Mafia
-
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?
ఒకప్పుడు బాలీవుడ్లో మాఫియా డాన్ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్‌తో ప్రేమలో పడి కెరీర్‌ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.డాన్‌తో ప్రేమలో..మోనికా బేడి కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్‌లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.ఐదేళ్లు జైలు శిక్ష!అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్‌తో పరిచయమే ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది. తెలుగులోనూ సినిమాలు..శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. షారుఖ్, సల్మాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. View this post on Instagram A post shared by Monica Bedi (@memonicabedi) -
గోవాలో ఏం జరుగుతోంది?.. సీఎం రియాక్షన్ ఇదే!
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే.. ఈసారి ఇయర్ ఎండ్‌లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్‌లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన. ‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.నిజంగానే పడిపోయిందా?చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు2024 నవంబర్‌నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.*ఓహెర్లాడో గణాంకాల ప్రకారంఒక్కడితో మొదలై.. గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్‌మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్‌లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్‌కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్‌లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు. చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య -
ఇది 'గంగా' దందా
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు. ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్‌ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్‌లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్‌కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్‌ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
కల్తీ కల్లు.. ఆరోగ్యానికి చిల్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ‘కల్తీ’ కల్లు మాఫియా రెచ్చిపోతోంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన శంషాబాద్, సరూర్‌నగర్ అబ్కారీ అధికారులు వారిచ్చే ముడుపులు పుచ్చుకుని కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇటీవల మీర్‌పేటలోని నందనవనం బస్తీకి చెందిన ఓ మహిళ కల్తీకల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి, కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎౖజ్శాఖ వారికి అండగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్తీలే కల్లు కాంపౌండ్లకు అడ్డాలు ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును సేవించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం తొలగుతా యి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చో ట్ల కల్తీ తక్కువ. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కారి్మ కులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. గుడుంబా దొరక్క పోవడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లు కు అలవాటుపడుతున్నారు. ప్రజల్లోని ఈ బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు సొమ్ము చేసు కుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్పాజోలమ్ వంటి ప్రమాదకరమైన రసాయణాల ను వినియోగించి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు.తయారీలో మోతాదుకు మించి రసాయణాలను వినియోగిస్తుండడంతో దీన్ని సేవించిన వారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. శంషాబాద్, రాజీవ్శెట్టినగర్, మీర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, బొంగుళూరుగేటు, ఆదిబట్ల, యాచారం, చేవెళ్ల, షాద్‌నగర్, షాబాద్, కడ్తాల్ శివారు ప్రాంతాల్లో ఈ కల్తీ కల్లు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుత సీజన్లో తాటి చెట్లకు ఆశించిన స్థాయిలో కల్లు ఉత్పత్తి కాదు. ఒకటి రెండు తాటి చెట్ల నుంచి కల్లును సేకరించినా, ఇది వారి సొంత అవసరాలకు కూడా సరిపోదు. కానీ జిల్లాలోని ఏ ప్రధాన రోడ్డు వెంట చూసినా కృత్రిమ కల్లు దుకాణాలే దర్శనమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీ లు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనేక విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఒక లైసెన్సు.. రెండు దుకాణాలు శంషాబాద్ పట్టణంలోని ఓ ప్రధాన కల్లు దుకాణంలో సభ్యుల మధ్య జరిగిన గొడవతో కల్లు విక్రయాలు రోడ్డుపైకి వచ్చాయి. గొడవల కారణంగా దాదాపు నెల రోజులుగా దుకాణం తెరవని విక్రయదారులు తమ దందాను మాత్రం యథేచ్చగా రోడ్డెక్కించారు. దాదాపు మూడు వందల సభ్యులతో ఉన్న ఈ దుకాణంలో కొంత కాలంగా వ్యాపారుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఓకే దుకాణంలో రెండు వేర్వేరు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఎక్సైజ్ నిబంధనల మేరకు ఒక లైసెన్స్‌పై రెండు విక్రయ కేంద్రాలు నడిపిస్తున్న విషయం తెలుసుకున్న ఆబ్కారీ అధికారులు ఒక లైసెన్స్‌పై ఒకటే దుకాణం నడిపిచాలని హెచ్చరించారు. వ్యాపారులు మాత్రం ఇదేమి పట్టనట్టుగా దందా కొనసాగిస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వీకర్ సెక్షన్ కాలనీ మీదుగా ఉన్న రోడ్డుపైనే కల్లు విక్రయాలు జరుపుతుండటంతో కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదు. నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మానసిక విక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు సైతం పని చేయవు. మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం. – డాక్టర్ రాజేశ్, న్యూరో సర్జన్క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్లతో కల్లు తయారీ మోతాదుకు మించి రసాయనాలుకలపడంతో ప్రమాదం పట్టించుకోని జిల్లా ఎక్సైజ్ అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్న వైనం -
ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!
గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్‌లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.Goa’s taxi mafia is responsible for it. 100%I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్వరుణ్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
జంతువుల కొవ్వుతో ఆయిల్ పవన్ ఇలాకాలో కల్తీ దందా
-
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్‌లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
ఉసురు తీస్తున్న అమెరికా డ్రీమ్స్
అమెరికా. ఊహల స్వర్గం. ముఖ్యంగా భారత యువతకైతే ఎలాగైనా చేరి తీరాలనుకునే కలల తీరం. ఇందుకోసం చాలామంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. చదువు, నైపుణ్యం వంటి అర్హతలు లేకున్నా అక్రమంగానైనా అగ్రరాజ్యం చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కరడుగట్టిన మాఫియా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కి సర్వం కోల్పోతున్నారు. ధనం, మానంతో పాటు కొన్నిసార్లు నిస్సహాయంగా ప్రాణాలూ పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి, అయినవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. అయినా అత్యంత ప్రమాదకరమైన ‘డంకీ’ మార్గాల్లో అమెరికా బాట పడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ ఇటీవల వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా డంకీ గుర్తుందా? అక్రమంగా ఇంగ్లండ్ చేరేందుకు కొందరు చేసే ప్రయత్నమే దాని ఇతివృత్తం. ఇలా అక్రమ దారుల్లో దేశాలు దాటడాన్ని ‘డంకీ మార్గం’గా పిలుస్తారు. ఇదో పంజాబీ పదం. ఇలా అమెరికా చేరేందుకు ప్రయతి్నస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆ క్రమంలో ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటూ, మనుషులను అక్రమంగా చేరవేసే మాఫియా చేతుల్లో నానారకాలుగా చిత్రవధకు గురవుతున్నట్టు స్కై న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది.ఈ విధంగా మానప్రాణాలను రిసు్కలో పెట్టుకుంటున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టు తన నివేదికలో పేర్కొంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2022 నాటికే అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల సంఖ్య ఏకంగా 7.25 లక్షలు దాటేసింది. ఈ జాబితాలో మెక్సికో, ఎల్ సాల్వెడార్ తర్వాత మనోళ్లు మూడో స్థానంలో ఉన్నారు. 2023లో రికార్డు స్థాయిలో ఏకంగా 96,917 మంది భారతీయులను అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్బంధించడమో, బలవంతంగా వెనక్కు పంపడమో జరిగినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాకు రూటు ఇలా.. అమెరికాలో అక్రమంగా ప్రవేశించదలచే భారతీయులు తొలుత పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి సెంట్రల్ అమెరికా దేశాలకు చేరతారు. మాఫియా ప్రపంచంలో వీటికి అమెరికాకు గేట్‌వేలుగా పేరు. ఈ దేశాల వీసా తేలిగ్గా లభిస్తుంది. పైగా అక్కడి నుంచి తొలుత మెక్సికోకు, ఆపై అమెరికాకు చేరడం సులువు. ఆయా దేశాల నుంచి వీళ్లను అమెరికా చేర్చేందుకు ఒక నమ్మకమైన గైడ్‌ను అక్రమ రవాణా మాఫియాయే ఏర్పాటు చేస్తుంది. అతన్ని కొయొటోగా పిలుస్తారు. అయితే అత్యంత కష్టతరం, ప్రమాదకరం అయిన మార్గాల గుండా సాగే ఈ ప్రయాణం అక్షరాలా ప్రాణాంతకమే! దీనికి కొన్నిసార్లు ఒక్రటెండేళ్ల సమయం కూడా పడుతుంది! భారతీయులపై నానారకాల అకృత్యాలు జరిగేది కూడా ఈ దశలోనే. అమెరికాలోకి సరిహద్దు దాటించేందుకు ఏటా మూడు సీజన్లుంటాయి. నేను సీజన్‌కు సగటున 500 మందిని పంపుతుంటా. – స్కై న్యూస్‌తో ఒక ఏజెంట్ ‘అమెరికా వెళ్లేందుకు నా సేవింగ్స్ అన్నీ ఊడ్చి మరీ మాఫియాకు రూ.40 లక్షలు చెల్లించా. కానీ నన్ను కఠ్మాండూ తీసుకెళ్లి బంధించారు. మావాళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. – సుభాష్ కుమార్ (26)ఆ సరిహద్దు.. ప్రత్యక్ష నరకంకిందా మీదా పడి అమెరికా సరిహద్దు దాకా చేరేవారిది మరో రకం దైన్యం. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ వద్ద చిక్కుపడేవారైతే అక్షరాలా నరకం చవిచూస్తున్నారు. ఆ ప్రాంతమంతా మెక్సికన్ మాఫియా నియంత్రణలో ఉంటుంది. దాంతో బాలికలు, మహిళలపై ఇష్టారాజ్యంగా లైంగిక దాడులు, అత్యాచారం జరుగుతున్నాయి. వాళ్లను బలవంతంగా వేశ్యా వృత్తిలోకి కూడా దించుతున్నారు. అక్కడ సగటున ప్రతి ముగ్గురిలో ఒకరిపై లైంగిక దాడి జరుగుతున్నట్టు అంచనా. సర్వం తెగనమ్ముకుని..తమ పిల్లలను ఎలాగైనా అమెరికా పంపడమే లక్ష్యంగా సర్వం తెగనమ్ముకుంటున్న వారికి కొదవ లేదు. మాఫియా అడిగినంత ఇచ్చుకునేందుకు ఇల్లు, పొలం, నగా నట్రా వంటివన్నీ తాకట్టు పెట్టడమో, అమ్మడమో చేస్తున్నారు. అలా ఆస్తులన్నీ అమ్మించి అమెరికా బాట పట్టిన మలీ్కత్సింగ్ అనే 30 ఏళ్ల టెక్నాలజీ గ్రాడ్యుయేట్ దోహా, అల్మాటీ, ఇస్తాంబుల్, పనామా సిటీ గుండా చివరికి ఎల్ సాల్వడార్ చేరుకున్నాడు. అక్కడ మాఫియా చేతిలో దుర్మరణం పాలయ్యాడు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. సాహిల్ అనే మరో 19 ఏళ్ల యువకుడు పనామా నుంచి బయల్దేరి మార్గమధ్యంలోనే గల్లంతయ్యాడు. అప్పట్నుంచీ అతని ఆచూకీ కోసం తండ్రి శివకుమార్ (45) చేయని ప్రయత్నమంటూ లేదు.ఇదీ పరిస్థితి⇒ డంకీ రూటు సెంట్రల్ అమెరికా దేశాల మాఫియాకు కొన్నేళ్లుగా ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది. ⇒ అమెరికా చేర్చేందుకు 50 వేల నుంచి లక్ష డాలర్ల దాకా (రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు) వసూలుచేస్తున్నాయి. ⇒ వీళ్లకు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లున్నారు. ⇒ వీరి వల్లో పడేవాళ్లలో ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల యువత సంఖ్యే అధికం. ⇒ ఆశావహులు ముందుగా విమాన మార్గంలో పనామా తదితర దేశాలకు చేరతారు. ⇒ అక్కడినుంచి వీళ్ల జుట్టు పూర్తిగా మాఫియా ముఠాల చేతికి చిక్కుతుంది. ⇒ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు, జలమార్గాలను దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది. ⇒ అలా అమెరికా చేరేదాకా ప్రయాణమంతా ‘వాళ్ల దయ, వీళ్ల ప్రాప్తం’ అన్నట్టుగా ఉంటుంది. ⇒ చాలాసార్లు ఫేక్ బోర్డింగ్ పాసులు, వీసాలు చేతిలో పెట్టి ‘ఇదే అమెరికా’ అంటూ నమ్మించి మార్గమధ్యంలోనే వదిలేస్తుంటారు. ⇒ ఇలాంటి వాళ్లంతా పోలీసులకో, క్రిమినల్ గ్యాంగులకో చిక్కుతారు. అంతిమంగా వాళ్లకు చిప్ప కూడు, చిత్రహింసలే గతవుతాయి. -
బాబుకు ఝలక్.. ఇసుక మాఫియాకి జేసీ వార్నింగ్
-
పోలవరం మట్టిన పందికొక్కుల్లా తినేస్తున్నారు
-
ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది?
ఒకప్పుడు ఇది మాఫియా డెన్. ఇప్పుడు థీమ్ పార్క్. దీని పేరు ‘హేసియెండా నేపోలెస్’. అంటే నేపుల్స్ ఎస్టేట్ అని అర్థం. కొలంబియన్ డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ స్థావరమిది. దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌లో నివాస భవనాలు, ఒక ఈతకొలను, నాలుగు చెరువులతో పాటు ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన వృక్షసముదాయం చిట్టడవిని తలపిస్తుంది. ఇక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఎస్కోబార్ నీటి ఏనుగుల వంటి భారీ జంతువులను ఇక్కడకు తెచ్చి పెంచుకునేవాడు. ఈ ఎస్టేట్‌లో ఒక జూ, శిల్పశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. పోలీసుల దాడిలో ఎస్కోబార్ 1993లో మరణించాడు. ఈ ఎస్టేట్ కోసం అతడి కుటుంబం దావా వేసినా, కోర్టులో ఓడిపోయింది.దాంతో ఇది 2006లో కొలంబియా ప్రభుత్వానికి స్వాధీనమైంది. కొలంబియా ప్రభుత్వం దీనిని ఒక థీమ్పార్కుగా తీర్చిదిద్ది, కొత్తగా ప్రవేశద్వారాన్ని నిర్మించింది. ప్రవేశద్వారానికి పైన విమానాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. ఈ విమానంలోనే ఎస్కోబార్ మాదకద్రవ్యాలను రవాణా చేసేవాడు. దేశ దేశాల్లో తిరిగిన తర్వాత ఇదే విమానంలో నేరుగా తన ఎస్టేట్‌కు చేరుకునేవాడు.కొలంబియా ప్రభుత్వం ఇక్కడ జురాసిక్ పార్క్ తరహాలో 2014 నాటికి పూర్తిస్థాయి ఆఫ్రికన్ థీమ్‌పార్కు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడిది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఈ థీమ్‌పార్కులో ఒక రోజు బస చేయడానికి 15 డాలర్లు (రూ.1,215) చెల్లించాల్సి ఉంటుంది. ఈ థీమ్‌పార్కులో ఎస్కోబార్ మ్యూజియం, పట్టుబడతాననే భయంతో అతడు తగులబెట్టిన కార్లు, కొకెయిన్ గోదాముల శిథిలాలు ఆనాటి మాఫియా సామ్రాజ్యానికి ఆనవాళ్లుగా నిలిచి ఉన్నాయి.ఇవి చదవండి: అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!! -
నీటి సంక్షోభం: ఢిల్లీ ట్యాంకర్ మాఫియాపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాష్ట్రంలో నీటి సంక్షోభం నెలకొన్న సమయంలో ట్యాంకర్ మాఫీయాను అరికట్టకపోవటంపై సుప్రీకోర్టు ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నీటి వృధాపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని సీరియస్ అయింది. ట్యాంకర్ మాఫియా, నీటి వృధాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల రిపోర్టును తమకు అందజేయాలని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జిస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలే ఆదేశించారు. ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ప్రభుత్నానికి చేతకాకపోతే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘‘ కోర్టు ముందు నకిలీ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు?. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటర్ వస్తోంది. ఢిల్లీకి వచ్చిన నీరు ఎక్కడికి వెళ్లుతోంది?. ట్యాంకర్ మాఫియా విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాజేయాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. చర్యలకు సంబంధిచి పూర్తి నివేదిక గురువారం అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.హిమాచల్ ప్రదేశ్.. హర్యానాకు ఇస్తున్న మిగులు నీటిని ఇలాంటి సంక్షోభ సమయంలో తమకు తరలించాలని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రియించింది. దీంతో ఢిల్లీకి నీటిని అందించాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్‌కు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ నీటిని అందించిన హర్యానా తమ వాటాను తగ్గిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. -
అమ్మకానికి ఆడ శిశువు
-
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
‘అభివృద్ధిని ఇండియా కూటమి ఓర్వలేదు’: ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్‌లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అజంగఢ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు. తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు. దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని, ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు. पूर्वी उत्तर प्रदेश समेत पूरे देश के परिवारजनों के जीवन को आसान बनाने के लिए हमारी सरकार दिन-रात काम रही है। आजमगढ़ में विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/fGxt3QsZt4 — Narendra Modi (@narendramodi) March 10, 2024 -
93 పేలుళ్ల కేసు నుంచి తుండాకు విముక్తి
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. -
పేదవాడి ప్రాణం.. ఖరీదెంత?!
మిర్యాలగూడ అర్బన్ : ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రికి వస్తే.. వచ్చిన రోగం పోవడం దేవుడెరుగు.. అసలు ప్రాణమే లేకుండా పోతే..! ఆ ప్రాణానికి ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు సైతం వైద్యులకే వత్తాసు పలుకుతూ బాధిత కుటుంబాల్లో కన్నీరు మిగిలిస్తున్నారు. ఒక్కోసారి రోగులు, వారి బంధువులును సైతం బెదిరించి విషయం బయటికి పొక్కకుండా పెద్ద మనుషులు (రౌడీ షీటర్లు) ఆయా ఆస్పత్రులకు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వారిని పెంచి పోషిస్తున్నారని ప్రజలకు తెలిసిన విషయమే. అనేక చావులను బయటికి రానీయకుండా ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరికి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా వైద్యధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలిపే ఘటనలు ఇలా.. ● దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన దాసరి యల్లయ్య తన కూతురు మీనాక్షి(9)తో కలిసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డీకాలనీలో గల ఓ వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలికలను పరీక్షించిన ఎముకల వైద్యుడు కాలికి ఆపరేషన్ చేయాలని థియేటర్‌కు తీసుకెళ్లి ఎముకల వైద్యుడే మత్తు మందు ఇచ్చాడు. మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న రోగి బంధువులు (ఫైల్) కొద్ది సేపటికే బాలిక అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వైద్యుడు బాలిక పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పి స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి హడావుడిగా వారిని హైదరాబాద్ తరలించి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌కు తీసుకెళ్లే సరికి ఆ బాలిక మృతిచెందింది. వెంటనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి బాలిక ప్రాణానికి రూ.5లక్షలు ఖరీదు కట్టారు. ● గత సంవత్సరం ఆగస్టు 30న త్రిపురారం మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన మాతంగి రాధ (38) కడుపునొప్పితో బాధపడుతూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల ఓ మల్టీసెపషాలిటీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. వారంరోజుల తరువాత డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రాధకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు వైద్య సేవలు ప్రారంభించారు. అయినప్పటికీ మహిళ ఆరోగ్యం బాగు పడకపోగా మరింత క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కాగా పెద్ద మనుషుల జోక్యంతో మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు నీళ్లు.. అన్నీ మావే.. అంతా మాకే.. అన్నట్లుగా ఉంది మిర్యాలగూడలో వైద్యులు తీరు. ఆస్పత్రులతోపాటు ల్యాబ్, మెడికల్ షాప్ వంటి వ్యాపారాలన్నీ వారే ఏర్పాటు చేసుకుని ఎలాంటి అర్హత లేని సిబ్బందిని పనిలో పెట్టుకుని రోగుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఏదైనా రోగం వచ్చిందని వైద్యుడి వద్దకు వెళ్తే.. అవసరం లేకపోయినా అన్ని రకాల పరీక్షలు రాసి తమవద్దే చేయించుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి మృతిచెందడంతో ఆందోళన చేస్తున్న బంధువులు (ఫైల్) తమకు నచ్చిన విధంగా ల్యాబ్ నుంచి రిపోర్టులు రాయించుకుని ఏ జబ్బూ లేకున్నా వేల రూపాయల మందులు తమ సొంత మెడికల్ షాపుల ద్వారా అంటగడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అకారణంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
కోటీశ్వరుడైన ముంబై బిచ్చగాడు.. మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?
హైదరాబాద్: సాధారణంగా చేయి చాచడానికే చాలా అవమానకరంగా భావిస్తూ ఉంటాం అలాంటిది భిక్షాటనను ప్రొఫెషన్ గా ఎంచుకుని అందులో కోటానుకోట్లు ఆర్జిస్తున్నాడు ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్. ఎటువంటి టాక్స్ మినహాయింపు లేకుండా నెలకు సుమారు రూ.7 కోట్లు సంపాదించే ప్రొఫెషనల్ బిచ్చగాడైన భరత్ జైన్ ఇటీవల రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశాడు. దీంతో అనుమానమొచ్చిన ఐటీ శాఖ ఆయన ఇంటిపై సోదాలు జరపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కథనాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా కాళ్ళు చేతులూ చక్కగా ఉన్నవారు కూడా భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా బయట రాష్ట్రాలకు చెందినవారని అందరికీ తెలిసిందే. వీరి వెనుక ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఉండి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమీషనర్ సీవీ ఆనంద్ గతంలో సంచలనం సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్ కథనాన్ని గుర్తుచేశారు. భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను మించిన ముష్టియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, నలుగురు భార్యలతో కలిసి ఆయన నివాసముండటానికి లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు. ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగ లాగితే డొంకంతా కదిలింది. భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భరత్ జైన్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చినవాడు కాదు. ఐఐఎం కోల్‌కతాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే ఆతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళ ఆర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళుతుందట. ఇది కూడా చదవండి: బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్ -
ఈ కంపెనీలో ఒక రోజు
వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్‌ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్లో మాఫియా డాన్ కరీమ్లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్‌లో ఉన్న అమ్మాయిలను కరీమ్లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్. ‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా. ఒకసారి దావూద్‌ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్‌కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్! తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్. -
గోల్డ్ సిటీలో చీకటి సామ్రాజ్యం.. జనజీవనం సాగుతుందిలా..
ఆ నగరంలో ఎటుచూసినా బంగారమే. ప్రపంచంలోనే గోల్డ్సిటీగాపేరొందిన ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలు ‘అంధకారం’, హింస, క్రిమినల్ సిండికేట్ల వివాదాల మధ్య నలిగిపోతూ కనిపిస్తాయి. ఈ బంగారు గనుల మెరుపుల వెనుక ఇక్కడివారి జీవితంలోని మరో కోణం ఎలా ఉంటుంది? ఇక్కడి సాధారణ ప్రజల జీవితం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో బంగారం మెరుపు ముందు మరేదీ సాటిరాదు. అలాగే బంగారాన్ని మించినది మరేదీ లేదని చెబుతుంటారు. బంగారం మాయ ప్రపంచాన్నంతటికీ ఒకే విధంగా కమ్మేసింది. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ నగరం.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు గనులు కలిగిన ప్రాంతం. ఇక్కడ బంగారం తవ్వకాలు 5 వేల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకూ అంటే మహారాజుల కాలం నుంచి ప్రస్తుత యుగం వరకూ ఇక్కడ బంగారం తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇక్కడి బంగారు వన్నె ఏమాత్రం తగ్గనేలేదు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున 22 మంది పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ.. అమెరికా, చైనా, భారత్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దపెద్ద బంగారు గనులున్నాయి. కానీ ‘గోల్డ్ సిటీ ఆఫ్ వరల్డ్’ అని ఏప్రాంతాన్ని అంటారో తెలుసా? అదే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్. ఇక్కడే అత్యంత భారీగా బంగారు నిల్వలు కలిగిన విట్వాటర్శాండ్ మైన్స్ ఉన్నాయి. ఈ విట్వాటర్ శాండ్ గనులు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ సువిశాల బంగారు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో 40 శాతం మేరకు ఉంటుంది. అందుకే జోహెన్స్ బర్గ్ పేరు బంగారంలా వెలిగిపోతుంటుంది. ఎంత బంగారం ఉందంటే... విట్వాటర్శాండ్కు చెందిన గోల్డ్ మైన్స్ భూమిలోపల మూడు వేల మీటర్ల లోతున ఉన్నాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం ఉందనే అంచానాలున్నాయి. ఇక్కడ గడచిన 61 ఏళ్లుగా బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 1961 నుంచి ఇక్కడి గనుల్లో మొదలైన తవ్వకాలు రాబోయే 70 ఏళ్ల వరకూ అంటే 2092 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 2017లో ఇక్కడ 281,300 ఔన్స్‌లు, 2018లో 157,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ యురేనియం గునులు కూడా భారీగానే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకోదగిన ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవి కూల్ప్ గోల్డ్‌మైన్, డ్రిఫోంటైన్ గోల్డ్ మైన్, సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇంపాలా మైన్, షిపాంగ్ మైన్. సామాన్యుల జీవితం ఇలా.. ఇక్కడి బంగారం మెరుపుల మధ్య సామాన్యుల జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది. జోహెన్స్ బర్గ్‌లోని గౌంటెడ్ ప్రాంతం దక్షిణాఫ్రికాలో అతి చిన్న భూభాగం. అంటే కేవలం 1.5 శాతం భూభాగం. అయితే ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తున్నారు. దేశంలోని 26 శాతం జనాభా అంటే ఒక కోటీ 60 లక్షల మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. గౌంటెడ్ ప్రాంతం.. వాల్ నదీ తీరంలో ఉంటుంది. పలు పర్వాతాలతో పాటు ఇక్కడి విభిన్న వాతారణం ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే ఇక్కడి బంగారుల గనుల తవ్వకాలకు సంబంధించిన ఉపాధి పనులు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ప్రజలను ఇక్కడ ఉండేలా చేస్తున్నాయి. సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉన్న జోహెన్స్ బర్గ్ పట్టణ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. తరచుగా ఇక్కడ మంచు కురుస్తుంటుంది. గోల్డ్‌సిటీగా మారడం వెనుక.. జోహెన్స్ బర్గ్ గోల్డ్‌సిటీగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 19వ శతాబ్ధపు చివరినాళ్ల నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. నదీ తీరంలో ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జోహెన్స్ బర్గ్ జనాభా 50 లక్షలు దాటింది. బంగారు గనుల్లో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఫలితంగా ఇక్కడి సంస్కృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై ఆఫ్రికా వంటలు మొదలుకొని ఆసియాతోపాటు అన్ని రకాల యూరోపియన్ ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో 60 లక్షల చెట్లను నాటి ఫారెస్ట్సిటీగా రూపమిచ్చింది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక చెట్లతో కూడా సిటీగానూ అబివర్ణిస్తుంటారు. ఇక్కడి గోల్డ్మైన్స్పై మొదట యూరప్ వ్యాపారవేత్తల హవా ఉండేది. తరువాతి కాలంలో అరబ్బుల ప్రభావం వేగంగా వ్యాప్తి చెందింది. క్రిమినల్ సిండికేట్లకు నిలయంగా.. ఇక్కడి అడవులు, పర్వతశ్రేణులలో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి అనైతికంగా కూలీలను తీసుకువస్తుంటారు. చీకటితో కూడిన సొరంగాలలో బంగారం పొందవచ్చంటూ ఆశ చూపించి ఇక్కడ జరిగే పనుల్లో కూలీలను నియమిస్తారు. కిలోమీటర్ల పొడవున క్రిమినల్ సిండికేట్ అక్రమ తవ్వకాలు సాగిస్తుంటుంది. ఈ నేధ్యంలో అప్పుడప్పుడూ హింసాయుత ఘటనలు, తూటాల కాల్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో 6 వేలకు పైగా బంగారు గనులు ఉన్నట్లు అంచనా. ఈ గనుల్లో తవ్వకాలు పూర్తయ్యాక వాటిని అలానే వదిలేస్తుంటారు. ఇక్కడి గనులను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ సిండికేట్స్ మధ్య వివాదాలు జరుగుతుంటాయి. ఇంతటి భయావహ పరిస్థితుల మధ్య ఇక్కడ 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరంతా గోల్డ్‌మైన్స్ పనులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నందున హౌసింగ్ సెక్టార్లో షార్టేజీ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగిత కూడా 29 శాతం మేరకు పెరిగింది. సౌత్ ఆఫ్రికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెలువరించి న ఒక రిపోర్టు ప్రకారం 2015 నాటికి ఇక్కడ 30 వేలకు మించిన ఆక్రమణదారుల ఇక్కడ తమ కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో అత్యధికులు జోహెన్స్ బర్గ్ పట్టణ సమీప ప్రాంతాల్లోని గోల్డ్‌మైన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. వీరిలో 75 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరంతా ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్నారు. భారత్‌లో బంగారు గనుల విషయానికొస్తే.. బంగారు గనులనేవి కేవలం పర్వతప్రాంతాలు, పీఠభూములలోనే కాదు.. సముద్రపు లోతుల్లోని ప్రాంతాల్లోనూ వ్యాప్తిచెంది, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్‌లో కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎంతో పేరొందిన ప్రాంతం. దేశంలో అత్యధక స్థాయిలో బంగారు ఉత్పాదన కర్నాటకలో జరుగుతుంది. ఇక్కడ కోలార్, హుట్టీ, ఉటీ పేర్లతో బంగారు గనులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు కర్నాటకలో సుమారు 17 టన్నుల బంగారం నిల్వలు కలిగిన గనులు ఉన్నాయని భావిస్తున్నారు. అంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్‌లలోనూ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే భారత్‌లోనూ బంగారు నిక్షేపాలు గుర్తించదగని రీతిలోనే ఉన్నాయని చెబుతుంటారు. చాలాదేశాల్లో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు చర్యలను అక్కడి ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. -
మణిపూర్ హింస వెనుక డ్రగ్ మాఫియా?
ఢిల్లీ: మణిపూర్‌లో గిరిజనులు-గిరిజనేతరుల నడుమ చెలరేగిన వివాదాలు.. తీవ్ర హింసకు దారి తీశాయి. అల్లర్ల మూలంగా 60 మంది సాధారణ పౌరులు బలికాగా.. 300 మందిదాకా గాయపడ్డారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని మణిపూర్ హోంశాఖ ప్రకటించుకుంది. ఈ తరుణంలో మణిపూర్ హింస వెనుక మరో కారణం ఉందని ఓ ప్రొఫెసర్ అనుమానిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉండొచ్చని అంటున్నారు జేఎన్‌యూ ప్రొఫెసర్ భగత్ ఓయినమ్. తాజాగా.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో హింస చెలరేగడానికి గల కారణాలని విశ్లేషించారు. బీజేపీ ప్రభుత్వం డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ దెబ్బకు విలవిలలాడిపోయిన మాఫియా.. మణిపూర్‌లో హింసకు కారణం అయ్యిందన్నారు. ఇక.. కుకీ వర్గం తమ ఉనికి గురించి ఆందోళన చెందడం కూడా హింసకు మరో కారణమని అన్నారాయన. కుకీ వర్గం మయన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్‌కు వలస వచ్చిందని ఆరోపించాయారన. మెయితీ కమ్యూనిటీకి గనుక ఎస్టీ హోదా లభిస్తే.. తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని, తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కుకీ కమ్యూనిటీ అభద్రతా భావంలోకి కూరుకుపోయింది. అందుకే మెయితీలతో ఘర్షణకు దిగి.. మణిపూర్ కల్లోలానికి కారణమైందని తెలిపారాయన. మే 3వ తేదీన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మునుపెన్నడూలేని రీతిలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అగ్గికి ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అప్రమత్తమైన మణిపూర్ సర్కార్.. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు. మణిపూర్ సీఎం అభ్యర్ధన మేరకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికప్పుడు స్పందించి పారా మిలటరీ బలగాలను మణిపూర్‌లో మోహరించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంతగా పరిస్థితిని చక్కదిద్దినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టంతో పాటు సుమారు 1,500 నివాసాలు ధ్వంసమై ఆస్తినష్టం వాటిల్లింది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల డిష్యుం.. డిష్యుం. ఎందుకో తెలుసా? -
డాన్లు–గాడ్ఫాదర్ల లంకె ఛేదించాలి!
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నేతల పోషణలో, ప్రభుత్వ సంస్థల సంబంధంలో ఉంటూ మాఫియా ఇంతకాలం పెరుగుతూ వచ్చింది. పోలీసు శాఖ, బ్యూరోక్రసీ దశాబ్దాలుగా మాఫియాతో పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన డాన్లను సృష్టిస్తూ వచ్చింది. చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య గల ఈ సంబంధాన్ని ఛేదించనట్లయితే... చట్టసభల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి తగు చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే... పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుంది. పోలీసు శాఖలో కొనసాగిన నా 35 సంవత్స రాల సర్వీసులో, సరైనవిధంగా కానీ, తప్పు పద్ధతిలో కానీ ఒక మాఫియా డాన్‌ను చంపిన ఘటన సాధారణ ప్రజానీకంలో ఇంత ఆసక్తిని రేకెత్తించి, ఇంత వివాదాన్ని సృష్టించిన ఉదంతం నాకయితే గుర్తు లేదు. నిజానికి, సీన్ నుంచి కీలక పాత్ర ధారులను పక్కనబెట్టి, జరుగుతున్న సందడిని మాత్రమే ఎవరైనా గమనించినట్లయితే, ఆ శోధన ఒక పాపులర్ నేత హత్యకు గురయ్యా డన్న ముగింపునకు వచ్చి ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల తీవ్రత కంటే ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని పట్టాలు తప్పించేందుకు ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న కృతనిశ్చయాన్ని అది ఎక్కువగా ప్రతిఫలించి ఉండేది. నిర్దిష్ట వివరాల్లోకి వస్తే, 1993 నాటికే... ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో సంబంధాలను కలిగి, వారి రక్షణలో ఉంటున్న మాఫియా సంస్థల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని పొందడానికి నాటి ప్రభుత్వం ఎన్.ఎన్. వోహ్రా కమిటీని నియమించింది. దీనిపై పని ప్రారంభించిన కమిటీ, ‘ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాసంగికత లేకుండా చేసి, మాఫియా నెట్వర్క్ వాస్తవానికి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది’ అని తేల్చిచెప్పింది. ఈ కమిటీ అంతిమంగా కొన్ని సిఫార్సులను చేసింది. కానీ వాటిపై తదుపరి కార్యాచరణ లేకుండాపోయింది. పార్లమెంటులో దీనిపై తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. అయినా ఫలితం లేదు. క్రమంగా పోలీసు శాఖ, బ్యూరోక్రసీ ఈ పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ అక్రమ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన మాఫియా డాన్లను సృష్టిస్తూ వచ్చింది. యూపీలో ముఖ్తార్ అన్సారీ, అతీఖ్ అహ్మద్, శ్రీ ప్రకాశ్ శుక్లా వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి ఈ సంబంధాన్ని ఎలా ఛేదించవచ్చు? మొదటగా, మాఫియాను రాజకీయ నాయకులు పోషిస్తూ, కాపాడటాన్ని తప్పకుండా నిలిపివేయాలి. రెండు, దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి. మూడు, మాఫియా డాన్లను చట్టానికి జవాబుదారీగా చేయాలి. నాలుగు, ఈ అవినీతి సంబంధంలో భాగంగా ఉన్న పోలీసు అధి కారులు, బ్యూరోక్రాట్ల రెక్కలు కత్తిరించాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాకు అత్యున్నత స్థాయిలో ఎలాంటి రాజకీయ రక్షణా లేకుండా పోయింది. దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని గణనీయంగా తగ్గించి వేశారు. యూపీ పోలీసుల ప్రకారం– అతీఖ్ అహ్మద్, అతడి కుటుంబ సంపదలో రూ.1,169.20 కోట్లను జప్తు చేయడం, స్వాధీనపర్చు కోవడం లేదా నాశనం చేయడం జరిగింది. దీనికి తోడుగా, 12 మంది ముఠా నేతలు, వారి 29 మంది అనుయాయులకు శిక్ష పడేలా చేశారు. ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష పడగా, అతీఖ్ అహ్మద్‌కు యావజ్జీవం పడింది. ఎట్టకేలకు న్యాయచక్రాలు కదలడం ప్రారంభించాయి. అయితే ఈ మార్గం సజావుగా లేదు. ఏప్రిల్ 15న అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్‌ను తప్పనిసరి వైద్య పరీక్షలకు తీసుకువెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని యువ నేరస్థులు వారిని కాల్చిచంపారు. నిందితులకు రక్షణగా ఉంటున్న భద్రతా సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వారి స్పందన పేలవంగా ఉండిపోయింది. జరిగింది దురదృష్టకరమైనది. దాన్ని అధిగమించి ఉండవచ్చు. కానీ, ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు ఆ నేరంలో భాగస్వాములయ్యారని ఆరోపించడం న్యాయం కాకపోవచ్చు. న్యాయ విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించింది. బాందా, హమీర్పుర్, కాస్గంజ్ నుంచి వచ్చిన ఈ ముగ్గురు యువకులు ఎలా ఒక్కటయ్యారు? వారిని ఈ పనిలోకి ఎవరు దింపారు? వారి ఉద్దేశం ఏమిటి? వారికి ఎవరు డబ్బులిచ్చారు? వారికి టర్కీ పిస్టల్స్ ఎవరు అందించారు? హత్యాఘటనలో వారు చేసిన నినాదాలను ఎవరైనా వారికి నేర్పించారా వంటి సంబంధిత విషయాలన్నీ న్యాయ విచారణ, పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలన్న కోరికతోనే ఈ హత్యలకు పూనుకున్నామని ఈ ముగ్గురు హంతకులు ఇచ్చిన వివరణ నమ్మేలా లేదు. అతీఖ్ కుమారుడు అసద్ అహ్మద్, అతడి అనుచరుడు గులామ్ హుస్సేన్‌లను ఏప్రిల్ 13న యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్కౌంటర్ అని చెబుతున్న దానిలో చంపేశారు. 2005లో జరిగిన రాజు పాల్, మరో ఇద్దరు పోలీసుల హత్యలో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యతో వీరికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తాజా ఘటనపై తప్పకుండా న్యాయ విచారణ జరిపించాల్సి ఉంది. ఈలోగా నిందాత్మక క్రీడ మొదలైపోయింది. న్యాయవిచారణ వెల్లడించాల్సింది ఇప్పటికే తెలిసి ఉన్న వాస్తవాలను కాదు. ఒక ‘టాంగావాలా’ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేలా, అధికారులు సైతం మోకాళ్లపై వంగేంత అధికార కేంద్రంగా అతగాడిని మార్చేసిన రాజకీయ నేతలు, పార్టీలు ఏవి అనే విషయాన్ని న్యాయవిచారణ బయటపెట్టాల్సి ఉంది. పాశ్చాత్య మీడియా సైతం ఈ హత్యలకు విశేష ప్రాముఖ్య తనిచ్చింది. కానీ ఈ సందర్భంగా వాటి కపటత్వం బయటపడుతోంది. ఒక మాజీ ఎంపీ హత్యకు గురయ్యాడని ‘బీబీసీ’ నివేదించడమే కాదు, అతడిని మాఫియా డాన్‌గా కాకుండా రాబిన్ హుడ్‌గా అభివర్ణించింది. ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, భారత్ చట్టవ్యతిరేక హింసవైపు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అమెరికాలోనే ప్రతి సంవత్సరం సగటున వెయ్యి మంది పౌరులు (2022లో 1,096 మంది, 2021లో 1,048 మంది) పోలీసుల కాల్పుల్లో హత్యకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయింది. ఇది సమష్టి బాధ్యత మరోవైపున జరిగిన తప్పులన్నింటి భారాన్ని పోలీసులు మోయవలసి వస్తోంది. బహుశా అందుకు వారు అర్హులే కావచ్చు. రాజకీయ వర్గానికి కూడా కొంత జవాబుదారీతనం ఉండకూడదా? మాఫియాను పెంచి పోషించింది వారే మరి. ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం లేదా? మునుపటి అలహాబాద్ జిల్లాలో నేర న్యాయ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న సమయంలోనే అతీఖ్ అహ్మద్ పెరిగాడు. అతీఖ్, అతడి అనుయాయులపై ఉన్న 54 కేసులు ఇప్పటికీ విచారణ దశలోనే ఎందుకు ఉంటున్నాయి? అందులో 1979 నాటి పాత హత్య కేసు కూడా ఉందని గుర్తించాలి. దేశంలో నేర న్యాయవ్యవస్థ వాస్తవానికి కుప్పగూలిపోతోందని జస్టిస్ వీఎస్ మలిమథ్ 2003 లోనే హెచ్చరించారు. మరి దిద్దుబాటు చర్యలు చేపట్టారా? పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం గురించి ఎవరైనా పట్టించుకున్న పాపాన పోయారా? చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని మనం ఛేదించనట్లయితే... శాసనసభలు, పార్లమెంట్‌లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి మనం తగిన చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే పరిస్థితి మరింత ఘోరంగా దిగజారి పోతుంది! ప్రకాశ్ సింగ్ వ్యాసకర్త మాజీ పోలీసు అధికారి;పోలీసు సంస్కరణల కోసం పనిచేస్తున్నారు. (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వైద్య బృందం
-
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
మాఫియాను మట్టిలో కలిపేస్తాం
-
తూటాలతో తక్షణ న్యాయం?
కంటికి కన్ను... పంటికి పన్ను లాంటి డైలాగులు, వెంటాడి వేటాడడాలు తెరపై చూస్తాం. నిజ జీవితంలో పదులకొద్దీ సాయుధ పోలీసుల కళ్ళెదుట, టీవీ కెమెరాల ముంగిట అలా జరగడం ఒళ్ళు జల దరించే అనుభవం. రాజకీయాల్లోకొచ్చిన నేరసామ్రాజ్యనేత అతీక్ అహ్మద్, ఆయన తమ్ముడు ఖాలిద్ అజీమ్ అలియాస్ అష్రాఫ్‌లు యూపీలో పోలీస్ కస్టడీలో ఉండగా, మీడియా ముసుగులో వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు చంపిన తీరు అలాంటిదే. హత్యలు, అపహరణలకు పాల్పడి నూటికిపైగా కేసులున్న నేరగాడిగా పేరుమోసిన అతీక్ జీవితంలో హింసను నమ్మి, చివరకు హింసలోనే చనిపోవడం కవితాత్మక న్యాయంగా కనిపించవచ్చు. కానీ కరడుగట్టిన నేరస్థుణ్ణి సైతం చట్టబద్ధంగా విచారించి కోర్ట్‌లో కఠినశిక్ష విధించాలి. తక్షణశిక్షలతో సత్వరన్యాయం జరపాలనిచూస్తే అన్యాయమే. ‘మాఫియా కో మిట్టీ మే మిలా దూంగా’ (మాఫియాను మట్టిలో కలిపేస్తాను) అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెలలోనే కనీసం 3 ఎన్కౌంటర్లకు మౌనసాక్షి. విషాదం ఏమిటంటే, ఈ సర్కారీ ప్రేరేపిత హింసను పౌర సమాజం సైతం అభ్యంతర పెట్టకుండా, ఆమోదిస్తూ ఉండడం. పరారీలో ఉన్న అతీక్ కుమారుడు ‘ఆత్మరక్షణకు పోలీసుల ఎదురుకాల్పుల్లో’ గురువారం ఝాన్సీలో చనిపోతే, శనివారం రాత్రి ప్రయాగరాజ్‌లో పోలీసుల ఎదుటే కాల్పుల్లో అతీక్ ప్రాణాలు విడిచాడు. రాజకీయ ప్రత్యర్థి ఉమేశ్‌పాల్ హత్యలో తండ్రీ కొడుకులిద్దరూ నింది తులు. అతీక్ హత్యపై రిటైర్డ్ జడ్జీ సారథ్యంలో కమిషన్ వేశారు యోగి. తీరా మంత్రులే ఈ మర ణాలు ‘కర్మ ఫలిత’మనీ, ‘దేవుడి న్యాయ’మనీ వ్యాఖ్యానిస్తుంటే ఇక విచారణలో ఏం తేలుతుంది! అతీక్‌ను ఎవరో చంపారనీ, వ్యవస్థ ప్రమేయం లేదనీ నమ్మలేం. చట్టప్రకారం ఏప్రిల్ 13న కస్టడీకి కోర్టు అప్పగించిన వెంటనే వైద్యపరీక్షలు జరపాల్సిన పోలీసులు 15వ తేదీ రాత్రి దాకా ఎందుకు ఆలస్యం చేశారు? సాధారణ పరీక్షలకు అసాధారణంగా ఆ రాత్రివేళను ఎందుకు ఎంచు కున్నారు? సంకెళ్ళు వేయరాదని కోర్టు తీర్పులున్నా సరే ఎందుకు వేశారు? కాలిస్తే ఒకరికొకరు దూరం జరిగే వీలైనా లేకుండా హతులిద్దరికీ కలిపి ఒకే పొడవాటి సంకెల ఎందుకేశారు? ప్రాణహాని ఉన్న నేరస్థులని తెలిసినా బందోబస్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ సమయానికి వారు అక్కడికలా నడుచుకుంటూ వస్తారని కాల్పులు జరిపిన కుర్రాళ్ళకెలా తెలిసింది? ఘోర నేర చరిత్రలేమీ లేని వారి చేతికి ఆధునిక విదేశీ తుపాకీలెలా వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వెరసి, యూపీలో శాంతిభద్రతలకు టీవీ ప్రత్యక్షప్రసారాలకు చిక్కిన ఈ హత్యలే ప్రతీక. కస్టడీలోని వారికైనా కనీస భద్రత కల్పించలేని పోలీసు వ్యవస్థ ఘనతకు ఉదాహరణ. ఇంతకీ నకిలీ ఎన్కౌంటర్లు, సర్కారీ ప్రేరేపిత హత్యల ద్వారా యూపీ సర్కార్ ఏ సంకేతాలు పంపాలని చూస్తోంది? పట్టుమని 17 ఏళ్ళకే కేసులకెక్కి, 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న అతీక్ ఇన్నేళ్ళుగా రాజకీయపార్టీల్లో కొనసాగుతూ, ఇష్టారాజ్యంగా దంధా కొనసాగించడం 1990ల నుంచి మన రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల పుణ్యమే. జైలుకెళ్ళినా చక్రం తిప్పిన అతీక్‌ను 2019లో గుజరాత్లో జైలుకు మార్చారు. ఇటీవలే యూపీకి పట్టుకొచ్చారు. తాజా ఘటనతో ఈ డాన్ కథ ముగిసింది. కానీ, చేసిన నేరాలూఘోరాలూ ఎన్నయినా, ఎంత పెద్దవైనా కావచ్చు. విచారణ లేకుండా తక్షణన్యాయమే పరిష్కారమనే ప్రభుత్వాల ధోరణి రాజ్యాంగ విహిత న్యాయసూత్రాలకే విరుద్ధం. సమదృష్టితో సాగాల్సిన వ్యవస్థలపై విశ్వాసానికి విఘాతం. యూపీలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్కౌంటర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నాలుగేళ్ళ క్రితమే 2019 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మార్చిలో యోగి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి అలాంటి 15 కేసుల పూర్తి సమాచారాన్ని అప్పట్లోనే భారత ప్రభుత్వానికి పంపింది. ఆ కేసుల్లో బాధితులందరూ నిరుపేద మైనారిటీలే. తాజా డేటా ప్రకారం గత ఆరేళ్ళ యోగి పాలనలో 10,900కు పైగా పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయి. నిందితులు 183 మంది పోలీసు తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, నకిలీ ఎన్కౌంటర్లపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడో మార్గదర్శకాలిచ్చింది. కానీ గద్దె మీది పెద్దలు తలుచు కున్నప్పుడల్లా అవి గాలికి పోతున్నాయి. వెరసి నేర న్యాయవ్యవస్థ కుప్పకూలి, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని గుర్తు చేస్తున్నాయి. ఇక, గత నవంబర్‌లో అమృత్‌సర్‌లో ఓ హిందూ రాజకీయ నేత ఇలాగే మీడియా ముందు కాల్పులకు గురై చనిపోయినప్పుడు సోకాల్డ్ మేధావులు ఇంత రచ్చ చేయలేదేమిటన్నది ఓ వాదన. జరిగిన దారుణాన్ని బట్టి కాక, మతాన్ని బట్టి గగ్గోలు పెడుతున్నారనీ వారి ఆరోపణ. చిత్రంగా మారణకాండలో సైతం మతం చొచ్చుకొచ్చిన రోజులివి. అతీక్ కుమారుడు ఎన్కౌంటరైనప్పుడు అధికార పార్టీ యువజన విభాగం టపాసులు కాల్చి, సంబరాలు చేసుకుంది. అది ఆందోళన రేపే ధోరణి. అది మరవక ముందే ప్రాణహాని ఉందంటూ అతీక్ సుప్రీం కోర్ట్‌లో భయపడినట్టే జరిగింది. అంతకన్నా భయపడాల్సిందేమిటంటే – హతులు ముస్లిమ్లైనప్పుడల్లా హంతకులు జైశ్రీరామ్ నినాదాలు చేయడం. ప్రజలను వర్గాలుగా చీల్చే ఈ ప్రయత్నాలు, దేవుడి పేరు అడ్డంపెట్టి దారుణా లకు ఒడిగట్టే తీరు సమాజానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరం. ఏ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు దిగినా గర్హనీయమే. ‘డబుల్ ఇంజన్’, ‘బుల్డోజర్’ లాంటి మాటలతో మళ్ళీ కేంద్రంలో గద్దెనెక్కదలచిన పార్టీలూ, కాబోయే ప్రధానిగా ప్రచారమవుతున్న యూపీ నేతలూ అది గమనించాలి. -
క్రిమినల్ కథా చిత్రమ్.. అత్యంత కరడుగట్టిన నేరగాడు అతీక్ అహ్మద్
మాఫియా డాన్, గ్యాంగ్ లీడర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, మాఫియా–బాహుబలి, దబాంగ్, పొలిటి కల్ లీడర్.. ఇవన్నీ ఒకే వ్యక్తికి పర్యాయపదాలు. ఆ ఒక్కడే అతీక్ అహ్మద్. ఉత్తరప్రదేశ్‌లో అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అతడి తండ్రి అతీక్ అహ్మద్ పేరు మళ్లీ ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది. నిరుపేద టాంగావాలా కుమారుడైన అతీక్ అహ్మద్ రౌడీయిజంలో, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. రూ.వందల కోట్ల విలువైన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మించిన అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)ను అతీక్ అహ్మద్ సొంత జాగీరుగా మార్చేసుకొని, సమాంతర పాలన సాగించాడంటే అతడి హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వందకుపైగా కేసులు నమోదైనప్పటికీ.. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు మినహా ఏ కేసులోనూ అతీక్‌కు శిక్ష పడలేదు. వ్యవస్థ మొత్తం అతడికి దాసోహమైందని, నిస్సిగ్గుగా ఊడిగం చేసిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నేరాల నుంచి వ్యాపారాలు, వ్యాపారాల నుంచి రాజకీయాలు.. ఇలా సాగింది అతీక్ ప్రస్థానం. నేరాలను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నాడు. 18 ఏళ్ల వయసులో తొలి ఎఫ్ఐఆర్ ► అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. టాంగా నడిపే అతడి తండ్రి హజీ ఫిరోజ్ నేరస్వభావం ఉన్నవాడే. అతీక్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో నేరమార్గం ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో చెలరేగిపోయాడు. 1983లో 18 ఏళ్ల వయసున్నప్పుడు అతీక్‌పై మొదటి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అతడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు విసిరిన వల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతీక్‌పై నమోదైన కేసులను విచారించాలంటే న్యాయమూర్తులు వెనుకంజ వేసేవారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 10 మంది జడ్జీ్జలు తమంతట తామే ఈ కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు. అతీక్ చంపేస్తాడన్న భయమే ఇందుకు కారణం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక కూడా ప్రత్యర్థులను కిడ్నాప్ చేసి, తానున్న జైలుకు రప్పించి, తీవ్రంగా హింసించాడు. అతడిని ఉత్తరప్రదేశ్ జైళ్లలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. కుటుంబం.. నేరమయం ► ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతీక్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్లో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కరడుగట్టిన నేరగాడైన అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు సైతం నేరాలబాట పట్టినవారే కావడం గమనార్హం. కొందరు ఇప్పటికే వేర్వేరు కేసుల్లో జైలుపాలయ్యారు. అతడి భార్య మాత్రం పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ► నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ కన్ను 1980వ దశకంలో రాజకీయాలపై పడింది. 1989లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మతం కార్డు వాడుకున్నాడు. తన ప్రత్యర్థి చాంద్బాబాను హత్య చేశాడు. సులువుగా విజయం సాధించాడు. తొలిసారి ఎమ్మెల్యే హోదా సంపాదించాడు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1991, 1993లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌తో, 2002 ఆప్నా దళ్ టికెట్‌తో గెలిచాడు. 2002లో ఆప్నా దళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడయ్యాడు. హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున ఫూల్పూర్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. పార్లమెంట్లో అడుగుపెట్టాడు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా నేరాలు ఆపలేదు. మరింత రాటుదేలాడు. బినామీల పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇతర కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాలకు అతీక్ నేరసామ్రాజ్యం విస్తరించింది. అచ్ఛంగా సినిమాల్లో చూపించే డాన్ల తరహాలోనే అతడి వ్యవహార శైలి, ప్రవర్తన ఉండేవి. తరచుగా గుర్రంపై వీధుల్లో తిరిగేవాడు. కొన్నిసార్లు ఖరీదైన కార్ల కాన్వాయ్ వెంటరాగా పాదయాత్ర చేస్తుండేవాడు. రాజుపాల్ హత్య కేసు ► 2005 జనవరి 25న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో అతీక్ పతనం ప్రారంభమైంది. ఈ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశాడు. కానీ, ఓటమే ఎదురయ్యింది. 2004లో ఎంపీగా గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికల్లో తన సోదరుడు అజీమ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ స్థానంలో నేరచరిత్ర ఉన్న రాజుపాల్కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో అజీమ్ ఓడిపోయాడు. రాజుపాల్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో అతీక్, అజీమ్ నిందితులు. రాజుపాల్ హత్యతో మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై అజీమ్ గెలిచాడు. అతీక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయాడు. అసద్ అహ్మద్ ► ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అసద్ అహ్మద్ నిందితుడు. చాలా రోజులు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. ► అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ► గురువారం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు గులామ్తోపాటు మరణించాడు. ► అతీక్ అహ్మద్ మరో ఇద్దరు కుమారులైన అజాన్, అబాన్ మైనర్లు. వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ హోంలో ఉన్నారు. అతీక్ అహ్మద్ ► గత 43 ఏళ్లుగా పోలీసు రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ► ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో అతీక్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ► ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. ► అతీక్ అహ్మద్ 1996లో షాయిస్తా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. ► వారికి ఐదుగురు కుమారులు.. అలీ అహ్మద్, ఉమర్ అహ్మద్, అసద్ అహ్మద్, అజాన్ అహ్మద్, అబాన్ అహ్మద్ ఉన్నారు. ► పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐతో అతీక్ అహ్మద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. అష్రాఫ్ అలియాస్ అజీమ్ అహ్మద్ ► అతీక్ అహ్మద్ సోదరుడే అష్రాఫ్/అజీమ్ అహ్మద్. ► ఇతడిపై మొత్తం 52 కేసులు ఉన్నాయి. ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ► 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ఇతడిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ► యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. షాయిస్తా పర్వీన్ ► ఉమేశ్ పాల్ హత్య వ్యవహారంలో అతీక్ అహ్మద్, ఆష్రాఫ్ అహ్మద్‌తోపాటు షాయిస్తా పర్వీన్‌పై కేసు నమోదయ్యింది. ► పరారీలో ఉన్న పర్వీన్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ► ఆమె ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో రివార్డు మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచారు. అలీ అహ్మద్ ► బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడిన కేసులో 2021లో అలీ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ► ఉమేశ్‌పాల్ హత్య కేసులోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది. ► అలీ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చి 3న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు లక్నో జైలులో ఉన్నాడు. ► అలీ అహ్మద్ లాంటి నేరగాళ్లు బయట ఉంటే కేవలం సాక్షులకే కాదు, సమాజానికి సైతం ముప్పేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉమర్ అహ్మద్ ► లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతీక్ అహ్మద్‌తోపాటు ఉమర్ అహ్మద్‌పై 2018 ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ► అదే కేసులో ఉమర్ అహ్మద్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
సెలవొస్తే...మట్టి కాళీ
సెలవు రోజు వచ్చిందా...మట్టి మాఫియాకు పండగే...చీకటి వ్యాపారానికి తెర లేస్తుంది. మట్టి మాఫియా చెలరేగిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతాయి. గత టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ చేసిన వారే ఇప్పటికీ అనధికారిక తవ్వకాలు సాగిస్తున్నారు. నాడు వీరిచ్చిన మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇప్పటికీ వీరికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. పోలవరం కాలువ 147 నుంచి 150 చైనేజి కుడిపక్కన గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు సమాచారం. సూరంపల్లికి చెందిన టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ తవ్వకాలపై నున్న, పాతపాడు, సూరంపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అక్రమంగా తరలించిన దాదాపు 4 వేలకు పైగా ట్రిప్పుల మట్టిని ఫ్లిప్‌కార్ట్ వారికి చెందిన స్థలంతో పాటు, ముస్తాబాద వద్ద ఉన్న పొలాలను మెరక చేసేందుకు వినియోగించినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఈ మట్టి మాఫియా వేలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలించి, కోట్లాది రూపాయలను దండుకుంది. అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నారిలా... ప్రధానంగా సెలవు రోజుల్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న టీడీపీ నేతకు అక్కడ పనిచేసే ఏఈ స్థాయి అధికారి బంధువు కావడంతో, ఆ అధికారి ద్వారా చక్రం తిప్పుతున్నారు. నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన డీఈఈ, ఈఈ స్థాయి అధికారులతో ఆ టీడీపీ నేత బలమైన మైత్రీ బంధం ఉండడంతో తన బంధువు అయిన ఏఈకి ఏ ఇబ్బందీ రాకుండా చక్క బెడుతున్నారు. అనుమతులు లేవు పోలవరం కాలువ మట్టికి సంబంధించి ఒకరికి తప్ప, మరెవరికీ మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేశాం. – కర్ణ శ్రీనివాసరావు,పోలవరం డివిజన్ ఈఈ -
ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల నివాసాలు బుల్డోజర్లతో కూల్చివేత
లక్నో: మాఫియాపై మరోసారి ఉక్కుపాదం మోపారు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితుల నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రత్యక్ష సాక్షి. గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్, అతని భార్య, కొడుకుతో పాటు బీఎస్పీ నేత శైష్ఠ పర్వీన్ ఈ కేసులో ప్రధాన నిందితులు. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న అతిఖ్.. ఉమేశ్ పాల్‌ను కోర్టులో వాంగ్మూలం ఇవ్వకుండా హత్య చేయించాడు. పట్టపగలే తన ఇంటిముందే ఉమేష్ పాల్‌ను దుండగులు కాల్పిచంపడం ప్రయాగ్‌రాజ్‌లో కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 20 మంది నిందితులను గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో వారి ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేత దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Bulldozers demolishing properties of accused in Prayagraj case, who are close aides of gangster Atique Ahmed. #UmeshPal#Pragraj#AtiqueAhmed#प्रयागराज#उमेशपाल_हत्याकांड#YogiAdityanath Yogi Baba Supremacy🔥 pic.twitter.com/EX2KP9tsfS — Sumit Singh Chandel (@Real_Sumit1) March 1, 2023 ఇటీవల అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ గురించి మాట్లాడుతూ.. మాఫియాను మట్టికరిపిస్తామని యోగి అదిత్యనాథ్ హెచ్చరించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎస్పీ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నేరస్థులను మీరు ప్రోత్సహించి, వారికి మూలమాలలు వేసి సత్కరించి.. నేరం జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని నిందించడమేంటని మండిపడ్డారు. అయితే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు..
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశవ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, చండీగడ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు చేపడుతోంది. ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. గ్యాంగ్స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. చదవండి: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టు రట్టు
-
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా
-
అక్రమ మద్యానికి అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీకి క్రమేణా అడ్డుకట్ట పడుతోంది. ఇటు అనంతపురం జిల్లా, అటు శ్రీసత్యసాయి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) పోలీసులు చెక్‌పోస్టుల్లో పకడ్బందీగా తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం వ్యాపారులకు చెక్ పెడుతున్నారు. ఇప్పుడు రెండు జిల్లాల్లోనూ సారా తయారీ, ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021లో నమోదైన కేసులతో పోలి్చతే 2022లో సగం కేసులు కూడా నమోదు కాలేదు. సగానికి తగ్గిన అరెస్టులు 2021లో 9 మాసాల్లో (జనవరి నుంచి సెపె్టంబర్ 30 వరకు) కాపు సారా, నల్లబెల్లం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (అక్రమ మద్యం) రవాణా కేసుల్లో 3,417 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది తొమ్మిది మాసాల్లో 1,419 మంది మాత్రమే అరెస్టయ్యారు. దీన్నిబట్టి అక్రమ మద్యం నియంత్రణ ఏస్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా కర్ణాటక నుంచి గతంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విచ్చల విడిగా మద్యం వచ్చేది. కర్ణాటక – శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్టు వద్ద భారీ స్థాయిలో మద్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గించడం కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో 15 గ్రామాలను నాన్పెయిడ్ లిక్కర్ అమ్మే గ్రామాలుగా గుర్తించారు. అందులో ఇప్పటికే 8 గ్రామాల్లో అమ్మకాలు పూర్తిగా లేకుండా చేశారు. శ్రీసత్యసాయిలో 8 గ్రామాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరినీ ఉపేక్షించం సరిహద్దుల్లో నిఘా వేసి జిల్లాలోకి అక్రమంగా వస్తున్న మద్యం, వాహనాలను నియంత్రించాం. పర్యవేక్షణ పెంచడం ఒకటైతే.. ప్రధానంగా ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే మద్యం తగ్గింది. రానురాను ఈ కేసుల సంఖ్య మరింతగా తగ్గిస్తాం. ఈ కేసుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. –రామ్మోహన్రావు, అడిషనల్ ఎస్పీ, సెబ్ -
‘నీకెంత ధైర్యం.. నా మనుషులపైనే కేసులు పెట్టి బైండోవర్ చేస్తావా’
గద్వాల రూరల్: ‘నీకెంత ధైర్యం.. నా మనుషులపైనే కేసులు పెట్టి బైండోవర్ చేస్తావా.. అంటూ గద్వాలలో కల్లు కం లిక్కర్ మాఫియా పేట్రేగిపోతుంది.. అనధికార కల్లు దుకాణాలు నడిపిస్తూ అమాయక ప్రజల రక్తాన్ని పీల్చి జేబులు నింపుకొంటున్న కల్లు కం లిక్కర్ మాఫియా లీడర్ బుధవారం ఏకంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారికి వార్నింగ్ ఇచ్చి దాదాగిరి చేయడం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గద్వాలలో అక్రమంగా కల్లు వ్యాపారం చేస్తూ.. కల్లు మాఫియా లీడర్‌గా పేరుగాంచిన సివిల్ సప్లయ్ బియ్యం కాంట్రాక్టర్ ఇటీవల లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన అక్రమ వ్యాపారాలకు అధికారం కూడా తోడవడంతో అక్రమ దందా మూడు కల్లు సీసాలు.. ఆరు బీర్లుగా సాగుతోంది. అయితే గద్వాల పట్టణ శివారులోని అయిజ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఓ వైన్‌షాపు సదరు కల్లు మాఫియా లీడర్ కనుసన్నల్లో కొనసాగుతుంది. అదే ప్రాంతంలో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎలాంటి అనుమతి లేకుండా మాంసం దుకాణాలు ఏర్పాటు చేయించి అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి లిక్కర్ దందా కొనసాగిస్తున్నాడు. నిబంధనలకు నీళ్లు.. వాస్తవానికి ప్రభుత్వం అనుమతులిచ్చిన వైన్‌షాపుల వద్ద లిక్కర్‌ను మాత్రమే కొనుగోలుదారునికి విక్రయించాలి. అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ వంటివి విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం అక్రమ దందాకు అలవాటు పడిన సదరు లీడర్ ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు 10కిపైగా మాంసం, స్నాక్స్ దుకాణాలను తన మనుషులతో ఏర్పాటు చేయించి దర్జాగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న మాంసం, స్నాక్స్ దుకాణాలను తొలగించాలని, లేదంటే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మొదటి హెచ్చరికగా సదరు వ్యాపారులకు స్పష్టం చేశారు. దీంతో అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న సదరు వ్యాపారులు తమ లీడర్‌ను ఆశ్రయించారు. దీంతో రెచ్చిపోయిన సదరు కల్లు లీడర్ తన అనుచర వర్గంతో కలిసి బుధవారం ఏకంగా గద్వాలలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డ్యూటీలో ఉన్న ఓ అధికారిపై జులుం ప్రదర్శించారు. నేనెవరో నీకు తెలుసు కదా.. నా దందాకే అడ్డు చెబుతావా.. మా వాళ్లను బెదిరిస్తావా.. నీకెంత ధైర్యం.. నీఅంతు చూస్తా..? నేను తలుచుకుంటే చిటికెలో నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా.. తమాషా చేస్తున్నావా.. నావెనక సర్కారే ఉంది.. జాగ్రత్త అంటూ దాదాగిరి చేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కి టీవీల్లో ప్రసారమై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ అధికారికే భద్రత కరువైతే.. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. నాపై దాడి చేయలేదు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సదరు కార్యాలయ అధికారిని వివరణ కోరగా సదరు వ్యక్తి వచ్చిన మాట వాస్తవమే.. మా వాళ్లే దుకాణాలను పెట్టుకుని బతుకుతున్నారు.. మీరు బైండోవర్ చేస్తామని చెప్పారంటా అని నాతో కొద్దిగా గట్టిగా అడిగారు. అంతేకాని నాపై ఎలాంటి దాడి చేయలేదు. బయట న్యూస్ టీవీలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు
-
దారుణ మారణ యాప్ గాళ్లు
-
అనంతపురంలో రెచ్చిపోయిన Loan APP మాఫియా
-
వీడొక్కడే సినిమా తరహాలో గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా
సనత్‌నగర్: బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా నలుగురిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో సనత్‌నగర్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి వెళ్లిపోవడంతో వారిని తీసుకువచ్చి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదును స్వీకరించామని ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. ఈ ఘటనతో నగరంలో గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడొక్కడే సినిమాను తలదన్నే రీతిలో... సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాను తలదన్నేలా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కొనసాగింది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. పర్యాటక వీసాపై దుబాయ్‌కు వెళ్లేవారికి డబ్బులు ఎరగా వేసి అక్రమంగా బంగారాన్ని నగరానికి తరలిస్తున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారానికి పలు రకాల రసాయనాలను అద్ది కాళ్లకు చుట్టుకుని ఎయిర్పోర్ట్ అధికారులను సైతం బురిడీ కొట్టించారు. పాతబస్తీకి చెందిన షహబాజ్ (21), శ్రీనగర్‌కాలనీకి చెందిన అయాజ్ (22), సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన పహద్ (23)లను 15 రోజుల క్రితం స్మగ్లర్లు దుబాయికు పంపారు. నాలుగు రోజులపాటు దుబాయ్‌లో గడిపిన వీరికి అక్కడి స్మగ్లర్లు ఒక్కొక్కరికీ రెండు కిలోల చొప్పున పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని ఇచ్చి పంపారు. ఈ బంగారాన్ని నగరంలో ఉన్న స్మగ్లర్ల ముఠాకు అందజేసినందుకుగాను దుబాయికు వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, అక్కడ వసతి ఏర్పాట్లు, వీసా ఖర్చులతో పాటు మరో రూ.10 వేలను అందజేశారు. దుబాయికు వెళ్లిన ముగ్గురిలో అయాజ్, షహబాజ్లు తిరిగి నగరానికి వచ్చేశారు. పహాద్ మాత్రం కనిపించకుండాపోవడంతో అతని ఆచూకీ తెలపాలంటూ ఆయాజ్, షహబాజ్‌లతో పాటు కనిపించకుండాపోయిన పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, అతని బంధువు ఆసిమ్‌లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. బాధితులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేసు నమోదుకు బాధితులు విముఖత వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా కేసు ఏమాత్రం ముందుకుసాగలేదు. దీంతో సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ నేరుగా బాధితులను పిలిపించి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి స్మగ్లింగ్ ముఠాపై కేసు నమోదు చేశారు. స్మగ్లింగ్ ముఠాలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. (చదవండి: విల్లాలో విందు.. పేదింట విషాదం) -
పాక్ నుంచి రిందా కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్ హర్వీందర్ సింగ్ అలియాస్ రిందా పాకిస్తాన్ నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లకు సహకరిస్తున్నాడు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్ పాయింట్ ఆదిలాబాద్ అని, అక్కడకు వచ్చే నాందేడ్ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. త్రుటిలో తప్పించుకుని పాక్‌కు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రిందా కుటుంబం పంజాబ్‌లోని తరంతరాన్ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్‌కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్‌కు పారిపోయాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్‌లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీకేఐ సంస్థ ఐఎస్ఐ, ఎల్ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్‌లోని∙బీకేఐ స్లీపర్ సెల్స్‌తోపాటు నాందేడ్‌లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు. -
తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా..
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్‌గా మారిన అంబులెన్స్ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వార్త కూడా చదవండి: AP: రేపే టెన్త్ పరీక్షలు -
పెరిగిపోతున్న సుపారీ... సవారీ! రంగంలోకి కిరాయి హంతకులు
సాక్షి హైదరాబాద్: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడలో చోటు చేసుకున్న రియల్టర్ల జంట హత్యలు కిరాయి హంతకుల పనిగా తేలింది. ఇలాంటి ఉదంతాలు రాజధానిలో అనేకం వెలుగు చూస్తున్నాయి. హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని తీసుకునే మెుత్తాన్ని సుపారీ అంటారు. ఇది ముంబై మాఫియా సామ్రాజ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పదం. అక్కడ కిరాయి హత్య చేయడానికి సిద్ధమైన వ్యక్తికి డబ్బుతో పాటు ఓ సుపారీ ఇస్తారు. అందుకే కిరాయి హత్యలు సుపారీలు ప్రాచుర్యం పొందాయి. హత్యలకు సుపారీ తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కిరాయి హంతకులు కొన్ని రోజులు ఆశ్రయం పొందుతున్నారు. దీనికో సం హోటళ్లు, లాడ్జిల్ని ఆశ్రయిస్తున్నారు. అక్కడి నుంచే రెక్కీ, పథక రచన, దానిని అమలు చేస్తున్నా రు. తమ టార్గెట్ కదలికల్ని గమనించడానికి వారి ఇల్లు, వ్యాపార ప్రదేశాలకు సమీపంలో ఉన్న లా డ్జిల్లో హంతక ముఠాలు దిగుతున్నాయి. ఆపై అదు ను చూసుకుని తెగబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జిలను ఆ స్టేషన్ సిబ్బంది రాత్రిపూట తనిఖీ చేయాలి. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా వా టిపై నిఘా ఉంచాలి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి ఇది ఎంతో అవసరం. నిఘా ప్రక్రియ మెుక్కుబడిగా సాగడంతో అనేక కేసుల్లో ఏదైనా ఉదంతం జరిగిన అనంతరమే పోలీసులు గుర్తించగలుగుతున్నారు. ఒకసారి కిరాయి హత్యకు పాల్పడిన, కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు ఆపై చేతులు దులుపుకుంటున్నారు. ఆ నేర గాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? అనే అంశాల్ని అవసరమైన స్థాయిలో పర్యవేక్షించడం లేదు. చైన్ స్నాచర్, పిక్ పాకెటర్‌పై ఉన్న నిఘా కూడా వీరిపై ఉండట్లేదు. అందుకు అవసరమైన సిబ్బంది, నిఘా యంత్రాంగం కూడా అందుబాటులో లేదు. వారిపై నిఘా కొరవడినందుకే నేరం జరిగిన తరవాతే పట్టుబడుతున్నారు. అరుదైన సందర్భాల్లోనే నేరం చేయడానికి ముందు దొరుకుతున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులకు బందోబస్తులు, రోటీన్ డ్యూటీల మినహా మిగిలిన వ్యవహారాలు చూడటం కష్టసాధ్యంగా మారిపోవడం సైతం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ కిరాయి హంతకులు ఎక్కువగా నాటు తుపాకులనే వాడుతున్నారు. వీరికి ఈ ఆయుధాలన్నీ ప్రధానంగా ఉత్తరాది నుంచి వచ్చి చేరుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కొన్ని చోట్ల నాటు తుపాకులు, కత్తులు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి విక్రయించే ముఠాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో వ్యవస్థీకృతంగా కిరాయి హత్యలు చేసే వాళ్లు అరుదు. ఈ నేపథ్యంలోనే పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి పని పూర్తి చేసుకువెళ్లే ఎక్కువగా ఉంటున్నారు. (చదవండి: మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్) -
ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!
లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్‌పత్, షమ్లీ, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, శరణ్‌పూర్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్ అంబేడ్కర్ మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్ అంబేడ్కర్ భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్‌పేయ్ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్ పరిపాలన నడుస్తోందని అన్నారు. -
ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్ షా
ముజఫర్‌నగర్: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్ అహ్మద్ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు. బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్ ముుందుకొస్తారా అని సవాల్ విసిరారు. అఖిలేష్ ప్రభుత్వ పాలనకు ముజఫర్ నగర్ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్ బలియాన్‌ని అమిత్ షా అభినందించారు. మళ్లీ అదే తప్పు చేయొద్దు... ఉత్తరప్రదేశ్‌ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్‌నగర్ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి నుంచి సౌరభ్ స్వరూప్ బరిలో ఉన్నారు. -
20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు
టెక్నాలజీ.. ఆక్సిజన్ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్ లెవల్స్ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన. పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్‌లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్ ఫోటో సాయంతో గూగుల్ మ్యాప్‌ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు. చివరికి మాడ్రిడ్(స్పెయిన్) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్ మ్యాప్ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్‌ను గూగుల్ మ్యాప్ పట్టించడంపై సోషల్ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్ కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం. చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది -
బుందేల్‌ఖండ్‌ను నాశనం చేశారు: మోదీ
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్‌ఖండ్‌లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు. -
ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
ముంబై: మహరాష్ట్రలో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. తాజాగా, ముంబైలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 4 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా.. సహర్ కార్గో కాంప్లెక్స్‌లో 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: నలుగురు అరెస్ట్: పాదరక్షలు తీయకుండ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం -
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్‌లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
ఆన్లైన్ రమ్మీ.. అంతా డమ్మీ.. ఆశకు పోతే ప్రాణాలుండవు!
మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) అనే సీఏ విద్యార్థి.. ఆన్లైన్ రమ్మీకి బానిసయ్యాడు. అప్పులు చేసి మరీ ఆడాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. గత ఏడాది డిసెంబర్ 29న విషం తాగి చనిపోయాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టాడు. మొదట్లో కొంత లాభం రావడంతో తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు, అప్పులు చేసినవి కలిపి ఏడు లక్షలు పెట్టి ఆడాడు. సొమ్మంతా పోగొట్టుకున్నాడు. డబ్బు లన్నీ తిరిగి సాధించాలని మళ్లీ 8 లక్షలు అప్పులు చేశాడు. ఈ సొమ్ము కూడా పోవడంతో.. ఆందోళనకు గురై గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధాన్ని తొలగించుకునేందుకు ముంబై గేమ్ మాఫియా రంగంలోకి దిగింది. పేకాట, ఆన్లైన్ గేమింగ్‌లను బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ఆన్లైన్ రమ్మీకి సడలింపు ఇచ్చేలా చేయాలని ఓ కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్‌తో సంప్రదింపులు జరిపింది. దీనికి ఆ ఇద్దరు కీలక వ్యక్తులు అంగీకరించారని.. కొన్నికోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుని, అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు చేసిన సదరు ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి.. అనుకున్న ‘పని’ సాధించలేకపోయారు. ఈలోగా విషయం పెద్దలకు తెలియడంతో.. చీవాట్లు పెట్టారని తెలిసింది. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో పేకాట, ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం టీఆర్ఎస్ సర్కారు 2016లోనే రాష్ట్రంలో పేకాటను నిషేధించింది. దానితోపాటు ఇంటర్నెట్లో ఆడే ‘ఆన్లైన్ రమ్మీ’, ఇతర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటలపైనా నిషేధం విధించింది. పేకాటతోపాటు యువతను వ్యసనాలకు గురిచేసే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నిర్ణయంపై మహిళలతోపాటు అన్నివర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఆన్లైన్ పేకాట వందలు, వేల కోట్ల వ్యాపారం కావడంతో.. ముంబై వేదికగా ఆన్లైన్ వెబ్సైట్లు, యాప్‌లను నిర్వహిస్తున్న మాఫియా సంస్థలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటకు అనుమతి వచ్చేలా చేయాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను సంప్రదించాయి. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నాలు ఆన్లైన్ రమ్మీ మాఫియా ‘ఆఫర్’కు లొంగిపోయిన ఒక కీలక ప్రజాప్రతినిధి, ఓ సీనియర్ ఐఏఎస్.. ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో సదరు సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఒప్పందం కుదుర్చుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అడ్వాన్స్‌గా కొన్నికోట్ల మొత్తాన్ని తీసుకున్నారని వెల్లడించాయి. ఇది జరిగి రెండు, మూడు నెలలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీనితో రమ్మీ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధిని, సీనియర్ అధికారిని నిలదీశారని.. వారం, పది రోజుల్లో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారని సమాచారం. ఈ పది రోజుల గడువు తీరినా స్పందన లేకపోవడంతో అడ్వాన్స్ తిరిగివ్వాలని ఒత్తిడి పెంచారని.. ఈ క్రమంలో విషయం మరో కీలక ప్రజాప్రతినిధి ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరిపోయిందని తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, మాఫియాకు డ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా అడ్వాన్స్ సొమ్ము తిరిగి ముంబై మాఫియాకు తిరిగి పంపారని తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా.. స్పందించలేదు. నిషేధమున్నా.. ఏటా వేల కోట్ల దందా రాష్ట్రంలో ఆన్లైన్ పేకాటపై నిషేధం ఉండటంతో.. గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ వంటివాటిలో సదరు యాప్స్ అందుబాటులో ఉండవు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా సదరు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ప్రచారం చేస్తూ.. లింకులు పెడతాయి. ఆ లింక్స్‌ను షేర్ చేస్తే పాయింట్లో, నగదో రివార్డు ఇస్తామని ఆశపెడ్తాయి. అలా ఒకరి నుంచి ఒకరికి లింకులు షేర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇలా 12లక్షల మందికి పైగా సదరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గతంలోనే కేంద్ర హోంశాఖకు నివేదికలు ఇచ్చాయి. వీటిద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుగా దందా సాగుతోందని అంచనా వేశాయి. 2018లో తెలంగాణ నుంచి రూ.1,200 కోట్ల మేర ఆన్లైన్ యాప్స్‌లో దందా సాగిందని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫేక్ లొకేషన్‌తో జిమ్మిక్కులు ఆన్లైన్ రమ్మీ యాప్‌లు మొబైల్ఫోన్ల లొకేషన్ డేటాను తీసుకుంటాయి. రాష్ట్రంలో అధికారికంగా నిషేధం ఉండటంతో ఇక్కడి మొబైల్ లొకేషన్ ఉంటే గేమ్ ఆడటానికి వీలుకాదని చూపిస్తాయి. అయితే ఆన్లైన్ గేమ్ మాఫియా సంస్థలు ఫోన్లలో ఫేక్ జీపీఎస్ లొకేషన్ చూపించే యాప్స్‌ను షేర్ చేస్తున్నాయి. వీటిసాయంతో ఆన్లైన్ రమ్మీ ఆడేవారు ఫోన్లో అసలు జీపీఎస్ లొకేషన్‌ను డిసేబుల్ చేసి.. ఫేక్ జీపీఎస్‌ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నట్టు లొకేషన్ పెడుతూ.. ఆన్లైన్ పేకాట ఆడుతున్నారు. ఏమిటీ ఆన్లైన్ రమ్మీ వ్యవహారం? పేకాట క్లబ్బుల్లో, బయటా ‘మూడు ముక్కలాట, రమ్మీ’ ఆడినట్టుగానే.. ఆన్‌లైన్‌లోనూ డబ్బులు పెట్టి ఆడేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని నియంత్రణలను పెట్టింది. అందుకు అనుగుణంగా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి దందా చేస్తున్నాయి. ఆన్లైన్ పేకాట, గ్యాంబ్లింగ్‌ను తమ రాష్ట్రాల్లో అనుమతించాలా, నిషేధించాలా అన్ని నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ పేకాటను నిషేధించాయి. మొదట్లో ‘ఎర’ వేసి.. ఆన్లైన్ పేకాట ఆడేవారు సదరు వెబ్సైట్/యాప్‌లకు బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానించి.. డబ్బులను వాటిలోకి బదిలీ చేసుకుంటారు. ఆ డబ్బులతో పేకాడుతారు. గెలిచినవారికి డబ్బులు ఇవ్వడం, ఓడిపోతే కట్ చేయడం జరుగుతాయి. సర్వీస్చార్జీల పేరిట కొంత మొత్తాన్ని మినహాయించుకుంటాయి. అయితే ఈ ఆన్లైన్ గేమ్స్‌లో చాలా వరకు మోసమే. వీటిలో ఆడటం మొదలుపెట్టినవారికి కొద్దిరోజులు కావాలనే డబ్బులు గెలుచుకున్నట్టు చూపిస్తారని.. వారు ఆన్లైన్ పేకాటకు బానిసలయ్యాక ఉన్న డబ్బంతా ఊడ్చేస్తాయని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో చాలా మంది లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. అవన్నీ పోగొట్టుకుని అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు ఎన్నో నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన చిందం పోశెట్టి.. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడ్డాడు. మొదట్లో కొంత డబ్బులు రావడంతో.. తర్వాత అప్పులు చేసి మరీ ఆడాడు. డబ్బులన్నీ పోవడంతో ఆవేదనలో మునిగిపోయాడు. ఈ ఏడాది జనవరి 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
చెరువులు మింగేసి... ఊరు మునకేసి..
వరద వెళ్లిపోవాలంటే కాల్వలు కావాలి.. వాటిని పూడ్చేసి ఇళ్లు నిర్మిస్తే..? నీరు నిల్వ కావాలంటే చెరువులు ఉండాలి.. వాటిలో కాలనీలు కట్టేస్తే..? మరి వాన నీళ్లన్నీ ఎటు పోవాలి? ఎటూ పోలేకనే.. వరద రోడ్ల మీద పారుతోంది.. కాలనీల్లో ప్రవహిస్తోంది.. ఇళ్ల్లను ముంచెత్తుతోంది.. ఎనలేని నష్టాన్ని మిగుల్చుతోంది! ఇలా కాల్వలు, చెరువులు, కుంటలు ఆక్రమణల పాలవడం వల్లే.. చిన్న వానకే నగరాలు, పట్టణాలు వణికిపోతున్నాయి. ఒకటీరెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. వివిధ పార్టీల నేతలు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాలాలను, చెరువులను పూడ్చేస్తున్నారు. ఆయా చోట్ల వెంచర్లు వేసి కాలనీలు కట్టేస్తున్నారు. అక్కడ ఇళ్లు కొనుక్కుంటున్న సాధారణ జనం ఆగమాగం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలైలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి చాలా పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. చెరువులు, నాలాల ఆక్రమణలు, వాటివల్ల ఉత్పన్నమైన పరిస్థితిని గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. –సాక్షి నెట్వర్క్ ఇది సిరిసిల్ల పట్టణ శివార్లలో కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఉన్న కొత్త చెరువు. ఆధునీకరణ పేరిట చెరువును సగం మేర పూడ్చి.. పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాజీవ్‌నగర్, జేపీ నగర్, ముష్టిపల్లి, చంద్రంపేట పరిసరాల నుంచి వచ్చే వరదను కొత్త చెరువులోకి మళ్లించారు. ఓవైపు చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు వరద చేరిక పెరిగిపోయి.. కాస్త గట్టివాన పడితే మత్తడి దూకుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా శాంతినగర్ ప్రాంతం జల దిగ్బంధం అవుతోంది. ఇక కొత్త చెరువులోకి మురికినీరు చేరకుండా ఉండాలని మురికినీటి శుద్ధి (ఈటీపీ) ప్లాంటును ఏర్పాటు చేశారు. అది లోపభూయిష్టంగా ఉండటంతో మురికినీరు సిరిసిల్ల పట్టణ వీధులను ముంచెత్తుతోంది. కొత్తచెరువు మత్తడి నీళ్లు వెళ్లేందుకు గతంలో కాల్వ ఉండేది. దాన్ని కొందరు కబ్జా చేసి, ఇళ్లు, ఇతర సముదాయాలు నిర్మించారు. దీనితో మత్తడి వరద రోడ్డుపై ప్రవహిస్తూ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నిర్మల్ బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువులో వాకింగ్ ట్రాక్ పేరిట ఏర్పాటు చేసిన కట్ట ఇది. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామంటూ పోసిన ఈ కట్ట.. చెరువు ఎఫ్టీఎల్ మధ్యలోనే ఉండటం గమనార్హం. దీని అవతల మరింత చెరువు, ఎఫ్టీఎల్ పరిధి భూములు ఉన్నాయి. కానీ ఆ భూములు చెరువు పరిధిలోవి కావని, ఎఫ్టీఎల్ పరిధి ఆ కట్ట వద్దే ముగిసింది అన్నట్టుగా చూపుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖుల భూములు ఉండటంతోనే.. ఇలా కట్ట నిర్మించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పెద్దలు చెరువుల సమీపంలోని భూములను కొనుగోలు చేస్తూ.. మెల్లగా చెరువుల భూములను చెరబడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. చెరువు మధ్యలో రోడ్డు.. నీళ్ల మధ్యలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఈ రోడ్డు.. ఖమ్మం పట్టణశివార్లలోని ఖానాపురం చెరువులోనిది. ఖమ్మం కార్పొరేషన్‌గా మారినప్పుడు శివార్లలోని ఖానాపురం హవేలి పంచాయతీని విలీనం చేశారు. నాటి నుంచే ఇక్కడి చెరువుపై ఆక్రమణ దారుల కన్ను పడింది. ఖానాపురం చెరువు పూర్తి విస్తీర్ణం సుమారు 133 ఎకరాలు. సర్వే నంబర్ 13లో 75.23 ఎకరాల మేర చెరువు ఉండగా.. ఎఫ్టీఎల్ పరిధిలోని 57.17 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ద్వారా 200 ఎకరాలకు సాగునీరు అందేది. ఇప్పుడు ఆక్రమణలు పెరిగి కుంచించుకుపోతోంది. ప్రధాన చెరువులోనే రెండెకరాల వరకు కబ్జాలుకాగా.. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఓ రియల్ వెంచర్‌కు దారి కోసం ఇటీవల చెరువు మధ్యలోంచి మట్టిరోడ్డు వేశారు. జనం ఫిర్యాదులు చేయడంతో అధికారులు దానిని తవ్వించేశారు. ఇలాంటి ఆక్రమణలు మరెన్నో ఉన్నాయని స్థానికులు అంటున్నారు. వరంగల్ శివనగర్‌లో కబ్జాల పాలై ఇరుకుగా మారిపోయిన శివనగర్ నాలా ఇది. ఇదొక్కటే కాదు. వరంగల్‌లో ప్రధాన నాలాలు అయిన నయీంనగర్ నాలా, బొందివాగు నాలా సహా అన్నీ కూడా ఆక్రమణలతో కుదించుకుపోయాయి. దీనితో భారీ వర్షాలు పడినప్పుడు వరద అంతా రోడ్ల మీద ప్రవహిస్తోంది. ఇది హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతం. నిండుగా ఇళ్లతో కనిపిస్తున్న ఇక్కడ 25 ఏళ్ల కింద ఓ చెరువు ఉండేది. ఇదొక్కటే కాదు గోపాలపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఆరు చెరువులు ఆక్రమణల పాలయ్యాయి. మెల్లగా నిర్మాణాలు వెలుస్తూ.. ఇప్పుడు చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. దీంతో వానలు పడ్డప్పుడల్లా కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ‘గొలుసుకట్టు’తెంపేశారు! రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. కాకతీయ రాజులు ఎంతో ముందు చూపుతో ఇక్కడ గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. ఒక్కో చెరువు నిండిన కొద్దీ నీళ్లు దిగువన ఉన్న చెరువులోకి వెళ్తూ ఉండేలా అనుసంధానం చేశారు. ఇప్పుడా చెరువులు చాలా వరకు మాయమయ్యాయి. మిగతా చెరువులు, నాలాలు కూడా సగానికిపైగా కబ్జాల పాలయ్యాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 823, వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 190 చెరువులు ఉన్నట్టు నూతన మాస్టర్ ప్లాన్‌లో చూపించారు. ఈ చెరువుల్లో సగానికిపైగా కుదించుకుపోయాయి. వందలకొద్దీ కాలనీలు వెలిశాయి. ఏ చిన్న వాన పడినా అవన్నీ నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, కుడా, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో వేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కేవాస్తేగా మారాయి. అంతేకాదు అధికారులు నోటిఫై చేసి, ఆయా వెబ్సైట్లలో పెట్టిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతనే లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఒక్క వానతో ఆగమాగం గత ఏడాది ఆగస్టులో వరంగల్‌లో 27 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అసలే చెరువులు, నాలాలు అన్నీ కబ్జాలు, ఆక్రమణల పాలై ఉండటంతో.. భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా నగరంలోనే నిలిచిపోయింది. 40 కాలనీలు పూర్తిగా నీటమునిగాయి, వందల కొద్దీ కాలనీలు జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టమూ నమోదైంది. దీంతో అధికారులు వరంగల్‌లో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించారు. క్షుణ్నంగా సర్వే చేసి చెరువుల ఎఫ్టీఎల్, ఇతర హద్దులు తేల్చాలని.. వాటి పరిధిలో ఎన్ని ఇండ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయో గుర్తించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆదేశించినా.. గత ఏడాది వరదలు ముంచెత్తిన సమయంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. మళ్లీ వరదల సమస్య రాకుండా చూడాలని, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చి వేయాలని ఆదేశించారు. కానీ ఆక్రమణల కూల్చివేతలు, నాలాల విస్తరణ నామమాత్రంగానే మిగిలిపోయింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో సుమారు 33 కాలనీలు జలమయం అయ్యాయి. హన్మకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేట లో 150 ఎకరాల కోమటి చెరువులో సుమా రు 15–20 ఎకరాలు కబ్జాల పాలైంది. ► కాజీపేట బంధం చెరువు 57 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు సగమే మిగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నా.. కార్పొరేషన్ వారు ఇంటి నంబర్లు ఇస్తున్నారు. ► హన్మకొండ వడ్డేపల్లి చెరువు 324 ఎకరాలు ఉంటుంది. ఇందులో సుమారు 40 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. ► గొర్రె కుంట కట్టమల్లన్న చెరువు 21.24 ఎకరాలు ఉండేది. ఇందులో ఎనిమిది ఎకరాల దాకా ఆక్రమణల పాలైంది. చెరువులోనే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ► వరంగల్‌కు కీలకమైన భద్రకాళి చెరువు విస్తీర్ణం 336 ఎకరాలుకాగా.. 30 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయినట్టు అంచనా. ► హాసన్పర్తి పెద్దచెరువు 157 ఎకరాలు ఉండాలి. ఇటీవల కొందరు.. పట్టాభూమి పేరుతో చెరువు పరిధిలోని 30 ఎకరాలను చదును చేయడం వివాదాస్పదమైంది. ► ములుగు రోడ్‌లోని కోట చెరువు 159 ఎకరాల విస్తీర్ణం ఉండేది. సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ తేల్చింది. ► చిన్నవడ్డేపల్లి చెరువు విస్తీర్ణం 100 ఎకరాలుకాగా.. 20 ఎకరాల వరకు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ► 170 ఎకరాల మామునూరు పెద్ద చెరువు లో 40 ఎకరాలు ప్రైవేటు చెరలోనే ఉంది. ► పాతబస్తీ ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) 126 ఎకరాల్లో ఉండగా.. సుమారు 26 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ► అమ్మవారిపేట దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు. ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 20 ఎకరాల వరకు మాయమైంది. ► తిమ్మాపూర్ శివారు బెస్తం చెరువును స్మృతి వనంగా మార్చే ప్రతిపాదన ఉంది. 6 ఎకరాల విస్తీర్ణం ఉండే ఈ చెరువులో.. సగం దాకా ఆక్రమణలోనే ఉంది. వరంగల్ పెరకవాడలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి సోదరుడు నాలాపైనే కట్టిన భవనం ఖమ్మం.. ఆక్రమణలకు గుమ్మం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. 2006 నాటితో పోలిస్తే.. ప్రస్తుతం చెరువు ఎంతగా కుంచించుకుపోయిందో ఈ ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి ఈ చెరువు పూర్తిస్థాయి విస్తీర్ణం 163 ఎకరాలు. పాకబండ బజార్, ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని 66, 234 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్న ఈ చెరువులో ఆరేడు ఎకరాలకు పైనే కబ్జాల పాలైంది. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడమే కాదు ప్రభుత్వ భవనాలు కూడా చెరువు భూముల్లో వెలిశాయి. కొందరు చెరువుల పక్కనే ఉన్న భూములు కొని, ఆ సర్వే నంబర్లతోనే చెరువు భూములకు పట్టాలు చేయించుకున్నారు. తీరా ఇన్నేళ్ల ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు వెళ్తే.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు, తామే హక్కుదారులమంటూ పత్రాలు చూపిస్తుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెరిగి.. కబ్జాదారుల కన్నుపడి ఖమ్మం పట్టణం 2012 అక్టోబర్‌లో కార్పొరేషన్ హోదా పొందింది. అప్పటి నుంచి పట్టణం విస్తరణ, భూముల రేట్లు బాగా పెరిగాయి. పట్టణంలోని లకారం చెరువు చుట్టుపక్కల చదరపు గజం రూ.30 వేలకుపైనే పలుకుతుండటంతో కబ్జా దారుల కన్ను పడింది. మెల్లమెల్లగా ఆరేడు ఎకరాలకుపైనే ఆక్రమణలు వెలిశాయి. గతంలో చెరువు పరిధిలో భూమిని లీజుకు ఇచ్చిన ఉద్దేశం కూడా మూలకుపడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. చివరికి 2015లో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఆక్రమణలు ఆగాయి. కానీ ఇప్పటికే కబ్జాల పాలైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు చెరువుల్లోని నీళ్లు వెళ్లే కాల్వలు, నాలాలు కూడా కబ్జా కావడంతో.. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇండ్లు నీట మునుగుతున్నాయి. నిర్మల్.. కబ్జాల ఖిల్లా! నిర్మల్ జిల్లా కేంద్రం చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. 450 ఏళ్ల క్రితమే కాకతీయుల స్ఫూర్తితో స్థానిక పాలకుడు నిమ్మనాయుడు, ఆయన తర్వాతివారు వీటిని తవ్వించారు. ప్రస్తుతం 11 చెరువులు ఉనికిలో ఉండగా.. దాదాపు అన్నింటిలో ఆక్రమణలు ఉన్నాయి. ఈ చెరువుల మధ్య నీళ్లు తరలిపోయే కాల్వలు కూడా కబ్జాల పాలయ్యాయి. ఈ కారణంగానే భారీ వర్షాలు పడ్డప్పుడల్లా చెరువుల్లోకి చేరాల్సిన నీళ్లు.. కాలనీలు, ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది జూ లైలో భారీ వర్షాలతో పలు చెరువులు పూర్తిగా నిండాయి. సమీప కాలనీలు నీట మునిగాయి. కొందరు పట్టాభూములుగా చెప్పుకొంటున్న భూములు కూడా ఇప్పటికీ చెరువు నీటిలో మునిగే ఉన్నాయి. అవన్నీ ఆక్రమణలేనని.. అధికారులు పట్టించుకోకున్నా వానలతో బయటపడిందని స్థానికులు అంటున్నారు. నిజానికి నిర్మల్ గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై స్థానిక న్యాయవాది ఒకరు మూడేళ్ల కిందటే హైకోర్టులో పిల్ వేశారు. దానిపై కొద్దినెలల కింద జరిగిన విచారణ సందర్భంగా.. చెరువుల ఆక్రమణలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో కొంతమేర తొలగింపు చేపట్టినా.. ఇంకా భారీగా కబ్జాలు అలాగే ఉన్నాయి. ఆక్రమణలపై టాస్క్‌ఫోర్స్ వేశాం ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటివనరుల ఆక్రమణలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎక్కడికక్కడ పరిశీలన జరిపి.. కేసులు పెడుతున్నాం. పూర్తిస్థాయి నివేదికలు సిద్ధమయ్యాక ప్రభుత్వానికి అందజేస్తాం. – శంకర్‌నాయక్, సీఈ, జలవనరుల శాఖ, ఖమ్మం చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ►మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చెరువుల ఆక్రమణలు, అధికార యంత్రాంగం ఆలోచన లేని నిర్ణయాల ఫలితంగా సిరిసిల్ల పట్టణం వరదను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి భారీ వర్షాలకు సిరిసిల్లలోని 20 వరకు కాలనీలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు అయితే ఏ చిన్నపాటి వాన పడినా జలమయం అవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకుపైగా ఉండగా.. అందులో 48వేల మంది వరకు ఇలా ముంపును ఎదుర్కొంటున్నారు. ► 1990 దశకంలో సిరిసిల్లలోని రాయిని చెరువును పూర్తిగా పూడ్చేసి.. సుమారు పది వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీనితో వరద వెళ్లే దారి లేక.. చిన్నపాటి వానలు కురిసినా బీవై నగర్, సుందరయ్యనగర్, తారకరామానగర్, ఇందిరానగర్‌లు మునుగుతున్నాయి. ► మానేరువాగు నుంచి వచ్చే మంచినీటి కాల్వ ఉదారువాగు ఇప్పుడు మురికి కూపంగా మారింది. కాల్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. చదవండి: GHMC: కోటికి చేరువలో టీకా -
‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్లు ఇవ్వం’
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్ఐ నివేదించింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు) 1. बीएसपी का अगामी यूपी विधानसभा आमचुनाव में प्रयास होगा कि किसी भी बाहुबली व माफिया आदि को पार्टी से चुनाव न लड़ाया जाए। इसके मद्देनजर ही आजमगढ़ मण्डल की मऊ विधानसभा सीट से अब मुख्तार अंसारी का नहीं बल्कि यूपी के बीएसपी स्टेट अध्यक्ष श्री भीम राजभर के नाम को फाइनल किया गया है। — Mayawati (@Mayawati) September 10, 2021 దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్పీ కృషి చేస్తుంది. బీఎస్పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు. 2. जनता की कसौटी व उनकी उम्मीदों पर खरा उतरने के प्रयासों के तहत ही लिए गए इस निर्णय के फलस्वरूप पार्टी प्रभारियों से अपील है कि वे पार्टी उम्मीदवारों का चयन करते समय इस बात का खास ध्यान रखें ताकि सरकार बनने पर ऐसे तत्वों के विरूद्ध सख्त कार्रवाई करने में कोई भी दिक्कत न हो। — Mayawati (@Mayawati) September 10, 2021 చదవండి: బుజ్జగింపులో వింత కోణం -
పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
సాక్షి, హైదరాబాద్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటూ పన్నులు ఎగవేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారమంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట రాయబారుల పేరుతో కార్లు దిగుమతిని ముంబై మాఫియా చేస్తోంది. అనంతరం దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు మణిపూర్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక ఈ లగ్జరీ కార్లను ముంబై మాఫియా నుంచి కొందరు బడాబాబులు కొంటున్నారు. ప్రస్తుతం విదేశీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలను డీఆర్ఐ సేకరిస్తోంది. పన్ను ఎగవేత కార్లు వాడుతున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. -
గుట్కా దందా కు చెక్
-
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ హత్య!
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్గంజ్లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
Telangana: విత్తు.. విపత్తు
►శనివారం ఖమ్మం జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయు క్తంగా దాడులు చేసి ఏకంగా రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ►మూడురోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో ఏకంగా రూ. 13.5 కోట్ల విలువ చేసే నకిలీ మిర్చి, కూరగాయలు, పుచ్చ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఒక్కరోజులోనే ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం అధికారులనే నివ్వెరపరిచింది. ►శనివారం హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్, వనస్థలిపురం పరిధిలో పోలీసులు దాడులు చేసి రూ. 1.15 కోట్ల విలువైన నకిలీ పత్తి, మిరప, వేరుశనగ విత్తనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. ►అత్యధికంగా ధర ఉండే పత్తి, మిరప, సోయాబీన్, మొక్కజొన్న వంటి విత్తనాలు (నకిలీ) తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వాటిని కొంటూ మోసపోతున్నారు. రాష్ట్రంలో విత్తనాల కొరత కూడా నకిలీ దందాకు కారణమవుతోంది. సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఒకపక్క అధికారులు ఎక్కడికక్కడ నిఘా వేసి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నా.. మరోపక్క అదే స్థాయిలో నకిలీ విత్తన మాఫియా పేట్రేగిపోతోంది. వానాకాలం మొదలై ప్రస్తుతం విత్తనాలు వేసే సమయం కావడంతో అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోంది. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ప్రతిరోజూ నకిలీ విత్తనాలు భారీ మొత్తంలో బయటపడుతున్నాయి. వాస్తవానికి సీజన్ రాకముందు నుంచే నకిలీ విత్తనాల సరఫరా మొదలుపెట్టిన అక్రమార్కులు, ఇప్పుడు మరింత విచ్చలవిడిగా అమాయక రైతులకు అంటగడుతున్నారు. రాష్ట్రంలో విత్తన మాఫియా ప్రతి వానాకాలం సీజన్లో వందల కోట్ల విలువైన నకిలీ విత్తనాల దందా కొనసాగిస్తోందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ఈ సీజన్లో కేవలం గత 15–20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.80 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడినట్లుగా వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపిందంటే.. రాష్ట్రంలో ఏస్థాయిలో ఈ అక్రమ దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నకిలీ విత్తన మాఫియా రెచ్చిపోవడానికి కొందరు అధికారులు, మరికొందరు రాజకీయ నేతల అండదండలే కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. లక్షలకు లక్షలు ముడుపులు తీసుకుంటున్న అధికారులు, నేతల కారణంగానే రాష్ట్రం నకిలీ విత్తనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. విత్తన చట్టంలోని లోపాలు కూడా అక్రమ దందాకు ఊతం ఇస్తున్నాయని అంటున్నారు. అధిక ధర పలికే విత్తనాల్లోనే.. పోలీసులు, వ్యవసాయాధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా అత్యధికంగా ధర ఉండే పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, మిరపలకు సంబంధించిన నకిలీ విత్తనాలు వ్యాపారులు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అందులో అత్యధికంగా పత్తి విత్తనాలే ఉంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో 70.05 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాల చొప్పున మొత్తం 1.40 కోట్ల ప్యాకెట్లకు పైగా అవసరం. ఈ విత్తనాన్ని మొత్తం ప్రైవేట్ కంపెనీలే (ప్రభుత్వ విత్తనాల్లేవు) రైతులకు విక్రయిస్తాయి. అయితే ప్రైవేటు కంపెనీల వద్ద కేవలం 90 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అంటే ఇంకా 50 లక్షల ప్యాకెట్ల కొరత నెలకొని ఉంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన మాఫియా నకిలీ లేబుళ్లు తయారు చేసి అందులో నాసిరకం విత్తనాలను పెట్టి రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం వరదలా పారుతోంది. రైతులు కూడా అమాయకంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందానికి భారీగా బీజీ–3 విత్తనాలు దొరికాయి. అయితే ‘మాకు మంచి దిగుబడి వస్తే చాలు... ఏ విత్తనమైతే ఏంటి?’అని కొందరు రైతులు ప్రశ్నించడంతో అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. ఇక మిరప విత్తనం కొరత కూడా ఉండటంతో అందులోనూ నకిలీ ముఠా రెచ్చిపోతోంది. ఇక నకిలీ, నాసిరకం విత్తనాలను కొన్నిచోట్ల ప్యాకింగ్ చేయకుండానే లూజ్‌గా అమ్ముతున్నారు. లైసెన్సులు లేకుండానే అనుమతి ఉన్నట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. అసలు జర్మినేషన్ రాదని (మొలకెత్తవని) నిర్ధారించిన సీడ్స్‌ను కూడా ప్యాకింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడ రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. కాలం తీరిన విత్తనాలను వాటి నాణ్యత పరీక్షించకుండా, తేదీలు మార్చి మళ్లీ వాటినే (పాత విత్తనాలకు కొత్త ప్యాకింగ్) అమ్మకానికి పెడుతున్నారు. ఈ నకిలీ విత్తనాల విషయంలో సాధారణ, చోటా మోటా వ్యాపారులను మాత్రమే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తుండగా.. ఈ అక్రమ దందాల వెనుక అసలు సూత్రధారులు బయటకు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 13 కేంద్రాలపై క్రిమినల్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన విక్రయ కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ శనివారం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 229.55 క్వింటాళ్ల నకిలీ పత్తి, సోయాబీన్ తదితర పంటల విత్తనాలను, రికార్డులు లేని 74.3 మెట్రిక్ టన్నుల ఎరువులు, 268 కిలోల క్రిమిసంహరక మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లోని 13 కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గతంలో పట్టుకున్న మరికొన్ని కేసులు – ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 24.05 లక్షలు. – మంచిర్యాల జిల్లాలో గత 15 రోజుల్లో రూ. 50 లక్షల విలువైన బీజీ–3 విత్తనాలను పట్టుకున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, మందమర్రి, భీమినిలలో ఎక్కువగా దొరికాయి. ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. – కర్ణాటక సరిహద్దు గ్రామాల మీదుగా వికారాబాద్ జిల్లాకు తరలిస్తున్న 5.95 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను ఈ నెల 8వ తేదీన చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు పలు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ముద్రించిన ఖాళీ ప్యాకెట్లు, తూకం యంత్రాలు, ప్యాకింగ్ మెషీన్లను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. – ఈ నెల 4న వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటిపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే మండలం గోకఫసల్వాద్ గ్రామానికి చెందిన వీరపనేని కొండప్పనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. – మెదక్ జిల్లాలో కాలం చెల్లిన వరి, కూరగాయల విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 5.20 లక్షలు. తూప్రాన్, రామాయంపేటలలో ఎక్కువగా దొరికాయి. – ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్వారకా స్టార్ బిందు మిర్చి విత్తనం పట్టుకున్నారు. వాటి విలువ రూ.71 లక్షలు. ఏన్కూరు మండల కేంద్రం, ఖమ్మం రూరల్ మండలం అరేకొడు, కాచిరాజుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని అంజనాపురంలలో ఎక్కువగా పట్టుకున్నారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల దీప్తి, భూమిక, పల్నాడు, సిరి, రాజేశ్వరి, పద్మావతి, అల్ట్రా, స్టార్ బిందు, పీహెచ్ఎస్ – 491 బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్న రూ.3.04 కోట్ల విలువైన నకిలీ మిర్చి విత్తనాలను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. – ఆసిఫాబాద్ జిల్లాలో గత పదిహేను రోజుల్లో రూ. కోటిన్నర విలువైన నిషేధిత బీజీ–3 (హెచ్‌టీ కాటన్) పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కాగజ్‌నగర్, బెజ్జూర్, చింతల మానేపల్లి, పెంచికల్పేట్లలో ఇవి వెలుగుచూశాయి. ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఏన్కూరుకు చెందిన బైరు వేణుగోపాల్‌రావు, మంగయ్యలు అదే గ్రామానికి చెందిన ముడిగొండ వెంకట కృష్ణారావు అనే రైతుకు మే 17న రూ.68 వేల విలువైన ‘ద్వారకా సీడ్స్ స్టార్ బిందు ఎఫ్–1 హైబ్రిడ్’అనే మిరప విత్తనాలు విక్రయించారు. ఇవి నాణ్యమైనవని, అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు. అయితే ఇటీవల నకిలీ విత్తనాల బెడద అధికమయ్యిందనే సమాచారంతో కృష్ణారావు ఈనెల 8న స్థానిక వ్యవసాయాధికారి (ఏవో) నర్సింహారావుకు సమాచారం అందించారు. ఏవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్ గుట్టు బయటపడింది. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని సాయిలక్ష్మి ఏజెన్సీ నుంచి 2,016 ప్యాకెట్లు, మహబూబాద్‌లోని దార్వకా ఏజెన్సీ దుకాణం నుంచి 1,840 ప్యాకెట్లు, వరంగల్‌లోని పరమేశ్వరి ఏజెన్సీ నుంచి 3,380 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ షాప్ యజమానులు శ్రీధర్, సురేష్, పిచ్చయ్య, అజ్మీర సురేష్, చెరుకుమల్లి శ్రీధర్, వరంగల్‌కు చెందిన దేవ సతీష్‌పై కేసు నమోదు చేశారు. ద్వారకా విత్తన కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ మేనేజర్ మలపతి శివారెడ్డిని అరెస్ట్ చేశారు. నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు మంచిర్యాల క్రైం: జిల్లాలోని మంచిర్యాల, సీసీసీ నస్పూర్, తాళ్లగురిజాల, భీమిని, కన్నెపెల్లి, తాండూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ.51 లక్షల విలువైన నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో.. కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంపై జిల్లా టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్, కొడంగల్ పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి దాడులు చేశారు. సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలను, గడ్డి మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. టేకుమట్ల(రేగొండ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్ఎస్ అగ్రి మాల్లో రూ.2.9 లక్షల విలువైన కాలం చెల్లిన మిరప విత్తనాలు ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
Ramdev యూటర్న్: వ్యాక్సిన్ తీసుకుంటా, వారు దేవదూతలు
సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్ యూ టర్న్ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు రాందేవ్. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు. అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. రాందేవ్‌కు లీగల్ నోటీసు లిచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాందేవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చదవండి : వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా!
పలమనేరు (చిత్తూరు జిల్లా): వివిధ మాదకద్రవ్యాల తయారీకి వినియోగించే ఓపీఎం పోపీ (గసగసాలు) సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన మరో ముఠా ఈ అంతర్జాతీయ మాఫియాకు సహకారమందిస్తోంది. అంతేకాకుండా వీటిని స్థానికంగా పండించడానికి రైతులకు విత్తనాలను అందించడం వంటివి చేస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో తాజాగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓపీఎం పోపీ సాగు వివరాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పంటను సాగు చేస్తున్న పలువురు రైతులను అరెస్టు కూడా చేశారు. అయితే పంటను ఎవరు సాగు చేయమన్నారు? ఎవరు కొంటారు? ఎక్కడికి తీసుకెళ్తారనే విషయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రధానంగా దృష్టి సారించింది. సోమవారం ముంబైకి చెందిన భార్యాభర్తలను అరెస్టు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో మత్తు పదార్థాల రవాణా వెనుక బెంగళూరు, ముంబై లింకులతో కూడిన అంతర్జాతీయ మాఫియా, ఉగ్రవాదులు హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోనే రహస్య సాగు.. కర్ణాటకకు ఆనుకుని ఉన్న రాష్ట్ర సరిహద్దు గ్రామాలతోపాటు కోలారు జిల్లాలో రహస్యంగా ఓపీఎం పోపీ సాగు గత పదేళ్ల నుంచే సాగుతోంది. ఈ పంటకు సంబంధించిన ముఠా ఏజెంట్లు కర్ణాటకలోని బెంగళూరు, కోలారు, చింతామణి, శ్రీనివాసపుర, దొడ్డబళ్లాపుర, పావగడ తదితర ప్రాంతాలతోపాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వందలాదిమంది ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు కొద్ది మొత్తం మాత్రమే విదిల్చి.. ఏజెంట్లు కోట్లాది రూపాయలు విలువైన పంటను ఇప్పటికే తరలించినట్లు భావిస్తున్నారు. స్థానికంగా రైతులకు ఈ పంట విత్తనాలను అందిస్తూ.. ఆ తర్వాత పంటను కొనుగోలు చేసే ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకొనే పనిలో అధికారులు ఉన్నారు. ఈ ముఠాను పట్టుకుంటే.. దీని ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మాఫియాను ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లే నిర్వహిస్తున్నారనే అనుమానాలున్నాయి. కాయ నుంచి వస్తున్న జిగురు.. గత టీడీపీ ప్రభుత్వ పాపమే.. ఈ మత్తు పంట సాగవుతోందని తెలిసినా గత టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఏటా పంటల నమోదును రెవెన్యూ శాఖ చేపడుతుందనేది తెలిసిన సంగతే. పదేళ్లుగా ఈ పంట రహస్యంగా సాగవుతున్నప్పుడు గత ప్రభుత్వం ఈ పంటను ఎందుకు నమోదు చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అలాగే వ్యవసాయ శాఖ కూడా నిషేధిత జాబితాలో ఉన్న ఈ పంటను సాగు చేయొద్దని రైతులను హెచ్చరించిన దాఖలాలు లేవు. డ్రగ్స్ తయారీకి వాడే మొక్క బెరడు- కాయలోపల గసగసాలు.. మొక్క నుంచి అంతా లాభమే.. మామూలుగా ఓపీఎం పోపీ మొక్క నుంచి గసగసాలతోపాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తున్నారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు.. దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్, మార్ఫిన్ వంటి మత్తు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయారుచేస్తున్నట్లు గతంలోనే ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇళ్లల్లోనే పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారుచేసి.. ఆ ప్యాకెట్లను ఇక్కడి నుంచి ఆటోలు, కార్లు, ప్రైవేటు బస్సుల్లో బెంగళూరుకు పంపుతున్నారు. బొంబాయి క్రిష్ణమ్మ, బల్కర్సింగ్ అరెస్ట్.. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే గసగసాలు (ఓపీఎం పోపీ) సాగు కేసులో సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె ఎస్ఈబీ పోలీసులు ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ (50), ఆమె భర్త బల్కర్ సింగ్(60)లను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్ఈబీ డీఎస్పీ పోతురాజు, సీఐ కేవీఎస్ ఫణీంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మదనపల్లె మండలం మాలేపాడులో నిషేధిత గసగసాల పంటను సాగు చేసిన కత్తివారిపల్లెకు చెందిన బొమ్మరాసి నాగరాజు(45), అతడి మామ అల్లాకుల లక్షుమన్న (60), బావమరిది ఎ.సోమశేఖర్ (26)లను మార్చి 14న పోలీసులు అరెస్టు చేశారు. అలాగే గసగసాల సాగుకు విత్తనాలను సరఫరా చేసిన చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మిరి వెంకట రమణ అలియాస్ నాగరాజు (50), రేవణ కుమార్ (46)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు అందించిన సమాచారంతో ముంబైకి చెందిన బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మ, ఆమె భర్త బల్కర్ సింగ్‌లను తాజాగా అరెస్టు చేశారు. వారిని మదనపల్లె కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా, త్వరలోనే డ్రగ్ మాఫియాలోని ప్రధాన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది జనసేన, టీడీపీ చెట్టాపట్టాల్.. -
భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు!
హైదరాబాద్: యాదాద్రికి సమీపంలో భారీ రియల్ దందా బయటపడింది. యాదాద్రి, భువనగిరి చుట్టుపక్కల భూముల కొనుగోళ్లలో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య గత ఆరేళ్లలో రూ.700 కోట్ల విలువైన లెక్కల్లో చూపని అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాల్లో అధికారులు గుర్తించారు. యాదగిరిగుట్టతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంస్థలు వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లను నిర్మిస్తుంటాయి. యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర శివారులో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో అనేక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక సమాచారం సేకరించారు. భూముల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఈ సోదాల సందర్భంగా లెక్కలు చూపని రూ.11.88 కోట్ల నగదు, రూ.1.93 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఆరేళ్లలో లెక్కలు చూపకుండా (నల్లదనం) సాగించిన లావాదేవీలకు సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన విలువ కంటే ఎక్కువ నగదు స్వీకరించి, ఆ నగదును భూముల కొనుగోలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. కలకలం రేపిన సోదాలు.. మార్చి 23, 24వ తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పలు సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ సోదాలు జరిపిన కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్పెక్ట్రా, సన్‌సిటీ సంస్థలు ఉన్నాయి. స్పెక్ట్రా సంస్థ చైర్మన్ జగన్, సన్‌సిటీ సంస్థ చైర్మన్ నారాయణగౌడ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రాలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న కాంగ్రెస్ ఆలేరు ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఇంటిపై మార్చి 23, 24 తేదీల్లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ 2 సంస్థల మధ్య జరిగిన దాదాపు రూ.700 కోట్ల మేర లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఎవరీ బీర్ల ఐలయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామానికి చెందిన బీర్ల అయిలయ్య రాజకీయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. కొంతకాలంగా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో భూములు కొంటూ.. అమ్ముతూ వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు. గతంలో సైదాపురం సర్పంచ్‌గా, పాల సంఘం చైర్మన్‌గా, యాదగిరిగుట్ట పట్టణంలో ఎంపీటీసీగా కొనసాగారు. ఈ క్రమంలోనే కొందరు భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కొనుగోలు చేయడం, అమ్మడం చేసేవారు. హైదరాబాద్‌కు చెందిన స్ప్రెక్టా రియల్ ఎస్టెట్ కంపెనీతో పరిచయం పెంచుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. బీర్ల అయిలయ్య రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. -
10 అడుగుల గోతిలో పాతేస్తా: సీఎం వార్నింగ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా మాఫియా గ్యాంగ్‌లు, గుండాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన మూడ్ అసలే బాగోలేదని, రాష్ట్రంలో మాఫియాగాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు ఆపకుంటే పది అడుగుల గోతిలో పాతిపెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విటర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని ఆయన పేర్కొన్నారు. చట్టాలను గౌరవించే పౌరుల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పువ్వు మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తుందని, రాక్షసంగా ప్రవర్తించేవారి పట్ల పిడుగులు వర్షం కురిపిస్తుందని అన్నారు. డ్రగ్స్ పెడ్లర్, భూ దందా, చిట్ ఫండ్ మాఫియా, గూండాలు ఇలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పాతుకుని ఉన్న డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడానికి కేంద్ర సంస్థలతో మంతనాలు జరుపుతున్నామని తెలిపారు. ఇక నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సూచనల మేరకు డ్రగ్స్ మాఫియాపై చర్యల కోసం డిసెంబర్ 15 నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సీఎం చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని ఎన్సీబీ తెలిపింది. ముఖ్యంగా మాల్వా, మహాకోషల్ ప్రాంతాల్లో డ్రగ్స్ దందా అధికంగా సాగుతోందని వెల్లడించింది. -
మూవీ మాఫియా ఇళ్లల్లో దాక్కుంది
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఆ ఎనిమిదినీ అంతం చేయాలి
‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ఫిల్మ్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే... ► నెపోటిజమ్ టెర్రరిజమ్ ► డ్రగ్స్ మాఫియా టెర్రరిజమ్ ► సెక్సిజమ్ టెర్రరిజమ్ ► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్ ► విదేశీ సినిమాల టెర్రరిజమ్ ► పైరసీ టెర్రరిజమ్ ► శ్రమ దోపిడీ టెర్రరిజమ్ ► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్.. ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు కంగనా. -
కొడుకు కోసమే కక్షసాధింపు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా, సుశాంత్ రాజ్‌పుత్ హంతకులు, వారికి చెందిన డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కత్తికట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో?’’ అని ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు. (చదవండి: కంగనపై శివసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!) ముంబై వీడిన క్వీన్ సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. కుక్కతోక వంకర! ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్ఏ ప్రతాప్ సర్నాయక్ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. -
ఇక్కడ మాఫియా లేదు
ప్రస్తుతం బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. నేనెందుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం. అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 250 కిలోల మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను డీఆర్ఐ( డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఆర్ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ. 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తుమందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్‌ను అధికారులు తిరిగి పట్టుకున్నారు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (వరదలపై అధికారులను అప్రమత్తం చేసిన హరీశ్ రావు) -
పచ్చ దోపిడీ
-
‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు వారాలకు పైనే అయినప్పటికి.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు.. బాలీవుడ్ స్టార్లపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్ సుమన్ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని గమనిస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి’ అన్నారు. అంతేకాక ఓ సిండికేట్, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అన్నారు. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదన్నారు.(‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’) ‘సుశాంత్ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్ మరణించాడు’ అంటూ శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ కుటుంబాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.(‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’) -
మీడియా ముసుగులో మాఫియా దందా
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : మీడియా ముసుగులో మాఫియా దందా చేస్తున్న నలుగురు జర్నలిస్టులపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ చానళ్లలో జర్నలిస్టులుగా చలామణీ అవుతూ బ్లాక్ మెయిల్, దందాలకు పాల్పడుతున్నారని క్వారీ వ్యాపారి గోపొసెట్టి రమేష్ ఇటీవల తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మైనింగ్ స్క్వాడ్ ఏలూరు నుంచి వచ్చింది. వారంతా ఓ హోటల్లో ఉన్నారు’అంటూ బెదిరించి నగదు వసూళ్లు చేశారని రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తమ్మిసెట్టి రంగసురేష్(స్టూడియో.ఎన్), వానపల్లి పుండరీకాక్షుడు(స్టూడియో.ఎన్), మెర్జా. రమేష్(టీవీ9), పెర్దోజు మురళి(ఎన్ టీవీ)లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఏమార్చి.. రూటు మార్చి..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్న 344 షాపులను కుదించి వాటి స్థానంలో 275 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో విజయవాడ పరిధిలో 135 ప్రభుత్వ షాపులు.. మచిలీపట్నం పరిధిలో 140 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 148 బార్ అండ్ రెస్టారెంట్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే ఏపీఎస్‌బీసీఎల్ గోదాముల నుంచి మద్యం విక్రయిస్తోంది. అయితే ప్రభుత్వ మద్యం షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయించే మద్యం ధరల్లో వ్యత్యాసం చాలా ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కొందరు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వారితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమంగా తరలింపు.. విజయవాడ నగరం టిక్కిల్ రోడ్డులో గత నెల 21న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని(06449) ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. గతంలో ఇక్కడ హాంగోవర్ పేరిట సూపర్ మార్కెట్ తరహాలో ఓ ప్రైవేటు మద్యం దుకాణం ఉండేది. ఆ షాపు నిర్వాహకులకు నగరంలో పలు బార్లు కూడా ఉన్నాయి. గతంలో హాంగోవర్లో పనిచేస్తున్న సిబ్బందినే ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణంలో నియమించారు. వీరందరూ కుమ్మక్కై ఆదివారం మధ్యాహ్నం 1.40 గంట సమయంలో 06449 నంబరు మద్యం షాపునకు సంబంధించిన బీరు, మద్యం బాటిళ్ల బాక్స్‌లను ఆటోలో లోడు చేస్తున్న దృశ్యం ‘సాక్షి’ కంట పడింది. అనుమానంతో సాక్షి ప్రతినిధి ఆ ఆటోను అనుసరించగా ఆ ఆటో నేరుగా పంట కాలువ రోడ్డులోని ‘చిల్లీస్ రెస్టారెంట్ అండ్ బార్’ వద్ద ఆగింది. అనంతరం ఆటోలో ఉన్న మద్యాన్ని దించి బార్లోకి తరలించారు. మద్యం షాపు వద్ద లోడు నింపిన దగ్గర నుంచి బార్ వద్ద లోడును దించిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఈ తరలింపు తంతు కేవలం అరగంటలోపు పూర్తి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రభుత్వ మద్యం షాపు నుంచి సరుకును ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు తరలిస్తున్నా ఎక్సైజ్ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు ఉంటాయ్.. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉన్న సరుకును ఎవరైనా బెల్టు షాపులకు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ విక్రయించరాదు. అలా చేస్తే దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కొనుగోలు చేసిన బార్ యజమానులపై కఠినంగా వ్యవహరిస్తాం. బార్‌ను సీజ్ చేస్తాం. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం. – మురళీధర్, ఎక్సైజ్ డీసీ, కృష్ణా జిల్లా -
మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇన్స్టాగ్రామ్’ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మెక్సికో మాఫియా లేడీ డాన్ ‘లా కత్రినా’ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఆమె అసలు పేరు మెరియా గ్వాడలూప్ లోపెజ్ ఎస్కివెల్. హత్యలు, కిడ్నాప్‌లతోపాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ వ్యాపారం చేసే మాఫియా మూఠాకు ఆమె 2017లో నాయకురాలు అయ్యారు. తండ్రి నుంచి ఆమెకు ఆ నాయకత్వం దక్కిందని చెబుతారు. ఆమె గత అక్టోబర్ 14వ తేదీన పోలీసులపై దాడి చేయగా 13 మంది పోలీసులు మరణించారు. 9 మంది గాయపడ్డారు. అప్పటి నుంచి మెక్సికో పోలీసులు ఆమె కోసం కాపు కాస్తున్నారు. ‘ఎం 2’గా వ్యవహరించే మరో ముఠా నాయకుడిని కలుసుకునేందుకు ఆమె గత శుక్రవారం తన బాడీ గార్డులతో లా బొకాండ నగరంలోని ఓ ఇంటికి నిరీక్షిస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడి జరిపి కాల్పులు జరపగా, ఆమె మెడలో బుల్లెట్ దిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఆమె ముఠాకు చెందిన మరో యువతి మరణించగా, ఏడుగురు గన్మేన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రి దొరికాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సోమవారం మీడియాకు అందిన వీడియో ఫొటోలు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన లా కత్రినా ఆఖరి క్షణాలను వీడియోలో చూడవచ్చు. ఆమె ఏకే 47 తుపాకీ పట్టుకొని దిగిన ఫొటో అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం రేపింది, -
టీడీపీ.. చీకటి వ్యాపారం
సాక్షి, బొమ్మనహాళ్: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండతో టీడీపీ నాయకుడు టీవీఎస్ కాంతారావ్ నేమకల్లు సమీపాన కొండల్లో ఉన్న కంకర మిషన్ల నుంచి కంకరను, డస్ట్ పౌడర్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదీ రాత్రి వేళ కర్ణాటకకు తరలిస్తున్నారు. గత ఏడాది నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల రైతులు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మేకలు, గొర్రెలు, జీవాలు, ప్రజలు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల చనిపోతున్నాయని, తక్షణమే కంకర మిషన్లను నిలిపివేయాలని గ్రీన్ టిబ్యునల్‌కు వెళ్లారు. ఈ విషయంపై గ్రీన్ టిబ్యునల్ అధికారులు పరిశీలించి నేమకల్లు కొండల్లో కంకర మిషన్లను, క్వారీలను పూర్తిగా నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు బేఖాతర్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను టీడీపీ నాయకుడు టీవీఎస్ కాంతారావ్ బేఖాతర్ చేశారు. తన స్వంత కంకర మిషన్‌ను తెరిచి నిల్వ ఉంచిన కంకరను, డస్టŠట్ పౌడర్‌ను లారీల్లో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం కాంతారావ్ కంకర మిషన్ నుంచి కర్ణాటకకు కంకరను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లతో పాటు జేసీబీని నేమకల్లు గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఒక్క రోజే దాదాపు 25 లారీల కంకర, డస్ట్‌ను కర్ణాటకకు తరలిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న కంకరకు అడ్డుకట్ట వేసి, కాంతారావ్‌పై చట్టపరమైన తీసుకోవాలని తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జ్వరమొస్తే జేబు ఖాళీ..
సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 482 ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. అందులో ఖమ్మం నగరంలోనే 240 ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయి. అనధికారికంగా జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్‌లు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. సీజనల్ జ్వరాలు తీవ్రరూపం దాల్చడంతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా బెడ్లు ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది. జ్వరంతో వచ్చిన పేషెంట్లకు అవసరం లేకపోయినా అన్ని రకాల టెస్టులు రాసి.. వారి వద్ద నుంచి అందినంత గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సాధారణ జ్వరం వచ్చినా డెంగీ టెస్టుల పేరుతో రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.200కోట్ల వ్యాపారం.. వైద్య, ఆరోగ్య శాఖ వైఫల్యంతో జిల్లాలో ఈ సీజన్లో జ్వరాలు తీవ్రమయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు వృద్ధిచెంది వాటి బారినపడి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దాదాపు రూ.180కోట్ల నుంచి రూ.200కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా ఇంత వ్యాపారం ఏ జిల్లాలో జరగలేదని తెలుస్తోంది. ఈసారి జ్వరాల సీజన్ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు సిరులు కురిపించిందని చెప్పొచ్చు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇంత వ్యాపారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దోపిడీ జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు ఉండడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైంది. నిబంధనలు గాలికి.. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు ఉండాలి. అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫైర్ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా వారు సూచించిన విధంగా ఉండాలి. ఆయా పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ.. చాలా ఆస్పత్రుల్లో నిబంధనలు ఖాతరు చేయట్లేదు. అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అర్హత లేకున్నా ల్యాబ్‌లలో టెస్టులు చేయిస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా ఒకటి, రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆర్ఎంపీల వైద్యంతో ఇక్కట్లు.. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ సాధారణ జ్వరం, ఇతర నొప్పులు రాగానే స్పెషలిస్ట్ వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు. ఆ వీధిలోనో, ఆ గ్రామంలోనో ఉండే ఆర్ఎంపీని పిలిపించుకొని చూపించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాధారణ చికిత్స అందించి నయం చేసేవారు. కానీ.. ప్రస్తుతం కొందరు ఆర్ఎంపీలు ధర్జనే ధ్యేయంగా రోగుల వద్ద నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. పారాసిటమాల్ మాత్రవేస్తే నయమయ్యే జ్వరాన్ని డెకట్రాన్ వంటి ఇంజక్షన్లు వేసి రోగులను మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నారని కొందరు డాక్టర్లు పేర్కొంటున్నారు. వచ్చీరాని వైద్యం వల్ల రోగులకు అంతర్గతంగా బ్లీడింగ్ జరిగి ప్లేట్లెట్స్ పడిపోయి మృత్యువాత పడుతున్నట్లు కొందరు వైద్యులు వివరిస్తున్నారు. సాధారణంగా రోగిని పరీక్షించిన ఆర్ఎంపీలు మెరుగైన వైద్యం కోసం స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు తీసుకెళితే.. వెంటనే జ్వరం అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. దీనికి తోడు కొందరు ఆర్ఎంపీలు కమీషన్ కోసం కక్కుర్తిపడి వారు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రైవేటు యాజమాన్యాలు పేషెంట్‌ను తమ ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆర్ఎంపీకి 30 నుంచి 50 శాతం కమీషన్ ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. చూసీచూడనట్లు ఉన్నందుకు అధిక మొత్తంలో ప్రైవేటు యాజమాన్యాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు భారీగానే నగదు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు తప్పక పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆయా ఆస్పత్రులను సీజ్ చేస్తాం. ప్రైవేటు ఆస్పత్రులపై కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నాం. ఇటీవల కొన్నింటిని సీజ్ కూడా చేశాం. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. – డాక్టర్ కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
రేషన్ బియ్యం దందా
సాక్షి, జమ్మికుంట: పేదల బియ్యం గద్దల పాలవుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన రూపాయికి కిలో బియ్యం దొడ్డిదారిన దళారులకు దక్కుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని చౌకగా చేజిక్కించుకుంటున్న మాయగాళ్లు రాత్రికి రాత్రే హోటళ్లు, వ్యాపార సంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. భారీగా చీకటి దందా సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. నిద్రావస్థలో జోగుతున్న సర్కారు నిఘాతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బియ్యం కోటా పెంచారు. 2014 నుంచి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకు 16,800 టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 4,890 టన్నులు, జగిత్యాలకు 5,240, పెద్దపల్లికి 3,576, సిరిసిల్ల జిల్లాకు 3,093 టన్నులు తరలుతున్నాయి. వీటి విలువ రూ.50.40 కోట్లు ఉంటుంది. కిలోకు రూ.8 చొప్పున కొంటున్న దళారులు.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదోవ పడుతూనే ఉన్నాయి. వివిధ మార్గాల్లో గుట్టుగా దళారులకు చేరుతున్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో అధికశాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తినడం లేదు. చౌకధరల దుకాణంలో రూపాయికి కిలో చొప్పున పొందుతున్న దొడ్డు బియ్యాన్ని చౌకగా అమ్ముకుంటున్నారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న దళారులు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. కొందరికి రైలుమార్గం అనువుగా ఉండడంతో బియ్యాన్ని ప్యాసింజర్ రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల సరుకులను విరూర్, నాగపూర్ వ్యాపారులకు అక్రమంగా చెరవేస్తూ, కిలోకు రూ.28 నుంచి రూ.35 దాకా గిట్టుబాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దొడ్డు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో అక్కడికి పెద్దఎత్తున రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం కావడం, సర్కారు పర్యవేక్షణ పెద్దగా లేకపోవడం.. వెరసి అక్రమార్జనతో దళారుల జేబులు నిండుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈయేడు ఇప్పటి వరకు అడపా దడపా జరిగిన తనిఖీల్లో 4,583 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు రూ.1.37 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు 183 కేసులు నమోదు చేశారు. దీన్ని బట్టి రేషన్ బియ్యంతో మాయగాళ్లు నడిపిస్తున్న చీకటి దందా ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. కిలో బియ్యం తయారీకి రూ.30 ఖర్చు.. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటోంది. వాటిని మిల్లుల్లో మర పట్టించి, ఛౌకధరల దుకాణాలకు పంపుతోంది. ఈమేరకు వివిధ చార్జీలు, పన్నులు కలుపుకొని కిలో బియ్యంపై రూ.30 వరకు ఖర్చు చేస్తోంది. కాగా.. చాలామంది లబ్ధిదారులు దొడ్డు బియ్యం తినేందుకు విముఖత చూపుతున్నారు. వాటిని కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున అమ్ముతూ, రూ.40 లకు లభిస్తున్న సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం కొంటున్న దళారులకు కిలోపై రూ.10 నుంచి రూ.25 దాకా లాభం చేకూరుతోంది. అంటే.. పేదల కోసం సర్కారు కల్పిస్తున్న రాయితీతో దళారులకే ప్రయోజనం కలుగుతోంది. -
మాఫియా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
మాఫియా చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అరుణ్‌విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాఫియా. నటి ప్రియభవానీశంకర్ నాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు ప్రసన్న ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌నరేన్ తెరెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో నటుడు అరుణ్‌విజయ్ స్టైలిష్ గెటప్ అందరినీ ఆకర్షించింది. మాఫియా అనగానే యాక్షన్ సన్నివేశాలతో కూడిన మాస్ ఎంటర్టెయినర్ చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. నటుడు అరుణ్‌విజయ్ కెరీర్లో ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోతుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. చిత్రంలో తన పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. టీజర్లో నటుడు అరుణ్విజయ్ను సింహంగానూ, ప్రసన్నను నక్క గానూ చూపించి కథను మాత్రం రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతూ వారి పాత్రల స్వభావాన్ని ఆవిష్కరించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించారు. ఈ టీజర్‌ను ఇప్పటికే 2.9 మిలియన్ల ప్రేక్షకులు యూట్యూబ్‌లో తిలకించారు. ఇది అరుణ్‌విజయ్ చిత్రాలలోనే పెద్ద రికార్డు అంటున్నారు. కాగా దర్శకుడు కార్తీక్‌నరేన్ మాఫియా చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మాఫియా చిత్ర షూటింగ్ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు జాక్స్ బిజాయ్ సంగీతాన్ని, గోకుల్ బెనాయ్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. -
మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి
లక్నో: యూపీలో లిక్కర్ మాఫియా బరితెగించింది. సహరన్‌పూర్‌లో ఆదివారం ఓ జర్నలిస్ట్, ఆయన సోదరుడిని మద్యం మాఫియా కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ హిందీ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ను గతంలోనూ పలు సందర్భాల్లో మద్యం మాఫియా బెదిరించిందని సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ ఆశిష్ జన్వాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఆయన సోదరుడు ఘటనా స్ధలంలోనే మరణించారు. ఈ ఘటనకు సంబందించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్‌ను మద్యం మాఫియా హతమార్చడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తనకు బెదిరింపులు రావడంపై ఆశిష్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపించారు. కాగా మద్యం మాఫియా జర్నలిస్టుపై కాల్పులు జరిగిన సమాచారం అందగానే డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు రూ 5 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. -
ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు
బ్రిటన్‌లోని ప్రతి ఇంటి వంటింటి కంబోర్డుల్లో నిగనిగలాడుతున్న ఎర్రటి ఇటలీ టమోటాలు మెరిసిపోతుంటాయి. వండకుండానే వాటిని అలాగే నమిలి తినేయాలనిపిస్తుంది. వాటి పక్కనే రకరకాల ఫ్లేవర్లు కలిగిన టమోటా సాస్‌లు, పేస్ట్‌లు నోరూరిస్తుంటాయి. కానీ అవన్నీ మానవ రక్తంతో ఎరుపెక్కాయని తెలిస్తే...వాటి వెనకాల బానిస కూలీల ఆకలి కేకలు ఉన్నాయని, వారి ప్రాణ త్యాగంతో అవి ఫలించాయని తెలిస్తే....ఇది ముమ్మాటికి నిజం. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న టమోటాల్లో 80 శాతం ఇటిలీ నుంచి ఎగుమతి అవుతున్నవే. ఇక ఎగుమవుతున్న టమోటా ఉత్పత్తుల్లో ఐదోవంతు ఇటలీ నుంచి వస్తున్నవే. దక్షణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో టమోటాలను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండించే టమోటా పంట కోతకొచ్చినప్పుడు పనిచేసే కార్మికులంతా ఆఫ్రీకా నుంచి వలస వచ్చిన బానిస కూలీలే. ఇటలీ చట్టం ప్రకారం వారికి రోజుకు కనీస వేతనంగా 45 యూరోలు చెల్లించాలి. వారికి చెల్లించేది కేవలం మూడున్నర యూరోలు లేదా 30 కిలోల టమోటాలు మాత్రమే. అందుకు కారణం వారంతా ఇటలీ మాఫియా నెట్వర్క్ కింద పనిచేయడమే. కాదని ఎదురు తిరిగితే అది కూడా దక్కదు. ఇటలీ బానిస కూలీలను సరఫరా చేసే మాఫియా పేరు ‘ఎన్డ్రాంగేటా’. ఇది ఒక్క ఇటలీకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా విస్తరించింది. (ఇటలీ నుంచే అమెరికాకు ‘గాడ్ ఫాదర్’ వ్యవస్థ విస్తరించిన విషయం తెల్సిందే) ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల నుంచి కూలీలను సరఫరా చేసే కాంట్రాక్టులకు ఎక్కువగా ఈ మాఫియానే రకరకాల పద్ధతిలో కొట్టేస్తుంది. ‘సెపరలాటో’లుగా పిలిచే గ్యాంగ్ లీడర్లను బానిస కార్మికులు నివసించే తాత్కాలిక షెడ్లకు పంపిస్తుంది. అక్కడ ఆ గ్యాంగ్ లీడర్లు అవసరమైనంత మంది కూలీలను ఎంపిక చేసుకొని సైట్‌కు తీసుకెళతారు. టమోటా తోటల్లో అయితే వారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాలి. ఉదయం ఇంటి వద్దనే తిని రావాలి. సాయంత్రం ఇంటికి వెళ్లాకే తినాలి. మధ్యలో ఆకలి భరించలేకపోతే పండిపోయి పడేయాల్సిన టమోటాలను మాత్రమే తిని కడుపు నింపుకోవాలి. కాస్త కునుకు తీసేందుకు ప్రయత్నిస్తే, కాపలాకాసే గూండా చేతిలో ఉన్న కొరడా వచ్చి వీపును చుర్రుమనిపిస్తుంది. మాఫియాకు 300 కోట్ల యూరోలు ఈ పుంగ్లీ ప్రాంతంలో మాఫియా నెట్వర్క్ గుప్పిట్లో దాదాపు 90 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వారు చాలి చాలని కూలీతో పనిచేస్తుంటే వారి మీద మాఫియాకు ఏటా 300 కోట్ల యూరోలు లాభంగా వస్తున్నాయని ఇటలీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి బోర్గేస్ మీడియాకు తెలిపారు. ఈ మాఫియా దేశం మొత్తంగా వ్యవసాయ కూలీల ద్వారా ఏటా 2,200 కోట్ల యూరోల రెవెన్యూను కూడగడుతోందని ‘అబ్జర్వేటరీ ఆఫ్ క్రైమ్ ఇన్ అగ్రికల్చర్, ది ఫుడ్ చెయిన్’ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఇతర వ్యవసాయ రంగాల్లో పనిచేసే కూలీలకు టమోటా కూలీలకన్నా ఈ మాఫియా కొద్దిగా ఎక్కువ చెల్లిస్తోంది. రోజుకు 45 యూరోలు చెల్లించాల్సి ఉండగా, అందులో మూడో వంతును మాత్రమే చెల్లిస్తుంది. వాటిలోనూ రాను, పోను రవాణా చార్జీలను కూడా పట్టుకుంటుంది. వర్క్ పర్మిటి వస్తుందన్న ఆశతో కూలీలు ఎదురు తిరిగేందుకు సాహసించలేరు. వర్క్ పర్మిట్లున్నా లాభం లేదు వర్క్ పర్మిట్లున్న కార్మికులకు కూడా ఈ మాఫియా 35 యూరోలకు మించి చెల్లించడం లేదు. అందులో రవాణా, మంచినీళ్ల చార్జీలను వసూలు చేస్తుంది. వర్క్ ప్లేస్‌కు సమీపంలో ఊరవతల కూలీల కోసం చిన్న గుడారాలు వేయిస్తుంది. అందులోనే వారు మగ్గిపోవాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇంతలో అక్కడ అక్రమంగా గుడారాలు వెలిశాయన్న విషయం తెల్సిన వెంటనే స్థానిక ఇటలీ అధికారులు వచ్చి వారి గుడారాలను కూల్చేస్తారు. వారు అక్కడి నుంచి కట్టుబట్టలతో చెట్టూ పుట్టా పట్టుకొని వెళ్లాల్సిందే. 2016లో కార్మిక చట్టం బలోపేతం కూలీల నిలువు దోపిడీ, బానిస కూలీల వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ఇటలీ ప్రభుత్వం 2016లో దేశ కార్మిక, వలస కార్మిక చట్టాల నిబంధనలు కఠినతరం చేసింది. దేశం నుంచి టమాటో ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రముఖ బ్రాండులైన సిరియో, టెస్కో, నార్దో లాంటి కార్పొరేట్ సంస్థలకే కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యతను అప్పగించింది. కూలీల వ్యవస్థలో దోపిడీని నిర్మూలించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంతోమంది కూలీల మృతి టమాటోలు తెంపుతున్న సమయంలో గుండె పోటుతో చనిపోతున్న వయస్సు మళ్లిన వారు ఎంతో మంది ఉంటున్నారు. వారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు అందుబాటులో అంబులెన్స్‌లను కూడా మాఫియా ఏర్పాటు చేయడం లేదు. టమోటాల ఒవర్ లోడ్‌తో వెళుతున్న వాహనాలపైనే కూలీలను ఎక్కించడం వల్ల ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. బ్రిటన్‌కు ఎక్కువగా టమోటాలను, వాటి ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ‘నార్దో’ బ్రాండ్ పరిధిలో ఇలా ఎక్కువ మంది మరణించారు. -
వెనక్కి తగ్గని డ్రగ్స్ మాఫియా
-
తప్పు చేయకపోతే చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేయకపోతే తనతో చర్చకు సిద్ధం కావాలని, ఆ చర్చ ఎక్కడ పెట్టినా వస్తానన్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేశారు. పదో షెడ్యూల్లో ఫిరాయింపుల ఉన్న నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్న కేసీఆర్ ప్రగతిభవన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఇతర నాయకులను మాట్లాడిస్తున్నారని, ఆయన్ను బయటకు ఎలా రప్పించాలో తమకు తెలు సని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్ లో భట్టి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని, ఈ పొలిటికల్ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ ఉండదని చెప్పారు. భవిష్యత్తులో డబ్బున్న వాళ్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసి సీఎంలు, పీఎంలు అవుతారని, అందుకే తాను ఆమరణదీక్షకు కూర్చున్నానని అన్నారు. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన పోరాటం ఆరంభం మాత్రమేనని , రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై తాను, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై త్వరలోనే వివిధ వర్గాల మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెపుతున్నారని, కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు, ఆ తర్వాత వారే నాయకులుగా ఉన్నారని, అప్పుడు పార్టీ నుంచి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే వెళుతున్నామని చెబుతున్నారని, పార్టీ మారకపోతే ఈ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతల నియోజకవర్గాలను అభివృద్ధి చేయరా అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారంతా రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో గెలవాలని భట్టి సవాల్ విసిరారు. -
గోల్డ్ మాఫియా!
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటారు పెద్దలు’.. సరిగ్గా ఇలాగే బంగారం పన్ను ఎగవేతకు ఇక్కడి వ్యాపారులు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. దీనికోసం ఏకంగా పరిశ్రమలే ఏర్పాటు చేయడం లేదా అలాంటి పరిశ్రమలతో ములాఖత్ అవ్వడం చేస్తున్నారు. హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇలాంటి గోల్మాల్ వ్యాపారాలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా భారీ స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటికి రావడం డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ కుంభకోణం కారణంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి.. స్థానిక మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. దీనికి ఇటీవల వెలుగుచూసిన ‘జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్’ఉదంతమే నిదర్శనం. బంగారు ఆభరణాల తయారీకి అనుమతి పొందిన ఈ పరిశ్రమ రాచబాటలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా కోట్ల రూపాయల పన్నులు మిగుల్చుకుని జేబులో వేసుకుంటోంది. అసలేం జరిగింది?... రావిర్యాలలోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్ పరిశ్రమ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారాన్ని స్థానిక మార్కెట్‌కు బదిలీ చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న బంగారానికి పన్నులు ఉండవు. ఇదే గోల్‌మాల్‌కు కారణమైంది. దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలు తయారు చేసి తిరిగి విదేశాలకు ఎగుమతి చేయాలి. కానీ, వీరు అలా పంపకుండా.. చాలా స్వల్ప శాతం బంగారంతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిలో అధిక శాతం రంగురాళ్లు నింపి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిపై అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో సదరు సంస్థపై దాడులు చేశారు. స్వా«ధీనం చేసుకున్న ఆభరణాలను, రికార్డులను చూసిన అ«ధికారులు విస్తుపోయారు. ఓ లావాదేవీలో 19 కిలోగ్రాముల బంగారం, 2 కిలోగ్రాముల రాళ్లు ఉండాలి. కానీ, 20.85 కిలోగ్రాముల రాళ్లు, కేవలం 565 గ్రాముల బంగారమే ఉండటంతో గుట్టు బయటపడింది. చాలాకాలం నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారని, నగరంలో పేరున్న ఓ బడా జువెల్లరీ సంస్థకు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకూ 1,100 కిలోల బంగారాన్ని ఇలా పక్కదారి పట్టించి భారీగా ఆర్జించారని, ప్రభుత్వానికి రూ. వేల కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. రాకెట్ విదేశాల్లోనే ఉందా? వాస్తవానికి 20 కిలోల బంగారం చొప్పున విదేశాల నుంచి ఆర్డర్ వస్తే.. తిరిగి అదే బరువుకు సమానమైన ఆభరణాలు చేసి పంపాలి. కానీ, అలాకాకుండా గ్రాముల్లో బంగారం పూతపూసి, కిలోగ్రాముల్లో రంగురాళ్లు నింపి పంపుతుంటే విదేశాల నుంచి అధికారులకు ఎందుకు ఫిర్యాదు రాలేదన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. విదేశాల్లోనే వీరికి సహకరించేవారు ఉన్నారని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం పరిమాణంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటున్నా.. అవతలి వాళ్లు నోరు మెదపకుండా ఎలా ఉన్నారన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. నోట్ల రద్దు సమయంలో నగరానికే చెందిన మసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లరీస్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.110 కోట్ల మేరకు గోల్మాల్ చేసినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. రూ.82 కోట్లు విలువైన 145 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. -
నెల్లూరులో...టీడీపీ ఇసుకాసురులు
జిల్లాలో ఐదేళ్లలో ఇసుకాసురులు రెచ్చిపోయారు. అధికార పార్టీలోని కొందరు మాఫియాగా ఇసుకను కొల్లగొట్టి.. రూ.కోట్లు గడించారు. జిల్లాలో ప్రధానమైన పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్యా నదులతో పాటు నీటి పారుదల జరిగే వాగుల్లో దొరికే ఇసుక కోసం వాటిని కుళ్లబొడిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా గనుల మాదిరిగా తవ్వేసి రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా జీపీఎస్ విధానం అమలు పరిచినా.. నెట్ వర్క్ కనెక్ట్ కాకుండా ఆపేసి యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు తరలించారు. జిల్లాలో పోలీస్, విజిలెన్స్, గనుల శాఖల అధికారులు సైతం టీడీపీ నేతలు తరలించే ఇసుక రవాణాపై పూర్తిగా ఆంక్షలు ఎత్తేశారు. స్థానిక ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలకు తీసుకెళ్లే ట్రాక్టర్లను మాత్రం అడ్డుకుని కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. స్థానిక అవసరాలకు రవాణా చేసే వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై నిఘా పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో అధికార పార్టీ నేతలకు ఇసుక రవాణా పెట్టుబడి లేదని వ్యాపారంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇసుక వ్యాపారానికి తెరలేపారు. ఇసుక ఉచితంగా ప్రకటించిన తర్వాత టీడీపీ నేతలు దాన్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. దీంతో జిల్లాలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలుగా కొనసాగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్యా నదుల్లోని ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి, రూ.కోట్లు గడిస్తున్నారు. నదుల్లో ఇసుకను తరలించేందుకు ఉన్న అనుమతులు పక్కన పెట్టి ఉచితం మార్గదర్శకాలకు భిన్నంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఎవరైనా తమ ఇళ్ల కట్టడాలకు ఉచితంగా తీసుకుందామని వెళ్తే వారిని బెదిరించి తమ వాటా ఇచ్చిన తర్వాతే తీసుకుని వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారికంగా 28.. అనధికారికంగా మరో 20 జిల్లాలో మొత్తం 28 ఇసుక రీచ్‌లు అధికారికంగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా స్వర్ణముఖి, పెన్నానది, కాళంగి, కైవల్యా నదులతో పాటు ఆయా పరివాహక ప్రాంతాల్లో ఈ రీచ్‌లు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, సోమశిల, అప్పారావుపాళెం, పడమట కంభంపాడు, దవ్వూరు, కుట్టుపల్లి, పొట్టెంపాడు రీచ్‌లో భారీగా ఇసుక విక్రయాలు జరుగుతుంటాయి. వీటితో పాటు జొన్నవాడ, ముదివర్తి, వేగూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో ఎక్కువగా అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతోంది. పొదలకూరు ప్రాంతంలో ఉన్న రీచ్‌లో జిల్లాలోని ఒక మంత్రి అనుచరులు ఎక్కువగా ఈ ప్రాంతంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్‌లోని పొట్టేపాళెం వద్ద కూడా అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువగా ఉంది. అమలు కాని జీపీఎస్ విధానం జిల్లా నుంచి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని స్వయంగా పోలీసు, రెవెన్యూ, సంబంధిత మైనింగ్ అధికారులు చెబుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇసుక తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో జిల్లాలో ఇసుక తరలించే ట్రాక్టర్లకు దాదాపుగా 2 వేలకు వరకు జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసినా, కనెక్ట్ కాకుండా ఆపేసి రవాణా చేయడం గమనార్హం. జీపీఎస్ విధానం అమలు చేయాలని ఆదేశాలు వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లతో ఆ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఏ స్థాయిలో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా సరిహద్దులు దాటుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చెప్పిందే రేటు అధికారికంగా ఇళ్ల నిర్మాణాలకు కొనుగోలు చేసుకోవాలంటే ట్రాక్టర్ ఇసుక రూ.1100 లోపు తీసుకోవాలని ప్రభుత్వం ధర నిర్ణయించింది. కాని ఇళ్ల నిర్మాణాలకు రూ.2 వేల వరకు తీసుకుంటూ, వాణిజ్య అవసరాలకు డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రీచ్‌లను తమ కనుసన్నల్లో నడిపిస్తున్న టీడీపీ నేతలు అధికంగా వసూలు చేస్తుండడంతో ట్రాక్టర్ యజమానులు కూడా వినియోగదారుల వద్ద అధికంగా తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తుంది. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువ జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది నుంచి తమిళనాడుకు, పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాకు తరలిపోతుంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని రీచ్‌ల నుంచి ఎక్కువగా వైఎస్సార్ జిల్లాకు తరలిపోతుంది. ఇక పోతే నెల్లూరు, కోవూరు నియోజకవర్గం పరిదిలోని ఇసుక రీచ్‌ల నుంచి జిల్లా అవసరాలతో పాటు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారిపై ఎక్కువగా తమిళనాడుకు పోతుంది. దీంతో లారీ ఇసుక రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగా ప్రాంతాలను బట్టి వసూలు చేస్తుండడం గమనార్హం. ఇతర రాష్ట్రాలకైతే మూడింతలు, నాలుగింతలు పెరుగుతుంది. తెలుగు తమ్ముళ్లే మాఫియాగా సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని టీడీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి రూ. కోట్లు గడించారు. నాయుడుపేట ప్రాంతంలో స్వర్ణముఖి, మామిడికాలువ, సూళ్లూరుపేట ప్రాంతంలో కాళంగినది, పాముల కాలువ, కరిపేటి కాలువల్లో ఇసుకను స్థానికులకు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా తరలించి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరసా వెంకటరత్నయ్య, మరో టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఇసుకకు గిరాకీ బాగా ఉండడంతో రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. అన్నమేడు, మర్లపల్లిలో రాత్రి వేళ 100 మంది కూలీలతో 50 లారీలకు పైగా ఇసుకను నింపి చెన్నైకు తరలించేవారు. తుమ్మూరు, స్వర్ణముఖి నదిలోని శివాలయం సెంటర్, బీడీ కాలనీ, పెళ్లకూరు మండల పరిధిలోని తాళ్వాయిపాడు, చావాలి, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తి మీదుగా వందల లారీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. అధికారులు నామమాత్రపు దాడులు, మామూళ్లతో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తడ, సూళ్లూరుపేట మండలాలకు ట్రాక్టర్లలో తరలించి అక్కడి నుంచి చెన్నైకు తరలించేవారు. ఓజిలి మండలంలో మామిడికాలువ, పున్నేపల్లి, కొత్తపేట ప్రాంతాల్లో నది నుండి ఇసుకను తరలించి ఓజిలి మండలానికి చెందిన టీడీపీ నేతలు ఇసుక స్మగ్లింగ్ దర్జాగా సాగిపోయేది. తన వర్గీయులు ఇసుక మాఫియాతో కోట్లు గడిస్తుండడం చూసి టీడీపీలోని మరో వర్గం తన అనుచరులతో ఎదురు దాడికి దిగడంతో మాఫియాకు అడ్డుకట్ట వేయగలిగారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం అనుచరులు కూడా ఇసుకను తరలించినట్లు ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి. పచ్చ మాఫియా గూడూరు: నిర్మాణాలకు ఇసుక ఉచితమనేది ప్రకటనలకు మాత్రమే.. కానీ పచ్చ మాఫియా నేతలకు అది కాసులు కురిపిస్తోంది. రాత్రనకా పగలనకా, ఇబ్బడిముబ్బడిగా ట్రాక్టర్లతో ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు మాత్రం ఇసుకను తన సొంత ఇంటి నిర్మాణం కోసం తీసుకెళ్లాలంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. గూడూరు నియోజక వర్గంలో వాకాడు, కోట, గూడూరు, చిట్టమూరు మండల ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. అయితే ఆయా మండలాల్లో గృహ నిర్మాణాలు చేపడుతున్న సామాన్య, మధ్య తరగతి పేద ప్రజలకు వివిధ రకాల అనుమతులు, ఆంక్షలు విధించిన అధికారులు, టీడీపీ నేతలకు మాత్రం ఏ విధమైన అనుమతులు లేకుండానే ఉచితంగా ఇసుకును తరలించుకునేందుకు దోహదపడుతున్నారు. పోలీసులు, అధికారులు సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్తే మాత్రం దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తోన్నారు. దీంతో సామాన్య ప్రజలకు ఇసుక అందని ద్రాక్షలా మారింది. వాకాడు మండలం కాశీపురంలో ఉన్న ఇసుక రీచ్‌ను అక్కడ గ్రామస్తులు అడ్డుకుని రీచ్‌ను మూసి వేశారు. కోట మండలంలోని పుచ్చలపల్లి వద్ద ఉన్న స్వర్ణముఖి రీచ్‌లో ఇసుక దోపిడీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న వారు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక కోసం వెళ్తే సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. చిల్లకూరు మండలంలోని పరిశ్రమలకు ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తూ కొందరు టీడీపీ నాయకులు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. కైవల్యా.. కుళ్లబొడిచారు సైదాపురం: మండల పరిధిలోని కైవల్యా నదిని ఇసుక కోసం టీడీపీ నేతలు కుళ్లబొడిచేశారు. అక్రమంగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు ఇసుకను బహిరంగంగానే తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. మండలంలోని గంగదేవిపల్లి, అనంతమడుగు, సైదాపురం, రామసాగరం, పాలూరు రాజుపాళెం కేంద్రంగా మారింది. ఈ గ్రామాల్లో సమీపంలో కైవల్యా నది ఉండడంతో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుకను బహిరంగంగానే తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ఉన్న సరిగా అమలు చేయకపోవడంతో వేల రూపాయలతో ఇసుకను అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రూ.2,500 నుంచి రూ.3 వేలకు ధర పలుకుతుంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే కైవల్యా నుంచి ఇతర ప్రాంతాలకు విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్న సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. అనధికారిక ఇసుక ర్యాంప్ నెల్లూరురూరల్: నెల్లూరు రూరల్ పరిధి లోని పెన్నానదిలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పెన్నానది నుంచి ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలి వెళుతుంది. 2014 ఎన్నికలకు ముందు నెల్లూరురూరల్ పరిధిలో పొట్టేపాళెం, కోడూరుపాడు, నవలాకులతోట, ములుమూడి, సజ్జాపురం, గొల్లకందుకూరు ప్రాంతాల్లో పెన్నానది వద్ద ఇసుక రీచ్‌లు ఉండేవి. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాళెం రీచ్ మినహా మిగతా అన్ని రీచ్‌లను రద్దు చేసింది. ఇసుక ఉచితం కావడంతో పొట్టేపాళెం రీచ్ నుంచి ప్రతినిత్యం 300 నుంచి 400 ట్రాక్టర్లలో ఇసుక నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలకు రేయింబవళ్లు ఇసుక రవాణా సాగిస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు, ములుమూడి, సజ్జాపురం, గొల్లకందుకూరు ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక ర్యాంప్ లు ఏర్పాటయ్యాయి. గతంలో రద్దు చేసిన రీచ్‌లనే అధికార పార్టీ నాయకులు ర్యాంప్‌లుగా నిర్వహిస్తున్నారు. ర్యాంప్‌ల వద్ద ట్రాక్టర్ల నిర్వాహకుల నుంచి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక డంపింగ్‌లు రూరల్ ప్రాంతంలోని పలు చోట్ల ఇసుక డంపింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పొట్టేపాళెం రీచ్ సమీపంలో ఇసుక డంపింగ్ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. పెన్నానదిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపింగ్ కేంద్రాలకు చేర్చి అక్కడ నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా జిల్లాలోని దూర ప్రాంతాలకే కాకుండా తమిళనాడుకు ఇసుకను తరలిస్తున్నారు. నిబంధనలను అమలు చేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. -
మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్
ముంబై: భారత అధికారులకు గత 15 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న మాఫియా డాన్ రవి పుజారి ఎట్టకేలకు దొరికాడు. ఆఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డకార్‌లో పోలీసులు పుజారీని జనవరి 22న అరెస్ట్ చేశారు. ఈ విషయమై ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుజారీ అనుచరులు విజయ్ రోడ్రిక్స్, ఆకాశ్ శెట్టిలను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వీరిని విచారించగా, పుజారీ సెనెగల్‌లో తలదాచుకుంటున్నట్లు తేలిందన్నారు. బిల్డర్లు, సినీ ప్రముఖులను డబ్బుల కోసం ఈ గ్యాంగ్ బెదిరిస్తుందన్నారు. పుజారీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కర్ణాటకకు చెందిన పుజారీపై డజనుకుపైగా హత్య, బెదిరింపుల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంతగ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. -
ఇటుక దందా..ఇష్టారాజ్యం
బాన్సువాడ టౌన్: చట్టాలు ఎన్ని వచ్చినా అక్రమార్కులకు చుట్టాలుగానే మారుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో అవినీతి పరుల ఆగడాలు ‘మూడు ఇటుకలు.. ఆరు బట్టీలు’గా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇటుక బట్టీలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటుకను కాల్చడానికి అడవి కలపను, బొగ్గును వాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, దేశాయిపేట్ గ్రామాల సమీపంలో ఇటుక బట్టీలను నడిపించడం మొదలు పెట్టారు. వీటి ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదారేళ్ల నుంచి ఆయా గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలను కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో రెండు, మూడు చోట్ల ఇటుక దందా జోరుగా నడుస్తోంది. ఇటుక కాల్చడానికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలపను తీసుకొచ్చి కాల్చుతున్నారు. అలాగే నల్లబొగ్గును కూడా వాడుతున్నారు. అటు వైపు రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీల వ్యాపారుల నుంచి మామూళ్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ అడవి నుంచి ట్రాక్టర్లలో కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌కు రూ.2వేల వరకు ఇటుక బట్టీల వారు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా వ్యాపారం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. బోర్లం గ్రామ సమీపంలో నిర్వహించే ఇటుక బట్టీలవారు పక్కనే అడవి ప్రాంతం నుంచి కలప వాడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తమకేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పచ్చని పొలాల్లో... భూ పరిరక్షణ చట్టం 129/12 లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహించాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా పంట భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. మండల కేంద్రానికి కూత వేటులో దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు. ఆయా పంచాయతీల పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి. ఇదిలా ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో అసైన్డ్ భూముల్లో సైతం ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇటుక బట్టీల వ్యాపారులు అటువైపు నుంచి ప్రవాహిస్తున్న వాగుల్లోనే అయిల్ ఇంజన్లు, విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు మాత్రం కిమ్మనడంలేదు. వ్యాపారులదే హవా... ఇటుక బట్టీల నిర్వాహకులు అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను నడిపిస్తున్నారు. ఇటుక బట్టీలకు అనుమతి లేకుండానే విద్యుత్ చౌర్యం, అడవి నుంచి కలప అక్రమ రవాణా అధికారులు పట్టించుకోకపోవం మూలంగా వారు ఇష్టారాజ్యంగా దందాను కొనసాగిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుంటాం తమ పరిధిలోని ఏ ప్రాంతంలో అయినా ఇటుక బట్టీలు ఎక్కడెక్కడ ఎన్నాయో తెలుసుకుంటాం. అనుమతులు తీసుకున్న విషయం తెలియదు. పూర్తి సమాచారం తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. –సుదర్శన్, తహసీల్దార్, బాన్సువాడ. -
అక్రమ మైనింగ్‌కు అడ్డాగా కొత్తగూడెం జిల్లా
-
మాఫియాలతో బహుపరాక్!
ఎన్నికలు సమీపిసున్న వేళ అక్రమార్కులకు కళ్లెం వేయాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. ధనం, మద్యం ప్రవాహంతో పాటు మాఫియా సైతం విజృంభించే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, హుండీ, హవాలా దందాలపై డేగకన్నేయాలని పేర్కొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతానికి భిన్నంగా వ్యయం భారీగా పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ మించి ఆందోళనకర కోణాలు కేంద్ర నిఘా వర్గాలు వెలుగులోకి తెచ్చాయి. ధనం, మద్య ప్రవాహంతో పాటు మాఫియా సైతం విజృంభించే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా, ఓ దేశంలోని వివిధ ప్రాంతాలమార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు రకాలైన మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారలు ఉపయోగించుకుంటారు. ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థులు తమ అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ రెండింటితో పాటు అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాల్సిందిగా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేర్చి అక్కడ నుంచి వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. డీమానిటైజేషన్ తర్వాత ఈ సమస్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయినా... ఎన్నికల సీజన్లో పెరగవచ్చని అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఈ నేరం చేస్తున్న గ్యాంగ్‌లకు తోడు డిమాండ్ ఆధారంగా కొత్తవి కూడా పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందన్నాయి. దుబాయ్ కేంద్రంగా జరిగే హవాలా వ్యవహారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌ను డబ్బును అందిస్తే... అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీ చేస్తాడు. తాజాగా ఈ పంథా మారింది. దుబాయ్‌లో వ్యక్తుల నుంచి ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న దుబాయ్మాడ్యుల్తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. ఇక్కడ డెలివరీ చేయడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్ నేరాలు చేయించి ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు విశృఖలంగా పంజా విసురుతాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్ని భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చుల లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అనేక మార్గాల్లో మద్యాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడరు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందనేది నిఘా వర్గాల అంచనా. మిగిలిన మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై లేకున్నా... నకిలీ మద్యం వల్ల మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రమాదం కాదు..మాఫియా హత్యే!
ఒంగోలు(ప్రకాశం): తమ ఏకైక కుమారుడు పమిడి సాయిమనోజ్, మారిషస్ వాటర్‌ఫాల్‌లో పడి చనిపోయాడనే వాదన పూర్తిగా అవాస్తవమని, అక్కడి కాలేజీలో డ్రగ్స్ విక్రయాల గురించి తెలుసుకోవడం వల్లే మాఫియా విద్యార్థులతో కలిసి హత్యచేసిందని పమిడి సాయి మనోజ్ తల్లిదండ్రులు రమాదేవి, వెంకటస్వామిలు ఆరోపించారు. మంగళవారం స్థానిక సౌమ్య అపార్టుమెంట్‌లోని తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 2017 అక్టోబరులో తమ కుమారుడు మారిషస్‌లోని అన్నా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడన్నారు. ఆ తరువాత ఒకసారి ఇంటికి వచ్చాడని, ఈ సమయంలో కాలేజీలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తమతో చెప్పాడన్నారు. తిరిగి జనవరిలో మారిషస్‌కు వెళ్లాడని, అయితే గత ఏప్రిల్ 15న అతన్ని 5గురు ఫ్రెండ్స్ బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారన్నారు. ఇలా మూడు వారాల నుంచి బలవంతంగా తనను ప్రమాదకరమైన స్థలాల్లో పిక్నిక్కు తీసుకువచ్చినట్లు ఇండియాలోని స్నేహితులకు చాటింగ్ ద్వారా చెప్పాడని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, 16వ తేదీ ఉదయం 1.20 గంటలకు చెన్నైలో ఉన్న అన్నా మెడికల్ కాలేజీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. తమ కుమారుడు వాటర్‌ఫాల్‌లో పడిపోయాడని, పరిస్థితి క్రిటికల్ అంటూ ఫోన్ చేశారన్నారు. మరికొద్దిసేపటికే తమ బాబు మరణించాడని అతని స్నేహితులు ఫోన్‌చేసి చెప్పారని, కానీ యాజమాన్యం మాత్రం తప్పుడు సమాచారం అంటూ కొట్టిపారేసిందని చెప్పారు. ఉదయం 11గంటలకు మరలా ఫోన్‌చేసి చనిపోయాడని చెప్పారన్నారు. 19వ తేదీకి ముందు తమకు ఎలాంటి సమాచారం లేదని, 19వ తేదీన ఎయిర్‌పోర్టులో కొన్ని కాగితాలు అందించారన్నారు. కొన్ని వారాల తరువాత వాటిని పరిశీలిస్తే డ్రగ్స్ ముఠా విద్యార్థులతో కలిసి తమ కుమారుడ్ని చంపి ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు చిత్రీకరించినట్లుగా భావిస్తున్నామంటూ ఆరోపించారు. అనుమానం ఇలా: పిక్నిక్కు 40 మంది విద్యార్థులు బస్‌లో వెళితే కారులో 5గురు విద్యార్థులు తమ కుమారుడ్ని బలవంతంగా ఎలా తీసుకువెళ్లగలిగారనేదానితో తమకు అనుమానం మొదలైందన్నారు. వాటర్ ఫాల్లో నీరు కేవలం 3 నుంచి 4అడుగుల లోతు మాత్రమే ఉంటుందని, తమ కుమారుడు 5.10అడుగుల ఎత్తు ఉంటాడన్నారు. అంతమంది విద్యార్థులు, టూరిస్టులకు తెలియకుండా ఎప్పుడో ఎవరో గుర్తించి పైకి తీసేంత పరిస్థితి ముమ్మాటికీ అనుమానమేనని చెప్పారు. డెత్ రిపోర్టులో పల్మనరీ హేమరేజి అని చెబుతున్నారు. దీని ప్రకారం 24 గంటలు గడిచిన తరువాత మాత్రమే వ్యక్తి ఇటువంటి పరిస్థితికి లోనవుతాడని వైద్యులు చెబుతున్నారు. కానీ మా బాబు చనిపోయింది 6 గంటల్లోపే అని తెలిపారు. వాటర్ఫాల్లోనే మృతిచెందినట్లు రిపోర్టులు చెబుతుంటే కాలేజీ యాజమాన్యం మాత్రం.. ఆస్పత్రిలో మృతిచెందినట్లు చెబుతున్నారు. ఇటీవల తాము చెన్నైలోని ఆఫీసులో మాట్లాడేందుకు యత్నిస్తే అపాయింట్మెంట్ ఇచ్చారని.., తీరా అక్కడకు వెళితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటూ దబాయించారన్నారు. తాము కాలేజీ వద్దే మీడియాతో సమావేశం అవుతామని చెప్పడంతో చెన్నై హైకోర్టు అడ్వకేట్ సమక్షంలో కాగితాలను త్వరలోనే పంపిస్తామంటూ ఒప్పందం చేసుకొన్నారని తెలిపారు. కానీ ఇంతవరకు మరణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కు సంబంధించిన కాగితాలు ఏవీ ఇంతవరకు ఇవ్వకపోగా రెండు సంవత్సరాల తరువాత అయితే ఇస్తామని చెబుతున్నారన్నారు. శశికళకు బినామీ అట.. ఇటీవల నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి అన్నా మెడికల్ కాలేజీ యాజమాన్యం శశికళకు బినామీ అని, అందువల్ల కేసును క్లోజ్ చేసుకోవాలంటూ రెండు సార్లు సూచించడం మా అనుమానాన్ని మరింతగా బలపరిచిందన్నారు. తాము మెయిల్ ద్వారా కేసును క్లోజ్ చేయవద్దంటూ మారిషస్ పోలీసులకు సమాచారం పంపామన్నారు. దీనిపై కాలేజీ ఎండీ వైద్యలింగం తొలుత అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం మొత్తం తామే అని చెప్పారని, కానీ ఇప్పుడు తాము కేవలం అడ్మిషన్స్ మాత్రమే చూస్తామని, అది మారిషస్ కాలేజీ అని చెప్పడం తల్లిదండ్రులను నమ్మించి మోసం చేయడంగానే భావిస్తున్నామన్నారు. డిమాండ్ ఇదీ.. తమ కుమారుడి మృతికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు, సాక్షుల వాంగ్మూలం, ఫోరెన్సిక్ రిపోర్టు, హాస్పిటల్లో బాబుకు అందించిన ట్రీట్మెంట్ సమాచారం తదితరాల వివరాల కాపీలు అందించాలని తాము కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎంబసీ ద్వారా కూడా జరిగిన అంశంపై పోరాటం చేస్తూ తమ కుమారుడికి జరిగిన అన్యాయం మరో విద్యార్థికి జరగకూడదని, నిజం నిగ్గుతేలాలంటూ ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు మీడియా సమావేశంలో మనోజ్‌సాయి తల్లిదండ్రులు పమిడి రమాదేవి, వెంకటస్వామిలు తెలిపారు. -
చాప్టర్ IX
పోలీస్ కమీషనర్ బంగ్లా. లోధి ఎస్టేట్. న్యూఢిల్లీ.నేటినుంచి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనున్న సౌదీ అరేబియా.ఇసుక తుపాన్లతో, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధాని. రెండు రోజుల నుండి కురుస్తున్న....‘‘హలో...’’...భయాందోళనలో ప్రజలు. మరో నాలుగు రోజుల వరకు పరిస్థితి ఇలానే కొనసా...‘‘నానీ! టీవీ వాల్యూం కొంచెం డౌన్ చెయ్. హలో.. కమిషనర్ అరవింద్ కుమార్ స్పీకింగ్..’’‘‘హలో అరవింద్ సర్! నేను రమేష్‌ని మాట్లాడుతున్నా. పదేళ్ళ క్రితం ఏలూరులో మీ సబార్డినేట్‌గా పనిచేశాను సర్.’’‘‘హే రమేష్! ఎలా ఉన్నావ్? ఏంటి ఇంత సడన్‌గా కాల్ చేశావ్? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ?’’‘‘అందరూ బావున్నాం సర్. ఒక ఇంపార్టెంట్ విషయం చెబ్దామని కాల్ చేశా. పదేళ్ళక్రితం మనం ఏలూరులో పనిచేసేటప్పుడు అన్ సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయిన రైల్వే హాకర్ మర్డర్ కేస్కి ఫైనల్‌గా సమాధానం దొరికింది సర్.’’‘‘వా... వాట్? కమ్ అగైన్.’’‘‘మీకు తెలిసే ఉంటుంది.. త్రీ డేస్ బ్యాక్ డెబ్బై రెండేళ్ళ నాగ్‌పూర్ మాఫియా డాన్ విలాస్ రావ్ దండేర్కర్ హార్ట్ అటాక్‌తో చనిపోయిన సంగతి. ఆఖరి కోరికగా తను చనిపోయిన తర్వాత వాడి ఆటో బయోగ్రఫీ విడుదల చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పి బుక్స్ కూడా ఎప్పుడో ప్రింట్ చేయించేశాడంట సర్.’’ ‘‘సో..?’’‘‘ఆ బుక్ ‘మై కన్ఫెషన్స్ – విలాస్ రావ్ దండేర్కర్’ మార్కెట్లోకి నిన్నే రిలీజ్ అయ్యింది. ఆ బుక్‌లో చాప్టర్ 9 మీరొక్కసారి చదవండి సర్.’’‘‘కమాన్ రమేష్! అసలేముంది ఆ బుక్‌లో? ఏలూరులో జరిగిన మర్డర్‌కి, నాగ్‌పూర్ మాఫియా డాన్‌కి సంబంధం ఏంటి?’’‘‘బిలీవ్ మీ సర్. ఒక్కసారి చదవండి. మూడేళ్ళు ఆ కేస్ మీద మీరు పడ్డ స్ట్రగుల్‌కి ఆన్సర్ దొరుకుతుంది.’’‘‘ఓకే... ఓకే... డెఫినెట్‌గా చదువుతాను. బట్...’’‘‘పదేళ్ళ నాటి మర్డర్ మిస్టరీ వీడిపోయింది సర్. అది నేను చెప్పడం కంటే మీరు చదివి తెలుసుకుంటేనే బావుంటుంది. చాప్టర్ 9. బై సర్.’’‘‘ఓకే రమేశ్.. బై.’’ పోలీస్ కమిషనర్ అరవింద్ ఫోన్ పెట్టేశాడు.‘‘వాట్ హాపెండ్ డాడ్? ఎవరు ఫోన్లో..’’ అరవింద్ కొడుకు నాని అడిగాడు.‘‘నథింగ్. నేను బైటకి వెళ్తున్నా నానీ.’’‘‘ఇంత పెద్ద వర్షంలోనా? కమాన్ డాడ్.. మీరేగా కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామన్నారు..’’.‘‘సారీ నానీ! ఐ హావ్ టు గో నవ్. రియల్లీ సారీ. డిన్నర్ చేసేయ్, నాకోసం వెయిట్ చెయ్యకు.’’‘‘ఎంత టైం పడుతుంది డాడ్? ఆఫీస్ వర్కా? కాదంటే చెప్పండి ఈరోజు డ్రైవర్ రాలేదుగా నేనొచ్చి కార్ డ్రైవ్ చేస్తా...’’ ‘‘నో. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతోందో. ఇట్స్ నాట్ సేఫ్ అవుట్ దేర్. మ్యాచ్ చూసి డిన్నర్ చేసి పడుకో. చిన్న పనే. చూసుకుని నేను వచ్చేస్తా.’’కార్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది.హెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. వైపర్స్ అటూ ఇటూ కొట్టుకుంటున్నాయి. కారు బంగ్లానుండి బయటకి వచ్చింది. అరవింద్‌ని కారు ముందుకి తీసుకువెళ్తోంటే... కాలం వెనక్కి తీసుకెళ్తోంది. 2008. ఏలూరు.గంటకి 182 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనున్న తుఫాన్......దేశంలోని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న ఆ దేశ ప్ర...నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా......రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన సంఘటనకి...‘‘అబ్బబ్బబ్బా.. రేయ్ నానీ! ఒక్క చానల్ ఉంచలేవా, అస్తమానూ మారుస్తూ ఉంటావ్. అసలే అర్ధరాత్రెళ్లిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. చూస్తుంటే ఈ వానేమో ఆగి చచ్చేట్టులేదు. ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నకోసారి ఫోన్ చెయ్.’’ టీవీ చూస్తున్న నానీతో అరుస్తున్నట్టు మాట్లాడింది వాళ్లమ్మ. పచ్చదనానికి, ప్రశాంతతకి నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు నగరం అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలిన తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో తుపాకీతో చేసిన హత్య ఇదేమొదటిదవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని జిల్లా ఎస్పీ అరవింద్ కుమార్ గార్ని అడిగి తెలుసుకుందాం.‘‘అమ్మా! ఇలా రా. ఫోనెందుకు, డైరెక్ట్‌గా టీవీలో చూద్దువుగాని నాన్నని.’’ అన్నాడు నాని చిన్నగా నవ్వుతూ. ‘‘ఇట్స్ ఎ క్వైట్æ షాకింగ్ ఇన్సిడెంట్ టు అస్. గన్ కల్చర్ అనేది ఈ జిల్లాలో ఇప్పటివరకు లేదు. సమ్ వన్, మేబీ సమ్ పీపుల్.. ఈ ఊరు పద్ధతుల్ని మార్చాలని అర్ధరాత్రి అలా జస్ట్ లైక్ దట్ ట్రిగ్గర్ పుల్ చేశారు. ఒక మనిషిని చంపారు. ఈ ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో హాకర్ అతను. పేరు నిమ్మకాయల నాగరాజు అలియాస్ రాజు. వి ఆర్ టేకింగ్ దిస్ కేస్ వెరీ సీరియస్ అండ్ హియర్ అయాం గివింగ్ మై వర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఏలూరు – డోంట్ పానిక్. వి విల్ హంట్ దిస్ గై డౌన్ అండ్ బ్రింగ్ బాక్ పీస్ టు ది సిటీ..’’ మీడియాతో మాట్లాడి పక్కకొచ్చాడు అరవింద్. ‘‘రమేశ్! కమాన్ కమ్ హియర్. ఇంత వర్షంలో కూడా ఎలా వచ్చింది ఈ బ్లడీ మీడియా. అసలు జనాన్ని సగం భయపెట్టేది వీళ్లే. జనం బాగా భయపడుతున్నారని వాళ్లకి కొంచెం ధైర్యం చెబుదామని నేనే మాట్లాడా. సరే! కేస్ గురించి రైల్వే పోలీస్ ఏమంటున్నారు?’’ సబార్డినేట్ రమేశ్‌ని పిలిచి ప్రశ్నించాడు అరవింద్. ‘‘అదే సర్! వాళ్ళు హేండిల్ చేస్తారంట ఈ కేస్‌ని.’’‘‘హేండిల్ చేస్తారా? ఎవరు వాళ్ళేనా? అయినా కేస్ గురించి వాళ్ళనెవడగుతాడు రమేశ్. సొసైటీ, మీడియా, హయ్యర్ అథారిటీస్ అందరూ పడేది మనమీదేగా. వాళ్ళు గనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓ పదేళ్ళు పడుతుంది కేస్ క్లోజ్ చెయ్యడానికి. చెప్పు... కేస్ మనమే తీసుకుంటున్నామని.’’‘‘ఓకే సర్ మాట్లాడతా. రాజు బాడీని అటాప్సీకి పంపించేశాం సర్. నిన్నరాత్రి రాజుతో పాటున్న ఇంకో రైల్వే హాకర్ శీనుని రైల్వే పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నాం. ఏడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పడంలేదు. షాక్‌లోనుండి ఇంకా తేరుకోలేదనిపిస్తోంది సర్.’’‘‘ఓకే! లెట్స్ సీ. పదండి’’.అరవింద్, రమేశ్ బయల్దేరారు. ‘‘ఈ రూమ్‌లో లైట్స్ లేవా? ఆన్ చెయ్యండి. వీడేనా?’’ అరవింద్ గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ‘‘ఎస్ సర్!’’‘‘ఆ కిటికీలు మూసేయండి. జల్లు పడుతోంది లోపలకి. నీ పేరేంటి?’’‘‘సర్ అడుగుతున్నారుగా సమాధానం చెప్పు.’’‘‘సారు. నా పేరు శీనండి.’’ శీను నోరువిప్పాడు భయపడుతూ. ‘‘రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంటావ్?’’ ‘‘ప్లాట్ఫారంమీద, రైల్లో కూల్డ్రింకులు, వాటర్ బాటిల్లు అమ్ముతాను సారు.’’‘‘రాజు నీకెలా తెలుసు?’’‘‘రేయ్ రేయ్... ఆపరా ఆ ఏడుపు. ఇది సర్ వీడి పరిస్థితి. వాడి పేరెత్తంగానే వీడేడుపెత్తుకుంటున్నాడు.’’ రమేశ్ కోపంగా అన్నాడు.‘‘వాడ్ని వీడే చంపేసుంటాడు రమేశ్. మనదగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు.’’‘‘సారు...?’’‘‘మరేంటి చెప్పు. ఇటు చూడు శీనూ! ముందు నిన్నరాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా నువ్వు ఆలస్యం చేసిన ప్రతి సెకనూ హంతకుడు పారిపోవడానికి హెల్ప్ అవుతుంది. హంతకుడికి హెల్ప్ చేస్తావా నువ్వు?’’‘‘లేదు సారు... లేదు. సెప్తా. రాజుగాడు, నేను సిన్నప్పట్నుండి స్నేహితులం సారు. పక్క పక్క ఇళ్లు. కలిసి పెరిగాం. ఒకేసోట సదువుకున్నాం. ఇప్పుడొకేసోట పనిజేత్తన్నాం సారు. ఆడు కూడా నాలానే ఇక్కడ కూల్డ్రింకులు, వాటర్ బాటిళ్లు అమ్ముతాడు. రోజూ ఇదే పనండి మాది. రోజూలానే నిన్న కూడా పన్లోకొచ్చాం. కానీ ఆ మాయదారి వాన పడకుండా ఉండుంటే రాజుగాడికి ఈ సావు తప్పేది సారు.’’‘‘ఊరుకో ఊరుకో. ఏడవకు. వానకి, రాజు హత్యకి సంబంధమేంటి?’’‘‘నిన్న కురిసిన వానకి స్టేషన్లో ఆఫీసర్లందరూ ఇంటికెళ్లిపోయారు సారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారొక్కరే ఉండిపోయారనుకుంట. పయానం సేసేదానికి జనం కూడా గుబులు పడ్డట్టున్నారు.ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. మేము కూడా ఇంటికి పోయేటోల్లమే కానీ కాలక్షేపానికి కబుర్లు సెప్పుకుంటా అలా ఉండిపోయాం. ఆ సరదా కబుర్లే ఇంత కొంప ముంచిద్దనుకోలేదు సారు.’’‘‘కరెక్ట్‌గా చెప్పు నిన్నరాత్రి ఏం జరిగిందో...’’‘‘సెప్తా సారు. నిన్నరాత్రి........... అప్పటికే రాత్రి పదకొండున్నర దాటింది.‘ఏరా రాజు. ఇంకిటికి పోదామా?’ అన్నాను నేను. ‘వెల్దాంలేహె! ఓ కంగారెందుకురా. ఆ స్పెషల్ ట్రైన్ కూడా సూసేసి పోదాం.’ అన్నాడు రాజుగాడు. సిగరెట్ తాగుతా, ‘ఆహా శీనుగా. భలే మజాగా ఉందిరా ఈ వానలో సిగరెట్టు తాగుతుంటే.’ అన్నాడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 07101 సికింద్రాబాద్ నుండి కాకినాడ వెళ్ళవలసిన సూపర్‌ఫాస్ట్ స్పెషల్ 11:45కి ప్లాట్ఫారం నంబర్ రెండు మీదకి వస్తుంది అని వినిపిస్తుంటే ‘ఒరేయ్ శీనుగా! ఎందుకురా అదలా ఓ కూత్తది. అయినా ఏ నా కొడుకున్నాడు ఈ స్టేషన్లో దాని మాటలిండానికి.’ అంటూ ఉషారుగా మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ట్రైనొచ్చింది సారు. మేమిద్దరం అలాగే కబుర్లు సెప్పుకుంటున్నాం. ఏం సూసాడో ఏమో కానీ, ట్రైన్ ఆగుతుండగా డ్రింక్ బాటిల్లు వాటర్ బాటిల్లు ఉన్న ట్రే పట్టుకుని ట్రైన్ కేసే పరిగెత్తాడు రాజుగాడు. బండాగే దిక్కుకి నా ఈపెట్టి కూసోడంతో రాజుగాడ్ని ఎవరు పిలిసారో నాకు కనపడ్లేదు సారు. కానీ ఆ బండికున్న మొత్తం డోర్లు కిటికీలు అన్నీ యేసేసున్నాయి సారు ఒక్క కిటికీ తప్ప. వాన జోరుగా పడతానే ఉంది. మావోడు వానలో తడుత్తానే తీసిన ఆ కిటికీ ఉన్న పెట్టె దగ్గరకి పరిగెత్తుకుంటా ఎల్లాడు.’’‘‘ఓకే. రాజు ఆ కిటికీ దగ్గరకెళ్ళిన తర్వాత ఏం జరిగింది?’’‘‘అదే తెలియదు సారు. పెట్టె నాకు శానా దూరంలో ఆగింది. ఆడు కిటికీలోనుండి ఎవరితోనో మాట్టాడాడు. తర్వాత ఎనక్కి తిరిగి నా వంక సూసి నవ్వాడు సారు.’’‘‘వాట్. నీ వంక చూసి నవ్వాడా? ఎందుకు?’’‘‘తెలియదు సారు. నా వంక సూసి నవ్వాక మళ్లీ కిటికీకేసి తిరిగాడు. అంతే బండి కూత పెట్టడం, ముందుకి కదలడం, రాజుగాడు నున్చున్నోడు నున్చున్నట్టే ఫ్లాట్‌ఫారం మీద పడటం.. అన్నీ సిటికెలో జరిగిపోయినాయి సారు. నేను పరిగెత్తుకెల్లి సూసేసరికి అక్కడంతా రక్తం. అటు పక్కకి పడున్న రాజుగాడ్ని నాకేసి తిప్పాను సారు. అంతే! తలంతా రక్తం. నుదురుకి బెజ్జం పడి రక్తం వత్తానే ఉంది. ఆడ్ని పిలిశా. కొట్టా. ఏ ఉలుకూ పలుకూ లేకుండా అలా పడున్నాడు. నాకు బయ్యమేసి ఎంటనే 108కి కొట్టా సారు. పోలీస్ సార్లక్కూడా సెప్పా. ఆల్లొచ్చి సూసి పాణం లేదన్నారు. రాజుగాడ్ని తీసుకొచ్చి పొడి ప్రాంతంలో పొడుకోబెట్టాం. తర్వాత ఎనక్కి తిరిగి సూసేసరికి ఫ్లాట్ఫారంమ్మీద ఒక్కటంటే ఒక్క రక్తం సుక్క ఆనవాలన్నా లేకుండా ఆ వాన దేవుడు అంతా నీటితో కడిగేశాడు సారు. ‘‘ఊరుకో శీను. రమేశ్! తనకి మంచి నీళ్ళు ఇవ్వండి.’’ లేచాడు అరవింద్. శీను దగ్గర్నుంచి అంతకన్నా మించి ఇంకే సమాధానం వస్తుందని అతననుకోలేదు. ‘‘సర్ ఆటాప్సీ రిపోర్ట్ వచ్చింది. 9 ఎంఎం బుల్లెట్ క్లోజ్ రేంజ్డ్ స్ట్రయిట్ హెడ్ షాట్ సర్. ఫింగర్ ప్రింట్స్ ఏం ట్రేస్ చెయ్యలేకపోయాం. నాకు ఈ కేస్‌లో విట్నెస్ దొరకడం కూడా ఇంపాజిబుల్ అనిపిస్తోంది సర్.’’ రిపోర్ట్ పట్టుకొని చెబుతూ ఉన్నాడు రమేశ్. ‘‘వై ఈజ్ దట్ రమేష్?’’‘‘ఆ రోజు వచ్చింది డైలీ ట్రైన్ కాదు సర్, స్పెషల్ ట్రైన్. అండ్ తుఫాన్‌కి తొంభై శాతం మంది జనం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మేము గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ క్లాస్ స్లీపర్ మొత్తం ఆరోజు 50 మంది మాత్రమే ప్రయాణం చేశారు. శీను చెప్పినదాని ప్రకారం చూస్తే ఆరోజు విండో ఓపెన్ చేసుంచిన కోచ్ 9 అని సస్పెక్ట్ చేసి పాసెంజర్స్ లిస్ట్ తీసుకున్నాం. ఆరోజు 9లో ముగ్గురు మాత్రమే ప్రయాణించారు సర్. భార్యాభర్తలిద్దరూ అండ్ ఒక స్టూడెంట్. వాళ్ళ బాక్గ్రౌండ్ వెరిఫై చేశాం. అంతా క్లీన్‌గా ఉంది. విడివిడిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురూ కూడా నాలుగో వ్యక్తిని చూడలేదనే చెప్పారు సర్. ఫైనల్లీ ఆరోజు జనమెక్కువ లేరని టీసీ కూడా టికెట్ చెకింగ్‌కి వెళ్లలేదంట సర్.’’ రమేశ్ తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ‘‘వాట్ ఈజ్ దిస్ రమేశ్! ఇంకొన్ని రోజులాగితే హంతకుడే ఆరోజు తుఫాన్ తెప్పించాడంటారా? అసలు అంత పెద్ద కోచ్‌లో ఆ ముగ్గురికి కనపడకుండా ఇంకో వ్యక్తి ఉండటానికి అవకాశం లేదంటావా? వీళ్ళు కోచ్‌కి ఒక ఎండ్‌లో ఉండి నాలుగో వ్యక్తి ఇంకో ఎండ్‌లో ఉండే అవకాశం లేదంటావా?’’‘‘ఆ అవకాశం ఉంది సర్. కానీ ఆరోజు ట్రైన్ ఏలూరు నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత వర్షం ఇంకా పెద్దది కావడంతో ట్రైన్‌ని కొవ్వూరులో నాలుగు గంటలపాటు ఆపేశారు. ఆ సమయంలో కోచ్‌లో ఉన్న ముగ్గురూ ఆ నాలుగో వ్యక్తిని చూసే అవకాశం లేదంటారా సర్?’’‘‘రైట్. అంటే వాడు ఆ కోచ్‌లో ఎక్కువసేపు ఉండుండడు. మనం ఎక్కడో ఏదో పాయింట్ వదిలేస్తున్నాం రమేశ్. ఒక రైల్వే హాకర్‌ని గన్‌తో కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పైగా రాజుకి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా గన్‌తో కాల్చేంత స్కెచ్ వెయ్యగలరని నేననుకోవడం లేదు. హత్యకి క్లూ దొరకలేదు. మోటివ్ కనిపించట్లేదు. విట్నెస్ కూడా లేరు. ఇదంతా పకడ్బందిగా చేసిన హత్యా లేదా ఎవరైనా ఆకతాయిల పనా? ఎవరు చేసుంటారు రమేశ్ ఇదంతా?’’ ‘‘.... ఎవరు? ఎవరు?’’. కాలం పదేళ్లనాటి సంగతుల్ని, కారు పావుగంట ప్రయాణాన్ని ముగించుకుని ఆక్స్ఫర్డ్ బుక్‌స్టోర్ ముందుకొచ్చి ఆగాయి.‘‘గుడ్ ఈవినింగ్ సర్! హౌ మే ఐ హెల్ప్ యు?’’ నవ్వుతూ పలకరించాడు స్టోర్‌కీపర్. ‘‘యా! డూ యు హావ్ ద బుక్ ‘మై కన్ఫెషన్స్’ బై విలాస్ రావ్ దండేర్కర్?’’ అరవింద్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.‘‘జస్ట్ ఏ సెకండ్ సర్! యా వియ్ హావ్ ద బుక్ సర్. ఓవర్ దేర్ సిక్స్త్ రో ఫోర్త్ రాక్ సర్.’’ చెయ్యి ఆ రేక్ వైపు చూపిస్తూ చెప్పాడు స్టోర్‌కీపర్. ‘‘థాంక్యూ.’’ అంటూ ఆ రేక్ వైపుకు బయలుదేరాడు అరవింద్. బుక్ అందుకొని నేరుగా చాప్టర్ 9 ఉన్న పేజీకి వెళ్లిపోయాడు. చాప్టర్ IX నా తోడబుట్టిన తమ్ముడే నన్ను చంపాలనుకున్నాడు. చంపి నా కుర్చిలో కూర్చుని నేను నిర్మించిన చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. భాయ్ భాయ్ అని ఆప్యాయంగా పిలుస్తూనే నన్ను చంపడానికి నా వెనుక పెద్ద కుట్ర రచించాడు.2008. అక్టోబర్. నాగ్‌పూర్‌లో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. తెల్లవారుజామున నాగ్‌పూర్ నుండి పెళ్లికని కారులో బయలుదేరి వెళ్తున్న మామీద దారి మధ్యలో ఎటాక్ జరిగింది. మేం కూడా వాళ్లమీద తిరిగి కాల్పులు జరిపాం. ఏడుగురున్న మా గుంపులో నలుగురు స్పాట్లో చచ్చిపోయారు. అందులో వికాస్ బాడీలో 32 బుల్లెట్లు దిగాయి నన్ను కవర్ చేసినందుకు. మిగిలిన ఇద్దర్ని నాగ్‌పూర్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోమని పంపించి నేను ఆంధ్రా పారిపోయా. నా ప్రయాణమంతా వర్షమే. నేను తప్పించుకోవడానికి ఆ వర్షమే నాకు తోడయ్యింది. నేను ఆంధ్రాలోని వరంగల్ చేరే వేళకి చీకటి పడుతుంది. నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగే ఒక ఆంధ్రా స్నేహితుడి దగ్గరకి వెళ్ళడానికి వరంగల్‌లో ట్రైన్ ఎక్కాను.ట్రైన్ అంతా దాదాపు ఖాళీగా ఉంది. వర్షాల వల్లనేమో ట్రైన్కున్న డోర్లు, కిటికీలు అన్నీ మూసేశారు. ట్రైన్ ఎక్కినప్పటినుంచి ఏ కోచ్‌లోనూ అరగంటకి మించి ఎక్కువసేపు ఉండలేదు నేను. ప్రమాదం నాకెంత దూరంలో ఉందో తెలియక ప్రతి అరగంటకి ఒక్కో కోచ్ మారుతూ పోయా. ఏ కోచ్‌లోనూ పెద్ద జనం లేరు. నా అరవయ్యేళ్ళ వయసుకి నన్ను అనుమానించినవారు, ప్రశ్నించినవారు ఎవ్వరూ లేరు. ఓ రెండు గంటల తరవాత ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో అలా!మెలకువొచ్చేసరికి ట్రైన్ మెల్లగా వెళ్తోంది. బాగా దాహం వేసింది. ట్రైన్ విండో ఐరన్ షట్టర్ పైకెత్తి బయటకి చూశా. వర్షం, చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాయి. చీకటి తప్ప బయటేమీ కనిపించలేదు. చాలాసేపట్నుంచి అదే కోచ్‌లో ఉండిపోవడంతో వెంటనే లేచి వేరే కోచ్‌కి వెళ్ళిపోయా. నా దాహానికి గొంతెండుకుపోయింది. ఏదైనా స్టేషన్ వస్తుందేమోనని షట్టర్ పైకెత్తి బయటకి చూస్తూనే ఉన్నా. మెల్లగా నా గొంతు పిడచకట్టుకుపోయింది. లాలాజలం ఊరక నాలుక ఎండిపోయి నోట్లో అటూ ఇటూ తిప్పడానికి కూడా కష్టంగా తయారయ్యింది. అప్పుడే జీవితంలో నీళ్ల విలువేంటో తెలిసింది. కిటికీలోనుండి నా కుడిచేయి బయటకి పెట్టా. వాన నీటికి తడిచిన చేతి వేళ్లని నాలుక మీద రాసుకున్నా. తేడా తెలియలేదు. నీళ్ళే కావాలి తాగడానికి. చూశా, చూశా, చూస్తూనే ఉన్నా. ట్రైన్ వెళ్తోంది కానీ ఏ స్టేషన్లోనూ ఆగట్లేదు. ఆ సమయంలో నీళ్ల కోసం నేను పడిన యాతనతో పోల్చుకుంటే ఇన్నేళ్ల నా జీవితంలో నేనసలు ఏ బాధలూ పడలేదనే చెప్పాలి. నేను నా ప్రాణాన్ని లెక్కచెయ్యను కానీ ఇంకిలాంటి బాధ ఎక్కువసేపు పడలేననిపించింది. ఎక్కడో నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన నాకు, ఇక్కడింత బాధేంటో అని అనుకుంటుండగానే ట్రైన్ వేగం తగ్గింది. షట్టర్ పైకెత్తి చూశా. ఏదో స్టేషన్ వచ్చింది. ఆనందంలో వాటర్ బాటిల్స్ ఎక్కడున్నాయో అని ప్లాట్ఫారం మీద వెతికాను. కనిపించాయి. రెండు ట్రేల్లో వాటర్ బాటిల్స్, డ్రింక్స్ పక్కన పెట్టుకుని ప్లాట్ఫారం మీద కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు మనుషులు కనిపించారు. నేను ట్రైన్లో నుండి చెయ్యి బయటకి పెట్టి ఊపుతూ వాటర్ అని బొటన వేలు చూపించా. ఇద్దరిలో ఒక వ్యక్తి నన్ను చూసి ట్రే తీసుకుని నేనున్న కోచ్ వైపుకి పరిగెత్తాడు. ట్రైన్ ఆగింది. వర్షం మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఆ మనిషి ట్రే పట్టుకుని నా దగ్గరకు రాగానే వాటర్ బాటిల్స్ అని చెప్పి నా పర్స్లోనుండి చేతికి తగిలిన నోటు తీసి అతనికిచ్చా. వర్షంలో తడిసిపోతుందని అతను నా చేతిలో ఉన్న నోటుని టక్కున లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు చూశా, అది వెయ్యి రూపాయిల నోటు. అతను నోటుని తీసుకుని జేబులో పెట్టుకుని వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా వెనక్కి తిరిగి అక్కడెక్కడో కూర్చుని ఉన్న ఇంకొకడి వైపు చూసి నవ్వాడు. వాడలా ఎందుకు నవ్వాడో ఆ క్షణంలో నాకర్థం కాలేదు. అలా నవ్వుతూనే వాడు నా వైపుకి తిరిగి మెల్లగా వెనక్కి జరిగాడు. నేను ట్రే వైపు చూపిస్తూ బాటిల్స్ అని కళ్ళతో అడిగా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కానీ బాటిల్స్ ఇవ్వడం లేదు. అప్పుడర్థమైంది వాడు నన్ను మోసం చెయ్యబోతున్నాడని. నేను డబ్బుల్ని లెక్క చెయ్యను కానీ నాకివ్వాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వకుండా నా నుండి, వర్షం నుండి వెనక్కి జరుగుతుంటే కోపంతో నేను వాడ్ని అలా చూస్తూ ఉండిపోయా. వాడు కూడా ఈ అరవయ్యేళ్ళ ముసలోడు ఏం చేస్తాడ్లే అనే ఆలోచనతోనేగా నన్నిలా మోసం చేశాడు. నా జీవితంలో వాడికంటే దారుణమైన మనుషుల్ని చూశా. వాడినలాగే చూస్తూ నలభై ఏళ్లుగా నా వొంట్లో ఒక భాగమైపోయిన దానికోసం కుడి చేయి వెతికింది. పక్కన పెట్టిన కోట్లోకి చెయ్యి పోయింది.దొరికింది నా స్టార్ పిస్టల్. 92 మోడల్. టక్కున తీసి కిటికీలోపలనుండే ఆ మనిషికి గురి పెట్టా. అది కనబడగానే ఆ మనిషి మొహమ్మీద నవ్వు మాయం అయింది. గన్ చూడగానే చాలామంది షాక్‌లోకి వెళ్లిపోతారు. మెదడు మొద్దుబారిపోతుంది. వాడు కూడా షాక్లోకెళ్లిపోయాడు. వాడికి తగిలిన షాక్ భయంగా మారే సమయంలోనే... అసలు ఏం జరుగుతుందో మెదడుకి అర్థమయ్యే సమయంలోనే ట్రైన్ హార్న్ బ్లో చేశారు. నేను ట్రిగ్గర్ నొక్కాను. ట్రైన్ మెల్లగా కదిలింది. బులెట్ వేగంగా వెళ్లి వాడి నుదురిని చీల్చి తల్లోపలికెళ్లింది. వాడి చేతిలో ఉన్న ట్రే ఎగిరిపడింది. బాటిల్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. వాడు నున్చున్నోడు నున్చున్నట్టే కుప్పకూలిపోయాడు. ప్లాట్ఫారం మీద చిమ్మిన వాడి రక్తం వర్షం కడిగెయ్యడమే నాకాఖరిగా కనిపించింది. అప్పుడంటే ఉద్రేకంలో చేశా కానీ, తర్వాత నా జీవితంలో ఈ సంఘటన తలచుకుని చాలాసార్లు బాధపడ్డాను. ‘‘సర్! ఎక్స్క్యూజ్ మీ సర్. వి ఆర్ క్లోజింగ్. డు యు వాంట్ ద బుక్, సర్?’’ స్టోర్‌కీపర్ మాటలతో చాప్టర్ 9 నుంచి బయటకొచ్చాడు అరవింద్. ‘‘యా! బిల్ ఇట్ ఫర్ మీ.’’ అన్నాడు ఏ భావం లేకుండా. కమిషనర్ అరవింద్ కుమార్ బుక్ స్టోర్ బైట గోడకానుకుని బంగారు కాంతిని వెదజల్లే సోడియం లైట్ల వెలుగులో వర్షాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు –‘పదేళ్ల క్రితం ఓ వర్షం పడిన రాత్రి జరిగిన మర్డర్ మిస్టరీకి సమాధానం ఈరోజు రాత్రి ఈ వర్షంలో తెలిసింది. నిజంగా వర్షానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదంతా జస్ట్ కో ఇన్సిడెన్సా? ఏమో నిజంగా మనిషి మెదడుకి అందని విషయాలు ఇంకా ఎన్నున్నాయో!’అదే సమయంలో టీవీ చూస్తూ అరవింద్ కొడుకు నానీ కూడా తనలో తాను అనుకుంటున్నాడు – ‘డాడ్ ఇంకా రాలేదేంటి? ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసి పడుకోమన్నారుగా డాడ్, ఇప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేమో?’టీవీ మోగుతూనే ఉంది – బ్రేకింగ్ న్యూస్... బ్రేకింగ్ న్యూస్...ఢిల్లీ జన్‌పథ్ రోడ్లో బ్రేక్స్ ఫెయిలయిన ఒక ట్రక్ రెండు బైకులు, ఒక కారు మీదనుండి దూసుకెళ్లడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడుతుండటం వల్ల సహాయక చర్యలకి ఆలస్యమవుతుందని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాక్సిడెంట్‌కి గురైన కారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వశాఖ ఉన్నతాధికారిదని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ కారులో ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. - కె.ఎన్. మనోజ్ కుమార్ -
వైద్యఅంగడిలో బందిపోట్లు
బందిపోట్లు స్టెన్‌గన్‌లతో దోచుకుంటే స్టెతస్కోప్‌లతో వైద్యం చేసే డాక్టర్లు స్టెంట్ పోట్లతో రోగుల గుండెల్లో పొడిచారు. ఒక లాయర్ సాంగ్వాన్. ఫరీదాబాద్‌లో తన మిత్రుడికి కరొనరీ స్టెంట్ కావాలంటే వైద్యశాలకు వెళ్లాడు. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి వీలుగా తీగతో అల్లిన స్టెంట్ అనే వస్తువును మూసుకుపోయిన గుండెనాళాల్లో అమరుస్తారు. ఆ స్టెంట్ గరిష్ట ధర ఎంత అనడిగితే చెప్పేవాడే లేడు. మీరు కొన్న రశీదు ఇవ్వండి అంటే అదీ ఇవ్వడు. పోనీ నాకు ఈ ధరకు స్టెంట్ అమ్మినట్టు రశీదు ఇవ్వండి అంటే అదీ లేదు. ఆ నల్లకోటు లాయర్ ఈ తెల్లకోటు వ్యాపారుల దోపిడీమూలాలు కనుక్కోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. మనదేశంలో చికిత్స పేరుతో కొందరు డాక్టర్ల తెల్లకోటు చాటున ఆరులక్షల 70 వేల కోట్ల రూపాయల నల్ల దందా జరుగుతున్నదని తేల్చాడు సాంగ్వాన్. ఈ దేశంలో రూ. 3,300 కోట్ల దాకా కరొనరీ స్టెంట్ల పరిశ్రమ వర్థిల్లుతున్నది. అసలా రోగికి స్టెంట్ అవసరమా లేదా అనేది వేరే కుంభకోణం. స్టెంట్ ధర దానికదే ఒక భయంకరమైన కుంభకోణం. మనదేశంలో కార్డియోవాస్కులార్ సమస్యలతో, గుండెపోటు తదితర గుండె జబ్బులతో మృత్యుముఖంలోకి వెళుతున్న అయిదు కోట్ల మందికి బతకాలంటే స్టెంట్లు తప్పనిసరి అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ డాక్టర్ కార్పొరేట్ అనైతిక వ్యాపార సంబంధాల వల్ల నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి నిరంతర కృషి చేయడం వల్ల జనించిన కృత్రిమ స్టెంట్ మార్కెట్ విపరీత లాభాపేక్షా దుర్బుద్ధిని మరింత పెంచింది. వీరు స్టెంట్‌ను అసలు ధర కన్న 654 శాతం ఎక్కువకు అమ్ముతున్నారు. మన వైద్యవస్తువులు ఔషధాల ధరలను నిర్ధారించే జాతీయ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ సంస్థ ఇన్నాళ్లూ ఏంచేసిందో తెలియదు కాని ఫిబ్రవరి 13, 2017 నాడు కోటింగ్ లేని అసలు స్టెంట్ ధర 7,260 రూపాయలకన్న మించరాదని చెప్పింది. లక్షలాది మంది హృద్రోగులు హృదయంలేని హృదయ సజ్జనుల (సారీ.. సర్జనుల) దోపిడీకి బలైన తరువాత, సాంగ్వాన్ వంటి సామాన్యులు ఆర్టీఐ ద్వారా పిల్ ద్వారా ఈ కుంభకోణాన్ని బయటికి తీసిన తరువాత తీరిగ్గా ఈ ధరానిర్ధారణాధికార సంస్థ ఈ రహస్యాన్ని ప్రకటించింది. ఔషధాన్ని స్రవించే అత్యాధునిక స్టెంట్‌ను కూడా 29 వేల 600 రూపాయల కన్నా ఎక్కువ ధరకు అమ్మకండిరా తెల్ల వ్యాపారుల్లారా అని చెప్పిందా? స్టెంట్ కొనుక్కున్న గుండె వ్యాపారులు ఇప్పటివరకు ఎంత చెల్లించారో లెక్కవేసుకోండి. అప్పటిదాకా రూ. 7,260ల స్టెంట్‌ను ఈ దొంగలు రూ. 45 వేలకు, రూ. 29,600ల అత్యాధునిక స్టెంట్‌ను లక్షా 20 వేలకు సగటున కొన్నేళ్ల పాటు అమ్ముకున్నారు. సాంగ్వాన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మెట్రో హాస్పిటల్ వారు 3.2 లక్షల రూపాయల కన్న ఎక్కువ వసూలు చేశారని పేర్కొన్నారు. సాంగ్వాన్ వరసగా ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ మొత్తం 54 ఆస్పత్రుల వారు రకరకాల రేట్లు వేసి గుండెలో స్టెంట్ పేరుతో నెత్తురు తోడుకున్నారని వివరించారు. స్టెంట్లను కూడా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చి వాటి ధరలను ఇష్టం వచ్చినట్టు వైద్యశాలలు పెంచకుండా నిరోధించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు భారత రసాయనిక, ఎరువుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాని కొన్ని నెలలయినా ఏ చర్యా తీసుకోలేదు. అక్టోబర్ 2015 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ కోర్టుధిక్కార పిటిషన్ వేయకతప్పలేదు. ఏడాది తరువాత, జూలై 2016లో ప్రభుత్వానికి వేడి తగిలి స్టెంట్లను ఆ జాబితాలో చేర్చింది.ఒక ఆర్టీఐ సవాల్, ఒక పిల్, ఒక ఫిర్యాదు, ఒక కోర్టు ధిక్కార పిటిషన్, వెరసి సుదీర్ఘ పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం అనే మత్తగజానికి చీమ కుట్టినట్టు కాలేదు. పంపిణీదారులు, వైద్యశాలలు, డాక్టర్లు కూడా తోడుదొంగలుగా మారి రోగులను విపరీతంగా దోచుకున్నారని ఆవేదనతో ఆవేశంతో సాంగ్వాన్ అనే ఒక యువలాయర్ డాక్టర్లతో కలిసి సాగుతున్న ఈ దోపిడీని సవాల్ చేశాడు. ఒక్క డాక్టరు కూడా అడగలేకపోయాడా? తెలిసి నోరుమూసుకుంటే నేరంలో భాగస్వాములే. వారే చేతులుకలిపితే చెప్పేదేముంది? కార్పొరేట్ మేనేజర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారం స్టెంట్లు అమ్మక తప్పదనేవారిని ఏమనాలి? డాక్టర్లు అనా బ్రోకర్లు అనా? వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చిందెవరు? వైద్యులు కాదా? - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
హర్యానా మాఫియా డాన్ అరెస్ట్
-
మాఫియా డాన్ సంపత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ సంపత్ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటన్నాడు. ఈ నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ, హరియాణా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు. సంపత్ హరియాణాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు. ఎదిరించిన వారిని ఆధారాలు లేకుండా అంతమొందించడం సంపత్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో ఇరువై రోజుల క్రితం భాగ్యనగరానికి పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా మియాపూర్‌లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఈనేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హరియాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకులను స్వాథీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పది హత్య కేసులు, మూడు హత్యాచార కేసులు, పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులు నమోదైనట్లు హరియాణ పోలీసులు వెల్లడించారు. -
రెచ్చిపోయిన మాఫియాలు
బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ముగ్గురు పాత్రికేయులను మాఫియా ముఠాలు పొట్టనబెట్టుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాలూ మాఫియా ముఠాల ఆగడాలను దశాబ్దాలుగా చవిచూస్తూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో అంతా సవ్యంగా ఉన్నదని కాదు. న్యూఢిల్లీ మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల వరకూ అన్నిచోట్లా పాత్రికేయులు మాఫియాలనుంచీ, పోలీసులనుంచి ఏదో రూపంలో బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బస్తర్వంటి ప్రాంతాల్లో పోలీసులే బాహాటంగా పాత్రి కేయులపై స్థానికుల్ని ఉసిగొల్పి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. గత రెండేళ్లలో 12మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారు. 50కి పైగా దాడుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. గతంతో పోలిస్తే మాధ్యమాల విస్తృతి పెరిగింది. పాలకుల కైనా, వారి అండదండలతో చెలరేగిపోతున్న మాఫియాలకైనా ఈ కొత్త పరిస్థితి మింగుడుపడటం లేదు. కనుకనే రకరకాల విధానాల ద్వారా మాధ్యమాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీకి చెందిన ఇతరులు ఇందులో ఆరితేరారు. ‘సాక్షి’పై పలు విధాలుగా వివక్ష ప్రదర్శించిన చరిత్ర బాబుది. ఇబ్బందికరమైన ఉదంతాలు జరిగినప్పుడు చానెళ్ల ప్రసారాలను ఆపేయడం, కొన్ని సందర్భాల్లో నెలల తరబడి వాటికి ఆటంకం కలిగించడం అక్కడ రివాజు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో తమపై విమర్శలు చేశారన్న అక్కసుతో అర్థరాత్రుళ్లు పోలీసులతో దాడులు చేయించి కొందరిని నిర్బంధంలోకి తీసుకున్న ఉదంతాలు జరిగాయి. ఏతా వాతా స్వతంత్రంగా, నిర్భయంగా ఉన్నదున్నట్టు చెప్పడానికి ప్రయత్నించే పాత్రికేయు లకు ఇది గడ్డుకాలం. నిజానికి జరిగేవాటితో పోలిస్తే మీడియాలో వెల్లడవుతున్న ఉదంతాలు చాలా తక్కువ. న్యూఢిల్లీలోనో, మరో నగరంలోనో పాత్రికేయులపై దాడులు జరిగినప్పుడు అవి మీడియా దృష్టిని ఆకర్షిస్తాయి. కనుక వాటి గురించి అందరూ మాట్లాడుకుంటారు. ప్రభుత్వాలు కూడా స్పందించకతప్పని స్థితిలో పడతాయి. కానీ మారుమూల ప్రాంతంలో జరిగేవి సరిగా వెల్లడికావు. అక్కడ పోలీసులు, మాఫియా ముఠాలు కుమ్మక్కయితే అలా బయటపెట్టిన పాత్రికేయుల ప్రాణాలకు భరోసా ఉండదు. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఉదంతం వింటే దిగ్భ్రాంతి కలుగుతుంది. రాజధాని పట్నాకు 80 కిలోమీటర్ల దూరంలోని గర్హని గ్రామంలో బాల్య వివాహాలకు, వరకట్నం దురాచారానికి వ్యతిరేకంగా జరిగే మానవహారంలో పాల్గొనమని గ్రామస్తులపై స్థానిక అధికారి ఒకరు ఒత్తిళ్లు తెచ్చారని, బెదిరించారని రాసిన వార్త సర్పంచ్ భర్తకు అభ్యంతరకరంగా తోచింది. అలాగే ఆక్రమణల తొలగింపులో అధికారులు తన అధీనంలోని స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని వెల్లడించడం ఆగ్రహం కలిగించింది. పర్యవసానంగా మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వారిద్దరినీ వాహనంతో ఢీకొట్టి హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక చానెల్లో పనిచేస్తున్న మరో పాత్రికేయుణ్ణి ఇసుక మాఫియా ట్రక్కుతో ఢీకొట్టించి ప్రాణాలు తీసింది. చంబల్ నదీ గర్భం నుంచి ఇసుక తరలిస్తున్న మాఫియాతో స్థానిక పోలీసు అధికారి కుమ్మక్కవుతున్న తీరును నిరూపించేందుకు ఆ పాత్రి కేయుడు ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుని మాట్లాడి, ఆ అధికారి అడిగిన డబ్బులో కొంత మొత్తం చెల్లించాడు. దాన్నంతటినీ రహస్య కెమెరాలో చిత్రించాడు. ఇది ప్రసారమయ్యాక అతనిపై ఆ పోలీసు అధికారి కక్షగట్టాడు. చిత్రమేమంటే నిరుడు నవంబర్‌లో ఈ కథనం ప్రసారం చేశాక అటు ఇసుక మాఫియానుంచి, ఇటు పోలీసు అధికారి నుంచి బెదిరింపులు రావడంతో పోలీసు రక్షణ కావాలని పాత్రికేయుడు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకు న్నాడు. ఆ సంగతిని జిల్లా ఎస్పీ కూడా ధ్రువీకరిస్తున్నారు. కానీ ఆయన అడిగిన రీతిలో రక్షణ కల్పించలేకపోయారు. మధ్యప్రదేశ్‌లో మాఫియాలెలా చెలరేగుతున్నాయో అక్కడ ఏళ్ల తరబడి కొనసాగిన వ్యాపమ్ కుంభకోణమే చెబుతుంది. ఆ కుంభకోణాన్ని బయట పెట్టినవారు మాత్రమే కాదు... అందులో నిందితులుగా ఉన్నవారు సైతం వివిధ సందర్భాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇదంతా చూసి ఆ కేసులో నిందితులుగా అరెస్టయి జైళ్లలో ఉన్న పలువురు బెయిల్ మంజూరైనా జైళ్లను వదిలి బయటికొచ్చేందుకు సిద్ధపడలేదు. ఆరోపణలెదుర్కొని అరెస్టయిన అధికారి గుండెపోటుతో మరణిస్తే కుటుంబసభ్యులు అది హత్య అని అనుమానించాక వారికి బెదిరింపులొచ్చాయి. అలాగే ఈ కేసులో నిందితురాలుగా ఉన్న ఒక యువతి బెయిల్‌పై విడుదలైన కొద్దిరోజులకే శవంగా మారింది. ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించిన పాత్రికేయుడు ఉన్నట్టుండి నురుగలు కక్కుకుని చనిపోయాడు. దాదాపు ఆరున్నరవేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టాక తప్పనిసరై మూడేళ్లక్రితం కేంద్రమూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వమూ అందుకు అంగీకరించాయి. నిజాల్ని నిర్భయంగా వెలుగులోకి తెచ్చే పాత్రికేయులపైనా, అక్రమాలను అందరి దృష్టికీ తెచ్చే పౌరులపైనా ఇలా వరసబెట్టి దాడులు జరుగుతున్న నేపథ్యంలో విజిల్‌బ్లోయర్స్ చట్టం ఏమైందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ఆ చట్టం 2014లో పార్లమెంటు ఆమోదం పొందినా దాని అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో అంతులేని జాప్యం చోటు చేసుకుంది. ఆ కర్మకాండ పూర్తికాకుండానే కేంద్రం దానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు తెచ్చింది. దాని అతీగతీ ఇంకా తేలలేదు. ఈలోగా మాఫియాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దాడు లకు దిగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వాలు వెనువెంటనే చర్యకు ఉపక్రమిస్తే, సత్వరం విచారణ జరిపి కారకులను శిక్షిస్తే ఇటువంటివి పునరావృత్తం కావు. కానీ పాలకులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాత్రికేయులపై దాడి అంటే సారాంశంలో ప్రజాస్వా మ్యంపై దాడి అని గుర్తించి, ప్రజలే చైతన్యవంతులై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. పాలకులకు బుద్ధి చెప్పాలి. -
మాఫియా ఆగడాలు.. ఇబ్బందుల్లో తెలుగు కార్మికులు
సాక్షి, హైదరాబాద్ : బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని మలేషియా వెళ్లిన కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఓ వైపు రూ. 1500 లతో తీసుకునే విజిటింగ్ వీసాలను ఏజెంట్లు ఏకంగా లక్ష రూపాయలపైనే విక్రయిస్తుంటే, అక్కడికి వెళ్లిన తర్వాత మలేషియా మాఫియా చేతిలో చిక్కుకున్న కార్మికుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయి. సామాజిక కార్యకర్త శాంతి ప్రియతో కలిసి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ నంగి దేవెందర్‌రెడ్డి మలేషియాలోని మాఫియా చేస్తున్న అరాచకాలను వెలుగులోకి తెచ్చారు. 20 మంది కార్మికులను మాఫియా చెరనుంచి విముక్తి చేసి ఇండియన్ ఎంబసీలో అప్పజెప్పారు. వీరిలో 10 మంది ఇండియాకు తిరిగి వచ్చేలా సహకరించారు. దాదాపు వెయ్యి మంది పైచిలుకు ఇంకా అక్కడే మాఫియా గుప్పిట్లో మగ్గిపోతున్నారని దేవెందర్ రెడ్డి చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి మలేషియాలో ఉంటున్న కార్మికుల బాగోగులు తెలుసుకొని, అక్కడ మాఫియా చేతుల్లో ఇబ్బంది పడుతున్న కార్మికులకు విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు విజిట్ వీసాల మీద మలేషియా దేశానికి వెళ్లొద్దని సూచించారు. ఏజెంట్లు చూపించే కంపెనీ అగ్రిమెంట్ మీద అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, అక్కడకి వెళ్లిన తర్వాత కార్మికులకు కనీసం వసతి, ఆహారం లాంటివి కూడా లేకుండా నరకయాతన అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అక్కడ మాఫియా వాళ్లు ఏది చెప్పితే అది చేసే పరిస్థితిల్లో కార్మికులు ఉన్నారని వారిని వెంటనే రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మలేషియాలో క్షమాబిక్ష పథకం జూన్ 30 వరకు ఏజెంట్ల చేతిలో మోసపోయి మలేషియాలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇల్లీగల్ కార్మికులు(స్థానిక చట్టాలను ఉల్లంగించి అక్కడే ఉంటున్న కార్మికులు) అక్కడి ప్రభుత్వం కల్పించిన ఆమ్నేస్టీ (క్షమాబిక్ష)ని వినియోగించుకోవాలని దేవెందర్ రెడ్డి సూచించారు. మలేషియాలోమాఫియా అరాచకాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటూ మిగతా రాష్ట్రాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మలేషియాలోని ఇండియన్ ఎంబసీలో తెలుగు మాట్లాడేవారు లేక కార్మికులు వారి సమస్యలు చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. వెంటనే ఇండియన్ ఎంబసీలో తెలుగు అధికారులను నియమించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున కోరారు. కాగా, గల్ఫ్ దేశాల్లోఉంటున్న 20 లక్షల మంది తెలుగు రాష్టాలకు చెందిన కార్మికులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, అక్కడి ఎంబసీల్లో కూడా ఇద్దరు తెలుగు అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధితో పాటూ, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టిన హామీలపై మాట తప్పారని దేవెందర్ రెడ్డి మండిపడ్డారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల రూపాయలిస్తామని, ఉద్యోగం కోల్పోయిన వారికి ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఊదరగొట్టిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 650 మంది కార్మికులు చనిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని, హామీలన్ని మాటలకే పరిమితమయ్యాయని తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మరో వైపు కువైట్‌లో ఆమ్నేస్టీ అవకాశం ఉన్నా, అక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతున్న కార్మికులకి కనీసం విమాన టికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వ కల్పించడం లేదని దేవెందర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కువైట్‌లో ఏప్రిలో 22న ఆమ్నేస్టీకి చివరి రోజు అని దీన్ని కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ తరపున ఆరుగురు సభ్యులు అక్కడికి వెళ్లి 20 మందికి టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి విదేశాల్లో కార్మికులుగా దుర్బర జీవితాన్ని గడిపి చివరికి ఏదోలా తిరిగి వస్తే, ఇక్కడ వారికి ఎలాంటి ఉపాదిలేక రోడ్డున పడుతున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన బాధిత కార్మికులకు భరోసా ఎవరు కల్పిస్తారు, వారికి పునరావాసం ఇవ్వని ప్రభుత్వం ఎందుకు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల సహాయం కోసం సంప్రదించండి అంటూ ఇచ్చిన నెంబర్లు పని చేయడం లేదని, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కె.తారకరామారావుతో పాటూ ఎన్ఆర్ సెల్ డిపార్ట్ మెంట్ మొత్తం స్లీపింగ్ మోడ్‌లో ఉన్నాయని దేవెందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. విహారయాత్రల్లా వీదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రికి తెలంగాణ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు మాత్రం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్‌లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్‌డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
దావూద్ అనుచరుడు ఫరూక్ అరెస్టు
న్యూఢిల్లీ: అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడు గురువారం దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ముంబై తరలించి బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని మార్చి 19 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్‌ను భారత్‌కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్ సహాయకారిగా దోహదపడ్డాడు. -
మద్య నిషేధంతో మాఫియాకు బాటలు
చెన్నై: మద్య నిషేధం అమలైతే అది మాఫియా ఏర్పాటుకు దారితీస్తుందని సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. అందుకే తాను మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం ‘ఆనంద వికటన్’ తమిళ పత్రికలో వచ్చింది. నిషేధం అమలైతే కల్తీ మద్యం మాఫియా పుట్టుకొస్తుందని తెలిపారు. మద్యం తాగడం తగ్గించే వీలుంది కానీ, ప్రజలను ఆ అలవాటు నుంచి దూరంగా ఉంచటం కష్టమన్నారు. -
మాఫియాకు రాచమార్గం
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమ రవాణాకు దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విశాఖ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వాహనాలు ఇటుగా వెళుతుండటంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో ఈ మార్గాన్ని అడ్డాగా మార్చుకుని పశువులు, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాలతోపాటు దొంగనోట్ల మార్పిడి సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలో అక్రమ రవాణా మాఫియాను పట్టుకోవడానికి పోలీసులు ఏడాదిలో రెండుసార్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా విశాఖ ఏ జెన్సీ నుంచి జిల్లా మీదుగా గంజాయి అ క్రమ రవాణా సాగుతోంది. రవాణాలో కీలకపాత్రధారులు జిల్లావారు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. అయితే అప్పుడప్పు డు పోలీసులకు వచ్చిన సమాచారంతో భారీగా గంజాయి పట్టుపడుతోంది. విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు వయా పశ్చిమగోదావరి జిల్లా నుంచి సరిహద్దు దాటిస్తున్నారు. దీని కోసం ప్ర త్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా ఒక రూట్లోను, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరో రూట్లో రాష్ట్ర సరి హద్దులు దాటిస్తున్నారు. దీనిలో జిల్లాకు చెందిన స్థానిక వ్యక్తులతో పాటు పోలీసులలో కూడా కొందరు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గంజా యి వ్యవహారంలో చింతలపూడి సీఐపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. పశువుల అక్రమ రవాణా విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటివరకూ 24 కేసులు నమోదు కాగా సుమారు 1,850 ఆవులను పోలీసులు పట్టుకుని గోసంరక్షణ సమితికి అప్పగించారు. జిల్లా మీదుగా ప శువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. జిల్లా సరిహద్దులు దాటిం చేందుకు ఏకంగా ఒక ముఠా పనిచేస్తోం ది. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా వీటి ని తరలించేవారు. అప్పుడప్పుడు రూ ట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చిం తలపూడి మీదుగా జిల్లా సరిహద్దులు దా టిస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువులను రవాణా చేసు ్తన్న వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గో శాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే తెలంగాణాకు తరలిస్తున్నారు. గతంలో దేవరపల్లి వద్ద పట్టుకున్న గోవులు సకాలంలో గోశాలకు తరలించకపోవడంతో 40 వరకూ హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం వివాదం అయ్యింది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు కూడా మాఫియా ఈ రూట్‌నే ఎంచుకోవడం గమనార్హం. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే రూట్లో కాకినాడ పోర్టుకు ఈ బి య్యం చేరుతున్నాయి. మధ్యలో తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి ఏదొక బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్‌ల్లో నింపుతున్నారు. ఇలా చేసిన బ్యాగ్‌లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. ఈ రూట్లో పోలీసుల సహకా రం ఉండటంతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే రోజు జిల్లాలో రెండు దొంగనో ట్ల కేసులు నమోదు కావడం విశేషం. దేవరపల్లి, నరసాపురంలో దొంగనోట్ల ముఠాలను పట్టుకున్నారు. ఇద్దరు నిరాయుధులను పట్టుకోవడం కోసం దేవరపల్లిలో కాల్పులదాకా వెళ్లాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం డిపార్టుమెంట్లోనే వ్యక్తమైంది. ఇటీవల యర్నగూడెం వద్ద దొం గనోట్ల ముఠా పోలీసులపై దాడికి ప్రయత్నించి తప్పించుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది తెలియాల్సి ఉంది. దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు దేవరపల్లిలో.. గంజాయి కేసులు 4 గోవుల రవాణా 3 రేషన్ బియ్యం 2 దొంగనోట్ల మార్పిడి 1 గోపాలపురంలో.. గంజాయి కేసు 1 గోవుల రవాణా 1 నల్లజర్లలో.. గోవుల రవాణా 2 లింగపాలెంలో.. రేషన్ బియ్యం 2 కామవరపుకోటలో.. గోవుల రవాణా 1 కొయ్యలగూడెంలో.. గోవుల రవాణా 6 గుట్కా, ఖైనీ రవాణా 1 జంగారెడ్డిగూడెంలో.. గోవుల రవాణా 2 రేషన్ బియ్యం 1 బుట్టాయిగూడెంలో గోవుల రవాణా 1 జీలుగుమిల్లిలో.. గంజాయి రవాణా 1 రేషన్ బియ్యం 1 చింతలపూడిలో.. గంజాయి కేసు 1 రేషన్ బియ్యం 1 -
‘దందా’నా.. పీఏ ‘దందా’నా..
పశువుల అక్రమరవాణా జోరుగా సాగుతోంది. తెరవెనుక కొందరు బడాబాబులు గో సంరక్షణ పేరుతో పశు మాఫియాను ముప్ఫై గేదెలు, అరవై గోవులుగా యథేచ్ఛగా నడుపుతున్నారు. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతి లేకుండా మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నా పోలీసులు వీరిని ఏం చేయలేకపోతున్నారు. దీనికి కారణం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ హస్తం ఉండడమే. పశువుల రవాణా వాహనాలను పోలీసులు పట్టుకుంటే చాలు వెంటనే ఆ పీఏ నుంచి ఫోన్ వెళుతుంది. దీంతో వారు ఏం చేయలేకపోతున్నారు. ఒక వేళ వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసినా.. వాటిలో పశువులు మాత్రం యథావిధిగా గోశాల ద్వారా మాఫియా చెరలోకి వెళుతున్నాయి. రవాణా ఇలా.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో జరిగే పశువుల సంతలో కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటకకు చెందిన బడా వ్యాపారులు పశువులను దళారీలతో కొనుగోలు చేయిస్తారు. వీటిని వివిధ రకాల వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా గమ్యస్థానాలకు చేరుస్తారు. ఇది రూ.కోట్లలో జరిగే వ్యాపారం కావడంతో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చూపు దీనిపై పడింది. తనకు ఉన్న అధికార దండాన్ని ప్రయోగించి బడా వ్యాపారులను లోంగదీసుకున్నాడు. విశాఖ జిల్లా వరకు రవాణా సజావుగా సాగినా, తూర్పు గోదావరిలోకి వచ్చే సరికి అజ్ఞాత వ్యక్తి చెప్పినట్టు వినాల్సి వస్తోందని వ్యాపారులే చెబుతున్నారు. ఎవరైనా మాటవినక పోతే గోసంరక్షణ సమితి పేరిట పోలీసులకు ముందుగానే వాహనం నంబర్‌తో సహా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాటిని పట్టుకుని గోశాలకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత అదే వ్యాపారులకు వీటని దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికి ఎంతెంత.. తుని నుంచి రాజమహేంద్రవరం, రావులపాలెం వరకు ఉన్న పోలీస్స్టేషన్లను దాటించి వానాలను పంపడానికి బడా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ములు వసూళ్లు చేస్తున్నారు. కంటైనర్‌కు రూ.17,000 వసూలు చేస్తే ఇందులో పోలీసుల కోసం రూ. 15,000 గోశాలకు రూ.రెండు వేలు తీసుకుంటున్నారు. తుని నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో పశువులను రవాణా చేస్తున్నారు. సుమారు రోజుకు రూ.3.60 లక్షలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇందులో పాయకరావుపేట నుంచి రాజమహేంద్రవరం వరకు ఉన్న పోలీస్స్టేషన్లు, తేటగుంట ఆర్టీఏ చెక్ పోస్టుకు ముడుపులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.పది వేల వరకు ముడుపులు ఇవ్వగా సదరు మాఫియాకు. రూ.ఏడు వేలు మిగులుతోంది. అంటే రోజుకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నారు. నెలకు రూ.30 లక్షలు, ఏడాదికి రూ.3.60 కోట్లు ఇలా దందా కొనసాగుతోంది. తుని కేంద్రంగా దందా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను తాండవ సుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ప్రవేటు స్థలంలో దించి, అక్కడి నుంచి లారీల్లోకి ఎక్కించి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద లారీలో 12 పశువులను ఎక్కించాలి. వీళ్లు మాత్రం 30 నుంచి 40 వరకు కుక్కుతున్నారు. అవరమైతే పశువుల కాళ్లు విరిచేస్తున్నారు. ఇదంతా రాత్రి 12 గంటల తర్వాత జరుగుతోంది. ఎవరైనా ప్రశ్నించినా మీకు సంబంధం ఏమిటని గర్జిస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలింపు.. వాహనం సీజ్, ఇద్దరిపై కేసు నమోదు కొత్తపల్లి (పిఠాపురం): అక్రమంగా బీచ్ రోడ్డులో గోమాంసాన్ని తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముం దస్తు సమాచారం మేరకు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ సిబ్బందితో బీచ్ రోడ్డులో వెళుతున్న వాహనాన్ని గుర్తించి పట్టుకున్నా రు. ఆయన కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా నుంచి టాటా ఐషర్ ఏపీ31టీహెచ్4971 గల వ్యాన్‌లో పశు మాంసాన్ని ఉప్పాడ మీదుగా సామర్లకోటకు కాకినాడ బీచ్ రోడ్డులో తరలిస్తున్నారు. సుమారు మూడున్నర టన్నులు ఉన్న ఈ మాంసం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉం టుంది. మాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్ చేసి మాంసాన్ని కొనుగోలు చేసిన అల్తాప్, డ్రైవర్ టి.జగ్గారావులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఉప్పాడ గ్రామ రెవె న్యూ అధికారి పర్యవేక్షణలో ఉప్పాడ బీచ్ రోడ్డులో పూడ్చివేసి ఎస్సై కేవీఎస్ సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మాంసాన్ని కొత్తపల్లి పశువైద్యాధికారి రవిబాబు పరిశీలించారు. సుమారుగా 15 గేదెల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 6.30 నుంచి 8.30 లోపు తరలింపు ప్రతిరోజూ విజయనగరం, విశాఖపట్నం నుంచి ఉదయం 6.30 నుంచి 8.30 మధ్య అనేక వాహనాల్లో అక్రమంగా పశుమాంసాన్ని బీచ్ రోడ్డులో తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది పోలీసు సిబ్బంది మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాఫియా రాజ్యమేలుతోంది!
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీఆర్ఏ సాయిలును ఇసుక మాఫియా హతమారిస్తే ప్రభు త్వ పెద్దల ఒత్తిడితో కలెక్టర్, ఎస్పీలు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్నారు. ఇసుక ట్రాక్టర్ కానప్పుడు అక్కడికి ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయానికి దన్నుగా ఉండేందుకు కేంద్రం అందిస్తున్న ట్రాక్టర్లను టీఆర్ఎస్ ప్రభుత్వం తమ కార్యకర్తలకు ఇచ్చి వాటితో ఇసుక వ్యాపారం చేయిస్తోందని ఆరోపించారు. అంతా కేసీఆర్ స్వామ్యమే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అంతా కేసీఆర్ స్వామ్యమే నడుస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి జైలులో నిర్బంధించారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని అణచివేస్తూ, మాఫియాను పెంచి పోషిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొనకుండా, ఉద్యమాన్ని అడ్డుకున్న వారంతా ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నారన్నారు. దర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కిషన్‌రెడ్డిని పోలీ సులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆంజనేయులు, నాయకులు మురళీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భసంచి రాకెట్ సూత్రధారి అరెస్టు
నాలుగు డబ్బులు వస్తే...పిల్లల పెళ్లిళ్లు చేయవచ్చనే ఆశతో పాటు...తమకు పనికిరాని గర్భసంచులు ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో నిరుపేద, అమాయక మహిళలు ఓ కిలేడీ ఉచ్చులో పడిపోయారు. గర్భసంచి ఇవ్వాలంటే పలు రకాల పరీక్షలు చేయించాలని నమ్మబలికి వారి నుంచి సుమారు రూ.ఐదు లక్షల పైబడి దోచుకుంది. ఏడు నెలలుగా జరుగుతున్న వ్యవహారాన్ని టూటౌన్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. అదుపులోకి తీసుకునే సమయంలో విషయం తెలుసుకుని అక్కడ నుంచి పరారైన మాయలేడిని ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి టూటౌన్ పోలీసుస్టేషన్లో పట్టణ డీఎస్పీ ఎవి.రమణ వివరాలను వెల్లడించారు. విజయనగరం టౌన్: గర్భసంచులు ఇస్తే ఒక్కొక్కరికీ రూ.8 లక్షలు ఇస్తామంటూ సుమారు 15 మంది మహిళలను విశాఖ జిల్లా భీమునిపట్టణం మంగలి వీధికి చెందిన సూరాడ ఆదిలక్ష్మి అలియాస్ జ్యోతి అనే మహిళ మోసం చేసింది. వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలంటూ వారి నుంచి ఐదు లక్షల రూపాయలు పైబడి వసూలు చేసింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న జ్యోతి గతంలో విశాఖలోని పలు ఆసుపత్రుల్లో స్వీపర్‌గా పని చేయడంతో పాటు చిన్నపాటి వైద్యం చేయడం నేర్చుకుంది. దాన్నే ఆసరాగా తీసుకుని అమాయక మహిళలను మోసం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. కమ్మవీధి, బూడివీధి, బొంగువీధిలో ఉన్న పలువురు నిరుపేద, నిరక్ష్యరాస్యులైన మహిళలను టార్గెట్ చేసుకుంది. రూప, బూదేవి, సంతోషి, రాజీ, రమ తదితర మహిళలను ఒప్పించింది. విషయం తెలుసుకున్న మరికొందరు మహిళలు తమ గర్భసంచిని ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. మొత్తం 15 మంది మహిళలతో గర్భసంచి అమ్మకాలు చేయించి వారికి డబ్బులు ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకుంది. వారికి కొన్ని పరీక్షలు చేయాలని ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి లక్ష వరకూ వసూలు చేసింది. మొత్తం రూ.5 లక్షలకు పైబడి రాబట్టింది. విశాఖలో తాపీమేస్త్రీగా పని చేస్తున్న మేడిశెట్టి వెంకట శ్రీకాంత్ అనే వ్యక్తిని మహిళలకు వైద్యునిగా పరిచయం చేసింది. రాయపూర్ నుంచి ఇక్కడకు వచ్చారని, ఆరోగ్య స్తితి చూస్తారని వారికి పలు రకాల పరీక్షలను దగ్గరుండి చేయించింది. ఈ నెల 2న బాధితురాలు భూదేవి ఇంటి వద్ద అందరితో సమావేశం నిర్వహిస్తున్న విషయం కాస్త పోలీసులకు సమాచారమందింది. టూ టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లేసరికి, అప్పటికే విషయాన్ని తెలుసుకున్న మాయలేడి ఉడాయించింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సెల్ డేటా ఆధారంగా జ్యోతి, శ్రీనివాస్‌లను పట్టుకుని అరెస్టు చేశారు. కేసు చేధించడంలో కీలకపాత్ర పోషించిన ఎస్ఐ వి.అశోక్‌కుమార్, కానిస్టేబుల్లు సిహెచ్.అనిల్ శ్రీనివాస్, బలరామ్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో టూటౌన్ సీఐ బివిజె.రాజు పాల్గొన్నారు. -
వాల్టాకు తూట్లు
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఓ వైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే... మరో వైపు కలప అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. వాల్టా చట్టం అక్రమార్కులకు చుట్టంగా మారుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వృక్షాలను నరుకుతున్నారు. గ్రామాల్లో భారీ వృక్షాలు కనుమరుగవుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కలపను అక్రమంగా తరలిస్తున్నారని ఫారెస్ట్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇస్తే వారి జేబులు నింపేసుకుంటున్నారనే తప్ప వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. లారీల్లో కలప రవాణా చేసేందుకు సిద్ధంగా ఉందని చెబితే అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు మామూళ్లు తీసుకుని వెళ్లిపోతున్న సంఘటనలు కోకొల్లలు. అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలంలో కలప అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండల పరిధిలోని రెడ్డిపల్లి, వెంకట్రావ్పేట, గడిపెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వెర గ్రామాల్లో అక్రమార్కులు చెట్లను నరికి పట్టపగలే లారీల్లో తరలిస్తున్నారు. హైదరాబాద్, పెద్దశంకరంపేట, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వ్యాపారులు స్థానిక ఫారెస్ట్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. జిల్లా ఫారెస్టు అధికారులు మాత్రం కలప అక్రమ వ్యాపారాన్ని చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వాల్టా చట్టం ప్రయోగించి వాహనాలను సీజ్ చేస్తామని చెబుతున్నా... ఎక్కడా అమలు కావడం లేదు. చెట్లను నరికిన కలప దుంగలను రోడ్డు పక్కనే తరలించేందుకు సిద్ధంగా ఉంచినా అధికారులు మాత్రం వాటి జోలికి పోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పంట పొలాల్లోని చెట్లను నరుక్కోవాలంటే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. చెట్లను కొట్టాలంటే కొంత రుసుం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతూ కట్టెకోత మిషన్లకు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం 10 లారీల వరకు కలప రవాణా కొనసాగుతోంది. అక్రమంగా నిల్వ అల్లాదుర్గం మండలంలోని కట్టెకోత మిషన్ల యజమానులు కలప వ్యాపారం చేపడుతున్నారు. అనుమతులు లేకున్నా చెట్లను నరుకుతూ భారీ ఎత్తున కొత మిషన్లలో నిల్వ ఉంచుతున్నా... వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫారెస్టు అధికారులు ఒక్కో లారీకి రూ.రెండు వేలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్కమార్కులు తమ పలుకుబడిని ఉపయోగించి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో రాత్రిపూట కలపను లారీల్లో భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఇవ్వలేదు కలప రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కలప అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తాం. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కట్టెకోత మిషన్ల ద్వారా రైతులకు సంబంధించిన పనిముట్లు, వంట చెరుకుగా వినియోగించుకోవచ్చు. అనుమతిలేకుండా కలపను రవాణా చేస్తే చర్యలు తప్పవు. కలప అక్రమ వ్యాపారాన్ని అరికడతాం. – వెంకట్రామయ్య, పెద్దశంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ -
‘మాఫియా ముఠా’ కలకలం
భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట: నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంతో వార్తల్లోకెక్కిన దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామం పేరు.. తాజాగా, మరోమారు నలుగురి నోళ్లలో నానుతోంది. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో ఇక్కడి ముఠాను పోలీసులు జైలుకు పంపించారు. అందులోని ఇద్దరు సూత్రధారులు, కొందరు రాజకీయ నాయకుల సహకారంతో కేసుల నుంచి బయటపడ్డారు. వారు పాత గుణం పోనిచ్చుకోలేదు. అందుకే, ఇప్పుడు మరో రూపంలో మాఫియా ముఠా అవతారమెత్తారు. 1/70 అమలులోకి వచ్చిన తరువాత భూముల వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కడం లేదు. ఈ కారణంగా వాటి క్రయవిక్రయాలు జరగడం లేదు. రెవెన్యూ భూముల ప్రక్షాళన కార్యక్రమ నేపథ్యంలో ఈ (1/70 అమలుకు ముందున్న) భూములను కూడా క్రమబద్ధీకరిస్తామన్న పేరుతో సదరు భూయజమానుల నుంచి ఈ ముఠా డబ్బు వసూలు చేస్తోంది. ఈ ముఠాలో ఇద్దరిలో ఒకరు.. టీఆర్ఎస్ నాయకుడిగా, మరొకరు.. వామపక్ష నాయకుడిగా చలామణవుతున్నారు. వీరిద్దరిలో ఒకరు.. రైతు సేవాసమితి సభ్యుడిగా కూడా ఉన్నారు. వీరికి, కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారు. దీనిపై ముష్టిబండలో ‘రెవెన్యూ’ మాఫియా శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఇది, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది. తన మండలంలోని గ్రామం కావడంతో ఆయన దీనిని తీవ్రంగా పరిగణించారు. ఆ ముఠాపై ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం రహస్య విచారణ జరిపారు. ‘సాక్షి’ కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘ఆ ఇద్దరు ఎవరు?ఎవరి వద్ద డబ్బులు వసూలు చేశారు? సహకరించిన రెవెన్యూ సిబ్బంది ఎవరు? అనే దానిపై ఇంటెలిజెన్స్ రహస్యంగా విచారణ నిర్వహించింది. ఔనట.. నాకు కూడా తెలిసింది..! వసూళ్ల ముఠా వ్యవహారంపై ముష్టిబండ వీఆర్ఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ముష్టిబండలోని కొందరు ముఠాగా మారారని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పిడి చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. -
‘డి’ డాన్ ఎవరు?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 20 దేశాల్లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న డాన్ దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరు? దావూద్ వ్యవహారాలు నచ్చని అతడి కుమారుడు మొయిన్ నవాజ్ ఇప్పటికే ఆ ముఠాకు దూరంగా ఉంటున్నాడు.. ఇప్పుడు దావూద్ ప్రధాన అనుచరుడు, ‘డి కంపెనీ’అనధికార సీఈవోగా పేరుపడ్డ చోటా షకీల్ కూడా ముఠా నుంచి బయటికి వెళ్లిపోయాడు. మరిప్పుడు ‘డి కంపెనీ’కి నాయకుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న 62 ఏళ్లు నిండుతున్న దావూద్ అనారోగ్యం కారణంగా వారసుడిపై దిగాలుగా ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. నమ్మినబంటు దూరం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటూ మాఫియా సామ్రాజ్యాన్ని నియంత్రిస్తున్న దావూద్ ఇబ్రహీంకు 30 ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్నాడు షకీల్. దావూద్ గ్యాంగ్ రోజూవారీ కార్యకలాపాల బాధ్యత చూసేది అతనే. దావూద్ తరఫున మీడియాతో మాట్లాడడం (కరాచీ నుంచి ఫోన్లో) చేసేదీ తనే. దావూద్ తర్వాత ‘డి కంపెనీ’కి తనే నేతృత్వం వహించవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దావూద్ కుమారుడు మోయిన్ నవాజ్‌కు మాఫియా కార్యకలాపాలపై ఇష్టం లేదు. ముఠా నాయకత్వం తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడని, దాంతో దావూద్ దిగులుతో ఉన్నాడని ముంబైలోని దావూద్ అనుచరుడు ఇక్బాల్ హసన్ వెల్లడించినట్లుగా పోలీసులు తెలిపారు కూడా. దీంతో కరాచీలోనే ఉంటున్న దావూద్ తమ్ముడు అనీస్‌కు ముఠా నాయకత్వం దక్కే వీలుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య దావూద్ సమక్షంలోనే అనీస్‌కు, చోటా షకీల్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని.. అప్పటినుంచి డి గ్యాంగ్‌కు షకీల్ దూరంగా ఉంటున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై దావూద్ హెచ్చరించినా కూడా అనీస్ తీరు మార్చుకోలేదని.. దాంతో చోటా షకీల్ సొంత ముఠా ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాయి. అయితే దావూద్, చోటా షకీల్‌ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. ఆ ఇద్దరు విడిపోతే భారత్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టే కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని పాకిస్తాన్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు 20 దేశాల్లో.. భారత్‌తోపాటు పాకిస్తాన్, నేపాల్, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో, యూఏఈ, సైప్రస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్ల వరకూ దావూద్ డి కంపెనీ నేర సామ్రాజ్యం విస్తరించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ గ్యాంగ్ ఆస్తులు, వ్యాపార కార్యకలాపాల విలువ 670 కోట్ల డాలర్ల (సుమారు రూ.40 వేల కోట్లు) అని రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. కరాచీలో ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న భారీ భవంతిలో నివసిస్తున్న దావూద్‌కు ప్రధానంగా హవాలా కార్యకలాపాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ఇదికాక మాదకద్రవ్యాల రవాణా, బలవంతపు వసూళ్లు, బినామీలతో సినిమాల నిర్మాణం, కిరాయి హత్యలు, రియల్ ఎస్టేట్, బెట్టింగ్, ఉగ్రవాదం, నకిలీ నోట్ల చలామణీ వంటి కార్యకలాపాలతో ఒక కంపెనీ తరహాలో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం నడుస్తోంది. ఈ గ్యాంగ్ ఆదాయంలో 40 శాతం భారత్ నుంచే వస్తుందని అంచనా. ఇక దావూద్‌కు దుబాయ్‌తోపాటు యూఏఈ, బ్రిటన్లలో ఇతరుల పేర్లతో చట్టబద్ధమైన ఆస్తులు ఉన్నాయి. ఒక్క ఇంగ్లండ్‌లోనే దావూద్ పెట్టుబడులు 45 కోట్ల డాలర్ల (సుమారు రూ.3 వేల కోట్లు) మేర ఉంటాయని తెలుస్తోంది. డి కంపెనీ దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన వజ్రాలను గుజరాత్లో సానబెట్టే వ్యవహారాన్ని చోటా షకీల్ పర్యవేక్షిస్తాడని, ముంబైలోని గ్యాంగ్ సభ్యులకు నెలకు రూ.15 లక్షల దాకా చెల్లిస్తారని పోలీసులు చెబుతున్నారు. ముఠాలో 5 వేల మంది సభ్యులు! దావూద్ ముఠాలో ఐదు వేల మంది దాకా సభ్యులున్నారని.. లష్కరే తొయిబా, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలతో గట్టి సంబంధాలు ఉన్నాయని 2015లో అమెరికా కాంగ్రెస్ నివేదికలోనే పేర్కొన్నారు. కొన్నేళ్లు డి గ్యాంగ్‌లో పనిచేసిన చోటా రాజన్, అబూ సలేం, ఫాహీం తర్వాత సొంత ముఠాలు పెట్టుకున్నారు. భారత్‌లో కొందరు మహిళలు దావూద్ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. కరాచీలోనే దావూద్ 2015 ఆగస్టులో దావూద్ భార్య మెహజబీన్ పేరుతో ఉన్న ఒక ఫోన్ బిల్లును టైమ్స్‌నౌ టీవీ చానల్ సంపాదించింది. ఆ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. దావూద్ నిద్రపోతున్నారనీ, తాను కరాచీలో ఉంటున్నట్టు ఆమె ధ్రువీకరించడం గమనార్హం. కానీ పాకిస్తాన్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని బుకాయిస్తుంటుంది. బిట్‌కాయిన్స్‌తో లావాదేవీలు తన చట్టవ్యతిరేక నగదు లావాదేవీలు సులువుగా సాగడానికి వీలుగా దావూద్ ఇబ్రహీం.. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. డి గ్యాంగ్ రూ.950 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ సంపాదించిందని అతని సోదరుడు ఇక్బాల్ ఇటీవల ఓ ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. ఈ బిట్‌కాయిన్స్‌ను రియల్ ఎస్టేట్, మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాల్లో చెల్లింపులకుఉపయోగిస్తున్నారని బయటపెట్టాడు. ఎవరీ చోటా షకీల్? 1988లో దావూద్ గ్యాంగ్‌లో చేరిన షకీల్ అసలు పేరు షకీల్ షేక్. దావూద్‌తో పాటు దుబాయ్ పారిపోయాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితుడు. 2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసు సహా అనేక మంది శివ సైనికుల హత్యలతో షకీల్‌కు సంబంధముంది. 2000లో బ్యాంకాక్‌లో డి గ్యాంగ్ ప్రధాన శత్రువు చోటా రాజన్‌పై హత్యాయత్నం కూడా షకీల్ పన్నిన పథకం ప్రకారమే జరిగింది. డి కంపెనీకి అత్యధిక ఆదాయం వచ్చే భారత్‌లో కార్యకలాపాలన్నిటికీ బాధ్యుడు ఇతనే. దేశంలో కిరాయి హంతకుల ఎంపిక, రిక్రూట్మెంట్ అంతా షకీల్ కనుసన్నల్లోనే జరుగుతుందని చెబుతారు. షకీల్ తర్వాత టైగర్ (ఇబ్రహీం) మెమన్, ఉస్మాన్ చౌధరీ తదితరులు డి ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనీస్‌కే ముఠా పగ్గాలు? కస్కర్ అనే ఇంటి పేరున్న కొంకణ ముస్లిం కుటుంబంలో పుట్టిన దావూద్‌కు 11 మంది తోబుట్టువులు ఉన్నారు. వారిలో దావూద్ అన్న షాబీర్ గ్యాంగ్‌వార్‌లో మరణించగా.. సోదరి హసీనా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయింది. ప్రస్తుతం దావూద్ అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గ్యాంగ్ అధీనంలోని ఆస్తులను కుటుంబ సభ్యులకు, ఓ ట్రస్టుకు పంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లోని నేర సామ్రాజ్యాలు నడిపే కుటుంబాల మాదిరిగానే ముఠా నాయకత్వాన్ని ఇబ్రహీం కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే దావూద్ సోదరుడు అనీస్‌కే నాయకత్వం దక్కుతుందని కొందరు చెబుతుండగా.. అనీస్‌కు కూడా వయసు పైబడిందని డి గ్యాంగ్‌ను నడిపే స్థితిలో లేడని వార్తలొస్తున్నాయి. -
పాలు కాదు.. పచ్చి విషం
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నే ఇంటికి పాల ప్యాకెట్ వచ్చింది.. పాలు తెల్లగా, చిక్కగా ఉన్నాయి.. కానీ మరిగిస్తుంటే అదో రకమైన వాసన.. ఎంతసేపైనా మీగడ లేదు.. రంగుకూడా మారలేదు.. తోడుపెడితే పెరుగూ సరిగా కాలేదు.. బంకలాగా అతుక్కుపోతోంది... ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోందా? దీనికి కారణం నాణ్యత లేని, రసాయనాలు కలిపిన కల్తీ పాలు.. ఏ ఒక్కరి ఇంట్లోనో, ఒక్క కంపెనీవో కాదు.. ఏకంగా 45% పాల ప్యాకెట్లు నాణ్యతా ప్రమా ణాల ప్రకారం లేవని, హానికరమైన రసాయ నాలు కలసి ఉన్నాయని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. అంతేకాదు ఇ–కొలీ, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకూ నిలయంగా మారిపోయాయని ప్రభుత్వ లేబొరేటరీ పరీక్షల్లోనే వెల్లడైంది. ఈ పాలు తాగితే పోషకాల మాటేమోగానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి, వ్యాధుల బారినపడటం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లేబొరేటరీయే తేల్చింది.. మనకు పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ విక్రయమవుతున్న వాటిలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విక్రయిస్తున్న పలు ‡బ్రాండ్ల పాల ప్యాకెట్లను ఇటీవల ‘సాక్షి’బృందం సేకరించి నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రం (స్టేట్ ఫుడ్ లేబొరేటరీ)లో పరీక్షలు చేయించింది. అందులో కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొన్ని శాంపిళ్ల పాలలో కొవ్వు వంటి పదార్థాలు నిబంధనల మేరకు లేవని.. ప్రమాదకరమైన ఇ–కోలీ, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి వాటి ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. అంతేకాదు యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా వంటివి కూడా స్వల్ప మోతాదుల్లో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ‘సాక్షి’బృందం సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్యాకెట్ పాల నాణ్యతపై మహిళల అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు చెబుతున్నది ఒకటే! ప్యాకెట్ పాలు జిగటగా ఉంటున్నాయని.. మరగబెట్టినప్పుడు అదోరకమైన వాసన వస్తోందని.. సరిగా తోడుకోవడం లేదని.. తోడుకున్నా బంకలాగా అతుక్కుంటోందని వాపోతున్నారు. అటు పోటీ.. ఇటు కక్కుర్తి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థలు ఒక్కో లీటర్ పాలను వెన్న శాతాన్ని బట్టి రూ.40 నుంచి రూ.54 వరకు విక్రయిస్తున్నాయి. అయితే డెయిరీల మధ్య విపరీతమైన పోటీ నెలకొనడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు డెయిరీలు పాల పౌడర్‌ను కలిపి పాలు తయారు చేస్తున్నాయని.. పరిమితికి మించి హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడాను వినియోగిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వైరస్లు, బ్యాక్టీరియాలను తొలగించే ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. దాంతో ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న డెయిరీలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు! హైదరాబాద్ పరిధిలో ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం అమలు బాధ్యత జీహెచ్ఎంసీదే. అయితే తమ వద్ద అవసరమైన సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా ఈ బాధ్యతలను నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు అప్పగించారు. కానీ అక్రమాలను అరికట్టడంలో ఈ విభాగానిదీ ప్రేక్షకపాత్రే. రసాయనాలు, బ్యాక్టీరియా ఉన్న పాల ప్యాకెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నా.. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం వినియోగదారుల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి. రసాయనాలు, బ్యాక్టీరియా ప్రాణాంతకం! – పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని స్పష్టం చేస్తున్నారు. – ఇ–కోలీ కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. – గేదెలకు విచ్చలవిడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో ఆ రసాయనం పాలలో చేరుతోంది. దీనివల్ల ఆ పాలు తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. – పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడిని వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాల్లో పాల తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే రోగాలే.. ‘‘కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు వంటి అనారోగ్య సమస్యల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇ–కోలీ బ్యాక్టీరియా వల్ల వాంతులు, డయేరియా, జిగట విరేచనలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి..’’ – డాక్టర్ రాజన్న, చిన్న పిల్లల వైద్య నిపుణుడు కర్తవ్యం ఇదే.. – పాల కల్తీకి పాల్పడుతున్న డెయిరీలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ గట్టి నిఘా పెట్టాలి. ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. – కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. – సాల్మొనెల్లా, ఈ–కోలీ, యూరియాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నందున అక్రమార్కులపై ప్రభుత్వం ఫుడ్యాక్ట్–34 ప్రకారం చర్యలు తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో లో‘పాలు’.. జనాభా: కోటికి పైగా రోజువారీ పాల అమ్మకాలు: 25 లక్షల లీటర్లు సహకార, ప్రైవేటు పాల బ్రాండ్లు: 57 (సుమారుగా) సహకార డెయిరీలు విక్రయిస్తున్న పాలు: 7 లక్షల లీటర్లు ప్రైవేటు డెయిరీలు విక్రయిస్తున్నవి: 18 లక్షల లీటర్లు లీటర్ పాల ప్యాకెట్ ధర: రూ.40 నుంచి రూ.54 (పాలలో కొవ్వు శాతాన్ని బట్టి) పాలలో కలుపుతున్న రసాయనాలు: సోడా (నిల్వ ఉండేందుకు), హైడ్రోజన్ పెరాక్సైడ్ (దుర్వాసన రాకుండా ఉండేందుకు), యూరియా (చిక్కగా కనిపించేందుకు), జంతు సంబంధిత కొవ్వు (పాలలో కొవ్వు శాతాన్ని పెంచేందుకు), గ్లూకోజ్ (తియ్యటి రుచి కోసం) పాల ప్యాకెట్లలో తరచూ బయటపడుతున్న బ్యాక్టీరియా: సాల్మొనెల్లా, ఈ–కోలి (వీటితో ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు, యూరియా ఆనవాళ్లతో మెదడుకు హాని వంటి సమస్యలు) ఎంత మరిగించినా రంగు మారడం లేదు ‘‘పాలు మరిగించినా, మరుసటి రోజుకు కూడా రంగు మారడం లేదు. పాలు తోడువేస్తే పెరుగు జిగురుగా తీగలా సాగుతూ దుర్వాసన వస్తోంది. గడువు తీరిన పాలప్యాకెట్లను అంటగడుతున్నారు..’’ – సుధారాణి, పద్మానగర్ కల్తీ పాల విక్రయదారులపై కేసులు పెట్టాలి ‘‘ప్యాకెట్ పాలు ఉదయం మరిగించి పెట్టినా సాయంత్రానికే పగిలిపోతున్నాయి. పెరుగు కోసం తోడు వేస్తే నీళ్లలా మారుతున్నాయి. కల్తీ పాల కేంద్రాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..’’ – ప్రణయ, కుత్బుల్లాపూర్ గ్రామం పెరుగు అతుక్కుపోతోంది! ‘‘ఎనిమిదేళ్లుగా ప్యాకెట్ పాలనే వాడుతున్నాం. ఒక ప్యాకెట్ తాగడానికి వాడి.. మరో ప్యాకెట్ పాలను పెరుగు తోడువేస్తున్నాం. కానీ కొంత కాలంగా పాలు సరిగా తోడుకోవడం లేదు. పెరుగు బంకలా అతుక్కుపోతోంది..’’ ఎం.మమత, గృహిణి, ఈస్ట్ కల్యాణపురి తెల్లటి ఉండలు, పురుగులు వస్తున్నాయి ‘‘ప్యాకెట్ పాలు వేడి చేస్తుంటే అదో రకమైన వాసన వస్తోంది. పాలలో తెల్లటి ఉండల్లాంటి పదార్థాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు చిన్న పురుగులూ కనిపిస్తున్నాయి. పెరుగు తోడుకోవటం లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదు..’’ కాసం పద్మ, భవానీనగర్, ఏఎస్రావు నగర్ ప్యాకెట్ పాల నాణ్యతా పరీక్షలో తేలిందిదీ.. పరీక్ష ఉండాల్సిన మోతాదు పరీక్షలో వెల్లడైంది కొవ్వుశాతం కనీసం 3 శాతం 3.1 – 4 శాతం ఇతర ఘన పదార్థాలు కనీసం 8.5శాతం 8.82 – 9 శాతం ఈకోలి, సాల్మోనెల్లా అసలు ఉండరాదు ఉన్నాయి యూరియా, సోడా అసలు ఉండరాదు స్వల్ప మోతాదులో ఉన్నాయి (పలు కంపెనీల ప్యాకెట్ పాలను హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఫుడ్ లేబొరేటరీ పరీక్షించి ఇచ్చిన నివేదికలోని అంశాలు) -
గోమా(ఫి)య
వారానికి రూ.4 కోట్లు.. నెలకు రూ.16 కోట్లు.. ఏడాదికి రూ.200 కోట్లు.. ఏంటి.. ఈ అంకెలనుకుంటున్నారా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పశువులపై జరుగుతున్న వ్యాపారం ఇది. వ్యవసాయం భారంగా మారిన తరుణంలో అన్నదాత పశుపోషణ వదులుకుంటున్నాడు. రైతు అవసరాల కోసం కొంత పశుసంపద ఉంచుకున్నా.. మిగిలినది మాత్రం పశు మాఫియా ద్వారా కబేళాలకు తరలుతోంది. ప్రకృతి అనుకూలించకపోవడం.. చీడపీడల బెడద.. అక్కరకు రాని ప్రభుత్వ పథకాలు.. గిట్టుబాటు కాని ధరలు.. ఆదుకోని ప్రభుత్వం.. వెరసి వ్యవసాయానికి దూరమై వేరే వ్యాపకాలు చూసుకుంటున్న రైతులు తాము ప్రేమగా పెంచుకున్న పశువులను అమ్ముకుంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వారానికి ఒకరోజు జరిగే సంత పశువుల మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రైతులు, పాడిపోషకులు, వ్యాపారులు ఇక్కడ పశువుల క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఈ సంతల ద్వారా మార్కెట్ యార్డు కమిటీలకు దండిగా ఆదాయం చేరుతోంది. ఈ మార్కెట్ యార్డుల కమిటీలను పశుమాఫియా తమ చేతి కీలుబొమ్మలుగా మార్చుకుని, పశు సంపదను దోచుకుని కబేళాలకు తరలిస్తోంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, క్రోసూరులో పశువుల సంతలు ఉన్నాయి. వారంలో ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో పశువుల సంతలు నిర్వహిస్తుంటారు. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట యార్డు పరిధిలోని చిల్లకొల్లు గొర్రెల మండీలు, నందిగామ పశువుల సంతతో పాటు జీవాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఆయా సంతలో గేదెలు, దున్నలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు సంతలకు వస్తున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో వస్తుండగా, వచ్చిన వాటిలో 40శాతం మాత్రమే పాడిపోషణకు, వ్యవసాయ అవసరాలకు కొంటున్నారు. మిగిలిన 60 శాతం పాడి పశువులు, ఎద్దులు, ఆవులను తమిళనాడులోని కబేళాలకు తరలిస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో గోవులు, గేదెలను కుక్కి తీసుకెళ్తూ పట్టుబడిన కంటైనర్లు, లారీలే∙ఇందుకు నిదర్శనం. అంతా ‘అమ్మ’ కనుసన్నల్లో.. గుంటూరు జిల్లాలో జరిగే పశువుల సంతలో లావాదేవీలన్నీ మంత్రి సతీమణి కనుసన్నల్లో జరుగుతాయి. చిలకలూరిపేటలో మంత్రి కీలక అనుచరుడు రంగంలోకి దిగి ప్రైవేట్‌గా సంతనే నిర్వహిస్తున్నాడు. సంత చుట్టూ ప్రహరీ నిర్మించి బౌన్సర్లను నియమించుకున్నాడు. ఆ సంతలోకి వెళ్తే.. వారు చెప్పినట్టే రైతులు ఇచ్చుకోవాలి. కాదు.. అంటే బౌన్సర్ల చేతి దెబ్బలు తిని రావాలి. ఇక్కడి నుంచే మూగజీవాలు కబేళాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంతలో పశు క్రయవిక్రయాలు జరిగినా అమ్మ అనుమతితో పాటు మంత్రి అనుచరుడికి కప్పం చెల్లించాలి. చిలకలూరిపేటలో కప్పం చెల్లిస్తే రాష్ట్ర సరిహద్దుల వరకూ ఏ స్థాయి అధికారి వాహనాన్ని అడ్డుకునేది లేదు. నిబంధనలు ఇవీ.. పశువుల సంత నిర్వహణకు చాలా నిబంధనలు ఉన్నాయి. సంత నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన ఎనిమిది మందితో ఎస్ఎల్ఎంసీ కమిటీ ఏర్పాటుచేయాలి. వారు నిత్యం సంతలను పర్యవేక్షిస్తుండాలి. సంతల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, పాకలు, పశుగ్రాసం, తాగునీటి సౌకర్యం, పశువులు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేయించాలి. రవాణాచేసే ప్రతి జీవానికి సంబంధిత కమిటీలో పశువైద్యుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. సంతలో విక్రయించిన, కొనుగోలు చేసిన వివరాలను రికార్డు చేయించాలి. తక్కువ వయస్సు (యంగ్ యానిమల్) అయితే, అవి వ్యవశాయానికా, పాల దిగుబడి, లేదా పునరుత్పత్తి (బ్రీడింగ్) కోసమా అనే డిక్లరేషన్‌ను పశువుల కొనుగోలుదారుల వద్ద తీసుకోవాలి. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్–1977 (సెక్షన్–6) ప్రకారం ఇతర రాష్ట్రాలకు ఆవులను రవాణా చేయరాదు. సంత నుంచి రవాణా చేసే వాహనాల ధ్రువపత్రాలను పోలీస్, రవాణా, పశు సంవర్ధకశాఖ, మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. కానీ, పై నిబంధనలు ఎక్కడ అమలుకావు. -
ఇటలీ మాఫియా ‘డాన్’ టొటొ కన్నుమూత
మిలన్: ఇటలీని గడగడలాడించిన మాఫియా డాన్, ‘బాస్ ఆఫ్ బాసెస్’గా పేరుగాంచిన సాల్వటోర్ టొటొ రీన్(87) ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మాఫియాపై ఉక్కుపాదం మోపిన జడ్జీలు పోలీసుల్ని హతమార్చేందుకు కుట్రపన్నిన కేసుల్లో 26 యావజ్జీవ శిక్షల్ని టొటొ ఎదుర్కొంటున్నాడు. టొటొపై 150 మందిని హతమార్చినట్లు ఆరోపణలున్నాయి. ఇటలీ ప్రస్తుత అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లా అన్న, పాలెర్మో అధ్యక్షుడు పీర్శాంటి మట్టరెల్లాను టొటొ బృందం 1980లో కాల్చిచంపింది. గురువారం పుట్టిన రోజు సందర్భంగా కుటుంబీకులను కల్సుకున్నాక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ‘కోసా నోస్ట్రా’గా పిలుచుకునే ఇటాలియన్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఇద్దరు జడ్జీలు, పోలీసుల్ని 1992లో కారు బాంబులతో హతమార్చాడు. -
వేడివేడి గరళం
సాక్షి, అమరావతి: చాలా మందికి నిద్ర లేవగానే కాస్తంత టీ తాగితే కానీ తెల్లారదు. సమయానికి ఇంట్లో లేకుంటే బయటైనా సరే సింగిల్ ఛాయ్ పడాల్సిందే. వేడివేడిగా నాలుగు చుక్కలు గొంతులోకి దిగితేగానీ బద్ధకం వదలదు మరి! కొంతమంది ఎంత దూరమైనా అలవాటైన చోటకే వెళుతుంటారు. ఇక నుంచి బయట దుకాణాల్లో టీ తాగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. మనం తాగే టీ నీళ్లు ఆవిరితోపాటు వేడివేడిగా విషం కక్కుతున్నాయి. ఒకసారి వాడిన టీ పొడి వ్యర్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను అందులో కలిపి జనం గొంతుల్లోకి దించుతున్నారు. చిక్కగా, రుచిగా కల్తీ టీ... ఇన్నాళ్లూ పాలూ నీళ్లూ ఆహార పదార్థాలకే పరిమితమైన నకిలీ మాఫియా ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరిగే టీ పొడి మీద కన్నేసింది. కల్తీ టీ పొడిని క్వింటాళ్లకు క్వింటాళ్లే తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్న తీరు జలదరింపు కలిగిస్తోంది. మరింత చిక్కగా, రుచిగా ఉండే ఈ కల్తీ టీ పొడికి అలవాటుపడ్డ వినియోగదారులు పదేపదే అక్కడకే వెళ్తున్నారు. ఒకటికి రెండు సార్లు తాగి ఆస్వాదిస్తున్నారు. దీని వెనకాల కల్తీని ఎవరూ గుర్తించలేనంతగా రూపొందిస్తున్న నకిలీ మాఫియా జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటోంది. ధర తక్కువ.. రుచి ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణ కేంద్రాల్లో కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీనికి కారణం రేటు చాలా తక్కువగా ఉండటం. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పావు కిలో టీ పొడి రూ.130 వరకు ఉండగా కల్తీ టీపొడి మాత్రం కిలో రూ. 120కే అందుబాటులో ఉంది. దీంతో టీ షాపుల యజమానులు లేబుల్ టీ ప్యాకెట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. రసాయనాలు కలపడంతో వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నందున కల్తీ టీపొడి వైపే మొగ్గుచూపుతున్నారు. కల్తీకి సంబంధించి దుకాణదారులకు సైతం అంతుచిక్కని రీతిలో ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ కూ సరఫరా రాష్ట్రంలోని ప్రధాన టీ స్టాళ్లన్నిటిలోనూ కల్తీ టీ పొడినే వాడుతున్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేబుల్ లేకుండా డబ్బాల్లో, ప్యాకెట్లలో సరఫరా అవుతున్న కల్తీ టీ పొడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. గతంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో ఒక్కరోజే 200 క్వింటాళ్ల కల్తీ టీపొడిని సీజ్‌చేసి నిర్వీర్యం చేశారు. కల్తీకారం తయారవుతున్న గుంటూరు, విజయవాడలో నకిలీ టీ పొడి భారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. విశాఖపట్నం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. -
ఈ 4జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5వేలే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధరల్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా 'షైన్ ఎం815' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ సోమవారం ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది. బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో తమ డివైస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. డ్యూయల్ సిమ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 15గంటల టాక్ టైంను అందిస్తుందని తెలిపారు. మాఫే 'షైన్ ఎం815’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే 480 x 854 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 1 జీబి ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 64 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
సౌతిండియా మాఫియా డాన్ ఆత్మహత్య..
సాక్షి, చెన్నై: నిన్నటి వరకూ దక్షిణ భారతాన్ని గడగడలాడించిన డాన్ ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు పోలీసులతో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన డాన్ శ్రీధర్ ధనపాలన్(44) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన శ్రీధరన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే దక్షిణ భారత దావూద్ ఇబ్రహీంగా పేరుపొందాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 43కేసులు నమోదయ్యాయి. ఇందులో 7హత్యారోపణలు కూడా ఉన్నాయి. అనంతరం పోలీసుల తనిఖీలు పెరిగిపోవడం, పెద్ద మాఫియా డాన్‌గా ఎదగాలనే కోరికతో పోలీసుల కన్ను కప్పి కంబోడియాకు పారిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మద్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో విసుగు చెంది తన నివాసంలో సైనేడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం 6.30 ప్రాంతంలో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2013లో భారత్ నుంచి తప్పించుకొని కంబోడియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. శ్రీధర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే శ్రీధర్ మరణ వార్త విని అతని స్వస్థలం కాంచీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
అప్పడు దావూద్ బ్రదర్ ఏం చేస్తున్నాడంటే..
థానే : తప్పులు చేసేవారు ఎంత తాఫీగా ఉంటారో చెప్పేందుకు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. పలు కేసుల్లో నిందితుడైన అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో ఏం చేస్తున్నాడో.. ఏం చక్కా బీర్ కొడుతూ బిర్యానీ తింటూ కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అది చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కస్కర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. థానే యాంటి ఎక్స్టార్షన్ సెల్(ఏఈసీ) అధికారులు ముంబయిలోని హసీనా పార్కర్ ఇంటి నుంచి అతడిని అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ’ఇక్బాల్ కస్కర్ నాలుగు ప్లాట్లను, రూ.30లక్షలను ఒక బిల్డర్ నుంచి డిమాండ్ చేశాడు. మా విచారణలో కొంతమంది బిల్డర్లు, రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి’ అని థానే పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కస్కర్ ద్వారా దావూద్ ఇబ్రహీం అక్కడే పాక్‌లోనే ఉన్నాడనే విషయం తెలుసుకునే యత్నాల్లో ఉన్నారు. -
రాజకీయ క్రీనీడ
జిల్లాలో క్రీడా మాఫియా డీపీ నేతల తీరుతో క్రీడారంగం వివాదాస్పదం సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడోల్లో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ఇద్దరు నిందితులకు పరిటాల శ్రీరాం అండదండలు ఒలింపిక్ అసోసియేషన్ నిధులు డ్రా చేశారని జేసీ పవన్‌పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు జడ్జి, ఎస్పీ కుమారులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు! జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ మేకర్ మాఫే మొబైల్ అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎఫర్డబుల్ ధర రూ. 3,999 వద్ద 'ఎయిర్' పేరుతో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎయిర్ ను ఫస్ట్ టైం స్మార్ట్‌ఫోన్ యూజర్లనుద్దేశించి రూపొందించామని సావరియా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా ప్రకటించారు. మాఫే ‘ఎయిర్’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 4 అంగుళాల డిస్ప్లే 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 2 జీబి ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 32 జీబీకి విస్తరించుకునే అవకాశం 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2ఎంపీ సెల్ఫీ కెమెరా 2000ఎంఏహెచ్ బ్యాటరీ , పది గంటల టాక్ టైమ్ -
డాన్?
న్యూ స్టోరీ... న్యూ స్క్రీన్‌ప్లే... న్యూ క్యారెక్టరైజేషన్... శర్వానంద్ సినిమా ఒప్పుకోవాలంటే ఈ మూడు కంపల్సరీ. అఫ్కోర్స్ డైరెక్టర్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు శర్వానంద్ ఇలాంటి ప్యాకేజ్‌తో ఓ కొత్త సినిమా ఒప్పుకున్నారని సమాచారం. ‘స్వామి రారా, కేశవ’ వంటి వినూత్న చిత్రాలను అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కృష్ణానగర్‌లో వినిపిస్తోంది..మాఫియా డాన్‌గా శర్వానంద్ న్యూ లుక్‌లో కనిపించనున్నారట. అది మాత్రమే కాదు... ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారని ఓ టాక్. అందులో వయసు మళ్లిన పాత్ర ఒకటి అని భోగట్టా. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. -
ఇసుక మస్కా!
ఇసుక ధరల నిర్ణయంలో ఇసుక అక్రమాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని గ్రహించిన సర్కారు.. ఆత్మరక్షణలో పడింది. ఉచిత ఇసుక ఇస్తున్నా.. రవాణా, కూలీల పేరుతో దోపిడీ జరుగుతుందని గుర్తించి కొత్త ధరలు నిర్ణయించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే సమావేశమైన జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ కొత్త ధరల్లోనూ తిరకాసుపెట్టింది. రవాణాచార్జీలను భారీగా పెంచింది. ఫలితంగా వినియోగదారునిపై భారం పడనుంది. అదే సమయంలో కూలీల రేట్లలో కోత విధించింది. ఈ ధరలూ లోపభూయిష్టంగా ఉన్నాయనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొవ్వూరు/ఏలూరు మెట్రో : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇన్నాళ్లూ అధికారపార్టీ నేతలే గోదావరిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగించినా పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అప్రతిష్టను తొలగించుకునేందుకు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన జిల్లా శాండ్ మైనింగ్ కమిటీ ఇటీవలే ఇసుక లోడింగ్, రవాణాల ధరలను నిర్ణయించింది. ఈ ధరల కంటే అధికంగా వసూలు చేసినా.. ఇసుకను నిల్వ చేసినా.. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని మండల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకూ ఇలా.. ప్రభుత్వం ఇసుక ఉచితమంటూ ప్రకటించినా.. కొందరు ఇష్టానుసారంగా రీచ్‌ల్లో వ్యాపారం చేస్తున్నారు. అధికారపార్టీ నేతలే రూ.కోట్లు కొల్లగొట్టారు. నాయకులు వారి అనుచరులు ఇసుక రీచ్‌లను కబ్జా చేశారు. ట్రాక్టర్ లోడుకు రూ.500ల నుంచి 800ల వరకు చెల్లించాలంటూ అనధికార ధరలను నిర్ణయించారు. కొన్ని చోట్ల అక్రమ వసూళ్లకు దిగారు. నదీగర్భాలను ఇష్టారీతిన తవ్వేశారు. గూటాల, పోలవరం, నర్సాపురం, కొవ్వూరు, కుకునూరు, నిడదవోలు, వాడపల్లి, తాళ్ళపూడి, విజయరాయి, పెదవేగి ఇసుక ర్యాంపుల్లో టీడీపీ నేతలు తవ్వకాలకు బరి తెగించారు. ఒకానొక దశలో వారి ఆగడాలకు అడ్డువెళ్లేందుకు అధికారులూ వెనుకడుగు వేశారు. . కనీసం ప్రభుత్వ పనులకూ ఇసుక లభించని దుస్థితి కూడా నెలకొందంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన సర్కారు అప్రమత్తమైంది. కొత్త ధరలివీ.. ప్రభుత్వ పథకాలకు వెయ్యి క్యూబిక్‌మీటర్ల ఇసుక అవసరమైనప్పుడు మండల స్థాయిలో ఉన్న కమిటీకి (తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ) సంబంధిత శాఖ ఇంజినీరు దరఖాస్తు చేస్తే తేదీ, సమయం, ఎంత మేర తీసుకోవచ్చు, ఏ రీచ్‌కి వెళ్లాలి అనే వివరాలతో అనుమతి పత్రం ఇస్తారు. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఇసుక తీసుకెళ్లవచ్చు. సామాన్యులైతే రీచ్‌కి రానుపోను వాహనాల రవాణా చార్జీ మొదటి 5 కిలోమీటర్లు రూ. 400, తరువాత 10 కిలోమీటర్లు దాటిన ప్రతి ఒక కిలోమీటరుకు రూ.28 చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ట్రాక్టర్ లోడింగ్ చేసిన దానికి రూ.300ల చొప్పున చెల్లించాలి. రానుపోను 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రీచ్ నుంచి ఎవరైనా ఇసుక తీసుకువచ్చి ఇస్తే వినియోగదారుడు రూ.900లు చెల్లించాలి. దీనికి పడవ, కూలీల ఖర్చులు అదనం అంతకుమించి నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లు, ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైతే నేరుగా జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఏ రీచ్‌లోనైనా ట్రాక్టర్‌తో తప్ప ఇతర పెద్ద వాహనాలతో రవాణా చేయడానికి వీల్లేదు. రీచ్‌లలో ఇలా.. పడవల ద్వారా ఇసుక సేకరించే ర్యాంపుల్లో పడవలు, కూలీల నిమిత్తం యూనిట్‌కి రూ.800, పడవల ద్వారా నిడదవోలు వరకు తరలిస్తే యూనిట్‌కు రూ.1,000, ఓపెన్ రీచ్‌ల్లో మనుషుల ద్వారా రూ.500 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో మాత్రం ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు.యూనిట్ ఇసుక రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయాలు చేస్తున్నారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నిర్వాహకులు అఫిడవిట్ ఇవ్వాలి ధరలతోపాటు కొన్ని నిబంధనలూ విధించారు. ర్యాంపులో నిర్వాహకులు అఫిడవిట్ ఇవ్వాలని జిల్లా కమిటీ ఆదేశించింది. ఈ విషయాన్ని శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. నిబంధలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా కమిటీ సూచన మేరకు స్ధానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, కానిస్టేబుల్ పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసి ర్యాంపులపై నిఘా ఉంచాలని చెప్పారు. రోజువారీగా ఎంత ఇసుక తవ్వుతున్నారు? ఎవరికి ఎంత విక్రయిస్తున్నారు? వారి ఆధార్ నంబర్లతో సహా నమోదు చేయాలని నిబంధన విధించినట్టు వెల్లడించారు. దీనిలోభాగంగా ఓ కమిటీ ఏర్పాటు చేసుకునే వరకూ శుక్రవారం నుంచి మండలంలోని ర్యాంపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కొక్కటిగా మూతపడిన ర్యాంపులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, అనుమతు లేవన్న కారణంతో ఇరవై రోజుల క్రితం వాడపల్లి ర్యాంపును మూసివే శారు. వారం క్రితం అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తున్నారని ఔరంగాబాద్ ర్యాంపుని మూసివేశారు. వారం క్రితం తాడిపూడి ర్యాంపులో ఇసుక నిల్వ చేసే ప్రాంతంలో వరద నీరు చేరడంతో తవ్వకాలు తాత్కలికంగా నిలిచిపోయాయి. జిల్లాలో అధికారిక ర్యాంపులు పది ఉన్నాయి. వీటిలో తాడిపూడి, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్ ర్యాంపుల్లో మాత్రమే పడవల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. తాడిపూడి, ఔరంగబాద్ ర్యాంపులు గతంలోనే మూతపడగా ప్రక్కిలంక కొవ్వూరు ర్యాంపుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి తాత్క లికంగా మూతపడ్డాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పుడు ఉన్న ర్యాంపులు మూసివేయడంతో ఇసుక కష్టాలు మళ్లీ మొదటివచ్చే అవకాశాలున్నాయి. పడవల నిర్వాహకులు గగ్గోలు ప్రస్తుతం పడవల ద్వారా ఇసుక సేకరణకు కార్మికులకు యూనిట్‌కి రూ.700, లోడింగ్ నిమిత్తం రూ.60 చెల్లిస్తున్నారు.ఇసుక సేకరణ æకు పడవకు ఆయిల్ ఖర్చు రూ.50 చొప్పున ఖర్చువుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈలెక్కన రూ.810 అవుతుంటే రూ.800 ధర నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తున్నారు. లేదంటే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఓపెన్ ర్యాంపుల్లో పొక్లెయినర్ల సాయంతో నదిలో రోడ్లు వేసి తవ్వకాలు సాగించిన పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝళిపించడం విమర్శలకు తావిస్తోంది. అవసరమైతే కార్మికులకు ఇచ్చే వేతనంలో రూ.100 తగ్గించుకుంటే గిట్టుబాటు అవుతుందని ఆర్డీవో శ్రీనివాసరావు పడవల నిర్వహకులకు సూచించడం కోసమెరుపు. రవాణా మోత వాస్తవం ఐదు యూనిట్ల ఇసుక కొవ్వూరు నుంచి ఏలూరుకు సరఫరా చేయడానికి కిరాయి రూ.8వేల నుంచి రూ.8,500 తీసుకుంటున్నారు. జిల్లా కమిటీ మాత్రం యూనిట్‌కి రూ.2,100 చొప్పున ధర నిర్ణయించింది. అంటే ఐదు యూనిట్లకు రూ.10,500 చెల్లించాల్సి వస్తుంది. కొవ్వూరు నుంచి జంగారెడ్డిగూడెం 54 కిలోమీటర్లు వస్తుంది. గరిష్టంగా కిరాయి రూ.5,500 నుంచి రూ.6వేలు లోపు కిరాయి తీసుకుంటున్నారు. అటువంటిది జిల్లా కమిటీ మాత్రం కిరాయి యూనిట్ ఇసుక రవాణాకు రూ.1,700 నిర్ణయించారు.అంటే ఐదు యూనిట్లకు రూ.8,500 అవుతుంది. అంటే లబ్ధిదారుడిపై సుమారు రూ.2వేలు కిరాయి భారం పడుతుంది. సుమారు 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరానికి ఇదే కిరాయి నిర్ణయించారు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న నల్లజర్లకు యూనిట్ రవాణాకు రూ.1,000 చొప్పున నిర్ణయించారు. అంటే మూడు చోట్ల ఎక్కడికి వెళ్లినా అదే కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. ఐదుయూనిట్లకు రూ.5 వేలు కిరాయి నిర్ణయిస్తే లారీ కిరాయి మాత్రం రూ.3,500 నుంచి రూ.4వేలు తీసుకుంటున్నారు. రెండు యూనిట్ల లారీలకు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన కిరాయి కిలోమీటరుకు రూ.65లు, ఐదు యూనిట్ల లారీకి రూ.120 చొప్పున నిర్ణయించింది.ఈలెక్కన చూసినా జిల్లా కమిటీ నిర్ణయించిన ప్రస్తుతం మార్కెట్లో తీసుకుంటున్న కిరాయిల కంటే అ«ధికంగానే ఉంది. కిరాయిలు బాదుడు అధికారికం కానుండడంతో ఇసుక ధర లబ్ధిదారులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. -
తెలంగాణలో మాఫియాల రాజ్యం
తమ్మినేని వీరభద్రం సంగారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడం కాదని, సంపద పెరిగినంత మాత్రాన ప్రగతి సాధించినట్లు కాదన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు విజృంభిస్తూ దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. ప్రభుత్వమే యథేచ్ఛగా ఇసుక మాఫియాకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసుల అండతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిందన్నారు. ఎస్పీని వదిలేసి ఎస్ఐని బలిచేయడం వింతగా ఉందన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తప్పించుకుంటున్న కేసీఆర్‌ను పదేపదే ప్రశ్నిస్తున్న ఆచార్య కోదండరాంను అరెస్టుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. -
తెలంగాణలో మాఫియా రాజ్యం
విరసం నేత వరవరరావు పెద్దపల్లి రూరల్: తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్య మ సమయంలో ‘నక్సల్స్ ఎజెండా యే నా ఎజెండా’ అన్న కేసీఆర్ కుర్చీ ఎక్కిన తర్వాత దొరల పోకడకు తెర తీశార న్నారు. నేరెళ్ల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇసుక మాఫియా నిందితుల ఆస్తులను పంచాలన్నారు. కరీంనగర్ జైలులో ఉన్న నేరెళ్ల బాధితులను వరవరరావు పరా మర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ఇసుక మాఫియా మామూలుది కాదని.. సింగపూర్, మలేషియాలకు ఇసుక రవాణా చేస్తున్న గోల్డ్‌స్టోల్ కంపెనీకి చెందిందని, దీనికి కేటీఆర్‌తో సంబంధాలున్నాయన్నారు. -
మారని రోగుల తల’రాత’
అర్థంకాని మందులరాతలో ఆంతర్యమేమిటో? వైద్యలు రాసే మందుల చీటీతో అవస్థ వైద్యశాఖ నిబంధనలు బేఖాతరు ఆస్పత్రి వద్ద దుకాణాలే దిక్కంటున్న పేషంట్లు తణుకు అర్బన్ : వైద్యులు కలిపిరాతతో రాస్తున్న మందుల చీటీలు రోగులపాలిట శాపంగా మారాయి. మందుల చీటీతో మందుల దుకాణాలకు వెళ్లిన రోగులకు ఏ డాక్టర్ రాశారమ్మా మాకు అర్థం కావట్లేదనే సమాధానాలు వస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1500కు పైగా వైద్యులు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు 450 ఉండగా ఇందులో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటిలోను సుమారుగా 1300కు పైగా వైద్యులు వైద్య విధులు నిర్వర్తిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ విభాగంలో వైద్య విధాన పరిషత్‌లో ఏలూరు జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులైన తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంతో పాటు అదనంగా 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 95 మంది వైద్యులు విధుల్లో ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోని 93 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో మొత్తం 125 మంది వైద్యులు ఉన్నారు. వీరిలో తక్కువ మంది మాత్రమే పెద్ద అక్షరాలు విడివిడిగా రాస్తున్నారు. వైద్యుల అనుబంధ మందుల దుకాణాల్లోనే.. ప్రైవేటు వైద్యులు తమ ఆసుపత్రికి సంబంధించిన మందుల దుకాణంలోని ప్రతినిధికి మాత్రమే అర్థమయ్యేలా మందులు చీటీలో రాస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. బయట మందుల దుకాణాలకు చీటీ తీసుకువెళ్లినా వైద్యుడి చేతిరాత అర్థం కావడంలేదని ఆయనకు సంబంధించిన మందుల దుకాణంలోనే తీసుకోవాలని చెబుతున్నారని రోగులు చెబుతున్నారు. బయట దుకాణాల్లో అదే మందుపై ఎంఆర్పీపై 10 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారని, అదే వైద్యులకు సంబంధించిన మందుల దుకాణంలో ఎంఆర్పీ ధరలకే అమ్మకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలే మందుల ధరలు భారీగా పెరిగిపోయిన రోజుల్లో వైద్యులు మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు భీమవరం, తణుకు ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగులకు అవసరంలేని మందులు కూడా రాసి మందుల కొనుగోళ్ల శాతం పెంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో పేద రోగులకు వచ్చే పెద్ద వైద్యానికి వైద్య పరీక్షలతో పాటు మందుల ఖర్చు కూడా భారంగా మారింది. నిబంధనలకు పాతర మందుల చీటీలో కలిపిరాత కాకుండా పెద్దగా కనిపించేలా విడి అక్షరాలతో మందులు రాయాలని, అది కూడా ఏ పూట ఏ మందు వేసుకోవాలో రోగులకు వివరంగా అర్థమయ్యేలా మందుల చీటీ ఉండాలని న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. కానీ ఈ నిబంధనలు ప్రైవేటు ఆసుపత్రుల్లో 10 శాతం కూడా అమలు కావడంలేదు. మెడికల్ కంపెనీల రిప్రజెంటేటివ్‌లతో కుదిరిన ఒప్పందాలతో ఆ మందులు దొరికే దుకాణాల పేరుతో ముద్రించిన చీటీల్లోనే ముందులు రాస్తుండడం, ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కనిపిస్తోందని రోగులు విమర్శిస్తున్నారు. వైద్యుడు రాసిన మందులు అర్థంకావు వైద్యుడి రాసిన మందుల చీటీలో మందులు వారి మందుల దుకాణంలోనే అర్థం అవుతాయి. అంతేకాకుండా మెడికల్ రిప్లతో జరిగిన ఒప్పందాల కారణంగా ఆ మందులు ఉన్న మందుల దుకాణాల ప్రతినిధులకు మాత్రమే అర్థమయ్యేలా మందుల చీటీ రాస్తున్నారు. వై.శ్రీహరి, తణుకు విడి అక్షరాలతో రాయాలని ఆదేశిస్తాం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులకు ఇప్పటికే కలిపిరాతతో మందులు రాయకూడదని సర్కులర్ పంపించాం. మరొకసారి పరిశీలించి వైద్యులను విడి అక్షరాలతోనే మందులు రాయాల్సిందిగా హెచ్చరిస్తాం. డాక్టర్ డి.కోటేశ్వరి, డీఎంహెచ్‌వో, ఏలూరు విడి అక్షరాల్లోనే మందులు రాయాలి నిబంధనల ప్రకారం వైద్యులు ప్రిస్కెప్షన్లో పెద్దగా విడి అక్షరాలతో మందులు రాయాల్సి ఉంది. వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులందరికీ నిబంధనలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తాం. డాక్టర్ కె.శంకరరావు, డీసీహెచ్ఎస్, ఏలూరు -
ధర్మం కాదిది మీ ఖర్మం!
రెచ్చిపోతున్న గోమాఫియా కేసులు నమోదవుతున్నా యథేచ్ఛగా రవాణా ఎక్కడికక్కడ పకడ్భందీ ఏర్పాట్లు కోట్ల రూపాయల్లో వ్యాపారం బంగ్లాదేశ్, దుబాయ్‌లకు మాంసం ఎగుమతి జంగారెడ్డిగూడెం: భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుతున్నారు పాలు మూతులు బిగియగట్టి... నాటి స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో భరతఖండాన్ని గోమాతతో కవి అభివర్ణించారు. అదే విధంగా యుగాలకు ఆది అయిన కృతయుగం నాడే సకల దేవతలు ఒకే చోట కొలువై ఉండేలా గోమాతను సృజియించి, అందులో దేవతలు అణువణువై నిలిచిపోయారు. ఇలా ఎన్నెన్నో పూజలు అందుకున్న గోమాత నేడు తన ఆత్మఘోష వినిపిస్తోంది. నేను గోమాతను. భరత ఖండంలో పవిత్రంగా నన్ను కొలుస్తారు. నా నుంచి పుట్టే ప్రతీ అంశం మానవులకే ధారపోస్తున్నాను. సాక్షాత్తు నన్ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. గృహ ప్రవేశానికి నేను కావాలి. పూజా కార్యక్రమాలకు నేను కావాలి. ఔషధాలకు నా పొదుగు నుంచి వచ్చే పాలు, నా నుంచే వచ్చే మూత్రం, పేడ కావాలి. ఎన్నో రకాలుగా నేను మానవ జీవన గమనంలో భాగమై పోయాను. కృతయుగం నాటి నుంచి కలియుగం వరకు నన్ను పూజిస్తున్నారు. నా తనువు మొత్తం వ్యర్ధం లేని అర్థం. అటువంటి నన్ను నేడు కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు బలి చేస్తున్నారు. అమ్మ తరువాత అమ్మగా కొలిచే నన్ను మాంసం అంగడిలో విక్రయ వస్తువుగా మార్చి నా రక్తమాంసాలు అమ్ముకుంటూ నా ఉనికే రూపు మార్చేస్తున్నారు. నా నాలుగు కాళ్లను విరగ్గొట్టి, ట్రక్కులు, కంటైనర్లలో కుక్కి జీవశ్ఛవాన్ని చేసి కాసులు దండుకుంటున్నారు. జాలి కూడా చూపకుండా కర్కశంగా నాపట్ల వ్యవహరిస్తున్నారు. మీకిది తగునా..... రెచ్చిపోతున్న మాఫియా: గోమాత ఆత్మఘోష ఇలా ఉన్నప్పటికీ చాలామందికి కనీసం మానవత్వం లేకుండా పోతోంది. ఎవరికి వారే తమకేంటిలే అని గోవుల అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. దీంతో గోవులను అక్రమంగా రవాణా చేస్తూ ’గో’మాఫియా రెచ్చిపోతోంది. దీనికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా సహకరించడంతో పశువుల అక్రమ రవాణాకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఏటా కోట్లాది రూపాయలు ఈ అక్రమ రవాణా ద్వారా గో మాఫియా చేతులు మారుతోంది. ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిగోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు లక్షలాది పశువుల అక్రమ రవాణా జరిగిపోతోంది. బంగ్లాదేశ్, దుబాయిలకు కూడా అక్రమంగా రవాణా జరిగిపోతోంది. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశువుల రవాణా యథేచ్ఛగా జరిగిపోతోందంటే అధికారుల ఉదాశీనత, పెచ్చరిల్లుతున్న గోమాఫియా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి పశ్చిగోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా వాహనాలను సరిహద్దు దాటించడం వీరి పని. దీని కోసం వీరు పైలెట్లుగా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా: ఒడిశా, రాష్ట్ర సరిహద్దు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి గోవులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటైనర్లలో పశువులను సామర్ధ్యానికి మించి లోడ్ చేసి పైన టార్పాలిన్ కప్పి రవాణా చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఎటువంటి ఆంటకాలు లేకుండా వాహనాలు వచ్చినప్పటికీ జిల్లాలోకి ప్రవేశించే సరికి పోలీసులకు సమాచారం అందడం, వెంటనే పోలీసులు లారీలను సీజ్ చేయడం జరుగుతోంది. అయితే కొందరు పోలీసులు పశువులు రవాణా చేస్తున్న వ్యక్తులతో కుమ్మక్కై లారీలను వదిలి వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రవాణా మరీ దారుణంగా తయారైంది. ఒక కంటైనర్‌ను రెండు అంచెలుగా విభజించి పైన కింద గోవులను విచక్షణ మరిచి మరీ కుక్కేస్తూ సుదూర ప్రాంతాలు రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని గోవులు ఊపిరి ఆడక, ఆహార పానీయాలు అందక మృతి చెందుతున్నాయి. అయినా రవాణాదారుల్లో ఎక్కడా మానవత్వం కనిపించడం లేదు. పెద్దల ప్రమేయం: ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయంతో ఏటా కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో మీడియా వ్యక్తులు కూడా ఉండటంతో మాఫియా పని సులభమవుతోంది. ఇటీవల కొయ్యలగూడెంలో పోలీసులు గోవులు రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సీజ్ చేయగా సాక్షాత్తు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని, ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రితో స్వయంగా జిల్లా ఎస్పీకే ఫోన్ చేయించి వాహనాన్ని విడుదల చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికే కేసు నమోదు కావడంతో పోలీసులు చేతులెత్తేశారు. దళారుల హవా: పశువులను అక్రమ రవాణా చేసే వాహనాలకు దళారులు అండదండగా ఉంటున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ కొంతమంది బృందాలుగా ఏర్పడి వాహనాలను జిల్లా దాటిస్తున్నారు. ఒకవేళ తమకు సంబంధించిన వాహనం కాకపోతే వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పోలీసులకు పట్టివ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశువుల వాహనాలు జిల్లాను దాటించేందుకు దళారులకు ప్రతీనెలా లక్షలాది రూపాయలు గోమాఫియా ముట్టజెబుతోంది. చెక్‌పోస్టుల్లో కూడా వాహనాలను తనిఖీచేయకుండా మామూళ్ళు తీసుకుని వదిలివేస్తున్నారు. పంథామార్చిన గో మాఫియా: జిల్లా మీదుగా సరిహద్దును దాటించేందకు గోమాఫియా పంథాను మార్చింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలను సీజ్ చేస్తే వాటిని గోశాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గోశాలకు తరలించడం, అక్కడి నుంచి తిరిగి మళ్లీ యథావిధిగా రవాణా చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. తరలించడానికి రూ. లక్ష: జిల్లా సరిహద్దు దాటించేందుకు ఒక్కొక్క వాహనానికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారులు నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. ఈ దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తారు. దీనిలో ప్రత్యేకంగా మీడియా వ్యక్తులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులు తొలగించుకోవడానికి కిందిస్థాయి నుంచి హైకోర్టు వరకు న్యాయ సలహాదారులు ఎక్కడికక్కడ ఉన్నారంటే గోమాఫియా స్థాయి అర్థం చేసుకోవచ్చు. రవాణా చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే: ప్రివెన్షన్ ఆఫ్ యానియల్ యాక్ట్ 1960 (59 ఆఫ్ 1960)లోని సెక్షన్ 38 (1), (2) ప్రకారం పశువులను తరలించాలంటే కచ్చితంగా యాక్టులో పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించి రవాణా చేయాల్సి ఉంటుంది. గోవుల పరిమాణం, బరువుని బట్టి అవి స్వేచ్ఛగా తిరిగేలా రవాణా చేసే వాహనంలో ఖాళీఏర్పాటు చేయాలి. రోడ్డు ద్వారా గాని, రైల్వే ద్వారా గాని రవాణా చేసే సమయంలో రవాణా చేసే వాహనాన్ని బట్టి పశువులను నిర్ధేశించిన సంఖ్య మేరకే రవాణా చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో పాటు మేత, నీరు అందుబాటులో ఉండాలి. ఎటువంటి హింసకు గురికాకూడదు. ఇవన్నీ పాటించకపోతే యానియల్ క్రూయల్టీ యాక్టు ప్రకారం రవాణా చేసే యజమానులు, రవాణాదారులు కూడా శిక్షార్హులే. 08)నిఘా ఏర్పాటు చేశాం: పశువుల అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత వరకు పోలీసులే పశువుల అక్రమ రవాణా వాహనాలను పట్టుకుంటున్నారు. పశువుల అక్రమ రవాణా, కిక్కిరిసి రవాణా చేయడం నేరం. ఇకపై యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటాం. సీహెచ్ మురళీకృష్ణ, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం 09) అక్రమ రవాణాను అడ్డుకోవాలి: పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి. పశువులను చాలా దారుణంగా కాళ్లు విరగ్గొట్టి ట్రక్కులో పడవేసి కిక్కిరిసి రవాణా చేస్తున్నారు. ఇది అమానుషమైన చర్య. దీనిని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒక గోసంరక్షణ శాల ఏర్పాటు చేయాలి. అప్పుడు పశువుల అక్రమ రవాణా సాధ్యమైనంత అడ్డుకోవచ్చు. కొప్పాక శ్రీనివాసరావు, గో సంరక్షకుడు, జంగారెడ్డిగూడెం 10) మొగల్ పాలకులు సైతం గోహత్యను నిషేధించారు. భారతీయులైన మనం గోమాఫియాను అడ్డుకోలేకపోతున్నాం. గోసంరక్షణ పేరుతో దాడులు చేయడం అన్యాయం. కాని గోసంరక్షకులంతా సంఘ వ్యతిరేకులు కారు. వేదుల జనార్ధన్, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్, కొయ్యలగూడెం -
cow, mafia, eluru
విచారణ తప్పుదోవ గోసంరక్షణ శాల నిర్వాహకుడిపైనే దృష్టి మాఫియా నుంచి ఫిర్యాదుల స్వీకరణ కేసులో నుంచి బయటపడేందుకు పోలీసుల తిప్పలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమంగా రవాణా అవుతున్న గోవులు మృత్యువాత పడిన కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులు తిప్పలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో తమ బాధ్యత లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గోసంరక్షణ శాల నిర్వాహకుడు శ్రీనివాస్ లక్ష్యంగా విచారణ చేపడుతున్నారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పిలిపించి వారి నుంచి శ్రీనివాస్‌కు ఫిర్యాదులు స్వీకరించడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ రవాణాదారుల అరెస్ట్లేవీ? అసలు గోవుల అక్రమ రవాణాకు కారణమైన వారిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. ఆ దిశగా యత్నాలూ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వదిలేసి గో సంరక్షణ శాల నిర్వాహకుడిపై పోలీసులు పడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకూ 23 అక్రమ రవాణా కేసులు నమోదు చేసిన పోలీసులు పట్టుబడిన సుమారు 1800 అవులను ఆవపాడులోని గోసంరక్షణ సమితికి అప్పగించినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అక్కడ 210 గోవులు మాత్రమే ఉండటంతో మిగిలినవి ఏమయ్యాయి? ఎవరికి ఇచ్చారు? అక్రమ రవాణా చేశారా? అన్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో గోశాల నిర్వాహకుడిని లక్ష్యంగా చేశారు. చాలాకాలంగా అక్రమ రవాణా జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల పశువుల అక్రమ రవాణాను జిల్లా సరిహద్దులు దాటించే వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పశువుల రవాణా అవుతున్న వాహనాల వివరాలను వారిలో వారే పోలీసులకు చేరవేస్తున్నారు. దీనిని తెలుసుకున్న పశువుల అక్రమ రవాణా పెద్దలు వీరందరినీ తిరిగి సిండికేట్ చేసే యత్నం చేశారు. గతంలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా పశువులను జిల్లా సరిహద్దులు దాటించేవారు. అయితే పోలీసులకు సమాచారం అందుతుండటంతో ఇటీవల రూట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా జిల్లా దాటిస్తున్నట్టు సమాచారం. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గోశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికిరాత్రే మళ్లీ తెలంగాణకు తరలిస్తున్నట్టు సమాచారం. దీనికి దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. శనివారం దేవరపల్లి పోలీసుస్టేషన్లో దళారులు గోమాఫియాకు చెందిన వారిని పిలిపించి పంచాయితీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో గోసంరక్షణ సమితి నిర్వాహకుడిదే తప్పు అనేలా వారితో పోలీసులు ఫిర్యాదులు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. అసలు మాఫియాను పట్టుకోకుండా కొసరు వ్యక్తులను బాధ్యులుగా చూపించి వ్యవహారాన్ని సెటిల్ చేసే యత్నాలు జరుగుతున్నాయి. పోలీసుల అదుపులో శ్రీనివాస్ మరోవైపు వెంకట్రామన్నగూడెం రిజర్వు ఫారెస్ట్‌లో ఆవపాడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న గోశాల కన్వీనర్ కొండ్రెడ్డి శ్రీనివాస్‌ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గోశాలలో గోవులకు ఆలనాపాలనా కరువైంది. కన్వీనర్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడంతో మిగతా పరివారం కూడా పరారయ్యారు. ఆవులను దత్తత తీసుకోవడానికి వస్తున్న రైతులే ఇక్కడ సేవకులయ్యారు. గురువారం ముందు నాటికి ఉన్న 180 ఆవులతోపాటు, తదనంతరం దేవరపల్లి పోలీసులు అప్పగించిన 30 ఆవులకు గడ్డి, నీరు రైతులే అందిస్తున్నారు. ప్రస్తుతం గోశాల వద్ద దేవరపల్లి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ పహారా కాస్తున్నాడు. -
‘గో’ మాఫియా
ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక ’గోమాఫియాపై దృష్టి ఆవుల మృతితో కళ్లుతెరిచిన వైనం గోసంరక్షణ సమితిపై కేసు దర్యాప్తు ప్రారంభం చిత్రహింసలు పెట్టారని సమితి నిర్వాహకుని ఆవేదన సాక్షి ప్రతినిధి, ఏలూరు, దేవరపల్లి : అక్రమంగా తరలి వెళ్తున్న గోవులు అత్యంత హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీసులు నిద్రమత్తు వీడారు. గో మాఫియాపై దృష్టి పెట్టారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చెరేగిపోతున్న మాఫియా ఆగడాలపై రెండు నెలల క్రితమే ’సాక్షి’ కథనం ఇచ్చింది. ఈ మాఫియాకు రాష్ట్రంలోని అధికార పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలూ సహకరిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. అయినా స్పందించని పోలీసులు తాజా ఘటనతో కళ్లుతెరిచారు. తమదాకా వచ్చేసరికి... బుధ, గురువారాల్లో అక్రమంగా తరలిపోతున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు. వీటిల్లో 40 వరకూ మృత్యువాత పడటంతో ఆ శాఖలో కదలిక వచ్చింది.. 72 గోవులతో వెళుతున్న కంటెయినర్‌ను బుధవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద త్యాజంపూడికి చెందిన గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నల్లజర్ల మండలం ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసుకు సమాచారం వచ్చారు. అతను తమవద్ద ఖాళీ లేదని.. దేవరపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కంటెయినర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి రాత్రి 9 గంటల సమయంలో కాకినాడ ప్రభుత్వ గోసంరక్షణ సమితికి పంపించారు. అప్పటికే కంటెయినర్లో ఉన్న 30 గోవులు మృతి చెందినప్పటికీ దానిని కాకినాడ పంపించారు. అక్కడ నిర్వాహకులు గోవులను దించుకోవడానికి నిరాకరించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం కంటెయినర్‌ను దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితికి పంపించారు. అయితే మృతి చెందిన గోవులను దించుకోవడానికి నిర్వాహకుడు శ్రీనివాస్ నిరాకరించాడు. బతికున్న వాటిని మాత్రమే తీసుకున్నాడు. మృతి చెందిన గోవులను లారీ డ్రెవర్ నల్లజర్లతాడేపల్లిగూడెం రోడ్డులో రోడ్డు పక్కన దింపుతుండగా.. పరిసర ప్రజలు అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సయంలో మృతి చెందిన 32 గోవుల కళేబరాలను దేవరపల్లి, నల్లజర్ల ఎస్సైలు కంటెయినర్‌తో తీసుకువచ్చి యర్నగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టున గొయ్యితీసి పాతిపెట్టారు. మిగిలిన వాటిని గోసంరక్షణ సమితికి అప్పగించారు. చిత్రహింసలు పెట్టారు. ఇదిలా ఉంటే గోవులను దించుకోవడానికి నిరాకరించడంతోపాటు కంటెయినర్ డ్రైవర్‌ను డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలతో గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, సహాయకుడు రాఘవేంద్రరావును దేవరపల్లి ఎస్సై వాసు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన అనంతరం రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టినట్టు శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. పోలీసులు బాగా కొట్టడంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. మంత్రుల దృష్టికి వివాదం పోలీసుల చిత్రహింసలపై నిర్వాహకుడు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రుల జోక్యంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గతంలో జిల్లాలోని ఏయే పోలీస్ స్టేషన్ల పరిధిలో గోవులను స్వాధీనం చేసుకున్నారు. ఆవపాడు గోసంరక్షణ సమితికి ఎన్ని గోవులను అప్పగించారు అనే దానిపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అప్పగించిన గోవులన్నీ సమితిలో ఉన్నాయా, లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. గో సంరక్షణ సమితి వెనుక మాఫియా! : ఎస్సై గోసంరక్షణ సమితి నిర్వాహకుడిపై వచ్చిన ఫిర్యాదులపై శ్రీనివాసు, మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్టు దేవరపల్లి ఎస్సై పి.వాసు తెలిపారు. కేసు నుంచి బయటపడడానికి తాము కొట్టినట్టు శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, కొట్టడం వాస్తవం కాదన్నారు. కంటెయినర్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే టప్పటికే 30 గోవులు మృతి చెందినట్టు ఆయన తెలిపారు. గోసంరక్షణ సమితి వెనుక పెద్ద మాఫియా ఉందని వివరించారు. విచారణ తర్వాత వివరాలను చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఒడిశా నుంచి రవాణా ఒడిశా, శ్రీకాకుళం నుంచి, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రతిఏటా వేలాది పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కే కాక, బంగ్లాదేశ్‌కూ పశువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా చేస్తున్న వాహనాలను సరిహద్దు దాటించడం పనిగా పెట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి పశువులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటెయినర్లలో పశువులను సామర్థ్యానికి మించి లోడ్ చేసి పైన్ టార్పాలిన్ కప్పి అనుమానం రాకుండా రవాణా చేసేస్తున్నారు. ఈ విషయాలను రెండు నెలల క్రితమే సాక్షి వెలుగులోకి తీసుకువచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తమదాకా వచ్చే సరికి హైరానా పడుతున్నారు. -
మత్తు.. యువత చిత్తు
జిల్లాలోనూ డ్రగ్స్ కోరలు విస్తరిస్తున్న మత్తు మాఫియా జోరుగా నార్కొటిక్ డ్రగ్స్ విక్రయాలు భీమవరం ఘటనతో వెలుగులోకి తణుకు : మద్యం.. గంజాయి.. గుట్కా.. తాజాగా డ్రగ్స్.. పేర్లు ఏమైనా ఇవి యువతను పెడదోవ పెట్టిస్తున్నాయి. వారిని బానిసలుగా చేసి భవిష్యత్‌ను చిత్తు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో జిల్లాలో గంజాయి వినియోగం బాగా పెరిగింది. దీనికి తోడు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న గంజాయి కొన్నిసార్లు పోలీసులకు చిక్కుతున్నా సింహభాగం మత్తు మాఫియా చేతుల్లోకి వెళుతోంది. ఈ పరిస్థితుల్లో చాపకింద నీరులా కొందరు అక్రమార్కులు రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో జిల్లాలోనూ వీటి కదలికలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో నార్కొటిక్ మందుల వినియోగం పెరిగింది. మెడికల్ షాపుల ద్వారా వీటిని కొందరు యువతకు చేరవేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా జిల్లాలో హోల్‌సేల్ మందుల దుకాణాలపై జరుగుతున్న దాడులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా భీమవరానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. పొరుగు జిల్లాల నుంచి దిగుమతి పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లాకు దిగుమతి అవుతోంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు వాహనాలతో పాటు వివిధ వాహనాల్లో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతోంది. బడా వ్యాపారులు చిన్న చిన్నవారికి తాయిలాలు ఎరగా చూపిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి ఇళ్లల్లోనే చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆయా రైల్వేస్టేషన్లను వేదికగా చేసుకుని చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలుమార్లు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేసినా తిరిగి అదే వ్యాపారం చేస్తుండటం విశేషం. వీటితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఫోర్టువిన్ ఇంజక్షన్లు తక్కువ ధరకు తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఫెన్సిడిల్, కోరెక్స్ వంటి కాఫ్ సిరప్‌ల వినియోగం పెరిగింది. సాధారణంగా కొన్నిరకాల నార్కొటిక్ డ్రగ్స్ వినియోగాన్ని నిషేధించారు. కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వీటిని విక్రయించాల్సి ఉండగా ముందుల దుకాణ యజమానులు యథేచ్ఛగా వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మందుల షాపుల్లో దొరికే ఎరేజ్ ఎక్స్ లిక్విడ్‌ను యువత ఎక్కువగా వినియోగిస్తున్నట్టు సమాచారం. ఈ మందును చేతిరుమాలుపై వేసుకుని వాసన పీల్చి మత్తులో జోగుతున్నారు. ఇష్టారాజ్యంగా నిర్వహణ జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. ఏమాత్రం అవగాహన లేకుండా మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మాసిస్ట్ అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. సాధారణంగా డాక్టర్ ధ్రువీకరించిన చీటీ ఉంటేనే మందులు ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల వరకు మెడికల్ షాపులు ఉండగా మరో 700 వరకు హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో తణుకు, ఏలూరు ప్రధాన కేంద్రాలుగా హోల్‌సేల్ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 80 శాతం దుకాణాలు ఫార్మాసిస్టులు లేకుండానే నడుస్తుండగా కొత్తగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ ఉంటోంది. పట్టణాల్లోనే ఫార్మాసిస్ట్ లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిషేధిత కఫ్ సిరప్‌ను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్న భీమవరానికి చెందిన ఒక వ్యాపారిపై గతేడాది కేసు నమోదు చేశారు. సుమారు 5 వేల బాటిళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా ముంబైలో పట్టుబడిన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ మాఫియా వ్యవహారానికి సంబంధించి జిల్లాలో అధికారులు తనిఖీలు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘మాఫియాతో రాజధానికి చెడ్డపేరు'
హైదరాబాద్: మద్యం, డ్రగ్స్ మాఫియాతో రాజధాని నగరానికి చెడ్డ పేరు వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చెడ్డపేరు రాకుండా చూడటం బీజేపీ యువతతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. శుక్రవారం టీఆర్ఎస్కు చెందిన కొందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో కొందరు చేసే ఆగడాలతో మొత్తం పరిశ్రమకే చెడ్డపేరు వస్తోందన్నారు. మూడేళ్ల కేసీఆర్ పాలనతో జనం విసిగి పోయారని చెప్పారు. నరేంద్రమోదీ పాలనపై ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని అన్నారు. పాత బస్తీ ఎంఐఎం ఆగడాలకు అడ్డాగా మారుతోందని ఆయన ఆరోపించారు. -
పేట్రేగుతున్న ఇసుక దందా
ఆచంట : గోదావరి తీరంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుతూ కోట్లాది రూపాయల్ని లూటీ చేస్తోంది. ప్రైవేటు సైన్యాన్ని నడుపుతూ అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతోంది. అధికారులు, ఫిర్యాదుదారులతోపాటు విలేకరులపైనా దాడులు చేయిస్తోంది. ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో సాగుతున్న అక్రమాలపై అధికారులకు తరచూ ఫిర్యాదు చేస్తున్నాడనే కారణంగా అదే గ్రామానికి చెందిన నాగమునేంద్రరావుపై 2014 మార్చిలో ఇసుక మాఫియాకు చెందిన ప్రైవేటు సైన్యం దాడి చేసింది. మునేంద్రరావు ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించడంతోపాటు అతనిని తీవ్రంగా గాయపర్చింది. తాజాగా.. ఇసుక మాఫియా ఆగడాలపై న్యూస్ చానల్లో కథనం ప్రసారం కావడంతో ఆ చానల్ ఆచంట విలేకరి నల్లమిల్లి రామారెడ్డి ఇంటికి వెళ్లిన దుండగులు బుధవారం అర్ధరాత్రి అతడిపై హత్యాయత్నం చేశారు. మాఫియాకు అడ్డాగా సిద్ధాంతం ర్యాంపు జిల్లాలోని అతి పెద్ద ర్యాంపుల్లో సిద్ధాతం ర్యాంపు ఒకటి. ఇది కొంతకాలంగా అక్రమార్కులకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఈ ర్యాంపు నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించినప్పుడు మాఫియాకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున అక్రమంగా ఇసుక తరలించి జేబులు నింపుకున్న విషయం విదితమే. అప్పట్లో దీనికి కూతవేటు దూరంలోనే అనధికార ర్యాంపు ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. తర్వాత ఆ ర్యాంపును కూడా ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అదే ర్యాంపు నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా పెద్దఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అనుతించిన ర్యాంపుల్లోనూ అక్రమ తవ్వకాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ర్యాంపుల్లోనూ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఆచంట మండలం కోడేరు ఇసుక ర్యాంపులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకార.. ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. ఇసుకను యంత్రాల ద్వారా తవ్వి వాహనంలో లోడింగ్ చేసినందుకు యూనిట్‌కు రూ.175కు మించి వసూలు చేయకూడదు. అయితే ర్యాంపు నిర్వహణ, దారి ఏర్పాటు పేరుతో యూనిట్‌కు రూ.800 వరకూ వసూలు చేస్తున్నారు. ర్యాంపు నుంచి ఇప్పటివరకూ దాదాపు 60 వేల యూనిట్లకు పైగా ఇసుకను ఇలా అమ్మకాలు జరిపినట్టు సమాచారం. అధిక వసూళ్లు, అడ్డగోలు తవ్వకాలు సాగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. మట్టి పేరుతో తరలించుకుపోతున్నారు అక్రమ వ్యాపారులు పథకం ప్రకారం ఇసుకను కొల్లగొడుతున్నారు. నదీగర్భంలో నిర్మించే గ్రోయిన్లు, రివిట్మెంట్, రేవుల నిర్మాణం, మేటల తొలగింపు తదితర పనులను అక్రమార్కులు తమ దందాకు ఎంచుకుంటున్నారు. ఆ పనుల ముసుగులో ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలో ఏటిగట్టు రివిట్మెంట్ నిర్మాణం ముసుగులో పెద్దఎత్తున ఇసుక తరలిపోగా అక్రమార్కుల్ని గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. అయితే, అధికారులు స్వల్ప మొత్తంలో జరిమానా విధించి వదిలిపెట్టారు. తాజాగా పెనుగొండలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాల పూడిక పనులు చేపట్టారు. ఈ ముసుగులో ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. ఇందుకు సిద్ధాంతం సమీపంలోని ర్యాంపును ఎంచుకున్నారు. స్థలాల పూడికకు మట్టి అందుబాటులో లేదనే సాకుతో గోదావరి తీరంలోని మట్టి (బొండు ఇసుక) తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతులు పొందారు. అయితే మట్టిపేరుతో పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు గాను అధికార పార్టీ నేతల నుంచి అధికారులకు, ప్రజాప్రతినిధులకు పెద్దఎత్తున నజరానాలు అందుతున్నాయనే ప్రచారం సాగుతోంది. కాలువ గట్లనూ వదలడం లేదు పెరవలి : ఇసుకతోపాటు మట్టిని సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం లేదు. ప్రజాప్రతినిధుల అండదండలతో కాలువ గట్లను సైతం తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెరవలి మండలంలోని బ్యాంక్ కెనాల్ గట్టును యథేచ్ఛగా తవ్వి మట్టి అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో ఈ దందా సాగుతోందనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదేమని ఎవరైనా అడిగితే దాడులు చేయటం, రాజకీయంగా ఇబ్బందులు సృష్టించటం, కేసులు పెట్టించటం వంటి పనులు చేస్తున్నారు. ఎక్కడ మట్టి తవ్వాలన్నా.. మెరక చేయాలన్నా మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. ఖండవల్లి నుంచి కాకరపర్రు వరకు కాలువ కుడి గట్టును ఎక్కడికక్కడ పొక్లెయిన్ల సాయంతో 3 నుంచి 5 అడుగుల మేర తవ్వుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.600 నుంచి రూ.800కు విక్రయిస్తున్నారు. పెరవలి మండలంలోని కాకరపర్రు, ముక్కామల, ఉమ్మిడివారి పాలెం, ముత్యాలవారి పాలెం, ఖండవల్లి గ్రామాల వద్ద తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కాలువ గట్టు నుంచి నిత్యం సుమారు వెయ్యి ట్రాక్టర్లకు పైగా మట్టి తరలిపోతోంది. -
నెలరోజులు జైల్లో ఉంటా..: ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్ అధికారికి చిత్రమైన కోరిక కలిగింది. గుణ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న నియాజ్ ఖాన్ కొన్నాళ్లు జైలుకు వెళ్తానని అడుగుతున్నారు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్లడం కాదు.. జైల్లో ఉన్న మాఫియా డాన్ అబూ సలేం కథ రాద్దామని తాను అనుకుంటున్నానని, అందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజేష్ జైన్‌ను కోరారు. నియాజ్ ఖాన్ ప్రస్తుతం ఓ నవల రాస్తున్నారు. అందుకోసం ఒక నెల రోజుల పాటు అబూ సలేంతో పాటు జైల్లో ఉంటానని అడుగుతున్నారు. అబూ సలేం జీవితం మీద ఎక్కువగా దృష్టిపెట్టి తన ఐదో నవల రాస్తున్నానని, అతడి క్యారెక్టర్‌ను పరిశీలించడానికి, అతడి రోజువారీ జీవితం గురించి తెలుసుకోడానికి నెల రోజుల పాటు జైల్లో సలేంతో గడిపేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరానని ఖాన్ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని కలెక్టర్ రాజేష్ జైన్.. ఆ లేఖను భోపాల్‌లోని తన సీనియర్లకు పంపారు. 'లవ్ డిమాండ్స్ బ్లడ్' అనే పేరుతో ఖాన్ తన ఐదో నవల రాస్తున్నారు. ఇది థ్రిల్లర్‌గా ఉండబోతోంది. దాన్ని పూర్తి చేయడానికే అబూ సలేం జీవితాన్ని సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 1995లో జరిగిన ప్రదీప్ జైన్ అనే బిల్డర్ హత్య కేసులో అబూసలేం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడిపై దాదాపు 54 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకనాటి బాలీవుడ్ నటి మోనికా బేడీ అతడి ప్రియురాలు. -
దావూద్ ఆరోగ్యంపై స్పందించిన ఛోటా షకీల్
అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చిందని ఒకసారి.. కాదు కన్నుమూశాడని మరోసారి సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. వాస్తవానికి శుక్రవారం నుంచే దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై ఛోటా షకీల్ కరాచీ నుంచి భారతీయ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ''నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలాంటి సమస్యా లేదు'' అని ఛోటా షకీల్ చెప్పాడు. కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. అతడు గత కొంత కాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించిందని పాకిస్తానీ మీడియాలోని ఒక వర్గం తెలిపింది. అయితే ఇప్పుడు అదంతా తప్పేనని ఛోటా షకీల్ అంటున్నాడు. -
దేవుడి పేరున గ్రావెల్ దోపిడీ
యడ్లపాడు: దేవుడి పేరున గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్ ఇలా సహజ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. తాజాగా యడ్లపాడు మండలంలోని సంగం గోపాలపురం గ్రామ పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు దేవుడి పేరును ఉపయోగించుకుంటున్నారు. ఈ నెల 11న సంగం గోపాలపురం గ్రామం ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గుడికి భక్తులకు ఎగుడుదిగుడు లేకుండా రోడ్డు సరిచేసుకుంటామని దీనికి అవసరమైన గ్రావెల్‌ను గ్రామపరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఎర్రమట్టి గ్రావెల్‌ను తవ్వుకుంటామని స్థానిక గ్రామ నాయకులు మంత్రి ప్రత్తిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మంత్రి సరే అన్నదే తరువాయి తిరునాళ్లకు ముందుగానే గ్రావెల్ తవ్వకాలు ప్రారంభించారు. పనిలో పనిగా కొంతగ్రావెల్ గుడిముందు రోడ్డుకు తోలి యథేచ్ఛగా బయట ప్రాంతాలకు గ్రావెల్ విక్రయాలు చేపట్టారు. ఈ తతంగం మొత్తానికి సంబంధిత శాఖల అ«ధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కేవలం అధికారం ఉందికదా తమను ప్రశ్నించే వారెవరు అన్న రీతిగా కొనసాగిస్తున్నారు. ఎంతో విలువైన రెడ్‌గ్రావెల్ తవ్వి వందల కొద్ది ట్రక్కులు ద్వారా విక్రయాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది రూపాయలు అధికార పార్టీ నాయకుల జేబులు నింపాయన్నది నగ్నసత్యం. గతంలోనూ తవ్వకాలు... ప్రస్తుతం తిరునాళ్ల పేరుతో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడిన నాయకులకు గతంలోనూ ఇక్కడ ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు పాల్పడిన చరిత్ర ఉంది. సుమారు 8 నెలల కిందట టీడీపీ మండలస్థాయి నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా తవ్వకాలు నిర్వహించి సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో తవ్వి టన్నుల కొద్ది గ్రావెల్‌ను విక్రయించారు. అప్పట్లో ఈ గ్రావెల్ తవ్వకాలు బట్టబయలు కావడంతో వివిధ శాఖల అ«ధికారులకు ముడుపులు ముట్టజెప్పి తాత్కాలికంగా ఒక నెలరోజులు ఆపి తిరిగి తవ్వకాలు చేశారు. -
అక్రమాలకు అండ
చెరువులకు గండ్లుకొట్టిన అధికారులు మరునాడే వాటికి అనుమతులు పేట్రేగుతున్న ఆక్వా మాఫియా మామూళ్ల మత్తులో జిల్లాస్థాయి కమిటీ ఆందోళనలో వరి రైతులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమ చెరువులకు అధికారిక రంగులు అద్దుతున్నారు. దీంతో ఆక్వా మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్విన అక్రమ చెరువులు తవ్వకాలకు తాము అండగా ఉంటామనే విషయాన్ని అధికారులు అనుమతులు మంజూరు చేయడం ద్వారా స్పష్టంగా చాటుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు బాడవ ఆయకట్టులో 163 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమంగా చేపల చెరువులు తవ్వారు. వాటికి ఎలాంటి అనుమతులు లేకపోగా.. చెరువల తవ్వకాలు పూర్తయ్యాక అందులో 69.85 ఎకరాలకు 3 దరఖాస్తులు (పీఆర్ఎఫ్ 011700018229 / 011700018228 / 01170018226 ) ఆన్లైన్ చేఃఇరు. ఈ విషయాలను ఆధారాలతో సహా ’సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో’ శీర్షికన గత నెల 16వ తేదీన ’సాక్షి’ కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఎం.సుందర్రాజు సిబ్బందితో కలసి అక్రమ చెరువు గట్లకు యంత్రాలతో తూతూమంత్రంగా గండి కొట్టించారు. అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం నిబంధనలకు విరుద్దమని, ఈ చెరువులకు అనుమతులు రావడం చాలా కష్టమని రెవెన్యూ అధికారులే ఆ రోజున చెప్పారు. ఇందుకు భిన్నంగా ఆ మరునాడే.. ఫిబ్రవరి 17న ఒక దరఖాస్తుకు, ఫిబ్రవరి 20న మిగిలిన రెండు దరఖాస్తులకు జిల్లాస్థాయి కమిటీ అధికారి, మత్స్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ ఎండీ అబ్దుల్యాకుబ్ బాషా తాత్కాలిక అనుమతులను ఆగమేఘాలపై మంజూరు చేయడం విశేషం. అక్రమ చెరువులు తవ్వుతున్న ఆక్వా మాఫియాకు క్షేత్రస్థాయి నుండి జిల్లాస్థాయి అధికారుల వరకూ మద్దతు ఏమేరకు ఉందనే విషయం దీనిద్వారా స్పష్టమవుతోంది. మరో కోణం ఇదీ ఆక్వా మాఫియా భాగోతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 100 ఎకరాల సాగు భూమిని చెరువులుగా మార్చాలంటే తొలుత సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే చెరువుల తవ్వకాలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ.10 నుంచి రూ.12 వేల వరుకూ ఖర్చు పెడుతున్నారు. ఆ అనుమతులను ఆధారం చేసుకుని మొత్తం 100 ఎకరాల్లో చెరువు తవ్వకాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ సిబ్బంది అయినకాడికి దండుకుంటున్నారు. తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో మిగిలిన 60 ఎకరాలకు ఎకరానికి రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వానికి చెల్లించి, మొత్తం 100 ఎకరాల చెరువుకు అధికారిక చెరువులుగా మార్చుకుంటున్నారు. దీనివల్ల మిగిలిన 60 ఎకరాల్లో ఎకరానికి రూ.10 వేల వరకూ మాఫియా మిగుల్చుకుంటోంది. ఇలా ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మాఫియా కూడగడుతున్నట్టు సమాచారం. ఆన్సైట్ వద్దు.. ఆన్లైన్ ముద్దు చెరువుల అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మండల కమిటీ కనీసం ఆ భూమిని క్షేత్రస్థాయిలో (ఆన్సైట్) పరిశీలించేందుకు రాదు. మామూళ్ల మత్తులో పడి ఆన్లైన్లోనే వచ్చిన దరఖాస్తులకు వారం రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహారమంతా ఆన్లైన్లో ముగిసిపోతోంది. చెరువుల తవ్వకాల విషయంలో సరిహద్దు రైతుల అభ్యంతరాలను సైతం అధికార గణం గాలికి వదిలేస్తోంది. నోటీస్ బోర్డు నిబంధన ఎక్కడ చెరువు తవ్వకాలకు అనుమతి కోరుతూ దరఖాస్తు అందితే సర్వే నంబర్లతో పూర్తి వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో 15 రోజులపాటు ప్రదర్శించాలి. వాటిపై వచ్చిన అభ్యంతరాలను సమీక్షించాలి. అభ్యంతరాలు ఉంటే జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నిబంధనను అధికారులు గాలికి వదిలేసారు. రెండు పంటలు పండే భూమిని చేపల చెరువులుగా మార్చడానికి అనుమతి మంజూరు చేయకూడదు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారులు గడచిన 8 సంవత్సరాల పంట ఉత్పాదకతను ఉదహరించి పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో సర్వే నంబర్లకు మండల గణాంకాధికారి నుంచి పంటకోత ప్రయోగంలోని నిష్పత్తులను అనుసరించి తయారు చేసిన నివేదిక ఆధారంగా చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండానే వ్యవహారం నడిచిపోతోంది. -
ఆగని అక్రమం
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసింది.ఇసుక తవ్వకూడని ప్రాంతాలను గుర్తిస్తూ హద్దులు నిర్ణయించింది. హద్దుల వెంబడి కర్రలు సైతం పాతించింది. అయినా.. ఇసుకాసురులు ఆగటం లేదు. చిత్తం వచ్చినట్టు చెలరేగిపోతూ పెద్దఎత్తున ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రమాదం ముంచుకొస్తుందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా.. అక్రమార్కులకు లోపాయికారీగా సహకారం అందిస్తున్నారు. ఫలితంగా పోలవరం గ్రామంలో అక్రమ తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నాయి. ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల ర్యాంపు నుంచి రేయింబవళ్లు ఇసుకను ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. గోదావరి లంక ఒడ్డున గట్టును ఎత్తుచేసి నెక్లెస్ బండ్ నిర్మించినా.. అక్రమార్కులు ప్రత్యేకంగా బాటలు వేసుకుని ర్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక అవసరాలు, అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు ట్రాక్టర్లపై తరలించి ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల్లో ఇసుకను లోడ్‌చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నిత్యం 150 నుంచి 200 ట్రాక్టర్ల ఇసుకను తవ్వుకుపోతున్నా కన్నెత్తి చూసిన అధికారులు లేరు. దీంతో గోదావరి నదిలో రెండు నుంచి మూడు మీటర్ల లోతున భారీ గోతులు ఏర్పడుతున్నాయి. కర్రల్ని మార్చేస్తున్నారు ఇసుక తవ్వకూడని ప్రదేశాల్లో సీడబ్ల్యూసీ అధికారులు మూడు రంగులు పూసిన కర్రలను ఇసుక తిన్నెలపై పాతారు. వాటిని ఇసుకాసురులు నిత్యం నది వెలుపలకు మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు ర్యాంపు మార్గంలో ఉన్న గేటుకు గతంలో తాళం వేశారు. ఆ మార్గంలో పెద్ద గొయ్యి తవ్వి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎన్ని నిబంధనలు ఉన్నా అక్రమార్కుల దందా కొనసాగుతూనే ఉంది. చివరకు సీడబ్ల్యూసీ అధికారులు హద్దులు నిర్ణయించినా బేఖాతరు చేస్తూ ఇసుకను తోడేస్తున్నారు. కూలీల సాయంతోనూ తవ్వకూడదు హద్దులు దాటి ఇసుక తవ్వేస్తున్న వైనాన్ని సీడబ్ల్యూసీ ఏఈ సి.సత్యమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకూడదన్నారు. పోలవరంలోని సీడబ్ల్యూసీ కార్యాలయ స్టేషన్ గేజ్ లైన్ ప్రకారం దిగువన అర కిలోమీటరు, ఎగువన అర కిలోమీటరు భాగంలో ఎలాంటి తవ్వకాలు చేయకూ డదన్నారు. దీనివల్ల నీరు ప్రవహించే మార్గం మారిపోయే ప్రమాదం ఉందన్నారు. స్టేషన్ గేజ్లైన్ ఇరువైపులా మార్కింగ్ ఇస్తూ కర్రలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హద్దులు దాటి ఇసుక తవ్వితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇస్తామన్నారు. -
కృష్ణా జిల్లాలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా
-
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఉదాహరణలివిగో.. నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు. నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేయలేదు. చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది. ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు. చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. కనీసం దరఖాస్తు చేయలేదు... నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్ఎఫ్ 011700018229, పీఆర్ఎఫ్ 011700018228, పీఆర్ఎఫ్ 01170018226 ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు. ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు. ఇదో సిత్రం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్లైన్లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్లైన్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
’గుట్ట’కాయ స్వాహా
తాడిపూడి కాలువ గట్లను తవ్వుకుపోతున్న మట్టి మాఫియా మంత్రిగారి పేరు.. వ్యాపారం జోరు టీడీపీ నేతల హస్తం తాడేపల్లిగూడెం రూరల్ : తాడిపూడి కాలువ గట్లను మట్టి మాఫియా కొల్లగొడుతోంది. తాడిచెట్టు ఎత్తున వేసిన గట్లను ఎక్కడికక్కడ తవ్వేస్తూ పెద్దఎత్తున చీకటి వ్యాపారం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంజగ్గన్నపేట మధ్య సుమారు 5 కిలోమీటర్ల పొడవు తాడిపూడి కాలువ ఉండగా.. ఎక్కడికక్కడ పొక్లెయిన్లతో తవ్వేస్తూ లారీలో, ట్రాక్టర్లలో తరలించి విక్రయిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం తాడేపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం సెంటర్లోని చెరువును రైతు బజార్ ఏర్పాటు నిమిత్తం పూడ్చారు. ఈ పనుల కోసం ఇక్కడి గట్ల నుంచి మట్టి తవ్వి తరలించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచనల మేరకు అప్పట్లో ఈ పనులు చేశారు. చెరువు పూడిక పూర్తయినా కొందరు అక్రమార్కులు ఇప్పటికే అవే పనుల పేరుతో మట్టి తవ్వకాలు సాగిస్తూ చీకటి దందా నడుపుతున్నారు. అదేమని అడిగితే.. మంత్రి పేరు చెబుతున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే, ’చెరువు పూడిక కోసం మంత్రిగారు గట్లను తవ్వించేస్తే తప్పులేదు గాని.. మేం తవ్వుకెళితే తప్పు పడతారెందుకు’ అని దబాయిస్తున్నారు. గట్టు వెంబడి మట్టితోపాటు అడ్డంగా తవ్వేస్తూ గట్లను పూర్తిగా మాయం చేసేస్తున్నారు. ట్రక్కు మట్టి రూ.2,500 ట్రక్కు మట్టిని రూ.2,500, లారీ మట్టిని రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. రవాణా చేసే దూరాన్ని బట్టి ధరలను పెంచుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా గట్లను తవ్వేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇక్కడ తాడిపూడి కాలువ గట్లు ఉండేవని చెప్పడానికి ఆనవాళ్లు సైతం మిగిలే అవకాశం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గట్లను యథేచ్ఛగా తవ్వేయడం వల్ల వర్షాకాలంలో తాడిపూడి కాలువలోకి వచ్చే ఎర్రకాలువ నీరు పంట పొలాలను ముంచేసే ప్రమాదం ఉంది. మండలంలో చాలాచోట్ల గట్ల తవ్వకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల పరిధిలో రోడ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణానికి పూడిక, రియల్ ఎస్టేట్ భూముల పూడిక కోసం ప్రస్తుతం తాడిపూడి కాలువ గట్ల మట్టినే వినియోగిస్తున్నారు. ఈ దందా వెనుక కొందరు టీడీపీ నేతల హస్తముందనే ప్రచారం సాగుతోంది. -
’అటవీ’ ఆట.. వాళ్లది కాదట
కూచింపూడి అడవిలో కలప దోపిడీపై నోరు మెదపని అధికారులు అటవీ ప్రాంతం తమది కాదంటున్న అధికారులు మాఫియా వెనుక టీడీపీ పెద్దలు ! సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూచింపూడి అటవీ ప్రాంతంపై మాఫియా పంజా విసిరింది. అడవిలోగల వెదురు గడలు, యూకలిప్టస్ కలపను యథేచ్ఛగా నరికి దొంగిలించుకుపోతున్నారు. రవాణా కోసం హైవేను తలపించేలా రోడ్డు నిర్మించడంతోపాటు వెదురు పొదల మధ్య అంతర్గత రహదారులూ నిర్మించారు. ఈ విషయాలన్నీ అటవీ శాఖలో అందరికీ తెలుసు. అయినా ఎవరూ నోరుమెదపటం లేదు. అక్కడ సాగుతున్న బాగోతాన్ని ’అరణ్య రోదన’ శీర్షికన ఈనెల 2వ తేదీన ’సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అటవీ శాఖలో కలకలం రేగింది. ఈ వ్యవహారం వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉండటంతో అధికారులు నోరుమెదపడం లేదు. పెదవేగి మండలం న్యాయంపల్లి, కూచింపూడి గ్రామాల పరిధిలోని 6,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ఎవరి పరిధిలో ఉందో తెలియని స్థితిలో యంత్రాంగం ఉండటం జిల్లాలోని అడవుల దుస్థితికి అద్దం పడుతోంది. అక్కడ సాగుతున్న అక్రమాలపై ’సాక్షి’ వివరణ కోరగా అటవీ శాఖ అధికారులకు తమకేమీ తెలియదంటూనే.. ఈ విషయాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులకు చేరవేయడం, వారు వెంటనే రంగంలోకి దిగటం చూస్తుంటే ఈ దోపిడీ వెనుక ఎవరు ఉన్నారనే విషయం అర్థమవుతోంది. ఆ అడవి ఎవరిదీ కాదట నరికివేతకు గురవుతున్న కూచింపూడి అటవీ ప్రాంతం ఎవరి పరిధిలోకి వస్తుందన్న అంశంపై ఆ శాఖ అధికారులు, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. తమ శాఖలో జరుగుతున్న అక్రమాలు తమకు తెలియదంటూ నెపాన్ని ఇతర శాఖలపై నెట్టేస్తున్నారు. అక్కడ సాగుతున్న అక్రమాలపై డివిజనల్ అటవీ శాఖ అధికారి ఎన్.నాగేశ్వరరావును ’సాక్షి’ వివరణ కోరగా పెదవేగి మండలం కూచింపూడి పరిసరాల్లో అటవీ భూముల్లో విలువైన సంపదను దోచుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ ప్రాంతంలో కొంత అటవీ భూమిని ప్రభుత్వం ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించిందన్నారు. కార్పొరేషన్ అధికారులు వెదురు చెట్ల పెంపకం, అమ్మకాలు చేపట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అటవీ భూముల్లో హైవేను తలపించేలా రోడ్డు వేసిన విషయం తన దృష్టికి రాలేదని, ఆ ప్రాంతాన్ని సందర్శించి విచారణ జరుపుతామని సెలవిచ్చారు. ఇదే విషయమై ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ సరస్వతిరావును వివరణ కోరగా.. పెదవేగి ప్రాంతంలో తమ కార్పొరేషన్‌కు అటవీ భూములు లేవన్నారు. జిల్లాలో ఒక్క నల్లజర్ల పరిసరాల్లోని అటవీ భూముల్లో మాత్రమే మొక్కలు పెంపకం చేపట్టామని వివరించారు. కూచింపూడిలో వెదురు మొక్కల పెంపకం చేయడం లేదని, అక్కడ జరుగుతున్న తంతుకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు, అటవీ శాఖ అధికారులు, ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతంలోని అడవి, అక్కడి వ్యవహారాలతో తమకెలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ అడవి ఎవరికి చెందుతుంది. బాధ్యులు ఎవరన్న సందేహాలు వ్యక్తమవుతన్నాయి. ఈ తతంగం వెనుక అధికార పార్టీకి చెందిన పెద్ద నేతల హస్తం ఉండటంతో అటవీ శాఖ అధికారులు మౌనంగా ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ అంశంపై హైకోర్టులో పిల్ వేయనున్నటేకట లోక్ జనశక్తి పార్టీ నేత ఎల్.నాగబాబు సాక్షికి తెలిపారు. -
కంట’పడవా’!
యథేచ్ఛగా ఇసుక దందా చీకటి మాటున పడవల్లో రవాణా ఎమ్మెల్యే సోదరుడి అండతో చెలరేగిపోతున్న మాఫియా లాక్ గేట్లను తెరిచి మరీ తరలింపు ఒక్కొక్క పడవలో 8నుంచి 12 యూనిట్ల ఇసుక యూనిట్ రూ.4 వేలకు పైనే విక్రయం సాక్షి టాస్క్‌ఫోర్స్ : సర్కారు యంత్రాంగం నిద్రపోతోంది. చీకటి మాటున ఇసుక దందా చెలరేగిపోతోంది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ఇసుక అక్రమ తరలింపునకు రాజమార్గంగా మారింది. గోదావరి నదిలో తవ్విన ఇసుకను భారీ పడవల్లో నింపి రాత్రి 12 దాటిన తర్వాత పశ్చిమ కాలువ ద్వారా దర్జాగా తరలిస్తున్నారు. రబీ సీజన్లో జల రవాణాపై నిషేధం ఉన్నా.. పడవల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. ఇరిగేషన్ లాకులను అధీనంలోకి తీసుకున్న అక్రమార్కులు వాటిని తెరవడం.. మూయడం చేస్తున్నారు. కాపలా ఉండాల్సిన నీటిపారుదల శాఖ ఉద్యోగులు మామూళ్ల మత్తులో పడి మొత్తం వ్యవస్థను అక్రమార్కులకు అప్పగించేశారు. సీతంపేట నుంచి ఎక్కడికైనా.. గోదావరి నదిలో ఇసుక తవ్వి ఒక్కొక్క పడవలో 8నుంచి 12 యూనిట్ల ఇసుకను నింపుతున్నారు. కొవ్వూరు మండలం సీతంపేట, నిడదవోలు మండలం విజ్జేశ్వరం లాకులను తెరిచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి ఆ పడవలను నడుపుతున్నారు. అక్కడి నుంచి కావాల్సిన ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. నిత్యం 20 పడవల్లో 200 యూనిట్లకు పైగా ఇసుకను తరలించుకుపోతున్నారు. యూనిట్ ఇసుకను రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా తరలించుకుపోవడం ద్వారా రోజుకు రూ.8 లక్షల మేర ఆదాయాన్ని పొందుతున్నట్టు అంచనా. ఇది 20 పడవలు రోజుకు ఒక్క ట్రిప్ వేస్తే వచ్చే ఆదాయం మాత్రమే. కొన్ని పడవలు రెండు ట్రిప్‌లు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి డెల్టాలోని ఒక ప్రజాప్రతినిధి సోదరుడు అండగా నిలబడినట్టు సమాచారం. జల రవాణాకు అనుమతి లేకపోయినా.. గోదావరి నదిలో ఖరీఫ్ సీజన్లో మాత్రమే పూర్తిస్థాయిలో నీరు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే పడవల్లో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. రబీ సీజన్లో గోదావరిలో నీటి నిల్వలు పడిపోతుండటంతో పడవల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వడం లేదు. అయినా.. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా సీతంపేట, విజ్జేశ్వరం వద్ద లాకుల గేట్లను ఎత్తివేసి నదిలోంచి ఇసుక రవాణా చేస్తున్నారు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ హెడ్‌లాక్ నుంచే అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హెడ్‌లాక్ వద్ద ఒక సూపరింటెండెంట్, ముగ్గురు లస్కర్లు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక లస్కర్ మాత్రమే ఉంటున్నారు. కళ్లెదుటే లాక్ గేట్లు ఎత్తుతున్నా ఇరిగేషన్ ఉద్యోగులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు అక్రమ ఇసుక రవాణా సాగిపోతోంది. సీతంపేట నుంచి ఎక్కడికైనా.. విజ్జేశ్వరం హెడ్‌లాక్ వద్ద రెండు ప్రధాన లాకులు ఉన్నాయి. ఇక్కడ నుండి పడవలు సహజ వాయు విద్యుత్ కేంద్రం వెనుక భాగంలోని కాలువ నుంచి ప్రధాన కాలువలోకి చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి నిడదవోలు, శెట్టిపేత, తాళ్లపాలెం, తాడేపల్లిగూడెం,పెంటపాడు, ఏలూరు ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. రెండు బంటాలకే అనుమతులు కొవ్వూరు మండలం సీతంపేట, నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామాల్లో రెండు మత్య్సకార సంఘాల ఆధ్వర్యంలో రెండు బంటాలు మాత్రమే ఉన్నాయి. ఈ బంటా కార్మికులు మాత్రమే పడవల ద్వారా ఇసుక రవాణా చేయడానికి అనుమతులు పొందాయి. రెండు బంటాలకు చెందిన 32 పడవలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. ఈ పడవలు కూడా కేవలం ఖరీఫ్ సీజన్లో మాత్రమే కాలువలో తిరగాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా అనుమతులు లేని 20 పడవల ద్వారా రబీలోనూ ఇసుక రవాణా చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్నా.. రబీలో సాగునీటి కొరత దృష్ట్యా గోదావరి జలాలను నీటి పారుదల అధికారులు వంతులవారీ విధానంలో విడుదల చేస్తున్నారు. అయితే, కొంతమంది ప్రజాప్రతినిధుల అండతో ఇక్కడ పడవ కార్మికులే ఇష్టారాజ్యంగా లాకు గేట్లు ఎత్తడం, దించడం చేస్తున్నారు. అవగాహన లేని కార్మికులు గేట్లు ఎత్తిన తరువాత తిరిగి మూసివేసే సమయంలో ప్రమాదం జరిగినా.. గేట్లు తిరిగి వేసేటప్పుడు మొరాయించినా.. గోదావరిలోని నీరు దిగువకు వృథాగా పోతుంది. గట్లు ధ్వంసం అయ్యే పరిస్థితులు సైతం ఉన్నాయి. ఈ విధంగా ప్రతిరోజు గేట్లు ఎత్తివేయడంతో రోజుకు 500 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని అంచనా. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల అధికారులు నోరు మెదపడం లేదు.ç ప³డవ కార్మికుల ఉపాధి ముసుగులో పడవలపై ఇసుక తరలింపునకు అనుతించాల్సిందిగా అ«ధికారులు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. పడవలపై ఇసుక తెచ్చిన కార్మికులకు కూలి డబ్బులు చెల్లించి.. ఎమ్మెల్యే బంధువు ఒకరు అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీని వెనుక ఓ ఎమ్మెల్యే సోదరుడు చక్రం తిప్పుతున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జిల్లాలో రోజుకు 200 లారీల అక్రమ ఇసుక వ్యాపారం సాగుతోంది. వాడపల్లి ర్యాంపు కేంద్రంగా ప్రస్తుతం ఇసుక రవాణా సాగుతోంది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో పడవలు బయలుదేరగానే దిగుమతి పాయింట్ల వద్ద హైవే టిప్పర్లు, కూలీలతో టీడీపీకి చెందిన ఇసుక విక్రేతలు సిద్ధంగా ఉంటున్నారు. పడవ దిగుమతి పాయింట్‌కు చేరుకోగానే క్షణాల్లో అన్లోడ్ చేసి టిప్పర్ల ద్వారా గమ్యాలకు చకచకా చేర్చేస్తున్నారు. ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే 11 కాలువ పాయింట్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలో ఉన్న రెండు ర్యాంపుల నుంచి ఇసుకను తరలించే విషయంలో నిడదవోలు, తణుకు ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఒక ర్యాంపు నీకు, ఒక ర్యాంపు నాకు అనే ప్రతిపాదనను తణుకు ఎమ్మెల్యే తీసుకురాగా ఇద్దరిమధ్యా ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిడదవోలు నియోజకవర్గంలోని రెండు ఇసుక ర్యాంపులలో ఒక ర్యాంపును తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. రబీలో అనుమతులు లేవు విజ్జేశ్వరం హెడ్‌లాక్ వద్ద పడవల ద్వారా ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. గోదావరిలో నీటి లభ్యత ఏటా తక్కువగా ఉండటంతో ఆ సీజన్లో పడవల రాకపోకలకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు ఇవ్వం. ఖరీఫ్ సీజన్లో గోదావరిలో ఆశించిన విధంగా నీరు ఉండటంతో అప్పుడు మాత్రమే పడవల ద్వారా ఇసుక రవాణాకు అనుమతిస్తాం. విజ్జేశ్వరం లాకుల వద్ద అనధికారికంగా గేట్లు ఎత్తివేస్తున్న వ్యవహారంపై చర్యలు చేపడతాం. ఎన్.కృష్ణారావు, హెడ్‌వర్క్స్ ఈఈ, ధవళేశ్వరం -
పచ్చ గద్దలు
-
’ఆక్వా’రిష్టం
బరితెగిస్తున్న మాఫియా అన్నదాతకు తీరని నష్టం మామూళ్ల మత్తులో అధికారులు జిల్లాలోని అన్నదాతలకు ’ఆక్వా’రిష్టం దాపురించింది. పచ్చని చేలు అక్రమార్కుల ధన దాహానికి చెరువులుగా మారిపోతున్నాయి. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులూ వంతపాడుతున్నారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆక్వా మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండానే వేలాది ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం సాగిస్తోంది. తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చేస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో అక్రమంగా రొయ్యలసాగు జరుగుతోంది. వీటి నుంచి పంట కాలువల్లోకి విడుదలవుతున్న కాలుష్య నీరు పొలాలను ముంచెత్తుతోంది. తాజాగా నిడమర్రు మండలంలోని అడవికొలనుతోపాటు పలుగ్రామాల్లో వేలాది ఎకరాల్లో రబీ నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారంతా కౌలురైతులే. నారుమళ్ల కోసం ఆ రైతులు రూ.ఐదువేల నుంచి రూ.పదివేల వరకూ ఖర్చుచేశారు. ఈ ఖర్చంతా నీటిపాలైంది. పంట కాలువలూ పచ్చగా మారాయి. దీనిపై రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో మత్య్సశాఖ ఉన్నతాధికారులు వచ్చి చూసి వెళ్లారు. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండటం వల్లే అక్రమార్కులను అధికారులు ఏం చేయలేకపోతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నిడమర్రు మండలంలో ఉన్నన్ని అనధికారిక చెరువులు జిల్లాలో ఎక్కడా లేవు. ప్రభుత్వ అన్ సర్వే భూములనూ చెరువుల్లో అక్రమార్కులు కలిపేసుకున్నట్టు సమాచారం. అడవికొలనులో 85 సెంట్ల ప్రభుత్వ భూమినీ కలిపేసుకుని కొందరు చెరువులు తవ్వేసుకున్నారు. పెదనండ్రకొలను, అడవికొలను గ్రామాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేశారు. సాధారణంగా చేపల చెరువులకు రెండు అనుమతులు ఉంటాయి. తాత్కాలిక అనుమతితో చెరువు తవ్వుకోవచ్చుగానీ, నీరు నింపే అవకాశం లేదు. శాశ్వత అనుమతి వస్తేనే చేపల పెంపకానికి అనుమతి ఉంటుంది. అయితే తాత్కాలిక అనుమతులతోనే అక్రమార్కులు చేపల చెరువులు తవ్వేసి వాటిని తర్వాత రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అసలు రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రభుత్వ అనుమతులు లేవు. కానీ నిడమర్రు మండలంలో చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. వీటిల్లో పట్టుబడి కోసం నీటిని వదిలివేయడంతో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. నీళ్లు ఒక్కసారిగా వదలడంతో చాలాచోట్ల నారుమళ్లు నీట మునిగి కుళ్లిపోయాయి. అడవికొలను గ్రామం కలందకోడు పాయ, దొంగపర్రు, దాళ్వాపర్రిపాయల్లో నారుమళ్లు మొత్తం నాశనమైపోయాయి. దాదాపు రెండువేల ఎకరాల్లో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశకు చేరుకున్న నారు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానిక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతోపాటు రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం వల్లే ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిడమర్రుతోపాటు అడవికొలను, పెదనిండ్రకొలనుల్లో చేపల చెరువులుగా మారిన అత్యధిక పొలాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధాన రహదారికి పక్కనే రొయ్యల సాగు జరుగుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు. ప్రశ్నించిన రైతులకు ఆక్వా మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నారుమళ్లు నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. నారుమళ్లు నష్టపోవడంతో ఇప్పుడు వేరే చోట నారు కొని తెచ్చి నాట్లు వేసినా ఆ తర్వాత చెరువుల నుంచి కలుషిత నీరు వదిలితే ఏం చేయాలోనని మధనపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. . -
ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
మాజీ డాన్ ఛోటా రాజన్ ఏం చేస్తున్నాడో.. ఎలా ఉన్నాడో తెలుసా? అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, పూర్తిగా విషమించిందని అందువల్ల అతడికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వస్తోందని తెలిసింది. ఏదైనా బాగా పెద్ద ఆస్పత్రిలో అతడికి కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో చికిత్స చేయించాలని ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్కడి బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం అతడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే ఈ సలహా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం గుండె సమస్య, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో పాటు... ఛోటా రాజన్‌కు ఇన్సిషనల్ హెర్నియా, లాపరోటమీ, హైపర్‌టెన్షన్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి అతడికి కడుపునొప్పి వస్తుందని, మరోసారి ముక్కులోంచి రక్తం వస్తుందని, ఇంకోసారి అసలు నిద్రపట్టకపోవడం లాంటివి ఉంటాయని.. అందువల్ల ఇప్పటివరకు పూర్తిగా ఏయే సమస్యలు ఉన్నాయో అనే సమగ్ర సమీక్ష కూడా ఇంకా జరగలేదని వైద్యులు అంటున్నారు. రాజన్‌కు తగిన చికిత్స అందించేందుకు వీలుగా పూర్తిగా అతడికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది. -
డోర్‌డెలివరీ!
* ప్రజాప్రతినిధి అండతో నోట్ల మార్పిడి దందా * విజయవాడ కేంద్రంగా సాగుతున్న రాకెట్ * 30శాతం కమీషన్‌పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి * పోలీసుల అదుపులో ఓ ముఠా * కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు ! ‘రూ.లక్ష పాత నోట్లకు... రూ.70వేలు కొత్త నోట్లు... మంచి తరుణం మించిన దొరకదు.. వెంటనే రండి... ఎంతైనా మారుస్తాం.. మీకు అనువైన ప్రాంతానికే వస్తాం. ఏదైనా ఇబ్బంది వస్తే అన్న చూసుకుంటారు..’ ఇదీ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతున్న నోట్ల మార్పిడి దందా. పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు భారీ దందాకు తెరతీశారు. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొందరు బ్యాంకు అధికారులు వీరికి సహకరిస్తున్నారు. దీంతో బ్యాంకుల నుంచి దొడ్డిదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసుకున్నారు. అనంతరం ఐదు ముఠాలుగా ఏర్పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నోట్లమార్పిడికి తెరతీశారు. కోట్లలో నోట్లు మారుస్తూ భారీగా కమీషన్లు జేబులో వేసుకుంటున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఐదుగురు సర్వం తామై నోట్ల మార్పిడి దందాను సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న బడాబాబులు, వ్యాపారులతో మంతనాలు సాగిస్తున్నారు. 30 శాతం కమీషన్ఇస్తే... పెద్ద నోట్లను మార్పిడి చేసి కొత్త రూ.2వేల నోట్లు ఇస్తామని చెబుతున్నారు. ప్రధానంగా మద్యం, ఇసుక, వడ్డీ, బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కరెన్సీ దందా సాగిస్తున్నారు. అన్ని కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే.. టీడీపీ ప్రజాప్రతినిధి పరపతిని ఉపయోగించి బ్యాంకుల నుంచి కొత్త నోట్లను దొడ్డిదారిలో మార్పిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతి పరిధిలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు దొడ్డిదారిలో భారీగా పెద్ద నోట్లు మార్పిడి చేసినట్లు ఇప్పటికే రిజర్వు బ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల్లోనే రూ.9,650 కోట్లు మార్పిడి చేయడం గమనార్హం. కొందరు బ్యాంకర్లు అడ్డదారిలో బడాబాబులకు నోట్లు మార్పిడి చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్బీఐ ప్రాథమికంగా గుర్తించింది. విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులతో కూడిన రాకెట్‌కే అడ్డదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసినట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల అదుపులో ఓ ముఠా ! నోట్ల మార్పిడి దందాపై సమాచారం అందడంలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని ఓ ప్రాంతంలో నోట్ల మార్పిడి కోసం నిరీక్షిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారిలో టీడీపీ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఐదుగురిని విచారించడం ద్వారా మొత్తం రాకెట్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ! నోట్ల మార్పిడి ముఠాను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన ముఖ్య అనుచరుడిని విడిచిపెట్టాలని... మిగిలిన వారిపై కూడా నామమాత్రంగా కేసు నమోదు చేయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నగదు మార్పిడి ఇలా.. సెల్ఫోన్ల ద్వారా తమ పని సాగిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు దిన పత్రికపై తేదీ కనిపించేలా కొత్త రూ.2వేల నోట్ల కట్టలను ఉంచి ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతారు. తద్వారా అవి కొత్త నోట్లు అని నిర్ధారణ అవుతుంది. అనంతరం 30శాతం కమీషన్‌పై ఓ చోటకు చేరుకుని నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇలా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన నల్లకుబేరులు భారీగా నోట్లు మార్చుకున్నారు. మంత్రులదీ అదేదారి! నోట్ల మార్పిడిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తమ అనుచరులకు సాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి లిక్కర్ సిండికేట్లతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని అనుచరులు నోట్లు మార్చుకుని కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మంత్రి అండ ఉండటంతో ఆయన అనుచరులను కొందరు రియల్టర్లు, లిక్కర్ వ్యాపారులు సంప్రదించి గుట్టు చప్పుడుకాకుండా పెద్దనోట్లకుకమీషన్పై మార్చుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోనూ.... గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి రైతులకు రుణాలుగా ఇవ్వాల్సిన కొత్తనోట్లను తన అనుచరులకు ఇప్పించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి తన పరిధిలో ఉన్న పాల కేంద్రాల్లో పాత నోట్లు తీసుకోకుండా కట్టడి చేస్తూ... కౌంటర్లలో వచ్చే కొత్తనోట్లను తమ ఖాతాలో వేయించుకుని, తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకులకు జమ చేయిస్తున్నారని సమాచారం. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ప్రస్తుతం ఇదే పనిలో బిజీబిజీగా ఉన్న ట్లు తెలిసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యువరత్నం వివిధ వ్యాపార రంగాలకు చెందిన నల్లకుబేరులను కలిసి ఎన్ని కోట్ల రూపాయలైనా మార్చేస్తామని, 20 శాతం కమీషన్ ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం. -
వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి
– ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నాడని దాడి – తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నిడ్జూరు వీఆర్వో నాగన్న – కేసు వెనక్కి తీసుకోవాలని అధికారపార్టీ నేతల ఒత్తిడి కర్నూలు సీక్యాంప్: ఇసుకమాఫియా బరితెగించింది. నిడ్జూరు సమీపంలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న నిడ్జూరు వీఆర్వో నాగన్నపై సోమవారం దాడికి పాల్పడింది. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎలాగైనా కేసు వెనక్కి తీసుకోవాలని ట్రాక్టర్యజమానుల తరఫున అధికారపార్టీనేతలు రంగంలోకి దిగారు. పెద్దసంఖ్యలో ఆ పార్టీ నేతలు తహశీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అయితే, తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడంతో అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. చివరకు ఆళ్లగడ్డకు చెందిన ముఖ్యనేత బంధువు, కోడుమూరు నియోజకవర్గ ముఖ్య నేతలు ఇద్దరు తహసీల్దార్‌కు ఫోన్లు చేసి తమ వారిపై కేసులు పెట్టవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గడువు ముగిసినా ఇసుక రవాణా కర్నూలు మండలం నిడ్జూరు వద్ద ఇసుక రీచ్ ఉండేది. ఇప్పుడు దాని గడువు పూర్తి అయిపోయింది. ఇకఅక్కడ ఇసుకతీయరాదని అధికారులు నిర్ణయించారు. ఇసుక తీయడం వల్ల తుంగభద్రనదిలో భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి సమస్య వస్తుందని రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులకు, వ్యాపారులకు చాలా సార్లు విన్నవించారు. ఇవేవి తమకు పట్టవన్నుట్టు వ్యాపారులు నదిలో నుంచి ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు సోమవారం ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నిడ్డూరు వద్ద స్థానిక వీఆర్వో పట్టుకున్నాడు. తమ దందాను అడ్డుకుంటావని అక్రమార్కులు వీఆర్వోపై దాడికి పాల్పడ్డాడు. దాడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం: టీవీ రమేష్‌బాబు, తహసీల్దార్, కర్నూలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారం చేస్తున్న రెండుట్రాక్టర్లను వీఆర్వో పట్టుకున్నందుకు ఆయనపై దాడి చేశారు. దీనిపై వీఆర్వో తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదు. దాడి కేసు వెనక్కి తీసుకోవాలని మాకు ఎటువంటి ఒత్తిళ్లు రాలేదు. -
ఇసుకాయ స్వాహా
ఉచితం ముసుగులో దోపిడీ పోలవరం ర్యాంపులో ఎడాపెడా తవ్వకాలు టీడీపీ నేతల ఆగడాలు పోలవరం రూరల్ : అనుమతులతో పనిలేదు. అడ్డగించే నాథుడూ లేడు. ఇసుక ర్యాంపుల్లో అధికార పార్టీ నేతలు అడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోతున్నాయి. అనుమతి లేకపోయినా ఉచిత ఇసుక పేరిట యంత్రాల సాయంతో పెద్దఎత్తున ఇసుక తవ్వుతూ లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంచి అమ్ముకుంటున్నారు. పోలవరంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల ర్యాంపులో రెండు రోజులుగా ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ఇక్కడ ఇసుక తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా నియోజకవర్గ టీడీపీ నేత అండదండలతో ఆయన అనుచరులు యం త్రాలను ఉపయోగించి తవ్వకాలు జరిపిస్తున్నారు. రాత్రికి రాత్రి బయటి ప్రాంతాలకు తరలించి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. కూలీలను అడ్డుకుని మరీ.. శనివారం ఉదయం కూలీలు ఇసుకను లోడ్ చేసేందుకు వెళ్లగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపులో రోడ్డు నిర్మిస్తున్నామని, మెషి¯ŒSతో ఇసుకను తవ్వి వాహనాల్లో తరలిస్తామని చెప్పుకొచ్చారు. తమకు ఏ పనులూ లేకపోవడంతో ఇసుకను ఎడ్లబండ్లపై లోడ్ చేసి ఉపాధి పొందుతున్నామని, తమకు ఆ అవకాశం లేకుండా చేయొద్దని వేడుకున్నారు. అయినా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. కూలీలను ఆ ర్యాంపులోకి అడుగు పెట్టొద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో టీడీపీ నేతలకు, కూలీలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కూలీలు వాపోయారు. ఇసుక తవ్వే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా రేవు గతంలో ఉచిత ఇసుక పేరుతో ఈ ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తవ్వడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన వరదలకు కొంతవరకు పూడినా, ఇప్పటికీ రేవులు ప్రమాదకరంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టడంతో ఇక్కడి రేవు మరింత ప్రమాదకరంగా మారుతోంది. తవ్వకాలకు అనుమతులు లేవు పోలవరంలోని ఆంజనేయస్వామి గుడి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు లేవు. అక్కడ ఎవరూ ఇసుక తవ్వకూడదు. కొందరు ఇసుకు తవ్వుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్‌తో మాట్లాడాం. సంబంధిత శాఖల అధికారులతో కలిసి రెండు రోజుల్లో ర్యాంపును పరిశీలిస్తాం. – పి.మోహనరావు, ఏడీ, గనుల శాఖ -
కళ్లెం ఎక్కడ?
* ఆగని ఇసుక అక్రమ రవాణా * సీఎం నివాసం సమీపంలోనే తవ్వకాలు * కూలీల స్థానంలో యంత్రాలతో తోడేస్తున్న వైనం * అధికారుల దాడులను లెక్కచేయని ఇసుకాసురులు * చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సీఎం నివాసం సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కూలీలతో అయితే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయని యంత్రాలను రంగంలోకి దించారు. తాత్కాలిక సచివాలయం పేరుతో రాత్రింబవళ్లూ ఇసుక తోడేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఎప్పుడైనా వెళ్తే అధికారి పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆ మూడు రీచ్‌లలో అంతులేని అక్రమాలు.. తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం రీచ్‌లలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇసుక అక్రమంగా తవ్వేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు తాత్కాలిక సచివాలయం పేరుతో భారీ స్కెచ్ వేశారు. ఈ మేరకు రోజు బోరుపాలెం రీచ్ నుంచి వెయ్యికి పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. లింగాయపాలెం, వెంకటాయపాలెం రీచ్‌ల నుంచి మరో వెయ్యికి పైగా లారీల ఇసుక తవ్వేస్తున్నారు. ఈ మూడు రీచ్‌లలో సగటున నెలకు 60వేల లారీల ఇసుక తోడేస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి మూడు యూనిట్ల నుంచి ఆరు యూనిట్ల వరకు ఇసుక లోడ్ చేస్తారు. రోజుకు రెండు వేల లారీలకు సగటున 9 వేల యూనిట్ల ఇసుక తవ్వేస్తున్నారు. నెలకు 2.70 లక్షల యూనిట్ల ఇసుకను కృష్ణమ్మ గర్భం నుంచి తోడేస్తున్నారు. స్థానిక అవసరాలకు ఇంత భారీగా వినియోగిస్తారా.. అంటే అధికారులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించే ఒక్కో లారీకి సామర్థ్యాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.75 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు నెలవారీ మాముళ్లు వెళ్తుండటంతో వారు అక్రమ రవాణాకు రెడ్ కార్పెట్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై విమర్శలు వచ్చినప్పుడు, పత్రికల్లో వార్తలు ప్రచురించినప్పుడు మాత్రమే అధికారులు ఇసుక రీచ్‌లలో దాడులు చేసి 10 నుంచి 20 లారీలను పట్టుకున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. దాడులు చేసిన సమయంలో రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు సాగించాలని అధికారులే సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఒక్క రీచ్‌లో 400 లారీలు.. లింగాయపాలెం రీచ్‌కు శనివారం ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లగా.. అక్కడ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో వందలాది లారీలకు ఇసుక నింపుతున్నారు. సుమారు 400 లారీలకు యంత్రాలతో ఇసుక నింపటం కనిపించింది. ఇవన్నీ రాజధాని ప్రాంత అవసరాల కోసం తరలిస్తున్నాయా.. అని ఆరా తీస్తే.. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఈ రీచ్ నుంచి నిత్యం 500కు పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. లింగాయపాలెం రీచ్ వద్ద ఆందోళన.. లింగాయపాలేనికి చెందిన 150 మంది దళితులు క్వారీ అసోసియేషన్ పేరుతో రిజిష్టర్ చేయించుకుని రీచ్ వద్ద లోడింగ్ పనులు చేసుకుంటున్నారు. తాజాగా ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించడతోపై రీచ్ వద్ద స్థానిక దళితులు శనివారం ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణమ్మను నమ్ముకోని జీవనం సాగిస్తున్న తమను పచ్చ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కూలీలను కాదని భారీ యంత్రాలతో ఇసుకు తొడేస్తూ ఆ రీచ్ వైపు రానివ్వకుండా చేస్తున్నారని వాపోయారు. కూలీలు ఆందోళన చేస్తుండగా, పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. -
మాఫికి టోపి
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ∙ఏళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు నయాపైసా కూడా మాఫీ కాని వైనం పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా నెరవేరకపోవడంతో.. తాము నట్టేట మునిగామని నేతన్నలు వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా. మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్‌లూమ్స్‌కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో డబ్బు పడితే ఖతం మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. -
మందుల మాఫియా బేరసారాలు
- నిషేధిత మందులతో పట్టుబడిన వ్యక్తితో రాజీ! - రూ. 5 లక్షల పరిహారంతోపాటు, శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపిస్తామని ఆఫర్ మోర్తాడ్: గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన నొప్పి నివారణ, నిద్ర మాత్రలను యదేచ్ఛగా రవాణా చేస్తున్న మాఫియా ముఠా గుట్టు రట్టుకాకుండా ఉండటానికి ఎత్తులు వేస్తోంది. దుబాయ్‌లో 10 రోజుల కింద నిషేధిత మందులతో పట్టుబడిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ కుటుంబంతో రాజీకోసం ఈ ముఠా సభ్యులు ప్రయత్నా లు మొదలు పెట్టారు. శ్రీనివాస్‌కు దుబాయ్‌కు వెళ్లడానికి ముందు మందుల పార్శిల్‌ను ఇచ్చిన వ్యక్తులపై కేసు పెట్టకుండా ఉండటానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడానికి ఈ ముఠా సభ్యులు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుడి భార్య లతిక, ఇతర కుటుంబ సభ్యు లు గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ చాంద్‌పాషాతో కలిసి తెలంగాణ సచివాలయంలోని ఎన్ఆర్ఐ సెల్లో ఫిర్యాదు చేశారు. గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల విషయంపై శ్రీనివాస్‌కు ఎలాం టి అవగాహన లేదని, కేవలం సహా యం చేయాలనే ఉద్దేశంతోనే అతను వారిచ్చిన మందుల పార్శిల్‌ను తీసుకువెళ్లి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే గల్ఫ్‌లో నిషేధిత మందుల ముఠా సభ్యులు తక్కువ వ్యవధిలోనే రూ.లక్షలు గడిస్తున్నారు. ఇప్పటివరకు మందుల మాఫియా సూత్రధారులెవరూ అరెస్టు కాలేదు. -
మాఫియా ఉచ్చులో అమాయకుడు
* నిషేధిత మందులను తీసుకువచ్చాడని * జైల్లో పెట్టిన దుబాయ్ పోలీసులు * ఎయిర్‌పోర్టులోనే అరెస్టు అయిన తడపాకల్ వాసి * పార్సిల్ పంపించిన వ్యక్తుల సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ మోర్తాడ్: గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా ముఠా ఉచ్చులో అమాయకుడు చిక్కుకున్నాడు. రెండు నెలల సెలవుపై దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ వారం రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అయితే అతని వద్ద గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల పార్సిల్ దొరకడంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మన దేశంలో విరివిగా వినియోగించే అనేక మందులను గల్ఫ్ దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి. ఒంటినొప్పులు, నిద్రమాత్రలు తదితర రకాల మందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన గల్ఫ్ దేశాలు.. ఆ మందులను నిషేధించడమేకాకుండా వాటితో పట్టుబడిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి. పూసల శ్రీనివాస్ దుబాయ్‌లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడు. ఇటీవల కంపెనీ సెలవు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతను మళ్లీ దుబాయ్‌కు వెళ్లడానికి మోర్తాడ్‌లోని ఒక ట్రావెల్స్‌లో టికెట్ బుకింగ్ చేసుకున్నాడు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి మెట్‌పల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న పార్సిల్‌ను శ్రీనివాస్‌కు అప్పగించాడు. దుబాయ్‌లో అజయ్ అనే తమ వ్యక్తి పార్సిల్‌ను రిసీవ్ చేసుకుంటాడని శ్రీనివాస్‌కు వివరించారు. పార్సిల్లో ఏం ఉందో చెప్పకుండానే పార్శిల్ ఇవ్వడంతో శ్రీనివాస్ దానిని తన లగేజీలో పెట్టుకుని దుబాయ్ చేరుకున్నాడు. నిషేధిత మందుల రవాణాపై నిఘా ను తీవ్రతరం చేసిన దుబాయ్ పోలీసులు శ్రీనివాస్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో పార్శిల్ దొరకడంతో దాన్ని పరిశీలించగా నిషేధిత మం దులు లభ్యమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ పార్సిల్లో ఏం ఉందో తనకు తెలియదని దుబాయ్‌లో తాను ఉండే క్యాంపునకు అజయ్ అనే వ్యక్తి వచ్చి తీసుకువెళతాడని చెప్పారని శ్రీనివాస్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. అంతేకాక అజయ్ సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. శ్రీనివాస్ తన అరెస్టు విషయాన్ని తన సహచరుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించాడు. ఇక్కడ పార్శిల్ అందించిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. విదేశాంగశాఖ ఉన్నతాధికారులు స్పందించి అమాయకుడైన శ్రీనివాస్‌ను విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
దేవుడి పేరుతో దందా !
సంగీత కళాశాలలో వేదికల ఏర్పాటు టార్గెట్ నిర్ణయించి వసూలు ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, విజయవాడ : పండగొస్తే అందరూ సంబరం చేసుకుంటారు. కానీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని వ్యాపారులు మాత్రం వణికిపోతున్నారు. పండగ పేరు చెప్పగానే ఆందోళనకు గురవుతున్నారు. ఈ నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు ఉత్సవాలు, పండగల పేరుతో అడ్డగోలుగా వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడటమే ఇందుకు కారణం. సంగీత కళాశాలను వేదికగా చేసుకుని దేవుడి పేరుతో టార్గెట్లు విధించి మరీ దందా సాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా దసరా ఉత్సవాల పేరుతో... నగరంలో ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నగరంలో అనేక దేవాలయాల్లోనూ అమ్మవారి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చేస్తారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యాన రెండేళ్లుగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ దేవాలయం లేకపోయినా తాత్కాలికంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ ఉత్సవాల పేరుతో నియోజకవర్గంలోని వ్యాపారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలి ఏడాది ఈ ఉత్సవాలకు సీఎం హాజరుకావాల్సి ఉన్నా... నిర్వాహకులపై తీవ్ర విమర్శలు రావడంతో చివరి నిమిషంలో ఆయన రాలేదు. మరోవైపు భాషా, సంస్కృతిక శాఖ నుంచి రూ.30 లక్షలు తీసుకుని ఇక్కడ తూతూ మంత్రంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిధులను నొక్కేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ ఉత్సవాలనూ కబ్జా ! నగర ప్రతిష్ట పెంచేందుకు గత ఏడాది కొంతమంది ఔత్సాహిక వ్యాపారులు డూండి గణేష్ సేవా సమితి పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యాన సంగీత కళాశాలలో 73 అడుగుల వినాయక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అయితే ఆ సమయంలో డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు రూ.30 లక్షలు స్వాహా చేసినట్లు మిగిలిన సభ్యుల బహిరంగంగానే ఆరోపించారు. అయితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడిని కలుపుకొని ఈ ఏడాది స్థానిక ప్రజాప్రతినిధి డూండి గణేష్ సేవా సమితికి కొత్త కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై ప్రశ్నించిన పాత కమిటీలో ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను పథకం ప్రకారం అరెస్ట్ చేయించారు. తద్వారా ఆయన వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఉత్సవాల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ ఉత్సవాల పేరుతో కూడా నియోజవకర్గంలోని వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సులభంగా లక్షలాది రూపాయలు వస్తుండటంతో ఇటువంటి ఉత్సవాలు మరిన్ని నిర్వహించాలని సదరు ప్రజాప్రతినిధి వర్గం పథకాలు రచిస్తున్నట్లు తెలి సింది. గత ఏడాది గణేష్ ఉత్సవాల సమయంలో సంగీత కళాశాల వద్ద ఆ ప్రజాప్రతినిధి పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఈసారి పెద్ద ఎత్తున రాజకీయ నేతల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సమీపంలోని సీతారామ కల్యాణ మండపంపైనా సదరు ప్రజాప్రతినిధి కన్నేశారు. పథకం ప్రకారం దేవాదాయ శాఖను ఉపయోగించి ఈ కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే బ్రాహ్మణ సంఘాలతోపాటు టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడం.. చివరకు ఈ విషయం సీఎం వరకు వెళ్లడం,ఆయన సీరియస్ కావడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ వివాదం దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యాపారులను, కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉత్సవాలు నిర్వహించడం వల్ల సదరు ప్రజాప్రతినిధితోపాటు టీడీపీకి కూడా అప్రతిష్ట వస్తోందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. -
దోపిడీ గ్యాంగ్‌లు!
* ఇసుకను పంచుకున్న అధికార పార్టీ పెద్దలు * గ్యాంగ్‌ల వారీగా తవ్వకాలు... అమ్మకాలు * రూ. వెయ్యి కోట్లకు పైగా దోచుకున్న తొలి బ్యాచ్ * పుష్కరాల అనంతరం రంగంలోకి దిగిన రెండో బ్యాచ్ * స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లకు భాగస్వామ్యం * పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల సోదరుడి కనుసన్నల్లో అక్రమాలు సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలోని ఇసుకను అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. అధికారం చేపట్టి అమరావతిని రాజధానిగా ప్రకటించిన మొదలు ఇసుకపై కన్నేశారు. మొదట ఇసుక దోపిడీని కొందరికే పరిమితం చేశారు. రెండేళ్లుగా మొదటి గ్యాంగ్ సుమారు రూ.వెయ్యి కోట్లకుపైగా సొమ్ముచేసుకుంది. అమరావతిలో ఇటీవల ఐదుగురు విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాక ఇసుక అక్రమ రవాణాకు నాలుగు రోజులు విరామం ఇచ్చారు. అప్పటి వరకు ఇసుకను అమ్మి సొమ్ముచేసుకున్న వారికి గడువు ముగిసిందని చెప్పేశారు. పుష్కరాల తరువాత మరో బ్యాచ్‌కు ఇసుక అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు అధికారపార్టీ పెద్దల ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇందులో స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లకు భాగస్వామ్యం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు లింగాయపాలెం ఇసుక రీచ్ నిదర్శన మని గ్రామస్తులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడు సురేంద్ర ఆధ్వర్యంలో లింగాయపాలెం రీచ్ నుంచి ఇసుక అక్రమరవాణా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో రీచ్ పరిధిలోని సర్పంచ్, జెడ్పీటీసీ, మరికొందరు టీడీపీ నాయకుల భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. అక్రమ దోపిడీపైనా నిఘా ... తుళ్లూరు మండలం లింగాయపాలెం, బోరుపాలెం ఇసుక రీచ్‌ల వద్ద వచ్చిపోయే లారీల వివరాలు.. వసూళ్లను సీసీ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం ఈ రెండు రీచ్‌లకు అనుమతి ఇవ్వలేదు. అయినా ఒక్కో రీచ్ నుంచి రోజూ వెయ్యికిపైగా లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది. వచ్చిపోయే లారీలు, టిప్పర్ల నుంచి వసూళ్లు చేయటం కోసం ప్రత్యేకంగా రెండు టెంట్లు ఏర్పాటు చేశారు. రీచ్‌లోకి ప్రవేశించే లారీ డ్రైవర్ ముందు రూ.500 చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే లారీని లోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన రీచ్‌లలోనూ ఇదే తరహాలో దోపిడీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారిక లాంఛనాలతో అక్రమ రవాణా .. తాత్కాలిక సచివాలయం పేరుచెప్పి అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. సచివాలయాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ ఎల్అండ్టీ సంస్థకు చెందిన వాహనాలు పది ఉంటే... వందల సంఖ్యలో ప్రైవేటు వాహనాల ద్వారా అక్రమరవాణా సాగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని నదీతీరం వెంట సుమారు 250కుపైగా అక్రమ ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. ఉండవల్లి, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, బోరుపాలెంలోని ఒక్కో ఇసుక రీచ్ నుంచి రోజుకు సుమారు వెయ్యి టిప్పర్లు, లారీ ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మిగిలిన రీచ్‌ల నుంచి రోజుకు 300 నుంచి 500 లారీల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. ఈ అక్రమ రవాణా అధికారుల అండదండలతో జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించటం, బెదిరింపులకు దిగటం జరుగుతోంది. -
టీడీపీ నేతల ‘నకిలీ’లలు..
* దొంగనోట్ల కేసులో మాచర్ల ‘దేశం’ నేత అనుచరులు * నల్గొండ పోలీసుల అదుపులో ముఠా * కీలక సూత్రధారిగా టీడీపీ నేత తనయుడు * టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొంగనోట్ల తయారీ! * మాచర్లలోనూ మార్చినట్లు నిర్ధారణ సాక్షి, గుంటూరు/ మాచర్ల/ వెల్దుర్తి : నల్లగొండ జిల్లాలో నకిలీ కరెన్సీ చెల్లామణీ కేసులో నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకులే కీలకపాత్రధారులుగా ఉన్నారు. నియోజకవర్గ నాయకుడి కుమారుడు సైతం ఇందులో కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజక వర్గంలో ఎక్కడ చూసినా దొంగనోట్ల చెలామణిలో పాలక పార్టీ నాయకుల పాత్ర గురించే చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో వెల్లడవుతున్న విషయాలు విని ప్రజలు అవాక్కవుతున్నారు. దొంగనోట్ల కేసులో నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలానికి చెందిన కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా ఈ ప్రాంతానికి చెందిన మరో ఐదుగురికి సంబంధం ఉన్నట్టు తెలుసుకుని వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ పార్టీ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ.18 లక్షల నకిలీ కరెన్సీ, దొంగ నోట్ల ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందులో కీలక పాత్ర పోషించిన టీడీపీ నాయకుడి కుమారుడి పాత్రపై ఆరా తీసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాలో దొంగనోట్లు చెలామణి చేసిన నిందితులు ఎంతమంది ఉన్నారు? మాచర్ల నుంచి వచ్చి వివిధ ప్రాంతాలలో ఎంత మార్చారు? ఎక్కడెక్కడ వీరికి సంబంధాలున్నాయి? నకిలీ కరెన్సీ మార్పిడిలో మొత్తంగా కీలక పాత్రవహించిన వారెవరు? ఇంకా ఎక్కడెక్కడ నకిలీ నోట్ల డంప్‌లున్నాయి... ఎవరిని అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం తెలుస్తుందనే దిశగా నల్లగొండ జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీంతో నకిలీ కరెన్సీ మార్పిడికి సంబంధించిన వివరాల సేకరణతో పాటు సంబంధిత∙వ్యక్తుల కదలికలు తెలుసుకుంటూ మరికొంతమందిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ వారు దొంగనోట్ల మార్పిడిలో కీలకపాత్ర పోషించారని తెలిసి వామ్మో అధికారం వస్తే నాయకులు చేసే పనులు ఇవేనా అంటూ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కీలక సూత్రధారి టీడీపీ నేత తనయుడే? మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలానికి చెందిన దొంగనోట్ల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మాచర్ల నియోజకవర్గ టీడీపీ నేత తనయుడు దొంగనోట్ల వ్యవహారంలో కీలక సూత్రధారిగా చెబుతున్నారు. దొంగ నోట్ల కేసులో దొరికిన టీడీపీ నేత అనుచరులు ఇదే విషయాన్ని పోలీసుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో అతన్ని కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత తనయుడు దొంగనోట్ల తయారీ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. వీరే కాదు... కేసులో నిందితులుగా ఉన్న సూదినబోయిన అమరయ్య, బత్తుల శ్రీరాములు, దొండ మార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డి మాచర్ల నియోజకవర్గ టీడీపీ నేత అనుచరులుగా తెలుస్తోంది. వీరిలో తాటిపర్తి పాపిరెడ్డి సదరు టీడీపీ నేతకు ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆయన కోసం అనేక గొడవల్లో సైతం పాల్గొన్నట్లు సమాచారం. వీరితో పాటు వెల్దుర్తి మండలం కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నేతలకు సైతం దొంగ నోట్ల వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కండ్లకుంట గ్రామంలో దొంగనోట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న అనేక మంది పోలీసులు ఎక్కడ తమను తీసుకెళతారోననే భయంతో పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టించుకోని జిల్లా పోలీసులు.. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకుంట, గంగలకుంట గ్రామాలకు చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తలు దొంగనోట్లు మారుస్తూ నల్గొండ పోలీసులకు దొరకడంతో మాచర్ల టీడీపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ నాయకుని తనయునితో పాటు, ఆయన ముఖ్య అనుచరులు దొంగనోట్లు తయారు చేస్తూ గుంటూరు జిల్లాతో పాటు, నల్గొండ జిల్లాలోనూ వాటిని చెలామణి చేస్తూ వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు పోలీసులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. నల్గొండ పోలీసులు బుధవారం దొంగనోట్ల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఓ ప్రింటర్, పేపర్ కట్టర్‌తో పాటు రూ.18.95 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. ఈ కేసులో కీలక సూత్రధారి పేరు బయటకు రాకుండా పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. రెండు రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా జిల్లా పోలీ సులు దొంగనోట్ల కేసుపై దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక పోలీసులకు దొంగనోట్ల వ్యవహారం తెలిసినా అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో చూస్తూ ఊరుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండ పోలీసులు అరెస్టు చేసింది నలుగురిని మాత్రమేనని, ఇంకా చాలా మంది టీడీపీ నాయకులకు దొంగనోట్ల వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయనిఆరోపణలు వెల్లువెత్తుతున్నా, జిల్లా పోలీసులు దీనిపై కనీస దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి దొంగనోట్ల వ్యవహారం మూలాలను బయటకు తీయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
‘పేట’లో గంజాయి మాఫియా
సూర్యాపేట గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలో విస్తరించిన ఈ మాఫియా.. చిన్నారులు మొదలు.. ఇంజినీరింగ్ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. మత్తుకు అలవాటుపడుతున్న యువకులు›తల్లిదండ్రులను చితకబాదడం ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారుతోంది. విశాఖ, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతోంది. కొందరు ముఠాగా ఏర్పడి వారితో సంబంధాలు ఏర్పరుచుకుని ఈదందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న యువతకు గంజాయిని అందిస్తూ జీవితాలు బుగ్గిచేస్తున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న బొడ్రాయి బజార్, పాత వ్యవసాయ మార్కెట్, రాజీవ్‌నగర్, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, ఇందిరమ్మ కాలనీల్లో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. కొంతమంది యువకులు మధ్యవర్తులుగా ఉండి విద్యార్థులు, యువతకు చేరవేస్తున్నట్లు సమాచారం. గతంలో టిప్పర్, బొలేరో వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. యువతకు గంజాయి అందిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు పెట్టినా ఈ దందా జోరుగా కొనసాగుతూనే ఉంది. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా.. ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి రవాణా కొనసాగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాల ప్రహరీని ఆనుకొని కొందరు వాహనాల్లో వచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తుకు అలవాటుపడిన కొందరు విద్యార్థులు తమ జీవితాలను చిత్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. బొడ్రాయిబజార్‌కు చెందిన కొందరు యువకులు కూడా గంజాయి రవాణాలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నంబరు ప్లేట్లు లేని కార్లను వినియోగిస్తూ.. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం – వి.సునితామోహన్, డీఎస్పీ, సూర్యాపేట విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశాం. నర్సాపూర్, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. గంజాయి వాడుతూ దొరికిన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయం.. ఏకంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. గంజాయి రవాణాదారులపై కఠినచర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టే పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. చెడు అలవాట్లను మాన్పించే బాధ్యత తల్లిదండ్రులదే.