FMCG Shares
-
వాటా అమ్మేసిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani) తాజాగా ఎఫ్ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌లో (Adani Wilmar) 13.5 శాతం వాటా విక్రయించింది. ఫార్చూర్ బ్రాండ్ వంట నూనెలు, ఫుడ్ ప్రొడక్టుల కంపెనీలో 17.54 కోట్ల షేర్లను షేరుకి రూ. 275 ఫ్లోర్(కనీస) ధరలో అమ్మివేసింది. తద్వారా విల్మర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) నుంచి వైదొలగనుంది.వెరసి కీలకంకాని బిజినెస్‌ల నుంచి తప్పుకోవడం ద్వారా గ్రూప్‌నకు ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టనుంది. భాగస్వామి విల్మర్‌కు వాటా విక్రయించనున్నట్లు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ ద్వారా 13.5 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. దీనిలో అదనంగా విక్రయించే వీలున్న 6.5 శాతం వాటా(8.44 కోట్ల షేర్లు) సైతం కలసి ఉన్నట్లు వెల్లడించింది.మార్కెట్లు క్షీణతలో ఉన్నప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. దీంతో 1.96 కోట్ల షేర్లను అదనంగా ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే 17.54 కోట్ల షేర్లు(13.5 శాతం వాటా) ప్రస్తుతం విక్రయించగా.. మరో 1.96 కోట్ల(1.5 శాతం వాటా)ను సోమవారం(13న) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనున్నట్లు వివరించింది.అంటే మొత్తం 19.5 కోట్ల షేర్ల(15.01 శాతం వాటా)ను అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో 3.15 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకున్నట్లవుతుందని అదానీ గ్రూప్ తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా తాజా వాటా విక్రయ నేపథ్యంలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేసినట్లు అదానీ విల్మర్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు 74.37 శాతం, పబ్లిక్కు 25.63 శాతం వాటా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో ఒప్పందం ప్రకారం మిగిలిన వాటాను విల్మర్‌కు షేరుకి రూ. 305 ధర మించకుండా విక్రయించనున్నట్లు తెలియజేసింది. లావాదేవీకి ముందు కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 43.94 శాతం వాటా ఉన్న విషయం విదితమే.నిజానికి విల్మర్‌కు 31 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదిరినప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు లభించిన స్పందన ఆధారంగా మిగిలిన వాటా ను విక్రయించనుంది. మార్చి31లోగా మొత్తం వాటా విక్రయం పూర్తికానున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అదానీ విల్మర్ షేరు బీఎస్ఈలో 10 శాతం పతనమై రూ. 292 దిగువన స్థిరపడింది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సెగ
వంటనూనెలు, కొబ్బరి, పామాయిల్ వంటి కీలక ముడిసరుకుల రేట్లు పెరిగిపోవడం, ధరల పెంపుపరంగా తీసుకున్న చర్యలు మొదలైనవన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలకు సవాలుగా మారాయి. వీటి కారణంగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించడం, స్థూల మార్జిన్లు క్షీణించడంతో పాటు నిర్వహణ లాభాలు ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పలు ఎఫ్ఎంసీజీ సంస్థల ఆదాయ వృద్ధి కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.డాబర్(Dabur), మారికో తదితర లిస్టెడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇచ్చిన అప్డేట్లను బట్టి చూస్తే అమ్మకాల వృద్ధి అదే స్థాయిలో లేదా కనిష్ట సింగిల్–డిజిట్ స్థాయిలోనో ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోయిందన్నారు. ముడి వస్తువుల ధరల పెరుగుదలవల్ల ఉత్పత్తుల రేట్లను తప్పనిసరిగా పెంచాల్సి రావడం పరిశ్రమకు కాస్త ప్రతికూలం కాగలదని వివరించారు. డిసెంబర్ క్వార్టర్లో కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావచ్చని డాబర్ అంచనా వేస్తోంది. క్యూ3లో కొన్ని సెగ్మెంట్లలో నెలకొన్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, వ్యయాల తగ్గింపు, ఉత్పత్తుల రేట్లను కొంత మేర పెంచడం ద్వారా ఎదుర్కొన్నట్లు డాబర్ తెలిపింది. మెరుగ్గా గ్రామీణం ..పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మరింత వేగంగా వృద్ధి చెందినట్లు డాబర్ చ్యవన్‌ప్రాశ, వాటికా తదితర బ్రాండ్లను తయారు చేసే డాబర్ వెల్లడించింది. ఈ–కామర్స్(E-Commerce), క్విక్ కామర్స్ వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు వృద్ధి చెందుతుండగా, కిరాణా స్టోర్స్ వంటి విభాగాల్లో కొంత ఒత్తిడి నెలకొన్నట్లు వివరించింది. మారికో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో డిమాండ్ స్థిరపడుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన దేశీయంగా అమ్మకాల పరిమాణం వృద్ధి చెందవచ్చని, కానీ ముడి సరుకుల రేట్లు అధికంగా ఉన్నందున సీక్వెన్షియల్ ప్రాతిపదికన నిర్వహణ లాభాల వృద్ధి ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..ముడిసరుకుల రేట్లు ఊహించిన దాని కన్నా అధికంగా పెరిగిపోవడంతో స్థూల మార్జిన్లు ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా ఉండొచ్చని మారికో పేర్కొంది. సఫోలా(Safola), పారాచూట్, హెయిర్ అండ్ కేర్, నిహార్, లివాన్ తదితర ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. పట్టణాల్లో ఇంకో మూడు క్వార్టర్లు ఇలాగే ..ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల వృద్ధి అంతంతమాత్రంగాన ఉండటం, ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని వెల్త్ మేనేజ్మెంట్ సేవల సంస్థ నువామా తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మందగమనం మరో రెండు, మూడు త్రైమాసికాలపాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని, మెరుగైన వర్షపాతం, ఉచిత పథకాలు మొదలైన అంశాల కారణంగా పట్టణ ప్రాంత డిమాండ్‌ను దాటేయొచ్చని పేర్కొంది.చిన్న ప్యాక్లవైపే మొగ్గుసబ్బులు, స్నాక్స్, టీ మొదలైన వాటి విషయంలో ధరల పెంపు కారణంగా వినియోగదారులు చిన్న ప్యాక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని నువామా తెలిపింది. కొన్ని ముడి సరుకులకు సంబంధించి వార్షికంగా ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతం పెరిగిందని, దీంతో సబ్బులు, టీ, స్నాక్స్ వంటి ఉత్పత్తులకు సంబంధించి మార్జిన్లు గణనీయంగా తగ్గొచ్చని వివరించింది. ఇక చలికాలం రావడం కూడా కాస్త ఆలస్యం కావడంతో బాడీ లోషన్, చ్యవన్‌ప్రాశ్ వంటి నిర్దిష్ట సీజన్ ఉత్పత్తులపై ప్రభావం పడుతోంది. డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, క్విక్ కామర్స్ వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. -
విల్మర్ నుంచి అదానీ ఔట్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ(FMCG) దిగ్గజం అదానీ విల్మర్ నుంచి బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ వైదొలగనుంది. ఈ భాగస్వామ్య కంపెనీ(JV)లో అదానీ గ్రూప్, సింగపూర్ సంస్థ విల్మర్ విడిగా 43.94 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. అయితే దీనిలో 31.06 శాతం వాటాను విల్మర్‌కు విక్రయించనున్నట్లు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది.షేరుకి రూ.305 ధర మించకుండా విల్మర్(Wilmar)కు వాటాను అమ్మివేయనున్నట్లు పేర్కొంది. తద్వారా రూ.12,314 కోట్లు అందుకోనుంది. కంపెనీ ఫార్చూన్ బ్రాండ్‌తో వంట నూనెలుసహా పలు ఫుడ్ ప్రొడక్టులను విక్రయిస్తున్న విషయం విదితమే. మరో 13 శాతం వాటాను పబ్లిక్కు కనీస వాటా నిబంధనకు అనుగుణంగా ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు అదానీ(Adani) ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. వెరసి పూర్తి వాటాను 200 కోట్ల డాలర్లకు(సుమారు రూ.17,100 కోట్లు) విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుంది. లావాదేవీలు 2025 మార్చి31కల్లా పూర్తికావచ్చని అంచనా వేసింది. ఫలితంగా అదానీ నామినీ డైరెక్టర్లు జేవీ బోర్డు నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించింది.వృద్ధి అవకాశాలపైనే..అదానీ విల్మర్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరే నిధులను వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) పేర్కొంది. ఎనర్జీ, యుటిలిటీ, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ తదితర కీలకమైన మౌలిక సదుపాయాల బిజినెస్ పురోభివృద్ధికి వినియోగించనున్నట్లు వివరించింది. తాజా లావాదేవీ ద్వారా అదానీ గ్రూప్ లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడనుంది. కాగా.. ఏఈఎల్ నుంచి అదానీ విల్మర్‌లో గరిష్టంగా 31.06 శాతం వాటా కొనుగోలుకి విల్మర్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా పబ్లిక్కు కనీస వాటా నిబంధనమేరకు 13 శాతం వాటాను ఏఈఎల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించనుంది. ఇందుకు రెండు కంపెనీలు చేతులు కలిపినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ప్రస్తుతం అదానీ విల్మర్‌లో రెండు కంపెనీలకూ సంయుక్తంగా 87.87 శాతం వాటా ఉంది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం లిస్టింగ్ తదుపరి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంది.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుకంపెనీ నేపథ్యం1999 జనవరిలో సమాన వాటాతో జేవీగా ఏర్పాటైన అదానీ విల్మర్.. ఫార్చూన్ బ్రాండుతో వంట నూనెలు, రైస్, ఆటాసహా వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. 10 రాష్ట్రాలలో 23 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 3,600 కోట్లు సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 2022 ఫిబ్రవరిలో లిస్టయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2023–24) రూ.51,555 కోట్లకుపైగా ఆదాయాన్ని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.42,785 కోట్లుగా నమోదైంది. నవంబర్‌లో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అవినితి ఆరోపణలు చేశాక గ్రూప్ చేపట్టిన తొలి భారీ లావాదేవీ ఇది. గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
ఎఫ్ఎంసీజీ.. ఆరోగ్య‘మస్తు’!
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది. గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి. ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం. అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఫిట్నెస్.. లైఫ్ స్టయిల్... నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ. డిమాండ్ ఫుల్.. సరఫరా డల్కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరు ఇలా..
ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?డాబర్ లాభం నేలచూపుఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది. -
మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
పెరుగుతున్న పామాయిల్, ముడిసరుకు ధరల వల్ల ఎఫ్ఎంసీజీ సంస్థల మార్జిన్లు, లాభాలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభావం పడనుంది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థలు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్), డాబర్, మారికో ఇప్పటికే ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జిన్లలో వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా ఉండొచ్చని పేర్కొన్నాయి. కోప్రా, వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరిగినట్టు చెప్పాయి. ‘పామాయిల్ ధరలు, తయారీ వ్యయాలు మార్చి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండంకెల స్థాయిలో వీటి పెరుగుదల నమోదైంది. పెరిగిన వ్యయ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయకూడదని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త ఉత్పత్తులు సహా దీర్ఘకాల వృద్ధికి పెట్టుబడులు కొనసాగించాలని తెలిపింది’ అని జీసీపీఎల్ పేర్కొంది. పామాయిల్, ముడి సరుకుల ధరల కారణంగా సెప్టెంబర్ క్వార్టర్ స్టాండలోన్ ఎబిటా వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. ఆదాయం మాత్రం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఒకే ఆర్డర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతంముడి సరుకుల ధరల పెరుగుదల..ఇటీవలే ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచిన ఫలితంగా వెజిటబుల్ నూనెల ధరలు, కోప్రా ధరలు పెరిగాయని మారికో తెలిపింది. స్థూల మార్జిన్లు మోస్తరుగానే ఉండొచ్చని పేర్కొంది. ఆదాయ వృద్ధితో పోలిస్తే.. నిర్వహణ లాభం వృద్ధి మోస్తరుగానే ఉండొచ్చని అంచనా వేసింది. మరో ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ పంపిణీదారుల స్థాయిలో నిల్వలను సరిదిద్దే పనిలో ఉన్నట్టు తెలిపింది. ‘తక్కువ అమ్మకాలతో లాభాలపై ప్రభావం పడింది. ఆపరేటింగ్ మార్జిన్ రెండంకెల స్థాయిలో క్షీణించొచ్చు’అని పేర్కొంది. మరోవైపు ప్రకటనలపై డాబర్ తన వ్యయాలను పెంచింది. పంపిణీ ఛానల్ బలోపేతానికి వీలుగా ఈ తాత్కాలిక దిద్దుబాట్లు అవసరమని, రానున్న రోజుల్లో మెరుగైన నిర్వహణ, వృద్ధికి ఈ చర్యలు వీలు కల్పిస్తాయని చెప్పింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మెరుగుపడినట్టు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా ఆదాయం రెండంకెల స్థాయిలో పెరిగినట్టు అదానీ విల్మార్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ–కామర్స్ ఛానళ్ల ద్వారా గడిచిన ఏడాది కాలంలో ఆదాయం నాలుగు రెట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. -
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
దక్షిణాదిలో మొదటి తయారీ యూనిట్
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ డాబర్ తమిళనాడులోని ‘సిప్కాట్ ఫుడ్ పార్క్’లో తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ఈ యూనిట్ నిర్మాణానికిగాను డాబర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఈ ప్లాంట్ మొదటిది కావడం విశేషం.కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మొదటిదశ పనుల కోసం రూ.135 కోట్లు వెచ్చించనుంది. విల్లుపురం జిల్లా తిండివనంలోని సిప్కాట్ ఫుడ్ పార్క్‌లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా వివరాల వెల్లడించారు. Welcome to Tamil Nadu, @DaburIndia! In fact, welcome to South India! In the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal, @Guidance_TN today signed an MoU with Dabur for the establishment of a world-class manufacturing plant, their FIRST EVER in South India,… pic.twitter.com/1rAazmCVOH— Dr. T R B Rajaa (@TRBRajaa) August 22, 2024‘కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ కంపెనీకి దక్షిణాదిలో మొదటిది కావడం విశేషం. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. మొదటిదశలో రూ.135 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల సుమారు 250 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్లాంట్‌లో హోమ్‌కేర్, పర్సనల్ కేర్, జ్యూస్ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు మేలు జరుగుతుంది’ అని మంత్రి అన్నారు. -
మారుతున్న ప్రచార పంథా
ఏ వస్తువు తయారు చేసినా దాన్ని విక్రయించాలంటే సరైన ప్రచారం అవసరం. మేలైన వస్తువులు ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలైనా సరే వాటి స్తోమతకు తగిన ప్రచారకర్తలను నియమించుకుంటాయి. కొన్ని పెద్ద కంపెనీలు సినీ తారలు, క్రికెట్లు, పాపులర్ వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ప్రచారం సాగిస్తుంటాయి. కానీ క్రమంగా ఆ ట్రెండ్ మారుతుంది. ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశం ఇస్తున్నాయి.భారత్‌లో స్థిరంగా వృద్ధి చెందే ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) రంగంలోని కంపెనీలు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ పరిశ్రమలో ప్రముఖ సంస్థలుగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), డాబర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ)..వంటివి ఈ పంథాను అనుసరిస్తున్నాయి. ఈమేరకు 2024 ఆర్థిక సంవత్సరంలో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ విలువ రూ.2,344 కోట్లుగా ఉంది. ఇది 2026 నాటికి రూ.3,375 కోట్లకు చేరుతుందని అంచనా. కంపెనీలు తమ డిజిటల్ బడ్జెట్లో సుమారు 8-10 శాతం రెవెన్యూను ఈ ప్రచారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద కంపెనీగా ఉన్న హెచ్‌యూఎల్ తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వెచ్చించే ఖర్చును 2024లో 31 శాతం పెంచి రూ.6,380 కోట్లకు చేర్చింది. ఈ కంపెనీ దాదాపు 700 మంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా దేశంలోని అన్ని భాషల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాలు, యూట్యూజ్, ఇన్స్టాగ్రామ్..వంటి వాటిలో కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. ఇదిలాఉండగా, ఏ వస్తువైనా మార్కెట్లోని ఇతర కంపెనీ ఉత్పత్తుల ధరతో పోల్చి ఎక్కడ తక్కువకు లభిస్తుందో బేరీజు వేసుకుని తీసుకోవాలి. ప్రధానంగా ఏదో విలాసాలకు వస్తువులు కొనకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేలా జాగ్రత్తపడాలి. డబ్బు మిగిల్చుకోవాలి. -
గ్రామీణ మార్కెట్‌పై ఎఫ్ఎంసీజీ ఆశలు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక అంచనా వేసింది. అమ్మకాల్లో 6.1 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు 4.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ఫ్లాట్‌గా 4.2 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి స్థిరత్వం నెలకొంటే అక్కడి నుంచి భారీ మార్పు కనిపించొచ్చని అభిప్రాయపడింది. పట్టణాలతో సమానంగా సమీప భవిష్యత్తులో పల్లెల్లోనూ అమ్మకాలు ఊపందుకోవచ్చని తెలిపింది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు సగం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్టు గుర్తు చేసింది. ఎఫ్ఎంసీజీలో వృద్ధి జనాభా ఆధారంగానే ఉంటుంది కానీ, వినియోగం ఆధారంగా కాదని వివరించింది. ఇవీ సమస్యలు.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, గ్రామీణ గృహ పరిమాణంలో తగ్గుదల, యుటిలిటీల కోసం (టెలిఫోన్, విద్యుత్, పెట్రోల్ తదితర) ఎక్కువగా ఖర్చు చేస్తుండడం, పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టడం గ్రామీణ ప్రాతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగంలో స్తబ్దతకు కారణాలుగా కాంటార్ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత నుంచి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ వినియోగం పడిపోవడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇది పుంజుకుంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ ఇతర రంగాల మాదిరే ఎఫ్‌ఎంసీజీలోనూ ప్రీమియమైజేషన్ (నాణ్యమైన, ఖరీదైన బ్రాండ్ల వైపు మొగ్గు) ధోరణి వృద్ధి చెందుతోందని కాంటార్ నివేదిక తెలిపింది. ఇది మెరుగైన జీవన ప్రమాణాలను తెలియజేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని విభాగాలు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తున్నట్టు, దీంతో ప్రీమియం ఉత్పత్తులకు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఫేస్ స్క్రబ్/పీల్/మాస్్క, బాడీ వాష్, హెయిర్ కండీషనింగ్ సిరమ్, ముసేలి, కొరియన్ నూడుల్స్‌ను ఉదాహరణలుగా పేర్కొంది. -
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
ఆగని బుల్ పరుగు
ముంబై: ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మరో రికార్డు స్థాయిలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్ బలపరిచాయి. అధిక వెయిటేజీ మారుతీ సుజుకీ(7%), ఎంఅండ్ఎం(3%), ఐటీసీ(2%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 391 పాయింట్లు పెరిగి 80,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 24,433 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయం లాభాలతో మొ దలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి.ఆటో, ఎఫ్ఎంసీజీతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, రియలీ్ట, వినిమయ, ఫార్మా, యుటిలిటీ, కన్జూమర్ డిస్రే్కషనరీ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 437 పాయింట్లు బలపడి 80,397 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగసి 24,444 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. రికార్డు ర్యాలీలోనూ టెలికం క్యాపిటల్ గూడ్స్, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా చట్ట సభల్లో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగానికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.మారుతీ పరుగు⇒ పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల రిజి్రస్టేషన్ పన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీ సర్కా రు నిర్ణయంలో దేశంలో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసే మారుతీ సుజుకీ కంపెనీ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 6.60% పెరిగి రూ.12,820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 8% దూసుకెళ్లి రూ.12,955 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ⇒ నైరుతి రుతుపవనాలు రాకతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సందడి మొదలైంది. దీ ంతో వినియోగ ఆధారిత రంగ ఎఫ్ఎంసీ జీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈః రూ. 451.27 లక్షల కోట్లు ⇒ స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్ల సంపద సైతం జీవితకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్క రోజే రూ.1.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ ఆల్‌టైం గరిష్టం రూ. 451.27 లక్షల కోట్లకు చేరింది. -
ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మధ్య పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అధిక అమ్మకాల పరిమాణానికి తోడు గ్రామీణ మార్కెట్లు కోలుకోవడాన్ని ప్రస్తావించింది. పట్టణాల్లోనూ అమ్మకాలు 7–8 శాతం మేర పెరుగుతాయని, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధికితోడు, ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ అధిక విక్రయాలకు తోడ్పడొచ్చని అంచనా వేసింది. ప్రీమియం ఉత్పత్తుల వినియోగ ధోరణి, అమ్మకాల్లో వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమల నిర్వహణ మార్జిన్ల విస్తరణకు తోడ్పడతాయని.. మొత్తం మీద నిర్వహణ మార్జిన్లు 50–75 బేసిస్ పాయింట్లు పెరిగి 20–21 శాతానికి చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ‘‘మార్జిన్ల విస్తరణ అధికంగానే ఉంటుంది. కానీ మార్కెటింగ్ వ్యయాలు పెరగడం, సంఘటిత, అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య అధిక పోటీ నెలకొనడం దీన్ని పరిమితం చేస్తుంది’’అని వివరించింది. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో(ఎఫ్అండ్బీ) ముడి సరుకుల ధరలు పెరగడం మార్జిన్ల విస్తరణను పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, గృహ సంరక్షణ విభాగంలో కీలక ముడి సరుకుల ధరలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో సగం ఫుడ్, బెవరేజెస్ నుంచే వస్తుండగా, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ చెరో పావు శాతం వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్ గుర్తు చేసింది. ప్రీమియం ఉత్పత్తులను ఎక్కువగా ఆవిష్కరించడం, ముఖ్యంగా ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో తీసుకురావడం కంపెనీల మార్జిన్లకు మద్దతునిచ్చే అంశంగా పేర్కొంది. ఆహారం, పానీయాల్లో ఎక్కువ వృద్ధి ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో వృద్ధి అన్నది విభాగాల వారీగా భిన్నంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర వర్మ తెలిపారు. ‘‘ఫుడ్, బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) విభాగంలో ఆదాయాలు 8–9 శాతం మేర పెరగొచ్చు. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఇది 6–7 శాతం మధ్య ఉంటుంది. గృహ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఆదాయం 8–9 శాతం మేర పెరగొచ్చు’’అని వర్మ తెలిపారు. -
మార్కెట్‌కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
అంతంత మాత్రంగానే ఎఫ్ఎంసీజీ వృద్ధి.. క్యూ3లో 4–5 శాతంగా అంచనా
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా తక్కువ నుంచి మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూడొచ్చని అంచనా వేస్తున్నాయి. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం) వినియోగ డిమాండ్ ఊపందుకోవడమే ఈ అంచనాలకు కారణం. ఇప్పటికీ గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ స్తబ్దుగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో వరుసగా మూడో త్రైమాసికంలోనూ డిమాండ్ నిలకడగా కొనసాగింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ డిసెంబర్ త్రైమాసికం అప్డేట్లను పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. వినియోగం పుంజుకుంటుందనడానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయని, కనుక క్రమంగా వినియోగం పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో, తయారీ వ్యయాలు దిగిరావడం వల్ల స్థూల మార్జిన్లు మెరుగుపడతాయని పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు మరిన్ని ప్రకటనల ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ‘‘ప్రకటనలు, ప్రచారంపై వ్యయాలు పెంచడం ద్వారా అధిక శాతం స్థూల మార్జిన్ల విస్తరణకు అవకాశం ఉంది. నిర్వహణ లాభం ఆదాయం కంటే ఎక్కువ వృద్ధిని వార్షికంగా నమోదు చేయవచ్చు’’అని డాబర్ ఇండియా త్రైమాసికం వారీ అప్డేట్లో పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే డిమాండ్ ధోరణిలో పురోగతి కనిపించినట్టు చెప్పింది. అయినప్పటికీ పట్టణాల్లో వృద్ధితో పోలిస్తే గ్రామీణ వృద్ధి బలహీనంగానే ఉందని, కాకపోతే పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయని వెల్లడించింది. ధరల్లో వృద్ధి స్తబ్దుగానే ఉందని, డిసెంబర్ త్రైమాసికంలో ప్రధానంగా అమ్మకాల పరిమాణంలోనే వృద్ధి కనిపించినట్టు తెలిపింది. ఎఫ్అండ్బీ విభాగం అమ్మకాలు అధిక సింగిల్ డిజిట్ వృద్ధిని చూడగా, హోమ్, పర్సనల్ కేర్ విభాగం అమ్మకాలు మధ్యస్థ సింగిల్ డిజిట్‌ను చూసినట్టు పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంటోంది. గ్రామీణం పర్వాలేదు.. డిసెంబర్ క్వార్టర్లో గ్రామీణ మార్కెట్ కొంత ఉత్సాహపూరితంగా ఉన్నట్టు మారికో తెలిపింది. స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడంతో 2024లో వినియోగం ఇంకా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధికి పరిమితం కావొచ్చని, ప్రధాన పోర్ట్‌ఫోలియో అమ్మకాలు త్రైమాసికం వారీగా కొంత మెరుగుపడతాయని మారికో వివరించింది. పారాచ్యూట్ కోకోనట్ అయిల్ అమ్మకాలు తక్కువ సింగిల్ డిజిట్లో పెరగ్గా, సఫోలా ఆయిల్ అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. కన్సాలిడేటెడ్‌గా డిసెంబర్ త్రైమాసికం అమ్మకాల్లో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూసినట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది. ‘‘దేశీయంగా నిర్వహణ వాతావరణం సెప్టెంబర్ త్రైమాసికం మాదిరే ఉంది. అయినప్పటికీ మెరుగైన అమ్మకాలతో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధి నమోదైంది’’అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ దేశీయ ఎఫ్ఎంసీజీ అమ్మకాల వృద్ధి మధ్యస్థ సింగిల్ డిజిట్‌లోనే ఉండొచ్చని అంచనా. మారికో ఇంటర్నేషనల్ వ్యాపారం మధ్యస్థ స్థాయిలో వృద్ధి చెందగా, తమ అంతర్జాతీయ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డాబర్ ఇండియా తెలిపింది. -
మళ్లీ కొత్త రికార్డులు
ముంబై: ఎఫ్ఎంసీజీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీ లు ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 71,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్లు బలపడి 21,453 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడి కి లోనయ్యాయి. అయితే వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే షేర్లు ఒక శాతం రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోవడంతో పాటు లాభాలు ఆర్జించగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగి 71,624 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 21,505 వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్టాలు నమోదు చేశాయి. మరో వైపు ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లో నయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.603 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు ఒక శాతం లాభపడ్డాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు యూరప్ మార్కెట్లు పరిమిత లాభాల్లో కదలాడాయి. ► ‘‘స్టాక్ మార్కెట్లో ఆశావాదం కొనసాగింది. స్థిరీకరణ దశలో భాగంగా సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఎర్ర సముద్రం నౌకా మార్గానికి రక్షణ కల్పిస్తామంటూ అమెరికా ప్రకటనతో క్రూడాయిల్ ధరల్లో స్థిరంగా నెలకొంది. వృద్ధి ఆధారిత స్టాకుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు వినిమయ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► పెట్రోలియం క్రూడ్, డిజిల్‌పై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.50%, ఓఎన్జీసీ, హిందూస్తాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఐఓసీ, పెట్రోనెట్ షేర్లు ఒకటి నుంచి అరశాతం చొప్పున పెరిగాయి. ►భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటన(మంగళవారం)కు ముందు దేశీయ ఐటీ షేర్లలో అప్రమత్తత చోటు చేసుకొంది. కోఫోర్జ్ 3%, విప్రో 2%, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు ఒకశాతం పతనమయ్యాయి. ఎంఫసీస్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీఎం షేర్లు అరశాతం నష్టపోయాయి. ► షేర్ల విభజన రికార్డు తేది జనవరి 5 గా నిర్ణయించడంతో నెస్లే ఇండియా షేరు 4.50% లాభపడి రూ.25,485 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5.50% పెరిగి రూ.25,699 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!
పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. పిల్లలే కాదు పెద్దల్లోనూ ఆ అలవాటు ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా జంక్ ఫుడ్ సేల్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. తాజాగా యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (ఏటీఎన్ఐ) రిపోర్ట్ ప్రకారం జంక్‌ఫుడ్ సేల్స్ పెరుగుతున్నాయని తెలుస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీల సేల్స్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాటా పెరుగుతోంది. దేశంలో ప్రముఖ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారుచేస్తున్న 1,901 ప్రొడక్టుల్లో కేవలం 24 శాతం మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాల్లో ఈ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. మొత్తం ఏడు కేటగిరీల్లో 58 ఇండికేటర్లను వాడి కంపెనీలను విశ్లేషించామని ఏటీఎన్ఐ వెల్లడించింది. ప్రొడక్ట్ వివరాలు, గవర్నెన్స్, మార్కెటింగ్, లేబులింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏటీఎన్ఐ కంపెనీలకు హెల్తీనెస్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఐటీసీ టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాత స్థానాల్లో హిందుస్థాన్ యునిలీవర్, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, కోకకోలా ఇండియా ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్‌లో 3.5 కంటే ఎక్కువ స్టార్స్ పొందిన ప్రొడక్ట్‌లను హెల్తీ ప్రొడక్ట్‌లుగా ఏటీఎన్ఐ వర్గీకరించింది. ఇందులో పండ్లు, కూరగాయలు, ఫైబర్, కంట్రోలింగ్ స్థాయిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉన్నాయి. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో చాలా వాటికి చెందిన ప్రొడక్ట్‌ల రేటింగ్ 3.5 కంటే తక్కువ ఉందని ఏటీఎన్ఏ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ 20 ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రొడక్ట్‌ల యావరేజ్ రేటింగ్ 1.9 ఉందని తెలిపింది. సగానికి పైగా (55.6 శాతం) కంపెనీల ప్రొడక్ట్‌ల రేటింగ్ ఐదుకు 1.5గా ఉందని, కేవలం 12 శాతం ప్రొడక్ట్‌లు చిన్న పిల్లలు తినేందుకు అర్హత పొందాయని వెల్లడించింది. ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీలో అనేక మార్పులు వస్తున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రెగ్ ఎస్ గారెట్ అన్నారు. డైట్, న్యూట్రిషన్, హెల్త్ వంటి అంశాలపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక! ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు, షుగర్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ వాటాను హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, పెప్సికో వంటి కంపెనీలు వేగంగా తగ్గిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలతో తయారైన ప్రొడక్ట్‌లను హిందుస్తాన్ యునిలీవర్, ఐటీసీలు తయారుచేస్తున్నాయి. కానీ అందులోనూ చాలా సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హెల్తీ ఫుడ్ అంటే ఏంటో తెలియజేయడానికి ప్రామాణిక నిర్వచనం ఏమీ లేదని గుర్తు చేసింది. కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ‘హెల్తీఫుడ్’ పేరుతో ఉత్పత్తులు తయారుచేస్తున్నాయని తెలిపింది. కానీ అవి అంతర్జాతీయ ప్రయాణాలకు తగినట్లు గుర్తింపు పొందడం లేదని చెప్పింది. -
దక్షిణాదిలో తయారీ ప్లాంటు యోచనలో డాబర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్ దక్షిణాదిలో కొత్తగా ఫ్యాక్టరీ నెలకొల్పే యోచనలో ఉంది. ఏడాదిలోపే దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. దక్షిణాదిలో తమ వ్యాపారం గడిచిన 5–6 ఏళ్లలో రెట్టింపయ్యిందని, ప్రస్తుతం మొత్తం దేశీ విక్రయాల్లో 20 శాతం వాటా ఉంటోందని ఆయన చెప్పారు. దక్షిణాది మార్కెట్లో విప్రో తదితర ఎఫ్‌ఎంసీజ తయారీ సంస్థలు ఫుడ్ సెగ్మెంట్లోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడి మార్కెట్ కోసం కస్టమైజ్డ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వార్షికంగా దాదాపు రూ. 350–450 కోట్ల మేర పెట్టుబడి ప్రణాళికలున్న డాబర్ ఇండియా.. అటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోను తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. డాబర్‌కు సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే తదితర దేశాల్లోనూ ప్లాంట్లు ఉన్నాయి. -
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
AICPDF: ఎఫ్ఎంసీజీ.. అన్నేసి ప్యాక్‌లు వద్దు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత నెట్‌వర్క్‌పై అదనపు భారం పడినట్టు పంపిణీదారులు పేర్కొంటున్నారు. ప్యాకింగ్ సైజులను నాలుగు ప్రధాన కేటగిరీలుగా ప్రామాణీకరించాలని కోరుతున్నారు. ఆరంభ ప్యాక్, చిన్న ప్యాక్, మధ్యస్థ ప్యాక్, పెద్ద ప్యాక్ ఇలా నాలుగు విభాగాలుగా ఉండాలని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) డిమాండ్ చేసింది. గ్రామీణ మార్కెట్లలో విక్రయాలు పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టాయి. దీంతో ధరల పరంగా వినియోగదారుల్లో అయోమయం ఏర్పడినట్టు, స్టాక్ నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ తెలిపింది. ఒకే ధరలో పరిమాణం పరంగా వ్యత్యాసం ఉంటుండడం వినియోగదారుల్లో అయోమయాన్ని కలిగిస్తున్నట్టు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ ధైర్యíÙల్ పాటిల్ చెప్పారు. నిల్వ వసతులు పరిమితంగా ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చే ఇన్నేసి రకాల సైజుల ఉత్పత్తులను నిర్వహించడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను నాలుగు ప్రామాణిక ప్యాక్ సైజులు కింద వర్గీకరించాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖకు ఏఐసీపీడీఎఫ్ సూచించింది. ‘‘ప్రామాణిక ప్యాకేజింగ్ సైజులకు ఉత్పత్తులను క్రమబద్ధీకరించడం వల్ల నిర్వహణ సులభతరం అవుతుంది. రిటైలర్లకు సంక్లిష్టతలు తగ్గుతాయి. వినియోగదారుల్లో అయోమయాన్ని పోగొట్టొచ్చు’’అని పేర్కొంది. ఒకవైపు మార్కెట్ విస్తరణతోపాటు, మ రోవైపు ఉత్పత్తుల పంపిణీ నెట్వర్క్ సాఫీగా నడిచేందుకు వీలుగా ప్యాకింగ్ సైజులు ఉండాలని అభిప్రాయపడింది. కంపెనీలు ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు తాము ప్రోత్సాహం ఇస్తామని, మరింత వ్యవస్థీకృత, వినియోగదారు అనుకూల మార్కెట్ కోసం కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఏఐసీపీడీఎఫ్ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఆహార పరిశ్రమపై కమోడిటీ ధరల ప్రభావం
కోల్‌కతా: అధిక కమోడిటీ ధరలు, అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఆహార పరిశ్రమ (ఫుడ్)పై గణనీయంగా పడినట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. దీర్ఘకాలంలో ఈ అంశాల ప్రభావం అధికంగా ఉంటుందని 2022–23 వార్షిక నివేదికలో పేర్కొంది. ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి సాయపడినట్టు వివరించింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆహార పరిశ్రమ ఎదుర్కొన్న పెద్ద సవాలు.. ముడి పదార్థాలైన గోధుమలు, పాలు, పంచదార, పామాయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోవడం వల్ల ఎదురైన ద్రవ్యోల్బణమే’’అని పేర్కొంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రధానంగా బిస్కట్లు, కేక్‌లు, రస్్క, బ్రెడ్, చాక్లెట్ల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ పరిస్థితులు ఎంతో ఆశావహంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పరిస్థితులు అన్నవి 2023–24లో ప్రధానంగా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. సరైన వర్షపాతంపైనే గ్రామీణాభివృద్ధి, ఆహార ధరలు ఆధారపడి ఉంటాయి’’అని బ్రిటానియా తన నివేదికలో తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించామని, కొత్త భౌగోళిక ప్రాంతాల్లోకి విస్తరించామని ప్రకటించింది. బ్రాండ్ బలోపేతం, కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, సార్క్ దేశాలపై దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. -
భారత్‌లో నెస్లే ఇండియా వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా 2025 నాటికి భారత్‌లో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో భా గంగా ఒడిశా రాష్ట్రంలో దేశంలోనే 10వ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2023 మొదటి ఆరు నెలల్లో తాము రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తంలో ఒకటో వంతు ఆహారోత్పత్తుల కోసమే వెచ్చించినట్టు పేర్కొన్నారు. చాక్లెట్లు, కన్ఫెక్షనరీ తయారీ కోసం ఒక వంతు, మిగిలిన మొత్తాన్ని న్యూట్రిషన్, ఇతర ఉత్పత్తుల తయారీపై ఖర్చు చేసినట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్, కిట్‌క్యాట్ చాక్లెట్లు, నెస్‌కేఫే తదితర పాపులర్ ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తుండడం తెలిసిందే. 2023 నుంచి 2025 మధ్య మరో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ, ఇందులో రూ.900 కోట్లతో ఒడిశాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు సురేష్ నారాయణన్ తెలిపారు. అలాగే, కాఫీ, బెవరేజెస్ కోసం నిధులు వెచి్చంచనున్నట్టు చెప్పారు. నెస్లే ఇండియా ఏర్పాటైన నాటి నుంచి గత 60 ఏళ్లలో భారత్‌లో రూ.7,000 కోట్లను ఖర్చు చేసినట్టు ప్రకటించారు. మహిళలకు మరింత ప్రాతినిధ్యం గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో నూడుల్స్‌తోపాటు కన్ఫెక్షనరీ తయారీ సామర్థ్యాలను నెస్లే విస్తరిస్తోంది. అలాగే పంజాబ్‌లోని మోగాలో, గోవాలోని పాండాలో ప్లాంట్లను విస్తరిస్తున్నట్టు నారాయణన్ తెలిపారు. మరింత మంది మహిళా ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు చెప్పారు. కంపెనీ బోర్డులో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉండగా, క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో 20 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తమ కార్మిక శక్తిలో 25 శాతం మహిళల లక్ష్యానికి చేరువ అవుతున్నట్టు తెలిపారు. తమ సనంద్ ప్లాంట్‌లో అయితే సగం మంది కార్మికులు మహిళలే ఉన్నట్టు చెప్పారు. నెస్లే ఇండియాలో సుమారు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
పతంజలి ఫుడ్స్‌లో జీక్యూజీ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్ 5.96 శాతం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2,15,64,517 షేర్లను సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.96 శాతం వాటాకాగా.. బుధవారం షేరు ధర దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1,332.75 వద్ద ముగిసింది. ఈ ధరలో చూస్తే జీక్యూజీ పెట్టుబడి విలువ రూ. 2,900 కోట్లకు చేరింది. కాగా.. గత వారం ఓఎఫ్ఎస్ను చేపట్టిన పతంజలి ఫుడ్స్ షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరలో 2.53 కోట్ల షేర్ల(7 శాతం వాటా)ను ఆఫర్ చేసింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు మాతృ సంస్థ పతంజలి ఆయుర్వేద తెరతీసింది. దీంతో పతంజలి ఫుడ్స్‌లో పతంజలి ఆయుర్వేద వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం జూన్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌తోపాటు ఇతర విదేశీ సంస్థలు.. అదానీ గ్రూప్ కంపెనీలలోనూ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పతంజలి ఫుడ్స్ ఓఎఫ్ఎస్ సక్సెస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విజయవంతమైంది. శుక్రవారం ముగిసిన ఇష్యూకి రెండు రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 3 రెట్లు, సంస్థాగత వర్గాల నుంచి 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ ఓఎఫ్ఎస్ ద్వారా పతంజలి ఫుడ్స్‌లో 7 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు తెరతీసింది. ఓఎఫ్ఎస్లో 25,33,964 షేర్లను ఆఫర్ చేయగా.. 76,34,567 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. రిటైలేతర ఇన్వెస్టర్లకు గురువారమే 2.28 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 4.56 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 2,53,39,640 షేర్లను విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను పతంజలి ఆయుర్వేద్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఇష్యూతో ప్రస్తుతం కంపెనీలో 19.18 శాతంగా ఉన్న పబ్లిక్ వాటా 25 శాతానికిపైగా చేరనుంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 1,225 వద్ద ముగిసింది. -
స్విగ్గీ చేతికి లింక్స్ లాజిస్టిక్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రిటైల్ పంపిణీ సంస్థ లింక్స్ లాజిస్టిక్స్ లిమిటెడ్(లింక్)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్‌కో సిమెంట్స్, రామ్‌కో ఇండస్ట్రీస్ నుంచి లింక్‌ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది. మరోవైపు లింక్స్ లాజిస్టిక్స్‌లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్‌కో సిమెంట్స్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్ టెక్కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను పొందనున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా రామ్‌కో ఇండస్ట్రీస్ సైతం లింక్స్లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్ టెక్‌తో షేర్ల సబ్‌్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్కు చెందిన 22,35,223 సీసీపీఎస్‌లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్ యూనిట్‌గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. -
ఎఫ్ఎంసీజీకి ఈ ఏడాది సానుకూలం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కాస్త పుంజుకోవడం ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సానుకూలించనుందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ ఆదాయం 7–9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఎఫ్ఎంసీజీ వినియోగంలో 65 శాతం వాటా కలిగిన పట్టణాల్లో వినియోగం స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెరగొచ్చని తెలిపింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.5–1 శాతం మేర పెరిగి, కరోనా ముందున్న 20–21 శాతానికి చేరుకుంటాయని పేర్కొంది. ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్, కెమికల్స్, ముడి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గడం కంపెనీల అధిక మార్కెటింగ్ వ్యయాలకు సర్దుబాటుగా ఉంటుందని తెలిపింది. రూ.5.2 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్లో 35 శాతం వాటా కలిగిన 76 ఎఫ్ఎంసీజీ సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను క్రిసిల్ రేటింగ్స్ రూపొందించింది. అమ్మకాల పరంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1–3 శాతం వృద్ధినే చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4–6 శాతం మధ్య ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాల ఆధారంగానే ఈ విశ్లేషణకు వచి్చనట్టు చెప్పారు. సానుకూలం.. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు క్షీణతను చూడగా, 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లోనే సానుకూల వృద్ధి నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వినియోగ డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. కీలక పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని కూడా ప్రస్తావించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పట్టణ వినియోగం రెండంకెల వృద్ధిని చూడగా, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం వల్ల ఈ వృద్ధి ఇక ముందూ కొనసాగొచ్చని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్: మారికో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో డిమండ్ ధోరణులు స్థిరంగా ఉన్నట్టు మారికో సైతం ప్రకటించింది. అయితే జూన్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం శాంతించినందున ఈ ఏడాది మిగిలిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి పనితీరుపై ప్రకటన విడుదల చేసింది. గడిచిన త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ వర్షపాత అంచనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం, ద్రవ్యోల్బణం దిగిరావడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను క్రమంగా పెంచుతుందన్న ఆశలు కలి్పస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో దేశీయ అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి కనిపించినట్టు ప్రకటించింది. సఫోలా వంట నూనెల నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో పరంగా చానల్ ఇన్వెంటరీలో మార్పులు కూడా చేసినట్టు తెలిపింది. వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం గరిష్టంగా ఒక అంకె స్థాయిలో (7–8 శాతం) పెరిగినట్టు తెలిపింది. బ్రాండ్ల బలోపేతం, నూతన ఉత్పత్తులపై ప్రచారం కోసం అధికంగా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. -
గ్రామీణంలో పుంజుకున్న ఎఫ్ఎంసీజీ వినియోగం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం తిరిగి గాడిన పడింది. ఆరు త్రైమాసికాల క్షీణత తర్వాత మార్చి క్వార్టర్లో వృద్ధి నమోదైంది. డేటా విశ్లేషణ సంస్థ ‘ఎన్ఐక్యూ’ ఈ వివరాలను విడుదల చేసింది. ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35%గా ఉంటుందని పేర్కొంది. అయితే ఆరు త్రైమాసికాల తర్వాత అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు కాలేదు. అతి స్వల్పంగా 0.3 శాతమే పెరిగాయి. కాకపోతే దీన్ని సానుకూలంగా ఐక్యూ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 5.3%పెరిగినట్టు వెల్లడించింది. దీనికంటే ముందు గ్రామీణ మార్కెట్ చివరిగా 2021 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో వృద్ధిని చూడడా న్ని ఈ నివేదిక ప్రస్తావించింది. మొత్తం మీద మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో అమ్మకాల పరంగా 3.1%, విలువ పరంగా 10.1% వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడానికి తోడు, సంప్రదాయ అమ్మకాలు పెరగడం సానుకూల వృద్ధికి దోహదపడింది. ఆహారోత్పత్తులకే ఆదరణ.. ఆహారోత్పత్తుల అమ్మకాలు 4.3 శాతం వృద్ధి చెందాయి. ఆహారేతర వినియోగం కేవలం 0.2 శాతం పెరిగింది. ఆహారం కాకుండా, గృహ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. సంప్రదాయ కిరాణా దుకా ణాల్లో అమ్మకాలు కేవలం 1.9 శాతమే పెరగ్గా, ఆధునిక అంగళ్లు అయిన హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 14.6 శాతం వృద్ధిని చూశాయి. వీధి చివర్లో ఉండే కిరాణా దుకాణాల్లో ఎలాంటి డిస్కౌంట్లు ఉండకపోగా, పెద్ద షాపింగ్ మాల్స్ మంచి ఆఫర్లతో తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తుండడం ఈ పరిణామాలకు నిదర్శనం. ఎఫ్ఎంసీజీలో చిన్న కంపెనీఈలు అమ్మకాల పరంగా 7.2 శాతం వృద్ధిని చూస్తే, పెద్ద కంపెనీలకు ఇది 3.2 శాతంగానే ఉంది. ఇక్కడ కూడా అంతే, చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ మార్జిన్లతో తక్కువ ధరలకు విక్రయిస్తుండడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. -
నెస్లే నుంచి రూ. 27 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా తాజాగా ఒక్కో షేరుకి రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. బుధవారం నిర్వహించిన 64వ వార్షిక సమావేశంలో కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ ఏప్రిల్ 21కాగా.. వాటాదారులకు మే 8న ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున చెల్లించనుంది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. రూ. 10 ముఖ విలువగల 9.64 కోట్లకుపైగా షేర్లతోకూడిన మొత్తం చెల్లించిన మూలధనంపై డివిడెండును ప్రకటించింది. కాగా.. ప్రస్తుత ఏడాది(2023) తొలి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలను ఈ నెల 25న ప్రకటించనుంది. 2022 అక్టోబర్ 31న కంపెనీ షేరుకి రూ. 120 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఎన్ఎస్ఈలో నెస్లే ఇండియా షేరు 1 శాతం నీరసించి రూ. 19,460 వద్ద ముగిసింది. -
కంపాకోలాతో కోకాకోలా,పెప్సికోకు గట్టి సవాల్ విసిరిన రిలయన్స్
-
గ్రామాల్లో కొనుగోళ్లు.. గంపెడాశలు పెట్టుకున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
న్యూఢిల్లీ: కమోడిటీ ద్రవ్యోల్బణం చల్లబడడం ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగానికి అనుకూలమని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదారు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పడిపోగా, తిరిగి అది పుంజుకుంటుందన్న అంచనాతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో ఉన్నాయి. మార్జిన్లు మార్చి త్రైమాసికంలో పెరుగుతాయని గోద్రేజ్ కన్జన్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్) సైతం అంచనాతో ఉంది. ‘‘మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం క్రమంగా రికవరీని చూసింది. వార్షికంగా చూస్తే అమ్మకాల పరిమాణం పెరిగింది. పట్టణాల్లో, ప్రీమియం ఉత్పత్తుల విభాగాల్లో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం చల్లబడడం మొత్తం మీద వినియోగానికి, గ్రామీణ మార్కెట్లకు అనుకూలం’’అని మారికో తెలిపింది. కొబ్బరి ధరలు స్థిరంగా, సానుకూల శ్రేణిలోనే ఉండగా, వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మార్జిన్లు పెరుగుతాయని, వార్షికంగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్లో సహేతుకమైన వృద్ధి ఉంటుందని మారికో తెలిపింది. ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా, త్రైమాసికం వారీగా చూస్తే మార్చిలో పుంజుకున్నట్టు డాబర్ పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు తిరిగి సానుకూల ధోరణికి చేరాయని, గ్రామీణ మార్కెట్లలోనే ఇంకా సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందని తెలిపింది. సమీప కాలంలో వినియోగంపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం, ప్రభుత్వ వినియోగం పెరగడం అనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయి నుంచి దిగి రావడంతో, స్థూల మార్జిన్లను మెరుగుపడతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఒక అంకె వృద్ధి.. డాబర్ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారం 5–6 శాతం స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. దేశీ మార్కెట్లో వినియోగ డిమాండ్ ధోరణలు మార్చి త్రైమాసికంలో నిలకడగా ఉన్నాయని, ఎఫ్ఎంసీజీ రంగం నిలకడైన వృద్ధిని చూస్తుందని సీజీపీఎల్ చెబుతోంది. మొత్తం మీద వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ ఉంటుందని, హోమ్‌కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో అమ్మకాలు, ఆదాయం పరంగా రెండంకెల వృద్ధిని చూస్తామని అంచనా వేస్తోంది. భారత్ తర్వాత గోద్రేజ్ కన్జ్యూమర్‌కు ఇండోనేషియా రెండో అతిపెద్ద మార్కెట్ కాగా, కన్సాలిడేటెడ్ స్థాయిలో రెండంకెల వృద్ధిపై కంపెనీ అంచనాలతో ఉంది. ‘‘మా ఉత్పత్తుల నాణ్యతలో పురోగతి ఉంది. మార్కెటింగ్‌పై అదే పనిగా పెట్టుబడులు పెడుతుండడం వల్ల, స్థూల మార్జిన్లు కోలుకుంటాయి. దీంత ఎబిట్డాలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’’అని జీసీపీఎల్ తెలిపింది. వర్షాల సీజన్ సానుకూలంగా ఉండడం రానున్న త్రైమాసికాల్లో వృద్ధికి కీలకమని పరిశ్రమ భావిస్తోంది. ‘‘బ్రాండ్లు, ఆవిష్కరణలపై బలంగా పెట్టుబడులు పెడుతున్నాం. పంపిణీని విస్తరిస్తున్నాం. తద్వారా మా మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు, స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలనుకుంటున్నాం’’అని డాబర్ తెలిపింది. దేశీయ డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ సైతం చెబుతోంది. కాకపోతే వర్షాలు, వాతావరణ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగాన్ని ఆలస్యం చేయవచ్చన్న అభిప్రాయంతో ఉంది. -
ఐపీవోకు సెబీతో మామాఎర్త్ చర్చలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు హోనసా కన్జూమర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బలహీన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవోను పక్కనపెట్టినట్లు మీడియాలో వెలువడిన వార్తల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు మామాఎర్త్, ద డెర్మా కో మాతృ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీవోకు అనుమతి పొందే బాటలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌పై సెబీతో చర్చిస్తున్నట్లు కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు వరుణ్ అలగ్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందాక ఐపీవో చేపట్టేందుకు 12 నెలల గడువు ఉంటుందని, తదుపరి బ్యాంకర్లతో చర్చిస్తామని తెలియజేశారు. 2022 డిసెంబర్లో కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 4.68 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్లను ఆఫర్ చేయనున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లలో వరుణ్, ఘజల్ అలగ్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా, రోహిత్ కుమార్ బన్సల్ తదితరులున్నారు. -
గ్రామీణ ఎఫ్ఎంసీజీ వినియోగం పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. -
ఐటీసీ చేతికి యోగా బార్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) బ్రాండ్ యోగా బార్‌ను సొంతం చేసుకోనుంది. బ్రాండ్ మాతృ సంస్థ స్ప్రవుట్‌లైఫ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్ఎఫ్పీఎల్)లో 100 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీసీ వెల్లడించింది. మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో వాటాను చేజిక్కించు కో నున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా తొలుత 47.5 శాతం వాటాను దశలవారీగా 2025 మార్చి 31కల్లా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. కొనుగోలు తీరిలా తొలుత 2023 ఫిబ్రవరి 15కల్లా ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 39.4 శాతం వాటాకుగాను రూ. 175 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఐటీసీ తెలియజేసింది. తదుపరి మరో రూ. 80 కోట్లు వెచ్చించడం ద్వారా 47.5 శాతానికి వాటాను పెంచుకోనున్నట్లు వివరించింది. మిగిలిన 52.5 శాతం వాటాను సైతం తదుపరి దశలలో కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఎస్ఎఫ్పీఎల్.. కొత్తతరం డిజిటల్ ఫస్ట్ బ్రాండ్ యోగా బార్ పేరున న్యూట్రిషన్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. వేగవంత వృద్ధిలో ఉన్న పౌష్టికాహార విభాగంలో ఏర్పాటైన స్టార్టప్ ఎస్ఎఫ్పీఎల్.. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 68 కోట్ల టర్నోవర్ సాధించింది. -
క్యూ2లో స్తబ్దుగా ఎఫ్ఎంసీజీ విక్రయాలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ముగిసిపోలేదు. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మందగమనం, తయారీ వ్యయాలు పెరిగిపోవడం తదితర సవాళ్ల నుంచి అవి గట్టెక్కాల్సి ఉంది. కాకపోతే రానున్న నెలల్లో పరిస్థితులు సానుకూలిస్తాయన్న అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2) విక్రయాలు స్తబ్దుగా ఉన్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ ప్రకటించాయి. వీటి అమ్మకాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉండడాన్ని అవి ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం నెమ్మదించి, పండుగల సీజన్ కారణంగా వినియోగం పుంజుకుంటుందని ఇవి అంచనా వేస్తున్నాయి. వినియోగం పుంజుకుంటుంది.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు నెమ్మదించనున్నాయి. వర్షాలు కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అంచనాలకు తగ్గట్టే ఉన్నాయి. దీంతో వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొంది. సఫోలా, ప్యారాచూట్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో సైతం విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైనట్టు ప్రకటించింది. ‘‘డిమాండ్ సెంటిమెంట్ అంతకుముందు త్రైమాసికం మాదిరే క్యూ2లోనూ కొనసాగింది. కాకపోతే చివరి నెలలో (సెప్టెంబర్) కాస్త పుంజుకుంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు బలహీనంగా ఉండడం కనిపించింది’’అని మారికో తెలిపింది. కాకపోతే పట్టణ ప్రాంతాలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలు మెరుగ్గా ఉండడం కంపెనీలకు కాస్తంత వెసులుబాటు ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ద్వితీయ ఆరు నెలల కాలంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్టు మారికో తెలిపింది. అధిక పంటల దిగుబడి, పండుగల సీజన్ సానుకూలిస్తుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావం వ్యాపారంపై క్యూ2లోనూ కొనసాగినట్టు డాబర్ వెల్లడించింది. దీంతో అన్ని విభాగాల్లో డిమాండ్ బలహీనంగా ఉందని తెలిపింది. పట్టణాలు, ఈ కామర్స్ వేదికల్లో మాత్రం విక్రయాలు రెండంకెల వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, పండుగల సీజన్ వల్ల రానున్న నెలల్లో విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. -
గూగుల్‌ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం!
పెనుముప్పుగా పరిణమిస్తోన్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ‘‘రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్’’ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ప్రపంచదేశాల్లోని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ మాటలను సీరియస్‌గా తీసుకుని ఆచరించేవారు తక్కువే. కానీ సామాజిక స్పృహ కలిగిన కొంతమంది మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి తమ వంతు సాయంగా సరికొత్త పరిష్కార మార్గాలతో ముందుకొస్తున్నారు. ఈ కోవకు చెందిన నేహా జైన్ టెక్ ఉద్యోగాన్నీ సైతం వదిలేసి మట్టిలో వేగంగా కలిసిపోయే బయోప్లాస్టిక్‌ను రూపొందిస్తోంది. సముద్ర నాచుతో తక్కువ ఖర్చుతోట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషిచేస్తోంది. ముంబైకి చెందిన నేహా జైన్ చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించేది. బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో జర్నలిజం పూర్తిచేశాక, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో గూగుల్‌లో ఉద్యోగం సంపాదించింది. ఐదేళ్లపాటు వివిధ విభాగాల్లో పనిచేసిన నేహకు ఇంకా ఏదో చేయాలన్న తపన. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఆలోచిస్తున్న నేహ ఓ రోజు..‘‘రోజురోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి నా వంతు సాయంగా ఏదైనా మార్పు కలిగించేదిగా చేయాలి’’ అని అనుకుంది. అదేవిధంగా∙పర్యావరణానికి హాని చేయని జీవనశైలిని అనుసరించాలనుకుంది. అందుకే 2011లో కారు కొనుక్కోవడానికి బదులు సైకిల్‌ను ఎంచుకుంది. ఇలా ఒక్కో వస్తువును వినియోగించే ముందు పర్యావరణానికి అనుకూలంగా ఉండేవే ఎంచుకోవడం మొదలు పెట్టింది. గూగుల్‌ను వీడి... ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి చక్కని పరిష్కారం చూపాలని గట్టిగా నిర్ణయించుకున్న నేహ.. 2018లో గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. వెంటనే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పటిష్టంగా ఉండే వాటికోసం పరిశోధించడం మొదలు పెట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడానికి అనేక తయారీ కంపెనీలను సంప్రదించింది. ‘‘ఫాస్ట్‌మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కోసం ప్లాస్టిక్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. కానీ అవన్నీ రీసైకిల్ కావడం లేదు’ అని గ్రహించి మట్టిలో కలిసిపోయే సరికొత్త ప్లాస్టిక్‌ను రూపొందించడం కోసం తీవ్రంగా అన్వేషించి సముద్ర నాచుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాలనుకుంది. ఈ ఆలోచన రాగానే 2020 జూలైలో ‘జీరోసర్కిల్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి సముద్ర నాచుతో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ తయారీ మొదలు పెట్టింది. సముద్రనాచు ఎందుకంటే... సముద్ర ఉపరితలంపై తొమ్మిదిశాతం సముద్రనాచు దట్టంగా పెరిగి ఉంటుంది. ఈ నాచు వాతావరణంలో 53 బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తొలగిస్తుంది’’ అని ముంబై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న బయాలజిస్టుల ద్వారా తెలుసుకుంది. ఈ నాచును పెంచడానికి ఎరువులుగానీ, క్రిమిసంహారకాలు గానీ వినియోగించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా, నీరు, భూమిని కూడా కేటాయించాల్సిన పనిలేదు. 30–40 రోజుల్లోనే పెరిగి వినియోగానికి అందుబాటులోకి వస్తుంది అని క్షుణ్ణంగా తెలుసుకుని ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగులలోని శిలీంధ్రాలను సేకరించి ఎండబెట్టి, పొడి చేసి ఆ పొడితో ప్లాస్టిక్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోని మత్స్యకారుల ద్వారా ఈ నాచుని సేకరించి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ తయారు చేస్తోంది. 20 లక్షలతో ప్రారంభమైన జీరోసర్కిల్ కంపెనీ నేడు సముద్ర నాచులతో పారదర్శకమైన ప్లా్లస్టిక్ బ్యాగ్‌లను తయారు చేస్తూ దూసుకుపోతుంది. సొంత ఆర్అండ్డీ బృందంతో కాలుష్యరహిత సరికొత్త బయోప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది నేహ. -
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్‌లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్‌ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్‌లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్‌ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్‌లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్‌లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్‌తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్‌లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్‌కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్‌తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్‌ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్‌కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్‌కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్‌లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్‌లోనే ఆకాశ్.. జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈషా, అనంత్‌లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్‌ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్‌ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్‌కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్‌కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
పుంజుకుంటున్న ఎఫ్ఎంసీజీ రంగం!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ జూన్ త్రైమాసికంలో మోస్తరు వృద్ధిని చూసింది. విలువ పరంగా వ్యాపారం 10.9 శాతం పెరిగింది. ఆహారేతర వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో తగినప్పటికీ.. మొత్తం మీద వినియోగం పెరగడం కలిసొచ్చింది. డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం మీద వినియోగం మళ్లీ పుంజుకుంటున్నట్టు పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్లో యూనిట్ పరిమాణం పెరిగిందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు తగ్గినట్టు వివరించింది. పరిమాణం పరంగా సానుకూల ధోరణి ఉండొచ్చని, దీనికితోడు ధరల ఆధారిత వృద్ధి కూడా ఉంటుందని అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో రెండంకెల వృద్ధి నమోదైనట్టు నీల్సన్ ఐక్యూ ఎండీ సతీష్ పిళ్లై (భారత్) చెప్పారు. గత ఐదు త్రైమాసికాలుగా రెండంకెల స్థాయిలో ధరల పెరుగుదలను చూస్తున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం, ఇతరస్థూల ఆర్థిక గణాంకాలను ప్రస్తావించారు. ఎఫ్ఎంసీజీలో ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదవుతుందని నీల్సన్ఐక్యూ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తోందని.. కొంత నిదానంగా అయినా గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగం పెరగొచ్చని అంచనా వేసింది. రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు జూన్ త్రైమాసికంలో విక్రయాల పరంగా వృద్ధిని నమోదు చేశాయి. చదవండి👉 'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో! -
'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో డిమాండ్ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్‌ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్డేటెడ్ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్ త్రైమాసిక అప్డేటెడ్ తొలి నివేదికలను వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యాపారం ఓకే... ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్ మాత్రం తమన కంపెనీకి భారత్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. వినియోగమంటే భయం ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే, వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్‌వైపు మళ్లడం, చిన్న ప్యాక్‌లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో ఆదాయాలు పరిమితం 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్ -
జ్యోతి ల్యాబ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 547 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండు ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి జ్యోతి ల్యాబ్స్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 159 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 191 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 15 శాతంపైగా వృద్ధితో రూ. 2,196 కోట్లను అధిగమించాయి. ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేరు బీఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 150 వద్ద ముగిసింది. -
మెటల్, ఎఫ్ఎంసీజీ నష్టాలు, సెన్సెక్స్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అలా రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 236 పాయింట్లు కోల్పోయి 54,052 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ముగిసాయి. తద్వారా నిఫ్టీ 16, 150 స్థాయి దిగువకు చేరింది. మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మ పవర్ రియల్టీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ ,హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గానూ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. -
ఐటీసీ డివిడెండ్ రూ. 6.25
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 12% వృద్ధితో రూ. 4,260 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 3,817 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15% పైగా బలపడి రూ. 17,754 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15% పెరిగి రూ. 12,632 కోట్లను దాటాయి. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. జులై 22–26 మధ్య డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. కంపెనీ ఫిబ్రవరిలోనూ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడం తెలిసిందే. విభాగాల వారీగా: ఐటీసీ క్యూ4 ఆదాయంలో సిగరెట్ల విభాగం నుంచి 10 శాతం అధికంగా రూ. 7,177 కోట్లు లభించగా.. ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి రూ. 4,149 కోట్లు సమకూరింది. ఇది 12 శాతం వృద్ధి. ఇక వ్యవసాయ సంబంధ బిజినెస్ మరింత అధికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 4,375 కోట్లను తాకింది. ఈ బాటలో హోటళ్ల ఆదాయం రూ. 105 కోట్లు జమ చేసుకుని రూ. 407 కోట్లను అధిగమించింది. పేపర్ బోర్డ్ అమ్మకాలు రూ. 1,656 కోట్ల నుంచి రూ. 2,183 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఐటీసీ నికర లాభం 16 శాతం పురోగమించి రూ. 15,243 కోట్లయ్యింది. 2020–21లో రూ. 13,161 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 23 శాతం జంప్‌చేసి రూ. 65,205 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు ఎన్ఎస్ఈలో 0.75 శాతం బలపడి రూ. 267 వద్ద ముగిసింది. -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
నంబర్ వన్‌పై రుచీ సోయా గురి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ పొజిషన్‌కు చేరాలని లక్షిస్తున్నట్లు పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ చీఫ్ బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేదతోపాటు అనుబంధ సంస్థ రుచీ సోయా ఇండస్ట్రీస్ టర్నోవర్ రూ. 35,000 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. రుచీ సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) ప్రారంభంకానున్న సందర్భంగా రామ్‌దేవ్ విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. రానున్న కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ నుంచి ఫుడ్ బిజినెస్‌ను విడదీసి లిస్టెడ్ కంపెనీ రుచీ సోయాలో విలీనం చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా రానున్న ఐదేళ్లలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగాలలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయాను టాప్ ర్యాంక్ కంపెనీగా నిలపాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌యూఎల్ రూ. 45,996 కోట్ల టర్నోవర్ సాధించినట్లు ప్రస్తావించారు. షేరుకి రూ. 615–650 గురువారం(24) నుంచి ప్రారంభమైన రుచీ సోయా ఎఫ్‌పీవో ఈ నెల 28న(సోమవారం) ముగియనుంది. షేరుకి రూ. 615–650 ధరల శ్రేణిలో ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 4,300 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా రుణరహితంగా మారాలని రుచీ సోయా ఆశిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,290 కోట్లు అందుకుంది. కాగా.. పతంజలి గ్రూప్‌లోగల పలు కంపెనీలను దశలవారీగా లిస్టింగ్ చేయనున్నట్లు రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేశాక పతంజలి గ్రూప్ నాన్‌ఫుడ్, సంప్రదాయ ఔషధాలు, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా 2019లో రుచీ సోయాను పతంజలి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌పీవో నేపథ్యంలో రుచీ సోయా షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 873 వద్ద ముగిసింది. -
బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!
న్యూఢిల్లీ: బిస్కెట్లు మొదలుకుని నూడుల్స్ వరకు పలు ప్యాకేజ్డ్ ఉత్పత్తుల రేట్లు మళ్లీ పెరగనున్నాయి. రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ విడత పెంపు 10 శాతం వరకూ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి క్రమానుగతంగా రేట్లను పెంచే యోచనలో ఉన్నాయి. ‘పరిశ్రమలో ధరలు 10–15 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం‘ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. ప్రస్తుతం కమోడిటీల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నందున.. రేట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పడం కష్టమేనని ఆయన చెప్పారు. పామాయిల్ రేటు లీటరుకు రూ.180కి ఎగియగా.. ప్రస్తుతం రూ.150కి తగ్గింది. అటు ముడిచమురు ధరలు బ్యారెల్‌కి 140 డాలర్లకు పెరిగినా.. మళ్లీ 100 డాలర్ల దిగువకి వచ్చాయి. అయినా ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయని షా పేర్కొన్నారు. ఆచితూచి నిర్ణయం.. కోవిడ్ అనంతరం ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో రేట్లను భారీగా పెంచే విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని షా చెప్పారు. క్రితం సారి కూడా కంపెనీలు ధరల పెంపు భారాన్ని పూర్తిగా వినియోగదారులపై బదలాయించకుండా కొంత మేర తామే భరించినట్లు వివరించారు. ‘అందరూ దాదాపు 10–15 శాతం మేర పెంపు గురించి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ముడి వస్తువుల ధరలు అంతకుమించి పెరిగిపోయాయి‘ అని షా చెప్పారు. పార్లే విషయానికొస్తే ప్రస్తుతానికి తమ వద్ద ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇతర ఉత్పత్తుల నిల్వలు తగినంత స్థాయిలో ఉన్నాయని, నెలా రెణ్నెల్ల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతోందని డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుశ్ జైన్ తెలిపారు. ‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, తత్ఫలితంగా ధరల పెంపు కారణంగా వినియోగదారులు తమ పర్సులను తెరవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల భారాన్ని అధిగమించేందుకు క్రమంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం‘ అని ఆయన చెప్పారు. ఇప్పటికే పెంపు.. హెచ్‌యూఎల్, నెస్లే ఇప్పటికే రేట్లను పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నందువల్ల అవి ధరలను సత్వరం పెంచగలుగుతున్నాయని పేర్కొన్నాయి.‘హెచ్‌యూఎల్, నెస్లే వంటి వాటికి ధరలను నిర్ణయించే విషయంలో కాస్తంత ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. కాఫీ, ప్యాకేజింగ్ మెటీరియల్స్ భారాన్ని అవి వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరో విడత 3–5 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అవనీష్ రాయ్ చెప్పారు. కొన్ని వర్గాల కథనాల ప్రకారం హెచ్‌యూఎల్, నెస్లే మొదలైన సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడం కోసం టీ, కాఫీ, నూడుల్స్ వంటి ఉత్పత్తుల రేట్లను ఇప్పటికే పెంచేశాయి. బ్రూ కాఫీ, బ్రూక్‌బాండ్ టీ మొదలైన వాటి రేట్లను హెచ్‌యూఎల్ పెంచింది. అలాగే నెస్లే ఇండియా కూడా తమ మ్యాగీ నూడుల్స్ రేటును 9–16 శాతం మేర పెంచింది. అటు పాల పౌడరు, కాఫీ పౌడర్ ధరను కూడా పెంచినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా వ్యయాలను కట్టడి చేసుకోవడం, ఆదా చేసుకోదగిన అంశాలపై కసరత్తు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఇంకా భారం పడుతుంటే దాన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వస్తోందని కంపెనీల వర్గాలు పేర్కొన్నాయి. -
మందగమనంలో ఎఫ్ఎంసీజీ!
న్యూఢిల్లీ: భారత ఎఫ్ఎంసీజీ రంగం మందగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2021లో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగం తగ్గుముఖం పట్టగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా క్షీణతను చూవిచూసినట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ ఐక్యూ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు కంపెనీలు ధరల పెంపును చేపట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లేలా చేసినట్టు పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకునేందుకు 2021లో వరుసగా మూడు త్రైమాసికాల్లో రెండంకెల స్థాయిలో ధరలను పెంచినట్టు తెలిపింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గిపోగా.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధికి బదులు క్షీణతకు దారితీసినట్టు పేర్కొంది. 2021 చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా విక్రయాలు మైనస్ 2.6 శాతంగా ఉన్నట్టు వివరించింది. ‘‘ఎఫ్ఎంసీజీ కంపెనీల విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంది. కరోనా రెండో విడత కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపించింది. గత డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ గణాంకాలను పరిశీలించినా గ్రామీణ మార్కెట్ల విక్రయాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ధరల పెంపు చిన్న తయారీ దారులపై ప్రభావం చూపిస్తుంది. అధిక వ్యయాలను వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితుల్లో రూ.100 కోట్లు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల అమ్మకాలు 13 శాతం తగ్గాయి’’ అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలియజేసింది. అదే సమయంలో మధ్యస్థ, పెద్ద కంపెనీలు స్థిరమైన పనితీరు చూపించినట్టు పేర్కొంది. గడిచిన రెండేళ్లలో కొత్తగా 8 లక్షల ఎఫ్ఎంసీజీ స్టోర్లు తెరుచుకున్నాయని.. ఇందులో సగం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అయినట్టు వెల్లడించింది. -
ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై
న్యూఢిల్లీ: డ్రై సెల్ బ్యాటరీలు, ఫ్లాష్లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. తాత్కాలిక ఎండీగా.. ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్‌ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్ గ్రూప్ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్ఎస్ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది. -
ఎవరెడీకి డాబర్ ఓపెన్ ఆఫర్
కోల్‌కతా: డ్రై సెల్ బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో పూర్తిస్థాయి యాజమాన్య నియంత్రణకు వీలుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు షేరుకి రూ. 320 ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 5.26 శాతం అదనపు వాటా కొనుగోలు ద్వారా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. పరిస్థితులను గమనిస్తున్నాం ఎవరెడీలో పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న డాబర్ కుటుంబంలోని మోహిత్ బర్మన్ కంపెనీ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీని దారిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలియజేశారు. ఎవరెడీ బ్రాండుకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీకి విలువ జోడింపును చేపడుతామని, తద్వారా బిజినెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలమని వ్యాఖ్యానించారు. ఎవరెడీ కొనుగోలులో డాబర్ ఇండియా ప్రత్యక్షంగా పాల్లొనకపోవడం గమనార్హం! ఎవరెడీ ప్రమోటర్లు బీఎం ఖైతాన్ కుటుంబం మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ రుణ చెల్లింపులకు, ఇతర రుణాలకుగాను కంపెనీ షేర్లను తనఖాలో ఉంచుతూ వచ్చారు. అయితే చెల్లింపుల్లో విఫలంకావడంతో రుణదాత సంస్థలు వీటిని విక్రయిస్తూ వచ్చాయి. దీంతో ఖైతాన్ వాటా 44 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డాబర్ ఇండియా షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 565కు చేరగా.. ఎవరెడీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 375 వద్ద ముగిసింది. -
మీరు ధరలు పెంచుతూ పోతే.. మేం చూస్తూ ఊరుకుంటామా ?
Packaged FMCG sales fall as prices rise: సబ్బులు, షాంపులు మొదలు ఇంట్లో వాడే అనేక వస్తువులను అందించే ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్స్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)లకు షాక్ తగిలింది. ద్రవ్యోల్బణం పేరుతో హిందూస్థాన్ యూనిలీవర్ వంటి బడా కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోయాయి. దీంతో ప్రజలు ఆయా ప్రొడక్టుల వాడకాన్ని తగ్గిస్తూ షాక్ ఇచ్చారు. నీల్సన్ తాజా సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. గత కొంత కాలంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు రూరల్ ఇండియాపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతాయి. ఎఫ్ఎంసీజీలో దేశంలోనే పెద్దదైన హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీకి రూరల్ ఇండియాలో మంచి పట్టుంది. రూరల్ ఇండియాను టార్గెట్ చేసి రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 ప్రైస్లలో అనేక వస్తువులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీ మార్కెట్ వాటాలో 30 శాతం రూరల్ ఇండియాలో ఉంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో వస్తువుల ధరలు పెంచకుండానే వస్తువు క్వాంటిటీ తగ్గించాయి. ఉదాహారణకి రూ.10 ధరకి 30 గ్రాముల టూత్ పేస్ట్ లభిస్తే..ధరలు పెంచకుండా రూ. 10 ధరకి 26 గ్రాముల పేస్టుని అందించాయి. పేస్టు పరిమాణం తగ్గడం వల్ల స్థూలంగా అమ్మకాల్లో మార్పు రాదని కంపెనీల అంచనా. కానీ రూరల్ ఇండియా ప్రజలు ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆశలకు గండి కొట్టారు. తాము కొనే పరిమణాం తక్కువైనా సరే అందులోనే సర్థుకుపోతున్నారు తప్పితే అధికంగా కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కంపెనీల స్థూల అమ్మకాల్లో స్పష్టమైన క్షీణత నమోదు అయ్యింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అనడానికి ఈ పరిణామం ఉదాహారణ అని.. ప్రజల చేతుల్లో మరింత సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోని పక్షంలో .. ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఎఫ్ఎంసీజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమ్మకాల్లో క్షీణత కనిపించినప్పటికీ స్థూలంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2021 క్వార్టర్ 4లో లాభాలు నమోదు చేశాయి. సర్ఫ్, సబ్బుల ధరలు పెరగడం వల్ల క్వార్టర్ 3తో పోల్చితే క్వార్టర్ 4లో హెచ్‌యూఎల్ 10.30 శాతం లాభాలను నమోదు చేసింది. అయితే వినిమయం తగ్గిపోతే ఈ లాభాలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆందోళన. మొత్తంగా ధరల పెంపు విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలు అసలుకే ఎసరు తెచ్చేలా మారాయి. చదవండి: -
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!
ముంబై: దేశంలోని అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఈ నెలలో తన సబ్బులు & డిటర్జెంట్ల(వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్) ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే సరుకుల ధరలను పెంచినట్లు సంస్థ తెలిపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచింది. ఈసారి అత్యధికంగా సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర పెరిగింది. దీని ధరను 20 శాతం పెంచడంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. పెరిగిన సరుకుల ధరలు: లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు పెరిగింది. పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు పెరిగింది. రిన్ బండిల్ ప్యాక్(నాలుగు 250 గ్రాముల బార్ల) ధరను రూ.72 నుంచి రూ.76కు పెంచింది. అలాగే, సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ను రూ.18 నుంచి రూ.19కు పెంచింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధరను రూ.30 నుంచి రూ.31కి, 1 కిలో ప్యాక్ ధరలను రూ.60 నుంచి రూ.62కు పెంచింది. హెచ్‌యుఎల్ భాటలో ఇతర కంపెనీలు.. లక్స్ సబ్బుల ధరలను కంపెనీ పెంచ లేదు. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతో జనవరిలో తన ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచనున్నట్లు అదానీ విల్మార్ గత నెలలో పేర్కొంది. పార్లే ప్రొడక్ట్స్ మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ధరలను పెంచింది. ఈ ఏడాది క్యూ4లో ధరలను పెంచవచ్చని డాబర్ ఇండియా డిసెంబర్ నెలలో తెలిపింది. కావింకేర్ తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను కూడా ఈ నెలలో 2-3 శాతం వరకు పెంచనుంది. ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరగడంతోనే ధరలను పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. (చదవండి: నాలుగు రోజుల్లో రూ.6.08 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..!) -
ఫుడ్ ప్రాసెసింగ్ మరింత పటిష్టం!
న్యూఢిల్లీ: ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార ఉత్పత్తుల పరిశ్రమ) రంగాన్ని దేశంలో మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రాయితీలను ప్రకటించింది. ఈ విభాగంలో దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలు సహా మొత్తం 60 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. జాబితాలో పార్లే, డాబర్, బ్రిటానియా, నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), అమూల్ తదితర కంపెనీల దరఖాస్తులున్నాయి. రెడీ టు ఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్నవి), రెడీ టు కుక్ (స్వల్ప సమయంలోనే ఉండుకుని తినేవి), పండ్లు, కూరగాయలు, మెరైన్, మొజరెల్లా చీజ్ విభాగాల కింద ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 91 దరఖాస్తులు రాగా, అందులో 60కి ఆమోదం తెలిపింది. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా చేసే ఉత్పత్తిపై ఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అనుమతులు సంపాదించిన ఇతర ముఖ్య కంపెనీల్లో అవంతి ఫ్రోజన్ ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ప్రతాప్ స్నాక్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్, ఎంటీఆర్ ఫుడ్స్ ఉన్నాయి. పెద్ద పరిశ్రమగా అవతరిస్తుంది భారత్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దీర్ఘకాలంలో పెద్ద పరిశ్రమగా అవతరించేందుకు పీఎల్ఐ పథకం సాయపడుతుందని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అభిప్రాయపడింది. ఉద్యోగ కల్పనలో తాము కీలక పాత్ర పోషిస్తామని దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పెద్ద పరిశ్రమగా అవతరిస్తుందని పార్లే ఆగ్రో ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్‌షా అన్నారు. మెరుగైన యంత్రాలు, ప్లాంట్ల ఏర్పాటుకు ఈ పథకం వీలు కల్పిస్తుందని.. అంతర్జాతీయంగా గొప్ప భారత బ్రాండ్లు అవతరిస్తాయన్నారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు పోటీపడగలవంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా కూడా ఇదే మాదిరి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ కల్పనతోపాటు దేశీయంగా భారీ ఉత్పాదకతకు పీఎల్ఐ పథకం సాయపడుతుందున్నారు. పీఎల్ఐ పథకం భారత్‌లో రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చేదోడుగా నిలుస్తుందని.. పండ్లు, కూరగాయల విభాగంలో ప్రోత్సాహకాలకు ఎంపికైన నెస్లే ఇండియా పేర్కొంది. -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
సెన్సెక్స్ @ 59,000
స్టాక్ మార్కెట్లో బుల్ దూకుడు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో గురువారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఆయా రంగాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర లార్జ్‌క్యాప్ షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. సెన్సెక్స్ తొలిసారి 59,000 శిఖరాన్ని అధిరోహించి 417 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 481 పాయింట్లు ర్యాలీ చేసి 59,204 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 125 పాయింట్లు ర్యాలీ చేసి 17,645 వద్ద కొత్త తాజా గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 110 పాయింట్ల లాభంతో 17,629 వద్ద నిలిచింది. గడచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 963 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, మెటల్, మీడియా షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1622 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.168 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలహీనపడి 73.52 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించిన వార్తతో బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లు రాణించడంతో ఎన్ఎస్ఈలోని నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ ఐదున్నర శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3%, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రెండుశాతం ర్యాలీ చేశాయి. రెండోరోజూ టెలికం షేర్ల లాభాల మోత టెలికాం రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగ షేర్లు రెండురోజూ రాణించాయి. వోడాఫోన్ ఇంట్రాడేలో 28 శాతం లాభపడి రూ.11.47 స్థాయికి చేరింది. చివరికి 26 శాతం లాభంతో రూ.11.25 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్‌లో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.744 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం శాతంతో రూ.718 వద్ద స్థిరపడింది. మార్కెట్ క్యాప్‌లో ఐదో స్థానానికి భారత్ సూచీలు వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.4.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టస్థాయి రూ.260 లక్షల కోట్లకు చేరింది. విలువపరంగా భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరినట్లు బీఎస్ఈ సీఈవో అశిష్ చౌహాన్ తెలిపారు. సన్సార్ ఐపీఓకు మంచి స్పందన... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరిరోజు నాటికి 11.47 రెట్ల సబ్స్రై్కబ్షన్ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా... 13.88 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 26.47 రెట్లు, నాన్ – ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 11.37 రెట్లు, రిటైల్ విభాగంలో 3.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.382 కోట్లను సమీకరించింది. సెపె్టంబర్ 21న పరాస్ డిఫెన్స్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సెపె్టంబర్ 21న ప్రారంభం కానుంది. ఇదే నెల 23న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. సెన్సెక్స్ 57వేల నుంచి 58వేల స్థాయికి చేరేందుకు మూడురోజుల ట్రేడింగ్ సమయాన్ని తీసుకోగా.., 58 వేల నుంచి 59 వేల స్థాయికి చేరుకొనేందుకు ఎనిమిది ట్రేడింగ్ సమయాన్ని తీసుకుంది. -
HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు
ఇప్పటికే పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్రూమ్ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్ ఇవ్వనున్నాయి. పామ్ ఆయిల్ ఎఫెక్ట్ సబ్బు తయారీలో పామ్ ఆయిల్ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్ ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. యూనీలీవర్ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. గ్రాముల్లో తగ్గింపు ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్ యూనిలీవర్ మొగ్గుచూపుతుండగా సాచెట్స్, తక్కువ ధరకు లభించే ఐటమ్స్ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది. చదవండి: ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!! -
అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్ సంస్థలు..!
కోవిడ్-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్-19 రాకతో ఫాస్ట్ మూవింగ్ కస్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్డౌన్లు పలు ఆన్లైన్ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలపై మొగ్గుచూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ నిల్సన్ఐక్యూ పేర్కొంది.కోవిడ్ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్ అమ్మకాలు 96 శాతంగా ఉండగా కోవిడ్ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 52 మెట్రో నగరాల్లో ఎఫ్ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్ఎమ్సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సమీర్ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు ఈ-కామర్స్ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్ 9 శాతం, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్ఐక్యూ పేర్కొంది. -
ఉడాన్ మెగా భారత్ సేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఆన్లైన్ వేదిక ఉడాన్ మెగా భారత్ సేల్ ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇది కొనసాగనుంది. ఎఫ్ఎంసీజీ, ఆహారోత్తుల విభాగంలో చిన్న వర్తకుల కోసం భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్, ఇన్స్టాంట్ క్యాష్ డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్‌తోపాటు ఇతర ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 5 లక్షల పైచిలుకు వర్తకులకు ఈ భారీ అమ్మకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. వివిధ వ్యాపార విభాగాల్లో గడిచిన 18 నెలల్లో రూ.4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు చేసినట్టు ఉడాన్ వెల్లడించింది -
గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ విక్రయాలు డౌన్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా ఉండకపోవచ్చంటూ విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రకటించింది. కరోనా రెండో దశ కారణంగా జూన్ త్రైమాసికంలో ఎన్నో సవాళ్లను చూశామని.. పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ విక్రయాలు నిదానించొచ్చని ఈ సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పట్టణ మార్కెట్లలో విక్రయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్నాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఒకే మాదిరి విక్రయాలు ఉండొచ్చని విప్రో కన్జూమర్‌కేర్ అంచనా వేసింది. పామాయిల్ ధరలు కాస్త శాంతించడంతో సంతూర్ సబ్బుల ధరలు పెరుగుతాయని భావించడం లేదని తెలిపింది. సబ్బుల తయారీలో పామాయిల్‌ను ముడిపదార్థంగా ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది మార్చి, జూన్‌లో రెండు పర్యాయాలు మొత్తం మీద 8 శాతం వరకు సబ్బుల ధరలను విప్రో కన్జూమర్ పెంచడం గమనార్హం. ఆన్లైన్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు జోరుగా నడుస్తుండడంతో.. ఈకామర్స్ కోసమే ఉత్పత్తులను తీసుకురానున్నట్టు విప్రో తెలిపింది. ఆన్లైన్లో పెరిగిన విక్రయాలు ఇక ముందూ కొనసాగుతాయని అంచనా వేస్తున్నట్టు విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ ఈడీ వినీత్ అగర్వాల్ తెలిపారు. ‘‘గతంలో మాదిరి కాకుండా ఈ విడత గ్రామీణ ప్రాంతాలు సైతం కరోనాతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కనుక అమ్మకాల్లో వృద్ధి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకేలా ఉండొచ్చు. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో విప్రో 17.3 శాతం వృద్ధిని నమోదు చేసింది’’ అని అగర్వాల్ వివరించారు. -
టాటా కన్జూమర్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ..టాటా కన్జూమర్ నాలుగో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నష్టాల నుంచి బయటపడి రూ. 74 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 122 కోట్ల నికర నష్టం నమోదైంది. దేశీయంగా అమ్మకాల పరిమాణం రెండంకెల వృద్ధిని సాధించడం ప్రభావం చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం ఎగసి రూ. 3,037 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.05 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. క్యూ4లో దేశీ ఆహారం, పానీయాల విభాగాలలో 20 శాతంపైగా పురోగతిని అందుకున్నట్లు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గ్రూప్ సీఎఫ్‌వో ఎల్.కృష్ణకుమార్ పేర్కొన్నారు. నాన్‌బ్రాండెడ్ బిజినెస్ టాటా కాఫీ ప్లాంటేషన్ సైతం పటిష్ట పనితీరు చూపడం ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. టాటా కన్జూమర్ గతంలో టాటా బెవరేజెస్‌గా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. కాగా.. క్యూ4లో మొత్తం వ్యయాలు 29 శాతం పెరిగి రూ. 2,818 కోట్లను తాకాయి. విభాగాల వారీగా దేశీయంగా పానీయాల విభాగం 60 శాతం జంప్‌చేసి రూ. 1,205 కోట్లను తాకగా.. ఫుడ్ బిజినెస్ 22 శాతం పుంజుకుని రూ. 642 కోట్లకు చేరింది. వీటిలో సాల్ట్ అమ్మకాలు 17 శాతం, సంపన్ విభాగం ఆదాయం 26 శాతం చొప్పున ఎగసింది. అయితే అంతర్జాతీయ పానీయాల బిజినెస్ యథాతథంగా రూ. 875 కోట్లుగా నమోదైంది. టాటా స్టార్‌బక్స్ ఆదాయం 14 శాతం బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి టాటా కన్జూమర్ నికర లాభం రెట్టింపై రూ. 930 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 11,602 కోట్లకు చేరింది. టాటా కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం బలపడి రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 655–638 మధ్య ఊగిసలాడింది. -
కరోనా ఎఫెక్ట్: హెల్త్, హైజీన్ ఉత్పత్తులకు డిమాండ్
న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్, హైజీన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. శానిటైజర్లు, క్రిమిసంహారకాలు, చేతులు కడిగేందుకు వాడే లిక్విడ్స్ అమ్మకాలు అధికముయ్యాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని ఐటీసీ, హిమాలయ డ్రగ్స్, పతంజలి తెలిపాయి. రెండు మూడు నెలల క్రితం వీటి వాడకం తగ్గింది. కోవిడ్-19 కేసులు పెరగడంతో ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తమ హైజీన్ ఉత్పత్తులకు విపరీత డిమాండ్ వచ్చిందని ఐటీసీ పర్సనల్ కేర్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ సతీపతి తెలిపారు. సామర్జ్యాలను పెంచామని హిమాలయ డ్రగ్ కంపెనీ కరిన్దూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ డైరెక్టర్ రాజేశ్ కృష్ణమూర్తి వెల్లడించారు. డిమాండ్ అమాంతం పెరగడంతో సరఫరా విషయంలో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు పతంజలి తెలిపింది. అయితే ఇది తాత్కాలికమేనని, ఉత్పత్తులను క్రమబద్దీకరించామని సంస్థ ప్రతినిధి ఎస్.క.తిజారావాలా వివరించారు. ఎవరూ ఊహించని విధంగా కోవిడ్ కేసులు పెరిగాయని అన్నారు. సబ్బులు, మాస్కులు, క్లీనింగ్ ఉత్పత్తుల వంటి హైజీన్ ప్రొడక్ట్స్ డిమాండ్ అధికమైంది. కోవిడ్-19 కేసులు వచ్చిన తొలి నాలుగు నెలల్లో శానిటైజర్ల కోసం జనం ఎగబడ్డారు. దీంతో మద్యం, పెయింట్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు దీని తయార్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. చదవండి: కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ -
మరొ లాక్డౌన్ రాక ముందే కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏవైనా అంతరాయాలు తలెత్తితే వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2020లో లాక్డౌన్ కారణంగా తయారీ, సరఫరా సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరుకు నిల్వలను పెంచుకుంటున్నాయి. అలాగే సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. రోజువారీ కోవిడ్–19 కేసులు దేశంలో ఒక లక్ష మార్కును దాటిన సంగతి విధితమే. సమీపంలో నిల్వ కేంద్రాలు.. ఆకస్మికంగా ఏర్పడే స్థానిక లాక్డౌన్, అనిశ్చితి నుంచి గట్టెక్కడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇమామి డైరెక్టర్ హర్హ వి అగర్వాల్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, తయారైన, ముడి సరుకు, ప్యాకేజింగ్‌కు ఉపయోగించే పదార్థాలను నిల్వ చేసుకోవడం ద్వారా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నట్టు చెప్పారు. సాధ్యమైనంత వరకు విక్రయ ప్రాంతానికి సమీపంలో నిల్వ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. గతేడాది పాఠాల నేపథ్యంలో సరఫరా సమస్యలను తగ్గించడానికి కాల్ సెంటర్, వాట్సాప్ ద్వారా ఆర్డర్ బుకింగ్స్‌ను పెంచామని డాబర్ ఇండియా సేల్స్ ఈడీ ఆదర్శ్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ప్రభావితమయ్యే ప్రాంతాల్లోని పంపిణీదార్లకు, దుకాణాలకు సరఫరాను అధికం చేశామని చెప్పారు. అంచనా వేయలేం.. కిరాణా దుకాణాల కోసం సరుకు నిల్వలను తగిన స్థాయిలో నిర్వహిస్తున్నట్టు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ అరవింద్ మెదిరట్ట వెల్లడించారు. ఆన్లైన్లో ఆర్డర్లు ఇవ్వడానికి వీలుగా ఈ–కామర్స్ యాప్ సైతం అందుబాటులో ఉందని చెప్పారు. స్థానికంగా లాక్డౌన్స్ ఎప్పుడు, ఎంత కాలం ఉంటాయో అంచనా వేయలేమని, సరఫరా అడ్డంకులూ ఉంటాయని చెప్పలేమని గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు నిల్వలు చేసుకుంటున్నట్టు చెప్పారు. చదవండి: ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో ఆన్లైన్ జోరు! -
తొలుత జూమ్.. తుదకు ఫ్లాట్
ముంబై: రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే విదేశీ మార్కెట్ల ప్రభావంతో చివర్లో అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 50,441 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 14,956 వద్ద స్థిరపడింది. రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కదిలాయి. తొలి గంటలో సెన్సెక్స్ 667 పాయింట్లు జంప్‌చేసి 50,986ను తాకింది. తదుపరి ఆసియా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ బలహీనపడటంతో వెనకడుగు వేసింది. చివరి అర్ధగంటలో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 50,318 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 15,111–14,920 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. కాగా.. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేయడంతో తొలుత సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ డీలా ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు 1.6–0.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే రియల్టీ 1 శాతం, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, గెయిల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, యాక్సిస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ 7–1.5 శాతం మధ్య ఎగిశాయి. ఈ బాటలో పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఆర్ఐఎల్, సిప్లా సైతం 1.2–0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బ్రిటానియా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.2–0.5 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్‌అండ్‌వో ఇలా... డెరివేటివ్ విభాగంలో పీఎఫ్సీ, ఐఆర్సీటీసీ, గ్లెన్‌మార్క్, ఎన్ఎండీసీ, నాల్కో, భెల్, టొరంట్ పవర్, సెయిల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, జీ, కమిన్స్ ఇండియా 4.6–3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క అపోలో టైర్, టీవీఎస్ మోటార్, ముత్తూట్ ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, ఇండిగో, పేజ్, ఎంఫసిస్, బాటా 3.2–1.8 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.3–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 2,014 కోట్ల అమ్మకాలు చేపట్టడం గమనార్హం! -
రెండోరోజూ తడబాటే..!
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు. కొనసాగిన ఒడిదుడుకులు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
రికార్డుల ర్యాలీకి బ్రేక్..!
ముంబై: మార్కెట్లో వరుస రికార్డుల ర్యాలీకి గురువారం విరామం పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల ఏడురోజుల సుదీర్ఘ ర్యాలీ ఆగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో నీరసించి రూపాయి విలువ వంటి అంశాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 144 పాయింట్లు నష్టపోయి 45,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్లను కోల్పోయి 13,478 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలోనూ ఎఫ్ఎంసీజీ షేర్లు ఎదురీదాయి. మెటల్, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 418 పాయింట్ల వరకు నష్టపోయి 45,686 స్థాయి వద్ద, నిఫ్టీ 130 పాయింట్లను కోల్పోయి 13,399 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఇటీవల జరిగిన బుల్ ర్యాలీలో భారీగా లాభపడిన బ్యాంకింగ్, చిన్న, మధ్య తరహా షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ గరిష్టస్థాయిల వద్దే సూచీలు ట్రేడ్ అవుతున్న తరుణంలో జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ప్రతికూల సంఘటన జరిగితే లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందని వారంటున్నారు. వరుసగా రెండురోజులు లాభపడిన రూపాయి గురువారం 9 పైసలు నష్టపోయి 73.66 వద్ద స్థిరపడింది. సిమెంట్ షేర్లకు సీఐఐ షాక్... కాంపిటీటివ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పలు సిమెంట్ కంపెనీలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో గురువారం ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంబుజా సిమెంట్స్ 2 శాతం నష్టంతో రూ.248 వద్ద, ఏసీసీ 1.50 శాతంతో 1,632 వద్ద ముగిశాయి. ఆగని ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం... దేశీ ఈక్విటీల్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. నగదు విభాగంలో గురువారం రూ.2260 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ నెల 15 నుంచి మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ బ్రెడ్డు, బిస్కెట్లు తయారు చేసే మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 15 నుంచి ప్రారంభం కానున్నది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్‌కు ధరల శ్రేణి (ప్రైస్‌బాండ్)ని రూ.286–288గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 28న ఈ షేర్లు లిస్టవుతాయి. ఐపీఓలో రూ. 40.54 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. -
ర్యాలీకి బ్రేక్- 46,000 దిగువకు సెన్సెక్స్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు తాజాగా బ్రేక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు క్షీణించి 45,960 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు కోల్పోయి 13,478 వద్ద స్థిరపడింది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,686 దిగువన, నిఫ్టీ 13,399 వద్ద కనిష్టాలకు చేరాయి. రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1.6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ 3 శాతం ఎగసింది. రియల్టీ 0.4 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 11.5 శాతం కుప్పకూలగా.. అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, గెయిల్, ఐషర్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ 3.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, హెచ్‌యూఎల్ 4.2-2.4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎల్అండ్టీ 1.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. పీఎస్‌యూ షేర్లు వీక్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, రామ్‌కో సిమెంట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 4.4-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బంధన్ బ్యాంక్, గోద్రెజ్ సీపీ, టాటా కన్జూమర్, డీఎల్ఎఫ్, డాబర్ 5-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,665 క్షీణించగా..1241 లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ల బౌన్స్‌బ్యాక్- ప్రయివేట్ బ్యాంక్స్ స్పీడ్
ముందురోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తొలుత కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ తదుపరి దశలో జోరందుకున్నాయి. చివరివరకూ లాభాల బాటలో సాగాయి. సెన్సెక్స్ 377 పాయింట్లు జంప్‌చేసి 40,522 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 11,889 వద్ద స్థిరపడింది. అయితే తొలుత 39,978 వరకూ నీరసించిన సెన్సెక్స్ ఒక దశలో 40,556 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,899- 11,723 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనంకావడంతో తొలుత ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు నవంబర్ సిరీస్‌కు ఎఫ్‌అండ్‌వో పొజిషన్లను రోలోవర్ చేసుకోవడం కూడా ప్రభావం చూపినట్లు తెలియజేశారు. మీడియా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 3.2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఆటో 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ 1.2-0.7 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా.. నెస్లే, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, దివీస్, సిప్లా, ఎల్అండ్టీ, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6-2 శాతం మధ్య పురోగమించాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, గెయిల్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఐటీసీ, సన్ ఫార్మా 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎంఆర్ఎఫ్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఆర్ఎఫ్, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్, జీ, టాటా కన్జూమర్, ముత్తూట్ ఫైనాన్స్, ఐజీఎల్, అంబుజా, అశోక్ లేలాండ్, ఆర్ఈసీ, రామ్‌కో, దివీస్, పిడిలైట్, అమరరాజా, కంకార్ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీవీఆర్, సెయిల్, యూబీఎల్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఇండిగో, టొరంట్ ఫార్మా, ఐబీ హౌసింగ్ 4-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-0.6 శాతంమధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,282 లాభపడగా.. 1,372 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 119.4 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఒడిదొడుకుల మధ్య- ఎఫ్ఎంసీజీ అప్
ముందురోజు నమొదైన భారీ అమ్మకాల నుంచి కోలుకుంటూ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 97 పాయింట్లు తక్కువగా 40,048కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 11,747 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,291- 39,978 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటం, సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సోమవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. గురువారం అక్టోబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్, రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్ 1.4- 0.6 శాతం మధ్య డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, ఐవోసీ, ఎస్బీఐ, గెయిల్, టాటా మోటార్స్, యాక్సిస్, ఇన్ఫోసిస్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే కొటక్ బ్యాంక్ 6 శాతం జంప్‌చేయగా.. ఎన్టీపీసీ, శ్రీసిమెంట్, నెస్లే, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 2-0.7 శాతం మధ్య బలపడ్డాయి. డెరివేటివ్స్ తీరిలా ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఆర్బీఎల్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, టొరంట్ పార్మా, బంధన్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ఐడియా, బీవోబీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎల్ఐసీ హౌసింగ్, పీఎన్బీ, అపోలో టైర్, పీవీఆర్ 3.3-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. ఏసీసీ, జీ, ఇన్ఫ్రాటెల్, కాల్గేట్, ఎంఆర్ఎఫ్, కోఫోర్జ్, పిడిలైట్ 3-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.6 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,072 నష్టపోగా.. 639 లాభాలతో కదులుతున్నాయి. -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,974 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిమాండ్ పుంజుకుంటోందనడానికి సూచనగా కంపెనీ లాభాలు, ఆదాయాలు పెరిగాయి. క్యూ2లో హెచ్‌యూఎల్ రూ. 1,974 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,818 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 9 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో అమ్మకాలు రూ. 9,931 కోట్ల నుంచి సుమారు 16 శాతం పెరిగి రూ. 11,510 కోట్లకు పెరిగాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ మొత్తం వ్యయాలు రూ. 7,885 కోట్ల నుంచి రూ. 9,054 కోట్లకు చేరాయి. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. ‘సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ మేం లాభదాయక వృద్ధి నమోదు చేశాం. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేయడం కొనసాగిస్తాం‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. గడ్డు పరిస్థితులు గట్టెక్కినట్లేనని వ్యాఖ్యానించారు. తమ కార్యకలాపాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓ మోస్తరుగానే ఉందని మెహతా చెప్పారు. విభాగాలవారీగా చూస్తే.. ఫుడ్, రిఫ్రెష్మెంట్ వ్యాపార విభాగం అమ్మకాలు క్యూ2లో దాదాపు 83 శాతం ఎగిశాయి. హోమ్‌కేర్, సౌందర్య .. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు మళ్లీ కోవిడ్ పూర్వ స్థాయికి చేరాయి. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్‌కి చెందిన హెల్త్ డ్రింక్స్ (హార్లిక్స్ మొదలైనవి) కూడా పోర్ట్‌ఫోలియోలో చేరడం సంస్థ ఆదాయాలకు ఊతమిచి్చంది. హార్లిక్స్‌తో కలిపితే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధి నమోదు చేసింది. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు స్వల్ప నష్టంతో రూ. 2,172 వద్ద ముగిసింది. -
కుప్పకూలిన మార్కెట్లు- ఐటీ ఎదురీత
తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 38,137ను తాకగా.. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 11,322 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990- 38,073 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,535- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు డీలా పడ్డాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ క్షీణించగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. మెటల్, మీడియా, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3.7-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, సిప్లా, నెస్లే, ఐవోసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఎంఅండ్ఎం, జీ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ ద్వయం, విప్రో 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐబీ హౌసింగ్ పతనం.. డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్ 13 శాతం కుప్పకూలగా.. జిందాల్ స్టీల్, గ్లెన్‌మార్క్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, మదర్సన్, పిరమల్, బయోకాన్, బాలకృష్ణ, ఆర్బీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, టాటా పవర్, పీఎఫ్సీ, సెయిల్, టొరంట్ ఫార్మా, డీఎల్ఎఫ్ 8.5-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, అపోలో హాస్పిటల్స్ మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో1969 నష్టపోగా..653 లాభాలతో కదులుతున్నాయి. -
ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది. సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది. -
కన్జూమర్ ఎంఎన్‌ఎసీలూ వర్క్‌ఫ్రం హోమే
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలన్నీ (ఎంఎన్సీ) వర్క్‌ఫ్రం హోంకే మొగ్గుచూపుతున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తున్నప్పటికీ కోవిడ్ కేసులు పెరుగతుండడంతో ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయమని ఎంఎన్‌సీలు చెబుతున్నాయి. కోకోకోలా, పెప్సికో, నెస్లే, ఎల్జీ, రెకిట్ బెంక్‌సెర్ కంపెనీల ఇండియా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయమని చెబుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 10 శాతం సిబ్బందితో జూన్ 8 నుంచి ప్రైవేటు కార్యాలయాలు తెరవచ్చని అనుమతులు ఇచ్చినప్పటికీ, హిందుస్థాన్ యూనీలీవర్, పీఅండ్ జీ కంపెనీ కార్యాలయాలు ఎప్పుడు తెరవాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.మూడు దశల్లో ఉద్యోగులను అనుముతించేందుకు హెచ్‌యూఎల్ ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) కేంద్రంగా పనిచేస్తోన్న ఎల్జీ, పెప్సికో, నెస్లే, రెకిట్ బెంక్‌సెర్, ఆమ్వే కంపెనీలు వర్క్ ఫ్రం హోంకే మద్దతునిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూతపడిన ఐఫోన్ కార్యాలయాలు సైతం ఈ నెలలో తెరవనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నెస్లే ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ..తమ కంపెనీ సిబ్బందిలో ఎక్కువమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమైన పనులు నిర్వహించేందుకు మాత్రమే అత్యవసరాన్ని బట్టి కొంతమంది ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ తమ కంపెనీ సిబ్బందిని రెండు బ్యాచ్‌లుగా విభజించి, ఒక బ్యాచ్ వారం రోజులు ఆఫీసుకు వస్తే మరో రెండు వారాలు ఆ బ్యాచ్ ఇంటి వద్ద ఉండాలి. ఈ సమయంలో రెండో బ్యాచ్ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇక మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో జూన్15 వరకు వర్క్‌ఫ్రంహోంకు కొనసాగింపుకు అనుమతిస్తుంది. -
కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు
సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా అవతరించింది. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ మెగా ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది. రూ. 3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలుకు బోర్డు అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది. దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. (దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు) కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి ఎఫ్ ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిసాయి. అయితే ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. మంగళవారం నాటి మార్కెట్ లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. చదవండి: బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే -
బుల్‌చల్!
కార్పొరేట్ ట్యాక్స్ కోత లాభాలు వరుసగా రెండో రోజూ, సోమవారం కూడా కొనసాగాయి. పన్ను కోత కారణంగా బాగా ప్రయోజనం పొందే ఆర్థిక, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి భారీ లాభాలను సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకాయి. జీఎస్టీ మండలి సానుకూల నిర్ణయాలు కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ఉన్నా, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న ఈ వారంలో స్టాక్ సూచీలు బలంగా ట్రేడవడం విశేషం. ఇంట్రాడేలో 1,426 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1,075 పాయింట్లు లాభపడి 39,090 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 326 పాయింట్లు పెరిగి 11,600 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.8 శాతం చొప్పున ఎగిశాయి. ఇక గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 2,996 పాయింట్లు(8.3 శాతం), నిఫ్టీ 895 పాయింట్లు(8.36 శాతం) చొప్పున లాభపడ్డాయి. రెండు రోజుల్లో ఈ రెండు సూచీలు ఇంత భారీగా లాభపడటం ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. సాంకేతిక అవరోధాలు కారణంగా ముగింపులో చివరి పదినిమిషాల పాటు ఎన్ఎస్ఈ ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, యుటిలిటీస్, పవర్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్ల మేర పెరిగాయి. పన్ను కోత.. లాభాల మోత... కార్పొరేట్ ట్యాక్స్‌ను (సెస్‌లు, సర్‌చార్జీలు కలుపుకొని) కేంద్రం 34.9 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు వర్తించే మూలధన లాభాల పన్నుపై అదనపు సర్‌చార్జీని కూడా కేంద్రం తొలగించింది. అలాగే షేర్ల బైబ్యాక్‌పై పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. ఇక 37వ జీఎస్టీ మండలిలో వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను కంపెనీ తీసుకుంది. ఈ సానుకూల నిర్ణయాల వరదలో స్టాక్ మార్కెట్ లాభాల సునామీలో తడిసి ముద్దవుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ కోత కారణంగా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని సెంట్రమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ దేవాంగ్ మెహతా చెప్పారు. ఈ లాభాల నేపథ్యంలో కంపెనీలు ధరలను తగ్గించి డిమాండ్ పెంచేలా చేసి అమ్మకాలను పెంచుకుంటాయని పేర్కొన్నారు. లేదా వాటాదారులకు డివిడెండ్లు పంచడమో, మూలధన పెట్టుబడులను పెంచుకోవడమో చేస్తాయని, ఎలా చూసినా రేట్ల కోత కంపెనీలకు సానుకూలమేనని వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల లాభాలు పెరిగే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► నిఫ్టీ 50లోని 32 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ► హోటల్ రూమ్ టారిఫ్‌లపై జీఎస్టీని తగ్గించడంతో హోటల్ షేర్లు దుమ్ము రేపాయి. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 20 శాతం, రాయల్ ఆర్చిడ్ హోటల్స్ 16 శాతం, ఇండియన్ హోటల్స్ కంపెనీ 8 శాతం, ఐటీసీ 7 శాతం, హోటల్ లీలా వెంచర్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ఒక్క రాత్రి బసకు రూ.7,500 ధర ఉండే హోటల్ రూమ్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. రూ.7,500కు మించిన టారిఫ్‌లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయింది. సోమవారం ఈ షేర్ 10 శాతం నష్టంతో రూ.272 వద్ద ముగిసింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ విక్రయించిందన్న వార్తలతో ఈ షేర్ ఈ స్థాయిలో పడిపోయింది. ► ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం వచ్చే మార్చికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలతో బీపీసీఎల్ షేర్ 13% లాభంతో రూ.454 వద్ద, కంటైనర్ కార్ప్ షేర్ 6.4% లాభంతో రూ.585 వద్ద ముగిసింది. ► క్యూఐపీ మార్గంలో రూ.12,500 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 6.8 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. ► మార్కెట్ లాభాల ధమాకాలోనూ, 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాఫీ డే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ప్రొవొగ్, యాడ్‌ల్యాబ్స్.. ఈ జాబితాలో ఉన్నాయి. టార్గెట్లు పెరిగాయ్... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర చర్యల కారణంగా కంపెనీల లాభాలు జోరందుకుంటాయని విశ్లేషకులంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్, నిఫ్టీ టార్గెట్లను వివిధ బ్రోకరేజ్ సంస్థలు పెంచాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా సెన్సెక్స్45,000 పాయింట్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి నిప్టీ 12,300–13,300 రేంజ్‌కు చేరగలదని యూబీఎస్, 13,200 పాయింట్లకు ఎగుస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొన్నాయి. ఆల్‌టైమ్ హైకి బాటా... స్టాక్ మార్కెట్ జోరు కారణంగా పలు షేర్లు వాటి వాటి జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, డీ–మార్ట్(అవెన్యూ సూపర్ మార్ట్స్), హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఓల్టాస్, కాల్గేట్ పామోలివ్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
సబ్బుల ధరలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గించాయి అంతంత మాత్రంగానే ఉన్న అమ్మకాలను పెంచుకోవడం లక్ష్యంగా హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ కంపెనీలు తమ తమ సబ్బుల ధరలను తగ్గించాయి. సబ్బుల తయారీలో ఉపయోగపడే పామ్ఆయిల్ ధరలు తగ్గడం కూడా కలసిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.. హెచ్‌యూఎల్ గత నెలలోనే లక్స్, లైఫ్‌బాయ్ ధరలను తగ్గించగా... సంతూర్ సబ్బుల ధరలను విప్రో తాజాగా తగ్గించింది. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
ఐటీసీ లాభం 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల పనితీరు బలంగా ఉండటమే మెరుగైన ఫలితాలకు కారణం. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల విభాగంపై ఒత్తిళ్లు కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల విభాగం వారీగా రూ.2,932 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆయిల్ సీడ్స్, గోధుమ, కాఫీ, అగ్రి వ్యాపారాల్లో స్థూల ఆదాయం అధికంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. పేపర్ బోర్డ్స్ విభాగంలో అధిక అమ్మకాల ఆదాయం, హోటల్స్ వ్యాపారంలో రూమ్ వారీగా ఆదాయంలోనూ మెరుగుదల ఉందని పేర్కొంది. రాణించిన అన్ని విభాగాలు సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.8,759 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.7,988 కోట్లు కావడం గమనార్హం. సిగరెట్ల విభాగం ద్వారా ఆదాయం రూ.4,936 కోట్ల నుంచి రూ.5,486 కోట్లకు వృద్ధి చెందింది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల ఆదాయం రూ.3,051 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగింది. ఎఫ్ఎంసీజీ కాకుండా ఇతర విభాగాల ద్వారా (పేపర్, హోటళ్లు తదితర) ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి 4,148 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.52,035 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12,824 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,485 కోట్లు, ఆదాయం రూ.49,520 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. ఐటీసీ చైర్మన్‌గా సంజీవ్ పూరి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ‘ఐటీసీ’కి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ పూరి నియమితులయ్యారు. సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈయన్ను సీఎండీగా నియమించినట్లు.. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) హఠాన్మరణంతో సంజీవ్ పూరిని చైర్మన్‌గా నియమిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. సీఎండీ స్థానంలో తొలిసారిగా మాట్లాడిన సంజీవ్ పూరి.. ‘ఈ నూతన పదవిని నాకు దక్కిన ప్రత్యేక అధికారం, గౌరవంగా భావిస్తున్నా. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో బలమైన సంస్థగా ఎదిగిన ఐటీసీని మరింత బలపరచడం నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. 2015లో బోర్డు సభ్యునిగా నియమితులైన సంజీవ్.. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటీ కాన్పూర్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,538 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,538 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.1,351 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల్లో వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. అమ్మకాలు రూ.9,003 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.9,809 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.13 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. ఎబిటా మార్జిన్ 23.3 శాతం...: దేశీయ కన్సూమర్ వ్యాపారం 9 శాతం, అమ్మకాలు 7% చొప్పున పెరిగాయని మెహతా వివరించారు. ఎబిటా(నిర్వహణలాభం) 13 శాతం వృద్ధితో రూ.2,321 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్ 23.3 శాతంగా నమోదైందని తెలిపారు. గ్రామీణ మార్కెట్లో కొంత మందగమనం ఉన్నా, ముడి చమురు, కరెన్సీ వ్యయాల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నా గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని సంజీవ్ మెహతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు ఈడీల నియామకం...: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.5,237 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.6,036 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. అమ్మకాలు రూ.34,619 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.37,660 కోట్లకు పెరిగాయని వివరించారు. కాగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అనురాధ రజ్దాన్, వైభవ్ సంజ్‌గిరిలను నియమించామని కంపెనీ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,693 వద్ద ముగిసింది. -
వెలుగులో ఎఫ్ఎంసీజీ షేర్లు
* 164 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ * నిఫ్టీ 46 పాయింట్లు అప్ ముంబై: టోకు ద్రవ్యోల్బణం పెరగడం, రుతుపవనాల జాప్యంకావొచ్చన్న అంచనాలు వంటి ప్రతికూలాంశాల నడుమ ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం స్టాక్ సూచీలు పెరిగాయి. ట్రేడింగ్ ఆరంభంలో బ్యాంకింగ్ షేర్లలో జరిగిన అమ్మకాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 25,352 పాయింట్ల స్థాయికి తగ్గినప్పటికీ, ముగింపులో వేగంగా కోలుకుంది. చివరకు 164 పాయింట్ల పెరుగుదలతో రూ. 25,653 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,772 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యి, 46 పాయింట్ల ప్లస్‌తో 7,861 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ర్యాలీ... దేశంలోకి రుతుపవనాల రాక వారం రోజులు ఆలస్యం కావొచ్చంటూ వాతావరణ శాఖ అంచనాల్ని ప్రకటించినప్పటికీ, ఆశ్చర్యకరంగా ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 329.30 వద్ద ముగిసింది. ఇదే రంగానికి చెందిన మరో దిగ్గజ కంపెనీ హిందుస్థాన్ యూనీలీవర్ 1.7 శాతం ఎగిసింది. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్‌లు 0.5-1.6 శాతం మధ్య పెరిగాయి. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ లాబ్ 2.5 శాతం, టుపిన్ 1.2 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం 1.7 శాతం వరకూ పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్ల పతనం.. భారీ మొండి బకాయిల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడిస్తున్న ఫలితాలు దారుణంగా ఉండటంతో ఆ షేర్లలో తీవ్ర అమ్మకాలు జరిగాయి. గత శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఐదు పీఎస్‌యూ బ్యాంకులు నష్టాల్ని కనపర్చాయని, దాంతో ఈ కౌంటర్లలో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపినట్లు బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అన్నింటికంటే అధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 8.4 శాతం పతనమై రూ. 142.30 వద్ద ముగిసింది. ఎస్బీఐ 4.17 శాతం క్షీణించగా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆలహాబాద్ బ్యాంక్, పీఎన్బీ, ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 3-6 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు రెండు ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు నూతన గరిష్టస్థాయిల్ని అందుకోవడం విశేషం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.7 శాతం పెరిగి రూ. 1,163 వద్ద ముగియగా, యస్ బ్యాంక్ 3 శాతం ర్యాలీ జరిపి రూ. 980 వద్ద క్లోజయ్యింది. ఈ రెండు షేర్లూ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం.