ఆర్నెట్ లాంటి హాలీవుడ్ టెక్నిషియన్స్ ద నట్ జాబ్ 2 సినిమాకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాను 2017లో మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రజనీకాంత్-జాకీ చాన్ కాంబినేషన్లో సినిమా?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ - చైనీస్ సూపర్ స్టార్ జాకీ చాన్ కాంబినేషన్లో సినిమా రూపొందనుందా? ప్రస్తుతం మలేసియన్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఇది. మలేసియన్ నిర్మాత మొహమ్మద్ రఫీజి మొహమ్మద్ జిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించనున్న ఈ చిత్రానికి ‘చినీ సాగ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. సూపర్ స్టార్స్ ఇద్దర్నీ సదరు మలేసియన్ నిర్మాత కలిశారట. ఈ చిత్రంలో కథానాయికగా నటించమని సోనమ్ కపూర్‌ని అడిగానని కూడా మలేసియన్ మీడియాతో పేర్కొన్నారాయన. రఫీజి చెబుతున్న మాటలు నిజమైతే ఇది కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలేసియాలోని చినీ అనే సరస్సులో ఉండే డ్రాగన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఇందులో పలువురు ప్రముఖ మలేసియన్ తారలు కీలక పాత్రలు చేస్తారట. నార్వే, ఇండియా, చైనా, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్‌లో చిత్రీకరించనున్నారని భోగట్టా. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా చేయాలనుకున్నారట. కానీ, బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని రఫీజి అంటున్నారు. 90 శాతం గ్రాఫిక్స్‌తో సాగే ఈ చిత్రం 90 శాతం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుందట. మరి.. ఈ చిత్రం నిజంగానే తెరకెక్కుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. -
పంజాబీ పాటకు హాలీవుడ్ హీరో డ్యాన్స్
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్, బాలీవుడ్ హంక్ సోనూసూద్ కలిసి నటిస్తున్న హాలీవుడ్ సినిమా కుంగ్‌ఫూ యోగా. ఈ సినిమా చైనాతో పాటు భారతీయతకు సంబందించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో ఓ ప్రధాన పాత్రకు సోనూసూద్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలు వీడియో మీడియాలో హల్ చల్ చేస్తుండగా తాజాగా సోనూసూద్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల చైనాలోని షాంగైలో జరిగిన షాంగై ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన జాకీచాన్, సోనూసూద్‌లు స్టేజ్ పై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. అది కూడా ఇండియన్ పంజాబీ సింగర్ దలెర్ మెహంది పాడిన ఫేమస్ సాంగ్ తునక్ తునక్ తున్ తానా నా.. పాటకు స్టెప్పులేశారు. కుంగ్ ఫూ యోగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన జాకీ, సోనూలు తమ డ్యాన్స్ లతో ఈవెంట్ కే హైలెట్ గా నిలిచారు. -
హాలీవుడ్ స్టార్ హీరో.. బాలీవుడ్ డ్యాన్స్
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ కొద్ది రోజులు భారత్‌లో సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా కుంగ్ ఫూ యోగా కోసం షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీతో పాటు పలువురు భారతీయ నటులు కూడా కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజా షెడ్యూల్లో జాకీ చాన్, సోనూసూద్లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొరియోగ్రాఫిలో జాకీ చేసిన ఇండియన్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జోద్ పూర్, మండోర్ గార్డెన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వెల్లడించారు. జాకీచాన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫరా, 'యాక్షన్ కింగ్ డ్యాన్ కూడా చేస్తాడు. తన పేరును జాకీ జాక్సన్‌గా మార్చుకోనున్నాడు' అంటూ కామెంట్ చేశారు. సోనూ సూద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్స్ అమైరా దస్తర్, దిశ పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. The King of action CAN dance n how!! Changing his name 2 Jackie Jackson!! #kungfu yoga pic.twitter.com/2rcQXvtKeg — Farah Khan (@TheFarahKhan) 4 April 2016 -
జాకీ ఏరిపారేశాడు!
మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీ చాన్ ప్రస్తుతం ఇడియాలో ఉన్న విషయం తెలిసిందే. ఇండో-చైనీస్ సంయుక్త సమర్పణలో జాకీ చాన్ హీరోగా రూపొందుతున్న ‘కుంగ్ ఫూ యోగా’ చిత్రం షూటింగ్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఇందులో మన భారతీయ నటీనటులు అమైరా దస్తర్, సోనూ సూద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ పోరాట దృశ్యం చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న నటుడు జాకీతో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో అని ఇక్కడి టెక్నికల్ టీమ్ అనుకున్నారట. కానీ, జాకీ అందరితో కలిసిపోయి, చాలా సరదాగా షూటింగ్ చేస్తున్నారట. షాట్ గ్యాప్‌లో అమైరాతో ఈల వేసి, గోల చేస్తున్నారట కూడా. అది మాత్రమే కాదు.. షూటింగ్ లొకేషన్లో చిత్తు కాగితాలు కనిపిస్తే ఏరిపారేస్తున్నారని సమాచారం. జాకీ చాన్ అంతటి గొప్ప వ్యక్తే ఆ పని చేస్తుంటే, తామెందుకు చేయకూడదని అమైరా, సోనూ వంటి తారలు, ఇతర సాంకేతిక బృందం కూడా కంటికి కనిపించిన చెత్తను ఏరిపారేస్తున్నారట. -
జోధ్‌పూర్ ప్యాలెస్‌లో జాకీచాన్ స్టెప్పులు!
దుబాయ్: మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తారలు 'లోఫర్' ఫేమ్ దిశా పాట్నీ, 'అనేకుడు' ఫేమ్ అమైరా దస్తర్ కథానాయికలు కాగా, విలన్ గా సోనూ సూద్ చేస్తున్నాడు. 'కుంగ్ ఫూ యోగా' మూవీ షూటింగ్ లో భాగంగా జాకీచాన్ సోమవారం (మార్చి 21న) భారత్ కు రానున్నాడు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డులు 2016లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ... జాకీచాన్ తో కలిసి తాను నటిస్తున్నానని, ఆ మూవీ కోసం ఆయన భారత్ కు రానున్నారని తెలిపాడు. గతంలో 'ద మిత్' మూవీలో బాలీవుడ్ ఐటమ్ బాంబు మల్లికా షెరావత్, జాకీచాన్ తో కలిసి నటించింది. 2013లోనూ మూవీ షూటింగ్ కోసం జాకీచాన్ భారత్ కు వచ్చాడు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ తో మూడు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో కుంగ్ ఫూ యోగా ఒకటి. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ 21న జాకీచాన్ ఇందు కోసం ఇండియా రానున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను మూడు వారాల పాటు చిత్రీకరిస్తారని సోనూ సూద్ వివరించాడు. -
ఇండియాలో... జాకీచాన్ డ్యాన్స్!
మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ గురించి సినీ అభిమానులకు పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఫైట్స్ చేస్తూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ సూపర్‌స్టార్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అదీ మన బాలీవుడ్ స్టయిల్ పాటకు! ప్రస్తుతం జాకీచాన్ ఆ సన్నాహాల్లోనే ఉన్నారని సమాచారం. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందు తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు దిశా పాట్నీ (‘లోఫర్’ ఫేమ్), అమైరా దస్తర్ (‘అనేకుడు’ ఫేమ్) కథానాయికలు కాగా, సోనూ సూద్ విలన్. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ నెల 20న జాకీచాన్ దీని కోసం ఇండియా రానున్నారట. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను గ్రాండియర్‌గా మూడు వారాల పాటు చిత్రీకరించనున్నారు. -
'శాంటాను కలిసినంత ఆనందంగా ఉంది'
తెలుగు సినిమాతో వెండితెర మీదకు అడుగుపెట్టిన దిశాపటానీ.. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందట. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దిశా. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అనుకోకుండా వచ్చిన హాలీవుడ్ ఆఫర్ మాత్రం ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో దిశపటానీ ఓ ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది. మరో భారతీయ నటుడు సోనుసూద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సోనూ, జాకీ చాన్ తన మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్న దిశా.. ఇప్పుడు జాకీని ఏకంగా శాంటాతో పోల్చింది. తనను షూటింగ్ సమయంలో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న జాకీచాన్‌ను పొగడటానికి శాంటా అనే పదం చాలదంటూ కామెంట్ చేసింది. 'నా గురించి ఎంతో కేర్ తీసుకుంటున్న స్వచ్ఛమైన మనిషికి కృతజ్ఞతలు. నువ్వు ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటావు. చాలా మందికి నువ్వు జాకీచాన్ గానే తెలుసు, కానీ నువ్వు ఎంత గొప్పవాడివో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుంది. ఎంతో గొప్పగా ప్రేమించే వ్యక్తితో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శాంటా నన్ను కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత కన్నా ఎక్కువ. నీ గురించి చెప్పడానికి శాంటా అన్న పదం చాలదు'. అంటూ జాకీచాన్‌ను ఆకాశానికి ఎత్తేసింది దిశాపటాని. Thank you to the most pure soul on this planet for taking so much care of me !! You are and you… https://t.co/wnH9yTQTWo — disha patani (@DishPatani) March 7, 2016 -
బ్రిడ్జ్‌పై పేలిన డబుల్ డెక్కర్ బస్సు.. ప్రజలకు షాక్!
అది సెంట్రల్ లండన్‌లోని లాంబెత్ బ్రిడ్జ్. అత్యంత భద్రత ఉండే ఎంఐ5 ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరం. ఆదివారం ఉదయం కావడంతో ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలో సేద దీరుతున్నారు. ఇంతలోనే లాంబెత్ బ్రిడ్జ్‌పై ఓ డబుల్ డెక్కర్ బస్సు ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద పెట్టున శబ్దం చేస్తూ.. మంటలు ఎగజిమ్ముతూ పేలుడు జరుగడంతో దానిని చూసిన ప్రజలు అదిరిపోయారు. 2005 జూలై 7నాటి ఉగ్రవాద దాడులను తలపిస్తూ ఈ పేలుడు జరుగడంతో ముష్కరులు మళ్లీ లండన్‌పై పంజా విసిరారా? అని బెంబేలెత్తారు. ప్రజలు ఇలా బిక్కుబిక్కుమంటుడగా.. చావు కబురు చల్లగా చెప్పినట్టు అధికారులు అది నిజమైన పేలుడు కాదు.. ఓ సినిమా షూటింగ్ కోసం తీసిన ఉత్తుత్తి పేలుడు అంటూ తేల్చేశారు. యాక్షన్ స్టార్ జాకీచాన్ తాజా హాలీవుడ్ సినిమా 'ద ఫారేనర్' కోసం ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. నిజమైన పేలుడుకు ఏమాత్రం తీసిపోనిరీతిలో లాంబెత్ వంతెనపై తీసిన ఈ షూటింగ్ తో షాక్ తినడం ప్రజల వంతైంది. స్థానిక ప్రజలకు సమాచారమివ్వకుండా సినిమా షూటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారు.. వంతెనపై నిజంగా బస్సును పేల్చడమేమిటి అంటూ స్థానిక నెటిజన్లు, ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై గరంగరం అవుతున్నారు. Anyone worried about the exploding bus on Lambeth Bridge just now? It was just for a movie. pic.twitter.com/1ypWZZ6jPp — Nigel Huddleston MP (@HuddlestonNigel) February 7, 2016 -
హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది
తొలి సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేస్తోంది దిశాపటాని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన దిశ, ఇప్పుడు జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న ఈ బ్యూటి, ఈ సినిమాలో జాకీకి జోడిగా నటిస్తోందట. సోనూసూద్, అమైరా దస్తర్ లాంటి భారతీయ నటులు నటిస్తున్న ఈ సినిమా కథ ఇండియా, చైనాల నేపథ్యంలో సాగుతోంది. టిబెట్‌లో ఉన్న ఒక నిధి వేటలో భాగంగా ఇండియాకు వచ్చే జాకీచాన్‌కు, ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్లో పనిచేసే దిశ సాయం చేస్తోంది. ఇద్దరు కలిసి ఆ నిధిని ఎలా సాధించారు అన్నదే సినిమా కథ. కథా పరంగా దిశాపటానీ లీడ్ హీరోయిన్ అనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్‌తో దిశ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి. -
సోనూకి జాకీచాన్ న్యూ ఇయర్ గిఫ్ట్
యూనివర్సల్ స్టార్ జాకీచాన్, భారతీయ నటుడు సోనూసూద్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు స్టార్లు ప్రస్తుతం కుంగ్‌ఫూ యోగా సినిమాలో కలిసి నటిస్తున్నారు. చైనాతో పాటు భారతీయతకు సంబంధించిన సినిమా కావటంతో ఓ ప్రధాన పాత్రకు సోనూసూద్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేస్తుండగా తాజాగా సోనూసూద్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సోనూసూద్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన జాకీచాన్ వైట్ కలర్ జాకెట్‌ను సోనూకు గిప్ట్గా ఇచ్చాడు. జాకీచాన్ లాంటి టాప్ స్టార్ గిఫ్ట్ ఇవ్వటంతో సోనూసూద్ ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కుంగ్‌ఫూ యోగా ఈ ఏడాది చివరలో రిలీజ్ కానుంది. N the New Year Begins with my bro #jackiechan ..thank u for this lovely jacket #Beijing #kungfuyoga pic.twitter.com/N6sGxiVUQk — sonu sood (@SonuSood) January 2, 2016 -
ప్రిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న జాకీ ?
-
మహేశ్ సినిమాలో జాకీ చాన్?
'పోకిరి', 'బిజినెస్ మేన్'తో హీరో మహేశ్ బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్‌లది హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ అయింది. ఈ కాంబినేషన్లో మూడో చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని పూరి పేర్కొన్నారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్లార్ నటిస్తారని ఆయన తెలిపారు. అయితే, ఆ స్టార్ ఎవరనేది పూరి చెప్పలేదు. ఫిలింనగర్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఆ స్టార్ ఎవరోకాదు.. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకుడు జాకీ చాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం జాకీ చాన్ నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా'లో సోనూ సూద్ నటిస్తున్నారు. తెలుగులో సోనూ కెరీర్‌కి మంచి బ్రేక్ అయిన చిత్రం పూరీ దర్శకత్వం వహించిన 'సూపర్'. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సోనూ ద్వారానే జాకీతో పూరి సంప్రతింపులు జరుపుతున్నారట. -
గోవా బ్యూటీకి మరో షాక్
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకొని తరువాత బాలీవుడ్ చెక్కేసిన ముద్దుగుమ్మ ఇలియానాకు ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతూనే ఉంది. భారీ ఆశలతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా అవకాశాలు కరువవ్వటంతో సౌత్ మీద దృష్టి పెట్టింది. అప్పటికే సౌత్‌లో కొత్త తారలు పాతుకుపోవటంతో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. కష్టాల్లో ఉన్న ఇలియానాకు హాలీవుడ్ ఆఫర్ రావటంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. యాక్షన్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో భారతీయ వనిత పాత్రకు ఇలియానాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆఖరి నిమిషయంలో జాకీచాన్ కూడా గోవా బ్యూటీకి హ్యాండ్ ఇచ్చాడు. ఇలియానాతో చేయించాలనుకున్న పాత్రకు కొత్త తార అమైరా దస్తర్ను సెలెక్ట్ చేసుకున్నాడట. భారత్, చైనాలలో సాగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన అమైరా, తెలుగులో మంచు విష్ణు సరసన హీరోయిన్గా నటిస్తోంది. -
దుబాయ్ రోడ్లపై జాకీ
వెండితెరపై జాకీ చాన్ చేసే ఫైట్స్ చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక, ఆయన ఫైట్స్‌ని ప్రత్యక్షంగా చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇటీవల దుబాయ్‌లో ఓ రహదారి వైపు వెళుతున్నవాళ్లకి అదే జరిగింది. ఆ రోడ్డు మీద అతి వేగంగా దూసుకెళుతున్న కార్లు జనాల కంటపడ్డాయి. అంత వేగంగా వెళుతున్న కార్లను కొంతమంది తమ కెమెరాలో బంధించారు. కట్ చేస్తే.. కార్లు ఆగాయి. వాటిలో ఓ కారులోంచి జాకీచాన్ దిగారు. అంతే.. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అది నిజమా? కలా? అని తమను తాము గిచ్చి చూసుకున్నారు. అప్పటివరకూ జరిగిన కార్ల హడావిడి అంతా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కుంగ్‌ఫూ యోగా’ కోసమే అని తెలిసి, విడుదలకు ముందే యాక్షన్ సీన్ చూసినందుకు సంబరపడిపోయారు. అక్కడున్నవాళ్లల్లో కొంతమంది ఆ యాక్షన్ దృశ్యాలను క్లిక్‌మనిపించారు కదా. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ దృశ్యాలు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి 33 రోజుల పాటు జరిగింది. భారత్-చైనా దేశాల సంయుక్త నిర్మాణంలో స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
థ్యాంక్యూ జాకీ : సోనూసూద్
బాలీవుడ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు అంతర్జాతీయ సినీ అభిమానులకు దగ్గరవుతున్నాడు. చాలా రోజులుగా ఇండియన్ స్క్రీన్ మీద కనిపించటం మానేసిన సోనూ, ఇటీవల తన తదుపరి సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ మూవీ 'కుంగ్ ఫూ యోగ'లో కీలకపాత్రలో సోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న యూనిట్ సభ్యులకు జాకీచాన్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఈ విషయన్ని ట్విట్టర్లో తన అభిమానులతో షేర్ చేసుకున్న సోనూసూద్, జాకీచాన్‌కి కృతజ్ఞతలు తెలియజేశాడు. దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకుడు. దుబాయ్, బీజింగ్‌లతో పాటు, ఇండియాలోనూ కొంత భాగాన్ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. Thanks Jackie for an amazing dinner at #nobu #Atlantis #KungFuYoga pic.twitter.com/gNy4kjLI1T — sonu sood (@SonuSood) October 1, 2015 -
జాకీచాన్‌తో ఇలియానా!
యాక్షన్ సూపర్‌స్టార్ జాకీచాన్‌తో ఇలియానా నటించనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తున్న వార్త ఇది. జాకీ చాన్ తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగా’ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్-చైనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్ సరసన హీరోయిన్గా నటించడానికి ఇలియానాను తీసుకున్నారని సమాచారం. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఓ కీలక పాత్ర కోసం సోనూ సూద్‌ను ఎంపిక చేశారు. వాస్తవానికి ఇందులో ఓ కీలక పాత్రకు ఆమిర్ ఖాన్‌ను, కథానాయిక పాత్రకు కత్రినా కైఫ్‌లను తీసుకోవాలనుకున్నారట, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వారిద్దరూ ఈ ప్రాజెక్టును తిరస్కరించాల్సి వచ్చింది. ఆ తర్వాత హృతిక్ రోషన్‌ను తీసుకోవాలనుకున్నారు. అదీ కుదర్లేదు. మరి.. ఆ పాత్రకే సోనూ సూద్‌ని తీసుకున్నారా? అని తెలియాల్సి ఉంది. కత్రినా కైఫ్‌ని అనుకున్న పాత్రకు మాత్రం ఇలియానాని తీసుకున్నారట. ఇదిలా ఉంటే.. గతంలో ‘ద మిత్’ చిత్రంలో జాకీ సరసన మల్లికా శెరావత్ జాకీచాన్‌తో నటించారు. ఒకవేళ ఇప్పుడీ చిత్రంలో ఆయన సరసన ఇలియానా జతకడితే, అప్పుడు జాకీ చాన్ జాకీ సరసన నటించే రెండో భారతీయ నటి ఇలియానానే అవుతారు. -
ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి హాలీవుడ్ హీరో జాకీ చాన్, విలక్షణ నటుడు సోనూసూద్ అంటే ప్రాణమట. ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ తన ఫేవరట్స్ అని చెబుతున్నాడు. బాలీవుడ్లో రికార్డ్ కలెక్షన్స్ సినిమాలతో సత్తా చాటుతున్న ఈ హ్యాపీ న్యూ ఇయర్ హీరో వీళ్లిద్దరిపై తన అభిమానాన్ని సోషల్ మీడియాలో చాటుకున్నాడు. దీంతోపాటు హాలీవుడ్ మూవీ కుంగ్ ఫూ యోగాలో జాకీచాన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్న సోనూను ఒక కోరిక కూడా కోరాడు. వీరిద్దరిపై తనకున్న మక్కువను ప్రకటించిన షారూఖ్ పనిలో పనిగా ట్విట్టర్లో వీరిద్దరి ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు ''సోనూ.. నేనూ జాకీని కలవాలి... ఆయన్ని చూడాలి. ఈ మాట ఆయనకు చెప్పవూ'' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్ రీ ట్వీట్ కూడా చేశాడు. ''మీరన్నా నాకు అభిమానమే.. ఇప్పటికే చెప్పాను. జాకీతో తప్పకుండా మాట్లాడిస్తా.. మిమ్మల్ని కలిసేలా చేస్తా... వెయిట్ చేయలేవా'' అంటూ కామెంట్ చేశాడు. జాకీ చాన్ సినిమాలో నటించాలని వచ్చిన ఆఫర్‌ను షారూక్ ఖాన్ తిరస్కరించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో షారూక్ ఖాన్ తాజా ట్వీట్ ఆసక్తిని రేపింది. కాగా స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఫిలింగా రూపుదిద్దుకుంటున్న కుంగ్ ఫూ యోగా షూటింగ్ కార్యక్రమాలను దుబాయ్, బీజింగ్, ఇండియా లలో నిర్వహించనున్నారు. Two of my absolutely favourite men in the world. Way to go Sonu and please tell Jackie I want to come and see him. pic.twitter.com/JI7juGL6EE — Shah Rukh Khan (@iamsrk) September 30, 2015 Love u the most Shahhhhh..already told him. Will make u speak to him tomorrow and force u to visit us! Can't wait! https://t.co/MSo7Tbf4sy — sonu sood (@SonuSood) September 30, 2015 -
జాకీచాన్ సినిమాలో సోనూసూద్
-
జాకీచాన్ సినిమాలో సోనూసూద్
షారూక్ ఖాన్ 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా తరువాత మ్యాన్లీ యాక్టర్ సోనూసూద్ వెండితెర మీద కనిపించడం మానేశాడు. అప్పుడప్పుడు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో కనిపిస్తున్నా తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాత్రం స్పందించలేదు. మీడియా అడిగిన సందర్భంలో కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తానని చెబుతూ వచ్చాడు. అన్నట్టుగానే ఓ అంతర్జాతీయ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సోనూసూద్. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ హీరోగా నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు సోనూసూద్. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనూసూద్, జాకీచాన్ పాత్రతో సమానమైన పాత్రలో నటించనున్నాడట. అందుకే భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సోనూ. బీజింగ్ తో పాటు భారత్ లోనూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సోనూసూద్, ఇక అంతర్జాతీయ సినీ అభిమానులకు చేరువైనట్టే అంటున్నారు విశ్లేషకులు. -
చాన్ కోంగ్... జాకీ చాన్ ఎలా అయ్యాడు?
జాకీ చాన్... ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కానీ, ఈ పేరు వెనక ఓ చిన్న స్టోరీ ఉంది తెలుసా? జాకీ చాన్ అసలు పేరు చాన్ కోంగ్ సాంగ్. మరి.. జాకీ చాన్ ఎలా అయ్యారు అనుకుంటున్నారా? ఆ స్టోరీలోకి వస్తే... అది 1990. ఆ ఏడాది జాకీ చాన్‌గా మారారు చాన్ కోంగ్ సాంగ్. ఇతగాడి సినీ రంగప్రవేశం ఐదేళ్ల వయసులోనే జరిగింది. చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ చిన్నోడు.. కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావడంతో ఒకవైపు కాలేజీలో చదువుకుంటూనే, ఇంకో వైపు భవన కూలీగా చేశారు. జాకీ అనే వ్యక్తి అత్యంత చిన్న వయసులో కూలీగా చేరిన చాన్‌ను చేరదీసి, ఆ పనిలో మెళుకువలు నేర్పించారు. జాకీ శిష్యరికంలో చాన్ రాటుదేలడంతో అక్కడున్నవారంతా అతన్ని ‘లిటిల్ జాకీ’ అని పిలిచేవారట. గురువు మీద మమకారంతో చాన్ తన పేరును జాకీ చాన్‌గా మార్చుకున్నారు. జాకీ చాన్ పేరు వెనక స్టోరీ ఇదే. కాలేజీ పూర్తయ్యాక సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసినప్పట్నుంచీ టైటిల్ కార్డ్‌లో ‘జాకీ చాన్’ అని పేరు వేయించుకోవడం మొదలుపెట్టారు. గురువు మీద జాకీకి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. సో స్వీట్ కదూ...! -
జాకీచాన్ సరసన కత్రినా..?
-
కత్రినా ఇంకా ఓకే చెప్పలేదు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కత్రినా కైఫ్ 'కుంగ్ ఫూ యోగా' మూవీలో నటించనుందన్న వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి. హాంకాంగ్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ జాకీ చాన్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ మూవీలో అతడి సరసన ఆమె నటించనుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ సినిమాకు కత్రినా ఇంకా ఓకే చెప్పలేదని ఆమె అసిస్టెంట్ మంగళవారం తెలిపారు. 'కుంగ్ ఫూ యోగా' కథ విషయానికోస్తే.. చైనీస్ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ పాత్రలో కత్రినా నటించనున్నారని, జాకీ చాన్ ఆర్కియాలజిస్ట్ పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. మగధ సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలను ఆమెకు చాన్ వివరిస్తాడని, కత్రినాకు తోడ్పడతాడన్నది కథలో భాగంగా ఉందని వినికిడి. తొలుత బాలీవుడ్ సినీవర్గాలు స్టాన్లీ టొంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని అనుకున్నాయి. 'పీకే' తర్వాత 'దంగల్' మూవీతో బిజీగా ఉన్నట్లు, 'కుంగ్ ఫూ యోగా' లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని ఆమిర్ ఖండిచాడు. ప్రస్తుతం 'ఫితూర్', 'జగ్గా జాసూస్' మూవీలతో బాలీవుడ్ బ్యూటీ క్యాట్స్ బిజీగా ఉంది. -
రెస్టారెంట్ అధినేత
చైనీస్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ త్వరలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారు. ‘ది ఫారినర్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ‘ది చైనామ్యాన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కనుంది. ఇందులో జాకీ చాన్ లండన్‌లోని చైనా టౌన్ అనే రెస్టారెంట్ అధినేతగా నటించనున్నారు. కూతురి మరణానికి కారకులైనవారిని కనిపెట్టే విషయంలో సహాయపడని అధికారులతో విసిగి వేసారే ఈ రెస్టారెంట్ అధినేత చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. కుమార్తె మరణానికి కారణం ఓ ఉగ్రవాది గుంపు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. జాకీ తరహా పోరాటాలతో సాగే ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ‘ది నోట్‌బుక్, ‘ది అదర్ ఉమన్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన నిక్ కస్సావెటిస్ దర్శకత్వం చేయాలని అనుకుంటున్నారట. అక్టోబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
జీవిత లక్ష్యం నెరవేర్చుకున్నాడు
బీజింగ్: మార్షల్ ఆర్ట్స్ ప్రముఖ హీరో జాకీ చాన్ కొత్తగా యాక్టింగ్ స్కూల్(ఫిల్మ్ అండ్ టెలివిజన్)ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సినా అనే వెబ్ పోర్టల్ తెలిపింది. ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. వుహాన్ అనే నగరంలో ఈ స్కూల్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించినట్లు తెలిసింది. తన జీవిత కాలంలో యాక్టింగ్ స్కూల్‌ను స్థాపించడంలో ఒక భారీ లక్ష్యమని, దానిని ఆయన నెరవేర్చుకున్నారని మీడియా సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ నటులందరితో కలిసి ఆయన స్కూల్ ప్రారంభకార్యక్రమానికి విచ్చేరని ప్రముఖ దర్శకుడు జియాగాంగ్, నటుడు లిబింగ్ బింగ్ కూడా హాజరయ్యారు. ఈ స్కూల్ లో నటన, యానిమేషన్, డిజిటల్ మీడియా పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. -
త్వరలో ఇండియా వస్తా!
వయసు పెరుగుతోంది... ఇక యాక్షన్ చిత్రాల్లో నటించగలుగుతానో లేదో? ఆ శక్తి ఉంటుందో లేదో? అని ఆ మధ్య ఓ సందర్భంలో జాకీ చాన్ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకునిగా ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. వయసు పెరుగుతోందని ఆయన సరదాగా అన్నారు కానీ, ఆరు పదుల వయసులోనూ జాకీ చాన్ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘డ్రాగన్ బ్లేడ్’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ‘స్కిప్ ట్రేస్’, ‘కుంగ్‌ఫూ పాండా 3’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అలాగే, ‘కుంగ్‌ఫూ యోగా’ అనే చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియ-చైనాకు సంబంధించిన సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. ఈ కలయికలో రూపొందనున్న తొలి చిత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను బట్టి చైనీస్ మార్షల్ ఆర్ట్ కుంగ్‌ఫూ, భారతీయ యోగా నేపథ్యంలో కథ సాగుతుందని ఊహించవచ్చు. కథానుసారం ఈ చిత్రం షూటింగ్ ఇండియాలో కూడా చేయాల్సి ఉంటుందని, త్వరలో ఇక్కడికి వస్తానని జాకీ చాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఓ పని మీద ఆయన ఇండియా వచ్చారు. ఇండియా తనకు చాలా నచ్చుతుందని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితం జాకీ చాన్ నటించిన ‘ది మిత్’లో హిందీ భామ మల్లికా శెరావత్ నటించారు. మరి... హిందీ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు - ‘‘ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు. మంచి కథ దొరికితే అప్పుడాలోచిస్తా. ప్రస్తుతానికి చైనా-భారతీయ నేపథ్యంలో చేయబోతున్న ‘కుంగ్‌ఫూ యోగా’ పైనే దృష్టి సారిస్తున్నా’’ అని జాకీచాన్ చెప్పారు. -
ఏడాదికోసారి... మా అబ్బాయిని జైలుకి పంపిస్తా!
మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకుడు జాకీ చాన్ వారసుడు జేసీ చాన్ తండ్రిలానే ఈ కళలో భేష్ అనిపించుకున్నారు. తండ్రిలా రిస్కీ యాక్షన్ చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకెళుతూ, మంచి పేరు తెచ్చుకున్న జేసీ చాన్ ఆ మధ్య మాదకద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేరానికి గాను జేసీ ఆరు నెలల జైలు జీవితం గడిపాక, ఇటీవలే విడుదలయ్యారు. ఈ ఆరు నెలల శిక్ష జేసీలో చాలా మార్పు తీసుకువచ్చిందట. తనయుడిలో వచ్చిన మార్పు గురించి జాకీ చాన్ చెబుతూ - ‘‘జైలుకు ముందు... ఆ తర్వాత జేసీ జీవితంలో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు తను అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యంగా ఉండేవాడు. వేసుకునే దుస్తుల నుంచి వాడుకునే వస్తువుల వరకూ అన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ విసిరేసేవాడు. బూట్లు కూడా అంతే. కానీ, ఇప్పుడు అలా కాదు. బయటి నుంచి ఇంటికి రాగానే పాదరక్షలను చక్కగా, వాటికి కేటాయించిన ర్యాక్‌లో పెట్టేస్తున్నాడు. అల్మారాలో బట్టలు సరిగ్గా సర్దుకుంటున్నాడు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. వంటగదిలోకెళ్లి వాళ్ల అమ్మకి సహాయం చేస్తున్నాడు. ఒక రోజు గిన్నెలు కూడా కడిగాడు. అందుకే మా అబ్బాయిని ఏడాదికోసారి జైలుకి పంపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా’’ అని సరదాగా అన్నారు. -
జైలు నుంచి జాకీచాన్ తనయుడి విడుదల
బీజింగ్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుమారుడు జైయ్ సీ చాన్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. జైయ్ సీ చాన్తోపాటు అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు... జైయ్ సీ చాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో జైయ్ సీకి రూ.326 డాలర్ల జరిమాన కూడా విధించింది. ఇదే కేసులో అతడి స్నేహితుడు కై కో చెన్కు 14 రోజుల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో అరెస్ట్ అయిన జైయ్ సీ చాన్ ఆరు నెలల జైలు శిక్ష ముగియడంతో శుక్రవారం విడుదలయ్యారు. తన కుమారుడు తప్పు చేసినట్లు జాకీచాన్ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే జైలులో ఉన్న తన కుమారుడు జాయ్ సీ చాన్ విడుదల కోసం బెయిల్ కోసం దరఖాస్తు చేయనని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నా జైలుకు కారణం మానాన్నే: జాకీ చాన్ కొడుకు
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై జైలుపాలైన జెసీ చాన్.. తన తండ్రి జాకీచాన్ పై పలు ఆరోపణలు గుప్పించాడు. తాను జైలుకు వెళ్లడానికి తండ్రే ప్రధాన కారణమని ఆరోపించాడు. తనకు మార్గదర్శిగా నిలవాల్సిన తండ్రి తనను పూర్తిగా విస్మరించాడన్నారు. తను మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైనందుకు సిగ్గుపడుతున్నానని తల్లి జాన్ లిన్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశాడు. జాకీచాన్ పై కుమారుడు ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా జేసీ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టడం వల్ల తను ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాన్నారు. తన తండ్రి ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపేవారని, తనను ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సంఘటనలతో సహజంగానే తను తల్లికి దగ్గరయ్యానన్నారు. జేసీ జైలు పాలై ఐదు నెలలైనా ఇప్పటివరకూ తల్లిదండ్రులిద్దరూ చూడటానికి రాలేదని ఆరోపించారు. తల్లిని చూడగానే జేసీ చాన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడన్నారు. -
జాకీచాన్ కుమారుడికి జైలు శిక్ష
బీజింగ్: నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నటుడు, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీచాన్ తనయుడు జాయ్ సీ చాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీనితోపాటు రూ. 326 డాలర్ల జరిమాన విధించినట్లు తీర్పులో పేర్కొంది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని... జాయ్ సీ చాన్.. ఫాంగ్ జుమింగ్గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి మాదకద్రవ్యాలు సేవిస్తూ గతేడాది ఆగస్టు 14వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నిర్థారణ అయింది. దాంతో వారిపై విచారణ జరిపిన కోర్టు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. -
