suggestions
-
పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి?
నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్ని కలిస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెంగర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్‌వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్‌లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్‌రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం హెల్త్ ట్రీట్..మెనోపాజ్ ఔషధంతో లివర్‌కు ముప్పు!మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్‌లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్‌హార్మోనల్ ఔషధం.ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్‌కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్‌పై ‘లివర్‌కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు. -
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్–కాన్సెప్ట్), స్వీయ గౌరవం (సెల్ఫ్–ఎస్టీమ్), సామాజిక గుర్తింపు (సోషల్ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.నేనెవరు?ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.నా విలువేంటి? ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్‌కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్‌లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్ (2011) పరిశోధనలు తేల్చాయి. సామాజిక గుర్తింపు..వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.తల్లిదండ్రులు చేయాల్సినవి..– టీన్స్‌లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. – భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. – ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. – యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్ మోడల్స్‌గా ఉండాలి. -
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్‌తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
Health: మీకు తెలుసా.. అతి తిండీ అడిక్షనే!
నా వయసు 25 సం‘‘లు. కొన్ని నెలలుగా నేను విపరీతంగా తింటున్నాను. ఈ మధ్య 15 కేజీలు బరువు పెరిగాను. ‘స్ట్రెస్’కు లోనైనప్పుడూ, ఒంటరిగా ఉన్నప్పుడు తినడం మరీ ఎక్కువ. ఎలాగైనా ఈ అతి తిండి అలవాటు నుండి బయటపడాలని ఉంది. మీరే ఏదైనా సలహా చెబుతారనే ఆశతో ఉన్నాను. – రజని, విశాఖపట్నంపండుగల్లాంటి ప్రత్యేక సందర్భాలలో కొంచెం ఎక్కువగా తినడం మనందరికీ మామూలే! మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే, బహుశా మీరు ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనైనట్లు తెలుస్తుంది. 25–30 సం‘‘ల మహిళల్లోను, 40–45 సం‘‘ల పురుషుల్లోనూ ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నా. మెదడులోని రసాయనాలలో వచ్చే మార్పులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.అతి తక్కువ సమయంలో, ఫాస్ట్‌గా తినడం, కడుపు నిండినా ఆపుకోలేకపోవడం, బరువు పెరిగి గిల్టీగా ఫీలవడం, ఇన్ఫీరియారిటీకి, డిప్రెషన్‌కు లోనవడం జరుగుతుంది. ఒక విధంగా దీనిని ‘ఫుడ్ అడిక్షన్’ అనవచ్చు. మీలాంటి వారిలో మిగతా అడిక్షన్స్ లాగానే ఈ సమస్యను కూడా కొన్ని మందులతోను, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపి, జీవనశైలిలో మార్పులు, డైట్ కౌన్సెలింగ్‌తో మంచి మార్పులు తీసుకురావచ్చు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్’ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నా. సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్! -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
ప్రెగ్నెన్సీ సమయంలో.. ఈ లక్షణాలు కనిపెట్టడమెలా?
నాకు ఏడవ నెల. నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే లక్షణాలను ఎలా కనిపెట్టాలి? ఎలాంటి పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దివ్య శ్రీ, వికారాబాద్నెలలు నిండక ముందే ప్రసవించడం అనేది చాలామందికి అప్పటికప్పుడే మొదలవుతుంది. కానీ పదిమందిలో ఏడుగురికి ఏ ఇబ్బంది లేకుండా పురిటినొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా నెలలు నిండాకే డెలివరీ అవుతుంది. అయితే కొంతమందికి తరచూ నొప్పులు వచ్చి రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం మొదలవుతుంది. ఇలా అయినప్పుడు సర్విక్స్ కూడా తెరుచుకుంటుంది. కాబట్టి నొప్పులు అదుపు చేయడం కష్టమవుతుంది. అలాంటి లక్షణాలు కనబడిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.డెలివరీ సురక్షితంగా అయ్యి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి ముందస్తుగా అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చే సమయం దొరుకుతుంది. 37వారాల లోపు ఇలా జరిగితే, దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు. కొన్నిసార్లు 24–48 గంటలు నొప్పులు తగ్గే మందులు ఇవ్వొచ్చు. బిడ్డ ఊపిరితిత్తుల పరిపక్వత కోసం స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా హై యాంటీబయాటిక్స్ ఇస్తారు. యూరిన్, వెజైనల్ స్వాబ్స్ టెస్ట్‌కి పంపి, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఇలా తొందరగా నొప్పులు వచ్చాయా అని పరీక్షిస్తారు.పల్స్, బీపీ, బిడ్డ గుండె కొట్టుకోవడం ఎలా ఉన్నాయో చూస్తారు. స్కాన్‌లో బిడ్డ కదలికలు, రక్తప్రసరణను చూస్తారు. చాలామందికి నొప్పులు లేకుండా వాటర్ బ్రేక్ అయ్యి, వెజైనా నుంచి లీక్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే ఉమ్మనీరు పోతోంది, డెలివరీ ఎప్పుడైనా కావచ్చు అని అర్థం. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ నొప్పులు మొదలైనట్లయితే నెలలు పూర్తవకుండా పుట్టే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీ చేసుకోవాలి.నియోనాటాలజిస్ట్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో 24 వారాల నుంచి బిడ్డను జాగ్రత్తగా చూసే ఆధునిక పరికరాలు పెద్ద సెంటర్లలో ఉంటున్నాయి. తగిన శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సులు ఉండాలి. ప్రీమెచ్యూర్ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి తల్లికి ముందుగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. కొందరి విషయంలో ఉమ్మనీరు పోవడం మొదలైనా, ప్రసవం మొదలుకాకపోవచ్చు. అలాంటి వారిని ఆసుపత్రిలో ఉంచి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.ఉమ్మనీరు, రక్తప్రసరణ ఎలా ఉందో పరీక్షిస్తూ, తల్లికి బిడ్డకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకపోతే 37 వారాల వరకు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే బిడ్డకు తల్లి కడుపులో అందే పోషకాలను, వాతావరణాన్ని బయట పూర్తిగా ఇవ్వలేము. అందుకే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గర్భంలో ఉంచేందుకే ప్రయత్నించాలి. తప్పనిసరి అనుకున్నప్పుడే డెలివరీ చేయాలి.ఇవి చదవండి: నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? -
నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నాకు 5వ నెల, నడుమునొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. ఉద్యోగం చేస్తున్నాను. రెస్ట్‌లో ఉంటే కొంచెం బాగుంటోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధ, రేణిగుంటప్రెగ్నెన్సీలో 3వ నెల దాటిన తరువాత చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది మొదటి ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్‌కి పెల్విక్ లిగమెంట్స్ స్ట్రెచ్ అవటం వల్ల వస్తుంది. ఆ స్ట్రెచ్‌లో లోయర్ బ్యాక్, పెల్విక్స్ నొప్పి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. బరువులు ఎత్తకుండా ఉండటం, పడుకున్నప్పుడు వెన్నును మరీ వంచకుండా, కాళ్లను కదిలించడం ద్వారా ఒత్తిగిల్లడం, ఫ్లాట్ షూస్ వేసుకోవడం, ఆఫీస్‌లో కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా ఉంచి కూర్చోవడం చేయాలి.మెటర్నిటీ పిల్లోస్ కూడా వాడుకోవచ్చు. మసాజ్ వల్ల కూడా కొందరికి నొప్పి తగ్గుతుంది. కిందపడిన వస్తువులను మోకాలు మీద వంగి తీసుకోవడం, బ్యాక్ బెండ్ కాకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి ఎక్కువ ఉంటే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి. కొన్ని ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజ్ల వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ట్రెయినర్ పర్యవేక్షణలో అవి పాటించాలి. ఒకవేళ నడుమునొప్పితో పాటు, ఫీవర్ ఉన్నా, బ్లీడింగ్, యూరిన్‌లో నొప్పి ఉన్నా, ఛాతీ భాగంలో నొప్పి ఉన్నా, వాటర్ బ్రేకింగ్ ఉన్నా అది చాలా ప్రమాదం. వెంటనే డాక్టర్‌ను కలవాలి.హెల్త్ ట్రీట్: హిస్టరెక్టమీతో ఇతర సమస్యలు..హిస్టరెక్టమీ శస్త్రచికిత్స తర్వాత మహిళలు తర్వాతి కాలంలో ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ శస్త్రచికిత్సలో గర్భసంచిని, అండాశయాలను తొలగించడం వల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని అమెరికన్ వైద్య నిపుణురాలు డాక్టర్ బ్రునిల్డా నజారియో చెబుతున్నారు.న్యూయార్క్‌లోని ఒబేసిటీ సొసైటీ లాటిన్ అమెరికన్ విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్న డాక్టర్ బ్రునిల్డా ఇటీవల తన పరిశోధనలో తేలిన అంశాలను గ్లోబల్ వెల్నెస్ çసమిట్‌లో వెల్లడించారు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ చికిత్స తర్వాత మహిళల్లో గుండెజబ్బులు, రక్తపోటు, డెమెన్షియా, శరీరంలో కొవ్వు పెరిగి స్థూలకాయం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ బ్రునిల్డా నేతృత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.ఈ పరిశోధనలో భాగంగా 4,188 మంది మహిళలపై పరీక్షలు నిర్వహించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. హిస్టరెక్టమీ చేయించుకోని మహిళలతో పోల్చుకుంటే, హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో ముప్పయి ఐదేళ్లలోపు వయసులోనే హిస్టరెక్టమీ చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నట్లు గుర్తించారు.ఇవి చదవండి: ఆడంబరాలు.. అనర్థాలు తెస్తాయి! -
Health: అంతా మెదడులోనే ఉంది..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.మెదడులో అల్లకల్లోలం..టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.భావోద్వేగ నియంత్రణ కష్టం..ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్నెస్కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు..ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.డోపమైన్ ప్రభావం.. టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను సెట్ చేయాలి.– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి.. -
Health: వైట్.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.మేలు చేసే తెల్లటి ఆహారాలివి..ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ్రపోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్ అని పిలిచే పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు! -
మోకాలి నొప్పికి.. మెయిడ్ పేరు!
ఆ వైద్యసమస్య పేరే ‘హౌజ్ మెయిడ్ నీ పెయిన్’! వైద్య పరిభాషలో ‘‘ప్రెపటెల్లార్ బర్సయిటిస్’’ అనే ఓ జబ్బుకు పనిమనిషి పేరు పెట్టడం విశేషం. వాడుక పేరుగా పనిమనిషి (మెయిడ్) పేరు పెట్టిన ఆ జబ్బును ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అంటారు. ఇంటిని తుడిచే వారు రెండు మోకాళ్లనూ గచ్చు మీద ఆనించి, మరో చేతిని నేలకు ఆనించి ఇంకో చేత్తో గుడ్డతో తుడుస్తూ ఉండటంతో మోకాళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంది. అందుకే ఆ జబ్బుకు ఆ పేరు.అలాగని అది కేవలం పనిమనుషులకు వచ్చే సమస్య అనుకుంటే పొరబాటే. మోకాళ్లను నేలకు ఆనించి పనిచేసే వృత్తుల్లోని వారందరిలో (ఉదాహరణకు ప్లంబర్లు, గార్డెనర్లూ)నూ ఆ జబ్బు కనిపిస్తుంది. ఇంకా చె΄్పాలంటే ఆటల్లో నేల మీదికి దూకే సమయంలో మోకాళ్లు నేల మీద దోక్కుపోయే క్రీడాకారులకు కూడా ఈ నొప్పి వస్తుంటుంది. ఇలా ఎంతోమందిలో ఆ జబ్బు కనిపిస్తున్నప్పటికీ దానికి ‘‘హౌజ్ మెయిడ్స్ నీ’’ అనే పేరు స్థిరపడింది.చికిత్స...నొప్పి తొలిదశల్లో మోకాలికి ఐస్ పెట్టడం, పడుకునే/నిద్రపోయే సమయంలో ఆ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా మోకాలి కింద దిండు పెట్టడం, విశ్రాంతి ఇవ్వడం వంటివి చేయాలి. ఆటగాళ్లకు లేదా ఇతరత్రా వృత్తుల్లోని వారికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ మందులను ఇస్తారు. సూచిస్తారు. ఇక క్రీడాకారుల్లో ఈ సమస్య రాకుండా నివారించేందుకు ‘నీ–΄్యాడ్స్’ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలతో పాటు... మోకాళ్లకు దెబ్బతగిలినప్పుడు క్రీడలకూ, ప్రాక్టీస్‌కూ విశ్రాంతి ఇవ్వడం వంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తుంటారు. -
Health: అనీమియా వద్దు... ‘ఐరన్’ లేడీలా ఉందాం!
రక్తహీనత పురుషులూ, మహిళలూ, చిన్నారులూ ఇలా అందరిలోనూ కనిపించే సమస్యే అయినా మహిళల్లో మరింత ఎక్కువ. భారతీయ మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలూ, కేస్ స్టడీస్ చెబుతున్నాయి. నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి. రక్తహీనత అంటే ఏమిటి, సమస్య పరిష్కారం కోసం మహిళలు అనుసరించాల్సిందేమిటి అనే విషయాలను చూద్దాం...ఎర్రరక్తకణాలు మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.లక్షణాలు.. – అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియాకు సూచనగా పరిగణించవచ్చు. అనీమియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు...– శ్వాస కష్టంగా ఉండటం– కొద్దిపాటి నడకకే ఆయాసం– అలసట– చికాకు / చిరాకు / కోపం– మగత– తలనొప్పి– నిద్రపట్టకపోవడం– పాదాలలో నీరు చేరడం– ఆకలి తగ్గడం– కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం– ఛాతీనొప్పి– త్వరగా భావోద్వేగాలకు గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణమేమిటో తెలుసుకోవాలి. అసలు కారణాన్ని తెలుసుకుని దానికి సరైన చికిత్స ఇస్తే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి అనంతర చికిత్స తీసుకోవాలి.జాగ్రత్తలు / చికిత్స..ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇలాంటి టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ల సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.కారణాలు..మహిళలు తమ నెలసరి వల్ల ప్రతి నెలా రక్తాన్ని కోల్పోతుంటారు. కాబట్టి వాళ్లలో రక్తహీనతకు అది ప్రధాన కారణం. మరి కొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఉండటం వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. -
Health: క్రానిక్... పానిక్.. వేడివేడిగా బాడీ రిపేర్!
దేహంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించడం గానీ లేదా ఏవైనా గాయాలైనప్పుడుగానీ ఆ హానికారక సూక్ష్మజీవులతో పోరాడి, శరీరాన్ని రక్షించుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ... ఇన్ఫ్లమేషన్ అనే స్వాభావికమైన చర్య జరిగేలా చూస్తుంది. తెల్లరక్తకణాలపై. దేహాన్ని రక్షించేందుకు అవసరమైన కొన్ని రసాయనాలను పంపుతుంది.గాయమైనప్పుడు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపురావడం, మంట అనిపించడం గమనించవచ్చు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ... ఆ గాయాన్ని మాన్పే పని మొదలుపెట్టిందనేందుకు నిదర్శనాలే ఆ గుర్తులు. ఉదాహరణకు ఒకరి వేలు తెగిందనుకుందాం. వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ రంగంలోకి దూకుతుంది. తెగిన ప్రాంతం చుట్టూ ఎర్రబడి, వాపు వస్తుంది. తెగడంతో గాయమైన కణజాలాన్ని రిపేరు చేసేందుకు ఉపక్రమించాయన్నమాట.అలాగే జలుబు చేసినా లేదా దేహంలోకి జలుబు కలగజేసే వైరస్‌లాంటిది ఇంకోటి ఏదో ప్రవేశించిందంటే... దాన్ని తుదముట్టించేందుకు జ్వరం వస్తుంది. అంటే దేహం ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆ వేడిమి సహాయంతో శత్రు వైరస్‌ను కాల్చేటందుకే దేహపు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే జ్వరం అనేది దేహం తాలూకు ఓ ‘ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్’ అన్నమాట.కొద్దికాలం పాటు మాత్రమే ఉండే ఇన్ఫ్లమేషన్ను ‘అక్యూట్ ఇన్ఫ్లమేషన్’ అనీ, అదే దీర్ఘకాలం పాటు కొనసాగితే దాన్ని ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ అని వ్యవహరిస్తారు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చుగానీ... చాలాకాలం పాటు ఉండే ‘క్రానిక్ ఇన్ఫ్లమేషన్’ మాత్రం ఒక్కోసారి చాలా ప్రమాదకరం.ఒక ఇన్ఫ్లమేషన్ చాలాకాలం పాటు కొనసాగుతోందంటే... శత్రువును ఎదుర్కొనేందుకు దేహం, దాని తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా, సుదీర్ఘకాలం పాటు అలర్ట్‌గా ఉన్నాయని అర్థం.ఓ వ్యక్తి అనారోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నా, అతడు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నా, అతడు తీసుకుంటున్న ఆహారం అంతగా ఆరోగ్యకరంగా లేకపోయినా... ఈ అంశాలన్నీ అతడిలోకి వ్యాధి నిరోధక వ్యవస్థపై ఒత్తిడి కలగజేస్తూ, దాన్ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ సుదీర్ఘకాలం పాటు (క్రానిక్‌గా) కొనసాగుతుంది. అప్పుడా పోరాటం శత్రుకణాల మీద కాకుండా సొంత కణాల మీదే జరుగుతుండటం వల్ల... ఈ పోరులో ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటుంటాయి.ఉదాహరణకు ఓ వ్యక్తి తీసుకునే ఆహారంలో ్రపాసెస్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నా లేదా చక్కెరలను ఎక్కువగా తీసుకుంటున్నా అతడిలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. అది సుదీర్ఘకాలం కొనసాగుతున్నందు ఆరోగ్యవంతమైన కణాలనూ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సుదీర్ఘ ఇన్ఫ్లమేషన్స్తో ఆరోగ్యవంతమైన కణజాల వ్యవస్థలు దెబ్బతినడంతో అక్రమంగా గుండెజబ్బులు, డయాబెటిస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీయవచ్చు. ఇక ఆ ఇన్ఫ్లమేషన్ జీర్ణవ్యవస్థలో వస్తే అది ఆరోగ్యంపై రకారకాల దుష్ప్రభావాలను కలగజేయవచ్చు.ఓ వ్యక్తిలో అతడి జీర్ణవ్యవస్థ చాలా కీలకమైనది. ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా అది దేహంలోని కోటానుకోట్ల (ట్రిలియన్లకొద్దీ) కణాలకు జీవశక్తిని అందజేయడం, అక్కడ వ్యర్థాలను తొలగించడం వంటి పనులు చేస్తుంది. ఈ జీర్ణవ్యవస్థే దేహానికి మేలు చేసే ట్రిలియన్లకొద్దీ సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)కు ఆవాసం. వీటినే గట్ మైక్రోబియమ్ అంటారు. ఒక వ్యక్తి తాలూకు మూడ్స్ (భావోద్వేగాల)కూ ఇవే కారణం. అతడి వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడంలోనూ ఇవే కీలకం. అన్నట్టు వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన కణజాలంలో 70 – 80 శాతం వరకు జీర్ణవ్యవస్థలోనే ఉండటమనే అంశం కూడా ఓ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థకు అతడి జీర్ణవ్యవస్థ ఎంతగా ఊతం ఇస్తుందో ఈ అంశం తెలియజేస్తుంది.ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ‘లీకీ గట్ సిండ్రోమ్’ లాంటి ఎన్నో అనర్థాలకు దారితీయవచ్చు. మానసికాందోళనలు మాటిమాటికీ తలెత్తే వాళ్లలో కొందరిలో పేగుల్లోని గోడలు చిట్లుతాయి. ఈ పరిస్థితినే ’లీకీ గట్’ అంటారు. ఇలా పేగుల్లోని గోడలు చిట్లడం జరిగితే దేహంలోని ప్రమాదకరమైన విషపదార్థాలూ, జీర్ణం కాని వ్యర్థాలూ, బ్యాక్టీరియా.. ఇవన్నీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మరింత ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. దాంతో సొంత వ్యాధినిరోధక వ్యవస్థే తన కణజాలంపై ప్రతికూలంగా పనిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి వ్యాధులూ, చర్మరోగాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ఇక మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటివీ రావచ్చు.జీర్ణవ్యవస్థలో వచ్చే ఇన్ఫ్లమేషన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అయిన గట్ మైక్రోబియమ్ సమతౌల్యతను దెబ్బతీయవచ్చు. దాంతో కడుపుబ్బరం, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కనిపించవచ్చు. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడేందుకూ అవకాశముంది. గట్ మైక్రోబియమ్ దెబ్బతినడం వల్ల ఇన్ఫ్లమేషన్... మళ్లీ ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మైక్రోబియమ్ సమతౌల్యత మరింత దెబ్బతినడం... ఈ విషవలయం ఇలా కొనసాగుతూ జీర్ణవ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది.అందుకే జీర్ణవ్యవస్థ బాగుంటేనే వ్యాధి నిరోధక వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషకరమైన భావోద్వేగలతో మూడ్స్ బాగుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమేషన్స్ సైతం తగ్గుతాయి. ఇతర దీర్ఘకాలిక జబ్బులు... అంటే గుండెజబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటివి నివారితమవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉందంటే... దేహమంతా ఆరోగ్యంగా ఉందనీ, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా ఉందని అర్థం. -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్‌కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్‌ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్‌గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్‌కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్‌కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్‌గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్‌గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్‌లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Health: మాయ ‘తెర’కు పరిమితులు..
‘చిన్నీ.... పడుకో...’‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్‌కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్రూమ్లో ఫోన్లు, ట్యాబ్లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. -
Health: బీ‘పీక్స్’ పోకముందే చెక్స్!
రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే అందరికీ తెలిసిందే. కానీ... వాస్తవానికి రక్తపోటు వచ్చేందుకు ముందు కొన్ని సూచనల ద్వారా శరీరం హెచ్చరికలు పంపుతుంటుంది. అవేమిటో జాగ్రత్తగా గ్రహిస్తే అసలు రక్తపోటు రాకుండానే చాలాకాలం పాటు ఆలస్యం చేయడమో, అదే క్రమశిక్షణ పాటిస్తే దాదాపుగా నివారించడమో సాధ్యమవుతుంది. దేహం అలా హెచ్చరికలు పంపే దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా పేర్కొంటారు. నిజానికి ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగరూకతతో వ్యవహరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలూ, మూత్రపిండాలు, మెదడు లాంటి కీలకమైన ఎండ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా నివారించుకుకోవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ ఏమిటో చూద్దాం.రక్తనాళాల్లో రక్తం నిర్దిష్టమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి తాలూకు రక్తపోటు 120/80 ఉంటే అది పూర్తిగా నార్మల్ కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరిలో ఈ నార్మల్ కొలత ఖచ్చితంగా ఉండక కొంత అటు ఇటుగా మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉండవచ్చు. అలాగే డయాస్టోలిక్ విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉండవచ్చు. 120 /80 కి బదులుగా పైన పేర్కొన్న ఆ కొలతలు ఉంటే ఆ దశను రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అలాగని అది నార్మల్ విలువ కూడా కాదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు ‘హైబీపీ’ రావచ్చు. అయితే హైబీపీ నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలనూ, అనర్థాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకుని, కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.ప్రీ–హైపర్‌టెన్షన్‌లో బాధితులు వెంటనే మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని ముందుజాగ్రత్త చర్యలకు పూనుకోవాలి. ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే తమ తమ వ్యక్తిగత జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. హైబీపీ ఓ సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటును (హైబీపీని) సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి కలిగే అనర్థాలు, నష్టాలు వెంటనే బయటకు కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం బాధితుడికి మొదట్లో తెలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల నష్టం జరుగుతూపోతూ... దీర్ఘకాలంలో ఏవైనా అవయవాలు దెబ్బతినప్పుడు, వాటికి సంబంధించిన లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం తెలియరాదు. కొన్నిసార్లు నష్టం జరిగిపోయాక మాత్రమే అప్పుడది హైబీపీ వల్ల జరిగిన అనర్థమని తెలుస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు.హైబీపీకి కారణాలు.. హైబీపీకి నివారించలేనివీ, నివారించదగినవనే రెండు రకాల కారణాలుంటాయి.నివారించలేని కారణాలు:పెరుగుతున్న వయసు, కుటుంబంలో వంశపారంపర్యంగా హైబీపీ ఉన్న మెడికల్ హిస్టరీ వంటివి నివారించలేని కారణాలని చెప్పవచ్చు.నివారించదగిన కారణాలు:ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం (స్థూలకాయం), ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, పొగాకు నమలడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు నివారించదగిన కారణాలు. ఈ సూచనలు పాటించండి... – కేవలం ప్రీహైపర్‌టెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు నివారించదగిన కారణాలను తెలుసుకుని అవి ప్రమాదకరం కాదని నిర్లక్ష్యం చేయకుండా ఈ సూచనలు పాటించాలి.– జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అంటే సోడియమ్ మోతాదులు పెరగకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం.– ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం కంటే ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం.– మాంసాహారంలో వేట మాంసం కంటే వైట్ మీట్ అయిన చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవడం.– అదనపు బరువును ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం.– ఎప్పుడూ కూర్చుని ఉండే పనుల్లో ఉండేవారు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం.ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీ–హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్తవహిస్తే అధిక రక్తపోటును చాలాకాలం పాటు నివారించుకోవచ్చు. దాంతో గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా చేసుకోవచ్చు. -
Health: నెక్ పెయిన్‌కు.. కొన్ని లైఫ్‌స్టైల్ అలవాట్లే కారణాలని తెలుసా!
సాధారణంగా మధ్యవయస్కుల్లో కనిపించే మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు టీనేజర్లలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వాళ్లలోనూ అవి కనిపించేందుకు అవకాశం లేకపోలేదు. ఇటీవల మాత్రం టీనేజర్లలో మెడనొప్పి కేసులు చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెడ ఒంచి మొబైల్ చూస్తూ ఉండటం, అదే కాకుండా ఆ వయసులోని పోష్చర్కు సంబంధించిన లైఫ్‌స్టైల్ అలవాట్లూ ఇందుకు కారణం. ఉదాహరణకు... స్కూళ్లూ / కాలేజీలలో చాలాసేపు మెడవంటి రాసుకుంటూ, చదువుకుంటూ కూర్చునే ఉండటం, సరైన భంగిమ(పోష్చర్)లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య సరైన సమన్వయం లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు వాళ్లలో మెడనొప్పికి కారణమవుతుంటాయి. ఆ సమస్యలనుంచి విముక్తి ఎలాగో తెలుసుకుందాం.కేవలం కూర్చునే పోష్చర్ లాంటి అలవాట్లే కాకుండా... కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడనొప్పి రావచ్చు. ఉదాహరణకు చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వచ్చే అవకాశముంది.నివారణ కోసం...– స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట... డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో / తమ ఎత్తుకు తగినట్లుగా పోష్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి.కంప్యూటర్ల వాడకం లేదా వీడియో గేమ్స్‌లో పోష్చర్ సరిగా లేకుండా కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాలపై ఒత్తిడి సరిగా పడాల్సిన విధంగా కాకుండా... ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోష్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు.స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. టీనేజర్లలో ఒబేసిటీ తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఒబేసిటీ పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి.ఒకప్పుడు టీనేజీ పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసిపోయేలా ఆటలాడేవారు. కానీ ఇటీవల ఆటలాడటం తగ్గిపోయింది. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు తమ వర్కవుట్స్‌తో సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. తగినంత వ్యాయామం చేయడం లేదా బాగా ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు... దాంతో వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలకు లేత ఎండ తగిలేందుకు ఆరుబయట ఆటలాడేలా తల్లిదండ్రులు చూడాలి. పోష్చర్ సరిచేసుకోవడం, ఆటలాడటం / వ్యాయామం తర్వాత కూడా మెడనొప్పి వస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం మంచిది. -
Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
నా వయసు 41. ఎటువంటి మందులు వాడకుండానే గర్భం వచ్చింది. అనారోగ్య సమస్యలేమీ లేవు. కానీ అందరూ బాగా భయపెడుతున్నారు. ఇంటి దగ్గర్లోని చిన్నాచితకా ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకోవద్దు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుకన్య, కరీంనగర్ఈ రోజుల్లో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో గర్భం దాల్చేవారు పదిమందిలో ఒకరుంటున్నారు. వయసు పెరిగేకొద్దీ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. వందలో పదిమందికి హై బీపీ రావచ్చు. బీపీ అదుపు కాకపోతే‘ప్రీఎక్లాంప్సియా’ అనే సమస్య ప్రతి వందమందిలో ఇద్దరికి ఎదురవుతుంది. ఇది తల్లికి, బిడ్డకి ప్రమాదం.ఇలా బీపీ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యడం, ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ మూడవ నెల నుంచి తీసుకోవడం లాంటివి సహాయపడతాయి. అధిక బరువు ఉన్న వారిలో డయాబెటిస్ రిస్క్ కూడా నలభై ఏళ్ల తర్వాత ఎక్కువ ఉండొచ్చు. ఈ సమస్యను తొందరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే తల్లికి, బిడ్డకి ప్రమాదం. డయాబెటిస్ గుర్తించకుండా, దానికి చికిత్స తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో ఉండే లోపాలు 5వ నెల స్కాన్ తీసినప్పుడు బయటపడతాయి. నలభైల్లో వచ్చే గర్భంలో బీపీ, సుగర్, బరువు చూసి తగిన జాగ్రత్తలు అనుసరించాలి.రక్తసంబంధీకుల్లో సుగర్, బీపీ ఉన్న చరిత్ర గలవారు నలభైల్లో గర్భం దాల్చాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ముందుగానే అన్ని చెకప్‌లు చేయించుకుని ప్లాన్ చేసుకోవాలి. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది ప్రెగ్నెన్సీలో ప్రమాదానికి దారి తీస్తుంది. గడ్డకట్టిన రక్తం బ్రేక్ అయితే అది రక్తప్రసరణలో కలసి ఊపిరితిత్తులు, గుండెలో అడ్డంకి ఏర్పడి ప్రాణానికి ప్రమాదం కలుగజేస్తుంది. దీనిని పల్మనరీ ఎంబ్రాలిజమ్ అంటారు. అయితే నలభైలో గర్భం దాల్చిన వారికి ఇది పదింతలు ప్రమాదం. అందుకే దీనిని అరికట్టడానికి ముందుగానే మందులు మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం కూడా ఒక నివారణే.కంప్రెషన్ స్టాకింగ్స్ తొడుక్కోవాలని సూచిస్తారు. ప్రమాద అంచనా అనేది గర్భధారణ సమయంలోనూ, ఆ తరువాత కూడా చేస్తారు. రోజుకి 6–8 గ్లాసుల నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం. గుండె పట్టేసినట్టు, రక్తపు వాంతులు అవుతున్నా, ఆయాసం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల నలభైల్లో వచ్చే గర్భంలో బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. 6వ నెల నుంచి ప్రతి రెండు వారాలకి పొత్తికడుపు కొలతలను చూస్తారు. నెలకోసారి స్కాన్ చేసి, బిడ్డ ఎదుగుదలను అతి దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతారు.ఇంక ప్రసవ సమయం కూడా బిడ్డ ఎదుగుదలను బట్టి నిర్ణయిస్తారు. చాలాసార్లు 37 వారాలకే డెలివరీ చెయ్యాల్సి వస్తుంది. 37 వారాల తర్వాత బిడ్డ కడుపులోనే ఉంటే వెయ్యిలో ఇద్దరికి మనకు తెలియకుండానే ఇబ్బందులు వస్తాయి. అందుకే డాక్టర్ సలహా మేరకు అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసులో నార్మల్ డెలివరీ చెయ్యాలా లేక సిజేరియన్‌కి వెళ్లాలా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. డెలివరీ సమయంలో ఎనస్థీషియా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేసుకోవడం మంచిది. అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన డాక్టర్లు ఉన్న చోట డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి వాళ్లే చూసుకుంటారు.నియోనాటాలజిస్ట్ కూడా అందుబాటులో ఉండాలి. చాలాసార్లు ముందస్తుగా డెలివరీ అవ్వడం, పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండే అవకాశాలుంటాయి. అందుకే బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉండే ఆసుపత్రులను ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేస్తారు. ఈ రోజుల్లో నలభై పైబడిన వారిలో కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నారు.హెల్త్ ట్రీట్: సీఫుడ్ రసాయనాలతో వంధ్యత్వం!సీఫుడ్‌లోని రసాయనాలతో వంధ్యత్వం సహా నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ‘పెర్ అండ్ పోలీఫ్లూరోఆల్కైల్ సబ్‌స్టన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రకానికి చెందిన ఈ వందలాది రసాయనాలు ఎక్కువగా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీఫుడ్ ద్వారా శరీరంలోకి చేరి, శాశ్వతంగా తిష్ట వేసుకుంటున్నాయని, వీటి కారణంగా మహిళల్లో వంధ్యత్వం, రకరకాల క్యాన్సర్లు, నవజాత శిశువుల్లో శారీరక లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని న్యూహాంప్‌షైర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.సీఫుడ్ మాత్రమే కాకుండా, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల పరిసరాల్లో కొళాయిల ద్వారా సరఫరా అయ్యే మంచినీటిలోను, వాటి పరిసరాల్లో పండే తిండిగింజల్లోను కూడా పీఎఫ్ఏఎస్ రసాయనాలు మోతాదుకు మించి ఉంటున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అయితే, ఈ రసాయనాల మోతాదు మిగిలిన పదార్థాల కంటే సీఫుడ్‌లో మరింత ఎక్కువగా ఉంటున్నట్లు రుజువైంది. ముఖ్యంగా కాడ్, సాల్మన్, స్కాలప్, ట్యూనా వంటి చేపల్లోను, సముద్రపు రొయ్యల్లోను, పీతల్లోను పీఎఫ్ఏఎస్ రసాయనాలు ప్రమాదకరమైన పరిమాణంలో ఉంటున్నాయని, ఇకపై వీటిని తినే ముందు జనాలు కాస్త ఆలోచించుకోవాలని న్యూహాంప్‌షైర్ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన మేగన్ రోమానో హెచ్చరిస్తున్నారు.పీఎఫ్ఏఎస్ పదార్థాలు మట్టిలో కలసిపోవాలంటేనే వేలాది సంవత్సరాలు పడుతుందని, అలాంటిది ఇవి శరీరంలోకి చేరితే, వాటి వల్ల తలెత్తే అనర్థాలను ఊహించుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రపు రొయ్యలు, పీతల్లో అత్యధికంగా ప్రతి గ్రాములోను 1.74–3.30 నానోగ్రాముల మేరకు పీఎఫ్ఏఎస్ పదార్థాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు లాబొరేటరీ పరీక్షల్లో గుర్తించారు. ప్లాస్టిక్లోను, అగ్నిమాపక రసాయనాల్లోను ఎక్కువగా ఉండే పీఎఫ్ఏఎస్ రసాయన పదార్థాలు మానవ శరీరంలోకి మోతాదుకు మించి చేరుకుంటే, వంధ్యత్వం సహా నానా అనర్థాలు తప్పవని వారు చెబుతున్నారు.– డా. భావనా కాసుఇవి చదవండి: అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!? -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? – డి. వరలక్ష్మి, హైదరాబాద్– కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్. కౌసల్య, చిల్కమర్రి– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి! -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్‌గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
Health: ఇది సాధారణమే! చలికాలంలో తరచుగా జలుబు..
నాకు 5వ నెల. చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏ మందులు వేసుకోవాలి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? – మాధురి, జగ్గంపేటజలుబు అనేది గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సాధారణం. జలుబు, ఫ్లూ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మాములుగా జలుబుకి ఆవిరి తీసుకోవడం, పై పూతగా ఏమైనా రాసుకోవడం, పారాసిటమాల్ లాంటివి తీసుకోవచ్చు. కానీ జలుబుతో పాటు ఒళ్లునొప్పులు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఫ్లూ లక్షణాలు అని అర్థం. అప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమంది గర్భిణీలకు వాతావరణంలోని మార్పులతో ఇబ్బందులు ఎదురవుతాయి. యాంటీ వైరల్ మాత్రలు కుడా వాడాల్సి వస్తుంది. త్వరగా చికిత్స అందకపోతే కొందరిలో అది న్యూమోనియాగా మారుతుంది. దీనికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు హార్మోనల్ మార్పుల వల్ల, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అందుకే ఎక్కువమంది ఇబ్బందులు ఎదుర్కొంటారు.హై యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి వస్తుంది. ఫ్లూ కారణంగా ముందస్తు డెలివరీ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చలికాలంలో మీరు ఉన్న పరిసరాల్లో ఎవరో ఒకరికి జలుబు, ఫ్లూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు నిరోధించడం చాలా కష్టం. అందుకే గర్భిణీలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్లూ వ్యాక్సినేషన్ ఏ నెలలోనైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న వారిలో ఫ్లూ తాలూకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిరూపణ అయ్యింది. సరైన పోషకాహారం, నిద్ర, రోజుకు కనీసం నాలుగైదు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ముక్కులో వేసుకునే ్రడాప్స్ మంచివి కావు. డీకంజెస్టంట్ (కఫం పోయేలా చేసే) ఉన్న మందులు కూడా వాడకూడదు.ఫ్లూ వచ్చినప్పుడు చేసే చికిత్సతో కడుపులో ఉన్న బిడ్డ మీద ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మీకు 5వ నెలలో చేసే టిఫా స్కాన్‌లో బిడ్డ ఎదుగుదల తెలుస్తుంది. ఒక వేళ ఫ్లూ ఎక్కువ ఉండి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే వెల్ బీయింగ్ స్కాన్ అదనంగా చేస్తారు. మీకు జలుబు మాత్రమే ఉంటే ఒకటి రెండువారాల్లో తగ్గుతుంది. ఉప్పు నీటితో పుక్కిలించడం, వేడినీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. ముక్కు మూసుకుపోయి, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం లాంటివి ఉండి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి.మీకు షుగర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులున్నా, వాటి తాలూకు ఇబ్బందులు ఎదురైనా డాక్టర్ని కలసి, వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఒకటి రెండు వారాల వరకూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే వాళ్లు వాడిన వస్తువులు వాడకూడదు. చేతులను ముక్కు, కళ్ల వద్ద పెట్టుకోకూడదు. చేతులను శు్రభంగా కడుక్కోవాలి. మాస్క్ వాడటం కూడా మంచిది. ఫ్లూ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గదు. అందుకే రాకముందే ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫీవర్ ఉంటే డాక్టర్ని కలసి మందులు వాడాలి.హెల్త్ ట్రీట్.. పీసీఓఎస్‌తో తిండి సమస్యలు..?మహిళల్లో రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తిండి సమస్యలకు కూడా కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు బులీమియా (తిన్న తర్వాత బరువు పెరిగిపోతామన్న ఆందోళనతో బలవంతంగా వాంతి చేసుకోవడం), బింజ్ ఈటింగ్ (నియంత్రణ లేకుండా నిరంతరం తినడం) వంటి సమస్యలకు కూడా లోనవుతారని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. తొమ్మిది దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పీసీఓఎస్‌తో బాధపడే 28,922 మంది మహిళలపైన, ఈ సమస్య లేని 2,58,619 మంది మహిళలపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ అంశమై శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.ఈ పరిశోధన సారాంశాన్ని ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం’ సంచికలో ప్రచురించారు. ఆహారం తినడంలో సమస్యలకు లోనయ్యే పీసీఓఎస్ మహిళలపై జరిపిన పరిశోధనల్లో మరికొన్ని అంశాలూ బయటపడ్డాయి. వీరిలో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి అసలే రాకపోవడం, అండాశయం పైపొరపై పూర్తిగా పరిపక్వం కాని అండాలు ఏర్పడటం, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లోనే ఆహారం తినే అంశంలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లోని కేలీ గయోర్ఫీ, అవా సానెత్ల ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. – డా. భావన కాసు -
చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్ చైల్డ్ హీలింగ్!
బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్ చైల్డ్ వర్క్ లేదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్ ఫ్రీడమ్‌తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.ఇన్నర్ చైల్డ్‌ను గుర్తించడంమీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అవ్వడంవిజువలైజేషన్ ఎక్సర్సైజ్లు, డైరీ రాయం, డైలాగ్ టెక్నిక్స్ ద్వారా మీ ఇన్నర్చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్ చైల్డ్‌కు ఒక లేఖ రాయవచ్చు.ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇలా...ఇన్నర్ చైల్డ్ చెప్పేది వినడం మీరు మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్ చైల్డ్‌ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.హీలింగ్ అండ్ రీపేరెంటింగ్ మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లక్ష్యం. ‘రీపేరెంటింగ్’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్ చైల్డ్‌కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్ చైల్డ్‌కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.ఇన్నర్ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయడం..మీ ఇన్నర్ చైల్డ్‌ను అడల్ట్ సెల్ఫ్‌తో ఇంటిగ్రేట్ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్ కంపాషన్ను, ఎమోషనల్ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. – సైకాలజిస్ట్ విశేష్