Waltair Veerayya
-
చిరంజీవి సినిమా.. రవితేజ చేయనన్నాడు: దర్శకుడు బాబీ
గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. నిజానికి మొదట్లో రవితేజను ఈ సినిమా కోసం అనుకోలేదట. తీరా అనుకున్నాక మాస్ మహారాజ సినిమా చేయనన్నాడట. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. నాకు బ్రేక్ ఇచ్చింది రవితేజ 'నేను ఈ సినిమా కథ చెప్పగానే చిరంజీవి ఓకే అన్నారు. అప్పటికింకా రవితేజ పాత్ర రాసుకోలేదు. కానీ నాకే ఎక్కడో తెలియని అసంతృప్తి. రవితేజ లాంటి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందనిపించింది. రచయితగా ఎన్నో కష్టాలు పడుతూ, అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో రవితేజ నన్ను గుర్తించి దర్శకుడిగా నాకో అవకాశం ఇచ్చారు. అలా ఆయనతో పవర్ సినిమా తీశాను. అప్పటినుంచి పెన్ను పట్టుకుంటే చాలు రవితేజయే గుర్తొస్తుంటాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది. రవితేజ పాత్రపై ఆరు నెలలు కష్టపడ్డా అలాంటి సమయంలో తమ్ముడి పాత్రను హైలైట్ చేసి మళ్లీ షూటింగ్ చేద్దామంటే ఏమంటారోనని భయపడ్డాను. రవితేజ పేరు చెప్పకుండా సెకండాఫ్‌లో తమ్ముడి పాత్ర ఇలా ఉంటుందని చిరుకు చూచాయగా చెప్పాను. ఆయన వెంటనే ఆ తమ్ముడి పాత్ర చేసేది రవితేజ కదా.. అదిరిపోయిందన్నారు. నిర్మాతకు చెప్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బడ్జెట్ పెరిగినా ఓకే, మేము చూసుకుంటాం.. కానీ మిస్‌ఫైర్ కాకుండా చూసుకో అని సుతిమెత్తగా హెచ్చరించారు. అప్పటివరకు షూట్ చేసిన సెకండాఫ్ పక్కనపడేశాం. అయితే రవితేజ ఎప్పుడూ సపోర్టింగ్ రోల్ చేయలేదు. ఆయన్ను ఎలా అడగాలా? అని నాలో నేనే మథనపడ్డాను. ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని ఆ తర్వాత రవితేజ దగ్గరకు వెళ్లాను. రవితేజ ఒప్పుకోలేదు సర్, నాకు రేపు ఒక గంటపాటు సమయం కేటాయిస్తే కథ చెప్తాను అన్నాను. చిరంజీవి సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం అన్నారు. నేను ఓ క్షణం ఆగి చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని చెప్పాను. ఆయన సినిమాలో నాకోసం ఓ పాత్ర అనుకుంటున్నావా? అని నేరుగా అడిగేశారు. అందుకు నేను అవును సర్, ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు. చిరు అన్నయ్య సినిమాను రవి రిజెక్ట్ చేశాడన్న పేరు వద్దన్నారు. మొత్తానికి సరేనన్నారు సర్, మీరు కథ వినండి.. నచ్చకపోతే చేయొద్దు. అసలు నేను మిమ్మల్ని సంప్రదించిన విషయం కూడా ఎవరికీ చెప్పనన్నాను. అప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. కట్ చేస్తే తెల్లారి కలుద్దామన్నారు. వెళ్లి కథ చెప్పగా.. అన్నయ్యతో ఎప్పటినుంచో చేయాలనుంది, చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్ కుదిరింది' అని చెప్పుకొచ్చాడు బాబీ. కాగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'కు 365 రోజులు.. ఎక్కడో తెలుసా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. గతేడాది బాక్సాఫీస్ హిట్‌గా భారీ విజయాన్ని అందుకుంది. శుత్రిహాసన్, రవితేజ నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది అత్యధిక కలెక్షన్స్ (రూ. 236 కోట్లు) రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఒకప్పుడు సినిమాలు 100 రోజుల పాటు థియేటర్లలో కనిపిస్తేనే అదొక రికార్డు.. ఇప్పటి రోజుల్లో ఏ సినిమా అయినా కానివ్వండి బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రూ. 100 కోట్లు వచ్చాయా..? అని చూస్తున్నారు. అలా అయితేనే నేటి రోజుల్లో సినిమా హిట్ అనేస్తున్నారు. అలాంటిది చిరంజీవి వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకకు రెడీగా ఉంది. ఏపీలోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనుంది. నేడు సాయింత్రం (జనవరి 9) అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో మెగా ఫ్యాన్స్ 365 రోజుల వేడుక చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. గతేడాదిలో వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో జరిపింది. ఆ సమయంలో చిరంజీవి ఇలా మాట్లాడారు. 'అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను మళ్లీ తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని సంతోషం వ్యక్తం చేశారు. అలా పాతరోజులను ఆయన మళ్లీ గుర్తుచేసుకున్నారు. వాల్తేరు వీరయ్య నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అప్పుడు వాల్తేరు వీరయ్య. ఇప్పుడు దేవర..?
-
2023 టాలీవుడ్లో టాప్-10 కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. మరో వారంలో 2023 సంవత్సరానికి గుడ్‌బై చెప్పేసి కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టేస్తాము. ఇలాంటి సమయంలో గడిచిపోయిన సంవత్సరంలో మనమేం సాధించాం..? ఏం నష్టపోయాం..? అనే లెక్కలు వేసుకోవడం సహజం. సినిమా అనేది అందరినీ ఎంటర్టైన్ చేసే విభాగం.. అందుకే ఈ పరిశ్రమపై ప్రేక్షకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా కేవలం బాలీవుడ్‌కు మాత్రమే అందరూ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అక్కడి చిత్రాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. దీంతో మిగిలిన చిత్ర పరిశ్రమల పేర్లు కూడా అందరికీ తెలిసేవి కావు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బాలీవుడ్‌కు పోటీగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా 2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10లో ఉన్న చిత్రాల గురించి ఒకసారి చూద్దాం. కేవలం ఈ కలెక్షన్స్ వివరాలు టాలీవుడ్ పరిధి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గమనించగలరు. 1. 'వాల్తేరు వీరయ్య' మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'వాల్తేరు వీరయ్య'. 2023 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో రవితేజ కీ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్లో రూ. 160 కోట్ల రాబట్టి 2023లో విడుదలైన చిత్రాల్లో 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ పరంగా టాప్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 2. ఆదిపురుష్- ప్రభాస్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం.. 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 393 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 133 కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో 'వాల్తేరు వీరయ్య' కంటే కలెక్షన్స్ పరంగా 'ఆదిపురుష్' వెనకపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ఉన్నా కూడా టాలీవుడ్లో మాత్రం రెండో స్థానానికి పరిమితం అయింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 3. వీరసింహా రెడ్డి - బాలకృష్ణ 2023 సంక్రాంతి బరిలో 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'కు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఈ రేసులో మెగాస్టారే పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 134 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 97 కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 4. భగవంత్ కేసరి- బాలకృష్ణ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో బాలయ్య రెండు హిట్ సినిమాలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 85 కోట్లు రాబట్టి నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 5. 'బ్రో'- సాయిధరమ్ తేజ్,పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్ ప్రధాన కథానాయకుడిగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దీనిని డైరెక్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 114 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 82 కోట్లు రాబట్టి ఐదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 6. దసరా- నాని నాని పాన్ ఇండియా హీరోగా దసరా చిత్రంతో పరిచయం అయ్యాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. కీర్తి సురేశ్ ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. నానికి ఇది తొలి పాన్ ఇండియా చిత్రంకావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో ఆయన సూపర్ హిట్ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 118 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 76 కోట్లు రాబట్టి ఆరో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 7. జైలర్- రజనీకాంత్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 604 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 68 కోట్లు రాబట్టి ఏడో స్థానం దక్కించుకుంది. రజనీకాంత్ కెరియర్లో ఆల్‌టైమ్ హిట్‌గా జైలర్ నిలిచింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 8.'బేబీ'- ఆనంద్ దేవరకొండ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రేమ కథా చిత్రం 'బేబీ' . సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ను భారీగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 81 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 64 కోట్లు రాబట్టి ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 9. విరూపాక్ష- సాయిధరమ్ తేజ్ సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా నటించింది. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్‌కు బిగ్గెస్ట్ను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ టాలీవుడ్లో రూ. 63 కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. 10. సలార్- ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా సలార్ ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతానికి (డిసెంబర్ 23) టాలీవుడ్లో రూ. 101కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కన టాప్ టెన్ లస్ట్‌లో మూడో స్థానానికి సలార్ చేరుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ దూకుడు భారీగానే కొనసాగుతుంది. దీంతో సలార్ కలెక్షన్స్ క్లోజింగ్ అయ్యే సరికి టాప్-1 లోకి కూడా రావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.160 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ప్రముఖ సినీ ట్రేడ్ వర్గాల ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. -
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
వాల్తేరు వీరయ్య...ఇప్పుడు DJ వీరయ్య
-
అలా డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసింగదే. తాజాగా కోలీవుడ్ భామ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్‌పై కామెంట్స్ చేశారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించారు. -
మొదటి రోజే అదరగొట్టిన దసరా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా థియటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రెండు చిత్రాలను దాటేసి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా విడుదలైన మొదటి రోజే సంక్రాంతి హిట్ సినిమాలను అధిగమించేసింది. ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి రూ. 6.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను దాటేసిన నాని 'దసరా' నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 14.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
అలా చూపిస్తే వాల్తేరు వీరయ్య హిట్ అయ్యేది కాదు: పరుచూరి
ప్రముఖ lతెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య చాలా సింపుల్ స్టోరీ. కానీ రవితేజ బదులు రామ్ చరణ్ చేసి ఉంటే చిరంజీవికి మైనస్ మార్కులు పడేవి. ఎందుకంటే తమ్ముడి పాత్రలో రవితేజ పాత్ర చూశాక.. చరణ్ చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చా. అందుకే రవితేజను పెట్టారు. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకం. పైగా ఒక ఫిషర్ మ్యాన్‌కు జోడిగా శృతిహాసన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చిరంజీవి సినిమా మెగా ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తీశారు. చిరంజీవి, రవితేజ.. హీరోయిన్స్‌తో ప్రేమాయణం లాంటివి కథలో చూపిస్తే సినిమా హిట్ అయ్యేది కాదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?) చిరంజీవి నటనపై పరుచూరి మాట్లాడూతూ..' తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. మనకు తెలియకుండా ఆ వ్యాధితో ఏమైపోతాడోననే భయాన్ని ఆసాంతం ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. సంభాషణలు, పొడి పొడి మాటలు బాగున్నాయి. ఊహకందని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మలేషియాకు వెళ్లినప్పుడు బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. మలేషియా నుంచి ఓ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చిందే కథ. ఇందుకు కథ రచయిత బాబీని మెచ్చుకోవాలి. అప్పట్లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే కనిపించారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కేథరిన్ బాగా నటించారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయని' అని అన్నారు. మెగా ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూనకాలు లోడింగ్' అనే పదం కేవలం అభిమానుల కోసమే పెట్టారని వెల్లడించారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. -
ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్ర ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చదవండి: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్ అరెస్ట్ వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తికావడంతో ఇవాళ (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాందో చూడాలి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ నిర్మించిన ఈచిత్రంలో ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
మాస్ హీరోల దాడి.. అందాల భామలకు మళ్లీ కష్టాలే!
ఇటీవలకాలంలో హీరోయిన్స్ ...హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతే కాదు హీరోలతో పాటు సమానంగా స్క్రీన్ స్పెస్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ట్రెండ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దీంతో హీరో సెంట్రిక్ సినిమాల హవా మొదలయింది. మాస్ హీరోల సినిమాల దాటికి వుమెన్ సెంట్రిక్ సినిమాలకి అనుకున్న రేంజ్ లో హైప్ రావటం లేదు.. దీంతో స్టార్ హీరోయిన్స్ సైతం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోసం నానా తంటాలు పడుతున్నారు. హీరోల ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ తో స్క్రీన్ నిండిపోవటంతో.. హీరోయిన్స్ పాటలకి..రెండు సీన్స్ కి పరిమితం అయిపోతున్నారు. గతంలో కమర్షియల్ సినిమాలకు ఒక ఫార్మూలా ఉండేది..ఆరు పాటలు...ఆరు ఫైట్స్...మధ్య లో హీరోయిన్ తో రెండు మూడు సీన్స్ ... ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో...హీరోయిన్స్ స్క్రీన్ స్పెస్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సంక్రాంతి కి రిలీజైన కమర్షియల్ మూవీస్ చూస్తే...ఈ విషయం క్లారిటీగా అర్ధమైపోతుంది. వాల్తేరు వీరయ్య...వీర సింహారెడ్డి..వారసుడు సినిమాల్లో హీరోయిన్స్ నామా మాత్రంగానే కనిపించారు. వాళ్ల పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య లో శృతిహాసన్ రా ఏజెంట్ క్యారెక్టర్ చేసినా..పెద్దగా స్క్రీన్ స్పెస్ దక్కించుకోలేకపోయింది. ఇక వీర సింహారెడ్డిలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ పాటలకే పరిమితం అని చెప్పాలి. వారసుడులో నటించిన రష్మిక మందన్న పరిస్థితి కూడా అలానే అయింది. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ములేపిన సినిమాలు కెజిఎఫ్ చాపర్ట్ వన్..కెజిఎఫ్ ఛాప్టర్ 2.. ఈరెండు సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. కానీ స్క్రీన్ స్పెస్ తక్కువనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలతో బజ్ క్రియేట్ చేయలేకపోతున్న హీరోయిన్స్ కి... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కలిసి రావటం లేదు. ఈ మధ్య యశోద మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సమంత..అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సమంత పేరు ఇండస్ట్రీలో బాగానే వినిపించినా..ఆ తర్వాత ఎక్కడా సమంత పేరు వినబడలేదు. ఇక కమర్షియల్ సినిమాలనే నమ్ముకున్న కీర్తి సురేష్, రష్మిక మందన్న, పూజా హెగ్డే... లాంటి హీరోయిన్ల పేర్లు సినిమా ఎనౌన్స్మెంట్ ...మూవీ ఓపెనింగ్స్ లో తప్ప ఎక్కడ వినిపించటం లేదు. ఇక సినిమాలు సక్సెస్ అయితే హీరో దర్శకులు గురించి మాట్లాడుతున్నారు తప్ప... హీరోయిన్స్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడటం లేదు. హీరో సెంట్రిక్ సినిమాలకు క్రేజ్ రావటంతో...ఈ అందాల భామలను ప్రేక్షకులు కూడా పట్టించుకోవటం లేదు. సో..మొత్తానికి కమర్షియల్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై నల్లపూసల్లా మారిపోయిన హీరోయిన్స్ క్రేజ్ తగ్గిందనే మాట ..ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది. -
ఈ వారం థియేటర్స్‌లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్‌లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్‌లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
Maha Shivaratri 2023: థియేటర్స్‌లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్‌కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్‌లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్‌లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త లుక్‌లో చూపించడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని దేవి థియేటర్స్‌లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్‌లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్‌బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్‌లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్‌లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
అఫీషియల్: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అసలు కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB — Netflix India South (@Netflix_INSouth) February 7, 2023 -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మెగాస్టార్.. ఒక్కో సినిమాకి ఎంతంటే..
చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు నటించిన చిత్రాలలో ఆచార్య బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడగా.. గాడ్‌ఫాదర్ మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మాత్రం భారీ విజయాన్ని సాధించింది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.250 కోట్లపై పైగా వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. వాల్తేరు వీరయ్య సినిమా కోసం రూ.50 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట చిరంజీవి. అలాగే ప్రస్తుతం నటిస్తున్న బోళా శంకర్ చిత్రానికి కూడా అంతే పారితోషికం అందుకున్నాడట. కానీ ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు మాత్రం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. తన మార్కెట్‌కు తగ్గట్టుగా పారితోషికం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. బోళా శంకర్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
అంజనమ్మకు నేను నాలుగో కొడుకుని, ఆస్తి అడగట్లేదు..: రచ్చ రవి
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ సాధించింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు. శనివారం ఈ సినిమా విజయోత్సవ సభ హన్మకొండలో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మెగాస్టార్‌పై తనకున్న అభిమానం, ఆరాధనను మాటల్లో చూపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు రవి. ఈ క్రమంలో తన స్పీచ్‌కు అడ్డొస్తున్న యాంకర్ సుమపై విసుక్కున్నాడు. 'ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతా. జీవితంలో ఇంకెక్కడా మాట్లాడను. నీ కాల్మొక్తా బాంచన్.. నన్ను ఆపకు(సుమ వైపు చూస్తూ). ఓరుగల్లు నీళ్లు తాగి హైదరాబాద్‌కు వచ్చిన. కృష్ణానగర్‌లో నా కన్నీళ్లు నేను తాగి బతికిన.. కానీ ఒకటే చిరంజీవి అభిమానిగానే బతుకుతున్నా.. అన్నను థియేటర్లో చూసిన నేను ఒక్కసారి అన్నను నేరుగా చూస్తే చాలనుకున్నా. అలాంటిది అడగ్గానే బాబీ అన్న నాకు చిరంజీవి అన్న సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిండు. అంజనమ్మకు ముగ్గురు కొడుకులైతే నేను నాలుగో కొడుకుగా ప్రకటించుకుంటున్నా. ఆస్తి అడగట్లేదు, ఎప్పుడూ వారి వెనకే ఉంటాను. మెగాస్టార్‌ను చూస్తే చాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. జీవితానికి ఇది చాలు అని ఎమోషనలయ్యాడు రచ్చ రవి. చదవండి: త్వరగా వచ్చేయ్, నిన్ను చాలా మిస్ అవుతున్నా స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనం -
స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనం: చిరంజీవి
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ‘ఓరుగల్లు ప్రజల ప్రేమ, వాత్సాల్యం స్వచ్ఛమైనది. ఈ గడ్డపై ఎన్నో సంవత్సరాల తర్వాత అడుగుపెట్టా. అప్పుడు ప్రజా అంకిత యాత్రకు వచ్చిన జనవాహిని, అభిమానం నేడు మళ్లీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది’ అని మెగాస్టార్ చిరంజీవి ఆనాటి రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార విజయోత్సవ సభ శనివారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగింది. వేలాదిగా తరలివచ్చిని అభిమానుల నడుమ విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక అతిథిగా మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హాజరు కాగా సినీ దర్శకుడు బాబీ, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్‌తో పాటు చిత్ర బృందం, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ గుండు సుధారాణి, చిత్ర బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్‌లు షీల్డ్‌లు అందజేసి సత్కరించారు. అనంతరం రాంచరణ్‌కు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య షీల్డ్‌ను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అశేష అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ సభను ఎక్కడా జరుపుకుందామని తాము చర్చించుకుంటున్న సమయంలో స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనమని అందుకే ఇక్కడ సభ నిర్వహించేందుకు సిద్ధపడినట్లు తెలిపారు. ఒక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు లాంటి సినిమాల్లో మాదిరిగా మళ్లీ నన్ను అభిమానులకు అలా చూపించిన దర్శకుడు బాబీ, మంచి హిట్‌ను అందించిన నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. మేము క్వైట్‌గా ఉన్నంత వరకే.. మెగా పవర్‌స్టార్, చిరంజీవి తనయుడు రాంచరణ్ మాట్లాడుతూ ‘ఇటీవల కాలిఫోరి్నయాకు వెళ్తే.. ఓ మ్యాగజైన్ ఎడిటర్ మీ దగ్గర అభిమానం ఎలా చూపెడుతారు అని అడిగారు.. ఇప్పుడు చెబుతున్న అభిమానమంటే ఇలా ఉంటుంది’ అని చూపెట్టారు. తనకు హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ నాన్నకు హిట్ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సినిమా అంటే ప్యాషన్, ప్రేమ ఉన్నవారే ఇలాంటి చిత్రాలు ఇవ్వగలరన్నారు. సినిమాలో పూనకాలు సాంగ్ నన్ను రవితేజ దమాకా సినిమా చూసేలా చేసిందని పేర్కొన్నారు. చిరు సినిమాలకు ఎవరు ముఖ్య అతిథులు ఉండరని, ఆయనే అతిథి అని అన్నారు. ‘మా నాన్న చిరంజీవి చాలా సౌమ్యుడు. అందుకే నిశ్శబ్దంగా ఉంటున్నాడు. అతను క్వైట్‌గా ఉన్నంత వరకే ఏం చేసినా. లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయి’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. బ్లాక్‌లో కొని చూశా: దర్శకుడు బాబీ తాను ఇంటర్ చదువుతున్న సమయంలో హాస్టల్ గోడ దూకి రూ.200 వెచ్చించి బ్లాక్‌లో క్యాసెట్ కొని అన్నయ్య సినిమా చూశానని సినిమా దర్శకుడు బాబీ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడానికి సహకరించిన దర్శకులు వీవీ వినాయక్, మెహర్‌రమేష్‌లకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను ప్రేమ, మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో చేశానని అన్నారు. వరంగల్‌లో స్టూడియో పెట్టండి: మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌లో సినీ స్టూడియో పెట్టండి.. అందుకోసం స్టేజీపైన ఉన్న ఎమ్మెల్యేలు, నేను సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడాతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిర్మాత నవీన్‌తో తనకు 20 సంవత్సరాలకు పైగా సన్నిహితం ఉందని, మంచి మిత్రుడని తెలిపారు. -
నాన్న జోలికొస్తే ఊరుకోము.. రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య విజయ విహారం వరంగల్‌లోని హన్మకొండలో నిర్వహించారు. ఈ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ వేదికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. నాన్న సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని మేం ఉండం.మేం క్వైట్‌గా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి' అంటూ రామ్‌చరణ్ హెచ్చరించాడు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మరింది. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు సైతం చరణ్ చురకలించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో పనిచేసిన హీరోలందరికి హిట్లు ఇచ్చారని, కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి, ఎలా చూసుకోవాలనేది అంటూ చరణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
Waltair Veerayya Team Photos: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో తొక్కిసలాట
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లు సమాచారం. వీరయ్య విజయ విహారం పేరిట వాల్తేరు వీరయ్య చిత్రబృందం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!) కాగా.. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్‌ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. -
హీరోయిన్‌కు మెగాస్టార్ బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్
వాల్తేరు వీరయ్య హీరోయిన్‌కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిరు విష్ చేశారు. ఈ మేరకు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమాలో 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే' పాటలోని ఫోటోను జత చేశారు. దీంతో మెగా అభిమానులు సైతం శృతిహాసన్‌కు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ ట్విటర్లోరాస్తూ..' ప్రియమైన శ్రుతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీ కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. వృత్తి పట్ల మీ అంకితభావం, మీకున్న బహుముఖ ప్రజ్ఞతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నా.' అంటూ మెగాస్టార్ పోస్ట్ చేశారు. కాగా చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Happy Birthday Dear @shrutihaasan Have a Wonderful year ahead and May you scale greater heights with your passion & multi talents!!! 💐💐 pic.twitter.com/YV0sCb8Yzf — Chiranjeevi Konidela (@KChiruTweets) January 28, 2023 -
వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!
సాక్షి, మోపిదేవి (అవనిగడ్డ): వాల్తేరు వీరయ్య సినిమా ఫస్టాఫ్‌లో విలన్ క్యారెక్టర్ చేసిన బాబీసింహాని అందరూ తమిళ నటుడు అనుకుంటున్నారు కాని ఆయన మనోడే... కృష్ణాజిల్లా దివిసీమలో మోపిదేవి మండలం కోసూరివారిపాలెం వాసి. ఈ సినిమాలో చిరంజీవితో పోటీపడి విలన్‌గా మెప్పించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. విక్రమ్ సామి తమిళ అనే చిత్రంలో అద్భుతమైన విలనిజం ప్రదర్శించాడు. హీరో విక్రమ్‌తో పోటీపడి నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో సాల్మన్‌సీజర్‌గా చిరంజీవితో పోటీపడి చేసిన నటన బాబీసింహాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కోసూరువారిపాలెం నుంచి కోయంబత్తూర్‌కు... మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెంకు చెందిన లింగం రామకృష్ణ – కృష్ణకుమారి దంపతుల చిన్న కుమారుడే బాబీసింహా. ఆయన తల్లి కృష్ణకుమారి స్వగ్రామం గూడూరు మండల పరిధిలోని తరకటూరు. బాబీసింహా మోపిదేవి ప్రియదర్శిని స్కూల్లో 4 నుంచి 8వ తరగతి వరకూ చదివాడు. బాబీసింహా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేందుకు 1996లో తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వెళ్లారు. బాబీసింహా అక్కడే బీసీఏ చదివాడు. అనంతరం సినీరంగంపై ఉన్న మోజుతో కూర్తుపాత్తరాయ్ యాక్టింగ్ స్కూల్లో మూడు నెలలు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షార్ట్‌ఫిలింతో గుర్తింపు 2010లో తొలిసారిగా ది ఏంజల్ అనే షార్ట్‌ఫిలింని బాబీసింహా రూపొందించాడు. ఆయన మొత్తం 9 షార్ట్ ఫిల్మ్ లు తీయగా ‘విచిత్తిరిమ్’ అనే షార్ట్ఫిలింకు 2012లో బెస్ట్ యాక్టర్ ఇన్ లిటిల్షోస్ అవార్డు లభించింది. ఈ బుల్లి చిత్రమే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. బాబీసింహా జిగర్తంద చిత్రంలో సహాయనటుడిగా చేసిన నటనకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో ఇప్పటివరకూ 40 సినిమాల్లో నటించాడు. లవ్ ఫెయిల్యూర్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి... 2012లో తమిళ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన బాబీసింహా అదే సంవత్సరం తెలుగులో లవ్‌ఫెయిల్యూర్ చిత్రంలో నటించాడు. తరువాత సైజ్‌జీరో, రన్ చిత్రాల్లో నటించాడు. తెలుగు వాడైనా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళంలో 28 చిత్రాల్లో నటించగా కో–2, ఉరుమీన్, తిరుత్తి పైయిలే సినిమాల్లో హీరోగా నటించాడు. ఇరైవి, మెట్రో, మురిప్పిరి మనమ్, పాంబుసలై చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. తమిళంలో ఆయన్ను అభిమానులు సింహా అని ముద్దుగా పిలుచుకుంటారు. మలయాళంలో ఐదు చిత్రాల్లో నటించగా ‘కుమ్మర సంబరియం’ చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. హీరోగా నటిస్తూనే ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నారు. 2016లో తోటి నటి రేష్మి మీనన్‌ని వివాహం చేసుకున్నాడు. జన్మభూమిపై ఉన్న మమకారంతో 2017లో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో పాపకు పుట్టు వెంట్రుకలు మొక్కు తీర్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కుమారుడికి మోపిదేవిలోనే పుట్టు వెంట్రుకలు తీయించారు. ఈ సందర్భంగా స్వగ్రామమైన కోసూరువారిపాలెంలో శుక్రవారం స్థానికులు ఎడ్లబండిపై ఆయన్ను ఊరేగించి అభిమానం చాటుకున్నారు. సుబ్బారాయుడి సేవలో సినీ నటుడు బాబీసింహా మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని బాబీసింహా శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలు అందజేశారు. చిరంజీవితో నటించడం మర్చిపోలేని అనుభూతి చదువుకునే రోజుల్లో చిరంజీవిని దగ్గరగా చూడాలని ఆశ ఉండేది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయనతో కలిసి నటించడం మరుపురాని అనుభూతినిచ్చింది. మోపిదేవిలో చదువుకున్న రోజులు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేను. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేస్తాను. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేయాలని ఉంది. –బాబీసింహా, సినీహీరో చదవండి: రెండు రోజుల్లోనే రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పఠాన్ కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
మూడు నిమిషాలు.. రెండు కోట్లు.. ఊర్వశి రౌతేలా షాకింగ్ రెమ్యూనరేషన్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ చిరు అభిమానులను ఊర్రూతలూగించింది. బాస్ పార్టీ సాంగ్ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. మెగాస్టార్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అందరకొట్టింది బాలీవుడ్ భామ. అయితే ఈ సాంగ్‌కు ఆమె తీసుకున్న పారితోషికంపై నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. నటి ఊర్వశి రౌతేలా 'బాస్ పార్టీ' పాట కోసం భారీ మొత్తంలో వసూలు చేసిందని సమాచారం. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మూడు నిమిషాల పాట కోసం ఆమె దాదాపు రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకోగా.. ఊర్వశి పారితోషికంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 2023లోనే అత్యంత ఖరీదైన పాట? వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఊర్వశి, చిరంజీవీల 'బాస్ పార్టీ' పాట చిత్రీకరణకు రూ.30 కోట్లు ఖర్చయిందని వార్తలొచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను నకాష్, అజీజ్, డీఎస్పీ, హరిప్రియ ఆలపించారు. కాగా.. తదుపరి ఊర్వశి రౌతేలా రామ్ పోతినేనితో కలిసి కనిపించనుంది. ఆమె 'ఇన్స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సహనటిగా కూడా నటించనుంది. ఆ తర్వాత మిచెల్ మోరోన్‌తో కలిసి హాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. గ్లోబల్ మ్యూజిక్ సింగిల్‌లో ఆమె జాసన్ డెరులోతో కలిసి కనిపించనుంది.