Nawazuddin Siddiqui
-
ఇంతవరకు దీపికా పదుకొణె సినిమాలు చూడలేదు: ప్రముఖ నటుడు
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ బందూక్' సాంగ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.దీపిక సినిమాలు చూడలేదుబాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలా హీరోయిన్ దీపికా పదుకొణె గురించి అడగ్గా ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు, తన సినిమాలేవీ చూడలేదు అని బదులిచ్చాడు. అలాగే సెన్సేషనల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి కూడా తనకు తెలియదన్నాడు. టికు వెడ్స్ షెరు మూవీలో అవనీత్ కౌర్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖిత్వరలో చూస్తాపోనీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించిన స్త్రీ 2 సినిమా గురించి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని నవాజుద్దీన్ చెప్పాడు. టికు వెడ్స్ షెరు మూవీలో తనతో కలిసి నటించిన యంగ్ హీరోయిన్ అవనీత్ కౌర్ గురించి మాట్లాడుతూ.. ఆమె సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి. అద్భుతమైన నటి కూడా అని ప్రశంసించాడు.ఓటీటీ..కాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అద్భుత్ ఆదివారం (సెప్టెంబర్ 15న) ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో రిలీజైంది. ఈ మూవీలో డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రలు పోషించారు.చదవండి: సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే? -
Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు అందుకే చేస్తున్నా..
పాన్ ఇండియా సినిమాలతో భాషా సరిహద్దులు చెదిరిపోయాయి. హీరోలను, ఇతర నటీనటులను అన్ని భాషల వారు అక్కున చేర్చుకుంటున్నారు. అలా సౌత్‌లో బాలీవుడ్ నటుల హవా కూడా పెరుగుతోంది. ఇటీవల వచ్చిన సైంధవ్ సినిమాతో హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.డబ్బులిస్తున్నారని నటిస్తున్నాతాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదు. ఇష్టంతో ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. రామన్ రాఘవ్ వంటి సినిమాలు చేసినప్పుడు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై నాకు పూర్తి పట్టు ఉంటుంది. కానీ దక్షిణాది చిత్రాల వరకు వచ్చేసరికి ఆ పట్టు అలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నాను. సౌత్‌లో నాకు మంచి పారితోషికం ఇస్తారు. వాళ్లు డబ్బు ఇవ్వగానే ఆయా పాత్రల్లో నటిస్తున్నాను. పాత్రపై ఎమోషన్స్ ఉండట్లేకానీ ఆ పాత్రలపై పట్టు కోల్పోతుండటంతో షూటింగ్‌కు ముందు ఎవరో ఒకరు.. నేనేం చేయాలి? ఏ డైలాగ్స్ చెప్పాలనేది నాకు వివరించాల్సి వస్తోంది. కొన్నిసార్లు అక్కడేం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ఏదో యాడ్ షూటింగ్ అన్నట్లుగా పని కానిచ్చేస్తున్నాను. డబ్బులిస్తున్నారు, నటిస్తున్నానంతే అన్నట్లుగా ఉంటున్నాను. కానీ ఆ పాత్రపై ఎటువంటి ఎమోషన్స్ పెంచుకోవట్లేదు. అందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవల రౌతు కా రాజ్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.చదవండి: జైలు తిండి పడట్లేదు, ఇంటి భోజనం కావాలన్న దర్శన్ -
ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది.. ఇంత దూరం వస్తాననుకోలేదు!
నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘రౌతు కా రాజ్’. ఆనంద్ సుర్పూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఇంకా ‘సాక్షి’తో నవాజుద్దీన్ పంచుకున్న విశేషాలు. → హీరో పాత్ర, అతను ఓ కేసును పరిశోధన చేసే విధానం... ఈ రెండూ ‘రౌతు కా రాజ్’లో వీక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. సినిమాలోని మర్డర్ మిస్టరీ, గ్రామీణ నేపథ్యం ఆసక్తికరంగా, సహజత్వంతో ఉంటుంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చిందంటే ఈ ఫలితం నా ఒక్కడిదే కాదు... దర్శకుడు, ఇందులో భాగమైన నటీనటులు అందరి భాగస్వామ్యం వల్లే సాధ్యమైంది. → నేను ప్రధానంగా లీడ్ రోల్స్‌లోనే నటిస్తున్నాను. ఏదైనా కథ, అందులోని పాత్ర ఎగ్జైట్ చేసినప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాను. కథలోని నా పాత్రకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలనుకుంటాను. ఆ లక్షణాలకు నా నటన తోడైనప్పుడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు. ఆడియన్స్‌ను మెప్పించే క్రమంలో నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నా ఓకే. నటుడుగా నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. ఇండస్ట్రీలో ఇంత దూరం వస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. → ప్రస్తుతం కస్టమ్ ఆఫీసర్‌గా ఓ సినిమా, సెక్షన్ 108 మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. దక్షిణాదిలో రజనీకాంత్‌గారి ‘పేటా’, వెంకటేశ్‌గారి ‘సైంధవ్’ సినిమాలో నటించాను. మళ్లీ దక్షిణాది సినిమాలు చేయాలని ఉంది. కథలు వింటున్నాను. ఇక యాక్టింగ్ కాకుండా వ్యవసాయం అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా మా ఊరు వెళ్లిపోయి (ఉత్తరప్రదేశ్‌లోని బుడానా) వ్యవసాయం చేస్తుంటాను. -
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
నా ముఖం చూసి నిరుపేద అనుకుంటారు.. కానీ..: బాలీవుడ్ నటుడు
నన్ను చూసి చాలామంది పేదవాడిని అనుకుంటారు, కానీ అది నిజం కాదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. తన కుటుంబం దగ్గర బతకడానికి సరిపోయేంత డబ్బు ఉందని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ సిద్దిఖి మాట్లాడుతూ.. 'నేను పేద కుటుంబం నుంచి రాలేదు. నా తల్లిదండ్రులు మరీ అంత ధనవంతులు కాకపోయినా జీవించేందుకు సరిపోయేంత డబ్బు ఉండేది. అయితే నటుడిగా కెరీర్ ఆరంభించడానికి ముందు ఇక్కడ వాచ్‌మెన్‌గా పని చేశాను. పేరెంట్స్ దగ్గర డబ్బు ఆశించకూడదనే ఆ ఉద్యోగం చేశాను. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు.. మనీ పంపిస్తాం. నువ్వు ఏదీ చెప్పకపోతే అసలు ఏం చేస్తున్నావో మాకెలా తెలుస్తుంది? అని పేరెంట్స్ అంటూ ఉండేవారు.సినిమాలో ఛాన్స్ వచ్చేంతవరకు వారికేదీ చెప్పకూడదనుకున్నాను. అలా మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేశాను. చిన్న సినిమాల్లోనూ యాక్ట్ చేశాను' అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో నిన్నటి (జూన్ 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే? -
పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు.. భార్యతో సంతోషం కూడా..: నటుడు
ఆలూమగల మధ్య కొట్లాటలు సహజమే.. కానీ కొన్ని జంటల మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు తారాస్థాయిలో ఉంటాయి. కొందరైతే ఇదంతా భరించలేక విడాకులు తీసుకుంటారు. బాలీవుడ్ జంట నవాజుద్దీన్ సిద్దిఖి- ఆలియా కూడా అదే పని చేద్దామనుకున్నారు. అత్తింట్లోకి రానివ్వడం లేదని, తనను వేధిస్తున్నారంటూ ఆలియా రోడ్డుపై నానా రచ్చ చేసింది. కట్ చేస్తే.. కూతురి క్షేమం కోసం దంపతులిద్దరూ విడాకుల ఆలోచన విరమించుకుని కలిసిపోయారు.పెళ్లెందుకు దండతాజాగా నవాజుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో పెళ్లి బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి చేసుకోవడం దండగ అని మాట్లాడాడు. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లెందుకు అని ప్రశ్నించాడు. 'మీరు నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వివాహం చేసుకోకుండా కూడా ఆ ప్రేమను కొనసాగించవచ్చు కదా! మ్యారేజ్ వల్ల ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చూపిస్తారు. భార్య వల్ల సంతోషం..అదే ఈ పెళ్లి గోల లేకపోతే ఇద్దరూ అలాగే ప్రేమగా, ఆప్యాయంగా గడిపేయొచ్చు. అలా కాదని వైవాహిక బంధంలోకి అడుగుపెడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా రానురానూ కరిగిపోతూ ఉంటుంది. భార్య మనకు సంతోషాన్నిస్తుందని మొదట్లో అనుకుంటాం. కానీ రానురానూ మన ఉద్యోగం, చేసే పని వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆలియా, నవాజుద్దీన్ సిద్దిఖి ఇటీవలే 14వ పెళ్లి రోజు జరుపుకున్నారు.చదవండి: 'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు -
నా కూతురు తట్టుకోలేదు, అందుకే ఈ నిర్ణయం: నటుడి భార్య
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, తన పిల్లల్ని నడిరోడ్డున పడేశాడంటూ విడాకులకు దరఖాస్తు చేసింది. అటు నవాజుద్దీన్ కూడా.. ఆమె తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని కోర్టుకెక్కాడు. కోర్టు విడాకులు మంజూరు చేయకపోయినా ఇద్దరూ నానా రచ్చ చేసి విడిపోయినంత పని చేశారు. ఆ మధ్య ఆలియా.. 'ఒక బంధం నుంచి బయటపడేందుకు 19 ఏళ్లు పట్టింది. స్నేహం కన్నా ముఖ్యమైన బంధంలో ఉన్నాను' అంటూ పోస్ట్ పెట్టడంతో తను మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వైరలయ్యాయి. మంచి కూడా చెప్పుకోవాలి కట్ చేస్తే బద్ధ శత్రువుల్లా విరోధం పెంచుకున్న నవాజుద్దీన్ సిద్దిఖి, ఆలియా కలిసిపోయారు. ఈ విషయాన్ని ఆలియా వెల్లడించింది. మా వైవాహిక బంధానికి 14 ఏళ్లు నిండాయంటూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ మధ్య నా జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. మనకు జరిగిన చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నప్పుడు మంచి జరిగినప్పుడు కూడా చెప్పుకోవాలి. పిల్లలతో కలిసి నవాజుద్దీన్, నేను.. మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లల కోసం ఆలోచించి.. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి దూరడంతో అన్ని గొడవలు జరిగాయి. మా మధ్య ఏర్పడిన మనస్పర్థలు అన్నీ తొలగిపోయాయి. పిల్లల కోసం మేము కలిసుండాలనే నిర్ణయించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. ఇప్పుడు మేము విడిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నవాజ్.. షోరా(కూతురు)తో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. మా మధ్య ఏం జరిగినా అది పిల్లల్ని మానసికంగా దెబ్బ తీస్తుంది. షోర అస్సలు తట్టుకోలేదు. అందుకే ఇకమీదట మేము పోట్లాడకూడదని, ప్రశాంతంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం' అని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం కలిసిపోవాలనుకున్నందుకు నెటిజన్లు ఈ దంపతులను ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Anand pandey (@aaliya_anand_pandey_) చదవండి: ట్రోలింగ్‌కు బాధపడుతున్న అనుపమ.. అందుకే డుమ్మా! -
ఒక్కో హీరో కోట్లు తీసుకుంటున్నాడు, మాకు పెంచమని అడిగితే..
కథలో దమ్మున్నా సినిమా క్వాలిటీగా రావాలంటే నిర్మాతలు డబ్బులు ధారపోయాల్సిందే! అయితే సినిమా తీయడానికంటే అందులో నటించినవారి కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ రేంజులో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ పెరిగిపోయింది. హిట్టు పడ్డేకొద్దీ వారు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ పోతున్నారు. సినిమా ఫలితాలను బట్టి కొందరు పారితోషికం వెనక్కు ఇచ్చేస్తారు, లేదంటే కొంత కోతలు పెడుతుంటారు. మరికొందరు మాత్రం రిజల్ట్ ఎలా ఉన్నా పూర్తి మొత్తం ముట్టాల్సిందేనని కరాఖండిగా చెప్తారు. ఎంత తీసుకుంటారు? తాను మాత్రం అలా చేయనంటున్నాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు బాలీవుడ్లో నటీనటులు, చిన్నపాటి హీరోలు అందుకుంటున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నటులు సుమారు ఎంత పారితోషికం తీసుకుంటారు? అన్న ప్రశ్నకు నవాజుద్దీన్ స్పందిస్తూ.. చాలా ఎక్కువగా తీసుకుంటారని చెప్పాడు. పది కోట్ల పైనే ఉండొచ్చా? అని యాంకర్ అడగ్గా.. పదికోట్లకు అటుఇటుగా తీసుకుంటారని బదులిచ్చాడు. ఎక్కువ అడిగామంటే అంతే.. రెమ్యునరేషన్ విషయంలో బేరాలడతారా? అన్న ప్రశ్నకు తానైతే అలా చేయనని చెప్పాడు. ఇక్కడ నటుల టాలెంట్‌ను బట్టి వారికి ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. లేదు, మాకింకా ఎక్కువ కావాలని అడిగితే.. ఏంటి? మేము చెప్పిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకునే అర్హత నీకుందా? అని మొహం మీదే అనేస్తారు. అందుకే నేను ఎక్కువగా డిమాండ్ చేయను, ఇచ్చిందే తీసుకుంటాను. కొన్ని సినిమాలు డబ్బుల కోసమే చేశాను. మరికొన్ని పైసా తీసుకోకుండా ఫ్రీగా చేశాను. రూ.25 కోట్లు ఇచ్చినా చేయను నేను చిన్నాచితకా పాత్రలు చేయడం మానేశాను. నాకు రూ.25 కోట్లు ఇస్తామన్నా సరే అటువంటి పాత్రలు చేయను. ఇప్పటికే నా కెరీర్లో చాలా సినిమాల్లో చిన్న రోల్స్ చేశాను. ఇక చాలు. ఇకమీదట అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఇటీవలే సైంధవ్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సెక్షన్ 108 సినిమా చేస్తున్నాడు. చదవండి: ఫలించిన నిరీక్షణ.. డైహార్ట్ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్ విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆయన బయోపిక్‌లో నటించాలని ఉంది
తెలుగులోకి రావడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’తో కుదిరింది. వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్గానే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో చాలావరకూ ఆయన డూప్ లేకుండా చేశారు. సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా, చాలా సహనంతో ఉంటారు. వెంకటేశ్‌గారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్ చూశాను. వెంకటేశ్‌గారి ‘అనారి’ (‘చంటి’) చిత్రం కూడా చూశాను. ‘సైంధవ్’లో కొంత తెలుగు, కొంత హిందీ మాట్లాడే ఓ హైదరాబాదీ పాత్ర నాది. సెట్స్‌లో నా తొలి రోజు చిత్రీకరణ యాక్షన్‌తో మొదలు కావడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఇక బెస్ట్ మూమెంట్స్ అంటే.. శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం బోట్ పై స్పీడ్‌గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి ఎగిరాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్లోనే ల్యాండ్ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్ సినిమాలో ఉంటుంది. నా నటనకు మరొకరు డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా డైలాగ్స్ నేర్చుకుని ఆ భాషలో డబ్బింగ్ చెప్పడమే ఇష్టం. అప్పుడే నా పాత్రలో ఉన్న ఇంటెన్స్, డెప్త్ తెలుస్తాయి. శైలేష్ చాలాప్రోఫెషనల్ డైరెక్టర్. నటుడిగా నాది సుధీర్ఘమైన ప్రయాణం. శైలేష్ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయమే అవుతోంది. అయితే ఫిల్మ్ మేకింగ్ పరంగా అతనికి ఎంతో విషయ పరిజ్ఞానం, ఉందనిపించింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రోఫెషనల్ ప్రోడక్షన్ హౌస్. ∙టాలీవుడ్ చాలాప్రోఫెషనల్. ఇక రజనీకాంత్‌గారి ‘పేట’ (2019) సినిమా తర్వాత తమిళ, తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ కుదర్లేదు. అప్పుడు ‘పేట’లా ఇప్పుడు ‘సైంధవ్’ సంక్రాంతికే విడుదలవుతుండటం హ్యాపీ. ఇక ఓషోగారి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తా: నవాజుద్దీన్ సిద్ధిఖీ
ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘సైంధవ్’ కథ వచ్చింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. ఇలాంటి మంచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా యూనిక్‌గా ఉంటుంది. వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దాన్ సిద్ధిఖీ. విక్టర్ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. సంక్రాంతి కానుకగా జవవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవాజుద్దీన్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఓ మంచి కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్నాను. 'సైంధవ్’ అది కుదిరింది. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశాను. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నాను. చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ►నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడను. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే చూస్తాను. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం ఉన్న పాత్ర. ► ఈ సినిమాలోని నా పాత్రకు నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ► షూటింగ్ సమయంలో వెంకటేశ్ గారిని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి. ► దర్శకుడు శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం ఉన్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత వుంటుంది. ► ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. శ్రీలంక షెడ్యూల్లో ఈ ప్రమాదం జరిగింది. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. ఆ సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ► టాలీవుడ్లో వర్కింగ్ స్టైల్ బాగుంది. ఇక్కడ వర్క్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. సమయపాలన చక్కగా ఉంది.నాని, రానా నాకు మంచి స్నేహితులు. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం. ► ఓషో పాత్ర చేయాలని నా కోరిక. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను. -
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్‌ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
టూమచ్ ఓవరాక్షన్ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు
సినీప్రియులకు ఫేవరెట్ హీరోలుంటారు. అలాగే ఆ హీరోలు కూడా కొంతమంది స్టార్స్‌ను ఇష్టపడతారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖికి కూడా హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ డి నిరో, అల్ పాసినో అంటే ఎంతో ఇష్టం. వారిని చూసి ఇన్స్పైర్ అయిన అతడు అచ్చం వారిలాగే ఉండేందుకు ప్రయత్నించాడట. నడక, మాటతీరు ఆఖరికి నిద్రించే భంగిమలో కూడా సదరు స్టార్స్‌నే అనుకరించాడట! అయితే దీనివల్ల ఓసారి డైరెక్టర్‌తో నానామాటలు పడ్డాడంటున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను హాలీవుడ్ హీరోలను అనుకరిస్తుంటే మా టీచర్ వద్దని వారించింది. అయినా నేను పట్టించుకోలేదు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా మొదటి రోజు షూట్లో నేను అల్ పాసినోలా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లాను. అతడిలాగే మాట్లాడాను. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు నా తీరు ఏమాత్రం నచ్చలేదు. పొద్దునంతా ఓపిక పట్టిన ఆయన రాత్రి నన్ను చెడామడా తిట్టాడు. నువ్వు అల్ పాసినోలా ప్రవర్తిస్తూ చాలా టూమచ్ ఓవరాక్షన్ చేస్తున్నావు అని ఫైర్ అయ్యాడు. నాకు తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అవమానంతో రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టలేదు. తెల్లారి సెట్స్‌కు నేను పూర్తిగా నవాజ్‌లాగే వెళ్లాను' అని చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్ సిద్దిఖి. ఇతడు చివరిసారిగా టికు వెడ్స్ షెరు చిత్రంలో నటించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అతడు జోగిరా సారా రారా, అఫ్వాహ్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: చవక రేటుకే ఆదిపురుష్ 3D టికెట్లు -
రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్లో హీరోయిన్ను నవాజుద్దీన్ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్ విమర్శలపై స్పందించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్ మాలిక్‌గా కనిపించనున్నారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) -
ఇప్పటి హీరోలు అందుకు పనికి రారు.. మా కాలంలో అయితే..: నటుడు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షెరు. ఇందులో దాదాపు 50 ఏళ్ల వయసున్న సీనియర్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖి 21 ఏళ్ల కుర్ర హీరోయిన్ అవనీత్ కౌర్‌తో జంటగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 29 ఏళ్లుగా ఉంది. ఇకపోతే టీకూ వెడ్స్ షెరులో హీరోహీరోయిన్స్ రెచ్చిపోయి మరీ లిప్‌లాక్స్ ఇచ్చుకున్నారు. ఈ ట్రైలర్ చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. సగటు సినీప్రేక్షకుడు ఈ సన్నివేశాలను జీర్ణించుకోలేకపోయారు. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని నటుడిని తిట్టిపోస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అసలు మీ సమస్యేంటి? రొమాన్స్‌కు వయసుతో సంబంధమేంటి? మా కాలంలో రొమాన్స్‌ను స్పెషల్‌గా చూసేవాళ్లం. సంవత్సరాల తరబడి ప్రేమలో మునిగి తేలేవాళ్లం. ఇప్పటితరానికి రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడున్న హీరోలు అలాంటి పాత్రలు చేయడానికి కూడా పనికి రారు. అందుకే షారుక్ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్ రోల్స్ చేస్తున్నారు. అయినా ఇప్పుడు ప్రేమ, బ్రేకప్.. వంటిదంతా వాట్సప్‌లోనే జరిగిపోతోంది. ఇంక నిజమైన రొమాన్స్‌కు చోటెక్కడుంది?' అని ప్రశ్నించారు. కాగా టీకూ వెడ్స్ షెరు చిత్రంలో నవాజ్ జూనియర్ ఆర్టిస్ట్‌గా, అవనీత్ కౌర్ నటి కావాలన్న యువతి పాత్రలో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది. చదవండి: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి చిత్రం? -
నటుడితో విభేదాలు.. మరొకరితో లవ్‌లో పడ్డ నవాజుద్దీన్ భార్య!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి- ఆలియాలు ఏదో ఒక వివాదంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే! తనను, తన పిల్లలను రోడ్డున వదిలేశాడని ఆలియా, ఆమె తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ నవాజుద్దీన్ కోర్టు మెట్లెక్కారు. వీరిద్దరూ విడిపోయారే కానీ ఇంతవరకు అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. అయితే ఆలియా అప్పుడే తన జీవితంలో మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. తన లైఫ్‌లోకి ఓ ముఖ్యమైన వ్యక్తిని స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఒక బంధం నుంచి బయటపడటానికి 19 ఏళ్లు పట్టింది. కానీ నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే తొలి ప్రాధాన్యతనిస్తాను. నేనిచ్చే ప్రాధాన్యతలో ఎటువంటి మార్పు లేదు. కానీ కొన్ని బంధాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు చాలా సంతోషంగానూ ఉంది. ఈ హ్యాపీనెస్‌ను మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు ఆనందంగా ఉండే హక్కు లేదంటారా? చెప్పండి..' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు 'ఇప్పటికైనా సంతోషంగా ఉన్నావు, అది చాలు', 'ఇక మీదట నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: గ్రాండ్‌గా సీనియర్ నటి సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్ -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్‌లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్‌ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
యాక్షన్ ఎంటర్టైనర్గా 'సైంధవ్'.. తొలి షెడ్యూల్ పూర్తి
వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వెంకటేశ్ పాల్గొనగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ మంగళవారం వెల్లడించింది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ను కూడా వేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగుకి పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. 2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్వర్డ్లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు. -
భార్య, పిల్లలను ఇంట్లో నుంచి గెంటేసిన స్టార్ హీరో
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్ నటుడిపై అతని భార్య ఆలియా సంచలన కామెంట్స్ చేశారు. తనను , పిల్లలను ఇంటినుంచి గెంటేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కాగా.. ఇటీవల నవాజుద్దీన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ముంబైలోని వెర్సోవాలోని తన బంగ్లాకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఇంట్లోకి రాకుండా సోదరుడు ఫైజుద్దీన్ అడ్డుకున్నాడని నవాజుద్దీన్ ఆరోపించారు. తాజాగా అతని భార్య ఆలియా బంగ్లా బయట నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. అక్కడ ఆమె కుమార్తె షోరాను లోపలికి అనుమతించలేదని ఆ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. నవాజుద్దీన్ భార్య ఆలియా మాట్లాడుతూ..' తన పిల్లలను కూడా విడిచిపెట్టని నవాజుద్దీన్ సిద్ధిఖీ నైజం ఇదే. 40 రోజుల పాటు ఇంట్లో ఉన్న నేను వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కానీ నేను తిరిగి వచ్చాక నవాజుద్దీన్ సిద్ధిఖీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా చాలా మంది కాపలాదారులను నియమించాడు.. నన్ను, నా పిల్లలను నడిరోడ్డుపై వదిలేశాడు.. తన సొంత తండ్రి తనతో ఇలా చేస్తాడని నా కుమార్తె నమ్మలేకపోయింది. రోడ్డుపై ఏడుస్తున్న మమ్మల్ని నా బంధువుల్లో ఒకరు ఇంటికి తీసుకువెళ్లారు. నా పిల్లలను ఇంట్లో నుంచి తరిమి రోడ్లపై నిలబెట్టిన వ్యక్తి నవాజుద్దీన్ సిద్ధిఖీ. అతని అసలు రూపం ఇదే. నవాజుద్దీన్ మీరు నన్ను మా నా పిల్లలను విచ్ఛిన్నం చేయలేరు. నేను న్యాయం జరిగే పోరాడుతూనే ఉంటానంటూ వీడియోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) -
నా భర్త నాపై అత్యాచారం చేశాడు, సాక్ష్యం ఉంది: నటుడి భార్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖిపై అతడి భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తన పిల్లలను తనక్కాకుండా చేయాలని కుట్రచేస్తున్నారంటూ బోరున విలపించింది. ఈ వీడియోను ఆలియా శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 'నా పిల్లలకు అతడు ఎప్పటికీ తండ్రి కాలేడు. వాళ్లు ఎలా ఉన్నారని ఏరోజూ పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడేదో మంచి తండ్రి అని నిరూపించుకునేందుకు నా పిల్లలను లాక్కోవాలని చూస్తున్నాడు. ఈ పిరికివాడు తన అధికారం చెలాయించి తల్లి నుంచి పిల్లలను వేరు చేయాలని చూస్తున్నాడు. డబ్బుతో మనుషులను కొనుక్కోగలవేమో కానీ నా పిల్లల్ని లాక్కోలేవు. అసలు వారిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు? నీతో ఉంటారనుకుంటున్నావా? తండ్రి అంటే ఏంటో కూడా వారికి తెలియదు' అని ఏడ్చేసింది. 'నా పిల్లలను అక్రమం సంతానం అని నీ తల్లి నానా మాటలు అన్నప్పుడు నోరెత్తకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు. ఇప్పుడేమో గొప్ప మనిషివని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు... మహానటుడివి. సాక్ష్యాలతో సహా నాపై అత్యాచారం చేశావని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. ఏం జరిగినా సరే మనసు లేని కర్కోటకుల చేతిలోకి నా పిల్లలను చేరనివ్వను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా. కాగా తనకు సరైన తిండి పెట్టడం లేదని, కనీసం బాత్రూమ్ కూడా వినియోగించుకోవడం లేదని ఇదివరకే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంపై అటు ఆలియా, ఇటు నవాజుద్దీన్ కుటుంబం కోర్టు మెట్లెక్కారు. View this post on Instagram A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin) చదవండి: హైదరాబాద్‌లో చెప్పులు లేకుండా.. అమెరికాలో షూలతో