Kamareddy District Latest News
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నందుకే ఘాతుకం.. బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్: వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు.. ‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కా రణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. కాగా, దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. -
ఈవీఎంల హ్యాకింగ్చాలా సులభం
uమొదటి పేజీ తరువాయిపెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల సాఫ్ట్వేర్ ఉత్తమం కాదు.. ‘‘ఈవీఎంలను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఇకా చాలా తేలిగ్గా హ్యాక్ చేయవచ్చు. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. అయితే కంప్యూటర్లు ఓటింగ్ ట్యాబ్‌లేషన్‌ను కలిగి ఉండకూడదు. ఈవీఎంల్లో వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఉత్తమమైనది కాదు. ఎన్నికల్లో పేపరు బ్యాలెట్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి వ్యక్తి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి లైన్లో నిలబడి ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి’’అని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంల ద్వారా భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఎలన్ మస్క్ వ్యాఖలు మరోసారి చర్చకు దారి తీశాయి. ఈవీఎంల ద్వారా కాకుండా పారదర్శకత కోసం బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ అభ్యర్థి గెలిచేలా రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చు ఈవీఎంల పనితీరుపై ఎలన్ మస్క్ తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలో కాలం చెల్లిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారని, దీంతో వీటిని హ్యాక్ చేయడం అత్యంత సులభమని, ఈ విషయాన్ని ఒక టెక్నాలజీ నిపుణుడిగా చెబుతున్నట్లు జూలైలో మస్క్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో సెనేట్ ఇంటెలిజెన్స్ విచారణలో ఈ విషయం బయటపడిందని, ఓ అభ్యర్థి గెలిచే విధంగా ఓట్లను దొంగిలిస్తూ ఈవీఎంలను రీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సహా మరే విధంగానూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిని వినియోగించకూడదని మస్క్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
ఇదేమి రాజ్యం బాబూ?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జి ల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రో లు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు. ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘‘దిశ’’కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళలు భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘‘దిశ’’యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘‘దిశ’’ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘‘దిశ’’కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ?. ఎక్స్ వేదికగా నిలదీసిన వైఎస్ జగన్ శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కారు దారుణ వైఫల్యం బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు బద్వేలులో విద్యార్థినిపై పెట్రోలు పోసి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం ఉంది బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ దిశ యాప్ తెచ్చి 31,607 మందికి రక్షణ కల్పించాం + బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదుసార్లు కదిపినా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం.. పోలీసులు నిమిషాల్లో చేరుకునేలా చర్యలు తీసుకున్నాం + 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? -
సన్నాలకు తెగుళ్లు.. రైతుల బేజారు
నిజామాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే క్రమంలో తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్నరకం ధాన్యానికి ఆకుముడత, అగ్నితెగులు, కొలికి, కాటిక, లద్దెపురుగు, కాండంతొలిచె పురుగులు ఆశించడంతో మందుల పిచికారీ చేసినా ఫలితం కనిపించడం లేదు. రూరల్ మండలంలో దాదాపు 12,900 ఎకారల్లో సన్నరకం ధాన్యం(బీపీటీ) 5204 రకంను రైతులు సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పదిహేను రోజులు అయితే పంటచేతికి వచ్చే తరుణంలో సన్నరకానికి తెగుళ్లు రావడంతో రైతుల పాలిట శాపంగా మారింది. పెట్టుబడి భారం పెరిగినా.. ఇప్పటికే అన్నదాతలు రూరల్ మండలంలో సాగుచేస్తున్న సన్నరకానికి మూడు, నాలుగు సార్లు క్రిమిసంహారక మందులు(ఫెస్టిసైడ్స్) పిచికారీ చేశారు. దీనికి తోడు సన్నరకం నాటు వేసినప్పటి నుంచి నాలుగుసార్లు కాంప్లెక్స్ ఎరువులు చల్లారు. మితిమిరిన పెట్టుబడితో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ అధికారిణి జాదవ్ హీరా పంటలను పరిశీలించి, తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలు గూర్చి రైతులకు వివరించారు. తెగుళ్ల నివారణకు పాటించవల్సిన జాగ్రత్తల గూర్చి అవగాహన సదస్సులను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సన్నరకం వేసిన రైతన్నలకు పెట్టుబడి భారం పెరిగి పంటను దక్కించుకోవాలనే తాపత్రయంతో అన్నదాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ దోమపోటుకు మందులు వాడుతున్నారు. ప్రస్తుతం సన్నరకం ధాన్యం ధర బాగా పలుకుతుందని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ పంటకు తెగుళ్లు ఆశించడంతో వారి ఆశ నిరాశ అవుతుందా మరీ పెట్టిన పెట్టుబడి వస్తుందా అనే సంశయంలో ఉన్నారు. ఇప్పటికే పలు దఫాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీ ç³…r ^ól†-Mö^óla çÜÐ]l$Ķæ$…ÌZ ˘ అన్నదాతల ఆందోళన -
తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్‌కు చెందిన 26 ఏళ్ల మధిర సహానా ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు. కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్‌పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు.. తమ కుమార్తైపె నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతు న్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమార్తెను బతికించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన కుటుంబ సభ్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలలో వెంటిలేటర్‌పై బాధితురాలు -
ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్
మద్నూర్(జుక్కల్): పీహెచ్సీలో కొనసాగుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతోంది. ప్రభు త్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నప్పటికి సరైన అవగాహన లేక పలువురు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పాలై ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డోంగ్లీ మండల కేంద్రంలో ప్రభు త్వం 2023 మార్చిలో ప్రారంభించింది. జిల్లాలో కేవలం కొన్ని పీహెచ్సీలలో మాత్రమే ఆరోగ్య మహిళ కా ర్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. కార్యక్రమం ప్రారంభమైన 19 నెలల్లో 4,102 మంది మహిళలు సేవలు పొందినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటి వరకు 1,178 మంది మహిళలకు ల్యాబ్ టెస్ట్‌లు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం 90 మంది మహిళలకు ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లు వైద్యులు చెప్పారు. మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో వైద్య సేవలు దొరక్క మహిళలు ఇబ్బందులు పడేవారు. పలువు రు మహిళలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పురుషులైన వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి గతంలో ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి డోంగ్లీ పీహెచ్సీలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఉంటుంది. మహిళా వై ద్య నిపుణుల పర్యవేక్షణలో అనారోగ్యం బారిన ప డిన మహిళలకు బీపీ, షుగర్, రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్, నెలసరి, థైరాయిడ్, మూత్రకోశ సంబంధిత తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వైద్య పరీక్షల అనంతరం సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం పీహెచ్సీలో సేవలు 19 నెలల్లో 4,102 మందికి పరీక్షలుప్రతి మంగళవారం పరీక్షలు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా పీహెచ్సీలో ప్రతి మంగళవారం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మ హిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైతే మె రుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాం. మహిళలు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న నాణ్యమైన, ఉచిత సేవలను వినియోగించుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – శ్రీలేఖ, వైద్యురాలు, డోంగ్లీవైద్య సేవలు బాగున్నాయి ఆరోగ్య మహిళ పేరుతో ఆస్పత్రిలో మహిళలకు ప్రత్యే కంగా వైద్య సేవలు అందించడం ఈ ప్రాంత మహిళల కు ఎంతో మేలు జరుగుతుంది. వైద్యం అందక ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పక్కన ఉన్న మహారాష్ట్రకు వెళ్లే వాళ్లం. కాని ఆరోగ్య మహిళ మొదలైనప్పటి నుంచి ఇక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించడం బాగుంది. – అనిత, డోంగ్లీ -
వరి పంట కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బాల్కొండ: ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోతకు వ చ్చింది. దీంతో అక్కడక్కడ వరి పంట కోతలు ప్రారంభించారు. వరి పంట కోతలో, ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాల్కొండ వ్యవసాయ శాఖ అధికారి బద్దం లావణ్య వివరించారు. వరి చేనును కర్రపచ్చి మీద కోత కోయాలని, కోసిన చేనును పనలుగా పొలంలోనే 4–5 రోజు లు ఎండనివ్వాలని సూచించారు. నూర్చిన ధాన్యా న్ని చక్కగా ఎగరబోసి, శుభ్రపరిచి, బాగా ఎండబెట్టి ఆ తర్వాత నిల్వ చేయాలన్నారు. విత్తనం కోసం నిల్వ చేస్తే ధాన్యంలో తేమ శాతం చాలా ము ఖ్మని, తేమ శాతాన్ని 12 వరకు తగ్గించాలని అన్నా రు. ఎండని ధాన్యాన్ని నిల్వ చేస్తే ముక్కి పోయి తినడానికి పనికి రావని, అంతే గాక ముక్కు పురుగు, వడ్ల చిలుక, నూసి పురుగు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయన్నారు. గింజలో తేమ శాతం 12–13కు తగినంతగా ఆరబెట్టాలని, నిల్వ చేసే సాధనాలను శుభ్రపరిచి, పగుళ్లుంటే పూడ్చి, లోపల బయట సున్నము వేయడము లేద పేడ, ఎర్రమన్ను కలిపి అలికి ఎండబెట్టి ఉంచుకోవాలన్నారు. విత్తనాల కోసం గాని, తినడానికి గాని ధాన్యాన్ని, బియ్యాన్ని గోనే సంచుల్లో నిల్వ చేయడం మంచిదని, నిల్వ చేయబోయే గోనె సంచులను ముందుగా 10 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి ఎండబెట్టి ఉంచాలన్నారు. గోదాములను 10 శాతం మలాథియా న్ ద్రావణముతో పిచికారీ చేసిన తర్వాత బస్తాల్లో ధాన్యాన్ని నిల్వ చేయాలని పేర్కొన్నారు. ధాన్యం నిల్వ చేసే కొట్టాలు, భూమికి 4–5 అడుగుల ఎత్తులో కట్టాలని, మెట్లు పెట్టకూడదని, కిటీకిలకు ఇనుపమెష్ బిగించాలన్నారు. బస్తాల్లో నిల్వ చేసేటప్పుడు గోడలను తగులకుండా బస్తాలను పెట్టాలని, అడుగున నేల తగలకుండా చెక్కలు అమర్చి చెమ్మపట్టకుండ పాలిథీన్ షీటు పరవాలని సూచించారు. కొట్టులో ధాన్యం వేడెక్కడం గమనిస్తే వెంటనే ఆరబెట్టాలన్నారు. తక్కువ పరిమాణంలో ని ల్వ చేసినప్పుడు వేపాకు, వేపగింజల పొడి, నూరిన వెల్లుల్లి వసపొడి, సీతాఫలం గింజల పొడి 1–2 శాతం ధాన్యంలో కలిపితే కీటకాల బెడద తగ్గుతుందన్నారు. ఎలుకలు సంచరించకుండ బోనులు పెట్టి లేదా విషపు ఎరలు పెట్టి వాటిని నిర్మూలించాలని పేర్కొన్నారు. వరిలో అదనపు విలువ గల ఉత్పత్తులకు.. ఎగుమతికి అనుకూలమైన మంచి నాణ్యత కలిగిన రకాలను సాగుకు ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నా రు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మరియు అభివృద్ధికి ప్రోత్సహించు విధంగా ధాన్యపు పొట్టు లేదా తవుడు నుంచి రైస్‌బ్రాన్ నూనె ఉత్పత్తి చేయవచ్చన్నారు. ధాన్యంతో పేలాలు, బియ్యంతో అటుకులు తయారు చేయవచ్చని పేర్కొన్నారు.నాగంపేట్లో కోతకు వచ్చిన వరి -
అయోమయంలో అన్నదాతలు
బాల్కొండ : వానాకాలం సీజన్లో సాగు చేసిన మక్క, సోయా పంటలు చేతికి వచ్చాయి. యాసంగి పంటల సాగు కోసం రైతులు దుక్కి దున్ని భూములను సిద్ధం చేసుకున్నారు. సాధారణంగా యాసంగిలో అధికంగా ఎర్రజొన్న, తెల్లజొన్న సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం జొన్న పంటకు ధర తక్కువగా ఉన్నట్లు వ్యాపారులు ప్రచారం చేశారు. కొన్ని గ్రామాల్లో ఒప్పంద పత్రాలను కూడా రాసుకుంటున్నారు. గతంలో క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.ఐదు వేల వరకు ధర పలకగా ప్రస్తుతం క్వింటాలుకు రూ.3 వేలు అని ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు జొన్న సాగు చేయడానికి ఆలోచిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం వానాకాలంలో మక్క దిగుబడి అధికంగా వచ్చింది. ధర కూడా క్వింటాల్‌కు రూ.2,300పైనే పలికింది. దీంతో కొంతమంది రైతులు యాసంగిలో కూడా మక్క వేయాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మక్క వేస్తే వచ్చే వానాకాలంలో ఆ నేలలో పసుపు వేయడానికి అనువుగా ఉండదు. ఎర్రజొన్నలతో తిప్పలే.. ఎర్రజొన్న సాగు చేసినప్పటి నుంచి విక్రయించే వరకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటున్న వ్యాపారులు తీరా పంట చేతికొచ్చాక తిరకాసు పెడుతున్నారు. ప్రస్తుత సంవత్సరం క్వింటాలుకు రూ.3 వేల ధర ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. కానీ జొన్న పంటకు శ్రమ, నీటి అవసరం తక్కువగా ఉంటుంది. నూర్పిడి చేయడం సులభం. దీంతో రైతులు ఏ పంట వేయాలా అని ఆలోచిస్తున్నారు. దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన నేల యాసంగిలో సాగు చేసే ఆరుతడి పంటలపై సందిగ్ధం జొన్న, మక్క పంటల సాగుపై తేల్చుకోలేకపోతున్న రైతన్నరైతులు తేల్చుకోలేక పోతున్నారు ఆరుతడి పంటలసాగు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏ పంట సాగు చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. జొన్న పంటకు ధర బాగా తగ్గించారు. ఎర్ర జొన్న వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టి చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. – బుల్లెట్ రాంరెడ్డి, రైతు నాయకుడు అర్థం కావడం లేదు యాసంగికి ఏ పంటను సాగు చేయాలో అర్థం కావడం లేదు. ఎర్ర జొన్నల ధరలను తగ్గించారు. దీంతో మక్క వేయాలనుకుంటున్నాం. కానీ భూమిలో తకాతు మొత్తం పోతది. మళ్ల ఏడాది పసుపు పంట మంచిగా కాదు. ఎటు అర్థంకాక పంటను వేయడం లేదు. – నడ్కుడ నర్సయ్య, రైతు -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
ఖలీల్‌వాడి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శుక్రవా రం అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఏడాది వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటనను పోలీసు లు ఛేదించారు. భిక్షాటన కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న రాత్రి మద్నూర్‌కు చెందిన లక్ష్మి భర్త రాజు పిల్లలతో కలిసి జీజీహెచ్ పరిసరాల్లో నిద్రించారు. రాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు మహిళలు బాలుడిని కిడ్నాప్ చేశారు. శనివారం ఉదయం బాలుడు కనిపించకపోవడంతో తండ్రి రాజు ఒకటో టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలతో జీజీహెచ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం పోలీసులు వివరాలను సేకరించి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ముగ్గురు మహిళలు అంజుమ్ బేగంతో ఆమె పదేళ్ల కుమార్తె, దుర్గ ప్రభురావుబా మోహితాలు జీజీహెచ్‌లో తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న బాలుడిని ఎవరికీ అనుమానం రాకుండా కిడ్నాప్ చేశారు. మొదటగా వీరు రైలు ద్వారా మహారాష్ట్ర వెళ్దామని అనుకున్నా రైలు ఆలస్యంగా వస్తుందని తెలుసుకొని బోధన్ గుండా మహారాష్ట్ర వెళ్దామనుకొని ఆటోలో ఎక్కారు. వీరు బోధన్ రోడ్డులోని ఓ ప్రాంతంలో దిగి నాందేడ్‌కు వెళ్లేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులకు అందిన సమాచారం మేరకు వారు అక్కడికి చేరుకొని అంజుబేగం, మోహితాలను అదుపులోకి తీసుకుని, బాలుడిని రక్షించారు. వారిని విచారించగా బాలుడిని భిక్షాటన కోసం కిడ్నాప్ చేసినట్లు నేరం అంగీకరించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కేసులో తీవ్రంగా కృషి చేసిన ఏఎస్సై షకీల్, కానిస్టేబుళ్లు గంగారాం, అనూష, కెర్బాజీ, రాములును జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం వేర్వేరు కారణలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులు భరించలేక మహిళ, పెళ్లి కావడం లేదని యువకుడు, వ్యక్తిగత కారణాలతో వాగులో దూకి మరొకరు, రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిజాంసాగర్: తాళికట్టిన భర్త తనువు చాలించగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలం కొడిచర గ్రా మానికి చెందిన కె స్వరూప(34)కు గాంధారి మండలం ముదెల్లి గ్రామానికి చెందిన మొగులయ్యతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అరుణ్సందేశ్, ఇషాంత్ ఉన్నారు. ఇషాంత్ గర్భంలో ఉన్నప్పుడు మొగులయ్య మృతిచెందా డు. భర్త మృతితో స్వరూప వ్యవసాయ కూలీ పను లు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. కూలీ పను లకు వెళ్తున్న సమయంలో మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అరవింద్ అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి సహ జీవనానికి దారితీసింది. అతని మాటలు నమ్మి స్వరూప ఇద్దరు పిల్లలతో కలిసి మహమ్మద్‌నగర్‌కు వచ్చి కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. అరుణ్సందేశ్ ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతుండగా చిన్నకుమారుడు ఇషాంత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల నుంచి అరవింద్ స్వరూపను బెల్ట్‌తో కొడుతున్నట్లు చిన్నకుమారుడు ఇషాంత్ పోలీసులకు తెలిపారు. అరవింద్ వేధింపులు తాళలేక స్వరూప ఉదయం చిన్న కుమారుడు ఇష్టాంత్కు అన్నం తినిపించి బయటకు పంపించింది. కొద్దిసేపటికి స్వరూప అద్దె ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్వరూపకు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అరవింద్ ఇంటికి వచ్చి చూడగా ఆత్మహత్య చేసు కొని ఉండడంతో స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసు కొచ్చి అరుగుపై పడుకోబెట్టి అరవింద్ పారిపోయా డు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిజాంసాగర్ ఎస్సై సుధాకర్, బాన్సువాడ రూ రల్ సీఐ రాజేశ్, బాన్సువాడ టౌన్ సీఐ అశోక్‌తో పాటు పిట్లం, బీర్కూర్, జుక్కల్, పెద్దకొడప్గల్ మండలాల ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్వరూప మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తమ కుమార్తె మృతికి బాధ్యుడిపై చర్యలు తీసుకొని ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని ముదెల్లి, కొడిచెర గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేస్తామని స్థానికులు ముందుకు రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి కుదరడం లేదని యువకుడు.. భిక్కనూరు: పెళ్లి కుదరడం లేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాసుల సంతోష్ (26) వ్యవసాయం చేసుకుంటు జీవిస్త్నన్నాడు. కొంత కాలంగా పెళ్లి చేసుకునేందుకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా అవి సఫలం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై పేర్కొన్నారు. మారంపల్లిలో.. డొంకేశ్వర్: నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన మేతరి అశోక్(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అశోక్ తిరిగి రాలేదు. ఆదివారం డొంకేశ్వర్ మండల పరిధిలోని మారంపల్లి బ్రిడ్జి వాగు వద్ద స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మరణించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి.. ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి–ఉప్పల్వాయి ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఉప్పల్వాయి రైల్వే గేటు ప్రాంతంలో మృతదేహం ఉన్న ట్లు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 30–40ఏళ్ల మధ్య ఉంటుందని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712658591, 9493451642 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి
కామారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పాముకాటుతో ఒకరు, బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లింగంపేట: పాముకాటుతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన లింగంపేట మండలంలోని అయిలాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లయల గంగవ్వ(70) సాయంత్రం ఇల్లు ఊడుస్తుండగా పాము కాటువేసింది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాంధారి మండలంలో.. గాంధారి: బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం నాగ్లూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌రావు(42) పద్మాజీవాడి ఎక్స్ రోడ్డు నుంచి బైక్‌పై గాంధారి వైపు వస్తుండగా గాంధారి సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద కోదాడకు చెందిన లారీ వరి ధాన్యం కోసం వెళ్తుండగా ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న భాస్కర్‌రావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ సైదులును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ హోంగార్డు.. ఖలీల్‌వాడి: మద్యం మత్తులో యాసిడ్ తాగిన హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆరోటౌన్ ఎస్సై వెంకట్రావు ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సారంగాపూర్‌కు చెందిన చిన్నయ్య(39) జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న మద్యం మత్తులో యాసిడి తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కూతురును అరెస్టు చేశామంటూ బెదిరింపులుకామారెడ్డి క్రైం: మీ కూతురు డ్రగ్స్ కేసులో పట్టుబడిందని, ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్తున్నామని ముంబై పోలీసుల పేరిట సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి బెదిరింపు కాల్ చేసి డబ్బులు కాజేయాలని యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలోని గురురాఘవేంద్ర కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన రవికిరణ్కుమార్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో మీ కుమార్తెను అరెస్టు చేసి తీసుకెళ్తున్నామని, రూ. లక్ష తాము పంపించిన నంబర్‌కు పంపకపోతే ఆమె మీకు దక్కదంటు బెదిరించారు. ఫేక్ కాల్ అని గుర్తించిన రవికిరణ్ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. అతని కుమార్తె క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఎస్‌హెచ్‌వో సూచించారు. పేకాట స్థావరాలపై పోలీసుల దాడిపెద్దకొడప్గల్: మండల కేంద్రంతో పాటు విఠల్వాడి గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్టు చేయగా వీరి నుంచి రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. వేల్పూర్‌లో చైన్ స్నాచింగ్వేల్పూర్: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోతె గ్రామానికి చెందిన చింతలపల్లి రాజు అనే మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయినట్లు ఎస్సై నాగ్నాథ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపల్లి రాజు పడగల్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద బస్సు కోసం వేచి ఉంది. అంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో నుంచి బంగారు చైన్‌ను లాక్కొని మెట్పల్లి వైపు పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గెమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలుర, బాలికల జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాము, అశోక్, సురేష్, సుజాత, నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజేత జట్టుకు అభినందన నిజామాబాద్‌నాగారం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 షటిల్ బాడ్మింటన్ బాలుర విభాగంలో గెలిచిన క్రీడాకారులను క్రీడల కార్యదర్శి నాగమణి ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీలు ఆఫీసర్క్లబ్లో నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మిథున్, ఆదాం, సాత్విక్, మిథున్ కు అభినందనలు తెలిపారు. -
అటవీ భూమి హాంఫట్
సిరికొండ: ఆక్రమణదారుల భూదాహానికి అడవులు నేలమట్టమవుతున్నాయి. రూ. లక్షలు వెచ్చించి పెంచిన పచ్చని మొక్కలను కల్టివేటర్లతో దున్నేస్తున్నారు. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమార్కులు అటవీ భూములను హాంఫట్ చేస్తున్నారు. అడవులను యథేచ్ఛగా నరికేస్తూ పోడు పట్టాల పేరిట చదును చేపడుతున్నారు. ఇదంతా అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే అడవులు అంతరించిపోతున్నాయని, మామూళ్ల మత్తులో కబ్జాదారులకు అటవీ అధికారులు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముషీర్‌నగర్, కొండాపూర్, జంగిలోడి తండా పరిధిలోని మెట్టు తండా, న్యావనంది, జినిగ్యాల, పందిమడుగు, దుప్య తండా, పాకాల, తూంపల్లి, సిరికొండ అటవీ ప్రాంతాల్లో అడవుల ఆక్రమణ నిరాటంకంగా కొనసాగుతోంది. సిరికొండ అటవీ రేంజ్ పరిధిలో సిబ్బంది కొరత ఉండటంతో అడవులపై నిఘా కొరవడింది. దీన్ని అలుసుగా తీసుకొని రాత్రి వేళల్లో పొక్లెయిన్లు, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్లతో అడవులను చదును చేస్తున్నారు. మండలంలోని ముషీర్‌నగర్, కొండాపూర్, గడ్కోల్ బీట్లు సిరికొండ రేంజ్ పరిధిలో కాకుండా 25 కిలోమీటర్ల దూరాన ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్నాయి. 2016లో రేంజ్‌ల పునర్విభజన సమయంలో వాటిని సమీపంలో ఉన్న సిరికొండ రేంజ్లో కాకుండా ఇందల్వాయి రేంజ్లో కలిపారు. కొండాపూర్, ముషీర్‌నగర్ అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో అడవులను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ముషీర్‌నగర్ అటవీ ప్రాంతంలో పదిహేను రోజుల వ్యవధిలో అటవీ భూమిని చదును చేసిన ఆనవాళ్లున్నాయి. మెట్టుమర్రి తండా జీపీకి చెందిన పల్లె ప్రకృతి వనంలో పెంచిన చెట్లను తొలగించి భూమిని కబ్జా చేస్తున్నారు. అటవీ భూముల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో కాంటూరు కందకాలను తవ్వించారు. కబ్జాదారులు వాటిని కూడా పూడ్చివేసి అటవీ భూమిని కబ్జా చేసి చదును చేస్తున్నారు. పోడు పట్టాల పేరిట గుట్టలపై ఉన్న ప్రాంతంలో చెట్లను నరికేసి భూములను చదును చేస్తున్నారు. అటవీ భూములను నిరాటంకంగా నరికేసి చదును చేస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం కొసమెరుపు. అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అడవులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. సిరికొండలోని పలు గ్రామాల్లో కబ్జాల పర్వం పట్టించుకోని అటవీ శాఖ అధికారులుతనిఖీలు చేపడతాం ముషీర్‌నగర్, కొండాపూర్ అటవీ ప్రాంతాల్లో అడవుల నరికివేత మా దృష్టికి రాలేదు. సిబ్బందిని పంపించి తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం. – రవిమోహన్‌భట్, అటవీశాఖ అధికారి, ఇందల్వాయి -
ప్రతి ఇంటా బీజేపీ సభ్యత్వం చేయించాలి
కామారెడ్డి టౌన్: నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి బీజేపీ సభ్యత్వం చేయించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది ప్రాథమిక సభ్యత్వం చేస్తేనే క్రియాశీల సభ్యత్వానికి అర్హులని అన్నారు. ప్రతి బూత్‌కి వంద మంది చొప్పున సభ్యత్వం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో దశకి పూర్తి కావస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ సుపరిపాలన ప్రజలకు వివరించి జాతీయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరితో సభ్యత్వం చేయించాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్, నాయకులు శ్రీధర్, రమేష్, రంజిత్, సురేష్, అనిల్, ఆనందరావు, రవీందర్, రఘు, రజినీకాంత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేవీఆర్ -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట విద్యార్థులు
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేట విద్యార్థులు కమ్మరి నీరజ్, కొంపల్ల శీర్షికలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ భాస్కర్ రెడ్డి తెలిపారు. అండర్–17 విభాగంలో వచ్చే నెల 3న మహబూబ్‌నగర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆదివారం పాఠశాల సిబ్బంది ఎంపికై న విద్యార్థులను అభినందించారు. హెచ్ఎం రామ్ మనోహర్ రావు, సిబ్బంది విద్యాసాగర్ రెడ్డి, సునీల్‌రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సౌజన్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టీఎస్పీటీఏ నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(టీఎస్పీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దుబాసి నరేందర్, ప్రధాన కార్యదర్శిగా లింబాద్రి, గౌరవ అధ్యక్షుడిగా అనిల్ పటేల్, ఉపాధ్యక్షులుగా విజయ్, సంగయ్య, కార్యదర్శిగా శ్రీను, కార్యవర్గ సభ్యులుగా సతీష్, శ్యాంరావు, యేసురత్నం, మోహన్, సుధారాణిలను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు అన్నారు. ట్రాక్టర్స్ యూనియన్ కార్యవర్గం రాజంపేట: మండల కేంద్రంలో ట్రాక్టర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆంద్యాల రమే ష్, అధ్యక్షుగాగా కట్లెకుంట్ల సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా సల్ల నవీన్, కోశాధికారిగా ఆకుల రాజు, సహాయ కోశాధికారిగా ఇమ్రాన్ అలీ, సలహాదారులుగా బోయిని ఆంజనేయులు, పిట్ల నర్సింలు ఎన్నికయ్యారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
