Pakistan vs Bangladesh
-
పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. 59 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ పరాజయంతో టెస్టుల్లో పాకిస్తాన్ ర్యాంక్ మరింత దిగజారింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ 8వ స్థానానికి పడిపోయింది. రావల్పిండి వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ అయింది. బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం పాకిస్తాన్ జట్టుకు ఇదే తొలిసారి. ఒక్క టెస్టులోనూ పోరాటాన్ని కనబర్చలేకపోయిన పాక్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కంగుతింది. ‘ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయింది’ అని ఐసీసీ వెబ్సైట్లో తెలిపింది. సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో ర్యాంక్‌లో ఉంది. రెండు వరుస పరాజయాలతో వెస్టిండీస్ (7వ ర్యాంక్) కంటే దిగువ ర్యాంక్‌కు చేరింది. 1965 తర్వాత పాక్ ఇలా ర్యాంకింగ్స్‌లో దిగజారడం ఇదే తొలిసారి. అయితే పాక్‌ను వైట్‌వాష్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ 9వ ర్యాంక్‌లో మార్పు లేదు. కానీ బంగ్లాదేశ్ జట్టు 13 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుంది. త్వరలోనే బంగ్లాదేశ్... భారత్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది. -
మా ఓటమికి కారణం అదే.. అందుకు నాదే బాధ్యత: పాక్ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త కెప్టెన్సీ, ఆటగాళ్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వల్లే ఈ గతి పట్టిందంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు షాన్ మసూద్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో మొత్తంగా పేసర్లతో దిగడం, రెండో టెస్టులో ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలను తప్పుపడుతున్నారు.ఓటమికి బాధ్యత నాదేజట్టు ఆట తీరు చూస్తే సరైన ప్రణాళిక, వ్యూహాలు లేకుండానే బరిలోకి దిగినట్లు కనిపించిందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంపై కెప్టెన్ షాన్ మసూద్ స్పందిస్తూ.. ‘‘స్వదేశంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరాం. కానీ తీవ్ర నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియాలో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం.ఓటమికి బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. కానీ టెస్టు క్రికెట్‌ను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా లేనట్లు అనిపించింది. ఆటగాళ్లు గెలవాలనే లక్ష్యంతోనే ఆడినా... ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఆ అంశాలతో సంబంధం లేదుటెస్టు ఫార్మాట్ ఆడుతున్న బౌలర్లకు తరచూ అవకాశాలు ఇవ్వాలి. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం. ఇకపై మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలనుకుంటున్నాం. లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడతాం. జట్టు ఎంపిక, డ్రెస్సింగ్ రూమ్ వంటి అంశాలతో ఫలితాలకు సంబంధం లేదు. బంగ్లాదేశ్ జట్టు మా కంటే మెరుగైన ఆటతీరు కనబర్చింది. ఈ విజయానికి వారు అర్హులు’’అని పేర్కొన్నాడు.వాళ్లిద్దరిని తప్పించడం సరైందేఇక రెండో టెస్టు నుంచి షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను తప్పించిన తమ నిర్ణయాన్ని షాన్ మసూద్ సమర్థించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లపై పనిభారం ఎక్కువగా మోపడం సరికాదని పేర్కొన్నాడు. అయినా ఎల్లప్పుడూ ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడకూడదని.. మిగతా వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. తొలిసారి బంగ్లా గెలుపుకాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పేస్ త్రయం మీర్ హమ్జా, మొహమ్మద్ అలీ, ఖుర్రం షెహజాద్ వికెట్లు పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్‌పై బంగ్లా టెస్టుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.చదవండి: ఆ దృశ్యాలు నా కుమారుల కంటపడకూడదనుకున్నా: ద్రవిడ్ -
Pak vs Ban: పతనం దిశగా పాక్.. ఈ జట్టుకు ఏమైంది?
అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంతకన్నా కిందికి దిగజారలేదు అనుకున్న ప్రతీసారి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అంతకుమించిన చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆకీబ్ జావేద్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లు... జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజా, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు... ఇప్పుడు రెండున్నరేళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవలేక ఇబ్బంది పడుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం పాకిస్తాన్ జట్టు పతనావస్థను సూచిస్తోంది.రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన బంగ్లాదేశ్ జట్టు... పాకిస్తాన్లో పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌తో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 టెస్టుల్లో ఓడిన బంగ్లాదేశ్... తాజా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి సొంతగడ్డపై పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఐదో టెస్టులో పరాజయంబంగ్లాదేశ్కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా... వర్షం అంతరాయం మధ్య మూడున్నర రోజులే జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో అల్లర్లు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇలాంటి విజయం సాధించడం గమనార్హం. మరోవైపు గత కొంతకాలంగా స్వదేశంలోనూ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్న పాకిస్తాన్ జట్టు... ఈ ఏడాది వరుసగా ఐదో టెస్టు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఐదింట్లోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన షాన్ మసూద్... తొలి ఐదు టెస్టుల్లోనూ ఓటములు ఎదుర్కొన్న తొలి పాకిస్తాన్ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.ఈ సిరీస్‌లో నమోదైన పలు ఆసక్తికర రికార్డులను పరిశీలిస్తే.. 👉బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. ఇంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై, 2021లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లు నెగ్గింది. 👉ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేస్ బౌలర్లే తీయడం బంగ్లాదేశ్‌కు ఇది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్, నహీద్ రాణా, తస్కీన్ అహ్మద్ కలిసి పాకిస్తాన్ పది వికెట్లు పడగొట్టారు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బంగ్లా పేసర్లు 14 వికెట్లు పడగొట్టారు. 👉ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్–6 ప్లేయర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. టెస్టు మ్యాచ్ నెగ్గిన సందర్భంలో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు ఆటగాళ్లు చేసిన రెండో అత్యల్ప పరుగులివే. 1887లో ఆస్ట్రేలియా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. 👉సొంతగడ్డపై గత పది మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు గెలుపు రుచి చూడలేదు. ఇంతకుముందు 1969–1975 మధ్య పాకిస్తాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. 👉షాన్ మసూద్ సారథ్యంలో ఆడిన ఐదు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. గతంలో ఏడుగురు కెప్టెన్లకు తొలి ఐదు టెస్టుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ జాబితాలో ఖాలెద్ మసూద్ (12 టెస్టులు; బంగ్లాదేశ్), ఖాలెద్ మహమూద్ (9 టెస్టులు; బంగ్లాదేశ్), మొహమ్మద్ అష్రఫుల్ (8 టెస్టులు; బంగ్లాదేశ్), నయీముర్ రహమాన్ (5 టెస్టులు; బంగ్లాదేశ్), గ్రేమ్ క్రీమర్ (6 టెస్టులు; జింబాబ్వే), కేన్ రూథర్‌ఫార్డ్ (5 టెస్టులు, న్యూజిలాండ్), బ్రాత్‌వైట్ (5 టెస్టులు; వెస్టిండీస్) ముందున్నారు. -
పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఆరు వికెట్ల తేడాతో ఓడించికాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.మాటలు రావడం లేదుఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది. టీమిండియాతో సిరీస్‌కు సిద్ధంఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లువేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ -
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. పాక్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఇవాళ (సెప్టెంబర్ 3) ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఐదేసిన మిరజ్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. లిటన్ దాస్ వీరోచిత శతకంఅనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 26 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు.172 పరుగులకే కుప్పకూలిన పాక్తదనంతరం బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాపాక్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 40, షద్మన్ ఇస్లాం 24, షాంటో 38, మొమినుల్ హక్ 34 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీం 22, షకీబ్ అల్ హసన్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. పాక్ బౌలర్లలో మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. -
Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్ క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్ టెయిలెండర్ అబ్రార్ అహ్మద్ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ అబ్రార్ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..తొలి టెస్టులో ఘన విజయంరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూసోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నషీద్ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.ఆలస్యమైతే అవుటే.. షకీబ్ నవ్వులుఆ సమయంలో బౌలింగ్ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్ షకీబల్ హసన్. అబ్రార్ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్ అవుట్ కింద అవుట్ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్.. అలా పరిగెత్తగానే.. షకీబల్ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్.. టైమ్డ్ అవుట్ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవంఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ అవుటైనా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్ అవుట్ రూల్ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్ షకీబ్ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: 'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'unreal fear of abrar ahmed being get timed out when Shakib is bowling 😂Everyone remembered what happened with sir angelo Mathews 😜#PAKvBAN pic.twitter.com/bXiijoNBKb— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) September 2, 2024 -
'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుని 20 నెలలు దాటింది. కనీసం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనైనా బాబర్ తన రిథమ్‌ను పొందుతాడని అంతా ఆశించారు. కానీ బంగ్లా సిరీస్‌లో కూడా బాబర్ తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టుల్లోనూ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ సెలెక్టర్ మహ్మద్ వసీం ఆజంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ చాలా మొండి పట్టుదలగలవాడని, అతడితో పనిచేయడం కష్టమని వసీం చెప్పుకొచ్చాడు. కాగా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి ఆజం తప్పుకున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024 ముందు తిరిగి మళ్లీ పాక్ వైట్‌బాల్ కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ చేపట్టాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఘోర ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది."బాబర్ ఆజం ఎవరి మాట వినడు. చాలా మొండి పట్టుదలతో ఉంటాడు. జట్టులో మార్పులకు అస్సలు అంగీకరించకపోయేవాడు. జట్టు సెలక్షన్ సమయంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు నా పరిమితి దాటి మరి అతడిని ఒప్పించేవాడిని" అని ఓ లోకల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం పేర్కొన్నాడు.పాకిస్థాన్ జట్టుకు క్యాన్సర్కొంతమంది ఆటగాళ్లు పాక్ జట్టుకు క్యాన్సర్ గడ్డలా మారారు. నలుగురు కోచ్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత జట్టుకు నష్టం కలిగించే ఆటగాళ్ల గ్రూపును నేను గుర్తించాను. వారి పేర్లు మాత్రం నేను చెప్పాలనుకోవడం లేదు. ఆ తర్వాత వారిని జట్టు నుంచి తప్పించిడానికి నేను ప్రయత్నించాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ వారిని రీకాల్ చేసిందని వసీం తెలిపాడు.ఓటమి అంచుల్లో పాక్..ఇక వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఓటమి చవిచూసిన పాక్.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఘోరపరాభావం పొందింది. ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి సారి బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పాక్ పడింది. బంగ్లాతో తొలి టెస్టులో పరాజయం పాలైన మసూద్ సేన.. ఇప్పుడు రెండో టెస్టులో ఓటమి అంచున నిలిచింది. బంగ్లా విజయానికి ఇంకా 143 పరుగులు మాత్రమే అవసరం. -
PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్
రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు. దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. -
PAK VS BAN 2nd Test: చరిత్రలో తొలిసారి ఇలా..!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో బంగ్లా పేసర్లు పూర్తి ఆధిపత్యం చలాయించి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా బంగ్లా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నహిద్ రాణా నాలుగు, తస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసి పాక్ పతనాన్ని శాశించారు. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో పేసర్లే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు నేలకూల్చడం ఇదే తొలిసారి.టార్గెట్ 185సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకు ఆలౌటై బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. వాతావరణం అనుకూలించకపోవడంతో బంగ్లా జట్టు ఛేదనను ధాటిగా ప్రారంభించింది. నాలుగో రోజు చివరి సెషన్లో వర్షం మొదలయ్యే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలవాలంటే మరో 143 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆట చివరి రోజు మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. జకీర్ హసన్ (31), షద్మాన్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు.172 పరుగులకే కుప్పకూలిన పాక్బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు లిటన్ దాస్ (138) వీరోచితంగా పోరాడి శతకం చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. -
Pak Vs Ban: చెలరేగిన బంగ్లా పేసర్లు.. పాక్ 172 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు... అదే జోరులో సిరీస్ చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అద్వితీయ ఆట తీరుతో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేసింది.చెలరేగిన బంగ్లా పేసర్లుబంగ్లా రైటార్మ్ పేసర్లు హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నషీద్ రాణా 4 వికెట్లు కూల్చాడు. మరో కుడిచేతి వాటం పేసర్ టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులతో అజేయంగా ఉండటంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించారు. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు దాటలేక చతికిలపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసిన బంగ్లాదేశ్.. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయానికి 148 పరుగుల దూరంలో నిలిచింది.లిటన్ దాస్ వీరోచిత ఇన్నింగ్స్కాగా పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 78.4 ఓవర్లలో 262 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిటన్ దాస్ ఆదుకున్నాడు. ఎదురుదాడితో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లిటన్ దాస్ 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా పరుగులు రాబట్టాడు. అతడికి ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (124 బతుల్లో 78; 12 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. ఖుర్రమ్ షెహజాద్‌కు 6 వికెట్లువీరిద్దరూ ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో (4), మోమినుల్ హక్ (1), ముష్ఫికర్ రహీమ్ (3), షకీబ్ అల్ హసన్ (2), జాకీర్ హసన్ (1), షాద్మన్ ఇస్లామ్ (10) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6, మీర్ హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (3), నైట్ వాచ్‌మన్ ఖుర్రం షెహజాద్ (0) అవుటయ్యారు. గెలిస్తే సరికొత్త చరిత్రబంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా బంగ్లాదేశ్.. ఆతిథ్య పాక్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు. 172 పరుగులకే ఆలౌట్ చేసి మరోసారి షాకిచ్చింది.ఇక వర్షం కారణంగా పాక్-బంగ్లా తొలిరోజు(శుక్రవారం) ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లాదేశ్.. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు స్కోరు చేసింది. -
'బాబర్ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో'
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో వచ్చిన బాబార్ మరోసారి నిరాశపరిచాడు. చెత్త షాట్ ఆడుతూ స్లిప్‌లో దొరికిపోయాడు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన పేసర్ నహిద్ రానా తొలి బంతిని బాబర్‌కు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలవరీగా ఆఫ్ సైడ్ సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన ఆజం.. స్లిప్‌లో షాద్మాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Babar Retirement when??#PAKvsBAN #BabarAzam𓃵 pic.twitter.com/4d7urxWNA2— 𝚃 𝚊 𝚋 𝚒 𝚜 𝚑 (@AaqibMushtaqBh4) August 31, 2024 కనీసం హాఫ్ సెంచరీ కూడా..కాగా బాబర్ టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 16 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 331 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.पिछली 16 टेस्ट पारियों में एक भी अर्द्धशतक नहीं है। तुलना विराट कोहली से की जाती है। इस देश के साथ ही इस खिलाड़ी का बुरा दौर चल रहा...#PAKvsBAN#PakistanCricket #BabarAzam𓃵 #PAKvBAN pic.twitter.com/JxJjQufSsx— RITESH SINGH (@RITESHK61848792) September 2, 2024 -
బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?
బాబర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాదు వరల్డ్ క్రికెటలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కెప్టెన్సీతో పాటు తన క్లాసిక్ ఇన్నింగ్స్‌లతో పాక్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బాబర్ క్రీజులో ఉన్నాడంటే పాక్ డగౌట్లో కొండంత బలం. టీ20ల్లో కాస్త స్లోగా ఆడుతాడని పేరు ఉన్నప్పటకి మిగితా రెండు ఫార్మాట్లలో తనకు తిరుగులేదని బాబర్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ ఇదింతా ఒకప్పుడు. గత కొంత కాలంగా బాబర్ బ్యాట్ ముగిబోయింది.ఒకనొక దశలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పోటీ పడిన ఈ పాకిస్తానీ క్రికెటర్‌కు ఇప్పుడు ఏమైంది. కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోవడానికి తెగ కష్టపడతున్నాడు. ముఖ్యంగా తన ఫేవరేట్ టెస్టు క్రికెట్లో కూడా బాబర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.బాబర్‌కు ఏమైంది?స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాబర్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన ఆజం.. ఇప్పుడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్పిన్నర్లకు అద్బుతంగా ఆడుతాడని పేరు గాంచిన బాబర్.. అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత సమయం తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ చేశాడు. ఆఖరికి షకీబ్ బౌలింగ్‌లో బాబర్ ఇన్నింగ్స్ ముగిసింది.చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడంటే?బాబర్ ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 15 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాబర్ తన మార్క్‌ను చూపిస్తాడో లేదో వేచి చూడాలి. -
PAK Vs BAN: రాణించిన బంగ్లా బౌలర్లు.. పాకిస్తాన్ 274 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... రెండో టెస్టులోనూ భారీ స్కోరు చేయలేకపోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. శనివారం రెండో రోజు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (69 బంతుల్లో 57; 2 ఫోర్లు), అయూబ్ (110 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆగా సల్మాన్ (95 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించగా... బాబర్ ఆజమ్ (31), మొహమ్మద్ రిజ్వాన్ (29) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ పేలవ ఫీల్డింగ్ కారణంగా అందివచ్చిన అవకాశాలను కూడా పాక్ ఉపయోగించుకోలేకపోయింది. బంగ్లా ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేయడం విశేషం. బంగ్లాదేశ్ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లతో అదరగొట్టగా.. తస్కీన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్... ఆట ముగిసే సమయానికి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మన్ ఇస్లామ్ (6 బ్యాటింగ్), జాకీర్ హసన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.ఇన్నింగ్స్ తొలి బంతికే షాద్మన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో షకీల్ వదిలేయడంతో బంగ్లాకు నష్టం జరగలేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. -
Pak vs Ban: షాహిన్ ఆఫ్రిదిపై వేటు వేయడానికి కారణం అదే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బతీసినందుకే అతడిని జట్టు నుంచి తప్పించారనే వదంతులు వస్తున్నాయి. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి అనంతరం.. షాన్ మసూద్- షాహిన్ ఆఫ్రిది మధ్య సఖ్యత లోపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.కొట్టుకునే దాకావెళ్లిన ఆటగాళ్లుషాహిన్ భుజంపై మసూద్ చేయి వేయగా.. అతడు విసురుగా తీసివేసిన దృశ్యాలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకావెళ్లగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్ ఆఫ్రిది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఘోర పరాజయం నేపథ్యంలోకాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు... టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా... లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కోచ్ చెప్పిందిదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ మాట్లాడుతూ.. షాహీన్ షా భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ విరామం అతడికి ఉపయోగ పడుతుందనిఅన్నాడు. ‘షాహిన్‌తో చర్చించాం. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అత్యుత్తమ కూర్పుతో బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గెలెస్పీ పేర్కొన్నాడు. అయితే, సహచర ఆటగాళ్ల పట్ల షాహిన్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.చదవండి: లక్షల కోట్లకు వారసుడు.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే! -
బంగ్లాతో రెండో టెస్టు.. షాహీన్ అఫ్రిది దూరం! అతడికి ఛాన్స్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రావల్పండి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడా ప్రిలిమనరీ జట్టును పాకిస్తాన్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది దూరమయ్యాడు. ఇటీవలే అఫ్రిది భార్య అన్షూ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి పాక్ జట్టు మెనెజ్‌మెంట్ పితృత్వ సెలవు మంజారు చేసింది. ఇక అతడి స్ధానంలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఈ 12 మంది సభ్యుల జట్టులో పేసర్ మీర్ హమ్జాకు కూడా చోటు దక్కింది. అయితే మీర్ హమ్జా బెంచ్‌కే పరిమిత మయ్యే అవకాశముంది. అర్బర్ ఆహ్మద్‌కు ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే తొలి టెస్టులో చేసిన తప్పిదాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేయకూడదని పాక్ భావిస్తోంది. మొదటి టెస్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్తాన్ బరిలోకి దిగింది. అందుకు ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్‌కోచ్ గిల్లెస్పీ మరోసారి అటువంటి ఘోర తప్పిదం చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది."రావల్పిండి పిచ్ పరిస్థితులపై మా అంచనా ఆధారంగా 12 మంది సభ్యుల జట్టులో అబ్రార్ అహ్మద్‌కు చోటు ఇచ్చాము. అయితే మేము ఆడాల్సిన వికెట్‌ను ఇంకా పరిశీలించలేదని" గిల్లెస్పీ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడ.బంగ్లాతో రెండో టెస్టుకు పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, మహమ్మద్ అలీ, మీర్ హమ్జా -
‘బీసీసీఐని కాపీ కొట్టండి.. మనమూ గెలుస్తాం’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ టోర్నీలపై దృష్టి పెట్టకుండా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఆటను ఎలా అభివృద్ధి చేయాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి పీసీబీ నేర్చుకోవాలని సూచించాడు. పాక్ క్రికెట్ సరైన గాడిలో పడాలంటే మూలాల నుంచి ప్రక్షాళన అవసరమని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమితొలి టెస్టులో ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ లేకుండా ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. ఇక పాక్ అత్యుత్సాహంతో 6 వికెట్లకే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఏకంగా 117 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆట చివరి రోజు బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ చెలరేగిపోవడంతో పాక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో షాన్ మసూద్ బృందం ఆట తీరు సహా పీసీబీ విధానాలపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు సిరీస్ తర్వాత చాంపియన్స్ కప్ అనే వన్డే టోర్నీని నిర్వహించబోతున్నారు. బీసీసీఐని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండిపీసీబీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ఏం చేసినా కాపీ కొట్టేది. మరి పొరుగు దేశం భారత్ వైపు ఒకసారి చూడవచ్చు కదా! దయచేసి వాళ్ల వ్యవస్థను కూడా కాపీ కొట్టండి. మార్పులు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కాపీ కొట్టడంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు. అందుకే వాళ్లేం చేస్తే యథాతథంగా మీరూ చేసేయండి. ఇండియాలో తదుపరి దులిప్ ట్రోఫీ మొదలుకాబోతోంది. అదేమీ టీ20 లేదా వన్డే టోర్నమెంట్ కాదు. నాలుగు రోజుల ఆట ఉండే రెడ్‌బాల్ టోర్నీ. మూలాల నుంచి క్రికెట్‌ను పటిష్టం చేయడంపై వాళ్లు దృష్టిసారించారు.అందుకే ఆ జట్టు విజయవంతమైనదిగా నిలుస్తోంది’’ అంటూ పీసీబీ యాజమాన్యాన్ని తూర్పారపడుతూనే హితవు పలికాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాలుఇప్పటికైనా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించకపోతే పాక్ జట్టు మరిన్ని పరాభవాలు చవిచూడక తప్పదని బసిత్ అలీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరంగా విఫలమవుతోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో... ఆటగాళ్ల ఫిట్నెస్ లేమి, సెలక్షన్ విషయంలో బంధుప్రీతి కారణంగానే ఇలా పరాజయాలు అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పాక్ కొత్తగా మూడు దేశవాళీ టోర్నీలు ప్రవేశ్పెట్టి.. ప్రాథమిక దశ నుంచే క్రికెట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగా మూడు టోర్నీలుదేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఫిట్‌గా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
WTC: పాకిస్తాన్‌కు భారీ షాకులిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తుకాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.బంగ్లాకు సైతం ఎదురుదెబ్బఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.టాప్‌లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.PC: insidesportపాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
‘పాకిస్తాన్ నుంచి వెనక్కి రప్పించండి’.. బీసీబీకి నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ జట్టు నుంచి తక్షణమే తొలగించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఓ లాయర్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న షకీబ్‌ను బంగ్లాదేశ్‌కు రప్పించి.. అతడిని విచారించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్‌పై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గద్దె దిగిన షేక్ హసీనా ప్రభుత్వంలో 37 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ ఎంపీగా ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో అతని ఎంపీ పదవి కూడా ఊడింది. అయితే మూక దాడులు, పేట్రేగిన ఆందోళనకారుల వల్ల అమాయకులెందరో ప్రాణాలొదిలారు.ఈ నేపథ్యంలో రఫీఖుల్ ఇస్లామ్ అనే వ్యక్తి మాజీ ప్రధాని, సహచర మంత్రులు, ఎంపీలపై కేసు పెట్టారు. ఈ నెల 7న జరిగిన హింసాత్మక ఘటనలో ఇస్లామ్ కుమారుడు రుబెల్ మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మరణానికి గత ప్రభుత్వానిదే బాధ్యతని ఇస్లామ్ ఢాకాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు ప్రధాని సహా పదుల సంఖ్యలో పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.ఇందులో షకీబ్‌ను 28వ నిందితుడిగా చేర్చుతూ హత్య కేసు నమోదు చేశారు. నిజానికి ఈ ఆల్‌రౌండర్ ఆగస్టు 5కు ముందు, తర్వాత దేశంలో లేడు. గ్లోబల్ టీ20 లీగ్ ఆడేందుకు కెనడా వెళ్లాడు. జూలై 26 నుంచి ఆగస్టు 9 వరకు జరిగిన ఆ లీగ్‌లో ఆడి... అక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టుతో జతకలిశాడు. ఆగష్టు 21న మొదలైన తొలి టెస్టులో ఆడుతున్న షకీబ్.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం హత్య కేసులో నిందితుడిగా ఉన్న షకీబ్‌ను జాతీయ జట్టులో ఆడించవద్దని బంగ్లా సుప్రీం కోర్టు లాయర్ షాజీబ్ మహమూద్ ఆలం.. తన సహచర లాయర్ ఎండీ రఫినూర్ రహ్మాన్ తరఫున బీసీబీకి నోటీసులు పంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఈ విషయం గురించి షాజీబ్ బంగ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనల ప్రకారం షకీబ్‌కు జట్టులో ఉండే హక్కు లేదని నోటీసులో స్పష్టం చేసినట్లు తెలిపాడు. అయితే, అతడిని వెంటనే వెనక్కి తీసుకురావాల్సిందిగా తాము కోరలేదని.. బీసీబీ కొత్త టీమ్ ఇప్పుడే ఏర్పడిందని.. వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నాడు.చదవండి: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్ -
పాక్‌పై సూపర్ సెంచరీ.. బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు
పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బ్యాటర్ల శతకాలుబంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్‌తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024 -
తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్?
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్రయ్యాడు. అతడి భార్య అన్షా శనివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు అలీ యార్గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అఫ్రిది కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోషల్ మీడియా వేదికగా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహీద్ అఫ్రిది కుమార్తే.రెండో టెస్టుకు దూరం..?కాగా షాహీన్ అఫ్రిది ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తరపున ఆడుతున్నాడు. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కరాచీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
రావల్పిండి టెస్టు.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న బంగ్లాదేశ్
రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాను ఆదిలోనే పేసర్ ఖుర్రం షాజాద్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ జకీర్ హోస్సేన్, కెప్టెన్ శాంటోను ఔట్ చేసి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ షాద్మాన్ ఇస్లాం(93), మోమినుల్ హక్(50) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పాక్ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. షాద్మాన్, మోమినుల్ ఔటైన తర్వాత వారి బాధ్యతను లిట్టన్ దాస్, ముష్పికర్ రహీమ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ కంటే బంగ్లా ఇంకా 132 పరుగులు వెనకబడి ఉంది.ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(52), ముష్పికర్ రహీమ్(55) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అయూబ్, మహ్మద్ అలీ తలా వికెట్ సాధించారు. కాగా పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది. -
BAN vs PAK: పాకిస్తాన్ 448/5.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు. ఇక బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. ప్రస్తుతం రిజ్వాన్ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 277/గా ఉంది. రిజ్వాన్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సౌద్ షకీల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, పాక్ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 1959లో సయీద్ అహ్మద్ కూడా ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు.