ODI series
-
స్మృతి శతకం... సిరీస్ సొంతం
అహ్మదాబాద్: వారెవా... స్మృతి మంధాన ఇలా ఆడి ఎన్నాళ్లైంది. ఆఖరి వన్డే చూసినవారందరి నోటా వినిపించిన మాట ఇదే! కీలకమైన పోరులో ఆమె సాధించిన శతకంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను 2–1తో వశం చేసుకుంది. ఈ విజయంలో బౌలర్లు దీప్తిశర్మ, ప్రియా మిశ్రాలతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తోడయ్యారు. దీంతో మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్రూక్ హాలిడే (96 బంతుల్లో 86; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆదుకుంది. ఓపెనర్ జార్జియా ప్లిమెర్ (67 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3 వికెట్లు పడగొట్టగా, యువ లెగ్‌స్పిన్నర్ ప్రియా మిశ్రా (2/41) కీలకమైన వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 44.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి గెలిచింది. చాన్నాళ్ల తర్వాత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (122 బంతుల్లో 100; 10 ఫోర్లు)బ్యాట్‌కు పనిచెప్పింది. హర్మన్‌ప్రీత్ (63 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) రాణించింది. హన్నా రోవ్ 2 వికెట్లు పడగొట్టింది. కివీస్, భారత్ తమ తుది జట్లలో ఒక్కోమార్పు చేశాయి. జెస్ కెర్ స్థానంలో హన్నా రోవ్ బరిలోకి దిగింది. భారత జట్టులో హైదరాబాద్ సీమర్ అరుంధతి రెడ్డి స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకున్నారు. హాలిడే ఒంటరి పోరాటం భారత బౌలర్లు, ఫీల్డర్లు కట్టుదిట్టం చేయడంతో కివీస్‌కు ఆరంభంలోనే కష్టాలెదురయ్యాయి. జెమీమా మెరుపు ఫీల్డింగ్‌తో సుజీ బేట్స్ (4)తో పాటు మ్యాడీ గ్రీన్ (15)ను రనౌట్ చేసింది. సైమా, ప్రియా బౌలింగ్‌లలో లౌరెన్ (1), సోఫీ డివైన్ (9)లు అవుటయ్యారు. దీంతో ఒక దశలో 88/5 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్‌ను మిడిలార్డర్ బ్యాటర్ బ్రూక్ హాలిడే ఆదుకుంది. చూడచక్కని బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఇసాబెల్లా గేజ్ (49 బంతుల్లో 25; 1 ఫోర్)తో ఆరో వికెట్‌కు 64 పరుగులు, తహుహు (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాక హాలిడే నిష్క్రమించింది. గెలిపించిన స్మృతి, హర్మన్ చూసేందుకు లక్ష్యం సులువుగానే కనిపిస్తుంది. అయితే గత మ్యాచ్ గుర్తుకొస్తే ఎక్కడ, ఎప్పుడు కూలిపోతోందోనన్న బెంగ! నాలుగో ఓవర్లోనే షఫాలీ (12) అవుట్. స్మృతి ఫామ్‌పై దిగులు! కానీ స్టార్ ఓపెనర్ కీలకమైన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వన్‌డౌన్ బ్యాటర్ యస్తిక భాటియా (49 బంతుల్లో 35; 4 ఫోర్లు)తో కలిసి జట్టును పరుగుల బాట పట్టించింది. జట్టు స్కోరు వందకు చేరువయ్యే సమయంలో 92 పరుగుల వద్ద యస్తికను సోఫీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రాగా... 73 బంతుల్లో స్మృతి ఫిఫ్టీ పూర్తి చేసుకుంది.ఇద్దరు కలిసి న్యూజిలాండ్ బౌలర్లపై కదం తొక్కడంతో జట్టు గెలుపుబాట పట్టింది. హర్మన్ 54 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించింది. కాసేపటికే మంధాన 121 బంతుల్లో సెంచరీ మైలురాయిని చేరుకుంది. అదే స్కోరు వద్ద ఆమె క్లీన్బౌల్డయ్యింది. అప్పటికే జట్టు గెలుపుతీరానికి చేరుకుంది. జెమీమా (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)తో హర్మన్ లాంఛనాన్ని దాదాపు పూర్తి చేస్తుండగా, విజయానికి పరుగుదూరంలో జెమీమా ఎల్బీగా వెనుదిరిగింది. తేజల్ (0 నాటౌట్) ఖాతా తెరువకముందే హర్మన్‌ప్రీత్ బౌండరీతో జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ మహిళల ఇన్నింగ్స్: సుజీ బేట్స్ రనౌట్ 4; జార్జియా (సి) దీప్తి (బి) ప్రియా 39; లౌరెన్ (సి) యస్తిక (బి) సైమా 1; సోఫీ డివైన్ (బి) ప్రియా 9; హాలిడే (సి) రాధ (బి) దీప్తి 86; మ్యాడీ గ్రీన్ రనౌట్ 15; ఇసాబెల్లా (సి) అండ్ (బి) దీప్తి 25; హన్నా రోవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 11; తహుహు నాటౌట్ 24; కార్సన్ (సి) రాధ (బి) రేణుక 2; జొనాస్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–24, 2–25, 3–36, 4–66, 5–88, 6–152, 7–199, 8–210, 9–219, 10–232. బౌలింగ్: రేణుకా సింగ్ 10–1–49–1, సైమా ఠాకూర్ 9.5–1–44–1, ప్రియా మిశ్రా 10–1–41–2, దీప్తిశర్మ 10–2–39–3, రాధా యాదవ్ 4–0–21–0, హర్మన్‌ప్రీత్ 6–0–34–0. భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (బి) రోవ్ 100; షఫాలీ (సి) ఇసాబెల్లా (బి) రోవ్ 12; యస్తిక (సి) అండ్ (బి) సోఫీ 35; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 70; జెమీమా (ఎల్బీడబ్ల్యూ) (బి) జొనాస్ 11; తేజల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–16, 2–92, 3–209, 4–232. బౌలింగ్: లియా తహుహు 6–0–30–0, హన్నా రోవ్ 8–0–47–2, ఎడెన్ కార్సన్ 10–0–45–0, సోఫీ డివైన్ 7.2–0–44–1, సుజీ బేట్స్ 4–0–18–0, ఫ్రాన్ జొనాస్ 9–1–50–1. -
స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం: పాక్ కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతామాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్‌ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాంఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-1తో గెలిచింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
SA vs IRE: సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చిన ఐర్లాండ్
సౌతాఫ్రికాతో మూడో వన్డేల్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. సఫారీ జట్టును 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వన్డేల్లో సౌతాఫ్రికాపై ఐరిష్ టీమ్‌కు ఇది రెండో గెలుపు కావడం విశేషం. కాగా యూఏఈ వేదికగా ఐర్లాండ్- సౌతాఫ్రికా మధ్య అబుదాబి వేదికగా పరిమిత ఓవర్ల సిరీస్ జరిగింది.రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో ట్రోఫీని పంచుకున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి రెండింటిలో సౌతాఫ్రికా వరుసగా 139, 174 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ప్రొటిస్ జట్టుకు ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది.పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో బల్బిర్నీ 45 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 రన్స్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(34) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హ్యారీ టెక్టార్ 60 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ లోర్కాన్ టకర్ 26 పరుగులు చేయగా.. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమైంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐరిష్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. జేసన్ స్మిత్ పోరాటం వృథాఓపెనర్లు రియాన్ రెకెల్టన్(4), రీజా హెండ్రిక్స్(1), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(3) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో కైలీ వెరెన్నె 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేయగా.. ఆరోస్థానంలో వచ్చిన జేసన్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఐరిష్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో ఐర్లాండ్ విజయం ఖరారైంది. 69 పరుగుల తేడాతో ప్రొటిస్ జట్టుపై గెలుపొందింది. ఐర్లాండ్ బౌలర్లలో గ్రాహం హ్యూమ్, క్రెయిగ్ యంగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్ అడేర్ రెండు, ఫియాన్ హ్యాండ్, మాథ్యూ హంఫ్రేస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూడో వన్డేకు ముందే... సిరీస్ కోల్పోయినా సౌతాఫ్రికా ఆధిక్యాన్ని ఐర్లాండ్ 2-1కు తగ్గించగలిగింది. ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
SL vs WI: విండీస్ హార్డ్ హిట్టర్స్ దూరం.. పదిహేడేళ్ల కుర్రాడికి చోటు
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. రోవ్‌మన్ పావెల్ సారథ్యంలో టీ20 జట్టు.. షాయీ హోప్ కెప్టెన్సీలో వన్డే జట్టు లంక పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపింది. స్టార్ ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానుండగా.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ జట్లలో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.కాగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరు 13- 26 మధ్య మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు శనివారం జట్లను ప్రకటించిగా.. టీ20 జట్టులో కొత్తగా టెర్రెన్స్ హిండ్స్, షామార్ స్ప్రింగర్ చోటు దక్కించుకున్నారు.కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటికరేబియన్ ప్రీమియర్ లీగ్-2024(సీపీఎల్)లో అద్భుత ప్రదర్శనతో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రైటార్మ్ పేసర్ హిండ్స్.. ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఇక స్ప్రింగర్ కూడా కుడిచేతి వాటం పేసరే. 18 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.వీరిద్దరితో పాటు.. పదిహేడేళ్ల వికెట్ కీపర్ జువెల్ ఆండ్రూకు కూడా విండీస్ సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. అయితే, అతడిని వన్డే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. జువెల్ ఇప్పటి వరకు మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లలో కలిపి 165 పరుగులు సాధించాడు.స్టార్లు దూరం.. యువ ఆటగాళ్ల పాలిట వరంశ్రీలంకతో సిరీస్‌లకు విధ్వంసకర వీరులు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షిమ్రన్ హెట్మెయిర్, స్పిన్నర్ అకీల్ హొసేన్ దూరమయ్యారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో వీరంతా విశ్రాంతి కావాలని కోరగా.. అందుకు తాము సమ్మతించినట్లు వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ చెప్పాడు.శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథనేజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెర్రెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, షామార్ స్ప్రింగర్శ్రీలంకతో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుషాయీ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జువెల్ ఆండ్రూ, అలిక్ అథనేజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్ -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్‌తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్‌తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్‌బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే? -
స్టార్క్‌కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్‌గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.27 బంతుల్లోనేఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.స్టార్క్‌కు పీడకలఇక లివింగ్‌స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్‌లలో నాలుగు స్టార్క్ బౌలింగ్‌లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.186 పరుగుల తేడాతో విజయంఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.స్టార్క్ చెత్త రికార్డులివింగ్స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్‌లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024 -
Eng Vs Aus ODI: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. 27 బంతుల్లోనే
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 186 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. కాగా మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో పొట్టి సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. దీంతో 1-1తో టీ20 సిరీస్ డ్రాగా ముగిసిపోయింది. ఇక వన్డేల విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మూడో వన్డే నుంచి ఇంగ్లండ్ గెలుపుబాట పట్టింది.39 ఓవర్లకు మ్యాచ్ కుదింపుచెస్టెర్ లీ స్ట్రీట్ వేదికగా డీఎల్ఎస్ పద్ధతిలో ఆసీస్‌ను 46 పరుగుల తేడాతో ఓడించింది. అదే విధంగా.. లార్డ్స్ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. లండన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది.బౌండరీల వర్షం కురిపించిన బ్రూక్అయితే, వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాపార్డర్‌లో ఓపెనర్ బెన్ డకెట్ 62 బంతుల్లో 63 పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. Leading from the front 💪Batted, Harry Brook! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/RGV0rEZeWT— England Cricket (@englandcricket) September 27, 2024నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఫోర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 87 పరుగుల సాధించాడు. ఆడం జంపా బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో బ్రూక్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన లివింగ్స్టోన్ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ 28 బంతుల్లో 39 రన్స్ చేయగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఏకంగా 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 39 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 312 పరుగులు స్కోరు చేసింది.6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024ఆసీస్ 126 పరుగులకే ఆలౌట్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీస పోరాటపటిమ ప్రదర్శించలేకపోయింది. 24.4 ఓవర్లలో కేవలం 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 34 పరుగులతో కంగారు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 28 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్(5), జోష్ ఇంగ్లిస్(8), మార్నస్ లబుషేన్(4), గ్లెన్ మాక్స్వెల్(2), స్టార్క్(3 నాటౌట్) సింగిల్ డిజిట్లకే పరిమితం కాగా.. ఆడం జంపా, హాజిల్‌వుడ్ డకౌట్ అయ్యారు.మాథ్యూ పాట్స్‌కు నాలుగు వికెట్లుమిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ 13, సీన్ అబాట్ 10 పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక ఐదో వన్డే ఆదివారం జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదిక.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా
ఆస్ట్రేలియా యువ జట్టుపై భారత అండర్-19 క్రికెట్ టీమ్ ఘన విజయం సాధించింది. రెండో యూత్ వన్డేలో కంగారూ టీమ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది.ఇందులో భాగంగా.. పుదుచ్చేరిలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో వన్డేలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. పుదుచ్చేరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల జోరు.. కంగారూ బ్యాటర్లు బేజారుకంగారూ టీమ్‌లో అడిసన్ షెరిఫ్(39), క్రిస్టియన్ హోవే(28) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహ్మద్ ఎనాన్, కిరణ్ చోర్మాలే రెండేసి వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హార్దిక్ రాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సాహిల్ పరేఖ్ ధనాధన్ సెంచరీఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అండర్-19 జట్టు 22 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్ సాహిల్ పరేఖ్ 75 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రుద్ర పటేల్(10) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు.. సాహిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 50 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. సాహిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిరీస్ భారత్ కైవసంవీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత యువ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. సాహిల్ పరేఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.తుదిజట్లుభారత్రుద్ర పటేల్, సాహిల్ పరేఖ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), మహ్మద్ అమాన్ (కెప్టెన్), కె.పి.కార్తికేయ, కిరణ్ చోర్మాలే, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, మొహ్మద్ ఎనాన్, యుధాజిత్ గుహ,సమర్థ్ నాగరాజ్.ఆస్ట్రేలియారిలే కింగ్సెల్, జాక్ కర్టెన్, అడిసన్ షెరిఫ్, ఆలివర్ పీక్ (కెప్టెన్), అలెక్స్ లీ యంగ్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ హోవే, లింకన్ హాబ్స్, హ్యారీ హోక్స్ట్రా, లాచ్లాన్ రానాల్డో, హేడెన్ షిల్లర్, విశ్వ రామ్ కుమార్.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
చెలరేగిన స్టార్క్.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మార్ష్(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్ స్మిత్ (4), మ్యాక్స్‌వెల్ (7), లబుషేన్ (19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.నిప్పులు చేరిగిన స్టార్క్..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్‌వుడ్, హార్దీ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో) -
53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. యాభై మూడేళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత వరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఐదు వికెట్లతో చెలరేగి రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకీ అదేంటంటారా?!..అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య యూఏఈ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. వన్డేల్లో ప్రొటిస్‌పై మొదటి విజయం అందుకున్న హష్మతుల్లా బృందం.. రెండో వన్డేలో సంచలన విజయం సాధించింది. బవుమా సేనను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది.షార్జా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై నెగ్గి.. అఫ్గన్ సిరీస్ గెలవడంలో 26 ఏళ్ల రషీద్ ఖాన్‌ది కీలక పాత్ర. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు బౌల్ చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డి జోర్జి(17), ఐడెన్ మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2) రషీద్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.ఇదిలా ఉంటే.. శుక్రవారం(సెప్టెంబరు 20) రషీద్ ఖాన్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలో వన్డే చరిత్రలో పుట్టినరోజున ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఈ అఫ్గన్ స్టార్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తమ బర్త్‌డే నాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వెర్నర్ ఫిలాండర్ 2007లో ఐర్లాండ్ మీద 4/12, ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 2010లో ఆస్ట్రేలియా మీద 4/44 గణాంకాలు నమోదు చేశారు.High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
అదేం బ్యాటింగ్ సామీ!.. ఊచకోతే.. రోహిత్ రికార్డు బద్దలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హెడ్.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.ఆరోజు టీమిండియాపైటీమిండియాతో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్ హెడ్ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలిఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలయ్యారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.రికార్డులు సాధించిన హెడ్మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్ హెడ్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకు ముందు షేన్ వాట్సన్ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్‌గానూ హెడ్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(24), గ్లెన్ మాక్స్వెల్(21) హెడ్ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్‌ను కూడా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ అందుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలుట్రెంట్బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా హెడ్ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. న్యూజిలాండ్‌పై హెడ్ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ పేరిట ఉండేది.ఇదే ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్. అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తిఇక వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్ అలా వ్యాఖ్యానించాడు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గాThe perfect 𝐇𝐄𝐀𝐃 start for the Aussies in the ODI series 💯 🇦🇺#SonySportsNetwork #ENGvAUS #TravisHead | @travishead34 pic.twitter.com/PBItCBhPKE— Sony Sports Network (@SonySportsNetwk) September 20, 2024 -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్‌హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్‌కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్‌కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్‌వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
సౌతాఫ్రికాతో అఫ్గన్ వన్డే సిరీస్.. స్టార్ స్పిన్నర్ రీఎంట్రీ
అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేయనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా షార్జా వేదికగా అఫ్గన్ జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.ఆ ఇద్దరు దూరంఇందుకు సెప్టెంబరు 18- 22 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. హహ్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని ఈ టీమ్‌లోకి రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. మరో కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సైతం చీలమండ నొప్పి వల్ల సెలక్షన్‌కు అందుబాటులోకి రాలేకపోయాడని వెల్లడించింది.రషీద్ రావడం సంతోషంవీరి స్థానాల్లో అబ్దుల్ మాలిక్, దార్విష్ రసూలీలను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్ కొన్నిరోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో తాము ఆడబోతున్న ఏకైక జట్టుకు రషీద్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అఫ్గన్ బోర్డు గతంలో విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అతడు జట్టుతో చేరడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.కివీస్‌తో టెస్టు మొదలుకాకుండానేఇక భారత్‌లోని నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో అఫ్గన్ ఏకైక టెస్టుకు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. నోయిడా స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో.. చిత్తడిగా మారిన అవుట్‌ఫీల్డ్ ఎండకపోవడంతో తొలిరెండు రోజుల ఆట రద్దైంది. ఇక మూడో రోజు నుంచి వర్షం మొదలుకావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో సోమవారం మొదలుకావాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజులైనా.. కనీసం టాస్ కూడా పడలేదు. శుక్రవారం నాటి ఐదో రోజు ఆట కూడా రద్దైతే.. అఫ్గన్-కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోనుంది.సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, దార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, అల్లా మొహమ్మద్ గజన్ఫర్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఆసీస్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జోస్ ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు.ఈ గాయం కారణంగానే ది హండ్రెడ్ టోర్నమెంట్‌కు సైతం దూరమయ్యాడు. అయితే అతడు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. బట్లర్ తిరిగి మళ్లీ ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు బట్లర్ సారథ్యం వహించినట్లు ఈసీబీ వెల్లడించింది. కానీ ఇప్పుడు బట్లర్ ఫిట్‌నెస్‌పై సందిగ్దం నెలకొనడంతో.. ఇంగ్లండ్ జట్టుకు సామ్ కుర్రాన్ సారథ్యం వహించే అవకాశముంది. కాగా సెప్టెంబర్ 11 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్ -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌ను.. వన్డే సిరీస్‌కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్‌గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్‌ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్‌కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్‌తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల నేపథ్యంలో తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్‌కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ
బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవి చూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది. కాగా శ్రీలంకపై వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.మొదటి వన్డేను డ్రాగా ముగించిన భారత్.. వరసుగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. మరోసారి స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. లంక స్పిన్నర్ల దాటికి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో సత్తాచాటగా.. థీక్షణ, జెఫ్రీ వాండర్సే తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భాతర కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్‌లో శ్రీలంక తమ కంటే బాగా ఆడిందని హిట్‌మ్యాన్ కొనియాడాడు."స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్ల తడబాటుపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్నీ మేము తీవ్రంగా పరిగణిస్తాము. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ సరైన గేమ్ ప్లాన్‌తో ఆడాల్సిన అవసరముంది. సిరీస్‌లో మేము ఒత్తిడికి గురయ్యాము.తప్పు ఎక్కడ జరిగిందా అన్నది మేము చర్చించి తర్వాత మ్యాచ్‌ల్లో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. రాబోయే మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతే తప్ప టీ20 వరల్డ్‌కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. భారత్ తరుపన ఆడుతున్నంత కాలం మేము రిలాక్స్ అవ్వము. ముఖ్యంగా నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అటుంటి ఆంశాలకు అస్సలు చోటివ్వను.ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ ఈ సిరీస్ మొత్తం మేము చెత్తగా ఆడాం. కానీ శ్రీలంకకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. వారు మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. అందుకే శ్రీలంక సిరీస్‌లో విజయం సాధించింది. మేము ఇక్కడి కండిషన్స్‌కు తగ్గట్లు మా జట్టు కాంబినేషన్‌ను మార్చాము. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లకు ఇటువంటి కండిషన్స్‌కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేశాం. ఈ సిరీస్‌లో మాకు సానుకూల అంశాల కంటే ప్రతికూల ఆంశాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై కచ్చితంగా దృష్టి పెడతాము. ఎందుకంటే మరోసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైతే బాగా ఆడాలి కాదా. ఇక ఆటలో గెలుపోటములు సహజం. సిరీస్ కోల్పోవడం వల్ల ప్రపంచం ఏమి అంతం కాదు. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్‌లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్‌ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్‌రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. రోహిత్ సేన చెత్త రికార్డు
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే టై గా ముగియగా.. రెండో వన్డేల్లో భారత జట్టు పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినప్పటికీ అనూహ్య రీతిలో లంక చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓ చెత్త రికార్డు ముంగిట నిలిచింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత క్రికెట్ జట్టు తొలిసారి లంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది.అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసిపోగా.. రెండో వన్డేలో రోహిత్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది.ఆరంభంలోనే సిరాజ్.. ఓపెనర్ పాతుమ్ నిసాంక వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. 40 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టగా.. మిగతా వాళ్లు కూడా ఫర్వాలేదనిపించారు. కమిందు మెండిస్ సైతం 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(64), శుబ్‌మన్ గిల్(35) అదిరిపోయే ఆరంభం అందించారు. కానీ.. ఆ తర్వాత సీన్పూర్తిగా మారిపోయింది. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వాండర్సె తన మాయాజాలంతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు.10 ఓవర్లలో బౌలింగ్ కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో కాసేపు పోరాడినా.. వాండర్సె స్పిన్ దెబ్బకు భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 42.2 ఓవర్లలో 208 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా శ్రీలంక సిరీస్ 1-0తో ముందంజ వేసింది.ఈ నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత.. తొలిసారిగా శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవలేని స్థితిలో టీమిండియా నిలిచింది. మూడో వన్డేలో గెలిస్తే.. సిరీస్ 1-1తో సమం అవుతుంది. లేదంటే 2-0తో సిరీస్ కోల్పోయి 27 ఏళ్ల తర్వాత లంకకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా టీమిండియా నిలుస్తుంది. -
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్‌కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్‌లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్‌లో భారీ స్లాగ్‌స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్‌దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్‌దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్‌పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్‌దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్‌కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్‌పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
ఆ ఒక్క పరుగు చేయాల్సింది.. వారి వల్లే: రోహిత్ శర్మ
‘‘మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఛేదించగల స్కోరే ఇది. నిజానికి మేము బాగానే ఆడాం. అయితే, నిలకడలేమి బ్యాటింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పది ఓవర్ల తర్వాత.. ఒక్కసారి స్పిన్నర్లు బరిలోకి వచ్చారంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని ముందే ఊహించాం. అందుకే ఆరంభంలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని పరుగులు స్కోరు చేశాం.లక్ష్య ఛేదన మొదలుపెట్టిన సమయంలో మాదే పైచేయి. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ వల్ల తిరిగి పుంజుకున్నాం. అయితే, ఆఖర్లో 14 బంతులు ఉండి కూడా ఒక్క పరుగు తీయలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.ఆటలో ఇలాంటివన్నీ సహజమే. అయితే, శ్రీలంక ఈరోజు అద్బుతంగా ఆడింది. పిచ్ మొదటి నుంచి ఒకేలా ఉంది. తొలి 25 ఓవర్లలో మేము కూడా బాగా బౌలింగ్ చేశాం. తర్వాత వికెట్.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారింది. ఏదేమైనా మేము చివరిదాకా పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది.రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మేము కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు చేయాల్సింది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే ‘టై’గా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలిసారిగా లంకతో వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు.దంచికొట్టిన రోహిత్ఈ క్రమంలో శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఆతిథ్య జట్టును 230 పరుగులకు పరిమితం చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించినా మిడిలార్డర్ విఫలం కావడంతో కష్టాల్లో పడింది.ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(35 బంతుల్లో 16 రన్స్) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదుకుంటాడని భావిస్తే.. అతడు కూడా 32 బంతుల్లో కేవలం 24 పరుగులకే పరిమితమయ్యాడు.విజయానికి ఒక పరుగు దూరంలోవాషింగ్టన్ సుందర్(5) తేలిపోగా.. రీఎంట్రీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(31), అక్షర్ పటేల్(33) కాసేపు పోరాడగా.. శివం దూబే 25 పరుగులతో గెలుపు ఆశలు రేపాడు.అయితే, కేవలం 14 బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన వేళ.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్(0)ను అవుట్ చేయడంతో టీమిండియా ఆలౌట్ అయింది. విజయానికి ఒక పరుగు దూరంలో నిలిచి.. మ్యాచ్‌ను టై చేసుకుంది. భారత ఓపెనర్ల వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలగే(2/39) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: గురి చెదిరింది.. కాంస్యం చేజారింది -
నేనేం చేయాలి.. నన్నెందుకు చూస్తున్నావు?: వాషీపై రోహిత్ ‘ఫైర్’!
దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్ సందర్భంగా మైదానంలో దిగాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో ఆతిథ్య శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో భారత జట్టు బౌలింగ్‌కు దిగగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్ తీశాడు. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1) రూపంలో టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. అనంతరం.. శివం దూబే కుశాల్ మెండిస్(14), అక్షర్ పటేల్ సమరవిక్రమ(8) వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ చరిత్ అసలంక(14)ను పెవిలియన్‌కు పంపాడు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 27వ ఓవర్ మూడో బంతికి.. హాఫ్ సెంచరీ వీరుడు పాతుమ్ నిసాంక(56)ను అవుట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే, 29వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ చేసిన పనికి.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. దునిత్ వెల్లలగే క్రీజులో ఉన్న సమయంలో(28.5) సుందర్ గంటకు 91 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.ఈ క్రమంలో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వెల్లలగే విఫలమయ్యాడు. అయితే, బాల్ బ్యాట్ కంటే ప్యాడ్‌కు ముందు తాకిందని భావించిన వాషీ.. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ) కోసం అప్పీలు చేశాడు. అయితే, అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.దీంతో..స్లిప్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూసిన వాషీ.. అతడి గైడెన్స్ కావాలన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఏంటి? నువ్వే చెప్పాలి కదా!... అయినా నాకేం కనిపిస్తుందని నన్ను అడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా? ’’ అంటూ సరదాగా కసురుకున్నాడు. స్టంప్ మైకులో ఈ వ్యాఖ్యలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శివం దూబే, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Vintage stump mic banter from @ImRo45 😆 Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 🤩 📺#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/HYEM5LxVus— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2024