రాజకీయ పలుకుబడిని వాడుకోను: జాకీచాన్
బీజింగ్: తన కొడుకు జేసీ చాన్ చేసినపనికి తాను సిగ్గుపడుతున్నట్లు హాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ హీరో జాకీచాన్ చెప్పారు. అయితే అతన్ని కాపాడేందుకు తాను తన రాజకీయ పలుకుబడిని వాడుకోననని ఆయన చెప్పారు. తన కొడుకు ఏదో ఒకరోజు తనలాగే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారకర్త అవుతాడన్న ఆశాభావాన్ని జాకీచాన్ వ్యక్తం చేశారు. గాయకుడు, నటుడు జేసీ చాన్(32)ను మత్తుపదార్థాల కేసులో ఈ నెల 6న బహిరంగంగా విచారించనున్నట్లు బీజింగ్‌లోని ఓ కోర్టు మంగళవారం ప్రకటించింది. మత్తుపదార్ధాల నేరాలకు సంబంధించి జేసీచాన్, తైవాన్ సినీ నటుడు కో చెంగ్ తుంగ్, మరి కొంతమందిని బీజింగ్ పోలీసులు గత ఏడాది ఆగస్ట్ 14న అరెస్ట్ చేశారు. జేసీ, కోలు తాము మరిజువానా వాడినట్లు అంగీకరించారు. చైనాలో ఇలాంటి నేరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. మాదకద్రవ్యాలు వాడేవారికి గట్టి హచ్చరిక ఇచ్చేందుకు ఈ కేసులో వీరిని బహిరంగంగా విచారణ చేయనున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆక్రోబాటిక్ ఫైటింగ్ స్టయిల్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు అయిన జాకీచాన్ వంద సినిమాలలో నటించారు. చాన్ పేరు చెబితే చాలు మార్షల్ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాకీచాన్ గతంలో చైనాలో ప్రచారం నిర్వహించారు. అటువంటి చాన్ కొడుకు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. తన కుమారుడు చేసిన తప్పుకు అప్పట్లో చాన్ క్షమాపణలు కూడా చెప్పారు. -
ఒకే వేదికపై కేసీఆర్, చిరు, జాకీచాన్!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, యాక్షన్ హీరో జాకీచాన్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? కన్నులపండువగా ఉంటుంది కదూ! ఈ అరుదైన సన్నివేశాన్ని త్వరలో చూడవచ్చు. విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్జాతీయ స్టార్ హీరో జాకీచాన్ హైదరాబాద్ రానున్నారు. తమిళ సంచలన దర్శకుడు శంకర్ తాజా సినిమా 'ఐ' తెలుగు ఆడియో వేడుకలో జాకీచాన్ పాల్గొననున్నారు. కేసీఆర్, చిరులతో కలసి జాకీచాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ చిత్ర నిర్మాత ఈ ముగ్గురికి ఆహ్వానం పంపినట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. జాకీచాన్ రెండు రోజుల్లో ఓకే చెప్పవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఈ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్, అమీ జాక్సన్ నటించారు. -
అమితాబ్, జాకీ చాన్ల సంచలన కలయిక
హిందీ-చీనీ భాయీ భాయీ అన్న మాట పాతదే అయినా, ఇప్పుడు సినిమాలకు సంబంధించినంత వరకు ఆ మాట కొత్తగా వినిపిస్తోంది. భారత, చైనాల మధ్య సినీ అనుబంధం వెల్లివిరిసే అవకాశం కనిపిస్తోంది. తొలి ఇండో-చైనీస్ చలనచిత్ర రూపకల్పనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ‘గోల్డ్ స్ట్రక్’ పేరిట రూపొందే ఈ చిత్రంలో భారత, చైనా సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజాలు పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అదే గనక నిజమైతే, ఈ చిత్రంలో మన ‘బిగ్ బి’ అమితాబ్, చైనా సినీ సూపర్‌స్టార్ జాకీ చాన్‌లు కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఆధునిక కాలానికి చెందిన సాహస గాథగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇందులో భారత, చైనాల సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో పాటు పునర్జన్మకు సంబంధించిన ఉంటుందట. అంతేకాక, ఈ చిత్రంలో అభయ్ డియోల్, అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా నటించనున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సిన ఈ చిత్ర వ్యవహారం అప్పుడే మన సినీ పరిశ్రమలో సంచలన వార్తగా మారింది. -
'కుమారుడి నిర్వాకంతో సిగ్గుతో తలదించుకున్నా'
బీజీంగ్: తన కుమారుడు జాయ్ సీ చేసిన నిర్వాకం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హాలీవుడ్ నటుడు, చైనా కుంగుఫూ స్టార్ జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ నివాసంలో ఆయన కుమారుడు డ్రగ్స్ తో ఆగస్టు 14 తేదిన పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చైనాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జాకీ చాన్ గతంలో ప్రచారం నిర్వహించారు. మొదటిసారి ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ఎంతో ప్రజాదరణ కలిగిఉన్న నేను సిగ్గుతో తలవంచుకున్నాను. విషాదంలో మునిగిపోయాను అంటూ ఓ వెబ్ సైట్ కు తెలిపారు. జాయ్ సీ తల్లి దుఖంలో మునిగిపోయారని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ చేసిన తప్పు తెలుసుకుని యువతరం మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నానని జాకీ చాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
క్షమాపణ చెప్పిన హీరో కొడుకు
బీజింగ్: మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. నిషేధిత డగ్స్ కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే ఎమ్ స్టోన్స్ క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అతడు త్వరలోనే మంచిదారిలోకి వస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న 31 ఏళ్ల జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచితుడైన ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. వీరు నిషేధిత మారిజూనా డ్రగ్ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చాన్ ఇంటి నుంచి వంద గ్రాములు మారిజూనా డ్రగ్ తీసుకొచ్చినట్టు వారు విచారణలో అంగీకరించారు. -
జాకీ చాన్ కుమారుడు అరెస్ట్
బీజింగ్: కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్ గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులు అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్నది మాత్రం వెల్లడికాలేదు. ఈ రోజూ చైనా మీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు తన పోస్ట్ లతో టచ్ లో ఉండే ఈ హీరో వ్యాఖ్యలు గత మంగళవారం నుంచి వెలుగుచూడలేదు. -
జీవితాంతం ఆ ప్లాస్టిక్ ప్లగ్ తలలో ఉండాల్సిందేనట!
ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ‘యాక్షన్ స్టార్’ అనిపించుకున్న జాకీచాన్ని చూస్తే ఆరోగ్య బీమా కంపెనీలు పారిపోతాయి. ఎందుకో ఊహించే ఉంటారు. దాదాపు ప్రతి సినిమాకీ గాయాలపాలవ్వడం జాకీచాన్‌కి చాలా కామన్. ఆయనకు మెడిక్లెయిమ్ పాలసీ ఇస్తే, ఇక కంపెనీ దివాళా తీయడం ఖాయం. నటుడిగా జాకీచాన్ లైఫ్ అంత రిస్కీ అన్నమాట. కానీ రిస్కులు చేయడం తనకు కేక్ తిన్నంత సులువు అంటున్నారు జాకీచాన్. నేడు ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు... మామూలుగా ఏ బిడ్డయినా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటుంది. కానీ, జాకీచాన్ మాత్రం పన్నెండు నెలలు ఉండటం విశేషం. ఫలితంగా శస్త్ర చికిత్స చేసి, బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. స్వతహాగా పేద కుటుంబం కావడంతో జాకీ తండ్రి వైద్య ఖర్చులకు స్నేహితుడి నుంచి అప్పు తీసుకున్నారు. పుట్టినప్పుడు జాకీ బరువు దాదాపు ఐదున్నర కిలోలు. చిన్నప్పుడు జాకీని ఆయన తల్లి, ఇరుగుపొరుగువారు ‘పావోపావో’ (ఓ బంతి పేరు) అని పిలిచేవారు. బోర్లా పడుకుని బంతిలా దొర్లేవాడట జాకీ. చాలా చురుకుగా ఉండేవాడట. అందుకే ఆ పేరు. ఎనిమిదేళ్ల వయసులో ‘బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్’ అనే చిత్రం ద్వారా జాకీ నటుడిగా పరిచయమయ్యాడు. పెద్దయిన తర్వాత నటుడిగా, స్టంట్ మేన్‌గా, గాయకుడిగా, దర్శక, నిర్మాతగా చేయడం మొదలుపెట్టారు. వీరోచిత పోరాట దృశ్యాలు చేసే జాకీచాన్, అతని బృందం తరచుగా గాయాలపాలవుతుంటారు. దాంతో వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పోనీ ఏదైనా ఆరోగ్య బీమా చేయించుకుందామంటే ఏ కంపెనీ ముందుకు రాదు. అందుకే తన బృందానికి, తనకు అయ్యే వైద్య ఖర్చులు జాకీచానే భరిస్తారు. అత్యధిక పోరాటాలు చేసిన నటుడిగా, ఒకే సినిమాలో ఎక్కువ శాఖలకు పని చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ పుస్తకంలో రెండు సార్లు స్థానం సంపాదించుకున్నారు జాకీ. జాకీచాన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ ఒకటి. ఈ షూటింగ్లో ఓ చెట్టు కొమ్మ వేగంగా ఆయన తల్లోకి చొచ్చుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. శస్త్రచికిత్స చేసి, డాక్టర్లు జాకీ తలలో ఓ ప్లాస్టిక్ ప్లగ్‌ని అమర్చారు. జీవితాంతం ఇది ఉండాల్సిందేనట. జాకీచాన్ ఇప్పటివరకు లెక్కలేనన్ని సార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నారు. మూడుసార్లు ముక్కు పగిలింది. వేళ్లు, మెడ, చీలమండలం, దవడ ఎముకలు విరిగిన సందర్భాలు బోల్డన్ని ఉన్నాయి. ‘డ్రంకన్ మాస్టర్’ షూటింగ్లో ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు ఆయనకు కన్ను పోయినంత పనైంది. ఒక సన్నివేశం చేసినప్పుడు తనకు పూర్తి సంతృప్తినిస్తేనే జాకీచాన్ ఓకే చేస్తారు. లేకపోతే ఎన్ని టేక్స్ అయినా చేయడానికి వెనకాడరు. ‘డ్రాగన్ లార్డ్’లో ఓ సీన్‌కి 2,900 టేక్స్ తీసుకున్నారాయన. జాకీచాన్ అంకితభావానికి ఈ సంఘటనను ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జాకీచాన్‌కి ఓ కొడుకు ఉన్నాడు. అలాగే, ఎలైన్ అనే నటితో సంబంధం కారణంగా జాకీకి ఓ కుమార్తె పుట్టింది. తన మరణం తర్వాత మొత్తం ఆస్తి బిడ్డలకు వెళ్లదు. ఆస్తిలో సగం చనిపోయిన తర్వాత సేవా కార్యక్రమాలకు ఇచ్చేట్లు వీలునామా రాశారట. ఈ మార్షల్ ఆర్ట్స్ వీరుడు పాప్‌స్టార్ కూడా. ఇప్పటివరకు దాదాపు 20కిపైగా ఆల్బమ్స్‌ని విడుదల చేశారు. అలాగే, తన సినిమాల్లోని థీమ్ సాంగ్స్‌ని కూడా పాడుతుంటారు జాకీచాన్. బాలనటుడిగా ఆరు చిత్రాల్లో నటించారు జాకీ. ఆ తర్వాత పలు చిత్రాలకు స్టంట్‌మేన్‌గా చేశారు. ఈ చిత్రాల్లో బ్రూస్లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ ఒకటి. తన కెరీర్లో ఎన్నోసార్లు ప్రమాదాలకు గురైనా తట్టుకోగలిగానని, కానీ, ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా షూటింగ్లో బ్రూస్లీ అనుకోకుండా తన మొహం మీద ఇచ్చిన ఓ పంచ్‌కి కళ్లు బైర్లు కమ్మాయని, ఆ నొప్పి తీవ్రత ఇప్పటికీ గుర్తుందని జాకీచాన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక, నటుడిగా, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, దర్శక, నిర్మాతగా, గాయకునిగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు జాకీ. నటుడిగా ఆయన ఇప్పటివరకు దాదాపు 150 చిత్రాలు చేశారు. తనెప్పుడు రిటైర్ అవ్వాలో తన శరీరం డిసైడ్ చేస్తుందని, అది ఎప్పుడు మొరాయిస్తే అప్పుడు నటన మానేస్తానని ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు జాకీ. గతంలో ఉన్నంత ఎనర్జిటిక్‌గా లేకపోయినా తన ఆరోగ్యానికేం ఢోకా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘స్కిప్‌ట్రేస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఒకసారి పన్నెండు రాతి బండలను ఒంటి చేత్తో అమాంతంగా పగలగొట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచారు జాకీ. మాండ్రియన్, ఇంగ్లిష్, జర్మన్, కొరియన్, జపనీస్, థాయ్, కాంటనీస్... ఇలా పలు భాషలు మాట్లాడగలరు. - డి.జి. భవాని -
జాకీచాన్ తొలి త్రీడీ సినిమా
యాక్షన్ స్టార్ జాకీచాన్ కథానాయకునిగా రూపొందిన ‘పోలీస్ స్టోరీ 2013’ చిత్రం తెలుగులో అదే పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది. ఇండో ఓవర్సీస్ ఫిలింస్ సమర్పణలో శ్రీ సాయిగణేశా క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శిరసాని రత్నాంజన్ మాట్లాడుతూ -‘‘నిర్మాతగా నాకిది తొలి యత్నం. పోలీస్ స్టోరీస్‌కి ఆరవ భాగంగా రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో హాంకాంగ్‌లో విడుదలై, ఘనవిజయం సాధించింది. జాకీచాన్ గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఆయన నటించిన తొలి త్రీడీ సినిమా ఇదే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
ప్రపంచ సూపర్‌స్టార్ జాకీచాన్
ప్రపంచ సూపర్‌స్టార్ జాకీ చాన్ అని యువ నటుడు భరత్ పేర్కొన్నారు. కుంగ్‌ఫూ, కరాటే వంటి విద్యలతో కూడిన అబ్బుర పరిచే యాక్షన్ చిత్రాల కథా నాయకుడు జాకీచాన్ నటించిన పోలీసు కథా చిత్రాల్లో ఆరవ సీక్వెల్ పోలీసు స్టోరీ 2013. జాకీచాన్ సొంత నిర్మాణంలో 3డి ఫార్మెట్లో రూపొందిన తాజా చిత్రం ఇది. ఎస్.మోహన్ సమర్పణలో సురభి ఫిలింస్, ఇండో ఓవర్సీస్ సంస్థలు తమిళనాట ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు భరత్ మాట్లాడుతూ తమిళనాడు మహానటుడు శివాజీ గణేశన్ నటించిన తంగపతకం, రజనీకాంత్ మూండ్రుముగం, కమలహాసన్ కాకిసట్టై, సూర్య నటించిన కాక్క కాక్క వంటి చిత్రాలు పోలీసు కథలతో రూపొంది విజయం సాధించాయన్నారు. అదే విధంగా జాకీచాన్ పోలీసు కథల్లో నటించిన పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించాయన్నారు. జాకీచాన్ చిత్రాలు అద్భుత యాక్షన్‌తో పాటు హ్యూమర్ మిళితమై జనరంజకంగా ఉంటాయన్నారు. ఈ 3డి పోలీ సు స్టోరీ-2013 చిత్రం ప్రజాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని భరత్ అన్నారు. చిత్ర సమర్పకుడు ఎస్.మోహన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో జాకీచాన్ తొలిసారిగా పాడిన ఒరిజినల్ ట్రాక్ పాట ఉంటుందని తెలిపారు. పోలీసు స్టోరీ - 2013 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. చిత్రం గత వారం హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా భాషలలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పుష్పా కందస్వామి, దర్శకుడు పేరరసు, ఇండో ఓవర్సీస్ ఫిరోజ్ ఎలిస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పుడు రిటైరవ్వాలో నా శరీరం డిసైడ్ చేస్తుంది!
జాకీచాన్ రిటైర్మెంట్కి దగ్గరపడ్డారా?... ఇది దాదాపు ఐదారేళ్లుగా ఈ యాక్షన్ స్టార్ అభిమానుల్లో మెదులుతున్న సందేహం. ఒకవేళ రిటైర్ అయితే, మళ్లీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ స్టార్‌ని సిల్వర్ స్క్రీన్‌పై చూడటం కష్టమే. అందుకే, జాకీ అభిమానులు ఆయన రిటైర్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. కానీ, ఇంకెంత కాలం ఫైట్లు చెయ్యమంటారు? అంటున్నారు జాకీ. ఆయన ఆర్టిస్ట్ అయ్యి దాదాపు 50ఏళ్లు పైనే అయ్యింది. 1962లో ఎనిమిదేళ్ల వయసులోనే నటుడిగా రంగప్రవేశం చేసిన జాకీచాన్ ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్ హీరోగా, కామెడీ హీరోగా, దర్శక, నిర్మాతగా, గాయకునిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు జాకీచాన్. ప్రస్తుతం ఆయన నటించిన ‘పోలీస్ స్టోరీ 2013’ ఈ డిసెంబర్లో విడుదల కానుంది. ఇవి కాకుండా మరో మూడు చిత్రాల్లో నటించనున్నారు జాకీ. ఇటీవల ఓ కార్యక్రమంలో జాకీచాన్ మాట్లాడుతూ - ‘‘మరో ఆరు నెలల్లో నాకు అరవయ్యేళ్లొస్తాయి. గతంలో ఎనర్జిటిక్‌గా ఉండేవాణ్ణి. అయితే ఇప్పుడు కొంచెం అలసటగా అనిపిస్తోంది. ఫైట్ సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటోంది. గత కొంత కాలంగా మీ ‘రిటైర్మెంట్’ ఎప్పుడు అని మీడియావారు అడుగుతున్నారు. మరో ఐదేళ్ల తర్వాత అని సమాధానం చెబుతుండేవాణ్ణి. కానీ, ఈసారి వేరే సమాధానం చెబుతా. నేనెప్పుడు రిటైర్ అవ్వాలో నా శరీరం డిసైడ్ చేస్తుంది. అది ఎప్పుడు మొరాయిస్తే, అప్పుడు ఫుల్స్టాప్ పెట్టేస్తా’’ అని చెప్పారు. ఎంత పెద్ద రిస్కీ ఫైట్స్ అయినా డూప్ లేకుండా చేయడం జాకీ స్టయిల్. అయితే, భవిష్యత్తులో డూప్‌ని పెట్టుకోవచ్చేమో అని చెబుతూ -‘‘ఒకవేళ నేనెప్పటిలా ‘యాక్రోబాటిక్’ సీన్స్‌లో నటించాలంటే డూప్ సహాయం తీసుకోవాల్సిందే. ప్రేక్షకులు ఆమోదించి, క్షమిస్తే నేను డూప్‌ల సహాయం తీసుకుంటా’ అని సరదాగా పేర్కొన్నారు జాకీచాన్.