బాన్సువాడ: బాన్సువాడ మాత శిశు సంరక్షణ ఆస్పత్రిలో కొనసాగుతున్న తాత్కాలిక షెడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందున ఓపీ సేవలకు ఇబ్బందులు తలెత్తడడంతో రోగుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఏరియా ఆస్పత్రి భవనాన్ని కూల్చివేసి కొత్త భవన నిర్మాణ పనులు చేపడుతుండడంతో అప్పటి వరకు మాత శిశు ఆస్పత్రిలో తాత్కాలిక షెడ్డు వేసి వైద్య సేవలందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఖలేక్, ఎజాస్, నార్ల సురేష్, దాసరి శ్రీనివాస్ ఉన్నారు. పరామర్శ బాన్సువాడ రూరల్: బోర్లం క్యాంపునకు చెందిన జాస్తి సీతారత్నం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి మృతురాలి కుమారుడు విజయ్‌కుమార్(ఎన్ఆర్ఐ)ను పరామర్శించారు. -
కేసీఆర్ ఒక్కడే దీక్ష చేస్తే రాష్ట్రం రాలేదు
నిజామాబాద్ అర్బన్: కేసీఆర్ ఒక్కడే దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారని, కొందరు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో కోదండరాం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను అణిచివేశారన్నారు. కేసీఆర్ పదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, తన ఒక్కడితోనే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ఎంతో మంది బలిదానాలు చేయడంతో తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ రాజకీయ స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిందన్నారు. నిజామాబాద్‌లో ఇరిగేషన్‌కు చెందిన విలువైన భూమిని కబ్జా చేసి తెలంగాణ భవన్ నిర్మించారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకుడు గైని గంగారాం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మీ త్యాగం అమరం
కామారెడ్డి క్రైం: విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఆ శాఖ ఆధ్వర్యంలో నేడు(సోమవారం) అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించనున్నారు. ఒకప్పుడు పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ చోటుచేసుకుంటుందో తెలియని పరిస్థితి ఉండేది. నక్సలైట్ల సమాచారం అందగానే విరుచుకుపడేందుకు పోలీసు బలగాలు సిద్ధంగా ఉండేవి. పోలీసులు వచ్చే దారుల్లో మందుపాతరలు పేల్చేందుకు నక్సల్స్ సిద్ధపడేవారు. అప్పట్లో అనేక ఘటనలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1980 దశకంలో మొ దలైన పీపుల్స్ వార్ కార్యకలాపాలు దాదాపు మూ డు దశాబ్దాల పాటు విస్తృతంగా కొనసాగాయి. కా మారెడ్డి, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా దళాలు ఈ ప్రాంతంలో కార్యాకలపాలు కొనసాగించేవి. సిరికొండ, భీమ్‌గల్, ఇందల్వాయి, డిచ్పల్లి, కమ్మర్పల్లి, జక్రాన్‌పల్లి, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, వర్ని ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో వారికి పట్టు ఉండేది. నక్సల్స్ గ్రామాలకు వచ్చి వె ళ్తుండే వారు. ఈ క్రమంలో అనేకసార్లు ఎన్కౌంట ర్లు, ఎదురుకాల్పులు జరిగేవి. రామారెడ్డి మండలం మద్దికుంట వద్ద అప్పట్లో సీఆర్పీఎఫ్ వ్యాన్‌ను న క్సల్స్ పేల్చేశారు. లింగంపేట మండలం బురుగి ద్ద, ఉగ్రవాయి, ఎల్లారెడ్డి మండలం అజామాబాద్, ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై మందు పాతరలు పేల్చిన ఘనటలో పలువురు పోలీసులు మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యా రు. నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామాలకు చెందిన వారు పోలీస్ శాఖలో పనిచేయాలంటేనే భయపడేవారు. అప్పటికే చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు. త్యాగాలు వెలకట్టలేనివి పోలీసు అమరుల త్యాగా లు వెలకట్టలేనివి. గతంలో పోలీసులకు విధి నిర్వహణ లో అనేక సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యేవి. ము ఖ్యంగా నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించే సమయంలో ఎంతో మంది అ మరులయ్యారు. వారి త్యాగాల కారణంగానే ప్ర శాంతమైన వాతావరణం ఏర్పడింది. వారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుని మేం ముందుకు సాగుతున్నాం. వాళ్లను స్మరిస్తూ విధి నిర్వహణకు పునరంకితమవుతాం. – సింధుశర్మ, ఎస్పీఅసువులు బాసిన పోలీసులుసంస్మరణ వారోత్సవాల కార్యక్రమాలివే..పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరులకు వందన సమర్పణ. పరేడ్, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ సింధు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. 21 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా ర్యా లీలు, రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘విచక్షణ తో కూడిన మొబైల్ వాడకం’ అంశంపై ఇంటర్ విద్యార్థులకు, ‘మత్తు పదార్థాల నిర్మూలనలో నా పాత్ర’ అంశంపై డిగ్రీ, ఆ పైస్థాయి విద్యార్థులకు 21 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు ఉంటాయని వివరించా రు. అలాగే 3 నిమిషాల షార్ట్ వీడియోలు, 3 ఫొటోల విభాగంలో (పోలీసు సేవలు, విధుల కు సంబంధించి) పోటీలలోనూ విద్యార్థులు, యువత పాల్గొనాలని ఎస్పీ కోరారు. పోలీసు అధికారులకు.. ‘సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగు పర్చడంలో నా పాత్ర’ అనే అంశంపై ఏఎస్సై స్ధాయి అధికారి వరకు, ‘ధృడమైన శరీరంలో ధృఢమై న మనసు’ అనే అంశంపై ఎస్సై, ఆపై స్ధాయి అధికారులు 500 పదాలకు మించకుండా వ్యా సాలు రాసి పంపించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపిక చేస్తామని, పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన లింక్ ద్వారా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. గతంలో జిల్లాలో జోరుగా నక్సల్స్ కార్యకలాపాలు విధి నిర్వహణలో అసువులు బాసిన పలువురు పోలీసులు నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కామారెడ్డిలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన కానిస్టేబుల్ ఖుత్బుద్దీన్ 1989 జనవరి 10న నిజామాబాద్ జిల్లా పల్లికొండలో నక్సల్స్ చేతిలో హతమయ్యారు. 1991ఆగస్టు 2న డిచ్పల్లిమండలం సుద్దులం వద్ద నక్సలైట్లు మందుపాతర పేల్చిన ఘటన లో ఎస్సై సత్తయ్య మరణించారు. ఇదే ఘట నలో బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌కు చెంది న కానిస్టేబుల్ సుబ్బారావు కన్ను మూశారు. 1992 ఏప్రిల్ 28న లింగంపేట మండలం బూ రుగిద్ద వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చగా మద్నూరు చెందిన కానిస్టేబుల్ మారుతి మృతి చెందారు. 1994 డిసెంబర్ 30న గాంధారి ఎక్స్ రోడ్డు వద్ద సదాశివనగర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఆంజనేయులును నక్సల్స్ కాల్చిచంపారు. 1999 అక్టోబర్ 31న గాంధారిలో నిజామాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్వీ కృష్ణారావుపై నక్సల్స్ కాల్పులు జరపడంతో మృతి. మాచారెడ్డి మండలం బంజేపల్లికి చెందిన కానిస్టేబుల్ బానోత్ రాములు 2001 మే 3న సొంతూరుకురాగా నక్సల్స్ కాల్చిచంపారు. ఆయనను కాపాడేందుకు వెళ్లిన రాములు తమ్ముడు సంగ్యా కూడా నక్సల్స్ కాల్పుల్లో చనిపోయాడు. -
యూనియన్ అభ్యర్థులను గెలిపించుకోవాలి
కామారెడ్డి అర్బన్: వరంగల్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ ప్రతిపాదించిన అభ్యర్థులు పి శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్రెడ్డిలను గెలిపించాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి కోరారు. దామోదర్‌రెడ్డి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని ఈ ఎస్ఆర్ గార్డెన్లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీలుగా యూనియన్ మద్దతున్నవారిని ఎన్నుకుంటేనే ప్రభుత్వంనుంచి ఏదైనా సాధించుకోగలమన్నారు. రాష్ట్రంలో 70 వేల మంది ఉపాధ్యాయుల సభ్యత్వ మున్న పీఆర్టీయూ ఉనికి ఎమ్మెల్సీ ఎన్నికలతో ము డిపడి ఉందన్న విషయాన్ని ప్రతి సభ్యుడు గ్రహించాలని కోరారు. సీఎం తమ జేబులో ఉన్నాడంటూ ప్రచారం చేస్తున్న ఓ ఉపాధ్యాయ యూనియన్ మా టలు నమ్మొద్దన్నారు. తాను 26 ఏళ్లు పీఆర్టీయూ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని, నేడు టీచర్లందరికీ నెలకు రూ.16 వేల అధిక బెనిఫిట్ జరుగు తుందంటే అది తన వల్లనే అ ని మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎం ఫౌండేషన్ ద్వారా సిద్దిపేట జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని యూ నియన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర సహ అధ్యక్షుడు జి.గోవర్ధన్, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.దామోదర్‌రెడ్డిని సన్మానిస్తున్న పీఆర్టీయూ ప్రతినిధులు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి పిలుపు -
పట్టభద్రుల్లో పట్టు నిలుపుకోవాలి
మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, వేదికపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : త్వరలో నిర్వహించే ప ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భా రీ మెజారిటీతో గెలిపించి పట్టు నిలుపుకోవాలని జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపలి కృష్ణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించి న సభలో మంత్రి పాల్గొన్నారు. పట్టభద్రుల ఓట్ల న మోదును ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు జరిగినపుడు తెలంగాణ ఇవ్వని బీజేపీకి, తెలంగాణ ను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్కు ఎమ్మె ల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని పెంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీలను అమలు చేస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్క టిగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని చె ప్పి, ఇప్పటికే 80 శాతానికి పైగా రుణాలు మాఫీ చేశామన్నారు. వివిధ కారణాలతో మిగిలిపోయిన రైతుల రుణాలను కూడా త్వరలో మాఫీ చేయనున్న ట్లు తెలిపారు. గత పాలకులు పనికిరాని భూముల కు రైతుబంధు పేరుతో దోచిపెట్టారని ఆరోపించా రు. అర్హులైన రైతులకే రైతుభరోసా ఇవ్వడానికి త మ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అందువల్లే ఆల స్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు పది పదిహేను రోజు లు ఆలస్యంగా వేతనాలు వచ్చేవని, ఇప్పుడు ఒక టో తారీఖునే ఇస్తున్నామని జూపల్లి పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరుఅట్టహాసంగా నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి మదన్మోహన్రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరవడం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి పాల్గొన్న సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలూ రాకపోవడంపై పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ముందుముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న సమయంలో నేతల మధ్య విభేదాలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావునయాపైసా ఇవ్వలేదు.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పంటలు నష్టపోయిన రైతులకు నయాపైసా ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. తమ ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకుందన్నారు. మూడేళ్ల పాటు బిల్లు లు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేశారని, తమ ప్రభుత్వం ఆ బిల్లులను క్లి యర్ చేస్తుందని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని, మళ్లీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసిందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇచ్చి గౌరవిస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. సభలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, తెలంగాణ సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ఎల్.నర్సింగరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే రైతు భరోసా ఇవ్వాలి
తాడ్వాయి: ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగింపునకు వచ్చినా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రైతు బంధుకు సంబంధించిన నిధులను రుణమాఫీకి వాడుకున్నారని ఆరోపించారు. వెంటనే రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని సురేందర్ ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వా లని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇవ్వకపోయినా, రైతులందరి రుణాలను మాఫీ చేయకపోయినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాడ్వాయి ఏఎస్సై సంజీవులు సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి, రాస్తారోకోను విరమింపజేశారు. ఆందోళనలో సింగిల్‌విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిరెడ్డి, ముదాం నర్సింలు, రవీందర్‌రెడ్డి, మంగారెడ్డి, రాజుగౌడ్, ధర్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్ తాడ్వాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో -
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని ఆనంద్‌భవన్‌లో ఆదివారం అండర్ –17 క్రికెట్ క్రీ డాకారుల ఎంపిక నిర్వహించారు. దోమకొండ ట్రస్ట్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్తంగా క్యాంప్ నిర్వహించారు. ఉ మ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 78 మంది క్రీడాకారులు (బాలురు, బాలికలు) పా ల్గొన్నారు. నిజామాబాద్‌తో పాటు కామారె డ్డి జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో దోమకొండ ట్ర స్ట్ ద్వారా శిక్షణ తీసుకున్న బాలురు ఆసిఫ్, యశ్వంత్, శశికాంత్, ప్రజ్ఞాన్, అజిత్రెడ్డితోపాటు బాలికలు గుణశ్రీ, జ్యోతిక, అక్షయ, శ్రీనిధి, రోహిత, రవళి తదితరులున్నట్లు ట్ర స్ట్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రెటరీ హీ రాలాల్, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, నాయకులు శంకర్‌రెడ్డి, సీతారాం మధు, తదితరులు పాల్గొన్నారు. ‘సాగర్’ గేటు ఎత్తివేత నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఆదివారం సాయంత్రం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఒక గేటు ఎత్తి దిగువ మంజీరలోకి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ 12 గేట్లు.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వరదనీరు పెరిగింది. దీంతో అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గేట్లను ఎత్తి గోదావరిలోకి 37,488 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయంలోకి ప్రస్తుతం 47 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5,800 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5 వేలు, లక్ష్మి కాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 500, ఎస్కెప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 571 క్యూసెక్కులు పోతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా అంతే స్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. నేడు తెయూ వీసీ బాధ్యతల స్వీకరణ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సోమ వారం టి యాదగిరి రావు బాధ్యతలు స్వీక రించనున్నారు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న యాదగిరిరావు శుక్రవారం తెయూ వీసీగా నియామకమయ్యా రు. ఆయన శనివారం కేయూలో రిలీవ్ అయ్యారు. సోమవారం తెయూ పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు జిల్లాకు ఇన్చార్జి మంత్రి నిజామాబాద్అర్బ న్: జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవా రం నిజామాబాద్జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నుడా చైర్మన్ కేశ వేణు ప్ర మాణ స్వీకారంలో మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, సాయంత్రం 4 గంటలకు బస్వాగార్డెన్‌లో జ రిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి
కామారెడ్డి క్రైం: పాఠశాల స్థాయి నుంచే రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం రోడ్డు భద్రత అంబాసిడర్లకు అవగాహన కార్యక్రమం, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్‌ను నియమించామన్నారు. జిల్లాలోని 61 పాఠశాలల్లో 122 మంది విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించామని పేర్కొన్నారు. అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఇరుగు పొరుగు వారికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ నిబంధనలు తెలియజేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా వాహనాలను నడిపించాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. జిల్లాలో 520 గ్రామాలు ఉండగా గతేడాది దాదాపు 500 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో రోడ్డు ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాలకు కారకులైన వారికి నూతన చట్టం ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. అనంతరం క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలి
దోమకొండ: లెక్చరర్లు నాణ్యమైన విద్యనందించి ఫలితాలలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రంలో చివరి స్థానంలో దోమకొండ కళాశాల ఉందన్నారు. విద్యార్థులు రోజూ కళాశాలకు రావాలని, లెక్చరర్స్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. కళాశాలలో ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తమ పిల్లలు రోజూ కళాశాలకు వెళ్తున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు కళాశాలకు రాకపోతే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రిన్సిపాల్ శంకర్‌కు సూచించారు. వివిధ గ్రామాలనుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానన్నారు. కళాశాల వద్ద బస్సులు ఆపేలా చూస్తానన్నారు. కళాశాలలో 299 మంది విద్యార్థులు చదువుతున్నారని, రోజూ 100 నుంచి 150 మంది మాత్రమే తరగతులకు హాజరవుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఇకపై ప్రతినెలా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు కళాశాలకు వచ్చేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సలాం, తహసీల్దార్ సంజయ్రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. లెక్చరర్లు నాణ్యమైన విద్య అందించాలి విద్యార్థులు రోజూ కళాశాలకు రావాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్