solapur
-
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్‌కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
పోలీస్‌స్టేషన్‌లో టూ వీలర్ల కుప్పలు : ఆధారాలు చూపిస్తే మీవే!
సోలాపూర్: సోలాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యర్థంగా పడిఉన్న వాహనాలను పక్షంరోజుల్లోగా రుజువులు చూపించి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో వాటిని స్క్రాప్ కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని సోలాపూర్ తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేశ్‌పాండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘స్టేషన్ ఆవరణలో నాలుగు ఫోర్‌వీలర్లు, 67 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి యజమానులు అవసరమైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను గుర్తించి తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే వాటిని పాడుబడిన వాహనాలుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి : ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా! -
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్‌ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు. -
వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు
సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు. వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి. ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి! -
సీఎం జగన్ స్పూర్తిగా.. మరో కార్యక్రమం
సాక్షి, సోలాపూర్: మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో మొక్కలు నాటారు. వివరాల ప్రకారం.. సోలాపూర్ జిల్లాలోని నామదేవరావు జగతాప్ విద్యాలయాల్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. దాదాశ్రీ ఫౌండేషన్ ద్వారా సోమవారం ఉదయం పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో చెట్టును బహుమతిగా అందజేశారు. దీంతో.. విద్యార్థులు చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో డా.సంచిత్ పాల్ (రత్నానిధి ట్రస్ట్ సీఈవో), అమ్దార్ కుమారుడు యువ పారిశ్రామికవేత్త సుగంధ చంద్రికాపురే, యోగేష్ జంకర్ (ప్రముఖ కార్పొరేటర్ థానే), గౌతమ్‌జీ జగ్దాలే (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ షోలాపూర్), శివాజీ రావ్ బంద్‌గార్ సర్ (చైర్మన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్మలా (వి.వి. గోపానే) ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మోహోల్) యూత్ నాయకులు సంతోష్ ధేరే, అశోక్ ధేరే, దాదాశ్రీ ఫౌండేషన్‌కు చెందిన మాధవ్ జాదవ్, దాదాశ్రీ ఫౌండేషన్ మెంటర్ దిగంబర్ (తాత్యా) చోప్డే యువ పారిశ్రామికవేత్త అశోక్ షేత్ చోప్డే, గణేష్జీ చవాన్ (జర్నలిస్ట్) జర్రే హైస్కూల్ ప్రిన్సిపల్ ఘడ్గే సర్ విద్యార్థి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మాకూ ఓ జగన్ కావాలి! -
30న సోలాపూర్‌లో సభ
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకలాపాలను వేగవంతం చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నెలాఖరులోగా సోలాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహించేందుకు సభాస్థలిని ఎంపిక చేయాల్సిందిగా స్థానిక బీఆర్ఎస్ నేతలను ఆదేశించారు. సభ నిర్వహణ ఏర్పాట్లపై మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ తాజాగా చర్చించినట్లు తెలిసింది. పార్టీ బలప్రదర్శనకు అద్దం పట్టేలా కనీసం 2 లక్షల మందిని ఈ సభకు సమీకరించాలని లక్ష్యం నిర్దేశించారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పార్టీ నేత ఎస్.వేణుగోపాలాచారి తదితరులకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 20 తర్వాత మంత్రి హరీశ్‌రావు సోలాపూర్‌లో సభాస్థలిని పరిశీలించి స్థానిక బీఆర్ఎస్ నేతలతో సభ ఏర్పాట్లపై చర్చిస్తారు. సుమారు వారంపాటు పార్టీ నేతలతో కలసి సోలాపూర్‌లోనే మకాం వేసి సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలను పర్యవేక్షిస్తారు. బీఆర్ఎస్లోకి ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు? సోలాపూర్‌లో జరిగే బహిరంగ సభా వేదికగా ఎన్సీపీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఓ మాజీ ఎంపీ, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివసేన, ఎన్సీపీలో చీలిక, కాంగ్రెస్‌లో నిస్తేజం వంటి పరిణామాలు వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపేందుకు దోహదం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్లో చేరే ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, వారి చేరికలకు సంబంధించి కేసీఆర్ వివరాలు వెల్లడిస్తారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2024లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిన వివిధ పార్టీల నేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరగా వారిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన సోలాపూర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు నగేశ్ వల్యాల్, జుగన్భాయ్ అంబేవాలే, సంతోష్ బోంస్లే 30న జరిగే బహిరంగ సభలో కీలకపాత్ర పోషించనున్నారు. సోలాపూర్పై పట్టు సాధించేందుకు మహారాష్ట్రలోని మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్... నాందెడ్, ఔరంగాబాద్, నాగపూర్లలో సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే గత నెలలో సోలాపూర్‌లో రెండ్రోజులు పర్యటించారు. 30న నిర్వహించే భారీ సభ ద్వారా సోలాపూర్‌తోపాటు కొల్లాపూర్, సాంగ్లి, ఉస్మానాబాద్, బీడ్ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. -
మరో కొత్త రికార్డు..వందేభారత్ నడిపిన సురేఖ యాదవ్.. 5 నిమిషాల ముందే గమ్యస్థానానికి!
సాక్షి, ముంబై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన మొదటి మహిళ లోకోపైలట్‌గానూ సురేఖ యాదవ్ చరిత్ర సృష్టించారు. షోలాపూర్–ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో లోకోపైలట్ (డ్రైవర్)గా సురేఖ యాదవ్ విధులు నిర్వహించారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం సీఎస్ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు. 34 సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో వివిధ సేవలందిస్తున్న సురేఖ యాదవ్‌కు గూడ్స్ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న కల నెరవేరిందని, ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం టైంటేబుల్ ప్రకారం బయలుదేరిన ఈ రైలును సీఎస్ఎంటీకి ఐదు నిమిషాల ముందే చేర్చారు. ఇక్కడ ఆమెకు ఘన స్వాగత లభించింది. ఖండాలా–కర్జత్ మధ్య ఘాట్ సెక్షన్లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదే. ముఖ్యంగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే విద్యుత్ మోటార్లుంటాయి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ.. ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు. 1996 నుంచి.. మహారాష్ట్ర సాతారా జిల్లాలోని సెయింట్ పాల్ స్కూల్లో చదువుకున్న సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. 1989లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా నియమితులయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని 1996లో గూడ్స్ రైలు డ్రైవర్‌గా విధినిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2000లో మోటార్ ఉమెన్‌గా గౌరవం పొందారు. 2010లో ఘాట్ సెక్షన్లో రైలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తరువాత పుణే–ముంబై నగరాల మధ్య నడుస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు లోకోపైలట్‌గా ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడంలో కూడా సఫలీకృతం కావడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కవలలు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
ముంబై: కవలలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 2న జరిగిన వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వరుడిని చిక్కుల్లో పడేసింది. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో పెళ్లి కొడుకుపై బహుభార్యత్వం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీసీలోని 494 సెక్షన్ కింద నవ వరుడు అతుల్‌పై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌తోపాటు మహారాష్ట్ర మహిళా సంఘం కూడా కోరుతున్నాయి. Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t — Siraj Noorani (@sirajnoorani) December 4, 2022 అసలేం జరిగిందంటే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీ అతుల్ ఉత్తమ్ అనే వ్యక్తిని ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. రింకీ, పింకీలు ఇద్దరూ ఐటీ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అతుల్ అనే వ్యక్తితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అతుల్‌కు ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ ఉంది. కవలల తండ్రి మరణించడంతో ప్రస్తుతం వారు తల్లితో కలిసి ఉంటున్నారు. ఆరు నెలల క్రితం రింకీ, పింకీ తల్లి అనారోగ్యానికి గురవ్వడంతో అతుల్ తన ట్యాక్సీలో వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి అంగీకరించడంతో సోలాపూర్‌లో ఘనంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి కుమార్తెలిద్దరూ కలిసి వరుడికి ఒకే పూలదండ వేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. -
వైరల్ వీడియో: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్
-
ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్
వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయంటే ఏంటో అనుకుంటాం. కొన్ని జంటలను చూస్తే అలానే అనిపిస్తాయి. ఇక్కడొక వివాహ వేడుకలో పెళ్లికూతుళ్లు ఇద్దరూ ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. చాలా వింతగా ఉన్న ఇది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సోలాపూర్‌లోని మల్షిరాస్ తాలుకాకు చెందిన అక్లూజ్ అనే వ్యక్తి కవల అక్కా చెల్లెళ్లను పెళ్లిచేసుకున్నాడు. కవలలిద్దరూ ఐటీ ఇంజనీర్లే. ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆ ఇద్దరూ కవలలు ఒక వ్యక్తినే వివాహం చేసుకున్నారు. కవల అక్కా చెల్లెళ్లు పింకీ, రింకీ చిన్నతనం నుంచి కలిసే ఉండటంతో ఒకే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదీగాక ఆ ట్విన్ సిస్టర్స్ ఇద్దరూ చూసేందుకు ఒకేలా ఉంటారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆ కవల అక్కచెల్లెళ్లుకు కొద్దిరోజుల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లితోనే కలిసి ఉంటున్నారు. ఒకసారి వాళ్ల అమ్మ ఆరోగ్యం బాగోలేనప్పుడూ ఈ అతుల్ అనే వ్యక్తి తన కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లి సాయం అందించాడు. ఈ నేపథ్యంలోనే అతుల్‌కి ఆ ఇద్దరూ అక్కచెల్లెళ్లకు మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, అందువల్లే ఆ కవలలిద్దరూ అతూల్ అనే వ్యక్తినే పెళ్లిచేసుకున్నారని మహారాష్ట్ర స్థానిక మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మీరు కుడా ఓ లుక్కేయండి. Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt — Love (@LocalBabaji) December 4, 2022 (చదవండి: చోరీ చేసిన సోత్తు ఏం చేశావ్? దొంగ రిప్లై విని ఆశ్చర్యపోయిన పోలీసులు) -
బంపర్ ఆఫర్: రూపాయికే లీటర్ పెట్రోల్
సాక్షి, ముంబై: వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోలాపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్.. రూపాయికే లీటర్ పెట్రోల్ అని 500 మందికి పెట్రోల్ఇచ్చారు. దీంతో ఆఫర్ విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ వద్ద క్యూ కట్టారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనదారులకు కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3 — Maharashtra Today (@mtnews_official) April 14, 2022 ఈ సందర్భంగా బంక్ యజమాని మాట్లాడుతూ.. భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. కాగా, 500 మందికే పెట్రోల్ ఇవ్వడంతో మిగిలిన వారంతా ఉసురూమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్‌లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్‌బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్‌కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
మేయర్ దంపతులకు కరోనా
షోలాపూర్(మహారాష్ట్ర): షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ యెన్నం కాంచనకు కరోనా సోకింది. ఆమెతోపాటు భర్త యెన్నం రమేశ్‌కు కూడా కరోనా సోకినట్టు శుక్రవారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. దీంతో మేయర్ దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో షోలాపూర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మేయర్ దంపతులిద్దరికీ కరోనా సోకడంతో వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. చదవండి: షోలాపూర్ మేయర్‌గా తెలుగు మహిళ లాక్డౌన్ సమయంలో ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు.. ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి రాగానే కరోనాపై అవగాహన కల్పించేందుకు ఆమె పలు చోట్ల పర్యటించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు, క్వారంటైన్, కంటైన్మెంట్ ప్రాం తాల్లోనూ తిరిగారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఆమె అస్వస్థతకు గురికావడంతో పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె భర్త, వెంట తిరిగిన పలువురు ఉద్యోగులు, అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహిం చారు. అందులో ఆమె భర్తకు మినహా మిగతా వారికి నెగెటివ్ వచ్చింది. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! -
అనూహ్యం: అజిత్ పవార్, ఫడ్నవీస్ భేటీ
ముంబై : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ భేటీ అయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం ఏమైనా కూలుతుందా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, తర్వాత అజిత్ ఇచ్చిన వివరణతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలు.. సోమవారం స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్ షిండే కుమార్తె వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ఈ విషయంపై అజిత్ పవార్ వివరణనిస్తూ.. వాతావరణం, వర్షపాతం గురించే మేం మాట్లాడాం. ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావనకు రాలేదు. పెళ్లి నిర్వాహకులు చేసిన ఏర్పాట్ల వల్ల మేం పక్కపక్కనే కూర్చున్నాం తప్ప కావాలని కూర్చోలేదని మీడియాకు స్పష్టం చేశారు. -
ఒడిదుడుకులు తట్టుకుంటేనే విజయం సాధిస్తాం
షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ యెన్నం కాంచన ఎన్నికై రికార్డు సృష్టించారు. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం జరిగిన రెండవ టర్మ్ మేయర్ ఎన్నికల్లో యెన్నం కాంచన ఘన విజయం సాధించారు. అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో రెండేళ్ల క్రితం కృష్ణవేణి రెడ్డి కార్పొరేటర్‌గా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు మహిళ కాంచన యెన్నం ఏకంగా మేయర్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. పెళ్లి తర్వాతే తన జీవితంలో మార్పు పచ్చిందని కాంచన యెన్నం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఈగె అయిలప్ప, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కాంచన షోలాపూర్‌లోనే పుట్టి పెరిగారు. స్థానిక డీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాంచనకు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన యెన్నం రమేష్‌తో 1992లో వివాహం జరిగింది. సాధారణ గృహిణిగానే జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఆమె భర్త రమేష్ రాజకీయాల్లో తిరుగుతుండడం చూసి ఆమెకు కూడా కూడా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజసేవ చేయాలన్న సంకల్పం కలిగింది. దాంతో బీడీ కార్మికులు, కుట్టు పనులు చేసే మహిళలు తదితరుల కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయగలగడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. భర్త ప్రేరణ, ప్రోత్సాహం సమాజసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలోనే కాంచనకు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ‘‘1997లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేముండే మార్కండేయనగర్ వార్డు మహిళ కోటాలోకి రావడంతో ఈ వార్డు నుంచి టికెట్ కోసం నా భర్త తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఏ పార్టీకోసం పాటు పడుతున్నారో, ఆ పార్టీనే తనను పక్కన పెట్టేసరికి ఇద్దరం పార్టీ మారాం. ఇలా సుమారు గత 22 సంవత్సరాలుగా మేము బీజేపీలో కొనసాగుతున్నాం. 2002లో బీజేపీ నాకు మార్కండేయనగర్ వార్డు (షోలాపూర్ కార్పొరేషన్) నుంచి టికెట్ ఇచ్చింది. అలా నేను నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్‌గా విజయం సాధించి కార్పొరేషన్లో అడుగుపెట్టాను. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాను’’ అని కాంచన తెలిపారు. ఊహించని విజయం అయితే మేయర్ పీఠం దక్కుతుందని మాత్రం తను ఊహించలేదని కాంచన అన్నారు. ‘‘బీజేపీ నన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నాకు పోటీగా శివసేనకు చెందిన సారిక పిసే, కాంగ్రెస్‌కు చెందిన ఫిర్దోస్ పటేల్, ఎంఐఎంకు చెందిన శహజిదా బానో శేఖ్ బరిలోకి దిగారు. అయితే ఎన్నికకు ముందు సారిక పిసే, ఫిర్దోస్ పటేల్‌లు తప్పుకోవడంతో బానో శేఖ్తో నాకు పోటీ ఏర్పడింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలు జత కట్టాయి. కాని ఎన్నికకు ఒక రోజు ముందే వీడిపోయారు. దాంతో ఈ ఎన్నికలో నాకు 51 ఓట్లు పోలవ్వగా బానో శేఖ్కు కేవలం ఎనిమిది ఓట్లు పోలయ్యాయి. ఇలా ఊహించని విధంగా భారీ మెజార్టీతో విజయం సాధించగలిగాను’’ అని ఆమె చెప్పారు. ఆదర్శ కార్పొరేటర్ కుటుంబ సభ్యులతో (భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తె, మనుమడు) యెన్నం కాంచన కాంచన యెన్నం అనేక పదవులను అలంకరించారు. సుమారు 17 ఏళ్లనుంచి కార్పొరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ప్రస్తుతం షోలాపూర్ బీజేపీ వర్కింగ్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఇందిరా మహిళ సహకార బ్యాంకుకు వైస్ చైర్మన్‌గా, షోలాపూర్ మన్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసి) మహిళ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, అదేవిధంగా ఎస్‌ఎంసిలోని పలు పదవులను అలంకరించారు. 2016–17లో స్టాండింగ్ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆదర్శ కార్పొరేటర్ అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ పనిలోనైనా జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజమని కాని వాటిని తట్టుకుంటేనే విజయం లభిస్తుందని కాంచన యెన్నం అంటారు. – గుండారపు శ్రీనివాస్, మావునూరి శ్రీనివాస్ సాక్షి, ముంబై -
18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు
సాక్షి, ముంబై: తన ప్రియతమ నాయకుడు గెలిచాడని బాపు జావీర్ అనే కార్యకర్త ఏకంగా 18 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేపట్టి మొక్కు తీర్చుకున్నారు. షోలాపూర్ జిల్లా సాంగోలా అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి శహాజీ బాపు పాటిల్ విజయం సాధించారు. పాటిల్ విజయం కోసం సాంగోలా బాపు జావీర్ తనవంతు కృషి చేశారు. పాటిల్ విజయం సాధిస్తే స్వగ్రామం సుపాలే నుంచి పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు చేసి విఠలేషున్ని దర్శించుకుంటానని జావీర్ మొక్కుకున్నాడు. పాటిల్ గెల్చిన విషయం తెల్సి.. జావీర్ సుపాలి గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లాడు. ఎండలో తారు రోడ్డుపై, మట్ట రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు పెట్టిన దృశ్యం వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. -
కూలిన బ్యాంకు పైకప్పు..
షోలాపూర్ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన భవనం పైకప్పు కూలిన ఘటనలో 20 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన షోలాపూర్‌కు సమీపంలోని కర్మాలాలో బుధవారం చోటుచేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 10 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మిగతా వారిని కూడా బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. దైవదర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల వాహనంను ఓ ట్యాంకరు ఢీకొట్టింది. మరణించిన వారందరు షోలాపూర్‌లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మరణించిన వారిని చిలువేరి రజనీ (35), చిలువేరి అపర్ణ (13), ఆడం వర్ష (12), శివకుమార్ పోబత్తి (40), నర్మదా పోబత్తి (35), నేతాజీ పోబత్తి (12), శ్రద్ద పోబత్తి (4), ఆడం లింగరాజ్ (12)లుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘాట్ ప్రాంతంలో శింథపులే గ్రామం వద్ద సోమవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటచేసుకుంది. షోలాపూర్ గోదుతాయి పెరుళేకర్ గృహ సముదాయంలో నివసించే గడ్డం, చిలువేరి, ఖ్యాతం, పోబత్తి కుటుంబాలు ఓమినీ కారు అద్దెకు తీసుకుని తుల్జాపూర్ దైవదర్శనానికి బయలుదేరారు. తుల్జాపూర్ ఘాట్‌లో శింథపలే గ్రామం వద్ద ఓ ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఓమినీ కారు నుజ్జు నుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
బ్లూవేల్ భూతం: బాలుడిని రక్షించిన పోలీసులు
ముంబైః ప్రపంచదేశాలనే గడగడవణికిస్తున్న మృత్యు క్రీడ ‘బ్లూ వేల్’ బారిన పడిన ఓ 14 ఏళ్ల బాలున్ని పోలీసులు రక్షించారు. ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్ గేమ్ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు. వివరాల్లోకి వెళ్తే షోలాపూర్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుధీర్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. అయితే అయిదారు రోజుల నుంచి సుధీర్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తల్లిదండ్రులు గమనించారు. సెల్ ఫోన్లో బిజిగా ఉండడం కూడా గమనించారు. ముఖ్యంగా అస్వస్థతతోపాటు సరిగా నిద్రపోకపోవడం తదితరాలను గమనించి సుధీర్‌కు నిద్రపోయేందుకు రోజు తలకి ఆయుర్వేదం అయిల్‌తో మసాజ్ చేసేవారు. అయితే ఈ బ్లూ గేమ్ బారిన పడ్డాడన్న సంగతి వారికి తెలియలేదు. చెప్పపెట్టకుండానే బస్సెక్కాడు... కొన్ని రోజులుగా సరిగా నిద్రపోకుండా ఉన్న సుధీర్ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోవారికి ఎవరికి ఏమి చెప్పకుండానే ఇంట్లోనుంచి బయటపడ్డాడు. క్రికెట్ అకాడమి కోసమని తీసుకున్న రూ. మూడు వేల రూపాయలతోపాటు, సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరాడు. తాను ఇళ్లు వదిలి వెళ్తున్నానని తనను వెదికించేందుకు ప్రయత్నం చేయవద్దని లేదంటే తానేమైన చేసుకుంటానని బెదిరిస్తూ రాసిన లేఖను చూసి ఇంట్లో సు ధీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగారు. సెల్‌ఫోన్‌తోనే ఆచూకి లభ్యం....! సుధీర్ ఇళ్లు విడిచి వెళ్లడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సుధీర్ వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి పుణే దిశలో టేంబూర్ణీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. దీన్నిబట్టి పుణే దిశగా సుధీర్ ప్రయాణిస్తున్న భావించిన పోలీసులు బస్సు డిపోతో పాటు అటువైపు బయలుదేరిన బస్సు డ్రైవర్లు కండక్టర్లతో సంప్రదింపులు జరిపి బాలున్ని వివరాలు చెప్పి ఇలాంటి బాలుడు బస్సులో ఉన్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నంచేశారు. ఇంతలో ఓ బస్సులో వీరు చెప్పిన వివరాలనుసారం ఓ బాలుడు ఉన్నట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లో భిగవాన్ బస్సుస్టాండ్‌కు చేరుకోనున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి పోలీసులకు సమచారం అందించారు. అనంతరం ఆ బస్సులోని సుధీర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దర్యాప్తులో ఇదంత బ్లూ బెల్ గేమ్ ఆడడం వల్లే జరిగిందని తెలిసింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఘోరం జరగకముందే పోలీసులు సుధీర్‌ను రక్షించగలిగారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దుధని రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హోతగి-గుంతకల్లు, వాడి-లాతూర్-మన్మాడ్ మార్గాల్లో 12 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
ఘాటెక్కిన ఉల్లిధరలు
-
ఘాటెక్కిన ఉల్లి
మండపేట : ఉల్లి ధర ఘాటెక్కింది. ఏడాది కాలంలో ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.35కు చేరి సామాన్యులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. ఉల్లి ధరను పెంచేశాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వంద టన్నులకు పైగా ఉల్లిపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, శ్రీరాంపురం, పుణె తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుంటారు. వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్రలో 20 నుంచి 25 శాతం మేర దిగుబడులు పడిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి దళారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వారంటున్నారు. గోదాముల్లో ముందుగానే నిల్వలు చేసుకున్న దళారులు.. సరుకు లేదంటూ అరకొరగా అందజేస్తుండటం ధరలపై ప్రభావం చూపుతోందంటున్నారు. స్థానిక అవసరాలతో పాటు, ఒడిశాకు ఎగుమతి చేసేందుకు జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారులు రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటే, ప్రస్తుతం ఆ మేరకు అక్కడి నుంచి సరుకు అందడం లేదంటున్నారు. జూన్ నెలాఖరుకు రూ.16 నుంచి రూ.20 వరకున్న ధర, జూలై ప్రారంభంలో రూ.25కు చేరింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.35 పలుకుతోంది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ అధిక ధరకు కొనుగోలు చేయడంతో పాటు రవాణా చార్జీలు కూడా ఎక్కువై మార్కెట్‌కు చేరేసరికి ధర రెట్టింపవుతోంది. మరో రెండు నెలలు! ఇలాఉండగా మరో రెండు నెలల్లో కర్నూలు ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తే ధరలు అదుపులోకి వస్తాయంటున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పండించే ఉల్లిపాయలు డిసెంబర్, జనవరి నెలల్లో మార్కెట్లోకి వస్తే పూర్తిస్థాయిలో ధరలు అదుపులోకి వచ్చి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగా, ఉల్లిపాయల ధర ఘాటెక్కడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉల్లిపాయలు తప్పనిసరి కావడంతో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో కిలో రూ.10 మాత్రమే ఉండగా, ఈ ఏడాది మూడింతలు పెరగడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో హోటళ్లు, ఇళ్లలోను కొంత మేర వినియోగం తగ్గిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పరిహారంపై ఆంక్షలు తగునా!
షోలాపూర్: కరువు కారణంగా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు నష్టపరిహారం పొందే విషయంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడంతో రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. సరైన పత్రాలు, ఆత్మహత్యకు సరైన కారణాలు లేవనే సాకుతో సహాయం అందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. లేదంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. చిన్న చిన్న కారణాలు, తప్పిదాల వల్ల అనేక మందిని ఆర్థిక సాయం పొందే విషయంలో అనర్హులుగా ప్రకటిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రైతుల కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా ఆరుగురిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు రైతుల ఆత్మహత్యలు నియమ, నిబంధనలకు లోబడి లేవని, మరొకరి కుటుంబాన్ని విచారణ పేరుతో సాయం అందించేందుకు నిరాకరించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లేదా వారి వారసులకు ప్రభుత్వం లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది. అందులో రూ.30 వేలు నగదు, మిగిలిన రూ.70 వేలు నెల వారీగా అందజేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సిద్ధం చేశారు. కానీ అధికారులు చిన్న చిన్న కారణాలకే అనర్హులుగా ప్రకటించడం సమంజసం కాదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన జాబితా రూపొందించి అర్హులకు నష్టపరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
టెక్స్టైల్స్ బంద్ విజయవంతం
భివండీ, న్యూస్‌లైన్ : పెరిగిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహారాష్ట్రలోని వస్త్రపరిశ్రమ వ్యాపారులు సోమవారం ఒక్కరోజు బంద్ పాటించారు. ఈ బంద్‌లో మాలేగావ్, ధులే, షోలాపూర్, యేవ్లా, వీటా, ఇచ్చల్కరంజీ, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక పవర్లూమ్ అసోసియేషన్లు, భివండీకి చెందిన పవర్లూమ్ పరిశ్రమల యజమానులు, వివిధ పవర్లూమ్ సంస్థల పదాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా పవర్లూమ్ పరిశ్రమలతో భారీ స్థాయిలో వస్త్రాలను ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారం మోపిందని వారు ఆరోపించారు. విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఆందోళనకారులు విద్యుత్ బిల్లుల హోలి (విద్యుత్ బిల్లులను తగులబెట్టడం) నిర్వహించారు. వస్త్రపరిశ్రమల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లేందుకు ఆయా ప్రాంతాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందించారు. భివండీలో...: పట్టణంలోని పద్మనగర్, బండారి కంపౌండ్, నారాయణ్ కంపౌండ్, ఈద్గా రోడ్, శాంతీనగర్, మీట్ పాట, తదితర ప్రాంతాలలో పవర్లూమ్ పరిశ్రమలు సోమవారం బంద్ పాటించాయి. మహారాష్ట్ర పవర్లూమ్ బున్కర్ సంఘటన అధ్యక్షులు ఫైజాన్ ఆజ్మీ నేతృత్వంలో విద్యుత్ బిల్లుల హోలి నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫైజాన్ ఆజ్మీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలను కొనసాగించి పవర్లూమ్ పరిశ్రమలకు జీవం పోయాలని డిమాండ్ చేశారు. ప్లేన్ పవర్లూమ్ యంత్రాలను ఆధునీకరించేందుకు ఇస్తున్న రుణాన్ని రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిలకడగాలేని నూలు ధరలను అదుపు చేయాలని కోరారు. నూలు కార్టన్లపై ఎమ్.ఆర్.పి, రేట్లు ముద్రించాలని, పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజ్ వసతులు, కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.భివండీ పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు వంగ పురుషోత్తం న్యూస్‌లైన్ తో పాట్లాడుతూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల పవర్లూమ్ యంత్రాలు ఆగిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. -
దుకాణాలకు వేలం పాట
షోలాపూర్, న్యూస్‌లైన్: గడువు ముగిసిన షాపింగ్ సెంటర్లలోని దుకాణాలను వేలం పాట ద్వారా కేటాయిస్తామని షోలాపూర్ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ స్పష్టం చేశారు. గడువు ముగిసి పోయినప్పటికీ సదరు దుకాణాదారులు తమ వ్యాపారాన్ని అలానే కొనసాగిస్తున్నారని తెలిపారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అనుసరించి ఈ వేలంపాటను కొనసాగిస్తామన్నారు. సదరు షాపింగ్ సెంటర్లోని దుకాణాదారులతో ఇంతకు ముందే సమావేశం నిర్వహించామన్నారు. కాగా, ఈ దుకాణాల వేలం విషయమై స్టాండింగ్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని చెర్మైన్ బాబా మేస్త్రి స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, 2010 మార్చిలోనే పట్టణంలోని 460 దుకాణాల గడువు ముగిసిందని తెలిపారు. వీటిలో మేజర్, మినీ షాపింగ్లున్నాయని, ఆయా దుకాణాల్లో అనేకమంది బోగస్ అద్దె దుకాణాదారులు కూడా ఉన్నారన్నారు. గడువు ముగిసిన దుకాణాలకు వేలం వేయడం ద్వారా ఎస్ఎంసీకి ఆదాయం సమకూరనుందన్నారు. కాగా, 1,460 దుకాణాల్లో 601 మేజర్ దుకాణాలు ఉన్నాయన్నారు. ముందుగా మేజర్ దుకాణాల వేలం పాట నిర్వహిస్తామనీ, ఈ వేలంలో అందరూ పాల్గొనవచ్చునన్నారు.రూ.వెయ్యి చెల్లించి వ్యాపారులు వేలం ఫారాలు పొందవచ్చని తెలిపారు. వాటిని పూరించి కార్యాలయంలో అందజేయాలని చంద్రకాంత్ అన్నారు. కాగా, ఈ నెల 20వ తేదీన ఫారాలు విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సహకారానికి ప్రై‘వేటు’..!
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72 ప్రైవేటు పంచదార కంపెనీలు ఉండగా, అందులో 15 షోలాపూర్‌లోనే ఉన్నాయి. ఇక్కడ సహకార కంపెనీల కంటే కంటే ప్రైవేటు కంపెనీల సంఖ్య పెరుగుతోంది. షోలాపూర్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 30 కంపెనీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ క్రషింగ్ సమయంలో జిల్లాలో మరిన్ని ప్రైవేట్ కంపెనీలు వెలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంగళవేడా తాలూకాలోని కచరెవాడేలో యుటోపియన్, లవంగిలో భైరవనాథ్ షుగర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో మూడు ప్రారంభ దిశలో ఉన్నాయి. దీంతో జిల్లాలో ప్రైవేటు కంపెనీల సంఖ్య 20కి పెరగనుంది. రాష్ట్రంలో తక్కువగా వర్షపాతం నమోదైన షోలాపూర్, ఉస్మానాబాద్, లాతూర్ ప్రాంతాల్లోనే ప్రైవేట్ కార్ఖాణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఏర్పాటైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు విజయవంతమవ్వడమే కాకుండా కొన్నివేల మందికి ఉపాధిని కలిగించాయి. అయితే ప్రస్తుతం సహకార ఫ్యాక్టరీల పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో వాటిలో చాలావరకు మూతదశకు చేరుకున్నాయి. 36 సహకార చక్కెర కర్మాగారాలు లిక్విడేటర్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. అలాగే మరో 28 కంపెనీలు సహకారం నుంచి ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదిలాఉండగా, వర్షపాతం తక్కువగా ఉన్న కొల్హాపూర్ ప్రాంతంలో 5 ప్రైవేటు ఫ్యాక్టరీలున్నాయి. అలాగే పుణేలో 5, సతారా 3, సంగ్లీ 3, అహ్మద్‌నగర్ ప్రాంతంలో 5 చొప్పున ప్రైవేటు పంచదార కంపెనీలు వెలిశాయి. మరాట్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లాలో 6, లాతూర్‌లో 4 ప్రైవేట్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. -
చక్కెర రవాణాకు సౌకర్యాల కల్పన
షోలాపూర్, న్యూస్‌లైన్: పంచదార రవాణాకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని షుగర్ కంపెనీల వారికి సెంట్రల్ రైల్వే షోలాపూర్ డివిజన్ అధికారులు హామీ ఇచ్చారు. షోలాపూర్ డివిజన్ కార్యాలయంలో బుధవారం రైల్వే అధికారులు, షుగర్ ఫ్యాక్టరీల యజమానులు, కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కెర రవాణా సమయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. చక్కెర ఫ్యాక్టరీల నుంచి రైల్వే స్టేషన్ వరకు సరుకు రవాణా సమయంలో రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని సభ్యులు తెలిపారు. దాంతో సమస్యల పరిష్కారానికి తాము వెంటనే చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ చీఫ్ జాన్ థామస్, డిప్యూటీ అధికారి కె. మధుసూదన్, అశోక్ వర్మ, వాణిజ్య విభాగం అధికారులు మదన్‌లాల్ మీనా, ఐ. భాస్కర్‌రావుతోపాటు విఠల్‌రావు షిండే షుగర్ ఫ్యాక్టరీ, లోక మంగళ ఫ్యాక్టరీ, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్యాక్టరీ, వికాస్ సహకార ఫ్యాక్టరీ తదితర షుగర్ ఫ్యాక్టరీల ప్రతినిధులు, అహమ్మద్ నగర్, బేలాపూర్, గుల్బర్గా, షోలాపూర్ గుత్తేదార్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఈ యేడు చెరుకు క్రషింగ్ సీజన్లో సరుకు రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించాలనే యోచనలో రైల్వే యంత్రాంగం ఉంది.పంచదార లోడింగ్ అత్యధికంగా చేసుకునేందుకుగాను రైల్వే అధికారులు షుగర్ ఫ్యాక్టరీల వారిని ప్రత్యక్షంగా కలుసుకొంటున్నారు. ప్రస్తుతం షోలాపూర్ డివిజన్‌కు సంబంధించి ప్రయాణికుల రాకపోకల ద్వారా లభించే ఆదాయం కాస్త మందగించింది. ఈ లోటును పంచదార రవాణా ద్వారా పూడ్చుకోవాలని రైల్వే యంత్రాంగం భావిస్తోంది. ఇక్కడి నుంచి బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్ము తదితర రాష్ట్రాలకు రైల్వే ద్వారా పంచదార రవాణా అవుతుంది. ఈ సంవత్సరం చెరుకు విస్తారంగా పండింది. దీంతో పంచదార ఉత్పత్తులు భారీగా ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. గత యేడాది కంటే ఈ ఏడాది పంచదార రవాణా ద్వారా 15 శాతం అధిక ఆదాయం లక్ష్యంగా వారు కార్యాచరణ చేపడుతున్నారు. -
దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో సోమవారం ఉదయం నిర్వహించిన కులధ్రువీకరణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్, జోడు బసవన్న చౌక్ మహా ఈ-సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని ఆరో నంబరు పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిబిరాన్ని జనతా సహకార బ్యాంక్ చైర్మన్ జగదీష్ తుల్జాపూర్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాలకోసం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఎన్నోపాట్లు పడుతున్నారని, అయితే ఇటువంటి శిబిరాల నిర్వహణతో వారికి ఎంతో వె సులుబాటు లభించిందన్నారు. ఇక్కడ చదువుకున్న వారందరికీ ధువీకరణ పత్రాలు తప్పనిసరనే నిబంధనతో తెలుగువారంతా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇవి లభించడం కష్టంగా మారడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ నిబంధనను మార్చాల్సిందిగా కొత్త ప్రభుత్వాన్ని కోరతామన్నారు.ఈ శిబిరానికి హాజరైన 127 మంది విద్యార్థులు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుహిని శెట్టి జ్ఞాతి సంస్థ అధ్యక్షుడు దీనానాథ్ దూళం, ఫౌండేషన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ కోండా, శ్రీధర్ సుంరా, రమణ పోటుబత్తి, నరేంద్ర దారా, శివదత్త్ కుని, ఆనంద్ బిర్రు, ఆనంద్ బిర్రు, నారాయణ ఎరువా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సతీష్ చిటుమల్, శ్రీనివాస్ పోగులు, అర్చన పోతన, లక్ష్మీ బైరి, పూజానందాల్, శ్రీనివాస్ కామ్మూర్తి, సంతోష్ పోగుల తమవంతు సహకారం అందించారు. -
షోలాపూర్‌లో విస్తరిస్తున్న డెంగీ
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో డెంగీ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 14 మందికి ఈ రోగం సోకిందని, వీరంతా ప్రభుత్వ, ప్రైవేట్ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎస్ఎంసి ఆరోగ్య శాఖ అధికారి జయంతి ఆడ్కే మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లో డెంగీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. పూజా నలువాడే, పూజా చాయిస్కర్ అనే బాలికలు డెంగీ బారిన పడి, విజయ్ బోసుళే మలేరియా పాజిటివ్‌తో మృతి చెందారన్నారు. పట్టణంలోని అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లు సోకిన వారు అధిక సంఖ్యలోనే చికిత్స పొందుతున్నారని ఆమె వివరించారు. అలాగే ఒక కేసులో జైలు జీవితం గడుపుతున్న కళావతి పండారె అనే మహిళా ఖైదీకి కూడా డెంగీ సోకిందని ఆమె చెప్పారు.కాగా, డెంగీ నివారణకుగాను తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఎంపీ శరద్ బన్సోడే, ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్షించారు. అనంతరం వారితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణవ్యాప్తంగా ఫ్యాగింగ్ చేయించాలని, టైఫాయిడ్ నివారణ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. డీఐటీ వంటి ఔషధాలు కూడా పంపిణీ చేస్తున్నామని కమిషనర్ ఆయనకు వివరించారు. నయిజిందగి, సిద్ధేశ్వర్ నగర్, సలుగార్ వస్తి, కుముటనాకా అలాగే స్లండం ప్రాంతాల్లో డెంగీ విస్తరిస్తున్న దరిమిలా ఆయా ప్రాంతాలో ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టినట్లు జయంతి అడ్కే చెప్పారు. -
‘లోక్ మంగళ’ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
షోలాపూర్, న్యూస్‌లైన్ : పట్టణంలోని లోక్‌మంగళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సామూహిక వివాహాలు జరిగాయి. హరిబాయి దేవకరణ్ పాఠశాల ప్రాంగణంలో 111 జంటలు ఒకటయ్యాయి. అనంతరం రెండు గంటలపాటు 111 రిక్షాల్లో జంటలతో బారాత్ నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు లక్ష మందికి పైగా వధూవరుల బంధువులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 210 మంది రక్తదానం కూడా చేశారు. అంతేకాకుండా ఇక్కడ ‘స్వచ్ఛ్ భారత్’ నిర్వహించి చెత్తచెదారాన్ని నిర్ణీత ప్రదేశంలో వేసేలా అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా, లోక్‌మంగళ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించడం ఇది 18వ సారి అని ఫౌండేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశ్‌ముఖ్ తె లిపారు. -
4వ తేదీ నుంచి ఫ్లయింగ్ ఫెస్టివల్
సాక్షి, ముంబై: షోలాపూర్ అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు అవకాశం కలిగించనున్నట్లు డాక్టర్ శిరీష్ వలుసంగ్కర్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఈ నెల 4వ తేదీనుంచి ఆరు రోజుల పాటు రోటరీ క్లబ్ ఆఫ్ షోలాపూర్ నార్త్ఈస్ట్, అద్విప్ ఫ్లైడ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్యారాగ్లైడింగ్, ప్యారాసెయిలింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక విమానాశ్రయంలో ఈ ఉత్సవం మొదలవుతుందని, అనంతరం మొదట సిద్ధేశ్వరాలయంపై చిన్న విమానాల ద్వారా పుష్పవర్షం కురిపించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవం కోసం రెండు ప్యారాసెయిలింగ్, నాలుగు ప్యారాగ్లైడింగ్, నాలుగు చిన్న విమానాలను తీసుకువస్తున్నట్లు వివరించారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చాలా తక్కువ ఖర్చుతో పవర్ ప్యారాగ్లైడింగ్ , ప్యారాసెయిలింగ్ల్లో ఆకాశంలోకి వేల ఫిట్ల వరకు విహరించవచ్చని చెప్పారు. ఇదేవిధంగా, విమానాలలో పైలట్ ఉజనీ డ్యాం బ్యాక్ వాటర్ వరకు విహరించవచ్చన్నారు. విమానం తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్, నలుదుర్గా, అక్కల్కోట్, స్వామి సమర్థ్ మందిరం మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విమానం నడుస్తుందన్నారు. సమావేశంలో పవన్ మోండే, సోమేశ్వర్ యబాజి, రాకేష్ ఉదగిరి తదితరులు పాల్గొన్నారు. -
షోలాపూర్ సెంట్రల్ సిటీ ఎన్నిక రద్దుచేయాలి
సీపీఎం నేత ఆడం డిమాండ్ షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సెంట్రల్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రద్దు చేయాలని సీపీఎం అభ్యర్థి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య ఆడం డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ తాను త్వరలోనే ముంబై హైకోర్టులో వాజ్యం దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ సిటీ స్థానం పరిధిలో తను శివసేనకు మద్దతు ప్రకటించినట్లు ఓటర్లను నమ్మించి దుష్ర్పచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వాట్సప్‌లో పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. హిందువుల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పాల్పడ్డారని తెలిపారు. కాగ్రెస్ పార్టీ నుంచి తను రూ.11 కోట్లు తీసుకుని ప్రణతి షిండేకు మద్దతు ఇచ్చినట్లుగా ఎంఐఎం వారు తనపై దుష్ర్పచారం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు తాను ఎన్నికల అధికారి శాహుజీ పవార్, పోలీసు కమిషనర్లకు 13వ తేదీన అందజేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్లలో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి ఓట్లు పొందిందని ఆయన ఆరోపించారు.తన ఫిర్యాదులపై అధికారులెవరూ స్పందించనందున కోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అడ్వకేట్ ఎం.హెచ్.శేఖ్, నసియా శేఖ్, సిద్దప్ప కలుశెట్టి, సురేష్ పలుమారి, అశోక్ బల్లా తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడ చేరుకున్న ‘షోలాపూర్’ క్షతగాత్రులు
స్పెషల్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు కలెక్టర్ ఆదేశంతో అనూ ఆస్పత్రిలో చికిత్స విజయవాడ : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి షోలాపూర్ యశో దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదిమందిని విజయవాడ తరలించారు. మచిలీపట్నం, పరిసర ప్రాంతాలకు చెందిన వీరిని ప్రత్యేక వాహనంలో షోలాపూర్ నుంచి శుక్రవారం సాయంత్రం నగరానికి తీసుకువచ్చారు. నగరంలోని సూర్యారావుపేట అనూ ఆస్పత్రిలో రెవెన్యూ అధికారులు చేర్పించారు. ప్రత్యేక ఆరోగ్యశ్రీ పథకం కింద అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిం చాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. గాయపడినవారిలో అర్జా బాల, తోట వెంకటసుబ్బారావు, వడ్డీ లక్ష్మి, నూ కల నాగమణిలకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవస రం ఉందని వైద్యులు తెలిపారు. మిగతా వారిలో అర్జా సిరి నాగమణి, తోట కనకదుర్గ, కుమార్‌బాబు, అర్జా శ్రీనివాస్, చలమలశెట్టి సుజాతలకు ప్రథమ చికిత్స చేసి, డిశ్చార్జి చేశారు. క్షతగాత్రులను అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, వీఆర్వోలు బాషా, శ్రీనివాస్ ఆస్పత్రికి తరలించారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తహశీల్దార్ శివరావు బాధితులను పరామర్శించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. -
ఆ మాజీ ఎంపీ ప్రచారానికి 4వేల అల్లుళ్లు, కూతుళ్లు!
ఎప్పుడో పురాణాల్లో వందలాది కుటుంబ సభ్యులు యుద్దాల్లో పాల్గొన్నారని చరిత్ర పాఠ్యాంశంలో చదువుకున్నాం. కాని పురాణాల్లో కాకుండా తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తిని రేకెత్తించే అంశం ఓటర్లను ఆకర్షిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో దక్షిణ సోలాపూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున సుభాష్ దేశ్ ముఖ్ పోటి చేస్తున్నారు. ఈ మాజీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన తరపున 4 వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు చెమటోడుస్తున్నారు. అయితే ఈ రోజుల్లో వేలాది మంది కూతుళ్లు ఎలా ఉన్నారనే సందేహం కలుగడం సహజమే. లోక మంగళ్ గ్రూప్ అనే స్వచ్చంద సేవా సంస్త ద్వారా గత ఏడేళ్లలో 2 వేల మంది యువతులకు దేశ్ ముఖ్ సామూహిక వివాహాలు జరిపించారు. పేద కుటుంబాల్లో ఎవరూ అప్పుల బారిన పడకుండా ఆ కుటుంబాలకు చెందిన యువతులకు ప్రతి నవంబర్ లో సామూహిక వివాహాలను జరిపించే కార్యక్రమంలో దేశ్ ముఖ్ నిమగ్నమయ్యారు. వివాహంతోపాటు బట్టలు, నిత్యావసర వస్తువులతోపాటు ఆ దంపతులకు అమ్మాయి పుడితే 5 వేల రూపాయలను కూడా దేశ్ ముఖ్ ఇస్తుంటారు. ఇలా రెండు వేల సామూహిక వివాహాల జరిపించడం ద్వారా ప్రస్తుతం నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి దిలీప్ మానే వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: షోలాపూర్ బస్సు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృతిచెందిన దుర్ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. చలమలశెట్టి పాండురంగ, జగన్మోహన్ రావు, లక్ష్మి, పి. లక్ష్మి, ఎన్. లక్ష్మీకుమారి, శేషమణి, వెంకటేష్, రేష్మ ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో తెలుగువారు మృతి
-
రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృతి
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ లో సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కల్వర్ట్ ను ఢీకొనడంతో బస్సు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు కృష్ణా జిల్లా చిలకలపూడి చుట్టుపక్కల గ్రామస్థులుగా గుర్తించారు. గాయపడిన 20 మందిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. -
నాకు ఓటమి భయమా?
షోలాపూర్, న్యూస్‌లైన్: ఏడుసార్లు లోక్‌సభకు, ఏడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందిన తనకు పరాభవ భయమెక్కడిదని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీకి తన గురించి బాగానే భయం పట్టుకుందనీ, అందుకే ప్రతి బహిరంగ సభలో తన నామమే జపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారని మోడీపై పవార్ ఎదురుదాడికి దిగారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పదవి ఆశించననీ ఇంతకు ముందే స్పష్టం చేశానన్నారు. పరాభవం భయంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మోడీ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి తాను ఏడు సార్లు లోక్‌సభ, ఏడు సార్లు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లు మోడీకి తెలియక పోవచ్చని విమర్శించారు. ఒకవేళ పోటీ చేసినా బారామతి, మాడాలలోనే పోటీ చేసేవాడిననీ, ఈ రెండు చోట్ల ఎన్సీపీనే గెలుపొందిందని, అలాంటప్పుడు తనకు పరాభావ భయమేక్కడిది అని ప్రశ్నించారు. మోడీకి పార్టీ వర్గాలు తప్పుడు సమాచారం అందించి ఉంటాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఒకే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, ఇంత సమయం ప్రచారానికి వెచ్చిస్తున్నారని, వేరే పని ఏమి లేదా? అని పవార్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై తనకు గౌరవం ఉందని, వాస్తవంగా రాజకీయాలలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదనే అభిప్రాయంతోనే తాను విమర్శించడంలేదన్నారు. గుజరాత్ ‘వెస్’ మరాఠీ అలజడులకు మోడీ ప్రభుత్వం ఆజ్యం పోస్తోందని, దీనిని రాష్ట్ర ప్రజలు సహించబోర ని హెచ్చరించారు. మోడీ.. మహారాష్ట్ర వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ మరాఠీయులను కించపరిచే విధంగా నడుచుకుంటూ, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు ఊతమిస్తున్నారని పవార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డైమండ్ మార్కెట్‌ను గుజరాత్‌కు తరలించడం, ముంబై కోసం ‘సాగరి సురక్ష దళ్ శిక్షణ’ కేంద్రానికి ఆమోదం లభించినప్పటికీ ఆమోదాన్ని తోసిపుచ్చి గుజరాత్‌కు తీసుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మరాఠీయులు గుజరాత్లో అనేక ప్రాంతాలలో ఉంటూ అక్కడి వారితో మమేకమై ఉన్నారని, గుజరాతీయులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేశారన్నారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోందని, వీటి వల్లనే మరాఠీయులు వెస్ గుజరాతీయుల మధ్య వైరం పెరిగే అవకాశముందని పవార్ హెచ్చరించారు. సంఘ్ పరివార్.. బీజేపీల అజెండాను అమలు పరిచే దిశగా పావులు కదుపుతున్నారన్నారు. దసరా పర్వదినం సందర్భంగా సంఘ్ ప్రముఖుడి ప్రసంగాన్ని డీడీలో ప్రసారం చేశారని, అయితే బలహీన వర్గాల వారు దమ్మచక్ర పరివర్తన్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించినా దానిని డీడీలో ప్రసారం చేయలేదన్నారు. ఇలా వివక్ష చూపడం న్యాయం కాదని నిప్పులు చెరిగారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ప్రకటనలలో వాడుకుంటూ ఆయన పేరుతో ఓట్లు అడుక్కోవడం చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని కూడా పవార్ స్పష్టం చేశారు. మోడీ విమర్శలపై పవార్ ఎదురుదాడి ముంబై: రాష్ట్రంలో పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలను ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తిప్పి కొట్టారు. ‘‘నా ఎన్నికల రికార్డు ఏమిటో ఆయనకు (మోడీ)కి చెప్పండి. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నేను ఎన్నికలను తప్పించుకుంటానా?’’ అని సోమవారం మరాఠ్వాడా ప్రాంతంలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన సభలో పవార్ ప్రశ్నించారు. యూపీఏ నౌక మునుగుతోందని తెలిసే శరద్ పవార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా రాజ్యసభను ఎంచుకున్నారని మోడీ విమర్శించారు. దీనిపై పవార్ స్పందిస్తూ, ప్రధాన మంత్రికి తాను తప్ప మరో నాయకుడు కనిపించకపోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సభల్లో మోడీ ఏం మాట్లాడారు? ఏదైనా జాతీయ ప్రయోజనాన్ని గూర్చి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. సామాన్య మానవుని జీవితాన్ని మారుస్తానని చెప్పినా బాగుండేది. కానీ ఆయన ప్రసంగాలు చూస్తే, గరిష్టంగా శరద్పవార్పైనే దాడి చేసినట్టుగా ఉన్నాయి’’ అని ఎన్సీపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. చవాన్ వల్లే సమస్యలు పరిష్కారం కాలేదు: అజిత్ సాక్షి, ముంబై: మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సహకారం లేకపోవడంవల్ల అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేక పోయాయని మాజీ ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ ఆరోపించారు. ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్-ఖుల్తాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలో దిగిన ఎన్సీపీ అభ్యర్థి కృష్ణ పాటిల్ డోణ్గావ్కర్కు మద్దతుగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో అజిత్ పవార్ మాట్లాడారు. కొన్ని కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులకు 75 శాతం గ్రాంట్లు, అన్ని పాఠశాలలను డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల మాదిరిగా కాకుండా తమ పార్టీకి కుల, మతాలు తెలియవని, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ముందుకు సాగుతుందంటూ పరోక్షంగా శివసేనను కూడా విమర్శించారు. -
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయ దుస్తులతో అందమైన బతుకమ్మలతో బాలికలు, మహిళలు, యువతులు పాటలతో వాడ వాడల సందడి చేస్తున్నారు. విభిన్న నృత్యాలు, పాటలు, పలకరింపులు, ఆనందోత్సాహాలతో ఆకట్టుకుంటున్నారు. సోమవారం సాయంత్రం బిట్లా పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి శిక్షణ సంస్థ ట్రస్టు సులోచన గుండు, సంగీతా ఇందాపూరే, శ్రీనివాస్ కటుకూర్, హరీష్ కొండా, శ్రీధర్ చిట్యాల్, రమేష్ విడప్లు హాజరయ్యారు. అలాగే బిట్లా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నోరా, టీచర్లు శారద గోరంట్యాల్, అనిల్ గంజి, గీతా సాదులు, మధుకర్ మరగనేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా గోరంట్యాల్ బతుకు పాట బతుకమ్మ ఆటగా వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిపే ప్రతి పండుగను ఘనంగా జరుపుకొంటూ మన గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు. అలాగే గొంగడి బస్తి, దత్తు నగర్, సాకర్ పేట్, ఆంధ్రబద్రావతి పేట్, నీలం నగర్, విడప్ నగర్, కొత్త, పాత గురుకుల ఏరియాలలో రోజువారీగా, వాడవాడల్లో అలాగే శరన్నవరాత్రుల కోసం ఏర్పాటు చేసిన దేవి మండపాల ముందు బతుకమ్మ ఆటలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
షోలాపూర్‌లో నామినేషన్లు
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజక వర్గానికి సీపీఎం అభ్యర్ధి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య అడం బుధవారం నామినేషన్ వేశారు. నార్త్ షోలాపూర్ తహశీల్దార్, ఎన్నికల అధికారి శహాజీ పవార్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సీతారాం ఎచూరీ, సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ధవళే తదితరులు వచ్చారు. నామినేషన్ వేసేందుకు నర్సయ్య కార్యకర్తలతో దత్తు నగర్, పద్మశాలి చౌక్, జిందా శామదార్ చౌక్, కిడవాయి చౌక్, పేంటర్ చౌక్, బారాయిమాం చౌక్, బీజాపూర్ చౌక్, శ్రీ మార్కండేయ మందిర్, పంచకట్ట మార్గాల మీదుగా పాద యాత్రగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఇంత కాలం చేసిన ప్రజాసేవ, పనులు చూసే ప్రజలు తనకు ఓట్లు వేస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పిలుపునచ్చారు. విజయ్‌దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఐదుగురి నామినేషన్లు షోలాపూర్ ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గానికి బీజేపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు బుధవారం నామినేషన్లు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మోహిణి పత్కె, జగదీష్ పాటిల్, నాగేష్ వల్యాల్, సురేష్ పాటిల్, రోహిణి తజ్వల్‌కర్‌లు నామినేషన్లు వేశారు. ఒక వేళ పార్టీ విజయ్‌కి అభ్యర్ధిత్వం కేటాయించినట్లయితే, తాము ఎన్నికల బరి నుండి విమించుకునేది లేదని ఖరాఖండిగా తెలిపారు. గొంగడి బస్తి, కన్నా చౌక్, సమాచార్ చౌక్, బీజాపూర్ ప్రాంతాల మీదుగా ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు వేశారు. విజయ్‌కి తప్ప వేరెవరికి అభ్యర్థిత్వం కేటాయించినా తాము మద్దతునిస్తామని చెప్పారు. -
మైనారిటీల హక్కుల కోసం పోరాటం
షోలాపూర్, న్యూస్‌లైన్: భారతదేశంలో మైనారిటీలకు సముచితస్థానం కోసం తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ (ఎంఐఎం) నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదని, లౌకిక దేశమైన భారత్‌లో అన్ని మతాలవారికి సమాన హక్కు ఉండాలనేది తమ సిద్ధాంతమని ఆయనన్నారు. ఆయన సోమవారం రాత్రి స్థానిక హోం మైదానంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బాబ్రీ మసీద్ నేలమట్టమవడానికి ముందు భారతీయ జనతాపార్టీకి దేశం మొత్తం మీద ఇద్దరే ఎంపీలు ఉన్నారని, కాని మసీదు కూల్చివేత తర్వాత హిందుత్వవాదులుగా ప్రచారం చేసుకుని 280 ఎంపీ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్, భజరంగ్‌దళ్ వంటి మతసంస్థలతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాజ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే గోద్రా ఘర్షణలు జరిగిన విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. షోలాపూర్‌కే చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మతహింసను నిరోధించే బిల్లును పార్లమెంట్లో ఎందుకు ఆమోదింపజేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తాము హిందువులకు వ్యతిరేకంగా కాదన్నారు. అయితే హిందూత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇతర మతాలపై దాడులు జరిపే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి మతసంస్థలకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందనే విషయాన్ని నేతలు గుర్తించాలన్నారు. దేశంలోని 85 శాతం మేర మైనార్టీలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నాయి తప్ప వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఏమాత్రం కృషిచేయలేదని ఆయన ఆరోపించారు. పట్టణంలో మూడు లక్షల మంది వరకు మైనార్టీలున్నారు. వీరు టీ, గుట్కా తదితర వ్యసనాలపై ఖర్చు చేసే డబ్బులో రోజుకు ఒక్క రూపాయి చొప్పున మసీద్ కోసం జమ చేసినట్లైతే ఒక రోజుకు రూ. మూడు లక్షలు, అలాగే ఏడాదికి సుమారు రూ.11 కోట్లు ఆదా చేయవచ్చని, ఆ సొమ్ముతో ఇతరుల ముందు చేయి చాపాల్సిన అవసరం రాదని కూడా ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మైనార్టీలకు హితవు పలికారు. -
ఎస్ఎంసీ కమిషనర్ బదిలీ రద్దు
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రకాంత్ గూడేవార్ బదిలీని రద్దు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు చెప్పింది. చంద్రకాంత్‌కు వెంటనే పదవీ బాధ్యతలు అప్పగించాలని, తాత్కాలిక కమిషనర్, కలెక్టర్ ప్రవీణ్ గేడాంకు సూచించింది. తీర్పు వెలువడిన విషయం తెలిసిన వెంటనే పట్టణంలోని వివిధ సంఘాల ప్రతినిధులు ఎస్ఎంసి వద్దకు చేరుకుని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రకాంత్ పట్టణంలో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. అదే విధంగా ఆక్రమణలను కూలగొట్టడం, కార్యనిర్వాహక యం త్రాంగంలోని అవినీతి అధికారులపై వేటు వేయ డం, ఎల్బీటీని నిక్కచ్చి వసూలుకు పూనుకున్నా రు. దీంతో అత్యల్ప కాల వ్యవధిలోనే చంద్రకాంత్ పట్టణంలో ప్రజాదరణ పొందారు. కాగా, చంద్రకాంత్ చర్యలతో నష్టపోయిన అధికారపార్టీ నాయకులు ఆయన బదిలీ కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 23న చంద్రకాంత్‌ను గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీకి నిరసనగా ప్రజలు పట్టణంలో బంద్ పాటించి పలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో కొంత మంది హైకోర్టులో బదిలీకి వ్యతి రేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖ లు పరిచారు. దీనిపై రవీంద్ర గుగే,నరేష్ పాటిల్ న్యాయమూర్తుల బెంచ్ స్పందిస్తూ చంద్రకాంత్ బదిలీని రద్దుచేస్తూ తీర్పు చెప్పింది. మాజీ శాసనసభ్యుడు నర్సయ్య అడం, కార్పొరేటర్ ఆనంద్ చందన్‌శివే, పద్మశాలి ప్రతిష్టాన్ కన్వీనర్ సురేష్ పలుమారి, కామూ సంఘటన అధ్యక్షుడు అశోక్ ఇందాపూరె, ఎస్ఎంసి సిబ్బంది తదితరులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే సిఫార్సు వల్లే చంద్రకాంత్ బదిలీ జరిగిందని నర్సయ్య ఆరోపించారు. చంద్రకాంత్ రాత్రి వరకు ఇక్కడకు వచ్చి పదవీ బాధ్యతలు చేపడతారని, రేపు జెండావందనం చేస్తారన్నారు. -
పెట్రో మంటలు
షోలాపూర్, న్యూస్‌లైన్ : షోలాపూర్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా షోలాపూర్‌లోనే పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు సాగుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 16 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ 48 వేల లీటర్ల పెట్రోలు, 20 వేల డీజిల్‌లు విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ లీటరు ధర 86.55 రూపాయలు, పట్టణం వెలుపల రూ. 78.66 ఉంది. ప్రతి లీటరుకు రూ. 7.89 తేడా ఉంది. డీజిల్ ధర పట్టణంలో రూ. 72.45, వెలుపల రూ. 65.18. రూ.7.34 పైసలు తేడా ఉంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలకు విక్రయాలు చేయాల్సి వస్తోందని బంక్ డీలర్ల అసోషియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 11వ తేదీన బంక్‌ల బంద్ : డీలర్స్ అసోసియేషన్ వెల్లడి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్ర పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. సునీల్ చవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికిఈ నెల 11వ తేదీన పెట్రోల్ బంకుల బంద్ పాటిస్తున్నట్టు తెలిపారు. చైనా వస్తువులకు 0.1 శాతం మేర ఎల్బీటీ అమలు చేస్తున్న ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర ఎల్బీటీ పన్ను విధించడం సరైందికాదన్నారు. ఈ పన్నుల వలనే వినియోగదారులపై అదనపు భారం పడుతోందని ఆయన చెప్పారు. తక్షణమే ఎల్బీటీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెట్రోల్ బంక్‌ల యజమానులు నందకిషోర్ బాలుదావా, సిద్దేశ్వర్ వాళే, కేదార్ బావి తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు తన్నుకుపోయింది!
షోలాపూర్-రాయచూర్’ను ముందే బుక్ చేసుకున్న పొరుగు రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా అదనపు విద్యుత్‌ను పొంది, కరెంటు కష్టాల నుంచి బయట పడదామనుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తమిళనాడు అడ్డంగా ‘బుక్’ చేసింది. ఈ లైను ద్వారా సరఫరా అయ్యే సుమారు 1250 మెగావాట్ల విద్యుత్‌లో ఏకంగా 1000 ఎంవీని ఇప్పటికే ఆ రాష్ట్రం తన్నుకుపోయింది. ఇక ఇందులో మిగిలిన 250 మెగావాట్ల విద్యుత్ కోసం ఐదు దక్షిణాది రాష్ట్రాలు పోటీపడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో తెలంగాణ, ఏపీలు మరి కొన్నేళ్లు విద్యుత్ కష్టాలు భరించాల్సిందేనన్న విషయం స్పష్టమైపోయింది. -
పాండురంగా పాహిమాం
షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు నిత్యం సుఖఃసంతోషాలతో ఉండేలా వర్షాలు కురిపించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విఠల-రుక్మిణి దంపతులను వేడుకున్నారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం వేకువజామున మూడు గంటలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా పండరీపూర్‌లోని విఠల-రుక్మిణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుణుడు నెల రోజులు ఆలస్యంగా కరుణించడంతో రాష్ర్టంలోని రైతాంగం నిరాశకు లోనయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకుసాగుతున్నదని అన్నారు. విఠలుడి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున, వారికి తగిన సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఇక్కడి మఠాలు, ధర్మశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు భారీగా నిధులను కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. షోలాపూర్ పట్టణవ్యాప్తంగా రూ.81 కోట్ల వ్యయంతో సులభ్ మరుగుదొడ్ల కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. భీమనది తీరంలోని గోపాల్పూర్ వద్ద స్నానపు గదులు నిర్మించేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంత్ నామ్‌దేవ్ స్మారకం నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించామన్నారు. పల్లకీ యాత్రలు సాగే దేహూ, ఆలంది, బండారా, డోంగారు, నెవాసా తదితర ప్రాంతాలు, రోడ్ల అభివృద్ధికి రూ.143 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు రూపొందించామన్నారు. పల్లకీయాత్ర సందర్భంగా మరణించిన, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కిక్కిరిసిన భక్తజనం... లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల ‘పాండురంగ విఠల విఠల’ నామస్మరణతో పండరీపూర్ పులకించిపోయింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న విఠల-రుక్మిణి ఆలయం సమీపంలోని చంద్రబాగా నదీతీరం వెంబడి వార్కారీలు, భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి పల్లకీలు, కాలినడకన, వాహనాల ద్వారా భక్తులు ఇక్కడికి చేరుకొని చంద్రబాగా నదిలో స్నానాలు ఆచరించారు. విఠల రుక్మిణిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో ఎనిమిది లక్షల మంది మాత్రమే వచ్చారు. ప్రతి ఏటా 10 నుంచి 12 లక్షల మంది ఈ యాత్రకు వస్తుంటారు. ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక రథాన్ని అలంకరించి అందులో ఉత్సవమూర్తులను ఊరేగించారు. భక్తులు విఠలుడికి ఎండు ఖర్జూరాలు, బాదం పప్పు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రికి సన్మానం... పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు అన్నాసాహెబ్ డాంగె, పాలకవర్గ సభ్యులు.. ముఖ్యమంత్రి దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి దంపతులతోపాటు ఈ పూజలో పాల్గొనేందుకు కర్ణాటక బీదర్ జిల్లా వాసులైన శేలుకే రాము, ప్రమీల దంపతులకు అదృష్టం దక్కింది. మూడుతరాలుగా తమ కుటుంబీకులు వార్కారీలుగా ప్రతి ఏటా పండరీపూర్‌కు వస్తున్నట్లు రాము తెలిపారు. ముఖ్యమంత్రి ఈ దంపతులను సన్మానించారు. జీవితాంతం ఉచితంగా ఎంఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్‌లను అందజేశారు. -
మరాఠా గడ్డపై తెలుగు లెస్సేనా?
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఏడాదికేడాది తెలుగు విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఉపాధి కోసం, వ్యాపారం కోసం ముంబైకి వచ్చి స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య ఏటా పెరుగుతున్న తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం తెలుగు భాషా ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగు చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో తెలుగు మీడియం పాఠశాలల సంఖ్య కూడా పడిపోతోంది. తెలుగు మీడియంలో చదివించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం మొదటి కారణమైతే మరోవైపు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్చాలనుకున్నా అందుబాటులో తెలుగు మీడియం పాఠశాలలు లేకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రస్తుతం తెలుగు మీడియం పాఠశాలలు ముంబైతోపాటు భివండీ, షోలాపూర్, చంద్రపూర్, నాందేడ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా సరిపడా అధ్యాపకులు లేరు. ఏటికేటా ఈ విభాగానికి సంబంధించిన టీచర్లు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఈ కొరత నానాటికీ అధికమవుతోంది. వీరిని నియమించే విషయంలో సర్కారు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఈ సమస్య పరిష్కారమవడం లేదు. రాష్ట్రంలో తెలుగు బోధనకు సంబంధించి ప్రాథమిక విద్యస్థాయిలో ఈ కొరత తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు పిల్లలు తమ భాషను పూర్తిగా మరచిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. పదో తరగతిలో తెలుగును మొదటి భాషగా తీసుకున్నవారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఫస్ట్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 2012-13 విద్యా సంవత్సరంలో మొత్తం 924 మంది విద్యార్థులుండగా 2013-14లో వీరి సంఖ్య 788కి దిగజారింది. వీరిలో 780 మంది తెలుగు సబ్జెక్టులో పరీక్షలు రాయగా 699 మంది (89.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ వారీగా పరిశీలిస్తే 2012-13లో ముగ్గురు తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినప్పటికీ 2013-14 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా హిందీ-తెలుగు సబ్జెక్టులు సెకండ్, థర్డ్ లాంగ్వేజ్లుగా 356 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 347 (97.47 శాతం) మంది పాసయ్యారు. ఇక ముంబై డివిజన్‌ను పరిశీలిస్తే ఫస్ట్ లాంగ్వేజ్‌గా తెలుగు సబ్జెక్ట్‌లో పరీక్షలు రాసినవారి సంఖ్య గతంలో కంటే తగ్గింది. 2011-12లో 810 మంది పరీక్షలు రాయగా 2012-13లో 762 మంది పరీక్షలు రాశారు. అయితే 2013-14లో వారి సంఖ్య మరింత తగ్గి 649కి చేరింది. వీరిలో 576 (88.75 శాతం) మంది ఉత్తీర్థులయ్యారు. తల్లిదండ్రులూ ఆసక్తి చూపాలి.. తెలుగుభాష అభివృద్ధి విషయంలో వాస్తవానికి అధికారుల నుంచి ఉన్నంతలో ప్రోత్సాహం లభిస్తున్నా తల్లిదండ్రులే ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ ఇతర రాష్ట్రంలో నివసిస్తున్నందున తెలుగు భాష వల్ల కలిగే ప్రయోజనాలు పెద్దగా ఏమీ లేవన్న భావనతో తల్లిదండ్రులే మరో భాషపట్ల మక్కువచూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ములుండ్ బీఎంసీ పాఠశాల ఇన్చార్జి నాయిని ఆదినారాయణ మాట్లాడుతూ.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ముంబైలో కేవలం తమ పాఠశాలలో మాత్రమే తెలుగుమీడియంలో పదో తరగతి వరకూ బోధన అందిస్తోందన్నారు. పాఠ్యపుస్తకాలన్నీ సకాలంలో అందజేస్తున్నామని, పిల్లలకు ఉపయుక్తమయ్యే బ్యాగు, పుస్తకాలు, రెయిన్ కోటు, షూ తదితర 27 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. బీఎంసీ స్కూల్లో ఉత్తమ ఫలితాలు.. ములుండ్‌లోని బీఎంసీ స్కూల్లో ఈ ఏడాది ఎస్సెస్సీలో మంచి ఫలితాలు సాధించినట్లు ఆదినారాయణ తెలిపారు. 29 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో ఎస్.రామకృష్ణ (87.20 శాతం) సీహెచ్ చంద్రావతి (70.40), జె.జ్యోతి (69.20), టి.సోనీ (67.20), డి.పూజా (64.20) శాతం మార్కులు సాధించారన్నారు. మార్పు అవసరం.. తెలుగుభాషను కాపాడుకునేందుకు ప్రాథమిక స్థాయినుంచే మార్పు అవసరమని భాషాభిమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది వరకూ తెలుగువారు ఉంటున్నప్పటికీ వీరిలో అనేకమందికి తెలుగు భాషే రాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు తరాలు తెలుగును పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందన్న ఆవేదన భాషాభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తెలుగు భాషను ఒక అంశంగా తీసుకొని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో భాష పట్ల మక్కువను ప్రేరేపించేందుకు పెద్దలే ముందుకు రావాల్సిన అవసరముంది. ఇందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన తెలుగు సంఘాలు, తెలుగు కవులు, ప్రవాస తెలుగువారు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు పాఠశాలల ఏర్పాటు కోసం స్థానిక నాయకులపై ఒత్తిడి తేవాలని, ఏర్పాటైన పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు. అప్పుడే పరాయి రాష్ట్రంలో కూడా తెలుగు శాశ్వతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తల్లిదండ్రులను కొలిస్తేవిఠలుడు దిగి వచ్చాడు
సందర్భం- విఠోబా ఆలయం మంచి ఏదైనా దేవుడికి త్వరగా చేరుతుంది. పుండలికుడిలోని పరివర్తనకు మెచ్చిన శ్రీ మహావిష్ణువుఅతడికి వరం ఇవ్వాలని అనుకుంటాడు. వెంటనే వైకుంఠాన్ని వీడి భూలోకం చేరుకుంటాడు. మహారాష్ర్ట, షోలాపూర్ జిల్లాలోని పంధార్పూర్ పట్టణంలో 900 ఏళ్ల నాటి విఠోబా ఆలయం భారతీయ హైందవ సంప్రదాయ చరిత్రను తిరగరాయబోతోంది. తొలిసారి ఒక మహిళ ఈ ఆలయంలో అర్చకత్వ బాధ్యతలను చేపట్టబోతున్నారు. అలాగే, బ్రాహ్మణేతరులైన వారు సైతం ఈ ఆలయ పూజా కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం ఆలయ ట్రస్టు (విఠోబా రుక్మిణీ టెంపుట్ ట్రస్టు) గత వారం ఒక ఉద్యోగ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆలయంలో ఎనిమిది పూజారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైదవ మతాన్ని ఆచరిస్తూ, ఆలయ పూజలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన సారాంశం. ట్రస్టు చైర్మన్ అన్నా డాంగే పేరిట విడుదలైన ఆ ప్రకటన ప్రకారం మే 18న అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ట్రస్టు అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి గత జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ప్రేరణ. ఆలయానికి వచ్చే ఆదాయంపై, పూజా కార్యక్రమాల నిర్వహణ అధికారంపై వారసత్వ హక్కుల కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న స్థానిక బద్వే, ఉత్పత్ కుటుంబాల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పూజారుల నియామకాల విషయంలో ట్రస్టు స్వంత నిర్ణయం తీసుకోడానికి వీలైంది. అత్యంత ప్రాచీనమైన విఠోబా దేవాలయాన్ని 1968లో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏమిటి? స్థల పురాణం ఏమిటి? తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన విఠోబా ఆలయం పంధార్పూర్లో నెలకొనడం వెనుక పుండలికుడు అనే ఒక యువ కుడి కథ ఉంది. జానుదేవ్, సత్యవతి దంపతులకు వరఫలంగా జన్మించినవాడు పుండలికుడు. వీరి కుటుంబం దండివరన్ అరణ్యానికి సమీపంలో నివాసం ఉండేది. తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా, శ్రద్ధగా చూసుకునే పుండలికుడు వివాహం తర్వాత పూర్తిగా మారిపోతాడు! భార్య చుట్టూ తిరుగుతూ, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడు. కొన్నిసార్లు అవమానించేవాడు కూడా. కొడుకు ప్రవర్తనతో విసుగెత్తిన తల్లిదండ్రులు కాశీకి బయల్దేరుతారు. కాశీలో మరణిస్తే బాధల నుంచి, పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తుందని వారి ఆశ. అయితే వారితో పాటు పుండలికుడు కూడా తన భార్యను వెంట పెట్టుకుని కాశీకి సిద్ధం అవుతాడు. ప్రయాణంలో కూడా పుండలికుడు తన తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. చీటికి మాటికి పనులను పురమాయిస్తుంటాడు. తల్లిదండ్రులు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తుంటే తను, తన భార్య గుర్రం మీద వెళుతుంటారు. మార్గం మధ్యలో ఈ నలుగురూ ఒక ఆశ్రమం చేరుకుంటారు. ఆ ఆశ్రమం కుట్టుస్వామి అనే ఒక మహిమ గల సాధువుది. బాగా బడలికగా ఉండడంతో వాళ్లంతా ఆశ్రమంలోనే సేద తీరుతారు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక, పుండలికుడికి మెలకువ వచ్చి చూస్తే అతడికో దృశ్యం కనిపిస్తుంది! కొందరు అందమైన స్త్రీలు మురికి బట్టలతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. నీళ్లు మోసుకొచ్చి నేలంతా శుభ్రంగా కడుగుతారు. తర్వాత అవే బట్టలతో ప్రార్థన మందిరంలోకి వెళతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆశ్చర్యంగా వాళ్ల బట్టలన్నీ ఎంతో కాంతిమంతంగా తళతళలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్లు ఎలాగైతే వచ్చారో, అలా మాయమైపోతారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన పుండలికుడు ఆశ్చర్యచకితుడైపోతాడు కానీ తనవాళ్లెవరినీ లేపడు. తనవాళ్లకేమీ చెప్పడు. ‘ఇదంతా కల కాదుకదా’ అని కూడా అనుకుంటాడు. అయితే అతడిది కల కాదని రుజువు చేయడానికా అన్నట్లు, రెండో రోజు రాత్రి కూడా దేవతల్లాంటి ఆ స్త్రీమూర్తులు ప్రత్యక్షమౌతారు. పుండలికుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ల ఎదురుగా వెళ్లి ‘‘ఎవరు మీరు?’’ అని అడుగుతాడు. ‘‘మేము గంగా, యమునా నదులం, మిగతా వాళ్లు మిగతా నదులు’’ అని చెప్తారు ఆ స్త్రీమూర్తులు. పుండలికుడు అంతటితో ఊరుకోకుండా, ‘‘మీ బట్టలకు ఏమిటా మురికి?’’ అని ప్రశ్నిస్తాడు. స్త్రీమూర్తులు చిరునవ్వు నవ్వి, ‘‘మానవులు తమ పాపాలను కడిగేసుకోవడం కోసం మాలో మునుగుతారు కదా. అలా మునిగినప్పుడు వాళ్లు వదిలిన పాపాలే ఈ మురికి మరకలు’’ అని చెప్తారు. అంతటితో ఊరుకోక, ‘‘ఓయీ... పుండలికా... ఈ పాపులలోకెల్లా నువ్వు మహాపాపివి. ఎందుకంటే, నీ తల్లిదండ్రులను నువ్వు బాధ్యతగా చూడడం లేదు కదా’’ అంటారు. ఆ మాటలకు పుండలికుడు ఉలిక్కిపడతాడు. తల్లిదండ్రులను తానెంత నీచంగా చూసిందీ తలచుకుని తలచుకుని విలపిస్తాడు. వెళ్లి, తన తల్లిదండ్రుల కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. మంచి ఏదైనా దేవుడికి త్వరగా చేరుతుంది. పుండలికుడిలోని పరివర్తనను మెచ్చిన విష్ణుమూర్తి అతడికి వరం ఇవ్వాలని అనుకుంటాడు. వెంటనే వైకుంఠాన్ని వీడి భూలోకం చేరుకుంటాడు. విష్ణుమూర్తి వచ్చే సమయానికి పుండలికుడు తల్లిదండ్రుల సేవలో ఉంటాడు. వారికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ‘‘నాయనా తలుపు తియ్యి’’ అంటాడు విష్ణుమూర్తి. ‘‘పని మధ్యలో ఉన్నాను. వేచి ఉండండి’’ అంటాడు పుండలికుడు. విష్ణుమూర్తి మళ్లీ తలుపు తడతాడు. పుండలికుడు దిగ్గున లేచి వెళ్లి, తలుపు తీసి, ద్వారం బయటికి ఒక ఇటుకను విసిరి, అంతవరకూ దీనిపై కూర్చోండి అని లోనికి వెళ్లిపోతాడు. విష్ణుమూర్తి ఆ ఇటుకపై కూర్చోడు. నిలుచుంటాడు. పుండలికుడు తన పనంతా పూర్తి చేసుకుని వచ్చే వరకు అలాగే నిలిచి ఉండాడు. పుండలికుడు బయటికి వచ్చి విష్ణుమూర్తి కాళ్లపై పడి క్షమించమని కోరుతాడు. తల్లిదండ్రులపై అతడికున్న భక్తికి విష్ణుమూర్తి అంతటివాడే పరవశుడై, ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. పుండలికుడు చిత్రమైన వరం కోరతాడు. విష్ణుమూర్తిని ఎప్పటికీ భూమిపైనే ఉండిపొమ్మని అడుగుతాడు. అందుకు శ్రీమహావిష్ణువు అంగీకరించి, విఠోబాగా అవతరించి, అదే ఇటుక రాయిపై అలా నిలబడిపోతాడు. అలా కాల క్రమంలో ఆయన చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది. విఠోబాతోపాటు విష్ణుమూర్తి మరో అవతారమైన శ్రీకృష్ణుడు, ఆయన భార్య రుక్మిణీదేవిని కూడా ఈ ఆలయంలో కొలుస్తున్నారు. ఇక్కడికి ఒక్క మహరాష్ట్ర నుంచే కాకుండా, దేశ విదేశాలనుంచి రోజుకు 30 వేల మంది భక్తులు వచ్చి వెళుతుంటారు. -
వెనక్కుతగ్గిన చంద్రకాంత్
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ గురువారం తన రాజీనామాను వాపస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మంచి నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, దీంతో కుర్చి ఖాళీ చేయాలని పాలక పక్షమైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 22 ఏళ్ల తన పదవీకాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నానని, తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కుర్చి ఖాళీ చేయాలని ఆందోళన చేయడంతో నిరాశకు గురయ్యానని, దీంతో తన రాజీనామ లేఖను సమర్పించానని గూడెంవార్ తెలిపారు. పట్టణ వాసుల అభిమానం వల్ల తాను చేసింది తప్పని తెలుసుకొని రాజీనామా వాపస్ తీసుకున్నానన్నారు. అయితే పట్టణ వాసులకు నీటి సమస్య లేకుండా చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు. పట్టణానికి సంబంధించి అభివృద్ధి పనులు చేసినందుకుగాను సుశీల్ కుమార్ షిండే కూడా తనను అభినందించారని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించని ఎన్నో సమస్యలను తాను పరిష్కరించానన్నారు. టాక్లీ నుంచి సోరేగావ్ వరకు రూ.167 కోట్లతో మంచినీటి పైప్‌లైన్ వేయాలనే ప్రతిపాదన ఉందని, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోందన్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే శాశ్వతంగా మంచినీటి సరఫరా పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇందుకు కార్పొరేటర్లు కూడా సహకరించాలన్నారు. ఇక మీదట ఏ పని చేపట్టినా కార్పొరేటర్లతో చర్చిస్తానని విలేకరుల సమావేశంలో చంద్రకాంత్ గూడెంవార్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో తన పదవికి రాజీనామా చేయడంతో చంద్రకాంత్‌ను తిరిగి కమిషనర్ పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 7వ తేదీన షోలాపూర్‌లో కాంగ్రెస్ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సంతకాల సేకరణ, మోర్చా నిర్వహించిన స్థానిక నాయకులు అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. ఫలితంగా గూడెంవార్ తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. -
పుణేకు జల గండం!
పింప్రి, న్యూస్‌లైన్: పుణే వాసులకు నీటి గండం రాబోతుంది. నగర పరిధిలోని జలాశయాలు అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణే విభాగంలో 57 తాలూకాలలో 27 తాలూకాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ తాలూకాలలో తాగునీటి కష్టాలు ఎదురవనున్నాయి. భూ జలాల పరిశోధన, అభివృద్ధి విభాగం జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లోని 57 తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పుణే జిల్లాలో 192 బావుల నీటి మట్టం పరిశీలించాం. అందులో 100 బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 13 తాలూకాలలోని దౌండ్, పురంధర్, ఇందాపూర్, బారామతి తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సతారా జిల్లాలో 106 బావులలో భూగర్భ జలాలను పరిశీలిస్తే 45 బావులలో జలాలు అడుగంటాయి. 11 తాలూకాలలో సతారా, కోరేగావ్, మహాబలేశ్వర్, పాటణ్, తాలూకాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. సాంగ్లీ జిల్లాలో 86 బావులలోని నీటి మట్టాలు పరిశీలించాం. 41 బావుల నీటి మట్టాలు అడుగంటిపోయాయి. పలుస్, కడేగావ్, ఖనాపూర్, శిరాళా, తాలూకాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. షోలాపూర్ జిల్లాలో 166 బావుల నీటి మట్టాలను పరీక్షించాం. 68 బావుల జలాలు అడుగంటాయని తేలింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర సోలాపూర్, కరమాళా తాలూకాలలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 58 బావులలో నీటి జలాలు అడుగంటాయి. జిల్లాలోని పన్హాళా, రాధనగరి, గడహింగ్లాజ్, కాగల్, ఆజరా, చంద్గడ్, హతకణంగలే తాలూకాలలో నీటి సమస్య అధికంగా ఉందని, వర్షాలు ఎంత తొందరగా కురిస్తే సమస్య తీరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు. -
ఓటెత్తారు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం నమోదైంది. 2009 ఎన్నికల్లో ఈ 19 లోక్‌సభ స్థానాల్లో 54.14 శాతం పోలింగ్ నమోదవుతే ఈసారి అది 62.36 శాతానికి చేరుకుంది. అత్యధికంగా హత్కనంగలేలో 69 శాతం, కొల్హాపూర్, ఉస్మానాబాద్, బీడ్‌లో 65 శాతం, షోలాపూర్‌లో అత్యల్పంగా 57 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు... పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో చెదురు ముదురు సంఘటనలు మినహా రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంల మెరాయింపులు, ఏ బటన్ నొక్కినా ఒకరికే ఓటు వెళ్లడం తదితర సంఘటనలతోపాటు కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే అంతటా పోలింగ్ మాత్రం సజావుగానే ముగిసింది. ఈవీఎంలలో నేతల భవితవ్యం... రెండో దశలో పోటీ చేసిన 358 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లో భద్రమైంది. ఎండ ప్రభావంతోపాటు అనేక ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక ప్రాంతాల్లో ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. మధ్యాహ్నం ఎండ ప్రభావానికి ఓటర్లు సంఖ్య పలుచబడింది. అయితే సాయంత్రం అనేక మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం కనిపించింది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలు నియోజకవర్గాలలో జరిగిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. కొన్నిచోట్లా ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతవడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలు ఓటు వేయకుండానే నిరాశతో వెనుదిరిగారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. అనేక మంది ప్రముఖులు వారివారి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షోలాపూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ సీఎం అశోక్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, సుప్రియా సూలే, గోపీనాథ్ ముండే, రాజు శెట్టి తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాలేగాన్సిద్ధిలో ఉదయం ఓటు వేసిన తర్వాత అన్నా హజారే మాట్లాడుతూ...అందరు తమ కర్తవ్యంగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పుణేలో... పుణేలో ఓ ఈవీఎంలోని ఏ బటన్ నొక్కినా కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదంకే ఓటు వెళ్లడాన్ని ఓ ఓటరు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. శ్యామ్‌రావ్ కల్మాడీ స్కూల్ పోలింగ్ బూత్‌లో కొంత సమయం పోలింగ్‌ను నిలిపివేశారు. అయితే అప్పటికే 28 మంది ఆ ఈవీఎం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీజేపీతోపాటు ఇతర పార్టీలు అక్కడ మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, లేనిచో ఆ 28 మందికి మళ్లీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎంతో పోలింగ్ ప్రారంభించిన అనంతరం ఆ 28 మందికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. ఓటర్ లిస్ట్‌లో పేర్లు గల్లంతు... పుణేతోపాటు అనేక ప్రాంతాల్లో ప్రజలు ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పుణే కోథ్రూడ్, సింహగఢ్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. కేర్గావ్ పార్క్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ లిస్టులో సచిన్ నహర్ ఫొటో బదులు మరో మహిళా ఫొటో ముద్రితమైంది. ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్... పుణేలోని నగర్వాలా స్కూల్ పోలింగ్ బూత్‌లో గంట ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. ఈవీఎం మోరాయించడంతో మరో ఈవీఎంలు అందుబాటులో లేకపోవడంతో పుణే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే మరో ఈవీఎంను తీసుకువచ్చి పోలింగ్‌ను ప్రారంభించారు. ఈవీఎంలో పార్టీ గుర్తు లేదని ఫిర్యాదు.. పుణేలో ఈవీఎంలో బీజేపీ గుర్తు కనిపించడం లేదని హడప్సర్లోని కొందరు ఓటర్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈవీఎంను పరిశీలించగా మహాకూటమి పొత్తులో భాగంగా శివసేన పార్టీ గుర్తును ఉంచినట్లు పేర్కొన్నారు. షోలాపూర్‌లో...: పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడేల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వీరు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయం పెరుగుతుండడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు. -
షోలాపూర్ బరి నాలుగోసారీ నల్లేరుపై నడకే!
షోలాపూర్, న్యూస్‌లైన్: కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినప్పటికీ షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగోసారి బరిలోకి దిగిన సుశీల్‌కుమార్ షిండేని విజయలక్ష్మి సునాయాసంగా వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాషాయ ఉగ్రవాద శిబిరాలు తదితర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. వాస్తవానికి పశ్చిమ మహారాష్ట్రలోని ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. అధిష్టానానికి అత్యంత విధేయుడైన షిండే... దళిత కార్డును వినియోగించుకునేందుకు ఏనాడూ తటపటాయించలేదు. కోర్టులో గుమస్తా స్థాయి నుంచి తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి, క్రమేణా అత్యున్నత కేంద్ర హోం శాఖ మంత్రి స్థాయికి కూడా ఆయన ఎదిగారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్టానం తన అభ్యర్థిగా శరద్ బన్సోడేని బరిలోకి దించింది. 2009లో కూడా శరద్ ఇక్కడి నుంచి షిండేకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో పట్టణ, గ్రామీణ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నెల 17న ఎన్నిక జరగనున్న సంగతి విదితమే. ఇదిలాఉంచితే ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బన్సోడేకి యువతరం ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గస్థాయిలోనే ఉంది. బన్సోడే దేశభక్తి భావన ఇక్కడి యువతరాన్ని కట్టిపడేసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పుకోదగ్గస్థాయిలో ఓటుబ్యాంకు ఉంది. ఈ కారణంగానే షిండే వరుసగా మూడు పర్యాయాలు ఇక్కడినుంచి విజయం సాధించగలిగారు. ఈ నియోజకవర్గం అభివృద్ధికి షిండే రాత్రింబవళ్లు శ్రమించారని ఆ పార్టీ కార్యకర్తలు తమ ప్రచారంలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి మనోగతాన్ని ‘న్యూస్‌లైన్’ తెలుసుకుంది. జనం కోసం పనిచేయాలి రాజకీయ నాయకులు స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల కోసం పనిచేయాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోవాలి. దానిని ఆచరణలో చూపించాలి. విద్య, ఆరోగ్యంతోపాటు ఆరోగ్య స్థితిగతుల మెరుగు కోసం కృషి చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు ఎప్పుడైతే అందుతాయో అప్పుడే దేశం పురోగమించినట్టు. పారదర్శకంగా వ్యవహ రించాలి అభ్యర్థి విద్యావంతుడై ఉండాలి. పారదర్శకంగా వ్యవహ రించాలి. రాజకీయం అంటే భారీగా డబ్బు కూడగట్టుకునే మార్గంగా మారిపోయింది. అందుకే అనేకమంది ఈ రంగంలోకి వస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు. అలాంటి వారిని నిరాకరించాలి. ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం కాకుండా దేశం కోసం అసువులు బాసిన క్రాంతి వీరులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు పూనుకోవాలి. ఇలా అయితేనే దేశం ప్రగతి సాధిస్తుంది. - ప్రభాకర్ జంపాల్ మార్పు అనివార్యం తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. దీంతో ఓ కొత్త అనుభూతి కలుగుతోంది. కొత్త ఓటరునే అయినప్పటికీ విజ్ఞతతోనే ఓటు వేస్తా. సామాన్య ప్రజానీకం సమస్యల పరిష్కారానికి పాల్పడే అభ్యర్ధికే ఓటేస్తా. ఎందుకంటే ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నవారు ఏమిచేశారనేది అందరికీ తెలిసిందే. ఈసారి మార్పు అనివార్యం. - సతీష్ దుబ్బాక యువతరం రాణించడం హర్షణీయం ప్రస్తుత రాజకీయాల్లో యువతరం వారు రాణిం చడం హర్షణీయం. యువత కోసం ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టాలి. వారికి ఉపాధి కల్పించాలి. అలా చేస్తారని భావించినవారికే ఓటేస్తా. ఎందుచేతనంటే రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను నేటి రాజకీయ నాయకులు పట్టించుకోవాలి. వాటిని పరిష్కరించాలి. యువకుల సమస్యలు తీర్చగోరే వారికే ఓటు వేయాలి. అప్పుడే దేశం అభివద్ది సాధించడం సాధ్యమవుతుంది. నోటా వద్దు-నోట్లూ వద్దు అభ్యర్థులు పంచే డబ్బుకు ఆశపడను. ఆమోదయోగ్యుడికే ఓటు వేస్తా. ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగ పరచడం సబబు కాదు. దానిని గోప్యంగానే ఉంచాలి. నోటా ( నన్ ఆఫ్ ద ఎబౌ) బటన్‌ను ఎవరూ ఉపయోగించుకోకూడదని అందరికీ విన్నవిస్తున్నా. నోటా బటన్ నొక్కొద్దు, అలాగే నోట్లు కూడా తీసుకోవద్దు. - శ్రీనివాస్ చేగ్గు అభివృద్ధి చేసేవారికే ఓటు పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా మారాయి. వీటిపై రాకపోకలు సాగించడం వల్ల వెన్నునొప్పికి గురవుతున్నాం. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పట్టణ వాసులకు కనీస సదుపాయాలు కల్పించే అంశంపై నాయకులు దృష్టి సారించాలి. అభివృద్ధికోసం పాటుపడేవారికే ఓటు వేయాలి. - చంద్రమౌళి. తమునూర్ -
షోలాపూర్ బరి తెలుగువారి ఓట్లే కీలకం
షోలాపూర్, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరించనుండగా, మరికొన్నిచోట్ల తమదైన ముద్రనువేసుకోనున్నారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం తెలుగువారి అధీనంలోనే ఉండేది. ఇక్కడ నివసించేవారిలో సుమారు 50 శాతం మంది తెలుగు ప్రజలే. ఈ నియోజక వర్గంలో మొత్తం ఆరు సెగ్మెంట్లున్నాయి. షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, షోలాపూర్ సౌత్ సెగ్మెంట్లలో మెజారిటీ ఓటర్లు తెలుగు ప్రజలే. దీంతో ఇక్కడ తెలుగువారి ఓట్లే కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగువారైన గంగాధర్ కూచన్, ధర్మన్న సాదుల్, లింగరాజు వల్యాల్‌లు ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. దీంతో సుమారు 25 సంవత్సరాలపాటు తెలుగు వారే ఎంపీలుగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో ఈ నియోజకవర్గం ఎస్సీ కోటాలోకి వెళ్లింది. ఇలా జరగడం తెలుగువారు ప్రాతినిధ్యం వహించే అవకాశానికి గండికొట్టింది.మరోవైపు తెలుగువారిలో ఐక్యత లోపించడంతో అది ఇతరులకు అవకాశం దక్కేలాచేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఓటర్ల మనోభావాలను ‘సాక్షి’ తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఉత్తర షోలాపూర్ శాసనసభా నియోజకవర్గంలో నివసిస్తున్న తెలుగువారి సమస్యలను తెలుసుకునేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించింది. ఎన్నికల నేపథ్యంలో వారు ఏమి కోరుకుంటున్నారు..? ఎలాంటి సమస్యలున్నాయి? తదితరాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. -
భారీ ఊరేగింపుతో షిండే నామినేషన్
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయనతో పాటుగా మాడా స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి విజయసింహ మోహితే పాటిల్ భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ పత్రాలను ఈసీ రిటర్నింగ్ అధికారులకి సమర్పించారు. వీరి వెంట ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అనంతరం నగరంలోని హోం మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థులు షిండే, విజయసింహ మోహితే పాటిల్‌లను ఈసారి కూడా గెలిపించాలని సీఎం చవాన్, కేంద్ర మంత్రి పవార్ పిలుపునిచ్చారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను నరేంద్ర మెడీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లప్పుడు ఇరు కాంగ్రెస్ పార్టీల వైపే మొగ్గు చూపుతూ వచ్చిన స్థానికులు ఈసారి కూడా ఆదరించాలని అభ్యర్థించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడి నుంచే ప్రారంభమైందో తెలియని మోడీ ఇక దేశాన్ని ఎలా పాలించగలరని ప్రశ్నించారు. మత కలహాలు జరగకుండా ఉండాలంటే లౌకిక పార్టీలను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. ఊరేగింపు సాగిందిలా... నామినేషన్ దాఖలు కంటే ముందు నాయకులు ఊరేగింపుగా వెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వాహనాల ద్వారా జనం బస్టాండ్ సమీపంలోని శివాజీ విగ్రహం వరకు చేరుకున్నారు. అక్కడ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత ఊరేగింపును ప్రారంభించారు. పలు మార్గాల మీదుగా కొనసాగిన ఊరేగింపు రంగ్‌భవన్ చౌక్ వరకు చేరుకుంది. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేశారు. -
సాంగ్లీకి వెళితేనే...!
షోలాపూర్, న్యూస్‌లైన్: పట్టణంలో వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు నామమాత్రంగా మారడంతో స్థానిక పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు కార్యాలయాల్లో అధికారులను నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలువురు పారిశ్రామిక వేత్తలు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. పుణేలో పరిశ్రమ, కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయం, ఔరంగాబాద్‌లో అబ్కారీ, బారామతిలో విద్యుత్ పంపిణీ, అహ్మద్‌నగర్‌లో ఇండియన్ బాయిలర్ రెగ్యులేషన్ సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఉన్నాయన్నారు. అయితే ఇవి మొక్కుబడిగా మారాయన్నారు. దీంతో తాము పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. ఇది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకొని ఉంటుందన్నారు. ముంబై, పుణే, నాసిక్‌ల తర్వాత నాలుగోస్థానంలో షోలాపూర్ ఉంది. ఇక్కడ దుప్పట్లు, వస్త్రాలు తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కుటీర, భారీ పరిశ్రమలు దాదాపు 12 వేలవరకు ఉన్నాయి. ఇక్కడికి 200 కిలో మీటర్ల దూరంలోని సాంగ్లీలో జనాభా సంఖ్య తక్కువే. అంతేకాకుండా పరిశ్రమల సంఖ్య కూడా చెప్పుకోదగ్గస్థాయిలో లేదు. అయినప్పటికీ ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం మాత్రం ఉంది. 120 కి.మీ దూరంలోని లాతూర్ పట్టణాన్ని షోలాపూర్‌తో పోలిస్తే జనాభా తక్కువే. సహకార సంస్థల సంఖ్య కూడా అంతంతే. అయితే పారిశ్రామికవాడలో స్థలం అవసరమైతే అందుకోసం పారిశ్రామికవేత్తలు సాంగ్లీకి వెళ్లకతప్పడం లేదు. లాతూర్‌లో రిజిస్ట్రేషన్ ఉపసంచాలకుడు గత ఏడాది బదిలీ అయ్యారు. దీంతో ఈ బాధ్యతలను ఔరంగాబాద్‌లోని డీడీఆర్ డిప్యూటీ డెరైక్లర్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన న్యాయవాదులు, ఆయా సంస్థల డెరైక్టర్లు ఔరంగాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. అదేవిధంగా ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైందని వారు వాపోతున్నారు. ఫిబ్రవరిలో సాంగ్లీకి చెందిన ఎంఐడీసీ ప్రధాన కార్యాలయం ప్రధానాధికారి పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో కొల్హాపూర్‌కు చెందిన ఎంఐడీసీ ప్రధానాధికారికి ఈ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇందుకు సంబంధించిన పనుల కోసం స్థానిక పారిశ్రామిక వేత్తలు కొల్హాపూర్‌కు వెళ్లాల్సి వ స్తోంది. ఇలా చిన్న చిన్న పనుల కోసం లాతూర్, ఉస్మానాబాద్‌లకు వెళ్లాల్సి రావడంపై స్థానిక పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహించేవారు షోలాపూర్ నుంచి వచ్చేవారిపట్ల వివక్ష చూపుతున్నారంటూ వాపోతున్నారు. డీడీఆర్ డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయం ఇక్కడ ఉండాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నామని అశ్వని హెర్బల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ బిపిన్ పటేల్ తెలిపారు. ఇదిలావుండగా కులధ్రువీకరణకు సంబందించిన ఉన్నతస్థాయి కార్యాలయం పుణేలో ఉంది. దీంతో స్థానిక విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయపరంగా రిజర్వేషన్ పదవులు పొందగోరేవారు కులధ్రువీకరణ పత్రాల కోసం పుణేకి వెళ్లాల్సి వస్తోంది. శాసనసభ్యురాలు ప్రణతి శిందే చొరవతో సదరు కార్యాలయం ఇక్కడ ఏర్పాటైంది. అలాగే ఎస్బీఐ డివిజన్ కార్యాలయం సతారాలో ఉండేది. అందువల్ల ఇక్కడ పెద్ద మొత్తానికి సంబంధించిన రుణాల ఫైళ్లు సాతారాకు వెళ్లేవి. దీంతో సదరు వ్యాపారులు కూడా అక్కడికి వెళ్లక తప్పేదికాదు. -
షోలాపూర్ జిల్లాలో వడగండ్ల వాన
షోలాపూర్, న్యూస్‌లైన్: జిల్లాలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల తీవ్రతతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయింది. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలు అంధకారమయ్యాయి. గోదుతాయి పరులేకర్ బీడీ వర్కర్స్ కాంప్లెక్స్‌లో చెట్టు విరిగి పడడంతో మయూర్ (11) అనే బాలుడు మృతి చెందాడు. నీలంనగర్‌లో పాఠశాల పైకప్పు ఊడి పడడంతో 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్వాగత్‌నగర్‌లో ఇంటి కప్పు పడడంతో ఇద్దరు గాయపడ్డారు. పట్టణంలో, శివారు ప్రాంతాల్లో 400 లకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తేర్హే గ్రామపొలిమేరలోని సిద్ధానాథ్ చక్కెర ఫ్యాక్టరీలో ఉంచిన దాదాపు లక్ష చక్కెర సంచులు వర్షానికి తడిసిపోయాయి. దీంతో సుమారు రూ.11 లక్షల మేర నష్టం వాటిల్లింది. మాడా, పండర్పూర్, మంగళవేడా, మొహుల్, దక్షిణ, ఉత్తర షోలాపూర్, అక్కల్కోట్ తదితర తాలూకాల్లో మామిడి, శనగ, గోధుమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు ద్రాక్ష, అరటి పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. -
మధ్యతరగతి మహిళా విజయం
ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. ఇల్లు గడవడానికి భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఓ చిన్న వ్యాపారం ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదిగింది. తాను ఎదగడమే కాదు... మరో పదిమందికి ఉపాధి కల్పించింది. ఏటా పాతిక లక్షల రాబడిస్థాయికి చేరింది. దేశవిదేశాలలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె పేరు గోదావరి సాత్పుతే. ఆమె సాధించిన విజయాల వెనుక ఉన్న శ్రమ, పట్టుదల ఆమె మాటలలో... మాది షోలాపూర్జిల్లా బార్షీ తాలూకా జమగావ్లోని ఓ సాధారణ కుటుంబం. ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. 2000లో శంకర్‌తో నా వివాహం జరిగింది. అప్పటికి ఆయన ‘గాడ్గే ట్రాన్స్పోర్ట్’ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ వచ్చే జీతంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఒకరోజు నా భర్త కాగితంతో తయారుచేసిన ఆకాశకందిళ్లను (ఆకాశదీపంలాంటిది. వీటిలో ఎలక్ట్రిక్ లైట్ అమర్చుకుని, పై కప్పు నుంచి వేలాడదీయవచ్చు) తీసుకు వచ్చారు. నేను వాటిని ఏ భాగానికి ఆ భాగం విడదీసి, అది ఎలా తయారైందో తెలుసుకుని, అతికించేశాను. విషయం తెలుసుకుని ఊరుకోకుండా, స్వయంగా వాటిని తయారుచేయడం ప్రారంభించాను. నా భర్త తన సహాయసహకారాలు అందించారు. అలా తయారుచేసిన కందిళ్లను మొదట్లో ఇరుగుపొరుగు వారికి విక్రయించేదాన్ని. వ్యాపారాన్ని విస్తరించేందుకు నా భర్త జీతం నుంచి కొంత, నేను సంపాదించిన దానిలో నుంచి కొంత డబ్బు దాచేదాన్ని. అది చాలకపోవడంతో లోన్ కోసం ప్రయత్నించినా, లాభం లేకపోయింది. నా భర్త పనిచేసే కంపెనీ యజమాని, మా బంధువులు కొద్దికొద్దిగా ఆర్థిక సహాయం చేయడంతో వ్యాపారం ప్రారంభించాను. కొద్దిరోజుల తర్వాత భారతీయ యువశక్తి ట్రస్ట్ సంస్థతో నాకు పరిచయం కావడంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.35 వేలు రుణం లభించింది. ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని విస్తరించాను. ఉపాధి... పదిమందితో ప్రారంభమైన మా వ్యాపారంలో ప్రస్తుతం 75 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిది బృందాలుగా విభజించి ఆకాశ కందిళ్లను తయారుచేస్తున్నాం. ఒక్కో మహిళకు రోజువారి కూలీగా 250 రూపాయలు చెల్లిస్తున్నాం. వివిధ కార్యక్రమాలకు, పండుగలకు అనేక కంపెనీల వారు మా దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేస్తుంటారు. కాగితాల కటింగ్ పని నుంచి కాగితాలు అతికించడం, డెకరేషన్, కందిలి తయారుచేసేంత వరకు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. వీటిని విక్రయించే పని నా భర్త, మరిది రత్నాకర్‌లు స్వయంగా చూసుకుంటారు. మా మరిది ఎంబిఏ చేయడం వల్ల మార్కెటింగ్ పని సులువుగా ఉంది. మా ఆయన డ్రైవర్‌గా పనిచేయడం వల్ల ఇందుకు అవసరమయ్యే ముడిసరుకు లభించే ప్రదేశాలు, హోల్‌సేల్ విక్రయాలు బాగా తెలుసు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం వస్తోంది. ఉమ్మడికుటుంబం... ప్రతి మహిళ ఆర్థికంగా వృద్ధి సాధించాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం. మాది ఉమ్మడికుటుంబం కావడంతో, వ్యాపారం ఎలాంటి అరమరికలు లేకుండా సజావుగా సాగుతోంది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమలో దాగి ఉన్న కళానైపుణ్యాన్ని బయటకు తీసి గుర్తింపు సంపాదించాలి. - ఎం. శ్రీనివాస్, న్యూస్ లైన్, పుణే సిటీ - సుధీర్ చక్రవర్తి, న్యూస్ లైన్, పింప్రీ లండన్ వెళ్లినప్పుడు... ‘‘యూత్ బిజినెస్ ఇంటర్నేషనల్ (వైబీఐ) ఆధ్వర్యంలో 40 దేశాలలో ఈ శాఖలు ఉన్నాయి. కాగా బీవైఎస్టీనే నా పేరును సిఫారసు చేసింది. నాకు ఇంగ్లీష్ రాకపోవడంతో, దుబాసీని నియమించారు. లండన్‌లోని స్టాండ్ప్యాలెస్ హోటల్లో విడిది ఏర్పాటుచేశారు. మేము ఏడు రోజుల పాటు లండన్‌లో ఉన్నాం. మొదట రెండు రోజులు గైడ్ సహాయంతో వివిధ ప్రదేశాలను సందర్శించాం. ఒకరోజు ప్రిన్స్ చార్లెస్ మాకు డిన్నర్ ఇచ్చారు. ప్రతిఒక్కరితో ఐదు నిమిషాలు మాట్లాడారు. నాతో కరచాలనం చేయబోగా, భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారం చేశాను’’. - గోదావరి సాత్పుతే పురస్కారాలు... 2011 సంవత్సరంలో ‘సిటీ మైక్రో ఎంటర్ప్రెన్యూర్’ అవార్డు, లక్షాయాభై వేల రూపాయల నగదు బహుమతి స్థానిక కార్పొరేషన్, వివిధ మండళ్ల ద్వారా అనేక పురస్కారాలు లండన్‌లో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా 2013 యంగ్ ఎంటర్ప్రెన్యూర్ పురస్కారం, లక్ష రూపాయల నగదు బహుమతి. -
ఓం నమఃశివాయః
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్‌వాసుల ఇలవేల్పు అయిన శ్రీ సిద్ధరామేశ్వర్ కల్యాణోత్సం పట్టణంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం బాలివెస్లోని హీరెహబ్బు మఠం నుంచి ఊరేగింపుగా బయలు దేరిన నందికోలులు సిద్ధేశ్వర ఆలయం వద్ద ఉన్న సమ్మతి కట్ట వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ గంగా పూజ, సుగడి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి కురిసిన పూలవర్షంతో భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో ‘ఓం నమోః శివాయః’ ‘శ్రీ సిద్ధరామేశ్వర్ మహారాజ్‌కీ జై’ అనే నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయం వరకు కొనసాగిన ఊరేగింపు సమీప గ్రామాల ప్రజలతోపాటు షోలాపూర్ వాసులతో కన్నులపండువగా సాగింది. ఈ కల్యాణోత్సవంలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా స్వామివారి కల్యాణోత్సవానికి హాజరవుతున్నానని చెప్పారు. స్వామివారి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఈ జాతరలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని, ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని ఆ సిద్ధేశ్వరుణ్ని ప్రార్థించానన్నారు. పట్టణం మరింత అభివృద్ధి చెంది త్వరలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తృత ఏర్పాట్లు... నందికోలుల ఊరేగింపు కోసం పట్టణ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని నగల వ్యాపారులు, శివసేన పట్టణ కన్వీనర్ ప్రతాప్ చవాన్ భక్తులకు వాటర్ ప్యాకిట్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, మేయర్ ఆల్కా రాథోడ్, ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ , ఎమ్మెల్యే దిలీప్ మానేలతో పట్టణంలోని వివిధ పార్టీల పదాధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 68 శివలింగాలకు తైలాభిషేకం ఆదివారం శ్రీ సిద్ధరామేశ్వర్ పట్టణవ్యాప్తంగా స్వయంగా ప్రతిష్టించిన 68 లింగాలకు తైలాభిషేకం చేశారు. ఈ తైలాభిషేకంలో పాల్గొనేందుకు తెల్లని దుస్తులు ధరించిన సిద్ధేశ్వరుడి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు సాగిందని శ్రీ సిద్ధరామేశ్వర్ దేవస్థానం కమిటీ చైర్మన్ ధర్మారాజు కాడాది తెలిపారు. -
ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే
షోలాపూర్, న్యూస్‌లైన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అక్కల్కోట్ తాలూకా విహాన్నూర్ గ్రామంలో బీఎస్ఎఫ్ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఏ అభ్యర్థి బరిలోకి దిగినా, విజయాన్ని మాత్రం ఆపలేరని అన్నారు. తప్పకుండా తానే గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించనని, పార్టీ అప్పగించిన విధిని మాత్రమే నిర్వహిస్తానన్నారు. బీజేపీ తరపున శరద్‌బన్‌సోడే అయినా, మరొకరు అయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ముఖ్య అధికారులు, హోంశాఖ ఉన్నత అధికారులు, స్థానిక శాసనసభ్యుడు సిద్రామప్ప పాటిల్, మాజీ మంత్రి సిద్దరాం మేత్రేలతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
డాక్టర్ల సమ్మె విరమణ
సాక్షి, ముంబై: పోలీసుల దాడికి వ్యతిరేకంగా రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను శుక్రవారం విరమించి రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ విధుల్లో చేరారు. దాడికి పాల్పడిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని ప్రభుత్వం ప్రకటించడంతో ‘మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్’ (మర్డ్) తమ సమ్మెను విరమిస్తున్న ప్రకటించింది. ఈ నెల 31న షోలాపూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒక అత్యవసర కేసుతో బిజీగా ఉన్నప్పుడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యసాయం అందించాలని కోరారు. ఆమెను ప్రసూతి వార్డుకు తీసుకెళ్లాలని సూచించడంతో ఆగ్రహం చెందిన పోలీసులు సదరు డాక్టరును చితకబాదారు. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లంతా సమ్మె బాటపట్టారు. తమ సహోద్యోగిపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనపై సుమోటోగా స్పందించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఈ కేసుపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించి దాడి ఘటనపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే డాక్టరుపై దాడి చేసిన ముగ్గురు పోలీసులు లొంగిపోయారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మర్డ్ను కూడా సమ్మెను వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్టు మర్డ్ ప్రకటించింది. -
100 మర మగ్గాలు.. 40 మంది కార్మికులు!
షోలాపూర్, న్యూస్‌లైన్: గత పదేళ్లుగా పట్టణంలోని వస్త్ర పరిశ్రమ కార్మిక లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చద్దర్లు నేసే మరమగ్గాలపై పనిచేసే కార్మికుల సంఖ్య ఏడేనిమిదేళ్లలో 80 శాతానికిపైగా పడిపోయిందని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు పెంటప్ప గడ్డం ‘న్యూస్‌లైన్ ’తో వివరించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. చద్దర్ల మగ్గాలతోపాటు టవెల్స్ మగ్గాల కార్ఖాణాలు కూడా రోజుకోకటి మూతపడుతున్నాయన్నారు. ప్రస్తుతం వంద చద్దర్ల మరమగ్గాలకు కేవలం 40 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అంటే రెండు మగ్గాల భారం ఒకే కార్మికుడిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చద్దర్ల మరమగ్గాలు నడిపేందుకు యువతరం ఆసక్తి చూపడం లేదని, భవిష్యత్తులో ఈ మరమగ్గాలు నడిపేవారు దొరకడం మరింత కష్టంగా మారనుం దన్నారు. దీంతో ప్రపంచ ఖ్యాతి గడించిన షోలాపూర్ చద్దర్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదముం దని వస్త్రవ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షోలాపూర్ చద్దర్ తన అస్తిత్వాన్ని నిలదొక్కుకోలేక పోవడానికి అనేక కారణాలున్నాయి. టవెల్స్ ఉత్పత్తులకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీతో రూపొందించిన అత్యాధునిక మరమగ్గాలు కాలక్రమేణ మార్పులు చెందుతూ ఉత్పత్తిలో కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. కానీ చద్దర్లు ఉత్పత్తి చేసే కార్ఖాణాలలో మాత్రం ఇలాంటి అత్యాధునిక మరమగ్గాలు ఇంతవరకు రాలేదు. అందుకే వీటిల్లో పని చేసేందుకు కార్మికులు కూడా ఉత్సాహం కనబర్చడం లేదు. అందుకే గత ఏడెనమిదేళ్లుగా చద్దర్ల మరమగ్గం నడిపేందుకు ఏ ఒక్క కార్మికుడు చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పట్టణంలో చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాలపై పనిచేసే దాదాపు 1,200 మంది కార్మికుల వయస్సు 45 నుంచి 50 పైబడి ఉంది. అయితే ఈ మరమగ్గాపై పనిచేసేందుకు కొత్తగా ఎవరూ చేరకపోవడంతో ఒక్క కార్మికుడే రెండేసి మరమగ్గాలు రోజుకు 8 నుంచి 10 గంటలపాటు నడుపుతున్నాడు. ఇంత కష్టపడినా వారికి లభించేది కేవలం రూ. 300 మాత్రమే. ఇలా వేతనాలు తక్కువగా ఉండడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. చద్దర్ల ఉత్పత్తికి అత్యాధునిక మరమగ్గాలు తప్ప ప్రస్తుత తరుణంలో మరో గత్యంతరం లేదని కార్ఖానాల నిర్వాహకులు చెబుతున్నారు. ఆధునిక మగ్గాలపై పనిచేసే కార్మికుల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటున్నారు. కాగా శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం మరమగ్గాల సంఘం సిద్ధంగా ఉందని పెంటప్ప స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ రంగంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. -
గర్వంగా ఉంది!
షోలాపూర్, న్యూస్‌లైన్: ‘విద్య అందరికీ అందుబాటులోకి రావాలనే సంకల్పంతో పూర్వీకులు స్థాపించిన పద్మశాలి శిక్షణ సంస్థ నేడు మహా వృక్షంగా ఎదిగి, 22 శాఖలుగా విస్తరించింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనందిస్తున్న సంస్థ నేడు శతాబ్ధి ఉత్సవాలను జరుపుకోవడం, పూర్వీకుల కలలను సాకారం చేయడం, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉంద’నికేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లయ్య కొండా క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పద్మశాలి శిక్షణ సంస్థ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలకు షిండేఅధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొట్ట చేతపట్టుకొని తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చి, శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణిస్తున్న తెలుగువారి ధైర్యసాహసాలు ప్రశంసనీయమ’న్నారు. శాసనకర్తలుగా రాణించిన గంగాధర్ కుచన్, ధర్మన్న సాదుల్, విలాస్‌రావు బేత్, వెంకప్ప మడుర్, నర్సయ్య ఆడంలను పేరుపేరునా ప్రశంసించారు. తెలుగువారి ఐక్యతకు నిదర్శనం: చిరంజీవి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటకశాఖమంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణించడం హర్షించాల్సిన విషయంగా పేర్కొన్నారు. కలసికట్టుగా ఉంటూ విద్యాసంస్థను స్థాపించి, వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదన్నారు. తెలుగువారి ఐక్యత ఈ వేడుకలు నిదర్శనమన్నారు. రాజకీయాలలోకి రాకముందు నుంచి సుశీల్‌కుమార్ షిండేతో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. షోలాపూర్, తుల్జాపూర్, అక్కల్కోట్, పండరీపూర్‌లను కలిపే మెగాసర్క్యూట్ టూరిజం కోసం రూ.43 కోట్లు విడుదల చేశానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. నేతన్నలంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. చంటబ్బాయి సినిమాలో తాను వేసిన చార్లి చాప్లిన్ వేషానికి నిలువెత్తు చేనేత చిత్రపటం ఇక్కడి వారే వేసి తనకు అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి మరమగ్గాలు, బీడీ కార్మకులకు సంబంధించిన సమస్యలన్నీ యూపీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జాల్నా ఎమ్మెల్యే కైలాస్ గోరంట్యాల్, ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, ఎమ్మెల్యే, దిలీప్ మానే, మేయర్ అల్కా రాథోడ్ , కాంగ్రెస్ నాయకురాలు ఉజ్వల షిండే, పద్మశాలి సమాజానికి చెందిన వారితోపాటు ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు మహేష్ కోటే ప్రస్తావికోపన్యాసం చేస్తూ.. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలన్నారు. చివరగా సామాజిక ప్రజా సేవాసమితి తరఫున రమేష్ నాంపల్లి, చిరంజీవి ఫ్యాన్స్ తరఫున అరవింద్ దోమల్ చిరంజీవిని సన్మానించారు. -
ఉల్లి పేలుళ్లు
సాక్షి, గుంటూరు:మూడు నెలల నాడు జిల్లాకు రోజుకు 150 టన్నుల వరకు మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు, నాసిక్, షోలాపూర్‌ల నుంచి దిగుమతు లుండే ఉల్లి ఇప్పుడు కేవలం 80 టన్నుల వరకు దిగుమతి అవుతున్నట్లు అధికారుల లెక్క. అమ్మకాలు మాత్రం తీసికట్టుగా ఉండటం పరిశీలనాంశం. రైతుబజార్లలో సుమారు 25 క్వింటాళ్లు,బహిరంగ మార్కెట్లో 50 క్వింటాళ్ల వరకు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలినదంతా రిటైల్ వ్యాపారులు గోడౌన్లలో అక్రమ నిల్వలు చేస్తూ కొరత సృష్టించేందుకు యత్నిస్తున్నారు. తద్వారా అక్రమంగా రేట్లు పెంచే యోచనలో ఉన్నారు. రిటైల్ వ్యాపారుల అక్రమ దందాతో జిల్లాలోని వినియోగదారులు ఉల్లిని కొనలేని స్థితికి చేరుకుంటున్నారు. రిటైల్ వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ ఎలాగంటే.. ఉల్లి సాగయ్యే కర్నూలు, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా పంట తుడిచి పెట్టుకుపోయింది. అటు మహారాష్ట్ర, కర్ణాటకలలో ధర బాగా పలుకుతుండటంతో దిగుమతులు ఆశాజనకంగా లేవు. షోలాపూర్‌లో కొత్త పంట ఇంకా చేతికి రాలేదు. ఇటు జిల్లాలో ఉల్లి పంట సాగు చేసే పెనుమాక, అమరావతి, సౌపాడు, తుళ్లూరు, మోతడకలో సాధారణంగా డిసెంబర్లో పంట మార్కెట్‌కు వస్తుంది. ఇటీవల వరదలతో జిల్లాలోని ఈ ప్రాంతాల్లో పంట మొత్తం దెబ్బతింది. దీంతో రిటైల్ వ్యాపారుల్లో బ్లాక్ మార్కెటింగ్ ఆలోచనలు రేకెత్తి అరకొరగా దిగుమతి అయిన ఉల్లిని గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన ఉల్లిని బ్లాక్ మార్కెట్‌కు తరలించేస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి మాత్రమే ఎక్కువ కాలం నిల్వ చేసే వీలుంది. కర్నూలు, కడప ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లికి త్వరగా పాడయ్యే గుణం ఉండటంతో ఈ సరుకు జోలికెవ్వరూ వెళ్లడం లేదు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నగరానికి రోజుకు 8-10 లారీల సరుకు దిగుమతి అయ్యేది. ఇప్పుడు కేవలం 3 లారీల సరకు వస్తోంది. దీన్ని నగరంలోని రిటైల్ వ్యాపారులు గోడౌన్లకు తరలించి అక్రమ దందా నడుపుతున్నారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో వీరి దందా సాగుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఉల్లి ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రైతుబజార్లలో అంతంతమాత్రమే జిల్లాలోని ఏడు రైతు బజార్లలో అందుబాటులో ఉల్లి ధరలు ఉండేలా అమ్మకాలు చేపడతామని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ అమ్మకాలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. గుంటూరులో రెండు రైతుబజార్లు, తెనాలి-2, చిలకలూరిపేట-1, నరసరావుపేట-1, మంగళగిరి-1 రైతు బజార్లలో రోజుకు సుమారు 25 క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేపడతున్నట్లు అధికారులు పేర్కొంటున్నా, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగానే ఉంది. రైతు బజార్లలో రెండు రకాల సైజు ఉల్లి అమ్మకాలు సాగుతున్నాయి. కర్నూలు మీడియం సైజు ఉల్లి ధర రూ. 38, షోలాపూర్ రూ.48 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం మీడియం సైజు ధర రూ.60 వరకు ఉంటే, షోలాపూర్ ధర రూ.80 వరకు పలుకుతుంది. జూలై వరకు రూ.20 ఉంటే ఇప్పుడు మాత్రం నాలుగింతలు పెరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ఉల్లి ధరలు అదుపు చేయకుంటే, దీపావళి పండగకు అమాంతం పెంచే యోచనలో వ్యాపారులున్నట్లు సమాచారం. రైతుబజార్లలో కౌంటర్లు = షోలాపూర్ రకం రూ.48= కర్నూల్ రకం రూ.38 సాక్షి, గుంటూరు: ఉల్లిపాయల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాలోని ఉల్లిపాయల హోల్‌సేల్ అసోసియేషన్ వర్తకులతో మాట్లాడి అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకాలు చేసేలా ఒప్పందం చేయించారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, నరసరావుపేట పట్టణాల్లోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లలో షోలాపూర్‌కు చెందిన ఉల్లిపాయలను కిలో రూ.48 చొప్పున కర్నూల్‌కు రెండో రకం ఉల్లిపాయల్ని కిలో రూ.38 చొప్పున విక్రయించనున్నారు. గుంటూరులో పట్టాభిపురం, బస్టాండ్ సెంటర్లలోని రైతుబజార్లు, తెనాలిలో చెంచుపేట, రత్నబజార్, నరసరావుపేటలోని అరుణోదయ షోరూమ్ రైతుబజార్, మంగళగిరి మార్కెట్‌యార్డుతో పాటు చిలకలూరిపేట రైతు బజార్లో ఉల్లిపాయల ప్రత్యేక కౌంటర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు. -
ప్రిన్సిపాల్ హత్య కేసులో సీఐడీకి హైకోర్టు చీవాట్లు
ముంబై: సోలాపూర్‌లో ఒక కళాశాల ప్రిన్సిపల్ హత్యకేసు సాక్ష్యాల సేకరణలో సీఐడీ విఫలమైనందుకు హైకోర్టు తప్పుపట్టింది. 2010 లో సోలాపూర్‌కు చెందిన శోభంత్రావ్ జపాటే కళాశాల ప్రిన్సిపాల్ మహేష్‌ను ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఇప్పటివరకు సాక్ష్యాల సేకరణలో ఎటువంటి పురోగతి సాధించలేదు. దీనిపై ఫిర్యాదుదారు, హతుడి భార్య రూపాలి కోర్టును ఆశ్రయించింది. నిందితుల ప్రలోభాలకు లొంగి తన భర్త హత్యకేసును సీఐడీ తగిన విధంగా విచారించడంలేదని, వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కోర్టును కోరింది. కాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ‘ఈ కేసులో పూర్తిస్థాయి వివరాలు సేకరించేందుకు సీఐడీకి ఇదే చివరి అవకాశం.. మీకు చేతకాకపోతే చెప్పండి.. సీబీఐకి కేసును అప్పగిస్తాం..’ అని సీఐడీ పుణే ఇన్స్పెక్టర్ జనరల్‌ను హెచ్చరించింది.